Activities calendar

09 October 2016

21:48 - October 9, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగు పడుతున్నట్టు ఆమెకు చికిత్స చేస్తున్న చెన్నైలోని ఆపోలో ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. వైద్యానికి ఆమె స్వల్పంగా స్పందిస్తున్నారని అంటున్నాయి. ఈరోజు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖలు జయలలితను పరామర్శించారు. మరోవైపు జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ తమిళనాడు వ్యాప్తంగా పూజలు కొనసాగుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని.. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. జయలలిత కొద్దికొద్దిగా కోలుకుంటున్నారని వారు చెబుతున్నారు. ఇప్పటికే లండన్‌తోపాటు ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు జయలలితను పరీక్షించి, మెరుగైన చికిత్సకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. స్వదేశీ, విదేశీ వైద్య నిపుణుల సూచనలు, సలహాల మేరకు చెన్నైలోని అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

పరామర్శలు..
మరోవైపు జయలలితకు ప్రముఖుల పరామర్శలు కొనసాగుతున్నాయి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా, తమిళ మానిల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జీకే వాసన్‌ తదితరులు ఆపోలో ఆస్పత్రిలో జయను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి జయలలిత ఆరోగ్యంపై ఆరా తీశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా జయలలితను పరామర్శించారు. ఇంకోవైపు జయలలిత త్వరగా కోలుకోవాలంటూ... తమిళనాడు వ్యాప్తంగా అన్నాడిఎంకే శ్రేణులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జయలలిత ఫోటోలకు అర్చనలు చేయిస్తూ, నైవేద్యాలను నివేదిస్తున్నారు. గుమ్మడికాయలతో దిష్టి తీస్తున్నారు. హోమాలు, కలశ పూజలు చేస్తున్నారు. తిరుపరకుండ్రంలో సుబ్రహ్మణ్యస్వామికి పదివేల మందికి పైగా అన్నాడిఎంకే కార్యకర్తలు క్షీరాభిషేకం చేయించారు. జయలలిత త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌అవుతారన్న ఆశాభావాన్ని అన్నా డిఎంకే నేతలు, ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గతనెల 22న జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. జయలలిత కోలుకుంటున్నారని చెబుతున్న డాక్టర్లు... ఎప్పటికి సాధారణ స్థితికి చేరుకుంటారన్న విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. 

21:46 - October 9, 2016

హైదరాబాద్ : నగరంలోని ట్యాంక్‌బండ్‌ వద్ద సద్దుల బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వేలాదిగా తరలివచ్చిన మహిళలు వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను అలంకరించి.. ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా సాగుతున్న ఈ పండుగతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు సందడిగా మారాయి. విదేశీ మహిళలు సైతం సద్దుల బతుకమ్మలో పాల్గొని ఆడిపాడారు. బతుకమ్మ సందర్భంగా భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. దీంతో పరిసర ప్రాంతాలన్నీ వెలుగులు విరజిమ్మాయి. 

21:30 - October 9, 2016

హైదరాబాద్ : టిడిపి, వైసిపి మధ్య మాటల తూటాలు మళ్లీ పేలుతున్నాయి. టిడిపి నిర్వహించిన శిక్షణా శిబిరంలో..లోకేష్..ఏపీ మంత్రి చిన రాజప్ప ఫొటో పై వైసిపి పలు విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై అంతేఘాటుగా టిడిపి ప్రతివిమర్శలు గుప్పిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌... తన వైఖరిని సరిదిద్దుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. లోకేశ్‌ స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నారని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రులపై పెత్తనం చెలాయించడం లోకేశ్‌కు తగదని హితవు పలికారు.

సోమిరెడ్డి విమర్శలు..
లోకేష్‌ను అపఖ్యాతి పాలు చేసేందుకే వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. లోకేష్‌ కార్యకర్తల సంక్షేమం గురించి చర్చిస్తుంటే.. దానిని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్‌ హయాంలో మంత్రులు, అధికారులతో కుమ్మక్కై జగన్‌ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు సోమిరెడ్డి.

భూములు లాక్కొంటున్నారన్న భూమన..
పరిశ్రమల పేరుతో చంద్రబాబు ప్రజల నుంచి భూములను బలవంతంగా లాక్కుంటున్నారన్నారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి. తమ అనుయాయులు వేల కోట్లు సంపాదించేందుకునేందుకే ప్రజలకు తక్కువ నష్టపరిహారమిచ్చి భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం వేల ఎకరాల భూమిని సేకరించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుందన్నారు భూమన. 

21:22 - October 9, 2016

ఇండోర్ : న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 557 పరుగుల భారీ స్కోరు సాధించి ఇన్నింగ్స్ డిక్లెర్డ్ చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 211 పరుగులు, అజింక్య రహానె 188 పరుగులతో భారత్ భారీ స్కోరు సాధించింది. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్, జీతన్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. శాంట్నర్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఆట చివర్లో 9 ఓవర్ల పాటు ఆడిన న్యూజిలాండ్.. వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు గప్టిల్ 17, లాథమ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే కివీస్ మరో 329 పరుగులు చేయాల్సి ఉంది. 

21:18 - October 9, 2016

హైదరాబాద్ : ఏడాదికి మూడు పంటలు పండే విధంగా చెరువులు అలుగులు పోస్తుంటే సీపీఎం మహాజన పాదయాత్ర పేరుతో పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానింంచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తొలినుంచి వందశాతం వ్యతిరేకించిన పార్టీ మొదలు తెలంగాణ ఏర్పాటుపై తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ఆ తర్వాతే మహాజన పాదయాత్ర మొదలుపెట్టాలని సూచించారు. అయితే సీపీఎం చేపట్టే మహాజన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకోవాలని రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

తమ్మినేని కౌంటర్.. 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహాజన పాదయాత్రపై పలు విమర్శలు చేయడంపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని స్పందించారు. చాలా విచారకరమని, అంత కోపం..ఎందుకో తెలియడం లేదన్నారు. కేసీఆర్..టీఆర్ఎస్..ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర నిర్వహించడం లేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు సుభిక్షంగా అభివృద్ధి చెందాలని యాత్ర నిర్వహించడం చేయడం జరుగుతోందని తెలిపారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వెనుకబడిన తరగతుల వారు అభివృద్ధి చెందాలంటే మాటల్లో కాదని..చేతల్లో కావాలని పేర్కొన్నారు. గిరిజనులకు భూములివ్వాలని, విద్యార్థులకు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని, సంచార జాతుల వారికి సహాయం చేయాలన్నారు. మైనార్టీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో ఏ సమస్య ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుందన్నారు. తన గన్ మెన్లను సైతం ప్రభుత్వం ఉపసంహరించిందని, యాత్రకు పర్మిషన్, బందోబస్తు ఇవ్వాలని, రెచ్చగొట్టే కార్యక్రమాలను మానుకోవాలని సూచించారు. పాదయాత్రను ప్రజలు అర్థం చేసుకుని మద్దతు తెలపాలన్నారు. 
గొంతునొక్కుతున్నారు..
ప్రతిపక్షాల గొంతునొక్కేసేలా సీఎం కేసీఆర్‌ వ్యవహారిస్తున్నారని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు ఆరోపించారు. సీపీఎం మహాజన పాదయాత్రపై చేసిన కేసీఆర్‌ వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగ్గవి కావని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు భవిష్యత్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయని కాంగ్రెస్ నేత బెల్యా నాయక్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రతిఘటనను ఆహ్వానించినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

 

21:06 - October 9, 2016

హైదరాబాద్ : నగరంలో ఆదివారం రాత్రి భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. బోరబండ పద్మావతి కాలనీ, దేవయ్య బస్తీ, భవానీనగర్ ప్రాంతాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. భయంతో ఇళ్ల నుండి ప్రజలు బయటకు పరుగులు తీశారు. సరిగ్గా 8.30గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. కేవలం మూడు సెకన్ల పాటు మాత్రమే భూమి కంపించింది. ఒకే ప్రాంతంలో భూమి కంపించడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పంజాగుట్టలో కూడా భూమి కంపించింది అని పుకార్లు షికార్లు చేశాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షించారు. పేలుడు వల్ల భూమి కంపించిందా ? లేక ఇతరత్రా కారణాలున్నాయా ? పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

హైదరాబాద్, సిక్కోలులో భూ ప్రకంపనలు..

హైదరాబాద్ : నగరంలో ఆదివారం రాత్రి భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. బోరబండ పద్మావతి కాలనీ, దేవయ్య బస్తీ, భవానీనగర్ లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. భయంతో ఇళ్ల నుండి ప్రజలు బయటకు పరుగులు తీశారు. మరోవైపు శ్రీకాకుళంలోనూ భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. ఎచ్చర్ల, పొందూరు మండలాల్లో భూమి కంపించింది. 

20:06 - October 9, 2016

ఆరాధన కుటుంబ సభ్యులపై కేసు నమోదు..

హైదరాబాద్ : ఆరాధన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 60 రోజుల పాటు ఆరాధన ఉపవాస దీక్ష చేసి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐపీసీ 304, జువైనల్ జస్టిస్ యాక్ట్ 75 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

చెన్నైలో బాణసంచా కర్మాగారంలో పేలుడు..

చెన్నై : వెలిపురం జిల్లా పులిక్కిపులం గ్రామంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఐదుగురు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పాండిచ్చేరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

పోలీసు వాహనం బోల్తా..

నల్గొండ : మునగాల మండలం బరాకత్ గూడెం వద్ద అదుపు తప్పి పోలీసు వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. ఏపీ 9 పీఏ 590 వాహనం హైదరాబాద్ - మంగళగిరి వెళుతోంది. 

ఆందోళనలో కరీంనగర్ మిర్చి పంట రైతులు..

కరీంనగర్ : మహదేవ్ పూర్, కాటారం, మహాముత్తారం మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీనితో మిర్చి పంట రైతులు ఆందోళనలో ఉండిపోయారు. 

19:30 - October 9, 2016

హైదరాబాద్ : బీసీ విద్యార్థుల కోసం తెలంగాణ సర్కార్‌ కొత్త పథకాన్ని ప్రారంభించింది. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ ఫైల్‌పై కేసీఆర్‌ సంతకం చేశారు. దీంతో తొలిసారి విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయనుంది. తొలి ఏడాది 300 మంది విద్యార్థులకు 60 కోట్ల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తారు. 

19:28 - October 9, 2016
19:27 - October 9, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌, డోనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య రెండో బహిరంగ చర్చకు సర్వం సిద్ధమయ్యింది. డెమోక్రాటిక్‌ పార్టీ తరుపున అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ పార్టీ తరుపున న్యూయార్క్ రియల్టర్‌ డోనాల్డ్ ట్రంప్‌ పోటీ చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఆరున్నర గంటలకు మొదలయ్యే చర్చ గంటర్నపాటు కొనసాగుతుంది. మిస్సోరి రాష్ట్రం సెయింట్‌ లూయీస్‌లోని వాషింగ్‌టన్‌ యూనివర్సిటీలో బిగ్‌ డిబేట్‌ జరుగుతుంది. గత నెల 26న జరిగిన బహిరంగ చర్చలో హిల్లరీ పైచేయి సాధించిన నేపథ్యంలో రెండో డిబేట్‌ ఎలా ఉంటుందన్న అంశం ఆసక్తిగా మారింది. హిల్లరీ క్లింటన్‌, డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య మూడో బహిరంగ చర్చ ఈనెల 19న జరుగుతుంది. వచ్చే నెల 8న అమెరికా అధ్యక్ష పదవికి పోలింగ్‌ నిర్వహిస్తారు. 

19:25 - October 9, 2016

హైదరాబాద్ : సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్ర ప్రజా సమస్యలను అధ్యయనం చేయడానికి బాగా ఉపకరిస్తుందని వివిధ పత్రికలు, చానళ్ల ఎడిటర్లు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేని కారణంగా.. సీపీఎం క్రియాశీలంగా వ్యవహరించాలని పలువురు ఎడిటర్లు సూచించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 17నుంచి తలపెట్టిన మహాజన పాదయాత్రను పురస్కరించుకుని.. పార్టీ హైదరాబాద్‌లో ఎడిటర్ల సమావేశం నిర్వహించింది. వివిధ పత్రికలు, చానళ్ల ఎడిటర్లు ఈ భేటీకి హాజరయ్యారు. ముందుగా మాట్లాడిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాజన పాదయాత్ర ఉద్దేశాన్ని వివరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది నమూనాను ప్రజలు...., ప్రభుత్వం ముందు పెట్టడమే తమ యాత్ర ముఖ్యలక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లోఆధికారం కోసం తాము పాదయాత్ర చేయడం లేదని, వచ్చే తరం అభివృద్ది కోసమేనని అన్నారు.

పలువురి అభిప్రాయాలు..
సమావేశానికి హాజరైన సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కొండుభట్ల రామచంద్రమూర్తి.. ప్రభుత్వ విధానాలు నిరుద్యోగ యువతను ఆదుకునేలా ఉండాలన్నారు. కమ్యూనిస్టు భావజాలాన్ని యువతకు చేరేలా వామపక్షాలు కార్యాచరణను రూపొందించాలని సూచించారు. భేటీకి హాజరైన ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీనివాస్‌.. సీపీఎం అధికారం కోసం పోరాడే పార్టీ కాదని.. ప్రజల కోసం పోరాడే పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేని దృష్ట్యా సీపీఎం క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. ప్రజలను చైతన్యపరచడంతోపాటు, ప్రజా సమస్యలను లోతుగా తెలుసుకునేందుకు మహాజన పాదయాత్ర ఉపయోగపడుతుందని.. తాను ఆశిస్తున్నట్లు మనతెలంగాణ ఎడిటర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల్లోకి నేరుగా వెళ్లడం వల్ల అదనపు సమాచారం తెలుసుకునే వీలుంటుందని తెలిపారు. సీపీఎం విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు మహాజన పాదయాత్ర ఉపయోగపడుతుందని 10టీవీ అసోసియేట్‌ ఎడిటర్ శ్రీధర్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన ప్రజాకాంక్ష., తరువాత వచ్చిన పాలన ఎలా ఉంది. చేయాల్సిన మార్పులు మార్పు ఏంటి అనే అంశాల అధ్యయనానికి మహాజన పాదయాత్ర ఉపకరిస్తుందన్నారు. ప్రజా సమస్యలను సూక్ష్మ స్థాయిలో అధ్యయనం చేసేందుకు.. వాటికి పరిష్కారాలను సూచించేందుకు సీపీఎం మహాజన పాదయాత్ర ఉపకరిస్తుందని.. భేటీకి హాజరైన వక్తలు అభిప్రాయపడ్డారు. 

19:09 - October 9, 2016

వరంగల్ : పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల విభజన జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాల తీరు ఏమాత్రం సరిగా లేదని విరుచుకుపడ్డారు. వరంగల్‌ భద్రకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు మొక్కు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే అమ్మవారికి బంగారు కిరీటం సమర్పిస్తానన్న మొక్కును తీర్చారు సీఎం. దుర్గాష్టమి పర్వదినం, అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా ముఖ్యమంత్రి సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని.. 3 కోట్ల 70 లక్షల విలువైన 11 కిలోల 700 గ్రాముల బంగారు కిరీటాన్ని సమర్పించారు. అమ్మవారికి కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పట్టణ అభివృద్ధికి త్వరలో మాస్టర్‌ ప్లాన్‌ -కేసీఆర్‌..
తెలంగాణ సిద్ధిస్తే భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించుకుంటానని మొక్కుకున్నానని... తెలంగాణ వచ్చింది కనుక మొక్కు చెల్లించుకున్నానన్నారు కేసీఆర్‌. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వరంగల్‌లోని చారిత్రక కట్టడాలను అభివృద్ధి చేస్తామని.. పట్టణ అభివృద్ధికి మూడు వందల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. త్వరలోనే పట్టణ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తామన్నారు సీఎం.

విపక్షాలపై విమర్శలు..
కొత్త జిల్లాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు కేసీఆర్‌. జిల్లాల ఏర్పాటు కోసం ఏడాది క్రితమే సీఎస్‌ అధ్యక్షతన కమిటీ వేశామని.. ఆ తర్వాత కేకే అధ్యక్షతన హైపవర్‌ కమిటీ వేసి ప్రక్రియ పూర్తిచేశామన్నారు. అప్పుడు అభ్యంతరాలు చెప్పని నేతలు.. ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని అడ్డుకోవడమే ప్రతిపక్షం లక్ష్యంగా పెట్టుకుందని, పీసీసీ చీఫ్‌ ఏం మాట్లాడుతున్నారో.. ఆయనకే అర్ధం కావడం లేదని కేసీఆర్‌ అన్నారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలకు ముందుగానే దసరా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌.. ప్రజలంతా సుఖసౌభాగ్యాలతో విలసిల్లాలని భద్రకాళి అమ్మవారిని కోరినట్లు తెలిపారు. 

19:03 - October 9, 2016
19:01 - October 9, 2016

రాజమండ్రి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైఖరిని సరిదిద్దుకోవాలని వైసీపీ సూచించింది. టిడిపి శిక్షణా తరగతుల్లో ఏపీ మంత్రి చిన రాజప్ప, లోకేష్ కు సంబంధించిన ఓ ఫొటో వివాదం సృష్టిస్తోంది. టిడిపి..వైసిపి పార్టీల మధ్య విమర్శలు గుప్పిస్తోంది. లోకేష్ తన స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మంత్రులపై పెత్తనం చెలాయించడం లోకేష్ కు తగదని, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ లా జరుగుతోందన్నారు. ఏ దోపిడి జరిగినా లోకేష్ హస్తం ఉంటుందని ఘాటు ఆరోపణలు చేశారు. 

18:57 - October 9, 2016

హైదరాబాద్ : కాలేయ వ్యాధితో బాధ పడుతూ కేర్ ఆసుపత్రిలో హర్షిత కన్నుమూయడంపై ఆసుపత్రి యాజమాన్యం..ప్రభుత్వమే బాధ్యత వహించాలని యువజన కాంగ్రెస్ పేర్కొంది. హర్షిత కుటుంబానికి న్యాయం చేయాలని నేతలు ఆందోళన చేశారు. దీనితో అక్డక ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నేత అనీల్ టెన్ టివితో మాట్లాడారు. ప్రభుత్వం ఆదుకొనే వరకు ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే హర్షిత చనిపోయిందని, వైద్యానికయ్యే ఖర్చులను భరిస్తామన్న ప్రభుత్వ హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. ఇంకా అనీల్ ఏమన్నారో వీడియో క్లిక్ చేయండి. 

18:20 - October 9, 2016
18:19 - October 9, 2016

హైదరాబాద్ : చాలా రోజులుగా టీఆర్ఎస్ కార్యకర్తలు వేచి చూస్తున్న నామినెట్ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దసరా పండుగ నేపథ్యంలో కేసీఆర్ బొనాంజ ప్రకటించారు. ఏకంగా 9 కార్పొరేషన్లకు ఛైర్మన్ లను నియమకాలు జారీ చేశారు. వరంగల్ పర్యటన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిన వారు..ఎమ్మెల్యేలుగా పోటీ చేసి పరాజయం చెందిన వారికి ఛైర్మన్ల పదవులు కట్టబెట్టారు.

  • సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ గా మధుసూధన్ రెడ్డి..
  • టీఎస్ఐఐసీ ఛైర్మన్ గా బాల మల్లు...
  • గొర్రెల, మేకల పెంపకం అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా రాజయ్య..
  • టీఎస్ అగ్రో ఛైర్మన్ గా లింగంపల్లి కృష్ణారావు..
  • తెలంగాణ స్పోర్ట్స్ అథార్టీ ఛైర్మన్ గా వెంకటేశ్వర్ రెడ్డి..
  • ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నరేందర్ రెడ్డి..
  • ఇరిగేషన్ డెవలప్ మెంట్ ఛైర్మన్ గా ఈద శంకర్ రెడ్డి..
  • కుడా ఛైర్మన్ గా మర్రి యాదవ్ రెడ్డి..
  • వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా శ్యామూల్..
18:12 - October 9, 2016

హైదరాబాద్ : '30 ఇయర్స్ ఇండ్రస్ట్రీ' అంటే ఠక్కున 'పృథ్వీ' పేరుకు గుర్తుకు వస్తుంది. అనతికాలంలోనే కమెడీయన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన నటుడు. ఈ నటుడిపై పోలీసు కేసు నమోదైంది. పెళ్లి పేరిట తనను వేధిస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కానీ ఈ కేసును రాజీ కుదుర్చినట్లు తెలుస్తోంది. 2001లో కవిత అనే మహిళతో పృథ్వీకి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఇద్దరు పిల్లల బాద్యత తాను తీసుకుంటానని పృథ్వీ పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం పృథ్వీ మరో వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే తనను వేధిస్తున్నాడంటూ కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఇద్దరూ రాజీకి వచ్చారని తెలుస్తోంది. 

గాయపడిన మావోయిస్టులకు రక్తదానం చేసిన పోలీసులు..

విశాఖపట్టణం : ఎన్ కౌంటర్ లో గాయపడిన మావోయిస్టులకు పోలీసులు రక్తదానం చేశారు. ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు తీవ్రగాయాలకు గురయ్యారు. చికిత్స పొందుతున్న వీరికి పోలీసులు రక్తదానం చేశారు. 

17:41 - October 9, 2016

మెదక్ : జిల్లా సంగారెడ్డిలో ఈనెల 14 నుంచి 16 వరకు సీఐటీయూ రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరగనున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు నిప్పులు చెరిగారు. ఎన్నడూ లేని విధంగా కార్మిక వర్గ పోరాటాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. సీఐటీయూ మహాసభల సందర్భంగా ఆయన సంగారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా సాయిబాబుతో టెన్ టివి ముచ్చటించింది. 700 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని, మూడు రోజుల పాటు జరిగే మహాసభలకు ప్రముఖులు హాజరౌతారని తెలిపారు. ఏపీ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన సెక్రటరీలు వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుకాల కార్మికులు..ఉద్యోగుల కృషి ఉందని, కార్మికులు..ఉద్యోగుల త్యాగాలకనుగుణంగా తెలంగాణ ఏర్పడిందని ప్రభుత్వం పేర్కొందని గుర్తు చేశారు. దీనిని తాము స్వాగతించడం జరిగిందని, అందుకని సంవత్సరకాలంగా వివిధ సమ్యలపై వినతిపత్రాలు మాత్రమే ఇవ్వడం జరిగిందని తెలిపారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదన్నారు. మూతపడుతున్న పరిశ్రమల గురించి మాట్లాడకుండా పెద్ద పెద్ద పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:37 - October 9, 2016

హైదరాబాద్: ప్రతిపక్షాల గొంతునొక్కేసేలా సీఎం కేసీఆర్‌ వ్యవహారిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్రపై చేసిన కేసీఆర్‌ వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగ్గవి కావన్నారు. సీపీఎం తెలంగాణలో ఉండకూడదనే ఉద్ధేశ్యం..పాదయాత్ర చేయవద్దని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రతి పార్టీకి హక్కు ఉందని, ప్రతిపక్ష పార్టీలకు స్వేచ్ఛ..హక్కు ఉందని తెలిపారు. అందులో భాగంగా మహాజన పాదయాత్ర చేపట్టిందని, ప్రజలను చైతన్యం చేయడానికి వెళుతున్నారని తెలిపారు.
సీపీఎం ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా బడుగుల కోసం తుపాకీ పట్టిన సీపీఎంకు తెలంగాణతో సంబంధం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

17:17 - October 9, 2016

హైదరాబాద్ : చిన్నారి హర్షిత మృతి చెందడంపై ఆందోళనలు పెల్లుబికాయి. గత కొద్ది రోజులుగా కాలేయ వ్యాధితో బాధ పడుతున్న హర్షిత ఆదివారం కన్నుమూసింది. కేర్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారి హర్షితకు వైద్య ఖర్చులు అందిస్తామని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. చిన్నారి హర్షిత మృతి చెందడంపై మహిళా సంఘాలు..పలు పార్టీలు స్పందించాయి. హర్షిత కుటుంబాన్ని సంఘాల నేతలు..పార్టీల నేతలు పరామర్శించారు. అనంతరం హర్షిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఆరోగ్య శ్రీ నిధులు విడుదల చేయకపోవడం..కార్పొరేట్ ఆసుపత్రుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపణలు చేస్తున్నారు. పేరుకు మాత్రమే ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నారని, సీరియస్ గా ఆలోచించడం లేదని టి.కాంగ్రెస్ నేత మల్లు రవి వ్యాఖ్యానించారు. కళ్ల ముందే పిల్ల చనిపోయిందని, ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయిస్తారని హర్షిత తల్లిదండ్రులు అనుకున్నారని తెలిపారు. చావుకు కారణం ప్రభుత్వమేనని, చిన్నారి హర్షిత కుటుంబానికి రూ. పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం సీఎం..సంబంధిత మంత్రికి వినతిపత్రాలు ఇస్తామని, పరిహారం ఇచ్చేంత వరకు ఆందోళన చేస్తామన్నారు. 

లివర్ వ్యాధి..
మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన హర్షిత లివర్‌ వ్యాధితో బాధపడుతుండడంతో.. వైద్యానికయ్యే ఖర్చులన్నింటిని భరిస్తామని నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్రవైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఆ తర్వాత చిన్నారి హర్షితను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే లివర్‌ దొరకడంలేదనే సాకుతో ఆసుపత్రి యాజమాన్యం గత 3నెలలుగా చిన్నారికి వైద్యం చేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. దీంతో పాప ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. రాత్రి పాప ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉండడంతో...ఇదే అదనుగా ఆసుపత్రి యాజమాన్యం ప్రాథమిక వైద్య ఖర్చులు 4లక్షలు ఇస్తేనే వైద్యం చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న హర్షిత వైద్యం అందక కన్నుమూసింది. 

17:11 - October 9, 2016

ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మకు భారీ ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5.30 నుండి విదేశీయుల బతుకమ్మ నృత్యాలు చేయనున్నారు. రాత్రి 8.30 నుండి 9గంటల వరకు బాణాసంచా వెలుగులు విరజిమ్మనున్నాయి. సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. 

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..

విజయవాడ : నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ దర్శనానికి 2గంటల సమయం పడుతోంది. 

కేర్ ఆసుపత్రి వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళన..

హైదరాబాద్ : కేర్ ఆసుపత్రి వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. చిన్నారి హర్షిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు మోహరించారు.

 

సీఎం పర్యటనపై మంత్రి హరీష్ సమీక్ష..

మెదక్ : ఈనెల 11వ తేదీన సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఉదయం కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. జిల్లా ప్రారంభం కోసం సిద్దిపేటకు వస్తున్న సీఎంకు మంగళ హారతులతో ఘన స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 20 చోట్ల 30 వేల లడ్డూలు పంపిణీ చేస్తామని తెలిపారు. 

నిజామాబాద్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

నిజామాబాద్ : రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజామాబాద్ - పెద్దపల్లి మధ్య గూడ్స్ రైలుతో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ఇండియా 557/5 డిక్లేర్డ్..

ఇండోర్ : న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 557/5 వద్ద డిక్లేర్డ్ చేసింది. విజయ్ (10), గంభీర్ (29), పుజారా (41), కోహ్లీ (211), రహానే (188), శర్మ 51 నాటౌట్, జడేజా 17 నాటౌట్ గా మిగిలారు. అనంతరం న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆరంభించింది. 

మాయావతి ర్యాలీలో మృతి చెందిన వారికి పరిహారం..

లక్నో : బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి అఖిలేష్ ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రెండు లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్లు సీఎం అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. 

16:10 - October 9, 2016
16:08 - October 9, 2016

చెన్నై : అపోలో ఆసుపత్రి వద్ద వేద మంత్రాలు..పూజలతో మారుమోగుతోంది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతన్న సంగతి తెలిసిందే. దీనితో ఆమె ఆరోగ్యంపై అభిమానులు..నేతలు..కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. చికిత్స పొందుతున్న ఆసుపత్రికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. దీనితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రముఖులను మాత్రమే లోనికి పంపిస్తున్నారు. ఇదిలా ఉంటే జయ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో మహిళలు కలశ పూజలు నిర్వహించారు. సుబ్రమణ్య ఆలయ క్షేత్రం వద్ద స్వామి వారికి పాల బిందెలతో అభిషేకం నిర్వహించారు. తమిళనాడులోని అనేక జిల్లాల్లో అభిమానులు పూజలు నిర్వహించారు. మహిళలు సామూహికంగా కలశ పూజలు నిర్వహిస్తున్నారు. వీరంతా గత 15 రోజులుగా పూజలు చేస్తున్నారు. తమిళ సంప్రదాయం ప్రకారం ఈ పూజలు చేస్తున్నారు. మిగతా వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కేర్ ఆసుపత్రి ఎదుట మహిళా సంఘాల నేతల ధర్నా..

హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రి వద్ద మహిళా సంఘాలు ధర్నా నిర్వహించాయి. చిన్నారి హర్షిత మరణంపై ప్రభుత్వం..కేర్ ఆసుపత్రి యాజమాన్యం వెంటనే స్పందించాలని మహిళ సంఘ నేతలు డిమాండ్ చేశారు. హర్షిత కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

ఇన్నోవా కారు బీభత్సం..

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ లో ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. ఆటో స్టాండ్ లోకి దూసుకపోవడంతో నాలుగు ఆటోలు ధ్వంసమయ్యాయి. దీనితో పలువురికి గాయాలయ్యాయి. డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. 

జయను పరామర్శించిన పుదచ్చేరి సీఎం..

చెన్నై : అపోలో ఆసుపత్రిలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, సీపీఐ నేత డి.రాజాలు పరామర్శించారు. జయ ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

15:34 - October 9, 2016

హైదరాబాద్ : కేర్ ఆస్పత్రికి ధనదాహానికి ఓ చిన్నారి బలి అయింది. కేర్ ఆస్పత్రి నిర్లక్ష్యానికి చిన్నారి 'హర్షిత' మృతి చెందింది. చిన్నారి వైద్యానికయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్వయంగా ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనపై కాంగ్రెస్ నేత మల్లు రవి టెన్ టివితో మాట్లాడారు. ఆరోగ్య శ్రీ కింద రావాల్సిన నిధులు ప్రభుత్వం విడుదల చేకయకపోవడం వల్ల ప్రైవేటు ఆసుపత్రులు పలు కేసులను తీసుకోవడం లేదని తెలిపారు. అందులో భాగంగానే ఇది చోటు చేసుకుందని, దీనితో పేద తండ్రి తల తాకట్టు పెట్టి రూ. 15వేలు ఇచ్చాడని అనంతరం ఇంకో డాక్టరు వచ్చి నాలుగు లక్షలు ఇవ్వాలని పేర్కొన్నాడని అంతలోనే చిన్నారి మృతి చెందిందన్నారు. ఆరోగ్య శ్రీ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగ కోసం పదిహేను కోట్ల నిధులు విడుదల చేస్తారా ? వీరికి ఇవ్వరా ? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటున్నారని కానీ ఉన్న తెలంగాణ పోయే పరిస్థితి నెలకొందన్నారు. రూ. 100 కోట్లు విడుదల చేస్తామని, స్ట్రైక్ చేయని వారికిస్తామని ప్రభుత్వం పేర్కొందని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిర్లక్షం తాండవిస్తోందన్నారు. కుటుంబం బతకడం కోసమే చిన్నారి హర్షిత తల్లిదండ్రులు హైదరాబాద్ కు వచ్చారని, చిన్నారికి వైద్యం చేయిస్తామని ప్రభుత్వం హామీనివ్వడంతో ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నారని తెలిపారు. ప్రభుత్వం వల్లే పాప చనిపోయిందని, వెంటనే ఈ కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, పేదల పిల్లలు చనిపోకుండా చూడాలని మల్లు రవి డిమాండ్ చేశారు.

కన్నీరుమున్నీరు..
మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన హర్షిత లివర్‌ వ్యాధితో బాధ పడింది. ఈ విషయాన్ని టెన్ టివి బాహ్యప్రపంచానికి తెలియచేసింది. దీనితో టి.సర్కార్ స్పందించింది. వైద్యానికయ్యే ఖర్చులన్నింటిని భరిస్తామని నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్రవైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. కానీ చిన్నారి హర్షిత మృతి చెందింది. దీనితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

15:27 - October 9, 2016

హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వ విధానాలు సరిపోవని ప్రత్యామ్నాయ నమూనా అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్ర సందర్భంగా తమ్మినేని ఎడిటర్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని ప్రసంగించారు. అనంతరం ఎడిటర్స్ వారి వారి అభిప్రాయాలు వెల్లడించారు.

చిన్న రైతులకు బ్యాంకు రుణాలు ఎక్కడ - తమ్మినేని..
బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి సాధ్యమైనప్పుడే..రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. చిన్న రైతులకు బ్యాంకుల్లో రుణాలు దొరకక, ప్రైవేట్‌ రుణాలమీదనే ఆధారపడుతున్నారని అన్నారు. వైద్య, విద్య, సాహిత్య, సాంస్కృతిక రంగాలను ఆదుకునే విధంగా ప్రభుత్వ విధానాలు లేవని తెలిపారు. 90 శాతం మంది ప్రైవేటు రుణాలపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో చిన్న రైతులు అధికంగా ఉన్నారని, అందులో కౌలురైతులు అధికంగా ఉన్నారని తమ్మినేని తెలిపారు.

కమ్యూనిస్టు భావజాలాన్ని తీసుకెళ్లాలి - సాక్షి..
ప్రభుత్వ విధానాలు నిరుద్యోగ యువతను ఆదుకునే విధంగా ఉండాలని సాక్షి ఎడిటర్ రామచంద్రమూర్తి అన్నారు. సీపీఎం నిర్వహించిన ఎడిటర్స్ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ భావజాలాన్ని యువతలోకి తీసుకెళ్లే విధంగా వామపక్షాలు కార్యాచరణను రూపొందించాలని సూచించారు.

అధికారం కోసం పోరాడే పార్టీ కాదు - ఆంధ్రజ్యోతి ఎడిటర్..
సీపీఎం అధికారం కోసం పోరాడే పార్టీ కాదని..ప్రజల కోసం పోరాడే పార్టీ అని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షపార్టీలేని దృష్ట్యా సీపీఎం క్రియాశీలంగా వ్యవహించాల్సిన అవసరముందని ఆయన తెలిపారు.

పాదయాత్ర విజయవంతం కావాలి - 10టీవీ అసోసియేట్‌ ఎడిటర్
సీపీఎం విధానాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగేందుకు మహాజన పాదయాత్ర ఉపయోగపడుతుందని 10టీవీ అసోసియేట్‌ ఎడిటర్ శ్రీధర్ అన్నారు. పాత విధానాలను అనుసరిస్తోందని పాలక పార్టీపై ఆరోపిస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు...ఆ విధానాలు ఎందుకు ప్రజలకు కంటకంగా ఉన్నాయనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 

కేసీఆర్ వ్యాఖ్యలు దురదృష్టకరం - తమ్మినేని..

హైదరాబాద్ : మహాజన పాదయాత్రపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. పాదయాత్ర ప్రభుత్వానికో..టీఆర్ఎస్ కో వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసమే పాదయాత్ర అని తెలిపారు. మహాజన పాదయాత్రకు అన్ని అనుమతులివ్వాలని, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మహాజన పాదయాత్రకు ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

మహాజన పాదయాత్రను ఎద్దేవా చేసిన కేసీఆర్..

హైదరాబాద్ : ఉనికి కోసమే సీపీఎం పాదయాత్రలు చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడటాన్ని సీపీఎం సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో తిరిగే అధికారం సీపీఎంకు లేదని, సీపీఎం నేతలను ఎక్కడికక్కడే నిలదీయాలని పిలుపునిచ్చారు. ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పిన తరువాతే పాదయాత్ర ప్రారంభించాలని సూచించారు. 

14:40 - October 9, 2016

హైదరాబాద్ : ఏడాదికి మూడు పంటలు పండే విధంగా చెరువులు అలుగులు పోస్తుంటే సీపీఎం మహాజన పాదయాత్ర పేరుతో పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తొలినుంచి వందశాతం వ్యతిరేకించిన పార్టీ మొదలు తెలంగాణ ఏర్పాటుపై తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ఆ తర్వాతే మహాజన పాదయాత్ర మొదలుపెట్టాలని సూచించారు. అయితే సీపీఎం చేపట్టే మహాజన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకోవాలని రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

తమ్మినేని కౌంటర్.. 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహాజన పాదయాత్రపై పలు విమర్శలు చేయడంపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని స్పందించారు. చాలా విచారకరమని, అంత కోపం..ఎందుకో తెలియడం లేదన్నారు. కేసీఆర్..టీఆర్ఎస్..ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర నిర్వహించడం లేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు సుభిక్షంగా అభివృద్ధి చెందాలని యాత్ర నిర్వహించడం చేయడం జరుగుతోందని తెలిపారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వెనుకబడిన తరగతుల వారు అభివృద్ధి చెందాలంటే మాటల్లో కాదని..చేతల్లో కావాలని పేర్కొన్నారు. గిరిజనులకు భూములివ్వాలని, విద్యార్థులకు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని, సంచార జాతుల వారికి సహాయం చేయాలన్నారు. మైనార్టీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో ఏ సమస్య ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుందన్నారు. తన గన్ మెన్లను సైతం ప్రభుత్వం ఉపసంహరించిందని, యాత్రకు పర్మిషన్, బందోబస్తు ఇవ్వాలని, రెచ్చగొట్టే కార్యక్రమాలను మానుకోవాలని సూచించారు. పాదయాత్రను ప్రజలు అర్థం చేసుకుని మద్దతు తెలపాలన్నారు. 

14:33 - October 9, 2016

వరంగల్ : టి.కాంగ్రెస్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. భద్రకాళి ఆలయంలో అమ్మవారికి బంగారు కిరీటాన్ని కేసీఆర్ దంపతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాలు..తదితర విషయాలపై కేసీఆర్ ధ్వజమెత్తారు. హస్తం నేతలకు ఏ అంశంపై పోరాడాలో స్పష్టతలేదని మండిపడ్డారు. బంగారు తెలంగాణకోసం తాము ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిదానికి అడ్డుపడుతూ అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు.

కొత్త జిల్లాలు..
కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆనాటి నుండి చర్చలు జరుగుతున్నాయని, తాజాగా కేశవరావు నేతృత్వంలో హై పవర్ కమిటీ వేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇలా అనేక ప్రక్రియ అనంతరం కొత్త జిల్లాలపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇవన్నీ వారికి కనిపించడం లేదన్నారు. రెండు నుండి 4 లక్షల కుటుంబాల మధ్య ప్రతి జిల్లాల్లో ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. రైతు సమస్యలేంటో చూపించాలని నిలదీశారు. అసలు సమస్యలను కూడా వెతుక్కోవడంలో కాంగ్రెస్ నేతలు తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మిషన్ కాకతీయ ద్వారా ఇవాళ చెరువులు నిండి చెరువు నీళ్లల్లో బతుకమ్మలు నాట్యం ఆడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు ఇది కనిపించడంలేదా? అని అడిగారు. ఇప్పటి వరకు జిల్లాల సంఖ్య 31 అనుకుంటున్నామని చెప్పారు. కేబినెట్‌ భేటీ తర్వాత జిల్లాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

అమ్మవారికి బంగారు కిరీటం..
అంతకుముందు వరంగల్‌ భద్రకాళి అమ్మవారికి సీఎం కేసీఆర్‌ దంపతులు స్వర్ణకిరీటాన్ని సమర్పించారు.. తెలంగాణ వస్తే స్వర్ణ కిరీటాన్ని సమర్పిస్తానని ఉద్యమసమయంలో కేసీఆర్‌ అమ్మవారికి మొక్కుకున్నారు.. తెలంగాణ రావడంతో 3కోట్ల 70లక్షల రూపాయలతో అమ్మవారికి కిరీటం చేయించారు.. భద్రకాళి జన్మనక్షత్రంరోజున ఈ కిరీటాన్ని దుర్గమ్మకు సమర్పించారు.. ఈ కార్యక్రమంలో మంత్రి కడియం, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌, స్పీకర్‌ మధుసూదనాచారి పాల్గొన్నారు..  

14:29 - October 9, 2016
14:14 - October 9, 2016

కవులు సముద్రాలు ...ఆకాశాలు... సూర్యోదయాలు..ఏ దేశపు కవులైనా ఆ దేశపు దేహంనిండా ప్రవహించే రక్తపు జీవనదులు..భూగోళపు దమనులు.... స్పందించే ప్రజాహృదయాలు...నినదించే గళాలు, ఎగసిపడే చైతన్య సముద్రాలు ....గొప్ప ఆశయాల ఆకాశాలు.అలాంటివారిలో ఎ.ఆర్ వాసు ఒకరు.ఆయన ఇటీవలే కన్ను మూశారు. ప్రజాగేయకవి ఎ.ఆర్ వాసుకు నివాళులర్పిస్తూ..బాలసుధాకర్ మౌళి పుస్తక పరిచయంతో పాటు ఇటీవల విజయవాడలో జరిగిన వందకవితల పండుగ, చమన్ పుస్తకావిష్కరణ విశేషాలతో ఈ వారం మీ ముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం. ఇప్పడు వివిధ ప్రాంతాల్లో జరిగిన సాహితీ వేదికల వేడుకల విశేషాలేంటో చూద్దాం.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:12 - October 9, 2016

కవికీ కవిత్వానికి నిషేధాలుండకూడదు అంటూ కవిత్వం రాసిన వర్ధమాన కవి బాలసుధాకర్ మౌళి. కవిత్వాన్ని రాయడం ఒక ఫ్యాషన్ గా కాకుండా ఒక సీరియస్ ప్రక్రియగా భావిస్తాడతడు. అక్షరాలను మనుషులను ఒకేవిధంగా ప్రేమిస్తూ పద్యాలల్లుతున్న గిజిగాడు అతడు. ఒక పక్క పిల్లలకు పాఠాలు చెబుతూనే మరో పక్క కవితల పిట్టల్ని ఎగరేస్తుంటాడు. గతంలో ఎగరాల్సిన సమయం అన్న కవితా సంపుటిని వెలువరించిన ఈ కవి ఇప్పడు ఆకు కదలని చోట అన్న కవితా సంకలనాన్ని వెలువరించారు. బాలసుధాకర్ మౌళి కవితా సంకలనంపై అక్షరం సమీక్షణం మీకోసం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

14:11 - October 9, 2016

ఇండోర్ : న్యూజిలాండ్ జట్టుతో భారత్ మూడో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. రెండు రోజు ఆట తీరే మారిపోయింది. విరాట్ కోహ్లీ కదం తొక్కాడు. ఏకంగా డబుల్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. రెండోసారి డబుల్ సెంచరీ సాధించాడు. మొత్తం 347 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 18 ఫోర్ల సహాయంతో 200 పరుగుల మైలురాయిని చేరాడు. మరోవైపు రహానే కూడా బ్యాట్ ను విజృంభించాడు. ఇతను కూడా సెంచరీ సాధించి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. 328 బంతులను ఎదుర్కొన్న రహానే 159 పరుగులు చేసి ఆడుతున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో కోహ్లీది అరుదైన రికార్డుగా ఇది నిలుస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో 500 పరుగుల దాటిన అనంతరం డిక్లేర్డ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

14:10 - October 9, 2016

కవులు సముద్రాలు ...ఆకాశాలు... సూర్యోదయాలు..ఏ దేశపు కవులైనా ఆ దేశపు దేహంనిండా ప్రవహించే రక్తపు జీవనదులు..భూగోళపు దమనులు.... స్పందించే ప్రజాహృదయాలు...నినదించే గళాలు, ఎగసిపడే చైతన్య సముద్రాలు ....గొప్ప ఆశయాల ఆకాశాలు.అలాంటివారిలో ఎ.ఆర్ వాసు ఒకరు.ఆయన ఇటీవలే కన్ను మూశారు. ప్రజాగేయకవి ఎ.ఆర్ వాసుకు నివాళులర్పిస్తూ..బాలసుధాకర్ మౌళి పుస్తక పరిచయంతో పాటు ఇటీవల విజయవాడలో జరిగిన వందకవితల పండుగ ,చమన్ పుస్తకావిష్కరణ విశేషాలతో ఈ వారం మీ ముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం.
ఒక వేగు చుక్క నేల రాలింది... 
కర్నూల్ అంటే కరువు సీమ. ఆ కరువు సీమలో పుట్టిన ఒక వేగు చుక్క నేల రాలింది.గాయాల బతుకుల గేయాలు రాసుకుంటూ సమసమాజం కోసం స్వప్నించిన ఒక కాంతిపుంజం ఆరిపోయింది.తన కలంలో శ్రామిక జనాల చెమటచుక్కలనే సిరా చుక్కలుగా మార్చి ఎన్నో జనచైతన్య గీతాలు రాసిన ప్రముఖ గేయకవి ఎ.ఆర్.వాసు  ఇటీవల కన్ను మూశారు.ఆయన మరణ వార్తవిని నిరుపేదల కన్నులు అశ్రుపూరితాలయ్యాయి.బడుగుజీవుల బాదలగాధల విషాద బతుకులను అక్షర శిల్పాలుగా మార్చిన గేయకవి అతడు.ఇంతేలె నిరుపేదల బతుకులు అన్న శ్రీశ్రీవారసునిగా పేదబతుకుల ఈతిబాధల శోకగీతాలాలపించి ఎర్రజెండా నీడలో నడవండని ప్రభోధించి గేయకవి అతడు. తన స్వప్నం సాకారం కాకుండానే కన్ను మూశాడు. ఆ అరుణారుణ గీతాల  అక్షరమూర్తి,ఎర్రమందారాల విప్లవ నినాదాల చైతన్య స్ఫూర్తి, అభ్యుదయగేయాల అనంత కీర్తి,బడుగుజీవుల గుండెల ఆర్తి, ప్రజాకవి వాసుకు 10 టి.వి.అక్షరం నివాళులర్పిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

మైనర్ పై తండ్రి అత్యాచారం..

ప్రకాశం : కొత్తపట్నం (మం) ఈతముక్కలలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ పై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను తల్లి ఆసుపత్రిలో చేరిపించింది.

 

కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు..

వరంగల్ : పీసీసీ అధ్యక్షుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ వారికి ప్రజలు కనిపించలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లాలో 2.5 లక్షల మంది 4 లక్షల కుటుంబాలు ఉండాలన్నారు. పథకాలు ప్రవేశ పెట్టగానే పైరవీ కారులు ముందుకొస్తున్నారని విమర్శించారు. తమ హాయాంలో ఇసుకపై ఏడాదికి రూ. 365 కోట్లు వస్తే కాంగ్రెస్ హాయాంలో రూ. 5లక్షలు వచ్చాయన్నారు. జిల్లాలపై కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదని, ఏదైనా పని ప్రారంభిద్దామంటే అడ్డుపడుతున్నారని తెలిపారు.

వరంగల్ జిల్లా అభివృద్ధికి వేయి కోట్లు - కేసీఆర్..

హైదరాబాద్ : వరంగల్ పట్టణాభివృద్ధి కోసం బడ్జెట్ లో రూ. 300 కోట్లు కేటాయించడం జరిగిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటాన్ని ఆయన సమర్పించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడారు. వరంగల్ జిల్లా అభివృద్ధి కోపసం రూ. వేయ్యి కోట్లు కేటాయిస్తామని, అద్భుత పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. వరంగల్ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధమౌతోందన్నారు.

సంజన ఆరోగ్యం విషమం - వైద్యులు..

హైదరాబాద్ : చిన్నారి సంజన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేషన్ పై వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. నిన్న రాత్రి సంజనకు ఫిట్స్ వచ్చాయని తెలిపారు. 

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ పనులు ప్రారంభం..

విశాఖపట్టణం : ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ పనులను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. రూ. 100 కోట్లతో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ నిర్మాణం చేపట్టనున్నట్లు, సినీ ప్రముఖులు స్టూడియోలు పెట్టేందుకు ముందుకొచ్చారన్నారు. విశాఖను సినీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఇది ముందడుగు అని తెలిపారు. 

హైటెక్ సిటీలో స్వచ్ఛ భారత్ షార్ట్ ఫిలిం స్ర్కీనింగ్..

హైదరాబాద్ : హైటెక్ సిటీలో స్వచ్ఛ భారత్ షార్ట్ ఫిలిం స్ర్కీనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, సినీ ప్రముఖులు తనికెళ్ల, సుద్దాల పాల్గొన్నారు.

భద్రకాళి ఆలయంలో కేసీఆర్ దంపతుల పూజలు..

వరంగల్ : భద్రకాళి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి 11.7 కిలోల బంగారు కిరీటాన్ని కేసీఆర్ దంపతులు సమర్పించారు. రూ. 3.70 కోట్లతో అమ్మవారికి బంగారు కిరీటాన్ని ప్రభుత్వం చేయించింది. 

కొత్త కలెక్టర్ల జాబితా సిద్ధం..

హైదరాబాద్ : కొత్త కలెక్టర్ల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. సీనియార్టీ ప్రకారం జాబితాను తయారు చేసింది. జ్యోతి బుద్ధ ప్రసాద్, కిషన్, స్మితా సభర్వాల్, క్రిస్టినా ఛోంగ్ తూ, ప్రియదర్శిణి, చిరంజీవులు, విజయ్ కుమార్, ఇ.శ్రీధర్, అనీత రామచంద్రన్, మహ్మద్ అబ్దుల్ అజీం, బాలమాయదేవి, నిర్మల, గౌరవ్ ఉప్పల్, ఎల్.శర్మన్, మాణిక్ రాజ్, ఇలంబరి, ఎ.శరత్, మురళీ, రజత్ కుమార్ సైనే, పౌసామీబసు, చంపాలాల్, వెంకట్ రామిరెడ్డి, విజయేంద్ర, కైవైనాయక్, భారతీ లక్పతీ నాయక్, ఎంవీరెడ్డి, వెంకటేశ్వరరావు, సురేంద్ర మోహన్ పేర్లు జాబితాలో ఉన్నాయి.

14:00 - October 9, 2016

చెన్నై : తమిళనాడు అపధర్మ ముఖ్యమంత్రి ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. అపధర్మ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్న దానిపై అన్నాడీఎంకే వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నారు. అపధర్మ సీఎం రేసులో పన్నీరు సెల్వం, పళనీస్వామి పోటీపడుతున్నారు. పార్టీలో అసమ్మతి పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. జయలలితకు చికిత్స కొనసాగుతోంది. నిన్న జయలలితను వైగో, స్టాలిన్‌ పరామర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ చెన్నై పర్యటనపై సందిగ్ధం నెలకొంది. దసరా తర్వాత రావొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయ.

 

ఆరాధాన చేసింతి సంతారా కాదు - తండ్రి..

హైదరాబాద్ : ఆరాధన చేసింది సంతారా కాదని తండ్రి లక్ష్మీ చంద్ పేర్కొన్నారు. ఉపవాస దీక్ష అనంతరం ఆరాధన మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆరాధన చేసింది తపస్య అని, ఇది జైన మతంలో సంప్రదాయమన్నారు. తనకు వ్యాపారంలో ఎలాంటి నష్టం లేదని, వ్యాపారంలో లాభాల కోసమే కూతురితో దీక్ష చేయించాననడం అవాస్తవమని చెప్పుకొచ్చారు. డబ్బుల కోసమే కూతురిని చంపానని ఆరోపణలు వస్తున్నాయని ఆధారాలు ఉంటే చూపెట్టాలని డిమాండ్ చేశారు. 

13:56 - October 9, 2016

వరంగల్ : వరంగల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. భద్రకాళీ అమ్మవారికి స్వర్ణ కిరీటం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం సమర్పిస్తానని మొక్కుకున్నానని తెలిపారు. ఈ మేరకు అమ్మవారికి కిరీటం సమర్పించినట్లు తెలిపారు. వరంగల్ పట్ణణ అభివృద్ధికి బడ్జెట్ లో రూ.300 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. వరంగల్ ను అద్భుత పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. 

13:48 - October 9, 2016
13:46 - October 9, 2016

విజయవాడ : పాతికేళ్ల క్రితం ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల ప్రభావంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని దీనిపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. విజయవాడ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్ లో "పాతికేళ్ల ఆర్థిక సంస్కరణలు - అనుభవాల - ఫలితాలు" అన్న అంశంపై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు స్పందిస్తూ..గత 25 ఏళ్లుగా కేంద్రంలో ఏ పార్టీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఈ విధానాలనే అమలు చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సంస్కరణలపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

 

13:44 - October 9, 2016

గుంటూరు : ఏపీ సచివాలయ ఉద్యోగులను ఇంటి అద్దె భయం దడ పుట్టిస్తోంది. సచివాలయ ఉద్యోగి కనిపిస్తే చాలు ఇళ్ల యజమానులు రెంట్‌ మీటర్‌ను అమాంతంగా పెంచేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వెలగపూడి సెక్రటేరియట్‌ తరలివెళ్లిన ఉద్యోగులను ఇంటి అద్దెలు చుక్కలు చూపిస్తున్నాయి. 
వెలగపూడిలో అద్దెలు రెట్టింపు 
అమరావతిలో అద్దె ఇళ్లకు రెక్కలు వచ్చాయి. ఎన్నడూ లేనంతంగా డిమాండ్ పెరిగిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఓ మోస్తరుగా పెరిగిన అద్దెలు.......తాజాగా వెలగపూడిలో సచివాలయం ఏర్పాటుతో రెట్టింపయ్యాయి. హైదరాబాద్ నుంచి సచివాలయ ఉద్యోగులు నూతన రాజధానికి తరలిరావడంతో ఇళ్ల యజమానుల ఆశలకు అవధులు లేకుండా పోయాయి. సచివాలయానికి సమీపంలోని మంగళగిరి తదితర ప్రాంతాల్లో దొరికిందే అవకాశంగా ఇష్టారాజ్యంగా అద్దెలు పెంచి దండుకుంటున్నారు. 
విజయవాడ సమీప ప్రాంతాల్లో అద్దె ఇళ్లలోకి 
హైదరాబాద్ నుండి అమరావతికి తరలి వెళ్లాలని ఆరు నెలల క్రితమే ప్రభుత్వం ఉద్యోగులకు సూత్రప్రాయంగా చెప్పుకుంటూ వచ్చింది. దీంతో కొందరు ఉద్యోగులు విజయవాడ సమీప ప్రాంతాల్లో అద్దె ఇళ్లలోకి దిగిపోయారు. ఈ నెల 3 నుంచి అన్ని శాఖల ఉద్యోగులు వెలగపూడిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఇక్కడకు వచ్చిన ఉద్యోగులకు ఇంటి యజమానులు చెబుతున్న అద్దెలు వింటుంటే ఆశ్చర్యపోక తప్పడం లేదు. పట్టణానికి మించిన అద్దెలు పల్లెల్లో కనిపిస్తున్నాయి. సచివాలయం సమీపంలో ఉన్న మందడం, వెలగపూడి, రాయపూడి, మల్కాపురం, మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సింగిల్ బెడ్ రూమ్‌కు 8 నుంచి 10వేలు...డబుల్ బెడ్ రూమ్ అయితే 15 నుంచి 20వేల వరకు చెబుతున్నారు..ఎలాంటి వసతులు లేని రాజధాని గ్రామాల్లో భారీస్థాయిలో అద్దెలు పెంచడం గమనార్హం. హైదరాబాద్ లోనే 4 వేలకు సింగిల్ బెడ్ రూమ్ అద్దెకు లభిస్తుండగా.. వెలగపూడి సమీప గ్రామాల్లో 8 వేలు చెప్పడం దారుణమని ఉద్యోగులు మండిపడుతున్నారు. 
ఇళ్ల అద్దెల పెంపుపై మహిళా ఉద్యోగినులు పెదవి విరుపు 
ఇళ్ల అద్దెల పెంపుపై మహిళా ఉద్యోగినులు పెదవి విరుస్తున్నారు. సచివాలయ ఉద్యోగి అంటే చాలు అద్దె ధర వేలల్లో చెబుతున్నారని, ఉద్యోగులకు ప్రభుత్వం అదనంగా ఏదో ఇస్తుందనే అపోహ చాలామందికి ఉందంటున్నారు.. హైదరాబాద్ తరహాలోనే ఇక్కడ కూడా అదే హెచ్‌ఆర్‌ఏ అమలవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాజధాని ప్రాంతంలో ఇళ్ల యజమానుల ధన దాహానికి అడ్డుకట్ట వేయాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. 

 

13:38 - October 9, 2016

అమెరికా : మాథ్యూ హరికేన్‌ పెను విషాదాన్నే నింపింది. మాథ్యూ తుపాను బీభత్సానికి హైతీలో సుమారు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కరేబియన్‌ దీవుల్లో కల్లోలం రేపిన మాథ్యూ తుపాన్‌ అమెరికాను తాకింది. తుపాను కారణంగా 3 వేల 8 వందల విమానాలను రద్దు చేశారు.
అమెరికాలో అలజడి 
కరేబియన్‌ దీవులను అతలా కుతలం చేసిన మాథ్యూ తుపాన్‌ ఇపుడు అమెరికాలో అలజడి రేపింది. హరికేన్‌ మాథ్యూ తుపాను తీవ్రతకు  ఫ్లోరెడా, జార్జియా, దక్షిణ కరోలినా రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌, కేప్ కెనవెరెల్‌ బీచ్‌ ప్రాంతాల్లో తుపాను విరుచుకు పడింది. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో పెను గాలులతో పాటు భారీ వర్షం ఫ్లోరిడా అతలాకుతలమైంది. విద్యుత్‌ కనెక్షన్లు తెగిపోవడంతో 3 లక్షల మందిపై ప్రభావం చూపింది. తుపాను ధాటికి ఫ్లోరిడాలో నలుగురు మృతి చెందారు. మాథ్యూ తుపానుపై ముందే అప్రమత్తమైన ప్రభుత్వం- లక్షలాది మంది తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
3 వేల 8 విమానాలు రద్దు
తుపాను కారణంగా అమెరికాలో 3 వేల 8 విమానాలను రద్దు చేశారు. జార్జియా, సౌత్ కరోలినా ఫోర్ట్‌ లాయిడ్‌ డేల్‌ హాలీవుడ్‌ ఎయిర్‌పోర్టును మూసివేశారు. 2005 తర్వాత ఈ విమానశ్రయం మూతపడడం గమనార్హం. ఇప్పటికే దక్షిణ కరోలినాలోని తీరప్రాంతం భారీగా కోతకు గురైంది. జార్జియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లోని తీరప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
900 మందికి పైగా మృతి 
కరీబియన్ దీవుల్లో మాథ్యూ తుపాను సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఒక్క హైతీలోనే 900 మందికి పైగా మృతి చెందారు. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాల కారణంగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లు కూలడంతో చాలామంది గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 62 వేల మంది తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. 2010లో సంభవించిన భూకంపం నుంచి ఇప్పుడిప్పడే కోలుకుంటున్న హైతీకి మాథ్యూ తుఫాను పెను నష్టాన్నే కలిగించింది.

13:31 - October 9, 2016
13:30 - October 9, 2016

వరంగల్ పట్టణ అభివృద్ధికి కృషి : సీఎం కేసీఆర్

వరంగల్ : పట్టణ అభివృద్ధికి మూడు కోట్లు కేటాయించాని భవిష్యత్ మరిన్ని నిధుల ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. భద్రకాళీ అమ్మవారికి స్వర్ణ కిరీటం సమర్పించని అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వెయ్యి కోట్ల రూపాయలు పట్టణాభివృద్ధికి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 
 

అపధర్మ సీఎం రేసులో పన్నీరు సెల్వం, పళనీస్వామి

చెన్నై : తమిళనాడు అపధర్మ ముఖ్యమంత్రి ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. అపధర్మ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్న దానిపై అన్నాడీఎంకే వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నారు. అపధర్మ సీఎం రేసులో పన్నీరు సెల్వం, పళనీస్వామి పోటీపడుతున్నారు. 

13:14 - October 9, 2016

హైదరాబాద్ : దేశంలో ఉన్న ప్రతిఒక్కరు పరిశుభ్రత పాటించినప్పుడే స్వచ్ఛభారత్‌ కార్యక్రమం విజయవంతం అవుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని సైబర్‌సిటీ కన్వెన్షన్‌లో జరుగుతున్న స్వచ్ఛభారత్‌ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌...2019కల్లా స్వచ్ఛభారత్‌ కార్యక్రమం సక్సెస్‌ అవుతుందన్న నమ్మకం తనకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా కృషి చేస్తుందన్నారు. ఇక ఇదే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ...స్వచ్ఛభారత్‌ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన లఘుచిత్రాల ప్రదర్శన ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. 
17 ఉత్తమ లఘుచిత్రాలు ఎంపిక
స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సమాచారశాఖ నిర్వహించిన స్వచ్ఛ్‌గ్రహ ప్రచార కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా..ఎంపిక చేసిన ఉత్తమ లఘుచిత్రాలను హైదరాబాద్‌లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్యతో పాటు పలువురు ప్రముఖ సినీ నిర్మాణ అల్లుఅరవింద్‌, నటుడు తనికెళ్లభరణి, మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 14,500 లఘుచిత్రాల ప్రవేశాలు పొందగా అందులో 17 ఉత్తమ లఘుచిత్రాలుగా ఎంపికయ్యాయి. వీటిలో పది లఘుచిత్రాలను హైదరాబాద్‌ కొండాపూర్‌లోని సైబర్‌సిటీ కన్వెన్షన్‌ కేంద్రంలో ప్రదర్శిస్తారు.

 

13:02 - October 9, 2016

చిత్తూరు : ప్రేమ పేరుతో ఓ యువకుడు యవతి తల్లిదండ్రులపై దాడిచేసిన సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. శాంతిపురం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన ఓ యువతిని..శెట్టిపల్లి గ్రామానికి చెందిన గగన్‌ అనే యువకుడు కొద్ది రోజులుగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆర్టీసి బస్సులో కుప్పంకు వస్తున్న యువతి తల్లిదండ్రులపై ప్రేమోన్మాది ఒక్కసారిగా దాడిచేశాడు. దీంతో బస్సులో ఉన్న యువతి తల్లిదండ్రులు ఒక్కసారిగా బస్సులోంచి కిందపడ్డాడు. గాయాలైన దంపతులను వెంటనే చికిత్స కోసం కుప్పం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ప్రేమ పేరుతో వేధిస్తున్న గగన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని యువతి వేడుకుంటోంది.   

 

వైద్యం అందక చిన్నారి హర్షిత మృతి

హైదరాబాద్ : కేర్ ఆస్పత్రి నిర్లక్ష్యానికి చిన్నారి హర్షిత మృతి చెందింది. హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హర్షిత మృతి చెందింది.

12:59 - October 9, 2016

హైదరాబాద్ : కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు డబ్బే పరమావధిగా ప్రవర్తిస్తున్నాయి. కేర్ ఆస్పత్రికి ధనదాహానికి ఓ చిన్నారి బలి అయింది. కేర్ ఆస్పత్రి నిర్లక్ష్యానికి చిన్నారి హర్షిత మృతి  చెందింది. హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హర్షిత మృతి చెందింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన హర్షిత లివర్‌ వ్యాధితో బాధపడుతుండడంతో..వైద్యానికయ్యే ఖర్చులన్నింటిని భరిస్తామని నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్రవైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఆ తర్వాత చిన్నారి హర్షితను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే లివర్‌ దొరకడంలేదనే సాకుతో ఆసుపత్రి యాజమాన్యం గత 3నెలలుగా చిన్నారికి వైద్యం చేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. దీంతో పాప ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఇవాళ రాత్రి పాప ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉండడంతో...ఇదే అదనుగా ఆసుపత్రి యాజమాన్యం ప్రాథమిక వైద్య ఖర్చులు 4లక్షలు ఇస్తేనే వైద్యం చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న హర్షిత వైద్యం అందక కన్నుమూసింది. చిన్నారి హర్షిత మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:53 - October 9, 2016

హైదరాబాద్ : ప్రజలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో ఏర్పాటు చేసిన ఎడిటర్స్ మీట్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పాలనా తీరుతెన్నులు ప్రజలకు తెలియజేసేందుకు మహాజన పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈనెల 17 నుంచి మార్చి 12 వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. 5 నెలలపాటు 4 వేల కిమీ..పాదయాత్ర ఉంటుందన్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి కాకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై పాలకులు దృష్టి సారించాలన్నారు. వ్యవస్థలో విధానపరమైన మార్పురావాలని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి ఉపాధిని పెంచే విధంగా ఉండాలని సూచించారు. సెజ్ ల వల్ల లక్షల్లో ఉద్యోగాలు వస్తాయన్నారు.. కనీసం వేల సంఖ్యలో కూడా ఉద్యోగాలు రాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వనరులకనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నారు. రాష్ట్రంలోని నూటికి 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజలు అభివృద్ధి చెందితేనే..రాష్ట్రం అభివృద్ధి చెందినట్లని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నారు. గతంతో పోలిస్తే కొంత అభివృద్ధి జరగాలి.. కానీ ప్రస్తుతం అలా లేదని పేర్కొన్నారు. ఇప్పుడు చదువు రావాలంటే ప్రైవేట్ విద్యాలయాలను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోయారు. పేద వారికి చదువు రావాలంటే ప్రభుత్వ పాఠశాలలు బాగు కావాలి లేదంటే ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణ ఉండాలన్నారు. ప్రజలకు వైద్యం అందుబాటులో లేదని.. కార్పొరేట్ మయం అయిందని విమర్శించారు. అటవీప్రాంతంలో మలేరియా వస్తే నయం చేసే దిక్క లేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలపై పాలకులు దృష్టి పెట్టాలని కోరారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి పలు రంగాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సక్రమంగా లేదని విమర్శించారు. వ్యవసాయ విధానంలో సమూలమైన మార్పులు రావాలని తెలిపారు. ప్రత్యామ్నాయం విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రముఖుల ఆలోచనలు కూడా మహాజన పాదయాత్ర కార్యకర్రమంలో ఉన్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరగాలనేదానిపై ప్రజల్లో ఉద్యమం రావాలన్నారు. అయితే రాష్ట్రంలో ఇదే పాలన కొనసాగితే తీవ్ర నష్టం తధ్యమని చెప్పారు. 

 

వారు అభివృద్ధి కాకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు : తమ్మినేని

హైదరాబాద్ : రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి కాకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయన ఎడిటర్స్ మీట్ సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై పాలకులు దృష్టి సారించాలన్నారు. వ్యవస్థలో విధానపరమైన మార్పురావాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధి ఉపాధిని పెంచే విధంగా ఉండాలని సూచించారు. 

 

ఇదే పాలన కొనసాగితే తీవ్ర నష్టం తధ్యం : తమ్మినేని

హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న పాలనా తీరుతెన్నులు ప్రజలకు తెలియజేసేందుకు మహాజన పాదయాత్ర చేపట్టినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇదే పాలన కొనసాగితే తీవ్ర నష్టం తధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ప్రజలు అభివృద్ధి చెందాలన్నారు.

 

12:11 - October 9, 2016

డీజేగా స్టైలీష్ స్టార్ మరోసారి న్యూ ట్రెండ్ సెట్ చేయబోతున్నాడని టాక్. దువ్వాడ జగన్నాథమ్ సినిమా కోసం బన్నీ మళ్లీ ఆ ఫిట్ ట్రై చేస్తున్నాడట. గతంలో అల్లుఅర్జున్ ట్రై  చేసిన ఆ ఫిట్ బాక్సఫీసు వద్ద బంఫర్ హిట్టు కావడంతో సేమ్ సీన్ ని డీజే తో రిపీట్ చేస్తాడని ఫీల్మ్స్ సర్కిల్ లో వినిపిస్తోంది. బన్నీ మళ్లీ ట్రై చేస్తున్న ఆ ఫీట్ ఏంటో చూద్దాం...
కొత్త మూవీస్టార్ట్ చేయడానికి ఆరునెలల గ్యాప్ 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడుతో ఇండస్ట్రీ హిట్ కొట్టాక కొత్త మూవీస్టార్ట్ చేయడానికి ఆరునెలల గ్యాప్ తీసుకున్నాడు. బన్నీ, హరీష్ శంకర్ డైరెక్షన్ లో డీజే దువ్వాడ జగన్నాధం మూవీని ఇటీవలే అఫీషియల్ ప్రారంభించాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసిన యూనిట్ త్వరలో షూటింగ్ జరుపడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో డీజేకి సినిమా సంబంధించి ఇండస్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. 
బ్రాహ్మణుడిగా బన్నీ 
డీజే మూవీలో బన్నీ బ్రాహ్మణుడిగా కనిపించబోతున్నట్లు వినికిడి.ఈ క్యారెక్టర్ అదుర్స్ లో ఎన్టీఆర్ చేసిన చారి పాత్రకు దగ్గరగాఉంటుందనే టాక్ . కామెడి పరంగా అదుర్స్ లో చారి క్యారెక్టర్ లా ఉంటుందట కానీ బాడీలాగ్వేంజ్ పరంగా మాత్రం బన్నీ కేక అనేలా కనిపించానున్నాడు. అల్లుఅర్జున్ దువ్వాడ జగన్నాధం క్యారెక్టర్ కోసం మరోసారి సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడట.
బన్నీ మరోసారి సర్ ప్రైజ్ 
అల్లు అర్జున్ ఇంతకు ముందు దేశముదురు సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు డిజే కోసం స్టైలీష్ స్టార్ మరోసారి సర్ ప్రైజ్ చేసే లుక్ లో కనిపించనున్నాడట. ఎక్కువ భాగం షూటింగ్ హైద్రాబాద్ లోనే చేయనున్నారట. హరీష్ శంకర్ ఈ మూవీని ఫుల్ ప్లెడ్జెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మలుస్తున్నట్లు సమాచారం. డీజేతో బన్నీ మళ్లీ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేస్తాడని ఫీల్మ్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. 
 

 

12:10 - October 9, 2016

ధనుష్ దీపావళికి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. ఇప్పటిదాకా సింగల్ గానే సీన్ చూపించిన ఈ బక్కపలుచని స్టార్ దీవాళికి డబుల్ ట్రిట్ ని సిద్దం చేశాడు. ధనుష్ రెడీ చేసిన బంఫర్ ట్రిట్ ఏంటో వాచ్ దీస్ స్టోరీ.
న్యూ మూవీ కోడి సూపర్ బజ్ క్రియేట్ 
కోలీవుడ్ లో ధనుష్ న్యూ మూవీ కోడి సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. తమిళంలో కోడి అంటే జెండా అని అర్ధం.టైటిల్ కి తగ్గట్లుగానే ఇది కంప్లీట్ గా పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని పక్కాగా జోడించేశారు. అక్టోబర్ 27న దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ కానున్న ఈ మూవీ తమిళనాట సెన్సేషన్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.
ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ లో 
ఇప్పటి వరకు ధనుష్ బాక్సఫీస్ వద్ద సింగిల్ గానే సీన్ చూపించాడు. అయితే కోడి మూవీ కోసం ఈ హీరో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ లో కనిపించబోతుండడం వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది.కోడి మూవీ కోసం ఈ బక్కపలుచని బాబు అన్నాదమ్ములుగా రెండు డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నాడు. ఓ పాత్ర నీట్ గా షేవ్ చేసుకుని కనిపిస్తే ఓ పాత్రలో మాత్రం ధనుష్ ఊరమాస్ గా కనిపిస్తున్నాడు.
ధనుష్ పక్కన త్రిష, అనుపమా పరమేశ్వరన్ లు జోడీ 
కోడి చిత్రంలో ధనుష్ పక్కన త్రిష, అనుపమా పరమేశ్వరన్ లు జోడీ కట్టారు. రాజకీయ నాయకురాలిగా త్రిష లుక్ అదిరిందనే చెప్పాలి ఈ మూవీలో  త్రిష నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసినట్లు వినిపించింది. కానీ ట్రైలర్ మాత్రం త్రిష క్యారెక్టర్ పాజిటివ్ గానే ఉంది. థ్రియేటర్ కి వెళ్లిన ఆడియన్స్ ని త్రిష క్యారెక్టర్ థ్రిల్ చేస్తుందో చూడాలి.తమిళనాట భారీ అంచనాలు ఉన్న కోడి చిత్రం ఏం చేస్తోందో చూడాలి. 

 

తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

చిత్తూరు : తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సూర్యప్రభవాహనంపై మలప్పస్వామి ఊరేగింపు జరుగుతోంది. 

11:29 - October 9, 2016

భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కిరీటం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు

వరంగల్ : సీఎం కేసీఆర్ దంపతులు భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం అమ్మవారికి స్వర్ణ కిరీటం సమపర్పించారు. 

 

భద్రకాళి ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు పూజలు

వరంగల్ : సీఎం కేసీఆర్ దంపతులు భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేస్తున్నారు. కాసేపట్లో అమ్మవారికి స్వర్ణ కిరీటం సమపర్పించనున్నారు. 

వరంగల్ చేరుకున్న సీఎం కేసీఆర్

వరంగల్ : సీఎం కేసీఆర్ దంపతులు భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కాసేపట్లో అమ్మవారికి స్వర్ణ కిరీటం సమపర్పించనున్నారు. 

10:31 - October 9, 2016

నెల్లూరు : జిల్లాలో యధేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోంది. వ్యాన్ లో ఎర్రచందనం దుంగలను చెన్నైకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రూ.70 లక్షలు విలువ చేసే.. 28 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఇండోర్ టెస్టులో అజింక్యా రహానే సెంచరీ..

మధ్యప్రదేశ్ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో అజింక్యా రహానే సెంచరీ చేశాడు. టెస్టు కెరీర్ లో రహానే 8వ సెంచరీ సాధించాడు. ఇండోర్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. 

10:21 - October 9, 2016

నల్గొండ : జిల్లాలోని ఆలేరు, యాదగిరిగుట్టలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో సీపీఎం సహా ఇతర విపక్ష నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు లాక్కొని పోలీసులు దౌర్జన్యం చేశారు. యాదగిరిగుట్ట ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా దీక్ష చేస్తున్న మోటకొండూరు గ్రామస్తులను అరెస్టు చేశారు. నారాయణపూర్ పీఎస్ కు తరలించారు.  
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

రైతులకు భరోసా కోసం నేడు రఘువీరా పాదయాత్ర

అనంతపురం : రైతులకు భరోసా కోసం నేడు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి బ్రహ్మసముద్రం వేపులపర్తి నుంచి గుమ్మగట్ట వరకు పాదయాత్ర చేయనున్నారు.

కంటెయినర్ ఢీకొని వ్యక్తి మృతి

మహబూబ్ నగర్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటెయినర్ ఓ వ్యక్తిని ఢీకొట్టి మృతదేహాన్ని నాలుగు కిలోమీటర్లు లాక్కెళ్లింది. కంటెయినర్ చక్రాల వద్ద ఇంజన్ కు అతుకున్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అలంపూర్ ఆస్పత్రికి తరలించారు.

 

10:01 - October 9, 2016

మహబూబ్నగర్ : జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటెయినర్ ఓ వ్యక్తిని ఢీకొట్టి మృతదేహాన్ని నాలుగు కిలోమీటర్లు లాక్కెళ్లింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు నుంచి మహబూబ్ నగర్ వైపు వస్తున్న కంటెయినర్ మార్గంమధ్యలో అలంపూర్ చౌరస్తా సమీపంలో తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. మృతదేహాన్ని నాలుగు కిలో మీటర్లు లాక్కెళ్లింది. కంటెయినర్ చక్రాల వద్ద ఇంజన్ కు అతుకున్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అలంపూర్ ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియలేదు. అతని దగ్గర ఉన్న వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

సూళ్లూరుపేటలో వాహన తనిఖీలు

నెల్లూరు : సూళ్లూరు పేటలో పోలీసుల వాహనం తనిఖీలు చేపట్టారు. రూ.70 లక్షల విలువైన 28 ఎర్రచందనం దుంగలు చెన్నై తరలిస్తుండగా పట్టుకుని.. స్వాధీనం చేస్తున్నారు. వ్యాన్ ను సీజ్ చేశారు. 
 

08:42 - October 9, 2016

ఆలేరు, యాదగిరిగుట్టలో పోలీసులు అత్యుత్సాహం

నల్గొండ : ఆలేరు, యాదగిరిగుట్టలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో సీపీఎం సహా ఇతర విపక్ష నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. యాదగిరిగుట్ట ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న మోటకొండూరు గ్రామస్తులను అరెస్టు చేశారు. నారాయణపూర్ పీఎస్ కు తరలించారు.  

08:28 - October 9, 2016

హైదరాబాద్ : మహిళలంతా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ. పిల్లా, పెద్దలు.. ఊరూ, వాడ అంతా ఒక్కటై ఆడిపాడే ఉత్సవం. తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే కార్యక్రమం. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మను మహిళలంతా అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆడిపాడారు. అన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణంగా నిలిచే బతుకమ్మ పండుగ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆనందోత్సహాల మధ్య మహిళలు పండుగను జరుపుకున్నారు. 
వరంగల్‌ 
వరంగల్‌ జిల్లా హన్మకొండ పద్మాక్షమగుట్ట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి, రంగలీల మైదానం, వడ్డేపల్లి, దేశాయిపేటలో సద్దుల బతుకమ్మను మహిళలు ఘనంగా నిర్వహించారు. దీంతో ఈ ప్రాంతామంతా బతుకమ్మ పాటలతో మారుమ్రోగింది. 
మెదక్‌ 
అన్ని జిల్లాల్లో ఉదయం నుంచి బతుకమ్మలు పేర్చిన మహిళలు మధ్యాహ్నం 3 గంటల నుంచే మైదానాలకు చేరుకున్నారు. మెదక్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా మహిళలు బతుకమ్మ జరుపుకున్నారు. పటాన్‌చెరులోని చిట్కూరులో వర్షాన్ని లెక్కచేయకుండా మహిళలు బతుకమ్మ ఆడారు. 
ఖమ్మం 
ఖమ్మం లో సర్దార్‌పటేల్‌ స్టేడియంలో నిర్వహించిన మహాబతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లాలో తోమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని వాడ, వాడన బతుకమ్మ ఆటలు ఆడారు. వర్షంలో కూడ మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ పండగ వేడుకల్లో పాల్గొన్నారు. కోలాటాలు ఆడారు. 
నల్లగొండ 
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. మహిళలంతా సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు.
మహబూబ్‌నగర్‌
మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాలలో సద్దుల బతుకమ్మను మహిళలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంతో.. అన్ని చోట్ల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బతుకమ్మ ఆట-పాట తర్వాత బతుకమ్మలను నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. 

 

08:09 - October 9, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో వైద్యుల బృందం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చికిత్సకు జయలలిత స్పందిస్తున్నారని పేర్కొంది. పూర్తి స్థాయిలో కోలుకునేవరకు ఆమె ఆసుపత్రిలోనే ఉంటారని తెలిపింది. జయలలిత త్వరితగతిన కోలుకోవాలంటూ అభిమానులు పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆమె రాజకీయ వారసుడిపై మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. 
సెప్టెంబర్ 22 నుంచి అపోలో ఆస్పత్రిలో జయకు చికిత్స 
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై చెన్నై అపోలో వైద్యుల బృందం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  సెప్టెంబర్ 22 నుంచి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వైద్య చికిత్సకు త్వరితగతిన స్పందిస్తున్నారని  అపోలో ప్రధాన అధికారి సుబ్బయ్య విశ్వనాథన్ వెల్లడించారు. ఇన్ఫెక్షన్‌కు యాంటీ బయాటిక్స్ అందిస్తున్నామని, ప్రత్యేక వైద్యబృందం ఆమె చికిత్సను పర్యవేక్షిస్తోందని  వైద్యులు పేర్కొన్నారు.  జయలలిత పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ఆస్పత్రిలోనే ఉంటారని వైద్యులు ప్రకటించారు.
రిచర్డ్‌ బెలే నేతృత్వంలో ప్రత్యేక చికిత్స 
లండన్‌ సెప్సిన్‌ స్పెషలిస్ట్‌ వైద్యుడు రిచర్డ్‌ బెలే నేతృత్వంలో జయలలితకు ప్రత్యేక చికిత్స జరుగుతోంది. వూపిరిత్తులు, మధుమేహం, ఆస్తమా, ఇన్‌ఫెక్షన్లకు సంబంధించి జయలలితకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
జయకు పలువురి పరామర్శ
మరోవైపు అపోలో ఆసుపత్రికి నేతల పరామర్శలు వెల్లువెత్తాయి. డిఎంకె నేత స్టాలిన్‌ అపోలో ఆస్పత్రిలో జయలలితను పరామర్శించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎండీఎంకే నేత వైకో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించారు. సిఎంకు అవసరమైన వైద్య చికిత్సను వైద్యులు అందిస్తున్నారని, మంచి ఆరోగ్యంతో ఆమె త్వరలోనే ఇంటికి చేరబోతున్నారని వైకో తెలిపారు. అనంతరం తమిళనాడు గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావును వైకో కలిశారు. జయలలిత కోలుకునేవరకు గవర్నర్‌ తాత్కాలికంగా పాలనాపగ్గాలు చేపట్టాలన్న డీఎంకే నేత స్టాలిన్‌ డిమాండ్‌ను ఆయన తప్పుబట్టారు. 
త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు 
రెండు వారాలు గడిచినా అమ్మ జయలలిత అనారోగ్యం నుంచి కోలుకోకపోవడంతో పార్టీ నేతలు, ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అమ్మ త్వరగా కోలుకోవాలంటూ ఆసుపత్రి ఆవరణలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరుపుతున్నారు. సీఎం పరిపాలనకు అందుబాటులో లేకపోవడంతో కొత్తగా డిప్యూటీ సీఎంను నియమించాలని అన్నాడీఎంకే నేతలు యోచిస్తున్నట్లు భిన్న కథనాలు తెరపైకి వచ్చాయి. 

 

08:03 - October 9, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి నెలకొంది. ఓ వైపు పల్లెలు కళకళలాడుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాజధాని బోసిబోతోంది. పల్లెల వైపు నగరవాసులు పరుగులు తీస్తున్నారు. ఆత్మీయుల మధ్య ఆహ్లాదంగా గడిపేందుకు తరలిపోతున్నారు. రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. రైళ్లు, బస్సులు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
సొంతూర్లకు నగరవాసులు  
పట్నం వాసులు పల్లెబాట పట్టారు. విజయదశమి పండగను సొంతూళ్లలో ఆత్మీయుల మధ్య జరుపుకునేందుకు తరలిపోతున్నారు.  దీంతో హైదరాబాద్‌లోని జనాలు కుటుంబ సమేతంగా స్వగ్రామాలకు తరలిపోతున్నారు. భారీ ఎత్తున ఊళ్లకు వెళ్తుండటంతో నగరం బోసిపోతోంది. మరోవైపు ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఏ బస్టాండ్‌ చూసినా ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. 
బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు 
మరోవైపు రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, పిల్లలతో బస్టాండ్లలో పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు. దసరా రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు వేసినా.. అవి ఏ మూలకు సరిపోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. 
వెయ్యికి పైగా అదనపు బస్సులు 
శనివారం నుంచి వెయ్యికి పైగా అదనపు బస్సులు వేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అవసరమైతే మరిన్ని అదనంగా బస్సులు జిల్లాలకు నడుపుతామంటున్నారు. సిటీ బస్సులను కూడా ఇందుకోసం ఉపయోగిస్తామని చెబుతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి జిల్లాలకు అదనపు సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

 

07:57 - October 9, 2016

వరంగల్ :  ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి మొక్కు తీర్చుకునేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధమయ్యారు. స్వరాష్ట్రం సిద్ధిస్తే భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కిరీటాన్ని సమర్పిస్తానని అప్పటి తెలంగాణ ఉద్యమ దళపతిగా మొక్కుకున్నారు. 60 ఏళ్ల తెలంగాణ కల సాకారం కావడంతో..దేవుళ్ల మొక్కులను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వచ్చారు. శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా..భద్రకాళి అమ్మవారికి భారీ బంగారు కిరీటాన్ని సమర్పించనున్నారు.   
11.7 కేజీల స్వర్ణ కిరీటం
ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని..11.7 కేజీల స్వర్ణ కిరీటంతో అలంకరణ చేసే ఘడియలు ఆసన్నమయ్యాయి. మరికొన్ని గంటల్లో ఆ వేడుక భక్తులకు కనువిందు చేయనుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించి మొక్కుతీర్చుకుంటానని కేసీఆర్‌ ఉద్యమ సమయంలో అన్నారు. అన్న మాట ప్రకారం..దేవీ శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి సందర్భంగా ఈరోజు ఉదయం 10 గంటలకు అమ్మవారికి స్వర్ణ కిరీటాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సమర్పించనున్నారు. 
కిరీటం విలువ 3 కోట్ల 70 లక్షలు
హన్మకొండలో వెలసిన భద్రకాళి అమ్మవారికి సీఎం కేసీఆర్ స్వర్ణ కిరీటం సమర్పించే వేడుకను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వర్ణ కిరీటాన్ని 11.7 కేజీల బరువు..స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయించారు. ఈ కిరీటం విలువ 3 కోట్ల 70 లక్షలు. కిరీటాన్ని చెన్నైకి చెందిన జీఆర్‌టీ జ్యువెలర్స్‌ సంస్థ తయారుచేసింది. 
కిరీటం విలువ 3.70 కోట్లు 
సీఎం కేసీఆర్ రాకను పురస్కరించుకుని అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్‌,పోలీస్ కమిషనర్‌, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ భద్రకాళి ఆలయానికి వెళ్లి ఏర్పాట్లపై ఆలయ అధికారులతో చర్చించారు. మరోవైపు విలువైన బంగారు కిరీటాన్ని ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిగతా రోజుల్లో కలెక్టరేట్‌లోని ట్రెజరీ కార్యాలయంలో ఉంచాలని భావిస్తున్నారు. ఒకటి, రెండురోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 
వైభవోపేతంగా సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం  
ఏటా విజయ దశమి సందర్భంగా భద్రకాళి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈసారి సీఎం బహూకరించే పసిడి కిరీటంతో అమ్మవారు భక్తులకు దర్శనమీయనున్నారు. దుర్గాష్టమి...భద్రకాళి అమ్మవారి జన్మదినోత్సవం రోజున సీఎం కేసీఆర్ స్వర్ణ కిరీటం సమర్పిస్తుండటం పట్ల ఓరుగల్లు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

రైతులకు భోరోసా కోసం నేడు రఘువీరారెడ్డి

అనంతపురం : రైతులకు భోరోసా కోసం నేడు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఇవ్వనున్నారు. బ్రహ్మసముద్రం వేపులపర్తి నుంచి గుమ్మగట్ట వరకు పాదయాత్ర చేయనున్నారు.

ఇంద్రకీలాద్రిపై ఎనిమిదో రోజు నవరాత్రి ఉత్సవాలు

  విజయవాడ : ఎనిమిదో రోజు నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నేడు దుర్గాష్టమి సందర్భంగా మహాదుర్గగా అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారు. 

గుంటూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం

గుంటూరు : జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. గుంటూరు, సత్తెనపల్లిలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది.

 

 

నేడు దక్షిణ కొరియా, ఆర్జెంటీనా ఢీ

ప్రపంచ కబడ్డీ : నేడు దక్షిణ కొరియా, ఆర్జెంటీనా ఢీ కొననున్నాయి. సాయంత్రం 6.50 గంటల మ్యాచ్ ప్రారంభం కానుంది. 
రాత్రి 9 గంటలకు అమెరికా, జపాన్ తలపడనున్నాయి. 

 

నేడు స్వచ్ఛాగ్రహ షార్ట్ ఫిలింస్ స్క్రీనింగ్

హైదరాబాద్ : ఉదయం 9 గంటలకు సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్ లో స్వచ్ఛాగ్రహ షార్ట్ ఫిలింస్ స్క్రీనింగ్ జరుగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.

 

 

నేడు వరంగల్ జిల్లాకు సీఎం కేసీఆర్ దంపతులు

వరంగల్ : నేడు సీఎం కేసీఆర్ దంపతులు వరంగల్ జిల్లాలకు వెళ్లనున్నారు. భద్రకాళి అమ్మవారికి కిరీటం సమర్పించి మొక్కు తీర్చుకోనున్నారు. 

 

Don't Miss