Activities calendar

22 October 2016

ఆరో రోజు ముగిసిన సీపీఎం మహాజన పాదయాత్ర

రంగారెడ్డి : సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఆరో రోజు ముగిసింది. అబ్దుల్లాపూర్ మెట్ లో పాదయాత్ర ముగిసింది. ఇవాళ 26.4 కిమీ మేర నడిచారు. మొత్తం 100 కిలో మీటర్ల పైగా మేర పాదయాత్ర చేశారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర బృందంతో తమ్మినేనితోపాటు ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. ఈనెల 17న ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ పాదయాత్రను ప్రారంభించారు. 
 

22:07 - October 22, 2016

ఇది పాత కక్షలు కాదు.. తరతరాలుగా కొనసాగుతున్న ప్యాక్షనిజం కాదు. ఓ రెండు కటుంబాల మధ్య రగిలిచ్చిన చిచ్చు. దశాబ్ధం క్రితం వరకు ఆ రెండు కుటుంబాలు సాధారణ జీవితం కోసం వలసవచ్చినవి. అమాయకుల్లోని మూఢనమ్మకాలను క్యాష్ చేసుకున్నారు. రూపాయి నోట్ల నుంచి డాలర్లు సంపాదించే స్థాయికి ఎదిగారు. ఆ కటుంబాల మధ్య ఉన్న ప్రేమానురాగాలు వారి ఎన్నో ఏళ్ల సానిహిత్యం, ఇలా మొదలైన వారిలో డబ్బు అహంకారాన్ని పెంచింది. ఆస్తులు వారిని రాక్షసులుగా మార్చేశాయి. ఆ రెండు కుటుంబాల్లోని పిల్లల ప్రేమ.. పెద్దల మధ్య పంతానికి దారి తీసింది. అవే కక్షలు, పగ, ప్రతీకారంగా మారి దశాబ్ధం కాలంగా రక్త పాతం సృష్టిస్తోంది. ఆ పల్లెలో అసలేం జరుగుతోంది...? ఇదీ కథ కాదు.. రియల్ స్టోరీ.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

తాండూరు కస్తూర్బా గురుకుల పాఠశాలలో నలుగురు విద్యార్థులు అదృశ్యం

రంగారెడ్డి : తాండూరు కస్తూర్బా గురుకుల పాఠశాలలో 2 రోజుల క్రింతం నలుగురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. విద్యార్థినుల అదృశ్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. వార్డెన్, వాచ్ మెన్, ఇద్దరు టీచర్లను కలెక్టర్ సస్పెండ్ చేశారు.

21:47 - October 22, 2016

ఢిల్లీ : కబడ్డీ ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. ఎనిమిదో సారి కబడ్డీ ప్రపంచకప్ ను సొంతం చేసుకుంది. 38..29 తేడాతో ఇరాన్ పై గెలుపొందింది. ఫైనల్ లో 38..29 తేడాతో ఇరాన్ పై విజయం సాధించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

త్వరలో అంబేద్కర్ జాబ్ మేళా : మంత్రి రావెల

విజయవాడ : ఈనెల 24 నుంచి 31 వరకు అంబేద్కర్ జాబ్ మేళాను త్వరలో నిర్వహిస్తామని మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. 

 

21:42 - October 22, 2016

హైదరాబాద్ : సినిమా రంగానికి, డ్రగ్స్ వ్యాపారానికి ఉన్న సంబంధం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ నగరంలో ఒక డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. జీడిమెట్ల పోలీసులు ఇద్దరిని అరెస్టుచేసి, వారి నుంచి కిలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒక సినీనిర్మాత, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో నెల్లూరు జిల్లాలో మరోవ్యక్తిని అరెస్టుచేసి, అతడి వద్ద నుంచి కిలోన్నర కిటామైన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం డ్రగ్స్ విలువ రూ. 6 కోట్లని అంచనా వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:40 - October 22, 2016

హైదరాబాద్ : బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ తీర్పుపై సుప్రీంకు వెళ్లడమే మంచిదనే అభిప్రాయంలో తెలంగాణ స‌ర్కారు ఉంది. ట్రిబ్యున‌ల్ తీర్పుపై హరీష్‌రావు ఆధ్వర్యంలో మంత్రివ‌ర్గ ఉపసంఘం స‌చివాల‌యంలో భేటీ అయింది. సుమారు రెండు గంటలపాటు తీర్పుపై చర్చించారు. న్యాయనిపుణుల సలహా మేరకు భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ నెల 29న మరోసారి భేటీ కావాలని ఉపసంఘం నిర్ణయించింది. 
ట్రిబ్యునల్ తీర్పుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
కృష్ణా జలాల పంపిణీ విషయంలో బ్రిజేష్‌ కుమార్ ట్రిబ్యున‌ల్ తీర్పుపై తదుపరి చ‌ర్యల కోసం ఏర్పడిన మంత్రివ‌ర్గ ఉపసంఘం స‌మావేశ‌మైంది. ట్రిబ్యున‌ల్ తీర్పు వ‌ల్ల తెలంగాణ‌కు జ‌ర‌గుతున్న అన్యాయంపై క‌మిటీ చ‌ర్చించింది. మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు, అధికారులతో పాటు నీటిపారుదల రంగ నిఫుణులు.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రవీందర్ రావును కూడా సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని నిర్ణయం
ట్రిబ్యున‌ల్ ముందు వాద‌నలు వినిపించ‌డం కంటే సుప్రీంకు వెళ్లడ‌మే మంచిద‌నే అభిప్రాయానికి వచ్చిన‌ట్టు స‌మాచారం. సుప్రీంకు ఒంట‌రిగానే వెళ్లాలా లేక ఏపీతో క‌లిసి వెళ్లాల‌నే దానిపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఏపీతో కలిసి వెళ్లడం మంచిది కాదనే అభిప్రాయాలు వచ్చాయి. సుప్రీంకు వెళ్లేముందు గ‌తంలో ట్రిబ్యున‌ల్ తీర్పుపై విభేదించిన రాష్ర్టాలు ఏమైనా ఉన్నాయా అని చర్చించింది. ఈ మేరకు న్యాయనిపుణుల సలహా తీసుకోనుంది.
ఈ నెల 29న మరోసారి భేటీ కావాలని నిర్ణయం
ఇందుకోసం ఈ నెల 29వ తేదీన మరోమారు సమావేశం కావాలని ఉపసంఘం నిర్ణయించింది. ఆ రోజు జరిగే భేటీకి సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్ హాజరుకానున్నారు. వైద్యనాథన్ సలహామేరకు భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. 

 

21:35 - October 22, 2016

మూర్ఖత్వానికి మతం లేదు.. మానవత్వంతో పనేలేదు. బంధుప్రీతి మూర్ఖత్వానికి అస్సలుండదు. స్వార్థమనే పిశాచి రెక్కలపై ఊరేగుతూ.. వీర విహంగం చేస్తూ...విధ్వంసాన్ని సృష్టించాలన్న ఒక్క తపన తప్ప.. స్వార్థంతో శాంతిని పొందలేం, మూర్ఖత్వంతో మనషుల ప్రాణాలు కాపాడలేం. ప్రపంచంలో రోజు రోజుకీ పెరిపోతున్న నేరాలెన్నో, ఘోరాలెన్నో.. వాటికి బలైపోతున్న అమాయక ప్రాణాలెన్నో.. డబ్బు, డబ్బు...డబ్బు.. డబ్బు మబ్చులో తన, మన అనే బేధం లేకుండా 
కర్కశంగా ప్రవర్తించి.. నమ్మినవారినే మోసం చేస్తూ.. వారి కన్నీటీ కారకలవుతున్న నీచులెందరో మన సమాజంలో మనతోపాటే బతుకుతున్నారు. ఆస్తికోసం జరిగిన ఒక పోరులో యుద్ధ రంగంగా మారింది. ఆ పోరాటంలో ఎవరు చనిపోయారు. తెలుసుకుందాం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

కబడ్డీ వరల్డ్ కప్ విజేత భారత్

ఢిల్లీ : కబడ్డీ ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. ఎనిమిదో సారి కబడ్డీ ప్రపంచకప్ ను సొంతం చేసుకుంది. ఫైనల్ లో 38..29 తేడాతో ఇరాన్ పై భారత్ గెలుపొందింది.

21:19 - October 22, 2016

సర్కార్ సర్వే మీద సురువైన అసలు సర్వే.. డూబ్లికేటని తేలితే పోతదిగద సారు పరువే, గవర్నర్ ను గాయి గాయి జేస్తున్న విలేకర్లు.. నర్సిమన్ సారు ఉన్నంనాళ్లు బేఫికర్, హైదరాబాద్ తాగుబోతుల అద్బుత శ్రమ.. ఇసొంటోళ్లను మనం పూజించుకోలేమా.., వారణాసి ఆడవిల్లకు పేరు వెట్టిన మోడీ సారు.. ఇష్టం లేదన్నట్లు ఏడ్సుకుంట సెప్పింది సారి, 97 మంది పెండ్లాలు.. 185 మంది పిల్లలు... నైజీరియా దేశంల నడుస్తున్న ఒక్కటే సంపారం, తాబేళ్ల అరెస్టు జేసి తెచ్చిన అడవీ ఆఫీసర్లు..అక్రమంగా తరలిస్తున్నారని అనుమానాలు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

జీడిమెట్లలో వాహన తనిఖీలు

హైదరాబాద్ : జీడిమెట్లలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. డ్రగ్స్ ముఠా పట్టుబడ్డారు. ఇద్దరు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కిలోన్నర కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం డ్రగ్స్ విలువ రూ.6 కోట్లు ఉంటుందని అంచన వేశారు. అరెస్లైన వారిలో సినీ నిర్మాత, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. నిందితుల సమాచారంతో నెల్లూరులో మరొకరిని అరెస్టు చేశారు. 

 

20:41 - October 22, 2016

నంద్యాల వద్ద భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు

కర్నూలు : నంద్యాల వద్ద భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. కుందూనది సమీపంలో రైల్వే ట్రాక్ కుంగింది. గత రెండు గంటలుగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు అప్రమత్తతో ప్రమాదం తప్పింది. 

20:30 - October 22, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం త్వరితగతిన మెరుగుపడుతోంది. మరో 10 రోజుల్లో అమ్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరీ జయను పరామర్శించారు. అమ్మ త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల పూజలు కొనసాగుతున్నాయి.
31 రోజులుగా చికిత్స పొందుతున్న జయ
31 రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను తాత్కాలిక గవర్నర్‌ విద్యాసాగర్‌రావు పరామర్శించారు. గవర్నర్‌ జయను పరామర్శించడం ఇది రెండోసారి. రాష్ట్ర మంత్రులు, అపోలో  వైద్యులు జయ ఆరోగ్య పరిస్థితిని గవర్నర్‌కు వివరించారు. ఆమె త్వరితగతిన కోలుకుంటున్నారని, త్వరలోనే ఆస్పత్రి నుంచి జయను డిశార్జ్ చేయవచ్చని వస్తున్న వార్తల నేపథ్యంలో గవర్నర్‌ ఆసుపత్రికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  విద్యాసాగర్‌ రావు రాజ్ భవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితులు, పాలనా సంబంధమైన అంశాలపై చర్చించారు.
జయను పరామర్శించిన టీటీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు అపోలో ఆసుపత్రిలో జయలలితను పరామర్శించారు. జయను పరామర్శించిన వారిలో కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీలు మురళీ మోహన్‌, సీఎం రమేశ్‌ తదితరులున్నారు. జయలలిత ఆరోగ్యం 95శాతం మెరుగుపడిందని, 10 రోజుల్లో డిశ్చార్జ్‌ అవుతారని వైద్యులు చెప్పినట్లు సుజనాచౌదరి తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అవసరమన్నారు.
జయలలిత హెల్త్ బులిటెన్ విడుద‌ల 
జ‌య‌ల‌లిత మాట్లాడుతున్నార‌ని, ప్రస్తుతం ఆమెకు కృత్రిమ శ్వాసతో పాటు, ఫిజియో థెరపీని కొనసాగిస్తున్నట్లు అపోలో వైద్యులు శుక్రవారం బులిటెన్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈనెల 27న ఆమెను డిశార్జ్ చేసే అవకాశాలున్నట్లు వచ్చిన వార్తలను అపోలో వైద్యులు తోసిపుచ్చినట్లు సమాచారం. దీపావళికి ఆమె ఆస్పత్రిలోనే ఉండే అవకాశాలున్నాయి.
జయ త్వరగా కోలుకోవాలని అన్నాడిఎంకె నేతలు పూజలు 
మరోవైపు అమ్మ త్వరితగతిన కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్నాడిఎంకె నేతలు, కార్యకర్తలు పూజలు, హోమాలు, యాగాలు, సామూహిక ప్రార్ధనలు కొనసాగిస్తున్నారు. జయ అభిమానులు మైసూర్‌లోని చాముండేశ్వరి ఆలయానికి కోటి 60 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, విగ్రహాలను సమర్పించారు.
ట్రాఫిక్‌ రామస్వామి, ఫాతిమాలపై కేసు నమోదు 
జయలలిత ఆరోగ్యంపై పుకార్లు సృష్టించిన ట్రాఫిక్‌ రామస్వామి, ఫాతిమాలపై కేసు నమోదు చేశారు. ఈ విషయంలో ఇప్పటికే 8 మందిని అరెస్ట్‌ చేశారు. మరో 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

20:19 - October 22, 2016

ఢిల్లీ : భారతీయ బ్యాంకులపై పాకిస్తాన్‌ సైబర్ నేరగాళ్లు దాడులు జరిపే అవకాశాలున్నాయని కేంద్రం హెచ్చరించింది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సైబర్ భద్రతా సంస్థ ఓ నోటీసు జారీచేసింది. పాకిస్తాన్‌కు  చెందిన సైబర్ క్రిమినల్స్- బ్యాంకుల సమాచారాన్ని, మౌళిక సదుపాయాలను టార్గెట్ చేశారని బ్యాంకులకు కేంద్ర సైబర్ భద్రతా సంస్థ తెలిపింది. సైబర్ భద్రతా ఏజెన్సీ, కేంద్ర సెంట్రల్ బ్యాంకు ఆర్బీఐతో కలిసి పనిచేస్తోంది. రెండు రోజుల క్రితం భారతీయ బ్యాంకుల్లో జరిగిన భద్రతా ఉల్లంఘన కారణంగా 32 లక్షల అకౌంట్ల డెబిట్ కార్డుల సమచారం నేరగాళ్ల చేతికి వెళ్లిందని తేలింది. డెబిట్ కార్డుల దొంగతనంపై స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ వంటి వివిధ బ్యాంకులకు కేంద్రం నోటీసులు జారీచేసి నివేదిక కోరిన విషయం తెలిసిందే.

20:16 - October 22, 2016

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఉగ్రవాదులను సఫీర్‌ అహ్మద్‌ భట్, ఫర్హాన్‌ ఫయాజ్‌లుగా గుర్తించారు.  వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి, ఏకే 47తో సహా ఓ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్ట్‌ 16న బారాముల్లాలో సైనిక పోస్టులపై జరిపిన దాడులతో వీరికి సంబంధముందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు జమ్మూలోని చంగియాలో పాకిస్తాన్‌కు చెందిన గూఢచారిని భద్రతా దళాలు అరెస్ట్‌ చేశాయి. ఇతడు భారత ఆర్మీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి భారత్‌ జరిపిన ఎదురు దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఏడుగురు రేంజర్లు మృతి చెందిన నేపథ్యంలో పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. ఆర్‌ఎస్ పుర సెక్టార్లో పాక్‌ జరిపిన కాల్పులను భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. 

 

20:14 - October 22, 2016

ముంబై : 'యే దిల్‌ హై ముష్కిల్‌' రొమాంటిక్ సినిమా విషయంలో కొద్ది రోజులుగా కొనసాగిన సస్సెన్స్‌కు తెరపడింది. ఓ సినిమా విడుదల కావాలంటే సెన్సార్ బోర్డు అనుమతి తప్పనిసరి. కానీ ఈ సినిమా విడుదలకు మాత్రం ఓ సిఎం, ఓ పార్టీ నేత అనుమతితో విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని అడ్డంకులను అధిగమించిన 'యే దిల్‌ హై ముష్కిల్‌' దీపావళి ముందు విడుదలకు సిద్ధమైంది.
దేవేంద్ర ఫడ్నవిస్‌ నివాసంలో కీలక భేటీ 
బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ రూపొందించిన 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ చిత్రం విడుదలకు సంబంధించి ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ నివాసంలో కీలక భేటీ జరిగింది. సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేనచీఫ్ రాజ్ థాక్రేతో పాటు దర్శక నిర్మాతలు  కరణ్ జోహార్‌, సాజీద్‌ నడియావాలా, సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌, ముఖేష్ భట్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సినిమా ప్రారంభానికి ముందు ఉరీ ఉగ్రదాడిలో చనిపోయిన అమరజవాన్లకు నివాళులు అర్పిస్తూ ప్రకటన ఇవ్వడం,   పాక్‌ నటీనటులతో మరోసారి కలిసి పనిచేయబోమని చిత్ర నిర్మాతలు హామీ ఇవ్వడంతో  సినిమా విడుదలకు లైన్‌ క్లియరైనట్లు ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ అధ్యక్షుడు ముఖేష్‌ భట్‌ తెలిపారు.
ఎంఎన్‌ఎస్‌ మరో కొత్త డిమాండ్‌
'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలను అడ్డుకోమన్న ఎంఎన్‌ఎస్‌ మరో కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. పాకిస్థాన్ నటులతో సినిమాలు తీసే ప్రతి ఒక్క నిర్మాత 5 కోట్లు సైనిక సహాయ నిధికి  ఇవ్వాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. 
విడుదలకు అన్ని చ‌ర్యలు : రాజ్ నాథ్ సింగ్  
'యే దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్యలు తీసుకుంటామ‌ని ముఖేష్‌ భట్‌ నేతృత్వంలోని నిర్మాత‌ల సంఘానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హామీ ఇచ్చారు. ముంబైలో పర్యటించిన రాజ్‌నాథ్‌సింగ్‌  సిఎం ఫడ్నవిస్‌తో మాట్లాడి పరిస్థితిపై సమీక్షించారు. దీపావళి పండగ నేపథ్యంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమాకు రక్షణ కల్పించాలని సిఎంకు సూచించారు. సినిమా విడుదలను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఫడ్నవిస్ ఇంతకుముందే ప్రకటించారు.
సినిమా రిలీజ్‌ను అడ్డుకోవ‌ద్దు : క‌ర‌ణ్ జోహార్  
పాక్ న‌టుడు ఫ‌వ‌ద్ ఖాన్ న‌టించిన కార‌ణంగా సినిమాను అడ్డుకుంటామ‌ని, థియేటర్లపై దాడులు చేస్తామని మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో దర్శకుడు కరణ్‌జోహర్‌ తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. నాకు మన దేశం తప్ప ఏది ముఖ్యం కాదని, భ‌విష్యత్తులో మ‌ళ్లీ పాకిస్థాన్ న‌టుల జోలికి వెళ్లన‌ని, ఈ సినిమా రిలీజ్‌ను మాత్రం అడ్డుకోవ‌ద్దని క‌ర‌ణ్ జోహార్  ప్రాధేయ‌ప‌డాల్సి వచ్చింది. 
ఈనెల 28న విడుదల
కరణ్‌ జోహర్‌ 'యే దిల్ హై ముష్కిల్' సినిమా అక్టోబ‌ర్ 28న విడుదల కాబోతుంది. బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌ కపూర్‌, అనుష్క శర్మ, ఐశ్వర్యారాయ్‌లతో పాటు పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించారు.

20:10 - October 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామకాల కోసం..  ఫైనల్‌ పరీక్ష రేపు జరగనుంది. దీనికోసం తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ప్రిలిమినరీ రాత పరీక్షతో పాటు ఫిజికల్‌ ఎలిజిబిలిటీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఫైనల్‌ పరీక్ష కోసం సిద్ధమయ్యారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామకాల కోసం..  ఫైనల్‌ పరీక్ష ఆదివారం జరగనుంది. 
మొత్తం 9 వేల 281 పోలీస్ కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి ఇప్పటికే ప్రిలిమినరి రాత పరీక్షను నిర్వహించింది. ఇందులో పాసైన అభ్యర్థులకు ఫిజికల్ ఎలిజిబిలిటి పరీక్షలు నిర్వహించింది. ఈ రెండు పరీక్షల్లో 81 వేల 5 వందల 23 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి  రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఫైనల్‌ పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 153 ఎగ్జామ్ సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల్లోపే సెంటర్స్‌కు చేరుకోవాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ సూచించింది. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థుల్ని పరీక్షకు అనుమతించమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హాల్ టికెట్‌, ఫొటో ఉన్న ఐడెంటీటి కార్డ్‌ను వెంట తెచ్చుకోవాలని అభ్యర్థులకు సూచించారు. పరీక్షలో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయోమెట్రిక్‌లో అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తర్వాతే ఎగ్జామ్‌కు అనుమతించనున్నారు. 

19:53 - October 22, 2016
19:52 - October 22, 2016

గుంటూరు : జిల్లాలోని నరసరావుపేట ఎస్ ఎస్ ఎన్ కాలేజ్ లో జాబ్ మేళా జరిగింది. స్పీకర్  కోడెల శివ ప్రసాద్ రావు అధ్వర్యంలో  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, డా..కోడెల సత్యనారాయణ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 8 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.  చదువు పూర్తయిన విద్యార్ధులకు కంపెనీలను అప్రోచ్ కాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ... అలాంటి వాళ్లకు ఇదొక మంచి అవకాశమని స్పీకర్ కోడెల తెలిపారు. 

 

19:50 - October 22, 2016

గుంటూరు : గదులు లేవు..ఫ్యాన్లు లేవు..సరిపడా బెడ్‌లు అసలే లేవు.. స్టోర్‌ రూమ్‌లలో అటకెక్కిన బెడ్‌లు..ఆరుబయట వైద్యం..వరండాలలో రోగుల పడిగాపులు.. వెళ్లగానే ఆ ఆస్పత్రిలో కనబడే దృశ్యం. రాజధాని ప్రాంతంలో ప్రజలకు అందుతున్న వైద్యం తీరు ఇది.  
29 గ్రామాలకు అందని వైద్యం
ఏపీ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన 29 గ్రామాల ప్రజలకు.. కనీస వైద్య సదుపాయం కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. వెయ్యి కోట్లతో తాత్కాలిక సచివాలయం ఏర్పాటుకు ఎక్కడలేని ఉత్సాహం చూపిన ప్రభుత్వం, ఈ   ప్రాంతంలో ఉండే పేదల వైద్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. తుళ్లూరు చుట్టుపక్కల దాదాపుగా 15కుపైగా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు అన్నిటికి కలిపి  ఒకే ఒక్క ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉంది.
ఆరుబయటే వైద్యం
తుళ్లూరులో ఎనిమిది పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 1964 సంవత్సరంలో చెన్నారెడ్డి ఆర్థిక, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించారు. అప్పటి భవనంలో ఇప్పటికీ వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. అయితే ఆస్పత్రికి వెళ్లి చూస్తే ఎనిమిది పడకలు ఆరు బయట వరండాలో దర్శనిమిస్తాయి. ఆస్పత్రిలో కనీసం గదులు కూడా లేవు. అంతేకాదు రోగులకు చెట్టుకింద  వైద్యం అందిస్తున్నారు. ఇక ఇక్కడకి కాన్పుల కోసం వచ్చే రోగుల పరిస్థితి అయితే మరింత దయనీయం. కాన్పులకోసం వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఎలాంటి గదులు ఉండవు. కాన్పు అయిపోయిన తర్వాత వరండాలో ఉన్న మంచం మీదే తల్లి, బిడ్డ సేద తీరాలి. 
ఒక్కో బెడ్‌పై ఇద్దరిద్దరు పిల్లలు
కాన్పులు కేసులు ఎక్కువైతే.. ఒక్కో బెడ్‌ మీద ఇద్దరిద్దరు పిల్లలు పడుకోవాల్సి వస్తుంది. దీనికి తోడు అక్కడ కనీసం ఫ్యాన్లు కూడా లేవు. ఎమర్జెన్సీలో అందించేందుకు ఆక్సిజన్‌ లేదని..ఇద్దరు వైద్యుల్లో ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉంటారని స్థానికులు చెబుతున్నారు. చాలా కాలం నుంచి ఇక్కడ పరిస్థితి ఇలానే ఉందని.. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. పేరుకే రాజధాని తప్ప, ఇక్కడ ఒక్క సదుపాయం కూడా లేదని అంటున్నారు.
అందుబాటులో ఉండని ఆస్పత్రి సిబ్బంది
పీహెచ్‌సీలో మొత్తం ఇద్దరు డాక్టర్లు..ముగ్గురు స్టాఫ్‌ నర్సులు.. ఇతర సిబ్బంది ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో 11 గ్రామాల్లోని సబ్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అయితే వీరంతా ఎప్పుడు అందుబాటులో ఉంటారో ఎవరికి తెలియదు. ఇద్దరు డాక్టర్లు ఉండాల్సిన సమయంలో ఒకరే డాక్టర్‌ ఉంటారు. దీంతో రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి.  సబ్‌ సెంటర్లలో పూర్తిస్థాయిలో ఏఎన్‌ఎంలు  లేరు. 
30 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
మరోవైపు తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరిపడా సిబ్బంది ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. పీహెచ్‌సీకి ఇంతకంటే ఎక్కువ మంది స్టాఫ్‌ ఉండరని అంటున్నారు. కాగా ఇదే ప్రాంతంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి, ఈ ఏడాది ఉగాది రోజున మంత్రి కామినేని శ్రీనివాస్‌ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి పదినెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి స్వయంగా చెప్పారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా గాని టెండర్లు ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. 

 

డిసెంబర్ 16న దళిత్ ర్యాలీ : నారాయణ

హైదరాబాద్ : దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా డిసెంబర్ 16న హైదరాబాద్ లో దళిత్ ర్యాలీ ఉంటుందని సీపీఐ నేత నారాయణ అన్నారు. నయీం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్నారు. నయీం కేసులో 1996 నుంచి ఇప్పటి వరకు పని చేసిన సీఎంలు, హోంమంత్రులు, డీజీపీలకు నార్కో టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. 

ప్రజల దృష్టి మరల్చేందుకే తప్పుడు సర్వేలు : సంపత్

హైదరాబాద్ : ప్రజల దృష్టిని మళ్లించేందుకే పాలనపై సీఎం కేసీఆర్ తప్పుడు సర్వేలు చేయిస్తున్నారని కాంగ్రెస్ నేత సంపత్ ప్రజలను మభ్యపెట్టడానికే కేసీఆర్ సర్వే రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రెగ్యులైజ్ జీవోలతో ఎమ్మెల్యేలను లోబరుచుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డిలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టారని పేర్కొన్నారు. 

19:23 - October 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ కమిషన్ చైర్మన్ గా సామాజికవేత్త జీఎస్ రాములును నియమించారు. బీసీ కమిషన్ చైర్మన్ ను నియమిస్తూ ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. కమిషన్ సభ్యులుగా రచయిత జూలూరి గౌరీ శంకర్, వకుళాభరణం కృష్ణమోహన్, విద్యార్థి నేత ఆంజనేయులు గౌడ్ ఎన్నికయ్యారు. కమిషన్ సభ్య కార్యదర్శిగా బీసీ వెల్ఫేర్ కమిషనర్ ను నియమించారు. బీసీ కమిషన్ చైర్మన్ పదవీకాలం మూడేళ్లుగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

19:15 - October 22, 2016

అనంతపురం : జిల్లాలోని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ బుల్లెట్ బైక్ ని నడిపి సందడిచేశారు. బాలయ్య స్వయంగా బుల్లెట్‌ నడుపుతూ.. అభిమానులకు అభివాదం చేస్తూ అలరించారు.  రెండో రోజు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పట్టణంలోని పాండురంగనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ మున్సిపల్‌ పార్క్‌ను ప్రారంభించారు. పార్క్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. అనంతరం కెరికెర బసవనపల్లిలోని ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.39లక్షలతో నిర్మించిన నూతన భవనాలను బాలకృష్ణ ప్రారంభించారు. 

19:14 - October 22, 2016

విజయవాడ : మోనిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు నివాసంలో చంద్రబాబుతో సింగపూర్ బృందం భేటీ అయింది. ఈ ఒప్పందం కింద... విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల యువతకు ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు పెరగనున్నాయని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. 

 

19:10 - October 22, 2016

కర్నూల్ : జిల్లా నంద్యాల వద్ద భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కుందూనది సమీపంలో రైల్వే ట్రాక్ కుంగిపోవడంతో అప్రమత్తమైన అధికారులు ముందుగానే భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌ ను నిలిపివేశారు. ప్రస్తుతం రైల్వే ట్రాక్ ను పునురుద్దరించేందుకు అధికారులు పనులు చేపట్టారు. దీంతో  రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇంకా రైల్వే ట్రాక్ పునురుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. 

19:09 - October 22, 2016
19:00 - October 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో సీఎస్‌ రాజీవ్‌శర్మను... టీటీడీ ఈవో సాంబశివరావు కలిశారు. తెలంగాణకు టీటీడీ నిధుల వాటా వివాదం, ఇతర సమస్యలపై చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:59 - October 22, 2016

హైదరాబాద్ : ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న బహుబలి-2 ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆదివారం హీరో ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందుగానే ఫస్ట్ లుక్ తో ప్రభాస్ అభిమానులను సందడి చేసింది చిత్ర యూనిట్. తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన చిత్రం బాహుబలి. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్‌ వండర్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించగా ప్రస్తుతం బాహుబలి ద కన్‌క్లూజన్‌ సిద్ధమవుతోంది. కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడు? సగటు సినీ ప్రేక్షకుడి మదిని తొలిచేస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమానాధనామే ఈ చిత్రం. 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న బహుబలి 2 ను 2017 ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రలు పోషించారు.

18:50 - October 22, 2016

హైదరాబాద్ : అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, కుక్కపిల్ల కాదేదీ కవితకనర్హం అనీ మహాకవి అంటే... నూనె, నెయ్యి, పాలు... కావేవీ కల్తీకనర్హం అంటున్నారు కల్తీ రాయుళ్లు. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు.. వాడే పేస్ట్ నుంచి తాగే పాల వరకు వినియోగదారుడికి కల్తీలేని వస్తువు దొరకడం గగనమైపోయింది. పాలను నీళ్ళతో కల్తీ చేసే రోజులు పోయి.. ప్రాణాలు తీసే కృత్రిమ పాలను తయారు చేసేందుకు తెగబడుతున్నారు కొందరు అక్రమార్కులు. పాలతో జనం ప్రాణాలు తీసేందుకు సిద్ధమైన ఈ దుర్మార్గంపై టెన్ టీవీ స్పెషల్‌ స్టోరీ.. 
అంతరించిపోతున్న స్వచ్ఛత, నాణ్యత పదాలు 
స్వచ్ఛత, నాణ్యత' అనే పదాలు అంతరించిపోతున్నాయి. తినే తిండితో మొదలు కొని తాగే నీళ్లు అన్నీ కల్తీ ఉత్పత్తుల లిస్టులో చేరిపోతున్నాయి. అసలును మరిపించే కల్తీలు జనారణ్యంలోకి దూసుకువస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వస్తున్న నకిలీల గుట్టు వింటుంటే గుండెల్లో గుబులు పుడుతోంది.. ఏది అసలో.. ఎది నకిలీదో తెలియక సామాన్యులు బెంబెలెత్తున్నారు.
సంపూర్ణ పౌష్టికాహారంగా పాలు
పసిపిల్లల నుండి ముసలివాళ్ల వరకూ పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా భావిస్తారు. అలాంటి పాలను... విష పదార్థాలతో తయారు చేస్తున్న దారుణమిది. ఈ నకిలీ పాలల్లో ఎలాంటి పోషకాలు ఉండవు. చారెడు చక్కెర, దోసెడు యూరియా, పావులీటరు మంచినూనె, అరలీటరు అసలు పాలు, కొంత సర్ఫ్‌ మిశ్రమాన్ని 20 లీటర్ల మంచినీళ్లలో కలిపి ఈ కృత్రిమ పాలను తయారుచేస్తున్నారు. వీటికి ఏ విధమైన వాసనా వుండదు. వేరుగా ఉంటే, వీటిని గుర్తించడం తేలిక. పాలల్లో కలిపితే మాత్రం గుర్తించాలంటే పరీక్షల్లో తేలాల్సిందే. అతి తక్కువ పాలు కలిపి రసాయనాలతో తయారు చేసే ఈ పాలు చాలా ప్రమాదకరం.. సాంద్రత మామూలు పాలల్లాగానే ఉంటుంది. నిల్వ ఉంచితే పసుపు రంగుకు మారతాయి. 
కల్తీ పాల తయారీ స్థావరాలపై దాడులు 
కార్డెన్‌ సెర్చ్ లో భాగంగా హైదరాబాద్‌ లోని సౌత్ జోన్ పోలీసులు కామాటిపురాలో కల్తీ పాలను తయారు చేసే స్థావరాలపై దాడులు చేశారు. నకిలీ పాలను తయారు చేస్తున్న వ్యాపారస్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వచ్చమైన పాలలో 300 గ్రాముల ధూల్ పూర్ ఫ్రెష్ ని కలిపి పెరుగును తయారు చేస్తున్నారు. అధిక మొత్తంలో పాలను ఉత్పత్తి చేయడానికి 20 శాతం పాలనే వాడి అందులో విషపూరితమైన రసాయనాలు కలిపి కలుషితం చేస్తున్నారు. పాలు చిక్కగా ఉండేందుకు యూరియా కూడా కలిపి ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారు. నకిలీ పాల సాంపిల్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ల్యాబ్‌కు పంపించారు. కల్తీపాల షాపును సీజ్ చేసి రసాయనాలను ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కృత్రిమ పాలతో క్యాన్సర్‌ 
కృత్రిమ పాలల్లోని కొవ్వు క్యాన్సర్‌ను కలిగిస్తుంది. డిటర్జెంట్‌ వల్ల కడుపులో తిప్పినట్లవుతుంది. విరోచనాలు అవుతాయి. దీనిలో కలిపే యూరియా, ఒక మోస్తరు విషపదార్థంగా పనిచేస్తుంది. ఈ కల్తీ పాలు ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో బాగా తయారవుతున్నాయి. కానీ, ఇటీవల మన రాష్ట్రంలోనూ తయారుచేస్తుండటంతో ఆందోళన కలిగిస్తున్నాయి. దారుణం ఏమిటంటే.. ఇవి పాల సేకరణ కేంద్రాల ద్వారా సరఫరా వ్యవస్థలోకి చేరుతున్నాయి. కల్తీ మోసాలలో ఇది పరాకాష్ఠ. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసే ఇలాంటి విషపు పాలను గుర్తించేందుకు పాల సేకరణ కేంద్రాలలో మరింత కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలి. డబ్బు కోసం ఎంతకైనా తెగించే కక్కుర్తిరాయుళ్ళను కటకటాల వెనక్కి నెట్టి కఠినంగా శిక్షించాలి. కల్తీకోరులను కఠినంగా ఎదుర్కోకపోతే... అది మొత్తం సమాజానికే ప్రమాదం.

 

18:44 - October 22, 2016

రంగారెడ్డి : ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఆరో రోజు రంగారెడ్డి జిల్లా పోల్కంపల్లికి చేరుకుంది. అక్కడి గ్రామస్తులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మట్లాడారు. ప్రాజెక్టుల కింద రైతుల దగ్గర తీసుకుంటున్న భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని తమ్మినేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలపై సీపీఎం తరపున పోరాడతామని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు. 

 

బీసీ కమిషన్ చైర్మన్ గా సామాజికవేత్త జీఎస్ రాములు నియామకం

హైదరాబాద్ : తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ కమిషన్ చైర్మన్ గా సామాజికవేత్త జీఎస్ రాములును నియమించారు. బీసీ కమిషన్ చైర్మన్ ను నియమిస్తూ ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. 

18:18 - October 22, 2016

హైదరాబాద్ : హరీష్‌రావు నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ ముగిసింది. రెండు గంటలకు పైగా చర్చలు కొనసాగాయి. బ్రిజేష్‌కుమార్‌ తీర్పుపై తదుపరి కార్యాచరణ, సుప్రీంలో వినిపించే వాదనలపై చర్చ జరిగింది. 29న మరోసారి సమావేశం కావాలని సబ్‌కమిటీ నిర్ణయించింది. ఈ భేటీకి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక ఆహ్వానితులుగా కడియం శ్రీహరి, నిరంజన్‌రెడ్డి, నీటి పారుదల రంగ నిపుణులు, అధికారులు హాజరయ్యారు.  

 

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ ముగిసింది. రెండు గంటలకు పైగా చర్చలు కొనసాగాయి. బ్రిజేష్‌కుమార్‌ తీర్పుపై తదుపరి కార్యాచరణ, సుప్రీంలో వినిపించే వాదనలపై చర్చ జరిగింది. 

సీఎస్ రాజీవ్ శర్మను కలిసిన టీటీడీ ఈవో సాంబశివరావు

హైదరాబాద్ : సచివాలయంలో టీటీడీ ఈవో సాంబశివరావు తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు. పలు అంశాలపై చర్చించారు.

17:48 - October 22, 2016

తూర్పుగోదావరి : కాకినాడలో మున్సిపల్‌ పోరుకు పార్టీలన్నీ సన్నాహాలు చేసుకుంటున్నాయి. సమర శంఖం పూరిస్తే సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్థానిక పోరులో తమదే పై చేయిగా నిలవాలని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో స్మార్ట్‌ సిటీలో మున్సిపల్‌ ఎన్నికల కోలాహాలం మొదలైంది.. 
పెండింగ్‌ మున్సిపల్‌ కార్పోరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధం 
ఏపీలో స్థానిక సంస్ధల ఎన్నికలు మొన్నటి సాధారణ ఎన్నికల కన్నా ముందే పూర్తయ్యాయి. 2014లోనే మున్సిపల్‌ పాలక వర్గాల ఎన్నికలు జరిగాయి. కానీ అప్పట్లో వివిధ కారణాలతో వాటిలో కొన్ని చోట్ల ఎన్నికలు ఆగిపోయాయి. వాటిని పూర్తి చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా ఎన్నికల ప్రక్రియ మాత్రం సాగలేదు. కానీ ఇప్పుడు పెండింగ్‌ మున్సిపల్‌ కార్పోరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. 
గ్రామాల విలీన వ్యవహారం..ఎన్నికలు వాయిదా 
అప్పట్లో కాకినాడ నగరంలో గ్రామాల విలీన వ్యవహారం వివాదంగా మారడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. గత ఏడేళ్లుగా స్పెషలాఫీసర్‌ ఆధీనంలో పరిపాలన సాగుతోంది. స్మార్ట్‌ సిటీగా ఎంపిక చేసినప్పటికీ పాలకవర్గం మాత్రం లేదు. అయితే ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలకు సర్కార్‌ ముందుకొస్తున్నట్లు ప్రకటనలు వస్తుండటంతో అందరిలో సందడి కనిపిస్తోంది. సుధీర్ఘ విరామం తర్వాత మరోసారి ఎన్నికల కోలాహాలం నెలకొంది. 
రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనకు మున్సిపల్‌ పోరు పరీక్ష 
రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనకు మున్సిపల్‌ పోరు పరీక్షగా మారబోతోంది. అయినప్పటికీ తన పాలనకు ప్రజల మద్దతు ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓటర్లు తమకే పట్టం కడతారని లెక్కలేస్తున్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో కాకినాడ అర్బన్‌, రూరల్‌ స్థానాలు రెండింటిలోనూ టీడీపీ భారీ విజయాలు సాధించింది. ఇప్పుడు నగర పాలక సంస్ధ ఎన్నికలు కూడా తమకే సానుకూలంగా ఉంటాయని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. మేయర్‌ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
టీడీపీని ఓడించాలని వైసీపీ వ్యూహాలు
మంత్రులు ఎన్నికలపై సమీక్షలు జరుపుతుంటే.. టీడీపీని ఓడించాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. దానికి తగ్గట్టుగానే గడపగడపకు వైసీపీ అంటూ పర్యటనలు సాగిస్తోంది. ఓ వైపు జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, మరోవైపు నగర ఇంఛార్జ్‌ ముత్తా శశిధర్‌ లు సుడిగాలి పర్యటలు చేస్తున్నారు. వైసీపీలో వర్గ పోరు నడుస్తున్నా.. ఐక్యంగా పని చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 
మున్సిపల్‌ పోరు సందడి షురూ 
మొత్తంగా నేతల పర్యటనలు, అధికారుల హడావుడి అంతా కలిసి మున్సిపల్‌ పోరు సందడి షురూ అయ్యింది. చంద్రబాబు కూడా రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సిన అన్ని స్థానాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలు ఖాయమని అంచనా వేస్తున్నారు. మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

 

17:39 - October 22, 2016

హైదరాబాద్ : బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ తీర్పుపై అఖిలప‌క్షం ఏర్పాటు చేయ‌కుండా ప్రభుత్వం స‌బ్ క‌మిటీ వేయ‌డం సరికాదని కాంగ్రెస్ కిసాన్ సెల్ నేత కోదండరెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గ‌తంలో బ్రిజెష్ కుమార్ ట్రిబ్యున‌ల్ తీర్పును అప్పుడే కాంగ్రెస్ త‌ప్పు ప‌ట్టింద‌న్న సంగ‌తిని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ భ‌విష్యత్ తో ముడిప‌డిన తీర్పుపై కేసీఆర్ ఏక‌ప‌క్షంగా వ్వవ‌హ‌రించ‌డం త‌గ‌ద‌న్నారు. కేసీఆర్ ఏక‌ప‌క్ష నిర్ణయాలతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పై టిఆర్ఎస్ నేత‌లు బుర‌ద జ‌ల్లడం మానుకోవాల‌ని హితవు పలికారు. 

 

17:32 - October 22, 2016

విశాఖ : ప్రాంతంలోని పంచగ్రామాల సమస్యను కోర్టు తీర్పు ఆధారంగా పరిష్కరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. ఈ సమస్య కోర్టులో ఉన్నందున... తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలన్నారు. విశాఖలో దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. విశాఖలో కురుపాం మార్కెట్‌ వద్ద నిర్మించిన కొత్త షాపింగ్ కాంప్లెక్స్‌ను మంత్రి గంటా శ్రీనివాస్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం.. కొందరు తమకు ఇళ్లు కట్టించాలని కోరుతూ మంత్రులను అడ్డుకున్నారు.

 

17:24 - October 22, 2016

విశాఖ : తిరుమల తిరుపతి దేవస్థానంపై ఇతర రాష్ర్టాలకు ఎటువంటి హక్కు లేదని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ దేవాలయాలపై విశాఖలో దేవాదాయశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీ కేవలం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వస్తోందని.. ఈ దేవస్థానంపై తెలంగాణకు సంబంధం లేదన్నారు. టీటీడీ ఆదాయంలో తెలంగాణకు వాటా ఇవ్వాలన్న వ్యాజ్యంపై అవసరమైతే కోర్టులో ప్రభుత్వం తరపున ప్రొసిడ్ అవుతామని స్పష్టం చేశారు. 

 

16:59 - October 22, 2016

హైదరాబాద్ : నగరంలో అధ్వాన్నంగా ఉన్న రహదారులను బాగుచేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ... జీహెచ్ ఎంసీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మేయర్‌ ఛాంబర్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో... ఉద్రిక్తత నెలకొంది. వర్షాలకు రోడ్లు దెబ్బతిని నెలరోజులు అవుతున్నా... అధికారులు ఇంతవరకు చర్య తీసుకోలేదని కార్యకర్తలు ఆరోపించారు. 

 

16:57 - October 22, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్  ప్రభుత్వ పాలన భేష్ గా ఉందనే బోగస్ ప్రచారానికి సీఎం కేసీఆర్ తెరలేపారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సర్వే అంతా బోగస్ అని కొట్టిపారేసారు. కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు ఉత్తమ్. ప్రభుత్వ పాలన అద్భుతమంటూ ప్రచారం చేసుకోవడమంటే తెలంగాణ ప్రజల్ని అవహేళన చేయడమంటూ ఫైరయ్యారు. ఏ సంక్షేమ పథకం సక్రమంగా నడుస్తుందో చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు.

 

మూడు మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లు..

హైదరాబాద్ : మరో మూడు మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లు ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా రామచంద్రారెడ్డి...సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా తిప్పరావు కమల..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా విజయ నిర్మలలు నియమితులయ్యారు. 

భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం..

కర్నూలు : నంద్యాల వద్ద భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. కుందూనది సమీపంలో రైల్వే ట్రాక్ కుంగిపోయింది. గత రెండు గంటలుగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. 

16:16 - October 22, 2016

మేయర్ ఛాంబర్ వద్ద యూత్ కాంగ్రెస్ ధర్నా..

హైదరాబాద్ : మేయర్ కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అస్తవ్యస్థంగా ఉన్న రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు. 

బ్రిజేష్ ట్రిబ్యునల్ తీరుపై ఏకపక్షం తగదు - కోదండరెడ్డి..

హైదరాబాద్ : బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై అఖిలపక్షం ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం సబ్ కమిటీని వేయడాన్ని తప్పుబడుతున్నట్లు కాంగ్రెస్ కిసాన్ సెల్ ఛైర్మన్ కోదండరెడ్డి వెల్లడించారు. గతంలో ట్రిబ్యునల్ తీర్పును కాంగ్రెస్ తప్పుబట్టిందని, తెలంగాణ భవిష్యత్ తో ముడిపడిన తీర్పుపై కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరించడం తగదన్నారు.

 

టిటిడి ఏపీకి చెందినది - మాణిక్యాలరావు..

విశాఖపట్టణం : తిరుమల తిరుపతి దేవస్తానం ఏపీకి చెందినదని, తెలంగాణతో పాటు ఇతర ఏ రాష్ట్రానికి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి వీలు లేదని మంత్రి మాణ్యిక్యాలరావు పేర్కొన్నారు. సౌందర రాజన్ హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై ప్రభుత్వం తరపున పోరాటం చేస్తామని తెలిపారు. 

సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరుగుతోంది. మంత్రి హరీష్ రావు అధ్యక్షతనలో ఈ సమావేశం జరుగుతోంది.

16:07 - October 22, 2016

అతడు మాస్ కు బుజ్జిగాడు..క్లాస్ కు మిస్టర్ పెర్ఫెక్ట్..అభిమానులకు డార్లింగ్..అవార్డులకు, రికార్డులకు బాహుబలి..ఆ ఆరడుగుల ఆజానుబాహుడు..అందగాడు ప్రభాస్...అతడి పుట్టినరోజు సందర్భంగా..ప్రత్యేక కథనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసునిగా తెరమీదకు వచ్చాడు ప్రభాస్. హీరోగా ఎత్తూ, ఫిజిక్ ఉండి తనదైన శైలిలో టాలీవుడ్‌లో నిలదొక్కుకున్నాడు. చేసింది తక్కువ చిత్రాలైనా ప్రేక్షకుల మదిలో మాస్ హీరోగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. కృష్ణంరాజు నట వారసత్వాన్ని చేతపట్టి రికార్డుల మోత మోగిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 'ఈశ్వర్' తో మొదలైన ఆ ప్రస్థానం నిన్నటి 'బాహుబలి' వరకు అద్భుతంగా సాగింది. మాస్ ప్రేక్షకుల పల్స్ ఇట్టే పట్టేసిన 'ప్రభాస్' తన సినిమాలతో వారిని అలరించడం స్టార్ట్ చేశాడు. 'ఈశ్వర్' హిట్ తో కుర్రాడు మంచి కసి మీదున్నాడు కదా అనుకునే సరికి 'వర్షం' హిట్ తో స్టార్ స్టేటస్ కి ఎగబ్రాకాడు. హీరోగా 'ప్రభాస్' కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా 'వర్షం'. ఈ సినిమాతో ప్రభాస్ పెర్ఫామెన్స్ బాగా మెరుగయి ఆయనను స్టార్ హీరోగా మార్చేసింది. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ పెర్ఫామెన్స్ తో.. 'వర్షం'లో అదరగొట్టాడు. ఇక 'జక్కన్న' చేతిలో పడి 'ఛత్రపతి'గా అవతరించి బాక్సాఫీస్ బాద్షాగా మారాడు. సినిమా సినిమాకు నైపుణ్యతను జోడిస్తూ స్టార్ గా ఎదిగిన 'ప్రభాస్' ను పరిశ్రమలో అందరు డార్లింగ్ అని అంటుంటారు. 'ప్రభాస్' లోని మరో కోణాన్ని చూపించిన సినిమాలు 'చక్రం', 'పౌర్ణమి'. ఇక 'బుజ్జిగాడు'గా ట్రెండ్ సెట్ చేసిన 'ప్రభాస్' తన నిక్ నేమ్ అయిన డార్లింగ్ సినిమాతో అందరిని అలరించాడు. కొత్త రకం క్యారక్టరైజేషన్ కి ప్రాధాన్యతనిచ్చే 'ప్రభాస్' ఎప్పుడు ప్రయోగాలకు ముందుంటాడు.

డిఫరెంట్ స్టయిల్...
టాలీవుడ్ లో 'ప్రభాస్' ది డిఫరెంట్ స్టయిల్. హాలీవుడ్ స్టార్ లాంటి బాడీ, బాడీ లాంగ్వేజ్ అతడి సొంతం. డాన్స్.. యాక్షన్.. ఫైట్స్ ఇలా ప్రతి మూవీ మూమెంట్స్ లో అతడి స్టయిలే వేరు. ఈ లక్షణాలే 'ప్రభాస్' ని టాలీవుడ్ లో ఆల్ రౌండర్ ని చేసాయి. 14సంవ‌త్సరాలు..17 సినిమాలూ ఇదీ ప్రభాస్ హిస్టరీ. అత‌నికి ఫ్లాప్‌లు తెలుసు. యావ‌రేజ్‌లు తెలుసు. సూప‌ర్ హిట్లు హిట్లూ, బ్లాక్‌బ్లస్టర్ హిట్టూ అన్నీ తెలుసు. అందుకే ఓ హిట్టొస్తే కాల‌ర్ ఎగ‌రేయ‌డు. ఫ్లాప్ వ‌స్తే.. త‌ల‌దించుకోడు. ఎప్పుడూ ఒక‌టే.. న‌డ‌వ‌డిక. 'ప్రభాస్' క‌టౌట్ కి యాక్షన్ క‌థ‌లు త‌ప్ప మ‌రోటి న‌ప్పకూడ‌దు. ఫైట్ సీన్లలో త‌ప్ప సెంటిమెంట్ సీన్లు స‌రిప‌డ‌వు. కానీ… 'ప్రభాస్' వీటిలో దేనికీ లొంగ‌లేదు. కోపం వ‌స్తే ఫైట్ చేశాడు. అమ్మాయి న‌చ్చితే డ్యూయెట్లు పాడాడు.. టీజింగ్ చేశాడు..అమ్మ ప్రేమ కోసం క‌న్నీళ్లు పెట్టుకొన్నాడు..కుటుంబ బంధాల కోసం ప‌రిత‌పించాడు..'ప్రభాస్' ని ఆల్ రౌండ‌ర్ హీరో అన‌డానికి ఇంకేం కావాలి. 

మాస్ కు నిలువెత్తు రూపం..
మ‌న‌కు సూప‌ర్‌మేన్‌లు లేరు.. స్పైడ‌ర్‌మేన్‌లూ లేరు..! ఐరెన్ మేన్ అనే మాటే లేదు. కానీ.. హీమాన్‌లాంటి హీరో ఉన్నాడు – అత‌నే యంగ్ రెబ‌ల్ స్టార్ 'ప్రభాస్‌'. ఆర‌డుగులదేహం, ఆజానుబాహుడు అనే పదానికి అసలు సిసలైన రూపం అతగాడిది. .పూర్వం సినిమా హీరో అంటే కొన్ని లక్షణాలు ఉండేవి. ఆరడుగుల పొడవు... మంచి బాడీ... అమ్మాయిల్ని ఆకట్టుకునే స్పురద్రూపం... ఇవన్నీ ఉన్నవాడే హీరోగా నిలదొక్కుకోగలిగేవాడు. ఇప్పుడు కాలం మారింది. అందం లేదు... పొడుగూ లేదు... బాడీ లేదు. ఒక్క బ్యాక్ గ్రౌండ్ వుంటే చాలు ఎవరైనా హీరో అయిపోవచ్చు. అయితే, 'ప్రభాస్' మాత్రం నిన్నటి హీరో లక్షణాలను పుణికిపుచ్చుకున్న నేటి తరం హీరో! నిన్నటి తరం హీరోలు ఎలా వుండేవారో ప్రభాస్ అలాగే ఉంటాడు. మాస్ సినిమాలే 'ప్రభాస్' ను టాలీవుడ్ లో సూపర్ హీరోని చేసాయి. ముఖ్యంగా 'పూరీ జగన్నాథ్', 'రాజమౌళి', 'కొరటాల శివ' లాంటి దర్శకులు 'ప్రభాస్' లోని మాస్ యాంగిల్ ను బాగా వెలికితీసారు. ఇప్పుడు మాస్ కు నిలువెత్తు రూపం 'ప్రభాస్'.

ఛత్రపతి మూవీ...
హీరోగా 'ప్రభాస్' మాస్ ఇమేజ్ ను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లిన మూవీ 'ఛత్రపతి'. టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ 'రాజమౌళి' డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 'ప్రభాస్' కెరీర్ లో ల్యాండ్ మార్క్ లా నిలిచిపోయింది. 'ప్రభాస్' కెరీర్ ను 'ఛత్రపతి' ముందు 'ఛత్రపతి' తరువాత అని బేరీజు వేసుకునేంతగా హిట్ గా నిలిచిపోయిందీ సినిమా. 'ఛత్రపతి' తరువాత , పూరీ జగన్నాథ్ 'బుజ్జిగాడు' సినిమాతో 'ప్రభాస్' బాడీ లాంగ్వేజ్ ను, బాడీ మూమెంట్స్ ను, అతడి నటనలో ఈజ్ ను బాగా ఎలివేట్ చేసాడు. ఆ ఒక్క సినిమాలోనూ, మిగతా సినిమాల్లోనూ 'ప్రభాస్' లోని మార్పుని మనం స్పష్టంగా చూస్తాం. ఆ సినిమా కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేకపోయినా, 'ప్రభాస్' కి ఈ సినిమా చాలా ఉపయోగపడింది. ఆ తరువాత 'ఏక్ నిరంజన్' లో కూడా 'ప్రభాస్' మాస్ నటన జనాన్ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది.

బాహుబలి 2
ఇక 'ప్రభాస్' కెరీర్ 'బాహుబలి' ముందు 'బాహుబలి' తర్వాత అనుకొనేలా చేసింది బాహుబలి అఖండం విజయం. ఈ సినిమా కోసం 'ప్రభాస్' దాదాపు 3 సంవత్సరాలకు పైగానే 'రాజమౌళి' దగ్గర లాక్ అయిపోయాడు ప్రభాస్. ఏ నటుడి కెరీర్ కైనా ఒక బ్రేక్ అనేది ఉంటుంది. 'ప్రభాస్' కు మాత్రం ఆ బ్రేక్ చాలా ఎఫెక్టివ్ గా వచ్చింది. వేరే ఏ హీరో కూడా బద్దలు కొట్టలేని రికార్డుల్ని నెలకొల్పి 'బాహుబలి' తో టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా అవతరించాడు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలందరికన్నా మోర్ ఎక్స్పెన్సివ్ హీరో అయిపోయాడు. ఇదంతా కేవలం 'బాహుబలి' తెచ్చిపెట్టిన అఖండమైన ఖ్యాతి. నిన్నమొన్నటి వరుకూ టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోగా మాత్రమే సినిమాలు చేసుకొన్న 'ప్రభాస్' 'బాహుబలి' తో అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన ఖ్యాతి గడించాడు. 'బాహుబలి' కేవలం ఇండియాలోనే కాకుండా మరికొన్ని ఇతర దేశాల్లో సూపర్ హిట్టయి 'ప్రభాస్' కు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. దటీజ్ 'బాహుబలి'. ఇప్పుడు ప్రభాస్ 'బాహుబలి 2' తో చాలా బిజీగా ఉన్నాడు. ఫస్ట్ పార్ట్ కు ఎంత కష్టం పడ్డాడో రెండో భాగానికి కూడా అంతకు మించి కష్టపడుతున్నాడు 'ప్రభాస్'. దాదాపు 1000 కోట్ల టార్గెట్ తో 'జక్కన్న' 'బాహుబలి 2'ని జనరంజకంగా చెక్కుతున్నాడు. అంతేకాదు ఈ సినిమా అప్పుడే అనూహ్యమైన బిజఙనెస్ చేసేస్తోంది.

16 గంటల కష్టం..
'బాహుబలి' సినిమా కోసం యంగ్ రెబ‌ల్‌స్టార్ 'ప్ర‌భాస్‌' ఇప్పటికే మూడేళ్లకు పైగా స‌మ‌యం కేటాయించాడు. మొదటి భాగం రిలీజ్ అయ్యి ఏడాది పైగానే పూర్తి కాగా.. దానికి ముందు రెండున్నరేళ్ల కష్టం ఉంది. ఇప్పుడు 'బాహుబలి ది కంక్లూజన్' కు.. క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఇది పూర్తయ్యే వరకూ.. ప్రధాన నటులు అదే లుక్ ను మెయింటెయిన్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా 'బాహుబలి'గా నటిస్తున్న 'ప్రభాస్'.. తన లుక్స్ లో వీసమెత్తు కూడా తేడా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొదటి భాగంలో ఎక్కువగా శివుడు పాత్రమీదే కథ నడిచినా.. సెకండ్ పార్ట్ లో దాదాపు 'బాహుబలి' స్టోరీనే ఉంటుంది. పైగా ఈ పాత్ర కోసం ఇప్పటికే 20 కిలోల బరువు పెరిగాడు 'ప్రభాస్'. 'ప్ర‌భాస్' అంత‌ బరువు పెరిగి కూడా.. పూర్తి స్థాయి ఫిట్నెస్ ను మెయింటెయిన్ చేయాలి. అందుకే షూటింగ్.. వర్కవుట్స్ మొత్తం కలిపి 16 గంటల పాటు కష్టపడుతూనే ఉన్నాడట. ముందే తెలిసిన ప్రభాస్.. అందుకోసం ఎలాంటి లూప్ హోల్స్ వదలబోవడం లేదని.. ఈ 16 గంటల కష్టం చూస్తే అంద‌రికీ అర్ధమవుతోంది.

తమిళ..హిందీ భాషల్లో...
'బాహుబలి 2' మొదటి భాగంకన్నా ఇంకా ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేస్తే ,ఇక తరువాత ప్రభాస్ క్రేజ్ ను ఎవరూ అంచనా వేయలేరు. అయితే ఈ సినిమా పూర్తయిపోయాక ప్రభాస్ చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి ఎక్కువైపోయింది జనానికి. అంతేకాదు ఆ సినిమా బడ్జెట్ ప్లాన్ మీదకూడా జనానికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. బాహుబలి తో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగింది కాబట్టి, బాహుబలి 2 తో ఆ ఇమేజ్ ని మరింత క్యాష్ చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ప్రభాస్ కూడా తక్కువేం తినలేదు 'బాహుబలి' తో వచ్చిన ఇంటర్నేషనల్ స్టార్ డంని అలాగే కంటిన్యూ చేయడానికి పెద్ద ప్లానే వేసాడు . ప్రస్తుతం చేస్తున్న 'బాహుబలి పార్ట్ 2' తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ పై సుజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రాన్ని ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ బాషలలో కూడా నిర్మించానున్నారట. దీనివల్ల బాలీవుడ్ జనాలకు మాత్రమే కాకుండా మాలీవుడ్ , కోలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో కూడా వసూళ్లు రాబట్టవచ్చు అని ప్లాన్ చేస్తున్నారు. భారీ స్థాయిలో ఖర్చు పెట్టినా రాబడికి డోకా ఉండదని భావిస్తున్నారట. అదే సమయంలో 'బాహుబలి పార్ట్ 2' తర్వాత వచ్చే చిత్రం కాబట్టి అంచనాలు కూడా భారీగా ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్ కూడా భారీగానే ఉండొచ్చని ఒకవేళ ఆ సినిమా నచ్చితే మరింత మార్కెట్ పెరిగే చాన్స్ ఉంటుందని భావిస్తున్నారట. మొత్తం మీద 'ప్రభాస్' బాహుబలి ఇమేజ్ ని భలేగా క్యాష్ చేసుకుంటున్నాడు కదూ.
అభిమానుల ఫాలోయింగ్‌లోనూ…రికార్డుల వేట‌లోనూ..కొత్త పాత్రలు ఎంచుకోవ‌డంలోనూ, పాత్రల కోసం క‌ష్టప‌డ‌డంలోనూ 'ప్రభాస్' ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ఈ స్థాయికి చేరాడు. 'బాహుబ‌లి' 'ప్రభాస్'కి మ‌న‌స్ఫూర్తిగా జ‌న్మదిన‌ శుభాకాంక్షలు తెలియ‌జేసుకుంటోంది 10 టివి.

15:56 - October 22, 2016

కృష్ణా : విజయవాడ, మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌, మచిలీపట్నం రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి ఏడాదైనా... పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. కాంట్రాక్టర్లతో ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై రహదారి విస్తరణ పనులు ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
మడ కార్యాలయం ఏర్పాటు 
బందరు పోర్టుతో పాటు మచిలీపట్నం ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు మడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం... విజయవాడ, మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తయితేనే అభివృద్ధికి అన్ని విధాలుగా దోహదపడుతుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో 64 కిలోమీటర్ల పొడవునా నాలుగులైన్ల రహదారి విస్తరణకు గతేడాది డిసెంబర్‌లో కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ ఏడాదైనా.. పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.  
గజం రోడ్డును కూడా విస్తరించిన దాఖలాలు లేవు 
విజయవాడ నుంచి మచిలీపట్నం వరకూ రోడ్డు విస్తరణ కోసం చెట్లనైతే నరికివేశారు. కానీ ఒక్క గజం రోడ్డును కూడా విస్తరించిన దాఖలాలు లేవు. కంకిపాడు వద్ద రోడ్డు విస్తరణకు కొద్దిపాటి బైపాస్‌ను ఏర్పాటు చేయటం, ఉయ్యూరు సమీపంలో పంట పొలాలను చదును చేయడం వంటి పనులకు ఇప్పటివరకు శ్రీకారం చుట్టారు. రోడ్డు విస్తరణ పేరుతో... వేలాది వృక్షాలు నేలమట్టం అవుతుంటే స్థానికులు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం ఓ వైపు మనం-వనం పేరుతో పర్యావరణ పరిరక్షణ కోసం కోటి మొక్కలు నాటాలని పిలుపునిస్తూనే.. ఇంకో వైపు చెట్లను నేలమట్టం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
అధికార పార్టీ ప్రజాప్రతినిధులకనుకూలంగా మార్పులు 
రోడ్డు విస్తరణకు సంబంధించి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా బందరు విస్తరణ పనుల ప్లాన్లలో మార్పులు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి ఎక్కువ నష్టపరిహారం, మిగతా వారికి తక్కువ నష్టపరిహారం వచ్చేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో రోడ్డు విస్తరణ పనులు జాప్యం చేయడం వల్ల అంచనాలు పెంచుకుని కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 64 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించకుండా  మిగతా వారికి కూడా కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం బందరు రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేస్తున్నామని చెబుతున్నారు.  ఆరు నెలల్లో విస్తరణ పనులు పూర్తి చేస్తామని, పోర్టు పూర్తయ్యేనాటికి పనులు పూర్తవుతాయని చెబుతున్నారు.

15:51 - October 22, 2016

హైదరాబాద్‌ : నగరంలో డెంగ్యూ  స్వైర విహారం చేస్తోంది. హబ్సీగూడ గిరిజన కాలనీలో డెంగ్యూ ఓ చిన్నారిని బలితీసుకుంది. బస్తీ మొత్తం సుస్తీ చేసి ఆస్పత్రిలో మగ్గుతోంది. గిరిజన కాలనీలో సుమారు 70మందికి పైగా డెంగ్యూతో బాధపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోమల మందు కొట్టకపోవడం వల్లే డెంగ్యూ వచ్చిందని మండిపడుతున్నారు. ప్రస్తుతం గిరిజన కాలనీలో తాజా పరిస్థితిని టెన్ టివి రిపోర్టర్ వివరిస్తారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:46 - October 22, 2016

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. జయలలిత కోలుకుంటున్నారని ప్రభుత్వం ప్రకటించింది. జయలలిత వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నారని రాజ్‌భవన్‌ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్‌ విద్యాసాగరరావు ఈరోజు మరోసారి జయలలితను పరామర్శించారు. ఆమెతో మాట్లాడినట్లు.. బాగానే ఉన్నానని సైగల ద్వారా జయలలిత చెప్పినట్లు సమాచారం. చక్కటి వైద్యం అందించినందుకు డాక్టర్ల బృందాన్ని ఆయన అభినందించారు. ఆమె కోలుకోవడం సంతోషమని గవర్నర్ అన్నారు. జయలలితను టీడీపీ నేతలు పరామర్శించారు. మరో 10 రోజుల్లో జయలలిత కోలుకుంటుందని వైద్యులు తెలిపారని కేంద్రమంత్రి సుజనాచౌదరి తెలిపారు. నిన్న, మొన్న ఆస్పత్రి వర్గాలు హెల్ల్ బులిటెన్ విడుదల చేశారు. మరికొద్ది రోజుల్లో పూర్తి ఆరోగ్యంతో జయలలిత ఆస్పత్రి నుంచి బయటకు రానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:38 - October 22, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పాలనపై సర్వే నిర్వహించిన సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ సంస్థ కేసీఆర్‌ జేబు సంస్థ అని టీ.టీడీపీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఇప్పటివరకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలంతా అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితిపై నగరవాసులు, ఉద్యోగాలు లేక యువత, రిజర్వేషన్లు లేక ముస్లింలు.. ఇలా అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ పాలనలో బెస్ట్‌ అయితే.. ప్రజాబ్యాలెట్‌కు టీఆర్‌ఎస్‌ సిద్ధమా ? అని ప్రశ్నించారు. 

 

15:31 - October 22, 2016

తూర్పుగోదావరి : ఆధునిక టెక్నాలజీ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కాకినాడలో నిర్వహించిన స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని...దానికి వినూత్నంగా, భిన్నంగా ఆలోచించాలన్నారు. ఏ నియోజకవర్గంలో ఎప్పుడు ఓడీఎఫ్ మొదలు పెడతారని ఎమ్మెల్యేలను అడిగారు. ప్రతి నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం నెలకు పది వేల రూపాయలు సంపాదించేలా ప్రణాళికలు తయారు చేశామని చెప్పారు. కాకినాడలో మూడో బ్రిడ్జీ కావాలన్నారు. పోర్టు రోడ్డే కాకుండా నేషనల్ హైవేను నిర్మిస్తామని చెప్పారు. నేషనల్ హైవేను పోర్టుకు కనెక్టు చేస్తామని చెప్పారు. రింగు రోడ్లన్నంటిని కలిపి మాడ్రన్ టౌన్ గా తయారు చేస్తామని పేర్కొన్నారు. బ్రిటీష్ వారు రోడ్లను బ్యూటిఫుల్ గా తయారు చేశారని చెప్పారు. కాకినాడకు సముద్రం పక్కనుండడంతో వరద ప్రవాహం తక్కువగా ఉంటుందన్నారు. 

 

15:25 - October 22, 2016
15:24 - October 22, 2016
15:18 - October 22, 2016
15:14 - October 22, 2016

కాకినాడ : స్వచ్చంధ్రప్రదేశ్‌లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడలో పర్యటిస్తున్నారు. దోమలపై దండయాత్ర ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. అభివృద్ధి, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్ర విభజనతో ఎన్నో ఇబ్బందులు వచ్చాయని.. అయినా దృఢసంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. అందరూ చదువుకోవాలని.. ఆర్థిక ఇబ్బందులతో ఎవరూ చదువు మానేయవద్దన్నారు. 

 

15:00 - October 22, 2016

రంగారెడ్డి : జిల్లా మంచాల మండలం లింగంపల్లిలో సీపీఎం ఆరో రోజు మహాజన పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సరిపోదని, కోరుకున్న అభివృద్ధి కావాలని సూచించారు. బతుకులు బాగు పడాలని, రాష్ట్ర అభివృద్ధి అంటే రాష్ట్రంలో ఉన్న జనాల బతుకులు బాగుపడడమేన్నారు. ఆయన మాటల్లోనే...'ఈ జనాలు 93 శాతం మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు..ఇలాంటి కులాలు తెలంగాణలో 93 శాతం మంది ఉన్నారు. తెలంగాణ రాకముందు వీరి బతుకులు ఎలా ఉన్నాయి ? వచ్చిన తరువాత ఎలాంటి బతుకులున్నాయి. ? ఈ బతుకులు మారినయా ? వీరి బతుకులు మారాలి ? మారాలంటే ఏం చేయాలి ? బతుకులు మారడమంటే ప్రతి మనిషికి తిండి ఉండాలి..ఇళ్లు..గుడ్డ ఉండాలి..పిల్లలకు చదువు ఉండాలి..చదుకువున్న వాడికి ఉద్యోగం ఉండాలి.. జబ్బు వస్తే వైద్యం ఉండాలి..ఈ రకమైన సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి రావాలి. కానీ ఇవన్నీ వచ్చాయా ? నాలుగైదు రోజులుగా తాము పర్యటిస్తున్న ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు రాకపోకగా మరింతగా దిగజారుతున్నాయి. విద్య అందుబాటులో ఉండడం లేదు. టీచర్లు ఉండడం లేదు. టీచర్లు ఉంటే సౌకర్యాలు ఉండడం లేదు. ప్రైవేటు స్కూళ్లకు వెళితే వేల రూపాయలు చెల్లిస్తే చదువు చెప్పలేని పరిస్థితి నెలకొంది. గవర్నమెంట్ స్కూల్స్ లేని పరిస్థితి నెలకొంటోంది. ఉచితంగా చదువు చెప్పాలి' అని తమ్మినేని సూచించారు. 

'ఏ దిల్ హే ముష్కిల్' చిత్రం విడుదలకు లైన్ క్లియర్...

ముంబై : 'ఏ దిల్ హే ముష్కిల్' చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నెల 28వ తేదీన చిత్రం విడుదల కానుంది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను నిర్మాతల మండలి కలిసింది. భవిష్యత్ లో పాక్ నటులకు అవకాశం ఇవ్వబోమని సీఎంకు నిర్మాతల మండలి అధ్యక్షుడు మహేష్ భట్ పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బులను సైనిక సంక్షేమ నిధికి విరాళంగా ఇస్తామని ప్రకటించారు. 

జయ ఆరోగ్యంపై సర్కార్ ప్రకటన..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. జయలలిత కోలుకుంటున్నారని..వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారని పేర్కొంది. జయను గవర్నర్ విద్యాసాగర్ రావు పరామర్శించారు. జయ కోలుకోవడం ఆనందంగా ఉందన్నారు. 

ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తే వాస్తవాలు తెలుస్తాయి - రేవంత్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ హామీలపై ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తే వాస్తవాలు తెలుస్తాయని టి.టిడిపి నేత రేవంత్ పేర్కొన్నారు. రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రజాభిప్రాయం తెలుసుకుంటామన్నారు. 

జయను పరామర్శించిన విద్యాసాగర్ రావు..

తమిళనాడు : చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పరామర్శించారు. 

బాలుడి మృతి ఘటనలో జువైనల్ సూపర్ వైజర్ల సస్పెండ్..

కడప : జువైనల్ హోంలో బాలుడు మృతి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు సూపర్ వైజర్లను జువైనల్ హోం డైరెక్టర్ శారద సస్పెండ్ చేశారు. 

బాబును కలిసిన సింగపూర్ ప్రతినిధులు..

విజయవాడ : సీఎం చంద్రబాబును మోనిటరీ అథార్టీ ఆఫ్ సింగపూర్ ప్రతినిధులు కలిశారు. మోనిటరీ అథార్టీ ఆఫ్ సింగపూర్ తో ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఫిన్ టెన్ సెక్టార్ తో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదిరింది. విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చింది. మోనిటరీ అథార్టీ ఆఫ్ సింగపూర్ చేయూతనివ్వనుంది. 

13:50 - October 22, 2016

విశాఖపట్నం : మన సినిమా రంగం వాళ్లు నిజంగా విశాఖలో సినిమా చూపిస్తున్నారు.. విశాఖ ఫిల్మ్ నగర్ క్లబ్ పేరుతో రెండు సార్లు శంకుస్థాపనలు చేసినప్పటి నుంచి సభ్యత్వాల పేరుతో లక్షలు వసూళ్లు చేసేదాకా.. సినిమా ఆడించేస్తున్నారు.. తాజాగా చారిత్రక స్థలాల పక్కన ప్రభుత్వం క్లబ్ కు స్థలం కేటాయించడం ఈ తతంగంలో మరో ట్విస్ట్..

మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా మళ్లీ శిలాఫలకం..
ఈ పాటకు తగ్గట్లుగానే కొందరు తెలుగు సినీ పెద్దలు.. విశాఖ కల్చరల్ క్లబ్ పేరుతో సినిమా చూపించేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ది పేరుతో విచ్చలవిడి వ్యవహారాలకు కొందరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ప్రకృతి రమణీయతకు విశాఖ కేరాఫ్ అడ్రస్. అందమైన కొండలు, సముద్రతీరం.. వెరసి షూటింగ్‌లకు అనుకూలంగా ఉన్న ఈ ప్రదేశంలో ఏడాది క్రితం ..ఫిల్మ్‌ కల్చరల్‌ క్లబ్‌ నిర్మాణానికి..సీఎం చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరింపజేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి అతీ గతీ లేదు. దీనికి తోడు ఇటీవలే మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా మళ్లీ శిలాపలకం ఆవిష్కరింపజేశారు.

కల్చరల్‌ క్లబ్‌ క్లబ్‌ సభ్యత్వం పేరిట వసూళ్లు..
కల్చరల్‌ క్లబ్‌ క్లబ్‌ సభ్యత్వం పేరిట కొందరు వసూళ్లకు తెరలేపారు. క్లబ్‌ సభ్యత్వానికి సినిమా రంగానికి చెందినవారు 2 లక్షలు, అదే సినిమా రంగంతో సంబంధం లేని వారైతే.. 5 లక్షలు కట్టాలని నిబంధన పెట్టారు. హైదరాబాద్‌ క్లబ్‌ సభ్యులు కూడా వచ్చి వెళ్లొచ్చని..ఓటింగ్‌ హక్కు కావాలంటే మరో లక్ష రూపాయలు అదనంగా చెల్లించాలని నిబంధన పెట్టారు. అసలు భవన నిర్మాణానికి డీపీఆర్‌ కూడా సిద్ధం కాకుండానే శంకుస్థాపన చేయడం, సభ్యత్వ రుసుం వసూలు చేయడం విమర్శలకు తావిస్తోంది. దీనికి తోడు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ నేతృత్వంలో ఓ కమిటీ వేయడంతో.. ఇది సినిమా పెద్దల్లో విబేధాలకు దారి తీసింది.

క్లబ్ సభ్యత్వం కోసం 50 మంది 5 లక్షల చొప్పున సభ్యత్వం రుసుం
శంకు స్థాపన రోజునే ఫిల్మ్ అండ్ కల్చర ల్ క్లబ్ సభ్యత్వం కోసం దాదాపు 50 మంది 5 లక్షల చొప్పున సభ్యత్వం రుసుం చెల్లించారు. దీంతో పాటు సర్వీస్‌ టాక్స్‌ పేరిట ఒక్కొక్కరు మరో 75 వేల రూపాయలు ముట్టజెప్పుకున్నారు. వీరితో పాటు మరో 350 మంది.. కొత్తగా సభ్యత్వం కోసం నమోదు చేయించుకున్నారు. భవన నిర్మాణ పనులు కూడా మొదలు కాకుండానే లక్షల రూపాయలు వసూలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తమకు కావాల్సిన వారికి భూములు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంచే చేను మేస్తే కాపాడేది ఎవరని ప్రశ్నిస్తున్నారు.

ఏడాదికి ఎకరాకు 1 లక్ష 50 వేల చొప్పున లీజు
కొంచెం సినిమాటిగ్గా చెప్పాలంటే... కథ, షూటింగ్‌ వంటి కార్యాక్రమాలు ఏవీ లేకుండానే డైరెక్ట్‌ సినిమా టిక్కెట్లు విక్రయించినట్లు తయారైంది కల్చరల్‌ క్లబ్‌ పరిస్థితి. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కల్చరల్ క్లబ్‌ నిర్మాణం కోసం అంటూ కొందరు మంత్రి గంటాను కలిసి ప్రభుత్వ స్థలం కోసం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రభుత్వం స్థలం అప్పగిస్తే నిధులు పోగు చేసి నిర్మాణం చేపడతామని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో కాపులుప్పాడ వద్ద 15 ఎకరాలు ప్రభుత్వం లీజుకిచ్చింది. ఇక్కడ ఎకరం ధర దాదాపు కోటి రూపాయలుంది. కానీ.. ఏడాదికి ఎకరాకు 1 లక్ష 50 వేల చొప్పున లీజు నిర్ణయించారు. 15 ఎకరాల స్థలాన్ని లీజు పేరుతో కారు చౌకగా కొట్టేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బుద్ధుడి స్థూపాన్ని సినిమావారికి ఎలా ఇస్తారంటూ విమర్శలు
ఫిలింనగర్ క్లబ్ అయితే అధికారులు అనుమతులివ్వరని తెలిసీ... ఫిలింనగర్ కల్చలర్ సెంటర్ పేరుతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం, ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం అంతా పక్కా ప్లాన్డ్‌గా జరిగిపోయింది. బుద్ధుడి స్థూపాన్ని పరిరక్షించి, అభివృద్ధి చేయాల్సిన అధికారులు ఆ స్థలాన్ని సినిమా వాళ్లకు ఎలా ఇస్తారంటూ బుద్ధిష్టులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి వాణిజ్య నిర్మాణాలు చేపట్టరాదని, ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వకూడదని నిబంధనలున్నాయి. టూరిజం పేరుతో విశాఖ - భీమిలి మధ్య భూములను కొన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

ఫిలింక్లబ్‌కు కేటాయించిన స్థలం పూర్తిగా ప్రభుత్వానిదే : గంటా
మరోవైపు ఫిలింక్లబ్‌కు కేటాయించిన స్థలం పూర్తిగా ప్రభుత్వ స్థలమని మంత్రి గంటా చెబుతున్నారు. కేవలం తొట్లకొండకు బౌద్ధారామానికి వెళ్లే దారిని మాత్రమే ఫిలింక్లబ్‌ వారు ఉపయోగిస్తున్నారని మంత్రివర్యులు సెలవిచ్చారు.

కల్చరల్‌ సెంటర్‌ నిర్మాణానికి అనుమతులివ్వడం విమర్శలు
తలా తోక లేని సినిమాకు కలెక్షన్లు దండుకున్నట్లు... ఫిలిం కల్చరల్‌ సెంటర్‌ పేరుతో జరుగుతున్న తతంగం మరో సినిమాను తలపిస్తోందని, ప్రభుత్వం నిర్మాణ ప్లాన్‌ లేకుండానే కల్చరల్‌ సెంటర్‌ నిర్మాణానికి అనుమతులివ్వడం విమర్శలకు కారణమవుతోంది.  

13:42 - October 22, 2016

రంగారెడ్డి : జిల్లా మంచాల మండలం లింగంపల్లిలో సీపీఎం ఆరోరోజు మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. స్థానికంగా ఉన్న సమస్యలపై తమ్మినేని బృందానికి ప్రజలు భారీగా వినతిపత్రాలు ఇస్తున్నారు. లింగంపల్లిలో ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 93 శాతం ఉన్న సామాజిక వర్గ ప్రజల బతుకులు బాగా పడలేదని...  ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారని ఈసందర్భంగా తమ్మినేని ప్రశ్నించారు.  ఇంటికో ఉద్యోగం కల్పిస్తామన్న టీఆర్ఎస్ హామీ ఏమైందని తమ్మినేని ప్రశ్నించారు. మూతబడిన పరిశ్రమలు తెరిపించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

ఆరో రోజుకు చేరుకున్న పాదయాత్ర..
సీపీఎం మహాజన పాదయాత్ర ఆరోరోజు కు చేరుకుంది. మంచాల  మండలం  లింగంపల్లి, రాయపోలులో సీపీఎం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లింగంపల్లిలో గొర్రెల, మేకల సంఘాల వారు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. గ్రామస్తులు స్థానిక సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

పాదయాత్రకు మంచి స్పందన : సీపీఎం నేతలు
మహాజన పాదయాత్రకు మంచి స్పందన ఉందని సీపీఎం నేతలంటున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలో పాదయాత్ర కొనసాగుతోంది. స్థానిక సమస్యలపై ప్రజలు భారీ ఎత్తున వినతులు ఇస్తున్నారని సీపీఎం నేతలంటున్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

12:55 - October 22, 2016

వరంగల్‌ : కాకతీయ మెడికల్‌ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో దుమ్ము రేపారు. ఉత్కర్ష్‌ 2016 తరంగ్‌ ఫెస్ట్‌లో ఎనర్జెటిక్‌గా పాల్గొంటూ ఓహో అనింపించారు. సీనియర్స్‌, జూనియర్స్‌, ఫ్యాకల్టీ అన్న తేడా లేకుండా అంతా ఒకే స్టేజ్‌పై డాన్సులతో సందడి చేశారు. మోడర్న్ డ్రస్‌తో కనిపించే వాళ్లంతా... సంప్రదాయ దుస్తులు ధరించి మైమరపించారు. మెడికల్ కాలేజ్ లో వారం రోజుల పాటు జరుగుతున్న ఉత్కర్ష్ 16 లో అమ్మాయిలు, అబ్బాయిలు ర్యాంప్ వాక్ చేసి ఉర్రూతలూగించారు. 

12:53 - October 22, 2016

హైదరాబాద్ : విధి నిర్వహణలో పోలీసులు ఎంతో ఒత్తిడికి లోనువుతుంటారు. ఒక్కోసారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలుసుకునే సమయం కూడా దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడితో కుంగిపోతుంటారు. శారీరక దృఢత్వాన్ని కోల్సోయి అనారోగ్యానికి గురవుతుంటారు. మానసిక ఒత్తిడి నుంచి పోలీసులకు కొంతవరకైనా ఉపశమనం కల్పించే చేసే లక్ష్యంతో... హోం శాఖ హైదరాబాద్‌లోని అన్ని పోలీసు స్టేషన్లలో జిమ్‌లు ఏర్పాటు చేస్తోంది. పోలీసు స్టేషన్లలో జిమ్‌లపై 10 టీవీ ప్రత్యేక కథనం....

విధి నిర్వహణల్లో తీవ్ర ఒత్తిడి
విధి నిర్వహణలో పోలీసులకు ఉరుకులు, పరుగులు తప్పవు. ఒక్కోసారి రోజంతా పని చేయాల్సి ఉంటుంది. శాంతిభద్రతల నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణలో ఎంతో ఒత్తిడికి గురువుతుంటారు. సమ్మెలు, ఆందోళన సందర్భాల్లో ఆరోగ్య సమస్యలను సైతం లెక్కచేయకుండా పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్బాల్లో వీరు అనుభవించే మానసిక, శారీరక ఒత్తిడి వర్ణనాతీతం. అసట, శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి పోలీసులకు కొంతవరకైనా ఉపశమనం కల్పించి, శారీరక దృఢత్వాన్ని కాపాడుకునేందుకు వీలులగా జంట నగరాల్లోని పోలీసు స్టేషన్లలో వ్యాయామ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

జిమ్ ల ఏర్పాట్లుతో పోలీసుల హర్షం
జంటనగరాల్లో ఉన్న 63 పోలీసు స్టేషన్లకు జిమ్‌ పరికరాలను హోం శాఖ అందించింది. డంబెల్స్‌, ట్రెడ్‌ మిల్‌, సైక్లింగ్‌ పరికరాలతో పోలీసు స్టేషన్లలో చిన్నపాటి జిమ్‌లు ఏర్పాటు చేశారు. పని ఒత్తిడి కారణంగా బయట జిమ్‌లకు వెళ్లలేని తమకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. వ్యయామానికి ఠాణాల్లో జిమ్‌లు ఏర్పాటు చేయడంతో క్రియాశీలకంగా మారుతున్నామని పోలీసులు అంటున్నారు. జిమ్‌ పరికరాల నిర్వహణ విషయంలో పోలీసులు ఎవరికివారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుంటే ఇవి చాలాకాలం అందరికీ ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

 

12:44 - October 22, 2016

విజయవాడ : దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్ధలు నివ్వెర పోయేలా విజయవాడ ఎయిర్‌ పోర్టు రికార్డులు సృష్టిస్తోంది. ఏపీకి తలమానికంగా మారిన గన్నవరం విమానాశ్రయానికి ఏటేటా ఊహించని విధంగా ప్రయాణికుల రద్దీ పెరిగిపోతోంది. దీంతో ఈ ఎయిర్‌ పోర్టు అంతర్జాతీయ స్థాయికి చేరిపోయింది.

2015-16లో 4.04 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు
విభజనకు ముందు అంతంత మాత్రంగా ఉన్న సర్వీసులు.. ఇప్పుడు ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా మారింది. ఆపరేషన్స్‌, ఫ్లైట్‌ మూవ్‌ మెంట్స్‌ లో సగటున 72 శాతానికి పైగా వృద్దిని సాధించింది. 2015-16లో 4లక్షల 4వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. 2016-17లో ఇప్పటివరకే 6లక్షల 46 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. దీంతో ఎయిర్‌ పోర్టు అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసే దిశగా సర్కార్‌ అడుగులు వేస్తోంది.

రూ.137కోట్లతో అంతర్జాతీయ స్థాయి టెర్మినల్‌ భవన నిర్మాణం
ప్రస్తుతం 137 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయి టెర్మినల్‌ భవనం నిర్మాణం జోరుగా సాగుతోంది. ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2015 లో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 3వేల 332 విమాన సర్వీసులు నడిచాయి. 2016లో ఇదే సమయంలో 5వేల 764 విమాన సర్వీసులు నడిచాయి. గతేడాదికంటే ప్రస్తుతం 72. 99 శాతం సర్వీసులు పెరిగాయి. గత మూడు నెలల్లోనే 3వేల 57 విమాన సర్వీసులు నడవటం విశేషం..

ఇన్వెస్టర్స్‌, ఫారిన్‌ డెలిగేట్స్‌ టీమ్‌ భారీ స్థాయిలో రాకపోకలు
దేశ, విదేశాలకు ఉద్యోగ రిత్యా వెళ్లేవారు, ఉన్నత చదువుల కోసం ఆయా దేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి హైదరాబాద్‌, ఢిల్లీ అక్కడి నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, లండన్‌, తదితర దేశాలకు యువత అధిక సంఖ్యలో వెళ్తోంది. ఇంతే కాకుండా బిజినెస్‌ పీపుల్స్‌, పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ ఇన్వెస్టర్స్‌, ఫారిన్‌ డెలిగేట్స్‌ టీమ్‌ భారీ స్థాయిలో రాకపోకలు సాగిస్తుండటంతో ఎయిర్‌ పోర్టు వృద్ధి అంతకంతకు పెరుగుతోంది.

నవంబర్‌ నుంచి రోజు రాత్రి 8: 30 గంటలకు ఎయిరిండియా ఫ్లైట్‌
ముఖ్యంగా ఇతర విమానాశ్రయాలతో కనెక్టివిటీ బాగా పెరిగింది. కిందటేడాది లేని రూట్లలో కూడా ఈ ఏడాది విమానాలు నడుస్తున్నాయి. మరోవైపు రాత్రి పూట విమాన సర్వీసులు నడవటం కూడా ప్లస్‌ గా మారనుంది. నవంబర్‌ నుంచి ఎయిరిండియా ఫ్లైట్‌ రాత్రి 8గంటల 30 నిమిషాలకు ప్రతి రోజూ విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లనుంది.

రద్దీ పెరగటంతో మర్ని సర్వీసుల యోచన
ప్రయాణికుల రద్దీ పెరగటంతో మరిన్ని సర్వీసులు పెంచే యోచనలో ఎయిర్‌ పోర్టు అధికారులు ఉన్నారు. మొత్తం మీద వైజాగ్‌ ఎయిర్‌ పోర్టు తరహాలో గన్నవరం విమానాశ్రయానికి కూడా విమాన సర్వీసులు పెరగనున్నాయి. 

12:38 - October 22, 2016

విజయవాడ : ఏపీ టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టికెట్ల కోసం ఆశావహులు పెరుగుతున్నారు. ఇప్పటికే అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ కోటరీల్లోని వ్యక్తులు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

పట్టభద్రుల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో వచ్చే ఏడాది మార్చిలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం జిల్లాలకు కలిపి ఉపాధ్యాయుల కోటాలో ఒక ఎమ్మెల్సీ, పట్టభద్రుల కోటాలో మరో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. కడప-కర్నూలు-అనంతపురం జిల్లాల పరిధిలో కూడా ఉపాధ్యాయులు, పట్టభద్రుల కోటాలో కలిపి రెండు ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. ఇక విశాఖపట్నం-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాల కోటాలో ఒక పట్టభద్రుల స్థానానికి కూడా ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సి వుంది. దీంతో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అవకాశం లభించనున్న నేపథ్యంలో..ఎన్నికలకు మరో ఐదు నెలలు సమయం ఉన్నా..ఏపి టిడిపిలో అప్పుడే ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.

చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం జిల్లాల పరిధిలోని ఎమ్మెల్సీ స్థానానికి తీవ్రపోటీ
చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం జిల్లాల పరిధిలోని పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ స్థానం కోసం మద్దిపట్ల సూర్యప్రకాష్, పట్టాభిరామిరెడ్డి, బ్రహ్మం చౌదరి, లంకా దినకర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతిలో టిడిపి శిక్షణా శిబిరాన్ని నడిపిస్తున్న మద్దిపట్ల సూర్యప్రకాష్..అటు అధినేత చంద్రబాబు, ఇటు యువనేత లోకేష్ తో తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో బ్రహ్మం చౌదరికి కూడా టిడిపి అధినేత చంద్రబాబు వద్ద మంచి మార్కులే ఉండటంతో..తనకు ఈసారి ఎలాగైనా టికెట్ కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు.

ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి రమణారెడ్డి, మోహన్ రెడ్డిలు తీవ్ర ప్రయత్నం
చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి రమణారెడ్డి, మోహన్ రెడ్డిలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక కడప-కర్నూలు-అనంతపురం జిల్లాల నుంచి పాన్యం నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ కె. జి. రెడ్డి గ్రాడ్యుయేట్స్ కోటాలో..పుల్లారెడ్డి ఉపాధ్యాయుల కోటాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అటు విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాల కోటాలో ఉన్న ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి కూడా టిడిపి నుండి పోటీ చేసేందుకు ఆశావహుల లిస్టు రోజు రోజుకు పెరుగుతోంది.

గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయించేలా ప్రణాళికలు
అయితే ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం ఉండటంతోపాటు..పట్టభద్రుల నియోజకవర్గాల్లో అభ్యర్థుల పనితీరును కూడా పరిశీలించాలని టిడిపి అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అవసరమైతే సర్వే రిపోర్టులు కూడా తెప్పించుకుని.. .గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. 

12:33 - October 22, 2016

రాయలసీమకు నిధులు విడుదల చేయాలి - గఫూర్..

కడప : రాయలసీమ ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయనిపక్షంలో రాయలసీమ వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ హెచ్చరించారు. 

12:25 - October 22, 2016

ఢిల్లీ : వివిధ బ్యాంకుల లక్షలాది డెబిట్ కార్డుల డాటా లీక్ వహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. వెంటనే దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా బ్యాంకులను ఆదేశించింది. హ్యాకింగ్ పై ఆందోళన చెందవద్దని కేంద్రం ప్రజలకు భరోసా ఇచ్చింది.

32 ల‌క్షల డెబిట్ కార్డుల డాటా చోరీ
32 ల‌క్షల డెబిట్ కార్డుల డాటా చోరీకి గురైన విషయమై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. డెబిట్‌ కార్టుల హ్యాకింగ్‌పై వివరాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు ఇతర బ్యాంకులను ఆదేశించింది. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు తీసుకోవలసిన రక్షణ చర్యలపై నివేదిక ఇవ్వాలని బ్యాంకులను కోరింది. నష్టాన్ని నివారించేందుకే దీనిపై విచారణ చేపట్టినట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.

కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ హామీ
సైబర్ సెక్యూరిటీ చాలా కీలకమైనదని.. భద్రతా ఉల్లంఘన విషయంలో బ్యాంకుల నుంచి వివరణాత్మక నివేదికలను కోరామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ చెప్పారు. డెబిట్‌ కార్డుల డాటా చోరీపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కంప్యూటర్‌ ద్వారా హ్యాకింగ్‌ చేశారని, దీన్ని సుళువుగా ఛేదించగలమన నమ్మకం ఉందని, ఈ విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.

కోటి 3 లక్షల రూపాయలను మోసపూరితంగా విత్‌డ్రా లు
చైనా, అమెరికా తదితర దేశాల్లో ఎటియం కార్డులను దురుపయోగం చేసి డబ్బులు విత్‌డ్రా చేసినట్లు తెలుస్తోంది. 641 మంది కస్టమర్ల ఎటిఎం కార్డుల ద్వారా కోటి 3 లక్షల రూపాయలను మోసపూరితంగా విత్‌డ్రా చేసినట్లు 19 బ్యాంకులు సూచనప్రాయంగా తెలిపాయి. కార్డు వినియోగదారులు మాత్రం భారత్‌లో ఉండడం గమనార్హం.

డేంజర్ జోన్లో 32లక్షల డెబిట్ కార్డులు..
వివిధ బ్యాంకులకు చెందిన దాదాపు 32 లక్షల కార్డులు డేంజర్ జోన్ లోపడ్డాయన్న వార్తలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించాయి. ముప్పు పొంచి ఉన్న కార్డుల్లో 26 ల‌క్షలు వీసా, మాస్టర్‌కార్డ్‌కు చెందిన‌వి కాగా.. 6 ల‌క్షలు రూపేకి చెందిన‌విగా బ్యాంకు వ‌ర్గాలు తెలిపాయి. దీనిపై స్పందించిన బ్యాంకులు డెబిట్‌ కార్డులను రిటర్న్‌ చేయాలని కోరాయి.

6 లక్షల 25 వేల కార్డులను బ్లాక్‌
ముందస్తు జాగ్రత్తగా 6 లక్షల 25 వేల కార్డులను బ్లాక్‌ చేయడమో లేదా రిప్లేస్‌ చేయడమో జరిగిందని ఎస్‌బిఐ పేర్కొంది. దాదాపు 12 లక్షల వరకు డబ్బులు విత్‌డ్రా చేశారని, మోసపోయిన కస్టమర్లను బ్యాంకులు ఆదుకుంటాయని ఎస్‌బిఐ తెలిపింది. ఏటీఎం పిన్ నెంబర్లు మార్చుకోవాల్సిందిగా వినియోగదారులకు దాదాపు అన్ని బ్యాంకులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి..దేశ వ్యాప్తంగా దాదాపు 60 కోట్ల డెబిట్‌ కార్డులు, 19 కోట్ల రుపే కార్డులుండగా... మిగతావి వీసా...మాస్టర్‌ కార్డులు వినియోగంలో ఉన్నాయి.

12:16 - October 22, 2016

హైదరాబాద్ : రోడ్డు పనులు పూర్తి కాకుండా పూర్తయినట్లుగా జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో సమాచారం సమాచారం పెట్టిన ఇంజినీరింగ్‌ అధికారులపై కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ను కమిషనర్ జనార్థన్ రెడ్డి సస్పెండ్‌ చేశారు. గత ఏడాది కాలంగా రూ. 337 కోట్లతో 900లకు పైగా పనులను జీహెచ్‌ఎంసీ పూర్తి చేసింది. పూర్తి కాని పన్లను కూడా పూర్తయినట్లుగా ఇంజినీరింగ్‌ అధికారులు వెబ్‌ సైట్‌లో అప్ లోడ్ చేయటంపై ఆగ్రహంచిన కమిషనర్ డిప్యూటీ చీప్ఇంజనీర్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. కాగా ఇప్పటికే జీహెచ్ ఎంసీ పై ఆరోపణల వెల్లువలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీర్ సస్పెండ్ చేయటం ఆసక్తిగా మారింది. కానీ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారలు పనుల విషయంలో నిర్లక్ష్యం చేయటం..వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవుసరం ఎంతైనా వుంది.

12:09 - October 22, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాలపై టీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఓ వైపు అధికారిక వ్యవహారాలను చక్కబెడుతున్న గులాబి దళపతి కేసీఆర్ .కొత్త జిల్లాల్లో పార్టీ సమీకరణలపై కసరత్తు మొదలు పెట్టారు. త్వరలో కొత్త జిల్లాలకు దళపతులను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొత్త జిల్లాలపై టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి
తెలంగాణలో రాష్ట్రంలోని కొత్త జిల్లాలపై టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 జిల్లాల కేంద్రంగా జరిగిన పార్టీ విస్తరణ కార్యక్రమాలు..ఇప్పుడు పెంచిన జిల్లాల ఆధారంగా ముందుకు వెళ్లనున్నాయి. జిల్లాల సంఖ్య భారీగా పెరగడంతో ఆయా జిల్లాల్లో నాయకత్వాన్ని బలపర్చడంపై గులాబి బాస్ కేసీఆర్‌ దృష్టి సారించారు. కొత్త జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలనే యోచనలో అధికార పార్టీ నేతలున్నారు.

కొత్త జిల్లాల్లో పార్టీ బలోపేతంపై కేసీఆర్‌ దృష్టి
జిల్లాల సంఖ్యను ప్రభుత్వం 31కి పెంచడంతో ఆయా జిల్లాల కేంద్రాలుగానే కొత్త నాయకత్వానికి బాధ్యతలు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ సభ్యత్వ నమోదు తర్వాత..కొత్త కార్యవర్గాలు పూర్తి స్థాయిలో కొలువు దీరనున్నాయి. అయితే ఆలోపుగానే జిల్లాల వారిగా అడహక్ కమిటీలను వేసి..పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలనే యోచనలో గులాబి బాస్ ఉన్నట్లు సమాచారం. కొత్తగా నియమించే కార్యవర్గాల ఆధ్వర్యంలోనే సాధారణ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పరంగా బలమైన నేతలను జిల్లాల అధ్యక్షులుగా నియమించే విషయంపైనే కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్దబలం, అంగబలంతో పాటు స్థానికంగా జిల్లాల్లో గుర్తింపు ఉన్ననేతలకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే చాన్స్ ఉందని పార్టీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీలో సీనియర్లుగా ఉన్న నేతలకే జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.వచ్చే ఏడాది నిర్వహించే పార్టీ ప్లీనరీ నాటికి అన్ని జిల్లాల్లో బలమైన నాయకత్వానికి బాధ్యతలు అప్పగించేందుకు ముఖ్యమంత్రి ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

12:05 - October 22, 2016

ముంబై : వివాదాస్పదమైన ఏ దిల్‌ హై ముష్కిల్‌ సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. భ‌విష్యత్‌లో పాకిస్థాన్ న‌టుల‌తో ప‌నిచేయ‌బోమ‌ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ముఖేశ్ భ‌ట్ తెలిపారు. పాక్ న‌టుల‌ను త‌మ సినిమాల్లో వాడుకోబోమ‌ని నిర్మాత‌ల మండ‌లి మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్నవీస్‌కు హామీ ఇచ్చిన‌ట్లు ముఖేశ్ భ‌ట్ స్పష్టం చేశారు. హే దిల్ హై ముష్కిల్ సినిమా విడుద‌ల‌ను అడ్డుకోనున్నట్లు మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన హెచ్చరించడంతో బాలీవుడ్ ప్రముఖులు మ‌హారాష్ట్ర సీఎంను కలిశారు. 

11:58 - October 22, 2016

హైదరాబాద్ : చలికాలం వచ్చిందంటే రోగాలు విపరీతంగా వ్యాపిస్తాయి. చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఈ కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే విష జ్వరాలు సోకి ప్రాణాలు పోయే అవకాశాలున్నాయి. ఈ చలికాలంలో స్వైన్‌ ఫ్లూ దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. అందువల్ల అప్రమత్తంగా ఉంటే... సోకే ప్రమాదాలు తక్కువంటున్నారు డాక్టర్లు.

స్వైన్‌ఫ్లూతో జాగ్రత్తలు తప్పనిసరి
చలికాలంలో ప్రాణాంతక మహమ్మారి స్వైన్‌ఫ్లూ జనంపై పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే దగ్గరలోని డాక్టర్‌ను సంప్రదించడం మాత్రం మరవొద్దు. కాస్త జ్వరం.. జలుబు వచ్చాయంటే నిర్లక్ష్యం చేయకుండా... వెంటనే ఆస్పత్రికి వెళ్లి...చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. గతేడాది స్వైన్‌ ఫ్లూ సోకి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నట్లు రాష్ర్ట ప్రభుత్వం కనిపించడం లేదు. స్వైన్‌ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందే వసతులు ఉంటే... స్వైన్‌ఫ్లూని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు డాక్టర్లు.

ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు
స్వైన్‌ఫ్లూ గాలిలో చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఒకరికి స్వైన్‌ఫ్లూ సోకితే.. మరొకరికి త్వరగా సోకే ప్రమాదం ఉంది. స్వైన్‌ ఫ్లూ సోకితే.. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. జ్వరంగా విపరీతంగా రావడం సాధారణ స్వైన్‌ ఫ్లూ లక్షణాలు. కొంతమందికి ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు.. లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు డాక్టర్లు. శ్వాస తీసుకోవటం, నీళ్లు తాగటానికి, ఆహారం మింగటానికి ఇబ్బంది పడుతున్నట్లయితే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. జ్వరం, తీవ్రంగా దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే స్వైన్ ఫ్లూగా భావించి అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. చిన్నపిల్లల విషయంలో... జ్వరం తగ్గిపోయిన వెంటనే వారిని స్కూల్స్‌కు పంపించకుండా.. ఒక రోజంతా ఇంట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకునేలా చేయాలి. చిన్నారులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పడు తప్పకుండా టిష్యూ పేపర్లను అడ్డు పెట్టుకోవాలని తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం ఉంది. పెద్దవాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక చలికాలంలో గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. ప్రభుత్వం కూడా సీజనల్‌ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

 

11:54 - October 22, 2016

కడప : గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఫ్యాక్టరీ పేరుతో భూములు కొంటూనే ఉన్నారు. కానీ.. ఇంతవరకు అక్కడ ఫ్యాక్టరీకి పునాది రాయి కూడా వేయలేదు. వాగ్ధానాలు అమలు చేయకపోగా.. అక్కడున్న ఊళ్లకు ఊళ్లూ ఖాళీ చేయించారు. కడప జిల్లాలో ఏసీసీ సిమెంటు ఫ్యాక్టరీ నిర్వాహకంపై 10TV ప్రత్యేక కథనం..!

సిమెంట్‌ ఫ్యాక్టరీకి 3వేల ఎకరాల సేకరణ
క‌డ‌ప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలంలో ఏసీసీ సిమెంట్‌ ఫ్యాక్టరీ కోసమంటూ దాదాపు మూడు వేల ఎకరాల భూములు సేకరించారు. 1996, 2006, 2010లో విడతల వారిగా భూ సేకరణ జరిపారు. అప్పటి ప్రభుత్వ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించారు. ఆ భూముల్లో ఉన్న గ్రామాలను కూడా ఖాళీ చేయించడంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. కానీ.. ఇరవై ఏళ్లు కావస్తున్నా... ఇప్పటికీ ఫ్యాక్టరీ మాత్రం ప్రారంభం కాలేదు.

గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఏసీసీ హామీ
సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఏసీసీ హామీ ఇచ్చింది. దీంతో తమ ప్రాంతంలో అభివృద్ధి జరిగి, ఉపాధి అవకాశాలు వస్తాయని చాలామంది భూములను ఇచ్చారు. అభివృద్ధి ఏమో గానీ.. ఇంతవరకు అక్కడ ఫ్యాక్టరీకి భూమి పూజ కూడా జరిగిన దాఖలాలు లేవు. అటు ఫ్యాక్టరీ ప్రారంభం కాక, ఇటు భూముల్లో సాగుకు అవకాశం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

భూముల్ని కాజేసిందని రైతుల ఆవేదన
ఏసీసీ మోసపూరితంగా భూముల్ని కాజేసిందని భూములిచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లయినా తమ భూములు బీడుగా ఉండటాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. ఫలితం లేకుండా పోయిందని బాధితులు వాపోతున్నారు. 

మైలవరం మండలం వద్దిరాల, గొల్లపల్లి గ్రామాల్లో ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ
మైలవరం మండలం వద్దిరాల, గొల్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేయబోయే ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీపై రైతుల అభ్యంతరాలను తెలుసుకునేందుకు కలెక్టర్‌ సత్యనారాయణ, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఏసీసీ కంపెనీ ప్రతినిధులు రైతులతో సమావేశమయ్యారు. సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటుతో రైతులకు, పర్యావరణానికి ఎలాంటి సమస్య ఉండదని ఏసీసీ కంపెనీ ప్రతినిధులు కలెక్టర్‌కు తెలిపారు. అయితే..భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం విషయంలో కంపెనీ ప్రతినిధులకు, రైతులకు మధ్య సయోధ్య కుదరలేదు. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం భూ సేకరణ చేసి.. అప్పటి ధర ఇవ్వడంతో తామెంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలిస్తామన్న హామీ కూడా నెరవేర లేదని బాధితులు వాపోతున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని హెచ్చరిక
ప్రస్తుత ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వడంతోపాటు.. ఉద్యోగాలు ఇవ్వనందుకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని బాధిత రైతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. లేనిపక్షంలో తమ భూములు తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అటు అభివృద్ధి లేక.. ఇటు భూముల్లో సాగు చేసుకోలేక తమ గ్రామాలు నష్టపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

 

11:47 - October 22, 2016

గుంటూరు : 2050 నాటికి అమరావతి నగరం ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి ఏడాది క్రితం ఇదే రోజున చంద్రబాబునాయుడు త్రీడీ నామూనాను ఏర్పాటు చేశారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరిశీలించారు. అయితే త్రీడీ నమూనాలోని తొమ్మిది నగరాల్లో ఇప్పటి వరకు ఒక్క నగరానికి కూడా శంకుస్థాపన జరగలేదు. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

 

11:36 - October 22, 2016

హైదరాబాద్ : అన్నింటికి వారే ప్రధానం.. ఏ పని జరగాలన్న వారే ముఖ్యం.. ఫ్లాన్‌ చేసి ఎగ్జిక్యూట్‌ చేయాల్సింది వాళ్లే.. దీంతో బల్దియాలో వారిదే ఇష్టారాజ్యం అయి పోయింది. చెప్పింది చెయ్యరు.. చేసింది చెప్పరు. అందుకే బల్దియా ఉన్నతాధికారులు వారిపై కన్నేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు నిపుణులతో కమిటీలు వేసి మరీ అబ్జర్వ్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ మాయగాళ్లు ఎవరు..? వారిపై అంతగట్టి నిఘా ఎందుకు.? వాచ్‌ దిస్ స్టోరీ..

గ్రేటర్‌లో ప్రతి డెవలప్‌ మెంట్‌ వర్క్‌ లో ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ కీలక పాత్ర
గ్రేటర్‌ లో రోడ్డు వెయ్యాలన్నా.. వాటిని తవ్వాలన్నా.. ఒపెన్‌ లాండ్స్‌కు ప్రహరీ గోడ నుంచి వేలాది కోట్లు ఖర్చు అయ్యే భారీ నిర్మాణాల వరకు వీరిదే హవా.. ఇంజనీరింగ్‌ డిపార్టుమెంట్‌ గ్రేటర్‌లో ప్రతి డెవలప్‌ మెంట్‌ వర్క్‌ లో కీలక భూమిక పోషిస్తుంది. ప్రధానమైన సౌకర్యాల కల్పనకు ఇది ముఖ్యమైన విభాగం. ఇంతవరకు బాగానే ఉన్నా.. గత కొద్ది కాలంగా వీరి పనుల్లో స్పష్టత లేకుండా పోతోంది. ఏ పని చేపట్టినా ఏళ్లు గడుస్తున్నాయి. ఇక గ్రేటర్‌ లో జరుగుతున్న పనుల నాణ్యత విషయంలోనూ పలు విమర్శలున్నాయి.

ఎక్కడ చూసిన గుంతలరోడ్లే
గ్రేటర్‌లో ఏ రోడ్డు వేసినా కొద్ది నెలల్లోనే పాడైపోతోంది. సిటీలో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలతో దర్శనమిస్తున్నాయి. వేసిన రోడ్లనే వేస్తారు. వెయ్యకుండానే వేసినట్లు చూపిస్తారు. ఎప్పుడోస్తారో తెలీదు. వేసిన రోడ్డును నెలరోజుల్లోనే ఎందుకు తవ్వుతారో తెలీదు. అంతా అయోమయం.. గందరగోళం. ఏ చిన్న పనైనా కన్సల్టెన్సీలపై అధార పడాల్సిందే. కన్సల్టెన్సీ లేకుండా ఏ ప్రాజెక్టుకు డీపీఆర్‌ ఉండదంటే వీరి పని తనాన్ని అర్ధం చేసుకోవచ్చు.. గడిచిన ఐదేళ్లలో కన్సల్టెన్సీలకు 30 కోట్ల రూపాయల వరకు చెల్లించారంటే వీరు ప్రణాళిక ఎలా తయారు చేస్తున్నారో తెలుస్తోంది.

925 ప్రాంతాల్లో 1688 కి.మీ బీటి రోడ్లకు రీ కార్పొరేట్‌
గ్రేటర్‌ ఎన్నికల సమయంలో హడావుడిగా 337 కోట్ల రూపాయల వ్యయంతో నగర రోడ్లను సుందరీకరిస్తున్నామన్నారు. ఇందులో 925 ప్రాంతాల్లో 1688 కిలోమీటర్ల బీటి రోడ్లును రీ కార్పొరేట్‌ చేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో భారీగా దెబ్బతిన్న రోడ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పనులు పూర్తి చేసిన రోడ్ల వివరాలను జీహెచ్‌ఎంసీ వెబ్‌ సైట్‌ లో ఉంచారు. అసలు కొన్ని చోట్ల రోడ్లు వెయ్యకుండానే పనులు కంప్లీట్‌ అయిన్నట్లు పేర్కొన్నారు. అయితే మీడియాలో వరుస కథనాలు రావడంతో స్పందించిన కమిషనర్‌ వాటిని చెక్‌ చేయించామన్నారు. పనులు పూర్తి చెయ్యని వాటికి ఎక్కడ బిల్లులు చెల్లించలేదన్నారు.

ఇంజనీర్ల చర్యలపై గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌
కొద్ది రోజుల క్రితం ఇంజనీర్ల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌.. గ్రేటర్‌ లో పని చేస్తున్న అన్ని విభాగాల ఇంజనీర్లతో ఒక రోజంతా రివ్యూ నిర్వహించారు. ఇటీవల వేస్తున్న రోడ్లను మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి రాత్రిళ్లు కూడా తనిఖీలు చేశారు. ఉన్నతాధికారులు బల్దియా ఇంజనీర్లపై నిఘా పెట్టారు. ఇప్పటికైనా అధికారులు మారుతారో లేదో వేచి చూడాల్సిందే.. 

జీహెచ్ఎంసీ డిప్యూటి చీఫ్ ఇంజనీర్ సస్పెండ్..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ డిప్యూటి చీఫ్ ఇంజినీర్ పై కమిషనర్ వేటు వేశారు. డిప్యూటి చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసన్ ను కమిషనర్ సస్పెండ్ చేశారు. రోడ్డు పనులు పూర్తికాకుండానే పూర్తయినట్లుగా జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లో తప్పుడు సమాచారం పెట్టడంపై కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కాకినాడకు చేరుకున్న సీఎం బాబు..

కాకినాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాకినాడకు చేరుకున్నారు. స్వచ్చ ఏపీ, వనం మనం కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. 

కొప్పాకలో అక్రమ కట్టడాల కూల్చివేత..

విశాఖపట్టణం : అనాకపల్లి మండలం కొప్పాకలో అక్రమ కట్టడాలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేస్తున్నారు. అడ్డుకున్న స్థానికులను పోలీసులు అరెస్టు చేశారు. 

జగిత్యాల సర్కారీ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు..

జగిత్యాల : ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ శరత్ అకస్మిక తనిఖీలు చేశారు. వైద్య సదుపాయాలు, ఓపీ నిర్వాహణ సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మహారాష్ట్ర సీఎంతో 'ఏ దిల్ హై..చిత్ర బృందం..

ముంబై : ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు మార్గం సుగమైనట్లే కనిపిస్తోంది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను చిత్ర బృందం కలిసింది. సినిమా రిలీజ్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి పాక్ నటుడితో సినిమా తీయనని నిర్మాత స్పష్టం చేశారు. 

11:14 - October 22, 2016

శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మాతగా వెంకట్ కాచర్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా "తను వచ్చెనంట". తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్య బాలకృష్ణన్ నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీతోగా తెరకెక్కింది. హార్రర్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సక్సెస్ తో చిత్ర టీమ్ మంచి జోష్ మీద వుంది. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే "జాంబీస్" ఈసారి తెలుగు సినిమాలో రష్మి రూపంలో కనిపించింది. సినిమా సక్సెస్ అవ్వటంతో మంచి జోష్ లో వున్న రేష్మి..ధన్య బాలకృష్ణ తో టెన్ టీవీ సరదాగా చిట్ చాట్ చేసింది. ఈ సినిమాలో అందరం కలిసి 'దామెడీ'చేసామంటున్న రేష్మీ, ధన్యా బాలకృష్ణలు చిత్ర విశేషాలను టెన్ టీవీతో పంచుకున్నారు. మరి వారు చెప్పిన విశేషాలేమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

హెచ్ఐఐసీలో ఐసీఏఐ అంతర్జాతీయ సదస్సు..

హైదరాబాద్ : హెచ్ఐఐసీలో ఐసీఏఐ అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 

10:48 - October 22, 2016

హైదరాబాద్ : మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీ.టీడీపీ విద్యార్థి బృందం ముట్టడించింది. ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ను టీడీపీ విద్యార్థి బృందం ముట్టడించేందుకు యత్నించింది. దీంతో ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పీఎస్ కు తరలించారు. కాగా తెలంగాణలో విద్యార్థులకు ఫీజ్ ల రీయింబర్స్ మెంట్ కు సంబంధించి కోట్లాది రూపాయలు పెండింగ్ లో వున్న బకాయిలను వెంటనే విడుదల చేయాలంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థులపట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా సంతకాల సేకరణ చేస్తామని...తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు.. ఫీజ్‌రీయింబర్స్‌మెంట్‌ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని ఉత్తమ్‌ ఆలేరులో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

10:37 - October 22, 2016

హైదరాబాద్ : పాతబస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 400లమంది పోలీసులతో చాంద్రాయణగుట్ట,ఫలక్ నుమా, బార్కాస్ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 21మంది పాత నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నిరూపిత పత్రాలు లేని 65 వాహనాలకు సీజ్ చేశారు. ఎవరూ తప్పించుకుపోకుండా ఆ ప్రాంతంలోని ప్రధాన మార్గాలన్నీ మూసివేసి నిర్భంధ తనిఖీలను చేపట్టారు. కల్తీ పాలు తయారుచేసే ఓ ముఠాను..బెల్లంపాకంతో తేనెను తయారుచేసే కల్తీ ముఠాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఈ ముఠాను పోలీసలు అరెస్ట్ చేశారు. 

ఆంకాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం..

నిజామాబాద్ : ఆర్మూర్ (మం) అంకాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కల్వర్టును కారు ఢీకొంది. దీనితో ముగ్గురు మృతి చెందగా ఇద్దరికీ గాయాలయ్యాయి. 

విద్యారంగం నిర్వీర్యమవుతోంది - తమ్మినేని..

రంగారెడ్డి : విద్యారంగం నిర్వీర్యమవుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఆరోరోజు పాదయాత్ర లింగంపల్లిలో కొనసాగింది. పేద విద్యార్థులు ఎలా చదుకోవాలని, ఇంటికో ఉద్యోగం ఏమైందని ఆయన ప్రశ్నించారు. మూతపడిన పరిశ్రమలు తెరిపించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. 

ఆర్మూరులో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..

నిజామాబాద్ : ఆర్మూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి కారులో షిర్డీ వెళ్లిన కుటుంబం తిరుగు ప్రయాణంలో ఆర్మూరు మండలంలోని అంకాపూర్ వద్ద ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను గోదావరిఖనికి చెందిన ప్రభాకర్‌రావు, సరేందర్‌రావు, రాణిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

62 ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జా..

శ్రీకాకుళం : రూ.10 కోట్ల విలువైన అటవీ శాఖ ఆస్తులు కబ్జాకు గురయ్యాయి. ఎడ్చర్ల మండలం కొయ్యాల పంచాయితీలో సర్వే నెం: 427 లోని 62 ఎకరాల భూమిని రాజకీయ నాయకులు కబ్జాచేశారనే ఆరోపణలతో ప్రజాసంఘాలు..స్థానికులు ఆందోళన బాట పట్టారు.

ఆరోరోజుకు చేరుకున్న సీపీఎం పాదయాత్ర..

రంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర ఆరోరోజుకు చేరుకుంది. ఐదోరోజున శుక్రవారం మంచాలకు చేరుకున్న పాదయాత్ర శనివారం ఉదయం నుండి మంచాల నుండి కొనసాగుతోంది.కాగా పాదయాత్రలో భాగంగా స్థానికులు తమ కష్టాలను సీపీఎం నేతలకు విన్నవించుకుంటున్నారు. ఈ సమస్యలపై పాదయాత్ర రథసారధి తమ్మినేని సీఎం కేసీఆర్ కు లేఖ ద్వారా తెలియజేశారు. లేఖలో పేర్కొన్న అంశాలను వెంటనే నెరవేర్చాలని లేఖలో పేర్కొన్నారు. కాగా ఐదోరోజు సాయంత్రానికి పాదయాత్ర 100 కిలోమీటర్లు  దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.

మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించిన టీఎన్ఎస్ఎఫ్..

హైదరాబాద్ : మినిస్టర్ క్వార్టర్స్ ను టీడీపీ విద్యార్థి బృందం ముట్టడించింది. ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమండ్ చేస్తూ  టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ను టీడీపీ విద్యార్థి బృందం ముట్టడించింది. దీంతోఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. 

కూలిన చాపర్..19మంది మృతి..

రష్యా : సైబీరియా ప్రాంతంలో రష్యాకు చెందిన ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది. క్రస్నోయార్క్‌ రీజియన్‌ నుంచి ఉరెంగోయ్‌ ప్రాంతానికి 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎం-8 హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. సమాచారమందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదం నుంచి ముగ్గురు ప్రయాణికులను రక్షించగా.. 19 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.సాంకేతిక కారణాలు లేదా వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

తిరుమలలో మొరాయించిన సర్వర్లు..

తిరుమల : తిరుమలలో సర్వర్లు మొరాయించాయి. శ్రీవారి మెట్టు నడకదారిలో దివ్యదర్శనం కౌంటర్ వద్ద సర్వర్లు మొరాయించాయి. దీంతో రెండు గంటలుగా భక్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు.కాగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

09:08 - October 22, 2016
09:05 - October 22, 2016

నెల్లూరు: అనారోగ్యంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన ఓ యువకుడు బ్రెయిన్‌డెడ్‌గా మృతిచెందాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దినేశ్ రెడ్డి (31) అనే యువకుడిని వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. శ్రీధర్ రెడ్డి అనూషలకు ఒకే కుమారుడు..గత కొంతకాలంగా ఫిట్స్ తో బాధపడుతున్న దినేశ్ రెడ్డి బ్రెయిన్ డెడ్ తో మృతి చెందాడు. అవయవదానంపై అవగాహన కల్పించడంతో తల్లిదండ్రులు దినేశ్ అవయవాల దానానికి ముందుకొచ్చారు. నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో ఆపరేషన్ పూర్తయ్యింది. అనంతరం దినేశ్ గుండె, లివర్ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి..ఓ కిడ్నీని నారాయణ ఆసుపత్రికి, మరో కిడ్నీని బొల్లినేని ఆసుపత్రులకు,కళ్లు మోడరన్ కంటి ఆసుపత్రికి.. తరలించారు.దీంతో యువకుడి కాలేయం, గుండెను హైదరాబాద్ కిమ్స్‌లో బాధితులకు అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. నెల్లూరు నుంచి బేగంపేట వరకు హెలికాప్టర్ ద్వారా అవయవాలను తరలించారు. దీంతో యువకుడి కాలేయం, గుండెను హైదరాబాద్ కిమ్స్‌లో బాధితులకు అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. నెల్లూరు నుంచి బేగంపేట వరకు హెలికాప్టర్ ద్వారా అవయవాలను తరలించారు.
ఒకప్పుడు అవయదానంపై అవగాహనాలేమి..
ఒకప్పుడు అవయవదానం అంటేనే పెద్ద అపచారం భావించేవారు. అన్ని అవయవాలతోనూ ఖననం లేదా అంత్యక్రియలు పూర్తి చేస్తేనే వారికి స్వర్గంలోకం ప్రాప్తిస్తుందనీ..లేదంటే వారికి విముక్తి లభించదని నమ్మేవారు. కానీ ఇటీవలి కాలంలో అవయవదానాల పట్ల ప్రజలలో అవగాహన పెరుగుతోంది. ఇది శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఒక మనిషి అనివార్య కారణాలతో బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందినా..లేదా ప్రమాదానికి గురయినా ఆ వ్యక్తి యొక్క అవయవాలు తనతోపాటే మట్టిలో కలిసిపోయి ఎటువంటి ఉపయోగం లేకపోయే కంటే మరోకొంతమందికి అవి ప్రాణదానం చేసే ప్రక్రియ ఈ అవయవదానంతో చేకూరుతుంది. దీనిపై సమాజంలో వస్తున్న మార్పుతో మరికొంతమంది ఆరోగ్యానికి ప్రాణానికి లబ్ది చేకూరటం ఎంతో మంచి విషమే కదా..కానీ మృతుల కుటుంబ సభ్యులు తీసుకునే ఈ అవయవదానం పట్ల వారు వేదనను కూడా సమాజం అర్థం చేసుకోవాల్సిన అవుసరం వుంది..వారిని అభినందనలు తెలిపాల్సిన అవుసరం కూడా వుంది.

08:41 - October 22, 2016

నటి..గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన మహిళా దర్శకురాలు..సూపర్ స్టార్ కృష్ణ భార్య అయిన విజయ నిర్మలకు మనువడు, సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా 'నందిని నర్సింగ్ హోం' శుక్రవారం రిలీజైంది. పి.వి.గిరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పూర్తి రొమాంటిక్ కామెడీగా సాగింది. కథలోకి వెళ్తే.. మధ్యతరగతి కుర్రాడైన చంద్రశేఖర్ అలియాస్ చందు (నవీన్ విజయ కృష్ణ) వైజాగ్ లోని ఓ బ్యాంకులో రికవరీ మన్ గా పని చేస్తుంటాడు. ఆ బ్యాంకు పక్కనే గర్ల్స్ హాస్టల్.. ఇంకేం.. ఆ హాస్టల్ నుంచి వచ్చే స్వీట్ వాయిస్ కి ఐసై పోతుంటాడు. ఆ హాస్టల్ లోని అమూల్య (శ్రావ్య) అనే అమ్మాయిదే ఆ గొంతు అని తెలుసుకుంటాడు. పరిచయాలు ఏర్పడతాయి. అయితే ఇద్దరి దృక్పథాలు వేరు. డబ్బే ముఖ్యం అన్నది అమూల్య ఫిలాసఫీ అయితే డబ్బు కన్నా బంధాలు, బాంధవ్యాలు గొప్పవి అని చందు నమ్ముతుంటాడు.ఈ నేపథ్యంలో సాగిన నందిని నర్శింగ్ హోం సినిమా కు టెన్ టీవీ ఇచ్చిన రేటింగ్ తెలుసుకోవాలంటే ఈ వీడయో చూడండి..

08:16 - October 22, 2016

హైదరాబాద్ : శుక్రవారం తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతుల మూడో విడత రుణమాఫీ, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు నెలరోజుల్లోగా పెండింగ్ బకాయిలు క్లియర్ చేయాలని సీఎం కేసీఆర్ మంత్రులకు ఆదేశాలు జారీచేశారు.ఈ అంశాలపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం నేత) రాకేశ్ (టీఆర్ఎస్ నేత) అద్దంకి దయాకర్ (టీ.కాంగ్రెస్ నేత) పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ..సీపీఎం చేపట్టిన మహాపాదయాత్రలో ప్రజల వద్ద నుండి ప్రధానంగా ఈ అంశాలపైనే ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు..దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇలా టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన అవుసరముందని జూలకంటి డిమాండ్ చేశారు. ఈ అంశాలపై చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి విషయాలను వెల్లడించారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

8 మంది పాక్ రేంజర్లు హతం..

జమ్మూకాశ్మీర్ : హీరా నగర్ సెక్టార్ లో ఈరోజు ఉదయం పాక్ బలగాలు కాల్పులకు తెగబడటంతో, ఆ కాల్పుల్లో మన బీఎస్ఎఫ్ జవాన్ గాయపడటం విదితమే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీఎస్ ఎఫ్ బలగాలు దీటుగా సమాధానం చెప్పాయి. ఒక ఉగ్రవాది సహా, ఏడుగురు పాక్ రేంజర్లను హతమార్చినట్లు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. జమ్మూలో చొరబడాలన్నదే వారి ప్రధాన లక్ష్యమని, చొరబాటు యత్నాలను తాము తిప్పికొడుతున్నామని ఈ సందర్భంగా ఆ అధికారి పేర్కొన్నారు.

దినేశ్ బ్రెయిన్ డెడ్..అవయవదానం..

నెల్లూరు: అనారోగ్యంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన ఓ యువకుడు బ్రెయిన్‌డెడ్‌గా మృతిచెందాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో గల అపోలో ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దినేశ్(31) అనే యువకుడిని వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. అవయవదానంపై అవగాహన కల్పించడంతో తల్లిదండ్రులు దినేశ్ అవయవాల దానానికి ముందుకొచ్చారు. దీంతో యువకుడి కాలేయం, గుండెను హైదరాబాద్ కిమ్స్‌లో బాధితులకు అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. నెల్లూరు నుంచి బేగంపేట వరకు హెలికాప్టర్ ద్వారా అవయవాలను తరలిస్తున్నారు.

07:40 - October 22, 2016
07:37 - October 22, 2016

రంగారెడ్డి : ప్రజా సమస్యలపై సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర వంద కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. సమస్యల పరిష్కారం కోసం..ప్రజలకు అండగా నిలిచేందుకు పార్టీ ప్రజలతో మమేకమై సాగుతోంది. మండలాలు, తండాలు, గ్రామాల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అడుగడుగునా పాదయాత్రను ఆహ్వానిస్తూ..ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారు. పాదయాత్రలో వెల్లువెత్తిన సమస్యలను సీఎంకు వివరిస్తూ తమ్మినేని లేఖ రాశారు.

ఐదో రోజు..వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సీపీఎం పాదయాత్ర
జనంతో మమేకమై.. సాగుతున్న మహాజన పాదయాత్ర ఐదో రోజు..వంద కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. తండాలు, గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తమ్మినేని బృందం ముందుకు సాగుతోంది. మంచాల మండలం లోయపల్లిలో ఉదయం ప్రారంభమైన పాదయాత్ర ఆంబోతు తండా, సత్యంతండా, ఎల్లమ్మతండా, రంగాపూర్‌, జ్యాపాల, ఆరుట్ల వరకు సాగింది. రంగాపూర్‌ సమీపంలోని కోళ్లవంపు గ్రామం వద్ద పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఐదో రోజు పాదయాత్ర మంచాల మండలం రంగాపురం గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులు డప్పులు, గంగిరెద్దులతో ఘనస్వాగతం పలికారు. ఎర్రచీరలు, రెడ్‌ షర్ట్‌లతో 1500 మంది కార్యకర్తలు మహా పాదయాత్రలో పాల్గొన్నారు. తమ్మినేని బృందం గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పాదయాత్రకు పలువురు మద్దతు
సీపీఎం పాదయాత్రకు కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ రైతు సంఘం నేత కోదండరెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, కాంగ్రెస్‌, టీడీపీ స్థానిక నేతలు మద్దతు తెలిపారు. త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ సీపీఎం అని.. సీపీఎం పాదయాత్రను చూస్తే కేసీఆర్‌కు భయం పుట్టుకుందని అందుకే విమర్శిస్తున్నారని పాశం యాదగిరి అన్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన కేసీఆర్.. తండాలను పంచాయితీలుగా చేయడంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పార్టీ సీపీఎం కాదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అండగా నిలిచి రుణమాఫీ, తండాలను పంచాయితీలు మార్చే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎర్రజెండా ఎప్పటికీ అండగా ఉంటుందని తమ్మినేని అన్నారు.

పాదయాత్ర దృష్టికి వచ్చిన సమస్యలపై కేసీఆర్ కు తమ్మినేని లేఖ
పాదయాత్రలో ప్రజల నుంచి వెల్లువెత్తిన సమస్యలపై తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తండాల్లో విద్యావంతులు, యువకులు నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మానసిక వేధనకు గురవుతున్నారని, బతుకు దెరువు కోసం పట్టణాలకు వలసలు పోతున్నారని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు. 

07:31 - October 22, 2016

గుంటూరు : నకిలీ విత్తనాలు రైతన్నలను నట్టేట ముంచుతున్నాయి. ఎన్నడూ లేనంతగా నకిలీ విత్తనాలతో గుంటూరు జిల్లా అన్నదాతలు అప్పులపాలయ్యారు. రెండో పంట పండించే అవకాశం కూడా లేకపోవటంతో నష్టపరిహారం కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు రైతులు. నకిలీ విత్తనకంపెనీలపై చట్టపరమైన చర్యలతో చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం,. రైతన్నలను ఆదుకోవడంపై మాత్రం దృష్టిసారించటంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మనస్తాపంతో ముగ్గురు రైతుల ఆత్మహత్య
అసలే పంటలు పండక తీవ్ర నష్టంలో ఉన్న రైతులకు నకిలీ విత్తనాల రూపంలో మరింత నష‌్టం జరుగుతోంది. గుంటూరు జిల్లా రైతులను నకిలీవిత్తనాలు నట్టేట ముంచాయి. నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయామనే మనస్తాపంతో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ విషయాన్ని రైతులందరూ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లారు.

నకిలీవిత్తన కంపెనీలపై సస్పెన్షన్‌ విధింపు
నకిలీ విత్తనాల సాగుతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన బాట పట్టారు. తీవ్రస్థాయిలో నిసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం..నకిలీ విత్తన కంపెనీలపై దృష్టి సారించింది. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ కావేరి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. జీవా కంపెనీ విత్తనాల విక్రయాలపై కూడా ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. అయితే నకిలీ విత్తన వ్యాపారులపై చర్యలు తీసుకోవడంతోపాటు..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నపుడే...న్యాయం జరుగుతుందని రైతులు చెబుతున్నారు.

నకిలీవిత్తన వ్యాపారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
ప్రభుత్వం భరోసా ఇచ్చినా..తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తమకు న్యాయం చెయ్యాలంటూ ఆందోళనలను రోజురోజుకు ఉధృతం చేస్తున్నారు. ప్రతిపక్షపార్టీలు, ప్రజాసంఘాలు సైతం రైతులకు అండగా నిలుస్తున్నాయి. నకిలీవిత్తన వ్యాపారులను అరెస్ట్‌ చెయ్యడంతోపాటు..రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ప్రభుత్వం స్పందించాలని రైతుల డిమాండ్
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు.

07:23 - October 22, 2016

హైదరాబాద్  : గ్రేట‌ర్ ప‌రిధిలో దెబ్బతిన్న రోడ్ల వ‌ల్ల డామెజ్ అవుతున్న ఇమేజ్‌ను కంట్రోల్ చేసే ప‌నిలో ప‌డింది బ‌ల్దియా. సిటిలోని ఏ రోడ్డు దెబ్బతిన్నా..దాని దృష్టి జీహెచ్ ఎంసీ వైపే ఉంటుండ‌టంతో నగరరోడ్లను వెంట‌నే బాగు చెయ్యాలని అన్ని విభాగాల‌కు ఆదేశాలు జారీచేసింది బ‌ల్దియా. జాతీయ, రాష్ట్ర రాహ‌దారుల అధికారుల‌తోపాటు..మెట్రో, వాట‌ర్ బోర్డు,టీఎస్ ఐఐసీ , విద్యుత్‌శాఖ అధికారుల‌తో మేయర్‌ అత్యవసర స‌మావేశం ఏర్పాటు చేశారు.

గ్రేట‌ర్ ప‌రిధిలో 1688 కిలోమీటర్ల రోడ్లను రీకార్పెట్ చేసింది బ‌ల్దియా. .
గ్రేటర్‌ ఎన్నిక‌ల స‌మ‌యం నుండి కొద్ది నెల‌ల వ‌ర‌కు గ్రేట‌ర్ ప‌రిధిలో 1688 కిలోమీటర్ల రోడ్లను రీకార్పెట్ చేసింది బ‌ల్దియా. అందుకోసం 337కోట్లు రూపాయల్ని ఖ‌ర్చు చేసింది. అయితే ఇటీవల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా న‌గ‌రంలోని రోడ్లన్నీ చిధ్రమయ్యాయి. జాతీయ‌, రాష్ట్ర కార్పొరేష‌న్ రోడ్లతో పాటు మెట్రో రైల్..,తెలంగాణ పారిశ్రామికాభివృద్ది సంస్థలు నిర్వహిస్తున్న రోడ్లు కూడా గోతుల మ‌యం అయ్యాయి. దాంతో న‌గ‌రంలో స‌గ‌టూ ప్రయాణ వేగం స‌గానికి ప‌డిపోవ‌డంతో పాటు..విపరీతమైన దుమ్ము దూళీ లేస్తుంది. దాంతో వాహ‌న‌దారుల‌తోపాటు సిటిజ‌న్స్ రోడ్ల దుస్థితిపై బల్దియాపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల అధికారుల‌తో అత్యవసర స‌మావేశం నిర్వహించారు మేయ‌ర్ బొంతురామ్మోహన్‌.

టెండ‌ర్లు ఫైన‌ల్ చేసిన వెంట‌నే రోడ్ల మ‌ర‌మ్మతులు : కమిషనర్
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో జాతీయ ర‌హ‌దారులు 88 కిలోమీట‌ర్లు ఉన్నాయి. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల 20కిలోమీట‌ర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. వాటిని మరమ్మతు చెయ్యడానికి 11కోట్ల రూపాయ‌లతో టెండ‌ర్లు పిలిచామ‌ని..ఇవాళ టెండ‌ర్లు ఫైన‌ల్ చేసిన వెంట‌నే రోడ్ల మ‌ర‌మ్మతులు చేపడుతామని జాతీయ ర‌హ‌దారుల అధికారులు తెలిపారు. ఇక ఇండ‌స్ట్రీయ‌ల్ లోక‌ల్ అథారిటీ ఆధ్వర్యంలో 15 కిలోమీట‌ర్ల మేర ఇప్పటికే రోడ్లు వేశామ‌ని..మ‌రికొద్ది రోజుల్లో ఫైనాన్షియల్‌ సిటీ నుండి నాన‌క్‌రాంగూడ‌ వ‌ర‌కు మ‌రో 5 కిలోమీట‌ర్ల రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను వారం రోజుల్లో చేప‌డుతామ‌న్నారు అధికారులు. అలాగే మెట్రో అధికారులు కూడా వేగంగా ప‌నులు పూర్తిచేస్తారని కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి ప్రకటించారు.

నగరంలో 88 కి.మీ జాతీయ రహదారులు
మొత్తానికి భారీ వర్షాల వల్ల చిద్రమైన రోడ్లను బాగుచేసేందుకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. కొద్ది రోజుల్లోనే గతుకుల మయంగా మారిన నగర రోడ్లు మళ్లీ తళతళ మెరిపిపోతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్తున్నారు. 

07:16 - October 22, 2016

విజయవాడ : నవంబర్‌ ఒకటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. నిన్న జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. 14 అంశాలపై చర్చించిన పొలిట్ బ్యూరో కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఉండవల్లిలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం..
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన పొలిట్‌ బ్యూరో సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన వహించిన ఈ సమావేశం యూరీ ఘటనలో వీర మరణం పొందిన ఆర్మీ జవాన్లకు సంతాపం తెలిపిన తర్వాత మొదలైంది.

2016-18 సంవత్సరాలకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చ
2016-18 సంవత్సరాలకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు త్వరలో పార్టీ చేపట్టబోయే జన చైతన్య యాత్రలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నవంబర్‌ ఒకటి నుంచి నెల రోజుల పాటు ఏపీ, తెలంగాణ ప్రాంతాలతో పాటు తెలుగు ప్రజలుండే అన్ని రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

డ్వాక్రా మహిళలకు రుణ సదుపాయంపై చర్చ
డ్వాక్రా మహిళలకు రుణ సదుపాయం, అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి పక్షాల నుంచి వస్తున్న వ్యతిరేకతను తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాంపై సమావేశంలో చర్చించారు. త్వరలో జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు, పోలవరం ప్రాజెక్టు, ఏపీ, తెలంగాణ జల జగడంపై చర్చించారు.

హైదరాబాద్‌ లోని ఏపీ సచివాలయాలపై సమావేశంలో చర్చ
హైదరాబాద్‌ లోని ఏపీ సచివాలయాలపై కూడా సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కొత్త జిల్లాలు, ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలపై ఉద్యమ ప్రణాళిక రూపొందించినట్లు టి.టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ చెప్పారు. టీడీపీ రెండున్నరేళ్ల కాలంలో జరిగిన పురోగతి, కార్యకర్తల పిల్లల సంక్షేమంపై పొలిట్‌ బ్యూరోలో చర్చించినట్లు తెలిపారు.

చర్చకు రాని కేబినెట్ విస్తరణ అంశం..
ఏపీ కేబినెట్‌ విస్తరణ సమావేశంలో చర్చకు వస్తుందని అనుకున్నప్పటికీ అటువంటి ప్రస్తావన రాలేదు.

07:07 - October 22, 2016

గుంటూరు : కాలం కరిగిపోతోంది..ఆశలు సన్నగిల్లిపోతున్నాయి..కోటి ఆశలతో వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్లో ఆందోళన మొదలవుతోంది. కానీ,.పాలకులు వేసిన శిలాఫలకాలు మెరిసిపోతూనే ఉన్నాయి. ఆప్యాయంగా ప్రధాని తీసుకొచ్చిన మట్టి నీరు అక్కడే ఉంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ విడుదల చేసిన నమూనా అలాగే ఉంది. కానీ,..శాశ్వత రాజధానికి ఇంకా పునాదిరాయి కూడా పడలేదు. నవ్యాంధ్ర రాజధానికి శంఖుస్థాపన చేసి..ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా 10టీవీ ప్రత్యేక కథనం...!

ఉత్సాహం నింపిన నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమం
అక్టోబర్ 22 , 2015, ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలు మరిచిపోలేని రోజు. సొంత రాజధాని కలను నిజం చేస్తూ ప్రభుత్వం చేసిన శంకుస్థాపన కార్యక్రమం ప్రజలందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. కొత్త రాజధానిని నిర్మాణం చేస్తామంటూ, అంతర్జాతీయ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు ఉంటాయంటూ ప్రభుత్వం ప్రకటించి..రైతుల నుండి వేల ఎకరాల భూములు తీసుకుంది. వారి ఇచ్చిన భూముల్లో గతేడాది దసరా రోజు రాజధాని నిర్మాణానికి ప్రధాన శంకుస్థాపన చేశారు.

రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగి ఏడాది పూర్తి
ఈ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, విదేశీ ప్రతినిధులు ఇలా దేశంలోని ప్రముఖులందర్నీ ఆహ్వానించి..శంకుస్థాపన చేశారు. ఇలా ఆర్భాటంగా శంకుస్థాపన చేసి ఏడాది అవుతున్నా..రాజధాని నిర్మాణంలో ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. గతేడాది ఇదే రోజు వేసిన శిలాఫలకాలు, మట్టి నీరు, యాగశాలలు అలానే ఉన్నాయి. రాజధానికి సంబంధించి ప్రభుత్వం చేసిన ఒకే ఒక్క అభివృద్ధి గత ఏడాది శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని షెడ్డులు వేసి అందంగా నిర్మాణం చేయడం..!

2018 నాటికి మొదటి ఫేజ్‌ నిర్మాణం పూర్తిచేస్తామంటున్న సర్కార్‌
శంకుస్థాపన చేయక ముందు, చేసిన తర్వాత ప్రభుత్వం చెబుతున్న మాట 2018 నాటికి రాజధానిలో మొదటి ఫేజ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని. కానీ, ఏడాదిన్నర కాలంగా చెబుతున్న మాటలు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు..కానీ, శాశ్వత రాజధానికి సంబంధించిన ఎలాంటి పనులు ప్రారంభించడం లేదు. 2015 జనవరి 2న రాజధాని నిర్మాణానికి భూములు తీసుకునే సమయంలోనూ ఇవే మాటలు చెప్పారు. పాలన మొత్తం హైదరాబాద్ నుండి వెలగపూడికి తీసుకురావడానికి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించడం తప్పించి,..శాశ్వత రాజధానిపై మాత్రం ఫోకస్ పెట్టలేదు. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డిజైన్స్ ఎంపిక చేయడానికే మరో 3 నెలల సమయం
శంకుస్థాపన చేసి ఏడాది అవుతున్నా ఇంకా ప్రభుత్వ భవనాలకు సంబంధించిన డిజైన్స్‌ను ఎంపిక లేదు. ఇంతకముందు జపాన్‌కు చెందిన మాకీ అసోసియేషట్స్ డిజైన్స్ ఇచ్చినప్పటికీ...అవి చెత్తగా ఉన్నాయనే విమర్శలతో రాష్ర్ట ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మళ్లీ ఇప్పుడు డిజైన్స్ కోసం టెండర్ పిలిచి ఎంపిక చేయనున్నారు. అంటే..డిజైన్స్ ఎంపిక చేయడానికే మరో 3 నెలల సమయం పట్టనుంది. డిజైన్స్ ఎంపిక చేసిన తర్వాత ప్రభుత్వానికి అసలు పని మొదలవుతుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన మొదటి ఫేజ్ నిర్మాణం అంత ఆషామాషీగా అయ్యే అవకాశం లేదు. కృష్ణానది ఒడ్డున కట్టాలనుకుంటున్న సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి గ్రౌండ్ వర్క్ కోసమే ఎక్కువ సమయం పట్టే అవకాశముంది. ప్రభుత్వం చెప్పిన 2018 నాటికి వీటి నిర్మాణాలు జరిగే అవకాశం లేదు. శంకుస్థాపన చేసిన నాటి నుండి పనులు ప్రారంభించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన కోర్టు వివాదాలు
మరోవైపు రాజధాని నిర్మాణంపై కోర్టుల్లో జరుగుతున్న వివాదాలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. వాస్తవంగా రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించకపోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులు. అంతర్జాతీయ స్థాయిలో 9 నగరాలతో రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు డబ్బు అవసరం. కానీ, ప్రభుత్వం వద్ద నిధుల కొరత భారీగా ఉంది. రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి, కేంద్రం ఎప్పటికప్పుడు మొండి చెయ్యి చూపుతూనే ఉంది. ఇటు స్వీస్‌ చాలెంజ్‌ విధానంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సింగపూర్ కన్సార్టియంకు రాజధాని భూములు కట్టబెట్టేందుకు స్వీస్ చాలెంజ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇక రాజధాని కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న రైతుల్లో మాత్రం అసహనం ఆకాశాన్ని అంటుతోంది. వారికి ఇవ్వాల్సిన ప్లాట్లను ఇవ్వకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు రైతులు. శంకుస్థాపన చేయకముందే పాడి పంటలతో బాగుండేందని రైతులు గుర్తుచేసుకుంటున్నారు.

ప్రతిపక్షాల విమర్శలు
ఏడాది కాలంగా ఎలాంటి పురోగతి చేయలేని వారు అంతర్జాతీయ స్థాయిలో రాజధాని ఎలా కడతారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. శాశ్వత రాజధాని నుంచి దృష్టి మళ్లించడానికి తాత్కాలిక సచివాలయం అంటూ హడావిడి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శంకుస్థాపన చేసిన పాలకులు పూర్తి స్థాయిలో రాజధాని పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చే ఏడాదికైనా ఇవే శిలాఫకాలు ఉంటాయా..? లేక శాశ్వత రాజధాని నిర్మాణాలు కనబడుతాయో లేదో చూడాలి..!

07:01 - October 22, 2016

హైదరాబాద్ : నగరంలోని ఏపీ స‌చివాల‌యం క‌థ ఇక కంచికేనా...! తెలంగాణ ప్రభుత్వానికి సచివాల‌యం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీక‌రించిన‌ట్టేనా..? తాజా పరిణామాలు చూస్తే ఇలాగే కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రెండుగా ఏర్పడిన స‌చివాల‌యం..ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం చేతిల్లోకి వెళ్లిపోతోంది...!

హైదరాబాద్‌ను 10 ఏళ్లు ఉపయోగించుకుంటామన్న ఏపీ సర్కార్‌
ఆంధ్రప్రదేశ్‌ స‌చివాల‌యం హైదరాబాద్‌ నుంచి వెల‌గ‌పూడికి షిప్ట్ అయినా..లైజెనింగ్ స్టాఫ్‌ మాత్రం ప‌ని చేస్తున్నారు. ప‌దేళ్ల పాటు సచివాల‌యాన్ని త‌ప్పనిస‌రిగా ఉప‌యోగించుకుంటామ‌ని ఏపీ ప్రభుత్వం గతంలో చెప్పింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో టోటల్‌గా సీన్‌ మారింది. ఏపీ స‌చివాల‌యాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. గ‌వ‌ర్నర్ న‌ర‌సింహ‌న్‌తో ఈ అంశాలపై చ‌ర్చించామ‌ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడంతో... ఏపీ సచివాల‌యాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం ఖాయ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది.

హైదరాబాద్‌పై ఆంధ్రప్రదేశ్‌కు ప‌దేళ్ల పాటు హక్కు
ఉమ్మడి రాజ‌ధాని హైదరాబాద్‌పై ఏపీకి ప‌దేళ్ల పాటు హక్కుంది. కానీ, ప్రభుత్వం మాత్రం రాష్ర్ట విభజన జరిగిన రెండున్నర ఏళ్ల తర్వాత నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి పాలన సాగిస్తోంది. విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి సచివాల‌యంలో కొన్ని బ్లాకులు కేటాయించారు. దీంట్లో ప్రధానంగా ఎల్‌-బ్లాకులో సీఎం చంద్రబాబు అత్యున్నత స్థాయిలో తన చాంబ‌ర్‌ను 30 కోట్ల ఖర్చుతో ఆధునిక హంగులతో త‌యారు చేయించుకున్నారు. ఇప్పుడు ఇవ‌న్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోనున్నాయి. అయితే..తెలంగాణ సచివాల‌యాన్ని పూర్తిస్థాయిలో తీసేసి కొత్త నిర్మాణాలు చేప‌ట్టనున్నారు. దీంతో ఏపీ స‌చివాల‌యం జె-బ్లాక్‌తో పాటు మరికొన్ని బ్లాకుల్లో తెలంగాణ స‌చివాల‌యంలోని కొన్ని శాఖ‌లు ఉంచాల‌ని నిర్ణయించిన‌ట్టు స‌మాచారం. నిర్మాణం పూర్తయిన త‌ర్వాత ఏపీ స‌చివాల‌యాన్ని కూడా తీసేసి ఈ ప్రాంతంలో గార్డెన్లు, టూరిజం హోట‌ల్ ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నట్టు స‌మాచారం.

సెక్షన్‌-8 అమలు చేయాల‌ని కోరిన ఏపీ మంత్రులు
ఓటుకు నోటు కేసు సమయంలో హైదరాబాద్‌లో సెక్షన్‌-8 అమలు చేయాల‌ని ఏపీ మంత్రులు గట్టిగా వాదించారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉమ్మడి రాజ‌ధాని హైదరాబాద్‌ను విడిచి వెళ్లమని తేగేసి చెప్పారు. కానీ, తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో అమరావతి నుంచి పాలన మొదలైంది. ప్రస్తుతం ఏపీ స‌చివాల‌యాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చింది. దీనిపై ఇప్పటికే భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మ‌రి దీనిపై అధికారిక ప్రక‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. 

06:56 - October 22, 2016

హైదరాబాద్ : రెండేళ్ల పరిపాలనపై ప్రజలు అభిప్రాయానికి అనుగుణంగా పని చేయాలని సీఎం కేసిఆర్ మంత్రులకు సూచించారు. చాలా రోజుల తరువాత జరిగిన తెలంగాణ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పే విధంగా ఉండాలని కేసీఆర్ మంత్రులకు తెలిపారు. అన్ని ముఖ్యమంత్రే చూసుకుంటాడనే ధోరణితో వ్యవహరించడం మంచిది కాదని మంత్రులకు హిత బోధ చేసినట్లు సమాచారం.

బ్రిజేశ్ ట్రైబ్యునల్‌ తీర్పు..లాభనష్టాలపై స్పష్టమైన రిపోర్టుకు ఆదేశం
బ్రిజేశ్ ట్రైబ్యునల్‌ తీర్పువల్ల జరగబోయే లాభనష్టాలపై స్పష్టమైన రిపోర్టు అందించాలని సీఎం కేసీఆర్ మంత్రులకు ఆదేశించారు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై తదుపరి కార్యాచరణకు హరీష్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం ఆర్థికాభివృద్ధితో ముందకు పోతుంటే..ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉందని ఆయన అన్నారు.

ఆరోగ్యశ్రీ బకాయిలపై మంత్రి లక్ష్మారెడ్డిపై సీఎం ఆగ్రహం
కేబినెట్‌ సమావేశంలో ఆరోగ్యశ్రీ బకాయిల అంశంలో మంత్రి లక్ష్మారెడ్డిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ నిధులను అడ్డుపెట్టుకొని ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల అమలు విషయంలో పక్కాగా ఉండాలని సూచించారు. ఇందుకు మంత్రి లక్ష్మారెడ్డి నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌ ఆసుపత్రులపై తనకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఫీజురీయింబర్స్‌మెంట్‌పైనా చర్చించారు. త్వరలో అధికారులతో చర్చించి ఫీజు బకాయిలు చెల్లించాలని ఆదేశించారు.

ఏపీ భవనాలు తెలంగాణ ఇవ్వాలని గవర్నర్ ను కోరనున్న తెలంగాణ
కెబినెట్ భేటిలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై ఆ పథకం వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి వివరించారు. మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకొని పనులను వేగవంతం చెయ్యాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త సెక్కటేరియట్ నిర్మాణంపై సీఎం, మంత్రులకు వివరించారు. సెక్రటేరియట్ ,అసెంబ్లీ, మండలి, ఇతర హెచ్ఓడిలను ఇచ్చేందుకు ఏపి సానుకూలంగా ఉందని.. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పరిపాలన భవనాలను తెలంగాణకు కేటాయించాలని గవర్నర్‌ను కోరుతూ తీర్మానం చేశారు. 

06:52 - October 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై తదుపరి కార్యాచరణకు హరీష్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పరిపాలన భవనాలను తెలంగాణకు కేటాయించాలని గవర్నర్‌ను కోరుతూ తీర్మానం చేశారు. భాషా పండితులను, పీఈటీలను స్కూల్‌ అసిస్టెంట్‌లుగా అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు .. మహిళా ఉద్యోగులకు 90 రోజుల చైల్డ్‌ కేర్‌ సెలవులను ఇవ్వాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పడిన ఆరు జిల్లాలకు పేర్లను మార్చుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ కమిటీ భేటీ..
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భాషా పండితులు, పీఈటీల విజ్ఞప్తిపై చర్చించిన మంత్రివర్గం 2,487 భాషా పండితులు, 1047 పీఈటీలను స్కూల్ అసిస్టెంట్స్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే.. మహిళా ఉద్యోగులకు 90 రోజులు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ సెలవులు పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆరు దఫాల్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు.

బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సబ్ కమిటీ ఏర్పాటు
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై తదుపరి కార్యాచరణకు మంత్రివర్గ ఉపసంఘంను ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ కేబినెట్‌ సబ్‌కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది. అలాగే.. వర్సిటీల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కడియం నేతృత్వంలో ఓ కేబినెట్‌ సబ్‌కమిటీని వేశారు. మత్స్య సంపద, గొర్రెల పెంపకంపై.. మంత్రి తలసాని నేతృత్వంలో మరో కేబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పరిపాలన భవనాలను తెలంగాణకు కేటాయించాలని గవర్నర్‌ను కోరుతూ కేబినెట్‌ తీర్మానం చేసింది.

ఆరు జిల్లాల పేర్లు మార్పుకు కమిటీ ఆమోదం
ప్రజల అభీష్టం మేరకు ఆరు జిల్లాల పేర్లను మార్చుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కుమరం భీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలుగా పేర్లను మార్చారు.

పెండింగ్ బకాయిల విడుదల
అదేవిధంగా మంత్రివర్గ సమావేశంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రైతుల మూడో విడత రుణమాఫీపై చర్చించారు. నెల రోజుల్లో బకాయిలను క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు. 

కాకినాడలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన..

విజయవాడ : నేడు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వచ్ఛ ఏపీ, వనం-మనం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 

నేడు తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ..

హైదరాబాద్ : నేడు తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ కానుంది. కృష్ణా జలాలపై బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు, భవిష్యత్‌ కార్యాచరణపై సబ్ కమిటీ చర్చించనుంది. ఈ తీర్పుపై తెలంగాణ రాష్ట్రం అసంతృప్తిగా వుంది. కాగా శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై మంత్రి హరీష్ రావు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. 

నేడు భారత్-ఇరాన్ కబడ్డీ ఫైనల్..

గుజరాత్ : రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ లో నేడు కబడ్డీ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. శుక్రవారం రాత్రి థాయ్ లాండ్ తో తలపడిన భారత్ సునాయాసంగా విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఫైనల్ కు చేరుకున్న భారత్ ఇరాన్‌తో తలపడనుంది. 

కిడ్నాపర్లనుండి తప్పించుకున్న తహశీల్దార్ కుమార్తె..

అనంతపురం : తహశీల్దార్ కుమార్తె దుండగుల చెర నుండి బైటపడింది.చిత్తూరు తహశీల్దార్ కుమార్తెను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళుతుండగా ఆమె కేకలు వేసింది. దీంతో కారుతో సహా ఆమెను అక్కడే వదిలివేసి కిడ్నాపర్లు పరారయ్యారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నగరంలో ఖాప్స్ కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : సౌత్ జోన్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో చాంద్రాయణగుట్ట,ఫలక్ నుమా, బార్కాస్ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 

24న ప్రధాని వారణాసి పర్యటన..

ఉత్తరప్రదేశ్ : ప్రధాని నరేంద్ర మోదీ తన లోక్‌సభ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి వెళ్లనున్నారు. అక్టోబరు 24న ఆయన వారణాసిలో పర్యటించనున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. మోదీ వారణాసి పర్యటనలో భాగంగా ఉర్జా గంగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వారణాసిలో సహజ వాయువును పైపుల ద్వారా ఇంటింటికి అందజేయనున్నారు. అలాగే వారణాసి-అలహాబాద్‌ రైల్‌ ట్రాక్‌ డబులింగ్‌, వారణాసి-అలహాబాద్‌ రైల్‌ సెక్షన్‌ ఎలక్ట్రిఫికేషన్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. 

06:08 - October 22, 2016

రైతు గుండెమీద వాన సినుకు కురిసింది..వాన వచ్చిందని జాతర్లు చేసుకుంటున్న జనాలు..కమ్మరి, కుమ్మరి చాకలి, మంగలి, గిలా గందరూ జాతర జేసుకున్నరు. దున్నపోతుకు ఎదుర్కోలు..ఊర్లమీద దేవుళ్లందరికీ శాంతిపూజలు జేసిండ్రు..గిక సూడుండ్రి వారి ఆటపాటా..చిన్న పోరగాళ్లు కూడా పూనకంతా ఊగిపోయిండు..ప్రజల్లోకి ప్రతిపక్షాలు...నామినేటెడ్ పదవుల పందేరంలో కుర్సీలు ఇరగ్గొట్టుకున్న కారుపార్టీలు..సర్కారు స్కూల్లో మేట్టారు విద్యార్థినిని చితక్కొట్టిండు..దాంతో తలతిరిగి పడిపోయిండు..చేసేవన్నీ బట్టాబాయి పన్లు..ఎత్తిందేమో బాబా అవతారం..దొంగబాబా అవతారం ఎత్తిన సదాచారి బాబాతో ఓ చానల్ల డిబేట్ పెట్టిండు..దానికి ఇద్దరాడోల్లు కూడా వచ్చిండు..ఉదాటున్న లేచిన ఆడామో దొంగబాబా దవడ పగలగొట్టింది..గరి దొంగబాబా మాత్రం తక్కువ తిన్నడా ఆడామె మీద ఎదురు తిరిగి ఆడామెపై చానల్లోనే దాడి జేసిండు..పులి సంపి ఊరేగించిన జనాలు..గిసువంటి మస్తు ముచ్చట్లు మన మల్లన్న గీరోజుకూడా తీసుకొచ్చిండు..మరి జాగెందుకు మల్లన్న ముచ్చట్లు చూడుండ్రి మస్తు ఖుషీ అవుండ్రి.. 

Don't Miss