Activities calendar

14 October 2016

22:36 - October 14, 2016

ఎల్ 7 మూవీ టీమ్ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా టీమ్ సభ్యులు సినిమా విషయాలను తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

22:22 - October 14, 2016

తెలంగాణల తెర్లుకొచ్చిన పరిపాలన, మామ అల్లుళ్లనుఅలుముకున్న మంట, చంద్రబాబు నాయుడు ఏక్ నంబర్, పార్కులో వాకింగ్ కొచ్చిన మొసలి.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

22:19 - October 14, 2016

పవర్ ఫుల్ రైటర్ కోన వెంకట్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు అసక్తికమైన విషయాలను తెలిపారు. సినిమాలకు తను రాసిన మాటలు, డైలాగ్స్ పై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆర్కే బీచ్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

విశాఖ : ఆర్కే బీచ్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. సరదాగా నలుగురు విద్యార్థులు బీచ్‌కు వచ్చారు. స్నానం కోసం ముగ్గురు విద్యార్థులు సముద్రంలోకి దిగారు. లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో విద్యార్థులు మునిగిపోయారు. అక్కడే ఉన్న గార్డులు ఒకరిని కాపాడారు. మరో ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. 

పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వలో ఎత్తిపోతల పథకానికి ఆమోదం

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వలో పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకోసం 1638 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనివల్ల విశాఖ తాగునీటి అవసరాలతో పాటు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగంగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. 

22:12 - October 14, 2016

విశాఖ : ఆర్కే బీచ్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. సరదాగా నలుగురు విద్యార్థులు బీచ్‌కు వచ్చారు. స్నానం కోసం ముగ్గురు విద్యార్థులు సముద్రంలోకి దిగారు. లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో విద్యార్థులు మునిగిపోయారు. అక్కడే ఉన్న గార్డులు ఒకరిని కాపాడారు. మరో ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గల్లంతైన ఇద్దరి విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని పోలీసులంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

22:11 - October 14, 2016

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వలో పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకోసం 1638 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనివల్ల విశాఖ తాగునీటి అవసరాలతో పాటు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగంగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. 

 

22:09 - October 14, 2016

హైదరాబాద్ : విత్తన భాండాగారం అని గొప్పలు చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం.. ముందు విత్తన క‌ల్తీని అరిక‌ట్టాల‌ని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల జేఏసీ నేత‌లు అన్నారు. రాష్ట్రంలో ఇటీవ‌ల భయ‌ట‌ప‌డిన నకిలీ మిర్చి విత్తనాల బాగొతంపై సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వహించారు. వ్యాపారుల మోసానికి, అధికారుల నిర్లక్ష్యానికి తెలంగాణలోని 3 జిల్లాల మిర్చిరైతులు బలైపోయార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట‌ ఏపుగా పెరుగుతున్నా కాయలు రాక దాదాపు 14 వేల ఎక‌రాల్లో పంట‌న‌ష్టం జ‌రిగింద‌ని చెప్పిన రైతుసంఘాల నేత‌లు...  బాధిత రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని, నకిలీ విత్తనాల సరఫరా చేసిన కంపెనీలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

22:02 - October 14, 2016

విజయవాడ : స్మార్ట్ పల్స్ సర్వేను ఈనెలాఖరు లోగా పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇవాళ విజయవాడలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జవాబుదారీతనం, పారదర్శకత కోసమే పల్స్ సర్వే నిర్వహించామని చంద్రబాబు వెల్లడించారు. రూరల్ ఏరియాలో 78 శాతం, అర్బన్‌లో 57 శాతం సర్వే పూర్తయిందని, నెలాఖరులోగా స్మార్ట్ పల్స్ సర్వే పూర్తికావాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

 

21:53 - October 14, 2016

విజయవాడ : నల్లధనం అంశంపై చంద్రబాబు వ్యాఖ్యలను జగన్‌ వక్రీకరిస్తున్నారని గుంటూరులో మంత్రి పల్లె రఘునాథరెడ్డి విరుచుకుపడ్డారు. నల్లధనంపై జగన్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అక్రమ మార్గంలో సంపాదించిన లక్ష కోట్లను జగన్‌ ఎక్కడ దాచారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్‌కు ఆత్మలేదు.. ఆత్మవిమర్శ అంతకన్నా లేదని పల్లె దుయ్యబట్టారు. 

21:52 - October 14, 2016

ముంబై : బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహర్‌ కష్టాల్లో పడ్డాడు. తాను తాజాగా రూపొందించిన 'యే దిల్‌ హై ముష్కిల్‌' సినిమాలో పాకిస్తాన్‌ నటులు ఉండటంతో సినిమా విడుదలకు థియేటర్‌ యాజమాన్యాలు అంగీకరించడం లేదు. దీంతో నాలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదలకు ఆటంకం ఏర్పడుతోంది. పాక్‌ నటులు నటించిన సినిమాలను నిషేధించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన పిలుపునిచ్చింది. దీనిపై ఇండియన్ మోషన్ పిక్చర్‌ అసోసియేషన్ ఇవాళ సమావేశమై.. పాక్ నటులు నటించిన మూవీలను రిలీజ్ చేయరాదని నిర్ణయించారు. యే దిల్‌ హై ముష్కిల్‌ సినిమాలో పాక్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌తో పాటు...రణ్‌బీర్‌ కపూర్‌, అనుష్క శర్మ, ఐశ్వర్యారాయ్‌ నటిస్తున్నారు.  ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈనెల 28న విడుదల కావల్సి ఉంది. 

 

21:47 - October 14, 2016

విశాఖ : విశాఖ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో దుండగులు భారీ మోసానికి పాల్పడ్డారు. పాత నోట్ల మార్పిడి పేరుతో 30 లక్షలకు టోకరాపెట్టారు. 5కోట్ల పాత నోట్లను మారిస్తే 3 లక్షల కమీషన్‌ ఇస్తామని క్యాషియర్‌ సాయిసురేష్‌కు ఘరానాదొంగలు ఆశచూపారు. ఎవరికీ తెలియకుండా బ్యాంకు నుంచి 30 లక్షలు తీసుకెళ్లి సాయిసురేష్‌ మోసగాళ్లకు ఇచ్చాడు. అయితే పైన అసలు నోట్లు పెట్టి తెల్ల కాగితాల కట్టలను క్యాషియర్‌కి దుండగులు ఇచ్చారు. దీంతో జరిగిన మోసాన్ని బ్యాంకు అధికారులకు తెలిసింది. వెంటనే జరిగిన ఘటనపై పోలీసులకు బ్యాంక్‌ మేనేజర్‌ ఫిర్యాదు చేశారు. టూటౌన్‌ పోలీసుల క్యాషియర్‌ సాయిసురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 

21:46 - October 14, 2016

మేడ్చల్ : మండంలోని ఎల్లమ్మపేటలో జరిగిన సాయిలక్ష్మిప్రసన్న బాలిక హత్య కేసులో దర్యాప్తు సాగుతుంది. ముఖ్యంగా బాలిక చేతిలో లభించిన వెంట్రుకలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించి.. దర్యాప్తు చేస్తున్నారు. అలాగే హత్య జరిగిన సమయంలో ఇంటికొచ్చిన వ్యక్తులపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా అందరినీ విచారిస్తున్నారు. అలాగే మేడ్చల్‌లో ఉన్న సెల్‌ టవర్లలో కాల్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. సెల్‌ఫోన్ కాల్‌ డేటాలో ఆధారాలు లభించే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక రిపోర్టు ప్రకారం గొంతులో నరాలు తెగిపోవడం వల్ల పాప మృతి చెందినట్టు తెలిసింది. కాగా బాగా తెలిసిన వ్యక్తులే ఈ హత్యకు  పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

21:43 - October 14, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలో ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మించొద్దని... సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఈ పార్క్‌ నిర్మాణంతో వేలాదిమంది రైతులు, మత్స్యకారులు రోడ్డునపడతారని చెప్పారు.. ఈ పార్క్‌వల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కాలుష్యమవుతాయని తెలిపారు. 

21:41 - October 14, 2016

హైదరాబాద్ : ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రామకృష్ణ, ఓల్డేజ్‌ హోమ్‌ అధికారి గణేష్‌తో పాటు సుబ్బయ్య, వెంకటేష్‌ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రంగారెడ్డి జిల్లాలో యువతి దారుణ హత్య

రంగారెడ్డి : జిల్లాలోని ఆమన్ గల్ మండలం వెలుగురాళ్ల తండాలో పరువు హత్య కలకలం రేపింది. యువతి దారుణ హత్య గావించబడింది. మంగ అనే యువతికి పురుగుల మందు తాగించి ఆమె కుటుంబసభ్యులు హత్య చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

చాదర్ ఘాట్ లో ఇద్దరు యువకులపై రౌడీ షీటర్ కత్తితో దాడి

హైదరాబాద్ : చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో ఐఫా మసీద్ వద్ద ఇద్దరు యువకులపై రౌడీ షీటర్ అప్జల్ కత్తితో దాడి చేశాడు. యవకుల పరిస్థితి విషమంగా ఉంది. రౌడీ షీటర్ పరారీలో ఉన్నాడు. 

21:24 - October 14, 2016

హైదరాబాద్ : సీఎం చంద్రబాబునాయుడు మానసిక పరిస్థితిపై పలు అనుమానాలు కలుగుతున్నాయని వైసీపీ నాయకురాలు రోజా అన్నారు. ఇటీవల పలు అంశాలపై ఆయన అనుచిత వాఖ్యలు చేశారని అన్నారు. ఆయన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారతదేశాన్ని చాలా అవమానించారని.. దేశ ప్రజలకు చంద్రబాబునాయుడు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

 

21:22 - October 14, 2016

నల్లగొండ : జిల్లాలోని చండూర్‌ మండలం గట్టుప్పల్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది.. గట్టుప్పల్‌ను మండలం చేయాలంటూ గ్రామస్తులు నాలుగోరోజూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.. వివిధరకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా గ్రామంలో 144 సెక్షన్ విధించారు.. గ్రామానికి వచ్చే అన్ని రోడ్లను మూసివేశారు.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

21:19 - October 14, 2016

హైదరాబాద్ : యూఎస్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ బిజీ బిజీగా గడుపుతున్నారు.. రెండోరోజూ పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు.. ఫార్మా కంపెనీల ప్రతినిధులతో, అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ అధికారులతో చర్చలు జరిపారు. ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.. జనావాస ప్రాంతాల నుంచి ఫార్మా యూనిట్ల తరలింపుకు సహకరించేందుకు పర్యావరణ సంస్థ ముందుకు వచ్చింది. 

21:06 - October 14, 2016

హైదరాబాద్ : అంతన్నారు... ఇంతన్నారు... చివరకు ఏ హామీ నెరవేర్చకుండా పోతున్నారు. ఏడాది క్రితం హైదరాబాద్‌లో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు. ఏడాదిలోగా ఇళ్లను కట్టించి.. ఇస్తామని గొప్పగా చెప్పారు. కానీ, మంత్రుల హామీలు నెరవేరకపోవడంతో నగరవాసులు మండిపడుతున్నారు. ఇటు కాంట్రాక్టర్లు కూడా నిర్మాణానికి ఆసక్తి చూపకపోవడంతో ఈ పథకం ఆటకెక్కింది..!
సామాన్యుల‌ కోసం చేపట్టిన గృహ‌నిర్మాణ ప‌థ‌కం  
డబుల్ బెడ్ రూం ఇల్లు.. 560 చ‌ద‌ర‌పు అడుగుల్లో, రెండు ప‌డ‌క గ‌దులు, ఒక హాలు, ఒక కిచెన్ తో సామాన్యుల‌ కోసం చేపట్టిన గృహ‌నిర్మాణ ప‌థ‌కం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో డబుల్‌బెడ్‌ రూమ్‌ స్కీమ్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి... మేయర్‌ పీఠం దక్కించుకుంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ఎన్నికల ముందు నానా హడావుడి చేసిన అధికార పార్టీ నేతలు.. నగరంలో చాలాచోట్ల శంకుస్థాపనలు కూడా చేశారు. ఎల్బీన‌గ‌ర్ ఎరుక‌ల నాంచార‌మ్మ బ‌స్తీ, కూక‌ట్ ప‌ల్లిలోని చిత్తరమ్మ బ‌స్తీ, సికింద్రాబాద్ చిల‌క‌లగుడా దోబిఘాట్, స‌న‌త్‌న‌గ‌ర్‌లోని హమాలీబ‌స్తీ త‌దిత‌ర ప్రాంతాల్లో ఇళ్లనిర్మాణం కోసం ఏడాదిక్రితం శంకుస్థాప‌న‌లు చేశారు. ఇళ్లు లేనివారికి ఏడాదిలోగా డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించి.. ఇస్తామని  మంత్రి కేటీఆర్‌ గొప్పగా చెప్పారు. కానీ, మంత్రులు చెప్పిన హామీలు ఇంతవరకూ అమలు కావడం లేదని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై కనిపించని పురోగతి
ప్రస్తుతం డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల అంతస్తులపై అనేక సందేహాలు ఉన్నాయంటున్నారు నగరవాసులు. ఎన్ని అంతస్తుల్లో కడుతారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటు రెండుపడకల గదుల నిర్మాణాల టెండర్లకు కూడా స్పందన కరువైంది. నిర్మాణాల్లో ఫైనాన్స్‌ కష్టాలు వెంటాడుతాయంటున్నారు కాంట్రాక్టర్లు. మార్కెట్‌లో ప్రస్తుతం టన్ను స్టీల్‌ ధర 34 వేలు ఉండగా... ప్రభుత్వం మాత్రం టన్ను స్టిల్‌కు 31 వేలే చెల్లిస్తోందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందంటున్నారు. మొత్తంగా ఇళ్లులేని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ విషయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం హామీని త్వరగా నెరవేర్చాలని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

20:37 - October 14, 2016

గుంటూరు : కొత్త రాజధాని మొదటి దశ నిర్మాణం రోజురోజుకు ఆలస్యమవుతోంది. శంకుస్థాపన జరిగి ఏడాది గడిచినా ఇప్పటి వరకు రాజధాని నిర్మాణం ప్రారంభించిన పరిస్ధితి లేదు. దీంతో అసలు మొదటి దశ నిర్మాణం మొదలు కావడానికి ఎంత సమయం పడుతోంది అన్న దానిపై ఇప్పుడు అనుమానం మొదలైంది. 
శంకుస్థాపన జరిగి ఏడాది పూర్తి
ఏపీ కొత్త రాజధాని అమరావతిని ప్రకటించిన తర్వాత నిర్మాణం మాత్రం ఆలస్యం అవుతోంది. ఇప్పటికే పాలన మొదలయ్యి రెండున్నరేళ్లు గడిచిపోయాయి. రాజధానికి శంకుస్ధాపన జరిగి ఏడాది గడిచిపోయింది. గత ఏడాది దసరా పండగ రోజు రాజధాని నిర్మాణానికి శంకుస్ధాపన జరిగిన దగ్గర్నుంచి కనీసం ఒక్క ఇటుక కూడా రాజధాని నిర్మాణానికి ఉపయోగించని పరిస్ధితి ఏర్పడింది. 
రైతులకు ప్లాట్ల విషయంలో గందరగోళం
ఇప్పటికే  రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల విషయంలో గందరగోళం ఏర్పడింది.. కొంతమంది రైతులకు మాత్రమే ప్లాట్లు అందాయి. అవి కూడా కేవలం కాగితాల రూపంలోనే ఉన్నాయి. పట్టాలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకొంది ప్రభుత్వం. రైతులకు పూర్తిస్ధాయిలో ప్లాట్లు కేటాయించడానికి మరికొన్నినెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. 
స్విస్ చాలెంజ్ పద్ధతిలో మొదటి దశ నిర్మాణం  
రాజధాని నిర్మాణం మొదటి దశ స్విస్ ఛాలెంజ్ పద్దతిలో చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోంది. దీనిపై కోర్టులో ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. అయితే స్విస్ చాలెంజ్ పద్దతిపై కొంత వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడుతోంది. అయితే మొదటి దశ నిర్మాణం కోసం అనేక రకాల అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది నిర్మాణం మొదలు కావడం కూడా కష్టమే.
కేంద్రానికి డీపీఆర్ అందివ్వని రాష్ట్ర ప్రభుత్వం
రాజధాని మొదటి దశ 2018 వరకు పూర్తి చేస్తామని ప్రభుత్వం గతంలో చాలా సందర్భాల్లో ప్రకటించింది. ప్రభుత్వానికి  కేంద్రం నుంచి కొంత సహాయం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తిస్ధాయిలో డీపీఆర్ ను కేంద్రానికి కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. రాజధాని మొదటి దశలో ఎలాంటి నిర్మాణాలు ఉండాలి అనే దానిపై ప్రాజెక్టు రిపోర్టు తయారుచేసి కేంద్రానికి అందించాలి. ఇది జరిగిన తర్వాత కేంద్రం నుంచి సహాయం అందే ఛాన్స్ ఉంటుంది.
ఇక అప్పటి నుంచి మొదటి దశ నిర్మాణం మొదలయ్యే అవకాశం ఉంది. 
పాలన పూర్తయి రెండున్నరేళ్లు
ప్రస్తుతం పాలన పూర్తయి రెండున్నరేళ్లు అవుతోంది. చివరి ఏడాదిలో ఎన్నికల ప్రచారానికి సమయం సరిపోతుంది. ఇంకా కేవలం ఏడాదిన్నర రెండేళ్లలో మొదటి దశ నిర్మాణం పూర్తి కావాలి. ఇది జరిగితేనే ప్రభుత్వంపై ప్రజలకు కొంత నమ్మకం ఏర్పడుతుంది. కానీ ప్రస్తుతం మొదటి దశ నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది అనే దానిపై స్పష్టత రావడం లేదు.

 

20:35 - October 14, 2016

చిత్తూరు : తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. రెండో దఫా డ్వాక్రా రుణమాఫీని పురస్కరించుకొని అలిపిరి వద్ద డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన కేక్‌ను చంద్రబాబు కట్‌చేశారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలోని కాలనీల్లో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాలనీవాసుల సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. 

 

20:30 - October 14, 2016

హైదరాబాద్ : స్విస్ చాలెంజ్‌ విధానంలో స్వదేశీ కంపెనీలను ఎందుకు ప్రొత్సహించడం లేదని ప్రశ్నించింది రాష్ట్ర హైకోర్టు. విదేశీ కంపెనీలకు ఇచ్చినన్ని అవకాశాలు దేశీయ కంపెనీలకు ఎందుకు ఇవ్వరని నిలదీసింది. స్విస్‌ చాలెంజ్‌ విధానానికి సంబంధించి.. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వ వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం.
టెక్నికల్‌ పాయింట్స్‌ ఆధారంగానే సింగిల్‌ బెంచ్‌ తీర్పు అన్న ప్రభుత్వం
ఏ.పీ. రాజదాని నిర్మాణంలో స్విస్ చాలెంజ్ విధానంపై ఉమ్మడి హైకోర్టులో వాదనలు జరిగాయి.  కేవలం టెక్నికల్ పాయింట్స్ ఆధారంగానే సింగిల్ బెంచ్ తీర్పునిచ్చిందని ప్రభుత్వం వాదించింది. సింగిల్‌ బెంచ్‌ స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని రియల్ ఎస్టేట్‌ వ్యాపారంగా భావించిందని, అయితే తాము ఎప్పుడూ ఆ ధోరణిలో వ్యవహరించలేదని ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు వివరించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న న్యాయమూర్తి, స్వదేశీ సంస్థలను ఎందుకు ప్రోత్సహించడం లేదని ప్రశ్నించారు. భారతీయ ప్రమాణాలకే పరిమితమైతే ఇక్కడి వారే వస్తారని, అయితే అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు పాటించే విదేశీ సంస్థలను తీసుకు రాలేమని వాదించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలని కోరుతూ వాదనలు ముగించారు.
ప్రభుత్వం కోర్టుకు చెప్పేది ఒకటి.. చేసిది మరోటి పిటిషనర్‌
 పిటిషనర్ తరుపు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వం హైకోర్టుకు చెప్పేది ఒకటి చేసేది మరోటని అన్నారు. రెవెన్యూ షేర్ ప్రకటించకుండానే బిడ్డింగ్ పిలువడం వెనుక ఏదో మాయ ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాల కల్పనపై స్పష్టత లేదన్నారు. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం లేదన్నారు. రియల్ ఎస్టేట్ గా భావించకపోయినా  ఏదో ఒక వ్యాపారం మాత్రం చేస్తున్నారని వాదించారు. పిటిషనర్ తరఫు వాదనలు ఇంకా మిగిలే ఉన్నందున ధర్మాసనం.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

 

20:07 - October 14, 2016

రాష్ట్రంలోని టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని టూరిజం కార్మిక సంఘం నేత ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. 'ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్ మెంట్ అధికారులకీ, కార్మిక యూనియన్లకీ మధ్య ఇవాళ కీలక సమావేశం జరగబోతోంది. విజయవాడలో జరిగే ఈ సమావేశంలో దీర్ఘకాలికంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించేందుకు సిఐటియు సమాయత్తమైంది. 2013 సమ్మెకాలం నాటి వేతన బకాయిలు, 10వ పిఆర్ సి ప్రకారం డిఏ వర్తింపు, మరణించిన కార్మికుని స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం లాంటి అంశాలపై ఇవాళ్టి సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగం అభివృద్ధికి వున్న అవకాశాలేమిటి? ఏపిలో టూరిజం పాలసీ ఎలా వుంది? ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగం అభివృద్ధికి ఎలాంటి పాలసీ అవసరం? టూరిజం డిపార్ట్ మెంట్ కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? వర్కింగ్ కండిషన్స్ ఎలా వున్నాయి? వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:59 - October 14, 2016

ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయి. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల భారీగా ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం వుంది. ఉపాధి కల్పనలో పర్యాటకరంగం కీలకపాత్ర పోషిస్తుంది.  బాగా చదువుకున్నవారికి సేవా రంగం ఉపాధి కల్పిస్తే, కొద్దిపాటి నైపుణ్యం వున్నవారికి కూడా పర్యాటకరంగం ఉపాధి కల్పిస్తుంది. పట్టణీకరణ, బిజీ లైఫ్, పెరుగుతున్న ఆదాయాలు, జనాభాలో యువత సంఖ్య పెరగడం, ప్రపంచీకరణ, మీడియా ప్రభావాలు ఇవన్నీ పర్యాటక రంగం పాత్రను మరింత పెంచుతున్నాయి. పర్యాటకరంగంలో అవకాశాలూ సృష్టిస్తున్నాయి.  తమ సంపాదనలో ఏటా కొంతమొత్తం టూరిజంపై ఖర్చుపెట్టేందుకు నేటి యువత ఆసక్తి చూపిస్తోంది. ఏడాదికొక్కసారైనా ఫ్యామ్లీ ట్రిప్స్ వేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. తిరుమల వెంకన్న  ఆధ్యాత్మికవాదులనే కాకుండా దేశ విదేశీ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాడు. శ్రీశైలం, అరకులోయ, విశాఖబీచ్,  పాపికొండలు, పట్టిసీమ ఇలా అనేక ప్రాంతాలను చూసివచ్చేందుకు అనేకమంది ముచ్చటపడుతుంటారు. ఇటీవల కాలంలో లంబసింగికి కూడా క్రూజ్ పెరిగింది. ఇలా అనేక చూడముచ్చటైన కనువిందు చేసే ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే చక్కటి ప్రదేశాలెన్నో వున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పర్యాటక ప్రేమికులు కోహినూర్ తో పోల్చేవారు.  మన దేశంలో పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ది అగ్రస్థానమే. అయితే, పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడంలో వెనకబడి వున్నామన్నది మరో నిష్టూర సత్యం. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రాల్లో ఈ రంగం ప్రమోషన్ మీద పెడుతున్న శ్రద్ధ తక్కువనే చెప్పాలి.  పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అయినా, కేంద్రం నుంచి కూడా నిధులు పొందే అవకాశం వుంది. వీటిని సంపాదించడంలో మన రాష్ట్రాలు వెనకబడి వుంటున్నాయి.  స్వదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నా విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ వెనకబడి వుంటోంది.  విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో  మహారాష్ట్ర, తమిళనాడు,  ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ , బెంగల్, కేరళ లాంటి రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.  స్వదేశీ, విదేశీ టూరిస్టులను ఆకర్షించాలంటే అందుకు తగ్గ రవాణా సదుపాయాలు సమకూర్చాల్సి వుంటుంది. 
పర్యాటక కేంద్రాల మధ్య అనుసంధానం 
పర్యాటక కేంద్రాల మధ్య అనుసంధానం చేయాల్సి వుంటుంది. టూరిస్ట్ స్పాట్ లలో చక్కటి సౌకర్యాలు కల్పించాల్సి వుంటుంది. శాంతిభద్రతలు, కాలుష్యం లెవల్స్ ను  కూడా పర్యాటకులు పరిగణలోనికి తీసుకుంటారన్న విషయం మరవకూడదు.  ఒకవైపు టూరిస్ట్ స్పాట్ లలో సౌకర్యాలు, సదుపాయలు మెరుగుపరుస్తూ, మరోవైపు నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద వుంటుంది. అయితే, దురదృష్టవశాత్తు ఏపి టూరిజం డవలప్ మెంట్ కార్పొరేషన్ లో నిధుల దుబారా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. ఇందులో రాజకీయ జోక్యం మితుమీరుతోందన్న విమర్శలూ వున్నాయి. మరోవైపు ప్రభుత్వ విధానాలు కూడా లోపభూయిష్టంగా వుంటున్నాయి. టూరిజాన్ని అభివృద్ధి చేయడం కంటే ప్రయివేటీకరించడం మీదనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెడుతోంది. మరోవైపు కార్మికుల, ఉద్యోగుల జీతాలు పెంచకపోవడం, ఆరు నెలల కొకసారి డిఏ పాయింట్స్ పెంచకపోవడం లాంటి సమస్యలూ వున్నాయి. వీటన్నింటి పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవచూపాల్సిన అవసరం వుంది. 

 

18:28 - October 14, 2016

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 16వ తేదీనుంచి డిసెంబర్ 16వ తేదీవరకు కొనసాగనున్నాయి. పార్లమెంట్ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. లక్షిత దాడి తర్వాత తొలిసారిగా పార్లమెంట్ సమావేశాలు జరుగనుండటంతో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగనున్నది. సాధారణంగా నవంబర్ మూడో, నాలుగో వారంలో జరగాల్సిన సమావేశాలు రెండోవారంలోనే ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలను కూడా ముందుకు జరుపాలని కేంద్రం భావిస్తున్నది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలోనే సమావేశాలను ప్రారంభించనున్నట్లు సమాచారం.

 

18:23 - October 14, 2016

తమిళనాడు : చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో 23 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు లండన్, ఎయిమ్స్ వైద్యుల బృందం చెన్నైకి చేరుకుంది. ఆమెకు చికిత్స అందించేందుకు గతంలో వచ్చిన అంతర్జాతీయ వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే, ఎయిమ్స్ వైద్యులు గిల్‌నానీ, అంజన్ టిరిక్కా, నితీష్‌నాయక్ మరోసారి అపోలోకు చేరుకుని వైద్య చికిత్సలు అందిస్తున్నారు. సీఎం జయను పరామర్శించేందుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతూ అంబానీ అపోలో ఆస్పత్రికి వచ్చారు. జయకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు మాజీ గవర్నర్ కే రోశయ్య సీఎం జయలలితను పరామర్శించేందుకు నేడు చెన్నై రానున్నారు. ఇటు తమిళనాడుకు కొత్త గవర్నర్‌ను త్వరలోనే ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఆగస్టు చివరలో రోశయ్య పదవీ విరమణ చేసినప్పటి నుంచి.. ఆ బాధ్యతలను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు పర్యవేక్షిస్తున్నారు.

 

డీవీఆర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

సంగారెడ్డి : డీవీఆర్ కళాశాలలో బీటెక్ సెకండియర్ విద్యార్థి వినయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడో అంతస్తు నుంచి వినయ్ దూకాడు. అనారోగ్యం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. 

17:58 - October 14, 2016

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. ఈనెల 17 నుంచి చేపట్టనున్న మహాజన పాదయాత్రకు మద్దతుగా..  రాష్ట్ర వ్యాప్తంగా 2కె రన్‌ నిర్వహించారు. అన్ని జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
సీపీఎం ఆధ్వర్యంలో 2 కే రన్‌ 
తెలంగాణ వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో 2 కే రన్‌ కార్యక్రమాలు జరిగాయి. ఈనెల 17 నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాజన పాదయాత్ర చేపట్టనున్నారు. దీనికి మద్దతుగా  సీపీఎంతోపాటు పార్టీ అనుబంధ సంఘాలు  2కే రన్‌ నిర్వహించాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు  ఈ పరుగులో పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల సమస్యలను అధ్యయనం చేసేందుకు తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేపట్టనున్నారు. 
ఓయూ ఎన్ సీసీ గేట్ నుంచి 2కే రన్‌ 
తమ్మినేని చేపట్టనున్న మహాజన పాదయాత్రకు మద్దతుగా ఆ పార్టీ ఓయూ ఎన్ సీసీ గేట్ నుంచి 2కే రన్‌ నిర్వహించింది. ఈ రన్‌ను  ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ప్రారంభించారు.  2కేరన్‌ ఆర్ట్స్‌ కాలేజీ వరకు  కొనసాగింది.  ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సాయిబాబు, సీపీఎం నాయకులు వెంకట్‌, రాములు, ఎస్ ఎఫ్ ఐ, యూటీఎఫ్, ఐద్వా, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. 
కరీంనగర్‌ జిల్లాలో
సీపీఎం చేపట్టనున్న మహాజన పాదయాత్రను జయపద్రం చేయాలని కోరుతూ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో  సిఐటీయు 2కే రన్‌ నిర్వహించింది. స్థానిక కళాభారతి నుంచి తెలంగాణ చౌక్ వరకు ఈ  కార్యక్రమం జరిగింది. మహాజన పాదయాత్రను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యంరావు పిలుపునిచ్చారు.
భద్రాద్రి జిల్లాలో
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోనూ సీపీఎం 2కె రన్‌ నిర్వహించింది. మహాజన పాదయాత్రకు మద్దతుగా 2కె రన్‌ జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  తెలంగాణ ఆవిర్భవించి రెండున్నరేళ్లు  గడిచిపోయినా.... బడుగుల, బలహీన వర్గాల పరిస్థితిలో మార్పు రాలేదని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. 
వనపర్తిలో 
సీపీఎం మహాపాదయాత్రను విజయవంతం చేయాలంటూ వనపర్తిలో 2కే రన్‌ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, డీవైఎఫ్ ఐ, సీఐటీయు, ఎస్ ఎఫ్ ఐ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌లో 2కే రన్‌ 
సీపీఎం మహాపాదయాత్రకు మద్దతుగా మహబూబ్‌నగర్‌లో 2కే రన్‌ జరిగింది. టౌన్‌హాల్‌ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ఈ  రన్‌ నిర్వహించారు.. జిల్లా పార్టీ కార్యదర్శి రాములు 2కే రన్‌ను  ప్రారంభించారు.
నిజామాబాద్‌ లో 
సామాజిక న్యాయం కోసమే తమ్మినేని వీరభద్రం చేపట్టనున్న మహాజన పాదయాత్రకు మద్దతుగా నిజామాబాద్‌  2కే రన్‌ నిర్వహించారు సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు ఈ రన్‌ను ప్రారంభించారు. 
మంచిర్యాలలో 
జిల్లా కేంద్రం మంచిర్యాలలో సీపీఎం ఆధ్వర్యంలో 2కే రన్‌ జరిగింది. నగరంలోని ఐబీ నుంచి బస్టాండ్‌ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు 2కే రన్‌ నిర్వహించాయి.

 

17:51 - October 14, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో మరో రాజకీయ వేదిక ఏర్పడబోతుందా..? ప్రజల్లోకి వెళ్లేందుకు మరో సంస్థ పావులు కదుపుతోందా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణలో భవిష్యత్తు రాజకీయాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి.
ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న టీజాక్‌
తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ర్ట ప్రజల్లో మమేకమైన సంస్థ టీ-జాక్. ప్రజల గొంతుకను ఇప్పుడు బలంగా వినిపించేందుకు ఈ వేదిక సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ.. ప్రజా సమస్యలపై తరచూ తన గళం విప్పుతోంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్ల తర్వాత టీ-జాక్ పక్కా ప్లాన్‌తో ప్రజల్లోకి వెళ్లబోతోంది. ప్రభుత్వ విధానాలను జనంలోకి తీసుకెళ్లేందుకు పావులు కదుపుతోంది. 
కీలక సమస్యలపై టీజాక్‌ ప్రత్యేక దృష్టి
రాష్ర్ట ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై టీజాక్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్య, వైద్య రంగాలపై అధ్యయనం చేసిన టీ-జాక్... ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండి పడుతోంది. కీలక రంగాలపై ప్రభుత్వం నిర్ల్యక్షం చేస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా విద్య, వైద్య అంశాలనే తీసుకునే ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. వచ్చే నెలలో వైద్య సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. అనంతరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశంపై అన్ని జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేసి... ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది.
ఆర్థిక స్థితిగతులపై శ్వేత పత్రం విడుదల చేయాలి 
తెలంగాణ ధనిక రాష్ర్టమని ముఖ్యమంత్రి పదేపదే చేస్తున్న ప్రకటనలపై టీజాక్‌ స్పందిస్తూ... రాష్ర్ట ఆర్థిక స్థితిగతులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన టీ-జాక్ ప్రభుత్వంపై ఎదురుదాడికి నేరుగా దిగుతుండడం... రాజకీయంగా చర్చనీయంశంగా మారింది.

 

17:48 - October 14, 2016

పశ్చిమగోదావరి : సిఎం చంద్రబాబు ప్రజల మనిషి కాదని, కంపెనీల బాబు అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను జైల్లో పెట్టి కంపెనీలను నడిపిస్తుందా అని ప్రశ్నించారు. ప్రజల సహకారం లేకుండా కంపెనీలు నడవడం సాధ్యంకాదన్నారు. తక్షణమే అక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 
ఆక్వాఫుడ్‌పార్కు ప్రాంతంలో బృందాకారత్‌ పర్యటన 
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, నరసాపురం మండలాల పరిధిలో తుందుర్రు వద్ద నిర్మిస్తున్న ఆక్వాఫుడ్‌పార్కు ప్రాంతంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ పర్యటించారు. ఫుడ్‌పార్కు బాధితులకు ఆమె ధైర్యం చెప్పారు. తణుకు సబ్‌జైల్లో ఉన్న అరేటి సత్యవతిని బృందా కారత్‌ పరామర్శించారు.  అనంతరం కంసాల బేతపూడి చేరుకుని స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి కాలుష్యంతోపాటు ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థజలాలు గొంతేరు డ్రెయిన్‌లో కలిసి 35 గ్రామాల్లోని పంటపొలాలు దెబ్బతింటాయని ఆమెకు గ్రామస్తులు వివరించారు. ప్రజా ఓట్లతో గెలిచి పోలీస్‌ బలగాలతో ప్రజలపై ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు బృందాకారత్‌.     
భీమవరంలో బహిరంగ సభ
భీమవరం పాతబస్టాండ్‌ ఆవరణలో అఖిలపక్షం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిధిగా పాల్గొని బృందాకారత్‌ ప్రసంగించారు. తుందుర్రు ఫుడ్‌పార్క్‌ విషయంలో ప్రభుత్వం అన్నిరకాలుగా చట్టాలను ఉల్లంఘిస్తోందని అన్నారు. వ్యవసాయానికి సరిగా నీరందడం లేదని రైతులు చెబుతుంటే.. ఫ్యాక్టరీకి పంటకాలువ ద్వారా రోజుకు లక్షలీటర్ల నీటిని ఏవిధంగా ఇస్తారని ప్రశ్నించారు. ప్రతిరోజూ 50వేల లీటర్ల వ్యర్థజలాలు విడుదలై ఈప్రాంతం మొత్తం మురికికూపంగా తయారు కానుందన్నారు. అన్నిపార్టీలనూ కలుపుకుని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఫుడ్‌పార్క్‌ అంశంపై చర్చకు తీసుకొస్తామని బృందాకారత్‌ అన్నారు. గొంతేరు పరిరక్షణ పోరాట కమిటీకి సిపిఎం మద్దతు ఉంటుందని ఆమె అన్నారు. 

 

'శౌర్య సమారక్' యుద్ధ స్మారకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

భోపాల్ : 'శౌర్య సమారక్' యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. 62 అడుగులు ఎత్తులో శౌర్య సమారక్ యుద్ధ స్మారకం ఏర్పాటు చేశారు. దేశ రక్షణకు జవాన్లు ప్రాణ త్యాగం చేస్తున్నారని మోడీ కొనియాడారు. శ్రీనగర్ లో వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేశారని తెలిపారు. 

ఆర్ కే బీచ్ లో ఇద్దరు విద్యార్థుల గల్లంతు

విశాఖ : ఆర్ కే బీచ్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కంచెరపాలెంకు చెందిన ఆదిత్య, సంతోష్ లుగా గుర్తించారు. మరో విద్యార్థిని గార్డులు రక్షించారు.  

 

15:46 - October 14, 2016

హైదరాబాద్ : రబీ పంటకు అవసరమైన సాగునీటి కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా ఖరారు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండు విడతల్లో చేపట్టిన మిషన్ కాకతీయను సమగ్రంగా సమీక్షించాలని నిర్ణయించారు. ప్రాధాన్యత పరంగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సమాయత్తమవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులకు హరీష్‌రావు సూచించారు.    
జలసౌధలో మంత్రి హరీష్‌రావు సమీక్ష
జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీష్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 18న చీఫ్ ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశం జరపాలని మంత్రి నిర్ణయించారు. అన్ని ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు నిండినందున ఒక్క చుక్కనీరు కూడా వృథా పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిట్టచివరి రైతుకు సైతం నీరందేలా ప్రణాళిక రచించి అమలు చేయాలని మంత్రి కోరారు.
ఖరీఫ్ సీజన్ సాగునీటి విడుదల నివేదికలపై సమీక్ష
మొన్నటి ఖరీఫ్‌లో ఏయే ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలకు సాగునీరందించారనే విషయమై ఇంజనీర్లు సమర్పించిన నివేదికలను మంత్రి సమీక్షించారు. శ్రీరాంసాగర్ స్టేజ్ 1 , స్టేజ్ 2, వరద కాలువ, నాగార్జునసాగర్, శ్రీశైలం, నిజాంసాగర్, ఎల్లంపల్లి, సింగూరు, మూసి, కడెం, జూరాల తదితర ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్ పంటకు జరిగిన సాగునీటి సరఫరాను మంత్రి అడిగి తెలుసుకున్నారు. శ్రీరాంసాగర్ నుంచి 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవలసిందేనని మంత్రి హరీష్ ఆదేశించారు. ఎస్ఆర్ఎస్‌పీ స్టేజ్ 1 లో మిగిలిపోయిన కాలువల మరమ్మత్తులు, ఇతర పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద రెండో పంటకు 6 లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరివ్వాలని కోరారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. 
పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై సమీక్షించాలని ఆదేశం
మహబూబ్ నగర్ జిల్లాలో గత మూడేళ్ళుగా జరుగుతున్న ఎత్తిపోతల పథకాలను సమీక్షించాలని, చెరువుల సంఖ్యను సమీక్షించి.. డేటా సేకరించాలని అధికారులను మంత్రి కోరారు. ఆన్ గోయింగ్ ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల పాలమూరు జిల్లాలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు.
వర్షాలతో నిండిన ప్రాజెక్టులోని నీటిని చెరువుల్లోకి తరలించాలని కోరారు. ఇటీవల వరదల నియంత్రణ సమన్వయంతో జరిగిందని మంత్రి అన్నారు. 
ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్ష
ఖమ్మం జిల్లాకు చెందిన సీతారామ, భక్త రామదాసు, నల్లగొండ జిల్లాకు చెందిన డిండి తదితర ప్రాజెక్టుల పనుల పురోగతి, భూసేకరణ పనులను  మంత్రి ఈ సమావేశంలో సమీక్షించారు. సీతారామ ప్రాజెక్టు కోసం  1700 ఎకరాల భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ నెల 18న జరిగే సి.ఇ. ల సమావేశంలో ప్రాజెక్టుల వారీగా రబీ పంటకు వున్న నీటి లభ్యత, మిషన్ కాకతీయ ఫలితాలు, మూడో దశలో చేపట్టే  పనులు ,  తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించాలని మంత్రి హరీష్ రావు నిర్ణయించారు. 

 

15:42 - October 14, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. వాషింగ్‌టన్‌లో అమెరికాలో భారత రాయబారి తరుణ్‌జిత్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ, అమెరికాల  మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాల పెంపు కోసం సహకరించాలని కోరారు. వారం రోజులపాటు అమెరికాలో పెట్టుబడుల సేకరణకు పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తొలిరోజు ఫార్మారంగ కార్యాచరణపై బిజీగా గడిపారు. దౌత్యాధికారులతోనూ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులతోనూ సమావేశాలు నిర్వహించారు. 
పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు 
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, ఎన్నారై శాఖల మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహించారు. ఫార్మా కంపెనీల ప్రతినిధులతో, అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ అధికారులతో ప్రత్యేక చర్చలు జరిపారు. ఫార్మా రంగంలో పెట్టుబడుల అవకాశాల గురించి, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సానుకూల పరిస్థితుల గురించి వారికి వివరించారు. నగరంలోని జనావాస ప్రాంతాల నుంచి ఫార్మా యూనిట్ల తరలింపులో సలహాసంప్రదింపులు అందించేందుకు పర్యావరణ సంస్థ ముందుకు వచ్చింది. 
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కాథరిన్ బీ హడ్డా
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తాత్కాలిక భారత రాయబారి తరుణ్‌జీత్‌సింగ్ సంధూతో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ, అమెరికాలోని పలు రాష్ర్టాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాల పెంపుదలకు సహకారం అందించాల్సిందిగా వారిని కోరారు. హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్ గా నియమితులైన కాథరిన్ బీ హడ్డా మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి వచ్చే విద్యార్థులు, వారి సమస్యలను మంత్రి కేటీఆర్ అమెతో చర్చించారు. అనంతరం బోయింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బెర్ట్రాండ్ మార్క్ అలెన్ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని ఎయిరోస్పేస్ సిటీలో ఉన్న బోయింగ్ సంస్థకు ప్రభుత్వ సహకారం అందుతున్న తీరుపైన అయన హర్షం వ్యక్తం చేశారు. ఎయిరోస్పేస్ రంగంలో విద్యార్థులు, యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపైన ఇరువురు చర్చించారు.
పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రతినిధుల బృందంతో సమావేశం 
మేరీలాండ్‌లో అమెరికా ఆహార, ఔషధ సంస్థ, ఐవీ2 అనే సంస్థతో కేటీఆర్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రతినిధుల బృందంతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు, అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలతో రాష్ట్రం ముందుకు వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారితో చర్చించారు. నగరంలోని ఫార్మా కంపెనీలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలకు, ఫార్మాసిటీలోకి తరలించే ప్రయత్నాలను మంత్రి ప్రస్తావించారు. 
జోనథన్‌తో మంత్రి భేటీ
క్లీవ్‌లాండ్ మెటార్ సైకిల్ వర్క్స్ కంపెనీ సీఈఓ జోనథన్‌తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పే అంశాన్ని పరిశీలించాలని, ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. కమ్యూనిక్లిక్ సంస్థకు చెందిన రాంరెడ్డితోనూ మంత్రి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తమ సంస్థ విభాగాన్ని ప్రారంభించేందుకు రాంరెడ్డి ముందుకు వచ్చారు. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్-2017 డైరెక్టర్ టామ్ లెర్సస్టెన్‌తోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు హైదరాబాద్ అత్యుత్తమ వేదిక అని ఆయనకు సూచించారు. మంత్రి కేటీఆర్ వెంట ఇంధన, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉన్నారు. మొత్తంగా అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌ పెట్టుబడుల కోసం బిజీబిజీగా గడుపుతున్నారు. 

బాబు, జగన్ తోడుదొంగలే : బివి.రాఘవులు

గుంటూరు : సీఎం చంద్రబాబు, వైసీపీ నేత జగన్ లపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో రాఘవులు మీడియాతో మాట్లాడుతూ నల్లధనం విషయంలో బాబు, జగన్ తోడుదొంగలే అని విమర్శించారు. 

హామీల అమలు లేదు : తమ్మినేని

హైదరాబాద్ : గతంలో ఇచ్చిన హామీల అమలు కావడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. విద్య, వైద్యం కార్పొరేటుమయమైందని వాపోయారు. సామాన్యుడికి విద్య అందుబాటులో లేదని.. దీంతో డ్రాపౌట్ పెరిగిందన్నారు.  57 శాతమే మహిళల్లో విద్య ఉందన్నారు. విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.  

​వనరులు సమాన పంపకాలు జరగలేదు : తమ్మినేని

హైదరాబాద్ : జిల్లాలకు వనరుల సమాన పంపకాలు జరగలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జిల్లాల విభజనలో కొన్ని జిల్లాలకు అన్యాయం జరిగిందని.. దాన్ని సరిదిద్దాలని కోరారు. మరికొన్ని కొత్త జిల్లాలు కావాలంటూ ప్రజలు చేస్తున్న డిమాండ్లను కేసీఆర్ పరిశీలించాలన్నారు. మిర్యాలగూడ, నారాయణపేట జిల్లాలుగా చేయాలని ప్రజలు కోరుతున్నారని వారి కోరిక మేరకు వాటిని జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో గట్టు మండలం ఏర్పాటు చేస్తామని ప్రకటించి... కార్యాలయాలు, సమాగ్రిని ఏర్పాటు చేశారు. కానీ స్థానిక ఎమ్మెల్యేకు గట్టును మండలంగా చేయడం ఇష్టం లేదు కాబట్టి..

ప్రజల్లో జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి : తమ్మినేని

హైదరాబాద్ : జిల్లాల విభజన చేస్తే సరిపోదని.. ప్రజల్లో జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కొత్త జిల్లాలతోపాటు విద్య, వైద్యాన్ని కూడా ప్రజలకు అందించాలని సూచించారు. కొత్త జిల్లాలగా విభజిస్తేనే సరిపోదని..  జిల్లాకు అధికారాలు, నిధులు ఇవ్వాలన్నారు. కనీస వేతనాలు అమలు జరగాలని చెప్పారు. కొత్త జిల్లాల్లో బతుకులు బాగుపడాలని పేర్కొన్నారు. ఈ విధమైన ప్రక్రియ జరిగినప్పుడే ప్రజల్లో నిజమైన ఆనందం కలుగుతుందని... బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. 

12:01 - October 14, 2016

హైదరాబాద్ : జిల్లాల విభజనలో శాస్త్రీయత లేదని.. అశాస్త్రీయంగా విభజించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రాజకీయ అవసరాల కోసమే ప్రభుత్వం జిల్లాల విభజన చేసినట్లుగా ఉందన్నారు. ఈ మేరకు ఆయన ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్ లో మీడియాతో మాట్లాడారు. జిల్లాల విభజన చేస్తే సరిపోదని.. ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలన్నారు. కొత్త జిల్లాలతోపాటు విద్య, వైద్యాన్ని కూడా ప్రజలకు అందించాలని సూచించారు. కొత్త జిల్లాలుగా విభజిస్తేనే సరిపోదని..  జిల్లాకు అధికారాలు, నిధులు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు కావాలని పేర్కొన్నారు. కనీస వేతనాలు అమలు జరగాలని చెప్పారు. కొత్త జిల్లాల్లో బతుకులు బాగుపడాలని పేర్కొన్నారు. ఈ విధమైన ప్రక్రియ జరిగినప్పుడే ప్రజల్లో నిజమైన ఆనందం కలుగుతుందని... బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. జిల్లాలకు వనరుల సమాన పంపకాలు జరగలేదన్నారు. జిల్లాల విభజనలో కొన్ని జిల్లాలకు అన్యాయం జరిగిందని.. దాన్ని సరిదిద్దాలని కోరారు. మరికొన్ని కొత్త జిల్లాలు కావాలంటూ ప్రజలు చేస్తున్న డిమాండ్లను కేసీఆర్ పరిశీలించాలన్నారు. మిర్యాలగూడ, నారాయణపేట జిల్లాలుగా చేయాలని ప్రజలు కోరుతున్నారని వారి కోరిక మేరకు వాటిని జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో గట్టు మండలం ఏర్పాటు చేస్తామని ప్రకటించి... కార్యాలయాలు, సామాగ్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ స్థానిక ఎమ్మెల్యేకు గట్టును మండలంగా చేయడం ఇష్టం లేదు కాబట్టి మళ్లీ ఉపసంహరించుకున్నారని అది సబబు కాదని.. గట్టును మండలంగా ప్రకటించాలని కోరారు. ఇప్పటికీ పాత విధానాలే కొనసాగుతున్నాయన్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలు కావడంల లేదని చెప్పారు. విద్య, వైద్యం కార్పొరేటుమయమైందని వాపోయారు. సామాన్యుడికి విద్య అందుబాటులో లేదని.. దీంతో డ్రాపౌట్ పెరిగిందన్నారు. 57 శాతమే మహిళల్లో విద్య ఉందన్నారు. విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. రాష్ట్రంలో 93 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీలున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు కావడం లేదన్నారు. అభివృద్ధి నమూనా మారాలని సూచించారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం మారితే సరిపోదని... విధానాలు మారాలని.. అవి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలన్నారు. కుల వివక్షత రూపుమాపాలని, సామాజికన్యాయం జరగాలని తెలిపారు. ఏమైనా జిల్లాల ఏర్పాటు జరిగిందని.. కాబట్టి అందుకనుగుణంగా తమ పార్టీ కమిటీలను జిల్లాల వారిగా విభజించామని తెలిపారు. కొత్త జిల్లా కమిటీలు, సెక్రటరీలు, కార్యదర్శివర్గాన్ని ఎన్నుకున్నామని పేర్కొన్నారు. 

 

 

రాజకీయ అవసరాల కోసమే జిల్లాల విభజన : తమ్మినేని

హైదరాబాద్ : జిల్లాల విభజనలో శాస్త్రీయ లేదని... రాజకీయ అవసరాల కోసమే ప్రభుత్వం జిల్లాల విభజన చేసినట్లుగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్ లో మీడియాతో మాట్లాడారు. జిల్లాలకు వనరుల సమాన పంపకాలు జరగలేదన్నారు. జిల్లాల విభజనలో కొన్ని జిల్లాలకు అన్యాయం జరిగిందని.. దాన్ని సరిదిద్దాలని కోరారు. 

 

విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

పశ్చిమగోదావరి : ఉంగుటూరు మండలం పెద్దతాడేపల్లిలో విషాదం నెలకొంది. వరికోత మిషన్ కు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. 

కర్నూలు జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు : సి.బెళగల్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. సరస్పరం రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. పొలానికి నీరు మళ్లించే విషయంలో వివాదం తలెత్తింది. 

Don't Miss