Activities calendar

21 October 2016

20:01 - October 21, 2016

విజయవాడ : కాపులకు అన్నివిధాలా న్యాయం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై మంజునాథ కమిషన్‌ వేశామని .. స్మార్ట్ పల్స్ సర్వే రిపోర్టు ఆధారంగా మంజునాథ కమిషన్‌ నివేదిక ఇస్తుందన్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో కాపు మెగా జాబ్‌మేలాలో పాల్గొన్న సీఎం... కొంతమంది కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వారి కుట్రలకు భయపడేది లేదన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించడం వల్లే యువతకు మేలు జరుగుతోందన్నారు. తనకు ప్రజలే హైకమాండ్‌ అని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. 

28న ఆర్థిక,పరిపాలన నగరాలకు జైట్లీ శంకుస్థాపన : చంద్రబాబు
స్వల్పకాలంలోనే వెలగపూడి తాత్కాలిక సచివాలయం నిర్మించడం ఒక చరిత్రన్నారు.. సీఎం చంద్రబాబు నాయుడు. పాలన సొంతనేలపై ఉంటేనే ప్రజలకు అభివృద్ధి ఫలాలు దక్కుతాయని తెలిపారు. శంకుస్థాపన జరిపిన ఏడాది కాలంలోనే ఈ నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఈ నెల 28న ఆర్థిక, పరిపాలన నగరాలకు కేంద్రమంత్రి జైట్లీ శంకుస్థాపన చేస్తారని సీఎం ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో రెండు బ్యాంకుల శాఖలను చంద్రబాబు ఇవాళ ప్రారంభించారు..

అమ్మ కూర్చుంటున్నారుట?!..

తమిళనాడు : అనారోగ్యం కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆమె రోజులో ఎక్కువ సేపు స్పృహలోనే ఉంటున్నారని, బెడ్‌పై కూర్చోగలుగుతున్నారని తెలిపారు. ఆమె నెమ్మదిగా మాట్లాడుతున్నారని చెప్పారు. అయితే వెంటిలేటర్‌ సదుపాయాన్ని ఇంకా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమెకు గత మూడు వారాల నుంచి ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్సను అందిస్తున్న సంగతి తెలిసిందే.

జవహర్ నగర్ లో భారీ చోరీ..

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం భారీ చోరీ జరిగింది. నాగారం లక్ష్మీనగర్‌లోని ఓ ఇంటి తాళాలు పగులగొట్టి రూ.10లక్షల నగదు, 8తులాల బంగారాన్ని దోచుకున్నారు. సంతోష్‌నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇల్లు గుల్ల చేశారని బాధితులు వాపోతున్నారు. భాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పాత నేరస్థులే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

19:50 - October 21, 2016
19:46 - October 21, 2016

నందమూరి కళ్యాణ్ రామ్ , పూరీ తొలి కలయిక లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఇజం. పటాస్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకొచ్చిన కళ్యాణ్ రామ్ , పూరీతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. పూరీ తనదైన స్టైల్లో కళ్యాణ్ రామ్ ను సరికొత్త మేకోవర్ తో చూపిస్తూ రూపొందించిన ఈ సినిమా జనం అంచనాల్ని అందుకుందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం...

పటాస్ తో కళ్యాణ్ రామ్ హిట్టుకొట్టగానే స్టార్ స్టాటస్ వచ్చేసినట్టే ఫీలయ్యారు అభిమానులు. అయితే పూరీ లాంటి డైరెక్టర్ నుంచి హిట్టు పడితేనే స్టార్ డమ్ వచ్చినట్టు అని ఫీలయ్యాడో ఏంటోగానీ , తన సొంత బ్యానర్ లోనే పూరీ డైరెక్షన్ లో ఇజం అనే సినిమా ను యన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద సొంతంగా తీసుకున్నాడు కళ్యాణ్ రామ్ . అయితే కళ్యాణ్ రామ్ పాత సినిమాలతో పోల్చితే ఈ సినిమా రేంజ్ ఎక్కువ, పూరీ పాత సినిమాలతో పోల్చితే ఈ సినిమా రేంజ్ చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కథేమీ లేదు, కథనంతో సినిమా ను నెట్టుకురావాలనే ఉద్దేశంతో కొన్ని మంచి సీన్సే రాసుకున్నాడు. కాకపోతే పూరీ ఇదివరకు తీసిన సినిమాల తాలూకు వాసనలు కనిపిస్తాయి. ముఖ్యంగా పోకిరి, కెమెరా మేన్ గంగతో రాంబాబు సినిమాల ఛాయలు కొంత వరుకూ కనిపిస్తాయి. మొత్తానికైతే పూరీ కొత్త గా తీసిన ఈ సినిమా యాజిటీజ్ గా ఆయన పాత సినిమాలాగానే అనిపించడమే విచిత్రం.

సత్యనారాయణ మార్తాండ్ అనే జర్నలిస్ట్ కొందరి అక్రమాల్ని బైటపెడతాడు. ఆ ప్రయత్నంలో ఆయన రెండు కాళ్ళూ పోగొట్టుకుంటాడు. దాన్ని కళ్లారా చూసిన ఆయన కొడుకు కక్షతో హిడెన్ జర్నలిస్ట్ అవుతాడు. ఎవరి కంటా పడకుండా అతి పెద్ద నెట్ వర్క్ తో గ్రాండ్ లీక్స్ పేరుతో పెద్ద పెద్ద వాళ్ల అవినీతుల్ని బైట పెడుతూ ఉంటాడు. అందులో ఇంటర్నేషనల్ మాఫియా డాన్ జావేద్ ఇబ్రహీం ఒకడు. బ్యాంక్ ఆఫ్ పేరడైజ్ లో డిపాజిట్ చేసుకున్న పెద్ద పెద్ద వాళ్ల అకౌంట్లను హ్యాక్ చేసి వాళ్ల వేల కోట్లను ఇండియాలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి పేదవాడి అకౌంట్ లోకి హీరో ట్రాన్స్ ఫర్ చేయడమే మిగతా కథ. అయితే సాధారణమైన హీరో , ఏకంగా ఇంటర్నేషనల్ డాన్ కూతుర్ని లైన్ లో పెట్టడం తేలికగా పడగొట్టేయడం లాంటి సీన్స్ కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి. అంతేకాదు హై టెక్ సెక్యూరిటీ ఉన్నవిలన్ ఇంట్లోకి హీరో దూరడం కూడా లాజిక్ లెస్ అనిపిస్తుంది. ఇలాంటి కొన్ని సీన్స్ తప్ప ఫస్టాఫ్ అంతా తాపీగా నడిచిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆసక్తిగానే ఉంటుంది.

ఇక లవ్ ట్రాక్ రొటీన్ గానే అనిపిస్తుంది. జగపతి బాబు ఎంట్రీ కూడా పెద్ద గా ఎఫెక్ట్ ఇవ్వదు. ఆయన్ను ఫవర్ ఫుల్ గా చూపించడంలోనూ పూరీ విఫలమయ్యాడు. క్లైమాక్స్ ను మరీ సిల్లీగా , ఇల్లాజికల్ గా తీసాడు పూరీ. కానీ డైలాగ్స్ కొన్ని జనంచేత కేకపెట్టిస్తాయి.

ఇజం సినిమాకి అతి పెద్ద ప్లాస్ పాయింట్ కళ్యాణ్ రామ్ మేకోవర్. అతడి డిక్షన్ , బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని పూరీ భలేగా మార్చేసాడు. మంచి ఈజ్ తో కూడా పెర్ఫార్మ్ చేసి , తరువాత సినిమాలకి చక్కటి బాట వేసుకున్నాడు కళ్యాణ్ రామ్ . ఇక హీరోయిన్ గా నటించిన అదితి ఆర్య పర్వాలేదనిపిస్తుంది. విలన్ జగపతి బాబు పాత్ర ను పవర్ ఫుల్ గా రాసుకున్నాడు కానీ, చూపించడంలో పూరీ కొంచెం గాడి తప్పినట్టు అనిపిస్తుంది. ఇందులో జగపతి బాబు కొత్తగా చేసిందేమీ ఉండదు. ఇక మినిస్టర్ గా నటించిన పోసాని, హీరో తండ్రిగా నటించిన తనికెళ్లభరణి పాత్రలు మామూలుగానే అనిపిస్తాయి. టోటల్ గా ఈ సినిమాకి ఇంటర్వెల్ ఎపిసోడ్ , ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కళ్యాణ్ రామ్ కోర్ట్ సీన్ జనాన్ని బాగా కుర్చీలో కూర్చోబెడుతుంది. లైవ్ లో పెద్ద వాళ్ల అకౌంట్లలోని డబ్బుల్ని పేదవాళ్ల అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేసే సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిపోతుంది. మరి ఈ సీన్ వల్లగానీ, కళ్యాణ్ రామ్ నటన వల్లగానీ జనం ఈ సినిమాని పూర్తిగా కాకపోయినా కొంతైనా ఆదరిస్తారేమో మరి చూడాలి. ఇజం సినిమా.రేటింగ్ కోసం ఈ వీడియో చూడండి..

19:26 - October 21, 2016

ఛత్తీస్ ఘడ్ : అమెరికాలోని నయాగరా జలపాతాన్ని మించిన అందాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని చిత్రకూట్‌ వాటర్‌ ఫాల్స్‌, కర్నాటకలోని జోగ్‌ ఫాల్స్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంతాల జలపాతం... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ వీటి దగ్గర సరైన సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఆదరణకు నోచుకోవడంలేదు. ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న చత్తీస్‌గఢ్‌లోని చిత్రకూట్‌ జలపాతంపై 10 టీవీ ప్రత్యేక కథనం...

ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం..బస్తర్‌ జిల్లా..చిత్రకూట్‌ వాటర్‌ ఫాల్స్‌
ఎత్తైన కొండల మీద నుంచి జాలువారుతున్న ఈ జలపాతం ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ జిల్లాలో ఉన్నచిత్రకూట్‌ వాటర్‌ ఫాల్స్‌. బస్తర్‌కు 36 కిలో మీటర్లు, జగ్దల్‌పూర్‌కు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం.. ఒడిశాలోని కలహండి జిల్లా కత్తిగూడ గ్రామం దగ్గర పుట్టిన చిన్నవాగు... కొండలు, గుట్టలు, వాగులు, వకంలు, లోయలు దాటుకుంటూ 236 కిమీ మీటర్లు ప్రవహించి ఛత్తీస్‌గఢ్‌లోని చిత్రకూట్‌ దగ్గర భారీ జలపాతంగా మారి ఇంద్రావతి నదిలో కలిసే సుందర దృశ్యాలు అందర్నీఆకట్టుకుంటాయి.

పర్యాటకులకు కట్టిపడేస్తున్న చిత్రకూట్
వర్షాకాలంలో చిత్రకూట్‌ జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. మినీ నయాగారగా పిలువబడే ఈ వాటర్‌ ఫాల్స్‌ను చూసేందుకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణతోపాటు దేశ, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. నూటయాభై మీటర్ల ఎత్తు నుంచి కిందకు దుమికే ఈ జలపాతం పర్యాటకుల మనసును దోచేస్తుంది. కదలకుండా కట్టిపడేస్తుంది.

సౌకర్యాల లేమితో వన్నె తగ్గిన చిత్రకూట్
చిత్రకూట్‌ శివాలయానికి పక్కనే ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవని పర్యాటకులు చెబుతున్నారు. ఇంత ఎత్తు నుంచి పడుతున్న జలపాతాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత మనోహరమైన చిత్రకూట్‌ జలపాతాల దగ్గర సరైన సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. బసచేసేందుకు కాలేజీలు, హోటళ్లు నిర్మిస్తే పర్యాటకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని సూచిస్తున్నారు. అయితే వర్షాల కాలంలో కొద్ది రోజులు మాత్రమే కనువిందు చేసే ఈ జపాతాల దగ్గర శాశ్వత ప్రాతిపదికపై కాటేజీలు, హోటళ్లు నిర్మించే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. 

మరో బాణసంచా గోదాంలో అగ్నిప్రమాదం..

తమిళనాడు : గురువారం శివకాశీలోని ఓ బాణసంచా గోదాంలో అగ్నిప్రమాదం ఘటన మరువక ముందే మరో బాణసంచా గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. కోయంబత్తూరులో గల టపాసుల గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నరు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇరాక్ దళాలపై ఉగ్రవాదాడి..19మంది మృతి!..

ఇరాక్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు ఎదురుదాడి మొదలుపెట్టారు. కిర్కూ న‌గ‌రంలో ఇస్లామిక్ ఉగ్ర‌వాదులు భారీ స్థాయిలో ఇరాక్ దళాలపై కౌంట‌ర్ అటాక్‌కు దిగారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిలో సుమారు 19 మంది మృతిచెందారు. ప్ర‌భుత్వ బిల్డింగ్‌ల‌పై దాడి చేశారు. ఆ దాడుల్లో ఆరుగురు పోలీసు ఆఫీస‌ర్లు మృతిచెందారు. నిర్మాణంలో ఉన్న ప‌వ‌ర్ స్టేష‌న్‌పై దాడి చేయ‌డం వ‌ల్ల సుమారు 13 మంది మృతిచెందారు. ఇరాక్-అమెరికా సంకీర్ణ సేన‌లు చేస్తున్న దాడుల వ‌ల్ల 12 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు కూడా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికారులు తెలిపారు. 

18:42 - October 21, 2016

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీ నాలుగు గంటలపాటు కొనసాగింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై తదుపరి కార్యాచరణపై మంత్రి హరీష్ రావు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని సమావేశం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు.  ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని గవర్నర్ ను కోరేందుకు కేబినెట్ నిర్ణయించిందన్నారు. మహిళా ఉద్యోగులకు 90 రోజులు చైల్డ్‌కేర్ లీవ్స్..ఆ సెలవులను పిల్లకు 18 ఏళ్లు వచ్చే లోపుగా వాడుకునేందుకు వీలుగా కేబినెట్ నిర్ణయించిందన్నారు.రాష్ట్రంలో మత్స్య సంపద పెంచేందుకు గొర్రెల పెంపకంపై మంత్రి తలసాని నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు.  రుణమాఫీ, ఫీజ్ రీయింబర్స మెంట్ , ఆరోగ్య శ్రీ బకాయిలు త్వరంగా విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లుగా తెలిపారు. వర్శిటీల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కేబినెట్ సబ్ కమిటీకి కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు..ఆరు జిల్లాల పేర్లమార్పుకు కూడా కేబినెట్ నిర్ణయించిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. 

ముగిసిన టీ.ఎస్ కేబినెట్ సమావేశం..

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీ నాలుగు గంటలపాటు కొనసాగింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై తదుపరి కార్యాచరణ, మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్ లీవ్స్, ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన భవనాల అప్పగింత కోరుతూ గవర్నర్ కు విజ్ఞప్తి, జిల్లాల పేర్లమార్పు, ప్రజల విజ్ఞప్తుల మేరకు పలు జిల్లాల్లో మార్పులు, చేర్పులు వంటి తదితర అంశాలపై మంత్రివర్గ సభ్యులు సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

17:39 - October 21, 2016

కరీంనగర్ : సింగరేణి సంస్థ సమస్యలతో సతమతమవుతోందా..? బొగ్గు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్న సింగరేణి అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతోందా..? అవును... ఇది అక్షరాలా నిజం. కాగితాల మీద లాభాలు చూపిస్తున్నా... సింగరేణి ఖజానా మాత్రం ఖాళీగా వెక్కిరిస్తోంది. ఇంతకీ సింగరేణి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అందుకు కారణాలేమిటి..

నాలుగు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి
కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించిన సిరుల గని సింగరేణి.. ఏటా భారీగా లాభాలను అర్జిస్తోంది. అయితే ఇదంతా రికార్డుల్లో చెప్పుకోవడానికి మాత్రమే.. 2015,16 ఆర్ధిక సంవత్సరంలో 60.04 మిలియన్ టన్నుల నిర్దేశిత లక్ష్యాలను సాధించి దాదాపు వెయ్యి కోట్ల నికర లాభాలను అర్జించినప్పటికి సంస్థ వద్ద నగదు పైసా కూడా లేదు.

సింగరేణి ఖాతాలో డిపాజిట్లు నిల్
గడిచిన ఎనిమిదేళ్లలో బ్యాంక్ ఫిల్లింగ్ పేరిట మొత్తంగా 3500 కోట్ల రూపాయలు ఉంటే గడిచిన రెండేళ్లలో మొత్తం ఖర్చు అయిపోయి ఖాతా ఖాళీ అయింది. ప్రస్తుతం 800 కోట్ల జెన్ కో బాండ్లు మినహా సింగరేణి ఖాతాలో డిపాజిట్లు లేవు. లెక్కల్లో లాభాలు కన్పిస్తున్నా.. చేతిలో మాత్రం చిల్లి గవ్వ లేని సింగరేణి కార్మికులకు బొగ్గు కొనుగోలు చేసిన వాళ్లే శాపంగా మారారు. బోగ్గు కొనుగోలు చేసిన సంస్ధలు సమయానికి డబ్బులు చెల్లించకపోవడంతో కోట్ల రూపాయల బకాయిలు పెరిగిపోయాయి. కొనుగోలు దారులపై వత్తిడి పెంచితే సంస్ధ వినియోగదారుడిని కొల్పొయే ప్రమాదం ఉండటంతో సింగరేణి పరిస్థితి అడ కత్తెరలో పోక చెక్కలా మారింది.

జెన్ కో సంస్థ సింగరేణి కి దాదాపుగా 4600 కోట్ల బకాయి
సింగరేణి సంస్థ నుండి ఉత్పత్తి అయ్యే బొగ్గు ప్రధానంగా విద్యుత్ కేంద్రాలకు ఎక్కువగా వినియోగం అవుతోంది. రామగుండం ఎన్టీపిసి, జెన్ కో లతో పాటు బొగ్గు ఆధారిత పరిశ్రమలకు సరఫరా అవుతోంది. జెన్ కో సంస్థ సింగరేణి కి దాదాపుగా 4600 కోట్ల రూపాయలు బకాయి పడింది. దీంతో ఐదేళ్ల నుంచి జెన్ కో చెల్లించాల్సిన మొత్తం తడిసి మోపెడు అయింది. ఇక సింగరేణి సంస్థ వినియోగదారులకు విక్రయిస్తున్న బొగ్గు ధర కోలిండియాలో కంటే టన్నుకు నాలుగైదు వందలు ఎక్కువే కాబట్టి మార్కెట్లో బొగ్గు విక్రయం తగ్గింది. తక్కువ ధరకు లభిస్తుందని కొలిండియా పాటు విదేశీ బోగ్గును దిగుమతి చేసుకుంటున్నారు.

రోజుకు 18వేల టన్నుల బొగ్గు సరఫరా
ఇదిలా ఉంటే సింగరేణి సంస్థ ఏపి జెన్‌ కోకు రోజుకు 18వేల టన్నుల బొగ్గు సరఫరా చేస్తోంది. రోజురోజుకు బకాయిలు పెరుగుతుండటంతో సింగరేణి యాజమాన్యం ఇటీవల డబ్బులు చెల్లించాలంటూ ఏపి జెన్‌ కోకు లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా స్పందించి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. పది రోజులుగా సింగరేణి బొగ్గును ఏపి జెన్‌ కోకు సరఫరా చేయకపోవడం ఇరు రాష్ర్టాల మధ్య వివాదంగా మారింది. అయితే 200 కోట్ల రూపాయల బకాయి చెల్లింపులో మాత్రం ఏపి సర్కార్ మౌనం వహిస్తుండటంతో సింగరేణి అయోమయంలో పడింది.  

17:33 - October 21, 2016

రంగారెడ్డి : కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన కేసీఆర్.. తండాలను పంచాయితీలుగా చేయడంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పార్టీ సీపీఎం కాదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అండగా నిలిచి రుణమాఫీ, తండాలను పంచాయితీలు మార్చే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. సీపీఎం మహాజన పాదయాత్ర ఐదో రోజు మంచాల మండలంలో విజయవంతంగా కొనసాగుతోంది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు తొమ్మిది మంది బృందం గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

100కి.మీ. పూర్తి చేసుకున్న సీపీఎం పాదయాత్ర..
సీపీఎం మహాజన పాదయాత్ర నేటికి ఐదో రోజుకి చేరుకోంది. కోళ్లవంపు గ్రామం వద్ద పాదయాత్ర 100 కి.మీ పూర్తి చేసుకొంది. నేటి పాదయాత్ర మంచాల మండలం రంగాపురం గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులు డప్పులు, గంగిరెద్దులతో ఘనస్వాగతం పలికారు. ఎర్రచీరలు, రెడ్‌ షర్ట్‌లతో 1500 మంది కార్యకర్తలు మహా పాదయాత్రలో పాల్గోన్నారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు తొమ్మిది మంది బృందం గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

జియో కు ట్రాయ్ సమర్థన..

ముంబై : జియో లైఫ్ టైమ్ ఫ్రీ వాయిస్ కాల్స్ ఆఫర్ కు ట్రాయ్ సమర్థించింది. జియో ఆఫర్లు గైడ్ లైన్స్ ను ఉల్లంఘించడం లేదని ట్రాయ్ తేల్చింది. జియో ఉచిత సేవలను జనవరి 1తో ముగించాలని ఆదేశించింది. ట్రాయ్ తీర్పును రిలయన్స్ జియో సమర్థించింది.

 

జేఎన్ యూ విద్యార్థుల ఆందోళన..

ఢిల్లీ : రైల్ భవన్ సమీపంలో జేఎన్ యూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. అదృశ్యమైన విద్యార్థి నజీబ్ అహ్మద్ ఆచూకిని కనుగొనాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కోయంబత్తూరులో బాణాసంచా గోదాంలో అగ్నిప్రమాదం..

తమిళనాడు : కోయంబత్తూరులో ఓ బాణాసంచా గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పది మంది మంటలు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

రాజధాని శంకుస్థాపనకు ఏడాది..

విజయవాడ : అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి రేపటికి ఏడాది సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజధాని నిర్మాణంలో భాగంగా మొదట అడ్మినిస్ట్రేటివ్ సిటీ నిర్మించడం జరుగుతుందని, అరుణ్ జైట్లీ చేతుల మీదుగా సిటీకి శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో జైట్లీ పర్యటన ఖరారైన తరువాత తేదీని ప్రకటిస్తామని, ఇప్పటికే రహదారుల పనులు మొదలయ్యాయని తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా నిలుస్తుందని తెలిపారు.

 

వెనుకబడిన రిలయన్స్ జియో..

ఢిల్లీ : ట్రాయ్ 4 జీ స్పీడ్ టెస్టులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 4జీ స్పీడ్ లో ఇతర కంపెనీలకంటే రిలయన్స్ జియో వెనుకబడింది. ఐడియా (7.6), వోడాఫోన్ (7.3) ఎంబీపీఎస్ ఉన్నట్లు వెల్లడైంది. 

16:54 - October 21, 2016

హైదరాబాద్ : గ్రేట‌ర్ హైదరాబాద్‌ రోడ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెయ్యని రోడ్లకు వేసిన‌ట్లు బిల్లులు తీసుకున్నట్లు ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి అన్ని విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. రోడ్లపై క‌మిష‌న‌ర్ జ‌నార్దన్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు. నాణ్యతా లోపం కార‌ణంగానే రోడ్లు త్వర‌గా పాడ‌వుతున్నాయని అధికారులు తేల్చారు. మరోవైపు రోడ్ల వివ‌రాలు స‌మ‌గ్రంగా లేవంటూ మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గ‌డిచిన మూడు నెల‌ల క్రితం 1688 కిలోమీట‌ర్ల ప‌నులు పూర్తయ్యాయి.భారీగా కురిసిన వ‌ర్షాల కార‌ణంగా సిటిలో భారీగా రోడ్లు దెబ్బతిన్నాయి. 486 ప్రాంతాల్లో 150 కిలోమీట‌ర్లకు పైగా రోడ్లు పాడైన‌ట్లు అధికారులు గుర్తించారు. రోడ్ల బాగుకోసం రూ.80కోట్ల వ‌ర‌కు బ‌ల్దియా ఖ‌ర్చుచేస్తోంది. కాగా శుక్రవారం నగరంలోని రోడ్ల దుస్థితిపై టీడీపీ ఆందోళన చేపట్టింది. జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు. నాసిరకం రోడ్ల నిర్మాణంలో అధికారులు, కాంట్రాక్టర్ల పాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే.

16:47 - October 21, 2016

హైదరాబాద్ : షిర్డీ సాయి బాబాపై స్వరూపానంద అనుచిత వ్యాఖ్యలు సాయి భక్తులకు ఆగ్రహం తెప్పించాయి. సాయి బాబా దేవుడు కాదంటూ స్వరూపానంద చేసిన కామెంట్లపై భక్తులు మండిపడుతున్నారు. హైదరాబాద్‌ లోని దిల్‌ సుఖ్‌నగర్‌ సాయి బాబా ఆలయ ట్రస్ట్‌ అధ్వర్యంలో భక్తులు స్వరూపానంద దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసన తెలిపారు. స్వరూపానంద వెంటనే బాబా భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

16:44 - October 21, 2016

హైదరాబాద్ : కేసీఆర్‌ పాలన తుగ్లాక్‌ పాలనను తలపిస్తోందని సీఎల్‌పీ ఉప నేత కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. వాస్తు పేరుతో వేల కోట్ల ప్రజా ధనాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం వృధా చేస్తుందన్న ఆయన.. రైతులకు రుణ మాఫీ అమలు చేయడంలో సర్కార్‌ విఫలమైందన్నారు. రైతులకు మద్దతు ధర ఇప్పించడం కోసం 500 బైకులతో భారీ ర్యాలీ చేస్తామన్నారు. ఇకనైనా కేసీఆర్‌ తన పద్దతి మార్చుకోక పోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని కోమటి రెడ్డి హెచ్చరించారు. 

16:42 - October 21, 2016

విజయవాడ : ఏపీలో నెలకొన్న కరవు పరిస్థితులు, ప్రత్యేక ప్యాకేజీ..దాని చట్టబద్ధత, నదుల అనుసంధానం తదితర అంశాలను టీడీపీ పొలిట్‌బ్యూరోలో చర్చించినట్లు ప్రభుత్వ విప్‌ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. సర్జికల్‌ దాడులు, ఆర్మీ చర్యలను పొలిట్‌బ్యూరో అభినందించిందన్న ఆయన.. నవంబర్‌ 1 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చేలా కృషి చేయాలని పొలిట్‌బ్యూరోలో చర్చించినట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. 

16:39 - October 21, 2016

పిలిఫిన్స్‌ : హైమా తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. 135 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ఇళ్లు, వాహనాలు, చెట్లు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వంతెనలు కూలిపోయిన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే నలుగురు మృతి చెందగా.. 10 లక్షల మంది నిరాశ్రయులైయ్యారు. హైమా తుఫాన్‌ చైనాలోనూ విరుచుకుపడింది. రంగంలోకి దిగిన సైన్యం సహయక చర్యలు చేపడుతోంది.

16:25 - October 21, 2016

జమ్ము కశ్మీర్ : కశ్మీర్‌ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని హీరానగర్ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్ స్థావరాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాకిస్తాన్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ బీఎస్‌ఎఫ్ జవాను గాయపడ్డాడు. పాక్ కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. మరోవైపు ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో ఇంటింటిని సోదా చేస్తున్నారు.

16:21 - October 21, 2016

ఢిల్లీ : బిసిసిఐకి సుప్రీంకోర్టు మళ్లీ ఝ‌ల‌క్ ఇచ్చింది. లోధా కమిటీ సూచించిన సంస్కరణలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ బీసీసీఐకి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లోధా కమిటీ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపేవరకూ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నిధులు జారీ చేయకూడదని బీసీసీఐకి కోర్టు సూచించింది. లోధా క‌మిటీ సిఫారసులు అమలు చేస్తామ‌ని రాష్ట్ర సంఘాలు అఫిడ‌విట్ దాఖ‌లు చేస్తేనే వారికి నిధులు విడుదల చేయాలని స్పష్టంచేసింది. వీటిని ప‌రిశీలించ‌డానికి ఓ స్వతంత్ర ఆడిట‌ర్‌ను నియ‌మించాల్సిందిగా లోధా క‌మిటీకి సూచించింది. సంస్కరణల అమలుపై డిసెంబ‌ర్ 3లోగా కోర్టులో అఫిడ‌విట్ సమర్పించాలని బోర్డు అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్‌ 5కు వాయిదా వేసింది.

16:21 - October 21, 2016

చలికాలం వచ్చేస్తోంది. ఇప్పటికే చలిగాలులు మొదలయ్యాయి. దీనితో చర్య సమస్యలు ఏర్పడుతుంటాయి. చర్మం పొడిగా, జిడ్డుగా మారడం, జుట్టు పొడిబారడం, పెదాలు తడి ఆరడం లాంటి ఎన్నో సమస్యలు చలికాలంలో వస్తాయి. పొడి చర్మం ఉన్న వారు మాయశ్చరైజర్‌ కోల్డ్ క్రీమ్‌ను రెగ్యులర్‌గా వాడాలి. అంతేకాక, చర్మం పొడిబారకుండా ఉండేందుకు తరచూ మంచినీళ్లు తాగుతుండాలి.
వేడి నీళ్లతో స్నానం చర్మం మరింత పొడిబారేలా చేస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.
చలి తక్కువగా ఉండే సమయంలో అంటే ఉదయం 7-8 గంటలకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. నడకను ఎంచుకోవడం ఉత్తమం.
బాదం నూనె, బాదంపొడి, అరటి ముక్కలు, గ్లిజరిన్ లేదా తేనే లు ప్రతొక్కటి రెండు చెంచాల మోతాదు తీసుకోవాలి. నాలుగు టీ స్పూన్లు పాలు ఆ మిశ్రమానికి కలిపి మెత్తని గుజ్జు మాదిరి పేస్ట్ చేసి ముఖానికి, మెడకు మృదువుగా మసాజ్ చేస్తూ పట్టించి కొద్దిసేపుంచి కడిగేయాలి. ఇది పొడి చర్మానికి ఉపయోగపడుతుంది.
​ జిడ్డు చర్మం కలిగిన వారు.. రెండు టీ స్పూన్లు ఓట్‌ మీల్‌పొడి, నాలుగు టీ స్పూన్లు మజ్జిగ, రెండు టీ స్పూన్లు గంధంపొడి కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించి, గోరువెచ్చని నీటితో కడిగేస్తే జిడ్డు చర్మం పోయి కాంతివంతంగా ఉంటుంది.

16:19 - October 21, 2016

అమెరికా : వచ్చే నెల 8న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణలు వివాదాస్పదమవుతున్నాయి. ట్రంప్‌ వ్యాఖ్యలపై అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా తీవ్రంగా ప్రతిస్పందించారు. ట్రంప్‌ ఆరోపణలు ప్రమాదకరమని, అమెరికా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయని ఇవాళ ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఒబామా మండిపడ్డారు. గురువారం లాస్‌ వేగాస్‌లోని నెవాడా యూనివర్సిటీలో హిల్లరీ, ట్రంప్‌ల మధ్య మూడో విడత బహిరంగ జరిగింది. ఈ డిబేట్‌లో ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికలు సజావుగా జరిగే అవకాశాలులేవని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా .... ఆమోదిస్తారా.... లేదా.. అన్న మోడరేటర్‌ ప్రశ్నకు ట్రంప్‌ సరైన సమాధానం చెప్పలేదు. ఎన్నికలు జరిగే వరకు వ్యాఖ్యానించబోనన్నారు. రిగ్గింగ్‌, ఎన్నికల ఫలితాలపై ట్రంప్‌ చేసిన ఆరోపణలను ఫ్లోరిడా ర్యాలీలో ఒబామా తిప్పికొట్టారు. 

కమ్యూనిస్టులకు ప్రజలే దేవుళ్ళు -చుక్కా రాములు..

రంగారెడ్డి : కమ్యూనిస్టులకు ప్రజలే దేవుళ్లని సీఐటీయూ నేత చుక్కా రాములు పేర్కొన్నారు. సీపీఎం నిర్వహిస్తోన్న మహాజన పాదయాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. రంగాపూర్ గ్రామంలోని కోళ్లవంపు వద్ద పాదయాత్ర 100 కి.మీటర్ల మైలురాయిని చేరుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజల కోసం 4000 కి.మీ లు నడిచి వెళ్తున్నారని తెలిపారు. ఆడిన మాట ఎందుకు తప్పుతున్నావ్ అని, 3 ఎకరాల భూమి ఏది? అని సూటిగా ప్రశ్నించారు. 

16:12 - October 21, 2016

నెల్లూరు : జిల్లాలో దారుణం జరిగింది. కలిగిరి మండలంలో పాపనముసలిపాలెంలో ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కత్తులు కర్రలతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ల తలెత్తిన ఘర్షణలో సుబ్బారెడ్డి, మహేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి మృతి చెందారు. కాగా భూముల కొనుగోలు విషయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసినట్లుగా తెలుస్తోంది. దాడి చేసిన వ్యక్తులు నెల్లూరు పీఎస్ లో లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

16:05 - October 21, 2016

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. దాదాపు రెండున్న గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. జమ్ము కశ్మీర్ లోని ఉరి ఘటనలో అమరులైన వీర జవానులకు సమావేశం ముందుగా శ్రద్ధాంజలి ఘటించింది. 2016 నుండి 18 వరకూ ఏపీ తెలంగాణలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ప్రణాళికలు, ఏపీలో ప్రభుత్వ పాలన, ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి ప్రజలలో ఎటువంటి అభిప్రాయం వుంది అనే అంశాలపై సమావేశం చర్చించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో నెలకొన్న జలవివాదం, పోలవరం నిర్మాణం..నీటి పారుదల ప్రాజెక్టులు..జన చైతన్య యాత్ర, ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి చట్టబద్ధత తీసుకువచ్చే అంశాలపై వంటి పలు కీలక అంశాలపై పోలిట్ బ్యూరో సమావేశం చర్చించారు. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించడంపై సుదీర్ఘంగా చర్చించారు. భవనాల అప్పగింతపై సభ్యుల అభిప్రాయాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు హాజరయ్యారు. మరింత సమాచారానికి వీడియో చూడండి.. 

పొలం వివాదం..ముగ్గురి మృతి..

నెల్లూరు : పొలం వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కత్తులు..కర్రలతో దాడులకు దిగారు. ఈఘటనలో ముగ్గురు మృతి చెందారు. కనిరిగిరి (మం) పాపన ముసలిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

15:47 - October 21, 2016

విజయనగరం : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఆ ప్రాంతంలో రియల్‌ భూమ్ ఒక్కసారిగా ఊపందుకుంది. భూసేకరణ ప్రక్రియ పూర్తయి, ఎయిర్ పోర్టు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండటం రియల్ వ్యాపారులకు వరంగా మారింది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పక్కనే వెంచర్ అంటూ ప్రచారాలతో ఊదరగొడుతున్నారు. ఎయిర్ పోర్టు పుణ్యమా అని బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు... భోగాపురంలో తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాసులుగా కొనసాగిస్తున్నాయి.

భోగాపురం మండలంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం జోరుగా కసరత్తు చేస్తున్న తరుణంలో అదే స్పీడ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఎయిర్ పోర్టు ప్రతిపాదిత ప్రాంతానికి అనుకొని ఉన్న భూముల్లో ఇప్పుడు రియల్ వ్యాపారం జోరందుకుంది. భోగాపురం మండలంతో పాటు పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో సుమారు 500 వరకు వెంచర్లు వెలిశాయి. ఎకరా కోటి పలికే ఈ భూముల ధరలు విమానాశ్రయం ప్రచారంతో రెట్టింపయ్యాయి. భోగాపురానికి అటు శ్రీకాకుళం, ఇటు విశాఖ వరకు ఉన్న జాతీయ రహదారి పొడవునా ఇబ్బడి ముబ్బడిగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి.

భోగాపురం మండలం విస్తీర్ణం 28వేల ఎకరాలు
భోగాపురం మండలం విస్తీర్ణం 28వేల ఎకరాలు. ఇందులో సుమారు 5,500 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ చేస్తోంది. జాతీయ రహదారికి ఇరువైపులా వ్యాపించిన ఈ మండలం సముద్రతీరానికి అతిచేరువులో ఉంది. దీని భౌగోళిక పరిస్థితిల వల్ల పదేళ్ల క్రితమే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందింది. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, ఐఎఎస్, ఐపిఎస్‌లు వంటివారే కాకుండా, సామాన్య మధ్య తరగతి ప్రజలు కూడా ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలపై కొనుగోళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఓవైపు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, మరోవైపు 16వ నెంబరు జాతీయ రహదారి, సువిశాల సముద్రతీరం, విశాఖపట్నంకు అతిచేరువలో ఈ ప్రాంతం ఉండటంతో రియల్ వ్యాపారం జోరందుకుంది. శుభగృహ వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే ఈ ప్రాంతంలో మూడు నుంచి ఐదు వరకు వెంచర్లు వేసి విక్రయించాయి. భోగాపురం ప్రాంతంలో ఐదు వేల రూపాయల లోపునే ధరలను అందుబాటులోకి తేవడంతో కొనుగోళ్లుదారులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇటీవల డెంకాడ మండలం ఐనాడ జంక్షన్ సమీపంలో శుభగృహ సంస్థ వేసిన కొత్త వెంచర్ కు అనూహ్య స్పందన వచ్చింది. 

రెడ్డీస్, అరవింద్, మ్యాట్రిక్స్ వంటి పలు ఫార్మా కంపెనీలు
కొత్తగా రాబోయే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలో వెంచర్లు వేస్తుండటంతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాల మధ్యలో ఈ ప్రాంతం ఉండటం రియల్ వ్యాపారులకు కలిసివస్తోంది. ఇదే ప్రాంతం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఇక్కడ రెడ్డీస్, అరవింద్, మ్యాట్రిక్స్ వంటి పలు ఫార్మా కంపెనీలు వెలిశాయి. భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు ఈ ప్రాంతంలో రానున్నాయి. మరోపక్క విశాఖ, విజయనగరం పట్టణాల విస్తరణ యమస్పీడుగా జరుగుతున్నాయి.

భూముల కొనుగోళ్లపై దృష్టిపెట్టిన కస్టమర్లు
భూముల ధరలు అమాంతంగా పెరిగిపోతుండటంతో అవకాశం ఉన్నప్పుడే సొంతంటి స్థలం సంపాదించుకోవాలన్న ఆలోచనతో చాలా మంది కస్టమర్లు భోగాపురంలోని భూముల కొనుగోళ్లపై దృష్టిపెట్టారు. మొత్తంగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు రాకతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల పంట పండినట్లయింది.

15:43 - October 21, 2016

హైదరాబాద్ : ఫీజులు రీఎంబర్స్‌మెంట్‌ అమలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను మోసం చేసిందని తెలంగాణ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ పథకానికి ప్రభుత్వం గండికొట్టడంతో పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం పొంచివుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌ పథకం నిలిపివేతకు వ్యతిరేకంగా ఎన్ఎస్ యూఐ, యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థి గర్జన ర్యాలీని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌లో ఉన్నత విద్యను పేదలకు చేరువ చేస్తే... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దూరం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు మండిపడ్డారు.

15:38 - October 21, 2016

హైదరాబాద్ : ఈసారి బతుకమ్మను విదేశాల్లో కూడా ఘనంగా జరుపుకున్నామని.. ఎంపీ కవిత ప్రకటించారు.. వివిధ దేశాల్లో తాను పర్యటించి అక్కడ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం సంతోషాన్నించ్చిందని తెలిపారు. తమ ఆస్తులపై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై కవిత ఘాటుగా స్పందించారు. తమకు ప్రకటించుకునేంత ఆస్తులు లేవని స్పష్టం చేశారు.

15:22 - October 21, 2016

వరంగల్ : జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో దారుణం జరిగింది. ఈవ్ టీజింగ్ లకు ఆకతాయిల వేధింపులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అమ్మాయిలు, మహిళలపై వేధింపులకు మాత్రం ఫుల్ స్టాప్ పడటంలేదు. వేధింపులతో విద్యార్థినులు చదువుకునేందుకు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు సమాజంలో నెలకొంటున్నాయి. ఆకతాయిల వేధింపులకు ఎంతోమంది బలైపోతున్నారు. ఇటువంటి సంఘటనే వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆరు నెలలుగా రమ్య అనే యువతిని కళాశాలకు వెళ్లి వచ్చే సమయంలో దారిలో కాపుకాసి అమర్ అనే వ్యక్తి తరచూ వేధింపులకు గురిచేస్తుండేవాడు. కాగా అమర్ వేధింపులు తాళలేని రమ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన బంధువులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే రమ్య మృతి చెందింది. ఈ క్రమంలో అమర్ ను కఠినంగా శిక్షించాలని రమ్య బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా అమర్ కు ఇప్పటికే వివాహం అయి ఇద్దరు పిల్లలు కూడా వున్నట్లుగా తెలుస్తోంది. 

త్వరలో ఆస్తుల వివరాలు - మంత్రి పల్లె..

గుంటూరు : త్వరలో తన ఆస్తుల వివరాలు ప్రకటిస్తానని మంత్రి పల్లె ప్రకటించారు. భూ కబ్జాలు, దందాలు చేశానంటూ తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు చూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదని తెలిపారు. 

రోడ్ల రిపేర్ పై జీహెచ్ఎంసీ మేయర్..కమిషనర్ సమావేశం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల సమస్యలపై మేయర్, కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మెట్రో, ఎల్ అండ్ టి, టీఐఐసీ, జీహెచ్ఎంసీ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. 

భూపాలపల్లిలో దారుణం..

భూపాలపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహితుడి లైంగిక వేధింపులకు భరించలేక ఓ విద్యార్థిని తనువు చాలించింది. విద్యార్థిని మృత్యదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వివాహితుడై, విద్యార్థిని మృతికి కారకుడైన అమర్ ని కఠినంగా శిక్షించాలని కుటుంసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

నయీం సోదరుడికి రిమాండ్ పొడిగింపు..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం సోదరుడు ఫహీంను పోలీసులు రాజేంద్రనగర్ కోర్టు లో హాజరు పరిచారు. మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించారు. 

కొనసాగుతున్న టి. కేబినెట్ సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ సమావేశానికి అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, ఏఏజీ రామకృష్ణారావులు కూడా హాజరయ్యారు. కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు, సచివాలయం తరలింపు, కొత్త జిల్లాల్లో పాలనపై చర్చ జరగనుంది. 

14:50 - October 21, 2016

హైదరాబాద్ : ఇటీవలి కాలంలో నగరంలో కురిసిన భారీ వర్షాలు, మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం దీనికి తోడు అధికారుల నిర్లక్ష్యం, నాసిరకంతో రోడ్లు నిర్మాణాలు వంటి పల కారణాలతో నగర రోడ్లు పరిస్థితి చెప్పనలవికానంత అధ్వాన్నంగా మారిపోయాయి. దీంతో బైటకు రావాలంటేనే నగరవాసులు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయం వద్దర టీ.టీడీపీ ధర్నా చేపట్టింది. నగరంలోని రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా వుందని టీడీపీ నేతలు విమర్శించారు. రోడ్ల మరమ్మత్తును వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నాసిరకం రోడ్ల నిర్మాణంలో అధికారులు,కాంట్రాక్టర్ల పాత్ర వుందని టీడీపీ నేతలు ఆరోపించారు. సమాచారానికి వీడియో చూడండి..

14:45 - October 21, 2016

గుంటూరు : మహిళా చైర్ పర్సెన్ నన్నపనేని రాజకుమారి వాహనం ఓ బైకు ను ఢీకొంది. దీంతో బైకు నడుపుతున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. యువకుడిని వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మరోపక్క తన వాహనం ఢీకొన్న యువకుడు పరిస్థితి చూసి నన్నపనేని రాజకుమారికి బీపీ పెరగటంతో ఆమెను కూడా ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నందివెలుగు రోడ్డులో జరిగింది. 

14:35 - October 21, 2016

హైదరాబాద్: ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీ సచివాలయంలో జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా.. కృష్ణా జలాల పునఃపంపిణీపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతోపాటు కొత్త సచివాలయ నిర్మాణం వంటి పలు అంశాలను కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.కొత్త ఉద్యోగాల నియామకాలు, కొత్త జిల్లాల్లో పనితీరు, 20 అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

ముగిసిన టిడిపి పొలిట్ బ్యూరో..

విజయవాడ : టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. జనచైతన్య యాత్ర, పార్టీ సభ్యత్వ నమోదుతో సహా 15 అంశాలపై చర్చించారు. 

ఫీజు రీయింబర్స్ మెంట్ కాలేజీల మూత - ఉత్తమ్..

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయకపోవడంతో 3200 కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ తెలిపారు. సర్కార్ మెడలు వంచేందుకు దరఖాస్తుల ఉద్యమం చేపట్టడం జరిగిందని, డిసెంబర్ 2న రాహుల్ ఈ ఉద్యమంలో పాల్గొంటారని తెలిపారు. 

తెలంగాణలో ఫీజులు లేవు..ఉద్యోగాలు లేవ్ - డీకే అరుణ..

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్ మెంట్ విద్యార్థులు ప్రస్తావిస్తుంటే ప్రభుత్వం అణిచివేత ధోరణి అవలింబిస్తోందని టి.కాంగ్రెస్ నేత డీకే అరుణ పేర్కొన్నారు. తెలంగాణలో ఫీజులు లేవు..ఉద్యోగాలు లేవని విమర్శించారు. 

14:06 - October 21, 2016

నాటి యాంకర్ సరస్వతీతో మానవి ప్రత్యేక ఇంటర్వూ నిర్వహించింది.  ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. తన కెరీర్, యాంకర్ గురించి పలు విషయాలు తెలిపారు. ఆ విషయాలను ఆమె మాటల్లోనే... 'యాంకరింగ్ అనే పదం మా బ్యాచ్ తో మొదలైంది. ప్రతి చానల్ కు పని చేశాను. 26  సం.లుగా యాంకరింగ్ చేస్తున్నాను. సుమాంజలి ప్రొగ్రామ్ చేశాను. బాగా ఎంజాయ్ చేశాను. వయస్సులో కాదు జీవితంలో ఎదగాలి. 1988 సం.లో నాకు పెళ్లి అయింది' అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

చైతన్యపురి నాలాపై ఉన్న ఇళ్ల కూల్చివేత..

హైదరాబాద్ : చైతన్యపురి నాలాపై నిర్మించిన ఇళ్లను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. 

సచివాలయానికి చేరుకున్న కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కృష్ణా జలాలపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు, సచివాలయం తరలింపు..కొత్త జిల్లాల్లో పాలనపై చర్చ జరగనుంది. 

13:46 - October 21, 2016

హైదరాబాద్ : గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా గవర్నర్‌తో సమావేశమైన చంద్రబాబు.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై వివరించారు. ఈ సమావేశం గంటన్నరపాటు కొనసాగింది. తాజా రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ జరిగింది. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేవన్నారు. కేబినెట్ విస్తరణపై చంద్రబాబు చర్చించలేదని తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. ఘర్షణ వాతావరణం వల్ల రెండు రాష్ట్రాలకు ఇబ్బందని అభిప్రాయపడ్డారు. ఘర్షణ వాతావరణం ఉంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని తేల్చి చెప్పారు.

 

13:41 - October 21, 2016
13:39 - October 21, 2016

హైదరాబాద్ : విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల జీతభత్యాలను 30 శాతంపైగా పెంచిన విషయాన్ని నాయిని గుర్తు చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్‌ గోషామల్‌ స్టేడియంలో జరిగిన సంస్మరణ కార్యక్రమానికి నాయిని హాజరయ్యారు. పోలీసు అమరవీరుల స్థూపం దగ్గర పుష్పగుచ్ఛాలు  ఉంచి నివాళలర్పించారు. ఈ సందర్భంగా హోం మంత్రి శాంతభద్రతల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. 
 

13:30 - October 21, 2016

విశాఖ : కోట్ల విలువ చేసే ఆ భూములకు రెక్కలొచ్చాయి. నిన్నమొన్నటి వరకు ప్రభుత్వ భూములుగా ఉన్న ఆ స్థలాలు.. ఉన్నపళంగా ప్రైవేటు భూములయ్యాయి. విలువైన ఆ భూముల్ని దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దలే తెరవెనక వ్యవహారం నడిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూములుగా ఉన్న ఆ స్థలాలు..అసలు ప్రైవేటు భూములుగా ఎలా మారాయి. విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న అరవై ఎకరాల దస్‌పల్లా భూములపై 10 టివి స్పెషల్‌ స్టోరీ...!
వేలకోట్ల విలువైన భూములు
విశాఖ నగరం నడిబొడ్డున సర్వే నెంబర్‌ సర్వే నెంబర్ 1196, 1197లో దాదాపు 60.5 ఎకరాల భూమి ఉంది. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భూములుగా పరిగణించబడుతున్న ఈ భూములు.. తాజాగా కొందరు ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలకు గురవుతోంది. ఈ  భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. 
దస్‌పల్లా రాణి కమలాదేవి హైకోర్టులో పిటిషన్‌ 
సర్క్యూట్‌ హౌజ్‌ ప్రాంతంలోని 60.5 ఎకరాల భూమి తమదని 2000 సంవత్సరంలో దస్‌పల్లా రాణి కమలాదేవి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 1999-2000లో విశాఖ జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసిన కృష్ణబాబు.. ఈ భూములు ప్రభుత్వ భూమలుగా తేల్చారు. 2009లో ఈ భూములు దసపల్లా రాణికి చెందినవని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2012 లో సుప్రీం కోర్టు ఎక్స్ పార్టీ డిక్లేర్ కూడా ఇచ్చింది. అయితే 2014 లో కొంతమంది వ్యక్తులు రాణి కమలాదేవి నుంచి భూముల్ని జీపీఏ చేయించుకుని నిర్మాణాలు చేపట్టడం మొదలు పెట్టారు. దాదాపు 52 మంది ఈ భూముల్లో నిర్మాణాలు చేపట్టడం వివాదస్పదంగా మారింది.  
ప్రభుత్వ భూములే అని తేల్చిన కలెక్టర్
2015లో అప్పటి కలెక్టర్ యువరాజ్ దస్‌పల్లా  సర్వే నెంబర్ 1196, 1197 లోని భూములు ప్రభుత్వ భూములే అని తేల్చి చెప్పారు. 2015 లో ఇప్పటి  జీవీఎంసీ కలెక్టర్ కు పంపిన ప్రభుత్వ భూముల లెక్కల వివరాల్లో .. 1196, 1197 సర్వే నెంబర్ల గురించి ఎక్కడా పేర్కొనకపోవడంతో వివాదానికి తెరలేపినట్లయింది. 2000 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం  జీవో నెంబర్  556 విడుదల చెస్తూ సర్వే నెంబర్ 1197 ఉన్న 2 వేల చదరపు గజాలను  టీడీపీ ఆఫీసుకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల్లో కూడా ఈ భూమి వివాదంలో ఉన్నట్లు పేర్కొంది. 
పెద్దల వల్లే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం : ప్రతిపక్షాలు
అధికారంలో ఉన్న పెద్దల వల్లే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ బినామీల పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూముల వ్యవహారానికి సంబంధించి సీబీఐ విచారణ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని గద్దల్లా తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకునేది లేదని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని వైసీపీ నేతలు చెబుతున్నారు. 
భూములు ఆక్రమిస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు
కొందరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భూములు ఆక్రమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. భూముల్ని కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భూముల్ని కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. టీడీపీ నేతలు, రియల్ ఎస్టేట్‌ బ్రోకర్లు, అధికార ప్రతినిధులు తప్పుడు డాక్యుమెంట్లతో భూములను కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
ఆరోపణలను ఖండించిన టీడీపీ నేతలు 
మరోవైపు చంద్రబాబు, లోకేష్‌లపై ప్రతిపక్షాల ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. అది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు, ప్రభుత్వానికి మధ్య వ్యవహారమని కొట్టిపడేశారు. దసపల్లా భూముల వ్యవహారంలో సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. అభివృద్ధిని ఓర్వలేక అసత్యప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత చెప్పారు. ఇది ప్రైవేటు వ్యవహారమని టీడీపీ కొట్టిపడేస్తున్నా... వేల కోట్ల విలువ చేసే భూముల వ్యవహారంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, భూములు ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  

 

జీహెచ్ఎంసీ వద్ద టిడిపి ధర్నా..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద టిడిపి ధర్నా నిర్వహించింది. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేసింది. నాసిరకం రోడ్ల నిర్మాణంలో అధికారులు..కాంట్రాక్టర్ల పాత్ర ఉందని పేర్కొంది. 

13:22 - October 21, 2016

హైదరాబాద్ : కొందరు ఆయన్ని స్వరాష్ట్ర స్వాప్నికుడన్నారు. కొందరు తెలుగువారి మధ్యలో చిచ్చు పెట్టిన ప్రాంతీయవాది అన్నారు. కొందరు ఆయన్ని పోరాటశక్తి అన్నారు. కొందరు కేవలం ఆరాటపరుడు అన్నారు. అంతటి ఘన చరిత్ర ఉన్న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ జీవితం ప్రజలకు ఆదర్శమే కాదు.. వెండి తెర మీద ఎక్కడం కూడా అవసరం అంటున్నారు. ఆయన జీవితం మీద సినిమా తీసేందుకు ఓ యువ దర్శకుడు ముందుకొచ్చారు. 
హీరో ఎవ్వరు అనేది ఇంకా సంచలనం
4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఆయన ఒక ఆశయ సారధి... వారి కలలను నిజం చేసిన మహా నాయకుడు. ఎవరు ఏమన్నా, ఎవరు ఎలా అనుకున్నా, ఉద్యమంలో ఆయన ముందుకు సాగారు. ఇదంతా మనమందరం చూసిన చరిత్ర, చూస్తున్న వర్తమానం. కానీ కేసీఆర్‌ జీవితంపై త్వరలోనే ఓ సినిమా రాబోతోంది. మామూలు ఎమ్మెల్యే నుంచి పార్టీ అధ్యక్షుడిగా, ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రస్థానాన్ని తెరకెక్కించబోతున్నారు. కేసీఆర్ జీవితంపై సినిమాయే సంచలనం అంటే అందులో హీరో ఎవ్వరు అనేది ఇంకా సంచలనం!
బయోపిక్‌ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ 
ఇటీవల కాలంలో బయోపిక్‌ల ఆధారంగా తీస్తున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. త్వరలో సీఎం కేసీఆర్‌ జీవితం ఆధారంగా బయోపిక్‌ సినిమా రాబోతోంది. దర్శకుడు మధుర శ్రీధర్‌ కేసీఆర్‌ బయోపిక్‌ తీయాలనుకుంటున్నట్లు చెప్పారు. 2017 జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సినిమా షూటింగ్‌ను ప్రారంభించి, 2018 ఫిబ్రవరి 17న కేసీఆర్‌ పుట్టిన రోజున విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 
శ్రీధర్‌ దర్శకత్వంలో...  
1969 తెలంగాణ ఉద్యమ చరిత్ర విన్నానన్న ఆయన.. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమకారుల్ని విడివిడిగా కలిశానన్నారు. కొందరి మాటల ద్వారా తెలంగాణ ఉద్యమం సాగిన తీరు తెలుసుకున్నానని చెప్పారు. ఈ చిత్రాన్ని నిర్మాత రాజ్‌ కందుకూరి తన ధర్మపథ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారని దర్శకుడు శ్రీధర్‌ వెల్లడించారు. సినిమాలో ఉద్యమ ప్రస్థానమే హైలెట్‌గా నిలువనుందనే టాక్‌ వినిస్తోంది. కేసీఆర్‌ జీవితాన్ని వెండి తెరపై చూడాలంటే 2018 ఫిబ్రవరి 17వరకు ఆగాల్సిందే మరీ. 

కోళవంపు వద్ద మహాజన పాదయాత్ర 100 కి.మీ.పూర్తి..

రంగారెడ్డి : సీపీఎం మహాజ పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఐదో రోజు (శుక్రవారం) కోళ్లవంపు వద్ద ఈ మైలురాయిని చేరుకుంది. మంచాల (మం) రంగాపూర్ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. డప్పులు, గంగిరెద్దులతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎర్రచీరలు..రెడ్ షర్ట్ లతో 1500 మంది కార్యకర్తలు స్వాగతం పలికారు. కిలో మీటర్ పొడవునా ర్యాలీ నిర్వహించారు. 

13:12 - October 21, 2016

ముంబై : యే దిల్ హై ముష్కిల్ సినిమా విడుద‌ల‌కు అడ్డంకులు తొలగినట్టే కనిపిస్తోంది. సినిమా విడుదలకు కావలసిన రక్షణ చర్యలు చేపడతామని నిర్మాతల సంఘానికి కేంద్ర హోంశాఖ హామీ ఇచ్చింది. దీంతో 'యే దిల్ హై ముష్కిల్' సినిమా అక్టోబ‌ర్ 28న విడుదలకు సిద్ధమవుతోంది.
రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన నిర్మాతలు  
క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శక‌త్వంలో రూపొందిన 'యే దిల్ హై ముష్కిల్' సినిమా విడుద‌ల‌కు అడ్డంకులు తొలిగాయి. ఈ సినిమా విడుదలకు సంబంధించి ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ అధ్యక్షుడు ముఖేష్ భ‌ట్ నేతృత్వంలో నిర్మాతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. సినిమా విడుదలకు అడ్డంకులు లేకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 
సినిమా విడుదలకు చర్యలు తీసుకుంటాం : రాజ్ నాథ్ సింగ్ 
దీనిపై స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ 'యే దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్యలు తీసుకుంటామ‌ని నిర్మాత‌ల సంఘానికి హామీ ఇచ్చారు. ఎలాంటి విధ్వంసం జరగకుండా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల‌తో మాట్లాడి సినిమాకు రక్షణ కల్పిస్తామని హోంమంత్రి  చెప్పిన‌ట్లు  ముఖేష్ భ‌ట్ తెలిపారు. మన సినిమాలు పాకిస్థాన్‌లో రిలీజ్ అవుతున్నాయా లేదా అన్నది మాకు అన‌వ‌స‌రం.. ప్రపంచ‌వ్యాప్తంగా మన సినిమాలు విడుద‌ల‌వుతాయని భ‌ట్ చెప్పారు. 
కరణ్‌జోహర్‌ తీవ్ర ఆందోళన
ఈ సినిమాలో పాక్ న‌టుడు ఫ‌వ‌ద్ ఖాన్ న‌టించిన కార‌ణంగా సినిమాను అడ్డుకుంటామ‌ని, థియేటర్లపై దాడులు చేస్తామని మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన హెచ్చరించింది. సినిమా ఓన‌ర్స్ అసోసియేష‌న్ కూడా నాలుగు రాష్ట్రాల్లోని వంద‌లాది థియేట‌ర్లలో సినిమాను విడుదల చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించడంతో దర్శక నిర్మాత కరణ్‌జోహర్‌ తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. నాకు మన దేశం తప్ప ఏది ముఖ్యం కాదని, భ‌విష్యత్తులో మ‌ళ్లీ పాకిస్థాన్ న‌టుల జోలికి వెళ్లన‌ని, ఈ సినిమా రిలీజ్‌ను మాత్రం అడ్డుకోవ‌ద్దని క‌ర‌ణ్ జోహార్ ప్రాధేయ‌ప‌డ్డారు. 
ఎంఎన్ఎస్ తీరుపై ప్రముఖుల మండిపాటు 
ఎంఎన్ఎస్ తీరుపై ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్‌తోపాటు ఇత‌ర ప్రముఖులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. పాకిస్థాన్ న‌టులు న‌టించిన సినిమాల‌ను ఆడ‌నివ్వబోమ‌న్న ఎంఎన్ఎల్‌ పై సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి మార్కండేయ క‌ట్జూ తనదైన శైలిలో విరుచుకుప‌డ్డారు. ఎంఎన్ఎస్ కార్యక‌ర్తలు అరేబియా స‌ముద్రం ఉప్పునీళ్లు తాగిన గూండాలు కావ‌చ్చు.. కానీ నేను అల‌హాబాదీ గూండాను. ప‌విత్ర త్రివేణి సంగ‌మ నీళ్లు తాగానంటూ ట్వీట్‌ చేశారు. నిస్సహాయులైన న‌టుల‌పైన  ప్రతాపం చూపడం కాదు... ద‌మ్ముంటే నాతో త‌ల‌ప‌డండి.. ఎవ‌రు పెద్ద గూండానో తేలిపోతుందని ఖట్జూ ఎంఎన్‌ఎస్‌కు ట్విట్టర్‌లో సవాల్‌ చేశారు.
ఈనెల 28న విడుదల 
కరణ్ జోహార్ దర్శకత్వంలో 'యే దిల్ హై ముష్కిల్' సినిమా అక్టోబ‌ర్ 28న విడుదల కాబోతుంది. బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌ కపూర్‌, అనుష్క శర్మ, ఐశ్వర్యారాయ్‌లతో పాటు పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించారు.
భారత్‌, పాపకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు
యూరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్‌ పాపకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ నటులను బహిష్కరించాలని ఎంఎన్‌ఎస్‌తో పాటు కొన్ని సంస్థలు పిలుపునివ్వడాన్ని కొంతమంది ప్రముఖులతో పాటు బాలీవుడ్‌లో కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. నటులు టెర్రరిస్టులు కారని, వాళ్లు వీసా తీసుకుని ఇండియాకు వస్తారని సల్మాన్‌ఖాన్‌ తదితరులు పాక్‌ కళాకారులను వెనకేసుకొచ్చిన విషయం తెలిసిందే.

 

రాయలసీమ పవర్ ప్లాంట్ లో నిలిచిన విద్యుదుత్పత్తి..

కడప : ఎర్రగుంట్ల రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 1300 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 

13:08 - October 21, 2016

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ తో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. గంటన్నరపాటు సమావేశం కొనసాగింది. రాష్ట్ర అభివృద్ధని చంద్రబాబు గవర్నర్ కు వివరించారు. తెలంగాణతో ఎలాంటి వాద, ప్రతివాదనలకు దిగే అవకాశం లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:04 - October 21, 2016
13:03 - October 21, 2016

విజయవాడ : ప్రారంభమైన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో జన చైతన్య యాత్ర, పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు మొత్తం 11 అంశాలపై పొలిట్ బ్యూరో లో చర్చించనున్నారు. కళా వెంకట్రావును మంత్రివర్గంలోకి తీసుకోవాలని చర్చ జరుగనుంది. ఎపి, తెలంగాణతోపాటు ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాల్లో కూడా టీడీపీని విస్తరించాలనే అంశం, ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నదం వంటి పలు అంశాలను చర్చిస్నుట్లు తెలుస్తోంది. అంతకముందు గవర్నర్ నరసింహన్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:58 - October 21, 2016
12:57 - October 21, 2016

పెద్దపల్లిలో యువతికి తప్పిన అపాయం..

సుల్తాన్ బాద్ : పెద్దపల్లిలో యువతికి అపాయం తప్పింది. నాలుగు రోజుల క్రితం ఫోన్ లో పరిచయమైన యువకుడితో బైక్ పై వెళుతుండగా అనుమానం వచ్చి బైక్ పై నుండి కిందకు దూకింది. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. యువతిని వదిలి యువకుడు పరారయ్యాడు. సుల్తాన్ బాద్ మండలం గర్రేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

12:56 - October 21, 2016
12:55 - October 21, 2016

గుంటూరు : జిల్లాలోని మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్‌ గోపవరపు శ్రీదేవి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పురుగు మందు తాగిన తర్వాత అపస్మారక స్థితికి చేరుకున్న శ్రీదేవిని పిడురాళ్ల ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.  మూడు నెలల క్రితం శ్రీదేవి...  భర్త మల్లికార్జునరావు గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి  శ్రీదేవి రాజీనామా చేశారు. ఆర్థిక ఇబ్బందులతో శ్రీదేవి ఆత్మహత్మ చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 
 

ఫీజు రీయింబర్స్ మెంట్ పై టి.కాంగ్రెస్ పోరు..

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్ మెంట్ పై దరఖాస్తుల ఉద్యమానికి టి.కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. శంషాబాద్ లో భారీ బహిరంగసభ నిర్వహించింది. టి.పిసిసి చీఫ్ ఉత్తమ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. 

12:54 - October 21, 2016

గుంటూరు : జిల్లా కేంద్రంలోని శంకరకుంట ఫ్లైవోర్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్ లో సిబ్బంది శాంపిల్స్ సేకరిస్తుండగా... పెట్రోల్ పోయించుకునేందుకు ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ రింగ్ కావడంతో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలనాకి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

 

12:52 - October 21, 2016

రంగారెడ్డి : సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర వంద కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపురం గ్రామంలో వందో కి.మీ. పూర్తి చేసుకుంది. పాదయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. మహాజన పాదయాత్ర  నాలుగు వేల కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వంద కిలో మీటర్లు కొద్ది దూరమైనా... పెద్ద పెద్ద ప్రజా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తమ్మినేని వీరభద్రం చెబుతున్నారు. ఈమేరకు తమ్మినేని 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు పెద్ద పెద్ద ఆశలు కల్పించిందన్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేదని విమర్శించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంచలేదని విమర్శించారు. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ల హామీ అమలు కాలేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

గుంటూరు పెట్రోల్ బంక్ లో ప్రమాదం..

గుంటూరు : పెట్రోల్ బంక్ లో ప్రమాదం చోటు చేసుకుంది. శంకరకుంట ఫ్లై ఓవర్ సమీంపలోని భారత్ పెట్రోల్ బంక్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. 

తండాలను ఎప్పుడు పంచాయితీలు చేస్తవ్ - తమ్మినేని..

రంగారెడ్డి : తండాలను ఎప్పుడు పంచాయితీలు చేస్తవ్ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఐదో రోజు (శుక్రవారం) పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంచాల మండలంలో ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన ప్రసంగించారు. 

11:39 - October 21, 2016

హైదరాబాద్ : గుంతలమయమైన హైదరాబాద్‌ రోడ్లు మృత్యుమార్గాలుగా మారాయి. కూకట్‌పల్లి వై జంక్షన్‌ దగ్గర జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. కేపీహెచ్‌బీ ఎస్‌ఎస్‌ కాలనీకి చెందిన అరుణకుమార్‌, హఫీజ్‌పేట నివాసి సోమశేఖర్‌ ఇంజనీరింగ్ విద్యార్థులు. అరుణకుమార్‌ ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇద్దరు కలిసి బైక్‌పై కాలేజీ నిమిత్తం మూసాపేట వైపు వెళ్తున్నారు. మార్గంమధ్యలో కూకట్‌పల్లి వై జంక్షన్‌ సమీపంలోకి రాగానే రోడ్డు గుంతలు ఏర్పడడంతో ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి సడన్‌బ్రేక్‌ వేయడంతో అదుపుతప్పి కిందపడ్డారు. బైక్‌పై వెనుక కూర్చున్న అరుణ్‌కుమార్‌ డివైడర్ ను బలంగా ఢీకొట్టడంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సోమశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న కూకట్ పల్లి పోలీసులు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ఉన్న గుంతలే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని కోరుకుంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

కొస్గిలోని ఆస్పత్రిలో దారుణం

మహబూబ్ నగర్ : జిల్లాలోని కొస్గిలోని ఓ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ప్రసవం కోసం మహిళను బంధువులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రసవం అనంతరం తల్లీబిడ్డ మృతి చెందారు. వైద్యలు పరారయ్యారు. 

ఏడో యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత..

పెద్దపల్లి : రామగుండం ఎన్టీపీసీ 500 మె.వా. సామర్థ్యం గల ఏడో యూనిట్ లో విద్యుదుత్పత్తి నిలిపివేశారు. వార్షిక మరమ్మత్తులో భాగంగా 35 రోజుల పాటు విద్యుత్ నిలిపివేసిన అధికారులు మరమ్మత్తు చేయనున్నారు. 

10:37 - October 21, 2016

భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఢిల్లీలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ పోరాడి ఓడింది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఛేదనలో వెనకబడిపోయింది. చివర్లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 242 పరుగులు చేసింది. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ ఆదివారం జరగనుంది. 

 

10:32 - October 21, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కుదుటపడుతోందని అన్నాడిఎంకె సీనియర్ నేత హండే తెలిపారు. అపొలో ఆసుపత్రిలో ఆయన జయలలితను పరామర్శించారు. జయకు అందిస్తున్న చికిత్స వివరాలను లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైని అడిగి తెలుసుకున్నారు. హండే ఎంజీఆర్ ప్రభుత్వంలో వైద్య మంత్రిగా పనిచేశారు. జయకు ఊపిరితిత్తుల్లో వాటర్ ఇన్ఫెక్షన్ కారణంగా సుదీర్ఘకాలం చికిత్స తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు.  అప్పట్లో ఎంజిఆర్ ఆస్పత్రిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పోటో విడుదల చేయటం జరిగిందని కాని ఇప్పటి పరిస్థితులు వేరని హండే తెలిపారు. ఫిజియోథెరఫీ వలన జయ త్వరితగతిన కోలుకుంటున్నారని, మరో వారం పది రోజుల్లో ఆమె ఆరోగ్యం మెరుగై పాలనా పగ్గాలు చేపడతారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు జయలలిత త్వరితగతిన కోలుకోవాలంటూ అన్నాడిఎంకె నేతలు, కార్యకర్తలు పూజలు, హోమాలు చేస్తున్నారు. జయలలిత గత 28 రోజులుగా చెన్నైలోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

 

బెంగళూరు హైవేను మూసివేసిన టి.కాంగ్రెస్ విద్యార్థి నేతలు..

శంషాబాద్ : తెలంగాణ విద్యార్థి గర్జన పేరిట శంషాబాద్ లో కాంగ్రెస్ నాయకులు బస్సులను అడ్డుకున్నారు. బెంగళూరు హైవేను మూసివేయడంతో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. దీనితో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. 

గోషామహల్ లో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం..

హైదరాబాద్ : గోషామహల్ లో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమం జరిగింది. హోం మంత్రి నాయినీ, డీజీపీ అనురాగ్ శర్మలు హాజరయ్యారు. 

కాసేపట్లో టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం..

హైదరాబాద్ : కాసేపట్లో టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జనచైతన్య యాత్ర పార్టీ సభ్యత నమోదుపై చర్చించనున్నారు. 

09:54 - October 21, 2016

నెల్లూరు : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం కొమ్మలపూడి దగ్గర గొర్రెల లోడుతో ఆగివున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసాపురం గ్రామానికి చెందిన భాస్కర్‌, వెంకయ్య, వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గొర్రెలు కూడా మృతి చెందాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

09:50 - October 21, 2016

కూకట్ పల్లిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

హైదరాబాద్ : కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బైక్ నుంచి పడి ఎంటెక్ విద్యార్థి మృతి చెందాడు. 

గ్వాలియర్ జూలో 15 పక్షులు మృతి

ఢిల్లీ : ఉత్తర భారత్ లోని పలు జూలలో ఫ్లూ విజృంభిస్తోంది. తాజాగా గ్వాలియర్ జూలో 15 పక్షులు మృతి చెందాయి. పక్షుల శాంపిల్స్ ను భోపాల్ లోని జబల్ పూర్ ల్యాబ్ కు తరలించారు. నిన్నటి వరకు ఢిల్లీ నేషనల్ జూలోనూ 20 పక్షులు మృతి చెందాయి. అధికారులు నేషనల్ జూను మూసి వేశారు. 

రామగుండంలో 7వ యూనిట్ లో విద్యుదుత్పత్తి నిలిపివేత

పెద్దపల్లి : రామగుండం ఎన్ టిపిసి 500 సామర్థ్యం గల 7వ యూనిట్ లో విద్యుదుత్పత్తి నిలిపి వేశారు. 

09:38 - October 21, 2016

దేశ రక్షణ రహస్యాలను లీక్ చేశాడని వరుణ్ గాంధీపై ఆరోపణలు నేపథ్యంలో అతనిపై విచారణ జరపాలని వక్తలు డిమాండ్ చేశారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత కైలాష్, బీజేపీ నేత ప్రకాశ్ గౌడ్, నవ తెలంగాణ ఎడిటర్ ఎస్. వీరయ్య పాల్గొని, మాట్లాడారు. విచారణ జరిపి వాస్తవాలను బయపెట్టాలన్నారు. వరుణ్ పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:32 - October 21, 2016

విజయవాడ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో పోలీసు అమరవీరులకు గవర్నర్‌ నరసింహన్‌ నివాళులర్పించారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ గ్రౌండ్‌లో పోలీసులు పరేడ్‌ నిర్వహించారు. గవర్నర్‌కు డీజీపీ సాంబశివరావు ఘన స్వాగతం పలికారు. 

 

మాచర్ల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ శ్రీదేవి ఆత్మహత్యాయత్నం

గుంటూరు : మాచర్ల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ శ్రీదేవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

09:28 - October 21, 2016

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అబిడ్స్‌ జీహెచ్‌ఎంసీ బిల్లు కలెక్టర్‌ నర్సింహారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు కోటికి పైగా అక్రమాస్తులు గుర్తించారు. సిద్ధిపేట జిల్లా నంగునూరి గ్రామంలో నర్సింహారెడ్డికి 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో 3 ఇళ్లు, 3 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. కూకట్ పల్లిలోని ఆయన నివాసంలో ఉన్న 90 తులాల బంగారు ఆభరణాలు, భారీగా వెండీ అభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు, లాకర్లు గుర్తించారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

09:14 - October 21, 2016

పోలీసులు ప్రజలతోమమేకమవ్వాలని రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రెడ్డన్న తెలిపారు. జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పోలీసుల నైపుణ్యం పెంచాలన్నారు. పోలీసు కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం తగదని హితవుపలికారు. 'ఇవాళ పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినం. ప్రతి ఏటా అక్టోబర్‌ 21న పోలీస్‌ అమరవీరుల దినోత్సవం నిర్వహించడానికి కారణం ఏమిటి? దీని ప్రాధాన్యత ఏమిటి? మారుతున్న కాలంలో వృత్తి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? పోలీసులు తమ బాధ్యతలు మరింత సమర్ధవంతంగా నిర్వహించాలంటే ప్రభుత్వం ఎ లాంటి సహకారం అందించాల్సిన అవసరం వుంది? ఇదే అంశంపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:01 - October 21, 2016

పోలీస్‌ వృత్తి అత్యంత బాధ్యతాయుతమైనదే కాదు కఠినతరమైనది కూడా. చలి, ఎండ, వాన, వరద ఇవేవీ పట్టించుకోకుండా , పండుగలు పబ్బాలు అని లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ  విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను నిత్యం మనం చూస్తూనే వున్నాం. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్న పోలీసులెందరో. అలాంటి వారిని సంస్మరించుకునే రోజే అక్టోబర్‌ 21.  
పోలీసులంటే మనలో చాలా మందికి భయం
పోలీసులంటే మనలో చాలా మందికి భయం. వారు మన దగ్గరకు వస్తున్నారంటే హడలిపోతుంటాం.  విధి నిర్వహణలో, శాంతి భద్రతల పరిరక్షణలో, ట్రాఫిక్‌ నియంత్రణలో  ఒక్కొక్కసారి కఠినంగా వ్యవహరిస్తుండడం, మరికొన్ని సందర్భాలలో నిబంధనలు అతిక్రమిస్తుండడం వల్ల పోలీసులంటే మన సమాజంలో కొన్ని రకాల అభిప్రాయాలు ఏర్పడిపోయాయి. 
విధి నిర్వహణలో అనేక కష్టాలు
కానీ, ఖాకీలంతా క్రౌర్యానికి ప్రతీకలే అనుకుంటే పొరపాటే. ఆ ఖాకీ దుస్తుల వెనక సున్నిత హృదయమూ దాగి వుంటుంది. వారికీ కన్నీళ్లుంటాయి. విధి నిర్వహణలో అనేక కష్టాలుంటాయి. వానొచ్చినా, వరదొచ్చినా, ఉప్పెనొచ్చినా తామే ముందు పరుగులు తీస్తారు. గొడవలైనా, ఘర్షణలైనా, కొట్లాటలైనా సమాచారం అందిన మరుక్షణమే అక్కడకు పరుగెత్తుతారు. పండుగలైనా, ఉత్సవాలైనా, సభలైనా, సంబరాలైనా, ఊరేగింపులైనా మేమున్నామంటూ బందోబస్తు డ్యూటీలకొస్తారు.  రోజుల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, ప్రాణాలకు తెగించి డ్యూటీ చేస్తున్నవారెందరో. 
పోలీసులకు నిర్ణీత డ్యూటీ వేళలంటూ వుండవు 
ఇతర ఉద్యోగులకు మాదిరిగా పోలీసులకు నిర్ణీత డ్యూటీ వేళలంటూ వుండవు. ఎప్పుడంటే అప్పుడు డ్యూటీకి  పరుగులు తీయాల్సిందే. తెల్లవారుఝామున డ్యూటీకి ఎక్కితే, ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరే పోలీసులెందరో. రోజుకి కనీసం 16 గంటలకు తక్కువ కాకుండా పనిచేసే పోలీసులు మన చుట్టూ ఎందరో వున్నారు. ఇన్ని గంటలపాటు ఒక్కొక్కసారి నిల్చొనే వుండాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో టాయ్‌లెట్స్‌కి వెళ్లలేని పరిస్థితుల్లో డ్యూటీ చేయాల్సి వుంటుంది. పొద్దస్తమానం నిల్చొనే డ్యూటీ చేయాల్సి వస్తుంది. నిత్యం దుమ్ము ధూళిలో గంటల తరబడి నిల్చొని పనిచేయడం వల్ల అనేకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. కొట్లాటలు, ఘర్షణలు, ఎన్‌ కౌంటర్‌ లు, మందుపాతర్ల పేలుళ్లల్లో ప్రాణాలూ కోల్పోతున్నారు. కొంతమంది పోలీసుల జీవితాలను దగ్గరగా వెళ్లి పరిశీలిస్తే ఆ ఉద్యోగమే ఒక శిక్షేమో అన్న వేదన మనల్ని ఆవహిస్తుంది. 
వీక్లీ ఆఫ్‌ లేదా వారంతపు సెలవు అన్నది అందని ద్రాక్షే 
బర్త్‌ డే, మ్యారేజ్‌ డే, పిల్లల పుట్టిన రోజు ఇలాంటి సందర్భాలలో కూడా సెలవు తీసుకోలేని, అడగలేని వాతావరణంలో అనేకమంది పోలీసులు పనిచేయాల్సి వస్తుంది. వీక్లీ ఆఫ్‌ లేదా వారంతపు సెలవు అన్నది పోలీసులకు అందని ద్రాక్ష పండుగానే వెక్కిరిస్తోంది. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలంటే ఇప్పుడున్న సిబ్బంది సరిపోరన్నది వాస్తవం. సిబ్బంది సంఖ్యను మరో 30 శాతం పైగా పెంచుకోవాల్సి వుంటుంది. అంటే పోలీసులు ఇప్పటికే తాము మోయాల్సిన బరువు కంటే 30 శాతం అదనంగా మోస్తున్నట్టే లెక్క.  కాబట్టి, పోలీసులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి ఒక్కరూ సానుభూతితో అర్దం చేసుకోవాలి. 

 

08:56 - October 21, 2016

ముంబై : బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన దంగల్‌ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. నితీశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమిర్‌ హరియాణాకి చెందిన మల్లయోధుడు మహావీర్‌ సింగ్‌ పోఘట్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆమిర్‌ భార్యగా సాక్షి తన్వర్‌, కూతుళ్లుగా ఫాతిమా సనా, షేక్‌సాన్యా మల్హోత్రాలు నటించారు. డిసెంబర్‌ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ట్రైలర్‌ను 5 గంటల వ్యవధిలోనే దాదాపు ఐదు లక్షల మంది వీక్షించారు. 

 

08:53 - October 21, 2016

హైదరాబద్ : నాలుగో రోజు సీపీఎం మహాపాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగింది. యాచారం, మంచాల మండలాల్లో దాదాపు ఇరవై కిలోమీటర్ల పాటు పలు గ్రామాల్లో సాగిన పాదయాత్రలో.. స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు తమ్మినేని. పలుచోట్ల తమ్మినేని పాదయాత్రకు విశేష స్పందన లభించింది. 
నేతలకు సమస్యలు విన్నవించిన ప్రజలు  
సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర నాల్గో రోజుకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నల్లవెల్లిలో పాదయాత్ర కొనసాగింది. యాత్ర చేస్తున్న నేతలకు ప్రజలు తమ సమస్యలు విన్నవించారు.  యాచారం మండలం మంతన్‌గౌరెల్లిలో ఫ్లోరైడ్‌ బాధితులతో తమ్మినేని మాట్లాడారు. మంతన్‌ గౌరెల్లిలో ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉంది. అధికారంలోకి రెండేళ్లయినా తెలంగాణ ప్రభుత్వం ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించకపోవడం సిగ్గుచేటని ఈ సందర్భంగా తమ్మినేని అన్నారు.  
ప్రజల సమస్యలు తెలుసుకున్న తమ్మినేని
ఉదయం నల్లబెల్లి నుంచి ప్రారంభమైన సీపీఎం పాదయాత్ర.. యాచారం మండలం మంతన్‌గౌరెల్లి,  మర్రిగూడెం మండలం వెలగపల్లి తండా , మంచాల మండలం లోయపల్లికి చేరుకుంది. లోయపల్లిలో సభ నిర్వహించి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు తమ్మినేని. 
తమ్మినేనితో తమ ఆవేదన చెప్పుకున్న బాధితులు   
ప్రతి గ్రామంలో బాధితులు తమ ఆవేదనను తమ్మినేనితో చెప్పుకున్నారు. డిండి ప్రాజెక్టు కింద వెలగపల్లి తండాలోని 3800 ఎకరాలు ప్రాజెక్టు కింద పోతోంది. 123 జీవో కింద బలవంతంగా భూములు లాక్కొన్నారు. ఎకరానికి 4.50 లక్షలు చెల్లించారు. వాళ్లంతా కూడా తమ్మినేనితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఆవేదన చెప్పుకున్నారు. 
నిర్వాసితులకు అండగా ఉంటాం : తమ్మినేని  
నిర్వాసితులు ధైర్యంగా పోరాడాలని, వారికి తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా తమ్మినేని నిర్వాసితులకు ధైర్యం చెప్పారు. జీవనోపాధి కోసం ఇక్కడి యువత పట్టణాలకు వలస వెళుతున్నా... ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు కల్పించడం లేదని ఆయన ప్రశ్నించారు. రెండుమూడు రోజుల్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను సీఎం కేసీఆర్‌కు వివరిస్తూ తమ్మినేని లేఖ రాశారు. 

 

నేడు సిమెంట్ పరిశ్రమలో మార్పులపై జాతీయ సదస్సు

హైదరాబాద్ : నేడు హెచ్ ఐసీపీలో సిమెంట్ పరిశ్రమలో తాజా మార్పులపై జాతీయ సదస్సు జరుగనుంది. 

నేడు పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం

హైదరాబాద్ : నేడు పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం. గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. 

 

08:24 - October 21, 2016

హైదరాబాద్ : తెలంగాణలో జిల్లాల సంఖ్యను భారీగా పెరగడంతో అధికార పార్టీ కొత్త జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఆయా జిల్లాల్లో పాలనా వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఇంచార్జ్ మంత్రులను నియమించేందుకు ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు.
జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను నియమించాలని ప్లాన్‌
పాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 31కి పెంచింది ప్రభుత్వం. అధికారుల ఏర్పాట్ల ప్రక్రియను ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రభుత్వం... రాజకీయ అంశాలపైనా దృష్టి పెడుతోంది. కొత్త జిల్లాల్లో రాజకీయాలు టీఆర్‌ఎస్‌ చుట్టే తిరిగేలా అధినేత మరోకొత్త వ్యూహానికి సిద్ధమవుతున్నారు. పార్లమెంటరీ కార్యదర్శులను గతంలో నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్... కోర్టు ఆదేశాలతో ఆ పదవులను రద్దు చేయాల్సి వచ్చింది. తాజాగా జిల్లాల సంఖ్య పెరగడంతో... ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వాల హయంలో మాదిరిగానే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా  ఇప్పుడు జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను నియమించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 
మంత్రివర్గంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న 17 మంది 
ప్రస్తుతం మంత్రివర్గంలో 17 మంది మంత్రులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మంత్రులందరికీ  మంత్రుల ప్రాతినిథ్యం లేని జిల్లాలకు ఇంచార్జ్ లుగా నియమించే కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాల విభజన ద్వారా కొత్త జిల్లాల్లో ఇంచార్జ్ మంత్రుల ఆధ్వర్యంలోనే పాలనా వ్యవహారాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు  సమీక్షలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాలకు ఇంచార్జ్ లుగా  మంత్రులను నియమిస్తే.....కొత్త జిల్లాల్లో కూడా పార్టీ పరంగా మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పాటు మంత్రులకు కేటాయించే అదనపు నిధుల ద్వారా అభివృద్ధి వైపు అడుగులు వేయవచ్చనే అభిప్రాయం నేతల్లో వినిపిస్తోంది.  

08:20 - October 21, 2016

విజయవాడ : రెండు సంవత్సరాల నుంచి సేకరించిన భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన సీపీఎం పొలిట్ బ్యూరో నేత రాఘవులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. భూసేకరణ పట్ల సీఎం చంద్రబాబు మొండి వైఖరికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 
    

08:17 - October 21, 2016

తూర్పుగోదావరి : జిల్లాలోని తొండంగి మండలంలో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ...ఇప్పటికే సీపీఎం, ప్రజాసంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టగా...తాజాగా ఐద్వా ఆధ్యర్యంలో మహిళలు పాదయాత్ర చేపట్టారు. దివీస్‌ ప్రభావిత ప్రాంతంలో 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 
ఐద్వా మహిళలు పాదయాత్ర 
తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ రోజురోజుకూ ఆందోళనలు పెరిగిపోతున్నాయి. దివీస్‌ను వ్యతిరేకిస్తూ... తొండంగి మండలం దివిస్‌ ప్రభావిత గ్రామాల్లో ఐద్వా మహిళలు పాదయాత్ర చేపట్టారు.. ఈ గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. పాదయాత్రగా వెళ్తున్న ఐద్వా నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 
గ్రామాల్లో 2 నెలలుగా 144 సెక్షన్ అమలు 
తొండంగి మండ‌లంలోని పంపాది పేట‌, దాన‌వాయిపేట ప‌రిసర గ్రామాల్లో 2 నెలలుగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉధృతం కావడంతో మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రం వరకూ పీఎస్‌లోనే ఉంచారు.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దివీస్‌ పరిశ్రమ ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని...ఐద్వానేతలు, మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే తీవ్రస్థాయిలో పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. 

 

08:13 - October 21, 2016
08:11 - October 21, 2016

విశాఖ : సబ్బవరంలో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు పెట్రోలియం హబ్‌గా మారుతుందని చెప్పారు. విశాఖ జిల్లాలోని వంగలిలో పెట్రోలియం యూనివర్శిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా.. పెందుర్తి టీడీపీలో వర్గ విభేదాలు ఒక్క సారిగా బయటపడ్డాయి. అంతకుముందు వంగలి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్శిటీకి వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 
పెట్రోలియం హబ్‌గా మారనున్న రాజమండ్రి 
ఏపీలో పుష్కలంగా వనరులున్నాయని, భవిష్యత్‌లో విశాఖ..రాజమండ్రి పెట్రోలియం హబ్‌గా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలిలో పెట్రో యూనివర్శిటికీ సీఎం శంకుస్థాపన చేశారు. పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతో ఏపీని తిరుగులేని శక్తిగా మారుస్తామని చంద్రబాబు అన్నారు. జులై 2017 నాటికి ఏపీలో వందశాతం గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. నాలుగైదేళ్లలో ఏపీ ముఖచిత్రం మారిపోతుందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పెట్రోలియం వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. మోదీ, చంద్రబాబు జోడీతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశారు. 
వంగలి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత 
యూనివర్సిటీ శంకుస్థాపనకు ముందు వంగలి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీకి వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బలవంతపు భూసేకరణను నిరసిస్తూ ఇళ్లపై నల్ల జెండాలను ఎగురవేశారు. నిరసన తెలుపుతున్న సీపీఎం నేతలను, గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేశారు. 
టీడీపీలో వర్గ విభేదాలు 
పెట్రోలియం వర్సిటీకి శంకుస్థాపన జరుగుతుండగా పెందుర్తి టీడీపీలో వర్గ విభేదాలు ఒక్క సారిగా వెలుగులోకి వచ్చాయి. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తమను వేదిక మీదకు పిలవకుండా... కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని... టీడీపీలోకి కొత్తగా చేరిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అరోపించారు. ఈ వ్యవహారంపై తాను పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానన్నారు. 
పెట్రోయూనివర్సిటీ శంకుస్థాపనలో ఉద్రిక్తతలు
విశాఖజిల్లా సబ్బవరంలో జరిగిన పెట్రోయూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమం ఉద్రిక్తలకు వేదికైంది. ఇటు సీపీఎం పార్టీ ఆందోళన చేపట్టగా..అటు పెందుర్తి టీడీపీ వర్గంలో వివాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు స్పందించి ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. 

07:56 - October 21, 2016

హైదరాబాద్ : బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో తదుపరి ఏం చేయాలన్న దానిపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఇవాళ జరిగే కేబినెట్‌ భేటీలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నారు. ఇటు నూతన సచివాలయ నిర్మాణం, పన్నులకు సంబంధించిన పలు అంశాలు,  వైద్య, ఆరోగ్యశాఖలోని వైద్యవిధాన పరిషత్‌లో పలు పోస్టుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. 
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై కేబినెట్‌లో చర్చ
కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యనే జరగాలని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణ గురించి ఆలోచిస్తోంది. నీటి విషయంలో ఏం చేయాలన్నదానిపై అన్ని విధాలుగా చర్చించి ఒక నిర్ణయానికి రావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ క్యాబినెట్ సమావేశంలో దీనిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా.. కృష్ణా జలాల పునఃపంపిణీపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతోపాటు కొత్త సచివాలయ నిర్మాణం, తదితర 20 వరకు అంశాలను చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
కొత్త జిల్లాల్లో అభివృద్ధి పనుల పర్యవేక్షణపై చర్చ
ఇటు జిల్లాల ఏర్పాటు తరువాత కొత్త జిల్లాల్లో అభివృద్ధి పనుల పర్యవేక్షణ ఎలా ఉంది? కొత్త కలెక్టర్లు, ఎస్పీల పనితీరు ఎలా ఉంది? అనే అంశాలపై మంత్రుల నుంచి ముఖ్యమంత్రి ఫీడ్‌బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో స్వల్ప మార్పులు, చేర్పులకు సంబంధించిన అంశాలపైనా చర్చించనున్నారు. కొన్ని కొత్త ఉద్యోగ నియామకాల అంశం కూడా ప్రస్తావనకు రానుంది. 
కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లపై చర్చ
కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు తదితర అంశాలపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. తాత్కాలికంగా సచివాలయ కార్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాలపై కూడా చర్చించనున్నారు. ఆయా స్థలాలను ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జీఏడీ ముఖ్యకార్యదర్శి అధర్‌సిన్హా, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, పంచాయతీరాజ్ కమిషనర్, సెర్ప్ సీఈవో నీతూకుమారి ప్రసాద్ పరిశీలించారు. సీఎస్ రాజీవ్‌శర్మ వీటిపై మంత్రిమండలి సమావేశానికి పూర్తిస్థాయి నివేదికను ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఆధారంగా కార్యాలయాల తరలింపుపై నిర్ణయం తీసుకుంటారు. 
వైద్యవిధాన పరిషత్‌లో పలు పోస్టుల ఏర్పాటుపై నిర్ణయం 
ఇవాళ జరిగే క్యాబినెట్ సమావేశంలో.. నీటిపారుదల శాఖలో 39 డీఈఈ, 24 ఈఈల పోస్టుల ఏర్పాటు, మైనారిటీ సంక్షేమంలో భాగంగా విద్యాసంస్థల నిర్మాణానికి అనుగుణంగా చంచల్‌గూడ జైలులోని ఖైదీలను చర్లపల్లి, వరంగల్ సెంట్రల్ జైళ్లకు తరలించడం, అసెంబ్లీలో ఒక డైరెక్టర్ పోస్టును సృష్టించడం, వైద్య, ఆరోగ్యశాఖలోని వైద్యవిధాన పరిషత్‌లో పలు పోస్టుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.

 

విజయవాడలో పోలీసుల అమరవీరుల దినోత్సవం

కృష్ణా : విజయవాడలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ హాజరైయ్యారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్ నరసింహన్, డీజీపీ సాంబశివరావు నివాళులర్పించారు. 

 

నేడు లాసెట్ కమిటీ సమావేశం

హైదరాబాద్ : నేడు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో లాసెట్ కమిటీ సమావేశం జరుగనుంది. మూడేళ్లు, ఐదేంల్ల న్యాయ విద్యా కళాశాలల్లో కౌన్సెలింగ్ తేదీల ఖరారుపై చర్చించనున్నారు. 

కూకట్ పల్లిలో ఏసీబీ దాడులు

హైదరాబాద్ : కూకట్ పల్లిలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆబిడ్స్ జీహెచ్ ఎంసీ బిల్ కలెక్టర్ నర్సింహారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. రూ.కోటికి పైగా అక్రమ ఆస్తులను గుర్తించారు. 

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం సమావేశం

హైదరాబాద్ : నేడు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం సమావేశం జరుగనుంది. కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు, సచివాలయ తరలింపు వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.

Don't Miss