Activities calendar

02 October 2016

21:59 - October 2, 2016

కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపారు.  
'ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. టీఆర్ ఎస్ కు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం. బీజేపీకి ఇక్కడ అవకాశాల్లేవు.. ఆ పార్టీకి ఇక్కడ అడ్రస్ కూడా లేదు. ఇప్పటికే టీఆర్ ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. మైనారిటీలకు, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్, రెండు పడకల ఇల్లు వంటి హామీలు అమలు చేయలేదు. కొత్త హామీలతో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ తప్పుతోంది. కొత్త రాష్ట్రం దివాళా దిశగా పయనిస్తోంది. తెలంగాణ ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ జాప్యం చేసింది. కాంగ్రెస్ పార్టీ నాన్చుడు ధోరణితోనే టీఆర్ ఎస్ గెలిచింది. 
సీమాంధ్ర నాయకుల్ని వెన్నాడుతున్న విభజన రాజకీయాలు  
సీమాంధ్ర నాయకుల్ని ఇంకా విభజన రాజకీయాలు వెన్నాడుతున్నాయి. ఉండవల్లి విభజన కథ పాక్షిక కోణం మాత్రమే. ప్రజల్ని విభజన సమస్య పేరిట వేధించడం నాయకులకు మంచిదికాదు. విభజిత ఆంధ్రకు నేనెటువంటి అన్యాయం చేయలేదు. ప్రత్యేకహోదా, విద్యా సంస్థల ఏర్పాటుకు మద్దతిచ్చా.... పోలవరం వ్యయం కేంద్రం భరించాలని కోరాను. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావాలని ఆంధ్రానాయకులు ఆశించారు. యూటీ డిమాండ్ ను వ్యతిరేకించాను.. అడ్గుకున్నాను. మారిన పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ వైపు నిలిచాను. విభజన కీలక సమయంలో అధికార విపక్షాల మధ్య సయోధ్య కుదిర్చాను. కమలనాథ్, సుష్మాల మధ్య మనస్పర్థలు తొలగించి బిల్లు ప్రవేశపెట్టేలా చేశాను. సీమాంధ్ర నాయకులు రాజకీయాన్ని పెట్టుబడి లేని వ్యాపారుంగా మార్చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భౌతికంగా అడ్డుకోవాలని సీమాంధ్రనాయకులు చూశారు' అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:57 - October 2, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత.. వైద్య చికిత్సకు స్పందిస్తున్నారని అపోలో వైద్యులు తెలిపారు. మరికొద్దిరోజులపాటు ఆస్పత్రిలోనే ఉండాలని స్పష్టం చేశారు. జయలలిత హెల్త్‌ బులిటెన్‌ను అపోలో వైద్యులు విడుదల చేశారు. మరోవైపు జయలలిత ఆరోగ్యంపై వదంతులు వస్తుండటంతో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు పెద్ద సంఖ్యలో అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. జయలలిత కోలుకుంటున్నారని.. స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారాల నేపథ్యంలో విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నాడిఎంకె వర్గాలు ఆరోపిస్తున్నాయి. 
పార్టీ వర్గాల్లో ఆందోళన
అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై పార్టీ వర్గాల్లో ఆందోళన గంటగంటకూ పెరుగుతోంది.  సోషల్‌ మీడియాలో తమ అధినేత్రి ఆరోగ్యంపై జరుగుతోన్న ప్రచారం వారి ఆందోళనకు కారణమవుతోంది. సెప్టెంబర్‌ 22న జ్వరం, డీ హైడ్రేషన్‌ సమస్యలతో.. చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్నారు. మొన్నటి వరకూ ఆమె ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌లు వెలువరించిన ఆసుపత్రి వర్గాలు.. గడచిన రెండు రోజులుగా మౌనాన్ని ఆశ్రయించాయి. దీంతో అన్నాడిఎంకె వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. 
జయలలిత ఆరోగ్యస్థితిని తెలుసుకున్న గవర్నర్‌ విద్యాసాగరరావు
శనివారం సాయంత్రం గవర్నర్‌ విద్యాసాగరరావు అపోలో ఆసుపత్రి వెళ్లి.. జయలలిత ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. పురట్చితలైవి కోలుకుంటున్నారని రాజ్‌భవన్‌ వర్గాలు అధికారిక ప్రకటన వెలువరించాయి. అయినా అన్నాడిఎంకె శ్రేణుల్లో ఆందోళన తగ్గలేదు. పైగా ఆదివారం ఉదయం.. రాష్ట్ర మంత్రులు పెద్ద సంఖ్యలో జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అదే సమయంలో అన్నాడింఎకె శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నాయి. తమ అధినేత్రి ఆరోగ్యం గురించిన బులెటిన్‌ విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో.. ఆసుపత్రి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 
వదంతులు నమ్మొద్దు : అన్నాడీఎంకే అధికార ప్రతినిధి 
ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన వదంతులు నమ్మొద్దని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. విపక్షాలు దురుద్దేశపూరితంగా తమ అధినేత్రి ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 
జయ ఆరోగ్యంపై వదంతులు ఆగలేదు 
సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్‌.. జయలలిత కోలుకుంటున్నారని అధికారిక ప్రకటన వెలువరించినా.. ఆదివారం ఆమె ఆరోగ్యంపై వదంతులు ఆగలేదు. పైగా జయలలిత తాజా ఫోటోను విడుదల చేయాలన్న కరుణానిధి డిమాండ్‌ కూడా వదంతులకు బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దని.. అధినేత్రి మంచి ఆరోగ్యంతో బయటకు వస్తారని నాయకులు భరోసా ఇస్తున్నారు. జయలలిత ఆరోగ్యంపై సమగ్ర హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయాలని, ఆమె ఫొటోను విడుదల చేయాలని అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. జయలలిత ప్రస్తుతం లండన్‌ వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. 

 

21:53 - October 2, 2016

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. వరుసగా రెండు రోజులు పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శనివారంనాటి పేలుడు..కిరోసిన్ బాంబు అనుకోని పోలీసులు లైట్ తీసుకున్నారు. అయితే ఇవాళ కూడా మరోసారి పేలుడు జరిగి ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాంబుస్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు. అసలు ఇంతకి ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఏం జరుగుతోంది. ? 
పేలుళ్ల మిస్టరీ..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరుగుతున్న వరుస పేలుళ్లు నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో శనివారం ఓ స్కూటర్‌ డిక్కీలో జరిగిన పేలుడు ఘటన మర్చిపోకముందే తాజాగా మరోసారి అదే ప్రాంతంలో పేలుడు సంభవించింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలెర్టయ్యారు. 
ఇబ్రహీంపట్నంలో తాజాగా మరో పేలుడు 
అంబేద్కర్‌ చౌరస్తాలో స్కూటరు డిక్కీకి సమీపంలో ఉన్న శిలాఫలకం పక్కన తాజాగా మరో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. శనివారం స్కూటర్ డిక్కీలో జరిగిన పేలుడు కిరోసిన్‌ బాటిల్‌ వల్ల జరిగిందనుకున్నారు. పోలీసులు కూడా డిక్కీలో ఉన్నది కిరోసిన్ బాటిల్‌ అని గుర్తించారు. 
ప్రజల్లో భయాందోళన 
అయితే అదివారం కూడా పేలుడు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూమిలో పాతిపెట్టిన బాంబు పేలడంతో యాదయ్య అనే వ్యక్తికి కాలు పూర్తిగా కోల్పోయే పరిస్ధితి వచ్చింది. కాళీదాస్,నాగమణి అనే ఇద్దరికి కూడా తీవ్రగాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన పేలుళ్లతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అసలు ఇదే ప్రాంతంలో ఎందుకు వరుస పేలుళ్లు జరుగుతున్నాయన్న కోణంలో క్లూస్‌ టీం ఆధారాలను సేకరించేపనిలో నిమగ్నమైంది. 
టిఫిన్ బాంబులు భూమిలో దాచిపెట్టారా..? 
పేలుడు జరిగిన ప్రాంతంలో గిరిజనులు ఎక్కవగా నివసిస్తున్నారు. వీరు పందుల కోసం తేలికపాటి మందు పాతర్లు పెడుతుంటారు. అవే ఇక్కడ అమర్చారా..అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేక ఎవరైనా కావాలనే టిఫిన్ బాంబులు భూమిలో దాచిపెట్టారా..? ఇంకా ఎన్ని బాంబులు అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నాయో తెల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దీనికోసం అంబేద్కర్ చౌరస్తాలో జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు. వరుస పేలుళ్లతో ఇబ్రహీంపట్నం పరిసరాల ప్రజలు.. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందోనన్న ఆందోళనతో ఇళ్లల్లోంచి వచ్చేందుకే జంకుతున్నారు. త్వరలోనే పేలుళ్ల మిస్టరీని చేధిస్తామని పోలీసులు ధీమగా చెప్తున్నారు. 

21:48 - October 2, 2016

విజయవాడ : ప్రజాసమస్యలపై గళమెత్తేవారిని అణచడమే లక్ష్యంగా.. ఏపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. తుందూరు ఆక్వా బాధితుల పక్షాన నిలిచిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును అరెస్టు చేసిన తీరుపై.. రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస మర్యాదలు కూడా పాటించకుండా ఓ జాతీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శితో పోలీసుల వ్యవహార తీరును విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. 
క్రూరమైన పద్ధతుల్లో మధు అరెస్టు 
పశ్చిమగోదావరి జిల్లా తుందూరులో.. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను ఏర్పాటు యత్నాలు జరుగుతున్నాయి. పచ్చదనంతో కళకళలాడే ఈ ప్రాంతం ఈ ఫ్యాక్టరీ వల్ల కలుషితమైపోతుందని ఆందోళన చెందుతున్న స్థానికులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వారికి సంఘీభావం తెలిపేందుకు శనివారం తుందూరు వెళ్లబోయిన సీపీఎం ఏపీ కార్యదర్శి మధును.. పోలీసులు అత్యంత హేయంగా.. క్రూరమైన పద్ధతుల్లో అరెస్టు చేశారు. 
పోలీసులు అరెస్ట్‌ చేసిన తీరుపై తీవ్రంగా స్పందించిన మధు  
తనను పోలీసులు అరెస్ట్‌ చేసిన తీరుపై మధు తీవ్రంగా స్పందించారు. పరిశ్రమల ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని... నిషేధిత పరిశ్రమల ఏర్పాటునే అడ్డుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అణచివేత విధానంపై భీమవరంలో మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని దౌర్జన్యానకి పాల్పడ్డారని మధు తెలిపారు. పోలీసులు అనుమతించినా.. లేకున్నా.. ఈనెల 4న  తుందూరు వెళ్లితీరతామని మధు స్పష్టం చేశారు. 
మధు అరెస్టు తీరును ఆక్షేపించిన విపక్షాలు  
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అరెస్టు తీరును విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఆక్షేపించాయి. కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.  తుందూరు ఆక్వాఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు కోసం.. ప్రభుత్వం నిర్బంధాన్ని ఆశ్రయిస్తోందని  వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.తుందూరు పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించడం ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. 
మధు అరెస్టు తీరును తప్పుబట్టిన వైసీపీ 
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అరెస్టు తీరును వైసీపీ నాయకులూ తప్పుబట్టారు. పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం మధును ఫోన్‌ ద్వారా పరామర్శించారు. ప్రజాసమస్యలపై పోరాడే వారిపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్నతీరును పార్టీ ఇతర నేతలూ తప్పుబట్టారు. ప్రజల అభీష్టానికి.. పర్యావరణానికీ వ్యతిరేకంగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. దాన్ని ప్రశ్నించిన వారి గొంతు నొక్కాలనుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

 

21:43 - October 2, 2016

హైదరాబాద్ : జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ప్రజాభిప్రాయం మేరకే విభజించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ శాస్త్రీయంగా జరుగుతోందని అన్నారు. జిల్లాల విభజనపై ఇవాళ మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్‌ విడివిడిగా భేటీ అయ్యారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ విస్త్రతంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ..చిరస్థాయిలో నిలిచిపోయే జిల్లాల విభజనతో అందరికీ మంచి జరగాలన్నారు. అనవసరంగా తమను మరోచోట కలిపారన్న భావన ప్రజల్లో రాకూడదన్నారు. ఆయా జిల్లాల నేతలంతా చర్చించుకుని ఏకగ్రీవ తీర్మానంతో రావాలని సూచించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా నేతలు పలు మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. వికారాబాద్‌ జిల్లాకు అనంతగిరి అని, శంషాబాద్‌ జిల్లాకు రంగారెడ్డి అని పేరు పెట్టాలని మంత్రి మహేందర్‌రెడ్డి..ముఖ్యమంత్రిని కోరారు. అలాగే 
చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మండలాలు శంషాబాద్‌ జిల్లాలో, కల్వకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాలు శంషాబాద్‌ జిల్లాలో, కొడంగల్‌, బొమ్రాస్‌పేట మండలాలు వికారాబాద్‌ జిల్లాలో, గండేడు మండలం మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలిసే అవకాశం ఉంది. ఇక సోమవారంనాడు ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల నేతలతోనూ సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఈ భేటీకి తప్పకుండా రావాలని ఆయా ప్రాంతాల మంత్రులు, ఎమ్మెలు, ఎమ్మెల్సీలను సీఎం  ఆదేశించారు.

విశాఖ జిల్లాలో దారుణం

విశాఖ : జిల్లాలో దారుణం జరిగింది. బావను బావమరిది హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాడేరు మండలం ఉగంగొయ్యి గ్రామంలో నెలక్రితం నిందితుడు ఓ విషయంలో తన భార్యను బెదిరిస్తూ ఆమె సోదరుడిని హత్య చేశాడు. దీంతో ఆమె తన భర్తపై పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

ఇథియోపియాలో తొక్కిసలాట..పలువురు మృతి

ఇథియోపియా : ఒరోమియా ప్రాంతంలో జరుగుతున్న మత పరమైన పండుగలో తొక్కిసలాట జరిగింది. కొందరు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు భాష్పవాయువును ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ప్రజలు పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

 

రెండో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం

ఢిల్లీ : దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌ల్లో దక్షిణాప్రికా విజయం సాధించింది. 142 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 361 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. 

రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

గుంటూరు : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. బాపట్ల సూర్యలంక రోడ్‌ ఇమ్మడిశెట్టిపాలెంలో బాలుడిని కారు ఢీకొట్టింది. దీంతో బాలుడు మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న వారిని పట్టుకొని స్థానికులు చితకబాదారు. 

20:43 - October 2, 2016

సీఎం జయలలిత ఆరోగ్య బులెటిన్ విడుదల

చెన్నై : సీఎం జయలలిత ఆరోగ్య బులెటిన్ విడుదల అయ్యారు. మరికొన్ని రోజులు జయను ఆస్పత్రిలోనే ఉంచాలని అపోలో వైద్యులు తెలిపారు. జయలలిత ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని చెప్పారు. జయలలిత చికిత్సను స్పందిస్తోందన్నారు. డా.జాన్ రిచర్డ్స్ ట్రీట్ మెంట్ తో కోలుకున్నారని పేర్కొన్నారు. జయ ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక వైద్య బృందంతో జాన్ రిచర్డ్స్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. 

 

నారాయణగూడలో రియల్టర్ల ఆగడాలు

హైదరాబాద్ : నారాయణగూడలో రియల్టర్ల ఆగడాలు పెచ్చు మీరాయి. భూ వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒక వర్గాన్ని గన్ తో మరో వర్గం బెదిరించింది. రెండు గ్రూపులను పోలీసుల అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. 

మెదక్ జిల్లాలో పర్యటించన దత్తాత్రేయ

మెదక్ : హత్నూర మండలం గుండ్లమాచనూరులో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పర్యటించారు. వరదలకు దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు. 

 

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ

చిత్తూరు : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకుర్పారణ జరుగుతోంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. 

19:25 - October 2, 2016
19:16 - October 2, 2016

చిత్తూరు : కార్మికులతో పాటు వారి కుటుంబాలకు ఉపయోగపడే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'చంద్రన్న బీమా' పథకాన్ని ప్రవేశపెట్టింది. తిరుపతిలోని తారకరామ మైదానంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 2 కోట్ల అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ప్రమాదవశాత్తూ మరణించినా, పూర్తిస్థాయి అంగవైకల్యం సంభవించినా 5లక్షలు అందజేస్తారు. ఏదైనా ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే 3 లక్షల 62 వేల 500 ఇస్తారు. సహజంగా మరణిస్తే 30వేల రూపాయలు అందిస్తారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల పిల్లల్లో ఇద్దరికి 12వందల చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. 

 

19:13 - October 2, 2016

హైదరాబాద్ : తెలంగాణలో సామాజిక అభివృద్ధికై మహాజన పాదయాత్ర చేపడుతున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. హైదరాబాద్‌లోని ఎస్వీకేలో మహాజన పాదయాత్రపై మేధావులతో చర్చాగోష్టి జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు ఆశించిన పాలన సాగడంలేదని..విద్య, వైద్యం ప్రజలకు అందడంలేదన్నారు. కాంట్రాక్టర్లకు వందలకోట్లు దోచిపెట్టేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వంగా మారినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని..అప్పుడే తెలంగాణ కష్టాలు తీరతాయని టీ జేఏసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఈసమావేశంలో పొత్తూరి వెంకటేశ్వరరావు, చుక్కా రామయ్య, జస్టిస్‌ చంద్రకుమార్‌, విద్యుత్‌ రంగ నిపుణులు రఘు పలువులు పాల్గొన్నారు. 

 

19:08 - October 2, 2016
19:07 - October 2, 2016

ఢిల్లీ : దేశవ్యాప్తంగా గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహాత్ముడికి నేతలు, అధికారులు  ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లో బాపూ ఘాట్‌ వద్ద సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిలు పూలమాల వేసి నివాలులర్పించారు. గాంధీ చూపిన మార్గంలో నడుస్తూ.. ఆయన ఆశయాలను సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పలువురు అభిలాషించారు. హైదరాబాద్‌ లో 
గాంధీ జయంతిని పురష్కరించుకుని హైదరాబాద్‌ బాపూఘాట్‌లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌, ఘనంగా నివాళులు అర్పించారు.  వీరితో పాటు కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంత్రులు నాయిని నరసింహరెడ్డి, మహెందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
ఢిల్లీలో
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రి ఈటెల రాజెందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా పలువురు నేతలు గాంధీ ఆశయాలను స్మరించుకున్నారు. రాష్ట్రంలో గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు కృషి చేస్తున్నామని మంత్రి ఈటెల చెప్పారు. 
గాంధీభవన్‌లో
గాంధీభవన్‌లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేతలు  జానారెడ్డి, వీహెచ్‌, అంజన్‌కుమార్‌యాదవ్‌ మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 
గాంధీ విగ్రహనికి పుష్ప అలంకరణ
జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలను తెలంగాణ అసెంబ్లీలో ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని పుష్పాలతో అలంకరించారు. శాసనసభ సభాపతి మధుసూదనాచారి, ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌, పూలమాలవేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు.
రాజేంద్రనగర్‌లో 
రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, వాడను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఈ సందర్భంగా స్వచ్ఛ్‌ పక్వాఢ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి సూచించారు. నగరంలోని మల్కాజ్‌గిరి గాంధీ పార్క్‌లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కనకరెడ్డి, స్థానిక కార్పొరేటర్‌లు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి.. గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు కృషి చేస్తామని ఎంపీ మల్లారెడ్డి అన్నారు. 

18:27 - October 2, 2016

మహబూబ్ నగర్ : పాలమూరు... రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయి 3 జిల్లాల్లోని 20 లక్షల ఎకరాల పంటలకు సాగునీరందితే తమ మనుగడకు కష్టంగా మారుతోందని విపక్షాలు చేస్తున్న రాద్దాంతంపై దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మండిపడ్డారు. ఈమేరకు వెంకటేశ్వరరెడ్డి టెన్ టివితో మాట్లాడారు. పాలమూరు...రంగారెడ్డి ఎత్తిపోతలతో జిల్లా సస్యశామలం అవుతుందని, కర్వేన రిజర్వాయర్ కింద ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయ్యిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ప్రాజెక్ట్ ఆగదని చెప్పారు. 

 

కోల్ కతా టెస్టు.. ముగిసిన మూడో రోజు ఆట

బెంగళూరు : కోల్ కతా టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 227పరుగులు చేసింది. క్రీజులో భువనేశ్వర్.. 8, సాహా.. 39 పరుగులు చేశారు. భారత్ కు 339 పరుగుల ఆధిక్యం లభించింది. 

కరీంనగర్ జిల్లాలో సెల్ఫీ విషాదం

కరీంనగర్ : జిల్లాలో సెల్ఫీ విషాదం నెలకొంది. జగిత్యాల ఎస్సారెస్సీ మెయిన్ కెనాల్ వద్ద సెల్ఫీ దిగుతూ కెనాల్ లో పడి అహ్మద్ (18) అనే యువకుడు గల్లంతయ్యారు. ముగ్గురు స్నేహితులు కలిసి సెల్ఫీ దిగుతుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. 

ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. 

17:56 - October 2, 2016

మెదక్ : జిల్లాలోని జిన్నారం మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని గ్రామస్తులు సెల్ టవర్ ఎక్కారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలిసిరాస్తారోకో నిర్వహించారు. దీంతో దాదాపు రెండు కి.మీ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

 

17:51 - October 2, 2016

గాంధీనగర్ : గుజరాత్‌ తీరప్రాంతంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తీరానికి సమీపంలోకి దూసుకొచ్చిన పాకిస్తాన్‌ బోట్‌ను నావీ అదుపులోకి తీసుకుంది. బోట్‌లో 9మంది పాకిస్తాన్‌ పౌరులు ఉన్నారు. విచారణ కోసం వారిని ఫోర్‌బందర్‌కు తరలించారు. బోట్‌ సంఘటనతో అటు మహరాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా తీరప్రాంతాల్లో నావీ అప్రమత్తమైంది. 

 

17:47 - October 2, 2016

చిత్తూరు : అక్టోబర్‌2 గాంధీజయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో స్వచ్ఛాంద్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రప్రదే సాధనలో ముందుకు సాగుతామని ప్రతిజ్ఞచేశారు. ఈసందర్భంగా రాష్ట్ర పారిశుద్ధ్య ప్రణాళిక పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కూడా పాల్గొన్నారు. స్వచ్ఛభారత్‌ ,స్వచ్ఛాంధ్రప్రదేవ్‌ ఉద్దేశాన్ని వివరించారు. 

 

17:44 - October 2, 2016

ఢిల్లీ : స్వచ్ఛ భారత్‌ సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు ప్రసార శాఖ చేసిన ప్రయత్నం సఫలమైందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. స్వచ్ఛభారత్‌పై లఘ చిత్రాలు తీసిన వారికి ప్రోత్సాహకాలు ప్రకటించామని అన్నారు. గుజరాత్‌లో 170, ఏపీలో 110 మున్సిపాలిటీలు బహిరంగ మూత్రవిసర్జన రహిత ప్రాంతాలుగా గుర్తించబడ్డాయని అన్నారు. బహిరంగ మూత్ర విసర్జన రహిత ప్రాంతంగా గాంధీజీ సొంత జిల్లా పోరుబందర్‌ అని తెలిపారు.

17:43 - October 2, 2016

హైదరాబాద్ : నాలాలు, చెరువుల్ని కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై  కూల్చివేతలు కొనసాగుతాయని సిటీ సివిల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి దేవేందర్‌రెడ్డి అన్నారు. కూల్చివేసిన భవనాలు మళ్లీ నిర్మిస్తే వారి పైన క్రిమినల్ కేసులు పెడతామన్నారు. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి జే.ఎన్.టి.యూలో భవన నిర్మాణాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా సిటీ సివిల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దేవేందర్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో బిల్డర్స్ హాజరయ్యారు. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ తరపున అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తున్న ప్రభుత్వనికి తమ మద్దతు ఉంటుందని వారు అన్నారు. 

 

'చంద్రన్న' బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

తిరుపతి : 'చంద్రన్న' బీమా పథకం ప్రారంభించారు. 2 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు అబ్ధి చేకూరుతుందన్నారు. ప్రమాదవశాత్తు మరణించినా, పూర్తిస్థాయి అంగవైకల్యం ఉన్నా రూ.లక్షల బీమా వర్తిస్తుందని చెప్పారు. ఏదైనా ప్రమాదం వల్ల పాక్షికంగా అంగవైకల్యం వస్తే రూ.3,62, 500 బీమా, సహజంగా మరణిస్తే రూ.30వేలు చెల్లిస్తామని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల పిల్లలకు రూ.1200 ఉపకార వేతనం ఇస్తామని సీఎం చెప్పారు.

17:11 - October 2, 2016

స్వచ్ఛ్ ఎపి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

తిరుపతి : స్వచ్ఛ్ ఎపి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ పాల్గొన్నారు. 110 పట్టణాలు, 1000 గ్రామ పంచాయతీలకు బహిరంగ విసర్జన రహిత ప్రాంతాలుగా హోదా దక్కడం సంతోషకరమన్నారు. ప్రతి శనివారం ప్రతి ఒక్కరూ పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. మురుగుదొడ్లు లేనివారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేసే చట్టం తెస్తామని చెప్పారు. 

16:55 - October 2, 2016
16:52 - October 2, 2016

ఛత్తీస్ గఢ్ లో లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు

ఛత్తీస్ గఢ్ : బిజాపూర్ పోలీసుల ఎదుట 25 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. 

16:42 - October 2, 2016

పుల్వామాలో మాజీ సర్పంచ్ కాల్చివేత

జమ్మూకాశ్మీర్ : పుల్వామాలో మాజీ సర్పంచ్ ను ఉగ్రవాదులు హత మార్చారు. మాజీ సర్పంచ్ ఫయాజ్ అహ్మద్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. 

16:37 - October 2, 2016

గుంటూరు : ప్రజానాట్యమండలి ఏపీ రాష్ట్ర సహాయకార్యదర్శి ఆర్‌.ఎస్‌.వాసు గుండెపోటుతో మృతి చెందారు.  అమరావతిలో జరుగుతున్న ప్రజానాట్యమండలి శిక్షణాతరగతుల హాజరైన వాసు ఇవాళ మధ్యాహ్నం అకస్మాత్తుగా  గుండెపోటు రావడంతో మృతిచెందారు. 'నా చెమటచుక్కో.. నాచెమటచుక్కా'.. అనే పాటతో గేయరచయితగా మంచిపేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లా ప్రజానాట్యమండలి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వాసు మృతదేహాన్ని కర్నూలుకు తరలించారు. 

16:31 - October 2, 2016

విజయవాడ : పరిశ్రమలకు సిపిఎం వ్యతిరేకం కాదని... నిషేధించబడిన పరిశ్రమల ఏర్పాటును మాత్రమే అడ్డుకుంటోందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా నిర్మించే ఆక్వా పరిశ్రమ ఏర్పాటు  ప్రక్రియను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్వా, రసాయన, తోళ్ల పరిశ్రమల హబ్‌గా రాష్ట్రాన్ని మార్చేందుకు సర్కారు ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆక్వా పరిశ్రమ సందర్శన సందర్భంగా భీమవరంలో మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని దౌర్జన్యానకి పాల్పడ్డారని తెలిపారు. భీమవరం పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వాఫుడ్ పార్క్ ఏర్పాటు ప్రాంతాన్ని సందర్శించకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఈనెల 4న  పోలీసులు అనుమతి ఇచ్చినా... ఇవ్వకపోయినా... పెద్ద ఎత్తున సిపిఎం కార్యకర్తలతో తుందుర్రు సందర్శిస్తామని స్పష్టం చేశారు. 

16:14 - October 2, 2016

ఢిల్లీ : తెలంగాణలో భారీ వర్షాల వల్ల సుమారు 2,202 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. తెలంగాణ సీఎస్‌ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లిన మంత్రి ఈటెల బృందం మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. తెలంగాణకు వాటిల్లిన నష్టాన్ని పూడ్చేందుకు 2,202 కోట్ల ఆర్ధిక సాయం చేయాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరామని..అందుకు మంత్రి సానుకూలంగా స్పందించాలని ఈటెల తెలిపారు. తెలంగాణలో భారీ వర్షాల వల్ల 600 చెరువులకు గండ్లు పడ్డాయని..వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయని, వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయన్నారు. 

 

జయ ఆరోగ్యంపై మళ్లీ వదంతులు.. కలకలం

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీ.ఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై మళ్లీ వదంతులు రావడం కలకలం రేపుతోంది. 'అమ్మ' ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఊహాగానాలు వస్తుండటంతో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన బాట పట్టారు. జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళనకు దిగారు. మరోవైపు తమిళనాడు మంత్రులు కూడా అపోలో ఆస్పత్రికి చేరుకుంటుండటంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద టెన్షన్...

తమిళనాడు : చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమిళనాడు సీఎం జయలలితపై హెల్త్‌ బులిటెన్ విడుదల చేయాలని అన్నాడీఎంకే కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉదయమే జయలలితను చూసేందుకు మంత్రులంతా తరలివచ్చారు. జయలలిత క్షేమంగా ఉన్నారని తమిళనాడు మంత్రులు చెబుతున్నారు. 

16:05 - October 2, 2016

తమిళనాడు : చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమిళనాడు సీఎం జయలలితపై హెల్త్‌ బులిటెన్ విడుదల చేయాలని అన్నాడీఎంకే కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉదయమే జయలలితను చూసేందుకు మంత్రులంతా తరలివచ్చారు. జయలలిత క్షేమంగా ఉన్నారని తమిళనాడు మంత్రులు చెబుతున్నారు. జయలలిత వేగంగా కోలుకుంటున్నారని రాజ్‌భవన్‌ ప్రకటించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా భారీగా తరలిరావడంతో... ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో 11 రోజులుగా అపోలోలో చికిత్స పొందుతున్న జయలలిత.. త్వరగా కోలుకోవాలంటూ... ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తలు, జయలలిత అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. వదంతులు నమ్మొద్దని పార్టీ ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
జయ ఆరోగ్యంపై మళ్లీ వదంతులు.. కలకలం
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీ.ఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై మళ్లీ వదంతులు రావడం కలకలం రేపుతోంది. 'అమ్మ' ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఊహాగానాలు వస్తుండటంతో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన బాట పట్టారు. జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళనకు దిగారు. మరోవైపు తమిళనాడు మంత్రులు కూడా అపోలో ఆస్పత్రికి చేరుకుంటుండటంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జ్వరం, డీ హైడ్రేషన్‌తో సీఎం జయలలిత గత నెల 22న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలితకు వైద్య బృందం మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వారం రోజులపాటు అమ్మ ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశారు. తదుపరి బులిటెన్‌లు ఆగడంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో సీఎం జయలలితకు వ్యతిరేకంగా గత రెండు రోజులుగా వదంతులు వచ్చాయి. సీఎం ఆరోగ్యంపై అధికారిక ప్రకటన, ఫొటోతో సహా బహిర్గతం చేయాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే జయలలితను శనివారం రాత్రి పరామర్శించిన ఇన్‌చార్జ్‌ గవర్నర్ విద్యాసాగర్‌రావు.. ఆమె చికిత్స పొందుతున్న  వార్డులోకి తాను వెళ్లినట్టు, అక్కడ అందిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించినట్టు తెలిపారు. ఆమె కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఆమె త్వరితగతిన కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై తమిళనాడులో వదంతులు, ఊహాగానాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న అభిమానులు.. ఏక్షణంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జయలలిత సమగ్ర హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయాలని, ఆమె ఫొటోను విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు.

 

15:53 - October 2, 2016

మహబూబ్‌నగర్‌ : సరిగ్గా ఏడాదిక్రితం ఇదే అక్టోబర్‌ 2న మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగాయి. నదీతీర గ్రామాలను అల్లకల్లోలం చేశాయి.. అధికారులు అప్రమత్తంచేసేలోపే ఇళ్లు, పొలాలు కొట్టుకుపోయాయి.. ఆనాడు గ్రామాలను ఓదార్చేందుకు ఎంతోమంది నేతలొచ్చాయి.. ఎన్నో హామీలిచ్చారు.. ఆ తర్వాత అన్నీ గాలికొదిలేశారు. వరదలతో సర్వం కోల్పోయిన బాధితులు ఇప్పటికీ ఆసరాకోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

15:50 - October 2, 2016

రంగారెడ్డి : పేషెంట్‌ను ఐసీయూలో ఉంచారు.. డాక్టర్లు హడావుడిగా తిరుగుతున్నారు. ఆ టెస్టులు చేయాలి. ఈ టెస్టులు చేయాలంటూ బంధువుల నుంచి వేలకు వేలు డిపాజిట్‌ చేయించుకుంటున్నారు. ఇంతా చేసి వారు పడ్డ హడావుడి అంతా.. ఓ శవానికి చికిత్స చేసేందుకు.. ఏంటీ ఠాగూర్‌ సినిమా గుర్తొస్తోందా..? అవును అచ్చంగా అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో వెలుగు చూసింది. మృతదేహానికి చికిత్స చేస్తున్నామంటూ వైద్యులు చేసిన మోసంపై బాధితులు ఆసుపత్రి ఎదుటే ఆందోళనకు దిగారు. 
ఠాగూర్‌ సినిమాలో సీన్‌..
ఈ సీన్‌ గుర్తుందిగా.. ఆ మధ్యలో వచ్చిన ఠాగూర్ సినిమాలోదీ దృశ్యం. కాసుల కోసం కక్కుర్తి పడే వైద్యుల తీరును ఎండగట్టిన దృశ్యమిది. అచ్చంగా ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వెలుగు చూసింది. వైద్యం కోసం వచ్చిన ఓ వృద్ధురాలు చనిపోతే.. ఆ సంగతిని బయట పెట్టకుండా.. ఇంకా చికిత్స చేస్తున్నామంటూ వైద్యులు ఆడిన డ్రామా బట్టబయలైంది. 
హస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి
రెండు రోజుల క్రితం శంషాబాద్ లోని ట్రిడెంట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో పెంటమ్మ అనే మహిళ చేరింది. చికిత్స పొందుతూనే ఆమె మరణించింది. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టిన వైద్యులు.. ఠాగూర్‌ సినిమాలోని డాక్టర్లలా వ్యవహరించారు. ఏవేవో టెస్టులు చేయాలన్నారు. బ్లడ్‌ అత్యవసరం తీసుకురమ్మన్నారు.  అంతేనా భారీగా ఖర్చవుతుందంటూ పెంటమ్మ కుటుంబ సభ్యుల నుంచి భారీ మొత్తాన్ని డిపాజిట్‌ చేయించుకున్నారు. 
చనిపోయిన వ్యక్తికి ఎలా వైద్యం చేశారంటూ ఆందోళన
ట్రిడెంట్ డాక్టర్ల హడావిడితో బంధువుల్లో అనుమానం తలెత్తింది. వారిలో కొందరు ఐసీయూలోకి వెళ్లి చూడగా పెంటమ్మ చనిపోయి కనిపించింది. దీంతో ఆగ్రహంతో వారంతా ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను వెంటనే ఆరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళనకు ఆసుపత్రి యాజమాన్యం దిగొచ్చింది.  బాధితుల కుటుంబానికి న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. 

 

15:44 - October 2, 2016

తమిళనాడు : చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జయలలితపై హెల్త్‌ బులిటెన్ విడుదల చేయాలని అన్నాడీఎంకే కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉదయమే జయలలితను చూసేందుకు మంత్రులంతా తరలివచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా భారీగా తరలిరావడంతో... ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో 11 రోజులుగా అపోలోలో చికిత్స పొందుతున్న జయలలిత.. త్వరగా కోలుకోవాలంటూ... ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తలు, జయలలిత అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. 

 

15:42 - October 2, 2016

హైదరాబాద్ : భారత్‌.. ఉగ్రవాదానికి వ్యతిరేకమని ఎపిపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఇందిరాభవన్‌లో గాంధీ జయంతి వేడుకలకు రఘువీరా హాజరయ్యారు. జై జవాన్‌, జై కిసాన్‌ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని రఘువీరారెడ్డి అన్నారు. 19మంది సైనికులను ఉగ్రవాదులు చంపితే దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించిందని గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నవారికి వ్యతిరేకమన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ అడుగుజాడల్లో నడవాలని పిలుపిచ్చారు. 

 

15:38 - October 2, 2016

రంగారెడ్డి : జిల్లాలో వరుస పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న ఇబ్రహీంపట్నంలో పేలుడు సంభవించింది. అది మరిచిపోకముందే తాజాగా ఇబ్రహీంపట్నంలో మరోసారి పేలుడు సంభవించింది. అంబేద్కర్ చౌరస్తాలో మళ్లీ పేలుడు జరిగింది. రద్దీగా ఉండే ప్రాంతంలో అర్ధ గంట క్రితం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో యాదయ్య, కాళిదాసు, నాగమ్మ ఉన్నారు. నాగమ్మకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. పేలుడు ఎలా సంభవించిందన్న విషయాలను పరిశీలిస్తున్నారు. అదే ప్రాంతంలో నిన్న రాత్రి 8 ప్రాంతంలో స్కూటర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. నిన్న పేలుడు ఎందుకు జరిగిందనేది అర్థం కాలేదు. అయితే నిన్న జరిగిన పేలుడు ఘటనలో స్కూటర్ లో ఉన్న పెట్రోల్ బాటిల్ పేలినట్లు భావిస్తున్నారు. ఆ ఘటన మరువకముందే మరోసారి పేలుడు సంభవించడంతో స్థానికంగా భయాందోళనలు రేకెత్తాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఇబ్రహీంపట్నంలో మరోసారి పేలుడు

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నంలో మరోసారి పేలుడు సంభవించింది. అంబేద్కర్ చౌరస్తాలో మళ్లీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదే ప్రాంతంలో నిన్న రాత్రి స్కూటర్ పేలింది. 

 

ప్రజల ముందు ప్రత్యామ్నాయ అభివృద్ధి - తమ్మినేని..

హైదరాబాద్ : మహాజన పాదయాత్ర సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేధావులతో చర్చా గోష్టి జరిగింది. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కోదండరామ్, చుక్కా రామయ్య, జస్టిస్ చంద్రకుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. తెలంగాణలో సమగ్ర, సామాజిక అభివృద్ది సాధనకై మహాజన పాదయాత్ర చేపడుతున్నామన్నారు. పాదయాత్రకు మేధావులు మద్దతివ్వాలని, 17న ఇబ్రహింపట్నం నుండి పాదయాత్ర ప్రారంభమౌతుందన్నారు. నాలుగు నెలలపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందని, ప్రత్యామ్నాయ అభివృద్దిని ప్రజల ముందు ఉంచుతామన్నారు.

పీఎన్ఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి అకస్మిక మృతి...

గుంటూరు : ప్రజా నాట్యమండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్.ఎ.వాసు (40) గుండెపోటుతో మృతి చెందాడు. అమరావతిలో పీఎన్ఎం శిక్షణా తరగతులకు వాసు హాజరయ్యారు. మధ్యాహ్నం 12గంటలకు గుండెపోటుతో అకస్మికంగా మృతి చెందారు. నా చెమట చుక్కో..నా చెమట చుక్కా గేయ రచయితగా వాసు మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా పీఎన్ఎం కార్యదర్శి వాసు పనిచేస్తున్నారు. 

ప్రభుత్వానిది నిరంకుశత్వం - సీపీఎం మధు..

విజయవాడ : పరిశ్రమలకు సీపీఎం వ్యతిరేకం కాదని ఏపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ప్రపంచంలో నిషేధించబడిన పరిశ్రమలను ఏర్పాటు చేసే పద్ధతులను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఆధారిత, ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, భీమవరం పోలీసులు తమపట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారని తెలిపారు. తుందుర్రులో అక్వాపుడ్ పార్క్ ఏర్పాటు ప్రాంతంలో పోలీసులు అనుమతినిచ్చినా, ఇవ్వకున్నా 4న అక్వాపుడ్ పార్క్ ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలిస్తామన్నారు. 

13:28 - October 2, 2016
13:25 - October 2, 2016

విజయవాడ : దుర్గగుడి ప్రముఖ ఆలయాల్లో ఒకటి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అధికంగా పోటెత్తుతుంటారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుత్తున్నాయి. వంద రూపాయల దర్శనం టికెట్లు అయిపోయాయని..రూ. 300 టికెట్లు తీసుకెళ్లాలని అధికారులు చెప్పడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆలయ ఈవో క్షమాపణలు చెప్పారు. ఇది మరిచిపోకముందే దుర్గ గుడి లడ్డూలో పురుగులు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.
లడ్డూ తయారీలో నాణ్యత కరవైంది. లడ్డూ తయారీలో జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. లడ్డూలో పురుగులు వస్తున్నాయని భక్తుల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అపరిశుభ్రంగా ఉన్న వంటశాలపై మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:21 - October 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతులను, వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందని.. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ, మండలి సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని కోరారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వంలోని పెద్దలు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. 

దుర్గగుడి లడ్డూలో పురుగులు..

విజయవాడ : దుర్గగుడి లడ్డూ తయారీలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వంటశాల అపరిశుభ్రంగా మారిపోయింది. లడ్డూలో పురుగులు వస్తున్నాయంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

12:31 - October 2, 2016
12:31 - October 2, 2016
12:21 - October 2, 2016
12:20 - October 2, 2016

విజయవాడ : కనకదుర్గమ్మ ఆలయ అధికారుల తీరు వివాదాస్పదమౌతోంది. భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనార్థం వంద రూపాయల టికెట్ కౌంటర్ వద్ద హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారు. వంద రూపాయల టికెట్లు అయిపోయ్యాయని, రూ. 300 టికెట్లు తీసుకోవాలని..లేకుంటే ఉచిత దర్శనం ద్వారా వెళ్లవచ్చని అధికారులు ఉచిత సలహాలు ఇవ్వడంపై భక్తులు మండిపడుతున్నారు. చివరకు భక్తుల ఆగ్రహాన్ని అర్థం చేసుకున్న ఆలయ ఈవో సూర్యకుమారి సిబ్బంది వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై భక్తులకు ఈవో క్షమాపణలు చెప్పారు. 

ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో సీఎం చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రజా ప్రతినిధుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు.

12:11 - October 2, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ? ఆమె కోలుకుంటున్నారా ? ఆసుపత్రి నుండి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు ? ప్రస్తుతం తమిళనాడులో ఎక్కడ చూసినా ఇదే చర్చ వినిపిస్తోంది. గత 12 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సీఎం జయలలిత చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యానికి గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుండి జయ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. సోషల్ మీడియాలో పలు పుకార్లు షికారు చేశాయి. దీనితో ఆమె ఆరోగ్యంపై అన్నాడీఎంకే నేతలు..కార్యకర్తలత్లో ఆందోళన నెలకొంది. ఆమె చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. స్వయంగా గవర్నర్ విద్యా సాగర్ రావు రంగంలోకి దిగి ఆసుపత్రి వద్దకు చేరుకుని జయను పరామర్శించారు. ఆరోగ్యం బాగానే ఉందని గవర్నర్ విద్యాసాగర్ రావు ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ జయ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడం గమనార్హం. వెంటనే జయ ఆరోగ్య పరిస్థితిపై ఓ ప్రకటన చేయాలని అభిమానుల..నేతలు..కార్యకర్తలు కోరుతున్నారు.
మరోవైపు ఆసుపత్రి ఎదుట ఆందోళన వాతావరణం నెలకొంది. జయను పరామర్శించేందుకు మంత్రులు..నేతలు..కార్యకర్తలు..అభిమానులు తరలివచ్చారు. దీనితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లండన్ నుండి వచ్చిన వైద్యుడి పర్యవేక్షణలో జయకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి మాత్రం బాగానే ఉందని తెలుస్తోంది. 

కొండపల్లి బొమ్మలకు మహర్ధశ - ఎంపీ కేశినేని...

విజయవాడ : కొండపల్లి బొమ్మల పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం రూ. 1.59 కోట్లు మంజూరు చేసినట్లు ఎంపీ కేశినేని పేర్కొన్నారు. బొమ్మల తయారీ పరిశ్రమకు మహర్ధశ పడుతుందని, ప్రపంచ వ్యాప్తంగా కొండపల్లి బొమ్మలకు గుర్తింపు తెచ్చేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు.

 

గాంధీకి నివాళులర్పించిన గవర్నర్, సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : మహాత్మాగాంధీ 147వ జయంతి సందర్భంగా బాపూఘాట్ వద్ద నివాళులర్పించిన గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయినీ, తలసాని, లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ కేకే, పొంగులేటి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. 

11:35 - October 2, 2016

తన వయస్సు పిల్లలతో ఎంచక్కా ఆడుతూ-పాడుతూ గంతులేయాల్సిన వయస్సులో ఓ బాలిక నిత్యం నరకం అనుభవిస్తోంది. బాగా చదివి డాక్టర్‌ కావాలనే లక్ష్యంతో ఉన్న ఆ చిన్నారిని విధి వెక్కిరించింది. కాళ్లు, చేతులు చచ్చుబడి మంచానికే పరిమితమైంది. సరిగా మాట్లాడలేని పరిస్థితుల్లో నిత్యం మూగవేదన అనుభవిస్తోంది. ఖరీదైన వైద్యం అందించలేని దుర్భర స్థితిలో ఉన్న చిన్నారి తల్లిదండ్రులు.. ఆర్థిక సహయం కోసం ప్రభుత్వాన్ని, దాతలను కన్నీళ్లతో వేడుకుంటున్నారు. బాలిక పేరు మధులత. బాగా కష్టపడి డాక్టర్‌ అయ్యి.. నిరుపేదలకు ట్రీట్‌మెంట్ అందిచాలనే బలమైన కోరిక ఈ పాపది. అయితే.. అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైంది.

2011లో మధులతకు తీవ్ర జ్వరం..
చిత్తూరు జిల్లా వి కోట మండలం తోటకనుమ గ్రామానికి చెందిన సూరి, హేమలత దంపతుల కూతురు మధులత. ఎప్పుడు కూడా ఎంతో చలాకీగా ఉండే మధులతకు 2011లో బాగా జ్వరం రావడంతో దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. ఆ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన సూదిమందు వికటించి..పాప కోమాలోకి వెళ్లిందంటున్నారు చిన్నారి తల్లిదండ్రులు. మధులతను బతికించుకోవడం కోసం బెంగళూరులో ఉన్న నిమాక్సి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన డాక్టర్లు.. ప్రైవేటు ఆస్పత్రిలో ఇచ్చిన ఇంజెక్షన్‌ వికటించడం వల్లే చిన్నారి ఈ పరిస్థితుల్లో ఉందని డాక్టర్లు చెప్పారని తల్లిదండ్రులు అంటున్నారు. అప్పటికే మధులత శరీరంలోని నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో కాళ్లు, చేతులు, చూపు, మాటలు పడిపోయాయి.

నిత్యం పనిచేస్తేగాని పొట్టగడవని పరిస్థితి..
ఇప్పటి వరకూ పైసా పైసా కూడబెట్టిన సొమ్ముతో, ఇంట్లోని నగలన్నీ అమ్మి.. చిన్నారి వైద్యం కోసం ఖర్చు పెట్టారు. అయినా మధులత కోలుకోకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పనిచేస్తేగాని పొట్టగడవని పరిస్థితుల్లో ఉన్న ఈ దంపతులు... ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన న్యూరోస్పెషలిస్ట్‌ వద్ద నెలకు 5 వేల చొప్పున ఖర్చు చేసి వైద్యం అందిస్తున్నారు. మధులత తల్లి ఓ షూ ఫ్యాక్టరీలో నెలకు 4వేలకు పనిచేస్తోంది. తండ్రి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు పనిచేస్తే వచ్చిన డబ్బుతో ఇంటి కిరాయి, కుటుంబ పోషణకు ఖర్చుపెట్టి.. మిగిలిన డబ్బుతో మధులతకు వైద్యం చేయిస్తున్నారు. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేదు. ఖరీదైన వైద్యానికి అప్పుచేసి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. డాక్టర్‌ కావాలనే తన కూతురు కోరిక నెరవేర్చండి అని ప్రభుత్వాన్ని ఈ నిరుపేద దంపతులు వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, దాతలు స్పందించి.. మధులత ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు తల్లిదండ్రులు. పెద్దయ్యాక డాక్టర్‌ కావాలని కలలు కంటున్న చిన్నారి కోరికను నెరవేర్చండి అంటూ ప్రాధేయపడుతున్నారు. 

11:33 - October 2, 2016
11:30 - October 2, 2016
11:15 - October 2, 2016

నెల్లూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..కానీ అనుమానం పెంచుకున్నాడు..చివరకు కట్టుకున్న భార్యను చంపేశాడు..రెండు ముక్కలుగా నరికేశాడు..రక్తపు చుక్క లేకుండా చేసేశాడు..అత్యంత పాశవికంగా వ్యవహరించిన ఈ వ్యక్తి వైద్యుడు కావడం గమనార్హం. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని అరవింద్ నగర్ లో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన సుధీర్ కుమార్ హౌస్ సర్జన్ గా వ్యవహరిస్తున్నాడు. కర్నూలు జిల్లాకు చెందిన వినీతను ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించారు. అయినా కూడా వీరు ప్రేమ పెళ్లి చేసుకుని అరవింద్ నగర్ లోని ఓ రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో నివాసం ఉంటున్నారు. కానీ మొదటి నుండి వినీత విషయంలో భర్త సుధీర్ అనుమానం పెట్టుకున్నాడు. ఈ విషయంలో తరచూ గొడవపడుతుండే వాడు. ఇష్టమొచ్చినట్లు కొట్టేవాడు..గాయపరిచేవాడు.

రక్తం లేకుండా చేశాడు...
గత నెల 28వ తేదీన మళ్లీ అనుమానించాడు. దీనితో వినీత..సుధీర్ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో వినీతను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం బాత్ రూంలో మృతదేహాన్ని ఉంచి శరీరంలో రక్తపు చుక్క లేకుండా శుభ్రపరిచాడు. మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి సూట్ కేసులో భద్రపరిచాడు. వినీతను చంపేశానని ఆమె తండ్రికి ఫోన్ చేసి పెట్టేశాడు. వెంటనే ఈ విషయాన్ని వినీత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సుధీర్ సూట్ కేసుల్లో ఉన్న మృతదేహాన్ని తిరుపతికి తీసుకెళ్లాడు. ఆటో..ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి (మం) బాకరాపేట వద్ద లోయలో సూట్ కేసులను సుధీర్ పడేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సుధీర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి దగ్గర తలుపులు పగులగొట్టి చూసినా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. చివరకు సుధీర్ పోలీసులకు లొంగిపోయాడు. ఇతడిని విచారించిన అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

11:05 - October 2, 2016

నీకు కౌలుకిచ్చి నా భూమిల నేనే కూలోన్నయిన.. నీ గరిసెలు నింపి నేను పరిగెలేరుకున్న.. నీ బస్తాలు మిల్లుకేసి.. నేను మాత్రం రోకటి పోట్లు దిన్న అంటూ ఘాటుగా కవిత్వం రాసిన దళిత బహుజన కవి పిట్టల శ్రీనివాస్. అలుగు కవితా సంపుటితో సంచలనం సృష్టించారు. దళిత బహుజన కవి పిట్టల శ్రీనివాస్ గురించి పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:58 - October 2, 2016

సాహిత్యం సామాజిక మార్పుకు దోహదం చేస్తుంది. మానవ సమూహాలను ఉత్తేజితం చేస్తుంది. ఉద్యమాల బాట పట్టిస్తుంది. సమున్నత సమాజాన్ని ఆశిస్తూ ఎందరో రచయితలు, కవులు, కథలు కవితలు రాస్తున్నారు. అలాంటివారిలో సాంఘిక న్యాయం కోసం పోరాడుతూ అదే సమయంలో కథలు కూడా రాసిన రచయిత్రి 'తాయమ్మ కరుణ' ఒకరు. సమాజంలోని బడుగువర్గాల బాధల గాధల్ని చూసి ఆమె చలించి పోయింది. ఉద్యమబాటలో అడుగులు వేస్తూనే, తన అనుభవాలు, ఆలోచనలనే కథలుగా మలిచింది. 'తాయమ్మ కథల' పేరుతో కథాసంపుటిగా వెలువరించింది. మనసులను కదిలించే కథలు రాసింది. అటు కదనరంగంలో, ఇటు కథారంగంలో జయభేరి మ్రోగించిన రచయిత్రి కరుణపై ప్రత్యేక కథనం. ఈ కవయిత్రి గురించి పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

10:55 - October 2, 2016

'నాగచైతన్య' కూడా ఒపెన్ అయ్యాడు. 'సమంత'తో లవ్ ఎఫైర్ పై ఈ అక్కినేని హీరో క్లారిటి ఇచ్చేశాడు. రెండు వారాల కిందట అవును మేం లవ్ లో ఉన్నాం అంతేకాదు డేటింగ్ కూడా చేస్తున్నామంటూ 'సమంత' ఒపెన్ అయింది. ఇప్పుడు 'చైతూ' కూడా కన్ ఫర్మ్ చేస్తూ తమ లవ్ సీక్రెట్స్ ని బయటపెట్టాడు. మరి 'సమంత'తో లవ్ గురించి చైతూ ఏం చెప్పాడు ? మొత్తానికి 'నాగచైతన్య' 'సమంత'తో ప్రేమాయణం గురించి పూర్తిగా ఓపెన్ అయిపోయాడు. దాగుడు మూతలు లేకుండా అన్ని విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడేశాడు. తమ ఇద్దరి ప్రేమాయణం ఎలా మొదలైంది. పెళ్లి వైపు ఎలా నిర్ణయం తీసుకున్నది ఆ ఇంటర్వ్యూలో వివరించాడు 'చైతూ'. అంతేకాదు 'సమంత'తో పెళ్లి ప్రస్తావన తెచ్చింది మొదట తనేనని కూడా ఈ అక్కినేని హీరో చెప్పేశాడు. 'ఏమాయ చేసావే' సమయంలో ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. కష్టసుఖాలు మాట్లాడుకునేవాళ్లమని 'నాగచైతన్య' చెప్పుతున్నాడు సినిమాలు హిట్ అయినప్పుడు, ఫ్లాప్ అయినప్పుడు ఫీలింగ్స్ ఒకరితో ఒకరం పంచుకునేవాళ్లట. అలా వీరికి తెలియకుండానే క్లోజ్ అయ్యారట. క్లోజ్ అయ్యాక ప్రేమలో ఎలా పడ్డమనేది తెలియకుండానే జరిగిందని 'చైతూ' చెప్పుతున్నాడు. ఐతే ఈ జంట ఇప్పటిదాకా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదట. ఇది ఎవరూ నమ్మలేని విషయని ఈ యంగ్ హీరో నవ్వుతూ చెప్పుతున్నాడు.

పెళ్లిపై క్లారిటీ..
పెళ్లి గురించి కూడా 'నాగచైతన్య' క్లారిటి ఇచ్చాడు. 'సమంత' దగ్గరికెళ్లి ఎన్ని రోజులు ఇలా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటాం. నాకు నువ్వు కరెక్ట్ అనిపిస్తోంది. పెళ్లిచేసుకుందాం. మనిద్దరం ఒక రిలేషన్షిప్ లో కంటిన్యూ అవ్వాలంటే పెళ్లి చేసుకుందాం.. అలా కాకుండా ఇలాంటి బంధంలో ఎన్నిరోజులున్నా ప్రయోజనం ఉండదని చైతూ, సమంతతో చెప్పాడట. అంతేకాదు పెళ్లి వద్దనుకుంటే ఇంతటితో ఆపేద్దాం అని కూడా అన్నాడట. దీంతో 'సమంత' కూడా వెంటనే ఒకే అంటూ నవ్వేసిందట. అయితే ఇదంతా ఈ ఎడాదిలోనే జరిగిందట. అన్నట్లు పెళ్లి వచ్చే ఎడాదిలో ఉంటుందని చెప్పుతున్నాడు.

10:53 - October 2, 2016
బాహుబలి-2 ( ద కంక్ల్యూషన్) ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే భారీ బడ్జెడ్ తో, హెవీ విజ్వల్ వాండెర్ తో నిర్మిస్తున్న సినిమా త్వరలోనే షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకుని ప్రచారానికి రెడీ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సృష్టించిన ప్రకంపనలు రాజమౌళికే కాదు, తెలుగు సినిమా ఇండస్ర్టీకే కీర్తిని తెచ్చిపెట్టాయి. దీనికి సీక్వెల్గా ‘బాహుబలి-2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబందించిన విశేషాలను తెలియజేసేందుకు ఇటీవల  ప్రెస్ మీట్ తో ముందుకు వచ్చిన చిత్ర బృదం…. ‘బాహుబలి-2’ లోగోను విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా రాజమౌలి కేవలం లోగోనే కాదు , ప్రేక్షకులకు ఇన్ డైరెక్ట్ గా మరో ప్రశ్నను కూడా విసిరాడు. లోగో పోస్టర్ లోని కింది భాగంలో ఆంగ్ల అక్షరాలతో ఉన్న 'డబ్ల్యూకేకేబీ 2017' అనే చిన్న ట్యాగ్ ఇప్పుడు ఆశక్తి కరంగా మారింది. అసలు ఏంటీ ఈ డబ్ల్యూకేకేబీ, దీనికి అర్థం ఏముంటుంది అనే ప్రశ్న మరో సారి ప్రేక్షకులకు, అభిమానులకు సవాలుగా మారింది. ఇప్పటికే బిగినింగ్ లో రాజమౌలి వదిలిన ఓ చిన్న ప్రశ్న సీని ప్రముఖులతో పాటు చిన్న పిల్లలను సైతం తలామునకలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌలి మరో ప్రశ్నని వదిలి మరింత ఆశక్తిని పెంచాడు. అయితే బిగినింగ్ లో 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు' అనే ప్రశ్నను సూచిస్తు ఈ ట్యాగ్ ఉందని అనుకోవచ్చు. ఆ మొదటి ప్రశ్నకు సమాదానం 2017 లో ఉంటుందని రాజమౌలి చెప్పిన విషయాన్ని బట్టి 'డబ్ల్యూకెకెబీ 2017' అంటే ''వై డిడ్ కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రశ్నకు జవాబు 2017 ఉంటుంది 'అని అర్థం కావచ్చు... కాని అసలైనా అర్థం ఇదేనా...? లేకా ఇంకా ఏమైనా ఉందా అనేది సస్పెన్స్ గా మారింది... ఏదీ ఏమైనా ఇటు సినీ వర్గాలను, అటు ప్రేక్షకులను తలామునకలు చేయటంలో రాజమౌళి దిట్టా అని మరో సారి నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా చిత్ర సన్నివేశాలు, రెండు పాటలను డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు నిర్మాత శోభు యార్లగడ్డ. జనవరిలో బాహుబలి-2 ట్రైలర్‌ను… ఏప్రిల్‌ 28, 2017 న సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు...ఇక అక్టోబర్‌ 22న బాహుబలి కామిక్ బుక్‌ తో పాటు బాహుబలి-2 ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతున్నట్లు హీరో ప్రభాస్ తెలిపాడు. ప్రభాస్ పుట్టిన రోజు 23నే ఫస్టు లుక్ విడుదల చేయాలని భావించినప్పటికీ, ఆయన అభిమానుల కోసం ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి స్పష్టం చేశారు.
 
10:51 - October 2, 2016

బాలీవుడ్ లో మెగా కాంబినేషన్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు రాని ఓ సెన్సేషన్ కాంబినేషన్ బీటౌన్ లో రాబోతున్నట్లు టాక్. ఇండియన్ మెగాస్టార్ బిగ్ బి, మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కలిసి నటించనున్నారు. ఇండియన్ ఎవర్ గ్రీన్ స్టార్ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ కాంబినేషన్ లో మూవీ రాబోతోంది. అమితాబ్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇలా చాలా మంది స్టార్స్ తో నటించాడు. అమీర్ కూడా సేమ్. కానీ ఇప్పటి వరకు ఈ ఇద్దరు కలిసి నటించలేదు. అలాంటిది వీరి కాంబినేషన్ లో ఫస్ట్ టైం మూవీ రాబోతుండడంతో బాలీవుడ్ ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు.

యశ్ రాజ్ ఫిలిమ్స్..
యశ్ రాజ్ ఫిలిమ్స్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ టైటిల్ తో అమితాబ్, అమీర్ కాంబినేషన్ లో ఓ మూవీ చేస్తోంది. ధూమ్1, ధూమ్2 సినిమాలకు కథలు అందించడంతో పాటు ధూమ్ 3తో దర్శకుడిగా మారిన విజయ్ కృష్ణ ఆచార్య ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు. ధూమ్ 3లో అమీర్ డ్యూయల్ రోల్ చేసిన విషయం విదితమే. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే ఈ చిత్రం విడుదల తేదీ కూడా ఖరారు చేశారు. 2018 దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని ప్రకటించేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలవుతుందని సమాచారం.  

ముస్తాబైన తాత్కాలిక సచివాలయం..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం పాలనకు ముస్తాబైంది. రేపటి నుంచి నవ్యాంధ్ర పాలన వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే సాగనుంది. కీలకమైన ఆర్థిక, హోం, రెవెన్యూ శాఖలతోపాటు మొత్తం 48 శాఖలకు చెందిన 80 శాతం ఫైళ్లు శనివారం సాయంత్రానికే ఇక్కడకు చేరుకున్నాయి. 

కొనసాగుతున్న దసరా ఉత్సవాలు..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీశైలంలో రెండోరోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు భ్రమరాంబ అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయంలో బాలత్రిపురసుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

10:39 - October 2, 2016

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బుల్లి తెరమీద కూడా కనింపించ బోతున్నాడు. వెండితెర మీద ఆయనను గెలిపించిన ప్రజల కోసం ఇప్పుడాయాన బుల్లి తెలరమీద ప్రజలను గెలిపించడానికి రాబోతున్నాడు. మెగాస్టార్ ఏంటీ..? బుల్లి తెర మీదకు ఏంటి అనుకుంటున్నారా..? అవును బుల్లి తెర మీద విశిష్ట ఆదర పొందిన మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో లో హోస్ట్ గా నాగార్జున బదులుగా ఈ సారి మెగాస్టార్ చిరంజీవిని చేయించాలని మాటీవీ యాజమాన్యం నిర్ణయించింది. దీనికి సంబందించి స్మాల్ టీజర్ నీ కూడా ఇటీవల విడుదల చేసింది మెక్ మేనేజ్మెంట్. 'వెండి తెర మీద మీరు నన్ను గెలిపించారు. బుల్లి తెర మీద నేను  మిమ్మల్ని గెలిపించడానికి రాబోతున్నాను' అనే డైలాగ్ తో మెగాస్టార్ ఈ టీజర్ లో కనిస్తారు.  ఇప్పటి దాకా నాగ్ మూడు సీజన్లు చేశారు..నాలుగో సీజన్ డిసెంబర్ 12 నుంచి మొదలుకాబోతోన్న నేపథ్యంలో దీనికి హోస్ట్ గా నాగ్ కు బదులు చిరు  హాట్ సీట్ మీద కనిపించబోతున్నారు.  నాగ్ వద్దన్నారో లేక చిరు ఆసక్తి చూపారో తెలీదు గానీ రానున్న  సీజన్ మాత్రం చిరు చేయడం ఖాయమయిపోంది. మూడో సీజన్ లో ఓ గెస్ట్ గా చిరంజీవి ఎంఇకె లో పాల్గొన్నారు. చిరు కోసం టైమింగ్స్ కూడా మార్చారు. సోమవారం నుంచి గురువారం దాకా ప్రతీరోజూ రాత్రి 8-30 గంటలకే ఇది ప్రసారమవుతుంది. చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 షూటింగ్ కు ఇబ్బందికలగకుండా దీని షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు...

10:29 - October 2, 2016

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి సినిమా 'ఠాగూర్'సినిమా చూశారా ? అందులో మృతదేహానికి వైద్యం చేసే సన్నివేశం ఒకటి ఉంటుంది. డబ్బులు కాజేయాలని కార్పొరేట్ ఆసుపత్రులు మోసం చేసే వైనాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ప్రస్తుతం అలాంటి సన్నివేశం ఒకటి జరిగింది. ఏకంగా శవానికి వైద్యం నిర్వహించారు. మృతుడి బంధువులు నిజం తెలుసుకోవడంతో ఆసుపత్రి యాజమాన్యం పలు చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. టైడెంట్ హస్పిటల్ లో అనారోగ్యంతో పెంటమ్మ అనే మహిళను హస్పటల్ లో చేరింది. అయితే చికిత్స పొందుతూ పెంటమ్మ మృతి చెందిన విషయాన్ని వైద్యులు దాచి పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహానికి వైద్యం చేస్తున్నట్లు నటించారు. దీనికోసం పెంటమ్మ సీరియస్ గా ఉందని రక్తం ఎక్కించాలని కుటుంబసభ్యుల ముందు హడావిడి చేశారు. అయితే వైద్యుల తీరుపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా పెంటమ్మ చనిపోయి ఉంది. దీంతో బాధితులు హస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను వెంటనే ఆరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

10:24 - October 2, 2016

హైదరాబాద్ : వీసీ అప్పారావు.. పేరు తెలియని వారుండరు. దేశ వ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోయింది. ఎందులో ? ఇటీవలే విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనలో వీసీ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనే ఆత్మహత్యకు కారకుడంటూ విద్యార్థులు ఆరోపణలు గుప్పించారు. దీనిపై కేసులు కూడా నడుస్తున్నాయి. ఇలాంటి వీసీ చేతుల మీదుగా తాను పట్టా అందుకోనని ఏకంగా వేదికపైనే స్పష్టం చేయడం సంచలనం సృష్టించింది.
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వార్షికోత్సవంలో వైస్ చాన్సలర్ పొదిలి అప్పారావుకు పరభావం ఎదురైంది. ఆయన చేతుల మీదుగా పీహెచ్ డీ పట్టా స్వీకరించేందుకు ఓ పరిశోధక విద్యార్థి నిరాకరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ లో నిర్వహించిన హెచ్ సీయూ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిలాసఫీలో పీహెచ్ డీ పట్టా తీసుకోవాల్సిందిగా పరిశోధక విద్యార్థి సుంకన్నను ఆహ్వానించడంతో వేదికపైకి వెళ్లారు. వీసీ అప్పారావు పట్టా అందిస్తున్న సమయంలో రోహిత్.. ఆత్మహత్యకు కారకుడైన వీసీ చేతుల మీదుకు పట్టాను తీసుకోనని నిల్చున్నారు. దీంతో చీఫ్ గెస్ట్ గా వచ్చిన ప్రొఫెసర్ బిపిన్ శ్రీవాస్తవ... సుంకన్నకు పట్టా అందించారు.

నిరాకరించాను..
ఈ సందర్భంగా విద్యార్థి సుంకన్న టెన్ టివితో మాట్లాడారు. దేశం మొత్తం వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన తెలిసిందేనని, వీసీ అప్పారావు ఐదు మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం జరిగిందని అందులో తాను ఒకడినని తెలిపారు. అలాంటి వీసీ అప్పారావు చేతుల మీదుగా డిగ్రీ పట్టా అందుకోవడం ఇష్టం లేదన్నారు. అతనిపై క్రిమినల్ ఛార్జెస్ కేసులు నడుస్తున్నాయని తెలిపారు. పట్టా తీసుకొనే సమయంలో తాను పట్టా తీసుకోవడం కుదరని వీసీ అప్పారావుకు తెలపడం జరిగిందన్నారు. దీని గురించి క్యాంపస్ లో మాట్లాడుకుందాం..అని అన్నారని, మీరు గాకుండా వేరే వారితో ఇప్పించాలని సూచించడం జరిగిందన్నారు. లేనిపక్షంలో ఇక్కడి నుండి వెళ్లిపోతానని తాను చెప్పడంతో ఇతరులతో పట్టా ఇప్పించారని తెలిపారు. 

వీసీ అప్పారావు చేతుల మీదుగా పట్టా తీసుకుని విద్యార్థి..

హైదరాబాద్ : హెచ్ సీయూ స్నాతకోత్సవంలో వీసీ అప్పారావ్ కు విద్యార్థి సుంకన్న షాక్ ఇచ్చాడు. వీసీ అప్పారావు పట్టా ప్రధానం చేస్తుండగా విద్యార్థి తిరస్కరించాడు. దీనితో ప్రొ.బిపిన్ శ్రీవాస్తవ చేతుల మీదుగా విద్యార్థి సుంకన్న పట్టా స్వీకరించాడు. 

దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు..

ఢిల్లీ : భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో స్వచ్చ భారత్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు చెత్తను తొలగిస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఢిల్లీలో, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఓ ఆసుపత్రిలో చెత్తను తొలగించి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కోల్ కతాలో చిన్నారులతో కలిసి స్వచ్చ భారత్ నిర్వహించారు. ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ డెహ్రాడూన్ లో చెత్తను తొలగించారు. 

09:37 - October 2, 2016
09:16 - October 2, 2016
09:14 - October 2, 2016
09:12 - October 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. ఆది, సోమవారాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ సంచాలకులు వైకే రెడ్డి పేర్కొన్నారు. ఇటు విదర్భ నుండి తెలంగాణ వరకు అటు బంగాళాఖాలంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. దీనిఫలితంగా వర్షాలు పడే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. 

మెదక్ లో మంత్రి హరీష్ రావు పర్యటన..

మెదక్ : జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. కేతకి సంగమేశ్వర ఆలయాన్ని హరీష్ సందర్శించారు. ఝరాసంగంలో దెబ్బతిన్న పంటలను హరీష్ పరిశీలించారు. 

బ్రెస్ట్ క్యాన్సర్ పై మహిళలకు అవగాహన ఉండాలి - రెజీనా..

హైదరాబాద్ : ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ పై 2కే పింక్ రిబ్బన్ వాక్ జరగనుంది. కేబీఆర్ పార్క్ నుండి వాక్ ప్రారంభమైంది. ఈ వాక్ లో సినీ నటి రెజీనా పాల్గొంది. మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని రెజీనా సూచించారు. 

మూల విరాట్ ను తాకని సూర్యకిరణాలు..

శ్రీకాకుళం : రెండో రోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు నిరాశే కలిగింది. మూలవిరాట్ ను సూర్యకిరణాలు తాకలేదు. 

08:45 - October 2, 2016

కోల్‌కతా టెస్ట్ రెండో రోజే సీన్‌ రివర్సైంది. తొలి రోజు అంతగా ప్రభావం చూపలేకపోయిన కొహ్లీ అండ్ కో రెండో రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. భారత్‌ను 316 పరుగులకు ఆలౌట్‌ చేసిన న్యూజిలాండ్‌ జట్టు..బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయింది. స్వింగ్‌ కింగ్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ధాటికి కివీ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టడంతో టీమిండియా మ్యాచ్‌పై పట్టు బిగించింది. రెండో రోజు ఆటలో స్వింగ్‌ కింగ్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ధాటికి కివీ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టడంతో టీమిండియా డామినేట్‌ చేసింది. స్వదేశంలో 250వ టెస్ట్ ఆడుతోన్న భారత జట్టు....స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా పుజారా, రహానే హాఫ్‌ సెంచరీలతో ఫైటింగ్‌ స్కోర్‌ నమోదు చేయగలిగింది.లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌తో కలిసి వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ వృద్దిమాన్‌ సాహా భాగస్వామ్యాలు నమోదు చేసి భారత జట్టు స్కోర్‌ 300 పరుగుల మార్క్ దాటడంలో కీలక పాత్ర పోషించాడు.

తేలిపోయిన కివీస్..
టెస్టుల్లో 3వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన సాహా...54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.316 పరుగులకు భారత్‌ ఆలౌటైంది.నాలుగో వికెట్‌కు పుజారా,రహానే 141 పరుగులు కీలక భాగస్వామ్యం కారణంగానే భారత జట్టు ప్రతిష్టాత్మక 250వ టెస్ట్‌లో గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌ జట్టు తేలిపోయింది. భారత పేసర్‌ భువనేశ్వర్‌ ధాటికి కివీ టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. గప్తిల్‌, లాథమ్‌, నికోల్స్‌ విఫలమైనా...కెప్టెన్‌ రాస్‌ టేలర్‌, ల్యూక్‌ రాంకీతో కలిసి 4వ వికెట్‌కు 62 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నాడు.

వర్షం కారణంగా అంతరాయం..
వర్షం కారణంగా ఆటకు గంటసేపు ఆటకు అంతరాయం కలిగినా....భారత బౌలర్ల జోరు మాత్రం తగ్గలేదు. మిషెల్‌ శాంట్నర్‌, మ్యాట్‌ హెన్రీలను వరుస బంతుల్లో ఔట్ చేసిన భువనేశ్వర్‌...టెస్టుల్లో 4వ సారి 5 వికెట్ల ఫీట్‌ నమోదు చేశాడు.
రెండో రోజు ఆట ముగిసే సరికి న్యూజిలాండ్‌ జట్టు 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ 5 వికెట్లు, షమీ,జడేజా చెరో వికెట్‌ తీశారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 188 పరుగులు వెనుకబడిఉంది. మొత్తంమీద రెండో టెస్ట్‌లో ఏదైనా అద్భుతం జరిగితేనే తప్ప న్యూజిలాండ్‌ జట్టుకు ఓటమి తప్పేలా లేదు.

08:37 - October 2, 2016

విశాఖపట్టణం : జిల్లాను సినిమా హబ్‌గా తీర్చిదిద్దుతామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పలువురు చలనచిత్ర ప్రముఖులతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నిర్మాతలు హాజరయ్యారు. ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌కు 15 ఎకరాలు లీజుకు ఇచ్చామని అన్నారు. ఈనెల 9న ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి గంటా ప్రకటించారు.  

08:34 - October 2, 2016

హైదరాబాద్ : విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణకు పారిశ్రామిక పన్ను రాయితీని ప్రకటించింది కేంద్రప్రభుత్వం. రాష్ట్రంలోని హైదరాబాద్‌ మినహా మిగిలిన 9 జిల్లాలకు ఈ పన్ను రాయితీ వర్తించనుంది. గతేడాది ఏప్రిల్‌ నెలనుంచి 2020 మార్చి వరకూ ఈ పన్ను రాయితీ అమల్లో ఉండనుంది. రెండురోజుల క్రితమే ఏపీలోని 7 జిల్లాలకు పన్ను రాయితీని ప్రకటించిన కేంద్రం...ఇప్పుడు దాన్ని తెలంగాణకు వర్తించేలా నిర్ణయం తీసుకుంది.  పారిశ్రామిక అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. అందుకనే ఆయా రాష్ట్రాల్లో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు పన్ను రాయితీని ప్రకటించింది. తెలంగాణలో వెనుకబడిన 9 జిల్లాలకు కేంద్రం పారిశ్రామిక పన్ను రాయితీని ప్రకటించింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ పన్ను రాయితీని ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్‌ మినహా మిగిలిన జిల్లాలకు ఈ పన్ను రాయితీ వర్తించనుంది. పరిశ్రమలకు 15శాతం పన్ను రాయితీతోపాటు 15 శాతం అదనపు తరుగుదల అవకాశం కల్పిస్తూ కేంద్రం ఉత్వర్వులు జారీ చేసింది.

ఇటీవలే కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్..
ఏపీకి పారిశ్రామిక పన్ను రాయితీని ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలోనే కేంద్రం..తెలంగాణకు కూడా పన్ను రాయితీని ప్రకటించింది. తమ రాష్ట్రంలోని 7 జిల్లాలకు కాకుండా, 13 జిల్లాలకు పన్నురాయితీ కల్పించాలని ఏపీ సర్కారు కోరింది. అయితే వెనుకబడిన జిల్లాలకు మాత్రమే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. పరిశ్రమల విషయంలో తెలంగాణ సర్కారు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో..కేంద్రం నుంచి రాయితీని పొందింది. ఈ మధ్య ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్..కేంద్రమంత్రులను కలిసి ఏపీకి ఇచ్చిన మాదిరిగానే తమకూ న్యాయం చేయాలని కోరారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని తెలిపారు. తాజాగా కేంద్రం ప్రకటించిన ఈ రాయితీతో రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించిన వారికి రాయితీ లభిస్తుంది. 

రేకుల మధ్య ఇరుక్కుని ఇద్దరు మృతి..

పశ్చిమగోదావరి : ద్వారకా తిరుమల మండలం గున్నంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేకుల లోడుతో వెలుతున్న లారీలో ప్రయాణీస్తున్న ఇద్దరు రేకుల మధ్య ఇరుక్కపోయి మృతి చెందారు. 

ఢిల్లీలో గాంధీ..లాల్ బహదూర్ శాస్త్రి జయంతి..

ఢిల్లీ : దేశ రాజధానిలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి సమాధి వద్ద పలువురు నివాళులు అర్పిస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్, రాష్ట్ర డిప్యూటి సీఎం సిసోడియా, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నివాళులు అర్పించారు. 

07:41 - October 2, 2016

విజయవాడ : నగరంలో 'మజ్ను' చిత్ర యూనిట్‌ పలు థియేటర్లలో సందడి చేసింది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు హీరో నాని. రానున్న రోజుల్లో మంచి మాస్‌ లవ్‌ స్టోరీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తానని అన్నారు. తాను నటించిన 'మజ్ను' సినిమాను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. థియేటర్లలో 'మజ్ను' సినిమా డైలాగ్‌లు చెప్పి సందడి చేశారు. 

07:36 - October 2, 2016

నేడు, రేపు భారీ వర్షాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. 

వాతావరణ ఒప్పందానికి భారత్ ఆమోదం..

న్యూఢిల్లీ : వాతావరణ మార్పులపై కుదిరిన పారిస్ ఒప్పందానికి భారత్ ఆదివారం ఆమోదం తెలపనుంది. మహాత్మగాంధీ జయంతి నాడు ఈ ఒప్పందానికి ఆమోదం తెలపనున్నట్లు సెప్టెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే పేర్కొన్నారు. 

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..

నెల్లూరు : అరవింద్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను భర్త సుధీర్ కుమార్ హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేసి రెండు సూట్ కేసుల్లో పెట్టి చిత్తూరు జిల్లా చంద్రగిరి (మం) బాకరాపేట వద్ద లోయలో సుధీర్ పడేశాడు. పీఎస్ లో మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

నేడు శేరిలింగంలో మహా శ్రమదానం..

హైదరాబాద్ : శేరిలింగంపల్లి సమీపంలోని గోపన్న పల్లి తండాల్లో మహా శ్రమదానం నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మంత్రి మహేందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌లు హాజరుకానున్నారు.

 

నేడు బ్రెస్ట్ కేన్సర్ పై ఉచిత వైద్య శిబిరం..

హైదరాబాద్ : సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌, ఉషాలక్ష్మీఫౌండేషన్‌, కిమ్స్ ఆసుపత్రి సహకారంతో బ్రెస్ట్ కేన్సర్‌పై ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించనున్నారు. 

నేటి నుండి నగరంలో వీధి వ్యాపారుల పాలసీ..

హైదరాబాద్ : గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం నుంచి నగరంలో వీధి వ్యాపారుల పాలసీ అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. స్ట్రీట్‌ వెండర్స్ యాక్ట్ 2014 ప్రకారం వీధి వర్తకులకు కల్పించాల్సిన సౌకర్యాలు.. వారి హక్కులు.. రక్షణపై అవగాహన కల్పించనున్నారు.

07:00 - October 2, 2016
06:46 - October 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను ఆడిన ఆడపడుచులు రెండో రోజు అంగరంగ వైభవంగా అటుకుల బతుకమ్మను ఆడారు. పూల జాతరతో తెలంగాణ మురిసిపోతోంది. తెలంగాణ ఆడపడుచులు ఖండాంతరాల్లో బతుకమ్మ వేడుకలు ఆడి ఇక్కడి సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. పూల జాతరతో తెలంగాణ మురిసిపోతోంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో మార్మోగిపోతోంది. బతుకమ్మ వేడుకలతో పల్లెలు, పట్టణాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. గ్రామాల్లోని చెరువుల వద్ద బతుకమ్మ కళ ఉట్టిపడుతుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. ప్రకృతి సంబురాల పతాక అయిన బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణలోని అన్నిజిల్లాల్లో సందడిగా సాగుతున్నాయి. భాద్రపద అమావాస్య నుంచి మొదలైన ఈ పండుగ సందర్భంగా తెలంగాణ లోగిళ్లన్నీ పూలజాతరలుగా మెరిసిపోతున్నాయి.


నేతల హాజరు...
సికింద్రాబాద్‌లో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జాహ్నవి కళాశాల అధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. రంగు రంగుపూలతో తయారు చేసిన బతుకమ్మలను విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో పెట్టి ఆడి, పాడారు. హైదరాబాద్‌ కాప్రా సర్కిల్ ఏఎస్‌రావు నగర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రెండోరోజు నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి.. అందర్నీ ఉత్సాహపరిచారు. మెదక్‌ జిల్లా సిద్దిపేట పట్టణంలోని వాడవాడల్లోనూ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. స్థానిక శివమ్స్‌ గార్డెన్‌లో చిన్నారులు, పెద్దలు అందంగా పేర్చిన బతుకమ్మలను ప్రధాన విధుల్లో పెట్టి.. బతుకమ్మ ఆడారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని సుల్తాన్‌పూర్‌ గ్రామంలో బతుకమ్మ సంబరాల్లో మహిళలు సంతోషంగా ఆడిపాడారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కూడా హాజరయ్యారు. జోగిపేటలో రెండోరోజు నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు సందడి చేశారు. రకరకాల పువ్వులతో అలంకరించిన బతుకమ్మలకు పూజలు చేశారు. అనంతరం అందోల్ పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు.

లండన్ లో ఎంపీ కవిత..
ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని గొడిసిరల్ గ్రామంలోని శివాలయంలో 10 ఫీట్ల ఎత్తుగల బతుకమ్మను ఏర్పాటు చేశారు. సంబరాల్లో ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖ నాయక్‌ పాల్గొని.. బతుకమ్మ ఆడారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ ఎంపీ కవిత లండన్‌లో రెండోరోజు నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను దుబాయ్‌లో నిర్వహించారు. బతుకమ్మ పండుగకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన తెలంగాణ జాగృతి ఈ ఏడాది 9 దేశాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తోంది. విదేశాల్లో ఉన్న తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఒక్కొక్క పువ్వేసి చందమామ, ఒక్క జాము అయ్యే చందమామ వంటి పాటలతో తెలంగాణ మార్మోగుతోంది. 

06:43 - October 2, 2016

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో తొలిరోజు అమ్మవారు శ్రీస్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి గా అలంకరించబడ్డారు. వేకువజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు తెలంగాణలోనూ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ప్రభుత్వాలు కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి.

విజయవాడ..
దసరా ఉత్సవాల పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభయ్యాయి. తొలిరోజు కనకదుర్గమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ఉదయం 9 గంటల నుంచే అమ్మవారిని స్వర్ణకవచాలంకృత శ్రీకనకదుర్గాదేవిగా అలంకరించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి బారులు తీరారు. దీంతో కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో పోటెత్తింది.  ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వినాయకుని గుడి నుంచి క్యూలైన్‌లో కాలినడకన అమ్మవారిని దర్శించుకున్నారు. మార్గమధ్యలో భక్తులకు కలిగిన ఇబ్బందులను గమనించిన మంత్రి..అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నవావరణపూజలు, రుద్రయాగం, చండీయాగ పూజలను చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 

తెలంగాణలో..
మరోవైపు తెలంగాణలోనూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రాంభమయ్యాయి. దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ ఆలయంలో అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున చేరుకున్న మహిళలు కంకుమ పూజలు చేశారు. అనంతరం హంసవాహనంపై అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు.కరీంనగర్ జిల్లా జగిత్యాలలో దుర్గమాత విగ్రహ ప్రతిష్టను భక్తి శ్రద్ధలతో జరిపారు. నవదుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ఊరేగింపు మేళతాళాలతో జరిగింది. 

06:40 - October 2, 2016

హైదరాబాద్: రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని తెలంగాణ టీడీపీనేతలు ఆరోపించారు. బ్యాంకులు రుణమాఫీ అందించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని అన్నారు. ప్రైవేట్ వ్యాపారులు అధికవడ్డీలకు రుణాలివ్వడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని అన్నారు టీడీపీ నేతలు. నకిలీ విత్తనదారుణలతో ఎదుర్కొంటున్న సమస్యలపై వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శికి నివేదిక సమర్పించారు నేతలు. రైతులు ప్రభుత్వతీరుతో విసుగుచెంది ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద అధికవడ్డీలకు రుణాలుతీసుకుని ఆర్థికంగా చితికిపోతున్నారని అన్నారు రేవంత్‌రెడ్డి. సీఎం వద్ద ఉన్న ప్రత్యేక అభివృద్ధి నిధిని రుణమాఫీకి మళ్లించి రైతులలో మనోస్థైర్యం కలిగించాలని డిమాండ్ చేశారు. పత్తిరైతులు దారుణంగా నష్టపోవడానికి నకిలీ విత్తనాలే కారణమని ప్రియదర్శిని కమిటీతేల్చిందని అన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలలో రైతురుణమాఫీని చేర్చాలని లేనిపక్షంలో టీడీపీ కార్యాచరణను రూపొందిస్తుందని

ప్రభుత్వం పూర్తిగా విఫలం..
భారీ వర్షాలతో పంటనష్టం జరిగితే ప్రభుత్వం ఎందుకు రైతులను పరామర్శించడం లేదని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. నాణ్యమైన విత్తన సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందంటున్నారు. నకిలీ విత్తనాలతో లక్ష ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిందని మూడు జిల్లాల్లో పూర్తిగా నష్టపోయారని అన్నారు సండ్రవెంకటవీరయ్య. మండల స్థాయిలో టీంలను పంపి నష్టపోయిన పంటలపై నివేదిక తెప్పించాలని కమిషనర్‌ను కోరారు టీడీపీ నేతలు. తెలంగాణ రైతాంగానికి ఏక కాలంలో రుణమాఫీ చేయాలని టీ-టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. రైతుల పక్షాన ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమబాట పడతామని హెచ్చరిస్తున్నారు టీ- టీడీపీ నేతలు.

06:37 - October 2, 2016

హైదరాబాద్ : ద‌శాబ్దాల అనుబంధం.. మాట‌ల్లో చెప్పలేని మ‌మ‌కారం.. ఎన్నో తీపి గుర్తులు.. మ‌రెన్నో మ‌ధుర జ్ఞాప‌కాలు.. బ‌రువెక్కిన హృదయంతో ఏపీ స‌చివాల‌య ఉద్యోగులంతా స్వరాష్ట్ర బాట ప‌ట్టారు. తెలంగాణ ఉద్యోగులతో ఉన్న అనుబంధానికి తెరదింపుతూ.. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయానికి ఉద్యోగులు కన్నీటితో వీడ్కోలు పలికారు. 1956 నవంబరు 1వ తేదీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసింది. నిజాంల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ సచివాలయ ప్రధాన సముదాయంలో అరవై ఏళ్ల పాటు పాలన సాగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సెక్రటేరియట్‌ ఇక్కడి నుంచే 28 నెలలపాటు నడిచింది. సచివాలయ భవనంలో ఒకప్పుడు జి-బ్లాక్‌ కీలకమైనది. ఎన్టీఆర్‌ వరకూ ఉన్న ముఖ్యమంత్రులందరూ ఈ బ్లాక్‌ నుంచే పరిపాలన సాగించారు. తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు సచివాల‌యంలోని సీ-బ్లాక్ కేంద్రంగా ప‌నిశారు. చంద్రబాబునాయుడు, వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, రోశ‌య్య, కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బ్లాక్‌ నుంచే పాల‌న చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏ, బీ, సీ, డీ బ్లాకులు తెలంగాణకు... హెచ్‌, జే, కే, ఎల్‌ బ్లాకులు ఏపీకి కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పలు శాఖలు హైదరాబాద్‌ నుంచి వెలగపూడికి వెళ్లాయి. రెవెన్యూ సహా మరికొన్ని శాఖలు శుక్రవారం ప్యాకప్‌ అయ్యాయి. ఏపీకి సంబంధించి వివిధ విభాగాల అధిపతుల కర్యాలయాలు కూడా ఇప్పటికే తరలిపోయాయి. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఉన్న కొన్ని డైరెక్టరేట్‌లు మూడు నాలుగు రోజుల్లో విజయవాడకు చేరుకోనున్నాయని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు.

సోమవారం నుండి...
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న స‌చివాల‌య ప్రాంగ‌ణంలో ఎన్నో మ‌ధుర జ్ఞాప‌కాలు...చ‌రిత్రకు స‌జీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఎన్నో కీల‌క నిర్ణయాలు.. మ‌రెన్నో రాజ‌కీయ మార్పులు.. ఎంద‌రెంద‌రో అమాత్యుల‌కు తీపి జ్ఞాప‌కంగా నిలిచింది సచివాల‌యం. ఇప్పుడు.. వీరంతా.. హైద‌రాబాద్ స‌చివాల‌యంతో ఉండే ఎమోష‌న‌ల్ ఎటాచ్ మెంట్ ను వీడ‌లేక‌..వీడ‌క త‌ప్పక‌...బ‌రువెక్కిన హృద‌యంతో వెల‌గ‌పూడి దిశగా అడుగులు వేశారు. సోమవారం వెలగపూడిలోని సచివాలయం నుంచే విధులు నిర్వహించబోతున్నారు. కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా హైదరాబాద్‌ సచివాలయంలో భవనాలను పూర్తిగా ఖాళీ చేయడం లేదు. రికార్డుల నిర్వహణ, కోర్టు కేసులు చూసుకోవడానికి కొందరు ఉద్యోగులు హైదరాబాద్‌లోనే ఉంటారు.

06:35 - October 2, 2016

జమ్మూ కాశ్మీర్ : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం.. ఇండోపాక్ సరిహద్దుల్లో టెన్షన్ కొనసాగుతూనే ఉంది. సైన్యం సన్నద్ధతను పరిశీలించేందుకు ఆర్మీ జనరల్ దల్బీర్ సింగ్ జమ్మూలో పర్యటిస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పాక్‌పై నిరసనలు, వార్నింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. అణ్వాయిధాలున్న దేశంగా బాధ్యతగా మెలగాలని అమెరికా, రాష్యా, చైనాలాంటి అగ్రరాజ్యాలు సూచించాయి. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ అయ్యారు. సర్జికల్‌స్ట్రైక్స్‌ తర్వాతి పరిణామాలను.. పాక్‌వైఖరిపై అంతర్జాతీయంగా వెలువడుతున్న స్పందనను ఆయన రాష్ట్ర పతికి వివరించే అవకాశం ఉంది.

జమ్మూ కశ్మీర్ లో పర్యటన..
భారత్‌-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. సైనికదళాల ప్రధాన అధికారి జనరల్‌ దల్బీర్‌సింగ్‌ జమ్ముకశ్మీర్‌లో పర్యటించారు. ఉధంపూర్‌లోని నార్తర్న్‌ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. సరిహద్దుల వెంట దళాల అప్రమత్తతను ఆయన పరిశీలించారు. ఆర్మీసన్నద్ధతపై హెడ్‌క్వార్టర్స్‌లోని ఉన్నతాధికారులతో జనరల్‌ దల్బీర్‌సింగ్‌ చర్చించారు. మరోవైపు యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వాతావరణంలో భారత్‌ సైన్యం అంతర్గతంగా సన్నద్ధతను పరీక్షించుకుంటోంది. అత్యంత అధునాతనమైన ఆయుధాలు, ఫిరంగులతో అంబాలా కంటోన్మెంటులో త్రివిధ దళాలకు చెందిన సైనికులు సమాయత్తం అయ్యారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అంబాలా కంటోన్మెంటులో త్రివిద దళాల సైనికులు సంసిద్ధమయ్యారు.
మరోవైపు ఉరీ సంఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఉరీలోని బ్రిగేడ్‌ కమాండర్‌ సోమశంకర్‌ను తొలగించిన రక్షణశాఖ అధికారులు.. అదేస్థానంలో కిలోఫోర్స్‌కి చెందిన ఎస్‌పీ అహల్వత్‌ను నియమించారు. ఇదిలావుంటే .. భారత్‌పై అణుదాడులకు కూడా వెనుకాడం అనే పాకిస్థాన్‌ నాయకుల ప్రకటనలపై అమెరికా మండిపడింది. నిగ్రహం పాటించాలని సలహాఇచ్చింది. అటు రష్యా అధ్యక్షుడు కూడా భారత్‌కు అనుకూల ప్రకటన చేశారు. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద గ్రూపులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

పాక్ కాల్పులు..
అటు ...పాక్‌తో సంబంధాలపై దేశంలో జరుగుతున్న పరిణామాలపై సీపీఎం స్పందించింది. పాకిస్థాన్‌తో టెన్షన్‌ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో దౌత్యపరమైన చర్చలద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో ఉన్న పాకిస్థాన్‌ కళాకారులపై నిర్బంధం సరికాదన్నారు ఏచూరి. ఇదిలావుంటే.. జమ్ముకశ్మీర్‌ బోర్డర్‌లో జమ్ము కశ్మీర్‌లో పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. అఖ్నూర్ సెక్టార్‌లో పాకిస్థాన్ దళాలు భారత సైనిక స్థావరాలపై కాల్పులు జరిపాయి. భారత సైనిక దళాలు ధీటుగా స్పందించాయి. 

06:32 - October 2, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై.. శనివారం పలు వదంతులు స్వైర విహారం చేశాయి. సాయంత్రం చెన్నై అపోలోలో జయలలితను గవర్నర్ విద్యాసాగర్ రావు పరామర్శించారు. ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం..ఆమె వేగంగా కోలుకుంటున్నారని రాజ్‌భన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందంటూ శనివారం వార్తలు వెలువడ్డాయి. జ్వరం, డీ హైడ్రేషన్‌ సమస్యలతో అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత.. వారం రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. 

ఖరారైన ఇంచార్జి గవర్నర్‌ విద్యాసాగరరావు పర్యటన..
శనివారం ఉదయం జయలలిత ఆరోగ్యంపై వచ్చిన వదంతులకు బలం చేకూర్చేలా కొన్ని పరిణామాలు జరిగాయి. జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి ప్రాంగణంలో పోలీసులు భారీఎత్తున మోహరించారు. మరోవైపు ఆసుపత్రి వర్గాలు రెండు రోజులుగా జయ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయలేదు. ఇదే క్రమంలో రాష్ట్ర సీనియర్‌ రాజకీయవేత్త, మాజీముఖ్యమంత్రి కరుణానిధి కూడా జయ ఆరోగ్యంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆమె ప్రస్తుత ఫోటోను విడుదల చేయాలని శుక్రవారమే డిమాండ్‌ చేయడమూ.. ఈ వదంతులకు మరింత బలం చేకూర్చింది. దీనికితోడు.. రాష్ట్ర ఇంచార్జి గవర్నర్‌ విద్యాసాగరరావు చెన్నై పర్యటన ఖరారైంది. వీటన్నింటి నేపథ్యంలో జయలలిత ఆరోగ్యంపై సందేహాలు పెరిగిపోయాయి.

వదంతులను ఖండించిన అన్నాడిఎంకె వర్గాలు..
జయలలిత ఆరోగ్యంపై వచ్చిన వదంతులను అన్నాడిఎంకె వర్గాలు ఖండించాయి. ప్రస్తుతం ఆమె.. లండన్‌కు చెందిన కన్సల్టెంట్‌ ఇంటెన్సివిస్ట్‌ డాక్టర్‌ రిచర్డ్‌ జాన్‌ బేలే.. పర్యవేక్షణలో కోలుకుంటున్నారని, కరుణానిధి కోరినట్లు ఎలాంటి ఫోటోలూ విడుదల చేయాల్సిన అవసరం లేదనీ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రన్‌ ప్రకటించారు. ఇంకోవైపు.. జయలలిత ఆరోగ్యంపై తన వద్ద కీలక సమాచారం ఉందంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఫ్రాన్స్‌లోని తమిళనాడు యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మ ఆరోగ్యంపై వదంతులు వ్యాపింప చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చెన్నై చేరుకున్న ఇంచార్జి గవర్నర్‌ విద్యాసాగరరావు
జయలలిత ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో రాష్ట్ర ఇంచార్జి గవర్నర్‌గా కూడా వ్యవహరిస్తున్న మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు.. ఈ సాయంత్రం చెన్నై చేరుకుని.. అపోలో ఆసుపత్రిలో జయలలితను పరామర్శించారు. రాష్ట్ర మంత్రులు కూడా అపోలో ఆసుపత్రికి చేరుకుని జయ పరిస్థితిపై ఆరా తీశారు. ఇంకోవైపు అమ్మ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అన్నాడింఎకే కార్యకర్తల్లో తీవ్ర గందరగోళాలన్ని, వేదనను కలిగించాయి. ఆమె ఆరోగ్యం కుదుట పడాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. 

06:29 - October 2, 2016
06:27 - October 2, 2016

హైదరాబాద్ : సమయం దగ్గర పడుతుండటంతో కొత్త జిల్లాలపై ప్రభుత్వం కసరత్తును స్పీడప్ చేసింది. కొత్త జిల్లాలు పరిపాలన మొదలైన రోజు నుండే ప్రతిశాఖ కూడా కార్యకలాపాలు కొనసాగించాలని సీఎస్ రాజీవ్‌శర్మ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పటుకానున్న జిల్లాలకు అవసరమైన ఫైళ్ళను కాపీ చేసుకుని తీసుకెళ్లాలని సూచించారు. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ క్యాడర్‌ను సన్నద్ధం చేసేందుకు రెండ్రోజుల పాటు వరస సమావేశాలు ఏర్పాటు చేశారు. సచివాలయంలో ఆయాశాఖల ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ కొత్త జిల్లాలపై చర్చించారు. జిల్లాలు ఏర్పాటు అవుతున్నందున మాతృ జిల్లాల్లో ఉన్న ఒరిజినల్ రికార్డులను ఆయా జిల్లాలోనే రికార్డు రూమ్‌లలో భద్ర పర్చాలని అధికారులకు సీఎస్‌ సూచించారు. కొత్త జిల్లాలకు అవసరమైన రికార్డులను స్కానింగ్ చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతిశాఖలో చేపడుతున్న పనులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల్లో పోస్టులు, కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్‌లు, కొత్త పోస్టుల మంజూరు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సీరియస్‌గా చర్చించారు సీఎస్‌.

దసరా నుంచే కార్యాలయాలు..
దసరా రోజున కొత్త జిల్లాల్లో పాలన మొదలవుతున్నందున అన్నిశాఖలు అదే రోజు తమ కార్యాలయాలను ప్రారంభించాలని సీఎస్‌ ఆదేశించారు. అదే రోజు ప్రభుత్వ కార్యాకలాపాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. తమ తమ శాఖల్లో అవసరమైన వసతి ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంపై ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిల్లాల్లో పనిచేసే సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

పార్టీ క్యాడర్‌తో భేటీ కావాలని భావిస్తున్న కేసీఆర్‌..
కొత్త జిల్లాల ఏర్పాటుపై రాజకీయంగా వచ్చే సమస్యలు ఎదురవ్వకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌..టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో 2, 3 తేదీల్లో చర్చించనున్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు జరగాలని సీఎం భావిస్తున్నారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలోని నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. ఈ రెండు రోజులు జరిగే సమావేశాలకు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరుకావాలని సీఎం ఆదేశించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా నేతలతో, 3న హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ నేతలతో సీఎం సమావేశం కానున్నారు. మొత్తంగా దసరా నుంచి కొత్త జిల్లాల్లో పాలన మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఢిల్లీకి వెళ్లనున్న డిప్యూటి సీఎం..మంత్రి ఈటెల..

హైదరాబాద్ : నేడు దేశ రాజధాని ఢిల్లీకి తెలంగాణ రాష్ట్ర డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, మంత్రి ఈటెల, సీఎస్ రాజీవ్ శర్మ లు ఢిల్లీకి వెళ్లనున్నారు. వరదల కారణంగా తెలంగాణలో సంభవించిన నష్టంపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు నివేదిక సమర్పించనున్నారు. 

06:12 - October 2, 2016

పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఓ ప్రైవేటు బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విశాఖపట్టణం - నర్సాపురంకు బీబీఆర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు వెళుతోంది. తేతలి వద్దకు రాగానే బస్సు అదుపు తప్పింది. వేగంగా కాల్వలోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున 3గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే స్పందించారు. బస్సులో ఉన్న వారందరినీ బయటకు లాగారు. మొత్తం బస్సులో 40 మంది ప్రయాణీకులున్నారు. డ్రైవర్ బస్సును అతివేగంగా నడపడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

జయలలిత ఆరోగ్యంపై ప్రెస్ నోట్..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత వేగంగా కోలుకుంటున్నారని రాష్ట్ర ఇన్ ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు వెల్లడించారు. గవర్నర్ అపోలో ఆసుపత్రి సందర్శనపై రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది. 

రాష్ట్ర వేడుకగా గాంధీ జయంతి..

హైదరాబాద్ : గాంధీ జయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని లంగర్ హౌస్ సమీపంలోని బాపూఘాట్ వద్ద ఆదివారం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. 

జిల్లాల ప్రజాప్రతినిధులతో భేటీ కానున్న సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : జిల్లాల ఏర్పాటుపై జిల్లాల ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఉదయం 11.30గంటలకు మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. రేపు హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. జిల్లాల రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై చర్చించనున్నారు. సమావేశానికి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా హాజరు కావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

కాల్వలోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు..

పశ్చిమగోదావరి : తణుకు (మం) పేతలి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన ఓ ప్రైవేటు బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. స్థానికులు ప్రయాణీకులను రక్షించారు. బస్సులో 60 మంది ప్రయాణీకులున్నారు. తృటిలో ప్రమాదం తప్పినట్లైంది. 

Don't Miss