Activities calendar

01 October 2016

22:06 - October 1, 2016

అభిమానానికి అర్థం మారుతుంది. ఆత్మీయతకు వెలకడుతున్నారు. అనురాగానికి వెలువలేకుండా చేస్తున్నారు. యాంత్రికజీవనంలో పడి మరమనుషుల్లా మారుతున్న మనుషులు ఏం కోల్పోతున్నారో తెలుస్తోందా..? అదే తెలిస్తే ఇలా ప్రవర్తించరు. ఇలా ఉండరు కూడా... !ప్రతీ క్షణ డబ్బు, ఆస్తులు కూడబెట్టుకోవడం కోసమే బ్రతుకుతున్నారు. ఇక ప్రేమాభిమానాలను పంచుకునేదెప్పుడు..? ఒక్కసారి ఎవరివారు ప్రశ్నించుకుంటే.. వెనక్కితిరిగి చూసుకుంటే... ఏం కోల్పోతున్నామో అర్థమవుతుంది.. ఎంత పెద్ద తప్పు చేస్తున్నామో తెలుస్తుంది.. వాస్తవంలోకి రావాలి.. పేగు తెంచి జన్మనిచ్చిన కన్నతల్లి, తన జీవితాన్ని త్యాగం చేస్తూ పెంచి పెద్ద చేసిన కన్నతండ్రిని మరిచిపోతున్నారు కొందరు. ఎనిమిది పదుల వయస్సులో ఉరితాడుకు వేలాడిన ఓ వృద్ధుడి ఆత్మహత్య.... తప్పుచేస్తున్నవారికి కనువిప్పు కలిగించాలి. ఇదీ కథకాదు.. ఏ రియల్ స్టోరీ... ఓ పల్లెకు వెళ్లి చూడండీ... ఎప్పుడూ సందడిగా ఉండే ఆ పల్లే ఇప్పుడు మూగబోయింది. ఆ ఊరిని విషాదం ఆవిహించింది.. ఆ ఊరిలో ఎవరిని కదిలించినా అవే మాటలు. ఓ వృద్ధుడి మరణం వారిలో ఎంతో మార్పుతెచ్చింది. మరిన్ని అంశాలను వీడియోలో చూద్దాం... 

 

22:01 - October 1, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమవరం పరిధిలోని తుందూరు ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా పర్యటించేందుకు వెళ్లిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం చౌక్‌కు చేరుకోగానే సీపీఎం ఏపీ కార్యదర్శి మధును, ఇతర నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈఅరెస్ట్‌లకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. 
తుందూరులో పర్యటించేందుకు వెళ్లిన నేతల అరెస్ట్‌ 
ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా..నిర్వాసితులకు బాసటగా నిలిచేందుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో తుందూరులో పర్యటించేందుకు వెళ్లిన నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిర్వాసితులకు, రైతులకు బాసటగా ఎలాంటి కార్యక్రమం జరగనీయకుండా ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ బలవంతపు అరెస్టులకు పాల్పడింది. భీమవరంలో ప్రకాశం చౌక్‌కు చేరుకోగానే సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, జిల్లా కార్యదర్శి బలరాం, ఇతర నేతలను పోలీసులు  బలవంతంగా అరెస్ట్‌ చేశారు. 
పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా 
అక్రమంగా అరెస్ట్‌ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ  అఖిల పక్షం నేతలు భీమవరం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారు.  ఈ అరెస్ట్‌లకు నిరసనగా వైసీపీ, సీపీఎం నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో సీపీఎం ఏపీ కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు ఆధ్వర్యంలో వామపక్ష నేతలు ధర్నా చేపట్టారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న వామపక్ష నేతలపై చంద్రబాబు అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. 
భీమవరం ఎస్సై వైఖరిపై బాబూరావు ఆగ్రహం 
అరెస్ట్‌లకు పాల్పడ్డ భీమవరం ఎస్సై వైఖరిపై బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఎస్సై సుధాకర్‌రెడ్డినిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్రమ అరెస్ట్‌లతో ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

 

21:55 - October 1, 2016

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం.. ఇండోపాక్ సరిహద్దుల్లో టెన్షన్ కొనసాగుతూనే ఉంది. సైన్యం సన్నద్ధతను పరిశీలించేందుకు ఆర్మీ జనరల్ దల్బీర్ సింగ్ జమ్మూలో పర్యటిస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పాక్‌పై నిరసనలు, వార్నింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. అణ్వాయిధాలున్న దేశంగా బాధ్యతగా మెలగాలని అమెరికా, రాష్యా, చైనాలాంటి అగ్రరాజ్యాలు సూచించాయి. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ అయి... తాజా పరిమాణాలను వివరించారు. 
జమ్ముకశ్మీర్‌లో దల్బీర్‌సింగ్‌ పర్యటన 
భారత్‌-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. సైనికదళాల ప్రధాన అధికారి జనరల్‌ దల్బీర్‌సింగ్‌  జమ్ముకశ్మీర్‌లో పర్యటించారు.  ఉధంపూర్‌లోని నార్తర్న్‌ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. సరిహద్దుల వెంట దళాల అప్రమత్తతను ఆయన పరిశీలించారు. ఆర్మీసన్నద్ధతపై హెడ్‌క్వార్టర్స్‌లోని ఉన్నతాధికారులతో జనరల్‌ దల్బీర్‌సింగ్‌ చర్చించారు.  
ఎదుర్కొనేలా సిద్దమవుత్ను త్రివిద దళాల సైనికులు  
మరోవైపు యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వాతావరణంలో భారత్‌ సైన్యం అంతర్గతంగా సన్నద్ధతను పరీక్షించుకుంటోంది.  అత్యంత అధునాతనమైన ఆయుధాలు, ఫిరంగులతో అంబాలా కంటోన్మెంటులో త్రివిధ దళాలకు చెందిన సైనికులు  సమాయత్తం అయ్యారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అంబాలా కంటోన్మెంటులో త్రివిద దళాల సైనికులు సంసిద్ధమయ్యారు. 
ఉరీ సంఘటనలో దర్యాప్తు 
మరోవైపు ఉరీ సంఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఉరీలోని బ్రిగేడ్‌ కమాండర్‌ సోమశంకర్‌ను తొలగించిన రక్షణశాఖ అధికారులు.. అదేస్థానంలో కిలోఫోర్స్‌కి చెందిన ఎస్‌పీ అహల్వత్‌ను నియమించారు. 
పాకిస్థాన్‌ నాయకుల ప్రకటనలపై అమెరికా మండిపాటు 
ఇదిలావుంటే .. భారత్‌పై అణుదాడులకు కూడా వెనుకాడం అనే పాకిస్థాన్‌ నాయకుల ప్రకటనలపై అమెరికా మండిపడింది. నిగ్రహం పాటించాలని సలహాఇచ్చింది. అటు రష్యా అధ్యక్షుడు కూడా భారత్‌కు అనుకూల ప్రకటన చేశారు. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద గ్రూపులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని  స్పష్టం చేశారు. 
పాకిస్థాన్‌ కళాకారులపై నిర్బంధం సరికాదన్న ఏచూరి 
అటు ...పాక్‌తో సంబంధాలపై దేశంలో జరుగుతున్న పరిణామాలపై సీపీఎం స్పందించింది. పాకిస్థాన్‌తో టెన్షన్‌ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో దౌత్యపరమైన చర్చలద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో ఉన్న పాకిస్థాన్‌ కళాకారులపై నిర్బంధం సరికాదన్నారు ఏచూరి. 
మరోసారి పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘన 
ఇదిలావుంటే.. జమ్ముకశ్మీర్‌ బోర్డర్‌లో జమ్ము కశ్మీర్‌లో పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. అఖ్నూర్ సెక్టార్‌లో పాకిస్థాన్ దళాలు భారత సైనిక స్థావరాలపై కాల్పులు జరిపాయి. భారత సైనిక దళాలు ధీటుగా స్పందించాయి. 

 

21:50 - October 1, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై రాజ్‌భవన్ నుంచి ప్రెస్‌నోట్‌ విడుదలైంది. జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని.. ఆమె త్వరగా కోలుకుంటున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జయలలిత ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని గవర్నర్‌ ఆప్రకటనలో పేర్కొన్నారు. 

 

21:46 - October 1, 2016

జయలలిత ఆరోగ్యంపై తమిళనాడు రాజ్ భవన్ నుంచి ప్రెస్ నోట్ విడుదల

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై ఆ రాష్ట్ర రాజ్ భవన్ నుంచి ప్రెస్ నోట్ విడుదల అయింది. జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. 

 

ఇబ్రహీంపట్నంలో పేలుడు

హైదరాబాద్ : ఇబ్రహీంపట్నంలో పేలుడు సంభవించింది. అంబేద్కర్ చౌరస్తాలో పార్కింగ్ చేసిన నెం.ఎపి 28జీ3498 నెంబర్ గల స్కూటర్ లో పేలుడు సంభవించింది.  ఈఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

21:27 - October 1, 2016

సినీ నటుడు, ది విలన్ అజయ్ ఘోష్ తో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా అజయ్ తన సినీ కెరీర్ గురించి వివరించారు. సినిమా అనుభవాలను తెలిపారు. సినీ రంగంలోని ఒడిదుడుకులు, కష్టాలను వివరించారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:24 - October 1, 2016

సీఎల్పీ ఉప నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్కతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
'ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడలేదు. నిజంగా అవినీతికి పాల్పడితే ప్రాసిక్యూట్ చేయిడానికి కేసీఆర్ కు ఎందుకు భయం. సొమ్ములు దోచుకున్న కాంట్రాక్టర్లలో కాంగ్రెస్ వారు ఉన్నా ప్రాసిక్యూట్ చేయి. గోటితో పోయేదాన్ని కేసీఆర్ కొండంత చేస్తున్నారు. ప్రాజెక్టుల డిజైన్ మార్పు లక్షల కోట్లు దోచుకోవడానికే. ప్రాజెక్టుల అవినీతిపై త్వరలో ఆధారాలతో వస్తాం. ఆయనంటే గౌరవం జానారెడ్డిని ఉద్దేశించి ఎప్పుడు ఏమీ అనలేదు. ఉత్తమ్ విభేదాలు లేవు..ఉన్నది భేదాభిప్రాయాలు మాత్రమే. కాంగ్రెస్ లో బేదాభిప్రాయాలు కామన్. రాహుల్ పాదయాత్ర మళ్లీ ఉంటుంది. రాహుల్ యాక్షన్ ప్లాన్ పేరుతో అనుబంధ సంఘాలు పటిష్టం చేస్తాం. కేసీఆర్ మాయమాటలు నమ్మితే ప్రజలు మోసపోతారు. జిల్లాల విభజన అశాస్త్రీయం. 40 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ ను ఎందుకు విభజన చేయలేదు. హైదరాబాద్ విభజను ఎంఐఎం వద్దందా... బీజేపీ వద్దందా... వరంగల్ జిల్లాను ఎందుకు విభజిస్తున్నారు..? గద్వాల్, జనగామ జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్షంలో మేం మాట్లాడలేదు. కానీ జిల్లాల ఏర్పాటు కార్యాచరణ రాలేదని చెప్పాం... దీన్ని పార్టీలో కొందరు వక్రీకరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి బాగుంది. కాంగ్రెస్ లో ఎలాంటి కుమ్ములాటలు లేవు. కొంతమంది నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. వాటిని భిన్నభిప్రాయాలుగానే చూడాలి. భేదాభిప్రాయాలుగా చూడరాదు. అంతిమంగా ఏకాభిప్రాయంతోనే ముందుకు వెళ్తాము. ఉత్తమ్, నా మధ్య కోల్డ్ వార్ లేదు. కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటిని భేదాభిప్రాయాలుగా చూడొద్దు. జానారెడ్డి అంటే నాకు చాలా అభిమానం. సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలు' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

21:15 - October 1, 2016

హైదరాబాద్ : దర్శకుడు రాజమౌళి గుడ్‌న్యూస్‌ చెప్పేశారు. ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్ మ్యూజియంలో బాహుబలి హీరో ప్రభాస్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 2017 మార్చి నాటికి ఈ విగ్రహం బ్యాంకాక్‌లోని మ్యూజియంలో ప్రదర్శనకు సిద్ధమవుతుందని .. దీనికోసం ప్రభాస్‌ విగ్రహానమూనాకి  కావాల్సిన కొలతలు కూడా తీసుకున్నారు. ప్రపంచంవ్యాప్తంగా  ప్రముఖ వ్యక్తుల మైనపు విగ్రహాలను తయారుచేసి.. ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తారు. బ్యాంకాక్‌లోని ఈ మ్యూజియంలో ప్రస్తుతం మన దేశంనుంచి మహాత్మాగాంధీ, ప్రధాని నరేంద్రమోదీల విగ్రహాలు మాత్రమే ఉన్నాయి.  మూడో విగ్రహం ప్రభాస్‌ది అవుతుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలిసౌత్‌ఇండియా హీరో ప్రభాసే అవుతారని రాజమౌళీ తెలిపారు. 

 

21:13 - October 1, 2016

ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెంలో వస్త్ర దుకాణాన్ని సినీ నటి కాజల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాజల్‌ బతుకమ్మను తలపై పెట్టుకుని సందడి చేశారు. బతుకమ్మలను ప్రత్యక్షంగా మోయడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. షోరూం చాలా బాగుందని.. యజమానులకు అభినందనలు తెలిపారు. కాగా కాజల్‌ను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

 

21:08 - October 1, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మహిళా నేతలు ఆటపాటలతో సందడి చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కూడా పాల్గొని బతుకమ్మ ఆడారు.  తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ మహిళలు.. గర్వంగా.. గొప్పగా బతుకమ్మ పండుగను చేసుకుంటున్నారని పద్మా అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మ ముఖ్య భూమిక పోషించిందని అన్నారు.
వరంగల్‌లో.. 
వరంగల్‌లోని.. మాస్టర్జీ గర్ల్స్‌ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు..కోలాటాలు.. ఆటపాటలతో సందడి చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి.. విద్యార్థులు సంబరాల్లో పాల్గొన్నారు. పిల్లలకు.. చిన్నతనం నుంచే సంస్కృతి, సంప్రదాయాల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని స్కూల్‌ డైరెక్టర్‌ ఆశాజ్యోతి అన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు.. విలువలు కూడా తెలియజేస్తున్నామని అన్నారు.

 

20:57 - October 1, 2016

పశ్చిమగోదావరి : తుందూరు ఆక్వా ఫుడ్‌ పార్క్ నిర్మాణ గ్రామాల్లో పోలీసుల అరాచకరాజ్యం నడుస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పోలీసుల అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. పోలీసులు అడ్డుకున్నా... తుండూరు వెళ్లితీరుతామని ప్రకటించారు. ఆక్వా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈనెల 6న భీమవరంలో సభ నిర్వహిస్తామని చెప్పారు. 
 

20:55 - October 1, 2016

చెన్నై : తమిళనాడులో జయలలిత ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతోంది. ఇంఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌ రావు.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శిస్తున్నారు. జయ మంత్రివర్గం కూడా అపోలో ఆసుపత్రి వద్దే ఉంది. జయలలిత ఆరోగ్యంపై ఇప్పుడు ప్రకటన వస్తుందని అంతా భావిస్తున్నారు. ఉదయం నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలు భారీగా అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు మధ్యాహ్నం లండన్‌ నుంచి వచ్చిన డాక్టర్‌ రిచర్డ్‌... ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. 10 రోజుల నుంచి అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్నారు. ఆమె డీహైడ్రేషన్‌, ఫీవర్‌తో ఆస్పత్రిలో చేరారు. అయితే గత రెండు రోజుల నుంచి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయకపోవడంతో అందరిలోనూ టెన్షన్‌ మొదలైంది. మరోవైపు అమ్మ త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ అన్నాడీఎంకే కార్యకర్తలను వెంటాడుతోంది. 

 

రాష్ట్రపతి ప్రణబ్ ప్రధాని మోడీ భేటీ

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. సర్జికల్ దాడిపైన రాష్ట్రపతికి వివరించారు. 

రాజస్థాన్ లో పిడుగుపాటుకు ఏడుగురు మహిళలు మృతి

జైపూర్ : రాజస్థాన్ లో పిడుగుపాటుకు ఏడుగురు మహిళలు మృతి చెందారు. బరా గ్రామంలో ఘటన చోటుచేసుకుంది. 

20:42 - October 1, 2016
20:39 - October 1, 2016

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభయ్యాయి. తొలిరోజు దుర్గమ్మ శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వినాయకుని గుడి నుంచి క్యూలైన్లలో కాలినడకన అమ్మవారి దర్శించుకున్నారు. మార్గమధ్యలో భక్తుల ఇబ్బందులను గమనించి అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా మహోత్సవాలు, ఆలయ ఏర్పాట్లపై మంత్రి దేవినేని ఉమా టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

20:25 - October 1, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలోని తుందుర్రు ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా పర్యటించేందుకు వెళ్లిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీమవరం ప్రకాశం చౌక్‌కు చేరుకోగానే సీపీఎం ఏపీ కార్యదర్శి మధును పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. 
అఖిలపక్షం ఆధ్వర్యంలో పర్యటనకు వెళ్లిన నేతలు, కార్యకర్తలు 
ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా..నిర్వాసితులకు బాసటగా నిలిచేందుకు అఖిల పక్షం ఆధ్వర్యంలో తుందురు ప్రాంతంలో పర్యటించేందుకు పలు పార్టీల నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. నిర్వాసితులకు, రైతులకు బాసటగా ఎలాంటి కార్యక్రమం జరగనీయకుండా ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ బలవంతపు అరెస్టులకు పాల్పడింది. 
అఖిల పక్ష నేతలు, కార్యకర్తలు అరెస్ట్‌
తుందూరు ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చిన అఖిల పక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేశారు. వారెంట్ ఉందని చెబుతూ పోలీసులు వైసీపీ, సీపీఎం నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణా రహితంగా అరెస్ట్‌లకు పాల్పడటం దారుణమని అఖిల పక్ష నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 
మధును వెంటనే విడుదల చేయాలని కార్మికులు ఆందోళన
అక్రమంగా అరెస్ట్‌ చేసిన సీపీఎం ఏపీ కార్యదర్శి మధును వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ  ఆక్వా ఫ్యాక్టరీ వ్యతిరేకులు నిరసనకు దిగారు. భారీ ఎత్తున  భీమవరం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామన్న రైతులు, ప్రజలు బలవంతంగా అరెస్ట్‌లు చేశారు. పేద రైతులకు అండగా నిలిచేందుకు వచ్చిన నేతలను అరెస్ట్‌ చేయడం దారుణమని పలువురు అరెస్ట్‌లను ఖండించారు. 

20:18 - October 1, 2016

ఎసిబికి చిక్కిన రెడ్డిగూడెం ఎస్సై రమేష్, హెడ్ కానిస్టేబుల్

కృష్ణా : రూ.10 వేల లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు. రెడ్డిగూడెం ఎస్సై రమేష్, హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ పట్టుబట్టారు. 

 

ఇస్రో అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ

విజయవాడ : ఇస్రో అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలను సీఎం కోరారు. 

 

20:08 - October 1, 2016

నిజామాబాద్ : వారంతా విధి వంచితులు. మాయదారి జబ్బు వారి జీవితాలను దుర్భరం చేసింది. అందరూ ఉన్నా అనాథలుగా బతకాల్సిన దుస్థితి వారిది. అయిన వాళ్ల చీదరింపులు, చిత్కరాలు తట్టుకోలేకపోయారు. తలదాచుకోవడానికి నానా ఇబ్బందులు పడి చివరకు తమకంటూ ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా దేవనగర్‌ క్యాంపుపై ప్రత్యేక కథనం. 
దేవనగర్‌ లెప్రసి సొసైటీ
ఇది నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవనగర్‌ క్యాంపు..ఎన్నో బాధలు, మరెన్నో అవమానాలు తట్టుకోలేక కుష్టువ్యాధిగ్రస్తులు స్వతహాగా నిర్మించుకున్న గ్రామమే దేవనగర్‌ లెప్రసి సొసైటీ. ఇది ఊరు మాత్రమే కాదు..కుష్టురోగులను అక్కున చేర్చుకునే ఆశ్రమం కూడా. మందులతో చేసే చికిత్స కన్నా అనుబంధాలు, ఆత్మీయతలు పెనవేసుకుని జీవిస్తున్నారు. ఈ క్యాంపులో ప్రతి ఒక్కరికి ఓ ప్రేమకథ ఉంది. గాయపడిన గుండెలున్నాయి. కుష్టువ్యాధి దేహన్ని చిక్కిశల్యం చేస్తున్నా..తమకంటూ ఒకరున్నారన్న ధైర్యం వారిలో జీవితంపై ఆశలు పెంచుతోంది.  
ప్రతి హృదయం వెనుక ఓ కన్నీటిగాధ
దేవనగర్ క్యాంపులో ప్రతి హృదయం వెనుక ఓ కన్నీటిగాధ ఉంది. అంతకన్నా గుండెలనిండా ఆవేదన ఉంది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి కుష్టువ్యాధి సోకడంతో..దేవనగర్‌లో అంతా ఒక్కటిగా జీవిస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా ఐక్యంగా జీవిస్తూ సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటుతున్నారు. అయితే జిల్లాలోని డిచ్‌పల్లి ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని..ఇంటికి తిరిగివెళ్లిన వారు కూడా మళ్లీ దేవనగర్ బాటపడుతున్నారు. కారణం అక్కున చేర్చుకోవాల్సిన కుటుంబ సభ్యులు చీదరించుకోవడమే. దీంతో దేవనగర్లో ఏదో ఒక పని చేసుకుంటూ జీవితాలు వెల్లదీస్తున్నారు. క్యాంపులో కొందరు ప్రేమైక జీవితం గడుపుతున్నారు. ఒకరిపై ఒకరు మనసు పడి సహజీవనం సాగిస్తున్నారు.  
కుష్టువ్యాధిగ్రస్తులు ఉండటానికి నిరాకరించిన గ్రామస్తులు   
దేవనగర్‌ గ్రామం మొదట్లో అమృతాపూర్ గ్రామపంచాయితీ పరిధిలో ఉండేది. కుష్టువ్యాధిగ్రస్తులు తమతోపాటు ఉండటానికి గ్రామస్తులు నిరాకరించారు. గుడిసెలు తొలగించారు. అయినా మొక్కవోని దైర్యంతో కలెక్టరేట్‌ను ముట్టడించి నిరసనగళమెత్తారు. చివరికి తమ లక్ష్యాన్ని సాధించారు. ఇక ఆనాటి నుంచి గ్రామం దేవనగర్‌ లెప్రసి సొసైటీగా మారిపోయింది. వీరిలో చాలామంది భిక్షాటనతో పొట్టపోసుకుంటున్నారు. 500 పెన్షన్‌ డబ్బులు ఏ మూలకు సరిపోవడం లేదంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు చేయూత అందించాలని దేవనగర్‌ క్యాంపు వాసులు కోరుతున్నారు. 

 

19:51 - October 1, 2016

నిజామాబాద్ : వంద శాతం రాయితీతో.. ఉచితంగా మత్స్యకార్మికులకు చేప పిల్లలను అందిస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లాలోని 3250 చెరువుల్లో వేసేందుకు చేప పిల్లలు పంపిణీ చేస్తామన్నారు. అలాగే దళారులను ఆశ్రయించకుండా ఒక హెక్టారుకు రెండు వేల చేపలు చెరువులో పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  గొర్రెలు, మేకలు పెంపకందార్లకు సబ్సిడీ రుణాలు అందిస్తామని మంత్రి చెప్పారు. 

19:41 - October 1, 2016

శ్రీకాకుళం : సిక్కోలు జిల్లాలో కొబ్బరి రైతులు కుంగిపోతున్నారు. కొబ్బరికాయల ధరలు అమాంతంగా పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కొబ్బరి ధరలు గణనీయంగా తగ్గడం, కొబ్బరి దిగుబడి పూర్తిగా పడిపోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలోని 14 వేల హెక్టార్లలో కొబ్బరి రైతులు ఈ ప్రభావంతో గడ్డు పరిస్ధితులు ఎదుర్కొంటున్నారు. సిక్కోలు జిల్లాలో కొబ్బరి తోటల సోయగం కనుమరుగవుతోంది. ఓవైపు ప్రకృతి విపత్తులు..మరోవైపు పడిపోతున్న ధరలతో రైతులు కొబ్బరితోటలకు స్వస్తి పలుకుతున్నారు. 
14వేల హెక్టార్లలో విస్తరించిన కొబ్బరితోటలు
శ్రీకాకుళం జిల్లాలో 14వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు ఉన్నాయి. జిల్లాలో వరిపంట తర్వాత  కొబ్బరితొటలే ఎక్కువగా పెంచుతున్నారు. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంగా పిలిచే...కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురంతోపాటు మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో  కొబ్బరితోటలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రణస్థలం, లావేరు, గార మండలాల్లో  కూడా కొబ్బరి అందాలు పరుచుకుని ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా లక్షలాది మందిని బతికిస్తున్న కొబ్బరితోటలు ఇపుడు గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. 
గిట్టుబాటుధర లేక కొబ్బరిరైతు సతమతం
పడిపోతున్న ధరలు కూడా కొబ్బరిరైతును కంటతడిపెట్టిస్తున్నాయి. గతేడాది దసరా సమయంలో వెయ్యి కొబ్బరికాయలకు 18 వేలు పలికేతే.. ప్రస్తుతం 7వేల రూపాయలకు దిగజారింది. కొబ్బరిరైతుల కష్టాలు తీరుస్తామన్న నాయకులు హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.. మరోవైపు ఆదుకోవాల్సిన ఉద్యానవనశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 
కొబ్బరిరైతును వెంటాడుతున్న ప్రకృతి విపత్తులు 
జిల్లాపై ప్రతిఏటా విరుచుకుపడుతున్న తుఫానులతో  కొబ్బరిచెట్లు భారీసంఖ్యలో నేలకొరుగుతున్నాయి. పైగా తుఫానులకు తట్టుకుని నిలిచి చెట్లు తెగుళ్లభారిన పడ్డాయి. సంవత్సరాలపాటు కూడా కాతాపుతా లేకుండా ఉండిపోతున్నాయి. దీంతో దిగుబడిలేక రైతులు దిగాలుపడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తమను ఆదుకోవాలని సిక్కోలు జిల్లా కొబ్బరిరైతులు కోరుతున్నారు. 

19:13 - October 1, 2016

బెంగళూరు : మాజీ ప్రధాని దేవెగౌడ్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బెంగళూరులోని అసెంబ్లీ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేస్తున్నారు. తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దేవెగౌడ నిరసనకు దిగారు. తమిళనాడు-కర్నాటకల మధ్య కావేరి జలాల వివాదం నెలకొంది. ఈనెల 6 వరకు తమిళనాడుకు ఆరు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై కర్నాటకలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లో తమిళనాడుకు కావేరి జలాలు వదిలేది లేదని భీష్మిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని దేవెగౌడ కూడా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అమరణ దీక్షకు దిగారు. 

 

19:11 - October 1, 2016

తిరుపతి : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తిరుపతి పర్యటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంతో  కీలకపాత్ర పోషించిన వెంకయ్యనాయుడుకు ఇవాళ తిరుపతిలో సన్మానం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా తీసుకురావడంతో విఫలమైన వెంకయ్యనాయుడుకు సన్మానం ఏర్పాటు చేయడాన్ని వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. గత రాత్రి నుంచి సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేసి, పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. దీనిపై వామపక్ష నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో వెంకయ్యనాయుడు విఫలమయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. 

 

19:09 - October 1, 2016

తూర్పుగోదావరి : తుందూరు ఆక్వా పుడ్ పార్క్ కు నిరసనగా అఖిలపక్షం నాయకుల పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. భీమవరంలో  సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు అఖిలపక్షం నాయకులను పోలీసులు ఆరెస్ట్ చేశారు. దీంతో  భీమవరం పోలీస్ స్టేషన్ ముందు సీఐటీయూ కార్మికులు ఆందోళనకు దిగారు. సీపీఎం మధును అక్రమంగా ఆరెస్ట్ చేయడమే కాకుండా దాడి చేసిన ఎస్సై ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.  దీంతో కార్మికులను పోలీసులు ఆరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలితను పరామర్శించిన గవర్నర్ విద్యాసాగర్ రావు

తమిళనాడు : చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలితను తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు పరామర్శించారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలివస్తున్నారు. ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 

శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరంలో అల్లకల్లోలం

శ్రీకాకుళం : సముద్ర తీరంలో అల్లకల్లోలం రేగింది. సంతబొమ్మాళి మండలం పాతమేఘవరం, అల్తాడ, భావనపాడు ప్రాంతాల్లో అలలు 7 అడుగుల ఎత్తు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 

తాత్కాలిక సచివాలయానికి భద్రతపై డీజీపీ సమీక్ష

గుంటూరు : తాత్కాలిక సచివాలయానికి భద్రతపై డీజీపీ సమీక్ష చేశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సోమవారం సచివాలయం నుంచి పాలన ప్రారంభం కానున్న సందర్భంగా భద్రతపై చర్చించామని డీజీపీ సాంబశివరావు తెలిపారు.  సచివాలయానికి రెండంచెల భద్రత కల్పించామని చెప్పారు. 

 

బందర్‌పోర్టుకు భూములిచ్చేందుకు ముందుకురాని రైతులు

కృష్ణా : బందర్ పోర్టు భూ సమీకరణలో రైతుల స్పందన అసలు కనిపించడం లేదు. 33వేల ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేయగా... కేవలం నలుగురు రైతులే భూములిచ్చేందుకు ముందుకొచ్చారు. భూసమీకరణకు గడువు ఈనెల 4తో ముగియనుంది. దీంతో మరో నెల రోజుల పాటు గడువు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. 

17:38 - October 1, 2016

నిజామాబాద్‌ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లి సహా ఐదుగురు చిన్నారులు వాగులో కొట్టుకుపోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. మెదక్ జిల్లా కంగ్జి మండలం తడుకల్ గ్రామానికి చెందిన రాజు, రాజమణి దంపతులు. రాజు హెల్పర్ గా పని చేస్తున్నాడు. వీరికి ఐదుమంది సంతానం. రాజమణి గర్భవతిగా ఉంది. అయితే వైద్య పరీక్షల నిమిత్తం రాజు తన బావమరిదిని తోడుగా పంపుతూ భార్య రాజమణిని కారులో పిట్లం ఆస్పత్రికి పంపారు. తల్లితోపాటు చిన్నారులు ప్రియ, జ్యోతి, రెండేళ్ల కవలపిల్లలు, మరో 10నెలల పాప కారులో వెళ్తున్నారు. మార్గంమధ్యలో నిజమాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగాం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కానీ మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కారును అలాగే వాగులో నుంచి తీసుకెళ్లాడు. దీంతో ప్రవాహానికి వాగులో కారు కొట్టుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తల్లి సహా 5గురు పిల్లలు గల్లంతయ్యారు. తాడు సహాయంతో కారు డ్రైవర్ తోపాటు మరో యువకుడిని స్థానికులు రక్షించారు. వీరి మృతితో మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుము కున్నాయి. భర్త రాజుతోపాటు మిగిలిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

 

రెండో రోజు ముగిసిన భారత్, కివిస్ కోల్ కతా టెస్టు

కోల్ కతా టెస్టు : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 7 వికెట్లు నష్టపోయి 128 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 310 పరుగులు. 5 వికెట్లు తీసి భువనేశ్వర్ కివిస్ నడ్డివిరిచాడు. షమీ, జడేజాలకు చెరో వికెట్ పడగొట్టారు. 

 

16:55 - October 1, 2016

కృష్ణా : బందర్ పోర్టు భూ సమీకరణలో రైతుల స్పందన అసలు కనిపించడం లేదు. 33వేల ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేయగా... కేవలం నలుగురు రైతులే భూములిచ్చేందుకు ముందుకొచ్చారు. భూసమీకరణకు గడువు ఈనెల 4తో ముగియనుంది. దీంతో మరో నెల రోజుల పాటు గడువు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:50 - October 1, 2016

హైదరాబాద్ : బ్రెస్ట్ కాన్సర్‌పై మహిళలకు అవగాహన పెంచేందుకు ఇటు ప్రభుత్వం.. అటు స్వచ్ఛంద  సంస్థలు నిత్యం కృషి చేస్తున్నాయి. ఏటా  ఈ కాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండంటంతో దీనిపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా నేటి నుంచి నెల రోజుల పాటు బ్రెస్ట్ కాన్సర్ అవగాహన కల్పించాలని నిర్ణయించాయి. 
ఏటా ఒక మిలియన్‌ కొత్త కేసులు నమోదు 
బ్రెస్ట్ క్యాన్సర్ ఎంతో మంది మహిళల ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి..దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా ఒక మిలియన్‌ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రతి 8మంది మహిళల్లో ఒకరిలో ఈ క్యాన్సర్‌ కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 19 సెకండ్లకు ఒకరిలో రొమ్ముక్యాన్సర్‌ గుర్తించబడుతుంది. మన దేశంలోని  పట్టణ ప్రాంతాల్లో 30మందిలో ఒకరు,  గ్రామీణ ప్రాంతాల్లో 65మందిలో ఒకరు ఈ జబ్బు బారిన పడుతున్నారు. మహిళల లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్‌లలో ఇది రెండోస్థానంలో ఉంది. ప్రధానంగా మెట్రోపాలిటన్‌ నగరాల్లో మొదటి స్థానం రొమ్ము క్యాన్సర్‌దే కావడం విచారకరం.
50 ఏళ్లు దాటిన మహిళల్లో ఎక్కువుగా బ్రెస్ట్‌ క్యాన్సర్  
50 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ వ్యాధి  ఎక్కువగా కనిపిస్తుంది. హార్మోన్స్‌లో వచ్చే మార్పుల  వల్లే  ఈ క్యాన్సర్   సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పిల్లలులేని వారిలో, పిల్లలకు పాలివ్వని తల్లుల్లో రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారపు అలవాట్ల విషయంలో శ్రద్ధ వహించకపోవడం కూడా ఈ వ్యాధి సంభవించడానికి  ఒక కారణం. అంతేకాకుండా స్మోకింగ్, హెవీ వెయిట్‌ కూడా  కారణమవుతున్నాయి. అంతేకాదు స్మోకింగ్, వెయిట్ ఎక్కువగా ఉండటం కూడా కారణమవుతాయి. ప్రధానంగా అండాశయ క్యాన్సరు, పెద్ద పేగుల క్యాన్సరు వచ్చిన వారిలో  రొమ్ముక్యాన్సర్‌ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. 
బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవగాహన మాసంగా అక్టోబర్
రొమ్ము క్యాన్సర్‌ రావడానికి గల కారణాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్  బారిన పడకముందే దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు డాక్టర్లు. మరోవైపు తెలంగాణ సర్కారు బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై  మహిళలకు అవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్క్రీనింగ్ టెస్ట్ లు  నిర్వహించింది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసమే  పింక్‌ రిబ్బన్‌ ఫౌండేషన్‌ సంస్థ...అక్టోబర్‌ మాసాన్ని బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవగాహన మాసంగా నిర్వహిస్తోంది. 

 

16:45 - October 1, 2016

గుంటూరు : వైసీపీ గుంటూరుకు మ‌కాం మార్చేందుకు సిద్ధమవుతోంది. వైసీపీ ఆఫీసును గుంటూరుకు త‌ర‌లించేందుకు పార్టీ తీవ్రక‌స‌ర‌త్తు చేస్తోంది. ఏపీలో పార్టీ కార్యక‌లాపాల‌ను గుంటూరు నుండే నిర్వహించాల‌ని జ‌గ‌న్ భావిస్తుండ‌టంతో..పార్టీ కార్యాల‌యానికి ఆనువైన ప్రదేశం వెతికే ప‌నిలో ప‌డ్డారు పార్టీ ముఖ్యనేత‌లు. విజ‌య‌ద‌శమి నాటికి పార్టీ ఆఫీస్‌కు శంకుస్థాప‌న చేయాల‌ని భావిస్తున్నారు నేతలు.   
అమరావతికి చేరుతున్న వైసీపీ హెడ్‌ ఆఫీస్‌ 
ఇక నుంచి వైసీపీ కార్యక్రమాలు ఏపీ నుంచే కొన‌సాగ‌బోతున్నాయి. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రస్తుత కేంద్రకార్యాల‌యం హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన స‌మావేశాలు ఇప్పటివ‌ర‌కు లోటస్‌పాండ్‌లోనే  నిర్వహిస్తూ వ‌స్తున్నారు నేతలు. అయితే అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం జ‌రుగుతుండ‌డం, సీఎం చంద్రబాబు సైతం విజ‌య‌వాడ నుండి ప‌రిపాల‌న సాగిస్తుండ‌డంతో, వైసీపీ ఆఫీసును కూడా ఆమ‌రావ‌తికి మార్చాల‌ని జ‌గ‌న్ డిసైడ్‌ అయ్యారు. 
దసరా నాటికి ఆఫీస్‌ ఓపెనింగ్‌కు ముమ్మర కసరత్తు 
ఏపీ ప్రతిపక్షపార్టీ తమ కార్యకలాపాలను గుంటూరు నుండే నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఏపీలో సంబంధించిన స‌మావేశాలకు, కార్యక‌ర్తలకు, అభిమానుల‌కు జ‌గ‌న్ అందుబాటులో ఉండాల‌ని ఆలోచిస్తున్నారు. భ‌విష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ద‌స‌రా త‌రువాత ఏపీ పార్టీ ఆఫీసును గుంటూరులో ఏర్పాటు చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.
మొదట విజ‌య‌వాడ స‌మీపంలో కార్యాలయ ఏర్పాటుకు ప్లాన్‌
మొదట విజ‌య‌వాడ స‌మీపంలో వైసీపీ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌ని భావించారు. కాని విజ‌య‌వాడ న‌గ‌రం ర‌ద్దీ దృష్ట్యా కొన్ని స‌మ‌స్యలు త‌లెత్తే అవ‌కాశం ఉండడంతో వెనక్కి తగ్గింది వైసీపీ అధిష్టానం. తాజాగా కృష్ణా,గుంటూరు, ప్రకాశం జిల్లాల‌ను క‌లుపుతూ కేంద్ర కార్యాల‌యాన్ని నిర్మించే ప్రయ‌త్నం చేస్తోంది వైసీపీ. ఇందుకోసం స్థల అన్వేష‌ణ కూడా పూర్తైన‌ట్లు తెలుస్తోంది. ఐదు వేల మంది కార్యకర్తలు పట్టేలా ఒక హాల్‌ను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 
కార్యాల‌యానికి రూప‌క‌ల్పన 
భ‌విష్యత్‌లో పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల తాకిడిని త‌ట్టుకునే విధంగా ఈ కార్యాల‌యానికి రూప‌క‌ల్పన చేస్తున్నారు నేతలు. ఈ కార్యాల‌య నిర్మాణాన్ని పార్టీ సీనియ‌ర్ నేతలు బొత్స, విజయ‌సాయిరెడ్డిలు ప‌ర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

16:39 - October 1, 2016

విజయవాడ : భారత్‌ ఎప్పుడు  తమపై దాడి చేస్తుందోననే భయం పాకిస్తాన్‌ ను వెంటాడుతుంటే ..ఏపీలోని ప్రజాప్రతినిధులను మాత్రం ఐటీ భయం వెంటాడుతోంది.  కొద్దిరోజులుగా ఆయా ఎమ్మెల్యేల ఇంటిపై ఐటీదాడులు జరుగుతుండటంతో...పాలక, ప్రతిపక్షంలోని నేతలు ఆందోళన చెందుతున్నారు. తమ వంతు ఎప్పుడొస్తుందోనని భయపడుతున్నారు. సీనియర్ నేతలు సైతం ఎప్పుడు ఐటీ అదికారులు తమ ఇళ్లపై దాడులు చేస్తారోనని హడలిపోతున్నారు. 
పాలక, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ఐటీ దాడులు 
ఏపీలోని రాజకీయ నేతలను ఐటీ భయం పట్టుకుంది. పాలక, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ఐటీ అధికారులు దాడులు నిర్వహించడంతో..ఎప్పుడు తమపై దాడి చేస్తారోనని హడలిపోతున్నారు. ఇప్పటికే ఏపీలోని అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేల ఆస్తులపై ఐటీ శాఖ దాడులతో ఈ భయం మరింత రెట్టింపయ్యింది. అధికార పక్షంలో ఉన్న తమకు ఏమీకాదని ఇంతకాలం అనుకున్న ప్రజాప్రతినిధులు తాజా దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. కోట్లాది రూపాయలను ఐటీ అధికారులు సీజ్ చేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.  
టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటిపై ఐటీ దాడులు
కొద్దిరోజుల కిందట చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటిపై ఐటీ అధికారులు అత్యంత రహస్యంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎమ్మెల్యే ఇంటిలో భారీగా అక్రమాస్తుల్ని అధికారులు గుర్తించారు. సత్యప్రభ కుటుంబానికి బెంగళూరుతోపాటు ఇతర ప్రాంతాల్లో అనేక కంపెనీలు ఉన్నాయి. దాదాపు 300కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి సరైన పత్రాలు లేనట్లు ఐటీ దాడుల్లో తేలింది. ప్రస్తుతం  సత్యప్రభ మంత్రి పదవి రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
టీడీపీ ఎమ్మెల్యేల ఇళ్లపైన ఐటీ దాడులు
టీడీపీకి చెందిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి నివాసంపై ఐటీ దాడులు జరిగాయి. బెంగళూరులోని ఆయన కార్యాలంయతో పాటు ఇతర నివాసాలపై ఐటీ సోదాలు చేసింది. మోదుగుల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేస్తుండటంతో..ఇందుకు సంబంధించి లెక్కల్లో తేడాలు వచ్చినట్లు సమాచారం. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు చెయ్యడంతో తలలు పట్టుకోవడం ప్రజాప్రతినిధుల వంతు అవుతోంది. 
వైపీపీలోనూ ఐటీ భయం 
కేంద్రంతో దోస్తితోపాటు రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై ఐటీదాడులు నిర్వహించడంతో..ఇటు టీడీపీలోనూ అటు ప్రతిపక్షం వైపీపీలోనూ ఐటీ భయం మొదలైంది. ఐటీ సోదాలు జరుపుతామని కేంద్రం కూడా ప్రకటించడంతో..రాజకీయనేతలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. 

 

నిజామాబాద్ జిల్లాలో దారుణం...

నిజామాబాద్ : జిల్లాలో దారుణం జరిగింది. పిట్లం మండలం కారేగాం వద్ద పిల్లివాగులో ప్రవాహం ధాటికి ఓ కారు కొట్టుకుపోయింది. 
కారులో ప్రయాణిస్తున్న తల్లితో సహా ఐదుగురు పిల్లలు వాగులో కొట్టుకుపోయారు. డ్రైవర్ ను స్థానికులు కాపాడారు. 

తెలంగాణలోని 9 జిల్లాలకు పన్ను ప్రోత్సకాలు

హైదరాబాద్ : తెలంగాణలోని 9 జిల్లాలకు కేంద్రం పన్ను ప్రోత్సకాలు ప్రకటించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు పారిశ్రామిక పన్ను ప్రోత్సాహకాలను కల్పించింది.  

 

16:06 - October 1, 2016

మెదక్‌ : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నారాయణ ఖేడ్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుర్కపల్లిలో పటేల్‌ చెరువు, గంగాపూర్‌ మెండికట్టకు.. పటాన్‌చెరు ఐనోలులో పెద్ద చెరువుకు గండి పడింది. అలాగే కృష్ణాపూర్‌, బిడెకన్న మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగులో ఎంఆర్‌ఎఫ్‌ ఉద్యోగి సంగమేశ్వర్‌ కొట్టుకుపోయారు.  

 

16:00 - October 1, 2016

మహబూబ్ నగర్ : గద్వాల జిల్లా కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపుతున్నట్లు ఆమె ప్రకటించారు. తన రాజీనామాను స్పీకర్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. వేలాది మంది ప్రజలు గద్వాలను జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నా.. తాను ఎమ్మెల్యేగా ఉన్నందుకే జిల్లాగా ప్రకటించడం లేదని.. అందుకే రాజీనామా చేస్తున్నట్లు డీకే అరుణ తెలిపారు. ప్రజలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

15:25 - October 1, 2016

చెన్నై : తమిళనాడులో జయలలిత ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతోంది. లండన్‌ నుంచి డాక్టర్‌ రిచర్డ్‌ చెన్నై అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. జయలలితను ఆయన పరిశీలిస్తున్నారు. గత 10 రోజుల నుంచి అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్నారు. ఆమె డీహైడ్రేషన్‌, ఫీవర్‌తో ఆస్పత్రిలో చేరారు. అయితే గత రెండు రోజుల నుంచి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయకపోవడంతో అందరిలోనూ టెన్షన్‌ మొదలైంది. ఈ తరుణంలో డీఎంకే అధినేత జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో విడుదల చేయాలని కరుణానిధి డిమాండ్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జయలలితను పరామర్శించేందుకు గవర్నర్‌ విద్యాసాగర్‌ మధ్యాహ్నం ముంబై నుంచి చెన్నై రానున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు అమ్మ త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ అన్నాడీఎంకే కార్యకర్తలను వెంటాడుతోంది. 

 

చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత

తమిళనాడు : చెన్నై అపోలో ఆస్పత్రిలో తమిళనాడు సీఎం జయలలిత చికిత్స పొందుతున్నారు. జయలలితను పరీక్షించేందుకు లండన్ నుంచి డాక్టర్ రిచర్డ వచ్చారు. జయలలిత ఆరోగ్యోంపై 2 రోజులుగా హెల్త్ బులిటెన్ వెలువడలేదు. గవర్నర్ సాయంత్రం చెన్నైకి చేరుకోనున్నారు. గవర్నర్ జయలలితను పరామర్శించనున్నారు. 
 హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని కరుణానిధి డిమాండ్ చేశారు. వదంతులు పుట్టించిన పది మంది డీఎంకే కార్యకర్తలను అరెస్టు చేశారు. చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

 

వివిధ శాఖల హెచ్ వోడీలతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం

హైదరాబాద్ : వివిధ శాఖల హెచ్ వోడీలతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం నిర్వహించారు. జిల్లాల పునర్విభజనపై చర్చ జరుపుతున్నారు. 

ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తూ డీకే అరుణ ప్రకటన

హైదరాబాద్ : ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తూ డీకే అరుణ ప్రకటించారు. తన రాజీనామా లేఖను సీఎంకు పంపుతున్నానని తెలిపారు.

13:51 - October 1, 2016

తిరుపతి : తిరుపతిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు బీజేపీ, టీడీపీ కార్యకర్తలు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడారు. ఏపీని అభివృద్ధి చేసేందుకు కేంద్రం కట్టుబడి వుందని పేర్కొన్నారు. ఏపీ రాజధాని నడిబొడ్డులో వున్న విజయవాడ బస్ స్టాండ్ అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించామన్నారు. హుదూద్ తుఫాన్ లో దెబ్బతిన్న విశాఖ ఎయిర్ పోర్ట్ ను ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ గా తీర్చిదిద్దేందుకు కేంద్రం అదనంగా నిధులు కేటాయించిందనీ తెలిపారు. రాబోయే రోజుల్లో ఏపీని మూడు విమానాశ్రయాల నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడవాలనేది కేంద్రం యొక్క ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు,శ్రీకాకుళం వంటి ఉత్తరాంధ్ర ప్రాంత జిల్లాలకు వందల కోట్ల రూపాయలను ప్రకటించామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో గిరిజన వర్శిటీ ఫైనలేజ్ అయ్యిందని తెలిపారు. నెల్లూరులో సముద్ర జలాలపై పరిశోధన చేసేందుకు అంతర్జాతీయన పరిశోధనా సంస్థను కేంద్రం కేటాయించామనీ దానికి సంబంధించి వాకాడలో శంకుస్థాపన జరిగిందన్నారు. వైజాగ్ టూ చెన్నై ఇండ్రస్ట్రియల కారిడార్,అలాగే కృష్ణ పట్నం టూ చెన్నై కారిడార్ తో ఉద్యోగాల కల్పన చేయ్యొచ్చని ఈ సందర్బంగా మంత్రి పేర్కొన్నారు. 

13:44 - October 1, 2016

కర్నాటక : కావేరి జలాల విడుదులపై మొండికేస్తున్న కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాలన్న సుప్రీకోర్టు ఆదేశాలను కర్నాటక ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. నీరు విడుదల చేయాలని దఫదఫాలుగా ఆదేశించినా... కర్నాటక ముఖ్యమంత్రి అమలు చేయలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 6వ తేదీ వరకు తమిళనాడుకు ఆరు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అంశంపై చర్చించేందుకు సిద్దరామయ్య అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి ఇవాళ సాయంత్రం కావేరి పరీవాహక ప్రాంతాల రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కర్నాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి రాష్ట్ర మంత్రులు, అధికారులతో జరిగే ఈ సమావేశంలో కావేరి యాజమాన్య బోర్డు ఏర్పాటుపై చర్చిస్తారు. 

13:01 - October 1, 2016

పశ్చిమ గోదావరి : తుందుర్రులో పోలీసుల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. ఆక్వాఫుడ్‌పార్క్‌ గ్రామాల్లో పర్యటించేందుకు వచ్చిన అఖిలపక్షనేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆక్వాఫుడ్‌ పార్క్‌ పరిసర గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. మరింత సమాచారానికి వీడియో చూడండి.. 

12:58 - October 1, 2016

చిత్తూరు : మన్నవరం ప్రాజెక్టు సాధనకోసం ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డి 30గంట దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. కాగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నేడు చిత్తూరు జిల్లా తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన వెంకయ్యనాయుడుని అడ్డుకుంటామని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. దీంతో అర్థరాత్రి నుండి వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీక్షకు సంఘీ భావం తెలిపేందుకు వచ్చిన వామపక్ష నేతలను కూడా పోలీసలు అరెస్ట్ చేశారు. దీనిపై యండవల్లి మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేని వెంకయ్యనాయుడు సన్మానం ఎలా చేయించుకుంటున్నారంటూ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. న్యాయమైన హక్కుకోసం ఉద్యమం చేస్తున్నవారిని అరెస్ట్ చేయటం అప్రజాస్వామిక చర్య అంటూ ఆయన పేర్కొన్నాడు. తనకు సంఘీభావం తెలపటానికి వచ్చిన వామపక్ష కార్యకర్తలను..మహిళా కార్యకర్తలనూ అమానవీయంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీకి హోదా తేలేని వెంకయ్యనాయుడు గారూ గో బ్యాక్ అంటూ ఆయన నినదించారు. 6వేల కోట్లతో..6వేలమంది ఉద్యోగాలు వస్తాయని ఆశించిన మన్నవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన యండవల్లి డిమాండ్ చేశారు. 

12:48 - October 1, 2016

తిరుమల : తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ మంత్రి మాణిక్యాల రావు, సినీ నటుడు అర్జున్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనతరం వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రపంచంలోని హిందూ దేవాలయాల ప్రతినిధులతో సమావేశం: మాణిక్యాల రావు
ప్రపంచంలోని అన్ని హిందూ దేవాలయాల ప్రతినిధులతో తిరుపతిలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు.. అలాగే ఏపీలోని అన్ని ఆలయాలకు వెబ్‌సైట్లు రూపొందిస్తామని చెప్పారు.. ఇందులో ఆలయాల ఆస్తులు, ఆభరణాలు, ఆదాయ, వ్యయాల వివరాలు ఉంచుతామని తెలిపారు..

కూతురు హీరోయిన్‌గా ప్రేమరాధ చిత్రం నిర్మిస్తున్నాం : అర్జున్
సినీనటుడు అర్జున్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. ఉదయాన్నే తిరుమల చేరుకున్న అర్జున్‌... వీఐపీ దర్శన సమయంలో స్వామివారికి పూజలు చేశారు.. తన కూతురు హీరోయిన్‌గా ప్రేమరాధ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు..

12:43 - October 1, 2016

జమ్ము కశ్మీర్ : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మన సైనికుల మెరుపదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ సైనికులు ఆత్మరక్షణలో పడ్డారు. ఉగ్రవాద శిక్షణా శిబిరాలను కొత్త ప్రాంతాలను మార్చారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌ నుంచి మన్షేరా, నౌషేరా, జీలం ప్రాంతాలకు ఉగ్రవాద శిక్షణా శిబిరాలను తరలించినట్టు మన నిఘా వర్గాలు పసికట్టాయి. ఈ క్యాంపుల్లో లష్కరే తోయిబా, హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌; జైషే మహ్మద్‌ గ్రూపులకు చెందిన 500 మంది శిక్షణ పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్టు మన నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్‌ ఆక్రమి కశ్మీర్‌లోని మ్యూరే, రావాల్‌కోట్‌లోని ఏడు ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు మెరుపు దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌ సైనికులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కశ్మీర్ లో పర్యటిస్తున్న ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్
సర్జికల్ ఆపరేషన్స్ అనంతరం భారత్-పాక్ సరిహద్దులోని పరిస్థితులు వేడిమీద ఉన్న నేపథ్యంలో.. భారత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ శనివారం కశ్మీర్ లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ప్రాంతంలోని భద్రతా వ్యవహారాలను ఆయన సమీక్షించనున్నారు. ఎల్ ఓసీని దాటి ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన అనంతరం జమ్మూకశ్మీర్‌లో భారత ఆర్మీ చీఫ్ తొలి పర్యటన ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్ వెంటే వుంటామన్న సార్క్ దేశాలు..
భారత్ కొట్టిన దెబ్బతో పాకిస్థాన్ కు దిమ్మతిరిగింది. యూరీ సెక్టార్ పై ఉగ్రదాడికి పాల్పడిన వెంటనే రంగంలో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ సార్క్‌ సదస్సుకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు. దీంతో భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు తాము కూడా భారత్ వెంటే ఉన్నామని, పాకిస్థాన్‌ తక్షణం ఉగ్రవాద అనుకూల చర్యలు మానుకోవాలని, ఉగ్రవాదాన్ని అరికట్టేదిశగా కదలాలని సూచిస్తూ సార్క్ సదస్సుకు రామని తేల్చిచెప్పాయి.శ్రీలంక, మాల్దీవులు కూడా భారత్ వెంటే ఉన్నామన్న సంకేతాలు ఇస్తూ, సార్క్ సదస్సుకు రాలేమని పాకిస్థాన్ కు తెలిపాయి.

పాక్ ను హెచ్చరించిన అమెరికా..
సరిహద్దుల్లో పాక్‌ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. 36 గంటల వ్యవధిలో మూడోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. జమ్ము-కశ్మీర్‌ అక్నూర్‌ సెక్టార్‌లోకి కాల్పులు జరిపారు. మన సరిహద్దుల్లోకి మోర్టార్లు ప్రయోగించింది. ఇదిలావుంటే పాకిస్థాన్‌కు అమెరికా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం వస్తే భారత్‌పై అణ్వాయుధాలు ప్రయోగించక తప్పదన్న పాకిస్థాన్‌ రక్షణ మంత్రి మహ్మద్‌ ఖ్వాజా ఆసిఫ్‌ ప్రకటనను తప్పుపట్టింది. ఆసిఫ్‌ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమెరికా ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అణ్వాయుధాలతో భారత్‌ను సర్వనాశనం చేస్తామన్న ఆసిఫ్‌ హెచ్చరించడంపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అసహనంతోనే పాకిస్థాన్‌ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని యూఎస్ విమర్శించింది. 

12:35 - October 1, 2016

తమిళనాడు : జయలలిత ఆరోగ్యంపై టెన్షన్‌ కొనసాగుతోంది. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నాడీఎంకే నేతలు తెలిపారు. అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలని రాష్ట్రవ్యాప్తంగా పూజలు కొనసాగుతున్నాయి. జయలలిత ఆరోగ్యంపై రకరకాల వదంతులు వస్తున్న నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో విడుదల చేయాలని కరుణానిధి డిమాండ్‌ చేశారు. మరోవైపు వదంతులు సృష్టించిన పలువురిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. మధ్యాహ్నం జయలలితను కలిసేందుకు గవర్నర్‌ అపోలో ఆస్పత్రికి రానున్నారు. 

సల్మాన్ ఖాన్ పాక్ వెళ్లిపోవాలి:శివసేన..

ముంబై : యూరీ ఉగ్రదాడి జ‌రిగిన అనంత‌రం బాలీవుడ్ లోని పాకిస్థాన్ నటులు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన చేసిన హెచ్చరిక‌ల‌పై బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ స్పందిస్తూ నిన్న చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లపై శివ‌సేన, ఎంఎన్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. యూరీ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది ఉగ్ర‌వాదులే.. కానీ న‌టీన‌టులు కాదని, వారు భార‌త్ కు రావచ్చని ఆయ‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స్పందించిన‌ శివసేన నాయకురాలు మనీషా కాయండే.. ఆయ‌న‌కు ఈ విషయంలో పాఠం నేర్పించాలని వ్యాఖ్యానించారు.

అమ్మ ఆరోగ్యంపై టెన్షన్..

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పది రోజుల క్రితం చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన ఆమె గురించి గత రెండు రోజుల నుంచి వైద్యులు హెల్త్ బులెటిన్‌లు కూడా ఏమీ జారీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.అయితే అన్నాడీఎంకే వర్గాలు గానీ, రాష్ట్ర మంత్రులు గానీ, చివరకు రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు గానీ దీనిపై స్పందించకపోవడం ఏంటని డీఎంకే అధినేత కరుణానిధి కూడా ప్రశ్నలు లేవనెత్తారు.

దీక్ష చేపట్టిన మాజీ ప్రధాని!..

కర్నాటక : కావేరీ జలాలు విడుదల చేయడం కుదరదని మాజీ ప్రధాని, జీడీయూ చీఫ్ దేవెగౌడ అన్నారు. నీటిని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయొద్దని కోరుతూ కర్ణాటక అసెంబ్లీ ఎదుట దీక్షకు దిగారు. కర్నాటక-తమిళనాడులకు నిపుణుల కమిటీని పంపించి ఎక్కడ ఎంత నీరు ఉందో చూడాలని ఆయన సూచించారు. వాస్తవ పరిస్థితి తెలుసుకుని మాట్లాడాలని దేవెగౌడ అన్నారు. తమిళనాయకులు బెదిరింపులకు దిగుతున్నారంటూ దేవెగౌడ ఆవేదన వ్యక్తం చేశారు.

15 కిలోల గంజాయి స్వాధీనం..

విజయనగరం : ఎస్.కోటలో శనివారం అక్రమంగా తరలిస్తున్న 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌కు చెందిన రాంసింగ్, బాబాసాగలనాథ్ ఎస్.కోట బస్టాండ్ వద్ద ఉండగా వారిని పోలీసులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న 15 కిలోల గంజాయిని సీజ్ చేశారు. వారిద్దరిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి... విచారణ చేపట్టారు.

భారత్ ఆల్ అవుట్..

కోల్‌కతా: ఈడెన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 104.5 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌట్ అయింది. 239/7 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్.. వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. వికెట్ కీపర్ సాహా ఒంటరి పోరాటం చేసినా.. అతడికి ఎవరి నుంచి సహకారం అందలేదు. చివరి వికెట్‌కు షమితో కలిసి 35 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. సాహా పుణ్యమా అని భారత్ 300 పరుగులు దాటింది.

రెండు లారీ ఢీ..ఇద్దరు మృతి..

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాతపడ్డారు. శనివారం ఉదయం రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్‌లోనే ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రాయిచూర్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. 

10:48 - October 1, 2016

ముంబై : అదో పెద్ద అపార్ట్‌మెంట్...ఎవరి పనుల్లో వారున్నారు...ఓ యువకుడు కూడా తనపనిలో తానున్నాడు...అపార్ట్‌మెంట్ వెనకాల నుంచి పాకుతూ ఎక్కేస్తున్నాడు..ఇది ఎవరూ గమనించలేదు..అప్పుడే మూడో అంతస్తులో కిటికీవైపు వచ్చిన మహిళ చూసి ఖంగుతింది..దొంగ కావచ్చనుకుంది..కాని తెలిసిన కుర్రాడే..చూస్తే పెద్ద కత్తి కన్పించింది..తనకోసమే వస్తున్నాడని తెలుసుకుని భయంతో వణికిపోయింది...ఇంతకీ ఆ కుర్రాడు స్పైడర్‌మాన్‌లా ఎందుకు మారాడు...ఆ మహిళను ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు..

కక్ష తీర్చుకునేందుకు స్పైడర్‌మాన్‌లా
ఇది ఓ అపార్ట్‌మెంట్...ఇక్కడ సరిగ్గా చూడండి...ఓ యువకుడు ఎలాంటి ఆధారం లేకుండా చకా చకా ఎక్కేస్తున్నాడు...ఇతను దొంగ కాదు...దోపిడీ చేసేందుకు ప్రయత్నాలేమి చేయడం లేదు...తనలో ఆవేశం..రగులుతున్న కక్షతో ఇలా మారిపోయాడు..అప్పటివరకు చెట్టు కూడా ఎక్కలేకపోయిన ఈ కుర్రాడు ఏకంగా అపార్ట్‌మెంట్‌ ఎక్కేస్తున్నాడు...ఇతని కోపానికి కారణం..అపార్ట్‌మెంట్లో ఉన్న ఓ మహిళే ...ఆమెపై కక్ష తీర్చుకునేందుకు ఇలా స్పైడర్‌మాన్‌లా మారిపోయాడు..

కన్నతల్లికి అవమానం..భరించలేకపోయిన తనయుడు..
ముంబాయిలోని 'ముంబయి బయంధర్' అపార్ట్‌మెంట్‌ ఉంటున్న ఈ యువకుడి తల్లికి...మరో మహిళకు మధ్య చిన్న గొడవ జరిగింది..ఈ క్రమంలో ఆ మహిళ ఆవేశాన్ని అణుచుకోలేక యువకుడి తల్లిని చెంప చెల్లుమనిపించింది...అప్పటివరకు  ఇంటికి వచ్చిన యువకుడికి విషయం తెలిసింది..అంతే రగిలిపోయాడు...తన తల్లిని అవమానించిన మహిళపై కక్షకట్టాడు. 
కత్తి పట్టుకుని అపార్ట్‌మెంట్లోకి వెళ్లేందుకు యత్నం..
ముంబయిలోని రిజ్వీ కాలేజీ విద్యార్థి ధోనీ గోపాల్ తన తల్లిని చెంపదెబ్బకొట్టిన మహిళపై పగతీర్చుకునేందు పెద్ద కత్తితో మహిళపై దాడికి ప్రయత్నించాడు.. ఇంటిలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. కత్తితో వస్తున్న అతడిని చూసిన మహిళ భయంతో ఇంటి తలుపులను మూసివేసింది. మహిళపై ఎలాగైనా పగతీర్చుకోవాలనుకున్నాడు. అంతే..
భయంతో పోలీసులకు సమాచారం..
కత్తిపట్టుకొని మూడు అంతస్తుల బిల్డింగ్‌ను స్పైడర్‌మ్యాన్‌లా ఎక్కాడు. అపార్ట్‌మెంట్ కిటికీ అద్దాలను పగులగొట్టాడు. దీంతో భయపడిపోయిన బాధిత మహిళ పోలీసులకు సమాచారం అందించడంతో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు...ముంబాయిలో ఈ ఘటన కలకలం రేపింది...

10:42 - October 1, 2016

.గోదావరి : జిల్లా తుందుర్రు ఆక్వాఫుడ్‌పార్క్‌ గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆక్వాఫుడ్‌పార్క్‌ గ్రామాల్లో నేడు అఖిలపక్ష నేతలు పర్యటించనున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు గ్రామాల్లో భారీగా మోహరించారు. గత నెల రోజులుగా తుందుర్ర ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అక్వాఫుడ్ పార్క్ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న సీపీఎం పార్టీ నేతలు పోలీసులు అడ్డుకున్నారు. నేతలు గ్రామాలలోకి రాకుండా ఆ ప్రాంతానికి సంబంధించి రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. నేతల పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా అడ్డుకుంటున్నారు.ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం జరిగితే పచ్చని పల్లెల్లో తీవ్రంగా కలుషితం అవుతుందనీ ఇప్పటికే పర్యావరణ వేత్తలు పేర్కొన్నారు. దీంతో గర్భిణీస్త్రీలపై ఈ కాలుష్య తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని..పుట్టబోయే పిల్లకు అనారోగ్య లక్షణాలు వచ్చే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

10:36 - October 1, 2016

మెదక్‌ : జిల్లాలో వర్షాలు హోరెత్తిపోతున్నాయి... శుక్రవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ఝరాసంగంలోని కేతకి ఆలయంలోకి వరద నీరు చేరింది.. నీటితో ప్రధాన ఆలయం నిండిపోయింది. ఆలయం ముందున్న దుకాణాలు కొట్టుకుపోయాయి. మరో వైపు జహీరాబాద్ మండలం బొప్పనపల్లి -బోరేగావ్ మధ్య వంతెన తెగిపోయింది. జీర్లపల్లి గ్రామ శివారులో వరద తాకిడికి బ్రిడ్జి కూలింది. 5గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించించింది.. న్యాల్‌కల్‌ మండలంలో 22.4 సెం.మీ వర్షపాతం నమోదయినట్లు తహసీల్దారు దశరథ్‌సింగ్‌ తెలిపారు. భారీ వర్షంతో 70కి పైగా ఇళ్లు, దాదాపు 40 దుకాణాల్లోకి వరదనీరు చేరింది. 10 ఇళ్లు నేలకూలాయి. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఓ బాధితుడు సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. నారింజ, చినిగేపల్లి ప్రాజెక్టుల కట్టలు దెబ్బతిని వరదనీరు రోడ్లపై చేరింది. న్యాల్‌కల్‌లో విద్యుత్‌ స్థంబాలు నేల కూలాయి. రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా, బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.

10:24 - October 1, 2016

తిరుపతి : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ అయినవారిలో సీపీఐ నేత నారాయణ కూడా వున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశ సరిహద్దుల్లో యుద్ధవాతావరణం.. ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో బీజేపీ నేత వెంకయ్యనాయుడు సన్మానం చేయించుకోవటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సన్మాన సభను సంతాపసభగా మార్చుకుని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించాలంటూ నారాయణ ఎద్దేవా చేశారు. ఒకపక్క భారత్ సైనికులు ప్రాణాల్ని సైతం త్యాగం చేస్తూ దేశాన్ని రక్షించేందుకు యత్నిస్తుంటే సన్మానాలు అంత అవసరామాని ప్రశ్నించారు. రాత్రి నిద్రించే సమయంలో మంచాలపై వున్నవారిని వున్నట్లుగా అరెస్ట్ చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్భంధకాండల మధ్య సన్మానాలు ఏమిటని మండిపడ్డారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నేడు చిత్తూరు జిల్లా తిరుపతిలో పర్యటించనున్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశంపై ఆయనకు బీజేపీ శ్రేణులు తిరుపతిలో సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెంకయ్యనాయుడు వచ్చిన నేపథ్యంలో వామపక్షాలు వెంకయ్య అడ్డుకునేందుకు యత్నించనున్నారనే సమాచారంతో రాత్రికి రాత్రే వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన వెంకయ్యనాయుడుని అడ్డుకుంటామని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. దీంతో అర్థరాత్రి నుండి వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని ఈస్ట్ రేణిగుంట పీఎస్ తరలించారు. ఇప్పటికే 100మంది వామపక్ష నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గత అర్థరాత్రి నుండి ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వారి గృహాలకు వెళ్ళి వెళ్లి మరీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు.దీన్ని నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

09:55 - October 1, 2016

విజయవాడ : బెజవాడలో దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు శ్రీస్వర్ణ కవచాలంకృత కనక దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు... తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీపై మరిన్ని సమాచారానికి వీడియో చూడండి..

09:51 - October 1, 2016

అమెరికా : భారత్‌-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహించడానికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఉరీ సైనిక స్థావరంపై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరడంపై బాన్‌ కీ మూన్‌ అందోళన వ్యక్తం చేశారు. రెండు అణ్వాయుధ దేశాలు ఉద్రికత్తలు సడలించుకోవాలని సూచించారు. సహరిద్దుల్లో సైనికులు, ఆయుధాల మోహరింపు వంటి అంశాల్లో రెండు దేశాలు సంయమనం పాటించాలని బాన్‌ కీ మూన్‌ సూచించారు. రెండు దేశాలు అంగీకరిస్తూ భారత్‌-పాక్‌ల మధ్య దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్‌ సహా వివిధ సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు సహకరిస్తానని బాన్‌ కీ మూన్‌ చెప్పారు. 

09:46 - October 1, 2016

జమ్ము కశ్మీర్ : సరిహద్దుల్లో పాక్‌ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. 36 గంటల వ్యవధిలో మూడోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. జమ్ము-కశ్మీర్‌ అక్నూర్‌ సెక్టార్‌లోకి కాల్పులు జరిపారు. మన సరిహద్దుల్లోకి మోర్టార్లు ప్రయోగించింది. ఇదిలావుంటే పాకిస్థాన్‌కు అమెరికా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం వస్తే భారత్‌పై అణ్వాయుధాలు ప్రయోగించక తప్పదన్న పాకిస్థాన్‌ రక్షణ మంత్రి మహ్మద్‌ ఖ్వాజా ఆసిఫ్‌ ప్రకటనను తప్పుపట్టింది. ఆసిఫ్‌ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమెరికా ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అణ్వాయుధాలతో భారత్‌ను సర్వనాశనం చేస్తామన్న ఆసిఫ్‌ హెచ్చరించడంపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అసహనంతోనే పాకిస్థాన్‌ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని యూఎస్ విమర్శించింది.  

దేశ ప్రజలకు ప్రధాని దసరా శుభాకాంక్షలు..

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు శనివారం నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. 'పవిత్ర నవరాత్రి ప్రారంభమైన సందర్భంగా అందరికి నా శుభాకాంక్షలు' అని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

డీఎండీకే నేత ఇంటిపై బాంబుదాడి..

తమిళనాడు : పెరంబుదూరు సమీపంలో డీఎండీకే నేత ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబుతో దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి బాంబు దాడికి పాల్పడిన ముఠా కోసం గాలిస్తున్నారు. పెరంబుదూరు సమీపంలోని తండలంలో డీఎండీకే నేత శశికుమార్‌ నివసిస్తున్నారు.

చిన్నషక్కర్‌గాం చెరువులో విద్యార్థులు గల్లంతు..

నిజామాబాద్:మద్నూర్ మండలం చిన్నషక్కర్‌గాం చెరువులో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు శుక్రవారం సాయంత్రం చెరువులో ఈతకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో వారి కోసం కుటుంబసభ్యులు వెతకగా చెరువు గట్టుపై వారి దుస్తులు, చెప్పులు కనిపించటంతో లోపలికి దిగి ఈత కొట్టే క్రమంలో మునిగి ఉంటారని భావిస్తున్నారు. అయితే, రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో శనివారం ఉదయం వారి కోసం గాలింపు ప్రారంభించారు. 

09:29 - October 1, 2016

తిరుపతి : ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్రం ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టింది. దీనిపై ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తీవ్రస్థాయిలో అధికారపక్షంపై విరుచుకుపడింది. ప్యాకేజీని స్వాగతించటానికి నీవెవడివి? అని సాక్షాత్తు రాష్ట్ర సీఎంపై పరుష పదజాలంతో ప్రతిపక్షనేత జగన్ తీవ్ర విమర్శలకు దిగిన విషయం తెలిసిందే..దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర సర్కార్ పై నిరంతరం విరుచుకుపడే వైసీపీ పార్టీ కేంద్రప్రభుత్వంపై ఎటువంటి విమర్శా చేయదు. దీనికి కారణం ఏమిటి? జగన్ పై వున్న కేసుల నేపథ్యంలోనే అయివుండొచ్చు అనేది అధికారపక్ష నేతలు పేర్కొంటుంటారు. కాగా ప్రత్యేక ప్యాకేజీ అంశంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు శనివారం తిరుపతిలో సన్మాన కార్యక్రమాన్ని ఆ పార్టీనేతలు నిర్వహించబోతున్నారు. ఈనేపథ్యంలో వెంకయ్యనాయుడు పర్యటనను అడ్డుకుంటామని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. ఈక్రమంలో పలువురు నేతల్ని శుక్రవారం అర్థరాత్రి నుండే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో వామపక్ష నేతలు పోరాడతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంకయ్యనాయుడు పర్యటన విషయంలో వైసీపీ ఎటువంటి స్పందనా లేకుండా వుంది. దీనిపై కేంద్రం విషయంలో జగన్ భయపడతున్నట్లుగా భావించేలా వైసీపీ తీరుతెన్నులున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది.

భారీస్థాయిలో వామపక్ష నేతల అరెస్ట్
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నేడు చిత్తూరు జిల్లా తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన వెంకయ్యనాయుడుని అడ్డుకుంటామని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. దీంతో అర్థరాత్రి నుండి వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని ఈస్ట్ రేణిగుంట పీఎస్ తరలించారు. ఇప్పటికే 100మంది వామపక్ష నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గత అర్థరాత్రి నుండి ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వారి గృహాలకు వెళ్ళి వెళ్లి మరీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు.దీన్ని నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

08:51 - October 1, 2016
08:47 - October 1, 2016
08:44 - October 1, 2016

హైదరాబాద్ : వైసీపీ గుంటూరుకు మ‌కాం మార్చేందుకు సిద్ధమవుతోంది. వైసీపీ ఆఫీసును గుంటూరుకు త‌ర‌లించేందుకు పార్టీ తీవ్రక‌స‌ర‌త్తు చేస్తోంది. ఏపీలో పార్టీ కార్యక‌లాపాల‌ను గుంటూరు నుండే నిర్వహించాల‌ని జ‌గ‌న్ భావిస్తుండ‌టంతో..పార్టీ కార్యాల‌యానికి ఆనువైన ప్రదేశం వెతికే ప‌నిలో ప‌డ్డారు పార్టీ ముఖ్యనేత‌లు. విజ‌య‌ద‌శమి నాటికి పార్టీ ఆఫీస్‌కు శంకుస్థాప‌న చేయాల‌ని భావిస్తున్నారు నేతలు.

ఇప్పటి వరకు లోటస్‌పాండ్‌ నుంచే వైసీపీ కార్యకలాపాలు
ఇక నుంచి వైసీపీ కార్యక్రమాలు ఏపీ నుంచే కొన‌సాగ‌బోతున్నాయి. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రస్తుత కేంద్రకార్యాల‌యం హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన స‌మావేశాలు ఇప్పటివ‌ర‌కు లోటస్‌పాండ్‌లోనే నిర్వహిస్తూ వ‌స్తున్నారు నేతలు. అయితే అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం జ‌రుగుతుండ‌డం, సీఎం చంద్రబాబు సైతం విజ‌య‌వాడ నుండి ప‌రిపాల‌న సాగిస్తుండ‌డంతో, వైసీపీ ఆఫీసును కూడా ఆమ‌రావ‌తికి మార్చాల‌ని జ‌గ‌న్ డిసైడ్‌ అయ్యారు.

గుంటూరు నుండే కార్యకలాపాలు నిర్వహించేందుకు వైసీపీ ప్లాన్‌
ఏపీ ప్రతిపక్షపార్టీ తమ కార్యకలాపాలను గుంటూరు నుండే నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఏపీలో సంబంధించిన స‌మావేశాలకు, కార్యక‌ర్తలకు, అభిమానుల‌కు జ‌గ‌న్ అందుబాటులో ఉండాల‌ని ఆలోచిస్తున్నారు. భ‌విష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ద‌స‌రా త‌రువాత ఏపీ పార్టీ ఆఫీసును గుంటూరులో ఏర్పాటు చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

మొదట విజ‌య‌వాడ స‌మీపంలో కార్యాలయ ఏర్పాటుకు ప్లాన్‌
మొదట విజ‌య‌వాడ స‌మీపంలో వైసీపీ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌ని భావించారు. కాని విజ‌య‌వాడ న‌గ‌రం ర‌ద్దీ దృష్ట్యా కొన్ని స‌మ‌స్యలు త‌లెత్తే అవ‌కాశం ఉండడంతో వెనక్కి తగ్గింది వైసీపీ అధిష్టానం. తాజాగా కృష్ణా,గుంటూరు, ప్రకాశం జిల్లాల‌ను క‌లుపుతూ కేంద్ర కార్యాల‌యాన్ని నిర్మించే ప్రయ‌త్నం చేస్తోంది వైసీపీ. ఇందుకోసం స్థల అన్వేష‌ణ కూడా పూర్తైన‌ట్లు తెలుస్తోంది. ఐదు వేల మంది కార్యకర్తలు పట్టేలా ఒక హాల్‌ను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. భ‌విష్యత్‌లో పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల తాకిడిని త‌ట్టుకునే విధంగా ఈ కార్యాల‌యానికి రూప‌క‌ల్పన చేస్తున్నారు నేతలు. ఈ కార్యాల‌య నిర్మాణాన్ని పార్టీ సీనియ‌ర్ నేతలు బొత్స, విజయ‌సాయిరెడ్డిలు ప‌ర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. 

08:40 - October 1, 2016

హైదరాబాద్ : ఏపీ సచివాల‌యంలో త‌ర‌లింపు ప్రక్రియ వేగ‌ం పుంజుకుంది. ప్రభుత్వం ఇచ్చిన డెడ్‌లైన్‌ వరకు 90 శాతం సచివాలయాన్ని తరలించేందుకు శాఖలన్నీ కసరత్తు చేస్తున్నాయి. రెవిన్యూ, విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖలు మాత్రం దసరా తర్వాత తరలివెళ్లేదుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. తరలింపు అనంతరం స్కెలిటెన్ స్టాఫ్‌పై స్పష్టతిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తొంది.

అమరావతి నుండే పాలనకు షూరూ..
ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజ‌ధాని అమరావతి నుంచే రాష్ట్ర పాలన మొద‌లయ్యేందుకు కౌంట్ డౌన్ మొద‌ల‌యింది. ఈనెల 3న పూర్తి స్థాయి పాల‌నంతా కొత్త రాజ‌ధాని నుంచే జ‌ర‌గాల‌ని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా వేగ‌వంతం అవుతున్నాయి. స‌చివాల‌యంలో ఉన్న 33 శాఖ‌ల్లో మెజారిటీశాఖ‌లు సోమవారం నుండి ఏపీలో పాలన ప్రారంభించనున్నాయి. అయితే మరికొన్ని శాఖలు ఈనెల 15 త‌ర్వాత వెళ్లేందుకు సర్కార్ వద్ద ప‌ర్మిష‌న్ తీసుకున్నాయి. వెల‌గ‌పూడిలో ఇంకా నిర్మాణాలు పూర్తి కాకపొవడంతో రెవెన్యూ, విద్యా, దేవాదాయ, పంచాయతీరాజ్ శాఖలు దసరా తర్వాత అమరావతికి తరలివెళ్ళనున్నాయి. ఇప్పటికే కంప్యూట‌ర్లు ష‌ట్‌డౌన్ ప్రక్రియ పూర్తయ్యి నాలుగు రోజులు దాటిపోయింది. దీంతో

దసరా తర్వాత రెవిన్యూ, విద్యా, దేవాదాయ, పంచాయతీరాజ్‌శాఖలు
ఇదిలా ఉంటే..అన్ని శాఖ‌ల‌నుంచి ఒక‌రి నుంచి ముగ్గురు సిబ్బంది లైజ‌నింగ్ సిబ్బందిగా ఏపీ స‌చివాయం హైదరాబాద్‌లో ఉంచ‌నుంది ఏపీ ప్రభుత్వం. పూర్తిగా అయితే రిటైర్మెంట్‌కు దెగ్గరగా ఉన్న సీనియర్ సిబ్బందిని లైజనింగ్‌కు వాడుకోవాలనీ సర్కార్ నిర్ణయించింది. వీరితో హైకోర్టు కేసులతో పాటు షెడ్యూల్ 9,10 సంస్థల నిర్వహనా..ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలపై మధ్యవర్తిత్వం నడింపించన్నారు. ఏదేమైనా అనుకున్న టార్గెట్ ప్రకారం సోమవారం నుంచి వెల‌గ‌పూడిలో ఏపీ పాల‌న ప్రారంభించి రికార్డు స్రుష్టించిందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. 

08:34 - October 1, 2016

జమ్ము కశ్మీర్ : సరిహద్దుల్లో పాక్‌ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. 36 గంటల వ్యవధిలో మూడోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. జమ్ము-కశ్మీర్‌ అక్నూర్‌ సెక్టార్‌లోకి కాల్పులు జరిపారు. మన సరిహద్దుల్లోకి మోర్టార్లు ప్రయోగించింది. పాక్ పై భారత్ చావుదెబ్బ కొట్టినా పాకిస్థాన్ వైఖరిలో ఏమాత్రం మార్పు రావటంలేదు. అక్నూర్ సెక్టార్ లో చొరబాటు దార్లు మళ్ళీ కాల్పులకు దిగారు. అక్నూర్ సెక్టార్ వద్ద పాక్ బలగాల నుండి దాడుల్ని భారత్ జవాన్లు ఎదుర్కొంటున్నారు.గత ఐదురోజులుగా ఆరుసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాకిస్థాన్ పాల్పడినట్లుగా తెలుస్తోంది. పాక్ సైన్యాల దాడుల్ని భారత్ జవాన్లు ధీటైన సమాధానం చెబుతున్నారు. కాగా కాల్పులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.ఉదయం 4గంటల సమయం నుండి కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తీవ్రవాద స్థావరాలపై భారత్‌ సర్జికల్‌ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 8 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. సుమారు 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా పాకిస్థాన్ పలుమార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన విషయం తెలిసిందే.

అప్పమత్తమైన కేంద్ర హోం శాఖ
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడుల నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలోనైనా పాక్‌ దాడులు జరిపే అవకాశం ఉన్నందున కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దేశంలో అన్ని మెట్రో నగరాల్లో నెలరోజుల పాటు హై అలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు దేశాన్ని రక్షించుకోవడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని పాకిస్తాన్‌ పేర్కొంది. 

నవాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన ప్రత్యేక మంత్రివర్గ సమావేశం

మరోవైపు పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన ప్రత్యేక మంత్రివర్గ సమావేశం జరిగింది. పిఓకేలో భారత ఆర్మీదళాలు ఎలాంటి సర్జికల్‌ దాడులు నిర్వహించలేదని పాక్‌ పేర్కొంది. నియంత్రణ రేఖ వద్ద ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇందులో పాకిస్తాన్‌ జవాన్లు మృతి చెందారని చెప్పుకుంది. కశ్మీర్‌పై తాము వెనక్కి తగ్గేది లేదని పాక్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ వెల్లడించారు. కశ్మీర్‌ ప్రజల సమస్యల అంశం తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. దేశాన్ని రక్షించుకోవడానికి తమ సైనిక బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు.

08:19 - October 1, 2016

చిత్తూరు : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నేడు చిత్తూరు జిల్లా తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన వెంకయ్యనాయుడుని అడ్డుకుంటామని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. దీంతో అర్థరాత్రి నుండి వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని ఈస్ట్ రేణిగుంట పీఎస్ తరలించారు. ఇప్పటికే 100మంది వామపక్ష నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గత అర్థరాత్రి నుండి ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వారి గృహాలకు వెళ్ళి వెళ్లి మరీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు.దీన్ని నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో రేణిగుంట విమానాశ్రయానికి మంత్రి వెంకయ్యనాయుడు రానున్నారు. ప్రత్యేక హోదా రాకపోవటానికి కారణాలేంటి? ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటానికి దారితీసిన పరిస్థితులు..దానివల్ల కలిగే లబ్ది..వంటి పలు అంశాలను తిరుపతి సమావేశంలో వెంకయ్య తెలిపనున్నారు. కాగా ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మంత్రి వెంకయ్యనాయుడు పలు ప్రాంతాలలో సమావేశాలు నిర్వహిస్తున్న విషయంతెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తిరుపతికి వస్తున్నట్లుగా సమాచారం. 

'యుద్ధం'తోనే సమాధానం అంటున్న భారత్ జవాన్..

శ్రీకాకుళం : సర్జికల్ దాడులతో కాదు.. యుద్ధం చేసి పాకిస్థాన్ పని పట్టాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీకాకుళం జిల్లా వంగర మండలానికి చెందిన వీర జవాను కనగల శ్రీరాములు అన్నాడు. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీరాములు ఉగ్రవాదుల్ని హతమార్చిన సైనిక బృందంలో సభ్యుడు. ఆ ఘటనలో గాయపడిన శ్రీరాములు ప్రస్తుతం ఢిల్లీలోని రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపుదాడి వార్తలను టీవీల్లో చూసిన శ్రీరాములు సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఉపేక్షించకూడదని, పాక్ అంతు చూడాల్సిందేనని అన్నాడు.

కల్తీ మద్యానికి 38మంది బలి?!..

ఉక్రెయిన్ : కల్తీ మద్యం సేవించిన 38 మంది మృతి చెందారు. మరో 39 మంది తీవ్ర అస్వస్థతకు గురైచికిత్స పొందుతున్నారు. మరికొంత మంది తమ చూపును సైతం కోల్పోయారు.ఈ ఘటన ఉక్రెయిన్ లో శుక్రవారం చోటు చేసుకుంది. మరిన్ని మరణాలు పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. గత కొంత కాలంగా కల్తీ మద్యం సేవించి తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతంలో చాలా మంది మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

14 మంది మందుబాబులపై కేసు..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో శనివారం తెల్లవారుజామున పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాగి వాహనం నడుపుతున్న 14 మందిపై కేసులు నమోదు చేశారు. వారికి చెందిన10 కార్లతోపాటు 4 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి... కోర్టులో హజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

నేటి నుండి దసరా ఉత్సవాలు..

విజయవాడ: నేటి నుంచి అక్టోబర్‌ 11 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేడు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారి దర్శనానికి నేడు ఉదయం 8 గంటల నుంచి భక్తులకు అనుమతి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కనకదుర్గాదేవి అమ్మవారిని నేడు మంత్రి దేవినేని ఉమ దర్శించుకోనున్నారని వారు తెలిపారు.

నగరంలో హైఅలర్ట్..

హైదరాబాద్‌ : దేశ సరి హద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ప్రధాన నగరాలను అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘావర్గాలు చేసిన హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మెహిదీపట్నం, కంటోన్మెంట్‌, తిరుమలగిరి తదితర ఆర్మీ ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. పాసులున్న వారిని మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు. చుట్టుపక్కల సాయుధ పహరా పెంచారు. ఆ ప్రాంతాల్లో బయటి వ్యక్తులు సంచరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రక్షణ, పరిశోధన సంస్థల వద్ద పోలీసు ఉన్నతాధికారులు భద్రతను పర్యవేక్షించారు.

కాల్పులు జరుపుతున్న చొరబాటు దార్లు..

జమ్ము కశ్మీర్ : పాక్ పై భారత్ చావుదెబ్బ కొట్టినా పాకిస్థాన్ వైఖరిలో ఏమాత్రం మార్పు రావటంలేదు. గొడ్డుమీద పడిన వాన చందంగా పాక్ చొరబాటుదార్ల వ్యవహరిస్తున్నారు. అక్నూర్ సెక్టార్ లో చొరబాటు దార్లు మళ్ళీ కాల్పులకు దిగారు. ఉదయం 4గంటల సమయం నుండి కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తీవ్రవాద స్థావరాలపై భారత్‌ సర్జికల్‌ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 8 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. సుమారు 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది.

భారత్ వెంటే వుంటామన్న సార్క్ దేశాలు..

ఢిల్లీ : భారత్ కొట్టిన దెబ్బతో పాకిస్థాన్ కు దిమ్మతిరిగింది. యూరీ సెక్టార్ పై ఉగ్రదాడికి పాల్పడిన వెంటనే రంగంలో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ సార్క్‌ సదస్సుకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు. దీంతో భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు తాము కూడా భారత్ వెంటే ఉన్నామని, పాకిస్థాన్‌ తక్షణం ఉగ్రవాద అనుకూల చర్యలు మానుకోవాలని, ఉగ్రవాదాన్ని అరికట్టేదిశగా కదలాలని సూచిస్తూ సార్క్ సదస్సుకు రామని తేల్చిచెప్పాయి.శ్రీలంక, మాల్దీవులు కూడా భారత్ వెంటే ఉన్నామన్న సంకేతాలు ఇస్తూ, సార్క్ సదస్సుకు రాలేమని పాకిస్థాన్ కు తెలిపాయి.

వెంకన్న ఆలయంలో చోరీ..

హైదరాబాద్ : వనస్థలిపురంలోని పురాతన వెంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఈక్రమంలో దొంగలను నిలువరించేందుకు ప్రయత్నించిన వాచ్‌మన్‌పై దాడిచేశారు. వారి దాడిలో వాచ్‌మన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.

సంగమేశ్వరాలయంలోకి వరద నీరు..

మెదక్ : జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంఘంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ఝరాసంఘంలోని కేతకి సంగమేశ్వర ఆలయంలోకి వరద నీరు చేరుకుంది. న్యాల్కల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లోకి వర్షం నీరు చేరుకుంది. ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి పలుచోట్ల స్తంభాలు విరిగిపడడంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు రాతంత్రా చీకట్లోనే గడపాల్సి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

07:30 - October 1, 2016

జమ్ము కశ్మీర్ : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడుల నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలోనైనా పాక్‌ దాడులు జరిపే అవకాశం ఉన్నందున కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దేశంలో అన్ని మెట్రో నగరాల్లో నెలరోజుల పాటు హై అలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు దేశాన్ని రక్షించుకోవడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని పాకిస్తాన్‌ పేర్కొంది.పిఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ సర్జికల్‌ దాడుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉగ్రవాద శిబిరాలపై దాడులు, తాజా పరిస్థితులపై రాజ్‌నాథ్‌ అధికారులతో చర్చించారు. దేశ సరిహద్దులోనూ..దేశవ్యాప్తంగా 30 నగరాలలోనూ హై అలర్ట్ గా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో లక్ష్మణ రావు (మాజీ ఎమ్మెల్సీ),కైలాష్ (టీ.పీసీసీ నేత),ఎస్.కుమార్(బీజేపీ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న నేతల అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

 

07:20 - October 1, 2016

విజయవాడ : భారత్‌ ఎప్పుడు తమపై దాడి చేస్తుందోననే భయం పాకిస్తాన్‌ ను వెంటాడుతుంటే ..ఏపీలోని ప్రజాప్రతినిధులను మాత్రం ఐటీ భయం వెంటాడుతోంది. కొద్దిరోజులుగా ఆయా ఎమ్మెల్యేల ఇంటిపై ఐటీదాడులు జరుగుతుండటంతో...పాలక, ప్రతిపక్షంలోని నేతలు ఆందోళన చెందుతున్నారు. తమ వంతు ఎప్పుడొస్తుందోనని భయపడుతున్నారు. సీనియర్ నేతలు సైతం ఎప్పుడు ఐటీ అదికారులు తమ ఇళ్లపై దాడులు చేస్తారోనని హడలిపోతున్నారు.

పాలక, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ఐటీ దాడులు
ఏపీలోని రాజకీయ నేతలను ఐటీ భయం పట్టుకుంది. పాలక, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ఐటీ అధికారులు దాడులు నిర్వహించడంతో..ఎప్పుడు తమపై దాడి చేస్తారోనని హడలిపోతున్నారు. ఇప్పటికే ఏపీలోని అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేల ఆస్తులపై ఐటీ శాఖ దాడులతో ఈ భయం మరింత రెట్టింపయ్యింది. అధికార పక్షంలో ఉన్న తమకు ఏమీకాదని ఇంతకాలం అనుకున్న ప్రజాప్రతినిధులు తాజా దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. కోట్లాది రూపాయలను ఐటీ అధికారులు సీజ్ చేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటిపై ఐటీ దాడులు
కొద్దిరోజుల కిందట చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటిపై ఐటీ అధికారులు అత్యంత రహస్యంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎమ్మెల్యే ఇంటిలో భారీగా అక్రమాస్తుల్ని అధికారులు గుర్తించారు. సత్యప్రభ కుటుంబానికి బెంగళూరుతోపాటు ఇతర ప్రాంతాల్లో అనేక కంపెనీలు ఉన్నాయి. దాదాపు 300కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి సరైన పత్రాలు లేనట్లు ఐటీ దాడుల్లో తేలింది. ప్రస్తుతం సత్యప్రభ మంత్రి పదవి రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపైన ఐటీ దాడులు
టీడీపీకి చెందిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి నివాసంపై ఐటీ దాడులు జరిగాయి. బెంగళూరులోని ఆయన కార్యాలంయతో పాటు ఇతర నివాసాలపై ఐటీ సోదాలు చేసింది. మోదుగుల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేస్తుండటంతో..ఇందుకు సంబంధించి లెక్కల్లో తేడాలు వచ్చినట్లు సమాచారం. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు చెయ్యడంతో తలలు పట్టుకోవడం ప్రజాప్రతినిధుల వంతు అవుతోంది.

ఐటీ సోదాలతో భయపడుతున్న అధికార,విపక్ష నేతలు
కేంద్రంతో దోస్తితోపాటు రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై ఐటీదాడులు నిర్వహించడంతో..ఇటు టీడీపీలోనూ అటు ప్రతిపక్షం వైపీపీలోనూ ఐటీ భయం మొదలైంది. ఐటీ సోదాలు జరుపుతామని కేంద్రం కూడా ప్రకటించడంతో..రాజకీయనేతలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. 

07:15 - October 1, 2016

విజయవాడ : హైదరాబాద్‌లో నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసింది. దాదాపు మూడుగంటలపాటు ఎడతెరిపి లేకుండా పడిన వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తర కోస్తాకు ఆనుకుని బంగాళాఖాతంలో శుక్రవారం మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికితోడు విశాఖపట్నం మీదుగా పశ్చిమ, తూర్పుగా ద్రోణి వుంది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, తెలంగాణలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్టోబర్‌ రెండు నుంచి తెలంగాణలో వర్షాలు పెరుగుతాయని, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

07:09 - October 1, 2016

విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబయింది. దుర్గమ్మ ఆలయ పరిసరాలను సర్వాంగసుందరంగా అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

శరన్నవరాత్రి ఉత్సవాలకు సకల ఏర్పాట్లు
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు సకల ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలను అంగరంగవైభంగా నిర్వహించేందుకు ఆలయ పాలకమండలితోపాటు వివిధ ప్రభుత్వశాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. కెనాల్‌రోడ్డులోని వినాయకుడి ఆలయంనుంచి కొండపై వరకు క్యూలైన్లకోసం బ్యారికేడ్లు వాటిపై నీడకోసం షామియానాలు కూడా సిద్ధం చేశారు.

మూడుషిఫ్టులలో సిబ్బంది సేవలు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. స్నానఘాట్లలో మహిళలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తలనీలాలు సమర్పించేచోట 200వందల మంది క్షురకులను నియమించారు. వారికి ప్రత్యేకంగా గుర్తింపుకార్డులు కూడా ఇచ్చారు. ఘాట్లలోనూ, ఆలయ పరిసరాల్లోనూ ఎలాంటి పారిశుద్ధ్య సమస్యలు రాకుండా మూడుషిఫ్టులలో సిబ్బంది సేవలు అందించనున్నారు.

కీలకప్రాంతాల్లో సీసీకెమెరాలతో నిఘా
ఈ ఉత్సవాల్లో దాదాపు 15లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగినట్టుగా .. ట్రాఫిక్‌ నియమాలతోపాటు.. వీఐపీల దర్శనాలను క్రమబద్దీకరిస్తున్నట్లు పాలకమండలి తెలిపింది. వీఐపీల తాకిడితో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీఐపీలకోసం ప్రత్యేక దర్శన సమయాన్ని నిర్దేశించారు. మొత్తం 6వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ర్పాటు చేస్తున్నారు. కీలకప్రాంతాల్లో సీసీకెమెరాలతో నిఘాపెట్టారు.

శరన్నవరాత్రి ఉత్సవాలు ఈసారి 11రోజులు
అయితే .. తిథుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో.. శరన్నవరాత్రి ఉత్సవాలు ఈసారి 11రోజులు ఉంటాయంటున్నారు పండితులు. ఈ వేడుకల్లో అమ్మవారికి ప్రతిరోజు ప్రాతఃకాలం నుంచే అభిషేకాలు, పూజలు ప్రారంభమవుతాయంటున్నారు. కనకదుర్గమ్మ వైభవాన్ని కన్నులారా వీక్షించేలా సకల ఏర్పాట్లు పూర్తిచేసింది దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ పాలకమండలి. 

07:03 - October 1, 2016

హైదరాబాద్ : ఆరోగ్య శ్రీ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. తమ డిమాండ్లు నెరవేర్చలేదని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్య శ్రీ సేవలను అర్దరాత్రి నుంచి నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడక తప్పట్లేదు.

130 ప్రైవేటు, 60 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు
తెలంగాణలోని ప్రయివేట్ ఆస్పత్రులు మరోసారి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపి వేశాయి. ఈ మధ్య కాలంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపి వేయటం ఇది మూడవ సారి. ఆస్పత్రుల నిర్ణయంతో ఆరోగ్య శ్రీ సేవల కోసం వచ్చే రోగులకు తీవ్ర ఇక్కట్లు తప్పటం లేదు. వాస్తవానికి గతంలో కూడా బకాయిలు మొత్తం ఒకేసారి చెల్లించాలంటూ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి లక్ష్మారెడ్డి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించారు. 100 కోట్లు విడుదల చేస్తామని,..మిగిలిన 200 కోట్లను దశల వారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ బకాయిలు విడుదల చేయకపోవడంతో మరోసారి స్ట్రైక్‌కు వెళ్తున్నాయి.

బకాయిలు చెల్లించని ప్రభుత్వం
ఇప్పటికే అప్పులు చేసి ఆరోగ్య సేవల్ని అందిస్తున్నామని..అయితే పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉండటంతో సేవలు అందించ లేక పోతున్నాం అంటున్నారు ఆసుపత్రుల యాజమాన్యాలు. పైగా కొత్త ఎంవోయూ చేయక పోవటం..కొన్ని సేవలకు ధరలు పెంచక పోవటం లాంటి కారణాలో ఆరోగ్య శ్రీ సేవలు నడుపలేమని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎంవోయూ ప్రకారం ముందుకు సాగాలని,..ఆజమాయిషి చలాయిస్తే సహించేది లేదని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. 190 ఆసుపత్రుల్లో 130 ప్రైవేటు ఆసుపత్రులు..60 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవల్ని కొనసాగిస్తున్నాయి. సర్కారీ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందదని భావించే రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు సమస్యలను ఎదుర్కొక తప్పటం లేదు.

06:59 - October 1, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాలకు పన్ను రాయితీ కల్పిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పన్ను రాయితీలు 2015 నుంచి 2020 మార్చి వరకూ వర్తిస్తాయి. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు పన్ను రాయితీ వర్తించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు పన్ను రాయితీలు వర్తించనున్నాయి. ఇటీవల కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ జిల్లాలకు సైతం పన్ను రాయితీ ప్రకటించాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ కోరారు.

06:56 - October 1, 2016

జమ్ము కశ్మీర్ : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడుల నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలోనైనా పాక్‌ దాడులు జరిపే అవకాశం ఉన్నందున కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దేశంలో అన్ని మెట్రో నగరాల్లో నెలరోజుల పాటు హై అలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు దేశాన్ని రక్షించుకోవడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని పాకిస్తాన్‌ పేర్కొంది.

మెట్రో నగరాలు 30 రోజుల హై అలర్ట్ గా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు
పిఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ సర్జికల్‌ దాడుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉగ్రవాద శిబిరాలపై దాడులు, తాజా పరిస్థితులపై రాజ్‌నాథ్‌ అధికారులతో చర్చించారు. దేశంలోని అన్ని మెట్రో నగరాలు 30 రోజుల పాటు హై అలర్ట్ గా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

పాక్‌ కూడా ప్రతీకార చర్యలకు దిగిందని ప్రచురించిన డాన్‌ పత్రిక
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై బుధవారం అర్ధరాత్రి సమయంలో భారత్‌ చేపట్టిన దాడులకు పాక్‌ కూడా ప్రతీకార చర్యలకు దిగిందని డాన్‌ పత్రిక తెలిపింది. పాక్‌ జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది భారత సైనికులు చనిపోగా.. ఓ జవానును పాక్‌ ఆర్మీ బంధించిందని పాకిస్తాన్‌ మీడియా వెల్లడించింది.

సర్జికల్‌ స్ట్రయిక్‌లో పాల్గొన్న సైనికులంతా క్షేమం : భారత్ ఆర్మీ
పాక్‌ దాడుల్లో 8 మంది భారత జవాన్లు మృతి చెందారని పాక్‌ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవని భారత ఆర్మీ పేర్కొంది. సర్జికల్‌ స్ట్రయిక్‌లో పాల్గొన్న సైనికులంతా క్షేమంగా తిరిగొచ్చారని తెలిపాయి. గురువారం అనుకోకుండా నియంత్రణ రేఖ దాటి పాక్ భూభాగంలో అడుగుపెట్టిన 22 ఏళ్ల చందు బాబులాల్‌ చౌహాన్‌కు సర్జికల్‌ దాడులతో సంబంధం లేదని ఆర్మీవర్గాలు స్పష్టం చేశాయి. సర్జికల్‌ దాడులు జరిగిన చాలా సేపటి తర్వాత చందును పాక్‌ ఆర్మీ అధికారులు బంధించారని పేర్కొన్నాయి. పొరపాటున సరిహద్దు దాటడం, తనిఖీల తర్వాత తిరిగి రావడం సరిహద్దుల్లో సాధారణంగా జరిగేదేనని ఆర్మీ పేర్కొంది. పాకిస్థాన్ చెర‌లో ఉన్న జ‌వానును విడిపించేందుకు అన్ని ప్రయ‌త్నాలు చేస్తున్నామ‌ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

భారత్‌ చేపట్టిన లక్షిత దాడులను సమర్థించిన అఫ్గానిస్థాన్‌
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ చేపట్టిన లక్షిత దాడులను అఫ్గానిస్థాన్‌ సమర్థించింది. ఆత్మరక్షణలో భాగంగానే భారత్‌ సైనిక చర్యకు దిగిందని పేర్కొంది. మరోవైపు పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన ప్రత్యేక మంత్రివర్గ సమావేశం జరిగింది. పిఓకేలో భారత ఆర్మీదళాలు ఎలాంటి సర్జికల్‌ దాడులు నిర్వహించలేదని పాక్‌ పేర్కొంది. నియంత్రణ రేఖ వద్ద ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇందులో పాకిస్తాన్‌ జవాన్లు మృతి చెందారని చెప్పుకుంది. కశ్మీర్‌పై తాము వెనక్కి తగ్గేది లేదని పాక్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ వెల్లడించారు. కశ్మీర్‌ ప్రజల సమస్యల అంశం తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. దేశాన్ని రక్షించుకోవడానికి తమ సైనిక బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. పిఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ సర్జికల్‌ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం రాత్రి నియంత్రణ రేఖ వెంబడి ఆక్రమిత కశ్మీర్‌లోని మూడు సెక్టార్లలో ఉన్న ఏడు ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి వాటిని నేలమట్టం చేసింది. 

రాజీనామా చేస్తానంటున్న డీకే అరుణ..

మహబూబ్ నగర్ : గద్వాల జిల్లా ఏర్పాటు కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధమని గద్వాల ఎమ్మెల్యే డీకే స్పష్టం చేశారు. గద్వాల జిల్లా ఏర్పాటుకు తాను అడ్డమని టీఆర్‌ఎస్‌ పార్టీ భావిస్తున్నందున ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసం, ప్రజల కోసం తాను ఎమ్మెల్యే పదవికి వదులుకోవడానికి సిద్ధమని ప్రకటించారు.

06:47 - October 1, 2016

మహబూబ్ నగర్ : గద్వాల జిల్లా ఏర్పాటు కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధమని గద్వాల ఎమ్మెల్యే డీకే స్పష్టం చేశారు. గద్వాల జిల్లా ఏర్పాటుకు తాను అడ్డమని టీఆర్‌ఎస్‌ పార్టీ భావిస్తున్నందున ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసం, ప్రజల కోసం తాను ఎమ్మెల్యే పదవికి వదులుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎం కేసీఆర్‌కు లేఖ రాయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే స్పీకర్‌ను కలిసి రాజీనామా పత్రం కూడా సమర్పించనున్నట్లు ఆమె వెల్లడించారు. 

కొనసాగుతున్న వామపక్ష నేతల అరెస్ట్ లు ..

చిత్తూరు : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నేడు చిత్తూరు జిల్లా తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన వెంకయ్యనాయుడుని అడ్డుకుంటామని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. దీంతో అర్థరాత్రి నుండి వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని ఈస్ట్ రేణిగుంట పీఎస్ తరలించారు. 

Don't Miss