Activities calendar

15 October 2016

22:35 - October 15, 2016
22:14 - October 15, 2016

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాజన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నాలుగు వేల కిలో మీటర్లు, 5 నెలలపాటు పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 17 నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా తమ్మినేని పలు విషయాలు వివరించారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'మహాజన పాదయాత్ర ప్రభుత్వ వ్యతిరేక యాత్రకాదు. ప్రజాచైతన్య యాత్ర.. సమస్యలపై సాధికారి పరిశీలన యాత్ర. సర్కారును స్పందింపచేయడమే మా లక్ష్యం. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలి. బడుగు, బలహీన వర్గాలకు భూ పంపిణీ చేయాలి. రాష్ట్రంలో 93 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలే. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి పాదయాత్ర లక్ష్యాలు. 31 జిల్లాలో 4 వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది. హైదరాబాద్ లో మౌలిక వసతులు మెరుగు పరచాలి. భూకబ్జాదారులు పెరిగిపోతున్నారు. హైదరాబాద్ బస్తీల్లో కనీస వసతులు లేవు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:55 - October 15, 2016

సిలికాన్ వ్యాలీ : హైదరాబాద్‌లో స్టార్టప్‌లను ప్రపంచ దేశాలతో అనుసంధానం చేసే టీ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ సిలికాన్ వ్యాలీలో ప్రారంభించారు. ఉబర్, టై సిలికాన్ వ్యాలీతో కలిసి...టీ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని 10 స్టార్టప్ నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ని నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు కేటీఆర్. భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా తెలంగాణను అభివర్ణించారు ఉబర్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షులు రేచల్ వెట్ స్టోన్. హైదరాబాద్‌లో స్టార్టప్ నిర్వహణకు అత్యంత అనుకూలంగా ఉందని ఆయన ప్రశంసించారు.

 

21:53 - October 15, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమైంది. హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, రోడ్ల అద్వాన్న స్థితిపై ఈనెల 19 సాయంత్రం 6 గంటలకు శేరిలింగంపల్లిలో నిరసన కార్యక్రమం చేపడతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. ఒకేసారి రైతురుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న భూపాలపల్లి జిల్లాలో రైతుగర్జన సభ నిర్వహిస్తామన్నారు. 21న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని నెలరోజుల పాటు అన్ని కాలేజీల్లో సంతకాల సేకరణ చేపడతామన్నారు. 

21:51 - October 15, 2016

డెహ్రడూన్ : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి చందౌలి మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 24 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. బాబా జయదేవ్‌ గురు జయంతి సందర్భంగా భక్తులు భారీగా చందౌలికి చేరుకున్నారు. బాబాను దర్శించుకునేందుకు జన సమూహం ఒక్కసారిగా రావడంతో రాజ్‌ఘాట్‌ వంతెన వద్ద తొక్కిసలాట జరిగింది. వీరంతా ఆధ్యాత్మిక గురువు జయ్‌ గురుదేవ్‌కు శ్రద్ధాంజలి ఘటించేందుకు ఒకచోట చేరినపుడు ఈ ఘటన చోటుచేసుకుందని జిల్లా అధికారి కుమార్‌ ప్రశాంత్‌ పిటిఐకి తెలిపారు. పరిమితిని మించి ఎక్కువ భక్తులను అనుమతించడంతో పాటు వారిపై సరైన నియంత్రణ లేకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు చెప్పారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యుపి సిఎం అఖిలేష్‌ యాదవ్ మృతులకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారికి ప్రధాని మోది ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.

 

21:46 - October 15, 2016

హైదరాబాద్ : అక్వాపుడ్ పార్కు ప్రాజెక్టు బాధితులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి గోడును వెళ్లబోసుకున్నారు. అక్వాపుడ్ పార్కును వేరే చోటుకు తరలించాలని కోరారు. అ వివరాలను వారి మాటల్లోనే చూద్దాం...
బాధితులు.. 
ప్రజాభిప్రాయం సేకరణ చేయలేదు. రైతుల అభిప్రాయాలు తీసుకోలేదు. ఫోర్జరీ సంతకాలతో భూములు తీసుకున్నారు. గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. చిన్న పిల్లలపై హత్యనేరాలు కేసులు పెట్టారు. యువతపై కేసులు నమోదు చేశారు. రెండున్నర సం.లుగా పోరాటం చేస్తున్నారు. రాత్రిళ్లు వ్యవసాయ పొలంలో మందులు వేసే దుస్థితి నెలకొంది. బహిర్భూమికి వెళ్లే వారి వద్ద ఆధార్ కార్డును చూస్తున్నారు. పార్కును వేరే చోటుకు తరలించాలని కోరుతున్నాము. నదులు, కాల్వలను నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు. మా అందరిపై కూడా కేసులు ఉన్నాయి. యువతి, చిన్నపిల్లలు, మహిళలపై అక్రమ కేసులు పెట్టారు. పోలీసుల రాజ్యం నడుస్తోంది. 144 సెక్షన్ విధించారు. మా సమస్యను ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు చెప్పాము. ఎవరు పట్టించుకోలేదు. మా తరపున పోరాడే ముచ్చర్ల త్రిమూర్తులు, ఆరేటి వాసు, సత్యవతిలను అరెస్టు చేశారు. ఎక్కడివెళ్లిన ఆధార్ కార్డు అడుగుతున్నారు. మూడు వేల మంది పోలీసులను రప్పించారు. మేము మాట్లాడానికి స్వేచ్ఛ ఇవ్వడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేస్తారని నమ్మి ఆయన్ను కలిసేందుకు వచ్చాము అని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.
 

21:38 - October 15, 2016
21:37 - October 15, 2016

హైదరాబాద్ : జిల్లాలోని తుందుర్రులో నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం పునరాలోచన చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. ఫ్యాక్టరీని వెనక్కితీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వాపార్క్ బాధితులు ఇవాళ హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌ను కలిసి తన గోడు వినిపించారు. ఉభయ గోదావరి జిల్లాలు అన్నంపెట్టే జిల్లాలని, నదులను కలుషితం  చేసే పరిశ్రమల ఏర్పాటు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. పంటలకు అనుకూలంగా లేని ప్రాంతాల్లోనే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. 30 రోజులుగా ఆయా గ్రామాల్లో 144 సెక్షన్‌ ఎందుకు పెట్టారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తే... హైకోర్టు స్వతహాగా కమిటీ ఏర్పాటు చేసి, ఆక్వాఫుడ్‌ పార్క్‌ విషయాన్ని పరిశీలించాలని పవన్‌ కళ్యాన్‌ కోరారు. 
గోదావరి కాలుష్యానికి కంకణం కట్టుకున్నారు..? 
ప్రధాని నరేంద్ర మోదీ గంగానది ప్రక్షాళనకు కార్యక్రమాన్ని చేపడితే... గోదావరి జిల్లాల టీడీపీ, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు... గోదావరి నది కాలుష్యానికి కంకణం కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. తుందుర్రు ఆక్వా ఫుడ్‌ పార్క్‌ విషయంలో నరసాపురం ఎంపీ గోకరాజు రంగరాజు అంటీమట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
144 సెక్షన్‌ ఎందుకు విధిస్తున్నారో
రెండున్నరేళ్లుగా తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్‌ సమస్య కొనసాగుతున్నా.. నెల రోజుల క్రితం మరింత ఉధృతమైందన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. ఆ చిన్న గ్రామాల్లో 144 సెక్షన్‌ ఎందుకు విధిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ప్రజలకు అండగా నిలిచిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో సహా పలువురిని నిర్బంధించడం సరికాదన్నారు పవన్‌కల్యాణ్‌. 
బాధితులకు న్యాయసహాయం చేస్తా : పవన్‌ 
కేసుల్లో చిక్కుకున్న తుందుర్రు ఆక్వాఫుడ్‌ పార్క్‌ బాధితులకు న్యాయ సహాయం అందిస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. కాలుష్యకారక పరిశ్రమలకు అనుమతి ఇచ్చే ముందు ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని కోరారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గమనించి ఈ పరిశ్రమను సముద్రతీర ప్రాంతానికి తరలించాలని కోరారు. 
నదులను కలుషితం చేసే పరిశ్రమల ఏర్పాటు సరికాదు : పవన్‌కల్యాణ్‌
నదులను కలుషితం చేసే పరిశ్రమల ఏర్పాటు సరికాదన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. తుందురు ఆక్వా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజల ఆందోళనను ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్తానన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే..ఈ సమస్యపై అవగాహన ఉన్న సీపీఎంతో సహా కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తానని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

21:34 - October 15, 2016

స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తాను నటించిన జయమ్ము నిశ్చయమ్ము సినిమా గురించి తెలిపారు. తన సినీ కెరీర్ వివరించారు. ఆయన తెలిపిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను  వీడియోలో చూద్దాం...

 

21:24 - October 15, 2016

ఆదిలాబాద్ : గిరిజనులను అడవికి దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఆదివాసీలే భయంతో స్వస్థలాలను వీడిపోయేలా.. వ్యూహం అమలవుతోంది. పులుల సంరక్షణ కోసం... గిరిపుత్రులు నిర్వాసితులవుతున్న దైన్యం కళ్లకు కడుతోంది. పులుల సంరక్షణే కానీ.. మా గోడు పట్టదా..? ఇదేనా ప్రభుత్వ గిరిజన విధానం..? ఇదేనా ఆదివాసీలను ఆదుకునే వైనం..? ఇవీ గిరుల్లో ప్రతిధ్వనిస్తోన్న ఆదివాసీ ప్రశ్నలు.  
పాలకుల వ్యూహాలకు బలవుతున్న ఆదివాసీలు.. 
పాలకుల వ్యూహాలకు బలవుతున్న ఆదివాసీలు.. గిరిజన గ్రామాల్లో లేని సమస్యలు సృష్టిస్తోన్న పాలకులు.. భయంతో గూడేలను ఖాళీ చేస్తున్న గిరిపుత్రులు.. ఇంతకీ ప్రజలను ఇంతలా భయపెడుతున్న పాలకుల అస్త్రం ఏంటి..? ఇంకేంటి..? జీవో నెంబర్‌-27. అవును కవ్వాల అభయారణ్యాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా పరిగణిస్తూ జారీ చేసిన జీవో నెంబర్‌-27, అణగారిన ఆదివాసీల బతుకులను బజారుకీడుస్తోంది. ఈ జీవోయే ఆదివాసీల బతుకులను ఛిద్రం చేస్తోంది. 
గిరిజనులను అడవికి దూరం చేసే ప్రయత్నం 
ఆదిలాబాద్‌ జిల్లాలో.. గిరిజనులను అడవికి దూరం చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా.. వ్యూహాత్మకంగా సాగిస్తోంది. గిరిజన గూడేలన్నింటినీ ఒకేసారి ఖాళీ చేయిస్తే.. వ్యతిరేకత వస్తుందన్న భావనతో.. ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడలు వేస్తూ.. ఆదివాసీలను అడవులనుంచి తరిమేస్తోంది. ప్రతి గ్రామానికీ విడిగా సరికొత్త సమస్యలు సృష్టిస్తూ.. ప్రజలే బెంబేలెత్తి పారిపోయేలా చేస్తోంది. ఇక్కడి గిరిజనులకు.. కనీసం తాగునీరు కూడా అందకుండా వ్యూహాత్మకంగా బోర్లను మరమ్మతు చేయకుండా వేధిస్తున్నారు. 
పోడు వ్యవసాయమే జీవనాధారం
ఈ ప్రాంత గిరిజనులకు పోడు వ్యవసాయమే జీవనాధారం. పశుపోషణ, అడవిలో దొరికే బంక, ఇప్పపువ్వు, తునికాకు, తేనెలతో పాటు.. అడవుల్లో కాసే సీతాఫలం వంటి ఫలాలు, వెదురు బొంగులతో చీపుర్లు, గుల్లలు తయారు చేసి అమ్ముతుంటారు. ఈ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా వచ్చే అరకొర ఆదాయంతోనే వీరు జీవనం సాగిస్తున్నారు. టైగర్‌ జోన్‌ ఏర్పాటు జీవో జారీ చేయడం ద్వారా.. ప్రభుత్వం అడవి బిడ్డలనూ అడవుల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటోంది. ఈ జీవో కారణంగా లభించిన అధికారాలతో.. అటవీ అధికారులు.. గిరిజనులు అడవుల్లో పోడు చేసుకోకుండా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో గిరిజనులు ఉపాధిని కోల్పోతున్నారు. 
40 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించేందుకు ప్లాన్ 
జిల్లాలోని జన్నారం, కడెం పరిధుల్లోని సుమారు 40 గ్రామాల్లోని ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం జన్నారం డివిజన్‌లోని మల్యాల, మైసంపేట్‌, రాంపూర్‌ గ్రామాల గిరిజనులను తరలించే ప్రయత్నం జరుగుతోంది. వీరందరికీ పునరావాసం కింద ఆర్థిక సాయం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే భూమికి భూమి.. ఇంటికి ఇల్లు, రోడ్డుకు రోడ్డు కావాలని స్థానిక గిరిజనం నినదిస్తోంది. 
ఉమ్మడి రాష్ట్రంలోని నిర్ణయం అమలు 
ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్నే తెలంగాణ ప్రభుత్వమూ అమలు చేస్తుండడాన్ని స్థానిక గిరిజనులు జీర్ణించుకోలేక పోతున్నారు. పైగా గిరిజనుల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. ఆర్థిక సాయం ఆశ చూపి.. బలవంతంగా అడవి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాన్ని గిరిజన సంఘాలు తప్పుబడుతున్నాయి. స్మగ్లర్లు అడవులను అడ్డంగా నరికేస్తూ కలపను అక్రమంగా తరలించుకు పోతుంటే ఉదాసీనంగా ఉన్న పాలకులు.. గిరిజనుల విషయంలో ఇంత మొండిగా వ్యవహరిస్తుండడాన్ని గిరిజన సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. అడవి బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు.. వీరంతా భారీ ఉద్యమానికి  సిద్ధమవుతున్నారు.

 

21:14 - October 15, 2016

సంగారెడ్డి : 93 శాతం ఉన్న అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఈనెల 17 నుంచి చేపట్టనున్న మహాజన పాదయాత్ర గురించి సంగారెడ్డిలో జరుగుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శుల సమావేశంలో చర్చించారు. మహాజన పాదయాత్రపై అన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమవుతుందని తమ్మినేని అన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పాదయాత్ర చేపడుతున్నామన్నారు. సామాజిక తెలంగాణ కావాలన్నారు. ఇచ్చిన హామీల్లో 90 శాతం హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. సామాజిక అజెండా చర్చ జరగడం కేసీఆర్‌కు ఇష్టం లేదన్నారు. 93 శాతం వర్గ ప్రజల్లో మహాజన పాదయాత్ర చర్చనీయాంశమవుతుందని చెప్పారు. మహాజన పాదయాత్రను ప్రజలంతా ఆదరించాలని కోరారు. 

 

మరో 3 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్ ల నియామకం

హైదరాబాద్ : మరో 3 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్ లను నియమించారు. తొర్రూరు మార్కెట్ చైర్మన్ గా హనుమాండ్ల నరేందర్ రెడ్డి, కొడగండ్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఉప్పినేని రమాదేవి, బోధన్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ముర్తుజా బేగంను నియమించారు. 

 

ట్యాంక్ బండ్ త్యాగరాజు విగ్రహం ఎదుట వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై త్యాగరాజు విగ్రహం ఎదుట రాజు అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పింటించుకున్నాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. నారాయణరెడ్డిపేట మండలాన్ని మెదక్ లోనే ఉంచాలని రాజ డిమాండ్ చేశారు.  

 

19:55 - October 15, 2016
19:52 - October 15, 2016

గోవా : ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో భారత్‌, రష్యాలు మరింతగా సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. గోవాలో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మన ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ద్వైపాకిక్ష అంశాలపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య 16 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో నాగపూర్‌-సికింద్రాబాద్‌ హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ నిర్మాణం, ఏపీలో ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఉన్నాయి. అలాగే తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రంలో మూడు, నాలుగు యూనిట్ల నిర్మాణానికి సంబంధించిన పౌర-అణు విద్యుత్‌ ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. వీటితో పాటు కీలకమైన ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ 400 మిసైళ్ల కొనుగోలు ఒప్పందం కూడా కుదిరింది. 

భువనగిరి క్లబ్ లో ఎస్ ఓటీ పోలీసులు తనిఖీలు

యాదాద్రి : భువనగిరి క్లబ్ లో ఎస్ ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. పేకాడుతున్న 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

19:39 - October 15, 2016

నిజామాబాద్ : ఏడంతస్తుల మేడ అది. కానీ, అందులో అన్ని లొసుగులే. పేరుకు పెద్దాసుపత్రి అయినా... చికిత్స చేయడానికి వైద్యులుండరు. రోగులను స్ట్రెచర్ పై తీసుకెళ్లేందుకు సిబ్బంది కనిపించరు. నిత్యం వెయ్యికి మందికి పైగా రోగులు వచ్చే ఆస్పత్రిలో కేవలం సగం మందే సిబ్బంది ఉన్నారు. నిజామాబాద్ పెద్దాస్పత్రి దుస్థితి ప్రత్యేక 10 టీవీ ప్రత్యేక కథనం..!
సిబ్బంది కొరత 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి అనుసంధానంగా.... ఏడంతస్తుల పెద్దాసుపత్రి చూడ్డానికి కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నే స్థాయిలో ఉంటుంది. కానీ, ఇక్కడ అన్ని సమస్యలే.. వైద్యం కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలపై అధికార యంత్రాంగం ఇప్పటికీ దృష్టిపెట్టడం లేదు. ముఖ్యంగా ఆస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రతిరోజూ వెయ్యి మందికి పైగా ఔట్ పేషెంట్లు వచ్చే ఈ ఆస్పత్రిలో రోగుల రద్దీకి తగ్గట్లు వైద్య సిబ్బంది లేరు. 
150 మంది డాక్టర్లకు కేవలం ఆస్పత్రిలో 58 మంది  
ఎంసీఐ నిబంధనల ప్రకారం 500 పడకల ఆస్పత్రిలో 700 మంది సిబ్బంది ఉండాలి. 150 మంది డాక్టర్లు ఉండాలి. వీరితో పాటు పారా మెడికల్, ఇతర సిబ్బంది ఉండాలి. కానీ, ఈ ఆస్పత్రిలో కేవలం 58 మంది మాత్రమే వైద్యులున్నారు. 17 మంది చొప్పున ఉండాల్సిన ల్యాబ్ లో నలుగురు, రేడియాలజీ విభాగంలో ముగ్గురున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విభాగాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది.
రోగులకు తీవ్ర ఇబ్బందులు
వైద్యులు, సిబ్బంది కొరత వల్ల వైద్యం కోసం వచ్చే పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పట్టించుకునే నాథుడే ఉండరని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
28 మంది ఆపరేషన్ అసిస్టెంట్‌లకు ప్రస్తుతం ఏడుగురే 
ఆస్పత్రిలో 168 మంది స్టాఫ్ నర్సులు అవసరం కాగా 48 మంది మాత్రమే ఉన్నారు. ఆస్పత్రిలో వీరందించే సేవలు చాలా కీలకం. మూడు షిప్టుల్లో వీరు పనిచేయాలి. కీలక విభాగాల్లో కూడా ఒక్కరు లేదా ఇద్దరు నర్సులు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. ఆస్పత్రిలో 7 ఆపరేషన్ థియేటర్లు ఉంటే  28 మంది అసిస్టెంట్ లు అవసరం కాగా ఏడుగురు మాత్రమే ఉన్నారు. సిబ్బంది, వైద్యుల కొరతతో ఎమర్జెన్సీ రోగులను హైదరాబాద్ కు రిఫర్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆస్పత్రిలో వైద్యసిబ్బందిని నియమించి.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

 

19:32 - October 15, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు ముప్పెట దాడి చేస్తున్నాయి. పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలను విపక్షాలు వేలెత్తి చూపిస్తున్నాయి. దీంతో గులాబీ దళం ఆత్మరక్షణలో పడుతోంది. విపక్ష పార్టీల విమర్శ దాడులను ఎదుర్కొనేందుకు  విమర్శలతోనే సమాధానమిస్తున్న అధికార పార్టీ... వాస్తవాలను మాత్రం ప్రజలకు వివరించకుండా అదేపనిగా కవర్‌ చేసుకుంటోంది..!
ప్రతిపక్షాల సవాళ్లతో గులాబీ నేతలు అయోమయం 
ప్రభుత్వ నిర్ణయాలను ప్రతిపక్షాలు వేలెత్తిచూపుతుండడంతో అధికార పార్టీ సహించలేకపోతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సమస్యలను అధిగమించమని అంచనా వేసుకుంటున్న గులాబీ నేతలకు... ప్రతిపక్షాల సవాళ్లు.. అయోమయానికి గురి చేస్తున్నాయి. అధికార పార్టీగా అన్ని సమస్యలపై స్పందించాల్సి ఉన్నా... తాము అనుకున్న విధానాన్ని మాత్రమే అమలు చేసే ప్రయత్నాలు చేస్తోంది టీఆర్‌ఎస్‌. ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానం ఇవ్వకుండా ఆ పార్టీలపై దుమ్మెత్తి పోస్తోంది. సలహాలు, సూచనలు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. ఎదురుదాడికి దిగుతోంది.
అధికార పార్టీని ఇరుకున పెడుతున్న కోదండరాం 
రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై టీ.జాక్ ఛైర్మన్ కోదండరాం చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీని మరింత ఇరుకున పెడుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానాలను నివృత్తి చేయాల్సిన అధికార పార్టీ నేతలు... తాము చేస్తున్నదంతా సర్దుబాటు మాత్రమే అంటూ... కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక విధానాలపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం లేదంటున్నారు. 
అధికార పార్టీలో మహాజన పాదయాత్ర గుబులు 
సీపీఎం చేపడుతున్న మహాజన పాదయాత్రపై కూడా అధికార పార్టీలో గుబులు రేపుతోంది. ముఖ్యమంత్రి నేరుగా సీపీఎంని టార్గెట్ చేయడంతో ఆ పార్టీ నేతలు మరో అడుగు ముందుకేసి పాదయాత్రపై అర్థరహిత విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడంతో అంశాల వారీగా బహిరంగ చర్చకు సిద్ధమంటూ మెలికపెడుతున్నారు. మొత్తంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం పోలిటికల్‌ హీట్‌ను పెంచుతోంది. 

 

19:26 - October 15, 2016

హైదరాబాద్ : రెండున్నరేళ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో విద్యారంగంలో సమస్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అమలుకు ఎలాంటి అడుగులు పడటం లేదు. సంక్షేమ హాస్టళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఫీజుల మాఫీ లాంటి సమస్యలు ఇంకా పరిష్కారం కానే లేదు. తెలంగాణ సర్కార్‌ విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
విద్యా రంగానికి ప్రాధాన్యత ఇవ్వని ప్రభుత్వం 
తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లయినా.. ప్రభుత్వం ఇంతవరకు కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.  పాఠశాల విద్య మొదలు..యూనివర్శిటీ విద్య వరకు తెలంగాణ సర్కార్‌కి ఒక విధానం అంటూ లేకుండా పోయింది. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలకు చుట్టకపోవడంతో.. ఉన్నత విద్య నాణ్యత ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు నానా ఇబ్బందులు పడుతున్నాయని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. 
పాఠశాలల్లో విద్య మరింత అధ్వానం 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీఎస్సీ నియామకాలు జరపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య మరింత అధ్వానంగా మారింది. అతి తక్కువ సంఖ్యలో ఉన్న ఎంఈవోలతో స్కూళ్లపై పర్యవేక్షణ కూడా సరిగా లేకుండా పోయింది. గురుకుల పాఠశాల అభ్యున్నతి, సంక్షేమ హాస్టళ్లలో వసతులు మెరుగు పరుస్తామన్న నేతల హామీలు హామీలుగానే మిగిలిపోయాయని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు.  హాస్టళ్లలో సన్న బియ్యం అన్నం పెడతామన్న సర్కార్.. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యమని చెబుతున్నారన్న ఆరోపణలున్నాయి.  
ఆచరణకు నోచుకోని హామీలు 
పాలకుల హామీలు ఆచరణకు నోచుకోకపోవడంతో.. ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రాధాన్యత గల రంగంగా గుర్తించినట్లు కనబడటం లేదు. ప్రణాళిక రూపకల్పన, నిధుల కేటాయింపుల్లో వివక్ష, పనితీరుతో విద్యారంగం దయనీయ స్థితికి చేరుకుంది. ఉన్నత విద్యాశాఖను, విశ్వవిద్యాలయాలను సమన్వయం చేసుకుని విద్యారంగం బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నత విద్యామండలి.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.   
అక్షరాస్యతలో తెలంగాణ 32వ స్థానం 
తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో దేశంలో 32వ స్థానంలో ఉంది. అక్షరాస్యతలో జాతీయ సగటు 74.4 శాతం ఉంటే, తెలంగాణలో 66.46 శాతం నమోదైంది. ఎస్సీ, ఎస్టీల్లో 50 శాతం మాత్రమే ఉంది. దీనికి తోడు ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలో పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
కేజీ టు పీజీ ఉచిత విద్యపై చేతులెత్తేసిన సర్కార్... ?
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య పథకం అమలుపై చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. కేజీ టు పీజీ కోసం రెండేళ్లుగా నిధులు విడుదల కేటాయిస్తున్నామంటూ అసెంబ్లీ లో ప్రకటిస్తూనే ఉన్నారు. దీంతో పాటు గతేడాది 25 కోట్లు, ఈ ఏడాది 100 కోట్లు కేటాయించారు. కానీ ఆ నిధులు ఎటు పోతున్నాయన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. కేజీ టూ పీజీ నినాదంగా మాత్రమే మిగిలిందని, ఆచరణ సాధ్యం కావడానికి కావాల్సిన బడ్జెట్‌ను పెంచలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
అంతంత మాత్రంగానే ఉన్నత విద్య  
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండటంతో.. న్యాక్‌ గుర్తింపు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నియామకాలు, నిధులు లేకుండా విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చెందే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు అధ్యాపకుల భర్తీ  ప్రక్రియను చేపట్టలేదు. దీంతో విద్యార్థులకు పాఠాలు చెప్పే అధ్యాపకులు లేక  నానాటికి విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. అన్ని యూనివర్సిటీల్లో కలిపి 2,753 మంది అధ్యాపకుల ఖాళీలు ఉంటే.. ప్రస్తుతం ఉన్నది కేవలం 1504 మంది మాత్రమే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.  యూనివర్సిటీల్లో అధ్యాపకులు లేక న్యాక్‌ గుర్తింపును కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని నిపుణులు చెబుతున్నారు. 
అధ్యాపకుల పోస్టుల క్రమబద్ధీకరణ ఊసేలేదు.. 
అటు ఒప్పంద అధ్యాపకుల పోస్టులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఆ ఊసే ఎత్తడం లేదు. రెగ్యులరైజేషన్‌ కోసం కాంట్రాక్ట్‌ ఉద్యోగులు చాలా కాలంగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఇటు రేషనలైజేషన్‌లో భాగంగా సర్కార్‌ 4 వేల పాఠశాలలను మూసేసింది. సంక్షేమ హాస్టళ్లలో కొన్నింటిని రేషనలైజేషన్ లో భాగంగా మూసివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికీ కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో  గిరిజన హాస్టళ్లలో  వైద్యం సరిగ్గా అందడం లేదు. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. విద్యా హక్కు కోసం తెలంగాణలో మరో ఉద్యమం జరగాల్సిన అవసరం   ఉందని నిపుణులు చెబుతున్నారు. 
గందరగోళంలో వృత్తి విద్య   
డిగ్రీ, పీజీ విద్యతో పాటు వృత్తి విద్య రంగం కూడా గందర గోళ పరిస్థితిలో పడింది. ఎంసెట్‌ 2 పేపర్‌ లీకేజీతో పాటు.. ఆ తర్వాత నిర్వహించిన ఎంసెట్‌ 3లో కూడా అవకతవకలతో నిండి ఉందన్న విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి పెట్టాలని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

రంగారెడ్డి జిల్లాలో అక్రమ ఇళ్లను కూల్చివేస్తున్న జీహెచ్ ఎంసీ

రంగారెడ్డి : ఘట్ కేసర్ మండలం చౌదర్ గూడలో అక్రమ ఇళ్ల నిర్మాణాలను జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. భారీగా పోలీసుల మోహరించారు.

 

18:20 - October 15, 2016

హైదరాబాద్ : ఆక్వాపుడ్ పార్క్ ప్రాజెక్టును వెనక్కితీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆక్వాపుడ్ పార్క్ బాధితులు హైదరాబాద్ లో పవన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్వాఫుడ్ పార్క్ తో జీవ నదులు కాలుశ్యమవుతాయన్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ కాలుష్యంతో మత్స్య సంపద నష్టపోతుందని తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఆలోచించాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ పెట్టడం సరికాదన్నారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలను ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ.. ప్రజలకు మద్దతుగా ఇటీవల సీపీఎం నాయకులు పి.మధు వెళ్లినప్పుడు వారిని నిర్బంధించడం భావ్యం కాదన్నారు. గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం సరికాదన్నారు. తుందుర్రు వెళదామనుకున్నా... కానీ ఉద్రిక్తల కారణంగా వెళ్లలేకపోయానని తెలిపారు. కాలుష్యంతో ఉత్పన్నమయ్యే నష్టం గురించి ప్రభుత్వం అంచనా వేయలేదని చెప్పారు. గ్రామాల మధ్య ఫ్యాక్టరీ పెట్టడం సరికాదన్నారు. సముద్ర తీర ప్రాంతానికి ఫ్యాక్టరీని తరలించాలని సూచించారు. ఫ్యాక్టరీ సమస్యలను అధ్యయనం చేయడానికి కమిటీని వేయాలన్నారు. టీడీపీ గెలుపొందడానికి పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు ఎంతగానో దోహదపడ్డారని తెలిపారు. ఫ్యాక్టరీ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ప్రధాని నరేంద్రమోడీ గంగా ప్రక్షాళన చేస్తుటే.. ఇక్కడి బీజేపీ నేతలు గోదావరి నదిని కాలుష్యంచేసేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా ప్రజలకు అండగా ఉండాలన్నారు. గోదావరి డెల్టా మరో నందిగాం అయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా జరిగే ఆందోళనకు జనసేన మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. 
సీపీఎం నేత పి.మధు 
'పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన ఉండటాన్ని మేం హర్షిస్తున్నాం. అందరం కలిసి తుందుర్రులో ఫ్యాక్టరీని అడ్డుకుంటాం. పర్యావరణ నిబంధనలను ధిక్కరించి ప్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకోవడం దారుణం. 144 సెక్షన్ విధించాలల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవ్యహరిస్తుంది. 144 సెక్షన్ ఉపసంహరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకుని అక్కడ పుడ్ పార్కు నిర్మించకుండా పోరాటం చేస్తాం. ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. పోర్జరీ సంతకాలు చేసిన పత్రాలు సమర్పించారు. చిన్న చిన్న చెరువులు ధ్వంసం అవుతాయి. చేప పిల్లలు చనిపోతాయి. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారు. పుడ్ పార్క్ కు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మద్దుతో అందరినీ కలుపుకుని పోరాటం చేస్తామని' చెప్పారు.

 

అక్వాఫుడ్ పార్క్ గ్రామస్తులపై అక్రమ కేసులు సరికాదు : పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : అక్వాఫుడ్ పార్క్ ప్రాజెక్టు ప్రాంతాల గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తుందుర్రు వెళదామనుకున్నా... కానీ ఉద్రిక్తల కారణంగా వెళ్లలేకపోయానని తెలిపారు. కాలుష్యంతో ఉత్పన్నమయ్యే నష్టం గురించి ప్రభుత్వం అంచనా వేయలేదని చెప్పారు. గ్రామాల మధ్య ఫ్యాక్టరీ పెట్టడం సరికాదన్నారు. 

అక్వాఫుడ్ పార్క్ తో జీవ నదులు కాలుశ్యం : పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : అక్వాఫుడ్ పార్క్ తో జీవ నదులు కాలుశ్యమౌతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ కాలుష్యంతో మత్స్య సంపద నష్టపోతుందని తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఆలోచించాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ పెట్టడం సరికాదన్నారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలను ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.  

17:45 - October 15, 2016

యూపీ : వారణాసిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. మృతులు 19కి చేరింది. మరో 20 మందికి గాయాలయ్యాయి. జయ్ గురుదేవ్ జయంతి సందర్భంగా వేలాది భక్తులు తరలివచ్చారు. భక్తులు కిక్కిరిసారు. రాజ్ ఘాట్ వంతెన ఇరుకుగా ఉంది. భక్తులు ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో 19 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయపడినవారిని మొరుగైన చికిత్స కొసం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మరోవైపు భద్రతా, పోలీసులు వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. జయ్ గురుదేవ్ జయంతికి 6 వేల మంది భక్తులు తరలివచ్చారని తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

వారణాసిలో తొక్కిసలాట.. 19కి పెరిగిన మృతుల సంఖ్య

యూపీ : వారణాసిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. మృతులు 19కి చేరారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. 
రాజ్ ఘాట్ వంతెన వద్ద జయ్ గురుదేవ్ భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

 

17:32 - October 15, 2016

హైదరాబాద్ : సంచలనం రేపిన చిన్నారి లక్ష్మీ ప్రసన్న హత్య మిస్టరీ వీడింది. చిన్నారి ఇంటికి సమీపంలో ఉండే బాలుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట గ్రామంలో కృష్ణమూర్తి, భవాని దంపతుల కూతురు లక్ష్మీప్రసన్న.. ఈ నెల 12న తల్లిదండ్రులు విధులకు వెళ్లగా.. చిన్నారి ఇంట్లోనే ఉంది. ఇంటికి సమీపంలో ఉండే బాలుడు చోరీ చేసేందుకు ఇంట్లోకి దూరాడు. ప్రసన్నపై లైంగిక దాడికి యత్నించాడు. అదే సమయంలో చిన్నారి పిన్ని ఇంట్లోకి రావడంతో..తన గుట్టు బయటపడుతుందని భయంతో... ప్రసన్నగొంతు, మణికట్టును బ్లేడుతో కోసి పారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ ఇంటికి వచ్చి చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సాయపడ్డాడు. అయితే కేసును అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు బాలుడే ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు.   

 

పవన్ కళ్యాణ్ ను కలిసిన అక్వాపుడ్ పార్కు బాధితులు

హైదరాబాద్ : అక్వాపుడ్ పార్కు ప్రాజెక్టు బాధితులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి గోడును వెళ్లబోసుకున్నారు. అక్వాపుడ్ పార్కును వేరే చోటుకు తరలించాలని కోరారు.

లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద వాహనదారులు ఆందోళన

శ్రీకాకుళం : పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద వాహనదారులు ఆందోళన చేపట్టారు. భారీగా ట్రాఫిక్ జాం అయింది. రూ.375 టోల్ వసూలు చేయాల్సిన వాహనానికి రూ. 460 వసూలు చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. 

భారత్, రష్యా మధ్య 10కీలక ఒప్పందాలు

గోవా : భారత్, రష్యా మధ్య 10కీలక ఒప్పందాలు కుదిరాయి. ఒప్పంద పత్రాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీ సంతకాలు చేశారు. మేకిన్ ఇండియాలో రష్యా భాగస్వామ్యం కానుంది. ఆంధ్రప్రదేశ్, రష్యా మధ్య రెండు ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మండలితో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. ఎపిలో రావాణా, నౌకా నిర్మాణ రంగంలో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. 

 

నేడు పవన్ కళ్యాణ్ ను కలవనున్న 'అక్వాఫుడ్' బాధితులు

హైదరాబాద్ : అక్వాఫుడ్ పార్కు ప్రాజెక్టు బాధితులు సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు. 

 

ఐఆర్ ఎస్ అధికారి, సినీ నిర్మాతనంటూ డబ్బు కాజేసిన ఎన్నారై అరెస్టు

హైదరాబాద్ : ఐఆర్ ఎస్ అధికారి, సినీ నిర్మాతనంటూ ఎన్నారై వెంకటరత్నంరెడ్డి మహిళల నుంచి డబ్బు కాజేశాడు. సీసీఎస్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. గుంటూరు, హైదరాబాద్ లలో అతనిపై పలు కేసులున్నాయి. బ్యాంకు దోపిడీ కేసులో వెంకటరత్నరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. 

పాదయాత్రపై కేసీఆర్, టీఆర్ ఎస్ నేతల తిట్లు, శాపనార్థాలు : తమ్మినేని

మెదక్ : మహాజన పాదయాత్రకు సంబంధించి కేసీఆర్ టీఆర్ ఎస్ నేతల తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తాను లేవనెత్తిన సమస్యలపై చర్చకు ఎందుకు రారని తమ్మినేని ప్రశ్నించారు. 

15:18 - October 15, 2016

యూపీ : వారణాసిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. రాజ్ ఘాట్ వంతెన వద్ద జయ్ గురుదేవ్ భక్తుల మధ్య తొక్కిసలాట చేటుచేసుకుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:09 - October 15, 2016

గోవా : భారత్, రష్యా దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య 16 కీలక ఒప్పందాలు కుదిరాయి. బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. భారత్, రష్యాల మధ్య విమానాల కనెక్టివిటీ మరింత పెరగాలని మోడీ అన్నారు. భారత్, రష్యాలు పారిశ్రామికంగా సహకరించుకోవాలని ఆకాంక్షించారు. ఆర్థిక రంగంలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ఉగ్రవాదం నిర్మూలనకు రెండు దేశాలు కలిసి కృషి చేయాలని కోరారు.

 

వారణాసిలో తొక్కిసలాట.. 12 మంది మృతి

యూపీ : వారణాసిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. రాజ్ ఘాట్ వంతెన వద్ద ఘటన చోటుచేసుకుంది. 
 

14:46 - October 15, 2016

గోవా : భారత్, రష్యాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాధినేతల సమక్షంలో కీలక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది. 

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ భేటీ

రష్యా : భారత్, రష్యాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాధినేతల సమక్షంలో కీలక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది. 
 

భారత్, రష్యాల మధ్య విమానాల కనెక్టివిటీ పెరగాలి : మోడీ

రష్యా : భారత్, రష్యాల మధ్య విమానాల కనెక్టివిటీ మరింత పెరగాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. బ్రిక్స్ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత్, రష్యాలు పారిశ్రామికంగా సహకరించుకోవాలని ఆకాంక్షించారు.
 

రాష్ట్రాన్ని నకిలీ విత్తన భాండాగారంగా చేసిన కేసీఆర్ : రేవంత్

హైదరాబాద్ : రాష్ట్రాన్ని కేసీఆర్ నకిలీ విత్తన భాండాగారంగా చేశారని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దేవా చేశారు. ఇంతవరకు ఏ నకిలీ విత్తన కంపెనీపైనా పీడీ యాక్టు పెట్టలేదన్నారు. డీలర్లపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. 

13:48 - October 15, 2016

సాయంత్రం పవన్ ప్రెస్ మీట్..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 4గంటలకు జరిగే ఈ మీడియా సమావేశంలో మెగా అక్వాపుడ్ పార్క్ రైతుల సమస్యలపై పవన్ మాట్లాడనున్నారు. 

పొట్టిపాడులో సీఎం చంద్రబాబు పర్యటన..

కృష్ణా : జిల్లాలోని ఉంగటూరు మండలం పొట్టిపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ మనిషి కాదని..ఒక వ్యవస్థ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడమే చరిత్ర అని తెలిపారు. అమరావతిని ప్రపంచంలో మేటి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 

ఎస్పీ కార్యాలయంలో ఘర్షణ..

నెల్లూరు : ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ ఎస్ఐ నాగభూషణం, ఏఓ రాజశేఖర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తనకు రావాల్సిన బిల్లుల విషయంలో అడ్డుపడుతున్నాడని ఏవో రాజశేఖర్ పై ఏఆర్ఎస్ఐ నాగభూషణం దాడికి యత్నించాడు. పోలీసులు దీనిని అడ్డుకున్నారు. ఎస్పీకి పోలీసులు ఫిర్యాదు చేయనున్నారు. 

గట్టుప్పల్ మండలంలో కొనసాగుతున్న పోలీసు ఆంక్షలు..

నల్గొండ : పోలీసు బందోబస్తు మధ్య స్వామి అంత్యక్రియలు పూర్తి చేశారు. గట్టుప్పల్ మండలం కేంద్రంగా ప్రకటించాలని బుడిగె స్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిలపక్ష నేతలను పోలీసులు గృహ నిర్భందం చేశారు. 

13:36 - October 15, 2016
13:26 - October 15, 2016
13:22 - October 15, 2016

హైదరాబాద్ : వైసీపీ నేత రోజాపై టిడిపి నేత బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా వైసీపీ..టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు..లోకేష్ లపై రోజా పలు విమర్శలు గుప్పించారు. దానికి కౌంటర్ గా బుద్ధా వెంకన్న ప్రతిసమాధానం ఇచ్చారు. రోజా వైసీపీలో ఒక పెయిడ్ వర్కర్ అని, జగన్ బ్యాటరీ లేని సెల్ ఫోన్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేయడం సబబు కాదన్నారు. రోజా హద్దు మీరితే ఊరుకోమని హెచ్చరించారు. 

13:18 - October 15, 2016

విశాఖలో బీజేపీ రాష్ట్ర సమావేశం..

విశాఖపట్టణం : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విశాఖలో ప్రారంభమైంది. ఏపీ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించి సహకరిస్తున్న ప్రధాన మంత్రికి ధన్యవాదం తెలుపుతూ తీర్మానం చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు పేర్కొన్నారు. 

రైతులకు కొత్త రుణాలివ్వలేదు - రేవంత్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి 30 నెలల కాలం పూర్తయ్యిందని, ఈ సమయంలో ఏం చేశారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదన్నారు. రైతులకు కొత్త రుణాలివ్వలేదని, రైతు రుణమాఫీ ఇవ్వలేదన్నారు

13:11 - October 15, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి 30 నెలల కాలం పూర్తయ్యిందని, ఈ సమయంలో ఏం చేశారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదన్నారు. రైతులకు కొత్త రుణాలివ్వలేదని, రైతు రుణమాఫీ ఇవ్వలేదన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడం..అధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని, ప్రతిపక్షాలు చెబితే వినిపించుకోరు..పత్రికలు రాస్తే పట్టించుకోరని విమర్శించారు. 2015-16 సంవత్సరానికి రూ. 712 కోట్ల రూపాయలు ఇచ్చిందని గుర్తు చేశారు. 

వివిధ దేశాధినేతలతో మోడీ భేటీ..

గోవా : బ్రిక్స్ సదస్సుకంటే ముందు వివిధ దేశాధినేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోడీ సమావేశమయ్యారు. పరస్పర ప్రయోజన ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించనున్నారు. భారత్ - రష్యా మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి. 

12:31 - October 15, 2016

మాజీ వరల్డ్ చాంపియన్‌ టీమిండియా న్యూజిలాండ్‌తో కీలక వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. సొంతగడ్డపై వన్డే 3వ ర్యాంకర్‌ న్యూజిలాండ్‌ను ఓడించేందుకు 4వ ర్యాంకర్‌ భారత్‌ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. వన్డేల్లో ఈ రెండు జట్ల ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్. స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సమరానికి ముందు భారత్‌కు ఇవి కలిసొచ్చే అంశాలే. కానీ ప్రస్తుతం ప్రత్యర్ధి కూడా పటిష్టమైనదే...న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ అంటే ఏ జట్టుకైనా పెద్ద చాలెంజ్‌. ఎందుకంటే ఆల్‌రౌండర్లు, మ్యాచ్‌ విన్నర్లతో సమిష్టిగా రాణించే కివీస్‌ టీమ్‌ను ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం. ప్రస్తుతం న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్టు అన్ని విభాగాల్లో బలంగా లేదు. బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగానే ఉన్నా అనుభవం లేని బౌలర్లతో కూడిన బౌలింగ్‌ ఎటాక్‌ తేలిపోయే అవకాశాలు లేకపోలేదు. ఎటువంటి జట్టుతో అయినా అద్భుతాలు సృష్టించగల టీమిండియా వన్డే కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ పెద్ద సవాల్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

హోరాహోరీ..
ఇరు జట్లు వన్డేల్లో పోటీపడుతున్నాయంటే హోరాహోరీ పోరు ఖాయమనే చెప్పాలి. కానీ న్యూజిలాండ్‌తో వన్డే ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో మాత్రం భారత్‌దే కాస్త పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 91 మ్యాచ్‌ల్లో పోటీపడగా...భారత్‌ 46 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. న్యూజిలాండ్‌ 41 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మొత్తం మీద టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య వన్డే సిరీస్‌ భారత అభిమానులకు మాత్రమే కాదు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పెద్ద పండుగే. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో వరుసగా 3,4 స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్‌,భారత జట్ల మధ్య 5 వన్డేల సిరీస్‌ హోరాహోరీగా సాగుతుందో లేక ఏకపక్షంగా ముగుస్తుందో చూడాలి.

12:07 - October 15, 2016

పనాజీ : గోవా వేదిక‌గా జ‌రుగుతున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్ది సేప‌టి క్రితం గోవాకు చేరుకున్నారు. ఆయ‌న‌కు పలువురు కేంద్రమంత్రులు, గోవా అధికార ప్రతినిధులు స్వాగ‌తం ప‌లికారు. ర‌ష్యా అధ్య‌క్షుడు ఐఎన్ఎస్ హన్సా బేస్ కు రాత్రి 1 గంటలకే చేరుకోవాల్సి ఉండ‌గా ప్ర‌తికూల వాతావ‌ర‌ణంతో ఆయ‌న రాక‌ ఆలస్యమ‌యింది. దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం 7గంటలకు కూడా ఆయన గోవాకు చేరుకోలేకపోయారు. అనంతరం ఉదయం ఎట్టకేలకు పుతిన్ గోవాలో అడుగు పెట్టారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని మోదీతో పుతిన్ ధ్వైపాక్షిక సంబంధాల బ‌లోపేతంపై కూడా చ‌ర్చించ‌నున్నారు.

సిలికాన్ లో టి.బ్రిడ్జి ప్రారంభం...

సిలికాన్ : హైదరాబాద్ లో స్టార్టప్ లను ప్రపంచదేశాలతో అనుసంధానం చేసే టి.బ్రిడ్జిని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సిలికాన్ వ్యాలీలో ప్రారంభించారు. ఉబర్, టై సిలికాన్ వ్యాలీతో కలిసి టి.బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. 

పరిసరాల పరిశుభ్రతపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..

విజయవాడ : పరిసరాల పరిశుభ్రతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్య, వైద్య, మున్సిపల్, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొన్నారు. నెల రోజుల్లో అంటు వ్యాధులు ప్రబలడం గణనీయంగా తగ్గిందని, దోమలపై దండయాత్ర విజయవంతం కావడమే కారణమన్నారు. డెంగీ బాధితుల సంఖ్య 1389 నుండి 71కి తగ్గిందని చంద్రబాబు తెలిపారు. మలేరియా బాధితుల సంఖ్య 15వేల నుండి 394కి తగ్గిందన్నారు. 

రైతులకు టిడిపి క్షమాపణలు చెప్పాలి - హరీష్..

వరంగల్ రూరల్: ఎనుమాముల మార్కెట్ లో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ మదుసూధనాచారి హాజరయ్యారు. డిప్యూటి సీఎం కడియం, మంత్రులు హరీష్ రావు, చందూలాల్ తదితరులు హాజరయ్యారు. వరంగల్ కు ఒక కోల్డ్ స్టోరేజీని కేటాయిస్తామని, రబీ సీజన్ లో వ్యవసాయానికి 9గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని, కాకతీయ కాల్వల ద్వారా ఆయుకట్టుకు నీరు అందిస్తామన్నారు. వ్యవసాయం దండగన్న టిడిపి నేతలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని, రైతులకు టిడిపి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు సీఎం చంద్రబాబు అవాంతరాలు సృష్టించారని తెలిపారు. 

11:54 - October 15, 2016

హైదరాబాద్ : రింగ్ అయితే హాలో అంటారు.. ఏ ఇబ్బంది పడకుండా స్వీట్‌గా వెల్కమ్ టూ జీహెచ్ఎంసీ అంటారు. సమస్య ఏదైనా సంయవనంతో సమాధానం చెబుతారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే... జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు ఇప్పుడు సమస్యలతో సతమతమవుతున్నారు. మూడేళ్లుగా కళకళలాడిన కాల్ సెంటర్ నేడు కళాహీనంగా మారిన దుస్థితిపై 10టీవీ ప్రత్యేక కథనం..!అనునిత్యం ప్రజా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి.. తీసుకెళ్లి.. సమస్యలను వెంటనే పరిష్కరించే జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు గ్రహణం పట్టుకుంది. 2111 1111 ఈ నంబర్ హైదరాబాద్‌ నగర వాసులకు సుపరిచితం. ఎందుకంటే... డ్రైనేజీ పొంగినా, మ్యాన్‌హోల్ తెరుచుకున్నా, వీధిలో చెత్త పేరుకుపోయినా.. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువైనా... ఇలా ఏ సమస్య అయినా.. అందరికీ టక్కున గుర్తొచ్చేది జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌.

అమలుకాని కనీస వేతన చట్టం..
ప్రతిరోజూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన కాల్‌సెంటర్ ఇప్పుడు కాల్ కిల్లింగ్ సెంటర్‌గా మారిపోయింది. ప్రతిరోజు 19మంది విధులు నిర్వహించాల్సి ఉండగా కేవలం 10 మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ఇందులోనూ ఇద్దరు వీక్ ఆప్‌లో ఉంటారు. జీహెచ్ఎంసీ నుంచి 19మందికి 2 లక్షల 29 వేల 276 రూపాయలు బిల్లు డ్రా చేస్తున్నారు. ఇందులో ఈఎస్ఐ, పీఎఫ్ కట్ చేసి... మిగిలిన డబ్బులు ఉద్యోగులకు చెల్లించాలి. కానీ, కాంట్రాక్ట్‌ చేపట్టిన HRH నెక్ట్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కొందరికి 5,990 రూపాయలు, మరికొందరికి 6,100 రూపాయలు చెల్లిస్తూ కనీస వేతన చట్టాన్ని అమలు తుంగలో తొక్కుతున్నారు.

బల్దియా ఖజనాకు గండి..
ఇక ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపుల్లో కాంట్రాక్టు సంస్థ తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తోంది. కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న 19 మందికి చెల్లిస్తున్న ఈఎస్ఐ, పీఎఫ్ వివరాలు ప్రతినెల బిల్ టైంలో కార్పొరేషన్‌కు సబ్‌మిట్‌ చేయాల్సి ఉండగా.. కేవలం 73 మంది వివరాలు మాత్రమే సమర్పిస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా బల్దియా అధికారులు ఇవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాల్‌సెంటర్‌కు మేనేజర్స్‌గా శ్రీనివాస్‌, అరవింద్‌ అని చెబుతున్న సంస్థ... జీహెచ్‌ఎంసీకి ఇచ్చే బిల్లులో మాత్రం గంగాధర్‌, నరేష్‌ పేర్లను చూపిస్తున్నారు. మరోవైపు కాల్ సెంటర్ పనితీరు అంతం మాత్రంగానే ఉంది. నిత్యం టెక్నికల్‌ సమస్యలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతిసారి కంప్యూటర్లు సర్వర్‌ డౌన్‌ అవడం వల్ల కాల్‌సెంటర్‌ సరిగా పనిచేయడం లేదు. భారీ వర్షాలు, విపత్తులు వచ్చినప్పుడు కాల్ సెంటర్ జపం చేసే అధికారులు... కాల్ సెంటర్‌లో ఏం జరుగుతుందో పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు కార్మికుల కష్టాలను గట్టెక్కిస్తారా..? లేక సదరు కాంట్రాక్ట్‌ సంస్థ తప్పుడు విధానాలకు వంతపాడుతారో చూడాలి. 

11:50 - October 15, 2016

హైదరాబాద్‌ : నెక్లెస్‌రోడ్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఎగ్జిబిషన్‌ ఘనంగా ప్రారంభమైంది. దేశ, రాష్ట్రాల్లోని పోలీసుల పనితీరు, విధినిధానాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. దేశ, రాష్ట్రాలకు చెందిన 20 పోలీసు స్టాళ్లను రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో డిజిపి అనురాగ్‌ శర్మ, సిపి మహేందర్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులు హాజరయ్యారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:49 - October 15, 2016
11:47 - October 15, 2016

హైదరాబాద్ : వారంతా రాజ‌కీయ దిగ్గజాలు.. జిల్లా పేరు చేబితే ట‌క్కున గుర్తొచ్చే లీడర్లు. ఒకప్పుడు ఏళ్ల త‌ర‌బ‌డి జిల్లాల్లో చ‌క్రం తిప్పిన నేత‌లు.. సీన్ క‌ట్ చేస్తే ఇప్పుడు వారి అడ్రస్‌లు పూర్తిగా గ‌ల్లంతయ్యాయి. జిల్లాల‌ విభ‌జ‌న అస్త్రంతో హ‌స్తం నేత‌ల చిరునామాలు చెల్లా చెదుర‌య్యాయి. ఇన్నాళ్లు పెద్ద జిల్లాలనే ఏలిన నేత‌లు.. ఇప్పుడు అదే జిల్లాలో ఓ మూల‌కు ప‌రిమిత‌మైపోయారు..!ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసిన‌ట్లు.. తెలంగాణలో జిల్లాల పున‌ర్విభ‌జ‌న కాంగ్రెస్ నేత‌ల రాజకీయ భవిష్యత్తునే మార్చేసింది. నిన్నటి దాకా ఆయా జిల్లాల్లో చక్రం తిప్పిన నేతలు.. ఇప్పుడు వారి అడ్రస్‌లు గ‌ల్లంతయ్యాయి. జిల్లాల విభజన కారణంగా కొందరు పరాయి జిల్లా నేతలుగా మారితే... మరికొందరు అదే జిల్లాల్లో ఓ మూలకు పరిమితమైపోయారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా అంటే గుర్తొచ్చే డి. కేఅరుణ‌.. జిల్లాల విభజన జరగకముందు.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పట్టున్న నేతగా పేరుంది. ఇప్పుడు జిల్లా విభజనతో డీ.కే అరుణ జోగులాంబ జిల్లాకే పరిమితమయ్యారు. ఇటు సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి ఇలా ఉద్దండులుగా ఉన్న న‌ల్గొండ జిల్లాలో సేమ్ సీన్. మొన్నటి దాకా 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌క్రం తిప్పిన జానారెడ్డి, కోమ‌టి రెడ్డిలు ఇప్పుడు కేవలం న‌ల్గొండ జిల్లాలో ఓ మూల‌కు ప‌రిమిత‌మైపోయారు.

పూర్తిగా మారిన చిరునామాలు..
కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా చ‌క్రం తిప్పుతూ వ‌స్తున్న మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌నర్సింహ్మ, మాజీ మంత్రి గీతారెడ్డిల‌ది ఇదే ప‌రిస్థితి. మెదక్‌ జిల్లా విభజనతో వీరిద్దరి చిరునామాలు పూర్తిగా మారిపోయాయి. దామోదర నియోజకవర్గం సిద్దిపేట, సంగారెడ్డి రెండు జిల్లాల పరిధిలోకి చీలిపోగా... ఇక గీతారెడ్డి సంగారెడ్డి జిల్లాకే పరిమితమయ్యారు. ఇటు కరీంన‌గ‌ర్ జిల్లా రాజ‌కీయాల్లో దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఫ్యామిలీ దశాబ్దాలుగా చక్రం తిప్పింది. ఇప్పుడు కరీంనగర్‌ జిల్లా విభజనతో పెద్దపల్లి, భూపాల్‌పల్లి జిల్లాల్లో సగం సగానికి శ్రీధర్‌బాబు పరిమితమయ్యారు. ఇటు వరంగల్‌ జిల్లాలో ఇన్నాళ్లు తన హవా నడిపించిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యది ఇదే పరిస్థితి. వరంగల్‌ జిల్లా విభజనతో పొన్నాల ప్రస్తుతం జనగాం జిల్లాకే పరిమితమయ్యారు. ప్రస్తుతం శాస‌న మండలి ప‌క్ష నేత‌గా ఉన్న ష‌బ్బీర్ఆలీ.. జిల్లా విభజన జరగకముందు నిజామాబాద్‌ జిల్లాలోని 9 నియోజ‌క‌వ‌ర్గాల‌లో రాజ‌కీయ చ‌క్రం తిప్పారు. ఇప్పుడు జిల్లా విభజనతో కామారెడ్డి జిల్లాకే పూర్తిగా పరిమితమైపోయారు. అయితే ఇదంతా కేసీఆర్ కావాల‌నే చేసింద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. ప్రజ‌ల సౌల‌భ్యం కోసం కాకుండా.. రాజ‌కీయ ల‌బ్ది కోసం.. మ‌రి ముఖ్యంగా కాంగ్రెస్‌ను రాజ‌కీయంగా డిస్టర్బ్ చేసేందుకే జిల్లా విభ‌జ‌న‌లు వాడుకున్నారని విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా నిన్నటి వరకూ ఆయా జిల్లాల్లో కీలక నేతలుగా ఉన్నవారు.. ఇప్పుడు జిల్లాల విభజనతో నిన్నటి దాకా ఏలిన జిల్లాలోనే ఓ మూలకు పరిమితమయ్యారు. 

11:44 - October 15, 2016

స్పీడ్‌ పెరిగింది...ఆధారాలు దొరికాయి...సిట్‌ బలోపేతం చేశాం...గణేష్‌ నిమజ్జనం తర్వాతే..కాదు..కాదు దసరా తర్వాతే..అరెస్టులకు ముహూర్తం దొరకడం లేదా..నయీం కేసులో పెద్దోళ్లు సేఫేనా...

హైదరాబాద్ : నయిం కేసులో సిట్‌ స్పీడ్‌ పెంచుతుందా..? లేక తుస్‌ మనిపిస్తుందా..?? గడిచిన కొంతకాలంగా ఇదుగో అరెస్టు..అదుగో అరెస్టులు...ఇదుగో వీరున్నారు..అదుగో వీరున్నారంటూ లీకులిస్తున్నారేగాని అరెస్టులు మాత్రం జరగడం లేదు... సిట్ ను బలోపేతం చేసి నెల రోజులు అవుతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు...పోలీసుల దర్యాప్తు పై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా..? లేక అరెస్టులు కాకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా..?? మొన్నటివరకు నయీం..నయీం..నయీం...ఎప్పుడు చూసినా నయాం సంబంధించిన కథనాలే... నయీం కేసుల్లో లీడర్లు ఉన్నారన్నారు..లీకులు కూడా ఇచ్చారు...ఇక పోలీసు అధికారులు ఉన్నారంటూ ఆఫ్‌ది రికార్డు చెప్పుకొచ్చారు...అంతా అయిపోయింది..ఇక అరెస్టులేనంటూ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు..కాని ఇప్పటికి ఏ మాత్రం కదల్లేదు...లీకులు మాత్రం వస్తూనే ఉన్నాయి...

దర్యాప్తు స్టేటస్‌పై ఉత్కంఠ...
నయిం కేసు దర్యాప్తు స్టేటస్ పై ఉత్కంఠ కోనసాగుతోంది...గ్యాంగ్‌స్టర్‌కు సహాకరించిన రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల పై చర్యలు ఉంటాయని సిట్ ఛీప్ నాగిరెడ్డి పదే పదే మీడియా ముందు చెప్పుకొచ్చారు...25 రోజుల క్రితం మరో 30 కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్ట్ చేస్తామని ఎవ్వరిని వదలబోమని తేల్చేశారు. వినాయక నిమజ్జనం తర్వాత అరెస్టులకు రంగం సిద్దమంటూ ఆఫ్‌ది రికార్డ్‌లో చెప్పారు.

దీనికోసమే సిట్‌ బలోపేతం...
ఇక గ్యాంగ్‌స్టర్‌ చేసిన ఎన్నో దందాల్లో పోలీస్ శాఖలో, రెవెన్యూ తో పాటు ఇతర ప్రభుత్వ అధికారుల పాత్ర పై ప్రత్యేకంగా మరో ఉన్నతాధికారి పర్యవేక్షిస్తారని సిట్ ను బలోపేతం చేశారు. అడిషనల్ డిజి అంజనీ కుమార్ ను పర్యవేక్షకునిగా నియమించారు. కాని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వి.ఐ.పీని ప్రశ్నించలేదు. కనీసం నోటీసులు ఇవ్వలేదు...నల్గొండకు చెందిన ఇద్దరు రాజకీయ నాయకుల పై వ్రాతపూర్వక ఫిర్యాదులు అందిన స్పందించలేదు...కనీసం విచారించిన సందర్భాలు కన్పించలేదు...ఇక కొందరు లీడర్లు మాత్రం తమపై బురద చల్లుతున్నారంటూ తప్పించుకుంటున్నారు...పోలీసులు చట్టప్రకారం పనిచేస్తున్నామంటూనే సాక్ష్యాల కోసం చూస్తున్నామని చెబుతూనే కేసు దర్యాప్తును వీగిపోయేలా చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

24 హత్య కేసుల్లో నిందితుడు..
గ్యాంగ్‌స్టర్‌ తాను చేసే దందాలో ప్రతీ ఆఫీసర్‌ను లొంగదీసుకున్నాడు. ఇందుకు గాను తృణమో ఫణమో అప్పగించాడనేది జగమెరిగిన సత్యం. దాదాపు 24 హత్యలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక కొందరు పోలీసుల సహకారంతో తన ప్రత్యర్థులు ఎక్కడున్నారో సెల్‌ లొకేషన్‌ ద్వారా తెలుసుకుని మట్టుపెట్టిన సందర్భాలున్నాయి. నయీం కేసుల దర్యాప్తు చేస్తున్న సిట్‌ ఇప్పటివరకు చిన్న చిన్న వారిని..కుటుంబీకులను మాత్రమే అరెస్టులు చేశారు..చిన్న చిన్న గిఫ్ట్‌లు తీసుకున్నవారిపై కేసులు పెట్టారు. ప్రచారం చేశారు...నయీంకు రైట్ హ్యాండ్ గా ఉన్న వారిని వదిలేస్తున్నారు. బినామి రూపంలో వేల కోట్లు దాచిపెట్టుకున్న వారిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి...సిట్ దర్యాప్తుకు ఒత్తిళ్లు లేకుండా ప్రభుత్వం చూడాలని బాధితులు కోరుతున్నారు...అసెంబ్లీ సమావేశాల్లోగా కేసు ముగిస్తామని చెప్పిన పోలీసులు పారదర్శకంగా వ్యవహారించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి...మరి సిట్‌ అధికారులు సీరియస్‌గా తీసుకుంటారో..లేక తుస్‌మనిపిస్తారో చూడాల్సిందే.

10:29 - October 15, 2016
10:21 - October 15, 2016

మెదక్ : సంగారెడ్డిలో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మహాసభలు కొనసాగుతున్నాయి. నేడు రెండో రోజు పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జాతీయ కార్యదర్శి సుదా భాస్కర్ తో టెన్ టివి ముచ్చటించింది. సీఐటీయూను ఎలా పటిష్టం చేయాలి ? అనే దానిపై చర్చించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తికాలం కార్యకర్తలు 57 శాతం మంది మాత్రమే యూనియన్లకు బాధ్యత వహిస్తున్నారని, ప్రతొక్కరినీ యూనియన్లకు బాధ్యత వహించాలని తీర్మానం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐక్యతా కేంద్రంగా సీఐటీయూ ఉందని, అన్ని సంఘాలను కలుపుకుని ఐక్యంగా ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఆలోచించడం జరుగుతుందన్నారు. మండలం..జిల్లా రెండే ప్రధానంగా ఉంటుందని, మండలాల వారీగా యూనియన్లు స్థాపించడం..ఉద్యమాలు నడపడం చేయడం జరుగుతుందన్నారు. 

గోవాకు దక్షిణాఫ్రికా..బ్రెజిల్ అధ్యక్షులు..

పనాజీ: బ్రిక్స్ స‌మావేశాల్లో పాల్గొనేందుకు బ్రెజిల్ అధ్య‌క్షుడు మైఖేల్ టీమ‌ర్‌, ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్షుడు జాక‌బ్ జుమాలు గోవా చేరుకున్నారు. విదేశాంగ స‌హాయ మంత్రి జ‌న‌ర‌ల్ వీకే సింగ్ ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్షుడికి విమానాశ్ర‌యంలో స్వాగ‌తం ప‌లికారు. 

కాశ్మీర్ లో పెరిగిన యాపిల్స్ అమ్మకాలు..

జమ్మూ కాశ్మీర్ : కాశ్మీర్ యాపిల్స్ ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఉగ్రవాది బుర్హాన్‌వానీ ఎన్‌కౌంటర్ అనంతరం కాశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయినా యాపిల్స్ అధికస్థాయిలో అమ్ముడయ్యాయి. 

10:08 - October 15, 2016
09:48 - October 15, 2016

హైదరాబాద్ : నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం అయిటిపాములలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. మృతులు ప్రశాంత్‌, శృతి, రత్నలుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ వారు వినోద్‌, దిలీప్‌, శ్వేతగా గుర్తించారు. తీవ్రగాయాలైన వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బేస్తవారపేట మండలం ఒందుట్ల బస్టాండు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో
నలుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బేస్తవారిపేట వైపునుంచి గిద్దలూరు దిశగా వెళ్తున్న టాటా ఇండికా కారును వెనుక నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొంది. దీంతో కారు కంప చెట్లలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న అయిదుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో ఇద్దరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని నల్గొండ జిల్లాకు చెందిన బొట్టా పాండురంగయ్య చౌదరిగా గుర్తించారు.

కర్నూలులో..
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాగలమర్రి వద్ద డివైడర్‌ని స్కార్పియో వాహనం ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తిరుమల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు సుబ్బరాజు, కనకరాజు, కృష్ణంరాజు, రంగరాజుగా పోలీసులు గుర్తించారు. మృతులంతా హైదరాబాద్‌ నిజాంపేటకు చెందిన వాసులుగా గుర్తించారు.

09:45 - October 15, 2016

హైదరాబాద్ : దొంగను పట్టుకోవాల్సిన ఎస్సై తానే దొంగగా మారాడు. ఓ ఇంట్లో చోరీ చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. బడంగ్‌పేట్ నగర పంచాయతీ పరిధిలోని అల్మాస్‌గూడ శ్రీశ్రీహోంలో శివప్రసాద్ అనే వ్యక్తి నివాసముంటున్నారు. ఇటీవల ఆయన కుటుంబ సమేతంగా కరీంనగర్‌కు వెళ్లారు. ఇది గమనించిన మహేందర్‌రెడ్డి అనే వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడ్డాడు. సరిగ్గా అదే సమయంలో శివప్రసాద్ తన స్వగ్రామం నుంచి తిరిగి వచ్చాడు. ఈ సమయంలో తన ఇంట్లో కనబడిన అతనిని మీర్ పేట పోలీసులకు అప్పగించాడు. మీర్‌పేట పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అతడు ఎస్సై మహేందర్‌రెడ్డిగా తేలింది. నగర కమిషనరేట్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం విభాగంలో పనిచేస్తున్నట్లు అతడి వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా నిర్ధరించారు. సూర్యాపేట ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాది వికారుద్దీన్‌ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌లో ఇతడు సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు. తాను దొంగతనానికి వెళ్లలేదని, కేసు విచారణలో భాగంగానే అక్కడకు వెళ్లడం జరిగిందని ఎస్ఐ పేర్కొన్నారు. 

09:35 - October 15, 2016

బోల్తా కొట్టిన స్కార్పియో...నలుగురు మృతి..

కర్నూలు : చాగలమర్రి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ ను ఢీకొని స్కార్పియో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. గాయాలైన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. తిరుమల నుండి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు సుబ్బరావు, కనకరాజు, కృష్ణం రాజు, రంగరాజులుగా గుర్తించారు. వీరందరూ హైదరాబాద్ నిజాంపేట వాసులుగా గుర్తించారు. 

08:31 - October 15, 2016
08:21 - October 15, 2016

హైదరాబాద్ : స్నేహితుల మధ్య జరిగిన స్వల్ప వివాదం ఒకరి ప్రాణాన్ని తీసింది. నగరంలోని ఆజంపురాలో ఉండే అబ్దుల్ రెహమాన్, సలాబత్, అఫ్జల్ లు మసీదు దగ్గర కలిశారు. ఓ విషయంలో గొడవ చోటు చేసుకుంది. దీనికి ఆగ్రహించిన అఫ్జల్ తన స్నేహితుడు హమీద్ పై కత్తితో దాడి చేశాడు. మరో స్నేహితుడు సలావత్ పై కూడా దాడికి ప్రయత్నించాడు. దీనితో సలావత్ పారిపోయాడు. గాయాలకు గురైన సలావత్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చాదర్ ఘాట్, మలక్ పేట తదితర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. నిందితుడు తండ్రి తాజ్ ఖాన్ రౌడీ షీటర్ అని పోలీసులు పేర్కొన్నారు. 

08:09 - October 15, 2016
07:36 - October 15, 2016

తెలంగాణ రాష్ట్రంలో రాబడిలో రికార్డు సృష్టిస్తోందని పలు వార్తలు వెలువడుతున్నాయి. ఆర్థిక రంగంలో దూకుడు ప్రదర్శిస్తోందని, దక్షిణాది రాష్ట్రాల్లో మన రిజిస్ట్రేషన్ల శాఖదే అగ్రస్థానంలో కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ ప్రాంతాన్ని జిల్లాలగా ఏర్పాటు చేయాలని కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో పిఎల్ శ్రీనివాస్ (టీఆర్ఎస్), జగన్ లాల్ నాయక్ (టి.కాంగ్రెస్), జూలకంటి రంగారెడ్డి (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

చాదర్ ఘాట్ లో స్నేహితుల మధ్య ఘర్షణ..

హైదరాబాద్ : చాదర్ ఘాట్ లో స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అబ్దుల్ రెహమాన్, సలాబత్ పై అఫ్జల్ కత్తితో దాడి చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెహమాన్ మృతి చెందాడు. అఫ్జల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

నేటి నుండి హోంగార్డు పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ..

హైదరాబాద్ : నేటి నుండి హోంగార్డు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 1800 పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

 

06:51 - October 15, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యంపై ఆందోళనతో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు అపోలో ఆస్పత్రి వద్దనే పడిగాపులు కాస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి చెన్నైలోని అపోలో ఆసుపత్రికి నేతలు తరలి వస్తున్నారు. డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి రాజతి అమ్మాల్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అన్నాడీఎంకే నేతల నుంచి జయలలిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సిఎం జయలలిత అనారోగ్యంపై వదంతులు సృష్టించిన కేసులో మరో ఇద్దరిని చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జయలలిత తీవ్రమైన అనారోగ్యంతో సెప్టెంబరు 22 నుంచి చెన్నై అపోలోలో చేరారు.  

06:49 - October 15, 2016

ఢిల్లీ : దేశ రక్షణ కోసం సైనికులు తమ జీవితాలనే త్యాగం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారి సేవలను కొనియాడారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో శౌర్య స్మారక్‌ యుద్ధ స్మృతి చిహ్నాన్ని మోది ఆవిష్కరించారు. ఇటీవల ఉత్తరాఖండ్‌, శ్రీనగర్‌లో ఏర్పడ్డ భయంకర వరదల నుంచి బాధితులను కాపాడడంలో సైన్యం చూపిన ధైర్య సాహసాలు మరవలేనివని చెప్పారు. తమపై రాళ్లు విసిరినా, తలలు పగల గొట్టినా..మానవతా దృక్పథంతో అవన్నీ మరచిపోయి ప్రజలను కాపాడేందుకే జవాన్లు ప్రాముఖ్యత నిస్తారని తెలిపారు. 

06:48 - October 15, 2016

గోవా : ఇవాళ్లి నుంచి గోవాలో ఐదు దేశాల బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాకిస్తాన్‌ను ఏకాకి చేసే దిశగా భారత్‌ ఈ వేదికను ఉపయోగించుకోనుంది. సీమాంతర ఉగ్రవాదంపై పాక్‌ను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని బ్రిక్స్‌ దేశాలను భారత్‌ కోరే అవకాశముంది. ఈ సందర్భంగా భారత్‌ రష్యాతో సుమారు 34 వేల కోట్లతో కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకోనుంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది. గోవాలో ప్రధాన దేశాల నేతలు పాల్గోనుండడంతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సరిహద్దు ఉగ్రవాదంతో భారత్‌ ఎదుర్కొంటున్న ముప్పును బ్రిక్స్ దేశాల ముందు ఉంచడం ద్వారా అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకి చేసేందుకు ప్రధాని మోది ఈ వేదికను ఉపయోగించుకోనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌ను అన్ని విధాలా కట్టడి చేయాలని భారత్‌ బ్రిక్స్‌ దేశాలకు సూచించే అవకాశం ఉంది.

పుతిన్ తో మోడీ..
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోది, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. భార‌త్ ర‌ష్యాతో సుమారు 34 వేల కోట్ల విలువైన చారిత్రక రక్షణ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇందులో భాగంగా ర‌ష్యా భార‌త్‌కు ఐదు అత్యాధునిక యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ ఎస్‌-400 మిస్సైల్‌ను భారత్‌కు అందించనుంది. ఎస్‌-400 ఉప‌రిత‌లం నుంచి గ‌గ‌న‌త‌లానికి ప్రయోగించే అత్యాధునిక క్షిప‌ణి. దేశంపై దాడికి వ‌చ్చే ఎయిర్‌క్రాఫ్ట్స్‌, మిస్సైల్స్‌ను ఇవి 4 వందల కిలోమీట‌ర్ల దూరం నుంచే ప‌సిగ‌ట్టగ‌ల‌వు. ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వానికి మద్దతు కోసం చైనాతో భారత్‌ చర్చించే అవకాశం ఉంది. దీనిపై చైనా తమ వైఖరిని ఇదివరకే వెల్లడించింది. ఉగ్రవాద సంస్థ జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిలో భారత్‌ చేసిన వాదనను చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే. యూరప్ దేశాల ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు 2011లో బ్రిక్స్‌ ఏర్పాటైంది. ఆర్థికంగా, రాజకీయంగా పరస్పరం సహకరించుకునేందుకు బ్రిక్స్ దేశాలు ప్రత్యేక బ్యాంక్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాయి.  

06:43 - October 15, 2016

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జవాన్లే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్‌లోని జకూరా ప్రాంతంలో ఎస్ఎస్‌బీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో ఓ జవాన్‌ మృతి చెందగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదుల కోసం ఆర్మీ గాలింపు చేపట్టింది. 27 రోజుల్లో ఉగ్రవాదులు దాడి చేయడం ఇది ఆరోసారి. 

06:39 - October 15, 2016

కృష్ణా : 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోయే రైతులకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందే అన్నారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు. గన్నవరం మండలం వీరపనేని గూడెంలో ప్రభుత్వం ఐటీహబ్‌ కోసం..తీసుకొనే భూముల్లో మధు పర్యటించారు. అనంతరం గ్రామంలో నిర్వాసిత రైతులు చేస్తున్న నిరసన శిబిరంలో పాల్గొని వారికి మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా స్పందిస్తూ..రాష్ట్రంలో 4లక్షల,11వేల ఎకరాలు భూములను సాగుదారుల నుండి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

06:36 - October 15, 2016

రంగారెడ్డి : జిల్లా ఆమన్‌గల్‌ మండలం వెలుగురాళ్ల తండాలో పరువుహత్య కలకలం రేపింది. మంగ అనే యువతి దారుణహత్యకు గురైంది. కుటుంబ సభ్యులే పురుగుల మందుతాగించి హత్య చేసి.. రహస్యంగా ఖననం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యిందని.. అబార్షన్‌ చేయించుకోమన్నా వినిపించుకోలేదని అందుకే హత్య చేశారని అంటున్నారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామ సమీపంలో పాతిపెట్టిన మంగ మృతదేహాన్ని వెలికితీశారు. 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   

06:34 - October 15, 2016

విజయనగరం: చారిత్రక నగరం, సంస్క్రతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన విజయనగరం.. ఉత్సవాలకు సన్నద్ధమైంది. విజయనగర సాంస్కృతిక వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించే దిశగా విజయనగర్ ఉత్సవ్ పేరుతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు రోజుల పాటు కన్నులపండువగా జరిగే ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. కళలకు, సంగీతం, సాహిత్యాలకు వేదికగా బాసిల్లుతున్న చారిత్రక నగరం విజయనగరం. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరానికి ముందుగా విజయనగర ఉత్సవాలను నిర్వహించే సంప్రదాయాన్ని జిల్లా యంత్రాంగం కొనసాగిస్తోంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు నగరం అందంగా ముస్తాబైంది. విద్యుద్దీపాల కాంతులు, స్వాగత తోరణాలు, కళాకారుల సందడితో మూడు రోజుల పాటు జిల్లా వాసులను అలరించనుంది.

పలు కార్యక్రమాలు..
ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆనందగజపతి ఆడిటోరియం, అయోధ్య మైదానం, సంస్కృత కళాశాల, కోట, విజ్జీ స్టేడియం వేదికలపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఉదయం కోట నుంచి ఆనందగజపతి ఆడిటోరియం వరకు ర్యాలీతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. అనంతరం ఆనందగజపతి ఆడిటోరియంతో ప్రారంభ సభ, నృత్య కార్యక్రమాలు జరగనున్నాయి. అయోధ్య మైదానంలో మధురగాయకుడు ఘంటసాలకు నివాళిగా స్వర నీరాజనం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉత్సవాలలో భాగంగా విజయనగర గగన వివారానికి ప్రత్యేకంగా హెలికాఫ్టర్‌ను ఏర్పాటు చేయడం ఈ ఉత్సవాల ప్రత్యేకత.

సందడి..
ఓ పక్క శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు, మరోపక్క విజయనగరం ఉత్సవాల నేపథ్యంలో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. ఉత్సవాలను, సిరిమాను సంబరాలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. విజయనగర చరిత్ర, సంస్కృతిని భవిష్యత్ తరాలకు తెలియజేయడమే ఈ ఉత్సవ లక్ష్యమని కేంద్రమంత్రి అశోక గజపతిరాజు అన్నారు. విజయనగరం శాంతికాముకనగరమని, సంగీత, సాహిత్యాలకు నిలయమన్నారు. మొత్తం మీద ఒకేసారి రెండు సంబరాలు రావడంతో విజయనగరం పట్టణమంతా సందడిగా మారింది. 

06:31 - October 15, 2016

విజయవాడ : పట్టిసీమ ప్రాజెక్టు స్ఫూర్తితో మరో బృహత్తర ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వరద గోదావరిని ఒడిసి పట్టేందుకు.. ఆ నీటిని పోలవరం ఎడమకాలువకు మళ్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 1638 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 3500 క్యూసెక్కుల వరద నీటిని పోలవరం ఎడమకాలువకు మళ్లించనుంది. ఈ నీటిని విశాఖ వాసుల తాగునీటి అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వం ఉపయోగించనుంది. అంతేకాకుండా దీని ద్వారా పోలవరం ఎడమకాలువ పరిధిలోని 58 కిలోమీటర్ల మేర ఆయకట్టుకు నీరు అందనుంది.

కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టు అవసరమా అనే వాదనలు..
ఇప్పటికే పోలవరం ఎడమకాలువ పనులు పూర్తయ్యాయి. వచ్చే సంవత్సరం జూలై నాటికి ఈ పథకం పూర్తిచేసి ఉత్తరాంధ్రకు నీరు అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు 2018 నాటికి పోలవరం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటికప్పుడు ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి ఈ ప్రాజెక్టు చేపట్టడం అవసరమా అని వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబు సర్కార్ మాత్రం ప్రాజెక్టు నిర్మాణంపై శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నిర్మాణానికి సంబంధించిన అనుమతులు జారీచేసింది. 

06:29 - October 15, 2016

హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా మెడికల్‌ అండ్‌ ఫార్మా రంగంలోని ఆవిష్కరణలన్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కార్‌ సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీ గురించి అమెరికాలోని ఫార్మా దిగ్గజాలతో మంత్రి కేటీఆర్‌ భేటీ అవుతున్నారు. ఫార్మా రంగంతో పాటు.. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నారు. అమెరికాలో తెలంగాణ మంత్రి కె.తారక రామారావు పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తొలుత ప్రపంచ ఫార్మా దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఛైర్మన్‌ పాల్‌ స్టోఫెల్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ గురించి పాల్‌కు కేటీఆర్‌ వివరించారు. తెలంగాణలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ యూనిట్‌ ఏర్పాటు చేయాలని పాల్‌ను కేటీఆర్‌ కోరారు. తెలంగాణ ఫార్మా సిటీ పట్ల పాల్‌ ఆసక్తి కనబర్చారు. వచ్చే ఏడాది భారత్‌కు వచ్చినప్పుడు.. తెలంగాణలో పర్యటిస్తానని పాల్‌ హామీ ఇచ్చారు. ఇక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీతో తెలంగాణ సర్కార్‌ ఎంవోయూ కుదుర్చుకుంది. దీని ద్వారా తెలంగాణ టీబీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కంపెనీ సహకారం అందిస్తుంది.

నగరంలో వాక్సిన్‌ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ ఏర్పాటు..
అనంతరం మరో ప్రముఖ ఫార్మా దిగ్గజం మెర్క్‌ కంపెనీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు సనత్‌ చటోపాధ్యాయ్‌తో కేటీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణలో డయేరియా మహమ్మారిని తరిమికొట్టేందుకు సహకరిస్తామని.. తెలంగాణలో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సనత్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను హైదరాబాద్‌ రావాలని కేసీఆర్‌ కోరగా.. వచ్చే నెల వచ్చేందుకు సనత్‌ హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న సంస్థలతో తయారీ ప్లాంట్‌,.. నగరంలో వాక్సిన్‌ ఎక్సలెన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు మెర్క్‌ సంస్థ ముందుకువచ్చింది.

బ్రెస్ట్ క్యాన్సర్‌ నిర్ధారణ ప్రాజెక్ట్‌కు గురించి వివరణ..
ఆ తర్వాత ఫైజర్‌ కంపెనీ గ్లోబల్‌ హెడ్‌ నానెట్‌ సోసెరో మరియు ఇతర సీనియర్లతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నిర్ధారణ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌ గురించి కంపెనీ కేటీఆర్‌కు వివరించింది. ఫార్మా రంగంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులలో భాగస్వాములు కావాలని కేటీఆర్‌ కోరారు. కేటీఆర్‌ పర్యటనలో మరికొన్ని సంస్థలతో తెలంగాణ సర్కార్‌ ఎంవోయూలు కుదుర్చుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీతో పాటు.. పలు ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని మంత్రి కోరిక మేరకు పలు సంస్థల ప్రతినిధులు తెలంగాణలో పర్యటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. 

06:26 - October 15, 2016

విజయవాడ : పేదవాడికి ఆర్థిక భద్రత పేరుతో ప్రతి కుటుంబానికి నెలకు పదివేలు ఆదాయం అందించే కార్యక్రమం రూపొందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. వెలగపూడిలోని సచివాలయంలో సంక్షేమ శాఖల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా సంఘాలను కూడా సంక్షేమంలో భాగం చేయాలని సూచించారు.  ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలగపూడిలో సచివాలయంలోని తన చాంబర్‌లో సంక్షేమశాఖల పనితీరుపై ఆయన సమీక్షిచారు. బడుగు బలహీన వర్గాల కుటుంబాలు నెలకు పదివేల రూపాయలు సంపాందించేలా వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించాలని భావిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.

పలు ఆదేశాలు..
సంక్షేమ పథకాలన్ని ప్రతి ఒక్కరికి అందేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ముఖచిత్రం ఉంటుందని... ఆయా నియోజకవర్గాల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా డ్వాక్రా ఉత్పత్తులు విక్రయించే ఏర్పాట్లు చేయాలన్నారు. డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించాలని సూచించారు. సంక్షేమ పథకాల పర్యవేక్షణకు జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటుచేయాలని సీఎం నిర్ణయించారు. ఈ కమిటీకి ఆయా జిల్లాల ఇంచార్జ్‌లు అధ్యక్షులుగా, జిల్లాల మంత్రులు, జిల్లాపరిషత్ చైర్మన్‌లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రధానంగా సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షిస్తుంది. బ్యాంకర్లతో సమన్వయమై ప్రతి సామాజిక వర్గానికి రుణాలు అందేలా చూడాలని కమిటీని ఆదేశించారు. బలహీన వర్గాల కోసం ఆయాశాఖలు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్ కేంద్రాలు, స్టార్టప్స్‌లను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రతి విద్యార్థి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని.. వారికి పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, సంక్షేమశాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. 

06:22 - October 15, 2016

ప్రకాశం : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బేస్తవారపేట మండలం ఒందుట్ల బస్టాండు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. బేస్తవారిపేట వైపునుంచి గిద్దలూరు దిశగా వెళ్తున్న టాటా ఇండికా కారును వెనుక నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొంది. దీంతో కారు కంప చెట్లలోకి పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న అయిదుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలో మరో ఇద్దరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని నల్గొండ జిల్లాకు చెందిన బొట్టా పాండురంగయ్య చౌదరిగా గుర్తించారు.

నల్గొండలో...
నల్గొండ జిల్లా అయిటిపాములలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. 

06:20 - October 15, 2016

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన మేడ్చల్‌ చిన్నారి హత్య కేసులో ఉత్కంఠ వీడింది. మూడు రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈ కేసులో చిల్లరదొంగే హంతకుడిగా తేలింది. మేడ్చల్‌ మండలం ఎల్లంపేటలో ఈ నెల 12న మధ్యాహ్నం సమయంలో ఏడేళ్ల సాయిలక్ష్మీప్రసన్న దారుణ హత్యకు గురైంది. ఇంటి వెనక ఉన్న స్నానాలగదిలో చిన్నారి మణికట్టు, గొంతుపై బ్లేడ్‌తో కోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ కేసును చేధించేందుకు తీవ్రంగా శ్రమించిన పోలీసులు అదే గ్రామానికి చెందిన బాలుడిని నిందితుడిగా గుర్తించారు. ఎల్లంపేట గ్రామంలో చిల్లర దొంగతనాలు చేసే ఆ బాలుడు 12వ తేదీ మధ్యాహ్నం చిన్నారి ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బాలిక అక్క కావ్యశ్రీ నిద్రపోతుండగా సాయిలక్ష్మీప్రసన్న ఆడుకుంటూ కనిపించింది. ఆ చిన్నారిని స్నానాలగదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోగా తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించింది. విషయం బయట పడుతుందని భావించిన ఆ బాలుడు బ్లేడ్‌తో చిన్నారి గొంతు, మణికట్టుపై కోశాడు. అదే సమయంలో బాలిక పిన్ని వెంకటలక్ష్మి రావడంతో గోడ దూకి పారిపోయాడు. సెల్‌ సిగ్నల్స్ ఆధారంగా బాలుడిని గుర్తించిన పోలీసులు... అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. పోలీసులు ఇవాళ మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు.

నేడు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం..

ఢిల్లీ : నేడు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరగనుంది. లోథా కమిటీ సిఫార్సుల అమలుపై చర్చ జరగనుంది. 

రాష్ట్ర ఉత్సవంగా వాల్మీకి జయంతి..

హైదరాబాద్ : మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 16న మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించడానికి కమిటీని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీకి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

నేడు తెలంగాణ జిల్లాల వ్యాపుల విడుదల..

హైదరాబాద్ : నేడు తెలంగాణ జిల్లాల మ్యాపులు విడుదల కానున్నాయి. మ్యాపులను సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. 

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా..

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నేటి నుండి జరగాల్సిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 19 నుండి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. 

నేటి నుండి ఆసరా ఫించన్ల చెల్లింపు..

హైదరాబాద్ : తెలంగాణలో ఆసరా ఫించన్ల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ. 395 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణలోని 35,81,392 మందికి ఫించన్లు, బకాయిలు చెల్లించేందుకు వీలు కలిగింది. 

కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురి మృతి..

నల్గొండ : జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈఘటనలో నలుగురు మృతి చెందారు.

 

నేటి నుండి బ్రిక్స్ శిఖరాగ్ర సభ..

గోవా : నేటి నుండి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గోవా వేదికగా ఐదు దేశాల నేతలు చర్చలు జరపనున్నారు. పాక్ ను ఏకాకి చేసేందుకు భారత్ వ్యూహాలు రచిస్తోంది.

 

నేడు నాలుగు జిల్లాలో మంత్రి హరీష్ పర్యటన..

హైదరాబాద్ : రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం నాలుగు జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో వివిధ కార్యక్రమాలకు మంత్రి హాజరుకానున్నారు.

విశాఖలో రెచ్చిపోయిన ఉన్మాది..

విశాఖపట్టణం : ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. కత్తులతో కనిపించిన వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. 

Don't Miss