Activities calendar

07 October 2016

22:03 - October 7, 2016

ఢిల్లీ : లోధా ప్యానెల్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయ‌డానికి నిరాక‌రిస్తున్న బీసీసీఐకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. రాష్ట్ర సంఘాల‌కు నిధులు విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని ఆదేశించింది. లోధా సిఫార‌సుల‌ను అమ‌లు చేసేవ‌ర‌కు ఇప్పటికే విడుద‌ల చేసిన నిధుల‌ను కూడా వాడుకోకూడ‌ద‌ని ప్రత్యేకంగా ఆదేశాలు జారీచేసింది. సిఫార‌సుల‌పై ఐసీసీ చీఫ్‌తో ఏం మాట్లాడారో వ్యక్తిగతంగా ఓ అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను ఆదేశించింది. అనంతరం తదుపరి విచార‌ణ‌ను ఈనెల 17కు వాయిదా వేసింది. కాగా గతంలో లోధా కమిటి చేసిన సిఫార్సులను అమలు చేయాల్సిందేనంటూ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియాకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని మండిపడింది. బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ క్రికెటరా అంటూ ప్రశ్నించింది. వీటిని అమ‌లు చేయ‌డానికి కొత్తగా ఓ పాల‌క‌వ‌ర్గాన్ని నియ‌మించే దిశ‌గా కోర్టు ఆలోచ‌న చేస్తోంది. విచార‌ణ సంద‌ర్భంగా చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌.. బోర్డు ముందు రెండు ఆప్షన్లు ఉంచారు. ఈ సంస్కర‌ణ‌ల‌ను అమ‌లు చేయ‌డానికి ప్రత్యేకంగా కొంత‌మంది అధికారుల‌నైనా నియ‌మించండి.. లేదంటే లోధా ప్యానెల్ నుంచి ఇంకొంత గ‌డువునైనా తెచ్చుకోండి అని సూచించారు. లోధా సిఫారసులను బేషరతుగా అమలు చేస్తామని హామీ ఇవ్వాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనిపై రేపటి వరకు గడువు విధించింది. క్రికెట్‌ సంఘాలకు డబ్బు కేటాయించే విషయంలో బోర్డు పారదర్శకత పాటించాలని, రాత్రికి రాత్రే 4 వందల కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది. 

 

 

21:58 - October 7, 2016

కొలంబియా : నోబెల్ శాంతి బ‌హుమ‌తి కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యూల్ శాంటోస్‌ను వ‌రించింది. కొలంబియా రెబ‌ల్స్ తో ఆయ‌న కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి గాను ఈ అవార్డుకు నోబెల్ క‌మిటీ ఎంపిక చేసింది. 52 ఏళ్ల యుద్ధానికి తెర‌దించుతూ శాంటోస్ ఈ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే ఆ త‌ర్వాత నిర్వహించిన రెఫ‌రెండ‌మ్‌లో ఆ దేశ ప్రజలు.... శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించారు. అయినా శాంతి కోసం తాను ప్రయత్నిస్తూనే ఉంటాన‌ని శాంటోస్ ప్రకటించారు. దేశాల మ‌ధ్య శ‌త్రుత్వాన్ని రూపుమాపి... శాంతి కోసం త‌మ శాయ‌శ‌క్తులా ప్రయత్నించే వ్యక్తులు, సంస్థలకు నోబెల్ శాంతి బ‌హుమ‌తి ప్రకటిస్తున్నారు. 

21:53 - October 7, 2016

గుంటూరు : మహిళా సంఘాల రుణాలను ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ మేరకు మూడు వేల కోట్లు విడుదల చేస్తామని దీంతో మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరినట్లేనని మంత్రి అన్నారు. అలాగే రైతులకు ఈ ఏడాది ఏడు కోట్లతో పాటు వారికి ఇచ్చిన బాండ్లు.. వడ్డీలతో కలిపి 11 వేల 5 వందల కోట్లు మాఫీ చేశామని మంత్రి చెప్పారు.

21:51 - October 7, 2016

హైదరాబాద్ : జిల్లాల పెంపుతో ఆర్థిక భారాన్ని మోపేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్‌ నాయకులు పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకుండా దాన్ని కప్పిపుచ్చుకునేందుకే జిల్లాల పెంపును తెరపైకి తెస్తోందని ఆయన అన్నారు. ప్రజలను మభ్యపెట్టి అరచేతిలో స్వర్గం చూపిస్తోందని మండిపడ్డారు. 

21:48 - October 7, 2016

ఢిల్లీ : ఏరో స్పేస్, రక్షణ రంగాల పెట్టుబడులకు తెలంగాణలో ఎన్నో అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్.. పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

ఢిల్లీలో రెండో రోజు పలువురు పారిశ్రామిక వేత్తలతో కేటీఆర్ భేటీ
ఢిల్లీలో జరుతున్న వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరమ్‌ సమావేశంలో రెండోరోజు మంత్రి కేటీఆర్ పలువురు కీలకనేతలతో భేటీ అయ్యారు. భారత్‌ ఫోర్జ్ కంపెనీ ఎండీ బాబా కల్యాణితో సమావేశమయ్యారు. తెలంగాణలో ఎయిరోస్పేస్, డిఫెన్‌ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. దీంతోపాటు రాష్ట్రంలో ఎయిరోటెక్నాలజీ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను మంత్రి వివరించారు. త్వరలోనే హైదరాబాద్‌ వచ్చి సీఎం కేసీఆర్‌తో సమావేశమవుతానని బాబా కల్యాణి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు.

హెచ్‌పీ ఇండియా ఎండీ నీలమ్‌ ధావన్‌ తోనూ కేటీఆర్ సమావేశం
హెచ్‌పీ ఇండియా ఎండీ నీలమ్‌ ధావన్‌ తోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో కంపెనీ కార్యకలాపాల విస్తరణ, స్మార్ట్‌ సిటీ సొల్యూషన్ల మీద మంత్రి ఆమెతో చర్చించారు. అశోక్‌ లేలాండ్‌ సీఈవో వినోద్‌ కె దాసరితో మంత్రి సమావేశమై ఆటోమొబైల్‌ రంగం గురించి చర్చించారు. ఆటోమొబైల్‌ పరిశ్రమకు అనుకూల వాతావరణం ఉన్న తెలంగాణలో అశోక్ లేలాండ్ తయారి ప్లాంట్‌ ఏర్పాటును పరిశీలించాలన్నారు.

సీఐఐ టాప్‌ లీడర్‌షిప్‌తో సమావేశమైన కేటీఆర్
దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకానమిక్ ఫోరంలో తెలంగాణకు భాగస్వామ్యం కల్పించనున్నట్లు...ఢిల్లీలలో ఎకానమిక్ ఫోరమ్‌ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న ఫిలిప్‌రాస్లోర్‌తో హామీ ఇచ్చారు. అంతకు ముందు సీఐఐ టాప్‌ లీడర్‌షిప్‌తో సమావేశమైన మంత్రి... ఇతర దేశాల్లోని ఆదర్శవంతమైన విధానాలను తమకు తెలియజేస్తే వాటిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 

21:42 - October 7, 2016

ఢిల్లీ : టెక్నాలజీ సాయంతో... గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సమన్వయం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాల్సిన అవసముందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ప్రతినిధుల సూచనలను దృష్టిలో పెట్టుకొని.... ప్రతి సిటీని స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. 

21:39 - October 7, 2016

తమిళనాడు : జయలలిత అనారోగ్యం నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జయలలిత సన్నిహితుడు, సీనియర్‌ మంత్రి పన్నీర్‌సెల్వం, చీఫ్‌ సెక్రెటరి గవర్నర్‌ భేటి అయ్యారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్‌ సెల్వంను నియమించాలని రాజ్‌భవన్‌ యోచిస్తోంది. మరోవైపు జయలలిత సుదీర్ఘ అనారోగ్యం నేపథ్యంలో తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి కేంద్రానికి లేఖ రాశారు.

అమ్మ కోలుకోవాలి : రాహుల్ గాంధీ
చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అపోలో ఆసుపత్రిని సందర్శించారు. అయితే జయలలితను చూసేందుకు ఆసుపత్రి వర్గాలు రాహుల్‌ను అనుమతించలేదు. వైద్యులను అడిగి జయలలిత ఆరోగ్యం వివరాలను తెలుసుకున్నారు. దాదాపు అరగంట పాటు రాహుల్‌ అపోలో ఆసుపత్రిలో గడిపారు. జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రాష్ట్రపతిపాలన విధించాలి: సుబ్రమణ్యస్వామి
తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం వల్ల రాష్ట్రంలో పాలన స్తంభించిందని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు రాసిన లేఖలో స్వామి పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తుండడంతో ఈ డిమాండ్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఐసిస్‌, ఎల్‌టిటిఈ తదితర తీవ్రవాద సంస్థలు తమ ఉనికిని చాటుకునే ప్రమాదముందని హెచ్చరించారు.

గవర్నర్ తో సీఎం రామ్మోహన్ భేటీ
మరోవైపు గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు సమావేశమయ్యారు. పాలనాపరమైన విషయాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం.

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సీఎం జయలలిత
జ్వరం, డీహైడ్రేషన్‌తో ముఖ్యమంత్రి జయలలిత సెప్టెంబర్‌ 22న అపోలో ఆసుపత్రిలో చేరారు. లండన్‌ వైద్య నిపుణుడు రిచర్డ్‌ బేలె నేతృత్వంలో జయకు చికిత్స కొనసాగిస్తున్నారు. వూపిరిత్తులు, మధుమేహం, ఆస్తమా, ఇన్‌ఫెక్షన్లకు సంబంధించి జయలలితకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ఆమె శరీరం సహకరిస్తోందని వైద్యులు పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు ఆమెను ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాల్సి అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.

21:31 - October 7, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ కేబినెట్‌ భేటీలో వాడివేడిగా చర్చజరిగింది. కొత్త జిల్లాల్లోకి వెళ్లడానికి అనాసక్తిగా ఉన్న గ్రామాలు, మండలాల జాబితాను తయారు చేసి, సొల్యూషన్‌ను ఒకటి రెండు రోజుల్లో కనుగొనాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. న్యూ డిస్ట్రిక్ట్స్‌ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించక పోయినా.. ఈ దసరా నుంచే 31 జిల్లాలు తెలంగాణలో రూపుదిద్దుకోనున్నాయి.
ప్రధాన చర్చ జిల్లాలపైనే : కడియం
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జిల్లాల ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చజరిగింది. 27 జిల్లాలకు నోటిఫికేషన్‌ ఇచ్చిన ప్రభుత్వం.. సిరిసిల్ల, జనగాం, గద్వాల, ఆసిఫాబాద్‌ జిల్లాల డిమాండ్లు రావడంతో.. ఈ సంఖ్య 31కు పెరిగింది. అయితే.. కేబినెట్‌ భేటీలో జిల్లాల సంఖ్యపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలపై తుది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఐఏఎస్, ఐపీఎస్ ల సంఖ్యపై స్పష్టత వస్తుందని సమావేశం అనంతరం డిఫ్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు.
వెనకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్య: కడియం
వెనకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు కడియం తెలిపారు. కేజీ టు పీజీలో భాగంగా 2016-17లో షెడ్యూల్ కులాల విద్యార్థుల కోసం 103 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మైనార్టీల కోసం 71 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించినమన్నారు. 50ఎస్టీ గురుకులాలను ప్రారంభించామని కడియం తెలిపారు.
బీసీ కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
దీంతో పాటు బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే నిజామాబాద్‌, కరీంనగర్‌, సిద్దిపేట, రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 23 కొత్త పోలీస్‌ సబ్‌డివిజన్లు, 28 కొత్త సర్కిళ్లు, 92 కొత్త పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు, యాదగిరిగుట్ట, పెద్దశంకరంపేటలో ఫైర్‌ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయించారు. అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకు టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు కడియం తెలిపారు. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు మోటార్ వెహికిల్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చామని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి కేన్సర్ ఆస్పత్రిని నెలకొల్పేందుకు హెటిరో సంస్థ ముందుకు వచ్చినందున.. దానికి శేరిలింగంపల్లిలో 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.  

పాక్ నటులతో నటించనంటున్న బాలీవుడ్ నటుడు..

ఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌ నటులతో కలిసి తాను పనిచేయలేనని బాలీవుడ్‌నటుడు అజయ్‌దేవగణ్‌ స్పష్టం చేశారు. ఓ జాతీయ ఛానల్‌ నిర్వహించిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ పాక్‌నటులతో కలిసి పనిచేయకపోవడానికి గల కారణాలను వివరించారు.

21:14 - October 7, 2016

వరంగల్ : జేఏసీ కన్వీనర్ కోదండరాంకు ప్రమాదం తప్పింది. తొర్రూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద జేఏసీ కన్వీనర్ ప్రొ.కోదండరాంకు పెను ప్రమాదం తప్పింది. కోదండరామ్ ప్రయాణిస్తున్న వాహనం టైరు పోలిపోవటంతో  అదుపు తప్పిన వాహనం డివైడర్ ను ఢీకొంది. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలకు హాజరైన వరంగల్ కు వస్తుండగా ఈప్రమాదం చోటు చేసుకుంది. 

కోదండరాంకు తప్పిన ప్రమాదం..

వరంగల్ : తొర్రూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద జేఏసీ కన్వీనర్ ప్రొ.కోదండరాంకు పెను ప్రమాదం తప్పింది. కోదండరామ్ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలకు హాజరైన వరంగల్ కు వస్తుండగా ఈప్రమాదం జరిగింది. 

శ్రీవారి భక్తులపై లాఠీచార్జ్!!

తిరుమల: శుక్రవారం రాత్రి జరగనున్న శ్రీవారి గరుడ సేవకు భక్తులు భారీగా హాజరవుతున్నారు. ఇప్పటికే చేరుకున్న భక్తులతో మాఢవీధులు కిక్కిరిసిపోయాయి. మేదరమిట్ట వద్ద భక్తుల రద్దీ పెరగడంతో... పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. అటు తోపులాట, లాఠీఛార్జ్ తో పలువురు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు వీరిని తరలించేందుకు అంబులెన్స్ వచ్చే వీలులేకపోవడంతో.. స్ట్రచర్లపై ఆసుపత్రికి తరలించారు. 

ట్రిపుల్ తలాఖ్ పై స్పష్టం చేసిన కేంద్రం..

ఢిల్లీ: భార‌త్‌లాంటి లౌకిక దేశంలో ట్రిపుల్ త‌లాఖ్‌కు తావులేద‌ని ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుతోనే ముస్లిం మ‌త పెద్ద‌లు పెళ్లి, విడాకులు, వార‌స‌త్వం వంటి అంశాల్లో త‌మ సొంత సివిల్ కోడ్‌ను పాటిస్తున్నారు.

తమిళ పరిణామాలపై కేంద్రం ఆరా..

ఢిల్లీ : అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్థితిపై రకరకాల వదంతులు వస్తున్న తరుణంలో రాష్ట్ర పరిస్థితులపై కేంద్రం ఫోకస్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ విద్యాసాగర్ రావు ఆసుపత్రిలో జయలలిత ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్న అనంతరం కేంద్రానికి నివేదికను అందజేశారు. తమిళనాడు మంత్రులు పన్నీర్ సెల్వమ్, ఎడప్పడి కె.పళని స్వామితో సమావేశమయ్యారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కూడా విద్యాసాగర్ రావును కలుసుకున్నారు. తమిళనాడు పరిణామాలను గవర్నర్ ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నారు.

కొత్త జిల్లాల పేర్లపై సరికొత్త డిమాండ్..

హైదరాబాద్: కొత్త జిల్లాలకు పేర్లు పెట్టడానికి తీవ్రకసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సరికొత్త డిమాండ్ వినిపించింది. తెలంగాణలో కొత్త జిల్లాల పేర్లలో క్రైస్తవ పేర్లకు ప్రాధాన్యత కల్పించాలని జెరూసలెం మత్తయ్య డిమాండ్ చేశారు. మత్తయ్య డిమాండ్‌పై కేసీఆర్ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.

రేపు ఎల్బీ స్టేడియంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు..

హైదరాబాద్: రేపు ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగనున్నాయి. బతుకమ్మ సంబురాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కలెక్టర్ నిర్మల, పర్యాటకశాఖ ఎండీ సుమిత్ సింగ్ ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.

20:34 - October 7, 2016

పత్తాలాటకాల్లను పట్టుకున్న పోలీసోల్లు ..సర్కాకాపీసు ముంగట ఒంటేలు పోసిన పెద్దమడిసి...తెలంగాణల వదలని జిల్లాల లొల్లి..ప్రజాప్రతినిథులకు ర్యాంకులిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు..తమిళనాడుల అమ్మకు ఏమైంది? అమ్మ పానానికి ఏమైందని ప్రజలు ఆగమాగం అయిపోతన్నరు. పూజారులంతా పూజలు సేత్తన్నారు...అమ్మ అభిమానులంతా సూలాలు గుచ్చుకుంటన్నరు. ..మరోపక్కన కాంగ్రెస్ మొద్దబ్బాయ్ రాహుల్ గాంధీ కూడా అమ్మను సూడనీకి దవాఖాను వచ్చిండు పరామర్శించనీకి..దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రులకు దరిద్రం పట్టుకుందని జాతాలు చెప్తుండు అయ్యవారు..పంచాయితీలకు మూలపురుషుడు సుబ్రమణ్యస్వామి కూడా తమిళనాడుల రాష్ట్రపతిపాలన పెట్టాలని జాబు రాసిండు..సింగరేణి ఉద్యోగులకు కేసీఆర్ సారు వరాలిచ్చిండంట..సింగరేణిల కార్మికుల ఎన్నికలున్నయ్ గందుకనే కేసీఆర్ మాయకు కారణంగదేనంటుల్ల..ఎలచ్చల్ల వస్తేనే కేసీఆర్ కు జనాలు యాదికొస్తయంట..నల్లగొండ జిల్లాల మూటకొండూర్ల డిజిజన్ చేయాలని లొల్లి షురూ గయ్యింది. గిసువంటి మస్తు ముచ్చట్లు సూడాలంటే గీ వీడియోను గ్లిక్ చేయుండ్రి..మస్తు ఖుషీ అవుండ్రి..

20:05 - October 7, 2016

అనేక కారణాలతో వివాదాస్పదమవుతున్న హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్ ..ప్రారంభం కూడా అంతే వివాదస్పదమవుతోంది. ప్రాజెక్ట్‌ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇటు ప్రభుత్వంగానీ, అటు ఎల్‌అండ్‌టీ గానీ స్పష్టం చెయ్యడం లేదు. ఈ ఏడాది మొదట్లో అని ఒకసారి...జూన్‌లో అని మరోసారి...దసరాకి ప్రారంభమవుతుందని మరోసారి వాయిదా వేస్తూ వస్తున్నారు. మెట్రో అసలెప్పుడు పట్టాలెక్కుతుందోననే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇటు ప్రభుత్వంలోనూ, అటు ఎల్‌అండ్‌టీ లోనూ లేని స్పష్టత
నిర్మాణ విషయంలో వివాదస్పదమైన ఈ ప్రాజెక్టు..ఇప్పుడు ప్రారంభం విషయంలోనూ అంతే చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రభుత్వం.... అటు ఎల్‌అండ్‌టీ సంస్థలు చెబుతూనే ఉన్నయి. కానీ మెట్రో మాత్రం కదలడం లేదు. మెట్రో పనుల నిర్మాణం వల్ల అటు ప్రయాణికులు, ఇటు సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మైటాస్ కంపెనీ నిర్మాణం చేపడుతుందని మొదట ఊహాగానాలు
ప్రైవేట్‌ పబ్లిక్‌ భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం మొదటి నుంచి వివాదాస్పదమే. ముందు మైటాస్ కంపెనీ నిర్మాణం చేపడుతుందని ఊహాగానాలు వినిపించాయి. తరువాత ఎల్‌అండ్‌ టీ సంస్థ నిర్మాణ పనులను చేపట్టింది. గ్రేటర్‌ పరిధిలో మూడు కారిడార్లలో నిర్మితమవుతున్న...72 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్ట్‌ను ఆరుదశల్లో పూర్తి చెయ్యాల్సి ఉంది. కాని వివిధ కారణాలతో వాయిదా పడుతూనే వస్తోంది. ఇందుకు ఎల్‌అండ్‌టీ అధికారులతో పాటు, ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మొదటిదశలో నాగోల్‌- మెట్టుగూడ వరకు 8 కి.మీ. నిర్మాణం పూర్తి
మొదటిదశలో నాగోల్‌ నుంచి మెట్టుగూడ వరకూ 8 కిలోమీటర్లు, రెండో దశలో మియాపూర్ నుంచి ఎస్‌ఆర్‌నగర్ వరకు 12 కిలోమీటర్ల మెట్రో నిర్మాణాలు పూర్తయ్యాయి. మూడో దశలో మెట్టుగూడ నుంచి బేగంపేట్‌ వరకు 10 కిలోమీటర్లు, నాలుగోదశలో బేగంపేట నుంచి శిల్పారామం వరకు 10 కిలోమీటర్ల నిర్మాణం జరగాలి. ఐదో దశలో ఎస్‌ఆర్‌ నగర్‌ నుంచి ఎల్‌బీనగర్ వరకు 18 కిలోమీటర్ల వరకూ మెట్రో నిర్మాణం పూర్తవ్వాలి. ఇక చివరిగా ఆరో దశలో జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో 15 కిలోమీటర్లు 2017 జనవరి నాటికి పూర్తవ్వాలి. అయితే ఈ లైన్లు ఎప్పటికి పూర్తవుతాయో క్లారిటీ లేదు.

నాగోల్‌-మెట్టుగూడ, మియాపూర్-ఎస్‌ఆర్‌నగర్ మార్గాల్లో పూర్తయిన మెట్రో
సుల్తాన్‌ బజార్..అసెంబ్లీ మార్గాల్లో అలైన్‌మెంట్‌ మార్చాలని నిర్ణయించిన ప్రభుత్వం... తరువాత అదే మార్గంలో మెట్రో వెలుతుందని ప్రకటించింది. ఈపాటికి నగరంలో 48 కిలోమీటర్ల మేర మెట్రో పరుగు పెట్టాలి..కాని ఇప్పటివరకూ ఒక్క దశలో కూడా మెట్రో ప్రారంభం కాలేదు. నాగోల్‌ టు మెట్టుగూడ, మియాపూర్ టు ఎస్‌ఆర్ నగర్ వరకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. మంత్రి కేటీఆర్ వందరోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రారంభించాలని భావించినా అది కూడా విఫలమైంది. పనులు పూర్తయినా మెట్రోను ప్రారంభించకపోవడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది.

మెట్రో నిర్మాణంతో మరింత ట్రాఫిక్ సమస్య
మెట్రోరైల్ అమల్లోకి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయనే మాట ఎలాగున్నా...నిర్మాణంతో మరింత ట్రాఫిక్ సమస్య నెలకొందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వాహనదారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తయిన మెట్రో లైన్లలోనైనా రైళ్లను నడిపిస్తే, కొంత సౌకర్యంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు. త్వరగా అన్ని మార్గాలలోనూ మెట్రోను పూర్తి చెయ్యాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

20:04 - October 7, 2016

నగరంలో మెట్రో ప్రాజెక్టు మొదటి నుండి వివాదాస్పదంగానే కొనసాగుతోంది. నగరంలో దాదాపు 72 కిలోమీటర్ల మేర ఆరుదరశల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు కోసం నగర ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతీవారు చెప్పే విషయం నగరంలో నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్. మెట్రో ప్రాజెక్టుతో నైనా నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. కాగా ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఉగాదికి అని ఒకసారి, దసరాకి ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైపోతున్నాయి.దీనిపై అటు ప్రభుత్వంలోనూ, ప్రాజెక్టు చేపట్టిన ఇటు ఎల్ అండ్ టీ లోనూ స్పష్టత ఇచ్చే పరిస్థితి లేదు. ఇటు ప్రయివేటు పబ్లిక్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న అతి పెద్ద ప్రాజెక్టు ఈ మెట్రో ప్రాజెక్టు.. ఇది ఎల్ అండ్ టీ కంపెనీ నుండి మోటాస్ కంపెనీ చేతికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం తరలనుందిని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో కర్నె ప్రభాకర్ రావు(టీఆర్ఎస్ నేత),శ్రీనివాస రెడ్డి(సీపీఎం నేత) రామచంద్రయ్య(ప్రముఖ విశ్లేషకులు) మల్లురవి (కాంగ్రెస్ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వెలిబుచ్చారో తెలుసుకోవాలంటే ఈవీడియోను క్లిక్ చేయండి..

 

తమిళనాడు ఆపద్ధర్మ సీఎంగా పన్నీర్ సెల్వం?..

తమిళనాడు : తీవ్ర అనారోగ్యం కారణంగా తమిళనాడు సీఎం జయలలిత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూసుకునేందుకుగాను తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించేందుకు రాజ్ భవన్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇన్ ఛార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అక్కడి సీనియర్ మంత్రులు పన్నీర్ సెల్వం, పళని స్వామిలతో చర్చించారు. జయలలితకు నమ్మినబంటు, విశ్వాసపాత్రుడు అయిన పన్నీర్ సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

19:40 - October 7, 2016
19:36 - October 7, 2016

విశాఖపట్నం : పరవాడ ఫార్మాసిటీలో మాదక ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్న రాంకీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు డిమాండ్‌ చేశారు. మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేస్తున్నట్టు గుర్తించినా.. రాంకీ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం.. రాంకీ యాజమాన్యంతో కుమ్మక్కైనట్టు భావించాల్సి వస్తుందన్నారు.   

19:33 - October 7, 2016

విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీని కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్న ఈవో సూర్యకుమారి తెలిపారు. రాష్ట్రంలోనే ఉన్న ప్రముఖ దేవాలయాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రి దేవాలయం రెండవ స్థానం పొందింది. ఇక్కడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కనకదుర్గమ్మ అమ్మవవారి దసరా నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరంలాగే అత్యంత వైభవంగా అధికార యంత్రాంగం నిర్వహిస్తోంది.

19:24 - October 7, 2016

విజయవాడ : బందరు పోర్టును అక్కడి ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తే సరిపోతుందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూ సమీకరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచంలో ఏ పోర్టు కూడా 5 వేల ఎకరాలకు మించిలేదని, అలాంటిది మచిలీపట్నంలో పోర్టు కోసం 36 వేల ఎకరాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమల కోసం భూములు కావాల్సి వస్తే వాటికి సరిపడా ప్రభుత్వ భూములున్నాయని, రైతుల నుంచి భూములు బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బందరు ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క రైతు భూములిచ్చేందుకు సిద్ధంగా లేరంటున్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.

19:10 - October 7, 2016

హీరో అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్లో చేసిన తాజా చిత్రం ‘ప్రేమమ్’. ఇటివల విడుదలైన పాటలు, ట్రైలర్లు జనాలకు బాగా కనెక్టవడంతో ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ప్రేమమ్’ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అసలు ప్రేమమ్ కధేమిటి సినిమా ఏలా ఉందో తెలుసుకొవాలంటే రివ్యూ లోకి వెళ్ళాలిసిందే.

ప్రతి మనిషి జీవితంలో లవ్ అనేది కామన్. కాని ఓకే మనిషి జీవితంలో 3సార్లు ప్రేమ పుడితే ఏమవుతుందనేదే ప్రేమమ్.ఈ సినిమాకి ట్యాగ్ లైన్ అయిన 'లవ్ స్టోరిస్ ఎండ్ బట్ ఫీలింగ్స్ నాట్ ' అనేదే ఈ సినిమా. కధగా చెప్పినప్పుడు కొత్త పాయింట్ అనిపించకపొయినా దాన్ని డిల్ చెసిన విధానంలో, వర్క్ అవుట్ చెసిన ఫీల్ తో గొప్ప సినిమాగా మారింది మలయాళ ప్రేమమ్. అదే సినిమాని కాస్త నిడివి తగ్గించి యాజ్ టీజ్ గా నిజాయితిగా తెలుగులో రిమేక్ చేశారు.
కధ విషయానికొస్తే...విక్రమ్ అనే కుర్రాడు టినేజ్ లో సుమ తో లవ్ లో పడతాడు.కాని అనుకొని కారణాల వలన ఫేయిల్ అవుతుంది. తరువాత కాలేజ్ లైఫ్ లో లేక్చరర్ సితార తో లవ్ లో పడతాడు. అదీ కుడా నాట్ ఏ హ్యాపి ఎండింగ్.తరువాత లైఫ్ లో సెటిల్ అయ్యి హ్యాపిగా సాగిపొతుండగా ఓక అనెక్స్ పెక్టేడ్ పర్సన్ ఎదురవుతుంది. అమెతో లవ్ లో పడతాడు. ఇంతకి అమె ఎవరు? ఫైనల్ గా ఆ ప్రేమైనా సక్సెస్ అవుతుందా లేదా? వంటీ ఫీల్ గుడ్ పాయింట్ తో హత్తుకొనేలా సాగిపొయే ప్యూర్ లవ్ స్టొరీ "ప్రేమమ్".

నటి నటుల విషయానికొస్తే...నాగచైతన్య మెచ్యూరిటి లెవల్స్ బాగున్నాయి. ఓరిజనల్ ప్రేమమ్ లో ఉన్న హిరోని అనుసరించాడు. చాలా వరకు సక్సెస్ అయ్యాడు. హిరొయిన్స్ శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడొనా సెబాస్టియన్ ముగ్గురు కుడా పాత్రల్లో లాగా కాకుండా పక్కింటి అమ్మాయిలు లాగా కనిపించడంతో ప్రేక్షకులు ఈజిగా కనెక్ట్ అయిపొతారు. శృతి, నాగ చైతన్య పెయిర్ బాగుంది. కంటేంట్ లో జనరేట్ అయిన కామెడి నాచురల్ గా అనిపించింది. మిగతా నటినటులందరూ తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు. అదనపు అకర్షణలుగా నాగార్జున, వెంకటేష్ లు అతిధి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ధ్రిల్ చేశారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే...దర్శకుడు చందు మొండేటి మలయాళ ప్రేమమ్‌ని సొల్ మిస్సవ్వకుండా తెలుగులో మలచి ఘన విజయాన్ని అందుకున్నాడు.ఇక కెమెరామెన్ కార్తిక్ ఘట్టమనేని ప్రేమమ్ ఒరిజినల్ ఫిల్ ని తెలుగులో తిసుకురావడంలో కీ రోల్ పొషించాడు.గొపి సుందర్, రాజేశ్ మురూగేశన్ లు అందించిన సంగీతం సినిమాకి ప్రాణం పొసింది. ప్రొడక్షన్ వాల్యూస్ బ్యానర్ కు తగ్గట్లూ చాలా రిచ్ గా వున్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. అన్ని డిపార్ట్మెంట్లు బాగా పని చేశాయి. ప్రేమమ్ ను అందరు ప్రేమించే విధంగా వుంది. మిల్కీ బ్యూటీ తమ్మన్న 'అభినేత్రి' సునీల్ నటించిన ఈడు గోల్డ్ ఎహే' సినిమా రివ్వ్యూల కోసం ఈ వీడియోను చూడండి....

18:51 - October 7, 2016

హైదరాబాద్ : బతుకమ్మ గిన్నిస్‌ బుక్‌ రికార్డు దిశగా అడుగులువేస్తోంది.. ఎల్‌ బీ స్టేడియంలో పదివేలమంది బతుకమ్మ ఆడేలా ఏర్పాట్లు చేస్తోంది.. మిగతా ప్రాంతాల్లోకూడా మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించారు.. తెలంగాణ ప్లవర్ ఫెస్టివల్ బతుకమ్మను కలర్ పుల్ గా నిర్వహించేందుకు బల్దియా రంగంలోకి దిగింది. బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. అలాగే బతుకమ్మ ఆడే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లను పూర్తిచేసింది.. శానిటేషన్ సమస్యలు రాకుండా కార్మికులతో ప్రత్యేక టీంలను సిద్ధం చేశారు.. సాగరతీరంలో జరుగుతున్న ఏర్పాట్లను కమిషన్ జనార్థన్ రెడ్డి బల్దియా ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షించారు.దీనిపై మరిం సమాచారానికి ఈ వీడియో చూడండి...

18:33 - October 7, 2016
18:32 - October 7, 2016

హైదరాబాద్ : బతుకమ్మ అంటే ఆడపడుచుల పండుగని జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. దేవుడికి పూలతో పూజిస్తారు, కానీ పూలనే దేవుడిగా కొలిచే పండుగ బతుకమ్మ పండుగని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభించే బతుకమ్మ పండుగ గిన్నీస్ బుక్ రికార్డు సాధించేందుకు ఎల్బీ స్టేడియంలో 10వేల మంది మహిళలతో బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నామనీ..దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బొంతు పేర్కొన్నారు. తెలంగాణ ప్లవర్ ఫెస్టివల్ బతుకమ్మను కలర్ పుల్ గా నిర్వహించేందుకు బల్దియా రంగంలోకి దిగింది. బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. అలాగే బతుకమ్మ ఆడే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లను పూర్తిచేసింది.. శానిటేషన్ సమస్యలు రాకుండా కార్మికులతో ప్రత్యేక టీంలను సిద్ధం చేశారు..

ముగిసిన టీ.ఎస్ కాబినెట్ సమావేశం..

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశమనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో కేజీ టు పీజీలో భాగంగా 2016-17లో షెడ్యూల్ కులాల విద్యార్థుల కోసం 103 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలకు 30రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మైనార్టీల కోసం 71 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించినమన్నారు. 50ఎస్సీ గురుకులాలను ప్రారంభించినమని తెలిపారు.

18:23 - October 7, 2016

తిరుమల: తిరుమలలో శుక్రవారం రాత్రి జరగనున్న శ్రీవారి గరుడ సేవకు భక్తులు భారీగా హాజరవుతున్నారు. ఇప్పటికే చేరుకున్న భక్తులతో మాఢవీధులు కిక్కిరిసిపోయాయి. మేదరమిట్ట వద్ద భక్తుల రద్దీ పెరగడంతో... పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. అటు తోపులాట, లాఠీఛార్జ్ తో పలువురు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు వీరిని తరలించేందుకు అంబులెన్స్ వచ్చే వీలులేకపోవడంతో.. స్ట్రచర్లపై ఆసుపత్రికి తరలించారు. తిరుగిరులు భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగుతున్నాయి. లక్షల సంఖ్యలో తరలివచ్చిన యాత్రికులతో తిరువీధులు నిండిపోయాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే గరుడ వాహన సేవను వీక్షించేందుకు మధ్యాహ్నానికి భక్తులు గ్యాలరీలోకి చేరిపోయారు. గ్యాలరీలు నిండిపోవడంతో మాడ వీధుల బయట లక్షల సంఖ్యలో జనం వేచి చూస్తున్నారు. భక్తులు తోసుకోవడంతో వెంగమాంబ అన్నదాన సత్రం ప్రవేశద్వారం వద్ద స్వల్పంగా తోపులాట చోటుచేసుకుంది. ఆస్థాన మండపం, వసంత మండపం, వరాహస్వామి వసతిగృహాల వద్ద భక్తులు భారీగా చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తితిదే అధికారులు ఏర్పాటు చేశారు. అయినా అధిక సంఖ్యలో భక్తులు రావటంతో స్వల్పంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి.

18:13 - October 7, 2016

ఢిల్లీ : ఉన్న కేటీఆర్ రెండోరోజు పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమ్యారు. ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌ సమావేశంలో మంత్రి భారత్‌ పోర్జ్‌ కంపెనీ ఎండీ బాబా కళ్యాణితో భేటీ అయ్యారు. తెలంగాణలో ఎయిరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. 

18:10 - October 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా హైదరాబాద్‌ ఎస్వీకేలో బతుకమ్మ ఆర్ట్ గ్యాలరీ ఆకట్టుకుంటోంది. ఎస్వీకేలోని ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలో ఆర్టిస్ట్‌ హరికృష్ణ డప్పులపై బతుకమ్మ చిత్రాలు గీసి అందరినీ అబ్బురపరుస్తున్నారు. తెలంగాణ మహిళల జీవన విధానం కళ్లకు కట్టినట్లుగా ఈ చిత్రాలను ఆవిష్కరించారు. దీనికి సంబందించి మరిన్ని సమాచారానికి వీడియో చూడండి..

18:05 - October 7, 2016

నల్లగొండ : తెలంగాణలో నూతన జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటులో శాస్త్రీయత లోపించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా.. కేవలం అధికార పార్టీ నేతల ఇష్టాలను బట్టి నూతన జిల్లాలు..మండలాలు ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. 

18:03 - October 7, 2016

గ్రీస్ : గ్రీస్‌లో ఫ్రీ రన్నింగ్‌ చాలెంజ్‌ పోటీలు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాయి. ఈ కాంపిటీషన్‌లో ప్రపంచంలోనే 30 మంది ఫ్రీ రన్నింగ్‌ స్పెషలిస్ట్ లు పాల్గొన్నారు.శాంటోరినీలో జరిగిన ఈ పోటీలను చూసేందుకు అభిమానులు సైతం క్యూ కట్టారు. డేర్‌డెవిల్‌ ఫ్రీ రన్నింగ్‌ ట్రిక్స్‌తో వీక్షకులను అలరించారు. రిస్కీ ఫీట్స్‌తో చూపు తిప్పుకోనివ్వకుండా చేశారు. కళ్లు చెదిరే స్టంట్స్‌తో అదరగొట్టిన గ్రీస్‌ స్టంట్‌ స్పెషలిస్ట్‌ మోర్గాన్‌ ఫ్రీజర్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచి టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. 

17:58 - October 7, 2016

ఢిల్లీ : ప్రధాని మోదిని 'ఖూన్‌ కి దలాలి' అంటూ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి చీఫ్‌ అమిత్‌ షా మండిపడ్డారు. ఆర్మీని, అమర వీరులను, దేశ ప్రజలను రాహుల్‌ అవమానించారన్నారు. కాంగ్రెస్‌ మూలాల్లోనే దలాలితనం ఉందని ఎద్దేవా చేశారు. రాహుల్ వ్యాఖ్యలు భద్రతా దళాల స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపారు. మెరుపు దాడులపై ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని... మన ఆర్మీ శక్తి సామర్థ్యాలు ఏమిటో అందరికీ తెలుసు అని అమిత్ షా వెల్లడించారు. ఈ దాడులపై దేశమంతా హర్షిస్తోందని అమిత్ షా తెలిపారు.

17:55 - October 7, 2016

బీహార్‌ : మద్య నిషేధం అమలుపై నితీష్‌ ప్రభుత్వానికి ఊరట లభించింది. మద్యనిషేధం చట్టాన్ని రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై తదుపరి విచారణ 8 వారాల తర్వాత జరపనుంది. దీంతో బిహార్‌లో మళ్లీ మద్యపాన నిషేధం అమలు కానుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న బీహార్‌లో కొత్త మద్యపాన నిషేధాన్ని నితీశ్ సర్కార్ ప్రకటించింది. బీహార్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ యాక్ట్-2016ను పాట్నా హైకోర్టు నిలిపివేయడంతో నితీష్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 5 నుంచి బీహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో మద్యాన్ని అమ్మడాన్ని, తాగడాన్ని పూర్తిగా నిషేధించింది. 

17:49 - October 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ కాబినెట్ భేటీ ముగిసింది. తెలంగాణ‌ రాష్ట్ర కేబినెట్ స‌మావేశం ముగిసింది. రాష్ట్ర‌ మంత్రుల‌తో ప‌లు అంశాల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ సుదీర్ఘంగా చ‌ర్చించారు. ద‌స‌రా నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కానున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. జిల్లాల పున‌ర్వవ‌స్థీక‌ర‌ణకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం మీడియాతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. వెనకబడిన తరగతుల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు 2017-18లో 119 బీసీ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఏర్పాటు చేయాల‌ని కేబినెట్ ఆమోదం పలికిందని కడియం తెలిపారు. ఇప్పటికే ఎఈస్టలకు 50 రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగతున్నాయని తెలిపారు. బీసీ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని తెలిపారు. కరీంనగర్, రామగుండం, సిద్ధిపేట, నిజామాబాద్ లలో నూతనంగా నాలుగు పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు..మైనార్టీ విద్యార్థుల కోసం 90 రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఏర్పాటు.. కేన్స‌ర్ ఆసుప‌త్రి కోసం శేరిలింగం ప‌ల్లిలో హెటిరో సంస్థ‌కు 15 ఎక‌రాల భూమి కేటాయింపు..జీహెచ్ఎంసీ ప‌రిధిలో అక్ర‌మ నిర్మాణాల అడ్డుక‌ట్ట‌కు వేసేందుకు ట్రైబ్యున‌ల్ ఏర్పాటు ..పుర‌పాల‌క శాఖలో ఏకీకృత స‌ర్వీస్ రూల్స్ కోసం జీహెచ్ ఎంసీ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌..రాష్ట్ర తాగునీటి కార్పొరేష‌న్‌ను వేత‌నాలు, పింఛ‌న్ల ప‌రిధిలో తెస్తూ కాబినెట్ ఆమెదం పలికిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు.

17:22 - October 7, 2016

తమిళనాడు : ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్‌రావు శుక్రవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జయలలిత ఆరోగ్య పరిస్థితితో పాటు... రాష్ట్రంలో పాలన తీరును గవర్నర్‌ అడిగి తెలుసుకున్నారు.

శివకాశిలో అగ్నిప్రమాదం..

తమిళనాడు : శివకాశిలో మందుగుండ్లు తయారు చేసే ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సమాచారమందుకున్న అగ్నిమాపక దళ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నాయి. ఐదు అగ్నిమాపక యంత్రాల సహాయంతో సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

17:12 - October 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ కాబినెట్ సమావేశం కొనసాగతోంది. ఈ సమావేశంలో కొత్త జిల్లాలకు కాబినెట్ ఆమోదం తెలుపనుంది. ఈ సమావేశంలో బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సమావేశం ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. మున్సిపల్ ఉద్యోగుల బదిలీ,35 మున్సిపాలిటీల్లో ప్రయివేట్ సెక్టార్ ద్వారా నీటి సరఫరా..ఏకీకృత సర్వీసు రూల్స్ ఏర్పాటు..ఆర్టీసీ బోర్డులో బైరెక్టర్ గా జీహెచ్ ఎంసీ కమిషనర్ నియామకం,వేములవాడ ఆలయ అభివృద్ధికి డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు వంటి పలు కీలక నిర్ణయాలను కాబినెట్ ఆమోదం తెలిపినట్లుగా సమాచారం.

 

కశ్మీర్ యాపిల్స్ పై సంచలన వ్రాతలు!..

హర్యానా : పాక్ అక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఇటీవల విజయవంతంగా లక్షిత దాడులు నిర్వహించిన క్రమంలో హర్యానాకు దిగుమతైన కశ్మీరీ యాపిల్స్‌పై భారత్ వ్యతిరేక నినాదాలు కనిపించడం సంచలనమైంది. సిర్సా కూరగాయల మార్కెట్‌కు వచ్చిన రెండు బాక్సుల కశ్మీర్‌ యాపిల్స్‌ను తెరిచి చూడగా, వాటిలోని రెండు యాపిల్స్‌పై భారత వ్యతిరేక నినాదాలు కనిపించాయి. 'మాకు స్వాంతంత్ర్యం కావాలి', 'కుక్కలు వెనక్కి వెళ్లిపోవాలి' అనే నినాదాలు ఈ యాపిల్స్‌పై రాసి ఉన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆ ప్రాంతంలో అప్రమత్తమయ్యాయి. 

వ్యభిచార ముఠా గుట్టురట్టు..

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌‌ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును సీసీఎస్‌ పోలీసులు రట్టు చేశారు. మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సోదాలు నిర్వహిస్తున్న పోలీసులపై వ్యభిచార కేంద్రం నిర్వాహకులు దాడి చేశారు. ఈ దాడిలో సైబర్‌ క్రైం ఎస్సై మదన్‌, కానిస్టేబుల్‌ మహేష్‌కు గాయాలయ్యాయి. మాదాపూర్‌ పోలీసుల సాయంతో ముగ్గురు యువకులు, యువతిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

విరిగిపడ్డ కొండచరియలు..17 మంది మృతి..

చైనా : కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందారు. తూర్పు చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మేగి తుఫాను చైనాను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టైఫూన్ కారణంగా ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 3.15 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు.

16:50 - October 7, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో మరోసారి పరిపాలన సంస్కరణలకు తెరలేసింది. పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న ఇరవైఆరు సర్కిళ్లను ముప్పైకి పెంచాలని జీహెచ్ ఎంసీ స్థాయీ సంఘం నిర్ణయించింది. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జరిగిన స్టాడింగ్‌ కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జీహెచ్‌ఎంసీ సర్కిళ్ల సంఖ్య ముప్పైకి పెంచాలని నిర్ణయం
జీహెచ్‌ఎంసీ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పాలకవర్గం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న సర్కిళ్లను ముప్పైకి పెంచాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జరిగిన జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో ఉన్న పదహారు సర్కిళ్లను ఏడాది క్రితం 26కు పెంచారు. ఈ దసరా నుంచే కొత్త సర్కిళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలని నిర్ణయించారు.

ప్రైవేటు వ్యక్తుల చేతికి జీహెచ్‌ఎంసీ క్రీడా మైదానాలు
మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న క్రీడా మైదానాలు, ఆటస్థలాలు, ఈత కొలనుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలు లేదా క్రీడా సంఘాలకు అప్ప గించాలని స్థాయీ సంఘం నిర్ణయించింది. పే అండ్‌ ప్లే ప్రాతిపదికన వీటిని అప్పగిస్తారు. ప్రస్తుతం వీటిని జీహెచ్‌ఎంసీయే నిర్వహిస్తోంది. మహానగర పాలక సంస్థకు ఇది భారంగా మారడంతో... ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఈ వ్యయభారం తగ్గడంతోపాటు... కొత్తగా ఆదాయం సమకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. జంటనగరాల్లోని నలభై మార్కెట్లలో ఉన్న దుకాణాల కేటాయింపు మార్గదర్శకాలకు స్థాయీ సంఘం ఆమోదముద్ర వేసింది. నాలాలకు గోడల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల వెడల్పుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

16:47 - October 7, 2016

ఖమ్మం : వెంకటాపురం మండలం..ఆలుబాక గ్రామంలో ముగ్గురు యువకులు సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. వెంకటాపురం, వాజేడు మండలాలను భద్రాచలం నియోజకవర్గంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంత వరకు టవర్‌ దిగేది లేదని చెబుతున్నారు. కాగా దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే నిరసనలు మరింత పెరుగుతాయని ఆ ప్రాంత ప్రజలు హెచ్చరిస్తున్నారు.  

16:34 - October 7, 2016

ఢిల్లీ : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాటల తీరే వేరుగా వుంటుంది. ఆయన నోరు విప్పారంటే సంచలనం రేగాల్సిందే. అది స్వపక్షమైనా, విపక్షమైనా, మిత్రపక్షమైనా సరే ఆయన వ్యాఖ్యలు సంచలనాలే అవుతుంటాయి. ఈ క్రమంలోనే మిత్రపక్ష నేతలపై జేసీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం ఎలాగైనా మాట్లాడుతారంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్ వాస్తవాలను బహిర్గత పరచాలనే వారంతా దేశద్రోహులని పారికర్‌ అనడం దురదృష్టకరమని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. సర్జికల్‌ దాడులపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న ఆయన మాజీ ప్రధానులు, రక్షణ మంత్రులకైనా ఆ వీడియోలను చూపించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రానున్న ఎన్నికల కోసమే బీజేపీ చేసిన జిమ్మిక్కుగా ప్రజలు భావిస్తారన్నారు. 

బీసీసీఐకి 'సుప్రీం' షాక్..

ఢిల్లీ: లోధా ప్యానెల్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయ‌డానికి నిరాక‌రిస్తున్న బీసీసీఐకి షాకిచ్చింది సుప్రీంకోర్టు. రాష్ట్ర సంఘాల‌కు నిధులు విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని ఆదేశించింది. లోధా సిఫార‌సుల‌ను అమ‌లు చేసేవ‌ర‌కు ఇప్ప‌టికే విడుద‌ల చేసిన నిధుల‌ను కూడా వాడుకోకూడ‌ద‌ని రాష్ట్ర సంఘాల‌కు కూడా స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో త‌ర్వాతి విచార‌ణ‌ను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ సిఫార‌సుల‌పై ఐసీసీ చీఫ్‌తో ఏం మాట్లాడారో వ్య‌క్తిగ‌తంగా ఓ అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని బీసీసీఐ అధ్య‌క్షుడు అనురాగ్ ఠాకూర్‌ను ఆదేశించింది. 

జాఫరర్ ట్రైన్ టార్గెట్ గా బాంబు దాడులు..

పాకిస్థాన్‌ : రైల్వే ట్రాక్‌పై రెండు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రావ‌ల్‌పిండి వెళ్తోన్న జాఫ‌ర్ ఎక్స్‌ప్రెస్‌ను దుండ‌గులు టార్గెట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో అయిదుగురు మృతిచెందారు. మ‌రో 17 మంది గాయ‌ప‌డ్డారు. బ‌లోచిస్తాన్‌లోని బోల‌న్ జిల్లాలో ఉన్న అబ్‌-ఈ-గుమ్ ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై బాంబుల‌ను అమ‌ర్చారు. ఇదే ప్రాంతంలో 20 నిమిషాల వ్య‌వ‌ధి త‌ర్వాత మ‌రో పేలుడు జ‌రిగింది. గాయ‌ప‌డ్డ‌వాళ్ల‌ను క్వెట్టాలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. బ‌లోచిస్తాన్ సీఎం స‌నాహుల్లా జెహ్రీ ఈ ఘ‌ట‌న‌ను ఖండించారు.

16:08 - October 7, 2016

విశాఖ : అన్నవరం క్షేత్రంలో అక్రమ వసూళ్ల దందాకు అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. తాంబూలాల పేరుతో సాగుతున్న అక్రమ వసూళ్లతో భక్తులు హడలి పోతున్నారు. అర్చకుల దెబ్బకు ఆలయ పేరు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయని సత్యదేవుని భక్తులు ఆక్రోశిస్తున్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వసూళ్ల దందాపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ...!

అక్రమాలకు నిలయంగా సత్యదేవుడి ఆలయం
అన్నవరం సత్యదేవుడి ఆలయం...నేడు అర్చకుల ఆగడాలకు నిలయం..అర్చకుల వసూళ్ల దందాతో హడలుతున్న భక్తజనం..ఇదీ... ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో జరుగుతున్న అక్రమ వసూళ్ల దందా. ఈ క్షేత్రంలో దంపతుల వ్రతాలకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో వ్రతాచరణకు తరలి వస్తుంటారు. ధనార్జనే ధ్యేయంగా కొనసాగుతున్న ఆలయ పాలకమండలి.. వ్రతం టికెట్ల రేట్లను విపరీతంగా పెంచేసింది. ఇదే అంశం అర్చకులకు వరమైంది.

ఆలయంలో టిక్కెట్ల ధర పెంపు
ఎంతో పేరు ప్రతిష్టలు గల అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. పర్వదినాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా వ్రతాచరణకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పెరిగిన రద్దీని ధనార్జనకు మార్గంగా భావించిన ఆలయ పాలకమండలి వ్రతం టికెట్ల ధరలను అమాంతం పెంచేసింది. 150 రూపాయలు మొదలు.. 300, 700, 1500 రూపాయాలుగా నాలుగు కేటగిరీల్లో టిక్కెట్లను విక్రయిస్తున్నారు. ఏసీ రూములో వ్రతం చేయించుకునే వారు మరో ఐదు వందలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

అర్చకుల దోపిడీపై భక్తుల విమర్శలు
వ్రతం టికెట్ల ధరే భరించలేని స్థాయిలో ఉంది అంటుంటే.. అర్చకుల వేధింపులు దానికి అదనం అయ్యాయంటున్నారు భక్తులు. వ్రతం చేయించుకునే భక్తుల నుంచి అర్చకులు దబాయించి మరీ.. పెద్ద మొత్తాల్లో వసూలు చేస్తున్నారు. పెరిగిన వ్రతం టికెట్ల ధరలతో ఇప్పటికే జేబులకు చిల్లులు పడుతుంటే.. పురోహితులు ముక్కుపిండి తమ సంభావన వసూలు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భక్తులను దబాయించి మరీ.. సంభావన వసూలు చేస్తున్న అర్చకులు
నిబంధనల ప్రకారం అయితే ఒక్కసారి టికెట్ తీసుకున్న భక్తులు... ఎవరికీ ఎక్కడా చిల్లి గవ్వ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ వ్రతం నిర్వహించే పూజారులు మాత్రం భక్తులపై ఒత్తిడి తెచ్చి వందల్లో వసూలు చేస్తున్నారు. దీంతో వ్రతాల రూపంలో ఆలయానికి సగటున రోజుకి 3 లక్షల రూపాయల ఆదాయం సమకూరుతుంటే.. దీనికి మించి పురోహితులు దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పురోహితులు భక్తులు ఇచ్చే కానులకు తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైన భక్తులు కానుకలు ఇచ్చినా.. దానిని ఆలయానికి అందించాలి. కానీ ఇక్కడి పురోహితులు మాత్రం వందల్లో వసూలు చేయడం విమర్శలకు తావిస్తోంది.

అక్రమాలపై స్పందించని ఆలయం ఈవో పై విమర్శలు
పురోహితుల వసూళ్ల పర్వం బాహాటంగానే సాగుతున్నప్పటికీ.. ఆలయ ఈవో స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ వసూళ్ల దందాకు మామూళ్లు అందుకునే ఈవో కార్యాలయం సహకారం ఉందన్న ఆరోపణలున్నాయి.

భక్తులను బేజారెత్తిస్తున్న పూజారుల బలవంతపు వసూళ్లు
గతంలో ఎవరైనా ఇస్తే తీసుకునే అలవాటున్న పూజారులు ఇప్పుడు బలవంతపు వసూళ్లకు పాల్పడటం భక్తులను బేజారెత్తిస్తోంది. సాధారణ భక్తులయితే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వసూళ్ల పర్వానికి తెర దించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు కోరుతున్నారు.  

15:58 - October 7, 2016

కరీంనగర్‌ : జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు ఊపందుకుంది. పరిపాలన భవనాల కోసం అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. దసరా నాటికి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో.. భవనాలు ఎంపిక చేసే పనిలో అధికారులు తలమునకలయ్యారు. ప్రతిపాదించిన జగిత్యాల,సిరిసిల్ల,పెద్దపల్లి జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటు పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. 90 శాతం ప్రభుత్వ భవనాలలో కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు.

శరవేగంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ
కరీంనగర్ జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. జగిత్యాల,సిరిసిల్ల,పెద్దపల్లి జిల్లాలుగా ప్రతిపాదించడంతో.. జిల్లా కేంద్రాల్లో శాఖల వారీగా భవనాల ఏర్పాటుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నీతు ప్రసాద్ ప్రభుత్వ శాఖల కార్యాలయాల భవనాల ఎంపిక పనులు పరిశీలిస్తుండగా...పోలీస్ శాఖకు సంబంధించిన ఆఫీసుల ఏర్పాటును ఎస్పీ జోయల్ డేవిస్ పర్యవేక్షిస్తున్నారు. తొలి విడతగా ప్రకటించిన పెద్దపల్లి,జగిత్యాల జిల్లాలో ఇప్పటికే తాత్కలిక కలెక్టరేట్ పనులను పూర్తి చేశారు. ఇటివల ప్రకటించిన సిరిసిల్ల జిల్లాలో కార్యాలయాల ఏర్పాటు పనులను వేగవంతం చేశారు.

ప్రభుత్వ శాఖల కార్యాలయ భవనాల ఎంపికలో కలెక్టర్‌ బిజీ బిజీ
జగిత్యాల, పెద్దపల్లికి సంబంధించి కార్యాలయాల మరమ్మతుల కోసం 96 లక్షలు కేటాయించారు. అక్టోబర్ 16 నాటికి జిల్లాల డేటా కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి,18 వరకు కామన్ రికార్డుల స్కానింగ్..25 నాటికి రికార్డుల ప్యాకింగ్ సిద్దంగా ఉంచేందుకు పనులను స్పీడప్‌ చేశారు. పెద్దపల్లిలో వీలైనంత వరకు ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రభుత్వ భవనాల్లో నూతన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఐటిఐ సిఇఓ భవనంలో కలెక్టర్,జెసి, డిఆర్ఒ ఆఫీసులు సిద్ధం చేస్తున్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు లోని రైతు విశ్రాంతి భవనంలో మొదటి అంతస్తును జాయింట్ డైరెక్టర్ వ్యవసాయశాఖ, డీడి ఉద్యానవన శాఖ,డిడి పట్టు పరిశ్రమ శాఖలకు కేటయించారు. పెద్దపల్లికి సంబంధించి అధికారులు,సిబ్బంది కేటయింపులూ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

జగిత్యాల, పెద్దపల్లి కార్యాలయాల మరమ్మతుకు 96 లక్షలు
జగిత్యాల జిల్లాకు సంబందించి మెజారిటి శాఖల కార్యాలయ భవనాల ఎంపిక కలెక్టర్ నీతు ప్రసాద్ పూర్తి చేశారు. ఎస్పారెస్పీ ప్రాంగణంలోని పంచాయితి రాజ్ ఈఈ కార్యాలయంలో కలెక్టరేట్,జెసి,డిఆర్ఓ, కార్యాలయాలతో పాటు చాంబర్స్,రికార్డు గది,ఎన్ఐసి కి కేటయించారు. ధరూర్ క్యాంపు లోని గిరిజన హస్టల్‌లో జిల్లా పోలీస్ కార్యాలయం,ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కి కేటాయించారు. డిపిఆర్ఓ,ఏడి సర్వే, ల్యాండ్ రికార్డు,డిఆర్డిఎ,పంచాయితి,దేవాదాయ శాఖ,ఇరిగేషన్,బిసి,ఎస్సీ,మైనారిటి సంక్షేమ శాఖ ల కార్యాలయలకు ఎస్సారెస్పీ సబ్ డివిజన్ 1,2 లో ని గదులను కేటాయించారు.

ధరూర్ క్యాంపులోని గిరిజన హస్టల్‌లో జిల్లా పోలీస్ కార్యాలయం
సిరిసిల్లలో కార్యాలయాల ఏర్పాటు కోసం సెస్,టన్ క్లబ్, తంగళ్ల పల్లిలోని బీడి కంపెని స్థలంతో పాటు,ప్రభుత్వ జూనియర్ కళాశాల,సినారె భవనాలను పరిశీలిస్తున్నారు. సెస్ కార్యాలయంలో కలెక్టరేట్‌తో పాటు మిగతా భవనాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత డిఎస్పి కార్యాలయంలో ఎస్పీ ఆఫీస్‌, రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నారు .మినీ స్టేడియాన్ని పోలీస్ పరేడ్ గ్రౌండ్ కేటాయించారు. వీటితో పాటు రెవెన్యూ శాఖ ఫైళ్ల కేటాయింపు పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

15:45 - October 7, 2016

ఖమ్మం : భద్రాచలంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య దీక్ష రెండోరోజుకు చేరింది.. రాజయ్య దీక్షకు సీపీఎం కార్యకర్తలు, స్థానిక నేతలు, ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి.. భద్రాచలంను జిల్లాగా చేయాలంటూ... వాజేడు, వెంకటాపురం మండలాలను భద్రాచలం డివిజన్‌లోనే కొనసాగించాలంటూ సున్నం రాజయ్య గురువారం ఆమరణ దీక్ష మొదలుపెట్టారు.. 

15:43 - October 7, 2016

పశ్చిమగోదావరి : తుందుర్రు మెగా ఆక్వాఫుడ్‌ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా..పశ్చిమగోదావరి జిల్లా..పాలకొల్లు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తుందుర్రులో 144 సెక్షన్‌ ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్‌ డిమాండ్‌ చేశారు. గుజరాత్‌లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ను సీఎం చంద్రబాబునాయుడు ఏపీకి పట్టుకొచ్చారని ఆయన అన్నారు. దీని వల్ల కాలుష్యం ఎక్కువై చాలా నష్టాలు సంభవిస్తాయని అన్నారు. 

15:38 - October 7, 2016

ఢిల్లీ: భారత-పాకిస్తాన్‌ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమీక్ష జరిపారు. 2018 నాటికి భారత-పాకిస్తాన్‌ సరిహద్దు సీల్‌ చేయాలని నిర్ణయించినట్లు హోంమంత్రి చెప్పారు. సరిహద్దు భద్రతపై ఆయా రాష్ట్రాలు పలు సూచనలు చేశారని తెలిపారు. సరిహద్దు భద్రతా దళం ఏదైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చార్జిషీట్‌ దాఖలు చేసిన విచారణ జరిపించాలని, ఎవరైనా దోషిగా తేలితే వారిని కఠినంగా శిక్షించాలని ఆయా రాష్ట్రాలకు సూచించినట్లు హోంమంత్రి తెలిపారు. భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సమయంలో ఆర్మీ చేపట్టిన చర్యలపై ప్రతి ఒక్కరూ నమ్మకం కలిగి ఉండాలని అన్నారు. 

15:35 - October 7, 2016

హైదరాబాద్ : గద్వాల్‌ జిల్లాకు అంగీకరించారంటూ సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు... అనంతరం అరుణ హైపవర్ కమిటీ చైర్మన్ అయిన కేకేను, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ తో భేటీ అయ్యారు. అల్లంపూర్,ఉండవల్లిని జోగులాంబ జిల్లాలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతాలను ఇతర జిల్లాలో కలపడం సరికాదని సీసీఎల్ ఏ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్రకు విజ్ఞప్తి చేశారు..ఈ ప్రాంతాలను వనపర్తిలో కలుపుతున్నారంటూ వార్తలొస్తున్నాయని... ఈ పొరపాటును సరిచేయాలని కోరారు.. 

15:26 - October 7, 2016

విజయవాడ: విజయవాడలో ఉన్నట్టుండి ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రకాశం బ్యారేజీ సమీపంలోని సీతమ్మవారి పాదాల వద్ద సబ్ స్టేషన్ పై పిడుగుపడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పిడుగుపడిన అదిరిపాటుకు ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగతున్నాయి. పిడుగుపాటుకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

కొలంబియా అధ్య‌క్షుడుకి నోబెల్ శాంతి బహుమతి..

కొలంబియా : నోబెల్ శాంతి బ‌హుమ‌తి కొలంబియా అధ్య‌క్షుడు జువాన్ మాన్యూల్ శాంటోస్‌ను వ‌రించింది. కొలంబియా రెబ‌ల్స్‌తో ఆయ‌న కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి గాను ఆయ‌న‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది నోబెల్ క‌మిటీ. 52 ఏళ్ల యుద్ధానికి తెర‌దించుతూ శాంటోస్ ఈ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే ఆ త‌ర్వాత నిర్వ‌హించిన రెఫ‌రెండ‌మ్‌లో ఆ దేశ ప్ర‌జ‌లు ఈ శాంతి ఒప్పందాన్ని వ్య‌తిరేకించారు. అయినా శాంతి కోసం తాను ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాన‌ని శాంటోస్ ప్ర‌క‌టించారు.

15:12 - October 7, 2016

హైదరాబాద్ : సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై చర్చిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న గద్వాల , సిరిసిల్ల, జనగామ, అసిఫాబాద్ నాలుగు కొత్త జిల్లాల ఏర్పాటుకై నియమించబడిన హైపవర్ కమిటీ కాబినెట్ సమావేశంలో కేకే నివేదికను అందజేశారు. ఈ నివేదికతో పాటు సిద్ధిపేట, కరీంనగర్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లు, బీసీ కమిషన్, జీహెచ్‌ఎంసీ ట్రిబ్యునల్ తదితర అంశాలపై చర్చిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా దసరా రోజు చేపట్టే కార్యక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో తుదిరూపు ఇవ్వనున్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

ఉద్యోగాల పేరిట మోసాలు..3గురు అరెస్ట్..

హైదరాబాద్ : నగరంలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నైజీరియన్లను రాచకొండ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, 7 సెల్‌ఫోన్లు, ఆన్‌లైన్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మీడియాపై దాడి..మంత్రి ఆరా..

విజయవాడ: విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో ఈనాడు-ఈటీవీ సిబ్బందిపై దాడి ఘటనపై వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఆరా తీశారు. దాడి ఘటనపై విచారణ జరిపించాలని.. ఘటనకు సంబంధించి దృశ్యాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డీఎంఈని ఆదేశించారు.

ప్రారంభమైన తెలంగాణ కాబినెట్ సమావేశం..

హైదరాబాద్ : సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై చర్చిస్తున్నారు. హైపవర్ కమిటీ నివేదికతో పాటు సిద్ధిపేట, కరీంనగర్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లు, బీసీ కమిషన్, జీహెచ్‌ఎంసీ ట్రిబ్యునల్ తదితర అంశాలపై చర్చిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా దసరా రోజు చేపట్టే కార్యక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో తుదిరూపు ఇవ్వనున్నారు.

నేవీ కేంద్రం వద్ద పేలుళ్లు!..

గుజరాత్ : పోర్ బందర్ సమీపంలోని భారత నావికాదళ కేంద్రంలో వినిపించిన పేలుళ్లు సంభవించాయి. నేవి ప్రధాన కేంద్రంలో కాల్పులు జరిగినట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోర్ బందర్ ఎస్పీ, ఐజీ సంఘటనాస్థలికి చేరుకున్నారు. కాగా నావెల్ బేస్ లో వినిపించిన భారీ శబ్దాలు ఆప్రాంతంలోని పిల్లలు ఫైర్ క్రాకర్స్ కాలిస్తే వచ్చినవేనని నేవీ ప్రకటించినట్లుగా సమాచారం. యూరీ దాడి, ఆపై సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత, గత వారం నుంచి నేవీ బేస్ లో భద్రతను పెంచామని అధికారులు వెల్లడించింది.

హైపర్ కమిటీతో రజకసంఘాలు భేటీ..

హైదరాబాద్ : హైపర్ కమిటీతో రజక సంఘాలు భేటీ అయ్యాయి. కొత్తగా ఏర్పడబోయే జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని కమిటీ చైర్మన్ కేకేను రజక సంఘాలు కోరాయి. కాగా తెలంగాణ పోరాటంలో నిజాం దొరలను ఎదిరించి భూమికోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం సంగతి తెలిసిందే.

సీతమ్మవారి పాదాల వద్ద పిడుగుపాటు..

విజయవాడ: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన సమయంలో ప్రకాశం బ్యారేజీ సీతమ్మవారి పాదాల దగ్గర కొద్దిసేపటి క్రితం పిడుగుపడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. రెండు బైక్‌లు ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పిడుగుపాటు సమయంలో దుర్గగుడి ముఖమండపం సమీపంలోని క్యూలైన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో పది మంది కరెంట్ షాక్‌కు గురవగా, ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

22 ఎయిర్ పోర్టులో హై అలర్ట్..

ఢిల్లీ : ఉగ్రభూతం దేశాన్ని వెంటాడుతోంది. ఏ క్షణంలోనైనా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ఢిల్లీ, హైదరాబాద్‌ సహా మొత్తం 22 ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. దీంతో విమానాశ్రయాల వద్ద భారీ భద్రను ఏర్పాటు చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం చేసిన దాడులకు పాక్‌ ప్రతీకారం తీర్చుకోవచ్చునని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో పౌరవిమానయాన శాఖ, పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌, పారామిలటరీ బలగాలకు సమాచారం ఇచ్చింది. పాక్‌ సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్, గుజరాత్‌లో భద్రత పెంచారు.

కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం : జూలకంటి

నల్గొండ : కొత్త జిల్లాల ఏర్పాటును సీపీఎం స్వాగిస్తుందని ఆ పార్టీ నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు.  శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల ఏర్పాటు లేదన్నారు. ప్రజాభిప్రాయాలతో సంబంధం లేకుండా జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేయడం సరికాదని హితవు పలికారు. మిర్యాలగూడెం, భద్రాచలంకు జిల్లా అర్హతలున్నాయని తెలిపారు. ప్రజల ఉపయోగానికి కాకుండా అధికార పార్టీ నేతల కోసం జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. మహాజన పాదయాత్ర విజయవంతానికి ఈనెల 13న అన్ని డివిజన్ కేంద్రాల్లో టూకే రన్ నిర్వహిస్తామని చెప్పారు. 

 

14:15 - October 7, 2016

హైదరాబాద్ : మరి కాసేపట్లో తెలంగాణ కాబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న నాలుగు జిల్లాలు గద్వాల , సిరిసిల్ల, జనగామ, అసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, బీసీ కమిషన్ ఏర్పాటు, నగరంలోకి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వంటి పలు అంశాలపై కాబినెట్ నిర్ణయాలు తీసుకోనుంది. కాగా నాలుగు కొత్త జిల్లాల ఏర్పాటుకై నియమించబడిన హైపవర్ కమిటీ మరికాసేపట్లో నివేదికను సీఎం కేసీఆర్‌ను అందివ్వనుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం 27 జిల్లాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు డిమాండ్ల నేపథ్యంలో మరో నాలుగు జిల్లాల ప్రతిపాదనలపై చర్చించాల్సిందిగా హైపవర్ కమిటీని సీఎం కేసీఆర్ నియమించారు. కే.కేశవరావు నేతృత్వంలో హైపవర్ కమిటీ గత మూడు రోజులుగా అనేక మందితో చర్చలు జరిపింది. కొత్త జిల్లాలపై పూర్తి స్థాయి సమాచారంతో రిపోర్టు సిద్ధం చేసిన కమిటీ ఈరోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ను కలిసి నివేదికను అందజేయనుంది.

పోర్ బందర్ లోని నేవల్ బేస్ లో భారీ పేలుడు

గుజరాత్ : పోర్ బందర్ లోని నేవల్ బేస్ లో బారీ పేలుడు సంభవించింది. నేవీ ప్రధాన కేంద్రంలో కాల్పులు జరిగినట్లు అనుమాన పడ్డారు. ఘటనాస్థలానికి పోర్ బందర్ ఎస్పీ, ఐజీ వెళ్లారు. 

 

14:06 - October 7, 2016

సూపర్ సింగర్ పర్నికతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు అసక్తికరమైన విషయాలు తెలిపింది. ఈ ఫీల్డ్ కు వస్తానని అనుకోలేదని చెప్పారు. సింగర్ గా జర్నీ చాలా బాగుందన్నారు. పెళ్లి తర్వాత కూడా చాలా బాగుందని తెలిపారు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంట్లో పాడుతానని చెప్పారు. ఆమె పలు పాటలను పాడి వినిపించారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

14:00 - October 7, 2016

గుజరాత్ : పోర్ బందర్ లోని నేవల్ బేస్ లో భారీ పేలుడు సంభవించింది. నేవీ ప్రధాన కేంద్రంలో కాల్పులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలానికి పోర్ బందర్ ఎస్పీ, ఐజీ వెళ్లారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:54 - October 7, 2016

హైదరాబాద్ : 2014 పునర్విభజన చట్టం ప్రకారం.. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామపంచాయతీల సరిహద్దులను మార్చడానికి వీల్లేదని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల ఏర్పాటులో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని 2014 సం.లోనే ఈసీ కేంద్రప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. 2014 పునర్విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా చేయాలని సీఎం కేసీఆర్ 2015 లో కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు. 2016 సం.లో కేంద్రప్రభుత్వానికి 119 నియోజకవర్గాలను 153 నియోజకవవర్గాలుగా చేయాలని సీఎస్ రాజీవ్ శర్మ లేఖ రాశారని గుర్తు చేశారు. 

 

13:46 - October 7, 2016
13:44 - October 7, 2016

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో తమిళనాడులో పాలన కుంటుపడిందని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సుబ్రమణ్యస్వామి లేఖ రాశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:38 - October 7, 2016

తమిళనాడు : చెన్నై ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలితను కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ పరామర్శించారు. ఉదయం ఆస్పత్రికివచ్చిన రాహుల్‌ను ఆపోలో ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు లోపలికి తీసుకువెళ్లారు. వైద్యులను అడిగి జయలలిత ఆరోగ్య వివరాల్ని రాహుల్ తెలుసుకున్నారు. ఊపిరిత్తులు, మధుమేహం, ఆస్తమా ఇన్‌ఫెక్షన్లకు సంబంధించి జయలలితకు చికిత్స అందిస్తున్నారు.

 

సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

కృష్ణా : విజయవాడలో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలతో 3 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. రబీ సాగుకు శనగవిత్తనాలు పంపిణీ చేయాలన్నారు. 

జయలలిత అనారోగ్యంతో కుంటుపడిన పాలన : సుబ్రమణ్యస్వామి

చెన్నై : తమిళనాడు జయలలిత అనారోగ్యంతో తమిళనాడులో పాలన కుంటుపడిందని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి విమర్శించారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సుబ్రమణ్యస్వామి లేఖ రాశారు. 

12:46 - October 7, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలోని పెదవేగి మండలం రామసింగవరంలో దారుణం జరిగింది. బడికెళ్లలేదని కూతుర్ని కన్న తండ్రే చితకబాదడంతో చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెల 22న బడికి వెళ్లలేదని ఆరో తరగతి చదువుతున్న 12ఏళ్ల కుమార్తెను తండ్రి చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలిక మృతి చెందింది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా కుమార్తె మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టాడు తండ్రి. ఆతర్వాత బాలిక బంధువుల ఇంటికి వెళ్లిందని గ్రామస్తులకు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు నీలదీయడంతో విషయం బయటకు వచ్చింది. బాలిక తల్లి స్వరూపారాణిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా జరిగిన దారుణాన్ని బయటపెట్టింది. మృతికి కారుకుడైన తండ్రి రాజారత్నం పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు.

 

నిఘావర్గాల హెచ్చరికతో హై అలర్ట్

ఢిల్లీ : నిఘావర్గాల హెచ్చరికతో సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాల్లో దాడులు జరిగే అవకాశముందన్న హెచ్చరికతో తనిఖీలు పెంచారు. నిఘావర్గాల ముఖ్యప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. జమ్ము కాశ్మీర్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ సరిహద్దులో పోలీసులు సోదాలు జరుపుతున్నారు. 

12:43 - October 7, 2016

ఢిల్లీ : నిఘావర్గాల హెచ్చరికతో సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాల్లో దాడులు జరిగే అవకాశముందన్న హెచ్చరికతో తనిఖీలు పెంచారు. నిఘావర్గాల ముఖ్యప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. జమ్ము కాశ్మీర్‌,  గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ సరిహద్దులో పోలీసులు సోదాలు జరుపుతున్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:39 - October 7, 2016

తమిళనాడు : చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను రాహుల్‌గాంధీ పరామర్శించనున్నారు. మరో వైపు మధుమేహం, అస్తమా సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న జయ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జయ ఆరోగ్యం కుదుటపడడం లేదు. ఆమెకు చికిత్స కొనసాగుతుందని ఎయిమ్స్‌ వైద్యులు చెబుతున్నారు. సుదీర్ఘకాలం వైద్యం అవసరమని వైద్యులు అంటున్నారు. నేడు లండన్‌ నుంచి డాక్టర్‌ రిచర్డ్‌ జాన్‌ 
రానున్నన్నారు.

 

12:32 - October 7, 2016

హైదరాబాద్‌ : దేశంలో ఎక్కడ ఏ సరుకు దొరికినా అది అక్రమమని తేలినా..దానికి మూలం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు... ఇక్కడి నుంచే కొనసాగుతున్న స్మగ్లింగ్‌తో భారీగా తరలిపోతున్నాయి..డ్రగ్స్...ఎలక్ట్రానిక్ వస్తువులు..సిగరేట్లు..బంగారం..ఇలా విదేశాల నుంచి తరలివస్తున్న సరుకు ఈజీగా బయటపడుతుంది..ఇందుకు కారణాలేంటని లోతుగా దర్యాప్తు చేసిన దాఖలాలు లేవు...ఆ సమయంలో దొరికిన స్మగ్లర్ల నుంచి వచ్చిన సమాచారంతో కొందరు ఇంటి దొంగలను అరెస్టు చేసేవారే..ఆ తర్వాత ఇక దాని గురించి సమాచారం సేకరణ ఉండదు...తాజాగా డ్రగ్స్‌ సరఫరాలో వింగ్ కమాండర్ రాజశేఖర్‌రెడ్డి దొరకడంతో ఎన్నో విషయాలు బయటపడ్డాయి..మరెన్నో విషయాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. అక్రమ రవాణాకు అడ్డు కట్ట పడేదెన్నడు...??
స్మగ్లింగ్‌ అడ్డాగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు..
ఒక వైపు బంగారం, మరో వైపు డ్రగ్స్...ఇంకో వైపు నకిలీ కరెన్సీ..ఆ వైపు ఎర్రచందనం....దేశ సంపదనను కొల్లగోట్టే విలువయిన వస్తువులను అక్రమ రవాణా ద్వారా తీసుకురావడం మామూలైంది...కస్టమ్స్ అధికారులు, అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా...వీరి ఆగడాలకు మాత్రం ఎయిర్ పోర్టులు అడ్డాగా మారుతున్నాయి...డీ.ఆర్.ఐ. రంగంలో దిగేంత వరకు దోపిడిలు బహిర్గతం కావడం లేదంటే సహకరిస్తున్నదెవరు..? వాటిని తరలించేందుకు సాయం చేస్తున్నదెవరు...? 
బడా దోపిడిలను పట్టించుకోవడం లేదా...?
ఒక్కమాటలో చెప్పాలంటే విదేశాల నుంచి ఒక ఎల్.ఈ.డీ. టీ.వీ. తీసుకోస్తే.. కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని కోరడా ఝుళిపించే కస్టమ్స్ అధికారులు.. బడా దోపిడిలను పట్టించుకోవడం లేదా...? భారత దేశ అదాయానికి గండి కొడుతున్న ముఠాలకు ఎయిర్ పోర్టు సిబ్బంది, ప్రభుత్వ ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయనే అరోపణలు ఉన్నాయి...
హైదరాబాద్‌ కేంద్రంగానే రవాణా..
దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాటి మూలాలు హైదరాబాద్ లో ఉంటున్నాయి...వరుసగా జరుగుతున్నసంఘటనలు భద్రత వలయాల్లో ఉండే ఎయిర్ పోర్టులకు మచ్చ తెస్తున్నాయి..మొన్న బెంగళూర్ లో పట్టుపడ్డ 250 కోట్ల విలువ చేసే డ్రగ్స్ హైదరాబాద్ నుంచి సరఫరా అయింది...శాస్త్ర వేత్త అతని భార్య ఫార్మాకంపనీల నుంచి డ్రగ్స్ తయారు చేయించుకోని హైదరాబాద్ బేగం పేట ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు , చెన్నై ఆ తర్వాత దక్షాణాఫ్రికా, ఆసియా దేశాల్లోకి తరలించారు.. ఇందుకు సహకరించింది ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్ రాజశేఖర్‌రెడ్డినే..కీలకమైన అధికారిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి తన పవర్‌ను డ్రగ్స్ తరలించడంలో వాడుకున్నారు...గత 5 యేళ్లుగా ఈ దందా కోనసాగుతుందని తేలింది...వందల కోట్ల రూపాయల డ్రగ్స్‌ తరలిపోయింది.
అడ్డూ అదుపులేని బంగారం స్మగ్లింగ్‌
బంగారం స్మగ్లింగ్‌కు అడ్డూ అదుపులేనేలేదు...దేశ విదేశాల నుంచి తరలివస్తున్న కిలోల కొద్దీ గోల్డ్‌ ఇప్పటికే ఎన్నో సార్లు ఎయిర్‌పోర్టులో దొరికిపోయింది.. అక్రమ రవాణాలో దొరికింది 40 శాతమేనని తెలుస్తోంది...మిగతాది కొందరు అధికారుల అండదండలతో తరలిపోయినట్లు ఆరోపణలున్నాయి...ఇంటి దొంగల ప్రమేయంతో భారీగా స్మగ్లింగ్‌ జరుగుతుందనేది ఇప్పటికే కొన్ని ఘటనల్లో తేలిన విషయం...
గోల్డ్‌ రవాణాకు శంషాబాద్‌ పోర్టు అడ్డా...
బంగారం అక్రమ దిగుమతులకు శంషాబాద్ ఎయిర్ పోర్టు అడ్డగా మారిందనడంలో సందేహం లేదు...ఇప్పటికే కస్టమ్స్‌ అధికారులు కిలోల కొద్దీ బంగారాన్ని పట్టుకున్నారు..అయితే రవాణా అయిందెంత..? పట్టుకున్నదెంత అంటే మాత్రం లెక్కలు లేవు.. ఎందుకంటే రవాణా అవుతున్న దాంట్లో చాలా వరకు ఇంటి దొంగల సహకారంతోనే తరలిపోతున్నట్లు తెలుస్తోంది...దుబాయి, సౌదీ నుంచి వచ్చే వారు అక్రమంగా కిలోల కొద్ది బంగారం తీసుకొస్తుంటారు..వీరికి కిలోపై కొన్ని లక్షల రూపాయల సుంకం చెల్లించాల్సిన అసవరం ఉండదు..దీంతోనే స్మగ్లింగ్‌ చేస్తూ గోల్డ్‌ను తరలిస్తున్నారు...ఇలా నెలకు వందల కిలోల బంగారం అక్రమంగా దిగుమతి అయినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ వద్ద అధారాలు ఉన్నాయి...గతంలో ఎయిర్ హోస్టెస్‌ అరెస్ట్ చేస్తే 17 కేజీల బంగారం పట్టుపడింది...ఇక జీ.ఎం.ఆర్. ఉద్యోగుల హాస్తం ఉందని తెల్చి అరెస్టులు కూడా జరిగాయి...
అక్రమ రవాణా 
కాదేదీ స్మగ్లింగ్‌కు అనర్హం అన్నట్లు మారింది. విదేశాల్లో చౌకగా దొరికే సిగరేట్లు, సెల్‌ఫోన్ పరికరాలు ఇలా ఎన్నోరకాల వస్తువులు అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. 15 రోజుల క్రితం పట్టుపడ్డ 4 కోట్ల విలువ చేసే సింగరేట్స్ వీటికి ఉదహారణ..కస్టమ్స్ రుసుము లేకుండా చేసుకునేందుకు ముఠాలు పెద్ద ఎత్తున్న అక్రమాలకు పాల్పడుతున్నాయి... 
రవాణా ఆగకపోవడానికి కారణాలేంటి..
ఎయిర్ పోర్టులో ఎంతో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు, స్కానర్లు ఉన్నా.. అక్రమ రవాణా మాత్రం అగడం లేదు. అధికారులకు పట్టుపడుతున్న వస్తువులు చాల తక్కువేనని తెలుస్తోంది...కస్టమ్స్ అధికారులు ఎన్ని ఎత్తులు వేసిన అంతకు పై ఎత్తులు వేస్తూ.. స్మగ్లర్లు సరుకులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇందుకు సహకరిస్తున్న ఇంటి దొంగలను ఏరిపారేస్తేనే వీటికి అడ్డుకట్ట పడేది.

 

కాసేపట్లో జయలలిత పరామర్శించనున్న రాహుల్ గాంధీ

చెన్నై : కాసేపట్లో తమిళనాడు సీఎం జయలలిత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. అపోలో వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

12:16 - October 7, 2016

దర్శకుడు బోయపాటి శ్రీను హ్యట్రిక్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈ మాస్ దర్శకుడు మరో బ్లాక్ బస్టర్ కొట్టాడానికి మరోసారి పక్కా మాస్ స్టోరీని రెడీ చేశాడట. మరి బోయపాటి కొత్త మూవీ విశేషాలేంటో మీరు ఓ లుక్కెయండి.
మరోసారి పక్కా మాస్ స్టోరీని సిద్ధం చేసిన బోయపాటి
దర్శకుడు బోయపాటి శ్రీను బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో పుల్ స్వీంగ్ లో ఉన్నాడు. బాలకృష్ణతో 2014లో లెజెండ్ లాంటి రోరింగ్ హిట్టు కొట్టిన ఈ దర్శకుడు ఈ ఎడాది స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్ తో సరైనోడు లాంటి ఊరమాస్ సినిమా తీసి మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ తో ఊపులో ఉన్న ఈ దర్శకుడు హ్యట్రిక్ బ్లాక్ బస్టర్ కోసం మరోసారి పక్కా మాస్ స్టోరీని సిద్ధం చేసినట్లు సమాచారం. 
బోయపాటి అంటేనే ఊరమాస్ 
బోయపాటి శ్రీను అంటేనే ఊరమాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఈ దర్శకుడు ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో కొత్త మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ నెలల కిందటే ఒపెనింగ్ జరుపుకుంది. అయితే పక్కా స్టోరీ రెడీ చేసుకున్నకే షూటింగ్ స్పాట్ లోకి అడుగుపెట్టాలని దర్శకుడు బోయపాటి నిర్ణయించుకున్నాడట. అందుకే ఇంతకాలం స్టోరీ ప్రిపరేషన్ లో ఉన్న ఈ దర్శకుడు ఇప్పుడు స్టోరీని లాక్ చేసి షూటింగ్ కి రెడీ అయినట్లు తెలుస్తోంది.  
నవంబర్ 4 నుంచి రెగ్యులర్ షూటింగ్   
నవంబర్ 4వ తేదీ నుంచి బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్, రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. పక్కా మాస్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రకూల్ ని హీరోయిన్ తీసుకున్నారు. లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దేవిశ్రీ ప్రసాద్ మరోసారి బోయపాటి మూవీకి సంగీతం అందించబోతున్నాడు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని సమ్మర్ కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మూవీతో బోయపాటి హ్యట్రిక్ కంప్లీట్ చేయడంతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ని మలుపు తిప్పే హిట్టు ఇవ్వాలని కసిగా ఉన్నాడట.

 

11:59 - October 7, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని గోదావరిఖనిలో వీఆర్‌ఎస్‌ ఇండిపెండెంట్లు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆందోళన చేపట్టారు. తమ పిల్లలకూ వారసత్వ ఉద్యోగాల భర్తీలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 1997 నుంచి 2001వరకూ సింగరేణిలో వీఆర్ ఎస్ పొందిన కార్మికులకు 2లక్షల రూపాయలు చెల్లించి ప్రభుత్వం రిటైర్‌మెంట్ ఇచ్చింది. వారసత్వ ఉద్యోగాల భర్తీలో ఈ కార్మికుల కుంటుంబాలకు అవకాశం లేదన్న ప్రకటనతో వీరంతా నిరసనబాట పట్టారు. వారసత్వ ఉద్యోగాల భర్తీలో తమ పిల్లలకూ అవకాశం ఇవ్వాలని డిమాండ్

 

11:56 - October 7, 2016

హైదరాబాద్ : మియాపూర్ లేక్ వ్యూ ఎన్ క్లేవ్ లో భారీ చోరి జరిగింది. లేక్ వ్యూ ఎన్ క్లేవ్ లో నివాసముంటున్న ప్రభావతి ఇంట్లో  రాత్రి ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. దొంగలు 60 తులాల బంగారం, 2 కిలోల వెండి, భారీగా నగదు దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

11:55 - October 7, 2016

అమెరికా : హైతీలో దాదాపు 300మంది ప్రాణాలుతీసిన మాథ్యూ హరికేన్‌... అమెరికాను వణికిస్తోంది.. శక్తివంతమైన ఈ హరికేన్‌ ఫ్లోరిడాలో బీభత్సం సృష్టిస్తోంది..దీంతో అమెరికా అధ్యక్షుడు ఒబామా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.. జార్జియా రాష్ట్రాల్లోఎమర్జెన్సీ ప్రకటించారు.ఈ తుఫాన్‌ బీభత్సానికి హైతీ వణికిపోయింది... 230 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీగా నష్టం జరిగింది.. చెట్లు, ఇళ్లు కూలిపోయాయి.. నదులు ఉప్పొంగి ప్రవహించడంతో దాదాపు 339 మంది మరణించారు.. ముఖ్యంగా మత్స్యకార కుటుంబాల్లో ఎక్కువమంది మృత్యువాత పడ్డారు.. నైరుతి దిశలోని టుబురాన్‌లో నష్టతీవ్రత ఎక్కువగా ఉంది.
ఊళ్లోకి నీళ్లు 
లెస్ ఆంగ్లాయిస్ ప్రాంతాన్ని ముందుగా ఈ మాథ్యూ హరికేన్ కొట్టింది. సముద్రం ఉప్పొంగి ఊళ్లోకి నీళ్లు వచ్చేశాయి. ప్రాణభయంతో అందరూ ఇళ్లు విడిచి బయటకు పరుగులుతీశారు.. 2007లో వచ్చిన ఫెలిక్స్ హరికేన్ తర్వాత.. కరేబియన్‌ దీవుల్లో ఆ స్థాయిలో వచ్చిన అతి బలమైన హరికేన్ మాథ్యూయే అని స్థానికులు చెబుతున్నారు.. ఈ తుఫాన్‌ ఇప్పుడు ఫ్లోరిడా దిశగా పయనిస్తోంది.  ఈ హరికేన్‌ హెచ్చరికతో హైతీలో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికను ఆదివారానికి వాయిదా వేశారు. 2010నుంచి హైతీలో ప్రకృతి విపత్తులు సంభవిస్తూనే ఉన్నాయి.. 2010లో హైతీ రాజధాని పోర్ట్ ఆవు ప్రిన్స్ ప్రాంతంలో భారీ భూకంపం 2 లక్షల మంది ప్రాణాలుతీసింది.. ఆ తర్వాత వచ్చిన కలరా వల్ల మరో 9 వేల మంది మరణించారు, మరికొన్ని వేల మంది అనారోగ్యం పాలయ్యారు.. ఈసారి కూడా కలరా వచ్చే ప్రమాదం ఉందని, వరదల కారణంగా నీరు కలుషితం అయిందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ  
హైతీలో తుఫాన్‌ బీభత్సంతో ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల ఒబామా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇక్కడ దాదాపు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ పదేళ్లలో అమెరికాలో ఎప్పుడూ ఇంత తీవ్రమైన హరికేన్ రాలేదు. తీరం సమీపానికి వచ్చేకొద్దీ హరికేన్ తీవ్రత మరింత పెరుగుతుంది. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరం మొత్తం దీనివల్ల ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 

ఫ్లోరిడాలో మాథ్యూ పెను తుపాన్ బీభత్సం

అమెరికా : ఫ్లోరిడాలో మాథ్యూ పెను తుపాన్ బీభత్సం సృష్టించింది. గంటకు 220 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తాకిడికి హైతిలో 339 మందికి పైగా మృతి చెందారు. ఒబామా ప్రభుత్వం ప్లోరిడాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. 

అఖ్నూర్ లో అనుమానిత వ్యక్తులు సంచారం

జమ్మూకాశ్మీర్ : అఖ్నూర్ లో అనుమానిత వ్యక్తులు సంచారించారు. జౌరియన్ వద్ద అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్ల గుర్తించారు. భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. 

ప.గో జిల్లాలో దారుణం

పశ్చిమ గోదావరి : పెదవేగి మండలం రామసింగారంలో దారుణం జరిగింది. స్కూల్ కు వెళ్లడం లేదని తండ్రి కొట్టడంతో 12 ఏళ్ల కుమార్తె మృతి చెందింది. గుట్టుచప్పుడు కాకుండా తండ్రి ఆమె మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టాడు. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

11:31 - October 7, 2016

టీఆర్ ఎస్ నేత కె.కేశవరావు నివాసంలో హైపవర్ కమిటీ భేటీ

హైదరాబాద్ : టీఆర్ ఎస్ నేత కేశవరావు నివాసంలో హైపవర్ కమిటీ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

తంజూవూరులో ప్రతిపక్ష నేత స్టాలిన్ ధర్నా

తమిళనాడు : తంజూవూరులో ప్రతిపక్ష నేత స్టాలిన్ ధర్నా చేపట్టారు. కావేరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

మలేషియా ఎయిర్ లైన్స్ శకలాలు గుర్తింపు

కౌలాలంపూర్ : మలేషియా ఎయిర్ లైన్స్ శకలాలను గుర్తించారు. మారిషస్ లో విమాన శకలాలను గుర్తించినట్లు ధృవీకరించారు. 2014 మార్చి 8న మలేషియా ఎయిర్ లైన్స్ గల్లంతయ్యారు. విమాన ప్రమాదంలో 200 మంది మృతి చెందారు. 

 

పాక్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులతో రాజ్‌నాథ్ భేటీ

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ ఇండో, పాక్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఈ భేటీకి రాజస్థాన్‌, గుజరాత్‌, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు... బీఎస్ ఎఫ్ ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు.. జైసల్మేర్‌లో నిర్వహించబోయే ఈ సమావేశంలో ఉగ్రదాడులు, పీవోకేలో పరిస్థితిపై చర్చించే అవకాశముంది.

11:11 - October 7, 2016

చిత్తూరు : బ్రహ్మోత్సవాల్లో ముఖ్యఘట్టమైన గురుడోత్సవానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ రాత్రి జరగబోయే గరుడోత్సవానికి భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. తిరుమలలో భద్రతపై రాయలసీమ డీఐజీ ప్రభాకర్‌ రావుతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం....

11:06 - October 7, 2016

చెన్నె : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. మధుమేహం, అస్తమా సంబంధిత వ్యాధులతో జయ బాధపడుతోంది. మరో వైపు ఎయిమ్స్‌ వైద్యుల చికిత్స కొనసాగుతోంది. సుదీర్ఘకాలం చికిత్స అవసరమని అపోలో వైద్యులు అంటున్నారు. నేడు లండన్‌ నుంచి డాక్టర్‌ రిచర్డ్‌ జాన్‌ చెన్నైకు రానున్నారు. జయలలిత ఆరోగ్యం కుదుట పడడానికి ఇంకా సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే జయలలిత వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. జయలలిత దత్తత తీసుకుని వివాహం జరిపిన కుమారున్ని కూడా అనుమతించడం లేదు. 

 

11:00 - October 7, 2016

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ ఇండో, పాక్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఈ భేటీకి రాజస్థాన్‌, గుజరాత్‌, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు... బీఎస్ ఎఫ్ ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు.. జైసల్మేర్‌లో నిర్వహించబోయే ఈ సమావేశంలో ఉగ్రదాడులు, పీవోకేలో పరిస్థితిపై చర్చించే అవకాశముంది.

 

10:47 - October 7, 2016
10:39 - October 7, 2016
10:37 - October 7, 2016

భక్త కన్నప్ప చిత్రానికి సంబంధించి ఫీల్మ్ సర్కిల్స్ లో మరో కొత్త విషయం వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణుతో తనికెళ్ల భరణి రూపొందించాలనుకున్నాడు. కానీ లేటేస్ట్ గా ఈ మూవీకి ఓ వర్సటైల్ దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడట. ఇంతకీ భక్తకన్నప్ప సినిమా కహానీ ఏంటో మీరు ఓ లుక్కెయండి.
ప్రభాస్ తో రిమేక్ ..?
పాత మధుర చిత్రం భక్తకన్నప్ప కృష్ణం రాజు కెరీర్ లోనే కాదు తెలుగు చిత్రం పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచి పోయింది. ఈ చిత్రాన్ని ప్రభాస్ తో రిమేక్ చేయాలని కృష్ణంరాజు భావిస్తున్నాడు. అయితే ఇంతలోనే తనికెళ్ల భరణి భక్తకన్నప్ప పేరట ఓ స్టోరీ రెడీ చేశాడు. ఈ చిత్రాన్ని తన దర్శకత్వంలోనే రూపొందించాలని తనికెళ్ల భరణి ఎడాదిగా విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఆగిపోయిందనుకున్న ఈ మూవీకి సంబంధించిన లేటేస్ట్ గా కొత్త న్యూస్ వినిపిస్తోంది.
తనికెళ్ల భరణి దర్శకత్వంలో మంచు విష్ణు
తనికెళ్ల భరణి తన దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా భక్తకన్నప్ప రూపొందించాలని ప్లాన్ చేశాడు. కానీ ఎందుకోఈ నటుడు ఇప్పుడు మార్చుకున్నాడట. ఈ స్టోరీని కృష్ణవంశీతో దర్శకత్వంలో తెరకెక్కించాలని భావిస్తున్నాడట. అయితే కన్నప్పగా మాత్రం మంచు విష్ణునే నటించబోతున్నాడట. తనికెళ్ల భరణి ఇటీవలే ఈ విషయాన్నికృష్ణవంశీకి చెప్పాడట. అందుకు ఈ దర్శకుడు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం.ప్రస్తుతం కృష్ణవంశీ నక్షత్రం చిత్రం షూటింగ్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కంప్లీట్ గానే భక్తకన్నప్ప స్టోరీపై కూర్చుకునేందుకు ప్లాన్ చేసినట్లు టాక్ . ఇంతకు ముందు ఈ దర్శకుడు శ్రీఆంజనేయం అనే భక్తి చిత్రం చేసి చేతులు కాల్చుకున్నాడు. మరీ ఇప్పుడు భక్తకన్నప్పతో కృష్ణవంశీ మైమరిపిస్తాడా లేక శ్రీఆంజనేయం ఫలితాన్నే పునరావృత్తం చేస్తాడా చూడాలి.  

10:31 - October 7, 2016
10:26 - October 7, 2016
10:25 - October 7, 2016

కుదటపడని సీఎం జయలలిత ఆరోగ్యం

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం కుదటపడడం లేదు. మధుమేహం, ఆస్తమా సంబంధిత సమస్యలతో జయలలిత బాధపడుతోంది. ఎయిమ్స్ వైద్యుల చికిత్స కొనసాగుతోంది. జయకు సుధీర్ఘంగా చికిత్స అవసరమని ఆపోలో వైద్యులు తెలిపారు. నేడు లండన్ నుంచి డాక్టర్ రిచర్డ్ జాన్ రానున్నారు. 

 

08:51 - October 7, 2016

.సీపీఎం చేపట్టన మహాజన పాదయాత్రపై టీ.ప్రభుత్వం చేస్తున్న విమర్శలు అర్ధరహితమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీపీసీసీ నేత మహేష్ గౌడ్, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ పాల్గొని, మాట్లాడారు. టీఆర్ ఎస్ అధికారంలోకి రాగానే నియంతృత్వ పోకడలకు పోతుందని విమర్శించారు. ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తుంటే ప్రభుత్వానికి ఎందుకింత ఉలికిపాటు అని ప్రశ్నించారు. అధికార పార్టీ తీరు సరిగ్గా లేదన్నారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను వెలికితీసి వాటి పరిష్కారానికి ప్రభుత్వాలపై పోరాటం చేస్తాయని తెలిపారు. ప్రజా సమస్యలపై టీప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. విమర్శలు మాని.. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

నేడు కర్నూలులో సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర, ధర్నా

కర్నూలు : నేడు సీపీఎం ఆధ్వర్యంలో ఓర్వకల్లు నుంచి కర్నూలు వరకు పాదయాత్ర, ధర్నా నిర్వహించనున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పాల్గొననున్నారు. శకునాలలో సోలార్ పవర్ ప్లాంట్ లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. 

 

పూంచ్ సెక్టార్ లో రెండు చోట్ల పాక్ సైన్యం కాల్పులు

శ్రీనగర్ : పాకిస్తాన్ కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ సెక్టార్ లో రెండు చోట్ల పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. 

నేడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

మహబూబ్ నగర్ : నేడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

నేడు సుప్రీంకోర్టులో సీఎం జయలలిత ఆస్తుల కేసు విచారణ

ఢిల్లీ : నేడు సుప్రీంకోర్టులో తమిళనాడు సీఎం జయలలిత ఆస్తుల కేసు విచారణ జరుగనుంది. కోర్టు నేడు తుది తీర్పు ప్రకటించనుంది. 

07:56 - October 7, 2016

బంగారం వర్తకవ్యాపారానికి ఇప్పటి వరకు కౌన్సిల్ ఉందని... దానికి బోర్డు ఏర్పాటు చేయాలని గోపీనాధ్‌ డిమాండ్ చేశారు. ఇవాళ్టి జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'మొన్న తులం బంగారం ధర ఒక్కసారిగా 750 రూపాయలకు పైగా పడిపోవడం బంగారం మార్కెట్‌ లో తీవ్ర కలకలమే సృష్టించింది. పండుగల సీజన్‌ లో ధర మరింత పెరుగుతుందన్న అంచనాల నేపథ్యం ఈ పతనం మార్కెట్‌ను కుదిపేసింది. అయితే, బంగారం ధరల్లో తీవ్ర హెచ్చతగ్గులకు కారణం ఏమిటి? సమీప కాలంలో బంగారం ధరలు ఏ దిశలో పయనించే అవకాశం వుంది? అసలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్న అంశాలేమిటి? బంగారం ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల బంగారం వర్తకులు, బంగారం పనిచేసేవారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? బంగారం ధరల్లో హెచ్చుతగ్గులను నివారించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:35 - October 7, 2016

ఉత్తర ప్రదేశ్‌ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోడీపై మళ్లీ ధ్వజమెత్తారు. సర్జికల్‌ దాడుల పేరిట జవాన్ల రక్తంతో ప్రధాని చెలగాటమాడుతున్నారని తీవ్రమైన విమర్శలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో చేపట్టిన కిసాన్‌యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముగిసిన రాహుల్‌ కిసాన్‌ యాత్ర
ఉత్తరప్రదేశ్‌లో 2017లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన కిసాన్‌ యాత్ర  ముగిసింది. ఢిల్లీ పార్లమెంట్‌ స్ట్రీట్‌కు చేరుకోవడంతో రాహుల్‌ యాత్ర ముగిసింది. జంతర్‌మంతర్‌ వద్ద రైతుల నుద్దేశించి ప్రసంగించిన రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదిని టార్గెట్‌ చేశారు. జమ్ముకశ్మీర్‌లో  సైనికులు రక్తం ధార పోశారు..సర్జికల్‌ దాడులు చేశారు.. వారి రక్తంతో మీరు చెలగాటమాడుతున్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు విదేశాల నుంచి నల్లధనాన్ని తెప్పించి ఒక్కొక్కరి బ్యాంక్‌ ఖాతాలో 15 లక్షలు వేస్తామని ప్రజలకిచ్చిన హామీ ఏమైందని ప్రధానిని నిలదీశారు.
నెల రోజులపాటు కిసాన్‌ యాత్ర 
సెప్టెంబర్‌ 6వ తేదీన రాహుల్‌ గాంధీ దియోరి నుంచి చేపట్టిన కిసాన్‌ యాత్ర నెల రోజుల పాటు కొనసాగింది. రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అధికార సమాజ్‌వాదీ పార్టీ, బిజెపిలను టార్గెట్‌ చేశారు. రైతులకు రుణమాఫీ చేయాలని అఖిలేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మోది ప్రభుత్వం కొందరు పారిశ్రామికవేత్తలకే కొమ్ము కాస్తోందని, రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. 
ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న రాహుల్  
యూపిలోని మొత్తం 4 వందల నియోజకవర్గాలకు గాను 140 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా 26 ఖాట్‌ సభలు, 26 రోడ్‌ షోలు నిర్వహించారు. రైతులు, ఇతరులు తమ సమస్యలను రాహుల్‌కు విన్నవించుకున్నారు. 
హాస్యాస్పదమైన సంఘటనలు 
కిసాన్‌ యాత్రలో కొన్ని హాస్యాస్పదమైన సంఘటనలు జరిగాయి. రాహుల్‌ నిర్వహించిన ఖాట్‌ సభలకు వచ్చిన గ్రామస్థులు సభ ముగిసిన అనంతరం మంచాలను ఎత్తుకెళ్లారు. 

 

నేటి నుంచి రైలు ప్రయాణికులకు పైసాకే రూ.10 బీమా

హైదరాబాద్ : నేటి నుంచి రైలు ప్రయాణికులకు పైసాకే రూ.10 బీమా వర్తిస్తుంది. ఈనెల 31 వరకు తీసుకున్న అన్ని టిక్కెట్లపైనా బీమా వర్తింపు అమలవుతుంది. 

07:26 - October 7, 2016

హైదరాబాద్ : జిల్లాల ఏర్పాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. తాను అనుకున్న వ్యూహంలోకి ప్రతిపక్షాలను లాగడంలో విజయం సాధించారు. కేసీఆర్ వ్యూహంతో విపక్షాలు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది. 
జిల్లా పునర్విభజనపై అఖిలపక్ష భేటీ 
జిల్లాల విభజపై  ప్రభుత్వం మొదలు పెట్టిన కసరత్తు రాజకీయ ఆందోళనలకు దారితీసింది. అధికార పార్టీ తమకు అనుకూలంగా జిల్లాల పునర్విభజన చేస్తోందంటూ విపక్షాలు విమర్శల వర్షం కురిపించాయి. దీంతో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి  ఆయా పార్టీల నేతల అభిప్రాయాలు స్వీకరించింది. జిల్లాల విభజన అంశాన్ని అన్ని పార్టీలు స్వాగతించాయి. ఇదే సమయంలో మండలాల విలీనం, కొత్త మండలాలు, డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి పలు డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. 
మొత్తం 27జిల్లాల ఏర్పాటకు ముసాయిదా నోటిఫికేషన్‌ 
రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలను పునర్వస్థీకరించి, కొత్తగా పదిహేడు జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తం 27 జిల్లాలను ఖరారు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ విడదలచేసి ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించింది. గద్వాల, జనగామ, సిరిసిల్ల జిల్లాలకు ముసాయిదాలో చోటు దక్కలేదు. దీంతో ఆ మూడు ప్రాంతాల్లో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. సీఎం కేసీఆర్‌ కుటుంబంపై విపక్ష నేతలు వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. 
కొత్తగా మరో నాలుగు జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం 
దీంతో కేసీఆర్‌... రాష్ట్ర మంత్రులు, ఎంపీలు,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  రెండు రోజుల పాటు సమీక్షలు నిర్వహించారు.  ప్రజలు, నేతల నుంచి వచ్చిన డిమాండ్లను పరిగణలోకి తీసుకుని  కొత్తగా మరో నాలుగు జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. అదిలాబాద్‌లో ఆసిఫాబాద్, వరంగల్‌లో జనగామ, కరీంనగర్‌లో సిరిసిల్ల, మహబూబ్‌నగర్‌లో గద్వాల  జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో విపక్ష పార్టీలు తాము విజయం సాధించామని సంబరపడాలో.....లేక  కేసీఆర్‌ ఆడిన పొలిటికల్‌ గేమ్‌లో చిక్కుకున్నామని బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితిని సృష్టించారు.  గులాబీ బాస్‌ వ్యూహంతో  జిల్లాల ఏర్పాటుకు ఉద్యమించిన నేతలు ఇప్పుడు సైలెంట్‌ అయ్యారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ఈ నిర్ణయం  తీసుకున్నామన్న వాదాన్ని టీఆర్ ఎస్ నేతలు వినిపిస్తున్నారు. కాగా  కొత్త జిల్లాల ఏర్పాటు  ఘనత గులాబీ పార్టీకి దక్కుతుందన్న ఆందోళన విపక్ష నేతల్లో  మొదలైంది.
మరికొన్ని ప్రాంతాల్లో జిల్లాల సాధన కోసం ఉద్యమాలు  
కొత్తగా నాలుగు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో... తాజాగా మరికొన్ని ప్రాంతాల్లో జిల్లాల సాధన కోసం ఉద్యమాలు తీవ్రం అవుతున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం, మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట,  వరంగల్‌ జిల్లా ములుగు, కరీంనగర్‌ జిల్లాలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరుతో మరో జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు  గట్టిగా వినిపిస్తున్నాయి. 
హైపవర్‌ కమిటీ నియామకం
మరోవైపు జిల్లాల పునర్విభజనపై కొత్త డిమాండ్లను పరిగణలోకి తీసుకునే ప్రసక్తే లేదని కేశవరావు అధ్యక్షతన ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ చెబుతోంది. అయితే పునర్విభజనలో అన్ని జిల్లాలు  రూపు రేఖలు మారుతున్నా ... హైదరాబాద్ మాత్రం యథావిధిగా ఉండడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
 

నేడు జీఎస్ ఝా కమిటీ సమావేశం

బెంగళూరు : కావేరి నదీ జలాల వివాదంపై నేడు జీఎస్ ఝా కమిటీ సమావేశం జరుగనుంది. కావేరి నదీ పరివాహక ప్రాంతాలను కమిటీ సందర్శించనుంది. 17 న సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనుంది. 

 

07:14 - October 7, 2016

గుంటూరు : రాష్ట్రంలోని ప్రతిపక్షాలు పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఎపి ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు విమర్శించారు. పరోక్షంగా వామపక్షాలపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదని ఓ వైపు విమర్శిస్తూనే మరోవైపు వచ్చిన పరిశ్రమలను కూడా కొందరు నేతలు అడ్డుకుంటున్నారని గుంటూరు జిల్లా లో జరిగిన టీడీపీ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో మండిపడ్డారు.
పరోక్షంగా సీపీఎంపై విరుచుకుపడ్డ బాబు 
గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో జరిగిన టీడీపీ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు ప్రతిపక్షాలను ముఖ్యంగా వామపక్షాలను టార్గెట్‌ చేశారు. పరోక్షంగా సీపీఎంపై విరుచుకుపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో దివీస్‌ ల్యాబ్స్‌, పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వా ఫుడ్‌ పార్క్‌లకు అవరోధాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
దివీస్ కాలుష్యం...భూగర్భ జలాలు విషతుల్యం
సీఎం చంద్రబాబు ఆరోపణలు ఇలావుంటే..వాస్తవానికి విశాఖ జిల్లాలో దివీస్‌ వెదజల్లుతున్న కాలుష్యంతో చాలా గ్రామాల్లో భూగర్భ జలాలు విషతుల్యంగా మారాయి. జలవనరులు కాలుష్య కాసారాలుగా తయారయ్యాయి. కోరలు సాచిన దివీస్‌ కాలుష్యం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోదంటూ ఈ ప్రాంత ప్రజలు ఈ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దివీస్‌ ల్యాబ్స్‌ తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో మరో యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని.. దివీస్‌కు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా తొండంగి ప్రాంత ప్రజలు చేస్తున్న ఆందోళనకు సీపీఎం బాసటగా నిలిచింది. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో ఫుడ్‌ పార్క్‌ వ్యతిరేక ఉద్యమానికి సీపీఎం అండగా నిలిచింది. ఏపీ రాజధాని అమరావతి భూసమీకరణను కూడా ప్రతిపక్షాలు అడ్డుకున్న విషయాన్ని టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ఎవరు ఎన్ని అవరోధాలు, అడ్డంకులు సృష్టించినా అన్నింటిని అధిగమించి ముందుకుపోవడమే తన కర్తవ్యమంటూ పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు.

 

07:04 - October 7, 2016

హైదరాబాద్ : సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్‌ వరాల వానలో తడిపేశారు. లాభాల్లో కార్మికులకు 23శాతం వాటా చెల్లించాలని ప్రకటించారు. డిపెండెంట్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియ పునరుద్ధిరించాలన్నారు. దీపావళి బోనస్‌గా ప్రతి కార్మికునికి మరో 54 వేలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. మరోవైపు సీఎం వరాలు ప్రకటించడంతో సింగరేణి ఉద్యోగులు, కార్మికులు సంబురాల్లో మునిగితేలారు.  
కార్మికుల సంక్షేమానికి కీలక నిర్ణయాలు 
సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కార్మికుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కార్మికుల సమస్యలపై ప్రజాప్రతినిధులు, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపారు. సింగరేణిలో పనిచేసి గాయపడినా, అనారోగ్యం పాలయినా, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం అన్నారు. ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.అదేవిధంగా డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టాలన్నారు. 
లాభాల్లో కార్మికులకు 23 శాతం వాటా 
సింగరేణి సంస్థకు 2015-16 సంవత్సరంలో సింగరేణి సంస్థకు 1066.13 కోట్ల నికర ఆదాయం వచ్చింది. అయితే ఈ లాభంలో కార్మికులకు 23శాతం వాటా చెల్లించాలని సీఎం నిర్ణయించారు. సింగరేణి కార్మికులకు 245.21 కోట్లు పంపిణీ చేశారు. దీంతో ఒక్కో కార్మికుడికి సగటున 43,078లు అందనుంది. ఇక దీపావళి బోనస్‌గా ప్రతి కార్మికునికి మరో 54 వేలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఒక్కో కార్మికుడికి 97 వేలకు పైగా నగదు అందనుంది. 
సింగరేణి కార్మికుల సేవలపై సీఎం ప్రశంసలు 
2015-16 సంవత్సరంలో 60.38 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని..తద్వారా 1313 కోట్ల స్థూల లాభం సమకూరిందన్నారు. సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు పణంగా పెట్టిపోరాడుతారని, వారిలాగే గని కార్మికులు కూడా దినదిన గండంగా పనిచేస్తారన్నారు. సింగరేణి ఉద్యోగుల్ని, కార్మికుల్ని సీఎం అభినందించారు. సింగరేణి ప్రాంతంలోనూ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 
సింగరేణి కార్మికుల సంబురాలు  
సీఎం నిర్ణయంతో ఆనందోత్సాహంలో ఉన్న కార్మికులు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మందమర్రిలో సంబురాల్లో మునిగితేలారు. కార్మికులకు బోనస్ చెల్లించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినందుకుగాను విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులకు రెండు బోనస్‌లు చెల్లించడం చారిత్రాత్మకమని సింగరేణి జేఏసీ ఛైర్మన్ ఎండీ మునీర్ పేర్కొన్నారు.

07:00 - October 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌ ఇవాళ మద్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్‌కు ముందు జరుగుతున్న ఈ సమావేశంలో కీలకనిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్త జిల్లాలపై మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై  తీసుకున్న నిర్ణయాలకు పచ్చజెండా ఊపనున్నారు. వీటితో పాటు మరో కీలక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.
మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యత 
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రద్దైన కేబినెట్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. దసరా నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో...మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుంది. ఇప్పటికే ప్రకటించిన 17 జిల్లాలకు తోడు కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలు, డివిజన్లు, మండలాల ఆవశ్యకత... ప్రారంభోత్సవం ఎలా చేయాలి? ఈ విషయాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై మంత్రి మండలి సభ్యులకు సీఎం వివరిస్తారని తెలుస్తోంది. దీంతోపాటు కొత్త జిల్లాలపై మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. 
పలు అంశాలపై చర్చ
ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తడం.. అందుకు నాలాల ఆక్రమణలే ప్రధానకారణమని తెలుసుకున్న ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. జీహచ్ఎంసీ పరిధిలోని నాలాలు, చెరువుల్లో వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి ఏర్పాటుకానున్న ప్రత్యేక ట్రిబ్యునల్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు జీహచ్ఎంసీ ఉద్యోగుల బదిలీల విషయంలో, రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీ అధికారినైనా..మరోచోటుకు ట్రాన్స్‌ఫర్‌ చేసేలా రానున్న కొత్త చట్టానికి  కూడా మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది.
భూసేకరణ కోసం మరో చట్టం
2013 భూసేకరణ చట్టంలోని వెసులుబాటు ప్రకారం...ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం మరో చట్టం తీసుకురాబోతోంది. ఇప్పటికే చట్టం రూపొందిచాల్సిన భాద్యతపై ఓ కమిటీ పనిచేస్తున్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా త్వరలోనే ఆర్డినెన్స్ తెస్తారని సమాచారం. కొత్త భూసేకరణ, పరిహారం చట్టానికి సంబందించిన ఆర్డినెన్స్‌కూ కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు మరో కీలక నిర్ణయానికి ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్న సందర్భంగా కొత్త కమిషనరేట్లు ఏర్పాటు చేయనున్నారు. సిద్ధిపేట, కరీంనగర్, నిజామాబాద్, రామగుండంలో ప్రతిపాదించిన కమిషనరేట్లకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 

కీలక విభాగాల ఉద్యోగులకు సెలవులు రద్దు

హైదరాబాద్ : కీలక విభాగాల ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

ఆ సిఫార్సులను అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని బీసీసీఐకి సుప్రీం ఆదేశం

ఢిల్లీ : లోథా కమిటీ సిఫార్సులను అంగీకరిస్తూ నేడు మధ్యాహ్నంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని బీసీసీఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది. 

Don't Miss