Activities calendar

06 October 2016

21:55 - October 6, 2016

పశ్చిమగోదావరి : పోలవరం పనులు నిలిపివేశారని 10టీవీ ప్రసారం చేసిన కథనానికి సీఎం కార్యాలయం స్పందించింది. ప్రాజెక్ట్ పనులు చేయిస్తున్న ట్రాన్స్ ట్రాయ్ సంస్థ జీతాలు చెల్లించకపోవడంతో.. ఉద్యోగులు ఇవాళ పనులు నిలిపివేశారు. 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని వారు ఆరోపించారు. దీనిపై టెన్‌ టీవీ కథనం ప్రసారం చేయడంతో... ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఉద్యోగుల వేతనాలు వెంటనే చెల్లించాలని.. ట్రాన్స్‌ ట్రాయ్ కంపెనీని ఆదేశించింది. గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించింది. 

21:52 - October 6, 2016

నల్లగొండ : ఈనెల 17 నుంచి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన 'మహాజన పాదయాత్ర' లోగోను సూర్యాపేటలో ఆవిష్కరించారు. నల్గొండజిల్లా సూర్యాపేటలో జరుగుతున్న రాష్ట్ర కమిటీ సమావేశాల్లో తమ్మినేని ఈ లోగోను ఆవిష్కరించారు. పాదయాత్ర సందర్భంగా తయారు చేసిన ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా విడుదల చేశారు. ఎప్పటికప్పుడు యాత్ర వివరాలను తెలియజేసేందుకు గూగుల్ మ్యాప్ టెక్నాలజీని కూడా యాప్‌లో పొందుపరిచారు. 

21:50 - October 6, 2016

హైదరాబాద్ : తెలంగాణలో సీపీఎం పాదయాత్ర నిర్ణయం.. గులాబీ దళం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పాదయాత్రతో తమ బండారం బయటపడుతుందని.. తమపై ప్రజా వ్యతిరేకత రేంజ్‌ ఎంతో ప్రపంచానికి తెలిసిపోతుందని బెంబేలెత్తుతోంది. ప్రజా సమస్యల అధ్యయనం కోసం తలపెట్టిన ఈ పాదయాత్రను జీర్ణించుకోలేక.. కారు పార్టీ నేతలు అర్థరహిత విమర్శలు గుప్పిస్తున్నారు. పాలక పక్షం ఎన్ని విమర్శలు చేసినా.. మహాజన పాదయాత్ర ద్వారా ప్రజల చెంతకు వెళ్లడం తథ్యమని.. సీపీఎం స్పష్టం చేసింది.

ఈనెల 17వ తేదీ నుంచి 'మహాజన పాదయాత్ర'
గులాబీ దళం బెంబేలెత్తిపోతోంది.. తమ పట్ల ప్రజల్లోని వ్యతిరేకత ఎక్కడ ప్రపంచానికి తెలిసిపోతుందోనని కలవరపడి పోతోంది. ఇదంతా సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్ర ఎఫెక్ట్‌. రాష్ట్రంలో రెండున్నరేళ్ల టీఆర్ఎస్‌ నేతల ఏలుబడిలో.. ప్రజలు పడుతున్న అవస్థలను తెలుసుకునేందుకు.. తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని బృందం.. ఈనెల 17 నుంచి మహాజన పాదయాత్రకు సిద్ధమవుతోంది. సుమారు నాలుగు వేల కిలోమీటర్లు.. దాదాపు ఐదు నెలల పాటు నడిచి.. బడుగు, బలహీన వర్గాల సమస్యలను అధ్యయనం చేయడమే ఈ పాదయాత్ర లక్ష్యం.

టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల గుండెల్లో దడ ..
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బృందం తలపెట్టిన ఈ మహాజన పాదయాత్ర.. కారు పార్టీ నేతల గుండెల్లో దడ పుట్టిస్తోంది. సీపీఎం పాదయాత్రతో బంగారు తెలంగాణ బండారం బయటపడుతుందని బెంబేలెత్తుతున్నారు. పూర్తిగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని కోరుతూ.. వారి సమస్యల అధ్యయనం కోసమే పాదయాత్ర తలపెట్టినట్లు పదేపదే స్పష్టం చేసినా.. దీనిపై అవాకులు చెవాకులు పేలుతున్నారు కారు పార్టీ నేతలు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం అలుపెరగని పోరాటం
ఇప్పటికే ప్రజా సమస్యల పరిష్కారం కోసం.. సీపీఎం పాలకపక్షంపై అలుపెరుగని పోరాటం సాగిస్తోంది. మల్లన్నసాగర్‌, ఫార్మాసిటీ సెజ్‌లతో పాటు.. పలు ప్రాజెక్టుల నిర్వాసితుల పక్షాన సీపీఎం పోరాడుతూనే ఉంది. జీవోల ద్వారా భూసేకరణ జరిపి, రైతుల నోట్లో మట్టి కొట్టాలని భావించిన ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఆఖరుకు ఈ అంశంపై న్యాయస్థానం కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. సీపీఎం పోరాట ఫలితంగా సిద్ధించిన ఇలాంటి ప్రజా విజయాలు ప్రభుత్వానికి కంటగింపుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో తాము గొప్పగా చెబుతున్న అభివృద్ధి.. నేతిబీరకాయ చందమేనన్న వాస్తవం సీపీఎం పాదయాత్రతో బయటపడుతుందన్న బెదురుతోనే తమపై విమర్శలు గుప్పిస్తోందని సీపీఎం ఆక్షేపించింది.

పాదయాత్ర పార్టీ కోసం కాదు ప్రజల కోసం : తమ్మినేని
స్పష్టమైన ప్రణాళిక, సమగ్ర విధానంతో.. ప్రజా సమస్యల అధ్యయనం కోసం.. ప్రజల వద్దకే పాదయాత్రగా వెళుతోన్న సీపీఎంపై...టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలను ప్రజా సంఘాలు తప్పుబట్టాయి. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కరమే ధ్యేయంగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకే వెళతామని, పాలక పక్షం తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని.. సీపీఎం పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. 

21:46 - October 6, 2016

హైదరాబాద్ : సింగరేణి కార్మికులు...సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులతో సమానమని సీఎం కేసీఆర్ అన్నారు. సైనికుల తరహాలోనే కార్మికుల పట్ల సహృదయంతో వ్యవహరించాలన్నారు. సింగరేణిపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏళ్ల తరబడి సింగరేణి కార్మికులు చేసిన సేవలకు గుర్తింపుగా వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం వారి వారసులకు దసరా కానుకని కేసీఆర్ అన్నారు. సింగరేణి ఆదాయంలో 23 శాతం లాభాన్ని కార్మికుల వాటాగా పంచాలన్నారు. దీని ద్వారా ఒక్కోకార్మికుడు 43 వేల 78 రూపాయలు, దీపావళి బోనస్ కింద రూ. 54 వేలు అందుకోనున్నారు. 

21:43 - October 6, 2016

ఉత్తరప్రదేశ్ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదిపై మళ్లీ ధ్వజమెత్తారు. సర్జికల్‌ దాడుల పేరిట జవాన్ల రక్తంతో ప్రధాని చెలగాటమాడుతున్నారని తీవ్రమైన విమర్శలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో చేపట్టిన కిసాన్‌యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

21:40 - October 6, 2016

ఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత క‌శ్మీర్‌లో ఆర్మీ జ‌రిపిన స‌ర్జిక‌ల్ దాడులు వంద శాతం క‌చ్చిత‌మైన‌వ‌ని ర‌క్షణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ స్పష్టం చేశారు. మనవైపు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. మన ఆర్మీపై ఎవరికి అనుమానం ఉండనక్కరలేదని తెలిపారు. మన సైనిక బలాన్ని చూసి గర్వంగా ఉందని పేర్కొన్నారు. పెద్ద పెద్ద దేశాలు కూడా స‌ర్జిక‌ల్ దాడుల్లో సక్సెస్‌ కాలేక పోయాయని మన ఆర్మీ విజయవంతంగా దాడులు నిర్వహించిందన్నారు. కొన్ని పార్టీలు డిమాండ్ చేసినంత మాత్రాన దాడుల‌కు సంబంధించిన సాక్ష్యాల‌ను విడుదల చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని పారిక‌ర్ చెప్పారు. స‌ర్జిక‌ల్ దాడుల‌ను పొలిటిక‌ల్ మైలేజీ కోసం వాడుకుంటున్నార‌న్న విమ‌ర్శల‌ను ఆయ‌న ఖండించారు. 

21:38 - October 6, 2016

జమ్ము కశ్మీర్ : పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందనడానికి మరో ఆధారం లభించింది. జమ్ముకశ్మీర్‌లోని హంద్వారాలో చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులను ఆర్మీ కాల్చి చంపింది. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు తదితర వస్తువులను భారత్‌ స్వాధీనం చేసుకుంది. అందులో కొన్ని పరికరాలపై మేడ్‌ ఇన్‌ పాకిస్తాన్‌ ఉండడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు నౌగాంలో కూడా చొరబాటుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సమాచారం.

కుప్వాడా జిల్లా హంద్వారాలో చొరబాటు యత్నాలు
జమ్ముకశ్మీర్‌ కుప్వాడా జిల్లా హంద్వారాలో లాన్‌గేట్‌ వద్ద ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదుల దాడి యత్నాన్ని భారత భద్రతా బలగాలు వమ్ము చేశాయి. తెల్లవారు జామున 5 గంటల సమయంలో సరిహద్దు ఫెన్సింగ్‌ దాటి ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ.. సైనిక శిబిరంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. హోరా హోరీ పోరులో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పుల అనంతరం ఘటనాస్థలంలో 3 ఏకే 47లు, గ్రేనేడ్‌ లాంచర్లు, ఫుడ్‌ ప్యాకెట్లు, ఇంజక్షన్లు, మ్యాప్‌లు, జీపీఎస్‌ పరికరాలు, రేడియో సెట్‌లు, మ్యాట్రిక్‌ షీట్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు
ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో పాకిస్థాన్‌ నుంచి వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. వారి వద్ద లభ్యమైన పరికరాలు ఓబీఎస్‌ పాకిస్థాన్‌ ప్రై.లిమిటెడ్‌ సంస్థ తయారు చేసినట్లుగా ఉంది. ఇంజక్షన్‌లు కూడా పాకిస్థాన్‌లోనే తయారయ్యాయి. ముగ్గురు టెర్రరిస్టులు హతమవడంతో హంద్వారా ఆపరేషన్‌ ముగిసిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

సమర్థవంతంగా అడ్డుకుంటున్న భారత్ భద్రతా బలగాలు
పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత ఆర్మీ సర్జికల్‌ దాడుల తర్వాత నియంత్రణ రేఖవద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సరిహద్దు దాటి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. వారికి సహకరించేందుకు పాకిస్తాన్‌ సైన్యం తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఉగ్రవాదుల చొరబాట్లను భద్రతా బలగాలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. 

21:29 - October 6, 2016

ఢిల్లీ : ప్రతి ఇంటిలో డిజిటల్ అక్షరాస్యులను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా అన్ని పల్లెలకు ఇంటర్నెట్ సేవలను, ఐటీ పరిజ్ఞాన ఆధారిత ఫలాలను అందిస్తామన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్‌లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగానికి ప్రశంసలు లభించాయి.

డిజిటల్ తెలంగాణ, ఫైబర్ గ్రిడ్, -సేవలపై వివరణ
రాష్ర్టంలో పెట్టుబడులకు రక్షణ కల్పించేలా సెక్టోరల్ పాలసీలు, వివాదాల పరిష్కార యంత్రాంగం, ఎగ్జిట్ పాలసీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్‌. ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ తెలంగాణ, ఫైబర్ గ్రిడ్, ఈ-సేవలపై వివరించారు. భారతదేశంలోని మౌలిక వసతుల రంగంలో ఉన్న అవకాశాలను, తెలంగాణ కేంద్రంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే దేశం, రాష్ట్రం ముందుకు వెళ్తాయని, ప్రజల జీవనవిధానంలో మార్పులు చోటుచేసుకుంటాయన్నారు కేటీఆర్‌. రాష్ట్రంలోని రోడ్డు నెట్‌వర్క్ విస్తరణపై కూలంకుశంగా మాట్లాడారు. తెలంగాణలో ఉన్న 1800 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారులను త్వరలోనే కేంద్ర సహకారంతో రెట్టింపు చేసే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.

ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా పల్లెలకు కూడా ఇంటర్నెట్ సేవలు
తెలంగాణలో ఇప్పటికే రెండు లక్షల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని, ప్రతి ఇంటిలో డిజిటల్ అక్షరాస్యులను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా పల్లెలకు కూడా ఇంటర్నెట్ సేవలను, ఐటీ పరిజ్ఞాన ఆధారిత ఫలాలను అందిస్తామన్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ఇది పూర్తయితే ప్రభుత్వ సేవలు ప్రజలు సత్వరం అందడానికి ఆస్కారం ఉంటుందని వివరించారు. ఇ-గవర్నెన్స్ దాటి ఎం-గవర్నెన్స్ దిశగా ప్రభుత్వ సేవలను తీసుకెళ్తున్నామని కేటీఆర్‌ చెప్పారు.

ఢిల్లీలో రెండురోజుల పాటు ప్రపంచ ఆర్థిక సదస్సు
రెండురోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు వివిధ దేశాల, రాష్ర్టాల పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులతో కూడిన ఈ రెండు ప్యానెళ్లలో కేటీఆర్ మాత్రమే ఏకైక రాజకీయ ప్రతినిధిగా హాజరుకావడం విశేషం.

21:26 - October 6, 2016

గుంటూరు : పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న కార్యకర్తల పేరిట రెండు లక్షల రూపాయల చొప్పున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయనున్నట్లు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ప్రకటించారు. పార్టీ కోసం పనిచేసే వారిని తెలుగుదేశం ఎప్పటికీ గుర్తిస్తుందన్నారు. అనారోగ్యం వల్లే తొలి రెండు రోజుల శిక్షణ తరగతులకు హాజరు కాలేక పోయినట్లు చెప్పారు. తన తండ్రితో విభేదాలున్నాయంటూ జరిగిన ప్రచారం హాస్యాస్పదమన్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం చంద్రబాబుదే తుది నిర్ణయమని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

పార్టీ శ్రేణులకు నజరానా..
తెలుగుదేశం అధినాయకత్వం.. పార్టీ శ్రేణులకు నజరానా ప్రకటించింది. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తోన్న కార్యకర్తలకు రెండేసి లక్షల రూపాయలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయనున్నట్లు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. టీడీపీ శిక్షణ తరగతుల చివరి రోజున హాజరైన లోకేశ్‌... వివిధ కారణాలతో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇప్పటివరకు రూ.15 కోట్లను సంక్షేమ నిధి ద్వారా అందించినట్లు లోకేశ్‌ తెలిపారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి నేతలు ఎవరేం చేస్తున్నారో.. పార్టీ ఎప్పటికప్పుడు గమనిస్తోందని.. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

శిక్షణ తరగతుల్లో పాల్గొన్న లోకేశ్‌..
శిక్షణ తరగతుల్లో పాల్గొన్న లోకేశ్‌.. ప్రజాప్రతినిధులకు కోర్‌ డ్యాష్‌ బోర్డు, కైజాలా యాప్‌లపై పలు సూచనలు చేశారు. అనంతరం నాయకులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ ఇచ్చారు. అనారోగ్యం కారణంగానే రెండు రోజుల పాటు శిక్షణ తరగతులకు హాజరు కాలేకపోయానని ఆయనీ సందర్భంగా వివరణ ఇచ్చారు. తన తండ్రితో విభేదాలే గైర్హాజరుకు కారణమంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. జగన్‌లా తండ్రికి తలవంపులు తెచ్చే పనులు ఎన్నడూ చేయనన్నారు. జగన్‌లా చిన్నాన్నతో రాజీనామా చేయించి పదవులు దక్కించుకోవాలన్న ఆలోచనలు తనకు రావన్నారు. పార్టీ పటిష్టత కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని, పార్టీ కోసం కష్టపడుతూ ఆర్థికంగా వెనుకబడిన కార్యకర్తలకు రెండు లక్షల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయనున్నట్లు లోకేష్‌ ప్రకటించారు.  

21:22 - October 6, 2016

హైదరాబాద్ : ప్రజలకు మేలైన సేవలు అందించడమే పరిపాలన విభాగాల అంతిమ లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కొత్త జిల్లాల స్వభావ, స్వరూప, అవసరాలను బట్టి.. విభాగాల విస్తరణ, కుదింపు, సర్దుబాటు చేసుకోవాలని సూచించారు.

కొత్త జిల్లాల్లో పాలన విభాగాల గురించి సీఎం కేసీఆర్ సమీక్ష
జిల్లాల పునర్విభజన అనంతరం.. జిల్లాల్లో ఉండాల్సిన పరిపాలన విభాగాల కూర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌.. హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పారదర్శకమైన పాలన, అవినీతి నిర్మూలన, సంక్షేమ పథకాల సత్వర అమలు లక్ష్యంగా ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణ జరగాలని సీఎం చెప్పారు. ఒకే తరహా పనులు చేసే అధికారులు వేర్వేరు విభాగాల్లో ఉండడం వల్ల సమన్వయం లోపిస్తోందని.. ఈ గందరగోళాన్ని నివారించేందుకు ప్రభుత్వ శాఖల్లో సరళీకరణ జరగాలని సీఎం సూచించారు.

జిల్లాల్లో పని భారాన్ని బట్టి శాఖల సర్దుబాటు-కేసీఆర్‌
జిల్లాల్లో కొన్ని శాఖల సిబ్బందికి విపరీతమైన పని ఒత్తిడి ఉంటుందని, మరికొన్ని శాఖలకు పనే ఉండని పరిస్థితి ఉందని, అందుకే.. పనిభారాన్ని బట్టి.. శాఖల విస్తరణ లేదా సర్దుబాటు జరపాలని ముఖ్యమంత్రి.. అధికారులను ఆదేశించారు. పని తక్కువగా ఉన్న శాఖల సిబ్బందిని పని ఒత్తిడి ఉన్న శాఖలకు బదిలీ చేయాలని సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కల్లో పరిశ్రమల శాఖకు పని ఎక్కువ వుంటుందని, అక్కడ ఆ శాఖను విస్తరించాలని, జిల్లాల్లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను బలోపేతం చేయాలని సీఎం సూచించారు. అడవులు ఎక్కువగా ఉన్న భూపాలపల్లి, కొత్త గూడెం, మంచిర్యాల లాంటి జిల్లాల్లో ఆ శాఖ కార్యకలాపాలను పెంచాలని, ఉద్యానవనాలు ఎక్కువ వుండే చోట హార్టికల్చర్ శాఖను బలోపేతం చేయాలని సూచించారు.

ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహితమైన పాలన అందాలి -కేసీఆర్
కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఇంకా అవినీతి జాడ్యం వుందని, ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ బాగా మారాలని, ఈ డిపార్ట్‌మెంట్‌లో శాఖలో సిటిజన్ చార్టర్ అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహితమైన పాలన అందించాలన్నారు.

పలు రాష్ట్రాలకు వెళ్లి అధ్యనం చేయనున్న అధికారులు
దేశంలో.. ఎక్కువ జిల్లాలున్న రాష్ట్రాలకు వెళ్లి.. పాలన విభాగాల తీరును అధ్యయనం చేయాలని సీనియర్‌ అధికారులను సీఎం ఆదేశించారు. ఉత్తరప్రదేశ్‌కు ఎస్.కె.జోషి, మధ్యప్రదేశ్ కి సోమేశ్ కుమార్, ఛత్తీస్ గఢ్ కి మీనా, హర్యానాకు నవీన్ మిట్టల్, ఒడిశాకు బిపి ఆచార్య, తమిళనాడుకు అజయ్ మిశ్రా, బీహార్‌కు ఎస్.పి.సింగ్ వెళ్లి అధ్యయనం చేయాలని ఆదేశించారు. 

చండీగఢ్‌లో హై అలర్ట్!..

చండీగఢ్‌: చండీగఢ్‌లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయాన్ని చండీగఢ్‌ హోంశాఖ కార్యదర్శి అనురాగ్‌ అగర్వాల్‌ ఈ విషయాన్ని దృవీకరించారు. ఐబీ నుంచి హెచ్చరికలు వచ్చాయనీ..పోలీసులను అప్రమత్తం చేశామని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానికులు పోలీసులుకు సమాచారమందించాలని ప్రకటన జారీ చేశారు. గత వారం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సైన్యం నిర్వహించిన లక్షిత దాడుల వల్ల ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌లో హైఅలర్ట్‌ను ప్రకటించారు.

అమ్మ దత్తపుత్రుడికి చేదు అనుభవం..

తమిళనాడు : సీఎం జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జయలలితను పరామర్శించేందుకు వెళ్లిన ఆమె దత్త పుత్రుడు సుధాకరన్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు ఆయన్ని అనుమతించలేదు. దీంతో సుమారు గంటన్నర పాటు అక్కడే వేచి చూసిన ఆయన తిరిగి వెళ్లిపోయారు. దీనిపై సుధాకరన్ మద్దతుదారులు మండిపడ్డారు. జయలలితను చూసేందుకు ఆయన్ని అనుమతించాలని డిమాండ్ చేశారు. మరోపక్క, జయలలిత మేనకోడలిని అంటూ వచ్చిన మహిళ దీపా జయకుమార్ కు కూడా ఈ సాయంకాలం చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే.

రోహిత్ వేముల దళితుడు కాదట!..

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్ సీయూ) విద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని, వ్యక్తి గత కారణాల వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని జస్టిస్ రూపన్ వాలా కమిషన్ తేల్చి చెప్పింది. మానవ వనరుల శాఖకు ఈమేరకు అందజేసిన తన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. రోహిత్ తల్లి దళితురాలు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది. రోహిత్ వేముల ఆత్మహత్య వ్యవహారంలో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలకు ఎటువంటి ప్రమేయం లేదని వారికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆ నివేదికలో పేర్కొంది.

'అమ్మ' కోలుకుంటున్నారట..

తమిళనాడు : కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న తమిళనాడు సీఎం జయలలితకు సంబంధించిన హెల్త్ బులెటిన్ ను చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. జయలలిత కోలుకుంటున్నారని, మరికొన్ని రోజుల పాటు ఆమె ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. జయలలితకు షుగర్, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు చికిత్స, కొన్ని పరీక్షలతో పాటు స్కానింగ్ కూడా నిర్వహించామని ఆ హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు

సింగరేణి కార్మికులపై సీఎం వరాలజల్లు..

హైదరాబాద్: సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాలజల్లు కురిపించారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 23 శాతం వాటా చెల్లించాలని సీఎం నిర్ణయించారు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ నేడు కీలక సమావేశం జరిపారు. సమావేశం సందర్భంగా సీఎం పలు నిర్ణయాలను తీసుకుంటూ సింగరేణి కార్మికులపై వరాలజల్లు కురిపించారు. సింగరేణిలో పనిచేసి గాయపడినా, అనారోగ్యం పాలయినా, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం అన్నారు. అదేవిధంగా డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టాలన్నారు.

20:31 - October 6, 2016

సిగపట్లతో సితక్కొట్టుకున్న ఆడాంగులు..తెలంగాణల జిల్లాల లొల్లి ఎంతకీ తీరటం లేదు..మండలాల మార్పులు..సెల్ టవర్ ఎక్కి జిల్లాల కోసం ఎక్కి లొల్లి చేత్తన్న పోరగాళ్లు..ఉల్వ సేనులో పోగొట్టుకోని కందిసేలో ఎతులాడినట్లుంది కాంగ్రెసోల్ల పని..అధికారం కోసం చేసులమ్మట.. చెల్కలమ్మట దేవులాడతన్న కాంగ్రెసోల్లు..బోటి కూర తిన్నడని పోరగాడ్ని పోలీసోల్లకప్పగించిన బాపనోల్లు..పోలీసోల్లు కూడా మల్లీ కొట్టిండంట..ఆడుకుంటా ఎల్లి ఇనప పెట్టిలో దాకుని సచ్చిపోయన పోరగాల్లు..పిలగాల్లు ఆడుకుంటాన్నరని వదిలేయకుండా కాసింత ఓ నజరేయుండ్రి మల్ల..దుమ్మురేపుతున్న బతుకమ్మ పాట.. గిసువంటి మస్తుముచ్చట్లు సూడాలంటే మల్లన్న ముచ్చట్లు వీడియో చూడుండ్రి..మస్తు ఖుషీ అవుండ్రి..

19:58 - October 6, 2016

జమ్ము కశ్మీర్ ప్రాంతంలోని యూరిపై పాకిస్థాన్ చేసిన ఉగ్రదాడిలో భారత్ జవాన్లు 18మంది బలైపోయారు. దీంతో ఉగ్రమూకల పీచమణచేందుకు భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పొంచి ఉన్న నరహంతక టెర్రిరిస్టులను ఏరిపారేసేందుకు సర్జికల్ దాడులతో పాకిస్థాన్ ను చావుదెబ్బ కొట్టింది. ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తూ.. కయ్యానికి కాలు దువ్వే పాక్‌కూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌-పాక్ మధ్య యుద్ధం వచ్చే అవకాశముందా..? ఉగ్రవాద నిర్మూలన సైన్యంతో జరిగే పనికాదా..?సరిహద్దులు ఉద్రిక్తంగా ఉంటే తీవ్రవాదులకు లాభమా.. నష్టమా...?అనే అంశంపై 'ఫర్ ద పీపుల్' కార్యక్రమంలో సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విశ్లేషించారు. ఉరి ఘటనలో 18మంది సైనికుల్ని పాకిస్థాన్ పొట్టన పెట్టుకున్న తరువాత భారతదేశ ప్రజలు యుద్ధంతోనే పాకిస్థాన్ ను కట్టడిచేయాలని భావించారని రాఘవులు పేర్కొన్నారు. కాల్పుల ఒప్పందాన్ని చేసుకున్న దశాబ్దకాలంగా భారత్ పాకిస్థాన్ మధ్య వాతావరణం సాపేక్షంగానే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇటువంటి వాతావరణం ఇరుదేశాల మధ్య నెలకొన్న సందర్భంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం చాలా తక్కువుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఖడించాల్సిన అవుసరం వుందన్నారు. ఉరి ఉగ్రవాదదాడి తరువాత పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్ ను ఒంటరిచేయటం శుభపరిణామమన్నారు. పాకిస్థాన్ దుశ్చర్యల్ని ఎండగట్టేలా ప్రభుత్వం వ్యవహరించటం ఆహ్వానించదగ్గదన్నారు. రాఘవులు విశ్లేషణ కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

పూర్తయిన రాహుల్ కిసాన్ యాత్ర..

ఉత్తరప్రదేశ్‌ : రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార నిమిత్తం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన కిసాన్‌ యాత్ర గురువారంతో ముగిసింది. యూపీ నుంచి దిల్లీ పార్లమెంట్‌ స్ట్రీట్‌కు చేరుకోవడంతో యాత్ర ముగిసింది. సెప్టెంబర్‌ 6వ తేదీన రాహుల్‌ ఈ యాత్రను చేపట్టారు. దాదాపు 3,438 కిమీ, 48 జిల్లాల్లోని 141 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో ఆయన పాల్గొన్నారు. 

మరో 4గురు పాక్ ఉగ్రవాదులు హతం..

జమ్ము కశ్మీర్‌ : నౌగాం సెక్టార్‌లో ఉగ్రవాదుల మళ్లీ చొరబాటుకు యత్నించారు. అప్రమత్తంగా భారత సైన్యం ఈ చొరబాటుని భగ్నం చేసింది. చొరబాటుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.

19:34 - October 6, 2016

10టీవీ కథనానికి స్పందన..

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్ట్ పనులను కార్మికులు నిలిపివేశారు. కంపెనీ నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో.. ఉద్యోగులు పనులు నిలిపివేశారు. మరోవైపు తమకు జీతాలు ఇవ్వకుండా... త్రివేణి కంపెనీతో పనులు చేయిస్తున్నారని... ట్రాన్స్‌ట్రాయ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దీని 10టీవీలో ప్రసారమైన కథనానికి ఏపీ సీఎం కార్యాలయం స్పందించింది. ఉద్యోగులకు వేతనాలు వెంటనే చెల్లించాలనీ..పనులను వెంటనే పూర్తిచేయాలని ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. 

18:52 - October 6, 2016

చిత్తూరు : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యభక్తులకే అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు టీటీడీ బోర్డ్ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. రేపు జరిగే గరుడసేవ విజయవంతం కావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రేపటి వేడుకను విజయవంతం చేసేందుకు.. భక్తులందరూ సహకరించాలని కోరుతున్న టీటీడీ చైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి తెలిపారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

18:47 - October 6, 2016

విశాఖ : సింహాచల పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు మరోసారి సీఎం చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. ఇరవై సంవత్సరాలుగా సమస్య పరిష్కారానికి నోచుకోలేదని, వెంటనే సమస్యను పరిష్కరించాలని పంచగ్రామాల్లో ఒకటైన విజినిగరపాలెం గ్రామస్తులు విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. అక్రమంగా ఇళ్లు కూల్చేసినప్పుడు, పోలీసులు గ్రామల్లోకి వచ్చినప్పుడు స్పందించని మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఇప్పుడు దగ్గరుండి సీఎంకు వినతిపత్రం అందజేయించారు. 

18:44 - October 6, 2016

హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటు కాబోయే అన్ని జిల్లాలకు... తమకు సంబంధం లేదని హైపవర్ కమిటీ ఛైర్మన్ కేకే స్పష్టం చేశారు. హైపవర్ కమిటీ కేవలం గద్వాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, జనగాం ఈ నాలుగు జిల్లాల ఏర్పాటుపై మాత్రమే హైపవర్ కమిషన్ ఏర్పడిందన్నారు. వీటిపైనే తాము అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. తమ నివేదికను రేపు ఉదయం లోగా ముఖ్యమంత్రికి అందజేయనున్నట్టు కేకే ప్రకటించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేపట్టిన విషయం తెలిసిందే. 

భారీగా మత్తు పదార్థాలు పట్టివేత..

విశాఖపట్నం: డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న పరవాడలోని పరిశ్రమలో రూ.2.52 కోట్లు విలువైన 100 కిలోల ఆల్ఫాజోలం, 62 కిలోల ముడిపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విశాఖ, మెదక్ జిల్లాల్లో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.

18:39 - October 6, 2016

గుంటూరు : టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ర్యాంకులు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వారికి ఏ,బీ,సీ,డీ ర్యాంకులను సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సర్వే చేయించారు. ఈ సర్వే ఆధారంగా వారికి ర్యాంకులు కేటాయించడం జరిగినట్లు సమాచారం. సీల్డు కవర్ల ద్వారా వారికి ఈ ర్యాంకులను అందజేశారు. ఈ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు తెలుస్తోంది.ప్రజాప్రతినిధుల విధుల నిర్వహణపై చంద్రబాబు సర్వే నిర్వహించారు. సర్వే ఆధారంగా వచ్చిన నివేదిక ఆధారంగా ర్యాంకులను పార్టీలో వున్న పెద్దలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇచ్చిన ర్యాంక్ లతో తమ విధులను మరింతగా మెరుగుపరచుకునేలా వ్యవహరించాలని చంద్రబాబు ప్రజాప్రతిధులకు సూచించారు. గతంలో చేసిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రజాప్రతినిథులకు చంద్రబాబు ఆదేశించారు.గుంటూరు కేఎల్ యూనవర్సిటీ ప్రాంగణంలో నిర్వహిస్తున్నతెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతులు రెండో రోజూ కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులకు టెక్నాలజీపై శిక్షణ ఇస్తున్నారు. అలాగే నియోజకవర్గాల వారీగా నిపుణులు నాయకులకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే నియోజకవర్గాలవారీగా కోర్‌డాష్‌బోర్డు నిర్వహణపై శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగానే ఎమ్మెల్యేలకు ర్యాంకులు చంద్రబాబు అందజేశారు.

18:17 - October 6, 2016

గుంటూరు : అర్బన్ ఎస్పీ కార్యాలయంలో కీచకపర్వం చోటుచేసుకుంది. సూపరింటెండెంట్ లైంగిక వేధింపులు తాళలేక మహిళా జూనియర్ అసిస్టెంట్ ఆత్మాహత్యకు యత్నించింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న కరీముల్లా అనే వ్యక్తి జూనియర్ అసిస్టెంట్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో సదరు మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. కాగా అధికారులు పట్టించుకోకవటాన్ని అలుసుగా తీసుకున్న సూపరింటెండెంట్ మరింతగా రెచ్చిపోయాడు. దీంతో వేధింపులు భరించలేక సదరు మహిళా ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయాన్ని గోప్యంగా వుంచేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ములుగులో ముదురుతున్న ఆందోళనలు..

వరంగల్‌ : ములుగును సమ్మక్మ- సారలమ్మ జిల్లాగా చేయాలని ఉద్యమాలు చేస్తున్నా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు ఏజెన్సీ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించకుండా , అనవసర ప్రాంతాలను జిల్లా చేస్తూ ముఖ్యమంత్రి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత నాలుగు రోజులుగా బంద్‌లు , రాస్తారోకో, సమ్మెలతో నిరసన తెలిపిన ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఈ రోజు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు.

17:16 - October 6, 2016

ఆ జిల్లాల కోసమే హైపవర్..

హైదరాబాద్: కొత్తగా ఏర్పాటు కాబోయే అన్ని జిల్లాలకు సంబంధించి హైపవర్ కమిటీకి సంబంధంలేదని కేకు పేర్కొన్నారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై ఇప్పటికే సీఎం ఒక నిర్ణయానికి వచ్చారని తెలిపారు. హైపవర్ కమిటీ కేవలం నాలుగు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన కోసం మాత్రమే ఏర్పడిందని గమనించాలని కోరారు. సీఎం కేసీఆర్ 31 జిల్లాలను ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గద్వాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, జనగాం ఈ నాలుగు జిల్లాల ఏర్పాటుపై మాత్రమే హైపవర్ కమిషన్ ఏర్పడిందన్నారు.

ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్..

హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటన్నీ అధికారితో ధృవీకరణపత్రం అందుకున్నారు. 

నిలిచిపోయిన పోలవరం పనులు...

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు వద్ద పనులను ఉద్యోగులు నిలిపివేశారు. జీతాలు ఇవ్వకపోవడంతో ట్రాన్స్ ట్రాయ్ ఉద్యోగులు పనులు నిలిపివేశారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని, జీతాలు ఇవ్వకుండా త్రివేణి కంపెనీతో పనులు చేయిస్తున్నారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. 

టిడిపి శిక్షణా తరగతుల్లో లోకేష్..

గుంటూరు : టిడిపి శిక్షణా తరగతుల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొన్నారు. ఇకపై పార్టీలో ఒకరికి ఒకే పదవి విధానం వర్తింపచేస్తామని, పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న కార్యకర్తలకు ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తామన్నారు. కార్యకర్త సంక్షేమ నిధి నుండి వచ్చే వడ్డీని పేదరికంలో ఉన్న సీనియర్ కార్యకర్తలకు రూ. 2లక్షళ ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తామన్నారు. 23 సెకండ్లలో సభ్యత్వం రెన్యువల్ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

16:50 - October 6, 2016

ఢిల్లీ : లోధా కమిటి చేసిన సిఫార్సులను అమలు చేయాల్సిందేనంటూ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియాకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని మండిపడింది. బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ క్రికెటరా అంటూ ప్రశ్నించింది. వీటిని అమ‌లు చేయ‌డానికి కొత్తగా ఓ పాల‌క‌వ‌ర్గాన్ని నియ‌మించే దిశ‌గా కోర్టు ఆలోచ‌న చేస్తోంది. విచార‌ణ సంద‌ర్భంగా చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌.. బోర్డు ముందు రెండు ఆప్షన్లు ఉంచారు. ఈ సంస్కర‌ణ‌ల‌ను అమ‌లు చేయ‌డానికి ప్రత్యేకంగా కొంత‌మంది అధికారుల‌నైనా నియ‌మించండి.. లేదంటే లోధా ప్యానెల్ నుంచి ఇంకొంత గ‌డువునైనా తెచ్చుకోండి అని సూచించారు. లోధా సిఫారసులను బేషరతుగా అమలు చేస్తామని హామీ ఇవ్వాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనిపై రేపటి వరకు గడువు విధించింది. క్రికెట్‌ సంఘాలకు డబ్బు కేటాయించే విషయంలో బోర్డు పారదర్శకత పాటించాలని, రాత్రికి రాత్రే 4 వందల కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది. 

16:48 - October 6, 2016

హైదరాబాద్ : తెలంగాణలో సీపీఎం తలపెట్టిన 'మహాజన పాదయాత్ర' పై గులాబీ దళంలో గుబులు మొదలైంది. ఆ పార్టీకి చెందిన నేతలు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. స్వయంగా మంత్రి తుమ్మల పలు విమర్శలు గుప్పించారు.  రాష్ట్రంలో ఏ వర్గం ఆందోళనగా ఉందని సీపీఎం నాయకులు పాదయాత్ర చేపడుతున్నారనంటూ మంత్రి తమ్ముల వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్ని రంగాల్లో తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పుకొచ్చారు. అసలు మీ పాదయాత్ర యొక్క లక్ష్యం ఏంటో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీపీఎం తెలంగాణ చేపట్టిన 'మహాజన పాదయాత్ర'పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా విమర్శలు చేశారు. సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. 

టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టిన తమ్మినేని
సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 'మహాజన పాదయాత్ర' చేపట్టినట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో రెండు రోజులుగా జరుగుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా సమావేశాల్లో చర్చించిన అంశాలు, తీసుకున్న కీలక నిర్ణయాలను తమ్మినేని 10టీవీకి ప్రత్యేకంగా వివరించారు. మహాజన పాదయాత్రకు ప్రజాతంత్రవాదులు, సామాజిక శక్తులు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని తమ్మినేని కోరారు. పాదయాత్ర చేసేది సీపీఎం పార్టీయే అయినా ప్రజల కోసం..వారి శ్రేయస్సు కోసం సీపీఎం మహాజన పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. సీపీఎం చేసే పాదయాత్ర ప్రజా సమగ్రాభివృద్ధి కోసమేనని మరోసారి తమ్మినేని స్పష్టం చేశారు.  పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:35 - October 6, 2016

పశ్చిమగోదావరి : ఏపికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు పనులను చేపట్టిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఉద్యోగులకు కార్మికులకు గత నాలుగు నెలల నుండి జీతాలివ్వటం లేదు. పోలవరం ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి. 3 నెలలుగా ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ జీతాలు చెల్లించకపోవడంతో.. ఉద్యోగులు పనులు నిలిపివేశారు. మరోవైపు తమకు జీతాలు ఇవ్వకుండా... త్రివేణి కంపెనీతో పనులు చేయిస్తున్నారని... ట్రాన్స్‌ట్రాయ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.  జీతాలు ఇచ్చేంతవరకూ పనులు చేపట్టబోమని ట్రాన్స్ ట్రాయ్ సంస్థ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. అకాగా ప్రతీ సోమవారం నాడు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. దీనిపై పనులపై నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. కానీ ప్రాజెక్టు కోసం పనులు చేసే కార్మికుల కష్టాల గురించి పట్టించుకోవటంలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టు కోసం పనులు చేసే కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు సంబంధించినవారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పనులు నిలిపివేస్తే కేసులు నమోదు చేస్తామని కార్మికులను బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

16:24 - October 6, 2016

హైదరాబాద్ : ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. దసరా రోజున ప్రారంభమయ్యే కొత్త జిల్లాల ఏర్పాట్లపై కేసీఆర్ కొత్త జిల్లాల ఆవిర్భావ ఏర్పాట్లు, పాలనా అంశాలపై చర్చిస్తున్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రజలకు మేలైన సేవలు అందించడమే లక్ష్యంగా పరిపాలనా విభాగాలు ఉండాలన్నారు. ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహితమైన పాలన అందాలని ఆదేశించారు. ప్రతీ జిల్లాలో ఒకే విధమైన పరిపాలనా విభాగం, ఉద్యోగుల సంఖ్య ఉండాలనే కచ్చితమైన నిబంధన లేదని స్పష్టం చేశారు. ఆయా జిల్లాల్లోని స్వభావం, స్వరూపం, పనితీరు, అవసరాన్ని బట్టి విభాగాల విస్తరణ, కుదింపు, సర్దుబాటు ఉండాలని సూచించారు. అటవీ శాఖ, మున్సిపల్, మైనార్టీ, ఎస్టీ సంక్షేమం, హార్టికల్చర్, పరిశ్రమల వంటి శాఖల్లో అన్ని జిల్లాల్లో ఒకే విధంగా పని భారం ఉండదన్నారు. జిల్లాల్లో పని భారాన్ని బట్టి ఆయా శాఖలను విస్తరించడం, సర్దుబాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమల శాఖకు పని ఎక్కువ ఉంటుంది.. అక్కడ పరిశ్రమల శాఖ విస్తరించాలని చెప్పారు. గ్రామీణ జిల్లాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు బాగుపడాలన్నారు. అడవులు ఎక్కువగా ఉన్న భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల లాంటి జిల్లాల్లో అటవీ శాఖ కార్యకలాపాలు ఎక్కు వ చేయాలని ఆదేశించారు. ఉద్యానవనాలు ఎక్కువగా ఉండే చోట హార్టికల్చర్ శాఖ మెరుగుపర్చాలని చెప్పారు. గిరిజన ప్రాంతాలలో వైద్యసదుపాయం మెరుగు పరచాల్సిన అవుసరముందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. జనానికి మెరుగైన పరిపాలన అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు..దసరా రోజున ప్రారంభించే విధానంపై గవర్నర్ కలిసి సీఎం కేసీఆర్ అన్ని అంశాల్ని వివరించారు. 

కొత్త జిల్లాలపై ఎంసీహెచ్ ఆర్డీలో కేసీఆర్ పలు సూచనలు..

హైదరాబాద్ : కొత్త జిల్లాల విభజనపై ఎంసీహెచ్ ఆర్డీలో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా రోజున ప్రారంభమయ్యే కొత్త జిల్లాల ఏర్పాట్లపై చర్చించారు. జిల్లాల పునర్ విభజన ద్వారా ప్రజలకు మేలైన సేవలు అందించడమే లక్ష్యమని కేసీఆర్ తెలిపారు. ఎంతమంది ఉద్యోగుల సంఖ్య ఉండాలన్న నిబంధనలు ఏమీ లేవని, జిల్లాను బట్టి వివిధ విభాగాల విస్తరణ, కుదింపు ఉండాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఒకే విధమైన పాలనా విభాగం..జిల్లాలోని స్వభావం..స్వరూపం..అవసరాన్ని బట్టి వివిధ విభాగాల విస్తరణ, కుదింపు ఉండాలని సూచించారు.

చైనా టౌన్‌హాల్‌లో అగ్నిప్రమాదం..

కోల్‌కతా: కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చైనా టౌన్‌హాల్‌లో ఇవాళ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పి వేస్తున్నారు.

బీసీసీఐపై సుప్రీం తీవ్ర ఆగ్రహం..

ఢిల్లీ : బీసీసీఐ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటిలోగా లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయాలని ఆదేశించింది. లేకుంటే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. నిబంధనలు పాటించే అసోసియేషన్ లకు నిధులు కేటాయించాలని ఆదేశించింది. అసోసియేషన్లకు రాత్రికి రాత్రి రూ. 400 కోట్లు ఎలా ఇస్తారని, మాట వినకుంటే బోర్డును రద్దు చేస్తామని సీజే ఆగ్రహం వ్యక్తం చేసింది. 

15:54 - October 6, 2016

హైదరాబాద్ : ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ చలానాలు కట్టని వాహనదారుల కోసం ట్రాఫిక్ పోలీసులు దసరా స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న చలానాల పేమెంటే కోసం లోక్ అదాలత్ నిర్వహిస్తూ ఒన్ టైంలో హాఫ్ ఫైన్ ఎమౌంట్ సెటిల్ చేస్తున్నారు .గోషా మహల్ పోలీస్ స్డేడియంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ పై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

15:47 - October 6, 2016

హైదరాబాద్‌ : ఈనెల 8వ తేదీన ఎల్బీస్టేడియంలో 10 వేల మంది మహిళలతో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను ఉన్నతాధికారులతో కలిసి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఏర్పాట్లపై 10టీవీతో మాట్లాడారు. దారిపోడవునా శానిటేషన్‌ టీమ్స్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పారిశుద్ధ్యానికి అధిక ప్రాధ్యానత ఇస్తామంటున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు.

15:41 - October 6, 2016

నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు.. లక్షల మంది ప్రజలకు సాగు, తాగు నీరందించే మహాజలాశయం. కానీ ఆ జలాశయం ఉన్న ఊరి జనం మాత్రం దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. లక్షల మంది రైతుల బతుకుల్లో వెలుగులు నింపిన ఆ ప్రాజెక్టు స్థానికులను మాత్రం నిండా ముంచింది. ప్రాజెక్టు వల్ల ఎన్నో బీడు భూములు సస్యశ్యామలం అయ్యాయి. కానీ.. ఆ ఊరి రైతులు మాత్రం భూములు కోల్పోయి అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు..

పంటలు పండే భూములు పోగొట్టుకున్నా..ఇప్పటికీ అందని నష్ట పరిహారం
ఇదీ
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నెలకొన్న సోన్‌పేట గ్రామస్తుల వేదన. నిజామాబాద్‌లో జిల్లాలో లక్షల మంది రైతుల బతుకుల్లో వెలుగులు నింపిన ఈ ప్రాజెక్టు.. ఈ గ్రామాన్ని మాత్రం నిండా ముంచింది. ఎన్నో ప్రాంతాలకు సాగు, తాగు నీరందించి సస్యశ్యామలం చేసిన ఈ జలాశయం.. సోన్‌పేట్‌ గ్రామాన్ని మాత్రం నామరూపాల్లేకుండా చేసింది. ఒకప్పుడు భూస్వాములుగా ఉన్నత జీవితాలను అనుభవించిన చాలా మంది రైతులు.. ఎస్సారెస్పీ దెబ్బకు ఉన్న భూముల్ని కోల్పోయి నిరాశ్రయులుగా మారి... దుర్భర జీవితాలు గడుపుతున్నారు.

ఇప్పటికీ తగిన పరిహారం అందక.. కూలీలుగా మారిన రైతన్నలు..
ఎస్సారెస్పీ కింద భూముల కోల్పోయిన అనేక మంది రైతులు ఇప్పటికీ తగిన పరిహారం అందక.. కూలీలుగా దుర్భర జీవితాలు గడుపుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం..అధికారుల అలసత్వం కారణంగా సోన్‌పేట్‌ గ్రామస్తులకు శ్రీరాంసాగర్‌ శాపంలా మారింది. ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయి.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రాజెక్టు కోసం వేల ఎకరాలను తీసుకున్న ప్రభుత్వం
సోన్‌పేట్‌ గ్రామ సమీపంలోని వేల ఎకరాల భూముల్లో జలాశయం నిర్మించడంతో.. వందల ఎకరాల్లో పంటలు పండించిన రైతులు ఉన్నపళంగా నిరాశ్రయులయ్యారు. ప్రాజెక్టు కోసం వేల ఎకరాలను తీసుకున్న ప్రభుత్వం.. నిర్వాసితులకు మాత్రం ఇప్పటికీ నష్ట పరిహారం చెల్లించలేదు. దౌర్జన్యంగా భూములు లాక్కోవద్దంటూ అప్పట్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు, ఉద్యమాలు చేశారు. తమకు తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదు.

ఒక్క రైతుకు కూడా గుంట భూమి ఇవ్వకపోవడం శోచనీయం..
జలాశయం నిర్మాణం తర్వాత వేరే ప్రాంతంలో భూములిస్తామన్న అధికారులు ఇప్పటికీ ఒక్కరికి కూడా గుంట భూమి ఇవ్వకపోవడం శోచనీయం. చాలామంది రైతులు ఇప్పటికీ ప్రాజెక్టు పక్కనే గుడిసెలు వేసుకుని కూలీలుగా మారారు. సోన్‌పేట్‌ గ్రామస్తుల భూముల్లో సిబ్బందికి క్వార్టర్లు, పార్క్‌, ప్రాజెక్టు కాలువలు నిర్మించిన ప్రభుత్వం.. నిర్వాసితులను మాత్రం పట్టించుకోకపోవడం దారుణం. నాయకులు, అధికారుల చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూమి అడిగితే తమపై కేసులు పెడుతున్నారని సోన్‌పేట్‌ నిర్వాసితులు ఆవేదన
ప్రాజెక్టు వద్ద దాదాపు 300 ఎకరాల్లో అధికార పార్టీ నేత వర్గీయులు సాగు చేస్తున్నా.. ఎవరూ కన్నెత్తి కూడా చూడటం లేదని, అదే గుంట భూమి అడిగితే తమపై కేసులు పెడుతున్నారని సోన్‌పేట్‌ నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. పక్కనే అతిపెద్ద జలాశయం ఉండి కూడా చుక్కనీరు తమ గ్రామానికి రావటం లేదని వాపోతున్నారు. ఎన్నికలప్పుడు నేతలు భూములిప్పిస్తామని హామీలు ఇచ్చి.. ఆ తర్వాత ముఖం చాటేశారని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వాలపై పోరాటాలు చేసి.. వయస్సు మళ్లిపోయిందని.. ఇక తమకు పోరాడే శక్తి కూడా లేదని నిర్వాసితులు ధైన్యంగా చెబుతున్నారు. తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.

15:31 - October 6, 2016

ప్రకాశం : ఏసీబీకి చిక్కిన ఒంగోలు రవాణాశాఖాధికారి రాంప్రసాద్ అక్రమ ఆస్తులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. రాంప్రసాద్‌ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఒంగోలు, నెల్లూరు, తెనాలి, వినుకొండ, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరులో ఆస్తులను గుర్తించారు. పన్నెండు చోట్ల ఏసీబీ అధికారులు చేసిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.

15:26 - October 6, 2016

విజయవాడ : నామినేటెడ్ పదవుల వ్యవహారం టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని రాజేస్తోంది. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికి పోస్టులు ఇచ్చారని.. సీనియర్లు మండిపడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగేలోగా.. నామినేటెడ్‌ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేసే యోచనలో అధినేత ఉన్నట్లు సమాచారం.

నామినేటెడ్‌ పదవుల భర్తీ వ్యవహారం..
నామినేటెడ్‌ పదవుల భర్తీ వ్యవహారం.. అధికార టీడీపీలో అసంతృప్తిని రాజేస్తోంది. నామినేటెడ్‌ పదవుల కోసం.. కోటి ఆశలతో ఎదురుచూసిన సీనియర్లకు కాకుండా.. ఈమధ్యనే పార్టీలో చేరిన వారికి పదవులు దక్కడం అసంతృప్తికి కారణమవుతోంది. తాజాగా ప్రకటించిన నామినేటెడ్‌ జాబితాలో రాయపాటి అనుచరులు, ఆయన కోటరీకే ఎక్కువ పోస్టులు దక్కాయని టీడీపీ సీనియర్‌ కార్యకర్తలు గుర్రుమంటున్నారు. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని పనిచేసే తమకు మొండి చేయి చూపడంపై వారు మండిపడుతున్నారు .

డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు దక్కిన నామినేటెడ్‌ పదవి
పార్టీలో కొత్తగా చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు నామినేటెడ్‌ పదవి దక్కింది. ఆయనతో పాటే.. మరికొందరు కాంగ్రెస్‌ నుంచి వచ్చిన నేతలకూ నామినేటెడ్‌ పదవులు దక్కాయి. ఇది టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తికి ప్రధాన కారణమవుతోంది. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు కూడా సేవలందిచిన తమను కాదని, కొత్తవారికి పోస్టులు కేటాయించడంపై వీరంతా అసంతృప్తిగా ఉన్నారు. తమకు నామినేటెడ్ పోస్టులు దక్కాలంటే ఇంకెంత కాలం వేచి ఉండాలని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ వంటి కీలక కార్పొరేషన్‌లతో పాటు.. వివిధ దేవాలయాల పాలకమండళ్ల నియామకం జరగాల్సి ఉంది. ఆ సందర్భంలోనైనా తమ సీనియారిటీని అధినాయకత్వం గుర్తించాలని టీడీపీ సీనియర్‌ నాయకులు కోరుతున్నారు.

 

పాదయాత్రపై టీఆర్ఎస్ విమర్శలపై స్పందించిన తమ్మినేని..

నల్గొండ : మహాజన పాదయాత్ర మీద టీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు. ప్రజల్లో ఉండే వారికి గెలుపోటములతో సంబంధం లేదని, కమ్యూనిస్టులు నిత్యం ప్రజల్లోనే ఉంటారని పేర్కొన్నారు. సీఎం పీఠం ఎక్కేముందు సీపీఎం నిజాయితీ పార్టీ అన్న కేసీఆర్ తమ విధానాలపై ఎదురు దాడులు చేస్తున్నారని విమర్శించారు. 

15:20 - October 6, 2016

కర్నూలు : రేపటి నుంచి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరగనున్నాయి. ఈ వారోత్సవాలు నగరంలోని సెయింట్‌ జోసఫ్స్ కాలేజీలో నిర్వహించనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్త రబ్బానీ తెలిపారు. షార్‌లో ప్రయోగిస్తున్న రాకెట్లు, క్షిపణులు, అత్యాధునిక సాంకేతికత కలిగిన యుద్ధవిమానాలను ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి ప్రారంభంచనున్నారు. ఈ ఉత్సవాలను ప్రజలు విజయవంతం చెయ్యాలని కోరుతూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. 

ముగిసిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు..

నల్గొండ : సూర్యాపేటలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు కొద్దిసేపటి కిందట ముగిశాయి. తెలంగాణ సమగ్రాభివృద్ధిపై ప్రత్యామ్నాయ అభివృద్ధి డాక్యుమెంట్ రూపొందించడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం పేర్కొన్నారు. 17న ప్రారంభమయ్యే 'మహాజన పాదయాత్ర' ద్వారా ఆ డాక్యుమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చిస్తామన్నారు. తమ అభివృద్ధి నమూనా ఒక పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు. 

15:18 - October 6, 2016

ఖమ్మం : భద్రాచలాన్ని జిల్లాగా చేయాలంటూ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణదీక్ష ప్రారంభించారు.. ఈ దీక్షకు ఉద్యోగ, వ్యాపార, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి... దీక్షా శిబిరాన్ని పోతినేని సుదర్శన్‌ ప్రారంభించారు.. ఖమ్మంను 3 జిల్లాలుగా చేయాలని సున్నం రాజయ్య డిమాండ్ చేస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను రేపింది. దీనిపై పలు ప్రాంతాలలో ఆందోళనలు కొనసాగాయి. కలెక్టర్లు, సీఎస్, ఉన్నతాధికారులతో ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన సీఎం కేసీఆర్ కసరత్తు తుది దశకు చేరుకున్నాయి, దాదాపు 31 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భద్రాద్రి పేరుతో భద్రాచలాన్ని జిల్లా గా ఏర్పాటు చేస్తామని సీఎం గతంలో మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి భద్రాద్రిని జిల్లాగా ఏర్పాటు చేయాలని..అలాగే ఖమ్మం జిల్లాను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయాలంటూ సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య భద్రాచలాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఆమరణదీక్ష చేపట్టారు.  

'సీపీఎం మహాజన పాదయాత్ర' లోగో, వైబ్ సైట్ ప్రారంభం..

నల్గొండ : సీపీఎం మహాజన పాదయాత్ర లోగో, వెబ్ సైట్ ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, నంద్యాల నరసింహరెడ్డి, జూలకంటి, బి.వెంకట్, నాగయ్యలు పాల్గొన్నారు. సూర్యాపేటలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు కొద్దిసేపటి కిందట ముగిశాయి. ఈ సందర్భంగా తమ్మినేని ప్రసంగించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధిపై ప్రత్యామ్నాయ అభివృద్ధి డాక్యుమెంట్ రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. 17న ప్రారంభమయ్యే 'మహాజన పాదయాత్ర' ద్వారా ఆ డాక్యుమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చిస్తామన్నారు.

15:10 - October 6, 2016

జమ్ము కశ్మీర్ : హంద్వారాలో ఎన్‌కౌంటర్‌ ముగిసిందని ఆర్మీ ప్రకటించింది... సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.. వీరి దగ్గరనుంచి భారీగా ఆయుధాల్ని స్వాధీనం చేసుకుంది.. 3 ఏకే 47తుపాకులు, 17 మాగ్జిన్లు, రెండు సెల్‌ఫోన్స్‌, 4 రేడియోలు, 3 జీపీఎస్ సెట్లు, ఆహారపదార్థాలు, మెడిసిన్లు, కోడ్‌షీట్లు, ఆర్మీ జాకెట్లను భారత సైనికులు స్వాధీనం చేసుకున్నారు.. వీటితోపాటు కత్తులు, 12 గ్రనేడ్లు, గ్రనేడ్‌ లాంచర్లు, ఉగ్రవాదులదగ్గరున్న భారత కరెన్సీనికూడా స్వాధీనం చేసుకుంది.. ఈ వస్తువులన్నింటిపై పాకిస్తాన్‌ గుర్తులున్నాయి.

14:12 - October 6, 2016

'బాల్య వివాహాలు...వ్యతిరేకంగా చట్టాలు' అంశంపై మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు హైమావతి, సీడబ్య్లుసీ చైర్మన్ శ్యామల  పాల్గొని, మాట్లాడారు. బాల్య వివాహాలు, చట్టాలు, అనర్థాలపై పలు విషయాలను వారు వివరించారు.   పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

14:07 - October 6, 2016

హైదరాబాద్ : నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ సీనియర్‌ నాయకురాలు బుట్టారేణుకా చౌదరి డిమాండ్‌ చేశారు. నకిలీవిత్తనాల వ్యాపారులను కఠినంగా శిక్షించాలన్నారు. నకిలీ విత్తనాల వల్ల ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆమె అన్నారు. తాను మూడు జిల్లాల్లోనూ పర్యటించి, రైతుల బాధలను తెలుసుకున్నానని తెలిపారు. నకిలీవిత్తనాలపై సీడ్‌ సర్టిఫికేషన్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. 

 

14:00 - October 6, 2016

జమ్మూకాశ్మీర్ : హంద్వారాలో ఎన్‌కౌంటర్‌ ముగిసిందని ఆర్మీ ప్రకటించింది. సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.. వీరి దగ్గరనుంచి భారీగా ఆయుధాల్ని స్వాధీనం చేసుకుంది. 3 ఏకే 47తుపాకులు, 17 మాగ్జిన్లు, రెండు సెల్‌ఫోన్స్‌, 4 రేడియోలు, 3 జీపీఎస్ సెట్లు, ఆహారపదార్థాలు, మెడిసిన్లు, కోడ్‌షీట్లు, ఆర్మీ జాకెట్లను భారత సైనికులు స్వాధీనం చేసుకున్నారు.. వీటితోపాటు కత్తులు, 12 గ్రనేడ్లు, గ్రనేడ్‌ లాంచర్లు, ఉగ్రవాదులదగ్గరున్న భారత కరెన్సీనికూడా స్వాధీనం చేసుకుంది.. ఈ వస్తులన్నింటిపై పాకిస్తాన్‌ గుర్తులున్నాయి. 
ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం : ఆర్మీ 
ఉదయం జరిగిన హంద్వారా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదుల నుంచి 3ఏకే 47 తుపాకీలు, గ్రైనేడ్లు, జీపీఎస్ సిస్టమ్ స్వాధీనం చేసుకున్నామన్నారు. సరిహద్దుల్లో మన సైన్యం హైఅలర్ట్‌గా ఉందని.. ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతమంతా సైన్యం జల్లెడ పడుతుందన్నారు.. ఉగ్రవాదులు దాడి చేసిన వెంటనే సైన్యం అప్రమత్తమై ఉగ్రవాదులను మట్టుబెట్టామని వెల్లడించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

13:55 - October 6, 2016

సులువుగా డబ్బును ఎలా సంపాదించాలని కొంతమంది వక్రమార్గాలు ఎంచుకుంటుంటారు. కొందరు అక్రమంగా రవాణా చేస్తుంటారు..కొందరు దొంగతనానికి పాల్పడుతుంటారు..ఇలా రకరకాలుగా తమ చోరకళను ప్రదర్శిస్తుంటారు. కానీ పోలీసులకు వీరు దొరికిపోతుంటారు. ముఖ్యంగా విదేశాల నుండి అక్రమంగా డబ్బులు..బంగారు ఆభరణాలు..ఇతరత్రా వాటిని తరలిస్తుంటారు. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులకు వీరు దొరికిపోతుంటారు. కానీ కొంతమంది వీరికి దొరకకుండా ఉండాలని నయా ప్లాన్ వేశారు. తమ రెక్టమ్స్ (ఎనల్ పార్ట్స్) లో డబ్బును దాచుకున్నారు. కానీ వీరి ప్లాన్ బెడిసికొట్టింది. ఎయిర్ పోర్టు పోలీసులకు దొరికిపోయారు. ఈ ఘటన బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
దుబాయ్ నుండి ముగ్గురు వ్యక్తులు భారీ నగదుతో వస్తున్నారని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టులో దిగగానే అనుమానం వచ్చిన ముగ్గురి వ్యక్తులను తనిఖీలు నిర్వహించారు. వాళ్లను చెక్ చేసిన సమయంలో తలపాగాలో నుండి భారీగా యూరో నోట్లు బయటపడ్డాయి. ఆశ్చర్యకరంగా రెక్టమ్స్ లో 3.9 యూరోలు (దాదాపు 2.9 కోట్లు) దాచి పెట్టుకున్నారని గ్రహించి ఎయిర్ పోర్టు అధికారులు ఆశ్చర్యపోయారు. శరీరంలో నగదు దాచుకుని వచ్చిన ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తాము వ్యాపారం చేయడానికే తాము ఇంత పెద్ద మొత్తంలో డబ్బును దాచుకుని తెస్తున్నట్లు ఆ వ్యక్తులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

13:55 - October 6, 2016

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యువ హీరో దగ్గుబాటి రాణా కలయిలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి2’. దీనికి  సంబంధించి రాణా ఇటీవలే తన ట్విట్టర్ ఖాతాలో  బాహుబలి లో చూపించబోయె సిక్స్ ప్యాకు ను మొదటి సారి చూపిస్తు ఔరా అనిపించుకున్నాడు. ఈ పోస్టర్‌లో  రాణా చొక్క మాటున దాగి ఉన్న సిక్స్ ప్యాక్ లుక్‌ని మనం గమనించవచ్చు.'బాహుబలి'లో 'రానా' సుమారు 110 కిలోల బరువు ఉండేవాడంట. రెండో భాగంలో మాత్రం బరువు తగ్గాల్సి ఉండటంతో దానికోసం రాణా భారీగా కరసత్తులు చేసి బరువు తగ్గించుకునే పనితో పాటు శరీరాకృతిని పెంచుతున్నారు. అయితే ఈ పని అంతా కోచ్ పర్యవేక్షనలో జరుగుతోంది.  ఈ సందర్భంగా తీసిన ఓ ఫోటోను 'రానా' తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుని విస్మయానికి గురిచేశాడు. రానున్న సినిమాలో  రాణానే ఇంత కండలు తిరిగేల చూపిస్తున్న రాజమౌళి మరి బాహుబలుడు 'ప్రభాస్'ను ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో, ప్రభాస్ తన బాడీ పెంచడానికి ఎలా కసరత్తులు చేస్తున్నాడో అని ఆశక్తిగా మారింది. ఇదిలా ఉండగా బహుబలిలో ఓ దృడమైన జంతువు  పంతం పట్టిన బల్లాలుడు మరింత కండలు పెంచిన బహుబలి2లో ఇంక ఎంత పెద్ద జంతువుతో పోటీ పడుతాడోఅనే ఆశ్చర్యం కలగకపోలేదు... ఏదేమైనా ఇలాంటి సందేహాలు తీరాలంటే బాహుబలి2 రిలీజ్ వరకు వేట్ చేయాల్సిందే…

13:45 - October 6, 2016

ఢిల్లీ : క్రికెట్‌ క్రేజీ నేషన్‌ భారత్‌లో కబడ్డీ వరల్డ్‌ కప్‌ పోటీలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 12 జట్ల మధ్య ప్రపంచకప్‌ సమరానికి అహ్మదాబాద్‌లో రంగం సిద్ధమైంది. అనూప్‌ కుమార్‌ నాయకత్వంలోని భారత జట్టు 2016 ప్రపంచకప్‌లో హాట్‌పేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.
అహ్మదాబాద్‌లో సిద్ధమైన రంగం  
2016  కబడ్డీ వరల్డ్‌ కప్‌కు అహ్మదాబాద్‌లో రంగం సిద్ధమైంది. 16 రోజుల పాటు 12 దేశాల మధ్య జరుగనున్న ప్రపంచ సమరంలో ఆతిధ్య భారత్‌ టైటిల్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. రౌండ్‌ రాబిన్‌ కమ్‌ నాకౌట్‌ ఫార్మాట్‌లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌ కోసం కబడ్డీ ఫ్యాన్స్‌తో పాటు క్రీడాభిమానులు  సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తొలిసారిగా పోటీపడుతున్న 12 జట్లు 
2016 ప్రపంచకప్‌లో తొలిసారిగా 12 జట్లు పోటీ పడుతున్నాయి. భారత్‌ , అర్జెంటీనా, అమెరికా, జపాన్‌,థాయ్‌లాండ్‌, సౌత్‌ కొరియా, ఇంగ్లండ్‌, కెన్యా,పోలాండ్‌,ఇరాన్‌, ఆస్ట్రేలియా , బంగ్లాదేశ్‌ వరల్డ్‌ టైటిల్‌ కోసం పోటీకి దిగుతున్నాయి. పోలాండ్‌ , అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెన్యా, అమెరికా దేశాలు తొలి సారిగా కబడ్డీ వరల్డ్‌ కప్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. 
భారత జట్టుకు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ 
సర్కిల్‌, ఇంటర్నేషనల్‌ ఫార్మాట్లో ఇప్పటివరకూ జరిగిన 7 ప్రపంచకప్ పోటీల్లోనూ భారత జట్టుకు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. ఏడుకు ఏడు వరల్డ్‌ కప్‌ పోటీల్లోనూ భారత జట్టే విజేతగా నిలిచింది. ఇప్పటివరకూ అన్ని  ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇండియన్‌ టీమ్‌ను అధిగమించడంలో మిగతా జట్లు విఫలమయ్యాయి. సర్కిల్‌ ఫార్మాట్‌లో 5 సార్లు, ఇంటర్నేషనల్‌ ఫార్మాట్లో రెండు సార్లు భారత్‌ చాంపియన్‌గా నిలిచింది.
హాట్‌పేవరెట్‌గా బరిలోకి భారత జట్టు 
అనూప్‌ కుమార్‌ నాయకత్వంలోని భారత జట్టు 2016 ప్రపంచకప్‌లో హాట్‌పేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. భారత్‌ తర్వాత  ఇరాన్‌, సౌత్‌ కొరియా ,థాయ్‌లాండ్‌, జపాన్‌ వంటి ఆసియా దేశాలకు మిగతా జట్ల కంటే మెరుగైన అవకాశాలు ఉన్నాయి.  
భారత్‌కే విజయావకాశాలు 
ఇటు టీమ్‌ కాంబినేషన్‌...అటు ట్రాక్ రికార్డ్‌...ఎలా చూసుకున్నా, 2016 వరల్డ్‌కప్‌లో భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి 8వ సారి వరల్డ్‌ చాంపియన్‌గా నిలవాలని పట్టుదలతో ఉన్న భారత్‌...అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే. 

13:40 - October 6, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త పోలీసు స్టేషన్లు, కొత్త కమిషనరేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పోలీసు వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు..నూతన జిల్లాల్లో పదోన్నతులతో ఉన్నతాధికారులను నియమించేందుకు సర్కార్‌ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనంతరం ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు వెల్లడించారు. 
పోలీసు ఉన్నతాధికారులతో నాయిని ఉన్నతస్థాయి సమావేశం 
దసరా నుంచి ప్రారంభమయ్యే కొత్త జిల్లాల పాలనకు పోలీస్ శాఖ సిద్ధమయింది. అందుకు కావాల్సిన సిబ్బందిని సిద్ధం చేసి.. రేపో మాపో ఆదేశాలు జారీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 118 కొత్త మండలాల ఏర్పాటు నేపథ్యంలో.. 82 కొత్త పోలీస్ స్టేషన్‌లు, 23 సర్కిళ్లు, 22 సబ్ డివిజన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేయబోతున్నారు. 
రాష్ట్రంలో 8 కమిషనరేట్లు 
పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల ప్రాంతంలో కమిషనరేట్ పెద్దగా ఉన్నందున ఐజీ స్థాయి అధికారిని కమిషనర్‌గా నియమించాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించారు. దీంతో మొత్తం రాష్ట్రంలో 8 కమిషనరేట్లు ఉండబోతున్నాయి. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో అడిషనల్ ఎస్పీలకు పదోన్నతులు కల్పించి ఎస్పీలుగా నియమించనున్నారు. చిన్న జిల్లాలతో పోలీసు వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కానుందని టీఆర్‌ఎస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు.  
ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశం 
కొత్త జిల్లాల్లో పోలీసుల పని తీరు ఎలా ఉండాలనే అంశంపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు  చేశారు. అధికారులు తాజా పరిణామాలపై సీఎంకు నివేదిక సమర్పించారు. దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకుంటారు. అవసరమైతే అధికారుల నిర్ణయాలపై మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 16 మంది అడిషనల్ ఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా, అలాగే  22 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే జీవో విడుదల పదోన్నతులు పొందిన అధికారులను కొత్త జిల్లాల్లో నియమించనున్నట్లు సమాచారం. 

 

13:35 - October 6, 2016

విశాఖ : టెక్నాలజీని ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న డిజిటల్‌ ఇండియా సదస్సును ఆయన ప్రారంభించారు. విశాఖ లాంటి నగరం దేశంలో మరెక్కడా లేదన్నారు. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. 
 

13:27 - October 6, 2016

చిత్తూరు : కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని చంద్రబాబులు అబద్ధాల ప్యాకేజీలు ఇస్తున్నారని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వామపక్షాలు దీక్ష చేపట్టాయి. రాయలసీమకు 50 వేలకోట్ల రూపాయలు ప్రకటించాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ దీక్షలో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. జిల్లాకు ముష్టివేసినట్లు రూ.50 కోట్లు ఇస్తే అభివృద్ధి జరుగదన్నారు. 2014 వరకు ప్రత్యేకహోదాపై ఊరించారని.. ఇప్పుడు లేదంటున్నారని మండిపడ్డారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వలాలు పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పాత వాగ్ధానాలను గంగలో కలిపారని.. ఇప్పుడు కొత్త వాగ్ధానాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలపై నిర్బంధం ప్రయోగించి... అణచివేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాలను అణిచివేస్తే అగవని... ఉవ్వెత్తున లేస్తాయిని చెప్పారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. 

13:26 - October 6, 2016

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' వరుస సినిమాలతో బిజీ బిజీగా మారబోతున్నాడా ? ఏకంగా నాలుగు సినిమాల్లో నటించబోతున్నాడా ? అంటే టాలీవుడ్ లో అవుననే టాక్ వినిపిస్తోంది. ఎన్నికలు వచ్చే నాటికి ఈ సినిమాలన్నీ రిలీజ్ చేయాలని 'పవన్' యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'సర్ధార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అనంతరం 'పవన్' కాటమరాయుడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 'డాలి' డైరెక్ట్ చేస్తున్న 'కాటమరాయుడు' చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిసున్నారు. ఈ చిత్రాన్ని 2017 ఫిబ్రవరి మాసంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. దీని అనంతరం మాటల మాంత్రికుడు 'తివిక్రమ్'తో ఓ సినిమా చేయనున్నారు. అనంతరం మరో రెండు సినిమాలకు 'పవన్' సైన్ చేయనున్నారని టాక్. ఈ సినిమాలన్నీ 2018 నాటికి పూర్తి కావాలని 'పవన్' ప్లాన్ వేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'జనసేన' పార్టీతో 'పవన్' రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలు మొదలయ్యే సమయానికి బిజీగా ఉండాల్సినవసరం ఉంటుందని, అందుకే వీలైనన్నీ సినిమాలు చేయాలని 'పవన్' అనుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2017లో రెండు..2018లో మరిన్ని చిత్రాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే ఓపిక పట్టాల్సిందే. 

13:20 - October 6, 2016

ఢిల్లీ : సరిహద్దులతో భద్రతపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అత్యున్నతస్థాయి సమావేశం కొనసాగుతోంది.. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారుడితోపాటు... రక్షణ శాఖ అధికారులు హాజరయ్యారు.. హంద్వారా ఆర్మీక్యాంప్‌ ఉగ్రదాడిపై ఇందులో చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:14 - October 6, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహబుబ్ నగర్ జిల్లాలో వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పై ఆధారపడి కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. రైతులకు నష్టపరిహారం ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

 

లోయలో పడిన బస్సు..ముగ్గురు మృతి..

జమ్మూ కాశ్మీర్ : ఉదంపూర్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడిపోవడంతో ముగ్గురు మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. 

జయ కోలుకోవాలని అన్నదానం..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థనలు..పూజలు చేస్తున్నారు. ఆనంద్ సాయి టెంపుల్ లో కార్యకర్తలు..నేతలు..అభిమానులు అన్నదానం నిర్వహించారు. 

13:11 - October 6, 2016

ఢిల్లీ : సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. హంద్వారాలోని 30 ఆర్ఆర్‌ ఆర్మీ క్యాంపు లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.  లాంగ్ గేట్ ఆర్మీ క్యాంపు సమీపంలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులకు ,ఆర్మీ జవాన్లకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారత జవాన్లు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

ఆందోళనకరంగానే చిన్నారి సంజన పరిస్థితి..

హైదరాబాద్ : తాగుబోతుల నిర్లక్ష్య డ్రైవింగ్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి సంజన ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. గురువారం సంజన కాలుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం వెంటిలేషన్ పై వైద్యం అందిస్తున్నామని, తల్లి శ్రీదేవి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. 

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు - మంత్రి తుమ్మల..

ఖమ్మం : పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకపోతోందని, అభివృద్ధిని చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. గత పాలకులు రైతులను పట్టించుకోవడం లేదని, రైతులకు గిట్టుబాటు ధర, 9గంటల విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. తప్పు చేయాల్సి వస్తే ఉరేసుకుని చస్తాం కానీ తప్పు చేయమన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించడం జరుగుతోందన్నారు. 

ప్రజల మనోభావాలు పట్టించుకోవడం లేదు - పోతినేని సుదర్శన్..

ఖమ్మం : ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోగ్యానికి ఏమైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పోతినేని సుదర్శన్ పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

 

దుర్గ ఆలయంలో నకిలీ పాస్ లు..

విజయవాడ : కనకదుర్గమ్మ ఆలయంలో నకిలీ పాస్ లతో భక్తులు దర్శనానికి వస్తున్నారు. అధికారులు పాసులు స్వాధీనం చేసుకున్నారు. పాస్ ల జారీలో సిబ్బంది ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. 

13:07 - October 6, 2016

హీరోయిన్ రిచా పనయ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా 'ఈడ్ గోల్డ్ ఎహే' సినిమా విశేషాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద వామపక్షాల నిరహార దీక్ష..

చిత్తూరు : తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద వామపక్షాల నిరహార దీక్ష శిబిరాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు సందర్శించారు. విభన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, జిల్లాకు ఏడాది రూ. 50 కోట్లు ముష్టి తమకొద్దన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెరో రూ. 50 వేల కోట్లు ప్రకటించిందని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. 

దుర్గ ఆలయంలో నకిలీ పాస్ లు..

విజయవాడ : కనకదుర్గమ్మ ఆలయంలో నకిలీ పాస్ లతో భక్తులు దర్శనానికి వస్తున్నారు. అధికారులు పాసులు స్వాధీనం చేసుకున్నారు. పాస్ ల జారీలో ఇష్టానురాజ్యంగా సిబ్బంది వ్యవహరిస్తున్నారు.  

12:58 - October 6, 2016
12:56 - October 6, 2016
12:55 - October 6, 2016
12:26 - October 6, 2016

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన డా.జీసీ ఖిలానీ, నితీశ్ నాయక్‌, డా.అంజన్‌త్రిఖా నేతృత్వంలోని వైద్యుల బృందం జయలలితకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. చెస్ట్‌, హార్ట్‌ డాక్టర్లతోపాటు మత్తు వైద్యుడు జయకు చికిత్స అందిస్తున్నారు. గతంలోపోలిస్తే జయ ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోందని డాక్టర్లు చెబుతున్నారు. జయలలిత అనారోగ్యంనుంచి పూర్తిగా కోలుకుంటే మరో రెండు వారాల్లో ఆమెను డిశ్చార్జ్‌ చేసే అవకాశముందని తెలుస్తోంది.
పిటిషన్‌ కొట్టివేత
జయలలిత అనారోగ్యం వివరాల్పి బహిర్గతం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు మద్రాస్‌ కోర్టు కొట్టివేసింది.. జయలలితకు చికిత్స ఎన్ని రోజులు జరుగుతుందో ఎవరూ చెప్పలేరని స్పష్టం చేసింది.. పబ్లిసిటీకోసం మాత్రమే ఈ పిటిషన్‌ను వేసినట్లుగా ఉందని విమర్శించింది.. పిటిషన్లను ఇలా రాజకీయాలకోసం వాడుకోవద్దని సూచించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తోంది - సీఎం బాబు..

విశాఖపట్టణం : డిజిటల్ సమ్మిట్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అందమైన ప్రదేశం విశాఖ నగరమని, ఆధునిక టెక్నాలజీలో దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రెండంకెల వృద్ధి రేటు కేవలం భారత్ కే సాధ్యమని ప్రపంచ దేశాలన్నీ చెబుతున్నాయని పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఎంతో అభివృద్ధిని సాధించడం జరిగిందన్నారు. 

రాజ్ నాథ్ అత్యున్నత సమావేశం..

హైదరాబాద్ : హంద్వారాలో ఉగ్రవాదులు..భారత బలగాలకు మధ్య జరిగిన కాల్పులు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దీనితో సరిహద్దు భధ్రతపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భధ్రత సలహాదారు, రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

హంద్వారాలో ముగిసిన ఎన్ కౌంటర్..

జమ్మూ కాశ్మీర్ : హంద్వారాలో ఎన్ కౌంటర్ ముగిసింది. భారీ స్థాయిలో మారణాయుధాలను ఆర్మీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మూడు ఏకే 47 తుపాకులు, 17 మాగ్జిన్లు, రెండు సెల్ ఫోన్స్, 4 రెడియోలు, కత్తులు, 12 గ్రనేడ్లు, గ్రనేడ్ లాంచర్లు, మూడు జీపీఎస్ సెట్లు, ఆహార పదార్థాలు, మెడిసిన్లు, కోడ్ షీట్లు, ఆర్మీ జాకెట్లను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదుల నుండి భారత కరెన్సీని స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న వస్తువులపై పాక్ గుర్తులున్నాయి. 

గవర్నర్ ను కలిసిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను సీఎం కేసీఆర్ కలిశారు. సద్దుల బతుకమ్మ కార్యక్రమానికి రావాలని గవర్నర్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. 

12:07 - October 6, 2016

విశాఖ : జీకే వీధి మండలం కుంకుమపుడి వద్ద ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు మావోయిస్టులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. స్థానికంగా ఈఘటన తీవ్ర కలకలం రేపింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:01 - October 6, 2016

జమ్మూకశ్మీర్ : సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. హంద్వారాలోని 30 ఆర్ఆర్‌ ఆర్మీ క్యాంపు లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.  లాంగ్ గేట్ ఆర్మీ క్యాంపు సమీపంలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులకు ,ఆర్మీ జవాన్లకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారత జవాన్లు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

సింగ్ నగర్ లో ఎక్సెల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత..

విజయవాడ : సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనావాసాల మధ్య చెత్త డంపింగ్ ఆపాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త లారీలను స్థానికులు, సీపీఎం నేతలు అడ్డుకున్నారు. సీపీఎం నేత బాబురావుతో సహా పలువురు అరెస్టు అయ్యారు. 

సున్నం రాజయ్య దీక్ష ప్రారంభం..

ఖమ్మం : ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ దీక్ష ప్రారంభమైంది. దీక్ష శిబిరాన్ని పోతినేని సుదర్శన్ ప్రారంభించారు. దీక్షకు ఉద్యోగ, వ్యాపార, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపారు. భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని, ఖమ్మంను మూడు జిల్లాలుగా విభజించాలని డిమాండ్ చేస్తున్నారు. 

పోలీసు కాల్పుల్లో మావోయిస్టులకు గాయాలు..

విశాఖపట్టణం : జీకే వీధి (మం) కుంకుమపూడి వద్ద మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో పలువురు పోలీసులకు గాయాలయయ్యాయి. అనంతరం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో మావోయిస్టులు హంబ్రీ, శోభన్, నర్సింగ్ లకు గాయాలయ్యాయి. జీకే వీధి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. శోభన్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. హంబ్రీ, శోభన్ పై రూ. లక్ష చొప్పున రివార్డు ఉంది. 

డిజిటల్ సమ్మిట్ ప్రారంభం..

విశాఖపట్టణం : జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. డిజిటల్ సమ్మిట్ ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. విశాఖలాంటి నగరం దేశంలో మరెక్కడా లేదని, 

11:09 - October 6, 2016

'శంకర్' దర్శకత్వంలో ఓ చిత్రం వస్తుందంటే ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. అత్యంత భారీ బడ్జెట్ తో 'శంకర్' సినిమాలు నిర్మిస్తుంటాడు. గతంలో ఆయన నిర్మించిన చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'రజనీకాంత్' 'ఐశ్వర్య రాయ్' కాంబినేషన్ లో 'రోబో' వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అనంతరం దీనికి సీక్వెల్ గా 'రోబో 2' సినిమాను 'శంకర్' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 350 కోట్లతో సినిమాను రూపొందిస్తున్నట్లు టాక్. గతేడాది డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు 150 రోజులు షూటింగ్ పూర్తి చేశారు. ఇటీవలే క్లయిమాక్స్ చిత్రీకరించారు. మొత్తంగా 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ సీన్స్ చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిత్ర కథానాయకుడు 'రజనీకాంత్' కథానాయిక 'అమీ జాక్సన్'పై ఓ రోమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో 'రజనీ' పూర్తిగా యంగ్ గా కనిపిస్తుండడం విశేషం. నవంబర్ లో 'రోబో 2' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా వచ్చే ఏడాది అక్టోబర్ 19న విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందా ? లేదా? అనేది చూడాలి. 

జయ ఆరోగ్యంపై దాఖలైన పిటిషన్ కొట్టివేత..

చెన్నై : సీఎం జయలలిత ఆరోగ్యంపై దాఖలైన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. చికిత్స ఎన్ని రోజులు జరుగుతుందని ఎవరూ చెప్పలేరని కోర్టు పేర్కొంది. 

10:34 - October 6, 2016

హైదరాబాద్ : మద్యం మత్తులో బడాబాబుల కొడుకులు వీరంగం సృష్టించారు. సికింద్రాబాద్‌లో రోడ్డుపై ఒకరిని ఒకరు విచక్షణారహితంగా కొట్టుకున్నారు. వీరంతా ఎయిర్‌ఫిల్ ఇంటర్నేషనల్‌ కాలేజీ విద్యార్థులు. స్థానికులు విద్యార్థులందరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

 

10:29 - October 6, 2016

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు ఎయిమ్స్‌ వైద్యులు జయలలితకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. చెస్ట్‌, హార్ట్‌ డాక్టర్లతోపాటు మత్తు వైద్యుడు జయకు చికిత్స అందిస్తున్నారు. గతంలోపోలిస్తే జయ ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోందని డాక్టర్లు చెబుతున్నారు. జయలలిత అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుంటే మరో రెండు వారాల్లో ఆమెను డిశ్చార్జ్‌ చేసే అవకాశముందని తెలుస్తోంది.

 

10:16 - October 6, 2016
10:15 - October 6, 2016
10:14 - October 6, 2016

తెలంగాణ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేపట్టిందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత రాకేష్, టీడీపీ విద్యాసాగర్, కాంగ్రెస్ నేత బెల్యా నాయక్ పాల్గొని, మాట్లాడారు. జిల్లాల విభజన సరైనదేనని కానీ.. శాస్త్రీయత లేదన్నారు. ప్రజాభిప్రాయాలను స్వీకరించాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆర్డీవో ఇంట్లో ఏసీబీ సోదాలు..

ప్రకాశం : ఒంగోలు ఆర్డీవో రామ్ ప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో తనిఖీలు నిర్వహించింది. ఒంగోలు, నెల్లూరులోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తోంది. 

సూర్యాపేటలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు..

నల్గొండ : సూర్యాపేటలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహరెడ్డి, జూలకంటి రంగారెడ్డి, వెంకట్, ఇతర నేతలు పాల్గొన్నారు. 

ఉత్తర కాశ్మీర్ లో సైనిక శిబిరంపై ఉగ్ర దాడి..

జమ్మూ కాశ్మీర్ : సరిహద్దులో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. లాంగ్ గేట్ ఆర్మీ క్యాంపు సమీపంలో ఉగ్రవాదులకు, ఆర్మీ జవాన్లకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. హంద్వారాలోని 30 ఆర్ఆర్ ఆర్మీ క్యాంపు లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. ముగ్గురు ఉగ్రవాదులను భారత జవాన్లు మట్టుబట్టారు.

 

విశాఖలో మావోయిస్టులు..పోలీసులకు మధ్య కాల్పులు..

విశాఖపట్టణం : జీకే వీధి (మం) కుంకుమపూడి వద్ద ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పలువురు పోలీసులకు గాయాలైనట్లు తెలుస్తోంది. 

09:58 - October 6, 2016

మత్స్యపరిశ్రమకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని తెలంగాణ మత్స్యకారుల సంఘం నేత బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలంగాణలో మత్స్య సంపద అభివృద్ధికి వున్న అవకాశాలు, క్షేత్ర స్థాయి ఇబ్బందులపై గతంలో 10టీవీ జనపథంలో అనేకసార్లు చర్చా కార్యక్రమాలు నిర్వహించాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో చేప పిల్లలు వదిలే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 3న ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని 15 రోజుల పాటు నిర్వహిస్తారు. చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగానే పంపిణీ చేస్తుండడం మరో విశేషం. ఇందుకోసం దాదాపు 35 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇల్లు అలకగానే పండుగ కానట్టు చేప పిల్లలను చెరువుల్లో వదిలిపెట్టడంతోనే మత్స్యకారుల సమస్యలు పరిష్కారం అవుతాయని భావించలేం. ఇంకా అనేక చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన తొలి అడుగు ఆహ్వానించదగ్గ పరిణామమే. ఈ నేపథ్యంలో చేప పిల్లల పంపిణీ వ్యవహారం క్షేత్ర స్థాయిలో ఎలా సాగుతోంది? ఇందులో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా? మత్స్య సంపద అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి ఇంకా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇదే అంశంపై బాలకృష్ణ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:51 - October 6, 2016

తెలంగాణలో మత్స్య సంపద పెంపకానికి అపారమైన అవకాశాలున్నాయి. 20 లక్షల మందికి ఇదే జీవనాధారం. హైదరాబాద్ లాంటి మహానగరంలో విస్తారమైన మార్కెట్ వుంది. విదేశాల్లో సైతం మన మత్స్యసంపదకు మంచి గిరాకీ వుంది. అయితే, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఎలా విఫలమయ్యామో 10టీవీ జనపథం కార్యక్రమంలో అనేక సందర్భాలలో చర్చించుకున్నాం ఈ నేపథ్యంలో ఉచితంగా చేప పిల్లల పెంపకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. 
తెలంగాణలో 46వేల చెరువులు
తెలంగాణలో 46వేల చెరువులున్నాయి. వాటిలో అత్యధిక భాగం మొన్నటి వర్షాలకు కళకళలాడుతున్నాయి.  క్రిష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. మొత్తం 64 రిజర్వాయర్ లున్నాయి. ఇన్ని జలవనరులున్నా తెలంగాణలో మత్స్యసంపద వార్షిక ఉత్పత్తి 10 వేల టన్నులు మించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటే ఇంతకు పదింతల ఉత్పత్తి సాధించే వీలుంది. దీనివల్ల ప్రజలకు చక్కటి పోషకాహారం లభించడమే కాకుండా, విదేశీ మారకద్రవ్యాన్నీ ఆర్జించే వీలుంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం వుంది. 
తెలంగాణలో ఒక టన్ను ఉత్పత్తి కూడా లేదు..
పశ్చిమబెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఒక హెక్టార్ విస్తీర్ణంలో కనీసం 5 టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతుంటే, తెలంగాణలో ఒక టన్ను కూడా లేదు. ఇందుకు ఏకైక కారణం ఇంతకాలమూ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడమే. కనీసం నిజాం నవాబులు ప్రదర్శించిన చొరవ కూడా కొరవడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టి తొలి అడుగులు వేయడం అభినందనీయం. అయితే, ఈ కృషి ఆరంభ శూరత్వం కాకూడదు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలు ఇంకా చాలా వున్నాయి. 
నిరుపయోగంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు   
ఇబ్రహీంపట్నం, రాజేందర్ నగర్, సింగూరు, డిండి లాంటి ప్రాంతాల్లోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు నిరుపయోగంగా వెక్కిరిస్తున్నాయి.  దీంతో మత్స్యకారులు చేప పిల్ల విత్తనాల కోసం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేపపిల్లలు కూడా తెలంగాణలోని ఉత్పత్తి కేంద్రాల ప్రొడక్ట్స్‌ కావు పొరుగు రాష్ట్రాల నుంచి కొనుక్కొస్తున్నవి. దీంతో భారీ మొత్తంలో కాంట్రాక్టర్లకు సమర్పించుకోవాల్సి వస్తోంది. 
మూడు అంగుళాల చేప పిల్లల విత్తనాలు పుష్టికరంగా వుండి, చక్కగా పెరుగుతాయంటూ మత్స్యకారులు చెబుతుంటారు. ప్రభుత్వ యంత్రాంగం పడకేయడంతో దళారీలు నాశిరకం చేపవిత్తనాలను అంటగడుతున్నారు.   ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే  మూతపడ్డ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను పునరుద్ధరించడమే కాకుండా, మరికొన్నింటిని స్థాపించుకోవాల్సి వుంటుంది.
మత్స్యపరిశ్రమలో దళారీల ఇష్టారాజ్యం 
మత్స్యపరిశ్రమలో దళారీల ఇష్టారాజ్యం నడుస్తోంది. గ్రామాల్లో  చేపలు పట్టేవారికి కిలోకి ఇరవై పాతిక రూపాయలు కూడా చెల్లించడం లేదు. కానీ అదే చేపలను హైదరాబాద్ ముషీరాబాద్ మార్కెట్ లో వంద నుంచి నూటా యాభై రూపాయలకు విక్రయిస్తున్నారు.  తెలంగాణ మత్స్యకారుల శ్రమంతా దళారీల భోజ్యంగా మారుతోందనడానికి ఇంతకంటే వేరే నిదర్శం ఏం కావాలి?
ఇరు రాష్ట్రాల మత్స్యసంపదకు గిరాకీ ఎక్కువ
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మత్స్యసంపద కు హైదరాబాద్ లో గిరాకీ ఎక్కువ. కోటి మంది జనాభా వున్న మహానగరమిది. కానీ, ప్రభుత్వం ఒక్క మార్కెట్ కూడా ఏర్పాటు చేయలేదు.  ఎక్కడా శీతల గిడ్డంగులు నిర్మించలేదు. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. 
చేపల వేట ప్రమాదకరమైన వృత్తి
చేపల వేట ప్రమాదకరమైన వృత్తి. రెండు మూడు కేజీల బరువున్న చేపలు, 120 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ఎగిరెగిరి పడుతుంటాయి.  ఎగిరెగిరి పడుతూ ఎదురు రొమ్ములపై చేపలు కొట్టే దెబ్బలకు మత్స్యకారులు గాయపడుతుంటారు. ఒక్కొక్కసారి చనిపోతుంటారు. చెరువుల్లో చేపల వేటకు వెళ్లినవారు రాత్రిపూట వలలు వేసి, చెరువు గట్ల వెంటనే నిద్రిస్తారు. ఇలాంటి వారిని పాములు కాటేస్తుంటాయి. తెలంగాణలో ప్రతి ఏటా ఇలాంటి ప్రమాదాల్లో 30 నుంచి 40 మంది చనిపోతున్నారు. ప్రమాదవశాత్తు మరణించినవారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలో చేసిన వాగ్ధానం ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. మత్స్యపరిశ్రమ అవసరాలు తీరాలంటే కనీసం మూడు వేల కోట్ల రూపాయలైనా కేటాయించాలన్నది మత్స్యకార్మిక సంఘాల సూచన. చేప పిల్ల విత్తన కేంద్రాల అభివృద్ధి, పరిశోధన, ఐస్ ప్లాంట్ లు, శీతలీకరణ గిడ్డంగుల నిర్మాణం, ఫిష్ ఫుడ్ కోర్టులు, అధునాతన మార్కెట్ల ఏర్పాటుకు నిధులు వెచ్చిస్తే మత్స్యపరిశ్రమకు చాలా మేలు జరుగుతుంది. 

 

09:44 - October 6, 2016

ఢిల్లీ : మన దేశానికి చెందిన అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్‌ 18 ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి దీనిని ప్రయోగించారు. ఏరియాన్‌ ఫైవ్‌ ఏవీ 231 రాకెట్‌ ద్వారా ఈరోజు తెల్లవారుజామును జీశాట్‌ 18ను ప్రయోగించారు. మంగళవారం అర్ధరాత్రే ఈ ప్రయోగాన్ని చేపట్టాల్సి ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా ఇవాళ్టికి వాయిదా పడింది. ఇస్రో రూపొందించిన ఈ  ఉపగ్రహం ద్వారా టెలీకమ్యూనికేషన్‌ సేవలు మెరుగుపడతాయి. సమాచార రంగంలో మన దేశానికి సేవలు అందిస్తున్న ఉపగ్రహాల్లో ఇది  పద్నాలుగోది. ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష  కేంద్రం నుంచి ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఇది ఇరవైయ్యోది. 3,404 కిలోల బరువున్న జీశాట్‌-18లో 40 కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌పాండర్లు  ఉన్నాయి. సాధారణ ట్రాన్స్‌పాండర్లతోపాటు సీ-బ్యాండ్‌, కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లు ఈ ఉపగ్రహం ప్రత్యేకత.

09:31 - October 6, 2016

గుంటూరు :  'దాగుడు మూత దండాకోర్... పిల్లి వచ్చే ఎలుకా భద్రం... ఎక్కడి దొంగలు అక్కడే... గప్‌చుప్' అంటూ ఓ ఆట ఉంది. ఇది చిన్నపిల్లలు ఆడుతుంటారు. సెలవులు వచ్చిందంటే చాలు..ఈ ఆటను ఆడుతుంటారు. ఈ ఆటను ఆడుతూ ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన పిడుగురాళ్ల మండలం జనాపాడ గ్రామంలో చోటు చేసుకుంది. బ్రహ్మయ్య ఆర్మీలో ఉద్యోగం చేస్తూ జనాపాడ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. సెలవుల నేపథ్యంలో చిన్నారులు 'దాగుడు మూతల' ఆటను ఆడుతున్నారు. దాక్కుందామని ఇంట్లో నివాసం ఉన్న మిలటరీ బాక్స్ లో బ్రహ్మయ్య కూతురు, అదే వీధిలో ఉంటున్న మరో పాప దాక్కున్నారు. కానీ అది లాక్ అయిపోయింది. దీనితో ఆ ఇద్దరు చిన్నారులకు ఊపిరాడక గిలగిలకొట్టుకొంటూ ప్రాణాలు వదిలారు. విషయం తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రెండు కుటుంబాల్లో విషాద చాయలు అలముకున్నాయి. 

09:27 - October 6, 2016

నల్గొండ : జిల్లాలోని చీకటిగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మరో 25మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌ నుంచి జంగారెడ్డిగూడె వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

విశాఖ జిల్లాలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

విశాఖ : జీకే వీధి మండలం కుంకుమపుడి వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పలువురు పోలీసులు గాయపడ్డారు. 

గుంటూరు జిల్లాలో విషాదం

గుంటూరు : జిల్లా పిడుగురాళ్ల మండలం జనాపాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దాగుడుమూతలు ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు మిలటరీ బాక్స్‌లో ఓపెన్‌ చేసి అందులో దాక్కున్నారు.. బాక్స్‌ లాక్‌ కావడంతో ఊపిరాడక పిల్లలు మృతి చెందారు. 

 

09:17 - October 6, 2016

శ్రీనగర్ : సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్లోని సైనిక శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. హంద్వారాలోని 30 ఆర్ ఆర్ ఆర్మీ క్యాంపు లక్ష్యంగా కాల్పులకు దిగారు. లాంగ్ గేట్ ఆర్మీ క్యాంపు సమీపంలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులకు ఆర్మీ జవాన్లకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. 

 

09:09 - October 6, 2016

బాహుబలి2 ఓవర్సీస్ ఫ్రీ బిజినేస్ లెక్కలు వింటే దిమ్మతిరగడం ఖాయం. బాహుబలి సెన్సేషన్ హట్టు కావడంతో బాహుబలి 2 బిజినేస్ ఓ రేంజ్ లో సాగుతుంది. రెండో భాగం రిలీజ్ కి చాలా టైం ఉన్నప్పటికి ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఆఫర్లతో డిస్టిబ్యూటర్స్ జక్కన్న ఆఫీసు వద్ద పడిగాపులు కాస్తున్నారట. బాహుబలి2 ఓవర్సీస్ ఫ్రీ బిజినేస్ లెక్కలేంటో చూద్దాం...
మరో సెన్సేషన్ కి రాజమౌళి రెడీ 
బాహుబలి 2 సినిమాతో దర్శకుడు రాజమౌళి మరో సెన్సేషన్ కి రెడీ అవుతున్నాడు. బాహుబలి తొలి భాగం బిజినెస్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు సెకెండ్ పార్ట్ బాహుబలి2 అంతకు మించిన సంచనాలను సృష్టించేలా కనిపిస్తోంది.  మొదటి పార్ట్ ఊహాలకు కందని స్థాయిలో సక్సెస్ కావడంతో,ఈ ద్వితీయ భాగానికి విపరీతమైన హైప్ క్రియేట్ అవుతోంది. దీంతో డిస్టిబ్యూషన్ పరంగా ప్రతి ఏరియా నుంచి బాహుబలి2 ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయి.
ఓవర్సీస్ లో భారీ స్థాయిలో బిజినెస్ 
బాహుబలి 2 కి ఓవర్సీస్ లో భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ వెర్షన్లకు ఓవర్సీస్ హక్కులను గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ నాలుగు లాగ్వేంజెస్ ఓవర్సీస్ డిస్టిబ్యూషన్ హక్కులను ఈ సంస్థ ఏకంగా 50 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం. ఇందుకు సంబంధించిన డీల్ ఓకే అయినట్టు తెలుస్తుంది. 
బాహుబలి 2 రిలీజ్ కి ఇంకా 8నెలల సమయం
బాహుబలి 2 రిలీజ్ కి ఇంకా 8నెలల సమయం ఉంది. ఇప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకి ఆకాశం తాకుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఫ్రీ బిజినేస్ పరంగా కూడా ఈ చిత్రం అంచనాలకు అందని స్థాయిలో జరుగుతుంది. చూస్తుంటే బాహుబలి 2  ఫ్రీ బిజినేస్ లోనే 500కోట్లు పొగుచేసేలా కనిపిస్తోంది. మరి ఈ చిత్రానికి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన ఈజీగా 1000కోట్లను వసూల్ చేస్తుందనడంలో సందేహం లేదు.

 

జీశాట్ 18 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

హైదరాబాద్ : అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో ముందడుగు వేసింది. జీశాట్ 18 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. తెల్లవారుజామున 2 గంటలకు జీశాట్ 18 ఉపగ్రహ ప్రయోగం చేశారు. ప్రతికూల వాతావరణంలో 24 గంటలు ఆలస్యంగా ప్రయోగం చేశారు. దేశీయ టెలికమ్యూనికేషన్ వ్యవవ్థ మరింత బలపడనుంది. 

దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు

విజయవాడ : దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు లలితత్రిపుర సుందరిదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనుంది. 

 

08:40 - October 6, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఆరోగ్యశ్రీ వైద్య  సేవలు అటకెక్కాయి. చేసిన చికిత్సలకు బకాయిలు చెల్లించని సర్కారు వైఖరిని  నిరసిస్తూ ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంతో రోగులు నానాఅవస్థలు పడుతున్నారు. ఈ విషయంలో కూడా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రైవేటు ఆస్పత్రులకు మధ్య విబేధాలు తలెత్తాయి. కొన్ని దవాఖానల్లో మినహా, మిగిలిన చోట ఆరోగ్య శ్రీ వైద్య  సేవలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇది అసత్య ప్రచారమని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు... సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
రోగులు తీవ్ర అవస్థలు 
ప్రవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోగ్య శ్రీ వైద్య సేవలను నిలిపివేయడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ వైద్య సేవలను నిలిపివేడయం ఇది మూడోసారి. అందించిన వైద్య సేవలకు ప్రభుత్వం  బకాయిలు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. 
ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాల మధ్య మాటల యుద్ధం 
ఆరోగ్య శ్రీ వైద్య సేవల నిలిపివేత విషయంలో అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రైవేటు యాజమాన్యంలోని కొన్ని ఆస్పత్రుల్లో మినహా, మిగిలిన చోట్ల ఈ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నది ప్రభుత్వంతోపాటు, ఆరోగ్య శ్రీ ట్రస్టు వాదన. అయితే  తెలంగాణలో ప్రైవేటు రంగంలో ఉన్న 190 ఆస్పత్రుల్లో  ముప్పై కార్పొరేట్‌ హాస్పటల్స్‌లో మినహా మిగిలిన అన్ని చోట్ల ఆరోగ్య శ్రీ వైద్య సేవలు కొనసాగడంలేదని ప్రవేటు ఆస్పత్రుల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. 
ప్రాథమిక చికిత్స తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులకు... 
ఆరోగ్య శ్రీ పథకం కింద అత్యవసర వైద్యం కోసం  వచ్చిన రోగులకు కాదనకుండా ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులకు పంపుతున్నట్టు ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలు చెబుతున్నాయి. పాత బకాయిలు చెల్లించకుండానే  వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం, ఆరోగ్య శ్రీ ట్రస్టు తమపై ఒత్తిడి చేయడాన్ని వీరు తప్పుపడుతున్నారు. 
ప్రభుత్వం అసత్య ప్రచారం : ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం 
బకాయిలు చెల్లింపు విషయంలో ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్న వాదాన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు వినిపిస్తున్నాయి. బకాయిలు పూర్తిగా చెల్లిస్తే ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించడానికి అభ్యంతరంలేదని వీరు చెబుతున్నారు. లేకపోతే ఆస్పత్రులను మూసివేసే పరిస్థితి వస్తుందని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి  బకాయిలు  పూర్తిగా చెల్లించకపోతే ఆరోగ్య శ్రీ సేవలను ఉపసహరించుకోవడం మినహా... మరో ప్రత్యామ్నాయంలేదన్న వాదాన్ని ప్రైవేటు ఆస్పత్రులు యాజమాన్యాలు వినిపిస్తున్నాయి. 

 

08:32 - October 6, 2016

హైదరాబాద్ : పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమన్నారు గవర్నర్‌ నరసింహన్‌. ఎన్నికల నిర్వహణలో అవకతవకలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని.. అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా చూడాలన్నారు నరసింహన్‌. 
పార్లమెంట్‌, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలన్న నరసింహన్ 
పార్లమెంట్‌, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని జరిగిన 24వ అఖిల భారత ఎన్నికల కమిషనర్ల సదస్సులో పాల్గొన్న గవర్నర్‌ ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. మరింత పారదర్శకత ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలు స్వేచ్చగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశముందన్నారు. ఇది తన అభిప్రాయం కాదని సమాజం కోరుకుంటుందన్నారు. 
ఉప ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకం
ఉప ఎన్నికల నిర్వహణ మూలంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు నరసింహన్‌. తనకు ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయన్నారు. జనవరి, జులైలో మాత్రమే ఎన్నికలు జరగాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతతో పాటు మంచి చరిత్ర, అవగాహన కలిగివుండాలన్నారు. నేర చరిత్ర ఉన్నవారిని ఎన్నికల్లోకి రాకుండా చూడాల్సిన అవసరముందన్నారు. అభ్యర్థులు, పార్టీలు ఎన్నికలకు మూడు వారాల ముందే నియోజకవర్గాలకు దూరంగా  ఉండాలని, కేవలం మీడియా ద్వారానే ప్రచారం చేసుకునే విషయాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని గవర్నర్‌ సూచించారు. ఎన్నికల నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. సామాన్య ప్రజలు సైతం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా చైతన్యపరచాలన్నారు. స్థానికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను రీకాల్‌ చేసే అంశాలను పరిశీలించాలని నరసింహన్‌ ఎన్నికల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి భారత ఎన్నికల సంఘం కమిషనర్‌ అచల్‌కుమార్‌ జోతి, ఢిల్లీ, ఛండీగడ్‌ ఎన్నికల సంఘం అధికారులతో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పాల్గొన్నారు. 

 

08:24 - October 6, 2016

హైదరాబాద్ : నకిలీ విత్తన తయారీదారులు భరతం పట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి విత్తనాలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యింది. నకిలీ విత్తనతయారీదారులపై పీడీ యాక్టు ప్రయోగించి అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 
రైతుల నడ్డి విరుస్తున్న నకిలీ విత్తనాలు 
తెలంగాణలో నకిలీ విత్తనాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి. సాగుసీజన్‌లో కొన్ని కంపెనీలు, విత్తనతయారీదారులు నకిలీ, నాసిరకం విత్తనాలు అంటకడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కంపెనీల ప్రచారాన్ని  విత్తనాలను నాటిన రైతులు... అవి మొలకెత్తపోవడంతో నిలువునా నష్టపోతున్నారు. మొలకెత్తి, పంట ఏపుగా పెరిగినా పూత, పిందె రాకపోవడంతో  అన్నాదాతలు దిగాలుపడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై వీరి ఆటలు సాగకుండా ఉక్కుపాదం మోపాలని  నకిలీ విత్తనాల బెడదపై  నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌... అధికారులను ఆదేశించారు. 
పంట దిగుబడి రాకపోవడంతో రోడెక్కిన రైతులు 
వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నకిలీ మినప, పత్తి విత్తనాలతో  పైర్లు సాగు చేసిన రైతులు,  పంటదిగుబడిరాకపోవడంతో నష్టపోయిన రైతులు రోడ్లెక్కి ఆందోళన చేసిన అంశంపై కేసీఆర్‌ సమీక్షించారు.  దీనిపై వెంటనే ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి  నివేదికలు తెప్పించాలని  ఆదేశించారు. రాష్ట్రం నుంచి పేకాట, గుడుంబా, గుట్కాను తరిమికొట్టడంలో విజయం సాధించిన విషయాన్ని  ముఖ్యమంత్రి ప్రస్తావించారు. నకిలీ విత్తాలను  బెడద నివారణపై కూడా ఇదే విధంగా వ్యవహరించాలని ఆదేశించారు. తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని  కోరారు. రాష్ట్రం నుంచి పారిపోయే విధంగా చర్యలు ఉండాలని  సూచించారు.  నకిలీ విత్తనాలు తయారు చేయాలంటేనే గజగజ వణికిపోయే పరిస్థితి తీసుకురావాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులుపై విచారణ జరిపించి, తప్పు చేసిన వారిని ఉద్యోగాల నుంచి సస్పెండ్‌ చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. 
ఆస్తుల స్వాధీనంలో రాజీలేదు 
నకిలీ విత్తన తయారీదారులు ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు చట్టపరంగా ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయంలో రాజీలేకుండా వ్యవహరించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలపై అన్ని జిల్లాల్లో నిఘా పెట్టాలని కోరారు. వీటి తయారీదారులను సంఘవ్యతిరేక శక్తులుగా పరిగణించి, వీరి కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలపై జిల్లా కలెక్టర్లు,ఎస్పీలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు.

 

08:10 - October 6, 2016

హైదరాబాద్ : 24.. 27.. 30.. 31.. 33 ఇలా ఎన్నో జిల్లాలు ఏర్పడుతాయని ఊహాగానాలు వినిపించినా చివరకు 31 ఖాయమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌. అంతకుమించి కొత్త జిల్లాల ప్రతిపాదనలు పరిశీలించరాదని సీఎస్‌ను ఆదేశించారు. దీంతో తెలంగాణలో 31 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. హైపవర్‌ కమిటీ నివేదికపై చర్చించి.. రేపటి కేబినెట్‌ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కొత్త జిల్లాల ప్రతిపాదనలకు సర్కార్‌ నో 
ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతో పాటు హైపవర్ కమిటీ పరిశీలనలో వున్న నాలుగు జిల్లాలు మినహా మరే కొత్త  జిల్లా ప్రతిపాదనను పరిశీలించరాదని ప్రభుత్వం నిర్ణయించింది.  జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేశవరావు నేతృత్వంలోని హైపవర్ కమిటీ వివిధ వర్గాల నుండి సమాచారం సేకరించింది. దాని వివరాలను బుధవారం రాత్రి కేసీఆర్‌కు కేశవరావు వివరించారు.  తుది నివేదికను ఈరోజు సీఎంకు అందజేయనున్నారు.  ముసాయిదాలో ప్రకటించిన 27 జిల్లాలు, హైపవర్ కమిటీ పరిశీలిస్తున్న నాలుగు జిల్లాలు... మొత్తం 31 జిల్లాలకు  లోబడే తుది జిల్లాల ప్రకటన ఉంటుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.
దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని సీఎంకు విన్నవించిన నాయిని
నల్లగొండ జిల్లా దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి సీఎంకు విన్నవించారు.  దీనిపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతిపాదిత 31 జిల్లాలు మినహా మరే కొత్త జిల్లా డిమాండును ప్రభుత్వం పరిశీలించబోదని స్పష్టం చేశారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగానే ప్రభుత్వం అన్ని కోణాల నుండి పరిశీలించి 31 జిల్లాల ప్రతిపాదనలను పరిశీలిస్తుందన్నారు కేసీఆర్‌. అంతకు మించి ప్రభుత్వం వద్ద డిమాండ్లు పెట్టడం సరికాదన్నారు.  అధికారులు కూడా 31 ప్రతిపాదిత జిల్లాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలే తప్ప కొత్త జిల్లాల డిమాండ్లను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవద్దని కేసీఆర్‌.. సీఎస్‌ రాజీవ్‌శర్మను ఆదేశించారు.  తెలంగాణలో 31 జిల్లాలకు మించి మరే కొత్త జిల్లా ఏర్పడే అవకాశం లేదని కేసిఆర్ స్పష్టం  చేశారు.  31 జిల్లాల ఏర్పాటు కూడ పైపవర్ కమిటీ నివేదిక ఆధారంగానే జరుగుతుందన్నారు.  కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలే తప్పకొత్త డిమాండ్లను పట్టించుకోవద్దన్నారు కేసీఆర్‌. 
త్వరలో తుది నోటిఫికేషన్‌ 
ఇక కొత్త జిల్లాలకు ఆమోదముద్ర వేసేందుకు రేపు కేబినెట్‌ సమావేశం జరగనుంది. హైపవర్‌ కమిటీ అందించే నివేదికపై చర్చించి జిల్లాలను ఫైనల్‌ చేయనున్నారు.  అంతేకాకుండా రాష్ట్రంలో మొత్తం ఎన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఉండాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో స్పష్టత రానుంది. అనంతరం జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 
జిల్లాల కార్యాలయాల ప్రారంభంపై నిర్ణయం
ఇప్పటికే 31 జిల్లాలు ఫైనల్‌ కావడంతో ఎవరెవరు జిల్లాల కార్యాలయాలను ప్రారంభించాలో నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ మెదక్‌, సిద్దిపేట జిల్లాలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి హరీష్‌రావు పాల్గొంటారు. ఇక వరంగల్‌ రూరల్‌ జిల్లాను మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, భూపాలపల్లి జిల్లాను అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి ప్రారంభిస్తారు. డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ జగిత్యాల, మరో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జనగామ జిల్లాలను ప్రారంభిస్తారు. అదేవిధంగా నాయిని యాదాద్రి, ఈటెల పెద్దపల్లి, పోచారం కామారెడ్డి, పద్మారావు మంచిర్యాల, మహేందర్‌రెడ్డి శంషాబాద్‌, కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాలను ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఆసిఫాబాద్‌ను జోగు రామన్న, సూర్యాపేటను జగదీష్‌రెడ్డి, కొత్తగూడెంను తుమ్మల, నిర్మల్‌ను ఇంద్రకరణ్‌రెడ్డి, వనపర్తిని తలసాని, నాగర్‌కర్నూల్‌ను లక్ష్మారెడ్డి, గద్వాలను జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. మల్కాజ్‌గిరి జిల్లా సీఎస్‌ రాజీవ్‌శర్మ ప్రారంభిస్తారు. మొత్తానికి జిల్లాలు ఫైనల్‌ కావడంతో ఆయా ప్రాంతాల్లో కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. ఆ ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. 

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు

జమ్మూకాశ్మీర్ : హంద్వారాలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఆర్మీ క్యాంప్ లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. 

 

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

నల్గొండ : కేతేపల్లి మండలం చీకటిగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. 

 

విశాఖ జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

విశాఖ : జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. డిజిటల్ సమ్మిట్ లో ఆయన పాల్గొననున్నారు. 

 

Don't Miss