Activities calendar

05 October 2016

22:00 - October 5, 2016

ఢిల్లీ : పిఓకేలో ఆర్మీ మెరుపు దాడుల తర్వాత రెండోసారి కాబినెట్‌ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. నియంత్రణ రేఖ వద్ద తాజా పరిస్థితులు, భద్రతపై ప్రధానికి కమిటీ వివరించింది. ఆర్మీ చిత్రీకరించిన సర్జికల్‌ స్ట్రయిక్స్ వీడియో ఫుటేజీని కేంద్రానికి అందజేసింది. మెరుపు దాడుల ఆధారాలను బయటపెట్టే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. సర్జికల్‌ స్ట్రైక్స్‌పై ఇష్టానుసారంగా మాట్లాడొద్దని ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులను హెచ్చరించారు.

సర్జికల్‌ దాడుల ఆధారాలను విడుదల చేయవద్దని నిర్ణయం
పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఇండియన్‌ ఆర్మీ జరిపిన మెరుపు దాడుల తర్వాత ప్రధాని మోది అధ్యక్షతన రెండోసారి కాబినెట్‌ భద్రతావ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక, రక్షణ, హోంశాఖ మంత్రులతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. సర్జికల్‌ దాడుల తర్వాత పాక్‌-భారత్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత, భద్రత తదితర అంశాలపై సమావేశం చర్చించింది.

క‌శ్మీర్‌లో వంద మంది ఉగ్రవాదులు మాటు
నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ ఆక్రమిత క‌శ్మీర్‌లో వంద మంది ఉగ్రవాదులు మాటు వేసిన‌ట్లు కేబినెట్ క‌మిటీ ఆన్ సెక్యూరిటీ ప్రధాని మోదీకి వివ‌రించింది. దీనికి సంబంధించిన నివేదికను జాతీయ భ‌ద్రత స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ ప్రధానికి అంద‌జేశారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన స‌మాచారాన్ని దోవ‌ల్ త‌న నివేదిక‌లో పొందుప‌రిచారు.

సరిహద్దులో సుమారు 12 ఉగ్రస్థావ‌రాల‌ను గుర్తింపు
మెరుపు దాడుల త‌ర్వాత ఉగ్రస్థావ‌రాల‌కు పాకిస్థాన్ ఆర్మీ ర‌క్షణ క‌ల్పిస్తున్నట్లు సీసీఎస్ ప్రధానికి తెలిపింది. సరిహద్దులో సుమారు 12 ఉగ్రస్థావ‌రాల‌ను గుర్తించిన‌ట్లు వెల్లడించింది. శీతాకాలంలో ద‌ట్టమైన పొగ మంచు క‌మ్ముకుంటుందని, ఇదే అదునుగా ఉగ్రవాదుల‌ను స‌రిహ‌ద్దు దాటించి మ‌రోసారి భార‌త్‌లో దాడులు చేయించ‌డానికి పాక్‌ ప్రణాళిక చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. సర్జికల్‌ దాడుల తర్వాత ఉగ్రవాదులు కొత్త ల్యాంచ్‌ ప్యాడ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం.

సర్జికల్‌ దాడులఆధారాలను చూపాలంటూ కాంగ్రెస్‌, ఆప్‌ చేసిన డిమాండ్‌
పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఇండియన్‌ ఆర్మీ జరిపిన సర్జికల్‌ దాడులకు సంబంధించిన ఆధారాలను చూపాలంటూ కాంగ్రెస్‌, ఆప్‌ చేసిన డిమాండ్‌ను కమిటీ తోసిపుచ్చింది. సర్జికల్‌ దాడుల ఆధారాలను విడుదల చేయవద్దని సమావేశం నిర్ణయించినట్లు సమాచారం. సర్జికల్‌ దాడులపై ఆర్మీ ఇచ్చిన సమాచారంపై తమకు నమ్మకం ఉందని కేంద్రం పేర్కొంది. దీన్ని ఎవరు నమ్మినా...నమ్మకపోయినా తమకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతకుముందు సర్జికల్‌ దాడులకు సంబంధించిన ఆధారాలను బయట పెట్టేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.

భారత్ చేసిన దాడిలో ఏడు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం
యూరి ఉగ్రవాద దాడి ఘటన తర్వాత గతవారం పిఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై ఆర్మీ మెరుపు దాడులు జరిపింది. ఈ దాడిలో ఏడు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశామని, చాలా మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్‌ మాత్రం భారత్‌ ఎలాంటి దాడులు జరపలేదని కొట్టి పారేసింది. పాక్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, సర్జికల్‌ దాడులకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. 

21:53 - October 5, 2016

నల్లగొండ : దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు పెరగాల్సిన అవసరం ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ రాఘవులు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం సర్జికల్ స్ట్రయిక్స్ ను వినియోగించుకొని ఉద్రిక్తత పెంచడం సరైన పద్ధతి కాదన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలకు రాఘవురలు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఉరి ఘటన..మోదీ ప్రభుత్వం తీరు
ఉరి ఘటన అనంతరం.. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ రాఘవులు తప్పుపట్టారు. సర్జికల్ దాడులు గతంలో కూడా జరిగాయని, దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం... రాజకీయ ప్రయోజనాల కోసమేనని అభిప్రాయపడ్డారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండురోజుల పాటు నిర్వహించనున్న ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి 150 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మల్లు స్వరాజ్యం
సూర్యాపేటలోని సీపీఎం కార్యాలయం నుంచి సమావేశాల ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరులైన సీపీఎం కార్యకర్తలు, నేతలు, ప్రజాతంత్రవాదులు, ఉరి ఘటనలో అసువులు బాసిన సైనికులకు సమావేశం ప్రారంభంలో నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడారు. దేశంలో దళితులపై జరుగతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు.

శాస్త్రీయ లేకుండా జిల్లా విభజన : తమ్మినేని
ఎటువంటి శాస్త్రీయ ప్రతిపాదిక లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటును సీపీఎం స్వాగతిస్తోందన్న ఆయన సంఖ్యాశాస్త్రం ప్రకారం జిల్లాల సంఖ్యను నిర్ణయించడాన్ని తప్పుపట్టారు.

ఈ నెల 17వ తేదీ నుంచి 'మహాజన పాదయాత్ర'కు శ్రీకారం : తమ్మినేని
ప్రజలను చైతన్య పరిచి.. ప్రత్యామ్నాయ అభివృద్ధి ప్రణాళికను ప్రజల ముందు పెట్టేందుకే ఈ నెల 17వ తేదీ నుంచి 'మహాజన పాదయాత్ర'కు శ్రీకారం చుట్టామని చెప్పారు తమ్మినేని. రెండురోజుల పాటు జరుగుతున్న ఈ సమావేశాల్లో 'మహజన పాదయాత్ర', కొత్త జిల్లాల ఏర్పాటు, పార్టీ విస్తరణ, నూతన జిల్లా కమిటీల ఏర్పాటు, తదితర విషయాలపై చర్చించారు. రెండవ రోజు సాయంత్రం ఇందిరమ్మ కాలనీని రాష్ట్ర నేతలు సందర్శించే అవకాశముంది. 

21:47 - October 5, 2016

విజయవాడ : ఇసుక అక్రమ తవ్వకాలపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. నియోజవర్గాల్లో అక్రమాలు జరిగితే ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. గురువారం నుంచి ఇసుక అక్రమ తవ్వకాలపై దాడులు జరపాలని ఆదేశించారు. గుంటూరులో రెండోరోజు టీడీపీ నిర్వహిస్తున్న వర్క్‌షాపులో పాల్గొన్న చంద్రబాబు నేతలకు పలు కీలక సూచనలు చేశారు.

ఇసుక అక్రమాలపై చంద్రబాబునాయుడు ఆగ్రహం
ఇసుక అక్రమాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో జరగుతున్న టిడిపి శిక్షణ తరగతుల రెండోరోజు... ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌ల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక అక్రమాలను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని హెచ్చరించారు. కిందిస్థాయి నేతలు తప్పుచేస్తే..ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలదే బాధ్యతని తేల్చిచెప్పారు. మీ స్థాయిలో తప్పులు సరిదిద్దకపోతే..నా స్థాయిలో జోక్యం ఉంటుందంటూ కటువుగా హెచ్చరించారు. ఒకరిద్దరిపై వేటువేస్తే వ్యవస్థ మొత్తం దారిలోకి వస్తుందని కూడా సీఎం అన్నారు.

తప్పు సరిదిద్దుకోకపోతే నా స్థాయిలో జోక్యం ఉంటుందన్న సీఎం
ఇళ్ళ నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలపైనా చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. జియో ట్యాగింగ్ చేస్తే 4,100 కోట్ల విలువైన ఇళ్లు లేవని తేలిందన్నారు. విచారణలో ఇళ్ళు ఉన్నాయని తేలితేనే డబ్బులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. బేస్‌మెంట్ కూడా లేని ఇళ్లకు డబ్బులు ఎలా ఇస్తామని చంద్రబాబు ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే సహించనని ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్ ఇచ్చారు. చనిపోయిన వారిపేరిట ఇప్పటికీ పెన్షన్ డ్రా చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 వేల మంది పేరిట పెన్షన్‌ డ్రా చేసినట్టు స్మార్ట్ పల్స్ సర్వేలో తేలిందన్నారు. మరణించిన వారి పేరిట కిందిస్థాయి సిబ్బంది పెన్షన్లు డ్రా చేస్తున్నా..ఎమ్మెల్యేలకు ఈ విషయంలో బాధ్యత లేదా అని ప్రశ్నించారు. గ్రామాల్లో చనిపోయిన వారి పేరిట పెన్షన్లు డ్రా చేస్తుంటే..జన్మభూమి కమిటీలు ఏం చేస్తున్నాయని చంద్రబాబు ప్రశ్నించారు.

జియో ట్యాగింగ్‌తో రూ. 4,100 కోట్లు విలువైన ఇళ్లు లేవు-సీఎం
ఇక సాంకేతిక శిక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నేతలకు కంప్యూటర్ పాఠాలు బోధించారు. కైజాలా యాప్‌ వినియోగంతో పాటు కోర్‌ డాష్‌ బోర్డు ఉపయోగించడంపై కంప్యూటర్‌ ల్యాబ్‌లో చంద్రబాబు స్వయంగా శిక్షణ ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా..ప్రతిఒక్కరు అప్‌డేట్‌ అవ్వాలని లేకపోతే అవుట్‌డేట్‌ అవ్వకతప్పదని ఆయన నేతలను హెచ్చరించారు. రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ కేవలం 300కోట్లతో పూర్తిచేయడం ఒక వినూత్న ప్రయత్నమన్న చంద్రబాబు..భూగర్భ కేబుల్ వేస్తే 3వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యేదని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత కేఎల్‌ యూనివర్శిటీ విద్యార్థులు తయారు చేసిన డ్రోన్లతో వ్యవసాయం, అగ్రికల్చర్‌ యూప్‌ తయారీ వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను చంద్రబాబు పరిశీలించారు. గురువారం మూడోరోజు జరిగే వర్క్‌షాపులో నాయకత్వ లక్షణాలు, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి..ప్రజలకు ఎలా స్పూర్తిగా నిలవాలనే అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. 

21:44 - October 5, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాలు ఓ కొలిక్కి వచ్చాయో..లేదో... తెలంగాణలో తాజాగా డివిజన్లు, మండలాల ఆందోళనలు పెరిగిపోతున్నాయి. తమ ప్రాంతాన్ని మండలంగా ప్రకటించాలని , తమ ప్రాంతాన్ని డివిజన్‌గా ప్రకటించాలని పలు చోట్ల దీక్షలు, ఆందోళనలకు దిగుతున్నారు.

మండలాలు, డివిజన్ల ఆందోళనలు
తెలంగాణలో కొత్త జిల్లాలు ఓ కొలిక్కి వచ్చినా.. తాజాగా మండలాలు, డివిజన్ల ఆందోళనలు పెరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భద్రాచలంను జిల్లాగా ప్రకటించాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజకయ్య డిమాండ్‌ చేశారు. వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాల్‌పల్లి జిల్లాలో కలపడాన్ని ఆయన తప్పు బట్టారు. తక్షణమే ఈ రెండు మండలాలను భద్రాచలం నియోజకవర్గంలోనే కొనసాగించాలన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రాలో విలీనమైన నాలుగు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు.

కల్వకుర్తిని రెవిన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్‌
మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిని రెవిన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ 45 రోజులుగా రిలే నిరాహార దీక్ష, ఆమరణ దీక్ష, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. కల్వకుర్తిని రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పాలమూర్‌ చౌరస్తాలో అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో రాస్తోరోకో నిర్వహించారు. వెంటనే కల్వకుర్తి డివిజన్‌ ప్రకటించకపోతే గ్రామాల్లోని టీఆర్‌ఎస్‌ జెండాలను పీకేస్తామని, దసరా రోజు కేసీఆర్‌ దహన కార్యక్రమం చేపడతామని నిరసనకారులు హెచ్చరించారు.

రఘునాథపురం ను మండలం కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌
నల్గొండ జిల్లాలోని రఘునాథపురం ను మండలం కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ.. సమీప గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పొట్టిమర్రి క్రాస్‌రోడ్డు వద్ద మహిళలు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. రఘునాథపురానికి మండలానికి ఉండాల్సిన అన్ని అర్హతలున్నాయని గ్రామస్తులు ధర్నాకు దిగారు. స్థానిక ఎమ్మార్వో రాములు ఘటనాస్థలానికి వచ్చి పై అధికారులకు తెలియజేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా వరమించారు.

బీచుకుంద మండలంలోని పెద్దకొడపుగల్‌ను మండలంగా డిమాండ్
నిజామాబాద్‌ జిల్లా బీచుకుంద మండలంలోని పెద్దకొడపుగల్‌ను మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ప్రజలు, అఖిలపక్ష నేతలు రోడ్డుపై బైటాయించి నినాదాలు చేశారు. స్థానిక ఎస్సై మండల డిమాండ్‌ను పై అధికారులకు తెలియజేస్తామనడంతో గ్రామస్తులు రాస్తోరోకో విరమించారు. ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాకపోతే సీఎం వద్దకు బస్సుయాత్ర చేపడతామని స్థానిక నేతలు హెచ్చరించారు. 

21:40 - October 5, 2016

హైదరాబాద్ : ప్రజాభీష్టం మేరకే తమ పాలన సాగుతోందని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటులో కానీ.. చీప్‌లిక్కర్‌, ఫాస్ట్‌ పథకాలపై వెనక్కి తగ్గడంలో గానీ.. ప్రజాభీష్టం మేరకే వ్యవహరించినట్లు తెలిపారు. నయీం కేసును సమర్థంగా విచారించే సాంకేతికత, సత్తా రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

డీ.కే అరుణ కోసం గద్వాలను జిల్లా చేయడం లేదని కేటీఆర్‌ వివరణ
ప్రజల అభీష్టం మేరకే రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ప్రజలు కోరారు కాబట్టే సిరిసిల్లను జిల్లా చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ సందర్భంగా పలు అంశాలపై కేటీఆర్‌ మాట్లాడారు. డీకే అరుణ కోసం గద్వాల జిల్లా చేయడం లేదని.. ప్రజలు కోరారు కాబట్టే.. గద్వాల, జనగాం, ఆసిఫాబాద్‌ జిల్లాలు ఏర్పడుతున్నాయన్నారు. కొత్త జిల్లాల వల్ల పథకాలు నేరుగా అర్హులైన లబ్దిదారులకే చేరతాయన్నారు. అధికార యంత్రాంగానికీ తమ జిల్లాలోని కుటుంబాల స్థితిగతులు తెలుస్తాయని అన్నారు. కల్వకుర్తి రెవిన్యూ డివిజన్‌ కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీ చేపట్టిన ధర్నాలో.. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి.. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ తీవ్రంగా ఆక్షేపించారు. చాలాఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ వాళ్లకు కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌ చేయాలని తెలియదా..? అని ప్రశ్నించారు.

నయీం కేసును సీబీఐతో విచారణ చేయించడం ఎందుకని కేటీఆర్
సీఎం క్యాంపు ఆఫీస్‌లో ప్రజా దర్బార్ పెట్టడం లేదన్న విపక్షాల కామెంట్స్‌పై స్పందించిన కేటీఆర్‌.. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులే సమస్యలను పరిష్కరిస్తుంటే ఇక దర్బార్‌లు ఎందుకని ప్రశ్నించారు. నయీం ఎన్‌కౌంటర్‌పై తమ ప్రభుత్వానికి మంచిపేరే వచ్చిందన్న కేటీఆర్‌... నయీంను పెంచి పోషించింది.. కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు కాదా అని అని ప్రశ్నించారు. నయీంను 18 ఏళ్లు భరించినప్పుడు విచారణపై ఇంకొన్నిరోజులు ఆగలేరా..?అని ప్రశ్నించారు. నయీం కేసులో సమర్థవంతమైన స్టేట్ పోలీస్ ఉండగా.. సీబీఐతో విచారణ చేయించడం ఎందుకన్నారు.

దసరా మరుసటి రోజున అమెరికా కేటీఆర్‌
దసరా మరుసటి రోజున అమెరికా వెళుతున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. వారం పాటు సాగే పర్యటనలో టీ-హబ్‌కు అనుబంధంగా ఈనెల 14న అమెరికాలో టీ-బ్రిడ్జిని ప్రారంభిస్తామన్నారు. దీంతోపాటు.. మెదక్‌జిల్లా సుల్తాన్‌పూర్‌లో 400 ఎకరాల్లో తలపెట్టిన అడ్వమెట్‌ పార్క్‌ గురించీ అమెరికాలో స్టడీ చేస్తామన్నారు. అడ్వమెట్‌ మెడికల్‌ డివైజెస్‌లో కూడా ప్రసంగిస్తున్నానని... నిరుడు ఇదే సెమినార్‌లో హిల్లరీ క్లింటన్‌ కూడా ప్రసంగించారని కేటీఆర్‌ తెలిపారు. 

21:25 - October 5, 2016

హైదరాబాద్ : దసరా రోజు నేతలు కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట, మెదక్ జిల్లాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొననున్నారు. కొత్త జిల్లాలను ప్రారంభించనున్న నేతల వివరాలు ఇలా వున్నాయి. సిద్ధిపేట,మెదక్ జిల్లాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే జనగామ - మండలి ఛైర్మన్ స్వామిగౌడ్,భూపాలపల్లి- స్పీకర్ మధుసూదనాచారి,వరంగల్ రూరల్ - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి,జగిత్యాల - డిప్యూటీ సీఎం మహమూద్ అలీ,యాదాద్రి - హోంమంత్రి నాయిని ,పెద్దపల్లి - మంత్రి ఈటల రాజేందర్ ,కామారెడ్డి - మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి,మంచిర్యాల - మంత్రి పద్మారావు,వికారాబాద్ - మంత్రి మహేందర్‌రెడ్డి ,సిరిసిల్ల- మంత్రి కేటీఆర్ ,ఆసిఫాబాద్- మంత్రి జోగు రామన్న ,నిర్మల్ జిల్లా - మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి,గద్వాల జిల్లా - మంత్రి తలసాని శ్రీనివాస్,నాగర్ కర్నూల్ జిల్లా - మంత్రి లక్ష్మారెడ్డి,సూర్యాపేట జిల్లా - మంత్రి జగదీష్‌రెడ్డి ,కొత్త గూడెం జిల్లా - మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు,మహబూబాబాద్ జిల్లా - మంత్రి చందూలాల్  వనపర్తి జిల్లా - మంత్రి జూపల్లి కృష్ణారావు,మల్కాజ్‌గిరి - సీఎస్ రాజీవ్‌శర్మ లు కొత్త జిల్లాను దరసరా రోజు ప్రారంభించనున్నారు. 

20:39 - October 5, 2016

అనగనగా ఓ కాన..ఆ కానల ఓ పులిరాజు. ఆ పులిరాజుకు మస్తు ఆకలేసిండు..కానంతా తిరగినా ఏమీ దొరకలే..దేవులాడగా దేవులాడగా ఓ సెట్టుమీద ఓ కోతి కనిపించింది మన పులిరాజుకు. మరిజాగెందుకని సెట్టేక్కేసిండు పులిరాజు, కోతిని తిననీకు మస్తు ప్రయత్నించుండు. అసలే అది కోతాయే..పులికి సిక్కుతాదా మరి..పులిరాజుని నానా తిప్పలు పెట్టింది. కిందికెల్లితే మీదికీ మీదికెలితే కిందికి ఆఖరికి కపిరాజు దొరకని మన పులిరాజు ఢాంమని కింద బొక్కబోర్లా పడిండు..కోతిని తిననీకి బోయి బొక్కబోర్ల పడ్డ పులిరాజు .ముదురుతున్న జిల్లాల లొల్లి..33 అన్నరు..ఇంకెన్ని మారనున్నయో చూద్దారి..ములుగు సంగతేంటంటున్న జనాలు..సమ్మక్క సారక్క సంగతేంటని సీతక్క లొల్లి..ఓ కాడ పాలాభిషేకాలు..ఓ కాడ శాసనార్థాలు కేసీఆర్ కు.. ఆంధ్ర సచివాలం ఆడబిడ్డలకు పసుపు కుంకుమ..పండ్లు పెట్టిన నన్నపనేని రాజక్క. చారన కోడి బారానా మసాలన్నట్లుగా వుందిగీ సంగతి...పుట్టినదినం నాడు చెరువులో చేపపిల్లల్ని ఏసిన ప్లానింగ్ కమిషనర్.మనసు పడిన కథల సభల ..ఆయనకిద్దరు గలాటా..కొట్లాటల గోల..టక్కరాయన సుబ్బారెడ్డి అవయవాలను దానం జేసిన కుంటుంబీకులు..బ్యాంకును దోసేందుకు పేద్ద ఏడు నెల్లు కట్టపడి సొరంగం తవ్విన దొంగలు..బ్యాంక్ ల ఒక్క పైసగూడ దొరలేదుల్లా..

మరో నాలుగు కమిషనరేట్లు?..

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా డీజీపీ కార్యాలయంలో పోలీసు శాఖపై తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా 82 పోలీస్‌ స్టేషన్లు, 22 సర్కిళ్లు, 22 సబ్‌ డివిజన్లు అవసరమన్నారు. అనంతరం డీజీపీ అనురాగ్‌ శర్మ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న నాలుగుతో పాటు మరో నాలుగు కమిషనరేట్లకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్లు ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. రామగుండం కమిషరేట్‌కు ఐజీ స్థాయి అధికారిని నియమించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

19:56 - October 5, 2016

రామావతారం ఎత్తిన ప్రధాని మోదీ..

ఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రశిబిరాలపై సర్జికల్ దాడులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన మోదీ ఇందుకోసం 'రామా'స్త్రాన్ని ప్రయోగించారు. ఉగ్రవాదులకు స్వర్గధామంగా పాక్‌ను మలిచిన ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ పదితలల 'రావణాసురుడు'గా నిలిచారు. సర్జికల్ దాడులకు సాక్ష్యాలేవంటూ నిలదీసి ఇండియన్ ఆర్మీ సైనిక సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం ద్వారా పాక్ 'హీరో'గా నిలిచిన ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ 'మేఘనాధుడు' (రావణాసురిడి కుమారుడు ఇంద్రజిత్) పాత్ర పోషించారు. రామాయణంలోని పాత్రలను పోలుస్తూ వారణాసిలో బుధవారంనాడు ఈ పోస్టర్లు వెలిసాయి.

పాక్ బోట్ స్వాధీనం..

గుజరాత్‌ : కచ్ తీర ప్రాంతంలో పాకిస్థాన్ బోటును బీఎస్‌ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. తీర ప్రాంతం వెంబడి బోటులో వెళ్తున్న అనుమానితులను బీఎస్‌ఎఫ్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. భారత్‌లో దాడులు చేయించడానికి పాకిస్థాన్ మరోసారి ప్రణాళిక రచిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. 

19:41 - October 5, 2016
19:38 - October 5, 2016

ఢిల్లీ : ఓ సైంటిస్టు సృష్టించిన సంచలనం ఇది...మాదక ద్రవ్యాల్లో సరికొత్త దనాన్ని చూపిస్తూ స్నేహితుల సహకారంతో పాటు తెలిసినవారి ద్వారా దొరికిన లింకులతో దేశ,విదేశాలకు డ్రగ్స్ తరలిస్తున్నారు...వందల కోట్లలో బిజినెస్ చేస్తున్న ఈ మాఫియాకు వెన్నుదన్నుగా ఉన్న ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌ దొరికిపోయాడు..ఇంకా ఇందులో ఎంతో మంది పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది...ఎన్‌సీబీ తీగలాగిన కొద్దీ బయటపడుతున్నాయి...

డ్రగ్స్‌ రాకెట్‌లో బయటపడుతున్న పెద్దోళ్లు..
భారీ ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్న మాదకద్రవ్యాల కేసులో లోతుగా శోధిస్తున్న నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు మరోకరిని అరెస్టు చేయడం కలకలం రేపింది...ముఠాకు సహకరించిన ఎయిర్‌ఫోర్స్‌ అధికారి రాజశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు...భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న జి.రాజశేఖరరెడ్డి నాలుగు రోజుల క్రితం అరెస్ట్ అయిన శాస్త్రవేత్త వెంకటరామారావుకు స్నేహితుడే...రాజ‌శేఖ‌ర్ నుంచి రూ.10లక్షల నగదు, ఐదు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. రాజశేఖర్‌ను ప్రాధమికంగా విచారించిన నార్కోటిక్‌ బ్యూరో అధికారులు అతన్ని అరెస్ట్‌ చేసి రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు...న్యాయస్థానం రాజశేఖర్‌కు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించడంతో వెంటనే జైలుకు తరలించారు....హైదరాబాద్‌, బెంగ‌ళూరులో ముఠా సభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్‌ చేసిన నార్కోటిక్‌ అధికారులు తాజాగా వింగ్‌ కమాండర్‌ అరెస్టు తో మొత్తం నలుగురయ్యారు...

వదిలేది కాదంటున్న ఆఫీసర్లు..
ఇదిలా ఉంటే డ్రగ్స్‌ ముఠాకు సూత్రధారి వెంకటరామారావు కాగా...అతనికిక పూర్తి సహకారం అందించిన అతని భార్య ప్రీతితో పాటు మరోకరు శంకర్‌రావులను అరెస్టు చేశారు...గత నెల 29న వీరిని అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారించగా భారీగా డ్రగ్స్ బయటపడింది.. ఆ తర్వాత వీరిని విచారించిన అధికారులకు తెలిసిన పేర్లతో పాటు ఎయిర్‌ఫోర్స్‌ వింగ్ కమాండర్ రాజశేఖర్‌రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు తేలింది..దీంతో ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆయనపై నిఘా పెట్టిన అధికారులు ఫోన్‌కాల్స్‌ రికార్డులను సేకరించారు..దీంతో రాజశేఖర్‌రెడ్డి కూడా డ్రగ్స్‌ ముఠాలో కీలకమని తేలింది...

స్నేహితుడితో కలిసి దందాలో రాజశేఖర్...
డ్రగ్స్‌ కింగ్‌గా మారిన సైంటిస్టు వెంకటరామారావుకు రాజశేఖర్‌రెడ్డి స్నేహితుడే..దీన్ని ఆసరాగా చేసుకుని రాజశేఖర్‌కు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించినట్లు తెలుస్తోంది... హైదరాబాద్‌ నుంచి డ్రగ్స్‌ను సులువుగా విమానంలోనే బెంగళూరుకు తరలించేవారు...ఇందుకు రాజశేఖర్‌రెడ్డి కూడా పూర్తి సహకారం అందించాడు..ఇందుకు గాను భారీ ఎత్తున డబ్బు ముట్టజెప్పేవారు...

సైంటిస్టు దొరకడంతో తప్పించుకునేయత్నం..
బెంగళూరు, హైదరాబాద్ ప్రధాన కేంద్రాలుగా సాగుతున్న ఈ డ్రగ్ రాకెట్ గురించి ఎన్‌సీబీ వర్గాలు వివరాలు సేకరించి, రాజశేఖరరెడ్డిని అరెస్టు చేసే సమయానికి అతడు గోవా పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది...దీంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు...ఇక మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేసియాలతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాలకు కూడా యాంఫెటమైన్ స్మగ్లింగ్ చేయడంలో రాజశేఖరరెడ్డిది కీలకపాత్ర అని తెలుస్తోంది...చాలాకాలం పాటు బెంగళూరులో పనిచేసిన అతడికి.. ఆ తర్వాత వైమానిక దళం ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్ వచ్చింది. ఈ కేసులో మరికొందరు వైమానిక దళం మాజీ అధికారులు కూడా ఉండే అవకాశం ఉందని, వాళ్లందరి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని అంటున్నారు...
మాదక ద్రవ్యాలను తయారీకి నగరాలే ఎంపిక
మాదక ద్రవ్యాలను తయారు చేయడం కోసం మహానగరంలోని పారిశ్రామిక కంపెనీలను ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు..ఎలాంటి అనుమానం రాకుండా పలు కంపెనీల్లో వీటిని తయారు చేసి అక్కడి నుంచి రహస్యంగా తరలిస్తున్నారు..ఇందులో ప్రధానంగా రసాయన పరిశ్రమలను ఎంచుకోవడం వల్ల ఎలాంటి అనుమానాలు రావడం లేదు...భారీగా పట్టుబడ్డ కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులకు మరికొంత మంది పాత్ర ఉన్నట్లు ఇప్పటికే సమాచారం.. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు బయటపడతారో చూడాలి...

రోజుకో మలుపు తిరుగుతున్న డ్రగ్స్ కేసు...
గడిచిన ఐదు రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న డ్రగ్స్‌ కేసు దర్యాప్తులో ఎన్‌సీబీ అధికారులకు కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే బెంగళూరులోని ఓ కంపెనీలో సైంటిస్టుగా పనిచేస్తున్న రామారావుతో పాటు ఆయన భార్య దొరకగా...వారి ద్వారా వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డి పట్టుబడ్డారు..అయితే మాదక ద్రవ్యాల రవాణాలో ఓ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన సిబ్బంది ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..దీనికి సంబంధించిన వివరాలు సేకరించిన ఎన్‌సీబీ అనుమానితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది..

విదేశాలకు వెళ్లడానికి ఎన్నో లింకులు..
హైదరాబాద్‌, బెంగళూరులలో కలిపి మొత్తం రూ.45 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ముడి పదార్థం తయారు చేసి బెంగళూరుకు ఎగుమతి చేస్తున్నారు..అక్కడ దాన్ని మరింత శుద్ధిచేసి వాడటానికి వీలుగా మాత్రల మాదిరిగా రూపొందించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఎన్‌.సి.బి. దర్యాప్తులో వెల్లడైంది. తయారీదారులెవరో తేలిపోయింది. విదేశాలకు ఎగుమతి చేసేటప్పుడు ఎవరెవరు సహకరిస్తున్నారన్న దానిపైనే ఇప్పుడు అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు...

19:31 - October 5, 2016

హైదరాబాద్ : ప్రజలకు దగ్గరయ్యేందుకు సోషల్‌మీడియాని అస్త్రంగా వాడుకోవాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో జనసేన పార్టీ పేరుతో ఖాతా తెరిచింది. అలాగే యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది. పార్టీకి నిర్మాణం, సిద్ధాంతాల సమాచారంతో పాటు.. పవన్‌ ప్రసంగ వీడియోలు ప్రజలకు అందుబాటులో ఉంచారు.

బహిరంగ సభలకే పరిమితమైన జనసేన..
ఇంతకాలం బహిరంగ సభలకే పరిమితమైన జనసేన.. ఇకపై ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సోషల్‌మీడియాను వినియోగించుకోవాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా.. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్లను తెరిచేసింది. వీటితోపాటు యూట్యూబ్‌ చానెల్‌నూ ప్రారంభించింది.

పార్టీకి సంబంధించిన ప్రతి అంశాన్ని సోషల్‌ మీడియా
పవన్‌ కల్యాణ్‌ అభిమానుల్లో అత్యధికులు యువతే. వీరంతా ఇంటర్నెట్‌ శావీలుగా ఉన్నారు. అందుకే సభలు, సమావేశాల కన్నా.. యువత అత్యధికంగా టచ్‌లో ఉండే సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేస్తే.. ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలు చేరే అవకాశం ఉందని జనసేనాని భావిస్తున్నారు. అందుకే సోషల్‌ నెట్‌వర్క్‌లో అకౌంట్లు తెరిచారని భావిస్తున్నారు. పార్టీకి సంబంధించిన ప్రతి అంశాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోవాలని పవన్‌ నిర్ణయించినట్లు ఆయన సన్నిహితుల కథనం.

ట్విట్టర్ వ్యాఖ్యలకు విశేష ఆదరణ
పవన్‌ కల్యాణ్‌ పలు సందర్భాల్లో వ్యక్తిగత ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా చేసిన వ్యాఖ్యలకు విశేష ఆదరణ లభించింది. ప్రత్యేక హోదాపైనా, భూసేకరణకు వ్యతిరేకంగా తుళ్లూరు ప్రాంత రైతులకు మద్దతుగాను ఆయన ట్వీట్ల ద్వారానే తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇప్పుడు అధికారికంగా పార్టీ సిద్ధాంతాలనూ సోషల్‌ మీడియా ద్వారానే ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతోపాటే.. జనసేన సిద్ధాంతాలు, పార్టీ ఆవిర్భావ వృత్తాంతాలను వివరిస్తూ.. పవన్‌ కల్యాణ్‌ స్వయంగా రాస్తున్న పుస్తకాన్నీ త్వరలోనే విడుదల చేయనున్నారు.

 

19:07 - October 5, 2016

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరామనీ..దానికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి ఈటెల పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో ఆరు లక్షల మంది విద్యార్థులున్నారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి ఈటల రాజేందర్ కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు అదనపు బియ్యం కోటా విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. పీడీఎస్‌కు సంబంధించి రూ.1640 కోట్ల బకాయిలున్నయని వెల్లడించారు. పీడీఎస్ బకాయిలను త్వరలో విడుదల చేస్తామని కేంద్రం హామీనిచ్చినట్లు పేర్కొన్నారు. కాగా తెలంగాణ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరామనీ, దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లుగా ఆయన పేర్కొన్నారు.

19:03 - October 5, 2016
19:01 - October 5, 2016

విజయవాడ : ఇసుక అక్రమాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో జరుగుతున్న టిడిపి శిక్షణా తరగతుల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఇసుకను ప్రవేశపెడితే..ఇసుకను అక్రమంగా రవాణా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కిందిస్థాయి నేతలు తప్పుచేస్తే ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జ్ లదే బాధ్యత అన్నారు. 

18:59 - October 5, 2016

హైదరాబాద్ : ప్రజలకు దగ్గరయ్యేందుకు సోషల్‌మీడియాని అస్త్రంగా వాడుకోవాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో జనసేన పార్టీ పేరుతో ఖాతా తెరిచింది. అలాగే యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది. పార్టీకి నిర్మాణం, సిద్ధాంతాల సమాచారంతో పాటు.. పవన్‌ ప్రసంగ వీడియోలు ప్రజలకు అందుబాటులో ఉంచారు.

జనసేన యూట్యూబ్‌ చానెల్‌
ఇంతకాలం బహిరంగ సభలకే పరిమితమైన జనసేన.. ఇకపై ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సోషల్‌మీడియాను వినియోగించుకోవాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా.. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్లను తెరిచేసింది. వీటితోపాటు యూట్యూబ్‌ చానెల్‌నూ ప్రారంభించింది.

సోషల్ నెట్ వర్క్ లో జనసేన
పవన్‌ కల్యాణ్‌ అభిమానుల్లో అత్యధికులు యువతే. వీరంతా ఇంటర్నెట్‌ శావీలుగా ఉన్నారు. అందుకే సభలు, సమావేశాల కన్నా.. యువత అత్యధికంగా టచ్‌లో ఉండే సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేస్తే.. ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలు చేరే అవకాశం ఉందని జనసేనాని భావిస్తున్నారు. అందుకే సోషల్‌ నెట్‌వర్క్ అకౌంట్లు తెరిచారని భావిస్తున్నారు. పార్టీకి సంబంధించిన ప్రతి అంశాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోవాలని పవన్‌ నిర్ణయించినట్లు ఆయన సన్నిహితుల కథనం.

పవన్ ట్విట్టర్ వ్యాఖ్యలు స్పందన
పవన్‌ కల్యాణ్‌ పలు సందర్భాల్లో వ్యక్తిగత ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా చేసిన వ్యాఖ్యలకు విశేష ఆదరణ లభించింది. ప్రత్యేక హోదాపైనా, భూసేకరణకు వ్యతిరేకంగా తుళ్లూరు ప్రాంత రైతులకు మద్దతుగాను ఆయన ట్వీట్ల ద్వారానే తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇప్పుడు అధికారికంగా పార్టీ సిద్ధాంతాలనూ సోషల్‌ మీడియా ద్వారానే ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతోపాటే.. జనసేన సిద్ధాంతాలు, పార్టీ ఆవిర్భావ వృత్తాంతాలను వివరిస్తూ.. పవన్‌ కల్యాణ్‌ స్వయంగా రాస్తున్న పుస్తకాన్నీ త్వరలోనే విడుదల చేయనున్నారు. 

18:47 - October 5, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల జవాబుదారీతనంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రజాప్రతినిధులకు పీఏ, పీఎస్‌లుగా విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను వెనక్కి పంపించారా అని దీపక్ మిశ్రాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలకు, పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు అనుగుణంగా ఒక స్కీంను కోర్టు ముందుంచామని, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి బయో మెట్రిక్ విధానం, హాస్టల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల ఏర్పాటు, మూతబడిన స్కూళ్లను తిరిగి ప్రారంభించడం వంటి చర్యలను తెలంగాణ ప్రభుత్వం కోర్టు ముందు ఉంచింది. అయితే ప్రభుత్వం చెప్పిన స్కీంపై కోర్టు నియమించిన అశోక్ గుప్తా కమిటీ అభిప్రాయాలను,.పిటిషనర్ అభిప్రాయాలను తీసుకొని..నవంబర్‌లో వాటిపై విచారించి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇక ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో టాయిలెట్స్ సదుపాయం, తాగునీటి సదుపాయాలపై అమికస్ క్యూరి కమిటీ సీల్డ్ కవర్‌లో నివేదిక ఇచ్చింది. దానిపై 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించగా..ప్రభుత్వ యంత్రాంగమంతా ఏపీకి తరలివెళ్లిన నేపథ్యంలో 4వారాల గడువు కావాలని ఏపీ తరుపు న్యాయవాది అభ్యర్థించారు. దీనిపై సమ్మతించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్ 22కి వాయిదా వేసింది. 

18:45 - October 5, 2016

నల్లగొండ : యుద్ధం అనేది చివరి అస్త్రంగా ఉండాలి తప్పితే.. మొదటి ఆయుధంగా కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ రాఘవులు అభిప్రాయపడ్డారు. సర్జికల్ స్ట్రయిక్స్ అనేవి కొత్తవి కావని.. ప్రభుత్వం పరిపక్వతతో ఆలోచించాలని.. రాజకీయాల కోసం ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించవద్దని హితవు పలికారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో రాఘవులు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసమస్యలను గాలికి వదిలి.. ఇతర కార్యక్రమాలతో హాడావుడి చేస్తున్నారని.. తెలంగాణలో జిల్లాల విభజనకు శాస్త్రీయ ప్రాతిపదికనేదది లేదని ఈ సందర్భంగా బివి రాఘవులు పేర్కొన్నారు. 

18:41 - October 5, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నాలాలు, చెరువులను ఆక్రమించుకుని నిర్మించిన ఇళ్లు, బహుళ అంతస్తులు భవనాలు, ఫంక్షన్‌ హాళ్లను పూర్తిగా తొలగించి, ముంపు నుంచి నగరానికి విముక్తి కల్పించాలని జీహెచ్ ఎంసీ నిర్ణయించింది. ఆక్రమణలతోపాటు, నాలాల ఒరిజినల్‌ వెడల్పులను నిగ్గు తేల్చేందుకు సర్వేకి సిద్ధమయ్యింది. 1960 నాటి సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాప్‌ ఆధారంగా నాలాలు, చెరువులను పునరుద్ధరించాలన్న కృతనిశ్చయంతో జీహెచ్ ఎంసీ ఉంది.

2000 ఆగస్టు, 2016 ఆగస్టుల్లో ముంపు
జంటనగరాల్లోని నాలాలు, చెరువులు ఆక్రణలకు గురయ్యాయి. అండబలం, కండబలం ఉన్న వారు, రాజకీయ నేతలు, బడాబాబులు... ఇలా ఎవరికి వారు తమకున్న పలుకుబడిని బట్టి వీటిని ఆక్రమించుకున్నారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ ఆక్రమణలే హైదరాబాద్‌ కొంప ముంచుతున్నాయి. ప్రజలు ముంపుబారిన పడుతున్నారు. 2000 ఆగస్టులో ఒకసారి, 2016 ఆగస్టులో మరోసారి మురుగు ముంపు ముప్పు తెచ్చిపెట్టింది. కాలనీలు, ఇళ్లలోకి చేరిన నీరు రోజుల తరబడి నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆక్రమణల తొలగింపు విషయంలో గత పాలకులు అంటీముట్టనట్టుగా వ్యవహరించినా... ప్రస్తుత సర్కార్‌ మాత్రం వీటిని తొలిగించేందుకు పట్టుదలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే నాలాలు, చెరువుల్లో వెలసిన అకమ్ర కట్టడాలపై శాస్త్రీయ సర్వేకి సిద్ధమయ్యింది.

1960, 1970 నాటి సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాప్‌లు
నాలాలు, చెరువుల పొడవు వెడల్పు, విస్తీర్ణం వంటి అంశాలపై జీహెచ్‌ఎంసీ సర్వే నిర్వహిస్తోంది. ఇందు కోసం మున్సిపల్‌, పోలీసు, రెవిన్యూ, నీటిపారుదల శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించింది. 1960, 1970 నాటి సర్వే ఆఫ్‌ ఇండియా టోపో షీట్లు, మ్యాప్‌లను తీసుకుని ఈ బృందాల్లోని అధికారులు, సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. నాలాలు, చెరువు శిఖాల్లో 28 వేల వరకు ఆక్రమణలు ఉన్నట్టు గతంలో నియమించిన కమిటీలో తేల్చాయి. అయితే అప్పట్లో చేసిన సర్వే సమగ్రమైనదికాదంటున్న అధికారులు... ఇప్పుడు శాస్త్రీయంగా సర్వే చేసిన ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించారు. :ఆక్రమణలను తొలిగించే విషయంలో సంబంధిత వ్యక్తులకు రెండువారాలు ముందుగా నోటీసులు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను పాటిస్తూనే....ముందుకుసాగాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. 

18:38 - October 5, 2016

కరీంనగర్ : ప్రజాపోరాటం ఫలించింది.. ప్రభుత్వం దిగి వచ్చింది.. రెండు నెలలుగా చేస్తున్న ఆందోళనల లక్ష్యం నెరవేరనుంది. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో రాజన్న జిల్లాగా రూపుదిద్దుకోబోతున్న ఈ ప్రాంత ప్రజల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.

సిరిసిల్ల జిల్లా కోసం పోరాట బాట పట్టిన ప్రజలు
సిరిసిల్ల ప్రాంత ప్రజల కోరిక నెరవేరింది. ఈ ప్రాంతాన్ని జిల్లాగా మార్చేందుకు కేసీఆర్‌ అంగీకరించారు. దీంతో ఈ ప్రాంతంలో హర్షాతిరేకాలు మిన్నంటుతున్నాయి. జిల్లాల తొలి జాబితాలోనే సిరిసిల్ల పేరుంటుందని ప్రజలు భావించారు. కానీ 27 జిల్లాలతో విడుదలైన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో సిరిసిల్ల పేరు లేదు. దీంతో 53 సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఏర్పడిన జేఏసీ 60 రోజుల పాటు నిరవధికంగా ఆందోళనలు కొనసాగించింది. రాస్తారోకో, ధర్నాలతో మొదలైన ఉద్యమం.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేంత వరకు కొనసాగింది. ఒక సందర్భంలో పోలీసుల లాఠీచార్జ్‌ కూడా జరిగింది.

ఉద్యమం ఉధృతం చేసిన ప్రజలు
ఈ క్రమంలో సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట మండలాల్లో అధికార పార్టీ నేతలకు.. జేఏసీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఒకనొకదశలో టీఆర్‌ఎస్‌ నాయకులపై ఆందోళనకారులు ప్రత్యక్ష దాడులకూ దిగారు. అయితే సిరిసిల్ల జిల్లా ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కేటీఆర్‌.. నియోజక వర్గంలో ఎలాంటి పర్యటనలు చేయలేదు. పైగా జిల్లా ఏర్పాటు సాధ్యం కాదని.. ప్రత్యేక ప్యాకేజీతో సిరిసిల్లను అభివృద్ధి చేస్తామంటూ చెప్పుకొచ్చారు. దీనికి అంగీకరించని జేఏసీ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేసింది.

ప్రజాభిష్టం మేరకు జిల్లా ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌

చివరికి ప్రజల ఆందోళనకు.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తలొగ్గింది. తొలుత రాజకీయ కారణాలతో పక్కన పెట్టినప్పటికి.. ఆ తరువాత ప్రజల అభీష్టం మేరకే జిల్లా ఏర్పాటు చేయవలసి వచ్చిందని చెబుతూ.. ముఖ్యమంత్రి జిల్లా ఏర్పాటుకు ఓకే చెప్పేశారు. దీంతో ఆ ప్రాంతవాసుల సంబరాలు.. అంబరాన్నంటుతున్నాయి.

14 మండలాలతో సిరిసిల్లా జిల్లా ఏర్పాటు
14 మండలాలతో సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. గత ముసాయిదాలో ముస్తాబాద్ మండలంతో పాటు మానకొండూరు నియోజక వర్గంలోని ఇల్లంతకుంటను సిద్దిపేటలో కలుపుతున్నట్టు చూపించారు. ప్రస్తుతం ఆ రెండు మండలాలు సిరిసిల్లలోనే కొనసాగనున్నాయి. ప్రస్తుతం తొమ్మిది పాత మండలాలు కొత్త జిల్లాలో ఉన్నాయి. వీటికి తోడుగా మరో ఐదు కొత్త మండలాలను ఏర్పాటు చేయనున్నారు. సిరిసిల్ల నియోజక వర్గంలో సిరిసిల్ల రూరల్, వీర్నపల్లి మండలాలు, వేములవాడ నియోజక వర్గంలో వేములవాడ రూరల్, రుద్రంగి ఇల్లంతకుంట మండలంలోని పోత్తురు కేంద్రంగా ఒక మండలం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ జిల్లాలో సుమారు ఆరు లక్షల జనాభా ఉండే అవకాశం ఉంది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు పరిపాలనపరమైన పనుల్లో వేగం పెంచారు. 

18:35 - October 5, 2016

విజయవాడ : బెజవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.. తిధుల హెచ్చు తగ్గుల కారణంగా అమ్మవారు ఇవాళ కాత్యాయనిదేవిగా భక్తులకు దర్శన మిస్తున్నారు... అమ్మవారి దర్శనంకోసం తెల్లవారుజామునుంచే భక్తులు బారులుతీరారు.. మరిన్ని సమాచారానికి ఈ వీడియో చూడండి..

బీచ్ లో ముగ్గురు గల్లంతు..

పశ్చిమగోదావరి : మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ముగ్గురు యువకులు మృతిచెందారు. ఈతకు వెళ్లిన భానుప్రకాశ్‌, సాయితేజ, రాజేష్‌ అనే విద్యార్థులు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

ఇసుక ఆగడాలపై బాబు ఆగ్రహం..

విజయవాడ : ఇసుక అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా తాను ఉపేక్షించనంటూ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ రెండో రోజు శిక్షణా తరగతుల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజలకు మంచి చేయాలని ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టామని, ఈ పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఒక పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా క్షేత్ర స్థాయి నివేదికలు తెప్పించుకుంటామని అన్నారు. ‘కింది స్థాయి నేతలు తప్పు చేస్తే.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలదే బాధ్యత.

శాంతి కావాలంటున్న హింసాదేశపు నాయకుడు..

పాకిస్థాన్ : తాము యుద్ధానికి వ్య‌తిరేక‌మ‌ని, త‌మ‌కు శాంతి కావాల‌ని, క‌శ్మీర్‌తో స‌హా అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని భావిస్తున్న‌ట్లు పాకిస్థాన్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ అన్నారు. ఇవాళ ఆ దేశ ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న‌ మాట్లాడారు. యూరీ ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే, ఎటువంటి విచార‌ణ నిర్వ‌హించ‌కుండా పాకిస్థాన్‌పై భార‌త్ ఆరోప‌ణ‌లు చేసింద‌న్నారు. నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద స‌ర్జిక‌ల్‌ దాడులు, అంత‌ర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకిని చేయాల‌ని భార‌త్ భావిస్తున్న నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ ప్ర‌త్యేకంగా పార్ల‌మెంట్‌లో మాట్లాడారు. 

ముగిసిన హైపవర్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : కేకే నివాసంలో హైపవర్ కమిటీ సమావేశం ముగిసింది. ప్రజాభిప్రాయం మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని, ప్రతొక్కరి వద్ద నుండి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. గద్వాల..జనగామ..సిరిసిల్ల..ఆసిఫాబాద్..జిల్లాలపై నేతల వినతులు..అభ్యంతరాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 630 దరఖాస్తులు వచ్చాయని, అందరి అభిప్రాయాలు సమగ్రంగా పరిశీలించి తుది నివేదికను ఏడో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందచేస్తామన్నారు.

 

హైపవర్ కమిటీని కలిసిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : హైపవర్ కమిటీని మంత్రి కేటీఆర్ కలిశారు. సిరిసిల్లా జిల్లా ఏర్పాటుపై కమిటీ ముందు మంత్రి కేటీఆర్, పార్టీ నేతలు అభిప్రాయాలు తెలిపారు. సిరిసిల్ల జిల్లాకు రాజన్న పేరు పెట్టాలని కేటీఆర్ కోరారు. కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు హైపవర్ కమిటీకి మంత్రి కేటీఆర్ ఇచ్చారు. 

డీసీపీ ఇక్బాల్ ను అడ్డుకున్న సంజన బంధువులు..

హైదరాబాద్ : సంజనను పరామర్శించడానికి వచ్చిన డీసీపీ ఇక్బాల్ ను బంధువులు అడ్డుకున్నారు. నిందితుల బెయిల్ ను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేస్తామని, ఎసీపీపై ఆరోపణలుంటే లిఖిత పూర్వక ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని ఏల్బీనగర్ డీసీపీ పేర్కొన్నారు. 

యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

నెల్లూరు : ఎమ్మెల్సీ అభ్యర్థులను యూటీఎఫ్ ప్రకటించింది. నెల్లూరు, చిత్తూరు ప్రకాశం జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిగా విఠపు బాలసుబ్రమమణ్యం..పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా ఎడ్లవల్లి శ్రీనివాసుల రెడ్డి..కడప, కర్నూలు, అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా డా.గేయానంద్..శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టభధ్రుల నియోజకవర్గ అభ్యర్థిగా అజయ్ శర్మలను యూటీఎఫ్ ఖరారు చేసింది. 

17:15 - October 5, 2016

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ మ్యాచ్ లో భారత్ జయకేతనం ఎగురవేసింది. ఐదు రోజుల మ్యాచ్ లో రెండో రోజు ఓ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మహ్మద్ షమీ కుమార్తె ఆయిరా 14 నెలలు తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్ర జ్వరంతో బాధ పడుతూ..శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడింది. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేరిపించారు. ఐసీయూకి తరలించి వైద్యులు షమీకి చికిత్స అందించారు. అయినా మహ్మద్ షమీ మాత్రం సహచరులతో కలిసి ఆటలో పాల్గొన్నాడు. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. సహచరుడు భువనేశ్వర్ కుమార్ తో కలిసి షమీ రెండు ఇన్నింగ్స్ లలో ఆరు వికెట్లు తీశాడు. ప్రతి రోజు షమీ ఆట ముగియగానే కూతురి వద్దకు వెళ్లి మళ్లీ తదుపరి ఆటలో పాల్గొనేవాడు.

కెప్టెన్ ప్రోత్సాహించాడన్న షమీ..
కివీస్ జట్టుపై భారత్ విజయం సాధించింది. 178 పరుగుల తేడాతో చిత్తు చేసి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ ను చేజిక్కించుకుంది. విజయం సాధించడమే కాకుండా నెంబర్ వన్ ర్యాంకును సైతం కైవసం చేసుకుంది. డ్రెస్సింగ్ రూంలో భారత ఆటగాళ్లు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో కూడా పాల్గొన్న అనంతరం షమీ నేరుగా కూతురిని చూసేందుకు వెళ్లాడు. మూడు రోజుల చికిత్స అనంతరం అయిరా ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు అదే రోజు డిశ్చార్జ్ చేశారు. తన కూతురు ఆసుపత్రిలో ఉన్న సమయంలో కెప్టెన్ ఎంతగానే ప్రోత్సాహించే వాడని మహ్మద్ షమీ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్ కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న వారు షమీని అభినందించారు. 

17:03 - October 5, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి . విద్యార్థినులు ,మహిళలు పెద్ద సంఖ్యలో ఈ సంబురాల్లో పాల్గొని ఆట పాటలతో అలరిస్తున్నారు . సుందరయ్య పార్కు వద్ద.. జాహ్నవి డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు .రంగు రంగుల బతుకమ్మలు పేర్చి....ఉత్సాహంగా దాండియా ,కోలాటాలతో హోరెత్తించారు. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి.. 

16:59 - October 5, 2016

ఢిల్లీ : దాద్రీ హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాబిన్‌ అలియాస్‌ రవి ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నోయిడా జైలులో ఉన్న రవి రెండు రోజుల క్రితం శ్వాసకోస వ్యాధి, తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో అతన్ని పోలీసులు నోయిడాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవి మంగళవారం సాయంత్రం 7 గంటలకు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. తమ కుమారుడు నారోగ్యంతో చనిపోలేదని పోలీసులే జైలులో కొట్టి చంపారని రవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జైలరే ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వైద్య రిపోర్టు వచ్చాకే అసలు విషయం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. దాద్రీలో బీఫ్‌ తిన్నాడన్న కారణంతో గత ఏడాది సెప్టెంబర్‌లో అఖ్లాక్‌ను కొట్టి చంపిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రవితో పాటు 18 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

16:57 - October 5, 2016

జమ్ము కశ్మీర్ : సరిహద్దులో పాక్‌ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. తాజాగా రాజౌరి సెక్టార్‌లో పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. న్యూషెరా సెక్టార్‌లో పాక్‌ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. మోర్టార్‌ షెల్స్‌తో దాడులకు పాల్పడ్డారు. సరిహద్దు గ్రామాల్లోని ఇళ్లలో వీటి ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో 8 సార్లు పాకిస్తాన్‌ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని అధికారవర్గాల సమాచారం. పాక్‌ సైనికులకు కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. భారత ఆర్మీ సర్జికల్‌ దాడుల తర్వాత పాకిస్తాన్‌ నియంత్రణ రేఖ వద్ద దాడులను ఉధృతం చేసింది.

16:55 - October 5, 2016
16:45 - October 5, 2016

కర్నాటక : బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది కార్మికులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో 8 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

16:43 - October 5, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల ఎస్పీలతో డీజీపి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు నలుగురు కమిషనర్లు, అడిషనల్‌ డీజీపీలు, ఐజీలు, డీఐజీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల్లో ఎస్పీ, సర్కిల్‌ కార్యాలయాలు, పీఎస్‌ల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కాసేపట్లో డీజీపీ కార్యాలయానికి సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

16:26 - October 5, 2016

ఎంతటి వారికైనా కొన్ని క్షణాలుంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడానికి, అందరూ  పంక్తి భోజనం చేయడానికి, అయిన వారితో కలిసి ఆనందాన్ని పంచుకోవడానికి. ఎంత బిజీ షెడ్యూల్డ్  అయిన కొన్ని క్షణాలుంటాయి ఆప్తులతో కలిసి సరదాగా ముచ్చటించుకోవడానికి . ఇలా కుటుంబ సభ్యులతో సరదాగా వెళ్లె పిక్నిక్ లు, కలిసి చేసుకునే పండగలు, ఒక చోట కూర్చుని చెప్పుకునే కబుర్లు మనస్సుకు ఆనందాన్ని కల్గించడంతో పాటు ఆత్మ స్థైర్యాన్ని కూడా కల్గిస్తాయి. ఆ కొంచెంపాటి క్షణాలు చెప్పలేని సంతోషాన్ని కల్గిస్తాయి, చిరకాలం స్శృతులుగా మిగులుతాయి. అందుకేనేమో తెలుగులో ఓ నానుడి ఉంది ' కుటుంబ సభ్యులతో కలిసి గడిపే క్షణాలే నిజమైన ఆనందాన్ని కలిస్తాయి'అని.  ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా వ్యక్తులైనా కుటుంబ సభ్యులతో కలిసి గడపకుండా ఉంటారా. మనువళ్ళతో , మనవరాళ్లతో ముచ్చటించకుండా ఉంటారా..ఈ మధ్యే ఏపీ సీఎం చంద్రబాబు తన మనుమడు దేవాన్ష్‌ను కలిసి సరదాగా గడిపిన విషయం నారా లోకేశ్ ట్విట్టర్ లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. కేవలం బాబు నే కాదు. సీఎం కేసీఆర్, దివంగత నేతలు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లు కూడా అప్పుడుప్పుడు మనుమళ్లతో,మనుమరాళ్లతో, కుటుంబ సబ్యలతో  గడిపారు. ఆ ఆనంద క్షణాలను బయటకు పంచుకున్న అనేది ఈ ఫోటోల ద్వారా తెలుస్తోంది.

16:17 - October 5, 2016

హైదరాబాద్ : చరిత్రలో తొలిసారిగా ఈ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ డీజీపీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, పోలీసు అధికారుల కేటాయింపు అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. 16 మంది అడిషనల్ ఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా, 22 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త జిల్లాల బాధ్యతలు నాన్ కేడర్ ఎస్పీలకే అప్పగించనున్నారు. ప్రతి జిల్లాకు ఒక ఓఎస్డీని నియమించనున్నారు. సిద్ధిపేట సహా కరీంనగర్, నిజామాబాద్ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు మంచిర్యాల, రామగుండంలో ఏదో ఒక చోట కమిషనరేట్‌ను ఏర్పాటు చేయనున్నారు. నలుగురు కమిషనర్లు, అడిషనల్ డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, జిల్లా ఎస్పీలతో డీజీపీ అనురాగ్ శర్మ సమీక్షించబోతున్నారు. కొత్త జిల్లాల్లో ఎస్పీ, సర్కిల్, కార్యాలయాలు, పీఎస్ ల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

అశాస్త్రీయంగా జిల్లాల విభజన - తమ్మినేని..

నల్గొండ : జిల్లాల విభజనను సీపీఎం స్వాగతిస్తోందని, కానీ అశాస్త్రీయంగా జరుగుతున్న జిల్లాల విభజనను వ్యతిరేకిస్తోందని పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రజావసరాలతో సంబంధం లేకుండా నూతన జిల్లాల ఏర్పాటు జరుగుతుండడం శోచనీయమన్నారు. సీఎం జిల్లాల ఏర్పాటుపై స్పష్టమైన ప్రతిపాదిక ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

జీహెచ్ఎంసీలో సమూల మార్పులు - మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో సమూల మార్పులు తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆక్రమణల కూల్చివేతల విషయంలో వెనక్కితగ్గేది లేదన్నారు. మా పార్టీ నేతలు కూడా కూల్చివేతలను అడ్డుకోవద్దని కోరడం జరిగిందని, కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలను కూల్చివేయడం జరుగుతుందన్నారు. జీహెచ్ఎంసీలో సర్కిళ్ల సంఖ్యను 24 నుండి 30కి పెంచుతామన్నారు. మేజర్ రోడ్డు డివిజన్ ను రద్దు చేయనున్నామన్నారు. సర్కిల్ స్థాయి అధికారులకు అధికారులు పెంచడం జరుగుతోందని, జీహెచ్ఎంసీ అభివృద్ధికి 20 నుండి 25 కోట్లు కావాలన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం కోసం ఈనెల 12 నుండి వారం పాటు అమెరికా పర్యటన ఉంటుందన్నారు.

సీఎం కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు..

హైదరాబాద్ :సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగ జరిగాయి. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత, ఎంపీ కవితలు బతుకమ్మలను పేర్చారు. 

జగన్ పై దేవినేని ఫైర్..

విజయవాడ : ప్రతిపక్ష నేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. జగన్ కు నెలకోసారి రైతులు గుర్తుకొస్తారని, అనంతపురంలో కరవును సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. రాయలసీమలో రెయిన్ గన్స్ తో పంటలను కాపాడగలిగామని, జలయజ్ఞంలో పందికొక్కులా కాంగ్రెస్ నేతలు తింటే పోలవరం పూర్తే లక్ష్యంగా టిడిపి ముందుకెళుతోందన్నారు. రాయలసీమ ప్రజలకు నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు. 

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు - మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు అని, అనుకున్న పనులు పూర్తి కావాలంటే జిల్లాల విభజన అవసరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జిల్లాల విభజనకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన మిగిలిందన్నారు. జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని, 150 ఏళ కిందటే ఆసిఫాబాద్ జిల్లాగా ఉండేదన్నారు. అందుకే ఇప్పుడు మళ్లీ ఆసిఫాబాద్ ను జిల్లాగా చేయడం జరుగుతోందని తెలిపారు. నియోజకవర్గాల పునర్ విభజన అవుతుందనే విశ్వాసం ఉందని, సీఎం కేసీఆర్ ను నియంత అన్న జైపాల్ రెడ్డికి సిగ్గుండాలని అని వ్యాఖ్యానించారు.

15:58 - October 5, 2016

మెదక్ : మద్యం మత్తు ఎందరి ప్రాణాలతో బలిగొంటోంది. మద్యం తాగినవారు ఆరోగ్యం దెబ్బతిని ప్రాణం పోగొట్టుకుంటే వారి ఒక్కరికే కాదు కుటుంబం మొత్తానికి అది తీరని శోకంగా మారిపోతుంది. ఈ మద్యం మహమ్మారికి వేల కుటుంబాలు బలయిపోతున్నాయి, తాగి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ మద్యం త్రాగి వాహనాలు నడిపి అన్నెం పుణ్యం ఎరుగని అమాయకులను వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇవి లెక్కలేనన్ని జరుగుతున్నాయి. పరిగణలోకి వచ్చినవి చాలా తక్కువగానే వుంటున్నాయి.

చిన్నారి రమ్య కుటుంబంలో మూడు తరాల వ్యక్తులు బలి
గత కొంతకాలం క్రితం ఆడుతూ పాడుతూ సంతోషమే తమ హద్దు అంటూ కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళిన చిన్నారి రమ్య కుటుంబం మద్యం బాబుల నిర్లక్ష్యానికి మూడు తరాల వారు బలైపోయిన సంగతి తెలిసిందే. వారి బాధ తీరని శోకంగానే మిగిలిపోయింది. నేరస్థులను అరెస్ట్ చేయడం.. విడిచిపెట్టడం..అనేది సాధారణంగా మారిపోయింది. తాజాగా ఆసుపత్రిలో ప్రాణాలతో తల్లీ కుమార్తెలు పోరాడుతున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో కూడా షిర్డీ నాధుడ్ని దర్శించుకునేందుకు బయలుదేరిన ముగ్గురు వ్యక్తులు ఈ మద్యం మహమ్మారికే బలయ్యారు. 

మెదక్ జిల్లాలో...
పుణ్యక్షేత్రం షిర్డీ సాయినాధుడ్ని దర్శించుకునేందుకు బయలుదేరి అనంతలోకాలు వెళ్ళిపోయారు. బంధువుల ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ లో ఐదుగురు మద్యం సేవించారు. తాగిన మత్తులోనే షిర్డీకి ప్రయాణమయ్యారు. ప్రయాణం చేయవద్దని తండ్రి వారించాడు. వారి చేతుల్లో నుంచి లగేజ్ బ్యాగులు కూడా లాక్కున్నాడు. అయినా వినకుండా ఐదు మంది కారులో షిర్డీ బయల్దేరారు. మార్గమధ్యలో మెదక్‌ జిల్లా కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ వద్ద కారును లారీ ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఆలోచించండి..
చూసారా మద్యం మత్తు ఎందరి కుటుంబాలను రోడ్డు పాలు చేస్తోంది. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అలాగే మద్యం త్రాగి వాహనాలు నడిపితే ఎంతటి ప్రమాదం ఏర్పడుతుందో దానికి ఎంతమంది కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోతాయోననే విషయం కూడా మందుబాబులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు సూచిస్తున్నారు. ఎవరి ప్రాణం వారు తీసుకోవడానికి ఎవరికీ హక్కులేదు. మరి ఎదుటివారి ప్రాణాలను బలితీసుకునే హక్కు వీరికి ఎవరిచ్చారు? ఈ ప్రశ్న ప్రతీఒక్కరూ వేసుకోవాల్సిన అవసరముంది.

15:37 - October 5, 2016

హైదరాబాద్: సంవత్సరం నుంచి తాము చేసిన పోరాట ఫలితంగానే యాదాద్రి జిల్లా ఏర్పడిందని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరస్సింహాలు అన్నారు. యాదాద్రిని జిల్లాగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌కి ధన్యావాదాలు తెలిపారు. న్నారు. అలాగే నల్గొండ జిల్లాలోని ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్రంలో ఆందోళనలకు దారితీసింది. ఈనేపథ్యంలోనే నల్లగొండ జిల్లాలోని యాదాద్రిని జిల్లాగా ఏర్పాటు చేయాలని టీడీపీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  కొన్ని ప్రాంతాలలో అప్పటివరకూ వున్న జిల్లాను విడగొట్టి మరో జిల్లాగా మార్చవద్దంటూ జరిగితే, మరికొన్ని ప్రాంతాలలో జిల్లాను ఏర్పాటు చేయాలంటే ఆందోళనలు రేగిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 10 జిల్లాలుగా వున్న రాష్ట్రం పరిపాలనా సౌలభ్యం కోసం 27 జిల్లాలు ఏర్పాటు చేయాలని మొదట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టింది. ఆందోళన రీత్యా..పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న కేసీఆర్ సర్కార్ 30 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అది కాస్తా పెరిగి పెరిగి 33 జిల్లాలుగా స్థిరపడింది. మరి అక్కడితో ఆగనుందో వీటి సంఖ్య పెరగనుందో వేచి చూడాలి. కాగా సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ 6 కాబట్టి 33 తోనే జిల్లాల ఏర్పాటు ఖరారుకానున్నట్లుగా సమాచారం.

15:24 - October 5, 2016

వారణాసి : ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తుంటే రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి ? వచ్చిన అవకాశాన్ని వదలరు. అది ఏ కార్యక్రమమైనా అందులో తమ పార్టీని ప్రచారం చేసుకోవాలని అనుకుంటారు. సరిగ్గా అదే జరిగింది. రెండు..మూడు రోజుల్లో 'దసరా' పండుగ రానున్న సంగతి తెలిసిందే. దీనిని చక్కగా వినియోగించుకోవాలని కాషాయ దళం యోచించింది. బుధవారం వారణాసిలో ఓ పోస్టర్ వెలిసింది. బీజేపీ మిత్రపక్షమైన శివసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ పోస్టర్ ను వేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధం చేస్తున్న 'రాముడిగా' చిత్రీకరించారు. మరి రావణుడిని ఎవరు అనుకుంటున్నారా ? పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ను చిత్రీకరించారు. ఓరీ.. రావణా కాసుకో.. ఇంకా ఒకే ఒక్క సర్జికల్ స్ట్రైక్ బాణంతో నీ కథ ముగుస్తుంది అని మోడీ హెచ్చరిస్తున్నట్లు పోస్టర్లు వెలిశాయి. ఇక రావణుడి కొడుకు మేఘనాథుడిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గా చిత్రీకరించారు. ఇటీవలే భారత ఆర్మీ అధికారులు సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సర్జికల్ స్ట్రైక్ పై కేజ్రీవాల్ పలు వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్మీ ఆపరేషన్ కు కూడా రాజకీయాలు జోడించడంపై పలువురు నోరెళ్ల బెడుతున్నారు. 

బెంగళూరులో కుప్పకూలిన భవంతి..

బెంగళూరు : బెళ్లందూరులో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. 8మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

కచ్ ఏరియాలో పాక్ బోట్ సీజ్..

గుజరాత్ : రాష్ట్రంలోని కచ్ ఏరియాలో పాక్ బోట్ ను బీఎస్ఎఫ్ సీజ్ చేసింది. ఈ బోట్ లో 9 మంది పాక్ దేశస్థులున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి కోసం బీఎస్ఎఫ్ గాలింపులు చేపడుతున్నట్లు సమాచారం. 

ఇంద్రకీలాద్రిపై మీడియా ఆంక్షలు..

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై మీడియాపై ఆంక్షలు విధించారు. లడ్డూలలో పురుగుల ఘటన, మహా నివేదన ఆలస్యం వంటి విషయాలు బట్టబయలు చేసిన మీడియాపై ఈవో కక్ష సాధింపులు చేపట్టారు. 

15:01 - October 5, 2016

హైదరాబాద్ : దసరా పండుగ వస్తోందంటే చాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబడుచులు ఉత్సాహాల్లో తేలిపోతుంటారు. రంగురంగుల పూలన్నీ సేకరించి బతుకమ్మలు తయారు చేసుకుని పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం అయ్యిందంటే చాలు వీధిలోని ఆడపడుచులంతా ఓ చోట చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన బతుకమ్మ వేడుకలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కవితతో పాటు పలువురు మహిళలు బతుకమ్మలు పేరుస్తున్నారు. జాగృతి సంస్థాపకురాలు ఎంపీ కవిత బతుకమ్మ పాటలు పాడి రంగు రంగుల పూలతో బతుకమ్మ తయారు చేశారు.  

రోల్ మోడల్ తెలంగాణ - మంత్రి ఈటెల..

ఢిల్లీ : దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ ఉండబోతోందని మంత్రి ఈటెల పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అబ్బాస్ నఖ్వీతో భేటీ అనంతరం మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మైనార్టీ పాఠశాల కోసం రూ. 500 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి అబ్బాస్ నఖ్వీని కోరడం జరిగిందన్నారు. కొత్త మైనార్టీ గురుకుల పాఠశాలల నిర్మాణానికి ఆర్థిక సాయం, హాజ్ యాత్రికుల కోటా పెంచాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఏసీబీ డీజీ ఏకే ఖాన్ నేతృత్వంలో మైనార్టీ స్కూళ్ల పర్యవేక్షణ జరుగుతోందని, మైనార్టీ సంక్షేమ పథకాలను చూసేందుకు రాష్ట్రానికి రావాలని నఖ్వీని ఆహ్వానించడం జరిగిందన్నారు. 

తిరుమలలో పోలీసుల అదుపులో అనుమానితులు..

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయ మాఢవీధుల్లో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు అనుమానితుల నుండి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 

జయ ఆరోగ్యంపై స్పష్టమైన ప్రకటన చేయాలి - స్టాలిన్..

చెన్నై : సీఎం జయలలిత ఆరోగ్యంపై స్పష్టమైన ప్రకటన చేయాలని, ప్రకటన ద్వారా వదంతులను తగ్గించవచ్చని ప్రతిపక్ష నేత స్టాలిన్ పేర్కొన్నారు. జయను కలిసే పరిస్థితి లేదని వార్తలొస్తున్నాయని పేర్కొన్నారు. 

14:55 - October 5, 2016
14:50 - October 5, 2016

హైదరాబాద్‌ : నగరంలో రోడ్ల దుస్థితిపై సర్కార్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నేరుగా రంగంలోకి దిగిన స్పెషల్‌ సీఎస్‌ ఎంజీ గోపాల్‌ బేగంపేటలో రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. నగరంలో రోడ్ల పరిస్థితి రోడ్లపై నడటానికే భయపడేలా వున్నాయి. కాగా ఇటీవల నగరంలో కురిసన భారీ వర్షాలు వాటి పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయ్యాయి. ఎక్కడ గుంత వుందో, ఎక్కమ మ్యాన్ హోల్ వుందో తెలియని పరిస్థితి నగరంలో ఏర్పడింది. నగరంలోని రోడ్లపై దాదాపు 50వేల భారీ గుంతలు ఏర్పడినట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. స్పెషల్ సీఎస్ ఎంజీ గోపాల్ పరిశీలించారు. జీహెచ్ ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ పై గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే పునరుద్ధరించాలని ఆయన ఆదేశించారు.

14:49 - October 5, 2016

న్యూ మూవీ 'యే దిల్ హై ముష్కిల్' లో 'ఐశ్వర్యరాయ్' కావాలనే ఓ రేంజ్ లో రోమాన్స్ చేసిందట. దర్శకుడు కరణ్ జోహర్ తో చర్చించి మరీ 'ఐశ్వర్య' రోమాన్స్ డోస్ పెంచమని చెప్పిందట. మాజీ మిస్ వరల్ట్ రెచ్చిపోయి రోమాన్స్ చేయడానికి మాస్టర్ ప్లాన్ ఉందట. ఇంతకీ 'ఐశ్వర్య రాయ్' వేసిన ఆ ప్లాన్ ఏంటీ ?'ఐశ్వర్యరాయ్', 'రణబీర్', 'అనుష్క'ల లేటెస్ట్ ఫిల్మ్ 'యే దిల్‌ హై ముష్కిల్‌'. ఈ మూవీలో 'రణ్‌బీర్‌', 'ఐశ్వర్య' రొమాన్స్ పై బాలీవుడ్ లో హాట్ హాట్ చర్చా సాగుతోంది. ఈ రొమాంటిక్ సీన్స్ కి సంబంధించిన ఆలోచన 'ఐశ్వర్యరాయ్' దే అని బాలీవుడ్ చెప్పుతోంది. ఆ ఓ రేంజ్ లో రోమాంటిక్ సీన్స్ ని షూట్ చేయాలని 'ఐష్' దర్శకుడిపై ఒత్తిడి తెచ్చినట్లు బీటౌన్ లో వినికిడి. ఇంకా లోతుగా వెళ్తే ఈ రోల్ కోసం 'ఐష్‌'ను ఓకే చేసినప్పుడు ఘాటైన ఇంటిమేట్‌ సీన్స్ లేవట. దర్శక నిర్మాత 'కరణ్‌ జోహార్‌'కి అలాంటి ఆలోచన లేదని బాలీవుడ్ కోడై‌కూస్తోంది.

ఫీలైన ఐష్..
తన రోల్‌ గురించిన స్ర్కిప్ట్ చదివినపుడు ఏదో లోటుగా వున్నట్లు 'ఐష్' ఫీలైందట. క్యారెక్టర్‌ని దర్శకుడు చంపేసినట్టు భావించిందట. అందుకే తన రోల్‌ని వీలైనంత రొమాంటిక్‌ ప్లాన్ చేయమని 'ఐష్' సూచించిదట. స్వయంగా 'ఐష్‌' నుంచే ఇండికేషన్స్ రావడంతో 'కరణ్ జోహర్' ఈ మూవీ పుల్ లెంగ్త్ రొమాంటిక్ మూవీగా రూపొందించాలని ఫిక్స్ అయ్యాడట. సెకెండ్ ఇన్నింగ్స్ లో 'ఐశ్వర్యరాయ్' కి సక్సెస్ రాలేదు. ఈ భామ చేసిన రెండు చిత్రాలు విజయం సాధించలేదు. దీంతో ఓ రేంజ్ లో రోమాన్స్ చేసి ఈ జనరేషన్ యూత్ ని అట్రాక్ట్ చేయాలని 'ఐష్' భావిస్తున్నట్లు టాక్. అందుకే కుర్రహీరో 'రణబీర్ కపూర్' తో సైతం లిప్ లాక్స్ లో రెచ్చిపోయింది. మొత్తానికి సెకెండ్ ఇన్నింగ్స్ లో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని 'ఐశ్వర్యరాయ్' హాట్ హాట్ సీన్స్ కైనా ఒకే అనడం ఇంట్రెస్ట్ గా మారింది.

14:44 - October 5, 2016

హైదరాబాద్ : మాదకద్రవ్యాల ముఠాకు సహకరించిన ఎయిర్‌ఫోర్స్‌ అధికారి రాజశేఖర్‌రెడ్డిని నార్కోటిక్‌ బ్యూరో అధికారులు నాందేడ్ ప్రాంతంలో రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌గా పనిచేస్తున్న ఇతన్ని తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ‌శేఖ‌ర్ నుంచి రూ.10లక్షల నగదు, ఐదు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. రాజశేఖర్‌ను ప్రాధమికంగా విచారించిన నార్కోటిక్‌ బ్యూరో అధికారులు అతన్ని అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. హైదరాబాద్‌, బెంగ‌ళూరులో ముఠా సభ్యులు ముగ్గురిని అరెస్ట్‌ చేసిన నార్కోటిక్‌ అధికారులు తాజాగా వింగ్‌ కమాండర్‌ అరెస్టుతో మొత్తం నలుగురు ఈ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో ఉన్నత పదవుల్లో వున్న అధికారుల పాత్ర కూడా వున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. 

14:42 - October 5, 2016

హైదరాబాద్ : జనసేన పార్టీ సోషల్ మీడియాలో అడుగుపెట్టింది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో జనసేన పార్టీ పేరుతో ఖాతా తెరిచింది. అలాగే యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది. పార్టీకి సంబంధించిన సమాచారం, పార్టీ సిద్ధాంతాలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ సమావేశాలకు సంబంధించిన వీడియో పుటేజ్ ను యూట్యూబ్ ద్వారా కార్యకర్తలను అందజేస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటికే జనసేప అధినేత పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదాపై తిరుపతి, తూర్పుగోదావరి జిల్లాలలో బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. పార్టీగా రూపాంతరం చెందిన జనసేనకు ఇంతవరకూ ఎటువంటి నిర్మాణాత్మక కమిటీలు ఏర్పాటు చేయలేదు. పార్టీకి సంబంధించి ఇంతవరకూ కర్త ,కర్మ,క్రియ అన్నీ పవన్ కళ్యాణ్ నే నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ప్రజలకు చేరువయ్యేందుకు జనసేన పార్టీ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

సోషల్ మీడియాలో 'జనసేన'..

విజయవాడ : జనసేన సోషల్ మీడియాలో అడుగు పెట్టింది. యూ ట్యూబ్, ఫేస్ బుక్..ట్విట్టర్ లో జనసేన ఖాతా తెరిచింది. పార్టీకి సంబంధించిన సమాచారం, పార్టీ సిద్ధాంతాలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియచేస్తామని జనసేన పార్టీ పేర్కొంది. పార్టీ సమావేశాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ను యూ ట్యూబ్ ద్వారా అందిస్తామన్నారు. 

రంగారెడ్డి కోర్టులో ఎయిర్ ఫోర్స్ కమాండర్..

హైదరాబాద్ : ఎయిర్ ఫోర్స్ కమాండర్ రాజశేఖరరెడ్డిని నార్కో టికెట్ సెల్ అధికారులు రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశ పెట్టారు. రెండేళ్లుగా బెంగళూరు, చెన్నైకు డ్రగ్స్ సరఫరా చేయడంలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

రోడ్ల దుస్థితిపై సర్కార్ సీరియస్..

హైదరాబాద్ : నగరంలో రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బుధవారం పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీ గోపాల్ బేగంపేటలో రోడ్లను పరిశీలించారు. 

వీడియో విడుదలకు ఆర్మీ ఒకే..

ఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్ వీడియోల విడుదలకు ఆర్మీ ఒకే చెప్పింది. వీడియోల విడుదలకు అభ్యంతరం లేదని తెలిపింది. పీఎంవో నిర్ణయం అనంతరం వీడియో ఫుటేజ్ విడుదల చేయాలని ఆర్మీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

13:51 - October 5, 2016

సహజీవనం అంటే ఏమిటీ.... అనే అంశంపై మానవి నిర్వహించిన మైరైట్ చర్చా కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, పలు విషయాలు తెలిపారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే... 
'సహజీవనం.. వెస్ట్రన్ కర్చర్. యువతీయువకులు ఒకరినొకరు అవగాహన చేసుకునేందుకు డేటింగ్ చేసుకుంటారు. సహజీవనం కూడా ఒకరకంగా పెళ్లి లాంటిదే. పెళ్లిలాంటి పెళ్లి. సహజీవనంలో యువతీయువకులు కలిసి జీవిస్తారు. నిరంతరాయంగా కలిసి ఉంటారు. అంటే 5, 10 సం.లు, ఏండ్ల తరబడి...సహజీవనం చేస్తారు. సహజీవనానికి కూడా చట్టబద్ధత ఏర్పాటు చేశారు. యువతీయువకులు కలిసి జీవించే దాన్ని సహజీవనం అంటారు. సహజీవనంలో యువతికి ఏమైనా సమస్యలు తలెత్తినట్లైతే గృహ హింస చట్టాన్ని అశ్రయించవచ్చు అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:50 - October 5, 2016

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సెంటిమెంట్ కు అధిక ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. ఆయనకు నమ్మకాలు కూడా చాలా ఎక్కువని కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. ఏ పని చేసినా ఆయన సెంటిమెంట్ గా చూస్తారని వినికిడి. '6' అంకె అంటే ఆయనకు సెంటిమెంట్ ఎక్కువ. ఆయన వాడే వాడే వాహనాల నెంబర్లు కూడా '6' సంఖ్యతోనే ఉంటాయి. ఇలా ప్రతి సందర్భంలో '6' వచ్చే విధంగా జాగ్రత్తలు పడుతుంటారని టాక్. తాజాగా కొత్త జిల్లాల విషయంలో కూడా ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
దసరా నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో 23 జిల్లాలు ఉంటాయని పేర్కొంది. అందులోని సంఖ్యలు 2, 3లను కలిపితే 5 వస్తుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం 23 సంఖ్య కేసీఆర్ కు కలిసిరాదని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించారు. ప్రజల సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్య ఎక్కువైనా ఫర్వాలేదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అనంతరం జిల్లాల సంఖ్య పెరిగింది. 27 జిల్లాలుగా ఉన్న కొత్త జిల్లాలు 30 గా మారడం..ఆ తరువాత 31కి చేరుకున్నాయి. తాజాగా మరో రెండు కొత్త జిల్లాల ప్రతిపాదనలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం కొత్త జిల్లాలు '33' అని తెలుస్తోంది. దేవరకొండ...ఇబ్రహీంపట్నం జిల్లాను ఏర్పాటు చేయాలని కొత్తగా తెరపైకి డిమాండ్స్ వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 33 జిల్లాలు ఏర్పాటు చేయడం చేస్తే సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దసరా లోపున జిల్లాల ఏర్పాటు అవుతుందా ? లేదా ? అనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది. 

13:42 - October 5, 2016

హైదరాబాద్ : ఢిల్లీలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి నఖ్వీతో భేటీ అయిన ఈటెల ... రాష్ట్రంలో నూతన మైనార్టీ గురుకుల పాఠశాలల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. హజ్ యాత్రికుల కోటా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీకి ఎంపీ వినోద్, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారికూడా హాజరయ్యారు.

13:40 - October 5, 2016

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం కుదుటపడాలంటూ అభిమానులు పూజలు చేస్తూనే ఉన్నారు. సీఎం త్వరగా కోలుకోవాలంటూ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చెన్నై అపోలో ఆస్పత్రిముందు జయలలిత ఫొటోలతో ఈ ప్రార్థనలు నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:37 - October 5, 2016
13:29 - October 5, 2016
13:25 - October 5, 2016
13:21 - October 5, 2016

ఢిల్లీ : పిఓకేలో సర్జికల్‌ దాడుల తర్వాత ఉగ్రవాద నిర్మూలనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించేందుకు ప్రణాళిక చేస్తోంది. మరోవైపు తమకు 6 నెలల సమయమివ్వండి... పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాదుల జాడ లేకుండా చేస్తామని ఆర్మీ ధీమాగా చెబుతోంది.
ఆర్మీలో పెరిగిన ఆత్మస్థయిర్యం 
పాకిస్థాన్ ఆక్రమిత క‌శ్మీర్‌లో సర్జికల్‌ దాడుల తర్వాత ఇండియన్‌ ఆర్మీలో ఆత్మస్థయిర్యం పెరిగింది. ఒక్కసారి స‌ర్జిక‌ల్ దాడులు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ప్రయోజ‌నం ఉండదని ఉగ్రవాద నిర్మూలనకు ప‌క్కా ప్రణాళిక రూపొందించాల‌ని సీనియ‌ర్ మిలిట‌రీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ఆరు నెల‌ల స‌మ‌యం ఇవ్వండి.. పీవోకేలో ఉగ్రవాదుల‌ను లేకుండా చేస్తామ‌ని చెబుతోంది ఇండియ‌న్ ఆర్మీ. ఈ విష‌యాన్ని స‌ర్జిక‌ల్ దాడుల త‌ర్వాత ప్రభుత్వానికి తెలియ‌జేసిన‌ట్లు ఆర్మీ వ‌ర్గాలు వెల్లడించాయి.
ఎలాంటి పరిణామాల‌నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి
సర్జికల్‌ దాడుల నేపథ్యంలో ప్రస్తుతం ఉగ్రవాదులు కాస్త వెనక్కి తగ్గినా, మళ్లీ రెచ్చిపోయే అవకాశముందని ఆర్మీవర్గాలు అంచనా వేస్తున్నాయి. క‌శ్మీర్‌తో పాటు భార‌త్‌లోని ఇతర ప్రాంతాలను ఉగ్రవాదులు టార్గెట్‌ చేయొచ్చని, ఎలాంటి పరిణామాల‌నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆర్మీ వర్గాలు ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఆర్మీ చెప్పిన‌ట్లే బారాముల్లా, గురుదాస్‌పూర్‌, పూంఛ్‌ సెక్టార్‌ల‌లో ఉగ్రవాదులు దాడులకు తెగ‌బ‌డ్డ విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకోవ‌డానికి రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు ప్రయత్నిస్తారని,  ముఖ్యంగాఉగ్రవాదుల‌ను స‌రిహ‌ద్దు దాటించే ప్రయ‌త్నాలు ముమ్మర‌మ‌వుతాయ‌ని ఆర్మీ అధికారులు చెప్పారు.
ఉగ్రవాద కదలికలపై అప్రమత్తంగా ఉండాలి.. 
పిఓకేలో ఉగ్రవాద కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, వారి స్థావరాలను ధ్వంసం చేయడం ఒక్కటే మార్గమని ఆర్మీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నియంత్రణ రేఖ వద్ద దాడులను అడ్డుకునేందుకు గాను కశ్మీర్‌లో భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. సరిహద్దులో అప్రమత్తంగా ఉండడమే కాదు..కశ్మీర్‌ లోయలోని ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులకు సహకరించే వారిపట్ల కఠినంగా వ్యవహరించి వారిపై విచారణ జరిపించాలని, దీంతో వారు ఉగ్రవాదులకు సహకరించాలంటేనే భయపడి పోతారని అధికారులు చెబుతున్నారు.
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 40 ఉగ్రవాద శిబిరాలు 
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సుమారు 40 ఉగ్రవాద శిబిరాలున్నట్లు భారతీయ ఆర్మీ, నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవి కాకుండా ఎల్వోసి వద్ద 50 లాంచ్‌ ప్యాడ్స్‌ ఉన్నాయి. ఇందులో రెండు వందలకు పైగా ఉగ్రవాదులు దాక్కున్నారు. వీరందరికీ పాకిస్తాన్‌ సైన్యం భద్రత కల్పిస్తోంది.

 

13:17 - October 5, 2016
13:14 - October 5, 2016

ఆర్మీకి అండగా నిలవాలన్న చినజీయర్..

హైదరాబాద్ : ఆర్మీకి అండగా నిలవాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిజీ పిలుపునిచ్చారు. దీపావళి..దసరా ఖర్చులు తగ్గించుకొని ఆర్మీకి కొంత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆర్మీ నిధికి పది లక్షల రూపాయల తాను ఇస్తున్నట్లు తెలిపారు. 

13:09 - October 5, 2016

హైదరాబాద్ : చిన్నారి సంజన, తల్లి శ్రీదేవి ఆరోగ్య పరిస్థితిపై కామినేని ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం సంజన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని.. చిన్నారి మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తెలిపారు. చిన్నారి తల్లి శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉందన్నారు. మరో 24గంటలు గడిస్తే కానీ చిన్నారి పరిస్థితి గురించి ఏమి చెప్పలేమన్నారు. 

 

వంద మంది ఉగ్రవాదులు..

ఢిల్లీ : సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భద్రతపై ప్రభుత్వానికి ఎన్ఎన్ఏ నివేదిక అందచేసింది. వంద మంది శిక్షణపొందిన ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించింది. 

13:07 - October 5, 2016

ఢిల్లీ : సరిహద్దులో భద్రతపై ఏర్పాటైన భద్రతాకమిటీ సమావేశం ముగిసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశంలో సర్జికల్ దాడుల వీడియో ఫుటేజీ విడుదలపై చర్చించారు. దాదాపు అరగంటపాటు కొనసాగిన సమావేశానికి కేంద్రమంత్రులు, అధికారులు హాజరయ్యారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్‌ పారికర్, ప్రకాశ్ జవదేకర్, సురేశ్ ప్రభు, అశోక్‌ గజపతి రాజు, అధికారులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:07 - October 5, 2016

ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు..ప్రస్తుతం ఉదయం లేచినప్పటి నుండి మొదలు రాత్రి పడుకొనే వరకు ఉరుకులు..పరుగులతో కాలం గడిచిపోతోంది. దీనితో ఆహార నియమాలపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
రక్త హీనత రాకుండా ఉండేందుకు ఆహారంలో తప్పకుండా ఐరన్ ఉండే విధంగా చూసుకోవాలి. చేపలు..ఆకుకూరలు, కందగడ్డ, పీనట్ బటర్, ఎండు ద్రాక్ష, నల్ల ద్రాక్ష, తాజా కూరగాయలు ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి.
ప్రతి 20 నుండి 30 నిమిషాలకొకసారి నీళ్లు తాగుతుండడం చేయాలి.
పాలు..గుడ్లు భుజించాలి. కొవ్వు పదార్థాలను సరియైన మోతాదులో తీసుకుంటే ఫలితం కనబడుతుంది.
భోజనానికి రెండు గంటల ముందుగా ఎలాంటి స్నాక్స్ తినకపోవడం మంచిది. భోజనంలో తప్పనిసరిగా పాలు..కూరగాయలు..పండ్లు ఉండేలా జాగ్రత్త పడాలి.
ఉదయం టిఫిన్ తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలి. తీసుకోకపోవడం వల్ల శరీర భాగాలకు సరిపడా శక్తి అందక ఎనీమియాకు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నిద్ర లేవగానే మూడు గ్లాసుల మంచినీటిని సేవించాలి. ఆ నీరు శరీరంలోని పేరుకపోయిన వ్యర్థానంతా మల విసర్జన రూపంలో బయటకు పంపుతుంది.
బరువును అదుపులో ఉంచుకోవాలి. దీని కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజువారీ ఆహారంలో కాయగూరలూ, పండ్లూ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి.

12:34 - October 5, 2016

మాస్ రాజా రవితేజ కాస్త తగ్గాడు. దిల్ రాజు కోసం ఏ మాత్రం తగ్గని ఈ మాస్ స్టార్ దర్శకుడు బాబీ కోసం మాత్రం బాగానే తగ్గాడు. ప్రస్తుతం ఈ హీరో బాబీ తో పాటు ఓ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ రెండు మూవీస్ కోసం కాస్త తగ్గాడు. దిల్ రాజుకి తగ్గని మాస్ రాజా, దర్శకుడు బాబీకోసం ఎందుకు తగ్గాడో చూద్దాం.....
ఆచితూచి కొత్త సినిమాలు సెలెక్ట్  
వరుసగా సినిమాలు చేసే రవితేజ స్పీడ్ తగ్గించాడు. వరుస ఫెల్యూర్స్ కారణంగా మాస్ రాజా ఆచితూచి కొత్త సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే రవితేజ గ్యాప్ తీసుకుని సినిమాలు చేయడానికి కేరింగ్ తో పాటు బెట్టు చేయడమే అని తెలుస్తోంది. దిల్ రాజుతో చేసే సినిమా క్యాన్సిల్ కావడానికి రవితేజ తగ్గకపోవడమే అని వినిపిస్తోంది. 
7 నుంచి 8కోట్లా రెమ్యూనరేషన్ 
రవితేజ కాస్త అటు ఇటుగా 7 నుంచి 8కోట్లా రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. అయితే వరుసగా కిక్ 2, బెంగాల్ టైగర్ రిజల్ట్స్ తేడా కొట్టాయి. దీంతో దిల్ రాజు, రవితేజతో చేసే మూవీకి 5కోట్ల మాత్రమే ఇస్తానని చెప్పాడట. కానీ ఈ మాస్ స్టార్ అందుకు సమిసేరా అనడంతో దిల్ రాజు, రవితేజల కాంబినేషన్ మూవీ అటకెక్కింది. అయితే బాబీ దర్శకత్వంలో చేయనున్న సినిమా కోసం రెమ్యూనరేషన్ పరంగా మాస్ రాజా బాగానే తగ్గాడని వినికిడి. 
బాబీ డైరెక్షన్ లో రవితేజ కొత్త సినిమా 
రవితేజ బాబీ డైరెక్షన్ లో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మాస్ రాజా 6కోట్లకు ఒకే చెప్పాడట. ఈ చిత్రాన్ని కె రాధామోహన్ నిర్మిస్తున్నట్లు సమాచారం. కేవలం బాబీ మీదున్న నమ్మకంతోనే రవితేజ ఈ అమౌంట్ కి ఒకే చెప్పాడట. అంతేకాదు మూవీ సక్సస్ అయితే వాటాలో కొంత ఇవ్వడానికి నిర్మాత ఒప్పుకోవడం వల్లే మాస్ రాజా ఈ అమౌంట్ కి ఒకే చెప్పాడట. మరి ఈ సినిమాతో అయిన మాస్ రాజా మునుపటి ఫాం అందుకుంటాడో లేదో చూడాలి.

 

12:28 - October 5, 2016

హైదరాబాద్ : బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోంది. LB స్టేడియంలో 10 వేల మంది మహిళలతో బతుకమ్మ ఆడి గిన్నీస్‌ రికార్డులో స్థానం సంపాదించేందుకు సన్నాహాలు చేస్తోంది. డ్వాక్రా సంఘాలు మొదలు మహిళా కార్పొరేటర్ల వరకూ ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని కేసీఆర్ సర్కార్‌ పిలుపునిచ్చింది.
బతుకమ్మకు ప్రపంచ గుర్తింపు తెచ్చేందుకు సర్కార్ సన్నాహాలు
తెలంగాణ ఆడబిడ్డల ఆట, పాట అయిన బతుకమ్మకు ప్రపంచ గుర్తింపు తెచ్చే దిశగా కేసీఆర్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గిన్నీస్‌ రికార్డులో స్థానం కోసం ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో బతుకమ్మ  ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందుకోసం ఈ నెల 5,6 తేదీల్లో డివిజన్ల వారీగా మహిళలు, కార్పొరేటర్లకు బల్దియా,  మెప్మా ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు.  
10 వేల మంది మహిళలతో బతుకమ్మ..?
అయితే ఇప్పటి వరకు కేరళ రాష్టానికి చెందిన ఓనం నృత్యానికి గిన్నీస్‌ రికార్డ్‌ ఉంది. 5 వేల 211 మంది మహిళలు సామూహికంగా నృత్యం చేసి ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఓనం రికార్డును అధిగమించేలా పదివేల మంది మహిళలతో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాట్లపై హోంమంత్రి  నాయిని, మంత్రి చందులాల్, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. బతుకమ్మ ఉత్సవాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేటర్లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.   
బతుకమ్మకు గిన్నీస్‌ రికార్డ్ లక్ష్యంగా అధికారులు సిద్ధం 
ఒక్కో కార్పొరేటర్ 200 మంది మహిళలను తీసుకురావాలని జీహెచ్ ఎంసీ మేయర్‌ సూచించారు. వీరికి కావాల్సిన రవాణా ఇతరత్రా ఏర్పాట్లను పర్యాటక శాఖతో పాటు జీహెచ్ఎంసీ చూస్తుందన్నారు. బతుకమ్మకు గిన్నీస్‌ రికార్డ్ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. అందమైన బతుకమ్మలతో మహిళలు ఎల్బీ స్టేడియాన్ని పూలవనాన్ని తలపించేలా తీర్చిదిద్దనున్నారు. 

 

తెలంగాణ డీజీపీ ఉన్నతస్థాయి సమావేశం..

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో డీజీపీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నలుగురు కమిషనర్లు, అడిషినల్ డీజీపీలు, ఐజీలు, డీఐజీలు పాల్గొన్నారు. 

ముక్తార్ అబ్బాస్ తో ఈటెల భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ మంత్రి ఈటెల భేటీ అయ్యారు. వేణుగోపాల చారి, ఎంపీ వినోద్ పాల్గొన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలకు ఆర్థిక సాయం, హాజ్ యాత్రికుల కోటా పెంచాలని విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ బలంగా కోరుకున్న వ్యక్తి కాకా - మంత్రి హరీష్..

హైదరాబాద్ : తెలంగాణను బలంగా కోరుకున్న వ్యక్తి కాకా అని మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ఇవ్వాలని పలుసార్లు కేంద్రంతో వాదించారని, పార్టీ ఏదైనప్పటికీ తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపారని తెలిపారు. రాబోయే రోజుల్లో కాకా కీర్తి చిరస్థాయిగా ఉండేలా కృషి చేస్తామన్నారు. 

కాకా ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలి - కడియం..

హైదరాబాద్ : కాకా ఆశయాలను మందుకు తీసుకెళ్లాలని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. కాకా జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఆయనతో పాటు తెలంగాణ మంత్రులు కూడా నివాళులర్పించారు. దళితుల అభివృద్ధి కోసం కాకా నిరంతరం కృషి చేశారని, తెలంగాణ కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. 

ఏపీ దేవాదాయ శాఖలో ముదిరిన వివాదం..

విశాఖపట్టణం : ఏపీ దేవాదాయ శాఖలో వివాదం ముదిరుతోంది. అసిస్టెంట్ కమిషనర్ కు వ్యతిరేకంగా ఆలయ సిబ్బంది..ఈవోలు ఆందోళన చేపట్టారు. పుష్పవర్ధన్ ను తొలగించే వరకు విధులు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.  

12:12 - October 5, 2016

ఢిల్లీ : ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం కొనసాగుతోంది. సరిహద్దులో పరిస్థితి, సర్జికల్ స్ట్రైక్స్ వీడియో ఫుటేజీ విడుదల అంశాలపై ఇందులో చర్చిస్తున్నారు. సర్జికల్ వీడియో విడుదల చేయాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌పై చర్చ నడుస్తోంది. ఈ భేటీకి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్‌ పారికర్, ప్రకాశ్ జవదేకర్, సురేశ్, అశోక్‌ గజపతి, అధికారులు హాజరయ్యారు.

 

రోశయ్యను కలిసిన ముద్రగడ..

హైదరాబాద్ : మాజీ గవర్నర్ రోశయ్యను కాపు ఉద్యమ నేత ముద్రగడ కలిశారు. రోశయ్యను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు, కాపు ఉద్యమానికి రోశయ్య మద్దతు కోరడం జరిగిందన్నారు. 

కరాచీ బేకరీలో బాలల హక్కుల సంఘం తనిఖీలు..

హైదరాబాద్ : నాంపల్లి కరాచీ బేకరీలో బాలల హక్కుల సంఘం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో బాల కార్మికులున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. 20 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు సమాచారం.

కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతనలో కేంద్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెడ్ పార్క్ కు తమిళనాడు, కాంచీపురం, చెంగళ్ పట్టులో హెచ్ ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ కు 330 ఎకరాల ప్రభుత్వ భూమి స్థలం కేటాయింపు..జలసహకారంపై భారత్, యూరోపియన్ మధ్య ఒప్పందానికి...హెచ్ ఐవీ, ఎయిడ్స్ బిల్లు 2014 సవరణలకు ఆమోదం..రష్యా ఆయిల్ సంస్థ జేఎన్ సి వాన్ కోర్ నెస్ట్ నుండి 11 శాతం వాటా కొనుగోలుకు ఓఎనీజసీ విదేశీ లిమిటెడ్ కు అనుమతి..కేంద్రం ఆమోదం తెలిపింది. 

11:57 - October 5, 2016
11:56 - October 5, 2016

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఇన్నేళ్ల యూనివర్శిటీ చరిత్రలో అకడమిక్ స్టాఫ్‌ కాలేజీలో బతుకమ్మ సంబరాలను జరపుకోవడం మొదటిసారని అంటున్నారు మహిళలు. ఎప్పుడు క్లాసు రూముల్లో ఉండే తాము కాలేజీ ప్రాంగణంలో బతుకమ్మ జరపుకోవడం పట్ల మహిళ ప్రొఫెసర్లు ఆనందం వ్యక్తం చేశారు.
బతుకమ్మ ఆడిన మహిళా ప్రొఫెసర్లు 
ఉస్మానియా యూనివర్శిటీలో మహిళా ప్రొఫెసర్లు బతుకమ్మ ఆడారు. అకడమిక్ స్టాఫ్ కాలేజీలో ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఓరియంటేషన్ ప్రొగ్రామ్ లో భాగంగా కాలేజీలో బతుకమ్మ వేడుకల్ని ఆనందంగా జరుపుకున్నారు మహిళా ప్రొఫెసర్లు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి.. ఆడిపాడారు. బతుకమ్మ సంబరాలు తమ కాలేజీలో ఓరియంటేషన్ ప్రొగ్రామ్ కి వచ్చిన మహిళలతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రోఫెసర్లు. 
బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న పురుషులు  
మహిళల స్టాఫ్ కాలేజీలో పురుషులు కూడా బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు. మహిళలతో కలిసి దాండియా స్టెప్ప్‌లు వేసి అందర్ని అలరించారు. అకడమిక్ స్టాఫ్ కాలేజీ చరిత్రలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నామన్నారు..  అతి త్వరలోనే ఉస్మానియి యూనివర్శిటీ శతాబ్ధి ఉత్సవాలు జరుపుకోబోతున్న నేపథ్యంలో బతుకమ్మ ఉత్సవాలను కాలేజీలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు కాలేజీ డైరెక్టర్ బాలకిషన్. ఎప్పుడు బోధనలో మునిగితేలే తమకు బతుకమ్మ సంబరాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయన్నారు. 

చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద ప్రార్థనలు..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమె త్వరగా కోలుకావాలని అభిమానులు ఆసుపత్రి ఎదుట పూజలు..ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. 

పేదలు..కార్మికుల కోసం కాకా కృషి - వెంకటస్వామి..

హైదరాబాద్ : పేదలు, కార్మికుల సంక్షేమం కోసం వెంకటస్వామి కృషి చేశారని మాజీ ఎంపీ వివేక్ పేర్కొన్నారు. ప్రాణహిత చేవెళ్ల కోసం కాకా చాలా కష్టపడ్డారని తెలిపారు. సింగరేణి సంస్థ మూతపడకుండా కృషి చేయడం జరిగిందన్నారు. 

దుర్గమ్మను దర్శించుకున్న టీమిండియా చీఫ్ సెలక్టర్..

విజయవాడ : ఇటీవ‌లే టీమిండియా చీఫ్‌ సెలెక్టర్‌గా ఎంపికైన ఎమ్మెస్కే ప్రసాద్ బుధవారం ఉద‌యం ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామివారిని ద‌ర్శించుకొని, పూజ‌ల్లో పాల్గొన్నారు. ఆయ‌న‌కు దేవాల‌య అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దుర్గమ్మ‌వారి ఆశీస్సులతో అత్యుత్తమ క్రికెట్‌ జట్టును ఎంపిక చేస్తానని ఎమ్మెస్కే పేర్కొన్నారు. 

కొనసాగుతున్న టిడిపి శిక్షణా తరగతులు..

గుంటూరు : రెండో రోజు టిడిపి శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ఈ శిక్షణలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులకు టెక్నాలజీపై నియోజకవర్గాల వారీగా కైజాల యాప్ పై, సీఎం కోర్ డాష్ బోర్డు నిర్వాహణపై ప్రజాప్రతినిధులకు శిక్షణనిచ్చే ల్యాబ్ ను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు.

ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు..

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం కాత్యాయనీ దేవిగా బెజవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. 

గోదావరిఖని ఆసుపత్రిలో వైద్యుల మధ్య విబేధాలు..

కరీంనగర్ : గోదావరిఖని ఆసుపత్రిలో వైద్యుల మధ్య విభేదాలు పొడచూపాయి. విభేదాల కారణంగా వైద్యులు విధులకు హాజరు కాలేదు. అత్యవసర చికిత్సలకు అంతరాయం ఏర్పడడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. 

ముగిసిన భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ..

ఢిల్లీ : కాసేపటి క్రితం భద్రతా వ్యవహరాల కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు, సరిహద్దు భద్రతపై చర్చించారు. 

కాకా విగ్రహానికి నివాళులు..

హైదరాబాద్ : మాజీ పార్లమెంట్ సభ్యుడు, స్వర్గీయ వెంకటస్వామి జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ట్యాంక్ బండ్ సమీపంలోని కాకా విగ్రహానికి డిప్యూటి సీఎంలు కడియం, మహమూద్ ఆలీ, హోం మంత్రి నాయినీ, కేకే, డీఎస్, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కాకా ఫొటో ఎగ్జిబీషన్ ను నేతలు సందర్శించారు. 

శ్రీదేవి..చిన్నారి సంజన హెల్త్ బులెటిన్ విడుదల..

హైదరాబాద్ : తాగుబోతుల నిర్లక్ష్య డ్రైవింగ్ కు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి శ్రీదేవి, చిన్నారి సంజన ఆరోగ్య పరిస్థితిపై కామినేని వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. సంజన పరిస్థితి విషమంగానే ఉందని, బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టిందని వైద్యులు పేర్కొన్నారు. సంజన తల్లి శ్రీదేవి పరిస్థితి నిలకడగానే ఉందని, వెన్నుపూసలో నాలుగు ఎముకలు విరిగినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్య శ్రీ ప్రత్యేక కోటాలో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. 

11:40 - October 5, 2016

పశ్చిమగోదావరి : జిల్లా తుందుర్రులో పోలీసుల దౌర్జన్యానికి ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేకులు నానా కష్టాలు పడుతున్నారు. గ్రామస్తులు భయంతో హడలెత్తిపోతున్నారు. అక్రమ కేసులు పెడుతుండడంతో ఊళ్ళో నుంచి పారిపోయి పరాయి పంచన తలదాచుకుంటున్నారు. పక్క గ్రామంలో రైతులు తలదాంచుకుంటున్నారు. పంటలను కాపాడుకోవడానికి రాత్రి వేళ్లలో గ్రామానికి వస్తున్నారు. తుందుర్రులో రాత్రి సమయం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో 10టివి తెలుసుకునే ప్రయత్నం చేసింది. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం...

 

11:06 - October 5, 2016

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' వెంట వెంటనే సినిమాలు ఒప్పుకొనేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన నటిస్తున్న 'కాటమరాయుడు' షూటింగ్ కొనసాగుతుండగానే మరో సినిమాకు 'పవన్' గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కిషోర్ కుమార్ పార్దసాని (డాలీ) దర్శకత్వంలో 'కాటమరాయుడు' సినిమాలో 'పవన్' నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సినిమా అనంతరం మాటల మాంత్రికుడు 'తివిక్రమ్' దర్శకత్వంలో 'పవన్' ఓ సినిమా చేయనున్నాడని టాక్. ఈ చిత్రానికి 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన 'పవన్' కి ఈ సినిమా ఎంతో దోహదం చేస్తుందని ప్రచారం జరుగుతోంది. 'జల్సా', 'అత్తారింటికి దారేది' వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తరువాత 'పవన్', 'త్రివిక్రమ్' కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో భారీగానే అంచనాలు నెలకొంటున్నాయి. మరి ఈ చిత్రం ఎప్పుడు మొదలువుతుందో ? అప్పుడు కానీ ఈ చిత్ర విశేషాలు తెలియవు. అంతవరకు వెయిట్ చేయాల్సిందే. 

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు..

పశ్చిమ బెంగాల్ : మిడ్నాపూర్ లో పోలీసుల ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. బుధవారం ఉదయం పది మంది నక్సల్స్ లొంగిపోయారు. 

10:50 - October 5, 2016

కాపులను బీసీల్లో చేర్చాలని వక్తలు సూచించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో ఎపి బిజెపి నేత శ్రీధర్, టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి చందు సాంబశివరావు, వైసీపీ నేత కరణం ధర్మశ్రీ పాల్గొని, మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:45 - October 5, 2016
10:44 - October 5, 2016

మెదక్ : జిల్లాలో విషాదం నెలకొంది. షిరిడి వెళ్తూ మృత్యులోకాలకు వెళ్లారు. మల్కాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. జిల్లాలోని ఆర్ సీ పురం మండలం శ్రీనివాసనగర్ కాలనీలోని ఓ ఇంట్లో నిన్న మధ్యాహ్నం పంక్షన్ జరిగింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యుల్లో కొంతమంది మద్యం సేవించారు. రాత్రి వరకు కూడా మద్యం మత్తులోనే ఉన్నారు. షిరిడి వెళ్లేందుకు ఐదు మంది సిద్ధమయ్యారు. వారి తండ్రి వారించాడు. వారి చేతుల్లో నుంచి బ్యాగులు కూడా లాక్కున్నాడు. అయినా వినకుండా ఐదు మంది కారులో షరిడి బయల్దేరారు. మార్గంమధ్యలో మెదక్‌ జిల్లా కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ వద్ద కారును లారీ ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతులు, గాయపడినవారి నుంచి మద్యం సేవించిన వాసన వస్తుంది. వాహనంలో కూడా మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

10:23 - October 5, 2016

వరంగల్‌ : శివనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టీసీఐ ట్రాన్స్‌పోర్టు గోదాములో మంటలంటుకున్నాయి. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటికిపైగా ఆస్తి నష్టం జరిగిఉంటుందని అంచనావేస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం..

ఢిల్లీ : ప్రధాని నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరి, మనోహర్ పారికర్, భద్రతా అధికారులు పాల్గొన్నారు. 

10:21 - October 5, 2016

ఆ చిన్నారికి అభం..శుభం తెలియదు.. వయస్సు రెండేళ్లు..తన బైక్ కు అడ్డు వస్తావా ? అంటూ ఆ చిన్నారిపై పెట్రోల్ పోసి నిప్పటించాడో దుర్మార్గుడు. తీవ్రగాయాల పాలైన ఆ చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అందులో ఆ దుర్మార్గుడు మైనర్ కావడం గమనార్హం. ఒళ్లుగొగుర్పొడిచే ఈ ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
జిలాల్ నగర్ లో ఆటో డ్రైవర్ రహీం నివాసం ఉంటున్నాడు. ఇతనికి నలుగురు సంతానం. చిన్నవాడైన రెండు సంవత్సరాల ఆలీఖాన్ మంగళవారం రాత్రి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బైక్ పై ఫైజల్ (15) అనే యువకుడు వచ్చాడు. ఆలీఖాన్ అడ్డుగా ఉండడంతో ఫైజల్ హారన్ కొట్టాడు. చిన్నారి తప్పుకోకపోవడంతో ఫైజల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే చిన్నారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికులు వెంటనే గమనించి మంటలను ఆర్పి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఉస్మానియాలో చిన్నారికి చికిత్స పొందుతున్నాడు. చేయి..తలకు తీవ్రగాయాలయ్యాయి. దీనిపై కాలాపత్తర్ పోలీసులు కేసు నమోదు చేసి ఫైజల్ ను అదుపులోకి తీసుకున్నారు. మైనర్ కావడంతో ఇతడని జువైనల్ కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. 

ఇంకా విషమంగానే చిన్నారి సంజన ఆరోగ్యం...

హైదరాబాద్ : తాగుబోతుల వీరంగానికి గాయపడిన చిన్నారి సంజన ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ఐసీయూలో వెంటిలెటర్ పై చిన్నారి సంజన చికిత్స పొందుతోంది. సంజనకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన నిర్వహిస్తున్నారు. నిందితులకు బెయిల్ రాకుండా పోలీసులు అడ్డులేకపోయారని ఆరోపించారు. 

చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకున్న లండన్ వైద్యుడు..

చెన్నై : అపోలో ఆసుపత్రికి లండన్ డాక్టర్ రిచర్డ్ జాన్ బీలే చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలితకు చికిత్స నిర్వహించనున్నారు. 

కర్మన్ ఘాట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఆక్సిడెంట్ !..

హైదరాబాద్ : కర్మన్ ఘాట్ గాయత్రినగర్ లో రత్నాకర్ రెడ్డి మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. కొత్తపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. 

వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం..

వరంగల్ : శివనగర్ లోని టీసీఐ ట్రాన్స్ పోర్టు గోదాంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 

ఎమ్మెల్యే ఇంటిపై ఉగ్రవాదుల దాడి..

జమ్మూ కాశ్మీర్ : మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు. షోపియాన్ లోని ఎమ్మెల్యే మహ్మద్ యూసఫ్ భట్ ఇంటిపై ఈ రోజు తెల్లవారుజామున ఉగ్రవాదులు గ్రనేడ్ తో దాడికి పాల్పడ్డారు. 

దాద్రి నిందితుడు మృతి..

ఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్ లోని దాద్రి ప్రాంతానికి చెందిన అక్లఫ్ బీఫ్ తిన్నాడని దారుణంగా కొట్టి చంపిన కేసులో ప్రధాన నిందితుడు రాబిన్ అలియాస్ రవి (20) ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తమ కుమారుడు అనారోగ్యంతో చనిపోలేదని పోలీసులే జైలులో కొట్టి చంపారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. 

10:08 - October 5, 2016

హైదరాబాద్ : మొన్నటి దాక లేదని.. నిన్నటికి ఒకే అనడంలో అంతర్యమేంటి..? జిల్లాల సంఖ్య పెంపు వెన‌క కేసీఆర్ అస‌లు ఆలోచ‌న ఏంటీ..? మొదట్లో ససేమిరా అన్న సీఎం, అంతలోనే మ‌న‌సు మార్చుకోవ‌టం వెనక ప్రభావం చూపిన అంశాలేంటి..? ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న 31 జిల్లాలేనా..? లేక తెలంగాణ ముఖచిత్రంలో మరిన్ని జిల్లాలు వస్తాయా..?
మరో నాలుగు జిల్లాల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ 
మొన్నటి దాకా నవ్య తెలంగాణ 27 జిల్లాలకే పరిమితమవుతుందని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అనూహ్యంగా మరో నాలుగు జిల్లాల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కొత్త జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనల దశలోనే అన్ని ప్రాంతాలనుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. తమ ప్రాంతాన్ని జిల్లా చేయాలంటూ ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనలు.. హర్తాళ్లు నిర్వహించారు. అయినా సీఎం కేసీఆర్‌ తగ్గలేదు. పైగా ఆల్‌పార్టీకి 27 జిల్లాలతోనే ముసాయిదాను అందించారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఆవేదనను సీఎం అర్థం చేసుకోవడం లేదంటూ గడచిన రెండు నెలలుగా ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. గద్వాల జిల్లా కోసం మాజీ మంత్రి డి.కె.అరుణ తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. అయినా పట్టించుకోని కేసీఆర్‌.. సోమవారం అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. భారీ డిమాండ్‌ వున్న సిరిసిల్ల, గద్వాల, జనగాంతో పాటు ఆసిఫాబాద్‌ ప్రాంతాన్నీ జిల్లాలుగా ప్రకటించారు. సీఎం నిర్ణయం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలాయన నిర్ణయానికి కారణాలేంటన్న ఆరా కూడా మొదలైంది. 
ప్రజల డిమాండ్లకే మొగ్గుచూపిన కేసీఆర్‌
ప్రజ‌ల నుంచి బ‌ల‌మైన డిమాండ్లు వ‌చ్చిన చోట వారి కోరిక నేర‌వేర్చే అవ‌కాశం ఉంటే నిర్ణయం తీసుకోవాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించార‌ట‌. ప్రజల డిమాండ్లు నెరవేరిస్తే.. భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ పార్టీకే లబ్ది చేకూరుతుందని గులాబీదళపతి భావిస్తున్నారట..! అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్నది పార్టీ వర్గాల టాక్‌.  మిగిలిన జిల్లాల ఏర్పాటుకు సిరిసిల్ల డిమాండే కారణమైందన్న వాదన వినిపిస్తోంది. 
సిరిసిల్ల జిల్లాకు గ్రీన్‌సిగ్నల్‌ 
మంత్రి కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న సిరిసిల్లను జిల్లా చేయాలన్న డిమాండ్‌ బాగా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ కూడా కాస్తంత పునరాలోచనలో పడ్డట్లు చెబుతున్నారు. ఒకే డివిజ‌న్ ఉన్న మ‌హ‌బూబాద్‌ను జిల్లా చేస్తున్నందున... సిరిసిల్ల ప్రజ‌ల కోరిక‌ మేర‌కు సిరిసిల్ల, వేముల‌వాడను కలిపి 13 మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం అంగీకరించినట్లు చెబుతున్నారు. సిరిసిల్ల జిల్లాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సీఎం.. డిమాండ్‌ అధికంగా ఉన్న గ‌ద్వాల, జ‌న‌గామ‌, అసిఫాబాద్‌లను కూడా జిల్లాలుగా మార్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన డిమాండ్లతో ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు మొగ్గుచూపింది. సీఎం నిర్ణయం వల్ల ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు కొంత సానుభూతి లభిస్తుందనీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

 

దసరాకు హైదరాబాద్, కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ : దసరా పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్..కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈమేరకు సీనియర్ పీఆర్‌వో షకీల్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, కాకినాడ స్పెషల్ ట్రైన్ ఈ నెల 7వ తేదీ సాయంత్రం 7.10కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 8వ తేదీ రాత్రి 8 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50కి సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు.

 

నేడు అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల సదస్సు

హైదరాబాద్ : నేడు అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల సదస్సు జరుగనుంది. ఈసీల సదస్సును గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. 

08:31 - October 5, 2016

యంగ్ హీరో నాని స్పీడ్ చూసి ఓరి నీ స్పీడు బంగారం కాను అంటున్నారు ఇండస్ట్రీలు. ఈ నేచుల్ స్టార్ ఎడాదిలో ఇప్పటికే మూడు సినిమాలు విడుదల చేశాడు. ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్ తో బిజీలో ఉన్న ఈ హీరో మరో రెండు కొత్త సినిమాలకు సైన్ చేశాడు. మరి నాని చేస్తున్న ఆ కొత్త సినిమాలేంటో చూద్దాం...
10నెలల వ్యవధిలోనే మూడు సినిమాలు రిలీజ్ 
నేచురల్ స్టార్ నాని స్పీడ్ ఏంటో కనిపిస్తూనే ఉంది. ఈ ఏడాది 10నెలల వ్యవధిలోనే మూడు సినిమాలు రిలీజ్ చేయడం విశేషమంటే, ఆ మూడు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకోవడం మరో విశేషం. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న నేను లోకల్ సినిమాను ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవున్నాడు. ఇంతలోనే మరో రెండు సినిమాలను లైన్ పెట్టినట్లు సమాచారం. 
కొత్త సినిమాకి నాని లైన్ క్లియర్ 
ఎవడే సుబ్రమణ్యం నుంచి మొదలుపెడితే, భలేభలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాధ, జెంటిల్మన్, మజ్నులతో కంటిన్యూగా ఐదు హిట్స్ కొట్టాడు. నేను లోకల్ తో డబుల్ హ్యాట్రిక్ కంప్లీట్ చేయబోతున్నాడు. ఈ స్పీడ్ లో నాని కొత్త సినిమాలకు సంబంధించి స్పీడ్ కంటిన్యూ చేస్తున్నాడు. దర్శకుడు పరుశురాం అసిస్టెంట్ శివలో డీవీవీ దానయ్య నిర్మించే కొత్త సినిమాకి నాని లైన్ క్లియర్ చేసినట్లు వినిపిస్తోంది.
పరుశురాం డైరెక్షన్ లో మరో సినిమా
పరుశురాం శిష్యుడితో సినిమా చేస్తున్న నాని ఆ తరువాత పరుశురాం డైరెక్షన్ లో మరో సినిమాకి సైన్ చేశాడట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎడాది వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమాతో పరుశురాం దర్శకుడిగా మరోసారి ఫ్రువ్ చేసుకున్నాడు. అన్నట్లు నాని గీతా ఆర్ట్స్ లో చేసిన భలే భలే మగాడివో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 

08:24 - October 5, 2016

మెగా తనయుడు మాటిచ్చి తప్పాడు. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త హార్ట్ అయ్యారు. దీంతో మెగా ఫ్యాన్స్ ని ఖుషీ చేయడానికి రామ్ చరణ్ ఇప్పుడు కొత్త స్కెచ్ వేశాడు. అభిమానులను ఆనందపరుచడానికి చెర్రీ వేసిన ఆ కొత్త ప్లాన్ ఏంటో వాచ్ దీస్ స్టోరీ.
చెర్రీ కొత్త మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు 
మెగా తనయుడు బాక్సఫీసు బ్లాక్ బస్టర్ కొట్టి చాలా కాలం అవుతుంది. చరణ్ ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన ఎవడు, గోవిందుడు అందరివాడేలే చిత్రాలు పెట్టుబడిని మాత్రమే రికవరీ చేశాయి. దీనికి తోడు బ్రూస్ లీ అయిన బాక్సఫీసు ని బద్దలు కొడుతుందనుకుంటే నిరాశపరిచింది. దీంతో మెగా అభిమానులు చెర్రీ కొత్త మూవీ కోసం వేయికళ్లతో చూస్తున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ 
రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ అనే కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్టు తని ఒరువన్ కి రిమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం దసరా బరీలో నుంచి తప్పుకుంది.  దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశపడ్డారు. అయితే ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపడానికి చెర్రీ దసరా గిప్ట్ ని సిద్దం చేశాడట.
దసరాకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ 
దసరా పండుగ సందర్భంగా రామ్ చరణ్ అండ్ టీం ధృవ సినిమా టీజర్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ఈ చిత్రంలొ చెర్రీ సరసన రాకూల్ ప్రీతిసింగ్ మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది. దసరా బరీలోనుంచి వెనక్కి వెళ్లిన ధృవ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

 

07:57 - October 5, 2016

తెలంగాణలోని కాంట్రాక్ట్‌ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ జేఏసి నేత సురేష్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మొన్న హైదరాబాద్‌లోని ఇంటర్‌ డిగ్రీ కమిషనరేట్‌ దగ్గర తెలంగాణలోని కాంట్రాక్ట్‌ లెక్చరర్లు కుటుంబ సమేతంగా తమ గోస వినిపించారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్లు కుటుంబ సమేతంగా ఆందోళనల్లో పాల్గొనాల్సిన అవసరం ఎందుకొచ్చింది? కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలేమిటి? వాటి అమలు ఎలా వుంది? కాంట్రాక్ట్‌ లెక్చరర్ల కోరికలేమిటి? ఇదే అంశంపై సురేష్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

07:53 - October 5, 2016

తెలంగాణలో ప్రభుత్వ డిగ్రీ జూనియర్‌ కాలేజీలలో దాదాపు నాలుగు లక్షలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ప్రభుత్వ కాలేజీలలో నాలుగున్నర వేల మంది లెక్చరర్‌లు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరిలో 16 ఏళ్ల నుంచి పనిచేస్తున్నవారు కూడా వున్నారు. జూనియర్‌ కాలేజీలలో రెగ్యులర్‌ లెక్చరర్‌ల కంటే కాంట్రాక్ట్‌ టీచర్లే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు.
గురువులకు ఉద్యోగ భద్రత అవశ్యం
విద్యా బోధన హృదయంలోంచి జరగాల్సిన ప్రక్రియ. ఉపాధ్యాయులైనా, అధ్యాపకులైనా నిరంతర విద్యార్థులుగా వున్నప్పుడే అత్యుత్తమ స్థాయిలో బోధించగలరని అనేకమంది ఉత్తమోత్తమ గురువులు ప్రవచించారు. అది నిజం కూడా. అందులో ఏమాత్రం సందేహం లేదు. 
టీచింగ్‌ వృత్తి అత్యంత బాధ్యాయుతం 
టీచింగ్‌ వృత్తి అత్యంత బాధ్యాయుతమైనది. అత్యంత కళాత్మకమైనది. విద్యార్థులకు విద్యను బోధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. జాతిని నిర్మించే బృహత్తర బాధ్యత.  దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దే పవిత్ర కర్తవ్యం.  సహనం, సంయమనం, సమయస్పూర్తి, స్నేహశీలత ఇలాంటి సుగుణాలు ప్రదర్శించినవారిని ఉత్తమోత్తమ గురువులుగా శిష్యులు అభిమానిస్తుంటారు. శిష్యుల హృదయాల మీద తమ రూపాన్ని ప్రతిష్టించుకున్న గురువులు ధన్యులు. 
టీచింగ్‌ వృత్తిలో అభద్రతా భావం ఉండకూడదు  
అయితే ఉపాధ్యాయులైనా, అధ్యాపకులైనా తమ బాధ్యతను సమర్ధమంతంగా నిర్వహించాలంటే అందుకు తగిన వాతావరణం కూడా వుండాలనడంలో సందేహం లేదు. టీచింగ్‌ వృత్తిలో వున్నవారికి ఏమాత్రం అభద్రతా భావం ఉండకూడదు.  తమ భవిష్యత్‌ గురించి, తమ పిల్లల భవిష్యత్‌ గురించి ఏమాత్రం బెంగ వుండకూడదు. అత్యంత ప్రశాంత వాతావరణంలో, భవిష్యత్‌ పై అత్యంత ఆత్మవిశ్వాసంతో బోధన సాగించిన్నప్పుడే వారి దగ్గర చదువు నేర్చుకునే విద్యార్థులకు మేలు కలుగుతుంది. దురదృష్టవశాత్తు విద్యారంగంలో అదే కొరవడుతోంది. 
ఉపాధ్యాయ, అధ్యాపక నియామకాల విషయంలో నిర్లక్ష్యం 
ముఖ్యంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ, అధ్యాపక నియామకాల విషయంలో నిర్లక్ష్యం చేస్తోంది. చివరకు బోధనారంగంలో కూడా కాంట్రాక్ట్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది. విద్యాబోధన అన్నది కాంట్రాక్ట్‌ వ్యవహారం కాదనీ, అది అత్యంత నిష్టతో, బాధ్యతతో సాగాల్సిన ప్రక్రియ అని ఈ ప్రభుత్వాలకు ఎవరు చెప్పాలి? విద్యారంగంలో కాంట్రాక్ట్‌ లెక్చరర్లను నియమించే విధానం 2000 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. గత  పదహారేళ్లుగా కొన్ని వేల మంది అధ్యాపకులు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో  250 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 450 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు వుంటే వాటిలో  నాలుగున్నర వేల మందికి పైగా కాంట్రాక్ట్‌ లెక్చరర్లున్నారు. దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీలలో చదువుకుంటున్నారు. లెక్చరర్ల నియామకాల విషయంలో అశ్రద్ధ చేయడమంటే ఇన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలను నిర్లక్ష్యం చేయడమే. 
కాంట్రాక్ట్‌ లెక్చరర్లను పీడిస్తున్న ఉద్యోగ అభద్రత 
ఉద్యోగ అభద్రత అనేది కాంట్రాక్ట్‌ లెక్చరర్లను పీడిస్తున్న ప్రధాన సమస్య. ప్రతి ఏటా వీరి ఉద్యోగాలను రెన్యువల్‌ చేయాల్సి వుంటుంది. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలని కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ఎంతోకాలంగా పోరాడుతున్నారు. అత్యంత బాధ్యతాయుతమైన టీచింగ్‌ వృత్తిలో వున్నవారిని అభద్రతాభావంలో ఉంచడం మంచిదికాదు. గురువులను అభద్రతాభావంలో ఉంచడమంటే వారి దగ్గర చదువు నేర్చుకుంటున్న విద్యార్థుల భవిష్యత్‌ను నిర్లక్ష్యం చేయడమే. 

 

నేడు, రేపు కడప జిల్లాలో జగన్ పర్యటన

కడప : నేడు, రేపు వైసీపీ అధినేత జగన్ జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన

మెదక్ : నేడు జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

నేటి నుంచి సూర్యపేటలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు

నల్గొండ : సూర్యపేటలో నేడు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి రెండు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్జీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరుకానున్నారు. 

07:36 - October 5, 2016

చిత్తూరు : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవోపేతంగా  నిర్వహిస్తున్న వాహన సేవలను చూసి, తరలించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం ఉందయం చినశేషవానహనం, సాయంత్రం హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు... ఇవాళ ఉదయం సింహహానంపై ఊరేగుతారు. సాయంత్రం ముత్యపుపందిరి వాహనంపై  విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. 
హంసవాహనంపై మలయప్పస్వామి 
తిరుమల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి మలయప్పస్వామి హంసవాహనంపై తిరుమాడవీధుల్లో విహరించారు. లోకంలో సమస్త విద్యలను బోధించే మాత సరస్వతి దేవి. ఈమె వాహనం హంస. ఈ వాహనంపై శ్రీనివాసుడు వీణపాణియై ఊరేగుతున్న అద్భుతమైన  ఘట్టాన్ని  వేలాది మంది భక్తలు వీక్షించారు.  హంస పాలలోని నీళ్లను వేరు చేస్తుందన్న ప్రతీతి ఉంది.  లోకంలో మంచి, చెడు లుంటాయి. చెడును తొలగించి మంచిని గ్రహించడమే ఉత్తముల లక్షణం. ఈ భావాన్ని భక్తజనావళికి బోధించేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే హంసవాహనాన్ని అధిష్టించారు. హంసలు మానససరోవరంలో విహరిస్తుంటాయని భక్తుల విశ్వాసం.. భక్తుల మనస్సులోను భగవంతుడు వుంటాడు. హంస వాహనంపై వున్న స్వామిని వీక్షిస్తే అజ్ఞానం తొలగి జ్ఞానం లభిస్తుందన్న నమ్మకంలో భక్తులు శ్రీవారి హంసవాహన సేవలో పాల్గొన్నారు.
బద్రీనారాయణుని రూపంలో భక్తులకు దర్శనం
మంగళవారం ఉదయం మలయప్పస్వామి ఐదు తలల చిన్నశేషవాహనంపై బద్రీనారాయణుని రూపంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మేళతాలాలు, మంగళవాయిద్యాలతో   కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది. 
నేడు సింహవాహనంపై ఊరేగనున్న శ్రీవారు  
బ్రహ్మోత్సవాల్లో మూడోరోజైన బుధవారం ఉదయం శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతారు. సాయంత్రం ముత్యపుపందిరి వాహనపై  విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. 

07:31 - October 5, 2016

హైదరాబాద్ : టీసర్కార్‌ ఇచ్చిన హామీలపై పోరుకు సిద్ధమవుతోంది హస్తం పార్టీ. క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. అధికార పార్టీ వాగ్ధానాలపై ప్రజల వాయిస్‌ పెంచేందుకు.. లబ్దిదారులతో దరఖాస్తుల ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సక్సెస్‌ అయితే అన్ని అంశాలపై ఇదే తీరుతో ముందుకెళ్లే విధంగా ప్లాన్‌ చేస్తోంది హస్తం పార్టీ. 
హస్తం పోరుబాట
ప్రభుత్వంపై వినూత్నంగా సమరభేరీ మోగించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ రూపకల్పన చేస్తోంది. రైతు రుణమాఫీ, డబుల్‌బెడ్‌రూమ్‌, దళితులకు మూడెకరాల భూమితో పాటు పలు హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌.. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. వీటిని అస్త్రాలుగా మలచుకుని పోరుబాట పట్టాలని హస్తం నేతలు నిర్ణయించారు. గాంధీభవన్‌లో సమావేశమైన కాంగ్రెస్‌నేతలు.. ప్రభుత్వంపై పోరాటానికి ప్లాన్‌ రూపొందించారు. 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులివ్వని సర్కార్‌ 
తమ హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేయకుండా టీఆర్‌ఎస్‌ పక్కన పెట్టిందని.. కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే మొదటగా రైతులు, విద్యార్థుల సమస్యలపై పోరుబాటకు సిద్దమవుతున్నారు. విమర్శలు చేయడం కన్నా.. ప్రభుత్వంపై రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజల వాయిస్‌ పెంచేలా ప్లాన్‌ చేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఓ ఫార్మాట్‌ను రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు, విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఉద్యమం చేపట్టనున్నారు. రుణమాఫీ అమలు తీరు, విడతల వారీగా చెల్లింపులతో వస్తున్న నష్టంపై 40 లక్షల మంది రైతులతో దరఖాస్తులు ప్రభుత్వానికి పంపించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. అదేవిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కూడా విద్యార్థుల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకుని ప్రభుత్వానికి పంపించనున్నారు. మరోవైపు వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు నేటినుంచి క్షేత్రస్థాయి పర్యటనకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధమయ్యారు. 
20న రైతు గర్జన పేరుతో బహిరంగ సభ 
మొత్తానికి ప్రభుత్వంపై వినూత్నంగా పోరాటం చేసేందుకు హస్తం పార్టీ ప్లాన్‌ చేస్తోంది. ఈ కార్యక్రమం సక్సెస్‌ అయితే మరిన్ని అంశాలపై ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా రైతు సమస్యలపై ఈనెల 20న పెద్దపల్లిలో 'రైతు గర్జన' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు హస్తం పార్టీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు.

 

07:26 - October 5, 2016

పశ్చిమగోదావరి : పోలీసుల ఆంక్షలు, అణిచివేతల మధ్య వామపక్ష నాయకులు.. పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్వాసిత గ్రామాల్లో పర్యటించారు. అడుగడుగునా పోలీసుల పహారా ఉన్నా, నిర్వాసితుల సమస్యలను తెలుసుకున్నారు. ఫుడ్‌ పార్క్‌ నిర్వాసితుల్లో ధైర్యం, భరోసా నింపేందుకు వారికి అండగా నిలుస్తామన్నారు. 
గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ 
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో చేపట్టిన ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భూ నిర్వాసితులంతా ఏకమై నిర్మాణం వద్దని తేగేసి చెబుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏడాది నుంచి అలుపెరగకుండా ఆందోళనలు చేస్తున్నా.. ప్రజల గోడు ఏ మాత్రం పట్టడం లేదు. గత 20 రోజులుగా తుందుర్రు, కంసాల బేతపూడి, జోన్నలగరువు గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ విధించారు. అంతేకాదు.. ఈ మూడు గ్రామాల్లో 144 సెక్షన్‌, సెక్షన్‌ 30లను అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 
నిర్వాసిత గ్రామాల్లో వామపక్ష నేతల పర్యటన 
భూ నిర్వాసితుల ఆందోళకు మద్దతు ఇస్తున్న సీపీఎం నాయకులపై అక్రమ కేసులు పెట్టి.. జైళ్లకు పంపిస్తున్నారు. అయినా వామపక్ష నేతలు ప్రభుత్వానికి బెదరకుండా.. ఆక్వాఫుడ్‌ పార్క్‌ భూ నిర్వాసితులకు అండగా నిలుస్తున్నారు. బాధితుల్లో ధైర్యం నింపుతున్నారు. భరోసా కల్పించేందుకు తాము అండగా ఉన్నామంటూ నిర్వాసిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. 
ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని అడ్డుకుంటాం : మధు 
తుందుర్రు, కంసాల బేతపూడి, జోన్నలగరువు, వేరేపాలం, ముత్యాలపల్లి గ్రామాల ప్రజలు వామపక్ష నేతలకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. గ్రామాల్లో ప్రతిరోజు పోలీసులు తమను వేధిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి.. జైళ్లకు పంపిస్తున్నారని తమ బాధలను చెప్పుకుని.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణం జరక్కుండా అడ్డుకుంటామని సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి మధు స్పష్టం చేశారు. 
ఆక్వాపుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని విరమించుకునే వరకూ ఆందోళనలు : వామపక్షాలు 
ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా తుందుర్రులో ఆక్వాఫుడ్ పార్క్‌ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ముందుకెళ్తే..  పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వామపక్షాలు గట్టిగా హెచ్చరించాయి. ఆక్వాపుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని విరమించుకునే వరకూ పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి.. ఆందోళనలు చేస్తామని వామపక్షాలు హెచ్చరించాయి. 

 

07:20 - October 5, 2016

విజయవాడ : పాత, కొత్త నేతల కలయికతో పార్టీ ముందుకు సాగాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పథకాలతో ఓటర్లని ప్రభావితం చేసేలా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని విజయవాడలో జరిగిన టిడిపి వర్క్‌షాపులో పిలుపునిచ్చారు. 2004 ఎన్నిక‌ల్లో  మితిమీరిన విశ్వాసంతో అధికారం కోల్పోయామన్న చంద్రబాబు..ఈసారి అలాంటి పొరపాటు పునరావృతం కాకుండా 2019 ఎన్నికలకు సమన్వయంతో సిద్ధం కావాలని నేత‌ల‌కు పిలుపునిచ్చారు. 
చంద్రబాబు క్యాడర్‌కు దిశానిర్దేశం
నాయకత్వ సాధికారత పేరిట విజయవాడ సమీపంలోని కేఎల్‌ యూనివ‌ర్సిటిలో టిడిపి నాయకులకు శిక్షణ తరగతులను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు హాజరయ్యారు. ప్రజల ఆమోదం పొందడం, విపక్షాలు చేసే విమర్శలు సమర్థవంతంగా తిప్పికొట్టడం, నిరంతరం ప్రజల మధ్య ఉండటం లాంటి లక్షణాల్ని నాయకులు అలవర్చుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని,. పొత్తులన్నీ రాష్ట్రాభివృద్ధి కోసమేనని తెలిపారు. 
ప్యాకేజీని విభేదించడం సబబు కాదన్న బాబు
కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీని ఎందుకు సమర్థిస్తున్నామో ప్రతి ఒక్కరూ విశ్లేషించుకోవాలని, ప్రత్యేకహోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెప్తున్నప్పుడు దానిని విభేదించటం సబబు కాదని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే రెండు జాతీయ విద్యాసంస్థలు మినహా అన్నీ సాధించుకున్నామన్నారు. మరికొన్నింటికి భవనాలు నిర్మించాల్సి ఉందని..అవన్నీ పూర్తిచేయాలంటే 10వేల కోట్లు ఖర్చు అవసరమవుతుందన్నారు. కేంద్రం పునర్ విభజన చట్టంలో కొన్ని ముఖ్యమైన అంశాలు పెట్టిందని వాటి సాధన దిశగానే తమ కృషి జరుగుతోందని చంద్రబాబు చెప్పారు. 
తొలి రోజు మూడు అంశాలపై చర్చ 
3రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల్లో తొలి రోజు మూడు అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర విభజన ప్రక్రియ-సవాళ్లు పటిష్ట నాయకత్వంతో పరిష్కారాలపై చర్చను చంద్రబాబు చేపట్టగా..ప్రత్యేక హోదా-ప్రత్యేక ప్యాకేజీపై చర్చను ఆర్ధికమంత్రి యనమల చర్చించారు. 

 

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

మెదక్ : కొండాపూర్ మండలం మల్కాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు రామచంద్రాపురం మండలం శ్రీనివాసనగర్ వాసులుగా గుర్తించారు. 

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం

హైదరాబాద్ : పాతబస్తీ కాలాపత్తర్ లో దారుణం జరిగింది. బైక్ కు అడ్డొచ్చిందని రెండేళ్ల చిన్నారిపై పెట్రోల్ పోసి బాలుడు నిప్పంటించాడు. చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

 

07:03 - October 5, 2016

హైదరాబాద్ : జనగామ, గద్వాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు కోసం నియమించిన హైపవర్‌ కమిటీ హై స్పీడ్‌లో దూసుకుపోతుంది. తమకు అప్పగించిన పనిని పూర్తిచేసేందుకు చకచక పనులు పూర్తి చేస్తోంది. ఆయా జిల్లాల ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు, విన్నపాలను పరిశీలిస్తోంది. 7వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా....ఓ రోజు ముందుగానే నివేదిక ఇచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది.  
కేకే ఆధర్యంలో నియమించిన హైపవర్‌ కమిటీ 
కొత్తగా నాలుగు జిల్లాల ఏర్పాటు కోసం కేకే ఆధర్యంలో నియమించిన హైపవర్‌ కమిటీ సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతోంది. కొత్త జిల్లాలపై ప్రజాప్రతినిధుల విజ్ఙప్తులను పరిశీలించడానికి హై పవర్ కమిటీ కేకే నివాసంలో భేటీ అయింది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జోగురామన్న హాజరయ్యారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు అంశంపై కమిటీ సభ్యులు చర్చించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం వరకు తుది నివేదికను అందించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.
హైదరాబాద్‌ జిల్లాను విభజించవద్దన్న నాయిని 
హైదరాబాద్‌ జిల్లాను ఒక్కటిగానే ఉంచాలని.. విడగొట్టవద్దని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కోరారు. కొత్త జిల్లాలపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీకి ఆయన నివేదిక సమర్పించారు.
కల్వకుర్తిని రెవిన్యూ డివిజన్ చేయాలి : జైపాల్ యాదవ్ 
అటు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిని రెవిన్యూ డివిజన్ చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోరారు. కల్వకుర్తికి చెందిన పలువురు నేతలతో కలిసి హైపవర్ కమిటీకి వినతిపత్రం సమర్పించారు. కల్వకుర్తి రెవిన్యూ డివిజన్ కోసం ఆందోళనలు జరుగుతున్నాయని జైపాల్ యాదవ్ చెప్పారు. మరోవైపు గద్వాల జిల్లా ఏర్పాటుపై ఆ ప్రాంత నేతలు హై పవర్ కమిటీని కలిశారు. మంత్రి జూపల్లి, ఎంపీ జితేందర్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ బండారి భాస్కర్, నియోజకవర్గ ఇన్ చార్జ్ కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు గద్వాలను జిల్లాగా ప్రకటించాలంటూ కమిటీని కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజల నుంచి వచ్చిన విజ్ఙప్తులను హై పవర్ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. 
31 జిల్లాలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం 
తెలంగాణలో ప్రస్తుతం 31 జిల్లాలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. 7వ తేదీ వరకు నివేదిక అందించాల్సి ఉండటంతో హై పవర్‌ కమిటీ వేగంగా పనులు పూర్తిచేస్తోంది. 

06:57 - October 5, 2016

హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి జిల్లా కేంద్రంలో మొదటి రోజు నుంచి కలెక్టర్, ఎస్ పి కార్యాలయాలు పని చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌  అధికారులను ఆదేశించారు. మండలాల్లో కూడా పోలీస్ స్టేషన్లు, మండల రెవిన్యూ కార్యాలయాలు పని చేయాలన్నారు. ప్రతీ రెవిన్యూ డివిజన్‌లో ఆర్ డీవోతో పాటు డీఎస్ పీ స్థాయి అధికారి ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. సిద్దిపేట కేంద్రంగా పోలీసు కమిషనరేట్‌ ఏర్పాటు చేయాలని కొత్త జిల్లా ఏర్పాటుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసీఆర్ నిర్ణయించారు. 
ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం 
కొత్త జిల్లాల్లో పాలనాపరంగా చేపట్లాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.  పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలకు అదనంగా మరో నాలుగు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పిన కేసీఆర్‌, అన్ని జిల్లాలతోపాటు వీటిలో కూడా పాలన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.  జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు కూడా  పరిశీలనలో ఉందని అధికారుల దృష్టికి  తెచ్చారు.  వీటికి తోడు కొత్త డివిజన్లు, మండలాలు కూడా ఏర్పాటవుతున్నందున అన్ని చోట్ల  కార్యాలయాల ఏర్పాటు, అధికారుల నియామకం పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన డిమాండ్లను పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాలు,   రెవిన్యూ డివిజన్లు, మండలాల  ఏర్పాటుపై  నిర్ణయం తీసుకున్నామన్నారు. 
సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు 
సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ పోలీసు శాఖను ఆదేశించారు.  కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న కరీంనగర్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కు సంబంధించి కూడా ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో  స్వయంగా పాల్గొనాలని సీఎం నిర్ణయించారు. . మంత్రులు, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక్కో జిల్లాను ప్రారంభించాలని  సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పరిధిలో ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్లు, మండలాలను ప్రారంభించాలని చెప్పారు. ఎవరు ఎక్కడ ఏ కార్యాలయాన్ని ప్రారంభించాలో జాబితా తయారు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.
ఉద్యోగులకు పదోన్నతులకు డీపీసీలు 
కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో పని చేయడానికి ఉద్యోగుల విభజన వెంటనే పూర్తి చేయాలని, అవసరమైతే డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీలు నిర్వహించి పదోన్నతులు కల్పించాలని కేసీఆర్‌ సూచించారు. యాదాద్రి జిల్లాను రాచకొండ పోలీస్ కమిషనరేట్లో, జనగామ జిల్లాను వరంగల్ పోలీస్ కమీషనరేట్లలో భాగం చేయాలని ప్రతిపాదించారు. కొమురం భీమ్ పుట్టిన జోడెన్ ఘాట్‌ కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకి వస్తున్నందున్న దీనికి  కొమురం భీమ్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్,  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, ఇదే జిల్లాలోని తాండూరులను రెవెన్యూ డిజిన్లుగా మార్చాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. 
భైంసాలో ఆర్డీవో కార్యాలయం 
ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త రెవెన్యూ డివిజన్ ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రజలందరకీ అందుబాటులో ఉండే విధంగా భైంసాలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలోని మార్కూక్, తూప్రాన్ మండలంలోని మనోహరాబాద్, నిజామాబాద్ జిల్లాలోని చందూరు, ములుగు నియోజకవర్గంలో కన్నాయిగూడెం, నిర్మల్ అర్బన్, రూరల్ మండలాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  నాగిరెడ్డి పేట మండలాన్ని కామారెడ్డి జిల్లాలో కొనసాగించాలని నిఘా వర్గాలు జరిపిన సర్వేలో తేలిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని  ఈ మండలాన్ని కామారెడ్డిలో కొనసాగించాలని చెప్పారు.  అమసరమైతే మెదక్ కు సమీపంలో ఉన్న నాగిరెడ్డిపేట  పరిధిలోని గ్రామాలను మెదక్ జిల్లాలో కలపాలని సూచించారు. మొయినాబాద్, శంకరపల్లి, షాబాద్ లతో పాటు చేవెళ్ల మండలాను  కూడా  శంషాబాద్ కేంద్రంగా ఏర్పాటవుతున్న రంగారెడ్డి  జిల్లాలో చేర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలుస్తున్నందున ఆ నాలుగు మండలాలను సైబారాబాద్  పోలీస్ కమీషనరేట్ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. 

 

నేడు స్టేషన్ ఘన్ పూర్ బంద్ కు అఖిలపక్షం పిలుపు

వరంగల్ : స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాన్ని జనగామలో కలపడాన్ని నిరసిస్తూ నేడు అఖిలపక్షం నేడు స్టేషన్ ఘన్ పూర్ బంద్ కు పిలుపిచ్చింది. 

 

నేడు జీఎస్టీ కౌన్సిల్ అత్యవసర భేటీ

ఢిల్లీ : నేడు జీఎస్టీ కౌన్సిల్ అత్యవసర భేటీ కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ హాజరుకున్నారు. 

భారత్ లో శ్రీలంక ప్రధాని పర్యటన

ఢిల్లీ : భారత్ లో శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ్ సిం ఘే పర్యటించనున్నారు. నేడు ప్రధాని నరేంద్రమోడీతో శ్రీలంక ప్రధాని సమావేశం కానున్నారు. 

 

నేడు సీఎం జయలలిత ఆరోగ్య వివరాలు తెలపనున్న తమిళనాడు ప్రభుత్వం

చెన్నై : మద్రాస్ కోర్టు ఆదేశంతో నేడు తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై ప్రభుత్వం వివరాలు తెలపనుంది. 

 

నేడు సీఎం కేసీఆర్ నివాసంలో బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్ : నేడు సీఎంకేసీఆర్ నివాసంలో బతుకమ్మ సంబరాలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు ఎంపీ కవిత హాజరుకానున్నారు.

Don't Miss