Activities calendar

10 October 2016

21:34 - October 10, 2016

కేరళ : కన్నూరు జిల్లాలో సిపిఎం కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం షాపులో పనిచేస్తున్న 40 ఏళ్ల మోహనన్‌ను గుర్తు తెలియని దుండగులు ఆయుధాలతో దాడి చేశారు. దాడిలో మరో కార్మికుడు అశోకన్‌ గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ మోహనన్‌కు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కన్ను మూశాడు. ఈ హత్య వెనక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందని కన్నూరు జిల్లా సిపిఎం ఆరోపించింది. మోహనన్‌ హత్యకు నిరసనగా సిపిఎం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. మోహనన్‌ హత్యను సిపిఎం పొలిట్‌ బ్యూరో తీవ్రంగా ఖండించింది.   

21:33 - October 10, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య బులెటిన్‌ను విడుదల చేశారు. ఆమె కోలుకుంటున్నారని, చికిత్సకు సహకరిస్తున్నట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. మరోవైపు పాండిచ్ఛేరి గవర్నర్‌ కిరణ్‌బేడి, కేరళ గవర్నర్‌ సదాశివం, సిఎం విజయన్‌ జయలలితను పరామర్శించారు. మరోవైపు జయలలిత ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తున్న ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గత మూడు వారాలుగా తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తాజాగా అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. ఆమెకు కృత్రిమ శ్వాస కొనసాగుతోందని, ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. జయలలితకు యాంటీ బయటిక్స్ అందిస్తున్నామని, న్యూట్రిషీయన్ సపోర్టుతో ఫీజియో థెరపీ చేస్తున్నామని వివరించారు. ఎయిమ్స్ డాక్టర్ జీ ఖిల్నానీ పర్యవేక్షణలో జయలలితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రముఖుల పరామర్శ..
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను ప్రముఖులు పరామర్శించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడి, కేరళ గవర్నర్‌ సదాశివం, ముఖ్యమంత్రి విజయన్‌ జయలలితను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయలలిత కోలుకుంటున్నారని, త్వరలోనే ఆమె డిశ్చార్జ్ అవుతారని కేరళ గవర్నర్ పీ సదాశివం అన్నారు. వైద్య చికిత్సలకు జయ స్పందిస్తున్నట్లు వైద్యులు చెప్పారని ఆయన తెలిపారు. జయలలిత త్వరలోనే కోలుకుని మళ్లీ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించే అవకాశాలున్నాయన్న ఆశాభావాన్ని పినరయి విజయన్‌, జస్టిస్ సదాశివం వ్యక్తం చేశారు.

వదంతులకు అడ్డుకట్ట..
జయలలితపై వస్తున్న వదంతులకు అడ్డుకట్ట వేయాలని అన్నాడీఎంకే భావిస్తోంది. ఇందుకోసం 'ఆల్‌ ఈజ్‌ వెల్‌ అమ్మ', 'మై సీఎం ఈజ్‌ ఫైన్‌' పేరుతో సోషల్‌ మీడియాలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అమ్మ మద్దతుదారులందరూ మై సీఎం ఈజ్‌ ఫైన్‌ అని జయలలిత ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టుకోవాలని సూచించింది. జ్వరం, డీ హైడ్రేషన్‌తో జయలలిత సెప్టెంబర్‌ 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ అన్నాడిఎంకె కార్యకర్తలు, అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు జరుపుతున్నారు.

రేపు మర్కుక్ లో సీఎం కేసీఆర్ పర్యటన..

మెదక్ : జిల్లాలోని ములుగు మండలం మర్కుక్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. మర్కుక్ గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రంగా ప్రకటించింది. మర్కుక్‌లో ప్రభుత్వ భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 

ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా రోజున అతిపెద్ద పాలనా సంస్కరణలు అమలు కావడం శుభసూచికమన్నారు. 

కొత్త జిల్లాలకు కొత్త పోలీసు బాస్ లు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా రోజున కొత్త జిల్లాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పోలీసు కమిషన్లు, ఎస్పీలను ఖరారు చేసింది. నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా కార్తికేయ, రామగుండంకు విక్రమ్ జీత్ దుగ్గల్, ఖమ్మంకు షానవాజ్ ఖాసీం, కరీంనగర్ కు కమలాసన్ రెడ్డి, సిద్ధిపేట కు కార్తీకేయలు పోలీసు కమీషనర్ లు గా వ్యవహరించనున్నారు.

20:59 - October 10, 2016

దసరా రోజున కొత్త జిల్లాలు..సీపీఎం మహాపాదయాత్రను ఎద్దేవా చేసిన కేసీఆర్..రాముడు కాదు..రావాణడే దేవుడు..కర్నూలు జిల్లాలో సురువైన కట్టల లడాయి..పోలీసుల చెవిలో పువ్వులు పెట్టిన పోరడు..ఇలాంటి అంశాలపై మల్లన్న ముచ్చట్లు చెప్పిండు. మరి ఆ ముచ్చట్లు చూడాలంటే వీడియోలో చూడండి. 

20:50 - October 10, 2016

సప్తగిరి..పూర్తి పేరు వెంకటప్రభు ప్రసాద్..టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన నటించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. కమెడియన్ గా ఉన్న ఇతను త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దసరా పండుగను పురస్కరించుకుని 'సప్తగిరి'తో టెన్ టివి ముచ్చటించింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగిందని, కమెడీయన్ గా చేసిన సినిమాలు విజయవంతమయ్యాయని సప్తగిరి తెలిపారు. మంచి కథ దొరకడం వల్లే హీరోగా చేయడం జరుగుతోందన్నారు. తమిళంలో ఓ సినిమా చూడడం జరిగిందని, తన జీవితానికి దగ్గరగా కథ ఉందని తెలిపారు. కొన్ని మార్పులు చేసి ఎంటర్ టైన్ మెంట్ గా చిత్రాన్ని రూపొందించడం జరుగుతోందన్నారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియోలో చూడండి. 

పాంపోర్ లో కొనసాగుతున్న కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పాంపోర్ లో ఉగ్రవాదులు..భారత బలగాలకు మధ్య కాల్పులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈడీఐ బిల్డింగ్ లో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత బలగాలు ప్రయత్నిస్తున్నాయి. 

18:52 - October 10, 2016

అడవిదేవులపల్లి, మోట కొండూరు గ్రామాలు ఇక మండలాలు..

హైదరాబాద్ : నల్గొండ జిల్లాలోని అడవిదేవులపల్లి, మోట కొండూరు గ్రామాలను మండలాలుగా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మండలాలను పేర్లను తుది ముసాయిదాలో పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. 

జనంపైకి దూసుకెళ్లిన లారీ..ఆరుగురు మృతి..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సియోనిలో జనంపైకి లారీ దూసుకెళ్లింది. ఆరుగురు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి.

 

కేరళలో సీపీఎం కార్యకర్తను హత్య చేసిన ఆర్ఎస్ కార్యకర్తలు..

కేరళ : సీపీఎం కార్యకర్త మోహనన్ ను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. సీఎం పినరయి విజయన్ సొంత నియోజకవర్గంలో మోహనన్ దుకాణంలో ఉండగా ఆర్ఎస్ కార్యకర్తలు ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. మోహనన్ హత్యను సీపీఎం పొలిట్ బ్యూరో ఖండించింది. 

18:33 - October 10, 2016

విజయవాడ : ఏపీలో మంత్రివర్గ విస్తరణ.. ఈ దసరాకి లేనట్లే. దీంతో దసరాను అమాత్యగిరీతో సరదాగా గడుపుదామనుకున్న ఆశావహులు మరోసారి ఉస్సురన్నారు. అసలు ఏపీ మంత్రివర్గ విస్తరణ ఎందుకు వాయిదా పడింది..? త్వరలోనే తీపి కబురంటూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కొంతకాలంగా పార్టీ నేతలను ఊరిస్తూ వస్తున్నారు. దీంతో చాలా మంది దసరా రోజున కేబినెట్‌ విస్తరిస్తారని, అందులో తమకు బెర్త్‌ ఖరారు అన్న ఊహల్లో మునిగిపోయారు. కానీ వెలువడుతున్న సంకేతాలు.. దసరా రోజున మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని తేల్చేశాయి. చంద్రబాబు మంత్రివర్గ విస్తరణను ఎందుకు వాయిదా వేశారు..? ఏపీ కేబినెట్‌ విస్తరణకు సంబంధించి చంద్రబాబు సుదీర్ఘ కసరత్తును చేసినట్లుగా ప్రచారం జరిగింది. తన తనయుడు లోకేశ్‌కు మంత్రి పదవితో పాటు.. ఆయనకు అప్పగించాల్సిన శాఖపైనా సీఎం నిర్దిష్టమైన అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అలాగే కోడెల శివప్రసాదరావును మంత్రివర్గంలోకి తీసుకుని.. గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల నరేంద్రను స్పీకర్‌ను చేస్తారన్న ప్రచారమూ జరిగింది. ప్రస్తుతమున్న లెక్కల ప్రకారం.. మరో ఆరుగురికి కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్నవారిలో ముగ్గురికి ఉద్వాసన పలికి మొత్తం తొమ్మిది మంది కొత్తవారికి అవకాశం కల్పించాలని సీఎం భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో.. ఎందరో నేతలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

పలు సామాజిక వర్గాలు..
ఆశావహులు పెరగడం.. సామాజిక సమతుల్యత పాటించడం.. చంద్రబాబుకు కష్టంగా మారినట్లు సమాచారం. ఎస్సీ సామాజికవర్గం నుంచి పోటీ ఎక్కువ ఉండటం, అలాగే రెడ్డి సామాజికవర్గం నుంచి ఎవరిని తీసుకోవాలనే దానిపై క్లారిటీ రాక సీఎం సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది. దీనికి తోడు టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవులివ్వాలి.. ఇస్తే పార్టీ నేతల నుంచి.. అలాగే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మిగతా ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభ్యంతరం వస్తుందోనని సీఎం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజికవర్గం నుంచి ఎవరిని తీసుకోవాలన్న దానైపైనే ఎక్కువ సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి రేసులో ఉన్నారు. ఇద్దరూ ఎమ్మెల్సీలే కావడం గమనార్హం. అయితే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డికి కచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని సీఎం హామీ ఇచ్చారని సమాచారం. భూమా వర్గం కూడా మంత్రి పదవి ఖాయమంటూ ప్రచారం చేసుకుంటోంది. అలాగే జెసీ దివాకర్‌రెడ్డి..తన సోదరుడు ప్రభాకర్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు కల్పించాలని ఒత్తిడి తేస్తున్నారట. కేంద్ర కేబినెట్‌ విస్తరణ సమయంలో జేసీ సహాయ మంత్రి పదవి ఆశించారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో టీడీపీ ఉన్నట్లు సమాచారం.

ఆశావాహులు..
ఎస్టీ సామాజిక వర్గం నుంచి పోలవరం ఎమ్మెల్యే ముమ్మిడి శ్రీనివాస్, విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి రేసులో ఉన్నారు. వీరిలో ఒకరికి ఖచ్చితంగా కేబినెట్‌లో స్థానం దక్కే అవకాశాలున్నాయని సమాచారం. ఎస్సీ సామాజికవర్గం నుంచి..మంత్రి వర్గంలో కూర్పు అధినేతకు తలనొప్పిగా మారిందని సమాచారం. ఎప్పటి నుంచో మంత్రులు రావెల కిశోర్ బాబు, పీతల సుజాతలపై వేటు పడొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ సామాజికవర్గం నుంచి మాల, మాదిగ కాంబినేషన్ లో నక్కా ఆనందబాబు, శ్రవణ్ కుమార్, అనిత, గొల్లపల్లి సూర్యారావు, పులపర్తి నారాయణ మూర్తి, ఆనందరావులు మంత్రి పదవి ఆశిస్తున్నారు.  కాపు సామాజికవర్గం నుంచి ఇప్పటికే ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావుకు దాదాపు బెర్తు ఖాయమంటున్నారు. అయితే వైసీపీ నుంచి పార్టీలో చేరిన జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు, బొండా ఉమా మహేశ్వరరావులు విస్తరణలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా నుంచి.. క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు కూడా మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నారు. అలాగే మైనారిటీ కోటాలో , ఎమ్మెల్సీ షరీఫ్, వైసీపీ నుంచి పార్టీలో చేరిన కదిరి ఎమ్మల్యే చాంద్ బాషా, జలీల్ ఖాన్‌లు రేసులో ఉండటంతో సీఎం ఓ క్లారిటీకి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువ మంది ఎమ్మెల్సీలే..
మంత్రి వర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్న ఆశావహుల్లో ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉండటం మరో సమస్యగా మారిందని తెలుస్తోంది. వారికి మంత్రిపదవి ఇస్తే.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎలాంటి వ్యతిరేకత వస్తుందోనని అధినేత ఆలోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలంటున్నాయి. పయ్యావుల కేశవ్, గాలి ముద్దు కృష్ణమనాయుడు, సోమిరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి లు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్‌ను కూడా మార్చిలో ఎమ్మెల్సీ చేస్తానని పార్టీ అధినేత హామీ ఇచ్చారని సమాచారం. దీంతో ఆయన కూడా మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నవారిలో ఉన్నారు.  జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కు మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సీఆర్డీఏ చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సుజయ కృష్ణరంగారావు, కర్నూలు నుంచి భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ, తూర్పు గోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ కు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. కాపు ఉద్యమం ముద్రగడ వ్యవహారశైలిని అదుపు చేయటానికి జ్యోతుల నెహ్రూకి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

విమర్శలు వస్తాయా ? 
వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ రికార్డుల ప్రకారం వైసీపీ ఎమ్మెల్యేలు గానే ఉన్నారు. వాళ్లను మంత్రి వర్గంలోకి తీసుకుంటే విమర్శలొస్తాయా.. తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంలో తలెత్తిన రాజ్యాంగపరమైన ప్రశ్నలు తమకూ ఎదురు కావొచ్చన్న అనుమానం పార్టీ హైకమాండ్‌లో ఉంది. ఏతావాతా దసరా వచ్చింది. కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. కనీసం దీపావళి నాటికైనా విస్తరణ ఉంటుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఆశావహులు. 

18:29 - October 10, 2016
18:27 - October 10, 2016

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బంది నిర్వాకం నలుగురి చిన్నారుల ప్రాణాల మీదికి తెచ్చింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడికి పూనకం రావడంతో.. టీటీడీ సిబ్బంది అతనిని క్యూలైన్‌ నుంచి బలవంతంగా తోసిపడేశారు. దీంతో ఆ భక్తుడి కుటుంబ సభ్యులకు, టీటీడీ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విచక్షణ కోల్పోయిన టీటీడీ సిబ్బంది.. భక్తులను తోసేశారు. దీంతో ఐదుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. గాయపడ్డవారిని వెంటనే అశ్విని ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా రాజమండ్రికి చెందిన లక్ష్మీగణపతి భజన బృందం సభ్యులు. వీరంతా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేశారు.

ఆర్టీసీ బస్సుల కొరత..
ఆర్టీసీ బస్సుల కొరతతో తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రథోత్సవానికి తరలివచ్చిన భక్తులు... తిరుగు ప్రయాణంలో చాలినన్ని బస్సులు అందుబాటులో లేకపోవడంతో... గమ్యస్థానాలు చేరుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. బస్టాండ్‌లోకి బస్సు వస్తుండగానే ఉరుకులు, పరుగులు తీస్తూ... కిటికీ అద్దాల నుంచి బ్యాగులు చేస్తూ సీట్లు పట్టుకుంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ విఫలమైందని విమర్శిస్తున్నారు. భక్తుల ప్రయాణ ఇబ్బందుల గురించి ఆర్టీసీ అధికారులు పట్టించుకోపోవడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

18:25 - October 10, 2016

విశాఖపట్టణం : విద్యా ప్రమాణాలు మెరుగుపడే విధంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. సంప్రదాయ విద్యా బోధన కంటే ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈనెల 4 నుంచి విశాఖపట్నంలోని ఆంధ్రా యూవర్సిటీలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై ఇస్రో నిర్వహించిన వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో స్పేస్‌ టెక్నాలజీ వినియోగంపై ఇస్రో-ఏపీ ప్రభుత్వానికి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. యూనివర్సిటీలు చేసే పరిశోధనలు ప్రజలకు ఉపయోగపడాలని చంద్రబాబు కోరారు. 

కొత్త జిల్లాలకు కలెక్టర్లు..

హైదరాబాద్ : వరంగల్ జిల్లా కలెక్టర్ గా ఐఏఎస్ అమ్రపాలి, మెదక్ జిల్లా కలెక్టర్ గా భారతి, యాదాద్రి జిల్లా కలెక్టర్ గా రామచంద్రన్ లను నియమించారు. ఈ రాత్రికి అధికారికంగా ఆదేశాలు జారీ చేయనున్నారు. 

అంతరిక్ష పరిజ్ఞానంలో ఏపీ అగ్రస్థానం - బాబు..

విశాఖపట్టణం : జిల్లాలో అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు. అంతరిక్ష పరిజ్ఞానంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని, ఇందులో అన్ని వర్సిటీలు పోటీ పడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి సాధ్యమన్నారు. 

17:32 - October 10, 2016
17:30 - October 10, 2016
17:08 - October 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఇక 31 జిల్లాలుగా మారనుంది. రేపే దీనికి ముహూర్తం నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం 11.13 సిద్ధిపేటలో ఈ కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. అంతేగాకుండా ఏ ఏ మంత్రి ఏ జిల్లాను ప్రారంభించాలో జాబితాను సిద్ధం చేశారు. కాసేపటి క్రితం సీఎం కేసీఆర్ తో సీఎస్ భేటీ అయ్యారు. జిల్లాల విభజన..చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. సోమవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. అంతేగాకుండా స్వల్ప మార్పులు చేసినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ ఎర్రవెల్లికి బయలుదేరారు.

మంత్రుల వివరాలు..
సూర్యాపేట - జగదీష్ రెడ్డి, యాదాద్రి - నాయినీ నర్సింహరెడ్డి, వనపర్తి - నిరంజన్ రెడ్డి, జోగులాంబ (గద్వాల) – లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూలు - మంత్రి జూపల్లి కృష్ణారావు, నిర్మల్ - ఇంద్రకిరణ్ రెడ్డి, ఆసిఫాబాద్ - జోగురామన్న, మంచిర్యాల – పద్మారావు, కొత్తగూడెం - మంత్రి తుమ్మల, సిరిసిల్ల – కేటీఆర్, పెద్దపల్లి - ఈటెల, జగిత్యాల - మహమూద్ ఆలీ, సంగారెడ్డి - పద్మా దేవేందర్ రెడ్డి, సిద్ధిపేట – సీఎం కేసీఆర్ / హరీష్, కామారెడ్డి - పోచారం, వరంగల్ రూరల్ - కడియం శ్రీహరి, భూపాలపల్లి - అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, జనగాం - శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మహబూబాబాద్ - చందులాల్, మల్కాజ్ గిరి (మేడ్చల్) - తలసాని, వికారాబాద్ - మహేందర్ రెడ్డిలు ప్రారంభించనున్నారు.
గత రెండు నెలల క్రితం 27 జిల్లాలతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తమ మండలాలు నియోజకవర్గంలో చేర్చాలని..తమ మండలాలను కలపవద్దని పలు సూచనలు..సలహాలు అందాయి. అంతేగాకుండా పలు జిల్లాల్లో కూడా ఆందోళనలు కొనసాగాయి. ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలకు పేర్లను ఖరారు చేయాల్సి ఉంది. 

జయ హెల్త్ బులెటిన్ విడుదల..

చెన్నై : సీఎం జయలలిత హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేశారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని అపోలో వైద్యులు వెల్లడించారు. జయకు కృత్రిమ శ్వాస అందిస్తున్నామని, ఎయిమ్స్ నుండి వచ్చిన పల్మనాలజిస్టు జయలలితకు ప్రత్యేక చికిత్స చేస్తున్నారన్నారు. మరికొన్ని రోజులు జయకు ప్రత్యేక చికిత్స అవసరమని, మరికొన్ని రోజులు జయకు ప్రత్యేక చికిత్స అవసరమన్నారు. 

బోరబండలో భూ ప్రకంపనలు వాస్తవం - ఎన్ జీఆర్..

హైదరాబాద్ : నిన్న బోరబండలో భూ ప్రకంపనలు రావడం వాస్తవమని భూమి లోపలి పొరల్లో ఏర్పడిన పగుళ్ల వల్లే ప్రకంపనలు వచ్చినట్లు ఎన్ జీఆర్ ప్రకటించింది. రిక్టర్ స్కేల్ పై 1.2గా నమోదైనట్లు తెలిపింది. 

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 299 పరుగులు..

ఇండోర్ : న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 299 పరుగులు చేసింది. 258 పరుగుల అధిక్యంలో భారత్ నిలిచింది. అశ్విన్ ఆరు వికెట్లు తీయగా జడేజాకు రెండు వికెట్లు తీశాడు. కెరీర్ లో అశ్విన్ 20 సార్లు ఐదు వికెట్లు తీశాడు. 

16:19 - October 10, 2016
16:09 - October 10, 2016

చిత్తూరు : శ్రీవారి ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరగడం కలకలం సృష్టించింది. ఈఘటనలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఓ భజన బృందం ఈ ఉత్సవాల్లో పాల్గొంటోంది. వీరికి సోమవారం మధ్యాహ్నం శ్రీవారి దర్శనానికి టిటిడి కల్పించింది. భక్తజన బృందం శ్రీవారి దర్శనానికి వెళ్లింది. గరుడాళ్వార్ సమీపానికి రాగానే భక్త జన బృందంలో ఉన్న ఓ సభ్యుడికి పూనకం వచ్చింది. అక్కడనే విధులు నిర్వహిస్తున్న టిటిడి సిబ్బంది వీరిని ఒక్కసారిగా నెట్టివేశారు. దీనితో బృందంలో ఉన్న నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై టిటిడి స్పందించింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. 

16:06 - October 10, 2016

శ్రీవారి ఆలయంలో తొక్కిసలాట..

తిరుమల : శ్రీవారి ఆలయం వద్ద తోపులాట చోటు చేసుకుంది. నలుగురు అస్వస్థతకు గురయ్యారు. భజన బృందంలో ఉన్న ఓ భక్తుడికి పూనకం వచ్చింది. వెంటనే అక్కడున్న టిటిడి సిబ్బంది తోసివేశారు. దీనితో తోపులాట చోటు చేసుకుంది. అస్వస్థతకు గురయిన వారిని ఆసుపత్రికి తరలించారు. తోపులాటపై టిటిడి స్పందించింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. 

15:44 - October 10, 2016
15:40 - October 10, 2016

అమెరికా : దేశ అధ్యక్ష అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ రెండో డిబేట్‌లో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. గతంలో మహిళలపై ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను హిల్లరీ ఎండగట్టారు. ట్రంప్ వ్యక్తిత్వమేంటో ఆడియోటేపుల్లో బయటపడిందని.. అధ్యక్ష పదవికి ట్రంప్ తగిన వ్యక్తి కాదని హిల్లరీ అన్నారు. అయితే.. మహిళలను తానెప్పుడూ కించపరచలేదని.. మహిళలంటే తనకెంతో గౌరవం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆడియో టేపుల్లో బయటపడిన వ్యవహారాన్ని ప్రైవేటు సంభాషణగా చూడాలన్న ట్రంప్.. తాను చేసిన వ్యాఖ్యల పట్ల అమెరికా ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అసలు మహిళలను కించపరిచింది హిల్లరీ భర్త బిల్ క్లింటన్ అంటూ ట్రంప్ ఎదురుదాడికి దిగారు. అధికార వ్యవహారాలకు హిల్లరీ వ్యక్తిగత మెయిల్‌ను వాడిన విషయంలో హిల్లరీ క్షమాపణలు చెప్పాలని.. 33 వేల ఈమెయిల్స్‌ను ఆమె ఎందుకు తొలగించారో చెప్పాలని ట్రంప్ అన్నారు. ఈమెయిల్స్ వ్యవహారంలో హిల్లరీ జైల్లో ఉండాలని.. తాను గెలిస్తే ఈ విషయంలో విచారణ జరిపిస్తానని ట్రంప్ అన్నారు. అయితే ఈమెయిల్స్ వ్యవహారంలో ఎప్పుడో తన తప్పును అంగీకరించానని హిల్లరీ అన్నారు. ముస్లింలను అవమానించడం సరికాదని.. అమెరికా అందరికి స్వాగతం పలుకుతుందని హిల్లరీ అన్నారు. అమెరికన్లు ఇస్లాంతో యుద్ధం చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. అమెరికా సైట్లను రష్యా హ్యాక్ చేస్తుందని.. పుతిన్.. ట్రంప్‌ను ఎందుకు సమర్ధిస్తున్నారని హిల్లరీ ప్రశ్నించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. హిల్లరీకి ప్రతిదానికి రష్యాను నిందించడం అలవాటైపోయిందన్నారు. తనకు రష్యాతో గానీ.. పుతిన్‌తో గానీ ఎలాంటి సంబంధాలు లేవని ట్రంప్ స్పష్టం చేశారు. 

15:38 - October 10, 2016
15:36 - October 10, 2016

చిత్తూరు : బుడిబుడి అడుగుల సవ్వడి.. ముద్దులొలికే బోసినవ్వులు..చూడగానే ఎత్తుకోవాలనిపించే అల్లరితనం..అలాంటి చిన్నారికి పెద్దకష్టమే వచ్చింది. లివర్‌ వ్యాధి కబలించడంతో కన్నవారు కుమిలిపోయారు. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబం వైద్యం చేయించలేక అల్లాడిపోయింది. కారుణ హత్యకు అనుమతించాలని కోర్టు గడపను తట్టింది. కానీ సీఎం చంద్రబాబు ఆపన్నహస్తం..తండ్రి కాలేయ దానం..చెన్నయ్‌ గ్లోబల్‌ ఆస్పత్రి అంకితభావం ఆ చిన్నారికి పునర్జన్మనిచ్చింది. ఆ చిన్నారే చిత్తూరు జిల్లా ములకల చెరువు మండలం బత్తాలపురానికి చెందిన 8 నెలల జ్ఞానసాయి. రామప్ప, సరస్వతిల గారాల పట్టి. ఇవాళ పుట్టిన రోజు కావడంతో టీటీడీ అధికారులు విఐపీ విరామదర్శనం కల్పించారు. 

15:33 - October 10, 2016

చెన్నై : అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కేరళ గవర్నర్‌ సదాశివం, ముఖ్యమంత్రి వినరయి విజయన్‌ పరామర్శించారు. అపోలో ఆస్పత్రి వైద్యులను కలిసి జయకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి కొద్దికొద్దిగా స్పందిస్తున్నారని డాక్టర్లు వీరి దృష్టికి తెచ్చారు. జయలలిత త్వరలోనే కోలుకుని మళ్లీ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించే అవకాశాలున్నాయన్న ఆశాభావాన్ని పినరయి విజయన్‌, సదాశివం వ్యక్తం చేశారు. 

15:22 - October 10, 2016

హైదరాబాద్ : సీపీఎం తలపెట్టిన 'మహాజన పాదయాత్ర'కు ఎమ్మెల్యే సంపత్ మద్దతు ప్రకటించారు. అక్టోబర్ 17వ తేదీ నుండి 2017 మార్చి 12 వరకు 4000 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రపై సీఎం కేసీఆర్ ఆదివారం పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ సందర్భంగా టెన్ టివితో సంపత్ మాట్లాడారు. తమ్మినేని నేతృత్వంలో చేపట్టిన పాదయాత్ర బలహీన వర్గాలకు బలం చేకూరుస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. సీపీఎం పాదయాత్రపై కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎందుకు చేస్తున్నావ్ ? అని ప్రశ్నించడం సరికాదని తెలిపారు. పాదయాత్రలో వెలుగులోకి వచ్చిన సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. శాసించకుండా ఏ పార్టీ కార్యక్రమం చేపట్టినా స్వాగతించి ఎమైనా తప్పులుంటే సర్కార్ సూచించాలని సంపత్ తెలిపారు. 

15:08 - October 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల నోటిఫికేషన్ కొద్ది గంటల్లో విడుదల కానుందని తెలుస్తోంది. కాసేపటి క్రితం సీఎం కేసీఆర్ తో సీఎస్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు నర్సింహరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సోమవారం అర్ధరాత్రి అనంతరం కొత్త జిల్లాల నోటిఫికేషన్ విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. కేబినెట్ ఆమోదించిన దానిపై స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 31 జిల్లాలకు సంబంధించిన కార్యాలయాలు..కార్యాలయాల ప్రారంభోత్సవం తదితర వివరాలను కేసీఆర్ కు సీఎస్ వివరిస్తున్నారు. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు సూచించిన మార్పులను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 

'మహాజన పాదయాత్ర'కు ఎమ్మెల్యే సంపత్ మద్దతు..

హైదరాబాద్ : సీపీఎం తలపెట్టిన 'మహాజన పాదయాత్ర'కు ఎమ్మెల్యే సంపత్ మద్దతు ప్రకటించారు. తమ్మినేని నేతృత్వంలో చేపట్టిన పాదయాత్ర బలహీన వర్గాలకు బలం చేకూరుస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. సీపీఎం పాదయాత్రపై కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. పాదయాత్రలో వెలుగులోకి వచ్చిన సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. 

సీఎం కేసీఆర్ తో సీఎస్ భేటీ..

హైదరాబాద్ : క్యాంపు ఆఫీసులో సీఎం కేసీఆర్ తో సీఎస్ భేటీ అయ్యారు. జిల్లాల పునర్ విభజన ఫైలును సీఎం కేసీఆర్ సంతకం కోసం తీసుకొచ్చారు. 

సీపీఎం పాదయాత్రను స్వాగతిస్తున్నాం - రేవంత్..

హైదరాబాద్ : సీపీఎం తలపెట్టిన మహా పాదయాత్రను స్వాగతిస్తున్నట్లు టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాదయాత్రకు సహరించడంపై క్షేత్రస్థాయిలో చర్చిస్తామని, కేసీఆర్ సీపీఎం పాదయాత్రను అడ్డుకోవాలని పిలుపునివ్వడం సరికాదన్నారు. కొత్త జిల్లాల పేరిట జోనల్ వ్యవస్థను దెబ్బతీశారని, ఎంఐఎం కోసం హైదరాబాద్ ను యదాతథంగా ఉంచారన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలను కేసీఆర్ దుర్వినియోగం చేశారని విమర్శించారు. న్యాయసలహా తీసుకున్నాకే కొత్త జిల్లాల ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేయాలని లేనిపక్షంలో గవర్నర్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. 

14:29 - October 10, 2016

శ్రీకాకుళం : అక్కడ అసలే కిడ్నీల జబ్బులు. అనారోగ్యంతో తల్లడిల్లిపోతున్న బాధితుల్ని ఇప్పుడు మరో వ్యాధి కబలిస్తోంది. ఒక్క సమస్యతోనే నరకయాతన అనుభవిస్తున్నవారిని మరింత అవస్థలకు గురిచేస్తోంది.. ఆ జబ్బేంటి? దీనికి కారణమేంటి? దీనిపై ప్రత్యేక కథనం..శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో మరో వ్యాధి జనాల్ని బెంబేలెత్తిస్తోంది.. అసలే కిడ్నీల వ్యాధితో బాధపడుతూ నిత్యం నరకం చూస్తున్న బాధితులను మరో జబ్బు పట్టిపీడిస్తోంది.. మూత్రపిండాల జబ్బు బాధితుల్లో ప్లేట్‌లెట్ల కౌంట్‌ తగ్గిపోయి వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

కిడ్నీ వ్యాదులు..
ఉద్దానం ఈ ఊరి పేరు చెబితేనే కిడ్నీ జబ్బులు గుర్తుకువస్తాయి. అంతగా ఇక్కడ కిడ్నీ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఈ మాయరోగంతో బాధపడుతున్న వారిని ఇప్పుడు మరో జబ్బు ఆందోళనకు గురిచేస్తోంది. విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులతో ఈ వ్యాధి బాధితులు అల్లాడిపోతున్నారు. ఈ రోగుల రక్తాన్ని ల్యాబ్‌లో పరీక్షిస్తే ప్లేట్‌లెట్లు తగ్గిపోతున్న విషయం బయటపడుతోంది. ఇలా చిన్నారులనుంచి పెద్దల వరకూ అందరిలోనూ ఇదే పరిస్థితి. సోంపేట, ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం, విశాఖలో ఈ లక్షణాలతో ఎక్కువమంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఉద్దానంలో కిడ్నీ జబ్బులపై ఎంతమంది ఎన్నిరకాల సర్వేలు చేసినా, పరిశోధనలు నిర్వహించినా ఇంతవరకూ పరిష్కారం మాత్రం దొరకలేదు. ఇప్పుడు ఈ సమస్యకు తోడు ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం మరింత ఇబ్బందిపెడుతోంది. ఉద్దానాన్ని పట్టిపీడిస్తున్న ఈ రోగాల నివారణకు ప్రభుత్వం చొరచూపాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

14:24 - October 10, 2016

విజయవాడ : ఏపీ కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగుపెట్టే ముహుర్తం ఖరారైంది. దసరా పండగను పురస్కరించుకుని రేపు ఉదయం సీఎం చంద్రబాబు తన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల మధ్యలో పూజా కార్యక్రమాలతో సీఎం తన కార్యాలయంలో అడుగుపెట్టబోతున్నారు. సీఎం కార్యాలయం ప్రారంభోత్సవం సందర్బంగా నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సీఎం కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి మరింత సమాచారాన్ని వీడియోలో చూడండి. 

14:21 - October 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ పార్టీ ఎజెండా అని టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. తమపార్టీకి సోయి ఉంది కాబట్టే..జిల్లాలు తిరుగుతూ..రైతుల సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సోయి లేదన్న కేసీఆర్‌ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దమ్ముంటే..ఏ జిల్లాకైనా వెళ్దాం..రైతులే ఎవరేంటో తేల్చుతారన్నారు పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క. రుణమాఫీ అమలుకాక, పంటలు మునిగిపోయి రైతులు అల్లాడిపోతుంటే..సీఎం మాత్రం రైతులు సంబరాలు చేసుకుంటున్నారని అనడం విడ్డూరంగా ఉందన్నారాయన. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

బాబుఖాన్ బిల్డింగ్ వద్ద చెత్తకుండిలో పసికందు..

హైదరాబాద్ : సోమాజీగూడ బాబూఖాన్ బిల్డింగ్ వద్ద చెత్తకుండీలో అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. శిశువును బంజారాహిల్స్ లోని రెయిన్ బో ఆసుపత్రికి తరలించారు. 

13:59 - October 10, 2016
13:57 - October 10, 2016

దసరా సందర్భంగా మానవి కార్యక్రమానికి ఓ విలక్షణమైన అతిధి మానవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె ఎవరో తెలుసుకునే ముందు ఆమె విలక్షణమైన టాలెంట్ ఏంటో తెలుసుకుందాం. ఏ సందర్భానికైనా ఎటువంటి పదాలనైనా అలవోకగా పారడీగా మార్చి పాటు పాడే పేరడీ శారద ఈరోజు కార్యక్రమానికి విచ్చాశారు. మరి పేరడీ పాటలలో విహరించాలంటే ఈ వీడియోను చూడండి..

13:52 - October 10, 2016
13:50 - October 10, 2016

తమిళనాడు : అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ప్రముఖుల నుంచి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేదీ, కేరళ గవర్నర్‌ సదాశివం, ముఖ్యమంత్రి విజయన్‌ చెన్నై చేరుకుని జయలలితను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయలలితకు మెరుగైన చికిత్స అందిస్తున్నారనీ..త్వరంలోనే ఆమె కోలుకుంటారని కిరణ్ బేడీ పేర్కొన్నారు.

13:49 - October 10, 2016

దర్శకుడు 'కొరటాల శివ' 'మహేష్ బాబు'తో చేయనున్న న్యూ మూవీకి బిగ్ డిల్ కుదుర్చుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. హ్యట్రిక్ సక్సెస్ లతో దర్శకుడిగా 'కొరటాల' రేంజ్ మారిపోయింది. దీంతో 'ప్రిన్స్' తో చేయనున్న మూవీకి నిర్మాత ఈ దర్శకుడికి బంఫర్ ఆఫర్ ఇచ్చాడట. ప్రస్తుతం ఇండస్ట్రీలో దర్శకుడు 'కొరటాల శివ' గాలి వీస్తుంది. వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' రెండు సినిమాలు వంద కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో దర్శకుడిగా 'కొరటాల' రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో 'ప్రిన్స్' తో చేయనున్న కొత్త మూవీ కోసం నిర్మాతలు ఈ దర్శకుడు అడిగిన మొత్తాన్ని పువ్వుల్లో పెట్టి మరీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
దర్శకుడు 'కొరటాల శివ' తన నెక్ట్స్ మూవీని 'మహేష్ బాబు' తో చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎడాదిలో స్టార్ట్ కానున్న ఈ మూవీని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. 'శ్రీమంతుడు' కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో బిజినేస్ అదిరిపోతుందని తెలిసిందే. అందుకే నిర్మాత దానయ్య కొరటాలతో బిగ్ డిల్ చేసుకుంటున్నాడట.  ఈ కొత్త సినిమాకి కోసం దానయ్య 'మహేశ్ బాబు'కి పారితోషికంగా 22 కోట్లు ఇవ్వనున్నాడట. అలాగే దర్శకుడు కొరటాల ఓవర్సీస్ రైట్స్ ను ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నాడట. ఎంతలేదన్న ఓవర్సీస్ రైట్స్ కింద 'కొరటాల'కు ఈజీగా 15 నుంచి 20కోట్లు వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'శ్రీమంతుడు' ఓవర్సీస్ లో 18కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక 'జనతా గ్యారేజ్' కూడా 15కోట్లపైనే కలెక్ట్ చేసింది. కేవలం మూడు సినిమాలతోనే 'కొరటాల' ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు.

13:41 - October 10, 2016

విజయవాడ : కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరస్వామి వార్ల జలవిహారానికి హంసవాహనం సిద్ధమైంది. విజయదశమి పర్వదినం సందర్భంగా రేపు సాయంత్రం..తెప్పోత్సవం కన్నుల పండువగా జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేస్తున్నారు. విజయదశమి పండుగనాడు రాక్షససంహారం అనంతరం ఉగ్రస్వరూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపచేసేందుకు కృష్ణవేణి మాతా తన ఒడిలో విహరించాలని కోరినట్లు పురాణాలు చెప్తున్నాయి. అయితే ఆనాటి నుంచి నేటివరకు ప్రతి సంవత్సరం..దసరాశరన్నవరాత్రులు పూర్తి అయిన తర్వాత విజయదశమి రోజు హంసవాహనంపై దుర్గామల్లేశ్వరస్వామివార్లు జలవిహారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. మరింత సమాచారానికి వీడియో చూడండి..

13:41 - October 10, 2016

'నాగ చైతన్య' సాహసానికి మంచి బూస్టింగ్ దొరికింది. 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం పై మొన్నటి వరకు అంతా నెగటివ్ మాట్లాడారు. కానీ ఇప్పుడు ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. మరి సడన్ గా 'సాహసం శ్వాసగా సాగిపో' మూవీపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడటానికి కారణం ఏంటీ ? అనుకున్నట్లుగానే 'నాగ చైతన్య' 'ప్రేమమ్' మూవీతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీతో 'చైతూ' లవ్ స్టోరీస్ తనకు పోటీలేదనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు. అయితే 'ప్రేమమ్' సక్సెస్ ఇప్పుడు 'చైతూ' కొత్త మూవీ 'సాహసం శ్వాసగా సాగిపో' మూవీకి శ్వాసగా మారింది. '

'ప్రేమమ్' మూవీ కంటే 
ప్రేమమ్' మూవీ కంటే 'సాహసం శ్వాసగా సాగిపో' మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ మూవీ డీలే అవుతోంది. దీంతో 'ప్రేమమ్' మూవీని మొదలెట్టి అనుకున్న టైంలో కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 'ప్రేమమ్' సినిమాని ముందు తేవాలన్న నిర్ణయం మంచే చేసింది. అది 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాకు కలిసొచ్చేలా కనిపిస్తోంది. మామూలుగా వాయిదా పడి రిలీజయ్యే సినిమాలపై నెగెటివ్ ప్రభావం ఉంటుంది. అలాంటి సినిమాలు ఆడవన్న సెంటిమెంటు కూడా ఉంది. కానీ ఇప్పుడు 'ప్రేమమ్' ముందు రిలీజై మంచి విజయం సాధించడంతో 'సాహసం' మీద పాజిటివ్ ఎఫెక్ట్ పడుతోంది. 'సాహసం శ్వాసగా సాగిపో' మూవీని సరిగ్గా ప్రమోట్ చేశారంటే మంచి రిజల్ట్ రాబట్టొచ్చు. గౌతమ్ మీనన్ సినిమా కాబట్టి కచ్చితంగా అందులో కంటెంట్ ఉండకపోదు. కాబట్టి సినిమా ఫర్వాలేదు అనిపిస్తే చాలు మంచి హిట్టవుతుంది. 

13:39 - October 10, 2016

నెల్లూరు: మంత్రి నారాయణ పర్యటించారు. నగరంలోని ఆయా ప్రాంతాలలో కాలువగట్లపై ఉన్న ఆక్రమణ ఇళ్లను పరిశీలించారు. పేద ప్రజలకు పక్కా ఇళ్లు ఇచ్చిన తరువాతనే ఆక్రమణలు తొలగిస్తామని మంత్రి తెలియజేశారు. ఈనెల 12 నుంచి జరగనున్న రొట్టెలపండుగకు సీఎం చంద్రబాబు హాజరయ్యే అవకాశముందని నారాయణ అన్నారు. 

13:36 - October 10, 2016

హైదరాబాద్ : ప్రజలను రెచ్చగొట్టేలా సీఎం కేసీఆర్ మాట్లాడటం సరికాదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. సీపీఎం మహాజనపాదయాత్రపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌పై ...మేధావులు, ప్రజాసంఘాల నాయకులు మండిపడ్డారు. హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్నే ప్రజలు నిలదీస్తారని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. 

గవర్నర్ దృష్టికి జిల్లాల విభజన - రేవంత్..

హైదరాబాద్ : జిల్లాల విభజన విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిని తెలుగు రాష్ట్రాల గవర్నర్ దృష్టికి తీసుకెళుతామని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాల విభజన ఆయా ప్రాంతాల్లోని దళిత, గిరిజన నాయకులను ఎదగనీయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గద్వాల డివిజన్ లో గతంలో 9 మండలాలుంటే ఇప్పుడు జిల్లా చేసి 13 మండాలను చేర్చారని తెలిపారు.  

13:30 - October 10, 2016

హైదరాబాద్ : పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల విభజన జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాల తీరు ఏమాత్రం సరిగా లేదని విరుచుకుపడ్డారు. వరంగల్‌లో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా కాంగ్రెస్ పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొత్త జిల్లాలపై మాట్లాడుతున్నవారు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సన్నాలు..దద్దమ్మలు అంటూ పరుషపదాలతో తనదైన శైలి కేసీఆర్ విరుచుకుపడ్డారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో మాట్లాడారు. ఒక సీఎం స్థాయిలో వుండి భయంకరంగా మాట్లాడుతున్నారనీ..తెలంగాణ కేసీఆర్ జాగీరా?అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్న  టీఆర్ఎస్ నేతలే సన్నాసులను  టీ.పీసీసీ కార్యదర్శి ఉత్తమ్ కుమార్ కేసీఆర్ పై మండిపడ్డారు. చిన్నారి హర్షితకు వైద్యం చేయిస్తామని మాట ఇచ్చిన సర్కార్ నిర్లక్ష్యానికి హర్షిత బలైపోయిందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగారు జిల్లాల మండలాల ఏర్పాటుపై జరుగతున్న తీరుపై గవర్నర్ స్పందించాలని టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కోరారు. ఆయా ప్రాంతాలలో వుండే దళిత గిరిజన నాయకులు ఎదగనీకుండా జిల్లాల విభజన జరుగతోందని ఆయన విమర్శించారు. ఈ విభజనలో 5రకాల ఉల్లంఘనలకు పాల్పడుతోందని దీనిపై గవర్నర్ దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి కోరారు. 

కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం - పోతినేని సుదర్శన్..

ఖమ్మం : మహాజన పాదయాత్రపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సీపీఎం నేత పోతినేని సుదర్శన్ పేర్కొన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను మానుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అభివృద్ధి చెందకుండా బంగారు తెలంగాణ సాధ్యమా అని సూటిగా ప్రశ్నించారు. 

కివీస్ కు పొంచి ఉన్న ఫాలోఆన్ ముప్పు..

ఇండోర్ : భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుకు ఫాలోఆన్ ముప్పు పొంచి ఉంది. భారత బౌలర్ అశ్విన్ దుమ్మురేపుతున్నాడు. స్పిన్ మాయాజాలంతో కివీస్ టాప్ ఆర్డర్ ను అశ్విన్ కుప్పకూల్చాడు. మొత్తంగా నాలుగు వికెట్లు తీశాడు. 

పోలీసు అధికారులతో డీజీపీ కీలక భేటీ..

హైదరాబాద్ : పోలీసు విభజనపై తుదికసరత్తు జరుగుతోంది. పోలీసు అధికారులతో డీజీపీ కీలక భేటీ నిర్వహించారు. 9 కమిషనరేట్లు, కొత్తగా ఏర్పడే జిల్లా ఎస్పీల విధి విధానాలను ఖరారు చేయనున్నారు.  

12:57 - October 10, 2016

కరీంనగర్ : ధర్మారం మండలం చామన్ పల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కిరోసిన్ బాటిల్ పట్టుకుని ఓ రాజు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. తన సమస్య పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. యువకుడు బెదిరింపులకు కారణమేంటో వివరాలు తెలుసుకుందాం...తనకు వారసత్వంగా వచ్చిన ఆరు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు తన పెదనాన్న పేరుతో పట్టా ఇచ్చారని రాజు అవేదన వ్యక్తం చేసాడు. తనకు న్యాయం చేయమని వెళఙతే రెవెన్యూ అధికారులు, పోలీసులు తనను వేధిస్తున్నారనీ..భూపత్రాలు ఇవ్వకపోగా తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. జిల్లా కలెక్టరూ, కోర్టు కూడా తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ సదరు అధికారలు తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. పత్రాలు ఇవ్వాలంటే రూ.50వేలు లంచం ఇవ్వాలని వీఆర్ వో అడుగుతున్నాడనీ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

12:45 - October 10, 2016

గుంటూరు : జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తోంది. చిలకలూరిపేటలో ఇంటర్‌ విద్యార్థి డెంగ్యూతో మృతి చెందాడు. అటు పెదకాకానిలో డెంగ్యూతో మహిళ చనిపోయింది. మరోవైపు ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు.దీంతో  బాధితులు ప్రయివేట్‌ వైద్యాన్ని రోగులు ఆశ్ర యిస్తున్నారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొం తునొప్పి, నీరసం, విపరీతమైన తలనొప్పి లక్షణాలతో జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. వ్యాధుల ఉధృతి రోజురోజుకీ అధిక మవుతోంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటే జిల్లావాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

12:38 - October 10, 2016

నిజామాబాద్ : సోయాబీన్‌, వరి, చెరకు పంటలు బాగా దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన పంట నోటికి అందకపోవడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వర్షాలకు పంట నష్టోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకుంటామన్న ప్రభుత్వం... ఈ దిశగా ఇంతవరకు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భారీ వర్షాలకు అన్నదాతల కష్టాలు
ఇందూరు జిల్లాలో అపార జలవనరులు, సారవంతమైన భూములు ఉన్నాయి. కష్టపడిపని చేసే రైతులు ఉన్నారు. అయితే గతరెండేళ్లు తీవ్ర వర్షాభావంతో జలవనరులన్నీ అడుగంటిపోయాయి. వర్షాలపై ఆధారపడి పైర్లు సాగు చేసినా.. వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయి, అప్పులపాలయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారభంలో మంచి వర్షాలకు పడ్డాయి. దీంతో గత రెండేళ్ల దుఃఖాన్ని దిగిమింగుకుని పంటలు వేశారు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి.. సాగు చేసిన పంటలు ఆగస్టులోని వర్షాభావంతో కొంత దెబ్బతిన్నాయి. ఆ తర్వాత కురిసిన వర్షాలకు కొద్దిగా తేరుకున్నా.... పంట చేతికొచ్చిన దశలో కురిసిన భారీ వర్షాలకు అన్నదాతల నడ్డి విరిశాయి.

లక్షా ఆరువేల ఐదొందల అరవై ఐదు హెక్టార్లలో పంట నష్టం..
అప్పోసొప్పో చేసి ఆరుగాలం శ్రమించిన పంట వర్షాలకు పూర్తిగా దెబ్బతినడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లాలో లక్షా ఆరువేల 565 హెక్టార్లలో వరి, సోయా పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో 300 కోట్ల రూపాయల మేర నష్టపో్యారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకొనేందుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవచ్చని ఆశించారు. కానీ అధికారులు ఇంతవరకు పంటల నష్టం వివరాలను కూడా సేకరించకపోవడంతో తమ ఆశలు అడియాశలయ్యాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ప్రకటలతో సరిపెడుతోందంటూ విమర్శలు..
పంటనష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో పాలకుల ప్రకటనలు కోటలు దాటుతున్నా... చేతలు గడప దాటడంలేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అప్పుల ఊబి నుంచి రైతులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. సర్కారు చర్యలు సుష్కప్రియాలు, శూన్యహస్తాలుగా ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రోడెక్కుతున్న అన్నదాతలు..
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించి, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఆచరణకు నోచుకోవడంతో అన్నదాతలు ఆందోళనలతో రోడ్డెక్కుతున్నారు. 

12:34 - October 10, 2016

గుంటూరు : ఏపీ రాజధాని శంఖుస్థాపన ప్రాంతం పర్యాటకులతో కళకళలాడుతోంది. ఈ ప్రాంతాన్ని సుందరీకరించడంతో టూరిస్టుల సంఖ్య మరింత పెరిగింది. రంగు రంగుల పూలు, పచ్చని ప్రకృతిమధ్య జనాలు సేదతీరుతున్నారు.

2015 అక్టోబర్‌ 22.... ఒకేరోజు ఏపీ ప్రజలు రెండు పండుగలు
2015 అక్టోబర్‌ 22.... ఒకేరోజు ఏపీ ప్రజలు రెండు పండుగలు జరుపుకున్నారు...... సరిగ్గా దసరా పండుగ రోజున అమరావతికి ప్రధాని మోదీ శంఖుస్థాపన చేశారు.. ఉద్దండరాయునిపాలెంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది...... పలువురు ప్రముఖులు ఈ శంఖుస్థాపనలో పాల్గొన్నారు.... పలు పుణ్యక్షేత్రాలనుంచి సేకరించిన మట్టి, నీటితో ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారు.. యాగం నిర్వహించారు..

టూరిస్ట్ స్పాట్‌గా అమరావతి
శంఖుస్థాపనన తర్వాత ఈ ప్రాంతం టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది.. అమరావతి నిర్మాణానికి పునాదిరాయిగా నిలిచిన ఈ ప్రదేశాన్ని ప్రభుత్వం 16లక్షల రూపాయలతో సుందరీకరించింది.. అమరావతి నమూనా, యాగశాల, వివిధ పుణ్యక్షేత్రాలనుంచి సేకరించిన మట్టి, నీరులకు వేర్వేరుగా షెడ్లు ఏర్పాటు చేశారు. వీటి దగ్గరకు వెళ్లకుండా చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు.

21 రకాల మొక్కలతో కళకళలాడతున్న అమరావతి
శంఖుస్థాపన ప్రదేశానికి రాగానే సందర్శకులను ఆకట్టుకునేలా చుట్టూ అందమైన మొక్కలు, బెర్ముడా గడ్డి పెంచుతున్నారు. 21 రకాల మొక్కలు, రంగు రంగుల పూలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ మొక్కల్ని పర్యవేక్షించడానికి కూలీలను నియమించారు. రెండు నెలలక్రితం మొదలుపెట్టిన ఈపనులు పూర్తికావడంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి.. అమరావతి శంఖుస్థాపన ప్రాంతం సుందరరూపు సంతరించుకోవడంతో... పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

12:26 - October 10, 2016

తమిళనాడు : గత కొద్దిరోజులుగా సీఎం జయలలిత తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత సంతకం ఫోర్జరీ జరిగిందంటూ ఫిర్యాదు కలకలం రేగింది. అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ, జయలలితకు అంత్యంత సన్నిహితురాలు..స్నేహితురాలు అయిన శశికళ జయలలిత సంతకం ఫోర్జరీ చేసిన పాలనా వ్యవహారాలు కొనసాగిస్తున్నారని ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై దృష్టి పెట్టాలని ఫిర్యాదు లేఖలో శశికళ పేర్కొన్నారు. కాగా చెన్నై అపోలో ఆసుపత్రిలో జయలలితకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు అమ్మ త్వరగా కోలుకోవాలని అభిమానుల పూజలు చేస్తున్నారు. అటు విపక్షాలు మాత్రం తమిళనాడులో పాలన స్తంభిస్తోందని.. తాత్కాలిక సీఎంను నియమించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అన్నాడీఎంకే వర్గాలు మాత్రం.. తాత్కాలిక సీఎం అవసరం లేదని చెబుతున్నాయి. అటు జయలలితకు నేతల పరామర్శలు కొనసాగుతున్నాయి. నేడు కేరళ సీఎం విజయన్‌ జయలలితను పరామర్శించనున్నారు.

12:23 - October 10, 2016

తమిళనాడు : చెన్నై అపోలో ఆసుపత్రిలో జయలలితకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు అమ్మ త్వరగా కోలుకోవాలని అభిమానుల పూజలు చేస్తున్నారు. అటు విపక్షాలు మాత్రం తమిళనాడులో పాలన స్తంభిస్తోందని.. తాత్కాలిక సీఎంను నియమించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అన్నాడీఎంకే వర్గాలు మాత్రం.. తాత్కాలిక సీఎం అవసరం లేదని చెబుతున్నాయి. అటు జయలలితకు నేతల పరామర్శలు కొనసాగుతున్నాయి. నేడు కేరళ సీఎం విజయన్‌ జయలలితను పరామర్శించనున్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

12:21 - October 10, 2016

గుంటూరు : సీఎం చంద్రబాబు రేపు విజయదశమి సందర్భంగా...అమరావతి తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయం నుంచి పాలనకు శ్రీకారం చుట్టనున్నారు. గత ఏడాది సరిగ్గా విజయదశమి రోజునే అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ సమక్షంలో సీఎం శంకుస్థాపన చేశారు. సరిగ్గా ఏడాది తర్వాత అదే రోజున సచివాలయంలోని తన కార్యాలయం నుంచి సీఎం పాలనను ప్రారంభించనున్నారు.

12:18 - October 10, 2016

మహబూబ్ నగర్ : తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేస్తున్న నూతన జిల్లాలకు...ప్రభుత్వ కార్యాలయాలు శరవేగంగా ముస్తాబవుతున్నాయి. వనపర్తిలోని కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాల భవనాలు రెడీ అవుతున్నాయి. జిల్లా కార్యాలయాలను కలెక్టర్‌ శ్రీదేవి పరిశీలిస్తున్నారు. వనపర్తిలోని పాలిటెక్కిక్ కళాశాల ఆవరణలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రెస్‌పెరేడ్‌ రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. 

అమ్మ సంతకం ఫోర్జరీ అంటూ శశికళ ఫిర్యాదు..

తమిళనాడు : గత కొద్దిరోజులుగా సీఎం జయలలిత తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత సంతకం ఫోర్జరీ జరిగిందంటూ ఫిర్యాదు కలకలం రేగింది. అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ, జయలలితకు అంత్యంత సన్నిహితురాలు..స్నేహితురాలు అయిన శశికళ జయలలిత సంతకం ఫోర్జరీ చేసిన పాలనా వ్యవహారాలు కొనసాగిస్తున్నారని ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలలని ఫిర్యాదు లేఖలో శశికళ పేర్కొన్నారు.

పాక్ లోకి ప్రవేశిస్తామంటున్న ఆర్మీ..

జమ్ము కశ్మీర్ : ఉగ్రవాదులకు ఇదే విధమైన మద్దతు పాక్ నుంచి లభిస్తున్న పక్షంలో ఎల్ఓసీ నిబంధనలను తాము పాటించబోమని, ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దులు దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి ప్రవేశిస్తామని పాకిస్థాన్ కు స్పష్టం చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. 1999 నాటి కార్గిల్ యుద్ధంతో పోలిస్తే, ఇప్పడు భారత వైఖరి వేరుగా ఉందని, వాస్తవాధీన రేఖకు విలువ ఇవ్వకుండా, దాన్ని మార్చాలని భావిస్తే ఊరుకోబోయేది లేదని స్పష్టం చేసినట్టు తెలిపారు. పాక్ వైపు నుంచి చొరబాట్లు ఆగని పక్షంలో, ఇండియా వైపు నుంచి కూడా చొరబాట్లు చేసే హక్కు తమకుందని వెల్లడించినట్టు తెలిపారు. 

బీ ప్రిపేర్డ్ అంటున్న ప్రధాని మోదీ!..

ఢిల్లీ : భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ఆయుధ సరఫరా కంపెనీలకు మోదీ ప్రభుత్వం నుంచి కీలక సూచనలు వెళ్లాయి. ఏ క్షణమైనా కేంద్రం నుంచి ఆర్డర్లు వస్తాయని, వెంటనే ఉత్పత్తిని పెంచి, స్వల్ప వ్యవధిలో ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని డిఫెన్స్ కంపెనీలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ విషయాన్ని కేంద్ర ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి. 

వాయిళ్ళపల్లి గ్రామస్థుల ఆందోళన..

నల్లగొండ : తెలంగాణ‌లో రేప‌టి నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ ప‌లు ప్రాంతవాసులు ఆందోళ‌న‌లు ఇంకా కొన‌సాగిస్తూనే ఉన్నారు. నల్గొండ జిల్లాలోని సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని వాయిళ్లపల్లి వాసులు ఈరోజు ఉద‌యం ఆందోళ‌న‌కు దిగారు. త‌మ గ్రామాన్ని ఘట్టుప్పల్‌ మండలంలో క‌ల‌ప‌కూడ‌ద‌ని నిర‌స‌న తెలుపుతున్నారు. కొంద‌రు యువ‌కులు సెల్ ట‌వ‌ర్ ఎక్కి త‌మ డిమాండును నెర‌వేర్చాల‌ని నిర‌స‌న తెలుపుతున్నారు. 

నెల్లూరుజిల్లాలో మంత్రి నారాయణ పర్యటన..

నెల్లూరు: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈరోజు నెల్లూరు నగరంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. చిన్నబజారు, పప్పుల వీధి, శెట్టిగుంట రోడ్‌ తదితర ప్రాంతాల్లో కాలువగట్టుపై ఉన్న అక్రమ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. పేద ప్రజలకు పక్కా ఇళ్లు ఇచ్చిన తర్వాత ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం చెప్పే అసత్యాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షమే ఉంటుందన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని.. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని కార్పోరేషన్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

ప్రాణం తీసిన విహారయాత్ర..

చిత్తూరు : చెన్నైకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మిత్రుల బృందం చిత్తూరు జిల్లాలో పలు పర్యాటక కేంద్రాలను దర్శించేందుకు టవేరా వాహనంలో బయలుదేరి వచ్చారు. ఈక్రమంలో తలకోనకు వెళుతుండగా ఐతేసిద్దక్క బావి మలుపు వద్ద వేగంగా వెళుతున్న టవేరా వాహనం టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న విజయ్‌ఆనంద్‌ (28), రాజేష్‌(27) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సహచరులు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునే లోపే ఇద్దరూ మృతి చెందారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

మహిళా జడ్జి ఆత్మహత్యాయత్నం!..

ఢిల్లీ : 30 ఏళ్ల జాయింట్ మేజిస్ట్రేట్ ప్రతిభ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాన్పూర్ లోని సర్క్యూట్ హౌస్ కాలనీలో ఉన్న నివాసంలో ఆమె ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆమె శరీరంపై గాయాలున్నాయని, రెండు చేతుల నరాలు కట్ అయి ఉన్నాయని పోలీసులు తెలిపారు.

11:14 - October 10, 2016

నల్లగొండ : నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినా ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. నల్గొండ జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని వాయిళ్లపల్లి గ్రామాన్ని నూతనంగా ఏర్పడుతున్న ఘట్టుప్పల్‌ మండలంలో కలపొద్దని డిమాండ్‌ చేస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. సుమారు 1850 మంది మీసేవ ద్వారా అభిప్రాయాలు వెల్లడించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా పలువురు యువకులు సెల్‌టవర్‌ ఎక్కి ముగ్గురు యువకులు నిరసన తెలిపారు. వాయిళ్లపల్లి గ్రామాన్ని సంస్థాన్‌ నారాయణపురం మండలంలోనే కొనసాగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

లాభాలతో స్టాక్ మార్కెట్లు ..

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభపడి ట్రేడ్ అవుతోంది. కాగా, హైదరాబాద్ నగర బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.30,380గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.28,340కి అమ్ముడవుతోంది. కిలో వెండి ధర రూ.44,752 పలుకుతోంది.

10:39 - October 10, 2016

 

విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాల్టికి 10వ రోజుకు చేరుకోవడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇవాళ 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్థిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తుతోంది. రేపటితో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనుండడంతో రేపు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహిషాసుర మర్థినిగా అమ్మవారి విశేషాలను ఆలయ అర్చకులు వివరించారు. మహిషాసుర మర్థిని అవతారంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వాసం. కాగా దసరా ఉత్సవాలు తుది దశకు చేరుకోవంటతో భవానీ భక్తులు మాలధారణను విరమించనున్నారు. దీనికి ఆలయ యాజమాన్యం అన్ని ఏర్పాటు చేసింది. మరింత సమాచారానికి వీడియో చూడండి.. 

చామన్ పల్లిలో ఉద్రిక్తత?..

కరీంనగర్ : ధర్మారం మండలం చామన్ పల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కిరోసిన్ బాటిల్ పట్టుకుని ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. తనకున్న భూమికి సంబంధించిన సమస్య కోసం వెళ్లితే రెవెన్యూ అధికారులు తనను వేధిస్తున్నారనీ.. తన భూపత్రాలు ఇచ్చేందుకు రూ.50వేలు లంచం అడుగుతున్నారని ఆరోపిస్తున్నాడు. తన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

10:12 - October 10, 2016

జమ్మూకశ్మీర్ : జమ్ము కశ్మీర్ లో మళ్లీ కాల్పుల కలకం రేగింది. కశ్మీర్ లోని పాంపోర్‌లోని ఈడీఐ భవనం వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక ఆర్మీ మ జవాను తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతోన్నాయి. ఈడీఐ భవనంలో ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ భవనంపై ఉగ్రవాదుల దాడి జరగడం ఇది రెండో సారి. ఫిబ్రవరిలోనూ ఉగ్రవాదులు భవనంపై దాడి చేశారు. 48 గంటల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు టెర్రరిస్టులను బలగాలు మట్టుబెట్టాయి. కాగా ఫిబ్రవరి 20న ఈడీఐ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.జీలం నది సరిహద్దుల్లోంచి ప్రవేశించిన ఉగ్రవాదులు బేస్ క్యాంప్ ను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది.

పార్లమెంట్ కు ఉగ్రముప్పు?!..

ఢిల్లీ: భారత్ పార్లమెంటుపై 2001లో జరిగిన దాడి పునరావృతం కానుందా?. తాజాగా భారత ఇంటెలిజెన్స్ అధికారులు జారీచేసిన హెచ్చరికలు ఈ విషయాన్నే నిర్ధారిస్తున్నాయి. నిర్దేశిత దాడులతో చావుదెబ్బ తిని పగతో రగిలిపోతున్న పాకిస్తాన్ నిఘా సంస్ధ ఐఎఐ భారత పార్లమెంటుపై దాడి చేయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఉగ్రసంస్ధ జైష్ ఏ మొహమ్మద్ (జేఈఎమ్) సాయం కోరినట్లు తెలిసింది. 

09:49 - October 10, 2016

కరీంనగర్ : ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువైన కరీంనగర్ రాజకీయాలు దేశ, రాష్ట్రస్థాయిలో పరిపాలనను శాసించాయి. చాలా మంది నేతలకు రాజకీయ ఓనామాలు నేర్పి... తిరుగులేని నేతలుగా రాజకీయ భవిష్యత్తును అందించింది. అలాంటి కరీంనగర్‌లో జిల్లాల పునర్వీభజనతో రాజకీయంగా భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. కరీంనగర్‌లో జిల్లా విభజనతో మారనున్న రాజకీయ సమీకరణలపై 10టీవీ ప్రత్యేక కథనం...!

జిల్లాల విభజనతో మారబోతున్న కరీంనగర్ రాజకీయాలు
తెలంగాణలో జిల్లాల పునర్విభజనతో కరీంనగర్ రాజకీయాలు పూర్తిగా మారబోతోన్నాయి. జిల్లాను పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలుగా విభజించి కొత్త జిల్లాల్లో టీఆర్ఎస్‌కు ఎదురు లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి వ్యూహత్మకంగా వ్యవహారించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్‌లో చేరుతారనే ఊహగానాలు
కరీంనగర్ లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రానున్న రోజుల్లో త్రిముఖ పోటి ఉండనుంది. గతంలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన గంగుల కమలాకర్ కు, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, కాంగ్రెస్ తరపున పోటి చేసిన చలిమెడ లక్ష్మినరసింహరావులు గట్టి పోటీనిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్ధి చలిమెడ లక్ష్మినరసింహరావు టీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఎంపీ పోన్నం ప్రభాకర్ కూడా కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. పొన్నం ప్రభాకర్ ను టీఆర్ఎస్ లో చేర్చుకున్నట్లయితే కాంగ్రెస్ బలమైన నేతను కొల్పోవలసి వస్తుంది. హుజురాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లా రాజకీయల్లో కీలక నేతగా ఎదిగే అవకాశాలు సుగమం అయ్యాయి. హుజురాబాద్ నియోజక వర్గాన్ని వరంగల్ లో కలుపుతారనే ప్రచారం మొదటగా జరిగినప్పటికి రాజకీయంగా ఈటెలకు కొంత నష్టం జరిగే అవకాశం ఉండడంతో నిర్ణయం వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

జగిత్యాలలో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్, టీడీపీ నుంచి గట్టిపోటీ
కొత్త జిల్లాల విభజనలో జగిత్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలని చాలా ఏళ్ల నుంచి డిమాండ్ ఉంది. డిమాండ్ కి అనుకూలంగానే జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌కి కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, టీడీపీ నుంచి ఎల్. రమణ గట్టి పోటీనివ్వనున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలు ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు. కోప్పుల ఈశ్వర్ లకు కాంగ్రెస్ తరుపున ధీటైన అభ్యర్ధులు ఉన్నారు. జగిత్యాల రాజకీయాలో కీలక నేతలుగా ఉన్న జీవన్ రెడ్డి, ఎల్. రమణ లు ఇద్దరిలో ఒకరిని టీఆర్ఎస్ లోకి తీసుకోవాలన్నది టీఆర్ఎస్ ప్రయత్నం.

శ్రీధర్ బాబును టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు
అనుహ్యంగా తెర పైకి వచ్చిన పెద్దపల్లి జిల్లాలో రాజకీయ సమీకరణల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. పెద్దపల్లి జిల్లా రాజకీయాలతో పాటు పొరుగున ఉన్న మంచిర్యాల జిల్లాలో వివేక్ సోదరులు చక్రం తిప్పనున్నారు. రానున్న ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి వివేక్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న సుమన్ ను అవసరం అయితే ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశాలు లేక పోలేదు. ప్రస్తుతం పెద్దపల్లిలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల ఉనికి లేకుండా చేయడం అధికార పార్టీ ముందున్న సవాల్. మంథని నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి శ్రీధర్ బాబుతో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పోటి తప్పదని తెలుస్తోంది. శ్రీధర్ బాబు కు మంథని,రామగుండం ప్రాంతాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. రానున్న ఎన్నికల్లో శ్రీధర్ బాబును ఎదుర్కొవాలంటే అధికార పార్టీకి కొంత కష్టసాధ్యం కానున్న నేపధ్యంలో శ్రీధర్ బాబును టీఆర్ఎస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరగుతున్నాయి.

మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల
సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు కాంగ్రెస్, బిజేపీ నుంచి పోటీ ఎదురవుతోంది. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి కేకే మహేందర్ రెడ్డి పోటీగా నిలవనున్నారు. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. వేములవాడలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ తరపున ఆది శ్రీనివాస్ బలమైన పోటిని ఇస్తున్నారు. ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై దేశీయ పౌరసత్వ వివాదం కొనసాగుతుండగా రాజకీయాల్లో ఉండడంతో వ్యాపార పరంగా ఇబ్బందులు తలెత్తున్నాయనే కారణంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాడో లేదో అన్న సస్పెన్స్ కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ను టీఆర్ఎస్ లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

కమ్యూనిస్టు పార్టీలకు చెక్ పెట్టేందుకు గులాబీ పార్టీ ప్లాన్
ఇక జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలకు చెక్ పెట్టడానికి గులాబీ పార్టీ గట్టి ప్రయత్నం చేసింది. హుస్నాబాద్ లో సీపీఎం, సీపీఐ పార్టీకి బలమైన క్యాడర్ తో గ్రామాల్లో పటిష్టమైన నాయకత్వం ఉంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసెందుకు కమ్యూనిస్టులు నాయకత్వం ఉన్న హుస్నాబద్, కోహెడ మండలాలను సిద్దిపేటలో కలిపారు.

ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు యత్నాలు
మొత్తంగా కొత్త జిల్లాల్లో కాంగ్రెస్ , టీడీపీ, కమ్యూనిస్ట్ నాయకులకు చెక్ పెట్టే విధంగా జిల్లాల రూపకల్పన చేసినప్పటికీ టీఆర్ఎస్ కు కూడా ఎన్నికల్లో గట్టి పోటీ ఎదుర్కొనక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఉగ్రదాడిలో జవాను వీరమరణం ..

జమ్మూకశ్మీర్ : పాంపోర్‌లోని ఈడీఐ భవనం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతోన్నాయి. ఈడీఐ భవనంలో ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. 

09:27 - October 10, 2016

విజయవాడ: ఫుడ్‌కోర్టు తొలగింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నిర్వహిస్తున్న ఫుడ్‌కోర్టును ఆదివారం అర్థరాత్రి సమయంలో మున్సిపల్‌ సిబ్బంది తొలగించే యత్నం చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ సిబ్బందికి వ్యాపారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఫుడ్‌కోర్ట్ ను ఖాళీ చెయ్యాలని కమిషనర్‌, మున్సిపల్‌ సిబ్బందిని తమపై దాడికి దింపారని వ్యాపారులు ఆరోపించారు. బెంజ్‌సర్కిల్‌కు ఫుడ్‌ కోర్ట్ మార్చుతున్నకారణంగా ఈ వివాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్యెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు రంగంలోకి దిగారు. ఫుడ్‌కోర్టు విషయంపై కమిషనర్, కలెక్టర్‌తో చర్చించి, న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. 

ఫుడ్ కోర్ట్ వివాదం..

విజయవాడ: ఫుడ్‌కోర్టు తొలగింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నిర్వహిస్తున్న ఫుడ్‌కోర్టును ఆదివారం అర్థరాత్రి సమయంలో మున్సిపల్‌ సిబ్బంది తొలగించే యత్నం చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ సిబ్బందికి వ్యాపారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అయితే వ్యాపారులకు మద్దతుగా మున్సిపల్‌ కమిషనర్‌ ఇంటి ముందు టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.

09:13 - October 10, 2016

అమెరికా : సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరుగుతున్న రెండో డిబేట్ వాడివేడిగా సాగింది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. హిల్లరీ వ్యక్తిగత జీవితంపై ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్త ఉద్యోగాలు కల్పించడంలో హిల్లరీ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. తాను మారిన మనిషినని అన్నారు.

-మెయిల్ లీక్‌పై హిల్లరీ సమాధానం చెప్పాలి : ట్రంప్
బిల్ క్లింటన్ మహిళలకు చేసిన అన్యాయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ అన్నారు. 12 ఏళ్ల బాలికపై బిల్ క్లింటన్ అత్యాచారానికి పాల్పడ్డారని, అయినా హిల్లరీ నోరు మెదపలేదని ఆరోపించారు. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం తాను మాట్లాడిన మాటలను తెరపైకి తేవడం తప్పన్నారు. ఈ-మెయిల్ లీక్‌పై హిల్లరీ సమాధానం చెప్పాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయిస్తే హిల్లరీ జైలు కెళ్లడం ఖాయమని అన్నారు. ఈ-మెయిల్ లీక్‌పై హిల్లరీ మరోసారి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 39వేల ఈమెయిల్స్ లీకైనప్పటికీ తప్పు జరగలేదనడం దారుణమని పేర్కొన్నారు.

గతంలోనే తాను క్షమాపణలు చెప్పానన్న హిల్లరీ
హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. ట్రంప్ వ్యాఖ్యలు మహిళలపై ఆయనకున్న గౌరవానికి నిదర్శనమని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అర్హుడు కాదనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమీ ఉండదన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి అమెరికా ప్రతీక అని స్పష్టం చేశారు. అధ్యక్షుడు ఒబామాపై ట్రంప్ దారుణమైన వ్యాఖ్యలు చేశారని హిల్లరీ అన్నారు. ట్రంప్ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. ఈ -మెయిల్ వ్యవహారంలో తన తప్పు ఉందని, దానికి గతంలోనే తాను క్షమాపణలు చెప్పానని హిల్లరీ గుర్తు చేశారు.

రౌడీ షీటర్ దారుణ హత్య!..

హైదరాబాద్‌ : అర్ధరాత్రి రౌడీషీటర్ల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్‌లో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. నగరంలోని ఫలక్‌నుమాలో జరిగిన ఈ గ్యాంగ్‌వార్‌లో మహ్మద్ సలీం అనే రౌడీషీటర్‌ను మరో రౌడీ షీటర్ ఇర్ఫాన్ దారుణంగా హత్యచేశాడు. సలీం తమ్ముడు, రౌడీ షీటర్ అయిన ఫైరోజ్‌ఖాన్ కూడా ఇటీవలే హత్యకు గురయ్యాడు. రౌడీషీటర్ల గ్యాంగ్‌వార్‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సలీం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వీరుల త్యాగాలపై రాజకీయాలా?..

జమ్ము కశ్మీర్ : దేశ కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగాలను రాజకీయాలకు వాడుకోవద్దని దివంగత సైనికుడు లాన్స్ నాయక్ హేమరాజ్ భార్య ధర్మావతి ప్రాధేయపడింది. 2013, జనవరి 8న పూంచ్ సెక్టార్‌లో నాయక్ హేమరాజ్‌ను ఉగ్రవాదులు పొట్టన బెట్టుకున్నారు. సైనికుల ప్రాణ త్యాగాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని ధర్మావతి పేర్కొన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ భద్రత కోసం సైనికులు పాటుపడుతున్నారన్న విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు. ఇండియన్ ఆర్మీపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

లారీ బోల్తా.. ఇద్దరి మృతి..

నెల్లూరు : టెక్కలి మండలం మార్లగుంట వద్ద సోమవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..మరోవ్యక్తి గాయపడ్డాడు.మృతులు గుండ్లసముద్రానికి చెందిన రమణయ్య, వెంకటగిరికి చెందిన యుగంధర్‌గా గుర్తించారు.

బాసరలో మహాచండీ యాగం..

ఆదిలాబాద్ : బాసర అమ్మవారి ఆలయంలో సరస్వతి యాగం జరిగింది. సరస్వతి యాగంతో నవరాత్రి ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నారు. అమ్మవారి ఆలయంలో మహా చండీయాగం, పూర్ణాహుతి పూర్తైంది. సిద్ధిదాత్రి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సరస్వతి యాగంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

అమ్మ సైగలు..జోష్ లో అభిమానులు..

తమిళనాడు : గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంతున్న సీఎం జయలలితకు చికిత్స కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్న జయలలిత ఆదివారం మధ్యాహ్నం కళ్లు తెరిచి వైద్యులతో నెమ్మదిగా మాట్లాడినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమచారం. తనకేమైందంటూ సైగలతో ఆమె వైద్యులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆమె కళ్లు తెరిచి మాట్లాడడంతో అన్నాడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

అమ్మ కోటలో నెచ్చెలి పాగా?!..

తమిళనాడు : సీఎం జయలలిత కోటలో పాగావేసేందుకు ఆమె నెచ్చెలి శశికళ ప్రయత్నిస్తున్నారా? జయ అనారోగ్యాన్ని అవకాశంగా తీసుకుని పావులు కదిపేందుకు ఆమె సిద్ధమవుతున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రానున్న ఉప ఎన్నికల్లో తాను స్వయంగా బరిలోకి దిగడం కానీ, లేదంటే తన వారికి అవకాశం కల్పించడం కానీ చేసి, జయలలిత కోటలో శిశికళ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. జయలలిత వ్యక్తిగత జీవితంలో కీలకపాత్ర పోషించిన శశికళకు రాజకీయంగా మంచి పలుకుబడితోపాటు సామాజికంగా బలమైన దేవర్ కులానికి చెందిన ఆమెకు వారి మద్దతు పుష్కలంగా ఉంది. 

'డాన్సింగ్ గాళ్'కావాలంటున్న పాక్!..

ఢిల్లీ : భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్థాన్ ఇప్పుడు ఓ కళాఖండాన్ని అడ్డం పెట్టుకుని కుట్రలకు సిద్ధమవుతోంది. సింధు లోయలో బయటపడిన మొహంజదారో కాలంనాటి కాంస్య విగ్రహాన్ని భారత్ తమకు అప్పగించాలని పాక్ త్వరలో డిమాండ్ చేయనున్నట్టు పాక్ పత్రికలు కథనాలు ప్రచురించాయి. 1926లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త ఎర్నెస్ట్ మాకే సింధు లోయ ప్రాంతంలో 4500 ఏళ్లనాటి ‘డ్యాన్సింగ్ గాళ్’ విగ్రహాన్ని గుర్తించారు.

08:40 - October 10, 2016

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో 8వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతోన్నాయి. మహారథంపై తిరువీధుల్లో మలయప్ప స్వామి ఊరేగుతున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఊంజల్ సేవ కొనసాగనుంది. రాత్రికి అశ్వవాహనంపై శ్రీవారు ఊరేగిన అనంతరం వాహన సేవలు ముగియనున్నాయి. మంగళవారం తెల్లవారుజామున పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం జరగనుంది. వరాహ పుష్కరిణి వద్ద ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరగనుంది. తిరుమంజనం అనంతరం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం చేయనున్నారు. రేపు రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

08:29 - October 10, 2016

మహాజన పాదయాత్ర పేరుతో సీపీఎం పార్టీ చేపట్టిన పాదయాత్రపై ఇప్పటికే గులాబీ దళం పలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్ కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. మరో అడుగు ముందుకేసిన కేసీఆర్ పాదయాత్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సీపీఎం మహాజన పాదయాత్ర పేరుతో పాదయాత్ర చేయడం విడ్డూరంగా వుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తొలినుంచి వందశాతం వ్యతిరేకించిన పార్టీ మొదలు తెలంగాణ ఏర్పాటుపై తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ఆ తర్వాతే మహాజన పాదయాత్ర మొదలుపెట్టాలని సూచించారు. అయితే సీపీఎం చేపట్టే మహాజన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకోవాలని రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. దీనిపై స్పందించిన సీపీఎం తాము చేపడుతున్న పాదయాత్రను అడ్డుకోవాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 17 నుంచి చేపట్టనున్న మహాజన పాదయాత్రను ఎద్దేవా చేస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గట్లు లేవని పేర్కొంది. సీపీఎం చేస్తున్నది ప్రభుత్వ, టీఆర్‌ఎస్ వ్యతిరేక యాత్ర కాదని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరోసారి స్పష్టం చేశారు. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వెంకట్ (సీపీఎం నేత), సుధాకర్ (సీపీఐ నేత), గోవర్థన్ రెడ్డి (టీఆర్ఎస్ నేత) ఇందిర (కాంగ్రెస్ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తల అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్ మెంట్‌లు అన్నీ నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు.

ట్రంప్ టూ హిల్లరీ మాటల యుద్ధం..

హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ సోమవారం రెండో డిబేట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో మహిళలపై ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను హిల్లరీ ఎండగట్టారు. ట్రంప్ వ్యక్తిత్వమేంటో ఆడియోటేపుల్లో బయటపడిందని.. అధ్యక్ష పదవికి ట్రంప్ తగినవ్యక్తి కాదని హిల్లరీ అన్నారు. అయితే.. మహిళలను తానెప్పుడూ కించపరచలేదని.. వారిపట్ల తనకెంతో గౌరవం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.

07:55 - October 10, 2016

హైదరాబాద్ : రెండున్నర సంవత్సరాలుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన టీఆర్‌ఎస్‌ నేతల పడిగాపులకు గులాబీ దళాపతి తెరదించారు. ఎట్టకేలకు నామినేట్‌డ్ పోస్టులకు నియామకాలను చేపట్టారు. దీంతో ఒక్కసారిగా గులాబీ నేతల్లో కొత్త ఉత్సాహం ఊరకలేస్తోంది. ఇప్పటికే కొంతమంది నేతలను పదవులు వరించగా... మరికొంత మంది తమకు కూడా పదవులు దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నామినేట్‌డ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టిన టీ సర్కార్‌
ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం పదవుల భర్తీకి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పడు ఇప్పుడు అని ఊరుస్తూ వచ్చిన నామినేట్‌డ్ పోస్టుల నియామాకాలకు గులాబీ బాస్‌ తెరదించారు. తొమ్మిది మంది నేతలను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

పెద్ద ఎత్తున భర్తీ అయిన మార్కెట్ కమిటీలు
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 వేల పదవులను భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుందని గతంలో ప్రకటించిన కేసీఆర్‌.. ప్రస్తుతం మార్కెట్ కమిటీలను మాత్రం పెద్ద ఎత్తున భర్తీ చేశారు. అయితే రాష్ట్ర స్థాయి పదవులను మాత్రం అతి తక్కువ మంది నేతలకే కేటాయించారు. ఏది ఏమైనా పోస్టుల భర్తీతో గులాబీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కొత్త జిల్లాల ఏర్పాటుతో మరిన్ని పదవులు భర్తీ అయ్యే అవకాశం
త్వరలో కొత్త జిల్లాలు కూడా అమలులోకి వస్తుండడంతో జిల్లాల విభజన అనంతరం మరిన్ని రాష్ట్ర స్థాయి పదవులు భర్తీ చేసే అకాశం ఉందని తెలుస్తోంది. జిల్లాల వారిగా పార్టీ పరిస్థితులకు అనుగుణంగా పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందన్న ధీమా అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పార్టీ కార్యవర్గం నియామాకాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరగకపోవడంతో పార్టీ పదవులు కూడా దక్కే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నేతలు అంచనా వేస్తున్నారు.మొత్తానికి ఇటు కొత్త జిల్లాల ఏర్పాటు... అటు పదవుల భర్తీతో రెండు రోజుల ముందుగానే టీఆర్‌ఎస్‌ నేతలు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. 

07:48 - October 10, 2016

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ కోలాహలం సందడి చేస్తోంది. బెజవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి దసరా ఉత్సవ ఏర్పాట్లపై అమ్మవారి దేవాలయాలలో దసరా వేడుకలు సందడిగా మారాయి. దసరా వేడుకలకు అమ్మవారి దేవాలయాలు భక్తులతో సందడిని సంతరించుకున్నాయి. దసవతారాల్లో రోజుకో అలంకరణతో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకల కోసం ఈ వీడియోను చూడండి..

07:43 - October 10, 2016

హైదరాబాద్ : బహిరంగ మలమూత్ర విసర్జన లేని సమాజాన్ని స్థాపించడమే గాంధీకి మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు కేంద్రమంత్రి వెంకయ్య. స్వచ్ఛభారత్ ప్రజా ఉద్యమంలా మారిందన్న ఆయన.. పరిశుభ్రతనేది ప్రతిఒక్కరి జీవితంలో దినచర్య కావాలన్నారు. హైదరాబాద్‌లో జరిగిన స్వచ్ఛగ్రహ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

సైబర్‌ సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో స్వచ్ఛగ్రహ షార్ట్‌ ఫిల్మ్స్‌ స్క్రీనింగ్‌
హైదరాబాద్ సైబర్‌ సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో స్వచ్ఛగ్రహ షార్ట్‌ ఫిల్మ్స్‌ స్క్రీనింగ్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 4,500 లఘుచిత్రాలు ప్రవేశాలు పొందగా అందులో 20 ఉత్తమ లఘుచిత్రాలను ఎంపిక చేశారు. వీటిలో తెలంగాణ నుంచి కేవీ కరుణ కుమార్‌ నిర్మించిన చెంబుకు మూడింది షార్ట్‌ఫిల్మ్‌ దేశవ్యాప్తంగా మూడో స్థానాన్ని సంపాదించింది. స్వచ్ఛభారత్‌ ప్రచారం కోసం ఎంపిక చేసిన లఘుచిత్రాలను ఉపయోగిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో స్వచ్ఛగ్రహ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన..
పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్వచ్ఛ్‌ భారత్‌ రాజకీయ ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా.. ప్రజా కార్యక్రమంగా జరిగిన నాడే సత్ఫలితాలు సాధింస్తుందన్నారు. ఇప్పటికే తెలంగాణలో బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత పట్టణాలను ప్రకటించడం శుభపరిణామన్నారు.

పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్న వెంకయ్య
స్వచ్ఛగ్రహ ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి కేటీఆర్‌..స్వచ్ఛ్‌ భారత్‌ నుంచి స్ఫూర్తి పొందడమే కాదు దాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్‌ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా టాయిలెట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

స్వచ్ఛ్‌ భారత్‌ను ఆచరణలో పెట్టినప్పుడే ఉత్తమ ఫలితాలు-కేటీఆర్
స్వచ్ఛగ్రహ లఘు చిత్రాల ప్రదర్శనలో స్వచ్ఛ్ భారత్‌పై వక్తల ఆకట్టుకునే సూక్తులు, ఛలోక్తులు ఆహుతులను అలరించాయి. 

07:35 - October 10, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో ఉద్యమ పార్టీగా పట్టు దక్కించుకున్న టీఆర్‌ఎస్‌... అధికార పార్టీగా అవతరించినా ఉద్యమ పంథాను వీడడం లేదు. విపక్ష పార్టీలను నిర్వీర్యం చేసేందుకు ప్రణాళికలను అమలు చేసిన గులాబీ బాస్.... ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీల తీరును అదే స్థాయిలో తప్పు బడుతున్నారు.

మల్లన్నసాగర్ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీలపై ఫైర్‌
నిన్న మొన్నటి వరకు తెలంగాణలో దూమారం రేపిన మల్లన్నసాగర్ వ్యవహారంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను మాటలతో కాకుండా ప్రత్యక్ష చర్యలతో అడ్డుకునే ప్రయత్నం చేసింది. భూ నిర్వాసితలకు మద్దతు తెలుపుతున్న వారీని కనీసం మెదక్ జిల్లాల్లో అడుగు పెట్టకుండా అధికార పార్టీగా అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రాజెక్టు నిర్మాణంపై తాము అనుకున్నదే చేస్తామన్న సంకేతాలను ఇస్తూ వచ్చింది.

విపక్ష పార్టీలపై పైచేయి కోసం పనిచేసిన గులాబి పార్టీ శ్రేణులు
స్వయంగా సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో.....గులాబీ పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా విపక్ష పార్టీలపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించాయి. కాంగ్రెస్ పార్టీ నేతలను కనీసం ఆ గ్రామాల్లో తిరగకుండా హైదరాబాద్‌కే పరిమితం చేసింది. ప్రతిపక్ష పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించి మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను కలుసుకోవాల్సి వచ్చింది.

సీపీఎం తలపెట్టిన మహాపాదయాత్రపై సీఎం అక్కసు
తాజాగా సీపీఎం తలపెట్టిన మహాపాదయాత్రపై గులాబీపార్టీ తన అక్కసును చూపుతోంది. స్వయంగా పార్టీ అధినేత సీపీఎం పాదయాత్రపై విరుచుకుపడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.

రాష్ట్ర ఆవిర్భావ తర్వాత కనిపించని ఆ పరిస్థితులు
ఉద్యమ సమయంలో తెలంగాణా సెంటిమెంట్ తో ఇతర పార్టీల నేతలను అడ్డుకున్న సంఘటనలు ఎన్నో జరిగాయి... కానీ, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ పరిస్థితులు లేవు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో మరోసారి అవే పరిస్థితులు తలెత్తే ప్రమాదం కనిపిస్తోందన్న ఆందోళన ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోంది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నా......ప్రతిపక్షంలో ఉన్నా సెంటిమెంట్ రగిలించడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

 

పీఎస్టీయూలో ప్రవేశాలకు గడువు పొడిగింపు..

హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం 2016-17 విద్యా సంవత్సరానికి ఎంపీఏ, జానపద కళలు, రంగస్థల కళలు, కూచి పూడి నృత్యం, ఆంధ్ర నాట్యం, ఎంఏ తెలుగు, భాషా శాస్త్రం, సంగీతం, జ్యోతిష్యం, జర్నలిజం, బిఎఫ్‌ఏ, పీజీ డిప్లొమా, డిప్లొమా సర్టిఫికెట్, కళా ప్రవేశిక కోర్సులలో ప్రవేశానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్ వి. సత్తిరెడ్డి తెలిపారు.

హాస్యనటుడిపై వరకట్న వేధింపుల కేసు..

హైదరాబాద్ : హాస్యనటుడు పృథ్వీరాజ్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. తనను వివాహం చేసుకుని నాలుగేళ్లపాటు కాపురం చేసిన పృథ్వీరాజ్ ఇటీవల ముఖం చాటేయడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నాడంటూ కవిత అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

07:18 - October 10, 2016

నిజామాబాద్ : కామారెడ్డి ప్రాంతం... నిజామాబాద్ జిల్లాలో ఓ పట్టణం.. ఇంకొన్ని గంటల్లో ఏడు దశాబ్దాల బంధానికి వీడ్కోలు పలుకుతూ కొత్త జిల్లాగా మారబోతుంది. మరికొన్ని గంటల్లోనే కామారెడ్డి ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుంది.. దసరా పండుగ రోజు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఇందుకు పునాది పడబోతుంది.

కొత్త జిల్లాగా అవతరించబోతున్న కామారెడ్డి
నిజామాబాద్ జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా పెనవేసుకున్న కామారెడ్డి కొత్త జిల్లాగా అవతరించబోతుంది. ఇందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. కొత్త జిల్లాలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కామారెడ్డితో పాటుగా బాన్సువాడ, ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్లూ ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో 20 మండలాలు, 474 గ్రామాలు ఉండనున్నాయి.

కామారెడ్డి పరిధిలో కామారెడ్డి బిక్నూరు, రాజంపేట, దోమకొండ,
కామారెడ్డి డివిజన్‌ పరిధిలో కామారెడ్డి బిక్నూరు, రాజంపేట, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాలు.. బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో బాన్సువాడ, బీర్కూరు, బిచ్కుంద జుక్కల్, మద్నూరు, నిజాంసాగర్ పిట్లం మండలాలు.. అదేవిదంగా ఎల్లారెడ్డి పరిధిలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డి పేట, లింగంపేట, గాందారి మండలాలు ఉండనున్నాయి.

కామారెడ్డికి కొత్త కలెక్టర్‌గా సత్యనారాయణ, ఎస్పీగా చందన దీప్తిని
కామారెడ్డికి కొత్త కలెక్టర్‌గా సత్యనారాయణ, ఎస్పీగా చందన దీప్తిని ప్రభుత్వం నియమించినట్లు సమాచారం.. ఆర్డర్ టూ సర్వ్ ద్వారా ఉద్యోగులను కేటాయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంకొన్ని గంటల్లో సొంత పరిపాలన దిశగా కామారెడ్డి అడుగులు వేయనుంది. 

07:14 - October 10, 2016

మహబూబ్ నగర్ : జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావొస్తోంది. నూతనంగా ఏర్పడే జిల్లాల్లో కార్యాలయాల భవనాలు కొలువుదీరాయి. జిల్లా నాలుగు జిల్లాలుగా మారబోతోంది. దసరా నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమయ్యేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలు
తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు జిల్లాల విభజనలో నాలుగు జిల్లాలుగా అవతరించబోతుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలు దసరా పండగ రోజు ప్రారభమయ్యేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

వనపర్తి ఆర్ అండ్ బీ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయం
వనపర్తి విద్య పరంగా అభివృద్థి చెందిన ప్రాంతం కావడంతో పాటు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు వనపర్తిలో ఉన్నాయి. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆర్ అండ్ బీ కార్యాలయంలో, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో దసరా పండగ రోజు పాలన ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవడంతో వనపర్తి ప్రజలు హర్షవ్యక్తం చేస్తున్నారు.

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గెస్ట్ హౌజ్‌లో జిల్లా కార్యాలయాలు
గద్వాల్ జిల్లా ఈ పేరు వింటేనే ధర్నాలు, నిరసనలు గుర్తుకొస్తాయి.. మూడు జిల్లాలుగా ముచ్చటగా ముసాయిదాలో విడిపోయిన పాలమూరు జిల్లా ఇప్పుడు నడిగడ్డ కొత్త జిల్లాగా అవతరించబోతోంది. అలంపూర్, గద్వాల్ నియోజకవర్గాలను కలుపుతూ ఏర్పాటు చేసిన జిల్లా దాదాపు 13 మండలాలతో గద్వాల్ జిల్లాగా ఏర్పడుతోంది. గద్వాల పట్టణంలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గెస్ట్ హౌజ్ లో జిల్లా కార్యాలయం, ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు.

నాగర్ కర్నూల్ ఇంటిగ్రేటెడ్ భవనంలో కలెక్టర్ కార్యాలయం
నాగర్ కర్నూల్ జిల్లా విభజనలో మొదటి నుంచి ప్రతిపాదన ఉన్న జిల్లా కావడంతో ముందు నుంచే అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాలను కలుపుతూ జిల్లాగా ఏర్పాటు చేశారు. దాదాపు మూడు రెవెన్యూ డివిజన్ లతో వున్న జిల్లా కావడంతో అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. దసరా నుంచి పాలన అందించే విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నాగర్ కర్నూలు పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ భవనంలో కలెక్టర్ కార్యాలయంతో పాటు ఇతర కార్యాయాలు, డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఆఫీస్ ను ఏర్పాటు చేస్తున్నారు. 

07:10 - October 10, 2016

హైదరాబాద్ : దసరా నుంచి తెలంగాణ రాష్ట్రం కొత్త రూపు సంతరించుకోనుంది. కొత్త జిల్లాలతో రాష్ట్ర ముఖచిత్రం మారనుంది. పది జిల్లాలుగా ఉన్న రాష్ట్రం 31 జిల్లాల రాష్ట్రంగా అవతరించనుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సరికొత్త చరిత్రకు నాంది పలకబోతుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశం 31జిల్లాలతో కూడిన తుది ముసాయిదా బిల్లుకు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది.

31జిల్లాల రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ఓ కొలిక్కి వచ్చింది. 31 జిల్లాల రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతుంది. కొత్తగా 21 జిల్లాలు, 22 రెవెన్యూ డివిజన్లు, 120 మండలాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తుది నోటిఫికేషన్ రూపకల్పన కూడా దాదాపుగా పూర్తయింది. ఈ నోటిఫికేషన్‌కు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆయా జిల్లాల ఆవిష్కరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకంపై వీడని మౌనం
ఇది ఇలా ఉంటే కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు ఎవరు అనే దానిపై ప్రభుత్వ పెద్దలు మౌనం పాటిస్తున్నారు. అయితే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న కలెక్టర్లు, ఎస్పీలే కొత్తగా రాబోయే కార్యాలయాల ఏర్పాట్ల బాధ్యతలను స్వయంగా పరీశీలిస్తారని తెలుస్తోంది.

పట్టించుకోని ప్రతిపక్షాల అభ్యంతరాలు
మొత్తానికి ప్రతిపక్షాలు ,ప్రజా సంఘాలు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా.. ప్రభుత్వం మాత్రం వారి అభిప్రాయాలు సేకరించకుండానే తుది నోటిఫికేషన్‌కి సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం కల్లా తుది నోటిఫికేషన్‌ విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం జిల్లాలు, మండలాల వివరాలు ఇలా ఉన్నాయి...

Don't Miss