Activities calendar

23 October 2016

21:38 - October 23, 2016

కరీంనగర్ : జిల్లాలో జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశం రసాభాసాగా మారింది. సమావేశంలోటీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లాలకు నేతలను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో జిల్లా నేతలు సమావేశం నిర్వహించారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఓ వర్గం అభిప్రాయపడగా... మరో వర్గం వ్యతిరేకించడంతో... ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. 

21:37 - October 23, 2016

పశ్చిమగోదావరి : త్వరలో రాష్ట్రంలో మోడర్న్ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. పశ్బిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఉండిలో నిర్మించిన డంపింగ్‌యార్డ్‌ ప్రారంభోత్సవానికి సీఎం హాజరవుతారని మంత్రి చినరాజప్ప అన్నారు. టెక్నాలజీ సహాయంతో నేరాల సంఖ్యను తగ్గించే విధంగా చర్యలు చేపడతున్నామని తెలిపారు. 

21:35 - October 23, 2016

మొహాలీ : న్యూజిలాండ్ పై భారత్ మరో విజయం సాధించింది. ఈ విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అద్భుత శతకం సాధించాడు. ఇంకా ఓవర్లు ఉండగానే విజయం సాధించడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 49.4 ఓవర్లలో 285 పరుగులుకు ఆలౌట్ అయ్యింది. 199 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన కివీస్ ను హెన్రీ (39) ఆదుకున్నాడు. ఓపెనర్ లాథమ్ (61) పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్లు నిరాశపరిచారు. శర్మ (13), రహానే (5) వెనుదిరిగారు. అనంతరం వచ్చిన కోహ్లీ, ధోనిలు కివీస్ బౌలర్లను చీల్చిచెండారు. 202 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 154 పరుగుల చేసి నాటౌట్ గా మిగిలాడు. ధోని 80 పరుగులు చేసి ఔటయ్యాడు. పాండే 28 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 

21:29 - October 23, 2016

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీలోని అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. కమీషన్ల కోసమే పోలవరాన్ని ప్రభుత్వం హాడావుడిగా పనుల్ని చేపిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే విపక్షాల ఆరోపల్ని అధికార పార్టీ టిడిపి తిప్పికొడుతోంది. రైతుల మేలు కోసం ప్రాజెక్టుల్ని చేపడితే..అదినచ్చని విపక్షాలు..ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమాన్ని చేపట్టాయని ప్రతివిమర్శలు గుప్పిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు..పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేదని అధికార టిడిపి విపక్షాల్ని ప్రశ్నిస్తుంటే..కమీషన్ల కక్కుర్తి కోసమే పోలవరాన్ని హడావుడిగా పూర్తిచేస్తున్నారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది.

రఘువీరా విమర్శలు...
పోలవరం విషయంలో చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తి కోసమే పోలవరం ప్రాజెక్టును హాడావుడిగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తున్నారని రఘువీరారెడ్డి విమర్శించారు. 2014లో ప్రజలకిచ్చిన హామీల్లో సింహభాగం ఇప్పటివరకు నెరవేర్చలేదని ప్రజలే సర్వేలో తీర్పుఇచ్చారని గుర్తుచేశారు.

ఘాటుగా స్పందించిన సోమిరెడ్డి..
పోలవరం ప్రాజెక్టుపై విపక్ష కాంగ్రెస్‌ చేసిన విమర్శలపై టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌..పోలవరాన్నరి ఎందుకు పూర్తిచేయలేదని సోమిరెడ్డి ప్రశ్నించారు. కేవలం మట్టిపనులు చేసి కాంగ్రెస్ చేతులు దులుపుకుందన్నారు. పోలవరం గురించి మాట్లాడే హక్కు విపక్ష కాంగ్రెస్‌, వైసిపిలకు లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2018లోపు పోలవరం మొదటి దశను పూర్తిచేసి తీరుతామని సోమిరెడ్డి అన్నారు. రైతులకు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తిచేస్తోంటే.. విపక్షాలకు నిద్రపట్టడంలేదని సోమిరెడ్డి విమర్శించారు. పట్టిసీమను 1300 కోట్ల రూపాయలతో రికార్డుస్థాయిలో సంవత్సరంలో పూర్తిచేసి రైతులకు నీరందిస్తే..దానిపై కూడా విపక్షాలు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధానికి తెరతీస్తోంది. 

21:27 - October 23, 2016

విజయవాడ : బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్వాకం వల్లే సెక్షన్‌ 89 వచ్చిందని అన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఎదుట సరైన వాదనలు వినిపించకపోవడం వల్లే... ఏపీకి అన్యాయం జరిగిందని దేవినేని ఆరోపించారు. 

21:26 - October 23, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన సచివాలయం, శాసనసభ, మండలి భవనాలను తమకు అప్పగించేందుకు సహకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో కేసీఆర్‌ ఈరోజు భేటీ అయ్యారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పరిపాలనా భవనాలను అప్పగించాలని కోరుతూ తెలంగాణ మంత్రిమండలి ఇటీవల తీర్మానం చేసింది. ఆ తీర్మానం ప్రతిని గవర్నర్‌కు కేసీఆర్‌ అందజేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలను తెలిపారు. వీలైనంత త్వరగా తమకు భవనాలు అప్పగించేలా చూడాలని ముఖ్యమంత్రి కోరినట్లు తెలిసింది.

21:24 - October 23, 2016

ఉత్తర్ ప్రదేశ్ : యూపీలో సమాజ్‌వాది పార్టీలో సంక్షోభం ముదిరి పాకాన పడింది. రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీలో... ములాయం వర్గం, అఖిలేష్ వర్గం... పరస్పరం తమ పట్టు నిలుపుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వరుసకు బాబాయ్‌ అయిన శివపాల్‌ యాదవ్‌ సహా ముగ్గురు మంత్రులను కేబినెట్‌ నుంచి తొలగిస్తే.. అందుకు కౌంటర్‌గా... ములాయం సింగ్‌ యాదవ్‌ పార్టీలో కీలకంగా ఉన్న రాంగోపాల్‌యాదవ్‌ను సస్పెండ్‌ చేశారు.

స్పందించిన ములాయం వర్గం..
శివపాల్‌పై వేటు పడిన కొద్ది గంటల్లోనే ములాయం వర్గం అదే స్థాయిలో స్పందించింది. పార్టీలో కీలకంగా ఉన్న రాంగోపాల్‌యాదవ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు శివపాల్‌ యాదవ్ ప్రకటించారు. రాంగోపాల్‌ కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని... బీజేపీ నేతలతో చేతులు కలిపారని శివపాల్‌ ఆరోపించారు. తాజా నిర్ణయాలతో... ములాయం కుటుంబంలో విబేధాలు రోజురోజుకు తీవ్ర స్థాయికి చేరాయి. ములాయంకు శివపాల్ సొంత తమ్ముడు కాగా, రాంగోపాల్ వరుసకు సోదరుడు అవుతారు. అఖిలేష్‌ను రాంగోపాల్ తప్పుదోవ పట్టిస్తున్నారని శివపాల్ ఆరోపణ. రాంగోపాల్ తనపై కుట్రపన్నారని, ఆయన కొడుకును రక్షించుకోవడానికి బీజేపీతో చేతులు కలిపాడని ఆరోపించారు. అంతకుముందు అఖిలేష్‌కు మద్దతుగా రాంగోపాల్ ఎస్పీ చీఫ్ ములాయంకు లేఖ రాశారు. మొత్తానికి యూపీ సమాజ్‌వాదిలో నెలకొన్న కుటుంబ కలహాలు పార్టీ భవితవ్యంపై నీలినీడలు కమ్మకునేలా చేస్తున్నాయి. ఈ ప్రభావం... వచ్చే ఎన్నికల్లో పార్టీపై ఏ విధమైన ప్రభావం చూపుతుందోనని పార్టీ నేతలు, కార్యకర్తలు కలవరపడుతున్నారు. 

భారత్ ఘన విజయం..

మొహాలీ : మూడో వన్డేలో భారత్ గెలుపొందింది. ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించి. ఐదు వన్డేల సిరీస్ లో 2-1 తేడాతో భారత్ అధిక్యం సంపాదించింది. న్యూజిలాండ్ విధించిన 285 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. 

తానాకు సంబంధం లేదన్న జంపన్న..

హైదరాబాద్ : టెన్ టివి కథనానికి తానా నేతలు కోమటి, జంపాలలు స్పందించారు. టెన్ టివి కథనంలో వాస్తవం ఉందని కోమటి జయారం పేర్కొనగా తానా సేకరించిన విరాళంలో డిజిటల్ కాస్లుకు రూ. కోటి, అంగన్ వాడీ కేంద్రాలకు రూ. కోటి ఇవ్వాలనుకున్నట్లు తానా అధ్యక్షులు జంపాన చౌదరి పేర్కొన్నారు. కోమటి జయరాం ఇచ్చిన రూ. 4.5 కోట్ల చెక్కుకు తానాకు సంబంధం లేదన్నారు. రేపటి బోర్డు సమావేశంలో అన్ని విషయాలు చర్చించడం జరుగుతుందన్నారు. 

తానాలో లుకలుకలు..

హైదరాబాద్ : తానాలో లుకలుకలు ఏర్పడడంతో రేపు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కోమటి జయరాం వ్యవహార శైలిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఏపీలో డిజిటల్ క్లాసుల నిర్వాహణకు కోమటి జయరాం ఇచ్చిన చెక్కుపై వివాదం నెలకొంది.రూ. 4.5 కోట్లు ఎక్కడి నుండి తెస్తారంటూ, కార్యవర్గం అనుమతి లేకుండా చెక్కు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

చెక్కు విషయంలో అనుమానక్కర్లేదు - జయరాం..

హైదరాబాద్ : తాను ఇచ్చిన చెక్కు విషయంలో అనుమానాలు అక్కర్లేదని తానా మాజీ అధ్యక్షులు జయరాం పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. తనకు ఇప్పటికే చాలా మంది నాలుగున్నర కోట్లకు కమిట్ మెంట్ ఇచ్చారని, వాటిని వసూలు చేసి ప్రభుత్వానికి అప్పగించే బాధ్యత తనదేనని తెలిపారు. తన రక్తంలో తానా ఉందని, తానెప్పుడూ తానాకు నష్టం చేయనన్నారు. తానిచ్చిన చెక్కు పాస్ కావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.

 

చిలకలూరి పేటలో దారుణం..

గుంటూరు : చిలకలూరి పేటలో దారుణం చోటు చేసుకుంది. భార్య సావిత్రిపై భర్త కత్తితో దాడి చేశాడు. దీనితో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబకలహాలే కారణమని తెలుస్తోంది. 

19:38 - October 23, 2016

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మాజీ అధ్యక్షుడి హామీ చెక్కు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.. ఏపీలో డిజిటల్‌ తరగతులకు నాలుగున్నర కోట్లు ఇస్తామంటూ మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం ప్రకటన తానాలో చిచ్చుపెట్టింది.. డబ్బు లేకుండా చెక్కు రూపంలో హామీ ఎలా ఇస్తారంటూ విమర్శలొస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు జయరాం తీరుతో తానాలో లుకలుకలు బయలుదేరాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషించారు. తానా తరపున అందించారా ? వ్యక్తిగతంగా అందించారా ? అనేది క్లారిటీ లేదన్నారు. ఏపీలో డిజిటల్ తరగతుల కోసం చెక్ అందించారని, తానా అనుమతి ఏ మేరకు ఉంది ? 4.5 కోట్ల చెక్కు చెల్లుబాటు కాకపోతే ఎంతవరకు బాధ్యత వహిస్తారు ? దీనివల్ల ప్రభుత్వం ఏమి ఆశిస్తోంది ? రాని నిధులపై ప్రభుత్వం ఎలాంటి వివరణనిస్తుంది ? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. హుదూద్ తుఫాన్ సమయంలో మూడు లక్షల డాలర్లు నిధులు వసూలయ్యాయని, ప్రభుత్వానికి అందించడం కోసం తానా ప్రయత్నం చేసిందన్నారు. వేరే కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేద్దామని ప్రభుత్వం పేర్కొందన్నారు. ఏపీలో జరిగే డిజిటల్ తరగతులకు, మరికొంత నిధులు హుదూద్ తుఫాన్ లో నష్టపోయిన అంగన్ వాడీ స్కూళ్లకు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:37 - October 23, 2016

తానా మాజీ అధ్యక్షుడి హామీ చెక్కు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.. ఏపీలో డిజిటల్‌ తరగతులకు నాలుగున్నర కోట్లు ఇస్తామంటూ మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం ప్రకటన తానాలో చిచ్చుపెట్టింది. ఈ విషయంపై తానా అధ్యక్షులు (చికాగో) జంపాల చౌదరితో టెన్ టివి మాట్లాడింది. 20వ తేదీన జరిగిన సమావేశం నుండి అపోహలు ప్రారంభమయ్యాయని, సమావేశం జరిగిన సమయంలో ప్రకటించిన విరాళ వివరాలు..తానా తాలూకు విరాళాలు ఇద్దరు సీనియర్ డైరెక్టర్లు అనుకోవడం..దీనిని అపార్థం చేసుకోవడం మొదలైందన్నారు. హుదూద్ కోసం సేకరించిన రెండు కోట్లలో తుపాన్ కారణంగా ప్రభావితమైన అంగన్ వాడీ కేంద్రాలకు ఒక కోటి రూపాయలు..డిజిటల్ క్లాసుల కోసం కోటి రూపాయలు అనుమతినివ్వడం జరిగిందన్నారు. జయరాం స్వయంగా సేకరించిన నిధులు తానా వద్ద దాదాపు 67 -70 లక్షల రూపాయలున్నాయన్నారు. గత ఆరు నెలలుగా పర్యటిస్తున్నారని తెలిపారు. ఒక వివరణ కావాలని పాలక మండలి కోరడం జరిగిందని, దీనికి వివరణనివ్వడంతో ఈ వివాదం సద్దుమణుగుతుందన్నారు. హామీ చెక్కు బాధ్యత జయరాందేనని తేల్చిచెప్పారు.

వివాదేమీ లేదు - కోమటి జయరాం..
తానాలో హామీ చెక్కుపై జరుగుతున్న వివాదంపై తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం స్పందించారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. తానా మాజీ అధ్యక్షుడి హామీ చెక్కు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.. ఏపీలో డిజిటల్‌ తరగతులకు నాలుగున్నర కోట్లు ఇస్తామంటూ మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం ప్రకటన తానాలో చిచ్చుపెట్టింది. ఇందులో వివాదేమి లేదని, డిజిటల్ క్లాసు రూంలు..అంగన్ వాడీ..శ్మశాన వాటికల కోసం నిధుల కోసం తాను పర్యటించడం జరిగిందన్నారు. తానాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. టెన్ టివి ప్రసారం చేసిన కథనం కరెక్టుగానే ఉందన్నారు. 5000 డిజిటల్ క్లాసులకు నిధులు సమకూర్చే ప్రయత్నంలో ఉన్నట్లు, ఇప్పటికే 300 స్కూళ్లలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక్కో ఎన్నారై ద్వారా కంట్రిబ్యూషన్ ఇప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. చెక్ పాస్ అవుతుందని, ఇంకో పదిహేను రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఎఫ్ సీఆర్ అకౌంట్ ఉండాలని, తానా ఫౌండేషన్ లో మూడు ప్రాజెక్టుల్లో ఒక పార్ట్ అన్నారు. తానా అనేది తన బ్లడ్ లో ఉందని, ఎలాంటి నష్టం జరిగించే పని చేయనని తెలిపారు. నాలుగున్నర కోట్లకు కమిట్ మెంట్ ఉందని నూటికి నూరు శాతం భర్తీ చేస్తానని కోమటి జయారం పేర్కొన్నారు. 

కోదండరామ్ పై మంత్రి హరీష్ ఫైర్..

హైదరాబాద్ : రైతుల కోసం దీక్ష అంటున్న కోదండరామ్ ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మోతె రిజర్వాయర్ నిర్మాణం వద్దంటూ కాంగ్రెస్, టిడిపి, బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలిపారు. భూములు లేకుండా ఆకాశంలో ప్రాజెక్టులు కడుతామా అని ప్రశ్నించారు. 

18:47 - October 23, 2016

విజయవాడ : రొమ్ము కాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసులు భాగస్వామ్యమవుతారని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రొమ్ము క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే నయం చేయడం చాలా సులభమని స్పష్టం చేశారు. ఉషా లక్ష్మి బ్రెస్ట్ కాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పింక్‌రిబ్బన్‌ వాక్‌కు సవాంగ్ హాజరయ్యారు. బందర్‌ రోడ్డులో ప్రారంభమైన ఈ వాక్‌లో సినీ హీరో సుమంత్‌తో పాటు క్యాన్సర్‌ వైద్యులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.. 

18:46 - October 23, 2016

విశాఖపట్టణం : హ్యాపీ సండేలో భాగంగా విశాఖ సాగర తీరం జనసంద్రంగా మారింది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ బీచ్‌లో తెగ ఎంజాయ్‌ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అంతా ముగ్దులయ్యారు. వీరిని అలరించేందుకు బీబ్‌ మ్యూజిక్‌ బీడ్‌ పేరుతో ఈ బృందం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. వారమంతా ఉద్యోగాలతో బిజీబిజీగా ఉండే వారంతా ఆదివారం ఫ్యామిలీతో గడపాలని చాలామంది కోరుకుంటారు. పిల్లలతో కలిసి సండే రోజు షాపింగ్‌కు, సినిమాలకు వెళ్తుంటారు. ఆదివారం వస్తే.. విశాఖ వాసులు ఆర్కే బీచ్‌వైపు పరుగులు తీస్తుంటారు.

వినసొంపైన మ్యూజిక్..
బీచ్ వైపు వెళ్లితే వినపోంపైన మ్యూజిక్ తో ఓ బృందం అద్భుతమైన మెలోడి ర్యాక్ డ్యూయట్ పాటలో ఆలరిస్తుంటుంది. అక్కడ జనం సైతం వాకింగ్ కాసేపు ఆపి... అక్కడే నిలబడి వినసోంపైన సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ బృందంలో కొందరు వారి అభిరుచులకు తగ్గట్టుగా ఎదైనా సాధించాలనుకున్నారు. ఇలాంటి ఆలోచనలోంచి పుట్టుకువచ్చిందే బీబ్ మ్యూజిక్ బీడ్.. అంటే కనెక్టింగ్ ది ఆర్టిస్ట్. ఎకంగా బీడ్ పేరిట ఒక సంస్థను స్థాపించారు. అలా ఈ ఏడుగురు యూత్ మెంబర్లు కలిసి కసిగా సంస్థ అభ్యున్నతికి తనదైన ఆలోచనలతో కృషి చేస్తున్నారు. టాలెంట్ ఉండి కూడా మంచి ప్లాట్ పాం లేక ఎందరో యువకులు నిరాశకు గురవుతున్నారని, వారికి ప్రోత్సాహం ఇవ్వడమే తమ లక్ష్యమంటున్నారు.

ద్వితీయ బహుమతి..
ఈ మధ్య విశాఖలో జరిగిన స్టార్టప్ సదస్సులో తమ ఆలోచనలను ఆవిష్కరించి... ద్వితీయ బహుమతి పొందారు. ఇప్పటి వరకు 50 మంది మ్యూజిక్ ఆర్టిస్ట్‌లను గుర్తించి వారికి ప్రోత్సాహం అందిస్తున్నారు. వైజాగ్ టూరిజమ్‌లో తమ సంస్థకు అవకాశం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ని కోరారు. 2017 నాటికి సొంతంగా రికార్డింగ్ ల్యాబ్‌ ఏర్పాటు చేసి... ఐదు వేల మంది మ్యూజిక్ ఆర్టిస్ట్‌లను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 

18:41 - October 23, 2016

విశాఖ : జిల్లా భీమిలిలో ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌కు బౌద్ధారామాల వద్ద భూముల కేటాయింపు వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. తొట్లకొండలో భూకేటాయింపుపై ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న బౌద్ధసంఘాలు తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. కల్చరల్‌ ఫిలిం క్లబ్‌కు ప్రభుత్వం కేటాయించిన భూములను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రపంచానికి అహింసను, పరమతసహనాన్ని పరిచయం చేసిన బుద్ధుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి బుద్ధిరావాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. 

18:39 - October 23, 2016

విజయవాడ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మాజీ అధ్యక్షుడి హామీ చెక్కు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.. ఏపీలో డిజిటల్‌ తరగతులకు నాలుగున్నర కోట్లు ఇస్తామంటూ మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం ప్రకటన తానాలో చిచ్చుపెట్టింది.. డబ్బు లేకుండా చెక్కు రూపంలో హామీ ఎలా ఇస్తారంటూ విమర్శలొస్తున్నాయి... మాజీ అధ్యక్షుడు జయరాం తీరుతో తానాలో లుకలుకలు బయలుదేరాయంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగు వారికి ఎలాంటి సమస్యవచ్చినా వెంటనే స్పందించే తానా... ఓ మాజీ అధ్యక్షుడి తీరుతో చిక్కుల్లోపడింది.. రెండేళ్లక్రితం ఏపీలోని పలు ప్రాంతాలను హుదూద్‌ తుఫాన్‌ కుదిపేసింది.. ఈ బాధితులను ఆదుకునేందుకు ఎంతోమంది ముందుకు వచ్చారు... తానాకూడా తనవంతు సహాయం చేసేందుకు కదిలివచ్చింది.. బాధితులను ఆదుకునేందుకు అప్పటి అధ్యక్షుడు నన్నపనేని మోహన్‌ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఈ విషాదానికి కదిలిపోయిన ప్రవాసాంధ్రులు... రెండు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ డబ్బును తానా ఫౌండేషన్‌ ఇండియా అకౌంట్‌కు పంపింది.

1212 స్కూళ్లలో డిజిటల్ తరగతులు..
సీన్‌ కట్ చేస్తే... ఏపీలోని 5 వేల పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభమయ్యాయి... శుక్రవారం విశాఖలో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.. 12వందల 12 స్కూళ్లలో డిజిటల్ తరగతుల తొలి దశ అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ తరగతులకు నాలుగున్నర కోట్లు ఇస్తామంటూ కోమటి జయరాం ఇచ్చిన హామీ చెక్కు వివాదాస్పదమైంది. డిజిటల్‌ తరగతులకు జయరాం ఇచ్చిన చెక్కు అందరినీ గందరగోళంలో పడేసింది.. ప్రపంచంలో ఎక్కడైనా చెక్కు ఇవ్వడమంటే దాదాపు డబ్బు ఇచ్చినట్లే ఈ చెక్కు డేట్‌నుబట్టి డబ్బు డ్రా చేసుకోవడమే మిగిలి ఉంటుంది. హామీ అన్నపదం మాత్రం మాటలకు పరిమితమవుతుంది. జయరాం ప్రకటన మాత్రం భిన్నంగా ఉంది. హామీ చెక్కుపేరుతో చంద్రబాబుకు నాలుగున్నర కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించేశారు. డబ్బు పూర్తిగా వసూలు చేయకుండా తానా కార్యవర్గం అనుమతి తీసుకోకుండా ఈ పని ఎలా చేస్తారంటూ ప్రవాసాంధ్రులనుంచి విమర్శలు వచ్చినట్లు వార్తలొచ్చాయి.

హుదూద్‌ బాధితులకోసం రూ. 2కోట్లు వసూలు..
తానా సేకరించిన విరాళాలపై కూడా క్లారిటీ లేకుండా పోయింది.. హుదూద్‌ బాధితులకోసం దాదాపు 2కోట్ల రూపాయలు వసూలయ్యాయి... ఈ డబ్బుకు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్‌ జతచేసి కొన్ని సర్వీసులకు వాడదామంటూ సీఎం చంద్రబాబు తానాకు గతంలో ప్రతిపాదించారు.. దీనిపై జులైలో తానా కార్యవర్గం సమావేశమైంది.. ఈ నిధుల్లో 50శాతం డబ్బును డిజిటల్‌ ప్రాజెక్టుకు... మిగతాభాగం తుఫానులో నష్టపోయిన అంగన్‌వాడీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఖర్చుపెట్టాలని తీర్మానించారు.. ఈ తీర్మానం అలా ఉండగానే చంద్రబాబుకు నాలుగున్నరకోట్ల హామీ చెక్కును జయరాం ఎలా ఇస్తారంటూ ప్రవాసాంధ్రులనుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. పైగా ఎక్కడా తానా పేరువాడకుండా సొంత డబ్బులాగా ఎలా ఇస్తారంటూ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారంటూ వార్తలొచ్చాయి. ఈ విమర్శలపై తానా అధ్యక్షుడు జంపాల చౌదరి స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. హుదూద్‌ తుఫాన్‌ బాధితులకోసం కోమటి జయరాం పలు నగరాల్లో పర్యటించారు. ఎన్నో సమావేశాలు నిర్వహించి 75లక్షల రూపాయలు సేకరించారు. మరో 75వేల డాలర్లకు ప్రవాసులనుంచి హామీలుకూడా తీసుకున్నారు. ఈ డబ్బుకూ తానాకు సంబంధంలేదని జంపాల చెప్పారని తెలుస్తోంది. ముందు సేకరించిన 75లక్షల్ని డిజిటల్‌ తరగతులకు ఖర్చు చేయాలంటూ చంద్రబాబుకు చెక్కు ఇచ్చినట్లు సమాచారం. జయరాంకు మరికొందరు 75వేల డాలర్లవరకూ ఇస్తామంటూ హామీలిచ్చారు. ఈ డబ్బును వసూలు చేసి డిజిటల్‌ తరగతులకు ఇస్తారని సమాచారం. ఇవి కాకుండా మిగిలిన సొమ్ము విషయాన్నిమాత్రం ముందస్తు హామీగా పరగణించాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇది అధికారిక చెక్కు కాదని... కేవలం ముందస్తు హామీఅని భావించాలంటూ జయరాం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది..

సోమవారం తానా అత్యవసర సమావేశం..
ఈ ఇష్యూలో మరో ట్విస్ట్‌ ఏంటంటే.. తానా డబ్బు లెక్కల్లో గందరగోళం కొనసాగుతోంది.. తానా కార్యవర్గం కేవలం కోటి రూపాయల్నిమాత్రమే డిజిటల్‌ క్లాస్‌రూంలకు ఇచ్చేందుకు అనుమతి తెలిపింది.. జయరాం వ్యక్తిగతంగా సేకరించిన డబ్బు మొత్తం కలిపినా రెండు కోట్లు దాటదు.. మరి మిగతా డబ్బులు ఎక్కడినుంచి తెస్తారన్నదానిపై స్పష్టత కరువైంది.. మొత్తానికి మాజీ అధ్యక్షుడి తీరు తానాను సంక్షోభంలోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై సోమవారం తానా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.. ఇందులో అన్ని అంశాలపై పూర్తిగా చర్చించే అవకాశముంది.

ఇబ్రహీంపట్నంకు చేరుకున్న మహా పాదయాత్ర..

రంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఏడో రోజు యాంజాల్ లో కొనసాగిన పాదయాత్ర కాసేపటి క్రితం అబ్దుల్ పూర్ మండల్ నుండి ఇబ్రహీంపట్నం మండలంలో అడుగు పెట్టింది. 

18:20 - October 23, 2016
18:16 - October 23, 2016
18:05 - October 23, 2016

సంగం బస్టాండు వద్ద అగ్నిప్రమాదం..

నెల్లూరు : సంగం బస్టాండు వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చెత్తకుప్పల్లో మంటలు అంటుకుని రెండు కార్లు, రెండు టెంపోలు దగ్ధమయ్యాయి. 

గూడూరులో విషాదం..

నల్గొండ : బీబీనగర్ మండలం గూడూరులో విషాదం చోటు చేసుకుంది. చిన్నేటి కుంటలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పదో తరగతి విద్యార్థులు సాయికిరణ్, నిఖిల్ లు మృతి చెందిన వారిలో ఉన్నారు. మొత్తం 14 మంది విద్యార్థులు ఈతకు వెళ్లారు. 

బోధన్ లో కాంగ్రెస్ పాదయాత్ర ముగింపు సభ..

నిజామాబాద్ : బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పాదయాత్ర ముగింపు సభ జరిగింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానా, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలు పాల్గొన్నారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని నాలుగు రోజుల పాటు పాదయాత్ర జరిగింది.

మరింత ముదురుతున్న సమాజ్ వాది పార్టీ సంక్షోభం..

ఉత్తర్ ప్రదేశ్ : సమాజ్ వాది పార్టీ సంక్షోభం మరింత ముదురుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ పై బహిష్కరణ వేటు పడింది. ఆరేళ్ల పాటు బహిష్కరించినట్లు యూపీ ఎస్పీ అధ్యక్షులు శివపాల్ యాదవ్ పేర్కొన్నారు. రాంగోపాల్ యాదవ్ గత కొన్న రోజులుగా బీజేపీ నేతలను కలుస్తున్నారని తెలిపారు. 

17:19 - October 23, 2016
16:39 - October 23, 2016

విజయవాడ : దళితుడిగా పుట్టడమే తప్పని మాట్లాడిన చంద్రబాబు ముందుగా దళితులకు క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రన్న దళిత బాట కార్యక్రమం చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చెశారు. ఓటుకు నోటు కేసుకి భయపడి ప్రత్యేక హోదా విషయంపై చంద్రబాబు నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. పోలవరం విషయంలోనూ చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారని రఘవీరా ఆరోపించారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు విజయనగరం డీసీసీ చీఫ్ ఆదిరాజును ఉత్తరాంద్ర పట్టభద్రుల విభాగం నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించారు. 

16:37 - October 23, 2016

కబడ్డీలో తమకు తిరుగులేదని భారత్‌ కబడ్డీ జట్టు మరోసారి నిరూపించింది. వరుసగా మూడోసారి ప్రపంచకప్ గెలిచి ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. అహ్మదాబాద్‌లో ఇరాన్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ 38-29 పాయింట్లతో విజయం సాధించింది. మొదటి అర్ధభాగం పూర్తయ్యేసరికి ఇరాన్ 18-13 పాయింట్లతో వెనుకబడి ఉన్న టీమిండియా..సెకండాఫ్‌లో చెలరేగి ఆడింది. భారత ఆటగాళ్లు రైడింగ్‌లో, డిఫెన్స్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అజయ్ ఠాకూర్ వన్ మ్యాన్ షో.. భారత్‌ను విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు.

మరోసారి నిరూపణ..
సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే ..పదడుగులు ముందుకు వేసేందుకేనని భారత కబడ్డీ జట్టు మరోసారి నిరూపించింది. విశ్వ విజేతగా ఆవిర్భవించే సత్తా తమకే ఉందని మరోసారి నిరూపించింది భారత కబడ్డీ టీమ్‌. ప్రథమార్థంలో వెనకబడ్డా..రెండు ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమికి పగ తీర్చుకుంటామని ప్రత్యర్థి సవాల్‌ చేసినా.. టీమిండియా ఏ మాత్రం అదరలేదు..బెదరలేదు. స్టార్‌ రైడర్లు రాహుల్‌ చౌదరి, పర్దీప్‌ నర్వాల్‌ విఫలమవుతున్నా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో..పట్టు విడువని విక్రమార్కుల్లా సమష్టి ప్రదర్శనతో వరుసగా మూడోసారి విశ్వవిజేతగా భారత్‌ జట్టు నిలిచింది.

తీవ్ర ఒత్తిడి..
మ్యాచ్‌ ప్రథమార్థంలో భారత కబడ్డీ జట్టు తీవ్ర ఒత్తిడి అనుభవించింది. ఇరాన్‌ డిఫెండర్లు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకున్నారు. భారత రైడర్లను వరుసగా పట్టేస్తూ ప్రథమార్థంలో 18-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. అయితే ద్వితీయార్థంలో భారత్‌ దెబ్బతిన్న సింహంలా గర్జించింది. రైడర్‌ అజయ్‌ ఠాకూర్‌ చిచ్చరపిడుగులా చెలరేగాడు. 12 రైడ్‌ పాయింట్లతో ఇరాన్‌ డిఫెన్స్‌ను చెదరగొట్టి ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇరాన్‌ కెప్టెన్‌ మిరాజ్‌షేక్‌ను ఔట్‌ చేసిన టీమిండియా..ఆట ముగిసే వరకూ అతడిని కోర్టు బయటే ఉండేలా చేసి ఆ జట్టు ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టింది. ఆఖరి మూడు నిమిషాల్లో వ్యూహాత్మకంగా ఆడి 38-29 పాయింట్లతో విశ్వవిజేతగా ఆవిర్భవించింది భారత కబడ్డీ జట్టు. ఇరాన్‌ను వరుసగా మూడో ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడించి..రికార్డు సృష్టించింది. 

16:34 - October 23, 2016

హైదరాబాద్ : తెలంగాణలో రైతులు రుణమాఫీ అమలుకాక అప్పులపాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద టీ-జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ నేతృత్వంలో రైతు దీక్ష కొనసాగుతోంది. రైతు సమస్యల పరిష్కారం కోసమే దీక్ష చేపట్టినట్లు కోదండరామ్ వివరించారు. రుణమాఫీ త్వరగా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కల్తీ విత్తనాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేని స్పష్టం చేశారు. రైతుల కోసం సమగ్ర వ్యవసాయ విధానం వెంటనే తీసుకురావాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో ఆచార్య హరగోపాల్‌, చుక్కా రామయ్య, జస్టిస్‌ చంద్రకుమార్‌ హాజరయ్యారు.

బాధాకరం - చుక్కా రామయ్య..
కేసీఆర్‌..రైతులను పట్టించుకోకపోవడం బాధాకరమని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. అడిగిన వాళ్లకల్లా కోట్ల రూపాయల్ని ఇస్తున్న కేసీఆర్‌..రైతుల రుణమాఫీ చేయడంలో విఫలం అవుతున్నారని విమర్శించారు. రైతు దీక్షకు మద్దతు తెలిపిన చుక్కారమయ్యా..ఎల్లకాలం ప్రజలు మనవెంటే ఉంటారని అనుకోవడం పొరపాటని కేసీఆర్‌ను హెచ్చరించారు. 

15:57 - October 23, 2016
15:56 - October 23, 2016
15:30 - October 23, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం..విధానాలపై ప్రొ.కోదండరాం ధ్వజమెత్తారు. ప్రభుత్వం సరపరా చేసిన విత్తనాలు కూడా మొలకెత్తలేదంటూ విమర్శలు గుప్పించారు. ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న రైతు జేఏసీ దీక్షను ఆయన సందర్శించి ప్రసంగించారు. అనావృష్టి, అతివృష్టి తెలంగాణనను దెబ్బతీశాయని తెలిపారు. మార్కెట్ లో మద్దతు ధర లభించడం లేదని, అసైన్డ్ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటోందని ఆరోపించారు. రైతులను దళారీలు మోసం చేస్తున్నారన్నారు. 

కరవాడలో స్థానికుల ఆందోళన..

తూర్పుగోదావరి : మామిడికుదురు (మం) కరవాడలో స్థానికులు ఆందోళన చేపట్టారు. సముద్రగర్భంలో ఓఎన్జీసీ చేపట్టిన సర్వేకు సంబంధించిన కేబుళ్లను స్థానికులు తొలగించారు. 

ప్రభుత్వ విత్తనాలు మొలకెత్తలేదు - ప్రొ.కోదండరాం..

హైదరాబాద్ : ప్రభుత్వం సరపరా చేసిన విత్తనాలు కూడా మొలకెత్తలేదని, అనావృష్టి, అతివృష్టి తెలంగాణనను దెబ్బతీశాయని ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న రైతు జేఏసీ దీక్షను ఆయన సందర్శించి ప్రసంగించారు. మార్కెట్ లో మద్దతు ధర లభించడం లేదని, అసైన్డ్ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటోందని ఆరోపించారు. రైతులను దళారీలు మోసం చేస్తున్నారన్నారు.

 

15:19 - October 23, 2016

ఐదు రాష్ట్రాల్లో ఒకేసారి ఒకేసారి ఎన్నికలు ?

ఢిల్లీ : వచ్చే ఏడాది ఫిబ్రవరి - మార్చిలో ఐదు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఈసీ యోచిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

నిజామాబాద్ లో జంట హత్యల కలకలం..

నిజమాబాద్ : జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. హైమత్ పురా కాలనీలో సహజీవనం చేస్తున్న జంట హత్యకు గురైంది. మైసయ్యతో పాటు లక్ష్మిని గొంతుకోసి దుండగులు చంపివేశారు. ఇద్దరి మృతదేహాల మీద కారం చల్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

14:51 - October 23, 2016

విజయవాడ : సీపీఎం ప్రజాచైతన్య పాదయాత్ర చేపట్టింది. ప్రజా సమస్యలను నెరవెర్చడంతో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం పార్టీ నగర కార్యదర్శి బాబూరావు మండిపడ్డారు. ప్రజాచైతన్య యాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళతామన్నారు...ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సీపీఎం పెద్దఎత్తున్న పోరాటం చేస్తోందన్నారు హెచ్చరించారు. ప్రజా చైతన్య పాదయాత్రలో సీపీఎం నగర కార్యదర్శి బాబూరావుతో టెన్ టివి మాట్లాడింది. ఆయన ఏమన్నారో వీడియోలో చూడండి. 

14:48 - October 23, 2016

హైదరాబాద్: భ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తిచేస్తోందని సాక్షాత్తూ తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్ రావు అన్నారని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం గురించి ఏపీని చూసైనా సిగ్గుపడ్డాలని పక్క రాష్ట్రాల వారు అంటుంటే రాష్ట్రంలోని వైసీపీ, కాంగ్రెస్‌లు మాత్రం ప్రాజెక్టులకు అడ్డుపడడం దారుణమన్నారు. పోలవరం గురించి మాట్లాడే హక్కు ఆ రెండు పార్టీలకు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

14:46 - October 23, 2016

నిజామాబాద్ : జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. ఈ ఘటన హైమత్ పురా కాలనీలో చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న లక్ష్మీ, మైసయ్యలు వాచ్ మెన్ గా ఉంటున్నారు. వీరిద్దరూ ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. మైసయ్యతో పాటు లక్ష్మిని గొంతుకోసి దుండగులు చంపివేశారు. ఇద్దరి మృతదేహాల మీద కారం చల్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దంపతులు కాకపోయినా సహజీవనం చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

14:29 - October 23, 2016

ఇటీవల  నవతెలంగాణా పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన దరువుల బండి,ప్రజాగేయాలు అన్న పుస్తకాల ఆవిష్కరణ సభ సుందరయ్య కళానిలయంలో జరిగింది.ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో జయధీర్ తిరుమలరావ్,గోరటి వెంకన్న,మెట్రో రైలు యం.డి.ఎన్వీరెడ్డి, భిక్షమయ్య, స్ఫూర్తి,పి.యన్. మూర్తి,పసునూరిరవీందర్ తదితరులు పాల్గొన్నారు.బండిసత్తెన్న సాహిత్యం ప్రజలను ఎంతగానో ఆలోచింపజేస్తుందని వక్తలు కొనియాడారు.
దేవుడు పుస్తకావిష్కరణ సభ 
ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కంచ ఐలయ్య రాసిన అంటరాని దేవుడు పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఐలయ్య ఆంగ్లంలో రాసిన పుస్తకాన్ని కృష్ణ మూర్తి తెలుగులోనికి అనువదించారు.భారతీయ కుల సమస్యలను అంతర్జాతీయ స్థాయిలో ఈ పుస్తకంలో రచయిత చర్చించారని వక్తలు పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

14:27 - October 23, 2016

ఒకప్పటి సాహిత్యం కొన్ని వర్గాలవారికే పరిమితమై ఉండేది. నేడు అట్టడుగు వర్గాలవారు అక్షరాస్యులు కావడంతో అన్ని కులాల అస్తిత్వంతో తెలుగు సాహిత్యం వెలువడుతోంది. ముఖ్యంగా దళిత బహుజన కులాల రచయితలు మునుపెన్నడూ లేని విధంగా కథలు నవలలు సృష్టిస్తున్నారు. అలాంటి వారిలో అనంతపురం జిల్లాకు చెందిన చిలుకూరి దేవపుత్ర ఒకరు. ఆయన ఇటీవలే కన్నుమూశారు. ఆ మహారచయిత కు నివాళులర్పిస్తూ వివిధ సాహితీ వేదికల విశేషాలతో  ఈ వారం మీ ముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం. 
చిలుకూరి దేవపుత్ర ఇక లేరు 
తెలుగు సాహిత్యంలో అద్భుత కథలు సృష్టించిన చిలుకూరి దేవపుత్ర ఇక లేరు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు కథలు నవలలు రాసి కరువుసీమ బడుగుజీవుల బతుకు కథనాలను కథలుగా నవలలుగా అక్షరీకరించిన ఆ కథన శిల్పి ఇటీవలే కన్ను మూశాడు. నిరాంబరునిగా, స్నేహశీలిగా, కథనశిల్పిగా పేరుపొందిన దేవపుత్ర అకాలమరణాన్ని సాహితీ ప్రియులు జీర్ణించుకోలేక పోతున్నారు. చిలుకూరి దేవపుత్రకు 10 టి.వి.అక్షరం నివాళులు అర్పిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:59 - October 23, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సీఎం కేసీఆర్ రైతులను పట్టించుకోలేదని సాక్షి పత్రిక ఎడిటర్ రామచంద్రామూర్తి అన్నారు. ఇప్పటికైనా రైతులను పట్టించుకోవాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న రైతు జేఏసీ దీక్షను ఆయన సందర్శించి దీక్షకు మద్దతు తెలిపారు. 
ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నడైనా రైతులను పరామర్శించారా? జస్టిస్ చంద్రకుమార్
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నడైనా రైతులను పరామర్శించారా అని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. పరామర్శించి ఉంటే రైతుల కష్టాలు తెలిసేవన్నారు. ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న రైతు జేఏసీ దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
తెలంగాణ వచ్చాక రైతుల ఆత్మహత్యలు విషాదకరం : హరగోపాల్‌
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు జరగడం విషాదకరమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సొంత రాష్ట్రంలోనైనా తమ బతుకులు బాగుపడతాయనుకున్న రైతులకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న రైతు జేఏసీ దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. 

13:55 - October 23, 2016

రంగారెడ్డి : సీపీఎం పార్టీ మహాజన పాదయాత్ర ఏడో రోజు విజయవతంగా కొనసాగుతోంది. పాదయాత్ర అబ్దుల్లూపూర్ మెట్ నుంచి పెద్దఅంబర్ పేటకు చేరుకుంది. తండాల్లో గిరిజనులు అభివృద్ధికి దూరంగా గడుపుతున్నారని తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేసారు. అభివృద్ధి అంటూ సొంత డబ్బా కోట్టుకుంటున్న ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మహాజన పాదయాత్రలో ప్రజల సమస్యలపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
'గిరిజన తండాల్లో అభివృద్ధి శూన్యం. గిరిజన తండాల్లోని అభివృద్ధిపై ప్రభుత్వం చర్చకు రావాలని సవాల్ చేస్తున్నాను. గ్రామ సీమల్లో ప్రజలు సంతోషంగా లేరు. గత పాలనకు టీసర్కార్ పాలనకు తేడా లేదు. దళితులకు మూడు ఎకరాలు, గిరిజనుల భూ పంపిణీ పథకం ఎక్కడా అమలు కాలేదు. ప్రభుత్వం భూములు ఇవ్వకపోగా ప్రాజెక్టుల పేరుతో ప్రజల నుంచి భూమలు లాక్కుంటున్నారు. చెర్లగూడ రిజర్వాయర్ కోసం గిరిజనుల నుంచి 4 వేల ఎకరాలను సేకరిస్తున్నారు. చట్టం ప్రకారం కూడా వారికి నష్టపరిహారం చెల్లించడం లేదు. చదువు రాని గిరిజనులను చూసి తక్కువ నష్ట పరిహారం చెల్లిస్తూ మోసం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గిరిజలను మోసం చేసి, వంచించి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు వారికి అన్యాయం చేస్తున్నారు. చందులాల్.. కేసీఆర్ కు డబ్బా కొడుతున్నాడు. తెలంగాణ వచ్చాక గిరిజనులకు చేసిన ఒక్క పనైనా చేశారో చెప్పాలి. రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ఏడు మండలాలను ఎపిలో కలుపడాన్ని వ్యతిరేకిస్తూ మొదటి బంద్ ను వామపక్షాలు నిర్వహించాయి. అది గుర్తించాలి. గిరిజనులకు టీసర్కార్ ద్రోహం చేసిందని... అందులో సీతారాం నాయక్ కు పాత్ర ఉంది. కేసీఆర్ కు బయపడి మంత్రులు, ఎమ్మెల్యే ఇలా మాట్లాడుతున్నారు తప్ప అవి వారి నోటి నుంచి వచ్చే మాటలు కావు. గిరిజన తండాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. దరిద్ర్యాన్ని తట్టుకోలేక పిల్లలను అమ్ముకుంటున్నారు. గిరిజన సమస్యలపై, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని' ప్రభుత్వానికి తమ్మినేని సవాల్ విసిరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

13:42 - October 23, 2016

హైదరాబాద్ : హీరో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం నెలకొంది. ప్రభాస్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్లో ప్రశాంత్ అనే యువకుడు, కాకినాడలో రవీంద్ర మరో యువకుడు మృతి చెందారు. మరికొందరి అభిమానులకు గాయాలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:39 - October 23, 2016

డెహ్రడూన్ : యూపీ‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు నెలకొన్నాయి. ములాయం కుటుంబంలో ముసలం ముదిరింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమాజ్ వారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వరుసకు బాబాయి అయిన శివపాల్ యాదవ్ పై వేటువేశారు. శివపాల్ సహా ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలిగిస్తూ అఖిలేష్‌ నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో యాదవ్ పరివారంలో కొద్దిరోజులుగా సాగుతోన్న అంతర్గత కలహాలు పతాకస్థాయికి చేరినట్లయింది. సమాజ్ వాది పార్టీలో రాజకీయం సంక్షోభం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. 

 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

మొహాలి : భారత్, న్యూజిలాండ్ ల మధ్య కాసేపట్లో మూడో వన్డే మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి వన్డేలో భారత్ విజయం సాధించింది. రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో మూడో వన్డే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. రెండు జట్ల మధ్య పోరు హోరాహోరిగా సాగనుంది.

 

13:09 - October 23, 2016

హైదరాబాద్ లో డెంగ్యూ  స్వైర విహారం చేస్తోంది. ఇక్కడి ఒక్క గిరిజన బస్తీలోనే.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. దాదాపు 70 మంది డెంగ్యూ వ్యాధి బారిన పడ్డారు. కొన్ని ఇళ్లల్లోనైతే.. కుటుంబ సభ్యులందరికీ డెంగ్యూ సోకింది. ఈ సందర్భంగా డెంగ్యూ ఫీవర్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో సిటిజెన్ ఆస్పత్రి వైద్యులు సందీప్ పాల్గొని, మాట్లాడారు. డెంగ్యూ ఫీవర్ రకాలు, ఎలా వస్తుంది..? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆ విషయాలను ఆయన మాటల్లోనే.. 
'దోమ కాటు వల్ల వచ్చే వైరల్ ఫీవర్ డెంగ్యూ. పగటిపూట తిరిగే దోమ కాటు వల్ల..డెంగ్యూ వస్తుంది. నాలుగు రకాల వైరసులతో డెంగ్యూ వస్తుంది. డెంగ్యూ మూడు దశల్లో ఉంటుంది. డెంగ్యూ వైరల్ ఫీవర్ లాంటిందే. మన రక్తంలో డెంగ్యూ వైరస్ ఏడు రోజులు ఉంటుంది. ఆ తర్వాత శరీరం నుంచి వెళ్లిపోతుంది. ప్లేట్ లెట్స్ పడిపోతుంటాయి. సాధారాణంగా మనలో లక్షన్నర నుంచి నాలుగు లక్షల మధ్యలో ప్లేట్ లెట్స్ ఉంటాయి. ప్లేట్ లెట్స్ పడిపోకుండా చూసుకోవాలి. నివాస ప్రాంతాల్లో నీరు, చెత్త ఉండకుండా చూసుకోవాలి. ఫుల్ షెర్ట్స్ ధరించాలి. బ్యాక్టీరియాతో టైపాయిడ్ జ్వరం వస్తుంది. రాత్రి పూట తిరిగే దోమల వల్ల మలేరియా వస్తుంది అని వివరించారు. పలువురి నుంచి వచ్చిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. డెంగ్యూ ఫీవర్, జాగ్రత్తలు పలు సలహాలు, సూచనలు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

హీరో ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం

హైదరాబాద్ : హీరో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం నెలకొంది. బర్త్ డేను పురస్కరించుకుని ఫ్లెక్సీలు కడుతున్న సందర్భంగా విద్యుత్ షాక్ కు గురై ఇద్దరు అభిమానులు మృతి చెందారు. 

12:52 - October 23, 2016

హైదరాబాద్ : నర్సింగ్‌ అనగానే... ఓ ఫ్లారెన్స్‌ నైటేంగిల్‌, ఓ మదర్‌ థెరిసా గుర్తుకొస్తారు. నిరంతర సేవానిరతి, స్వచ్ఛమైన ఆప్యాయత. నిస్సహాయ స్థితిలోని రోగికి బతుకుపై భరోసా కల్పించే ఓపిక నర్సుల సొంతం. సేవాతత్పరతకు నిదర్శనంగా నిలిచే నర్సుల జీవితాలు కష్టాలమయమే. సేవలకు గుర్తింపు లేక.. చేస్తున్న ఉద్యోగాలకు భద్రత లేక..  నర్సులు సతమతమవుతున్నారు. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వేల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్నారు. తెలంగాణలో నర్సింగ్‌ వృత్తి దైన్యతపై 10TV ప్రత్యేక కథనం..! 
రోగుల్లో బతుకుపై భరోసాను నింపే నర్సులు 
నర్సులు..! మోముపై చెరగని చిరునవ్వుతో రోగుల్లో బతుకుపై భరోసాను నింపే ప్రేమమూర్తులు. ఆసుపత్రికి వచ్చిన రోగికి వైద్యుల కంటే కూడా అత్యధికంగా సేవలు అందించేది నర్సులే. కానీ పేషెంట్‌కు బాగైతే.. పేరు డాక్టర్‌కి.. లేదంటే నింద నర్సులకి. వారి శ్రమకు తగిన ప్రతిఫలం మాత్రం ఉండదు. కనీసం చేసిన సేవలకు సరైన గుర్తింపు కూడా ఉండదు. అత్యధిక శ్రమదోపిడీకి గురవుతున్నా.. ప్రభుత్వం వీరి సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. 
నర్సులకు కనీస సౌకర్యాలు కరువు 
నిత్యం సమస్యల సుడిగుండంలో మునిగి తేలే నర్సులకు ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌, ఎంజీఎం, నిమ్స్‌, ఈఎస్‌ఐ, రిమ్స్‌ వంటి పెద్దాసుపత్రుల్లో సరిపడా సిబ్బంది లేక.. ఉన్న వారిపైనే ఎక్కువ భారం పడుతోంది. అన్ని ఆసుపత్రుల్లో వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా... వాటిని భర్తీ చేయడం లేదు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలోనే నర్సులను నియమించుకుని.. అరకొర జీతాలు ఇస్తూ.. వారితో నిరంతర సేవలు చేయించుకుంటున్న దుస్థితి ఉంది. ఆరోగ్య తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యమని నర్సింగ్‌ ఉద్యోగులు చెబుతున్నారు. 
కష్టాలపాలవుతున్న నర్సింగ్ విద్యార్థులు 
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం ఇంటెన్సివ్ కేర్‌లో ఒక్క పేషెంట్‌కి ఒక్క నర్సు ఉండాలి. కానీ..తెలుగు రాష్ట్రాల్లో  50, 60 మంది పేషెంట్స్ కి ఒక్క నర్సు మాత్రమే ఉన్నారు. రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లయినా... ఒక్క నోటిఫికేషన్‌ వేయక పోవడం గమనార్హం. కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తూ.. కష్టాలపాలవుతున్నామని నర్సింగ్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
కనీస సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ఉదాసీనత 
ఇక విధుల్లో ఉన్న నర్సులకు కనీస సదుపాయాల విషయంలోనూ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. నైట్‌ షిప్టుల్లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు కనీస భద్రత ఏర్పాట్లూ కరవే. రాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులతో వచ్చే వారు అసభ్యంగా ప్రవర్తిస్తున్న దాఖలాలున్నాయి. ప్రభుత్వం నుంచి నర్సులకు ఎలాంటి సపోర్ట్‌ లేదన్న అభిప్రాయం వెల్లడవుతోంది. 
శ్రమదోపిడీకి గురవుతున్న నర్సులు 
కొత్త రాష్ట్రంలో చాలా హాస్పిటల్స్‌లో పడకల సంఖ్య అయితే పెంచారు గానీ... నర్సులను మాత్రం నియమించలేదు. దీంతో ఉన్నవారిపై పనిభారం ఎక్కువై శ్రమదోపిడీకి గురవుతున్నారు. పది మంది చేయాల్సిన పనిని ఒక్కరే చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుస్తోంది.
నర్సులకు ఛీత్కారాలే సత్కారాలు 
నర్సులు నిరంతర సేవలందించినా.. ఛీత్కారాలే సత్కారాలవుతున్నాయి. ఏ చిన్న తప్పు జరిగినా డాక్టర్ల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో రోగుల బంధువులు భౌతిక దాడులకూ దిగుతున్నారని నర్సులు చెబుతున్నారు. రాష్ట్రంలో నర్సింగ్‌ విభాగాన్ని పట్టించుకున్న నాథుడే లేకపోవడంతో.. ఈ వ్యవస్థ ఇష్టారాజ్యంగా తయారైందంటున్నారు.  ముఖ్యంగా నర్సులకు ప్రత్యేకంగా ఓ డైరెక్టరేట్‌ లేకపోవడంతో..  తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థితిలో వారున్నారు. 
ఏర్పాటు కాని నర్సింగ్ డైరెక్టరేట్ 
వచ్చే విద్యాసంవత్సరానికి నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. డిప్యూటి డైరెక్టర్ పోస్టుకి నర్సింగ్‌లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ చేసిన వారిని నియమిస్తారు. కానీ ఈ రంగానికి సంబంధం లేని గ్రూప్‌-1 అధికారిని నియమించడం విమర్శలకు తావిస్తోంది.  ఇప్పటికైనా నర్సింగ్‌ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న వేలాది నర్సింగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంబంధిత సంఘాలు కోరుతున్నాయి. 
ప్రభుత్వాసుపత్రుల్లో సరైన నర్సింగ్ సిబ్బంది లేదు
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సరైన నర్సింగ్ సిబ్బంది లేదు. పేషెంట్ల నిష్పత్తికి తగ్గ నర్సులు లేకపోవడంతో.. ఉన్న నర్సులపై తీవ్రమైన పనిభారం పడుతోంది. ఈ వృత్తిలో మగవారికి అవకాశాలు మృగ్యమై పోతున్నాయి. నర్సింగ్ కోర్సులు చేసి వైద్యరంగంలో స్థిరపడాలనుకునే మేల్‌ నర్సులకు ఆసుపత్రుల్లో ఉద్యోగం సంపాదించడం పెద్ద సమస్యగా మారింది.  
గాంధీలో ఇంకా 511 మంది నర్సులు అవసరం 
రాష్ట్రంలోని ఆసుపత్రుల్లోని పడకల సంఖ్యకు, నర్సుల సంఖ్యకు ఉన్న అంతరం దీన్ని బట్టి అర్థమవుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా గాంధీలో ఇంకా 511 మంది నర్సులు అవసరం ఉంది. గాంధీలో కాంట్రాక్టు నర్సులుగా మరో 200 మంది పనిచేస్తున్నారు. వారి రెగ్యులరైజేషన్ ప్రక్రియ కేవలం హామీగానే మిగిలిపోయింది.  రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతుండటం.. సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నా ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి.  రోగులకు తగ్గ నిష్పత్తిలో స్టాఫ్‌ ఉండాల్సిన అవసరం ఉందని సంబంధిత ఉద్యోగులు చెబుతున్నారు. 
ఉస్మానియాలో ఇంకా 800 నర్సులు అవసరం 
ఉస్మానియా హాస్పిటల్‌లో మొత్తం 1,113 పడకలకు అనుమతి ఉండగా... దాదాపు 15 వందల మంది ఇన్‌పేషెంట్స్‌గా ఉంటున్నారు. ఆసుపత్రిలో నర్సుల సంఖ్య మాత్రం కేవలం 262 మాత్రమే. వాస్తవానికి ఉస్మానియాలో ఇంకా 800 వరకు నర్సులు అవసరం. కానీ ఇందులో సగం మంది కూడా లేకపోవడంతో.. ప్రస్తుతం పనిచేస్తున్నా నర్సులపై పనిభారం పెరుగుతోంది.  
నిజామాబాద్‌లో ఉన్న పెద్దాసుపత్రి పరిస్థితి దారుణం
నిజామాబాద్‌లో ఉన్న పెద్దాసుపత్రి పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ 500 పడకలకు అనుమతి ఉండగా.. విధుల్లో ఉండేది కేవలం 50 మంది మాత్రమే. అంటే ప్రతి షిఫ్టులోనూ 15 మంది మాత్రమే ఉంటారు. వీరే ఐదొందల పడకలపైని పేషెంట్లకు సేవ చేయాల్సి వస్తోంది. అంటే ఒక్కొక్కరు తమ షిఫ్టులో సగటున 35 పడకలను పర్యవేక్షించాల్సి వస్తోంది. 
పోస్టులు భర్తీ చేయకుండా ఆపేశారు... 
డైరెక్టర్ ఆఫ్‌ హెల్త్‌లో 733 నర్సింగ్ పోస్టులు, వైద్య విధానంలో 941 ఖాళీలున్నాయి. వీటితో పాటు ఈఎస్‌ఐలో 285 పోస్టులు భర్తీ చేయకుండా ఆపేసారు. గురుకుల పాఠశాలల్లో 103 నర్సింగ్ పోస్టులు, ఈఎస్‌ఐ, గురుకులాల్లో కలిపి 1,229 పోస్టులు ఉన్నాయి. వీటికితోడు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు దాదాపుగా 1300 పోస్టులు అవసరం. మొత్తానికి రాష్ట్రంలో 2, 529 మంది నర్సింగ్ పోస్టులు  ఖాళీగా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 1000 పోస్టులకు మాత్రమే ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఈ పోస్టులకు కూడా మోక్షం లేకుండా పోయింది. మరోవైపు తమకు ఇచ్చే అరకొర జీతాలు ఏ మాత్రం సరిపోవడం లేదని కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు 
మరోవైపు.. రాష్ట్రంలో ఆరు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలుంటే... వాటిలో సరైన సిబ్బంది లేక ఇబ్బందులెర్కొంటున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులే క్లాసులు చెబుతున్న పరిస్థితి ఉందంటే సమస్య తీవ్రత ఎలా ఉందో ఇట్టే తేటతెల్లమవుతోంది. చాలా చోట్ల నర్సింగ్‌ విద్యార్థినులకు కనీస సౌకర్యాలు కూడా లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన తమ సమస్యలు పరిష్కరించడం లేదని విద్యార్థినిలు ఆవేదన చెందుతున్నారు. 
నర్సింగ్‌ కాలేజీలపైనా ప్రభుత్వం శీతకన్ను 
రాష్ట్రంలోని నర్సింగ్‌ కాలేజీలపైనా ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. అక్కడా విద్యార్థినులకు సరైన సౌకర్యాలు లేవు. దీన్ని పరిష్కరించే బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందన్న విమర్శలున్నాయి. పేషెంట్‌ మగవాడైనా, స్త్రీ అయినా ఫిమేల్‌ నర్సులే సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మేల్‌ నర్సుల నియామకం చేపట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణమన్న వాదన ఉంది. నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన మేల్‌ నర్సులకు అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ.. ఇటు ప్రైవేటు హాస్పిటల్స్‌లోనూ ఉద్యోగాలు లభించడం లేదు. ఎలాంటి లింగ వివక్ష లేకుండా మగవారికి కూడా నర్సింగ్‌ ఉద్యోగాలివ్వాలని నిబంధనలున్నా.. వాటిని అమలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన జీవోలను ప్రభుత్వాలు బేఖాతరు చేస్తూ తమకు అన్యాయం చేశాయని మేల్‌ నర్సులు అంటున్నారు. 
నర్సింగ్ లో డిప్లొమా చేసి బీఎస్సీ చేసేందుకు జీవో విడుదల
నర్సింగ్ లో డిప్లొమా పూర్తి చేసి బీఎస్సీ చేసేందుకు 2005లో జీవో విడుదల చేసారు. కానీ అది ఇంతవరకు అమలు కాలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనైనా ఈ జీవో కి మోక్షం కలుగుతుందని భావించినా.. ఇప్పటికీ అది కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది మేల్‌ నర్సులు కోర్సులు పూర్తిచేశారు. కానీ ప్రభుత్వం వీరికి ఉద్యోగాలిచ్చిన దాఖలాలు లేవు. వారంతా ప్రైవేటు ఆసుపత్రుల్లో తక్కువ జీతాలకు వార్డ్‌బాయ్‌ తరహా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న పేషంట్లకు అనుగుణంగా  ప్రభుత్వం నర్సులను నియమించాల్సిన అవసరం ఉందని సంబంధిత సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

 

12:38 - October 23, 2016
12:37 - October 23, 2016

ఎనర్జీటిక్ హీరో రామ్ డిసిషన్స్ రాంగ్ అవుతున్నాయి. ఈ హీరో నో చెప్పితే ఆ మూవీ సూపర్ హిట్టేనట. రామ్ నో చెప్పిన రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా మారి ఈ హీరో డిసిషన్స్ తీసుకోవడంలో పూర్ అనే విషయాన్ని స్పష్టం చేశాయి. రామ్ గేస్ చేయలేక చేయిజారవిడుచుకున్న ఆ సూపర్ హిట్స్ ఏంటో మీరే చూడండి. 
రామ్ కెరీర్ లో ఎలాంటి మార్పు లేదు
రామ్ కెరీర్ లో ఎలాంటి మార్పు లేదు. ఈజ్ ఉన్న హీరో అయినప్పటికి స్టోరీస్ విషయంలో క్లారిటి లేకపోవడం మైనస్ గా మారింది. రామ్ కెరీర్ ఒక్క అడుగు ముందుకి ఒక్క అడుగు వెనక్కి ఇలా సాగుతుంది. నేను శైలజతో హిట్టు కొట్టిన హీరో హైపర్ తో బొక్కబోర్లపడ్డాడు. అంతేకాదు సరైన అంచనవేయ లేక రెండు సూపర్ హిట్స్ ని వదిలేసుకున్నాడు.
ప్రేమమ్ రిమేక్ ప్రపోజల్ మొదట రామ్ కు..
రీసెంట్‌గా నాగ చైతన్య నటించిన రిమేక్ ప్రేమమ్ సూపర్ హిట్టు అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిమేక్ ప్రపోజల్ మొదట రామ్ దగ్గరకే వచ్చింది. కానీ ఈ రిమేక్ ని అంచన వేయడంలో రామ్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఫలితంగా నాగచైతన్య కెరీర్ లో ప్రేమమ్ భారీ హిట్టుగా నిలిచింది. 
ధనుష్ వీఐపీ మూవీని చేజార్చుకున్న రామ్  
ప్రేమమ్ విషయంలోనే కాదు గతంలో కూడా రామ్ ఇలాగే ఓ సూపర్ హిట్టుని చేజార్చుకున్నాడు. ధనుష్ వీఐపీ మూవీని తెలుగులో రామ్ తోనే రిమేక్ చేయాలనుకున్నాడు. అప్పుడు కూడా రామ్ నో చెప్పాడు. దీంతో వీఐపీని రఘువరణ్ బిటెక్ గా డబ్ చేసి ధనుష్ సూపర్ హిట్టు కొట్టాడు. దీంతో రామ్ స్టోరీస్ ని అంచన వేయలేకపోతున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ మీదు కామెంట్స్ పడుతున్నాయి.

 

12:22 - October 23, 2016

ఎన్టీఆర్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఇంట్రెస్ట్ గా మారింది. న్యూ మూవీ కోసం యంగ్ టైగర్ ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తాడనేది బిలియన్ మార్క్ క్వశ్చన్ గా మారింది. ఎన్టీఆర్ ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో నెక్ట్ మూవీ డైరెక్టర్ విషయంలో బుడ్డోడు డైలామాలో పడిపోయాడు. ఇంతకీ ఎన్టీఆర్ అనుకున్నదేంటో హావ్ ఏ లుక్.
జనతా గ్యారేజ్ తో భారీ హిట్టు
జనతా గ్యారేజ్ తో భారీ హిట్టుతో ఎన్టీఆర్ పుల్ ఫాంలోకి వచ్చేశాడు. చాలా కాలం తరువాత యంగ్ టైగర్ బాక్సఫీసు వద్ద తన అసలు సిసలు ఫర్మామెన్స్ తో రికార్డ్ మోత మోగించాడు. ఇంతటి విజయం తరువాత మిస్స్టేక్ చేయాకూడదనే ఉద్దేశ్యంతోనే కొత్త మూవీ కోసం ఈ మాస్ స్టార్ టైం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అనుకున్నదానికి రివర్స్ లో జరగడంతో ఇప్పుడు ఏం చేయాలా అని బుడ్డోడు డైలామాలో పడిపోయాడట.
ఏ డైరెక్టర్ తో చేయాలన్న ఆలోచనలో యంగ్ టైగర్
జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ మరోసారి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో మూవీ చేయాలని భావించాడు. అయితే కళ్యాణ్ రామ్ తో తీసిన ఇజం సక్సెస్ అయితే కచ్చితంగా పూరీతోనే మూవీ ఉండేది. కానీ కానీ మొన్న రిలీజైన ఇజం మూవీ నెగటివ్ టాక్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో చేయాలా అని థింక్ చేస్తున్నాడట. 
కొత్త దర్శకులతో ఎన్టీఆర్ సినిమా..?
వినాయక్, బోయపాటి, త్రివిక్రమ్ ఈ దర్శకులందరూ ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక జక్కన్న రాజమౌళితో చేద్దామంటే ఆయన మరో 8నెలల వరకు ఖాళీగా లేడు. ఇలా సినియర్ స్టార్ దర్శకులందరూ వేరే సినిమాలతో కమిట్ అయ్యారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ తప్పని సరిగా ఇప్పుడున్న కొత్త దర్శకులతోనే పని చేయాల్సివస్తుంది. మరీ ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో న్యూ మూవీకి కమిట్ అవుతాడో చూడాలి.  

 

12:14 - October 23, 2016

బాలీవుడ్ లో ప్రస్తుతం బయోఫిక్స్ హవా నడుస్తోంది. ఈ క్రమంలో ఆల్ రెడీ బయోఫిక్ తో సూపర్ హిట్టు కొట్టిన అక్షయ్ కుమార్ మరో రియల్ లైఫ్ స్టోరీకి నటించబోతున్నాడు. గోల్డ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా  అనౌన్స్ చేశాడు. అక్షయ్ కుమార్ నటించనున్న ఆ రియల్ లైఫ్ స్టోరీ ఏంటో మీరే చూడండి.
రుస్తుంతో సూపర్ హిట్టు కొట్టిన అక్షయ్ 
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి బాగా స్పీడ్ ఎక్కువ. సినిమాలు ఫినిష్ చేసేసి రిలీజ్ చేయడంలో అకీ కుర్రాళ్లకు కూడా అందనంత స్పీడ్ తో దూసుకెళ్లిపోతున్నాడు. ప్రామిసింగ్ హిట్స్ తో దూకుడు మీదున్న ఈ ఖిలాడీ ఈ ఎడాది రుస్తుంతో సూపర్ హిట్టు కొట్టాడు. ఈ క్రమంలో అక్షయ్ మరో బయోఫిక్ కి రెడీ అవుతున్నాడు. 
ధోనీ రియల్ లైఫ్ స్టోరీ మంచి విజయం 
ప్రస్తుతం బాలీవుడ్ బయోఫిక్స్ తో ఊగిపోతుంది. లేటేస్ట్ గా వచ్చిన ధోనీ రియల్ లైఫ్ స్టోరీ కూడా మంచి విజయం సాధించింది. అంతేకాదు త్వరలో రిలీజ్ కానున్న అమీర్ ఖాన్ దంగల్ కూడా రియల్ లైఫ్ స్టోరీతో రూపొందుతున్నదే. ఇక రియల్ స్టోరీ రుస్తుంతో సూపర్ హిట్టు కొట్టిన అక్షయ్ కుమార్ ఇప్పుడు 1948 ఒలంపిక్స్ స్టోరీ ఆధారంగా మరో బయోఫిక్ కీ రెడీ అయ్యాడు.
గోల్డ్ మూవీ చేస్తున్న అకీ  
బేబీ, రుస్తోం, ఎయిర్ లిఫ్ట్ ఇలా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అకీ గోల్డ్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ లోగో రిలీజ్ తో పాటు 2018 ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. 1948లో లండన్ లో 14వ ఒలింపిక్స్  జరిగాయి. ఈ ఒలంపిక్స్ లో భారత దేశం తొలిసారిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆ క్రీడాల నేపథ్యంలోనే ఈ మూవీ సాగుతుందట. రీమకంగ్తీ ఈ బయోఫిక్ కి దర్శకత్వం వహిస్తోంది.   

 

యూపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు

డెహ్రడూన్ : యూపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ములాయం కుటుంబంలో ముసలం పుట్టింది. సీఎం అఖిలేష్ యాదవ్ కేబినెట్ నుంచి శివపాల్ ను తొలగించారు. మరో ముగ్గురు మంత్రులపై వేటు వేశారు. మరికొందరిపై వేటుపడే అవకాశం ఉంది. కొంతకాలంగా శివపాల్, అఖిలేష్ యాదవ్ మధ్య విభేదాలు నెలకొన్నాయి.

 

నకిలీ విత్తనాలు, మార్కెట్ దోపిడీ అరికట్టాలి : కోదండరాం

హైదరాబాద్ : నకిలీ విత్తనాలు, మార్కెట్ దోపిడీని అరికట్టాలని టీజాక్ చైర్మన్ కోదండరాం అన్నారు. ప్రభుత్వం ఇచ్చే రైతు రుణమాఫీ పథకంతో రైతులపై మరింత రుణభారం పెరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోవడం లేదని అంటున్నారు. రాష్ట్రంలోని పలు మండలాల్లో కరువు తీవ్రంగా ఉందన్నారు. ప్రభుత్వం కరువు మండలాల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 

 

రైతు సమస్యలను పరిష్కరించాలి : కోదండరాం

హైదరాబాద్ : రైతు సమస్యల కోసం వ్యవసాయ విధానం రావాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఇందిరాపార్కు వద్ద తెలంగాణ రైతు దీక్షను ఆయన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి వ్యవసాయానికి ఒక విధానం కావాలని కోరారు. మార్కెట్ దోపిడీ నుంచి రైతుకు రక్షణ ఇవ్వాలన్నారు. నీటితో పంపిణీ మాత్రమే రైతు సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. 

11:45 - October 23, 2016

హైదరాబాద్ : రైతు సమస్యల కోసం వ్యవసాయ విధానం రావాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఇందిరాపార్కు వద్ద తెలంగాణ రైతు దీక్షను ఆయన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి వ్యవసాయానికి ఒక విధానం కావాలని కోరారు. మార్కెట్ దోపిడీ నుంచి రైతుకు రక్షణ ఇవ్వాలన్నారు. నీటితో పంపిణీ మాత్రమే రైతు సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. వ్యవసాయం విధానం రావాలని పేర్కొన్నారు. విచ్చల విడి, బలవంతపు భూసేకరణ నుంచి రక్షణ కావాలన్నారు. రైతు సమస్యలకు నీటి పంపిణీ ఒక్కటే మార్గం కాదని.. రైతు సమస్యల పరిష్కారం కోసం ఒక విధానం రావాలన్నారు. నకిలీ విత్తనాలు, మార్కెట్ దోపిడీని అరికట్టాలని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే రైతు రుణమాఫీ పథకంతో రైతులపై మరింత రుణభారం పెరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోవడం లేదని అంటున్నారు. రాష్ట్రంలోని పలు మండలాల్లో కరువు తీవ్రంగా ఉందన్నారు. ప్రభుత్వం కరువు మండలాల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 

 

11:36 - October 23, 2016

హైదరాబాద్ : నగరంలో డెంగ్యూ  స్వైర విహారం చేస్తోంది. ఇక్కడి ఒక్క గిరిజన బస్తీలోనే.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. దాదాపు 70 మంది డెంగ్యూ వ్యాధి బారిన పడ్డారు. కొన్ని ఇళ్లల్లోనైతే.. కుటుంబ సభ్యులందరికీ డెంగ్యూ సోకింది. దీంతో ఆ గిరిజన బస్తీ వాసులు బెంబేలేత్తిపోతున్నారు. పేదల బస్తీ అనే కాబోలు.. ఆరోగ్య శాఖ అధికారులెవ్వరూ ఆ ప్రాంతంవైపు చూసిన పాపాన పోలేదు. 
డెంగ్యూ దెబ్బకి వణికిపోతోన్న హైదరాబాద్  
డెంగ్యూ దెబ్బకి హైదరాబాద్ వణికిపోతోంది. హబ్సిగూడలోని గిరిజన కాలనీ మొత్తం డెంగ్యూతో సతమతమవుతోంది. బస్తీలో 70మంది డెంగ్యూ బారిన పడ్డారు. విస్తరిస్తోన్న డెంగ్యూ వైరస్‌.. స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. 
ప్రాణాలను హరిస్తున్న డెంగ్యూ
ప్రతి కుటుంబంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుందామంటే.. వైద్యులు ఎప్పుడు వస్తారో తెలియక.. ఆర్థిక భారమైనా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే చికిత్స చేయించుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు.. రోగుల నుంచి భారీ మొత్తాన్ని టెస్టుల పేరిట గుంజుకుంటున్నాయి. ప్రైవేటు వైద్యం మరీ ఖరీదు కావడంతో.. కొందరు పేదలు.. సాధారణ గోళీమందులతోనే నెట్టుకొస్తున్నారు. ఫలితంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రైవేటు వైద్యం చేయించే స్థోమత లేక.. సర్కారీ వైద్యం సకాలంలో అందక.. ఈ బస్తీకే చెందిన ఓ పాప ఈ మధ్యనే ప్రాణాలు కోల్పోయింది. 
వైద్యాధికారులపై స్థానికుల ఆగ్రహం
దాదాపు 70 మందికి డెంగ్యూ సోకితే.. వైద్యాధికారులెవ్వరూ ఆ వైపు చూడక పోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం స్థానికులను పరామర్శించేందుకూ రాకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్న గిరిజన బస్తీ వాసులు  
మంచి నీటి కాలుష్యంతో పాటు.. బస్తీ చుట్టుపక్కల నిర్మాణంలోని ఆపార్ట్‌మెంట్ల నుంచి వచ్చే వృథానీరు బస్తీ పరిసరాల్లో నిలిచిపోతోంది. దీంతో అక్కడ దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ దోమలే డెంగ్యూ వ్యాధిని వ్యాపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడును పట్టించుకుని.. మెరుగైన వైద్యం అందించాలని హబ్సిగూడ గిరిజన బస్తీ వాసులు కోరుతున్నారు. 

 

11:28 - October 23, 2016

చిత్తూరు : ఏడుకొండల వాడి దర్శనం కోసం.. కొందరు భక్తులు అడ్డదారులు తొక్కుతున్నారు. టీటీడీ నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని స్వామిని దర్జాగా దర్శించుకుంటున్నారు. ఇంతకాలం సాగిన వీరి మోసాలు.. డోనార్‌సెల్‌తో బట్టబయలవుతున్నాయి. 
శ్రీనివాసుని దర్శనం కోసం మోసాలు
శ్రీనివాసుని దర్శనం కోసం సాధారణ భక్తులు పడిగాపులు పడుతుంటారు. గంటలకొద్దీ.. కొన్నిసార్లు రోజుల కొద్దీ స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్‌ల్లోనే కాచుకుని కూర్చుంటారు. కానీ.. కొందరు నకిలీలు.. టీటీడీకి శఠగోపం పెడుతూ.. స్వామి వారిని దర్జాగా దర్శనం చేసుకుంటూ.. ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ పొందుతున్నారు. ఈ వైనం ఇటీవలే టీటీడీ పరిశీలనలో వెల్లడైంది. డోనార్‌ సెల్‌ ఇట్లాంటి నకిలీల గుట్టును రట్టు చేసింది.
పుట్టుకొచ్చిన నకిలీలు  
తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక పరిపుష్ఠికి.. శ్రీనివాసుని భక్తుల కానుకలు, విరాళాలే మూల కారణం. టీటీడీ ఏర్పాటు చేసిన వివిధ సేవా ట్రస్టులకు భక్తులు విరివిగా విరాళాలు ఇస్తున్నారు. ఇలాంటి దాతలనూ టీటీడీ సముచిత రీతిలో గౌరవిస్తోంది. దాతలకు ప్రత్యేకంగా పాస్‌పుస్తకాలు ఇస్తోంది. దాతలు ఇచ్చిన విరాళాన్నిబట్టి.. ఈ పాస్‌ పుస్తకాలను కేటాయిస్తారు. వీటిని తెచ్చే భక్తులకు ఏటా ప్రత్యేక దర్శనం, బస, ప్రసాదాలు, బంగారు డాలర్‌ వంటి సదుపాయాలను టీటీడీ కల్పిస్తోంది. సుమారు 42 వేల ఏడు వందల 90 మంది దాతలు ఈరకంగా భూరి విరాళాలు ఇచ్చారు. వీరందరికీ పాస్‌ పుస్తకాలు అందించారు. ఇక్కడే నకిలీలు పుట్టుకొచ్చారు. 
దాతలకు పాస్‌ పుస్తకాలు
మొదట్లో.. పాస్‌పుస్తకం తీసుకుని వచ్చి.. నేరుగా దర్శనం చేసుకునే వీలుండేది. ఈ పాస్‌పుస్తకం చెంత వున్న వారిని ఎవరూ అడ్డగించేవారు కాదు. దీంతో నకిలీ ఆసాములు దీన్ని ఆసరాగా తీసుకున్నారు. నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించి శ్రీవారి దర్శనాన్ని కోరుకునే వారికి భారీమొత్తం తీసుకుని విక్రయించారు. ఇంతకాలం బాగానే సాగిందికానీ.. ఇటీవలే ఏర్పాటు చేసిన డోనర్‌ సెల్‌తో నకిలీల గుట్టు రట్టయింది. దాతల పాస్‌పుస్తకాలను డోనార్‌ మేనేజ్‌మెంట్‌ అప్లికేషన్‌ విధానం ద్వారా.. టీటీడీ ఆన్‌లైన్‌లో ఉంచింది. ఒరిజినల్‌ దాతల వివరాలన్నీ అందులో పొందుపరిచింది. ఈ విషయం తెలియని నకిలీలు.. తమవద్దనున్న పాస్‌పుస్తకాలను తీసుకు రావడంతో బండారం బయటపడింది. 
బయటపడుతున్న బోగస్ పాస్‌పుస్తకాలు
టీటీడీ ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరించడంతో.. శ్రీవారి దర్శనానికి వచ్చే నకిలీ దాతల సంగతి బయటపడింది. ఈ మధ్యనే ఇలాంటి నాలుగు నకిలీ పాస్‌ పుస్తకాలు పట్టుబడ్డాయి. దీనిపై ఈవో విచారణకూ ఆదేశించారు. ఇప్పటికే విజిలెన్స్‌ అధికారులు సదరు నకిలీ దాతలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక్కడే శ్రీవారి భక్తులను కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. భక్తులు ఇచ్చిన భూరి విరాళాలను భోంచేసిన టీటీడీ సిబ్బందే ఇలాంటి నకిలీ పాస్‌పుస్తకాలను కట్టబెట్టారా..? లేక దళారులు స్వయంగా ఇలాంటి దందాకు పాల్పడ్డారా..? ఆలయ అధికారులు మాత్రం.. తమ సిబ్బంది ప్రమేయం ఉండదని వాదిస్తున్నారు. 
నిధులు సక్రమంగా జమవుతున్నాయా..?
ఈ తతంగంతో అసలు టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు వచ్చిన నిధులు సక్రమంగా జమవుతున్నాయా...లేదా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అందుకే టీటీడీ ట్రస్టులకు వచ్చిన విరాళాలపై ఆడిట్‌ చేయిస్తున్నారు. అసలు బోగస్ పాస్‌పుస్తకాలు బయట ముద్రించినవా.. లేక తస్కరించినవా అనే విషయంపైనా ఆరా తీస్తున్నారు. మొత్తానికి తరచూ ఇలాంటిదే ఏదో ఓ వివాదం టీటీడీ ప్రతిష్ఠను మసకబారుస్తూనే ఉంది. టీటీడీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. 

 

11:23 - October 23, 2016
11:22 - October 23, 2016

విజయవాడ : రొమ్ము కాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసులు భాగస్వామ్యమవుతారని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రొమ్ము క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే నయం చేయడం చాలా సులభమని స్పష్టం చేశారు. ఉషా లక్ష్మి బ్రెస్ట్ కాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పింక్‌రిబ్బన్‌ వాక్‌కు సవాంగ్ హాజరయ్యారు. బందర్‌ రోడ్డులో ప్రారంభమైన ఈ వాక్‌లో సినీ హీరో సుమంత్‌తోపాటు... క్యాన్సర్‌ వైద్యులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. 

 

అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుపోతాం : తమ్మినేని

రంగారెడ్డి : ప్రజల సమస్యలపై పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తమ్మినేని నేతృత్వంలో సీపీఎం మహాజన పాదయ్రాత జరుగుతోంది. ఏడో రోజు పాదయాత్ర కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర నడుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రజల సమస్యలపై పోరాడేందుకు జనసేన ముందుకు వస్తే కలిసి పని చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. గిరిజన సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా  ఉన్నామని తెలిపారు. టీఆర్ ఎస్ మంత్రులు, ఎంపీలు కానీ చర్చకు వస్తే ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.

11:02 - October 23, 2016

హైదరాబాద్ : కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ ఫైనల్‌ ఎగ్జామ్‌ ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 153 ఎగ్జామ్‌ సెంటర్లలో పరీక్ష జరుగుతోంది. పరీక్ష కోసం పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. 9,281 పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలవగా.. ప్రిలిమినరీ, రాత..ఫిజికల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లు పూర్తయ్యాయి. వీటిలో అర్హత సాధించిన 81,523 మందికి ప్రస్తుతం పరీక్ష జరుగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

ఛత్తీస్ గఢ్ : బీజాపూర్ జిల్లా ఆవపల్లి పీఎస్ పరిధిలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు మావోయిస్టు మృతి చెందారు. 12 బోర్ రిఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. 

ఇందిరాపార్కు వద్ద కోదండరాం రైతు దీక్ష

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద టీజేఏసీ చైర్మన్ కోదండరాం రైతు దీక్ష చేపట్టారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని దీక్ష చేస్తున్నారు.

కొనసాగుతోన్న కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ఫైనల్ ఎగ్జామ్

హైదరాబాద్ : తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ఫైనల్ ఎగ్జామ్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం అయింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 153 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

10:32 - October 23, 2016
10:27 - October 23, 2016
10:25 - October 23, 2016

రంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్రకు గ్రామ..గ్రామాన ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. సీపీఎం మహాజన పాదయాత్ర బృందానికి గ్రామాల్లోని ప్రజలు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఆరు రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్రపై బృంద సభ్యుడు పోకంపల్లి ఆశయ్య టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే 
'ప్రజలు సమస్యలతోటి ఎదరు వస్తున్నారు. ముసలి వారికి ఫించన్ రావడం లేదు. గ్రామాల్లో చాలా మంది అర్హులకు రేషన్ కార్డులు లేవు. పలు గ్రామాల్లో మంచీ నీరు లేదు. గ్రీన్ సిటీ, ఫిల్మ్ సిటీ పేరుతో పేదల భూములు కబ్జా చేశారు. కేసీఆర్ ప్రజాసమస్యలను గాలికొదిలేశారు. పేద ప్రజల నుంచి గుంజుకున్న ఫిలిం సిటీ భూముల్లో ఎర్రజెండా పాతుతామని' అని ఆశయ్య చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

10:15 - October 23, 2016

హైదరాబాద్ : గ్రేట‌ర్‌లో పసుపు జెండాను మళ్లీ రెపరెపలాడించేందుకు టిడిపి కసరత్తు చేస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో చతికిల పడ్డ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పార్టీ అధిష్టానం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉయోగించాల‌ని భావిస్తోంది. త‌ద్వారా గ్రేటర్‌ హైద‌రాబాదులో పార్టీ యాక్టీవ్‌గా ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తోంది. స‌మ‌ర్ధుల‌కు బాధ్యతలు అప్పగించి వారిని ప్రోత్సహించ‌డానికి గ్రీన్‌సిగ్నల్‌ కూడా ఇచ్చింది హైక‌మాండ్. 
గ్రేటర్‌లో పట్టుకోసం 
తెలంగాణలో మొదటినుంచి టిడిపికి బ‌ల‌మున్న ప్రాంతం గ్రేట‌ర్ హైద‌రాబాద్. గత సాధారణ ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపితో కలిసి గ్రేట‌ర్ ప‌రిధిలో 15స్ధానాల‌ను టిడిపి దక్కించుకుంది. అయితే అంత‌లోనే టిడిపికి టీఆర్‌ఎస్‌ ఊహించని షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ గ్రేటర్‌లో తమ బలాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళింది. టిడిపిలో ఉన్న అంతర్గత విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకున్న టీఆర్ఎస్..టిడిపికి చెందిన కీలక నేతలకు గులాబి కండువాలు కప్పి తమ పార్టీలో చేర్చుకుంది. గ్రేటర్ పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవ‌డంతో టీడీపీ క్రమంగా బలహీనపడింది. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి చెప్పుకోత‌గ్గ ఓట్లు సాధించినా..సీట్లు సాధించ‌లేక‌పోయింది. అతిక‌ష్టం మీద‌ ఒకే ఒక్క డివిజన్ మాత్రమే టిడిపి గెలవ‌గ‌లిగింది.
గ్రేటర్‌లో పుంజుకున్న టీఆర్‌ఎస్‌ 
గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలతో ఖంగుతిన్న టిడిపి..గ్రేటర్లో పూర్వవైభవం తీసుకురావడానికి ఉన్న అవ‌కాశాల‌పై ప్రణాళిక‌లు సిద్ధం చేస్తోంది. దీనికోసం టిడిపి ముఖ్యనేతలంతా గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీని మళ్లీ పట్టాలెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. టీడీపీ తెలంగాణ‌ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్దం చేశారు. దీనిలో భాగంగా ఇవాల్టి నుండి గ్రేటర్‌ పరిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో  ప్రత్యేక స‌మావేశాల్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారంనాడు బహద్దూర్‌పురా, చాంద్రాయణగుట్ట, కంటోన్మెంట్‌, ఖైరతాబాద్‌లో..25న గోషామహల్‌, 26న అంబర్‌పేట, జూబ్లీహిల్స్‌, 27న కార్వాన్‌, యాకుత్‌పురాల‌లో 28న సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే వ‌చ్చేనెల 1వ తేదీ నుండి గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని పార్టీ నిర్ణయించింది. అయితే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మార‌డంతో ఆ స్ధానంలో సీనియ‌ర్లను సమన్వయకర్తలుగా నియ‌మించ‌నుంది. అటు నియోజ‌క‌వ‌ర్గ స్ధాయిలో ఎక్కడికక్కడ పార్టీకి కొత్తరక్తాన్ని ఎక్కించ‌డంతో పాటు వారికే కీల‌క‌ బాధ్యతలు అప్పగించాల‌ని చూస్తోంది. త‌ద్వారా గ‌తంలో స‌భ్యత్వ నమోదుకు మ‌రో 20 శాతం అదనంగా గ్రేట‌ర్లో చేసేలా ప్రణాళిక‌లు సిధ్ధం చేస్తోంది. 
ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసిన నేతలు 
మొత్తంమీద గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీని మళ్ళీ పట్టాలెక్కేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే గ్రేటర్‌లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తున్నా..క్యాడర్ ద్వారా పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయ‌త్నాలు చేస్తోంది. అయితే అంతిమంగా ఈ ప్రయ‌త్నాలు ఏ మేర‌కు ఫ‌లిస్తాయో తెలియాలంటే మ‌రికొంత కాలం ఆగాల్సిందే. 

 

09:30 - October 23, 2016

హైదరాబాద్‌ : నగరంలో మీర్‌పేట్ లెనిన్‌ నగర్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. రాచకొండ జాయింట్‌ సీపీ శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో 170 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలులేవంటూ 9 ఆటోలు, 16 బైకులతోపాటు కారును సీజ్ చేశారు. 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురు పాత నేరస్తులున్నారు.

 

ఏడో రోజు ప్రారంభమైన సీపీఎం మహాజన పాదయాత్ర

రంగారెడ్డి : అబ్దుల్లాపూర్ మెట్ నుంచి సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభం అయింది. పెద్దంబర్ పేట్ వద్ద పాదయాత్రకు సీపీఐ సంఘీభావం తెలిపారు. పెద్దంబర్ పేట్, గండి చెరువు, ఉప్పరిగూడ, సంఘీనగర్, తొర్రూరు, ఖమ్మగూడ, బొంగులూరు, రాగన్నగూడ గ్రామాల్లో పాదయాత్ర బృందం పర్యటించనుంది.

 

08:36 - October 23, 2016

హైదరాబాద్ : కర్మన్ ఘాట్‌లో యాదగిరి అనే వ్యక్తి మృతి మిస్టరీగా మారింది. మెదట సహజ మరణంగా భావించి ఆంత్యక్రియలు పూర్తి చేసిన కుటుంబసభ్యులు..ఆ తర్వాత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. మృతి చెందిన కొన్నాళ్ల తర్వాత మృతుని సెల్ ఫోన్‌ని పరిశీలించగా కొట్టుమిట్టాడుతూ చనిపోయిన వీడియో బయటపడింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. కట్టుకున్న భార్యే హత్యే చేసిందని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది.
సంచలనంగా మారిన యాదగిరి మృతి  
ఇదే ఇప్పుడు అటు కుటుంబసభ్యులు, ఇటు పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. యాదగిరిది మొదట సహజ మరణంగా భావించినా..ఆ తర్వాత సెల్‌ఫోన్లో బయటపడ్డ వీడియోతో మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. అయితే కట్టుకున్న భార్యే యాదగిరిని హత్య చేసిందని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది.
సహజ మరణంగా భావించిన కుటుంబసభ్యులు 
హైదరాబాద్‌ కర్మన్ ఘాట్‌లో బైరు యాదగిరి, బైరు కవిత భార్యాభర్తలిద్దరూ నివాసం ఉంటున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన యాదగిరి వివాహం తర్వాత కర్మన్‌ఘాట్‌లోనే వ్యాపారం చేస్తూ నగరంలోనే స్ధిరపడ్డారు. అయితే జులై 17న బెడ్‌పై నుండి కింద పడ్డాడన్న సమాచారం కుటుంబసభ్యులకు తెలిసింది. వెంటనే వారు..చికిత్స కోసం యాదగిరిని స్థానికంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రికి తరలించారు. అయితే యాదగిరిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు కుటుంబసభ్యులకు తెలిపారు. ఎలా చనిపోయాడన్న దానిపై డాక్టర్‌ని వివరణ అడగగా..ఎక్కువ మోతాదులో ఆల్కాహాల్ తీసుకోవడం వల్లే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు సహజ మరణంగా భావించి నల్గొండ జిల్లా పెద్ద ఆడిశర్లపల్లి గ్రామంలో అతని అంత్య క్రియలు పూర్తి చేసారు.
యాదగిరిని భార్య కవితే హత్య చేసిందని కుటుంబసభ్యులు ఫిర్యాదు 
అయితే చనిపోయిన ఐదు రోజుల తర్వాత మృతుడు యాదగిరి సెల్‌ఫోన్‌ని కుటుంబసభ్యులు పరిశీలించగా దానిలో ఓ వీడియో క్లిప్ కనిపించింది. వీడియో క్లిప్‌ని పరిశీలించగా దానిలో ఊపిరాడక,..కదలలేని వీడియో చూసినట్టు మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపారు. చనిపోయే సమయంలో మృతుడు యాదగిరి భార్య కవిత రికార్డు చేసినట్టు కంప్లైంట్‌లో మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. వీడియోని పరిశీలించిన తర్వాత మృతుడి కుటుంబసభ్యులు భార్య కవితపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. సెల్ ఫోన్ గురించి పదే పదే కవిత అరాతీసేదని,.ఆందోళన చెందుతూ ఉండడం చూసి తాము సెల్ ఫోన్ చూడగా అసలు విషయం బయటపడిందని మృతుడి బంధువులు అంటున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రులు హరీష్ , ఈటెల

కరీంనగర్ : నేడు జిల్లాలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ పాల్గొననున్నారు.పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొననున్నారు. 

ఎపిలో నేటి నుంచి సీపీఎం ప్రజా చైతన్య పాదయాత్ర

విజయవాడ : నేటి నుంచి సీపీఎం ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించనున్నారు. సీపీఎం రాష్ట్ర, నగర నాయకులు హాజరుకానున్నారు. 

నేడు నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన

ఆదిలాబాద్ : నేడు నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. 

 

నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జోగు రామన్న పర్యటన

ఆదిలాబాద్ : జిల్లాలో నేడు మంత్రి జోగు రామన్న పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జోగు రామన్న పాల్గొననున్నారు. 

హైదరాబాద్ చేరుకున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు కేటీఆర్ కు స్వాగతం పలికారు. 

07:57 - October 23, 2016

రంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర ఆరో రోజుకు చేరుకుంది. పాదయాత్రలో భాగంగా తమ్మినేని బృందం వెళ్లిన ప్రతిచోటా జనం నీరాజనం పడుతున్నారు. స్థానిక సమస్యలపై తమ్మినేని బృందానికి ప్రజలు భారీగా వినతి పత్రాలు ఇస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మెజారిటీ శాతం ఉన్న సామాజిక వర్గ ప్రజల బతుకులు బాగుపడటం లేదని, పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోందని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. 
లింగంపల్లిలో ఆరోరోజు ప్రారంభమైన పాదయాత్ర 
సీపీఎం మహాజన పాదయాత్ర ఆరోరోజు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలో ప్రారంభమైంది. లింగంపల్లి నుంచి రాయప్రోలు, పోల్కంపల్లి మీదుగా అనాజీపూర్‌ చేరుకుంది. ఆరోరోజు ప్రజల నుంచి వెల్లువెత్తిన సమస్యలను వివరిస్తూ తమ్మినేని సీఎంకు లేఖ రాశారు. అందిరకీ కడుపునిండా భోజనం, బియ్యం ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వేల మందికి రేషన్‌ కార్డులు తొలగించడాన్ని తమ్మినేని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం మండలంలో ఉపాధి పనులు ప్రారంభించి, తక్షణమే పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. 
ప్రాజెక్టులకు మేం వ్యతిరేకం కాదు : తమ్మినేని  
ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని తమ్మినేని వీరభద్రం మరోసారి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల కోసం రైతుల దగ్గర తీసుకుంటున్న భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్నదే తమ డిమాండ్‌ అన్నారు. 
పాదయాత్రకు గొర్రెల, మేకల సంఘం నేతలు సంఘీభావం 
లింగంపల్లిలో పాదయాత్రకు గొర్రెల, మేకల సంఘం నేతలు సంఘీభావం తెలిపారు. ఆరో రోజుతో పాదయాత్ర దాదాపు 130 కిలోమీటర్ల పూర్తి చేసుకుంది. 

 

07:53 - October 23, 2016

విజయవాడ : చంద్రన్న బీమా..చంద్రన్న రుణ మాఫీ..పథకాలను ప్రజల్లోకి తీసుకొచ్చిన ఏపీ సర్కారు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మన కోడి పేరుతో  ఏపీ ప్రభుత్వం కొత్తగా  కోళ్ల పెంపక పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది..ఇప్పటి వరకు మేకలు, చేపలు, కాయగూరల సాగుకు వచ్చే సబ్సిడీ ఇప్పుడు కోళ్ల పెంపకానికి అందనుంది. 
'చంద్రన్న' కోళ్లు 
వినూత్న పథకాలను ప్రజల్లోకి తీసుకొచ్చిన టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు కొత్తగా చంద్రన్న కోళ్లంటూ మరో పథకం రూపుదిద్దుకోబోతోంది. మన కోడి పేరుతో ఈపథకానికి రూపకల్పన చేసినా.. చంద్రన్న కోళ్ల పథకంగా మార్చేందుకు సెర్ప్ అధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రధానంగా ఏపీలో ఉన్న డ్వాక్రా సంఘాల మహిళలకు సబ్సిడీ మీద పెరటి కోళ్లను అందిస్తారు..పశుసంవర్ధక శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఈ పథకాన్ని నిర్వహిస్తాయి.
డ్వాక్రా సంఘాలకు అందుబాటులో కోడి పథకం
రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు చెందిన నిరుపేద మహిళలకు మన కోడి పథకం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా 10 వేల కోళ్ల యూనిట్లను సబ్సిడీ నిధులతో వీరికి పంపిణీ చేస్తారు. ఒక్కో యూనిట్‌కి 45 కోడి పిల్లలను 75 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తారు. 4 వారాల వయసున్న ఒక్కో కోడిపిల్ల ఖరీదు 68 రూపాయిలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక యూనిట్‌కి 45 కోడిపిల్లలు చొప్పున మొత్తం 3వేల 60 రూపాయిల ఖర్చు అవుతుంది. లబ్ధిదారు అయిన మహిళ కేవలం తన వాటాగా కింద 810 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 2వేల 250 రూపాయిలను  ప్రభుత్వం సబ్సిడీ కింద చెల్లిస్తుంది. 
గిరిజనులకు పూర్తి సబ్సిడీతో పథకం అమలు
గిరిజనులకు పూర్తి సబ్సిడీతో పథకాన్ని అమలు చేయనున్నారు. గిరిజనులు ఎక్కువగా ఉండే మండలాల్లో ఉచితంగానే కోడి పిల్లలిస్తారు. లబ్ధిదారులైన మహిళల ఎంపిక డీఆర్‌డీఏ సిబ్బంది చూస్తారు. ఎంపికైన వారి నుంచి వారి వాటా డబ్బును డీఆర్‌డీఏ సిబ్బంది వసూలు చేసి,..నెల లోపలే కోడి పిల్లలను సరఫరా చేస్తారు. అన్ని యూనిట్లకు ఇండ్‌ బ్రో అండ్‌ బ్రీడింగ్‌ ఫార్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కోడి పిల్లలను సరఫరా చేయనుంది. పశువైద్యాధికారులు లబ్ధిదారులందరికీ పెరటి కోళ్ల పెంపకంపై శిక్షణ ఇస్తారు. అనంతరం పథకంలో ఉన్న అన్ని యూనిట్లలోని కోళ్ల ఆరోగ్యపరిరక్షణతో పాటు వ్యాధి నిరోధక టీకాలను వైద్యులు సకాలంలో అందజేస్తారు.

 

07:48 - October 23, 2016

కాకినాడ : అభివృద్ధిని అడ్డుకోవ‌డానికి విప‌క్షాలు టెర్రరిస్టుల మాదిరిగా వ్యవ‌హ‌రిస్తున్నాయంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిప‌డ్డారు. కాకినాడ‌లో జ‌రిగిన స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో భాగంగా..దోమ‌ల‌పై దండ‌యాత్ర కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే ల‌క్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా స్థానికులతో మాట్లాడి..అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆనంద‌భార‌తి గ్రౌండ్స్ లో జ‌రిగిన స‌భ‌లో ప్రసంగించారు. 
టూరిజం హ‌బ్ గా గోదావ‌రి జిల్లాలు 
ఉభ‌య గోదావ‌రి జిల్లా వాసుల రుణం తీర్చుకుంటాన‌ని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడలనో పర్యటించిన ఆయన కాకినాడ అభివృద్ధికి ప‌లు ప‌రిశ్రమ‌లను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. టూరిజం హ‌బ్ గా గోదావ‌రి జిల్లాలు మార‌బోతున్నట్టు వెల్లడించారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు వ‌చ్చే నెల‌లోనే 3వేల రూపాయ‌ల చొప్పున అకౌంట్ల‌లో వేస్తామ‌ని హామీ ఇచ్చారు.
చంద్రబాబు విపక్షాలపై మండిపాటు 
కాకినాడ పర్యటించిన చంద్రబాబు విపక్షాలపై మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవ‌డానికి విప‌క్షాలు టెర్రరిస్టుల మాదిరిగా  వ్యవ‌హ‌రిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కులం మీద అభిమానం ఇత‌ర కులాల మీద విద్వేషంగా మార‌కూడ‌ద‌ని చంద్రబాబు అన్నారు. కాపుల సంక్షేమానికి తాను క‌ట్టుబ‌డి ఉన్నానని తెలిపారు. ఎవ‌రూ అడ‌గ‌కుండానే తాను తూర్పు గోదావ‌రి జిల్లా వ‌చ్చి కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ప్రక‌టించాన‌ని గుర్తు చేశారు. కాపుల కోసం వెయ్యి కోట్ల‌తో కార్పోరేష‌న్ ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. 
జనం లేక వెలవెల బోయిన సీఎం సభ  
ఇదిలా ఉండగా స‌రిగ్గా సీఎం ప్రసంగిస్తున్న స‌మ‌యంలో స‌భలో మూడొంతుల జనాభా ఖాళీ కావ‌డం అంద‌రినీ ఆశ్చర్యప‌రిచింది. చంద్రబాబు ఉప‌న్యాసం చివ‌రికొచ్చే స‌రికి స‌భ‌లో కేవ‌లం మీడియా ప్రతినిధులు, టీడీపీ ముఖ్య కార్యక‌ర్తలు, భ‌ద్రతా సిబ్బంది మిన‌హా మిగిలిన ఎవరూ లేరు. వివిధ క‌ళాశాల‌ల నుంచి త‌ర‌లించిన విద్యార్థులంతా మ‌ధ్యలోనే వెళ్లిపోవ‌డం, డ్వాక్రా మ‌హిళ‌లు చాలా సేపు ఓపికతో ఉన్నా.. చివరకు సీఎం మాట్లాడుతుండగా అందరూ వెళ్లి పోవడంతో స‌భ బోసిపోయింది. 

 

07:43 - October 23, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామకాల కోసం..  ఫైనల్‌ పరీక్ష ఇవాళ జరగనుంది. దీనికోసం తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ప్రిలిమినరీ రాత పరీక్షతో పాటు ఫిజికల్‌ ఎలిజిబిలిటీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఫైనల్‌ పరీక్ష కోసం సిద్ధమయ్యారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామకాల కోసం..  ఫైనల్‌ పరీక్ష ఆదివారం జరగనుంది. మొత్తం 9 వేల 281 పోలీస్ కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి ఇప్పటికే ప్రిలిమినరి రాత పరీక్షను నిర్వహించింది. ఇందులో పాసైన అభ్యర్థులకు ఫిజికల్ ఎలిజిబిలిటి పరీక్షలు నిర్వహించింది. ఈ రెండు పరీక్షల్లో 81 వేల 5 వందల 23 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి  రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఫైనల్‌ పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 153 ఎగ్జామ్ సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల్లోపే సెంటర్స్‌కు చేరుకోవాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ సూచించింది. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థుల్ని పరీక్షకు అనుమతించమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హాల్ టికెట్‌, ఫొటో ఉన్న ఐడెంటీటి కార్డ్‌ను వెంట తెచ్చుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు 
పరీక్షలో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయోమెట్రిక్‌లో అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తర్వాతే ఎగ్జామ్‌కు అనుమతించనున్నారు. 

 

07:40 - October 23, 2016

హైదరాబాద్ : సినిమా రంగానికి, డ్రగ్స్ వ్యాపారానికి ఉన్న సంబంధం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ నగరంలో ఓ డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. జీడిమెట్ల పోలీసులు ఇద్దరిని అరెస్టుచేసి,.వారి నుంచి కిలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒక సినీనిర్మాత, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో నెల్లూరు జిల్లాలో మరోవ్యక్తిని అరెస్టుచేసి, అతడి వద్ద నుంచి కిలోన్నర కిటామైన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం డ్రగ్స్ విలువ 6 కోట్ల రూపాయలని పోలీసులు అంచనా వేశారు. 
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా డ్రగ్స్ తీసుకెళ్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కందికట్టు వెంకట సురేష్‌బాబు, నిజామాబాద్‌కి చెందిన ఇద్దరు బైక్‌పై వెళుతుండగా కుత్బుల్లాపూర్ క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు చేయగా వీరి వద్ద ప్యాకెట్లలో డ్రగ్స్‌ లభించింది. వెంటనే వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా..నెల్లూరులో వీరికి సంబంధించిన మరో వ్యక్తి మారం శ్రీహరి రెడ్డి ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు నెల్లూరు వెళ్లి శ్రీహరి రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద కూడా డ్రగ్స్ ప్యాకెట్లు లభించాయి.  
డ్రగ్స్ వ్యవహారంపై లోతుగా పోలీసుల దర్యాప్తు
భారీ మెత్తంలో డ్రగ్స్  లభించడంతో  ఈ వ్యవహారంపై  పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డవారిలో  సురేష్ బాబును  ఏ1 నిందితుడిగా భావిస్తున్నారు. సురేష్ బాబుకి చిన్ననాటి నుండి సినిమా తీయాలనే కోరిక ఉండడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని  నిర్ణయించుకున్నాడు.  మరి కొందరి సహాయంతో డ్రగ్స్ సరఫరా చేయాలని ప్లాన్‌ చేశాడు. సురేష్‌బాబుకి  నిజామాబాద్ జిల్లాకు చెందిన కిషోర్ కూడా తోడయ్యాడు. వీరికి నెల్లూరుకు చెందిన శ్రీహరి రెడ్డి సహాయమందించాడు. శ్రీహరి రెడ్డి, సురేష్ బాబు ఇద్దరిది నెల్లూరు జిల్లా కావడంతో పరిచయం ఏర్పడింది. ఈ ముగ్గురూ కలిసి యువకులే లక్ష్యంగా డ్రగ్స్ వ్యాపారం చేశారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. 
ఇది రెండో అతిపెద్ద డ్రగ్స్ కేసు
సైబరాబాద్ పరిధిలో ఇది రెండో అతిపెద్ద డ్రగ్స్ కేసు. ఇంతకుముందు ఒక శాస్త్రవేత్తను అరెస్టుచేసి,..అతడి వద్ద వందల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి రహస్యంగా రిమాండ్‌కి తరలించారు.  

 

07:36 - October 23, 2016

హైదరాబాద్ : ఎట్టకేలకు తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించింది. బీసీ కమిషన్ ఛైర్మన్‌గా  సామాజికవేత్త బీ.ఎస్ రాములును, సభ్యులుగా వకుళాభరణం కృష్ణమోహన్‌, జూలూరి గౌరీశంకర్, ఆంజనేయులు గౌడ్ లను నిమమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
ఛైర్మన్ గా ఛైర్మన్‌గా సామాజికవేత్త బీఎస్‌ రాములు
తెలంగాణ బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఛైర్మన్‌గా బీఎస్ రాములును, సభ్యులుగా వకుళాభరణం కృష్ణమోహన్ , జూలూరి గౌరీశంకర్, ఈడిగ ఆంజనేయులు గౌడ్ లను నియమిస్తూ ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. సుప్రసిద్ధ రచయిత, బహుగ్రంథకర్త, సామాజిక అంశాలపై దశాబ్దాలుగా కృషిచేస్తున్న బీఎస్ రాములను బీసీ కమిషన్ ఛైర్మన్‌గా నియమించారు. బీఎస్ రాములుది జగిత్యాల జిల్లా. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఈయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. రాములు బీసీల జీవన స్థితిగతులపై అనేక రచనలు చేశారు. 
సభ్యులుగా వకుళాభరణం కృష్ణమోహన్
బీసీ ఉద్యమనేతగా గుర్తింపు తెచ్చుకున్న వకుళాభరణం కృష్ణమోహన్‌ను బీసీ కమిషన్ సభ్యునిగా నియమించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2009 వరకు రెండు పర్యాయాలు బీసీ కమిషన్ సభ్యులుగా వకుళాభరణం పనిచేశారు. మంచి రచయిత, వక్త అయిన ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో యం.ఏ తెలుగు, పి.హెచ్.డి పూర్తి చేశారు. కరీంనగ్ జిల్లాకు చెందిన వకుళాభరణం దాసరి సామాజిక వర్గానికి చెందినవారు. 
మరో సభ్యులుగా జూలూరి గౌరీశంకర్ 
మరో సభ్యునిగా ప్రస్తుత సూర్యాపేట జిల్లావాసి అయిన ప్రముఖ రచయుత, కవి, జూలూరి గౌరీశంకర్ ను ప్రభుత్వం నిమమించింది. ఈయన విశ్వకర్మ సామాజిక వర్గానికి చెందినవారు. తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులుగా వ్యవహరించి జూలూరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. 
సభ్యులుగా విద్యార్థి నేత ఆంజనేయులు గౌడ్
విద్యార్ధి నాయకుడిగా పనిచేసిన ఈడిగ ఆంజనేయులు గౌడ్ ను బీసీ కమిషన్ సభ్యులుగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా వాసి అయిన ఆంజనేయులు గౌడ్ తెలంగాణ బీసీ ఫోరం అధ్యక్షునిగా పనిచేశారు .తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో కీలకంగా పనిచేశారు.   
మూడేళ్ల పాటు బీసీ కమిషన్‌ పదవీకాలం
బీసీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన వారందరూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారు కావడంతో బీసీలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులుగా వీరు మూడేళ్లు పాటు కొనసాగుతారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల హోదాలతో సమానంగా వీరికి సదుపాయాలు కల్పిస్తారు. 

 

నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన

చిత్తూరు : నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

నేడు కోదండరాం రైతు దీక్ష

హైదరాబాద్ : నేడు ఇందిరాపార్కు వద్ద కోదండరాం రైతు దీక్ష చేపట్టనున్నారు. రైతు సమస్యలను పరిష్కరించి.. వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

 

మీర్ పేట్ బాలాపూర్ లో కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : మీర్ పేట్ బాలాపూర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో 300 పోలీసులు పాల్గొన్నారు. రాచకొండ జాయింట్ సీపీ శిశీధర్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 

ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ.. నేడు భారత్, పాకిస్తాన్

మలేషియా : ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. మలేషియాలో సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే మ్యాచ్

మొహాలీ : నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగనుంది. మొహాలీలో మ.1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

 

నేడు తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగానికి తుది రాత పరీక్ష

హైదరాబాద్ : తెలంగాణలో నేడు కానిస్టేబుల్ ఉద్యోగానికి తుది రాత పరీక్ష జరుగనుంది. ఉదయం 10 గంటల నుంచి మ. ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 153 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

Don't Miss