Activities calendar

29 September 2016

22:56 - September 29, 2016

మల్లన్నముచ్చట్లలో భాగంగా బత్కమ్మ పాటను ప్రజా గాయకురాలు విమలక్క రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విమలక్కతో పాటు గాయకులు కార్తీక్, నూతన, శిరీష లు పాల్గొని, పలు విషయాలు తెలిపారు. బత్కమ్మ పాట విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా విమలక్క, కార్తీక్, నూతన, శిరీష బతుకమ్మ పాటలు పాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా...

 

22:44 - September 29, 2016

జమ్మూకశ్మీర్ : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తీవ్రవాద స్థావరాలపై భారత్‌ విరుచుకుపడింది. అర్థరాత్రి తరువాత సర్జికల్‌ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 8 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. సుమారు 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. 
అర్ధరాత్రి ఇండియన్‌ ఆర్మీ ఆపరేషన్‌
జమ్ముకశ్మీర్‌ సరిహద్దులో తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నన్న పాకిస్తాన్‌కు తగిన రీతిలో భారత్ బుద్ధి చెప్పింది. పక్కా సమాచారం మేరకు బుధవారం రాత్రి 12 గంటలకు సరిహద్దు నియంత్రణ రేఖ పొడవునా భారత సైన్యం 3 కిలోమీటర్ల మేర చొచ్చుకుపోయింది. ఉగ్రవాద శిబిరాలపై ప్రత్యేక పారా కమాండర్లు హెలిక్యాప్టర్‌ ద్వారా సర్జికల్‌ దాడులు జరిపారు. తెల్లవారు జామున నాలుగున్నర వరకు జరిగిన సర్జికల్‌ దాడుల్లో ఉగ్రవాదులతో పటు వారికి గైడ్లుగా వ్యవహరించినవారు, శిబిరి నిర్వాహకులకు భారీ నష్టం సంభవించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడుల్లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 8 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. 30 నుంచి 40 మంది టెర్రరిస్టులు హతమైనట్లు సమాచారం. ఈ వివరాలను రక్షణ, విదేశీ మంత్రిత్వ శాఖ తరపున డిజిఎంఓ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ రణబీర్‌సింగ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రోటోకాల్‌ ప్రకారం సర్జికల్‌ దాడులపై పాకిస్తాన్‌కు ముందే సమాచారమిచ్చామని తెలిపారు.
ఉగ్రవాదుల చొరబాటుతో ఆందోళన : భారత్‌
సరిహద్దు రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటు ఆందోళన కలిగిస్తోందని భారత్‌ పేర్కొంది. యూరి ఉగ్రవాద దాడి ఘటనకు సంబంధించిన ఆధారాలను పాకిస్తాన్‌కు దర్యాప్తు కోసం సమర్పించడం జరిగిందని రణబీర్‌సింగ్‌ చెప్పారు. ఉగ్రవాదులంతా పాకిస్తాన్‌లో, పిఒకెలో శిక్షణ పొందినట్లు ఆధారాలున్నాయన్నారు. ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్‌కు పాకిస్తాన్‌ సహకరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వద్ద భారత్‌ సర్జికల్‌ దాడులతో పాక్‌ సిగ్గుతో తలదించు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చేదు నిజాన్ని మింగలేక కక్కలేక ఎలాంటి సర్జికల్‌ దాడులు జరగలేదని మీడియాను ఆకర్షించడానికే భారత్‌ ప్రకటన చేసిందని పాక్‌ ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. పైగా సరిహద్దులో భారత్‌ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది.
సర్జికల్‌ దాడులను ఖండించిన పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌  
అంతకుముందు సర్జికల్‌ దాడులను పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ ఖండించడం గమనార్హం. మేము శాంతిని ఆకాంక్షిస్తున్నామని, మా వైఖరిని చేతగానితనంగా భావించరాదని, తమ భూభాగంపై దాడులు జరిగితే తగిన బుద్ధి చెబుతామని ఆయన భారత్‌ను హెచ్చరించారు.
నియంత్రణ రేఖ వద్ద రెడ్ అలర్ట్ 
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఏర్పడిన ఉధ్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నియంత్రణ రేఖ వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించింది. గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని భద్రతా అధికారులను హెచ్చరించింది. అంతర్జాతీయ సరిహద్దుకి 10 కి.మీ. దూరంలో ఉన్న గ్రామస్థులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సర్జికల్‌ దాడులు నిర్వహిస్తామన్న సమాచారాన్ని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, జమ్ముకశ్మీర్‌ గవర్నర్, సిఎం మెహబూబా ముఫ్తీలకు ప్రధాని నరేంద్రమోడీ ముందే తెలపడం గమనార్హం.
సర్జికల్‌ దాడులను సమర్ధించిన అఖిలపక్ష నేతలు  
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్‌ దాడులను అఖిలపక్ష నేతలు సమర్ధించారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌తో పాటు మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, రాంవిలాస్‌ పాశ్వాన్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, జేడీయూ నేత శరత్‌యాదవ్‌, ఎన్సీపీ నేత శరత్‌పవార్‌, కాంగ్రెస్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, చిదంబరం, టీడీపీనేత సీఎం రమేష్‌తో పాటు పలువురు ఆర్మీ అధికారులు హాజరయ్యారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ మెరుపు దాడులు జరిపిన అంశంపై నేతలు చర్చించారు. మరోవైపు కశ్మీర్‌, పంజాబ్‌ సరిహద్దు గ్రామాల్లో కేంద్రం హై అలర్ట్‌ ప్రకటించింది. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
ఇండియన్‌ ఆర్మీకి అభినందనలు : ఏచూరి 
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి... ఇండియన్‌ ఆర్మీకి అభినందనలు తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన సర్జికల్‌ దాడులను సమర్థించారు. 
సర్జికల్‌ దాడులకు అన్ని పార్టీల మద్దతు : వెంకయ్యనాయుడు 
సర్జికల్‌ దాడులకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఐదారు ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ దాడులు చేసిందని అన్నారు. దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌ను అన్ని పార్టీలు సమర్థించాయని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. సరిహద్దుల్లో 70 ఏళ్లుగా ఉన్న సమస్యను ప్రధాని మోదీ పరిష్కరిస్తున్నారని ఆయన అన్నారు. 
 

 

22:34 - September 29, 2016

విశాఖ : నగరంలో కొద్దిసేపటి క్రితం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ల లోడుతో వెళ్లుతున్న కంటైనర్‌లారీలో మంటలు చెలరేగాయి. కంటైనర్‌లో మొత్తం 68 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌బైక్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. లారీ చెన్నై నుంచి కోల్‌కతాకు వెళ్లుతున్నట్టు డ్రైవర్‌ చెబుతున్నారు. ఆనందపురం-తగరపువలస రహదారిపై వెళ్లుతున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్‌ లారీని పక్కకు ఆపి కిందికి దూకి ప్రాణాలు కాపాడు కున్నాడు. సమాచారం అందుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను ఆర్పేశారు. 

 

22:31 - September 29, 2016
22:30 - September 29, 2016
22:28 - September 29, 2016
22:27 - September 29, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్ సీయూ) విద్యార్థిసంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి విజయకేతనం ఎగురవేసింది. పోటీ చేసిన అన్ని స్థానాలనూ ఎస్‌ఎఫ్‌ఐ కూటమి కైవసం చేసుకుంది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ ఏబీవీపీని ఓడించింది. 5200 మందిలో 3800 మంది విద్యార్థులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. కూటమిగా పోటీ చేసిన ఎస్‌ఎఫ్‌ఐ, డీఎస్‌యూ, టీఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్‌, టీవీవీ.... ఏబీవీపీ ప్యానెల్‌ను ఓడించింది. 52 ఓట్ల తేడాతో అధ్యక్ష అభ్యర్థి కుల్‌దీప్‌సింగ్‌ నాగి విజయం సాధించించారు. 401 ఓట్ల తేడాతో ఉపాధ్యక్ష అభ్యర్థి భూక్యా సుందర్‌ గెలుపొందారు. 390 ఓట్ల తేడాతో ప్రధాన కార్యదర్శి సుమన్‌ దామెర  విజయం సాధించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

హెచ్ సీయూలో ఎస్ ఎఫ్ ఐ కూటమి ఘన విజయం

హైదరాబాద్ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్ సీయూ) విద్యార్థిసంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి విజయకేతనం ఎగురవేసింది. పోటీ చేసిన అన్ని స్థానాలనూ ఎస్‌ఎఫ్‌ఐ కూటమి కైవసం చేసుకుంది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ ఏబీవీపీని ఓడించింది. 5200 మందిలో 3800 మంది విద్యార్థులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. కూటమిగా పోటీ చేసిన ఎస్‌ఎఫ్‌ఐ, డీఎస్‌యూ, టీఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్‌, టీవీవీ.... ఏబీవీపీ ప్యానెల్‌ను ఓడించింది. 

 

20:48 - September 29, 2016

విశాఖ : జిల్లాలోని పంచగ్రామాల్లో ఒక్కటైన విజినిగిరిపాలెంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రామంలో ఇళ్లను కూల్చేందుకు సింహాచలం దేవస్థానం అధికారుల ప్రయత్నించడంపై స్థానికులు ఆందోళనకు దిగారు. తొలగింపులను అడ్డుకున్న పలువురు గ్రామస్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో మిగతా గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 

 

నయీం కేసులో నిందితున్ని కల్వకుర్తి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన సిట్

మహబూబ్ నగర్ : నయీం కేసు వ్యవహారంలో ఏ13 నిందితుడు టెక్ మధును సిట్ బృందం కల్వకుర్తి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచింది. కల్వకుర్తిలో వ్యాపారిని బెదిరించిన కేసులో మధు నిందితుడుగా ఉన్నాడు.

పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు భేటీ

విజయవాడ : పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. మూడు రోజుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళా మావోలు ఉన్నారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 

20:23 - September 29, 2016

విశ్వ శాంతికి బతుకమ్మ పండుగ దోహదపడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. బతుకమ్మలో యూనివర్సల్ మెసేజ్ ఉందన్నారు. బతుకమ్మ ఇచ్చేది.. ఒక హోప్, ఒక నమ్మకం అని తెలిపారు. ఈమేరకు టెన్ టివి ఆమెతో ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1100 వందల చోట్ల బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కలిసివచ్చిన విధంగా రాష్ట్ర అభివృద్ధిలోనూ అందరూ కలిసిరావాలని పిలుపిచ్చారు. మరిన్ని వివరాలను ఆమె మాటల్లోనే... 
నాలో ఏ మార్పు రాలేదు.. 
'నాలో ఏ మార్పు రాలేదు.. బతుకమ్మ పండుగలో చాలా మార్పు వచ్చింది. ఉద్యమంలో భాగంగా బతుకమ్మ ఆడాము. సాంస్కృతిక ఉద్యమం చాలా ప్రభావం చూపింది. ట్యాంక్ బండ్ పైకి వచ్చి మహిళలందరూ బతుకమ్మ ఆడారు. వేల మంది కలిసివచ్చారు. మహిళల్లో ఉద్యమ స్పిరిట్ చూశాను. వేల మంది ఆడబిడ్డలను కలవడం నా అదృష్టం. బతుకమ్మలో యూనివర్సల్ మెసేజ్ ఉంది. భారత సంస్కృతిలోని అన్ని అంశాలను ప్రపంచం ఆదరిస్తుంది. బతుకమ్మ పండుగలో పర్యావరణ పరిరక్షణ, స్పిరిచ్యువల్ మెసేజ్ ఉన్నాయి. 
ఆయన లేకపోతే ఏమీ లేదు....
నా భర్త మద్దతు లేకపోతే నాకు ఏమీ లేదు. మా ఇద్దరి మధ్య చాలా బంధం ఉంటుంది. ఒంటరిగా పని చేయలేం. అందరి మద్దతు ఉండాలి. మాట్లాడడం, నిలదీయం, కరఖండిగా ఉండడం నాన్నగారి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చాయి. మనం చెప్పేది ఎదుటివారికి పూర్తిగా అర్థమవ్వాలి. స్పష్టత ఉండాలని నాన్న చెప్పారు. 
నాన్న కన్నా అన్నతోనే ఎక్కువగా క్లోజ్ 
నాన్న కంటే అన్నతోనే ఎక్కువగా క్లోజ్ గా ఉంటాను. ఏ విషయం ఉన్నా అన్నతో చెబుతానని' ఆమె చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గూడ్స్.. ప్యాసింజర్ రైళ్లు ఢీ..

ఒడిశా : కటక్ కటజోడి రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరిగింది. గూడ్స్.. ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 

ప్రభుత్వ స్కూల్స్ లో బయోమెట్రిక్ సీఎం చంద్రబాబు అసంతృప్తి

విజయవాడ : ప్రభుత్వ పాఠశాలలో బయోమెట్రిక్ అమలుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

19:24 - September 29, 2016

కృష్ణా : జిల్లాలోని పెడన పురపాలక సంఘ చైర్మన్‌ ఎన్నికలో అధికార టీడీపీకి ఊహించని షాక్‌ తగిలింది.  అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి బండారు ఆనందప్రసాద్‌ ఒక ఓటులో విజయం సాధించారు. 15వ వార్డుకు చెందిన టీడీపీ కౌన్సిలర్‌ లంక సత్యవతి పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటువేశారు. దీంతో అధికారపార్టీ నాయకులు ఖంగుతిన్నారు. మంత్రి కొల్లురవీంద్ర, ఎమ్మెల్యే కాగితవెంకట్రావుతోపాటు జిల్లాటీడీపీ అధ్యక్షుడు అర్జునుడు పర్యవేక్షణ చేసినా టీడీపీకి విరుద్ధంగా ఫలితం వచ్చింది. 

19:18 - September 29, 2016

కృష్ణా : బందర్ పోర్టులోని పరిశ్రమల కోసం చేపట్టిన భూసమీకరణపై చేపట్టిన గ్రామసభలు రైతుల నిరసనలతో దద్దరిల్లాయి. మచిలీపట్నం మండలపరిధిలోని పొట్లపాలెం, గుండుపాలెంలోని గ్రామసభలకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భూములు ఇవ్వబోమంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పార్టీలకు అతీతంగా భూసమీకరణకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సుబ్బారావు తెలిపారు. 

 

19:15 - September 29, 2016

ఢిల్లీ : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్‌ దాడులను అఖిలపక్ష నేతలు సమర్ధించారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతదన జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌తో పాటు మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, పాశ్వాన్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, జేడీయూ నేత శరత్‌యాదవ్‌, ఎన్సీపీ నేత శరత్‌పవార్‌, కాంగ్రెస్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, చిదంబరం, టీడీపీనేత సీఎం రమేష్‌తో పాటు పలువురు ఆర్మీ అధికారులు హాజరయ్యారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ మెరుపు దాడులు జరిపిన అంశంపై నేతలు చర్చించారు. మరోవైపు కశ్మీర్‌, పంజాబ్‌ సరిహద్దు గ్రామాల్లో కేంద్రం హై అలర్ట్‌ ప్రకటించింది. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
సర్జికల్‌ దాడులకు అన్ని పార్టీలు మద్దతు : వెంకయ్యనాయుడు 
సర్జికల్‌ దాడులకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఐదారు ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ దాడులు చేసిందని అన్నారు. దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
ఇండియన్‌ ఆర్మీకి అభినందనలు : ఏచూరి  
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి... ఇండియన్‌ ఆర్మీకి అభినందనలు తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన సర్జికల్‌ దాడులను సమర్థించారు. 
ఆర్మీ ఆపరేషన్‌ను అన్ని పార్టీలు సమర్థించాయి : ఎంపీ సీఎం రమేష్‌ 
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌ను అన్ని పార్టీలు సమర్థించాయని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. సరిహద్దుల్లో 70 ఏళ్లుగా ఉన్న సమస్యను ప్రధాని మోదీ పరిష్కరిస్తున్నారని ఆయన అన్నారు. 

 

19:06 - September 29, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుతో తెలంగాణ మంత్రి కేటీఆర్ చర్చించారు. రైల్వే క్రాసింగ్ వద్ద జరిగే మెట్రో ప్రాజెక్టు పనులకు దక్షిణ మధ్య రైల్వే చార్జీలు వసూలు చేయడాన్ని నిలిపివేయాలని ప్రభుకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామని కేటీఆర్‌కు సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. 

 

స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 13కు వాయిదా వేసింది. 

19:01 - September 29, 2016

హైదరాబాద్ : జనాభా ప్రాతిపదికన గిరిజనులకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన గిరిజనుల సమస్యలపై చర్చా గోష్టిలో తమ్మినేని పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ సమగ్ర, సామాజిక అభివృద్ధి సాధనకై అక్టోబర్ 17 నుంచి సీపీఎం ఆధ్వర్యంలో మహాజన పాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. పాదయాత్రకు అన్ని వర్గాలు మద్దతివ్వాలని తమ్మినేని కోరారు. 

తెలంగాణలో ఎస్సై తుది రాత పరీక్ష తేదీలు ఖరారు

హైదరాబాద్ : తెలంగాణలో ఎస్సై తుది రాత పరీక్ష తేదీలు ఖరారు అయ్యాయి. ఎస్సై సివిల్ అభ్యర్థులకు నవంబర్ 19, 20 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పీటీవో, కమ్యూనికేషన్ ఎస్సై అభ్యర్థులకు 19, 20, 27 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.

 

బతుకమ్మ పండగ ఏర్పాట్లపై మేయర్, కమిషనర్ సమీక్ష

హైదరాబాద్ : బతుకమ్మ పండగ ఏర్పాట్లపై మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. అక్టోబర్ 8న 10 వేల బతుకమ్మలతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. బతుకమ్మ ప్రపంచ గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్పారు. హుస్సేన్ సాగర్ లో బతుకమ్మను నిమజ్జనం చేసేందుకు జీహెచ్ ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందని మేయర్ బొంతు తెలిపారు.

 

18:10 - September 29, 2016

ఢిల్లీ : సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ మెరుపు దాడులు జరిపిన అంశంపై నేతలు చర్చించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఐదారు ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ దాడులు చేసిందని అన్నారు. భారత్ సర్జికల్ దాడులకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. సైనిక చర్యలను అన్ని పార్టీల నేతలు ప్రసంశించారు. రాజకీయపరంగా, చర్చల ద్వారా కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి... ఇండియన్‌ ఆర్మీకి శుభాకాంక్షలు తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన సర్జికల్‌ దాడులను సమర్థించారు. సర్జికల్‌ దాడులకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ సమావేశానికి రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌తో పాటు మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, పాశ్వాన్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, జేడీయూ నేత శరత్‌యాదవ్‌, ఎన్సీపీ నేత శరత్‌పవార్‌, కాంగ్రెస్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, చిదంబరం, టీడీపీనేత సీఎం రమేష్‌తో పాటు పలువురు ఆర్మీ అధికారులు హాజరయ్యారు. మరోవైపు కశ్మీర్‌, పంజాబ్‌ సరిహద్దు గ్రామాల్లో కేంద్రం హై అలర్ట్‌ ప్రకటించింది. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

సైనికులకు వందనం - బాబు..

విజయవాడ : భారత సైన్యం చర్యలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. సైనికులకు వందనం తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. భారత్ పై ఉగ్రవాదుల చర్యలను ఎదుర్కొంటామని తెలిపారు. 

ఉగ్రదాడులను భారత్ సహించదు - వెంకయ్య...

ఢిల్లీ : ఉగ్రవాద దాడులను భారత్ సహించదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కాసేపటి క్రితం అఖిలపక్ష సమావేశం ముగిసింది. అన్ని రాజకీయ పార్టీలు కేంద్రానికి మద్దతు తెలిపాయని తెలిపారు. సైనిక చర్యను అందరూ అభినందించారని, ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. 

ఉగ్రవాదులను ఏరివేసే చర్యలకు మద్దతు - గులాంనబీ..

ఢిల్లీ : ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం తీసుకొనే చర్యలకు తమ మద్దతు తెలియచేస్తున్నట్లు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

17:23 - September 29, 2016

సైనిక చర్యను అభినందిస్తున్నాం - ఏచూరి..

ఢిల్లీ : భారత సైన్యం చేపట్టిన చర్యలను అభినందిస్తున్నట్లు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. కాసేపటి క్రితం అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఉగ్రవాదుల దాష్టీకాన్ని డీజీఎంఓ వివరించారని తెలిపారు.

17:21 - September 29, 2016

నిజామాబాద్‌ : జిల్లాలోని బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హాజరైన కార్యక్రమంలో పాము కలకలం సృష్టించింది. స్థానిక ఎస్ ఆర్ ఎన్ కే డిగ్రీకళాశాలలో ఫ్రెషర్స్‌డే జరుగుతుండగా హఠాత్తుగా దూసుకొచ్చిన పాము కాసేపు హల్‌చల్‌ చేసింది. కార్యక్రమం నడుస్తున్న సమయంలో పాము రావడంతో విద్యార్థులంతా తలోవైపు పరుగులు తీశారు. దీంతో కాసేపు గందరగోళపరిస్థితి తలెత్తింది. వెంటనే అక్కడే ఉన్న అటెండరు పామును చంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

 

17:17 - September 29, 2016

హైదరాబాద్ : వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మత్తు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో రోడ్లపరిస్థితిపై సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న రోడ్లపై సమాచారం ఇచ్చేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను పంచాయతీరాజ్‌ శాఖా ఏర్పాటు చేసిందని చెప్పారు. జిల్లాలవారీగా కూడా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి ..వచ్చిన ఫిర్యాదుల మేరకు వెంటనే రోడ్ల మరమ్మత్తుచేయాలని అధికారులకు సూచించారు. 

 

సరిహద్దులో హై అలర్ట్...

ఢిల్లీ : ఉగ్రవాదులపై భారత దళాలు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం పాక్..భారత సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గుజరాత్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.

 

మిలటరీ చర్యను అభినందించిన అఖిలపక్షం..

ఢిల్లీ : కేంద్రం తీసుకున్న మిలటరీ చర్యను అఖిలపక్షం అభినందించింది. కాసేపటి క్రితం అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఎలాంటి పరిస్థితునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీజీఎంవో వెల్లడించారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా సిగరేట్లు..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టు కార్గోలో భారీగా సిగరేట్లు పట్టుబడ్డాయి. రూ. 2 కోట్ల విలువైన సిగరేట్లను డీఆర్ఐ పట్టుకుంది. కోల్ కతా నుండి సిగరేట్లు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.

 

17:02 - September 29, 2016

మాతృత్వం స్త్రీలపై ప్రకృతి మోపిన అదనపు భాద్యత. అయినా మహిళలు, ఎంతో ఇష్టంగానే ఆ బాధ్యతను మోస్తున్నారు. ఇలాంటి మహిళలు సుఖ ప్రసవానికి యోగా ఎంతో ఉపయోగకరం అంటున్నారు నిపుణులు. అలాంటి యోగాసనాలు ఏంటో వీడియో క్లిక్ చేయండి. 

17:00 - September 29, 2016

మనం తినే ఆహారం ఎంత సురక్షితమైంది? మన కంచాల్లో వడ్డించుకున్న భోజనం ఎంత ఆరోగ్యకరమైంది? ఎప్పుడైనా సీరియస్ గా ఆలోచిస్తున్నామా? ఇకనైనా ఆలోచిద్దామా? ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. సహజ ఆహారం అందరికీ అందుబాటులో ఉంచాలి. ఈ లక్ష్యంతో ముందుకు సాగుతూ రైతులకు, వినియోగదారులకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తోంది SAPCL. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, రైతులను సంఘటిత పరుస్తూ నిబద్ధతతో తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనికి మానవి అభినందనలు తెలియచేస్తోంది. ఇలాంటి కృషికి ప్రతి ఒక్కరూ చేయూత అందించాలని ఆకాంక్షిస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:00 - September 29, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌కు కాసేపు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా చేయాలంటూ ఓ యువకుడు ఎమ్మెల్యే కాళ్ళను పట్టుకున్నాడు. దీంతో కాసేపు ఉద్రక్త పరిస్థితి నెలకొంది. వెంటనే తేరుకున్న ఎమ్మెల్యే అనుచరులు యువకుడిని పక్కకు లాగేశారు. 

 

ముగిసిన అఖిలపక్ష సమావేశం..

ఢిల్లీ : హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాక్ ఉగ్రవాదంపై చర్యలు..పరిణామాలపై చర్చించారు.

16:55 - September 29, 2016

హైదరాబాద్ : ప్రభుత్వం పేదలకు నాడు ఇళ్ల పట్టాలు ఇచ్చారు.... నేడు జీహెచ్ ఎంసీ పేదల ఇళ్లను కూల్చివేసింది. నాలాలపై అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియను జీహెచ్ ఎంసీ ముమ్మరం చేసింది. దీంతో నాలాల అంచున నిర్మించుకున్న పేదల ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో బాధితులు రోడ్డున పడ్డారు. గతంలో ఇళ్ల పట్టాలిచ్చారు...ఇప్పుడేమో కూల్చివేశారని బోరున విలపిస్తున్నారు. ఇది హైదరాబాద్ లోని పేదల దుస్థితి. హైదరాబాద్‌లో అక్రమకట్టడాల కూల్చివేత కొనసాగుతూనే ఉంది. అయితే కాప్రా సర్కిల్‌ మారుతీనగర్‌లో కూల్చివేతల పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అక్రమనిర్మాణాల పేరుతో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు కేవలం పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జీవో 58 ప్రకారం పట్టాలిచ్చిన భూముల్లోని నిర్మాణాలు కూల్చడంతో రోడ్డున పడ్డామని గిరిజన కుటుంబాలు ఆవేదన చెందుతున్నారు. తాము లేని సమయంలో చూసి ఇళ్లను కూల్చివేశారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై టెన్ టివి ప్రతినిధి అందించిన మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

జిల్లాల పునర్ విభజనపై కేసీఆర్ చర్చ..

హైదరాబాద్ : జిల్లాల పునర్ విభజనపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సీఎస్ రాజీవ్ శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

16:47 - September 29, 2016

భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో..ఒకదాని వెనుక ఒకటిగా చరిత్రాత్మక ఘట్టాలు చోటు చేసుకొంటున్నాయి. కాన్పూర్ గ్రీన్ పార్క్ వేదికగా ఇటీవలే 500 వ టెస్ట్ మ్యాచ్ ఆడిన టీమిండియా స్వదేశీగడ్డపై 250వ టెస్ట్ మ్యాచ్ కు సైతం సిద్ధమవుతోంది. స్వదేశీ ప్రధాన టెస్ట్ వేదికల్లో టీమిండియా రికార్డులపై నెంబర్ వన్ ర్యాంక్ అందుకోవాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో...ఐదు వందల మ్యాచ్ లు ఆడిన నాలుగోజట్టుగా కొద్దిరోజుల క్రితమే చరిత్ర సృష్టించిన టీమిండియా మరో అరుదైన రికార్డుకు సిద్ధమయ్యింది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..

అరుదైన ఘనత..
న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ ద్వారా మరో అరుదైన ఘనత సొంతం చేసుకోనుంది. స్వదేశీ గడ్డపై 250వ టెస్ట్ మ్యాచ్ కు...విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన ..తన 500వ మ్యాచ్ లో చరిత్రాత్మక విజయం సాధించిన టీమిండియా..సొంత గడ్డపై తన 250వ మ్యాచ్ ను సైతం కివీస్ ప్రత్యర్థిగానే ఆడటానికి సిద్ధమయ్యింది. ఇటీవలి కాన్పూర్ టెస్ట్ వరకూ టీమిండియా..500 మ్యాచ్ లు ఆడితే..అందులో స్వదేశంలో ఆడినవే 249 మ్యాచ్ లు ఉన్నాయి. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా టీమిండియా ఇప్పటి వరకూ ఆడి 33 టెస్ట్ మ్యాచ్ ల్లో 13 విజయాలు, 6 పరాజయాలు, 14 డ్రాల రికార్డుతో ఉంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా కూడా టీమిండియా అత్యధిక విజయాల రికార్డే ఉంది. మొత్తం 31 టెస్టుల్లో 13 విజయాలు, 6 పరాజయాలు, 11 పరాజయాలు, ఒకే ఒక్క టై మ్యాచ్ ల అరుదైన రికార్డు ఉంది.

ఈడెన్ లో మిశ్రమ ఫలితాలు...
ఇక..ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా టీమిండియా కేవలం 24 టెస్టు లు మాత్రమే ఆడింది. ఇందులో 10 గెలుపు, 7 ఓటమి, ఏడుమ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ లో మాత్రం..టీమిండియాకు మిశ్రమఫలితాలు ఉన్నాయి. మొత్తం 39 మ్యాచ్ లు ఆడి..11 విజయాలు మాత్రమే నమోదు చేసింది. 9 పరాజయాలు, 19 డ్రాలు సాధించింది. ప్రస్తుత సిరీస్ లోని కాన్పూర్ టెస్ట్ వరకూ 500 మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. 130 విజయాలు, 57 పరాజయాలు, 212 డ్రా, 1 టై రికార్డు తో ఉంది. న్యూజిలాండ్ ప్రత్యర్థిగా టీమిండియా ఆడిన 55 టెస్టుల్లో 19 గెలుపు, 10 ఓటమి, 26 డ్రాల రికార్డు ఉంది. కోల్ కతా టెస్ట్ లో సైతం నెగ్గి..టెస్ట్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ అందుకోవాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది.

16:45 - September 29, 2016

ఢిల్లీ : భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దులో ఉగ్రవాద చొరబాట్లను భారత సైన్యం భగ్నం చేసింది. సరిహద్దు పొడవునా భారత్‌ సర్జికల్‌ దాడులు చేసింది. 7 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. పాక్ ఆక్రమిక కశ్మీర్లో తీవ్రవాద స్థావరాలపై తొలిసారిగా భారత్ విరుచుకుపడింది. నిన్న అర్థరాత్రి సైన్యానికి చెందిన పారా కమెండోలు.. హెలికాఫ్టర్ల ద్వారా.. ఉగ్రస్థావరాలపై దాడులకు దిగారు. సరిహద్దు దాటి 2 కిలోమీటర్ల లోనికి వెళ్లి.. దాడులు నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ చీఫ్... లెఫ్ట్‌నెంట్‌ జనరల్ రణబీర్‌ సింగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 
సరిహద్దులో పరిస్థితిపై సమీక్ష 
సరిహద్దులో పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రధాని ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. మరోవైపు తాజా పరిస్థితిని వివరించేందుకు కేంద్రం... ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ప్రారంభం అయింది.
ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు : రణ్ బీర్ సింగ్ 
నిఘా విభాగాల నుంచి సేకరించిన పక్కా సమాచారం మేరకు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై నిన్న రాత్రి ఆర్మీ మెరుపు దాడులు జరిపింది. ఈ విషయాన్ని లెఫ్టెనెంట్ జనరల్ రణ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. సైన్యానికి చెందిన పారా కమెండోలు.. హెలికాఫ్టర్ల ద్వారా.. ఉగ్రస్థావరాలపై దాడులకు దిగారు. సరిహద్దు దాటి 2 కిలోమీటర్ల లోనికి వెళ్లి.. దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని, ఉగ్రవాదులకు, వారిని సమర్థించే వారికి భారీ నష్టం సంభవించిందన్నారు. ఆపరేషన్ గురించి పాకిస్తాన్‌ ఆర్మీకి తెలియజేసిటన్లు రణబీర్‌సింగ్‌ తెలిపారు. ఉరీ ఉగ్రవాద ఘటన అనంతరం.. తీవ్రవాద స్తావరాలపై భారత్ దాడులకు దిగడం ఇదే తొలిసారి. ఉరీ ఘటనలో పాక్ ప్రమేయానికి సంబంధించిన పలు సాక్ష్యాలను ఇప్పటికే భారత్.. ఆ దేశానికి అందించినట్లు భాకత లెఫ్టెనెంట్ జనరల్ రణ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:42 - September 29, 2016

ఇండియన్‌ క్రికెట్‌ మక్కా ఈడెన్‌ గార్డెన్స్‌లో మరో చరిత్రత్మాక మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. స్వదేశంలో టీమిండియా 250వ టెస్ట్‌కు కోల్‌కతా ఈడెన్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. తొలి టెస్ట్ విజయంతో జోరు మీదున్న కొహ్లీ అండ్‌ కో....రెండో టెస్ట్ లోనూ నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి టెస్ట్ లో ఆల్‌రౌండ్‌తో అదరగొట్టిన కొహ్లీ సేనకు కేన్‌ విలియమ్‌సన్‌ నాయకత్వంలోని న్యూజిలాండ్‌ జట్టు సవాల్‌ విసురుతోంది. ఇప్పటివరకూ టెస్టుల్లో ఓవరాల్‌గా 500వ టెస్టులు ఆడిన భారత్‌ స్వదేశంలో ఆడబోతున్న 250వ టెస్ట్ ఇదే కావడం విశేషం. 500వ టెస్ట్ లో హిస్టారికల్‌ విక్టరీ నమోదు చేసి జోరు మీదున్న కొహ్లీ అండ్‌ కో రెండో టెస్ట్‌లోనూ నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది.

భారత్ బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టం..
మురళీ విజయ్‌, పుజార, రహానే, రోహిత్‌ శర్మ ఫామ్‌లో ఉండటంతో పాటు భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉంది. గాయపడిన రాహుల్‌ స్థానంలో జట్టులోకొచ్చిన గంభీర్‌ తుది జట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ సైతం తిరిగి గాడిలో పడితే భారత బ్యాటింగ్‌కు తిరుగుండదు. ఇక భారత స్పిన్‌ ట్విన్స్ అశ్విన్‌, జడేజా తొలి టెస్ట్ లో ఎంతలా మ్యాజిక్‌ చేశారో అందరికీ తెలిసిందే. న్యూజిలాండ్‌ బ్యాట్స్ మెన్‌ను బోల్తా కొట్టించిన అశ్విన్‌ 10 వికెట్లు తీశాడు. జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించాడు. ఎలా చూసుకున్నా అన్ని విభాగాల్లో న్యూజిలాండ్‌ కంటే భారత జట్టే పవర్‌ఫుల్‌గా ఉంది.

తేలిపోయిన కివీస్..
మరోవైపు తొలి టెస్ట్‌ రెండు రోజుల ఆటలో ఆధిపత్యం ప్రదర్శించిన న్యూజిలాండ్‌ జట్టు మూడో రోజు నుంచి అనూహ్యంగా తేలిపోయింది. కివీస్‌ బౌలర్లు ఫర్వాలేదనిపించినా బ్యాట్స్ మెన్‌ మాత్రం భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంలో దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్‌సన్‌, గప్తిల్‌, రాస్‌ టేలర్‌, ల్యూక్‌ రాంకీ వంటి అనుభవజ్ఞులు రాణిస్తేనే న్యూజిలాండ్ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మరోసారి విఫలమైతే న్యూజిలాండ్‌ జట్టు రెండో టెస్ట్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇక ఈ టెస్ట్ లో నెగ్గితే టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌కు చేరుకుంటుంది. సొంతగడ్డపై టెస్టుల్లో తిరుగులేని ట్రాక్‌ రికార్డ్ కలిగిన టీమిండియాకు...స్వదేశంలో ఆడబోతున్న 250వ టెస్ట్ లోనూ విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 

16:30 - September 29, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపును వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన బాధితులకు ఊరట లభించింది. గ్రేటర్ పరిధిలో నాలాపై అక్రమ కట్టడాలపై కూల్చివేతలపై హైకోర్టులో విచారణ జరిగింది. నోటీసులు ఇచ్చి.. బాధితుల వాదనలు విన్న తర్వాతే అక్రమ కట్టడాలను కూల్చాలని జీహెచ్ఎంసీని కోర్టు ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలాలపై నిర్మాణాల తొలగింపును వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం రెండున్నరగంటలకు హైకోర్టులో వాదనలు జరిగాయి. నోటీసులు ఇచ్చి.. బాధితుల వాదనలు విన్న తర్వాతే అక్రమ కట్టడాలను కూల్చాలని జీహెచ్ఎంసీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 13కి వాయిదా పడింది. నిన్న పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం 8వారాలపాటు నాలాలపై నిర్మాణాలు కూల్చొద్దని ఆదేశించింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించింది.

 

ముఖ్యమంత్రులతో మాట్లాడిన రాజ్ నాథ్..

ఢిల్లీ : వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ లో మాట్లాడారు. ఉగ్రవాదంపై తీసుకున్న చర్యలపై ఆయన వివరించారు. సరిహద్దులోని పది కిలోమీటర్ల మేర ప్రజలను ఖాళీ చేయించాలని పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాద్ కు ఆదేశాలు జారీ చేశారు. 

సైన్యానికి ప్రముఖుల మద్దతు..

ఢిల్లీ : పాక్ పై భారత సైన్యం తీసుకున్న చర్యలకు దేశ యావత్తు మద్దతు తెలియచేస్తోంది. సైనికులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఉగ్రవాదంపై ప్రభుత్వం తీసుకొనే చర్యలు తమ మద్దతు ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆర్మీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఇలాంటి చర్యలు అవసరమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
దేశం యావత్తు భారత సైన్యానికి అండగా నిలుస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు.
భారత్ నిబద్ధతకు ఈ నిర్ణయమే నిదర్శనమని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.

16:11 - September 29, 2016

జమ్మూకశ్మీర్ : భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దులో ఉగ్రవాద చొరబాట్లను భారత సైన్యం భగ్నం చేసింది. సరిహద్దు పొడవునా భారత్‌ సర్జికల్‌ దాడులు నిర్వహించింది. పాక్ ఆక్రమిక కశ్మీర్లో తీవ్రవాద స్థావరాలపై తొలిసారిగా భారత్ విరుచుకుపడింది. నిన్న అర్ధరాత్రి సైన్యానికి చెందిన పారా కమెండోలు.. హెలికాఫ్టర్ల ద్వారా.. ఉగ్రస్థావరాలపై దాడులకు దిగారు. సరిహద్దు దాటి 2 కిలోమీటర్ల లోనికి వెళ్లి.. దాడులు నిర్వహించారు. 7 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ చీఫ్... లెఫ్ట్‌నెంట్‌ జనరల్ రణబీర్‌ సింగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 
ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ మెరుపు దాడులు : రణ్ బీర్ సింగ్ 
నిఘా విభాగాల నుంచి సేకరించిన పక్కా సమాచారం మేరకు ఉగ్రవాద స్థావరాలపై నిన్న రాత్రి ఆర్మీ మెరుపు దాడులు జరిపినట్లు లెఫ్టెనెంట్ జనరల్ రణ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. ఈ దాడుల్లో ఏడు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని, ఉగ్రవాదులకు, వారిని సమర్థించే వారికి భారీ నష్టం సంభవించిందన్నారు. ఆపరేషన్ గురించి పాకిస్తాన్‌ ఆర్మీకి తెలియజేశామన్నారు. ఉరీ ఉగ్రవాద ఘటన అనంతరం.. తీవ్రవాద స్తావరాలపై భారత్ దాడులకు దిగడం ఇదే తొలిసారి. ఉరీ ఘటనలో పాక్ ప్రమేయానికి సంబంధించిన పలు సాక్ష్యాలను ఇప్పటికే భారత్.. ఆ దేశానికి అందించింది. సరిహద్దులో పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రధాని ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. మరోవైపు తాజా పరిస్థితిని వివరించేందుకు కేంద్రం... సాయంత్రం 4 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 

 

అఖిలపక్ష సమావేశం ప్రారంభం..

ఢిల్లీ : హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పాక్ ఉగ్రవాదంపై చర్యలు..పరిణామాలపై చర్చించనున్నారు. 

16:02 - September 29, 2016

'నాగ చైతన్య కెరీర్ లో ప్రేమమ్ నిలిచిపోతుంది. ఈ మూవీ చాలా చాలా బాగుంది'. ఇవి ఎవరో చెప్పినవి కావు. 'నాగార్జున' ఇలాంటి ట్వీట్స్ తో 'ప్రేమమ్' చిత్రం పై అందరికి ఆసక్తిని కలిగిస్తున్నాడు.. 'ప్రేమమ్' సక్సెస్ పై 'నాగార్జున' కాన్పిడెంట్ గా ఉన్నాడు. మరి 'నాగ్' 'ప్రేమమ్' మూవీపై చెప్పిన ఆ విశేషాలేంటీ ? దసరా రిలీజ్ కానున్న సినిమాల్లో ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న మూవీ 'ప్రేమమ్'. ఇది రీమేక్ మూవీ అయినా సరే, కాంబినేషన్ల కారణంగా ఈ మూవీకి బోలెడంత బజ్ వచ్చేసింది. 'నాగ చైతన్య' హీరోగా నటించడమే తెలుగు 'ప్రేమమ్' కి అన్నిటికంటే పెద్ద ప్లస్ అవుతోంది.

నాగ్ కు స్పెషల్ షో..
ప్రస్తుతం సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాపై కింగ్ 'నాగార్జున' మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తున్నాడు. 'నాగ చైతన్య' రీసెంట్ గా తన తండ్రి 'నాగార్జున'కు స్పెషల్ షో వేయించి మరీ 'ప్రేమమ్' మూవీ చూపించాడట. సినిమా ఆద్యంతం 'నాగ్' మైమరించిపోయినట్లు వినికిడి. మూవీ కంప్లీట్ కాగానే 'నాగ్' యూనిట్ లో ప్రతీ ఒక్కరినీ అభినందించాడట. ఈ క్రమంలోనే 'నాగ్', 'చైతు' ఖాతాలో సూపర్ హిట్ పడుబోతోందని కాన్ఫిడెంట్ గా చెప్పుతున్నాడట. ఇంతటితో ఆగకుండా అభిమానులతో ఇప్పుడే తెలుగు 'ప్రేమమ్' మూవీ చూసి, చాలా సంతోషంగా ఇంటికి వచ్చా' అంటూ ట్వీట్ ఈ చిత్రంపై అంచనాలు పెంచాడు.

15:40 - September 29, 2016
15:37 - September 29, 2016

నెల్లూరు : ప్రత్యేక ప్యాకేజీని బీజేపీ, టీడీపీ నేతలు తప్ప ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని, ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదానే పరిష్కారమని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రానికి హోదా సాధించేవరకు ఉద్యమాలను కొనసాగిస్తామని, కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:32 - September 29, 2016

ఢిల్లీ : స్వచ్ఛ భారత్‌ కార్య్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛభారత్‌ అభియాన్‌పై ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ 150 జయంతోత్సవ సంవత్సరం 2019 నాటికి పూర్తిగా పరిశుభ్రమై దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. 

15:26 - September 29, 2016

మెదక్‌ : జిల్లాలోని హత్నూర మండలం బోర్బట్ల గ్రామంలో అరబిందో ఫార్మా కాలుష్యం భరించలేక రైతులు రోడ్డెక్కారు. కంపెనీముందు ఆందోళనకు దిగారు. కంపెనీనుంచి వస్తున్న వ్యర్థాలతో తమ పంటలన్నీ నాశనమయ్యాయని ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.

 

15:21 - September 29, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపును వ్యతిరేకిస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. బాధితులు నిన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నం రెండున్నరగంటలకు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. నిన్న పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం 8వారాలపాటు నాలాలపై నిర్మాణాలు కూల్చొద్దని ఆదేశించింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించింది.

15:20 - September 29, 2016

'ధోని' సినిమా అనేక రకాలుగా ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తోంది. ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రియల్ లైఫ్ స్టోరీ కావడంతో ఈ సినిమాపై రోజు రోజుకి హైప్ పెరుగుతోంది. 'ధోనీ'తో ప్రేమాయాణం నడిపిన హీరోయిన్స్ కి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో ఉంటుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో స్టోరీ పరంగా కూడా ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. బాలీవుడ్ బయోపిక్స్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 'డర్టీ పిక్చర్', 'బాగ్ మిల్కా బాగ్', 'సుల్తాన్' లాంటి సినిమాలు బాక్సాఫీసుని షేక్ చేయడంతో బీటౌన్ లో రియల్ లైఫ్ స్టోరీస్ కి బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో త్వరలో రిలీజ్ కానున్న 'ధోనీ' సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ కలెక్షన్ల పరంగానే కాకుండా స్టోరీ పరంగా సన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. బాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన బయోఫిక్ స్టోరీస్ లో 'ఎం.ఎస్.ధోని', 'ది అన్ టోల్డ్ స్టోరీ' మరో ఎత్తు అని చెప్పాల్సిందే. ఇండియన్ క్రికెట్ టీమ్ గ్రేటెస్ట్ కెప్టెన్లలో ఒకడైన 'ధోని' కెరీర్ ఎలా ఆరంభమైందో, అతను ఎలా ఎదిగాడో, ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడో అందరికీ తెలుసు. ఐతే అతడి కెరీర్ ఆరంభమవ్వడానికి ముందు ఏం జరిగిందన్నది చాలామందికి తెలియదు. ఆ విశేషాలతోనే నీరజ్ పాండే ఈ చిత్రాన్ని మలిచినట్లు సమాచారం.

దీపికా పడుకొనే..
'ధోని' స్టార్ క్రికెటర్ గా అయ్యాక హీరోయిన్స్ తనతో నడిపిన ఎఫైర్స్ ఈ మూవీలో ఉండబోతున్నాయా అనేదే ఇప్పుడు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. 'ధోని' స్టార్ క్రికెటర్ గా ఎదిగాక 'దీపిక పడుకోనే' కోసమే ఆయన తన లాంగ్ ఎయిర్స్ ని కట్ చేశాడనే టాక్ ఉంది. అంతేకాదు 'దీపిక' ఈ క్రికెటర్ తో పీకలోతు ప్రేమలో పడిందనేది ఓపెన్ సీక్రెట్. అంతేకాదు ఈ బ్యూటీ వల్లే 'ధోని'కి, 'యువరాజ్ సింగ్' మధ్య విభేధాలు వచ్చినట్లు అప్పట్లో వినిపించింది. మరి ఈ సంగతులన్నీ ఈ మూవీలో పొందుపరిచారా లేదా చూడాలి. అదే విధంగా మరో హీరోయిన్ 'లక్ష్మీరాయ్' అయితే ఏకంగా 'ధోని'తో డేటింగ్ కూడా చేసింది. ఈ బ్యూటీ ఇటీవలే 'ధోని'తో తనది జెస్ట్ ప్రెండ్ మాత్రమే అంటూ కహానీ చెప్పింది. ఈ ఫ్రైడే రిలీజ్ కానున్న ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో చూడాలి.

సైనిక చర్యను ఖండించిన పాక్..

ఢిల్లీ : భారత సైనిక చర్యలను పాకిస్థాన్ ఖండించింది. ఈ దాడులను ఖండిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. శాంతి నెలకొనాలనేదే తమ ఆకాంక్ష అని, బలహీనులు అనుకోవద్దన్నారు. పాక్..భద్రత రక్షణ..కు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 

కేసీఆర్ కు రాజ్ నాథ్ సింగ్ ఫోన్..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేసీఆర్ కు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద జరిగిన పరిణామాలు ఆర్మీ చర్యలను కేసీఆర్ కు రాజ్ నాత్ వివరించారు.

 

పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు..

జమ్మూ కాశ్మీర్ : పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులకు చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటక పాక్ సరిహద్దులో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది. రాత్రి 12 నుండి తెల్లవారుజామున 4.30 గంటల వరకు భారత సైనిక ఆపరేషన్ కొనసాగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి మూడు కిలోమీటర్ల మేర సైన్యం చొచ్చుకపోయింది. 

నయీంతో సంబంధాలు లేవు - కోమటిరెడ్డి..

హైదరాబాద్ : నయీంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆరోపణలు చేయడం కాదని..ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. మంత్రిగా ఉన్న సమయంలో నయీం సెటిల్ మెంట్లకు అడ్డుకట్ట వేయడం జరిగిందని, గ్యాంగ్ స్టర్లతో సంబంధాలు పెట్టుకోవాల్సిన కర్మ తనకు లేదన్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకే తమపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. తన కొడుకును చంపానని చెప్పిన నయీంతో తనకు సంబంధాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. నయీం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. 

15:08 - September 29, 2016

ఢిల్లీ : బుధవారం రాత్రి  సరిహద్దు పొడుగునా భారత్‌ జరిపిన కాల్పులపై పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ స్పందించారు. సీమాంత రేఖను దాటి సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయడాన్ని ఆయన ఖండించారు. 'మేము శాంతిని ఆకాంక్షిస్తున్నామని, మా వైఖరిని చేతగానితనంగా భావించ రాదని' షరీఫ్‌ స్పష్టం చేశారు. పాక్‌ ఆర్మీ మట్టుకు పెద్దగా దాడులు జరగలేదని పేర్కొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

హెచ్ సీయూలో కౌంటింగ్ ప్రారంభం..

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం ఓటర్లు 5200 ఉండగా 3800 ఓట్లు పోలయ్యాయి. 

పంచాయతీ రోడ్లను బాగు చేయాలన్న మంత్రి జూపల్లి..

హైదరాబాద్ : భారీ వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీ రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశాలు జారీ చేశారు. 1700 కి.మీ.మేర 1524 రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. తాత్కాలిక మరమ్మత్తుల కోసం రూ. 49.61 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నట్లు, పూర్తిస్థాయి నిర్మాణాల కోసం రూ. 318.58 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 73 భవనాలు వర్షాలతో దెబ్బతినడం జరిగిందని, మరమ్మత్తులకు రూ. 3.44 కోట్లు అవసరమని తెలిపారు. 

14:56 - September 29, 2016

ఢిల్లీ : కశ్మీర్‌ సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత  సైన్యం భగ్నం చేసిందని డిజిఎంఓ లెఫ్ట్‌నెంట్‌ జనరల్ రణబీర్‌ సింగ్‌ తెలిపారు. సరిహద్దులో నుంచి ఉగ్రవాదులు చొరబడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు ఉగ్రవాద స్థావరాలపై నిన్న రాత్రి ఆర్మి మెరుపు దాడులు జరిపినట్లు రణ్‌బీర్‌సింగ్‌ చెప్పారు. ఈ దాడుల్లో ఏడు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని, ఉగ్రవాదులకు, వారిని సమర్థించే వారికి భారీ నష్టం సంభవించిందన్నారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు పాకిస్తాన్‌ సైనికులు మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ డిజిఎంఓకు తెలియజేశామన్నారు. ఉరి ఉగ్రవాద దాడి సంబంధించిన ఆధారాలను పాకిస్తాన్‌కు దర్యాప్తు కోసం సమర్పించడం జరిగిందన్నారు. సరిహద్దు పరిస్థితిని వివరించేందుకు కేంద్రం సాయంత్రం 4 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

బీటింగ్ రీట్రీట్ వాయిదా వేసుకున్న బీఎస్ఎఫ్...

ఢిల్లీ : వాఘా సరిహద్దు వద్ద బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని బీఎస్ఎఫ్ వాయిదా వేసుకుంది. భారత్ లోకి ఉగ్రవాదులు చొచ్చుకవస్తున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సంగతి తెలిసిందే. 

కూల్చివేతలపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : నాలాలపై అక్రమ నిర్మాణాల తొలగింపును వ్యతిరేకిస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని కోర్టు ప్రశ్నించింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మధ్యాహ్నం 2.30గంటలకు వాదనలు జరగనున్నాయి. కూల్చివేతపై బుధవారం బాధితులు కోర్టును ఆశ్రయించారు. 8వారాల పాటు కూల్చొద్దని హైకోర్టు ఆదేశించింది. 

బీరేంద్ర సింగ్ తో మంత్రి కేటీఆర్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. 

ఎమ్మెల్యే విద్యాసాగర్ కాళ్లను పట్టుకున్న యువకుడు..

కరీంనగర్ : కోర్టులను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ ఎమ్మెల్యే విద్యాసాగర్ కాళ్లను ఓ యువకుడు పట్టుకున్నాడు. ఎమ్మెల్యే అనుచరులు యువకుడిని తోసేశారు. 

సముద్రంలో బోల్తా పడిన పడవ..

శ్రీకాకుళం : గార మండలం బందరువానిపేటలో సముద్రంలో పడవ బోల్తా పడింది. దీనితో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందగా మరో ఐదుగురు క్షేమంగా ఉన్నారు. 

ప.గో.లో అక్వా వర్సిటీ - బాబు..

విజయవాడ : జిల్లాలో కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. కోస్తాలో నాలుగు జిల్లాల్లో మెట్టభూములకు అండర్ గ్రౌండ్ పైపులైన్ ద్వారా సాగునీరు సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అక్వా వర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

 

14:03 - September 29, 2016

ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే మానవి హెల్త్ కేర్ కార్యక్రమం ఈరోజు కూడా మన ముందుకు వచ్చేసింది. ఈనాటి హెల్త్ కేర్ లో 'సుఖ ప్రసవానికి యోగా' తో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..సూచనలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి.. 

13:59 - September 29, 2016

ఢిల్లీ : కశ్మీర్‌ సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసిందని డిజిఎంఓ లెఫ్ట్‌నెంట్‌ జనరల్ రణబీర్‌ సింగ్‌ తెలిపారు. సరిహద్దులో నుంచి ఉగ్రవాదులు చొరబడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు నిన్న రాత్రి ఆర్మి మెరుపు దాడులు జరిపినట్లు రణ్‌బీర్‌సింగ్‌ చెప్పారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు, వారిని సమర్థించే వారికి భారీ నష్టం సంభవించిందన్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ డిజిఎంఓకు తెలియజేశామన్నారు. ఉరి ఉగ్రవాద దాడి సంబంధించిన ఆధారాలను పాకిస్తాన్‌కు దర్యాప్తు కోసం సమర్పించడం జరిగిందన్నారు. కశ్మీర్‌ సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసిందని డిజిఎంఓ లెఫ్ట్‌నెంట్‌ జనరల్ రణబీర్‌ సింగ్‌ తెలిపారు. సరిహద్దులో నుంచి ఉగ్రవాదులు చొరబడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు నిన్న రాత్రి ఆర్మి మెరుపు దాడులు జరిపినట్లు రణ్‌బీర్‌సింగ్‌ చెప్పారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు, వారిని సమర్థించే వారికి భారీ నష్టం సంభవించిందన్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ డిజిఎంఓకు తెలియజేశామన్నారు. ఉరి ఉగ్రవాద దాడి సంబంధించిన ఆధారాలను పాకిస్తాన్‌కు దర్యాప్తు కోసం సమర్పించడం జరిగిందన్నారు.

సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు
ఉరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినా.... సరిహద్దుల్లో పాక్‌ కవ్వింపు చర్యలు ఆగలేదు. భారత్‌తో కయ్యానికి పాకిస్థాన్‌ కాలుదువ్వుతున్నట్టు కనిపిస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము-కశ్మీర్‌ సరిహద్దులోని పూంచ్‌ సెక్టార్‌ నౌగామ్‌ ప్రాంతంలోకి పాక్‌ రేంజర్లు కాల్పులు జరిపారు. భారీ మోర్టార్లు ప్రయోగించారు. మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

13:51 - September 29, 2016

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మహిళా ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం.. ఆహ్లాదకరంగా సాగింది. కొద్దిరోజుల్లో ఏపీకి తరలి వెళుతున్న మహిళా ఉద్యోగులు... తెలంగాణ మహిళా ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత స్మృతులను పంచుకుంటూ ఆత్మీయంగా గడిపారు.

ఏపీకి తరలి వెళ్లనున్న సచివాలయ మహిళా ఉద్యోగులు
అక్టోబర్‌ 3 నుంచి ఏపీలో పూర్తి స్థాయి పాలనకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఒక్కో శాఖ తరలింపు కార్యక్రమం వేగంగా సాగుతోంది. కొన్ని రోజుల్లో హైదరబాద్‌ సచివాలయం వీడి వెళుతున్న ఏపీ మహిళా ఉద్యోగులు.. తెలంగాణ మహిళా ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఏపీ సచివాయంలో నిర్వహించిన ఈ సమ్మేళనం ఎంతో ఉల్లాసంగా సాగింది.

హైదరాబాద్‌తో అనుబంధాన్ని స్మరించుకున్న ఏపీ మహిళా ఉద్యోగులు
హైదరాబాద్ వదలి వెళుతున్నందుకు ఏపీ మహిళా ఉద్యోగులు బాధను వ్యక్తం చేశారు. అయితే.. ప్రస్తుత పరిస్ధితుల్లో కొత్త రాజధాని అమరావతి అభివృద్థిలో భాగస్వాములు కావడం తప్పనిసరి కాబట్టి.. అక్కడి వెళ్లక తప్పదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ తో ఏళ్ల తరబడి అనుబంధాన్ని వదిలి వెళ్లాల్సి రావడం పట్ల బావోద్వేగానికి గురయ్యారు ఉద్యోగులు.
జ్ఞాపకాలను నెమరెసుకున్న ఉద్యోగులు
తెలంగాణ ఉద్యోగులు కూడా ఏపీ ఉద్యోగులతో కలిసి ఆత్మీయంగా గడిపారు. జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కలిసి మెలిసి పని చేసినప్పటి ఘటనలు గుర్తు చేసుకున్నారు. ఏపీ ఉద్యోగులకు కొత్త రాజధానిలో మంచి భవిష్యత్తు ఉందంటున్నారు. రెండు రాష్ట్రాల మహిళా ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంతో ఏపీ సచివాలయంలో సందడి వాతావరణ ఏర్పడింది .

13:36 - September 29, 2016

తిరుమల : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పోరాడుతుంటే, ఇద్దరు బ్రదర్స్ మాత్రం ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారని.. వాళ్లలో ఒకరు వెంకయ్యనాయుడు, మరొకరు చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ‘వెన్నుపోటు బ్రదర్స్’ గా వీళ్లిద్దరూ రాష్ట్రాన్ని ఏ విధంగా నష్టపరుస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని రోజా విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.

సాయంత్రం కేంద్ర అఖిలపక్ష సమావేశం..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతనలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. భారత సరిహద్దు వద్ద నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు సర్జికల్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆర్మీ డీజీఎంవో పేర్కొన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు భారత్ లోకి చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో సరిహద్దుల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. 

రాచకొండలో వ్యభిచార గృహాలపై దాడులు..

హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 75 మందిని అరెస్టు చేశారు. 40 మంది మహిళలకు విముక్తి కల్పించారు. వ్యభిచార నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వ్యభిచారం నిర్వహిస్తున్న నాలుగు ఇళ్లను సీజ్ చేయడం జరిగిందన్నారు. వ్యభిచారం నడిపిస్తున్న హోటల్ లైసెన్స్ రద్దు చేస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. 

సచివాలయం బయట నారాయణరావుపేట గ్రామస్తులు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ను కలిసేందుకు మెదక్ జిల్లా నారాయణరావుపేట సర్పంచి, గ్రామస్తులు సచివాలయానికి వచ్చారు. నారాయణరావుపేటను మండల కేంద్రంగా ప్రకటించాలని సీఎంను గ్రామస్తులు కోరనున్నారు. అపాయింట్ మెంట్ లేకపోవడంతో సచివాలయం బయటే గ్రామస్తులు వేచి ఉన్నారు. 

13:20 - September 29, 2016

కర్నూలు : కొండజూటూరు గ్రామస్థులు పాణ్యం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. తప్పుడు కేసులు పెట్టి మహిళ ప్రాణం తీశారంటూ జాతీయ రహదారి 40పై బైఠాయించి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్థంభించిపోయింది. నానో కెమికల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ బాలప్ప..అతని భార్య స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన ఫ్యాక్టరీ యాజమాన్యం గత కొంతకాలంగా బాలప్ప కుటుంబాన్ని వేధిస్తున్నారనీ..దీంతో మనస్థాపంతో బాలప్ప భార్య ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. కాగా స్థానికులతో బాలప్ప కుటుంబానికి వున్న విరోధం నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.కాదు పోలీసులు..ఫ్యాక్టరీ యాజమాన్యపు వేధింపులతోనే తన భార్య ఆత్మహత్య చేసుకుందనీ తమకు న్యాయం జరిగేవరకూ ఆందోళన విరమించమనీ బాలప్పతోపాటు గ్రామస్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. 

13:13 - September 29, 2016

ఒక్క సినిమా కోసం అతను ఏ సినిమాలు ఒప్పుకోలేదు..ఒకటి కాదు..రెండు..కాదు..మూడు సంవత్సరాలు ఒక్క సినిమాకు మాత్రమే 'ప్రభాస్' కమిట్ అయ్యాడు. అదే 'బాహుబలి'.. రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి తెలుగు చిత్ర స్టామినా ఏంటో చూపించింది. అనంతరం 'బాహుబలి -2' చిత్రం కోసం 'ప్రభాస్' ఏ సినిమాలు కూడా ఒప్పుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే 'ప్రభాస్' పుట్టిన రోజు అక్టోబర్ 23. ఈ రోజున 'ప్రభాస్' కు ఓ గిఫ్ట్ ఇవ్వాలని 'రాజమౌళి' అనుకుంటున్నాడంట. ఖరీదైన కారు లేదా వాచ్ లాంటిది గిఫ్ట్ ఇస్తారని అనుకుంటున్నారా? 'ప్రభాస్‌'కి విభిన్నమైన గిఫ్ట్ ఇవ్వనున్నట్లు టాలీవుడ్‌ చర్చ జరుగుతోందంట. ఆ రోజున 'బాహుబలి 2' టీజర్ రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే టీజర్ కాకుండా కేవలం 'ప్రభాస్‌'కు సంబంధించిన 30 సెకండ్ల టీజర్‌ను రిలీజ్ చేయాలని 'రాజమౌళి' భావిస్తున్నట్లు టాక్. ప్రభాస్‌కు గిఫ్ట్ గా ఈ టీజర్‌ను 'రాజమౌళి' ఇవ్వనున్నట్టు సమాచారం. మరి ఇది నిజమైనా ? కాదా ? అనేది తెలియాలంటే అక్టోబర్ 23వరకు వేచి చూడాల్సిందే. 

కొండజూటూరు గ్రామస్తుల ఆందోళన...

కర్నూలు : పాణ్యం వద్ద కొండజూటూరు గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. నానో కెమికల్ ఫ్యాకర్టీ ఏర్పాటును వ్యతిరేకించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టినందుకే మహిళ ఆత్మహత్య చేసుకుందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి దిగ్భందం చేయడంతో 5 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. 

12:46 - September 29, 2016

గుంటూరు : నగరంలోని రెవిన్యూ కల్యాణ మండపంలో శ్రామిక మహిళ 11 వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. సీఐటీయూ సీనియర్‌ నాయకురాలు నీలిమ మైత్రి జెండాను ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు దేశం నలుమూలల నుంచి శ్రామిక మహిళా కార్యకర్తలు హారజరవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరక విధానాలపై ఈ మహాసభల్లో చర్చిస్తున్నారు. సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌, జాతీయ కార్యదర్శి హేమలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కార్మిక శక్తితో 35 శాతంపైగా ఉన్న మహిళలు తమ హక్కుల సాధన కోసం పోరాడాలని తపన్‌ సేన్‌ పిలుపు ఇచ్చారు. 

12:44 - September 29, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌. మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 8 ఏళ్లలో 835 కోట్లు ఖర్చు పెడితే.. రెండేళ్ల కాలంలో 675 కోట్లు తమ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపన పోలేదన్నారు. రైతుల కోసం కాంగ్రెస్ జలయజ్ఞం ప్రారంభించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. 

పెడన మున్సిపాల్టీ వైసిపి హస్తగతం..

విజయవాడ : పెడన మున్సిపాల్టీ వైసీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా ఆనంద ప్రసాద్ (వైసీపీ) ఎన్నికయ్యారు. చివరి నిమిషంలో వైసిపికి టిడిపి కౌన్సిలర్ స్రవంతి మద్దతునిచ్చారు. 12 ఓట్లతో ఆనంద్ ప్రసాద్ గెలుపొందారు. 

12:39 - September 29, 2016

ఢిల్లీ : పాక్ సైనికులు కవ్వింపులకు పాల్పడుతున్నారని భారత డీజీఎంవో రణబీర్ సింగ్ పేర్కొన్నారు. మోడీ అధ్యక్షతనలో భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సందర్భంగా డీజీఎంవో మీడియాతో మాట్లాడారు. భారత సరిహద్దులో చొరబాట్లు జరుగుతున్నాయని, 20 చొరబాట్లను భారత దళాలు నివారించామన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ డీజీఎంవోతో గత రాత్రి మాట్లాడడం జరిగిందని, చొరబాటులను ఆపాలని సూచించడం జరిగిందన్నారు. జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు జరుగుతున్నాయని, ఇటీవలే పూంచ్, ఉరి ఘటనలే ఇందుకు ఉదాహరణలని తెలిపారు. పాకిస్తాన్ హస్తం ఉందని ఉగ్రవాదుల నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులను బట్టి తెలుస్తోందన్నారు. కొంతమంది ఉగ్రవాదులను సజీవంగా పట్టుకోవడం జరిగిందన్నారు. వీరిని విచారించడం జరిగిందని, పాకిస్తాన్ లో శిక్షణ..ఆయుధాలు సమకూర్చినట్లు వారు పేర్కొనట్లు తెలిపారు. రాజకీయంగా..ఆర్మీ ఆధారంగా పాక్ పై పలు అభిప్రాయాలు తెలియచేయడం జరిగిందన్నారు. పూంచ్..ఉరి సెక్టార్ లో మృతి చెందిన ఉగ్రవాదుల వేలి ముద్రలను పాక్ కు పంపించినట్లు తెలిపారు. ఉగ్రవాదుల స్థావరంగా తాము మార్చడం జరగదని గతంలో పాక్ పేర్కొందని, కానీ అలా జరగడం లేదన్నారు. కొద్ది రోజుల కిందట భారత సరిహద్దులో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించడం జరిగిందని, ఇది తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్, భారత్ లోని పలు కీలక ప్రాంతాల్లో వీరు దాడులు చేసేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. దేశంలోని ప్రజలు..వారి ఆస్తులు..ప్రాణాలను రక్షించడం కోసం ఈ ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు. ఆపరేషన్ సమాప్తం చేయడం జరిగిందని, ఉగ్రవాదుల ఏరివేత కోసమే ఈ ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కాల్పుల విరమణనను పాక్ పదే పదే ఉల్లంఘిస్తోందన్నారు.

భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల మంత్రివ‌ర్గ ఉప‌సంఘంతో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ..
పాకిస్థాన్ త‌న దుస్సాహ‌స‌ చ‌ర్య‌ల‌ను ఆప‌కుండా మ‌రోసారి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన అంశంపై భార‌త్ సీరియ‌స్‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల మంత్రివ‌ర్గ ఉప‌సంఘంతో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ ఈరోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. పాక్ తీరుపై ఆయ‌న చ‌ర్చిస్తున్నారు. క‌శ్మీర్ స‌హా అన్ని స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో భద్ర‌త‌పై స‌మీక్ష జ‌రుపుతున్నారు. పాకిస్థాన్‌కు దీటుగా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ మోహ‌రింపుపై కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. భద్రతాపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలను మోదీ సమగ్రస్థాయిలో సమీక్షిస్తుస్తున్న సందర్భంగా డీజీఎంవో ఈ వ్యాఖ్యలు చేశారు. 

పాక్ సైనికులు కవ్వింపులు - డీజీఎంవో..

ఢిల్లీ : పాక్ సైనికులు కవ్వింపులకు పాల్పడుతోందని భారత ఆర్మీ డీజీఎంవో రణభీర్ సింగ్ పేర్కొన్నారు. మోడీ అధ్యక్షతనలో భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సందర్భంగా డీజీఎంవో మీడియాతో మాట్లాడారు. భారత సరిహద్దులో చొరబాట్లు జరుగుతున్నాయని, 20 చొరబాట్లను అడ్డుకోవడం జరిగిందన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ డీజీఎంవోతో మాట్లాడడం జరిగిందని, చొరబాటు దారులను ఆపాలని సూచించడం జరిగిందన్నారు. జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు జరుగుతున్నాయని, ఇటీవలే పూంచ్, ఉరి ఘటనలే ఇందుకు ఉదాహరణలని తెలిపారు.

12:27 - September 29, 2016

హైదరాబాద్ : లతిత్ ఆదిత్య హత్యలో ఆదిత్య తల్లి స్పందించారు. ఆదిత్యతో వివాహం ఇష్టం లేనందునే సుస్మిత బంధువులు తన కుమారుడిని దారుణంగా హత్య చేశారని ఆదిత్య తల్లి పేర్కొన్నారు. ఎప్పటికైనా ఆదిత్యను చంపేస్తామని సుస్మిత తండ్రి అన్నట్లుగా ఆమె తెలిపారు. తనంటే చాలా ఇష్టమనీ..వివాహం జరిగితే అన్నీ సర్ధుకుంటాయని తమను ఒప్పించిందన్నారు. వివాహానికి తాము కూడా హజరయ్యామనీ..అనంతరం ఒక నెలపాటు తమ వద్ద వున్నారనీ ఆదిత్య తల్లి పేర్కొన్నారు. తరువాత ఇద్దరూ విడిగా కాపురం పెట్టినట్లుగా ఆమె తెలిపారు. ఆదిత్యకు సుస్మితకు మధ్య చిన్న చిన్న వివాదాలు మాత్రమే జరుగుతుండేవనీ..సహజంగా భార్యాభర్తల మధ్య ఇటువంటివి సర్వసాధారణమేననీ ఆదిత్య స్నేహితులు పేర్కొన్నారు. వివాహం అయిన నాలుగు నెలలకు సుస్మిత ప్రెగ్నెంట్ అయ్యిందనీ..అబార్షన్ చేయించుకుంటానన్న సుస్మితన మాటలకు ఆదిత్య కాదన్నాడనీ..ఈ క్రమంలో సుస్మిత అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందనీ..తరువాత కొద్దిరోజులకు తిగిరి వచ్చేసిందనీ స్నేహితులు తెలిపారు. ఇంతలోనే హత్య జరగటం వంటి పరిణామాలు సంభవించాయి. వనస్థలిపురం పీఎస్ పరిధిలోని సచివాలయనగర్‌కాలనీలో నివాసముంటున్న లలిత్ ఆదిత్యా (28) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 

భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరుగుతోంది. కేంద్ర హోం శాఖ, రక్షణ శాఖ మంత్రులు హాజరయ్యారు. 

ఏపీలో వైద్య ప్రవేశాల్లో స్పోర్ట్స్ కోటా పునరుద్ధరణ..

విజయవాడ : ఏపీలో వైద్య ప్రవేశాల్లో స్పోర్ట్స్ కోటాను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేశారు. స్పోర్ట్స్ కోటాను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును విద్యార్థులు ఆశ్రయించారు. క్రీడల ప్రాధాన్యం ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. 

12:06 - September 29, 2016

అన్నీ వేసి చూడు..నన్ను వేసి చూడు అని ఉప్పు అంటుందంట. వంటకాల్లో ఉప్పు లేకపోతే రుచి రాదు. అదే సందర్భంలో ఉప్పు ఎక్కువయినా ప్రమాదమే. కానీ ఈ ఉప్పు కేవలం వంటకాల్లో మాత్రమే వాడుతారా ? అంటే ఉప్పు అందానికి కూడా వన్నె తెస్తుందంట. మెరిసే చర్మానికి ఈ ఉప్పు ఉపయోగపడుతుంది. అదెలాగా ?
మెరిసే పళ్లు పొందడానికి, నోటి దుర్వాసన దూరం చేయడానికి ఉప్పు సహాయపడుతుంది.
ఉప్పు సహజసిద్ధమైన క్లెన్సర్. ఇది చర్మంపై పేరుకున్న మురికిని తొలగించడంలో సహాయపడుతుంది.
రాళ్ల ఉప్పుని కొన్ని నీళ్లలో కలుపుకోవాలి. స్ప్రే బాటిలో నిల్వ చేసుకుని ఎప్పుడు అవసరమైతే.. అప్పుడు ముఖంపై స్ప్రే చేసి.. తుడుచుకోవాలి ఇలా చేయడం వల్ల ఫేస్ ఫ్రెష్ గా కనిపిస్తుంది.
కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే...గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకోవాలి. నీళ్లలో ముంచిన దూదిని తీసుకుని కళ్ల మీద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
చర్మం తడిగా ఉన్నప్పుడు ఉప్పు చల్లుకుని సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.
ఉప్పు, లవంగనూనె, ఆలివ్ ఆయిల్ తీసుకుని బాగా కలిపి శరీరానికి రాయాలి. కాసేపటి తర్వాత స్నానం చేయాలి. దీనివల్ల చర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శరీరం కాంతివంతంగా మారుతుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు నోటిలో వేసుకుని పుక్కిలించాలి. దీంతో దంతాల నొప్పి, నోటి పూత వంటివి పోతాయి.

కావేరీ నది జల వివాదంపై ముగిసిన సమావేశం..

ఢిల్లీ : కావేరీ నది జల వివాదంపై ఢిల్లీలో జరిగిన సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కేంద్ర మంత్రి ఉమా భారతి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కర్నాటక రాష్ట్రం నుండి సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం తరపున పళణిస్వామి హాజరయ్యారు. 

11:47 - September 29, 2016
11:45 - September 29, 2016

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహలు నేడు ఏసీబీ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ఈకేసుపై కోర్టులో హాజరుకావాల్సిందిగా రేవంత్, ఉదయ్‌సింహలకు గతనెలలో ఏసీబీ సమన్లు జారీ చేసింది. దీంతో ఈరోజు పాతబస్తీలోని ఏసీబీకోర్టుకు రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహాలు  హాజరయ్యారు. విచారణ అనంతరం ఈకేసును అక్టోబర్ 24తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందనీ.. న్యాయస్థానాన్ని తాను గౌరవిస్తాననీ అందుకే కోర్టుకు హాజరయ్యానని కేసును వచ్చే నెల 24కు వాయిదా పడిందనీ తెలిపారు. కాగా ఓటుకు నోటు కేసు పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తగినంత బలం లేకపోయినా అభ్యర్థిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు లంచం ఇస్తూ దొరికిపోయిన రేవంత్ రెడ్డిని గతంలో ఏసీబీ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. తాజగా, ఈ కేసును మళ్లీ విచారిస్తుండటంతో రేవంత్ మళ్లీ కోర్టుకు హాజరయ్యారు.

జిల్లాల ప్రగతి నివేదిలపై సీఎం బాబు సమీక్ష..

విజయవాడ : జిల్లాల వారీగా ప్రగతి నివేదికలను సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. విజయవాడలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. విజిలెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వెబ్ సైట్ ను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సాధారణ పాలనపై దృష్టి పెడుతూనే జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రత్యేక ప్రణాళికతో కలెక్టర్లు ముందుకు రావాలని సూచించారు. సింగపూర్ కంటే శ్రీకాకుళం జిల్లా విస్తీర్ణం 8 రెట్లు ఎక్కువ అని..జనాభాలో సింగపూర్ కంటే 50 తక్కువ అని..జిల్లాలో 197 కి.మీటర్ల సముద్ర తీరం ఉందన్నారు.

రైతులను పట్టించుకోని గత పాలకులు - ఈటెల..

హైదరాబాద్ : గత పాలకులు రైతులను పట్టించుకోలేదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. హైటెక్ పోకడలకు పోయి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారని, కాంగ్రెస్ హాయాంలో జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం జరిగిందని, ఐదు లక్షల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయిందన్నారు. అసంపూర్తి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రెండేళ్లలో ప్రభుత్వం రూ. 675 కోట్లు ఖర్చు చేసిందని, భారీ స్థాయిలో వరదలు వచ్చినా తట్టుకొనేలా నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. 

కావేరీ నది జల వివాదంపై ఢిల్లీలో సమావేశం..

ఢిల్లీ : కావేరీ నది జల వివాదంపై సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి ఉమా భారతి అధ్యక్షతన సమావేశం జరగనుంది. కర్నాటక రాష్ట్రం నుండి సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం తరపున పళణిస్వామి హాజరు కానున్నారు.

 

వరంగల్ లో కొనసాగుతున్న కూల్చివేతలు..

వరంగల్ : రెండో రోజు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నాలాపై నిర్మితమైన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 

11:39 - September 29, 2016

ఢిల్లీ : కాసేపట్లో కావేరీ జాలాలపై కేంద్రమంత్రి ఉమాభారతి అధ్యక్షతన సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు రాష్ట్ర సంబంధిత అధికారులు.. తమిళనాడు తరపున హాజరు కావాల్సిన ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం రీతా రాష్ట్ర అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నాను. కాగా కేంద్ర జల వనరుల శాఖకు సంబంధించిన పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తమిళనాడుకు మరో రెండు రోజుల పాటు 6 వేల క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాలను కర్నాటక ప్రభుత్వం బేఖాతరు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదరడంతో కేంద్రం జోక్యం చేసుకుంది. శుక్రవారం లోపు కర్నాటక, తమిళనాడు సిఎంలతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గురువారం ఇరు రాష్ట్రాల మధ్య సమావేశానికి కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యత వహించనున్నారు.

11:21 - September 29, 2016

హైదరాబాద్ : వనస్థలిపురం పీఎస్ పరిధిలోని సచివాలయనగర్‌కాలనీలో నివాసముంటున్న లలిత్ ఆదిత్యా (28) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. ఈ కేసును డీసీసీ భాస్కర్  స్వయంగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిత్య భార్య సుస్మితను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత 8నెలల క్రితం సుస్మితను వివాహం చేసుకున్న ఆదిత్యపై స్థానిక పీఎస్ లో నాలుగు కేసులున్నట్లుగా తెలుస్తోంది. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న కొంతకాలానికే ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో సుస్మిత పుట్టింటికి వెళ్ళిపోయింది. వివాహం అయిన నాలుగు నెలల నుండే తనను ఆదిత్య హింసిస్తున్నాడని పుట్టింట్లో చెప్పింనట్లుగా సమాచారం. .. ఈ నేపథ్యంలోనే ఆదిత్య హత్య జరగటంతో ఆదిత్య తల్లిదండ్రులు పీఎస్ లో సుస్మిత బంధువులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా గుర్తించారు. ఆదిత్య జులాయిగా తిరిగేవాడనీ..అందుకే తాము వివాహాన్ని వ్యతిరేకించామనీ సుస్మిత తల్లిదండ్రులు పేర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. గురువారం తెల్లవారు ఝామున కారులో వచ్చిన నలుగురు దుండగులు ఇంట్లో నిద్రిస్తున్న ఆదిత్య ను బైటకు లాగి పూలకుండీలతో దారుణంగా కొట్టారు. అనంతరం కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆదిత్య అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆదిత్య మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. సీసీ పుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన దుండగుల విషయంలో గాలింపును పోలీసులు ముమ్మరం చేశారు. 

ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకం - రాహుల్..

అస్సాం : ఆర్ఎస్ఎస్ భావజాలానికి తాను వ్యతిరేకమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పేద ప్రజలు..రైతుల హక్కుల కోసం..నిరుద్యోగుల కోసం తాను పోరాటం చేస్తుండడంతో కేసులు పెడుతున్నారని విమర్శించారు. 

11:03 - September 29, 2016

ఆనాడు అన్నం వండిన తరువాత ఆ నీటిని పక్కన పెట్టేవాళ్లు. దీనిని అన్నం గంజి అని పిలిచే వారు. ప్రస్తుతం ఈ నీటిని చాలా మంది పడేస్తుంటారు. అంతేగాకుండా రైస్ కుక్కర్..ప్రెజర్ కుక్కర్ లాంటి సాధనాల్లో అన్నం వండేస్తున్నారు. అన్నం వంపిన నీటిలో ఎన్నో లాభాలున్నాయి. మరి దీనితో ఎలాంటి లాభాలున్నాయో చూద్దామా...
అన్నం గంజిలో ఆస్ట్రిజెంట్ గుణాలుంటాయి. చర్మంపై పేరుకున్న దుమ్ముని తొలగిస్తాయి. సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.
చర్మంపై పేరుకున్న దుమ్మును ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్, అరకప్పు నీళ్లు కలపాలి. గోరువెచ్చగా ఉన్న సమయంలో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
అన్నం గంజిని 48 గంటల పాటు అలానే వదిలేయాలి. అందులో ఒక కప్పు నీళ్లు కలపాలి. తరువాత ఐదు నిమిషాల పాటు వేడి చేసి చల్లారనివ్వాలి. అనంతరం కాటన్ బాల్ తో ఆ మిశ్రమంలో ముంచి చర్మానికి అప్లై చేయాలి.
ఒక టేబుల్ స్పూన్ బంగాళ దుంప రసం, ఒక టేబుల్ స్పూన్ అన్నం గంజి తీసుకుని ముఖానికి మసాజ్ చేసుకోవాలి. ఓ 15 నిమిషాల అనంతరం శుభ్రం చేసుకుంటే బాగుంటుంది.
రైస్ వాటర్ ఒక కప్పు నీటిని కలపాలి. కొన్ని చుక్కల లావెండర్, రోజ్ మెరీ ఆయిల్స్ మిక్స్ చేయాలి. షాంపూ చేసుకున్న అనంతరం ఈ మిశ్రమంతో శుభ్రం చేసుకోవాలి. ఐదు నిమిషాల అనంతరం మళ్లీ నీటితో శుభ్రం చేసుకోవాలి. జుట్టు కాంతివంతంగా మారుతుంది.
అన్నం గంజిని రిఫ్రిజిరేటర్ లో ఓ గంట పాటు పెట్టాలి. అనంతరం ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ కలపాలి. దూదితో చర్మానికి అప్లై చేయాలి. అనంతరం ఓ పదిహేను నిమిషాల అనంతరం చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. 

10:58 - September 29, 2016

నెల్లూరు : ఏపీకి ప్రత్యేక హోదానే అన్ని విధాలా శ్రేయస్కరమని విద్యార్థి లోకం ముక్తకంఠంతో స్పష్టం చేస్తోంది. హోదా విషయాన్ని పక్కకు పెట్టి చంద్రబాబు, కేంద్రంతో రాజీపడి సొంత ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. హోదా సాధించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరిం సమాచారానికి వీడిమో చూడండి..

10:56 - September 29, 2016

హైదరాబాద్ : వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లో వన్‌ కే రన్‌ నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఈ రన్‌ను ప్రారంభించారు. తెలంగాణ కార్డియలాజికల్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్థులు తరలి వచ్చారు. గుండెను ఎలా పదిలంగా ఉంచుకోవాలన్న అంశంపై డాక్టర్లు అవగాహన కల్పించారు. శరీరంలో కెలెస్ట్రాల్‌ చేరకుండా చూసుకోవాలని సూచించారు. నిత్యం వ్యాయామం చేస్తే గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చన్నారు. ఒత్తిడికి దూరంగా ఉంటే నిండు జీవితం గడపొచ్చని పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి చెప్పారు.  

10:53 - September 29, 2016

పశ్చిమగోదావరి : సినిమాకని వెళ్ళిన ముగ్గురు యువకులు అనంతలోకాలకు వెళ్ళిపోయారు. ఈ ఘటనల పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున రుస్తుంబాద సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు రుస్తుంబాద గ్రామానికి చెందిన మీసరపు సురేంద్ర, పాలపర్తి అశోక్, దాసరి మణిరాజుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సినిమాకని వెళ్ళిన యువకులు మృత్యువాత పడ్డంతో వారి కుటుంబాలలో విషాదం నెలకొంది. మొగల్తూరు వాసులైన ముగ్గురు యువకులు సమీపంలోని నర్సాపురానికి సెకండ్ షో సినిమాకు వెళ్ళారు. సినిమా అయిపోయన అనంతరం నర్సాపురం నుండి తిరుగు ప్రయాణమైన ముగ్గురు యువకులు మొగల్తూరు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో వాహనం హెడ్ లైట్లతో గందరగోళానికి గురయిన వారు సదరు వాహనాన్ని ఢీకొన్నట్లుగా తెలుస్తోంది.మృతుల వాహనాన్ని ఆధారంగా తీసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటానాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

బీపీఎల్ ఇళ్లు కూల్చొద్దు - జీహెచ్ఎంసీ కమిషనర్..

హైదరాబాద్: టౌన్ ప్లానింగ్ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. నాలాలు, చెరువులపై ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. బీపీఎల్ కుటుంబాలు నివాసం ఉంటున్న ఇళ్లు కూల్చొద్దని వారికి సౌకర్యాలు కల్పించిన తరువాతే తొలగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇతర భవనాలు, వ్యాపార సంస్థలను తొలగించాలని పేర్కొన్నారు. 

పీపీపీ పద్ధతుల్లో వైద్య రంగం అభివృద్ధి - కామినేని..

విజయవాడ : వరల్డ్ హార్ట్ డే వేడుకల్లో మంత్రి కామినేని పాల్గొన్నారు. ప్రభుత్వం అన్ని రకాల వైద్య సేవలను అందించలేదని, పీపీపీ పద్ధతుల్లో వైద్యరంగాన్ని అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. మితమైన ఆహార అలవాట్లు..వ్యాయామం మాత్రమే మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయన్నారు. 

గోదావరి నీటి మట్టం 40 అడుగులు..

ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరుకుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

గోదావరి నీటి మట్టం 40 అడుగులు..

ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరుకుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

10:38 - September 29, 2016

పాకిస్థాన్ : పాకిస్థాన్‌ బరితెగించింది. మన దేశంపై ఉక్రోషం వెళ్లగక్కుతోంది. భారత్‌ నుంచి పాక్‌ భద్రతకు ముప్పు వస్తే అణ్వాయుధాలు ఉపయోగించడానికి వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్‌ ఆసిఫ్‌ చెప్పారు. అణ్వాయుధాలు ఉన్నది అలంకరణ కోసం కాదని ఒక ఇంటర్యూలో చెప్పారు. అణ్వాయుధాలు తయారు చేసింది పాకిస్థాన్‌ రక్షణ కోసమేనన్నారు. భారత్‌లో యుద్ధమంటూ వస్తే అణ్వాయుధాలు ఉపయోగించడం మినహా పాకిస్థాన్‌కు మరో అవకాశం లేదన్నారు. వ్యూహాత్మక అణ్వాయుధాల విషయంలో తాము భారత్‌ కంటే పైచేయిలో ఉన్న విషయాన్ని అంతర్జాతీయ సమాజం కూడా అంగీకరించిన విషయాన్ని ఖ్వాజా మహ్మద్‌ ఆసిఫ్‌ గుర్తు చేశారు. భారత్‌ నుంచి అన్ని రకాలుగా వస్తున్న తీవ్ర ఒత్తిడిని దృష్టిలో పెట్టుకునే అణ్వాయుధాలు సమకూర్చుకున్నట్టు ఆసిఫ్‌ చెప్పారు. 

10:36 - September 29, 2016

అక్కినేని నాగార్జున..దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కలయిక అంటే ముఖ్యంగా భక్తిరస ప్రధాన చిత్రాలు గుర్తుకొస్తాయి. వీరి కాంబినేషన్ లో 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడి సాయి' చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకున్నాయి. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం వస్తోంది. అదే 'ఓం నమో వెంకటేశాయ'. ఈ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి అందిస్తున్న ఈ చిత్రంలో 'అక్కినేని నాగార్జున' 'హాథీరామ్‌ బాబా'గా మరో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. దర్శకేంద్రుడు 'కె.రాఘవేంద్రరావు' తనదైన శైలిలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా 'ఓం నమో వెంకటేశాయ' చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే మెయిన్ పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీనివాసుడిగా టీవీ నటుడు 'సౌరభ్' నటిస్తోండగా, 'అనుష్క' మహా భక్తురాలు 'కృష్ణమ్మ'గా కనిపించనుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఆలయం సెట్టింగ్‌లో షూటింగ్ జరుగుతోంది. లొకేషన్ లోని కొన్ని ఫోటోలను 'రాఘవేంద్రరావు' విడుదల చేశారు. ఫొటోలో 'బ్రహ్మనందం' కూడా ఉండడం బట్టి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో కథానాయికలుగా 'అనుష్క', 'ప్రగ్యా జైస్వాల్' నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. 

10:33 - September 29, 2016

అమెరికా : ఐసిస్‌ ఉగ్రవాదం ప్రపంచానికి ముప్పుగా పరిణమించిందని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముష్కరులు దాడులను ప్రపంచ దేశాలు సంయుక్తంగా ఎదుర్కోవాల్సి ఉందని వర్జీనియాలోని పోర్టు లూయిస్‌లో జరిగిన టౌన్‌హాల్‌ బహిరంగ చర్చలో ఒబామా చెప్పారు. ఉగ్రవాదులు స్థావరాలను కూకటివేళ్లతో పెకలించాల్సి ఉందన్నారు. జిహాదీ ఉగ్రవాదులు ఆయుధాలు చేతపట్టి అమాయకులు ప్రాణాలు తీస్తున్నారని, దీనిని సహించబోమని హెచ్చరించారు.

నగరంలో వ్యక్తులు మాయం?!..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకేసారి ముగ్గురు వ్యక్తులు కనిపించకుండా పోయారు. శంషాబాద్ బ్రాహ్మణవాడ బస్తీకి చెందిన చంద్రకాంత్(45) అనే వ్యక్తి, సాత్విక్(3) అనే బాబు, అదేవిధంగా ఎయిర్‌పోర్టు కాలనీకి చెందిన రేణుక(21) అనే మహిళ అదృశ్యమయ్యారు. వీరంతా వేర్వేరు కుటుంబాలకు చెందినవారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వీరు ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మిషన్ కాంపౌండ్ లో విషాదం..

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ మిషన్ కంపౌండ్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. శీనయ్య వెంచర్‌లో గుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. 

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం..

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 142 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్..46 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. 

రెండో రోజు ఏపీ కలెక్టర్ల సదస్సు..

విజయవాడ : రెండో రోజు ఏపీ రాష్ట్రంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. గృహ నిర్మాణం, వైద్య ఆరోగ్యం, పెండింగ్ పెట్టుబడులు, శాంతిభద్రతలపై చర్చించనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, డీజీపీ సాంబశివరావు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. 

గౌహతి కోర్టుకు రాహుల్ గాంధీ..

అస్సాం : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గౌహతి కోర్టుకు చేరుకున్నారు. ఆర్ఎస్ఎస్ పై పలు వ్యాఖ్యలు చేసిన సందర్భంలో రాహుల్ కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

కరీంనగర్ లో దంపతుల ఆత్మహత్య..

కరీంనగర్ : కమాన్ పూర్ మండలం కల్వచర్లలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. 

బోరభట్లలో రైతుల ఆందోళన...

మెదక్ : హత్నూర మండలం బోరభట్లలో అరబిందో ఫార్మసీ యూనిట్ 1వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. పరిశ్రమలోని వ్యర్థ జలాలను పంటపొలాల్లోకి వదులుతున్నారని రైతలు ఆందోళన చేస్తున్నారు.

 

09:45 - September 29, 2016

విశాఖ: విశాఖ నుంచి అండమాన్‌కు బయల్దేరిన ఎంవీ హర్షవర్థన్ ప్రయాణీకులు ఆందోళన చేపట్టారు. దాదాపు 38 గంటలపాటు ఈ నౌక నడి సముద్రంలో నిలిచిపోవటంతో 670మంది ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. జన్ రేటర్ లో తలెత్తిన సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కాగా సాంకేతిక లోపాన్ని ఇంజనీర్లు సరిదిద్ధారు. కానీ అండమాన్ చేరుకోవాల్సిన నౌకను తిరిగి మళ్లీ విశాఖకు మరిలించి ప్రయాణీకులను షిప్ దిగమన్నారు. దీంతో అండమాన్ చేరాల్సిన తమను తిరిగి విశాఖకు మరలించటంతో వారు తమను అండమాన్ కు చేర్చాలననీ..అంతవరకూ షిప్ దిగమని డిమాండ్ చేశారు. 

09:24 - September 29, 2016

హైదరాబాద్ : వనస్థలిపురం పీఎస్ పరిధిలోని సచివాలయనగర్‌కాలనీలో నివాసముంటున్న లలిత్ ఆదిత్యా (28) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన నలుగురు దుండగులు ఇంట్లో నిద్రిస్తున్న ఆదిత్య ను బైటకు లాగి పూలకుండీలతో దారుణంగా కొట్టారు. అనంతరం కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆదిత్య అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. గత 8నెలల క్రితం సుస్మితారెడ్డి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహానికి ఇరువురి తరపునుండి బంధువులు ఒప్పుకోకపోవటంతో అప్పటి నుండి వనస్థలిపురంలోనే ఇద్దరు నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదిత్య దారుణంగా హత్యకు గురవ్వటంపై పలు అనుమానాలు బలపడుతున్నాయి. క్రమంలోనే కాగా గత కొంత కాలంనుండి దంపతుల మధ్య కలహాలు రేగినట్లుగా స్థానికులు పేర్కొన్నారు. లతిత్ భార్య తరపు బంధువులే ఈహత్యకు కారణమంటూ వనస్థలిపురం పీఎస్ లో లతిత్ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు ఎసీపీ భాస్కర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆదిత్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా వున్న సీసీ పుటేజ్ తో దాడికి పాల్పడిన యువకుల ఎవరనే కోణంలో డీసీపీ భాస్కర్ దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్..10ఏళ్ళ జైలు..

హైదరాబాద్ : డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన 11 మందిని ఎర్రమంజిల్‌ 3వ ఎంఎం కోర్టులో హాజరు పర్చగా ఒకరికి రూ. 2 వేలు, 10 మందికి జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఒకరికి ఒకరోజు, ముగ్గురికి రెండు, ఇద్దరికి మూడు, ముగ్గురికి నాలుగు, ఒకరికి 10రోజుల జైలుశిక్ష న్యాయమూర్తి విధించారని సీఐ జ్ఞానానందరెడ్డి చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటా మని ఆయన హెచ్చరించారు.

దుర్గమ్మ సన్నిథిలో కత్తితో మహిళ హల్ చల్..

విజయవాడ : దుర్గగుడి మహా మండపం వద్ద కత్తి పట్టుకుని ఓ మహిళ హల్‌చల్ చేసింది. మతిస్థిమితం లేని ఓ గుర్తుతెలియని మహిళ మూడు రోజులుగా మహా మండపం పరిసరాల్లో తిరుగుతున్నట్లు శానిటరీ సిబ్బంది గుర్తించారు. క్యూలైన్ మెట్లపై కూర్చొన్న భక్తులను తిడుతుండటంతో వారు ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. మతిస్థిమితంలేని సదరు మహిళలను అక్కడి నుండి తరలించేందుకు ఆలయ సిబ్బంది యత్నిస్తున్నారు.

విజయవాడ–విశాఖపట్నం మధ్య కొత్త రైలు?..

విజయవాడ : విజయవాడ–విశాఖపట్నం మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించేం దుకు రైల్వే సన్నాహాలు చేస్తోంది. దీన్ని అక్టోబర్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చే రైల్వే శాఖ కొత్త టైం టేబుల్‌లో ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి వివరాలు సిద్ధం చేస్తోంది.

పంచగ్రామాలలో ఉద్రిక్తత..

విశాఖ : పంచగ్రామాల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. విజయనగర పాలెంలో ఇళ్ళను కూల్చేందుకు పోలీసులు సహాయం సింహాచలం దేవస్థానం అధికారులు యత్నించారు. అధికారుల్ని అడ్డుకున్న స్థానికులు రోడ్ పై బైఠాయించారు. కోర్టులో కేసు కొనసాగుతుండగా ఇళ్ళను కూల్చేందుకు వచ్చివారిపై మండిపడ్డ గ్రామస్థులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థుల తిరుగుబాటుతో వెనక్కి తగ్గిన పోలీసులు ఆ ప్రాంతం నుండి వెనుతిరిగినట్లుగా తెలస్తోంది. 

08:49 - September 29, 2016

ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలతో పాటు, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధ, గురువారాల్లో విజయవాడలో కలెక్టర్ల సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అన్ని రంగాల్లో ఉప‌యోగిస్తున్నామన్నారు.అగ్రికల్చర్ ..ఆర్టికల్చర్ ను డెవలప్ చేసుకుంటే వృద్దిరేటు పెరుగుందని తెలిపారు.విజ‌య‌వాడ‌లో రెండు రోజుల క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కంప్యూటరీకరణతో రాష్ట్ర రెవెన్యూను పెంచుకోవాలనీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తులసిరెడ్డి (ఏపీ కాంగ్రెస్ నేత) నక్కా ఆనంద్ బాబు( టీడీపీ ఎమ్మెల్సీ),ఉమామహేశ్వర రావు (సీపీఎం నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియో క్లిక్ చేయండి.సమగ్ర సమాచారం తెలుసుకోండి. 

08:45 - September 29, 2016

విశాఖ : పంచగ్రామాల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. విజయనగర పాలెంలో ఇళ్ళను కూల్చేందుకు పోలీసులు సహాయం సింహాచలం దేవస్థానం అధికారులు యత్నించారు. అధికారుల్ని అడ్డుకున్న స్థానికులు రోడ్ పై బైఠాయించారు. కోర్టులో కేసు కొనసాగుతుండగా ఇళ్ళను కూల్చేందుకు వచ్చివారిపై మండిపడ్డ గ్రామస్థులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థుల తిరుగుబాటుతో వెనక్కి తగ్గిన పోలీసులు ఆ ప్రాంతం నుండి వెనుతిరిగినట్లుగా తెలస్తోంది.

విశాఖ సింహాచలం దేవస్థాన పరిధిలో
విశాఖ సింహాచలం దేవస్థాన పరిధిలో విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తరంతో పాటు పెందుర్తి, భీమిలి నియోజక వర్గాల్లో ఈ గ్రామాలు ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో వందల ఏళ్ల నుంచి గిరిజనులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దేవస్థానం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులు ఎప్పటి నుంచో సొంత భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. సర్వే నెంబర్‌ 275లో కైలాసగిరితో పాటు ఇతర కొండల్లో ఎక్కువ భాగం రిజర్వు ఫారెస్టుగా ప్రకటించారు. దీంతో ఈ భూములు ఫారెస్ట్‌ పరిధిలోకి వస్తాయి. కానీ పట్టా మాత్రం దేవస్థానానికి ఇచ్చారు. ఇప్పటికే ఈ కొండలపై అనేక మంది నిరుపేదలు ఇళ్లు, గుడిసెలు నిర్మించుకుని ఉంటున్నారు. ఒక్క 275 సర్వే నెంబర్‌లోనే పదివేలకు పైగా కుటుంబాలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఆ నివాసాలను రెగ్యులరైజ్‌ చేస్తామని కూడా ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది.

ఎప్పుడో ఏళ్ల కిందట మొదలైన భూ సమస్య
ఎప్పుడో ఏళ్ల కిందట మొదలైన భూ సమస్య ఇంకా రగులుతూనే ఉంది. విశాఖ సింహాచల దేవస్థానాన్ని ఆనుకుని ఉన్న పంచగ్రామాల భూ వివాదం ఓ కొలిక్కి రాకపోడంతో సంబంధిత గ్రామాల ప్రజలు త్రిశంకు స్వర్గంలో పడ్డారు. తాతలు ముత్తాతల నుంచి ఈ గ్రామాల ప్రజలు దాదాపు 1730 ఎకరాల భూమి సాగు చేస్తూ వస్తున్నారు. సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచగ్రామాలైన అడవి వరం, వెంకటాపురం, వేపగుంట, పురుషోత్తపురం, చీమలపల్లి పరిధిలో పల్లం, మెట్ట, బంజరు, పోరంబోకు భూములున్నాయి. ఈ ఐదు గ్రామాల రైతులు వారి పూర్వీకులు అనాధిగా వాటిని సాగు చేస్తూ జీవిస్తున్నారు. 1903లో గిల్‌మెన్‌ సర్వే ప్రకారం ఈ రైతులంతా కూడా జిరాయితీ రైతులుగా గుర్తించబడి అప్పటి నుంచి జిరాయితీ శిస్తు కూడా కడుతున్నారు. రైతులకు 1977లో అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌లో కూడా జిరాయితీ రైతులుగా సీలింగ్‌ చేసి సర్టిఫికెట్లు కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఇంతవరకు సజావుగానే ఉన్నా... 1996లో చినగదిలీ, పెందుర్తీ ఎమ్మార్వోలు పంచగ్రామాల్లోని భూములు దేవస్థానం పరిధిలోనివని పట్టాలివ్వడంతో వివాదం ప్రారంభమైంది. దీనికై అవసరమైన రైతులకు, నివాసులకు ఏ విధమైన నోటీసులు ఇవ్వలేదు. వారి వాదనలు వినకుండానే పట్టాలిచ్చారు.

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రైతు సంక్షేమ సంఘం
సాగు చేసుకుంటూ బతుకుతున్న తమ భూములు దేవస్థానానివని అధికారులు అనడంతో అడవివరం రైతు సంక్షేమ సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఒక్క అడవివరం పరిధిలోనే దాదాపు 470 ఎకరాల జిరాయితీ భూములున్నాయి. అనేక ఏళ్ల నుంచి గిరిజనులు ఈ భూముల్లే నమ్ముకుని బతుకులు వెళ్లదీస్తూ వస్తున్నారు. ఈ భూములు తమవంటూ దేవస్థానం అధికారులు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. విజయనగర రాజులు దేవస్థానానికి ఇనాం భూములుగా ఇచ్చారని పేర్కొనడంతో.. బాధిత రైతులు ఎటూ పాలుపోని స్థితిలో సతమతమవుతున్నారు.

భూములైతే సాగు చేసుకుంటున్నారు కానీ
భూములైతే సాగు చేసుకుంటున్నారు కానీ ఆ భూముల్లో బోర్లు వేయడానికి గానీ, బ్యాంకు లోన్లు పొందడానికి గానీ రైతులకు అవకాశం లేకుండా పోతోంది. ఇనాం భూములని బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు. రైతు రుణమాఫీ పథకాన్నీ అమలు చేయడం లేదు. సోలార్‌ పంపు సెట్లు, గ్రామాల్లో ఇళ్ల మరమ్మతులకు కూడా పంచగ్రామాల రైతులు నోచుకోవడం లేదు.

వివాదాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం
ఏళ్ల తరబడిగా కొనాసాగుతున్న పంచగ్రామాల భూ సమస్య వివాదాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఎంతో కాలంగా పంటలు పండిస్తున్న భూములపై తమకు ఎలాంటి హక్కులు లేకుండా చేయడం దారుణమని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణలను దేవస్థానం అధికారులు అడ్డుకుంటున్నారని.. అటు ప్రభుత్వమూ ఈ వివాదాన్ని ఎటూ తేల్చకపోవడం బాధాకరమని గిరిజన రైతులు అభిప్రాయపడుతున్నారు. 

08:22 - September 29, 2016

హైదరాబాద్‌ : నగరంలోని జూబ్లీహిల్స్‌లోని కాక్‌టేల్ క్లబ్‌లో బుధవారం రాత్రి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. క్లబ్‌ను తెరవాలంటూ మల్లేపల్లికి చెందిన రౌడీషీటర్ అనుచరులు బౌన్సర్లపై దాడిచేశారు. మూసి ఉన్న క్లబ్‌ను తెరిచేందుకు బౌన్సర్లు నిరాకరించడంతో యువకులు రెచ్చిపోయారు. బౌన్సర్లను చితకబాదడమే కాకుండా అక్కడున్న వస్తువులను ధ్వంసం చేశారు. అంతేకాదు క్లబ్‌ను తెరవకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఆపై ఇష్టానుసారం బౌన్సర్లపై దాడిచేశారు. దీంతో క్లబ్ యాజమాన్యం జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దాడిలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సీసీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న  డీసీపీ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా దాడికి పాల్పడినవారిలో వున్న వ్యక్తులు రౌడీ షీటర్ అతని అనుచరులు గత కొంతకాలంగా అజ్ఞాతంగా వున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

08:13 - September 29, 2016

హైదరాబాద్ : వనస్థలిపురం పోలీసుస్టేషన్‌ పరిధిలోని సచివాలయనగర్‌కాలనీలో నివాసముంటున్న ఓ యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. కొందరు గుర్తుతెలియని దుండగులు కారులో వచ్చి లలిత్‌(28) నివాసముంటున్న ఇంటిలోకి చొరబడి నిద్రిస్తున్న లతిత్ ను బైటకు లాక్కుని వెళ్ళి పూలకుండీతో దారుణగా కొట్టారు. ఈ ఘటనలో లలిత్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారమందుకున్న వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌ ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. లతిత్ భార్య తరపు బంధువులే ఈహత్యకు కారణమంటూ వనస్థలిపురం పీఎస్ లో లతిత్ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు ఎసీపీ భాస్కర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న ఆదిత్యా లలిత్ గత కొంతకాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో బంధువులు వ్యతిరేకించటంతో వేరుగా కాపురం వుంటున్నాడు. ఈ నేపథ్యంలో లతిత్ దారుణ హత్యకు గురవ్వటంతో లతిత్ కుటుంబంలో విషాదం నెలకొంది. 

07:35 - September 29, 2016

హైదరాబాద్ : ప్రతిరోజు ఎన్నో టెన్షన్స్.. తీవ్రమైన పని ఒత్తిళ్లు.. దానికి తోడు బాడీకి ఎక్సర్‌సైజ్‌లు లేకపోవడం..మరీ ముఖ్యంగా సరైన ఆహారపు అలవాట్లు లోపించడం.. ఇన్ని సమస్యలుంటే ఇంకేముంది.. గుండె లబ్‌డబ్‌ అని కొట్టుకోవడం మానేస్తుంది. రోజురోజుకు ఈ సమస్యలు పెరిగిపోతున్నాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా యువతలో ఈ సమస్య పెరిగిపోవడంతో ఆందోళనకరంగా మారుతోందంటున్నారు వైద్యులు. నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 10టీవి ప్రత్యేక కథనం...!

ఇండియాలో పెరుగుతున్న గుండెజబ్బు బాధితులు
ఇండియాలో రోజురోజుకూ గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అకాల మరణానికి గురి చేసే గుండెజబ్బులపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా భారత్‌ను గుండెజబ్బులు పట్టిపీడిస్తున్నాయి. ప్రపంచంలో గుండె జబ్బు రోగుల్లో 60 శాతం మంది భారతీయులే కావడం దయనీయం. మనిషి మరణానికి 28 నుంచి 30 శాతం వరకు గుండె జబ్బులే కారణమని స్పష్టం చేస్తున్నారు వైద్యులు.

చెడు ఆహారపు అలవాట్లతో గుండెకు చేటు
మానసిక ఒత్తిళ్లు, ఆరోగ్యకరమైన జీవన విధానం లేకపోవడంతో గుండెజబ్బులకు కారణలవుతున్నాయి. పట్టణాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. గ్రామాల్లో కూడా గుండె జబ్బులు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందంటున్నారు నిపుణులు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల మంచి ఆహార అలవాట్ల లేకపోవడం... సిగరేట్లు, ఆల్కాహాల్ వంటి చెడు అలవాట్లు ఎక్కువగా ఉండటంతో గుండె జబ్బుల బారిన పడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. పనిలో ఒత్తిడి కారణంగా ఏటా 2.4 మిలియన్‌కి పైగా భారతీయులు గుండె జబ్బులతో మరణిస్తున్నారంటున్నారు గుండె సంబంధిత వైద్య నిపుణులు. 95 శాతం మంది గుండెపోటు వచ్చాక సమయానికి హాస్పటల్స్‌కు వెళ్లకపోవడం వల్ల చాలామంది మరణిస్తున్నారంటున్నారు.. అయితే గుండె నొప్పికి ముందు కొన్ని లక్షణాలు గమనించాలంటున్నారు డాక్టర్లు. ఛాతి మధ్య భాగంలో నొప్పి రావడం, మంట, చమటలు పట్టడం, భుజం నుంచి చెయ్యి వరకు నొప్పి రావడం వంటివి జరుగుతుంటాయని, ఇలాంటివి ఉంటే వెంటనే గుండెపోటుగా అనుమానించి గుండె జబ్బులకు జంక్‌ ఫుడ్‌ కూడా కారణం
గుండెను పదిలంగా కాపాడుకోవాలంటే..ఎవరికి వారే..జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ప్రతి సంవత్సరం వరల్డ్ హార్ట్‌డేను నిర్వహిస్తున్నారు. మనిషి జీవనానికి కీలకమైన అవయవం గుండె. అలాంటి కీలకమైన గుండెకు కష్టం వస్తే శారీరక వ్యాధులు దీర్ఘకాలికంగా ఇబ్బందులకు గురి చేస్తాయి. దీంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది.

అధిక బరువుతో బాధపడే వారిలో గుండెజబ్బులు
అధిక బరువుతో బాధపడే వారిలో ఎక్కువ మంది హృద్రోగ సమస్యల బారిన పడుతున్నారు. మద్యం, కొవ్వు పదార్థాలను తీసుకోవడంతో కొవ్వు శాతం పెరిగి హృద్రోగ సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు పరీక్షలు చేయించుకుంటే తప్ప గుండె సమస్యలు ఉన్నట్లు తెలుసుకోలేకపోతున్నారు. దీంతో ఆలస్యంగా చికిత్సలు చేయించుకుంటుండడంతో అప్పటికే గుండె సమస్యలు పెరిగిపోయి హార్ట్ అటాక్‌తో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తంగా శారీరక వ్యాయామంతో గుండె సమస్యలను దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సో.. వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ.. ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలి.

07:28 - September 29, 2016

విజయవాడ : రాష్ట్రంలో జలభద్రత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో... ఆయన దిశానిర్దేశం చేశారు. సవాళ్లు ఎప్పుడూ ఉంటాయని వాటిని ఎదుర్కొనే తీరే ముఖ్యమన్నారు. తమ ప్రభుత్వం తొలి దశ ప్రాధాన్యంగా భూగర్భ జల వనరులను కాపాడుకుంటున్నామని... రెండో ప్రయత్నంగా నదుల అనుసంధానం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు 9.7 అడుగులకు రావడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

07:24 - September 29, 2016

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. వర్షాల వల్ల మున్సిపాలిటీల్లో జరిగిన నష్టంపై కేంద్రానికి వివరించనున్నారు. దీంతోపాటు ఇతర పట్టణాల్లో చేపట్టనున్న పలు మౌలికవసతులు, ప్రాజెక్టులపై సాయం కోరనున్నారు. ఇందులో భాగంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో సమావేశం కానున్నారు. ఈనెల 30న జరగనున్న ఇండో-సాన్‌ 2016 స్వచ్ఛభారత్ సదస్సులో మంత్రి పాల్గొంటారు.

ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కోరేందుకు మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని కేంద్రానికి వివరించనున్నారు. ఇప్పటికే వర్షాల నష్టాన్ని అంచనా వేసి, నివేదిక సిద్ధం చేయాలని కేటీఆర్ మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల్‌ను ఆదేశించారు. ఈమేరకు మున్సిపల్‌శాఖ వివిధ పురపాలికల నుంచి సమాచారం సేకరించింది. వర్షాల నష్టంతోపాటు, ఇతర పట్టణాల్లో పలు మౌలిక వసతులు, ప్రాజెక్టులపై కేటీఆర్ కేంద్రాన్ని సాయం కోరనున్నారు.

ఇండో-సాన్‌ 2016 స్వచ్ఛభారత్ సదస్సులో పాల్గొననున్న కేటీఆర్
ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని మంత్రి కేటీఆర్‌....నివేదిక రూపంలో కేంద్రమంత్రి వెంకయ్యానాయుడుకు అందజేస్తారు. దీంతోపాటు తెలంగాణకు అమృత్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్రం నుంచి 10కోట్ల 73 లక్షల రూపాయల సాయం అందనున్నది. ఈ ప్రాజెక్ట్‌ గైడ్‌లైన్స్ అమలులో క్రియాశీలంగా పనిచేసినందుకుగాను ఈ ప్రోత్సాహక నిధులు కేంద్రం ఇవ్వనుంది. దీనిపై కూడా మంత్రి కేటీఆర్ చర్చించనున్నారు. ఈనెల 30న జరగనున్న ఇండో-సాన్‌ 2016 స్వచ్ఛభారత్ సదస్సులో మంత్రి పాల్గొంటారు.

07:14 - September 29, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు దాదాపుగా పూర్తైంది. న్యూ డిస్టిక్స్ ఫార్మెషన్ కోసం ఉన్న పోస్టులను రద్దు చేస్తూ..అవసరమైన చోటా కొత్త బాధ్యతలతో సరికొత్త పోస్టులు క్రియేట్ చేస్తోంది ప్రభుత్వం. దసరా నుంచి కొత్త జిల్లాల్లో పాలన సాగించాలని ప్రయత్నిస్తోంది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో స్వల్ప మార్పులు చేసి.. తాజాగా మరో నోఫికేషన్‌ జారీ చేయనుంది.

మారనున్న తెలంగాణ అంతర్గత భౌగోళిక చిత్రం
10 జిల్లాలతో కూడిన తెలంగాణ అంతర్గత భౌగోళిక చిత్రం త్వరలో మారబోతుంది. మరో 10 రోజుల్లో ప్రస్తుత పది జిల్లాల స్ధానంలో కొత్తగా 17 జిల్లాలు రానున్నాయి. అదనపు రెవెన్యూ డివిజిన్లు, కొత్త మండలాలతో కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతుంది. కొత్త జిల్లాల కేంద్రాల్లో కలెక్టరేట్లు, ఎస్‌పీ కార్యాయాలతో పాటు..అదనపు సిబ్బంది వంటి కీలక అంశాలు అన్ని పూర్తయ్యాయి. సీఎస్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ పూర్తిస్థాయి కసరత్తులో భాగంగా డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో వచ్చిన అభ్యంతరాలు, విజ్ఞప్తులను పెద్దగా పట్టించుకున్న దాఖాలాలు లేవు. కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత రెండు మూడు రోజుల్లో ఫైనల్ నోటిఫికేషన్‌కి సిద్ధమవుతున్న ప్రభుత్వం..గతంలో చెప్పినట్లు నోటిఫికేషన్ ముందు ఆల్‌పార్టీ మీటింగ్ కూడా లేనట్లేనని తెలుస్తోంది.

కొత్త జిల్లాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం
కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంత మంది సిబ్బంది అవుతారన్న విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతనే ఆయా జిల్లాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో బదిలీల నిషేధం ఉన్నందున ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తే ఇతర శాఖల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తారన్న ఉద్దేశంతో ఆర్డ్‌ర్‌ టు సర్వ్‌ కింద తాత్కాలిక నియామకాలు మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఉన్నతాధికారులు, ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ఉన్న కీలక పోస్టులను రద్దు చేయాలని నిర్ణయించింది.

ఉపయోగంలేని పోస్టులను రద్దు చేయాలని నిర్ణయం
జిల్లాల్లో పెద్దగా ఉపయోగంలేని పోస్టులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో అసిస్టెంట్‌ జాయింట్‌ కలెక్టర్‌, ప్రధానాధికారుల పోస్టులను రద్దు చేయనున్నట్లు సమచారం. రద్దు చేసిన పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను ఇతర జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని వివిధ కేటగిరిల్లో స్థానం కల్పించనున్నారు. రెవెన్యూ డివిజన్లలో, జిల్లా రెవెన్యూ డివిజన్లలోనూ కొన్ని పోస్టులను రద్దు చేయనున్నట్టు సమాచారం.

తాత్కాలిక నియామకాలే చేపట్టాలని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సూచన
కొత్త జిల్లాల్లో తాత్కాలిక నియామకాలే చేపట్టాలని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సూచించినట్లు సమాచారం. కొత్త జిల్లాల్లో 'ఆర్డర్‌ టు సర్వ్‌' కింద తాత్కాలిక నియామకాలు చేపట్టనుంది. మొత్తానికి మరో పది రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలు, జిల్లాలతో కొత్త రూపు సంతరించుకోనుంది.

07:09 - September 29, 2016

హైదరాబాద్ : యాదాద్రి ఆలయ నిర్మాణ పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు సీఎం ఆమోదం తెలిపారు. ప్రధాన ఆలయ సముదాయాల నిర్మాణం, భక్తుల కోసం నిర్మించనున్న నిర్మాణాల త్రీడీ వీడియో, ఫొటోలను సీఎం వీక్షించారు. ఆగమశాస్త్ర పండితుల నిర్దేశాల మేరకు నిర్మితమవుతున్న ఆలయకట్టడాల త్రీడీ నమూనాల పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

కాటేజీలలో చిన్న చిన్న మార్పులతో ఓకే చేసిన సీఎం కేసీఆర్‌
వచ్చే ఏడాది దసరానాటికి యాదాద్రి దేవాలయాన్ని తీర్చిదిద్ది సిద్ధం చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. యాదాద్రి నరసింహాలయంపై సమీక్షనిర్వహించిన సీఎం..కాటేజీలలో చిన్నచిన్న మార్పులతో డిజైన్‌ ను సీఎం ఆమోదించారు. ప్రపంచంలోనే ప్రత్యేక నిర్మాణంతో దైవభక్తి ఉట్టిపడే విధంగా శిల్పకళా నైపుణ్యంతో యాదాద్రి దేవస్థానం రూపొందించాలన్నారు సీఎం. ఐదు రాజగోపురాలతో ప్రాకార మండపాలు పూర్తిస్థాయి శిలతో నిర్మితం కానున్నాయి.

బ్లాక్‌స్టోన్‌తో నిర్మితమవుతున్న యాదాద్రి పూర్తి ఆలయం
ప్రపంచంలోనే మొదటి దేవస్థానంగా యాదాద్రి చరిత్రలో నిలిచిపోనుందని ఆకాంక్షించారు సీఎం. యాదాద్రి ఆలయ సముదాయం పూర్తిస్థాయి బ్లాక్‌స్టోన్‌తో నిర్మితమవుతోంది. 500 మంది శిల్పులు యాదాద్రిలో ఇప్పటికే శిల్పాలు చెక్కడం, నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సీఎంతో పాటు పలువురు వీవీఐపీలు దైవదర్శనం కోసం వచ్చినపుడు బస చేసేందుకు అవసరమైన ప్రత్యేక కాటేజీ దైవ సన్నిధి నిర్మాణాలను ఏర్పాటుచేస్తోంది ప్రభుత్వం.

తంజావూర్ వంటి సాంప్రదాయ నిర్మాణంలో యాదాద్రి ఉండాలన్న సీఎం
ఆగమశాస్త్ర సూత్రాలను తంజావూర్ వంటి వేల ఏళ్ల కిందటి సాంప్రదాయ నిర్మాణ కౌశలానికి యాదాద్రి ప్రాణప్రతిష్ట పోయనున్నదని తెలిపారు. రెండున్నర ఎకరాల్లో నిర్మిస్తున్న కాటేజీల సముదాయాలకు పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. యాదాద్రిలో పూర్తిస్థాయి నిర్మాణాల అనంతరం గుట్టపై పచ్చదనం వెల్లువిరియడంతోపాటు ఆలయ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని సీఎం కేసీఆర్‌కు భావిస్తున్నారు.

108 అడుగుల ఆంజనేయస్వామి భారీ విగ్రహ నమూనాకు సీఎం ఆమోదం
యాదాద్రిలో 108 అడుగుల ఆంజనేయస్వామి భారీ విగ్రహ నమూనాకు సీఎం ఆమోదం తెలిపారు. ఆంజనేయస్వామి భారీ విగ్రహ రూపకల్పనకు చైనా శిల్పులు ముందుకొచ్చారు. 

07:01 - September 29, 2016

హైదరాబాద్ : భారీ వర్షాల ధాటికి హైదరాబాద్‌ అతలాకుతలమైంది. కుండపోతగా కురిసిన వర్షాల వల్ల వరదల్లో చాలా ప్రాంతాలు జలదిగ్బంధ మయ్యాయి. అయితే నాలాలపై అక్రమ నిర్మాణాల కారణంగానే వరద తీవ్రత ఎక్కువైందని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. దీంతో నగరంలోని అక్రమ కట్టడాలను కూల్చివేయడంతోపాటు, రోడ్లు ఇతర మౌలిక సౌకర్యాల కల్పనను సమాంతరంగా చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కూల్చివేతలపై కేసీఆర్ ఆరా
హైదరాబాద్‌లో వరదల ధాటికి సర్కారు పునరాలోచనలో పడింది. నగరంలో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ సమీక్షించారు. నగరాభివృద్ధికి బ్యాంకర్ల నుంచి ఆర్థికసాయం తీసుకొని ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు సూచించారు. ప్రభుత్వం మిషన్‌ భగీరథ వంటి పథకాలను చేపడుతుండటంతో బ్యాంకర్లలో విశ్వాసం ఏర్పడిందని ఆయన తెలిపారు.

నగరంలో అత్యవసరంగా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సీఎం ఆదేశం
నగరంలో అత్యవసరంగా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చెయ్యాలని సూచించారు. సమిష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. వరదల కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని చెప్పారు.

నగరాభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు-కేసీఆర్

హైదరాబాద్‌ నగరాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను వచ్చే బడ్జెట్‌ నుంచి కేటాయించనున్నట్లు సీఎం తెలిపారు. వరదల బీభత్సానికి కారణమైన అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులపై అధికారులు సీఎంకు వివరించారు. రెండు రోజుల్లో నాలుగు వందల అక్రమ కట్టడాలను కూల్చినట్లు తెలిపారు. మరికొన్ని నిర్మాణాలను త్వరితగతిన కూల్చివేసేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

06:51 - September 29, 2016

భయాలే నిజమయ్యాయి. ప్రభుత్వరంగ సంస్థల మూసివేతకే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలోని 15 ప్రభుత్వరంగ సంస్థల మూసివేతకు నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో అయిదు కంపెనీల మూసివేతకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. మరో మూడింటిని మూసివేసేందుకు అంతర్గత ఆదేశాలందాయి. మూసివేస్తున్నవాటిలో భారత్ పంప్స్ అండ్ కంప్రెషర్స్ టైర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఇన్ ల్యాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్, బెంగాల్ కెమికల్ ఫార్మాస్యూటికల్స్, హిందూస్తాన్ ఫోటో ఫిల్మ్, భారత్ వ్యాగన్స్ అండ్ ఇంజనీరింగ్, హిందూస్థాన్ యాంటీ బయాటిక్స్ సంస్థలున్నాయి. ఇన్ని ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? నష్టాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం ఎంత వరకు సమంజసం? దాదాపు 74 ప్రభుత్వరంగ సంస్థలకు ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో వీటిని రక్షించుకోవాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలేమిటి? పౌరసమాజం పోషించాల్సిన పాత్ర ఏమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ యూనియన్ నేత నర్సింహారెడ్డి 10టీవీ స్టూడియోకి వచ్చారు. మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

ఢిల్లీ వెళ్ళనున్న మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : నేడు మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్న కేటీఆర్. శుక్రవారం జరగనున్న స్వచ్ఛ భారత్ సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు.

యువకుడి దారుణ హత్య!..

హైదరాబాద్ : వనస్థలిపురం పోలీసుస్టేషన్‌ పరిధిలోని సచివాలయనగర్‌కాలనీలో నివాసముంటున్న ఓ యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. కొందరు గుర్తుతెలియని దుండగులు కారులో వచ్చి లలిత్‌(28) నివాసముంటున్న ఇంటిలోకి చొరబడి నిద్రిస్తున్న లతిత్ దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో లలిత్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారమందుకున్న వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌ ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Don't Miss