Activities calendar

08 October 2016

21:42 - October 8, 2016

విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులు ఆందోళనలకు దిగారు. ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు పెల్లుబికాయి. ప్రభుత్వం బాధితుల పట్ల నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

వామపక్ష పార్టీల నేతలు సంఘీభావం..
అగ్రిగోల్డ్ బాధితులు రోడెక్కారు. ప్రభుత్వం తమకు ఎలాంటి సాయం అందడం లేదని... డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు. అగ్రిగోల్డ్‌ కుంభకోణానికి కారణమైన వారిని శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని విజయవాడలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న వారికి వామపక్ష పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు.

వైసీపీ సంఘీభావం..
అగ్రిగోల్డ్‌ బాధితులు ప్రకాశం జిల్లా ఒంగోలు దక్షిణ బైపాస్‌ రోడ్డులో ఆందోళన చేపట్టారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్థికంగా నష్టపోయిన బాధితులు జాతీయ రహదారి దగ్బంధం చేశారు. ఆందోళనకు దిగిన బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనకు వైసీపీ సంఘీభావం తెలిపింది.

కడపలో ..
కడపలో స్థానిక ఇస్కాన్ సర్కిల్‌లో బాధితులు రాస్తారోకో నిర్వహించారు. దాదాపు గంటసేపు రాస్తారోకో జరిగింది. బాధితులకు మద్దతుగా సీపీఎం, సీపీఐ నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు.

శ్రీకాకుళంలో..
అటు శ్రీకాకుళంలో..అగ్రిగోల్డ్‌ బాధితులు కదం తొక్కారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ హైవే వద్ద అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా నిర్వహించారు. ఆందోళనలో పాల్గొన్న ఐదు వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు.

గుంటూరు జిల్లా కాకానిలో..
గుంటూరు జిల్లాలో.. అగ్రిగోల్డ్‌ బాధితులు ఆందోళన బాట పట్టారు. సీపీఐ ఆధ్వర్యంలో పెదకాకాని వద్ద రాస్తారోకో నిర్వహించారు. నిరసనలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద కూడా బాధితులు తమ ఆందోళనను కొనసాగించారు.

తక్షణమే న్యాయం చేయాలంటూ డిమాండ్
తీవ్ర మానసిక వేదనకు గురవుతూ.. ఆర్థికంగా నష్టపోయినా.. ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయడం లేదని ప్రజాసంఘాలు విమర్శించాయి. ప్రభుత్వం తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

21:41 - October 8, 2016

కొత్త జిల్లాలపై కసరత్తు జోరుగా సాగుతోంది. ఇవాళ అన్ని విభాగాల అధిపతులు, కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ రాజీవ్‌ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే కొత్త జిల్లాలు, కార్యాలయాలు, సిబ్బంది సర్దుబాటుపై సమీక్షించారు. ఏర్పాట్లపై ఆలస్యం వద్దని... పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 

21:32 - October 8, 2016

తమిళనాడు : జయలలిత అనారోగ్యం నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జయలలిత సన్నిహితుడు, సీనియర్‌ మంత్రి పన్నీర్‌సెల్వం, చీఫ్‌ సెక్రెటరి గవర్నర్‌ భేటి అయ్యారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్‌ సెల్వంను నియమించాలని రాజ్‌భవన్‌ యోచిస్తోంది. మరోవైపు జయలలిత సుదీర్ఘ అనారోగ్యం నేపథ్యంలో తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి కేంద్రానికి లేఖ రాశారు.

జయలలితను పరామర్శించిన రాహుల్ గాంధీ
చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అపోలో ఆసుపత్రిని సందర్శించారు. అయితే జయలలితను చూసేందుకు ఆసుపత్రి వర్గాలు రాహుల్‌ను అనుమతించలేదు. వైద్యులను అడిగి జయలలిత ఆరోగ్యం వివరాలను తెలుసుకున్నారు. దాదాపు అరగంట పాటు రాహుల్‌ అపోలో ఆసుపత్రిలో గడిపారు. జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రాష్ట్రపతి పాలన విధించాలని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి లేఖ
తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం వల్ల రాష్ట్రంలో పాలన స్తంభించిందని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు రాసిన లేఖలో స్వామి పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తుండడంతో ఈ డిమాండ్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఐసిస్‌, ఎల్‌టిటిఈ తదితర తీవ్రవాద సంస్థలు తమ ఉనికిని చాటుకునే ప్రమాదముందని హెచ్చరించారు.

గవర్నర్ తో సీఎస్ రామ్మోహన్ రావు భేటీ
మరోవైపు గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు సమావేశమయ్యారు. పాలనాపరమైన విషయాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం.

సెప్టెంబర్‌ 22న అపోలో ఆసుపత్రిలో చేరి సీఎం జయలలిత
జ్వరం, డీహైడ్రేషన్‌తో ముఖ్యమంత్రి జయలలిత సెప్టెంబర్‌ 22న అపోలో ఆసుపత్రిలో చేరారు. లండన్‌ వైద్య నిపుణుడు రిచర్డ్‌ బేలె నేతృత్వంలో జయకు చికిత్స కొనసాగిస్తున్నారు. వూపిరిత్తులు, మధుమేహం, ఆస్తమా, ఇన్‌ఫెక్షన్లకు సంబంధించి జయలలితకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ఆమె శరీరం సహకరిస్తోందని వైద్యులు పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు ఆమెను ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాల్సి అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.

21:27 - October 8, 2016

హైదరాబాద్‌ : మహా బతుకమ్మ గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకుంది. మైదానం మధ్యలో ఏర్పాటు చేసిన 20 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ 9 వేల 212 మంది మహిళలు 12నిమిషాల పాటు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బతుకమ్మ ఆడి చరిత్ర సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి అద్దంపట్టేలా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు పాల్గొని వీక్షించారు. గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిన బతుకమ్మ మురిసి మెరిసిపోయింది.
పూల వనంలా మారిన హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం...
పూల వనంలా మారిన హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం...తంగేడు, గునుగు, బంతిపూలతో పేర్చిన బతుకమ్మలతో సరికొత్త శోభను సంతరించుకున్న స్టేడియం.తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ముగ్దులైన విదేశీ వనితలు... జోరు వానలోనూ ఆడిపాడిన మహిళలు..కనీవిని ఎరుగని రీతిలో బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. తెలంగాణభాషా సాంస్కృతికశాఖ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పది వేలమంది మహిళలతో గిన్నిస్ బుక్ రికార్డే లక్ష్యంగా ఆడపడుచులు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలతో, ఆటలతో ఎల్బీస్టేడియం మార్మోగిపోయింది. కోలాట ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కోలాటాలు, డప్పులు, నృత్యాలతో కనువిందు చేశారు.

ఈ వేడుకను రికార్డుల్లోకి ఎక్కిన్నట్లుగా ప్రకటన
ఎల్బీ స్టేడియం మధ్యలో ఏర్పాటు చేసిన 20 అడుగుల బతుకమ్మ అందర్నీ ఆకట్టుకుంది. భారీ బతుకమ్మ చుట్టూ 35 గుండ్రటి వరుసలలో మహిళలు ఆడిపాడారు. మొదటి వరుసలో 200 మంది, చివరి వరుసలో వేయిమంది మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ప్రతీవరుసలో బతుకు కష్టసుఖాల విలక్షణతను వివరించే శృతిలయల ఆటపాటలతో లాల్‌బహదూర్ స్టేడియం మార్మోగింది. కార్యక్రమాన్ని వీక్షించిన గిన్నిస్ నిర్వాహకులు..కేరళలో ఒకేరోజున 5,211 మంది మహిళలు ఓనమ్ పండుగను జరుపుకోవడం ఇప్పటివరకు ప్రపంచ రికార్డుగా ఉన్నది. దీనిని బతుకమ్మ మహాప్రదర్శన అధిగమించింది. 

అమ్మ త్వరగా కోలుకోవాలి : స్టాలిన్

తమిళనాడు : అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రతిపక్ష నేత స్టాలిన్ పరామర్శించారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో శ్వాసకోశ సమస్యతో ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించేందుకు స్టాలిన్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనను పన్నీర్ సెల్వం, పళనిస్వామి, శశికళ కలసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత వద్దకు తీసుకెళ్లారు. ఆమెను పరామర్శించిన తరువాత బయటకు వచ్చిన స్టాలిన్ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతానికి ఆమె పూర్తిగా కోలుకోలేదని, పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు.

దుర్గమ్మకు బాబు దంపతుల పట్టువస్త్రాలు ..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు బెజవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వీరు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిని విస్తరించేందుకు కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు సౌకర్యాలు మెరుగుపడ్డాయని ఆయన గుర్తుచేశారు. అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించామని ఆయన చెప్పారు. గతంలో కంటే మరింత సౌకర్యవంతంగా అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు.

కుప్పకూలిన భవనం..5గురు మృతి..

కర్ణాటక : బెంగళూరులోని సర్జాపుర రహదారి బెళ్లందూరు క్రాస్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఐదుగురు దుర్మరణం పాలైన ఘటన ఇంకా మరువక ముందే దేశ రాజధాని నగరంలో మరో భవనం నేలకూలింది. దిల్లీ నగరంలోని పటేల్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న మరో భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్ని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

21:03 - October 8, 2016

ఏపీ చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకం చేపట్టిన రాష్ట్ర రాజధాని నిర్మాణమైన అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిర్మించేందుకు సిద్ధపడింది. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని నిలుపుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే ప్రకటిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి  స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలుపరిచేందుకు అన్ని ప్రయత్నాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ విధానంతో సింగపూర్ కంపెనీలకు ఈ నిర్మాణ బాధ్యల్ని అప్పగించేలా యత్నాలు జరుగతున్నాయి. సింగపూర్ కంపెనీలకు అమరావతి నిర్మాణాన్ని కట్టబెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానాన్ని తీసుకొచ్చారని ప్రతిపక్షాలతో పాటు వామపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఈ విధానంపై ఉమ్మడిరాష్ట్రాల హైకోర్టులో కేసుపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ నేపథ్యంలో స్విస్ చాలెంజ్ విధానం అమరావతికి ఎంతవరకూ సరైంది? దీని వెనుక వున్న ఉద్ధేశ్యమేంటి? అనే అంశాలపై మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరావుతో టెన్ టీవీ 'ఫేస్ టూ ఫేస్' నిర్వహించింది. ఈ స్విస్ చాలెంజ్ విధానంపై వడ్డే ఏం విశేషాలు తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:57 - October 8, 2016

తెలంగాణ రాష్ట్రంల అనేక చెరువులు, కుంటలు కబ్జాకు గురైయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు చెరువులు.. కుంటలు వుండే ప్రాంతంల నేడు పెద్ద పెద్ద భవనాలు దర్శనమిస్తున్నాయి. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీగా వుండే బతుకమ్మ పండుగ పేరుతోనే నగరంలోని అంబర్ పేట ప్రాంతంలో 'బతుకమ్మ కుంట' పేరుతో ఓ పేద్ద చెరువుండేదంట గతంల..ఆ చెరువు కాస్తా ఇప్పుడు కబ్జాకు గురయిపోయింది. బతుకమ్మ పండుగ నేపత్యంలో బతుకమ్మ కుంట చెరువు కబ్జా గురించి తెలిపేందుకు ఈనాడు మన మల్లన్న జర ప్రయత్నిస్తున్నాడు.

బతుకమ్మ కుంటల ఈతనేర్చుకున్నానంటున్న కాంగ్రెస్ నేత..
ఈ బతుకమ్మ కుంటల ఈత నేర్చుకున్నాని కాంగ్రెస్ నేత వీహెచ్ చెప్పారు. ఇక్కడనే పొలాలల్ల తిరిగిన..బడికి పోకుంటా చెరువులో ఆటలాడినానని మనుమంత చెప్పిండు. బతుకమ్మ అంటేనే కవితమ్మ అంటన్నారనీ ..మరి కబ్జా కు గురైన బతుకమ్మ కుంట కవితమ్మకు ఎందుకు కనిపియట్లేదని తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి అన్నారు. కబ్జాకు గురైన జాగల లడాయి షురు అయ్యిందనీ..కబ్జాలను ఊడపెరుక్కునేదాకా ఈ లడాయిని అపేదిలేదన్నారు. సీపీఎం చాడ వెంకటరెడ్డి మాట్లాడతా..బతుకమ్మ కుంటల బతుకమ్మలను కలపనీకి నీరే లేదనీ మరి బతుకమ్మ కుంటల బతుకమ్మలను కలిపేదాకా పోరాడతామన్నరు. పైసలను ప్రింట్ చెయ్యిచ్చు గానీ భూమిని ప్రింట్ చేయలేమని వీహెచ్ పేర్కొన్నారు. తనకు కూడా కోట్లుత్తాము గులాబీ పార్టీలో కి రమ్మన్నారని తెలిపారు. బతుకమ్మ పండుగ అంటేనే ఆడపిల్లల్ని బతకనీయటమేననీ..పార్టీ చేసే బతుకమ్మ పండగ కోట్లు ఖర్చుపెట్టి చేసేది బతుకమ్మ పండుగే కాదన్నారు తమ్మినేని. చెరువులుంటనే బతుకమ్మలాడాతామని ఖచ్చితంగా మా బతుకమ్మ కుంట మాకు కావాలని బతుకమ్మ కుంటవాసులు డిమాండ్ చేస్తన్నారు. బతుకమ్మ కుంటపై స్థానికులు..విపక్షాలు ఏమి అభిప్రాయాలు వ్యక్తం చేశారో తెలుసుకోవాలంటే ఈ రచ్చబండ వీడియోను క్లిక్ చేయండి..

 

20:31 - October 8, 2016

విజయవాడ : రైతుల అంగీకారం లేకుండా భూములను లాక్కోవాలని చూస్తే సహించేది లేదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూ సేకరణ చేయడాన్ని వామపక్షాలు ఎప్పటికీ అంగీకరించవన్నారు. ఏపీలోని 13 జిల్లాల్లోని 59 మండలాల్లో 4 లక్షల 11 వేల ఎకరాలకు పైగా భూములను దౌర్జన్యంగా లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని మధు అన్నారు. చంద్రబాబుకు భూమి పిచ్చిపట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

20:28 - October 8, 2016

కర్నూలు : ముక్కుపచ్చలారని బాల్యంపై పెరుగుతున్న దారుణాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. అభం శుభం తెలియని అమాయకుల పాలిట కొందరు దుర్మార్గులు పాశవికంగా ప్రవర్తిస్తూ.. మానవత్వానికే మచ్చ తెస్తున్నారు. చిన్న పిల్లాడన్న కనికరం కూడా లేకుండా ఓ దుర్మార్గుడు కర్కశంగా ప్రవర్తించాడు. ఓ బాలుణ్ణి భిక్షం ఎత్తించడమే కాక.. కాళ్లు, చేతులూ విరిచేసి శరీరంపై వాతలు పెట్టాడు. దెబ్బల్ని తాళలేక ఆ బాలుడు మృత్యువాత పడ్డ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

పలకా బలపం పట్టాల్సిన చిట్టిచేతులు.. వీధుల్లో భిక్షమెత్తుతున్నాయి
పలకా బలపం పట్టాల్సిన చిట్టి చేతులు.. వీధుల్లో బిక్షాటన చేస్తున్నాయి. ఆడిపాడే వయస్సులో అమ్మా... అంటూ యాచనకు దిగుతున్నాయి. బడిలో అక్షరాలు దిద్దాల్సిన బాల్యం కొందరు స్వార్థపరుల చేతుల్లో చిక్కి..బుగ్గిపాలవుతోంది. చిన్న పిల్లవాడని కూడా చూడకుండా.. అభం శుభం తెలియని ఓ బాలుడిని ఓ కర్కశుడు కాళ్లు చేతులు విరిచేసి బిక్షాటనకు పంపించాడు. శరీరం నిండా వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేశాడు. దెబ్బలకు తాళలేని ఆ బాలుడు ఆసుపత్రిలో మృతి చెందాడు.

గణేష్ చేతిలో చిప్పపెట్టి బిక్షాటన చేయిస్తున్న దుర్మార్గుడు
కర్నూల్ జిల్లా జూపాడు బంగ్లా మండలం లింగాపురానికి చెందిన గోపాల్ అనే వృద్ధుడు.. ప్రకాశం జిల్లాకు చెందిన గణేష్ అనే బాలుడిని వెంట తీసుకొచ్చాడు. తన జీవనం కోసం గణేష్ చేతిలో చిప్పపెట్టి బిక్షాటన చేయించసాగాడు. పసివాడన్న కనికరం కూడా చూపకుండా... బాలుడి కాళ్లు..చేతులు, విరిచేసి బిక్షాటన చేయించాడు. బిక్షాటన డబ్బుల కోసం తరుచూ చిత్ర హింసలకు గురి చేసేవాడు. డబ్బుల కోసం తరచూ గోపాల్...అతనితో సహజీవనం చేస్తున్న లక్ష్మి.. బాలుడిని తీవ్రంగా కొట్టేవారు. రెండు రోజుల కిందట గణేశ్ ను గోపాల్ తీవ్రంగా కొట్టాడు. దెబ్బల తీవ్రత ఎక్కువ కావడంతో బాలుడు సృహ తప్పిపోయాడు. వెంటనే అతడిని గోపాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పిల్లల వార్డులో చేర్పించారు.

తీవ్ర గాయాల పాలైన గణేష్‌.. మృతి
తీవ్ర గాయాల పాలైన గణేష్‌.. గురువారం మృతి చెందాడు. దీంతో గోపాల్‌, లక్ష్మి బాలుడి మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా.. ప్రవర్తించిన గోపాల్‌, లక్ష్మిలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

19:58 - October 8, 2016

కృష్ణా : బందరు పోర్టుకు.. భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం.. అన్ని ఎత్తులూ వేస్తోంది. భూసమీకరణ గడువు ముగుస్తున్నా.. రైతులు భూములిచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఈమేరకు తీర్మానాలూ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం నయాన్నో, భయాన్నో రైతులను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. సీఎం చంద్రబాబు కూడా ఆ ప్రాంత నేతలు, అధికారులకు ఈ దిశగా సంకేతాలిచ్చారు.

భూములు ఇచ్చేది లేదంటూ గ్రామసభల్లో రైతుల తీర్మానాలు
బందరు పోర్టు భూసమీకరణకు ఈ ప్రాంత రైతులు ససేమిరా అంటున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదంటూ గ్రామసభల్లో తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే 28 గ్రామాల్లోని రైతులు భూములిచ్చేది లేదని తీర్మానాలు చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. రైతుల నుంచి వస్తోన్న వ్యతిరేకతతో ప్రభుత్వం అయోమయంలో పడింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. రైతుల అభ్యంతరాలను, వారి సమస్యలను తెలిపేందుకు ప్రభుత్వం నెలరోజుల వ్యవధి ఇచ్చింది.

చట్టప్రకారం సేకరించేందుకు ప్రభుత్వం 2015 ఆగస్టులో నోటిఫికేషన్ జారీ
నిజానికి బందరు పోర్టుకు భూమిని చట్టప్రకారం సేకరించేందుకు ప్రభుత్వం 2015 ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. రైతులకు ఇష్టం లేకుండా సెంటు భూమి కూడా సేకరించబోమని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ళ నారాయణ కూడా హామీ ఇచ్చారు. అమరావతి ప్రాంతానికి తీసుకున్నట్లే సమీకరణ విధానంలో భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ-మడను ఏర్పాటు చేసింది. మడ పేరిట మళ్లీ భూ సమీకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

1.05 లక్షల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వ నిర్ణయం
బందరు పోర్టు కోసం 1.05 లక్షల ఎకరాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం 2016 సెప్టెంబర్‌లో 33 వేల ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. పట్టా, అసైన్డ్‌ భూములు పోను మిగిలిన రైతుల భూమిని సమీకరించాలని ప్రభుత్వం భావించింది. ససేమిరా అంటున్న రైతులు ఫారమ్‌-2 ద్వారా తమ అభ్యంతరాలను అక్టోబర్‌ లోగా తెలపాలంటూ గడువు విధించింది. ఆ గడువు ఇంకా ముగియక ముందే.. భూముల కోసం గ్రామస్థాయి సమావేశాల నిర్వహణను ముమ్మరం చేసింది. బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులు తమ అభ్యంతరాలు తెలిపేందుకు ఇంకా గడువున్నా.. ప్రభుత్వం గ్రామసభలు ఏర్పాటు చేస్తుండడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. దీన్నిబట్టి బలవంతంగానైనా భూములు లాక్కోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు స్పష్టమవుతోందని స్థానిక రైతులు అనుమానిస్తున్నారు.

ప్రాణాలైనా ఇస్తాం గానీ..భూములివ్వం : రైతులు
రైతులు భూములిచ్చేలా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారితో సామరస్యంగా ఉండాలని చంద్రబాబు సూచన ప్రాయంగా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రైతులు కూడా రాష్ట్రాభివృద్ధి కోసం సహకరించాలని, పోర్టు వస్తే పరిశ్రమలు వస్తాయని, దీంతో ఉద్యోగావకాశాలు వస్తాయని.. సీఎం పదేపదే చెప్పుకొస్తున్నారు. అయితే.. పోర్టు కోసం వేల ఎకరాలు అవసరమా అన్నది రైతుల ప్రశ్న. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూములు తీసుకుంటానంటే చూస్తూ ఊరుకోబోమని రైతులు హెచ్చరిస్తున్నారు.

అందుబాటులో ఉన్న స్థలంలోనే నిర్మిస్తే మంచిదంటున్న రైతులు 
ఏదేమైనా..ప్రభుత్వం రైతుల సమస్యలను, అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని బందరు పోర్టును అందుబాటులో ఉన్న స్థలంలోనే నిర్మిస్తే మంచిదని రైతులు అభిప్రాయపడుతున్నారు. 

19:42 - October 8, 2016

హైదరాబాద్ : చెరువులు, కుంటలను రక్షిస్తామని తెలంగాణ ప్రభుత్వం మాయ మాటలు చెబుతోందని వామపక్షాలు విమర్శించాయి. చెరువులు, కుంటలు కబ్జా చేశారంటూ... పేదల ఇళ్లను కూలగొడుతున్న సర్కార్‌.. పెద్దల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించాయి. కబ్జాల నుంచి చెరువులకు విముక్తి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ నిర్వహించిన కార్యక్రమానికి వామపక్షాల నేతలు మద్దతు పలికారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు వినూత్న నిరసన
చెరువుల పరరిక్షణ పేరిట కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు వినూత్న నిరసన నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా సాగుతున్న కార్యక్రమాల్లో భాగంగా.. శనివారం అంబర్‌పేట నియోజకవర్గంలోని బతుకమ్మకుంట వద్ద బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమానికి వామపక్ష నేతలు కూడా హాజరయ్యారు. ఒకప్పుడు బతుకమ్మకుంట నీటితో కళకళలాడేదని, ఇప్పుడు అంతా కబ్జాకు గురైందని ఈ సందర్భంగా వీహెచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో అధికార పార్టీకి చెందిన నాయకులు కుంటను

తెలంగాణ ప్రభుత్వంలో నయాం బ్యాచ్ వుందా : తమ్మినేని
చెరువులు, కుంటలను రక్షిస్తామంటూ ప్రభుత్వం మాయ మాటలు చెబుతోందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. భూ ఆక్రమణ దారులకు ప్రభుత్వం కొమ్ము కాయడంలో అర్థం ఏంటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంలో నయీం బ్యాచ్‌ ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. 93 శాతంగా ఉన్న బడుగుల అభివృద్ధి లేకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని నేతలు ప్రశ్నించారు. బతుకమ్మకుంటను పునరుద్ధరించే వరకు పోరాటం చేస్తామన్నారు. 

అమ్మ హెల్త్ బులిటెన్..

తమిళనాడు : ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్‌ విడుదల చేశారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో జయకు చికిత్స జరుగుతోందని వెల్లడించారు. ఆమెకు కృత్రిమ శ్వాసను పరిస్థితులకు అనుగుణంగా అందిస్తున్నట్లు చెప్పారు. జయలలిత వూపిరితిత్తుల్లో నెమ్ము తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇతర సమగ్ర చికిత్సలనూ వైద్య నిపుణుల బృందంఅందిస్తోందని బులెటిన్‌లో పేర్కొన్నారు.

19:24 - October 8, 2016

శ్రీకాకుళం : ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. అన్ని పార్టీల కంటే ముందుగా వామపక్షాలు ఇతర ప్రజాపక్షాల తరుపున ఉమ్మడిగా పీడీఎఫ్ అభ్యర్ధిగా అజయ్ శర్మను ప్రకటించారు. ప్రస్తుత పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎంవీఎస్.శర్మ... అజయ్ శర్మ పేరును ప్రకటించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక పేరుతో అనేక కార్యక్రమాలను అజయ్‌ శర్మ నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అజయ్ శర్మ పేరును ఏకగ్రీవంగా ప్రకటించాయి. 

19:21 - October 8, 2016

విశాఖ : రవీంద్రనగర్‌లో భారీ పోలీసు బందోబస్తు మధ్య రిలయన్స్ సెల్‌ టవర్‌ను ఏర్పాటు చేస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ టవర్స్‌తో తాము అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సెల్‌ టవర్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సెల్ టవర్ తో స్థానికంగా నివాసముంటున్న వారికి క్యాన్సవంటి వ్యాధులొస్తున్నాయనీ స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో వచ్చిన హుదూద్ తుఫానుకు సెల్ టవర్ లు కూలి పలు ఇబ్బందులెదుర్కొన్నామనీ పలువురు గాయాలపాలయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

19:14 - October 8, 2016

తమిళనాడు : ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్‌ విడుదల చేశారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో జయకు చికిత్స జరుగుతోందని వెల్లడించారు. ఆమెకు కృత్రిమ శ్వాసను పరిస్థితులకు అనుగుణంగా అందిస్తున్నట్లు చెప్పారు. జయలలిత వూపిరితిత్తుల్లో నెమ్ము తొలగింపు తొలగించేలా చికిత్స కొనసాగుతోందని వైద్యులు పేర్కొన్నారు. జయకు కృత్రిమ శ్వాసను పరిస్థితులకు అనుగుణంగా అందిస్తున్నామని చెప్పారు. ఇతర సమగ్ర చికిత్సలనూ వైద్య నిపుణుల బృందంఅందిస్తోందని బులెటిన్‌లో పేర్కొన్నారు. కాగా క్రిటికల్ సమస్యలకు కాంప్లికేటెడ్ చికిత్స కొనసాగిస్తున్నట్లుగా వైద్యులు తెలిపారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నియమించే విషయంలో కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రులు చర్చలు కొనసాగిస్తున్నారు. జయలలితను పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు వచ్చినప్పటికీ ఎటువంటి సమాచారం బైటకు తెలియనివ్వటంలేదు. అసలు పరామర్శకు వచ్చిన వారికి కూడా పూర్తి స్థాయి సమాచారం తెలియనట్లుగా కూడా తెలుస్తోంది. అభిమానుల తాకిడి మాత్రం తగ్గటంలేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విషయంలో దసరా పండుగ తరువాతనే ఒక క్లియరెన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రేసులో ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన అమ్మకు అత్యంత విధేయుడైన పన్నీర్ సెల్వం..పళనిస్వామి పేర్లు తరచుగా వినిపిస్తున్నాయి.

19:01 - October 8, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాకు తాము వ్యతిరేకం కాదని.. అలాని అశాస్త్రీయంగా జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను విడదీయవద్దని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. కొన్ని జిల్లాల్లో 5 లక్షల జనాభా ఉంటే.. మరికొన్ని జిల్లాల్లో 40 లక్షల జనాభా ఉందని ఆయన అన్నారు. దసరాకు కాకుంటే దీపావళికి జిల్లాలను ఫైనల్‌ చేయవచ్చని అన్నారు. జిల్లాల విభజనపై మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా కొత్తజిల్లాల ఏర్పాటు ప్రక్రియ శాస్త్రీయంగా జరుగుతుందని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్కసుమన్‌ అన్నారు. గ్రామాల్లో ప్రజలంతా ఆనందంగా ఉంటే.. ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదని ఆయన విమర్శించారు.  

గుజరాత్ లో పర్యటించనున్న రాహుల్..

ఢిల్లీ : 2017లో గుజరాత్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గుజరాత్‌లో పర్యటించనున్నారు. గుజరాత్‌కు తూర్పు భాగంలో ఎక్కువగా గిరిజన ఓటర్లను ఆకర్షించేందుకు ‘నవ్‌సర్‌జన్‌ ఆదివాసీ అధికార్‌ యాత్ర’ పేరిట ప్రజల్లోకి వెళ్లనున్నారు. కాగా యూపీ రానున్న ఎన్నికల సందర్భంగా కూడా కిసాన్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ పర్యటించిన విషయం తెలిసిందే.

18:44 - October 8, 2016

రికార్డు బతుకమ్మ..

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిని ప్ర‌తిబింబింప‌జేసే బ‌తుక‌మ్మ పండుగ‌లో భాగంగా ఈరోజు హైద‌రాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన మ‌హాబ‌తుక‌మ్మ వేడుక‌లు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధ మ‌హిళ‌ల వ‌ర‌కు ఎల్బీస్టేడియానికి భారీ సంఖ్య‌లో చేరుకున్నారు. ఉత్సాహంగా ఆడిపాడుతున్నారు. మొత్తం 9,292 మంది ఒకేసారి బ‌తుక‌మ్మ ఆడి గిన్నిస్‌ రికార్డు న‌మోదు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. మైదానంలో మొత్తం 35 వ‌ర‌స‌ల్లో బ‌తుక‌మ్మ ఆడారు. ఈ వేడుక‌ల‌ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున‌ పోలీసులను మోహ‌రింప‌జేశారు. మొత్తం 27 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

జగన్‌కు లోకేశ్‌ బహిరంగ లేఖ..

హైదరాబాద్‌: వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శనివారం లేఖ రాశారు. సాక్షి పత్రికలో అవాస్తవాలు, అభూతకల్పనలు ప్రచురిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సాక్షిలో నిన్న వచ్చిన కథనాలతో అవాస్తవాలు ప్రచురిస్తున్నారని మరోసారి రుజువైందన్నారు. వైఎస్‌తో పనిచేసిన సీనియర్‌ నాయకులు, మంత్రులను అవమానపరిచిన చరిత్ర జగన్‌దేనని లోకేశ్‌ మండిపడ్డారు.

18:30 - October 8, 2016

హైదరాబాద్‌: వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శనివారం లేఖ రాశారు.చినరాజప్ప-లోకేష్‌ ఉన్న ఫోటో మీద వైసీపీ చేస్తున్న ఆరోపణలపై స్పందించిన లోకేష్‌.. వర్క్ షాప్‌లో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.  సాక్షి పత్రికలోనూ, సోషల్ మీడియాలోనూ అవాస్తవాలు, అభూతకల్పనలు ప్రచురిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సాక్షిలో నిన్న వచ్చిన కథనాలతో అవాస్తవాలు ప్రచురిస్తున్నారని మరోసారి రుజువైందన్నారు. వైఎస్‌తో పనిచేసిన సీనియర్‌ నాయకులు, మంత్రులను అవమానపరిచిన చరిత్ర జగన్‌దేనని లోకేశ్‌ మండిపడ్డారు. పెద్దలు, సహచరులను గౌరవించటం నా తల్లిదండ్రులు నాకు నేర్పించారనీ..తనపై జగన్ చేసిన అసత్య ప్రచారాలను తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ నియంతృత్వ ధోరణితో పలువురు నాయకులు పార్టీని వీడిపోయిన మాట వాస్తవం కాదాని ప్రశ్నించారు. అనారోగ్యంతో వర్క్ షాప్ రానంత మాత్రానా తనకు తన తండ్రికి మధ్య అభిప్రాయబేదాలు వచ్చాయని అసత్య ప్రసారాలు చేయటం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు. దీనిపై జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. టీడీపీ నిర్వహించిన ప్రజాప్రతినిథుల వర్క్ షాప్ కు అనారోగ్యంతో లోకేష్ మొదటి రెండు రోజులు హాజరు కాని విషయం తెలిసిందే. 

18:11 - October 8, 2016
17:53 - October 8, 2016

హైదరాబాద్ : మహా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిన మన బతుకమ్మ మురిసి మెరిసిపోయింది. తెలంగాణ ప్రాంతానికి పరిమితమైన బతుకమ్మ ఇప్పుడు విశ్వవ్యాప్తం బతుకమ్మగా రికార్డు నెలకొల్పింది. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన మహా బతుకమ్మ వేడుకలో ఒకే చోట, ఒకే సారి 9,292 మంది తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మను ఆడి చరిత్ర సృష్టించారు. మొత్తంగా 10,029 మంది మహిళలు స్టేడియానికి తరలివచ్చారు. మహా బతుకమ్మకు గిన్నిస్ బుక్ లో చోటు లభించడంతో తెలంగాణ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. కేరళ రాష్ట్రంలో ఒకేరోజున 5,211 మంది మహిళలు ఓనమ్ పండుగను జరుపుకోవడం ఇప్పటివరకు ప్రపంచ రికార్డుగా ఉన్నది. దీనిని బతుకమ్మ మహాప్రదర్శన అధిగమించి చరిత్ర సృష్టించింది.

దసరా కాలంలో మాత్రమే విరబూసే పూలు
తంగేడు, బంతి, గునుగు వంటి తీరొక్క పూలతో 20 అడుగులతో బతుకమ్మను పేర్చారు. స్టేడియం మధ్యలో ఈ 20 అడుగుల బతుకమ్మను ఉంచి దాని చుట్టూ చిన్నపాటి బతుకమ్మలను ఉంచారు. 35 వరుసలలో 2 వేల మంది మహిళలు బతుకమ్మ ఆడారు. ఉయ్యాల పాటలతో స్టేడియం మార్మోగిపోయింది.

వానలో కూడా బతుకమ్మలాడిన తెలంగాణ ఆడబిడ్డలు
మహా బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ఆడపడుచులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జోరు వానలోనూ పది వేలమంది మహిళలతో గిన్నిస్ బుక్ రికార్డే లక్ష్యంగా ఆడపడుచులు బతుకమ్మ ఆడారు. కోలాట ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చూడముచ్చటగా బతుకమ్మలను పేర్చిన ఆడపడుచులు సందర్భానుసారంగా పాటలు పాడుతూ సందడి చేశారు. కోలాటాలు, డప్పులు, నృత్యాలతో కనువిందు చేశారు ఆడపడుచులు.

మహా బతుకమ్మ గిన్నిస్ బుక్ రికార్డు..

హైదరాబాద్ : మహాబతుకమ్మ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. 9209 మంది మహిళలు బతుకమ్మను ఆడారు. మహాబతుకమ్మకు 10029 మంది మహిళలు హాజరయ్యారు.

 

17:22 - October 8, 2016

హైదరాబాద్‌ : అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట కబ్జాకు గురవుతుంటే కేసీఆర్ ప్రభుత్వానికి కనపడట్లేదా అని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట దగ్గర జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కబ్జాదారులకు వంత పాడుతూ.. కబ్జాలను ప్రోత్సహిస్తోందని తమ్మినేని వీరభద్రం, చాడ విమర్శించారు.

కాల్పులు జరిపింది పాక్ ఉగ్రవాదులే...

జమ్మూ కాశ్మీర్ : నౌగామ్ సెక్టార్ లో కాల్పులు జరిపింది పాక్ ఉగ్రవాదులేనని భారత ఆర్మీ నిర్ధారించింది. ఉగ్రవాదులు పాక్ నుండి వచ్చినట్లు ఆధారాలు సేకరించింది. 

17:10 - October 8, 2016

కోహ్లీ సెంచరీ..ఇండియా 256/3..

ఇండోర్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ మూడు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. గంభీర్ నిష్క్రమించిన అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీతో కలిసి పుజారా ఆచితూచి ఆడాడు. రహానే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 100 పరుగులతో, రహానే 72పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, పటేల్, సాంట్నర్ తలో వికెట్ తీశారు.

జగన్ కు లోకేశ్ లేఖ..

విజయవాడ : టిడిపి వర్క్ షాప్ కు సంబంధించిన ఓ ఫొటోపై టిడిపి, వైసీపీ పార్టీల మధ్య విమర్శలు అధికమౌతున్నాయి. వైసీపీ చేసిన ఆరోపణలకు టిడిపి కౌంటర్ ఇచ్చింది. ఈ వివాదంపై లోకేష్ వైసీపీ అధ్యక్షుడు జగన్ కు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. అసత్యాలు ప్రచారం చేసినందుకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దలని గౌరవించడం తల్లిదండ్రులు తనకు నేరిపించారని, అనారోగ్యంతో వర్క్ షాప్ కు రాకపోతే వక్రీకరిస్తారా అని ప్రశ్నించారు. 

 

17:07 - October 8, 2016

హైదరాబాద్: వర్షం అంటేనే నగరవాసులు హడలిపోతున్నారు. గత కొద్దిరోజులుగా భాగ్యనగానికి వరుణుడు విశ్రాంతినిచ్చాడు. ఇప్పుడు తాజాగా మళ్లీ నగరాన్ని వర్షంతో ముంచెత్తాడు.దీంతో ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ పండుగ వేడుకలకు తాత్కాలికంగా ఆటకం ఏర్పడింది. నగరంలో ఇవాళ వర్షం కురిసింది. అమీర్‌పేట్, ఎస్ ఆర్ నగర్, సనత్‌నగర్, బోరబండ, కుషాయిగూడ, కాప్రా, మల్కాజిగిరి, నేరెడ్‌మెట్, బషీర్‌బాగ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అబిడ్స్, లంగర్ హౌజ్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. 

16:57 - October 8, 2016
16:55 - October 8, 2016
16:49 - October 8, 2016

హైదరాబాద్ : నగరంలో విషాదం నెలకొంది. సికింద్రాబాద్‌ కుండల బజార్‌లో బంగారం వ్యాపారి లక్ష్మీచంద్‌.. తన కూతురిని రోజుల తరబడి ఉపవాస దీక్ష చేయించాడు. దీంతో ఆ బాలిక మృతి చెందింది. వ్యాపారంలో నష్టాలు రావడంతో లక్ష్మీచంద్‌ ఓ మత గురువును కలిశాడు. అతని సూచన మేరకు తన 8వ తరగతి చదివే కూతురు ఆరాధను ఉపవాస దీక్షకు సిద్ధం చేశాడు. అప్పటి నుంచి ఆరాధానను దశల వారీగా ఉపవాస దీక్ష చేయించాడు. ఒకసారి 8 రోజులు, మరోసారి 14 రోజులు, ఇంకోసారి 30 రోజుల పాటు ఉపవాసాలు ఉంచారు. బాలిక తల్లిదండ్రులు లక్ష్మీచంద్‌, మానీస్‌ సమధారియాలు జులై నుంచి నవంబరు నెల వరకు ఆరాధనను ఉపవాసాలకు సిద్ధం చేశారు. ఉపవాస దీక్షలో ఉన్న ఆరాధాన రోజురోజుకూ నిరసించింది. ఉపవాసం చేపట్టి రెండు నెలలు కావడంతో ఆరాధన కిడ్నీలు, లివర్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. గుండె సమస్యలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 2వ తేదీన ఆరోగ్యం విషమించడంతో కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో కిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలిక ప్రాణాలు కోల్పోయింది.

68 రోజుల ఉపవాసదీక్ష..కిడ్నీలు, లివర్‌ దెబ్బతినడంతో మృతి
ఆరాధన చనిపోయిన విషయం బయటకు రావడంతో బాలల హక్కుల కమిషన్‌ రంగంలో దిగి... వివరాలు సేకరించింది. తల్లిదండ్రులను సంప్రదించింది. ఎక్కడా తాము తప్పు చేశామన్న భావనను వారు వ్యక్తం చేయలేదు. పోలీసుల వద్ద ఆరా తీస్తే తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని.. చెప్పారు. వెంటనే బాలల హక్కుల సంఘం కమిషన్‌ ప్రతినిధులు నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఫిర్యాదులో తెలిపారు.

మండిపడ్డ బాలల హక్కుల సంఘాలు..కమిషనర్ కు ఫిర్యాదు
ఈ ఘటనపై బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే విషయం వివరాలు సేకరించి... బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ... పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

16:43 - October 8, 2016

కర్నూలు : శివారులోని గ్లిజరిన్‌ తయారీ పరిశ్రమ సీసీడబ్ల్యూలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమ కూలింగ్‌ టవర్‌లోని రియాక్టర్‌లో ఆయిల్‌ లీకై మంటలు చెలరేగాయి. ఫైర్‌ సింబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంతో పెద్దఎత్తున పొగలు ఎగజిమ్ముతున్నాయి. మధ్యహ్నాం 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్పీ సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రియాక్టర్లు పేలటంతో మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో కర్నూలు పట్టణమంతా పొగలు కమ్మేసాయి. మంటలు అదుపులోకి రావటానికి దాదగాపు నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

కోహ్లీ సెంచరీ..ఇండియా 256/3..

ఇండోర్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ మూడు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. గంభీర్ నిష్క్రమించిన అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీతో కలిసి పుజారా ఆచితూచి ఆడాడు. రహానే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 100 పరుగులతో, రహానే 72పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, పటేల్, సాంట్నర్ తలో వికెట్ తీశారు.

వీధి రౌడీల్లా కొట్టుకున్న ప్రభుత్వాధికారులు!..

విశాఖ : నడిరోడ్డుపై ప్రభుత్వ అధికారులు వీధిరౌడీల్లా కొట్టుకున్నారు. ఓ తహశ్దీరు ఓ సీఐ చితక్కొట్టుకున్న సంఘటన విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి మండలం బుచ్చయ్యపేట తహశీల్దార్ వెంకటశివ కారును అనకాపల్లి టౌన్ సీఐ విద్యాసాగర్ రావు ఆపారు. దీంతో ఇది ప్రభుత్వ వాహనమని, తాను ఎమ్మార్వోనని చెబుతూ ఆయన మండిపడ్డారు. దీంతో సీఐ ఆ కారును కాలితో తన్నారు. దాంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది చిలికిచిలికి గాలివానగా మారడంతో, ఇద్దరూ బాహాబాహీకి దిగారు. ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు నడి రోడ్డు మీద ముష్టియుద్ధానికి దిగడంతో స్థానికులు బిత్తరపోయారు.

16:27 - October 8, 2016

హైదరాబాద్ : మహా బతుకమ్మ వేడుకలలో పాల్గొనేందుకు తెలంగాణ ఆడబిడ్డలు ఎల్బీస్టేడియానికి భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను గిన్నీస్ బుక్ లో రికార్డు చేసేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ మహాబతుకమ్మ వేడుకల్లో వరుణుడు ఆటంకం కలిగించేలా పరిస్థితులు కనపిస్తున్నాయి. నగరంలో చిరుజల్లులు మొదలయ్యాయి. దీంతో ఆటపాటలకు కొంత ఆటంకం ఏర్పడింది. కాగా తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన బతుకమ్మ పండుగ నేటితో ప్రపంచ విఖ్యాతిగాంచేలా ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో బతుకమ్మ వేడుకలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. మరికాసేపట్లో పదివేల మంది తెలంగాణ ఆడబిడ్డలు ఒకేసారి, ఒకే వేదిక మీది నుంచి బతుకమ్మ పాటలు, ఆటలతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులలో బతుకమ్మ పండుగ వైభవాన్ని నమోదు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలకు తాగు నీరు, సౌకర్యాలు కల్పించారు. బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన నగర మేయర్ బొంతు రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలను ఖండాంతరాలకు విస్తరించాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. మహా బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా మహా బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. భద్రతా ఏర్పాట్లను మధ్య మండల డీసీపీ కమలాసన్ రెడ్డి పరిశీలించారు. మొత్తం 27 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. స్టేడియంలోకి వెళ్లే గేట్ల వద్ద సెన్సార్లను ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి సంచులు, సూట్‌కేసులు, కవర్లు, పేలుడు స్వభావం కలిగిన పదార్థాలను తీసుకురావొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

రెండంకెల వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం ఏపీ - బాబు..

విజయవాడ : దేశంలో రెండంకెల వృద్ధి రేటు సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అనువైన ప్రాంతమని, టెక్నాలజీ, ఐవోటీని ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు. టిడిపి నేతలకు టెక్నాలజీ, ఐవోటీలో శిక్షణనివ్వడం జరిగిందన్నారు. ఏపీని మ్యానుఫాక్షరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతామని, పట్టణీకరణకు కూడా ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో సీఐఐకు స్థలం కేటాయిస్తామని సెంట్రల్ హబ్ గా రూపొందించాలని తెలిపారు. 

కర్నూలులో అగ్నిప్రమాదం..

కర్నూలు : జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కర్నూలు శివారులోని ఓ పరిశ్రమలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న రెండు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

నగరంలో వర్షం..కాసేపట్లో మహా బతుకమ్మ సంబరాలు..

హైదరాబాద్ : కాసేపట్లో ఎల్ బి స్టేడియంలో మహా బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఎల్బీ స్టేడియం మొత్తం పూలవనంగా మారిపోయింది. కాసేపటి క్రితం వర్షం పడుతుండడంతో కార్యక్రమానికి ఆటంకం కలిగింది. 20 అడుగుల ఎత్తులో భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. బతుకమ్మ చుట్టూ 35 వరుసలలో మహిళలు ఆడనున్నారు. 

16:06 - October 8, 2016

కీ.శే.శ్రీమతి చిటుకుల అరుణ సమర్పణలో సందీప్ క్రియేషన్స్ బ్యానర్ పై సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి తారాగణంగా రూపొందుతోన్న చిత్రం 'నేను సీతాదేవి'. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చైతన్య రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిత్రీకరణ నుండి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న 'నేను సీతాదేవి' సినిమా ఈనెల 14న రిలీజ్ కానుంది..ఈ నేపథ్యంలో చిత్ర హీరో హీరోయిన్లు సందీప్, కోమలిలతో టెన్ టీవీ లైవ్ షో నిర్వహించింది. ఈ సందర్బంగా హీరో సందీప్ మాట్లాడుతూ..లవ్ లో పడితే త్రివిక్రమన్ లా మాటలు రాయ్యొచ్చు..వేటూరిలా పాటలు రాయ్యొచ్చు అనే డైలాగ్ వదిలారు.కాగా హీరో హీరోయిన్లు ఇద్దరికీ ఇదే తొలిసినిమా కావటం విశేషం. నేను సీతాదేవి సినిమా హీరో హీరోయిన్లు చెప్పే విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

16:00 - October 8, 2016

జానపద..పౌరాణికాల పాత్రలు చేయడంలో నందమూరి 'బాలకృష్ణ' దిట్ట. ఇది పలు సందర్భాల్లో రుజువైంది కూడా. గుక్క తిప్పుకోకుండా డైలాగ్ లు పలకడంలో 'బాలకృష్ణ' రూటే వేరు. ప్రస్తుతం అందరి చూపు 'బాలకృష్ణ' వైపే ఉంది. ఎందుకంటే ఆయన నటిస్తున్న '100వ చిత్రం' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 'క్రిష్' దర్శకత్వంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతోంది. రెండో శతబ్దానికి చెందిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' జీవితం ఆధారంగా కథ తెరకెక్కుతోంది. పాత్ర కోసం 'బాలకృష్ణ' చాలా కష్టపడుతున్నారు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన పలు వీడియోలు విడుదలైన సంగతి తెలిసిందే. దీనితో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. 'బాలకృష్ణ' కు ఈ చిత్రం మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే 'బాలకృష్ణ' నటిస్తున్న ఈ చిత్రం సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు టాక్. ఇప్పటికే టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా మరో ఫొటో రిలీజ్ చేసింది. ఇందులో రాజసం ఉట్టిపడేలా ఉన్న ఫొటోను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. సింహాసనంపై 'బాలకృష్ణ' కూర్చొని ఉన్న ఈ ఫొటో అభిమానులను అలరిస్తోంది. దసరా కానుకగా ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోందంట. ఈ సినిమాలో 'శ్రియ' హీరోయిన్ గా నటిస్తుండగా 'హేమమాలిని' 'బాలకృష్ణ' తల్లిగా నటిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాకు 'కంచె' ఫేం చింతరంజన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. 

15:47 - October 8, 2016

జమ్ము కశ్మీర్‌ : లోయలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం పోలీసులు పెల్లెట్‌ తుపాకులతో జరిపిన కాల్పుల్లో ఓ పన్నెండేళ్ల బాలుడు గాయపడి మృతి చెందాడు. సైద్‌పోరా ప్రాంతానికి చెందిన జునైద్‌ అహ్మద్‌ ఇంటిముందు ఆడుకుంటుండగా పెల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని స్థానికులు తెలిపారు. నిరసనకు దిగిన ఆందోళనకారులపై పెల్లెట్‌ ఫైరింగ్‌ జరిపాల్సి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనతో అల్లర్లు మరింతగా వ్యాపించే ప్రమాదం కన్పించడంతో భద్రతాధికారులు కశ్మీర్‌లోని ఏడు ప్రాంతాల్లో మళ్లీ కర్ఫ్యూ విధించారు. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు మూసివేశారు. గత 92 రోజులుగా కశ్మీర్‌ లోయలో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ తర్వాత కశ్మీర్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 90కి చేరింది.

15:44 - October 8, 2016

ఉత్తరప్రదేశ్ : భారత వైమానిక దళం 84వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌ బేస్‌లో వాయుసేన నిర్వహించిన వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో వైమానిక దళ చీఫ్ అరుఫ్ రహా పాల్గొన్నారు. వాయుసేన పరేడ్‌తో పాటు తేజస్, సుఖోయ్‌ తదితర విమానాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. 84 వసంతంలోకి అడుగు పెట్టిన వైమానిక దళానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐఏఎఫ్ శక్తి సామర్థ్యాలపై దేశం గర్విస్తుందని, గడిచిన ఎనిమిది దశాబ్దాల్లో వారు అందించిన సేవలు మరువలేవని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. వైమానికదళ యోధులకు, వారి కుటుంబాలకు ఎయిర్‌ ఫోర్స్‌ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 

15:42 - October 8, 2016

హైదరాబాద్‌ : ఎల్బీస్టేడియంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. గిన్నిస్‌ రికార్డే లక్ష్యంగా ఈ బతుకమ్మ సంబరాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. పదివేల మంది మహిళలు ఇందులో భాగస్వామ్యం కానున్నారు. ప్రతీ పూజకూ పూలను ఉపయోగిస్తాం కానీ బతుకమ్మ పండుగలో పూలనే పూజించే పండుగ అని మేయర్ పేర్కొన్నారు. బతుకమ్మ కోసమే ఈ రుతువులో పూలు విరగబూసే గునుగు, బంతి, తంగేడు పూలతో 20 అడుగుల ఎత్తులో బతుకమ్మలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కేరళ రాష్ట్రంలో తమ ప్రాంత సంప్రదాయాన్ని ప్రతిబింభించేలా కేరళ వాసులు ఒకేరోజున 5,211 మంది మహిళలు ఓనమ్ పండుగను జరుపుకోవడం ఇప్పటివరకు ప్రపంచ రికార్డుగా వుండగా ఈ రికార్డును మహా బతుకమ్మ మహాప్రదర్శన అధిగమించే విధంగా ఏర్పాట్లు నిర్వహించామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.

15:36 - October 8, 2016

తమిళనాడు : సీఎం జయలలిత అనారోగ్యంతో తమిళనాడులో పాలన కుంటుపడకుండా చేపట్టాల్సిన చర్యలపై అన్నా డీఎంకే ముఖ్య నేతలు దృష్టిపెట్టారు.... ఈ బాధ్యతల్ని పళనిస్వామి, పన్నీర్‌ సెల్వంలకు అప్పగిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.. ప్రజా పనుల శాఖామంత్రిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి, ఆర్థిక మంత్రి పన్నీర్‌ సెల్వం పేర్లు ముఖ్యంగా తెరపైకి వస్తున్నాయి.. జయ కోలుకోవడానికి చాలా సమయంపడుతుందన్న వైద్యుల సూచనతో తాత్కాలిక సీఎం ఎంపిక కోసం ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు.. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.. మరోవైపు గవర్నర్‌ విద్యాసాగరరావుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రావు భేటీ అయ్యారు.. పళనిస్వామి, పన్నీర్‌ సెల్వంకూడా గవర్నర్‌తో భేటీ కావడంతో డిప్యూటీ సీఎంకోసం కసరత్తు నడుస్తోందని వార్తలొస్తున్నాయి.. అయితే రాజ్‌భవన్‌ మాత్రం కావేరి సమస్యపై మాత్రమే చర్చ నడిచిందని ప్రకటించింది.. అటు జయలలితను పరామర్శించేందుకు నేతల క్యూ కొనసాగుతోంది..ఎండీఎంకే నేత వైగో జయలలితను పరామర్శించారు.. ఇవాళ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కూడా అమ్మను పరామర్శించబోతున్నారు..గత నెల 22న ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

కోడిపందాలపై ఖాప్స్ పంజా..

పశ్చిమగోదావరి : నల్లజర్ల మండలంలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఆవుపాడులో కోడిపందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులను చూడగానే పందెంరాయుళ్లు పరుగందుకున్నారు. 11 మందిని పందాలరాయుళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికితోడు, 22 బైక్ లు, రూ. 11 వేలను స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాలు జోరుగా సాగుతున్నాయని గత కొన్ని రోజులుగా పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దీంతో, ఈ రోజు వారు దాడులు నిర్వహించారు.

15:22 - October 8, 2016

మాటల మాంత్రికుడు 'తివిక్రమ్ శ్రీనివాస్', పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కాంబినేషన్ లో ఓ చిత్రం రానున్నట్లు ఇటీవల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'డాలీ' దర్శకత్వంలో 'పవన్ కళ్యాణ్' 'కాటమరాయుడు' గా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని అనంతరం 'తివిక్రమ్' సినిమాలో 'పవన్' నటించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం స్టోరీ చర్చలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు టాక్. నటీ నటుల ఎంపికలో 'తివిక్రమ్' నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 'పవన్' ఫ్రెండ్ ఎవరు నటిస్తారని అని అంటే ఠక్కున 'ఆలీ' పేరు గుర్తుకొస్తుంది. 'ఆలీ' 'పవన్' కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు రూపొందిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాలో మాత్రం 'పవన్' కు స్నేహితుడిగా కమెడియన్ యాక్టర్ 'సునీల్' నటిస్తారని టాలీవుడ్ టాక్. 'పవన్ - తివిక్రమ్' ప్రాజెక్టు ఉందా ? లేదా ? అనేది తెలియరావడం లేదు కానీ ఇలాంటి వార్తలు మాత్రం పుకార్లు షికార్లు చేసేస్తున్నాయి. మరి అసలు విషయాలు ఏంటీ అనేది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే. 

దేశవ్యాప్తంగా పెట్రోల్ బంక్స్ బంద్..

గుంటూరు: మరోసారి దేశ వ్యాప్త బంద్‌కు పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 19, 26 తేదీలలో సాయంత్రం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే నవంబర్ 3, 4 తేదీలలో ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తామని, నవంబర్ 5న సాయంత్రం 6గంటలకు పెట్రోల్ బంక్‌లు మూసివేస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు రావిగోపాలకృష్ణ తెలిపారు.

కోహ్లీ హాఫ్ సెంచరీ..ఇండియా 165/3..

ఇండోర్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 41 పరుగులు చేసిన పుజారాను.. సాంట్నర్ పెవిలియన్‌కు పంపాడు. గంభీర్ నిష్క్రమించిన అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీతో కలిసి పుజారా ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలోనే భారత్ స్కోరు 100 పరుగులు దాటింది. కోహ్లీ 56 పరుగులతో, రహానే 25పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, పటేల్, సాంట్నర్ తలో వికెట్ తీశారు.

11 బాంబులు స్వాధీనం..

పంజాబ్ : తుప్పుపట్టిన పదకొండు బాంబులను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌సర్ సమీపంలోని ఛెహెర్ట్ రోడ్డు వద్ద దూరంగా పడవేసి ఉన్న బ్యాగు నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా తుప్పుపట్టి ఉన్నాయి.

14:49 - October 8, 2016

గుంటూరు : జిల్లాలో.. అగ్రిగోల్డ్‌ బాధితులు ఆందోళన బాట పట్టారు. సీపీఐ ఆధ్వర్యంలో పెదకాకాని వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా నిరసనలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద కూడా బాధితులు తమ ఆందోళనను కొనసాగించారు. కాగా శ్రీకాకుళంలో..అగ్రిగోల్డ్‌ బాధితులు కదంతొక్కారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ హైవే వద్ద అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా నిర్వహించారు..ఇప్పటికైనా ప్రభుత్వం తమకు ఆదుకోవాలని కోరారు. కాగా ఆందోళనలో పాల్గొన్న ఐదు వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

హోదా డిమాండ్ తనదే - జేపీ..

విజయవాడ : లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రత్యేక హోదా డిమాండ్ మొదట తీసుకొచ్చింది తానేనని జేపీ పేర్కొన్నారు. హోదాతోనే విద్య..ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. విభజన వల్ల వచ్చిన ఆర్థిక లోటును కేంద్రం భరించాలని, రాష్ట్ర సర్కార్ విధానా వల్ల వచ్చే లోటును కేంద్రం తీర్చదన్నారు. కేంద్రం ఇచ్చిన రాయితీలు సరిపోవన్నారు. ట్యాక్స్ హాలిడే ప్రకటించేలా కేంద్రంపై వత్తిడి తేవాలన్నారు.

 

నకిలీ మావోయిస్టుల గుట్టు రట్టు..

హైదరాబాద్ : నకిలీ మావోయిస్టుల గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద రూ. 3.90 లక్షలు..తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై 9 బెదిరింపు కేసులు..రెండు కిడ్నాప్ కేసులున్నాయని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. 

ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆందోళన..

హైదరాబాద్ : గన్ పార్క్ వద్ద ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని ఉద్యోగులను తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. 

14:45 - October 8, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాలపై కలెక్టర్లు, హెచ్ వోడీలతో సీఎస్‌ రాజీవ్‌ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఎల్లుండినుంచి ప్రారంభమయ్యే కొత్త జిల్లాలు, కార్యాలయాలు, సిబ్బంది సర్దుబాటుపై సమీక్షించారు.. దసరా పండుగ రోజున కొత్తగా ఏర్పడనున్న కొత్త జిల్లాల కార్యాలయాలు, సిబ్బంది నిర్వహణ వంటి తదితర అంశాలపై అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారానికి వీడియోను వీక్షించండి..

పరిశుభ్రత - ప్రజారోగ్యంపై సీఎం బాబు టెలికాన్ఫరెన్స్...

విజయవాడ : పరిశుభ్రత - ప్రజారోగ్యంపై సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజారోగ్యంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజా జీవితంలో పరిశుభ్రత భాగం కావాలని, అంటువ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పరిసరాల పరిశుభ్రతలో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఉన్నత పాఠశాలల్లో రూ. 5 లక్షలతో ఆటస్థలాలు అభివృద్ధి చేయాలని, వైద్యరోగ్య, విద్య, మున్సిపల్, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 

బాబుతో చైనా ప్రతినిధుల భేటీ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో చైనాకు చెందిన సానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సోలార్, పవన విద్యుదుత్పత్తిపై చర్చ జరిగింది. మౌలిక వసతులు కల్పించాలని చైనా ప్రతినిధులు కోరారు. అవసరమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని సీఎం బాబు సూచించారు. 

హమాలీలకు దసరా కానుకల పంపిణీ..

అనంతపురం : రాప్తాడులో హమాలీలకు దసరా కానుకలను మంత్రులు పరిటాల సునీత, పల్లె, రఘునాథ్ రెడ్డి లు పంపిణీ చేశారు. ఒక క్వింటాకు రూ. 12 నుండి 15 హ్యాండింగ్ కమిషన్ పెంచుతున్నట్లు పేర్కొన్నారు. 

14:39 - October 8, 2016

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియం పూలనాన్ని తలపిస్తోంది.దసరా పండుగ బుతువులో విరగబూసే గునుగు, బంతి, తంగేడు పూలతో 20 అడుగుల ఎత్తులో బతుకమ్మలను ఏర్పాటు చేశారు. దీంతో ఎల్బీస్టేడియం రంగురంగు పూలతో కొత్త శోభను సంతరించుకుంది. 10 వేల బతుకమ్మలతో కళకళలాడుతోంది. బతుకమ్మలను పేర్చిన ఆడపడుచులు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. కోలాటాలు, డప్పులు, నృత్యాలతో కనువిందు చేస్తున్నారు ఆడపడుచులు. హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తోన్న మహా బతుకమ్మ వేడుకకు తెలంగాణ ఆడబిడ్డలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

కనీవినీ ఎరుగని రీతిలో బతుకమ్మ వేడుకలు
తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన బతుకమ్మ పండుగ నేటితో ప్రపంచ విఖ్యాతిగాంచనుంది. దీనికోసం ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో బతుకమ్మ వేడుకలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. మరికాసేపట్లో పదివేల మంది తెలంగాణ ఆడబిడ్డలు ఒకేసారి, ఒకే వేదిక మీది నుంచి బతుకమ్మ పాటలు, ఆటలతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులలో బతుకమ్మ పండుగ వైభవాన్ని నమోదు చేయనున్నారు. తెలంగాణభాషా సాంస్కృతికశాఖ సారథ్యంలో తెలంగాణ లోని 10 జిల్లాల నుండి వచ్చిన మహిళలకు ఇప్పటికే పాటలు పాడటం నృత్యాలు చేయటం తర్ఫీదునిచ్చింది. మహా బతుకమ్మ వేడుకలో ఆటపాటలతో అలరించేందుకు తెలంగాణ ఆడబిడ్డలంతా సిద్ధంగా వున్నారు. మహా బతుకమ్మ నిమజ్జనానికి బతుకమ్మ కొలనులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బతుకమ్మ పండుగ వైభవాన్ని చాటిచెప్పేలా స్టేడియంను తీర్చిదిద్దారు. కేరళ రాష్ట్రంలో ఒకేరోజున 5,211 మంది మహిళలు ఓనమ్ పండుగను జరుపుకోవడం ఇప్పటివరకు ప్రపంచ రికార్డుగా ఉన్నది. దీనిని బతుకమ్మ మహాప్రదర్శన అధిగమించనున్నది.మంత్రి అజ్మీరా చందూలాల్, రాష్ట్రప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, భాషాసాంస్కృతికశాఖ కార్యదర్శి బీ వెంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి బతుకమ్మ మహాప్రదర్శన కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. బతుకు కష్టసుఖాల విలక్షణతను వివరించే శృతిలయల ఆటపాటలతో లాల్‌బహదూర్ స్టేడియం మార్మోగనుంది. 

13:43 - October 8, 2016

గుంటూరు : హైదరాబాద్‌ నుంచి కొత్త రాజధానికి తరలి వచ్చిన మహిళా ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. అరకొర సదుపాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. సరైన రవాణా సదుపాయం లేక..నిత్యావసరాలు దొరకక...ఆందోళన చెందుతున్నారు. 
అసంపూర్ణంగా సౌకర్యాలు 
వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో అసంపూర్ణంగా ఉన్న సౌకర్యాల నడుమ మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కొన్ని బ్లాక్‌ల్లో ఇంకా పనులు జరుగుతున్నాయి. దీంతో లోపల విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పనులతో దుమ్ము..దూళి అధికంగా వస్తుందని.. దీంతో చాలా అసౌకర్యంగా ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. అలాగే ఇక్కడ నిత్యావసర సరుకులు దొరకడం లేదని.. సరుకులు దొరికేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
రెయిన్‌ ట్రీ పార్క్‌లో వసతి ఏర్పాటు 
మహిళా ఉద్యోగుల కోసం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న రెయిన్‌ ట్రీ పార్క్‌లో వసతి ఏర్పాటు చేశారు. అక్కడ నుంచే ఉదయం.. సాయంత్రం బస్సుల్లో సచివాలయానికి విధులకు హాజరవుతున్నారు. అయితే సచివాలయానికి వచ్చే బస్సుల సమయాల్లో ఏదైనా తేడా వస్తే తాము తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని మహిళా ఉద్యోగులు వాపోతున్నారు. కొన్నిసార్లు బస్సులు మిస్‌ అయిపోతున్నామని.. గ్రామీణ ప్రాంతం కావడంతో గమ్యస్థానానికి వెళ్లడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
కార్యాలయంలో బాత్‌రూమ్‌ల కొరత
కార్యాలయంలో బాత్‌రూమ్‌ల కొరత తీవ్రంగా ఉందని..దీని వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందని మహిళా ఉద్యోగులు అంటున్నారు. ప్రతి బ్లాక్‌లో ఫ్లోర్‌వైజ్‌గా ఆడవాళ్లకి, మగవాళ్లకి ఒకే చోట బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు విడిగా బాత్‌రూమ్‌లు నిర్మించాలని కోరుతున్నారు. ఈ సమస్యలను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి దృష్టికి తీసుకెళ్లగా.. వాటిని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నన్నపనేని హామీ ఇచ్చినా... సమస్యలు పరిష్కారం అయ్యేవరకు... మహిళా ఉద్యోగులకు ఇబ్బందులు తప్పేలా లేదు. 

 

13:37 - October 8, 2016

మూడో వికెట్ కోల్పోయిన భారత్..

ఇండోర్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన పుజారాను.. సాంట్నర్ పెవిలియన్‌కు పంపాడు. గంభీర్ నిష్క్రమించిన అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీతో కలిసి పుజారా ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలోనే భారత్ స్కోరు 100 పరుగులు దాటింది. కోహ్లీ 24 పరుగులతో, రహానే ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, పటేల్, సాంట్నర్ తలో వికెట్ తీశారు.

13:33 - October 8, 2016

హైదరాబాద్ : పోలీసులకు ఫిట్ నెస్ కోసం అన్ని పోలీస్ స్టేషన్లలో జిమ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి, సంతోష్ నగర్, కుల్సుంపుర, గోల్కొండ పోలీస్ స్టేషన్ల నూతన భవన సముదాయాలకు హోంమత్రి నాయిని నర్సింహారెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తామని.. గోల్కొండ పీఎస్ పరిధిలో ఎన్ని సీసీ కెమెరాలో ఉన్నాయో వాటన్నింటినీ దానికి అనుసంధానం చేస్తారని చెప్పారు. హైదరాబాద్ లో అన్ని సదుపాయాలు కలవని తెలిపారు. తెలంగాణలోని హైదరాబాద్ కు భూకంపాలు, వరదలు, తుపానులు రావన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తా త్రేయ, డీజీపీ అనురాగ్ శర్మతో పాటు సీపీ మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.  

 

సిడ్నీలో బతుకమ్మ సంబరాలు..

సిడ్నీ: ఆస్ట్రేలియా సిడ్నీలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మను అలంకరించి కవిత పాటలు పాడారు.

నాలుగు పీఎస్ ల నిర్మాణానికి నాయినీ శంకుస్థాపన..

హైదరాబాద్ : నగరంలో నాలుగు పీఎస్ ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయినీ నర్సింహరెడ్డి శంకుస్థాపన చేశారు. సంతోష్ నగర్, కుల్సుంపురా, గోల్కొండ పీఎస్ లకు శంకుస్థాపన చేశారు. 

13:27 - October 8, 2016

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావర‌ణ శాఖ పేర్కొంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవ‌ర్త‌నం ప‌శ్చిమ బెంగాల్, ఒడిశాలపై చురుగ్గా కొన‌సాగుతోంద‌ని, వీటి ప్ర‌భావంతో తెలుగు రాష్ట్రాల్లో ప‌లుచోట్ల చెదురుమదురుగా, ప‌లుచోట్ల ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. 

13:20 - October 8, 2016

సొట్టబుగ్గల సుందరి తాప్సీ స్లోగా బాలీవుడ్ లో క్లిక్ అయ్యేలా కనిపిస్తోంది. లేటేస్ట్ గా ఈ బ్యూటీ ఖాతాలో మరో సక్సెస్ సీక్వెల్ పడింది. సౌత్ లో సక్సెస్ కాలేకపోయిన ఈ బ్యూటీ బీటౌన్ లో మాత్రం ఛాన్స్ లతో పాటు సక్సెస్ పట్టేస్తోంది. బాలీవుడ్ లో ఈ బ్యూటీ అందుకున్న ఆ సక్సెస్ సీక్వెల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
తెలుగులో తాప్సీకి ఒక్క హిట్ లేదు..
తెలుగు, తమిళ భాషల్లో తాప్సీ 20 సినిమాల వరకు చేసింది. ఇన్ని సినిమాలు చేసిన ఏం లాభం సక్సెస్ మాత్రం ఈ సొట్టబుగ్గల హీరోయిన్ ని వరించలేదు. కనీసం కోలీవుడ్ లో అయిన ఒకటిఆరా సక్సెస్ లు వచ్చాయి. కానీ తెలుగులోనే ఒక్కటంటే ఒక్క పెద్ద హిట్టు కూడా తాప్సీకి దక్కలేదు. కానీ బాలీవుడ్ మాత్రం ఈ బ్యూటీ కాలం కలిసొచ్చేలా కనిపిస్తోంది.
తాప్సీ బాలీవుడ్ బాట 
సౌత్ లో కాలం కలిసిరాకపోవడంతో తాప్సీ బాలీవుడ్ బాటపట్టింది. అక్కడ ఈ బ్యూటీ హీరోయిన్ గా చేసిన చస్ మే బదూర్ , బేబీ సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇక లేటేస్ట్ గా రిలీజైన పింక్ మూవీ అయితే బాలీవుడ్ లో చర్చానీయాంశంగా మారింది. పింక్ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు ఈ మూవీలో తాప్సీ నటనకు మంచి పేరు వచ్చింది. దీంతో తాప్సీకి వరుస ఛాన్స్ లు వస్తున్నాయి.
నామ్ షబానాలో తాప్సీకి ఛాన్స్ 
ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్ లో రానా హీరోగా రూపొందుతున్న ఘాజీ తో పాటు థడ్కా అనే మూవీస్ చేస్తోంది. వీటితో పాటు లేటేస్ట్ నామ్ షబానా సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ తాప్సీ నటించిన బేబీ కి సీక్వెల్ గా రూపొందుతుండడం విశేషం. సినిమాకి ఇది సీక్వెల్. ఈ మూవీ స్టోరీ మొత్తం తాప్సీ చుట్టే తిరుగుతుందని టాక్ .ఈ మూవీ సక్సెస్ అయితే కనుక బాలీవుడ్ లో ఈ సొట్టబుగ్గల సుందరి ఫేట్ మారినట్లే అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తాప్సీ బాలీవుడ్ లో నెమ్మదిగా నిలదొక్కుకునేలా కనిపిస్తోంది.

 

13:16 - October 8, 2016

సమంత పట్టలేని సంతోషంలో మునిగితేలుతుంది. అంతేనా చైతూ పై ఈ బ్యూటీ చేసిన ట్వీట్ ఆడియన్స్ మరీ మరీ అట్రాక్ట్ చేస్తోంది. నాగచైతన్య లవ్ విషయంలో సమంత ఇంతకాలం సైలెంట్ గా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ చెన్నై బ్యూటీ చైతూ పై లవ్ ని ఓపెన్ గా ఎక్స్  ప్రెస్ చేస్తోంది. ఇంతకీ ఇంత సంతోషానికి రిజన్ ఏంటో మీరే చూడండి.
సమంత భావోద్వేగానికి లోనైందట
సమంతకు దీపావళి పండుగ ఇప్పుడే వచ్చినట్లు అనిపిస్తోందట. అంతేకాదు ప్రస్తుతం ఈ బ్యూటీకి గట్టిగా అరవాలో, ఏడువ్వాలో, ఎగిరి గంతులేయ్యాలో తెలియడం లేదట. శామ్స్ ఇంత ఆనందంగా ఉండటానికి నాగచైతన్య నే కారణమనేది ఒపెన్ సీక్రెట్ . చైతూ వల్లనే ప్రస్తుతం సమంత ఈ రేంజ్ లో భావోద్వేగానికి లోనైందట.
సమంత ముందు రోజే చూసిందట
నాగచైతన్య ప్రేమమ్ మూవీ నిన్ననే రిలీజైంది. ఈ మూవీని సమంత ముందే రోజే చూసిందట. కచ్చితంగా ఈ మూవీ సూపర్ హిట్టు అవుతుందని సమంత అప్పుడే చెప్పిందట. అయితే నిన్న రిలీజైన ప్రేమమ్ మూీకి ఆడియన్స్ యూనిమాస్ గా సూపర్ హిట్టు టాక్ రావడంతో సమంత నోట మాటరాలేనంత సంతోషంతో వెరీ ఎమోషన్ అయిపోయింది.
ప్రేమమ్ తో నాగచైతన్య జెన్యూన్ హిట్టు 
ప్రేమమ్ తో నాగచైతన్య చాలాకాలం తరువాత జెన్యూన్ హిట్టు అందుకున్నాడు. కాబోయే భర్త సక్సెస్ ని చూసిన సమంత ట్వీటర్ లో ఈ విషయాన్నే పోస్ట్ చేసింది. కొన్నిసార్లు మన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేం. ప్రజెంట్ నా ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. మై ఉడ్ బీ సక్సెస్ కొట్టడంతో ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయని సమంత ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో ప్రేమమ్ పై మరింత ఇంట్రెస్టింగ్ పెరిగింది. మొత్తానికి చైతూ పై ప్రేమను సమంత పబ్లిక్ గా షేర్ చేసుకుంటుంది.

 

13:10 - October 8, 2016
13:09 - October 8, 2016
13:06 - October 8, 2016

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని కలెక్టర్‌ శ్రీదేవికి పెద్ద ప్రమాదం తప్పింది.. పెబ్బేరు బైపాస్‌ సమీపంలో కలెక్టర్‌ వాహనం ఆటోను ఢీకొట్టింది.. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి... వీరిని ఆస్పత్రికి తరలించారు.. ఈ ప్రమాదంలో కలెక్టర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.. మరో వాహనంలో ఆమె ఆలంపూర్‌కు వెళ్లిపోయారు.

 

13:03 - October 8, 2016

చెన్నై : తమిళనాడు సీఎం జయలలితను ఎండిఎంకే నేత వైగో పరామర్శించారు. చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఇవాళ జయలలితను ప్రధానిమోదీకూడా పరామర్శించబోతున్నారు. మరోవైపు తమిళ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయలలిత అనారోగ్యంతో తాత్కాలిక సీఎంగా పన్నీర్‌ సెల్వంను నియమిస్తారంటూ వార్తలొస్తున్నాయి. పన్నీర్‌ సెల్వంను సీఎంగా రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. పన్నీర్‌ సెల్వంను బీ ఫ్యాక్ట్‌తో సీఎంగా ప్రకటిస్తారని ప్రచారంజరుగుతోంది. ఇదే అంశంపై గవర్నర్‌తో పన్నీర్‌ సెల్వం, పలని స్వామి భేటీ అయ్యారు. మరోవైపు కావేరి జలాల సమస్య, జయ ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టులో ఈ నెల 10న తుదితీర్పు వెలువడనుంది. ఈలోపే సీఎం మార్పు జరగాలని అన్నా డీఎంకే ముఖ్య నేతలు భావిస్తున్నట్లు సమాచారం. గత నెలల 22న జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతోంది. జయలలితకు ఎయిమ్స్‌ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:58 - October 8, 2016

అమెరికా : కరేబియన్ దీవుల్ని అతలాకుతలం చేసిన హరికేన్ మాథ్యూ అమెరికాపై పెను ప్రభావం చూపుతోంది. తుపాను ఇంకా తీరాన్ని తాకకపోయినా.. భారీ వర్షాలు, గాలుల ధాటికి శుక్రవారం ఫ్లోరిడా రాష్ట్రం వణికిపోయింది.160 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు 10 లక్షల ఇళ్లు కూలిపోయాయి... వ్యాపార సముదాయాలకు విద్యుత్ నిలిచిపోయింది. భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.. రాకాసి తుపాను మాథ్యూ దెబ్బకు హైతీ  మారూపాల్లేకుండా పోయింది. హైతీలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాలు ప్రాథమిక అంచనా మాత్రమేనని ఇంకా పెరగవచ్చని అధికారులు ప్రకటించారు.
ఎమర్జెన్సీ ప్రకటించింన అమెరికా ప్రభుత్వం 
మాథ్యూ హరికేన్ గంటకు 192 కి.మీ. వేగంతో ఏ క్షణమైనా తీరం తాకవచ్చన్న హెచ్చరికలతో అమెరికా ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.. డేటోనా బీచ్, కేప్ కెనవెరల్, జాక్సన్‌విల్లెలపై మాథ్యూ విరుచుపడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
పలు రాష్ట్రాలపై హరికేన్ ప్రభావం...
ఫ్లోరిడా తీరంతో పాటు జార్జియా, ఉత్తర, దక్షిణ కరోలినా రాష్ట్రాలపై మాథ్యూ హరికేన్  ప్రభావం అధికంగా ఉంటుందని అమెరికా వాతావరణశాఖ చెబుతోంది. మాథ్యూ బలహీనపడినా ఇంకా ప్రమాదకరంగానే ఉంటుంది. అట్లాంటిక్ తీర నగరాల్లో భారీ అలలతోపాటు పెను గాలులతో కుండపోత వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫ్లోరిడా తీర ప్రాంతాల నుంచి 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  2007లో హరికేన్ ఫెలిక్స్ తర్వాత కేటగిరి 5 స్థాయి తుపానుగా మథ్యూ నమోదయ్యింది.  వ చ్చే 24 గంటల్లో తీరం వెంట రాకాసి అలలు, 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. 

 

12:53 - October 8, 2016
12:52 - October 8, 2016

విజయవాడ : బందరు పోర్టును అక్కడి ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తే సరిపోతుందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. రైతుల నుంచి బలవంతంగా భూ సమీకరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచంలో ఏ పోర్టు కూడా 5 వేల ఎకరాలకు మించిలేదని, అలాంటిది మచిలీపట్నంలో పోర్టు కోసం 36 వేల ఎకరాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమల కోసం భూములు కావాల్సి వస్తే వాటికి సరిపడా ప్రభుత్వ భూములున్నాయని, రైతుల నుంచి భూములు బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బందరు ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క రైతు భూములిచ్చేందుకు సిద్ధంగా లేరని తెలిపారు. 

12:46 - October 8, 2016

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీ బస్ స్టేషన్ ప్రయాణీకులతో కిటకిటలాడుతోంది. దసరా సెలవులు కావడంతో జూబ్లీ బస్ స్టేషన్ కు ప్రయాణికులు పోటెత్తారు. ఒకేసారి రద్దీ పెరగడంతో బస్సులు సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జేబీఎస్ తో పాటు ఎంజీబీఎస్ బస్‌ స్టేషన్లతోపాటు... సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలోకూడా ఇదే పరిస్థితి ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఏపీలో రైతులకు అభద్రతా భావం - రఘువీరా..

అనంతపురం : రైతులకు భరోసా ఇవ్వడానికి రేపు బ్రహ్మ సముద్రం వేపులపర్తి నుండి గుమ్మగట్ట పూలకుంట వరకు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీర పాదయాత్ర చేయనున్నారు. రైతులు సాగు చేసిన వేరు శనగ ఎండిపోయే దశలో ఉందని, ప్రభుత్వం మాత్రం కరవు లేదని వంచించాలని చూస్తోందన్నారు. రైతులకు కొత్త రుణాలు, ఇన్ పుట్ సబ్సిడీ అందడం లేదని దీనితో రైతుల్లో అభద్రతా భావం ఏర్పడిందన్నారు. 

క్రీడలపై కూడా శ్రద్ధ చూపాలి - చిన రాజప్ప..

తూర్పుగోదావరి : చదువుతో పాటు క్రీడలపై కూడా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప పేర్కొన్నారు. క్రీడలకు సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, జిల్లాల్లో ఆధునిక వసతులతో క్రీడా మైదానాల ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. గ్రామాల్లో క్రీడలకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. క్రీడలను స్వచ్చందం సంస్థలు ప్రోత్సాహించాలని తెలిపారు. 

12:40 - October 8, 2016

హైదరాబాద్ : వేల ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. కేసీఆర్ ప్రభుత్వంలో నయీం బ్యాచ్ ఉందా.. ? అనే అనుమానం కల్గుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌ బతుకమ్మ కుంటలో తమ్మినేనితోపాటు, సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. రాష్ట్రంలోని బతుకుమ్మ కుంటలన్ని కబ్జాకు గురవుతున్నాయని.. ప్రభుత్వమే రౌడీలను పెట్టించి కబ్జా చేయిస్తోందని విమర్శించారు. కబ్జాదారుల నుంచి రాజకీయ నాయకులకు వాటా అందుతోందని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే ఏమిటి.. రాష్ట్ర ప్రజలకు బంగారం ఇస్తారా.. ఇంక ఏమైనా ఇస్తారా సీఎం కేసీఆర్ చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు. బతుకమ్మ కుంట అక్రమణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతిస్తున్నామని చెప్పారు. నయీం వందల ఎకరాల భూములను ఆక్రమించాడని, పది వేల కోట్ల రూపాయలను సంపాదించినట్లు తెలుస్తోందన్నారు. ప్రభుత్వాల సహకారంతోనే నయీం ఇష్టానుసారంగా వ్యవహరించాని తెలిపారు. ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ప్రస్తుత, గత ప్రభుత్వాల అండదండలు నయీంకు ఉన్నాయని ఆరోపించారు. అందరి అండదండలతోనే నయీం బ్యాచ్ నడిచిందని ఆరోపించారు. నిజాం నవాబుకు సొంత భూములు ఉన్నాయన్నారు. దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ వెళ్లిన ఇక్కడి నవాబులు వేల, లక్ష ఎకరాల భూములు వదిలేసి వెళ్లారని.. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఉంటే ఉపయోగకరంగా ఉండేదన్నారు. 

 

12:22 - October 8, 2016

ఢిల్లీ : భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘింస్తూనే ఉంది.  పాక్ సైనికులు మరోసారి తెగబడ్డారు. పూంచ్‌ సెక్టార్‌ వద్ద భారత జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక జవానుకు గాయాలయ్యాయి. మోటార్‌ షెల్లార్స్‌తో పాక్‌ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. పాకిస్తాన్‌ 10 రోజుల్లో 26 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

చెన్నైకు మోడీ..

చెన్నై : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెన్నైకి రానున్నారు. అపోలో ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా సీఎం జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. జయను పరామర్శించి ఆరోగ్య విషయాలను తెలుసుకోనున్నారు. 

12:14 - October 8, 2016

హైదరాబాద్ : సోషల్ మీడియాలో జనసేన హల్‌చల్‌ చేస్తోంది. ఇటీవల్ సోషల్ మీడియాలో అడుగుపెట్టిన జనసేన పార్టీ జనసేన మనసేన పేరుతో యూట్యూబ్‌లో వీడియో విడుదలచేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా అంతటా వ్యాపిస్తోంది. ఇప్పటిదాకా ప్రత్యేకహోదాపై పవన్‌కళ్యాణ్‌ పెట్టిన సభలన్నింటిలోని కొన్ని కొన్ని ఘట్టాలను ఈ వీడియోలో చూపించారు. 

 

12:12 - October 8, 2016

గుంటూరు : జిల్లా ఎస్పీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ గా ఉద్యోగం చేస్తున్న మాధవి ఆత్మహత్యాయత్నం చేశారు. బి సెక్షన్ సూపరింటెండెంట్ కరీముల్లా తనను తరచూ లైంగిక వేధింపులకు గురిచేసేవాడని ఆమె  ఆరోపిస్తున్నారు. కరీముల్లా ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేసి ఎస్పీ త్రిపాఠికి వినిపించినా...ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డానని చెబుతున్న జూనియర్‌ అసిస్టెంట్‌ టెన్ టివితో మాట్లాడింది. ఆ వివరాలను ఆమె మాటల్లోనే...
బాధితురాలు..
'వర్క్ లేకున్నా... పిలుస్తాడు. మిస్డ్ కాల్ ఇస్తాడు... నేను కాల్ చేయాలంట. పదే పదే మిస్ట్ కాల్ ఇస్తాడు. ముందుగా నీవు నాకు ఫ్రెండ్ అన్నాడు. నువ్వంటే ఇష్టం అంటాడు. సెప్టెంబర్ 30న ఆయన సీటులో కూర్చుని కాల్ చేసి.. ఇంటికి వెళ్లాక నాకు కాల్ చేయమన్నాడు. నాలుగు నెలలుగా అతని నుంచి ఇబ్బందులు, వేధింపలు ఎదుర్కొంటున్నాను. అతని ప్రవర్తన తెలిసి కాల్ రికార్డ్ చేశాను. ఎస్పీకి చూపించాను. ఏం చేయమంటావు అని ఎస్పీ నన్ను అడిగాడు. కానీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాలుగు రోజుల నుంచి ఎవ్వరు హెల్ప్ చేయలేదు' అని వాపోయింది.  

 

12:11 - October 8, 2016

పొడిచర్మం కలిగిన వారు చర్మాన్ని శుభ్రపరచుకునేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. ఎన్నో సౌందర్య సాధనాలను వాడుతుంటారు. కానీ కొన్ని టెక్నిక్స్ పాటిస్తే పొడిచర్మం నుండి కాపాడుకోవచ్చు.

  • పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు.
  • మృదువైన చర్మం కలిగినవారైతే, ఆరెంజ్‌ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి.
  • పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • మసాజ్‌ ఆయిల్‌, గంధం పొడి, రోజ్‌ వాటర్‌, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది.
  • అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.
  • కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది.
  • కాళ్లూ, చేతులకు గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్‌, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేతులకు, కాళ్ళకు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి.
  • ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
12:02 - October 8, 2016

హైదరాబాద్ : నాంపల్లి, సంతోష్ నగర్, కుల్సుంపుర, గోల్కొండ పోలీస్ స్టేషన్ల నూతన భవన సముదాయాలకు హోంమత్రి నాయిని నర్సింహారెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తా త్రేయ, డీజీపీ అనురాగ్ శర్మతో పాటు సీపీ మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.  

 

11:58 - October 8, 2016

ప.గో : పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. త్రివేణి సంస్థ అర్థరాత్రి నుంచి పనులు నిలిపివేసింది. డీజిల్‌కు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో పనులు నిలిపేసినట్టు తెలుస్తోంది. పోలవరం నిర్మాణం పనులను ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ త్రివేణి సంస్థకు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చి చేతులు దులుపుకుంది. ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. 
 

 

అన్నవరంపై టెన్ టివి కథనాలకు స్పందన..

తూర్పుగోదావరి : టెన్ టివి కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. అన్నవరం దేవస్థానంలో 31 మంది వ్రత పురోహితులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఐదుగురు పురోహితులను సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకున్నారు. 

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి - సాంబశివరావు..

విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు సాంబశివరావు పేర్కొన్నారు. బాధితులను అరెస్టు చేయడం దారుణమని తెలంగాణలో ప్రతిపక్షంగా పోరాడాడే టిడిపి ఏపీలో ఎందుకు తమపై కక్ష కట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను డైరెక్టర్లు బినామీ పేర్లతో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. 

అగ్రిగోల్డ్ బాధితుల రాస్తారోకో..

విజయవాడ : రామవరప్పాడు రింగ్ రోడ్డులో అగ్రిగోల్డ్ బాధితులు రాస్తారోకో నిర్వహించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

భారత వాయుసేన 84వ వార్షికోత్సవాలు..

ఢిల్లీ : భారత వాయుసేన 84వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హిండన్ ఎయిర్ బేస్ లో విన్యాసాలు జరిగాయి. ఇందులో తేజస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. 

పరిశుభ్రత - ప్రజారోగ్యంపై బాబు సమీక్ష..

విజయవాడ : పరిశుభ్రత - ప్రజారోగ్యంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అంటు వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. స్కూళ్లలో పరిశుభ్రత బాధ్యత సెర్ఫ్ తీసుకోవాలని, ఉన్నత పాఠవాలలో ఆటస్థలాలు అభివృద్ధి చేయాలన్నారు. స్వచ్ఛ భారత్ కు ఏపీ నాంది కావాలని పిలుపునిచ్చారు. 

10:40 - October 8, 2016

ఖమ్మం : భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వాజేడు, వెంకటాపురం మండలాలను భద్రాచలంలోనే కొనసాగించాలని... అలాగే భద్రాచలాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ సున్నం రాజయ్య దీక్ష చేస్తున్నారు. రెండు రోజులుగా చేస్తున్న రాజయ్య దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేసి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 
సున్నం రాజయ్య... 
'వాజేడు, వెంకటాపురం మండలాలను భద్రాచలంలో కొనసాగించాలని, భద్రాచలం జిల్లా కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని, ఎపిలో కలిపిన నాలుగు గ్రామ పంచాయతీలను తెలంగాణలోని భద్రాచలంలో ఉంచాలని... ఈ డిమాండ్ల మీద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాను. నిన్న కేబినెట్ మీటింగ్ లో స్పష్టత రాలేదన్న విషయాన్ని టీవీలో చూశాను. ప్రభుత్వం చాలా కుట్ర పూరితంగా నా దీక్షను భగ్నం చేసింది. ఇంకోరూపంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రభుత్వ ప్రకటన చేసే దాకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని' తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

బస్టాండ్లలో విపరీతమైన రద్దీ..

హైదరాబాద్ : నగరంలో దసరా సందడి నెలకొంది. స్వగ్రామాలకు వెళ్లేందుకు నగర వాసులు బయలుదేరుతుండడంతో జేబీఎస్, ఎంజీబీఎస్ లలో విపరీతమైన రద్దీ నెలకొంది. బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

వరంగల్ లో ఇద్దరు మైనర్లపై అత్యాచారం..

వరంగల్ : ఇద్దరు మైనర్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొండకండ్ల, పరకాలలో మైనర్లపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కొండకండ్లలో అత్యాచారం చేసిన యువకుడిపై నిర్భయ కేసు నమోదు చేశారు. బాధితురాలిని తొర్రూర్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. పరకాలలో మైనర్ ను యువకుడు గర్భవతి చేశాడు. పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. దీనితో పోలీసులు కేసు నమోదు చేశారు. 

10:06 - October 8, 2016
10:05 - October 8, 2016
10:03 - October 8, 2016

చెన్నై : తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. సీఎం జయలలిత అనారోగ్యంతో తాత్కాలిక సీఎంగా పన్నీర్‌ సెల్వంను నియమించే అవకాశం ఉంది. రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్‌తో కీలక మంత్రులు పన్నీర్‌ సెల్వం పలని స్వామి భేటీ అయ్యారు. పన్నీర్‌ సెల్వంను బీ ఫ్యాక్ట్‌తో సీఎంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అపోలో ఆస్పత్రిలో జయలలితకు చికిత్స కొనసాగుతోంది. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ చెన్నైకి వెళ్లి జయలలితను పరామర్శించనున్నారు. ఇదిలావుంటే కావేరి జలాల సమస్య, జయ ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టులో ఈ నెల 1న తుది తీర్పు వెలువడనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవికి తప్పిన ప్రమాదం

మహబూబ్ నగర్ : జిల్లా కలెక్టర్ శ్రీదేవికి ప్రమాదం తప్పింది. పెబ్బేరు బైపాస్ సమీపంలో కలెక్టర్ వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆడోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో వాహనం అలంపూర్ కు శ్రీదేవి బయల్దేరింది. 

 

నిర్మానుష్యంగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతం

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. త్రివేణి సంస్థ అర్ధరాత్రి నుంచి పనులు నిలిపివేసింది. డీజిల్ కు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ సంస్థ పనులు నిలిపివేసింది. ఎక్కడికక్కడి పనులు నిలిచిపోయాయి. 

తమిళనాట మారుతున్న రాజకీయ పరిణామాలు

చెన్నై : తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. సీఎం జయలలిత అనారోగ్యంతో తాత్కాలిక సీఎంగా పన్నీర్‌ సెల్వంను నియమించే అవకాశం ఉంది. రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

09:31 - October 8, 2016

ప్రభుదేవా, సోనుసు ద్ ప్రధాన పాత్రల్లో తమన్నాటైటిల్ రోల్ లో నటించిన చిత్రం అభినేత్రి. తమిళ దర్శకుడు కె ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోనవెంకట్ తో కలిసి ప్రభుదేవా స్వయంగా నిర్మించాడు. హర్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం మంచి అంచనాల నడుమ రిలీజైంది. కానీ అంచనాలను అందుకోవడంలో మాత్రం అభినేత్రి నిరాశపరిచింది.
కథ... 
మోడ్రన్ గాళ్ ని పెళ్లి చేసుకోవాలనుకునే కృష్ణ, (ప్రభుదేవా) అనుకోని పరిస్థితుల్లో దేవి (తమన్నా) పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఈ కొత్తజంట 205 అనే రూంలో అద్దెకు దిగుతారు. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కృష్ణ, దేవిని ఎలాగైనా వదిలించుకోవాలనే క్రమంలో అనేక రకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ అవేవీ ఫలించావు. ఈ క్రమంలో అంతకు ముందు 205రూమ్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రూబీ ఆత్మ దేవిని ఆవరిస్తుంది. ఆ తరువాత కృష్ణ ఎదుర్కొన్న సమస్యలేంటి అనేది అభినేత్రి అసలు కథ. హీరోయిన్ కావాలనుకున్న రూబీ ఛాన్స్ లు రాకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంటుంది. రూబీ ఆత్మ దేవిని ఆవరించి దేవి ద్వారా తన హీరోయిన్ కలను నేరవేర్చుకోవాలని ఆశపడుతుంది.అయితే అసలు విషయం తెలుసుకున్న కృష్ణ ఆత్మతో దయచేసి తన భార్య దేవి శరీరాన్ని వదిలివెళ్లాలని ప్రాధేయపడుతాడు. ఈక్రమంలో రూబీ ఆత్మ తను ఓ సినిమా చేసినాక దేవి శరీరాన్ని వదిలేస్తానని మాట ఇస్తోంది.  
విశ్లేషణ..  
దర్శకుడు విజయ్ ఫస్ట్ హాఫ్ లో కథ లేకపోయిన చాలా క్లీన్ గా రూపొందించి ఇంటర్వెల్ దగ్గర చిన్న ట్వీస్ట్ ఇచ్చాడు. దీంతో సెకాండాఫ్ లోనై థ్రిల్లర్ అంశాలతో థ్రిల్ చేస్తాడనుకున్న ఆడియన్స్ ని దర్శకుడు పూర్తిగా నిరాశపరిచాడు. ప్రభుదేవా కామెడి బాగా చేసిన అసలు కథలో విషయం లేకపోవడం మైనస్ .ఇక తమన్నా టైటిల్ రోల్ చేసిన మిల్కీబ్యూటీ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు.కెమేరా పనితనం బాగుంది. మురళీ శర్మ కామెడి అక్కడక్కడ పేలింది. మొత్తానికి అభినేత్రి ఇటు హర్రర్ థ్రిల్లర్ కాకుండా ఇటు పూర్తి స్థాయి ఫ్యామిలీ మూవీ కాకుండా మధ్య కిల్ అయింది.

 

భద్రాచలంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఖమ్మం : భద్రాచలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు ఐశ్వర్యక్ష్మీ అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. 

భారత్, న్యూజీలాండ్ మూడో టెస్టు మ్యాచ్

మధ్యప్రదేశ్ : ఇండోర్ వేదికగా భారత్, న్యూజీలాండ్ మూడో టెస్టు మ్యాచ్ జరుగనుంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

09:17 - October 8, 2016

మహిళను హత్య చేసి.. బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు

నల్గొండ : జిల్లాలో దారుణం జరిగింది. నర్సమ్మ అనే మహిళను హత్య చేసి.. ఐదు తులాల బంగారు గొలుసును దుండుగులు లాక్కెళ్లారు. నిన్న సాయంత్రం నర్సమ్మ బతుకమ్మ పువ్వుల కోసం వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు అర్ధరాత్రి నర్సమ్మ మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 

కరీంనగర్ జిల్లాలో పొంగిపొర్లుతున్న బొక్కల వాగు

కరీంనగర్ : జిల్లాలోని బొక్కల వాగు పొంగిపొర్లుతోంది. సింగరేణి ఓపెన్ కాస్ట్ కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్-ఆద్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు మధ్యలో బొక్కల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.  ఉదయం కార్మికులు విధులకు ఆటంకం కలిగింది. వాగు దాటలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  అధికారుల నిర్లక్ష్యమే కారణమని కార్మికులు ఆందోలన చేపట్టారు. 

 

08:13 - October 8, 2016
08:12 - October 8, 2016
08:04 - October 8, 2016

తెలంగాణ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేస్తుందని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టీఆర్ ఎస్ నేత వకుళాభరణం కృష్ణమోహన్, బీజేపీ నేత కుమార్ పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా జిల్లాలను విభజన కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. అఖిపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ప్రజాభిష్టం మేరకు జిల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

07:56 - October 8, 2016

సీఎం జయలలితను పరామర్శించనున్న ప్రధాని మోడీ

చెన్నై : నేడు తమిళనాడు సీఎం జయలలితను ప్రధాని నరేంద్రమోడీ పరామర్శించనున్నారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్నారు. అనారోగ్యంతో జయ ఆస్పత్రిలో చేరారు. 

 

వాహన తనిఖీలు...లారీ ఢీకొని హోంగార్డు మృతి

నెల్లూరు : మర్రిపాడు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లారీ ఢీకొని హోంగార్డు అహ్మద్ మృతి చెందారు. 

 

07:48 - October 8, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఊరువాడ బతుకమ్మ సంబురాలతో హోరెత్తుతున్నాయి. నృత్యాలు, కోలాటాలతో మహిళలు ఆడిపాడుతున్నారు. రాష్ట్ర పండుగైన బతుకమ్మకు అంతర్జాతీయ ఖ్యాతి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 10 వేల మంది మహిళలతో మహా బతుకమ్మ ఆడించి గిన్నీస్‌ రికార్డు నెలకొల్పేందుకు ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. 20 అడుగుల బతుకమ్మకు జీహెచ్‌ఎంసి సర్వం సిద్ధం చేసింది. 
10 వేల మంది మహిళలతో బతుకమ్మ
తెలంగాణ పూల పండగ బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈరోజు ఎల్‌బి స్టేడియం వేదికగా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. 10 వేల మంది మహిళలతో జీహెచ్‌ఎంసి, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహాబతుకమ్మ నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా 20 అడుగుల బతుకమ్మను తీర్చిదిద్దుతున్నారు. 
ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు బల్దియా ప్రయత్నం
మహా బతుకమ్మ వేడుకలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు బల్దియా ప్రయత్నిస్తోంది. మహిళల సమీకరణ కోసం..ప్రతి కార్పోరేటర్ తప్పనిసరిగా 200 మందిని తీసుకురావాలని నిబంధన విధించారు. అంతేకాకుండా పొదుపు, మహిళా సంఘాల నుంచి కూడా భారీగా ఆడపడుచులను తరలించేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు మహిళలకు ఎల్బీ స్టేడియంలో శిక్షణ ఇస్తున్నారు. 
పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు 
మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎల్‌బి స్టేడియాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
ప్రతి మహిళను లెక్కించి స్కాన్ చేసి లోపలికి 
గిన్నీస్ రికార్డు కోసం మహాబతుకమ్మ నిర్వహిస్తుండటంతో.. ఎల్బీ స్టేడియానికి వచ్చే ప్రతి మహిళను లెక్కించి స్కాన్ చేసి లోపలికి అనుమతిస్తారు. దీన్ని గిన్నీస్ రికార్డు కోసం ఎడిటోరియల్ వారికి అందజేస్తామంటున్నారు అధికారులు. 20 అడుగుల మహా బతుకమ్మ చుట్టూ మహిళలను ఆడిస్తామంటున్నారు. శనివారం 5 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. మహా బతుకమ్మ సంబురాలకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా బల్దియా, సాంస్కృతిక విభాగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు బల్దియా మేయర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

 

07:43 - October 8, 2016

హైదరాబాద్ : చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ కేబినెట్‌లో చేరడం ఖాయమేనా? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనే కొనసాగుతారా లేక మరో నేతకు ఆ పదవి కట్టబెడతారా? లేక జోడు పదవుల్లో చినబాబే చక్రం తిప్పుతారా ? అలా అయితే ఒక వ్యక్తికి ఒక పదవే ఉండాలన్న లోకేష్‌ చేసిన కామెంట్లు కామెంట్లుగానే మిగిలిపోనున్నాయా? ఈ ప్రశ్నలు ఏపీ టీడీపీలో హాట్‌ టాఫిక్‌గా మారాయి.  
ఒకే నేతకు జోడు పదవులపై అభ్యంతరాలు 
టీడీపీలో ఒకే నేతకు జోడు పదవులు వుండటంపై ఆది నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఒకటి కన్నా ఎక్కువ పదవులు ఉండటం వల్ల అధికారాలు ఒకే వ్యక్తి చేతుల్లో ఉండటమే కాకుండా, నిర్మాణాత్మక ప్రణాళికల అమల్లోనూ ఆలస్యం జరుగుతుందని టిడిపి భావిస్తోంది. అందుకే తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తికి-ఒకే పదవి అన్న సిద్దాంతాన్నే ఫాలో అవుతోంది. అయితే ఇప్పటికే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నారా లోకేష్‌ను..కేబినెట్‌లోకి తీసుకుంటారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. 
పార్టీ వ్యవహారాల్లో క్రీయశీలకంగా చినబాబు 
తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వున్న లోకేష్‌ను త్వరలోనే మంత్రి మండలిలోకి తీసుకోనున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. అప్పటి నుంచి ఏపి కేబినెట్‌లోకి  చిన బాబు ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని పార్టీ క్యాడర్‌ ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో దసరా తర్వాత జరిగే కేబినెట్ విస్తరణలో లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపడతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. 
చర్చనీయాంశంగా లోకేష్‌ జోడు పదవుల అంశం 
నారా లోకేష్‌కు జోడు పదవులు కట్టబెడతారన్న వార్తలు ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారాయి. అయితే ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలన్న లోకేష్ కామెంట్లు ఆయనకు వర్తిస్తాయా లేదా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. అసలు కేబినెట్ విస్తరణలో లోకేష్ పేరు వుంటుందా... మంత్రివర్గంలో చేరడానికి చినబాబు ఇష్టపడుతున్నారా లేక మరికొంత  కాలం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలోనే కొనసాగుతారా అన్న అంశాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. దసరా పండగ తర్వాతే  ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

07:36 - October 8, 2016

హైదరాబాద్ : జిల్లాల పునర్విభజనపై ఆందోళనలు మొదలవుతున్నాయి. 31 జిల్లాలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు తప్పుపడుతున్నారు. జిల్లాల ఏర్పాటు కేసీఆర్‌ రాజకీయ చదరంగంలో భాగమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే జిల్లాల పునర్విభజన చేయడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. 
ముందు నియోజవర్గాల పునర్విభజన 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని.. ఆ తర్వాత జిల్లాల పునర్విభజన జరుగుతుందని అందరూ భావించారు. కానీ.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అందుకు భిన్నంగా నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమీషన్లు ప్రక్రియ కొనసాగిస్తుండగానే నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. 
జిల్లాల ఏర్పాటు వివాదాస్పదం
అయితే.. తొలుత 24.. ఆ తర్వాత 27.. తాజాగా 31 జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు రావడం వివాదాస్పదంగా మారుతోంది. మరోవైపు పలు ప్రాంతాల్లో కొత్త జిల్లాల కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. వీటన్నింటికి జిల్లాల డిమాండ్‌ ఉన్న ప్రాంతాలతో పాటు.. మరికొన్ని జిల్లాలకు కేసీఆర్‌ పచ్చజెండా ఊపడమే కారణమని పలువురంటున్నారు. నియోజకవర్గాల్లోని మండలాలను ఇష్టానుసారంగా విభజించడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుపడుతున్నారు. ముందుగా జిల్లాలు, మండలాలను పునర్విభజన చేయడం ద్వారా కొత్త నియోజకవర్గాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. తాజా నిర్ణయం ప్రకారం జిల్లాలు ఏర్పడి.. వాటి ప్రాతిపదికగా కేంద్ర ఎన్నికల సంఘం నియోజకవర్గాల పునర్విభజన జరిపితే రాష్ట్రంలో దళిత, గిరిజన ప్రజాప్రతినిధులకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటున్నారు. 
పునర్విభజన చట్టాన్నితుంగలో తొక్కుతున్న కాంగ్రెస్‌ 
అధికార పార్టీ నిర్ణయాలను సమర్ధిస్తూ.. తమ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌ చేయాలంటూ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కోరడం ఏంటని రేవంత్‌రెడ్డి పరోక్షంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. పునర్విభజన చట్టాన్ని తయారు చేసిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ఆ చట్టాన్నితుంగలో తొక్కుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. 
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం : రేవంత్‌రెడ్డి 
నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే జిల్లాల పునర్విభజన చేపట్టడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు రేవంత్‌రెడ్డి. ఓ వైపు దసరాకు కొత్త జిల్లాలు ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. రేవంత్‌రెడ్డి కోర్టును ఆశ్రయిస్తాననడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

 

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా భారీగా తరలిస్తున్న భక్తుల సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. వీఐపీలకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అనుమతిస్తారు. సాయంత్రం అమ్మవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

కబడ్డీ ప్రపంచకప్ లో నేటి మ్యాచ్ లు

ఢిల్లీ : కబడ్డీ ప్రపంచకప్ లో నేటి మ్యాచ్ ల వివరాలు ఇలా ఉన్నాయి. సాయంత్రం 6.50 నిమిషాలకు ఇంగ్లండ్, బంగ్లాదేశ్ ఢీకొంటాయి. రాత్రి 8 గంటలకు పోలెండ్, కెన్యా మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 9 గంటలకు భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. 

 

07:16 - October 8, 2016

ఖమ్మం : భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వాజేడు, వెంకటాపురం మండలాలను భద్రాచలంలోనే కొనసాగించాలని... అలాగే భద్రాచలాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ సున్నం రాజయ్య దీక్ష చేస్తున్నారు. ఎపిలో కలిపిన ఏడు మండలాలను భద్రాచలం జిల్లాలలో కలపాలని కోరుతున్నారు. రెండు రోజులుగా చేస్తున్న రాజయ్య దీక్షను తెల్లవారుజామున 2.30 గంటలకు పోలీసులు బలవతంగా భగ్నం చేసి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీక్షస్థలి వద్ద ఉన్న టెంట్ ను ఇతర సమాగ్రిని బలవంతంగా తీసేశారు. రాజయ్య వైద్యం చేయించుకోవడానికి నిరాకరిస్తున్నారు. వైద్యం అందించడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. భద్రాచలం ఏరియా ప్రజల మనోభావాలే తనకు ముఖ్యమని... ప్రాణాలు పోయినా పర్వాలేదన్నారు. రాజయ్య దీక్ష భగ్నాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. 

నేటి నుంచి భారత్, న్యూజిలాండ్ మూడో టెస్ట్ మ్యాచ్

మధ్యప్రదేశ్ : ఇండోర్ వేదికగా నేటి నుంచి భారత్, న్యూజిలాండ్ మూడో టెస్టు మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్ రెండు జట్లు సిద్ధం అయ్యాయి. 

నేడు వరంగల్ కు వెళ్లనున్న సీఎం కేసీఆర్

వరంగల్ :  నేడు సీఎం కేసీఆర్ వరంగల్ కు వెళ్లనున్నారు. రేపు భద్రకాళి అమ్మవారికి సీఎం మొక్కు చెల్లించనున్నారు. అమ్మవారికి 11 కిలోల 700 గ్రాముల స్వర్ణ కిరీటం ఇవ్వనున్నారు. 

ఎమ్మెల్యే సున్నం రాజయ్య దీక్ష భగ్నం

ఖమ్మం : సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 

Don't Miss