Activities calendar

12 October 2016

22:09 - October 12, 2016

టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తరమైన అంశాలను తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

22:02 - October 12, 2016

చిత్తూరు : తిరుపతిలోని ఎస్వీ వైద్యకళాశాల సమీపంలో ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. 70 అడుగుల విద్యుత్‌ స్తంభంపైకి ఎక్కాడు. ఫైర్‌ సిబ్బంది వల పెట్టి కాపాడేందుకు యత్నించారు. దీంతో ఆ యువకుడు కిందకు దూకేశాడు. అయితే ఫైర్‌ సిబ్బంది ఏర్పాటు చేసిన వలలో పడకుండా కిందపడ్డాడు. తీవ్రగాయాలైన ప్రభాకర్‌ను ఆస్పత్రికి తరలించారు. 

 

తిరుపతిలో ఓ యువకుడు హల్‌చల్‌

చిత్తూరు : తిరుపతిలోని ఎస్వీ వైద్యకళాశాల సమీపంలో ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. 70 అడుగుల విద్యుత్‌ స్తంభంపైకి ఎక్కాడు. ఫైర్‌ సిబ్బంది వల పెట్టి కాపాడేందుకు యత్నించారు. దీంతో ఆ యువకుడు కిందకు దూకేశాడు. 

21:57 - October 12, 2016

మెదక్ : రానున్న రోజుల్లో ముస్లింలకు రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. దసరా పండుగ సందర్భంగా సీఎం తన ఫామ్‌ హౌస్‌లో ముస్లిం సోదరులకు విందు ఇచ్చారు. ఈ విందుకు వివిధ జిల్లాల నుంచి ముస్లిం, మైనారిటీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లలో మైనారిటీ గురుకులాలను 500కు పెంచుతామన్నారు. మైనారిటీ పథకాల అమలు కోసం మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు అడిగిన పలు ప్రశ్నలకు కేసీఆర్‌ సమాధానమిచ్చారు. 

 

21:53 - October 12, 2016

కృష్ణా : విజయవాడలో రియల్టర్‌ పొట్టూరి శ్రీనివాస్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారం రోజుల క్రితం తన వెంచర్‌లో పురుగుల తాగి శ్రీనివాస్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌ ఈరోజు మృతి చెందాడు. తన మృతికి కొంతమంది కారణమని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. పోలీసులు సూసైడ్‌ నోట్‌ ఆధారంగా విచారణ చేపట్టారు. 

 

21:52 - October 12, 2016

మెదక్ : మేడ్చల్‌ లో దారుణం జరిగింది. చిన్నారి నిద్రస్తుండగా దుండగులు గొంతుకోసి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎల్లమ్మపేటలో నివాసం ఉండే కృష్ణమూర్తి, భవానీల చిన్న కూతురు సాయి లక్ష్మీ ప్రసన్న (7).. సెలవు దినం కావడంతో అక్కతో కలిసి నిద్రిస్తోంది. పట్ట పగలే దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. నిద్రిస్తున్న లక్ష్మీ ప్రసన్నను బాత్‌ రూపంలోకి ఎత్తుకెళ్లిన దుండగులు గొంతు కోసి గొంతు కోసి పరారయ్యారు. చాలా సేపు ఎవ్వరు గమనించకపోవడంతో పాప అక్కడిక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

విజయవాడలో రియల్టర్‌ పొట్లూరి శ్రీనివాస్‌ ఆత్మహత్య

కృష్ణా : విజయవాడలో రియల్టర్‌ పొట్టూరి శ్రీనివాస్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారం రోజుల క్రితం తన వెంచర్‌లో పురుగుల తాగి శ్రీనివాస్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

మేడ్చల్‌ లో దారుణం

రంగారెడ్డి : మేడ్చల్‌ లో దారుణం జరిగింది. పట్ట పగలే ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు 7 ఏళ్ల పాప గొంతు కోసి పరారయ్యారు. చాలా సేపు ఎవ్వరు గమనించకపోవడంతో పాప అక్కడిక్కడే మృతి చెందింది. 

 

21:30 - October 12, 2016

 ఢిల్లీ : సర్జికల్‌ దాడుల సక్సెస్‌ విజయం ఆర్మీకే దక్కుతుందని రక్షణ మంత్రి మనోహర్‌ పారీకర్ స్పష్టం చేశారు.  ప్రధాని మోది తీసుకున్న నిర్ణయానికి ఆయనకు కూడా ఈ క్రెడిట్‌ దక్కుంతున్నారు. మన ఆర్మీని చూసి గర్వపడుతున్నానని పారీకర్‌ పేర్కొన్నారు. సర్జికల్‌ దాడులకు సంబంధించి ప్రతిపక్షాల తీరుపై ఆయన మండిపడ్డారు.  

 

21:23 - October 12, 2016

నారాయపేట ఎమ్మెల్యే ఇల్లు ఆగమాగం, రెండున్నఏళ్ల సంది సెలవు దీసుకోని మోడీ, లోకేషం లలిత కలలు, భార్యను కొట్టిన కానిస్టేబుల్, సెల్ఫీ మోజులో నెత్తి ఖరాబు చేసుకున్న యువతి, మంత్రి గంటా మీద చింపాజీల నజర్.. ఈ అంశాలపూఐ 
మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

21:18 - October 12, 2016

కృష్ణా : విజయవాడ దుర్గగుడిలో తొక్కిసలాట జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసినప్పటికీ భవానీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శనం కోసం క్యూలైన్‌లోకి  వెళ్లేందుకు భక్తులు పోటీ పటడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీంతో కొందరు వికలాంగులు కింపడిపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:08 - October 12, 2016

ఖమ్మం : సామాజిక న్యాయం, బలహీన వర్గాలు, మైనారిటీల హక్కులు రక్షణ కోసం మహాజన  పాదయాత్ర చేయనున్నట్టు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఈమేరకు తమ్మినేని టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తన యాత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టింది కాదన్నారు. ఇది ప్రజల కోసం చేస్తున్న యాత్రని చెప్పారు. ప్రజలను వ్యతిరేకించే వారే మహాజన పాదయాత్రను వ్యతిరేకిస్తారని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. 

21:01 - October 12, 2016

మెదక్ : నూతనంగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాకు కార్యదర్శిగా ఎన్నికావడం సంతోషంగా ఉందని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలకు కమిటీలు వేసి పార్టీ నిర్మాణం చేస్తామన్న ఆయన.. ప్రజల అవసరాలకు అనుకూలంగా పోరాడుతామని స్పష్టం చేశారు. సీపీఎం పార్టీ నిర్మాణానికి అన్ని విధాల కృషి చేస్తామని మల్లారెడ్డి చెప్పారు. 

 

20:55 - October 12, 2016

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అలయ్‌ బలయ్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్రమంత్రి దత్తాత్రేయ ఆహ్వానం మేరకు గవర్నర్‌ నరసింహన్‌, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు నాయిని, ఈటెల రాజేందర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 12 ఏళ్లుగా దత్తాత్రేయ నిర్వహిస్తున్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడారు. మనుషుల మధ్య సంబంధాలు మరింత బలపడేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి దత్తాత్రేయ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 

 

20:49 - October 12, 2016

కాకినాడ : రిలయన్స్‌ సంస్ధ దోపిడీపై సీపీఎం కన్నెర్ర జేసింది. తూర్పుగోదావరి జిల్లా గాడిమొగలో ఎర్రదండు మెరుపు ధర్నాకు దిగింది. కేజీ బేసిన్‌ లోని రిలయన్స్‌ సంస్ధ ప్రధాన కార్యాలయంఎదుట సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఓన్జీసీ బావుల నుంచి అక్రమ తవ్వకాలు జరుపుతున్న రిలయన్స్‌ సంస్ధ తక్షణమే ప్రభుత్వానికి 11 వేల కోట్లు చెల్లించాలని  సీపీఎం జిల్లా కార్యదర్శి శేషుబాబ్జీ  డిమాండ్‌ చేశారు. 

 

కాబూల్ లో ఉగ్రవాదులు దాడి

అప్ఘనిస్తాన్ : కాబూల్ ఓ మొహర్రం ప్రార్థనలు చేస్తున్న షియాలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 36 మందికి గాయాలయ్యాయి. కాబూల్ లోని షియా సాకీ మసీదు వద్ద ఉగ్రవాదులు దాడి జరిపారు. పోలీసు యానిఫాంలో వచ్చి దాడికి పాల్పడ్డారు. 

 

యువతి కిడ్నాప్ ఆపై అత్యాచారం

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిధిలో యువతిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాళ్లగుడలోని ఓ ఫామ్ హౌజ్ లో యువతిని బంధించి ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. బాధితురాలు తప్పించుకుని పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఫామ్ హౌజ్ వాచ్ మెన్, ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.  నిందితులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. 

 

20:09 - October 12, 2016

జమ్ముకశ్మీర్‌ : పాంపోర్‌లో గత 3 రోజులుగా కొనసాగుతున్న ఆర్మీ ఆపరేషన్ ముగిసింది. 56 గంటలకు పైగా సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. మూడు రోజుల క్రితం ఈడీఐ  భవనంలోకి చొరబడ్డ ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా శ్రమించాయి. ఆర్మీ ఆపరేషన్‌లో నిన్న ఓ ఉగ్రవాది, ఇవాళ మరో ఉగ్రవాది హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు ఈడిఐ భవనాన్ని టార్గెట్‌ చేయడం గత 8 నెలల్లో ఇది రెండోసారి. ఈ ఆపరేషన్‌లో ఎక్కున నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డామని ఆర్మీ అధికారులు తెలిపారు. 

 

20:07 - October 12, 2016

కరీంనగర్‌ : జిల్లాలో ఆన్‌లైన్‌ మోసం బయటపడింది. జమ్మికుంటకు చెందిన శ్రీధర్‌.. స్నాప్‌డీల్‌ ద్వారా 35 వేల రూపాయలకు ల్యాప్‌టాప్‌ బుక్‌ చేశాడు. అయితే వచ్చిన బాక్స్‌లో ల్యాప్‌టాప్‌ బదులు ఒక పుస్తకం, చెక్కలు బయటపడడంతో శ్రీధర్‌ అవాక్కయ్యాడు. జరిగిన మోసాన్ని స్నాప్‌డీల్‌ దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని శ్రీధర్‌ వాపోతున్నాడు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:59 - October 12, 2016

నల్గొండ : యాదాద్రి జిల్లా చండూరు మండలం గట్టుప్పల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గట్టుప్పల్‌ను మండల కేంద్రంగా ప్రకటించి, ఆ తర్వాత తుది జాబితాలనుంచి తొలగించడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిలపక్షంల ఆధ్వర్యంలో రిలే  నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరం దగ్గర ఒక వ్యక్తి వంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుణ్ని అస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు వ్యక్తులు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో గట్టుప్పల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

 

19:57 - October 12, 2016

నల్గొండ : యాదాద్రి జిల్లా గట్టుప్పల్ లో ఉద్రిక్తత నెలకొంది. గట్టుపల్ ను మండల కేంద్రంగా ప్రకటించాలని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలు అయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

19:47 - October 12, 2016

మహబూబ్ నగర్ : నవ తెలంగాణ దినపత్రిక మహబూబ్‌నగర్‌ ఎడిషన్‌ కేంద్రాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. దసరా పండుగ రోజున నూతనంగా ఏర్పాటు చేసిన ప్రింటింగ్‌ ప్రెస్‌ ను ఆయన స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నవ తెలంగాణ ఎండీ పి.వీ ప్రసాద్‌, మేనేజర్‌ వెంకటేశ్‌  పాల్గొన్నారు. పత్రికలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలని నవ తెలంగాణ ఎండీ పి.వీ ప్రసాద్‌ అన్నారు. 

సామాజిక న్యాయం... సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పాదయాత్ర : తమ్మినేని

నల్గొండ : సామాజిక న్యాయం.. సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రాష్ట్రాభివృద్ధి కోసమే పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. పాదయాత్ర ప్రారంభం కాకుండానే ప్రభుత్వంలో అలజడి మొదలైందన్నారు. జనాభా, వనరుల ఆధారంగా జిల్లాలు ఏర్పడి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు 23 జిల్లా కమిటీలు పూర్తయ్యాయని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కేసీఆర్ కు ఇష్టం లేదు : తమ్మినేని

నల్గొండ : ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి సీఎం కేసీఆర్ కు ఇష్టం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాదయాత్రను అడ్డుకోవాలని కేసీఆర్ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆటంకాలెన్ని ఎదురైనా పాదయాత్ర ఆపేదిలేదని స్పష్టం చేశారు. 

 

ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కేసీఆర్ కు ఇష్టం లేదు : సీఎం కేసీఆర్

నల్గొండ : ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కేసీఆర్ కు ఇష్టం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. పాదయాత్రను అడ్డుకోవాలని కేసీఆర్ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆటంకాలెన్ని ఎదురైనా పాదయాత్ర ఆపేదిలేదని స్పష్టం చేశారు. 

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదం

విశాఖ : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. ఎస్‌ఎంఎస్‌-2లో మరుగుతున్న ఉక్కుద్రవం మీద పడటంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఓ కార్మికుడు మృతి చెందాడు.

19:18 - October 12, 2016

హైదరాబాద్ : సామాజిక చైతన్యమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్న నవ తెలంగాణ దినపత్రిక మరో రెండు కొత్త ఎడిషన్లను ప్రారంభించింది. వరంగల్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మహబూబ్‌నగర్‌లో మంత్రి లక్ష్మారెడ్డి కొత్త ఎడిషన్లను ప్రారంభించారు. మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నవ తెలంగాణ దినపత్రిక ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. 
వరంగల్‌, మహబూబ్‌నగర్‌లలో సరికొత్త ఎడిషన్లు
అచిరకాలంలోనే తెలంగాణ పాఠకుల అభిమానాన్ని చూరగొన్న నవతెలంగాణ దినపత్రిక.. పాఠకులకు మరింత చేరువయ్యేందుకు తాజాగా మరో రెండు ఎడిషన్‌లను ప్రారంభించింది. వరంగల్‌, మహబూబ్‌నగర్‌లలో సరికొత్త ఎడిషన్లను ప్రారంభించింది. పెట్టుబడిదారి పత్రికలకు భిన్నంగా సామాజిక చైతన్యమే లక్ష్యంగా కొనసాగుతున్న నవ తెలంగాణ దినపత్రిక వరంగల్‌ ఎడిషన్‌ను మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర్‌ ఎస్‌.వీరయ్య, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి, నవ తెలంగాణ ఎడిషన్‌ మేనేజర్‌ సుబ్బారావు, ఎడిషన్‌ ఇన్‌చార్జ్‌ మట్టయ్య హాజరయ్యారు. 
ప్రజల అభిమానాన్ని పొందాలి : కడియం
అత్యాధునిక టెక్నాలజిని ఉపయోగించుకుని.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అభిమానాన్ని నవ తెలంగాణ దినపత్రిక పొందాలని మంత్రి కడియం శ్రీహరి ఆకాంక్షించారు. 
ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తోంది : ఎస్.వీరయ్య 
నవ తెలంగాణ ప్రజల గొంతుకగా ఉండేందుకు, నిలదొక్కుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తోందన్నారు నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర్‌ ఎస్‌.వీరయ్య. ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తూ, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నవ తెలంగాణ దిక్సూచిగా నిలుస్తోందన్నారు. 
మహబూబ్‌నగర్‌ ఎడిషన్‌ను ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చల మండల కేంద్రంలోనూ కొత్తగా నవ తెలంగాణ ఎడిషన్‌ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నవ తెలంగాణ ఎండీ పీవీ ప్రసాద్‌, మేనేజర్‌ వెంకటేష్‌, సీపీఎం జిల్లా అధ్యక్షులు, ఇతర నాయకులు హాజరయ్యారు. 

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

ప్రకాశం : కొనకమిట్ల మండలం మర్రిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. దీంతో తండ్రీ కొడుకు మృతి చెందారు. తల్లి, కూతురు పరిస్థితి విషమంగాఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

పాంపోర్ లో ముగిసిన ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ : పాంపోర్ లో ఎన్ కౌంటర్ ముగిసింది. ఈడీఐ భవనం వద్ద 3 రోజులపాటు కాల్పులు కొనసాగాయి. భద్రతాదళాలు ఇద్దరు ఉగ్రవాదులను హత మార్చారు. 

పీవోకేలో 15 కిమీ పరిధిలో ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ : పారికర్

ఢిల్లీ : పీవోకేలో 15 కిమీ పరిధిలో ఆర్మీసర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తున్నట్లు మనోహర్ పారికర్ తెలిపారు. సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ప్రధాని, ఆర్మీకి దక్కుతుందన్నారు. సైన్యం 8 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ లో 35 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. 

 

పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణపై యంత్రాంగం సంతృప్తి

హైదరాబాద్ : పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ సాఫీగా ముగియడంపై అధికార యంత్రాంగం సంతృప్తిగా ఉందని అధికారులు చెప్పారు. ఏడాదిపాటు అత్యంత లోతుగా కసరత్తు చేయడం వల్ల కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల కూర్పు అద్భుతంగా జరిగిందని అధికారులు తెలిపారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నోటిఫికేషన్ ఇవ్వడంతో పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ముగిసిందని ఉన్నతాధికారులు స్పష్టీకరణ చేశారు. 

 

13:51 - October 12, 2016

దంపతులు తీసుకునే విడాకులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దంపతుల మద్య అత్తమామల విషయంగా సహజరంగా వివాదాలు తలెత్తుతూంటాయి. ఈ క్రమంలో భర్త తరపు తల్లిదండ్రులను అంటే అత్తమామల విషయంలో భార్య బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఆ భార్యకు విడాకులివ్వవచ్చు అని సంచలన తీర్పునిచ్చింది. అటు ఇంటి తీర్పునివ్వటానికి గల కారణాలేమిటి? ఇంత ఘాటుగా సుప్రీంకోర్టు ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చింది అనే అంశంపై ఈనాటి మైరైట్ కార్యక్రమంలో అడ్వకేట్ పార్వతిగా వివరించేందుకు సిద్ధంగా వున్నారు. మరి ఎందుకు ఆలస్యం న్యాయలసలహాల మరింత సమాచారం కోసం చూడండి. మైరైట్ కార్యక్రమం..

13:41 - October 12, 2016

వరంగల్ : నవ తెలంగాణ పత్రికకు అంకిత భావంతో పని చేసే సిబ్బంది ఉన్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌ నగరంలోని రాంపూర్‌ లో జరిగిన నవ తెలంగాణ జిల్లా ఎడిషన్‌ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పద్దతులను మార్చుకొని పత్రిక ప్రజల మన్ననలు పొందాలన్న కడియం.. ప్రస్తుతం జర్నలిజంలో విలువలు పతనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక దృక్పథంతో జర్నలిస్టులు పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్‌ వీరయ్య, సివిల్‌ సప్లైయ్స్‌ ఛైర్మన్‌ పెద్ది సుదర్శన్‌ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు. 

13:37 - October 12, 2016

హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం కేంద్ర మంత్రి దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరుకానున్నారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఇతర నేతలు హాజరుకానున్నారు. రాజకీయాలకు అతీతంగా బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన బండారు దత్తాత్రేయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని కళాకారులతో కలిసి ఆడారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులందరికి పసందైన విందుభోజనాన్ని బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేశారు. తెలంగాణ రుచులన్నింటిని అతిథులకు వడ్డించబోతున్నామని బండారు దత్తాత్రేయ తెలిపారు.  

13:33 - October 12, 2016

నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ జిల్లాను రెండు జిల్లాలుగా విభజించారు. 22 మండలాలు, రెండు రెవిన్యూ డివిజన్‌లతో కామారెడ్డి కేంద్రంగా ఏర్పాటైన ఈ జిల్లాలో అధికారిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

జిల్లా కలెక్టర్‌గా సత్యనారాయణ, ఎస్పీగా శ్వేతారెడ్డి బాధ్యతలు
కామారెడ్డి జిల్లాను వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఇదే సందర్భంగా జిల్లా కలెక్టర్‌గా సత్యనారాయణ, ఎస్పీగా శ్వేతారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు సరిగ్గా అందేందుకు.. చిన్న జిల్లాలు అవసరమని మంత్రి పోచారం అన్నారు.

మూడు రెవెన్యూ డివిజన్లు
మొత్తం మూడు రెవిన్యూ డివిజన్లు.. 22 మండలాలతో ఏర్పాటు చేసిన కామారెడ్డి జిల్లా జనాభా 9,74,227 మంది. ఈ ప్రాంతం మెదక్‌, సిరిసిల్ల, నిజామాబాద్‌, సిద్దిపేట జిల్లాలకు కూడలిగా నిలుస్తోంది. తెలంగాణలో బెల్లం ఉత్పత్తి చేసే ఏకైక ప్రాంతమిది. బి-టెక్‌ డెయిరీ టెక్నాలజీ కాలేజీ కామారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చింది.

జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా రుద్రూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం..
విభజన తర్వాత.. నిజామాబాద్‌ మూడు రెవిన్యూ డివిజన్‌లు, 27 మండలాలతో మిగిలింది. ప్రస్తుతం ఈ జిల్లా జనాభా 15,77,108 మంది. ఈ జిల్లా పసుపు సాగుకు పెట్టింది పేరు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీరు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తోంది. బ్రిటిష్‌కాలంలో ఏర్పాటు చేసిన రుద్రూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం.. జిల్లాకు ప్రత్యేకంగా నిలుస్తోంది. 

13:26 - October 12, 2016

హైదరాబాద్‌ :తాగుబోతులు కారు డ్రైవింగ్ ఘటనలో పెద్ద‌ అంబ‌ర్‌పేట‌లో చిన్నారి సంజనతో పాటు ఆమె తల్లి శ్రీదేవి గాయపడిన విషయం తెలిసందే.తలకు తీవ్రగాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంజన న‌గ‌రంలోని కామినేని ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోంది. కొన్ని రోజులుగా విషమంగా ఉన్న ఆమె ప‌రిస్థితి ప్రస్తుతం మెరుగుప‌డింద‌ని ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. సంజ‌న‌కు కృతిమ శ్వాస తొల‌గించినట్లు పేర్కొన్నారు. త‌న కుటుంబ స‌భ్యుల‌ను సంజ‌న గుర్తుప‌డుతోందని వైద్యులు చెప్పారు. పూర్తిగా కోలుకోవ‌డానికి మ‌రి కొన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.

శ్రావణ్ ఆత్మహత్యపై స్పందించిన రసమయి..

కరీంనగర్ : శ్రావణ్ ఆత్మహత్యకు ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ స్పందించారు. మానకొండూరు ఎస్సై, గన్ మెన్ లను సీపీ సస్పెండ్ చేశారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించి..మృతుడి తండ్రికి హోంగార్డు ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు,రూ. 10లక్షలు నష్టపరిహారం ఇస్తామని ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ హామీ ఇచ్చారు. కాగా కరీంనగర్ లో దసరా వేడుకల సందర్బంగా పోలీసులకు స్థానిక యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వెంటనే విడుదల చేశారు. కానీ మళ్లీ స్టేషన్ కు రావాల్సి వుంటుందనటంతో శ్రావణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

13:13 - October 12, 2016

కరీంనగర్ : శ్రావణ్ ఆత్మహత్యకు ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ స్పందించారు. కరీంనగర్ లో దసరా వేడుకల సందర్బంగా పోలీసులకు యువకుల మధ్య వాగ్వాదం జరగటంతో యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వెంటనే విడుదల చేశారు. కానీ మళ్లీ స్టేషన్ కు రావాల్సి వుంటుందనటంతో శ్రావణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ మానకొండూరు పీఎస్ ముందు శ్రావణ్ బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో మానకొండూరు ఎస్సై, గన్ మెన్ లను సీపీ సస్పెండ్ చేశారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించి..మృతుడి తండ్రికి హోంగార్డు ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు,రూ. 10లక్షలు నష్టపరిహారం ఇస్తామని ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ హామీ ఇచ్చారు. 

బంధువులను గుర్తు పడుతున్న సంజన..

హైదరాబాద్‌ :తాగుబోతులు కారు డ్రైవింగ్ ఘటనలో పెద్ద‌ అంబ‌ర్‌పేట‌లో చిన్నారి సంజనతో పాటు ఆమె తల్లి శ్రీదేవి గాయపడిన విషయం తెలిసందే.తలకు తీవ్రగాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంజన న‌గ‌రంలోని కామినేని ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోంది. కొన్ని రోజులుగా విషమంగా ఉన్న ఆమె ప‌రిస్థితి ప్రస్తుతం మెరుగుప‌డింద‌ని ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. సంజ‌న‌కు కృతిమ శ్వాస తొల‌గించినట్లు పేర్కొన్నారు. త‌న కుటుంబ స‌భ్యుల‌ను సంజ‌న గుర్తుప‌డుతోందని వైద్యులు చెప్పారు. పూర్తిగా కోలుకోవ‌డానికి మ‌రి కొన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.

పంజాబ్‌లో తెలుగు విద్యార్థి మృతి..

నెల్లూరు : త్మకూరులో విషాదం నెలకొంది. పంజాబ్‌ రాష్ట్రంలోని ఓ కాలేజ్ లో ఆత్మకూరుకు చెందిన శ్రీకాంత్ అనే విద్యార్థి ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న శ్రీకాంత్ తల్లిదండ్రులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. కాగా తోటి స్నేహితులే తమ కుమారుడ్ని హత్యచేశారని వారు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మాజీ మంత్రి సంగంరెడ్డి మృతి..

వరంగల్: జిల్లాకు చెందిన మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు సంగంరెడ్డి సత్యనారాయణ ఇకలేరు. ఆయన ఈనెల 10న రాత్రి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. సంగంరెడ్డి సత్యనారాయణ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీఆర్‌ఎస్ వ్యవస్థాక సభ్యుల్లో సత్యనారాయణ ఒకరని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్ష బలంగా ఉన్న నేత సత్యనారాయణ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. సత్యనారాయణ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు.

పాంపోర్ లో రెండో ఉగ్రవాది హతం..

జమ్మూ కశ్మీర్‌ : పాంపోర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య గత 50 గంటలకు పైగా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ (ఈడీఐ) బిల్డింగ్ నుంచి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ఈ కాల్పుల్లో నిన్న ఒక ఉగ్రవాది మృతిచెందినట్టు భద్రతా అధికారులు తెలిపారు. తాజాగా ఇవాళ జరిపిన కాల్పుల్లో మరో తీవ్రవాది హతమైనట్టు వెల్లడించారు. బిల్డింగ్ లోపల నక్కి ఉన్న మరో తీవ్రవాది కోసం భద్రతా బలగాలు వెతుకుతున్నాయి.

12:16 - October 12, 2016
12:14 - October 12, 2016

కరీంనగర్ : మాన‌కొండూరులో శ్రావణ్ అనే యువ‌కుడు ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకోసుకున్నాడు. శ్రావణ్ ఆత్మహత్యకు పోలీసులే కరణమని బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ..ద‌స‌రా ఉత్స‌వాల సందర్భంగా ఆ ప్రాంతంలోని ప‌లువురు యువ‌కులు నిన్న పోలీసుల‌తో వాగ్వివాదానికి దిగారు. దీంతో వారిని పోలీసులు పోలీస్‌స్టేష‌న్‌కి తీసుకెళ్లి హెచ్చ‌రించి వ‌దిలివేశారు. అయితే, మ‌రోసారి పోలీస్‌స్టేష‌న్‌కు రావాల‌ని ఐదుగురు యువ‌కుల‌ను పోలీసులు ఆదేశించారు. దీంతో తీవ్ర‌ మ‌న‌స్తాపం చెందిన శ్రావ‌ణ్‌(23) అనే యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కాగా శ్రావణ్ ఆత్మహత్యకు పోలీసులే కారణమంటూ సీఎస్ ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసు వాహనాలను, ఫర్నీచర్ , సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

భారీ భద్రతతో మొహర్రం..

హైదరాబాద్: మొహర్రం సందర్భంగా పాతబస్తీలో భద్రత కట్టుదిట్టం చేశారు. 2,500 మంది పోలీసులు, రెండు కంపెనీల కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాక ఐదు బాంబు స్కాడ్స్, 10 షీటీమ్స్‌తో పాతబస్తీలో పటిష్ట బందోబస్తును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీబీకాఆలం నుంచి చాదర్‌ఘాట్‌ వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బీబీకాఅలావా నుంచి ప్రారంభమై ఊరేగింపు అలీజా కోట్ల... చార్మినార్‌, గుల్జార్‌ హౌస్‌, మీరాలం మండీ... దారుల్‌ షిఫాల మీదుగా చాదర్‌ ఘాట్‌ వరకు ఊరేగింపు జరుగుతోంది. ఊరేగింపు జరిగే ఏరియాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు చేసినట్లు పోలీసులు తెలిపారు

11:55 - October 12, 2016

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మొహర్రం సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు. 2,500 మంది పోలీసులు, రెండు కంపెనీల కేంద్ర బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఐదు బాంబు స్కాడ్స్, 10 షీటీమ్స్‌తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బీబీకా ఆలం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీబీకా అలావానుంచి ప్రారంభమై ఈ వూరేగింపు అలీజా కోట్ల, చార్మినార్‌, గుల్జార్‌ హౌస్‌, మీరాలం మండీ, దారుల్‌ షిఫాల మీదుగా కొనసాగి చాదర్‌ ఘాట్‌ వరకు యాత్ర సాగే మార్గంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఊరేగింపు జరిగే ఏరియాల్లో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

ఎన్టీపీసీ కార్మికుల ఆందోళన..

క‌రీంన‌గ‌ర్ : పెద్ద‌ప‌ల్లి, రామ‌గుండం ఎన్టీపీసీ ముందు ఈరోజు ఉద‌యం కార్మికులు పెద్ద‌ ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. ఇటీవ‌లే ఎన్టీపీసీలో అధికారులు 11 మంది ఒప్పంద కార్మికుల‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో విధులు బ‌హిష్క‌రించిన మూడు వేల మంది ఒప్పంద కార్మికులు నిర‌స‌న‌ తెలుపుతున్నారు. సస్పెండ్ చేసిన‌ ఒప్పంద కార్మికుల‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వారిని విధుల్లోకి తీసుకునే వర‌కు ఆందోళ‌న విర‌మించబోమ‌ని తేల్చిచెబుతున్నారు.

11:34 - October 12, 2016

జమ్ము కశ్మీర్ : పాంపోర్‌లోని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్(ఈడీఐ) హాస్టల్ బిల్డింగ్‌లోకి చొరబడి మూడు రోజులుగా కాల్పులు జరుపుతున్న లష్కరే తాయిబా ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. సోమవారం రాత్రి ప్రారంభమైన కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా మంగళవారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ బిల్డింగ్‌లోకి కొన్ని రోజుల క్రితం ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు చొరబడ్డారు. భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులు తొలుత సోమవారం 5 గంటల ప్రాంతంలో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఉగ్రవాదులు ఇదే భవనంలోకి చొరబడి కాల్పులు ప్రారంభించిన విషయం తెలిసిందే.

11:27 - October 12, 2016

నెల్లూరు : జిల్లాలో రొట్టెల పండుగ ప్రారంభమైంది. .ఈ పండుగకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. రొట్టెల పండుగ నెల్లూరు జిల్లాకే విశిష్టతను తెచ్చిపెట్టే పండుగ.. కోరిన కోర్కెలు తీర్చే సంబరాల పండుగ.. ప్రతి ఏటా మొహర్రం సందర్భంగా ఈ పండుగ ఐదురోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగ రోజు పేదలకు రొట్టెలు పంచితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. తమ కోర్కెలు తీరినందుకు గుర్తుగా ఏటా గోధుమ రొట్టెలను మొక్కులుగా చెల్లిస్తారు. పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, సౌభాగ్యం, వ్యాపారం, విదేశీయానంతోపాటు సంతాన రొట్టెలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటితో పాటు వివిధ కోరికలను బట్టి రొట్టెలు పంచుతుంటారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. దర్గా అనగానే సహజంగా ఎవరైనా సరే.. ఒక మతానికి సంబంధించిన అంశంగా భావిస్తారు. కానీ నెల్లూరు బారాషహీద్ దర్గా విషయంలో మాత్రం అదేమీలేదు. ఇక్కడ జరిగే రొట్టెల పండుగకు అన్ని మతాలవారూ తరలివస్తారు. ఈ రొట్టెల పండుగలో ప్రధానమైనది గంధమహోత్సవం. ఈ గంధ మహోత్సవం వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు తెల్లవార్లూ జాగారం చేస్తారు. మత పెద్దలు తెచ్చే గంధం కోసం భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తారు. గంధం తీసుకురాగానే భక్తులు దాన్ని అందుకునేందుకు పోటీపడతారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద బారాషహీద్ దర్గాలోని రొట్టెల పండగలోని ప్రధాన ఘట్టం గంధ మహోత్సవం. ఈ గంధాన్ని తమ దగ్గరుంచుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. 

11:16 - October 12, 2016

గుంటూరు : బుధవారం ఉదయం వెలగపూడిలోని సీఎం చాంబర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు..ప్రపంచ స్థాయిలోనే అమరావతి నిర్మాణం వుంటుందని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వం చేసే సంక్షేమం గుర్తుండటం లేదన్నారు. దేశంలో బ్లాక్ మనీని రద్దు చేయాల్సిన అవుసరముందన్నారు. దీనిపై ప్రధానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. బ్లాక్ మనీని రద్దు చేయాలంటే రూ.500,1000 నోట్లను రద్దు చేయాల్సిందేనన్నారు.

ఓట్ బ్యాంక్ అంతా డబ్బుతోనే నడుస్తోంది : చంద్రబాబు
ప్రస్తుతం ఓటు బ్యాంక్ అంతా డబ్బుతోనే నడుస్తోందన్నారు. డబ్బు పంచి ఓట్లు వేయించుకున్న నాయకుడు అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించుకోవటమే తప్ప మెరుగైన పాలన అందించలేరని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సాక్షిగా దసరా పండుగ చేసుకుంటాం కానీ రావణాసురుడు లాంటి వ్యక్తులు ఇంకా సమాజంలో వున్నారన్నారు. ప్రభుత్వం ఎంత చేసినా ఓట్లు వేసేముందు మాత్రం ఐదు వందల కోసమే చూస్తున్నారని అన్నారు. ఊర్లలో నీరు లేకపోతే నీళ్లిచ్చి, కరెంటు లేకపోతే కరెంటిచ్చి, గ్యాస్ లేకపోతే గ్యాస్ ఇచ్చి... వాళ్లకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో అన్ని చేసాక లాస్టులో 500 రూపాయలు ఇస్తే... అతను డబ్బిచ్చిన వాళ్లకే ఓటేస్తాడు. ఇదెక్కడి న్యాయం? ఆ ఐదొందలకు, వెయ్యికి... ఇప్పుడు ఎమ్మెల్యేల పోటీ. నా దగ్గర డబ్బులేదు కాబట్టి, రేపు ఎలక్షన్లలో పోటీ చేయాలి కాబట్టి, ఇప్పటి నుంచే డబ్బు దాచుకోవాలని ఎమ్మెల్యేలు చూస్తున్నారు. వేరీజ్ వాల్యూస్ అని ప్రశ్నించారు. కాగా కుటుంబ వ్యవస్థ పట్టిష్టంగా వున్న దేశం భారత దేశమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రోబోలతో మాట్లాడుకునేలా పాశ్చాత్యదేశాలు వున్నాయన్నారు.

 

మానకొండూర్ లో ఉద్రిక్తత..

కరీంనగర్ : మాన‌కొండూరులో ఓ యువ‌కుడు ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. ద‌స‌రా ఉత్స‌వాల సందర్భంగా ఆ ప్రాంతంలోని ప‌లువురు యువ‌కులు నిన్న పోలీసుల‌తో వాగ్వివాదానికి దిగారు. దీంతో వారిని పోలీసులు పోలీస్‌స్టేష‌న్‌కి తీసుకెళ్లి హెచ్చ‌రించి వ‌దిలివేశారు. అయితే, మ‌రోసారి పోలీస్‌స్టేష‌న్‌కు రావాల‌ని ఐదుగురు యువ‌కుల‌ను పోలీసులు ఆదేశించారు. దీంతో తీవ్ర‌ మ‌న‌స్తాపం చెందిన శ్రావ‌ణ్‌(23) అనే యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. గ్రామ‌స్తులు ఆ యువ‌కుడి మృత‌దేహంతో మాన‌కొండూరు పోలీస్‌స్టేష‌న్‌కు బ‌య‌లుదేరారు.

పాంపోర్‌లోఆగని కాల్పులు..

జమ్ముకశ్మీర్‌: పాంపోర్‌లోని ఈడీఐ భవనం వద్ద ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈడీఐ భవనం వద్ద గత మూడు రోజులుగా కాల్పులు కొనసాగుతుండటంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భవనంలో దాగి ఉండి ముష్కరులు కాల్పులకు పాల్పడుతున్నారు. ఒక ఉగ్రవాదిని హతమార్చినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. భవనంలోకి ప్రవేశించిన భద్రతా బలగాలు అన్ని గదుల్లో గాలిస్తున్నాయి. భవనంలో మరో ఉగ్రవాది దాగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

10:53 - October 12, 2016

తమిళనాడు : రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం జయలలిత దగ్గర ఉన్న శాఖలన్నింటినీ ఆర్ధికమంత్రి పన్నీర్‌సెల్వంకు అప్పగిస్తూ రాజ్‌భవన్ ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు అపోలో ఆస్పత్రిలో జయలలిత కోలుకుంటున్నట్లు.. ఆమె ఆరోగ్యంపై ఆందోళన వద్దని పరామర్శించిన నేతలంటున్నారు.

తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం
తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జయలలిత కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో.. ఆమె శాఖలన్నింటిని పన్నీర్‌ సెల్వంకు అప్పగిస్తూ రాజ్‌భవన్‌ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయనకు కేబినెట్‌ సమావేశాలు ఏర్పాటు చేసే అధికారం కల్పించారు.

అర్టికల్‌ 166 ప్రకారం కేబినెట్‌ సమావేశాల నిర్వహణ
అర్టికల్‌ 166 ప్రకారం కేబినెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు పన్నీర్‌ సెల్వంకు అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జయలలిత సూచన మేరకే ఆర్థిక మంత్రికి శాఖలు అప్పగించామని రాజ్ భవన్ ఉత్తర్వులో పేర్కొంది. అమ్మ అనారోగ్యం నుంచి కోలుకునేంత వరకు ఆర్థిక మంత్రి అన్ని శాఖలను చూసుకుంటారు.

సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ సతీశ్‌ కుమార్‌, టెక్నీషియన్‌ మాడాస్వామి అరెస్టు
ఇది ఇలా ఉంటే జయలలిత ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రకరకాల వదంతులకు పాల్పడ్డ మరో ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వెబ్‌సైట్‌ టెక్నీషినయన్‌ను లోబరచుకుని అపోలో ఆస్పత్రి డాక్టర్ల ధ్వని అనుకరణ స్వరంతో తప్పడు వీడియోను అప్‌లోడ్‌ చేసిన మాడాస్వామి, అలాగే ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారం పొందుపరిచిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సతీశ్‌కుమార్‌లను చెన్నై పోలీసులు అరెస్డు చేశారు.ప్రస్తుతం జయలలిత అనారోగ్యం బారిన పడటంతో తమిళ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. 

10:45 - October 12, 2016

హైదరాబాద్ : ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకునే మొహరం ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మతసారస్యానికి ప్రతీకగా మోహరం ఉత్సవాలకు.. హైదరాబాద్‌లోని దర్గాలన్నీ ముస్తాబయ్యాయి. మరోవైపు ఈ వేడుక కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.

భద్రతలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్, షీటీమ్స్
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి.. బీబీల ఆలంను దర్శించుకొని దట్టీలు సమర్పించారు. బుధవారం జరిగే ఊరేగింపులో భద్రత కోసం.. 2500 మంది పోలీస్ బలగాలను మోహరించినట్టు తెలిపారు. వీరితో పాటు ఆర్ఏఎఫ్ , టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్ కూడా సేవలందించనున్నాయి. మొహర్రం కోసం దర్గాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. రంగరంగుల విద్యుత్ దీపాలతో... స్వాగతం పలుకుతున్నాయి.

10:41 - October 12, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ పాలనలో మరో కీలక ఘట్టానికి నాంది పడింది. ఏపీ తాత్కాలిక సచివాలయంలో సీఎం చంద్రబాబు కార్యాలయం ప్రారంభమైంది. ఫస్ట్‌ బ్లాక్‌ లోని మొదటి అంతస్తులో ఉదయం 8 గంటల 9 నిమిషాలకు తన ఛాంబర్‌ను సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబుకు సీఎం కార్యాలయ సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగసంఘాల నేతలు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కొత్త ఛాంబర్‌లో ఫైలుపై మొదటి సంతకం చేశారు.

రాకెట్ లాంఛర్లతో దాడి చేసినా చెక్కు చెదరని రీతిలో నిర్మాణం
ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ఎన్నో ప్రత్యేకలతో రూపుదిద్దుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అత్యంత రక్షణాత్మకంగా నిర్మిస్తున్నారు. రాకెట్ లాంఛర్లతో దాడి చేసినా ఏ మాత్రం చెక్కు చెదరని రీతిలో దీని నిర్మాణం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరి భద్రతా దృష్ట్యా మొత్తం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో దీనిని నిర్మిస్తున్నారు. మంత్రివర్గ సమావేశాల నిర్వహణకు అవసరమైన సమావేశమందిరం,.భోజనం చేసేందుకు ప్రత్యేక డైనింగ్ హాల్‌, ఇటాలియన్ మార్బుల్‌తో ఫ్లోరింగ్..ఇలా అనేక ప్రత్యేకతలతో ముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధమైంది. ఇక ఈ భవనంలో ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు, వీడియో కాన్ఫరెన్స్ ఇతర సమావేశ మందిరాలు ఉంటాయి. ఇక ఇతర భవనాలకు లేని విధంగా ఏడు లిఫ్ట్‌లు ఈ భవనంలో ఉన్నాయి. ముఖ్యమంత్రికి మాత్రమే ప్రత్యేకంగా ఒక లిఫ్ట్ కేటాయించారు. కార్యాలయం అంతా అత్యాధునిక సీసీ కెమెరాలతో ఏర్పాటు చేశారు. మొత్తంమ్మీద సచివాలయ నిర్మాణంలో తన మార్క్‌ సాంకేతికను చంద్రబాబు చూపించారు. 

10:37 - October 12, 2016

కర్నూలు : దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో 31 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. స్వామివారి జైత్రయాత్రలో పాల్గొనేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని కనులారా తిలకించేందుకు పక్కరాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కర్నూలులోని దేవరగట్టులో మాలమల్లేశ్వరుడి కల్యాణం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్‌ మోహన్‌, ఎస్పీ రవికృష్ణ పర్యవేక్షణలో ఉత్సవ ఏర్పాట్లు చేశారు. 13 వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 50చోట్ల 100 సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలతో నిఘాను పర్యవేక్షిస్తున్నారు. ఇనుప రింగులు ధరించిన కర్రలతో భక్తులు రాకుండా పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరోవైపు బన్నీ ఉత్సవంలో గాయపడ్డ వారికి చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

10:34 - October 12, 2016

హైదరాబాద్ : ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకునే మొహరం ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మతసారస్యానికి ప్రతీకగా మోహరం ఉత్సవాలకు.. హైదరాబాద్‌లోని దర్గాలన్నీ ముస్తాబయ్యాయి. మరోవైపు ఈ వేడుక కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఇస్లాం మతస్తులకు ముఖ్యమైన పండుగలలో మొహరం
ఇస్లాం మతస్తులకు ముఖ్యమైన పండుగలలో మొహరం ఒకటి. ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ మొహరం ఉత్సవాలు నేపథ్యం ఓసారి చూస్తే..... ఇరాక్‌ లోని కర్బరా పట్టణంలో నబికల్ నాయకం మనుమడైన ఇమామ్ హుస్సేని రజి ఆన్ ఆయన కుటుంబ సభ్యులు కలసి ఇస్లాం మత కట్టుబాట్లు, ఆచారాల పరిరక్షణకు కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి త్యాగాలకు గుర్తుగా... ప్రతి ఏటా మొహరం పండుగను జరుకుంటారు ముస్లీం సోదరులు.

ఇమామ్ హుస్సేని, ఆయన కుటుంబసభ్యుల త్యాగాల ప్రతీక మొహర్రం
మొహరం వేడుకలకు... హైదరాబాద్ పాతబస్తీ సిద్ధమైంది. పీర్లపల్లి దర్గాలో మొహరం పండగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దీనినే పీర్ల పండుగ అని కూడా అంటారు. ఈ దర్గాకి ముస్లింలతో సమానంగా హిందువులు రావటం విశేషం.

 

10:26 - October 12, 2016

విజయవాడ : నవ్యాంధ్రప్రదేశ్‌ రోజురోజుకు కొత్తరూపు సంతరించుకుంటుంది. ఇప్పటికే అనేక సంస్థలు, పరిశ్రమలు తరలివస్తుండగా తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌, తపాలా శాఖ సర్కిళ్లను ప్రారంభించారు. అమరావతిలో పోస్టల్‌శాఖకు ఐదెకరాల స్థలం కేటాయించగా.. ఏపీలో ఫైబర్‌గ్రిడ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి ఏర్పాటు చేయనుంది. దసరా పర్వదినాన విజయవాడలో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్కిళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు మనోజ్‌సిన్హా, సుజనాచౌదరిలు హాజరయ్యారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి ఫైబర్‌గ్రిడ్‌ ఏర్పాటు -చంద్రబాబు
విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా మంచి జరుగుతుందన్నారు చంద్రబాబు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యాలయాలు ఉన్న శాఖ పోస్టల్దే అని చంద్రబాబు గుర్తు చేశారు. పోస్టల్‌శాఖ ఎన్నో సేవలు అందిస్తుందని.. భవిష్యత్‌లో మరిన్ని సేవలు అందించనుందన్నారు సీఎం. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌కు అమరావతిలో ఐదెకరాల స్థలం కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ మంచిగా పని చేస్తుందని.. రాష్ట్రంలో ప్రవేశపెట్టబోయే ఫైబర్‌గ్రిడ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు.

పోస్టల్‌ శాఖ మంచి భవిష్యత్‌ ఉంది -వెంకయ్యనాయుడు
రానున్న రోజుల్లో పోస్టల్‌ శాఖకు మంచి భవిష్యత్‌ ఉందన్నారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. దేశంలో ఆర్ధిక సంస్కరణలను పీవీ నర్సింహారావు ప్రారంభిస్తే.. టెక్నాలజీని వాజ్‌పేయి దేశవ్యాప్తం చేశారన్నారు. మోదీ నేతృత్వంలో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతున్నారు వెంకయ్య. రాబోయే రోజుల్లో తపాల, టెలికం సేవలు మరింత విస్తృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి జయంతిసిన్హా. బీఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌ సర్కిళ్ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌ కొ‌త్త రూపు సంతరించుకుందని పలువురు అభిప్రాయపడ్డారు.

10:21 - October 12, 2016

నెల్లూరు : నెల్లూరు జిల్లా అంటే మొదట గుర్తొచ్చే పండుగ రొట్టెల పండుగ.. ఈ పండుగకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. నెల్లూరులో ఐదురోజుల పాటు జరిగే బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగపై ప్రత్యేక కథనం..

నెల్లూరు జిల్లాకే విశిష్టతను తెచ్చిపెట్టే పండుగ..
రొట్టెల పండుగ నెల్లూరు జిల్లాకే విశిష్టతను తెచ్చిపెట్టే పండుగ.. కోరిన కోర్కెలు తీర్చే సంబరాల పండుగ.. ప్రతి ఏటా మొహర్రం సందర్భంగా ఈ పండుగ ఐదురోజుల పాటు జరుగుతుంది.

కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం
ఈ పండుగ రోజు పేదలకు రొట్టెలు పంచితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని.. అందుకే బారాషాహీద్ దర్గాకు ప్రతి ఏటా వస్తామని కొంత మంది భక్తులు చెబుతూ ఉంటారు. తమ కోర్కెలు తీరినందుకు గుర్తుగా ఏటా గోధుమ రొట్టెలను మొక్కులుగా చెల్లిస్తారు.

కోరికలను బట్టి రొట్టెల పంపిణీ..
భక్తులు కోరుకునే కోర్కెల్లో కూడా రకరకాలుంటాయి. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, సౌభాగ్యం, వ్యాపారం, విదేశీయానంతోపాటు సంతాన రొట్టెలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటితో పాటు వివిధ కోరికలను బట్టి రొట్టెలు పంచుతుంటారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. దర్గా అనగానే సహజంగా ఎవరైనా సరే.. ఒక మతానికి సంబంధించిన అంశంగా భావిస్తారు. కానీ నెల్లూరు బారాషహీద్ దర్గా విషయంలో మాత్రం అదేమీలేదు. ఇక్కడ జరిగే రొట్టెల పండుగకు అన్ని మతాలవారూ తరలివస్తారు.

రొట్టెల పండుగలో ప్రధానమైనది గంధమహోత్సవం
ఈ రొట్టెల పండుగలో ప్రధానమైనది గంధమహోత్సవం. ఈ గంధ మహోత్సవం వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు తెల్లవార్లూ జాగారం చేస్తారు. మత పెద్దలు తెచ్చే గంధం కోసం భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తారు. గంధం తీసుకురాగానే భక్తులు దాన్ని అందుకునేందుకు పోటీపడతారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద బారాషహీద్ దర్గాలోని రొట్టెల పండగలోని ప్రధాన ఘట్టం గంధ మహోత్సవం. ఈ గంధాన్ని తమ దగ్గరుంచుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

12లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
ఇక ఈ పండుగలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాదు.. దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ సారి సుమారు 12 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. అదీకాక రాష్ట్ర ప్రభుత్వం ఈ రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. దీంతో భక్తుల కోసం దర్గా ప్రాంగణాన్ని 7 జోన్లుగా విభజించి 4 కోట్ల రూపాయలతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాకు చెందిన మంత్రి నారాయణ , మేయర్ అబ్ధుల్ అజీజ్‌లు దగ్గరుండి ఈ ఏర్పాట్లును పరిశీలిస్తున్నారు.

2000 మంది పోలీసులతో బందోబస్తు..సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా
మరోవైపు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆయా ప్రాంతాల నుంచి నెల్లూరు వైపు వచ్చే బస్సుల సంఖ్యను చాలా డిపోల్లో పెంచగా.. నెల్లూరు బస్టాండుతోపాటు, కొన్ని ముఖ్యమైన సెంటర్ల నుంచి మరో కొన్ని బస్సులను దర్గా వరకూ ఆర్టీసీ నడుపుతోంది.

10:15 - October 12, 2016

జిల్లాల పునర్విభజనలో భాగంగా తెలంగాణలో 21 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. దీంతో ఇప్పటికే ఉన్న పది జిల్లాలను కలుపుకుని 31 జిల్లాలతో తెలంగాణ కొత్త రూపాన్ని సంతరించుకుంది. దసరా సందర్భంగా కొత్త జిల్లాల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కోలాహలంగా జరిగిన ఈ వేడుకల్లో మంత్రులు కొత్త జిల్లాలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు స్వీకరించడంతో పరిపాలన ప్రజలకు మరింత చేరువ అయ్యింది. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్) నడిపల్లి సీతారామరాజు (ప్రముఖ విశ్లేషకులు) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు తెలిపిన అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో ను చూడండి..

10:00 - October 12, 2016

హైదరాబాద్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా తెలంగాణలో 21 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. దీంతో ఇప్పటికే ఉన్న పది జిల్లాలను కలుపుకుని 31 జిల్లాలతో తెలంగాణ కొత్త రూపాన్ని సంతరించుకుంది. దసరా సందర్భంగా కొత్త జిల్లాల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కోలాహలంగా జరిగిన ఈ వేడుకల్లో మంత్రులు కొత్త జిల్లాలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు స్వీకరించడంతో పరిపాలన ప్రజలకు మరింత చేరువ అయ్యింది.

31 జిల్లాలుగా తెలంగాణ ముఖచిత్రం
దసరా పండుగ వేళ.. తెలంగాణలో నవోదయం...!31 జిల్లాలతో సరికొత్తగా తెలంగాణ ముఖచిత్రం..ఇన్నాళ్లూ పది జిల్లాలకే పరిమితమైన తెలంగాణ.. ఇప్పుడు 31 జిల్లాలకు విస్తరించింది. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో 21 కొత్త జిల్లాలు అవిర్భవించాయి. దసరా రోజున ఆనందోత్సాహాల మధ్య కొత్త జిల్లాలను మంత్రులు ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, కళాకారుల ఆట... పాటలతో కొత్త జిల్లాల ప్రారంభోత్సవం వైభవోపేతంగా జరిగింది.

సిద్దిపేట జిల్లాను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
మెదక్‌ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన సిద్దిపేట జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. తాత్కాలిక కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. సిద్దిపేట జిల్లాను ప్రారంభించారు. అదే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా మంత్రులంతా సరికొత్త జిల్లాలను ప్రారంభించారు. సీఎం ఇలాఖాలోనే కొత్తగా ఏర్పాటైన మెదక్‌ జిల్లాను శాసనసభ ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. కలెక్టరేట్‌ను సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు.

మూడు జిల్లాలుగా కరీంనగర్
కరీంనగర్‌ జిల్లాలో.. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి కేంద్రాలుగా మూడు కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. సిరిసిల్ల కేంద్రంగా ఏర్పాటైన రాజన్న జిల్లాను మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాను ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర, జగిత్యాల జిల్లాను ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ లాంచనంగా ప్రారంభించారు. విజయ దశమి రోజుల ఈ జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. ప్రజల ఆకాంక్షల మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు ఈసందర్భంగా తెలిపారు.

ఆయా జిల్లాలలో ప్రారంభోత్సవాలు
ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లా భద్రాద్రిని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా పని చేస్తుంది. నిజామాబాద్‌ జిల్లాను పునర్వస్థీకరించి కామారెడ్డి కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేశారు. ఈ కొత్త జిల్లాను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివారెడ్డి ప్రారంభించారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతోనే జిల్లాలను పునర్వభజించినట్టు పోచారం చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు అధికార వికేంద్రీకరణ ఉపయోగపడుతుందన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాను.. నాగర్‌ కర్నూలు, వనపర్తి, గద్వాల కేంద్రాలుగా మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. నాగర్‌ కర్నూలు జిల్లాను పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల కేంద్రంగా ఏర్పాటైన జోగులాంబ జిల్లాను వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, వనపర్తి జిల్లాను ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు.

పాంచ్ పటాకా వరంగల్
వరంగల్‌ జిల్లాను విభజించి కొత్తగా నాలుగు జిల్లాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలను ఉప ముఖ్యంత్రి కడియం శ్రీహరి లాంచనంగా ప్రారంభించారు. మహబూబాబాద్‌ జిల్లాను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌, జనగామ జిల్లాను శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రారంభించారు. భూపాలపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ జయశకంర్‌ జిల్లాను అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి ప్రారంభించారు.

మూడు జిల్లాలుగా నల్లగొండ
పునర్వస్థీకరణలో భాగంగా నల్గొండను మూడు జిల్లాలుగా విభజించారు. సూర్యాపేట, భువనగిరి కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. సూర్యాపేట జిల్లాను ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరి కేంద్రంగా ఏర్పాటైన యాదాద్రి జిల్లాను హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాను విభజించి వికారాబాద్‌, మేడ్చల్‌ కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. మేడ్చల్‌ కేంద్రంగా ఏర్పాటైన మల్కాజ్‌గిరి జిల్లాను పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌, వికారాబాద్‌ జిల్లాలను రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు.

అడవుల జిల్లా ఆదిలాబాద్ నాలుగు జిల్లాలుగా
అడవుల జిల్లా ఆదిలాబాద్‌ను నాలుగు జిల్లాలుగా విభజించారు. నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. నిర్మల్‌ జిల్లాను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గోండు వీరుడు కొమురం భీమ్‌ పేరుతో ఆసిఫాబాద్‌ కేంద్రంగా ఏర్పాటైన జిల్లాను బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, మంచిర్యాల జిల్లాను ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు ప్రారంభించారు. 

సెక్స్ వర్కర్లపై సుప్రీం వ్యాఖ్యలు!..

ఢిల్లీ : అత్యాచారం కేసుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కస్టమర్లు డబ్బులు ఇవ్వనంత మాత్రాన సెక్స్ వర్కర్లు తమపై అత్యాచారం జరిగిందని చెప్పలేరని స్పష్టం చేసింది. ముగ్గురు వ్యక్తులను అత్యాచారం కేసులో నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలను తప్పనిసరిగా పరిశీలించాల్సిందేనని, అయితే.. వాస్తవాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బెంగళూరులో జరిగిన కేసులో ఈ తీర్పు వెలువడింది. పనిమనిషిగా చేసే ఒక మహిళ..

అమ్మను పరామర్శించనున్న అమిత్ జైట్లీలు ..

ఢిల్లీ : నేడు సీఎం జయలలితను బీజేపీ చీఫ్‌ అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పరామర్శించనున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఆమె అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇప్పటికే దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలు జయలలితను పరమర్శించడానికి రావడం జరిగింది. ఆమె త్వరగా కోలుకోవాలని దేవాలయల్లో తమిళిలు పూజలు కూడా నిర్వహిస్తున్నారు.

కేటీఆర్ అమెరికా పర్యటన..

హైదరాబాద్: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా బయలుదేరి వెళ్లారు. వారం రోజులపాటు అమెరికాలో కేటీఆర్ పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూజెర్సీ, న్యూయార్క్, సిలికాన్ వ్యాలీ, చికాగో, మిన్నెసొటా ప్రాంతంలో మంత్రి పర్యటిస్తారు. వాణిజ్య సమావేశాలు, అడ్వామెట్-16 సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశమై పలు ఒప్పందం చేసుకోనున్నారు.

రొట్టెల వేడుకకు 15లక్షల మంది..

నెల్లూరు : నేటి నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. బారాషహిద్ దర్గాలో ప్రారంభం కానున్న ఈ పండుగలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఈ ఏడాది ఉత్సవంలో 15 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా, కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, శ్రీలంక తదితర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. నేడు ప్రారంభం అవుతున్న ఈ పండుగ మూడు రోజులు పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు ఇక్కడికొచ్చి రొట్టెలను పంచుకోవడం వల్ల వారి కోర్కెలు తీరుతాయని విశ్వాసం.

శ్రీవారి పాదాల వద్ద అగ్రిప్రమాదం..

తిరుమల : శ్రీవారి పాదాల దగ్గరున్న అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున అకస్మాత్తుగా అటవీ ప్రాంతం నుంచి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపిస్తుండడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

08:31 - October 12, 2016

గుంటూరు : వెలగపూడిలో మరో కీలక ఘట్టం ఆవిషృతమయ్యింది.  వెలగపూడిలో సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన చాంబర్ ను ప్రారంభించారు. బుధవారం ఉదయం 8.09 గంటలకు ముఖ్యమంత్రి తన కార్యాలయాన్ని సంప్రదాయం ప్రకారంగా ప్రారంభించారు. అనరంతరం చంద్రబాబు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, సీఎం సిబ్బంది, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూజలు నిర్వహించిన అనంతరం సీఎం ఆసనంలో పూజారులు చంద్రబాబును ఆశీనుల్ని చేశారు.  పలువురు మంత్రులు,ఉన్నతాధికారులు,ప్రముఖులు  చంద్రబాబును సత్కరించారు. కాగా నేటి నుంచి అమరావతి కేంద్రంగానే పాలన సాగించనున్నారు. రాకెట్ లాంచర్లతో దాడి చేసినా ఎటువంటి నష్టం వాటిల్లనంతగా అత్యంత పటిష్టంగా రూపొందించారు.

సీఎం చంద్రబాబు కార్యాలయం విశేషాలు..
సీఎం కార్యాలయ భవనాన్ని అత్యంత పటిష్టంగా, రక్షణాత్మకంగా నిర్మిస్తున్నారు. రాకెట్ లాంచర్లతో దాడిచేసినప్పటికీ భవనానికి ఎటువంటి ముప్పు ఉండని రీతిలో నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత దృష్ట్యా పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో నిర్మాణం జరుగుతోంది. బాబు సూచనల మేరకు కార్యాలయంలో చిన్నచిన్న మార్పులు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం భవనాన్ని 72/70 మీటర్ల నిష్పత్తిలో 50 వేల చదరపు అడుగులు..ఒక్కో భవనంలో రెండు అంతస్తులున్నాయి. మొత్తంగా లక్ష చదరపు అడుగుల మేర నిర్మాణం చేపట్టారు. 11 మీటర్లతో 36 గదులు నిర్మించనున్నారు. ఈ భవనంలో ఏడు లిఫ్టులుండగా.. సీఎం కోసం ప్రత్యేకంగా ఓ లిఫ్ట్ కేటాయించారు.

ఇప్పటికే పలువురు మంత్రులు తమ శాఖలను ప్రారంభించారు..
అమరావతిలో మొత్తం ఆరు భవనాలుగా నిర్మిస్తున్న సచివాలయంలో ఇప్పటికే నాలుగు భవనాలు సిద్ధమయ్యాయి. 2,3,4,5 భవనాల్లో ఇప్పటికే మంత్రులు తమ శాఖలను ప్రారంభించేశారు. లాంఛనంగా ప్రారంభం కావాల్సిన రెండు భవనాల్లో ఒకటి ముఖ్యమంత్రి కార్యాలయ భవనం, రెండోది అసెంబ్లీ, మండలి సమావేశాల భవనం. ముఖ్యమంత్రి సహా ఆయన కార్యాలయ సిబ్బంది, సీఎస్, సీఎం కార్యదర్శులు, మంత్రివర్గ సమావేశ భవనం, వీడియో కాన్ఫరెన్స్, ఇతర సమావేశ మందిరాలు ఈ భవనంలోనే ఉన్నాయి. ఈ భవనం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

తన చాంబర్ ప్రారంభించిన చంద్రబాబు..

గుంటూరు : వెలగపూడిలో సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన చాంబర్ ను ప్రారంభించారు. బుధవారం ఉదయం 8.09 గంటలకు ముఖ్యమంత్రి తన కార్యాలయాన్ని సంప్రదాయం ప్రకారంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సీఎం సిబ్బంది పాల్గొన్నారు. అనరంతరం చంద్రబాబు పూజలు నిర్వహించారు. నేటి నుంచి అమరావతి కేంద్రంగానే పాలన సాగించనున్నారు. రాకెట్ లాంచర్లతో దాడి చేసినా ఎటువంటి నష్టం వాటిల్లనంతగా అత్యంత పటిష్టంగా రూపొందించారు.

07:58 - October 12, 2016

కర్నూలు : అంతా అనుకున్నట్లుగానే జరిగింది. కర్రల సమరంలో తలలు పగిలాయి. రక్తం చిందింది. ఎంతమంది పోలీసులు మోహరించినా.. కర్నూలు జిల్లాలోని దేవరగట్టు కర్రల యుద్ధాన్ని ఆపలేకపోయారు. దసరా సందర్భంగా దేవుని ఉత్సవ విగ్రహాల కోసం గ్రామస్తులు తలపడ్డారు. కర్రల సమరంలో 25 మంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం
కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో 25 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. స్వామివారి జైత్రయాత్రలో పాల్గొనేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని కనులారా తిలకించేందుకు పక్కరాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కర్నూలులోని దేవరగట్టులో మాలమల్లేశ్వరుడి కల్యాణం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్‌ మోహన్‌, ఎస్పీ రవికృష్ణ పర్యవేక్షణలో ఉత్సవ ఏర్పాట్లు చేశారు. 13 వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 50చోట్ల 100 సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలతో నిఘాను పర్యవేక్షిస్తున్నారు. ఇనుప రింగులు ధరించిన కర్రలతో భక్తులు రాకుండా పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరోవైపు బన్నీ ఉత్సవంలో గాయపడ్డ వారికి చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

ఆచారం పేరుతో కొనసాగుతున్న కర్రల సమరం...
దసరా అనగానే అందరికీ గుర్తొచ్చేది కర్నూలు జిల్లాలోని బన్ని ఉత్సవం. దేవుడి కోసమంటూ గ్రామాలకు గ్రామాలు.. కర్రలతో కొట్టుకునే ఆచారం గగుర్పాటును కలిగిస్తుంది. సంప్రదాయాలు, ఆచారాల కలబోతగా సాగే ఈ తతంగాన్ని ఆపాలని.. మేధావులు, పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఏటా విఫలమవుతూనే ఉన్నాయి. శత్రు సైన్యంపై యుద్ధానికి వెళుతున్నట్లు ఎలా... కర్రలు చేబూని దూసుకెళుతున్నారో...! కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి ఏటా దసరా పండగ రోజు రాత్రిపూట జరిగే ఈ తంతును బన్ని ఉత్సవం అని పిలుస్తారు. పేరుకే ఇది ఉత్సవం. కానీ నెత్తురోడేలా కర్రలతో పొరుగు గ్రామాల ప్రజల తలలు పగులగొట్టడమే దీని అంతిమ లక్ష్యం. ఎందుకిలా అంటే.. ఇలవేల్పు మాలమల్లేశ్వరుని మా ఊరికి తీసుకెళ్లేందుకే అంటారు వారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కేంద్రానికి 15కిలోమీటర్ల దూరంలో.. పచ్చని కొండల మధ్య వెలసిన దేవరగట్టు క్షేత్రం.. ప్రతి దసరా సందర్భంలోనూ చర్చనీయాంశంగా మారుతుంటుంది. పండగ నాటి అర్ధరాత్రి.. కాగడాల వెలుతురులో.. దేవుడి ఉత్సవమూర్తిని తమ గ్రామానికి తీసుకుపోవాలని దేవరగట్టు.. దాని పరిసర గ్రామాల ప్రజలు కర్రలతో విపరీతంగా దాడులు చేసుకోవడం ఆనవాయితీ.. కర్రలతో విపరీతంగా బాదుకుంటూ.. ఒంటి నుంచి ఎంత రక్తం చిందిస్తే అంత మేలు జరుగుతుందన్న స్థానికుల భావన.. ప్రస్తుత హైటెక్‌ రోజుల్లో విస్మయాన్ని కలిగించక మానదు. కానీ, చూసే వాళ్లకు హింసలా అన్పించినా.. అనాదిగా వస్తున్న సంప్రదాయమని.. ఇలా చేయడం తమకెంతో ఆనందదాయకమని స్థానికులు చెబుతుండడం బయటి వారిని విస్తుపోయేలా చేస్తుంది.

ఆధునిక యుగంలో అనాగరిక సంప్రదాయం
నవ నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్న.. నేటి ఆధునిక యుగంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలుంటాయా అంటూ.. పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కర్రయుద్ధంలో హింస జరుగుతుందనే పోలీసులు కూడా దీన్ని నిలువరించేందకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈసారి కూడా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. 

బారాషాహిద్ లో రొట్టెల పండుగ..

నెల్లూరు: బారాషాహిద్ దర్గాలో నేటి నుంచి ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ జరుగనుంది. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ వేడుకలు సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారని సమాచారం.

నేడు సీఎం చంద్రబాబు చాంబర్ ఓపెనింగ్..

అమరావతి: వెలగపూడి సచివాలయంలో నేడు ఏపీ సీఎం చాంబర్ ప్రారంభం. లాంఛనంగా సీఎం చాంబర్ లో అడుగుపెట్టనున్న చంద్రబాబు. కాగా చాంబర్ కు సంబందించిన పనులు పూర్తి కాకపోవటంతో ప్రారంభోత్సవానికి మాత్రమే సీఎం సరిపుచ్చనున్నారు. సీఎం చంద్రబాబు పూర్తిస్థాయి పాలన సచివాలయం నుండి మొదలు కావటానికి మరికొంత సమయం పట్టనుంది. 

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్..

హైదరాబాద్: కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నేడు అలాయ్ బలాయ్. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్,తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులతోపాటు ఉన్నతాధికారులు హజరుకానున్నారు.

స్క్రాప్ దుకాణంలో ఫైర్..

హైదరాబాద్ : ఎల్బీనగర్ లోని బైరామాల్ గూడాలో బుధవారం తెల్లవారుజామున ప్లాస్టిక్ స్క్రాప్ షాపులో మంటలు చెలరేగాయి. గమరనించిన స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని..పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

సర్జికల్స్ ను వాజ్ పాయ్ అడ్డుకున్నారు: ఆర్మీ

ఢిల్లీ : మాజీ ఆర్మీ చీఫ్ వీపీ మాలిక్ ఓ ఆసక్తికర వాస్తవాన్ని బయటపెట్టారు. 1999లో పీఓకేలోకి ప్రవేశించి సర్జికల్ దాడులు జరపడానికి తాము సిద్ధమయ్యామని... కానీ నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి తమను అడ్డుకున్నారని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయంగా ఒత్తిడులు రావడం, అదే సమయంలో దేశంలో ఎన్నికలు కూడా జరగనుండటంతో సర్జికల్ దాడులకు వాజ్ పేయి ఒప్పుకోలేదని చెప్పారు.

రష్యాకు భారత్ హెచ్చరికలు!..

ఢిల్లీ : రష్యాకు భారత్ హెచ్చరికలు జారీ చేసింది. పాములాంటి పాకిస్థాన్‌ తో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పాకిస్థాన్‌ తో సైనిక సహకారం అంటే కోరి సమస్యలు కొనితెచ్చుకోవడమే అవుతుందని భారత్ అభిప్రాయపడింది. ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సరర్ అయిన పాకిస్థాన్‌ తో సైనిక సహకారంపై పునరాలోచించుకోవాలని రష్యాకు తెలియజేశామని రష్యాలో భారత రాయబారి పంకజ్ శరన్ తెలిపారు. ఈ సైనిక సహకారం భవిష్యత్తులో సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

కుఠార్‌ యుద్ధనౌకలో విషాదం..

విశాఖపట్టణం : నేవల్ డాక్ యార్డ్ లో విషాదం చోటుచేసుకుంది. ఐఎన్‌ఎస్‌ కుటార్‌ యుద్ధ నౌకలో మిస్‌ఫైర్‌ అయింది. ఐఎన్ఎస్ కుఠార్ యుద్ధనౌకలో తుపాకులు శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో లెఫ్టినెంట్ తేజ్ వీర్ సింగ్ తుపాకీ తూటాతగిలి అక్కడికక్కడ మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసిన నేవల్ పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

'అమ్మ' బాధ్యతలన్నీ విధేయుడుకే..

తమిళనాడు : ముఖ్యమంత్రి జయలలిత శాఖలు పన్నీర్‌సెల్వంకు బదలాయించారు. ఈ మేరకు తమిళనాడు రాజ్‌భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. పన్నీర్‌సెల్వం కేబినెట్ సమావేశాలు నిర్వహించేందుకు అనుగూణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. జయలలిత తిరిగి విధులు నిర్వహించేవరకు శాఖలను పన్నీరుసెల్వం నిర్వహిస్తారు. జయలలిత ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

షియాలపై దాడి..30మందికి గాయాలు..

కాబూల్‌: ఆఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో షియా వర్గీయులపై దుండగులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. మరికొంతమందిని ముగ్గురు దుండగులు బందీలుగా చేసుకున్నట్లు సమాచారం.

కర్రల సమరంలో చిందిన రక్తం...

హైదరాబాద్‌: దేవరగట్టు కర్రల సమరంలో ఈసారి కూడా రక్తం చిందింది. కర్రల సమరంలో 21 మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు కాగడాల మంట అంటుకొని మరో ఐదుగురికి గాయాలయ్యాయి. దసరా సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో గ్రామస్థుల కర్రల సమరం ఆనవాయితీగా వస్తోంది.

బస్ బోల్తా..39మందికి గాయాలు..

మధ్యప్రదేశ్‌ : బస్సు బోల్తా పడింది. భోపాల్‌ నుంచి బాలాఘాట్‌ కి వెళ్తున్న బస్సు జిర్పా గ్రామంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 39 మంది పోలీసులు గాయపడ్డారు. వీరంతా వీఐపీ డ్యూటీ విధుల కోసం బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన 39 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Don't Miss