Activities calendar

04 October 2016

సిద్దిపేటలో పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : సిద్దిపేటలో పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ పోలీస్‌శాఖను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయాలకున్న కరీంనగర్‌, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్లతో పాటు సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌కు సంబంధించి కూడా ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల ప్రారంభ కార్యక్రమంలో తాను పాల్గొంటానని ముఖ్యమంత్రి తెలిపారు. 

కొత్త జిల్లాల్లో కార్యాలయాలపై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి జిల్లా కేంద్రంలో మొదటి రోజు నుంచే కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలు పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే మండలాల్లో కూడా పోలీస్‌స్టేషన్లు, మండల రెవెన్యూ కార్యాలయాలు పనిచేయాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చేపట్టాల్సిన అధికారిక కసరత్తుపై క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

21:55 - October 4, 2016

ఢిల్లీ : స్టాక్‌హోమ్‌లోని రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ 2016కు గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డును ప్రక‌టించింది. బ్రిటన్‌ సంతతికి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు డేవిడ్‌ థౌలెస్‌, డుంకన్‌ హాల్డెన్‌, మైఖేల్‌ కోస్టెర్‌లిట్జ్‌లకు ఈ అత్యున్నత గౌరవం దక్కింది. ప‌దార్థానికి సంబంధించిన అసాధార‌ణ ద‌శ‌ల‌ను వెలికి తీయ‌డంలో చేసిన అధ్యయ‌నానికి గాను డేవిడ్ జె.థౌలెస్‌, డంక‌న్ ఎం.హాల్డెన్, మైకేల్ కోస్టెర్లిట్జ్‌ల‌కు ప్రతిష్టాత్మక నోబెల్‌ భౌతికశాస్త్ర పురస్కారం వరించింది. అత్యాధునిక గ‌ణిత‌శాస్త్ర ప‌ద్ధతులు ఉప‌యోగించి ప‌దార్థానికి చెందిన సూప‌ర్ కండక్టర్స్‌, సూప‌ర్ ఫ్లూయిడ్స్‌లాంటి అసాధార‌ణ ద‌శ‌లపై అధ్యయ‌నం చేశార‌ని క‌మిటీ తెలిపింది. 82 ఏళ్ల థౌలెస్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ కాగా... 65 ఏళ్ల హల్డానే న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌ వర్సిటీలో ప్రొఫెసర్‌. 73 ఏళ్ల కోస్టెర్‌లిట్జ్‌ రోడ్‌ ఐలాండ్‌లోని బ్రౌన్‌ యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. 

21:53 - October 4, 2016

హైదరాబాద్‌ : చిక్కడపల్లి త్యాగరాయగానసభలో పుస్తకావిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. పుస్తకావిష్కరణ కార్యక్రమం  జరుగుతుండగానే..సభలో ఒక్కసారిగా అలజడి రేగింది. రచయిత్రితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో సభలో అందరూ చూస్తుండగానే భర్తపై మొదటి భార్య దాడికి పాల్పడింది. మొదటి భార్య బంధువులు కూడా దాడికి పాల్పడడంతో..సభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

 

21:51 - October 4, 2016

హైదరాబాద్ : తెలంగాణలో సామాజిక, సమగ్ర అభివృద్ధికై సీపీఎం మహాజన పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 17 నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఐదు నెలల పాటు నాలుగు వేల కిలోమీటర్లు సాగనుంది. ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలతో అభివృద్ధి సాధ్యం కాదని ..సీపీఎం ప్రత్యామ్నాయ ముసాయిదాను ప్రజల ముందుకు ఈ యాత్ర ద్వారా తీసుకు వెళ్లనుంది. తొమ్మిది మంది ప్రధాన టీమ్‌తో ఈ యాత్ర జరుగుతుంది. 
ఈ నెల 17న ఇబ్రహీంపట్నంలో ప్రారంభం 
తెలంగాణలో సామాజిక, సమగ్ర అభివృద్ధి కోసం సీపీఎం మహాజన పాదయాత్రకు సిద్ధమైంది. ఈ నెల 17వ తేదీన ఇబ్రహీంపట్నంలో ఈ యాత్రను అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌ ప్రారంభించనున్నారు. ఐదు నెలల పాటు నాలుగు వేల కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగనుంది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో.. తొమ్మిది మంది ప్రధాన టీమ్‌తో ఈ యాత్ర కొనసాగుతుంది. 
కార్పొరేట్ విధానాలతో అభివృద్ధి సాధ్యం : రాఘవులు 
కార్పొరేట్ విధానాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని.. ఈ విధానాలతో అభివృద్ధి సాధ్యం కాదని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు . ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ వర్గాల వారు 92 శాతం రాష్ట్రంలో ఉన్నారని.. వీరు అభివృద్ధి చెందాలని రాఘవులు అన్నారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలు వెనుబడి ఉన్నాయన్నారు. విద్య, వైద్యం కార్పొరేటీకరణ జరిగి పేదలకు సేవలు అందటం లేదన్నారు. 
కొత్త జిల్లాల ఏర్పాటుతోనే అభివృద్ధి కాదు : తమ్మినేని 
కొత్త జిల్లాల ఏర్పాటుతోనే అభివృద్ధి కాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండలాలు ,గ్రామాలకు అభివృద్ది వికేంద్రీకరణ జరుగాలన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు, అభివృద్దిపై ఎందుకు మాట్లడటం లేదని తమ్మినేని ప్రశ్నించారు. మాటలు కాదు ..చేతలు కావాలన్నారు . ప్రత్యామ్నాయ విధానాలను పాదయాత్ర ద్వారా  ప్రజల ముందు ఉంచుతామని .. ప్రజాసమస్యల పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వం అని తమ్మినేని హెచ్చరించారు. 
పలు సంఘాలతో చర్చా గోష్టిలు 
పాదయాత్రకు సన్నహకంగా ఇప్పటికే వివిధ సామాజిక, ప్రజా, కుల సంఘాలతో చర్చా గోష్టిలు నిర్వహించారు. మేధావులు, ప్రముఖులతోనూ చర్చించి, వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకొని మహా పాదయాత్రకు మద్దతు కోరారు. పాదయాత్రకు ఆయా వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 

 

21:46 - October 4, 2016

హైదరాబాద్ : కాపులను బీసీల్లో చేర్చేంతవరకు ఉద్యమం ఆగదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేవరకు ప్రభుత్వంపై వివిధ దశల్లో పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి 15రోజులకొకసారి కాపునేతలంతా సమావేశమై..భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణపై చర్చించి తగిన మార్పులు చేర్పులు చేస్తామన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ముద్రగడ పద్మనాభం కాపు ముఖ్యనేతలతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన దాసరి నారాయణరావు స్పందిస్తూ..కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ముద్రగడ పద్మనాభం ఎలాంటి ఉద్యమం చేపట్టినా..తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ముద్రగడ వెన్నంటే ఉండి ఉద్యమాన్ని ముందుకు నడిపేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. 

 

21:43 - October 4, 2016

హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి జిల్లా కేంద్రంలో మొదటి రోజు నుంచే కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలు పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే మండలాల్లో కూడా పోలీస్‌స్టేషన్లు, మండల రెవెన్యూ కార్యాలయాలు పనిచేయాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చేపట్టాల్సిన అధికారిక కసరత్తుపై క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు సంబంధించి ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధుల వినతితో ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సిద్దిపేటలో పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటు చేయాలని పోలీస్‌శాఖను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయాలకున్న కరీంనగర్‌, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్లతో పాటు సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌కు సంబంధించి కూడా ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల ప్రారంభ కార్యక్రమంలో తాను పాల్గొంటానని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రులు, శాసనసభ స్పీకర్‌, మండలి ఛైర్మన్‌ ఒక జిల్లాను ప్రారంభించాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పరిధిలో ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్లు, మండలాలను ప్రారంభించాలని సూచించారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో పనిచేయడానికి ఉద్యోగుల విభజన వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 

 

విజయవాడ రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం టికెట్ ధర రూ.20 కి పెంపు

విజయవాడ : రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం టికెట్ ధర రూ.20కి పెంచారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు ధర పెంచారు. దసరా ఉత్సవాలు ముగిసేవరకు అమలు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 

 

సింగరేణి కార్మికులకు రూ.54 వేల దీపావళి బోనస్

కరీంనగర్ : సింగరేణి కార్మికులకు రూ.54 వేల దీపావళి బోనస్ ప్రకటించింది. కోల్ కత్తాలో జరిగిన జేబీటీసీఐ సమావేశంలో నిర్ణయంచారు. యజమాన్యం గతంలో రూ.48, 500 చెల్లించింది. సింగరేణి పై రూ.313 కోట్ల భారం పడనుంది. 

21:23 - October 4, 2016

హైదరాబాద్ : తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్‌కు ఆసుపత్రి పాలైన చిన్నారి సంజన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. తల్లి శ్రీదేవి మాత్రం నెమ్మదిగా కోలుకుంటున్నారు. అయితే మనవరాలి ప్రమాదం గురించి కలత చెందిన సంజన తాతయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హుటాహుటిన కామినేని ఆసుపత్రికి తరలించారు. 
కోలుకుంటున్న తల్లి శ్రీదేవి 
హయత్‌నగర్‌ మండలం అంబర్‌పేట వద్ద.. తాగుబోతుల రాష్‌ డ్రైవింగ్‌ కారణంగా తీవ్రంగా గాయపడ్డ బేబీ సంజన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె తల్లి శ్రీదేవి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రమాదానికి కారణమైన వారిలో ఒకరిని సోమవారం రాత్రి..  మరో ఇద్దరిని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసారు. మరోవైపు సంజనకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని కామినేని ఆసుపత్రి సూపరింటిండెంట్‌ తెలిపారు. 
సంజన కుటుంబంలో విషాదఛాయలు 
ఈ ప్రమాదంతో సంజన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. అదృష్టవశాత్తు తల్లి శ్రీదేవితోపాటు వెళ్లిన మరో కుమార్తె ప్రవళిక సురక్షితంగా బయటపడింది. చెల్లిని ఎత్తుకున్న తల్లి పక్కనే తానూ నడుస్తున్నానని.. అకస్మాత్తుగా కారొచ్చి తల్లిని, చెల్లిని గుద్దేసి వెళ్లినట్లు ఆ చిన్నారి చెబుతోంది. 
ప్రమాదానికి కారణమైన ముగ్గురి అరెస్టు... 
ప్రమాదానికి కారణమైన ముగ్గురిలో వెంకటరమణను సోమవారం రాత్రి అరెస్టు చేసిన హయత్‌నగర్‌ పోలీసులు.. మిగిలిన ఇద్దరినీ మంగళవారం ఉదయం అరెస్ట్ చేసారు. వెంకటరమణ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. ఇతను ఎలెక్ట్రీషియన్స్‌ యాదిరెడ్డి, శ్రీనివాస్‌లతో కలిసి.. ప్లాట్ల కొనుగోలుకు బాటసింగారం వెళ్లారు. తిరిగొచ్చేటప్పుడు కారులోనే మద్యం తాగి.. మైకంలో ప్రమాదానికి కారణమయ్యారు. 
సంజన బ్రెయిన్ డెడ్ వార్తలు అవాస్తవం : ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ 
సంజనకు తల, తుంటి, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయని, చిన్నారి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. ఇంకా 24 గంటల నుంచి 48 గంటలు గడిస్తే గానీ సంజన పరిస్థితి చెప్పలేమని కామినేని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ప్రసాద్ రావు అన్నారు.  
సంజనను పరామర్శించిన రమ్మ తండ్రి వెంకటరమణ  
ఇదిలా ఉండగా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సంజనను, రమ్మ తండ్రి వెంకటరమణ పరామర్శించారు. రమ్యకేసులో తమకు న్యాయం జరగలేదని అన్నారు. రమ్య చనిపోయి 90 రోజులవుతున్న నిందితులపై ఎలాంటి చార్జ్‌షీట్‌ వేయలేదని ఆరోపించారు. సంజనకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  సంజనకు చికిత్స నిమిత్తం రోజుకు 30 వేల రూపాయలకు పైగా ఖర్చు అవుతోందని సంజన తండ్రి శివానంద్ తెలిపారు. పేదలమైన తమకు అంత డబ్బు వెచ్చించే స్తోమత లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాయమందించాలని కోరారు. 

 

త్వరలో భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తాం : ముద్రగడ

హైదరాబాద్ : కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం ఆ సంఘం నేతల సమావేశం ముగిసింది. త్వరలో భవిష్యత్తు కార్యచరణప్రకటిస్తామని ముద్రగడ చెప్పారు. 15 రోజులకొకసారి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు, అభిప్రాయాల సేకరణ చేస్తామని చెప్పారు. బ్రిటీష్ కాలం నుంచే బీసీ రిజర్వేషన్ వుందన్నారు. 

 

అక్ నూర్ సెక్టార్ లో కొనసాగుతున్న కాల్పులు

జమ్మూకశ్మీర్ : అక్ నూర్ సెక్టార్ లో కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పులు శబ్ధాలతో మారుగోతుంది. 
సరిహద్దులో యుద్ధ వాతావరణణం కొనసాగుతోంది. 

20:48 - October 4, 2016

తెలంగాణ జేఏసీకి బలం టానీకు.. బందవస్తే అంటున్న సంఘాలొళ్లు, అనారోగ్యం పాలైన ఆరోశ్రీ పథకం.. ఆ కారడిని నమ్ముకుంటే ఇంక బతకం, 24 గంటలు ఆన్ డ్యూటీ.. తన సేతుల మాత్రం ఉంటది లాఠీ, జేసీ పట్టిన కుందేలు కుంటిదే...తాటి సెట్టు కింద దివాకరం సల్ల కథ, తెలుగు ప్రభుత్వాలపై ఏ ఏ దాడి...సూపియ్యాలే మన సీఎంలు వాడి, ఫోట్వలు దిగవొయి పాణం దీసుకుండు... కరీంనగర్ జిల్లాల పోరగాళ్ల ఆగమాగం, ఆ గ్రామంలో రాత్రిళ్లు సంచరిస్తున్న పులులు, వ్యవసాయ బావిలో పడి ఎలుగు బంట్లు మృతి... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....
 

 

20:39 - October 4, 2016

డ్రంకెన్ డ్రైవ్ కేసులో కఠిన చట్టాలు చేయాలని వక్తలు సూచించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాజీ ఏసీపీ రెడ్డన్న, సీనియర్ అడ్వకేట్ వీఆర్.మాచవరం, రమ్య తండ్రి వెంకటరమణలు పాల్గొని, మాట్లాడారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసులను త్వరగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి.. సత్వరమే కేసులను విచారించి.... పరిష్కరించాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

20:28 - October 4, 2016

హైదరాబాద్ : పోలవరం నిర్మాణానికి 40 వేల 200 కోట్లు అవసరమవుతాయని తాజాగా ఏపీ జలవనరుల శాఖ తేల్చిన లెక్క. అయితే... ఈ మొత్తాన్ని కేంద్రం భరిస్తుందా... లేక ముందు చెప్పినట్లు 24 వేల కోట్లకే కేంద్రం కట్టుబడుతుందా.? ప్రస్తుతం పోలవరం నిర్మాణంపై అనుమానాలకు తావిస్తోంది. 
పోలవరం.. దశాబ్దాల కల
పోలవరం.. దశాబ్దాల కల. అటు ఉమ్మడి రాష్ట్రంలో..ఇటు విభజన తర్వాత తరచూ వార్తల్లో నిలుస్తోన్న ప్రాజెక్టు. విభజన సందర్భంలో కేంద్రం పోలవరానికి జాతీయ హోదా ప్రకటించింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ముంపునకు గురయ్యే ఏడు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేశారు. ఇక ప్రాజెక్టు ఊపందుకున్నట్లే..అనుకుంటున్న తరుణంలో.. నత్తనడకను తలపించేలా కేంద్రం నిధులు విడుదల చేయడం ప్రారంభించింది. తాజాగా ఏపీకి ప్రకటించిన ప్రత్యేక సాయంలో భాగంగా మొత్తం వ్యయాన్ని భరిస్తామని మాటిచ్చింది... మొత్తం వ్యయమంటే ఎంత... గతంలో అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ప్రకారం అయితే 2014 ఏప్రిల్ నాటికి ఉన్న సవరించిన అంచనా వ్యయం 24 వేల కోట్లు.  జైట్లీ మాట ప్రకారం ఈ మొత్తాన్ని మాత్రమే భరిస్తారని అనుకోవాలా..?  అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన ఖర్చును చెల్లిస్తామని కూడా స్పష్టం చేశారు. మరి మిగతా ఖర్చేవరిది అన్నది మాత్రం ప్రశ్నార్ధకంగా మారింది. పోలవరం అంచనా వ్యయం 40,200 కోట్లు  
ఇప్పుడు తాజాగా పోలవరం అంచనా వ్యయం 40,200 కోట్లుగా ఏపీ జలవనరుల శాఖ లెక్క తేల్చింది. పోలవరం అథారిటీకి కూడా ఆ లెక్కలు పంపుతోంది. అనంతరం అథారిటీ కేంద్రానికి ఓ నివేదిక ఇస్తోంది. అయితే ఈ మొత్తం వ్యయాన్ని కేంద్రం భరిస్తుందా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. అరుణ్ జైట్లీ ప్రకటనే నిజమైతే ప్రాజెక్టు పరిస్థితి ఏంటీ... టీడీపీ సర్కార్ చెబుతున్నట్లు.. 2018 లోపు నిర్మాణం పూర్తవుతుందా... పునర్విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారం పోలవరం విషయంలో ఇచ్చిన హామీలు నెరవేరుతాయా..అన్నది సగటు మానవుడి ప్రశ్న. 
పోలవరం ప్రాజెక్టు ప్రారంభ అంచనా 10 వేల కోట్లు
జలయజ్ఞంలో భాగంగా 2005లో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు ప్రారంభ అంచనా 10 వేల కోట్లు. కుడి, ఎడమ కాలువలు, స్పిల్‌వే, రాక్‌ఫిల్‌ డ్యాం, అనుబంధ పనులను ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేశారు. 2005-06 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా 10 వేల 151 కోట్లు. ప్రాజెక్టుకు 2009 జనవరిలో కేంద్ర జలసంఘం నుంచి సాంకేతిక అనుమతి, అదే ఏడాది ఫిబ్రవరిలో ప్రణాళికా సంఘం నుంచి పెట్టుబడి అనుమతులు వచ్చాయి. దీంతో సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద ఓ ఏడాది కేంద్రం నుంచి నిధులు కూడా అందాయి. ఈ పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా స్టీరింగ్‌ కమిటీ జాతీయ హోదా కల్పించడానికి సిఫార్సు చేసింది. అయితే, ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని వ్యయ ఆర్థిక కమిటీ తాజా ధరలతో అంచనాలు తయారు చేసి పంపాలంటూ పక్కనపెట్టింది. దీంతో 2010-11 ధరలను పరిగణనలోకి తీసుకొని 16 వేల 11 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అప్పటి నుంచి కేంద్రం వద్ద పెండింగ్‌లో పడిపోయింది.
తెలంగాణ ఏడు మండలాలు ఏపీలో విలీనం 
పోలవరం నిర్మాణానికి తాజా అంచనా వ్యయం 40,200 కోట్లు. 2018లోపు ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. 2014 నాటికి అంచనా వ్యయం 24 వేల కోట్లయితే... అదే భరిస్తామని కేంద్రం చెబితే.. మిగతా 16 వేల కోట్ల భారం ఎవరిది...? ఏపీ సర్కార్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలవరం నిర్మాణానికి 2014 నాటికి 24 వేల కోట్లు, గతేడాది అక్టోబర్ నాటికి సుమారు 30 వేల కోట్ల వరకు ఖర్చు కావచ్చన్న అంచనా ఉండేది. ఆరు లేదా ఎనిమిది లేన్ల జాతీయ రహదారులకు తగినట్లుగా కాలువల పైన నిర్మాణాలు చేయాలని నిర్ణయించడం, భూసేకరణ ధర ఎకరాకు 10 నుంచి 15 లక్షల వరకు అంచనాల్లో పేర్కొనడం, 2013 భూసేకరణ చట్టానికి తగినట్లుగా పునరావాస పనులు... ఇలా అన్నీ కలిపి అంచనా వ్యయం 40,200 కోట్లకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాలువలపై నిర్మాణాల వ్యయం భారీగా పెరగటం, హెడ్‌వర్క్స్‌ వ్యయం, కాఫర్‌ డ్యాం ఎత్తు పెంచాలని నిర్ణయించడంతో పాటు భూసేకరణ, పునరావాస వ్యయం భారీగా పెరగడంతో అంచనా వ్యయం అధికమైనట్లు ఏపీ ఇరిగేషన్ శాఖ వర్గాలంటున్నాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ    దీనిని పరిశీలించి కేంద్ర జలవనరుల శాఖకు అందజేయనుంది. 
కుడి, ఎడమ కాలువల నిర్మాణ వ్యయమే 9500 కోట్లు 
కుడి, ఎడమ కాలువల నిర్మాణ వ్యయమే 4 వేల కోట్ల నుంచి.. సుమారు 9500 కోట్లకు పెరిగింది. హెడ్‌వర్క్స్‌ నిర్మాణ వ్యయం ఇప్పటికే భారీగా పెరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల సుమారు 350 గ్రామాలకు చెందిన 2 లక్షల మందికి పైగా ప్రజలు నిర్వాసితులు కానున్నారు. భూసేకరణ, పునరావాసానికే సుమారు 18 వేల కోట్లకు పైగా అవుతుందని అంచనా. ఇక విద్యుత్‌ బ్లాక్‌ నిర్మాణ వ్యయం సుమారు 3 వేల కోట్లు బాధ్యత మాత్రం ఏపీ సర్కార్ దే. మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా అందజేయనుంది. ఈ మధ్యనే ఏపీ ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నాబార్డు అధికారులతో మాట్లాడారు.. అయితే కేంద్ర జలవనరుల శాఖ నుంచి అనుమతి రాగానే నిధుల విడుదలపై క్లారిటీ ఇస్తామని నాబార్డు అధికారులు చెప్పినట్లు సమాచారం. 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్ఛు కేంద్రం భరిస్తుందా...? 
మరో వైపు ఏపీ సర్కార్ 2018  లోపు పూర్తి చేస్తామని చెబుతోంది. కానీ.. వ్యయం మాత్రం భారీగా కనిపిస్తోంది. మరి ఈ మొత్తాన్ని కేంద్రం భరిస్తుందా...? అరుణ్ జైట్లీ పాత ప్రకటన అనుసరిస్తే... పరిస్థితి ఏంటీ .. వంద శాతం నిధులని కేంద్రం భరిస్తుందని చెప్పిందని ఢంకా భజాయిస్తున్న ఏపీ సర్కార్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోలవరం నిర్మాణం కావాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ముందు నుంచి ఎదురవుతున్న బాలారిష్టాలను దాటుకోని కొంత ఆశాజనక పరిస్థితి వైపు అడుగులు పడుతున్నప్పుడు వ్యయం ఎవరు భరిస్తారన్నదానిపై క్లారిటీ ఖచ్చితంగా అవసరం. కొందరు అధికారులు చెబుతున్నట్లు 2014 నాటికి అంచనా వ్యయం 24 వేల కోట్లయితే... అదే భరిస్తామని జైట్లీ చెబితే.. మిగతా 16 వేల కోట్ల భారం ఎవరిది...? ఏపీ సర్కార్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

తొలిరోజు నుంచే కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులు పని చేయాలి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : కొత్త జిల్లాల్లో తొలిరోజు నుంచే కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులు పని చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్త మండలాల్లో రెవెన్యూ పీఎస్ లు పని చేయాలని సూచించారు. ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఆర్డీవోపాటు డీఎస్పీ స్థాయి అధికారి ఉండాలన్నారు. 

ఇబ్బందులు లేకుండా బతుకమ్మ పండుగ : నాయిని

హైదరాబాద్ : ఇబ్బందులు లేకుండా బతుకమ్మ పండుగను నిర్వహిస్తామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి చెప్పారు. వేలాది మహిళలతో హుస్సేన్ సాగర్ తీరంలో బతుకమ్మ ఆటపాటలు నిర్వహిస్తామన్నారు. ట్యాంక్ బంద్ అంతా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. 

19:57 - October 4, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలోని తుందుర్రులో ఆక్వాఫుడ్‌ పార్క్‌ను అడ్డుకుని తీరుతామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. తుందుర్రు ఆక్వాఫుడ్‌ పార్క్‌ బాధిత గ్రామాల్లో వామపక్ష నేతల పర్యటించారు. ఈ సందర్భంగా టెన్ టివితో మధు ప్రత్యేకంగా మాట్లాడారు. రైతులు, మత్స్యకారులు తమ భూముల్లో ఆక్వాఫుడ్‌ పార్క్‌ వద్దని చెబుతున్నా.. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. 

 

19:53 - October 4, 2016

గుంటూరు : ప్రతిపక్ష నేత జగన్‌కు కరవు అంటే ఏమిటో తెలుసా? అని రాష్ట్ర మంత్రులు చిన్నరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. రాయలసీమను రతనాలసీమగా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కరవు సీమగానే ఉండాలని జగన్‌ ఆకాంక్షిస్తున్నారని ఎద్దేవా చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. జగన్‌ తమతో కలిసి పర్యటనకు వస్తే ఇన్‌ఫుట్ సబ్సిడీ వివరాలు చూపిస్తామని మంత్రులు సూచించారు. 

19:51 - October 4, 2016

అనంతపురం : టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరవును కూడా హెలికాప్టర్ల లోంచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే అంటూ ఎద్దేవా చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం అనంతపురం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహా రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కరువు రావడం ఎవరి చేతుల్లోనూ ఉండదని, కరువు వచ్చినపుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబుకు ఎలా స్పందించాలో తెలియదన్నారు. నాలుగు రోజుల్లోనే కరువును జయించామని చెబుతున్నారని..కరువు నివారణ చర్యలు చేపట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని తెలిపారు. 

 

19:42 - October 4, 2016
19:41 - October 4, 2016

మహబూబ్ నగర్ : జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్ట్‌లో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లక్ష చేపపిల్లలను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 60 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో చేసిందని అన్నారు. అదే విధంగా గతంలో ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి పనులు కేసీఆర్ చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారన్నారు. 

 

నయీం కేసుల్లో చింతల వెంకటేశ్వర్‌రెడ్డిని విచారించిన సిట్‌

హైదరాబాద్ : నయీం కేసుల్లో సిట్‌ దూకుడు పెంచింది. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చింతల వెంకటేశ్వర్‌రెడ్డిని మరోసారి సిట్‌ అధికారులు విచారించారు. దసరా వరకు పూర్తి డేటాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. 

19:30 - October 4, 2016

హైదరాబాద్ : నయీం కేసుల్లో సిట్‌ దూకుడు పెంచింది. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చింతల వెంకటేశ్వర్‌రెడ్డిని మరోసారి సిట్‌ అధికారులు విచారించారు. దసరా వరకు పూర్తి డేటాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో అనేక మంది నేతలతో పాటు పోలీసు అధికారులను అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 155 కేసులు నమోదు  చేసిన సిట్‌ అధికారులు.. 95 మందిని అరెస్టు చేశారు. 8 మంది లొంగిపోయారు. 72 మంది కస్టడీ కొనసాగుతోంది. 175 మందికి పీటీ వారెంట్లు జారీ చేశారు. మరికొంత మందిని విచారించేందుకు రెడీగా ఉంది. 

 

సంజనని పరామర్శించిన రమ్య తండ్రి

రంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న సంజనని రమ్య తండ్రి పరామర్శించారు. రమ్య కేసులో తమకు న్యాయం జరగలేదన్నారు. రమ్య చనిపోయి 90 రోజులవుతున్నా నిందితులపై ఇప్పటికి ఛార్జ్ షీట్ వేయలేదన్నారు. మద్యం షాపుల్లో మైనర్లకీ మద్యం అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఈ విషయం పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. సంజన కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హయత్ నగర్ మండలం పెద్దఅంబర్ పేట వద్ద రెండు రోజుల క్రితం సంజన ప్రమాదానికి గురైంది. 

 

ముద్రగడ ఉద్యమానికి మేమంతా అండగా ఉంటాం : దాసరి

 హైదరాబాద్ : ఇక్కడ జరిగి విషయాలను ప్రభుత్వం సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తుందని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు చెప్పారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి తామంతా అండగా ఉంటామని తెలిపారు. 

 

సీఎం జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

చెన్నై : సీఎం జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 2 రోజులుగా అందించిన చికిత్సనే కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు. వైద్య నిపుణుల బృందం జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని చెప్పారు. మరికొన్ని రోజులు జయలలిత ఆస్పత్రిలోనే ఉంటారని తెలిపారు. 

 

ఎల్ఈడీ దీపాల ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ : ఎల్ఈడీ దీపాల ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎల్ ఈడీ దీపాలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. 

 

భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి

హైదరాబాద్ : భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. డేవిడ్ దౌలస్, డంకన్ హాల్డెన్, మైకల్ కొస్టర్లిజ్ కు నోబెల్ పురస్కారం లభించింది. 

 

కావేరి నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ : కావేరి నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అక్టోబర్ 7 నుంచి 18 వరకు 2 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్నాటకకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కావేరి డెల్టాను పరిశీలించి అక్టోబర్ 18 వరకు నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీకి అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈనెల 6 వరకు 6 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేస్తామని కర్నాటక కోర్టుకు తెలిపింది. 

గవర్నర్ నరసింహన్ ను కలిసిన రఘువీరారెడ్డి

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ ను ఎపిపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి కలిశారు. పద్మావతి కళాశాల సీట్ల కేటాయింపులో బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. 

కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేసే అవకాశాలు లేవు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, నిరంజన్ రెడ్డి, కలెక్టర్ శ్రీదేవి హాజరయ్యారు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమన్ గల్, మాడ్గుల, తలకొండపల్లి, కొత్తగా ఏర్పడే కడ్తాల్ మండలాలు శంషాబాద్ జిల్లాలో కలవబోతున్నాయని చెప్పారు. కావునా కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేసే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. అయితే ప్రజల కోరిక మేరకు కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పై ఆలోచించాలని పేర్కొన్నారు. 

 

సంజన తాతకు గుండెపోటు

హైదరాబాద్ : కారు ప్రమాదంలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న సంజన తాతయ్య నరేందర్‌ కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన కామినేని ఆసుపత్రికి తరలించారు. మొన్న రాత్రి మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో సంజన, ఆమె తల్లిని ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సంజన ప్రస్తుతం కామినేనిలో చికిత్స పొందుతోంది. 

17:36 - October 4, 2016

హైదరాబాద్ : కారు ప్రమాదంలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న సంజన తాతయ్య నరేందర్‌ కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన కామినేని ఆసుపత్రికి తరలించారు. మొన్న రాత్రి మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో సంజన, ఆమె తల్లిని ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సంజన ప్రస్తుతం కామినేనిలో చికిత్స పొందుతోంది. ఈ వార్త తెలిసిన వెంటనే నరేందర్ కు గుండెపోటు వచ్చింది. 

 

17:32 - October 4, 2016

ఢిల్లీ : పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ సర్జికల్‌ దాడులకు సంబంధించి విపక్షాలు లేవనెత్తిన సందేహాలపై బిజెపి మండిపడింది. కేజ్రీవాల్‌ లేవనెత్తిన అంశానికి పాక్‌ మీడియా ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొంది. మన ఆర్మీపై నమ్మకం లేదా అంటూ విపక్షాలను ప్రశ్నించింది. రాజకీయాలు వేరని, ఇలాంటి ప్రకటనలవల్ల ఆర్మీ నైరాశ్యానికి లోనవుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ కేజ్రీవాల్‌కు విజ్ఞప్తి చేశారు. సర్జికల్‌ దాడులపై చిదంబరం చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధికారిక ప్రకటనగా భావించావచ్చా అంటూ సోనియాగాంధీని నిలదీశారు. పిఓకేలో సర్జికల్‌ దాడుల ఆధారాలు బయటపెట్టడం ద్వారా పాక్‌ నోరు మూయించాలని కేజ్రీవాల్‌ వీడియో సందేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే.

 

17:25 - October 4, 2016

ఢిల్లీ : ఐదు రోజుల భారత పర్యటనకు వచ్చిన సింగపూర్ ప్రధాని లీ సియాన్ లూంగ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటి కానున్నారు. భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు తదితర ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. భారత పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీ చేరుకున్న లీ సియాన్‌ లూంగ్‌ ఓ విఐపిలా కాకుండా సాధారణ పౌరునిలా వ్యవహరించారు. తనకోసం కేటాయించిన కాన్వాయ్‌ను కాదని, ఎయిర్‌పోర్టు నుంచి బస్సులో తన హోటల్‌కు చేరుకున్నారు. సియాన్‌ లూంగ్‌ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, భారత్‌లోని సింగపూర్‌వాసులతో విడివిడిగా భేటీకానున్నారు. 5, 6వ తేదీల్లో రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో లూంగ్ పర్యటిస్తారు.

 

17:11 - October 4, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని వీణవంక మండలంలో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం శ్రీరాముల పేట శివారులో గల వ్యవసాయ బావిలో పడ్డ మూడు ఎలుగుబంట్లు మృతి చెందాయి. దీనిపై అటవీ అధికారులకు సమాచారం అందించినా.. వారు సరైన చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఎలుగుబంట్లు చనిపోయాయని మండిపడ్డారు.

 

17:08 - October 4, 2016

కర్నూలు : జిల్లాలోని చాగలమర్రిలో ఎమ్మార్వోపై నిన్న దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రవికృష్ణ...దాడికి గురైన ఎమ్మార్వో ఆంజనేయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాధికారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిపై బైండోవర్‌ కేసులు నమోదు అవుతాయని చెప్పారు. 

 

17:04 - October 4, 2016

ఖమ్మం : జిల్లాలోని అశ్వరావుపేటను జిల్లా చేయాలంటూ సీపీఎం న్యూ డెమోక్రసీ డిమాండ్‌ చేస్తోంది. ఆదివాసీలు అభివృద్ధి చెందాలంటే వెంటనే అశ్వరావుపేటను జిల్లాగా ప్రకటించాలంటూ బంద్‌ నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం పరిపాలన సౌలభ్యం కోసం చేస్తున్న జిల్లాల విభజన.. ఆదివాసీల పాలిట శాపంగా మారిందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు కళ్లు తెరిచి ఆదివాసీల పరిరక్షణకోసం చర్యలు చేపట్టాలని సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

17:03 - October 4, 2016

వరంగల్ : జిల్లాలోని ములుగును జిల్లా చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్‌లు, రాస్తారోకోలు నిర్వహిచారు. ములుగు నియోజకవర్గంలోని వెంటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూర్ నాగారం, ములుగు, మంగపేట మండలాల్లో కూడా బంద్‌లు, రాస్తా రోకోలు నిర్వహిచారు. ములుగు బస్టాండ్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహిచారు. మరో పక్క కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సీఎం దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వయించి దహనం చేశారు. అన్ని హంగులున్న ములుగుపై సీఎం కనికరం చూపడం లేదని కేసిఆర్‌పై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. తెలంగాణలోనే అతిపెద్ద ములుగు డివిజన్‌ను జిల్లా చేయకుండా అక్కరకు రానివన్ని జిల్లాలు చేయడం పద్ధతి కాదన్నారు. 

 

16:57 - October 4, 2016
16:56 - October 4, 2016
16:55 - October 4, 2016
16:50 - October 4, 2016

శ్రీకాకుళం : ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే కేవలం థ్యాంక్స్‌ చెప్పి చేతులు దులుపుకోవద్దు.. ఒకరు ముగ్గురికి సాయపడి.. ఆ ముగ్గురు..మరో ముగ్గురికి సాయపడాలి..ఇది స్టాలిన్‌ సిన్మాలో చిరంజీవి చెప్పే మాటలు..ఇదే తరహాలో సిక్కోలు జిల్లాలో ఓ స్వచ్చంద సంస్థ తాగుడు మాన్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఉచితంగా సేవలు అందిస్తూ ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతోంది.   
వారికి బాసటగా నిలుస్తోన్న ఏఏ గ్రూప్‌ సంస్థ 
మద్యపానం నుంచి విముక్తి పొందాలనుకునే వారికి బాసటగా నిలుస్తోంది శ్రీకాకుళం జిల్లాలోని ఏఏ గ్రూప్‌ సంస్థ. తాగుడు వ్యసనాన్ని మాన్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఎలాంటి లాభపేక్ష లేకుండా ఉచితంగా సేవలు అందిస్తూ తన ఔదార్యాన్ని చాటుకుంటుంది. పాలకొండ మండలం కొండాపురంలోని ఎ.ఎ గ్రూప్...ఆల్కహాలిక్ అనాలసిస్ పేరుతో మద్యం సేవించడం వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కల్పిస్తోంది. ఎలాంటి వైద్యం లేకుండా కేవలం సూక్తులు, పరివర్తన మార్గాలతో వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతోంది. 
కొండాపురంలో ప్రారంభమైన ఏఏ గ్రూప్‌ 
2005లో కొండాపురంలో ప్రారంభమైన ఏఏ గ్రూప్‌ అంచలంచెలుగా తన సేవలను విస్తరించింది. పదేళ్ళు పూర్తి చేసుకున్న ఈ సంస్థ 500 మందికి మద్యపానం నుంచి విముక్తి కల్పించింది. అంతేకాదు తమ సంస్థలో సభ్యులుగా చేరి పూర్తిగా మద్యం మానివేసిన వ్యక్తులతో..కొత్తవారికి శిక్షణ ఇప్పిస్తోంది. మద్యం కారణంగా వారి జీవితంలో ఎదురైన ఇబ్బందులు, కష్టాలు వివరిస్తూ వ్యసనపరులను చైతన్యపరుస్తారు. మనసుకు హత్తుకునే మాటలతో మత్తుమీద మక్కువ తగ్గేలా చేస్తారు. 
జనం నమ్మకాన్ని చూరగొంటున్న ఏఏ 
ఎలాంటి ప్రచార ఆర్భాటం లేని ఏ.ఏ సంస్థ అమెరికాలో 1901లో ప్రారంభమై..అక్కడ మంచి ఫలితాలు సాధించింది. ఆ ప్రేరణతో శ్రీకాకుళం జిల్లాలో ముప్పై వరకు తన శాఖలను విస్తరించింది. మద్యం మానాలనుకునేవారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతూ జనం నమ్మకాన్ని చూరగొంటుంది. రోజు సాయంత్రం సమయంలో కొత్త, పాత సభ్యులతో సంస్థ కార్యాలయంలో సమవేశమవుతారు. మద్య నిషేదం తమ లక్ష్యం కాదని.. స్వచ్చందంగా తాగుడుకు స్వస్తి పలకాలనుకునేవారికి సేవలందించాలన్నదే తమ ధ్యేయమంటారు సంస్థ నిర్వాహకులు. తాగుడు వ్యసనాన్ని మాన్పించేందుకు శ్రీకాకుళం జిల్లాలో ఏఏ గ్రూప్‌ చేస్తున్న సేవలపై మహిళల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

 

16:43 - October 4, 2016

కడప : జిల్లాలోని జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో జెడ్పీటీసీల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో.... తోపులాట జరిగింది. దీంతో సమావేశాన్ని జెడ్పీ ఛైర్మన్‌ వాయిదా వేశారు. 

 

రుణాలపై వడ్డీరేటును పావుశాతం తగ్గించిన రిజర్వ్‌ బ్యాంక్

ఢిల్లీ : త్రైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో... బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును రిజర్వ్‌ బ్యాంక్ పావుశాతం తగ్గించింది. దీంతో రెపోరేటు 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గింది. రివర్స్ రెపోరేటును కూడా పావుశాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 

16:39 - October 4, 2016

ఢిల్లీ : దసరా ముందు రిజర్వ్‌ బ్యాంక్ గుడ్‌న్యూస్ ప్రకటించింది. త్రైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో... బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును పావుశాతం తగ్గించింది. దీంతో రెపోరేటు 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గింది. రివర్స్ రెపోరేటును కూడా పావుశాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రఘురామ్ రాజన్‌ పదవీ విరమణ అనంతరం... గత నెలలో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉర్జిత్ పటేల్... తన తొలి సమీక్షలోనే... వడ్డీరేట్లు తగ్గిస్తూ కీలక ప్రకటన చేశారు. అయితే చరిత్రలో తొలిసారిగా..  ఆర్బీఐ గవర్నర్ నిర్ణయం కాకుండా... రిజర్వ్ బ్యాంక్ నియమించిన కమిటీ సూచన ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ ప్రకటనతో రెపోరేటు ఆరేళ్ల కనిష్ఠానికి చేరింది. దేశీయంగా ద్రవ్యోల్బణం... రిజర్‌ బ్యాంక్ లక్ష్యం కంటే తక్కువగా ఉండటం.. కలిసొచ్చింది. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకులు కూడా ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగిందే.. గృహ, వాహన, వ్యాపార రుణాలపై వడ్డీ కూడా తగ్గుతుంది. 

 

ఐడియా బొల్లారంలో డ్రగ్స్ పట్టివేత..

హైదరాబాద్ : ఐడియా బొల్లారంలో డ్రగ్స్ పట్టుబడింది. అంతరాష్ట్ర ముఠాను ఎన్ సీపీ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరులోని ఓ పరిశోధక సంస్థలో పని చేస్తున్న వెంకటరామారావుతో పాటు రవి శంకర్ రావు అనే వ్యక్తి అరెస్టు చేశారు. 30 కిలోల యాంఫెటమైన్  డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ డ్రగ్స్ విలువ రూ.200 కోట్లుగా ఉంది.  

అనంతపురం కలెక్టరేట్ ఎదుట జగన్ రైతు ధర్నా

అనంతపురం : కలెక్టరేట్ ఎదుట వైసీపీ అధినేత వైఎస్ జగన్ రైతు ధర్నా చేపట్టారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 250 మండలాల్లో కరువు తాండవిస్తోందని చెప్పారు. చంద్రబాబు రెయిన్ గన్ లు ప్రాంభించిన పొలం జిల్లాలో 90 శాతం పంటలు ఎండిపోయాయని తెలిపారు. 

 

సంజన బ్రెయిన్ డెడ్ వార్తలు పుకార్లే : కామినేని ఆస్పత్రి సూపరింటెండెంట్

హైదరాబాద్ : సంజన బ్రెయిన్ డెడ్ వార్తలు పుకార్లేనని కామినేని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు అన్నారు. మరో 48 గంటలు గడిస్తే కానీ సంజన ఆరోగ్య పరిస్థితిని చెప్పలేమని చెప్పారు. ప్రస్తుతం సంజన కోమాలో విషమంగానే ఉందన్నారు. 

సంజన రోడ్డు ప్రమాదం ఘటనలో మరో ఇద్దరు అరెస్టు

హైదరాబాద్ : సంజన రోడ్డు ప్రమాదం ఘటనలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి కమిషనర్ ఎదుట ఓ నిందితుడు లొంగిపోయాడు. సంజనకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది. 

15:39 - October 4, 2016

వాషింగ్టన్ : పాశ్చాత్య నాగ‌రిక‌త‌కు మారుపేరైన అమెరికాలో బ‌తుక‌మ్మ పూల పండుగ‌ ఘ‌నంగా జ‌రిగింది. తెలంగాణ సంస్కృతీ-సంప్రదాయాల‌కు ప్రతీక అయిన బ‌తుక‌మ్మ వేడుకను కాలిఫోర్నియా స్టేట్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కో స‌మీపంలో ఉన్న ఫ్రీమాంట్ న‌గ‌రంలో పండుగ వాతావ‌ర‌ణంలో ప్రవాస తెలంగాణ వాళ్లు జ‌రుపుకున్నారు. ఫ్రీమాంట్‌లోని రాయ‌ల్ ప్యాలెస్‌లో జ‌రిగిన వేడుక‌ల‌కు కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంటున్న మ‌న దేశ‌వాసులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. ప్రాంతాలు, కుల‌మ‌తాల‌కు అతీతంగా బ‌తుక‌మ్మ ఆడారు. 
ఫ్రీమాంట్‌లో బ‌తుక‌మ్మ వేడుక‌లు
కాలిఫోర్నియా స్టేట్‌లోని ఫ్రీమాంట్‌లోని వేద టెంపుల్ ప్రాంగ‌ణంలో బ‌తుక‌మ్మ ఆట‌ ఆడారు. భార‌త కాల‌మానం ప్రకారం ఆదివారం ఉద‌యం నిజామాబాద్‌ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌విత వేడుకల్లో సెట‌ర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. 
బ‌తుక‌మ్మకు ఎంపీ క‌విత పూజ‌లు
ఎంపీ కవిత అక్కడి మహిళలతో కలిసి వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి.. ఆడిపాడారు. గౌరీదేవికి ప్రతిరూప‌మైన బ‌తుక‌మ్మకు ఎంపీ క‌విత పూజ‌లు చేశారు. వేద టెంపుల్ పూజారుల మంత్రొఛ్చార‌ణ‌ల మ‌ధ్య ఆమెతో పాటు ఇత‌ర ప్రతినిధులు భ‌క్తిశ్రద్ధల‌తో మొక్కుకున్నారు. 
బ‌తుక‌మ్మ ఆటా పాట‌కు వేదికైన రాయ‌ల్ ప్యాలెస్‌ 
ఫ్రీమాంట్‌లో పేరొందిన రాయ‌ల్ ప్యాలెస్‌ బ‌తుక‌మ్మ ఆటా పాట‌కు వేదికైంది. బ‌తుక‌మ్మను ఎత్తుకుని క‌విత ప్యాలెస్‌కు రాగానే మ‌హిళ‌లు బ‌తుక‌మ్మ పాట‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు. క‌విత‌తో క‌లిసి ఉత్సాహంగా కోలాట‌మూ ఆడారు. మొత్తంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది దేశాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తోంది. 

 

15:30 - October 4, 2016

శ్రీకాకుళం : అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండటంతో.. అరుదైన వన్యప్రాణులూ అంతరించి పోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో తరచూ మూగజీవాలు మైదాన ప్రాంతాలు, జనావాసాల్లోకి చేరి మృత్యువాత పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. అటవీశాఖ వన్యప్రాణుల సంరక్షణ పట్ల నిర్లక్ష్యాన్ని చూపడం మూగ జీవాల పట్ల శాపంగా మారింది. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా 10 టివి ప్రత్యేక కథనం...!
తగ్గుతున్న అడవుల విస్తీర్ణం 
అడవుల విస్తీర్ణం తగ్గుతుండటంతో.. వన్యప్రాణులకూ ముప్పు వాటిల్లుతోంది. అడవి జంతువులు, పక్షులు, నెమలి, కొండచిలువ, పులి లాంటి జంతువుల ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో దట్టమైన అడవుల్లో.. మూగజీవాలు రోజురోజుకు అంతరించిపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కొత్తూరు, పాతపట్నం, సీతంపేట, భామిని, మెళియాపుట్టి మండలాల్లోని మారుమూల కొండల్లో నెమళ్ళు, అడవి పావురాలతో పాటు చిలుకలు, పిచ్చుకలున్నాయి. వీటితో పాటు చిరుతపులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, దుప్పి, జింకలు, అడవిమేక, గొర్రెలు, పందులతోపాటు సర్పజాతికి చెందిన కొండచిలువ, కింగ్-కోబ్రా లాంటి జీవాలున్నాయని గ్రీన్-మెర్సీ లాంటి సంస్థలు గుర్తించాయి.
ఏజన్సీ ప్రాంతాల్లో తిరుగుతున్న వేటగాళ్ళు  
కొన్నేళ్లుగా కొత్తూరు, సారవకోట, మందసా, మెళియాపుట్టి, సీతంపేట ఏజన్సీ ప్రాంతాల్లో వేటగాళ్ళు తిరుగుతున్నారు. అటవీ ప్రాంతం సమీపంలో తీగలు అమర్చి  విద్యుత్‌ షాక్‌తో వన్యప్రాణులను వేటాడుతున్నారు.  అరుదైన వన్యప్రాణులను, ఇతర జంతువులను చంపి మాంసాన్ని విక్రయిస్తున్నారు. దుప్పి, జింక, అడవిపందులతో పాటు వివిధ రకాల పక్షుల మాంసాన్ని గుట్టుచప్పుడు కాకుండా వేటగాళ్లు విక్రయిస్తున్నారు. నాటు తుపాకీలు, కరెంట్ షాక్ ద్వారా జంతువులను చంపుతున్న వేటగాళ్లపై చేపట్టిన చర్యలు మాత్రం అంతంత మాత్రమేనని వన్యప్రాణి ప్రేమికులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల నిధులు  వెచ్చిస్తున్నట్లు కాగితాల్లో చూపిస్తున్న అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల ఊపిరి తీస్తున్న.. నిఘా పటిష్టం చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. 
వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టాలి : స్థానికులు 
అయినప్పటికీ ప్రభుత్వం మేల్కొనకపోవడం..అటవీశాఖ పట్టించుకోక పోవడం ఈ దుస్థితికి దారితీస్తోంది. ప్రతిఏటా అక్టోబర్‌ నాలుగున ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం జరుపుకొంటున్నా... వన్యప్రాణుల వేటను మాత్రం నిరోధించలేకపోవడం గమనార్హం. అధికారులు ఇప్పటికైనా అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.  

 

15:15 - October 4, 2016

హైదరాబాద్ : హుజుర్ నగర్ ను రెవిన్యూ డివిజన్ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు తన నియోజకవర్గ నాయకులతో కలిసి రాష్ట్ర సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మను కలిసి విన్నవించారు. హుజుర్ నగర్ ను రెవిన్యూ డివిజన్ చేయాలని సీఎస్ ను కోరినట్లు తెలిపారు. హుజుర్ నగర్ నియోజకవర్గంలో మల్లారెడ్డి గూడెం, పాలకీడు కొత్త మండలాలుగా ఏర్పాటు చేయడాన్ని ఆయన స్వాగతిస్తున్నామన్నారు. 

 

బొల్లారం ప్రభుత్వపాఠశాలలో ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం

హైదరాబాద్ : బొల్లారం ప్రభుత్వపాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. విద్యార్థినులు టెన్త్ క్లాస్ చదువుతున్నారు. నిన్న స్కూల్ కు వెళ్లి విద్యార్థులు తిరిగిరాలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని మద్రాసు కోర్టు ఆదేశం

చెన్నై : తమిళనాడు జయలలిత ఆరోగ్యంపై మద్రాసు కోర్టులో విచారణ జరిగింది. జయ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని ఆపోలో ఆస్పత్రిని మద్రాసు కోర్టు ఆదేశించింది. 

నెల్లూరులో వ్యక్తి బ్రెయిన్ డెడ్.. అవయవదానం

నెల్లూరు : నారాయణ ఆస్పత్రిలో వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అవయవదానికి అతని కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. గుండెను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి, కిడ్నీ తిరుపతి స్విమ్స్ కి, మరో కిడ్నీ నెల్లూరు నారాయణ ఆస్పత్రికి తరలించారు. కాలేయం విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి, కళ్లు మోడరన్ ఐ ఆస్పత్రికి వైద్యులు తరలించారు. 
సుబ్బారెడ్డి కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. 

ముగిసిన హైపవర్ కమిటీ సమావేశం

హైదరాబాద్ : హైపవర్ కమిటీ సమావేశం ముగిసింది. కొత్త జిల్లాలపై సాధ్యాసాధ్యాలను చర్చించామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. 6 వ తేదీ సాయంత్రానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. 

14:04 - October 4, 2016

హైదరాబాద్ : ఈనెల 17వ తేదీ నుండి ఐదు మాసాల పాటు సుదీర్ఘమైన మహాపాదయాత్ర చేయాలని యోచించినట్లు సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రజల నుండి నేర్చుకోవడానికి..తమకు తెలిసింది వారికి చెప్పడానికి ప్రయత్నం చేస్తామన్నారు. బంగారు తెలంగాణ అని ఏవో అర్థం కాని పదాలు కాకుండా అర్థమయ్యే పదాలు చెప్పాలని సూచించారు. పేద వాడికి ఏం కావాలి ? తెలంగాణ రాష్ట్రం పటం అభివృద్ధి కాదని..రాష్ట్రంలోని ప్రజలు అభివృద్ధి కావాలని సూచించారు. వైద్యం..విద్య..అందుబాటులోకి రావాలని..జీడీపీ లెక్కలు..ద్రవ్యోల్బణం లెక్కలు అంటూ కాకిలెక్కలు చెప్పడం కాదన్నారు. ప్రత్యామ్నాయమార్గం ఉండాలని..దీని కోసం చర్చించడం జరుగుతుందన్నారు. చర్చా రూపంలో ఓ పత్రరూపంలో ప్రజల ముందు ఉంచుతున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాలైన ప్రాంతాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే అది అభివృద్ధి అంటారన్నారు.

కొత్త జిల్లాలు అయితే ఏం చేస్తారు ? 
కొత్త జిల్లాల విషయంలో అఖిలపక్షాన్ని మరొకసారి పిలుస్తామని చెప్పి ఇంతవరకు పిలవలేదన్నారు. జిల్లాలు చిన్నవిగా ఉంటే తప్పేమి లేదని..చేస్తున్న తీరు ఏంటీ ? అని ప్రశ్నించారు. జిల్లా ఏర్పాటు చేస్తే అభివృద్ధి అయిపోతుందా ? ఎన్ని ఎకరాల్లో కలెక్టరేట్ ఆఫీసు ఏర్పాటు చేస్తారు ? ఇలా ఇతర వాటిపై మాట్లాడుతున్నారే కానీ జిల్లా ఏర్పడితే జిల్లా కేంద్రంలో..పరిధిలో..జిల్లా ప్రజల సంపదను వృద్ధి చేస్తాం..పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం..విద్యా కేంద్రాలు..వైద్య కేంద్రాలు ఏర్పాటు చేస్తాం..సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేస్తా..ఇలాంటివి ఏవైనా చెబుతున్నారా..చంకలు గుద్దితే ఎలా అని సూటిగా ప్రశ్నించారు. తమ ఊరు రెవెన్యూ డివిజన్..మండలం ఏర్పాటు చేయాలని కోరుతున్నారే కానీ ఈ పరిశ్రమ తీసుకరావాలని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్ లో గిరిజన యూనివర్సిటీ పెడుతారా ? ఏ పరిశ్రమ పెడుతారు ? ఏ ఒక్కటి ఆలోచిస్తున్నారా ? అని ప్రశ్నించారు.

స్థానికులకే ఉద్యోగ అవకాశాలివ్వాలి...
వికేంద్రీకరణ నుండి అభివృద్ధి ప్రారంభం కావాలని అంటే మండలం నుండి అభివృద్ధి ప్రారంభించాలని సూచించారు. మండల కేంద్రంలో మహిళా సంక్షేమం..విద్య..వైద్య..పరిశ్రమల ఏర్పాటు..ఇలా అన్ని ఉండాలని ఇలాంటి చర్చ జరగాలని, ఇలాంటి చర్చ జరగాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రంలో జిల్లా..మండలం వాసులైనా స్థానికులకు ఉద్యోగ అవకాశాలివ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు, దీనికి ప్రభుత్వం అంగీకరిస్తుందా ? లేదా అని ప్రశ్నించారు.

రాష్ట్రంపై ఉన్న భక్తి ఈ పని చేయిస్తోంది..
అన్ని సమావేశాల్లో కూడా తమపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, ఇలాంటి పాదయాత్ర చేస్తారా ? అని ప్రశ్నలు వస్తున్నాయన్నారు. కాళ్లలో ఉన్న శక్తి కంటే తెలంగాణ రాష్ట్రంపై ఉన్న భక్తి ఈ పని చేయిస్తుందన్నారు. యాత్ర యొక్క లక్ష్యం సీపీఎం వల్ల ఒక్కదానివల్ల కాదని తాము పలు సందర్భాల్లో చెప్పడం జరుగుతోందని, సామాజిక శక్తులు..ఇలా అందరూ ముందుకు రావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. 

13:57 - October 4, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీపీఎం నిర్వహించే 'మహా పాదయాత్ర' 'మహా అధ్యయన యాత్ర' అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. అక్టోబర్ 17వ తేదీన ఇబ్రహింపట్నంలో ప్రారంభమై హైదరాబాద్ లో పాదయాత్ర ముగుస్తుందన్నారు. ఈ పాదయాత్ర ప్రారంభానికి ముఖ్య అతిథిగా ప్రకాష్ అంబేద్కర్ ను ఆహ్వానించడం జరిగిందన్నారు. అక్టోబర్ 17వ తేదీ నుండి నిర్వహించే 'మహాపాదయాత్ర' విశేషాలను ఆయన మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. పాదయాత్రలో పాల్గొనే వ్యక్తుల పేర్లను వెల్లడించారు. ఈ పాదయాత్రకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని నేతృత్వం వహిస్తారని, గతంలో నీటి సమస్య..దళితుల సమస్యలపై ఆయన పాదయాత్రలు నిర్వహించి ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన సందర్భాలున్నాయన్నారు.

పాల్గొనే వారు..
జాన్ వెస్లీ : దళితులు..బలహీన వర్గాల కోసం వెస్లీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఎస్.రమ : బీడీ కార్మికులు..ఇతర మహిళా సమస్యలను పరిష్కరించడానికి సుదీర్ఘంగా కృషి చేశారని పేర్కొన్నారు.
ఎంబీ రమణ : వృత్తిదారులు..సామాజిక తరగతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ముఖ్యంగా గీతా కార్మికుల సమస్యల విషయంలో అధ్యయనం చేశారని తెలిపారు.
టి.ఆశయ్య : సేవా తరగతుల సమస్యల నివారణకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల తరువాత అత్యంత హీనంగా చూస్తున్న రజక వృత్తిదారుల విషయంలో ఆయన కృషి చేశారని తెలిపారు.
కె.నగేష్ : ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పని చేస్తున్నప్పటి నుండి నాయకత్వంగా ఉన్నారని, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్నారని తెలిపారు. నల్గొండలో నుండి వచ్చారన్నారు.
ఎమ్.శోభన్ నాయక్ : విద్యార్థి దశ నుండి వచ్చాడని, బంజారా తెగ నుండి వచ్చి రాష్ట్ర కేంద్రంలో ముఖ్య కార్యకర్తగా మెలిగి రాష్ట్ర స్థాయి గిరిజన నాయకుడిగా ఎదిగారన్నారు.
నైతం రాజు : గిరిజన రంగం కార్యకర్త అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ రంగం గిరిజనులు గణనీయంగ ఉన్నారని తెలిపారు.
ఎండి అబ్బాస్ : ట్రేడ్ యనియన్ నాయకత్వంలో పని చేశారని, మైనార్టీ రంగం అభివృద్ధి కావాలని విశేష కృషి చేస్తున్నారని తెలిపారు.

రెండు నినాదాలు..
రెండు ప్రధానమైన నినాదాలతో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి అనే నినాదాలతో పాదయాత్ర జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో సామాజిక వెనుకబడిన తరగతుల సంఖ్య ఉందని తెలిపారు. సామాజిక తరగతుల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బాగా వెనుకబడి పోయిందని, సామాజిక తరగతులు వెనుకబడడం చాలా కీలకమన్నారు. అక్షరాస్యత..ఆరోగ్య..విషయాల్లో పరిశీలన చేస్తే రాష్ట్రం వెనుకబడి ఉందన్నారు. సామాజిక తరగతుల్లో వెనుకబాటుతనం తొలగించకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రాంతీయ అసమాన అభివృద్ధి..వైద్య..విద్యలు కార్పొరేటీకరణ అయిపోతున్నాయని, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ పరిస్థితి మారుతుందని అనుకుంటే అలాంటిది వేగం పుంజుకొనే పరిస్థితి నెలకొందన్నారు. ప్రైవేటు విద్య..ప్రైవేటు వైద్యం పెరుగుతూ ఉంటే బలహీన వర్గాలు ఇంకా వెనుకబడి పోతాయన్నారు.

అవే విధానాలు..
రెండున్నర సంవత్సరాలు పూర్తయయ్యాయని, ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన విధానాలు..ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో తేడా లేదన్నారు. ఎలాంటి విధానాలు అవలింబించాలో సీపీఎం ప్రజల ముందుకు తీసుకరావాలని అనుకున్నట్లు తెలిపారు. ఇందుకు ఒక చర్చ పత్రాన్ని కూడా సీపీఎం రూపొందించిందని, ప్రజల అభిప్రాయాలు తీసుకొంటుందన్నారు. అత్యధిక ప్రజలు ఏమి కోరుకున్నారో అవి ప్రభుత్వం ముందు ఉంచుతుందన్నారు. అంతేగాకుండా ముసాయిదా పత్రాన్ని రూపొందించడం జరుగుతుందని, రాష్ట్ర కమిటీలో చర్చించిన అనంతరం ముసాయిదా పత్రం విడుదల చేయడం జరుగుతుందని, దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సినవసరం ఉందన్నారు. 

13:23 - October 4, 2016

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సారి మాత్రం కొంత సంప్రదాయానికి అధికారులు తెరలేపారు. కేరళ సంప్రదాయ మంగళవాయిద్యాన్ని ప్రవేశ పెట్టారు. డోలు, ప్లూటు, తదితర వాయిద్యాలో వారు చేస్తున్న ప్రదర్శన ఆకట్టుకొంటోంది. ఈ సందర్భంగా టెన్ టివితో ఆలయ అర్చకులు మాట్లాడారు. అమ్మవారు సంగీత ప్రియురాలని, దేవాలయ ప్రతిష్టను పెంచాలని ఈవో సూచనలతో తాము ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:16 - October 4, 2016

హైదరాబాద్ : 'రమ్య' చట్టం తీసుకరావాలని ఇటీవల తాగుబోతుల దాష్టీకం వల్ల మృతి చెందిన చిన్నారి 'రమ్య' తల్లి రాధిక డిమాండ్ చేశారు. మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపి చిన్నారి రమ్యతోపాటు మరో ముగ్గురు మృతికి కారణమైన విద్యార్ధి ఆర్ శ్రావిల్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ పై రమ్య తల్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జులై 1వ తేదీన తన 5మంది స్నేహితులతో కలిసి పీకలదాకా మద్యం సేవించి కారు నడుపుతూ అదుపు తప్పి రోడ్‌ నంబర్‌ 3లోని శ్మశానవాటిక వద్ద శ్రావిల్‌ రోడ్‌ ప్రమాదానికి కారకుడు అయ్యాడు. ఈ ఘటనలో చిన్నారితో పాటు మరో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. బెయిల్ రావడంపై టెన్ టివి చిన్నారి రమ్య తల్లి రాధికతో టెన్ టివి ముచ్చటించింది. బెయిల్ రావడం చాలా బాధేసిందన్నారు. బెయిల్ తీసుకుని బయటకు వచ్చి ఇంకెంత మంది ప్రాణాలు తీసుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. కాలేజీ నుండి తీసేశారు కానీ ఇతర కాలేజీల్లో ఇతరులు చేరినట్లు తెలుస్తోందన్నారు. ప్రభుత్వం ఇంతవరకు తమకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, సంజన ఆక్సిడెంట్ విషయం తెలిసి చాలా బాధపడ్డానని తెలిపారు. గత కొన్ని రోజులుగా డ్రంక్ డ్రైవ్ ఆక్సిడెంట్లు జరుగుతున్నాయని, తాగడం అంటూ లేకపోతే చెకింగ్స్ ఉండవు కదా అని అన్నారు. మూడు ప్రాణాలు తీసిన శ్రావెల్ పై కఠినాతికఠినంగా శిక్షించాలని, మద్యం నిషేధించాలని..జనాల్లో భయం అంటూ నెలకొనే విధంగా చూడాలని రాధిక కోరారు. మరి ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

పంజాబ్ గ్రామాల్లో హై అలర్ట్..

పంజాబ్ : సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. గురుదాస్ పూర్ లో ఉగ్రవాదుల అనుమానితుల కలకలం రేగింది. కొంతమంది అనుమానితులను చూసినట్లు పోలీసుల, బీఎస్ఎఫ్ జవాన్లకు స్థానిక మహిళ సమాచారం అందించింది. రావి నదిలోని సటేజ్ కాల్వ నుండి అనుమానితులు వచ్చినట్లు తెలుస్తోంది. రావినది సరిహద్దు గ్రామాల్లో పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం రావి నదిలో పాక్ నుండి వచ్చిన ఖాళీ పడవను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 

మూడు ఎలుగుబంట్లు మృతి..

కరీంనగర్ : వీణవంక (మం) శ్రీరాములపేటలో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం బావిలో పడిన మూడు ఎలుగుబంట్లు మృతి చెందాయి. గ్రామస్తులు సమాచారం ఇచ్చినా అటవీ శాఖ స్పందించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.  

13:04 - October 4, 2016

లక్నోలో మోడీ దసరా సంబరాలు..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సంవత్సరం దసరా సంబరాలను లక్నోలో జరుపుకోనున్నారు. అక్టోబర్ 11వ తేదీన ఆయన లక్నోకు వెళ్లనున్నారు. 

ఐటీ కార్యాలయంలో సత్యేంద్ర జైన్..

ఢిల్లీ : రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఇన్ కమ్ ట్యాక్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట పార్టీ నేతలు కూడా ఉన్నారు. ఐటీ డిపార్ట్ మెంట్ నుండి ఆయనకు సమన్లు అందిన సంగతి తెలిసిందే. 

12:47 - October 4, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు నివేదికలు విడుదల చేస్తున్నా అభిమానులు..నేతలు..కార్యకర్తల్లో మాత్రం ఇంకా ఆందోళన నెలకొంది. 'జయ' ఆరోగ్య ప‌రిస్థితుల‌ను గురించి నిజానిజాల‌ను వెల్లడించాలని చెన్నైకి చెందిన‌ న్యాయ‌వాది ట్రాఫిక్ రామ‌స్వామి నిన్న‌ ఈ పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. సీఎంగా ఉన్న ఆమె ఆరోగ్య విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సినవసరం ఉందని, హెల్త్ బులెటిన్ విడుదల చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును ఆయన కోరారు. దీనిపై హైకోర్టు మంగళవారం విచారించింది. ఆరోగ్యంపై త‌క్ష‌ణ‌మే వైద్య నివేదిక ఇవ్వాల‌ని చెన్నై వైద్యులకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'జయ'కు జరుగుతున్న అనారోగ్యం..కొనసాగుతున్న చికిత్సకు సంబంధించిన వివరాలు బహిర్గతం కానున్నట్లు తెలుస్తోంది. 

12:44 - October 4, 2016

పశ్చిమగోదావరి : తుందూరులో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆక్వా ఫుడ్ పార్క్ వద్దని గత కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అందోళనకు సీపీఎం, ఇతర వామపక్ష నేతలు మద్దతు తెలిపారు. ఇటీవలే గ్రామాల్లో పర్యటించిన ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వినిపించాయి. సోమవారం కూడా సీపీఎం నేత మధుతో పాటు ఇతర ప్రజా సంఘాలు బాధిత గ్రామాల్లో పర్యటించారు. జైలుకు వెళ్లిన కుటుంబసభ్యులను వారు పరామర్శించారు. ముందస్తు అనుమతి తీసుకున్నా పోలీసులు నేతల వెన్నంటి ఉంటున్నారు. ఏ ఇంటికి వెళ్లినా కన్నీటితో తమ ఆవేదన తెలియచేస్తున్నారు. వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ నేతలు ముందుకు వెళుతున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం కాకుండా తాము పోరాటం చేస్తామని నేతలు స్పష్టం చేస్తున్నారు. 

12:19 - October 4, 2016

గుంటూరు : రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను రాజీ పడాల్సినవసరం లేదని, రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపతో పొత్తు పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జిల్లాలో టిడిపి ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కేంద్రం ఏమి చేయలేదని..ఇంకా సమస్యలున్నాయి..ఏమీ చేయలేకపోతున్నామని చెప్పడానికి సిద్ధంగా లేమన్నారు. వినూత్నంగా ఆలోచిస్తూ ముందుకెళుతున్నట్లు చెప్పారు. పెన్షన్ రూ. 200 నుండి రూ. 1000 పెంచి 43లక్షల మందికి నెల వారీగా పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ సెక్యూర్టీ కింద ఈ పాస్ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని కూడా తీసుకొచ్చినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. 

12:17 - October 4, 2016

హైదరాబాద్ : తాగుబోతుల నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా చిన్నారి సంజన మృత్యువుతో పోరాడుతోంది. తల్లి శ్రీదేవితో కలిసి అమ్మమ్మ ఇంటికి సంజన (5) వెళుతోంది. పెద్ద అంబర్ పేట వద్ద మద్యం సేవిస్తూ కారుతో యువకులు ఢీకొట్టారు. దీనితో శ్రీదేవి, సంజనలకు తీవ్రగాయాలయ్యాయి. సంజన కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సంజన బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కామినేని సూపరిటెండెంట్ ప్రసాదరావు టెన్ టివితో మాట్లాడారు. వెంటిలెటర్ పై చికిత్స కొనసాగుతోందని, ఎమ్ఆర్ఐ పరీక్ష చేస్తున్నట్లు తెలిపారు. తలకు తీవ్రగాయం కావడంతో పరిస్థితి శృతి మించిందని, కాలుకు ఫ్యాక్చర్ అయ్యిందన్నారు. సీనియర్ మోస్ట్ సర్జన్ ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందన్నారు. బ్రెయిన్ డెడ్ అభూత కల్పన అని, ప్రస్తుతం సంజన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు. 

12:03 - October 4, 2016

ఈ ఫొటో చూశారా ? రానా..'బాహుబలి'లో భల్లాలదేవగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'బాహుబలి ది కన్ క్లూజన్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ పాత్రలో ఒదిగిపోవడానికి 'రానా' బాగా కష్టపడుతున్నాడంట. మరింతగా ఫిట్ గా కనిపించడం కోసం 'రానా' భారీగా కసరత్తులు చేస్తున్నాడు. కోచ్ కునాల్ గిర్ పర్యవేక్షణలో శిక్షణ జరుగుతోంది. 'బాహుబలి'లో 'రానా' దగ్గరదగ్గరగా 110 కిలోల బరువు ఉండేవాడంట. రెండో భాగంలో మాత్రం బరువు తగ్గాల్సి ఉందంట. దీనితో భారీగా కరసత్తులు చేసి బరువు తగ్గించుకున్నాడు. ప్రస్తుతం 92-93 కిలోల బరువున్నాడంట. తన శరీర ఆకృతిని కోచ్ తో కలిసి పర్యవేక్షించుకుంటున్నాడు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫోటోను 'రానా' తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. 

పెద్ద అంబర్ పేట ఘటనలో మరో ఇద్దరి అరెస్టు..

హైదరాబాద్ : పెద్ద అంబర్ పేట వద్ద జరిగిన తాగుబోతుల నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల తల్లి కూతుళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లి శ్రీదేవి పరిస్థితి కొంతమెరుగవ్వగా చిన్నారి సంజన ఇంకా కోమాలోనే ఉంది. ఇదిలా ఉంటే కారు నడిపి ప్రమాదానికి కారణమైన ఇద్దరు నిందితులు యాదిరెడ్డి, శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు. వెంకటరమణ అనే వ్యక్తి నిన్ననే లొంగిపోయిన విషయం తెలిసిందే. 

11:38 - October 4, 2016

హైదరాబాద్ : ఉత్తమ విద్యారంగ వార్తకథన పురస్కారం టెన్ టివిని వరించింది. ఉత్తమ విద్యా రంగ వార్తా కనథ పురస్కారాలు -2015 అవార్డుల ప్రధాన కార్యక్రమం విజయవాడలో జరిగింది. విద్యారంగంలో ఉత్తమ కథనాలు అందించిన జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం అవార్డులను బహుకరించింది. 'టార్గెట్ స్కూల్ ఎడ్యుకేషన్' కథనానికి గాను టెన్ టివి ప్రతినిధి బెల్లంకొండ సతీష్ కు అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతరులు సత్కరించారు. 'బడి ఈడు పిల్లలు బడికే వెళ్లాలి' అనే కథనానికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని బెల్లంకొండ సతీస్ పేర్కొన్నారు. తనకు తొడ్పాటు అందించిన టెన్ టివి యాజమాన్యానికి..కుటుంబసభ్యులకు..స్నేహితులు..అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు సతీష్ పేర్కొన్నారు. 

11:28 - October 4, 2016

విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించడానికి భక్తులు పోటెత్తుతున్నారు. నాలుగో రోజు శ్రీ అన్నపూర్ణదేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వేకువ జామున నుండే భక్తులు తరలివస్తున్నారు. రేపు కాత్యాయాని రూపంలో దర్శనమివ్వనున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:20 - October 4, 2016
11:16 - October 4, 2016

హైదరాబాద్ : నిన్న రమ్య..నేడు సంజన..రేపు ? ఎవరు ? తాగుబోతుల దాష్టీకానికి కుటుంబాలు బలి కావాల్సిందేనా ? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాగి డ్రైవింగ్ చేస్తూ కొంతమంది మొన్న చిన్నారి రమ్య కుటుంబాన్ని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హయత్ నగర్ లో తాగుబోతుల దాష్టికానికి కూడా ఓ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దసరా సెలవుల కోసమని పెద్ద అంబర్ పేటలోఉన్న పుట్టింటికి వెళ్లడానికి తన కుమార్తెలతో శ్రీదేవి లాలాపేట నుండి వెళుతోంది. హయత్‌ నగర్‌ మండలం పెద్ద అంబర్‌ పేట ఔటర్‌ రింగురోడ్డు వద్ద అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజు కూతురు సంజన (5), ప్రవళికతో శ్రీదేవి రోడ్డు దాటుతోంది. ఆ సమయంలో మద్యం సేవించిన యువకులు వేగంగా కారుతో వారిని ఢీకొట్టారు. దీనితో శ్రీదేవి..సంజనలకు గాయాలయ్యాయి. శ్రీదేవి ప్రస్తుతం కొలుకొంటుండగా సంజన పరిస్థితి మాత్రం ఏం చెప్పలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈసందర్భంగా శ్రీదేవి కుటుంబసభ్యులతో టెన్ టివి ముచ్చటించింది. 'లాలాపేట నుండి అమ్మమ్మ ఇంటికి వస్తున్నాం..మమ్మీ రోడ్ క్రాస్ చేస్తోంది. కారు వచ్చే గుద్దేసింది. మా చెల్లే..అమ్మ పడిపోయారు' అని ప్రవళిక పేర్కొంది. ఆక్సిడెంట్ అయిన అనంతరం ఫోన్ చేశారని, అంబులెన్స్ తెప్పించి ఆసుపత్రికి తీసుకెళ్లారని శ్రీదేవి తల్లి పేర్కొంది. శ్రీదేవి ఇంకా కొలుకోలేదని, సంజన కోమాలోకి వెళ్లిపోయిందన్నారు. సంజనకు 95 శాతం గ్యారంటీ ఇవ్వమని వైద్యులు పేర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఆక్సిడెంట్ జరిగి జనాలు పోగై ఉన్నారని, కారు ఫొటో..కీస్ తీసుకుని అంబులెన్స్ కు ఫోన్ చేయడం జరిగిందని శ్రీదేవి సోదరుడు పేర్కొన్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

బీసీసీఐ అకౌంట్ల సీజ్ ?

ముంబై : బీసీసీఐ అకౌంట్లను జస్టిస్ లోథా కమిటీ ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రభావం భారత్ - న్యూజిలాండ్ టెస్టు సిరీస్ పై పడనుంది. పర్యటనలో ఇంకా ఓ టెస్టు..ఐదు వన్డేలను ఇరు జట్లు ఆడాల్సి ఉంది. లోథా కమిటీ సిఫార్సులు అమలు చేయకపోవడమే కారణమని తెలుస్తోంది. 

కాసేపట్లో జగన్ ధర్నా..

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు జగన్ జిల్లాకు రానున్నారు. వర్షాభావంతో రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అనంతపురంలో మహాధర్నా చేపట్టనుంది. కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాలో జగన్ పాల్గొననున్నారు. 

ఎంపీ గ్రామ సభను బహిష్కరించిన గ్రామస్తులు..

మెదక్ : దత్తత తీసుకున్న లడ్డారం గ్రామంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభను గ్రామస్తులు బహిష్కరించారు. దత్తత తీసుకుని రెండేళ్లు అవుతున్నా ఒక్కసారైనా తమవైపు చూడలేదంటూ గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామస్తులు లేకుండానే అధికారులతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిలు సమీక్ష నిర్వహిస్తున్నారు. 

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి డ్రైవర్..గన్ మెన్ ల వీరంగం..

మెదక్ : పటన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి డ్రైవర్..గన్ మెన్ లు వీరంగం సృష్టించారు. యాదగిరి అనే యువకుడిని వీరు చితకబాదారు. వీరిపై ఫిర్యాదు చేయడానికని వెళితే ఆర్పీపురం ఎస్ఐ చితకబాదడంతో యాదగిరికి తీవ్రగాయాలయ్యాయి. 

10:24 - October 4, 2016
10:13 - October 4, 2016
10:11 - October 4, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రక్రియ వేగం అందుకుంది. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ కొత్త జిల్లాలతో 27కు చేరుతాయని అందరూ భావించారు. తాజాగా టీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో మూడు జిల్లాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఆ జిల్లాల సంఖ్య 30కి చేరింది. అయితే చివరగా ఆసిఫాబాద్‌ను కూడా జిల్లాగా ప్రకటించాలని సీఎం భావించడంతో ఆ జాబితా 31కి చేరింది. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు కేకే నేతృత్వంలో హై పవర్ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో మహమూద్ ఆలీ, జగదీష్ రెడ్డి, పోచారం, జోగు రామన్నలున్నారు. ఈ నెల ఏడో తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

నాలుగు కొత్త జిల్లాలపై హై పవర్ కమిటీ..

హైదరాబాద్ : నాలుగు కొత్త జిల్లాలపై కేకే నేతృత్వంలో నలుగురు మంత్రులతో హై పవర్ కమిటీ ఏర్పాటైంది. కమిటీతో మహమూద్ ఆలీ, జగదీష్ రెడ్డి, పోచారం, రామన్నలున్నారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటును ఈ కమిటీ పరిశీలించనుంది. ఈ నెల ఏడో తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

09:33 - October 4, 2016

హైదరాబాద్ : తాగుబోతుల దాష్టీకానికి ఆసుపత్రి పాలైన చిన్నారి సంజన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. తాము నిరుపేదలమని..చికిత్స చేయించుకొనే ఖర్చు తమవద్ద లేవని..ప్రభుత్వం..అధికారులు ఆదుకోవాలని సంజన కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. హయత్‌ నగర్‌ మండలం పెద్ద అంబర్‌ పేట ఔటర్‌ రింగురోడ్డు వద్ద అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజు రాత్రి శ్రీదేవి తన కూతుళ్లు సంజన (5), ప్రవళికతో రోడ్డు దాటుతోంది. ఆ సమయంలో మద్యం సేవించిన యువకులు వేగంగా కారుతో వారిని ఢీకొట్టారు. తల్లి శ్రీదేవి..ఆమె ఒడిలో ఉన్న సంజనకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటికే ప్రవళిక రోడ్డు దాటడంతో ఎలాంటి గాయాలు కాలేదు. వీరిని ఆసుపత్రికి తరలించారు. కామినేని ఆసుపత్రిలో సంజన చికిత్స పొందుతోంది. ఆమె బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద నున్న సంజన తండ్రితో టెన్ టివి మాట్లాడింది. పాపది సేమ్ కండీషన్ ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను దుకాణంలో పని చేస్తానని..ఖర్చు పెట్టే అంత శక్తి లేదన్నాడు. తల్లి ఓ ఆసుపత్రిలో..కూతురు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, రానుపోనూ ఖర్చులే భరించలేకపోతున్నట్లు తెలిపాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. ఘటన జరిగిన అనంతరం లొంగిపోతే అయిపోతుందా ? పాప పరిస్థితి ఏంటనీ ప్రశ్నించాడు. మొన్న రమ్య..నేడు తన కూతురు..రేపు ఎవరికి ఏం జరుగుతుందో తెలియడం లేదని, ప్రభుత్వానికి అర్థమౌతుందా ? లేదా అని ప్రశ్నించాడు. ఈ ఘటనపై ప్రభుత్వం..అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

09:23 - October 4, 2016

కరీంనగర్ : సెల్ఫీ...తింటే సెల్ఫీ..పడుకొంటే సెల్ఫీ..నిలుచుంటే సెల్ఫీ..ఎక్కడికి వెళ్లినా..సెల్ఫీలు తీసుకుంటున్నారు. కానీ ఈ సెల్ఫీలే వారి ప్రాణాలు తీస్తున్నాయి. నిండు జీవితాలు బలైపోతున్నా ప్రజల్లో అవగాహన రావడం లేదు. తాజాగా సెల్ఫీ ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. నీటిలో మునిగి 9 తరగతి విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. గోదావరిఖనికి చెందిన రాహుల్ కరీంనగర్ లో ఓ హాస్టల్ ఉంటూ 9వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు రావడంతో ఇంటికి వచ్చాడు. అనంతరం తన స్నేహితులతో పెద్దపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో గుట్టల్లో ఉన్న గౌరిగుండాల జలపాతం వద్దకు వచ్చాడు. అనంతరం తాను బండపై నుండి నీటిలో దూకుతానని..ఫొటో తీయాలని రాహుల్ చెప్పాడు. అతను చెప్పినట్టే స్నేహితులు చేశాడు. అమాంతం రాహుల్ నీటిలోకి దూకాడు. మరలా పైకి రాలేదు. ఇదంతా చూస్తున్న స్నేహితులు కంగారు పడిపోయారు. సమీపంలో ఉన్న వారు రాహుల్ ను కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే సమయం మించిపోయింది. రాహుల్ కన్నుమూశాడు. కుమారుడు మృతి చెందాడన్న తెలుసుకున్న తల్లిదండ్రులు..కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పెద్దపల్లి మండలం సబ్బితం పంచాయతీ పరిధిలోని గౌరీగుండాల జలపాతం అందాలను చూసేందుకు భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు. కానీ అక్కడ ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. గతంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదాలను నియంత్రించేందుకు..హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

సబ్బితం జలపాతంలో పడి విద్యార్థి మృతి..

కరీంనగర్ : గోదావరిఖనికి చెందిన విద్యార్థి రాహుల్ దసరా సెలవులు గడిపేందుకు ఇంటికి వచ్చాడు. స్నేహితులతో కలిసి కరీంనగర్ జిల్లా సబ్బితం జలపాతం వద్దకు వెళ్లాడు. బండరాయి మీద నుండి నీటిలో దూకే దృశ్యాలను ఫోన్ లో చిత్రీకరించాలని రాహుల్ తన స్నేహితులతో చెప్పాడు. నీటిలో దూకిన రాహుల్ మునిగిపోయి మృతి చెందాడు. 

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నాలుగో రోజు..

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మను అన్నపూర్ణదేవి రూపంలో అలంకరించారు. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజామున మూడు గంటల నుండే భక్తులు తీరారు. పవిత్ర కృష్ణా నదిలో పుణ్యస్నానమాచరించిన అనంతరం భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటున్నారు. 

08:53 - October 4, 2016

పశ్చిమగోదావరి : తుందూరు ఆక్వా ఫుడ్‌ పార్క్ నిర్మాణ గ్రామాల్లో పోలీసుల అరాచకరాజ్యం నడుస్తోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. గత రెండు నెలలుగా ఈ ఆంక్షలు కొనసాగుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దిన దిన గండం..నూరేళ్ల ఆయిష్షుగా మారిపోయింది. గ్రామంలో ఒక్క మగాడు కూడా లేకుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సందర్భంగా టెన్ టివి ఓ గ్రామంలో పర్యటించి వారి బాధలను బాహ్యప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం చేసింది. ''బిక్కుబిక్కుమంటున్నాం..ఊళ్లో మగాళ్లు లేరు..ఎక్కడకు వెళుతున్నారు..ఎందుకు వెళుతున్నారు..ఆధార్..రేషన్ కార్డు ఉందా అని పోలీసులు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు..వినాయక చవితి చేయనివ్వ లేదు..ఈ పండుగ చేసుకోనివ్వరా' అని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 
తుందూరు అక్వాపుడ్ నిర్మాణ గ్రామాల వారు చేస్తున్న ఆందోళనకు సీపీఎం మద్దతు తెలుపుతోంది. పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కానీ పోలీసులు ఎక్కడికక్కడ నిర్భందం ప్రయోగిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సోమవారం గ్రామాల్లో పర్యటిస్తానని మధు స్పష్టం చేశారు. కొద్దిగంటల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

08:26 - October 4, 2016

హైదరాబాద్‌ : హ్యాంస్టెక్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ కాలేజీ విద్యార్థులు రూపొందించిన ఫ్యాషన్‌షో అదరహో అనిపించింది. మోడల్స్‌ క్యాట్‌వాక్‌ ఆహుతులను ఆకట్టుకుంది. సోమాజిగూడ పార్క్‌ హోటల్‌లో విద్యార్థులు తయారుచేసిన డిజైన్‌ వస్త్రాలను మోడల్స్‌ ధరించి ర్యాంప్‌పై ప్రదర్శించారు. 30 విభాగాలుగా సాగిన ఫ్యాషన్‌షో మోడ్రన్‌, వెస్ట్రన్‌, సంప్రదాయ దుస్తులతో మోడల్స్ క్యాట్‌వాక్‌ చేసి అందరినీ అలరించారు.

08:17 - October 4, 2016

పంజాబ్ : రాష్ట్రంలో పెను ప్రమాదం తప్పింది. జీలం ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. జలంధర్ - లుథియానా మధ్య చోటు చేసుకుంది. గాయాలకు గురైన వారిని లూధియాన వద్దనున్న సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ - పూణేకు ఈ రైలు సౌకర్యంగా ఉంటుంది. ఆర్మీ జవాన్లు వెళ్లడానికి ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇటీవల దేశ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. సమాచారం తెలుసుకున్న రైల్వే శాఖకు చెందిన కీలక అధికారులు ఘటనాస్థలికి వెళ్లారు. కొద్దిదూరంలో ఉన్న బ్రిడ్జిపై ఈ ఘటన జరిగి ఉంటే ప్రాణనష్టం జరిగేది. బోగీలు పట్టాలు తప్పడంతో జలంధర్ - లుథియానా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

08:12 - October 4, 2016

రంగారెడ్డి : వారు కష్టం చేస్తారు..శ్రమించి పనిచేయడం..రాత్రయితే కష్టాన్ని మరిచి నిద్రపోవడం..అలాంటి వారు నిద్రలో ఉండగానే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. జేసీబీ మృత్యువులా దూసుకొచ్చింది. జిల్లా తాండూరులోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న కార్మికులపైకి జేసీబీ దూసుకెళ్లింది. దీపక్ సింగ్, సంజయ్ మృతి చెందగా త్రిలోక్ తీవ్రగాయాలకు గురయ్యాడు. త్రిలోక్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

07:45 - October 4, 2016

10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ కొత్త జిల్లాలతో 27కు చేరుతాయని అందరూ భావించారు. అదేవిధంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు. తాజాగా టీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో మూడు జిల్లాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఆ జిల్లాల సంఖ్య 30కి చేరింది. అయితే చివరగా ఆసిఫాబాద్‌ను కూడా జిల్లాగా ప్రకటించాలని సీఎం భావించడంతో ఆ జాబితా 31కి చేరింది. హైపవర్‌ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించి దసరాలోగా తుది నిర్ణయం ప్రకటిస్తారు. ఈ అంశంపై టెన్ టివి చర్చా వేదికలో నంద్యాల నర్సింహరెడ్డి (సీపీఎం), ఆచారి (బిజెపి), వకుళాభరణం కృష్ణమోహన్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

లారీని తప్పింబోయి..

పశ్చిమగోదావరి : జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఓ ప్రైవేటు బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. లారీని తప్పించబోయి బస్సు అదుపుతప్పినట్లు తెలుస్తోంది. 

జేసీబీ ఢీకొని ఇద్దరు కార్మికుల మృతి..

రంగారెడ్డి : తాండూరు మండలం మల్కాపూర్ లోని ఇండియా సిమెంట్స్ లో జేసీబీ ఢీకొని ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. 

మరోసారి పాక్ కాల్పులు..

శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము కాశ్మీర్‌లోని కల్సియాన్, నౌషెరా సెక్టార్లలో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. 

07:03 - October 4, 2016

నీళ్లు ప్రాణాధారం. మనం తాగేనీళ్లు, వివిధ అవసరాలకు వాడే నీళ్లు నిల్వ వుండేది జలాశయాల్లో. వీటి నిర్వహణలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ స్పృహే ఇప్పుడు లోపిస్తోంది. మన దేశంలో చెరువులు, వివిధ జలాశయాల నిర్వహణను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇష్టమొచ్చిన్నట్టు వ్యర్ధాలను కలిపేస్తున్నారు. మురుగునీటిని జలవనరుల్లోకి వదిలేస్తున్నారు. వివిధ ఫ్యాక్టరీల యాజమాన్యాలు అతి భయంకర రసాయనాలను నీటి వనరులలో నిర్లక్ష్యంగా కలిపేస్తున్నా ప్రభుత్వాలు కళ్లు మూసుకుంటున్నాయి. ఇదేం పద్ధతంటూ ఏ ఒక్క పారిశ్రామికవేత్తనూ ఏ ఒక్క ప్రభుత్వమూ మందలించడం లేదు. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ ఉదాసీనత, ఈ నిర్లప్తత, ఈ నిర్లక్ష్యం మన పాలిట శాపంగా మారుతోంది.

పంటలన్నీ విష తుల్యం..
ఫలితంగా వాటి సమీపంలో పండిన పంటలన్నీ విషతుల్యమవుతున్నాయి. అవి తిన్నవారికి జబ్బులొస్తున్నాయి. చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రోగాలొస్తున్నాయి. ఇందుకు తిరుగులేని సాక్ష్యం హైదరాబాద్‌. ఒక్కప్పుడు హైదరాబాద్ మంచినీటి, సాగునీటి అవసరాలు తీర్చడంలో చెరువులు ప్రముఖ పాత్ర పోషించేవి. సిటీలో ఎటు చూసినా చక్కటి చెరువులు కనిపిస్తుండేవి. కానీ, రానురాను వాటి సంఖ్య తగ్గిపోతోంది. విస్తీర్ణమూ తరిగిపోతోంది. జీహెచ్ఎంసీ రికార్డులకీ, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికీ లెక్క కుదరని దీనావస్థ భాగ్యనగరంలో నెలకొంది. జీహెచ్ఎంసీ పరిధిలో 168 చెరువులున్నట్టు రికార్డులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో అవన్నీ కనిపించని దౌర్భాగ్యం. దాదాపు 40కి పైగా చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. హైదరాబాద్ లో అధికభాగం చెరువుల్లో ఏదో ఒక స్థాయిలో అక్రమ కట్టడాలు వెలిశాయి. హెచ్ ఎండీఏ పరిధిలో 2857 చెరువులున్నట్టు రికార్డుల్లో రాసుకున్నా, వాస్తవాలు మరో రకంగా వెక్కిరిస్తున్నాయి.

చెరువుల నిర్వాహణ ఘోరం..
మిగిలిన కొద్దిపాటి చెరువుల నిర్వహణ మరీ ఘోరంగా తయారైంది. హైదరాబాద్ చెరువులు అత్యంత ప్రమాదకర రసాయనాలకు నెలవులుగా మారాయి. ఈ విషయాన్ని యునెస్కో ఏనాడో హెచ్చరించింది. దుర్గం చెరువు, కిష్టారెడ్డిపేట, ఖాజిపల్లి, ఆసానికుంట, సాయి చెరువు, నూర్ మహ్మద్ కుంట, పెద్ద చెరువు ఇలా మరెన్నో చెరువుల్లో ప్రమాదకర రసాయనాలు తిష్టవేశాయి. ఇక హుస్సేన్ సాగర్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఆయా చెరువుల సమీపంలోని వివిధ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలే ఇంత ప్రమాదకర పరిస్థితికి కారణం. హైదరాబాద్ లో ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలకు అతి ప్రధాన కారణం నీటి వనరులు కలుషితం కావడమే. పిల్లల్లో తరచూ నులిపురుగులు ఏర్పడడానికీ, వారిలో ఎదుగుదల లోపించడానికి, డయేరియా లాంటి వ్యాధుల బారిన పడడానికీ జల కాలుష్యమే కారణమంటూ యునెస్కో నివేదిక ఏనాడో స్పష్టం చేసింది. హైదరాబాద్ లో కొన్ని చెరువుల కింద సాగు చేసిన ఆకు కూరలు తిన్నవారికీ అనారోగ్యం తప్పడం లేదు. ఆ చెరువుల నీళ్లు తాగిన పశువుల పాలు సైతం మన ఆరోగ్యాలను గుల్ల చేస్తున్నాయి. లీటర్ నీటిలో ఆరు మిల్లీ గ్రాముల ఆక్సిజన్ వుండాలి. అంతకంటే తగ్గితే చేపలు కూడా బతకలేవు. కానీ హైదరాబాద్ లోని అనేక చెరువుల్లో మూడు మిల్లీగ్రాముల ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితి. ప్రమాద తీవ్రతను అర్ధం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇప్పటికైనా హైదరాబాద్ చెరువుల నిర్వహణ విషయంలో తక్షణ జాగ్రత్తలు తీసుకోకపోతే, పరిస్థితి మరింత వికటించడం ఖాయం.

దేశమంతా ఇదే దురావస్థ..
ఒక్క హైదరాబాద్‌లోనే కాదు దేశమంతా ఇదే దురావస్థ. మంచినీటి లభ్యత తగ్గిపోతోంది. వ్యర్థ జలాల విడుదల పెచ్చుమీరుతోంది. ఒక అంచనా ప్రకారం మన దేశంలో 2025 నాటికి పారిశ్రామిక గృహ అవసరాలకు 29. 2 బీసీఎంల నీరు అవసరం. 2050 నాటికి వ్యర్థ జలాలు 48.2 బీసీఎంలకు చేరుకుంటాయి. జలవనరులపై ఒత్తిడి తగ్గాలంటే వ్యర్ధాలను శుద్ధి చేయడమే మార్గం. అయితే మన దేశంలో ఈ ప్రకియ నామమాత్రంగా సాగుతోంది. కనీసం 20శాతం వ్యర్ధజలాలను కూడా శుద్ధి చేయడం లేదు. ప్రతి నగరపాలక సంస్థ, పురపాలక సంస్థ తన పరిధిలో విడుదలయ్యే వ్యర్థ జలాలను శుద్ధి చేసినతర్వాతే వదలాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనలున్నా అవి అమలుకావడం లేదు. ఇళ్లు, ఆఫీసులు, ఆస్పత్రులు, పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాల్లో 80శాతం శుద్ధి చేయకుండానే నదుల్లోకి వదులుతున్నారు. ఫలితంగా మనదేశంలో సగం నదులు కలుషితమై, తాగడానికి పనికిరాకుండా పోతున్నాయి.

రెండు రకాల వ్యర్థ జలాలు..
ప్రధానంగా ఇళ్ల నుంచి రెండు రకాల వ్యర్థ జలాలు విడుదలవుతాయి. కిచెన్‌, బాత్రూమ్‌, బట్టలుతకడం వల్ల వచ్చిన నీళ్లు ఒకరకంగా కాగా, మరుగుదొడ్ల నుంచి పారే మల మూత్రాలు కలిసిన వ్యర్ధ జలం మరొకటి. మన దేశంలో ప్రతి ఇంటి నుంచి రోజుకి సగటున 686 లీటర్ల వ్యర్ధజలం విడుదలవుతోంది. ఇవన్నీ యథాతథంగా జలవనరుల్లో కలవడం వల్ల మన ఆరోగ్యాలకు అంతులేని హాని జరుగుతోంది. బెంగళూరు, చెన్నైలాంటి ఒకట్రెండు నగరాల్లో మినహాయిస్తే మరెక్కడా వ్యర్ధ జలాల నిర్వహణ సమర్ధవంతంగా అమలుకావడం లేదు. జపాన్‌లోని టోక్యో, దక్షిణ కొరియాలోని సియోల్‌ వంటి నగరాల్లో ఏ ఇంటికి ఆ ఇంటిలోనే వ్యర్ధ జలాలను శుద్ధి చేసే విధానం అమలు చేస్తున్నారు. ఇలా శుద్ధిచేసిన నీటిని మరుగుదొడ్లలో ఫ్లషింగ్‌కు వినియోగిస్తున్నారు. మన దేశంలో కనీసం మురుగునీటి పారుదల వ్యవస్థను కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్ధత తాండవిస్తోంది. డ్రైనేజీలు పొంగి పొర్లి వీధుల్లో ప్రవహిస్తుంటాయి. అవన్నీ నదుల్లో కలుస్తుంటాయి. ఒక్క మూసీ నదిలోకే ప్రతి రోజూ 700 నుంచి 800ల మిలియన్‌ లీటర్ల మురుగునీరు కలుస్తోందంటే పరిస్థితి ఎంత భీకరంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాలు యుద్ధప్రతిపాదికన స్పందించాలి. చెరువుల, జలాశయాల పరిరక్షణకు పూనుకోవాలి. 

06:45 - October 4, 2016

చెరువుల పరిరక్షణ ఇప్పుడో పెద్ద సవాలుగా మారుతోంది. ఓ వైపు పెద్దపెద్ద చెరువులు ఆక్రమణలకు గురవుతుంటే, మరోవైపు మిగిలినవి కాలుష్య కాసారాలుగా మారి కాలకూట విషాన్ని చిమ్ముతున్నాయి. చెరువులను పరిరక్షించుకోకపోతే, మన పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన చాలామంది ఔత్సాహికులు చెరువుల పరిరక్షణకు తమ వంతు కృషి సాగిస్తున్నారు. హైదరాబాద్‌ లో చెరువుల పరిరక్షణ నినాదంతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్న సోషల్‌ యాక్టివిస్టులు దీక్షితులుగారు, ఆనంద్‌ మోహన్‌ టెన్ టివి జనపథంలో విశ్లేషించారు. వారు ఎలాంటి సూచనలు..సలహాలు అందించారో వీడియో క్లిక్ చేయండి. 

06:43 - October 4, 2016

కోల్ కతా : స్వదేశంలో ఆడిన 250వ టెస్ట్‌లో టీమిండియాకు తిరుగేలేకుండా పోయింది. నాలుగో ఇన్నింగ్స్‌లో 376 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ జట్టు భారత బౌలర్ల ధాటికి మరోసారి తేలిపోయింది. 178 పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా సిరీస్‌ విజయంతో పాటు ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో కొహ్లీ అండ్‌ కో జోరు కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియాకు తిరుగేలేకుండా పోయింది. ఈడెన్‌ గార్డెన్స్‌ టెస్ట్‌లో భారత జట్టు నాలుగో రోజే సంచలన విజయం సాధించింది. స్వదేశంలో ఆడిన 250వ టెస్ట్‌లో టీమిండియాకు న్యూజిలాండ్‌ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ మెరుపులు, సాహా ఫైటింగ్‌ హాఫ్‌ సెంచరీతో న్యూజిలాండ్‌ ముందు 376 పరుగుల భారీ లక్ష్యాన్నుంచింది. నాలుగో ఇన్నింగ్స్‌లో 376 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్‌ టీమ్‌ భారత బౌలర్ల ధాటికి మరోసారి తేలిపోయింది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో కివీ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు.

197 పరుగులకే...
టిమ్‌ లాథమ్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవ్వడంతో న్యూజిలాండ్‌ 197 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అశ్విన్‌, జడేజా, షమీ పోటీలు పడి వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 178 పరుగుల తేడాతో నెగ్గిన భారత జట్టు ...మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతంచేసుకుంది. ఈ విజయంతో టీమిండియా ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. మొత్తంమీద కోల్‌కతా టెస్ట్‌ విజయంతో సిరీస్‌ సొంతం చేసుకోవడంతో పాటు...ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌ ప్లేస్‌కు చేరుకుని కొహ్లీ అండ్‌ కో సంచలనం సృష్టించింది. 500వ టెస్ట్‌, స్వదేశంలో 250 టెస్టుల్లో సాధించిన చరిత్రాత్మక విజయాలతో సొంతగడ్డపై సంప్రదాయ టెస్ట్‌ ఫార్మాట్‌లో భారత్‌కు తిరుగేలేదని మరోసారి రుజువైంది. మరి ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో కొహ్లీ అండ్‌ కో ఇదే స్థాయిలో చెలరేగాలని భారత క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. 

06:38 - October 4, 2016

జమ్మూ కాశ్మీర్ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ మళ్లీ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. ఒకటి కాదు రెండు కాదు ఐదు సార్లు భారత పోస్టులపై కాల్పులకు తెగబడింది. పాక్‌ కాల్పులను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేపట్టిన సర్జిక్ దాడులను జీర్ణించుకోలేని పాకిస్థాన్- నియంత్రణ రేఖ వద్ద ఐదు‌సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకశ్మీర్‌ పూంచ్ జిల్లాలోని మండీ, సబ్జియా, కృష్ణగటీ, షాపూర్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్‌ కాల్పులను భారత బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయి. 120 ఎంఎం, 80 ఎంఎం మోర్టార్ తదితర చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు సాధారణ పౌరులు స్వల్పంగా గాయపడ్డారు. ఉత్తర పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని బీఎస్ఎఫ్ పోస్ట్‌పై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. కాల్పులతో భారత సైన్యం దృష్టి మరల్చి ఉగ్ర వాదులను భారత్‌లోకి చొప్పించుందుకు పాక్ తీవ్రంగా యత్నిస్తోంది. ఆదివారం రాత్రి బారాముల్లాలో ఆర్మీ క్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఓ జవాన్ అమరుడయ్యాడు. అమర జవాన్‌ నితీన్‌ కుమార్‌కు అధికారులు, సైనికులు ఘనంగా నివాళులర్పించారు.

పావురం ద్వారా ఉత్తరం..
ఉరీ, బారముల్లాలో ఉగ్రదాడుల నేపథ్యంలో రాజధాని ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సాయుధ బలగాలతో గస్తీ చేపట్టాలని అన్ని పోలీస్‌ స్టేషన్లకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని మాల్స్‌, హాస్పిటల్స్, హోటల్స్‌, బస్టాండ్‌లు, రద్దీగా ఉండే ప్రదేశాలను భద్రతను పెంచారు. సిసిటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. ఇండియా, పాకిస్థాన్ స‌రిహ‌ద్దులో ప్రస్తుతం నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను శాంతింప‌జేసేందుకు రెండు దేశాల జాతీయ భ‌ద్రతా స‌ల‌హాదారుల మ‌ధ్య ఒప్పందం కుదిరినట్లు పాక్ ప్రధాని విదేశీ వ్యవ‌హారాల స‌ల‌హాదారు స‌ర్తాజ్ అజీజ్ వెల్లడించారు. భారత్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, పాక్ ఎన్ఎస్ఏ నజీర్ జంజువా ఫోన్లో మాట్లాడుకున్నట్లు స‌ర్తాజ్ తెలిపారు. పాకిస్తాన్‌ సరిహద్దులో ఓవైపు ఉద్రిక్తతలను తగ్గిద్దామంటూనే మరోవైపు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ తన దుర్బుద్ధిని మరోసారి చాటుకుంది. సరిహద్దులో పంజాబ్‌ పోలీసులు ఓ పావురాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదిని హెచ్చరిస్తూ పావురం ద్వారా ఉర్దూలో రాసిన మెసేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు.    

06:35 - October 4, 2016

చిత్తూరు : కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహన కార్యక్రమంతో ఉత్సవాలు మొదలయ్యాయి. తొలిరోజున మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో విహరించాడు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం సాయంత్రం గోధూళి వేళలో ధ్వజారోహన కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శ్రీనివాసుడికి బ్రహ్మ నిర్వహించే ఉత్సవాలకు ఆహ్వాన సూచికగా ఈ ధ్వజాన్ని వినువీధుల్లో ఎగురవేస్తారని భక్తులు విశ్వసిస్తారు.

ఆదివారం సాయంత్రం..
ఆదివారం సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ధ్వజారోహనతో ఉత్సవాలు జోరందుకున్నాయి. సోమవారం రాత్రి శ్రీవారు ఉభయ దేవేరులతో పెద్ద శేష వాహనంపై విహరించారు. ఈనెల 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శ్రీనివాసుడు ఒక్కో వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. చివరి రోజున శ్రీవారి సుదర్శన చక్రానికి శాస్త్రోక్తంగా స్నపనం చేస్తారు. ఆ సాయంత్రం ధ్వజావరోహనతో ఉత్సవాలు ముగుస్తాయి.

సీఎం పట్టు వస్త్రాలు..
శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల విద్యుద్దీకాంతులతో వెలుగులీనుతోంది. ఇటు పుష్పాలు సౌగంధం, విద్యుత్‌ సౌరభం.. తిరుమల శ్రీవారి ఆలయ శోభను ద్విగుణీకృతం చేస్తోంది. మహాద్వారం గోపురం నుంచి గర్భాలయం వరకు ప్రత్యేక అలంకరణలు చేశారు. తిరుమల అంతటా విద్యుత్‌ దీపాలంకరణలు, శ్రీవారి కటౌట్‌లు, తోరణాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. శ్రీవారి ఉత్సవాలను చూసేందుకు భక్తులు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు. 

06:33 - October 4, 2016
06:32 - October 4, 2016

విజయవాడ : ఏపీలోని అన్ని స్థాయిలో టిడిపి ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోయింది. పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేసింది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కానీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో టీడీపీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్న అసంతృప్తితో ఉన్న పార్టీ నాయకత్వం వీరికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లతోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో శిక్షణ ఇస్తారు. మొత్తం ఆరు సెషన్లలో 20 గంటలపాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.

ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లు...
ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంశాల్లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వీటిని ఎలా తిప్పికొట్టాలన్న విషయంలో శిక్షణ ఇస్తారు. హోదా, ప్యాకేజీ మధ్య ఉన్న తేడా, రాష్ట్రానికి ఏది లాభం వంటి అంశాలను విశదీకరిస్తారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం ఇస్తున్న నిధులపై అవగాహన కల్పిస్తారు. నాయకత్వ లక్షణాల పెంపు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై కూడా శిక్షణ ఇస్తారు. రాష్ట్ర విభజననాటి నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలు, ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లు, వీటిని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, జీడీపీ వృద్ధి వంటి అంశాలపై టీడీపీ ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు శిక్షణ ఇస్తారు. అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని.... ప్రజలతో ఎలా సత్సంబంధాలు కొనసాగించాలన్న అంశంపై అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణంతో టీడీపీ ప్రజా ప్రతినిధుల్లో ఎంతవరకు మార్పు వస్తుందో చూడాలి. 

06:29 - October 4, 2016

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుంది. టిపిసిసి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్త ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీని ప్రోరోగ్‌ చేయించి, బీఏసీ నిర్ణయానికి తూట్లు పొడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యింది. ఈ విషయంలో ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. రెండు పార్టీల మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పులా కొనసాగుతోంది. ఇప్పటికే అంశాలవారీగా సర్కారు విధానాలపై తీవ్రంగా విరుచుకుపడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు... జలదృశ్యం తర్వాత మరింతగా స్వరం పెంచారు. ఇప్పుడు ఆగస్టులో ఒకరోజు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాన్ని అస్త్రంగా చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్‌ చేయాలని నిర్ణయించారు.

పది రోజులు అసెంబ్లీ జరపాలని బీఏసీలో నిర్ణయం..
జీఎస్‌టీ బిల్లు ఆమోదం కోసం ఆగస్టు 30న ఒకరోజు అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే జీఎస్‌టీ బిల్లు ఆమోదం తర్వాత అసెంబ్లీని ప్రొరోగ్‌ చేయకుండా నిరవధిక వాయిదాలో ఉంచి మళ్లీ పునఃప్రారంభించాలని శాసనసభా కార్యకలాపాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. సెప్టెంబర్‌ 20 నుంచి పది రోజులు పాటు సమావేశాలు నిర్వహిస్తామని బీఏసీలో హామీ ఇచ్చింది. అయితే బీఏసీ నిర్ణయానికి విరుద్ధంగా ప్రభుత్వం అనుమతితో గవర్నర్‌ నరసింహన్‌ అసెంబ్లీని ప్రొరోగ్‌ చేశారు. దీనిపై మండిపడుతున్న కాంగ్రెస్‌ నేతలు... ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఆగస్టు 30 జరిగిన బీఏసీ మినిట్స్‌ కోసం కాంగ్రెస్‌ శాసనసభాపక్షం డిమాండ్‌ చేస్తోంది. శాసనమండలిలో కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే చిన్నారెడ్డి... బీఏసీ మినిట్స్‌ కోసం అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంకు లేఖ రాశారు.

ప్రభుత్వానికి అసెంబ్లీపై గౌరవంలేదంటున్న కాంగ్రెస్‌..
బీఏసీ మినిట్స్ అందిన తర్వాత పరిశీలించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అసెంబ్లీని ప్రొరోగ్‌ చేయడం ద్వారా ప్రభుత్వానికి శాసనసభపై గౌరవంలేదన్న వాదాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. సభా సంప్రదాయాలు, ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వం కాలరాసిందని విమర్శిస్తున్నారు. శాసనసభన్నా, శాసనసభ్యులన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గౌరవంలేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రివిలెజ్‌ నోటీసు ఇస్తే... రెండున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో సీఎంపై ఇదే మొదటి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అవుతుంది. 

06:26 - October 4, 2016

హైదరాబాద్ : 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ కొత్త జిల్లాలతో 27కు చేరుతాయని అందరూ భావించారు. అదేవిధంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు. తాజాగా టీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో మూడు జిల్లాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఆ జిల్లాల సంఖ్య 30కి చేరింది. అయితే చివరగా ఆసిఫాబాద్‌ను కూడా జిల్లాగా ప్రకటించాలని సీఎం భావించడంతో ఆ జాబితా 31కి చేరింది. హైపవర్‌ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించి దసరాలోగా తుది నిర్ణయం ప్రకటిస్తారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రకటించిన ముసాయిదా ప్రకారం 17 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు జనగామ, సిరిసిల్ల, గద్వాల జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ఎంపి కేకే నాయకత్వంలో హైపవర్ కమిటీ వేసి అధ్యయనం చేసి.. రెండు మూడు రోజుల్లోనే నివేదిక తెప్పించుకుని తుది నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. చిన్న జిల్లాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ కోసం జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెరిగినా అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు.

చిన్న జిల్లాల ద్వారానే అభివృద్ధి సాధ్యం..
మొదటి, రెండవ రోజు చర్చల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపై నాయకుల్లో ఏకాభిప్రాయం వ్యక్తమయింది. దీని ప్రకారం వరంగల్ జిల్లాలో 5, కరీంనగర్ జిల్లాలో 4, మహబూబ్ నగర్ జిల్లాలో 4, మెదక్‌లో 3, రంగారెడ్డిలో 3, నల్గొండలో 3, ఆదిలాబాద్‌లో 3, నిజామాబాద్ లో 2, ఖమ్మంలో 2, హైదరాబాద్ లో 1 చొప్పున జిల్లాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణలో 31 జిల్లాలు ఏర్పాటుకు అనుగుణంగా కసరత్తు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనే పేరు పెట్టాలని, వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లా పేరును వికారాబాద్‌గా ఉంచాలని, మహబూబాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు మహబూబాబాద్ పేరునే ఉంచాలని నిర్ణయించారు. సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడే జిల్లాకు రాజన్న పేరు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలు ఏర్పాటు అయ్యే విషయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందన్నారు.

సిరిసిల్ల జిల్లాకు రాజన్న పేరు...
కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్, జమ్మికుంట మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే కమలాపూర్, ఎల్కతుర్తి, బీమదేవపూర్ మండలాలను వరంగల్ అర్బన్ జిల్లాలో కలపాలని..హుస్నాబాద్, కోహెడ్ మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. పెద్దపల్లిని నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలని నిర్ణయించారు. ఖమ్మం జల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపాలని,..వరంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపాలని నిర్ణయించారు. కరీంనగర్ జిల్లాలో కొత్తగా రుద్రంగి మండలం ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఆళ్లపల్లి, కరకగూడెం, చుంచుపల్లి, లక్ష్మిందేవిపల్లి, సుజాతనగర్, అన్నపురెడ్డి మండలాల ఏర్పాటు విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ప్రతిపాదిత జనగామ జిల్లాలో కొత్తగా స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భూపాలపల్లి జిల్లాలోని ములుగుకున్న ప్రాధాన్యం, గిరిజన జనాభాను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకంగా నిధులు కూడా విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని వరంగల్ నగరంలోనే ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో గాదిగూడ, సిరికొండ మండలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ కేంద్రంగా మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆసిఫాబాద్ జిల్లాను ప్రతిపాదించారు.

మున్సిపాలిటీగా పెద్దపల్లి నగర పంచాయతీ..
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ..2022 నాటికి తెలంగాణ బడ్జెట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందన్నారు. అప్పటికి తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తవుతాయి. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణం, మిషన్ భగీరథ, రహదారుల నిర్మాణం లాంటి భారీ పెట్టుబడులతో చేసే పనులు కూడా పూర్తవుతాయన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సీఎం అన్నారు. కాబట్టి మన ప్రణాళిక, ఆలోచన రాబోయే ఏడెనిమిదేళ్ళ కోసం జరగాలన్నారు. రొటీన్ ప్రభుత్వాలకు భిన్నంగా..మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేసుకుపోవాలని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు సూచించారు. 

పంజాబ్ లో పట్టాలు తప్పిన రైలు..

పంజాబ్ : జీలం ఎక్స్ ప్రెస్ రైలు తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. జలంధర్ - లుధియాన మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈఘటనలో ఇద్దరికి గాయాలయినట్లు తెలుస్తోంది. 

నేడు వైద్య విద్య నాలుగో విడత కౌన్సెలింగ్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా వైద్య విద్య సీట్ల భర్తీ నాలుగో విడత కౌన్సెలింగ్ మంగళవారం నిర్వహించనున్నారు. మూడో విడత కౌన్సెలింగ్ లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

రేపు ఎన్నికల కమిషనర్ల సదస్సు..

హైదరాబాద్ : అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారుల సమావేశం బుధవారం జరగనుంది. బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్ లో జరిగే ఈ సదస్సును తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు.

 

నేడు ద్రవ్య పరపతి సమీక్ష..

ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షను ఆర్ బీఐ మంగళవారం నిర్వహించనుంది. సమీక్షలో వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకొనేందుకు ఏర్పాటు చేసిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి సమావేశం సోమవారం ప్రారంభమైంది. 

కావేరీ బోర్డుపై సుప్రీంకు నేడు కేంద్రం నివేదిక..

ఢిల్లీ : కావేరీ జల నిర్వాహణ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు లేదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. పార్లమెంట్ కు అధికారం ఉందని స్పీష్టం చేశారు. కర్నాటక తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 

గోదావరికి పెరుగుతున్న వరద..

నిజామాబాద్ : గోదావరిలో రోజురోజుకూ వరద పెరుగుతోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. రిజర్వాయర్ ఇప్పటికే నిండటంతో 38 గేట్లను ఎత్తి వరద జలాలను దిగువకు వదులుతున్నారు. 

Don't Miss