Activities calendar

18 October 2016

21:45 - October 18, 2016

ఢిల్లీ: బీసీసీఐకి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్‌ లోధా కమిటీ సంస్కరణల అమలుపై ఇచ్చిన తీర్పును తిరిగి సమీక్షించాలని కోరిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. వయో పరిమితి, పదవీకాలం, ఒకరికి ఒక పదవి, ఒక రాష్ట్రానికి ఒక ఓటు వంటివి అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని బీసీసీఐ వ్యతిరేకిస్తోంది. దీంతో సంస్కరణల అమలుకు రాష్ట్ర సంఘాలను ఒప్పించేందుకు మరింత సమయం కావాలని బీసీసీఐ కోర్టును కోరింది. 

21:43 - October 18, 2016

కర్ణాటక : కావేరి జలాల విడుదలపై కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మళ్లీ సీరియస్‌ అయింది. తమిళనాడుకు రోజుకు 2 వేల క్యూసెక్యుల నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ నీటిని విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. శాంతి భద్రతల పరిరక్షణకు రెండు రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు పేర్కొంది. కావేరీ నదీ జలాల విషయమై రేపు కూడా సుప్రీంలో విచారణ కొనసాగనుంది. కావేరీ జలాలపై రెండో రోజు కూడా తమిళనాడులో రైతు సంఘాలు, ప్రతిపక్షాలు రైలు రోకో కార్యక్రమం నిర్వహించాయి. పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఎగ్మోర్ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఆందోళనలో ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో, వీసీకే చీఫ్ టి.తురుమవలవన్ వామపక్షాల కార్యకర్తలు పాల్గొని ఎక్స్ ప్రెస్ రైలును అడ్డుకున్నారు.

21:40 - October 18, 2016

హైదరాబాద్ : టీటీడీకి విభజన సెగ తగిలింది. చిన్న దేవాలయాలకు టీటీడీ చెల్లించాల్సిన సొమ్మును చెల్లించడం లేదని హైకోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం దాఖలైంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 42 శాతంగా మొత్తం వెయ్యికోట్లు ఇవ్వాలని చిలుకూరు బాలజీ అర్చకులు సౌందర్ రాజన్ పిల్ వేశారు. పిల్ స్వీకరించిన హైకోర్టు మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏ.పీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు టీటీడీ కీ నోటీసులు జారీ చేసింది.

హైకోర్టులో పిల్ వేసిన చిలుకూరు బాలాజీ అర్చకుడు సౌందర్ రాజన్
వడ్డీ కాసుల వాడు వెంకటేశ్వరుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు బాకీ పడ్డారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 42 శాతం మొత్తం వెయ్యి కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు 1500 కోట్ల రూపాయలు చెల్లించాలి. చిన్న దేవాలయాలకు పెద్ద దేవాలయాలు నిధులిచ్చి ఆలయాలను రక్షించాలని గతంలో చట్టం చేశారు.తెలంగాణలో యాదగిరి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం, భద్రాచలం రామాలయంతో పాటు మరో రెండు దేవాలయాలు ఉన్నాయి. సీమాంధ్రలో ఆదాయం వచ్చే ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి అభివృద్థికి ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించేవి. పెద్ద ఆలయాల నుంచి వచ్చే ఆదాయంలోని కొంత మొత్తాన్ని చిన్న దేవాలయాల అర్చకుల వేతనాలు, వాటి అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. ఇందుకు టీటీడీ 1987 నుంచి 2014 వరకు తెలంగాణకు వెయ్యి కోట్ల రూపాయలు బాకీపడ్డారని ప్రధాన అరోపణ. విభజన చట్టం ప్రకారం చెల్లించాలని చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఏటా కేవలం 56 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు.

పిల్‌లో ఏడుగురిని ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్
అయితే ఈ పిల్ లో ఏడుగురిని ప్రతివాదులుగా చేర్చారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రెటరీలతో పాటు టీటీడీ పాలక మండలిని ప్రతివాదులుగా చేర్చారు. ఎండోమెంట్ గతంలో చట్టాలను పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి వాతావరణం నెలకొందని పిటిషనర్ విమర్శించారు. ఇందులో టీటీడీతో పాటు పలు అభివృద్ధి చెందిన దేవాలయాలు వాటాలు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ దేవాలయాలకు నష్టం జరిగిందని పిటిషనర్ ఆరోపించారు.

మూడు వారాల తర్వాత అఫిడవిట్‌ దాఖలు చేయనున్న ప్రతివాదులు
మొత్తానికి గతంలో అమలు కాని చట్టాలు ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన
తర్వాత తెర పైకి వస్తున్నాయి. తెలంగాణకు చెల్లించాల్సిన వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించడం లేదని పిల్ పై ఇరు రాష్ట్రాలు ఎలాంటి నివేదికలు అందజేస్తాయి.. టీటీడీ వివరణ ఎలా ఉండబోతుందనే అంశాలు ఆసక్తిగా మారాయి. మూడు వారాల తర్వాత ప్రతివాదులు కోర్టుకు కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేయనున్నారు. 

21:35 - October 18, 2016

హైదరాబాద్ : నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోడ్లు, భవనాలశాఖ అధికారులను ఆదేశించారు. దీని కోసం అవసరమైతే అమెరికా, యూరప్‌ వంటి దేశాల్లో పర్యటించి రావాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై సమగ్రంగా స్టడీ చేసి.. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలనే దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రోడ్లపై సీఎం.. క్యాంప్‌ కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రోడ్లు భవనాల శాఖపై సీఎం కేసీఆర్‌ సమీక్ష
క్యాంపు కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు తుమ్మల, లక్ష్మారెడ్డి ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రమాదాలు జరుగకుండా అంతర్జాతీయ స్థాయి క్వాలిటీతో తెలంగాణలో రహదారుల వ్యవస్థను తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రోడ్లు ఎలా ఉన్నాయి..? ఎలా ఉండాలి..? భవిష్యత్తులో మెరుగైన రోడ్ల వ్యవస్థ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలేంటి..? జాతీయ రహదారులుగా మార్చాల్సిన రూట్లు ఏవి..? కేంద్ర పథకాల ద్వారా నిర్మించాల్సిన రోడ్లు తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

2,500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను మంజూరు
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని సీఎం చెప్పారు. కేంద్రం నుంచి దాదాపు 2500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను మంజూరు చేయించుకోగలిగామని సీఎం చెప్పారు. జాతీయ రహదారులతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలతో నిర్మించే రహదారులు, రాష్ట్ర పరిధిలోని రహదారులు.. అన్నింటిని పరిగణలోకి తీసుకుని దానికి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగురోడ్ అవతలి నుంచి 330 కిలోమీటర్ల మేర రీజనల్ రింగు రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని సీఎం సూచించారు.

క్వాలిటీ రోడ్లకు ప్రాధాన్యత : కేసీఆర్
రహదారులు మన్నికగా ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అన్నారు. వర్షం వస్తే రోడ్లు పాడయ్యే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇతర దేశాల్లో అవలంభిస్తున్న ఆధునిక పద్దతులను అధ్యయనం చేసి అమలు చేయాలని కోరారు. యూరప్, అమెరికా దేశాల్లో రోడ్లు బాగుంటాయని, అక్కడ రోడ్లు ఎలా వేస్తున్నారో తెలుసుకోవాలని చెప్పారు.

21:30 - October 18, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో తుట్టె కదులుతోంది..ఇంతకాలం లీకులు మాత్రమే ఉండగా...సిట్‌ అధికారులు దీనికి సంబంధించిన సమాచారం సేకరించారు..పలు రకాల కేసులను విచారిస్తున్న సిట్‌ ఆధారాలు తీసుకుని సాక్ష్యుల ద్వారా వాంగ్మూలాలు రికార్డు చేశారు... స్టేట్‌మెంట్స్‌లలో పలువురు ప్రజాప్రతినిధులు.. పోలీసు అధికారుల పేర్లు బయటపడ్డాయి...ఇంతకాలం స్తబ్దుగా ఉందనుకున్న నయీం కేసులో కీలక మలుపు ఎలాంటి సంచనాలు సృష్టించనుందో....

నయీం కేసులో కీలక మలుపు...
గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ టీం అధికారులు కీలక ఆధారాలు సేకరించారు...నయీం దందాల్లో ఎందరో ఉన్నట్లు ఇప్పటికే తేలింది..దీనికి సంబంధించి విచారణ చేస్తున్న సిట్‌ లోతుగా దర్యాప్తు చేసి సాక్ష్యుల ద్వారా వాంగ్మూలాన్ని సేకరించారు...ఆ స్టేట్‌మెంట్‌ రికార్డులను కోర్టుకు సమర్పించారు...కోర్టుకు అందించిన రిపోర్ట్‌లో పోలీసు అధికారులతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు, నేతల పేర్లు ఉన్నాయి...దీంతో సిట్‌ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో విచారణ కీలక మలుపు తిరిగింది...

గంగసాని రవీందర్‌రెడ్డి స్టేట్‌మెంట్‌లో ఎమ్మెల్సీ నేతి
ఇప్పటికే అంతా ఊహిస్తున్నట్లే నిజమైంది... నయీం చేసిన ఎన్నో దందాల్లో ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ పేరు కూడా వచ్చింది..గంగసాని రవీందర్‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో నేతి విద్యాసాగర్ పేరు బయటకు వచ్చింది..ఇక నల్లగొండ జిల్లా చెందిన నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి పేరు మధ్యలో వచ్చినా ఆ తర్వాత మరుగున పడింది...కాని ఆధారాలు సేకరించిన సిట్‌ మధూకర్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ ద్వారా చింతల పేరును కూడా కోర్టుకు సమర్పించిన దానిలో చేర్చారు...

నర్సింహారెడ్డి స్టేట్‌మెంట్‌లో సీఐ వెంకట్‌రెడ్డి
ఇక నయీం కేసుల్లో ప్రధానం పోలీసు అధికారుల ప్రమేయం...దీనిపై ఇప్పటికే దుమారం చెలరేగుతుండగా సిట్ దర్యాప్తులో అధికారుల పేర్లు బయటకు వచ్చాయి..నయీం కేసు దర్యాప్తు చేస్తున్నప్పటి నుంచి కొందరు పోలీసుల సహకారం అందించినట్లు వచ్చిన సమాచారంతో ఇప్పటికే వారిని లూప్‌లైన్‌లో పెట్టారు..తాజాగా కొన్ని కేసుల్లో ఆధారాలు సేకరించి సాక్ష్యుల నుంచి సేకరించిన స్టేట్‌మెంట్‌లో ముగ్గురు పోలీసు అధికారుల పేర్లు బయటకు వచ్చాయి...ఇందులో ప్రధానంగా మొదటి నుంచి విన్పిస్తున్న పేరు డీఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్...ఆ తర్వాత డీఎస్పీ మస్తాన్‌వలీ, సీఐ వెంకట్‌రెడ్డిల పేర్లు ఉన్నాయి... నయీం చేసిన దందాలకు వీరు సహకరించినట్లు వాంగ్మూలం ద్వారా తేలింది...

నయీం బినామీలుగా గంగసాని రవీందర్‌రెడ్డి,
నయీం అరాచకాలు చేసి దానికి సంబంధించిన లావాదేవీల కోసం ఎందరో బినామీలు ఉన్నారు..అందులో కొందరిని ఇప్పటికే సిట్‌ అరెస్టు చేసి విచారణ చేయగా తాజాగా మరో ఐదుగురు పేర్లు బయటకు వచ్చాయి..నల్లగొండ జిల్లా చుట్టూ ఉంటున్న వీరంతా నయీంకు పూర్తిగా వెన్నంటే ఉంటూ బినామీలుగా వ్యవహరించారు...మొత్తానికి నయీం కేసులో బయటపడుతున్న పేర్లతో ఇక అరెస్టులకు రంగం సిద్దం చేసేందుకు సిట్‌ కదులుతుందని తెలుస్తోంది... కోర్టు అనుమతితో వీరందరిని విచారించి ఆ తర్వాత అరెస్టు చేయవచ్చని సమాచారం...

21:25 - October 18, 2016

గుంటూరు : పన్నెండు మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సభాహక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై వివరణ కోరుతూ తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 25, 26 తేదీల్లో ప్రివిలైజ్‌ కమిటీ ఎదుట హజరై వివరణ ఇవ్వాలని అదేశించింది.

గత శీతాకాల సమావేశాల్లో ప్రవర్తించి తీరుపై నోటీసులు
గత శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం విషయంలో నిరసన సందర్భంగా వైసీపీ సభ్యులు స్పీకర్‌ ప్రసంగాన్ని అడ్డుకుని.. పోడియం ఎక్కి నిరసన తెలిపారు. సభ్యుల ప్రవర్తనపై తీవ్రంగా స్పందించిన సభాహక్కుల సంఘం 12మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. ఈనెల 25, 26 తేదీల్లో తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, కోరుముట్ల శ్రీనివాసులు, చెర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, పాశం సునీల్‌కుమార్‌, కిలివేటి సంజీవయ్య, కంబాల జోగులుకు ఈ నోటీసులను జారీచేశారు.

వీడియో, ఆడియోలను ప్రదర్శించి సభ్యుల నుంచి దశలవారీగా వివరణ
సభలో జరిగిన గందరగోళ పరిస్థితులకు సంబంధించిన వీడియో, ఆడియోలను ప్రదర్శించి సభ్యుల్ని దశలవారీగా వివరణ కోరనున్నారు. అయితే సభ్యులు ఇచ్చిన వివరణల ఆధారంగానే వారిపై చర్యలు తీసుకోనున్నారు.

21:21 - October 18, 2016

విజయవాడ : ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. కాకినాడ-రాజమండ్రి గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, అనంతపురం-హిందూపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయించారు.

ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
సుమారు నాలుగు గంటలపాటు సాగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అర్బన్‌ ఏరియాలు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని.. అందుకే ఏపీలో మరో నాలుగు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. కాకినాడ-రాజమండ్రి గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, అనంతపురం-హిందూపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, నెల్లూరు-సూళ్లూరుపేట-నాయుడుపేటలకు కలిపి నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయించారు.

ఓర్వకల్లులో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సమావేశం ఆమోదం
అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. 2018 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేబినెట్ తెలిపింది. రాజధాని నిర్మాణ చట్ట సవరణకు నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం.. ఏపీ పారిశ్రామిక అభివృద్ధి చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. ఇక సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం అన్ని నియోజకవర్గాల్లో వంద ఎకరాల్లో పారిశ్రామిక పార్క్‌లు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కరువు, భూగర్భ జలమట్టం వంటి అంశాలపై కేబినెట్‌లో చర్చించారు. కల్తీ విత్తనాల తయారీ కంపెనీలు, అమ్మకందారులపై.. పీడీ యాక్టు పెట్టాలని కేబినెట్‌లో నిర్ణయించారు. డాటెడ్‌ ల్యాండ్స్‌పై తదుపరి కేబినెట్‌ సమావేశంలో..చర్చించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. దోమలపై దండయాత్రకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. 

10వ షెడ్యూల్ సంస్థలపై ముగిసిన ఇరురాష్ట్రాల సమావేశం..

ఢిల్లీ : పదో షెడ్యూల్ సంస్థలపై ఇరు రాష్ర్టాల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తెలంగాణ తరపున అధికారులు రామకృష్ణారావు, రాజీవ్ రంజన్ ఆచార్య, ఏపీ నుంచి అధికారులు కుటుంబరావు, బాలసుబ్రమణ్యం హాజరయ్యారు. ఉన్నత విద్యామండలి అంశంలో లిఖిత పూర్వక ప్రతిపాదనలు అందిన వారంలోగా స్పందిస్తామని రాష్ట్ర అధికారులు సమావేశంలో పేర్కొన్నట్లు సమాచారం. పదో షెడ్యూల్‌లోని అన్ని సంస్థల విషయంపైనా చర్చించాలని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో చర్చించిన విషయాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని ఇరు రాష్ర్టాల అధికారులు తెలిపారు.

చంచల్ గూడ జైలు తరలింపు?..

హైదరాబాద్‌: చంచల్‌గూడ కారాగారం తరలింపునకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌ త్రివేది, జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రాజీవ్‌ శర్మ సమావేశమయ్యారు. చంచల్‌గూడ జైలు స్థానంలో మైనార్టీలకు గురుకుల విద్యా సంస్థ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనుగుణంగా జైలు తరలింపు సాధ్యాసాధ్యాలు, ప్రత్యామ్నాయాలపై అధికారులతో సీఎస్‌ చర్చించారు.

20:00 - October 18, 2016

విజయవాడ : ఏపీ కేబినెట్‌ భేటీ కొనసాగుతోంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయించింది. కాకినాడ-రాజమండ్రి గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, అనంతపురం-హిందూపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, నెల్లూరు-సూళ్లూరుపేట-నాయుడుపేటలకు కలిపి.. నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. 1916లో బ్రిటీష్‌ ప్రభుత్వం పెట్టిన డాట్‌ ల్యాండ్స్‌ను పరిశీలించి.. సమస్యలను పరిష్కరించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 

దేవాలయ భూములను కూడా వదలని నయీం ..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఫ్రైడ్ ఇండియా కంపెనీ ఎండీ సనోబేర్ బేగ్ పై సరూర్ నగర్ పీఎస్ లో కేసు నమోదయ్యింది. 341,506 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. దేవాదుల గుట్ట స్వయంభు హనుమాన్ దేవాలయానికి చెందిన 4 ఎకరాల భూమిని నయీం ,సనోబేర్ బేగ్ కబ్జా చేసినట్లుగా కేసులో పేర్కొన్నారు. ఏ1 నిందితుడుగా నయీం,ఏ2గా రియాజ్, ఏ3గా సనోబేర్ బేగ్ పై కేసులు నమోదయ్యాయి. 

కింగ్ ఫిషర్ విల్లా వేలం?!..

ముంబై: లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్‌మాల్యాకు చెందిన ‘కింగ్ ఫిషర్ విల్లా’ను రేపు వేలం వేయనున్నారు. గోవాలోని అందమైన బీచ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న కింగ్ ఫిషర్ విల్లాను ఎస్‌బీఐ నేతృత్వంలో ఏర్పడిన 17బ్యాంకుల లెండర్ (రుణదాతలు) కన్సార్టియమ్ వేలానికి పెట్టనున్నట్లు సమాచారం.

19:13 - October 18, 2016

ప్రకాశం : ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమం అభాసుపాలవుతోంది. నిర్దేశించిన లక్ష్యం నీరుగారిపోతోంది. దళారులు,పైరవీకారులకు తప్ప సామాన్యుల సమస్యలు పట్టించుకునే అధికారులే కరువయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో మీకోసం కార్యక్రమం సాగుతున్న తీరుపై 10 టీవీ కథనం.

పురోగతి లేని మీకోసం
మీ కోసం.. పురోగతిని ప్రజల నోటే వింటాను... నేరుగా ఫోన్‌ చేసి వారి సమస్యలు పరిష్కరిస్తానని ఓవైపు సాక్షత్ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా ఉన్నతాధికారుల తీరు మీ కోసం కార్యక్రమం లక్ష్యాన్ని నీరు గారుస్తోంది. ప్రజలు కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోతోంది.

ప్రకాశం జిల్లాలో నీరుగారిపోతున్న మీకోసం
సమస్యలు వేలల్లో పరిష్కారం పదుల్లో అన్నట్లుగా మీకోసం పరిస్థితి మారింది. ఇందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు మీకోసం కార్యక్రమానికి హాజరుకాకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మొక్కుబడిగా మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దూరభారాలు లెక్కచేయకుండా పలు సమస్యలతో కలెక్టరేట్‌కు వచ్చే జనాన్ని మీ కోసం నిరాశపరుస్తోంది. మరోవైపు దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం తప్ప సత్వర పరిష్కారం చూపడం లేదంటున్నారు.

అధికారులు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు
కలెక్టర్‌ లేకుండా కిందిస్థాయి అధికారులతోనే మీకోసం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మండల కార్యాలయాల్లో గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని.. కలెక్టరేట్‌కు వస్తే ఇక్కడ కూడా నిరాశ మిగులుతుందంటున్నారు జనం. ఇంటి స్థలం కబ్జా చేశారని ఒకరు, స్మశాన స్థలాన్ని వదలిపెట్టడం లేదని ఇంకొకరు అత్యవసర సహయం కోసం వచ్చినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అత్యవసర సహయం అందించడంలో అలసత్వం
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ఉద్దేశించిన మీకోసం కార్యక్రమ ఉద్దేశం ఆచరణలో మాత్రం నీరుగారిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మీకోసం పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

19:01 - October 18, 2016

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో కీలక సాక్షుల వాంగ్మూలాలను కేసు దర్యాప్తు బృందం (సిట్‌) నమోదు చేసింది. ఈ సందర్భంగా సాక్షుల వాంగ్మూలాల్లో ఇద్దరు నేతలు, పోలీసుల పేర్లు వెలుగులోకి వచ్చినట్లుగా సమాచారం.  నయీం బినామీల స్టేట్‌మెంట్‌లో పోలీసులు, నేతల పేర్లు బయటకొస్తున్నాయి. ఈ నివేదికతో పోలీసులు, నేతల పేర్లను సిట్‌ కోర్టుకు సమర్పించింది. మధూకర్ రెడ్డి స్టేట్ మెంట్ తో చింతల వెంకటేశ్వర్ రెడ్డి, నర్శింహారెడ్డి స్టేట్ మెంట్ తో సీఐ వెంకట్ రెడ్డి, నాగేంద్రప్రుసాద్ స్టేట్ మెంట్లఓ డీఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్ ,యూసఫ్ ఖాన్ స్టేట్ మెంట్ తో డీఎస్పీ మస్తాన్ వలీ పేర్లను సిట్ నివేదికలో పేర్కొంది. 

18:56 - October 18, 2016

గుంటూరు : ఏపీ కేబినెట్‌ భేటీ కొనసాగుతోంది. ఇందులో రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ..కేంద్రం నుంచి వచ్చే ప్యాకేజీ నిధులపై చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే.. భూ వినియోగ మార్పిడి సులభతరం చెయ్యడంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మండవల్లిలో మెగా ఫుడ్ పార్కు కోసం సేకరించిన 12 వందల ఎకరాల భూమిని.. మార్కెట్‌ రేటు ప్రకారం పరిశ్రమల స్థాపనకు ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఏపీఎల్ఎల్ సీకి పలు పరిశ్రమల స్థాపనకు భూములను కేటాయించనున్నారు. విత్తన కల్తీని అరికట్టేందుకు చట్టంలో మార్పులపై నిర్ణయం తీసుకుంటారు. కేంద్ర ఆహార భద్రతా చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ఆహార భద్రతా చట్టం రూపొందించడంపై కేబినెట్‌ దృష్టి సారించనున్నట్లు సమాచారం.

18:05 - October 18, 2016

రంగారెడ్డి : తెలంగాణలో సామాజిక న్యాయం-సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం చేపట్టిన మహాజనపాదయాత్రకు గ్రామాల్లో విశేష స్పందన లభిస్తోంది. ఇబ్రహీంపట్నం ఎలిమినేడులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు 9 మంది సభ్యుల బృందం పర్యటిస్తోంది. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల అభిప్రాయాలను సీపీఎం తెలుసుకుంటోంది. ఈ సందర్భంగా ఎలిమినేడు గ్రామానికి సీపీఎం మహాపాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా స్థానికులు వారి సమస్యలను వెళ్ళబోసుకున్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర రథసారధి తమ్మినేని మాట్లాడుతూ..రేషన్ కార్డులు, వృద్దాప్య పెన్షన్లు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఇబ్రహీపట్నం మండలం ఎలిమినేడులో తమ్మినేని రెండోరోజు మహాపాదయాత్ర కొనసాగుతోంది. స్థానిక ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అందకున్నా.. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని తమ్మినేని ప్రశ్నించారు. వీటన్నింటికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అక్రమంగా తొలగించిన రేషన్ కార్డు : జాన్ వెస్లీ
సామాజిక న్యాయం..సమగ్రాభివృద్ధి ఎజెండాతో సీపీఎం ప్రారంభించిన మహాజన పాదయాత్ర ఎలిమినేడు గ్రామానికి చేరుకుంది. గ్రామంలోని అన్ని వర్గాలు పాదయాత్రను పూర్తిగా మద్ధతు తెలుసుతు తెలుపుతున్నారని పాదయాత్ర సభ్యులు జాన్ వెస్టీ పేర్కొన్నారు. ఓ వృద్ధురాలి ఇంటిముందు నిలిపి వున్న కారును ఆ ఇంటికి సంబంధించేనని అధికారులు సదరు వృద్ధురాలి రేషన్ కార్డును రద్దు చేసినట్లుగా తెలిపిందని జాన్ వెస్టీ పేర్కొన్నారు. స్థానికంగా వున్న సమస్యలను స్థానికులు పాదయాత్ర బృందానికి తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. 

17:55 - October 18, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి కావడంతో ఇప్పుడు తాజాగా విద్యారంగంపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. ఒకవైపు జిల్లా విద్యాధికారులకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసిన ప్రభుత్వం...మరోవైపు రాష్ట్రంలోని అన్నీ యూనివర్శిటీల్లో నాణ్యతా ప్రమాణాలపై ఫోకస్ చేసింది. ప్రాధమిక విద్య మొదలుకుని యూనివర్సిటీ స్థాయి వరకు క్వాలిటి ఎడ్యుకేషన్ అందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తు ముమ్మరం చేసింది.

వీసీలు, రిజిస్ట్రార్లు, ఉన్నతాధికారులతో కడియం భేటీ
తెలంగాణాలోని అన్ని యూనివర్శిటీల్లో నాణ్యతా లోపం చాలా క్లియర్ గా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు డిప్యూటి ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. విద్యాశాఖలో నాణ్యతా ప్రమాణాలు పెంపు కోసం రాష్ట్రంలోని అన్నీ యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, ఇతర ఉన్నతాధికారులతో హైద్రాబాద్ లోని ఉన్నత విద్యామండలిలో కడియం భేటీ అయ్యారు. ప్రాధమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు గత ప్రభుత్వాల వల్ల నిర్లక్ష్యానికి గురయ్యాయని అందుకే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని ఆయన అన్నారు.

నాణ్యతా ప్రమాణాలు, నిధులు, నియామకాలు చేపట్టలేదు- కడియం
మరోవైపు యూనివర్శిటీలకు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి, ఎటువంటి ప్రమాణాలు పాటించలేదని, నిధులు కేటాయించలేదని, నియామకాలు చేపట్టలేదని కడియ ఆగ్రహం వ్యక్తం చేసారు. అందుకే చెప్పుకోదగ్గ పరిశోధనలు కూడా ఈ మధ్య కాలంలో జరగలేదని గుర్తు చేసారు. కొత్తగా నియమితులైన వీసిలు చాలెంజింగ్‌గా పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.

మార్కెట్‌లో డిమాండ్‌కి తగ్గట్టుగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలి- కడియం
తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని కడియం తెలిపారు. మార్కెట్ లో డిమాండ్ కి తగ్గట్టుగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రపంచ దేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో.. తెలంగాణా యూనివర్సిటీలు పోటీ పడేవిధంగా తయారవ్వాలన్నారు. అందుకు కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని కడియం స్పష్టం చేశారు. . 

17:53 - October 18, 2016

ఢిల్లీ : ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఓ విద్యార్థి మిస్సింగ్‌ కావడం ఆందోళనకు దారి తీసింది. బయోటెక్నాలజీకి చెందిన విద్యార్థి నజీబ్‌ అహ్మద్ శనివారం నుంచి కనిపించడం లేదు. దీంతో అతడు ఉండే హాస్టల్‌ ముందు నజీబ్‌ పేరెంట్స్‌ ఆందోళన చేపట్టారు. నజీబ్‌ అహ్మద్‌ క్యాంపస్‌లోకి అడుగుపెట్టి కేవలం 15 రోజులే అవుతోంది. హాస్టల్‌ మెస్‌ కమిటీ ఎన్నికల సందర్భంగా నజీబ్‌ అహ్మద్‌కు ఏబివిపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగిందని వామపక్ష విద్యార్థులు చెబుతున్నారు. అదేరోజు రాత్రి నజీబ్‌ యూపిలో ఉన్న తన పేరెంట్స్‌కు సమాచారమిచ్చాడు. వారు వచ్చే లోపే నజీబ్‌ మిస్సయ్యాడు. ఏబివిపి కార్యకర్తలే నజీబ్‌ను కిడ్నాప్‌ చేశారని పేరెంట్స్‌ ఆరోపిస్తున్నారు. పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నజీబ్‌ కోసం క్యాంపస్‌లోని హాస్టల్‌ రూములన్నీ సోదా చేయాలని జెఎన్‌యు ఆదేశించింది.

17:51 - October 18, 2016

పశ్చిమ బెంగాల్‌ : ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఓ యువతి చిక్కుల్లో పడింది. దుర్గా నవరాత్రుల సందర్భంగా కోల్‌కతాలో దుర్గాదేవి శోభాయాత్ర జరిగింది. ఇందుకోసం భారీగా ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టడాన్ని కోలకతా యూనివర్శిటీలో పీజీ చదువుతున్న 21 ఏళ్ల యువతి.. తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వైపు నిరుద్యోగం, పేదరికం లాంటి సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే శోభాయాత్రను నిర్వహించడం సరికాదని పేర్కొంది. సిఎంపై విమర్శలు చేసినందుకు ఆగ్రహించిన టిఎంసి కార్యకర్తలు యువతి ప్రొఫైల్‌ ఫొటోతో కూడిన పోస్ట్‌ను పెద్ద హోర్డింగ్‌ చేసి కోల్‌కతా వీధుల్లో ఏర్పాటు చేశారు. దీంతో ఆ యువతి బెదిరిపోయింది. తనకు టిఎంసి నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయని పేర్కొంది. తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని స్థానికులు ఆ యువతికి మద్దతు ప్రకటించారు. 2012లో మమతాబెనర్జీని విమర్శించేలా ఉన్న కార్టూన్‌ను ఈ-మెయిల్‌ చేసినందుకు ఓ ప్రొఫెసర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

17:48 - October 18, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆధార్ న‌మోదు వందశాతం దిశ‌గా అడుగులేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 4కోట్ల మందికి పైగా ఆధార్ కార్డును పొందారు. ఇది రాష్ట్ర జ‌నాభాలో 92.92 శాతం కాగా.మిగిలిన వారికి కూడా ఆధార్ కార్డును జారీ చేయ‌డానికి స‌ర్కారు సిద్దమ‌వుతోంది. అక్రమాలు, అవినీతిని అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రతి ప్రభుత్వ ప‌థ‌కానికి ఆధార్‌ను అనుసంధానం చేయడంతో..ప్రజలంతా ఆధార్‌ను తప్పనిసరిగా తీసుకుంటున్నారు.

ఏపిలో ఆధార్ న‌మోదు వందశాతం..
ఏపిలో ఆధార్ న‌మోదు వందశాతం దిశ‌గా అడుగులేస్తోంది. ప్రతి వ్యక్తికి గుర్తింపు ఉండేలా గత యూపీయే ప్రభుత్వం ఆధార్‌ను ప్రవేశ పెట్టింది. దీంతో ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఆధారే ఆధారం అవుతోంది. ప్రభుత్వ ప‌థకాన్ని పొందాల‌న్నా, స్కూల్, కాలేజీల‌లో ఫీజ్ రీయంబ‌ర్స్ మెంట్ పొందాల‌న్నా, వంట‌గ్యాస్ స‌బ్బిడి పొందాల‌న్నా..ఇలా ప్రతి ప‌నికి ఆధార్ త‌ప్పనిసరిగా ప్ప‌నిస‌రిగా మారిపోయింది. పాఠ‌శాల‌లో పిల్లలను జాయిన్‌ చేయాల‌న్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల‌న్నా ఖ‌చ్చితంగా ఆధార్ ఉండాల్సిందే. ఏపిలో ప్రతి ప్రభుత్వ ప‌థకానికి ఆధార్ కార్డు త‌ప్పనిసరి చేశారు. ఇంత ప్రాధాన్యత ఉండ‌డంతో..ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు పొందడానికి క్యూ క‌డుతున్నారు. ఆధార్ కార్డుల జారీ కోసం ఏపిలో పెద్ద ఎత్తున్న ఆధార్ కార్డు న‌మోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల‌లో వేలిముద్రలు, క‌ళ్ల న‌మునాలు సేక‌రించి చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మీ సేవా కేంద్రాల‌లో కూడా ఆధార్ న‌మోదు, జారీ ప్రక్రియను చేస్తున్నారు. కేవ‌లం ఆధార్ కార్డుల జారీయే కాకుండా...త‌ప్పుఒప్పుల‌ను కూడా స‌రిదిద్దుతున్నారు.

ఆధార్‌ నమోదు కేంద్రాలకు క్యూ కడుతున్న జనం
5కోట్లకుపైగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ జ‌నాభాలో 4 కోట్ల 55 లక్షల 55 వేల 513 మంది ఆధార్ కార్డు పొందిన‌ట్లు ప్రభుత్వ గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇది రాష్ట్ర జ‌నాభాలో 92.92 శాత‌మ‌ని..మిగిలిన వారంద‌రికి కూడా ఆధార్ కార్డులు జారీ చేసి,..100 ‌శాతం ఆధార్ రాష్ట్రంగా ఏపిని తీర్చిదిద్దడానికి స‌ర్కారు ప్రణాళికలు రచిస్తోంది. 

17:44 - October 18, 2016

ప్రకాశం : ఆర్‌ఎల్‌పురంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గ్రానైట్‌ క్వారీలో పడి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు మృతదేహాలను అధికారులు వెలికితీయలేదు. 200 మీటర్ల లోతులో మృతదేహాలు పడి ఉన్నాయి.. మృతదేహాలను బయటకి తీయడం తమ వల్ల కాదంటూ గజ ఈతగాళ్లు చేతులెత్తేశారు. 

17:43 - October 18, 2016

హైదరాబాద్ : కేసీఆర్ తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చి కొత్తగా సచివాలయం నిర్మిస్తాననడం తుగ్లక్ పాలనను గుర్తు చేస్తోందన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తు కాంట్రాక్టులన్నీ వారికే అప్పగిస్తున్నాడని కోమటి రెడ్డి ఆరోపించారు. దేశంలోనే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ పేరుతెచ్చుకోవడం కేసీఆర్ పాలనతీరుకు నిదర్శనమన్నారు. 

కావేరీ జలాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆదేశాలు..

కర్ణాటక : క‌ర్ణాట‌క-త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య కొన‌సాగుతున్న కావేరీ న‌దీ జ‌లాల వివాదంపై ఈ రోజు సుప్రీంకోర్టు మ‌రోసారి విచార‌ణ జ‌రిపింది. వాద‌న‌లు విన్న అనంత‌రం రేపు ఇదే అంశంపై మ‌రోసారి విచార‌ణ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున త‌మిళ‌నాడుకు నీటిని విడుద‌ల చేయాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలు సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించింది. మరోవైపు ఈ రోజు త‌మిళ‌నాడులో కేంద్రం, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి.

17:28 - October 18, 2016

హైదరాబాద్ : మియాపూర్ లోని ఓ ప్రయివేట్ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రయివేటు కళాశాలలో ఎంపీసీ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక అనే విద్యార్థిని పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆప్రాంతంలో విషాదం నెలకొంది. విద్యార్థినుల సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సాత్విక నిజామాబాద్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. కాగా సాత్విక హోమ్ సిక్ తో బాధపడేదని సాటి విద్యార్థినులు పేర్కొన్నారు. సాత్విక విద్యాభాసం అంతా నిజామాబాద్ లోనే జరిగింది. ఒక్కసారిగా నగరంలో తల్లిదండ్రులకు దూరంగా వుండాల్సిరావటంతో హోమ్ సిక్ తోనే సాత్విక ఆత్మహత్యకు చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో తనిఖీలు..

హైదరాబాద్ : ఒరిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ తనిఖీలు చేపట్టినట్లుగా అగ్నిమాపక శాఖ డీజీ రాజీవ్ రతన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇంతవరకూ 77 ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వఝహించినట్లుగా తెలిపారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై విచారణ చేస్తున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ లోనే పారామిత్ర ఆసుపత్రి,ఈఎస్ఐ, మాట్రిక్స్, ఎండో యూఎస్, శ్రీకళ ఆసుపత్రులు ఎటువంటి నిబంధనలు పాటించటంలేదనట్లుగా గుర్తించామన్నారు. ఒడిశాలో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

మియాపూర్ కార్పొరేట్ కళాశాలలో దారుణం..

హైదరాబాద్ : మియాపూర్ కార్పొరేట్ కళాశాల దారుణం చోటు చేసుకుంది. పెట్రోల్ పోసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన సాత్వికగా గుర్తించారు. కళాశాలలో చదివే ఆసక్తి లేకే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. 

రేపు కృష్ణా జలాలపై రేపు కీలక తీర్పు?!..

ఢిల్లీ : కృష్ణా జలాలపై కృష్ణా ట్రిబ్యునల్ కీలక తీర్పునివ్వనుంది. ఈ తీర్పును అనుసరించి తీసుకోవాల్సిన న్యాయపరమైన కార్యాచరణ రూపొందించటానికి మంత్రి హరీష్ రావు సూచన మేరకు తెలంగాణ న్యాయవాదుల బృందం ఢిల్లీకి పయనమైంది.  

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..

హైదరాబాద్ : మియాపూర్ లోని ఓ ప్రయివేట్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక అనే విద్యార్థిని పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం మేరకు సంఘటాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సాత్విక నిజామాబాద్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు.

16:41 - October 18, 2016

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 521 పాయింట్లు లాభపడి 28,050 వద్ద ముగిసింది. నిఫ్టీ 158 పాయింట్లు లాభపడి 8,677 వద్ద ట్రేడ్ అయింది. కాగా, హైదరాబాద్ నగర బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.30,310గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.28,260కి అమ్ముడవుతోంది. కిలో వెండి ధర రూ.44,885 పలుకుతోంది.

నకిలీ నోట్ల గుట్టు రట్టు..

రంగారెడ్డి : జిల్లాలోని జవహర్‌నగర్‌లో నకిలీనోట్లు చెలామణి చేస్తున్న రెండు ముఠాలకు చెందిన సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్‌కు చెందిన ఏడుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 39 వేల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

పీఎస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

కరీంనగర్ : పెదపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కొయ్యూరు పీఎస్ వద్ద చోటుచేసుకుంది. ఓ కేసు విచారణలో పోలీసులు వేధిస్తున్నారంటూ పేర్కొంటూ ప్రేమ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి పీఎస్ వద్ద పురుగులమందు తాగిండు. వెంటనే స్పందించిన పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం మంథని ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రేమ్‌కుమార్‌రెడ్డి గుప్తనిధుల తవ్వకాల కేసులో నిందితుడిగా ఉన్నాడు.

ఏపీకి ప్రత్యేక హోదాపై పిటిషన్..

హైదరాబాద్ : ప్రత్యేకహోదాపై 'ప్రత్యేకహోదా సాధన సమితి' అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆయన పిల్ వేశారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రెండు వారాల తరువాత దీనిని విచారిస్తామని తెలిపింది. 

రాజకీయ పార్టీని స్థాపించిన ఉక్కుమహిళ..

మ‌ణిపూర్ : ఉద్య‌మ‌కారురాలు ఇరోమ్‌ ష‌ర్మిలా రాజ‌కీయ పార్టీని ప్రారంభించారు. ఆ పార్టీకి ప్ర‌జా(ప్రజ) అని పేరు పెట్టారు. ప్ర‌జా అంటే పీపుల్స్ రిస‌ర్జెన్స్ అండ్ జ‌స్టిస్ అలియ‌న్స్ పార్టీ. రానున్న మ‌ణిపూర్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున ఆమె పోటీకి దిగ‌నున్నారు. న్యాయం, ప్రేమ‌, శాంతి వంటి సూత్రాల‌తో పార్టీని నిర్మిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. తౌబాల్‌, ఖురియా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఆమె పోటీ చేయ‌నున్నారు. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మ‌ణిపూర్‌లో త‌మ పార్టీ నుంచి 20 మంది అభ్య‌ర్థులు పోటీప‌డుతార‌ని ఆమె చెప్పారు.

రాష్ట్రపతితో ఆంగ్ సాన్ సూకీ భేటీ..

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో మయన్మార్ విదేశాంగ శాఖ మంత్రి అంగ్‌సాన్ సూకీ భేటీ అయ్యారు. ఇవాళ ఆమె రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు భారత్, మయాన్మార్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలపై చర్చించారు. 

16:17 - October 18, 2016

కరీంనగర్ : పెద్దపల్లి జిల్లా కొయ్యూరులో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుప్తనిధుల తవ్వకాల కేసులో ప్రేమ్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని అందుకే ఆత్మహత్యకు పాల్పడానని నిందితుడు ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం మంథని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

16:11 - October 18, 2016

హిమాచల్‌ ప్రదేశ్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోది హిమాచల్‌ ప్రదేశ్‌లో మూడు జలవిద్యుత్‌ కేంద్రాలను ప్రారంభించారు. మండి జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కొల్డామ్‌, పార్వతీ రెండో దశ ప్రాజెక్టు, రాంపూర్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక పురాతత్వ విభాగపు పనులు చేయాల్సి వస్తోందని, పెండింగ్‌ ప్రాజెక్టుల ఫైళ్లని తిరగ దోడుతున్నట్లు ప్రధాని చెప్పారు. 1981లో ప్రారంభించిన ఓ రైల్వే ప్రాజెక్ట్‌ను ఇంతవరకు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో 34 కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్టు ఇపుడది 2 వేల వంద కోట్లకు చేరుకుందని, ఫలితంగా ప్రభుత్వంపై భారం పడుతోందని మోది అన్నారు. భారతీయ ఆర్మీ శక్తిపై తమకు గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మన ఆర్మీపై చర్చ జరుగుతోందని ఈ సందర్భంగా మోది తెలిపారు. ప్రధానిగా మోది తొలిసారిగా హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. 

16:07 - October 18, 2016

రంగారెడ్డి : జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారంలో విషాదం చోటుచేసుకుంది. సాయి ప్రియా కెమికల్ కంపెనీలో పేలుడు జరగడంతో.. బీహార్ కు చెందిన శివ చరణ్ భీమ్ అనే కార్మికుడు చనిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాచారానికి చెందిన ఆంజనేయులు, నాగరాజు పరిస్థితి విషమంగా ఉంది. ఈ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో గతంలో గండి చెరువులో ఎస్ఓటి పోలీసులు సీజ్‌ చేశారు. అక్కడి నుంచి రహస్యంగా బాచారం శివారులోకి తరలించారని స్థానికులు చెబుతున్నారు. 

16:04 - October 18, 2016

హైదరాబాద్ : 2014 ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మారెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో టీడీపీ ఎన్నికల మేనీఫెస్టోను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అయినా ఇంత వరకు యువత కోసం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. 

16:00 - October 18, 2016

నిజామాబాద్ : తెలంగాణలో జిల్లాల వేడి కొనసాగుతోంది. తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్లు అధికమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేయడంతో జిల్లాల సంఖ్య 31కి చేరింది. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడను జిల్లాగా ప్రకటించాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహర దీక్షలకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారానికి వీడియో చూడండి..

15:59 - October 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నేత నారాయణ.. విరుచుకుపడ్డారు. నయీం ఎన్‌కౌంటర్‌ జరిగినంత మాత్రాన సంతోషపడనక్కర్లేదని.. నయీం లాంటి శక్తులను పుట్టించే వ్యవస్థ ప్రస్తుత ప్రభుత్వానికి ఉందని ఆయన ఆరోపించారు. నయీం కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్‌ వేశామన్నారు. ఇక్కడ న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టుకు.. అక్కడ న్యాయం జరగకపోతే చివరగా ప్రజా కోర్టులో తేల్చుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం హిడెన్‌ ఎజెండాతో పనిచేస్తోందని నారాయణ ఆరోపించారు. 

15:55 - October 18, 2016

బియ్యం పిండితో వంటలతో పాటు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించవచ్చు. ఈ పిండిని శరీరానికి అప్లై చేయడం ద్వారా లాభాలు కలుగుతాయి. పాతకాలంలో చర్మ రక్షణకు దీనినే ఎక్కువగా వాడేవారంట. ఇది చర్మంపై ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరి దీనిని ఎలా వాడాలి ?
బియ్యం పిండి..ఓట్ మీట్..పాల పొడి మిశ్రమాలను కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో స్కిన్ టోన్ చాలా అందంగా బ్రైట్ గా మారుతుంది.
బాగా పండిన అరటి పండు, ఆముదం, బియ్యం పిండి కలిపి ప్యాక్ కింద తయారు చేసుకోని కళ్ల కింద రాసుకొంటే డార్క్ సర్కిల్స్ మటుమాయమవుతాయి.
బియ్యం పిండి, ఆలోవెరా జెల్‌, తేనె కలిపి పేస్టుగా చేసుకుని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే, ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి.
బియ్యంపిండి, ఎగ్‌ వైట్‌ , తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల స్కిన్‌ టైట్‌గా ఉంటుంది.
మిల్క్ క్రీం, బియ్యం పిండి, గ్లిజరిన్ సమాన మోతాదులో తీసుకుని చర్మానికి అప్లై చేయాలి. ముఖం..మెడకు రాయాలి. ఆరిన తరువాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి. 

15:33 - October 18, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్పమత్తమైన రైల్వే పోలీసులు బాంబ్ స్వాడ్ తో సహా స్టేషన్ లో గాలింపు చర్యలు చేపట్టారు. రెండవ నంబరు ప్లాట్ ఫారంపై బాంబు వుందంటూ ఓకాల్ వచ్చింది. దీంతో ఆరు బృందాలుగా విడిపోయిన రైల్వే పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. స్టేషన్ కు వున్న ప్రధాన ద్వారాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా పలుమార్లు స్టేషన్ కు ఆకతాయిలు ఇటువంటి బెదింపు కాల్స్ చేయటం పరిపాటిగా మారిపోయింది. కానీ ఆ వార్త వాస్తవం అయితే పరిస్థితి ఎలావుంటుందోననే నేపథ్యంలో పోలీసులు, బాంబ్ స్వాడ్ గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.

కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ..

విజయవాడ : కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కేంద్రం నుండి వచ్చే ప్యాకేజీ నిధులపై చర్చించనుంది. భూ వినియోగ మార్పిడి సులభతరం చేయడం..విత్తన కల్తీని అరికట్టేందుకు చట్టంలో మార్పులు.. కేంద్ర ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ఆహార భద్రత చట్టం రూపొందించడం..ఏపీఐఐసీకి పలు పరిశ్రమల స్థాపనకు భూముల కేటాయింపు..తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. 

కథా రచయిత చిలుకూరి దేవపుత్ర అస్తమయం..

అనంతపురం : కథా రచయిత చిలుకూరి దేవపుత్ర అస్తమయమయ్యారు. ఆయన స్వగృహంలో మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు కథా సాహిత్యంపై దేవపుత్ర చెరగని ముద్ర వేశారు. రాయలసీమ కరవు, వర్గ కక్షలు, అణగారిన బతుకులే ప్రధానాంశాలుగా కథా సృజన చేశారు. ఆరు గ్లాసులు, చివరి మనుషులు, ఏకాకి నౌక చప్పుడు వంటి ఎన్నో గొప్ప కథలు రాశారు. చిలకూరి నవలలో అద్దంలో చందమామ, చీకటి పూలు, పంచమం విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్..

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న బాంబు స్వ్కాడ్ తనిఖీలు చేపట్టింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

15:13 - October 18, 2016

గుంటూరు :కాసేపట్లో ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. ఇందులో రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ..కేంద్రం నుంచి వచ్చే ప్యాకేజీ నిధులపై చర్చించనున్నారు. అలాగే.. భూ వినియోగ మార్పిడి సులభతరం చెయ్యడంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మండవల్లిలో మెగా ఫుడ్ పార్కు కోసం సేకరించిన 12 వందల ఎకరాల భూమిని.. మార్కెట్‌ రేటు ప్రకారం పరిశ్రమల స్థాపనకు ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఏపీఐఐసీకి పలు పరిశ్రమల స్థాపనకు భూములను కేటాయించనున్నారు. విత్తన కల్తీని అరికట్టేందుకు చట్టంలో మార్పులపై నిర్ణయం తీసుకుంటారు. కేంద్ర ఆహార భద్రతా చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ఆహార భద్రతా చట్టం రూపొందించడంపై కేబినెట్‌ దృష్టి సారించనున్నట్లు సమాచారం.

మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని అకస్మిక తనిఖీలు..

విజయవాడ : పాత ప్రభుత్వాసుపత్రిలో మహిళ కమిషన్ ఛైర్మన్ నన్నపనేని అకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆసుపత్రిలో సమస్యలున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఆసుపత్రిలో బెడ్స్, గదుల కొరత ఉందని నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. ఒకే బెడ్ పై ఇద్దరు రోగులు ఉండడం దారుణమని, తక్షణమే వెయ్యి బెడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. 

పోలీసు సిబ్బందికి పెరిగిన పని ఒత్తిడి - డీజీపీ..

విజయవాడ : పోలీసు సిబ్బందికి పని ఒత్తిడి పెరిగిందని డీజీపీ పేర్కొన్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పట్టించుకోకపోవడంతో ప్రాణాపాయం ఏర్పడుతుందని, డీప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు అందుతున్న సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు, కుటుంబసభ్యులకు ఆరోగ్య భద్రత కల్పించడంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఆర్ఎల్ పురంలో అధికారుల నిర్లక్ష్యం..

ప్రకాశం : ఆర్ఎల్ పురంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. రాత్రి ప్రమాదవశాత్తు గ్రానైట్ క్వారీలో పడి ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలను అధికారులు వెలికితీయలేదు. 200 మీటర్ల లోతులో మృతదేహాలున్నట్లు తెలుస్తోంది. 

టిడిపి సమన్వయ కమిటీ సమావేశం..

విజయవాడ : సీఎం క్యాంపు కార్యాలయంలో టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, లోకేష్, ఎమ్మెల్సీ, మున్సిపాల్టీ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో నెలకొన్న మధ్య విబేధాల పరిష్కారంపై చర్చిస్తున్నారు.

 

14:43 - October 18, 2016

అనంతపురం : కథా రచయిత చిలుకూరి దేవపుత్ర అస్తమించారు. అనంతపురంలో స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. దేవపుత్ర తెలుగు కథా సాహిత్యంపై చెరగని ముద్ర వేశారు. రాయలసీమ కరవు, వర్గ కక్షలు, అణగారిన బతుకులే ప్రధానాంశాలుగా దేవపుత్ర కథా సృజన చేశారు. ఆరు గ్లాసులు, చివరి మనుషులు, ఏకాకి నౌక చప్పుడు వంటి ఎన్నో గొప్ప కథలు రాశారు. చిలుకూరి నవలల్లో అద్దంలో చందమామ, చీకటిపూలు, పంచమం విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. నూతలపాటి గంగాధరం, చాసో స్ఫూర్తి, తెలుగు విశ్వవిద్యాలయం అవార్డులను చిలుకూరి దేవపుత్ర అందుకున్నారు. 

14:41 - October 18, 2016

హైదరాబాద్‌: ఏపీ తెలంగాణ టీటీడీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 1987 నుండి 2004 వరకూ తెలంగాణకు వరకు తితిదే ఆదాయంలో తెలంగాణకు వాటా ఇచ్చేలా ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు. ఈ పిటిషన్‌ స్వీకరించిన న్యాయస్థానం మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని తితిదే, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఏపీలోని దేవాలయాలన్నీ పుష్కలమైన ఆదాయంతో వున్నాయనీ..తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాలు ఆదాయం తక్కువగా వున్నాయనీ చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు సుందర్ రాజన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు టీటీడీ దేవాలయం ఆదాయంలో వాటా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

14:34 - October 18, 2016

విజయవాడ : ఏపీ శాసనసభలో 12 మంది వైసీపీ సభ్యుల ప్రవర్తనపై వివరణ కోరుతూ సభాహక్కుల సంఘం నోటీసులు జారీచేసింది. గత శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం విషయంలో నిరసన సందర్భంగా వైసీపీ సభ్యులు స్పీకర్‌ ప్రసంగాన్ని అడ్డుకుని.. పోడియం ఎక్కి నిరసన తెలిపారు. సభ్యుల ప్రవర్తనపై తీవ్రంగా స్పందించిన సభాహక్కుల సంఘం 12మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. ఈనెల 25, 26 తేదీల్లో తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, కోరుముట్ల శ్రీనివాసులు, చెర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, పాశం సునీల్‌కుమార్‌, కిలివేటి సంజీవయ్య, కంబాల జోగులుకు ఈ నోటీసులను జారీచేశారు. సభలో జరిగిన గందరగోళ పరిస్థితులకు సంబంధించిన వీడియో, ఆడియోలను ప్రదర్శించి సభ్యుల్ని దశలవారీగా వివరణ కోరనున్నారు. అయితే సభ్యులు ఇచ్చిన వివరణల ఆధారంగానే వారిపై చర్యలు తీసుకోనున్నారు. కాగా ఎమ్మెల్యేలు ప్రివిలేజ్ కమిటీకి హాజరవుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

టిడిపి సమన్వయ కమిటీ సమావేశం..

విజయవాడ : సీఎం క్యాంపు కార్యాలయంలో టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, లోకేష్, ఎమ్మెల్సీ, మున్సిపాల్టీ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో నెలకొన్న మధ్య విబేధాల పరిష్కారంపై చర్చిస్తున్నారు.

పెద్దతుండ్లకు చేరుకున్న మహా పాదయాత్ర..

రంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. క‌ప్ప‌ప‌హాడ్ నుండి బ‌య‌లుదేరిన యాత్ర కాసేప‌టి క్రిత‌మే పెద్ద‌తుండ్ల‌కు చేరింది. 

13:52 - October 18, 2016

పిల్లలకు లేక చాలా మంది దంపతులు అవస్థలు పడుతున్నారు. ఫెర్టిలెటీ సెంటర్ ను ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా ఎక్కువగా ఆపరేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మారుతున్న జీవన శైలి కారణం కావచ్చు లేదా ఆహారపు అలవాట్లు కావచ్చు..ఎందుకిలా జరుగుతోంది ? ఈ అంశంపై మానవి వేదికలో ప్రముఖ గైనకాలజిస్టు జయంతిరెడ్డి, జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వ్యవస్థాపకురాలు జెస్సీ నాయుడు చర్చించారు. వారు ఎలాంటి సూచనలు..సలహాలు అందించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:31 - October 18, 2016
13:30 - October 18, 2016

హైదరాబాద్ : చిన్నారి సంజన గుర్తు ఉందా ? తాగుబోతుల నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజన ప్రస్తుతం కొలుకోంటోంది. ఇంతవరకు కోమాలో ఉంటూ వెంటిలేషన్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిన్నారి సంజన ఆరోగ్యం మెరుగు పడుతోందని, అందరితో మాట్లాడుతోందని..గుర్తు పడుతోందని చికిత్స చేస్తున్న కామినేని వైద్యులు వెల్లడించారు. రెండు..మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని పేర్కొంటున్నారు. అయితే ఈ ఘటనలో గాయపడిన సంజన తల్లి శ్రీదేవి సోమవారమే డిశ్చార్జ్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ నిందితులకు బెయిల్ రావడం పట్ల 

 • అక్టోబర్ 2వ తేదీ..గాంధీ జయంతి రోజున పెద్ద అంబర్ పేట వద్ద తల్లి శ్రీదేవి తన కూతుళ్లు సంజన (4), ప్రవళికతో రోడ్దు దాటుతోంది.
 • మద్యం సేవించిన యువకులు వేగంతో కారును నడిపి తల్లీకూతుళ్లను ఢీకొట్టారు.
 • సంజన..శ్రీదేవిలకు తీవ్రగాయాలయ్యాయి.
 • తీవ్ర గాయాలైన వీరిని 108 వాహనంలో కామినేని ఆసుపత్రికి తరలించారు.
 • ఈ ప్రమాదంలో చిన్నారి సంజన(4)కు తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లింది. 
13:27 - October 18, 2016

హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాహనాల డ్రైవింగ్ లైసెన్స్..ఇతరత్రా పత్రాలతో పాటు ఆధార్ కార్డు ఉండాల్సిందేనని పోలీసులు జారీ చేసిన సర్క్యూలేషణ్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆధార్ కార్డు ఉంటేనే వాహనం నడపాల్సి ఉంటుందని ఇటీవలే పోలీసులు సర్క్యూలేషన్ జారీ చేశారు. ఆధార్ కార్డు లేకపోతే పోలీసులు ఇబ్బందికరంగా గుర్తి చేయడంపై ఓ న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపింది. సర్క్యూలేషన్ ఎవరు జారీ చేశారు ? చట్టం చేయకుండా ప్రజలను ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ప్రాతిపదికన సర్క్యూలేషన్ జారీ చేశారని, వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

13:16 - October 18, 2016

హైదరాబాద్: సదావర్తి సత్రం భూముల వేలంపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు దారులకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వవద్దని న్యాయస్థానం ఆదేశించింది. మార్కెట్ విలువ కంటే తక్కువగా భూములు విక్రయించారంటూ మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది టెన్ టివితో మాట్లాడారు. ఏడు కోట్ల ఉన్న ఒక ఎకరం విలువను రూ. 26 లక్షలకు కొట్టేసిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. కోర్టు సానుకూలంగా స్పందించిందని, వేయి కోట్ల ఆస్తులు కొట్టేసిన వారికి సేల్స్ సర్టిఫికేట్ ఇవ్వవద్దని ఆదేశించడం జరిగిందన్నారు. 

సదావర్తి భూముల అమ్మకాలపై హైకోర్టు స్టే..

హైదరాబాద్ : సదావర్తి భూముల అమ్మకాలపై హైకోర్టు స్టే విధించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అమ్మకాలకు సంబంధించిన పత్రాలను జారీ చేయరాదని పేర్కొంది. 

భజరంగ్ జూట్ మిల్లు వద్ద ఉద్రిక్తత..

గుంటూరు : భజరంగ్ జూట్ మిల్లు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిల్లును తెరిపించాలని కార్మికులు నినాదాలు చేస్తున్నారు. కార్మిక శాఖ అధికారులతో జూట్ మిల్లు యాజమాన్యం, పరిరక్షణ కమిటీ నేతలు చర్చలు జరుపుతున్నారు. 

ముస్లిం మహిళలకు సీపీఎం పొలిట్ బ్యూరో మద్దతు..

ఢిల్లీ : తలాక్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ముస్లిం మహిళలకు సీపీఎం పొలిట్ బ్యూరో మద్దతు తెలిపింది. చాలా ఇస్లామిక్ దేశాలు తలాక్ ను అనుమతించడం లేదని పేర్కొంది. తలాక్ ను రద్దు చేయాలని ముస్లిం మహిళల డిమాండ్ ను ఆమోదిస్తే బాధితులకు ఉపశమనం లభిస్తుందని తెలిపింది. ముస్లిం మైనార్టీలను లక్ష్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, హిందూ మహిళా చట్టాలను సంస్కరించామని చెబుతున్నా మహిళలు వివక్షకు గురవుతున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో పేర్కొంది. 

12:44 - October 18, 2016

ఢిల్లీ : మయన్మార్ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షురాలు, ఆ దేశ విదేశాంగ మంత్రి అంగ్ సాన్ సూకీ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో సూకీకి భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. అనంతరం సూకీ సైనిక వందనం స్వీకరించారు. గోవాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ - బిమ్స్ టెక్ (బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ కోఆపరేషన్) సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం సూకీ గోవాకు వచ్చారు. బ్రిక్స్ కు అనుబంధంగా ఏర్పాటైన ఈ గ్రూప్ లో బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్ దేశాలకు సభ్యత్వం ఉంది. సాంకేతికాభివృద్ధిలో పరసర్పం సహకరించుకోవడమే బిమ్స్ టెక్ లక్ష్యం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లతో సూకీ చర్చలు జరుపనున్నారు. 

12:37 - October 18, 2016

హైదరాబాద్ : ఏ అంశాన్నీ వదలొద్దు...! అన్ని సమస్యలపై పోరుతో సర్కారును ఉక్కిరిబిక్కిరి చేద్దాం..!! ఇదీ తెలంగాణ కాంగ్రెస్‌ నిర్దేశించుకున్న యాక్షన్ ప్లాన్‌.. రైతులు, ఫీజులు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు.. ఇలా టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నింటినీ అస్త్రాలుగా మలచుకుని ఉద్యమ పథాన సాగాలని హస్తం నేతలు నిర్ణయించారు. బహిరంగ సభలు, గర్జనలతో హోరెత్తించేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణలో జోరు పెంచాలని హస్తం నేతలు నిర్ణయించారు.. ప్రాజెక్టుల్లో అవినీతిని ప్రస్తావించడం.. జలదృశ్యం ద్వారా కాంగ్రెస్‌ హయాంలో జరిగిన మేలును వివరించడం ద్వారా.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టామని భావిస్తున్న కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు రైతు సమస్యలపై పోరుబాట పట్టారు. అన్నదాతల ఆక్రందన పేరుతో ఆందోళనలు మొదలుపెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు.. వేలాది మంది రైతులతో కలిసి ఖమ్మం కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించి తమ ఉద్దేశాన్ని ప్రభుత్వానికి వెల్లడించారు. అటు ఆదిలాబాద్‌ జిల్లాలోనూ రైతు గర్జన చేశారు. ఇక్కడితో ఆగకుండా.. రైతుగర్జన పేరుతోనే నిరసనల్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. వరంగల్‌ వేదికగా మరోసారి తమ వాయిస్‌ను గట్టిగా వినిపించబోతున్నారు.

పాతబస్తీ నుంచి యాక్షన్‌ ప్లాన్‌..
ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్‌కు బాగా లబ్ది చేకూర్చిన హామీల‌పై హస్తం నేతలు దృష్టిపెట్టారు. ఫీజ్‌ రియింబర్స్ మెంట్, ఏక‌కాలంలో రుణ‌మాఫీ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు తదితర అంశాలపై దరఖాస్తుల ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈనెల 19న శేరిలింగంపల్లిలో భారీ బహిరంగసభ ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఇదే కాకుండా ప్రజల్లోకి వెళ్లేందుకు మరిన్న కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు.. ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్‌ పాత‌బస్తీ నుంచి కూడా కార్యక్రమాలు చేపట్టే యోచన చేస్తున్నారు. మొత్తానికి దూకుడుపెంచిన హస్తం నేతలు.. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ సర్కారుపై సమరశంఖం పూరించేందుకు సమాయత్తమవుతున్నారు. 

12:34 - October 18, 2016

మహారాష్ట్ర : మనిషి మృగాడై పోతున్నాడు. ఇతరులపై ఇష్టమొచ్చినట్లు చితకబాదుతున్నారు. చేతిలో కర్ర..కత్తి..ఇలా ఏది పడితే దానితో దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మహారాష్ట్రంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. థానే జిల్లాలో ఇద్దరు యువకులు ఓ విద్యార్థిడిని చితకబాదారు. చిన్నపాటి వివాదానికి చావుదెబ్బలు కొట్టారు. ఇదంతా మరో వ్యక్తి వీడియో చిత్రీకరించాడు. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఈవిషయం తెలుసుకున్న మానవ హక్కుల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. 

12:21 - October 18, 2016

చెన్నై : కావేరీ జల వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా ? ఎలాంటి తీర్పు వస్తుంది ? నీళ్లు విడుదల చేయాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇస్తుందా ? ఈ అంశాలపై రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కావేరీ నది జలాలను తమిళనాడు రాష్ట్రానికి విడుదల చేయాలని సుప్రీం కర్నాటకు సూచించిన అనంతరం పలు పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీం తుది తీర్పు ఇవ్వనుంది. ప్రస్తుతం తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. రైల్ రోకో రెండో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. రైతులతో డీఎంకే నేతలు రైళ్లను ఎక్కడికక్కడ ఆపివేశారు. సేలం, తిరుచానాపల్లి పెద్ద ఎత్తున రైల్ రోకో కొనసాగుతోంది. రైళ్లపై దుప్పట్లు పరుచుకుని నిద్రపోయారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. తమిళనాడు, కర్నాటకలో రెండు చోట్ల తాగునీటి సంక్షోభం ఉందని, సమస్య రెండు రాష్ట్రాల్లో ఉందని కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో అశాస్త్రీయంగా ఉందని, కాలం చెల్లిన విధానాలు అవలింబిస్తున్నాయని నివేదికలో పేర్కొంది. కావేరీ జలాలను ఎక్కువగా నిరుపయోగం చేస్తున్నాయని నివేదికలో తెలిపింది. ఈ రోజు తీర్పు వస్తుందా ? లేదా ? నీళ్లు విడుదల చేయాల్సిందేనని సుప్రీం పేర్కొంటుందా ? అనే ఉత్కంఠ నెలకొంది.

 • కావేరి నదీ జలాలను తమిళనాడు రాష్ట్రానికి రోజుకు 15వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 • తమిళనాడు రైతుల దురావస్థను తొలగించేందుకు పది రోజులపాటు ఈ నీటిని విడుదల చేయాలని తీర్పు వెలువరించింది.
 • ట్రిబ్యునల్‌ ఆదేశానుసారంగా నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది.
 • ఈ అంశంపై పది రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని పర్యవేక్షక కమిటీకి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.
 • సెప్టెంబర్ 30 వరకు రోజు 3వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు ఇవ్వాలని కావేరీ పర్యవేక్షక కమిటీ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
 • కావేరీ పర్యవేక్షక కమిటీ తీర్పు పట్ల తమిళనాడు, కర్ణాటక అసంతృప్తిగా ఉన్నాయి. గతంలో 12వేల క్యూసెక్కుల నీరు తమిళనాడుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ తమిళనాడుకు నీరు ఇచ్చేది లేదని కర్ణాటక తేల్చి చెప్పింది. 
12:12 - October 18, 2016

మమత మెడికల్ కాలేజీ అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ..

ఖమ్మం : జిల్లాలో మమత మెడికల్ కాలేజీ అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిగింది. మూడు వారాల పాటు నిర్మాణాలు చేపట్టవద్దని, నిర్మాణం కొనసాగుతుండగా జీవో నెంబర్ 59 ప్రకారం ఎలా రెగ్యులరైజేషన్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్..

సిద్ధిపేట : నంగనూరు (మం) సిద్ధిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. 

నయీం కేసుపై హైకోర్టులో విచారణ...

హైదరాబాద్ : నయీం కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. నయీం కేసు సీబీఐకి అప్పగించాలని సీపీఐ నేత నారాయణ పిల్ దాఖలు చేశారు. విచారన మూడు వారాల పాటు కోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సిట్ కు ఆదేశాలు జారీ చేసింది. 

ఎనుమాముల మార్కెట్ లో టి.టిడిపి నేతలు..

వరంగల్ : ఎనుమాముల మార్కెట్ ను టి.టిడిపి నేతలు సందర్శించారు. మొక్కజొన్న రైతుల సమస్యలను నేతలు అడిగి తెలుసుకున్నారు. 

వీసీలు..రిజిస్ట్రార్లతో మంత్రి కడియం భేటీ..

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లతో మంత్రి కడియం భేటీ అయ్యారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, వీసీల పని విధానం, బయోమెట్రిక్ విధానం అమలుపై చర్చిస్తున్నారు. 

విరిగిన రైలు పట్టా..ఆగిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్..

జనగాం : రఘునాథపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టా విరిగింది. రైల్వే అధికారులకు గ్యాంగ్ మెన్లు సమాచారం అందించారు. అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రఘునాథపల్లి వద్ద భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. 

11:26 - October 18, 2016

విజయనగరం : ఉత్తరాంధ్ర ఇలవేలుపు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకొనేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటలకు సిరిమాను ఊరేగింపు ఉత్సవం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సిరిమాను ఉత్సవాలను తిలకించేందుకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్స్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:11 - October 18, 2016

హైదరాబాద్ : ఫీవర్ ఆసుపత్రిలో నినాదాలతో మారుమాగింది. వేతనాలు చెల్లించాలంటూ ఆసుపత్రి కాంట్రాక్టు సిబ్బంది డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం సిబ్బంది బైఠాయిస్తూ ఆందోళన చేపట్టారు. మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలంటూ భీష్మించుకూర్చొన్నారు. దీనితో ఫీవర్ ఆసుపత్రిలో కంపుమయంగా మారిపోయింది. సిబ్బంది ఆందోళన చేస్తున్నా సంబంధిత కాంట్రాక్టర్, సూపర్ వైజర్స్ పట్టించుకోకపోవడం గమనార్హం.

ఎలా గడవాలి..
తమ వేతనాలు చెల్లించాలని కోరుతూ గతంలో ధర్నా చేయడం జరిగిందని, ఈ విషయాన్ని పరిష్కరిస్తామని ఆసుపత్రి సూపరిటిండెంట్ పేర్కొనడంతో ఆందోళన విరమించామన్నారు. కానీ వేతనాలు మాత్రం ఇవ్వలేదని, దీనితో తాము ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. కానీ సంబంధిత క్రిస్టల్ కంపెనీ పట్టించుకోవడం లేదని వాపోయారు. మూడు నెలల బకాయిలు చెల్లించాలని, పెరిగిన బకాయిలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్యం బడ్జెట్ విడుదల చేశారని, కానీ తమకు మాత్రం డబ్బులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పండుగలు చేసుకోవడం లేదని, పిల్లలకు స్కూల్ ఫీజులు ఎలా కట్టాలని..ఇళ్లు ఎలా గడవాలని ప్రశ్నించారు. క్రిస్టల్ కంపెనీ స్పందించి వేతనాలు ఇస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

ఫీవర్ ఆసుపత్రిలో ఆందోళన..

హైదరాబాద్ : ఫీవర్ ఆసుపత్రిలో శానిటేషన్, సెక్యూర్టీ సిబ్బంది ఆందోళన చేపట్టారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన చేపట్టారు. 

10:39 - October 18, 2016
10:33 - October 18, 2016
10:22 - October 18, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం హతమై నెలలు గడుస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన కేసు ఓ కొలిక్కి రావడం లేదు. సిట్ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించి పలువురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ సిట్ చేపడుతున్న దర్యాప్తుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ నేత నారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలి..సిట్ విచారణ సరిపోదు..రాజకీయ నేతలు..పోలీసులు..రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయని..డైరీని డిజిటలైషన్ చేయాలని నారాయణ పేర్కొంటున్నారు. నయీం కేసు విచారణను బహిర్గతం చేయాలని ఆయన పిల్ లో కోరారు. సిట్ కాకరంఉడా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు. దీనితో హైకోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించనుంది. విచారణలో భాగంగా పోలీసులు..సిట్ ఎలాంటి అంశాలు పేర్కొంటారనే ఉత్కంఠ నెలకొంది. కేసును సీబీఐకి అప్పగిస్తారా ? లేదా అనేది కొద్దిసేపట్లో తేలనుంది. మరోవైపు ఇప్పటి వరకు విచారణ చేపట్టకపోవడంపై న్యాయవాదులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. 

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి - తమ్మినేని..

రంగారెడ్డి : విద్య, వైద్య ఉపాధి అవకాశాలు అన్ని వర్గాలకు కల్పించాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మేటీల నుండి మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. మాటలతో బంగారు తెలంగాణ రాదని, ప్రజల బతుకులు మారాలని పేర్కొన్నారు.

 

కొనసాగుతున్న మహాజన పాదయాత్ర...

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం మండలం మేటీల నుండి సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభమైంది. రేషన్ కార్డులు తొలగించారని, ఫించన్లు రావడం లేదని సమస్యలను పాదయాత్ర బృందానికి గ్రామస్తులు తెలియచేస్తున్నారు. 

వైభవంగా పైడితల్లి ఉత్సవాలు..

విజయనగరం : పైడితల్లి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. 

09:55 - October 18, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వచ్చిన అనారోగ్యం ఏంటి? గత వారం రోజులుగా అమ్మ హెల్త్ బులెటిన్‌ కూడా విడుదల కాలేదు. అటు వైద్యులు కానీ, ఇటు పార్టీ వర్గాలు కానీ ఆమె ఆరోగ్యంపై ఎవరూ స్పందించడం లేదు. మరోవైపు అమ్మ ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో రూమర్లు సృష్టించే వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఏంటి? గత వారం రోజుల నుంచి అమ్మకు సంబంధించిన హెల్త్ బులెటిన్లు కూడా విడుదల చేయకపోవడంతో అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. జయలలిత ఆరోగ్యంపై అటు అన్నాడిఎంకె వర్గాలు కానీ, వైద్యులు కానీ స్పందించడం లేదు.

వదంతులు..
మరోవైపు అమ్మ ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో వదంతులు సృష్టిస్తున్నవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైబర్‌ నిపుణులతో కూడిన టీం దీనిపై ప్రత్యేక నిఘా పెట్టింది. రెండు మూడు వారాల్లోనే 50 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందులో కోయంబత్తూరులోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో అమ్మ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు వ్యాపింపచేయొద్దని నెటిజన్లకు సూచించారు. తప్పుడు వదంతులు సృష్టించేవారిపై ఏడేళ్లవరకు జైలుశిక్ష విధించే అవకాశముందని పోలీసులు హెచ్చరించారు.

అభిమానుల పూజలు..
అపోలో ఆస్పత్రి వద్ద వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు గత 24 రోజులుగా గుమిగూడుతూనే ఉన్నారు. ఆమెకోసం ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. జయలలిత అభిమానుల ఆందోళన తగ్గించేందుకు ఆమె ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేయాలని గవర్నర్‌ విద్యాసాగర్‌రావు సూచించారు. గతవారం సిఎం జయలలితకు సంబంధించిన శాఖలను ఆమెకు అత్యంత విధేయుడైన మంత్రి పన్నీర్‌ సెల్వంకు గవర్నర్‌ అప్పగించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జయలలిత నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

సెప్టెంబర్ 22న..
68 ఏళ్ల జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో సెప్టెంబర్‌ 22న అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆమెకు లంగ్స్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు పేర్కొన్నారు. లండన్‌ స్పెషలిస్ట్ వైద్యుడు రిచర్డ్‌ బాలే, ఎయిమ్స్ కు చెందిన ముగ్గురు ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో జయలలితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జయలలిత హెల్త్ బులెటిన్‌లో మాత్రం ఆమె చికిత్సకు స్పందిస్తున్నారని, మరికొంత కాలం ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. జయలలిత వాస్తవ పరిస్థితి ఏంటన్నది ఎవరికీ చెప్పడం లేదు. 

09:30 - October 18, 2016
09:29 - October 18, 2016

విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేపడుత్నున విధానాలపై కామ్రెడ్లు కదం తొక్కుతున్నారు. ప్రభుత్వం విచ్చలవిడిగా భూ సేకరణ జరుపుతోందని సీపీఎం ఆందోళనలు నిర్వహిస్తోంది. ఆక్కా ఫుడ్ ఫ్యాకర్టీకి వ్యతిరేకంగా గళమెత్తిన పార్టీ తాజాగా పెట్రో యూనివర్సిటీపై పోరాటానికి సిద్ధమైంది. అందులో భాగంగా మంగళవారం రైతులతో సీపీఎం భారీ ర్యాలీ నిర్వహించింది. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ర్యాలీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, నర్సింగరావు, లోకనాథంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఎండగట్టారు. పరిశ్రమల కోసం వందలాది ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. పెట్రో యూనివర్సిటీ శంకుస్థాపన పనులు ఆపేయాలని డిమాండ్ చేశారు. 

రైతు వ్యతిరేక ప్రభుత్వం - మధు...

విశాఖపట్టణం : సబ్బవరం (మం) రొంగలిలో పెట్రో యూనివర్సిటీకి భూసేకరణనను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, నర్సింగరావు, లోకనాథంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఎండగట్టారు. పరిశ్రమల కోసం వందలాది ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. పెట్రో యూనివర్సిటీ శంకుస్థాపన పనులు ఆపేయాలని డిమాండ్ చేశారు. 

09:23 - October 18, 2016

జయశంకర్ జిల్లా : సింగరేణిలో గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. దీనితో ఆ పేద కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన యువకుడికి ఇటీవలే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన కేటీకే 5 ఇంక్లయిన్ లో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన బండారి వెంకటేష్ కేటీకే 5 ఇంక్లయిన్ లో అండర్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండో షిప్ట్ లో భాగంగా మంగళవారం ఉదయం విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో బొగ్గు తీసుకొస్తున్న టబ్బులకు బ్రేక్ లు ఫెయిల్ అయ్యాయి. దీనితో అక్కడే ఉన్న వెంకటేష్ తలకు తీవ్రగాయమైంది. అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి కార్మికులు స్పందించి చిన్న ట్రైన్ వెంకటేష్ ను పడుకొబట్టి పైకి తీసుకొచ్చారు. అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడాన్ని వైద్యులు వెల్లడించారు. వెంకటేష్ మృతితో ఉప్పరపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇతనిది పేద కుటుంబం అని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం..సింగరేణి స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

సింగరేణిగనిలో అగ్నిప్రమాదం..

భూపాలపల్లి : సింగరేణి గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. కేటీకే 5 ఇంక్లయిన్ లో విధులు నిర్వహిస్తున్న అండర్ మేనేజర్ బండారి వెంకటేష్ తలకు టబ్బులు తగిలడంతో మృతి చెందాడు. ఇతడు మహబూబాబాద్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన వాడు. 

మేకర్ టవర్ లో ఫైర్ ఆక్సిడెంట్...

ముంబై : మేకర్ టవర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 8 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 

09:08 - October 18, 2016

ముంబై : దేశ ఆర్థిక రాజధానిలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కార్పొరేట్స్ సంస్థల ప్రతినిధులు ఎక్కువగా నివాసం ఉండే మేకర్ టవర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 
నారీమన్ పాయింట్ వద్ద 26వ ఫ్లోర్ లతో మేకర్ టవర్ ఉంది. ఈ టవర్ లో ప్రముఖ వాణిజ్య సంస్థల ప్రతినిధులు నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం 20వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ అంతస్తులో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎండీ నివాసం ఉంటున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అత్యంత చాకచక్యంగా భారీ క్రేన్ ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ దశలో మంటలు 21వ అంతస్తుకు వ్యాపించాయి. దీనితో నివాసంలో ఉండే వారు బయటకు పరుగులు తీశారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎండీ కుటుంబానికి చెందిన ఏడుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఇద్దరు మాత్రం మృతి చెందారు. వీరు సర్వేంట్స్ అని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

08:37 - October 18, 2016

జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. గత కొంతకాలంగా పాక్ బలగాలు భారత సైన్యంపై కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన అనంతరం పాక్ కాల్పులు మరింత ఉధృతం చేసింది. తాజాగా నౌషెరా సెక్టార్ లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు పాక్ కాల్పులకు దిగినట్లైంది. పాక్ కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి.
సెప్టెంబర్ 28వ తేదీన సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి పాక్ 30 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఎల్ వోసీ సరిహద్దులో ఉన్న భారత బలగాల శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పులు జరుపుతున్న సమయంలో ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఎస్ఎఫ్ బలగాలు, సీఆర్పీఎఫ్ బలగాలు సరిహద్దు వద్ద పహారా నిర్వహిస్తున్నాయి. మరోవైపు దౌత్యపరంగా పాక్ ను ఏకాకీ చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. పాక్ వైఖరిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పాక్ మాత్రం కాల్పులకు మాత్రం తెగబడుతోంది. 

మహాజన పాదయాత్ర..రెండో రోజు..

రంగారెడ్డి : మహాజన పాదయాత్ర రెండో రోజు ప్రారంభం కానుంది. మొదటి రోజు అత్యంత ఉల్లాసం, ఉత్తేజంతో ఏడు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. నేడు రెండో రోజు ఇబ్రహీంపట్నం మండలం మేటిల నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఎలిమనేడు, కప్పంపహాడ్, పెద్ద తుండాలలో పాదయాత్ర జరగనుంది. 

08:27 - October 18, 2016

ఆంధ్రప్రదేశ్ లో విఆర్ ఏలు మరోసారి పోరుబాట పట్టారు. విజయవాడలో జరిగిన గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర స్థాయి సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 24న ఆర్డీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు, 31న కలెక్టరేట్ల ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ లో విఆర్ ఏలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? విజయవాడలో జరిగిన గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర స్థాయి సదస్సులో తీసుకున్న నిర్ణయాలేమిటి? విఆర్ఏల సమస్యల పరిష్కారానికి సంఘం చేపట్టబోతున్న కార్యక్రమాలేమిటి? వీరి డిమాండ్స్ ఏమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్ విఆర్ఏ ల సంఘం నేత బాలకాశి విశ్లేషించారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో వీడియోలో చూడండి. 

08:24 - October 18, 2016

ఢిల్లీ : అంతరిక్ష పరిశోధనలో చైనా మరో మైలురాయి అధిగమించింది. మాన‌వ స‌హిత వ్యోమ‌నౌక‌ను చైనా విజ‌య‌వంతంగా ప్రయోగించింది. షెంజూలో అంత‌రిక్షానికి వెళ్లిన ఇద్దరు వ్యోమోగాములు అక్కడ నెల రోజుల పాటు పరిశోధనలు జరపనున్నారు. చైనా కాలమానం ప్రకారం.. ఉదయం ఏడున్నరకు ఇద్దరు వ్యోమగాములతో షెంజౌ-11 అనే వ్యోమనౌక రోదసిలోకి దూసుకెళ్లింది. జియుక్వాన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. ఈ నౌకలో ఇద్దరు వ్యోమగాములు జింగ్‌ హైపెంగ్‌, షెన్‌ డాంగ్‌ కక్ష్యలోకి పయనమయ్యారు.

లాంగ్‌ మార్చ్‌ 2ఎఫ్‌ అనే రాకెట్‌ ద్వారా..
లాంగ్‌ మార్చ్‌ 2ఎఫ్‌ అనే రాకెట్‌ ద్వారా ఈ వ్యోమనౌక నిర్ణీత క్షక్ష్యలోకి ప్రవేశించింది. రెండు రోజుల్లో వీరు రోదసిలోని చైనా ప్రయోగాత్మక అంతరిక్ష కేంద్రానికి చేరుకుని.. నెల రోజులు అక్కడే బస చేస్తారు. వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి చేర్చిన తర్వాతి రోజు షెంజౌ-11 వ్యోమనౌక భూమికి తిరుగు ప్రయాణం కానుంది. వ్యోమోగాములు జింగ్‌ హైపెంగ్‌.. షెన్‌ డాంగ్‌ నెల రోజుల పాటు అంతరిక్షంలో గడపనున్నారు. వైద్యం, భౌతిక‌శాస్త్రం, బ‌యోల‌జీకి సంబంధించిన అంశాలపై ప‌రిశోధ‌న‌లు చేయ‌నున్నారు. ఈ మిషన్‌కు జింగ్‌ హైపెంగ్‌ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. జింగ్ హైపెంగ్ అంత‌రిక్షంలోకి వెళ్లడం ఇది మూడ‌వ సారి. ఈ ప్రయోగం ద్వారా అంత‌రిక్షంలోకి చైనా వ్యోమ‌గాముల‌ను పంప‌డం ఆర‌వ‌సారి కావ‌డం విశేషం.

2003లో...
2003లో చైనా తొలిసారిగా మానవసహిత అంతరిక్ష ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2022 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ఇప్పుడీ సుదీర్ఘ మానవసహిత రోదసి యాత్రను చేపట్టింది. ప్రస్తుతం నింగికి ఎగిరిన షెంజూ వ్యోమ‌నౌక అంత‌రిక్ష కేంద్రంతో అనుసంధానం కావ‌డానికి మ‌రో రెండు రోజులు ప‌డుతుంది. మాన‌వ స‌హిత వ్యోమ‌నౌక‌ షెంజూ-11 స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయంతో అంతరిక్షంలో చైనా మరో మెట్టు అధిగమించిందని కొనియాడారు.

08:19 - October 18, 2016

హైదరాబాద్ : యూనివర్శిటీల ప్రక్షాళనకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమైంది. తొలిసారి వీసీలు, రిజిస్ట్రార్లతో మంత్రి కడియం ఇవాళ భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో యూనివర్శిటీల్లో నాణ్యతా ప్రమాణాలపై చర్చించబోతున్నారు. సమీక్ష తర్వాత ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులు చేయాలని భావిస్తున్నారు. మంగళవారం జరగబోయే ఈ సమావేశంలో వీసీలతోపాటు.. రిజస్ట్రార్లు, ఉన్నత విద్యాశాఖ అధికారులు హాజరుకానున్నారు.. విశ్వవిద్యాలయాల్లో నాణ్యతా ప్రమాణాలపై ఇందులో ముఖ్యంగా చర్చించే అవకాశముంది.

యూనివర్శిటీల్లో బయోమెట్రిక్ విధానం..
ఉన్నత విద్యను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టిన కడియం... ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు.. యూనివర్శిటిల్లో వీసీ పనివిధానం... సిసి కెమెరాల ఏర్పాటు, విద్యార్ధుల హాజరుపై చర్చించారు. యూనివర్శిటీల్లో బయోమెట్రిక్ విధానం అమలుపై మరింత చర్చ జరగాలని కడియం భావిస్తున్నారు.. ఈ అంశాలన్నింటిపై మంగళవారం వీసీలతో సమీక్షించనున్నారు.

యూనివర్శిటీల్లోని ఖాళీలపై ప్రభుత్వానికి అందిన నివేదిక..
మరోవైపు యూనివర్శిటీల్లోని ఖాళీలపై ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి ఇప్పటికే నివేదిక సమర్పించింది. అటు త్వరలో ఓయూ శతదినోత్సవం జరగబోతోంది. ముందు ఓయూలోని ఖాళీలను భర్తీ చేయాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత మిగతా యూనివర్శిటీల్లోని ఖాళీలను భర్తీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి యూనివర్శిటీలపై సర్కారు దృష్టిపెట్టడంపై విద్యరంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

08:16 - October 18, 2016

హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించే చర్యలు చేపట్టింది జీహెచ్‌ఎంసీ. దాదాపు 75 కోట్ల రూపాయలతో 180 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరిస్తున్నారు. రాత్రిపూట పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధికారులతో ఆకస్మిక పర్యటన చేపట్టారు. పనులు జరుగుతున్న చోటకు వెళ్లి.. పర్యవేక్షించారు. రోడ్ల నిర్మాణంలో రాజీపడే పడే ప్రసక్తే లేదని మేయర్‌ పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియోలో క్లిక్ చేయండి. 

08:15 - October 18, 2016

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. నిర్మాణం వద్ద పోలీస్‌ పికేటింగ్స్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. టార్గెట్‌లోపు ప్రాజెక్టును పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై చంద్రబాబు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో ఏపీ సీఎం సోమవారం చంద్రబాబు పర్యటించారు. విజయవాడ నుంచి నేరుగా పోలవరం చేరుకున్న సీఎం..ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. స్పిల్ వే, స్పిల్ చానల్ పనులను పరిశీలించి ఇంజనీర్ల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమావేశమైన చంద్రబాబు పోలవరం పనులు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల ఆలస్యంగా జరగటానికి గల కారణాలపై ఆరాతీశారు. వర్షాలతో పనులకు ఆటంకం ఏర్పడిందని, మట్టి తవ్వకాల పనుల్లో జాప్యం లేకుండా చూస్తామని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు.

30 నిఘా కెమెరాలు..
నవంబరులో పవర్ హౌస్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని సీఎం తెలిపారు. పోలవరం నిర్మాణం భద్రతా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఏజెన్సీ ప్రతినిధులు. దీంతో ప్రాజెక్టు ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. ప్రాజెక్టు లోపల పనిచేసే వారితో పాటు బయట నుంచి వచ్చి వెళ్లే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు చుట్టూ పోలీస్ పికెటింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ వ్యక్తుల రాకపోకలపై నిఘా, భద్రత ఏర్పాటులో ఆధునిక టెక్నాలజీ, సిబ్బందికి ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. బీఎస్ఎన్ఎల్, ఫైబర్ గ్రిడ్ సహకారంతో పోలవరం చుట్టూ 30 నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

2017 జూన్ నాటికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం..
2017 జూన్ నాటికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నీరు అందిస్తామని ఇరిగేషన్‌ శాఖ అధికారులు సీఎంకు చెప్పారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ముందస్తు రబీకి వెళ్లమని చంద్రబాబు ఆదేశించారు. ఏలేరు రిజర్వాయర్‌లో మరో 2 టీఎంసీల నీరు అదనంగా నిల్వ ఉంచేందుకు పరిశీలించాలని సూచించారు. మొత్తంగా 2018 వరకు పోలవరాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. 

08:12 - October 18, 2016

హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకానికి అప్పులు ఇచ్చేందుకు పలు ఆర్థిక సంస్థలు ముందుకొస్తున్నాయని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే 22వేల కోట్లు అప్పుగా ఇవ్వడానికి అంగీకరించాయని, మరో 7, 8 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు పలు సంస్థలు పోటి పడుతున్నాయని చెప్పారు. అవసరమైతే బడ్జెట్‌లో నిధులు కేటాయించైనా డిసెంబర్ 2017 నాటికి ప్రజలకు పరిశుభ్రమైన మంచినీరు అందిస్తామన్నారు. మిషన్ భగీరథపై ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు పరిశుభ్రమైన మంచినీరు ప్రతినిత్యం అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం అనుకున్న ప్రకారం నడుస్తుండటం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. 2017 డిసెంబర్ నాటికి ఈ పథకం పూర్తి కావడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు 365 రోజుల పాటు 24 గంటలూ అందేవిధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు సిఎం. భగీరథ పనులకు గ్రామాల్లో పైపులైన్ల నిర్మాణం, ఇంట్లో నల్లాలు బిగించే పనులు అతి ముఖ్యమైన పనులుగా భావించాలని అధికారులతో సీఎం చెప్పారు.

సమస్యలను అధిగమించాలన్న సీఎం..
పథకం ప్రారంభంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, పైపులైన్ల నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, జీఎల్బిఆర్‌ల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం. మిషన్‌ భగీరథను అమలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోందని, ఇప్పటికే ఆరు రాష్ర్టాలు ఈ పథకంపై అధ్యాయనం చేశాయని చెప్పారు. ఈ పథకం కోసం పలు ఆర్థిక సంస్థలు ఇప్పటికే 22వేల కోట్లు అప్పుగా ఇవ్వడానికి అంగీకరించాయని, మరో ఏడెనిమిది వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయన్నారు. అనుకున్నదాని ప్రకారం పనులు వేగంగా జరగాలని కోరారు.

1.5 శాతం ఇన్సెంటివ్..
గ్రామాల్లో అంతర్గత పనులు చేసే కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తి చేస్తే 1.5శాతం ఇన్సెంటివ్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. మిషన్ భగీరథ పథకం పూర్తి చేయడంతో పాటు భవిష్యత్తులో ఈ పథకం నిర్వహణ బాధ్యత కూడా ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖకే ఉంటుందని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మురుగు కాల్వల నిర్మాణం తదితర పనులు కూడా చేయాల్సి ఉన్నందున... ఈ శాఖకు పనిభారం ఎక్కువవుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి మిషన్ భగీరథ, ఆర్.డబ్ల్యు.ఎస్. లను కలిపేయాలని, అవసరాన్ని బట్టి పదోన్నతులు కల్పించాలని సీఎం చెప్పారు. పని విభజన కూడా పకడ్బందీగా జరగాలని అధికారులకు సూచించారు. 

08:08 - October 18, 2016

ఒడిశా : రాజధాని భువనేశ్వర్‌లోని సమ్‌ ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 23 మందికి మృతిచెందారు. సమ్‌ ఆసుపత్రి భవనంలోని డయాలసిస్‌ వార్డులో రాత్రి 8గంటల ప్రాంతంలో విద్యుత్తు షార్టు సర్క్యూట్‌తో ఈ ప్రమాదం సంభ‌వించింది. ఐసీయూ వార్డులో కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వార్డులో కదలలేని స్థితిలో ఉన్న వారు అక్కడికక్కడే కాలిపోయారు. మంటలంటుకున్న సమయంలో వార్డులోని ఐసీయూలో 20 మంది, పక్కనున్న వార్డులో 50 వరకూ రోగులు ఉన్నారు. మొదట డయాలసిస్ వార్డులో మంటలు చెలరేగి, మెడిసిన్, ఐసీయూ వార్డులకు మంటలు వ్యాపించాయి. దీంతో ఐసీయూ వార్డు, పరిసరాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. మంటలంటుకున్న వెంటనే ఐసీయూలో ఉన్నవారిని ఆసుపత్రి సిబ్బంది ఆమ్రీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఊపిరాడక అస్వస్థతకు గురై వీరంతా మృతిచెందినట్లు ఆమ్రీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. సమ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరికొంతమంది రోగులను కేపిటల్‌ ఆసుపత్రి, ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.

మోడీ తీవ్ర విచారం..
అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి ఆరు అగ్ని మాపక వాహనాలు హుటాహుటిన చేరుకున్నాయి. ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినా..మంటలు అదుపులోకి రాకపోవడంతో బహుళ అంతస్థుల్లో అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి వాడే ప్రత్యేక అగ్ని మాపక వాహనాన్ని తీసుకొచ్చి మంటలను నియంత్రించారు. అగ్నిమాపకశాఖ, పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టరు కె.సి. మహంతి, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కి ఫోన్‌చేసి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎంకు సూచించారు.

ఆసుపత్రికి చేరుకున్న సీఎం నవీన్..
అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వెంటనే ఆసుపత్రికి చేరుకొని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించగా..వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రైవేటు ఆసుపత్రి వర్గాలకు సూచించారు. ఘటనలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు 50వేలు పరిహారాన్ని అందిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. షాక్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొంత మంది పరిస్థితి విషమంగా మారింది. మృతులు, క్షతగాత్రుల వివరాలను తమకు పంపాలంటూ కేంద్రం తెలిపింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత్తం 500 మంది రోగులున్నట్లు సమాచారం. వారందరిని ఇతర ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే క్షతగాత్రులు, మృతుల వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 9439991226 నెంబర్‌తో హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. 

నౌషెరా సెక్టార్ లో పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : నౌషెరా సెక్టార్ లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు పాక్ కాల్పులకు దిగినట్లైంది. పాక్ కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. 

కావేరీ జలాల వివాదంపై తుది తీర్పు..

ఢిల్లీ : నేడు కావేరీ జలాల పంపిణీపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. దీనితో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. సోమవారం తమిళనాడులో రైతులు రైళ్లను స్తంభించిన సంగతి తెలిసిందే. 

పోలవరం వద్ద నేటి నుండి పోలీస్ పికెట్...

పశ్చిమగోదావరి : నేటి నుండి పోలవరం చుట్టూ పోలీస్ పికెట్ ఏర్పాటు చేయనున్నారు. పోలవరం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు..కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు. 

నేడు విశాఖలో మధు పర్యటన..

విశాఖపట్టణం: నేడు జిల్లాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించనున్నారు. సబ్బవరం (మం) రొంగలిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెట్రో వర్సిటీకి భూ సేకరణనను వ్యతిరేకిస్తున్న రైతులతో మధు భేటీ కానున్నారు. 

గురుకుల విద్యార్థులకు ఉచిత ట్యాబ్స్ పంపిణీ..

హైదరాబాద్ : గచ్చిబౌలిలో నేడు గురుకుల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమం జరగనుంది. 

వీసీలో నేడు మంత్రి కడియం సమావేశం..

హైదరాబాద్ : నేడు వీసీలతో మంత్రి కడియం సమావేశం కానున్నారు. ఉన్నత విద్యా మండలి విద్యాధికారులతో సమావేశం జరగనుంది. వీసీల పని విధానం, యూనివర్సిటీల్లో ఎడ్యుకేషన్ పై చర్చించనున్నారు. 

నేటి నుండి జీఎస్టీ సమావేశాలు..

ఢిల్లీ : నేటి నుండి జీఎస్టీ సమావేశాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. 

Don't Miss