Activities calendar

03 October 2016

20:40 - October 3, 2016

జయలలితకు ఏమయింది? ఉత్కంఠ ఎందుకు వీడటం లేదు?పార్టీ వర్గాల్లో, సగటు కార్యకర్తల్లో ఉత్కంఠ ఎందుకు వీడటం లేదు..?జయ తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? శశికళ అత్యవసర సమావేశం దేన్ని సూచిస్తోంది? తమిళనాట రాజకీయాలు ఏ మలుపుతిరగనున్నాయి? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం..ఒంటిచేత్తో రాష్ట్ర రాజకీయాలను చక్రంతిప్పే మహిళ ఆస్పత్రి పాలవటంతో తమిళనాడు అంతటా అయోమయం..గందరగోళం.. అందరిలో అనేక ప్రశ్నలు. అత్యున్నత స్థాయిలో నిజాలు తెలిసినప్పటికీ బయటకి వివరాలు రాకపోవటంతో ప్రజల్లో, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

జయలలిత ఆరోగ్యంపై నెట్లింట్లో రకరకాల పుకార్లు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో జయ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అమ్మకు సంబంధించిన ఒక ఫొటో వైరల్‌గా మారింది. జయలలిత ఆసుపత్రి బెడ్‌పైన ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకుని చికిత్స తీసుకుంటున్నట్లు ఉన్న ఫొటో ఒకటి నెట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమిళ నాట ఆమె ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి. ఆమె రూటే సెపరేటు..

ఆమె సింగిల్ హ్యాండ్ తో పాలిటిక్స్ ని నడిపించగల సత్తా ఉన్న ఉక్కు మహిళ..కంటిచూపుతో పార్టీని శాసించగల నేర్పు..అవరోధాలను, ప్రతికూలతలను ఎదుర్కొనే సత్తా...ఒక్కమాటలో చెప్పాలంటే జయ అంటే తమిళనాట ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి.. అలాంటి జయలలిత ఆస్పత్రి పాలైతే సగటు అభిమాని జీర్ణించుకోవటం అంత తేలిక కాదు..

నమ్మిన బంటు పన్నీరు సెల్వంకు సీఎం పగ్గాలు అప్పగించి, తన కనుసన్నల్లో ప్రభుత్వాన్ని నడిపించిన ఘనత ఆమెది. తన ఆజ్ఞల్ని ధిక్కరించిన ఉద్యోగుల్ని రాత్రికి రాత్రే తొలగించినా, డీఎంకే అధినేత కరుణానిధిని అరెస్టు చేయించినా, కక్ష సాధింపు ధోరణి అనుసరించే రీతిలో డీఎంకే మాజీ మంత్రుల్ని కట కటాల్లోకి నెట్టినా జయలలిత రూటే సెపరేటు.

ఇప్పుడు తమిళనాడు మాత్రమే కాదు.. దేశమంతటా ఉత్కంఠగా చూస్తోంది. జయ ఆరోగ్యం కోసం ఆమె అభిమానులు, అన్నాడీఎంకె కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఎదురు చూస్తున్నారు. అమ్మ ఎప్పుడు బయటికి వస్తుందా అని పడిగాపులు కాస్తున్నారు. తమిళనాట రాజకీయాలను శాసిస్తున్న జయలాంటి మహిళ ఆస్పత్రి పాలైతే ఇలాంటి పరిస్థితి ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు. మరో పక్క పార్టీలో తానే తిరుగులేని శక్తిగా ఉండి.. నంబర్ టూ అంటూ ఎవరూ లేని తరుణంలో భవిష్యత్తుపై ఆసక్తి, ఆందోళన ఉండటం కూడా సహజమే.

21:46 - October 3, 2016

కర్ణాటక : తమిళనాడుకు కావేరీ జలాల విడుదలకు సంబంధించి సుప్రీంకోర్టు కర్ణాటకపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడం మానుకోవాలని ఘాటుగా స్పందించింది. కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేశారా..? లేదా..? రేపు రెండింటిలోగా కోర్టుకు వెల్లడించాలని కర్ణాటకు ఆదేశించింది. అలాగే కావేరీ జలాలకు సంబంధించి అక్టోబర్‌ 4 లోపు కొత్త కమిటీ ఏర్పాటు చేయాలన్న ఆదేశాన్ని కేంద్రం నిరాకరించింది. కేవలం పార్లమెంటు మాత్రమే కమిటీ ఏర్పాటు చేయగలదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. తదుపరి విచారణ రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. సుప్రీం ఆదేశంపై కర్ణాటక అసెంబ్లీ సమావేశమైంది. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని తీర్మాణం చేసింది. అక్టోబర్‌ 1 నుంచి 6 వరకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించిన విషయం తెలిసిందే.

21:44 - October 3, 2016

తమిళనాడు : ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించిందా? ఆమె కోలుకోవడానికి ఎన్నాళ్లు పడుతుంది? ఇపుడు తమిళనాట ఏ నోట విన్నా ఇదే మాట. జయలలిత ఆరోగ్యం గురించి ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రివర్గాలు బులెటిన్‌ విడుదల చేశాయి. ఆమె ఆరోగ్యం కుదుట పడుతోందని పేర్కొన్నాయి. ఇంతకీ ఏది నిజం?

తమిళనాడు సిఎం జయలలిత ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. జ్వరం, డీ హైడ్రేషన్‌తోజయలలిత సెప్టెంబరు 22న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

రక్తంలో ఇన్ ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరిక
రక్తంలో ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న 68 ఏళ్ల జయలలితకు లండన్‌ సెప్సిన్‌ స్పెషలిస్ట్‌ వైద్యుడు రిచర్డ్‌ బెలే నేతృత్వంలో ప్రత్యేక చికిత్స జరుగుతోంది. జయలలిత క్రమంగా కోలుకుంటున్నారని మరికొద్ది రోజుల పాటు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని అపోలో వైద్యులు తెలిపారు.

పరిపాలనా బాధ్యతలను పర్యవేక్షిస్తున్న బ్యూరోక్రాట్స్
ప్రస్తుతం తమిళనాడు పరిపాలనా బాధ్యతలను బ్యూరోక్రాట్స్‌కు చెందిన ప్రత్యేక కోర్‌ టీం చూస్తోంది. మిగతా సమయాల్లో కూడా ఆమె ఇదే పద్ధతిని అనుసరిస్తారని సమాచారం. పరిపాలనకు సంబంధించి అతిముఖ్యమైన నిర్ణయాలను సిఎంఓ కార్యాలయమే చూస్తుంది. నలుగురు అధికారులు 56 విభాగాలకు చెందిన పరిపాలనా బాధ్యతలు చూస్తున్నారు. వీరంతా ప్రధాన కార్యదర్శితో పాటు జయలలిత సన్నిహితురాలు, అధికారిక సలహాదారు షీలా బాలకృష్ణన్‌కు కూడా రిపోర్టు చేస్తున్నారు. తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు జయలలితను పరామర్శించడానికి ఆదివారం ఆసుపత్రి వెళ్లారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు.

6సభ్యులున్న అధికారుల టీం పర్యవేక్షణ
ఆరుగురు సభ్యులున్న అధికారుల టీం మాత్రమే ఆసుపత్రిని సందర్శిస్తోంది. వీరితో పాటు జయలలిత సన్నిహితురాలు శశికళ, పన్నీర్‌ సెల్వంలకు మాత్రమే జయలలితను చూసేందుకు అనుమతించినట్లు సమాచారం.

అమ్మ ఆరోగ్యంపై ప్రముఖుల ఆరా
జయలలిత అనారోగ్యంపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ముఖ్యమంత్రి ఫొటోను విడుదల చేయాలని డిఎంకే అధినేత కరుణానిధి డిమాండ్‌ చేశారు.

భారీగా ఆసుపత్రికి చేరుకునే అభిమానులు
జయలలిత ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం చక్కర్లు కొడుతోందని అన్నాడిఎంకే పార్టీవర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఆరోగ్యం మెరుగవుతోందని, కావేరి జలాలపై జయ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అన్నా డీఎంకే నేతలు, కార్యకర్తలు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. జయలలిత త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి బయటకొస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

21:35 - October 3, 2016

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో వామపక్ష, అభ్యుదయవాదుల విజయం దేశంలోని విద్యార్ధి లోకానికి గొప్ప సందేశాన్ని అందించిందన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ బేబి. విద్యార్ధి ఐక్య ఉద్యమాల ద్వారా మత తత్వశక్తుల ఆగడాలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విజయాన్ని రోహిత్ వేములకు అంకింతమిస్తూ మరిన్ని ఐక్య ఉద్యమాలకు బాటలు వేస్తామంటున్నారు హెచ్ సీయూ ఎన్నికల్లో విజయం సాధించిన ప్యానెల్.

విజయం సాధించిన ప్యానెల్ మెంబర్స్ కి అభినందన సభ
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్యానెల్ మెంబర్స్ కి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్యానెల్ సభ్యులతో పాటు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, హెచ్ సీయూలో యునైటెడ్ ఫ్రెంట్‌లోని అన్ని విద్యార్ధిసంఘాలు పాల్గొని గెలిచిన సభ్యులను అభినందించారు.

మతోన్మాద శక్తులకు అడ్డుకట్ట: ఎంఏ బేబీ
ఈ సందర్భంగా సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ స్పందిస్తూ..మతోన్మాద శక్తులకు అడ్డుకట్ట వేయాలంటే వామపక్ష, దళిత, బహుజన విద్యార్ధి సంఘాలు ఐక్య ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సెంట్రల్ యూనివర్శిటీల్లో వామపక్ష, బహుజన విద్యార్ధి సంఘాలు యూనివర్శిటీ ఎన్నికల్లో విజయాల పరంపర కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. 

రోహిత్ వేములకు ఎస్ ఎఫ్ఐ విజయం అంకితం
హెచ్‌సీయూ ఎన్నికల్లో తాము సాధించిన ఈ విజయం రోహిత్ వేములతో పాటు పూలే, అంబేద్కర్‌, భగత్‌సింగ్‌లకు అంకితం ఇస్తామన్నారు హెచ్‌సియూ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన కులదీప్‌. అసలైన దేశభక్తులము తామంటూ బీరాలు పోయిన మతతత్వ శక్తులు పరాజయం పాలయ్యారని..వారికి దేశభక్తులని చెప్పుకోవడమే కానీ..ఎవరికోసం పోరాడే చిత్తశుద్ధి లేదని అన్నారు. 

ఐక్య ఉద్యమాల నిర్మాణానికి ఐదు సంఘాలు కృషి
హిందూత్వ శక్తులను తరిమేసి బలమైన ఐక్య ఉద్యమాలు నిర్మించేందుకు ఈ ఐదు సంఘాలు కూడా కృషి చేస్తాయని హామీ ఇచ్చారు హెచ్‌సియూ ఎన్నికల్లో ఎన్నికైన నేతలు. ఇది ప్రారంభం మాత్రమేనని.. హిందూత్వ శక్తుల భరతం పట్టి విద్యార్ధి వ్యతిరేఖ విధానాలను అవలంబిస్తున్న బీజేపి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని అన్నారు. తమ విజయం కేవలం మతోన్మాదులపై కాదని..దళితులపై, మైనార్టీలపై వివక్షను రెచ్చగొడుతున్న కేంద్రంపైన అన్నారు. భవిష్యత్‌లో సాధారణ ఎన్నికల్లోనూ కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రజావ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దింపేందుకు కృషి చేస్తామన్నారు. 

21:28 - October 3, 2016

హైదరాబాద్ : మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. మద్యం మత్తులో యువకుల ర్యాష్ డ్రైవింగ్‌ అమాయకుల ప్రాణాలమీదకు తెస్తోంది. చిన్నారి రమ్య ఉదంతాన్ని మరవకముందే....హైదరాబాద్‌ నగర శివార్లలో అదే తరహా ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న తల్లీకూతుళ్లను మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి సంజన బ్రెయిన్ డెడ్ అవ్వగా.. తల్లి శ్రీదేవి పరిస్థితి విషమంగా ఉంది.

మద్యం మత్తుతో డ్రైవింగ్..అమాయకుల ప్రాణాలు బలి
మద్యం మత్తు అమాయకుల ప్రాణాలమీదకు తెచ్చింది. యువకుల ర్యాష్ డ్రైవింగ్‌ కారణంగా ఓ కుటుంబంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి. హయత్‌ నగర్‌ మండలం పెద్ద అంబర్‌ పేట ఔటర్‌ రింగురోడ్డు వద్ద మద్యం సేవించిన యువకులు వేగంగా కారును నడిపి బీభత్సం సృష్టించారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న తల్లీకూతుళ్లను ఢీకొట్టారు. అనంతరం యువకులు కారును సంఘటనా స్థలంలో వదిలేసి పరారయ్యారు.

కోమాలో చిన్నారి సంజన
ఈ ప్రమాదంలో చిన్నారి సంజనకు తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లింది. చిన్నారి పక్కటెముకలు విరిగిపోయాయని, ఆమె బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు సంజన తల్లి శ్రీదేవి కూడా చావుబతుకుల మధ్య ఉంది. తీవ్ర గాయాలైన ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఫుల్లుగా మద్యం తాగిన నలుగురు యువకులు నిర్ధాక్షిణ్యంగా కారుతో ఢీకొట్టి, రెప్పపాటులో పారిపోయారని బాధితుల బంధువులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లీ కూతుళ్లను స్థానికులు 108 వాహనంలో సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. ప్రమాదానికి కారణమైన కారులో మద్యం సీసాలు దొరికాయి. యువకులు మద్యం మత్తులో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

నిందితులకోసం గాలింపు
రోడ్డు ప్రమాదానికి కారణమైన యువకుల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల సాయంతో నిందితులను గర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

21:24 - October 3, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. ఇప్పటివరకు మొత్తం 27 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడబోతుందని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. అయితే జనగాం, సిరిసిల్ల, గద్వాల జిల్లాల ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించారు. అయితే ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌ కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటుకు కూడా సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆసిఫాబాద్‌ జిల్లా ప్రతిపాదనలు పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 31కు చేరనుంది. చిన్న పాలన విభాగాలే మంచి ఫలితాలు ఇస్తాయని..దానికోసమే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలనకు చిన్న జిల్లాలే దోహదం చేస్తాయన్నారు. ప్రజల సౌకర్యార్థం జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెరిగినా ఫరవాలేదన్నారు సీఎం. 2022 నాటికి రాష్ట్ర బడ్జెట్‌ 5లక్షల కోట్లకు చేరకుంటుందని సీఎం అన్నారు. 2019లో టీఆర్‌ఎస్‌దే అధికారమని..అందుకే టీఆర్‌ఎస్‌ ప్రణాళిక ఆలోచనా..రాబోయే 7-8 ఏళ్ల కోసం జరగాలన్నారు. ఇక సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పాడే కొత్త జిల్లాకు రాజన్న పేరును పరిశీలించాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

చిన్న పాలన విభాగాలే మంచి ఫలితాలు ఇస్తాయి-కేసీఆర్‌
అయితే కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం అని పేరుపెట్టాలని సీఎం నిర్ణయించారు. వరంగల్‌లో మహబూబాబాద్‌ , భూపాలపల్లి, జనగాం, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల ఏర్పాటు విషయంలో జిల్లా ప్రజానిధుల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. హుజురాబాద్‌, జమ్మికుంట మండలాలను కరీంనగర్‌లో చేర్చనున్నారు. కమలాపూర్‌, ఎల్కతుర్తి, భీమదేవ్‌పూర్‌ మండలాలను వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కలపనున్నారు. హుస్నాబాద్‌, కోహెడ మండలాలను సిద్ధిపేట జిల్లాలో కలపాలని నిర్ణయించారు. పెద్దపల్లి నగర పంచాయతీని మున్సిపాలిటీగా మార్చనున్నారు. ఇక ఖమ్మంలోని వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపనున్నారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఆళ్లపల్లి, తరకగూడెం, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి, సుజాతనగర్‌, అన్నపురెడ్డి ఆరు మండలాలు ఏర్పాటు కానున్నాయి. వరంగల్‌లోని చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి మండలాలను సిద్ధిపేట జిల్లాలో కలపనున్నారు. స్టేషన్‌ఘనపూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా రాజధానిని వరంగల్‌ నగరంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కరీంనగర్ జిల్లాలో కొత్తగా రుద్రాంగి మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో గాధీగూడ, సిరికొండ మండలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

'అమ్మ'హెల్త్ బులిటెన్..

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యానికి ఆమె కావాల్సినంతగా స్పందిస్తున్నారని వెల్లడించారు. జయ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు.

20:33 - October 3, 2016

గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ చేతిలో దారుణ హత్యకు గురైన బెల్లి లలిత సోదరుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. 18 సంవత్సరాలుగా అజ్ఞాతంగా వుండి బెల్లి లలిత సోదరుడు కృష్ణ నయాం హత్య అనతరం అజ్ఞాతాన్ని వీడి సమాజంలోకి అడుగుపెట్టారు. నయీం అకృత్యాలపై గళమెత్తిన ప్రజాగాయకురాలు బెల్లి లలితను నయీం 1999 మే 26న నల్లగొండ జిల్లా భువనగిరిలో అత్యంత కిరాతకంగా చంపేసాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన లలిత సోదరుడు కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసుల చేతిలో నయీం ఎన్ కౌంటర్ అయిన నేపథ్యంలో ఆయన తిరిగి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బెల్లి కృష్ణతో ఈనాటి మల్లన్న ముచ్చట్లకు 10టీవీ స్టూడియోకి కృష్ణ వచ్చారు. మరి తన చెల్లెలు బెల్లి లతిత గురించి తన అజ్ఞాత జీవితం గురించి బెల్లి కృష్ణ తెలిపే వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:28 - October 3, 2016

మెదక్‌ : ఏడుపాయలలోని దుర్గ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడవ రోజైన ఇవాళ అన్నపూర్ణ దేవిగా అమ్మవారు, భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు ప్రత్యేక పూజలతో, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. 

20:26 - October 3, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. ఇప్పటివరకు మొత్తం 27 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడబోతుందని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. అయితే జనగాం, సిరిసిల్ల, గద్వాల జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ మేరకు సీఎం కేసీఆర్‌ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ మూడు జిల్లాల ఏర్పాటుకు కూడా సీఎం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. చిన్న జిల్లాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణలో మొత్తం 30 జిల్లాలు ఏర్పడనున్నట్లుగా అధికారిక సమాచారం. కొత్తగా 20 జిల్లాలకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. దీంతో స్థానికులు సంబురాలలో మునిగిపోయారు. జనగాం, సిరిసిల్ల, గద్వాల జిల్లాల ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎంపీ కేకే నేతృత్వంలో హైపవర్‌ కమిటీ నివేదిక వచ్చిన అనంతరం 2,3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరు,వికారాబాద్‌ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు వికారాబాద్‌ పేరు ఖరారైంది. ఇకపోతే ఎట్టకేలకూ సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ సిరిసిల్ల జిల్లాకు రాజన్న జిల్లాగా పేరు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. చిన్న పాలన విభాగాలే మంచి ఫలితాలు ఇస్తాయనీ కేసీఆర్‌ తెలిపారు. పేదరిక నిర్మూలనకు చిన్న జిల్లాలే దోహదం చేస్తాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ అరుణ ధన్యవాదాలు తెలిపారు. కాగా గత రెండు రోజుల కిత్రం రాజీనామాకు సిద్ధపడిన విషయం తెలిసిందే. జిల్లా ఏర్పాటుకు తాను అడ్డమైతే నా నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష కోసం తాను రాజీనామా చేస్తానని గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు. 

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

తిరుమల : తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని రకరాల ఫల,పుష్పాదులతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేద మంత్రాల మధ్య శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొని, శ్రీవారి సేవలో పాల్గొని తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమల చేరుకున్నారు.

19:32 - October 3, 2016

మార్కెట్ కమిటీలకు పాలక మండళ్ళ నియామకం..

హైదరాబాద్‌: తెలంగాణలోని ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 169 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 101 కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేయగా.. తాజాగా మరో ఏడు కమిటీలకు పాలక మండళ్లను ఖరారు చేశారు. కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పూడూరి మణెమ్మ, వైస్ ఛైర్మన్‌గా కట్ల శంకర్, మల్యాల మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చింతపంటి లక్ష్మి, వైస్ ఛైర్మన్‌గా బోయినపల్లి మధుసూధన్‌రావు నియమితులయ్యారు.

19:28 - October 3, 2016

రాజన్న జిల్లాగా సిరిసిల్ల..

హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, డిమాండ్లపై నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జిల్లాల వారీగా నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించారు. ఈరోజు కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లా నేతలతో ముఖ్యమంత్రి చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై నాయకుల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని కేసీఆర్‌ అన్నారు. 30 జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కసరత్తు జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు.

19:00 - October 3, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు మూడు వారాల తర్వాత తన మనుమడు దేవాన్ష్‌ను కలుసుకున్నారు. రాత్రి పార్క్ హయత్‌ హోటల్‌లో బస చేసిన చంద్రబాబు తన కుటుంబసభ్యులతో గడిపారు. చంద్రబాబు దేవాన్ష్‌ ఫోటోలను లోకేష్‌ ట్విట్టర్‌లో ఫోస్ట్ చేశారు. మనుమన్ని చూసిన చంద్రబాబు ముఖం వెలిగిపోయిందని.. ఆ వెలుగుతో వెయ్యి సిటీలకు వెలుగులు పంచవచ్చంటూ లోకేష్‌ కామెంట్‌ చేశారు.

18:56 - October 3, 2016

విజయవాడ : రాజధాని, పోలవరం నిర్మాణానికి జగన్‌ అడ్డుపడుతున్నారని మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. వైసీపీ నేతలతో కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని మండిపడ్డారు. పోలవరానికి ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్‌ను రద్దు చేస్తే... పనులు ఆగిపోవాలనేది వారి ఉద్దేశమన్నారు. 2018కి పోలవరం పూర్తి చేయాలని సీఎం పట్టుదలతో ఉన్నారని చెప్పారు.

18:54 - October 3, 2016

విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో తయారు చేసిన లడ్డూలను ఫుడ్‌సేఫ్టీ అధికారులు శాంపిల్స్‌ను సేకరిస్తున్నారు. భారీ వర్షం వల్లే లడ్డూల్లోకి పురుగులు వచ్చి చేరాయని ఫుడ్‌సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. అయితే పాడైన లడ్డూలన్నింటిని పడేశామని అధికారులు తెలిపారు. ఇకనుంచి ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల ఫుడ్‌సేఫ్టీ పద్దతులను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నామని ఫుడ్‌సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

18:50 - October 3, 2016

గుంటూరు : స్వరాష్ట్రం నుంచే పరిపాలన సాగాలన్నఏపీ సర్కార్‌ సంకల్పం నెరవేరింది. అమరావతి కేంద్రంగా పాలన ప్రారంభమైంది. వెయ్యి మందికి పైగా ఉద్యోగులు నూతన సచివాలయానికి తరలివచ్చారు. వీరికి స్థానికంగా ఘనస్వాగతం లభించింది. దసరా రోజున చంద్రబాబు.. సచివాలయంలోని తన చాంబర్‌లో అడుగుపెట్టడంతో.. ఈ అంకం పరిపూర్ణమవుతుంది.

వెలగపూడిలో సచివాలయం ప్రారంభం
ఏపీ సచివాలయంలో పాలన ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు అంతా ఇక నూతన సచివాలయం నుంచే విధులు నిర్వహిస్తారు. సర్వ హంగులతో సిద్ధమైన క్యూబికల్స్‌లో సచివాలయ సిబ్బంది కొలువుదీరారు. మిలమిల మెరిసే ఛాంబర్లు, చక్కటి ఫర్నీచర్‌, హాయి గొలిపే సెంట్రల్‌ ఏసీ, హై ఫ్రీక్వెన్సీ నెట్‌, వైఫై సౌకర్యంతో ఐటీ కార్పొరేట్‌ కార్యాలయాలను తలపించేలా ఉన్న సచివాలయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఆస్వాదిస్తున్నారు.

ఉద్యోగులను అభినందించిన స్పీకర్‌ కోడెల
వెలగపూడి సచివాలయానికి తరలివచ్చిన ఏపీ ఉద్యోగులను స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అభినందించారు. రాష్ట్ర పాలన ప్రారంభమైన నేపథ్యంలో.. అసెంబ్లీ భవన నిర్మాణాలనూ డిసెంబర్ 15లోగా పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆయన అసెంబ్లీ నమూనాలను, నిర్మాణ పనులనూ పరిశీలించారు.. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచే జరుగుతాయని స్పీకర్ చెప్పారు.

ప్రజలకు సమర్ధవంతమైన పాలన: యనమల
ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం వెలగపూడి నుంచే పాలన కొనసాగుతుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇప్పటికే ప్రధాన శాఖల అధికారులు వెలగపూడికి చేరుకున్నారని, చిన్నచిన్న సమస్యలున్నా వెంటనే పరిష్కరించుకొని ప్రజలకు సమర్ధవంతమైన పాలన అందిస్తామని చెప్పారు.

వెలగపూడి సచివాలయానికి మూడంచెల భద్రత
వెలగపూడి సచివాలయానికి మూడంచెల భద్రతను కల్పిస్తున్నారు. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ 24గంటలు బందోబస్తు నిర్వహించనున్నది. సచివాలయ ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు తనిఖీలు చేశాకే ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. గుర్తింపు కార్డు లేకుంటే అనుమతిని నిరాకరిస్తున్నారు. సచివాలయంలో ఏ చిన్న ఘటన జరిగినా తెలిసేలా ప్రతి బ్లాకులో సుమారు 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలన్నీ బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థకి అనుసంధానించారు.

అసెంబ్లీ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి
ఏపీ తాత్కాలిక సచివాలయం నుంచి పాలన మొదలైంది. ఇప్పుడు అసెంబ్లీ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. భవనాలు ఎలా ఉండాలి..? ఇంటీరియర్‌ డెకొరేషన్‌.. సీట్ల ఏర్పాటు ఎలా ఉండాలి..? అన్న అంశాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సరికొత్త భవనాలకు సంబంధించిన నమూనాలను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఆ నమూనాలను 10టీవీ ప్రత్యేకంగా సేకరించింది. ఆ డిటెయిల్స్ మీకోసం..!

అసెంబ్లీ భవనాలు, ముఖ్యమంత్రి, స్పీకర్ల చాంబర్‌ల కసరత్తు
విదేశీ సాంకేతిక పరిజ్ఞానం..అత్యాధునిక హంగులతో తాత్కాలిక సచివాలయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించేసింది. సిబ్బంది కూడా హైదరాబాద్‌కు వీడ్కోలు పలికి.. సోమవారం నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి విధులను మొదలు పెట్టేశారు. ఇప్పుడు అసెంబ్లీ భవనాలు, ముఖ్యమంత్రి, స్పీకర్ల చాంబర్‌లకు సంబంధించిన కసరత్తును ప్రభుత్వం ప్రారంభించింది.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఈ హాళ్లను నిర్మాణం
అసెంబ్లీ హాలు లోపలి భాగం ఎలా ఉండాలన్న అంశంపై ప్రభుత్వం రెండు ఆప్షన్‌లను పరిశీలిస్తోంది. ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం 175 మంది సభ్యులున్నారు. త్వరలోనే వీటి సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత కనీసం 225 మంది సభ్యులు అసెంబ్లీకి వస్తారని ప్రభుత్వంఅంచనా వేస్తోంది. దీనికి తగ్గట్లుగా అసెంబ్లీ లోపలి ఏర్పాట్లు ఉండేలా కసరత్తు చేస్తోంది. సుదీర్ఘ కాలం మన్నికగా ఉండేలా అత్యాధునిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఈ హాళ్లను నిర్మించాలని భావిస్తున్నారు.

పరిశీలిస్తున్న ప్రభుత్వం
ముఖ్యమంత్రి కార్యాలయం నమూనాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. సీఎంను కలిసేందుకు వచ్చే వారు విశ్రమించేందుకు వీలుగానూ లాంజ్‌ను అత్యంత సుందరంగా.. మనోహరంగా తీర్చిదిద్దనున్నారు. దీనికి సంబంధించిన నమూనాలనూ సీఎం పరిశీలనకు ఉంచారు. వీటితో పాటు స్పీకర్‌, మండలి చైర్మన్‌ల చాంబర్‌ల నమూనాలనూ ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటితో పాటు సువిశాల హాలును కూడా ప్రతిపాదిస్తున్నారు. ఈ నమూనాల్లో ముఖ్యమంత్రి ఆమోదం పొందిన వాటి ప్రకారం.. చకచకా నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

18:42 - October 3, 2016

మహబూబ్ నగర్ : ఒకప్పుడు అది కంచుకోట.. ఇప్పుడదే ప్రమాదపు అంచు. రక్షణ వలయంగా నిలిచిన ఆ కట్టడం.. నేడు ప్రమాదకరంగా మారింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు క్షణ క్షణం.. భయం..భయంగా కాలం గడుపుతున్నారు.

గద్వాలలో శిథిలావస్థకు చేరుకున్న పురాతన కట్టడం
మహబూబ్‌నగర్‌ జిల్లా.. గద్వాల పట్టణంలో.. శిథిలావస్థకు చేరుకున్న అతి పురాతనమైన కట్టడంతో ఆ ప్రాంత ప్రజలు భయం భయంగా బతుకు వెల్లదీస్తున్నారు. ముఖ్యంగా కోట కింద ఉన్న 25వ వార్డు కాలనీవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు.. ఎక్కడ కూలుతుందోనని భయపడుతున్నారు.

500 ఏళ్లక్రితం 32 రాతి బురుజుల నిర్మాణం
కోటలు.. పెద్దపెద్ద కట్టడాలకు గద్వాల పెట్టింది పేరు. అటువంటి గద్వాలలో ఐదు వందల ఏళ్ల క్రితం రాజుల కాలంలో 32 రాతి బురుజులు నిర్మించి.. చుట్టూ కందకం ఏర్పాటు చేశారు. శత్రువులబారి నుంచి రక్షణ కోసం దీనిని నిర్మించి.. అక్కడే సిపాయిల కోసం ఇళ్లు కూడా నిర్మించారు. తర్వాత కాలంలో అదే ఒక కాలనీగా మారింది. అక్కడ ప్రస్తుతం 70 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నాయి.

కూలుతున్న కోట గోడలు
అయితే ఆ కోట ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. కోట గోడలు కూలుతున్నాయి. దీంతో అధికారులు కూడా అక్కడ నుంచి వెళ్లిపోమని ఆ ప్రాంతవాసులను ఆదేశించారు. దీంతో ఆ పేద జీవులు అక్కడ ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో.. కొందరు బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. ఇంకా చాలా మంది ఏం చేయాలో తెలియక.. అక్కడే భయాందోళనతోనతోనే బతుకీడుస్తున్నారు.

తమను ఆదుకోవాలంటున్న బాధిత కుటుంబాలు
కాలనీ వాసులకు పునరావాసం కల్పించడంలో మున్సిపల్‌ సిబ్బంది.. వార్డు కౌన్సెలర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల ముందు ఓట్లు కోసం వచ్చారని..ఇప్పుడు తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

18:38 - October 3, 2016

హైదరాబాద్ : మతోన్మాద శక్తులకు అడ్డుకట్ట వేయాలంటే వామపక్ష, దళిత, బహుజన విద్యార్ధి సంఘాలు ఐక్య ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ బేబి. హెచ్ సీయూ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్యానెల్ మెంబర్స్‌కి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అభినందన సభ నిర్వహించారు. అన్ని సెంట్రల్ యూనివర్శిటీల్లో వామపక్ష, బహుజన విద్యార్ధి సంఘాలు యూనివర్శిటీ ఎన్నికల్లో విజయాల పరంపర కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ప్యానెల్ సభ్యులతో పాటు హెచ్ సీయూ లో యూనైటెడ్ ఫ్రెంట్‌లోని అన్ని విద్యార్ధిసంఘాలు పాల్గొని గెలిచిన సభ్యులను అభినందించారు. 

కార్గిల్ లో పర్యటించనున్న రాజ్ నాథ్..

ఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు జమ్ములో పర్యటించనున్నారు. జమ్మూలోని కార్గిల్, లేహ్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. అక్కడి భద్రతా అధికారులతో సమావేశమవుతారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకు రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇవాళ ఉదయం బారాముల్లాలో జరిగిన దాడి గురించి కూడా అధికారులను అడిగి ఆరా తీయనున్నారు.

18:20 - October 3, 2016

సెల్ ట‌వ‌ర్స్ రేడియేష‌న్ పై సుప్రీం ఆరా..

ఢిల్లీ : సెల్ ట‌వ‌ర్ల ద్వారా వెలుబ‌డే రేడియేష‌న్ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. రేడియేష‌న్ ప్ర‌మాణాలు, వాటి కోసం పాటించే నియ‌మాల‌ను అన్ని ఫోన్ కంపెనీలు త‌మ స‌మాచారాన్ని వెల్ల‌డించాల‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్ర ప్ర‌భుత్వానికి ఆ కంపెనీల‌న్నీ నిర్దిష్ట కాల వ్య‌వ‌ధిలోగా ఆ స‌మాచారాన్ని అందించాల‌ని కోర్టు మొబైల్ కంపెనీల‌ను కోరింది. సెల్ ట‌వ‌ర్ల ఏర్పాటులో టెలిక‌మ్యూనికేష‌న్ శాఖ ఏవైనా ఉల్లంఘ‌న‌ల‌ను గుర్తించిందా, ఒక‌వేళ అలాంటి సంఘ‌ట‌నలు జ‌రిగితే, ఎక్క‌డైనా చ‌ర్య‌లు తీసుకున్నారా అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది.

కలుషిత నూనె కేంద్రాలపై దాడులు..

రంగారెడ్డి: జిల్లాలోని పహడి షరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జంతు కళేబరాలతో నూనె తయారుచేస్తున్న పరిశ్రమపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 52 డ్రమ్ముల ఆయిల్‌తోపాటు 8టన్నుల కొవ్వును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కళేబరాల నుంచి నూనె తయారు చేస్తున్న ఎనిమిది మంది నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

17:14 - October 3, 2016

కోల్ కతా : సొంతగడ్డపై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి విజయంతో నిరూపించుకుంది. విజయ దుందుభి మోగించింది. న్యూజిలాండ్‌తో ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ 178 పరుగుల తేడాతో గెలుపొంది మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. స్వదేశంలో ఆడిన 250వ టెస్ట్‌లో టీమిండియాకు తిరుగేలేకుండా పోయింది. నాలుగో ఇన్నింగ్స్‌లో 376 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ జట్టు భారత బౌలర్ల ధాటికి మరోసారి తేలిపోయింది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో కివీ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. టిమ్‌ లాథమ్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవ్వడంతో భారత జట్టు 178 పరుగుల తేడాతో నెగ్గింది. భారత బౌలర్లలో అశ్విన్‌, జడేజా, షమీ పోటీలు పడి వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో భారత జట్టు ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. కోల్‌కతా టెస్ట్ విజయంతో భారత జట్టు సిరీస్‌ సొంతం చేసుకోవడంతో పాటు...ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌ ప్లేస్‌కు చేరుకుని కొహ్లీ అండ్‌ కో సంచలనం సృష్టించింది. 

టీమిండియా జయకేతనం..

కోల్ కతా : సొంతగడ్డపై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి విజయంతో నిరూపించుకుంది. న్యూజిలాండ్‌తో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ 178 పరుగుల తేడాతో గెలుపొంది మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టులో కూడా భారత్‌ 197 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయాలతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది.

కూలిన జాగ్వార్ విమానం..

రాజస్థాన్ : జైసల్మెర్ సమీపంలోని పోఖ్రాన్ లో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

16:55 - October 3, 2016

నెల్లూరు : తమ సమస్యలు తీర్చాలంటూ నెల్లూరులో హిజ్రాలు నిరసన చేపట్టారు. నగరంలోని వీఆర్‌సీ మైదానం నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీని నిర్వహించారు. జిల్లాలో 12 వందల 74 మంది హిజ్రాలు ఉన్నామని తెలిపారు. సొంత ఇళ్లు కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. తమ సమస్యల గురించి అనేక సార్లు అధికారులను సంప్రదించినా...ఎటువంటి న్యాయం జరగలేదని ఆరోపించారు. 

16:52 - October 3, 2016

ప్రకాశం : మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప కూడా దాటడం లేదు. ఓవైపు ఆస్పత్రుల పారిశుధ్య అధ్వాన్నస్థితి మారాలని అమాత్యులు గట్టిగా చెబుతుంటే.. మరోవైపు అధికారులు, సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇందుకు ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

దుర్బర స్థితిలో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి
విన్నారుగా స్వయంగా ఏపీ ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ఎమన్నారో.. మనుషులు ఉండటానికి కూడా వీలులేని దుర్బర స్థితిలో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి ఉందని సాక్ష్యాత్తూ ఆరోగ్య శాఖ మంత్రి అన్నారంటే పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్క రిమ్స్ ఆస్పత్రిలోనే కాదు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల తీరు ఇలానే ఉంది. ఆస్పత్రుల్లో పారిశుధ్య చర్యలు పడకేశాయి. ముక్కుపుటలు ఆదిరేలా దుర్గంధం వెదజల్లుతున్నాయి.

ఉన్నతాధికారులకు నజరానాలు
పారిశుధ్యం, పరిశుభ్రత అంటూ ఆరోగ్య సూత్రాలు వల్లె వేసే వైద్యులు, వైద్యాధికారులు.. చెప్పేందుకే నీతులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని వైద్యాలయాలు చెత్తకుండీలను తలపిస్తున్నాయి. ఏ వార్డులోకి వెళ్లినా భరించలేని దుర్గంధం వెదజల్లుతున్నాయి. చెత్తా చెదారంతో రోగులకు స్వాగతం పలుకుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్దతిలో పారిశుధ్యచర్యలు నిర్వహిస్తున్నారు. డాక్టర్లు, వైద్యాధికారుల కార్యాలయాలు, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచి.. మిగతా వార్డులను శుభ్రపరచడంలో అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఉన్నతాధికారులకు నజరానాలు ముట్టజెప్పడం వల్లే వారు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

కంపుకొడుతున్న వార్డులు
ఇక ఇన్ పేషెంట్‌ వార్డుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చినిగిన బెడ్లు, రక్తపు మరకలు, వాడిపాడేసిన గ్లూకోస్‌, రక్తం బాటిల్స్‌తో చెత్తకుండిని తలపిస్తున్నాయి. ఆస్పత్రుల్లోని అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి రోగులు, రోగుల బంధువులు ముక్కున వేలేసుకుంటున్నారు.

రోగం తగ్గక పోగా కొత్త రోగాలు
ఇక చిల్డ్రన్స్‌ వార్డుల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అపరిశుభ్ర పరిసరాల వల్ల చిన్నారులకు త్వరగా ఇన్‌ఫెక్షన్స్ సోకుతాయని వైద్యులకు తెలియంది కాదని..అయినా ఇవేవీ పట్టనట్లుగా విధులు నిర్వహిస్తున్నారని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. పేదోడికి పెద్దాస్పత్రులంటే కొండంత అండ అన్న పరిస్థితులు మారాయని..వచ్చిన రోగం తగ్గక పోగా కొత్త రోగాలు అంటుకోవడం ఖాయమని మండిపడుతున్నారు. 

16:43 - October 3, 2016

నిజామాబాద్‌ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పథకం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు గడిచిపోయినా.... ఇంతవరకు ఒక్క ఇల్లు నిర్మాణం కూడా చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. సొంత ఇంటికల నెరవేరుతుందనుకున్న పేదలు... తమ ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమాబాద్‌ జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పథకంపై 10 టీవీ ప్రత్యేక కథనం...

మూడడుగులు ముందుకు... ఆరడుగులు వెనక్కి..
నిజామాబాద్‌ జిల్లాలో డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పథకం మూడడుగులు ముందుకు... ఆరడుగులు వెనక్కి.. అన్న చందంగా మారింది. ఈ పథకం కింది జిల్లాలో ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించకపోవడంతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదల్లో నిరాశ, నిస్పృహలు అలముకుంటున్నాయి.

జిల్లాకు 7,665 ఇళ్లు మంజూరు..మొత్తం 81,921 మంది దరఖాస్తు
జిల్లాకు భారీగానే రెండు పడకగదులు ఇళ్లు మంజూరయ్యాయి. మొత్తం 7,665 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 81,921 మంది దరఖాస్తు చేస్తున్నారు. వీరిలో తొలిదశలో ఎంపిక చేసిన 1305 మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. ఆరు నెలల్లో రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందనలేదు. ప్రభుత్వం ఇవ్వచూపుతున్న యూనిట్‌ నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటంతో ఈ పథకాన్ని చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకురావడంలేదు. దీంతో అసలు ఈ పథకం ముందుకు సాగుతుందా.. లేదా... అన్న సంశయంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పథకానికి గ్రహణం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పథకాన్ని పాలకులు అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు. అన్ని చోట్ల కూడా శిలాఫకాలే దర్శనమిస్తున్నాయి. ఈ పథకం ముందుకు సాగకపోగా... ఇప్పుడు జిల్లా పునర్విభజన జరుగుతోంది. కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కామారెడ్డికి కేటాయించిన ఇళ్లను నిజామాబాద్‌ నుంచి కొత్త జిల్లాకు బదిలీ చేయాల్సి ఉంటుందన్ని భావిస్తున్నారు. అయితే కొంతమంది ప్రజాప్రతినిధులు జిల్లాకు మంజూరు చేసిన ఇళ్లను తగ్గించకుండా.. కామారెడ్డికి కొత్తగా ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు అధికారులంతా జిల్లాల పనర్విభజనపై దృష్టి పెట్టడంతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పథకానికి తాత్కాలికంగా గ్రహణం పట్టినట్టేనని భావిస్తున్నారు. కొత్త జిల్లాల్లో పాలన సర్దుకోడానికి ఆరు నెలల సమయ పడుతుంది. ఈ లోగా దరఖాస్తుదారులు మరింత నిరాశ, నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉండటంతో డుబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇవ్వచూపుతున్న రేటుకు ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకురాకపోవడంతో... యూనిట్‌ వ్యయాన్ని పెంచాలని లబ్దిదారులు కోరుతున్నారు.

 

16:38 - October 3, 2016

విజయవాడ : దీనికి సంబందించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్‌ అందిస్తారు. ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు మరోసారి బయటకొచ్చాయి.. విజయవాడ బీజేపీ నగర కార్యాలయం రణరంగాన్ని తలపించింది.. టీడీపీ ప్రభుత్వం తమకు ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ హంగామా సృష్టించారు.. కార్యాలయ అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు.. టీడీపీ మిత్రధర్మం పాటించడంలేదని... బీజేపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు..

జపాన్ శాస్త్రవేత్తకు 'నోబెల్'..

హైదరాబాద్ : జపాన్‌ శాస్త్రవేత్త యొషినొరి ఒషుమికి 2016 సంవత్స‌రానికిగానూ వైద్యశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని అందిస్తున్న‌ట్లు ఆ క‌మిటీ ఈరోజు ప్ర‌క‌టించింది. యొషినొరి ఆరోగ్యానికి సంబంధించి ఆటోఫేజీ అనే విధానంలో చేసిన కృషికిగానూ ఆయ‌న‌కు నోబెల్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు పేర్కొంది. ఇక భౌతిక శాస్త్రంలో నోబెల్-2016 సాధించిన శాస్త్ర‌వేత్త పేరును రేపు ప్ర‌క‌టించ‌నుంది. ఆ త‌రువాత ఈనెల 5వ తేదీన ర‌సాయ‌న‌శాస్త్రం, 7వ తేదీన శాంతి, 10న ఆర్థిక శాస్త్ర విభాగాల్లో నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌క‌టించ‌నున్నారు. ఆ త‌రువాత సాహిత్యంలో నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌క‌టించ‌నున్నారు.

కొత్తజిల్లాలపై కొనసాగుతున్న భేటీ..

హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమీక్ష కొనసాగిస్తున్నారు. ఇవాళ సచివాలయంలో ఆయన వరంగల్, కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశమాయ్యరు. కరీంనగర్ జిల్లా నేతలతో భేటీ ముగిసింది. వరంగల్ నేతలతో సమీక్ష కొనసాగుతోంది.

16:25 - October 3, 2016

అమ్మ ఆరోగ్యంపై కోర్టులో పిటీషన్..

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై మద్రాస్‌ హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలైంది. జయలలిత ఆరోగ్యంపై వాస్తవ పరిస్థితిని తెలపాలని కోరుతూ న్యాయవాది రామస్వామి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. గత 11రోజులుగా సీఎం జయ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. జయ ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని తెలపాలని కోరుతూ న్యాయవాది ఈ మేరకు పిటిషన్ వేశారు. 

16:02 - October 3, 2016

ఢిల్లీ : ఆధ్యాత్మిక గురువు ఆసారాంకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. అనారోగ్యం కారణంతో తనకు బెయిలు మంజూరు చేయాలన్న ఆసారాం బాపు అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఎయిమ్స్ రిపోర్టుపై అక్టోబర్‌ 17న సమాధానం చెప్పాలని ఆసారాంను ఆదేశించింది. అప్పటివరకు ఆసారాం బాపు జైలు ఊచలు లెక్కించక తప్పదు. 16 ఏళ్ల మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ఆసారాం బాపు 2013 నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆసారాం బాపు వైద్య పరీక్షల కోసం కోర్టు ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్లతో ఓ బోర్డును నియమించింది.

16:00 - October 3, 2016

ఢిల్లీ : 2002లో సంచలనం సృష్టించిన నితీష్‌ కటారా పరువు హత్య కేసులో దోషి వికాస్‌ యాదవ్‌కు పాతికేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఐపిసి 201 సెక్షన్‌ కింద హైకోర్టు అదనంగా విధించిన ఐదేళ్ల శిక్షను కోర్టు తగ్గించింది. మరో దోషి సుఖ్‌దేవ్‌ పహల్వాన్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. నితీష్‌ కటారా హత్యకేసులో 2008లో ట్రయల్‌ కోర్టు జీవిత ఖైదు విధించగా, 2014లో ఢిల్లీ హైకోర్టు- ముగ్గురు నిందితులకు 30 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దీనిపై వికాస్‌, సుఖ్‌దేవ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఐదేళ్ల శిక్ష తగ్గించింది. ఫిబ్రవరి 17, 2002లో గజియాబాద్‌లో స్నేహితుడి పెళ్లికని వెళ్లిన నితీష్‌ కటారాను వికాస్‌, విశాల్‌, సుఖ్‌దేవ్‌ పహిల్వాన్‌లు కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. తన సోదరిని ప్రేమించాడన్న కారణంతో వికాస్‌ యాదవ్‌ స్నేహితులతో కలిసి నితీష్‌ కటారాను హతమార్చారు. ఈ కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించాలన్న నితీష్‌ తల్లి నీలమ్‌ కటారా విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.

15:57 - October 3, 2016

జమ్ము కశ్మీర్ : నియంత్రణ రేఖ వద్ద భారత-పాకిస్తాన్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ పేర్కొన్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, పాకిస్తాన్‌ అధికారి నాసిర్‌ జన్‌జువా ఫోన్లో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయన్నారు. యూరీ ఉగ్రవాద దాడి, పిఓకేలో భారత ఆర్మీ సర్జికల్‌ దాడులు నిర్వహించిన నేపథ్యంలో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమకు ఏ ఇతర దేశానికి చెందిన భూభాగాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశం లేదని ప్రధాని మోది స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

 

15:54 - October 3, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లోని నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలపైనే రాష్ర్ట ప్రభుత్వం ఎక్కువ దృష్టిసారిస్తోందని, నగరంలోని రోడ్ల దుస్థితిపై ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదని సీపీఎం హైదరాబాద్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైనేజీ, మౌళిక వసతుల అభివృద్ధి కోసం గ్రేటర్‌ హైదరాబాద్‌కు 10వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ... జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట సీపీఎం నేతలు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ విభాగం నుంచి తక్షణమే నిధుల తరలింపును ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు నగర రోడ్లన్నీ కొట్టుకుపోయాయని, వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించకుండా.. కట్టడాలను తొలగించడం సరైంది కాదన్నారు. కొన్నేళ్లుగా ఉంటున్న వాళ్లు అకస్మాత్తుగా కట్టడాలను తొలగించడం వల్ల.. వాళ్లు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో జీహెచ్‌ఎంసీకి రావాల్సిన నిధులను రాష్ర్ట ప్రభుత్వం తగ్గించందన్నారు. అంతేకాదు.. బడ్జెట్‌లోనూ కోత విధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం హైదరాబాద్‌ నగర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. 

15:52 - October 3, 2016

రంగారెడ్డి : మానవత్వం రోజురోజుకూ మండగలిసిపోతోంది. దయాదాక్షిణ్యం అనే పదాలకు మనుష్యులు అర్థం మరచిపోతున్నారు. కడుపులోనే పసికందుల ప్రాణాల్ని తీసేవారు కొందరైతే..పుట్టిన తరువాత చంపేసేవారు మరికొందరు..ఇంకొందరు ముళ్ళపొదల్లో..చెత్తకుప్పల్లో,పాడు పడిన ప్రదేశాల్లో వదిలివేస్తుంటారు. పేగు తెంచుకు పుట్టిన బిడ్డను అలా వదిలివేయటానికి వారికి ఎటువంటి కారణాలున్నాగానీ, మానవత్వానికే ఇది మాయని మచ్చగా చెప్పుకోవచ్చు..జంతువులు సైతం తమ పిల్లలకు ఆపద వస్తే ప్రాణాలకు తెగించిపోరాడుతాయి. ఆపోరాటంలో తమ ప్రాణాల్ని సైతం బలిపెడతాయి. మరి మంచీ చెడూ ఆలోచించాల్సిన మనుష్యులు మాత్రం జంతువుల కంటే హీనంగా ముక్కుపచ్చలారని పసికందులను నిర్ధాక్షిణ్యంగా వదిలివేస్తున్నారు. మానవత్వం లేని మనుష్యులతో పాటు మానవత్వం పరిమళించే వ్యక్తులు కూడా ఈ సమాజంలో వున్నారు. కాబట్టి వీధిన పడ్ని కొన్ని పసిప్రాణాలు నిలుస్తున్నాయి. ఇటువంటి ఘటనే గ్రేటర్ పరిధిలో జరిగింది. హయత్‌నగర్‌లో దారుణం జరిగింది.. మూడు నెలల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పొదల్లో వదిలివెళ్లారు.. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది పాపకు చికిత్స అందించారు.. చిన్నారిని శిశువిహార్‌కు తరలించారు..

15:44 - October 3, 2016

నెల్లూరు : చంద్రశేఖరపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ కొట్టడంతో 15మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. ఇందులో డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది.. ఈ బస్సు విజయవాడ నుంచి తిరుపతి వెళుతుండగా ఈ ప్రమాదానికి గురైంది..

15:41 - October 3, 2016

హైదరాబాద్ : సిరిసిల్ల పట్టణం ఇకపై జిల్లాగా అవతరించనుంది. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం పచ్చజెండా వూపారు. కరీంనగర్‌ జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. హుజూరాబాద్‌ను వరంగల్‌లో కలపకుండా కరీంనగర్‌లోనే కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.ఈ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న సిరిసిల్ల ను జిల్లా చేయాలంటూ కొన్ని రోజులుగా డిమాండ్లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

తన పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన చైతూ..

హైదరాబాద్ : ప్రేమమ్ సినిమా ప్రమోషన్ లో అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ, ముందు తన తమ్ముడు అఖిల్ వివాహం ఉంటుందని, ఆ తరువాతే తన వివాహం ఉంటుందని తెలిపాడు. సమంతను వచ్చేఏడాది వివాహం చేసుకుంటానని చెప్పాడు. తామిద్దరం ఏం మాయ చేశావే నుంచే మంచి స్నేహితులమని చెప్పాడు. ఆ స్నేహాన్ని వచ్చే ఏడాది వివాహ బంధంగా మార్చుకుంటామని చెప్పాడు. వివాహం తరువాత కూడా సమంత నటిస్తుందని నాగ చైతన్య వెల్లడించాడు. కాగా, డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం జరగనున్నట్టు తెలుస్తోంది.

జిల్లాగా సిరిసిల్ల!..

హైదరాబాద్ : సిరిసిల్ల పట్టణం ఇకపై జిల్లాగా అవతరించనుంది. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కరీంనగర్ జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రధానిపై ప్రశంసల పరంపర..

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై ఎల్ల‌ప్పుడూ విమ‌ర్శ‌లు చేసే ప్ర‌తిప‌క్ష నేత‌లు కూడా ఇటీవ‌ల‌ పీవోకేలో భార‌త సైన్యం ఉగ్ర స్థావ‌రాల‌పై చేసిన సర‍్జికల్ దాడుల తరువాత ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు ఇటీవ‌లే మోదీ తొలిసారి మంచి ప‌నిచేశారంటూ ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అర‌వింద్ కేజ్రీవాల్ కూడా మోదీని పొగిడారు. తాము ప‌లు విష‌యాల్లో ప్ర‌ధానితో విభేదించినా.. పీవోకేలో సర‍్జికల్ స్ట్ర‌యిక్స్‌ విషయంలో మోదీ చూపిన మనోబలానికి సెల్యూట్ చేస్తున్న‌ట్లు కేజ్రీ పేర్కొన్నారు.

నయాం కేసులో మరో ఇద్దరు అరెస్ట్..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నేతతో పాటు పోలీస్ అధికారిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరిద్దర్నీ బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సిట్ అధికారులు మాత్రం అరెస్ట్ లను అధికారికంగా ధ్రువీకరించలేదు. 

14:54 - October 3, 2016

విజయవాడ : బెజవాడ దుర్గమ్మ దర్శనంకోసం అష్టకష్టాలు పడుతున్న భక్తుల సమస్యలపై 10 టీవీ కథనాలకు స్పందనొచ్చింది.. మూడు కిలోమీటర్లపాటు గంటలకొద్దీ క్యూ కడుతూ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.. చిన్నారులు, మహిళలు, వృద్ధులు టాయ్‌లెట్లు లేక అవస్థలు పడుతున్నారు.. వీరి కష్టాలపై 10టీవీ పలు కథనాలు ప్రసారం చేసింది.. వీటిపై స్పందించిన అధికారులు బయో టాయ్‌లెట్లను ఏర్పాటు చేశారు.. ఘాట్‌ టోల్‌గేట్‌నుంచి ఓంకారం మలుపు వరకూ బయో టాయిలెట్స్ నిర్మించారు.. తమ సమస్యను తీర్చారంటూ 10 టీవీకీ భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.. 

14:50 - October 3, 2016

హైదరాబాద్ : ఇప్పటివరకు నాలాలపై నిర్మించిన 722 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్నారు. కిర్లోసకర్ నివేదిక ప్రకారం నగరంలో 28000 పైచిలుకు ఆక్రమ నిర్మాణాలు ఉన్నాయన్నారు. అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయని తెలుసుకునేందుకు 390 కిలోమీటర్ల నాలాను మళ్లీ సర్వే చేయనున్నామన్నారు. 

14:47 - October 3, 2016

తూర్పుగోదావరి : కాకినాడలో పోలీసులు రెచ్చిపోయారు. దళిత సంఘాలు.. వామపక్ష నేతలపై లాఠీలు ఝుళిపించారు. టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నిందితుడుగా ఉన్న శిరోముండనం కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ కలెక్టరేట్‌ వద్ద వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బేబీ రాణికి గాయాలయ్యాయి. మరో ఇద్దరు సొమ్మసిల్లిపడిపోయారు. 20 ఏళ్ళనుండీ కొనసాగుత్ను కేసు విషయంలో ప్రశ్నించిన మహిళలపై పోలీసులు అతి దారుణంగా ప్రవర్తించారనీ సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బేబీరాణి పేర్కొన్నారు. ఎమ్మెల్యేను రక్షించేందుకు అధికారపార్టీ ప్రయత్నిస్తోంది బేబీరాణి ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆందోలన కారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు స్పందించి సరైన న్యాయం చేయకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు. 

ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన..

హైదరాబాద్ : వేతనాల కోసం జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. తమకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదంటూ సుమారు 70 మంది ఉద్యోగులు బైఠాయించారు. జీతాల్లేక తమ కుటుంబాలు పస్తులు ఉంటున్నాయనీ..వెంటనే వేతలనాలు చెల్లించాలనీ డిమాండ్ చేశారు.

14:31 - October 3, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయాం కేసులో మరో సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిలో టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్ర్ రెడ్డి,డీఎస్పీ రవీందర్ రెండ్డిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ అధికారులు విచారిస్తున్నారు. త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ నయాం కేసు నెలల తరబడి విచారణకొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు ప్రజాప్రతినిధులు, పోలీస్ శాఖలో ఉన్నతస్థాయి అధికారులు కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లుగా కూడా విచారణలో భాగంగా వెల్లడవుతున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో సిట్ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇలా నయాం కిరాతకాలకు సంబంధించి సంచలన విషయాలు సిట్ అధికారులు విచారణలో బైటపడుతున్నాయి.

ఢిల్లీ సర్కార్ పై సుప్రీం ఆగ్రహం..

ఢిల్లీ : నగరంలో విజృంభిస్తోన్న డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధుల‌పై కేజ్రీవాల్ స‌ర్కారు చూపిస్తోన్న‌ తీరు దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానానికి ఆగ్ర‌హం తెప్పించింది. ఢిల్లీ స‌ర్కారు క‌న‌బ‌రుస్తోన్న నిర్ల‌క్ష్యంపై సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం ఇటీవ‌లే ఈ అంశంపై త‌మ‌కు నివేదిక ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఢిల్లీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల‌ను కూడా నిర్లక్ష్యం చేసింది. దీంతో కోర్టు ఉత్త‌ర్వుల‌ను ధిక్క‌రించినందుకు గానూ ఢిల్లీ ప్ర‌భుత్వానికి రూ.25 వేల జరిమాన విధిస్తున్న‌ట్లు తాజాగా పేర్కొంది.

అడ్వకేట్ దారుణహత్య..

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలోని హుస్సేనిఆలంలో దారుణ హత్య జరిగింది. ఓ భూ వివాదంలో లాయర్ ముజీబ్‌ను నిందితుడు మీర్జాబేగ్ హత్య చేసినట్లు స్థానికుల సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మిర్జాబేగ్ కోసం మూడు పోలీస్ టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

13:33 - October 3, 2016
13:32 - October 3, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని ఆమె అభిమానులు శూలాలతో గుచ్చుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. గత 13 రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్నారు. వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడం..ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడంతో అన్నాడీఎంకే నేతలు..కార్యకర్తలు..అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున్న అభిమానులు చేరుకుంటున్నారు. దీనితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరకు గవర్నర్ విద్యాసాగర్ రంగంలోకి దిగి ఆసుపత్రికి వెళ్లి జయలలితను పరామర్శించారు. ఆమె ఆరోగ్యం బాగనే ఉందని..కోలుకుంటున్నారని గవర్నర్ కార్యాలయం నుండి ఓ ప్రకటన వెలువడింది. అనంతరం వైద్యులు కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కానీ అభిమానులు..నేతలు..కార్యకర్తల్లో మాత్రం తీవ్ర అలజడి నెలకొంది. సోమవారం జయ సొంత నియోజకవర్గరమైన ఆర్కే నగర్ లో అభిమానులు పెద్ద ఎత్తున్న భారీ ర్యాలీ నిర్వహించారు. శూలాలను గుచ్చుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకటన విడుదల చేస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

13:27 - October 3, 2016

హైదరాబాద్ : తాగి నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం..లైసెన్స్ రద్దు చేస్తాం..అంటూ ఘటన జరిగిన అనంతరం అధికారులు హడావుడి చేస్తుంటారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటాం..అని హామీలు గుప్పిస్తుంటారు. కానీ ఇవన్నీ ఉట్టివేనని మరోసారి తేలిపోయింది. తాగుబోతుల నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ తో చిన్నారి రమ్య కుటుంబం బలైపోయిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ మండలం పెద్ద అంబర్ పేట వద్ద సోమవారం తెల్లవారుజామున శ్రీదేవి తన కూతురు సంజన (5)తో రోడ్డు దాటుతోంది. అదే సమయంలో వేగంగా వస్తున్న కారు ఢీకొంది. దీనితో తల్లికూతురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. సంజన బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు తెలుస్తోంది. శ్రీదేవి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలివెళ్లిపోయారు. కారులో మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు. యువకులు పోలీసుల ఎదుట లొంగిపోయారా ? వీరు మద్యం సేవించారా ? ఎక్కడ తాగారు ? డ్రైవింగ్ చేసింది ఎవరు ? తదితర అంశాలు తెలియాల్సి ఉంది. 

13:16 - October 3, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాలపై సీఎం కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. దసరా నుండే కొత్త జిల్లాల అమల్లోకి వస్తాయని గతంలో ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కానీ తమ ప్రాంతాలు జిల్లాలు చేయాలని పలు డిమాండ్స్..ఆందోళన..ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు..కీలక నేతలతో భేటీ కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. పార్టీ క్యాడర్ ను ముందుగా సన్నద్ధం చేసి ప్రజల్లోకి పంపాలని కేసీఆర్ భావించారు. ఈ నేపథ్యంలో ఈ భేటీలు జరుగుతున్నాయి. సోమవారం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేస్తారని తొలుత ప్రచారం జరిగినా ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో సిరిసిల్ల పేరు లేకపోవడంతో జిల్లా వాసులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లను జిల్లా చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఒకానొక సమయంలో మంత్రి కేటీఆర్ ను అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు సహకరిస్తానని ఆయన హామీనిచ్చారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకుని ముందుకు వెళ్లాలని కేసీఆర్ దిశా..నిర్ధేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ఉద్యమశ్రేణులను బుజ్జగించే పనిని టీఆర్ఎస్ శ్రేణులకు అప్పగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలతో మధ్యాహ్నం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక్కడ కూడా పలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. జనగామ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..ఆందోళనలు సద్దుమణుగుతాయో వేచి చూడాలి. 

కర్నాటకకు సుప్రీం అల్టిమేటం..

ఢిల్లీ : కావేరి నదీ జలాలపై కర్నాటకు సుప్రీం అల్టిమేటం జారీ చేసింది. ఇప్పటివరకూ తమిళనాడుకు ఎంత నీరు వదిలారు? అసలు వదిలారా? లేదా అన్న విషయాన్ని మంగళవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా తెలియజేయాలని న్యాయమూర్తి డెడ్ లైన్ విధించారు. తమ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించింది.

722 నిర్మాణాలు కూల్చివేశాం - జీహెచ్ఎంసీ కమిషనర్..

హైదరాబాద్ : రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో మేయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. నాలాలు, చెరువులపై అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు ప్రతి రోజు ఉదయం 8 నుండి 12గంటల వరకు అధ్యయనం చేయాలని, పేదలకు సంబంధించి నిర్మాణాలు ఉంటే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, నష్టపరిహారం కల్పిస్తామని కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 722 నిర్మాణాలు కూల్చివేయడం జరిగిందని, నాలా, చెరువులపై 348 నిర్మాణాలున్నాయన్నారు. 

ఎమ్మెల్యే వంశీచంద్ దీక్ష..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి దీక్ష చేపట్టారు. కల్వకుర్తిని రెవిన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ తో ఈ దీక్ష చేపట్టారు. దీక్షకు అఖిలపక్షం నేతలు సంఘీభావం ప్రకటించారు. జానారెడ్డి, రేవంత్ రెడ్డి, బీజేపీ నేత పి.ఆచారి మద్దతు పలికారు.

 

తల్లీకూతురిని ఢీకొన్న కారు..

రంగారెడ్డి : హయత్ నగర్ మండలం పెద్ద అంబర్ పేట వద్ద రోడ్డు దాటుతున్న తల్లీకూతుళ్లను కారు ఢీకొంది. తల్లీకూతురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వీరిలో చిన్నారి సంజన (5) పరిస్థితి విషమంగా ఉంది. మద్యం సేవించి యువకుడు కారు నడిపినట్లు తెలుస్తోంది. 

నయీం కేసులో సిట్ అదుపులో డీఎస్పీ, టీఆర్ఎస్ నేత..

హైదరాబాద్ : నయీం కేసులో మరో ఇద్దరిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నేత చింతల వెంకటేశ్వరరెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డిని సిట్ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.

 

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..

తూర్పుగోదావరి : కాకినాడ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దళిత సంఘాలు, వామపక్షాలు ఆందోళన నిర్వహించాయి. పోలీసులు జరిపిన లాఠీ చార్జీలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బేబీరాణి తలకు తీవ్రగాయమైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 

బాబును కలిసిన కేంద్ర మంత్రి దత్తన్న..

హైదరాబాద్ : లేక్ వ్యూలో సీఎం చంద్రబాబును కేంద్ర మంత్రి దత్తాత్రేయ కలిశారు. తన కూతురు వివాహానికి చంద్రబాబును దత్తన్న ఆహ్వానించారు. 

కరీంనగర్ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : సచివాలయంలో కరీంనగర్ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. 

12:31 - October 3, 2016
12:24 - October 3, 2016

విజయవాడ : టిడిపి, బిజెపి వివాదాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. తమకు సరియైన ప్రాధాన్యతివ్వడం లేదని కమల దళం పలు సందర్భాల్లో టిడిపిపై ఆగ్రహం వ్యక్త చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ బీజేపీ కార్యకర్తలు ఆందోళన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడనే ఉన్న ఇతర నేతలు సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ వారు ఏమాత్రం వినకుండా కార్యాలయంలో ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. టిడిపి పాలనలో ఉన్న ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవులు కూడా కేటాయించడం లేదని, దుర్గగుడి కార్యవర్గంలో బీజేపీకి చెందిన వారు ఎవరూ లేకపోవడం ఆగ్రహానికి ఒక కారణమని తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పార్టీ నేత ఉమా మహేశ్వరరావుతో కార్యకర్తలు చర్చించారు. సమస్యను బీజేపీ రాష్ట్ర నేతల దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అయినా కూడా కార్యకర్తలు శాంతించలేదు. 

విజయవాడ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

విజయవాడ : బీజేపీ నగర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయ అద్దాలు..ఫర్నీచర్ ను కార్యకర్తలు ధ్వసం చేశారు. కార్యాలయాలోకి వెళ్లేందుకు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో కార్యకర్తలు కార్యాలయం ఎదుట బైఠాయించారు. టిడిపి ప్రభుత్వం తమకు ప్రాధాన్యతనివ్వడం లేదని, టిడిపి మిత్రధర్మం పాటించడం లేదని కార్యకర్తలు పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీకి ప్రాధాన్యతనివ్వడం లేదని విమర్శించారు.న 

12:14 - October 3, 2016

దంతెవాడ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు..

ఛత్తీస్ గఢ్ : దంతెవాడ జిల్లా మునగ, చిక్పాల్ వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. ఎస్డీఎఫ్ కోబ్రా, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్శహిస్తున్నాయి. అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. 

జయకు కొనసాగుతున్న చికిత్స..

తమిళనాడు : రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స కొనసాగుతోంది. సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

కివీస్ 55/0..

కోల్ కతా : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్ 31, మార్టిన్ గప్తిల్ 24 పరుగులు చేశారు. విజయానికి కివీస్ 321 పరుగులు చేయాల్సి ఉంది. 

11:30 - October 3, 2016
11:28 - October 3, 2016

గుంటూరు : ఏపీ పాలన ఇక అమరావతి నుండి కొనసాగనుంది. గుంటూరు జిల్లాలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని ఏపీ ప్రభుత్వం నిర్మించన సంగతి తెలిసిందే. దాదాపు 33 శాఖ ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధులు నిర్వహించనునున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆర్థిక, మున్సిపల్‌ శాఖల ఉద్యోగులు వెలగపూడికి చేరుకున్నారు. వీరికి సిబ్బంది స్వాగతం పలికారు. రాజధాని అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ పాలన కొనసాగుతుందని ఉద్యోగ సంఘ నేతలు పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో పరిపాలనా కార్యక్రమాలు కొనసాగించేందుకు మాత్రం ఇంకా వారం రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అసెంబ్లీ భవనం వద్ద స్పీకర్ కోడెల..
వెలగపూడి నిర్మాణంలో ఉన్న అసెంబ్లీ భవనానికి స్పీకర్ కోడెల చేరుకున్నారు. అసెంబ్లీ భవనాన్ని పరిశీలించి సమావేశాల నిర్వాహణ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఈ సందర్భంగా కోడెల మీడియాకు తెలిపారు. వెలగపూడికి తరలివచ్చిన ఉద్యోగులకు కోడెల శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నుండి వెలగపూడి సచివాలయం నుండి పూర్తి పాలన జరగబోతోందని, ఇందుకు ఉద్యోగులను అభినందిస్తున్నట్లు తెలిపారు. మెరుగైన పాలన అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. తక్కువ కాలంలో ఐదు బ్లాక్ ల నిర్మాణం జరిగిందని, కొన్ని ఇబ్బందులుంటాయన్నారు.

సమస్యలను అధిగమించి పాలన – యనమల..
వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి ఏపీ ఆర్థిక మంత్రి యనమల చేరుకున్నారు. ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యనమల మీడియాతో మాట్లాడారు. ప్రధాన శాఖ అధికారులు వెలగపూడికి చేరుకున్నారని, సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సమస్యలను అధిగమించి పాలన చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండేందుకే అమరావతి నుండి పాలన అందిస్తున్నట్లు యనమల పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:12 - October 3, 2016

జమ్మూ కాశ్మీర్ : ఓ వైపు కాల్పుల విరమణ ఉల్లంఘన..మరోవైపు శాంతిమంత్రం..ఇది పాకిస్తాన్ వ్యవహార శైలి. గత కొంతకాలంగా భారత్ - పాక్ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకొంటోంది. ఉగ్రవాదులు భారత బలగాలపై దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు పాక్ కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. తాజాగా పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్ధార్ అజిత్ శాంతిమత్రం జపించారు. సోమవారం భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కు ఫోన్ చేశారు.

బారాముల్లాలో ఉగ్ర దాడి..
జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా శివారులో ఉన్న సైనిక శిబిరంపై ఆత్మాహుతి దళం దాడికి పాల్పడింది. ఆదివారం రాత్రి 10.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడింది నలుగురు నుండి ఏడుగురు ఉగ్రవాదులున్నట్లు సమాచారం. రెండు గ్రూపులుగా విడిపోయి వీరు సైనికులపైకి కాల్పులు జరిపారు. శిబిరానికి దగ్గరలో ఉన్న పార్క్ ద్వారా నలుగురు ఉగ్రవాదులు సైనిక శిబిరంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అయితే సైనికులు వారిని నియంత్రించారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను సైనికులు మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాను వీరమరణం పొందారు. మరో జవాన్‌కు గాయాలయ్యాయి. మరోవైపు పంజాబ్ గురుదాస్ పూర్ లోకి చొరబాటు దారులు ప్రవేశించారు. బీఎస్ఎఫ్ వీరిపై కాల్పులు జరిపారు. డొరంగ్లా ప్రాంతంలో అనుమానిత వ్యక్తుల కోసం గాలింపులు చేపడుతున్నారు.

పారికర్ సమీక్ష..
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై త్రివిధ దళాధిపతులతో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశం అనంతరం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ కు పారికర్ వివరించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి భేటీలకు సంబంధించిన వివరాలను రాజ్ నాథ్ వివరించనున్నారు. 

భారత్ - పాక్ సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత..

జమ్మూ కాశ్మీర్ : భారత్ - పాక్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. పంజాబ్ గురుదాస్ పూర్ లోకి చొరబాటు దారులు ప్రవేశించారు. బీఎస్ఎఫ్ వీరిపై కాల్పులు జరిపారు. డొరంగ్లా ప్రాంతంలో అనుమానిత వ్యక్తుల కోసం గాలింపులు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కు పాక్ భద్రత సలహాదారు సర్ధార్ అజిత్ ఫోన్ చేశారు. సరిహద్దులో ఉద్రిక్తత తగ్గిద్దామంటూ విజ్ఞప్తి చేశారు. మరోవైపు సరిహద్దు భద్రతపై త్రివిధ దళాధిపతులతో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశం అనంతరం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ కు పారికర్ వివరించనున్నారు.

యాదవ్ బ్రదర్స్ కు 25 ఏళ్ల జైలు..

ఢిల్లీ : నితీస్ కటారా హత్య కేసులో వికాస్ యాదవ్, విశాల్ యాదవ్ లకు సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేసింది. 25 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. 2002 ఫెబ్రవరి 17 ఢిల్లీలో పథకం ప్రకారం నితీష్ ను వీరు మర్డర్ చేశారు. అప్పటి నుండి కేసు కొనసాగుతూ వస్తోంది. 

కోడెలతో యనమల..చక్రపాణి సమావేశం..

గుంటూరు : ఏపీ స్పీకర్ కోడెల తో ఆర్థిక మంత్రి యనమల, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి సమావేశమయ్యారు. వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి డీజీపీ సాంబశివరావు కూడా హాజరయ్యారు. అసెంబ్లీ భవనాల నిర్మాణంపై చర్చిస్తున్నారు. 

వెలగపూడికి చేరుకున్న స్పీకర్ కోడెల..

గుంటూరు : వెలగపూడి నిర్మాణంలో ఉన్న అసెంబ్లీ భవనానికి స్పీకర్ కోడెల చేరుకున్నారు. అసెంబ్లీ భవనాన్ని పరిశీలించి సమావేశాల నిర్వాహణ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కోడెల తెలిపారు. వెలగపూడికి తరలివచ్చిన ఉద్యోగులకు కోడెల శుభాకాంక్షలు తెలిపారు. 

నీరు - ప్రగతిపై సీఎం బాబు టెలికాన్ఫరెన్స్..

విజయవాడ : నీరు - ప్రగతిపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటికీ ఆరు శాతం లోటు వర్షపాతం ఉందని, భూగర్భ జలాలు గతంలో కన్నా రెండు మీటర్లు పెరిగినట్లు బాబు తెలిపారు. ఇప్పటి వరకు 1.05 లక్షల పంట కుంటలు తవ్వినట్లు, ఇంకా 6 లక్షల పంట కుంటలు తవ్వాల్సి ఉందన్నారు. ఆర్డీవోలకు పాలనా పగ్గాలు అప్పగించడం సంస్కరణలో భాగమన్నారు. 

న్యూజిలాండ్ విజయలక్ష్యం 376 పరుగులు...

కోల్ కతా : న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ 376 పరుగులు చేయాల్సి ఉంది. 

వెలగపూడిలో ఏపీ ఉద్యోగులు..

గుంటూరు : ఏపీకి చెందిన ఉద్యోగులను సచివాలయానికి తీసుకెళ్లేందుకు పది బస్సులను అధికారులు సిద్ధం చేశారు. నేటి నుండి వెలగపూడి సచివాలయం రెండో బ్లాక్ లో ఆర్థిక, రెవెన్యూ, మున్సిపల్ శాఖ కార్యాకలాపాలు ప్రారంభం కానున్నాయి. 

10:32 - October 3, 2016
10:31 - October 3, 2016
10:23 - October 3, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 ఆసుపత్రులు సేవలు నిలిపివేశాయి. రూ. 430 కోట్లు చెల్లించాల్సిందేనని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం మంత్రి లక్ష్మారెడ్డితో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నోటీసు ఇవ్వకుండా సేవలను నిలిపివేయవద్దని మంత్రి సూచించారు. గతంలో కూడా సేవలు నిలిపివేయడంతో ప్రభుత్వం చర్చలు జరిపిందని, రూ. 100 కోట్లు విడుదల చేస్తామని..మిగతా విడతలవారీగా చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొని మాట తప్పిందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వ హామీతో తాము గతంలో సేవలు కొనసాగించామని, ఈసారి మాత్రం తమ డిమాండ్లు తీర్చాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే రూ. 430 కోట్లు విడుదల చేయాలని..ఎంవోయూ ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలని..టారిఫ్ ఛార్జీల్లో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

10:16 - October 3, 2016

వరంగల్ : జిల్లాను ఎన్ని జిల్లాలుగా చేయాలనే దానిపై మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా జిల్లాను ఐదు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకేతాలు పంపారు. వరంగల్..హన్మకొండ జిల్లాలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలనే దానిపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ ను డిప్యూటి సీఎం కడియం, ఎర్రబెల్లి, రాజయ్య, కొండా దంపతులు, పెద్ది సుదర్శన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలువనున్నారు. భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ కు మధ్యాహ్నం ఏకగ్రీవంగా విన్నవించనున్నారు. 

వరంగల్ ఐదు జిల్లాలు..

వరంగల్ : జిల్లాను ఐదు జిల్లాలుగా విడగొట్టేందుకు కలెక్టర్ కు సీఎం కేసీఆర్ సంకేతాలు పంపారు. జనగామ జిల్లా ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ను కడియం, ఎర్రబెల్లి, రాజయ్య, కొండా దంపతులు, పెద్ది సుదర్శన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలువనున్నారు. భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల ఏర్పాటుపై మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కు ఏకగ్రీవంగా విన్నవించనున్నారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం సృష్టించాయి. లక్నో వెళుతున్న ప్రయాణీకుడి నుండి మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

 

నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. రూ. 430 కోట్ల బకాయిలను చెల్లించాలంటూ 130 ప్రైవేటు ఆసుపత్రులు సేవలను నిలిపివేశాయి. రెండు రోజుల క్రితం మంత్రి లక్ష్మారెడ్డితో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఎంవోయూ ప్రకారం నడుచుకోవాలని..టారిఫ్ ఛార్జీలు పెంచి బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సేవలు అందుకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 

09:30 - October 3, 2016

హైదరాబాద్ : నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ? కూల్చివేసే సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటీ ? ఎలాంటి ఇబ్బందులు రాకుండా అక్రమ నిర్మాణాలపై కొరఢా జులిపించాలనే దానిపై జీహెచ్ఎంసీ కమిషనర్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్జ జనార్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. నాలాలు, చెరువుల అక్రమణలు, ఆక్రమ నిర్మాణాల గుర్తింపుపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల తహశీల్దార్లు..సర్వేయర్లు..ఇరిగేషన్ ఇంజనీర్లు..జోనల్, డిప్యూటి కమిషనర్లు..టౌన్ ప్లానింగ్ అధికారులు హాజరయ్యారు. అక్రమ నిర్మాణాలను పక్కాగా గుర్తించి నోటీసులిచ్చేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ సందర్భంగా ఓ అధికారి టెన్ టివితో మాట్లాడారు. తొలుత హైదరాబాద్ జిల్లా అధికారులతో చర్చించడం జరిగిందని, మొత్తం 72 నాలాలున్నాయన్నారు. ఇందుకు జాయింట్ టీమ్స్ వేసి ప్రతి నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించాలని, ఇందుకు సంబంధించిన కార్యచరణను ఇవ్వడం జరిగిందన్నారు. బీపీఎల్ కు దిగువన ఉన్న వారా ? బీపీఎల్ కు ఎగువన ఉన్నవారా ? కమర్షియల్..గృహ సముదాయమా ? ఇలా అనేక అంశాలను అందులో చేర్చడం జరిగిందన్నారు. ఈ సమావేశం అనంతరం రంగారెడ్డి జిల్లాపై చర్చించడం జరుగుతుందన్నారు. 

అక్రమ నిర్మాణాలపై అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ సమావేశం..

హైదరాబాద్ : రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ భేటీ అయ్యారు. నాలాలు, చెరువుల అక్రమణలు, ఆక్రమ నిర్మాణాల గుర్తింపుపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల తహశీల్దార్లు..సర్వేయర్లు..ఇరిగేషన్ ఇంజనీర్లు..జోనల్, డిప్యూటి కమిషనర్లు..టౌన్ ప్లానింగ్ అధికారులు హాజరయ్యారు. అక్రమ నిర్మాణాలను పక్కాగా గుర్తించి నోటీసులిచ్చేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 

09:15 - October 3, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత 12 రోజులుగా ఆమె చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వైద్యానికి సహకరిస్తున్నారు..కోలుకుంటున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చెన్నైకు వస్తున్నారనే సమాచారం వస్తోంది. జయకు అత్యంత సన్నిహితురాలు శశికళ సూచనలతోనే వీరంతా చెన్నైకి వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

అనేక సందేహాలు..
 వీరంతా ఎందుకు చెన్నైకి వస్తున్నారనే దానిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈనెలాఖరున స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతుడడం..అత్యధిక స్థానాలు ఎలా కైవసం చేసుకోవాలనే దానిపై వీరు చర్చించబోతున్నారా ? పార్టీలో నిస్తేజం ఉందా ? సీఎం జయ ఆసుపత్రి పాలు కావడంతో పాలన స్తంభిస్తోందని డీఎంకే ఆరోపణలు చేస్తుండడం..జయ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈనెల పదో తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థిస్తుందా ? మరలా జయకు జైలుకు వెళుతారా ? ఇలాంటివి అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. జయ ఆరోగ్యంపై ఉత్కంఠ ఎప్పుడు వీడుతుందో వేచి చూడాలి. 

09:07 - October 3, 2016

జమ్మూ కాశ్మీర్ : ఉరి ఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత మరోసారి ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. భారత సైనిక శిబిరాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. తాజాగా బారాముల్లాలోని ఆర్మీ క్యాంప్ పై నలుగురు ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. శిబిరానికి దగ్గరలో ఉన్న పార్క్ ద్వారా నలుగురు ఉగ్రవాదులు సైనిక శిబిరంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అయితే సైనికులు వారిని నియంత్రించారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను సైనికులు మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాను వీరమరణం పొందారు. మరో జవాన్‌కు గాయాలయ్యాయి. ఉరి ఘటన జరిగిన 15 రోజులకే మళ్లీ ఉగ్రదాడులు జరగడంతో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
దాడికి సంబంధించిన వివరాలను ఆర్మీ అధికారులు మీడియాకు తెలియచేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఉగ్రవాదులు జరిపే దాడిపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా తీశారు. కాసేపట్లో కీలక సమావేశంలో రాజ్ నాథ్ ఆర్మీ అధికారులతో చర్చించనున్నారు. పాక్ నుండి సైనిక చర్యలు మొదలు కావడంపై వీరు చర్చించే అవకాశం ఉంది. 

09:02 - October 3, 2016

లవంగాలు..ఔషధం. దీనిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచింది. అలాగే లవంగ నూనె చర్మ ఆరోగ్యానికి ఎంతగానే దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మరి లవంగ నూనెను వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయి.
శరీరంపై గాయాలు వల్ల కలిగే మచ్చలను లవంగ నూనె తొలగిస్తుంది. అలాగే మొటిమలను కూడా తొలగించే సామర్థ్యం ఈ నూనెకు ఉంటుంది. ఒక రసాయనిక పొరలా ఏర్పడి మచ్చలను తొలగించేస్తుంది.
జుట్టు రంగు మారడం..వెంట్రుకలు తెగిపోవడం వంటి సమస్యలున్న వారు లవంగ నూనె వాడడం చాలా మంచిది. జుట్టు మొదళ్లకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. జుట్టు సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది.
లవంగాల నూనె వాడకం వల్ల బ్లాక్ హెడ్స్..వైట్ హెడ్స్ వంటి ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.
కొబ్బరి నూనె, లవంగాల నూనె కలిపిన మిశ్రమాన్ని తలకు రాసుకోవాలి. మెల్లిగా మసాజ్ చేయాలి. రెండు గంటల అనంతరం తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 

08:37 - October 3, 2016

నెల్లూరు : రియో ఒలింపిక్ స్టార్ పివి సింధును నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఆమెకు వెండి రాకెట్‌ను.. కోచ్‌ గోపిచంద్‌కు రోలెక్స్ వాచ్‌ను పోర్టు ఎండీ శశిధర్ బహుకరించారు. నెల్లూరులో అకాడమీ ఏర్పాటుకు గోపిచంద్‌కు సహకారం అందిస్తామని.. పోర్టులో సింధు పేరిట సింధువనం ఏర్పాటుచేశామని పోర్టు సీఈవో అనిల్‌ కుమార్ తెలిపారు. 

08:35 - October 3, 2016

హైదరాబాద్ : గుంటూరు జిల్లా వెలగపూడిలో సోమవారం నుండి పూర్తిస్థాయి పాలన ప్రారంభంకాబోతోంది. హైదరాబాద్‌నుంచి ఏపీ ఉద్యోగులు, అధికారులు వెలగపూడికి వెళ్లిపోయారు. నిన్న రాత్రి 75 మంది మహిళా ఉద్యోగులు ఏపీ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. గుంటూరు జిల్లా వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో దాదాపు 33 శాఖ ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధులు నిర్వహించబోతున్నారు. హైదరాబాద్‌ నుంచి చివరిగా తరలివస్తున్న ఆర్థిక, మున్సిపల్‌ శాఖల ఉద్యోగులకు ఘనంగా స్వాగతం పలికేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. 

08:34 - October 3, 2016

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ముఖమండపం వద్ద షార్ట్ సర్క్యూట్ తో వైర్లలో మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. నాసిరకం విద్యుత్ వైర్ల వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. క్యూ లైన్ లో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న భక్తులు కొంత భయాందోళనలకు గురయ్యారు. 

08:32 - October 3, 2016

ఢిల్లీ : ఉరి ఘటన తర్వాత భారత్ సైన్యం చేపట్టిన సర్జికల్‌ అటాక్స్‌తో పాకిస్తాన్‌ ప్రతికార చర్యలకు దిగుతోంది. తాజాగా భారత్‌ నుంచి పాకిస్తాన్‌ మీదుగా యూరప్‌, మధ్య ఆసియా దేశాలకు వెళ్లే విమానాలపై గగనతల ఆంక్షలు విధించింది. పాక్‌ గగనతలంపై తక్కువు ఎత్తులో ఎగిరేందుకు వీల్లేకుండా ఆ దేశం భారత విమానాలపై ఆంక్షలు పెట్టింది. మరోవైపు అ్రగరాజ్యం అమెరికా పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు ప్రపంచ దేశాల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. భారత్‌ సర్జికల్‌ దాడులతో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్‌ తాజాగా గగనతల ఆంక్షల్ని విధించింది. భారత్‌ నుంచి యూరప్‌, మధ్య ఆసియా దేశాలకు రాకపోకలు సాగించే విమానాలపై పాకిస్తాన్‌ ఆంక్షలు పెట్టింది. పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ మినహాయించి మిగతా అన్ని విమానాలు పాక్‌ గగన తలంపై తక్కువ ఎత్తులో ఎగిరే వీల్లేకుండా ఆ దేశం ఆంక్షలు పెట్టింది. మధ్య ఆసియా, యూరప్‌ దేశాలకు రాకపోకలు సాగించే విమానాలకు ఎప్పటినుంచో పాక్‌ ఎయిర్‌ కారిడార్‌పై విమానాలు ప్రయాణిస్తున్నాయి. తాజా ఆంక్షలతో విమానాలు మరింత ఎత్తులో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో అమెరికా, యూరప్‌, మధ్య ఆసియా దేశాలకు వెళ్లాల్సిన విమానాలకు అంతరాయం కలుగుతోంది.
మరోవైపు పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలన్న.. అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదనకు ప్రపంచ వ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాద ఘటనల వెనక పాక్‌ హస్తం ఉండటాన్ని అమెరికా ఎప్పటి నుంచో గమనిస్తూ వస్తోంది. తాజాగా ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలన్న వాదనకు అనేక దేశాల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది.   

గురుదాస్ పూర్ లో కాల్పులు..

పంజాబ్ : కాల్పుల ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తోంది. తాజాగా భారత్ - పాక్ సరిహద్దులోని గురుదాస్ పూర్ లో పాక్ బలగాలు కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 

08:08 - October 3, 2016

ఉభయగోదావరి జిల్లాల్లో ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ తీరంలో దివీస్ లాబరేటరీస్ వ్యతిరేక పోరాటం, తుందుర్రు పరిసరాల్లో ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం మహోధృతంగా సాగుతున్నాయి. ఈ రెండు పోరాటాల పట్ల ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం కఠిన వైఖరి అవలంభిస్తున్నాయి. ప్రభుత్వం కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్టును ప్రయోగిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), అల్జాపురి శ్రీనివాస్ (బీజేపీ), దినకర్ (టిడిపి), రామశర్మ (ఏపీ పీసీసీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

ఇంద్రకీలాద్రిపై తప్పిన ప్రమాదం..

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భక్తులకు ప్రమాదం తప్పింది. ముఖమండపం వద్ద షార్ట్ సర్క్యూట్ లో మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. నాసిరకం విద్యుత్ వైర్ల వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు..

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మగా దర్శనమిస్తున్నారు. 

ఎల్లంపల్లి ప్రాజెక్టులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు..

ఆదిలాబాద్ : ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 

తిరుమలలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు..

చిత్తూరు : తిరుమలలో నేటి నుండి శ్రీవార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నేటి నుండి 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా అన్ని ఆర్జీత సేవలను రద్దు చేశారు. స్వామి వారికి పట్టు వస్త్రాలను సీఎం చంద్రబాబు నాయుడు సమర్పించనున్నారు. 

అమరావతికి వెళ్లిన ఏపీ ఉద్యోగులు..

హైదరాబాద్ : సికింద్రాబాద్ నుండి ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో అమరావతికి ఏపీ ఉద్యోగులు తరలివెళ్లారు. స్వరాష్ట్రానికి తరలివెళ్లడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకుంటామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత సత్య సులోచన పేర్కొన్నారు. 

07:07 - October 3, 2016

పచ్చటి పొలాలతో కళకళలాడే ఉభయ గోదావరి జిల్లాలు ప్రజా ఉద్యమాలతో దద్దరిల్లుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఫుడ్ పార్క్ కి వ్యతిరేకంగానూ, తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ లాబొరేటరీస్ కి వ్యతిరేకంగానూ గ్రామాలకు గ్రామాలకు ఉద్యమిస్తున్నాయి. తమ ప్రాంతంలో నెలకొల్పుతున్న ఈ పరిశ్రమలను స్థానికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ పోరాటాలకు రైతు సంఘాలు, వామపక్షాలు ఎందుకు మద్దతిస్తున్నాయి? ఈ పరిశ్రమల ఏర్పాటు వల్ల స్థానికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేత నరసింహారావు విశ్లేషించారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

07:01 - October 3, 2016

తమ ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయంటే ఎవరైనా సంతోషిస్తారు. అయితే, ఆ పరిశ్రమల కారణంగా తమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని, జీవన ప్రమాణాలు పెరగాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే, ఒక్కొక్కసారి కొన్నికొన్ని పరిశ్రమలు ఉపాధి అవకాశాలు పెంచకపోగా, స్థానికంగా వున్న ఉపాధినే పోగొట్టే ప్రమాదం వుంటుంది. అలాంటి ప్రమాదం వున్నప్పుడు, ఆ పరిశ్రమ వల్ల జరిగే మేలు కంటే కీడు ఎక్కువైన్నప్పుడు సహజంగానే స్థానికులు వాటిని వ్యతిరేకిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇదే జరుగుతోంది. పర్యావరణ విధ్వంసం సృష్టించి, ఉన్న ఉపాధిని చెదరగొట్టే పరిశ్రమలు వద్దంటే వద్దంటూ అనేక గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్న దృశ్యం ఉభయ గోదావరి జిల్లాల్లో కనిపిస్తోంది.

కాకినాడ తీరంలో..
కాకినాడ తీరంలో దివీస్ లాబరేటరీస్ వ్యతిరేక పోరాటం, తుందుర్రు పరిసరాల్లో ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం మహోధృతంగా సాగుతున్నాయి. ఈ రెండు పోరాటాల పట్ల ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం కఠిన వైఖరి అవలంభిస్తున్నాయి. ఈ రెండు పరిశ్రమల కారణంగా స్థానికంగా కొన్ని వేల మంది ఉపాధి కోల్పోవడమే కాకుండా, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొంతకాలంగా ఉద్యమిస్తున్నారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీలు, మహిళా సంఘాల నేతలతో పాటు సిపిఎం అగ్రనేతలు ఆ ప్రాంతంలో పర్యటించి, బాధితులకు అండగా నిలుస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామా ? 
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తోంది. సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు ఆ ప్రాంత పర్యటనకు వచ్చిన్నప్పుడల్లా పోలీసులు అడగడుగునా అడ్డుకుంటున్న దృశ్యాలు టీవీలలో చూస్తూనే వున్నాం. ఈ నేపథ్యంలో మొన్న ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన మధు పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత వివాదస్పదమైంది. పొట్టలో తన్నుతూ, రోడ్డుపై ఈడ్చుకుంటూ వ్యాన్ లో విసిరేసి పోలీసు స్టేషన్ కు తరలించిన తీరు మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామా? అన్న అనుమానాన్ని కలిగిస్తోంది. ఆయనేమీ తీవ్రవాది కాదు. అభివృద్ధి నిరోధకుడూ కాదు. ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధికి బాటలు వేసే ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరాటాలలో క్రియాశీలకంగా పాల్గొంటున్న నేత. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో ప్రజా గొంతుక వినిపించిన నాయకుడు. అలాంటి అగ్రనేత పట్ల పోలీసులు ఇలా కక్ష కట్టినట్టు వ్యవహరించడం మంచి సంప్రదాయం కాదు. అది ప్రజాస్వామిక విలువలకే మాయని మచ్చ. అందుకే, మధుపై దాడిని నిరసిస్తూ అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.

శాంతియుతంగా..
కాకినాడ తీరంలోని తొండంగి మండలంలో స్థాపిస్తున్న దివీస్ లేబొరేటరీస్ ఉత్పత్తి కేంద్రం వల్ల ఆ ప్రాంతం కాలుష్య కాసారంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల 300 హేచరీలకు ముప్పు వాటిల్లడమే కాకుండా, పాతిక వేలమంది ఉపాధి ప్రశ్నార్ధకంగా మారుతుందన్న భయం స్థానికుల్లో వుంది. దీంతో పచ్చని పొలాల మధ్య మందుల పరిశ్రమ పెట్టొద్దంటూ స్థానికులు ఉద్యమిస్తున్నారు. పర్యావరణానికి హాని కలగని రీతిలో మరో ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు. శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమాల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

మెగా ఆక్వాఫుడ్..
పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు ప్రాంతంలో నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల కూడా పర్యావరణ సమస్యలు తెలెత్తుతాయన్నది స్థానికుల ఫిర్యాదు. ఈ మెగా ఫుడ్ పార్క్ కారణంగా 33 గ్రామాల ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయన్నది స్థానికుల ఆవేదన. ఈ ఆక్వాఫుడ్ పార్క్ నిర్మిస్తే, తుందుర్రుతో పాటు చుట్టు పక్కల 32 గ్రామాలు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి. అదంతా కాలుష్య ప్రాంతంగా మారిపోతుంది. తాగే నీళ్లు కలుషితమవుతాయి. పచ్చని పంట పొలాలు నాశనమవుతాయి. భూములన్నీ చౌడుబారిపోతాయి. ఈ ఫుడ్ పార్క్ లో వాడే కెమికల్స్ వల్ల గర్భవతులకు అనారోగ్య సమస్యలొస్తాయి. పుట్టే పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. ప్రజలు వ్యక్తం చేస్తున్న ఈ అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోకుండా, పోలీసుల సహకారంతో ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న తీరే తీవ్ర అభ్యంతరకరం.

06:41 - October 3, 2016

గుంటూరు : మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప కూడా దాటడం లేదు. ఓవైపు ఆస్పత్రుల పారిశుధ్య అధ్వాన్నస్థితి మారాలని అమాత్యులు గట్టిగా చెబుతుంటే.. మరోవైపు అధికారులు, సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇందుకు ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మనుషులు ఉండటానికి కూడా వీలులేని దుర్బర స్థితిలో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి ఉందని సాక్ష్యాత్తూ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని అన్నారంటే పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్క రిమ్స్ ఆస్పత్రిలోనే కాదు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల తీరు ఇలానే ఉంది. ఆస్పత్రుల్లో పారిశుధ్య చర్యలు పడకేశాయి. ముక్కుపుటలు ఆదిరేలా దుర్గంధం వెదజల్లుతున్నాయి.

నిర్లక్ష్యం..
పారిశుధ్యం, పరిశుభ్రత అంటూ ఆరోగ్య సూత్రాలు వల్లె వేసే వైద్యులు, వైద్యాధికారులు.. చెప్పేందుకే నీతులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని వైద్యాలయాలు చెత్తకుండీలను తలపిస్తున్నాయి. ఏ వార్డులోకి వెళ్లినా భరించలేని దుర్గంధం వెదజల్లుతున్నాయి. చెత్తా చెదారంతో రోగులకు స్వాగతం పలుకుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్దతిలో పారిశుధ్యచర్యలు నిర్వహిస్తున్నారు. డాక్టర్లు, వైద్యాధికారుల కార్యాలయాలు, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచి.. మిగతా వార్డులను శుభ్రపరచడంలో అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఉన్నతాధికారులకు నజరానాలు ముట్టజెప్పడం వల్లే వారు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

రోగుల అవస్థలు..
ఇక ఇన్ పేషెంట్‌ వార్డుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చినిగిన బెడ్లు, రక్తపు మరకలు, వాడిపాడేసిన గ్లూకోస్‌, రక్తం బాటిల్స్‌తో చెత్తకుండిని తలపిస్తున్నాయి. ఆస్పత్రుల్లోని అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి రోగులు, రోగుల బంధువులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక చిల్డ్రన్స్ వార్డుల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అపరిశుభ్ర పరిసరాల వల్ల చిన్నారులకు త్వరగా ఇన్‌ఫెక్షన్స్‌ సోకుతాయని వైద్యులకు తెలియంది కాదని..అయినా ఇవేవీ పట్టనట్లుగా విధులు నిర్వహిస్తున్నారని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. పేదోడికి పెద్దాస్పత్రులంటే కొండంత అండ అన్న పరిస్థితులు మారాయని..వచ్చిన రోగం తగ్గక పోగా కొత్త రోగాలు అంటుకోవడం ఖాయమని మండిపడుతున్నారు. 

06:38 - October 3, 2016

హైదరాబాద్ : పెట్టుబడి పెట్టారు..అంతా సవ్యంగానే సాగింది..పంపకాల్లో తేడాలు ముగ్గురు మిత్రుల మధ్య వైరానికి దారితీసింది. సెటిల్‌మెంట్‌ చేసుకుందామనుకున్న వారి మధ్య మాటా మాటా పెరిగింది.. బలవంతంగా సంతకం చేయించేందుకు గన్‌తో బెదిరించాడో పార్ట్‌నర్‌. తేరుకున్న మరో పార్ట్‌నర్‌ చాకచక్యంగా వ్యవహరించి అతడిని పోలీసులకు పట్టించాడు. నగరం నడిబొడ్డున జరిగిన ఈ వ్యవహారం కలకలం రేపింది. హైదరాబాద్‌ నారాయణగూడలో ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ వ్యవహారం అలజడి రేపింది. ఓ రెస్టారెంట్‌లో ముగ్గురు మిత్రుల మధ్య జరిగిన గొడవ తీవ్ర సంచలనం రేపింది. ఓ మాజీ మంత్రి పీఏగా పనిచేసిన మూర్తి, దీపక్‌రావు, కాంగ్రెస్‌ నేత ఆనందరావు మధ్య మాటమాట పెరిగింది. దీంతో తన మాట వినలేదని ఆవేశానికి గురైన ఆనంద్‌రావును దీపక్‌రావు గన్‌తో బెదిరించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాసేపు అక్కడ ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది.

నారాయణగూడలో గన్‌తో వార్నింగ్‌..
మూర్తి, దీపక్‌రావు, ఆనందరావు ముగ్గురూ కలిసి కోటి 30 లక్షల పెట్టుబడితో షేక్‌పేటలో 3000 గజాల స్థలం కొనుగోలు చేశారు. ఈ స్థలం తమదని hmda అధికారులు చెప్పడంతో..విక్రయించేందుకు విఫలయత్నం చేశారు. ఆ తర్వాత స్థల పంపకం విషయంలో ముగ్గురి మధ్య విబేధాలు తలెత్తాయి. తేడాలు రావడంతో గొడవ చినికి చినికి గాలివానలా మారింది. ఈ క్రమంలో నారాయణగూడలోని ఓ రెస్టారెంట్‌లో సెటిల్‌మెంట్‌ చేసుకుందామని మూర్తి, ఆనందరావులను దీపక్‌రావు పిలిపించాడు. స్టాంప్‌ పేపర్లపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి తేవడంతో ఆనందరావు అందుకు నిరాకరించాడు. దీంతో దీపక్‌రావు ఆనందరావును గన్‌తో బెదిరించాడు. అతనితో ప్రతిఘటించిన ఆనందరావు స్థానికుల సాయంతో నిందితుడిని నారాయణగూడ పోలీసులకు అప్పగించాడు.

భూ పంపకంలో ముగ్గురి మధ్య తేడాలు..
మరోవైపు మూర్తి బినామీ దీపక్‌రావు అని ఆనందరావు ఆరోపిస్తున్నాడు. ఇద్దరు కలిసే ఈ కుట్రకు పాల్పడ్డారని చెబుతున్నాడు. వీరినుంచి తనకు ప్రాణహాని ఉందంటున్నాడు. ఏదీ ఏమైనా మొన్న డాక్టర్ల మధ్య కాల్పుల ఘటనకు.. ఇప్పుడు ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ గొడవలో గన్‌ వార్నింగ్‌కు హిమాయత్‌ నగర్‌ వేదిక కావడం గమనార్హం. ఇది కాకతాళియమా లేక హిమాయత్‌ నగర్‌ సెటిల్‌మెంట్‌ గొడవలకు అడ్డాగా మారిందా అన్న విషయాన్ని తేల్చాల్సింది పోలీసులే.

06:35 - October 3, 2016

హైదరాబాద్ : గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ పూర్తి స్థాయి పాలన ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు 33 శాఖ ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధులు నిర్వహించనునున్నారు. హైదరాబాద్‌ నుంచి చివరిగా తరలివస్తున్న ఆర్థిక, మున్సిపల్‌ శాఖల ఉద్యోగులకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే పని చేస్తున్న సిబ్బంది ఏర్పాట్లు చేశారు. రాజధాని అమరావతి కేంద్రంగా ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్‌ పాలన కొనసాగుతుంది. గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం నుంచి పూర్తి స్థాయిలో పరిపాలనా కార్యక్రమాలు కొనసాగించేందుకు ఉద్యోగులు, అధికారులు, పాలకులు సిద్ధమయ్యారు. పాలన సజావుగా సాగేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

స్వాగత ద్వారాలు, బ్యానర్ల ఏర్పాటు..
ఇప్పటికే చాలా శాఖ ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి వెలగపూడి తరలివెళ్లారు. ఈ రోజు ఆర్థిక, మున్సిపల్‌తోపాటు మరికొన్ని శాఖ ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి వెలగపూడి వెళ్తున్నారు. వీరికి తెలంగాణ ఉద్యోగులు వీడ్కోలు పలకనున్నారు. వెలగపూడి చేరుకున్న తర్వాత తమ సహచరులు స్వాగతం పలుకుతారు. ఉత్సవ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాగత ద్వారాలు, బ్యానర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా వేదమత్రోచ్ఛారాలతో పూర్తి స్థాయి పాలనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు అనుగుణంగా కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి తరలించిన ఫైళ్లను తెలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీ ప్రజలకు మరింత చేరువకానున్న పాలన..
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో నిర్మిస్తున్న ఆరు భవనాల్లో ఐదు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొలువు తీరనున్న ఒకటో బ్లాక్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈనెల 11న విజయ దశమి సందర్భంగా చంద్రబాబునాయుడు చాంబర్‌లో ప్రవేశిస్తారు. ఇప్పటికే కొందరు మంత్రులు తమ చాంబర్లను ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన మంత్రులు చాంబర్లలో ప్రవేశించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మంత్రుల చాంబర్లకు అనుంబంధంగానే ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది కార్యాలయాలు ఏర్పాటు చేశారు. శాఖాధిపతుల కార్యాలయాలను ఇప్పటికే గుంటూరు, విజయవాడల్లో ప్రారంభించారు. సచివాలయం నుంచి కూడా పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానుండటంతో ప్రజలకు పాలన మరింత చేరువ అవుతుంది. సచివాలయలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అన్ని భవనాల్లో కూడా చీమి చిటుక్కుమన్నా ఇట్టే పసికట్టే ఆధునిక సీసీటీవీ కెమెరాలను బిగించారు. ప్రత్యేక భద్రతా దళం, పోలీసు పహారా ఏర్పాటు చేశారు.

వచ్చే బడ్జెట్‌ సమావేశాలు తప్పనిసరిగా ఏపీలోనే..
వెలగపూడిలోని సచివాలయానికి అనుబంధంగా నిర్మిస్తున్న శాసనసభ, శాసనమండలి భవనాలను డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. వీలుంటే అసెంబ్లీ, మండలి శీతాకాల సమావేశాలను ఏపీలోనే నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. లేకపోతే హైదరాబాద్‌లోనే నిర్వహించి... బడ్జెట్‌ భేటీని మాత్రం తప్పనిసరిగా తాత్కాలిక భవనాల్లోనే నిర్వహించాలన్న పట్టుదలతో ఏపీ ప్రభుత్వం ఉంది. మొత్తంమీద ఏపీ పాలన పూర్తిగా వెలగపూడి నుంచే ప్రారంభం కానుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

06:32 - October 3, 2016

హైదరాబాద్ : ప్రజల సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఐదు జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్‌ సమీక్షలు నిర్వహించారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల జిల్లాల ఏర్పాటు డిమాండ్‌పై కేకే అధ్యక్షతన హైపవర్‌ కమిటీని వేశారు. నాలుగైదు రోజుల్లో నివేదిక వచ్చిన అనంతరం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాల పునర్విభజనపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా పండుగ నుంచి కొత్త జిల్లా కేంద్రాల్లో పాలన నిర్వహించేందుకు అనుగుణంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జిల్లాల విభజనపై ముసాయిదా వెల్లడించిన ప్రభుత్వం తుది నిర్ణయం ఖరారు చేసేందుకు సమీక్షలు నిర్వహిస్తోంది. వివిధ జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాట్లపై వస్తున్న డిమాండ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఆదివారం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్‌ విడివిడిగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాలకు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు.

జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుపై సమీక్ష..
జిల్లాల వారిగా ఉన్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు ఇవ్వాలని ఆయా జిల్లాల నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు. గతంలో ప్రతిపాదించిన అంశాలకు చిన్నచిన్న మార్పులతో కొత్త ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు నేతలు అందచేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలు కొత్తగా ఏర్పడుతున్న శంషాబాద్‌లో విలీనం చేయాలని నేతలు ప్రతిపాదించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట మండలాలు వికారాబాద్ జిల్లాలో కలపాలని నేతలు ప్రతిపాదించారు. అలాగే దౌల్తాబాద్‌పై అభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. అయితే ఐదు జిల్లాలకు సంబంధించి తాజాగా సమర్పించిన ప్రతిపాదనలే తుది రూపు దిద్దుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లా నేతలు కూడా పలు మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. వికారాబాద్‌ జిల్లాకు అనంతగిరి అని, శంషాబాద్‌ జిల్లాకు రంగారెడ్డి అని పేరు పెట్టాలని మంత్రి మహేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. అలాగే చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మండలాలు శంషాబాద్‌ జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని 3 మండలాలు శంషాబాద్‌ జిల్లాలో కలపాలని గండేడు మండలాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలపాలని నేతలు ప్రతిపాదించారు. అలాగే నల్గొండ జిల్లాలో మద్దిరాల, నేరెడుకొమ్ము, మల్లారెడ్డి గూడెంలను మండలాలుగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను జిల్లా నేతలు కోరినట్లు సమాచారం. అలాగే సంస్ధాన్‌ నారాయణపూర్‌ మండలాన్ని యాదాద్రిలో విలీనం చేయాలని కోరారు.

దౌల్తాబాద్‌పై అభిప్రాయ సేకరణ చేయాలని విన్నపం..
కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాలో యుద్ధప్రాతిపదికన కార్యాలయాల్ని ఏర్పాటు చేసేలా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో ఏర్పాటయ్యే ప్రభుత్వ కార్యాలయాలకు భూ సేకరణ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ జిల్లా నేతలను ఆదేశించారు. పూర్తిగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే జిల్లాల పునర్విభజన జరుగుతుందని మరోసారి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తుదిరూపు ఇస్తున్నా..ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటూ అందుకు అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలుంటాయని సీఎం కేసీఆర్‌ సమీక్షలో తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే జిల్లాల విభజన..అందరికీ మంచి జరిగేలా ఉంటుందన్నారు కేసీఆర్‌. ఇక సోమవారంనాడు ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల నేతలతోనూ సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. 

06:29 - October 3, 2016

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. జయలలిత కోలుకుంటున్నారని నిన్న రాత్రి అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. అయితే ఎమ్మెల్యేలంతా చెన్నై రావాలని అన్నాడీఎంకే పార్టీ సమాచారమిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరు చెన్నై చేరుకుంటున్నారు. ఈ రోజు శశికళతో పాటు.. పార్టీ నేతలతో ఎమ్మెల్యేలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
గత 12 రోజులుగా ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు మరలా ఆదివారం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. దీనితో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జయ కోలుకోవాలని ఆసుపత్రి వద్ద పూజలు చేస్తున్నారు. జయను పరామార్శిచేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. దీనితో పోలీసులు ఆసుపత్రి ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

06:26 - October 3, 2016

ఢిల్లీ : ఉగ్రవాద దాడులకు జరిగిన కుట్రను ఎన్‌ఐఏ భగ్నం చేసింది. తెలంగాణ, కేరళ, ఢిల్లీ పోలీసుల సహకారంతో ఎన్‌ఐఏ అధికారులు కేరళలో ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేశారు. దక్షిణ భారతదేశంలో కొందరు ప్రముఖ వ్యక్తులను, కొన్ని ప్రముఖ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేందుకు వీరు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. మూడు నెలల నుంచి కేరళ నుంచి అదృశ్యమైన 21 మంది.. ఐసిస్‌లో చేరినట్లు తెలుస్తోంది. అరెస్టైనవారిలో మన్సీద్‌ అలియాస్‌ ఒమర్‌ అల్‌ హిందీ, అబూ బషీర్‌ అలియాస్‌ రషీద్‌, స్వాలీహ మొహమ్మద్‌ అలియాస్‌ యూసుఫ్‌, సఫ్వాన్‌పీ, జాసిం, రాంషద్‌లు ఉన్నట్లు గుర్తించారు. వీరిని ఈరోజు ఎర్నాకుళంలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. కేరళ, తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచిన అనంతరం మరింతగా విచారణ జరగనుంది.

06:24 - October 3, 2016

జమ్మూ కాశ్మీర్ : మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా శివారులో ఉన్న సైనిక శిబిరంపై ఆత్మాహుతి దళం దాడికి పాల్పడింది. రాత్రి 10.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడింది నలుగురు నుండి ఏడుగురు ఉగ్రవాదులున్నట్లు సమాచారం. రెండు గ్రూపులుగా విడిపోయి వీరు సైనికులపైకి కాల్పులు జరిపారు. శిబిరానికి దగ్గరలో ఉన్న పార్క్ ద్వారా నలుగురు ఉగ్రవాదులు సైనిక శిబిరంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అయితే సైనికులు వారిని నియంత్రించారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను సైనికులు మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాను వీరమరణం పొందారు. మరో జవాన్‌కు గాయాలయ్యాయి. ఉరి ఘటన జరిగిన 15 రోజులకే మళ్లీ ఉగ్రదాడులు జరగడంతో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. అదనపు భద్రతా దళాలను మోహరిస్తున్నారు. ఉగ్రవాదులు జీలం నది నుంచి దేశంలోకి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. తాజా పరిస్థితిని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు బిఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ వివరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి బీఎస్ఎస్ డీజీ, ఆర్మీకి సంబంధించిన అధికారులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. రాత్రి 10.30 నుండి జరిగిన కాల్పులు తెల్లవారుజామున 3.00గంటల వరకు కొనసాగాయి. 

అఖ్నూర్ లో ఉగ్రవాదుల దాడి..

జమ్మూ కాశ్మీర్ : మరోసారి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అఖ్నూర్ సెక్టార్ లో మరోసారి కాల్పులకు తెగబడింది. బారాముల్లా శివారులో ఉన్న ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. సైనిక శిబిరంపై నలుగురు ఉగ్రవాదులు దాడులు జరిపారు. రాత్రి 10.30గంటల నుండి కాల్పులు ప్రారంభమయ్యాయి. ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చగా ఎదురు కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ వీరమరణం పొందాడు. మరొకరికి గాయాలయ్యాయి. భద్రతా బలగాలు అప్రమత్తం కాగా అదనపు బలగాలు మోహరించాయి. 

నేడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్..

ఖమ్మం : తెలంగాణ శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక బరిలో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, జహీరాబాద్ కు చెందిన మహ్మద్ ఫరీదుద్దీన్ సోమవారం ఒంటి గంటకు నామినేషన్ వేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. 

ఉగ్రవాదుల కుట్ర భగ్నం..

అక్నూర్ : ఉగ్రవాద దాడుల కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) భగ్నం చేసింది. తెలంగాణ, ఢిల్లీ పోలీసుల సహకారంతో ఎన్‌ఐఏ అధికారులు కేరళలో ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. దక్షిణ భారతదేశంలో కొందరు ప్రముఖ వ్యక్తులను, కొన్ని ప్రముఖ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడేందుకు వీరు కుట్ర పన్నినట్టు ఎన్‌ఐఏ తెలిపింది. 

వాఘా సరిహద్దు వద్ద ఉద్రిక్తత..

పంజాబ్ : భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన వాఘా సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 'బీటింగ్ రిట్రీట్' సమయంలో పాకిస్థాన్ వాసులు భారత్ వైపు రాళ్లు రువ్వారు. ప్రతిరోజూ సాయంత్రం వాఘా సరిహద్దు వద్ద 'బీటింగ్ రిట్రీట్' నిర్వహిస్తుంటారు. 

లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు..

ఛత్తీస్ గఢ్ : బీజాపూర్ లో 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళా మావోయిస్టులున్నారు.

నేడు క్రీడలపై సమీక్ష..

న్యూఢిల్లీ : భారత క్రీడా పాలసీపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయెల్ తో అథ్లెటిక్స్ కోచ్, ద్రోణాచార్య నాగపురి రమేశ్, బ్యాడ్మింటెన్ చీప్ కోచ్ పుల్లెల గోపీచంద్ సోమవారం భేటీ కానున్నారు. 

భారత్ 339 పరుగుల భారీ అధిక్యం..

కోల్ కతా : మూడు టెస్టుల సిరీస్ ను మరో టెస్టు మిగిలి ఉండగానే దక్కించుకొనేందుకు భారత్ సిద్ధమైంది. పర్యాటక న్యూజిలాండ్ పదునైన పేస్ బౌలింగ్ ను చీల్చిచెండాడుతూ రెండో టెస్టుపై టీమిండియా మరింత పట్టు బిగించింది. మూడో రోజు ఆటలో కోహ్లీ సేన ప్రస్తుతం 339 పరుగుల భారీ అధిక్యంతో దూసుకెళుతోంది. 

Don't Miss