Activities calendar

30 September 2016

పెరిగిన పెట్రోల్ ధర, తగ్గిన డీజిల్ ధర

ఢిల్లీ : పెట్రోల్ ధర పెంచగా డీజిల్ ధరను తగ్గించారు. లీటరు పెట్రోల్ పై 28 పైసలు పెంచారు. లీటర్ డీజిల్ పై 6 పైసలు తగ్గించారు. 

సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్

కరీంనగర్ : సింగరేణి కార్మికులకు యాజమాన్యం దసరా అడ్వాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 3న రూ.18 వేలు చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్ జారీ చేసింది.

 

22:05 - September 30, 2016
21:59 - September 30, 2016

హైదరాబాద్ : ఏప్రిల్ లో ప్రపంచవ్యాప్తంగా బహుబలి -2 సినిమాను విడుదల చేయనున్నట్లు బహుబలి చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈరోజు బహుబలి -2 లోగో  ఆవిష్కరణ  కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్, రానా, దర్శకుడు రాజమౌళితో పాటుగా నిర్మాతలు శోభు యార్లగడ్డ పాల్గొన్నారు. బహుబలి కామిక్ బుక్ సిరీస్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్టోబర్ 22 న బహుబలి -2 ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు రాజమౌళి తెలిపారు.. ప్రభాస్ ఫ్యాన్స్ అక్టోబర్ 5 న గుడ్ న్యూస్ వింటారని దర్శకుడు రాజమౌళి తెలిపారు. 

 

21:57 - September 30, 2016

ఢిల్లీ : దుబాయిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కవిత బతుకమ్మకు పూలు పేర్చి అందంగా తయారు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. 
ఢిల్లీలో.. 
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. బతుకమ్మ సంబరాల్లో  కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి ఈటెల రాజేందర్, వేణుగోపాలాచారి, రామచంద్రు , డీఎస్, రాపోలు ఆనందభాస్కర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఆడిపాడారు. దేశ ప్రజలకు బతుకమ్మ ఔనత్యాన్ని చాటేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఏర్పాటుచేసిన తెలంగాణ అభివృద్థి, సంక్షేమ పథకాల ఫోటో ఎగ్జిబిషన్ ఆహుతులను అలరిస్తోంది. 

 

21:55 - September 30, 2016

హైదరాబాద్ : వనస్థలిపురంలో యువకుని హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక సచివాలయనగర్‌లో ఉండే లలిత్‌ ఆదిత్యను కొందరు కత్తులతో దారుణంగా పొడిచిచంపారు. కుటుంబ కలహాలతోనే ఆదిత్యను హత్య చేశారని పోలీసులు తేల్చారు. లలిత్‌ ఆదిత్య 8 నెలల క్రితం సుస్మితారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే యువతి తరపువారికి ఈ పెళ్లి ఇష్టం లేకపోవడం.. అందులో లలిత్‌-సుష్మిత మధ్య గొడవ జరగడం హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. హత్యలో పాల్గొన్న నలుగురిని గుర్తించిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

21:52 - September 30, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఈ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం పాతబకాయిలు చెల్లించకపోవడంతో పాటు డిమాండ్లను పరిష్కరించడం లేదని ప్రైవేటు హస్పిటల్స్ యాజమాన్యాల అసోసియేషన్ తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే.... ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. 

21:48 - September 30, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు గైడ్ లైన్స్ జారీ చేసింది. అక్రమదారులకు ఖచ్చితంగా నోటీసులు జారీ చేసిన తర్వాతనే కూల్చివేయాలని సూచించింది. నోటీసులు ఇచ్చిన తర్వాత వివరణ ఇచ్చేందుకు మూడు వారాల పాటు గడువు ఇవ్వాలని అదేశించింది. గడువు లోగా స్పందించలేకపోతే మళ్లీ వివరణ కోరాలని తెలిపింది. ఆ తర్వాతనే కూల్చివేత చేపట్టాలని స్పష్టం చేసింది. అయితే అక్రమ కట్టడాలను కూల్చివేయడాన్ని అభినందిస్తూనే.. చట్టాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఉమ్మడి హైకోర్టు వాఖ్యానించింది. 

 

21:44 - September 30, 2016
21:36 - September 30, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు పన్ను రాయితీ కల్పిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పన్ను రాయితీలు 2015 నుంచి 2020 మార్చి వరకూ వర్తిస్తాయి. 15% అదనపు తరుగుదల, పెట్టుబడిపై 15% ప్రోత్సాహకం కల్పించినట్లు సీడీబీటీ పేర్కొంది. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు పన్ను రాయితీ వర్తించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు పన్ను రాయితీలు వర్తించనున్నాయి. ఇటీవల కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలోని జిల్లాలకు కూడా పన్ను రాయితీ వర్తింపచేయాలని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. 

 

21:25 - September 30, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్యంపై వస్తున్న పుకార్లతో .. జయలలిత అభిమానులు.. ఏఐఏడీఎంకే కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. వారంరోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలిత చేరారు. వారం రోజులుగా ఆస్పత్రికే పరిమితం అవడంతో ఆమె ఆరోగ్యంపై సోషల్‌మీడియాలో ఆందోళనలు, పుకార్లు బయలుదేరాయి. దీనిపై స్పందించిన  ఏఐఏడీఎంకే నాయకులు... జయ ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదంటున్నారు. జయలలిత పూర్తి ఆరోగ్యంతో బయటికి వస్తారని భరోసా ఇచ్చారు. అటు అపోలో డాక్టర్లు కూడా జయలలిత వైద్యానికి బాగా స్పందిస్తున్నారని చెబుతున్నారు. 

21:23 - September 30, 2016

హైదరాబాద్ : రోడ్లు, డ్రైనేజీల మరియు మౌళిక వసతుల అభివృద్థి కోసం గ్రేటర్ హైదరాబాద్ కు రూ.10వేల కోట్లు ఇవ్వాలని సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ నుంచి నిధుల తరలింపు ఆపాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లు, డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లి కాలనీలు, బస్తీల ముంచెత్తడంతో జనజీవనం అతాలకుతలమైందని ఫైరయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాటలు చెప్పకుండా పనులు ఆచరణలో చూపెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. జీహెచ్ఎంసీ నుంచి నిధుల తరలింపు ఆపాలన్నారు. 

 

20:59 - September 30, 2016

ఎవరి బలం ఎంత ? అణ్వాయుధాలు ప్రయోగిస్తారా ? ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏమౌతాయి? ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ? యుద్ధం వస్తే..?? ఈ అంశంపై ఇవాళ్టి వైడాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న 'బాహుబలి 2'

హైదరాబాద్ : 'బాహుబలి 2' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. జనవరిలో చిత్రం ట్రైలర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు నెలల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేయనున్నారు.

 

తెలంగాణ జిల్లాలకు కూడా పన్ను రాయితీ వర్తింప చేయాలి : ఈటెల

హైదరాబాద్ : తెలంగాణ జిల్లాలకు కూడా పన్ను రాయితీ వర్తింప చేయాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

 

20:43 - September 30, 2016

ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శనార్థులు... స్పెషల్ పాటతోని మంగలారతులు, ఎమ్మెల్యే మెడకు మండలం పంచాదీ...మోత మోగుతున్న మోటకొండూరు, సిరిసిల్ల పోలీసులు వీరత్వం, ధీరత్వం.. దిష్టిబొమ్మల అరెస్టు చేసిన శూరత్వం, వ్యవసాయశాఖ మంత్రి సభల పాము సయ్యాట... పోచారం సారుది బాగున్నది గాచారం, పోలీసొళ్ల పేరుమీద దొంగల వసూలు.. అంటే పోలీసొళ్లే వసూలు జేస్తే ఒకేనా, సచ్చిపోయిన పోరడు మళ్ల ఇంటికొచ్చిండు... అనాధ శవానికి తలనీలాల సమర్పన.... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

మెట్రో నగరాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ

ఢిల్లీ : భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర హోంశాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. మెట్రో నగరాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న 30 రోజులు మెట్రో నగరాల్లో అలర్ట్‌గా ఉండాలని హోంశాఖ.. రాష్ట్రాలను హెచ్చరించింది.

20:39 - September 30, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు పన్ను రాయితీ కల్పిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పన్ను రాయితీలు 2015 నుంచి 2020 మార్చి వరకూ వర్తిస్తాయి. 15% అదనపు తరుగుదల, పెట్టుబడిపై 15% ప్రోత్సాహకం కల్పించినట్లు సీడీబీటీ పేర్కొంది. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు పన్ను రాయితీ వర్తించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు పన్ను రాయితీలు వర్తించనున్నాయి. ఇటీవల కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

20:35 - September 30, 2016

ఢిల్లీ : భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర హోంశాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. మెట్రో నగరాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న 30 రోజులు మెట్రో నగరాల్లో అలర్ట్‌గా ఉండాలని హోంశాఖ.. రాష్ట్రాలను హెచ్చరించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఏపీలో వెనుకబడిన జిల్లాలకు పన్నురాయితీ కల్పిస్తూ సీడీబీటీ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు పన్ను రాయితీ కల్పిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పన్ను రాయితీలు 2015 నుంచి 2020 మార్చి వరకూ వర్తిస్తాయి. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు పన్ను రాయితీ వర్తించింది. 

20:28 - September 30, 2016

కృష్ణా : విజయవాడలోని సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంత వాసుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత రెండు రోజులుగా సీపీఎం నేతలు చేస్తున్న నిరహార దీక్షలు ముగిసాయి. పార్టీ నగర కార్యదర్శి సి.హెచ్ బాబురావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం స్ధానికులు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి తమ నిరసన తెలిపారు. గత ఆరు నెలలుగా సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు గురువుతున్నారని బాబురావు మండిపడ్డారు. చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు వలన అనేక మంది రోగాల బారిన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

 

20:23 - September 30, 2016

తూర్పుగోదావరి : దళితులపై దాడికి పాల్పడిన ఆ ఎమ్మెల్యేని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రక్షిస్తోందా..? శిక్ష పడటం ఖాయంగా కనిపిస్తుండటంతో కేసును వాయిదా వేయాలని చూస్తోందా..? ఇదే చర్చ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వ్యవహారం ఇప్పడు చర్చనీయాంశమైంది. తాజాగా కేసు విచారణకు ముందుగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ని తొలగించడంతో దళిత సంఘాలు, వామపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. 
తోట త్రిమూర్తులను తప్పించేందుకు ప్రయత్నం
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను దళితుల దాడి కేసు నుంచి రక్షించేందుకు అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యేని సేఫ్‌జోన్‌లో ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మొదటి నుంచి వివాదాస్పదంగా ఉన్న తోట త్రిమూర్తులు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. 1996లో ఇద్దరు దళితులను శిరోముండనం చేసిన కేసులో ఆయన జైలుకెళ్లారు. ఎమ్మెల్యేగా ఉండగానే 4 నెలల పాటు జైలులో ఉన్నారు. ఈ కేసులో ఆయన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద రిమాండ్‌కు వెళ్లాల్సి వచ్చింది. 
దళితులను హింసించిన ఎమ్మెల్యే 
తొలిసారిగా 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయనకు వ్యతిరేకంగా బీఎస్పీ తరపున కొంతమంది దళితులు  పనిచేశారు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న త్రిమూర్తులు  దొంగతనం కేసులో దళితులను ఇరికించి, తన అధికార బలంతో తీవ్రంగా హింసించాడు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. దళిత సంఘాలు, పలు ప్రజా సంఘాలు వ్యతిరేకించడంతో కేసు తెరమీదకు వచ్చింది. మొదట రాజమండ్రిలోనూ, ఇప్పుడు విశాఖలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుపై విచారణ జరగాలి. అయితే  ఈనెల 26వ తేదీన విచారణ జరగాల్సి ఉండగా...23వ తేదీన ఈ కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో వ్యవహారం రాజకీయ వివాదానికి కారణంగా మారుతోంది. 
ప్రభుత్వ వ్యవహారంతో దళిత సంఘాల ఆందోళన 
టీడీపీ ప్రభుత్వం తమ ఎమ్మెల్యేను కాపాడుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ తీరుపై ఆందోళనలు మొదలవుతున్నాయి. ఇప్పటికే రామచంద్రాపురం ఆర్డీఓ ఆఫీస్‌ను దళిత సంఘాలు ముట్టడించాయి. అక్టోబర్ 3న కలెక్టరేట్‌లో ఆందోళన నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. తాజా పరిస్థితులపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. 
ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును వెంటనే బర్తరఫ్‌ చేయాలి : కత్తి పద్మారావు
దళితులకు శిరోముండనం చేయించిన కేసులో విచారణను ఎదుర్కొంటున్న రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును వెంటనే బర్తరఫ్‌ చేయాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేశాయి. తోట త్రిమూర్తులుకు రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప బంధువైనందున కేసును నీరుగార్చే అవకాశం ఉందని.. అందుకే తోట త్రిమూర్తులును పదవి నుంచి ముందుగా బర్తరఫ్‌ చేయాలని దళిత సంఘం నేత కత్తి పద్మారావు డిమాండ్‌ చేశారు. 
తోట త్రిమూర్తులుకు శిక్ష పడాల్సిందే : మాల్యాద్రి
అట్రాసిటీ కేసు ఎదుర్కొంటున్న రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును రక్షించే ప్రయత్నం చేస్తే దళితులు చూస్తూ ఊరుకోరని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి అన్నారు. దళితులకు శిరోముండనం చేయించిన తోట త్రిమూర్తులుకు శిక్ష పడాల్సిందేనని ఆయన అన్నారు.  

20:15 - September 30, 2016
20:14 - September 30, 2016
20:08 - September 30, 2016

కర్నూలు : పట్టెడన్నం పెట్టే.. పచ్చని పొలాల్లో బతుకులను చిద్రం చేసే ఫ్యాక్టరీ ఏర్పాటు వద్దంటూ గ్రామస్థులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. పల్లె వాతావరణాన్ని కలుషితం చేసే నానో కెమికల్‌ ఫ్యాక్టరీని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా.. యాజమాన్యం మాత్రం తనపని తాను చేసుకుపోతోంది. పైగా స్థానికులను విపరీతంగా వేధించడం ప్రారంభించింది. దీన్ని తట్టుకోలేక స్థానికుల్లో కొందరు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. పల్లెప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తున్న కర్నూలు జిల్లా శాంతిరామ్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ దాష్టీకాలపై 10 టివి స్పెషల్ స్టోరీ...! 
పల్లెజీవనంలోత నానో కెమికల్ కలకలం... 
ప్రశాంత పల్లెజీవనంలో నానో కెమికల్ కలకలం... రసాయన ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల అందోళన... తన పని తాను చేసుకుపోతున్న పరిశ్రమ యాజమాన్యం.. ఇదీ.. కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొండజూటూరు సమీపంలో నానో కెమికల్ ప్యాక్టరీ వ్యవహారం. రసాయన ఫ్యాక్టరీతో  స్థానికులకు తీవ్ర హాని జరిగే అవకాశం ఉందని సంబంధిత గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయినా ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం.. పరిశ్రమ ఏర్పాటుకే మొగ్గుచూపుతూ తన పని తాను చేసుకుపోతోంది. దీంతో స్థానికులు ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. 
హైకోర్టులో పిటిషన్‌
శాంతరామ్‌ రసాయన పరిశ్రమ ఏర్పాటు వల్ల తమకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందంటూ బాలప్ప అనే వ్యక్తి ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ను విరమించుకోవాలని ఫ్యాక్టరీ యాజమాన్యం బాలప్పపై ఒత్తిడి పెంచింది. అతను తలొగ్గకపోవడంతో వేధింపులను ముమ్మరం చేసింది. తమ పలుకుబడిని ఉపయోగించి బాలప్పపై అక్రమ కేసు బనాయించింది. ఈ వేధింపులను తట్టుకోలేక.. బాలప్ప భార్య సురేఖ ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కొండజూటూరు గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు.  సురేఖ మృతికి కారకులైన శాంతిరామ్‌ను అరెస్ట్ చేయాలని, ఎస్సై మురళీధర్‌ను సస్పెండ్‌ చేయాలంటూ పాణ్యం పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు.  వీరికి కాంగ్రెస్, వైసీపీ, వామపక్షాలు మద్దతు తెలిపాయి. 
గ్రామస్తులు ఆందోళన
భారీ ఎత్తున గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో పాణ్యం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సురేఖ మృతికి నష్టపరిహారం చెలించాలని  సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు
పరిశ్రమను వ్యతిరేకించిన స్థానికులు 
శాంతరామ్‌ కెమికల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులు ముందునుంచీ పోరాడుతూనే ఉన్నారు. ఈ నెల 14న జిల్లా ఉన్నతాధికారులు, ఫ్యాక్టరీ అధినేత శాంతిరామ్ కొండజూటూరు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినప్పుడూ స్థానికులు పరిశ్రమను వ్యతిరేకించారు. తమ వాదనను వినకుండా.. కన్విన్స్‌ చేసేందుకు ప్రయత్నించిన ఫ్యాక్టరీ యజమాని శాంతరామ్‌పై రాళ్లు రువ్వి నిరసన తెలిపారు. కెమికల్‌ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న కొండజూటూరు గ్రామస్థులను ఇటీవల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పరామర్శించారు. కోనసీమను తలిపించేలాంటి పచ్చని పైర్లతో తులతూగే కొండజూటూరు, బలపనూరు గ్రామాలు.. రసాయన పరిశ్రమ వల్ల సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే.. ప్రతిపాదిత స్థలంలో పేదలకు గుడిసెలు వేస్తామని హెచ్చరించారు. పల్లెల్ని కలుషితం చేసే రసాయన ఫ్యాక్టరీ ఏర్పాటును ఉపసంహరించుకోవాలని స్థానికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

 

19:58 - September 30, 2016
19:57 - September 30, 2016

నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్

హైదరాబాద్ : నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతోపాటు డిమాండ్లను పరిష్కరించడం లేదని ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. 

డిజిటల్ ఇండియా, కాంక్లేవ్ ప్రాంతీయ సదస్సు

విజయవాడ : ఇండియాటుడే, హెచ్ సీ సంస్థల సంయుక్తంగా డిజిటల్ ఇండియా, కాంక్లేవ్ ప్రాంతీయ సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సులో ఐటీ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, డీజీపీ సాంబశివరావు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పాల్గొన్నారు. కాసేపట్లో సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. 

19:30 - September 30, 2016

నేను శైలజ తో ఈ సంవత్సరం హిట్టు బోణికొట్టిన రామ్ అదే ఊపులో చేసిన మరో సినిమా హైపర్. అయితే రామ్ తనకు బాగా ఇష్టమయ్యే మాస్ యాక్షన్ జానర్ నే మళ్లీ ఎంచుకొని హైపర్ గా వచ్చాడు. ఇంతకీ రామ్ హైపర్ గా మెప్పించగలిగాడా లేడా.. ? నేడే విడుదల రివ్యూలో చూద్దాం. 
విశ్లేషణ...1 
ఎనర్టిటిక్ స్టార్  రామ్, మాస్ జానర్ లో మంచి కథతో వెళితే ఈపాటికి ఎన్నో హిట్స్ వచ్చి ఉండేవి. లాస్ట్ టైమ్ కందిరీగ తో  అలా వచ్చే హిట్టు కొట్టాడు. ఆ తర్వాత అదే రూట్లో రొటీన్ గా వెళ్లి దెబ్బతిన్నాడు. అయితే  ఈ సారి మాస్ జానర్ నే ఎంచుకొని  కాస్త మంచి కథతో వచ్చాడు. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్  ఈ సినిమాతో రామ్ ను బాగానే పైకిలేపే ప్రయత్నం చేసాడు. అందులో ఆల్మోస్ట్  సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాకోసం మంచి పాయింట్ ను ఎత్తుకున్నాడు. ముప్పైఏళ్లుగా నిజాయితీ గల ప్రభుత్వాధికారిగా విధులు వ్యవహరిస్తున్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కి తండ్రి ని విపరీతంగా ప్రేమించే ఒక కొడుకుంటే, తన తండ్రికి ఏదైనా ఆపదొస్తే ఆ కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నదే ఈ సినిమా థీమ్. ఈ పాయింట్ ను తెరకెక్కించడంలో మంచి మంచి సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. వినోదంతో పాటు, మంచి డ్రామాని కూడా ఎలివేట్ చేసి మంచి మార్కేలేయించుకున్నాడు దర్శకుడు. ఫస్టాఫ్ సరదాగా చాలా ఆసక్తికరంగా సాగుతుంది, సెకండాఫ్ కొంచెం ఓవర్ డ్రామాతో నిండి ఉంటుంది. టోటల్ గా హైపర్ సినిమా బి,సి ప్రేక్షకులకి మాస్ విందే అనిచెప్పొచ్చు. 
కథ...
రిటైర్ మెంట్ కి దగ్గరపడిన నిజాయితీ గల గవర్నమెంట్ ఉద్యోగి నారాయణ మూర్తి .ఆయన్ను ప్రాణంగా ప్రేమించే అతడి కొడుకు సూర్య. తన తండ్రికి చిన్న జ్వరంలాంటిది వచ్చినా అల్లాడిపోతాడు. అలాంటి తండ్రిచేత , ఇల్లీగల్ గా కట్టిన ఒక బిల్డింగ్ విషయంలో ఒక  మినిస్టర్ సంతకం చేయించాలనుకుంటాడు. కానీ నారాయణ మూర్తి నిజాయితీ ఆపని చేయనివ్వదు.  అందుకే ఆయనచేత నయాన్నోభయన్నా సంతకం చేయించాలని ప్రయత్నిస్తాడు మినిస్టర్ . ఆ ప్రోసెస్ లో ఈ విషయం తెలుసుకున్న నారాయణ మూర్తి కొడుకు సూర్య మినిస్టర్ కే వార్నింగిస్తాడు. దాంతో అహం దెబ్బతిన్న మినిస్టర్,  నారాయణమూర్తి కుటుంబాన్ని ఎలా డీల్ చేసాడన్నదే మిగతా కథ.  అయితే ఇందులో సన్నివేశాలన్నిటినీ కొడుకుకి తండ్రి మీద ఉన్న ప్రేమతోనే లింక్ అయి ఉంటాయి. కథ నుంచి డీవియేట్ అయ్యే సీన్స్ ఏమాత్రం కనిపించవు.  ఈ సినిమాకు అదే బలంగా మారింది. చెప్పాల్సిన పాయింట్ ను సూటిగా  డ్రామా తోనూ , కొన్ని ఎమోషన్స్ తోనూ బాగా  చెప్పాడు దర్శకుడు. ఫస్టాఫ్ టెంపోని సెకండాఫ్ కూడా మెయింటెన్ చెయ్యగలిగితే సినిమా ఓ రేంజ్ లో ఉండేది. ఓవర్ డ్రామా వల్ల కొన్ని సీన్లు ఎలివేట్ కాలేదు. బట్..సినిమా మాత్రం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి.
విశ్లేషణ..2
రామ్ పెర్ఫార్మెన్స్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. మంచి పంచ్ డైలాగులతో , మంచి కేరక్టరైజేషన్ త , అతడి కేరక్టర్ ను బాగా డిజైన్ చేసాడు దర్శకుడు. మొత్తానికి రామ్ తన పాత్రను చాలా ఈజ్ తో సమర్ధవంతంగా పోషించాడు. ఇక హీరోయిన్ రాశీఖన్నా గ్లామర్ ఈ సినిమాలో చాలా ఓవర్ డోస్ లో ఉందనిపించింది. రామ్ తండ్రి నారాయణ మూర్తిగా సత్యరాజ్ నటన అద్భుతమని చెప్పాలి. రామ్ తో ఆయన సీన్స్ అన్నీ ఫన్నీగా , అద్భుతంగా సాగుతాయి. ముఖ్యంగా తండ్రి కొడుకుల కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌటయింది. చిన్నప్పటినుంచి తండ్రి మీద కొడుకు కు ఎంతప్రేమో చెప్పే సన్నివేశాలు చాలా సరదాగా ఉన్నాయి.  ఇక ఆఖరిగా చెప్పుకోవాల్సినది మినిస్టర్ గా  రావు రమేష్ పాత్ర. ఆయన మినిస్టర్ గా తన పాత్రను చించి ఆరేసాడు. ముఖ్యంగా ఆయన పలికే డైలాగ్స్  ఫన్నీగానూ, మంచి ఇంటెన్సిటీ తోనూ నిండి ఉంటాయి. ఇక సంగీతం, సినిమాటో గ్రఫీ , నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా మాస్ ప్రేక్షకులే కాదు, తండ్రి కొడుకుల రిలేషన్ బాగా ఎలివేట్ చేయడం వల్ల క్లాస్ పీపుల్ కూడా బాగానే కనెక్ట్ అవుతారు.  
ప్లస్ పాయింట్స్ :
కథ, కథనాలు
రామ్ నటన
సత్యరాజ్, రావురమేష్ నటన
డైరెక్షన్ 
మైనస్ పాయింట్స్ :
కామెడీ లేకపోవడం 
సెకండాఫ్ ఓవర్ డ్రామా 
 

 

19:18 - September 30, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ ఎఫ్ ఐ కూటమి అన్ని స్థానాలలో ఘన విజయం సాధించడం పట్ల ఎస్ ఎఫ్ ఐ నేతలు హర్షం వ్యక్తం చేశారు. నారాయణగూడ చౌరస్తాలో ఎస్ ఎఫ్ ఐ నేతలు సంబరాలు నిర్వహించారు.  

 

19:11 - September 30, 2016

కరీంనగర్ : ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మధ్య మానేరు మధ్యలోనే కొట్టుకుపోవడానికి కారణం ఏంటి..? అసలీ నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాల్సింది...? గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు.. కట్ట ఎత్తును నిర్మించేటప్పుడే కాంక్రీటుతో పటిష్టంగా నిర్మాణం చేపడితే బాగుండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 
అత్యంత ప్రతిష్టాత్మకంగా మిడ్‌ మానేరు ప్రాజెక్టు
అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిడ్‌ మానేరు ప్రాజెక్టు..ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఎడమ వైపు కట్ట 40 మీటర్ల మేర కోతకు గురైంది. కాంక్రీటు డ్యాం కంటే మట్టి కట్టను ఎత్తుకు నిర్మించి ఉంటే డ్యాం నుంచి నీరు వెళ్లి పోయేది. దీంతో పాటు 3.3 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. మిడ్‌ మానేరుకు ఎగువ మానేరుతో పాటు మూలవాడు, శ్రీరాంసాగర్‌ వదర కాలువ నుంచి వచ్చే నీటితో లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. ఏకంగా 40 వేల ఎకరాలను సస్యశ్యామలం చేసే దాదాపు 4 టీఎంసీల నీరు వృథాగా పోయింది. దాదాపు 3.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా 34 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన కట్ట.. పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. 2009లోనే గడువులోగా జలాశయం పనులను పూర్తి చేసి ఉంటే ప్రస్తుత దుస్థితి తలెత్తి ఉండేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
మేడిగడ్డ ప్రాజెక్టుకు మిడ్ మానేరు అనుసంధానం చేస్తూ డిజైన్ 
తెలంగాణ ప్రభుత్వం గోదావరి నది జలాలను సద్వినియోగం చేసుకోవడానికి నిర్మించ తలపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టుకు మిడ్ మానేరు అనుసంధానం చేస్తూ డిజైన్ చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈ ప్రాజెక్టే కీలకం కానున్న నేపథ్యంలో ముందుగా మిడ్ మానేరును పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ప్రాజెక్టు నీటిమట్టం 318 మీటర్లు కాగా 303 మీటర్ల వరకు నిర్మించి 3.3 టీఎంసీలు నిల్వ చేయాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. నీటిమట్టం  304 మీటర్లకు చేరితో శాభాష్‌పల్లి వద్ద ఉన్న వంతెన ముంపునకు గురవుతుంది. కాబట్టి కరీంనగర్, వేములవాడ మధ్యలో ఉన్న ఈ వంతెన మార్గంలో మరో వంతెనను నిర్మించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్ధ్యం 25.873 టీఎంసీలు, పూర్తి స్థాయి నీటిమట్టం 318 మీటర్లు, గరిష్ఠ వరద ప్రవాహ డిజైన్‌ను 5 లక్షల క్యూసెక్కులతో పాటు 25 గేట్లతో మిడ్ మానేరును డిజైన్‌ చేసినా మట్టి కట్టలు వరద నీటి దాటికి నిలువలేదు. మొదటే ఆ కట్టల్ని కాంక్రీటుతో పటిష్టంగా నిర్మించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నది నిపుణుల వాదన.
వానలతో కొట్టుకుపోయిన మిడ్‌మానేరు 
ప్రాజెక్టును ప్రతిపాదించారు. పనులు ప్రారంభించారు.. ఏళ్లకు ఏళ్లు గడిపేశారు.. ఈ మధ్యలో లెక్కకు మిక్కిలిగా బడ్జెట్‌ అంచనాలు మార్చేశారు. అంతేనా.. కనీవినీ ఎరుగని రీతిలో కాంట్రాక్టర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లారు. ముక్కుతూ మూల్గుతూ ఓ కొలిక్కి తెచ్చిన ఆ ప్రాజెక్టు.. భారీ వర్షానికి కొట్టుకు పోయింది. ఇంతా చేసి.. నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందకపోవడం ఈ ప్రాజెక్టు హైలెట్. ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏది అంటారా..? ఇంకేది..? మొన్నీమధ్య వానలతో కొట్టుకుపోయిన మిడ్‌మానేరు ప్రాజెక్టు. దీని పూర్వాపరాలపై 10టీవీ ప్రత్యేక కథనం. 
భారీ వర్షానికే కొట్టుకు పోయిని ప్రాజెక్టు
లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్న సంకల్పం...కరవు కోరల నుంచి రైతాంగాన్ని రక్షించాలన్న సదుద్దేశం...పదేళ్ల కిందటే మిడ్‌ మానేరు ప్రాజెక్టుకు పునాది రాళ్లు...పనులు పూర్తి చేయకుండానే దఫా దఫాలుగా మారిన కాంట్రాక్టర్లు..
ఇదీ మిడ్‌ మానేరు ప్రాజెక్టు కథ..  ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన, అత్యంత కీలకమైన ప్రాజెక్టు.. ఓ భారీ వర్షానికే కొట్టుకు పోయింది. ఇది పాలకుల ఆశ్రిత పక్షపాతాన్ని, అధికారుల ఉదాసీనతను, కాంట్రాక్టర్ల స్వార్థాన్ని ప్రపంచానికి చాటింది. 
2006లో మిడ్ మానేరుకు అంకురార్పణ
మానేరు జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో.. కరీంనగర్‌ జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద 2006లో మిడ్ మానేరు ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 25.873 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభించారు. జలయజ్ఞంలో భాగంగా అప్పటి ప్రభుత్వం ఆగమేఘాల మీద మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణానికి  శంకుస్థాపన చేసింది. దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్నది ఈ ప్రాజెక్టు సంకల్పం. 
339.39 కోట్ల రూపాయలతో కాంట్రాక్టు.. 
మిడ్‌ మానేరు ప్రాజెక్టు ఎడమ వైపు 5.2765 కిలోమీటర్లు, కుడివైపు 4.4 కిలోమీటర్ల దూరం మట్టి కట్ట, రెండు వైపులా 80 మీటర్ల చొప్పున నాన్ ఓవర్ ఫ్లో డ్యాం, మధ్యలో 388 మీటర్ల స్పిల్ వే, 25 రేడియల్ గేట్లతో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఈ పనులను జడ్వీఎస్‌, రత్నా, సుషి సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో 339.39 కోట్ల రూపాయలతో పనులను చేజిక్కించుకుంది. 
కేవలం 23 శాతం పనులు
2010 ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగించినా...కాంట్రాక్టు సంస్థ కేవలం 23 శాతం పనులనే చేసి.. వేగం తగ్గించింది. ఒప్పందం ప్రకారం పని చేయని గుత్తేదారున్ని తొలగిస్తే  పెరిగిన భారం గుత్తేదారు భరించేలా ఈపీసీ ఒప్పందంలోని  సెక్షన్ 61 ప్రకారం చర్య తీసుకోవాలి.  కాంట్రాక్టర్ల జిమ్మిక్కులు, రాజకీయ నాయకుల జోక్యంతో ఒప్పందంలో  పలు మార్పులు చోటు చేసుకున్నాయి. సెక్షన్ 60 సీ కింద మిగిలిన పనిని తొలగిస్తూ 2010 నవంబర్ 10న ప్రభుత్వం కొత్తగా సర్క్యూలర్లను జారీ చేసింది. కొత్త సర్క్యులర్‌ ప్రకారం ప్రాజెక్టులో మిగిలిన నిర్మాణ పనులను కొంత పనిని కొత్త గుత్తేదారుకు అప్పగించారు.  కొత్త కాంట్రాక్టర్‌కు 2010-11 ధరల ప్రకారం 454 కోట్ల అంచనాలతో తిరిగి టెండర్లను పిలిచారు. ఈసారి మరో మూడు సంస్థలు కలిసి సంయుక్తంగా కాంట్రాక్టు పనులను దక్కించుకున్నాయి. ఎన్ఏపీఎల్, ఎంబిఎల్, ఐవీఆర్‌సీలు సంయుక్త భాగస్వామ్యంతో 20.5 శాతం తక్కువతో 360.90 కోట్లకు పనులను చేజిక్కించుకున్నాయి. ఈ క్రమంలో  ఇప్పటివరకు ఎనిమిది కాంట్రాక్టర్లు మారారు. కానీ ప్రాజెక్టు మాత్రం ఇంచు ముందుకు కదిలిన దాఖలాలు లేవు.  
మిడ్ మానేరు ప్రాజెక్టు కింద 14 గ్రామాలు ముంపు 
మిడ్ మానేరు ప్రాజెక్టు కింద 14 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వేములవాడ మండలంలో కోడిముంజ, అనుపురం, సంకెపల్లి, ఆరెపల్లి, బోయినపల్లి మండలంలో వరదవెల్లి, శాభాస్ పల్లి, నిలోజిపల్లి, కోదురుపాక, కొత్తపేట, మాన్వాడ, సిరిసిల్ల మండలంలో చీర్లవంచ, చింతల్ ఠాణా.. ఇల్లంతకుంట మండలంలో బుర్రవాణిపల్లి, కందికట్కూర్ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దాదాపుగా 19,440 ఎకరాల భూములతో పాటు, 8,524 ఇళ్లు 1123 కుటుంబాలు నిర్వాసితులు అయ్యారు. జీవనాధారమైన పంటపొలాలూ నీట మునగడంతో.. తమను ఆదుకోవాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు. 
అరకొరగా ప్రాజెక్టు నిర్మాణం 
ప్రాజెక్టు అరకొరగా నిర్మించడమూ.. అది కాస్తా వర్షార్పణం కావడం ఒక విషాదమైతే.. ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందకపోవడం మరో విషాదం. నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామన్న పాలకులూ.. చేతులెత్తేశారు. అటు భూములు.. ఇటు ఇళ్లు లేక నిర్వాసితులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, నిర్వాసితులను ఆదుకోవాలని అటు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 
ఇళ్ల పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం 
2006లో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపు గ్రామాలను సర్వే చేసిన అధికారులు భూముల పరిహారం చెల్లించారు. కానీ ఇళ్ల పరిహారం చెల్లింపులో మాత్రం తీవ్ర జాప్యం చేశారు. ఏళ్లూ పూళ్లూ గడిచిన నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. దీంతో ఉండటానికి ఇళ్లు లేక... కొత్త ఇళ్లు కట్టుకుందామంటే చేతిలో డబ్బులు లేక నిర్వాసితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో అటు పరిహారమూ రాక.. ఇటు ఉండేందుకు నివాసాలు లేక నిర్వాసితులు గొల్లుమంటున్నారు. 
నిర్వాసితుల ఆగ్రహం
ముంపు గ్రామాల ప్రజలంతా .. తాము దిక్కులేని పక్షుల్లా మారడానికి ప్రభుత్వమే కారణమంటూ ఇటీవల మంత్రులు ఈటెల రాజెందర్‌, హరీష్‌రావులపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా ప్రభుత్వం న్యాయం చేయడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు.  
సీఎం కేసీఆర్‌ ప్రకటనపై విమర్శలు 
మిడ్‌మానేరుకు సంబంధించి సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన కూడా ఇప్పుడు రాజకీయ విమర్శలకు తావిస్తోంది. మిడ్‌ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి 5.4 లక్షలు ఇస్తామని గతంలో ప్రకటించిన కేసీఆర్‌... ఆ ప్రకటన అవగాహన లేమితో చేసిందని స్వయంగా తానే ప్రకటించారు. ముంపు ప్రాంతంలో పునరావాస కాలనీలు నిర్మించి మౌలిక వసతులు కల్పించినందున డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేమని, ప్రజలు క్షమించాలని కేసిఆర్‌ ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. మిడ్‌ మానేరు నిర్వాసితులకు తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

 

నయీం కేసులో ఇంకా బయటకురాని చాలా నిజాలు

హైదరాబాద్ : నయీం కేసులో ఇంకా చాలా నిజాలు బయటకురాలేదు. 5 శాతం మంది బాధితులు మాత్రమే పోలీసులను ఆశ్రయించారు. మొత్తం 5 వేల మంది బాధితులు ఉన్నట్లు అనుమానం. నయీం రూ.20 వేల కోట్లు లావాదేవీలు చేసినట్లు అంచనా.  

టీ.పెండింగ్ కేసులను హైకోర్టుకు బదిలీ చేస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ పై విచారణ

హైదరాబాద్ : ఎపి ట్రిబ్యునల్ లో తెలంగాణ పెండింగ్ కేసులను హైకోర్టుకు బదిలీ చేస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ పై విచారణ జరిగింది. ఏ చట్టం ప్రకారం హైకోర్టును ఆదేశిస్తూ.. ఆర్డినెన్స్ తెచ్చారన్న అంశంపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ రద్దు చేయాలన్న పిటిషన్ పై తుది తీర్పును కోర్టు వచ్చే నెల 24 కి వాయిదా వేసింది. ట్రిబ్యునల్ కు సంబంధించిన కొత్త పిటిషన్లు హైకోర్టుకు రావాలని ధర్మాసనం సూచించింది. 

 

వైజాగ్ మెడ్ టెక్ పార్కులో పెట్టుబడులు పెట్టే వారికి సాయం : సుజనా

ఢిల్లీ : వైజాగ్ మెడ్ టెక్ పార్కులో పెట్టుబడులు పెట్టే వారికి సాయమందిస్తామని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. టెక్నాలజీ అభివృద్ధి చేసేవారికి ట్యాబ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. గత 20 ఏళ్లుగా ఈ బోర్డు ద్వారా టెక్నాలజీ అభివృద్ధికి నిధులు ఇస్తున్నామని చెప్పారు. 

 

మెట్రో నగరాలను అప్రమత్తం చేసిన కేంద్రహోంశాఖ

ఢిల్లీ : కేంద్రహోంశాఖ మెట్రో నగరాలను అప్రమత్తం చేసింది. రానున్న 30 రోజులు అప్రమత్తంగా ఉండాలని మెట్రో నగరాలకు సూచించింది. భారత్, పాక్ వార్ నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించింది.

 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై : స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా లాభపడింది. నిఫ్టీ మళ్లీ 8600 పాయింట్ల ఎగువకు చేరింది. నేడు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 38పాయింట్ల లాభంతో 27,865 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 8,611వద్ద ముగిసింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.66.61 వద్ద కొనసాగుతోంది. 

17:24 - September 30, 2016

గుంటూరు : నూతన సచివాయలయంలో వసతుల కల్పనకు ఏపీ సర్కారు ఏమాత్రం రాజీపడడం లేదు. సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించిన రాష్ట్ర సర్కారు..భవనాలకు అవసరమైన వసతుల విషయంలో పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తోంది. డ్రింకింగ్ వాటర్ నుంచి వేస్ట్ వాటర్ వరకు అన్ని పనులను దీర్ఘకాలిక ప్లాన్‌తో నిర్మిస్తోంది. తాత్కాలిక సచివాలయమే అయినప్పటికీ భవిష్యత్ లో ఏ అవసరాలకైనా ఉపయోగించుకునే విధంగా సచివాలయంలో వసతులు ఏర్పాటు చేస్తున్నారు.
నిర్మాణాలపై సర్కారు ప్రత్యేక దృష్టి 
నూతన సచివాలయంలో డ్రేనేజీ, అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ , ఎలక్ట్రీసిటీ, కాపౌండ్ వాల్  నిర్మాణాలను ఏపీ సర్కారు  ప్రణాళిక ప్రకారం చేపడుతోంది. భవిష్యత్తులలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా నిర్మాణాల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టింది. తాత్కాలిక సచివాలయాన్ని దాదాపుగా 49 ఎకరాల్లో నిర్మిస్తున్నారు.. ఇందులో 22 ఎకరాలు భవనాల కోసం కేటాయించగా మిగిలిని ప్రాంతాన్ని ఇతర  అవసరాల కోసం ఉపయోగించనున్నారు.
పక్కా ప్లానింగ్‌తో డ్రైనేజీ నిర్మాణం
సచివాలయం నిర్మిస్తున్న ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు వ్యవసాయ భూమి. గతంలో సాధారణ వర్షాలకే ఈ ప్రాంతంలోని పొలాల్లో నీరు చేరేది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో డ్రైనేజీ వ్యవస్థ పై  ప్రత్యేక దృష్టి పెట్టింది. మొత్తం బ్లాక్ ల నుంచి  వచ్చే వాటర్ తో పాటు బయట కూడా నీరు  నిల్వ ఉండకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను ఏర్పాటు చేసింది. అండర్ గ్రౌండ్ డ్రేనైజీ సిస్టమ్ సరిగా లేకపోవడంతో హైదరాబాద్ , చెన్నై లాంటి నగరాల్లో కుండపోత వర్షాలు వల్ల ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఒకవేళ భారీ వర్షాలు కురిసినా సచివాలయ ప్రాంతంలో  ఎలాంటి ఇబ్బందులు లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నారు.
వర్షాలు కురిసినా నో ప్రాబ్లమ్‌
సచివాలయానికి ఉపయోగించే పవర్ అండ్ నెట్ వర్కింగ్ కేబుల్స్  కోసం కూడా అండర్ గ్రౌండ్ సిస్టమ్ నే ఉపయోగిస్తున్నారు. వర్షాలు వస్తే కేబుల్ సిస్టమ్స్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.  సచివాలయ ప్రాంగణం చుట్టూ 8 అడుగులు ఎత్తులో పెద్ద వాల్ నిర్మాణం కూడా పూర్తి చేస్తున్నారు. మరో 5 రోజుల్లో ప్రభుత్వ పాలన ప్రారంభం కానున్న కారణంగా సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

 

17:17 - September 30, 2016
17:16 - September 30, 2016

హైదరాబాద్ : ఇండియన్‌ ఆర్మీకి అన్ని పార్టీల మద్దతు ఉంటుందని మాజీ ఎంపీ వీ.హనుమంతరావు అన్నారు. సార్క్‌ సదస్సును బహిష్కరించడం మంచిదేనన్న ఆయన ఇది పాకిస్తాన్‌కు ఓ హెచ్చరిక అన్నారు. భారత సైన్యంపై దాడి చేసిన ఉగ్రవాదులను ఏరివేయడం సరైన చర్యఅని వీహెచ్‌ అన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్‌ దాడులు సరైన చర్యే అని చెప్పారు. 

ప్రజల దృష్టి మళ్లించేందుకే కొత్త జిల్లాలు - పొన్నం..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకే కొత్త జిల్లాలను తెరపైకి తెచ్చిందని టి.కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సీఎం రాజకోణంలోనే జిల్లాల విభజన తీరు ఉందని, ప్రజా ఉద్యమాలను గౌరవిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఉద్యమాలను అణిచివేస్తున్నారని తెలిపారు. 

అన్ని జిల్లాల్లో ప్రాజెక్టుల పర్యటన - ఉత్తమ్..

హైదరాబాద్ : ఎల్లంపల్లి తరహాలో అన్ని జిల్లాల్లో ప్రాజెక్టుల పర్యటన జరుగుతుందని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. రుణమాఫీ..పంట నష్టపోయిన రైతుల సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. నాలుగైదు రోజుల్లో పీసీసీ కార్యదర్శుల నియామకం ఉంటుందని, కార్యదర్శులుగా 30-40 మంది ఉంటారని తెలిపారు. 27 జిల్లాలకు అధ్యక్షులు, కమిటీలపై అక్టోబర్ కల్లా కసరత్తు జరుగుతుందని, కొత్త జిల్లాల ఏర్పాటుపై కాంగ్రెస్ స్టాండ్ తీసుకోలేదన్నారు. స్థానిక డిమాండ్ బట్టి పార్టీ శ్రేణులు నడుచుకుంటాయన్నారు. 

ముగిసిన తొలి రోజు ఆట..

కోల్ కతా : తొలి రోజు ఆట ముగిసింది. భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. 

ఆసియాక‌ప్ అండ‌ర్‌-18 హాకీ విజేత భారత్..

ఢిల్లీ : ఆసియాక‌ప్ అండ‌ర్‌-18 హాకీ ఫైనల్ లో భారత్ విజయం సాధించింది. నిన్న సెమీఫైన‌ల్‌ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు చేరిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌, భార‌త్ మ‌ధ్య నువ్వానేనా? అన్నట్లుగా జ‌రిగిన మ్యాచ్ లో 5-4 తేడాతో భార‌త్ గెలిచింది. 

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

ముంబై: స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 38పాయింట్ల లాభంతో 27,865 వద్ద స్థిరపడగా..నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 8,611వద్ద ముగిసింది. 

16:47 - September 30, 2016

స్వదేశీ గడ్డపై టీమిండియా 250వ టెస్ట్ మ్యాచ్ భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా వినూత్నంగా ప్రారంభమయ్యింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకోడంతో ఈడెన్ గార్డెన్స్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గర ఏర్పాటు చేసిన ప్రత్యేక గంటను మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మోగించడంతో మ్యాచ్ ప్రారంభమయ్యింది. ప్రపంచ క్రికెట్ లండన్ లార్డ్స్ స్టేడియంలో జరిగే టెస్ట్ మ్యాచ్ లను గంట మోగించడం ద్వారా ప్రారంభించే సాంప్రదాయం ఉంది. అదే విధానాన్ని భారత క్రికెట్ మక్కాలో సైతం పాటించడం ద్వారా సరికొత్త సాంప్రదాయానికి తెరతీశారు.

16:47 - September 30, 2016

ఖమ్మం : ఓవైపు వరదలతో తీవ్ర నష్టాలు... మరోవైపు వ్యాపారుల మాటలతో నిలువునా మోసపోతున్నారు మిర్చి రైతులు. నకిలీ విత్తనాలతో వ్యాపారులు మాయమాటలు చెప్పి  రైతులను నిలువునా ముంచేస్తున్నారు. తమ కంపెనీకి చెందిన విత్తనాలు సాగుచేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని నమ్మిస్తున్నారు. దీంతో  రైతులందరూ అప్పులు చేసి.. మిర్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. చివరకు పంట నష్టం రావడంతో తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. వ్యాపారుల మోసాలకు బలైన ఖమ్మం, గుంటూరు జిల్లాల్లోని మిర్చి రైతుల బాధలపై 10 టీవీ ప్రత్యేక కథనం..!
తీవ్ర నష్టంలో మిర్చి రైతులు 
మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. అసలే వరదలకు పంటనష్టమొచ్చి నానా బాధలు పడుతుంటే....నకిలీ విత్తనాల పుణ్యమా అని బాగా పండాల్సిన పంట కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఖమ్మం జిల్లాలోని సుమారు 200 మంది రైతులు వైరాలోని ఓ డీలరు వద్ద మిర్చి విత్తనాలను కొనుగోలు చేశారు. ఖరీఫ్‌లో మంచి దిగుబడులు సాధించాలన్నా తపనతో సాగు ప్రారంభించారు. చివరకూ మొక్కలు పూతకు రాక, తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. 
అనేక ఆశలతో ఖరీఫ్ సాగు
అనేక ఆశలతో పంటను పండించుకున్నా... నెలన్నర వయసుకు వచ్చిన తరువాత మిర్చి పైరుకి ముడతరోగం వచ్చింది. చెట్లు ఎపుగా పెరుగుతున్నాయే తప్ప వాటికి ఏమాత్రం పూత, కాత లేదు. దీంతో విషయాన్ని గ్రహించిన  రైతులు చుట్టుపక్కల అధికారులకు ఫిర్యాదు చేశారు. విత్తనాల లోపం కారణంగానే ఇలా ముడతరోగం వచ్చిందని అధికారులు తెలపడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను మోసం చేసిన వ్యాపారులను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్‌ చేస్తున్నారు.
నకిలీ విత్తనాలతో మోసపోయిన మిర్చి రైతులు
మరోవైపు గుంటూరు జిల్లాలోనూ ఇదే తరహాలో మిర్చి రైతులు మోసపోయారు. లగడపాడు, అత్తలూరు, రామాపుం గ్రామాల్లోని రైతులు...తమ కష్టాన్నంతా పెట్టుబడిగా పెట్టి పంట పండించారు. తీరా మొలకసమయమొచ్చేసరికి ఎలాంటి ఫలితమూ లేకపోవడంతో వ్యాపారుల మోసాన్ని గ్రహించారు. నకిలీ విత్తనాల వల్లే తీవ్ర నష్టం వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు తమకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. 
రైతులు ఆగ్రహం 
నకిలీ మిర్చి విత్తనాలతో మోసపోయామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వ్యవసాయ శాఖాధికారుల ఎదుట సుమారు 150 మంది రైతులు ఆందోళన చేపట్టారు. నకిలీ విత్తనాలతో తమను మోసం చేసిన వ్యాపారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

16:45 - September 30, 2016

కోల్ కతా టెస్ట్ తొలి రోజు ఆటలో...వన్ డౌన్ చతేశ్వర్ పూజారా, మిడిలార్డర్ ఆటగాడు అజింక్యా రహానే ఫైటింగ్ హాఫ్ సెంచరీలతో టీమిండియాను ఆదుకొన్నారు. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న టీమిండియా స్కోరు ఒక్క పరుగుకే ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ నష్టపోయింది. మరో ఓపెనర్ విజయ్ 9 , కెప్టెన్ కొహ్లీ 9 స్కోర్లకు అవుట్ కాగా..పూజారా 219 బాల్స్ లో 17 బౌండ్రీలతో 87 పరుగులు చేసి...మీడియం పేసర్ వాగ్నర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. రహానే 157 బాల్స్ లో 11 బౌండ్రీలతో 77 పరుగుల స్కోరు సాధించాడు. మొత్తంగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 7 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. కివీ బౌలర్లలో హెన్రీ 3 వికెట్లు, పటేల 2, బౌల్ట్, వాగ్నర్ చెరో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ జట్టుకు సీనియర్ బ్యాట్స్ మన్ రోస్ టేలర్ నాయకత్వం వహిస్తున్నాడు. స్టార్ బ్యాట్స్ మన్ కేన్ విలియమ్స్ సన్ గాయంతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.

16:39 - September 30, 2016

ఢిల్లీ : అక్టోబర్‌ 2నాటికి తెలంగాణలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలు మరింత ఉత్సాహంగా చేపడతామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. స్వచ్ఛభారత్‌ వ్యూహాల రూపకల్పనలో భాగంగా ఢిల్లీలో జరిగిన ఇండోసాన్ 2016 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ మలమూత్ర విసర్జన లేని 17 నగరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే పలు గ్రామాలు, పట్టణాలు పరిశుద్ధప్రాంతాలుగా సిద్ధమయ్యాయని తెలిపారు.

 

16:35 - September 30, 2016

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీలో ఇండోశాన్‌ ఎగ్జిబిషన్‌లో సెంట్రలైజ్డ్‌ ఏసీ సిలిండర్‌ పేలింది. అయితే ఆసమయంలో అక్కడే మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబును కమాండోలు వెంటనే బయటకు తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. గ్యాస్‌ లీకేజీ వళ్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

 

16:17 - September 30, 2016

 ఢిల్లీ : హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడి నేత, మాజీ ఎంపి షహబుద్దీన్‌ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో షహబుద్దీన్‌ తిరిగి జైలుకు వెళ్లనున్నారు. రాజీవ్ రోషన్, అతడి ఇద్దరు సోదరుల హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన షహబుద్దీన్‌... 11 ఏళ్ల తర్వాత పట్నా హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. షాహబుద్దీన్‌పై మొత్తం 40 కేసులున్నాయి. గ్యాంగ్‌స్టర్‌ షహబుద్దీన్‌ బయటకు రాగానే ఆయన అనుచరులు హల్‌చల్‌ చేశారు. బాధిత కుటుంబాలు తమకు ప్రాణాపాయం ఉందని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. షాహబుద్దీన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ముగ్గురు కుమారులను కోల్పోయిన చంద్రకేశ్వర ప్రసాద్‌ తరపున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ సుప్రీకోర్టులో పిటిషన్‌ వేశారు. నితీశ్ కుమార్ ప్రభుత్వం కూడా షహబుద్దీన్‌ బెయిల్ రద్దును కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం.. షహబుద్దీన్ బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

 

16:00 - September 30, 2016

హైదరాబాద్ : టీసర్కార్ పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఘాటుగా విమర్శించారు. ప్రజాస్వామ్యంపై పూర్తిగా నియంతృత్వ ధోరణిగా వ్యవహరిస్తుందని తెలిపారు. టీసర్కార్ ఒంటరి పోకడలకు పోతూ... రాచరికాన్ని నడిపే విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అఖిలపక్షం, ప్రజలు, ప్రజాస్వామ్యానికి గౌరవం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షానికి జవాబు చెప్పే పద్ధతి సర్కార్ దగ్గర లేదన్నారు. ఏమైనా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఎదురుదాడికి దిగుతున్నారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. సిరిసిల్లను జిల్లా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వెనుకడుగు వేయడంలో ఆంతర్యమేమిటో తెలపాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు పంపితే.. ఇప్పటి వరకు సర్కార్ నుంచి తమకు ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లా పరిషత్ సమావేశాలను నిర్వహించాలని కోరారు. డివిజన్లు, మండలాల ఏర్పాటు అంశాలపై కూడా భేటీలు నిర్వహించాలని సూచించారు.
  

నకిలీ విత్తనాల కంపెనీలపై పీడియాక్టు పెట్టాలి - రేవంత్..

హైదరాబాద్ : ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో నకిలీ మిర్చీ విత్తనాల వల్ల 3 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని టి.టిడిపి నేత రేవంత్ పేర్కొన్నారు. నకిలీ విత్తనాల సరఫరా చేసిన కంపెనీలపై పీడీయాక్ట్ పెట్టాలని, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థను నిర్వీర్యం చేశారని తెలిపారు. మహబూబ్ నగర్ లో నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయారని, కంపెనీల నుండి పరిహారం రాబట్టాలని డిమాండ్ చేశారు. భారత సైన్యాన్ని అభినందనిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాల ముందు తన సైన్యం తలెత్తుకొనేలా చేసిందన్నారు. 

చంద్రబాబుకు తప్పిన ప్రమాదం..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ప్రమాదం తప్పింది. ఇండోశాన్ ఎగ్జిబిషన్ లో సెంట్రలైజ్డ్ ఏసీ సిలిండర్ పేలింది. సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతుండగా గ్యాస్ లీకై ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే కమాండోలు బాబును బయటకు తీసుకెళ్లారు. 

15:47 - September 30, 2016

ఢిల్లీ : కావేరీ నది జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అక్టోబర్ 1 నుంచి 6 వరకు తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్నాటకను ఆదేశించింది. రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తెలిపింది. కర్నాటక తీరును సుప్రీం తప్పుబట్టింది. తీర్పు అమలుకు కర్నాటకకు ఇదే చివరి అవకాశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అక్టోబర్ 4 లోపు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వానికి సూచించింది. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ నది జలాల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.

 

 

15:45 - September 30, 2016

ఢిల్లీ : దేశాన్ని చెత్త రహితంగా మార్చడానికి అందరూ కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో స్వచ్ఛ్ భారత్‌ సమావేశానికి ప్రధాని హాజరై, మాట్లాడారు. పలు రాష్ట్రాల మంత్రులు, అధికారుల మధ్య మోడీ ప్రసంగించారు. చెత్తలేని ప్రాంతాలతోనే మనకు ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. చెత్త నిర్వహణలో ఉత్తమ నగరం పూణేకు అవార్డు దక్కింది.. స్వచ్ఛ రైల్వేస్టేషన్‌గా సూరత్‌ ఎన్నికైంది.

 

పాకిస్థాన్ నటీనటులపై నిషేధం సరికాదు - సల్మాన్..

ముంబై : భారత్ లో పాక్ నటీనటులపై నిషేధం సరికాదని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నటులు వేరు ఉగ్రవాదం వేరని తెలిపారు. వారికి భారత ప్రభుత్వం వీసా అందిస్తుందన్నారు. 

నీటిని కర్నాటక విడుదల చేయాల్సిందే - సుప్రీం..

ఢిల్లీ : కావేరి జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమిలనాడుకు రోజుకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సుప్రీం తిరిగి ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1 నుండి 6 వరకు నీటిని విడుదల చేయాలని కర్నాటకకు సుప్రీం ఆదేశించింది. మంగళవారం లోపు కర్నాటక నది జలాల బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రానికి కూడా ఆదేశించింది. మరోవైపు కర్నాటక తీరును సుప్రీం తప్పుబట్టింది. తీర్పు అమలుకు కర్నాటకకు ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. 

పోలవరం నిర్మాణంపై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : పోలవరం నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలుచేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల తమ గ్రామాలు మునిగిపోతాయని ఒడిశా తరపు న్యాయవాది వాదనలను వినిపించారు. బచావాత్ అవార్డు ప్రకారం తమకూ నీటిలో వాటా కావాలని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు కోరాయి. ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక అభ్యంతరాలపై నాలుగు వారాల్లో వైఖరి తెలపాలని ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. 

స్వచ్ఛ భారత్ ప్రదర్శనను సందర్శించిన సీఎం బాబు..

ఢిల్లీ : స్వచ్ఛ భారత్ ప్రదర్శనను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. చెత్త సేకరణ, నిర్వాహణ యంత్రాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇండోశాన్ -2016 సదస్సుకు బాబు హాజరయ్యారు. ఏపీలో పారిశుధ్యం, పచ్చదనంపై ప్రభుత్వ చర్యలపై వివరణనిచ్చారు. 2018 అక్టోబర్ నాటికి ఏపీలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..

విశాఖపట్టణం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని కొనసాగుతోంది. దీనిఫలితంగా ఏపీలో మ‌రోసారి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. 

14:36 - September 30, 2016

నెల్లూరు : జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని అమెరికాలో మృతి చెందింది. ఉన్నత విద్య కోసం వెళ్లిన ఆమె అనంతలోకాలకు వెళ్లిపోవడంపై కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతులకు ఇద్దరు సంతానం. ప్రియాంక..శరత్ చంద్ర. ప్రియాంక చదువులో చురుకుగా ఉండేది. ఉన్నత విద్య కోసం ఆమె అమెరికాలోని అట్లాంటకు వెళ్లింది. సెప్టెంబర్ 1వ తేదీన ప్రముఖ కంపెనీలో జాబ్ సంపాదించడం జరిగిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అట్లాంటలోని ఓ కొలనుకు వెళ్లిన ప్రియాంక ప్రమాదవశాత్తు జారి పడిపోయి మృతి చెందింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియచేశారు. దీనితో ప్రియాంక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై ఆమె తండ్రి వెంకటేశ్వర్లు టెన్ టివితో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

అమరావతి నిర్మాణంపై ఎన్జీటీలో విచారణ..

ఢిల్లీ : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ఎన్జీటీలో విచారణ జరిగింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. నిర్మాణాలన్నీ తుది తీర్పుకు లోబడి ఉండాలని ఎన్జీటీ పేర్కొంది. రెండు లంక గ్రామాల్లో మాత్రమే ప్రజలు నివాసం ఉంటున్నారని కోర్టుకు ఏపీ తరపు న్యాయవాది తెలిపారు. వరద ప్రాంతాల్లో వేగంగా రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలపై పూర్తి వివరాలతో వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు.

షాబుద్దీన్ కు బెయిల్ రద్దు..

బీహార్ : ఆర్జేడీ మాపీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ కు పాట్నా హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేసింది. రెండు కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ, పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న షాబుద్దీన్ కు పాట్నా హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 

అట్లాంటలో నెల్లూరు విద్యార్థిని మృతి..

అమెరికా : నెల్లూరు జిల్లాకు చెందిన ప్రియాంక అట్లాంటలో మృతి చెందింది. కావలికి చెందిన ప్రియాంక కొలనులో మునిగి చనిపోయింది. ఈమె విద్యం కోసం అట్లాంట వెళ్లింది. ప్రియాంక మృతితో కుటుంబం దు:ఖసాగరంలో మృతి చెందింది. 

14:15 - September 30, 2016

కర్నూలు : జిల్లాలోని పాణ్యం మండలం కొండలజూటూరులో పోలీసులు బూట్ల చప్పుడు వినిపిస్తోంది. నానో కెమికల్ ఫ్యాక్టరీ వద్దు బాబు..అంటున్నా ప్రభుత్వం మాత్రం వారి మాటలను పెడచెవిన పెడుతోంది. దీనితో అక్కడి గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. వీరి ఆందోళనపై ఖాకీలు నిర్భందం ప్రయోగించారు. ఊరులో ఎవరూ తిరగవదదని హెచ్చరికలు జారీ చేశారు. కానీ నానో కెమికల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. పోలీసులు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ విధించడాన్ని గ్రామస్తులు తప్పుబడుతున్నారు. 

14:00 - September 30, 2016

న్యూ కలెక్షన్స్ తో కళ్లు చెదిరే నయా ట్రెండ్స్ తో మురిపించే సొగసు ఈరోజు సరికొత్త కలెక్షన్స్ తో మనముందుకు వచ్చేసింది. ఏ వయస్సు వారైన వేసుకునే వుండే డ్రస్ చుడీదార్..చుడీదార్స్ లో నయా ట్రెండ్ తో చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం..న్యూ లుక్స్ తో వచ్చిన ఈ సొగసుపై ఓ లుక్కేయండి...

జవాన్ విడిపించేందుకు ప్రయత్నాలు - కేంద్రం..

ఢిల్లీ :పాక్ చెరలో ఉన్న భారత జవాన్ ను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 

13:56 - September 30, 2016

హైదరాబాద్ : ప్రేమించుకున్నారు..పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు..ఇక వారి కొత్త కాపురం గుజరాత్‌లో మొదలయింది..ఆ తర్వాత హైదరాబాద్‌కు మారింది...పెళ్లయిన ఎనిమిది నెలలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి...ఇప్పుడేమో ఆలుమగల మధ్య మనస్పర్థలు వచ్చాయి.. ఇదే సమయంలో హత్యకు గురయ్యాడా ప్రేమికుడు...ఇది పరువు హత్యనా..? లేక మరేదైనా జరిగిందా..??

ప్రేమికుడు ఆదిత్య హత్య కేసులో దర్యాప్తు వేగం..
హైదరాబాద్‌లో సంచలనం రేపిన ప్రేమికుడు లలిత్‌ ఆదిత్య హత్య కేసులో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు... ఇప్పటికే ఏసీపీ భాస్కర్ పర్యవేక్షణలో నాలుగు టీమ్‌లు నాలుగువైపులా దర్యాప్తు చేస్తున్నాయి...ఆదిత్య హత్యకు ఎన్నో అనుమానాలున్నాయి.. దీంతోనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి హంతకులను పట్టుకోవాలని పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు... కొన్ని గంటల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది....

సుస్మితను విచారిస్తున్న పోలీసులు..
ఇదిలా ఉంటే లలిత్‌ ఆదిత్య హత్య జరిగిన సమయంలో ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న సుస్మితరెడ్డి ఇంట్లో లేదు..అంతకు ముందే ఆమె ఇల్లు విడిచివెళ్లిపోవడం...ఆ తర్వాత ఆదిత్య హత్యకు గురికావడం జరిగింది..దీన్ని బట్టి వస్తున్న అనుమానాలపై పోలీసులు సుస్మితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది...అయితే లలిత్ హత్యకు ముందు..సుస్మిత ఇంటి నుంచి వెళ్లాక నలుగురికి ఫోన్ చేసినట్లు ఆమె కాల్ రికార్డ్‌ సేకరించారు..అయితే ఆ నలుగురు ఎవరు..? ఆమె ఎందుకు ఫోన్ చేసిందన్న విషయాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు..సుస్మిత చెప్పే విషయాలతో హత్యకు గల కారణాలపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది...
పరువు కోణంలో హత్యకు గురయ్యాడా..
ఇక ఆదిత్య,సుస్మితల మధ్య చిన్న చిన్న గొడవలు పెరిగాయని తెలుస్తోంది..ఈ క్రమంలోనే సుస్మిత ఇంటి నుంచి వెళ్లిపోయింది... ఆ తర్వాతే ఆదిత్య హత్యకు గురికావడం కూడా అనుమానాలకు దారితీస్తోంది..ప్రేమ వివాహం చేసుకున్నాడని కక్షగట్టి పరువు హత్య చేశారా.. లేక ఆలుమగల మధ్య గొడవల్లో తలదూర్చి అంతం చేశారాన్న అనుమానాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు...

అయితే ఆదిత్య హత్య సుపారీ కిల్లర్స్‌ పనేనా..
లలిత్ ఆదిత్యను హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతానికి కర్నాటక రిజిస్ట్రేషన్ నంబర్ గల కారు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది...దీన్ని బట్టి ఆదిత్యను హత్య చేసేందుకు సుపారీ కిల్లర్స్ వచ్చారా..? లేక తెలిసినవారే ఈ హత్యకు పాల్పడ్డారాన్నది బయటపడాల్సి ఉంది...

ఆలూమగల మధ్య తలదూర్చిందెవరు?
లలిత్‌ ఆదిత్య ప్రేమ వివాహం చేసుకున్నందుకే హత్యకు గురయ్యాడా..? లేక ఆ తర్వాత కుటుంబ గొడవల్లో అంతమయ్యాడా..? ఆలుమగల మధ్య తలదూర్చిందెవరు..? ఎన్నో అనుమానాలున్న ఈ కేసులో పోలీసులు లోతుగా శోధిస్తున్నారు... ప్రేమికుడిని చంపడానికి కారణాలపై విచారిస్తున్నారు.. హైదరాబాద్ లో జరిగిన హత్య సంచలనం రేపుతోంది....

నిద్రలోనే నడుస్తూ వెళ్లి తలుపులు తీసిన ఆదిత్య..
అంతే ఆ క్షణంలో ఇంట్లోకి చొరబడ్డ గుర్తుతెలియని నలుగురు యువకులు వస్తూనే బీభత్సం సృష్టించారు...లలిత్ ఆదిత్య తో పాటు ఇంట్లో ఉన్న రాహుల్‌ ను బెదిరించి చంపేస్తామని చెప్పి బయటకు రావద్దంటూ గడియపెట్టారు..అప్పటికే నిద్రలోనే ఉన్న ఆదిత్య తేరుకునేలోపే దుండగుల కత్తులు దేహంలోకి దూసుకొచ్చాయి....మెట్లపైకి ఈడ్చుకెళ్లారు...పూలకుండీలతో తలపై కొట్టారు..ఆ ఇంట్లో రక్తపు ఆనవాళ్లు అరాచకానికి సాక్ష్యం..పూలకుండీల్లోని మట్టిలో అడుగులే నిదర్శనం...ఈ సీన్ చూస్తే అర్థమయిపోతుంది..తెల్లవారుజామున దుండగులు ఎలాంటి బీభత్సం సృష్టించారో...లలిత్ ఆదిత్యను టార్గెట్ చేసుకుని వచ్చిన దుర్మార్గులు కత్తులతో పొడిచి పొడిచి..పూలకుండీలతో కొట్టి కొట్టి చంపారు....వారి దాడిలో తీవ్రంగా గాయపడ్డ

ఆదిత్య,సుస్మితల పెళ్లి పెద్దల నిరాకరణ..
2015 నవంబరులో నగరంలోని రాగన్నగూడకు చెందిన సుస్మితరెడ్డి,లలిత్ ఆదిత్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..వీరి ప్రేమ వివాహం పెద్దలు ఇష్టం లేదు..వారిని ఎదురించి పెళ్లి చేసుకున్న వారు గుజరాత్‌లో ఆదిత్యకు ఉద్యోగం రావడంతో వెళ్లారు..సరిగ్గా రెండు నెలల క్రితం ఉద్యోగం వదిలేసిన ఆదిత్య హైదరాబాద్‌ వచ్చి వనస్థలీపురం సచివాలయనగర్లో కాపురం పెట్టాడు..సొంతంగా వ్యాపారం మొదలుపెట్టిన ఆదిత్యకు, సుస్మితరెడ్డిలకు మధ్య పొరపొచ్చాలు వచ్చాయి..ఈ విషయంలో జరిగిన గొడవలో సుస్మిత ఇంటి నుంచి వెళ్లిపోయింది..ఆ తర్వాత ఆదిత్యను దుండగులు దారుణంగా చంపారు...

సుపారీ ఇచ్చి హత్య చేసినట్లు అనుమానాలు..
ఇదిలా ఉంటే గత కొంత కాలంగా లలిత్ ఆదిత్య కుటుంబ సభ్యులకు, అతడి భార్య తరఫు బంధువులకు వివాదం జరుగుతోందని తెలుస్తోంది..ప్రేమ వివాహం ఇష్టం లేని పెద్దల మధ్య గొడవలు..అదే సమయంలో ఆలుమగల మధ్య మనస్పర్థలు ఉన్నాయి..ఈ క్రమంలోనే సుస్మిత కుటుంబీకులే హత్యకు కారణమా అన్న అనుమానాలపై పోలీసులు యశ్వంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.. సుపారీ ఇచ్చి ఆదిత్యను హత్య చేయించినట్లు పోలీసులకు దొరికిన ప్రాథమిక ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు...

13:46 - September 30, 2016

సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తో మహిళలు తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలిపే నిర్భయ ఈరోజుకూడా మనముందుకు వచ్చేసింది. ఈనాటి నిర్భయ కార్యక్రమంలో 'షోల్డర్స్ స్టెంత్స్'గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

13:42 - September 30, 2016

ఢిల్లీ : పాకిస్థాన్ చెర‌లో ఉన్న జ‌వానును విడిపించేందుకు అన్ని ప్రయ‌త్నాలు చేస్తున్నామ‌ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. గురువారం అనుకోకుండా నియంత్రణ రేఖ దాటి పాక్ భూభాగంలో అడుగుపెట్టిన 22 ఏళ్ల చందు బాబులాల్‌ చౌహాన్‌ను పాక్‌ ఆర్మీ అధికారులు బంధించినట్లు పాక్‌ పత్రిక డాన్‌ ప్రచురించింది. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రస్థావరాలపై బుధవారం అర్ధరాత్రి సమయంలో భారత్‌ చేపట్టిన దాడులకు పాక్‌ కూడా ప్రతీకార చర్యలకు దిగింది... పాక్‌ జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది భారత సైనికులు చనిపోగా.. ఓ జవానును పట్టుకున్నామని పాక్‌ మిలిటరీ చెప్పినట్లు డాన్‌ వెల్లడించింది.

తోసిపుచ్చిన ఆర్మీ..
అయితే పాక్‌ మీడియాలో వస్తున్న వార్తలను తొలుత భారత ఆర్మీ తోసిపుచ్చింది. ఆ వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవని, ఏ సైనికుడు పాక్‌ కస్టడీలో లేడని సైన్యం తెలిపింది. పొరపాటున సరిహద్దు దాటడం, తనిఖీల తర్వాత తిరిగి రావడం సరిహద్దుల్లో సాధారణంగా జరిగేదేనని ఆర్మీ పేర్కొంది. అయితే తాజాగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. 

బందరు పోర్టు భూ సేకరణ..రసాభాసగా గ్రామ సభ..

విజయవాడ : బందరు పోర్టు భూసేకరణకు సంబంధించి పల్లెతుమ్మలపాలెం గ్రామసభ రసాభాసగా మారింది. బందరు పోర్టుకు భూములు ఇచ్చేదిలేదని గ్రామస్తులు తేల్చిచెప్పారు. అధికారులు గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. సెంటు భూమికూడా బందరు పోర్టుకు ఇవ్వబోమని తేల్చిచెప్పారు.

13:33 - September 30, 2016

తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అక్టోబర్ 2న అంకురార్పణ, 3న ధ్వజారోహణం, అక్టోబర్ 7న గరుడ సేవ, 10న రథోత్సవం, 11న చక్రస్నానం జరగనుందన్నారు. అలాగే 3వతేదీన ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు. కాగా... ఈ బ్రహ్మోత్సవాలను లక్షా 80 వేల మంది భక్తులు వాహన సేవలు తిలకించేలా ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు. అలాగే మాడ వీధులతో పాటు వెలుపల 30 ఎల్‌ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే అక్టోబర్ 1 నుండి 12 వరకు 24 గంటల పాటు ఘాట్ రోడ్లు తెరిచి ఉంటాయని, ఉదయం 9గంటల నుంచి అర్దరాత్రి 1 గంట వరకు ఉచిత అన్నప్రసాదం ఉంటుందని, అలాగే 7 లక్షల లడ్డూలను సిద్ధం చేశామని ఈవో తెలిపారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామని, బ్రహ్మోత్సవాలుకు 3500 మంది సిబ్బంది, గరుడ సేవ రోజున 4700 సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు చేయడమేగాక 3వేల మంది శ్రీవారి సేవకులు, వెయ్యి మంది స్కౌట్స్ అండ్ సేవలు వినియోగించుకుంటున్నామన్నారు.

13:29 - September 30, 2016

ఢిల్లీ : తాము భారత దేశంతో యుద్ధం కోరుకోవడం లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. భారత్ - పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎల్ ఓసీ దాటి ఉగ్రవాద శిబిరాలపై భారత జవాన్లు సర్జికల్ స్ట్రైక్స్ దాడి అనంతరం కీలక కొంత ఉద్రిక్త వాతవరణం నెలకొంది. దీనితో ఇటు భారత్..అటు పాక్ దేశాల్లో కీలక భేటీలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రధాని షరీఫ్ అధ్యక్షతనలో జరిగిన సమావేశంలో భారత దేశం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పై చర్చించారు. ఈ సందర్భంగా షరీఫ్ స్పందించినట్లు తెలుస్తోంది. తాము భారతదేశంతో యుద్ధం కోరుకోవడం లేదంటూనే యుద్ధం వస్తే తనను తాను కాపాడుకొంటామని పేర్కొన్నారు. కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించకుండా పాకిస్థాన్ ఉగ్రవాద దేశంగా చిత్రీకరించేందుకు భారత్ ప్రయత్నిస్తోందంటూ పాక్ మంత్రివర్గంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. సర్జికల్ స్ట్రైక్స్ లో భారత జవాన్లు కొంతమంది మృతి చెందారని, ఓ జవాన్ ను అదుపులోకి తీసుకున్నట్లు పాక్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

హై అలర్ట్..
పాక్‌ సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది... సరిహద్దు ప్రాంతాల్లో భారీగా సైన్యాన్ని మోహరించారు.. ఆయా ప్రాంతాలకు యుద్ధ సామగ్రిని పంపుతున్నారు. ఎయిర్‌ఫోర్స్ విమానాలు కూడా సరిహద్దు దగ్గర గస్తీ కాస్తున్నాయి. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలా 20 వేల మందిని అక్కడినుంచి ఖాళీ చేయించారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌, పంజాబ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. సర్జికల్ దాడుల తర్వాత పరిస్థితిపై ఢిల్లీలో రాజ్‌నాథ్‌ అధ్యక్షతన CCS భేటీ ప్రారంభమైంది. దేశంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఇందులో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ, రక్షణ శాఖాధికారులు, ఐబీ, రా చీఫ్, ఇతర అధికారులు హాజరయ్యారు. 

పోలవరంపై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయాలని కోరుతూ ఒడిశా రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పోలవరం బ్యాక్ వాటర్ తో తమ గ్రామాలు మునిగిపోతాయని, తమకు తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు మద్దతుగా ఉన్నాయని ఒడిశా ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించుకుంది. కాగా, బచావత్ అవార్డు ప్రకారం తమకు నీటిలో వాటా కావాలన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వ అభ్యంతరాలపై తమ వైఖరి తెలపాలని ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

13:14 - September 30, 2016

కృష్ణా : బందరు మండలం పల్లెతుమ్మలపాలెం గ్రామసభ రసాభాసగా మారింది. బందరు పోర్టు భూ సేకరణకు భూములు ఇచ్చేది లేదంటూ రైతులు రైతులు స్పష్టం చేశారు. దీంతో అధికారులు రైతులకు నచ్చచెప్పటానికి యత్నిస్తున్నారు. అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఎకరం కాదు కదా ఒక్క సెంటు భూమికూడా ఇవ్వమని తేల్చి చెప్పారు. తమ గ్రామం నుండి అధికారులు వెళ్ళిపోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ సభను నిర్వహించేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. ఈ సభలో భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని రైతులు పేర్కొంటున్నారు. బందర్ పోర్టుకు సంబంధించి దాదాపు 28 గ్రామాలలో గ్రామసభను నిర్వహించిన అధికారులు 21 గ్రామాలకు చెందిన రైతులు భూములిచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపారు. దీంతో రైతులను ఒప్పించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు యత్నిస్తున్నారు. భూసేకరణ సమితి ఆధ్వర్యంలో భూసేకరణ చేయనున్న గ్రామాలలో అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. 

30మంది సీపీఎం నేతల అరెస్ట్..

కృష్ణా : గొల్లపల్లి ఆలయ రఘునాథ స్వామి ఆలయ భూములు వేలం ప్రారంభమయ్యింది. భూముల వేలాన్ని సీపీఎం నేతలు అడ్డుకున్నారు. దీంతో 30మంది సీపీఎం నేతలకు పోలీసులు అరెస్ట్ చేసి రూరల్ పీఎస్ కు తరలించారు. పీఎస్ వద్దనే సీపీఎం నేతలు నిరసన చేస్తున్నారు. 

ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వం :రైతులు

కృష్ణా : బందరు మండలం పల్లెతుమ్మలపాలెం గ్రామసభ రసాభాసగా మారింది. బందరు పోర్టు భూ సేకరణకు భూములు ఇచ్చేది లేదంటూ రైతులు రైతులు స్పష్టం చేశారు. దీంతో అధికారులు రైతులకు నచ్చచెప్పటానికి యత్నిస్తున్నారు. అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఎకరం కాదు కదా ఒక్క సెంటు భూమికూడా ఇవ్వమని తేల్చి చెప్పారు. 

మద్య నిషేధ చట్టాన్ని రద్దు చేసిన హైకోర్టు..

పాట్నా : బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్‌కుమార్‌ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం తీసుకొచ్చిన మ‌ద్య నిషేధ చట్టాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఇది చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ఈ సంద‌ర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. 

ఆత్మకూరులో బీటెక్ విద్యార్థి సూసైడ్..

గుంటూరు : మంగళగిరి మండలం ఆత్మకూరులో బీటెక్ ఫైనలియర్ విద్యార్థి వెంకటరమణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులే కారణమని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. 

12:43 - September 30, 2016

నిజామాబాద్ : ముదిమి వయసులో అండగా ఉంటాడనుకున్న పుత్రుడు విగతజీవిగా మారడన్న విషయం కన్నవారి గుండెలు పిండేసింది. ఆ నవ్వును చూడలేం.. ఆ మాటలు వినలేం.. మిగిలిందల్లా జ్ఞాపకాలే ఇలా కుమిలిపోతూ అంత్యక్రియలు నిర్వహించాక కన్నకొడుకు సజీవంగా ఇంటికి తిరిగొచ్చాడు. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతకడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

మిస్సింగ్ కేసు నమోదు
ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుడి పేరు రాజు..ఊరు నిజామాబాద్ జిల్లా సారంగపూర్. న్యాల్ కల్ గ్రామంలో గొర్రెల కాపరిగా పనిచేస్తూ చిల్లర దొంగతనాలు చేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా 20 రోజుల క్రితం హైదరాబాద్‌ పారిపోయాడు. రాజు కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో అతడి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన వారు.. రాష్ట్రంలోని అన్ని ఠాణాలకు సమాచారమిచ్చారు.

గుర్తుపట్టరాని స్థితిలో మృతదేహం
ఈ క్రమంలో హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల్లో గుర్తుతెలియని యువకుడు మృతిచెందినట్లు రాంగోపాల్‌ పేట పోలీసులు గుర్తించారు. అతడి డెడ్‌బాడీని గాంధీ మార్చురీకి తరలించి భద్రపరిచారు. ఈ విషయం తెలిసిన రాజు తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రి మార్చురీలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. రాజు చేయిపై ఉన్నట్లే అతడి చేయిపై పచ్చబొట్లు ఉండటంతో ఆందోళన చెందారు. ఫోటోలోని ఆనవాళ్లతో పొల్చి డెడ్‌బాడీని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. గుర్తుపట్టరాని స్థితిలో మృతదేహం ఉండటంతో..రాజుగా అనుమానించి స్వగ్రామం సారంగపూర్‌ తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

కురుమారుడిని చూసిన తల్లిదండ్రులు ఆనందం
అశ్రునయనాలతో రాజు తల్లిదండ్రులు దశదిన కర్మ నిర్వహించారు. తమ కొడుకు మృతికి గొర్రెల యజమానే కారణమని ఆగ్రహించిన వారు.. అతడి ఇంటిపై దాడి చేశారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత జరిగిన విషయం ఎంటో తెలుసుకుందామని రాజు స్నేహితుడు ప్రశాంత్‌ను ఆరా తీశాడు. రాజు చనిపోలేదని.. హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో పనిచేస్తున్నాడని చెప్పడంతో అవాక్కయ్యాడు. అక్కడి నుంచి రాజును స్వగ్రామం సారంగపూర్‌ రప్పించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే కన్నకొడుకును కళ్లారా చూసిన తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ తప్పు జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.

కుమారుడు రావటంతో పీఎస్ సమాచారం
మొత్తానికి చనిపోయాడనుకున్న రాజు సజీవంగా తిరిగి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు చనిపోయిన వ్యక్తి ఎవరన్న విషయం తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు.. సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట పోలీసులకు సమాచారమిచ్చారు. 

12:25 - September 30, 2016

హైదరాబాద్ : తెలంగాణను ముంచెత్తిన వర్షాలతో రాష్ట్రం మొత్తం చల్లబడినా రాజకీయ నేతల పోలిటికల్‌ కామెంట్లు హీట్ పెంచుతున్నాయి. భారీ వర్షాల కారణంగా తెలంగాణలో చాలా చోట్లా ప్రాజెక్టులకు గండిపడటంతో ప్రతిపక్షాలు నేరుగా విమర్శలు గుప్పిస్తున్నాయి. వర్షాల కారణంగా భారీ నష్టమేమి జరగలేదంటూ... అధికార పార్టీ అంటోంది. దీంతో అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే ఉంది.

ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెడుతున్న ప్రతిపక్షాలు
దాదాపు 20 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న రాజకీయపార్టీల నేతలు తమ పనిని కూడా ఇప్పుడే మొదలు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల కారణంగా జనజీవనం స్తంభించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే అధికారపార్టీ నేతలు కౌంటర్‌ అటాక్ ఇస్తున్నారు.

రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవడం లేదంటూ విమర్శలు
గ్రేటర్ హైదరాబాద్‌లో తలెత్తిన పరిస్థితిపై అధికారపార్టీ తనదైన స్టైల్లో స్పందించింది. వందేళ్ల తర్వాత ఈస్థాయిలో వర్షం కురిసినా నాలుగైదు కాలనీల్లోనే ఇబ్బందులు తలెత్తాయని పరిస్థితి మొత్తం అదుపులోనే ఉందని అంటోంది అధికారపార్టీ. క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికార, విపక్షపార్టీలు విమర్శలు చేసుకున్నా సహాయం అందించడంలో కేంద్రం పట్టించుకోవడం లేదనే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది గులాబీపార్టీ.

ముందుచూపుతోనే ప్రాజెక్టులు నిండాయంటున్న కాంగ్రెస్‌
ఇక ప్రాజెక్టులపై నేతలు ఎవరికి వారే తమ గొప్పులు చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ముందు చూపుతోనే ప్రాజెక్టులు నిండాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన విధానంతోనే సమస్యలు వస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రాజెక్టులను అడ్డుకుంటుంటే తామే ప్రాజెక్టుల కోసం రెండేళ్లలో తీవ్రంగా శ్రమించామని మంత్రి ఈటల అంటున్నారు.రాజకీయ పార్టీలు వర్షాలపై కూడా తమ రాజకీయ ఆధిపత్యాన్ని చాటి చెప్పుకునేందుకు

12:19 - September 30, 2016

ప్రధానిని ప్రశంసించిన సీపీఐ నారాయణ..

హైదరాబాద్‌: పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ అన్నారు. ఉరీ సైనిక క్యాంపులో ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ను వ్యూహాత్మకంగా ఒంటరిని చేసే ప్రయత్నాల్లో మోదీ ముందడుగు వేశారని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌లో జరగాల్సిన సార్క్‌ సమావేశాలను బహిష్కరించడంతో పాటు సార్క్‌ సభ్యదేశాల మద్దతును కూడగట్టడంలో సఫలమయ్యారని ప్రశంసించారు. యుద్ధానికి యుద్ధమే సమాధానం కాదని...

భీమదేవర పల్లిలో మావో పోస్టర్ల కలకలం..

కరీంనగర్ : భీమదేవరపల్లిలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టించాయి. పార్టీకి నష్టం కలిగిస్తున్నవారిని హతమారుస్తామని మావోలు పోస్టర్ల లో పేర్కొన్నారు. గమనించిన పోలీసులు పోస్టర్లను తొలగించారు. 

12:13 - September 30, 2016

ఢిల్లీ : భారత్ - పాక్ దేశాల్లో కీలక భేటీలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ అధ్యక్షతనలో సీసీఎస్ భేటీ జరగగా కాసేపటి క్రితం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ సింగ్ అధ్యక్షతనలో కేంద్ర హోం శాఖ కార్యాలయంలో రివ్యూ సమావేశం జరిగింది. కేంద్ర హోం శాఖ అధికారులు, ఇతర రక్షణశాఖ అధికారులు, ఐబీ, రా చీఫ్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశ భద్రత..అంతర్గత భద్రత అంశాలపై చర్చిస్తున్నారు. ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగిన అనంతరం నెలకొన్న పరిణామాలపై వీరు చర్చించనున్నారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, ఇతర దేశ సరిహద్దుకు సమీపంలో ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది.

పాక్ లో భేటీలు..
మరోవైపు పాక్ దేశంలో కూడా కీలక భేటీలు జరుగుతున్నాయి. ఆ దేశ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ అధ్యక్షతనలో కీలక సమావేశం జరుగుతోంది. ఇస్లామాబాద్ లో జరుగుతున్న పాక్ మంత్రివర్గం సమావేశంలో భారతదేశ సైన్యం చేపట్టిన సర్జికల్ ఆపరేషన్ కు సంబంధించిన సమాచారం లేదని...దాడులు జరగలేదని పాక్ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.
భారత్..పాక్ భేటీల అనంతరం ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పలు దేశాలు సూచిస్తున్నాయి. 

చెత్త రహిత దేశంగా భారత్ : మోదీ

ఢిల్లీ : దేశాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దాలని అందరూ సంకల్పం చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన స్వచ్ఛభారత్ వార్షికోత్సవంలో మోదీ ప్రసగించారు. సంకల్పం చేపడితే దేశంలో మార్పు రావడం కష్టమైన పని కాదన్నారు. చెత్త రహిత ప్రాంతాలతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. నగరాలు, పట్టణాలను చెత్త రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని కోరారు. స్వచ్ఛ భారత్ ఉపయోగాలను మీడియా విస్తృతంగా ప్రచారం చేసిందన్నారు. తమ వస్తువులను శుభ్రంగా చూసే జనం.. పది మందికి ఉపయోగపడే వస్తువులను శుభ్రంగా ఉంచడం లేదన్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హైఅలర్ట్..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఆక్టోపస్, సీఐఎస్‌ఎఫ్ బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. ఎయిర్‌పోర్టులోకి వచ్చే వాహనాలను, ప్రయాణికులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్‌వోసీ వెంబడి ఉన్న ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌తో పాటు దేశంలోని వివిధ మెట్రో నగరాల్లోకి చొరబడి, దాడులకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం లభించడంతో భారత సైన్యం లక్షిత దాడులు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.

పుణె నగరానికి స్వచ్ఛతా పురస్కారం ..

ఢిల్లీ: విజ్ఞాన్‌ భవన్‌లో పారిశుద్ధ్య సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కలెక్టర్లు, అమృత్‌ నగరాల మున్సిపల్‌ కమిషనర్లు హాజరయ్యారు. స్వచ్ఛ భారత్‌లో విశేష సేవలందించిన ఎన్‌సీసీకి ప్రధానమంత్రి చేతుల మీదుగా స్వచ్ఛతా పురస్కారం ప్రదానం చేశారు. ఎన్‌సీసీ తరఫున మేజర్‌ జనరల్‌ పురస్కారం అందుకున్నారు. చెత్త నిర్వహణలో పుణె పట్టణానికి స్వచ్ఛతా పురస్కారం దక్కింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా సేవలందించిన పలువురికి పురస్కారాలు ప్రదానం చేశారు.

సింగూర్ ప్రాజెక్టు గేట్ల మూసివేత..

మెదక్ : సింగూర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ఇన్ ఫ్లో 8వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 29.99 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 29.3 టీంఎసీలుగా ఉంది. 

ఆత్మహత్య చేసుకున్న రైతు..

ఖమ్మం : చర్ల మండలం ఆనందకాలనీలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి రైతు నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్షాలతో పంట నష్టం జరిగిందన్న మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. 

ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత..

ఆదిలాబాద్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుత నీట్టిమట్టం 19.45 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 20 టీఎంసీలు ఉండగా ఇన్ ఫ్లో 34,168, ఔట్ ఫ్లో 41,592 క్యూసెక్కులుగా ఉంది. 

పెండింగ్ కేసుల బదిలీపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : తెలంగాణ ట్రిబ్యునల్ పెండింగ్ కేసులను హైకోర్టుకు బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ జరిగింది. ఏ చట్టం ప్రకారం ఆర్దినెన్స్ తెచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. మధ్యాహ్నం 2.30గంటలకు వివరణ ఇస్తామని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు.

 

ఎమ్మెల్యే మహిపాల్ ఇంట్లో ఐటీ సోదాలు..

మెదక్ : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు నిర్వహించింది. నిన్న మధ్యాహ్నం నుండి శుక్రవారం ఉదయం వరకు సోదాలు జరిగాయి. పెద్దమొత్తంలో నల్లధనం దొరికనట్లు సమాచారం. 

11:58 - September 30, 2016

చిత్తూరు : మన్నవరం ప్రాజెక్టు సాధనకోసం ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డి 30గంట దీక్షను చేపట్టారు. జిల్లాకు వచ్చిన ఈ ఒక్క అవకాశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నీరుగారుస్తున్నారనీ యండవల్లి ఆరోపించారు. 2010లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో  భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాకు వన ప్రదాయిని అయిన మన్నవరంలో ఎన్టీపీసీ-భెల్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కడం ఒక వరమన్నారు. పెట్టుబడుల కోసం దేశవిదేశాలు తిరిగే చంద్రబాబు సొంత నియోజక వర్గంలోని మన్నవరం ప్రాజెక్టుపై అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. దీనిపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్పేంతవరకూ దీక్ష కొనసాగిస్తానని ఈ సందర్భంగా యండవల్లి పేర్కొన్నారు.

11:21 - September 30, 2016

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్‌నెం-12లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 9గంటల ప్రాంతంలో జేఆర్ కే బిల్టింగ్ లోని రెండవ అంతస్థులో వున్న సాఫ్ట్ వేర్ కార్యాలయంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో భవనంలో నలుగురు సిబ్బంది చిక్కుకున్నారు. స్థానికులు అందంంచిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చిక్కుకుపోయిన ఉద్యోగులను సురక్షితంగా రక్షించారు. ఎగసి పడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. కాగా సర్వర్ రూమ్ లో షార్ట్ సర్యూటే దీనికి కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

11:17 - September 30, 2016

ఢిల్లీ : ఉగ్రవాదుల ఏరివేతకు భారత్ ఏం నిర్ణయం తీసుకొనబోతోంది. ముఖ్యంగా పాక్ నుండి చొచ్చుకొని వస్తున్న ఉగ్రవాదులను భారత్ ఎలా అరికట్టనుంది ? పలు కీలక అంశాలపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చర్చించనున్నారు. కాసేపటల్లో జరిగే సీసీఎస్ భేటీలో కేంద్ర హోం శాఖ మంత్రి, రక్షణ శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సీసీఎస్ భేటీ అనంతరం హోం, రక్షణ శాఖల అధికారులతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సమావేశం కానున్నారు.
సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాదులను సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా భారత జవాన్లు మట్టుబెట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిది. పాక్ - భారత్ సరిహద్దుల వెంబడి యుద్ధవాతావరణం నెలకొంది. సర్జికల్ దాడుల అనంతరం దేశంలో చేపట్టబోయే భద్రతపై ఆయా సమావేశాల్లో చర్చించనున్నారు. భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? దేశ అంతర్గత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? అనే దానిపై ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ? సరిహద్దులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ? తదితర కీలకాశంలపై రాజ్ నాథ్ సింగ్ కూలకంశంగా చర్చించనున్నారు. ఇప్పటికే దేశ సరిహద్దు రాష్ట్రాల్లోని గ్రామాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తాజాగా జరిగే ఈ భేటీల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకొననున్నారో వేచి చూడాలి. 

జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ చంద్రబాబు భేటీ ..

ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన స్వచ్ఛ్‌భారత్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోరాతో చంద్రబాబు మంతనాలు జరిపారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు, సర్జికల్‌ స్ట్రైక్స్‌ దాడుల వివరాలను బాబు అడిగి తెలుసుకున్నారు. కశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉందని గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోరా చంద్రబాబుకు తెలిపారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్థం..

తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అక్టోబర్ 2న అంకురార్పణ, 3న ధ్వజారోహణం, అక్టోబర్ 7న గరుడ సేవ, 10న రథోత్సవం, 11న చక్రస్నానం జరగనుందన్నారు. అలాగే 3వతేదీన ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు. కాగా... ఈ బ్రహ్మోత్సవాలను లక్షా 80 వేల మంది భక్తులు వాహన సేవలు తిలకించేలా ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు.

లంచం తీసుకుంటూ పట్టుపడ్డ మహిళా జడ్జి..

ఢిల్లీ : తీస్ హజారీ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి రచనా తివారీ లఖన్ పాల్ లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నివాసం నుంచి సోదాల సందర్భంగా రూ.94 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. జడ్జి భర్త అలోక్ లఖన్ పాల్, న్యాయవాది విషాల్ మెహన్ లను కూడా అరెస్ట్ చేశారు.

కాసేపట్లో ప్రారంభం కానున్న సీపీఎస్ భేటీ..

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఎస్ ఈరోజు మళ్లీ సమావేశం అవుతుంది. నిన్న సమావేశమైన సీసీఎస్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దాడులను దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలని నిర్ణయించింది. దాని తర్వాత ఇరు దేశాలకు ఈ విషయం వెల్లడైంది. ఈరోజు సమావేశమయ్యే సీసీఎస్ అసలు పాకిస్థాన్ ప్రతీకార దాడులకు దిగితే చేయాల్సిందేమిటో తీర్మానిస్తుంది. దాడులు జరిపిన భారత్ ఆర్మీని ప్రధాని మరోసారి అభినందిస్తారని సమాచారం. ఆర్మీని మరింత బలోపేతం చేసే చర్యలు సీసీఎస్‌లో చర్చకు వస్తాయి.

కలుషితాహారం తిని 30మందికి అస్వస్థత..

అనంతపురం : లేపాక్షి మండలం నాయినిపల్లి గ్రామంలో భోజనం వికటించి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన వీరప్ప కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. గురువారం రాత్రి అతని కుటుంబ సభ్యులు వైకుంఠ సమారాధన ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనడానికి వచ్చిన బంధువుల తిన్న ఆహరం వికటించడంతో.. సుమారు 30 మంది వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. 

ప్రారంభమైన ఎన్టీఆర్ హెల్త్ వర్శీటీలో కౌన్సెలింగ్..

విజయవాడ : ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీలో బీ-కేటగిరి మెడికల్ కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఇవాళ 150 బీ-కేటగిరి సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అయితే... ఇప్పటికే బీ-కేటగిరిలో సీట్లు పొందిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అనర్హులని ఎన్టీఆర్ హెల్త్‌ వర్సిటీ వీసీ రవిరాజ్‌ పేర్కొన్నారు. అలాగే ఎ-కేటగిరిలో మిగిలిన సీట్లకు శుక్రవారం సాయంత్రం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, సీట్లు పొందిన అభ్యర్థులకు ఇక్కడే అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని వీసీ తెలిపారు.

రెండో వికెట్ కోల్పోయిన భారత్..

కోల్ కతా : ఈడెన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ తడబడుతున్నారు. కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్లు స్వల్ప పరుగులు చేసి పెవిలియమ్ చేరారు. ఓపెనర్ విజయ్ 9 పరుగులు మాత్రమే చేసి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 13 ఓవర్లలో 32/2 పరుగులు చేసింది. పుజాారా 21, కోహ్లీ 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. స్వదేశంలో జరుగుతున్న 250వ మ్యాచ్ కావడంతో భారత్ ఈ మ్యాచ్‌ను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు..

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్ది సేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. స్వచ్ఛ భారత్ ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న వార్షికోత్సవ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, 500 అమృత్ నగరాల మున్సిపల్ కమిషనర్ లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. విజ్ఞాన్ భవన్ లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పారిశుద్ధ్య సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు.

పటాన్ చెరు ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు..

మెదక్ : జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంటిపై ఐటీ శాఖ దాడులు జరిగాయి. ఎమ్మెల్యే భూమి కొనుగోలుకు సంబంధించి వివరాలను అధికారులు సేకరించారు. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు నిర్వహించారు. నిన్న మధ్నాహ్నం నుంచి అర్థరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో సుమారు 20 మంది అధికారులు పాల్గొన్నారు.

కొండజూటూరులో 144 సెక్షన్..

కర్నూలు : పాణ్యంలోని కొండజూలూరు గ్రామంలో  ఆందోళనలు కొనసాగుతున్నాయి. నానో కెమికల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు చేపట్టిన ఆందోళన ఉదృతమయ్యింది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసులు మోహరించారు. 

10:33 - September 30, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూలోని విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ ఎఫ్ఐ నేతృత్వంలోని సామాజిక ఐక్య కూటమి ఘనవిజయం సాధించింది. అధ్యక్ష పోస్టుతోపాటు అన్ని ప్యానెల్ పోస్టులనూ యునైటెడ్‌ ఫ్రంట్‌ఫర్ సోషల్‌ జస్టిస్ కైవసం చేసుకుంది. యూనియన్‌ అధ్యక్షులుగా యూఎస్ఎఫ్ జే అభ్యర్థి కుల్‌దీప్‌సింగ్ నాగి ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి ఏబీవీపీ అభ్యర్థి గోపీకృష్ణపై 52 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. యూఎస్ఎఫ్ జే విజయంతో వర్శిటీలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మతోన్మాద, విభజన శక్తులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మొన్న జేఎన్ యూ లో, నిన్నఇఫ్లూలో, ఇవాళ హచ్‌సీయూలో సామాజిక శక్తుల విజయపరంపర
హెచ్‌సీయూలో ఎస్ఎఫ్ఐ నేతృత్వంలోని సామాజిక ఐక్య కూటమి విజయకేతనం ఎగురవేసింది. వర్సిటీలో బుధవారం జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో యూఎస్ఎఫ్ జే గెలుపొందింది. అయితే ఏబీవీపీ కూటమి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఏ ఒక్క పోస్టును దక్కించుకోలేక చతికిలపడింది. మొన్న ఢిల్లీలోని జేఎన్యఊ లో...నిన్న హైదరాబాద్‌లోని ఇఫ్లూలో...ఇవాళ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సామాజిక శక్తులే విజయం సాధించడం విశేషం.

యూనియన్‌ అధ్యక్షులుగా యూఎస్ఎఫ్ జే అభ్యర్థి కుల్‌దీప్‌సింగ్ నాగి
ఏడు రౌండ్లపాటు జరిగిన ఓట్ల లెక్కింపులో అన్ని రౌండ్లలోనూ యూఎస్ఎఫ్జే కూటమి అభ్యర్థులు ఆధిక్యత ప్రదర్శించారు. 4వేల 6 వందల 42 ఓట్లకుగానూ 3వేల 8 వందల మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూనియన్‌ అధ్యక్షులుగా యూఎస్ ఎఫ్ జే అభ్యర్థి కల్‌దీప్‌సింగ్‌ నాగి ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి ఏబీవీపీ అభ్యర్థి గోపీకృష్ణ పై విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా భూక్య సుందర్‌ ఏబీవీపీఅభ్యర్థి పై 296 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. జనరల్‌ సెక్రటరీగా సుమన్‌ డమెరా ఎన్నికయ్యారు. జాయింట్‌ సెక్రటరీగా పిల్లి విజయకుమార్ గెలుపొందారు.

వర్సిటీ ఎన్నికల విజయంపై ఎస్ ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివ హర్షం
వీటితోపాటు మూడు జీఎస్‌క్యాష్ పోస్టుల్లోనూ కూటమి అభ్యర్థులే గెలుపొందారు. 54 కౌన్సిల్‌ పోస్టులకు గానూ 37 పోస్టుల్లో యూఎస్ఎఫ్ జే అభ్యర్థులే విజయం సాధించారు. ఈ విజయం పట్ల ఎస్ ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివ హర్షం వ్యక్తం చేశారు. 

10:30 - September 30, 2016

ఢిల్లీ : కావేరీ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. తమిళనాడు రాష్ట్రానికి నీళ్లు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు..నీళ్లు విడుదల చేసే పరిస్థితి లేదని కర్నాటక..ఈ మధ్యలో కేంద్రం జోక్యం చేసుకోవడం...నీళ్లు విడుదల చేసేది లేదని కర్నాటక స్పష్టం చేయడంతో జల వివాదం కొలిక్కి వస్తుందా ? కావేరీ నది జలాల అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాడుకు రోజుకు 15 వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనితో కర్నాటక రాష్ట్రం నీటిని విడుదల చేసింది. నీటిని విడుదల చేయడం పట్ల కర్నాటక రాష్ట్రంలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి నీళ్లు తక్కువగా ఉండడంతో విడుదల చేయలేమని పేర్కొంది. అనంతరం అఖిలపక్ష భేటీ కూడా జరిపింది. తమకు తాగునీరు లేదని, సాగునీరు తమిళనాడుకు ఇవ్వలేమని కర్నాటక స్పష్టం చేస్తూ వస్తోంది.

ఉమాభారతి ఆధ్వర్యంలో సమావేశం..
దీనితో కేంద్రం జోక్యం చేసుకుంది. కేంద్ర మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమిళనాడు ముఖ్యమంత్రి తరపున పళణిస్వామి హాజరయ్యారు. ఈ సమావేశంలో కూడా ఎలాంటి నీరు ఇచ్చేది లేదని కేంద్రానికి కర్నాటక స్పష్టం చేసింది. దీనితో నేడు సుప్రీంకోర్టులో జరిగే విచారణకు కేంద్రం వాదనలు వినిపించనుంది. రెండు రాష్ట్రాలు ఏలాంటి వాదనలు వినిపించాయనే దానిపై కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించనుంది. అక్టోబర్ - డిసెంబర్ మాసాల్లో వర్షాలు పడుతాయని, తమిళనాడుకు నీరు వస్తుందని కర్నాటక పేర్కొంటోంది. రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి మోడీ జోక్యం చేసుకోవాలని ఆయా రాష్ట్రాల ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి. 

10:26 - September 30, 2016

జమ్ము కశ్మీర్ : ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ పారా కమాండోలు దాడులు నిర్వహించడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. ఈ ఘటనతో యావత్‌ ప్రపంచం దృష్టిని భారత పారా కమాండోలు ఆకర్షించారు. భారత్‌ పారా కమాండోలకు సైన్యంలో ప్రత్యేక స్థానం ఉంది. పారా కమాండోలపై ప్రత్యేక కథనం..

ఉగ్రస్థావరాలపై దాడుల చేయడంలో కీలకపాత్ర పోషించిన పారాకమాండోలు
నిన్న రాత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో పారా కమాండోలు కీలకపాత్ర పోషించారు. ఈ కమాండోలకు మన సైన్యంలో ప్రత్యేక స్థానం ఉంది. క్షణాల్లో మెరుపు దాడులు చేసి తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఈ కమెండోలు నిష్ణాతులు. ఎంపిక నుంచి శిక్షణ వరకు ప్రతి దశలో కఠినమైన వడపోత అనంతరం కమాండోలను ఎంపిక చేస్తారు.

1966లో పారాచూట్ రెజిమెంట్‌గా ఏర్పాటు
1966లో ప్రత్యేకంగా దీనిని పారాచూట్‌ రెజిమెంట్‌గా ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్నో కీలక దాడుల్లో ఈ దళం ధైర్యసాహసాలను ప్రదర్శించింది. 1978లో వీటిని ప్రత్యేక దళాలుగా మార్చారు. పదాతి దళంలోని పారాచూట్‌ రెజిమెంట్ భారత ప్రత్యేక దళాల్లో కెల్లా అతిపెద్దది. వీరి శిక్షణ కాలం అధికారికంగా మూడన్నరేళ్లు ఉంటుంది.

గ్లాక్‌ 17, పిస్టల్‌ ఆటో 9ఎంఎం 1, హెస్కలర్‌ అండ్‌ కోష్‌ఎంపీ5 సబ్‌మెషీన్‌గన్‌,
సరిహద్దులకు ఆవలవైపు ఉన్న శత్రువుల్ని వ్యూహాత్మకంగా మట్టుబెట్టడంలో పారా కమాండోలది అందెవేసిన చేయి. ఈ దళం గ్లాక్‌ 17 ఆటోమెటిక్ రైఫిల్స్, 9ఎంఎం ఫిస్టల్ , ఎంపీ5 సబ్‌మెషీన్‌గన్‌, స్టెర్లింగ్‌ సబ్‌మెషీన్‌గన్‌, ఐడబ్లూఐ టవోర్‌ సబ్‌మెషీన్‌గన్‌, ఎం4 కార్బైన్‌, ఐఎంఐ గలీల్‌ రైఫిల్‌, సీ-90సీఆర్‌-ఆర్‌బి రాకెట్‌ లాంచర్స్ వంటి అత్యాధునిక ఆయుధాలను వినియోగిస్తాయి. ఈ దళ రవాణాకు సీ-130జే సూపర్‌ హెర్క్యూలెస్‌ వ్యూహాత్మక రవాణా విమానాన్ని వినియోగిస్తారు. దీంతోపాటు ధ్రువ, చేతక్‌ హెలికాప్టర్లను వినియోగిస్తారు.

1971 భారత్‌-పాక్ యుద్ధంలో అసమాన సేవలు
పారా కమాండోస్‌ ధైర్యసాహసాలు తొలిసారి 1971లో భారత్‌ -పాక్‌ యుద్ధంలో వెలుగులోకి వచ్చాయి. ఆరుగురు జట్టు సభ్యుల బృందం పాకిస్థాన్‌లో 240 కిలోమీటర్ల లోపల ఇండస్‌, ఛార్చో ప్రాంతంలో చొరబడి మెరుపుదాడులు నిర్వహించి 473 మందిని చంపి 140 మందిని గాయపర్చింది. దీంతో పాటు శత్రువుల 35ఎంఎం శతఘ్నులను ధ్వంసం చేసి 18 మంది పాక్‌ ఎస్‌ఎస్‌జీ సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. ఒక వైమానిక స్థావరాన్ని కూడా ధ్వంసం చేశారు. మొత్తం 10 పారాచూట్‌ బెటాలియన్లలో తొమ్మిది కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్నాయి. ముషోక్‌ లోయను స్వాధీనం చేసుకోవడంలో మంచి ధైర్యసాహసాలను ప్రదర్శించాయి. వీటితోపాటు పలు కీలక ఆపరేషన్లలోనూ ఇవి పాల్గొన్నాయి.

ఆపరేషన్ బ్లూస్టార్‌తో స్వర్ణదేవాలయానికి ఉగ్రవాదుల నుంచి విముక్తి
ఆపరేషన్‌ బ్లూస్టార్‌లో దాదాపు 80 మంది పారా కమాండోలు పాల్గొని స్వర్ణదేవాలయానికి ఉగ్రవాదుల నుంచి విముక్తి కల్పించారు. ఈ ఆపరేషన్‌లో దళానికి కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. అలాగే శ్రీలంకలోని మూలై ప్రాంతంలో పారాకమాండోస్‌ హెలికాప్టర్లను ఉపయోగించి చేసిన దాడిలో దాదాపు 200 మంది ఎల్‌టీటీఈ సభ్యులు మృతి చెందారు.

ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పడంలో పారా కమాండోల కీలక పాత్ర
ఆపరేషన్ కాక్టస్‌ పేరుతో భారత్‌ సమీప దేశమైన మాల్దీవుల్లో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ తమిళ ఈలం చెలరేగినప్పుడు 50 సభ్యుల పారా కమాండోల బృందం రంగంలోకి దిగి ఆ దేశ అధ్యక్షుడితో సహా పలువురిని రక్షించింది. ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించింది. పారా కమెండోలకు.. సైన్యంలోని ఇతర విభాగాల కంటే ప్రత్యేకంగా మెరున్ క్యాప్ ధరిస్తారు. యూనిఫాంపై బలిదాన్ పేరుతో సింబల్ ఉంటుంది. ఈ గుర్తు ద్వారా... దేశం కోసం ప్రాణాలిచ్చేందుకు ఎప్పుడు సిద్ధమని వారు చెప్పకనే చెబుతుంటారు.

10:14 - September 30, 2016
10:13 - September 30, 2016

హైదరాబాద్ : సంపన్నులు నివాసం ఉండే బంజారాహిల్స్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో జేఆర్ కే బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ లోని రెండో అంతస్తులో ఓ సాఫ్ట్ వేర్ కార్యాలయం ఉంది. శుక్రవారం ఒక్కసారిగా మంటలు..పొగలు రావడంతో స్థానికులు గమనించారు. వెంటనే ఈ సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు ఫైరింజన్లతో చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మంటలు..పొగలు వస్తుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భవంతిలో ఉన్న వారు కూడా బయటకు పరుగులు తీశారు. ఘటన జరిగిన సమయంలో సాఫ్ట్ వేర్ కార్యాలయంలో నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరంతా క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. 

10:11 - September 30, 2016

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్డు నెం -12 లోని బహుళ అంతస్తుల భవనంలో సాప్ట్ వేర్ కార్యాలయంలో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు ఫైరింజన్లలో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలార్పుతున్నారు. ఉదయం 9గంటల ప్రాంతంలో జేఆర్ కే బిల్టింగ్ లోని రెండవ అంతస్థులో వున్న సాఫ్ట్ వేర్ కార్యాలయంలో ఈ ప్రమాదం సంభవించింది. అగ్రిప్రమాదం సంభవించిన సమయానికి కార్యాలయం లోపల నలుగురు సిబ్బంది వున్నట్లుగా తెలుస్తోంది. వారిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా బైటకు తరలించినట్లుగా సమాచారం.

కాల్పుల ఒప్పందానికి పాక్ తూట్లు..

జమ్ము కశ్మీర్ : జమ్మూకశ్మీర్: భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన తర్వాత కూడా పాకిస్థాన్ సైన్యానికి బుద్ధి రావడం లేదు. తన పాత పద్దతిని కొనసాగిస్తూ సరహద్దుల్లో కాల్పులు జరుపుతోంది. గత 48 గంటల్లో ఐదో సారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూకశ్మీర్‌లోని అఖ్‌నూర్ సెక్టార్‌లో పాక్‌సైన్యం ఈ ఉదయం కాల్పులు జరిపింది. అయితే ఈ కాల్పుల్లో భారత సైనికులెవ్వరూ గాయపడలేదు. వెంటనే అప్రమత్తమైన సైన్యం ప్రతిదాడులకు దిగింది. నిన్న పూంచ్ సెక్టార్‌లో కూడా ఇదే తరహాలో కాల్పులు జరిగాయి.

09:47 - September 30, 2016

ఆర్మీ ప్రాంతాల్లో ఆంక్షలు..

హైదరాబాద్ : నగరంలో ఆర్మీ ఉన్న ప్రాంతాల్లో శుక్రవారం నుంచి ఆంక్షలు విధించారు. భారత్- పాకిస్తాన్‌ల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపధ్యంలో ఈ ఆంక్షలను విదించినట్లు సమాచారం. ఇప్పటికే నగరంలోని నాగమందిర్‌, లాలాపేట్‌, ఏఓసీ రహదారులను మూసివేశారు. అలాగే కంటోన్మెంట్‌లో ఆర్మీ పాసులు ఉన్నవారికే అనుమతి ఇస్తున్నారు. పాసులు లేని వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆర్మీ అధికారులు సూచిస్తున్నారు.

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం..

హర్యానా : భీవాని జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రక్కును బొలెరో వాహనం ఢీకొనడంతో 9 మంది దుర్మరణం చెందగా 12 మంది గాయపడ్డారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

హైదరాబాద్ : నగరలలోని అల్వాల్ హకీంపేట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనం పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

09:33 - September 30, 2016

రంగారెడ్డి : ఎయిర్ ఇండియా విమానంలో ఓ బ్యాగ్ లభ్యమయ్యింది. దుబాయ్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం బాత్రూమ్ లో వున్న ఓ బ్యాగ్ లో 700ల ఆర్ ఎండీ గుట్కా ప్యాకెట్స్,8ఐ ఫోన్స్,4ఐ పాండ్స్, 5కిలోల ఇరానియం పౌడర్ వున్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

09:31 - September 30, 2016

విజయవాడ : రొటీన్‌ పాలన వద్దు.. కొత్తగా ఆలోచించండి. సమన్వయంతో పనిచేసి సమస్యలకు చెక్‌పెట్టండి. ఇదీ విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సుల్లో ఉన్నతాధికారులు ప్రదర్శించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన స్పందన. జిల్లాల ప్రగతిపై కలెక్టర్లు, మంత్రులు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.
కలెక్టర్ల సదస్సుల్లో సీఎం చంద్రబాబు నిర్దేశం
మాటలొద్దు.. పని చూడండని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. విజయవాడలో రెండోరోజు కలెక్టర్ల సదస్సుల్లో చంద్రబాబు మాట్లాడారు. జిల్లాల్లో పరిపాలనను కొత్తపుంతలు తొక్కించాలని కలెక్టర్లకు సూచించారు.

శ్రీకాకుళంజిల్లా వెనుకబాటుపై సీఎం ఆందోళన..!
జిల్లాల రిపోర్టును పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్ ద్వారా చూసిన సీఎం .. శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుపై ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాలు కూడా అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. వెనుకబడిన జిల్లాల్లో విద్యా, వైద్యం, ఆరోగ్యం, సామాజిక రంగాల్లో వృద్ధిరేటు పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లకు సూచించారు. దీనిపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని వేస్తున్నట్టు సీఎం తెలిపారు. అభివృద్ధి ర్యాంకుల్లో మొదటి వరసలో విశాఖ, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు ఉండగా.. చివరినుంచి శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాలు ఉన్నాయి.

రైతుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ : చంద్రబాబు
రైతుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. నీరు ప్రగతి గ్రామీణ ఉపాధి హామీపై చర్చించారు సీఎం. ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానం అమలుపై విద్యాశాఖ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశీ విద్యా పథకం, మీకలలు సాకారం అనే ప్రచార పత్రాన్ని సీఎం ఆవిష్కరించారు. నవ్యాంధ్రప్రదేశ్‌ అవసరాలకు తగినట్టుగా విద్యాలయాలు ఎలా ఉండాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు.

సీఎస్ టక్కర్ పై కలెక్టర్ల ఆగ్రహం
సమావేశంలో మాట్లాడిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ కొందరు కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మొత్తానికి రెండోరోజు సమావేశంలో కన్విన్స్‌చేసే పద్ధతి మానుకుని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని కలెక్టర్లకు, జిల్లా ఇంచార్జి మంత్రులకు సూచించారు చంద్రబాబు. ఈ కార్యక్రమానికి డీజీపీ, పోలీస్‌ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

09:27 - September 30, 2016

ఢిల్లీ : భారత్ - పాక్ సరిహద్దు..ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియడం లేదు..సరిహద్దుల వెంబడి భారత బలగాలు మోహరించాయి.. రేఖకు సమీపంలో నివాసం ఉండే గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఒక్కసారిగా పరిస్థితి మారిపోవడంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు సంభవిస్తోయో తెలియడం లేదు. ఉరిలో ఉగ్రవాదులు జరిపిన దాడిని భారత్ సీరియస్ గా తీసుకుంది. 18 మంది జవాన్లు వీరమరణం పొందడాన్ని తీవ్రంగా పరిణమించింది. జవాన్ల వీరమరణం వృధా కానియ్యమని భారత్ పేర్కొంది. అనంతరం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు నిర్వమించినట్లు ఆర్మీ డీజీఎంవో ప్రకటించడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికంటే ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వ్యవహరాలపై అత్యున్నత సమావేశం నిర్వహించారు. ఉగ్రవాద శిబిరాలపై చేపట్టిన దాడులపై కూలంకుశంగా చర్చించారు. దీనికి సంబంధించిన విషయాలను దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రముఖులకు తెలియచేసింది. సాయంత్రం అఖిలపక్ష భేటీ నిర్వహించి ఘటనకు సంబంధించిన కారణాలు తెలియచేసింది. భారత సైన్యానికి అఖిలపక్షం మద్దతు తెలిపింది. ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా కేంద్రం తీసుకొనే చర్యలకు మద్దతు తెలియచేసింది. ఇదిలా ఉంటే భారత్ జరిపిన సర్జికల్ దాడులపై పాక్ స్పందించింది. అలాంటి దాడులు జరగలేదని ఒకసారి..దాడులను ఖండించడం వంటివి చేసింది.

ఈ రోజు కూడా భారత్ లో అత్యున్నత సమావేశాలు..
మరోవైపు ఈ రోజు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీతో ప్రధాన మంత్రి మోడీ భేటీ కానున్నారు. ఉగ్రమూకలపై సర్జికల్ దాడుల అనంతరం దేశంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించనున్నారు. అనంతరం హోం, రక్షణ శాఖల అధికారులతో రాజ్ నాథ్ భేటీ కానున్నారు.
భారత బలగాలు అప్రమత్తం..

అప్రమత్తమైన భారత బలగాలు..
ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడుల అనంతరం భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు రేఖ వెంబడి భారీగా బలగాల మోహరింప చేశారు. సరిహద్దు గ్రామాలను సైన్యం ఖాళీ చేయించింది. సాంబ, ఆర్ఎస్ పుర సెక్టార్ల నుండి 20 వేల మందిని తరలించారు. తరలించిన స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పంజాబ్ రాష్ట్రం ఆయా జిల్లాలకు కోటి రూపాయల నిధులను మంజూరు చేసింది.

మరో జవాన్ వీరమరణం..
ఇదిలా ఉంటే మరోసారి అర్ధరాత్రి అంకూర్ సెక్టార్ లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మరోసారి ఉల్లంఘించింది. భారత జవాన్లపై కాల్పులకు తెగబడింది. ఇందులో జవాన్లకు ఎలాంటి అపాయం కలగలేదని తెలుస్తోంది. ఉరి ఘటనలో మరో జవాన్ వీరమరణం పొందాడు. దీనితో దాడి ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. చికిత్స పొందుతూ మరో జవాన్ రాజ్ కిశోర్ సింగ్ శుక్రవారం ఉదయం వీరమరణం పొందాడు.

పాక్ లో కూడా అత్యున్నత సమావేశాలు..
పాకిస్తాన్ లో కూడా అత్యున్నత సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నేతృత్వంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. రెండు దేశాలు సమన్వయంగా ఉంటూ సమస్యను పరిష్కరించుకోవాలని ఐరాస సూచిస్తోంది. సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిన పరిణామాలను భారత్ ఆయా దేశాలకు సమాచారం అందిస్తోందని తెలుస్తోంది. ఎలాంటి తప్పిదం లేకుండా ఉండాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి భారత్ - పాక్ సరిహద్దులో ఓ టెన్షన్ వాతావరణం నెలకొంది. 

సాఫ్ట్ వేర్ కార్యాలయంలో అగ్రిప్రమాదం..

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్డు నెం -12 లోని బహుళ అంతస్తుల భవనంలో సాప్ట్ వేర్ కార్యాలయంలో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లలో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలార్పుతున్నారు.

ఉరీ ఘటనలో పెరిగిన జవాన్ల మృతుల సంఖ్య..

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడిన మరో జవాను మృతి చెందాడు. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ... జవాను నాయక్‌ రాజ్‌కిశోర్‌సింగ్‌ శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. దీంతో ఉరీ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. 48గంటల్లో పాక్‌ బలగాలు ఐదోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. జమ్ముకశ్మీర్‌, అఖ్నూర్‌లో పాకిస్థాన్‌ బలగాల కాల్పులు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వద్ద నిన్న తెల్లవారుజామున భారత బలగాలు జరిపిన మెరుపు దాడి నేపథ్యంలో సరిహద్దులో యుద్ధవాతావరణం నెలకొంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

కోల్‌కతా: ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. లార్డ్స్‌ తరహాలో ఈడెన్‌లో ఈసారి ప్రత్యేకంగా గంట ఏర్పాటు చేశారు. గత 12 టెస్టుల్లో 10 విజయాలతో జోరుమీదున్న భారత్‌ ఈడెన్‌లో విజయం సాధిస్తే అగ్రస్థానానికి చేరుకోనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉంది.

09:19 - September 30, 2016

రంగారెడ్డి : పెద్దఅంబర్‌పేట వద్ద ఆగివున్న ఓ లారీని బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ప్రయాణికుల్లో ఒకరు మరణించగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం నుండి హైదరాబాద్ వస్తూండగా ఆ ప్రమాదం చోటు చేసుకుంది.

09:17 - September 30, 2016

ఓ వైపు వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, మరోవైపు విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశం కౌలు రైతుల సమస్యలను మరోసారి ఎజెండా మీదకు తీసుకొచ్చాయి. కౌలు రైతులకు బ్యాంక్ లు రుణాలివ్వకపోవడాన్ని ఆర్ బిఐ దృష్టికి తీసుకెళ్లే ఆలోచనతో ఏపి రాష్ట్ర ప్రభుత్వం వుంది. మరోవైపు వర్షాలకు దెబ్బతిన్న కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది.

అదుపు తప్పిన వర్షాలు..కుదేలైన కౌలు రైతులు
కౌలు రైతులను సమస్యలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఒకసారి బ్యాంక్ లు, మరోసారి ప్రకృతి, ఒక్కొక్కసారి రెండూ కలిసి జాయింట్ గా వెక్కిరిస్తూనే వున్నాయి. ఈ ఏడాది వర్షాలు అదునుతప్పాయి. ఆగస్టులో వానలు ముకం చాటేయడంతో అనేక చోట్ల పంటలు ఎండిపోయాయి. అనంతపురం జిల్లాలో వేరుసెనగ పంటను రక్షించేందుకు వాటర్ గన్స్ ఉపయోగించాల్సి వచ్చింది. వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయని బాధపడుతున్న సమయంలో గత వారం చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈ వానలు కొన్ని చోట్ల మేలు, మరికొన్ని చోట్ల కీడు చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల 34వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ లో 600 కోట్ల రూపాయల విలువైన పంటలు దెబ్బతిన్నట్టు రైతు సంఘాలు అంచనా వేస్తున్నాయి. గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండున్నర లక్షల ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి, మినుము మొదలైన పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయినవారిలో 90శాతం మంది కౌలు రైతులు. వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరికి బ్యాంక్ రుణాలు పుట్టకపోవడంతో ప్రయివేట్ వ్యాపారుల దగ్గర వడ్డీలకు తెచ్చుకున్నారు. ప్రభుత్వాలు నష్టాన్ని అంచనా వేసేటప్పుడు కౌలు రైతుల సమస్యలను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి వుంటుంది. లేదంటే వారు అప్పుల వలయంలో కూరుకుపోయే ప్రమాదం వుంది.

అమలు కాని కౌలు రైతుల చట్టం
కౌలు రైతులకు బ్యాంక్ రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలు, రాయితీలు అమలు చేసేందుకు వీలుగా 2011లో ప్రత్యేక చట్టం తెచ్చినా అది సక్రమంగా అమలుకాకపోవడం వీరికి శాపంగా మారుతోంది. గుర్తింపు కార్డులివ్వడంలో అలసత్వం జరుగుతోంది. దీంతో కౌలు రైతులు పొందలేక పోతున్నారు. ప్రకృతి పగబట్టినప్పుడు వీరి పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోంది. కౌలు రైతులకు బ్యాంక్ రుణాలివ్వడం లేదన్న విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వుంది. 

ఆక్నూర్ సెక్టార్ లో పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : ఆక్నూర్ సెక్టార్ లో అర్ధరాత్రి భారత జవాన్లపై పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. ఉగ్రవాద శిబిరాలపై సర్జికట్ దాడుల అనంతరం పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. 48 గంటల్లో 5 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. 

09:13 - September 30, 2016

కౌలు రైతుల కష్టాలు తీరడం లేదు. బ్యాంక్ లు రుణాలివ్వడంలేదు. దీంతో ఆర్ బిఐ కి ఫిర్యాదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు గత వారం కురిసిన వర్షాలకు కౌలు రైతులకు భారీగా నష్టపోయారు. వీరికి నష్టపరిహారం అందడం సందేహస్పదంగా మారింది. వర్షాలకు పంటలు నష్టపోయిన కౌలు రైతులను ఆదుకునే మార్గాలేమిటి? బ్యాంక్ రుణాల సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నేత జమలయ్య విజయవాడ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

నేడు నవాజ్ షరీఫ్ అత్యున్నత సమావేశం..

పాకిస్తాన్ : నేడు భారత్ సర్జికల్ స్ట్రైక్స్ పై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఉగ్రవాద శిబిరాలపై భారత్ జవాన్లు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. 

భారత బలగాలు అప్రమత్తం..

ఢిల్లీ : ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడుల అనంతరం భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు రేఖ వెంబడి భారీగా బలగాల మోహరింపు. సరిహద్దు గ్రామాలను సైన్యం ఖాళీ చేయించింది. సాంబ, ఆర్ఎస్ పుర సెక్టార్ల నుండి 20 వేల మందిని తరలించారు. 

భద్రతా వ్యవహారాలపై నేడు మోడీ సమీక్ష..

ఢిల్లీ :  నేడు భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీతో ప్రధాన మంత్రి మోడీ భేటీ కానున్నారు. ఉగ్రమూకలపై సర్జికల్ దాడుల అనంతరం దేశంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించనున్నారు. అనంతరం హోం, రక్షణ శాఖల అధికారులతో రాజ్ నాథ్ భేటీ కానున్నారు. 

 

09:09 - September 30, 2016

హైదరాబాద్ : కొత్తజిల్లాల కసరత్తు ఫినిషింగ్‌ స్టేజ్‌కు వచ్చింది. నిన్నటిదాకా భారీ వర్షాలతో నెలకొన్న పరిస్థితుల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉంటే.. రెవెన్యూలో ఓ సెక్షన్‌ అధికారులు మాత్రం దసరా పండుగ నుంచి కొత్తజిల్లాల్లో పాలన సాగించేలా అన్నిపనులను చక్కబెట్టేస్తున్నారు.

పూరైన కసరత్తు
కొత్తజిల్లాలపై ప్రభుత్వం కసరత్తు దాదాపుగా పూర్తి చేసింది. ఇప్పటికే కార్యాలయాల కేటాయింపుతోపాటు మౌలికసదుపాయాలు కూడా కల్పించారు. ఇక సిబ్బంది , అధికారుల సర్దుబాటుపై దృష్టిపెట్టిన సర్కార్‌.. జిల్లా అధికారులతో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తోంది.

సీఎస్‌ రాజీవ్‌శర్మ కొత్తజిల్లాల కసరత్తులో బిజీ

ఇప్పటికే సీఎస్‌ రాజీవ్‌శర్మ కొత్తజిల్లాల కసరత్తులో బిజీగా ఉన్నారు. జిల్లాల వారీగా కలెక్టర్లతో భేటీలు నిర్వహిస్తూ.. కొత్త జిల్లాలకు యంత్రాంగాన్ని కేటాయించడంపై దృష్టిపెట్టారు. ఇక ప్రభుత్వం నుంచి ఫైనల్‌ నోటిఫికేషన్‌ రావడమే ఆలస్యం.. అధికారుల కేటాయింపు, కొత్తగా సిబ్బంది నియామకానికి సంబంధించిన అన్నిపనులు చకచకా కానిచ్చేయాలని సీఎస్‌ రాజీవ్‌ర్మ ఉన్నతాధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.

కొత్తజిల్లాల కసరత్తును స్పీడప్‌
నిన్నటిదాకా భారీవర్షాలతో ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వర్షాల పరిస్థితులపైనే దృష్టిపెట్టాల్సి వచ్చింది .అయితే ప్రస్తుతం భారీవర్షాలు కొంత శాంతించడంతో..ఇక కొత్తజిల్లాల కసరత్తును స్పీడప్‌ చేశారు. జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాల స్వీకరణ కూడా 21వ తేదీతోనే ముగియడంతో..ఇక ఆల్‌పార్టీ భేటీ కూడా ఉండదంటున్నారు రెవెన్యూ అధికారులు.

నోటిఫికేషన్ ఫైనల్
అన్నిపనులు పూర్తివుతుండడంతో అక్టోబర్‌ 7న కొత్త జిల్లాలపై ఫైనల్‌ నోటిఫికేషన్‌ అని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ముందునుంచి చెబుతున్నట్టు అక్టోబర్‌ 11నుంచి కొత్తజిల్లాల నుంచే పాలన మొదలవడం ఖాయం అంటున్నారు ఉన్నతాధికారులు. 

09:03 - September 30, 2016

ముంబై : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆర్మీ దాడుల ప్రభావం.. పాకిస్థాన్‌నే కాదు.. ముంబై, కరాచీ స్టాక్‌మార్కెట్లను వణికించింది. సైన్యం ప్రకటన వెలువడ్డ కాసేపట్లో బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లోని కీలక సూచీ సెన్సెక్స్ 572 పాయింట్లు పతనమైంది. అటు కరాచీ మార్కెట్ కూడా 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకు సెన్సెక్స్‌ 465 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. అటు రూపీ కూడా 38 పైసలు క్షీణించింది.

సూచీలపై తీవ్ర ప్రభావం
నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రస్థావరాలపై దాడులు చేపట్టినట్లు సైన్యం చేసిన ప్రకటన.. దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆరంభంలో లాభాల్లోనే ట్రేడ్‌ అయినప్పటికీ.. సైన్యం ప్రకటనతో ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. మదుపర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్‌ ఓ దశలో 572 పాయింట్ల నష్టంతో ట్రేడ్‌ అయింది. అటు నిఫ్టీ కూడా 8600 కిందకు పడిపోయింది. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 465 పాయింట్లు కోల్పోయి.. 27,827 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 154 పాయింట్ల నష్టంతో 8,591 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఆటో, రియల్టీ రంగాలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. చిన్న షేర్లూ కుప్పకూలాయి.

7.57శాతం నష్టపోయిన బీహెచ్‌ఈఎల్‌
ఎన్ ఎస్ ఈ నిఫ్టీలో బీహెచ్‌ఈఎల్‌ భారీ నష్టాలను చవిచూసింది. ఈ కంపెనీ షేర్లు 7 శాతానికి పైగా పడిపోయింది. అదానీపోర్ట్స్‌, అరబిందో ఫార్మా, హిండాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్... 4శాతానికి పైగా నష్టపోయాయి. భారతీ ఇన్‌ఫ్రా టెల్, టీసీఎస్‌, జీ ఎంటర్‌ టైన్‌మెంట్ షేర్లు మాత్రమే స్వల్ప లాభాలు చూశాయి. గత మూడునెలల్లో ఇదే అతి భారీ పతనం.

38 పైసల నష్టంతో 66.85 వద్ద ముగిసిన రూపీ
అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి.. 38 పైసల నష్టంతో 66.85 కు పడిపోయింది. ఒక దశలో 45పైసలకు పైగా నష్టపోయింది. బ్రెగ్జిట్ ఉదంతం తరువాత రూపాయి ఈ స్తాయిలో పతనం కావడం ఇదే మొదటి సారని ఫారెక్స్ మార్కెట్ ఎనలిస్టులు విశ్లేషించారు.

08:59 - September 30, 2016

జమ్ము కశ్మీర్ : ఉగ్రమూకల పీచమణచేందుకు భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పొంచి ఉన్న నరహంతక టెర్రిరిస్టులను ఏరిపారేసేందుకు సర్జికల్ దాడులతో ముందుకు పోయింది. ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తూ.. కయ్యానికి కాలు దువ్వే పాక్‌కూ హెచ్చరికలు జారీ చేసింది. ఆ సర్జికల్ స్ట్రయిక్స్‌ అంశమే ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ అంటే ఏమిటి..?

పక్కా ప్రణాళికతో సైన్యం లక్షిత దాడులు
సర్జికల్ స్ట్రయిక్స్‌... అంటే నిర్దేశిత లక్షాలపై దాడులు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రమూకలను తుద ముట్టించేందుకు.. భారత సైన్యం ఎంచుకున్న మార్గమే ఈ సర్జికల్ స్ట్రైక్స్. ఇపుడిదే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరూ ఈ దాడుల గురించే మాట్లాడుకుంటున్నారు. సర్జికల్ దాడులను సైన్యం పక్కా ప్రణాళికతో నిర్వహిస్తుంది. ఎక్కువ విధ్వంసం జరగకుండా కచ్చితమైన వ్యూహంతో ఎంపిక చేసుకున్న ఉగ్ర స్థావరాలపై నిశితంగా దాడులు చేయడాన్ని సర్జికల్‌ స్ట్రయిక్స్‌ అంటారు. దీంతో పరిసర ప్రాంతాలకు, సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉంటుంది. కేవలం దాడి చేయాలనుకున్న లక్ష్యం మీదనే గురిచూసి సైన్యం దాడి చేసి ధ్వంసం చేస్తుంది. అంటే ఉగ్రస్థావరాలను గుర్తించి పక్కాగా వాటి పైనే దాడులు చేసి ధ్వంసం చేస్తారు. జనావాసాలు ఎక్కువగా ఉన్నచోట దాడులు చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధానం ఉపయోగపడుతుంది.

సర్జికల్ దాడులకు సైన్యం ప్రత్యేక బృందాలు
సర్జికల్ దాడులకు సైన్యం ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తుంది. భారత త్రివిధ దళాల్లోనూ ఇందుకోసం ప్రత్యేక బృందాలున్నాయి. నిర్దేశిత ప్రాంతంలోకి సైనికులను చేరవేయడానికి వాయు మార్గం ఉపయోగిస్తారు. అంటే హెలికాప్టర్ల ద్వారా సైన్యాన్ని పంపించి మెరుపు దాడి చేసి శతృవును తుదముట్టిస్తారు. కొన్ని సందర్భాల్లో వైమానిక దాడులు కూడా చేస్తారు. ఈ దాడులకు ఇంటెలిజెన్స్‌ విభాగాలు, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రా.. లాంటి సంస్థలు అందించే సమాచారం కీలకంగా ఉపయోగపడుతుంది.

పరిసర ప్రాంతాలకు, సాధారణ పౌరులకు నష్టం వాటిల్లకుండా దాడులు
గతేడాది కూడా భారత సైన్యం మయన్మార్‌లో ఈ తరహా దాడులకు పాల్పడింది. మణిపూర్‌లో సైనికులపై తిరుగుబాటుదారులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టన బెట్టుకోవడంతో భారత సైన్యం గట్టి సమాధానమిచ్చింది. ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి మయన్మార్‌లో దాక్కున్న 38 మంది నాగా తిరుగుబాటుదారులను అంతం చేసింది. ఈ ఆపరేషన్‌ మొత్తం కేవలం 40 నిమిషాల్లో పూర్తిచేశారు. లక్షిత దాడులతో సాధారణ పౌరులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా సైన్యం ఆచితూచి అడుగులు వేస్తుంటుంది. 

08:38 - September 30, 2016

ఢిల్లీ : భారత దళాల సర్జికల్ స్ట్రైక్స్ విషయం బయటకొచ్చిన తర్వాత భారత్-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గురువారం నుండీ ఉద్రిక్తతలు క్షణక్షణం పెరుగుతూనే ఉన్నాయి. ఏ క్షణాన్నైనా యుద్ధం జరిగే అవకాశమున్నట్టుగా సరిహద్దు వాతావరణం మారిపోయింది. ఈ నేపథ్యంలో దేశ సరిహద్దు తీరం వద్ద భారత్ ఆర్మీ భారీగా బలగాలను మోహరించింది. భారత్ సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా వాగా బార్డర్ లో బీటింగ్ రీట్రీట్ పరేడ్ రద్దు చేశారు. సరిహద్దు ప్రాంతాలలకు పర్యాటకులకు అనుమితిని నిరాకరించారు. సరిహద్దు జిల్లాల అవసరానికి ఒక్కో జిల్లాలకు రూ.కోటి రూపాలయలు విడుదల చేశారు. ఉరీ ఉగ్రవాద దాడిలో జవాన్ల మృతుల సంఖ్య 19కి చేరింది. సెప్టెంబర్ 18న కశ్మీర్ అక్నూర్ సెక్టార్ లోని భారత్ హెడ్ క్వార్టర్స్ పై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో భారత్ జవాన్లు 18మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారికి చికిత్స నందిస్తున్నారు. దాడి గాయపడి చికిత్స పొందుతున్న మరోజవాను నాయక్ రాజ్ కిషోర్ సింగ్ మృతి చెందారు. పాక్ దొంగదెబ్బకు ప్రతీకారంగా గురువారం అర్థరాత్రిసమయంలో పాక్ స్థావరాలపై భారత్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ తో దెబ్బకు దెబ్బ తీసింది. దీనిపై గురువారం అత్యున్నతస్థాయి సమావేశాన్ని పాక్ ప్రధాని నవాజ్ నిర్వహించనున్నారు. సర్జికల్ దాడుల అనంతరం ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టాలన్న అంశంపై చర్చించనున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ సీసీఎస్ భేటీ జరుగనుంది. ఉగ్రదాడులు జరగొచ్చనే వార్తలతో అప్పమత్తమైన పంజాబ్ సర్కార్ డాక్టర్లు, సైనికాధికారులకు సెలవులను రద్దు చేసింది. 

భారత్ యుద్ధంలో సేవలందిస్తానంటున్న కాంగ్రెస్ నేత..

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి భారతీయుడి గుండెను హత్తుకునే ప్రకటన చేసి ఆకట్టుకున్నారు. 20 ఏళ్లు భారత వాయుసేనలో మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ గా సేవలందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ కదనోత్సాహంతో ఉన్నారు. తన అంచనా ప్రకారం భారత్ కు ప్రస్తుతం కష్టకాలమని, యుద్ధం దేనికీ పరిష్కారం కాదని చెప్పారు. అయితే అస్థిర పాకిస్థాన్ తో యుద్ధం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని, పాకిస్థాన్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టమని అన్నారు. దీంతో యుద్ధం వస్తుందనే అంచనా వేస్తున్నానని ఆయన తెలిపారు.

ఏపీలో కియా మోటార్స్!..

విజయవాడ : హ్యుందయ్ సోదర సంస్థ కియా మోటార్స్ నవ్యాంధ్రలో కార్ల పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు వచ్చింది. భారీ పెట్టుబడులతో అనంతపురం, లేదంటే నెల్లూరు జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. గురువారం కియా సంస్థ వైస్ ప్రెసిడెంట్ చెచీల్ స్ర్పాగ్ర్యూ, మరికొందరు ప్రతినిధులతో కలిసి అనంతపురంలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఈ సంస్థను ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించింది. చంద్రబాబు ఆహ్వానానికి కియా అప్పట్లో సానుకూలంగా స్పందించింది. 

అనంత ఎస్పీని మెచ్చుకున్న చంద్రబాబు..

విజయవాడ : ఈ సందర్భంగా సీసీటీవీల వినియోగంతో అనంతపురంలో నేరాలు ఎలా అదుపు చేసిందీ ఎస్పీ రాజశేఖర్‌బాబు వివరించారు. ఆయన చెప్పిన తీరుకు ముగ్ధుడైన చంద్రబాబు శభాష్ అంటూ కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీటీవీల ఏర్పాటుకు అవసరమైన నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.విజయవాడలో గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష సందర్భంగా ఎస్పీ ప్రజంటేషన్ కు సీఎం ప్రసంశల జల్లు కురిపించారు.

నేడు 10రైళ్లు రద్దు..

విజయవాడ : భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న సత్తెనపల్లి- పిడుగురాళ్ల మార్గంలో రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో గుంటూరు వైపు నుంచి సికింద్రాబాద్‌, హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే 10 రైళ్లను 30వ తేదీన రద్దుచేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. మరో మూడు రైళ్లను పాక్షికంగా రద్దుచేసినట్లు తెలిపింది. పిడుగురాళ్ల-రెడ్డిగూడెం-సత్తెనపల్లి స్టేషన్ల మధ్య జరుగుతున్న పునరుద్ధరణ పనుల్ని జనరల్‌ మేనేజర్‌ రవీంద్ర గుప్తా గురువారం పరిశీలించారు.

జైలు నుంచి 200 మంది పరార్!..

బ్రెజిల్: సావో పౌలోలో గల జర్థినోపోలిస్ జైలులో గురువారం జైలు నుంచి 200 మంది పరారయ్యరు. బ్రెజిల్‌లోనే సావో పౌలో పెద్ద నగరం. హాజరుకు పిలిచినప్పుడు కొంతమంది ఖైదీలు జైలు గదులకు నిప్పుపెట్టారు. ఈ సంఘటనతో చెలరేగిన అలజడిలో 200 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. 13 అడుగుల ఎత్తైన గోడను దూకి సమీపంలోని నదీతీరం వెంబడి అదేవిధంగా చెరకు పంట పొలాల నుండి ఖైదీలు పారిపోయారు.

ఢిల్లీ వెళ్ళనున్న సీఎం చంద్రబాబు..

విజయవాడ : నేడు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళనున్నారు. స్వచ్ఛ్ భారత్ సమావేవంలో చంద్రబాబు పాల్గొననున్నారు. కాగా గత రెండు రోజులుగా విజయవాడలో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. రెండు రోజులు జరిగిన సమావేశాలు ముగిసిన అనంతరం చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ స్వచ్ఛ్ భారత్ సమావేశంలో పాల్గొననున్నారు. 

తెలంగాణ భవన్ లో బతుకమ్మ వేడుకలు..

ఢిల్లీ : తెలంగాణ భవనంలో బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ పాల్గొననున్నారు. 

దసరాకు 10 స్పెషల్ ట్రైన్స్..

సికింద్రాబాద్ : దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌ - కాకినాడ పోర్టు మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమా శంకర్‌ కుమార్‌ తెలిపారు.

07:47 - September 30, 2016

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తీవ్రవాద స్థావరాలపై భారత్‌ విరుచుకుపడింది. అర్థరాత్రి తరువాత సర్జికల్‌ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 8 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. సుమారు 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్ముకశ్మీర్‌ సరిహద్దులో తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నన్న పాకిస్తాన్‌కు తగిన రీతిలో భారత్ ఆర్మీ దెబ్బకు దెబ్బ తీసింది. పక్కా సమాచారం మేరకు బుధవారం రాత్రి 12 గంటలకు సరిహద్దు నియంత్రణ రేఖ పొడవునా భారత సైన్యం 3 కిలోమీటర్ల మేర చొచ్చుకుపోయింది. ఉగ్రవాద శిబిరాలపై ప్రత్యేక పారా కమాండర్లు హెలిక్యాప్టర్‌ ద్వారా సర్జికల్‌ దాడులు జరిపారు. ఈ దాడుల్లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 8 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. 30 నుంచి 40 మంది టెర్రరిస్టులు హతమైనట్లు సమాచారం. ఈ వివరాలను రక్షణ, విదేశీ మంత్రిత్వ శాఖ తరపున డిజిఎంఓ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ రణబీర్‌సింగ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వీరయ్య (నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర్)రాకేష్(టీఆర్ఎస్ నేత) వేణు గోపాల్ రెడ్డి (బీజేపీ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకునేందుకు ఈ వీడియోను క్లిక్ చేయండి..సమగ్ర సమాచారం తెలుసుకోండి..

యూరి ఘటనలో మరో జవాన్ మృతి..

జమ్ము కశ్మీర్ : యూరి సెక్టార్ దాడి ఘటనలో మరో జవాన్ మృతి చెందారు. ఇప్పటికే 18మంది జవాన్లు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరో జవాన్ మృతి చెందారు. దీంతో జవాన్ల మృతుల సంఖ్య 19కి చేరింది. కాగా సెప్టెంబర్ 18న పాక్ దళాలు దొంగదెబ్బ తీసి యూరి సెక్టార్ పై దాడి చేసారు. ఈ ఘటనలో 18మంది జవాన్లు మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆర్మీ పాకిస్థాన్ స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి భారతదేశం యావత్తు మద్దతు పలికింది. హర్షం వ్యక్తం చేసింది.

షరీఫ్‌కు నేను చెప్తా : ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ : ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పాలనా దక్షత లేదని, భారత్ సర్జికల్ స్ట్రయిక్స్‌పై ఎలా స్పందించాలో ఆయనకు తాను చెబుతానని పాక్ మాజీ క్రికెటర్, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఎలా స్పందించాలో తనకు తెలుసనని ఈరోజు పంజాబ్ ప్రావిన్స్‌లో నిర్వహించనన్న మార్చ్‌లో ఆ విషయాన్ని చెబుతానని ఆయన పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్‌కు ప్రాథమికంగా ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పిన ఇమ్రాన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి కూడా శుక్రవారం ఓ సందేశం పంపిస్తానన్నారు.

విమానంలో బాత్రూమ్ లో బ్యాగ్?..

రంగారెడ్డి : ఎయిర్ ఇండియా విమానంలో ఓ బ్యాగ్ లభ్యమయ్యింది. దుబాయ్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం బాత్రూమ్ లో వున్న ఓ బ్యాగ్ లో 700ల ఆర్ ఎండీ గుట్కా ప్యాకెట్స్,8ఐ ఫోన్స్,4ఐ పాండ్స్, 5కిలోల ఇరానియం పౌడర్ వున్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

స్టాక్ మార్కెట్ కు 'సర్జికల్' దెబ్బ..

ముంబై: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేయడంతో డాలర్‌తో రూపాయి మారకం భారీగా క్షీణించింది. రూపాయి 39 పైసలు పతనమై 66.85 వద్ద ముగిసింది. రూపాయి 0.59 శాతం నష్టపోయింది. మూడు నెలల కాలంలో ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి. భారత్ పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్న విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ తీవ్రంగా ప్రభావితం కాగలదన్న ఆందోళన నెలకొన్నది.

లారీని ఢీకొన్న బస్..ఒకరు మృతి..

రంగారెడ్డి : పెద్దఅంబర్‌పేట వద్ద ఆగివున్న ఓ లారీని బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ప్రయాణికుల్లో ఒకరు మరణించగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నేడి నుండి దసరా సెలవులు..

హైదరాబాద్ : ప్రభుత్వం నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవుల ప్రకటించింది. శుక్రవారం నుంచి అక్టోబరు 12 వరకు పాఠశాలలు మూసివేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జి.కిషన్ తెలిపారు. పాఠశాలలు తిరిగి వచ్చేనెల 13 పున:ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Don't Miss