Activities calendar

17 October 2016

21:51 - October 17, 2016

రాజస్థాన్‌ : మాజీ సీఎం అశోక్ కు తృటిలో ప్రమాదం తప్పింది. మాజీ సీఎం ఆశోక్‌ పాల్గొన్న సభలోని స్టేడియం ఒక్కసారిగా కుప్ప కూలింది. అంతకుముందే ఆశోక్‌ ప్రసంగం ముగిసి పోయి ఆయన కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. పరిమితికి మించి స్టేజ్‌ పైకి ఎక్కడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. 

21:50 - October 17, 2016

గోవా : ఎన్ఎస్‌జీలో స‌భ్యత్వం కోసం భార‌త్ చేస్తున్న ప్రయ‌త్నాల‌కు తమ దేశం మద్దతు ఇస్తుందని బ్రెజిల్‌ అధ్యక్షుడు మైకేల్‌ టెమెర్‌ స్పష్టం చేశారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న పోరాటానికి పూర్తిగా సహకరిస్తామని బ్రెజిల్‌ పేర్కొనడాన్ని ప్రధాని మోది ప్రశంసించారు. గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్‌ అధ్యక్షుడు మైకేల్‌ టెమెర్‌తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల నేతల స‌మ‌క్షంలో అధికారులు ప‌లు ఒప్పందాలను మార్చుకున్నారు. మాద‌క ద్రవ్యాల నియంత్రణ‌, వ్యవ‌సాయ ప‌రిశోధ‌న‌, సైబ‌ర్ సెక్యూర్టీ లాంటి అంశాల‌పై బ్రెజిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రధాని తెలిపారు. బ్రెజిల్‌ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని మోది ఆహ్వానించారు. గోవా వేదికగా జరిగిన బ్రిక్స్‌ సమావేశాలకు భారత్‌తో పాటు బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. మోదీ ఇప్పటికే చైనా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 

21:47 - October 17, 2016

హైదరాబాద్ : మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఎమ్మెల్యేగా లబ్ది పొందిన జీతభత్యాలను తిరిగి చెల్లించాలని సంచలన తీర్పు ఇచ్చింది. 1999లో ఎస్టీలకు కేటాయించిన పార్వతీపురం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.

మాజీ మంత్రి శత్రుచర్లకు హైకోర్టులో చుక్కెదురు
మాజీ మంత్రి, టీడీపీ నేత శత్రుచర్ల విజయ రామరాజుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేగా ఆయన పొందిన మొత్తం వేతనాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పదవీకాలం ఇప్పటికే పూర్తయినా కూడా ఆ వేతనాన్ని ఆయన తిరిగి ఇవ్వాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
శత్రుచర్ల విజయరామరాజు 1999 నుంచి 2004 వరకు శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యేగా శత్రుచర్ల ఉండేవారు. క్షత్రియుడైన విజయరామరాజు ఎస్టీ కోటాలో ఎన్నికల్లో పోటీ చేశారని నిమ్మక జయరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లినా విజయరామరాజు క్షత్రియుడేనని, అందువల్ల ఎస్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తగదని, ఆయన ఎన్నిక చెల్లదని తేల్చారు. ఎమ్మెల్యేగా శత్రుచర్ల ఎన్నిక సరికానప్పుడు.. ఆయన పొందిన వేతనం మాట ఏంటని మరో పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. దీని విచారణ సందర్భంగా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తప్పుడు ధ్రువపత్రాలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వం నుంచి పొందిన జీతభత్యాల మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

తీర్పు దేశ రాజకీయాల్లో సంచలనం
శత్రుచర్ల విజయరామరాజు కేసులో.. న్యాయస్థానం తీర్పు దేశ రాజకీయాల్లో సంచలనాన్ని కలిగిస్తోంది. చాలామంది ప్రజాప్రతినిధులు ఇలా కులం విషయంలో తప్పుడు వివరాలను అఫిడవిట్‌లో సమర్పిస్తున్నారని కోర్టులలో పిటిషన్లు దాఖలవుతున్న నేపథ్యంలో.. ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది.

21:42 - October 17, 2016

మెదక్ : పుల్కల్ మండలం సరాఫ్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్విఫ్ట్ కారు, లారీ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మద్యం సేవించి వాహనాలు నడపటంతో ప్రమాదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 

21:40 - October 17, 2016

రంగారెడ్డి : సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ది ఎజెండాతో తెలంగాణలో మహజన పాదయాత్ర ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌ ఈ పాదయాత్రను ప్రారంభించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని నేతృత్వంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి వామపక్షాల నేతలు, ప్రజాసంఘాల నాయకులతో పాటు భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

పాదయాత్రను ప్రారంభించిన ప్రకాష్ అంబేద్కర్
సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా మహాజన పాదయాత్ర ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, ప్రజల సమక్షంలో అంబేద్కర్‌ మనవడు డాక్టర్‌ ప్రకాష్‌ అంబేద్కర్‌ మహజన పాదయాత్రను ప్రారంభించారు. తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగనున్న ఈ పాదయాత్ర కార్యక్రమానికి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పలువురు ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

చిన్న చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి : ప్రకాశ్ అంబేద్కర్
దేశం అభివృద్ధి చెందాలంటే చిన్న చిన్న రాష్ట్రాల వల్లే సాధ్యమని.. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బలపరిచామని అంబేడ్కర్ మనవడు ప్రకాష్‌ అంబేడ్కర్ అన్నారు. రాష్ట్రంలో 85శాతం నదీ జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని.. వాటిని ఒడిసిపట్టుకునేందుకు చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మించాలని.. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం సీపీఎం చేపట్టిన పాదయాత్రకు తమ మద్దతు ఉంటుందని ప్రకాష్ అంబేడ్కర్ తెలిపారు.

సమగ్ర అభివృద్ధికోసమే పాదయాత్ర : రాఘవులు
సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికోసమే పాదయాత్ర చేపట్టామని... సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు.... బంగారు తెలంగాణ... అగ్ర కులాల వారికా? వెనక బడిన కులాలవారికా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. గిరిజనులు, మైనార్టీలు, దళితులు బాగుపడకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

ప్రజా చైతన్యం కోసమే పాదయాత్ర : తమ్మినేని
సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాజన పాదయాత్ర చేపట్టడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్గించడానికి.. రాష్ట్రంలో 93 శాతం ఉన్న వెనకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఈ పాదయాత్రని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఇచ్చే ఎంగిలి మెతుకులు కోసం ప్రజలు ఎవరు ఎదురుచూడడం లేదని.. వారి హక్కుల కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలర్పించింది కమ్యూనిస్టులే : మధు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలు వదిలిపెట్టింది కమ్యూనిస్టులేనని.. తెలంగాణ కమ్యూనిస్టుల గడ్డ అని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. తెలంగాణలో దళితులు, గిరిజనులకు బతికే అవకాశం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గిరిజనుల భూముల కోసం సీఎం కేసీఆర్ అటవీశాఖ అధికారులకు తుపాకీలు అప్పజెప్పడం దారుణమని మండిపడ్డారు.

పేదలందరికీ న్యాయం జరగాలి : చాడ
తెలంగాణలో పేదలందరికీ న్యాయం జరగాలని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.. మహాపాదయాత్ర చేస్తున్న సీపీఎం పై కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.. సూర్యుడిపై ఉమ్మివేయాలని ప్రయత్నిస్తే అదివారిపైనే పడుతుందని అన్నారు. సీపీఎం ప్రజాసమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తుచేశారు.

కామ్రేడ్లతో ఎరుపెక్కిన ఇబ్రహీంపట్నం
సీపీఎం మహాజన పాదయాత్ర సందర్భంగా ఇబ్రహీంపట్నం మొత్తం కామ్రేడ్లతో ఎరుపెక్కింది. భారీ ఎత్తున ప్రజలు, వామపక్షాల నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో ఎక్కడ చూసినా ఎర్రజెండాలే దర్శనమిచ్చాయి. 

21:27 - October 17, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సచివాలయంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో భేటి అయ్యాయి. మూడురోజుల్లో బకాయిల్లో 300కోట్ల రూపాయల్ని విడుదలకు ప్రభుత్వం అంగీకరించింది. మరో 300కోట్లు ఈ నెలాఖారులోగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. చర్చలు సఫలీకృతం అవడంతో ఈనెల 24నుంచి జరగాల్సిన డిగ్రి సప్లిమెంటరీకి సహకరించేందుకు సమ్మతించాయి. 

21:25 - October 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్ణీత గడువులోగా మిషన్‌ భగీరథ నీరు ప్రజలకు అందేలా పనిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పైప్‌లైన్‌ నిర్మాణం, ఇంటింటికీ నల్లా బిగించే పనులు ముఖ్యమైనవని సీఎం పేర్కొన్నారు. మిషన్‌ భగీరథను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.22 వేల కోట్ల రుణానికి అంగీకారం కుదిరిందని.. అవసరమైతే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. 

మరో ఆత్మాహుతి దాడి..10మంది బలి..

ఇరాక్ : రెండు రోజుల క్రితం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 50 మంది మృతి చెందిన ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నగరం మ‌రోసారి ర‌క్త‌మోడింది. ఆర్మీ చెక్‌పోస్ట్ ద‌గ్గ‌ర‌ ఉగ్ర‌వాదులు కారు బాంబుతో ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో పది మంది మృతి చెందారు. మరో 17 మంది గాయాలపాలైనట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. 

20:26 - October 17, 2016

ఆంధ్రలో దోమలుండొద్దంటన్న సీఎం చంద్రబాబు..ఆంధ్రల సీఎం చంద్రబాబు దోమలపై దండయాత్ర ప్రకటించిండు..గందుకనే ఊర్లల్ల దోమల బ్యాట్ ల పంపిణీ చేసిండు....తెలంగాణ రాష్ట్రంల నాలుగు వేల కిలో మీటర్ల సీపీఎం మహాజన పాదయాత్ర.. కాంగ్రెస్ నేతలు గుత్తా సుఖేందర్ కోమటిరెడ్డి మాటల యుద్ధాలు..10 ఎకరాల్లో 150 గదులతో సీఎం కేసీఆర్ ఇల్లు కట్టుకుండ్రంట! నవంబర్ 24న కేసీఆర్ నూతన గృహ ప్రవేశం చేస్తుండంట..ఆధిపత్యం కోసం ఆట సంఘం నేతల గలాటాలు..

భారీ పేలుడు..పలువురు గల్లంతు!..

బెర్లిన్: జర్మనీ లుద్విగ్‌షెఫెన్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిందని అధికారులు తెలిపారు. ఘటనలో పలువురు గల్లంతయ్యారు. అనేకమంది గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు అనంతరం చెలరేగిన మంటలను ఆర్పేందుకు పెద్ద సంఖ్యలో ఫైరింజన్లను ఘటనా స్థలానికి తరలించారు. పేలుడుకు గల కారణాలపై విచారణకు ఆదేశించారు.

19:59 - October 17, 2016

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ – టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఇజం సినిమా ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘ఇజం’ చిత్రంలో హీరో నందమూరి కల్యాణ్ రామ్ ‘సిక్స్ ప్యాక్’లో కనిపించనున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఇజం సినిమా స్టోరీ, హైలెట్స్ ఇండ‌స్ట్రీలో సినిమాకు పాజిటివ్ టాక్‌ను పెంచేశాయి. ఈ నేపథ్యంలో టెన్ టీవీ విలక్షణ నటుడు..ఒకప్పటి హీరో..ఇప్పటి వినల్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు..ఇజం సినిమా హీరో కళ్యాణ్ రామ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూని చేసింది. మరి వీరు ఇజయం సినిమా గురించి ఏఏ విశేషాలు తెలిపారో వారి మాటల్లోనే తెలుసుకుందాం...ఇజం సినిమా జ‌ర్న‌లిజం బ్యాగ్రౌండ్‌తో సాగుతుంద‌ని హీరో కళ్యాణ్ రామ్ తెలిపారు. ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ వెరీ ప‌వ‌ర్ ఫుల్‌ జ‌ర్న‌లిస్టుగా మంచి షార్ప్‌గా కనిపించి అభిమానులను అలరించనున్నాడు. ఇక స్టోరీ విష‌యానికి వ‌స్తే అమెరికాను కుదిపేసిన ప‌నామా లీక్స్ , వికీ లీక్స్ వంటి సంచ‌ల‌న క‌థ‌నాన్ని పూరి ఎంచుకున్నాడనే విషయాన్ని కళ్యాణ్ కొట్టిపడేశాడు. ఈ లీక్స్ ఏవీ రాకముందే స్టోరీని సెలక్ట్ చేసుకున్నానని కళ్యాణ్ రామ్ టెన్ టీవీ ఇంటర్వ్యూలో తెలిపాడు. 

19:52 - October 17, 2016

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని బృందం.. ఒకటి కాదు .. రెండు కాదు.. ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తోంది. ఇది ఇప్పటివరకూ జరిగిన పాదయాత్రల్లో హైలెట్‌గా నిలవబోతోంది. ఇంతకీ ఇప్పటివరకు తెలుగు నేలపై ఎంతమంది..? ఎన్ని కిలోమీటర్లు చొప్పున పాదయాత్రలు చేశారు..? వాచ్‌ దిస్‌ స్టోరీ.

సీపీఎం మహాజన పాదయాత్ర..
పాదయాత్రలు.. రాజకీయ నేతలను ప్రజలకు చేరువ చేసే అస్త్రాలు. స్వాతంత్రోద్యమ కాలంలో వీటి పాత్ర అంతా ఇంతా కాదు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఓ మైలురాయిలా నిలిచిన పాదయాత్రలూ ఉన్నాయి. ఒక ప్రభుత్వాన్ని దించి..మరో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డ పాదయాత్రలు కూడా ఉన్నాయి. అన్ని యాత్రలు అధికారం కోసమే కావని నిరూపించిన పాదయాత్ర.. ఖమ్మంలో నిర్వహించిన మరో మహాప్రస్థానం యాత్ర. అదే స్ఫూర్తితో సీపీఎం ఇప్పుడు మహాజన పాదయాత్రకు శ్రీకారం చుట్టింది.

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర..
తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో కోటి కష్టాలతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్న తరుణంలో.. ప్రపంచ బ్యాంకు మోజులో పడి ప్రజలను పట్టించుకోకుండా..కేవలం ప్రపంచ బ్యాంకు విధానాలకు ప్రయోగశాలగా రాష్ట్రాన్ని మార్చిన సందర్భంలో.. నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి రాష్ట్రంలో ఒక కొత్త ఊపును తెచ్చింది. మహా ప్రస్థానం పేరుతో 2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఆయన మొత్తం 1460 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అప్పటివరకు జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ నూతనోత్సాహం నింపుకుని.. ప్రజల అండదండలతో 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఈ పాదయాత్ర రాజశేఖర్‌రెడ్డిని ప్రజా నాయకుడిగా మార్చటంతో పాటు.. రెండు దఫాలు ముఖ్యమంత్రిని చేసింది.

సీఎం చంద్రబాబు నాయుడు పాదయాత్ర
పోగట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లు.. ఏ ప్రజలకైతే దూరమయ్యారో అదే ప్రజలకు చేరువ కావాలని నిర్ణయించుకున్న చంద్రబాబు నాయుడు తిరిగి రాజశేఖర్‌రెడ్డి ప్రొఫార్మానే కాపీ చేశారు ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను గద్దెనెక్కిస్తే.. తర్వాత చంద్రబాబు నాయుడు ...వస్తున్నా మీకోసం... అంటూ బయలు దేరారు. ఈ పాదయాత్రను 2012 అక్టోబర్‌ 2 న అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభించారు చంద్రబాబు. మధ్య మధ్యలో అనుకోని ఆటంకాలు ఎదురై కొంత గ్యాప్‌ ఇచ్చినా... చివరికి ఈ నడక ఆయన్ను నేరుగా అసెంబ్లీకి చేర్చింది. ఈ రెండు పాదయాత్రలు అధికారమే పరమావధిగా సాగాయి.

అనంతపురంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ
ఇక ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా గతంలో పాదయాత్ర చేశారు. అనంతపురం జిల్లాలో పది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్‌గాంధీ అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. ఇదే స‌మ‌యంలో ప్రజాసమస్యల కోసం జరిగిన యాత్రలూ ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 2003లో సీపీఎం నాయకత్వంలో తమ్మినేని వీరభద్రం చేపట్టిన మరో ప్రజాప్రస్థానం జిల్లాలో ఓ రికార్డు. 2600 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో జిల్లాలోని అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. వీటితో పాటు జిల్లాల వారిగా అనేక అంశాల మీద వామపక్షాలు చేపట్టిన యాత్రల ద్వారా మరుగున పడిన అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూతురు షర్మిల పాదయాత్ర
అసెంబ్లీ ఎన్నకలకంటే ముందు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూతురు షర్మిల చేసిన పాదయాత్ర ఓ హైలెట్‌గా నిలిచింది. 212 రోజుల్లో దాదాపు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి రికార్డు సృష్టించారామె. 13 జిల్లాల్లో 107 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1680 గ్రామాలను చుట్టేశారు. పాలక ప్రతిపక్షాల కుమ్మక్కును ఎండగడుతూ.. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ షర్మిల తన పాదయాత్రతో ముందుకు సాగారు. అప్పటివరకు ఇంత దూరం నడిచిన మహిళా నేత మరెవరూ లేకపోవడం విశేషం. కర్నూలు, రంగారెడ్డి, నల్లగొండ, గుంటూరు తో పాటు అనంతర పురం జిల్లాలో షర్మిల పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ పాదయాత్ర..
ఇక ఇటీవల జిల్లాల పునర్విభజనలో గద్వాల జిల్లా సాధన కోసం.. మాజీ మంత్రి డి.కె.అరుణ, గద్వాల మండలం జమ్ములమ్మ ఆలయం నుంచి అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు.

మరో చారిత్రక అంకానికి సీపీఎం మహాజన పాదయాత్ర శ్రీకారం
తాజాగా మరో చారిత్రక అంకానికి తెరలేపింది సీపీఎం పార్టీ. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని నేతృత్వంలో సోమవారం నుంచి రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం నుంచి ప్రారంభమైన మహాజన పాదయాత్ర 4000 కిలోమీటర్ల మేర 5 నెలల పాటు సాగనుంది. తమ్మినేనితో పాటు మరో ఎనిమిది మంది నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. సామాజిక న్యాయం కోసం చేపడుతున్న ఈ యాత్రతో.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఇటువంటి యాత్రల అవసరం తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేదని స్వయంగా ముఖ్యమంత్రే స్పందించారు. దీంతో ప్రభుత్వం ఈ యాత్ర ప్రభావం తీవ్రంగానే ఉండబోతుందన్న సంకేతాలు వెలువడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

గవర్నర్ తో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో పరిపాలన, ఇతర అంశాలను గవర్నర్‌కు సీఎం వివరించినట్లు తెలుస్తోంది. దసరా పండుగ రోజున రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 21 జిల్లాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఫలించిన కడియం చర్చలు..

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో మంత్రి కడియం శ్రీహరి చర్చలు ఫలించాయి. ఫీజ్ రీయింబర్స్ మెంట్ కు సంబంధించి మంత్రి చర్చలు జరిపారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలను మరో రెండు రోజుల్లో రూ. 300 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. దశల వారీగా మొత్తం బకాయిలు విడుదల చేస్తామన్నారు. దీంతో సమ్మె విరమించి ఈ నెల 24 నుంచి జరిగే పరీక్షలకు సహకరిస్తామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల సంఘం స్పష్టం చేసింది.

18:41 - October 17, 2016

విజయవాడ : విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. సహజీవనానికి అడ్డుగా ఉన్నాడంటూ ఐదేళ్ల కొడుకును రేఖ అనే మహిళ ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోసాలలో జరిగింది. ఉదయం ఇంట్లో ఆడుకుంటున్న బాలుడిని ప్రియుడు రాజారావు నేలకేసి కొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని బందురు కాలువలో పడేశారు. దీన్ని గుర్తించిన స్థానికులు ఇరువురిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితులిద్దరూ ఏడాదిన్నర క్రితం మహారాష్ట్రలోని బాలాగఢ్‌ జిల్లా నుంచి గోసాలకు వచ్చి జీవిస్తున్నారు.

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోసాలలో ఘటన
రెండ్రోజులుగా చిన్నారికి జ్వరం వస్తుంది...ఆ తల్లి కొడుకు ఏడ్పులతో విసిగిపోయింది...కొడుకును ఓదార్చాల్సిన కన్నతల్లి దుర్మార్గంగా ప్రవర్తించింది..దీనికి తోడు ఆమె ప్రియుడు కూడా...ఇద్దరూ కలిసి పసివాడిని కొట్టడంతో చనిపోయాడు..ఎవరికీ తెలియకుండా పొలాల్లో పడేశారు.. ఆలస్యంగా వెలుగుచూసిన ఘోరం కృష్ణా జిల్లాలో జరిగింది..

ప్రియుడితో కలిసి ఓ అమ్మ అమానుషం..
కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెండ్రోజులుగా కన్పించని చిన్నారి బాలుడి విషయం ఆరా తీసిన స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు..వారంతా గాలిస్తే చిన్నారి బాలుడు నిర్జీవమై చెట్లల్లో కన్పించాడు...

కృష్ణా జిల్లాలో మరో దారుణం..
కృష్ణా జిల్లాలో మరో దారుణం జరిగింది...గోశాల లో నివసించే రేఖ అనే ఇల్లాలికి ఇద్దరు కొడుకులు...భర్తతో విబేదాలు రావడంతో విడిపోయింది... చిన్న కొడుకుతో కలిసి ఉంటున్న రేఖకు రాజారావుతో పరిచయం సంబంధంగా మారింది..రాజారావుతో కలిసి సహజీవనం చేస్తుంది...

దెబ్బలకు చనిపోయిన చిట్టితండ్రి..
గత 2 రోజులుగా బాలుడికి జ్వరం ఉండడంతో నిద్రపోకుండా ఏడుస్తున్నాడు...దీంతో కన్నతల్లి ఓదార్చాల్సింది పోయి చిన్నారిని తీవ్రంగా కొట్టింది.. రాజారావు కూడా కొట్టడంతో బాబుకు దెబ్బలు తగిలి చనిపోయాడు..వెంటనే పసివాడి డెడ్‌బాడీని గొడ్డపాడు పొలాల దగ్గర పడేసారు...ఇంటి పక్కన వారికీ అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విషయం బయటకి వచ్చింది... రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు...

18:24 - October 17, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ వయో పరిమితిని 34 నుంచి 40 ఏళ్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల నోటిఫికేన్లకు ఈ పరిమితి పెంపు వర్తించనుంది.ఈ నిబంధన 2017 డిసెంబర్ 31వరకూ ఈ వెసులుబాటు వర్తించనుంది. మరో 10వేల నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో నిరుద్యోగులకు శుభవార్త అందనుంది. 

18:22 - October 17, 2016

హైదరాబాద్: మాజీ మంత్రి శతృచర్ల విజయరామారాజుకు ఉమ్మడి రాష్ట్రాల న్యాయస్థానం షాక్ ఇచ్చింది. శతృచర్ల నుండి జీత భత్యాలు రికవరీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1999లో ఎస్టీలకు కేటాయించిన పార్వతీపురం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శతృదచర్ల ఎన్నికను సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో దాఖలైన ఫిటీషన్ ను న్యాయస్థానం విచారించింది. శతృచర్ల విజయరామారాజు ఎస్టీ కాదని అప్పట్లోనే న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా 1999 - 2004 మధ్య శతృచర్ల ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో జీత భత్యాలను రికవరీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

18:17 - October 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌ ప్రజల అవసరాలకు అనుగుణంగా మండలాలు, జిల్లాలు విభజించాలని పొలిటికల్‌ జేఏసీ ఛైర్మన్‌ కొదండరాం కోరారు. తెలంగాణ సచివాలయంలో సీఎస్‌ రాజీవ్‌ శర్మను కలిసి ఆయన.. వినతి పత్రం అందజేశారు. డిమాండ్లకు తగినట్లు మండలాలు ఏర్పాటు చేయాలని కోదండరాం కోరారు.

18:15 - October 17, 2016

హైదరాబాద్ : రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటెల రాజేందర్‌ చెప్పారు. సచివాలయంలో రైస్‌ మిల్లర్లతో సమావేశమైన ఆయన.. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 2.7 కోట్ల మందికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామన్న ఈటెల.. పేదలకు రూపాయికే కిలో బియ్యం అందిస్తున్నామన్నారు. 

18:15 - October 17, 2016
18:11 - October 17, 2016

రంగారెడ్డి : హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు అని దళితుల భూములు ఎకరాలకు ఎకరాలు దోచుకుంటున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలు వదిలిపెట్టింది కమ్యూనిస్టులేనని.. తెలంగాణ కమ్యూనిస్టుల గడ్డ అని తెలిపారు. తెలంగాణలో దళితులు, గిరిజనులకు బతికే అవకాశం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గిరిజనుల భూముల కోసం సీఎం కేసీఆర్ అటవీశాఖ అధికారులకు తుపాకీలు అప్పజెప్పడం దారుణమని మండిపడ్డారు. దళితులు, గిరిజనుల భూములు కాజేసి టీఆర్‌ఎస్ దొరలు వందల కోట్ల రూపాయలకు పడగలెత్తారన్నారు. తెలంగాణలోని బడుగు, బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులు, కార్మికుల అభివృద్ధి కోసం చేపట్టిన మహాజన పాదయాత్రకు సీపీఎం ఏపీ శాఖ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని మధు తెలిపారు.

18:09 - October 17, 2016

రంగారెడ్డి : పేదవాళ్లు కోసం.. బలహీన వర్గాల కోసం పనిచేసిన గొప్ప మహానీయులు కారల్‌మార్స్క్..డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అని రిటైర్డ్ ఐఏఎస్‌ ఆఫీసర్‌ కాకీ మాధవరావు అన్నారు. వారి అడుగుజాడల్లో నడిస్తే.. పేదవారికి న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి సభల అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

పెట్రోలియం వర్సిటీకి శంకుస్థాపన..

గుంటూరు : ఈ నెల 20న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్రమంత్రుల విశాఖ పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. విశాఖ జిల్లా సబ్బరవంలో పెట్రోలియం వర్సిటీకి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి తదితరులు పాల్గొననున్నారు. ఆరిలోవలో పెట్రోలియం మంత్రిత్వశాఖ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా 219 పాఠశాలల్లో సీఎం డిజిటల్‌ తరగతులను ప్రారంభించనున్నారు.

18:06 - October 17, 2016

రంగారెడ్డి : రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం సీపీఎం చేపట్టిన పాదయాత్రకు తమ మద్దతు ఉంటుందని డా.అంబేడ్కర్ మనవడు ప్రకాష్‌ అంబేడ్కర్ ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరుగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశం అభివృద్ధి చెందాలంటే చిన్న చిన్న రాష్ట్రాల వల్లే సాధ్యమని.. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బలపరిచామన్నారు. రాష్ట్రంలో 85శాతం నదీ జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని.. వాటిని ఒడిసిపట్టుకునేందుకు చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మించాలని.. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు.లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన స్మార్ట్ సిటీస్ పథకంలో నగరాలకు బదులుగా చిన్న చిన్న పట్టణాలను అభివృద్ధి చేయాలని అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ అన్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. సీపీఎం మహాజపాదయాత్రకు రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలపాలని ఆయన కోరారు. 

టూరిజం అభివృద్ధికి రూ.92 కోట్లు : చందూలాల్

వరంగల్ : టూరిజం అభివృద్ధికి రూ.92 కోట్లు మంజూరయ్యాయని మంత్రి చందూలాల్ వెల్లడించారు. ఇవాళ మంత్రి చందూలాల్ మీడియాతో మాట్లాడుతూ జయశంకర్ జిల్లాలో ప్రకృతి సౌందర్యాలు, సహజ వనరులు అధికంగా ఉన్నాయని తెలిపారు. సహజవనరులు, ప్రకృతి వనరులు అధికంగా ఉన్న జిల్లాలో పర్యాటక ప్రదేశాలన్నింటినీ అభివృద్ధి చేస్తమని తెలిపారు. 

17:58 - October 17, 2016

రంగారెడ్డి : ప్రజల కోసం పాదయాత్ర చేస్తే ప్రశ్నిస్తావా అంటూ టి.కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాదయాత్రను అడ్డుకున్న వారిని తన్నాలని దళితులు..గిరిజనులకు పిలుపునిచ్చారు. దళితుడైన రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుండి ఎందుకు తొలగించారని నిలదీశారు. తెలంగాణ కోసం పోరాడిన వారు టీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు లేరని విమర్శించారు. 12 వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతులు పండుగ చేసుకుంటున్నారని అంటున్నారని తెలిపారు. సీపీఎం పార్టీ మార్పును ఆహ్వానిస్తోందని, మహాజన పాదయాత్రకు మాల మహనాడు దండోరా మద్దతిస్తోందని సభ సాక్షిగా ప్రకటించారు. ప్రజల కోసం పాదయాత్ర చేస్తే ప్రశ్నిస్తావా ? ప్రశ్నించే హక్కు ఉంటదా ? దళితులకు మూడెకరాల భూమి ఇవ్వని వారు ప్రశ్నిస్తారా ? అభివృద్ధి చేస్తే అడ్డుకుంటున్నారని అంటున్నారని, తమ్మినేనికి నీరాజనాలు ఉంటాయా ? మిమ్మల్ని ప్రశ్నిస్తారా ? చూద్దామని తెలిపారు. 

బీసీసీఐకి ఊరట..

ఢిల్లీ: సుప్రీంకోర్టులో బీసీసీఐకి ఊర‌ట ల‌భించింది. లోధా ప్యానెల్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయ‌డానికి త‌మ‌కు మ‌రింత స‌మ‌యం కావాల‌న్న బోర్డు విన‌తిని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ మ‌న్నించారు. దీంతో ప్ర‌స్తుతానికి కోర్టు త‌మ‌ తీర్పు వెలువ‌రించ‌లేదు. అయితే కాంట్రాక్టులు, టెండ‌ర్లు వంటి ఆర్థిక విష‌యాల్లో బోర్డు అధికారాల‌కు క‌త్తెర వేయాల‌ని మాత్రం కోర్టు భావిస్తోంది. సోమ‌వారం లోధా ప్యానెల్ సిఫార‌సుల అమ‌లుపై వాద‌న‌లు కొన‌సాగాయి. అయితే వీటి అమ‌లుకు త‌మ రాష్ట్ర సంఘాల‌న్నింటినీ ఒప్పించ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌ని బోర్డు త‌ర‌ఫు న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ కోర్టుకు తెలిపారు.

17:56 - October 17, 2016

రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుడుతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మహాజన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ప్రభుత్వం చెబుతున్నది ఏంటీ ? చేస్తున్నది ఏంటీ ? సీపీఎం అనుసరిస్తున్న వైఖరిని ప్రజల ముందుంచారు. పాదయాత్రను అడ్డుకున్నా చేసి తీరుతామని కుండబద్ధలు కొట్టారు. ప్రజల్లో చైతన్యం రగిలించడానికి..ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పాదయాత్ర చేయడం జరుగుతోందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా..కేసీఆర్ కు వ్యతిరేకంగా ఈ పాదయాత్ర కాదని మరోమారు స్పష్టం చేశారు. ప్రజల్లో చైతన్యం రగిలించడానికే మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఎం ఎలాంటి వైఖరి తీసుకుందో దానిని పెద్దలు సమర్థిస్తూ ఇక్కడకు వచ్చారని తెలిపారు. 93 శాతం ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, మైనార్టీలున్నారని, వీరు అభివృద్ధి చెందితే బంగారు తెలంగాణ అని అంటారని తెలిపారు.

ఎంగిలి మెతుకుల కోసం కాదు..
నిలదీయడానికే మహాపాదయాత్ర అని, ఎంగిలి మెతుకుల కోసం కాదు..హక్కు అని పేర్కొన్నారు. మైనార్టీలకు ఇచ్చిన మాట ఏంటీ ? అని ప్రశ్నించారు. జనాభాను బట్టి సబ్ ప్లాన్ చేస్తామని అన్నారు కాబట్టే అడుగుతున్నట్లు తెలిపారు. కేవలం రంజాన్ పండుగ నాడు ముస్లిం సోదరులకు బిర్యానీ..కొత్తబట్టలు ఇవ్వడమా ? అని నిలదీశారు. ఎంగిలి మెతుకుల కోసం అడగడం లేదని, 12 శాతం సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వ్యవస్థలో ఉన్న లోపానికి వ్యతిరేకం..
భూమి దళితులు..గిరిజనుల చేతుల్లో ఉందా ? మైనార్టీలకు భూమి ఉందా ? భూమి లేకుండా ఆర్థిక హక్కు సాధించబడుతుందా ? అని నిలదీశారు. ఏ పరిశ్రమ చూసినా ఎవరు ఉంటారు ? దళితులు..గిరిజనులు..కుమ్మరి..వడ్డరి ఉన్నారా ? ఎవరున్నారు ? సినిమా హాళ్లు..టివి ఛానళ్లు..పెట్టుబడులు ఎవరి చేతుల్లో ఉన్నాయని ప్రశ్నించారు. వ్యవస్థల్లో ఉన్న లోపానికి వ్యతిరేకమే మహా పాదయాత్ర అని తెలిపారు. కుల నిర్మూలన కోసం పోరాడాల్సినవసరం ఉందన్నారు.

ఒక్క మాట మీద ఉంటే పార్టీ..
తెలంగాణ వాదాన్ని సపోర్టు చేయలేదు కాబట్టి దానికి శిక్షగా దీనిని భావించడం లేదని, కడుపులో ఉన్న మాట అది కాదన్నారు. సీపీఎం..బృందం మీద..తమ్మినేని మీద లేదని, కోపం ఉంటే 2004, 2009లో కలిసి పొత్తు పెట్టుకున్నప్పుడు అడ్డురాని వాదం..ఇప్పుడు ఎందుకు వచ్చిందని, ఈ ప్రశ్న సంధించి నాలుగు రోజులవుతోందని ఇప్పటి వరకు సమాధానం రాలేదని తెలిపారు. ఆనాడు వైఖరి మార్చుకున్నామా ? అని ప్రశ్నించారు. ఒక్క మాట మీద ఉండే పార్టీ సీపీఎం అని తెలిపారు.

ఆనాడు మెచ్చుకున్నారు..ఈనాడు ఏమైంది ? - తమ్మినేని..
ఆనాడు కేసీఆర్ సీపీఎం పార్టీని మెచ్చుకున్నారని ఈనాడు మాత్రం విమర్శిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ గెలవగానే తాము అంతా అభినందనలు తెలియచేయడానికి వెళ్లడం జరిగిందని, నిజాయితీ గల పార్టీ అని, కట్టుబడే పార్టీ అని ఆనాడు అన్నారని గుర్తు చేశారు. ఉద్యమ కాలంలో వ్యతిరేకంగా ఉన్నారు..ఎన్నికల్లో మాత్రం తనను గెలిపించడానికి ప్రయత్నించారని కొనియాడారని ఆనాటి మాటలను తమ్మినేని గుర్తు చేశారు. తమను సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోనని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఊళ్లలోకి వెళ్లవద్దని పేర్కొంటున్నారని ఎంతవరకు సబబమని ప్రశ్నించారు.

జోలికి వెళ్లం..జోలికి వస్తే ఊరుకోం..
తాము ఎవరి జోలికి వెళ్లమని..తమ జోలికి వస్తే ఊరుకోమని కేసీఆర్ కు సీపీఎం అంటే కోపం లేదని..తమ్మినేని అంటే కోపం లేదని... కోపం అంటే సీపీఎం లేవనెత్తున ఎజెండా అని తెలిపారు.

టీఆర్ఎస్ మంత్రి మెచ్చుకున్నారు - తమ్మినేని..
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు ఫోన్ చేశారని, సీపీఎం చేస్తుంది చాలా బాగుందని..ప్రభుత్వంపై వత్తిడి చేయాలని కోరడం జరిగిందని పేర్కొన్నారు. ఆయన పేరు చెబితే మంత్రి పోస్టు పోతుందని, కమ్యూనిస్టులకు ఓటు తెచ్చుకోవడం తెలీదు కానీ ఓడించడం మాత్రం తెలుసని ఆయన పేర్కొన్నారని తెలిపారు.

దాడి చేసినా..ఏమీ చేసినా సాగుతుంది..
తెలంగాణ గడ్డ మీద రాజకీయ ప్రత్యామ్నాయం చూపెడుతామన్నారు. దాడి చేస్తే ఒకరు పడుతారు..ఇద్దరు పడుతారు..అయినా యాత్ర జరగదు..9మంది పడినా మిగతా వారు పాదయాత్ర చేస్తారని తమ్మినేని తెలిపారు. పోలీసులు కూడా తనను అరెస్టు చేయలేరని, అరెస్టు చేసినా పాదయాత్ర మాత్రం సాగుతుందన్నారు. తనకు గుండె ఆపరేషన్ అయ్యిందని, స్టంట్ వేశారని తన ఆరోగ్యం మాత్రం సహకరిస్తుందన్నారు. ఇంత మంది చూపెడుతున్న అభిమానానికి..ఆదరణతో 8వేల కిలోమీటర్లు నడుస్తానని, ఒక నూతన అధ్యయానికి శ్రీకారం చుడుతామన్నారు.

20.64 కిలోల బంగారం స్వాధీనం!..

ఢిల్లీ : ఓల్డ్ ఢిల్లీలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఓ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 20.64 కిలోల బంగారం, రూ. 6.44 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బంగారం, నగదును కలిగి ఉన్న దుకాణ యజమానిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అరెస్ట్ లతో పాదయాత్రను ఆపలేరు : తమ్మినేని

రంగారెడ్డి : రాష్ట్ర విభజన విషయంలో ఒకే మాట మీద ఉన్న ఏకైక పార్టీ సీపీఎం పార్టీ అని తమ్మినేని పేర్కొన్నారు. నాలుగువేల కిలో మీటర్ల పాదయాత్ర పూర్తయిన తరువాతనే హైదరాబాద్ కు తిరిగి వస్తామన్నారు. పోలీసులను ఉసిగొల్పి..అరెస్ట్ లతోనూ పాదయాత్రను అడ్డుకోలేరన్నారు. అరెస్ట్ చేసి ఎక్కడ వదిలిపెడితే అక్కడే పాదయాత్రను కొనసాగిస్తానన్నారు. ప్రజల మనస్సుల్లో సీపీఎం ఉన్నంతవరకూ ఎవ్వరూ తమను అపలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్తా వారి గ్రామంలో పాదయాత్రపై ప్రచారం చేసి అవగాహన కల్పించాలిన ఈ సందర్బంగా తమ్మినేని పిలుపునిచ్చారు. 

అరెస్ట్ లతో పాదయాత్రను ఆపలేరు : తమ్మినేని

రంగారెడ్డి : రాష్ట్ర విభజన విషయంలో ఒకే మాట మీద ఉన్న ఏకైక పార్టీ సీపీఎం పార్టీ అని తమ్మినేని పేర్కొన్నారు. నాలుగువేల కిలో మీటర్ల పాదయాత్ర పూర్తయిన తరువాతనే హైదరాబాద్ కు తిరిగి వస్తామన్నారు. పోలీసులను ఉసిగొల్పి..అరెస్ట్ లతోనూ పాదయాత్రను అడ్డుకోలేరన్నారు. అరెస్ట్ చేసి ఎక్కడ వదిలిపెడితే అక్కడే పాదయాత్రను కొనసాగిస్తానన్నారు. ప్రజల మనస్సుల్లో సీపీఎం ఉన్నంతవరకూ ఎవ్వరూ తమను అపలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్తా వారి గ్రామంలో పాదయాత్రపై ప్రచారం చేసి అవగాహన కల్పించాలిన ఈ సందర్బంగా తమ్మినేని పిలుపునిచ్చారు. 

శత్రుచర్లకు కోర్టులో చుక్కెదురు..

హైదరాబాద్ : మాజీ మంత్రి శత్రుచర్లకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. 1978-2004 వరకూ ప్రభుత్వం నుండి పొందిన జీత భత్యాలను తిరిగి చెల్లించాలని శత్రుచర్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శత్రుచర్ల నుండి జీత భత్యాలు వసూలు చేయాలని ప్రస్తుత అసెంబ్లీ కార్యదర్శికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..

గుంటూరు : ఏపీ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ళపాటు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన 2017 డిసెంబర్ వరకూ అమలులో వుంటున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బీసీలకు కావాల్సింది మీ ఎంగిలి మెతుకులు కాదు : తమ్మినేని

రంగారెడ్డి : మైనార్టీలకు సబ్ ప్లాన్ అమలు చేయాలని పాదయాత్ర సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వ్యవస్థలో వున్న లోపాలకు వ్యతిరేకంగానే పాదయాత్ర చేపట్టామన్నారు. దీన్ని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని తెలిపారు. కేసీఆర్ అవలంభిస్తున్న పెట్టుబడిదారీ విధానంలో అన్ని కులాలకు సమాన వాటా దక్కాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది ప్రభుత్వం విదిలించే ఎంగిలి మెతుకులు కాదనీ వారికి దక్కాల్సిన 59 శాతం నిధులు కేటాయించాలన్నారు. 

మా పాదయాత్ర రాజకీయ యాత్ర కాదు : తమ్మినేని

రంగారెడ్డి : నాలుగు వేల కిలీమీటర్ల పాదయాత్ర పార్టీ కోసం కాదనీ..తమ సామర్థ్యం చాటుకోటానికో కాదనీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వున్న బడుగు బలహీన వర్గాల కోసమేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ యాత్ర రాజకీయ యాత్ర కాదని తెలిపారు. ప్రజల్లో చైతన్యాన్ని కలిగించటానికి మహాపాదయాత్ర లక్ష్యమని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అవలంభించే విధానాల వైఖరికి నిరసనగా..బలహీన వర్గాల ప్రజల సమస్యలపట్ల పోరాడటానికే ఈ యాత్ర తలపెట్టామన్నారు. అభివృద్ది అంటే ప్రజల అభివృద్ధేనన్నారు.

30రోజులు స్పేస్ లోనే ..

చైనా : అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు వేగం పుంజుకుంటున్నాయి. మాన‌వ స‌హిత వ్యోమ‌నౌక‌ను ఇవాళ చైనా విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. మంగోలియాలోని గోబి ఎడారి నుంచి షెంజూ-11 స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్ర‌యోగించారు. ఇద్ద‌రు వ్యోమ‌గాములు షెంజూలో అంత‌రిక్షానికి వెళ్లారు. జింగ్ హాపెంగ్‌, చెన్ డాంగ్‌లు సుదీర్ఘ కాలం అంత‌రిక్షంలో గ‌డ‌పనున్నారు. గ‌త నెల‌లో ప్ర‌యోగించిన అంత‌రిక్ష కేంద్రం టియాంగ్‌గాంగ్‌-2 స్పేస్ ల్యాబ్‌లో ఆ ఇద్ద‌రు వ్యోమ‌గాములు ఉంటారు. వాళ్లు 33 రోజులు పాటు అంత‌రిక్ష కేంద్రంలో బ‌స చేస్తారు. అందులో సుమారు 30 రోజుల పాటు ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించ‌నునున్నారు. 

రైతులు ఆత్మహత్యలు పండుగలా : అద్దంకి దయాకర్

రంగారెడ్డి : తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోరాడిన మేధావులు స్పందించకపోవటానికి కారణం చెప్పాలని టీ.కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక వాదులంతా ఈ పాదయాత్రకు మద్ధతునివ్వాలన్నారు. ప్రజలకోసం పోరాడి సీపీఎం పాదయాత్ర చేపట్టిన సీపీఎం కు తమ సంపూర్ణ మద్ధతునిస్తున్నామని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడినవారు ఒక్కరు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం లేరని తెలిపారు. రాష్ట్రంలో 12వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రైతులు పండుగ చేసుకుంటున్నాని ప్రభుత్వం ప్రకటించటం దురదృష్టకరమన్నారు.

15:41 - October 17, 2016

రంగారెడ్డి : దళితులు..గిరిజనులు..మైనార్టీలు..వెనుకబడిన వర్గాల వారికి న్యాయం జరగాలనే మహాజన పాదయాత్ర అని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నంలో మహాజన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పాదయాత్ర బహిరంగ సభ చూస్తుంటే మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయని అనిపిస్తోందని, నా తెలంగాణ..బంగారు తెలంగాణ అంటున్నారని, ఇందులో దళితులకు స్థానం లేదా ? గిరిజనలకు స్థానం లేదా ? అని ప్రశ్నించారు. గిరిజన భూమి మీద బతుకుతుంటే ఫారెస్టు డిపార్ట్ మెంట్ కు తుపాకులు ఇచ్చింది ప్రభుత్వమని విమర్శించారు. బలహీన వర్గాల భవిష్యత్ బాగు పడితే..అభివృద్ధి స్థానం దొరికితే అది అభివృద్ధి అని తెలిపారు. నగరంలో అడ్డగోలుగా వందల ఎకరాలు..వేల ఎకరాల దళితుల..గిరిజనుల భూములను కబ్జా చేసి కోట్లకు పడగలెత్తిన వారిని ఎందుకు అదుపు చేయలేదని ప్రశ్నించారు. రైతులు..కూలీలు..ఇతర సామాజిక తరగతుల వారికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. పాదయాత్రను అడుగడుగునా మద్దతు తెలియచేస్తున్నామని, కంటికి రెప్పలా కాపాడుకుని ముందుకు సాగనంపాలని సూచించారు. 

దళితుల భూములు దోచుకునేదా బంగారు తెలంగాణ : మధు

రంగారెడ్డి : కట్టెలమ్ముకుని జీవనం సాగించే రైతులపై పోలీసులు..ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సాగించిన హింసను అడ్డుకునేందుకు ఇబ్రహీంపట్నంలో ఎర్రజెండా ఆవిర్భవించిందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ప్రాణాలను సైతం లెక్కచేకుండా పోరాడారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ తప్పితే అడ్డగోలుగా దళిత గిరిజన భూములను దోచుకుంటున్న ఈ తెలంగాణ కాదు ప్రజలు కోరుకున్నదన్నారు. తెలంగాణలో గిరిజలకు,దళితులకు హక్కులు లేవాని మధు ప్రశ్నించారు.

ప్రజల కోసం ప్రాణాలివ్వటానికైనా సిద్ధం : బీవీ రాఘవులు

రంగారెడ్డి : సీపీఎం మహాపాదయాత్ర సందర్భంగా .. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా వున్నామని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. సామాజిక న్యాయం సమగ్రాభివృద్ది కోసమే సీపీఎం మహాజన పాదయాత్రను చేపట్టిందని ప్రజలందరికీ ఆరోగ్యం ఆహారం లేకుండా బంగారు తెలంగాణ ఎలా అవుతుందని ప్రశ్నించారు.బంగారు తెలంగాణ బడుగు, బలహీన వర్గాలకా లేదా ధనవంతులకా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో అక్షరాస్యత శాతం పెరగాల్సిన అవుసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.  

కేసీఆర్ కే గుబులు పుట్టించింది మహాజన పాదయాత్ర : చాడ

రంగారెడ్డి : బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్ధేశ్యంతో చేపట్టిన ఈ పాదయాత్ర విజయం సాధించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి చాట వెంకటరెడ్డి పేర్కొన్నారు. సీపీఎం పార్టీ తలపెట్టిన సాహసోపేపతమైన ఈ మహాజన పాదయాత్రను విజయవంతం కావాలని కోరుతున్నానన్నారు. ఇప్పటికే ఈ మహాజన పాదయాత్ర సక్సెస్ అయ్యిందన్నారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ ఈ పాదయాత్రపై చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్ర సీఎం కే ఈ పాదయాత్ర గుబులు పుట్టించిందన్నారు. 

15:12 - October 17, 2016

రంగారెడ్డి : 'ప్రాణాలు ఇస్తాం..అడ్డు తగిలితే..వెనక్కి అడుగు వేయం..ముందుకే కదులుతాం..అడుగుతున్నది మా కోరికా ? సామాజిక న్యాయం గొంతెమ్మ కోరికా' అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నంలో సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. సామాజిక న్యాయం కోరే వారు పాదయాత్రను సమర్థించాలని కోరారు. ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. బంగారు తెలంగాణ బడుగు, బలహీన వర్గాలకా ? సంపన్న వర్గాలకా ? తెలంగాణలో అక్షరాస్యత పెరగాల్సినవసరం లేదా ? మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయి ? అని సూటిగా ప్రశ్నించారు. ప్రతి వర్గానికి సబ్ ప్లాన్ ఇవ్వాలని సూచించారు. దళితులు..మైనార్టీలు..వెనుకబడిన వర్గాల వారు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమౌతుందన్నారు. బంగారు తెలంగాణ ఎవరికి అని సూటిగా ప్రశ్నించారు. బంగారం ఏది అడగడానికే మహా పాదయాత్ర అని తెలిపారు. అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నామని, దేశంలో 31 శాతంలో ఉన్న తెలంగాణ పైకి ఎలా వస్తుందన్నారు. అక్షరాస్యతలో అగ్రగామిగా నిలబడితేనే సాధ్యమౌతుందన్నారు. వెనుకబడిన దళితులు..మైనార్టీలు..గిరిజనులు బాగు పడకుంటే ఎలా అని ప్రశ్నించారు.

మూడెకరాల భూమి ఎక్కడ ? 
విద్య..వైద్య సౌకర్యాలు లేవని, పెద్దోళ్లు కార్పొరేట్ వైద్యం చేయించుకుంటున్నారని, వందల సంఖ్యలో బిడ్డలు చనిపోతున్నారని తెలిపారు. దళితులకు ఇస్తామని చెప్పిన మూడెకరాల భూమి ఎక్కడ అని ప్రశ్నించారు. సామాజిక న్యాయం..సమగ్రాభివృద్ధి ఎలా సాధ్యమని తెలిపారు. ఉద్యోగాలు..ప్రైవేటు రిజర్వేషన్ పై తాము ప్రశ్నించడం జరుగుతోందని, అందరికీ సబ్ ప్లాన్ కావాలని అడుగుతున్నట్లు తెలిపారు. మహాజన పాదయాత్రను అవహేళన చేస్తున్నారని, సామాజిక న్యాయం కోసం టీఆర్ఎస్ పాదయాత్ర చేస్తే తాము స్వాగతిస్తామన్నారు. తాము చేస్తున్నది అన్యాయమా ? తాము కోర్కెలు కోరడం లేదని వాళ్లు చెప్పిందే అడుగుతున్నట్లు తెలిపారు. అవాకులు..చెవాకులు చేయడం మానేయాలని, ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తే సమర్థించేందుకు తాము సిద్ధమని రాఘవులు వెల్లడించారు. 

15:12 - October 17, 2016

రంగారెడ్డి : బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని..సీపీఎం పార్టీ తలపెట్టిన సాహసోపేపతమైన ఈ మహాజన పాదయాత్రను విజయవంతం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్వి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ మహాజన పాదయాత్ర సక్సెస్ అయ్యిందన్నారు. సీఎం కేసీఆర్ పాదయాత్రపై చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు.  సీఎంకే ఈ పాదయాత్ర గుబులు పుట్టించిందన్నారు. దళిత గిరిజనులపై దాడులను ఖండించాలనీ..ఈ అంశంపై వామపక్ష పార్టీలన్నీ ఏకమవ్వాల్సి అవుసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రజానీకానికి అభినందనలు తెలిపారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం తలపెట్టిన మహాజన పాదయాత్ర సభ్యులందరికీ ఈ సందర్బంగా యాన అభినందలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ లను ప్రకటించి ఇప్పటికి ఒక్క పేద కుటుంబానికి కూడా ఇచ్చారా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణా కాదు ప్రజలకు కావాల్సింది బతుకు తెలంగాణ పేదలకు కావాలన్నారు. ఆత్మగౌరవం అనేది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే కాని సామాన్యులకు కరువయ్యిందని విమర్శించారు. 

14:53 - October 17, 2016

రంగారెడ్డి : వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు డాక్టర్‌ ప్రకాష్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నారు. సీపీఎం నిర్వహించతలపెట్టిన మహాజన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. సామాన్య మానవుడి ముఖంలో చిరునవ్వు..శాంతి..ఉల్లాసం..చూడాలని అనుకుంటున్నామన్నారు. జిల్లాల్లో అభివృద్ధి అనేది ఆయా జిల్లాల్లో వికేంద్రీకరించబడాలన్నారు. కొన్ని సంవత్సరాల తరువాత సామాన్య మానవడి ప్రశ్నను లేవనెత్తుతూ ఇక్కడి నుండి యాత్ర ప్రారంభం అవుతోందని, ఒక విధంగా ఇది మహాయాత్ర అని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల వికాసం కోసమే పాదయాత్ర అని పేర్కొన్నారు. అభివృద్ధిలో మాత్రం ఎలాంటి మార్పు జరగడం లేదన్నారు. పెద్ద ఎత్తున భారీ ప్రాజెక్టుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, నదుల్లో ఉన్న నీళ్లు సముద్రం పాలవుతుందోన్నారు. నది జలాలు సద్వినియోగం అయితే అభివృద్ధి వేగం పుంజుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

బడుగు వర్గాల కోసమే మహాజన పాదయాత్ర : ప్రకాశ్ అంబేద్కర్

రంగారెడ్డి : సామాజిక న్యాయానికి సమగ్రాభివృద్ధికోసం ఈ ప్రాదయాత్ర జరుగుతోందని బాబా సాహెబ్ అంబేద్కర్ మనుమడు అయిన ప్రకాశ్ అంబేద్కర్ పేర్కొన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే మహాజన పాదయాత్ర జరుగుతోందన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తామంతా బలపరిచినట్లుగా ఆయన తెలిపారు. నానాటికీ పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా చిన్న చిన్ని పట్టణాలను అభివృద్ధి చేయాల్సిన అవుసరముందన్నారు. 

మంత్రి కడియం సీఎస్ రాజీవ్ శర్మ భేటీ..

హైదరాబాద్: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ భేటీ అయ్యారు. విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై చర్చిస్తున్నారు. విడదలవారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసేలా నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం.

పడవ బోల్తా: 14 మంది మృతి..

మయన్మార్ : సెంట్రల్‌ మయన్మార్‌లోని మొనైవా నగరానికి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింద్‌విన్‌ నదిలో పడవ బోల్తా పడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది మృతదేహాలను వెలికి తీశారు. 154 మందిని ప్రాణాలతో రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో 240 నుంచి 250 మంది వరకు ప్రయాణికులు పడవలో ఉన్నారని, వారంతా యూనివర్శిటీ విద్యార్థులు, టీచర్లు, డాక్టర్లని అధికారి ఒకరు వెల్లడించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య 100కి పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు.

గుత్తాపై కోమటిరెడ్డి ఫైర్..

నల్లగొండ : గుత్తా సుఖేందర్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. గుత్తాలా పూటకో పార్టీ మారనని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. 2004 ఎన్నికల్లో నాపై చిత్తుగా ఓడిన గుత్తా నాకే సవాల్ విసరటం హాస్యాస్పదంగా వుందన్నారు. అధికార పార్టీలో వున్నాననే గర్వంతో గుత్తా మాట్లాడుతున్నారనీ..దమ్ముంటే ఎన్నికట్లో పోటీచేసిన తనపై గెలవాలని కోమటిరెడ్డి ఎదురు సవాలు విసిరారు. 

సీపీఎం మహాజన పాదయాత్ర సభ ప్రారంభం..

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నంలో మరి కాసేపట్లో సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భారీ బహిరంగసభను ప్రారంభమయ్యింది. మహాజన పాదయాత్ర పాట సీడీని ఆవిష్కరించారు. సభ ప్రారంభంలో అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, ,ఏపీ సీపీఎం కార్యదర్శి మధు, నివాళులర్పించారు. ఈ సభకు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్, సీపీఐ కార్యదర్శి చాడ, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మల్లు స్వరాజ్యం,అద్దంకి దయాకర్, గాలి వినోద్ కుమార్ హాజరయ్యారు. 

14:25 - October 17, 2016
14:00 - October 17, 2016
13:50 - October 17, 2016

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం ఎరుపెక్కింది..ఎర్ర జెండాలతో అరుణామయమైంది. సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర సందర్భంగా ఇబ్రహీంపట్నంలో ఆ పార్టీ భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సందర్భంగా సభలో పాదయాత్ర పాటల సీడిని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ విడుదల చేశారు. అనంతరం తమ్మినేని ఇతర నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇబ్రహీంపట్నంలో ప్రాంరభమయ్యే ఈ పాదయాత్రను అంబేద్కర్‌ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ప్రారంభించనున్నారు. తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని ఎనిమిదిమంది సభ్యుల బృందం.. ఐదు నెలల పాటు నాలుగు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించనుంది. 

అంబద్కేర్ విగ్రహానికి తమ్మినేని నివాళి...

రంగారెడ్డి : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయనతో పాటు సీపీఐ నేత చాడ, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఉన్నారు. 

13:23 - October 17, 2016

పశ్చిమగోదావరి : పోలవరం 2018 సంవత్సరం నాటికి పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ అక్కడ జరుగుతున్న పనులు చూస్తే మాత్రం ఇది సాధ్యమేనా అని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రతి సోమవారం రివ్యూ..సమీక్ష..పరిశీలన జరుపుతానని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సోమవారం కూడా బాబు పోలవరానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులపై ఏరియల్ రివ్యూ ద్వారా పరిశీలించారు. పోలవరానికి సంబంధించి రెండు ముఖ్యమైన ప్రదేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రస్తుతం అధికారులతో రివ్యూ జరుపుతున్నారు. గత నెలకు..ఈ నెలకు మధ్య కాలంలో ఎంతమేర పనులు జరిగాయో దానిపై బాబు సమీక్షిస్తున్నట్లు సమాచారం. పదిహేను రోజుల నుండి పనులు నత్తనడకన సాగుతోందని బాబు దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.
గత నాలుగు సంవత్సరాల నుండి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని, బాబు అధికారంలోకి వచ్చిన తరువాత 30 శాతం మాత్రమే పనులు జరిగాయని విమర్శలున్నాయి. జీతాలు ఇవ్వకపోవడంతో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి చెందిన ఉద్యోగులు స్వగ్రామాలకు వెళ్లిపోయారని తెలుస్తోంది. మరి నత్తడకన సాగుతున్న ఈ పనులపై సీఎం బాబు ఎలాంటి హెచ్చరికలు చేస్తారో చూడాలి. 

13:14 - October 17, 2016

రంగారెడ్డి : 'సామాజిక న్యాయం...సమగ్రాభివృద్ధి' పేరిట సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇబ్రహీంపట్నంలో యాత్రను అంబేద్కర్ మనవడు డా. ప్రకాష్ అంబేద్కర్ ప్రారంభించనున్నారు. యాత్ర ప్రారంభంకంటే ముందు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభ..పాదయాత్రలో పాల్గొనడానికి భారీగా నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. తాము భద్రాద్రి నుండి రావడం జరిగిందని, ఇళ్లు..బళ్లు అని చెప్పి వాగ్ధానాల మీద వాగ్ధానాలు ఇచ్చి ఓట్లను కొల్లగొట్టి ఏమి చేయలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆచరణలో నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాలు లేవు..నీళ్లు లేవు...సమస్యలు పరిష్కరించాలని అడిగితే లాఠీలకు పని చెబుతున్నారని విమర్శించారు. నిరుద్యోగాన్ని తగ్గించాలని..ఆర్థికశక్తి..కొనుగోలు శక్తి పెరిగితేనే అభివృద్ధి అంటారని తెలిపారు. జనహితం కోసమే సీపీఎం మహాజన పాదయాత్ర నిర్వహిస్తోందన్నారు. 
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో దళితులు..వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగడం లేదని మరో నేత పేర్కొన్నారు. వేలాది మంది దళితులకు డబుల్ బెడ్ రూం నివాసాలు ఇవ్వలేదని, ఫీజులు పెరగడంతో పిల్లలను స్కూళ్లకు పంపించలేని పరిస్థితి నెలకొందన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పాలేరు నియోజవక వర్గంలో దళితులకు భూమి ఇవ్వలేదని, భూములు పూర్తిగా కబ్జాకు గురవుతున్నారని తెలిపారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో పాదయాత్రలో..సభలో పాల్గొనేందుకు తరలివచ్చినట్లు తెలిపారు. 

రెవెన్యూ శాఖలో పురోగతి - మంత్రి కేఈ..

విజయవాడ : రెవెన్యూ శాఖపై మంత్రి కేఈ కృష్ణమూర్తి సమీక్ష జరిపారు. రెండున్నరేళ్లలో రెవెన్యూ శాఖలో పురోగతి సాధించడం జరిగిందని తెలిపారు. రెవెన్యూ శాఖలోని 13 అంశాల్లో టెక్నాలజీ ఉపయోగించి సంస్కరణలు తీసుకోచ్చామన్నారు. త్వరలో 250 సర్వేయర్ల పోస్టులు భర్తీ చేస్తామని, ప్రతిపక్ష నేత జగన్ రౌడీలా ప్రవర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. హోదాపై జగన్ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. 

మూడు శాఖలపై ముగ్గురు మంత్రులు సమీక్షలు..

విజయవాడ : మత్య్సశాఖపై మంత్రి ప్రత్తిపాటి, వైద్య ఆరోగ్య శాఖపై మంత్రి కామినేని, రెవెన్యూ శాఖపై మంత్రి కేఈ కృష్ణమూర్తిలు సమీక్షలు జరిపారు. 

ప్రచార ఆర్భాటాలు ఆపని ఏపీ ప్రభుత్వం - ఉండవల్లి..

హైదరాబాద్ : రెండేళ్లు గడిచినా ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు ఆపడం లేదని, పోలవరం పూర్తి చేయాలని విభజన చట్టంలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతలంటూ కొత్త నాటకానికి తెరతీశారని, పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులు లెక్క చెప్పకుండా మరో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం హాస్యాస్పదమన్నారు.

 

ప్రాజెక్టు పోలవరం పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్ష చేపట్టారు. పనుల పురోగతిని ఇంజనీర్లు బాబుకు వివరించారు. పనులపై చంద్రబాబు ఏరియల్ సర్వే చేయనున్నారు. 

 

జగన్ పై గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆగ్రహం

హైదరాబాద్ : టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు వైసీపీ అధినేత జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై జగన్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు. అమరావతిని ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా తయారు చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు చెప్పారు. 

12:38 - October 17, 2016
12:37 - October 17, 2016

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్ష చేపట్టారు. పనుల పురోగతిని ఇంజనీర్లు బాబుకు వివరించారు. పనులపై చంద్రబాబు ఏరియల్ సర్వే చేయనున్నారు. 

 

 

12:32 - October 17, 2016

హైదరాబాద్ : టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు వైసీపీ అధినేత జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై జగన్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు. అమరావతిని ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా తయారు చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

తిరుమల సదర్శన్ సత్రం వద్ద కలకలం..

చిత్తూరు : తిరుమల సుదర్శన్ సత్రం వద్ద కలకలం రేగింది. గొంతు కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఇతను నెల్లూరు జిల్లా ఉదయగిరి వాసిగా గుర్తించారు. 

పోలవరానికి చేరుకున్న సీఎం బాబు..

పశ్చిమగోదావరి : సీఎం చంద్రబాబు నాయుడు పోలవరానికి చేరుకున్నారు. ఏరియల్ సర్వే ద్వారా సీఎం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. మంత్రులు దేవినేని, పీతల సుజాత, మాణిక్యాలరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. 

వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ పాలన..

గుంటూరు : వెలగపూడి సచివాలయంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వ పాలన ప్రారంభమైంది. అన్ని శాఖల మంత్రులు..ఉద్యోగుల రాకతో సచివాలయం సందడిగా మారింది. 

12:15 - October 17, 2016

ఢిల్లీ : ఫార్మాట్‌ మారినా భారత్ విన్నింగ్‌ ఫార్ములా మారలేదు..! వేదిక మారినా మనోళ్ల జోరు తగ్గలేదు..! నాయకుడు మారినా జట్టు ఆటతీరులో ఏ మాత్రం తేడా రాలేదు..! టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌ను వైట్‌వాష్‌ చేసిన టీమిండియా వన్డేల్లోనూ ఆ దిశగా తొలి అడుగు వేసింది..! సుందర ధర్మశాలలో తొలి వన్డేలో బంతితో, బ్యాట్‌తో ప్రత్యర్థి న్యూజీలాండ్‌ను ముప్పతిప్పలు పెట్టిన భారత్‌ అదిరిపోయే విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను ఆరంభించింది. 
వన్డేల్లోనూ అదే జోరు 
టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా వన్డేల్లోనూ అదే జోరు కొనసాగించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో ఘనమైన బోణీ చేసింది. బౌలర్ల సమష్టి ప్రదర్శనకు విరాట్‌ కోహ్లీ 81 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 85 నాటౌట్‌గా ఆడిన క్లాసిక్‌ ఇన్నింగ్స్‌ తోడవడంతో ఆదివారం జరిగిన తొలి డే/నైట్‌ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో భారత్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజీలాండ్‌..నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 33.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీతో పాటు అజింక్యా రహానె 33 పరుగులు, కెప్టెన్‌ ధోనీ 21 పరుగులతో రాణించారు. కివీస్‌ బౌలర్లలో ఇష్‌ సోధి, బ్రాస్‌వెల్‌, నీషమ్‌ తలో వికెట్‌ తీశారు.  
ఆరంభంలోనే భారత్‌ ఆశించిన ఫలితం 
టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆశించిన ఫలితం ఆరంభంలోనే దక్కింది. అరగేంట్రం బౌలర్‌ హార్ధిక్‌పాండ్యా..ఓపెనర్‌ గుప్తిల్‌ను ఊరించే షార్ట్‌పించ్‌ బంతితో 12 పరుగుకు వెనక్కిపంపంపాడు. దీంతో భారత్‌ శుభారంభం అందుకుంది. విలియమ్స్‌, లాథమ్‌లు వికెట్‌ కాపాడుకుంటూ డిఫెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఉమేష్‌ వేసిన షార్ట్‌పిచ్‌ బంతిని విలియమ్స్‌ సిక్స్‌గా కొట్టేక్రమంలో బౌండరీ లైన్‌ వద్ద మిశ్రా చేతికి చిక్కాడు. ఆ వెంటనే టేలర్‌, లూక్‌ రోంచి, శాంట్నర్‌ ఎలాంటి పరుగులు చేయకుండానే డకౌట్‌ అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 3 పరుగులు, కోరె ఆండర్సన్‌ 4 పరుగులు, జిమ్మీ నీషమ్‌ పరుగులు, మార్టిన్‌ గప్టిల్‌ 12 పరుగులు చేసి తీవ్ర నిరాశ పరిచారు. దీంతో 43.5 ఓవర్లలో 190 పరుగులకే న్యూజిలాండ్‌ కుప్పకూలింది. ఓపెనర్‌ లాథమ్‌ 98 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 79 పరుగులతో నాటౌట్‌ట్‌గా నిలవగా..టిమ్‌ సౌథీ 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 అర్ధశతకంతో రాణించాడు. హార్దిక్‌ పాండ్యా, అమిత మిశ్రా మూడేసి వికెట్లు తీయగా..కేదార్‌ జాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌  చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. 
భారత్‌ శుభారంభం 
ఆ తర్వాత 191 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్, రహానె తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ఆరంభంలో రోహిత్ కాస్త నెమ్మదిగా ఆడగా రహానె మాత్రం అదిరిపోయే షాట్లతో అలరించాడు. కానీ బ్రాస్‌వెల్‌.. ఫుల్‌లెంగ్త్‌ బంతితో రోహితను ఎల్బీగా అవుట్‌ చేశాడు. కొద్దిసేపటికే రహానె కూడా అనవసర షాట్‌ ఆడి అవుటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వైస్‌ కెప్టెన్‌ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించాడు. కవర్‌ డ్రైవ్‌ బౌండ్రీతో ఖాతా తెరిచిన కోహ్లీ..మనీష్‌ పాండేతో కలిసి మూడో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు వంద పరుగుల వద్ద పాండే.. వెనుదిరిగాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న కోహ్లీ..ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మరోవైపు 55 బంతుల్లోనే మరింత జోరు పెంచాడు. ఆ తర్వాత కోహ్లీ తప్పిదంతో ధోనీ రనౌటవడంతో నాలుగో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే, అప్పటికే భారత్ లక్ష్యానికి చేరువైంది. కేదార్‌ జాదవ్‌ 10 పరుగుల నాటౌట్‌ సహకారంతో కోహ్లీ లాంఛనం పూర్తి చేశాడు. సోధి వేసిన బంతిని కోహ్లీ..సిక్స్‌గా మలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో భారత్‌ ఐదు వన్డేల సీరిస్‌లో తొలి వన్డే నెగ్గడంతో 1-0 ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో తన అద్భుత బౌలింగ్‌తో 31 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన హార్థిక్‌ పాండ్యాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇక భారత్‌-న్యూజీలాండ్‌ మధ్య రెండో వన్డే ఢిల్లీలో గురువారం జరగనుంది. 

ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష..

హైదరాబాద్ : ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. జిల్లాల విభజన అనంతరం పంచాయతీ రాజ్ విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈఎస్సీ సత్యనారాయణ రెడ్డి, 31 జిల్లాల అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

12:08 - October 17, 2016

గుంటూరు : ఎపిలో రోడ్లు రక్తమోడాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో ముళ్లపాడుకు చెందిన అవినాశ్‌, కాళేశ్వరరావు మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులు రహదారి పక్కన ఆగివున్న ట్రక్కును వేగంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

11:55 - October 17, 2016

రంగారెడ్డి : సీపీఎం నిర్వహించతలపెట్టిన మహాజన పాదయాత్రను అడ్డుకుంటే వారి అడ్రస్ ఉండదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. కాసేపట్లో ప్రారంభం కానున్న మహాజన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పెద్దమనిషి పాదయాత్రను అడ్డుకోవాలని పేర్కొనడం సరికాదన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతొక్కరికీ హక్కు ఉందని తెలిపారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, రుణమాఫీ చేయకపోవడం వల్ల అనేక మంది అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా ఇవ్వలేదని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడం లేదని..ఇలా అనేక సమస్యలున్నాయన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమస్యలపై తాము ప్రజల్లోకి వెళుతున్నామన్నారు. ప్రజలు చెప్పే సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని జూలకంటి సూచించారు. 

11:43 - October 17, 2016

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నంలో కామ్రెడ్లు కదం తొక్కారు. సీపీఎం నిర్వహించతలపెట్టిన మహాజనపాదయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. పాదయాత్ర కంటే ముందు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు..పేదలు పడుతున్న బాధలు కళ్లకు కట్టినట్లుగా పాటలు..ఆటల రూపంలో ప్రదర్శించారు.
పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ఎపి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, పలువురు మేధావులు, పలు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు నేతలు హాజరుకానున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో మహాజన పాదయాత్ర జరుగనుంది. మిగతా వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఆర్టీఐ యాక్టివిస్టు భూపేంద్ర దారుణ హత్య..

ముంబై : ఆర్టీఐ యాక్టివిస్టు భూ పేంద్ర వీరా హత్యకు గురయ్యాడు. ల్యాండ్ మాఫియా వ్యతిరేకంగా భూపేంద్ర పోరాడుతున్నాడు. 

11:30 - October 17, 2016

చెన్నై : తమిళనాడులో కావేరి నది జలాల పోరు ఉధృతమవుతోంది. రేపు కావేరి జాలాలపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. రేపటి తీర్పుపై తమిళనాడు కర్ణాటకలో ఉత్కంఠ నెలకొంది. కేంద్ర వైఖరిని ఖండిస్తూ  నిరసనలు వెల్లువెత్తాయి. తమిళనాడులో కావేరి జలాల కోసం రైతులు ఆందోళన చేస్తున్నారు. చెన్నైలో రైలు రోకో కార్యక్రమంలో డీఎంకే నేత స్టాలిన్ పాల్గొన్నారు. 40 గంటల రైలు రోకోకు రైతులు పిలుపునిచ్చారు. విపక్షాలు రైతులకు మద్దతిచ్చాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:18 - October 17, 2016

రంగారెడ్డి :  జిల్లా పూర్తిగా వెనుకబడిపోయిందని, మహాజన పాదయాత్రకు ఆటంకం కలిగిస్తే ప్రభుత్వానికే నష్టమని సీపీఎం నేత భూపాల్ తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. మహాజన పాదయాత్ర ఇబ్రహీంపట్నలో జరుగుతోందని, వేలాది మంది ఇక్కడకు తరలివస్తున్నారని తెలిపారు. నాలుగు గంటల వరకు సభ జరుగుతుందని అనంతరం ఉప్పర్ గూడ మీదుగా పోచారం వరకు పాదయాత్ర జరుగుతుందని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. రేపటి నుండి ప్రతి 25 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుందన్నారు. ఈనెలాఖరు వరకు రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర జరుగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా పూర్తిగా వెనుకబడి పోయిందని, ఎన్నో సమస్యలు నెలకొన్నాయన్నారు. ఈ సమస్యలపై అధ్యయనం చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ ముందుకెళుతుందన్నారు. ఈ పాదయాత్రను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. 

11:16 - October 17, 2016

రంగారెడ్డి : ప్రభుత్వం పేర్కొన్న హామీల్లో ఏ హామీలు అమలు చేశారని, అమలు చేసిన హామీలు ఎవరికి చెందాయని నిర్వాహక కమిటీ బాధ్యులు వెంకట్ పేర్కొన్నారు. పాదయాత్ర సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. దళితులకు ఎంతమందికి భూములిచ్చారని, రిజర్వేషన్ పెంచుతామని అన్నారు ఎందుకు పెంచలేదని సూటిగా ప్రశ్నించారు. దళితులకు..గిరిజనులకు.మైనార్టీలకు ఉద్యోగాలు రావడం లేదని తెలిపారు. కొన్ని కులాలకు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని, అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలని సూచించారు. పెన్షన్లు..ప్రాజెక్టులు..తెలంగాణ అభివృద్ధి కావాలని..కొత్త జిల్లాలు..ప్రభుత్వం పేర్కొన్న వాటిని బలపర్చడం జరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ కార్పొరేట్ విధానాలే ఈ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పాదయాత్ర అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొనడం సబబు కాదని ఇదేమి సంస్కృతి అని తెలిపారు. సామాజిక తరగతులు..అభ్యుదయ వాదులు..ప్రతొక్కరూ పాదయాత్రలో అడుగు వేస్తున్నారని, అభివృద్ధి కేవలం కొంతమందికి మాత్రమే దక్కిందని తెలిపారు. 

ఇబ్రహీంపట్నంకు చేరుకుంటున్న క్రామెడ్లు..

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నంలో కాసేపట్లో సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. యాత్రకంటే ముందుగా బహిరంగసభ జరగనుంది. ఈ యాత్రలో..సభలో పాల్గొనడానికి భారీగా కామ్రెడ్లు ఇబ్రహీంపట్నంకు చేరుకుంటున్నారు. 

తమిళనాడులో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..

చెన్నై : కర్ణాటక నుంచి తక్షణమే కావేరీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, డీఎంకే ఆధ్వర్యంలో 48 గంటల రైల్ రోకో తమిళనాడులో ప్రారంభమైంది. దీనితో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

10:50 - October 17, 2016
10:49 - October 17, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని బాలానగర్ లో రైల్వే ట్రాక్ పై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సికింద్రాబాద్ బాలానగర్ ఫిరోజ్ గూడ వద్ద రైల్వే ట్రాక్ పై మరమ్మతులు చేస్తుండగా కార్మికులపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో శ్రీనివాస్ అనే కార్మికుడు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోఓల చూద్దాం....

 

10:41 - October 17, 2016

రంగారెడ్డి : తెలంగాణలో సామాజిక, సమగ్ర అభివృద్ధికి సీపీఎం మహాజన పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. నేటి నుంచి మహాజన పాదయాత్ర ప్రారంభం కానుంది. డా.బిఆర్ అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ ఇబ్రహీంపట్నంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు బహిరంగ సభ నిర్వహించనున్నారు. వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున బహిరంగ సభకు తరలివస్తున్నారు. పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. పాదయాత్రపై టీసర్కార్ విమర్శలు చేయడం, అడ్డుకుంటామని చెప్పడంతో పాదయాత్రకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఆటకం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ఎపి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, పలువురు మేధావులు, పలు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు నేతలు హాజరుకానున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో మహాజన పాదయాత్ర జరుగనుంది. 
తమ్మినేనితోపాటు వివిధ ప్రజా సంఘాలు నేతలు జాన్ వెస్లీ, రమా, ఆశయ్య, నగేష్, ఎంవి.రమణ, నైతం రాజు, శోభన్ నాయక్, మహ్మద్ అబ్బాస్ పాదయాత్రలో పాల్గొననున్నారు. 5 నెలలపాటు 4 వేల కిలో మీటర్లు పాదయాత్ర కొనసాగనుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సీపీఎం కోరుకుంటున్నారు. అయితే మహాజన పాదయాత్రను టీసర్కార్ వ్యతిరేకిస్తుంది. పలు విమర్శలు చేస్తోంది. సీపీఎం పార్టీని వ్యతిరేకిస్తున్నారా...? లేదా సీపీఎం చేపట్టిని మహాజన పాదయాత్ర ఎజెండాలను వ్యతిరేకిస్తున్నారో తెలపాలని తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాదయాత్ర సందర్భంగా 18 కమిటీలు చేశారు. వివిధ రంగాల మేధావులు, ప్రజాసంఘాల నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. 2017 మార్చి 12న హైదరాబాద్ లో ముగింపు సభ జరుగనుంది. ముగింపు సభకు కేరళ సీఎం పినరయ్ విజయన్ హాజరు కానున్నారు. మొదటి రోజు 5 నుంచి 6 కిలో మీటర్లు పాదయాత్ర చేసే అవకాశం ఉంది. రేపటి నుంచి రోజుకు 25 నుంచి 30 కిమీ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర సందర్భంగా స్థానిక గ్రామాల్లో చిన్న పాటి సభలు
ఏర్పాటు చేస్తారు. అన్ని వర్గాల ప్రజను కలుస్తారు. వారి సమస్యలను తెలసుకుంటారు. సమస్యల పరిష్కారానికి కార్యచరణ రచించి.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని భావిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 
 

నీరు ప్రగతిపై సీఎం బాబు టెలీకాన్ఫరెన్స్..

విజయవాడ : నీరు ప్రగతిపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అందరికీ నీటి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని బాబు తెలిపారు. పట్టిసీమ ద్వారా ఇప్పటి వరకు 26 టీంఎసీలు వినియోగించుకున్నామన్నారు. డిసెంబర్ లోగా 30 టీఎంసీలు వినియోగించుకోవాలని, ఈ ఏడాది పట్టిసీమ ద్వారా 60 టీఎంసీలు వినియోగించుకుంటే వచ్చే ఏడాది 80 టీఎంసీలు వినియోగించుకోవాలన్నారు. 

తమిళనాడులో కావేరీ పోరు ఉధృతం..

చెన్నై : తమిళనాడులో కావేరీ పోరు ఉధృతమవుతోంది. 48గంటల రైల్ రోకోకు రైతులు పిలుపునిచ్చారు. రైతులకు విపక్షాలు మద్దతినిచ్చాయి. రేపు కావేరీ జలాలపై సుప్రీంకోర్టు తీర్పునివ్వనుంది. దీనితో ఇరు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. 

బాలానగర్ లో రైల్వే ట్రాక్ పై ప్రమాదం..

హైదరాబాద్ : సికింద్రాబాద్ బాలానగర్ లో రైల్వే ట్రాక్ పై ప్రమాదం జరిగింది. మట్టిపెళ్లలు విరిగిపడి ఒకరు మృతి చెందారు. మరో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి.

 

రైల్వే ట్రాక్ పై ప్రమాదం..ఒకరు మృతి..

హైదరాబాద్ : సికింద్రాబాద్ బాలానగర్ లో రైల్వే ట్రాక్ పై ప్రమాదం చోటు చేసుకుంది. మట్టిపెళ్లలు విరిగిపడి ఒకరు మృతి చెందంగా నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. రైల్వే ట్రాక్ పై మరమ్మత్తులు చేస్తుండగా ఈప్రమాదం జరిగింది. ఫిరోజ్ గూడ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. 

అనంతనాగ్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

జమ్మూకాశ్మీర్ : అనంతనాగ్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నిన్న రాత్రి టీవీ టవర్ వద్ద పహారా కాస్తున్నారు. పోలీసుల వద్ద ఉన్న ఐదు తుపాకులను ఉగ్రవాదులు లాక్కెళ్లారు. 

 

కాసేపట్లో మహాజన పాదయాత్ర ప్రారంభం..

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం లో సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

09:52 - October 17, 2016

రంగారెడ్డి : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ మహాజన పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. నేటి నుంచి మహాజన పాదయాత్ర ప్రారంభం కానుంది. డా.బిఆర్ అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ ఇబ్రహీంపట్నంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ఎపి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, పలువురు మేధావులు, పలు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు నేతలు హాజరుకానున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో మహాజన పాదయాత్ర జరుగనుంది. తమ్మినేనితోపాటు ఎనిమిది మంది పాదయాత్రలో పాల్గొననున్నారు. 5 నెలలపాటు 4 వేల కిలో మీటర్లు పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర సందర్బంగా 18 కమిటీలు చేశారు. వివిధ రంగాల మేధావులు, ప్రజాసంఘాల నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. 2017 మార్చి 12న హైదరాబాద్ లో ముగింపు సభ జరుగనుంది.

 

08:48 - October 17, 2016

పశ్చిమగోదావరి జిల్లాలోని తుందుర్రులో ఏర్పాటు చేయబోతున్న అక్వాఫుడ్ పార్క్ ప్రాజెక్టును ప్రభుత్వం వెనక్కితీసుకోవాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, వైసీపీ నేత రమేష్, సీపీఎం నేత గోపాలన్, లోక్ సత్తా అధికార ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. నివాసాలకు ఫ్యాక్టరీలు దూరంగా ఉండాలని తెలిపారు. మొదటి నుంచి ప్రజలు వద్దంటున్నప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకెళ్లిందని పేర్కొన్నారు. పచ్చని పంట పొలాల మధ్య ఆక్వాఫుడ్ పార్కు కాట్టాల్సిన అవసరమేంటనీ ప్రశ్నించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

నేడు మంత్రి కడియంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల భేటీ

హైదరాబాద్ : నేడు మంత్రి కడియం శ్రీహరితో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల భేటీ కానున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై చర్చించనున్నారు. 

08:12 - October 17, 2016

గోవా : బ్రిక్స్ వేదిక‌గా దాయాది పాకిస్థాన్‌పై నిప్పులు చేరిగారు ప్రధాని నరేంద్ర మోదీ. ప‌ర్యావ‌ర‌ణ శ్రేయ‌స్సుకు ఉగ్రవాదం విఘాతం క‌లిగిస్తోంద‌న్న మోదీ.. దుర‌దృష్టవ‌శాత్తు దాని మూలాలు త‌మ పొరుగుదేశంలోనే ఉన్నాయన్నారు. బ్రిక్స్ చివరి రోజైన రెండో రోజు స‌మావేశాల్లో భాగంగా మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాల‌ని బ్రిక్స్ దేశాధినేత‌ల‌కు పిలుపునిచ్చారు. 
పాకిస్థాన్‌పై పరోక్షంగా నిప్పులు చెరిగిన మోదీ
ఉగ్రమూకల శిబిరాలపై మెరుపుదాడులు చేయటం ద్వారా పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం చెప్పిన భారత్‌.. ఆ దేశాన్ని ఏకాకిని చేసేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. గోవాలో జరిగిన 8వ 'బ్రిక్స్‌' శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్‌ పేరు ఎత్తకుండా ఆ దేశాన్ని తూర్పారబట్టారు. ఈ సమావేశానికి మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్‌ జుమా, బ్రెజిల్‌ అధ్యక్షుడు మైఖేల్‌ టెమెర్‌ హాజరయ్యారు. 
ఉగ్రవాదానికి పొరుగుదేశం తల్లిలాంటిదని మోదీ వ్యాఖ్య
ఉగ్రవాదానికి పొరుగుదేశం తల్లిలాంటిదని, ఆర్థిక సమృద్ధతకు ఉగ్రవాదం నుంచి ప్రత్యక్ష ముప్పు పొంచి ఉందన్నారు మోదీ.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రమూకలన్నింటికీ ఆ దేశంలోని ముష్కర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని విమర్శించారు. రాజకీయ లబ్ధికోసం ఉగ్రవాదాన్ని సమర్థించే ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. పాక్‌ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన మోదీ.. బ్రిక్స్‌ దేశాలన్నీ ఉగ్రభూతానికి వ్యతిరేకంగా ఏకమై, కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 
ఆర్థిక సంబంధాల బలోపేతం దిశగా బ్రిక్స్‌ సదస్సు 
ఉగ్రవాదం నిర్మూలనకు త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలో సమగ్ర ఒప్పందం కుదిరేలా కృషి చేయాల్సిన ఆవశ్యకతను ప్రధాని గుర్తు చేశారు. తీవ్రవాదులను, వారిని సమర్థించే వారిని శిక్షించి తీరాలన్నదే తమ అభిమతమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్న మోదీ.. ఇటీవల పారిస్‌ ఒప్పందాన్ని ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్థిక సంబంధాల బలోపేతం దిశగా బ్రిక్స్‌ సదస్సు జరిగిందన్నారు మోదీ. బ్రిక్స్‌ సభ్యదేశాల అభివృద్ధే ప్రధాన అజెండాగా సమావేశాలు కొనసాగాయని అన్నారు. ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. సదస్సులో భాగంగా విద్య, వాణిజ్యం, పర్యాటకం తదితర అంశాలపై ఒప్పందాలు జరిగాయని మోదీ వెల్లడించారు.
దేశాల మ‌ధ్య మూడు ఒప్పందాలు 
బ్రిక్స్ స‌మావేశాల్లో భాగంగా దేశాల మ‌ధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి. ఈ మేర‌కు ఆయా దేశాల విదేశాంగ మంత్రులు ఒప్పంద ప‌త్రాల‌ను మార్చుకున్నారు. సమావేశాల సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. భారత్ తోపాటు ఈ మధ్యకాలంలో కొన్ని బ్రిక్స్ దేశాల్లో జరిగిన ఉగ్రదాడులను సమావేశం ఖండించింది. ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచ శాంతిభద్రతలకు పెను ముప్పుగా పరిణమించినట్లు బ్రిక్స్ దేశాలు గుర్తించాయి. శాంతి, భ‌ద్రతల విష‌యంలో ప‌ర‌స్పర స‌హ‌కారం, సంప్రదింపుల‌కు బ్రిక్స్ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నాయ‌ని మోదీ అన్నారు. ట్యాక్స్ ఎగవేత, నల్లధనం, అవినీతి నిర్మూలనలోనూ బ్రిక్స్ దేశాలు కలిసి పని చేస్తాయని స్పష్టంచేశారు.
పాకిస్థాన్‌కు షాక్‌ ఇచ్చిన రష్యా
బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు వేదికగా రష్యా..పాకిస్థాన్‌కు షాకిచ్చింది. పాక్‌తో ఎలాంటి సైనిక ఒప్పందాలు కుదుర్చుకోలేదని రష్యా రోస్టెక్‌ కార్ప్‌ సీఈవో సెర్గీ సెమిజోవ్‌ స్పష్టం చేశారు. అంతేకాదు.. ఆ దేశంతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోమని, ఆధునిక హెలికాప్టర్లు, సైనిక ఎయిర్‌క్రాప్ట్‌లను పాకిస్థాన్‌కు అమ్మబోమని చెప్పారు. ఇకపై ఎలాంటి ఒప్పందాలు ఉండవని కుండబద్దలు కొట్టారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని పారద్రోలేందుకే సంయుక్త సైనిక విన్యాసాలు చేశామన్నారు. ఇరుదేశాల దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్ట పరచాలని నిర్ణయించినట్లు బ్రిక్స్‌ సదస్సు భేటీ అనంతరం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో చైనా తెలిపింది.  

 

07:58 - October 17, 2016

చెరకు పరిశ్రమలను కాపాడుకోవాలని, చెరకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతు సంఘం నేత వై. కేశవరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన ఇవాళ్టి జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఆంధ్రప్రదేశ్ లో చక్కెర పరిశ్రమకు, చెరకు రైతులకు గడ్డు రోజులు రాబోతున్నాయా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇలాంటి అనుమానమే కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో చక్కెర పరిశ్రమకు వస్తున్న ప్రమాదమేమిటి? ఏపిలో టయోటా సూషో అనే బహుళజాతి కంపెనీ అడుగుపెడితే, సహకార చక్కెర ఫ్యాక్టరీలు బతికిబట్టకట్టగలవా? ఆంధ్రప్రదేశ్ లో సహకార చక్కెర కర్మాగారాలను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

07:53 - October 17, 2016

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో టాయోటా సుషో రిఫైనరీ పెడుతున్నారన్న వార్త ఆంధ్రప్రదేశ్ చక్కెర పరిశ్రమలో పెద్ద కలకలమే సృష్టిస్తోంది. దీని రాకతో 29 చక్కెర పరిశ్రమలు మూతపడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 30వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతారన్న భయాలు వెన్నాడుతున్నాయి. 
ఏపిలో 29 చక్కెర పరిశ్రమలు
ఆంధ్రప్రదేశ్ లో 29 చక్కెర పరిశ్రమలున్నాయి. వీటిలో 10 సహకారరంగంలో పనిచేస్తుండగా, మరో 19 ప్రయివేట్ రంగంలో మనుగడసాగిస్తున్నాయి. వీటిలో 20 నుంచి 30 వేలమంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. చెరకు కటింగ్, ట్రాన్స్ పోర్ట్ ద్వారా పరోక్షంగా మరికొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారు. దాదాపు మూడు లక్షల మంది చెరకు సాగు చేస్తున్నారు. ఇప్పుడు వీరందరి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇందుకు ఏకైక కారణం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నంలో చక్కెర రిఫైనరీ నెలకొల్పేందుకు టయోటా సూషో అనే బహుళజాతి కంపెనీకి అనుమతులిచ్చింది. ఇది జపాన్ కు చెందిన బహుళజాతి కంపెనీ. 150 దేశాలలో 750 డిస్ట్రిబ్యూషన్ యూనిట్లున్న పెద్ద కంపెనీ ఇది. దీని చూపు ఆంధ్రప్రదేశ్ మీద పడింది. 2450 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సమాయత్తమైంది. రోజుకు 3000 టన్నుల చక్కెర ఉత్పత్తి చేసే సామర్థ్యంతో పరిశ్రమ పెట్టేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లోని 29 పరిశ్రమలన్నీ కలిపి ఉత్పత్తి చేస్తున్న చక్కెరతో ఇది సమానం. ఆంధ్రప్రదేశ్ లోని 29 పరిశ్రమల బిజినెస్ మొత్తాన్ని టాయోటా సుషో కంపెనీ మింగేయడం తథ్యం. నెస్లీ, క్యాడ్ బరీస్, కోకోకోలా, పెప్సికోలా, వాల్ మార్ట్, మైక్రో వంటి సంస్థలకు ఇది నేరుగా చక్కెరను అమ్ముకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని 29 కంపెనీలు తమ ఉత్పత్తులను ఎవరికి అమ్ముకోవాలి? అసలు అవి చెరకు ఉత్పత్తి చేయడానికి అవసరమైన చెరకు దొరకుతుందా? ఇదే ప్రశ్న ఇప్పుడు అన్ని పరిశ్రమలను వేధిస్తోంది. 
30 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం
టయోటా పరిశ్రమ కారణంగా 600 మందికి ఉద్యోగాలొస్తే, 20 నుంచి 30 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే రైతులు, కార్మికులు, చక్కెర ఫ్యాక్టరీల యజమానులు టయోటా సుషో రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

 

నేడు చైనా మానవ సహిత అంతరిక్ష ప్రయోగం

బీజింగ్ : నేడు చైనా మానవ సహిత అంతరిక్ష ప్రయోగం చేయనుంది. షెంజౌ 11 నౌకలో ఇద్దరు వ్యోమోగాములు క్షక్ష్యలోకి పయనించనున్నారు. 

వైద్య ఆరోగ్యశాఖపై నేడు మంత్రి కామినేని సమీక్ష

గుంటూరు : నేడు వెలగపూడిలోని ఎపి కొత్త సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై హెచ్ వోడీలతో మంత్రి కామినేని శ్రీనివాస్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 

నేటి నుంచి పైడి తల్లి అమ్మవారి ఉత్సవాలు

విజయనగరం : నేటి నుంచి పైడి తల్లి అమ్మవారి ఉత్సవాలు జరుగనున్నాయి. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు. 

07:39 - October 17, 2016

హైదరాబాద్ : అత్తింటి వేధింపులకు మరో మహిళ బలైంది.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శ్వేత ఆత్మహత్య చేసుకుంది.. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లి మృతి.... తండ్రి కటకటాల్లోకి వెళ్లడంతో, వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. 
సాప్ట్ వేర్ ఇంజినీర్ శ్వేత ఆత్మహత్య 
సికింద్రాబాద్ నల్లగుట్టలో సాప్ట్ వేర్ ఇంజినీర్ శ్వేత ఆత్మహత్య చేసుకుంది. అత్తింటివారి వేధింపులు, ముఖ్యంగా భర్త టార్చరే శ్వేత ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్‌ నల్లగుట్టలో నివసించే శ్వేత, శ్రీకాంత్‌లకు నాలుగేళ్లక్రితం వివాహమైంది.. శ్వేత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తోంది.... ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లున్నారు.. రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్న శ్రీకాంత్‌... శ్వేతనుకూడా ఈ రంగంలోకి రావాలని ఒత్తిడి తెచ్చాడని, ఉద్యోగానికి రాజీనామా చేయాలని బలవంతం చేశాడని సమాచారం. దీనికి శ్వేత ఒప్పుకోకపోవడంతో ఇద్దరిమధ్యా మనస్పర్థలొచ్చాయని, ఈ క్రమంలోనే శ్రీకాంత్ శ్వేతపై వేధింపులు పెంచాడని, శనివారం రాత్రి తాగివచ్చి మళ్లీ భార్యతో గొడవపడ్డాడని తెలుస్తోంది. భర్త టార్చర్‌తో మనస్తాపం చెందిన శ్వేత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
అనాథలుగా మారిన పిల్లలు  
శ్వేత మృతివార్త తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదని... అత్తింటివారే హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి ఆత్మహత్య... తండ్రి కటకటాల్లోకి వెళ్లడంతో.. వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. 

07:35 - October 17, 2016

ఢిల్లీ : మన దేశంలో యువతను నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. జాబ్‌ దొరక్క..దొరికినా అది నిలబడడం చాలా కష్టంగా మారింది. కాస్ట్‌ కటింగ్‌ పేరుతో ఇప్పటికే చాలా కంపెనీల్లో.. సంస్థల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. నిజంగానే.. నిరుద్యోగం కల్లోలం సృష్టించే రోజులు రాబోతున్నాయా? అంటే.. అవుననే సమాధానం కూడా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఉద్యోగాలు దొరకడం చాలా కష్టమని ఢిల్లీకి చెందిన ఓ సంస్థ కళ్లు చెదిరే వాస్తవాలను యువత ముందుంచింది..!
తీవ్రంగా వెంటాడుతున్న నిరుద్యోగ సమస్య
ప్రస్తుత రోజుల్లో పీజీలు, పీహెచ్‌డీలు చేసినా.. ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా మారింది. చివరకు అటెండర్‌ ఉద్యోగానికి కూడా డిగ్రీలు, పీజీలు చేసినవారు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే నిరుద్యోగం అంతలా వెంటాడుతోంది. దాదాపు అన్ని రాష్ర్టాల్లోనూ ఇదే పరిస్థితి. చదువులు పూర్తి కాగానే జాబ్‌ చేయాలనేది చాలామంది కల. యువత అత్యధికంగా ఉన్న భారత్‌లో అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయా? అంటే కష్టమనే చెప్పాలి. 2011 లెక్కల ప్రకారం 121 కోట్ల జనాభాలో 50 శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సంఘటిత, అసంఘటిత రంగాలు రెండింటిలో కలిపి ఉద్యోగాల సంఖ్య 47 కోట్లు. అయితే... ప్రస్తుతం వ్యవసాయ, రిటైల్, నిర్మాణ రంగాలతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, నిర్మాణ కార్మికులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయా రంగాల్లో రోజుకు 550 ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. ఆ లెక్కన 2050నాటికి దేశంలో 70 లక్షల ఉద్యోగాలు మటుమాయం కానున్నాయి. 2050 నాటికి మనదేశ జనాభా 180 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ వివరాలన్నీ ఢిల్లీకి చెందిన సామాజిక సంస్థ ప్రహర్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో కళ్లు చెదిరే విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి. 
కేవలం 1.35 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి
లేబర్ బ్యూరో విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2015 సంవత్సరంలో దేశంలో కేవలం 1.35 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. అదే 2013లో 4.19 లక్షలు, 2009లో 9 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించారు. దేశంలో పౌరుల జీవన ప్రమాణాలు పెరగాల్సిందిపోయి తరగిపోతున్నాయని, ఉద్యోగాలు సృష్టించే ప్రక్రియ చాలా మందగించింది'అని ప్రహర్ సర్వేలో తెలిపారు. రోజుకు 550 ఉద్యోగాలు మాయం అవుతున్న విషయాన్ని లేబర్ బ్యూరో కూడా నిర్ధారించిందని ప్రహర్ రిపోర్టు తెలిపింది. కొత్త ఉద్యోగాలు కల్పించుకునే అవకాశం ఉన్న రంగాల్లో తీవ్ర మాంధ్యం ఏర్పడటమే నిరుద్యోగం పెరుగుదలకు కారణమని వివరించింది. 'ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 1994లో 60 శాతం మంది వ్యవసాయ రంగంలోనే ఉపాధి ఉండేది. కానీ 2013 నాటికి అది 50 శాతానికి పడిపోయింది. వ్యవసాయం తర్వాత 40 శాతం ఉద్యోగాలను కలిగి ఉన్న చిన్న, మధ్యతరగతి పరిశ్రమల రంగం.. మల్టీనేషన్ కంపెనీల రాకతో కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి కంటే నాలుగు రెట్లు ఎక్కువ మంది చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేస్తున్నారని ప్రహర్ రిపోర్టు తెలిపింది. 
స్మార్ట్ సిటీలకన్నా స్మార్ట్ విలేజ్ ల అవసరం 
భారతదేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పునర్జీవనం కల్పిస్తే తప్ప పరిస్థితులు చక్కబడవని, ఆ మేరకు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు దృష్టిసారించాలని సామాజిక అధ్యయన సంస్థ సూచించింది. 21వ శతాబ్దపు ఇండియాకు స్మార్ట్ సిటీలకన్నా స్మార్ట్ విలేజ్ ల అవసరం ఉందని అభిప్రాయపడింది.

 

07:28 - October 17, 2016

హైదరాబాద్ : అధికార టీఆర్ ఎస్ పార్టీ నేతలకు మరో నెల రోజుల్లో భారీ ఎత్తున పదవులు దక్కనున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యవర్గ నియామకంతో పాటు జిల్లా కార్యవర్గాలు, అనుబంధ సంఘాలను నియమించేందుకు పార్టీ అధినేత కేసీఆర్‌ సిద్ధమవుతున్నట్లు  తెలుస్తోంది. పెరిగిన జిల్లాలతో నేతలకు పెద్ద ఎత్తున పదవులు వరించనుండడంతో గులాబీ నేతలు ఆశలపల్లకిలో ఊరేగుతున్నారు.
ఊరిస్తున్న నామినేటెడ్, పార్టీ పదవులు
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలను ఓ వైపు నామినేటెడ్ పదవులు మరో వైపు పార్టీ పదవులు రెండేళ్లుగా ఊరిస్తున్నాయి. నామినేటెడ్ పదవులు దసరా నాటికి పెద్ద ఎత్తున భర్తీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగినా కేవం 9 కార్పోరేషన్ల చైర్మన్లను మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. రాష్ట్ర స్థాయిలో ఇంకా మెజార్టీ పదవులు ఖాళీగానే ఉన్నాయి. వివాదాస్పద షెడ్యూళ్లలో ఉన్న పదవులు మినహా అన్ని పదవులు కూడా భర్తీ చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పదవుల నియామకం కూడా ఇప్పటి వరకు జరుగలేదు. పార్టీ పోలిట్ బ్యూరో సహా రాష్ట్ర కార్యవర్గాన్ని  పార్టీ అధినేత కేసీఆర్‌ ఇప్పటి వరకు నియమించలేదు. తాజాగా జిల్లాల పునర్విభజన ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడంతో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పదవులపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు అంచనావేస్తున్నాయి. 
జిల్లాల వారిగా జాబితాలు సిద్ధం 
మొత్తం 31 జిల్లాలతో జిల్లా కార్యవర్గాల నియామకాన్ని చేపట్టేందుకు పార్టీ నేతలు జిల్లాల వారిగా జాబితాలు సిద్ధం చేయాలని పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా పోలిట్ బ్యూరో సహా రాష్ట్ర కార్యవర్గం అనుబంధ సంఘాలపై రాష్ట్ర స్థాయి నేతలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరో నెల రోజుల్లో పార్టీ  పదవులు, అనుబంధ సంఘాల కార్యవర్గాలను కూడా  ప్రకటించేందుకు  గులాబీ దళపతి రెడీ అవుతున్నట్లు సమాచారం. దీంతో కొత్త జిల్లాలుగా ఏర్పాటైన ప్రాంతాల్లో నేతల హడావుడి ఒక్క సారిగా పెరిగింది. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉండడంతో పార్టీ పదవులు దక్కినా  పట్టు సాధిస్తామన్న ధీమా నేతల్లో కనిపిస్తోంది. అయితే పార్టీ పదవుల్ని దక్కించుకునేందుకు కొత్త జిల్లాల్లో నేతలు తమ జిల్లా కీలక నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
కొత్త కార్యవర్గాల నియామకం అనంతరం పార్టీ పరంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ టీఆర్‌ఎస్‌ నేతల్లో కొత్త ఆశల్ని చిగురింపచేస్తున్నాయి. ఇప్పటికైనా పార్టీ పదవుల్ని దక్కించుకునేందుకు నేతలు తెగ ఆరాటపడుతున్నారు.  

 

07:24 - October 17, 2016

హుజుర్ నగర్ : సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసమే సీపీఎం పార్టీ మహా పాదయాత్ర చేపట్టిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు తెలిపారు. తెలంగాణలో తలపెట్టిన మహా పాదయాత్ర సందర్భంగా హుజుర్‌నగర్‌లో ఆ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, వామపక్ష నేతలు పాల్గొన్నారు. కళాకారుల ఆటపాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. 

 

నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేయనున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.  

 

నేడు మ.12 గం.లకు సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభం

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నంలో మధ్యాహ్నం 12 గంటలకు సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో పాదయాత్ర కొనసాగనుంది. 

పౌరసరఫరాలపై నేడు మంత్రి ఈటెల సమీక్ష

హైదరాబాద్ : పౌరసరఫరాలపై నేడు మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు మిల్లర్లతో ఈటెల సమావేశం కానున్నారు. 

Don't Miss