Activities calendar

19 October 2016

22:11 - October 19, 2016

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరులోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలను అమలు చేసి చూపింది టీడీపీయేనన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ దారిచూపిందనని పేర్కొన్నారు. పేదవాడికి న్యాయం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి ఎన్టీఆర్ అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో అభివృద్ధి ఎలా వుండాలో సాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ప్రజలకు మెరుగైన జీవ ప్రమాణాలు కల్పించాల్సిన అవుసరం ప్రభుత్వంపై వుందన్నారు. నా జీవితంలో కార్యకర్తలను ఎన్నడూ మర్చిపోలేనన్నారు. కార్యకర్తలను న్యాయం చేసేందుకు పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.  

21:57 - October 19, 2016

తమిళనాడు : ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. గత నెల 22 నుంచి అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న నేపథ్యంలో సిఎం జయలలితకు విశ్వాసపాత్రుడైన పన్నీర్‌ సెల్వం ఆధ్వర్యంలో జరిగిన కాబినెట్‌ సమావేశం కావేరి జలాల వివాదంతో పాటు పలు అంశాలపై చర్చించింది. పన్నీర్‌ సెల్వం తాను కూర్చున్న చైర్‌కు ముందు 'అమ్మ' పెద్ద ఫోటోను ఉంచి మంత్రివర్గ సమావేశాన్ని కొనసాగించారు. ఆ విధంగా జయలలిత పట్ల తనకున్న ఆరాధనను చాటుకున్నారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు జరిగిన ఈ సమావేశంలో 32 మంది మంత్రులు పాల్గొన్నారు. మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన వివరాలు మాత్రం మీడియాకు వెల్లడించలేదు. అన్నాడీఎంకే గత మేలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కేబినెట్ సమావేశం జరగడం ఇది మూడోసారి. గవర్నర్‌ విద్యాసాగర్‌రావు జయలలిత నిర్వహిస్తున్న శాఖలన్నింటిని పన్నీర్‌సెల్వంకు కేటాయించిన విషయం తెలిసిందే.

21:51 - October 19, 2016

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబం పేరిట ఉన్న ఆస్తులను ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రకటించారు. తమ కుటుంబం ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ప్రతి ఏడాది ఆస్తులను తప్పకుండా ప్రకటిస్తామని చెప్పారు. తనకు బినామీల పేరుతో ఆస్తులున్నాయని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువ ఉన్నట్లుగా నిరూపిస్తే వారికే ఇచ్చేస్తామని సవాల్‌ చేశారు.

ఆరు సంవత్సరాల నుండి ఆస్తులను ప్రకటిస్తున్నాం : లోకేశ్‌
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం పేరిట ఉన్న ఆస్తులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రకటించారు. వరుసగా ఆరో ఏడాది తమ కుటుంబ ఆస్తులను ప్రకటిస్తున్నట్లు లోకేశ్‌ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా తమ కుటుంబం ప్రతి ఏటా ఆస్తులను ప్రకటిస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు తన ఆస్తులను కుటుంబసభ్యులకు బదలాయించడం వల్ల ఇబ్బందుల్లో ఉన్నారని లోకేశ్‌ చమత్కరించారు. తనకు బినామీల పేరుతో ఆస్తులున్నాయని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని లోకేశ్‌ మండిపడ్డారు. తాము ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువ ఉన్నట్లుగా నిరూపిస్తే వారికే ఇచ్చేస్తామని సవాల్‌ చేశారు.

తనపై బురద జల్లడమే వైసీపీ పని : లోకేష్
తనపై బురద జల్లడమే వైసీపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని, తమ కుటుంబంలో ఎలాంటి తగాదాలు లేవని లోకేశ్‌ స్పష్టం చేశారు. తామెంత బిజీగా ఉన్నా వారానికోసారైనా కలిసి అన్ని విషయాలు చర్చించుకుంటామన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ ఇస్తే తప్పకుండా పోటీ చేస్తానని లోకేశ్‌ స్పష్టం చేశారు. తాను ప్రభుత్వ కార్యకలాపాల్లో తలదూరుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని లోకేశ్‌ తెలిపారు. తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలా? వద్దా? అన్న అంశాన్ని పార్టీ పొలిట్‌బ్యూరో నిర్ణయిస్తుందన్నారు.

మొత్తం ఆస్తుల విలువ తెలిపిన లోకేష్
చంద్రబాబు మొత్తం ఆస్తులు 3.73కోట్లుగా లోకేశ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని నివాసం విలువ 3.68 కోట్లు, లక్షా 52 వేల విలువ చేసే అంబాసిడర్‌ కారు, బ్యాంకు ఖాతాలో 3.59 లక్షలు నగదు, 3.06 కోట్ల బ్యాంకు రుణం ఉన్నట్లు లోకేశ్‌ వెల్లడించారు. భువనేశ్వరి మొత్తం ఆస్తులు 38.66 కోట్ల రూపాయాలు కాగా.. అందులో నికర ఆస్తులు 24.84 కోట్లుగా చూపారు. పంజాగుట్టలో 73 లక్షల విలువ చేసే స్థలం, తమిళనాడులో 1 కోటి 86 లక్షల విలువైన భూమి ఉన్నట్లు ప్రకటించారు. అలాగే మదీనాగూడలో 73 లక్షల విలువైన భూమి, హెరిటేజ్‌ కంపెనీల్లో 3.23 కోట్ల విలువ గల వాటాలున్నట్లు చూపారు. కోటి 27 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, 91 లక్షల విలువ చేసే కారు ఉన్నట్లు ప్రకటించారు.

లోకేశ్‌కు మొత్తం 14 కోట్ల 50 లక్షలు
ఇక లోకేశ్‌కు మొత్తం 14 కోట్ల 50 లక్షల విలువ గల ఆస్తులున్నట్లు ప్రకటించారు. అందులో 6 కోట్ల 35 లక్షల అప్పులు, 8 కోట్ల 15 లక్షల నికర ఆస్తులు, హెరిటేజ్‌ ఫుడ్స్‌లో 2కోట్ల 52 లక్షల విలువ గల వాటాలున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ఇతర కంపెనీల్లో కోటీ 64లక్షల విలువైన వాటాలు, 93 లక్షల విలువ చేసే ఓ కారు ఉన్నట్లు వెల్లడించారు. ఇక బ్రాహ్మిణికి మాదాపూర్‌లో 17లక్షల విలువ గల భూమి, జూబ్లీహిల్స్‌లో 3 కోట్ల 50 లక్షల విలువైన ఇళ్లు అలాగే చెన్నైలో 48 లక్షల విలువైన వాణిజ్య స్థలం ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా మణికొండలో కోటీ 23 లక్షల విలువ చేసే స్థలం ఉన్నట్లు వెల్లడించారు. దేవాన్ష్‌ పేరిట జూబ్లీహిల్స్‌లో 9 కోట్ల 17 లక్షల విలువ చేసే ఇళ్లు, 2 కోట్ల 4 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, 2 లక్షల 31 వేల రూపాయల నగదు ఉన్నట్లు వెల్లడించారు. 

21:43 - October 19, 2016

పశ్చిమగోదావరి : ప్రజాభిప్రాయం సేకరించకుండా పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వాఫుడ్‌ పార్క్ నిర్మిస్తున్నారని...వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడితే హత్యాయత్నం కేసులు పెడుతున్నారని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని జగన్‌ ప్రశ్నించారు. ఆక్వా పార్క్‌ బాధితులను జగన్‌ పరామర్శించారు.

సత్యవతి చేసిన తప్పేంటి : జగన్
పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అధినేత జగన్‌ పర్యటించారు. ఆక్వాఫుడ్‌ పార్క్ కు వ్యతిరేకంగా పోరాడి తణుకు జైలులోఉన్న సత్యవతిని జగన్‌ పరామర్శించారు.. సత్యవతి చేసిన తప్పేంటని జగన్‌ ప్రశ్నించారు.. కాలుష్యాన్ని అరికట్టాలని కోరితే హత్యాయత్నం కేసులు పెడతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని మండిపడ్డారు. 

తుందుర్రులో జగన్ పర్యటన
సత్యవతిని పరామర్శించాక జగన్‌.. ఆక్వాఫుడ్‌ పార్క్ నిర్మాణ గ్రామం తుందుర్రులో పర్యటించారు. నిర్వాసితుల కష్ట నష్టాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఆక్వా పార్క్‌ ఎలా నిర్మిస్తారని జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. పార్క్ నిర్మించొద్దంటూ ఆందోళన చేసిన సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధును అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

వైసీపీ ర్యాలీ
మరోవైపు ఆక్వాపార్క్ బాధితులకు మద్దతుగా పాలకొల్లులో వైసీపీ నేతలు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీ చేపట్టారు... గాంధీబొమ్మ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ శేషుబాబు జెండా ఊపి ప్రారంభించారు..మొత్తానికి ఆక్వా పార్క్‌ నిర్మాణంపై పోరుబాట పట్టిన జగన్‌.... బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు..  

21:40 - October 19, 2016

నల్లగొండ : భక్తులకు ఇబ్బంది కలగకుండా యాదాద్రి టెంపుల్ సిటీ అభివృద్ధి జరుగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాబోయే కాలంలో యాదాద్రిని సందర్శించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతదని.. భక్తుల తాకిడికి అనుగుణంగా యాదాద్రిలో వసతి, రహదారులు, క్యూలైన్ల వ్యవస్థ ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. యాదాద్రి సందర్శనలో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్ కాటేజీలు, టెంపుల్ సిటీల నిర్మాణ పనులు, రాజగోపుర ప్రాంతాలు, ప్రధాన ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం సీఎం కేసీఆర్ యాదాద్రి టెంపుల్ సిటీ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దైవ దర్శనం, సాంప్రదాయ ఆచారాలు, పూజలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు ఉండాలని నిర్దేశించారు. యాదాద్రి జిల్లాను ఇక నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాగా పిలవాలన్నారు. టెంపుల్ సిటీగా యాదగిరిగుట్ట, జిల్లా కేంద్రంగా భువనగిరి జంటగా అభివృద్ధి చెందుతాయని..దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. 

21:37 - October 19, 2016

ఢిల్లీ : కృష్ణా జలాల వాడకంపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తుది తీర్పు వెలువరించింది. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కృష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే పంపిణీ చేయాలని నిర్ణయించింది. కర్ణాటక, మహారాష్ట్రకు వీటితో సంబంధం లేదని స్పష్టం చేసింది. దీనిపై ఇరు రాష్ట్రాలు తమ అభ్యంతరాలు, వాదనలను నాలుగు వారాల్లోగా ట్రిబ్యునల్‌ ముందు దాఖలు చేయాలని ఆదేశించింది.

తెలుగు రాష్ట్రాల మధ్యే కృష్ణా జలాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు తెలుగు రాష్ట్రాల మధ్యే కృష్ణా జలాలు పంపిణీ చేయాలని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. జలాల పంపిణీ రెండు రాష్ట్రాలకేనని కేంద్ర జలవనరుల శాఖ గతంలో ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లింది. కృష్ణా జలాల వివాదంపై ఏర్పడిన ట్రిబ్యునల్‌ 2013 నవంబరు 29న తుది తీర్పు చెప్పింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపులను కొనసాగిస్తూనే 65 శాతం నీటి లభ్యత, సరాసరి నీటి లభ్యత కింద మిగులు జలాలను కూడా కేటాయించింది.

నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించిన ఉమ్మడి ఏపీ
అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014 జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేటాయింపులో నాలుగు టీఎంసీలను కర్నాటకకు తగ్గించి.. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ తుది తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక, బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పును గెజిట్‌లో నోటిఫై చేయాలని మహారాష్ట్ర కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాయి.

తుది తీర్పుకు తొమ్మిది అంశాలను నిర్ణయించిన ట్రిబ్యునల్
ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత తెలంగాణ కూడా ఈ కేసులో భాగస్వామి అయింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. దీంతో జలాలను మొదట రెండు రాష్ట్రాలకా, నాలుగు రాష్ట్రాలకా అన్నది నిర్ణయించడానికి ట్రిబ్యునల్‌ తొమ్మిది అంశాలను నిర్ణయించింది. దీని ఆధారంగా నాలుగు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. అన్ని వాదనలు విన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు కేటాయిస్తు తుది తీర్పు ఇచ్చింది. 

తెలంగాణ నీటిపారుదల సహాదారు విద్యాసాగర్‌రావు అసంతృప్తి
కృష్ణా జలాల పునఃపంపిణీపై బ్రిజేష్‌ కమార్‌ ట్రైబ్యునల్‌ వెలవరించిన నిర్ణయంపై తెలంగాణ నీటిపారుదల సహాదారు విద్యాసాగర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఏమి చేయాలన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. నాలుగు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాల్సిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకే పరిమితం చేయడం సరికాదని న్యాయవాదులు చెబుతున్నారు. 

ఏపీకి రానున్న అరుణ్ జైట్లీ..

ఢిల్లీ: కేంద్రమంత్రి ఆర్థికశాఖా మంత్రి అరుణ్‌ జైట్లీ ఈనెల 28న విజయవాడ రానున్నారు. ఏపీకి ప్రకటించిన ప్యాకేజీపై బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ప్యాకేజీపై ఏపీ ప్రజలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృతి చేసేందుకు బీజేపీ ఈ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్యాకేజీ వివరాలను ఏపీ ప్రజలకు జైట్లీ వివరించనున్నారు. బహిరంగసభతోపాటు విజయవాడలో చేపట్టబోయే పలు కేంద్ర ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారని బీజేపీ ప్రకటించింది. దీంతో ఈ నెల 28న జరగనున్న ఈ కార్యక్రమంపై ఆసక్తినెలకొంది.

పార్టీ కార్యాలయానికి బాబు..

గుంటూరు: తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరులోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ అధినేత హోదాలో ఆయన తొలిసారి రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. దీంతో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

కేంద్రమంత్రిపై రాళ్లదాడి!..

పశ్చిమబెంగాల్ : రాష్ట్ర అసన్‌సోల్‌లో కేంద్రమంత్రి బబుల్‌ సుప్రియోపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. రాయి ఛాతీపై తగలడంతో గాయమైనట్లు చెప్పారు. పశ్చిమ్‌బంగలోని అసన్‌సోల్‌ నియోజకవర్గ భాజపా ఎంపీ అయిన బబుల్‌ సుప్రియో అక్కడికి వెళ్లినప్పుడు.. పశ్చిమ్‌బంగ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి, అసన్‌సోల్‌ అసెంబ్లీ నియోజకవర్గ తృణమూల్‌ ఎమ్మెల్యే మలోయ్‌ ఘటక్‌ మద్దతుదారులు దాడి చేశారని, తన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేసినట్టు సమాచారం

20:47 - October 19, 2016

ఆరు దశాబ్దాలు గడిచినా పరిస్థితిలో మార్పు రాలేదు. మరో ఆరు దశాబ్దాలైనా వస్తుందనే నమ్మకం కనిపించటం లేదు.. అన్ని రకాలుగా అణచివేత, అంతులేని దోపిడీ, అంతం లేని వివక్ష... వెరసి దారుణమైన వెనుకబాటు. ఇలాంటపుడు దేశంలో దళితుల స్థితిగతులు ఎప్పుడు మారతాయి? సర్వేలు నిర్ఘాంతపరుస్తున్నాయి. సమస్యను చర్చించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. ఆ ఒక్కటి.. అంతులేని దారుణాలకు కారణమయింది. ఆ ఒక్కటి ఎన్నో అరాచకాలు సృష్టించింది. ఆ ఒక్కటే ఈ దేశ మూల వాసుల జీవితాలను కాలరాసింది. అది కులవ్యవస్థ.. కులవివక్ష కారణంగా ఈ దేశంలో మెజారిటీ ప్రజల జీవన స్థితిగతులు ఎంతగానో దిగజారిన వాస్తవం స్పష్టంగా కనిపిస్తోంది.. తరతరాలుగా సమాజంలో వేళ్లూనుకున్న కుల వివక్షను అంతం చేయకుండా దేశాన్ని అభివృద్ధి బాట పట్టించగలరా? స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా అన్నింటా దళితులు అట్టడుగున ఉన్నారంటే దానికి పాలకుల వైఫల్యమే కారణం కాదా..? దళితుల ఓట్లతో గద్దెనెక్కుతున్న ప్రభుత్వాలు ఆ తర్వాత ఓడమల్లయ్య, బోడి మల్లయ్యలాగా , వారిని పూర్తిగా విస్మరిస్తున్నాయి. కులం పునాదులు కూలకుండా నవభారత నిర్మాణం సాధ్యమౌతుందా? చిన్న బ్రేక్ తర్వాత.. సమస్యను చాలా కన్వీనియెంట్ గా విస్మరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. న్యాయం జరగాలంటే అన్యాయాన్ని నిలదీయటమే మార్గం. సమస్యకు పరిష్కారం కావాలంటే చర్చించటం ఓ మార్గం. దానికి చట్టసభలు వేదికగా మారటం, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవటం అత్యవసరం. మనిషి దేహంలో అన్ని అంగాలు సక్రమంగా పనిచేసినపుడే ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే దేశంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి బాటలో ఉండి, ఎలాంటి వివక్ష లేనపుడే దేశం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుంది. అదే నవభారత నిర్మాణానికి నాంది అవుతుంది. కానీ, ఆ పరిస్థితి సమీపంలో కనిపిస్తోందా? దళితులపై సాగుతున్న సామాజిక, ఆర్థిక దోపిడీని నిర్మూలించకపోతే, నవ భారతావని నిర్మాణం అసంపూర్ణమే అవుతుంది. ఈ రెండు దోపిడీలను నిర్మూలించి అభివృద్ధిలో దళితులను భాగస్వామ్యం చేసినప్పుడే నూతన భారతం వైపు పరుగు మొదలవుతుంది. దళితులకు ఆర్థికాధికారం కల్పించినప్పుడే సమాజంలో గూడుకట్టుకున్న సామాజిక, ఆర్థిక దోపిడీ నిర్మూలితం అవుతుంది. 

నల్లవెల్లికి చేరుకున్న మహాజన పాదయాత్ర..

రంగారెడ్డి : సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఉత్సాహంగా  కొనసాగుతోంది. యాచారం మండలం నల్లవెల్లి గ్రామానికి పాదయాత్ర చేరుకుంది. మూడోరోజు పాదయాత్ర 29.12 కిలోమీటర్ల కొనసాగింది. 

20:31 - October 19, 2016

ఆస్తులను వెల్లడించిన నారా లోకేష్..తిరుపతి ఎంకన్న బాబు ఆస్తుల్లో వాటా ఇవ్వాలంటున్న అయ్యవారు..విభజన సెగ తగిలిని ఏడుకొండవాడు..పెదపల్లి జిల్లాపై ఆదిపత్యంపై గులాబీ హస్తం నేతల పాట్లు..తుపాకీతో ఫోజులిచ్చిన నాయిని నర్సన్న..సర్కారు దవాఖానల సందర్శించిన రాజక్క..రాగిసెంబు రేటు రెండు లచ్చలంట..ఏడు పాయలకాడ పోటెత్తిన వరద..ఉసారుతో నీటిలో కొట్కపోయిన పోరగాడు..ఆరు వేల రూపాయల పెండ్లి పత్రికను సూసిండ్రా..గయితే సూడుండ్రి..

డాన్సర్లపై డబ్బులు విసిరిన ఎమ్మెల్యే?!..

ఉత్తరప్రదేశ్ : అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగత్ రామ్ పాసవన్ ఒక పెళ్లి వేడుకలో డ్యాన్సర్లపైకి డబ్బులు వెదజల్లుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లోకి చేరి హల్ చల్ చేస్తోంది. ఈ సంఘటనపై అక్కడి ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓపక్క సమాజ్ వాదీ పార్టీ అంతర్గత సమస్యలతో సతమతమవుతుంటే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరోపక్క ఇలాంటి పనులు చేస్తూ ఆనందిస్తున్నారంటూ విమర్శించారు. అయితే, ఈ సంఘటనపై స్పందించిన ఆ పార్టీ నేత ఒకరు మాట్లాడుతూ, విచారణ చేపట్టామని, వాస్తవాలు తెలిసిన తర్వాత ఆ ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బాబు బంగాళాఖాతంలోకే : జగన్

పశ్చిమగోదావరి : చంద్రబాబు అధికారంలో ఉండేది మరో రెండేళ్లేనని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా బేతపూడిలో ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ బాధితులతో ముఖాముఖి అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని అన్నారు. చంద్రబాబు,ఆక్వా ఫుడ్ ప్రాజెక్ట్ యాజమాన్యానికి తాము చెప్పేది ఒకటేనని, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ముందుకు వెళితే బంగాళాఖాతంలోకి వెళ్లాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు.

ఆర్మీ జవాను ఆత్మహత్య..

జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో విషాదం నెలకొంది. మేంద్‌హర్ సెక్టార్‌లో ఓ ఆర్మీ జవాను(23) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని లాన్స్ నాయక్ అనిల్ బూరగా ఆర్మీ ఉన్నతాధికారులు గుర్తించారు. జవాను ఆత్మహత్యతో తోటి జవాన్లు విషాదంలో మునిగిపోయారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

యాదాద్రి జిల్లా పేరు మార్పు! ..

నల్లగొండ : యాదాద్రి జిల్లా పేరులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఇక నుంచి యాదాద్రి - భువనగిరి జిల్లాగా పిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. యాదాద్రి పర్యటనకు వెళ్లిన సీఎం భువనగిరిలో రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు ఎలిమినేటి కృష్ణారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రి జిల్లాను యాదాద్రి - భువనగిరి జిల్లాగా మార్చాలని సీఎంకు కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు యాదాద్రి - భువనగిరి జిల్లాగా మార్చనున్నట్లు సీఎం వెల్లడించారు. 

భవిష్యత్ లో యాదాద్రికి భక్తుల రద్దీ : కేసీఆర్

నల్లగొండ : భక్తులకు ఇబ్బంది కలగకుండా యాదాద్రి టెంపుల్ సిటీ అభివృద్ధి జరుగాలని సీఎం కేసీఆర్ అధికారులకు నిర్దేశించారు. రాబోయే కాలంలో యాదాద్రిని సందర్శించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతదని..భక్తుల తాకిడికి అనుగుణంగా యాదాద్రిలో వసతి, రహదారులు, క్యూలైన్ల వ్యవస్థ ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. యాదాద్రి సందర్శనలో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్ కాటేజీలు, టెంపుల్ సిటీల నిర్మాణ పనులు, రాజగోపురాలకు శంకుస్థాపన చేసిన ప్రాంతాలు, ప్రధాన ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం సీఎం కేసీఆర్ యాదాద్రి టెంపుల్ సిటీ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. 

19:34 - October 19, 2016
19:26 - October 19, 2016

హైదరాబాద్ : తెలంగాణలో శాంతిభద్రతలపై డీజీపీ అనురాగ్ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ఎస్పీలతో, కమిషనర్లతో పాటు ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడి 9 రోజులు అవుతుండటంతో వాటి అనుభవాలు, సిబ్బంది కొరత, భవనాలు, సౌకర్యాలపై వివరాలు సేకరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పోలీసులు పని చేయాలని డీజీపీ జిల్లా పోలీస్ అధికారులకు సూచించారు. శాంతి భద్రతల్లో రాజీపడవద్దని అదేశాలు జారీ చేశారు.

19:20 - October 19, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సింగపూర్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. స్విస్ ఛాలెంజ్ పేరిట రాజధాని నిర్మాణంలో తెలుగు కంపెనీలను కాదని సింగపూర్ కంపెనీలకు పెద్దపీట వేయడం తెలుగువారిని, భారతీయులను అవమానించడమేనని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్విస్ చాలెంజ్ పై అవలంబిస్తున్న విధానాలను హైకోర్టు కూడా తప్పు బట్టిందని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చేస్తున్న పనులను చూస్తే కన్ ప్యూజన్ బాబుగా కనబడుతున్నారని ఎద్దేవా చేశారు. 

19:13 - October 19, 2016

గుంటూరు : వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పురుగులమందుల దుకాణాల్లో సోదాలు జరిపారు. లాంచస్టర్‌ రోడ్డులోని ఓ గోడౌన్‌లో బయో పెస్టిసైడ్స్‌ను అధికారులు సీజ్‌ చేశారు. వీటి విలువ 80లక్షల రూపాయలవరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పెస్టిసైడ్లను మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గోడౌన్‌తో పాటు జిల్లాలోని కారంపూడి, అచ్చంపేట, పిడుగురాళ్ల ప్రాంతాల్లోకూడా తనిఖీలు చేపట్టారు. అయితే అధికారుల రాక విషయం తెలుసుకున్న దుకాణదారులు.... ముందే షాప్‌లు మూసేశారు. నకిలీ బయో ఉత్పత్తులపై సీఎం సీరియస్‌ కావడంతో అధికారులు ఈ దాడులు చేపట్టారు. 

19:03 - October 19, 2016

విశాఖ : పెట్రో యూనివర్శిటీ నిర్మాణానికి అడ్డుచెప్పడం సరికాదన్నారు... ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. రైతులనుంచి ప్రభుత్వం ఎక్కడా బలవంతంగా భూములు తీసుకోలేదని స్పష్టం చేశారు.. మంచి ధరలు చెల్లించి అన్నదాతలనుంచి భూములు తీసుకున్నామని చెప్పారు.. యూనివర్శిటీకి భూసేకరణపై సీపీఎం నేతలు కావాలనే హడావుడి చేస్తున్నారని ఆరోపించారు.. విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో యూనివర్శిటీ శంకుస్థాపన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు..

18:59 - October 19, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు ట్రాఫిక్‌ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గుంతలు పడిన రోడ్లు, మెట్రో రైలు నిర్మాణానికి రహరాదుల మధ్య ఏర్పాటు చేసిన బ్యారికేడ్లతో కిలో మీటరు దూరం ప్రయాణించాలంటేనే నడుమలు ఇరిగే పరిస్థితులు నెలకొన్నాయి.

గ్రేటర్‌లో ట్రాఫిక్‌ చిక్కులు
కిలో మీటర్‌ దూరం వెళ్లాలంటే నరకాన్ని తలపించే పరిస్థితి .గుంతలు పడిన రోడ్లపై ప్రయాణంతో నడుములు విరిగే దుస్థితి.. .రోడ్లకు మధ్య ఏర్పాటు చేసిన మెట్రోరైలు బ్యారికేడ్లతో వాహనాల నత్తనడక .ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న మెట్రోరైలు ఎప్పటికప్పుడు వెనక్కిపోతోంది. పైగా నిర్మాణంలో జరుగుతున్న జాప్యం ట్రాఫిక్‌ కష్టాలు పెరుగుతున్నాయి. గ్రేటర్‌లో అసలే ఇరుకు రోడ్లు. ఆపై మెట్రోరైలు బ్యారికేడ్లతో రోడ్లను మూసివేయడంతో చీమల మారిదిగా ఒక వాహనం తర్వాత మరొకటి వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. కిలో మీటరు దూరం వెళ్లాలంటే నరకాన్ని తలపించే పరిస్థితులతో నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

కోర్టు కేసులతో రోడ్ల వెడల్పుకు అవరోధాలు
హైద‌రాబాద్ మెట్రో రైలు నిర్మాణంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించింది. రోడ్లను వెడల్పు చేయాల్సిన నగరపాలక సంస్థ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కొన్ని చోట్ల వెడల్పు చేసినా, ట్రాఫిక్‌ సాఫీగా సాగేందుకు అనుకూలంగాలేవు. ప్రార్థనా మందిరాలు ఉన్న ప్రాంతాల్లో కోర్టు కేసులు, ఇతరితర కారణాలతో రోడ్ల వెడల్పు పనులు నిలిచిపోయాయి. దీంతో మెట్రో నిర్మాణ మార్గాల్లో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల భద్రతా లోపాలకు ప్రజలు బలైపోతున్నారు.

వర్షాలకు దారుణంగా తయారైన రోడ్లు
గతనెల్లో కురిసన వర్షాలకు పాత గాంధీ ఆస్పత్రి దగ్గర మెట్రో పిల్లర్‌ గుంతలో పడి ఓ బాలులు ప్రాణాలు కాల్పోయాడు. అంతకుముందు మలక్‌పేట దగ్గర సిమెంట్‌ లోడుతో వస్తున్న లారీ మెట్రో గుంతలో పడిపోయింది. భద్రతా లోపాలతో ఎస్‌ఆర్‌ నగర్‌లో మెట్రో నిర్మాణంలో ప్రమాదం చోటు చేసుకుంది. పైనుంచి పరికరాలు కిందపడటంతో వారహనదారులకు గాయాలైన సందర్భాలున్నాయి. మెట్రోరైలును సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ట్రాఫిక్‌ కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. మెట్రోరైలు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లను రిపేర్లు చేసే విషయంలో జీహెచ్‌ఎంసీ, మెట్రో రైలు నిర్మాణ సంస్థలు సమన్వయంతో పని చేస్తూ ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా చూడాలని ప్రజుల కోరుతున్నారు. 

18:43 - October 19, 2016

హైదరాబాద్ : మాజీ నక్సలైట్ పటోళ్ళ గోవర్థన్ రెడ్డి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవర్థన్ రెడ్డి భార్య విద్యారెడ్డిని ఓ మహిళలపై బెదిరింపులకు పాల్పడుతోందనే కారణంతో పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. వివారాల్లోకి వెళితే కేపీహెచ్ బీ కాలనీలో నివాసముండే ధరణి అనే మహిళ విద్యారెడ్డి వద్ద అప్పు తీసుకుంది. ఈ క్రమంలో అప్పు చెల్లించాలని లేకుంటే ధరణిని ఆమె కుమారుడిని కిడ్నాప్ చేస్తానంటూ విద్యారెడ్డి బెదిరించిందనే ఆరోపణలపై విద్యారెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యారెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విద్యారెడ్డి కాగా పటోళ్ల గోవర్థన్ రెడ్డి మాజీ నక్సలైట్ అనే విషయం తెలిసిందే. గత కొంతకాలం గోవర్థన్ రెడ్డి పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. ఈ క్రమంలోనే గ్యాంగ్ స్టర్ నయీం గోవర్థన్ రెడ్డిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం నయీం కూడా పోలీసుల ఎన్ కౌంటర్ లో గురయిన విషయం కూడా తెలిసిందే. నయీం మరణం తరువాత బ్లాక్ మెయిల్స్ కు పాల్పడుతున్న వారిపై పోలీసులు సత్వరమే చర్యలు తీసుకోవటం గమనించదగిన విషయం. పరారీలో వున్న విద్యారెడ్డి అనుచరుల కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.

పటోళ్ళ గోవర్థన్ రెడ్డి భార్య అరెస్ట్..

హైదరాబాద్ : మాజీ నక్సలైట్ పటోళ్ళ గోవర్థన్ రెడ్డి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్ బీ కాలనీలో నివాసముండే ఓ మహిళను, ఆమె కుమారుడిని కిడ్నాప్ చేస్తానంటూ గోవర్థన్ రెడ్డి భార్య విద్యారెడ్డి బెదిరించింది. దీంతో బాధితురాలి ఫిర్యాదే మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

18:18 - October 19, 2016

విశాఖ : వంగలిలో ఉద్రిక్తిత నెలకొంది. సబ్బవరం మండలం వంగలిలో రేపు పెట్రో వర్శిటీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు,ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వంగలి ప్రాంతంలో గ్రామస్థులను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. పెట్రోవర్శిటీకి దాదాపు 720 ఎకరాల భూమి అవుసరం కానుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వంగలిలో నిర్మించే పెట్రో వర్శిటీని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పచ్చని పంటలు పండే భూములను వదులుకోవటానికి సిద్ధంగా లేమని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో పెట్రో యూనివర్శిటీ శంకుస్థాపన ఆపాలంటూ సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. గతంలో... మారిటైమ్ యూనివర్శిటీ స్థాపన కోసం ఆరేళ్లక్రితం 126 ఎకరాలు సేకరించారని... ఇప్పటివరకూ అక్కడ యూనివర్శిటీ నిర్మాణం ప్రారంభం కాలేదని గుర్తుచేశారు. ఇప్పుడు పెట్రో యూనివర్సిటీ పేరుతో భూసేకరణ జరపటం సరికాదన్నారు. దీని కోసం చట్టవిరుద్ధంగా భూములు సేకరించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో... ఎంతోమంది రైతులు ఉపాధి కోల్పోయారని లేఖలో రాశారు. ముందుగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని మధు డిమాండ్ చేశారు. సబ్బవరం మండలం వంగలి గ్రామంలో రేపు పెట్రో యూనివర్శిటీకి చంద్రబాబు శంకుస్థాపన చేయనుండటంతో... మధు ఈ లేఖ రాశారు.

ఎస్పీలు,కమిషనర్లతో అనురాగ్ శర్మ సమీక్ష..

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ అనురాగ్ శర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. కొత్త జిల్లాల్లో ఎస్పీలు, పోలీసు కమిషనర్లు ఆశించిన విధంగా పని చేయాలన్నారు. కార్యాలయ భవనాలతో పాటు ఫర్నిచర్, పూర్తిస్థాయి సిబ్బంది, కంప్యూటర్లు, ఫ్యాక్స్, జిరాక్స్ మిషన్లు త్వరగా సమకూర్చుకోవాలని చెప్పారు. అన్ని స్థాయిల పోలీసు అధికారులకు వాహనాలు ఇస్తామని తెలిపారు.

గుండాలలో మండలాల గోల..

నల్గొండ : గుండాల మండలాన్ని జనగామలో కలపవద్దంటూ ఇద్దరు యువకులు ఆందోళన చేపట్టారు. గుండాలలో సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలుపుతున్నారు. గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ వారు సెల్‌ టవర్‌ ఎక్కి ఆందోళన చేపడుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

మేయర్ పై 'చెప్పు' నిరసన..

రాజస్థాన్‌ : రాజధాని జైపూర్‌లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశాలు రసాభాసగా సాగుతున్నాయి. తొలిరోజు కౌన్సిలర్లు చొక్కాలుపట్టుకుని కొట్టుకోగా.. రెండో రోజు మరింత దిగజారి ప్రవర్తించారు. మేయర్‌పైకి ఓ కౌన్సిలర్‌ చెప్పు విసరడంతో ఘర్షణ ఉద్రిక్తంగా మారింది.

17:47 - October 19, 2016

హైదరాబాద్ : తెలంగాణలో మద్యం ఏరులైపారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న మద్యం అమ్మకాలు ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఆరు నెలల్లో ఎక్సైజ్‌ శాఖ ఆదాయం 55 శాతం అదనంగా పెరిగిందంటే... మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు..

రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
తెలంగాణ లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న అమ్మకాలతో ఖజానాకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వచ్చిపడుతోంది. దీంతో జనం నిషామత్తులో తూలుతుంటే.... సర్కారు ఖుషీ ఖుషీగా ఉంది.

అన్ని శాఖల రూ.22,500 కోట్లు, మద్యం ద్వారా రూ.2,500 కోట్లు
ఖజానాకు ఆదాయం సమకూర్చే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎక్సైజ్‌ శాఖదే అగ్రస్థానం. గత ఆరు నెలల్లో ఎక్సైజ్ శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. అన్ని శాఖల ద్వారా 22,500 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. ఈ మొత్తంలో పది శాతంపైగా మద్యం అమ్మకాలతో వచ్చిన ఆదాయమే ఉంది. ఎక్సైజ్‌ శాఖ ద్వారా 2,500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే కాలంలో జరిగిన మద్యం అమ్మకాలతో పోలిస్తే ఇది 55 శాతం అదనం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మద్యం ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆదాయం పెంచుకుంటూ పోతున్న ఎక్సైజ్‌ శాఖ ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

2016-17లో మొదటి ఆరు నెలల్లో 21 శాతం అదనపు ఆదాయం
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. 2016-17 మొదటి అర్థభాగంలో 21శాతం ఎక్కువ రెవిన్యూ సమకూరింది. పన్నుల ద్వారా ఖజానాకు 22,500 కోట్లు రూపాయలు జమ అయ్యింది. ఈ మొత్తంలో 16,400 కోట్ల రూపాయలు వాణిజ్య పన్నుల ద్వారా సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 14 శాతం అదనం. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 39 శాతం పెరిగింది. ఈ శాఖ ద్వారా 2,050 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. రవాణ శాఖ ఆదాయం 20శాతం పెరిగింది. ఈ శాఖ ద్వారా 1300 కోట్లు ఆదాయం సమకూరింది. ఈ విధంగా అన్ని ప్రభుత్వ శాఖల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఢోకా లేకుండా ముందుకుసాగుతున్నాయి.

అభివృద్ధే ప్రధాన ధ్యేయమంటున్న కేసీఆర్ ..
ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ వంటి కొన్ని పథకాలకు చెల్లింపుల్లో జాప్యం జరగడంతో ఆర్థిక పరిస్థితిపై పరిస్థితిపై ప్రతిపక్షాలు అనుమానాలు లేవత్తాయి. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ కూడా చేశాయి. అయితే సర్కార్‌ మాత్రం తన పనులను తాను చేసుకుంటూ పోతోంది. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. అభివృద్ధే ప్రధాన ధ్యేయమన్న ధీమాతో ముందుకు సాగుతున్నామని చెబుతున్నారు.

17:31 - October 19, 2016

రంగారెడ్డి : ''మేము వృద్ధులం..రేషన్ మొత్తానికి లేదు..నష్టపరిహారం ఇస్తమన్నరు..రాసుకపోతున్నరు..కరవు ప్రాంతమని ఇచ్చిండ్రు.. మాకు మాత్రం రాలేదు''. ఈ మాటలన్నీ  వృద్ధులు పేర్కొంటున్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో సీపీఎం మహాజన పాదయాత్ర మూడో రోజు కొనసాగింది. అక్కడి ప్రజల కష్టనష్టాలను నేతలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఫించన్లు అందడం లేదు..మంచినీరు రావడం లేదు..రేషన్ బియ్యం ఇవ్వడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపల్లిలో ఉన్న వృద్ధులతో టెన్ టివి ముచ్చటించింది. వారు ఏమన్నారో వారి మాటల్లోనే...
''మంచి మంచి వాళ్లవి కట్ చేసిండ్రు. మూడెకరాల భూమి ఇస్తమన్నరు. ఇవ్వలే..మాటలే పెద్దవి ఏమీ లేవు..ఫించన్ పైసలేవు..కరవు పైసలేవు..మూడేండ్ల నుండి ఒక్క పైస లేదు''..అంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదన తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

17:23 - October 19, 2016

ఫిలిప్పైన్స్ : ఆందోళ‌నకారులపై లాఠీచార్జ్ చేయ‌డం, వాట‌ర్‌కెనాన్లు ప్ర‌యోగించ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. కానీ మనీలాలో పోలీస్ వ్యాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఫిలిప్పైన్స్ రాజ‌ధాని మ‌నీలాలో మాత్రం ఓ పోలీస్ వ్యాన్ బీభ‌త్సం సృష్టించింది. ఆందోళ‌న‌కారుల‌పైకి దూసుకెళ్లింది. అడ్డొచ్చిన‌వారిని తొక్కేసుకుంటూ వెన‌క్కీ ముందుకూ వెళ్తూ భ‌యాందోళ‌న‌ల‌ను క‌లిగించింది. రాజధాని మనీలాలో అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన రక్తసిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న వారిపైకి పోలీసులు వ్యాన్‌ను నడిపారు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తొలుత ఆందోళనకారులు వ్యాన్‌ను చుట్టుముట్టి పోలీసుల నుంచి లాక్కున్న కర్రలతో వాహనాన్ని కొట్టడం మొదలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు వ్యాన్‌ను పలుమార్లు జనంపైకి పోనిచ్చాడు. ఫలితంగా పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు, అమెరికా భద్రతా సిబ్బందిపైకి ఎర్రరంగును చల్లిన 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకారులను అణచివేసేందుకు టియర్‌ గ్యాస్‌, జలఫిరంగులను కూడా ఉపయోగించారు. 

17:22 - October 19, 2016

'బాహుబలి' రికార్డ్స్ బద్దలైయ్యాయి. 'మెగా' స్టామినా ముందు 'బాహుబలి' రికార్డ్స్ నిలువలేకపోయాయి. అసలు 'బాహుబలి' రికార్డ్స్ తిరగరాసే సినిమా వస్తుందా అనుకున్న వాళ్లకి 'ఖైదీ నెంబర్ 150'తో 'మెగాస్టార్' సమాధానం ఇచ్చాడు. ఏంటీ ఇంకా సినిమా రిలీజ్ కాలేదు..అప్పుడే బ్రేక్ లేంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? 'బాహుబలి' సినిమా అనేది టాలీవుడ్ ఉన్నంత కాలం సువర్ణక్షరాలతో లిఖించి ఉంటుంది. ఇంతటి విజయాన్ని ఏ తెలుగు ప్రేక్షకుడు ఊహించి ఉండడు. బాక్సాపీసు వద్ద ఈ మూవీ 600కోట్లు వసూల్ చేసి అబ్బురపరిచింది. ఇంతటి విజయం సాధించిన మూవీని 'చిరంజీవి' మూవీ బీట్ చేయడమేంటీ అనుకోవచ్చాంతా కానీ ఇది నిజం. ప్రీ రిలీజ్ లో 'చిరు' మూవీ 'బాహుబలి'ని బీట్ చేసింది.

రెండు రాష్ట్రాలకు...
'మెగాస్టార్ చిరంజీవి' 150 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లో 'బాహుబలి'ని క్రాస్ చేసింది. 'ఖైదీ నెం 150' మూవీ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 32 కోట్లకు బిజినెస్ జరిగిందట. దాంతో ఇంతవరకూ రైట్స్ బిజినెస్ లో 'బాహుబలి' పేర వున్న 30 కోట్ల రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ విధంగా మెగాస్టార్ 'ఖైదీ నెంబర్ 150'.. 'బాహుబలి'ని అధిగమించింది. ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో మూవీ ప్రొడ్యూసర్ 'చిరు' తనయుడు 'చెర్రీ' ఫుల్ ఖుషీగా ఉన్నాడట. 'చిరు' రీ ఎంట్రీని 'మెగా' వారసుడు 'రామ్ చరణ్' మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీని ఖర్చుకు వెనుకాడకుండా గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ రికార్డు రేంజ్ 15కోట్లకు అమ్ముడుపోయాయి. ప్రీ బిజినేస్ లో 'బాహుబలి'ని అధిగమించిదేమో కానీ ఒవరాల్ బాక్సాపీసు కలెక్షన్లలో 'అన్నయ్య' మూవీ 'బాహుబలి' సినిమాను అధిగమించడం కలే అని చెప్పాలి. ఏదేమైన 9ఏళ్ల తరువాత 'చిరంజీవి' మూవీ చేస్తున్న ఈ రేంజ్ లో బిజినేస్ జరుగుతుందంటే దటీజ్ 'మెగాస్టార్' అనాల్సిందే.

17:16 - October 19, 2016

'కళ్యాణ్ రామ్' న్యూ స్టైలిష్ లుక్ విత్ సిక్స్ ప్యాక్ 'పూరీ' మార్కు టేకింగ్ తో 'ఇజం' సరికొత్తగా కనిపిస్తోంది. ఈ మూవీ కోసం 'కళ్యాణ్ రామ్' మునుపెన్నడు లేని విధంగా వెరీ స్టైలీష్ గా రగ్గడ్ లుక్ లోకి మారిపోయాడు. ఈ చిత్రంపై కళ్యాణ్ రామ్ తో పాటు 'పూరీ' సైతం బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ మధ్య 'పూరీ' చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆడింది లేదు. దీంతో 'ఇజం'తో లైవ్ లైట్ లోకి రావాలని 'పూరీ' కూడా ఆశపడుతున్నాడు. 'ఇజం' జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో నడిచే స్టోరీ 'పూరీ' ముందే క్లారిటి ఇచ్చాడు. అయితే ఈ మూవీలో పెయిన్ పుల్ లవ్ స్టోరీ కూడా ఉందట. ఈ పాయింట్ యూత్ ని టచ్ చేస్తుందని టీం నమ్మకంగా చెప్పుతోంది.

పూరీ మార్కు..
అంతేకాదు యూత్ కావాల్సిన 'పూరి' మార్కు హీరోయిజంతో పాటు హీరోయిన్ టీజింగులు సరదా సన్నివేశాలూ చాలానే ఉన్నాయంట. ఇవన్ని ట్రైలర్ చూస్తే అర్ధమవుతాయి. అయితే అంతకు మంచి కేక పుట్టించే లవ్ స్టోరీని కూడా ఇందులో ఇన్నర్ గా సాగుతుందట. 'ఇజం' ఫస్ట్ హాప్ లో క్యూట్ అండ్ పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ పెట్టామని 'కళ్యాణ్ రామ్' కూడా బలంగా చెబుతున్నాడు. ఇక సెకెండాఫ్ లో మూవీ యాక్షన్ మూడ్ లోకి వెళ్లుతుందట. దీన్ని బట్టి ఈ మూవీ ఓ 'పోకిరి', 'శివమణి' టైప్ లో పెయిన్ పుల్ లవ్ స్టోరీ 'పూరీ' ఇందులో చూపిస్తాడేమో అని అంతా ఊహించుకుంటున్నారు. మరి మూవీ ఎలా ఉండబోతుందనేది ఈ నెల 21న తెలిసిపోతుంది. 

17:08 - October 19, 2016

'దంగల్' ఈ దశాబ్దాపు బెస్ట్ మూవీ. ఇప్పుడు ఈ కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మిస్టర్ ఫర్ పెక్ట్ 'అమీర్ ఖాన్' ఈ మూవీతో సన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ గా ఉన్నాడని, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ తో సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అవుతుంది. 'దంగల్' మూవీపై ఈ రేంజ్ సెన్సేషన్ కామెంట్ చేసిన ఆ డైరెక్టర్ ఎవరు ? బాలీవుడ్ లో 'అమీర్ ఖాన్' ని అంతా మిస్టర్ ఫర్ పెక్ట్ అని ఎందుకు అంటారో ఆయన సినిమాల స్టోరీస్ చూస్తే అర్థం అవుతుంది. రెండేళ్ల కిందట 'పీకే' మూవీతో అమీర్ బాక్సాఫీసు రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మూవీ కాంట్రవర్శీలతో పాటు కలెక్షన్ల పరంగా బాలీవుడ్ లో సరికొత్త రికార్డ్స్ ని సెట్ చేసింది. ఇప్పుడు 'దంగల్' తో 'అమీర్' మరోసారి అలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఓ సినిమా రిలీజ్ కి రెండు నెలల ముందే రషెస్ చూసి, ఈ దశాబ్ద కాలం అత్యుత్తమ సినిమా అనే ధైర్యం చేశాడంటే ఆ సినిమా ఎంతటి ప్రభావం చూపించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి కామెంట్ 'దంగల్' సినిమాపై దర్శకుడు కరణ్ జోహార్ చేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

రషెస్ చూసి వావ్..
కరణ్ మాత్రమే కాకుండా షబానా ఆజ్మీ లాంటి మరికొందరు సెలబ్రెటీలు కూడా 'దంగల్' రషెస్ చూసి వావ్ అనేశారట. దీన్ని బట్టి 'దంగల్' మూవీ ఎలాంటి సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. 'దంగల్' మూవీ 'అమీర్' చేసిన '3 ఇడియట్స్', 'పీకే' కన్నా గొప్ప ఉంటుందని బాలీవుడ్ సెలెబ్రిటీస్ అంటున్నారు. మామూలుగానే 'అమీర్' సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. దీనికి తోడు ఈ వ్యాఖ్యలతో 'దంగల్' పై అంచనాలు మరింత పెరిగాయి. అంకిత్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'అమీర్' నలుగురు అమ్మాయిల తండ్రిగా నటిస్తున్నాడు. మహవీర్ పొగట్ అనే రెజ్లర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 23న 'దంగల్' ప్రేక్షకుల ముందుకొస్తుంది.

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు ఏర్పడటంతో కొత్తగా ఉద్యోగాలు ఏర్పడ్డాయి. పరిపాలన సుగమంగా సాగాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈమేరకు ఇవాళ ఆర్థిక శాఖ పలు పోస్టులకు అనుమతులు మంజూరు చేసింది. కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో రెవెన్యూ శాఖలో 2019 పోస్టులు మంజూరు చేసింది. వీటిలో కలెక్టరేట్‌లకు 693 పోస్టులు, రెవెన్యూ డివిజన్లకు 188 పోస్టులు మంజూరు చేశారు. మండలాలకు 1228 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 

16:37 - October 19, 2016

గుంటూరు : ఏపీలో టీచర్ పోస్టుల కోసం ఎదురు చూసేవారికి ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఏపీలో 1,385 టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం పలికింది. రెండు విడతలుగా భర్తీ చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఏడాది మొదటి విడతగా 1,104 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయంచింది.

16:32 - October 19, 2016

హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడటంతో కొత్తగా ఉద్యోగాలు ఏర్పడ్డాయి. పరిపాలన సుగమంగా సాగాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ పలు పోస్టులకు అనుమతులు మంజూరు చేసింది. కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో రెవెన్యూ శాఖలో 2109 పోస్టులు మంజూరు చేసింది. వీటిలో కలెక్టరేట్‌లకు 693 పోస్టులు, రెవెన్యూ డివిజన్లకు 188 పోస్టులు మంజూరు చేశారు. మండలాలకు 1228 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తహశీల్దార్లు 104, డిప్యూటీ తహశీల్దార్లు 104, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు 232, జూనియర్ అసిస్టెంట్లు 120, మండల సర్వేయర్లు 120, ఆఫీస్ సబార్డినేటర్లు 308 పోస్టులను ఆర్థిక శాఖ మంజూరు చేసింది. పాఠశాల విద్యా శాఖలో 85 ఎంఈవో పోస్టులు మంజూరు అయ్యాయి. ఆర్ అండ్ బీలో మరో 12 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

16:30 - October 19, 2016

విశాఖపట్నం : గాజువాకలో మహిళాలోకం కదం తొక్కింది. గాజువాక సమీపంలోని వడ్లపూడిలో ఉద్రికత్త నెలకొంది. సింహగిరి బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం బాటిల్స్, ఫర్నీచర్ ను మహిళలు ధ్వంసం చేశారు. జనావాసాల్లో వున్న బార్ అండ్ రెస్టారెంట్ ను వెంటనే మూసివేయాలని మహిళలు డిమాండ్ చేశారు. లేకుండా ఉద్యమం ఉదృతం చేస్తామని స్థానిక మహిళలు డిమాండ్ చేసారు.  

16:26 - October 19, 2016
16:25 - October 19, 2016

కృష్ణా : బందరు పోర్టు...ఒక అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. పోర్టును నిర్మిస్తామంటూ ప్రతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు హామీలివ్వడం...ఆ తర్వాత అధికారంలోకి రాగానే మర్చిపోవడం ఆనవాయితీగా మారుతోంది. పోర్టు పేరుతో రాజకీయాలు చేస్తున్న రాజకీయ పార్టీలు...అక్కడి ప్రజల బాగోగులను మాత్రం పట్టించుకోవడంలేదు. పోర్టు పేరుతో వేలాది ఎకరాలను అప్పనంగా లాక్కొంటున్న సర్కార్‌..రైతుల నోటికాడి ముద్దను లాక్కొంటోంది. కృష్ణ జిల్లాలో బందర్‌పోర్టు వ్యవహారంపై టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ.

బందరు పోర్టు కేంద్రంగా బ్రిటీష్ పాలన
కృష్ణాజిల్లా బందరు పోర్టు అనునిత్యం నోట్లో నానుడిగా మారింది. వందల ఏళ్ల క్రితం బ్రిటీష్ పాలకులు పరిపాలన చేసినప్పుడు బందరు పోర్టునే కేంద్రంగా చేసుకొని పాలన సాగించారు. అటువంటి పోర్టు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత క్రమక్రమంగా మరుగున పడింది. 30 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ పోర్టును ప్రధాన పార్టీలకు ఎన్నికల అజెండాగా మిగిలిపోయిందే తప్ప అభివృద్ధి దిశగా కొనసాగించిన దాఖలాలు లేవు. అధికారంలో ఉన్నప్పుడు చెప్పే మాటకు, అందలమెక్కిన ప్రభుత్వాలు చేస్తున్న పనులకు పొందన లేకుండా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బందరు పోర్టును 2 వేల ఎకరాల్లో నిర్మిస్తే చాలని వాదించింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 6,250 ఎకరాల్లో పోర్టు నిర్మిస్తున్నామని ప్రకటించి మరీ శంకుస్థాపన చేసి భూ దోపిడీకి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మార్గం వేసింది.

రాజకీయాలకు వేదికగా మారిన బందరు పోర్టు
ప్రస్తుతం టీడీపీ..అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పోర్టు నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. తర్వాత పోర్టు అభివృద్ధిని విస్మరించింది. పోర్టు పేరుతో పరిశ్రమలు వస్తాయని, 33 వేల ఎకరాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఏడాదిగా కంటి మీద కునుకులేకుండా చేసింది. పోర్టు విషయంలో ప్రభుత్వ చర్యను రైతులు వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం ఒకడుగు ముందుకు రెండగులు వెనక్కి పయనించి తీరా భూసమీకరణకు దిశగా అడుగులేసింది. ఇప్పుడు కూడా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌవడంతో ప్రభుత్వం 4 టీంలను ఏర్పాటు చేసి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను నయానో, భయానో ఒప్పించడం, వినకపోతే బెదిరించడం ఆపై హెచ్చరించడం పనిగా పెట్టుకుంది.

6నెలల్లో పోర్టు నిర్మిస్తామన్న టిడిపి..33 వేల ఎకరాలకు నోటిఫికేషన్
బందరు పోర్టుకు కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ..సారవంతమైన పచ్చని పంట పొలాలను లాక్కొంటోంది ప్రభుత్వం. ఇప్పటికే పరిశ్రమల కోసం లక్షల ఎకరాలు సేకరించిన ప్రభుత్వాలు..ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో భూములన్నీ బీళ్లుగా మారాయి. అయినా మంత్రి కొల్లు రవీంద్ర, బందరు ఎంపీ కొనకళ్ల నారారాయణరావుతోపాటు టీడీపీలోని ముఖ్యనేతలు భూసమీకరణకు రైతులను ఒప్పించే పనిలో నిమగ్నమయ్యారు. బందరు మండలంలోని కొందరు పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తమ భూములను ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో ప్రభుత్వానికి మింగుడుపడని విధంగా మారింది. మరోవైపు భూపరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏడాదికాలంగా బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసిన 29 గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి రైతులు, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తోంది.

భూ సమీకరణకు రైతులను ఒప్పిస్తున్న ఎంపీ కొనకళ్ల, మంత్రి కొల్లు రవీంద్ర
పంట పొలాలను ఇస్తే తామెలాగ బ్రతకాలంటూ రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు సరిదిద్దుకోకుండా..భూములతోనే వ్యాపారం చేస్తూ పాలన చేయాలనుకోవడం రైతుల పొట్ట కొట్టడమే అవుతుందని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పచ్చటి భూములను లాక్కొనే ప్రక్రియకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. 

16:23 - October 19, 2016

రంగారెడ్డి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో కలెక్టర్‌ దివ్య ఆకస్మిక తనిఖీలు చేశారు.. తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు.. అక్కడ వైద్యం ఎలా అందుతుందో రోగులను అడిగి తెలుసుకున్నారు.. అక్కడినుంచి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు.. విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.. చిన్నారులతోకలిసి మధ్యాహ్న భోజనం చేశారు..

16:17 - October 19, 2016

విజయవాడ : విశాఖ జిల్లాలో పెట్రో యూనివర్శిటీ శంకుస్థాపన ఆపాలంటూ సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. గతంలో... మారిటైమ్ యూనివర్శిటీ స్థాపన కోసం ఆరేళ్లక్రితం 126 ఎకరాలు సేకరించారని... ఇప్పటివరకూ అక్కడ యూనివర్శిటీ నిర్మాణం ప్రారంభం కాలేదని గుర్తుచేశారు. ఇప్పుడు పెట్రో యూనివర్సిటీ పేరుతో భూసేకరణ జరపటం సరికాదన్నారు. దీని కోసం చట్టవిరుద్ధంగా భూములు సేకరించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో... ఎంతోమంది రైతులు ఉపాధి కోల్పోయారని లేఖలో రాశారు. ముందుగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని మధు డిమాండ్ చేశారు. సబ్బవరం మండలం వంగలి గ్రామంలో రేపు పెట్రో యూనివర్శిటీకి చంద్రబాబు శంకుస్థాపన చేయనుండటంతో... మధు ఈ లేఖ రాశారు.

16:13 - October 19, 2016

పశ్చిమగోదావరి : ప్రజాభిప్రాయం సేకరించకుండా గ్రామాల మధ్య ఫ్యాకర్టీ నిర్మించడం సరికాదని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ అన్నారు. తుందుర్రులో ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ పెట్టవద్దంటూ నిరసన తెలిపిన గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయించి అమాయకుల్ని వేధించటం సరికాదని ఆయన అన్నారు. ఆక్వాఫుడ్ పార్క్కు వ్యతిరేకంగా ఉద్యమించి, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్‌ జైల్లో ఉన్న సత్యవతిని జగన్ పరామర్శించారు. సత్యవతి చేసిన తప్పంటేని, కాలుష్యాన్ని అరికట్టాలని కోరిన వారిపై హత్యాయత్నం కేసులు పెడతారా అని జగన్‌ ప్రశ్నించారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తే ఏడుగురిపై హత్యాయత్నం కేసులు పెట్టారని, గ్రామాల్లో భయాందోళనలు సృష్టించి గ్రామస్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 

పాదయాత్ర పూర్తయ్యేలోపు హామీలు నెరవేర్చాలి :తమ్మినేని

రంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. మూడోరోజుకు పాదయాత్ర చేసుకుంది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..దళితులకు 3ఎకరాల భూపంపిణీ,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని పాదయాత్ర పూర్తయ్యేలోపు అమలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తమ్మినేని డిమాండ్ చేశారు. లేదంటే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని ఆయన హెచ్చరించారు.ప్రాజెక్టుల పేరుతో 5లక్షల ఎకరాలను కాజేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. 

ప్రధాని మోదీతో సూకీ భేటీ..

ఢిల్లీ: మయన్మార్ విదేశాంగ మంత్రి అంగ్ సాన్ సూకీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు రెండు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. కాగా, గోవాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు సూకీ మన దేశానికి వచ్చిన విషయం తెలిసిందే.

భారీగా డెబిట్ కార్డుల నిలిపివేత?..

ఢిల్లీ: అనుమానాస్పద లావాదేవీలు జరుపుతున్నారని భావించి ఎస్‌బీఐ 6.25లక్షల డెబిట్‌ కార్డులను నిలిపివేసింది. ఈ కార్డులన్నీ థర్డ్‌పార్టీ ఏటీఎం యంత్రాల ద్వారా లావాదేవీలు నడుపుతున్నట్లు భావిస్తున్నారు. వినియోగదారులకు ఎటువంటి సమాచారం లేకుండా ముందు ఆ కార్డులను బ్లాక్‌ చేసింది. తర్వాత ఈమెయిల్స్‌ ద్వారా, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కార్డుదారులకు సమాచారాన్ని పంపింది.ఎస్‌బీఐ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ శివ్‌కుమార్‌ భాసిన్‌ మాట్లాడుతూ..మా సంస్థకు చెందిన 0.25 శాతం కార్డులను నిలిపివేశాము. ఈ కార్డులను వైరస్‌ సోకిన ఏటీఎంల్లో వినియోగిస్తున్నట్లు తెలిసింది.

15:28 - October 19, 2016

కర్ణాటక : మాజీమంత్రి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు పెళ్లిని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నారు. కేవలం ఒక్క శుభలేఖ ఆరువేల రూపాయలతో డిజైన్ చేయించాడు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి దీన్ని రూపొందించాడు. ప్రముఖులకు, సెలబ్రిటీలకు ఈ కార్డును పంపే తీరు కూడా వెరైటీగా వుంది. ఓ బాక్సులో చిన్న ఎల్‌ సీడీ స్క్రీన్, ఆటోప్లే వీడియో, స్నికెట్‌తో కూడిన ఒక నిమిషం నిడివి‌గల వీడియో గల కార్డు ఇది. ఈ వీడియోలో గాలి ఫ్యామిలీ మొత్తం కనిపించింది. గాలి కుటుంబసభ్యులు ప్రత్యేకంగా కంపోజ్ చేయించిన ఓ కన్నడ సాంగ్‌ ఇందులో హైలైట్. 

15:23 - October 19, 2016

రాజస్థాన్ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను కృష్ణ జింకల కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. వన్య ప్రాణులను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. రాజస్థాన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 1998లో 'హమ్‌ సాథ్‌ సాథ్‌ హై' సినిమా షూటింగ్‌ కోసం సల్మాన్‌ రాజస్థాన్‌ వెళ్లారు. 1998లో జోధ్‌పూర్‌కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో ఓ కృష్ణజింకను, ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారించిన జోధ్‌పూర్‌ కోర్టు.. రెండు కేసుల్లోనూ ఏడాది, ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ.. సల్మాన్‌ రాజస్థాన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ జులై 25న తీర్పు వెల్లడించింది. సల్మాన్‌కు వ్యతిరేకంగా రాజస్థాన్‌ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

15:15 - October 19, 2016

మెదక్ : మల్లన్న సాగర్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గతకొన్ని నెలలుగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం అంశంలో ఆ పరిసర ప్రాంతంలోని గ్రామస్థులకు ప్రభుత్వానికి మధ్య భూసేకరణ విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా మల్లన్న సాగర్ ముంపు గ్రామంలో ఒకటైన వేములఘాట్ లో ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంతంలో భూములను సర్వే చేసేందుకు వెళ్లిన తహశీల్దార్ , నీటిపారుదల శాఖ ఏఈని గ్రామస్థులు అడ్డుకున్నారు. కేసు కోర్టు కొనసాగుతుండగా సర్వే చేయటంతో అధికారులను అడ్డుకున్నారు. దాదాపు 135 రోజులుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాగానీ ఏ అధికారలు వచ్చి సమస్యలను విచారించని నేపథ్యంలో తాజాగా తహశీల్దార్ దేశీనాయక్ వచ్చి సర్వే చేపటంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. అనంతరం అధికారులను గ్రామస్థులంతా మూకుమ్మడిగా అడ్డుకుంటున్నారు. దీంతో గ్రామస్థులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కాగా కేసు కోర్టులో కొనసాగతుండగా తహశీల్దార్ పై తాము కోర్టుకు వెళతామని గ్రామస్థులు పేర్కొంటున్నారు. కాగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి చేస్తున్న భూసేకరణ విషయంలో గ్రామస్థులకు జరుగునతున్న అన్యాయాన్ని ఖండిస్తు సీపీఎం పార్టీ గ్రామస్థులకు అండగా వున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలుపార్టీలు, మేధావులు, ప్రజాసంఘాలు గ్రామస్థులకు అండగా నిలబడి అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేసారు. 

15:09 - October 19, 2016

నాగ చైతన్య రోమాంటిక్ ఫర్మామెన్స్ కి యూత్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఫలితంగా ప్రేమమ్ చిత్రం బాక్సఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రేమమ్ తో చైతూ కెరీర్ పరంగా బిగ్ హిట్టు ఖాతాలో వేసుకుంటున్నాడు. 
నాగ చైతన్య బిగ్ సక్సెస్
అక్కినేని హీరోలు లవ్ స్టోరీస్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రేమమ్ తో మరోసారి ఫ్రూవ్ అయింది. రాంగ్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుని దెబ్బతిన్న నాగచైతన్య సరైన టైంలో ప్రేమమ్ ని ఎంచుకుని బిగ్ సక్సెస్ కొట్టాడు. ఈ చిత్రం చైతూ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్లను వసూల్ చేస్తుందనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.
యూననిమాస్ గా హిట్టు టాక్
దసరా బరీలో రిలీజైన ప్రేమమ్ చిత్రం యూననిమాస్ గా హిట్టు టాక్ తెచ్చుకుంది చైతూ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించి యూట్ ని మెస్మరైజ్ చేశాడు. హీరోయిన్స్ కన్న ప్రేమమ్ సినిమాలో నాగచైతన్య యాక్టింగ్ పర్మామెన్స్ హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. అందుకే రిలీజై రెండు వారాలు దాటుతున్న ప్రేమమ్ స్టడి కలెక్షన్లతో దూసుకుపోతుంది.
రెండు వారాలకు గాను 20 కోట్ల షేర్ 
ప్రేమమ్ రెండు వారాలకు గాను 20 కోట్ల షేర్ ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పుతున్నాడు. అంటే ఈ కలెక్షన్లు  చైతూ కెరీర్ లోనే దిబెస్ట్ అని చెప్పాలి. ఇప్పటి వరకు బాక్సపీసు వద్ద చైతూ మార్కెట్ ఎంతనేదానిపై క్లారిటి లేదు. కానీ చైతూ మంచి లవ్ స్టోరీ చేస్తే మాత్రం ఈజీగా 50కోట్లు కొల్లగొట్టగలడని ప్రేమమ్ చిత్రం ఫ్రూవ్ చేసింది. 

15:05 - October 19, 2016

హరీశ్ శంకర్ డైరెక్షన్ లో అల్లుఅర్జున్ దువ్వాడ జగన్నాథమ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒపెనింగ్ జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. అయితే లేటేస్ట్ గా ఈ మూవీ షూటింగ్ డిటేల్స్ ని అనౌన్స్ చేశారు. మరీ డీజే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కానుందో మీరు ఓ లుక్కెయండి.
కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు 
స్టైలీష్ స్టార్ గా ఎదిగిన అల్లుఅర్జున్ స్టార్ డమ్ ని సూపర్ గా మొయిన్ టేన్ చేస్తున్నాడు. తన బాడీ లాగ్వేంజ్ తగ్గ స్టోరీస్ ఎంచుకుంటూ వరుసగా సూపర్ హిట్స్ కొడుతున్నాడు. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు చిత్రాలతో హ్యట్రిక్ కంప్లీట్ చేశాడు. సరైనోడు చిత్రం కెరీర్ పరంగా అతిపెద్ద హిట్టు అందుకున్న బన్నీ ఏ మాత్రం తొందరపడకుండా కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
నెలకిందటే డీజే అనౌన్స్ 
హరీశ్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెలకిందటే దువ్వాడ జగన్నాథం సినిమానే అనౌన్స్ చేశాడు. గ్రాండ్ గా ఒపెనింగ్ జరుపుకున్న ఈ చిత్రం మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. పక్కా స్టోరీ రెడీ అయిన తరువాతనే షూటింగ్ కి వెళ్లలనే ఉద్దేశ్యంతోనే బన్నీ దర్శకుడితో చెప్పాడట. అయితే ఇప్పుడు స్టోరీ పక్కాగా కుదరడంతో ఇక ఆన్ లోకేషన్స్ కి వెళ్లాలని యూనిట్ ఫిక్స్ అయిందట. 
ఈ నెల 20 నుంచి రెగ్యూ ర్ షూటింగ్..? 
ఈ నెల 20 నుంచి దువ్వాడ జగన్నాథ్ రెగ్యూ ర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ముకుందా సినిమాలో మురిపించిన పూజా హెడ్దె ఈ చిత్రంలో బన్నీతో జోడి కట్టనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ రాబోతున్న ఈ చిత్రం బన్నీ కెరీర్ లో మరో బిగ్ అంటూ హరీశ్ శంకర్ కాన్పిడెంట్ గా చెప్పుతున్నాడు.  

 

14:59 - October 19, 2016

కర్నూలు : రెండు దశాబ్దాల తర్వాత రూపుదిద్దుకున్న గోరుకల్లు రిజర్వాయర్‌కు చిల్లుపడింది. ప్రస్తుతం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో నీరు భూమిలోంచి ఎగిసిపడుతోంది. నీటి ధారల వల్ల జలాశయం పక్కన ఉండే గోరుకల్లు గ్రామం జలమయమవుతోంది. ప్రాణభయంతో ప్రతిక్షణం గ్రామస్తులు వణికిపోతున్నారు. బాధితులకు రక్షణ కల్పించి.. తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. లేదంటే గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది..!

పునాదులు కదిలి నేలమట్టమవుతున్న ఇండ్లు
ఈ గ్రామంలో ఎక్కడ చూసినా నీటి ఊటలే కన్పిస్తున్నాయి. పురాతన బావులు, కోనేర్లు పూర్తిగా నిండిపోయాయి. బోర్లలో అయితే నీరు పైకి ఎగసిపడుతోంది. నీరు ఇళ్లలోకి చేరడంతో పునాదులు కదిలి ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలోని పరిస్థితిది.

గోరుకల్లు గ్రామ సమీపంలో ప్రాజెక్టు నిర్మాణం
కృష్ణా నీటిని కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌కు తరలించాలన్న ఉద్దేశంతో గోరుకల్లు గ్రామ సమీపంలో ప్రాజెక్టును నిర్మించారు. అయితే.. డ్యామ్ దాదాపు పూర్తి కావడంతో 1.9 టీఎంసీల నీటిని గోరుకల్లు ప్రాజెక్టులో వదిలారు అధికారులు. దీంతో అప్పటి నుంచి డ్యామ్ పరిసర ప్రాంతాల్లో నీరు భూమిలో నుంచి లీకవుతోంది. గోరుకల్లు గ్రామంలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. నీరు ఊటలుగా వస్తోంది. దీంతో రంగంలోకి దిగిన డ్యామ్‌ సేఫ్టీ అధికార బృందం గ్రామంలోని జలధారలను పరిశీలించి.. అధ్యాయనం చేసింది. మట్టికట్టను వెడల్పు చేయడం ద్వారా సీపేజీ అరికట్టవచ్చని కమిటీ.. రాష్ర్ట ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలుస్తోంది. అయితే... లీకేజీ సమస్య ఎక్కడుందో కమిటీ స్పష్టంగా తెలపలేదు.

గోరుకల్లు గ్రామస్తులను ఆదుకోవాలని సీపీఎం డిమాండ్‌
మరోవైపు లీకేజీలపై అధ్యయనం చేసేందుకు ఎక్స్‌పర్ట్ కమిటీ వేసిన బోర్లలో నిరంతరాయంగా నీరు ఎగసిపడుతోంది. నీటి ఊటలు గోరుకల్లు గ్రామాన్ని చుట్టుముట్టాయి. నాన్‌స్టాప్‌గా నీరు వస్తుండటంతో తాగేనీరు కలుషితమవుతోంది. దీనికి తోడు దోమలు, పాముల బెడద ఎక్కువ కావడంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ఈ గ్రామాన్ని సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి పీ. మధు ఇటీవలే సందర్శించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని.. వారికి ధైర్యం చెప్పారు. బాధితులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని మధు డిమాండ్‌ చేశారు. 

తమకు పునరావాసం కల్పించాలని గ్రామస్తుల డిమాండ్‌
ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉన్న భూములను ఇచ్చామని, ఇప్పుడు మరో ప్రాంతానికి వెళ్లి ఉండేందుకు స్థలాలు కూడా లేవని గోరుకల్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే మరోచోట పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్‌అండ్ఆర్ ప్యాకేజీ ప్రకారం గ్రామ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు.
లీకేజీలపై ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారనే ఆరోపణలు
మరోవైపు డ్యామ్ లీకేజీపై ఎక్స్‌పర్ట్ కమిటీ అధ్యాయనం ఇంకా కొనసాగుతోంది. లీకేజీలపై ప్రభుత్వానికి అధికారులు తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. డ్యామ్ పూర్తయిన తర్వాత తొలుత లీకేజీలు సహజంగా ఉంటాయని, ఒకవేళ రెట్టింపు అయితే నిపుణుల కమిటీ పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.

తలనొప్పిగా మారిన లీకేజ్
నీటి లీకేజీ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో ప్రాజెక్టులో నీటి నిల్వను తాత్కాలికంగా నిలిపివేశారు. మొత్తంగా ప్రాజెక్టు నాణ్యతా లోపాల వల్లే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. తక్షణమే తమకు ప్రత్యామ్నాయం చూపించాలని గోరుకల్లు గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. 

14:56 - October 19, 2016

రంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో అప్రతిహతంగా కొనసాగుతోంది. మహాజన పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. ఇవాళ యాచారం మండలంలో మొండి గౌరెల్లి, చింతపట్ల, తక్కెళ్లపల్లి, కొత్తపల్లి, కిషన్‌పల్లి, మాల్‌, నల్లవెల్లి గ్రామాల్లో సీపీఎం మహాజన పాదయాత్ర సాగనుంది. అనారోగ్యంతో ఖమ్మంలో చనిపోయిన సీపీఎం ఉమ్మడి వరంగల్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నున్నా నారాయణకు తమ్మినేని వీరభద్రం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. 

14:49 - October 19, 2016

హైదరాబాద్: బ్రెయిన్‌డెడ్ అయిన కృష్ణా జిల్లా వాసి వంశీకృష్ణ అవయవాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి, అలాగే లివర్‌ను సికింద్రాబాద్‌లోని యశోదాకు తీసుకువచ్చారు. గుండెను తరలించే క్రమంలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ వరకు పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక అంబులెన్స్ లో గుండెను అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైజాగ్‌ చెందిన 29ఏళ్ల యువకుడికి ఈ గుండెను అమర్చనున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ అపోలోకు గుండె, యశోదాకు లివర్ తరలించారు. ఒక కిడ్నీ మంగళగిరి ఎన్‌ఆర్ఐ ఆస్పత్రికి, మరో కిడ్నీ విజయవాడలోని మరోఆ సుపత్రికి తరలించారు. బ్రతికుండగానే నలుగురికీ ఉపయోగపడిన తమ బిడ్డ చనిపోయిన తర్వాత కూడా ఇలా ఉపయోగపడినందుకు వంశీకృష్ణ కుటుంబ సభ్యులు దు:ఖంలో కఊ డా ఆనందపడుతున్నారు. తమ కుమారుడిని ఇతరుల్లో చూసుకోవచ్చనే మానవతా దృక్పథంతో అవయవాలు దానం చేసినట్లుగా వారు తెలిపారు. అవయవదానంతో వారు మరింతమందికి ఆదర్శంగా నిలిచారు. ఇటువంటివారిని చూసి మరికొంతమంది అవయవదానానికి ముందుకు రావాల్సిన అవుసరం ఎంతైనా వుంది.

వరుసగా ఆరో ఏడాది ఆస్తులను ప్రటిస్తున్నాం : లోకేష్

గుంటూరు : సీఎం చంద్రబాబు కుటుంబం ఆస్తుల వివరాలను ఆయన కుమారుడు లోకేష్ బాబు ప్రకటించాడు. ఈమేరకు ఆస్తుల వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించాడు. వరుసుగా 6 వ ఏడాది ఆస్తులను ప్రకటిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. 

14:05 - October 19, 2016

ఇటీవల సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. కోర్టులు ఇచ్చిన తీర్పుల గురించి వివరించారు. కాలర్స్ అడిగిన పలు సందేహాలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:01 - October 19, 2016

గుంటూరు : సీఎం చంద్రబాబు కుటుంబం ఆస్తుల వివరాలను ఆయన కుమారుడు లోకేష్ బాబు ప్రకటించాడు. ఈమేరకు ఆస్తుల వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించాడు. వరుసుగా 6 వ ఏడాది ఆస్తులను ప్రకటిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. దేశంలో ఏ రాజకీయ కుటుంబం ఆస్తులను ప్రకటించలేదని చెప్పారు. 1999 సంవత్సరంలో హెరిటేజ్ ప్రారంభించామని తెలిపారు. నిన్న లండన్ లో కార్పొరేషన్ గవర్నెన్స్ అవార్డు తన తల్లికి ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. అప్పు తీసుకుని ఇల్లు కట్టానని తెలిపారు. తన భార్య బ్రాహ్మిణి వ్యాపారం చూసుకుటుందని..  తాను, తన నాన్న చంద్రబాబు ఫుల్ టైం రాజకీయాల్లో ఉంటామని తెలిపారు. ప్రతిపక్షాలు లోకేష్ జపం చేస్తున్నారని తెలిపారు. 
ఆస్తుల వివరాలు..
హెరిటేజ్ ప్రస్తుత టర్నోవర్ రూ.2500 కోట్లు
జూబ్లీహిల్స్ లో ఇల్లు ఖరీదు రూ.3 కోట్ల 68 లక్షలు 
పాత అంబాసిడర్ కారు రూ.లక్షా 52 వేలు, 
చంద్రబాబు నికర ఆస్తులు రూ. 6 కోట్ల 7 లక్షలు
భువనేశ్వరి ఆస్తులు రూ.38 కోట్ల 66 లక్షలు
భువనేశ్వరి పేరిట పంజాగుట్టలో ఇంటి స్థలం ధర రూ. 73 లక్షలు 
భువనేశ్వరి బంగారు ఆభరణాలు రూ.కోటి 20 లక్షలు 
సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో రూ.3 లక్షల 59 వేలు 
లోకేష్ బాబు ఆస్తులు రూ.12 33 లక్షలు.. 
లోకేష్ బాబు కుమారుడు దేవాన్ష్ పేరిట రూ.2.4 కోట్ల డిపాజిట్ 
మదీనాగూడలోని ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ధర రూ.73 లక్షల 83 వేలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో తీసుకున్న రుణం రూ. 3 కోట్ల 5 లక్షల 42వేలు 

 

13:54 - October 19, 2016

ఢిల్లీ : ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో తిరుగులేని ఇండియా....సంచలనాలకు మారుపేరైన న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియం వేదికగా జరుగనున్న రెండో వన్డేలోనూ నెగ్గి సిరీస్‌పై పట్టు బిగించాలని  ధోనీ సేన  తహతహలాడుతుండగా....తొలి వన్డే ఓటమికి బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ టీమ్‌ పట్టుదలతో ఉంది.  
రెండో వన్డేకు కౌంట్‌డౌన్‌ 
భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో వన్డేకు  కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 5 వన్డేల సిరీస్‌లోని రెండో వన్డేకు ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియంలో రంగం సిద్ధమైంది.  ఇటు ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో తిరుగులేని ధోనీ అండ్‌ కో....అటు సంచలనాలకు మారుపేరైన కివీస్‌ టీమ్‌....ఇరు జట్ల మధ్య తొలి వన్డేలో హోరాహోరీ పోరు ఖాయమనుకున్నారంతా. కానీ ధర్మశాల వన్డేలో భారత బౌలర్ల ధాటికి కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో పోటీ ఏకపక్షంగా ముగిసింది. 
జట్టులో మ్యాచ్‌ విన్నర్లకు కొదువే లేదు
ధోనీ నాయకత్వంలోని వన్డే  జట్టులో మ్యాచ్‌ విన్నర్లకు కొదువే లేదు.  విరాట్‌కొహ్లీ, రోహిత్‌ శర్మ,అజింక్య రహానే,మనీష్‌ పాండే,ధోనీ  వంటి టాప్‌ క్లాస్ బ్యాట్స్‌మెన్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎప్పటిలానే పటిష్టంగా ఉంది. తొలి వన్డేలో హార్దిక్‌ పాండ్య, ఉమేష్‌ యాదవ్‌, కేదార్‌ జాదవ్‌,అమిత్‌ మిశ్రా న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఎలా కట్టడి చేశారో అందరికీ తెలిసిందే. 
రెండో వన్డేలో ఆడనున్న సురేష్‌ రైనా..?  
తొలి వన్డేకు దూరమైన సురేష్‌ రైనా రెండో వన్డేలో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. రైనా రాకతో భారత బ్యాటింగ్‌ మరింత  బలోపేతమవుతుందనడంలో డౌటే లేదు. సురేష్‌ రైనా మినహా తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే భారత జట్టు 
బరిలోకి దిగే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
అనూహ్యంగా తేలిపోయిన న్యూజిలాండ్‌ జట్టు  
మరోవైపు తొలి వన్డేకు ముందు అన్ని విభాగాల్లో భారత్‌ కంటే మెరుగ్గా కనిపించిన న్యూజిలాండ్‌ జట్టు అనూహ్యంగా తేలిపోయింది. విలియమ్‌సన్‌, రాస్‌ టేలర్‌,మార్టిన్‌ గప్తిల్‌, ల్యూక్ రాంకీ, కోరీ యాండర్సన్‌, లాథమ్‌ వంటి అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌తో కివీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ టీమిండియాకు ధీటుగానే  ఉన్నా.....అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో దారుణంగా విఫలమయ్యారు.  ట్రెంట్‌ బౌల్ట్‌,టిమ్‌ సౌథీ, బ్రేస్‌వెల్‌ ,మిషెల్‌ శాంట్నర్‌ ,ఇష్ సోధీ వంటి బౌలర్లతో కివీస్‌ బౌలింగ్ ఎటాక్‌ పదునుగా ఉంది. ఒంటి చేత్తో జట్టుకు విజయాన్నందించగల  కోరీ యాండర్సన్‌, జిమ్మీ నీషమ్‌ వంటి ఆల్‌రౌండర్లతో సమతూకంగానే ఉంది.కానీ సమిష్టిగా రాణించకపోతే న్యూజిలాండ్‌ జట్టుకు కష్టాలు తప్పవు.
ఫిరోజ్‌ షో కోట్లా స్టేడియంలో భారత్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌
ఢిల్లీ ఫిరోజ్‌ షో కోట్లా స్టేడియంలో భారత్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలించే కోట్లా పిచ్‌పై  భారత జట్టును ఓడించడం ప్రస్తుత న్యూజిలాండ్‌ జట్టుకు పెద్ద సవాలే. ఫేస్‌ టు ఫేస్‌  రికార్డ్‌లో భారత్‌దే పై చేయిగా ఉన్నా....న్యూజిలాండ్‌ జట్టును అసలే మాత్రం తక్కువ అంచనా వేయలేం.  
ధోనీసేన దూకుడు కొనసాగుతుందా..?  
సొంతగడ్డపై తిరుగులేని ట్రాక్ రికార్డ్‌తో పాటు జోరు మీదున్న భారత్‌ను ఓడించాలంటే మాత్రం విలియమ్‌సన్‌ అండ్‌ కో అంచనాలకు మించి రాణించాల్సిందే. ఫిరోజ్‌ షో కోట్లా  స్టేడియం వేదికగా జరుగనున్న సెకండ్‌ వన్డేలోనూ ధోనీసేన దూకుడు కొనసాగుతుందో లేదో చూడాలి.

 

13:46 - October 19, 2016

విశాఖ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో భూసేకరణకు సిద్ధమైంది. విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో  పెట్రోలియం యూనివర్సిటీ పేరుతో  750 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  గ్రామస్తుల ఆందోళనకు సీపీఎం మద్దతు తెలిపింది.
పెట్రోలియం యూనివర్శిటీకి 750 ఎకరాల భూ సేకరణ 
రాష్ట్రమంతటా భూసేకరణే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో భూసేకరణకు సిద్ధమైంది. విశాఖపట్నం జిల్లా వంగలి గ్రామంలో పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటుకు 750 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దీనిపై నిర్వాసితులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం బలవంతంగా తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
పంటలతో జీవనోపాధి పొందుతున్న రైతులు 
ప్రభుత్వం సేకరించనున్న 750 ఎకరాల్లో రైతులు పంటలు పండించుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో  రైతులందరూ రోడ్డున పడాల్సిన పరిస్థితి తలెత్తింది. విశాఖ నగరానికి సగం కూరగాయలు ఈ గ్రామం నుంచే వస్తాయి. సర్వే నెంబర్ 135, 109, 240, 241లో దాదాపు 750 ఎకరాల భూమి ఉంది. ఇందులో కొంత ప్రభుత్వ భూమి.. మరికొంత అటవీ భూమి కూడా ఉంది. ఈ భూముల్లో 190 ఎకరాలకు సంబంధించి 85 మందికి పట్టాలున్నాయి. మరో 554 ఎకరాల ప్రభుత్వ భూముల్లో చాలా సంవత్సరాల నుంచి రైతులు సాగుచేసుకుంటు జీవిస్తున్నారు. 
పట్టా భూములున్న రైతులకు మాత్రమే పరిహారం 
పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడంతో.. కేవలం పట్టా భూములున్న రైతులకు మాత్రమే పరిహారం చెల్లించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నిర్ణయంపై పట్టాలు లేని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు పట్టాలు ఇవ్వాలని ఎన్నిసార్లు అధికారులను వేడుకున్నా.. ఇవ్వలేదని.. ఇప్పుడు తమకు కూడా పట్టాలు ఇచ్చి పరిహారం అందించాలని కోరుతున్నారు. 
ఈ నెల 20న పెట్రో యూనివర్శిటికీ శంకుస్థాపన 
ఈ నెల 20న పెట్రో యూనివర్శిటికీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అయితే సీఎం పర్యటనను అడ్డుకుని తీరుతామని రైతులు స్పష్టం చేస్తున్నారు. రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు వంగలి గ్రామంలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించారు. 
మారిటైం యూనివర్శిటీ ఏర్పాటు 
జిల్లాలోనే ఉన్న రోంగలి గ్రామంలో కొద్ది సంవత్సరాల క్రితం ప్రభుత్వం మారిటైం యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని 150 ఎకరాలు సేకరించిందని ఇంత వరకూ ఆ భూములకు అతీ గతి లేకుండా పోయిందని మధు అన్నారు . ఇప్పుడు మళ్లీ  పెట్రో యూనివర్సిటీ పేరుతో మరో 750 ఎకరాలు సేకరించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 

 

13:41 - October 19, 2016

హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి కొలువుల జాతర సిద్ధమైంది. వచ్చేనెలలో గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు చేస్తూనే..గురుకులాల్లో కొత్త ఉద్యోగాల భర్తీకి టీఎస్ పీఎస్ సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కొత్త గురుకులాల మంజూరు తరువాత అక్కడ అవసరమైన లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు... సిబ్బంది నియామకాలకు టీ-సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాల జాతర 
తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాల జాతర మొదలైంది. కొత్తగా మంజూరైన గురుకులాలకు భోదన, భోదనేతర పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఎస్‌పిఎస్‌సికి ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఎస్సీ, ఎస్టీలకు 250, మైనార్టీలకు 160, బీసీలకు 119 గురుకులాలను మంజూరు చేసింది సర్కార్. ఈ గురుకులాల్లో పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తోంది తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌. 
పోస్టులన్నీ మహిళలతోనే భర్తీ చేసేందుకు నిర్ణయం
బాలికల గురుకులాల్లో పోస్టులన్నీ మహిళలతోనే భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారిగా పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా ఈ నియామకాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గురుకులాలకు పోస్టులను దశల వారీగా ప్రభుత్వం మంజూరు చేయడంతో గ్రూప్-2 పరీక్షల అనంతరం నియామకాలు చేపట్టాలని కమిషన్‌ నిర్ణయించింది. అయితే... తాజాగా అన్ని గురుకులాలకు పోస్టుల మంజూరు ప్రక్రియ ముగిసింది. అయితే... వీటిల్లో ఇప్పటికే నాలుగు వేల పోస్టుల భర్తీపై నోటిఫికేషన్ విడుదల చేసిన కమిషన్... ఇప్పుడు కొత్తగా మరో రెండు వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆరువేల పోస్టుల నియామకానికి సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. 

 

13:35 - October 19, 2016

హైదరాబాద్‌ : చారిత్రక నగరమే కాదు... క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా పేరొందింది. అందానికి అహ్లాదానికి మారుపేరుగా ఉండేది. ఇదంతా ఒకప్పుడు...కానీ ఇప్పుడు నగరమంతా చెత్త చెదారంతో నిండిపోతోంది. దీంతో బల్దియా యంత్రాంగం బిగ్ టార్గెట్ ను పెట్టుకుంది. 2017 స్వచ్ సర్వేక్షన్‌ అవార్డుల్లో టాప్‌ టెన్‌లో నిలవాలని భావిస్తోంది. అయితే జీహెచ్‌ఎంసీ ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతుందా...వాచ్‌ దిస్‌ స్టోరీ.
హైదరాబాద్‌ను టాప్‌టెన్‌లో నిలపాలని జీహెచ్‌ఎంసీ ప్రయత్నం
దేశంలోని నగరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి..స్వచ్ఛమైన నగరాలుగా తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. దీంట్లో భాగంగా క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా ఉండే నగరాలకు ర్యాంకులు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో హైదరాబాద్‌ను ఎలాగైనా టాప్‌టెన్‌లో నిలపాలని జీహెచ్‌ఎంసీ యంత్రాంగం  ప్రయత్నిస్తోంది. 
పారిశుధ్యలో ఇంకా వెనుకబాటులోనే హైదరాబాద్‌
 హైద‌రాబాద్ గ్లోబ‌ల్ సిటి అంటూ పాలకులు ప్రచారం చేస్తున్నా....ఆయా అంశాల్లో భాగ్య నగరం వెనుకబడే ఉంది.  2011జ‌నాభా లెక్కల  ప్రకారం  34 వేల నూట డబ్భై ఎనిమిది  కుటుంబాల‌కు వ్యక్తి గ‌త మ‌రుగుదోడ్లు లేవు. మ‌రో 11వేల 3 వందల 32 కుటుంబాల్లో వ్యక్తి గ‌త మ‌రుగుదొడ్లలో పారిశుధ్య నిర్వహణ లేదు. టాయిలెట్స్ లేని గృహాలకు, వాటిని అందించి తీరుతామని భరోసా ఇచ్చిన బల్దియా అధికారుల మాటలు కాగితాలకే పరిమిత మయ్యాయి. 
2015  స్వచ్ అవార్డుల్లో 249వ స్థానంలో హైదరాబాద్
2015 లో కేంద్రం ప్రకటించిన    స్వచ్ అవార్డుల్లో మైసూర్ మెదటి స్థానంలో నిలువ‌గా హైద‌రాబాద్  249వ స్థానంలో నిలిచింది . 2016లో 73 న‌గ‌రాల‌తో పోటి ప‌డ్డ హైద‌రాబాద్ 19స్థానంలో నిలిచింది. అయితే 2017లో  టాప్ టెన్ లో నిలిచేంద‌కు ప్రణాళిక‌లు సిద్దం చేస్తోంది బ‌ల్దియా. పారిశుద్యాన్నిమెరుగుప‌రచడం, శాస్ర్తీయ పద్దతిలో చెత్తను ప్రాసెస్ చెయ్యాలని భావిస్తోంది. ప‌బ్లిక్ అండ్ క‌మ్యూనిటి టాయిలెట్స్ ఏర్పాటుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. పారిశుధ్యంపై ప్రజల్లో చైతన్యం కల్పించండం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని ఆలోచిస్తోంది. నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచేందుకు అన్ని విధాలా బల్దియా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. అయితే ఈసారైనా కేంద్రం ప్రకటించే టాప్‌టెన్ క్లీన్‌అండ్ గ్రీన్‌ సిటీల్లో స్థానం సంపాదిస్తుందో..లేదో చూడాలి.

 

13:23 - October 19, 2016

కర్నాటక : అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయి జైలుశిక్ష అనుభవించి కండీషనల్ బెయిల్‌పై బయటపడిన కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు పెళ్లిని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నాడు. కేవలం ఒక్క శుభలేఖ ఆరువేల రూపాయలతో డిజైన్ చేయించాడు ఆయన. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి దీన్ని రూపొందించాడు. ప్రముఖులకు, సెలబ్రిటీలకు ఈ కార్డును పంపే తీరు కూడా వెరైటీగా వుంది. ఓ బాక్సులో చిన్న ఎల్‌ సీడీ స్క్రీన్, ఆటోప్లే వీడియో, స్నికెట్‌తో కూడిన ఒక నిమిషం నిడివి‌గల వీడియో గల కార్డు ఇది. ఈ వీడియోలో గాలి ఫ్యామిలీ మొత్తం కనిపించింది. గాలి కుటుంబసభ్యులు ప్రత్యేకంగా కంపోజ్ చేయించిన ఓ కన్నడ సాంగ్‌ ఇందులో హైలైట్. అయితే కూతురు బ్రాహ్మణి పెళ్లి ఆహ్వాన పత్రికకు భారీగా ఖర్చు చేయడం వివాదాస్పదమౌతోంది. 

 

13:18 - October 19, 2016

ఢిల్లీ : రెండు రోజుల పాటు నిర్వహించనున్న రోడ్డు రవాణా జాతీయ సదస్సును సీఐటీయూ జాతీయ అధ్యక్షుడు ఎ.కె పద్మనాభన్ ప్రారంభించారు. అఖిల భారత రోడ్డు రవాణా కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సదస్సులో కేరళ, కర్ణాటక, త్రిపుర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, రోడ్డు రవాణా కార్మిక సంఘాల నేతలు పాల్గొననున్నారు. 5 ప్రధాన అంశాలపై సదస్సులో చర్చించన్నారు. రవాణా రంగంలో ప్రభుత్వ ప్రజా రవాణా వ్యవస్థ పాత్ర..రోడ్డు ప్రమాదాలకు కారణాలు..ప్రజా రవాణాలో పర్యావరణం, చమురు వినియోగం..రవాణా కార్మికుల సమస్యలు..మోటార్ వెహికిల్ చట్టం సవరణ బిల్లు 2016 అంశాలపై చర్చ జరగనుంది. 

 

డాన్‌బాస్కో స్కూల్‌ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన

హైదరాబాద్‌ : నగరంలోని ఎర్రగడ్డలోని డాన్‌బాస్కో స్కూల్‌ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెంచిన స్కూల్‌ ఫీజులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సేవా ముసుగులో స్కూల్‌ యాజమాన్యం విరాళాలు సేకరించి అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేసి ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌కు తరలించారు. 

 

13:04 - October 19, 2016

హైదరాబాద్‌ : నగరంలోని ఎర్రగడ్డలోని డాన్‌బాస్కో స్కూల్‌ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెంచిన స్కూల్‌ ఫీజులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సేవా ముసుగులో స్కూల్‌ యాజమాన్యం విరాళాలు సేకరించి అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేసి ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌కు తరలించారు. 

13:01 - October 19, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. చంద్రబాబుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలన్న ఏసీబీ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ చంద్రబాబు పిటిషన్‌ వేశారు. గతంలో 8 వారాలపాటు హైకోర్టు స్టే ఇవ్వడంతో ..  వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. స్టేను 4 వారాలకు కుదించి మళ్లీ విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీం సూచన చేసింది.  

 

12:58 - October 19, 2016

డెహ్రడూన్ : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి మళ్లీ మతతత్వ ఎజెండాను తెరపైకి తెచ్చింది. అయోధ్యలో రామాయణ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కమలనాథుల తీరుపై విపక్షాలు కస్సుమన్నాయి. ఎన్నికల ముందు రామనామ జపం చేయడం బిజెపికి అలవాటైపోయిందని ధ్వజమెత్తాయి.
మళ్లీ తెరపైకి మతతత్వ రాజకీయాలు 
కీలకమైన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపి మతతత్వ రాజకీయాలను మళ్లీ తెరపైకి తెచ్చింది. హిందువుల ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా కొత్త ఎజెండాతో ముందుకు వచ్చింది. రామజన్మభూమి వివాదానికి కేంద్రమైన అయోధ్యలో రామాయణ మ్యూజియంను ఏర్పాటు చేయాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. వివాదాస్పద రామజన్మభూమి ఆలయం, బాబ్రీ మసీదుకు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో 150 కోట్ల బడ్జెట్‌తో 25 ఎకరాల స్థలంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. రాముడి జీవితం గురించి, రామాయణం గురించి తెలుసుకొనేవిధంగా ఈ మ్యూజియం ఏర్పాటుచేస్తామని కేంద్రమంత్రి మహేశ్ శర్మ తెలిపారు. ఇది విశ్వాసానికి సంబంధించినదని, విశ్వాసం, రాజకీయాలు వేర్వేరని ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు హిందువుల ఓట్లకు సమాజ్‌వాది గాలం 
మరోవైపు అధికార సమాజ్‌వాది పార్టీ కూడా హిందువుల ఓట్ల కోసం గాలం వేస్తోంది. అయోధ్యలో అంతర్జాతీయ రామ్‌ లీలా థీమ్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని అఖిలేష్‌ ప్రభుత్వం నిర్ణయించింది.
మోదీ సర్కారు చర్యలపై ప్రతిపక్షాలు మండిపాటు 
మోదీ సర్కారు తీసుకున్న చర్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల వేళ రాముడి జపం చేయడం బిజెపికి పరిపాటిగా మారిందని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం గర్హనీయమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. మోదీ ప్రభుత్వం రామాయణ మ్యూజియం, ఎస్పీ ప్రభుత్వం రామ్ లీలా థీమ్ పార్కు నిర్మిస్తామని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
బాబ్రీ మసీదుపై విహెచ్‌పి, ఇతర హిందుత్వ సంస్థలు విధ్వంసం 
రామజన్మభూమి పేరిట 1992లో 16వ శతాబ్దానికి చెందిన బాబ్రీ మసీదుపై విహెచ్‌పి ఇతర హిందుత్వ సంస్థలు విధ్వంసానికి పాల్పడ్డాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడతామని ప్రతిన బూనాయి. వివాదస్పద స్థలాన్ని హిందు, ముస్లింలకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై సంతృప్తి చెందని హిందూ, ముస్లిం సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 

 

12:52 - October 19, 2016

 వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య మూడో బహిరంగ చర్చకు రంగం సిద్ధమయ్యింది. లాస్‌ వేగాస్‌లోని నెవాడా యూనివర్సిటీ తుది డిబేట్‌ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమయ్యే చర్చ గంటన్నరపాటు కొనసాగుతుంది. ఆరు ప్రధాన అంశాలపై హిల్లరీ, ట్రంప్‌ మధ్య చర్చ జరుగనుంది. అమెరికా అప్పులు-అర్హతలు, వలసలు, ఆర్థిక వ్యవస్థ, సుప్రీంకోర్టు జడ్జిల నియామకం, విదేశాంగ విధానం, అధ్యక్షుడు లేదా అధ్యక్షరాలుగా విధులు నిర్వహించేందుకు ఉండాల్సిన దృఢసంకల్పం, ఆరోగ్యం వంటి అంశాలపై ఈసారి చర్చ జరుగుతుంది.  తుది చర్చలో పైచేయి సాధించేందుకు హిల్లరీ, ట్రంప్‌ హోరాహోరీ తలపడనున్నారు. గతనెల 26న, ఈనెల 9న జరిగిన రెండు చర్చల్లో హిల్లరీ క్లింటన్‌  పైచేయి సాధించారు. ఇది తుది  చర్చ కావడంతో ఇద్దరూ కూడా ఒకరి విధానాలపై మరొకరు విరుచుకుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది కోట్ల మందికి పైగా ప్రజలు ఈ చర్చను వీక్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు 

 

12:49 - October 19, 2016

కర్నూలు : రెండు దశాబ్దాల తర్వాత రూపుదిద్దుకున్న గోరుకల్లు రిజర్వాయర్‌కు చిల్లుపడింది. ప్రస్తుతం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో నీరు భూమిలోంచి ఎగిసిపడుతోంది. నీటి ధారల వల్ల జలాశయం పక్కన ఉండే గోరుకల్లు గ్రామం జలమయమవుతోంది. ప్రాణభయంతో ప్రతిక్షణం గ్రామస్తులు వణికిపోతున్నారు. బాధితులకు రక్షణ కల్పించి.. తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. లేదంటే గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది..!
పునాదులు కదిలి నేలమట్టమవుతున్న ఇండ్లు
ఈ గ్రామంలో ఎక్కడ చూసినా నీటి ఊటలే కన్పిస్తున్నాయి. పురాతన బావులు, కోనేర్లు పూర్తిగా నిండిపోయాయి. బోర్లలో అయితే నీరు పైకి ఎగసిపడుతోంది. నీరు ఇళ్లలోకి చేరడంతో పునాదులు కదిలి ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలోని పరిస్థితిది. 
గోరుకల్లు గ్రామ సమీపంలో ప్రాజెక్టు నిర్మాణం
కృష్ణా నీటిని కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌కు తరలించాలన్న ఉద్దేశంతో గోరుకల్లు గ్రామ సమీపంలో ప్రాజెక్టును నిర్మించారు. అయితే.. డ్యామ్ దాదాపు పూర్తి కావడంతో 1.9 టీఎంసీల నీటిని గోరుకల్లు ప్రాజెక్టులో వదిలారు అధికారులు. దీంతో అప్పటి నుంచి డ్యామ్ పరిసర ప్రాంతాల్లో నీరు భూమిలో నుంచి లీకవుతోంది. గోరుకల్లు గ్రామంలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. నీరు ఊటలుగా వస్తోంది. దీంతో రంగంలోకి దిగిన డ్యామ్‌ సేఫ్టీ అధికార బృందం గ్రామంలోని జలధారలను పరిశీలించి.. అధ్యాయనం చేసింది. మట్టికట్టను వెడల్పు చేయడం ద్వారా సీపేజీ అరికట్టవచ్చని కమిటీ.. రాష్ర్ట ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలుస్తోంది. అయితే... లీకేజీ సమస్య ఎక్కడుందో కమిటీ స్పష్టంగా తెలపలేదు. 
ఎక్స్‌పర్ట్ కమిటీ వేసిన బోర్లలో నిరంతరాయంగా నీరు 
మరోవైపు లీకేజీలపై అధ్యయనం చేసేందుకు ఎక్స్‌పర్ట్ కమిటీ వేసిన బోర్లలో నిరంతరాయంగా నీరు ఎగసిపడుతోంది. నీటి ఊటలు గోరుకల్లు గ్రామాన్ని చుట్టుముట్టాయి. నాన్‌స్టాప్‌గా నీరు వస్తుండటంతో తాగేనీరు కలుషితమవుతోంది. దీనికి తోడు దోమలు, పాముల బెడద ఎక్కువ కావడంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ఈ గ్రామాన్ని సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి పీ. మధు ఇటీవలే సందర్శించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని.. వారికి ధైర్యం చెప్పారు. బాధితులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని మధు డిమాండ్‌ చేశారు. 
తమకు పునరావాసం కల్పించాలని గ్రామస్తుల డిమాండ్‌
ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉన్న భూములను ఇచ్చామని, ఇప్పుడు మరో ప్రాంతానికి వెళ్లి ఉండేందుకు స్థలాలు కూడా లేవని గోరుకల్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే మరోచోట పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్‌అండ్ఆర్ ప్యాకేజీ ప్రకారం గ్రామ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. 
లీకేజీలపై ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారనే ఆరోపణలు
మరోవైపు డ్యామ్ లీకేజీపై ఎక్స్‌పర్ట్ కమిటీ అధ్యాయనం ఇంకా కొనసాగుతోంది. లీకేజీలపై ప్రభుత్వానికి అధికారులు తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. డ్యామ్ పూర్తయిన తర్వాత తొలుత లీకేజీలు సహజంగా ఉంటాయని, ఒకవేళ రెట్టింపు అయితే నిపుణుల కమిటీ పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. 
తాత్కాలికంగా నీటి నిల్వ నిలిపివేత నీటి 
లీకేజీ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో ప్రాజెక్టులో నీటి నిల్వను తాత్కాలికంగా నిలిపివేశారు. మొత్తంగా ప్రాజెక్టు నాణ్యతా లోపాల వల్లే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. తక్షణమే తమకు ప్రత్యామ్నాయం చూపించాలని గోరుకల్లు గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

భర్త మృతిని తట్టుకోలేక గొంతుకోసుకున్న భార్య

చిత్తూరు : కుప్పం ఎన్ టీఆర్ కాలనీలో కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఆర్టీసీ కార్మికుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతిని తట్టుకోలేక భార్య సానియా బ్రేడుతో గొంతుకోసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం సానియాను ఆస్పత్రికి తరలించారు.

 

క్యూసెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ స్కాం కేసులో నిందితుల అరెస్టు

హైదరాబాద్ : క్యూసెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ స్కాం కేసులో నిందితులను పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో బిలియర్డ్స్ నేషనల్ ఛాంపియన్ మైకెల్ ఫెరీరా ఉన్నారు. 

చంద్రబాబు పిటిషన్ ను విచారించనున్న హైకోర్టు

హైదరాబాద్ : కాసేపట్లో హైకోర్టులో ఓటుకు నోటు కేసు తనపై కేసు నమోదు చేసి విచారణ జరపాలన్న చంద్రబాబు ఎసిబి కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. చంద్రబాబు వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది.

 

12:10 - October 19, 2016

ఢిల్లీ : కృష్ణా జలాల పునఃపంపిణీపై బ్రిబేజ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకే పరిమితం చేసింది. ప్రాజెక్ట్‌ల వారీ నీటి కేటాయింపులను ఆ రెండు రాష్ట్రాలకే ఉండాలన్న నిర్ణయాన్ని ప్రకటించింది. కృష్ణా జలాల పునఃకేటాయింపులతో మహారాష్ట్ర, కర్నాటకలకు సంబంధంలేదని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణలను ఆదేశించింది. 

 

కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వెల్లడి

ఢిల్లీ : కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది. కృష్ణా జలాల పున:పంపిణీ ఎపి, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమని తేల్చి చెప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కేటాయింపులనే రెండు రాష్ట్రాలకు పంపణీ చేయాలని తీర్పు వెలువరించింది. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖతర్ ఎయిర్ వేస్ బోయింగ్ విమానం అత్యవసరంగా ల్యాండింగ్

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖతర్ ఎయిర్ వేస్ బోయింగ్ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. గోవాలో రన్ వే ఖాళీగా లేకపోవడమే కారణమని తెలుస్తోంది. 

10:51 - October 19, 2016
10:50 - October 19, 2016

సంక్షేమపై సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

విజయవాడ : సంక్షేమపై సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేద కుటుంబాల్లో పిల్లలు విజ్ఞాన వంతులైతే ఆర్థికంగా వ్యవస్థ బాగుంటుందని సీఎం చెప్పారు. ప్రతి పేదవానికి 100 రోజుల ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. పేదలకు పాడిపరిశ్రమ ద్వారా ఆదాయం పెంచుతున్నామని పేర్కొన్నారు. 50 శాతం పశుగ్రాసం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 

నేడు కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీని కలవనున్న మంత్రి ఈటెల

ఢిల్లీ : తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ నేడు కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీని కలవనున్నారు. పలు అంశాలపై ఆయనతో చర్చించనున్నారు. 
 

09:48 - October 19, 2016

ఎపి అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరకరంగా ప్రవర్తించారని చెబుతున్న ఎపి ప్రభుత్వం...మంత్రులు తప్పు చేసినా వారిని ఇంకా మంత్రివర్గంలో కొనసాగించడం ఎంత వరకు కరెక్టు అని వక్తలు ప్రశ్నించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత కరణం ధర్మశ్రీ, టీడీపీ నేత మాల్యద్రి, సీపీఎం నేత బాబురావు పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడుస్తుందన్నారు. 

 

09:45 - October 19, 2016

విజయవాడ : తాను చనిపోతూ మరికొంతమందికి ప్రాణం పోస్తున్నాడో యువకుడు. ప్రాణ ప్రదాతగా నిలవనున్నాడు. వేల రూపాయలు సంపాదించే కొడుకు తీవ్ర అస్వస్థతకు గురై బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అయితే అతని కుటుంబం మాత్రం ఆదర్శవంతంగా ఆలోచించారు. తన కుమారుడు చనిపోయినా అతని అవయవాలను దానం చేసి.. ఇతరులకు ప్రాణం పోయాలని తలంచారు. కృష్ణా జిల్లాలో బ్రెయిన్‌డెడ్‌ అయిన యువకుడి అవయవాలను దానం చేసేందుకు అతడి కుటుంబం ముందుకొచ్చింది. వంశీకృష్ణ అనే యువకుడు జగ్గయ్యపేట మండవ ఇంజినీరింగ్‌ కళాశాలలో నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. తలనొప్పి, జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని చికిత్స నిమిత్తం విజయవాడ ఆంధ్ర హాస్పిటల్‌లో చేరాడు. అతడి పరిస్థితి విషమించడంతో బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వంశీకృష్ణ అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యుల అంగీకరించడంతో ఆంధ్ర ఆస్పత్రి వైద్యులు జీవన్‌దాన్‌కు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా అవయవాలు తరలించాలని నిర్ణయించారు. గుండె, కాలేయం... గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తలరించనున్నారు. మూత్రపిండాలు, కళ్లు విజయవాడలోని వివిధ ఆస్పత్రుల్లో బాధితులకు వినియోగించనున్నారు.

 

ఆంధ్ర ఆసుపత్రిలో యువకుడు బ్రెయిన్ డెడ్..

విజయవాడ : ఆంధ్ర ఆసుపత్రిలో యువకుడు వంశీకృష్ణ బ్రెయిన్ డెడ్ కు గురయ్యాడు. తలనొప్పి జ్వరంతో వంశీకృష్ణ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యుల అంగీకారంతో జీవన్ దాన్ కు ఆసుపత్రిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మండవ ఇంజినీరింగ్ కాలేజీలో నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా వంశీకృష్ణ పనిచేస్తున్నాడు. 

09:12 - October 19, 2016

విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు కాజేసేందుకు కుట్ర జరుగుతోందని విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నర్సింగరావు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ భూములు లాక్కునేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. ప్లాంట్ ను బలహీనపర్చేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆవశ్యతక ఉందన్నారు. 

 

08:51 - October 19, 2016

ఇంటి ముందు కారు ఉందా ? అయితే కట్.. ఏంటీ ? కారు ఉంటీ ఏంటీ కట్ ? అని ఆలోచిస్తున్నారా? అది మీ కారా ? లేక ఇతరులుదా అని వారు ఆలోచించరు. కట్ చేస్తరు.. ఏంటా కట్ అని మళ్లీ ప్రశ్నిస్తున్నరా ? అయితే ఇది చదవండి...
ఇంటి ముందు కారు ఉంటే నీ 'కార్డు' రద్దు చేస్తరు. ఆ కారు నీదేనని రద్దు చేస్తరు. అయ్యో బాబోయ్ నాది కాదు..ఎవరో పెట్టి పోయిండ్రు..అని అన్నా ఆ అధికారులు వినిపించుకోరు. ఇదే జరిగింది ఇబ్రహీంపట్నంలోని వెలిమినేడులో. ఈ సంగతి సీపీఎం మహాజన పాదయాత్రలో బయటపడింది. గట్టు రాములమ్మ రేషన్ కార్డు రద్దైంది.
అడ్డగోలుగా కార్డుల తొలగింపుకు పూనుకుందని, మొత్తంగా 14,546 కార్డులను అధికారులు తొలగించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్యం తమ పాలిట సంకటంగా మారిందని పేదలు ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. కార్లు..ట్రాక్టర్లు..ఇతర వాహనాలున్నా కార్డులను తొలగించే ప్రక్రియ చేపడుతోందని, కనీసం పరిశీలన చేయకుండా ఆన్ లైన్ లో రద్దు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు కారు..ట్రాక్టర్..ఇతరత్రా వాహనాలు లేదని నిరూపించుకోవాల్సి వస్తోందని లబ్ధిదారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. కూటికి లేనోళ్లను అధికారులు తమ రికార్డుల్లో కోటీశ్వరులను చేసి నోటికాడి ముద్దను దూరం చేశారని లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుందో...

08:48 - October 19, 2016

విశాఖ స్టీల్ ప్లాంట్ కు మరో ప్రమాదం ముంచుకొస్తోంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం విశాఖ స్టీల్ భూములను అప్పగించే ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 
భూములు కాజేసే ప్రయత్నాలు
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెన్నేటి విశ్వనాధం నడిపిన ఉద్యమం ఫలితంగా విశాఖపట్టణంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటైంది. విశాఖలో ఉక్కు కర్మాగారం నెలకొల్పుతున్నట్టు 1970 ఏప్రిల్ 10న పార్లమెంట్ లో ప్రకటించారు. విశాఖ నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో నెలకొల్పిన ఈ కర్మాగారం భారతదేశంలోనే అత్యాధునిక స్టీల్ ప్లాంట్ గా గుర్తింపు పొందింది. విశాఖ ఉక్కు ఉత్పత్తులకు దేశ విదేశాల్లో సైతం మంచి క్రేజ్ వుంది. అత్యంత నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తోందన్న పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. 2010 నవంబర్ 10న నవరత్న హోదాను పొందడం మరో విశేషం.  భారతదేశంలో తీర ప్రాంతంలో వున్న ఏకైక ఉక్కు కర్మాగారం ఇదే కావడం మరో విశేషం. 25 వేల ఎకరాల్లో ఇది విస్తరించి వుంది.  సిఐవో 100 అవార్డును పొందిన ఘనత కూడా విశాఖ స్టీల్ కు వుంది. 
వైజాగ్ స్టీల్స్ నష్టాలు ప్రకటనతో కొంత నిరాశ 
గత ఆర్థిక సంవత్సరంలో 12, 271 కోట్ల రూపాయల సేల్స్ టర్నోవర్ సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం 1421 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటించింది. గత 14 ఏళ్లుగా లాభాలు ఆర్జిస్తున్న వైజాగ్ స్టీల్స్ నష్టాలు ప్రకటించడం కొంత నిరాశ కలిగించే పరిణామం. అయితే, భవిష్యత్ లో ఉక్కు డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోవడం, చైనా నుంచి పోటీ కారణంగా నష్టాలు చవిచూడాల్సి వచ్చిందంటూ యాజమాన్యం చెబుతున్నా, ఇంకా అనేక కారణాలున్నాయి.  7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో  పనిచేస్తోన్న మన విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు లేకపోవడం ఓ శాపం. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, ఐరన్ ఓర్ కొనుక్కోవాల్సి వస్తోంది.  ఒక టన్ను ఉక్కును ఉత్పత్తి చేయాలంటే 1.6 టన్నుల ఐరన్ ఓర్ ను వినియోగాంచాల్సి వస్తుంది. టాటా,  జిందాల్, సెయిల్ లాంటి సంస్థలకు సొంత గనులున్నా, విశాఖ స్టీల్ కు లేకపోవడం ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షకు నిదర్శనమన్న విమర్శలున్నాయి.  సొంత గనులున్న సంస్థలు తక్కువ ధరకే ఐరన్ ఓర్ సమకూర్చుకుంటుంటే, విశాఖ స్టీల్ ఏడు ఎనిమిది రెట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది నష్టాలకు కారణమవుతోంది. 
స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో భూములను ఆరగించే ప్రయత్నం  
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను కాజేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో విశాఖ స్టీల్ భూములను ఆరగించే ప్రయత్నాలను  కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో కూడా గంగవరం పోర్టు కోసమంటూ 1400 ఎకరాల స్టీల్ ప్లాంట్ భూములను బలవంతంగా తీసుకుని, దానికి బదులుగా ఎందుకూ పనికిరాని భూములను అంటగట్టారంటూ కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. 

యాచారంలో మూడోరోజు ప్రారంభమైన సీపీఎం మహాజన పాదయాత్ర

రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలంలో మూడో రోజు సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభమైంది. గౌరెల్లి, చింతపట్ల, తక్కెళ్ళపల్లి, కొత్తపల్లి, కిషన్‌పల్లి, మాల్‌, నల్లవెల్లి గ్రామంలో పాదయాత్ర కొనసాగనుంది. 

తాడేపల్లిగూడెంలో అర్ధరాత్రి ఫ్లెక్సీల వివాదం

పశ్చిమగోదావరి : తాడేపల్లిగూడెంలో అర్ధరాత్రి ఫ్లెక్సీల వివాదం నెలకొంది. మంత్రి మాణిక్యాలరావు అనుచరులు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. 

 

08:14 - October 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఉన్న సమస్యలను చర్చించేందుకు అసెంబ్లీలో ఐదు రోజుల సమయం కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన మహాజన పాదయాత్రలో భాగంగా రెండోరోజు ఇబ్రహీంపట్నం, యాచారం మండలాల్లో 28.2 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది.  
సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ  
మహాజన పాదయాత్రలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సీఎం కేసీఆర్‌కు వివరిస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువులు నిండినా ఇబ్రహీంపట్నం చెరువు నిండలేదని లేఖలో పేర్కొన్నారు. ఈ చెరువుకు నీరందించే ఫిరంగి నాలా పూర్తిగా ధ్వంసం అయిందని తెలిపారు. మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువులో పూడిక తీసినా.. ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈసి నదిపై గతంలో నిర్మించిన చందన్‌వెళ్లి డ్యాం తెగిపోయి, శిథిలావస్థకు చేరిందని, ఈ డ్యాంను పునరుద్ధరిస్తే చెరువులోకి నీరొస్తుందని లేఖలో తెలిపారు. 
దళితుల రేషన్‌ కార్డులు తొలగింపు
ఎత్తిపోతల ద్వారా వచ్చే నీటికంటే గ్రావిటీ ద్వారా నీటిని తేవడం పెద్దగా ఖర్చులేని పనని, దీంతో నిత్యం ఫ్లోరైడ్‌తో అల్లాడుతున్న సంస్థాన్‌ నారాయణపురం ప్రాంతంలో భూగర్భ జలాలు అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు. ఉప్పరి గ్రామంలో దళితుల రేషన్‌ కార్డులు తొలగించారని, అలాగే గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించడం లేదన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఎవరికీ ఇవ్వకుండానే ప్రభుత్వం నెరవేరిన పేదవాడి సొంతింటి కల అంటూ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తోందంటూ లేఖలో ఉటంకించారు. 
దళిత మహిళకు వృద్ధాప్య పింఛన్‌ ఆపేశారు  
పోచారం ప్రాంతంలో ఉన్న రైస్‌ మిల్లులు, ప్లైవుడ్‌ పరిశ్రమల్లో స్థానిక యువతకు అవకాశం ఇవ్వడం లేదని తమ్మినేని ప్రస్తావించారు. వెలిమనేడు గ్రామంలో అరవైకి పైగా కుటుంబాల రేషన్‌ కార్డులు తొలగించిన విషయాన్ని కూడా తమ్మినేని లేఖలో రాశారు. విమలమ్మ అనే మహిళ కుటుంబానికి ఆరు నెలలుగా రేషన్‌ ఇవ్వడం లేదని, గట్టు రాములమ్మ అనే దళిత మహిళకు వృద్ధాప్య పింఛన్‌ ఆపేశారని లేఖలో పేర్కొన్నారు. 
దళితులకు శ్మశాన వాటిక లేదు...
కప్పా పహాడ్‌ గ్రామంలో దళితులకు శ్మశాన వాటిక లేదని, అదే విధంగా గ్రామంలోని అరవై మందికి రేషన్‌ కార్డులు తొలగించారని తమ్మినేని సీఎంకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, బీసీ సంక్షేమం, మైనారిటీ నిధులపై అసెంబ్లీలో చర్చించాలని, పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. 
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి
రెండో రోజు మహాపాదయాత్ర ఇబ్రహీంపట్నం మండలం మేటిలలో ప్రారంభం అయింది. ఎలిమనేడు, కప్పా పహాడ్‌, పెద్దతూండ్ల, ధర్మన్నగూడ, చిన్నతూండ్ల, నంది వనపర్తి, మొగుళ్లవంపు గ్రామాల్లో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాదయాత్రకు స్వాగతం పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, మాటలు చెబితే బంగారు తెలంగాణ రాదని ఈ సందర్భంగా తమ్మినేని అన్నారు. ఉన్న రేషన్‌కార్డులను తొలగిస్తే పేదలు కడుపు నిండా ఎలా అన్నం తింటారని తమ్మినేని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే బతుకులు మారతాయని పేదలు ఆశించారని, ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటామని, పేదలకు మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావాలని తమ్మినేని అన్నారు. పాదయాత్ర ఆసాంతం బడుగు, బలహీన వర్గాలు, దళితులు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఎక్కడికెళ్లినా పెద్ద ఎత్తున జనం పాదయాత్ర బ్రహ్మరథం పడుతున్నారు.  

 

08:07 - October 19, 2016

పశ్చిమగోదావరి : తాడేపల్లిగూడెంలో ఫ్లేక్సీల వివాదం తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు వర్గీయులకు , మాజీ ఎమ్మెల్యే సత్యన్నారాయణ వర్గీయులకు మద్య ఈ ఫ్లేక్సీలు పెద్ద వివాదానికి దారితీశాయి. మంత్రి మాణిక్యాలరావు ఇల్లు, కొట్టు సత్యన్నారాయణ ఇల్లు ఒకే దారిలో ఉండటంతో గత 15ను రోజుల నుండి  ఆ దారిలో మంత్రి ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు. ఇవాళ   కొట్టు సత్యన్నారాయణ పుట్టిన రోజు కావడంతో భారీ ఫ్లేక్సీలను మంత్రి ఫ్లేక్సీలకు ఆనుకునేలా కొట్టు వర్గీయులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి వర్గీయులు ఫ్లేక్సీల ఏర్పాటును అడ్డుకోవడంతో...ఒక్కసారిగా ఇరు వర్గాల మద్య వివాదం మొదలైంది. ఫ్లేక్సీల ఏర్పాటు కోసం రెండు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్ళారు వివాదం పెద్దది కావడంతో పోలీసుల ఇరువర్గాలను చెదరగొట్టారు.

 

08:03 - October 19, 2016

హైదరాబాద్ : వచ్చే రబీ పంటకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇరిగేషన్‌ శాఖ ప్రాజెక్టుల వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మంత్రి హరీష్‌రావు ఇరిగేషన్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల ద్వారా రబీ పంటకు నీరు అందించే అంశంపై సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఇటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ మూడోదశ పనులపై కూడా మంత్రి సమీక్షించనున్నారు. 
రబీ పంటకు నీరందించడంపై ముందస్తు జాగ్రత్తలు
రబీ పంటకు నీరందించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇరిగేషన్‌శాఖ మంత్రి హరీష్‌రావు 'జలసౌధ'లో చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికార యంత్రాంగంతో మేధోమథనం చేయనున్నారు. రబీ పంటకు అవసరమైన ఇరిగేషన్ కార్యాచరణతో సమావేశానికి రావాలని ఇంతకుముందే సీ.ఈ.ల ను హరీష్‌రావు కోరారు. రబీ పంటకు అవసరమైన సాగునీటి కార్యాచరణను జిల్లాల వారీగా, ప్రాజెక్టుల వారీగా రచించాలని మంత్రి సూచించారు. 
మిషన్ కాకతీయ పనులపై అధికారులతో చర్చ
రెండు విడతల్లో చేపట్టిన మిషన్ కాకతీయ పనులపై ఇవాళ జరిగే సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. మూడోదశ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఖరారు చేసేందుకు ఈ సమావేశంలో కసరత్తు జరగనుంది. ప్రాధాన్యతా పరంగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అధికారులకు హరీష్‌రావు దిశా నిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో ఒక్క చుక్కనీరు కూడా వృథా పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చిట్టచివరి రైతులకు సైతం నీరందేలా ప్రణాళిక రచించాలని సి.ఇ లను హరీష్‌రావు కోరారు. 
రబీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశం
మొన్నటి ఖరీఫ్‌లో ఏయే ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలకు సాగు నీరందించారనే విషయమై నివేదికలపై మంత్రి హరీష్‌రావు సమీక్షించనున్నారు. శ్రీరామ్‌సాగర్ స్టేజ్-1 , స్టేజ్-2 , వరద కాలువ, నాగార్జునసాగర్, శ్రీశైలం, నిజాంసాగర్, ఎల్లంపల్లి, సింగూరు, మూసీ, కడెం, జూరాల తదితర ప్రాజెక్టుల నుంచి రబీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని మంత్రి సి. ఇలను ఆదేశించారు. ఎస్ఆర్ఎస్‌పీ స్టేజ్-1 లో మిగిలిపోయిన కాలువల మరమ్మత్తులు, ఇతర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద రెండో పంటకు 6 లక్షల 40 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని కోరారు. సాగర్ ఎడమ కాలువకు సంబంధించిన పెండింగ్ పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేయాలన్నారు. సి.ఇ. ల సమావేశంలో ప్రాజెక్టుల వారీగా రబీ పంటకు ఉన్న నీటి లభ్యత, మిషన్ కాకతీయ ఫలితాలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపైనా మంత్రి హరీష్‌రావు సుదీర్ఘంగా చర్చించనున్నారు. 

 

07:59 - October 19, 2016

హైదరాబాద్ : ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి కొత్త భయం పట్టుకుంది. 12మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సభాహక్కుల సంఘం నోటీసులు జారీ చేయడంతో..వైసీపీలో ఆందోళన మొదలైంది. వైసీపీకి సభ్యుల ప్రవర్తనపై వివరణ కోరుతూ తాజాగా నోటీసులు జారీ అవడంతో ఏం చెయ్యాలో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 
నోటీసుల జారీపై ఆందోళనలో వైసీపీ
తమ పార్టీ ఎమ్మెల్యేలపై  సభాహక్కుల సంఘం నోటీసులు జారీ చేయడంతో వైసీపీ ఆందోళనలో పడింది. ఇప్పటికే రోజా పై  ఏడాది పాటు సస్పెన్షన్ అమలులో ఉండగా...తాజాగా మరో 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అవడంతో...వైసీపీలో గుబులు మొదలైంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయడంతో..ఓర్వలేని అధికార పార్టీ తమ పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. 
ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు వైసీపీ ఆందోళనలు 
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ పేరుతో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు వైసీపీ రెండేళ్లకుపైగా ఆందోళనలు చేస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం విషయంలో నిరసన సందర్భంగా వైసీపీ సభ్యులు స్పీకర్‌ ప్రసంగాన్ని అడ్డుకుని.. పోడియం ఎక్కి నిరసన తెలిపారు. సభ్యుల ప్రవర్తనపై తీవ్రంగా స్పందించిన సభాహక్కుల సంఘం 12మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. ఈనెల 25, 26 తేదీల్లో తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 
నోటీసులు జారీకావడంపై వైసీపీ నేతలు ఆగ్రహం 
తమ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీకావడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కడానికే అధికార పక్షం సభాహక్కుల సంఘం పేరుతో తమకు నోటీసులు జారీచేసిందని వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మొదటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేపై అధికారపక్షం కక్షపూరితంగానే వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై తాము చేసిన పోరాటమే నేరమా అని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. తాజా ఘటనతో ఓవైపు వైసీపీ ఆందోళన చెందుతున్నా....మరోవైపు ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తోన్న తమపై అధికారపార్టీ కక్షసాధింపునకు ఇదే నిదర్శనమని..ప్రజలకు అర్థమయ్యేలా తెలియజెప్పాలని భావిస్తోంది. 

 

07:55 - October 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టానికి అత్యాధునిక సాంకేతిక సహకారం అందించేందుకు అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం ముందుకొచ్చింది. పెట్టుబడులు, ఐటీ, ఐటీ సేవలు తదితర రంగాల్లో కలిసి పని ముందడుగు వేయాలని రెండురాష్ర్టాలు నిర్ణయించాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, ఎన్నారై శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఉద్యోగాల కల్పన, స్మార్ట్ సొల్యూషన్స్, సుపరిపాలన, నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఆవిష్కరణలు వంటి రంగాల్లో తెలంగాణ, ఇల్లినాయిస్ కలిసి పనిచేయనున్నాయి. షికాగోలో భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ అసఫ్ సయీద్, మంత్రి కేటీఆర్‌ల సమక్షంలో తెలంగాణ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, అమెరికా స్టేట్ ఇన్నోవేషన్, టెక్నాలజీశాఖ కార్యదర్శి హార్దిక్‌భట్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు.. విపత్తులు, అత్యవసర సమయాల్లో ఇరురాష్ర్టాలు పరస్పరం సహాయసహకారాలను అందజేసుకుంటాయి. దీనికి సంబంధించిన టెక్నాలజీతోపాటు సాంకేతిక పరికరాలను ఇల్లినాయిస్ రాష్ట్రం తెలంగాణకు అందజేస్తుంది. స్మార్ట్‌సొల్యూషన్స్‌లో భాగంగా వాయుకాలుష్యాన్ని పసిగట్టే సెన్సార్లను తెలంగాణకు ఇలినాయిస్ అందజేయనుంది. ఇరురాష్ర్టాల్లో  పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో తెలంగాణ, ఇలినాయిస్ విధానపరమైన నిర్ణయాలు, ఆర్థికపరమైన మార్పులు-చేర్పులు, నూతన నిర్ణయాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకోనున్నాయి.

 

07:51 - October 19, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలా మారిన కృష్ణ నీటి పంపకాల పై కీలక తీర్పు వెలువడనుంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ దీని పై ఇవాళ తుది నిర్ణయం వెలువరించనుంది. దీనికోసం అవసరమైన సమాచారంతో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు ఇప్పటి కే ఢిల్లీ చేరుకున్నారు. అయితే కృష్ణా జలాల పునః పంపిణీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య జరగాలా? ...లేక ఈ రాష్ట్రలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర ల మధ్య జరగాలా? అనే అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వనున్నది.  
కృష్ణా ట్రిబ్యునల్ కీలక తీర్పు
కృష్ణాజలాల పునఃపంపిణీపై  బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్  కీలక తీర్పు వెలువరించనున్నది. ఈ తీర్పును అనుసరించి న్యాయపరమైన కార్యాచరణను రూపొందించడానికి తెలంగాణ న్యాయవాదుల బృందం ఇప్పటికే న్యూఢిల్లీ వెళ్లింది. దాదాపు ఏడాది కాలంగా ఈ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం తన వాదనలు విన్పిస్తున్నది. దీనిపై మంత్రి హరీశ్‌రావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 
అన్యాయంపై కేంద్రానికి టీ.ప్రభుత్వం ఫిర్యాదు
కృష్ణా జలాల కేటాయింపులలో దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం..కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ  పునర్విభజన చట్టం లోని సెక్షన్ 89 కింద తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావలసిన నీటి కేటాయింపుల కోసం తెలంగాణ సర్కారు న్యాయ పోరాటం సాగిస్తోంది.  
నాలుగు రాష్ట్రాలకూ పునః పంపిణీ జరగాలి : టీసర్కార్
ఇదే సమయంలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్ గెజిట్ ప్రచురణ జరగకుండా సుప్రీం కోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో  వాదనలు ప్రారంభించింది. 811 టిఎంసీల లో ఎపికి 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిల ను బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేసింది. నికర జలాలలో నాలుగు రాష్ట్రాలకూ పునః పంపిణీ జరగాలని  బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య ఏడాదిగా సాగుతున్న కృష్ణాజలాల పంపిణీ వివాదం ముగిసిపోతుందా..లేదా అనేది తీర్పుపై అధారపడి ఉంటుంది.

నేడు డీపీవో, డీఆర్ డీవోలతో మంత్రి జూపల్లి భేటీ

హైదరాబాద్ : నేడు డీపీవో, డీఆర్ డీవోలతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశం కానున్నారు. గ్రామ పంచాయతీ రికార్టుల నిర్వహణ, పారిశుద్ధ్యం, లే అవుట్ల అనుమతులు, అక్రమ నిర్మాణాలపై డీపీవోలతో చర్చించనున్నారు. ఆసరా పింఛన్లు, అభయాస్తం, స్త్రీనిధి, వడ్డీలేని రుణాలు, తెలంగాణ పల్లె ప్రగతి వంటి అంశాలపై డీఆర్ డీవోలతో చర్చ చేపట్టనున్నారు. 

నేడు ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం

ఢిల్లీ : నేడు ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నారు. పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

హైదరాబాద్ పాతబస్తీలో వాహనాల తనిఖీలు

హైదరాబాద్ : పాతబస్తీలో పోలీసులు వాహనాల తనిఖీలను చేపట్టారు. లైసెన్లు లేకుండా వాహనాలు నడుపుతున్న 200 మంది మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 

నేడు చీఫ్ ఇంజినీర్లతో మంత్రి హరీష్ రావు భేటీ

హైదరాబాద్ : నేడు చీఫ్ ఇంజినీర్లతో మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. రబీ పంటకు సాగునీరు సరఫరా రోడ్డు మ్యాప్, మిషన్ కాకతీయ మూడో దశ పైనా చర్చించనున్నారు. 

 

ప్రాణహిత ఆయకట్టుపై నేటి నుంచి లైడార్ సర్వే

హైదరాబాద్ : ప్రాణహిత ప్రాజెక్టు ఆయకట్టుపై నేటి నుంచి లైడార్ సర్వే చేయనున్నారు. 2.05 లక్షల ఎకరాల ఆయకట్టుపై త్వరలో తుది నివేదిక సమర్పించనుంది.

Don't Miss