Activities calendar

13 October 2016

22:21 - October 13, 2016

వాషింగ్టన్ : అమెరికాకు చెందిన ప్రఖ్యాత గేయరచయిత బాబ్‌ డెలెన్‌కు 2016కు గాను సాహిత్యంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం దక్కింది.  అమెరికా గేయ సంప్రదాయంలో కొత్త కవితా భావజాలాన్ని రూపొందించినందుకు గానూ 75 ఏళ్ల బాబ్‌కు ఈ అవార్డ్‌ వరించింది. బాబ్‌ డెలెన్‌ 1941లో అమెరికాలో జన్మించారు. ఆయన అసలు పేరు రాబర్ట్‌ ఎలెన్‌ జిమ్మర్‌మ్యాన్‌. 1959లో ఓ కాఫీ హౌజ్‌ నుంచి తన మ్యూజికల్‌ కెరీర్‌ను ప్రారంభించారు. ఎన్నో సంప్రదాయ షోలతో గాయకుడిగా దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాబ్‌ రచించిన 'బ్లోయింగ్‌ ఇన్‌ ది విండ్‌', 'ది టైమ్స్‌ దే ఆర్‌ ఎ-చేంజింగ్‌' గేయాలు అమెరికా పౌర హక్కులు, యుద్ధ వ్యతిరేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చే గీతాలుగా రుజువయ్యాయి. పాటల రచయితకు అవార్డు దక్కడం సహజమే కానీ తొలిసారిగా ఓ గాయకుడికి సాహిత్య అవార్డు దక్కడం విశేషం.

22:19 - October 13, 2016

  ఢిల్లీ : లా కమిషన్ రూపొందించిన ప్రశ్నావళిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది. ట్రిపుల్ తలాఖ్‌తోపాటు ఇతర ముస్లిం మహిళలకు సంబంధించిన అంశాలపట్ల ప్రశ్నావళిని రూపొందించడాన్ని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తప్పుపట్టింది. లా కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించడంలేదని, కేంద్రం చెప్పుచేతల్లో ఉండి మాట్లాడుతోందని ముస్లిం పర్సనల్ లా బోర్డు చీఫ్ మౌలానా వలి రహ్మెన్ విమర్శించారు. లా కమిషన్ రూపొందించిన ప్రశ్నావళిని నిష్పక్షపాతంగా తయారు చేయలేదని దీన్ని బహిష్కరిస్తామని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛనిచ్చిందని, లా కమిషన్‌ తీరు ఇందుకు విరుద్ధంగా ఉందని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు మండిపడింది. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాలనే అంశంపైన లా కమిషన్ ప్రశ్నావళి రూపొందించింది.

 

22:12 - October 13, 2016

నిజామాబాద్ : సచివాలయంలో బీజేపీ నాయకులు ధర్నా చేయడాన్ని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తప్పుపట్టారు. హరిత తెలంగాణ సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఓర్వలేకే... కమలనాథులు రైతుల సమస్యలను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. 

22:07 - October 13, 2016

నెల్లూరు : బారాషాహీద్‌ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగకు రెండో రోజు భక్తులు పోటెత్తారు. దర్గాలో జరుగుతున్న గంధమహోత్సవానికి భక్తులు తరలివస్తున్నారు. స్వర్ణాల చెరవులో రొట్టెలు మార్చుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు మొదటిసారి ఈ ఉత్సవాల్లో పల్గొన్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నట్టు ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. 

 

22:00 - October 13, 2016

గుంటూరు : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధిచేసి, వారసత్వ సంపదను కాపాడేందుకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ టూరిజం, కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ బోర్డుకు తర్వలో కార్యరూపం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించి, ప్రతిపాదనలు తయారు చేయాలని పర్యాటక రంగాభివృద్ధి  సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
వెలగపూడిలో రెండో రోజు చంద్రబాబు బిజీబిజీ 
గుంటూరు జిల్లా వెల్లగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ గడిపారు. వివిధ అంశాలపై మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. 
టూరిజం, కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం 
పర్యాటకరంగం అభివృద్ధిపై సమీక్షించిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌ టూరిజం, కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ బోర్డు పర్యాటక ప్రాధికార సంస్థ, సాంస్కృతిక కమిషన్‌, వారసత్వ సంపద పరిరక్షణ ప్రాధికార సంస్థలను పర్యవేక్షిస్తుంది. ఈ మూడు సంస్థల్లో నిపుణులను నియమిస్తారు. వీటి ఆధ్వర్యంలో జిల్లా, నగర స్థాయిల్లో కూడా  సాంస్కృతిక మండళ్లు  ఏర్పాటు చేస్తారు. జిల్లా పర్యాటక, సాంస్కృతిక మండలికి కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారు. నగర పర్యాటక, సాంస్కృతిక మండలికి మున్సిపల్‌ కమిషనర్‌ చైర్మన్‌గా వ్యవహరించేలా విధివిధానాలు ఖరారు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పర్యాటకాభివృద్ధి ప్రణాళికలు రూపొందించి, పెట్టుబడులు ఆకర్షించేలా ఇవి పని చేస్తాయి. 
అమరావతిలో 20..25 ఎకరాల్లో శాశ్వత కళావేదిక 
ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనిలో భాగంగా అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం దేవాలయాల అభివృద్ధికి బృహత్‌ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రాజధాని అమరావతిలో ప్రతి ఏటా డిసెంబర్‌లో  భారీ స్థాయిలోఅంతర్జాతీయ సాంస్కృతికోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం తెలుగు కళలు, సంస్కృతి ప్రబింబించేలా 20 నుంచి 25 ఎకరాల్లో శాశ్వత వేదిక ఏర్పాటు చేస్తారు. అమరావతిని ప్రపంచంలోఅతిపెద్ద సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సందర్శనకు వచ్చే పర్యాటకులు విడిది చేసేందుకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. 
చంద్రబాబుతో స్పీకర్‌ కోడెల భేటీ
అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. వెలగపూడిలో నిర్మిస్తున్న శాసనసభ తాత్కాలిక భవనాల్లో చేపట్టాల్సిన ఇంటీరియర్‌ డిజైనింగ్‌పై సీఆర్‌డీఏ అధికారులు, నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులతో సమీక్షించారు. 

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి

కరీంనగర్ : రూ.30 వేలు లంచం తీసుకుంటూ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఆర్ ఐ కరీముల్లాఖాన్ ఎసిబికి చిక్కాడు. 

తనూజ ఆత్మహత చేసుకున్నట్లు పోలీసుల నిర్ధారణ

విశాఖ : తనూజ మృతి కేసును పోలీసులు ఛేదించారు. తనూజ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. తనూజను వేధించిన దిలీప్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. జులై 24న కృష్ణరాయపురంలోని ఓ అపార్ట్ మెంట్ పై నుంచి తనూజ దూకింది. 

ముంబైలో కూలిన 5 అంతస్తుల భవనం.. 6 మంది చిన్నారుల మృతి

ముంబై : నగరంలో 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. మరో ఐదుగురిని సహాయక సిబ్బంది రక్షించింది. 

 

వరంగల్ లో కొత్తగా ఏర్పడ్డ ఐదు జిల్లాలకు సీపీఎం కార్యదర్శుల ఎన్నిక

వరంగల్ : కొత్తగా ఏర్పడ్డ ఐదు జిల్లాలకు సీపీఎం కార్యదర్శులను ఎన్నుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శిగా ఎస్.వాసుదేవరెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శిగా ఎం.చుక్కయ్య, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శిగా ఎస్.శ్రీనివాస్,  భూపాలపల్లి జిల్లా కార్యదర్శిగా కృష్ణారెడ్డి, జనగామ జిల్లా కార్యదర్శిగా యు.రవి ఎన్నికయ్యారు.

21:03 - October 13, 2016

దసరా దావత్ జేసుకున్న తెలంగాణ సర్కార్ .. 13 శాతం ఎక్కువదాగిన పబ్లిక్, బ్రహ్మంగారి అవతారమెత్తిన ముఖ్యమంత్రి.. ఎన్నికలు కాకముందుకే ఫలితాలు విడుదల, దరిద్రానికి దగ్గరైతున్న భారతదేశం... ఎటువాయే మేడిన్ ఇండియా ఏషం, రావణాసురిని జాగల ఎమ్మెల్యే బొమ్మ...తలగవెట్టి కసితీర్చుకుంట్ను రెంజర్ల జనం, ఉడుకు రక్తం ఎస్సైల ఉత్తుత్త లడాయిలు.. సర్కార్ మెడకు వడుతున్న పంచాదులు, సగురం కొరికిన స్నాప్ డీల్ కంపెనోడు.. అట్టకు ఆడర్ జేస్తే చెక్కతునకొచ్చింది.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...
 

20:50 - October 13, 2016
20:48 - October 13, 2016
20:47 - October 13, 2016
20:45 - October 13, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలో అక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ డిమాండ్ చేశారు. తుందుర్రు, కంసాలబేతపూడి గ్రామాల్లో ఆమె పర్యటించి బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు సర్కార్‌పై ఆమె నిప్పులు చెరిగారు. అక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రజలపై దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టిన వారిని విడిపిస్తామని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. 

 

20:42 - October 13, 2016

హైదరాబాద్ : ప్రధానమంత్రికి వైఎస్ జగన్ లేఖ రాశారు. స్వచ్ఛంద నల్లధనం వెల్లడి పథకం 2016పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఆదాయాన్ని వెల్లడించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చెబుతున్నా..చంద్రబాబు మాత్రం ఆ వివరాలు బయటకు చెబుతున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ వ్యక్తి 10 వేల కోట్ల నల్లధనాన్ని వెల్లడించారని..ఈ సమాచారం చంద్రబాబుకు ఎలా లభ్యమైందో బయటపెట్టాలన్నారు. బహుశా ఆయన చంద్రబాబు బినామీ అయి ఉండొచ్చన్నారు. 
జగన్‌పై దేవినేని ఉమా ఆగ్రహం
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. 10 వేల కోట్ల నల్లధనాన్ని జగన్‌ తెల్ల ధనంగా మార్చుకున్నారని ఉమా ఆరోపించారు. అవినీతికి జగన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అని ఉమా అన్నారు. 
దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది : రాజేంద్రనాథ్ రెడ్డి 
అవినీతి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని వైసీపీ 
ఎమ్మెల్యే రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్వచ్చంధ ఆదాయ వెల్లడి పథకం కింది రాష్ట్రం నుంచి ఒకే వ్యక్తి పదివేల కోట్ల వెల్లడించినట్టు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని  రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. 

 

20:37 - October 13, 2016

పశ్చిమగోదావరి : ఏలూరులో కంచె పెదకృష్ణ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేష్‌, రాజశేఖర్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఉదయం కృష్ణపై కత్తులతో దాడిచేసి దుండగులు దారుణంగా హత్య చేశారు. 

 

20:33 - October 13, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఈ దిశగా  ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు లయన్స్‌, రోటరీ క్లబ్‌లు, స్వచ్చంధ సేవా సంస్థలు, వైద్య సంఘాలు  సహకారం అందిచాలని మంత్రి కోరారు. ప్రపంచ అంధత్వ నివారణ దినోత్సవం సందర్భంగా విజన్‌ 2020 - ది రైట్‌ టూ సైట్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన  పరుగును లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా అరవై దేశాల్లో వరల్డ్‌ సైట్‌ డేని పాటించారు. పలువురు నేత్రవైద్యులు, స్వచ్చంధ సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

20:31 - October 13, 2016

మెదక్ : సీఐటీయూ'రాష్ట్ర ద్వితీయ మహాసభలకు సంగారెడ్డి సిద్ధమైంది. మూడు రోజుల పాటు సాగే సభలకు పలువురు జాతీయ నాయకులూ హాజరుకానున్నారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలకు సంగారెడ్డి వేదిక కానుంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సభలు జరగనున్నాయి. సభలను పురస్కరించుకుని.. సంగారెడ్డిలోని వివిధ కూడళ్లను తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. సంఘం జాతీయ కార్యదర్శులు స్వదేశీదేవ్‌ రాయ్‌, కె.హేమలత తదితరులు ఈ సమావేశాలకు పరిశీలకులుగా హాజరుకానున్నారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ నలుమూలల నుంచి సుమారు ఏడు వందల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. 

 

20:28 - October 13, 2016

వరంగల్ : నకిలీ విత్తనాలు, వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ తెలంగాణ టీడీపీ వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. హన్మకొండలోని ఏకశిలా పార్క్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు జరిగిన ఈ ర్యాలీలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద  సంఖ్యలో పాల్గొన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని నేతలు విమర్శించారు. నకిలీ విత్తనాలు రైతుల నడ్డి విరిచాయని పేర్కొన్నారు. వర్షాలు, వరదలకు రైతులు పంట నష్టపోయారని వాపోయారు. రైతులను ఆదుకోవడంలో ప్రభత్వం విఫలమైందని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

20:23 - October 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. పార్టీ నేతలతో కలిసి సచివాలయంలో నిరసన తెలిపిన ఆయన.. రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన ఇన్‌ఫుట్‌ సబ్సిడీ 791 కోట్లు..ఆర్నెళ్లు గడుస్తున్నా రైతులకు ఇవ్వలేదన్నారు. రైతు రుణమాఫీ బకాయిల విడుదలలోనూ జాప్యం చేయడం తగదన్నారు. 

 

20:10 - October 13, 2016

జమ్మూకశ్మీర్ : శ్రీనగర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో మళ్లీ కర్ఫ్యూ విధించారు. నౌహట్ట, ఖన్యర్‌, రైనవరి, సఫకదల్, మహారాజ్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కశ్మీర్‌ లోయలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా 144 సెక్షన్‌ను కొనసాగిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు. అయితే కొన్ని పౌర ప్రాంతాల్లో ఆటో రిక్షా లాంటి ప్రయివేట్‌ వాహనాలను అనుమతించారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్‌ లోయలో గత 97 రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో సామాన్య జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

20:06 - October 13, 2016

ఢిల్లీ : సీమాంతర ఉగ్రవాదం విషయంలో భారత్‌ తీసుకుంటున్న చర్యలను అమెరికా మద్దతు పలికింది. అయితే భారత్‌-పాక్‌ సరిహద్దులో ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుదేశాలు సంయమనం పాటించాలని వైట్‌ హౌజ్‌ అధికార వర్గాలు సూచించాయి. ఎల్వోసి వద్ద ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ చేపట్టిన సైనిక దాడులను సమర్థించింది. యూరీ ఘటన సీమాంతర ఉగ్రవాదమేనంటూ దక్షిణ ఆసియా భద్రతా వ్యవహారాల సీనియర్‌ డైరెక్టర్‌ పీటర్‌ లెవోయ్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆఖరులోగా ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు చోటు దక్కుతుందన్న ఆశాభావాన్ని అమెరికా వ్యక్తం చేసింది. ఇందు కోసం అమెరికా అన్ని రకాల ప్రయత్నం చేస్తుందని లెవోయ్‌ తెలిపారు.

 

19:20 - October 13, 2016

హైదరాబాద్ : నల్లధనంపై ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లేఖ రాశారు. దేశంలో నల్లధనం నియంత్రించాలంటే రూ.500, రూ.1000 నోట్లను నిషేధించాలని సూచించారు. ధన ప్రవాహంపై నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలని... అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలని లేఖలో తెలిపారు. 

చంద్రబాబు ప్రజల బాబు కాదు.. కంపెనీల బాబు : బృందాకరత్

పశ్చిమగోదావరి : ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా భీమవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పాల్గొన్నారు. చంద్రబాబు ప్రజల బాబు కాదు.. కంపెనీల బాబు అని ఎద్దేవా చేశారు. వృత్తిని మరిచి రంగనాధ రాజు, విశ్వనాధరాజుల ఇటుకలకు, ఇసుకకు పోలీసులు కాపలా కాస్తున్నారని విమర్శించారు. మోడీ, చంద్రబాబుల బుద్ధి ఒక్కటే అని మండిపడ్డారు. 

 

18:31 - October 13, 2016

హైదరాబాద్ : ప్రధానమంత్రికి వైఎస్ జగన్ లేఖ రాశారు. స్వచ్ఛంద నల్లధనం వెల్లడి పథకం 2016పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఆదాయాన్ని వెల్లడించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చెబుతున్నా..చంద్రబాబు మాత్రం ఆ వివరాలు బయటకు చెబుతున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ వ్యక్తి 10 వేల కోట్ల నల్లధనాన్ని వెల్లడించారని..ఈ సమాచారం చంద్రబాబుకు ఎలా లభ్యమైందో బయటపెట్టాలన్నారు. బహుశా ఆయన చంద్రబాబు బినామీ అయి ఉండొచ్చన్నారు. 

 

17:55 - October 13, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంతరావు మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో గల్లీలు తెలియని వ్యక్తిని మున్సిపల్‌ మంత్రిగా కొనసాగించరాదన్నారు. స్థానికంగా ఉన్న ముగ్గురు మంత్రుల్లో ఎవరికో ఒకరికి ఆ పదవిని కట్టబెట్టాలన్నారు. హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీ అద్వాన్నంగా ఉన్నా కేటీఆర్‌కు పట్టించుకునే తీరికలేదన్నారు. పెట్టుబడుల కోసం కేటీఆర్‌ విదేశాలు తిరుగుతున్నారని..అందుకే మున్సిపల్‌ మంత్రి పదవి నుంచి తప్పించాలన్నారు.  

 

గోరఖ్ పూర్ జైలులో పోలీసులు, ఖైదీల మధ్య ఘర్షణ

యూపీ : గోరఖ్ పూర్ జైలులో పోలీసులు, ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

తెలంగాణలో రికార్డు స్థాయి మద్యం విక్రయాలు

హైదరాబాద్ : తెలంగాణలో రికార్డు స్థాయి మద్యం విక్రయాలు జరిగాయి. దసరాకు రూ.585 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. లిక్కర్ అమ్మకంలో నల్లగొండకు ప్రథమస్థానం లభించింది. 

స్విస్ ఛాలెంజ్ విధానంపై ప్రభుత్వం తరపు వాదనలు పూర్తి

హైదరాబాద్ : స్విస్ ఛాలెంజ్ విధానంపై డివిజన్ బెంచ్ లో ప్రభుత్వం తరపు వాదనలు పూర్తి అయ్యాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎపి ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. 

సినీ స్టంట్ మాస్టర్ సాంబశివరావు కన్నుమూత

హైదరాబాద్ : సినీ స్టంట్ మాస్టర్ సాంబశివరావు (89) కన్నుమూశారు. 4 దశాబ్ధాల పాటు 600 లకు పైగా సినిమాలకు ఆయన స్టంట్ మాస్టర్ గా పని చేశాడు. సర్ధార్ పాపారాయుడు, కొండవీటి దొంగ, ప్రతిఘటన వంటి సినిమాలకు సాంబశివరావు స్టంట్ మాస్టర్ గా పని చేశారు. 

 

తిరుమలకు చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్

చిత్తూరు : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ ఈవో సాంబశివరావు చీఫ్ జస్టిస్ కు స్వాగతం పలికారు. ఠాకూర్ రాత్రికి తిరుమలోనే బస చేయనున్నారు. శ్రీవారి దర్శనార్థం చీఫ్ జిస్టిస్ తిరుమలకు విచ్చేశాడు. ఠాకూర్ తోపాటు జస్టిస్ ఎన్ వీ రమణ తిరుమలకు విచ్చేశాడు. 

అమెరికన్ పాప్ సింగర్ బాబ్ డిలాన్ కు నోబెల్ బహుమతి

వాషింగ్టన్ : అమెరికన్ పాప్ సింగర్ బాబ్ డిలాన్ కు నోబెల్ బహుమతి లభించింది. సాహిత్యంలో డిలాన్ నోబెల్ పురస్కారం గెలుచుకున్నారు. 

భోపాల్ లో భారీ అగ్ని ప్రమాదం

మధ్యప్రదేశ్ : భోపాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న  ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

 

16:54 - October 13, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. మెట్రో పిల్లర్‌ గోతిలో పడి బాలుడు దుర్మరణం చెందారు. నర్సిహ్మ అనే ఏడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి పాత గాంధీ ఆస్పత్రి వద్ద మెట్రో పిల్లర్‌ గోతిలో ప్రమాదవశాత్తు పడి పోయాడు. ఇటీవల వచ్చిన వర్షాలకు గోతిలోకి నీరు చేరింది. ఎవరూ చూడకపోవడంతో చిన్నారి మృతి చెందాడు. ఎక్కడ వెతికినా దొరకలేదు. దీంతో అనుమానం వచ్చి గోతిలో చూశారు. బాలుడి మృత దేహం లభ్యం అయింది. పోలీసులు కేసు నమోదు దర్యాస్తు చేస్తున్నారు. 

 

సికింద్రాబాద్‌లో విషాదం

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. పాత గాంధీ ఆస్పత్రి వద్ద మెట్రో పిల్లర్‌ గోతిలో పడి ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. 

 

16:46 - October 13, 2016

చిత్తూరు : తిరుపతిలో హీరోయిన్‌ రెజీనా సందడి చేశారు. ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ కు వచ్చిన రెజీనాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. తెలుగులో నక్షత్రం సినిమాతో పాటు తమిళంలో మరో మూడు సినిమాలకు కమిట్‌ అయినట్లు రెజీనా చెప్పారు. 

 

16:45 - October 13, 2016

నిజామాబాద్ : సామాజిక న్యాయం కోసమే సీపీఎం పాదయాత్ర చేపట్టిందని... నిజామాబాద్‌ జిల్లా పార్టీ కార్యదర్శి రమేశ్ బాబు అన్నారు. ఈ నెల 17న ఇబ్రహీంపట్నంలో ఈ పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. పాదయాత్రను జయప్రదం చేయాలంటూ నగరంలో 2 కే రన్‌ నిర్వహించారు.

 

16:40 - October 13, 2016

శ్రీకాకుళం : దేవుడు వరమిచ్చినా పూజారి కనకరించడం లేదు అన్నట్లుగా మారింది జీడిపప్పు రైతుల పరిస్థితి. అంతర్జాతీయ స్ధాయిలో పలాస జీడిపప్పు ధర రికార్డుస్థాయిలో పలుకుతుండగా...రైతులకు మాత్రం కనీస మద్దతు ధర కూడా లభించని పరిస్థితి. మార్కెట్‌లో కిలో జీడిపప్పు ధర వెయ్యి రూపాయలు పలుకుతుండగా... అందులో కేవలం మద్దతు ధర 150 రూపాయలకు మించడం లేదు..! బిర్యానీలో జీడిపప్పు ఉంటే దాని రుచే వేరు...జీడిపప్పుతో ఉప్మా చేస్తే లొట్టలేసుకొని తింటారు. ..జీడిపప్పు పాయసం దాని రుచి అమృతం... ఇలాంటి ప్రియమైన వంటకాలలో విరివిగా వాడే జీడిపప్పు ధరలు ఆకాశనంటాయి. 
జీడిపప్పు ఉత్పత్తికి కేరాఫ్ పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ పట్టణం జీడిపప్పు ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్. ఈ ప్రాంతంలో రోజు టన్నుల కొద్దీ జీడిపప్పు ఎగుమతులు జరుగుతుంటాయి. పలాస ఇండస్ట్రియల్ సెంటర్ అనంతపురం వద్ద 170 వరకూ కేష్యూ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అయితే స్థానికంగా జీడిపప్పు ధర వినియోగదారులను బెంబేలేత్తిస్తోంది. పలాసలో ప్రస్తుతం 720 రూపాయల నుండి 950 రూపాయల వరకూ మూడు రకాల క్వాలిటీ  జీడిపప్పు ధర పలుకుతోంది. ఎ వన్ (A 1) రకం జీడిపప్పు 1000 రూపాయలకు చేరింది. మునుపెన్నడూ లేనంతగా పలాస జీడిపప్పు రికార్డ్ స్థాయిలో రేటు పలుకుతోంది. గతఏడాది గరిష్టంగా 600 రూపాయలు పలికితే ఇప్పుడు వెయ్యి రూపాయలకు చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
జీడిపప్పు కొనడానికి జంకుతున్న రెస్టారెంట్లు
పలాస నుండి భువనేశ్వర్, బ్రహ్మపుర, విశాఖ, విజయవాడ ,హైదరాబాద్ లాంటి నగరాలకు హోల్ సేల్ గా జీడిపప్పును విక్రయిస్తుంటారు. పప్పుధర అమాంతంగా పెరగడంతో నిత్యం వినియోగించే రెస్టారెంట్ల యాజమాన్యాలు జీడిపప్పు కొనడానికి జంకుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించడం వల్ల కూడా జీడిపప్పు ధరలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. కిలో జీడిపప్పు ధర గత ఏడాదితో పోలిస్తే 400 రూపాయలు అదనంగా పెరిగింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరల పెరుగుదలకు కారణం అవుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. 
ఫలితం అందని రైతు
గరిష్టంగా జీడిపప్పు రేటు పలుకుతున్నా రైతుకు మాత్రం ఫలితం అందడం లేదు. నెంబర్ వన్ క్వాలిటీ రకం జీడిపప్పు కిలో 1000 రూపాయలు ఉంటే రైతులు పండించే జీడిపిక్కలు కేజీ 150 మించి లభించడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొత్తం మీద గడచినా కొన్ని దశాబ్దాలుగా ఇంత రేటు ఎప్పుడు లేదని వ్యాపారులు సైతం అంగీకరిస్తున్నారు.

16:34 - October 13, 2016
16:31 - October 13, 2016

హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై  ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం ప్రకటించాలని టీజేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. ఫీజుల రీ ఎంబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ పథకాలకు చెల్లింపులు నిలిచిపోవడం చూస్తుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించకపోవడాన్ని కోదండరామ్‌ తప్పు పట్టారు. రాష్ట్రానికి  కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయా... లేదా... వచ్చిన నిధులను వేర్వేరు కార్యక్రమాలకు మళ్లిస్తున్నారా ... అన్న విషయాలు తెలియాలంటే ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం అవసరమన్నారు. 

 

16:26 - October 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం ఎదుట బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. రైతులకు మూడో విడత రైతు రుణమాఫీ బకాయిలతో పాటు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ నేతలు హెచ్చరించారు. పోలీసులు ఎంత చెప్పినా ఆందోళన  విరమించలేదు. దీంతో పోలీసులు నేతలను అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:15 - October 13, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్వహిస్తున్న శాఖలను ఆర్థికమంత్రి పన్నీర్‌ సెల్వంకు అప్పగించడంపై వస్తున్న విమర్శలను అన్నాడిఎంకె తిప్పికొట్టింది. ఆమె మౌఖిక అనుమతితోనే పన్నీర్‌ సెల్వంకు అప్పగించడం జరిగిందని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సరస్వతి స్పష్టం చేశారు. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా జయలలిత వద్దకు డాక్టర్లు తప్ప ఇతరులెవరు వెళ్లడానికి వీలు లేదని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి సలహా లేకుండా అన్నాడిఎంకె ఏ నిర్ణయం తీసుకోదని పేర్కొన్నారు. జయలలిత ఆరోగ్యం మెరుగవుతోందని ఆమె పత్రికలు కూడా చదువుతున్నారని వెద్యులు చెప్పినట్లు అన్నాడిఎంకె వెల్లడించింది. జయలలిత సూచన మేరకే ఆమె వద్ద ఉన్న పోర్టుఫోలియోలను పన్నీర్‌సెల్వానికి కేటాయించినట్లు గవర్నర్ పేర్కొనడంపై డీఎంకే అధినేత ఎంకే కరుణానిధి ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగం ప్రకారమే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారా? అంటూ ప్రశ్నించారు. 

 

16:07 - October 13, 2016

తూర్పుగోదావరి : ఫలానా విత్తనాలనే వాడండి. అధిక దిగుబడులు పొందండి అంటూ ప్రభుత్వం చేసిన విస్తృత ప్రచారానికి అన్నదాతలు బలైపోయారు. ఆర్పీ బయో 226 రకం విత్తనాల వాడకంతో నిండా మునిగారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా తాలు ఉండటంతో.. దిక్కుతోచని స్థితిలో రైతులు లబోదిబోమంటున్నారు. నకిలీ విత్తనాల  సాగుతో తీవ్రంగా నష్టపోయిన తూర్పుగోదావరి జిల్లా రైతులపై 10టివి స్పెషల్‌ స్టోరీ...! 
అన్నదాతల ఆక్రందన
ఇదీ..తూర్పుగోదావరి జిల్లాలోని అన్నదాతల ఆక్రందన. వర్షాభావం నేపథ్యంలో నీటి ఎద్దడిని, ఎండ తెగులును తట్టుకుని స్వల్పకాలంలో అధిక దిగుబడులు సాధించేందుకు ఆర్పీ బయో 226 రకం విత్తనాలనే వాడాలని ఏపీ వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత ప్రచారం చేశారు. దీంతో అన్నదాతలంతా ఆర్పీ బయో 226 విత్తనాలను వాడి.. పంటలు వేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో 70 శాతానికి మించి తాలు ఉండటంతో రైతన్నలు లబోదిబో మంటున్నారు. 
ఆర్పీబయో 226 రకం విత్తనాలు
ఆర్పీబయో 226 రకం విత్తనాలను ఏపీ రాష్ట్ర విత్తనాభివృద్ధిశాఖ తొలిసారిగా రైతులకు సబ్సిడి ద్వారా అందజేసింది. తక్కువ నీటి వసతి, స్వల్పకాలంలో అధిక దిగుబడి వస్తుందని తెగులును నివారిస్తుందని రైతులను నమ్మించింది. ఆమేరకు విస్తృత ప్రచారం చేసింది. దీంతో రాజమహేంద్రవరం రూరల్‌, జగ్గంపేట, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం, పెద్దాపురం మండలాల్లోని దాదాపు పదివేల ఎకరాల్లో రైతులు ఆర్పీ బయో 226 రకం విత్తనాలను సాగు చేశారు. ఎంతో కష్టపడి పంటలు పండించారు. కానీ.. పంట చేతికొచ్చే దశలో తాలు గింజలు ఎక్కువ ఉండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
రైతుల్లో ఆందోళన 
ఎకరానికి ముప్పైవేలు ఖర్చు చేసిన రైతులు.. కనీస పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన ఆర్పీ బయో 226 విత్తనాల్లో నకిలీ విత్తనాలు కలవడం వల్లే పంటలో తాలు ఎక్కువ వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అయితే ఆ విత్తనాలు సరఫరా చేసింది ప్రభుత్వమే కాబట్టి.. తమకు సర్కారే నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాల సరఫరాపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించి.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు. 

 

15:58 - October 13, 2016

అనంతపురం : జిల్లాలో చిన్నారి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. కదిరి మండలం కూటసల్లా గ్రామంలో తెల్లవారు జామున 5 ఏళ్ల పాప అనుషాను గుర్తు తెలియని దుండుగులు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

బారాషాహీద్ దర్గాను సందర్శించనున్న సీఎం చంద్రబాబు

నెల్లూరు : సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. బారాషాహీద్ దర్గాను సీఎం సందర్శించనున్నారు. 

15:52 - October 13, 2016

ముంబై : స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. యూరప్‌ మార్కెట్ల ప్రభావంతో ఒక్కసారిగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 470 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 147 పాయింట్లు నష్టపోయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబై : స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. యూరప్‌ మార్కెట్ల ప్రభావంతో ఒక్కసారిగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 470 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 147 పాయింట్లు నష్టపోయింది. 

 

రాష్ట్ర ఆర్థికపరిస్థితి బావుంటే అప్పులపై ఎందుకంత మోజు..? రావుల

హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బావుంటే అప్పులపై ఈ ప్రభుత్వానికెందుకంత మోజు అని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. జీహెచ్ ఎంసీని దివాళా తీయించారని, ఆరోగ్యశ్రీ, ఫీజురీఎంబర్స్ మెంటుకు నిధులివ్వడం లేదని విమర్శించారు. ట్రెజరీలకు ఆంక్షలు విధించారని నిలదీశారు.

15:13 - October 13, 2016

హైదరాబాద్ : రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ నిధులు రిలీజ్ చేయాలని బీజేపీ నేతలు సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు. అనంతరం తెలంగాణ సచివాలయంలో సీఎం కార్యాలయం సమత బ్లాక్ ముందు ఆ పార్టీ నేతలు బైఠాయించారు. ఇన్ పుట్ సబ్సడీ నిధులు విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో కిషన్ రెడ్డి, ప్రభాకర్, నాగం జనర్ధన్ రెడితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 

 

బీజేపీ నేతల అరెస్టు

హైదరాబాద్ : రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ నిధులు రిలీజ్ చేయాలని బీజేపీ నేతలు సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు. అనంతరం సీఎం కార్యాలయం సమత బ్లాక్ ముందు నేతలు బైఠాయించారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

 

15:02 - October 13, 2016

యాదాద్రి : మోత్కూరులో ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హైదరాబాద్ వెళ్తున్న చెంగిచెర్ల డిపో బస్సులను స్థానిక ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు. యాదగిరి గుట్ట డిపో బస్సులోని వెళ్లాలని హుకుం జారీ చేశారు. టికెట్ డబ్బులు చెల్లించకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బస్టాండ్ లో రెండు గంటలుగా ప్రయాణికుల పడిగాపులు గాస్తున్నారు.

మోత్కూరులో ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం

యాదాద్రి : మోత్కూరులో ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హైదరాబాద్ వెళ్తున్న చెంగిచెర్ల డిపో బస్సులను స్థానిక ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు. యాదగిరి గుట్ట డిపో బస్సులోని వెళ్లాలని హుకుం జారీ చేశారు. టికెట్ డబ్బులు చెల్లించకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బస్టాండ్ లో రెండు గంటలుగా ప్రయాణికుల పడిగాపులు గాస్తున్నారు. 

నయీం భార్య, సోదరికి 14 రోజుల రిమాండ్

జగిత్యాల : గ్యాంస్ స్టర్ నయీం భార్య హసీనా, సోదరి సలిమాను కోరుట్ల కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 

సీఎస్ రాజీవ్ శర్మను కలిసిన బీజేపీ నేతలు

హైదరాబాద్ : రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ నిధులు రిలీజ్ చేయాలని బీజేపీ నేతలు సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు. సమత బ్లాక్ ముందు నేతలు బైఠాయించారు.  

 

ఆరాధన మృతి కారకులపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్తలో ఫిర్యాదు

హైదరాబాద్ : ఆరాధన మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్తలో బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. 24లోగా నివేదిక సమర్పించాలని నార్త్ జోన్ డీసీపీకి ఆదేశాలు జారీ చేసింది. 

 

లిఫ్టు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళ మృతి

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో లిఫ్టు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పోచమ్మ అనే మహిళ మృతి చెందారు. మెదక్ జిల్లాకు చెందిన పోచమ్మ గత వారం రోజుల క్రితం లిఫ్టు ప్రమాదంలో గాయపడింది. 

 

14:01 - October 13, 2016
13:58 - October 13, 2016

పశ్చిమగోదావరి : ల్లాలో ఆక్వాఫుడ్‌ పార్క్ నిర్మాణం ఆపేవరకూ తమ పోరాటం ఆగదని...సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ అన్నారు. వాతావరణాన్ని కాలుష్యంచేసే ఇలాంటి పరిశ్రమల ఏర్పాటు సరికాదని ప్రభుత్వానికి సూచించారు.. ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా పోరాడి ప్రస్తుతం తణుకు జైల్లోఉన్న సత్యవతిని బృందాకారత్‌ పరామర్శించారు.. ఆక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా పోరాడిన సీపీఎం సభ్యురాలు సత్యవతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని ఆమె ఖండించారు. అన్యాయాన్ని ప్రశ్నించినవారిని చంద్రబాబు జైలుకు పంపించం అమానుషమని ఆమె పేర్కొన్నారు. ఈ పార్క్ ను నిర్మాణం నిలిపివేసేవరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని మరోసారి బృందా కరత్ స్పష్టం చేశారు. 

13:54 - October 13, 2016

అమెరికా : తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు.. వారం రోజుల పాటు కేటీఆర్ అమెరికాలోనే ఉంటారు.. వాషింగ్టన్‌లో పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులతో సమావేశమైన కేటీఆర్‌.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.. ఆ తర్వాత అమెరికాలో భారత రాయబారి తరణ్‌ జీత్‌ సింగ్‌ తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణతో అమెరికాలోని రాష్ట్రాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు పెంపుకు సహకరించాలని కోరారు. బోయింగ్‌ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ బెర్‌ ట్రాన్స్‌ మార్స్‌ అలెన్‌ కలిసిన కేటీఆర్‌.. ఎయిరో స్పెస్‌ రంగంలో విద్యార్థులు, యువతకు శిక్షణ, నైపుణాభివృద్ధిపై చర్చించారు. రేపు వాషింగ్టన్‌లో జరగబోయే టీ-హబ్‌ సదస్సులో కేటీఆర్‌ పాల్గొంటారు.మరింత సమాచారానికి వీడియో చూడండి..

13:44 - October 13, 2016

అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినాన్ని ప్రపంచంలోని 100కు పైగా దేశాలు పాటిస్తున్నాయి. ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఎంహెచ్) దీన్ని 1992లో ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లో విద్యాపరమైన, ప్రజల్లో చైతన్యం కలిగించే అనేక కార్యక్రమాలను ఆయా దేశాల్లో చేపడుతున్నారు. అంతే కాకుండా మానసిక వ్యాధులకు చికిత్స కల్పించేందుకు అవసరమైన నిధులను ఆయా దేశాల ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయి. అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? దీనిపై సమాజంలో ఎటువంటి అవగాహనం వుంది? వంటి అంశాలను చర్చించేందుకు ఈనాటి వేదిక చర్చను చేపట్టింది. ఈ చర్చలో డా.రాధిక (సైకాలజిస్ట్), పి.శ్యామలాదేవి (లైట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్) పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

సీపీఎం నేత సత్యవతిని పరామర్శించిన బృందాకరత్..

పశ్చిమగోదావరి : తణుకు జైల్లో సత్యవతిని సీపీఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పరామర్శించారు. ఆక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా పోరాడిన సీపీఎం సభ్యురాలు సత్యవతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని ఆమె ఖండించారు. 

12:56 - October 13, 2016

పశ్చిమగోదావరి : ద్వారకా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.. స్వామివారి దర్శనంకోసం భక్తులు భారీగా తరలివచ్చారు.. స్వామివారి దర్శనంకోసం వస్తున్న భవానీ భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువగా వుండటంతో స్వామివారి దర్శనానికి 4గంటల సమయం పడుతోంది.

ముని పేరుమీదనే ఈ కొండకు ద్వారకా తిరుమలగా పేరు
ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రం అటు ఉభయ గోదావరి, ఇటు కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఈ క్షేత్రాన్నే చినతిరుపలి అని ద్వారకా తిరుమల అని పిలుస్తారు. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందినది. ద్వారకుడు అనే ముని ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం చాలా అరుదుగా వుంటుంది.

వింత విశేషాల చిన తిరుపతి ద్వారకా తిరుమల ..
ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామివారి విగ్రహము క్రిందనున్న ఎర్రచీమల పుట్టకు హాని కలగకూడదని ఇక్కడ స్వామివారి మూల విరాట్టుకు అభిషేకం చేయరని ప్రతీతి. ఎక్కడా లేని విధంగా ఒకే గర్భగుడిలో రెండు మూల విరాట్టులు వుండటం ఈ దేవాలయం యొక్క మరో విశేషం.ఈ గుడి యొక్క సంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు కళ్యానోత్సవములు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం- స్వయంభూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారనీ చెబుతారు. "పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే అంటే హృదయ భాగము వరకూ మాత్రమే కనిపించేలా మరో విగ్రహం వుంటుంది. ఇటువంటి ఎన్నో విశేషలు కలిగిందే చినతిరుపతిగా పిలిచే ద్వారకా తిరుమల. చీమల పుట్టలో వున్న ప్రధాన విగ్రహానికి అభిషేకం చేయటం కుదరదనే కారణంతో అర్థభాగంగా వున్న విగ్రహాం ప్రతిష్ట జరిగిందని పురాణాలు చెబుతున్నాయి...

12:52 - October 13, 2016

ప్రకాశం : శింగరాయకొండ జాతీయ రహదారిపై షార్ట్‌ సర్యూట్‌ తో కారు దగ్దమైంది. రాత్రి స్కార్పియో వాహనంలో పొగలు రావడంతో ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగారు. క్షణాల్లో కారు పూర్తిగా తగలబడిపోయింది. ప్రమాదాన్ని ముందే గమనించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. 

12:50 - October 13, 2016

చిత్తూరు : వాహనాల్లో ఎర్రచందనం తరలిపోతుంది...స్మగ్లర్లు చాలా తెలివిగా అడుగు వేస్తున్నారు..చెక్‌పోస్టులలో జాగ్రత్తగా ఉండాలి..సీరియస్‌గా లేకుంటే కోట్లు విలువైన సంపద చేజారిపోతుంది...ప్రతీసారి అటవీశాఖ మంత్రి చెప్పే మాటలే..కాని ఆయనగారి ఇలాఖాలోనే చెక్‌పోస్టుల వద్ద ఏం జరుగుతుందో చూడండి...

అటవీశాఖ మంత్రి ఇలాఖాలోనే చేతివాటం..
ఆ వాహనంలో ఏముందో తెలియదు..కాని వసూలు మాత్రం కావాల్సిందే..ఆ వాహనాల్లో స్మగ్లింగ్ జరిగినా ఫర్వాలేదు..కాని చేతికి చిల్లర అందితే రైట్..రైట్..అటవీశాఖ మంత్రి ఇలాఖాలోనే చేతివాటం..వసూల్‌రాజాలను పట్టించుకోని ఆఫీసర్స్..
చిత్తూరు జిల్లాలో చేతులు మారుతున్న నోట్లు...

ఇది చిత్తూరు జిల్లా నగరిలోని పుత్తూరు మండలం గొల్లపల్లి అటవీశాఖ చెక్ పోస్ట్...ఇక్కడ అటవీశాఖ సిబ్బంది రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీలు చేయాలి...అందులో ఏముందో తెలుసుకోవాలి...కాని వీరేం చేస్తున్నారో చూడండి..చూశారుగా.. చేతికి చిల్లర అందితే చాలు..రైట్‌ రైట్‌ అంటూ సిగ్నల్ ఇచ్చేస్తారు ఇక్కడి సిబ్బంది...ఇది ఎక్కడో కాదు సాక్షాత్తు అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ ఇలాఖాలో జరుగుతున్న బాగోతం...తమిళనాడు కు చెందిన వాహనాలను నిలిపి వారి దగ్గర నుండి దొరికినంత దోచేస్తున్నారు ...

ఆసరాగా చేసుకునే స్మగ్లర్లు...
ఎర్రచదనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులలో ఇది కూడా ఒకటి...ఆ చెక్‌పోస్టు దాటి వెళ్లే వాహనాల్లో ఎర్రచందనం ఉందా లేదాన్నది మాత్రం పట్టించుకోరు...ముక్కుపిండి మాత్రం వసూలు చేస్తుంటారు... చెక్ పోస్ట్ వద్ద నిఘా నేత్రాలు అమర్చి మరి దోపిడీ చేస్తున్నారు...

తిరుమల యాత్రికుల రూపంలో..
ఇక తిరుమల యాత్రికుల రూపంలో వాహనాల్లో తరలివెళ్లేవారిలో చాలావరకు తమిళ కూలీలే ఉంటున్నారు...ఇప్పటికే ఎన్నోసార్లు పట్టుబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి...ఇవేమీ చూడకుండా వాహనాల నుంచి వసూలు చేసి బాహాటంగా పంపిస్తున్నారంటే ఇందులో అధికారుల హస్తం ఉందా..లేక వారి కళ్లు కూడా గప్పేస్తున్నారా...?

12:42 - October 13, 2016

ఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది.. జమ్ములో ఐఐఎం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. జమ్మూ అభివృద్ధి ప్యాకేజీలోభాగంగా ఐఐఎం కు దాదాపు 61 కోట్ల రూపాయల కేటాయింపుకు కేబినెట్‌ అంగీకరించింది.. 2016నుంచి 2020లోగా ఈ విద్యాసంస్థను పూర్తిచేయాలని తీర్మానించింది.. అప్పటివరకూ తాత్కాలిక భవనాల్లో తరగతుల నిర్వహణకు ఓకే చెప్పింది.. జార్ఖండ్‌, బీహార్‌ రాష్ట్రాల్లోని గంగా నదిపై నాలుగులైన్ల రహదారులు, బ్రిడ్జ్‌ల నిర్మాణానికి 19వందల 54కోట్లు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.. అలాగే ఇథనాల్‌ పెట్రోల్‌కు సంబంధించి సప్లయ్‌, ధరల విషయంలో కంపెనీలతో వ్యవహరించాల్సిన విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. అలాగే యువత క్రీడల అభివృద్ధికి భారత్‌, ఖతర్‌ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాన్ని కూడా కేబినెట్‌ ఆమోదించింది.. నీటి నిర్వహణపై హంగేరితో జరిగిన ఒప్పందానికికూడా ఆమోదం తెలిపింది.. ద్వైపాక్షిత ఆర్థిక వాణిజ్య వ్యవహారాల్లో సహకారం, భారత్‌, రష్యా మధ్య జరిగిన అవగాహన ఒప్పందాలనుకూడా కేబినెట్‌ ఆమోదించింది.. 

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు..

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశమయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జమ్ములో ఐఐఎం ఏర్పాటుకు రూ.61.90 కోట్ల కేటాయింపు..ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో గంగానదిపై నాలుగు లైన్ల రహదారులు..బ్రిడ్జిల నిర్మాణానికి రూ.1954కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. క్రీడల అభివృద్ధికి భారత్-ఖతర్ ల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందానికి కేబినెట్ ఆమోద ముద్ర వంటి పలు అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదించింది.  

12:09 - October 13, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన ఖరారైంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నారు. నవంబర్‌ 12 నుంచి 22 వరకు సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, పలువురు ఉన్నతాధికారులు అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల కోసం ఎన్ ఆర్ఐలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడులకు అనువైన వాతావరణంపై ఎన్న ఆర్ ఐలకు చంద్రబాబు డెమో ఇవ్వనున్నారు. అమరావతి నిర్మాణం, కల్పించాల్సిన వసతులపై సమావేశంలో బాబు చర్చించనున్నారు.

చంద్రబాబు మరో విదేశీ పర్యటన..

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన ఖరారైంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నారు. నవంబర్‌ 12 నుంచి 22 వరకు సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, పలువురు ఉన్నతాధికారులు అమెరికాలో పర్యటించనున్నారు.

పత్తి వ్యాపారుల ఆందోళన..

ఖమ్మం: వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ఈ-నామ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. ఈ-నామ్‌ విధానం ఆమోదయోగ్యం కాదు... పాత విధానంలోనే పత్తి కొనుగోళ్లు కొసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కొందరు వ్యాపారులు దాడి చేయడంతో మార్కెట్‌ కార్యాలయం అద్దాలు, సామగ్రి ధ్వంసమయ్యాయి. పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

రౌడీ షీటర్ దారుణ హత్య!..

పశ్చిమగోదావరి : జిల్లా కేంద్రమైన ఏలూరు లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పెద్ద కృష్ణ అనే రౌడీ షీటర్ దారుహత్యకు గురయ్యాడు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఆర్ ఆర్ పేటలోని చింతచెట్టు వీధిలో ఉదయం 10గంటల ప్రాంతంలో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది. పెదకృష్ణ ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా వున్నాడు. దీంతో పాత కక్షలతోనే దుండగులు ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గతంలో కూడా చిన్నికృష్ణ కూడా దారుణ హత్యకు గురవం గమనించనించాల్సిన విషయం.పరారీలో వున్న నిందితులకోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 

11:32 - October 13, 2016

పశ్చిమగోదావరి : జిల్లా కేంద్రమైన ఏలూరు లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పెద్ద కృష్ణ అనే రౌడీ షీటర్ దారుహత్యకు గురయ్యాడు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఆర్ ఆర్ పేటలోని చింతచెట్టు వీధిలో ఉదయం 10గంటల ప్రాంతంలో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది. పెదకృష్ణ ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా వున్నాడు. దీంతో పాత కక్షలతోనే దుండగులు ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గతంలో కూడా చిన్నికృష్ణ కూడా దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల కళ్ళముందే ఈ దారుణ హత్య జరినట్లుగా తెలుస్తోంది. కాగా హత్యకు పాల్పడిన దుండగులు పరారీలో వున్నట్లుగా తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. కాగా తరచూ జిల్లా కేంద్రమైన ఏలూరు పరిసర ప్రాంతాలలో రౌడీ షీటర్ల హత్యలు జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

కేంద్ర ఉపసంఘం భేటీ..

ఢిల్లీ: గురువారం సాయంత్రం 5గంటలకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కానుంది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరుగనున్న ఈ భేటీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలపై కేబినెట్ కమిటీ చర్చించనుంది. నవంబర్ 3వ వారంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం.

10:58 - October 13, 2016

హైదరాబాద్ : సీపీఎం ఈ నెల 17 నుంచి చేపట్టబోతున్న మహాజన పాదయాత్రకు మద్ధతుగా ఆ పార్టీ ఓయు ఎన్ సీసీ గేట్ నుంచి 2కే రన్‌ నిర్వహించింది. ఈ రన్‌ను ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ప్రారంభించారు. 2కేరన్‌ ఆర్ట్స్‌ కాలేజీ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సాయిబాబా, సీపీఎం నాయకులు వెంకట్‌, రాములు, ఎస్ఎఫ్ఐ,యూటీఎఫ్, ఐద్వా, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

కరీంనగర్ లో సీపీఎం నేతల 2కె రన్
సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్రను జయపద్రం చేయాలని కోరుతూ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో సిఐటీయు 2కే రన్‌ నిర్వహించింది. స్థానిక కళాభారతి నుంచి తెలంగాణ చౌక్ వరకు ఈ రన్‌ నిర్వహించారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం అక్టోబర్‌ 17న చేపట్టబోతున్న మహాజన పాదయాత్రను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యంరావు పిలుపునిచ్చారు.

10:55 - October 13, 2016

నెల్లూరు : ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యంతో కొన్ని జరుగుతున్నాయి. దీంతో కుటుంబాలకు కుటుంబాలే వీధిన పడుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని చూసేందుకు వెళుతున్న ఇద్దరు అన్నాచెల్లెళ్ళను ఆర్టీసీ బస్ రూపంలో వచ్చి పొట్టనపెట్టుకుంది. ఆర్టీసీ బస్ నిర్లక్ష్యానికి రెండు నిండుప్రాణాలు బలైపోయాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. రాంగ్ రూట్ లో వస్తున్న ఓ ఆర్టీసీ బస్ బైక్ పై వెళ్తున్న అఖిలేశ్, తేజ అనే అన్నాచెల్లెళ్లను ఢీకొంది. దీంతో చెల్లెలు తేజ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయాలపాలయిన అన్న అఖిలేశ్ ను సింహపురి ఆసుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ అఖిలేశ్ కూడా మృతి చెందాడు. ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. దీంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ డ్రైవర్ పరారయినట్లుగా తెలుస్తోంది. కాగా వాహనాలు నడిపే ఎవరైనా సరే అప్రమత్తంగా వుండాల్సిన అవుసరం ఎంతైనా వుంది. ఎందుకంటే ఓ చిన్న నిర్లక్ష్యానికి వారితో పాటు అమాయకులు కూడా బలైపోతుంటారు. దయచేసిన వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి..మీరు ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలకు హాని కలిగించకండి..

 

10:35 - October 13, 2016

విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీని నష్టాలు పట్టిపీడిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కోట్ల మేర ఆర్టీసీ నష్టాలు చవిచూస్తోంది. చీటికి మాటికి డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల, పెరిగిపోతున్న పర్సనల్ కాస్ట్ వెరసి ఆర్టీసీ నష్టాలు భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో ఉండే ఆర్టీసీ ప్రగతి రథచక్రాలను ఆర్థిక కష్టాలు ముందుకు కదలినివ్వడం లేదు.

50 ఏళ్లలో రూ. 1000 కోట్ల నష్టాలు
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ నష్టాలు భారీగా పెరిగాయి. ఆర్టీసీ ఆవిర్భావ అనంతరం 50 ఏళ్లలో నష్టాలు వెయ్యి కోట్ల రూపాయలకు చేరుకుంది. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండున్నరేళ్లలో ఈ మొత్తం రూ.1,500 కోట్లకు పెరిగింది. 2015 ఆగస్ట్ నాటికి రూ.120.45 కోట్లుగా ఉన్న నష్టాలు ఒక్క ఏడాదిలోనే రూ.225 కోట్లకు పెరిగాయి. మొత్తంగా 2016 ఆగస్ట్ నాటికి నష్టాలు రూ.346 కోట్లకు చేరడంతో ఆర్టీసీ భవిష్యత్ పై నీలినీడలు అలుముకుంటున్నాయి. నష్టాల ఊబి నుంచి గట్టేందుకు సంస్థ ఆస్తుల్ని అమ్ముదామనే యోచనకు వచ్చారంటే ఆర్థిక పరిస్థితి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.

అప్పులతో కలిపి ఆర్టీసీకి రూ.3,600 కోట్ల నష్టం
ఆర్టీసీకి అప్పులతో కలిపి రూ.3,600 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది. ఈ నష్టాలను కార్మికులపై వేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినబడుతున్నాయి. 62 వేల మంది ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ కారణంగానే నష్టం వస్తోందని యాజమాన్యం చెబుతోంది. దీనిని అధిగమించాలంటే సిబ్బందిని కుదించాలని యోచిస్తూ, దీనికి కార్మిక సంఘాలు కూడా సహకరించాల్సిందిగా ఒత్తిడి తెలుస్తున్నట్లు సమాచారం. కానీ ఆర్టీసీని పట్టిపీడిస్తున్న నష్టాలకు ప్రధాన కారణం ప్రైవేట్ ఆపరేటర్లని ఆర్టీసీ యాజమాన్యానికి తెలిసినప్పటికీ కూడా సైలెంట్ గా ఉంటుందని కార్మికలోకం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

డీజిల్ ధరలు పెరిగడం లాంటివి నష్టాలకు కారణాలు
ఇదిలా ఉంటే 2015తో పోలిస్తే ఈ ఏడాది ఆర్టీసీ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కర్ణుడి చావుకు వందకారణాలు అన్నట్లు ఆర్టీసీ నష్టాలకు పలు సమస్యలు కారణాలు కనిపిస్తున్నాయి. శక్తికి మించి పన్నుల భారాలు, పెరిగిన పర్సనల్ కాస్ట్, శుభ కార్యాలు లేకపోవడం, ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. ఈ కారణాలన్ని కూడా ఆర్టీసీని కకావికలం చేశాయి. నష్ట నివారణ కోసం ఇంధన పొదుపు, మెటీరియల్ లో పొదుపు పాటించారు. వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచే చర్యలు చేపట్టారు. కొంతమేర ఇవి ఉపశమనం కల్గిస్తున్నప్పటికీ డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవటం వల్ల వీటిపై ఆర్టీసీ అధికారులు నియంత్రణ కోల్పోతున్నారు.

ప్రైవేట్ బస్సులను ఎదుర్కొకపోవటం నష్టాలకు కారణం
ఇంకోవైపు ప్రైవేట్ బస్సులకు ధీటుగా ఎదుర్కొంటామని పదేపదే చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు సత్వరమే తీసుకోకపోవడం కూడా నష్టాలకు కారణమని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం 27 శాతం డీజీల్ టాక్స్ వసూలు చేయడం ద్వారా కూడా ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యూనియన్లు సూచిస్తున్న సలహాలు, సూచనలను ఆర్టీసీ యాజమాన్యం పరిగణలోకి తీసుకోవాలని, సత్వరం కొత్త బస్ లను కొనుగోలు చేసి హైదరాబాద్, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్ లలో ప్రయాణ చార్జీలు తగ్గిస్తే ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆధారపడరని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. 

10:29 - October 13, 2016

హైదరాబాద్ : సీపీఎం ఈ నెల 17 నుంచి చేపట్టబోతున్న మహాజన పాదయాత్రకు మద్ధతుగా ఆ పార్టీ ఓయు ఎన్ సీసీ గేట్ నుంచి 2కే రన్‌ నిర్వహించింది. ఈ రన్‌ను ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ప్రారంభించారు. 2కేరన్‌ ఆర్ట్స్‌ కాలేజీ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సాయిబాబా, సీపీఎం నాయకులు వెంకట్‌, రాములు, ఎస్ ఎస్ఎఫ్ఐ,యూటీఎఫ్, ఐద్వా, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

10:25 - October 13, 2016

ఢిల్లీ : ఇవాళ ఢిల్లీలో కీలకభేటీలు జరగబోతున్నాయి.. ప్రధాని కార్యాలయంలో ఉదయం పదిన్నరగంటలకు కేంద్ర కేబినెట్‌ భేటీ కాబోతోంది.. సాయంత్రం 5గంటలకు పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగబోతోంది.. ఈ భేటీలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తేదీలను ఖరారు చేయబోతున్నారు.. ఈసారి నవంబర్‌ రెండోవారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఇక సాయంత్రం ప్రధాని అధ్యక్షతన కేంద్రమంత్రిమండలి సమావేశం కాబోతోంది.. ఇందులో మంత్రుల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, పార్లమెంట్‌ ముందుకు రాబోతున్న బిల్లులపై చర్చించనున్నారు.. మరింత సమాచారానికి వీడియో చూడండి..

10:23 - October 13, 2016

తమిళనాడు : సీఎం జయలలిత ఆరోగ్యంపై అనిశ్చితి కొనసాగతోంది. గత రెండు రోజులుగా జయలలిత ఆరోగ్యంపై ఎటువంటి హెల్త్ బులిటెన్ విడుదల కాలేదు. జయలతిత వున్న అన్ని శాఖలను హోంమంత్రి పన్నీర్ సెల్వంకు బదిలీ చేశారు. 17శాఖలకు మంత్రిగా పన్నీర్ సెల్వం కొనసాగతున్నారు. అన్ని శాఖలను పన్నీర్ సెల్వంకు బదిలీ చేయటంపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంవత్రి అయిన కరుణానిథి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కేబినెట్ సమావేశం జరిగే అవకాశమున్నట్లుగా సమాచారం.కాగా 20రోజులకు పైగా సీఎం జయలతిత ఆనారోగ్యంతో బాధపడుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె కోలుకోవాలని అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు. పాలనా కుంటుపడుతున్న తరుణంలో జయలలితకు వీర విధేయుడైన పన్నీర్ సెల్వంకు పాలనా నిర్వహణ బాధ్యల్ని అప్పగించటంపై పలువురు వ్యతిరేకిస్తున్నారు. కాగా జయలలిత సంతకం ఫోర్జరీ జరిగిందని ఆమెకు అతి సన్నిహితురాలైన శశికళ గవర్నర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా ముఖ్యమంత్రి జయలలిత ఆనారోగ్యం పాలవ్వటం తమిళనాట రాజకీయ సమీకరణాలు రోజు రోజుకూ సంచలం కలిగిస్తున్నాయి.  దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

సందడిగా ప్రారంభమైన రొట్టెల పండుగ‌..

నెల్లూరు: నెల్లూరు బారాషాహీద్‌ దర్గాలో రొట్టెల పండుగ కన్నుల పండువ‌గ జరుగుతోంది. రెండో రోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో దర్గా దారులన్ని జన సంద్రంగా మారాయి. కోరిన కోర్కెలు తీర్చే స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడు తోంది. కోరిన కోర్కెలు తీరిన భక్తులు స్వ‌ర్ణాల‌ చెరువులో భక్తులు రొట్టెలు మార్చుకుంటున్నారు. దేశ, విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులు తమకు కావాల్సిన రొట్టెలను పట్టుకుంటున్నారు. కోర్కెలు తీరిన‌ వారు ఇతరులకు రొట్టెలు ఇస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు..

ముంబై : స్టాక్‌మార్కెట్లు ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 237 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 72 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.79 పైసలుగా ఉంది. హెడీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, టాటా మోటార్స్‌ షేర్లు నస్టాల్లో ట్రేడవుతుండగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

09:58 - October 13, 2016

ముంబై : భారత్‌లో మరోసారి బంగారం రేట్లు తగ్గాయి... బులియన్‌ మార్కెట్‌ లో 10 గ్రాముల బంగారం ధర 260 రూపాయలు తగ్గి 30వేల 150కి చేరింది.. వెండి కూడా అదే బాటలో ప్రయాణిస్తోంది.. కిలో వెండి 160 రూపాయలు తగ్గి.. 42వేల 590 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ తగ్గడమే ఈ పరిస్థితి కారణమని నిపుణులు అంచనావేస్తున్నారు.

09:56 - October 13, 2016

కరీంనగర్ : దసరా సంబరాలు అలజడి రేపాయి...ఏకంగా పోలీసులపై దాడికి తెగబడ్డారు యువకులు..ఆ తర్వాత జరిగిన ఘటనతో గ్రామస్థులు పోలీసు స్టేషన్‌పై అటాక్ చేశారు...అర్థరాత్రి నుంచి ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు మధ్యాహ్నానికి సద్దుమణిగినా ఓ యువకుడిని బలితీసుకుంది..పోలీసులపై వేటు పడింది...జరిగిన ఘటనలో పోలీసుల వైఫల్యమా..? లేక కుర్రాళ్ల అతినా...??

గ్రామస్థుల మూకుమ్మడి దాడి..ఫర్నీచర్ ధ్వంసం ...
కరీంనగర్ జిల్లా మానకొండూరు గ్రామస్థులు పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు...ఫర్నీచర్ ధ్వంసం చేసి అలజడి సృష్టించారు..ఓ యువకుడి ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమంటూ ఆరోపిస్తూ అటాక్ చేయడంతో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది... విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి వచ్చి పరిస్థితిని సమీక్షించారు..

పోలీసులపై నలుగురు యువకుల దురుసుతనం..
మానకొండూరులో వెంకటేశ్వరస్వామి రథోత్సవం సందర్భంగా ఎస్సై వంశీకృష్ణపై నలుగురు యువకులు దురుసుగా ప్రవర్తించారు... విధులకు ఆటంకం కలిగించినందుకు వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు..దీంతో ఆ గ్రామ పెద్దలు..సర్పంచ్‌ వినతి మేరకు పోలీసులు ఆ నలుగురు యువకులను తిరిగి ఉదయం అప్పగించాలంటూ కండీషన్‌పై విడిచిపెట్టారు...

మనస్తాపంతో శ్రావణ్‌కుమార్ ఆత్మహత్య ..
నలుగురిని వదిలేయడంతో అందులో ఒకడైన శ్రావణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు...దీనికి పోలీస్ వేధింపులే కారణమంటు ఆగ్రహంతో గ్రామస్తులు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి మృతదేహంతో ఆందోళనకు దిగారు...స్టేషన్ లోని విజిటర్స్ రూమ్ లోని ఫర్నిచర్ తోపాటు సిసి కెమెరాలను,ఎల్ఎండి పోలీస్ వాహనం అద్దాలను ధ్వంసం చేశారు...పోలీసులు కొట్టడంతో తీవ్ర మనస్థాపనికి చెందిన శ్రావణ్ ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు...

కుటుంబానికి న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే..
ఇదిలా ఉంటే మానకొండూరులో జరుగుతున్న గొడవ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ఎమ్మార్వో ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించాలన్నారు... మరోవైపు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,కమిషనర్‌ కమలాసన్‌రెడ్డిలు చేరుకున్నారు...

గన్‌మెన్‌తో పాటు కానిస్టేబుల్స్‌పై చర్యలు..
ఇక శ్రావణ్‌ను ఎస్సై వంశీకృష్ణ తీవ్రంగా కొట్టడం వల్లే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడంటూ గ్రామస్థులు ఆరోపించిన దానిపై కమిషనర్ కమలాసన్‌రెడ్డి స్పందించారు..ఎస్సైని సస్పెండ్ చేస్తూ గన్‌మెన్, కానిస్టేబుల్స్‌పై ఆరోపణలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు..

మృతుని కుటుంబానికి న్యాయం
చనిపోయిన శ్రావణ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం తరుపు ఆదుకుంటామని...మృతుని తండ్రికి హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తామని, డబుల్‌బెడ్‌రూం ఇల్లు కూడా ఆ కుటుంబానికి మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు...ఇక రాత్రి జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసు స్టేషన్‌పై దాడి జరిగినదానిపై కూడా తీవ్రంగా స్పందించారు...

09:51 - October 13, 2016

ఢిల్లీ : ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్‌ కమిటీ సమావేశం కాబోతోంది.. కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించబోతున్నారు... ఈ సమావేశంలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.. పండగ సీజన్‌ ముగియగానే సమావేశాలు జరపాలని మోడీ సర్కార్‌ భావిస్తోంది. 

09:45 - October 13, 2016

ఎంబీసీలు తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గొంతెత్తున్నారు. సదస్సులు, సెమినార్ లు, ర్యాలీలు, పాదయాత్రల రూపంలో తమ సమస్యలను, డిమాండ్లను ఎజెండా మీదకు తీసుకొస్తున్నారు. ఇంతకీ ఎంబీసీలంటే ఎవరు? తెలంగాణ లో వీరి జనాభా ఎంత? విద్యా ఉద్యోగావకాశాలు, రాజకీయాల్లో వీరికి ఎలాంటి ప్రాధాన్యత లభిస్తోంది? స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం లభిస్తోందా? సంక్షేమ పథకాలు సక్రమంగా వీరికి చేరుతున్నాయా? ఎంబీసీల సమగ్రాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఎంబీసీ ఉద్యమ నేత ఆశయ్య 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈఅంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

09:44 - October 13, 2016

జమ్ముకశ్మీర్‌ : పాంపోర్‌లో గత 3 రోజులుగా కొనసాగుతున్న ఆర్మీ ఆపరేషన్ ముగిసింది. 56 గంటలకు పైగా సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఉగ్రవాదుల నుంచి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈఐడీ భవనంలో దాక్కున్న ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్‌లోని పాంపోర్‌లో గ‌త మూడు రోజులుగా సాగిన ఎన్‌కౌంట‌ర్ ఎట్టకేలకు ముగిసింది. శ్రీనగర్‌-జమ్ము జాతీయ రహదారిపై ఉన్న ప్రభుత్వ ఇడిఐ భవనంలో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. పాంపోర్‌లోని ఇడిఐ బిల్డింగ్‌ను సోమవారం ఉదయం 5 గంటలకు ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకుని భద్రతాదళాలపై కాల్పులు జరిపారు. భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మంగళవారం సాయంత్రం ఒక ఉగ్రవాది చ‌నిపోగా, మ‌రో ఉగ్రవాది బుధవారం హ‌త‌మ‌య్యాడు. భవనంలో మూడో టెర్రరిస్టు న‌క్కి ఉన్నాడ‌న్న ఉద్దేశంతో చాలా సేపటివరకు కాల్పులు జ‌రిపాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదుల జ‌రిపిన కాల్పుల్లో ఓ జవాను గాయ‌ప‌డ్డాడు.

ఇనిస్టిట్యూట్‌లోకి చొరబడ్డ ఉగ్రవాదులను గమనించిన ఉద్యోగి
సోమవారం ఇనిస్టిట్యూట్‌లోకి చొరబడ్డ ఉగ్రవాదులను ఓ ఉద్యోగి పసిగట్టాడు. దీంతో హాస్టల్‌లోని ఓ గదిలో చాపలు ఫర్నీచర్‌ను తగలబెట్టాడు. ఆరో అంతస్తులో అంటుకున్న మంటలను చల్లార్పేందుకు వెళ్లిన మరో ఉద్యోగిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే మంటలు వాటికవే చల్లారాయి.

అత్యంత చాక‌చక్యంగా ఆపరేషన్
ఇడీఐ భ‌వ‌నం పెద్దది కావడం వల్ల ఆప‌రేష‌న్‌ను అత్యంత చాక‌చక్యంగా చేపట్టాల్సి వ‌చ్చింద‌ని మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అశోక్ తెలిపారు. బిల్డింగ్ లోపల సాధార‌ణ పౌరులు ఉండడంతో వారిని బ‌య‌ట‌కు పంపించాకే ఆపరేషన్‌ ప్రారంభించినట్లు ఆయ‌న చెప్పారు. బిల్డింగ్‌లో 60 రూమ్‌లు ఉన్నాయ‌ని, అన్ని రూమ్‌ల‌ను క్లియ‌ర్ చేసేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు. ఉగ్రవాదుల క‌ద‌లిక‌ల‌ను ప‌సిక‌ట్టేందుకు బిల్డింగ్‌లో ఉన్న అద్దాల‌ను ప‌గ‌ల‌కొట్టాల్సి వ‌చ్చింద‌ని ఆయన పేర్కొన్నారు.

రెండుసార్లు ఈడీఐ భవనంపై దాడులు
ఉగ్రవాదులు జీలం నదిపై నుంచి పడవలో వచ్చిన ఉగ్రవాదులు ఇడిఐ భవనం వెనక నుంచి లోనికి చొరబడ్డట్లు సమాచారం. క‌శ్మీర్ లోయ‌లో ఉన్న యువ‌తకు వొకేష‌న్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఇడీఐ బిల్డింగ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే గ‌త కొన్ని రోజులుగా కశ్మీర్ లో అల్లర్లు చోటుచేసుకుంటున్న కార‌ణంగా ఈ బిల్డింగ్ నిర్మానుషంగా మారింది. ఉగ్రవాదులు ఈడిఐ భవనాన్ని టార్గెట్‌ చేయడం గత 8 నెలల్లో ఇది రెండోసారి. ఫిబ్రవరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా...ఐదుగురు సైనికులు అమరులయ్యారు. ఓ పౌరుడు మృతి చెందాడు.

09:38 - October 13, 2016

తమిళనాడు : బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్లిన నేతలు ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు సిఎం జయలలిత నిర్వహిస్తున్న పలు శాఖలను గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆర్థికమంత్రి పన్నీర్‌ సెల్వంకు అప్పగించారు. అన్నాడిఎంకె అధినేత జయలలిత జ్వరం, డీ హైడ్రేషన్‌తో మూడు వారాల క్రితం అపోలో ఆసుపత్రిలో చేరారు. ఎయిమ్స్‌కు చెందిన ప్రత్యేక బృందం ఆమెకు చికిత్స జరుపుతోంది. జయలలిత త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కార్యకర్తలు పూజలు, ప్రార్థనలు జరుపుతున్నారు.

09:36 - October 13, 2016

తమిళనాడు : ముఖ్యమంత్రి జయలలిత సూచన మేరకే ఆర్థిక మంత్రి, ఆమె నమ్మినబంటు పన్నీర్‌సెల్వానికి సీఎం ఆధ్వర్యంలో ఉన్న శాఖలు అప్పగించామని ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు చేసిన ప్రకటన వివాదాస్పదమవుతోంది. జయలలిత సూచన మేరకే ఆమె వద్ద ఉన్న పోర్టుఫోలియోలను పన్నీర్‌సెల్వానికి కేటాయించినట్లు గవర్నర్ పేర్కొనడంపై డీఎంకే అధినేత ఎంకే కరుణానిధి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హాస్పిటల్‌లో ఉన్న జయలలిత పన్నీర్‌సెల్వానికి తన పోర్టుఫోలియోలు అప్పగించాలని ఎలా కోరారో గవర్నర్ వివరణ ఇచ్చేంతవరకు దీనిపై అనుమానాలు ఉంటాయని పీఎంకే అధినేత ఎస్ రాందాస్ అన్నారు. ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వానికి తన పోర్టుఫోలియోలు అప్పగించాలని సలహా ఇస్తూ ఫైలుపై జయలలిత సంతకం చేశారా? అన్న ప్రశ్న కొందరిలో వ్యక్తమవుతోందని కరుణానిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జయ హాస్పిటల్‌లో చేరి 20 రోజులవుతున్నా, ఇంకా చాలా రోజులు హాస్పిటల్‌లోనే ఉండాల్సి వస్తుందని చెప్తున్నా ఇంత వరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన విడుదల కాలేదని అన్నారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం జయలలిత పోర్టుఫోలియోలను పన్నీర్‌సెల్వానికి అప్పగించడం ఆమోదయోగ్యమేనని కరుణానిధి తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, రాజ్యాంగం ప్రకారమే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారా? అన్న సంశయం విస్మరించలేనిదని అన్నారు. జయలలిత పూర్తి ఆరోగ్యవంతురాలై తిరిగి బాధ్యతలు చేపట్టేంత వరకూ చట్టబద్ధమైన ఏర్పాటు జరుగాలన్నదే తమ వైఖరని తెలిపారు.

09:25 - October 13, 2016

ప్రకాశం : పేదోడి భూమి హక్కు ఇక గాల్లో దీపమేనా..? పేదోడు సాగు చేసుకునేందుకు అంగుళం భూమి కూడా లేకుండా ఏపీ ప్రభుత్వం లాగేసుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం చేస్తోన్న తాజా ప్రయత్నాలు ఇందుకు అనుగుణంగానే సాగుతున్నాయి. 2013-భూసేకరణ చట్టానికి అభివృద్ది ముసుగువేసి ప్రకాశం జిల్లాలో భూముల్ని కొల్లగొట్టేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై 10టీవీ ప్రత్యేక కథనం..!

2013-భూసేకరణ చట్టాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న ప్రభుత్వం
కేంద్రం తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఈ చట్టం ద్వారా పేదల భూములను అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. చట్టానికి ట్రిపుల్ పీ ముసుగు వేసి భూములను తక్కువ ధరకే కాజేయాలని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పదిలక్షల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.

న్యాయశాఖ నుంచి నివేదిక కోరిన సర్కార్‌
ఈ భూములను సొంతం చేసుకునేందుకు అత్యవసర సేవల రూపంలో 2013-భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రపభుత్వం న్యాయశాఖ నుంచి నివేదిక కోరింది. ఇందులో భాగంగానే సర్కారీ ఆలోచనలకు అనుగుణంగా నివేదికలు రూపొందుతున్నాయి.

సవరణలతో రైతులు తీవ్రంగా నష్టపోతారంటున్న సీపీఎం
ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఖాళీ భూములైతేనేమీ... పేదోడు బతుకుతోన్న భూములైతేనేమి... మొత్తం లక్షన్నర ఎకరాలకు పైగా ప్రభుత్వం గుర్తించింది. ఈ భూములను పేదలనుంచి లాగేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది ఏపీ సర్కార్. ఈ సవరణలతో దళితులు, రైతులు తీవ్రంగా నష్టపోనున్నారని సీపీఎం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

గతంలో సెజ్‌ల పేరుతో వేలాది ఎకరాలు స్వాధీనం
సెజ్‌ల పేరుతో గతంలో వేలాది ఎకరాలను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ భూములను పణంగా పెట్టి బ్యాంకుల నుంచి యాజమాన్యాలు వేల కోట్ల రూపాయల రుణాలు పొందాయి. ఆ తరువాత ఈ భూములు నిరుపయోగమై ఖాళీగా పడి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పిస్తామన్న యాజమాన్యాలు ఆ ఊసెప్పుడో మరిచిపోయాయి. గత ప్రభుత్వాలలాగా ఒంటెద్దు పోకడలతో ముందుకెళితే ప్రభుత్వానికి ప్రజాప్రతిఘటన తప్పదని ప్రజాసంఘాలు, రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 

09:18 - October 13, 2016

ఖమ్మం : నకిలీ మిర్చి విత్తనాల సరఫరా కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కంపెనీ డైరెక్టర్‌ శివ, కంపెనీ డీలర్ విద్యాసాగర్ లను వైరా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన శివ గ్రీన్ ఇరా సీఎస్ 333 కంపెనీ పేరుతో నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన వడ్డమూడి విద్యాసాగర్ రావును డీలర్ గా ఏర్పాటు చేసి జిల్లాలో ఏజెంట్ల ద్వారా నకిలీ విత్తనాలు సరఫరా చేశాడు. ఈ విషయాలను పోలీసుల విచారణలో శివ, విద్యసాగార్ లు వెల్లడించడంతో వీరిపై చట్టపరమైన చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు.

09:16 - October 13, 2016

నల్లగొండ : యాదాద్రి జిల్లాలో దుర్గాదేవి ఊరేగింపు సాక్షిగా కులవిక్ష అంశం బయటపడింది. రామన్నపేట మండలంలోని జనంపల్లిలో దుర్గాదేవి ప్రతిమ నిమజ్జనం కోసం ఊరేగింపు నిర్వహించారు. ముందుగా నిర్ణయించిన మార్గం ప్రకారం దళిత కాలనీ నుంచి ఊరేగింపు వెళ్లాల్సి ఉంది. అయితే దళిత కాలనీ నుంచి అమ్మవారిని ఊగేరిస్తే గ్రామానికి అరిష్టమంటూ, మార్గం మళ్లించారు. దీంతో కాలనీకి దళిత యువకులు అమ్మవారి ఊరేగింపు నిర్వాహకులపై మండిపడ్డారు. తమ కాలనీ నుంచి ఊరేగింపు తీసుకెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో జనంపల్లిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామం చేరుకుని దళిత యువకులకు సర్దిచెప్పి, శాంతింప చేశారు. అయితే నిర్వాహకులు మాత్రం మళ్లించిన మార్గంలో ఊరేగింపు నిర్వహించి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు.

09:12 - October 13, 2016

హైదరాబాద్ : సెలవులు కావడంతో చిన్నారి మధ్యాహ్నం నిద్రలో ఉంది..పట్టపగలు ఇంట్లోకి చొరబడ్డ దుండగులు పాపను ఎత్తుకెళ్లారు..ఆ ఇంట్లోని బాత్‌రూంలోకి తీసుకెళ్లి గొంతు కోసి చంపారు...ఈ దారుణం ఎవరిది..? ఎందుకు చేశారు..? మల్కాజిగిరి జిల్లాలో కిరాతకానికి సాక్ష్యం ఏది..??

ఏడేళ్ల పాపను చంపిన రాక్షసం...
సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంది..గాఢనిద్రలో ఉన్న ఏడేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు ఏం చేస్తున్నారో తెలుసుకుని కేకలేసే లోపే గొంతు కోశారు...ఈ దారుణానికి సాక్ష్యంగా రక్తసిక్తమైన ఆ చిన్నారి ఇంటి పరిసరాలు చెబుతున్నాయి..పట్టపగలు ఇంట్లోకి చొరబడ్డ కిరాతకులు బాలికను చంపేశారు...

మేడ్చల్ లో దారుణం
మల్కాజ్‌ గిరి జిల్లా మేడ్చల్‌ ఎల్లమ్మపేటలో నివాసం ఉండే కృష్ణమూర్తి, భవానీల చిన్న కూతురు సాయి లక్ష్మీ ప్రసన్న ..ఏడేళ్ల చిన్నారి మూడో తరగతి చదువుతోంది...దసరా సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంది...పండగరోజు ఆడుకుని అలసిపోయిన చిన్నారి తన అక్కతో కలిసి మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోతుంది...అదే సమయంలో వచ్చిన దుండగులు లక్ష్మీ ప్రసన్నను బాత్‌ రూంలోకి ఎత్తుకెళ్లి గొంతు కోసి చంపారు...

రక్తపు మడుగులో చిన్నారి ప్రసన్న
ఈ దారుణానికి పాల్పడ్డ దుండగులు పారిపోగా అప్పటికే ఆ చిన్నారి మృతి చెందింది...చిన్నారి కోసం చూసిన వారికి బాత్‌రూంలో రక్తపు మడుగులో కన్పించింది....వెంటనే ఆస్పత్రికి తరలిస్తే అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు...తెలిసినవారి పనేనా..లేక దొంగతనానికి వచ్చారా..దుండగుల లక్ష్యం చిన్నారినేనా.. నేరుగా ఇంట్లోకి వచ్చిన దుండగులు ఏడేళ్ల లక్ష్మీ ప్రసన్నను ఎత్తుకెళ్లి చంపడంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు....అయితే ఈ దారుణానికి ఎవరు ఒడిగట్టి ఉంటారని చిన్నారి కుటుంబీకులు..చుట్టూ ఉన్నవారిని ప్రశ్నిస్తూ పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.

09:07 - October 13, 2016

విశాఖపట్నం : సెంట్రల్ పార్క్ విశాఖలో ఇప్పుడు కేంద్రబిందువుగా మారింది. ఎంతో చరిత్ర ఉన్న ఈ పార్క్‌ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల పరం కానుంది. వ్యాపార ప్రయోజనాల కోసం ఈ పార్క్ ను వాడుకునేందుకు ఉడా అధికారులు సన్నద్ధమయ్యారు. అధికారుల తీరును ప్రజా సంఘాలు, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

పార్క్ పై భూకబ్జాదారుల కన్ను
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక భాగంలో దాదాపు 23 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సెంట్రల్ పార్క్ ఉంది. ఇప్పుడు ఈ పార్క్ పై భూకబ్జాదారుల కన్నుపడింది. ఈ పార్క్‌ను నిర్మించిన ఉడా ఇప్పుడు పార్క్ నిర్వహణ తమ వల్ల కాదని చేతులెత్తేసింది. దీంతో పార్క్‌ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

వ్యతిరేకిస్తున్న వామపక్షాలు, ప్రజాసంఘాలు
ఉడా నిర్ణయాన్ని వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పచ్చదనం కోసం 35 కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన పార్క్‌ను ప్రైవేట్ పరం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని విమర్శిస్తున్నారు. విశాఖ ప్రజా స్పందన ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద ఒక్క రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

20 సంవత్సరాలు లీజుకు ఇవ్వాలని ఉడా నిర్ణయం
కేవలం 10కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ప్రైవేటు సంస్థలకు వెయ్యి కోట్లు విలువైన స్థలాన్ని కట్టబెట్టాలన్న నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సెంట్రల్ పార్కును ఏకంగా 20 సంవత్సరాలు లీజుకు ఇవ్వాలని ఉడా అధికారులు నిర్ణయించారు. భవిష్యత్‌లో పార్క్ టెండర్లు దక్కించుకున్న సంస్థలకు పార్క్ స్థలంలో నిర్మాణాలు చేపట్టే అధికారం కూడా కట్టబెట్టనున్నారు. దీంతో ఆ సంస్థలు ఇష్టానుసరంగా వ్యవహరించి పచ్చదనాన్ని హరిస్తాయని వామపక్షనాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎంట్రన్స్ ఫీజును ఐదు రూపాయలకు తగ్గించాలని డిమాండ్
మరోవైపు ప్రజా ప్రతినిధులు కూడా ఉడా పై తీవ్ర అగ్రహం వ్యక్తం చెస్తున్నారు. ప్రజా ప్రతినిధులను సంప్రదించకుండా... ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఉడా ఇష్టం వచ్చినట్లు వ్యహరిస్త్తోందని స్థానిక ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్క్ ను ప్రైవేటు వారికి ఇస్తే ఊరుకునేది లేదంటున్నారు. ఇరవై రూపాయలు ఉన్న ఎంట్రన్స్ ఫీజును ఐదు రూపాయలకు తగ్గించాలని కోరుతున్నారు.

ఏడాదికి రూ. 2.5 కోట్లు ఖర్చు
ఇది ఇలా ఉంటే ఉడా అధికారుల మాటలు మాత్రం మరోలా ఉన్నాయి.. దీని నిర్వహణకు ఏడాదికి రూ. 2.5 కోట్లు ఖర్చు అవుతుందని అందుకే ప్రైవేటు వ్యక్తులకు పార్క్ నిర్వహణను ఇస్తున్నామని చెబుతున్నారు. పార్క్ నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

08:58 - October 13, 2016

అమెరికా : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వాషింగ్టన్ చేరుకున్నారు. అమెరికాలో వారం రోజుల పాటు పర్యటించనున్న కేటీఆర్... ప్రపంచ ప్రఖ్యాత 5 ఫార్మా సంస్థలతో చర్చలు జరపనున్నారు. సిలికాన్ వ్యాలీలో ఈ నెల 14న టీ-హబ్ ఔట్‌పోస్ట్ టీ - బ్రిడ్జ్‌ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఫార్మా సంస్థలు పాల్గొనే అడ్వామెడ్ సదస్సులో కూడా కేటీఆర్‌ పాల్గొననున్నారు.

08:55 - October 13, 2016

హైదరాబాద్ : కొత్తగా జిల్లాలు ఏర్పాటుతో తమ ప్రాంతాలు వేరే మండలాల్లో కలవడంతో పలు గ్రామాల్లో ప్రజలు ఆందోళన చేపట్టారు. మరోవైపు తమ గ్రామాలను కొత్త మండలాలుగా ప్రకటిస్తామని చెప్పిన సర్కార్‌.. తుది జాబితాలో మండలాలుగా ప్రకటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్‌ను మండల కేంద్రంగా ప్రకటించాలంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

గట్టుప్పల్ లో ఉద్రిక్తత
నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల్‌లో ఉద్రిక్తత నెలకొంది. గట్టుప్పల్‌ను ప్రభుత్వం మండల కేంద్రంగా ప్రకటించి.. తుది జాబితాలో తొలగించడంపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేస్తున్నారు. ఎంపీటీసీతో సహా ఐదుగురు గ్రామస్తులు వాటర్‌ట్యాంక్‌ ఎక్కి ఆందోళనకు దిగారు. మరోవైపు ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. యాదయ్య అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయాలైన యాదయ్యను ఆస్పత్రికి తరలించారు.

హత్నుర మండలంలో కలపడంపై ఆగ్రహం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలానికి సమీపంలో ఉన్న రొయ్యపల్లి, నాగారం, అక్వంచగూడ గ్రామాలను జిన్నారం మండలంలో కలపాలంటూ ఆ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎనిమిది మంది పెట్రోల్‌ బాటిల్‌తో వాటర్‌ ట్యాంకర్‌పైకి ఎక్కారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. తమ గ్రామాలను జిన్నారం మండలంలో కలుపుతామని కలెక్టర్‌ హామీ ఇచ్చి కూడా.. హత్నుర మండలంలో కలపడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీమరావుపల్లిలో ధర్నా
తమ గ్రామాన్ని చేగుంట మండలంలోనే కొనసాగించాలంటూ బీమరావుపల్లి గ్రామస్తులు సిద్దిపేటలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. బీమరావుపల్లిని పక్కనే ఉన్న చేగుంటలో కలపకుండా.. నార్సింగ్‌ మండలంలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు.

మండలాల ఆందోళనలు కొనసాగుతున్నాయి

మొత్తానికి కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా సంతోషాలు జరుపుకుంటున్నా.. కొన్నిచోట్ల తమ గ్రామాలు వేరే మండలాల్లో కలవడంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరి ప్రభుత్వం వీటిపై ఎలా దృష్టి సారిస్తుందో చూడాలి.

08:50 - October 13, 2016

విజయవాడ : ఏపీలోని వివిధ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రష్యా ముందుకొచ్చింది. నౌకానిర్మాణం, ఓడ రేవుల అభివృద్ధి, మౌలికసదుపాయాల రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. అలాగే ఎయిరో స్పేస్‌, ఎలక్ట్రానిక్స్‌, అణు విద్యుత్‌, రక్షణ రంగాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రష్యా ప్రతిపాదించింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చంద్రబాబు... రష్యా ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

రష్యా వాణిజ్య శాఖమంత్రి డెనిస్ మ్యాంట్‌రోవ్‌ బృంద ఏపీలో పర్యటన
రష్యా పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డెనిస్ మ్యాంట్‌రోవ్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఏపీలో పర్యటించింది. విజయవాడలో ముందుగా ప్రభుత్వ అధికారులతో భేటీ అయిన ఈ బృందం... ఆ తర్వాత చంద్రబాబుతో సమావేశమయ్యింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో ఉన్న మౌలికవసతులు, వనరులు గురించి చర్చించారు.

వ్యవసాయ యాంత్రీకరణ, ఐటీ, బయోటెక్నాలజీ, నీటిపారుదల...
రష్యా పరిశ్రమల మంత్రి డెనిస్‌ మ్యాంట్‌రోవ్‌ వెంట వచ్చిన జెఎస్‌సీ, యూఎస్‌సీ కంపెనీల ప్రతినిధి బృందాలు ఏపీ ఆర్థికాభివృద్ధి మండలితో రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వ్యసాయ యాంత్రీకరణ, ఐటీ, బయోటెక్నాలజీ, నీటీపారుదల రంగాల్లో ఏపీలో మంచి అవకాశాలున్నాయని చంద్రబాబు.. రష్యా ప్రతినిధి బృందం దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ముందుకొస్తే సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఆర్థికాభివృద్ధి మందగించినా... భారత్‌లో వార్షికాభివృద్ధి రేటు మెరుగైన స్థితిలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే పదిహేను, ఇరవై ఏళ్లలో రాష్ట్ర వార్షికాభివృద్ధి రేటును 15 శాతానికి పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా చంద్రబాబు... రష్యా ప్రతినిధి బృందం దృష్టికి తీసుకెళ్లారు.

మాస్కో నుంచి ఏపీకి విమాన అనుసంధానికి కృషి
ఏపీ రాజధాని అమరావతిలో సాంకేతికాభివృద్ధికి రష్యా సంస్థలు సహకరిస్తాయని డెనిస్‌ మ్యాంట్‌రోవ్‌... చంద్రబాబుకు చెప్పారు. మాస్కో నుంచి ఏపీకి విమాన అనుసంధానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో సుస్థిరమైన ప్రభుత్వం ఉన్న విషయాన్ని రష్యా బృందం దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు... భవిష్యత్‌లో కూడా ఇదే విధంగా ఉంటుందని, పెట్టుబడులకు ఢోకా ఉండదని హామీ ఇచ్చారు. 

08:38 - October 13, 2016

పశ్చిమగోదావరి : పారిశ్రామికాభివృద్ధికి జనసేన పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అభివృద్ధితో ప్రజలు పురోగతి చెందాలేగానీ, భయంతో బతకకూడదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఆక్వాఫుడ్ పార్క్‌ బాధిత గ్రామస్తుల బృందం పవన్‌కల్యాణ్‌ను కలిసింది. బాధితుల ఆవేదనను అర్థంచేసుకున్న జనసేనాని ఆక్వారంగం, పర్యావరణ నిపుణులతో చర్చించి.. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

పవన్‌కల్యాణ్‌ను కలిసిన ఆక్వా ఫుడ్‌ పార్క్ బాధితులు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో నిర్మితమవుతున్న ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న బాధిత గ్రామస్తుల బృందం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిసింది. ఈ ప్రాజెక్ట్‌ వల్ల 30 గ్రామాలు కలుష్యానికి గురవుతాయని పవన్‌కల్యాణ్‌కు వివరించింది. తమ గోడును ప్రభుత్వం గానీ.. యాజమాన్యంగానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బాధితుల ఆవేదనపై పవన్‌కల్యాణ్‌ స్పందించారు.

అభివృద్ధితో పాటు ప్రజల బాధలు అంతే ముఖ్యమన్న పవన్‌
ఆక్వారంగం, పర్యావరణ నిపుణులతో చర్చిస్తానని బాధిత గ్రామస్తులకు పవన్‌ హామీ ఇచ్చారు. పరిశ్రమల అభివృద్ధికి జనసేన పెద్దపీట వేస్తుందని.. అయితే.. అభివృద్ధి ఎంత ముఖ్యమో.. ప్రజల బాధలు కూడా అంతే ముఖ్యమని పవన్‌కల్యాణ్‌ అన్నట్లు సమాచారం. సమస్య పరిష్కారానికి అందరమూ కలిసి పని చేద్దామని గ్రామస్తుల బృందానికి పవన్‌కళ్యాణ్‌ భరోసా ఇచ్చారు. ఇక తమ ప్రాంతానికి రావాలని ఆ బృందం చేసిన విన్నపానికి పవన్‌కల్యాణ్‌ సానుకూలత వ్యక్తం చేశారు.

ఆక్వా పార్క్ ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీపీఎం
ఆక్వాఫుడ్‌ పార్క్‌ను మొదట నుంచి సీపీఎం వ్యతిరేకిస్తూనే ఉంది. ఆయా గ్రామాల రైతులకు అండగా నిలిచింది. పార్క్ నిర్మాణం ఆపాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు జరిగాయి. రైతుల తరపున పోరాటం చేస్తున్న నేతలపై ప్రభుత్వం పోలీసుల చేత లాఠీచార్జీ చేయించి బలవంతపు అరెస్టులకు కూడా పాల్పడింది. 

రొట్టెల పండగకు బాబు రాక..

నెల్లూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం నెల్లూరుకు రానున్నారు. మధ్యాహ్నం 2.50 గంటలకు రేణుగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 3.20 గంటలకు స్థానిక పోలీస్‌ కవాతు మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు రోడ్డు మార్గాన దర్గామిట్టలోని బారాషాహీద్‌ చేరుకుని అక్కడ జరిగే రోడ్డుల పండగ లో సాయంత్రం 4.15 గంటల వరకు పాల్గొంటారు. అనంతరం 4.45 గంటల వరకు స్థానిక పోలీస్‌కవాతుమైదానంలోని ఉమేష్‌చంద్ర సమావేశమందిరంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

లారీ-బస్ ఢీ..20మందికి గాయాలు..

కరీంనగర్ : తర్కపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు కాగా బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. బస్సు జగిత్యాల నుంచి హైదరాబాద్‌‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

07:27 - October 13, 2016

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త జిల్లా ప్రక్రియ పూర్తయ్యింది. కొత్త జిల్లాల విభజన నేపథ్యంలో పలు ప్రాంతాలలో ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే. విపక్షాలు,ప్రజాసంఘాలు కొత్త జిల్లా విభజన శాస్త్రీయంగా జరగలేదని ఇప్పటికీ విమర్శలు వస్తూనే వున్నాయి. వేటినీ బేఖాతరు చేయని టీఆర్ఎస్ జిల్లాల విభజనను తన ఇష్టానుసారంగానే సాగించింది. దసరా పండుగ రోజున జిల్లాల ప్రారంభోత్సవాలను ఘనంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మండలాల రగడ ప్రారంభమయ్యింది. ఈ క్రమంలోనే యాదాద్రి జిల్లా చండూరు మండలం గట్టుప్పల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గట్టుప్పల్‌ను మండల కేంద్రంగా ప్రకటించి, ఆ తర్వాత తుది జాబితాలనుంచి తొలగించడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిలపక్షంల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరం దగ్గర ఒక వ్యక్తి వంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుణ్ని అస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు వ్యక్తులు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో గట్టుప్పల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఎం.శ్రీనివాస్ (సీపీఎం నేత)చిలకపల్లి నరసింహ ( టీఆర్ఎస్ నేత),బెల్లయ్య నాయక్ (టీ.కాంగ్రెస్ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకోవాలంటే ఈవీడియోను చూడండి..

 

21మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్..

ప్రకాశం : ఒంగోలు నగరంలోని సీవీఎన్ క్లబ్ లోని పేకాట శిబిరంపై గురువారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. పేకాట నిర్వాహకుడి అశోక్ తోపాటు 21 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు. 

రష్యాతో ఏపీ ఒప్పందాలు..

వెలంగపూడి : ఏపీ సీఎం చంద్రబాబుతో రష్యా పరిశ్రమలు-వాణిజ్యశాఖ మంత్రి డెనిస్‌ మాంటురోవ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ- రష్యా సర్కార్‌లు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఏపీ ఆర్థికాభివృద్ధి మండలితో జేఎస్‌సీ యునైటెడ్‌ షిప్పింగ్ కార్పొరేషన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. టెక్నో నికోల్‌తో సన్‌ గ్రూపు మరో ఒప్పందం జరిగింది.

ఆత్మాహుతి దాడిలో 8 మంది మృతి..

నైజీరియా : మైదుగురిలో ఓ మహిళా ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 8 మంది మృతి చెందారు. టాక్సీలో వచ్చిన ఓ మహిళా ఉగ్రవాది ఈ దారుణానికి పాల్పడినట్లు.. 8 మంది దుర్మరణం చెందినట్టు అత్యవసర సేవల అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో 15 మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నేడు కలెక్టర్లతో సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : కలెక్టర్లతో నేడు సీఎస్ రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్. కొత్త జిల్లాల్లో సుపరిపాలనపై చర్చ. 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల కార్యాలలో పాలన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లాలో పరిపాలన అంశంపై కలెక్టర్లతో సమీక్షించనున్నారు. 

Don't Miss