Activities calendar

16 October 2016

22:41 - October 16, 2016

తెలంగాణ రాష్ట్రంలో సీపీఎం మహాజన పాదయాత్రకు  శ్రీకారం చుట్టింది. 31 జిల్లాలు... 5 నెలలు.. 4 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో పాదయాద్ర జరుగనుంది. ఎనిమిది మంది బృందం పాదయాత్రలో పాల్గొననున్నారు. రేపు ఇబ్రహీంపట్నంలో మహాజన పాదయాత్రను అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మహాజన పాదయాత్ర బృందంతో టెన్ టివి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ వివరాలను వారి మాటల్లోనే... 
జాన్ వెస్లీ..
తెలంగాణలో రాష్ట్రంలో 93 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఎంబీసీలున్నారు. వీరి అభివృద్ధి జరగకుండా.. తెలంగాణ సమగ్రాభివృద్ధి జరగదు. కుల వివక్ష, అంటరాని తనం నిర్మూలించకుండా సామాజిక తెలంగాణ సాధ్యం కాదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ యాక్టు అమలు కావడం లేదు. జస్టిస్ పున్నయ్య కమిషన్ అమలు కాలేదు. దళితులకు కేటాయించిన నిధులను దోపిడీ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు కావడం లేదు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్ లో వాటా కేటాయించాలి. రిజర్వేషన్ అమలు కోసం ప్రత్యేక చట్టం చేయాలి.
ఎంవి.రమణ.... 
రాష్ట్రంలో 25 లక్షల మంది చేతి వృత్తులు చేసేవారు ఉన్నారు. 2 సం.లలో 56 మంది చనిపోయారు. 
ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెట్ లేదు. దీనిపై ప్రభుత్వానికి దృష్టి లేదు. నిపుణుల కమిటీ వేయాలి. బీసీ కమిషన్ వేస్తే కొంతమేరకు ఉపయోగం జరుగుతుంది. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తే అధికంగా లాభం చేకూరుతుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 200 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాలు తాత్కాలిక ఉపశమనం కల్గిస్తాయి. జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలి.
మహ్మద్ అబ్బాస్.... 
ముస్లీం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కేసీఆర్ చిత్తశుద్ధి ఉందా లేదా..అనే అనుమానం కల్గుతుంది. పోస్టులన్నీ భర్తీ అయిన తర్వాత రిజర్వేషన్లు ఇస్తే లాభం లేదు. రిజర్వేషన్లు అమలు చేయాలి. బడ్జెట్ కీలకంగా ఉంది. జనాబా ప్రాతిపదికన ముస్లీంలకు బడ్జెట్ కేటాయించాలి. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రంలో 46 శాతం ముస్లీం జనాభా ఉంది. తెలంగాణలో 89 వేల వక్ఫ్ భూమి ఉంది. వక్ఫ్ భూములు కబ్జాకు గురయ్యాయి. ఉర్దూ పాఠశాలలు మూతపడుతున్నాయి. 
రమా... 
అసంఘటిత రంగంలో 60 శాతం మహిళలు ఉన్నారు. 3 లక్షల మంది శ్రామిక మహిళలు ఉన్నారు. కనీస వేతనాలు అమలు చేస్తామని, కాంట్రాక్టు రద్దు చేసి...వారిని రెగ్యులర్ చేస్తామని చెప్పారు. కానీ అది జరగలేదు. ఆశా వర్కర్లు 103 రోజులు దీక్షలు చేశారు. కేసీఆర్ వర్గ ప్రయోజనాలను విస్మరించి పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. గత ప్రభుత్వ విధానాలనే టీసర్కార్ అవలంభిస్తుంది. ప్రభుత్వ విధానాల వల్ల లాభం లేదు. కనీసం వేతనం 18 వేలు రూపాయలు ఇవ్వాలి. గత పాలకుల విధానాలను అమలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
ఆశయ్య..
రాష్ట్రంలో బీసీ, ఎంబీసీలు వెనుకబడి ఉన్నారు. వీరిలో అభివృద్ధి లేదు. ఆర్థికంగా, సామాజికంగా, రాజీకయంగా 
అత్యంత వెనుకబాటు ఉంది. సంచార జాతులకు స్థిర నివాసం ఏర్పాటు చేయాలి. జీవనోపాధి కల్పించాలి. పెత్తందార్లు ఆగడాలు కొనసాగుతున్నాయి. సామాజిక న్యాయం అంటే... సీట్లు, పదవులు ఇవ్వడం కాదు.. అన్ని రంగాల్లో సామాజిక న్యాయం కావాలి. 
శోభన్ నాయక్...
రాష్ట్రంలోని గిరిజనులు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారు. వివక్ష కనిపిస్తోంది. గ్రామాలకు దూరంగా వెలివేసి ఉన్నారు. తండాలు, గిరిజన ప్రాంతాలను గ్రామ పంచాయతీలు చేయాలి. పాదయాత్రలో 856 గ్రామ పంచాయతీల్లోని 35 తండాల గుండా పాదయాత్ర వెళ్తుంది. లంబాడీలు, కోయల సమస్యలపై అధ్యయనం చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు.. అధ్వాన్నంగా ఉన్నాయిని... అన్ని సౌకర్యాలు కల్పించాలి. గిరిజనులకు రిజర్వేన్లు కల్పించాలి.
నైతం రాజు..
టైగర్ జోన్ పేరుతో ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీల భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారు. ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా ప్రకటించాలి.
నగేష్... 
రాష్ట్రంలో 60 లలక్షల మంది వ్యసాయ కార్మికులు ఉన్నారు. కనీస వేతన చట్టాన్ని అమలు జరపడం లేదు. వ్యవసాయంలో యాంత్రికరణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమగ్ర చట్టం తేవాలి. రేషన్ ద్వారా 16 సరుకులు ఇవ్వాలి. రాష్ట్రంలో కోటి ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని దళితులు, గిరిజనులకు పంచాలి. కూలీ రేట్ల విధానాన్ని అమలు చేయాలి. ఉపాధీ హామీ చట్టాన్ని అమలు కావడం లేదని...పకడ్బందిగా అమలు చేయాలి. వైద్యం కార్పొరేట్ అయింది. ప్రైవేట్ వైద్యంలో 25 శాతం వ్యవసాయం కార్మికులు ఉచితం వైద్యం అందించాలి అని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:01 - October 16, 2016

ఢిల్లీ : న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లీ అజేయంగా 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మూడు వికెట్లతో కివీస్ బ్యాటింగ్‌ను దెబ్బతీసిన హార్దిక్ పాండ్యాకి మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 190 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 33 ఓవర్లలోనే విజయాన్ని నమోదుచేసింది. ఈ గెలుపుతో టీమిండియా 5 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. 

21:56 - October 16, 2016

మెదక్ : ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహాజన పాదయాత్ర కొనసాగిస్తామన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. పాదయాత్ర ముగిసేలోగా ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో దళితులతో కలిసి... ఎర్రజెండాలు పాతి స్వాధీనం చేసుకుంటామని తమ్మినేని హెచ్చరించారు. మహాజన పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తుతాయని.. అందుకే పాదయాత్రపై అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలిపారు.

 

21:46 - October 16, 2016

హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లో ఇంటింటికి మంచినీళ్లు అందించే కార్యక్రమం దళిత వాడల నుంచే ప్రారంభం కావాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మిషన్ భగీరథ పథకంలో ఉపయోగించే మోటార్లను బి.హెచ్.ఇ.ఎల్ నుంచి సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ పనులను మంత్రులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పర్యవేక్షించాలని అదేశించారు. 
2017 నాటికి ఇంటింటికి నీరు : కేసీఆర్
2017 డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు గోదావరి, కృష్ణ జలాలు చేరుకునేలా పనులు పూర్తి చెయ్యాలని అధికారులను సీఎం కేసీఆర్ అదేశించారు. గ్రామాల్లోకి పైపులైన్లు వేసి ఇంటింటికి నీళ్లు పంపాలని కేసీఆర్ అధికారులను చెప్పారు. క్యాంప్ కార్యాలయంలో మిషన్ భగీరథ పనులపై అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు. ప్రతి ఇంట్లో నల్లా బిగించడమే ఈ పథకంలో అతిపెద్ద పని అని ఆయన అన్నారు.  ఈ పనిని వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన ఆచరణాత్మకమైన వ్యూహం రూపొందించాలని కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. గ్రామాల్లో ఇంటింటికి నీళ్లిచ్చే కార్యక్రమం దళిత వాడల నుంచే ప్రారంభం కావాలన్నారు.
పనులన్నీ సమాంతరంగా జరగాలి : కేసీఆర్
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బాల్కసుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు.  ఇన్ టేక్ వెల్స్ , వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, మెటార్ల ఫిటింగ్ తదితర పనులన్ని 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణంతో సహా అన్ని పనులు సమాంతరంగా జరగాలని సూచించారు. గ్రామాల వరకు చేరిన నీటిని అంతర్గత పైపు లైన్ల ద్వారా ఇంటించికి అందించాలన్నారు. ప్రభుత్వం తరుపునే నల్లాలు కూడా కొని ప్రతీ ఇంట్లో బిగించాలని చెప్పారు. 
ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ  
కేసీఆర్ మిషన్ భగీరథ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనదని కేసీఆర్ అన్నారు. మంత్రులు, కలెక్టర్లు ఎక్కువ శ్రద్ధ తీసుకోని పనులు జరుగుతున్న చోటికి వెళ్లి పరిశీలించి, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఎక్కడైనా పనులు అనుకున్న వేగంతో జరగకుంటే అధికారులు వెంటనే జోక్యం చేసుకోని పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. 
మిషన్ భగీరథకు మోటార్లు, పంపింగ్ సామాగ్రి అవసరం
మిషన్ భగీరథకు పెద్ద ఎత్తున మోటార్లు, పంపింగ్ సామాగ్రి అవసరం ఉన్నందున, ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ ఈఎల్ ద్వారానే సమకూర్చుకోవాలన్నారు. ఇరిగేషన్, విద్యుత్ రంగాల్లో బీహెచ్ ఈఎల్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పుడు మిషన్ భగీరథలో కూడా అలాగే జరగాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, బీహెచ్ ఈఎల్ అధికారులు త్వరలోనే సమావేశమై ఈ విషయంలో అవగాహనకు రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.   

 

21:25 - October 16, 2016

గోవా : బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు వేదికగా రష్యా..పాకిస్థాన్‌కు షాకిచ్చింది. పాక్‌తో ఎలాంటి సైనిక ఒప్పందాలు కుదుర్చుకోలేదని రష్యా రోస్టెక్‌ కార్ప్‌ సీఈవో సెర్గీ సెమిజోవ్‌ స్పష్టం చేశారు. అంతేకాదు.. ఆ దేశంతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోమని, ఆధునిక హెలికాప్టర్లు, సైనిక ఎయిర్‌క్రాప్ట్‌లను పాకిస్థాన్‌కు అమ్మబోమని చెప్పారు. ఇకపై ఎలాంటి ఒప్పందాలు ఉండవని కుండబద్దలు కొట్టారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని పారద్రోలేందుకే సంయుక్త సైనిక విన్యాసాలు చేశామన్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందంలో భాగంగా ఆధునిక హెలికాఫ్టర్లను అందించే ఒప్పందంపై చర్చలు మాత్రం జరిగాయని.. అయితే డీల్‌‌పై సంతకాలు చేయలేదని సీఈఓ సెర్గి చిమెజోవ్ తెలిపారు. 

21:14 - October 16, 2016

ఆ దెయ్యం ఆ ఇంట్లో అడుగుపెట్టినవాళ్లను అష్టకష్టాలు పెడుతుంది. ఆ బంగ్లా మీద ఆశపడ్డవారి అంతు చూస్తుంది. నిన్న  బూత వైద్యుడి హత్య, మొన్న ఎస్సై మీద హత్యాప్రయత్నం, బార్గవ్ మీద దాడి... నిజంగానే ఆ ఇంట్లో దెయ్యం ఉందా..?? ఉంటే ఒకసారి ఆ దెయ్యానికి హాయ్ చెప్పొద్దాం... రండి.. పూర్తి వివరాలను వీడియోలో చూడండి.. 

 

రూ. 5కోట్లు ఇవ్వాలని చిరు వ్యాపారికి ఫోన్ లో బెదిరింపులు

నాగర్ కర్నూల్ : జిల్లాలోని వెల్దండలో చిరు వ్యాపారి శ్రీనివాస్ గౌడ్ కు ఫోన్ లో దుండగుడు బెదిరించాడు. రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు చేశాడు. శ్రీనివాస్ రెడ్డి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. 

చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి

ఖమ్మం : రఘునాథపాలెం మండలం పంగిడిలో విషాదం నెలకొంది. బహిర్భూమికి వెళ్లి చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి చెందారు. మృతులు అబ్దుల్ రెహ్మన్ (5)సహా అన్నదమ్ములు ఎస్.నాగులు (12), ఎస్.నజీర్ బాషా(16)లుగా గుర్తించారు. 

 

ప్రైవేట్ కలేజీ యాజమాన్యాలను చర్చలకు ఆహ్వానించిన మంత్రి కడియం

హైదరాబాద్ : డిగ్రీ, పీజీ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపిచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై చర్చలకు మంత్రి ఆహ్వానించారు. 

ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

మహబూబ్ నగర్ : అన్వాడ మండలం వెంకటమ్మకుంట తండాలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. 
మృతులు శివ, సాయి, శివ, సాయి, శివకుమార్ లు కొత్తపేట వాసులుగా గుర్తించారు.

 

అగ్రిగోల్డ్ బాధితులకు అవగాహనా కార్యక్రమం

విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులకు మేధావులు, నిపుణులచే అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. బినామీల పేరుతో అగ్రిగోల్డు ఆస్తులు అమ్ముకునే యత్నం చేస్తున్నారని అగ్రిగోల్డు బాధితుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. అగ్రిగోల్డ్ అటాచ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అగ్రిగోల్డు బాధితులను గాలికి వదిలేసిందని విమర్మించారు. 

 

20:22 - October 16, 2016

హైదరాబాద్ : మేధావి వర్గం మౌనంగా ప్రేక్షక పాత్ర వహించి.. సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని విద్యావేత్త చుక్కా రామయ్య వ్యాఖ్యానించారు. 'రోహిత్ ఘటన.. హెచ్ సీయూలో పరిణామాల'పై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. హెచ్ సీయూ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అని ..రోహిత్ ఘటన..అనంతరం ప్రభుత్వాలు, యూనివర్సిటీ వ్యవహరించిన తీరు దేశానికి, యూనివర్సిటీకి అగౌరవం అని చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. అకడమిక్ కౌన్సిల్ వైఖరిని ఆయన తప్పు పట్టారు.

 

20:19 - October 16, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పత్తి కొనుగోలు కేంద్రాలను 90కి పెంచాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- సీపీఐ నిర్ణయించింది. గతంలో 84 కొనుగోలు కేంద్రాలుండగా మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి మేరకు కొత్తగా మరో 6 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సీపీఐ అంగీకరించింది. ఈ నెలాఖరులోగా  45 పత్తి కొనుగోలు కేంద్రాలు, నవంబర్ చివరిలోగా మరో 45 కొనుగోలు కేంద్రాలను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రారంభించనున్నట్టు సీపీఐ డైరెక్టర్  తెలియజేశారు. రాష్ట్రంలో పత్తి దిగుబడులు, కొనుగోలు అంశాలపై కాటన్  ఆఫ్ ఇండియా డైరెక్టర్ చొక్కలింగంతో మంత్రి హరీష్ రావు చర్చలు జరిపారు. తెలంగాణలో ఇప్పటివరకు ఆదిలాబాద్, వరంగల్ లలో కాటన్ కార్పొరేషన్ కార్యాలయాలు పనిచేస్తున్నాయని కొత్తగా నల్లగొండ జిల్లాలో మరో కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు చేసిన సూచనకు కూడా సీపీఐ అంగీకరించింది. 

 

20:15 - October 16, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజాసమస్యల అధ్యయనం కోసం.. సీపీఎం.. నేడు మహాజన పాదయాత్రకు శ్రీకారం చుడుతోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం... రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నెలల పాటు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనుంది. సమగ్ర సామాజిక అభివృద్ధి సాధనే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగించనున్నట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు. 
నాలుగు వేల కిలోమీటర్లు.. 
నాలుగు వేల కిలోమీటర్లు.. 5 నెలల సుదీర్ఘ కాలం.. ప్రజాసమస్యల అధ్యయనమే ధ్యేయం...31 జిల్లాలు.... నాలుగు వేల కిలోమీటర్ల దూరం.. 5 నెలల సుదీర్ఘ కాలం.. ప్రజాసమస్యల అధ్యయనమే ధ్యేయం.
సామాజిక సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పాదయాత్ర 
రాష్ట్ర సామాజిక సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీపీఎం తెలంగాణ శాఖ సోమవారం నుంచి మహాజన పాదయాత్రను చేపట్టనుంది. ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్‌ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాశ్‌ అంబేడ్కర్‌.. మహాజన పాదయాత్రను ప్రారంభిస్తారు. తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని ఎనిమిదిమంది సభ్యుల బృందం.. ఐదు నెలల పాటు నాలుగు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించనుంది. పాదయాత్ర బృందంతో కలిసి తమ్మినేని, ప్రకాశ్‌ అంబేడ్కర్‌లు.. ఆదివారం, ట్యాంక్‌బండ్‌పైని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. సీపీఎం పాదయాత్రను ప్రారంభించనుండడం తనకు ఆనందాన్నిస్తోందని ఈ సందర్భంగా ప్రకాశ్‌ అంబేడ్కర్‌ అన్నారు.
అప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యం : తమ్మినేని  
రాష్ట్రంలో 93 శాతంగా ఉన్న దళితులు, గిరిజనులు, బీసీలు, ఎంబీసీలు, మైనార్టీలు అభివృద్ధి చెందడం ద్వారానే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ పాదయాత్ర ద్వారా ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండాను ప్రజల ముందుంచాలని సీపీఎం భావిస్తోంది. విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. 
పాదయాత్రకు ముందు బహిరంగ సభ 
ఇబ్రహీంపట్నం వద్ద పాదయాత్ర ప్రారంభానికి ముందు.. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇందులో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం ఏపీ కార్యదర్శి మధు, సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సామాజిక, అభ్యుదయ, ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారు. సభలో పాదయాత్ర పాటల సీడిని ప్రజా గాయకుడు గద్దర్‌, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ విడుదల చేస్తారు. 2017 మార్చి 12న హైదరాబాద్‌ నిజాం గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగియనుంది. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సాగిస్తోన్న పాదయాత్రకు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది. 

 

20:10 - October 16, 2016

గోవా : ప్రపంచ దేశాలకు ప్రధాన సమస్యగా మారిన ఉగ్రవాదాన్ని తరిమేందుకు సభ్య దేశాలన్ని సహకరించుకోవాలని బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు స్పష్టం చేసింది. అభివృద్ధికి ఆటంకంగా మారిన టెర్రరిజం మూలాలు పాక్‌లో ఉన్నాయని భారత ప్రధాని మోదీ విమర్శించారు. గోవాలో జరుగుతున్న 8వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో సభ్యదేశాధినేతలు ఉగ్రవాద నిర్మూళనకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత చర్చలు జరిపారు. 
సంకుచిత వైఖరి ప్రయోజనకరం కాదు 
ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదుల విషయంలో సంకుచిత వైఖరి ఏ మాత్రం ప్రయోజనకరం కాదని, భవిష్యత్తులో ఇది అందరికి సమస్య కాగలదని బ్రిక్స్‌ దేశాలను ప్రధాని మోదీ హెచ్చరించారు. పాకిస్థాన్‌  ఉగ్రవాదం విషయంలో అవలంభిస్తున్న వైఖరిని మోదీ తప్పుబట్టారు. ఉగ్రవాదానికి తల్లిలాంటి దేశంగా పాక్‌ మారిపోయిందన్నారు.  
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఉగ్రవాద చర్యలు  
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల చర్యలు విస్తరించాయని, దాంతో భద్రత ప్రశ్నార్థకంగా మారిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధిపై ఉగ్రవాదం పడగ విప్పి, ఆర్థిక సమృద్ధికి పెనుముప్పుగా మారిందన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా..  ఉగ్రవాదం సమంజసమైనదేనన్న దృక్పథాన్ని పాక్‌ చాటుతోందని మోదీ అన్నారు. ఉగ్రవాదులకు నిధులు, ఆయుధాలు, శిక్షణ, రాజకీయ మద్దతు అందకుండా చూడాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాద నిరోధానికి జాతీయ సలహాదారుల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవాలని మోదీ సూచించారు. 
చైనా అధ్యక్షుడు భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు 
బ్రిక్స్‌ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కష్టపడే ప్రజలు, రంగురంగుల సంస్కృతి తననెంతో మంత్రముగ్ధున్ని చేశాయన్నారు. అక్టోబర్ నెల బ్రిక్స్‌ దేశాలకు ఫలప్రదంగా మారాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.  ఇరుదేశాల దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్ట పరచాలని నిర్ణయించినట్లు బ్రిక్స్‌ సదస్సు భేటీ అనంతరం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో  చైనా  తెలిపింది.  

 

20:05 - October 16, 2016
20:04 - October 16, 2016
20:02 - October 16, 2016

తొలి వన్డేలో భారత్ విజయం

ధర్శశాల : భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ 43.5 వోవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 190 పరుగులకు ఆలౌట్ అయింది. 

 

19:50 - October 16, 2016

పశ్చిమగోదావరి : ఆక్వాపార్క్‌ వద్దంటూ ఆందోళన చేసిన సత్యవతి కుటుంబం నరకయాతన అనుభవిస్తోంది.. పార్క్ వద్దంటూ ఆందోళనచేసిన సత్యవతితో పాటు... ఆమె కొడుకును పోలీసులు జైలులో పెట్టారు.. ఇద్దరూ జైలుపాలు కావడంతో క్యాన్సర్ పేషంట్‌ అయిన సత్యవతి భర్త నరకయాతన అనుభవిస్తున్నారు.. ఆయన్ని చూసుకునేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

మిషన్ భగీరథను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. మిషన్ భగీరథను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.  మిషన్ భగీరథకు నిరంతరం విద్యుత్ అందేలా చూడాలన్నారు. 

రేపు సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభం

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభం కానుంది. అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ, వామపక్ష పార్టీల కార్యదర్శులు హాజరుకానున్నారు. 

 

విరాట్ కోహ్లీ అర్ధ శతకం

ధర్మశాల : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ అర్ధ శతకం చేశాడు. ధర్మశాల వేదికగా మ్యాచ్ జరుగుతోంది. 

 

ఎన్ని అవాంతరాలు ఎదురైనా యాత్ర ఆపేదిలేదు : తమ్మినేని

హైదరాబాద్ : ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అవకాశాలు అందరికీ అందడమే నిజమైన సామాజిక న్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎంగిలి మెతుకులు వేసి... పాలకులు పబ్బం గడుపుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 52 శాతం వాటా అందాలన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా యాత్ర ఆపేదిలేదని స్పష్టం చేశారు. 

 

18:53 - October 16, 2016
18:40 - October 16, 2016

హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటైనా ఆసిఫాబాద్‌కు జిల్లాకు గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్‌ పేరు పెట్టినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ట్యాంక్ బండ్ దగ్గర కొమురంభీమ్‌ వర్థంతి సందర్భంగా ఆయనకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, చందూలాల్‌, ఎమ్మెల్యేలు, పలువురు గిరిజన నాయకులు నివాళులు అర్పించారు. గిరిజనుల హక్కుల సాధన కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారని వక్తలు అభిప్రాయపడ్డారు. 

 

18:36 - October 16, 2016

హైదరాబాద్ : సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్రను అడ్డుకోవాలనుకోవడం ప్రభుత్వం నిరంకుశ ధోరణికి నిదర్శనమని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. 2014 ఎన్నికల్లో సీపీఎం జెండాను పట్టుకున్న టీఆర్‌ఎస్ ఇప్పుడు అదే సీపీఎంను నిలువరించాలనుకోవడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ వైఖరి అతని పతనానికి నాంది అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

18:30 - October 16, 2016

విజయవాడ : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్మితమవుతున్న మెగా ఆక్వాఫుడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేస్తామని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న సీపీఐ జాతీయకార్యవర్గ సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టిందని.. అందుకే రాష్ట్రంలోని రైతుల భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ చేసిన మోసంపై హైకోర్టులో వ్యాజ్యం వేస్తున్నామని రామకృష్ణ తెలిపారు.  

 

18:27 - October 16, 2016

రెండో వికెట్ కోల్పోయిన భారత్

ధర్మశాల : భారత్, న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 62 పరుగుల వద్ద రహానే (33) ఔట్ అయ్యాడు. ధర్మశాల వేదికగా మ్యాచ్ జరుగుతోంది. 

తొలి వికెట్ కోల్పోయిన భారత్

ధర్మశాల వన్డే : భారత్, న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో 49 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. ధర్మశాల వేదికగా మ్యాచ్ జరుగుతోంది. 

18:04 - October 16, 2016

హైదరాబాద్ : నగరంలోని అల్వాల్ సిటిజెన్ కాలనీలో భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. తన ఇద్దరు పిల్లలతో సహ ధను శ్రీ అనే వివాహిత ధర్నా నిర్వహించింది. అత్తామామలు, భర్త డేనియల్ తమని ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపిస్తోంది. ధనుశ్రీ చేస్తున్న ధర్నాకు పలువురు మద్దతు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు ధర్నా నిర్వహిస్తానని ధనుశ్రీ చెబుతోంది. 

 

18:02 - October 16, 2016

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్రతో ప్రభుత్వంలో గుబులు మొదలైందని.. ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాదయాత్ర ప్రకటన తర్వాత... టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు, వాటి అమలుపై ప్రజల్లో విస్తృతమైన చర్చనడుస్తోందని, దీన్ని ప్రభుత్వం భరించలేకపోతోందని విమర్శించారు. అందుకే తమ పాదయాత్రపై చౌకబారు విమర్శలు చేస్తోందని తమ్మినేని మండిపడ్డారు. ట్యాంక్‌బండ్‌ వద్ద.. అంబేడ్కర్‌ విగ్రహానికి, పాదయాత్ర బృంద సభ్యులు, అంబేడ్కర్‌ మనుమడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌లతో కలిసి, తమ్మినేని.. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు కొమురంభీం విగ్రహానికీ పూలమాలలు వేసింది. సీపీఎం పాదయాత్రను అంబేద్కర్‌ మనుమడు, ప్రకాశ్ అంబేద్కర్‌ రేపు ఇబ్రహీంపట్నంలో ప్రారంభించనున్నారు. 

 

17:58 - October 16, 2016

 గోవా : ఆర్థిక సమృద్ధికి ఉగ్రవాదం నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్‌పై దుమ్మెత్తిపోశారు. గోవాలో జరుగుతున్న 8వ బ్రిక్స్‌ సదస్సులో మోదీతో పాటు సభ్యదేశాధినేతలు పాల్గొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ తల్లిలాంటిదని మోదీ విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రమూకలన్నింటికి.. పాకిస్తాన్‌లోని ముష్కర సంస్థలతో సంబంధాలున్నాయని ప్రధాని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఉగ్రవాదాన్ని సమర్థించే ధోరణిని మోదీ తీవ్రంగా ఖండించారు. బ్రిక్స్‌ దేశాలన్నీ ఉగ్రభూతానికి వ్యతిరేకంగా ఏకమై.. కలిసి కట్టుగా పోరాడాల్సిన అసవరం ఉందన్నారు. టెర్రరిజం నిర్మూళనకు త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలో సమగ్ర ఒప్పందం కుదిరేలా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని అన్నారు. 

'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలకు దర్శకుడు కాశ్యప్ మద్దతు

హైదరాబాద్ : కరన్ జోహార్ తీసిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు దర్శకుడు అనురాగ్ కాశ్యప్ మద్దతు తెలిపారు. సినిమా విడుదలను అడ్డుకోవడం సరికాదన్నారు. కరన్ జోహార్ ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రధాని మోడీ పాకిస్తాన్ లోనే ఉన్నారని తెలిపారు. మోడీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆతిథ్యాన్ని స్వీకరించారని..పాకిస్తాన్ నటుడు ఫహద్ ఖాన్ నటించినందున మోడీ క్షమాపణలు చెబుతారా అని అనురాగ్ ప్రశ్నించారు. ఈ సినిమాను విడుదల చేయకూడదని సినిమా ఓవర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. దీంతో నాలుగు రాష్ట్రాల్లో విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి.

శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు

కడప : శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చాంద్ బాయి అనే వ్యక్తిని దేవుడిని చేసి షిరిడీలో సాయిబాబాగా పూజిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి తమ ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. 

మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పథకం పనితీరుతోపాటు అమలు వంటి తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. 

 

ప.గో జిల్లా నాకు అత్యంత ముఖ్యమైన జిల్లా : సీఎం చంద్రబాబు

విజయవాడ : మెగా అక్వాపుడ్ పార్కుపై సమీక్ష ముగిసింది. పగో తనకు అత్యంత ముఖ్యమైన జిల్లా అని సీఎం చంద్రబాబు అన్నారు. యనమదురు డ్రైన్ శుద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని చెప్పారు. కాలుష్యం వెలువడే పరిశ్రమలను అనుమతించమని పేర్కొన్నారు. కాలుష్య రహిత జిల్లాగా మార్చడమే తన సంకల్పమన్నారు. 

 

17:13 - October 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సర్కారుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఈనెల 14 నుంచి వచ్చేనెల 18 వరకు జరగాల్సిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రకటించింది. 
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలను బహిష్కరణ 
తెలంగాణలో ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు కేసీఆర్‌ సర్కార్‌ తీరుపై గుర్రుగా ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఈనెల 14 నుంచి వచ్చేనెల 18 వరకు జరగాల్సిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రకటించింది. దీంతో డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడింది. డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేయూ, ఓయూ ప్రకటించాయి. ఈనెల 15న జరగాల్సిన పరీక్షను వచ్చేనెల 12న, ఈనెల 17న జరగాల్సిన పరీక్షను వచ్చేనెల 19కి, ఈనెల 18న జరగాల్సిన పరీక్ష వచ్చేనెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ఓయూ పరీక్షల నియంత్రణ విభాగం తెలిపింది. మిగతా పరీక్షలు యథాతధంగా షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి 
మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు 2,078 కోట్లను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం డిమాండ్ చేసింది. ఇందులో వెయ్యి కోట్లు విడుదల కాగా.. ఇంకా 2,078 విడుదల కావాల్సి ఉందని చెప్పింది. జూనియర్‌, డిగ్రీ, పీజీ కాలేజీలకు ఈ బకాయిల్లో 350 కోట్లు రావాల్సి ఉందని స్పష్టం చేసింది.  
డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం : పాపిరెడ్డి 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

తెలంగాణ సర్కార్ పై ఎస్.వీరయ్య ఆగ్రహం

మెదక్ : తెలంగాణ ప్రభుత్వంపై నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. సంగారెడ్డిలో జరుగుతున్న సీఐటీయూ ద్వితీయ రాష్ట్ర మహాసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర వచ్చాకైన తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు, రైతులు ఆశించారని.. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయని వాపోయారు.

16:55 - October 16, 2016

మెదక్ : తెలంగాణ ప్రభుత్వంపై నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. సంగారెడ్డిలో జరుగుతున్న సీఐటీయూ ద్వితీయ రాష్ట్ర మహాసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర వచ్చాకైన తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు, రైతులు ఆశించారని.. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయని వాపోయారు. రాష్ట్రం వచ్చి రెండున్నర సంవత్సరాలైన రైతన్నలు ఉరితాళ్లను వదల్లేని పరిస్థితి వచ్చిందన్నారు. అప్పులు ఉరి తాళ్లై రైతుల ప్రాణాలు తీస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వంలోనూ రైతుల ఆత్మహత్యలు జరిగాయిని గుర్తు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అందరూ సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ అనడం న్యాయమా...అని ప్రశ్నించారు. ప్రజలు నమ్మి టీఆర్ ఎస్ కు ఓట్లేసి వారిని నట్టేట ముంచుతారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగస్తులు, ప్రజలు పోరు బాట పట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. బతుకు బాటలో పిడికిలెత్తి నినదించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో యోచించాలని సూచించారు.

 

భారత్ విజయలక్ష్యం 191 పరుగులు

ధర్శశాల వన్డే : తొలి వన్డే మ్యాచ్ లో భారత బౌలర్లు జోరు ప్రదర్శించారు. భారత్, న్యూజిలాండ్ మధ్య ధర్శశాల వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ 190 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ విజయలక్ష్యం 191 పరుగులుగా ఉంది. హార్ధిక్ పాండ్య 3, ఉమేష్ 2, కేఎం జాదవ్ 2, మిశ్రా 3 వికెట్లను పడగొట్టారు. 

16:32 - October 16, 2016
16:30 - October 16, 2016

హైదరాబాద్ : వరకట్న వేధింపులు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అత్తింటివారి వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. అత్తింటివారు, భర్త వరకట్న వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సికింద్రాబాద్‌ రామ్‌గోపాల్‌పేటలోని నల్లగుట్టలో శ్రీకాంత్‌, శ్వేత దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. శ్వేత భర్త జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రామ్‌గోపాల్‌పేట టీఆర్ ఎస్ టికెట్‌ కోసం ప్రయత్నించారు.  శ్వేత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగం చేస్తోంది. అయితే అత్తింటివారు, భర్త శ్రీకాంత్ అదనపు కట్నం తేవాలని శ్వేతను వేధింపులకు గురిచేస్తున్నారు. ఈనేపథ్యంలో మద్యం సేవించి వచ్చిన శ్రీకాంత్ ఇదే విషయంపై రాత్రి శ్వేతతో గొడవకు దిగారు. అత్తింటివారు, భర్త వేధింపులు భరించలేక శ్వేత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్వేత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కానీ ఇది ముమ్మాటికి హత్యేనని శ్వేత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వేధింపులకు గురిచేసి... ఆత్మహత్య చేసుకునేవిధంగా ఆమెను పురిగొల్పారని పేర్కొన్నారు. మృతదేహాన్ని శ్రీకాంత్ ఇంటి ముందు ఉంచి ఆందోళన చేపడతామని శ్వేత తల్లిదండ్రులు, బంధువులు పేర్కొన్నారు. భర్తతోపాటు అత్తామామలపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని పోలీసులు హామి ఇచ్చారు. భర్త శ్రీకాంత్‌ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

తొమ్మిదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

ధర్మశాల : న్యూజిలాండ్, భారత్ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 177 పరుగుల వద్ద సౌథీ (55)  ఔట్ అయ్యాడు. 

15:56 - October 16, 2016

గుంటూరు : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మరో రెండు బ్లాకులను ప్రారంభించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంత్రి అచ్చెన్నాయుడు కార్మికశాఖ కార్యాలయాన్ని ప్రారంభించగా.. రెండో బ్లాక్‌లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి  రెవెన్యూశాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. కృష్ణా జిల్లా మండవల్లిలో 1400 ఎకరాల్లో నిర్మించనున్న మెగా ఫుడ్‌పార్క్‌కు సంబంధించి రైతులకు ఇవ్వనున్న నష్టపరిహార ఫైల్‌పై కేఈ తొలి సంతకం చేశారు. మరోవైపు యూత్‌ సబ్‌ప్లాన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తొలి సంతకం చేశారు. 

 

15:55 - October 16, 2016

హైదరాబాద్ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఈసారి వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇతర దేశాల్లో నిర్వహిస్తున్న విధంగా పోలీసు రన్‌ నిర్వహించారు. దేశంలోనే తొలిసారి నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమానికి తెలంగాణ వేదికగా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోలీసు రన్‌లో పోలీసు అధికారులంతా పాల్గొని విజయవంతం చేశారు. 
రన్ ను ప్రారంభించిన గవర్నర్‌ నరసింహన్‌ 
ఈనెల 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా పోలీసులు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. ఫ్రాన్స్‌లో పోలీసుల అమరవీరులకు ప్రతీకగా రన్‌ నిర్వహిస్తారు. అలాంటి రన్‌ దేశంలో ఉండాలని తెలంగాణ పోలీసులు కేంద్ర హోంశాఖకు సూచించారు. ఈ ఏడాది నుంచి మొదలు పెట్టాలని ప్రతిపాదనలు ఇచ్చారు. దీంతో తెలంగాణ నుంచే ఈ రన్‌ను ప్రారంభించాలని హోంశాఖ ఆదేశించింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. ఈ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్‌ నరసింహన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్‌ సీపీ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి, నేషనల్‌ పోలీసుల అకాడమీ డైరెక్టర్‌ అరుణ బహుగుణతో పాటు కేంద్ర బలగాలు, సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ అధికారులు హాజరయ్యారు. ఈ రన్‌లో పోలీసులతో పాటు.. అథ్లెట్లు పాల్గొన్నారు. 
దేశరక్షణలో పోలీసుల పాత్ర కీలకం : గవర్నర్ 
రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను గవర్నర్‌ నరసింహన్‌ కొనియాడారు. దేశరక్షణలో పోలీసుల పాత్ర కీలకమైందని.. పోలీసుల అమరవీరుల సేవలు మరిచిపోలేనివన్నారు. పోలీస్‌ రన్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు డీజీపీ అనురాగ్‌శర్మ. ప్రజల రక్షణకు తాము ఎప్పటికీ కష్టపడతామన్నారు అనురాగ్‌శర్మ. 
పోలీసుల్లో సంతోషం 
గతంలో కంటే భిన్నంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సక్సెస్‌ కావడంతో పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం దేశంలో మొట్టమొదటిసారి నిర్వహించే అవకాశం తెలంగాణ దక్కడం గర్వకారణంగా ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ రన్‌లో గెలుపొందిన విజేతలకు ఈనెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. 
వరంగల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో 5కే రన్‌
పోలీసులు ప్రజలతో భాగస్వామ్యం కావాలని వరంగల్‌ కమిషనర్‌ సుధీర్‌ బాబు పిలుపునిచ్చారు. పోలీస్‌ అమరవీరుల సంస్కరణ దినోత్సవం పురస్కరించుకొని హన్మకొండ పట్టణంలో 5కే రన్‌ నిర్వహించారు. రన్‌ ను జెండా ఊపి ప్రారంభించిన కమిషనర్‌.. పోలీసు అమరవీరులను ప్రజలు, పోలీసులు స్మరించుకోవాలని కోరారు. 
సిద్ధిపేట కమిషనర్‌ ఆధ్వర్యంలో 2కే రన్‌
పోలీసులు ప్రజలతో భాగస్వామ్యం కావడం కోసం వారం వారం కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తామని సిద్ధిపేట కమిషనర్‌ శివ కుమార్‌ చెప్పారు. పోలీస్‌ అమరవీరుల సంస్కరణ దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలో 2కే రన్‌ నిర్వహించారు. రన్‌ ను జెండా వూపి ప్రారంభించిన కమిషనర్‌.. విజేతలకు బహుమతులు అందజేశారు. 

ఎనిమిదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

ధర్మశాల వన్డే : న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 106 పరుగుల వద్ద బ్రేస్ వెల్ (15) ఔట్ అయ్యాడు. 

 

15:45 - October 16, 2016

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచితేనే బీసీ కులాల అభివృద్థి జరుగుతోందని బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. వాల్మీకి జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వాల్మీకి, బోయ కులాల అభివృద్థికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. వాల్మీకి ఫెడరేషన్ కు 200 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన కోరారు. 

 

15:41 - October 16, 2016

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఆశ్వయుజ పౌర్ణమి కావడంతో దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదివారం సెలవుదినం కూడా కావడంతో వేకువజామునుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరడంతో దుర్గమ్మ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా దుర్గగుడి అధికారులు సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూడండి..

 

15:39 - October 16, 2016

విజయవాడ : ఆక్వా ఫుడ్‌ పార్క్‌పై రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్థానిక నేతలతో సమీక్ష నిర్వహించారు. ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను వేరే చోటుకు తరలించే అవకాశం లేదని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే.. ఫ్యాక్టరీ నుంచి కాలుష్యం వెదజల్లకుండా.. ఎవరికీ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఫ్యాక్టరీపై చర్యలు తప్పవని.. ఫ్యాక్టరీ వ్యర్ధాలను పైపులైన్‌ ద్వారా సముద్రంలో కలిసే విధంగా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ ఆధారంగా ఫ్యాక్టరీ యాజమాన్యం నడుచుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్లు భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. 

 

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్వేత ఆత్మహత్య

హైదరాబాద్ : రాంగోపాల్ పేట పీఎస్ పరిధిలోని నల్లగుట్టలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్వేత ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటివారి వేధింపులు తాళలేక ఉరివేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. శ్వేతకు ఇద్దరు ఆడ పిల్లలున్నారు. భర్త శ్రీకాంత్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. 

ఏడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

ఢిల్లీ : న్యూజిలాండ్, భారత్ ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. 65 పరుగుల వద్ద స్నాంతర్ డౌకౌట్ అయ్యాడు 

రేపు సీపీఎం పాదయాత్రను ప్రారంభించనున్న ప్రకాశ్ అంబేద్కర్

హైదరాబాద్ : అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ హైదరాబాద్ చేరుకున్నాడు. రేపు సీపీఎం మహాజన పాదయాత్రను ప్రారంభించనున్నారు. మెజార్టీ ప్రజలకు అవకాశాలు రావాలనే డిమాండ్ తో సీపీఎం చేస్తున్న పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు. 

మీర్ పేటలో చిన్నారుల అదృశ్యం..

హైదరాబాద్ : మీర్ పేటలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. నిన్న ఇంటి ముందు ఆడుకుంటూ విద్యార్థులు ఆశీష్, మనీష్ లు కనిపించకుండాపోయారు. 

తొలి వికెట్ కోల్పోయిన కివీస్...

ధర్మశాల : కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగుల వద్ద గుప్తిల్ (12) ఔటయ్యాడు. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 3.4 ఓవర్లలో కివీస్ ఒక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. 

ఎల్ బినగర్ వద్ద రూ. 1.40 కోట్లు స్వాధీనం..

హైదరాబాద్ : ఎల్ బినగర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడ వెళుతున్న ప్రసాద్ అనే వ్యక్తి నుండి రూ. 1.40 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును పోలీసులు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు.

13:51 - October 16, 2016

ఒంగోలులో బహుజన కెరటాలు ఆధ్వర్యంలో పల్నాటి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన బొజ్జాతారకం సంస్మరణ సభలో.. డా ప్రసాదమూర్తి రచించిన ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం సిద్ధాంత గ్రంధం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ విమర్శకులు జి లక్ష్మీనర్సయ్య, గాయకుడు జయరాజు, ప్రొఫెసర్ వినోదిని, డా ఖాజా, శిఖామణి, కోయి కోటేశ్వరర్రావు తదితరులు పాల్గొన్నారు. 

13:49 - October 16, 2016

ఇటీవల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'సుద్దాల హనుమంతు జానకమ్మ' జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభ జరిగింది. 'సుద్దాల అశోక్ తేజ' ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ప్రముఖ గేయకవి, గాయకుడు 'వంగపండు ప్రసాదరావు'కు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గద్దర్, ఆర్.నారాయణమూర్తి, సినీనటుడు ఉత్తేజ్ ప్రముఖ కవి మువ్వా శ్రీనివాస్ రావు, నారాయణశర్మ తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:38 - October 16, 2016

సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. సృజనకారులు తమ కలాలకు పదును పెట్టి ప్రజలను ఆలోచింపజేస్తారు. ఆహ్లాదం, ఆనందం వినోదాలతో పాటు రాజకీయ సామాజిక చైతన్యాలను కలుగజేస్తారు. అలాంటి వారిలో అమెరికా గేయరచయిత 2016 నోబెల్ అవార్డు గ్రహీత బాబ్ డిలాన్ ఒకరు. బాబ్ డిలన్.... ఈ పేరు వింటేనే అమెరికన్ జానపద గాయకుడు సింగర్, ప్రఖ్యాత గేయకవి మూర్తిమత్వం మనకళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. సుమారు ఐదు దశాబ్దాలకు పైగా తన సంగీత సాహిత్యాలతో ప్రపంచ ప్రజల హృదయాలను ఉర్రూతలూగించిన గొప్పగాయకుడాయన. అతని పాటల్లో అద్భుత కవిత్వపు ఇమేజెస్ ఉన్నాయని ప్రశంసిస్తూ నోబెల్ కమిటి 2016 లో నోబెల్ బహుమతికి బాబ్ డిలాన్ ను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా బాబ్ డిలాన్ పై 'అక్షరం' ప్రత్యేక కథనం.

13:34 - October 16, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు కళ్యాణ రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ ఇందిరాపార్క్ దగ్గర నవభారత్‌ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా కళ్యాణ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ తీరును ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటుతుంటే.. కొత్త జిల్లాలు, రింగ్‌రోడ్లు అంటూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని కళ్యాణ రామకృస్ణ ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే నిత్యావసర ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

13:32 - October 16, 2016
13:31 - October 16, 2016

సంగారెడ్డి : సి.ఐ.టి.యు రాష్ట్ర ద్వితీయ మహాసభలు మూడో రోజు కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగిన మహాసభల్లో అనేక విషయాలపై కీలక తీర్మానాలు జరిగాయి. 10 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలను ప్రభుత్వం సవరించకపోవడాన్ని మహాసభలు తీవ్రంగా తప్పుబట్టాయి. కేంద్రం కార్మికుల హక్కులను కాలరాస్తోందని..కార్మికుల సమస్య పరిష్కారం కోసం ఐక్య పోరాటాలు చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియోలో చూడండి. 

13:28 - October 16, 2016

హైదరాబాద్ : నిన్న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రాజు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలో టీజాక్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సందర్శించారు. నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్‌లోనే కొనసాగించాలన్న డిమాండ్‌ రాజు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఎవరూ బలవన్మరణాలకు పాల్పడరాదని ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. టీజాక్‌ మీకు అండగా ఉంటుందని.. ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించుకుందామన్నారు.

13:25 - October 16, 2016

హైదరాబాద్ : సీజన్‌లో మార్కెట్‌ యార్డుల్లో రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్లపై ఉందని మంత్రి హరీష్‌రావు అన్నారు. రాజేంద్రనగర్‌లో జరుగుతున్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, అధికారుల అవగాహన సదస్సుకు హరీష్‌రావు హాజరయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయ మార్కెటింగ్‌లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. యార్డుకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉదయం వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉండాలని, యార్డులో కేవలం గంట మాత్రమే ఉండి వెళుతున్నారని తెలిపారు. సేవాభావం..బాధ్యతగా ఫీల్ కావాలని సూచించారు. మార్కెట్ యార్డు ఒక కుటుంబం అని, కుటుంబంలో ఇబ్బంది కలిగితే ఎలా వ్యవహరిస్తారో..అలాగే రైతుకు ఇబ్బంది కలిగితే అలానే వ్యవహరించాలని హరీష్ రావు సూచించారు. 

పశ్చిమగోదావరి తనకు అత్యంతమైన ముఖ్యమైన జిల్లా - బాబు..

విజయవాడ : మెగా అక్వాఫుడ్ పార్క్ పై సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన సమీక్ష ముగిసింది. పశ్చిమగోదావరి తనకు అత్యంత ముఖ్యమైన జిల్లా అని, యనమదుర్రు డ్రైన్ శుద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కాలుష్యం వెలువడే పరిశ్రమలను అనుమతించమని, కాలుష్య రహిత జిల్లాగా మార్చడమే తన సంకల్పమన్నారు. 

13:13 - October 16, 2016

విజయవాడ : మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్టు వ్యవహారంలో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. పార్క్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ కాలుష్యం నివారణకు చర్యలు తీసుకుంటామని పేర్కొంటోంది. ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుపై జరుగుతున్న ఆందోళనలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం సీఎం నివాసంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాకు సంబంధించిన మంత్రులు..ప్రజాప్రతినిధులు..అధికారులు..మెగా ఫుడ్ పార్క్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. పార్క్ అక్కడే ఏర్పాటు చేయాలని, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎం బాబు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ నుండి నేరుగా పైపులైన్ వేసి వ్యర్థ నీరు సముద్రంలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, ఫ్యాక్టరీ ద్వారా కాలుష్యం లేకుండా చేయాలని పలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

అనుమానాలు నివృత్తి చేస్తాం - ఎమ్మెల్యే రామాంజనేయులు...
ఇదిలా ఉంటే ప్రజల ఇబ్బందులను సీఎంకు వివరించడం జరిగిందని భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. ప్రజలు, ప్రతిపక్షాల అనుమానాలు నివృత్తి చేస్తామని, ఎవరికీ నష్టం కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యాక్టరీ నుండి నేరుగా పైపులైన్ వేసి వ్యర్థ నీరు సముద్రంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని, ఫ్యాక్టరీ ద్వారా కాలుష్యం లేకుండా చేస్తామన్నారు. పార్క్ ను అక్కడే ఏర్పాటు చేస్తామని, మార్చే ప్రసక్తే లేదన్నారు. ప్రాజెక్టుతో ఆక్వా రైతులకు మేలు జరుగుతుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ తో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కొన్ని రోజులుగా ఆందోళనలు..
ఆక్వా మెగా ఫుడ్...ఈ ఫ్యాక్టరీ వద్దంటూ గత కొన్ని రోజులుగా స్థానికులు..గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. వీరికి సీపీఎం..ఇతర ప్రజా సంఘాలు సంఘీభావం తెలియచేస్తూ పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమబాట పట్టిన గ్రామాలపై పోలీసుల దమనకాండ, అణచివేత చర్యలు కొనసాగుతున్న విషయం విదితమే. నిరసనలు జరుగుతున్న 30 గ్రామాల్లో కఠిన ఆంక్షలు విధించారు. పెద్దఎత్తున కాలుష్యాన్ని వెదజల్లే గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని సీపీఎం స్పష్టం చేసింది.

స్పందించిన పవన్..
ఈ నేపథ్యంలో ఆక్వా మెగా ఫుడ్ పార్క్ రైతులు సినీ నటుడు, జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీనితో పవన్ ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఎంతో మందికి నష్టం కలిగించే ఇలాంటి ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని, ప్రభుత్వం స్పందించకపోతే కలిసొచ్చే పార్టీలతో తాను శాంతియుత ఉద్యమం చేపడుతానని పవన్ స్పష్టం చేశారు. గ్రామాల్లో మధ్యలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పవన్..ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. 

మెగా ఆక్వా ఫుడ్ పార్క్ అక్కడే - రామాంజనేయులు..

విజయవాడ : మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్టు వ్యవహారంపై ప్రజాప్రతినిధులు..అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల ఇబ్బందులను సీఎంకు వివరించడం జరిగిందని భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. ప్రజలు, ప్రతిపక్షాల అనుమానాలు నివృత్తి చేస్తామని, ఎవరికీ నష్టం కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యాక్టరీ నుండి నేరుగా పైపులైన్ వేసి వ్యర్థ నీరు సముద్రంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యాక్టరీ ద్వారా కాలుష్యం లేకుండా చేస్తామన్నారు. పార్క్ ను అక్కడే ఏర్పాటు చేస్తామని, మార్చే ప్రసక్తే లేదన్నారు. ప్రాజెక్టుతో ఆక్వా రైతులకు మేలు జరుగుతుందన్నారు. 

12:48 - October 16, 2016

సమర్, అక్షిత, కిమయ ప్రధాన పాత్రల్లో శ్రీ మహాలక్ష్మీ ఇన్నోవేటివ్స్ మూవీస్స్ బ్యానర్‌పై సతీష్ గుండేటి దర్శకత్వంలో, పెర్ల ప్రభాకర్, గోపాల్ సంయుక్తంగా నిర్మించిన 'కొత్త కొత్తగా ఉంది' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా టెన్ టివి చిత్ర యూనిట్ తో ప్రత్యేకంగా ముచ్చటించింది. యూజ్‌ఫుల్‌ కామెడీ ఉంటుందని, టెస్ట్‌ ట్యూబ్‌ల ద్వారా పుట్టిన హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధం వంటి ఎమోషన్స్ ఎలా ఉంటాయనే కాన్సెప్ట్ తో ఎంటర్‌టైనింగ్‌గా చేసిన చిత్రమిదిని చిత్ర యూనిట్ తెలిపింది. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:34 - October 16, 2016

బతుకమ్మకుంట టీఆర్ఎస్ నేతదా అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాస్తవంగా హైదరాబాద్ అభివృద్ధి అయ్యిందని, కానీ పేదలు మాత్రం అభివృద్ధి కాలేదని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 17వ తేదీన మహాజన పాదయాత్ర చేపడుతున్న సందర్భంగా టెన్ టివి ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. వందల..వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని, ఆక్రమణలు చేశారని తెలిపారు. నయీంతో సంబంధం ఉన్న బ్యాచ్ లు ఇంకా ఉన్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఉన్నదున్నట్టుగా ఎందుకు వెల్లడించదని తెలిపారు. నయీం డైరీని ఎందుకు బహిర్గతం చేయదని సూటిగా ప్రశ్నించారు. బతుకమ్మ కుంట..ఆక్రమణనకు గురైందని, ఈ ఆక్రమణల వెనుక టీఆర్ఎస్ కు చెందిన నేత ఉన్నాడని తెలిపారు. లోకల్ గా పోటీ చేసిన అభ్యర్థి తన భూమి అని పేర్కొంటున్నాడని, ఒక కుంట ప్రైవేటు వాడి భూమి ఎలా అవుతుందని తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:23 - October 16, 2016

సీనియర్ స్టార్ 'వెంకటేష్' కసి మీదున్నాడు. అందుకే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతున్నాడు. 'వెంకీ' జెట్ స్పీడ్ తో 'గురు' మూవీని కంప్లీట్ చేస్తున్నాడు. ఈ మూవీ స్టార్ట్ చేసి నెల కూడా కాలేదు అప్పుడే టీజర్ ని కూడా రెడీ చేశారు. ఇంతకీ వెంకీ గురు మూవీ విశేషాలేంటీ . 'వెంకటేష్' ఎంతో ఊహించుకున్న 'బాబు బంగారం' తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం బడ్జెట్ ని రాబట్టగలిగింది కానీ ఈ చిత్రం వల్ల 'వెంకటేష్' కి ప్రత్యేకంగా ఒరిగింది మాత్రం ఏం లేదని చెప్పాలి. అందుకే 'గురు' రీమేక్ తో అయినా బాక్సాఫీసు వద్ద విక్టరీ నమోదు చేయాలని ఈ సీనియర్ స్టార్ కసిగా ఉన్నాడు.

దీపావళికి టీజర్ ? 
'వెంకటేష్' బాలీవుడ్ లో సూపర్ హిట్టు అయిన 'సాలా ఖద్దూస్' రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'గురు' టైటిత్ తో తెరకెక్కుతున్న గత నెల 19 స్టార్ట్ చేశారు. ఈ చిత్రం ఒపెనింగ్ రోజే 'వెంకీ' ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి మూవీపై అంచనాలు పెంచారు. ఇప్పుడు ఈ మూవీ టీజర్ సిద్దం చేసినట్లు సమాచారం. టీజర్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ నెల 30న దీపావళి సందర్భంగా 'గురు' చిత్రం టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. 'వెంకటేష్' ఊహించని రేంజ్ లోఈ మూవీ కోసం చేసిన మేకోవర్ అందరిని ఆశ్చర్యపరించింది. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ రీమేక్ తో అయిన 'వెంకీ' సోలోగా సూపర్ హిట్టు కొడుతాడో చూడాలి.

12:18 - October 16, 2016

'పాదయాత్రను అడ్డుకొనేందుకు సర్కార్ ప్రయత్నాలు'..

సిద్ధిపేట : మహాజన పాదయాత్ర కొనసాగకుండా ప్రభుత్వం అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఎన్ని అడ్డంకులు కలిగించినా పాదయాత్ర కొనసాగిస్తామని తెలిపారు. పాదయాత్ర ముగిసే సమయానికి దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వ భూముల్లో దళితులతో కలిసి ఎర్రజెండాలు పాతి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల పోరాటం మహత్తరమైందని, మల్లన్న సాగర్ కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని పాదయాత్రలో గ్రామ గ్రామాన తెలియచేస్తామన్నారు. 

11:46 - October 16, 2016
11:17 - October 16, 2016
11:16 - October 16, 2016
11:15 - October 16, 2016

యాదాద్రి : నూతనంగా ఏర్పాటుచేసే మోటకొండూర్‌ మండలంలో చాడ రెవెన్యూ కింద ఉన్న ఏడు గ్రామాలను కలపొద్దని మహిళలు ఆందోళన చేపట్టారు. బుచ్చిరెడ్డిగూడెంలో సెల్ టవర్ ఎక్కి ఐదుగురు మహిళలు ఆందోళన చేపట్టారు. ఆత్మకూరు మండలంలో కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వారితో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వాధికారులతో తాము మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామి, సెల్ టవర్ దిగిరావాలని పోలీసులు సూచిస్తున్నారు. కానీ పోలీసుల విజ్ఞప్తిని వారు తోసిపుచ్చుతున్నారు. మోటకొండూర్‌ను మండల కేంద్రంగా చేస్తూ దూరంగా ఉన్న గ్రామాలను కలిపి అసౌకర్యాల పాలు చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. మోటకొండూర్‌కు ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను కలపకుండా 15 నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాడ, నాంచారిపేట, కదిరేనిగూడెం, కాటపల్లి, కొండాపురం, ముత్తిరెడ్డిగూడెం, చందేపల్లి, సింగారం, చామాపూర్‌ గ్రామాలను కలిపి ప్రజలు మరింత అసౌకర్యాలకు గురయ్యే పరిస్థితి తీసుకొస్తుందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 

కొప్పాకలో ఆక్రమణల తొలగింపు..

విశాఖపట్టణం : అనకాపల్లి (మం) కొప్పాకలో ఆక్రమణల తొలగింపునకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. స్థానికులు అడ్డుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. 

10:59 - October 16, 2016

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమౌతున్నారు. అక్టోబర్ 17వ తేదీ నుండి 2017 మార్చి 12 వరకు పాదయాత్ర చేయనున్నారు. మొత్తంగా 6నెలలు 4వేల కిలోమీటర్ల పాదయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా పాదయాత్రకు సంబంధించిన విషయాలు..ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. గుండెలో స్టంట్ ఉన్నా పాదయాత్ర ఎలా ? ఇందుకు సంబంధించిన జాగ్రత్తలపై ఆయన మాట్లాడారు. దీర్ఘకాలంగా నడవడం..అనేది బాడీకి అలవాటు కావాల్సి ఉంటుందన్నారు. రెండు మూడు నెలల నుండి ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. మానసికంగా ధృఢంగా ఉండడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇళ్లు వదిలి కొన్ని రోజులు ఉండడం తనకు కొత్తేమి కాదన్నారు. తనకు గుండె ఆపరేషన్ జరిగిందని...అయినా ఆటంకం కలగదని భావిస్తున్నట్లు తెలిపారు. యోగా..స్విమ్మింగ్..ఇతరత్రా వ్యాయమాలు చేయడం జరుగుతోందన్నారు. తాను చేసే ప్రతి పనికి ఇంటి వారి మద్దతుంటుందని, ఇంట్లో వారికి కమ్యూనిస్టు భావాలున్నాయని తమ్మినేని పేర్కొన్నారు. 

10:30 - October 16, 2016

విజయవాడ : ఆక్వా మెగా ఫుడ్ ఫ్యాక్టరీ నిర్మాణ విషయంలో జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులు..ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. సీఎం నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నేతలు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజులుగా ఆందోళనలు..
ఆక్వా మెగా ఫుడ్...ఈ ఫ్యాక్టరీ వద్దంటూ గత కొన్ని రోజులుగా స్థానికులు..గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. వీరికి సీపీఎం..ఇతర ప్రజా సంఘాలు సంఘీభావం తెలియచేస్తూ పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమబాట పట్టిన గ్రామాలపై పోలీసుల దమనకాండ, అణచివేత చర్యలు కొనసాగుతున్న విషయం విదితమే. నిరసనలు జరుగుతున్న 30 గ్రామాల్లో కఠిన ఆంక్షలు విధించారు. పెద్దఎత్తున కాలుష్యాన్ని వెదజల్లే గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని సీపీఎం స్పష్టం చేసింది.

స్పందించిన పవన్...
ఈ నేపథ్యంలో ఆక్వా మెగా ఫుడ్ పార్క్ రైతులు సినీ నటుడు, జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీనితో పవన్ ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఎంతో మందికి నష్టం కలిగించే ఇలాంటి ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని, ప్రభుత్వం స్పందించకపోతే కలిసొచ్చే పార్టీలతో తాను శాంతియుత ఉద్యమం చేపడుతానని పవన్ స్పష్టం చేశారు. గ్రామాల్లో మధ్యలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

సంక్షేమ శాఖగా మారిన కార్మిక శాఖ - అచ్చెన్నాయుడు..

విజయవాడ : గతంలో కార్మిక శాఖ అంటే కేసులు..దాడులు అనే పేరు ఉండేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం కార్మిక శాఖ సంక్షేమ శాఖగా మారిందన్నారు. 2.5 కోట్ల మందికి చంద్రన్న బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ మాదిరిగా యూత్ సబ్ ప్లాన్ తీసుకరావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. యూత్ సబ్ ప్లాన్ సంబంధించిన ఫైల్ పై సంతకం చేయడం జరిగిందన్నారు. క్రీడల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 

రెవెన్యూ శాఖ కార్యలయాన్ని ప్రారంభించిన మంత్రి కేఈ..

విజయవాడ : తాత్కాలిక సచివాలయం రెండో బ్లాక్ లో రెవెన్యూ శాఖ కార్యాలయాన్ని మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభించారు. మండవల్లిలో నిర్మించనున్న మెగా ఫుడ్ పార్క్ కు సంబంధించి 600 మంది రైతులకు పరిహారం కింద రూ. 51 కోట్లు విడుదల చేస్తూ మంత్రి కేఈ మొదటి సంతకం చేశారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ఫుడ్ పార్క్ ను నిర్మించడం జరుగుతుందని, వెలగపూడి సచివాలయం నుండి రెవెన్యూ శాఖ కార్యకలాపాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 

వేముల ఘాట్ కు చేరుకున్న తమ్మినేని..

సిద్ధిపేట : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వేముల ఘాట్ కు చేరుకున్నారు. సిద్ధిపేట జిల్లా వేముల ఘాట్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ వ్యతిరేక నిరసన దీక్షలు 134 రోజుకు చేరుకున్నాయి. మల్లన్న సాగర్ రిజర్వాయర్ వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

09:55 - October 16, 2016

'ఇంకొక్కడు' మూవీ హీరో విక్రమ్ ఈ పేరు వింటేనే వెరయిటీ క్యారెక్టర్లు గుర్తుకొస్తాయి. శివపుత్రుడు, అపరిచితుడు, మల్లన్న, ఐ లాంటి సినిమాలతో ఆడియెన్స్‌ని మెప్పించిన ఈ హీరో త్వరలో మరో సరికొత్త రోల్‌కు రెడీ అయిపోతున్నాడని టాక్. రీసెంట్‌గా విక్రమ్ నటించిన ఇంకొక్కడు తమిళంలో హిట్ కొట్టినా టాలీవుడ్‌లో అంతగా సక్సెస్ కాలేదు. అయిన ఈ హీరో మాత్రం తనదైన శైలిలోనే మూవీస్ చేయాలని ప్రణాళిలు వేసుకుంటున్నాడు. విక్రమ్ ప్రస్తుతం సామి మూవీకి సీక్వెల్‌ని ప్లాన్ చేస్తున్నాడు. తన కెరీర్ లోనే ఈ చిత్రం భారీ మాస్ సక్సెస్ గా నిలిచింది. ఈ చిత్రాన్నే తెలుగులో బాలకృష్ణ హీరోగా లక్ష్మీ నరసింహా రీమేక్ చేశారు. త్వరలోనే ఈ సీక్వెల్ కి సంబంధించిన గ్రాండ్ వర్క్ కంప్లీట్ చేసి సెట్స్ పైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

హాలీవుడ్ మూవీ రీమెక్ ?
సామి సీక్వెల్ తరువాత విక్రమ్ హాలీవుడ్ మూవీని రీమేక్ చేస్తాడని కోలీవుడ్ సమాచారం. ఈ ఎడాది హాలీవుడ్ లో రిలీజైన డోంట్ బ్రీత్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ రీమేక్ లో విక్రమ్ నటిస్తే అదిరిపోతుందని కొందరూ నిర్మాతలు ఆయనతో చెప్పారట. ఈ క్రమంలో డోంట్ బ్రీత్ మూవీని చూసిన ఈ తమిళ స్టార్ సైతం మెస్మరైజ్ అయ్యాడట. వెంటనే రైట్స్ తీసుకోమ్మని నిర్మాతలకు చెప్పాడట. రైట్స్ తీసుకున్న వెంటనే ఈ హాలీవుడ్ రీమేక్ పట్టాలెక్కిస్తారని సమాచారం. ఈ లోగా విక్రమ్ సామి సీక్వెల్ ని కంప్లీట్ చేసి ఫ్రీ కావాలనుకుంటున్నాడట.

09:49 - October 16, 2016

సొట్ట బుగ్గల సుందరి 'తాప్సీ' స్లోగా బాలీవుడ్ లో క్లిక్ అయ్యేలా కనిపిస్తోంది. లేటేస్ట్ గా ఈ బ్యూటీ ఖాతాలో మరో సక్సెస్ సీక్వెల్ పడింది. సౌత్ లో సక్సెస్ కాలేకపోయిన ఈ బ్యూటీ బీటౌన్ లో మాత్రం ఛాన్స్ లతో పాటు సక్సెస్ పట్టేస్తోంది. బాలీవుడ్ లో ఈ బ్యూటీ అందుకున్న ఆ సక్సెస్ సీక్వెల్ ఏంటో హావ్ ఏ లుక్. తెలుగు, తమిళ భాషల్లో 'తాప్సీ' 20 సినిమాల వరకు చేసింది. ఇన్ని సినిమాలు చేసిన ఏం లాభం సక్సెస్ మాత్రం ఈ సొట్టబుగ్గల హీరోయిన్ ని వరించలేదు. కనీసం కోలీవుడ్ లో అయిన ఒకటి ఆరా సక్సెస్ లు వచ్చాయి. కానీ తెలుగులోనే ఒక్కటంటే ఒక్క పెద్ద హిట్టు కూడా 'తాప్సీ'కి దక్కలేదు. కానీ బాలీవుడ్ మాత్రం ఈ బ్యూటీ కాలం కలిసొచ్చేలా కనిపిస్తోంది. సౌత్ లో కాలం కలిసిరాకపోవడంతో 'తాప్సీ' బాలీవుడ్ బాటపట్టింది. అక్కడ ఈ బ్యూటీ హీరోయిన్ గా చేసిన 'చస్ మే బదూర్', 'బేబీ' సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇక లేటేస్ట్ గా రిలీజైన 'పింక్' మూవీ అయితే బాలీవుడ్ లో చర్చానీయాంశంగా మారింది.

'పింక్' భారీ విజయం..
'పింక్' సినిమా భారీ విజయం సాధించడంతో పాటు ఈ మూవీలో 'తాప్సీ' నటనకు మంచి పేరు వచ్చింది. దీంతో 'తాప్సీ'కి వరుస ఛాన్స్ లు వస్తున్నాయి.ప్రస్తుతం 'తాప్సీ' బాలీవుడ్ లో 'రానా' హీరోగా రూపొందుతున్న 'ఘాజీ' తో పాటు 'థడ్కా' అనే మూవీస్ చేస్తోంది. వీటితో పాటు లేటేస్ట్ 'నామ్ షబానా' సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ 'తాప్సీ' నటించిన బేబీ కి సీక్వెల్ గా రూపొందుతుండడం విశేషం. సినిమాకి ఇది సీక్వెల్. ఈ మూవీ స్టోరీ మొత్తం 'తాప్సీ' చుట్టే తిరుగుతుందని టాక్. ఈ మూవీ సక్సెస్ అయితే కనుక బాలీవుడ్ లో ఈ సొట్టబుగ్గల సుందరి ఫేట్ మారినట్లే అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తాప్సీ బాలీవుడ్ లో నెమ్మదిగా నిలదొక్కుకునేలా కనిపిస్తోంది.

09:34 - October 16, 2016

ఇరాక్ : రాజధాని బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. షియా ముస్లింలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 31 మంది మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. షియా మతస్తులు ఒక టెంట్ కింద మత సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఆత్మాహుతి దళ సభ్యుడు టెంట్‌లోకి చొచ్చుకొచ్చి ఈ దాడికి పాల్పడ్డాడు. 

09:33 - October 16, 2016

ఉత్తర్ ప్రదేశ్ : వారణాసిలో తొక్కిసలాట జరిగింది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో 24 మంది మృతి చెందారు. మృతుల్లో 15 మంది మహిళలు ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్లోని చందౌలీ-వారణాసి జిల్లా సరిహద్దులో బాబా జై గురుదేవ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం పెను విషాదాన్నే నింపింది. సభ కోసం వేలాదిగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో 24 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గంగానది ఒడ్డున ఉన్న డోమ్రీ గ్రామంలో బాబా జై గురుదేవ్ జ్ఞాపకార్థం రెండు రోజుల పాటు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు వారణాసిలోని పీలీ కోఠీ నుంచి డోమ్రీ గ్రామానికి భారీగా భక్తులు వెళ్తున్నారు. రాజ్ ఘాట్ వంతెన వద్ద ఉన్నట్టుండి తొక్కిసలాట జరిగిందని జిల్లా అధికారులు తెలిపారు.

4వేల మందికి అనుమతి..
4 వేల మందికి అనుమతి ఉన్న బాబా జై గురుదేవ్ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరవ్వడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. తొక్కిసలాట జరిగిన వెంటనే బాధితులకు వైద్య సాయం అందడంలో కూడా బాగా ఆలస్యమైంది. దీంతో మరణాల సంఖ్య పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండానే సభ ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. వారణాసి విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వారణాసిలో జరిగిన తొక్కిసలాటపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రధాని మోడీ 2 లక్షలు ప్రకటించారు.

09:10 - October 16, 2016

చిత్తూరు : పోలవరం డిజైన్లు..అనుమతిపత్రాలను శ్రీవారి పాదాల చెంత ఉంచారు. ఆదివారం ఉదయం ఏపీ మంత్రి దేవినేని ఉమ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మీడియాతో మాట్లాడారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్టును 2018 సంవత్సరం నాటికి పూర్తి చేస్తామని దేవినేని మరోమారు స్పష్టం చేశారు. 

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి దేవినేని...

చిత్తూరు : తిరుమల శ్రీవారిని మంత్రి దేవినేని ఉమ దర్శించుకున్నారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్లను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మీడియాతో మాట్లాడారు. పోలవరం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 

08:58 - October 16, 2016
08:35 - October 16, 2016
08:34 - October 16, 2016

వనపర్తి : జిల్లాల కేంద్రంపై సేల్ ట్యాక్స్ అధికారుల కన్ను పడింది. జిల్లా కేంద్రంలోని ఓ కిరాణా షాపు, ఫ్యాన్సీ స్టోర్స్ పై అధికారులు తనిఖీలు చేపట్టారు. స్టాక్స్ కు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. మీడియాను కూడా లోనికి అనుమతించలేదు. ఈ సమాచారం తెలుసుకున్న ఇతర దుకాణ యజమానులు తమ షాపులను మూసివేశారు. 8గంటలకు పైగా ఈ సోదాలు జరిగాయి. సోదాలు జరిగిన అనంతరం మీడియాకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీనితో అసలు ఏం జరిగుతుందో జనాలకు అర్థం కాలేదు. 

08:30 - October 16, 2016

అమెరికా : హైదరాబాద్ లో స్టార్టప్ లను ప్రపంచ దేశాలకు అనుసంధానం చేసే టి.బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ సిలికాన్ వ్యాలీలో ప్రారంభించారు. ఉబెర్, టై సిలికాన్ వ్యాలతో కలిసి టి.బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని పది స్టార్టప్ నగరాల్లో హైదరాబాద్ ను ఒకటిగా నిలపాలన్నదే తమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం తెలంగాణ అని ఉబెర్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు అభివర్ణించారు. స్టార్టప్ లకు హైదరాబాద్ అత్యంత అనుకూలంగా ఉందన్నారు. 

పోలీసు అమరవీరుల సేవలు మరిచిపోలేనివి - గవర్నర్..

హైదరాబాద్ : పోలీసు అమరవీరుల సేవలు మరిచిపోలేనివని, దేశ రక్షణలో పోలీసుల పాత్ర కీలకమైందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఏర్పాటు చేసిన జాతీయస్థాయి పోలీసు అమరవీరుల స్మారక పరుగును ఆయన ప్రారంభించారు. 

07:44 - October 16, 2016

స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి 'జయమ్మునిశ్చయమ్ము' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. శ్రీనివాస్ రెడ్డితో  ధనుంజయ్ ముచ్చటించాడు. శ్రీనివాస్ రెడ్డి లవ్ స్టోరీ గురించి కొన్ని విషయాలు టెన్ టివి అడిగింది. మరి ధనుంజయ్ రెడ్డి..శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియోలో చూడండి. 

07:34 - October 16, 2016

పశ్చిమగోదావరి : జిల్లా ద్వారకా తిరుమల అశ్వయుజ మాస తిరుకళ్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయ అర్చకులు వైఖానస అగమానుసారం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ తిరుకళ్యాణ మహోత్సవమును కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ఆలయ చైర్మన్ ఎస్.వి.సుధాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణం చూసేందుకు ఒక్క పశ్చిగోదావరి జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. కళ్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల వెండి గరుడ వాహనంపై ద్వారకా తిరుమల గ్రామ పుర వీధులలో ఊరేగారు.

రైల్వే శాఖలో భారీగా రిక్రూట్ మెంట్..

హైదరాబాద్ : రైల్వే శాఖలో భారీగా రిక్రూట్ మెంట్ జరగనుంది. 23,801 ఉద్యోగాలకు రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ పరిధిలో 3,210 పోస్టులు భర్తీ కానున్నాయి. ఐటీఐ, డిప్లామా, బీటెక్ విద్యార్హతలుగా నిర్ణయించారు. డిసెంబర్ 1 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

నెట్ నోటిఫికేషన్ విడుదల..

హైదరాబాద్ : నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్ (నెట్) నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుండి నవంబర్ 16 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరి 22న నెట్ పరీక్ష జరగనుంది. 

శ్రీవారి చెంత పోలవరం డిజైన్లు..

చిత్తూరు : నేడు శ్రీవారి పాదాల చెంత పోలవరం డిజైన్లను ఉంచనున్నారు. డిజైన్లను శ్రీవారి ముందుంచి మంత్రి దేవినేని ఆశీర్వాదం తీసుకోనున్నారు. 

నేడు జోడె ఘాట్ కు సీఎం కేసీఆర్..

ఆసిఫాబాద్ : నేడు జోడె ఘాట్ కు సీఎం కేసీఆర్ రానున్నారు. కొమరం భీం స్మారకస్థూపం, మ్యూజియాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. 

సూర్యాపేటలో పర్యటించనున్న మంత్రి జగదీష్ రెడ్డి...

సూర్యాపేట : నేడు జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించనున్నారు. పెన్ పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. కోదాడలో మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. 

కార్యాలయాలను ప్రారంభించనున్న కేఈ..అచ్చెన్నాయుడు..

విజయవాడ : నేడు సచివాలయంలో తమ కార్యాలయాలను మంత్రి కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. 

పోలీస్ మారథాన్ ప్రారంభం..

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో పోలీస్ మారథాన్ ను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. 

06:55 - October 16, 2016
06:40 - October 16, 2016

హైద‌రాబాద్ : నగర అభివృద్దిపై బ‌ల్దియా దృష్టి సారించింది. న‌గ‌రంలో పేరుకుపోయిన స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం అధికారులు మేదోమ‌ధనం నిర్వహించారు. స్వచ్ఛ భార‌త్ కార్యక్రమం నాలాల ఆక్రమ‌ణ‌లు, ఆదాయ వ‌న‌రుల పెంపు., హ‌రిత‌హారం కొన‌సాగింపు వీధి వ్యాపారుల ర‌క్షణ‌తో పాటు న‌గ‌రంలోని రోడ్ల దుస్థితిపై కూలంకషంగా చర్చించారు. దేశ‌ వ్యాప్తంగా 2017లో జ‌రిగే స్వచ్ఛ స‌ర్వేక్షన్ స‌ర్వేలో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని టాప్ టెన్ ర్యాంకింగ్ లో నిలిచేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌నర్ జనార్దన్ రెడ్డి అధికారులను అదేశించారు. గ‌త ఏడాది నిర్వహించిన స‌ర్వేలో హైదరాబాద్ న‌గ‌రానికి 19వ స్థానం ద‌క్కిందన్నారు. గత సంవ‌త్సరం 75న‌గ‌రాల‌ను మాత్రమే స‌ర్వే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే, ఈ ఏడాది 500న‌గ‌రాల‌ను పరిగణలోకి తీసుకొని స‌ర్వే చేయనున్నారని తెలిపారు.

 ఆదాయంపై దృష్టిసారించిన బల్దియా..
చిన్న చిన్న న‌గ‌రాల‌తో కూడా హైద‌రాబాద్ పోటీప‌డాల్సి వ‌స్తుంది కాబ‌ట్టి శానిటేష‌న్ అధికారుల‌తో పాటు అన్ని విభాగాల అధికారులు పారిశుద్థ్యం కోసం చిత్తశుద్దితో ప‌నిచేయాల‌ని అధికారుల‌కు హిత‌బోధ చేశారు. ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో డ‌బుల్ డస్ట్ బిన్స్ వినియోగంపై శ్రద్థ పెట్టాల‌ని, క‌మ్యూనిటి టాయిలెట్స్ నిర్మాణం, బ‌హిరంగ మ‌ల మూత్ర విస‌ర్జన నివార‌ణ‌కు క‌ట్టు దిట్టమైన చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. మరో వైపు గ్రేట‌ర్ ఖ‌జానా ఖాళీ అయినందున ఆదాయంపై బ‌ల్దియా దృష్టి సారించింది. ఇప్పటి కే గ‌త ఏడాది కన్నా 150కోట్ల రూపాయల ఆస్తి ప‌న్ను అధికంగా వ‌సూలు చేసిన అధికారులు, ట్రేడ్ ఫీజులో కూడా 7 కోట్ల రూపాయలు అద‌నంగా వ‌సూలు చేశారు. ట్రేడ్ లైసెన్స్ జారీలో పూర్తిస్థాయి మార్పులు చెయ్యాల‌ని నిర్ణయించారు.

ఆక్రమ నిర్మాణాల కూల్చివేతలు..
ఇప్పటికే న‌గ‌రంలో 150ట్రేడ్స్ కూ మాత్రమే ఫీజు వ‌సూలు చేస్తున్న బ‌ల్దియా దానిని 600ట్రేడ్స్ కు పెంచాల‌ని మూసాయిదాను రెడీ చేసింది. ఇక న‌గ‌రంలో నాలాలు చెరువుల్లో ఉన్న ఆక్రమనిర్మాణాల కూల్చివేత‌లో వ‌చ్చిన ఇబ్బందులను అధిగమించేందుకు బ‌ల్దియా చేప‌ట్టిన ఉమ్మడి స‌ర్వేను వేగంగా పూర్తిచెయ్యాల‌ని నిర్ణయించింది. 390కిలో మీట‌ర్ల మేర ఉన్న నాలాల స‌ర్వేలో ఇప్పటి వ‌ర‌కు 60కిలో మీట‌ర్లు పూర్తి అయ్యింది. దీని ద్వారా 2400 అక్రమ క‌ట్టడాలు గుర్తించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక రోడ్ల దుస్థితిపై కూడా జీహెచ్ఎఎంసీ సమావేశంలో ప్రత్యేకంగా ఫోక‌స్ చేసింది. ఇప్పటికే టెండ‌ర్లు పూర్తయిన వాటికి త‌క్షణమే ప‌నుల‌ను ప్రారంభించాల‌ని నిర్ణయించారు. 

06:35 - October 16, 2016
06:32 - October 16, 2016

హైదరాబాద్ : కొంద‌రికేమో సంబురం .. మ‌రికొంద‌రికేమో సంక‌టం ఇప్పుడిదే కాంగ్రెస్‌లో డీసీసీల ప‌రిస్థితి. కొత్త జిల్లాలు అందుబాటులోకి రావ‌డంతో.. ప‌ద‌వులొస్తాయ‌ని ఓ వైపు ఆశావాహులు ఖుషీ అవుతుంటే.. మరోవైపు ప్రస్తుతం ప‌దవిలో ఉన్నవారు మాత్రం తమ పదవికి ఎక్కడ ఎసరెస్తుందోనని భయపడుతున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలు అందుబాటులోకి రావ‌డంతో కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి నెల‌కొంది. ఇప్పటికే జిల్లాలను ఒంటిచేతితో చ‌క్రం తిప్పిన నేత‌లు.. జిల్లాల విభ‌జ‌న‌తో ఓ మూల‌కు ప‌రిమిత‌మైపోయారు. ఇప్పుడు డీసీసీల అంశం తెరపైకి రావడంతో ఏం చేయాలో తేలిక తలలు పట్టుకుంటున్నారు. మొన్నటి వ‌ర‌కు తెలంగాణలో ఉన్న ప‌ది జిల్లాల‌కు గాను 8 జిల్లాల‌కే డీసీసీలు కొన‌సాగుతున్నారు. ఇప్పుడు కొత్తగా మ‌రో 21 జిల్లాలు అందుబాటులోకి రావ‌డంతో.. అన్ని జిల్లాల‌కు క‌మీటీల‌ను నియ‌మించే ప‌నిలో ప‌డింది కాంగ్రెస్ పార్టీ. దీనిపై ఇప్పటికే కసరత్తును కూడా ప్రారంభించింది. దీంతో కొత్త క‌మీటీలు రానుండ‌టంతో ఆశావాహుల్లో ఆనందం వ్యక్తమ‌వుతోంది.

తప్పనిసరిగా మారిన డీసీసీల నియామకం..
ఇదిలావుంటే.. ప్రస్తుతం డీసీసీలుగా ఉన్న నేత‌లకు ఈ ప‌రిణామం కాస్త ఇబ్బందిక‌రంగా మారింది. కొన్ని రోజుల వ‌ర‌కు వీరినే కొన‌సాగిద్దామ‌ని పీసీసీ ఓ ద‌శలో భావించింది. అయితే ప‌క్క జిల్లా నేత‌లు త‌మ‌పై పెత్తనం చేయ‌డ‌మేంట‌ని ప‌లువురు పీసీసీకి ఫిర్యాదులు చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో ఇక డీసీసీల నియామ‌కం త‌ప్పనిస‌రైంది. మొత్తానికి గులాబి బాస్ తెచ్చిన కొత్త జిల్లాల అంశం కాంగ్రెస్ పార్టీకి కొత్త స‌వాళ్లను తెచ్చి పెడుతుంది. 

06:29 - October 16, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమైంది. హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, రోడ్ల అధ్వాన్న స్థితిపై ఈనెల 19 సాయంత్రం 6 గంటలకు శేరిలింగంపల్లిలో నిరసన కార్యక్రమం చేపడతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. ఒకేసారి రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న భూపాలపల్లి జిల్లాలో రైతు గర్జన సభ నిర్వహిస్తామన్నారు. 21న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని నెలరోజుల పాటు అన్ని కాలేజీల్లో సంతకాల సేకరణ చేపడతామన్నారు. 

06:27 - October 16, 2016

హైదరాబాద్ : తెలంగాణలో నకిలీ విత్తనాలు రైతుల కొంప ముంచుతున్నాయి... లక్షల ఎకరాల్లో పంట నష్టంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు టీ-టీడీపీ రైతు దీక్ష చేపట్టేందుకు రెడీ అవుతోంది. ప్రభుత్వ విధానాలతో తెలంగాణ నకిలీ విత్తన భాండగారంగా మారుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మారుస్తామంటూ ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన ప్రకటనలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నకిలి విత్తనాలతో చేతికందాల్సిన పంట నష్టపోవటంతో... రైతులు దిగాలు చెందుతున్నారని విమర్శిస్తున్నాయి. నకిలీ విత్తనాలు అందజేసిన కావేరి సీడ్స్, రాశి సీడ్స్, నూజివీడు సీడ్స్ లతోపాటు... ఎనిమిది విత్తన కంపెనీలకు వ్యవసాయ శాఖ నోటీసులు కూడా ఇచ్చింది. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ వ్యవసాయశాఖ ఆ నోటిసులలో పేర్కొంది.

దీక్ష చేస్తానన్న రేవంత్..
ఓ వైపు నకిలి విత్తనాలు తయారు చేసిన కంపెనీలకు నోటీసులిస్తున్న నేపథ్యంలోనే, వ్యవసాయశాఖ కమిషనర్ ప్రియదర్శినిని సెలవుపై పంపటాన్ని టీ-టీడీపీ తప్పుపడుతోంది. విత్తన కంపెనీల్లో టీఆర్ఎస్ కు అనుకూలమైన వాళ్ళు వుండటంతోనే, ఆ విత్తన కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం నుండి 812 కోట్ల రూపాయలు నిధులు విడుదలైనా... ఇప్పటి వరకు ఖరీఫ్ లో పంట నష్టపోయిన రైతులకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు. మిర్చి రైతులకు ఎకరాకు 40వేలు, పత్తి, సోయాబీన్ రైతులకు ఎకరాకు 30వేల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై పదిహేను రోజుల్లో ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకుంటే రైతు దీక్ష నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

06:25 - October 16, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పాలనా వ్యవస్థపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రాలన్నీ త్వరలోనే పెద్ద పట్టణాలు, నగరాలుగా అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ప్రతి జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని చెప్పారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలన్నారు. హైదరాబాద్‌లా ఇతర పట్టణాలు కిక్కిరిసిపోకుండా విధాన రూపకల్పన చేయాలని ఆదేశించారు. హెచ్‌ఎండీఏ, కుడా తరహాలో ప్రతీ జిల్లా కేంద్రానికి పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పట్టణంలోనే కాకుండా పట్టణానికి 10 కి.మీ. పరిధిలో లే అవుట్లు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్‌లో పెరిగే జనాభాను అంచనా వేసి పట్టణాలు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అత్యంత ఉత్సాహంతో పని చేస్తున్నారని తెలిపారు. ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక వనరులను గుర్తించి వాటిని ఉపయోగంలోకి తేవాలని సూచించారు.

రేపు పంట కాలనీలపై రైతులకు అవగాహన సదస్సు..

రంగారెడ్డి : జిల్లా యాచారం మండలం గన్ గల్ గ్రామంలో సోమవారం రైతులకు పంట కాలనీలపై అవగాహన సదస్సు జరగనుంది. దీనికి మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలు హాజరు కానున్నారు. 

నేటి నుండి డీఈవోల సమావేశం..

హైదరాబాద్ : కొత్త జిల్లాలో తక్షణమే 31 మంది జిల్లా విద్యాధికారుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. పాఠశాలల పర్యవేక్షణ, పరిపాలన విధానంపై ఈనెల 16 నుండి వరుసగా మూడు రోజుల పాటు 31 మంది డీఈవోలకు అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. 

నేడు రవీంద్రభారతిలో వాల్మీకి జయంతి ఉత్సవాలు..

హైదరాబాద్ : ఆదికవి, రామాయణ గ్రంథ రచయిత మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

 

కొత్త సచివాలయానికి రూ. 350 కోట్ల ప్రతిపాదనలు..

హైదరాబాద్ : నగరంలో నిర్మించబోతున్న రాష్ట్ర కొత్త సచివాలయ విషయంలో కీలక అడుగు పడింది. సుమారు 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోయే సచివాలయానికి రూ. 350 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ అండ్ బి శాఖ తయారు చేసిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సోమవారం ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. 

సదర్ ఘాట్ ప్రాజెక్టులో బాలిక గల్లంతు..

నిర్మల్ : జిల్లాలోని సదర్ ఘాట్ ప్రాజెక్టుకు విహార యాత్రకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. నీటి ఉధృతికి బాలిక కొట్టుకపోయింది. గజఈతగాళ్లు బాలిక కోసం గాలింపు చేపట్టారు. 

Don't Miss