Activities calendar

28 September 2016

అక్రమకట్టడాల కూల్చివేతలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్రమ కట్టడాల కూల్చివేతలో ఇదేవేగం కొనసాగించాలని సీఎం అధికారులకు సూచించారు. అక్రమ కట్టడాల కూల్చివేత సహా రోడ్ల అభివృద్ధి చేపట్టాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. నగరంలో అత్యవసరంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో 400 అక్రమ కట్టడాలు కూల్చివేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

22:11 - September 28, 2016

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాయిచూర్‌లోని ప్రవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసు కేసు విచారిస్తున్నారు. 

 

 

22:02 - September 28, 2016

వరంగల్ : ప్రాథమికంగా చేపట్టిన నిర్మాణాల తొలగింపును పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని సిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శైలజ అన్నారు. ఈమేరకు టెన్ టివితో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలతోనే వరంగల్‌లోని నాలాలపై అక్రమా నిర్మాణాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న కూల్చివేతలపై ఎలాంటి వ్యతిరేకత రాలేదని చెప్పారు. 

21:56 - September 28, 2016

హైదరాబాద్ : త్వరలో సీపీఎం చేపట్టనున్న మహాజన పాదయాత్ర బ్రోచర్‌ను ఎంబీ భవన్‌లో నేతలు ఆవిష్కరించారు. సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ సమగ్ర, సామాజిక అభివృద్ధి సాధనకై అక్టోబర్ 17 నుంచి మార్చి 12వరకు ఐదు నెలల పాటు నాలుగువేల కిలోమీటర్లు పాదయాత్ర చేపడుతున్నట్టు పార్టీ కోఆర్డినేటర్ వెంకట్ తెలిపారు. ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పాదయాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. 

21:55 - September 28, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మెడికల్ కౌన్సిలింగ్ గడువును సుప్రీంకోర్టు వారం రోజులపాటు పొడిగించింది. నెలరోజుల గడువు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ వారం రోజులపాటు పొడిగించింది. కనీసం పది రోజులైనా గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టులో తెలంగాణ అడ్వకేట్ జనరల్ కోరినప్పటికీ కోర్టు నిరాకరిస్తూ కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. అలాగే డెంటల్, మెడికల్ కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 7 వరకు గడువు పొడిగించారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈనెల 30లోగా  మెడికల్ కౌన్సిలింగ్ ముగించాల్సి ఉంది. తెలంగాణలో ఎంసెట్ పేపర్ లీక్ కావడంతో ప్రవేశాల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీంతో టీఆర్ఎస్ సర్కార్ కోర్టును ఆశ్రయించింది. తెలంగాణతో పాటు తమకు గడువు ఇవ్వాలని ఏపీ కూడా కోర్టును కోరింది.

 

21:31 - September 28, 2016
21:21 - September 28, 2016

ఎందుకు మూసేస్తున్నారు ? పెట్టుబడులెందుకు ఉపసంహరించుకుంటున్నారు..? ప్రైవేటుపరం ఎందుకు చేస్తున్నారు..? సర్కారు చెబుతున్నవాదనలేంటీ ? గ్లోబలి పీఠంపై ప్రభుత్వ రంగ సంస్థలు, పీఎస్ యూల మెడకు ఉరి..!! ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....
 

 

21:14 - September 28, 2016

నట్టు టైట్ చేస్తున్న హైద్రబాద్ పోలీసులు... పాయింట్ల ఇసాబుల పంజాదులు తస్పనట, మోరీల మీదగట్టిన ఇండ్లను గిచ్చిన సర్కార్.. జిల్లాలలెక్కనే నాలాల పంచాయితీ ఆళ్లమెడకే, అగ్వకమ్మినా.. ఎవ్వరుగొనని కార్లు.... హైదరాబాద్ ల వాన నీళ్లు తెచ్చిన బేజార్లు, సర్కారు కాలేజీలకు జొర్రిన తాగుబోతు...ఆడిపోరగాళ్లను అమ్మనాబూతులట, పాముతో పరాశ్కంచేసిన పోరడు... అనువగాని చోట సెల్ఫీ కోసం ఆరాటం, బంపర్ చరిత్ర సృష్టించిన బాలి కాకయ్య...30 వేల ఫీట్ల మీద అయ్యగారి పాట్లు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లును వీడియోలో చూద్దాం....

 

20:41 - September 28, 2016

ఢిల్లీ : సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన పెరోల్ గడువు అక్టోబర్ 24వరకు పొడిగించింది. అయితే సుబ్రతారాయ్‌ సెబీ వద్ద 2 వందల కోట్లు డిపాజిట్‌ చేయాలని లేదా మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. సెబీకి చెల్లించాల్సిన 12వేల కోట్లను ఎలా చెల్లిస్తున్నారో తెలుపాల్సిందేనని దానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌ను అక్టోబర్‌ 24 వరకు సమర్పించాలని రాయ్‌ తరుఫున న్యాయవాదిని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత శుక్ర వారం సుప్రీంకోర్టు సుబ్రతారాయ్‌ పెరోల్‌ను రద్దు చేసి వారంలోగా జైలుకు వెళ్లాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన 25 వేల కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమైన కేసులో 2014 లో సుబ్రతా రాయ్ జైలుకి  వెళ్లారు. తల్లి మరణంతో మానవీయ కోణంలో ఈ ఏడాది మే 6న  ఆయనకు నాలుగు వారాల పెరోల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది.  

 

20:40 - September 28, 2016

ఢిల్లీ : కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని కర్ణాటక మళ్లీ ధిక్కరించింది. తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయరాదని బెంగళూరులో జరిగిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. కావేరి జలాలను కర్ణాటకలో తాగు నీటి అవసరాలకు వాడాలని, తమిళనాడుకు విడుదల చేయరాదని అఖిలపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. మరోవైపు కావేరి జలాలపై కేంద్రం రేపు రాష్ట్రాలతో సమావేశం జరపనుంది. భవిష్యత్ లో కావేరి జలాలను రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. నీటిని వదలకూడదని కర్ణాటక ఉభయసభలు తీర్మానం చేసినా.. తమ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ.. కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదని అన్ని పార్టీల నాయకులు నిర్ణయం తీసుకున్నారు. 

 

20:37 - September 28, 2016

విజయవాడ : సీఆర్ డీఏ పరిధిలో ఇక‌పై బిల్డింగ్ ప‌ర్మిష‌న్ పొందేందుకు కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేదు. ఇంటి వ‌ద్దనే కూర్చుని బిల్డింగ్ ప్లాన్ కు సంబంధించిన ప‌ర్మిష‌న్లు పొందవ‌చ్చు. ఇప్పటికే సీఆర్ డీఏ పరిధిలో చాలా వ‌ర‌కూ సేవ‌ల‌ను ఆన్ లైన్ చేసిన చేసిన సీఆర్ డీఏ ఇక‌ నుంచి బిల్డింగ్ ప్లాన్ ప‌ర్మిష‌న్లను సైతం ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకోచ్చింది. 
ఆన్ లైన్‌లోనే దరఖాస్తు 
సీఆర్ డీఏ పరిధిలో.. భవన నిర్మాణాలకు అనుమతి కోసం ఆన్ లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవ‌చ్చు. సీఆర్ డీఏ పరిధిలోని బిల్డర్లు, లైసెన్స్ స‌ర్వేయ‌ర్ల తో నిర్వహించిన సమావేశంలో.. క‌మిష‌న‌ర్ శ్రీధర్ ఈ మేర‌కు నిర్ణయం తీసుకున్నారు. బిల్డింగ్ నిర్మాణానికి అవసరమైన అనుమ‌తుల కోసం ఇకపై కార్యాల‌యాలు చుట్టూ తిర‌గాల్సిన ప‌నిలేదు. ఇంటి వద్దనే కూర్చుని అనుమ‌తి కోసం ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. 
అందుబాటులో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ 
బిల్డింగ్ ప్లాన్ ప‌ర్మిష‌న్ కోసం ప్రత్యేకంగా సాప్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. అన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి వివ‌రాలు స‌క్రమంగా ఉన్నట్లయితే నేరుగా సీఆర్ డీఏ అధికారులు ద‌ర‌ఖాస్తులో పొందుప‌రిచిన వివ‌రాల‌ను విచారించి అనుమ‌తులు మంజూరు చేస్తారు. అయితే ఇలా ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తు విధానాన్ని ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడే బిల్డర్లపై.. వారిచ్చిన త‌ప్పుడు స‌మాచారం ఆధారంగా క‌ఠిన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే క్రిమిన‌ల్ కేసుల నమోదుకూ వెనుకాడబోమని సీఆర్ డీఏ  క‌మిష‌న‌ర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు...
టెక్నికల్ సందేహలకు ఉచితంగా కౌన్సిలింగ్ 
ఇవే కాకుండా సీఆర్ డీఏ పరిధిలో ప్రాజెక్టులకు సంబంధించిన టెక్నిక‌ల్ సందేహాల‌కు ఉచితంగా నిపుణులు, అధికారుల‌చే బిల్డర్లకు కౌన్సిలింగ్ ను ఇప్పించనున్నారు. దీనికోసం ప్రతి శ‌నివారాన్ని కేటాయించారు. ఈ రోజు బిల్డింగ్ కు సంభంధించిన ప్లానింగ్, టెక్నిక్  విష‌యాల‌పై సందేహలను నేరుగా అధికారుల‌ను అడిగి తెలుకోవ‌చ్చు. చాలా మంది లైసెన్సు స‌ర్వేయ‌ర్లు అవినీతికి పాల్పడుతున్నార‌ని క‌మిష‌న‌ర్ మండిప‌డ్డారు. కొంత మంది స‌ర్వేయ‌ర్లు ప్లానింగ్ విష‌యంలో బిల్డర్లను త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారనే స‌మాచారం సీఆర్ డీఏ దృష్టికి వచ్చిందనన్నారు. ఇక పై ఇలాంటి వారిపై క‌ఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇవే కాకుండా చాలా మంది త‌క్కువ ధరలకు వస్తున్నాయని అక్రమ భవనాలను కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రజలు అలాంటి వాటికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు .

 

యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు సీఎం కేసీఆర్ ఆమోదం

హైదరాబాద్ : యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఆలయ కట్డడాల త్రీడీ నమూనాల పట్ల కేసీఆర్ సంతృప్తి చెందారు. 108 అడుగుల ఆంజనేయస్వామి పాలరాతి విగ్రహ నమూనాకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. దైవసన్నిది, కాటేజీల నమూనాల పట్ల కేసీఆర్ సంతప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది దసరా నాటికి యాదాద్రి దేవాలయాన్ని భక్తుల సందర్శనార్ధం సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. 

20:23 - September 28, 2016

హైదరాబాద్ : వారిద్దరూ స్నేహితులు..! పైగా ఒకే ఊరివారు..!!  ఉద్యోగం కోసం.. హైదరాబాద్‌ వచ్చారు. ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా జీవించారు. అనూహ్యంగా విధి వారిలో ఒకరిని రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. అంతే అది చూసి తట్టుకోలేక పోయిన స్నేహితుడు.. తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
స్నేహితుడి మరణంతో ఆత్మహత్య 
హైదరాబాద్‌ మూసాపేటలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మిత్రులను బలిగొంది. హరికృష్ణ, రమేశ్‌లు ఇద్దరూ బైక్‌పై వెళుతుండగా.. వెనకనుంచి వచ్చిన వాహనం ఢీకొంది. దీంతో వాహనం చక్రం కింద పడి అక్కడికక్కడే విలవిలలాడుతూ మరణించాడు. తన వెనుకే కూర్చుని అంతదాకా సజీవంగా వున్న మిత్రుడు.. ఉన్నపళంగా మృత్యు ఒడికి చేరడంతో హరికృష్ణ తట్టుకోలేక పోయాడు. వెంటనే పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌ వద్దకు వెళ్లి.. రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. 
వాహనం కిందపడి రమేశ్‌ మృతి 
హరికృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వాహనం కింద పడి మరణించిన రమేశ్‌ శ్రీశ్రీ హాలిస్టిక్‌ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ గుంటూరు జిల్లా కారంపూడి మండలం వేపకం పల్లి గ్రామానికి చెందిన వారు. ఒకే గ్రామానికి చెందిన మిత్రులిద్దరూ.. ఇలా అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోవడం సన్నిహితులనే కాదు.. చూపరులనూ కంటతడి పెట్టించింది. 

 

20:17 - September 28, 2016
20:09 - September 28, 2016

విజయవాడ : ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి తన భాషను మార్చుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు సూచించారు. జగన్‌ భాష ప్రజాస్వామికంగా లేదన్నారు. వరద సహాయ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు చేస్తున్న పనుల్ని విపక్షనేత ఓర్చుకోలేక పోతున్నారని విమర్శించారు.  జగన్‌ బురద రాజకీయాలు మానుకుని .. ప్రతిపక్షనేతగా బాధ్యతగా మసలుకోవాలని కళావెంట్రావు సలహా ఇచ్చారు. 

 

19:59 - September 28, 2016

మెదక్ : రాబోయే మూడేళ్లలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి  తెలంగాణలో కరవును తరిమేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కరవుతో విలవిల్లాడిన రోజులు పోయి.. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయని, ప్రస్తుతం నెలకొన్న  లానినా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రాష్ట్రంలో వ్యవసాయ  విధానాన్ని రూపొందిస్తామన్నారు. 
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం  
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలో అమలవుతున్న అభివృద్ధి పథకాలను ఆయన పరిశీలించారు. మెదక్‌ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ప్రజలతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తెలంగాణలో దశాబ్దకాలంగా నెలకొన్న కరువును తరిమికొట్టడానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల.. మరో రెండేళ్లపాటు రాష్ట్రంలో నీటికొరత ఉండదన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా చెరువులు కుంటలు నిండుకుండల్లా మారడంతో.. భూగర్భజలాలు కూడా బాగా వృద్ధి చెందుతాయన్నారు. 
స్థానిక వనరులను ఉపయోగించుకోవాలన్న సీఎం  
స్థానిక వనరులను ఉపయోగించుకుని ఆదర్శ గ్రామాలుగా మారాలని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్థులకు సూచించారు. ఈగ్రామాలు రెండింటిలో డ్రిప్‌ ఇరిగేషన్‌ కింద సగటున 50 నుంచి 60బోర్లు వేయించాలని అధికారులకు సూచించారు. గోదావరిపై చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు మరో రెండేళ్లలో పూర్తిచేసి.. రాష్ట్రంలో నీటికరువుకు శాశ్వత పరిష్కారం ఇస్తామని కేసీఆర్‌ అన్నారు.

 

19:55 - September 28, 2016

ఢిల్లీ : సార్క్ దేశాలు పాకిస్తాన్‌కు షాకిచ్చాయి. న‌వంబ‌ర్‌లో ఇస్లామాబాద్‌లో జ‌రిగే సార్క్ దేశాల స‌మావేశానికి హాజ‌రు కాకూడ‌ద‌ని భార‌త్‌తో పాటు మ‌రో మూడు దేశాలు నిర్ణయించాయి. సీమాంతర ఉగ్రవాదంతో పాకిస్తాన్‌లో సార్క్‌కు సానుకూల వాతావరణం లేదని పేర్కొన్నాయి. దీంతో 2016 సార్క్‌ సమావేశాలు రద్దయ్యాయి.
సార్క్‌ సమావేశానికి హాజరు కాకూడదని భారత్‌ నిర్ణయం 
అంత‌ర్జాతీయ స‌మాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిని చేయాల‌న్న భార‌త్ లక్ష్యం క్రమంగా నెర‌వేరుతున్నట్టే కనిపిస్తోంది. నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్‌ సమావేశానికి హాజరు కాకూడదని భారత్‌ నిర్ణయించింది. సరిహద్దులో ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో సార్క్‌ స‌మావేశాల‌కు వాతావ‌ర‌ణం అనుకూలంగా లేద‌ని భారత్‌ స్పష్టం చేసింది.
భారత్ నిర్ణయానికి 3 దేశాలు మద్దతు
భారత్‌ నిర్ణయానికి సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ల నుంచి మద్దతు లభించింది. బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ దేశాలు కూడా సార్క్‌ సమావేశాలకు హాజరు కాకూదడని నిర్ణయించాయి. పాకిస్తాన్‌ హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించాయి.
సమావేశాలకు హాజరు కాలేమని తెలిపిన బంగ్లాదేశ్‌  
తమ అంత‌ర్గత వ్యవ‌హారాల్లో ఒక దేశం జోక్యం ఎక్కువైందని ఈ కారణంతో తాము 19వ సార్క్ స‌మావేశాలకు హాజరు కాలేమని నేపాల్‌లోని సార్క్ కార్యాల‌యానికి బంగ్లాదేశ్‌ తెలిపింది. ప్రాంతీయ స‌హ‌కారం, అనుసంధానానికి బంగ్లా క‌ట్టుబ‌డి ఉంద‌ని,  యూరి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌లో సానుకూల వాతావ‌ర‌ణం లేదని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి పాకిస్థాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాల్సిందేనంటూ భారత్‌లోని బంగ్లాదేశ్ హైకమిషనర్ సయ్యద్ మువాజెమ్ అలీ డిమాండ్ చేశారు.
సార్క్ స‌మావేశాల్లో పాల్గొన‌డం కుద‌ర‌దన్న భూటాన్ 
ద‌క్షిణాసియా ప్రాంతంలో ఈ మ‌ధ్య కాలంలో పెరిగిపోతున్న ఉగ్రవాదం.. ఈ ప్రాంత శాంతియుత వాతావ‌ర‌ణాన్ని, స‌మ‌గ్రతను దెబ్బతీసింద‌ని.. ఇలాంటి వాతావ‌ర‌ణంలో సార్క్ స‌మావేశాల్లో పాల్గొన‌డం కుద‌ర‌ద‌ని భూటాన్ పేర్కొంది. తమ దేశ ప్రజలపైకి పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోందని ఆఫ్గనిస్తాన్‌ మండిపడింది.
8 సార్క్ దేశాలు
8 సార్క్ దేశాలకు గాను ఇప్పటికే నాలుగు దేశాలు సార్క్ స‌మావేశాల్లో పాల్గొన‌మ‌ని స్పష్టంచేయ‌డంతో 2016 సార్క్‌ స‌ద‌స్సును రద్దు చేసే అవకాశాలు ఎక్కవుగా ఉన్నట్లు నేపాల్‌ సార్క్‌ అధికార వర్గాల సమాచారం. ప్రస్తుతం సార్క్‌ చైర్‌ను నేపాల్‌ నిర్వహిస్తోంది. 

 

19:43 - September 28, 2016
19:34 - September 28, 2016

తూర్పుగోదావరి : జిల్లాలో భారీమొత్తంలో గంజాయి పట్టుబడింది. రావులపాలెంలో లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీలేరు నుండి మొక్కజొన్నపొత్తుల లోడుతో వెళ్తున్న ఐషర్‌వ్యాన్‌ ను అనుమానంతో చెక్‌చేయడంతో బస్తాల కొద్ది గంజాయి బయటపడింది. వ్యాన్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

19:30 - September 28, 2016

గుంటూరు : వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం భూముల విషయంలో వివాదం నెలకొంది. తమ కుటుంబ సభ్యులకు చెందిన భూవివాదం హైకోర్టులో నడుస్తుండగా సచివాయానికి ప్రహరీ గోడ, అండర్ గ్రౌండ్ డ్రేనీజీని తమ భూముల్లో నిర్మిస్తున్నారంటూ మల్కాపురం గ్రామానికి చెందిన గద్దె రామమీర ప్రసాద్ ఆరోపించారు.. తమ భూములు వివాదం తేలే వరకు ఎలాంటి కట్టడాలు కట్టడానికి వీల్లేదని డిమాండ్ చేస్తున్నాడు. 

19:16 - September 28, 2016

చిత్తూరు : సీఎం చంద్రబాబు కేంద్రానికి బానిసలా మారాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై వామపక్ష పార్టీలు తిరుపతిలో ప్రజా బ్యాలెట్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. హోదాపై వెంకయ్యనాయుడు మాట మార్చడం దారుణమన్నారు. ఎపికి ప్రత్యేకహోదాపై వెంకయ్యనాయుడు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న ఢిల్లీ నేతలు ముఖం చాటేసేలా ప్రవర్తించడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. మొత్తానికి 2019 ఎన్నికల అంశాల్లో ప్రత్యేక హోదానే..  ప్రత్యేక అజెండాగా మారబోతుందంటున్నారు.

 

19:02 - September 28, 2016

హైదరాబాద్ : కాలా జాదులు ఆవహించిందంటూ, బూతాలు, దయ్యాలు ఉన్నాయంటూ అమయాకులను నమ్మబలికి దోపిడీ చేసి దొంగ బాబాలను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మానవాతీత శక్తులు ఉన్నాయంటూ, సైతాన్ ను వదిలస్తామంటూ మాయ మాటలు చెప్పి బాధితులను హింసిస్తూ డబ్బులు దోచుకుంటున్న మంత్రగాళ్ల ఆటకట్టించారు. పాత బస్తీలో క్షుద్ర పూజులు చేస్తున్న 16 మంది మంత్రగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
బురిడీ బాబాలు అరెస్టు  
మానవాతీత శక్తులు ఉన్నాయంటూ అమాయకులను మోసం చేస్తున్న బురిడీ బాబాలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగ బాబాల పై ఫిర్యాదులు రావడంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించి చార్మినార్ పరిదిలోని 16 మంది మంత్ర గాళ్లను అదుపులోకి తీసుకున్నారు. కాలా జాదు, సైతాన్ ఆవహించిందంటూ ప్రజలను బయబ్రాంతులకు గురిచేసి చిత్ర హింసలు పెట్టి డబ్బులు దండుకుంటున్న మాయగాళ్లు పెరిగిపోతుండటంతో పోలీసులు కొరడా జులిపించారు.
క్షుద్ర పూజలు                 
విదేశాలకు వెళ్లిన కుటుంబీకులను టార్గెట్ గా చేసుకొని ఫయాజ్ మహ్మమద్ అన్సారీ,  అన్వరుల్ ఖాన్ లు కాలా జాదులు ఆవహించాయని క్షుద్ర పూజలు నిర్వహించేవారు. ఇంట్లో పిల్లలకు దయ్యంపట్టిందని నమ్మబలికి పిల్లల కాళ్లు చేతులు కట్టేసి ఇనుప సీకులతొ కట్టేసి చిత్ర హింసలకు గురిచేస్తారు. క్షుద్ర పూజలు చేస్తన్న సమయంలో బాగా మరిగిన వేడి నీళ్లను పిల్లల పై పోసి రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. కొవ్వత్తులను కాల్చి చిన్నారుల జననాంగాల పై అంటించి హింసిస్తారు. 
అమయాకులకు టోకరా               
పురాతన సంపద, లంకెలు బిందెలు ఉన్నాయటంటూ అమయాకులను టోకరా వేస్తాడు. . కాచిగూడ కు చెందిన వస్త్ర వ్యాపారి దగ్గర నిది నిక్షేపాలు ఉన్నాయంటూ నమ్మబలికి 35లక్షల రూపాయలను దోచుకున్నాడు. చార్మినార్ దగ్గరి ఓ ఇంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయని తవ్వకాలు జరిపి నకిలీ బంగారాన్ని వ్యాపారికి అంటగట్టాడు. పథకం ప్రకారం ముందుగానే తవ్వకాలు జరిపే చోట బంగారు పూత పూసిన ఇత్తడి, మెరిసే బంగారు రాళ్లను పాతిపెట్టి మోసం చేశారని సౌత్ జోన్ డిసిపి సత్య నారాయణ చెప్పారు. ఇలాంటి దొంగ బాబాలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ ఎవరైన ఇలాంటి క్షుద్ర పూజులు నిర్వహిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.

 

ఎదురు కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్ : సుకుమా జిల్లా గాదిరావ్ పీఎస్ పరిధిలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 

అవంతి కాలేజీ ఫ్రెషర్ డే కార్యక్రమంలో రసాభాసా

హైదరాబాద్ : అవంతి కాలేజీ ఫ్రెషర్ డే కార్యక్రమం రసాభాసాగా మారింది. రెండు గ్రూపులగా విడిపోయి విద్యార్థులు కొట్టుకున్నారు. మద్యం సేవించి నడిరోడ్డుపై పరస్పరం దాడులు చేసుకున్నారు. 

యాదాద్రి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

నల్గొండ : యాదాద్రి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దేవాలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. 

తిరుమల శ్రీవారి ఆలయం పోటులో ప్రమాదం

తిరుమల : శ్రీవారి ఆలయం పోటులో ప్రమాదం సంభవించింది. కాగుతున్న నెయ్యి మీదపడి పోటు కార్మికుడికి గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. వడ ప్రసాదం తయారు చేస్తుండగా ఘటన చేసుకుంది. 

సీసీఎస్ మహిళా పీఎస్ లో భర్తపై భార్య ఫిర్యాదు

హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్ కు చెందిన శివశంకర్ పై సీసీఎస్ మహిళా పీఎస్ లో అతని భార్య ఫిర్యాదు చేసింది. మరదలుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సీసీ కెమెరా పుటేజ్ స్నేహితులకు చూపిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. 

 

ఇద్దరు నయీం అనుచరులు అరెస్టు

కరీంనగర్ : నయీం అనుచరులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బీడీ కాంట్రాక్టరును బెదిరించిన కేసులో రాజు, సుధాకర్ లను అరెస్టు చేశారు. రాజు, సుధాకర్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. కోర్టు తొమ్మిది రోజుల రిమాండ్ విధించింది. 

సార్క్ శిఖరాగ్ర సమావేశాలు రద్దు...

హైదరాబాద్ : సార్క్ శిఖరాగ్ర సమావేశాలు రద్దు అయ్యాయి. భారత్ సహా నాలుగు దేశాలు సార్క్ సమావేశాలను బహిష్కరించాయి. దీంతో సార్క్ సమావేశాలను రద్దు చేశారు. పాకిస్తాన్ లో నవంబర్ లో సార్క్ సమావేశాలు జరగాల్సివుంది. 

17:14 - September 28, 2016

హైదరాబాద్‌ : నగరంలో చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ ఎంసీ మేయర్‌ బొంతురామ్మోహన్‌ తెలిపారు. ఈమేరకు మేయర్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకుంటే.. పీడీయాక్ట్‌ను కూడా ప్రయోగిస్తామని హెచ్చరించారు. అయితే.. అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని చెప్పారు.

 

17:10 - September 28, 2016

హైదరాబాద్ :  నటుడు, కమెడియన్  అల్లరి నరేశ్  దంపతులకు  మొదటి సారి  పండంటి పాప పుట్టింది.  తనకు కూతురు పుట్టిన ఆనంద క్షణాలను అల్లరి నరేశ్  తన  ఫేస్ బుక్ ద్వారా ఈ విషయాన్ని  అభిమానులతో పంచుకున్నారు. తన గారాల పట్టిని ఎత్తుకొని దిగిన ఫొటోను నరేశ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అల్లరి నరేశ్, విరూపల వివాహం గతేడాది మేలో జరిగిన విషయం తెలిసిందే. సెల్ఫీరాజా మూవీ తో పూర్తి హిట్ అందుకుని అనందంలో ఉన్న  నరేశ్ కి పాప పుట్టడం మరింత  ఆనందాన్ని పెంచిదని చెప్పవచుచ్చు . కాగా అల్లరి నరేశ్ జీ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమాలో నటిస్తున్నాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు .

17:09 - September 28, 2016

విశాఖ : బహుబలి చిత్రంలో సన్నివేశాన్ని గుర్తుకు తెస్తున్న ఈ ఘటన విశాఖ జిల్లాలోని చోటుచేసుకుంది. చింతపల్లి మండలం కుడుమూసారి గ్రామంలోని మువ్వల దావీదు కుమారుడు అనారోగ్యానికి గురికావడంతో దాదాపు వాగులో 5 కిలోమీటర్లు నడిచి ప్రభుత్వ ఆసుపత్రికి తోటి గిరిజనుడు సహయంతో ఇలా నీళ్లు ఈదుకుంటూ ఓడ్డుకు చేరాడు.  కుడమూసారి పంచాయితీకి రహదారి సౌకర్యం లేకపోవడంతో పాటుగా వంతెన కూడా లేకపోవడంతో ఇలా వాగు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత పదిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ వాగు ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది. తండ్రి మనస్సు అంటే ఇదేనెమో.

16:44 - September 28, 2016

కర్నూలు : అత్యాచారం కేసులో కర్నూలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించింది. జులై 18న ఖాజీ బాషా వ్యక్తి ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి..ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు విచారించిన మొదటి అదనపు సెషన్స్ కోర్టు.. నిందితుడు ఖాజీ బాషాకు కిడ్నాప్ కు ఏడేళ్ల శిక్ష., అత్యాచారానికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.

 

16:30 - September 28, 2016

గుంటూరు : జిల్లాలోని తాడేపల్లి ఎంఈవో సుబ్బారావుపై పెదనందిపాడు ఎస్ ఐ కోటయ్య దాడికి పాల్పడ్డాడు. కోర్టు స్టే ఉందని చెప్పినా.. ఎంఈవోపై ఎస్ చేయిచేసుకున్నారు. సుబ్బారావుపై పలు కేసులు ఉన్నాయని పీఎస్ కు తీసుకెళ్లేందుకు యత్నించారు. ఎస్ ఐ చర్యలకు నిరసనగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

నానో కెమికల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నాం - సీపీఎం మధు..

కర్నూలు : జిల్లా పాణ్యం మండలంలోని కొండజూటూరులో ఏర్పాటు చేస్తున్న నానో కెమికల్ ఫ్యాక్టరీని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. దీనిని అడ్డుకొనేందుకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

రేపు ఢిల్లీకి మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని కలవనున్నారు. భారీ వర్షాలకు హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని వివరించనున్నారు. 

16:21 - September 28, 2016

నేచురల్ స్టార్ 'నాని' బాక్సాఫీస్ హవా కంటిన్యూ అవుతోంది. ఈ హీరో లేటెస్ట్ మూవీ 'మజ్ను'కి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు ముంచెత్తుతున్నా సరే తొలి వారాంతంలో ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 14 కోట్ల దాకా గ్రాస్ తో పాటు 9 కోట్ల షేర్ వసూల్ దక్కించుకుంది. నైజాం ఏరియాలో 'మజ్ను' రూ. 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే చిన్న విషయం కాదు. అయితే పస్ట్ వీక్ లో బండిలాకొచ్చిన 'నాని' ఇప్పుడు తప్పకుండా బాక్సాపీసు వద్ద మ్యాజిక్ చూపించాల్సిందే. లేకుండా నేచర్ తో పోరాడిన ఈ నేచురల్ స్టార్ కష్టం వృథా అయినట్లే.

చిత్రాలు తట్టుకుంటుందా ? 
'మజ్ను' చిత్రం వసూళ్లు ఇప్పటి వరకు సంతృప్తికరంగా ఉన్నాయి అయితే బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే ఈ చిత్రం ఈ సెకెండ్ వీక్ లో గట్టిగా కలెక్షన్లను రాబట్టాల్సిందే. ఇప్పటికే ఓవర్సీస్ లో నష్టాలపాలైన ఈ చిత్రం ఈ వీక్ డేస్ లో వసూళ్లు రాబట్టితేనే ఇక్కడి డిస్టిబ్యూటర్స్ సేఫ్ అవుతారు. లేకపోతే 'కృష్ణగాడి వీరప్రేమగాథ'లా ఈ చిత్రం కూడా కొద్దిపాటి నష్టాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మరి ఈ శుక్రవారం 'రామ్' 'హైపర్' తో పాటు 'ఎం.ఎస్.ధోని' కూడా రిలీజవుతోంది. ఈ చిత్రాలను తట్టుకుని 'మజ్ను' లాభాలు తెచ్చిపెడుతాడో చూడాలి.

కర్నూలు కోర్టు సంచలన తీర్పు..

కర్నూలు : ఏడేళ్ల బాలిక కిడ్నాప్...అత్యాచారం కేసులో మొదటి అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడు ఖాజీ బాషాకు జీవిత ఖైదు విధించింది. 

దుర్గం చెరువు వద్ద ఆక్రమణల తొలగింపు..

హైదరాబాద్ : నగరంలో ఆక్రమణల తొలగింపు కొనసాగుతున్నాయి. బుధవారం మాదాపూర్ దుర్గం చెరువు నుండి దర్గా మల్కం చెరువు వరకు నాలా వెంట ఆక్రమణలను తొలగించారు. 

ఎంఈవోపై చేయి చేసుకున్న ఎస్ఐ..

గుంటూరు : జిల్లా తాడేపల్లి ఎంఈవో సుబ్బారావుపై పెదనందిపాడు ఎస్ఐ కోటయ్య దాడి చేశాడు. సుబ్బారావుపై పలు కేసులున్నాయని పీఎస్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కోర్టు స్టే ఉందని చెప్పినా ఎంఈవోపై ఎస్ఐ చేయి చేసుకున్నాడు. ఎస్ఐ చర్యకు నిరసగా ఎంఈవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు.

 

15:59 - September 28, 2016


మెదక్ : రెండేళ్లలో గోదావరి జలాలు వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. వర్షం కోసం మొగులు వైపు చూసే పరిస్థితి పోతుందన్నారు. గోదావరి జలాలు వస్తే...ఇకపై అన్ని చెరువులు, కుంటల్లో 365 రోజులపాటు నీళ్లు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలోని ఎర్రవల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో ఎర్రవల్లి గ్రామానికి గోదావరి నీరందిస్తామని చెప్పారు. ఈసారి రెండో పంటను కూడా వేయవచ్చని తెలిపారు. రెండు సంవత్సరాలకు సరిపడ వర్షం పడిందన్నారు. 50 లేదా 60 బోర్లు వేయించాలని.. వాటికి మోటార్లు కూడా ఫిట్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు రకాలవాతావరణ పరిస్థితులుంటాయని చెప్పారు. అందులో ఒకటి ఎల్ నినో అని... ఎల్ నినో ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా పడతాయని.. దీంతో కరువు తాండవిస్తుందన్నారు. రెండోది... లానినో.. అని ..దీని ప్రభావంతో బాగా వర్షాలు పడతాయన్నారు. వర్షం నీటిని కాపాడుకుంటే కరువు ఉండదని చెప్పారు. ఎండాకాలంలో పంటు పండించేలా నీటిని కాపాడుకోవాలని సూచించారు. 

 

15:48 - September 28, 2016

వరంగల్‌ : నగరంలో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. 1000 నుంచి 2000 అక్రమ కట్టడాలను గుర్తించామని మేయర్ రాజ్ కుమార్ తెలిపారు. ఎట్టి పరిస్థితులలో వాటిని కూల్చివేస్తామని ఎట్టి పరిస్థితుల్లో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని మేయర్ స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:45 - September 28, 2016

హైదరాబాద్ : భారీ వర్షాలతో అతలాకుతలమైన భాగ్యనగరంలో అక్రమకట్టడాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చినా.. అది పూర్తి చేయడంలో మాత్రం సందేహాలు ఏర్పడుతున్నాయి. నాలాల పైన, చెరువుల పైన అక్రమ కట్టడాలు కూల్చివేయాలని అధికారులకు చెప్పినా... వారు మాత్రం కాలనీల్లో ఉన్న చిన్న చిన్న కట్టడాలు మాత్రమే కూల్చుతున్నారు... తప్పితే మూసీ నది నాలాపై ఉన్న చాలా అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టడం లేదు. దీనిపై మరింత సమాచారం టెన్ టివి ప్రతినిధి అందించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:42 - September 28, 2016

హైదరాబాద్‌ : మల్కాజ్‌గిరిలో మూడోరోజు అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. చెరువులు, నాలాల్లో కట్టిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. సీసీఎల్ కాలనీ, మిర్జాలగూడలోకూడా నిర్మాణాలు కూల్చివేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానికులు అడ్డుకున్నారు. పైసా పైసా కూడబెట్టి తాము ఇళ్లు కట్టుకున్నామని.. ఇప్పటికిప్పుడు కూల్చివేస్తే తాము ఎక్కడికి వెళ్లాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు.

15:41 - September 28, 2016

హైదరాబాద్ : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత విమర్శలు సంధించారు. కేంద్రంలో బాధ్యతాయుత పదవిలో ఉన్న వెంకయ్యనాయుడు.. తెలంగాణపై వివక్షచూపడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. విమోచనా రాజకీయం అంటే వెంకయ్యకు తెలంగాణ గుర్తుకొస్తుంది.. వరదసహాయం అంటే మాత్రం ఆంధ్రాప్రాంతం గుర్తుకొస్తుందని ఆమె విమర్శించారు. అటు తెలంగాణా కాంగ్రెస్‌ నాయకులపై కూడా కవిత విరుచుకుపడ్డారు. మిడ్‌మానేరు డ్యామ్‌పై హస్తం నేతలు విమర్శలు చేయడంపై ఆమె సీరియస్‌ అయ్యారు. 2006లో ప్రారంభమైన ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు పూర్తిచేయలేకపోయిందని కవిత ప్రశ్నించారు. 

 

15:36 - September 28, 2016

చిత్తూరు : ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఏపీపీసీసీ మరో అడుగు ముందుకేసింది. తిరుపతిలో ప్రజా బ్యాలెట్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు వెనక్కితగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలు అన్నారు. అంతకు ముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిపిసిసి చీఫ్ రఘువీరా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు. 

 

అప్పు చెల్లించలేదని వివాహితపై అత్యాచారం..

మెదక్ : దుండిగల్ లో దారుణం చోటు చేసుకుంది. రూ.5వేలు అప్పు చెల్లించలేదని వివాహితను నిర్భందించి తమిళనాడుకు చెందిన వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు. పీఎస్ లో భర్త సాయికుమార్ ఫిర్యాదు చేయడంతో బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలి

15:30 - September 28, 2016

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకతీతంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నట్లు టీఆర్ ఎస్ ఎంపి కవిత తెలిపారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుమక్మ పండుగ జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 1100 చోట్ల తమ కార్యకర్తలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. జాగృతి కార్యకర్తలు తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం పుట్టిన సైనికులని అభివర్ణించారు. వారిని ఎవరూ లీడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. కేరళలో జరిగే ఓనం పండుగులా... తెలంగాణలోనూ 25 వేల నుంచి 30 వేల మహిళలతో గిన్నిస్ బుక్ రిక్డారు నమోదు చేసే విధంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తారని చెప్పారు. అక్టోబర్ 6న గచ్చిబౌలిలో నిర్వహిస్తారని తెలిపారు. 
 

ప్రజాసాధికార సర్వే పూర్తి చేయాలి - చంద్రబాబు..

విజయవాడ : అక్టోబర్ 15వ తేదీలోగా ప్రజాసాధికార సర్వే పూర్తవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక సీఎంవోలో భాగమని, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చీఫ్ కమాండర్ గా సీఎం వ్యవహరిస్తారని వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్..కమ్యూనికేషన్ సెంటర్ గా మార్పు చేసినట్లు, జిల్లాలు, డివిజన్ లలో కలెక్టర్లు..ఆర్డీవోల ఆధ్వర్యంలో కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 

15:24 - September 28, 2016

ఢిల్లీ : ఈ ఏడాది నవంబర్‌లో పాకిస్థాన్‌లో జరిగే సార్క్‌ శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరించాలని మన నిర్ణయించుకుంది. ఉరిలోని సైనిక స్థావరంపై పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులు ఈనెల 18న దాడి జరిపిన నేపథ్యంలో మన దేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఇస్లామాబాద్‌లో జరిగే  సార్క్‌ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కావడంలేదని అధికార వర్గాలు ప్రకటించాయి. అఫ్గనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఉరీ ఘటన తర్వాత దౌత్యపరంగా పాకిస్థాన్‌లో ఏకాకిని చేసేందుకు మన దేశం ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి. 

 

నేను చెప్పినట్టే జరిగింది - కేసీఆర్..

మెదక్ : తాను వర్షాలు పడుతాయని చెప్పినట్టే జరిగిందని తెలగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎర్రవెల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వర్షం ఎక్కువ పడటానికి..కరవు రావడానికి రెండు కారణాలున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారని, ఒకటి ఎల్ నినో..రెండోది లానినోనని తెలిపారు. ఎల్ నినో ప్రభావితం ఎక్కువగా ఉంటే అక్కడ వర్షాలు పడవన్నారు. ప్రస్తుతం లానినో సైకిల్ ప్రారంభమైనట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారని తెలిపారు.

కూల్చివేతకు ఆరు కమిటీలు - జీహెచ్ఎంసీ మేయర్...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలు, కుంటలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఆరు కమిటీలను మేయర్ బొంతు రామ్మోహన్ ఏర్పాటు చేశారు. టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, యూసీడీ, తదితర శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేశారు. నాలాలు, కుంటలపై ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని, కూల్చివేతను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ పేర్కొన్నారు. అవసరమైతే పీడీయాక్ట్ ఉపయోగిస్తామని హెచ్చరించారు. 

తిరుపతిలో ఏపీ పీసీసీ ప్రజా బ్యాలెట్..

చిత్తూరు : ప్రత్యేక హోదా కోసం ఏపిపీసీసీ పోరుబాటపట్టింది. ప్రజల మద్దతు కూడగట్టేందుకు తిరుపతిలో ప్రజా బ్యాలెట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించింది. 

14:59 - September 28, 2016

జెరూసలెం : ఇజ్రాయిల్ మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత సిమోన్‌ పెరేజ్‌  కన్నుమూశారు. 93 ఏళ్ల సిమోన్‌ గుండెపోటుతో 15 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. సిమోన్‌ మరణాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడు ధృవీకరించారు. 1994లో అమెరికా అధ్యక్షుడిగా బిల్‌ క్లింటన్‌ ఉన్న సమయంలో ఇజ్రాయిల్‌-పాలస్తీనాల మధ్య ఓస్లో సంధి విషయంలో సిమోన్‌ ప్రధాన పాత్ర వహించారు. ఇజ్రాయిల్‌ తాత్కాలిక ప్రధాని ఇట్జాక్ రాబిన్, పాలస్తీనా నేత యాసర్ అరాఫత్‌తో కలిసి సిమోన్ సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. సిమోన్‌ పెరేజ్‌ 2007-2014 మధ్య ఇజ్రాయిల్‌కు రెండుసార్లు ప్రధానమంత్రిగా, అధ్యక్షుడిగా  సేవలందంచారు.

 

14:56 - September 28, 2016

ఢిల్లీ : భారీ వర్షాలు, వరదలకు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఆస్తి, పంట నష్టాలపై నివేదికలు అందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఎపి, తెలంగాణ ప్రభుత్వాలను కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లతో వెంకయ్య ఢిల్లీలో భేటీ అయ్యారు. వర్షాలు, వరదలకు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నష్టలను వివరించారు. రాష్ట్రాల నుంచి నివేదికలు అందిన తర్వాత కేంద్ర బృందాలను పంపించి, నష్టాలను పరిశీలించి సాయం అందించడానికి కేంద్రం అంగీకరించిందిని వెంకయ్యనాయుడు చెబుతున్నారు. కేంద్ర బృందాలు ఇచ్చే నివేదికల ఆధారంగా సహాయం ఉంటుందన్నారు. 

 

14:53 - September 28, 2016

కృష్ణా : బెజవాడ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. సిగ్నలింగ్‌ వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూట్‌ రిలే ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌ తుదిదశ పనులను పూర్తి చేశారు. అధికారులు సిగ్నలింగ్‌ వ్యవస్థను మెరుగుపర్చారు. అనుకున్న గడువు కంటే ముందే పనులు పూర్తయ్యాయి. దీంతో రైళ్లన్నీ వారం తర్వాత ప్లాట్‌ఫారాలకు చేరుకుంటున్నాయి. బెజవాడ రైల్వేస్టేషన్‌లో మెరుగైన సిగ్నలింగ్‌ వ్యవస్థపై మరిన్ని వివరాలను టెన్ టివి ప్రతినిధి అందించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

14:49 - September 28, 2016

చిత్తూరు : ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఏపీపీసీసీ మరో అడుగు ముందుకేసింది. తిరుపతిలో ప్రజా బ్యాలెట్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రజా బ్యాలెట్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు వెనక్కితగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలు అన్నారు. అంతకు ముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుపై సమీక్ష..

హైదరాబాద్ : కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుపై సీఎం అదనపు ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. మండలాలు..డివిజన్లు..జిల్లాల్లో పనిచేయడానికి అవసరమైన ఉద్యోగులు..ఖాళీల భర్తీ..ఇతర అంశాలపై చర్చించారు. కొత్తగా 3252 పోస్టులు అవసరమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రతి క్యాడర్ లోనూ అర్హతను బట్టి ఆయా శాఖల్లో పదోన్నతులు కల్పించి పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

రైల్వే ఉద్యోగులకు బోనస్..

ఢిల్లీ : రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. ఉద్యోగులు అడిగిన విధంగానే 78 రోజుల ప్రొడక్టివిటీ ఆధారిత బోనస్ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. 

నీరు విడుదల చేయవద్దని కర్నాటక అఖిలపక్షం నిర్ణయం..

బెంగళూరు : తమిళనాడుకు నీటిని విడుదల చేయరాదని కర్నాటక అఖిలపక్షం నిర్ణయం తీసుకుంది. క‌ర్ణాట‌క‌ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ‌రామ‌య్య కావేరీ జల వివాదంపై ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సుప్రీం ఆదేశాల‌పై చ‌ర్చించిన క‌ర్ణాట‌క రాజ‌కీయ పార్టీలన్నీ త‌మిళ‌నాడుకు నీటిని విడుద‌ల చేయ‌రాద‌నే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ముందుగా ఆదేశించినట్లే 6 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు కర్ణాట‌క‌ విడుదల చేయాల్సిందేన‌ని సుప్రీంకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

14:30 - September 28, 2016

'ప్రభాస్' మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. 'బాహుబలి 2' తరువాత చేయనున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ 100కోట్లతో తెరకెక్కబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. తెలుగుతో పాటు కోలీవుడ్ బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. సినిలవర్స్ అందరూ 'బాహుబలి 2' రిలీజ్ గురించే ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' భారీ విజయంతో 'ప్రభాస్' ఫ్యాన్స్ క్యాలుక్లేషన్లు టోటల్ గా మారిపోయాయి. నిజానికి 'బాహుబలి' సినిమా ఊహించని విజయం సాధిచింది. దీంతో 'ప్రభాస్' రేంజ్ కూడా బాగా పెరిగింది. 'బాహుబలి 2' రిలీజ్ తరువాత ఆయన రేంజ్ మరింత పెరగడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ కాన్పిడెంట్ గా ఉన్నారు. అయితే 'బాహుబలి' ఇమేజ్ ని కంటిన్యూ చేయడానికి 'ప్రభాస్' సరికొత్త స్కెచ్ వేస్తున్నాడట.

సుజిత్ డైరెక్షన్ లో...
'బాహుబలి'తో పెరిగిన మార్కెట్ ని 'ప్రభాస్' సరిగ్గా వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. 'బాహుబలి 2' తరువాత ఈ స్టార్ 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ డైరెక్షన్ లో మూవీ చేయడానికి సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని కూడా 100 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళం, హిందీల్లో ఏకకాలంలో నిర్మించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు మూడు లాగ్వేంజ్ కి సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. 'బాహుబలి'తో 'ప్రభాస్' కి నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ ఫాలోయింగ్ ని కంటిన్యూ చేయడానికే ఇలా త్రిభాష చిత్రాలు చేసేలా ప్రణాళికలు వేస్తున్నాడట. 'ప్రభాస్' ఇలా చేయడానికి పెద్ద రిజనే ఉందట. బాలీవుడ్ స్టార్స్ 'సల్మాన్ ఖాన్', 'షారూఖ్', 'అమీర్' రేంజ్ లో తను కూడా నేషనల్ స్టార్ గా 400కోట్ల మార్కెట్ ని సెట్ చేసుకోవాలని భావిస్తున్నాడట. నిజంగానే ఈ ఫార్మాట్ లో 'ప్రభాస్' సక్సెస్ అయ్యాడంటే సౌత్ 'ప్రభాస్' ని మించిన స్టార్ ఉండరనే చెప్పాలి.

14:28 - September 28, 2016

మన తెలుగు స్టార్స్ తో తమిళ డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు సినిమాలు చేస్తారు. కానీ తమిళ స్టార్స్ మాత్రం మన తెలుగు దర్శకులతో వర్క్ చేయడం ఎప్పుడోకని జరగదు. సేమ్ ఇప్పుడు ఓ తమిళ స్టార్ మన తెలుగు దర్శకుడితో ద్విభాష చిత్రానికి ప్లాన్ చేశాడు. ఇంతకీ ఆ తెలుగు దర్శకుడుతో ఆ నటుడు ద్విభాష చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం 'మహేష్ బాబు' 'మురుగదాస్' తో మూవీ చేస్తున్నాడు. అలాగే 'అల్లు అర్జున్' 'లింగుస్వామి'తో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా మంది తమిళ దర్శకులు ఇక్కడి స్టార్స్ తో సినిమాలు చేశారు. కానీ మన దర్శకులతో కోలీవుడ్ దర్శకులు పని చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. కానీ ఈ విషయంలో కాస్త మార్పు కనిపిస్తోంది. మొన్నీ ఈ మధ్య 'కార్తీ' 'వంశీ పైడిపల్లి' డైరెక్షన్ లో 'ఊపిరి' చేశాడు. ఇప్పుడు 'విశాల్' ఓ తెలుగు దర్శకుడితో మూవీకి సై అన్నాడు.

బెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్...
తమిళ స్టార్ 'విశాల్' ఎప్పటి నుంచో తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ హీరో స్వతహగా తెలుగు వాడే కానీ కోలీవుడ్ లో స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు 'విశాల్' నటించిన ఆల్ మోస్ట్ అన్ని సినిమాలు తెలుగులో డబ్ అవుతుంటాయి. అందుకే ఇప్పుడు దర్శకుడు 'శ్రీవాస్' డైరెక్షన్ లో 'విశాల్' తెలుగు తమిళంలో కలిపి ద్విభాష చిత్రం చేయబోతున్నాడు.  ఈ ఎడాది 'బాలకృష్ణ' 'డిక్టేటర్' తో సక్సెస్ కొట్టిన దర్శకుడు 'శ్రీవాస్' 'విశాల్' కోసం మంచి యాక్షన్ స్టోరీ రెడీ చేశాడట. ఈ దర్శకుడు చెప్పిన స్టోరీకి ఫ్లాటైపోయిన ఈ నల్లనయ్య ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తానే నిర్మిస్తానని చెప్పాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని టాక్. జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని 'శ్రీవాస్' 'విశాల్' కెరీర్ లోనే బెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించాలని భావిస్తున్నాడట.

14:18 - September 28, 2016

చూడటానికి అమాయకంగా ఉన్న యువకుడు నెట్ సెంటర్ నడుపుతున్నాడు. వచ్చే ఆదాయం సరిపోలేదు కావచ్చు. అక్కడకు వచ్చిన మహిళలు..అమ్మాయిలపై కన్ను పడింది. వారిని అసభ్యకరంగా చిత్రీకరించాడు. దీనితో బ్లాక్ మెయిల్ లకు పాల్పడుతున్నాడు. ఇలా ఎందరో ఆడవాళ్ల జీవితాలతో ఆడుకున్న ఈ దుర్మార్గుడి పాపం పండింది. కొన్నాళ్లుగా సిక్కోలులో సంచలనం రేకేత్తిస్తున్న బ్లూ ఫిలింల కేసు కొలిక్కి వచ్చింది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వీడియో క్లిక్ చేయగలరు..

14:11 - September 28, 2016

సిక్కోలులో చెలరేగుతున్న రోమియోలు..బయటకు వెళ్లలేక భయపడుతున్న అమ్మాయిలు..మహిళలు..పోకిరీలపై యాక్షన్ దిగిన పోలీసులు...

మహానగరంలోనే కాదు..మారుమూల ప్రాంతాల్లో పోకిరీల బెడద పెరిగిపోయింది. పాశ్చాత్య పోకడలు..సినిమాలు..సీరియల్స్..ప్రభావం యువతను పెడధోరణిని పెట్టిస్తోంది. శ్రీకాకుళం నగరంలో కొంతకాలంగా మహిళలు..కాలేజీ అమ్మాయిలు..బయటకు వెళ్లాలంటేనే భయంతో గజగజ వణుకుతున్నారు. ఇందుకు కారణం రోమియోలే. దీనిపై దృష్టిసారించిన పోలీసు బాస్ యాక్షన్ లోకి దిగారు. వందమందిని పోకిరీలను పట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

అక్రమాలకు పాల్పడలేదు - మోదుగుల..

విజయవాడ : తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని టిడిపి ఎమ్మెల్యే మోదుగుల పేర్కొన్నారు. ఐటీ సోదాలపై ఆయన స్పందించారు. తాను ఎవరికీ భయపడాల్సిన పని లేదని, విజయ్‌మాల్యాలా తాను పారిపోయేవాడిని కాదని స్పష్టం చేశారు. 

13:56 - September 28, 2016

న్యాయసలహాలు..సూచనలు అందించే మైరైట్ కార్యక్రమం ఈరోజు కూడా మన ముందుకు వచ్చేసింది. ఈరోజు మైరైట్ కార్యక్రమంలో బాల్యవివాహాలు..నిరోధక చట్టం గురించి సలహాలు సూచలను అందించేందుకు అడ్వకేట్ పార్వతిగా ఎటువంటి సలహాలు ఇస్తారో తెలుసుకోండి..ఆటలాడు వయస్సులో బాలలకు వివాహాలు చేసి వారి జీవితాలతో చిన్నారుల జీవితాలు అగమ్యగోచరంగా మారిపోతున్నాయి. దీన్ని నిరోధించటానికి బ్రిటీష్‌ కాలంలోనే బాల్య వివాహాల నిరోధక చట్టం 1929లో ఏర్పడింది. కాని నేటికి వేల కొలది జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలు..నిరోధక చట్టం గురించి మరింతగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

13:53 - September 28, 2016

ఆదిలాబాద్ : ఒకప్పుడు వేలాది మంది కార్మికులతో కళకళలాడి..ఆ తర్వాత మూతపడ్డ సిర్పూర్‌ పేపర్‌ మిల్లుకు మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. నష్టాలతో మూతపడ్డ పేపర్‌ మిల్లు పునరుద్దరణకు చెక్‌ రిపబ్లిక్‌ దేశానికి చెందిన పెప్సిల్‌ కంపెనీ ముందుకొచ్చింది. దీంతో కార్మికుల్లో మళ్లీ ఉపాధి ఆశలు చిగురిస్తున్నాయి. అయితే సిర్పూర్‌ మిల్లు మూతపడి నేటికి రెండేళ్లవుతున్న సందర్భంగా..టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ.

వేలాదిమంది కార్మికులతో కళకళలాడిన మిల్
సిర్పూరు పేపరు మిల్లు..ఈ పేరు వినగానే ఒకప్పుడు వేలాది మంది కార్మికులతో పరిశ్రమ కళకళలాడింది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న సిర్పూర్ పేపర్ మిల్లు 1936లో నిజాం నవాబు కాలంలో ఏర్పాటైంది. 1942లో మిల్లులో పేపర్ ఉత్పత్తిని ప్రారంభించారు. అయితే దశాబ్దాలుగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వస్తున్న ఈ పేపర్ మిల్లు..గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిర్వాహకుల అవినీతితో ఈ పరిశ్రమ ఒక్కసారిగా కళ తప్పింది. 2010 నుంచి నష్టాల బారిన పడింది. అప్పటి నుంచి యాజమాన్యం ప్రక్షాళన మొదలుపెట్టింది. దీంతో పేపర్ ఫ్యాక్టరీనే నమ్ముకుని జీవిస్తున్న కార్మికుల బతుకులు ముక్కలయ్యాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలకు జీవనోపాధినిచ్చింది. అయితే నష్టాల పేరుతో..ఈ మిల్లును సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే 2014 సెప్టెంబర్‌ 27న ఉత్పత్తిని యాజమాన్యం నిలిపివేసింది. దీంతో ఏళ్లనుంచి మిల్లులో పనిచేస్తున్న కార్మికులు బతుకులు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి.

2014 సెప్టెంబర్‌ 27న ఉత్పత్తి నిలిపివేత
సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో దాదాపు 5వేల మంది కార్మికులు పనిచేసేవారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి లభించేది. ప్రతి నెలా స్టాఫ్ ఉద్యోగులు, కార్మికులకు వేతనాల రూపంలో యాజమాన్యం 3.50 కోట్లు చెల్లించేది. కానీ రెండేళ్లుగా పరిశ్రమ మూతపడడంతో నెలనెలా రావాల్సిన జీతం అందక కొంతమంది కార్మికుల గుండెలు ఆగిపోయాయి. మరికొందమంది కార్మికుల బతుకులు రోడ్డునపడ్డాయి. ఒకవైపు ఉపాధిలేక,.మరోవైపు బతుకుబండిని లాగలేక కార్మికులు నేటికీ అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ఉపాధి లేకపోవడంతో పరిశ్రమలో పనిచేసిన ఉద్యోగులు నేడు కూలీలుగా మారి అత్యంత దయనీయ స్థితిలో బతుకుతున్నారు.

రూ. 3 కోట్ల 50 లక్షలు వేతనాలు
అయితే తాజాగా స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప,.జిల్లా మంత్రి జోగురామన్నలు చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన పెప్సిల్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. సిర్పూర్ పేపర్ మిల్లును వేయి కోట్ల రూపాయలతో టేకోవర్ చేసి మిల్లును తిరిగి ప్రారంభించేందుకు పెప్సిల్ కంపెనీ ముందుకు వచ్చినట్లు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. ఇందులో 350 కోట్లు ప్లాంట్లు, యంత్రాలు మరో 300 కోట్లు విద్యుత్తు ఉత్పాదక ప్లాంట్లకు వెచ్చించనున్నారు. ఈ ప్రతి పాదనలను మంత్రి జోగురామన్న ఇతర సభ్యులు స్వాగతించారని సమాచారం. అయితే ఇంత పెద్ద మొత్తంలో మిల్లు పునరుద్దరణకు ముందుకు వస్తున్న పెప్సిల్ కంపెనీకి ప్రభుత్వం కూడా పలు రాయితీలు కల్పిస్తామని హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం.

పెస్పిల్‌ కంపెనీతో చర్చలు జరిపిన మంత్రి జోగురామన్న
మొత్తానికి సిర్పూర్ పేపర్ మిల్లు తిరిగి పునః ప్రారంభం అవుతుందన్న వార్తల నేపథ్యంలో కార్మికుల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రెండేళ్లుగా ఉపాధిలేక దుర్బర పరిస్థితుల్లో ఉన్న తమకు మళ్లీ పరిశ్రమ ఉపాధి కల్పిస్తుందన్న కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.

13:49 - September 28, 2016
13:47 - September 28, 2016

హైదరాబాద్‌ :జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. నాలాలు,చెరువులు, కుంటలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలకు అధికారులు కూల్చివేస్తున్నారు. ఎవరి ఒత్తిళ్ళకు లొంగకుండా కోర్టు ఆదేశాల ప్రకారమే నడచుకోవాలని అధికారులకు కమిషన్ జనార్థన్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. కమిషన్ ఆదేశాల ప్రకారం అధికారులు కూల్చివేతల్ని కొనసాగిస్తున్నారు. నగరంలో నాలాలు, చెరువుల ఆక్రమణతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.. వర్షాలు హోరెత్తినప్పుడు ఇళ్లన్నీ నీటమునిగిపోతున్నాయి... రోడ్లు చెరువుల్లామారి ప్రజలు నరకం చూస్తున్నారు.. అశోక్‌ నగర్‌, హుసేన్‌ సాగర్‌ సమీప ప్రాంతాల్లో ఆక్రమణలు జోరుగా వెలిశాయి.. నీళ్లలో పిల్లర్లువేసి మరీ భవనాలు నిర్మించారు.. మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

ముగ్గురు కానిస్టేబుళ్లు..హోం గార్డు అరెస్టు..

హైదరాబాద్ : సైబరాబాద్ పీఎస్ పరిధిలో ముగ్గురు కానిస్టేబుళ్లు, ఓ హోం గార్డులను అరెస్టు చేశారు. వ్యభిచార కేంద్రాల నుండి డబ్బులు వసూలు చేస్తున్న రాజేంద్రనగర్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. ప్రేమ జంటలను వేధింపులకు గురి చేసిన కేసులో గచ్చిబౌలికి చెందిన కానిస్టేబుల్, హోం గార్డులను పోలీసులు అరెస్టు చేశారు. 

అక్రమాలపై ఫిర్యాదుల వెల్లువ..

హైదరాబాద్ : అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ తో పాటు మంత్రి కేటీఆర్ కు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. చెరువులు..నాలాలపై నిర్మాణాలను చేపట్టిన పెద్ద సంస్థలు వ్యక్తుల నిర్మాణాల జోలికి వెళ్లడం లేదంటూ ఉన్నతాధికారులకు ప్రజలు ఫిర్యాదు చేశారు. 

13:18 - September 28, 2016

టాలీవుడ్ లో అగ్ర హీరోలు చిరంజీవి..బాలకృష్ణ చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరు కు 150వ చిత్రం కాగా..బాలయ్యకు 100వ చిత్రం కావడం విశేషం. 'కత్తి' రీమెక్ ను వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరు నటిస్తున్నారు. దీనికి 'ఖైదీ నెంబర్ 150'గా నామకరణం చేశారు. 'క్రిష్' దర్శకత్వంలో చారిత్రాత్మక చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో బాలకృష్ణ తన ప్రతాపాన్ని చూపెట్టనున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రం సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు టాక్. ఇప్పటికే టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ దసరా కానుకగా ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతోందంట. బాలయ్య యుద్ధవీరుడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. హేమామాలిని బాలకృష్ణ తల్లిగా నటిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాకు కంచె ఫేం చింతరంజన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో అనేది తెలుసుకోవాలంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే. 

బందరు పోర్టు ల్యాండ్ పూలింగ్ కు భూములివ్వలేమన్న రైతులు..

కృష్ణా : ఎరబోతుపాలెం గ్రామసభలో గందరగోళం నెలకొంది. బందరు పోర్టు ల్యాండ్ పూలింగ్ కు భూములివ్వలేమని గ్రామసభను రైతులు బహిష్కరించారు. ఈ మేరకు డిప్యూటి కలెక్టర్ కు నివేదికను అందచేశారు. 

కూకట్ పల్లిలో కూల్చివేతలు..

హైదరాబాద్ : కూకట్ పల్లి ధరణీనగర్ నాలా పక్కన ఉన్న అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. వరద ముంపునకు గురై నాలుగు రోజులుగా ధరణీనగర్, బండారి లేవుట్ లు నీటిలో ఉన్నాయి. 

తెలుగు రాష్ట్రాల వర్షాభావంపై చర్చించిన వెంకయ్య..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక, హోం, వ్యవసాయ మంత్రులతో ఏపీ, తెలంగాణలో వర్షాభావంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చర్చించారు. పంట నష్టంపై అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని కోరడం జరిగిందని వెంకయ్య మీడియాతో వెల్లడించారు. రైతులను ఆదుకొనేందుకు చర్యలు చేపట్టాలని, రాష్ట్రం నుండి పంటనష్టం అంచనాలు వచ్చాక కేంద్ర బృందాలను పంపుతామని కేంద్రం పేర్కొందని తెలిపారు.

 

13:01 - September 28, 2016

పాట్నా : అంబులెన్స్..ప్రమాదం..అపాయం సమయంలో ఆదుకొనేది. కానీ నేడు అదే అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా విషాద ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మృతదేహాలను భుజన మోసుకుని..కట్టెకు వేలాడదీసుకుని వెళుతున్న అమానవీయ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పరిస్థితిలో మార్పు వస్తుందని ఊహించారు. కానీ ఎలాంటి మార్పు రాలేదని తాజాగా జరిగిన ఓ ఘటన రుజువు చేస్తోంది. బీహార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ లేదని చెప్పడంతో డెడ్ బాడీని ప్లాస్టిక్ బ్యాగులో చుట్టుకుని బంధువులు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
కతిహార్ లో సింతుకుమార్ మృతి చెందడంతో పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని బంధువులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. తాము శవపరీక్ష చేయలేమని, భగల్ పూర్ కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. దీనితో అంబులెన్స్ సదుపాయం ఏర్పాటు చేయాలని సింతుకుమార్ బంధువులు కోరారు. అంబులెన్స్ ఇవ్వకపోవడంతో ప్లాస్టిక్ బ్యాగులో చుట్టుకుని భగల్ పూర్ కు కుమార్ బంధువులు తరలించారు. మృతదేహం కుళ్లిపోవడంతో శవపరీక్ష చేసేందుకు అవసరమైన సదుపాయాలు తమవద్ద లేవని, అందుకే భగల్ పూర్ కు తీసుకెళ్లాలని సూచించినట్లు అక్కడి వైద్యులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం..అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

12:58 - September 28, 2016

హైదరాబాద్ : టీ-టీడీపీలో మళ్లీ ఆధిపత్య పోరు మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు టీ-టీడీపీ కార్యకర్తలకు క్లాసుపీకి పదిరోజులు కాకముందే..పార్టీలో క్రియాశీలక నేతల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. పార్టీకి దిశానిర్దేశం చెయ్యాల్సిన ఆ ఇద్దరు ఇప్పుడు తలోదారిగా వెళ్తుండటంతో..తెలుగుతమ్ముళ్లలో ఆందోళన మొదలైంది.

చెరోదారిలో పార్టీ అధ్యక్షుడు, కార్యానిర్వాహధ్యక్షుడు
పార్టీని నడిపించే సారధులు ఆ ఇద్దరు...ఒకరు పార్టీకి దిశానిర్దేశం చెయ్యాల్సిన అధ్యక్షుడి స్థానంలో ఉంటే..మరొకరు పార్టీ తీసుకునే నిర్ణయాలను అమలు చేసే కార్యనిర్వాహక అధ్యక్షుడు. అయితే వీరిద్దరిది ఇప్పుడు చెరోదారి అయింది. తెలంగాణలో పార్టీని తిరిగి పట్టాలెక్కించేందుకు అధ్యక్షుడిగా ఎల్‌.రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డిలను..పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. పార్టీని పట్టాలెక్కించడం మాటేమోగానీ...ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎల్‌.రమణ సొంత జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటనపై అనుమానాలు
హైదరాబాద్‌లో జరిగిన వరద బీభత్సంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై టీడీపీ ఆఫీస్‌లో ఫోటో ఎగ్జిబిషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొంటారని పార్టీ నేతలంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన కరీంనగర్ పర్యటనకు వెళ్లడంతో ఆశ్చర్యపోవడం కార్యకర్తల వంతైంది. ఫోటో ఎగ్జిబిషన్‌లో పాల్గొనాల్సిన ఆయన అకస్మాత్తుగా ఎల్‌.రమణ సొంత జిల్లాలో పర్యటించడంపై పార్టీ కేడర్‌లో గందరగోళం నెలకొంది.

నిరసన కార్యక్రమానికి హాజరుకాని ఎల్‌. రమణ
ఇదిలా ఉండాగా...భారీ వర్షాలకు హైదరాబాద్‌లో రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై టీడీపి చేపట్టిన నిరసన కార్యక్రమంలో కూడా ఇలాంటి సీనే చోటుచేసుకుంది. శ్రీనగర్‌కాలనీలో రోడ్లపై నిలిచిన వరదనీటిలో వరి మొక్కలు నాటే ఆందోళన కార్యక్రమంలో ఎల్‌.రమణ, రేవంత్‌రెడ్డి ఇద్దరూ హాజరవుతారని కార్యకర్తలకు సమాచారం వెళ్లింది. అయితే ఇందులో పాల్గొనకుండా...రంగారెడ్డి జిల్లాలో జరిగిన మరో నిరసన కార్యక్రమంలో ఎల్‌.రమణ పాల్గొనడంపై పార్టీశ్రేణుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో ఇద్దరి నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అధ్యక్ష,కార్యదర్శుల తీరుపై గందరగోళంలో పార్టీ
ఇప్పటికే తెలంగాణలో అంతంతమాత్రంగానే ఉన్న టీడీపీలో కీలకనేతల చెరోదారిపై పార్టీలో గందరగోళం నెలకొంది. పదిరోజుల క్రితమే చంద్రబాబు పార్టీ పరిస్థితులపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఆధిపత్యపోరు లేకుండా నేతలంతా పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. తాజాగా ఏర్పడిన సమస్యలపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

12:54 - September 28, 2016

విశాఖ : పచ్చని గ్రామాల్లో చిమ్ముకున్న కాలుష్యపు కోరలు. 16 గ్రామాల ప్రజల్లో మొదలైన గుబులు. 20 వేల మంది జీవితాల్లో చెలరేగిన అలజడి. ఆదుకోండని వేడుకున్నా పట్టించుకోని నేతలు.. దీంతో పోరాటబాట పట్టిన విశాఖ జిల్లా భీమిలి గ్రామస్తులు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న దివీస్‌ ల్యాబ్స్‌పై 10 టీవీ ప్రత్యేక కథనం.

అత్యంత సుందర ప్రాంతంగా భీమిలీ
భీమిలీ తీరం.. విశాఖలోని అత్యంత సుందర ప్రాంతాలలో ఒకటి. ఎన్నో అందమైన బీచ్‌లు ఉన్న సాగర తీరం. ప్రకృతి అందాలకు నెలవైన ప్రాంతం. ఏటా లక్షలాది మంది పర్యాటకులకు వీక్షించే సాగరం. ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ చూడాలనుకునే సుందరమైన ప్రాంతం.

పద్నాలుగేళ్ల క్రితం దివీస్‌ చిచ్చు
ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్న ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉన్న అన్ని మత్స్యకార గ్రామాల్లో ఏ పూటకాపూట శ్రమించి పూటగడుపుకునే వారే. ఇలాంటి వారి జీవితాల్లో పద్నాలుగేళ్ల క్రితం దివీస్‌ చిచ్చుపెట్టింది. బీమిలి మండలంలోని చిప్పాడ వద్ద దివీస్‌ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడంతో వీరిని కాలుష్యభూతం వెంటాడుతోంది. వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది.

పదహారు గ్రామాల ప్రజల తీవ్ర నిరసన
తొలుత ఒక యూనిట్‌, ఆ తర్వాత రెండో యూనిట్‌ ప్రారంభించి, రెండు చేతులా లాభాలు మూడుగట్టుకుంటున్న దివీస్‌... కాలుష్య సమస్యలను ఖాతరు చేయకుండా ఇప్పుడు మూడో యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. దీంతో ఇక్కడకు సమీపంలోని చిప్పాడ, చిట్టివలస, అన్నవరం, కంచేరు పాలేం, సిటీ నగర్ తదితర 16 గ్రామాల ప్రజలు తీవ్ర నిరసనలు వ్యకం చేస్తున్నారు. ప్రజాగ్రహంతో దివీస్ యాజమాన్యం తాత్కాలికంగా మూడో యూనిట్‌ పనులను నిలిపివేసింది. అయితే నిర్మాణం పూర్తైతే ఈ ప్రాంతంలో ఒక్క ప్రాణి కూడా మిగలదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విషతుల్యంగా మారిన భూగర్భ జలాలు
దివీస్ ల్యాబ్స్‌తో ఈ ప్రాంతంలోని 20 వేల మంది ప్రజలు దివీస్ కంపేనీ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వాతవరణంలో 3 శాతం వరకు ఐరన్‌ ఉండొచ్చు. కానీ దివీస్ పరిధిలోని గ్రామాల్లో 15 శాతం పైగా ఐరెన్ కంటేట్ ఉంది.. ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భూగర్భ జలాలు విషతుల్యం అయ్యాయి..బావులు, చిన్న చిన్న నీటి కుంటలు కూడా కాలుష్యానికి గురయ్యాయి. .బీమిలి పరిసర ప్రాంతాలలో ఇటీవల కాలంలో అమ్ల వర్షాలు కురుస్తున్నాయంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం కోరల్లో చిక్కుకుని వ్యవసాయం కుంటుపడింది.. పంటలు మాడిపోయి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ ప్రాంతంలో పడుతున్న కొద్దిపాటి పంటలను ఆహారంగా తీసుకుంటున్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ....

గర్భిణిల ఆరోగ్యం..మానసిక, శారీరక వైకల్యంతో పిల్లలు
దివీస్‌ పరిసర గ్రామాల్లో మంచినీటి వనరులు కూడా కాలుష్య కాసారాలుగా మారాయి. దీంతో తాగునీటిని మైళ్ల దూరం నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దివీస్‌ కాలుష్యం గర్భిణిల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాన్పులు కష్టమవుతున్నాయి. పుట్టే బిడ్డలు మానసిక, శారీరక వైకల్యంతో జన్మిస్తున్నారని ప్రజలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

పోలీసుల, నేతల అండతో రెచ్చిపోతున్న దివీస్‌ యాజమాన్యం
ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వకానీ, ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోవడంలేదని దివీస్‌ ల్యాబ్స్‌ బాధిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పోలీసులు, ప్రజాప్రతినిధుల అండదండలతో దివీస్ యాజమాన్యం గ్రామస్థులపై విరుచుకు పడుతోంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

వైద్యం కూడా చేయించని ఫ్యాక్టరీ యాజమాన్యం
మరోవైపు దివీస్‌లో జరిగే ప్రమాదాల్లో గాయపడే కార్మికులకు ఫ్యాక్టరీ యాజమాన్యం కనీస వైద్యం కూడా చేయించకుండా నిర్ధాక్షిణ్యంగా బయటకు గెంటివేస్తోందని కార్మిక సంఘా నేతలు ఆరోపిస్తున్నారు.

పాపాల పుట్టిగా దివీస్
పాపాల పుట్టగా మారిన దివీస్‌ కాలుష్యానికి, యాజమాన్యం ఆగడాలకు చెక్‌ పెట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. లేకపోతే జరిగే పరిణామాలకు ఇద్దరూ బాధ్యతు కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 

12:48 - September 28, 2016

హైదరాబాద్ : ఇస్రోతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మన టీవీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. మన టీవీ ద్వారా గ్రూప్‌ 2 ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వనున్నారు. అభ్యర్థులకు మరింత సులభతరంగా గ్రూప్‌ 2 కోచింగ్ ఇవ్వడానికి ఇస్రోతో సాంకేతిక సహయం తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రూప్‌ 2 పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు.

నిరుద్యోగులకు అవగాహన కోసమే : ఘంటా చక్రపాణి
నిరుద్యోగులకు అన్ని రంగాల్లో అవగాహన కల్పించేందుకు ఇస్రోతో ఒప్పందం చేసుకున్నామని టీఎస్ పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని.. వారి ఆశలను నెరవేర్చేందుకు తెలంగాణ పీఎస్‌ఎస్సీ కృషిచేస్తుందన్నారు. మనటీవీ ద్వారా గ్రూప్‌ 2 అభ్యర్థులకు మరింత మెరుగైన కోచింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. మనటీవీ ద్వారా అక్టోబర్‌ 1 నుంచి గ్రూప్‌ 2 కోచింగ్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కేబుల్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు ఈ సేవలను అందిస్తామన్నారు.

12:44 - September 28, 2016

విజయవాడ : రెండేళ్లలో ఏపీ ని దోమలు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు...అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఐఏఎస్ అధికారులుకు దిశా, నిర్దేశం చేశారు. రెండు రోజుల పాటు కొనసాగే సమావేశంలో గురువారం ఐపీఎస్ అధికారులతో శాంతిభద్రతలపై సమీక్షించారు. రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖ ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేవంలో వ్యవసాయం, రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి వంటి అంశాలపై చర్చిస్తున్నారు. పల్స్‌ సర్వేని కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 

బీసీసీఐ x లోధా కమిటీ..

ఢిల్లీ : బీసీసీఐపై లోధా కమిటీ మధ్య వార్ కొనసాగుతోంది. కమిటీ సిఫార్సులను బీసీసీఐ అమలు చేయడం లేదని, సుప్రీంకోర్టుకు జస్టిస్ లోధా కమిటీ నివేదిక సమర్పించింది. కమిటీ సిఫార్సుల అమలుకు బీసీసీఐ ఉన్నతాధికారులే అడ్డుపడుతున్నారని, బాధ్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కమిటీ కోరింది. 

12:39 - September 28, 2016

విజయవాడ : రాష్ట్రంలో జరిగే మరో వేడుకకు బెజవాడ సిద్ధమవుతోంది. బెజవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 11రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం భారీ స్థాయిలో భద్రతపై దృష్టిసారిస్తోంది. కృష్ణా పుష్కరాల సమయంలో వినియోగించిన టెక్నాలజీని దసరా ఉత్సవాలకు వినియోగించాలని సర్కారు భావిస్తోంది.

ఏడాది ఘనంగా జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
విజయవాడలో ప్రతి ఏటా జరిగే ఆధ్యాత్మిక ఉత్సవాల్లో అగ్రస్థానాన నిలిచేది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలే. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరపడం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో మాదిరిగా కెనాల్ రోడ్ లోని వినాయక గుడి నుంచి కొండపై వరకూ క్యూ లైన్లను ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 11 రోజులు జరిగే అమ్మవారి ఉత్సవాలలో సంప్రదాయ కార్యక్రమాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు.

టెక్నాలజీ సహాయంతో పటిష్ట భద్రత
ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. టెక్నాలజీ సహాయంతో మరింత పటిష్టంగా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దుర్గగుడి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలతోపాటు దుర్గగుడి వెలుపల కూడా పెద్దఎత్తున సీసీ కెమెరాలను సిద్ధం చేస్తున్నారు. సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగించుకొని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని విధాలా పూర్తిస్థాయి భద్రతను కల్పించనున్నారు.

20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
పుష్కరాల సమయంలో దాదాపు 20 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దసరా ఉత్సవాల సమయంలో 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు సమయాత్తమవుతున్నారు.

ఎత్తిపోతల పథకంపై మంత్రి హరీష్ సమీక్ష..

హైదరాబాద్ : ఎత్తిపోతల పథకంపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది 2లక్షల 34 వేల ఎకరాలకు సాగునీరందించాలని అధికారులను ఆదేశించారు. ఐడీసీ పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. 

సుప్రీంలో మెడికల్ కౌన్సెలింగ్ గడువుపై విచారణ..

ఢిల్లీ : మెడికల్ కౌన్సెలింగ్ గడువు పెంచాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అక్టోబర్ 7వరకు కౌన్సెలింగ్ పూర్తి చేసేందుకు అనుమతినిచ్చింది. గడవు పెంపు రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎంసెట్ పేపర్ లీక్ కావడం వల్ల సమస్య తలెత్తిందని తెలంగాణ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి పేర్కొన్నారు. 

కేదరీనాథ్ లో రాష్ట్రపతి..

ఉత్తరాఖండ్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్దిసేపటి క్రితం కేదరీనాథ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం హరీష్ రావత్, అధికారులు ఘన స్వాగతం పలికారు. 

12:15 - September 28, 2016

కాలానికనుగుణంగా పండ్లు వస్తుంటాయి. కొన్ని పండ్లు సంవత్సరమంతా దొరుకుతుంటాయి. ఆరోగ్యం బాగులంటే ఆహారంతో పాటు పండ్లు కూడా భుజించాలి. పండ్లలో దొరికే పోషకాలు మన శరీరానికి దొరుకుతాయి. దీనితో అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. మరి ఏ పండు తింటే ఏ లాభం అనేది చూద్దాం..
మామిడి : పలు రకాల క్యాన్సర్లను రానివ్వదు. రెచీకటిని దూరం చేస్తుంది కళ్ళు పొడిబారకుండా సహాయపడుతుంది. అంతేగాకుండా శరీరానికి చలువ.
అరటి పండు : తక్షణ శక్తిని అందిస్తుంది.
బత్తాయి : చర్మ సంరక్షణ, కంటి చూపు మెరుగుపడుతుంది. జ్వరపీడితులకు మంచిది.
పైనాపిల్ : ఎముకలను పటిష్టపరచడమే కాకుండా ఆర్తరైటిస్ దరి చేరనివ్వదు.
ఉసిరి : వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తం లోని చకెర నిల్వను తగిస్తుంది, కిళ్ళ వాతాన్ని తగిస్తుంది అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది
దానిమ్మ : మెదడు ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.
స్టాబెర్రీ : క్యాన్సర్ మీద పోరాడే గుణం ఎక్కువగా ఉంటుంది.
పుచ్చకాయ : హృదయ స్పందనల రేటను సక్రమంగా ఉంచుతుంది. బాడీ లోని ఫ్యాట్ ను తగిస్తుంది, హై బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది.
ఆపిల్ : రక్తహీనతను దూరం చేస్తుంది. హై బీపీని తగ్గిస్తుంది. మలబద్ధకం తగ్గిస్తుంది.
ఖర్జూరం : మత్తును దూరం చేస్తుంది. గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.

పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం - చంద్రబాబు..

విజయవాడ : 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరవు ఉండదని, జాతీయ వృద్ధితో పోలిస్తే ఏపీ ముందుందని, రాజధాని లేకపోవడం..వనరుల లేమి సమస్యలున్నాయన్నారు. 

మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగులో మోసుకెళ్లారు..

బీహార్ : మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ రాలేదని భార్య మృతదేహాన్ని మైళ్ల దూరం తీసుకెళ్లిన భర్త...చనిపోయిన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి మార్చురీ డ్రైవర్ నిరాకరించడం..తన తల్లి అంత్యక్రియలకు ఎవరూ సహకరించకపోవంతో కూతుళ్లు ఇంటి పై కప్పు కలపతో అంత్యక్రియలు చేయడం ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. కతిహార్ లో ముగ్గురు వ్యక్తులు ప్లాస్టిక్ బ్యాగ్ లో మృతదేహాన్ని తీసుకెళ్లారు. పోస్టుమార్టం నిమిత్తం బాగల్ పూర్ కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడం జరిగిందని, కానీ తమ దగ్గర అంత డబ్బుల దేని సంబంధిత వ్యక్తులు వాపోయారు. 

11:45 - September 28, 2016

కృష్ణా : బందర్‌ పోర్టు భూసమీకరణకు వ్యతిరేకంగా అన్నదాతలు పోరుబాట పట్టేందుకు సమాయత్తమవుతున్నారు. వెయ్యి గజాల ఇంటిస్థలం, 250 గజాల కమర్షియల్ ప్లాట్ కోసం తమ విలువైన భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెబుతున్నారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

వివాదంగా మారుతున్న బందరు పోర్ట్ నిర్మాణం
కృష్ణా జిల్లాలో బందర్‌ పోర్టు భూసమీకరణ వ్యవహారం అగ్గిరాజేస్తోంది. ఓవైపు భూసమీకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా..ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా దూకుడు ప్రదర్శించడంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్ని పార్టీల నాయకులతో అక్టోబర్ 1న మచిలీపట్నంలో భారీస్థాయిలో బహిరంగ సమావేశం నిర్వహించేందుకు భూపరిరక్షణ పోరాట సమితి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అక్టోబర్‌ 1 మచిలీపట్నంలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు
ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌లో 28 గ్రామాల పరిధిలో 14,600 ఎకరాల పట్టాభూమి, 8,900 ఎకరాల అసైన్డ్ భూమి, 9,700 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూమి ఒకరి పేరుతో ఉండగా.. అనుభవదారుగా మరొకరున్నారు. దీంతో పరిహారం విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. భూమి రైతుల పేరున లేకపోవటంతో వారికి ప్యాకేజీ ఎలా అమలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. భూసమీకరణ కోసం నియమితులైన డిప్యూటీ కలెక్టర్లు గ్రామాల్లో పర్యటిస్తూ భూ వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు సీపీఎం, సీపీఐ, వైసీపీ నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ భూ దందాల కోసమే ప్రభుత్వం భూసమీకరణ చేపడతుందని ఆరోపిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్న విపక్షాలు
ప్రభుత్వం ఈ ఏడాది జులై 23న విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌లో భూములు కోల్పోయిన రైతులకు ప్యాకేజీని ప్రకటించింది. ఎకరం పట్టా భూమి ఇచ్చిన రైతుకు మెరక భూమి అయితే నివాస స్థలం వెయ్యి గజాలు, కమర్షియల్ ప్రాంతంలో 250 గజాలు ఇస్తామని పేర్కొంది. మాగాణి భూమి అయితే వెయ్యి గజాల రెసిడెన్షియల్ ప్లాట్, 450 గజాల కమర్షియల్ స్థలం ఇస్తామంది. 1954 సంవత్సరానికి పూర్వం అసైన్డ్ చేసిన భూమి వారసత్వంగా వస్తే మెరకభూమి అయితే వెయ్యి గజాల ఇంటిస్థలం, 200 గజాల కమర్షియల్ స్థలం ఇస్తారు. మాగాణి భూమి అయితే 1000 గజాల నివాస స్థలం, 450 గజాల కమర్షియల్ స్థలం కేటాయిస్తారు. దీంతోపాటు భూమి కోల్పోయే రైతులకు ఏడాదికి మెరక అయితే 30 వేలు, మాగాణి అయితే 50 వేలు చొప్పున పంట నష్టపరిహారంగా పదేళ్లపాటు అందజేస్తారు. అసలు భూమి లేని వారికి నెలకు రూ.2,500 చొప్పున పింఛన్ గా అందించాలని నిర్ణయించారు. మెరకకు పదేళ్లకు 3 లక్షలు, మాగాణికి 5 లక్షలు చొప్పున నగదు ఇస్తామన్నారు. అయితే మార్కెట్‌ విలువ ప్రకారం వెయ్యి గజాల స్థలానికి 2 లక్షలకు మించి కూడా రాదని రైతులు వాపోతున్నారు. విలువైన పంట భూములను వదులుకోలేమని చెబుతున్నారు.

నిబంధనల ప్రకారమే భూసమీకరణలు : మంత్రి పల్లె
మరోవైపు నియమ నిబంధనల ప్రకారమే భూములు సమీకరిస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అంటున్నారు. మంగళవారం నుంచి అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఇవ్వటంతో రైతులంతా 9.2 ఫారాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పోర్టు ఏర్పాటు కోసం పంటలు పండే భూములు కాకుండా ప్రభుత్వ భూములు తీసుకోవాలని చెబుతున్నారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

 

కుషాయిగూడలో అక్రమ కట్టడాల కూల్చివేత...

హైదరాబాద్ : కుషాయిగూడలోని శుభోదయనగర్, సోనియా నగర్ లో అక్రమ కట్టడాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనితో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. 

11:40 - September 28, 2016

హైదరాబాద్ : ఇస్రోతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మన టీవీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. మన టీవీ ద్వారా గ్రూప్‌ 2 ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వనున్నారు. అభ్యర్థులకు మరింత సులభతరంగా గ్రూప్‌ 2 కోచింగ్ ఇవ్వడానికి ఇస్రోతో సాంకేతిక సహయం తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రూప్‌ 2 పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు.

11:34 - September 28, 2016

విజయవాడ : జాతీయ వృద్ధితో పోలిస్తే ఏపీ ముందుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నీటి భద్ర‌తపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్రత్యేక దృష్టి సారించింద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. విజ‌య‌వాడ‌లో రెండు రోజుల క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న ప్ర‌సంగించారు. స్మార్ట్ వాట‌ర్ గ్రిడ్ ఏర్పాటు చేయాల‌న్న‌ది త‌న‌ ల‌క్ష్యమ‌ని పేర్కొన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ల్ల రాష్ట్రానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులో రాష్ట్రంలో క‌ర‌వు అనే ప‌రిస్థితి ఉండ‌బోదని చంద్ర‌బాబు తెలిపారు. గోదావ‌రి, కృష్ణా, పెన్నా న‌దుల‌ను అనుసంధానం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు. స‌వాళ్ల‌ను ఎదుర్కుంటు ముందుకు వెళుతున్నామ‌ని చెప్పారు. రాజ‌ధాని లేక‌పోవ‌డం, వ‌న‌రుల లేమి స‌మ‌స్య‌లు ఉన్నాయని అయినా అన్ని పరిస్థితుల‌ను అధిగ‌మిస్తున్నామ‌ని చెప్పారు. ‘ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే జీఎస్ డీపీలో మ‌న‌మే ముందున్నాం.. మొద‌టి త్రైమాసికంలో 12 శాతం వృద్ధి సాధించాం.... జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధి రేటు ఎక్కువ‌... సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అన్ని రంగాల్లో ఉప‌యోగిస్తున్నామన్నారు.

కరవు నివారణకు చర్యలు : చంద్రబాబు
ష్ట్రంల కరవుకు చెక్ పెడతామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి,కృష్ణ, పెన్నా నదులను అనుసంధానం చేస్తే ఏపీలో ఎప్పటికీ కరవు అనే మాట వినిపించదన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ విషయంలో ప్రతీ ఒక్క కలెక్టర్ అప్రమత్తంగా వుండి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అగ్రికల్చర్ ..ఆర్టికల్చర్ ను డెవలప్ చేసుకుంటే వృద్దిరేటు పెరుగుందని తెలిపారు. దేశంలో ఏపీని ఆక్వా కల్చర్ హబ్ గా తయారుచేయాలన్నారు. రెండ్రోజుల పాటు జరగనున్న కలెక్టర్ల సదస్సు విజయవాడలో ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తి, నారాయణ, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబుతో పాటు పలువురు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

దేశంలో ఆదర్శంగా టీఎస్పీఎస్సీ - కేటీఆర్..

హైదరాబాద్ : వ్యవసాయ రంగంలోనూ శాటిలైట్ పరిజ్ఞానం వినియోగిస్తామని, ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ దేశంలో ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రోజుకు 4 గంటలు గ్రూప్ 2పై శిక్షణ తరగతులు నిర్వహించబడుతాయని, త్వరలోనే సివిల్స్, ఎంసెట్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దసరా తరువాత ఆరు వేల స్కూళ్లలో ఇస్రో సహకారంతో డిజిటల్ తరగతులు ఉంటాయని తెలిపారు.

 

కర్నూలులో సీపీఎం నేత మధు పర్యటన..

కర్నూలు : జిల్లాలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలని, ప్రపంచ వ్యాప్తంగా నిషేధించబడిన కాలుష్య ఫ్యాక్టరీలను రాష్ట్రంలో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీలను ప్రజలు..రైతులు వ్యతిరేకిస్తున్నారని, రైతులకు మద్దతుగా సీపీఎం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 

11:19 - September 28, 2016

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి మూసాపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. రమేష్, హరికృష్ణ అనే ఇద్దరు స్నేహితులు బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. వెనుకనుండి వచ్చిన ఓ లారీ వాహనం ఢీకొనటంతో బైక్ వెనుక కూర్చున్న హరికృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు. 15 సంవత్సరాల నుండి స్నేహితుడిగా వున్న హరికృష్ణ మరణాన్ని చూసి తట్టుకోలేక స్నేహితుడు రమేష్ భరత్ నగర్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు గుంటూరు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లి వాసులుగా గుర్తించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం పోస్ట మార్టం నిమిత్తం రమేష్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

ఇస్రోతో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందం..

హైదరాబాద్ : ఇస్రోతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 'మనటీవీ' సేవలను మెరుగుపరుచుకొనేందుకు ఒప్పందం చేసుకుంది. 'మన టీవీ' ద్వారా గ్రూప్ 2 ప్రవేశ కోచింగ్ ను ప్రభుత్వం ఇవ్వనుంది. అక్టోబర్ ఒకటో తేదీ నుండి 'మన టీవీ' ద్వారా గ్రూప్ 2 ప్రవేశ కోచింగ్ ఇవ్వనున్నారు. 

ఆర్థిక ఫలితాల్లో ఏపీ ముందుంది - యనమల..

విజయవాడ : ఆర్థిక ఫలితాల్లో ఏపీ ముందుందని, వృద్ధి రేటులో వ్యవసాయ రంగం కీలకంగా ఉంటుందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి లో ప్రగతి వైపు పయనిస్తున్నట్లు, అనేక రంగాల్లో మిగతా రాష్ట్రాలకన్నా ముందున్నట్లు తెలిపారు.

పాలనలో మార్పులు - కేఈ..

విజయవాడ : కోర్ డాస్ బోర్డ్, కమాండ్ కంట్రోల్ సిస్టం వంటి వినూత్న పద్ధతులతో పాలనలో మార్పులు తీసుకొస్తున్నట్లు ఏపీ డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. 

12.6 శాతం వృద్ధి రేటు సాధించాం - బాబు..

విజయవాడ : ఏపీ రాష్ట్రం ప్రస్తుతం 12.6 వృద్ధి రేటు సాధించడం జరిగిందని, లక్ష్యం మాత్రం 15 శాతం పెట్టుకోవడం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. రాబోయే 12-15 సంవత్సరాల్లో 15 శాతం వృద్ధి రేటు సాధిస్తే అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో ఏపీ చేరుతుందని పేర్కొన్నారు. కంబైన్డ్ కంట్రోల్ రూం తీసుకరావడం జరిగిందని, మొదటి సెషన్ వాటర్ రీసోర్స్ డెవలప్ మెంట్ గురించి మాట్లాడడం జరుగుతుందని, నీటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నారు.

10:52 - September 28, 2016

మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150' సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే సగం షూటింగ్ అయిపోయినట్లు తెలుస్తోంది. శ్రీమతి కొణిదెల సురేఖ సమర్పణలో, కొణిదెల ప్రొడక్షన్ హౌజ్ పతాకంపై, రాంచరణ్ నిర్మాణంలో వి.వి వినాయక్ దర్శకత్వంలో 'కత్తి' లాంటి సినిమాతో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బాస్ ఈజ్ బ్యాక్ పేరిట విడుదల చేసిన వీడియో అభిమానులను సంతృప్తిపరిచింది. అన్నయ్య 'మెగాస్టార్ చిరంజీవి'ని తెరపై ఎప్పుడెప్పుడు చూడాలని మెగా ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే 'చిరంజీవి' బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్నాడట. ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. అందుకే 'చిరంజీవి'తో సహా ప్రతి ఒక్కరూ పగలు రాత్రి తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. తాజాగా చిరంజీవికి సంబంధించిన న్యూ లుక్స్ ను చిత్ర యూనిట్ సోషల్ మాధ్యమం ద్వారా విడుదల చేసింది.
9ఏళ్ల తరవాత రీ ఏంట్రీ ఇస్తుండడంతో టైటిల్ విషయంలో మెగా కాంపౌండ్ చాలా కసరత్తు చేసింది. కానీ చివరికి మెగాస్టార్ రేంజ్ బాటలు వేసిన 'ఖైదీ' మూవీకి కలిసొచ్చేలా 'ఖైదీ నెంబర్ 150' టైటిల్ ని ఫిక్స్ చేశారు. రెండు సార్లు 'ఖైదీ' టైటిల్ తో హిట్స్ కొట్టిన మెగాస్టార్ ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటారనేది ఇంట్రెస్ట్ గా మారింది. మరి ఈ 'ఖైదీ నెంబర్ 150' 'చిరంజీవి' రీ ఏంట్రీ గ్రాండ్ సక్సెస్ ఇచ్చి వెల్ కమ్ చెప్పుతోందో చూడాలి.

10:47 - September 28, 2016

నల్లగొండ : వారంరోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి... అయితే నాగార్జున సాగర్‌లోమాత్రం ఇప్పుడిప్పుడే జలకళ సంతరించుకుంటోంది.. మొన్నటివరకూ డెడ్‌ స్టోరేజీతో వెలవెలబోయిన ప్రాజెక్టులోకి ఇప్పుడిప్పుడే ఎగువనుంచి వరదనీరు వచ్చి చేరుతోంది.. మరిం సమాచారాం కోసం ఈ వీడియోను చూడండి..

10:39 - September 28, 2016

విజయవాడ : ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలతో పాటు, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధ, గురువారాల్లో విజయవాడలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమయ్యింది. మొదటి రోజు నాలుగు సెషన్లు, రెండో రోజు ఐదు సెషన్లు ఉంటాయి. రెండో రోజు ఐదో సెషన్‌లో రాష్ట్రంలో శాంతిభద్రతలపై సమీక్షిస్తారు. దీనికి పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీలు హాజరవుతారు. బుధవారం భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) ఏసీ పునేటా స్వాగతోపన్యాసంతో సదస్సు ప్రారంభమవుతుంది. ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ప్రారంభోపన్యాసం చేస్తారు. సమతుల అభివృద్ధిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడతారు. ఆర్థిక పరిస్థితి, పెట్టుబడులు, ఉద్యోగాలు, వృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.టక్కర్‌ వివరిస్తారు. అనంతరం రియల్‌టైమ్‌ పాలన, విద్యార్థుల భాగస్వామ్యం వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతారు. ఐఏఎస్‌ అధికారులు రాజశేఖర్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ గురించి, ప్రద్యుమ్న డ్యాష్‌బోర్డు గురించి వివరిస్తారు. సామాజిక, డిజిటల్‌ మాధ్యమాల గురించి ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ వివరిస్తారు.

10:37 - September 28, 2016

నల్లగొండ : గుర్రంపోడు మండలం కాల్వలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో నాంపల్లి నుండి మల్లేపల్లి వెళ్లున్న ఆర్టీసీ బస్ ఆటో ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషయంగా వున్నట్లు సమచారం. మృతులు షాకాజీపురానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తింపు. పాగాకువారిగూడెంలో జరుగుతున్న బంధువుల పెద్దకర్మ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు ఆటోలో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. అనంతరం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక డీఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

ప్రారంభమైన ఏపీ కలెక్టర్ల సదస్సు..

విజయవాడ : కాసేపటి క్రితం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. డిప్యూటి సీఎం కేఈ ప్రసంగిస్తున్నారు. ఈ సదస్సుకు ఏపీ మంత్రులు హాజరయ్యారు. 15 శాతం వృద్ధి రేటు చేరుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలతో పాటు, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరుని సమీక్షించేందుకు ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. 

లక్నోలో దారుణం..

ఉత్తర్ ప్రదేశ్ : లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బందిపోటు దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించి 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. 12-13 మంది దుండగులు ఇంట్లోకి ప్రవేశించారని, తనను, భార్యను, పిల్లలను కొట్టారని పేర్కొన్నాడు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను..దుస్తులు..ఇతర విలువైన వస్తువులను దొంగిలించారని, తన కూతురిని ఎత్తుకెళ్లి అత్యాచారం జరిపారని ఆవేదన వ్యక్తం చేశాడు. కొద్దిసమయం తరువాత తన కూతురి ఆచూకి కనుగొన్నట్లు పేర్కొన్నారు. 

బెంగళూరులో ఆల్ పార్టీ మీటింగ్..

బెంగళూరు : కాసేపటి క్రితం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం సిద్ధరామయ్య, ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. కావేరి జల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చిస్తున్నారు.

 

10:00 - September 28, 2016

తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 3 నుండి 11 వరకూ తిరుమలలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. దసరా సెలవులు, తమిళ పెరటాసి నెల కావడంతో ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తారని టిటిడి అంచనా వేస్తోంది. దీంతో బ్రహ్మోత్సవాలకు తిరుమల శరవేగంగా ముస్తాబు అవుతోంది. తిరుమల మొత్తం కళ్లు మిరమిట్లు గొలిపేలా విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి జిల్లా రెవిన్యూ యంత్రాంగం, పోలీసు అధికారులు టిటిడికి తమవంతు సహకారం అందిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ కూడా భధ్రతా ఏర్పాట్లు పరిశీలించారు. బ్రహ్మోత్సవాలలో పలు మార్పులు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బ్రహ్మోత్సవాలకు మూడు లక్షలమంది భక్తులు వస్తారని టీటీడీ అంచానావేస్తోంది. 

09:53 - September 28, 2016

తన బ్యాగు ఎలుక కొరికిందని ఓ నటి ఓ మంత్రికి ఫిర్యాదు చేసింది. టాలీవుడ్..బాలీవుడ్ నటి కాదులేండి...ప్రఖ్యాత మరాఠీ నటి 'నివేదిత సరాఫ్'. ఇండియన్ రైల్వే తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని ఆమె వాపోయారు. అసలు ఏం జరిగిందంటే...మరాఠీలో 'నివేదిత' ప్రఖ్యాత నటి. ఆమె నటించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఈమె ఈనెల 22వ తేదీన లాతూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించారు. ఏ1 ఏసీ బోగీలో తనకు కేటాయించిన 27వ నెంబర్ సీట్లో ఆమె తలకింద బ్యాగు పెట్టుకుని నిద్రపోయారు. లేచి చూసే సరికి బ్యాగుకు చిల్లు ఉంది. బ్యాగులోని వస్తువులు ఏవీ పోలేదు. బ్యాగ్ మాత్రం డ్యామేజ్ అయింది. ఎలుక కొరికిందని గ్రహించిన 'నివేదిత' రైల్వే నిర్లక్ష్యంపై మంత్రి సురేష్ ప్రభుకు సోషల్‌మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో స్పందించారు. ప్రయాణీకుల ఫిర్యాదులపై రైల్వే సత్వరం స్పందిస్తుందని తెలిపారు. మరింత బాధ్యాతాయుతంగా పనిచేయాలని పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి హెచ్చరిస్తామని రైల్వే సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అదండి సంగతి...

తల్లాడ - దేవరపల్లి రోడ్ లో భారీగా ట్రాఫిక్ జాం..

పశ్చిమగోదావరి : తల్లాడ - దేవరపల్లి రోడ్ లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. జొన్నవారిగూడెం దగ్గర రోడ్డుపై ఉన్న గుంతల్లో లారీలు ఇరుక్కపోయాయి. దీనితో పది కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వాహనదారులు తీవ్ర ఇక్కటక్లు గురవుతున్నారు. 

రాజేంద్రనగర్ లో చెరువుకు గండి..

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లో ఉన్న ఓ చెరువుకట్టకు గండిపడింది. గండి పెరుగుతుండడంతో రషీద్ కాలనీలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 

మూసాపేటలో విషాదం..

హైదరాబాద్ : మూసాపేటలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మిత్రుడి మృతిని తట్టుకోలేక కిందపడి మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

జీహెచ్ఎంసీ కమిషనర్ టెలి కాన్ఫరెన్స్..

హైదరాబాద్ : టౌన్ ప్లానింగ్ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్రమకట్టడాల కూల్చివేతలపై సమీక్ష నిర్వహించారు. హైకోర్టు సూచనలు ఉన్నవాటిని కూడా తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

09:24 - September 28, 2016

విశాఖపట్నం : బంగాళాఖాతంలో అండమాన్‌ మార్గంలో ప్రయాణికుల నౌక నిలిచిపోయింది. మంగళవారం మధ్యాహ్నం 1.30గంటలకు విశాఖ నుంచి బయల్దేరిన ఎంవీ  హర్షవర్థన్ అనే నౌక జన్ రేటర్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నౌకలో దాదాపు 670 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం నుండి వారానికి రెండుసార్లు ఈ నౌక పోర్ట్ బ్లేయర్ కు ప్రయాణిస్తుంది. సమాచారం అందుకున్న అధికారులు ప్రయాణీకులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్నామ్నాయ ఏర్పాట్లకు యత్నిస్తున్నారు. 

ఉత్తర కోస్తాకు వర్ష సూచన..

విశాఖపట్టణం : ఏపీ ఉత్తర కోస్తాలో బుధవారం అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావర శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తా, తెలంగాణలో పలు చోట్ల విస్తారంగా, రాయలసీమలో చెదురుముదురుగా, మిగిలిన ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. 

ఏపీలో కలెక్టర్ల సదస్సు..

విజయవాడ : నేటి నుండి జిల్లాలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. బుధ, గురువారాల్లో ఈ సదస్సు జరగనుంది. 15 శాతం వృద్ధి రేటు చేరుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలతో పాటు, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరుని సమీక్షించేందుకు ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. 

నిజాంసాగర్ కు కొనసాగుతున్న వరద..

నిజామాబాద్ : నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 1402 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కు, ఔట్ ఫ్లో 80 వేల క్యూసెక్కులుగా ఉంది. 

విజయవాడలో నేటి నుండి యదావిధిగా రైళ్ల రాకపోకలు..

విజయవాడ : రైల్వే స్టేషన్ లో ఆర్ఆర్ఐ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ రోజు నుండి రైళ్ల రాకపోకలు యదావిధిగా ప్రారంభం కానున్నాయి. పది ప్లాట్ ఫారంలలో అన్ని రైళ్లు నిలిచే విధంగా సిగ్నలింగ్ వ్యవస్థను అధికారులు మెరుగుపర్చారు. 

మూడో రోజు కొనసాగుతున్న కూల్చివేతలు..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత మూడో రోజు కొనసాగుతోంది. నాలాలు, చెరువులు, కుంటలపై ఉన్న ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

 

లారీల్లో వెగలపూడికి దస్త్రాలు..

హైదరాబాద్ : వచ్చే నెల నుంచి వెలగపూడి నుంచే పాలన ప్రారంభించాలని కంకణం కట్టుకున్న ఏపీ ప్రభుత్వం అందుకోసం తీసుకుంటున్న చర్యలను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే పలు శాఖలను తరలించిన ప్రభుత్వం తాజాగా మంగళవారం ఆర్థిక శాఖకు చెందిన ఫైళ్లు, కంప్యూటర్లను నాలుగు లారీల్లో హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలించారు. మరోవైపు సచివాలయంలోని రెండో బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న ఆర్థిక పరిపాలన చాంబర్‌లోని ఫైళ్లను కూడా సర్దుతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రణాళిక శాఖ ఫైళ్లు కూడా హైదరాబాద్ నుంచి వెలగపూడికి చేరున్నాయి.

దర్శక నిర్మాత తిరువీధి గోపాలకృష్ణ మృతి..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకనిర్మాత తిరువీధి గోపాలకృష్ణ కన్నుమూశారు. హైదరాబాదు ఫిలింనగర్‌లోని ఆయన స్వగృహంలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.గోపాలకృష్ణ భౌతిక కాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. గోపాలకృష్ణకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమారుడు కొంతకాలం క్రితం మృతి చెందారు.రెండో కుమారుడు సినీ పరిశ్రమలోనే పనిచేస్తున్నారు.మురళీమోహన్ హీరోగా నటించిన ‘వస్తాడే మా బావ’, శివాజీ రాజా నటించిన ‘అహో బ్రహ్మ, ఓహో శిష్య’ తదితర సినిమాలకు గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. 

కొనసాగుతున్న ఐటీ దాడులు..

కర్నూలు : నంద్యాలలో ప్రముఖ వ్యాపారుల ఇళ్లపై బుధవారం ఉదయం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. నంద్యాలలో బంగారు వ్యాపారి, ఓ ట్రాన్స్‌పోర్టు వ్యాపారవేత్త ఆదాయ పన్ను చెల్లించకపోవడంతో ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి.

అర్థాంతరంగా ఆగిపోయిన అండమాన్ నౌక!..

విశాఖపట్టణం : అండమాన్ నికోబార్ దీవులకు చెందిన ఓ నౌక నడి సముద్రంలో ఆగిపోయింది. విశాఖ నుంచి బయలుదేరిన ఈ నౌక 6గంటల ప్రయాణించిన తర్వాత నౌకలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో దాన్ని నడి సముద్రంలో నిలిపివేశారు. కాగా... నౌక నిలిచిపోయిన నడి సముద్రంలో ప్రయాణానికి అనుకూల వాతావరణం లేదని తెలుప్తోంది. దీంతో నౌకలోని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

ఎర్రవల్లిలో పర్యటించనున్న కేసీఆర్..

మెదక్ : సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామం ఎర్రవల్లిలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించనున్నారు. మంగళవారం సాయంత్రమే ఎర్రవల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్... ఎర్రవల్లి పరిధిలోని చెరువుల్లో నీటి నిల్వ వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం వివరాలను జిల్లా జాయింట్ కలెక్టర్, గడా అధికారి హనుమంతారావుల ద్వారా తెలుసుకున్నారు.

08:21 - September 28, 2016

కర్నూలు: కల్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రగట్లతండ సమీపంలో ఉలిందకొండ వద్ద ఆగివున్న లారీని ఓ అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్స్ అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి కర్నూలుకు వస్తుండగా ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. గాయపడినవారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అనంతరం  కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగా  డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

08:12 - September 28, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాల్లో కొత్తగా నూతన కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. కొన్ని శాఖలను దానికి అనుబంధంగా ఉన్నశాఖల్లో విలీనం చేస్తున్నారు. అవసరాల మేరకు కొత్త పోస్టులను నియామకం చేస్తున్నారు. పాలనలో సమగ్ర మార్పులు తీసుకురావడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. దసరా నుంచే కొత్త జిల్లాల్లో పాలన సాగించాలని నిర్ణయం తీసుకుంది.

తుదిదశకు చేరిన మండలాలతో పాటు శాఖల పునర్‌వ్యవస్థీకరణ
కొత్త జిల్లాల ప్రారంభానికి సమయం తక్కువగా ఉండడంతో పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలతో పాటు శాఖల పునర్‌వ్యవస్థీకరణ తుదిదశకు చేరింది. అధికారులు, సిబ్బంది విభజనపై అన్ని శాఖలు నివేదికలు తయారు చేసి..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు సమర్పించాయి. కొత్త జిల్లాల కోసం పాలన వ్యవస్థలో భారీ ఎత్తున మార్పుచేర్పులు చేపట్టనున్నారు. పలు శాఖల విలీనం, పోస్టుల రద్దు, కొత్తగా సృష్టించడం వంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో ఎలాంటి పునర్‌వ్యవస్థీకరణ లేనప్పటికీ ఇతర జిల్లాల్లో జరిగే మార్పులనే ఇక్కడా అమలు చేయనున్నారు. అక్టోబరు 10న అధికారులు, ఉద్యోగులకు ఆర్డర్‌ టు సర్వ్‌ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయనుంది. దసరా రోజు వారంతా విధుల్లో చేరాలి. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జేసీలు ఉంటారు. అదనపు జేసీ పోస్టులు రద్దు కానున్నాయి.

ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ, వికలాంగులు, స్త్రీశిశు సంక్షేమ శాఖలన్నీ విలీనం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు, స్త్రీ-శిశు సంక్షేమ శాఖలన్నీ విలీనంకానున్నాయి. జిల్లా సంక్షేమ అధికారి పోస్టును సృష్టించి అన్ని సంక్షేమ శాఖల పర్యవేక్షణ అప్పగిస్తారు. పది కొత్త జిల్లాలకు ఇన్‌ఛార్జి అధికారులను నియమించనున్నారు. హోంశాఖ కొత్త జిల్లాలో పోలీసు కార్యాలయాలను ఏర్పాటు చేయనుంది. కొత్త జిల్లా కేంద్రాలకు 70 మంది చొప్పున కేటాయిస్తారు. వరంగల్‌ కమిషనరేట్‌ను ఒక జిల్లాలోకి మారుస్తారు. అక్కడి ఎస్పీని కొత్త జిల్లాకు కేటాయిస్తారు. యాదాద్రి రాచకొండ కమిషనరేట్‌కు కేంద్రమైనందున కొత్తగా అక్కడ ఎస్పీని నియమించరు. నిఘా విభాగంలో ప్రాంతీయ అధికారులకు జిల్లాల బాధ్యతలు అప్పగిస్తారు. అవినీతి నిరోధకశాఖలో డీఎస్పీలకు ప్రాంతీయ అధికారుల హోదా కల్పించి కొత్త జిల్లాల విధులనూ వారికే అప్పగిస్తారు. భారీ నీటిపారుదల శాఖ పరిధిలోని ప్రాజెక్టులకు ప్రస్తుతమున్న వ్యవస్థే కొనసాగుతుంది. చిన్న, మధ్యతరహా నీటిపారుదల శాఖకు జిల్లా స్థాయి అధికారిగా ఈఈని నియమిస్తారు.

కొనసాగనున్న సాంకేతిక, కళాశాల విద్యాశాఖలు
సాంకేతిక, కళాశాల విద్యాశాఖలు కొనసాగుతాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు, శాఖలు విలీనమవుతాయి. వృత్తి విద్యాధికారులు, ప్రాంతీయ తనిఖీ అధికారుల పోస్టులనూ కలిపేస్తారు. కొత్తగా జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి పోస్టులను సృష్టించి, వీరిలో అందులో నియమిస్తారు. సర్వశిక్షా అభియాన్‌, ఆర్‌ఎంఎస్‌ఏలను విలీనం చేస్తారు. వైద్య, ఆరోగ్యం వైద్య, ఆరోగ్యశాఖ మొత్తానికి ఒక్కరే జిల్లా అధికారి ఉంటారు. ఇటు వ్యవసాయశాఖలో ప్రస్తుతమున్న 9మంది జేడీలను ప్రాంతీయ అధికారులుగా నియమిస్తారు. చేనేత, జౌళి, హస్తకళల శాఖలను విలీనం చేస్తారు. కొత్త జిల్లాల్లో ట్రెజరీ, సబ్‌ట్రెజరీ కార్యాలయాలు ఏర్పాటవుతాయి. జిల్లాలో యువజన సంక్షేమాధికారిని నియమిస్తారు. సిబ్బంది, అధికారులను కొత్త జిల్లాలకు బదలాయిస్తారు. డివిజనల్‌ స్థాయి పోస్టులు రద్దవుతాయి. స్టెప్‌ సంస్థను రద్దు చేస్తారు. జిల్లా జైళ్ల శాఖ, నిఘా విభాగం, పోలీసు గృహనిర్మాణ సంస్థ, ప్రత్యేక భద్రత దళం విభాగాలు యథాతథంగా ఉండనున్నాయి. కొత్త జిల్లాలకు జిల్లా ఉపాధి అధికారులను నియమిస్తారు. మిగిలిన జిల్లాల్లో జేఈవోలకు పదోన్నతి కల్పిస్తారు. హైకోర్టును సంప్రదించి కొత్త జిల్లాల్లో కోర్టులను ఏర్పాటు చేస్తారు. అప్పటివరకు పాతవే కొనసాగుతాయి. కొత్త కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారుల బాధ్యతలు చేపడతారు. మొత్తంగా దసరా నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

08:01 - September 28, 2016

యూరి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టేందుకు భారత్‌ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. 18 మంది జ‌వాన్లను పొట్టన బెట్టుకున్న యూరీ ఘటనపై మరిన్ని ఆధారాలు సేకరించిన భారత్‌- పాకిస్తాన్‌కు సమన్లు జారీ చేసింది. 1996లో పాకిస్థాన్‌కు ఇచ్చిన మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ హోదాను రద్దు చేసేందుకు ఇండియా పావులు కదుపుతోంది. తాజాగా సేకరించిన ఆధారాలను భార‌త్‌లోని పాకిస్థాన్ హైకమిష‌న‌ర్ అబ్దుల్ బాసిత్‌కు స‌మ‌ర్పించింది. పాకిస్థాన్‌ను ఇరుకున పెట్టేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తెరపైకి తెచ్చిన కేంద్రం ఈ నిర్ణయంపై పాకిస్థాన్‌ గగ్గోలు పెట్టింది. ఈ ఒప్పందాన్ని భారత్‌ ఉల్లంఘిస్తే.. తాము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపజథ్యంలో భారత్ కు పాకిస్థాన్ కు యుద్ధమంటూ జరిగితే అది అణు యుద్ధమేనంటూ పాకిస్థాన్ తాజాగా ప్రకటన చేసింది. సార్క్ సదస్సుకు హాజరుకానంటూ ప్రధాని మోదీ నిర్ణయం..సింధూ జలాల ఒప్పందం కాన్సిల్ చేసుకున్నంతమాత్రాల ఇరు దేశాల వివాదం సద్దుమణుగుతుందా? పాక్ కొట్టిన దొంగ దెబ్బకు భారత ఏవిధంగా స్పందించాలి? ఈ క్రమంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నంద్యాల నర్శింహారెడ్డి (సీపీఎం నేత),నడింపల్లి సీతారామరాజు (ప్రముఖ విశ్లేషకులు)ప్రశాశ్ రెడ్డి (బీజేపీ నేత),పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

కారు ప్రమాదంలో ఇద్దరు మృతి..

విశాఖ: గాజువాక మండలం ఉక్కునగరంలో కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మృతులు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వాసులుగా గుర్తించారు.

లారీ,అంబులెన్స్ ఢీ..3గురు మృతి..

కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఎర్రగట్లతండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగివున్న ఓ లారీని అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్స్ అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి కర్నూలుకు వస్తుండగా ప్రమాదానికి గురైంది.

నెత్తురోడిన రోడ్లు..5గురు మృతి..

విజయవాడ : ఏపీలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కల్లూరు మండలం ఉలిందకొండ వద్ద వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులను అనంతపురం వాసులుగా గుర్తించారు.

07:31 - September 28, 2016

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ విద్యా విధానం ముసాయిదాపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. కేబినెట్ మాజీ కార్యదర్శి టిఎస్ఆర్ సుబ్రమణ్యం నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ సభ్యులు సమర్పించిన నివేదికలో అనేక వివాదస్పద అంశాలున్నాయి.

1968లో కొఠారి కమిషన్
మన దేశంలో విద్యారంగం నిస్సారంగా వుందన్నది సార్వత్రిక అభిప్రాయం. విద్యారంగంలో వ్యాపార విలువలు, నాణ్యతా ప్రమాణాలు పడిపోవడం, ఇంజనీరింగ్ విద్య నభ్యసించినా నైపుణ్యాలు పెరగకపోవడం, కమ్యూనికేషన్స్ స్కిల్స్ లేకపోవడం లాంటి అంశాలు అందరిలోనూ ఆవేదన కలిగిస్తున్నాయి. విద్యావిధానంలో మార్పుల కోసం ఎన్నో ఉద్యమాలూ నడుస్తున్నాయి. ఇప్పటిదాకా అనేక కమిషన్ లు వేశారు. అవి అనేక సూచనలు చేశాయి. 1948 -49లో రాధాకృష్ణన్ కమిషన్, 1952-53లో మొదలియార్ కమిషన్, 1968లో కొఠారి కమిషన్ అనేక సూచనలిచ్చాయి. 1986 జాతీయ విద్యావిధానంలో విద్యారంగం సాధించాల్సిన రాజ్యాంగ, జాతీయ లక్ష్యాలను స్పష్టంగా నిర్ధేశించాయి. జాతీయ సమగ్రత, ఆర్థిక సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య విధానం, ఆర్థికాభివృద్ధి వంటివి జాతీయ లక్ష్యాలుగా వుండేవి. రాజ్యాంగ పీఠికలో కూడా ఇవే లక్ష్యాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం 2016 జాతీయ విద్యావిధానం ముసాయిదాను విడుదల చేసింది. దీని మీద అభిప్రాయ సేకరణ పూర్తయినతర్వాత జాతీయ విద్యావిధానం ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

ఆర్థిక సామాజిక న్యాయం,లౌకిక విలువలు ప్రస్తావించలేదన్న విమర్శలు
విద్యారంగంలో నాణ్యత, ఉపాధి కల్పన నైపుణ్యాలు పెంచడానికి పెద్ద పీట వేసిన ముసాయిదా ఆర్థిక సామాజిక న్యాయం, లౌకిక విలువల గురించి ప్రస్తావించలేదన్న విమర్శలున్నాయి. మార్కెట్ ఎకానమీపై మోజు తప్ప అర్ధవంతమైన ప్రతిపాదనలు లేవన్న ఆవేదనలు వ్యక్తమవుతున్నయి. మొత్తానికి నిస్సారంగా వున్న ముసాయిదా మతత్వం, వాణిజ్యీకరణ, కేంద్రీకరణ లాంటి ప్రమాదకర అంశాలను తెర మీదకు తెస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆరవ తరగతి డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టడం, విద్యార్థుల సంఖ్య తక్కువగా వున్న స్కూళ్లను, మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలను విలీనం చేయాలన్న ప్రతిపాదనలు చివరకు ఏ పరిణామాలకు దారితీస్తాయో ఊహకందని విషయమేమీ కాదు. మూడు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు ఉద్దేశించిన ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ బాధ్యతలను అంగన్ వాడీల మీద పెట్టడం పిల్లలకు ఎంత మేలు చేస్తుందో చెప్పలేం. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ లకు దేశమంతా ఒకే సబ్జెక్ట్ వుండాలంటూ ప్రతిపాదించిన ముసాయిదా, ఏ, బి గ్రూప్ కేటగిరీలుగా విభజించాలంటూ మరో వివాదస్పద సూచన చేసింది. ఆ మూడు సబ్జెక్టులు ఇష్టపడేవారిని ఏ కేటగిరిగా, అవి వద్దనుకున్నవారిని బి కేటగిరిలో చేర్చాలన్నది ఈ ముసాయిదాలో మరో కీలకాంశం. టీచర్ల రిక్రూట్ మెంట్ కోసం ఉపాధ్యాయ నియామక కమిషన్ ఏర్పాటు, టీచర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలకు అప్పగించడం, ప్రతి ఐదేళ్లకోసారి టీచర్లకు పరీక్షలు పెట్టి, వాటి ఆధారంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ లు ఇవ్వడం అన్న ప్రతిపాదనలూ ఈ ముసాయిదాలో వున్నాయి.

07:26 - September 28, 2016

కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం ముసాయిదాను చర్చకు పెట్టింది. ఈ ముసాయిదాలో 33 అంశాలపై ప్రశ్నావళి రూపొందించి చర్చకు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యావిధానం ముసాయిదాలో ఏముంది? ఈ ముసాయిదాలో విద్యారంగ అభివృద్ధికి మేలు చేసే అంశాలేమిటి? కీడు చేసే అంశాలేమిటి? ఈ ముసాయిదాను ఎలా అర్ధం చేసుకోవాలి? ఈ ముసాయిదాపై ఉపాధ్యాయ సంఘాలేమంటున్నాయి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ యుటిఎఫ్ నేత ఐ. వెంకటేశ్వరరావు 10టీవీ స్టూడియోకి వచ్చారు. 

07:19 - September 28, 2016

ఢిల్లీ : యూరి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టేందుకు భారత్‌ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా యూరీ ఘటనపై మరిన్ని ఆధారాలు సేకరించిన భారత్‌- పాకిస్తాన్‌కు సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్‌కు ఇచ్చిన మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ హోదాను రద్దు చేసేందుకు ఇండియా పావులు కదుపుతోంది.

18 మంది జ‌వాన్లను పొట్టన బెట్టుకున్న యూరి ఘ‌ట‌న
18 మంది జ‌వాన్లను పొట్టన బెట్టుకున్న యూరి ఘ‌ట‌న వెనుక పాక్ హ‌స్తం ఉంద‌న్న కీల‌క ఆధారాలను భార‌త్ సేకరించింది. తాజాగా సేకరించిన ఆధారాలను భార‌త్‌లోని పాకిస్థాన్ హైకమిష‌న‌ర్ అబ్దుల్ బాసిత్‌కు స‌మ‌ర్పించింది. ఉగ్రవాదులు భార‌త్‌లోకి చొర‌బ‌డ‌టానికి స‌హ‌క‌రించిన ఇద్దరు వ్యక్తులు త‌మ క‌స్టడీలో ఉన్నట్లు బాసిత్‌కు తెలిపింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజ‌ఫ‌రాబాద్‌కు చెందిన ఫైజ‌ల్ హుసేన్‌, యాసిన్ ఖుర్షిద్ ఉగ్రవాదుల‌కు స‌హ‌క‌రించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి జయశంకర్‌ వెల్లడించారు. యూరి దాడిలో పాల్గొన్న ఓ ఉగ్రవాది హ‌ఫీజ్ మ‌హమ్మద్‌ కూడా ముజ‌ఫ‌రాబాద్‌కు చెందిన వ్యక్తేన‌ని తేలింది. పాకిస్తాన్‌ సియోల్‌కోట్‌కు చెందిన మరో టెర్రరిస్ట్‌ అబ్దుల్‌ ఖయూంను సెప్టెంబర్‌ 23 న అరెస్ట్‌ చేశామని, అతడు లష్కరే తోయిబా వద్ద 3 నెలల పాటు శిక్షణ పొందాడని భారత్‌ పాకిస్తాన్‌కు వివరించింది.

పాకిస్థాన్‌ను ఇరుకున పెట్టేందుకు సింధూ నదీ జలాల ఒప్పందం తెరపైకి
పాకిస్థాన్‌ను ఇరుకున పెట్టేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తెరపైకి తెచ్చిన కేంద్రం -ఇపుడు 1996లో పాకిస్థాన్‌కు ఇచ్చిన మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ హోదాను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ మేర‌కు ప్రధాని మోది సీనియ‌ర్ అధికారుల‌తో అత్యున్నత‌స్థాయి స‌మావేశం నిర్వహించారు. ఈ హోదా రద్దు చేసినా పెద్దగా ప్రభావం ఉండబోదని అసోచామ్‌ పేర్కొంది. పాకిస్తాన్‌కు భారత్‌ చేసే ఎగుమతులు చాలా తక్కువ స్థాయిలో ఉండడమే ఇందుకు కారణం.

అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న పాక్
సింధు నది జలాల పంపిణీ ఒప్పందం నుంచి తప్పుకోవాలన్న భారత్‌ నిర్ణయంపై పాకిస్థాన్‌ గగ్గోలు పెట్టింది. ఈ ఒప్పందాన్ని భారత్‌ ఉల్లంఘిస్తే.. తాము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్‌ ఏకపక్షంగా ఈ ఒప్పందం నుంచి తప్పుకోలేదని పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజిజ్‌ పేర్కొన్నారు. కార్గిల్‌, సియాచిన్‌ యుద్ధ సమయంలో కూడా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదన్నారు.

పాకిస్థాన్‌పై భారత్‌ అన్ని విధాలుగా ఒత్తిడి
యూరి దాడి త‌ర్వాత పాకిస్థాన్‌పై భారత్‌ అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తోంది. ఇప్పటికే దౌత్యప‌రంగా అంత‌ర్జాతీయ స‌మాజంలో పాకిస్థాన్‌ను ఏకాకిని చేయ‌డంలో దాదాపు సఫలీకృతమైంది. ఐక్యరాజ్యస‌మితి వేదిక‌గా భారత్‌ పాక్ దురాగ‌తాల‌ను బ‌ట్టబ‌య‌లు చేసింది. 

07:06 - September 28, 2016

ఢిల్లీ : లంచం, అవినీతి ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. సిబిఐ కేసుల భయంతో కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన బీకే బన్సల్ తన కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తండ్రీ కొడుకుల శవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫార్మా కంపెనీ నుంచి లక్షలాది రూపాయల లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో బికె బన్సాల్‌ను జులై 16న సిబిఐ అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో సిబిఐ ఆయన కుమారుడిని కూడా ప్రశ్నించింది. బన్సాల్‌ అరెస్ట్‌ తర్వాత పరువుకు భయపడి జులై నెలలోనే ఆయన భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. సిబిఐ దాడులతో తమ పరువు పోయిందంటూ వారు ఓ లేఖ కూడా రాశారు. భార్యా, కూతురు మరణంతో తీవ్రంగా కలత చెందిన బికె బన్సాల్‌ కుమారుడితో సహా ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. బన్సాల్‌కు సంబంధించి సిబిఐ 8 చోట్ల దాడులు నిర్వహించి అక్రమ ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, నగదును స్వాధీనం చేసుకుంది.

07:03 - September 28, 2016

కర్నాటక : కావేరి జలాలపై కర్ణాటకకు సుప్రీంకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు మరో రెండు రోజుల పాటు 6 వేల క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదరడంతో కేంద్రం జోక్యం చేసుకుంది. శుక్రవారం లోపు కర్నాటక, తమిళనాడు సిఎంలతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

 

07:00 - September 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి నిర్వహించనున్న గ్రూప్‌-2 పరీక్షకు రికార్డ్‌ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో 1032 పోస్టుల కోసం నిర్వహించే ఈ పరీక్షకు చివరి తేది ముగిసే నాటికి 8లక్షల 18వేల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. గత నోటిఫికేషన్‌లో 5లక్షల 64వేల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా..తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో దాదాపుగా రెండున్నర లక్షల దరఖాస్తులు పెరగటం విశేషం.

టీఎస్ సీఎస్ గ్రూప్‌-2కి రికార్డుస్థాయిలో అప్లికేషన్ల వెల్లువ
సర్కార్‌ కొలువులకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదని మరోసారి రుజువైంది. తెలంగాణ గ్రూప్-2 నోటిఫికేషన్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. గ్రూప్‌-2 పరీక్షకు అప్లై చేసుకునేందుకు సోమవారం అర్ధరాత్రితో గడువు ముగియడంతో దరఖాస్తులు విపరీతంగా వచ్చాయి. గ్రూప్‌-2కి దరఖాస్తు చేసుకున్న వారిలో మహిళలు 3లక్షల 4వేల 28 మంది ఉండగా... పురుషులు 4లక్షల 87వేల మంది ఉన్నారు. తెలంగాణేతరులు 23వేల 628 మంది అప్లై చేసుకోవడం విశేషం.

గ్రూప్‌2 పరీక్షను సమర్ధవంతంగా నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు
రికార్డుస్ధాయిలో గ్రూప్‌-2 కి అప్లికేషన్లు రావడంపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి స్పందించారు. ఈవిధంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం ఇదే మొదటిసారని తెలిపారు. దీంతో గ్రూప్‌-2 పరీక్షను సమర్ధవంతంగా నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్‌సీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో ఏర్పాట్లపై కమిషన్‌ చైర్మన్ చక్రపాణి సమీక్ష జరిపారు.

పోస్టులను పెంచాలనే ఉద్దేశంతో పరీక్ష వాయిదా
గతంలో 593 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. మరిన్ని పోస్టులను పెంచాలనే ఉద్దేశంతో పరీక్షను వాయిదా వేసి ఈ నోటిఫికేషన్ అనుబంధంగా ఈనెల 2వ తేదిన మరో నోటిఫికేషన్ విడుదల చేసారు. అయితే ఈ నోటిఫికేషన్ లో మరో 439 గ్రూప్‌ 2 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించింది సర్వీస్ కమిషన్. మొత్తంగా సోమవారం గడువు ముగిసే సమయానికి 8 లక్షల18వేల దరఖాస్తులు వచ్చాయి. అంటే గతం కంటే రెండున్నర లక్షలు ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి.ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఈవిధంగా గ్రూప్ 2కి దరఖాస్తులు రాలేదని... చిన్న రాష్ట్రమయినా, వెల్లువలా దరాఖాస్తులు రావడం విశేషమంటున్నారు విశ్లేషకులు. 

06:50 - September 28, 2016

విశాఖ : విశాఖ జిల్లాలో వర్షం దెబ్బకు కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉసూరుమంటూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. కుండపోత వర్షాలకు జిల్లాలోని చెరువులు, వంతెనలు ప్రమాదకర పరిస్థితికి చేరాయి. ఇప్పటికే వానల బీభత్సానికి రైతన్నలు చిగురుటాకులా వణుకుతున్నారు. ఈనెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని అన్నదాతలు కలవరం చెందుతున్నారు.

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంతో విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా పది మండలాల్లో వర్షపాతం నమోదైతే అందులో 8 మండలాలు విశాఖ జిల్లాలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి గతితప్పుతోంది. వర్షాల కారణంగా 10 మంది మృత్యువాత పడ్డారు. భారీ వర్షాలకు ఇప్పటివరకు 459 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు 6,600 ఇళ్లు నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో పలుచోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు తీవ్రంగా ఉన్న ప్రాంతంలోని 1,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎడతెరిపి లేని వర్షాలతో ఇప్పటి వరకు జిల్లాలో 3,644.6 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. తమను ఆదుకోవడానికి ఎవరూ రావడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

207 కిలోమీటర్ల రహదార్లకు దెబ్బ
జిల్లాలో భారీ వర్షాలకు రోడ్లు, కాజ్‌వేలపై నుంచి వరద పారుతోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలో 14 వంతెనలు ప్రమాదకరంగా మారంగా ... దాదాపు 207 కిలోమీటర్ల పొడువున రహదారులు దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు 5.10 కోట్లు.. పూర్తి స్థాయిలో 22.50 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. పంచాయతీరాజ్‌ పరిధిలో 10 రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు 34 లక్షలు.. పూర్తి స్థాయి నిర్మాణానికి 1 కోటి 22 లక్షలు అవసరమని అంచనా వేశారు.

రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
ఎలమంచిలి మండలం కొత్తూరు రైలు పట్టాలను అనుకుని నీరు ప్రవహించడంతో.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముందు జాగ్రత్తగా ఎలమంచిలి, తుని, అనకాపల్లి స్టేషన్లలో రైళ్లు నిలిపివేశారు. రాంబిల్లి మండలంలోని నారాయణపురం వద్ద వరద నీరు కాజ్‌వే పైనుంచి రెండు అడుగుల ఎత్తులో ప్రవహించడంతో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. కొత్తూరు దగ్గర కాజ్‌వే కనిపించని రీతిలో వరదనీరు పైనుంచి ప్రవహిస్తోంది. వర్ష బీభత్సంతో ప్రజలు అల్లాడుతుంటే.. అధికారులు, పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాద స్థాయికి చేరుకున్న రిజర్వాయర్లు
జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో సాధారణ వర్షపాతం...రెండు మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మిగిలిన 22 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పద్మనాభం మండలంలో 29 శాతం, ఎలమంచిలిలో సాధారణం కంటే 95.3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. చోడవరంలో 74.6 శాతం, కె.కోటపాడులో 50 శాతం, బుచ్చెయ్యపేటలో 45 శాతం అత్యధికంగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 10 చెరువులకు గండ్లు పడ్డాయి. జిల్లాలోని రిజర్వాయర్లు ప్రమాద స్థాయికి చేరాయి.

 

Don't Miss