Activities calendar

24 October 2016

22:09 - October 24, 2016
22:07 - October 24, 2016

హైదరాబాద్ : మరో రెండు, మూడు ఏళ్లల్లో తెలంగాణలోని అన్ని విద్యా సంస్ధలు కార్పొరేట్‌ చెప్పు చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రొఫెసర్‌ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ విద్యా సంస్ధల్ని నియంత్రించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలంటే విద్యార్ధి సంఘాలు ఏకమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పిడీఎస్‌యూ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బిగ్‌ డిబేట్‌ లో పాల్గొన్న ఆయన.. నాణ్యమైన విద్య అందించాలంటే ప్రభుత్వ పాఠశాలలను విస్తృత పరచాల్సిన అవసరం ఉందన్నారు. 

 

22:02 - October 24, 2016

ఏవోబీలో కొనసాగుతున్న కూంబింగ్

విశాఖ : ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో సమీప గ్రామాల్లో భయాందోళన నెలకొంది.
మావోయిస్టు మృతదేహాలను మల్కన్ గిరికి తరలించారు.

21:59 - October 24, 2016
21:58 - October 24, 2016

విశాఖ : ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో సమీప గ్రామాల్లో భయాందోళన నెలకొంది.
మల్కన్ గిరికి మావోయిస్టు మృతదేహాలను తరలించారు. అయితే మృత దేహాలకు పోస్టుమార్టంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం వరకూ పోస్టుమార్టం నిర్వహించవద్దని హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంపై స్పష్టత వచ్చే వరకూ పోస్టుమార్టం నిర్వహించవద్దని హైకోర్టు తెలిపింది. బుధవారం నాటికి విచారణ వాయిదా వేసింది. ఒడిశాలో ఎన్ కౌంటర్ జిరిగినట్లు రుజువు చూపితే రేపే పోస్టుమార్టం నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కానీ బంధువులు వచ్చే వరకూ పోస్టుమార్టం చేయొద్దని హక్కుల సంఘాలు కోరుతున్నాయి. ఎన్ కౌంటర్ లో 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 8 మంది మహిళలున్నారు. మావోయిస్టు కీలక నేత ఆర్ కె కుమారుడు కూడా మృతి చెందినట్లు సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

21:49 - October 24, 2016

సర్కారుకు దండం పెట్టిన కోదండం...సారుకు కోదండవేస్తున్న సర్కారు, శాంతియుతంగా తన్నుకున్న తమ్ముళ్లు...కరీంనగర్ జిల్లాల సైకిల్ పార్టోళ్ల సవాళ్లు, అభిమానం పిచ్చి అంతులేకుంటైతుంది... ఫ్యాన్ సచ్చిపోతే హీరోలది ఏం బోయింది, మందమర్రికాడా మందిని మింగే ఒపెన్ కాస్ట్, మాటిచ్చి తప్పుతున్న మినిషి మీద గుస, చలికాలంల వానలు పడాలని పూజలు.. ప్రకాశం జిల్లా పక్కపోంటి జనాలు, ఆకు, అలము తిని బతుకుతున్న బడుగులు... తెలంగాణ సర్కారు కెళ్లి అందని సాయం.... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

21:44 - October 24, 2016

బజారుకెక్కిన ములాయం ఇంటిపోరు... పూటకో మలుపు తిరుగుతున్న యూపీ రాజకీయాలు.. అఖిలేష్ సొంత పార్టీ పెట్టబోతున్నాడా..  ఎస్పీలో లుకలుకలు విపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయా...? తమ్ముడా...? తనయుడా..? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేకంగా కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

జనసేన మూడో బహిరంగ సభకు అనంతపురం వేదిక

హైదరాబాద్ : జనసేన మూడో బహిరంగ సభకు అనంతపురం వేదిక కానుంది. నవంబర్ 10న అనంతపురంలో జనసేన పార్టీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. టీడీపీకి బలమైన నాయకత్వం ఉన్న చోట సమస్యలపై శంఖారావం పూరించారు.

21:42 - October 24, 2016

హైదరాబాద్ : జనసేన మూడో బహిరంగ సభకు అనంతపురం వేదిక కానుంది. నవంబర్ 10న అనంతపురంలో జనసేన పార్టీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. టీడీపీకి బలమైన నాయకత్వం ఉన్న చోట సమస్యలపై శంఖారావం పూరించారు. కరువు, రైతుల కడగండ్లు ప్రాధాన్య అంశాలు వెన్నాడుతున్నాయి. అనంతపురం జిల్లాలో విఫలమైన రెయిన్ గన్స్ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. సోలార్ ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం వేల ఎకరాలు స్వాధీనం చేసుకుంది. వందల సంఖ్యలో భూనిర్వాసితులు ఉన్నారు. ఇప్పటికే వామపక్షాల ఆందోళనలతో రైతాంగం ఏకమవుతుంది. సమస్యల తీవ్రను సర్కార్ దృష్టికి తేవడం, స్పందింపచేయడమే పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఏపీలో జిల్లాల వారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి అన్ని జిల్లాల్లో సమావేశాల పూర్తికి సంకల్పించారు. 2019 ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే పార్టీకి పూర్తి రూపు ఇవ్వనున్నారు. 2017 ఆగస్టు నుంచి పార్టీకే పవన్ కళ్యాణ్ అధిక సమయం కేటాయించనున్నారు. వామపక్షాలు చేపడుతున్న ప్రజా సమస్యలపై పవన్ సానుకూలంగా స్పందిస్తున్నారు. 
తీవ్రతను బట్టి ఆయా అంశాలపై బహిరంగంగానే మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీతో ఇక తెగతెంపులు చేసుకోనున్నట్లు సమాచారం. తెలుగుదేశం ప్రభుత్వంపై మాత్రం అంశాల వారీగా ఆందోళన చేయనున్నారు.  క్రమేపీ స్వరం పెంచే వ్యూహంతో పవన్ ఉన్నారు. ఇప్పటికిప్పుడు టీడీపీకి దూరం కాకుండా ఒత్తిడి పెంచే యోచనలో జనసేన ఉన్నట్లు కనిపిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:40 - October 24, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలోని తుందుర్రులో ఆక్వాఫుడ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్యర్యంలో ప్రజాభేరి పాదయాత్ర జరిగింది. భీమవరంలో జరిగిన  పాదయాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనావాసాలకు దూరంగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  ఈరోజు నుంచి నవంబర్‌ 4 వరకూ ఈ పాదయాత్ర కొనసాగనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:39 - October 24, 2016

గుంటూరు : గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. చిలకలూరి పేటలోని స్థానిక నర్సింగ్‌ హోమ్‌ లో భార్యపై భర్త హత్యాయత్నం చేశాడు. కత్తితో భార్యపై దాడికి దిగాడు. గమనించిన స్థానికులు కిరాతక భర్తను అడ్డుకున్నారు. దీంతో గాయాలతో భార్య బయటపడింది. ఇదంతా సీసీ టీవి లో రికార్డు కావడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

రేపు ఉ.11 గం.లకు ఏపీ అసెంబ్లీలో ప్రివిలేజ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్ : రేపు ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీలో ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం కాబోతోంది. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 

21:35 - October 24, 2016

హైదరాబాద్ : రేపు ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీలో ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం కాబోతోంది. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. వర్షా కాల సమావేశాల్లో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై చర్చించనున్నారు. ప్రివిలేజ్‌ కమిటీకి హాజరుకావాలని 12 మంది వైసీపీ సభ్యులకు నోటీసులు అందజేశారు. రేపటి సమావేశానికి ఆరుగురు వైసీపీ సభ్యులు హాజరుకానున్నారు. ఇందులో కోడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దాడిశెట్టి, శ్రీనివాసులు, జగ్గిరెడ్డి, రాచమల్లు ఉన్నారు. వీరంతా కమిటీకి వివరణ ఇస్తారు. ఎల్లుండి కమిటీ ముందు మరో ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. 

 

21:29 - October 24, 2016

మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో భీమారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కోరిదుబ్బ గ్రామంలోని చిన్నమున్ని హాస్టల్‌లో యూకేజీ చదువుతున్న బాలుడు తీవ్ర జ్వరంతో మృతి చెందాడు. హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ చెన్నూరు ఆస్పత్రిలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

21:27 - October 24, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీల కన్వెన్షన్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో ఓయూలోని లా కాలేజీలో ఏర్పాటు చేసిన రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్‌ ను వీసి రామచంద్రం ప్రారంభించారు. ప్రభుత్వాలకు ఉన్నత విద్యపై చిత్తశుద్ధి కరువైందని ఎస్‌ఎఫ్‌ఐ విమర్శించింది. రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఇంతవరకు యూనివర్సిటీల్లోని సమస్యలు పరిష్కారం కాలేదని తెలంగాణ యూనివర్సిటీల కన్వినర్‌ ఆంజనేయులు మండిపడ్డారు. 

21:25 - October 24, 2016

నిజామాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల డిమాండ్లు కొనసాగుతునే ఉన్నాయి. మండలాలను జిల్లాగా మార్చాలని.. గ్రామాలను మండలాలుగా చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలోని బాన్సువాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని స్థానికులు కోరుతున్నారు. 
బాన్సువాడను జిల్లా కేంద్రం చేయాలని ప్రతిపాదనలు 
కామారెడ్డి పేరుతో బాన్సువాడను జిల్లా కేంద్రంగా చేయాలనే ప్రతిపాదనలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. అయితే ప్రభుత్వం కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మార్చి బాన్సువాడను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించింది. అయితే బాన్సువాడను జిల్లా చేయాలంటూ... అఖిల పక్షం ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు చేస్తున్నారు. 
1969లో గ్రామ పంచాయితీగా బాన్సువాడ మండలం 
1969లో బాన్సువాడ మండలం గ్రామ పంచాయితీగా ఏర్పడింది. అప్పటి నుంచి అధికారులు, నాయకులు బాన్సువాడ తలరాతను మార్చలేకపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 35 సంవత్సరాలుగా బాన్సువాడలో ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇంతవరకు ఎలాంటి అభివృద్ది చేయలేదని అఖిల పక్షం నేతలు ఆరోపిస్తున్నారు. 
గ్రామ పంచాయితీ పరిధిలో 14 గ్రామ పంచాయితీలు 
ఈ మేజర్‌ గ్రామ పంచాయితీ పరిధిలో సుమారుగా 14 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. జనాభా కూడా చాలా ఎక్కువే.. కామారెడ్డి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో... నిజామాబాద్‌ నుంచి 60 కిలో మీటర్ల దూరంలో బాన్సువాడ మండలం ఉంది. దీంతో ఈ ప్రాంతం అన్ని విధాల వెనకబడిందని అఖిల పక్షం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దీనిపై మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయింది. ఎల్లారెడ్డి, జుక్కల్‌, నారాయణఖేడ్‌ ప్రాంతాలకు సెంటర్‌ పాయింట్‌ కావడంతో బాన్సువాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని స్థానికులు కోరుతున్నారు. 

 

21:22 - October 24, 2016

రంగారెడ్డి : జిల్లాలోని తుక్కగూడలో సీపీఎం మహాజన పాదయాత్ర ఎనిమిదో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని, పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులను అడిగి పాఠశాల సమస్యలను తెలుసుకున్నారు. అంగన్‌వాడీ  సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. 
తెలంగాణలో హిట్లర్‌ పాలన : సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ర్టంలో ప్రస్తుతం హిట్లర్‌ పాలన కనిపిస్తోందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సీపీఎం చేపట్టిన 'మహాపాదయాత్ర'కు సబితా సంపూర్ణ మద్దతు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. అణిచివేయాలని చూస్తోందన్నారు.
హామీలను నెరవేర్చని ప్రభుత్వం : తమ్మినేని
ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి ఎజెండాతో తెలంగాణలో మహాజన పాదయాత్ర చేపట్టామని తమ్మినేని మరోసారి స్పష్టం చేశారు.
కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనులపైనే ప్రభుత్వ శ్రద్ధ : జస్టిస్‌ చంద్రకుమార్‌ 
కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనులపై శ్రద్ధ పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం... ప్రజా సమస్యలపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదని జస్టిస్‌ చంద్రకుమార్‌ విమర్శించారు. రైతు ఆత్మహత్యల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. 

 

21:17 - October 24, 2016

 విశాఖ : ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మల్కన్‌గిరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన మావోయిస్టుల్లో ఏడుగురు మహిళలూ ఉన్నారు. మావోయిస్టు పార్టీ కీలక నేత ఆర్కే తనయుడు కూడా ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు చెబుతున్నారు. 
24 మంది మావోయిస్టులు మృతి 
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఒడిశా రాష్ట్ర పరిధిలోని మల్కాన్‌గిరి జిల్లాలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఏవోబీలో మావోయిస్టులు కీలక సమావేశం నిర్వహిస్తున్న సమాచారం ఆధారంగా.. చిత్రకొండ బ్లాక్‌ పనసపుట్టు పరిసరాల్లో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. బూసిపుట్టు కట్టా ప్రాంతంలో మావోయిస్టులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్‌ జరిగింది. 
మృతి చెందిన మావోయిస్టులను గుర్తిస్తున్న పోలీసులు 
ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టులను గుర్తించే కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. ఇందులో మాజీ మావోయిస్టుల సహకారాన్ని తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం... మృతుల్లో వెంకటరమణ అలియాస్‌ గణేశ్, గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌, ఏవోబీ దళ కమాండర్‌ చలపతి, దయన్న, రాజన్న, అరుణ, బెంగాల్‌ సురేశ్‌లతో పాటు పార్టీ కీలక నేత ఆర్కే తనయుడు మున్నా కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నుంచి ఆర్కే తప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో.. గ్రేహౌండ్స్‌ బలగాలు అటవీ ప్రాంతంలోకి చొచ్చుకుపోయి మరీ కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. బలిమెల రిజర్వాయర్‌లోని ఏవోబీ కటాఫ్‌ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. 
బూసిపుట్టు కట్టా ఎన్‌కౌంటర్‌
బూసిపుట్టు కట్టా ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్టులతో పాటు ఇద్దరు పోలీసులూ గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హెలీకాప్టర్‌ ద్వారా మల్కన్‌గిరికి తరలించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం నుంచి మూడు ఏకే 47 గన్స్, ఏడు ఎస్ ఎల్ ఆర్ లు, 7 ల్యాండ్‌మైన్లు, 303 రైఫిల్స్, 15 భారీ ఆయుధాలు, ఒక ల్యాప్‌టాప్‌, 2 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ సమాచారం అందుకున్న ఏపీ డీజీపీ సాంబశివరావు విశాఖకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనా స్థలానికి అవసరాన్ని బట్టి అదనపు బలగాలను తరలించేందుకూ సిద్ధంగా ఉన్నామన్నారు. 
కొనసాగుతోన్న మృతదేహాల గుర్తింపు ఎస్పీ 
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో లభ్యమైన ఆయుధాలను బట్టి.. సమావేశంలో కీలక అగ్రనేతలు ఉన్నట్లు భావిస్తున్నామని విశాఖ ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ తెలిపారు. మృతదేహాల గుర్తింపు కొనసాగుతోందన్నారు. మావోయిస్టుల మృతదేహాలను మల్కన్‌గిరికి తరలిస్తామని ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ తెలిపారు.
ఎన్‌కౌంటర్‌ను ఖండించిన పౌరహక్కుల సంఘం, విరసం 
మరోవైపు ఏవోబీ ఎన్‌కౌంటర్‌ను పౌరహక్కుల సంఘం, విరసంలు తీవ్రంగా ఖండించాయి. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, మృతుల బంధువులు వచ్చేవరకూ పోస్టుమార్టం నిర్వహించరాదని ఆయా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. 
ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం 
అటు ఈ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను విచారించిన రాష్ట్ర హైకోర్టు.. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తుందో తేలే వరకు మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించింది. గురువారం వరకు పోస్టుమార్టం నిర్వహించరాదంటూ.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీలో ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌ కావడం ఇదే ప్రథమం. ఈ ఘటనతో.. ఏఓబీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. 

18:43 - October 24, 2016

ఢిల్లీ : టాటా గ్రూపులో కీలక పరిణమాలు చోటుచేసుకున్నాయి. టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికారు. తాతాల్కిక చైర్మన్ గా రతన్ టాటాను నియమించారు. నాలుగు నెలల్లో కొత్త ఛైర్మన్ ఎన్నిక జరుగనుంది. కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చద్రలు ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

టీ.సచివాలయం ఖాళీకి టీ.ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయ ఖాళీకి టీ.ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. 10 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించింది. 9 మంది ఐఏఎస్ లకు సచివాలయం తరలింపు బాధ్యతలు అప్పగించారు.

18:16 - October 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయ ఖాళీకి టీ.ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. 10 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించింది. 9 మంది ఐఏఎస్ లకు సచివాలయం తరలింపు బాధ్యతలు అప్పగించారు. ఎంజి గోపాల్, ఆధేర్ సిన్హా, అశోక్ కుమార్, వికాస్ కారీ, మీనా, సునీల్ శర్మ, శాలినీమిశ్రాలకు బాధ్యతలు అప్పచెప్పారు. ఒక్కొక్కరికి నాలుగు లేదా ఐదు శాఖలను తరలించే బాధ్యతలు అప్పగించారు. అన్ని శాఖల కార్యదర్శులకు బూర్గుల రామకృష్ణారావు భవనాలను కేటాయించారు. మున్సిపల్ ఆఫీస్ ను డీటీసీటీ ఆఫీసుకు తరలించాలని నిర్ణయించారు. పీఆర్ ఆండ్ ఆర్డీని పంచాయతీ భవన్ కు తరలించనున్నారు. హౌసింగ్ శాఖను గృహకల్పకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ సంక్షేమ శాఖకు డీఎస్ ఎస్ భవన్ ను కేటాయించారు. మిగిలిన శాఖలు బూర్గుల రామకృష్ణారావు బిల్డింగ్ కు తరలించనున్నారు. బీఆర్ కె భవన్ లోనే ప్రిన్సిపల్ సెక్రెటరీ చాంబర్స్ ఉండనుంది. ఆర్ ఆండ్ బీ, సంక్షేమ, పురపాలక, ప్రణాళిక శాఖలు మినహా అన్ని శాఖలన్నీ బీఆర్ కే భవన్ కే తరలించనున్నారు. 

టాటా గ్రూప్ లో కీలక పరిణామం..

ముంబై : టాటా గ్రూప్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాటా గ్రూప్ ఛైర్మన్ పదవికి సైరన్ మిస్త్రీ రాజీనామా చేశారు. తాత్కాలిక ఛైర్మన్ గా రతన్ టాటా కొనసాగనున్నారు. 

పోలవరం అనుమతులపై ఎన్జీటీ విచారణ..

ఢిల్లీ : పోలవరం అనుమతుల పిటిషన్ పై ఎన్జీటీ విచారించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని ఏపీ విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదులు వినేందుకు పర్యావరన శాఖకు బదులు జలవనరుల శాఖకు అవకాశం ఇవ్వాలని కోరింది. పర్యావరణశాఖపై అభ్యంతరాలు ఏంటనీ ఎన్జీటీ ప్రశ్నించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జలనవరుల శాఖ చేపడుతోందని ఎపీ తెలిపింది. ఏపీ అభ్యంతరను ఎన్జీటీ అంగీకరిస్తూ తదుపరి విచారణనను నవంబర్ 21కి వాయిదా వేసింది. 

17:22 - October 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌ తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. చంద్రబాబు చర్చలతో సమస్యలను పరిష్కరించుకుందామని కోరుతుంటే.. కేసీఆర్‌ కయ్యానికి కాలు దువ్వుతున్నారన్నారు. అన్నదమ్ముల్లా ఉంటున్న తెలుగు ప్రజలను రెచ్చగొట్టే విధంగా టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవహరిస్తోందని తెలిపారు. వాటాల విషయంలో ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. 

 

17:20 - October 24, 2016
17:11 - October 24, 2016

హైదరాబాద్ : కేసీఆర్‌ సర్కార్‌ ప్రజల ప్రభుత్వం అయితే వెంటనే ఎన్నికలకు రావాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ఫ్యామిలీ పాలన సాగుతోందని మండిపడ్డారు. విషజ్వరాలు విజృంభిస్తున్నా సీఎం పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫాం హౌజ్‌ లో కేసీఆర్‌ ఎంజాయ్‌ చేస్తున్నారని ఆరోపించారు. 

 

16:58 - October 24, 2016
16:57 - October 24, 2016
16:53 - October 24, 2016

హైదరాబాద్ : తన హత్యకు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కుట్ర చేశారని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శ్రీధర్‌బాబుకు గ్యాంగ్‌స్టార్‌ నయీంతో సంబంధాలు ఉన్నాయని మధు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌, డీజీపీకి రేపు ఫిర్యాదు చేస్తానని పుట్ట మధు చెప్పారు. గతంలో కాటారం ఏరియాలో జరిగిన హత్యల మిస్టరీ ఇంకా వీడలేదన్నారు. ఇప్పటి వరకు వాస్తవాలు వెలుగులోకి రాలేదని తెలిపారు.

 

16:46 - October 24, 2016

హైదరాబాద్ : గులాబి దళానికి దళపతి గుబులు పట్టుకుంది. సిట్టింగ్ శాసనసభ్యులు సహా మంత్రుల్లో  సర్వే వ్యవహారం ఆందోళన రేపుతోంది. కొంత మంది నేతల పేర్లు బయట పడినా.. అందరి చిట్టా సీఎం చేతుల్లోనే ఉందన్న అనుమానాలు నేతలను వెంటాడుతున్నాయి.
సర్వేతో గులాబి దళంలో కొత్త ఆందోళనలు 
సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేల వ్యక్తిగత అంశాలపై చేపించిన సర్వే గులాబి దళంలో కొత్త ఆందోళనలు రేపుతున్నాయి. కొంత మంది నేతలు మినహా అందరిలోనూ సర్వే గుబులు పట్టుకుంది. పార్టీ పరంగా చేసిన సర్వేతో విపక్షాలను ఇరుకున పెట్టేందుకు సీఎం చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ నేతల్లో కూడా చర్చనీయాంశమైంది. 
ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన సీఎం 
కొంత మంది ఎమ్మెల్యే తీరుపై ఇప్పటికే సర్వే ఆధారిత లీకులు బయటపడగా.. మరికొందరికి సీఎం వార్నింగ్‌ ఇచ్చారన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. శాసన సభ్యులతో పాటు మంత్రులు కూడా సీఎం ఆగ్రహానికి గురయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల వ్యక్తిగత అంశాలు వారి గెలుపుపై ప్రభావితం చేస్తాయనే సర్వే నివేదికలు ఇప్పుడు పార్టీలో గుబులు పుట్టిస్తోంది. 
వారికి పార్టీ టికెట్లు దక్కే అవకాశం లేదు..
సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో కనీసం 30 నుంచి 40 మందికి పార్టీ టికెట్లు దక్కే అవకాశాలు లేవని అధికార పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారే ఈ జాబితాలో అధికంగా ఉన్నారనే అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది. కొంత మంది మంత్రుల నియోజకవర్గాల్లో వారికి వ్యక్తిగతంగా తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయం సర్వేలో సీఎంకు స్పష్టమైన నివేదికలు అందాయని సమాచారం. రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 50 శాతం మందికి మొండి చెయ్యి తప్పదనే అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది. అధికార పార్టీ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే.. ఇతర పార్టీల నుంచి గులాబి గూటికి చేరిన నేతల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు అధికార పార్టీలో హాట్‌ టాపిక్‌ గా మారింది. 

 

16:40 - October 24, 2016

హైదరాబాద్ : ఏపీ ఇరిగేషన్‌శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావు వ్యాఖ్యలను వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఖండించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఎదుట సరైన వాదనలు వినిపించకపోవడం వల్లే ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న దేవినేని వ్యాఖ్యలను వాసిరెడ్డి పద్మ తప్పుపట్టారు. కేంద్రంలో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉండి కూడా రాష్ర్టానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. 

 

16:36 - October 24, 2016


విజయవాడ : బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను ఉన్నత చదువులు చదివించేందుకు...విదేశాలకు పంపించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని చెప్పారు. చంద్రన్న పరిపాలనలో ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందాలన్నారు. 

 

16:31 - October 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయాన్ని కూల్చాల్సిన అవసరం ఏముందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే సర్కార్‌ కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసిందన్నారు. ప్రజా ధనాన్ని ఇష్టానుసారంగా మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ నిర్మించాల్సిన అవసరం ఏముందో ప్రజలకు సమాధానం చెప్పాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 

 

16:21 - October 24, 2016

హైదరాబాద్‌ : ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై ఏపీ సీఎల్‌సీ వేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తుందో తేలే వరకు మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని కోర్టు తెలిపింది. గురువారం వరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించొద్దని ఆదేశించింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

డీసీసీబీ, టీఎస్సీఏజీలో ఖాళీ పోస్టుల భర్తీకి సబ్ కమిటీ..

హైదరాబాద్ : డీసీసీబీ, టీఎస్సీఏజీలో ఖాళీ పోస్టుల భర్తీకి సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్మన్ గా టీఎస్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ప్రెసిడెంట్, ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

షీ టీంలకు రెండేళ్లు..

హైదరాబాద్ : షీ టీమ్ లు ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యాయి. రెండేళ్లలో మహిళలను వేధించిన 4423 మందిని అరెస్టు చేసినట్లు, రెడ్ హ్యాడెండ్ గా కెమెరాకు 800 మంది చిక్కారని అడిషనల్ సీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు. వీరిలో మైనర్ లు 222, మేజర్లు 577 మంది ఉన్నట్లు తెలిపారు. రెండు పీడీ యాక్టులు, 40 మందిపై నిర్భయ చట్టం నమోదు చేశామన్నారు. 33 మందిపై ఐటీ యాక్టు, 1897 మంది ఆకతాయిలపై 41 మందికి జైలు శిక్షలు, 242 మందికి జరిమాన విధించినట్లు తెలిపారు. 392 మందిని హెచ్చరించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించడం జరిగిందన్నారు. 

శ్రీధర్ బాబుకు నయీంతో సంబంధాలు - పుట్ట మధు..

పెద్దపల్లి : మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు నయీంతో సంబంధాలున్నాయని, తన హత్యకు శ్రీధర్ బాబు కుట్ర చేశారని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. దీనిపై రేపు సీఎం కేసీఆర్, డీజీపిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తనను హత్య చేసేందుకు కూడా కుట్ర జరిగిందని దీని వెనుక శ్రీధర్ బాబు హస్తం ఉందన్నారు. 

16:13 - October 24, 2016

విశాఖ : ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని డీజీపీ సాంబశివరావు  తెలిపారు. లొంగిపోమని పోలీసు బలగాలు హెచ్చరిస్తున్నా...అవతలివైపు నుంచి మావోయిస్టులు కాల్పులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దాదాపు 20 మందికి పైగా మావోయిస్టులు మరణించారని... ఇద్దరు సీనియర్‌ కమాండోలు గాయపడినట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ మృతులను గుర్తిస్తున్నామని తెలిపారు.

 

గ్రేటర్ రోడ్ల కుంభకోణంపై లోకాయుక్తలో టిడిపి పిటిషన్ ?

హైదరాబాద్ : గ్రేటర్ రోడ్ల కుంభకోణంపై తెలంగాణ టిడిపి లోకాయుక్తలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విచారించాలని లోకాయుక్తను కోరాలని యోచిస్తోంది. దీపావళి తరువాత పిటిషన్ వేస్తారని సమాచారం. 

మావోయిస్టుల మృతదేహాలు భద్రపరచాలి - కోర్టు..

హైదరాబాద్ : ఏవోబీ ఎన్ కౌంటర్ పై ఏపీ సీఎల్ సీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుందో తేలే వరకు మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని కోర్టు సూచించింది. గురువారం వరకు పోస్టుమార్టం నిర్వహించవద్దని, తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది. 

15:16 - October 24, 2016

రాజమౌళి..అనగానే 'బాహుబలి' సినిమా గుర్తుకు వస్తుంది. ప్రపంచానికి టాలీవుడ్ శక్తి ఏంటో నిరూపించిన చిత్రం 'బాహుబలి'. ఈ సినిమాను రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. దీనికి కంటిన్యూగా 'బాహుబలి -2' ను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కొనసాగుతోంది. కానీ మళ్లీ అలాంటి తప్పు చేయనని రాజమౌళి పేర్కొన్నారు. ముంబైలో మామీ చలన చిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న రాజమౌళి మీడియాతో మాట్లాడారు. 'బాహుబలి' తొలి భాగంలో అతిథి పాత్రలో కనిపించి తప్పుచేశానని, మళ్లీ ఆ తప్పును పునరావృతం చేయనని అన్నారు. కట్టప్ప పాత్ర చక్కటి ఆదరణను పొందిందని, ఆ పాత్రకు ఇంతలా పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఊహించలేదన్నారు. రెండో భాగంలో యాక్షన్ ఘట్టాలు రొమాంచితంగా ఉంటాయని, ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని రాజమౌళి వెల్లడించారు. 

సీపీఎం మహాజన పాదయాత్రకు జిస్టిస్ చంద్రకుమార్ మద్దతు

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్రకు జిస్టిస్ చంద్రకుమార్ మద్దతు తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో తమ్మినేని వీరభద్రంతోపాటు పాదయాత్ర బృందాన్ని కలిసిన ఆయన పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. 

14:34 - October 24, 2016

లక్నో : సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం నేపథ్యంలో లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ కొడుకు అఖిలేశ్‌ యాదవ్‌ను ఉద్దేశించి పరోక్షంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్‌కు వ్యతిరేకంగా శివపాల్‌, అమర్‌సింగ్‌లను వెనకేసుకొచ్చారు. తన సోదరుడు శివపాల్‌ యాదవ్‌ను పెద్దనేతగా ములాయం అభివర్ణించారు. అమర్‌సింగ్‌ తనకు సోదరుడులాంటి వాడని ఆయన ఎన్నోసార్లు తనని రక్షించాడని పేర్కొన్నారు. శివపాల్‌, అమర్‌సింగ్‌లకు వ్యతిరేకంగా మాట్లాడితే నేను తట్టుకోలేనని స్పష్టం చేశారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మౌనం వీడిన అఖిలేశ్..
ఎస్పీ అంతర్గత విభేదాల సందర్భంగా లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో యుపి సిఎం అఖిలేశ్ యాదవ్ మౌనం వీడారు. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తన తండ్రితో ఎలాంటి విభేదాలు లేవని, ఆయన గురువు లాంటి వారని, కొత్త పార్టీ పెట్టడం లేదని అఖిలేష్‌ స్పష్టం చేశారు. ఓ దశలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ములాయం కోరితే సీఎం పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని అఖిలేష్‌ ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని తాను వ్యతిరేకిస్తానని అమర్‌సింగ్‌ను ఉద్దేశించి అఖిలేష్‌ మండిపడ్డారు.

అఖిలేష్ పై శివపాల్ యాదవ్ విమర్శలు..
లక్నో పార్టీ సమావేశంలో ములాయం సోదరుడు శివపాల్‌ యాదవ్‌ అఖిలేష్‌పై మరోసారి విరుచుకు పడ్డారు. అఖిలేష్‌ యాదవ్‌ కొత్త పార్టీ పెట్టి ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పాడని ఆరోపించారు. అఖిలేష్‌ ఈ మాటలన్నట్లు ప్రమాణపూర్వకంగా చెబుతున్నానని శివపాల్‌ చెప్పారు. నేనేం తప్పు చేశానని నా శాఖలన్నీ లాగేసుకున్నాడని నిలదీశారు. నేను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించానని పేర్కొన్నారు. పార్టీని ఉన్నత స్థితికి తెచ్చేందుకు తానెంతో కృషి చెసినట్లు శివపాల్‌ తెలిపారు.

ఘర్షణ..
సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో లక్నోలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి ముందు అఖిలేష్‌, శివపాల్‌ అనుచరులు బాహాబాహీకి దిగారు. ఒకరినిమించి ఒకరు నినాదాలు చేసిన ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డాయి. వివాదం తీవ్రం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను చెదరగొట్టి పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చారు.

14:30 - October 24, 2016

ఉక్రుల్ : మణిపూర్ సీఎంపై ఒక్రాం ఇబోబీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.. ఉక్రుల్ హెలిఫ్యాడ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తృటిలో సీఎం ఇబోబీ సింగ్ తప్పించుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

14:29 - October 24, 2016

హైదరాబాద్ : ఏవోబీ లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మధ్యాహ్నం రెండున్నరగంటలకు ఈ పిటిషన్‌ విచారణకు రాబోతోంది.. పోస్ట్ మార్టం నిబంధనలు పాటించి మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించాలని ఏపీ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది.. 

14:27 - October 24, 2016

విశాఖపట్టణం : ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో కాల్పులు కొనసాగుతున్నాయి.. మావోయిస్టులు కాల్పులు ఆపి లొంగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే 23మంది మృతిచెందారు.. ఈ మృతదేహాలను మల్కన్‌గిరికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.. AOB ప్రాంతమైన బూసిపుట్టు కట్టాలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.... ఈ జాయింట్‌ ఆపరేషన్‌ను ఏపీ, ఒడిశా, కేంద్ర బలగాలు సంయుక్తంగా నిర్వహించాయి.

ఏఓబీలో..
ఏఓబీలో సరైన సమయంకోసం ఎదురుచూస్తున్న పోలీసులు పంజా విసిరారు.. జంత్రి అటవీప్రాంతంలో మావోయిస్టుల ప్లీనరీ జరుగుతోందంటూ పోలీసులకు సమాచారం అందింది.. ఈ సమాచారంతో మావోయిస్టులపై దాడికి పోలీసులు పక్కా స్కెచ్‌తో రంగంలోకిదిగారు.. గ్రేహౌండ్స్ దళాలు అటవీప్రాంతంలో తొమ్మిది కిలోమీటర్లలోపలివరకూ చొచ్చుకువెళ్లారు. బలిమెల రిజర్వాయర్‌లోని ఏఓబీ కటాఫ్ ఏరియా జల్లెడపట్టారు.. ప్లీనరీ సమావేశంపై మెరుపుదాడి చేశారు.. మావోయిస్టులు తేరుకునేలోపు వారిపై బుల్లెట్లదాడి చేశారు.. ఈ కాల్పుల్లో పలువురు గ్రేహౌండ్స్‌ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి..

మృతుల్లో ఆరుగురు మహిళలు..
ఇక చనిపోయిన మావోయిస్టులను గుర్తించేందుకు మాజీ మావోయిస్టుల సహాయం తీసుకుంటున్నారు.. వారిని ఘటనాస్థలంలోకి తీసుకువెళ్లి మృతుల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.. మృతుల్లో మావోయిస్టు కీలకనేతలున్నట్లు తెలుస్తోంది.. వెంకటరమణ అలియాస్‌ గణేశ్, గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌, ఏవోబీ దళ కమాండర్‌ చలపతి, దయన్న, రాజన్న ఉన్నట్లు సమాచారం.. కాల్పుల ప్రదేశంనుంచి మూడు ఏకే 47 గన్స్, ఏడు SLRలు, 7 ల్యాండ్‌మైన్లు, 303 రైఫిల్స్, 15 భారీ ఆయుధాలు, ఒక ల్యాప్‌టాప్‌, 2లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. మృతుల్లో ఆరుగురు మహిళా నక్సలైట్లున్నట్లు తెలుస్తోంది.

ఒడిశాకు మృతదేహాలు...
కొన్ని నెలలుగా సైలంట్‌గాఉన్న మావోయిస్టులు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో మళ్లీ బలంపెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఇందులోభాగంగా చిత్రకొండ పనసపుట్టు దగ్గర సమావేశమయ్యారు.. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మెరుపుదాడిచేశారు.. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను ఒడిశాకు తరలిస్తామని SP తెలిపారు.. ఎన్‌కౌంటర్‌ ఒడిశాలో జరిగిందని... అందుకే మృతదేహాలను అక్కడికే పంపుతామని చెప్పారు.. గాయపడ్డ జవాన్లకుకూడా మల్కన్‌గిరిలోనే చికిత్స అందిస్తున్నారు.. 

ఎన్ కౌంటర్ పై హైకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : విశాఖలో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమంటూ హైకోర్టులో ఏపీ పౌరహక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. నిబంధనలకు అనుగుణంగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేసింది. 

ఆర్డీఓ ఆఫీసులో ఏజెంట్ల మధ్య వివాదం..

కృష్ణా : నందిగామ ఆర్డీఓ ఆఫీసులో ఏజెంట్ల మధ్య వివాదం నెలకొంది. తన కళ్లలో కారం చల్లి హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఏజెంట్ అల్లావుద్దీన్ పై పుల్లారావు అనే ఏజెంట్ ఫిర్యాదు చేశారు.

 

14:04 - October 24, 2016

సంప్రదాయ దుస్తుల్లో చుడీదార్ ఒకటి..చుడీదార్స్ లోనే నయా ట్రెండ్ ట్రై చేయాలనుకుంటే లాంగ్ లెంత్ చుడీదార్స్ ఇప్పుడు లేటెస్ట్ . ఇటువంటి కలెక్షన్ తో మీ ముందుకు వచ్చింది సొగసు..మరి నయా ట్రెండ్ లో లాంగ్ లెంత్ చుడీ దార్స్ కోసం తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి..

13:56 - October 24, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ కు విందులు వినోదాలు, పండుగలు, పబ్బాలు తప్ప ప్రజాసంక్షేమం పట్టటంలేదని టీ.టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు మరుగున పడ్డాయని.. హైదరాబాద్ రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ టీడీపీ నేతలు హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి విద్యార్థులను సీఎం కేసీఆర్ గాలికొదిలేశారని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

13:52 - October 24, 2016

రంగారెడ్డి : బీసీలకు, వృత్దిదారులకు సంబంధించి నిధులు పక్కదారి పడుతున్నాయని ఆయన ఆరోపించారు. వృత్తుల ఆధునీకరణకు సంబంధించి ప్రత్యేక కమిటీలు వేస్తామన్న ప్రభుత్వం ఆ విషయం మరచిందన్నారు..రాష్ట్రంలో నెలకొన్న కరువును అధిగమించాలంటే వృత్తిదారులను ఆదుకోవాల్సిన అవుసరమందని ఆయన సూచించారు. కాగా ఇబ్రహీంపట్నంలోని పటేల్ గూడెంలో సీపీఎం మహాజన పాదయాత్ర ఎనిమిదో రోజు పాదయాత్ర కొనసాగుతుంది. కొంగర, రావిరాల, తుక్కుగూడ, ఇమామ్‌ గూడ, మంకాల్‌, లేమూరుగ్రామాల్లో పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర ద్వారా సొంత రాష్ట్రంలోనూ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందని పాదయాత్ర సభ్యులు రమణ తెలిపారు. రాష్ట్రంలో వున్న మత్స్య కారులు పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారని రమణ ఆరోపించారు. 

13:47 - October 24, 2016

హైదరాబాద్ : జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నవంబర్ 10వ తేదీన అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది. దశల వారిగా జనంలోకి వెళ్లేందుకు కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే జనసేన బృందాలు అనంతలో పర్యటించి స్థానిక సమస్యలపై పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కి నివేదిక అందించినట్టు సమాచారం. మరింత సమాచారానికి వీడియో చూడండి..

13:40 - October 24, 2016

హైదరాబాద్ : అతన్ని అయిదున్నర అడుగుల బుల్లెట్ అనుకున్నారు. అతనే ధైర్యం విసిరిన రాకెట్ అనుకున్నారు. రెండు వైపులా పదునున్న కత్తిలా వాడుకున్నారు. ఎన్‌కౌంటర్లు, ఏరివేతలకు ఆయువుపట్టుగా మారి ఖాకీలకు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి..ఒక్కసారిగా రివర్స్ ఎందుకు అయ్యాడు. అతన్ని మార్చింది ఎవరు? ఆ రెండేళ్లలో అతన్ని వాడుకుంది ఎవరు? మాఫియా డాన్ నయీం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే ఎన్నో మలుపులు, మరెన్నో సంచలనాలు.. నయీం కేసును లోతుగా శోధిస్తున్న సిట్‌ టీమ్‌కు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. అతన్ని రెండు విధాలుగా ఉపయోగించుకున్న పోలీసులు, ఓ నేతాశ్రీ అతన్ని అరాచక శక్తిగా మార్చి తమ ప్రయోజనాలకు వాడుకున్నారన్న ప్రచారం వినిపిస్తోంది. అసలు నయిం గతంలో ఎలా ఉండే వాడు..ఆ నేతతో పరిచయం తర్వాత ఎలా మారాడు అన్న అంశాలు చర్చకొస్తున్నాయి.

నయీం కేసులో వెలుగుచూస్తున్న ట్విస్టులు
2008 వరకు నయిం పోలీసులకు మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ కాదు. ఖాకీలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాడు. ఇన్‌ఫార్మర్‌గా పలు రాష్ట్రాల పోలీసులకు టెర్రరిస్టులు, మావోయిస్టుల సమాచారం అందజేసేవాడు. కేంద్ర నిఘా బృందాలు సైతం ఇతగాడి సేవలు వాడుకున్నాయంటేనే..అతడి నెట్‌వర్క్‌ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో నయీం కీలక పాత్ర పోషించిన విషయాన్ని నాలుగు రాష్ట్రాల పోలీసులు మరవలేరు. అక్రమ ఆయుధాలు సరఫరా చేసే సోహ్రాబుద్దీన్‌ను పట్టించింది నయిమేనన్నది సి.బి.ఐ. వాదన.

2008 వరకు మోస్ట్‌వాంటెడ్ లిస్టులో కనిపించని నయీం పేరు
సోహ్రాబుద్దిన్ కేసులోనే కాకుండా హుజీ తీవ్రవాద కార్యకలాపాల అణిచివేతకు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బంగ్లాదేశ్ పారిపోయిన ముజీబ్‌ను మట్టిపెట్టడంలో కౌంటర్ ఇంటిలిజెన్స్‌కు ఉప్పందించాడు. ఆ సమచారమే హైదరాబాద్‌లో బాంబుపేలుళ్ల కుట్రలను భగ్నం చేసేందుకు సహకరించాయని అప్పటి పోలీస్‌ అధికారుల టాక్. అయితే ముజీబ్‌తో నయిం తరచు మాట్లాడే వాడని అక్రమ ఆయుధాల తరలింపు కేసులో నయీం పాత్ర ఉందని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులపై ద్వేషం పెంచుకున్న నయీం ఆ తర్వాత కోర్టుకు హాజరవుతూ కొందరి సాయంతో ఎస్కేప్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే 2008 నుంచి నయీం స్టోరీ కొత్త మలుపు తిరిగింది. అప్పటివరకు పోలీసులకు ఆయుదంగా ఉన్న అతడు..తనకు పరిచయం ఉన్న పోలీస్ అధికారులను మాత్రమే నమ్మేవాడట. వారికి గిఫ్ట్‌ల ఎరచూపి తన గుప్పిట్లో ఉంచుకునేవాడట. భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలంటే పొలిటికల్ లీడర్స్‌తో స్నేహమే అందుకు మార్గమని భావించాడట. అజ్ఞాతంలోనే ఉంటూనే భువనగిరిలోని పాత ఫ్రెండ్స్‌తో మళ్లీ జత కట్టాడు.

హుజీ తీవ్రవాద కార్యకలాపాలపై నయీం కీలక సమాచారం!
ప్రస్తుత మండలిలో ఓ సభ్యుడితో ఉన్న పరిచయాన్ని దందాలు, రౌడీయిజానికి నయీం వాడుకున్నట్లు తెలుస్తోంది. సెటిల్‌మెంట్‌ డాన్‌గా అనతి కాలంలోనే ఎదిగి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడు. వాటిని నిలుపుకోవడానికి మరెన్నో ఘోరాలు చేశాడు. నయీం ఓ శక్తిగా ఎదిగేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు సహకరించినట్లు సమాచారం.

దందాలు, రౌడీయిజానికి మండలి సభ్యుడి సహకారం?
2008 వరకు తాను నమ్మే సిద్దాంతాల కోసం పని చేసిన నయీం.. ఆ తరువాతే రాజకీయ మోజులో పడి అరాచక శక్తిగా మారాడనే వాదన ఉంది. అయితే ఈ సమాచారాన్ని సేకరించిన సిట్‌ బృందం.. నయింకు సహాకరించిన నేతలు, పోలీస్ అధికారులపై హైకోర్టు అదేశాలతో కేసులు నమోదు చేసి అరెస్టుల పర్వం కొనసాగించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

 

13:22 - October 24, 2016

హైదరాబాద్ : సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లో కొనసాగిన ఎన్ కౌంటర్ లో 23 మంది మావోలు హతమయ్యారు. ఈ ఘటనపై ప్రముఖ విరసం నేత వరవరరావు మాట్లాడుతూ, ఏవోబీలో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్ అని ఆరోపించారు. మావోల సమావేశంపై సమాచారం అందుకుని ఎన్ కౌంటర్ జరిపామనే ప్రకటనలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఆరోపించారు. చర్చలకని పిలిచి ఎన్ కౌంటర్ చేశారని వరవరరావు అభిప్రాయపడ్డారు. చర్చలకు వచ్చినటువంటివారిని ఎన్ కౌంటర్ చేయటం దారుణమన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా వున్న సమయంలో కూడా చర్చల నిమిత్తం పిలిచి ఎన్ కౌంటర్ చేశారనీ అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జరిగిందని ఆయన పేర్కొన్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ఎన్ కౌంటర్లో చనిపోయిన వారి మృత దేహాలను భద్రపరచాలని డిమాండ్ చేశారు. వారి బంధువులు వచ్చేంత వరకు పోస్ట్ మార్టం నిర్వహించకూడదని అన్నారు. జాతీయ మానవ హక్కుల సంస్థ నిబంధనల మేరకే పోస్ట్ మార్టం నిర్వహించాలని కోరారు. ఈ ఎన్ కౌంటర్ ను సవాల్ చేస్తూ పౌరహక్కుల నేతలు హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. పిటీషన్ పై హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు దీనిపై విచారణ చేపట్టనుంది.ఈ మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు రానుంది. కాగా ఏవోబీలో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. కొనసాగుతున్నాయి. కాగా ఎన్ కౌంటర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను గుర్తించి వారిని వారి కుటుంబాలకు అప్పగించటానికి సుదీర్ఘ సమయం పడుతున్నట్లుగా సమాచారం. కాగా ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి వాహనాలు వెళ్లే వీలులేనందున చాలా సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
నెత్తురోడిన ఆంధ్రా బోర్డర్
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు కాల్పులతో దద్దరిల్లింది.. పచ్చని అడవిలో నెత్తురుపారింది.. పారిపోయిన మావోయిస్టులకోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.... ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన 23మంది మావోయిస్టుల మృతదేహాలను మల్కన్‌గిరికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు..ఇక చనిపోయిన మావోయిస్టులను గుర్తించేందుకు మాజీ మావోయిస్టుల సహాయం తీసుకుంటున్నారు.. వారిని ఘటనాస్థలంలోకి తీసుకువెళ్లి మృతుల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.. మృతుల్లో మావోయిస్టు కీలకనేతలున్నట్లు తెలుస్తోంది.. విశాఖ ఏరియా కార్యదర్శిగా పనిచేస్తున్న గాజర్ల రవి అలియాస్‌ గణేశ్, చలపతి, దయ, రాజన్న, బెంగాల్‌ సుధీర్, అశోక్‌, మల్లేశ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.... ఈ కాల్పుల సమయంలో మరో అగ్రనేత ఆర్కె తప్పించుకున్నట్లు సమాచారం.. కాల్పుల ప్రదేశంనుంచి మూడు ఏకే 47 గన్స్, ఏడు ఎస్ ఎల్ ఆర్ లు, 7 ల్యాండ్‌మైన్లు, 303 రైఫిల్స్, 15 భారీ ఆయుధాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..
ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో మళ్లీ బలంపెంచుకునేందుకు మావోల యత్నం
కొన్ని నెలలుగా సైలంట్‌గాఉన్న మావోయిస్టులు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో మళ్లీ బలంపెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఇందులోభాగంగా చిత్రకొండ పనసపుట్టు దగ్గర సమావేశమయ్యారు.. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మెరుపుదాడిచేశారు.. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను ఒడిశాకు తరలిస్తామని SP తెలిపారు.. ఎన్‌కౌంటర్‌ ఒడిశాలో జరిగిందని... అందుకే మృతదేహాలను అక్కడికే పంపుతామని చెప్పారు.. గాయపడ్డ జవాన్లకుకూడా మల్కన్‌గిరిలోనే చికిత్స అందిస్తున్నారు.. 

ఎన్ కౌంటర్ పై హరగోపాల్ స్పందన..

హైదరాబాద్ : ఏపీ, ఒడిశా సరిహద్దులో జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై ప్రొ.హరగోపాల్ స్పందించారు. కాల్పులు ఏకపక్షమేనని, ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి సరికాదన్నారు. 

హెచ్ సీఏ అవకతవకల విచారణ వాయిదా..

హైదరాబాద్ : హెచ్ సీఏలో అవకతవకలు..భూ విక్రయాల స్కాంలో ఏసీబీ కోర్టుకు ఏడుగురు నిందితులు హాజరయ్యారు. తదుపరి విచారణ వచ్చే నెల 28కి వాయిదా పడింది. 

సోయాబీన్ విత్తనాల సరఫరాపై మంత్రి పోచారం ఆరా..

హైదరాబాద్ : వ్యవసాయ ప్రిన్స్ పల్ సెక్రటరీ, కమిషనర్ జగన్ మోహన్ తో మంత్రి పోచారం సమావేశమయ్యారు. సోయాబీన్ విత్తనాల సరఫరాపై చర్చ జరిగింది.

 

జంట హత్యల కేసును చేధించిన పోలీసులు

నిజామాబాద్ : జంట హత్య కేసును పోలీసులు చేధించారు. అహ్మద్ పురా కాలనీలో జరిగిన జంట హత్య కేసులో కొడుకే హంతుకుడిగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

ఎస్పీలో సద్దుమణిగిని వివాదం..

లక్నో : సమాజ్ వాదీ పార్టీలో వివాదం సద్దుమణిగింది. శివపాల్ యాదవ్..అఖిలేష్ యాదవ్ మధ్య ములాయం రాజీ కుదిర్చారు. శివపాల్ యాదవ్ చిననాన్న అని ఇద్దరూ కలిసి పనిచేయాలని ములాయం సూచించారు. 

12:45 - October 24, 2016

అనంతపురం : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ముఖాలు కన్పించబోతున్నాయి. ఇప్పటి వరకు తమ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చిన యువ నేతలు రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష పాత్ర పోషించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు నేతల వారసులు.. రాజకీయ వారసులుగా రంగ ప్రవేశం చేయబోతున్నారు. మరి రాజకీయ పార్టీలు వారికి అవకాశమిస్తాయా..? ఇంతకీ వారసులుగా రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నది ఎవరు..? అదేదో మీరే చూడండి...!

వారసులకు లైన్‌ క్లియర్‌ చేస్తున్న నాయకులు
దీపం ఉండగానే.. అన్న చందంగా.. తాము రాజకీయాల్లో ఉన్నప్పుడే.. తమ వారసులకు లైన్‌ క్లియర్‌ చేస్తున్నారు అనంత జిల్లాలో కొందరు రాజకీయ నేతలు. దశాబ్దాలుగా రాజకీయ రంగంలో కీలక నేతలుగా ఉన్న కొందరు నాయకులు తమ వారసులను రంగప్రవేశం చేసించేందుకు వడివడిగా అడుగులేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తమ వారసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్గం సుగమం చేసే ప్రయత్నంలో ఉన్నారు.

జేసీ కుటుంబం నుంచి ఇద్దరు యువ నాయకులు రంగప్రవేశానికి సిద్ధం
జిల్లాలో దశాబ్దాలుగా ఓటమి ఎరుగని జేసీ కుటుంబం నుంచి ఇద్దరు యువ నాయకులు రంగప్రవేశం చేయడానికి సిద్ధమయ్యారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు పవన్ రెడ్డిని, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన వారసుడిగా అస్మిత్‌రెడ్డిని పోటీ చేయించే పనిలో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. తాడిపత్రి నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తాను మాత్రం కొత్తగా ఏర్పడబోయే గుత్తి నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

రాజకీయాల నుండి తప్పుకుంటానంటున్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి
అయితే జేసీ వ్యాఖ్యలను పూర్తిగా విశ్వసించడం కష్టం. ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని చెబుతున్నప్పటికీ.. ఎన్నికల సమయానికి పోటీలో ఉండే అవకాశం లేకపోలేదు. గతంలో కూడా అనేకసార్లు ఇలానే ప్రకటించి ఎన్నికల్లో పోటీచేసిన దివాకర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్‌ స్థానంలో తన తనయుడు పవన్‌రెడ్డికి టికెట్‌ ఇప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం అనంతపురం పట్టణంలో పట్టు నిలుపుకొనేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ చైదరితో విబేధాలు నడుపుతూనే ఉన్నారు. గత కొద్ది రోజులుగా అనంతలోనే మకాం వేసి ఆర్యవైశ్యులతో పాటు పట్టణంలోని ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు. అయితే ఒక్క జేసీ కుటుంబానికే నాలుగు టికెట్లు ఇస్తే పరిస్థితి ఏంటన్న మీమాంస కూడా పార్టీ వర్గాల్లో ఉంది. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఉంది. వారసుల కోసం అవసరమైతే తమ రాజకీయ జీవితాలను త్యాగం చేస్తారా..? లేక నాలుగు టికెట్లు ఇచ్చే పార్టీలోకి వెళతారా అన్నది కాలమే నిర్ణయించాలి.

పరిటాల కుటుంబం నుండి సునీత కుమారుడు శ్రీరామ్
ఇక జిల్లాలో కీలకంగా ఉన్న పరిటాల కుటుంబం నుంచి పరిటాల శ్రీరామ్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తన తండ్రి హత్యానంతరం తల్లి పరిటాల సునీతకు అండగా ఉంటూ2014 ఎన్నికల్లో సునీత గెలుపు కోసం కీలకంగా పనిచేశాడు. వచ్చే ఎన్నికల నాటికి శ్రీరాం పోటీలో ఉండేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరిటాల కుటుంబం ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్నదానిపై తర్జన భర్జన ఉన్నప్పటికీ.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అదేం పెద్ద సమస్య కాదన్న అభిప్రాయం ఉంది. ఒకవేళ పునర్విభజన జరగకపోతే మాత్రం శ్రీరాం ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది టీడీపీ అధినేతకు తలనొప్పిగానే మారే అవకాశం లేకపోలేదు.

వారసుల రాకతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనని నేతల్లో టెన్షన్
ఏదేమైనా.. కొత్తగా వచ్చే యువనేతలు ఏయే స్థానాల్లో పోటీ చేస్తారన్నది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొత్తగా వారసులు రంగంలోకి దిగుతుంటంతో... ఎవరి సీట్లు గల్లంతవుతాయో అన్న టెన్షన్‌ చాలా మందిని వేధిస్తోంది. 

12:39 - October 24, 2016

ఉత్తరప్రదేశ్ : లోని సమాజ్‌వాదీ పార్టీలో వివాదం మరింత ముదిరింది.. లక్నోలోని పార్టీ ఆఫీసు దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. అఖిలేశ్, శివపాల్‌ మద్దతుదారులు పరస్పరం ఘర్షనకుదిగారు. ఈ గొడవతో పార్టీ కార్యాలయ పరిసరప్రాంతాలు యుద్ధవాతావరణాన్ని తలపించాయి.. తమ తమ అగ్ర నేతలకు మద్దతుగా నినాదాలు చేశారు.. మరోవైపు పార్టీలో ప్రస్తుత పరిస్థితిపై ములాయం అధ్యక్షతన ఎస్‌పీ ముఖ్య నేతలతో ములాయం సింగ్‌ సమావేశమయ్యారు.. ములాయం ఎదురుగానే ఈ సమావేశంలో అఖిలేశ్, శివపాల్‌ వాగ్వాదానికి దిగారు.. ఈ ఇద్దరు నేతల మద్దతుదారులు కూడా ఘర్షణ పడ్డారు.. 

12:37 - October 24, 2016

విశాఖ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఆగ్రనేతలు ఉన్నట్లు సమాచారం ఉందని విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్‌శర్మ తెలిపారు. ఏపీ, ఒడిశా పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారన్నారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా బెజ్జంగి బ్లాకు రామగుహ సమీపంలో ఎన్‌కౌంటర్‌ జరిగిందన్నారు. ఎన్‌కౌంటర్‌లో 23మంది మావోయిస్టులు మృతిచెందారని.. ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు గాయపడ్డారని తెలిపారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మావోయిస్టుల మృతదేహాలను మల్కన్‌గిరికి తరలిస్తామన్నారు.

ఎన్ కౌంటర్ లో 21మంది మావోలు మృతి
ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోకూంబింగ్‌ కొనసాగుతోంది.. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన 21మంది మావోయిస్టుల మృతదేహాలను విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల్లో గాజర్ల రవి, చలపతి, బెంగాల్‌ సుధీర్, అశోక్‌తోపాటు వెంకటరమణమూర్తితోపాటు... ఆర్కె కొడుకు మున్నా ఉన్నట్లు తెలుస్తోంది.. మల్కన్‌గిరిలో మావోయిస్టుల ప్లీనరీ జరగుతోందని పోలీసులకు నిన్న సాయంత్రం సమాచారం అందింది.. ఈ సమాచారంతో రాత్రినుంచి అడవుల్లో గ్రేహౌండ్స్‌ దళాలు కూంబింగ్‌ చేపట్టాయి.. పోలీసుల్ని గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.. తెల్లవారుజామునుంచి రెండు వర్గాలమధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి.. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.. వీరిని ప్రత్యేక హెలికాఫ్టర్‌లో విశాఖ ఆస్పత్రికి తరలించారు.. ఘటనాస్థలంలో భారీగా ఏకే 47లు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. బూసుపట్టి ఏరియాకు పదికిలోమీటర్ల దూరంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.. ఏపీ, ఒడిషా, కేంద్రబలగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కూంబింగ్‌ చేపట్టారు.. గాలింపుచర్యలు ఇంకా కొనసాగుతున్నాయని... మృతులను గుర్తించాల్సిఉందని.. ఏపీ డీజీపీ తెలిపారు.. 

12:28 - October 24, 2016

ఆదిలాబాద్ : ఓపెన్‌కాస్ట్‌ భూతం పలు గ్రామాల్ని బెంబేలెత్తిస్తోంది.. పల్లెల్ని మింగేస్తోంది.. ఓపెన్‌ కాస్ట్‌కోసం ఊర్లను ఖాళీ చేయాలంటూ అధికారులు గ్రామస్తులపై ఒత్తిడి పెంచుతున్నారు.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఎర్రగుంటపల్లిలో గ్రామస్తులు ఏమంటున్నారో వారి మాటల్లోనే..ఓపెన్ కాస్ట్ లు వద్దంటున్న ఎర్రగుంటపల్లి గ్రామస్థులు పేర్కొంటున్నారు. సర్వేలు చేయటానికి వచ్చిన అధికారులను అడ్డుకునేందురు గ్రామ పొలిమేరల్లో కాపుకాస్తున్నామన్నారు. ఈ విషయంగా కోర్టులో కేసు వేశామనీ దీనిపై న్యాయస్థానం స్టే ఇచ్చిందని గ్రామస్థులు తెలిపారు. అయినా అధికారులు గ్రామాలలోకి చొరబడి సర్వేలు చేస్తున్నారని తెలిపారు. తమ పోరాటానికి పొ.కోదండరాం వంటి పలు ప్రజాసంఘాలు మద్ధతిచ్చాయన్నారు. ప్రభుత్వం 123 చట్టంకింద వారిని కొంతమంది గ్రామస్థులను లోబరుచుకుని రాజకీయం చేస్తోందని..ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం తమకు ఎటువంటి న్యాయం జరగదనీ..తమ ఊరిని తమ ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చే ఉద్యమం చేపడతామని మంచిర్యాల గ్రామస్థులు స్పష్టం చేశారు. 

అఖిలేష్ పై ములాయం మండిపాటు..

లక్నో : అఖిలేష్ యాదవ్ పై ములాయం మండిపడ్డారు. పదవీ గర్వం తలకెక్కిందా..జూదగాళ్లను..మందుబాబులను ప్రోత్సాహిస్తున్నావా..ఎన్నికల్లో గెలిచే దమ్ముందా ? తానుండగా సమాజ్ వాదీ ముక్కలు కానివ్వనని ములాయం పేర్కొన్నారు. అఖిలేష్ మద్దతుదారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంత కష్టపడ్డామో ఏం తెలుసని ప్రశ్నించారు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తానని, అమర్ సింగ్..శివపాల్ పై తనకు గట్టినమ్మకం ఉందన్నారు. వారిపై ఎవరూ ఏం చెప్పినా వినిపించుకోదలుచుకోలేదని, తనను..శివపాల్ ను ఎవరూ విడదీయలేరన్నారు. జైలుకు వెళ్లకుండా తనను అమర్ సింగ్ కాపాడారని ములాయం పేర్కొన్నారు. 

12:01 - October 24, 2016

పంజాబ్ : భారత సారథులు మళ్లీ చెలరేగారు. ప్రత్యర్థిని చిత్తు చేసి టీమిండియాకు మరో విజయాన్ని అందించారు. కివీస్‌తో జరిగిన మూడో వన్డేలో విరాట్‌ కోహ్లి ఆజేయ శతకం చేశాడు. మరోవైపు ధోనీ అర్థ శతకంతో 9 వేల పరుగుల ఖాతాలో చేరడమే కాకుండా.. అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
ఏడు వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం..
మొహాలీ వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్‌ ఏడు  వికెట్ల తేడాతో గెలుపొందింది. 286 పరుగుల ఛేదనలో విరాట్‌కోహ్లి, ధోనీలు మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 151 పరుగులు జోడించి.. భారత్‌ను గెలిపించారు.

285 పరుగులకు కివీస్‌ ఆలౌట్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ భారత బౌలర్ల దాటికి 49.4 ఓవర్లలోనే 285 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. లక్ష్య ఛేదనకు దిగిన బారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రోహిత్‌శర్మ, రహానెలు 41 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో కెప్టెన్‌ ధోనితో కలిసి విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వికెట్‌ కాపాడుకుంటూ నే ఈ జోడి కివీస్‌ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. 27 ఓవర్లపాటు క్రీజులో నిలిచిన ఈ జోడి.. మూడో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో మ్యాచ్‌ దాదాపు భారత్‌ చేతుల్లోకి వచ్చేసింది. ఇక ధోనీ మునుపటి హిట్టింగ్‌తో సిక్సర్లు బాదుతూ అభిమానుల్ని అలరించాడు. భారత్‌ స్కోర్‌ 192 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. అయితే చివరి వరకు జోరు కొనసాగించిన కోహ్లి 104 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి ఆడడంతో భారత్‌ 48.2 ఓవర్లలోనే విజయం సాధించింది. కోహ్లి 154 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.

199 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన కివీస్‌
ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ ఆటగాళ్లు మొదటి నుంచి మెరుపువేగంతో పరుగులు చేసినా మిడిల్‌ ఓవర్లలో నెమ్మదించారు. భారత బౌలర్ల విజృంభణతో 199 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నా నిలదొక్కుకుని ఆడారు. దీంతో న్యూజిలాండ్‌ 285 పరుగులు చేయగలిగింది. కివీస్‌ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌, ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నషీమ్‌ అర్థ సెంచరీలు చేశారు. భారత్‌ బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌, కేదార్‌ జాదవ్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. అమిత్‌ మిశ్రా, జస్‌ప్రీత్‌ బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు.

9 పరుగుల ఖాతాలో చేరిన ధోనీ
ఈ వన్డేలో ధోనీ రికార్డుల మోత మోగించాడు. అర్థసెంచరీ చేసిన ధోనీ.. 9 వేల పరుగుల ఖాతాలో చేరాడు. ఈ మైలురాయిని అందుకున్న మూడో వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. గతంలో మాదిరిగా హిట్టింగ్‌ చేసిన ధోనీ.. ఈ మ్యాచ్‌లో మూడు సిక్స్‌లు బాది సచిన్‌ టెండూల్కర్‌ పేరుపై ఉన్న 195 సిక్స్‌ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో 154 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లి మొహాలీలో అత్యధిక స్కోర్‌ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌ విజయంతో భారత్‌ 2-1 ఆధిక్యంలో నిలిచింది. 

11:54 - October 24, 2016

హైదరాబాద్ : ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి...సాయిబాబా భక్తుల మధ్య వివాదం చెలరేగుతోంది. స్వరూపనంద స్వామి చేస్తున్న సంచలన వ్యాఖ్యలు సాయి భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌ వేదికగా మరోసారి స్వరూపానంద చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. రంగంలోకి దిగిన పోలీసులు సాయి భక్తులను అదుపులోకి తీసుకున్నారు.

శృతి మించుతున్న స్వరూపానంద వ్యాఖ్యలు..సాయి భక్తుల లడాయి
ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి....సాయిబాబా భక్తుల మధ్య లడాయి రోజు రోజుకు శృతిమించుతోంది. ఇప్పటికే షిర్డీ సాయి దేవుడు కాదంటూ స్వరూపానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సాయి భక్తుల్లో నిరసన జ్వాలలకు కారణమయ్యాయి. తాజాగా ఆయన చేపట్టిన హైదరాబాద్‌ టూర్‌ హైటెన్షన్‌ పుట్టించింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గురు వందనమ్ కార్యక్రమంలో స్వరూపానంద స్వామి పాల్గొంటారని తెలియడంతో..సాయి భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సభలో సాయిబాబాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

సాయి భక్తులు హెచ్చరించినా వెనక్కి తగ్గని స్వరూపానంద
సాయి భక్తులు హెచ్చరించినా వెనక్కి తగ్గని స్వరూపానంద స్వామి సాయిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో సాయి పేరిట ఒక భూతాన్ని పూజిస్తున్నారని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సాయిని దేవుడంటూ తమని మూర్ఖుల్ని చేయకండన్నారు. సంతోషిమాత వచ్చేసింది, వినాయకుడు పాలు తాగుతున్నాడన్న నమ్మకాలతో సనాతన ధర్మం పరువు తీయకండన్నారు.

సాయిభక్తులను అరెస్టు చేసిన పోలీసులు
ఈ వ్యాఖ్యలపై సాయిభక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సాయిభక్తులను పోలీసులు అరెస్టు చేశారు. స్వరూపానంద సరస్వతి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై సాయి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సాయిబాబాపై స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలు భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది ఉత్కంఠ రేపుతోంది. 

ఏసీబీ కోర్టులో రేవంత్..సెబాస్టియన్..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ లు హాజరయ్యారు. ఉదయ్ సింహా మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. కేసు విచారణ వచ్చే నెల 25కి వాయిదా వేసింది. 

కోల్డ్ స్టోరేజీని సందర్శించిన కలెక్టర్..

గుంటూరు : లాలూపురంలో వద్ద వద్ద లక్ష్మీలావణ్య కోల్డ్ స్టోరేజీని కలెక్టర్ కాంతీలాల్ దండే సందర్శించారు. సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. మంటల తీవ్రతతో మరో చాంబర్ లోకి వెళ్లపోయామని, రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఫైర్ నిబంధనలు పాటించని కోల్డ్ స్టోరేజీలపై చర్యలు తీసుకుంటామన్నారు. 

జేఎన్టీయూ కాలేజీ గేటు వద్ద సీపీఎం ధర్నా...

కాకినాడ : జేఎన్టీయూ కాలేజీ గేటు వద్ద సీపీఎం ధర్నా నిర్వహించింది. జేఎన్టీయూకి ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు చెల్లించాల్సిన రూ. 100 కోట్లు బకాయిలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలే కోట్లు బకాయిలు పడ్డారని తెలిపారు. 

విభేదాలపై చింతిస్తున్నా - ములాయం..

ఉత్తర్ ప్రదేశ్ : పార్టీలో వర్గ విభేదాలపై చింతిస్తున్నట్లు ములాయం సింగ్ యాదవ్ పేర్కొన్నారు. పార్టీ స్థాపనలో ఎంతో సంఘర్షన పడ్డానని, ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నానని, జైలు కూడా వెళ్లినట్లు తెలిపారు. 

11:20 - October 24, 2016

కమిషన్ మంజునాథ్ ను అడ్డుకున్న బీసీ సంఘాలు.

కర్నూలు : జడ్పీ హాల్ లో కాపులను బీసీల్లో చేర్చే అంశంపై బీసీ కమిషన్ మంజునాథ్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. మంజునాథ్ ను పలు బీసీ సంఘాలు అడ్డుకున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 

11:11 - October 24, 2016
11:07 - October 24, 2016

ఉత్తరప్రదేశ్ : అధికారం, ఆధిపత్యం, ఆనువంశిక పాలన సెగలతో ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ కుంపటి రగులుతోంది. బాబాయ్ అబ్బాయ్ ల మధ్య పోరు రాజకీయ సంక్షోభాన్ని ఎగదోస్తోంది. తమ్ముడిని వెనకేసుకొస్తున్న అదినేత ధోరణి తండ్రీ తనయుల సవాల్ గా మారుతోంది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో మొదటి పరివారంగా చెప్పుకునే ములాయం ఫ్యామిలీ వార్ సమాజ్‌వాదీ పార్టీకే సమస్యాత్మకంగా తయారైంది. రాష్ట్ర సర్కారునే సంక్షోభంలో పడేస్తోంది.

ప్రచ్ఛన్నయుద్ధంగా మారిన అంతర్యుద్ధం
నిన్నామొన్నటి దాకా నేతాజీ చెప్పిందే మాట. చూపిందే బాట అన్నట్లుగా సాగిన సమాజ్ వాదీ పార్టీ ఇప్పుడు నేతల కుమ్ములాటతో కొట్టుమిట్టాడుతోంది. నిన్నమొన్నటి వరకు నేతల మధ్య కొనసాగిన అంతర్యుద్ధం ఇప్పుడు ప్రచ్ఛన్నయుద్ధంగా మారింది. నేతల పరస్పర బహిరంగ విమర్శలతో ఓటర్లలో పార్టీ పలుచనువుతన్నాఅటు ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ కానీ, ఇటు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శివపాల్‌ యాదవ్‌ కానీ తగ్గడంలేదు. వర్గపోరు, ముఠా కుమ్ములాటతో పార్టీ పరువు, ప్రతిష్టలు గంగలో కలుస్తున్నా.... ఎవరికి వారు తమ తమ వాదనలు, పంతాలు పట్టింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో చీలిక ముంగిట్లో కొట్టుమిట్టాడుతోంది.

పాతికేళ్ల సమాజ్‌వాదీ మహాప్రస్థానం
ఉత్తరప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న కీలక తరుణంలో ముఠా ముచ్చట్లు ఆపార్టీ పుట్టిముంచే సూచనలు కనిపిస్తున్నాయి. 25 సంవత్సరాల రజతోత్సవ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఒడిదొడుకులు, ఉత్థాన పతనాలు చవిచూసింది సమాజ్ వాదీ పార్టీ. ములాయంసింగ్‌ యాదవ్‌ అకుంఠిత శ్రమతో వివిధ సామాజిక వర్గాల సమీకరణలతో దేశ రాజకీయాల్లోనే బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. ఎన్నెన్నో అవినీతి ఆరోపణలు, తప్పిదాలు, కేంద్రంలోని అధికార పక్షాలతో లోపాయికారీ ఒప్పందాలు, కప్పదాట్లు ఉన్నప్పటికీ సమాజ్ వాదీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వర్గాల బలం చెక్కుచెదరలేదు.

ఎన్నికల వ్యూహంలో శివపాల్‌ దిట్ట
2012 శాసనసభ ఎన్నికల్లో యూపీ ప్రజలు సమాజ్‌వాదీ పార్టీకి అదికారం అప్పగించారు. యువనేతగా ఆ ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించిన ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. పార్టీ ప్రస్థానంలో చేదోడువాదోడుగా ఉంటూ ఆ ఎన్నికల్లో సైతం తెరవెనుక వ్యూహ రచన చేసిన ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ కు కూడా అత్యంత కీలకమైన శాఖలతో కేబినెట్ లో స్థానం దక్కింది. శివపాల్ ఇండిపెండెంటుగా వ్యవహరిస్తూ ఉండటం ..కొన్ని నిర్ణయాల విషయంలో ముఖ్యమంత్రి అఖిలేష్ ను సైతం సంప్రదించకపోవడంతో గడచిన రెండు మూడేళ్లుగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. గతంలో ములాయంకు అత్యంత సన్నిహితునిగా పేరు పడ్డ అమర్‌సింగ్‌ పున: ప్రవేశం తర్వాత శివపాల్ తదితర ములాయం పాత కోటరీ బలం పుంజుకొని అసమ్మతి రాజకీయాలకు తెరలేపింది. ఒకవైపు శివపాల్ యాదవ్ వంటి బంధుగణం, మరోవైపు అమర్ సింగ్ వంటి ఆప్తుల బృందం చేతులు కలిపి అఖిలేష్ వ్యతిరేక రాజకీయాలకు ప్రాణం పోశారు. ములాయం సైతం ఈ గ్రూపు వైపే మొగ్గు చూపడంతో గడచిన మూడు నాలుగు నెలలుగా పార్టీపరంగానూ, ఉత్తర ప్రదేశ్ లోనూ ప్రారంభమైన రాజకీయ వేడి ఇప్పుడు మరింత రాజుకుని సెగులు, పొగల స్థాయిని దాటి మంటల దాకా వచ్చింది. నిన్న మొన్నటి వరకు నివురు కప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమనడంతో.. ఈ అగ్గిని చల్లార్చడం ఇప్పుడు పార్టీ అధిష్టానానికి కష్టంగా మారింది.

శివపాల్‌యాదవ్‌కు పార్టీ పగ్గాలు అప్పగింత
ముఖ్యమంత్రి అఖిలేష్‌ని ముప్పుతిప్పలు పెట్టేందుకు శివపాల్ నేతృత్వంలోని ములాయం కోటరీ ఒక వ్యూహం ప్రకారం పావులు కదపడం ప్రారంభించింది.ప్రభుత్వంలో పట్టు సాధించేందుకు అన్నిశాఖల్లోనూ తమ మనుషులు ప్రాబల్యం వహించేలా కీలక పదవులు దక్కించుకునే ప్రయత్నాలు చేసింది. ఈ అసమ్మతి రాజకీయాలను పసిగట్టిన అఖిలేష్ ...శివపాల్ మనిషిగా పేరుపడ్డ చీఫ్ సెక్రటరీ దీపక్ సింఘాల్ పై వేటు వేశారు. రెవిన్యూ, పబ్లిక్ వర్క్స్ , ఇరిగేషన్ వంటి పది విభాగాలపై పెత్తనం చెలాయిస్తున్న శివపాల్ మంత్రిత్వశాఖలకు కత్తెర వేశారు. దీంతో అలక వహించిన శివపాల్ రాజీనామా అస్త్రాన్ని సంధించారు. ములాయం మధ్యవర్తిత్వంలో బాబాయ్... అబ్బాయ్.. రాజీ పడ్డారు. మంత్రిత్వశాఖలన్నీ తిరిగి శివపాల్ కే దఖలుపడ్డాయి. దాంతో పాటు సమాజ్ వాదీ పార్టీ ఉత్తర ప్రదేశ్ శాఖ అధ్యక్షబాధ్యతలు కూడా అదనంగా వచ్చి చేరాయి. అంతవరకూ ఈ పదవిలో ఉన్న కొడుకుని తప్పించి తమ్ముడిని పార్టీ పరంగా బలోపేతం చేసేందుకు ములాయం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు లో తుదిమాట అఖిలేష్ దే అన్న అంగీకారం మేరకు బాబాయ్ అబ్బాయ్ ల మధ్య పార్టీ పరమైన పదవుల మార్పిడికి అంగీకారం కుదిరింది. అయితే బలవంతంగా కుదిరిన ఈ సంధి అటు ఇటువర్గాల ఒత్తిడితో బెడిసి కొట్టి మూన్నాళ్ల ముచ్చటగా మారడమే తాజా రాజకీయ సంక్షోభానికి కారణమవుతోంది.

ములాయం పెద్దరికాన్నే ప్రశ్నిస్తున్న అఖిలేష్‌ యాదవ్‌
తండ్రి ఒడిలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్న వారసుడే వారి పెద్దరికాన్ని ప్రశ్నిస్తున్నారు.. సై అంటూ సవాల్ విసురుతున్నాడు....అధినేతనే ధిక్కరిస్తూ స్వతంత్రంగా నలుగురు మంత్రులపై వేటు వేశారు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌. మరికొందరికీ ఇదే గతి తప్పదని హెచ్చరిక జారీ చేశాడు. ఏం జరగబోతోంది యూపీలో .... ఎటు దారితీస్తుంది ఈ సంక్షోభం...?

గూండాలు, రౌడీలపై మెతక వైఖరి విడనాడిన అఖిలేష్‌
నాలుగున్నరేళ్ల పాలనలో అద్భుతాలు సాధించకపోయినప్పటికీ పరిపాలకుడిగా కొంత ఇమేజ్ ను సృష్టించుకోగలిగాడు అఖిలేష్. గూండాలు, రౌడీలపై మెతకవైఖరిని విడిచిపెట్టడం, పోలీసులకు కొంతమేరకు స్వేచ్ఛనివ్వడం, స్మగ్లర్లు, డాన్ లకు రాజకీయ ఆశ్రయం కల్పించకపోవడం, సామాజిక కార్యక్రమాల్లో యువతను ప్రోత్సహించడం వంటి కొన్ని చర్యలు తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కచ్చితంగా సానుకూల పరిణామమే. దీంతో అఖిలేష్ పట్ల కొన్ని వర్గాలు ఆకర్షితమవుతున్నాయి. వ్యక్తిగత ప్రతిష్ఠ కలిగిన బలమైన నాయకునిగా సొంత ముద్ర వేసుకోగలిగాడు.

ములాయం సింగ్ యూత్ బ్రిగేడ్, సమాజ్ వాదీ యువజన సభ
ఇది శివపాల్ యాదవ్, అమర్ సింగ్ వంటి నాయకులకు కంటగింపుగా మారిందన్నది ఒక ఆరోపణ. ఈ నేపథ్యంలోనే అఖిలేష్ కన్వీనర్‌గా ఉన్న ములాయం సింగ్ యూత్ బ్రిగేడ్, సమాజ్ వాదీ యువజన సభ, సమాజ్ వాదీ యువ వాహిని, సమాజ్ వాదీ ఛాత్ర సభ వంటి యువజన విభాగాల అధ్యక్షులను శివపాల్ వర్గం మార్చివేసింది. దీనిని తనవర్గంపై నేరుగా ఎక్కుపెట్టిన దాడిగా ముఖ్యమంత్రి అఖలేష్‌ భావించారు. యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు సైతం అఖిలేష్‌ మద్దతుగా ర్యాలీలు, సభలు నిర్వహించారు. రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా అఖిలేష్ నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆయా సందర్భాల్లో చాలామంది నాయకులపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ అఖిలేష్... శివపాల్ వర్గ పోరు రోజురోజుకీ ముదురుతూ వచ్చిందే తప్ప చల్లారిపోలేదు. పరస్పరం అపనమ్మకం, అవిశ్వాసంతో ఒకరంటే మరొకరికి పొడగిట్టని పరిస్థితికి దారితీసింది.

అఖిలేష్‌కు మద్దతు ఇవ్వాలంటూ పార్టీ శ్రేణులకు రాంగోపాల్‌ యాదవ్‌ లేఖ
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మరో బాబాయ్ రాంగోపాల్ యాదవ్ అండతో పార్టీ పరంగా కూడా పట్టు సంపాదించే పని లో పడ్డాడు అఖిలేష్. బహిరంగంగా అఖిలేష్ కు మద్దతు పలికారు రాంగోపాల్‌. మళ్లీ ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ అధికారంలోకి రావాలంటే అఖిలేష్ నాయకత్వమే శరణ్యమంటూ పార్టీ శ్రేణులకు లేఖలు రాశాడు. ఇంతటి సంక్షోభంలోనూ తాను అఖిలేష్ పక్షమే అంటూ పార్టీ శ్రేణులు ఆయనకు మద్దతివ్వాలని రాంగోపాల్ అభ్యర్థించాడు. ఇదిలా ఉండగా మరోవైపు అఖిలేష్‌కు బాల్యస్నేహితుడు, శాసనసమండలి సభ్యుడైన ఉదయ్ వీర్ సింగ్ ఉదంతం సంక్షోభం కొత్త పుంతలు తొక్కడానికి కారణమైందన్న వాదనా ఉంది. సాక్షాత్తు అదినేత ములాయం ను ఉద్దేశిస్తూ శివపాల్, అమర్ సింగ్ ల కారణంగా మీరు పక్క దారి పడుతున్నారంటూ ఆక్షేపించారు. పదవి నుంచి తప్పుకొని జాతీయ అధ్యక్ష బాధ్యతలు అఖిలేష్ కు అప్పగించాలని సూచించాడు. దీంతో ఉదయ్ పై పార్టీ వేటు వేసింది. ములాయం శివపాల్ ల నేతృత్వంలోని పాత తరానికి, అఖిలేష్ సారథ్యంలోని పార్టీ యువతరానికి మధ్య అగాధం బహిర్గతమైంది. ఎవరి ఎత్తులు వారు వేశారు. అటో ఇటొ తేల్చుకోవాలనుకున్నారు పర్యవసానమే ...యూపీ సర్కారులో రాజకీయ సంక్షోభం....

బెడిసికొట్టిన బేణి ప్రసాద్‌ వర్మ రాజీ యత్నాలు
పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న అఖిలేష్‌, శివపాల్‌ వర్గాల మధ్య రాజీ కుదర్చాలని ఇటీవల కొందరు పార్టీ అగ్రనాయకులు బేణీప్రసాద్ వర్మ నేతృత్వంలో ప్రయత్నాలు చేశారు. అయితే అవన్నీ బెడిసికొట్టాయి. వికాస్ యాత్ర చేపట్టేందుకు అఖిలేష్ రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీని ఎన్నికల్లో తన సారథ్యంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా తన బలాన్ని, బలగాన్ని చాటి చెప్పడం కూడా ఈ యాత్ర ఉద్దేశం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన శివపాల్ తాజాగా జిల్లాల అధ్యక్షులు, బాధ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వచ్చి ఎన్నికల యాత్ర కు దిశానిర్దేశం చేయమంటూ అబ్బాయ్ అఖిలేష్‌ను శివపాల్ స్వయంగా ఆహ్వానించారు. అయినా సమావేశానికి గైర్ హాజరైన అఖిలేష్ తాజా గా తనకు అనుయాయులైన ఏడుగురు కీలక నేతలపై పార్టీపరమైన చర్యలు తీసుకోవడాన్ని తప్పుపట్టినట్లు తెలుస్తోంది. దీనిపై అదినేత ములాయం కు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం.

శివపాల్‌ సహా నలుగురు మంత్రులపై వేటు వేసిన అఖిలేష్‌
అయితే పార్టీ వ్యవహారాల్లో శివపాల్ నిర్ణయమే ఫైనల్ అని, పాలన వ్యవహారాల్లో నీదే ఫైనల్ అని అఖిలేష్ కు ములాయం తేల్చిచెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో తన పరిధిలోని పాలనపరమైన చర్యల్లో భాగంగా శివపాల్ ను మరో ముగ్గురు మంత్రులను అఖిలేష్ తొలగించారు. కుటుంబానికి, తనకు మధ్య విభేదాలు సృష్టి స్తున్న అమర్‌సింగ్‌ అనుచరులెవరూ తన మంత్రివర్గంలో ఉండటానికి వీల్లేదంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మిగిలిన మంత్రులు చెబుతున్నారు. నేరుగా బాబాయ్ పేరు చెప్పడానికి ఇష్ట పడటంలేదు అఖిలేష్. పార్టీ క్రమశిక్షణ ను ఉల్లంఘిస్తే సహించేదిలేదని, సీనియర్ నాయకుల పట్ల గౌరవం లేని వారిని గెంటివేయకతప్పదని చెబుతున్నారు శివపాల్ యాదవ్. కరవమంటే కప్పకు కోపం...విడవమంటే పాముకు కోపం. .. ...రెండు తరాల మధ్య...తండ్రీ కొడుకుల మధ్య...రాజకీయ ఆధిపత్య పోరులో తెగేదాకా వచ్చేసిన ఈ తంతులో ములాయం సింగ్ యాదవ్ ఉరఫ్ శివపాల్ యాదవ్ వర్గం ఏ రకంగా వ్యవహరించబోతోందన్నదే ఉత్కంఠ పరిణామం. ఇంతవరకూ మొత్తం ఉదంతానికి మౌన సాక్షిగా ఉన్న ములాయం తీసుకునే నిర్ణయం పైనే సమాజ్ వాదీ ముక్కలు చెక్కలవుతుందా? మూకుమ్మడిగా ఒక్కటిగానే సాగుతుందా? అన్న విషయం ఆధారపడి ఉంది.   

11:05 - October 24, 2016

సీతాఫలం..ఎన్నో పోషకాలుంటాయి. శీతాకాలంలో వచ్చే ఈ పండు పట్ల ఎంతో మంది మక్కువ చూపుతుంటారు. సీతాఫలంలో ముఖ్యంగా సి విటమిన్‌ ఉంటుంది. దీనిని తినడం వల్ల కంటి చూపు, వెంట్రుకలు, చర్మానికి చాలా మంచిది.
సీతాఫలాల్లో గుజ్జును జ్యూస్‌లా చేసి స్పటిక, చక్కెర లేదా బెల్లంతో కలిపి తాగితే బాలింతలకు, ఎదిగే పిల్లల ఆరోగ్యానికి బాగుంటుంది.
ఫైబర్‌ వల్ల అజీర్తి, మలబద్దకం తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. దీనిలోని కాల్షియం వల్ల ఎముకలు బలహీనంగా ఉన్నవారికి, పెరిగే పిల్లలకు ఎముకలు గట్టి పడటానికి దోహదం చేస్తాయి.
చర్మ వ్యాధిగ్రస్తులకు యాంటి సెప్టిక్‌గా పని చేస్తాయి. ఈ ఫలం గుజ్జును చర్మంపై ఏర్పడ్డ గడ్డలకు కడితే అవి తొందరగా మానుతాయి.
గుండె జబ్బులు, నరాలు, కండరాలు బలహీనంగా ఉన్న వారికి పోషకాహారంగా ఉపయోగపడతాయి.
సీతాఫలం ఆకుల నుంచి పసరు తీసి గజ్జి, తామర ఉన్న వారు వాటిపై పూస్తే త్వరగా తగ్గుతాయి.
వీటి గింజలను పొడి చేసి తలవెంట్రుకలకు పెడితే పేలు, చుండ్రు ఉన్నా తగ్గిపోతాయి.

100 గ్రాముల సీతాఫలంలోని పోషకాల విలువ
పోషకాలు గ్రాములు/మిల్లి గ్రాములు
మాయిశర్చర్‌ 70.5 గ్రాములు
కార్బోహైడ్రెట్లు 23.5 గ్రాములు
ఫ్యాట్‌ 04.0 గ్రాములు
ఫైబర్‌ 03.1 గ్రాములు
ప్రొటీన్స్ 01.6 గ్రాములు
పాస్పరస్‌ 47.0 మిల్లి గ్రాములు
విటమిన్‌ సి 37.0 మిల్లి గ్రాములు
మెగ్నిషియం 84.0 మిల్లి గ్రాములు
ఐరన్‌ 04.3 మిల్లి గ్రాములు
నియాసిన్‌ 01.3 మిల్లి గ్రాములు
జింక్‌ 0.8 మిల్లి గ్రాములు

కన్నీళ్లు పెట్టుకున్న అఖిలేష్...

లక్నో : సమాజ్ వాదీ పార్టీ కార్యాలయంలో కీలక భేటీ ప్రారంభమైంది. ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ లు పాల్గొన్నారు. తండ్రి ములాయం తనకు గురవని, తాను కొత్తపార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన తండ్రి ఆశీర్వాదంతో సీఎం అయ్యానన్నారు. ఈ పార్టీ తనది కాదని తండ్రిదేనని, కోరితే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

10:51 - October 24, 2016

రంగారెడ్డి : జిల్లా సీవీఎస్‌ఆర్‌ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్ధి దినేష్‌రెడ్డి మృతిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. దినేష్‌రెడ్డి మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ర్యాలీగా వస్తున్న విద్యార్థులను జోడిమెట్ల వద్ద అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు కాలేజీ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.మరింత సమాచారానికి వీడియో చూడండి..

10:46 - October 24, 2016

శ్రీకాకుళం : ఉన్నత చదువులు చదివాడు.. పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డాడు.. సంతోష జీవితం అనుభవిస్తున్నాడు.. అయినా ఏదో వెలితి.. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని.. ఊరి రుణం తీర్చుకోవాలని తపించాడు. అంతే అనుకున్నదే తరవుగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఇప్పుడతను ఆ ఊరి శ్రీమంతుడు.. ఎవరతను? అతను దత్తత తీసుకున్న గ్రామం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ.. శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ఉన్న గ్రామం బంటుపల్లి.. ఎన్నో రకాల సమస్యలు ఆ గ్రామాన్నిచుట్టుముట్టాయి. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం ముఖం చాటేసింది. ఇక తమ బతుకులు బాగుపడేది ఎప్పుడు అని దిగాలుగా ఉన్న గ్రామస్తుల జీవితాల్లోకి వెలుగు నింపడానికి వచ్చాడు. అతనే నడికుడితి ఈశ్వరరావు..

ఢిల్లీలో పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డ ఈశ్వరరావు
గ్రామస్తులు ఎన్ ఈ ఆర్ అని పిల్చుకునే ఈశ్వరరావు.. ఢిల్లీలో పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డాడు. అతని తల్లి గ్రామ సర్పంచ్‌.. తన ఊరు పడుతున్న కష్టాల గురించి తెలుసుకుని.. పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలని గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. అప్పటి నుంచి బంటుపల్లి గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి గ్రామస్తుల జీవితాల్లో వెలుగునింపారు.

చదువుకున్న యువతకు ఉపాధి.. మహిళలు స్వయం ఉపాధికి చర్యలు
గ్రామంలో చదువుకున్న యువతకు ఉపాధి.. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టుమిషన్ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి తమ జీవితాలు బాగుచేశారని గ్రామస్తులు చెబుతున్నారు. ఎన్.ఈ.ఆర్ తమకు దేవుడిచ్చిన వరమని అంటున్నారు.

నిర్లక్ష్యానికి గురైన బంటుపల్లి నేడు బంగారు బంటుపల్లి
ఒకప్పుడు ఎంతో నిర్లక్ష్యానికి గురైన బంటుపల్లి గ్రామం.. నేడు బంగారు బంటుపల్లిగా మారిందని.. శ్రీ మహాలక్ష్మి యూత్ క్లబ్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించి బంటుపల్లిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని యూత్ క్లబ్ సభ్యులు తెలిపారు.

ఊరి రుణం తీర్చుకునే భాగ్యం తనకు దొరకడం తన అదృష్టం : ఈశ్వర్రావు
పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే తపనతో తన సొంత నిధులు వెచ్చించి బంటుపల్లి గ్రామాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నానని ఈశ్వరరావు అన్నారు. ఊరి రుణం తీర్చుకునే భాగ్యం తనకు దొరకడం తన అదృష్టమని ఆయన చెబుతున్నారు.
హర్షిస్తున్న గ్రామస్థులు
ఈశ్వరరావు కృషితో శ్రీకాకుళం జిల్లాలోనే తమ గ్రామం అగ్రగామిగా నిలిచిందని.. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు తమ గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

10:40 - October 24, 2016

విశాఖ : ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.. పోలీసుల కాల్పుల్లో దాదాపు 19 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో గాజర్ల రవి, చలపతి, బెంగాల్‌ సుధీర్, అశోక్‌తోపాటు వెంకటరమణమూర్తితోపాటు... ఆర్కె కొడుకు మున్నా ఉన్నట్లు తెలుస్తోంది.. మల్కన్‌గిరిలో మావోయిస్టుల ప్లీనరీ జరగుతోందని పోలీసులకు నిన్న సాయంత్రం సమాచారం అందింది.. ఈ సమాచారంతో రాత్రినుంచి అడవుల్లో గ్రేహౌండ్స్‌ దళాలు కూంబింగ్‌ చేపట్టాయి.. పోలీసుల్ని గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.. తెల్లవారుజామునుంచి రెండు వర్గాలమధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి.. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.. వీరిని ప్రత్యేక హెలికాఫ్టర్‌లో విశాఖ ఆస్పత్రికి తరలించారు.. ఘటనాస్థలంలో భారీగా ఏకే 47లు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. బూసుపట్టి ఏరియాకు పదికిలోమీటర్ల దూరంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.. ఏపీ, ఒడిషా, కేంద్రబలగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కూంబింగ్‌ చేపట్టారు..

10:33 - October 24, 2016

గుంటూరు : లాలూపురంలో వద్ద వద్ద లక్ష్మీలావణ్య కోల్డ్‌ స్టోరేజీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. సంఘాటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్ని పరిశీలిస్తున్నా ఏఎస్పీ సుబ్బారావు మాట్లాడుతూ.. మిర్చి ఘాటు ఇబ్బంది మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నాన్ని మెచ్చుకోదగ్గదన్నారు. స్థానికుల సహాయ సహకారంతో రైతులకు నష్టం కలుగకుండా.. స్టోరేజ్ లోపల ప్రస్తుతం కాలిపోకుండా మిగిలివున్న మిర్చి బస్తాలనువెలుపలికి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు.ప్రమాద ఘటనకు చేరుకున్న రైతులు తమ ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ప్రమాదాలు సంభవించినా చర్యలు తీసుకోవాటంలో అలసత్వం వహిస్తున్నారనీ..సరైన ధర పలికేలా వున్న ఈ సమయంలోనే ప్రమాదం జరగటం దురదృష్టకరమని వాపోయారు. ఈ కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం ఐదోసారి ప్రమాదం జరిగిందనీ..ఇటువంటి ప్రమాదాలకు లోనవ్వకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యానికి అధిక పెట్టుబడులు పెట్టే రైతులే కాకుండా కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయి వీధిపడే పరిస్థితి వచ్చిందని..గతంలో జరిగిన ప్రమాదానికి ఇంతవరకూ నష్టపరిహారం అందనేలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

18 మంది మావోయిస్టుల మృతి..

విశాఖ: ఏవోబీలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గ్రే హౌండ్స్ సిబ్బందికి గాయాలయ్యాయి. మృతుల్లో 8 మంది మహిళలున్నారు. ఆర్కే కుమారుడు మున్నా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఏపీ, ఒడిశా, కేంద్ర బలగాల జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా శివారు ప్రాంతమైన బూసిపట్టు - కట్టా(పి)లో ఘటన చోటు చేసుకుంది. 

ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

లక్నో : సమాజ్ వాదీ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయి తోపులాటకు దిగారు. శివపాల్ యాదవ్, అఖిలేష్ యాదవ్ అనుచరులు బాహాబాహికి దిగారు. శివపాల్ యాదవ్ ను పార్టీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 

సీవీఎస్ఆర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత..

రంగారెడ్డి : సీవీఎస్ఆర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి దినేష్ రెడ్డి మృతిపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దినేష్ రెడ్డి మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమంటూ ఆందోళన చేపట్టారు. కాలేజీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీ వస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులను జీడిమెట్ల పీఎస్ కు తరలించారు. 

10:03 - October 24, 2016
09:58 - October 24, 2016

రంగారెడ్డి : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన.. సీపీఎం పార్టీ మహాజన పాదయాత్ర ఏడో రోజు విజయవతంగా కొనసాగింది. ఏడో రోజు పాదయాత్ర అబ్దుల్లూపూర్ మెట్ నుంచి పెద్దఅంబర్ పేటకు చేరుకుంది. తండాల్లో గిరిజనులు అభివృద్థికి దూరంగా గడుపుతున్నారని తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్థి అంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్న ప్రభుత్వం గిరిజనుల అభివృద్థిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. Look.

పాదయాత్రకు అడుగడుగునా ప్రజల నీరాజనాలు
అడుగుడుగునా జన నీరాజనం.. పల్లెపల్లెలో ప్రజల విన్నాపాలతో సీపీఎం మహాజన పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఏడో రోజు పాదయాత్రలో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్‌, పెద్ద అంబర్‌పేట తండాల్లో తమ్మినేని బృందం పర్యటించింది. తండాల్లో గిరిజనులు సమస్యలు అడిగి తెలుసుకుంది.

పాదయాత్రకు మద్దతు తెలిపిన సామాజిక వేత్త బాలకృష్ణ
అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ప్రారంభమై, పెద్దఅంబర్‌పేట, సంఘీనగర్‌, కోహెడ తొర్రూరు ఇంజాపూర్ తుర్కయంజాల్‌, కమ్మగూడ, రాజన్నగూడ, మన్నెగూడ, బొంగ్లూరు ఎక్స్‌ రోడ్, కొంగరలో పాదయాత్ర కొనసాగింది. తమ్మినేని పాదయాత్ర బృందానికి స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నేతలతో పాటు సామాజిక వేత్త బాలకృష్ణ మద్దతు తెలిపారు.

గిరిజనుల అభివృద్ధిపై చర్చించేందుకు మీరొస్తరా.. మంత్రులను పంపుతారా: తమ్మినేని
ప్రజా సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. గిరిజనులపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, తండాలను పంచాయతీలను చేయాలని డిమాండ్‌ ఈ సందర్భంగా తమ్మినేని డిమాండ్‌ చేశారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలను సంప్రదించకుండానే జిల్లాలను చేసిన కేసీఆర్‌.. పంచాయతీల ఏర్పాటుకు కుంటి సాకులు చెప్పడం దారుణమన్నారు. గిరిజనుల అభివృద్ధిపై చర్చించేందుకు మీరొస్తరా.. లేక మీ మంత్రులను పంపుతారా అని తమ్మినేని సవాల్‌ విసిరారు. ప్రశ్నిస్తున్నందుకే సీపీఎం మీద విషం కక్కిస్తున్నారని, కేసీఆర్‌ ఖబడ్దార్...అని తమ్మినేని హెచ్చరించారు. డిగ్రీలు, పీజీలు చదివిన గిరిజన యువత ఉద్యోగాల్లేక ఆటోలు నడుపుతున్నారని తమ్మినేని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిరుద్యోగుల సమస్యల్ని పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తినడానికి తిండి లేక గిరిజనులు కన్నబిడ్డల్ని అమ్మకునే దుస్థితి ఉందని, దీనికి తెలంగాణ పాలకులు సిగ్గు పడాలని ఆయన అన్నారు. 

భారీ అగ్నిప్రమాదం..35 ఫైర్ ఇంజన్లు!..

మధ్యప్రదేశ్ : రాజధాని భోపాల్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తుక్కు నిల్వ చేసిన ప్రాంతంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న 35 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తుక్కు నిల్వ చేసిన ప్రాంతంలో ఉన్న ఇతర భవనాలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకుంది. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 

బీఎస్ఎఫ్ జవాన్ల చేతిలో ఉగ్రవాది హతం..

జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా ప్రాంతంలో ఈ ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కోసం బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఇక ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే . అంతర్జాతీయ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

09:39 - October 24, 2016

హైదరాబాద్ : అంబర్ పేటలోని హోంగార్డుల కార్యాలయంలో ఆదివారం హోంగార్డులు చేపట్టిన దీక్ష రెండోరోజుకు చేరుకుంది. హోంగార్డుల రాష్ట్ర అధ్యక్షుడు సకినాల సత్యనారాయణ లోపల తాళం వేసుకుని సకినాల నాయరాణ దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. తమ డిమాండ్లు పరిష్కరించకుండా తమ దీక్షను బలవంతంగా విరమింపజేసేందుకు యత్నిస్తే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆయన హెచ్చరించారు. గతంలో సీఎం, హోం మినిష్టర్ ని కలిసి తమ కష్టాలను చెప్పుకున్నా ఎటువంటి న్యాయం జరగలేదని ఆయన వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్ళనుండి టెంపరరీ గా కొనసాగుతున్న తమ విధులను పర్మినెంట్ చేయాలని దీక్ష లో పాల్గొన్న హోం గార్డులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందకుంటే ఆమరదీక్ష చేసేందుకు కూడా తాము సిద్ధంగా వున్నామని వారు హెచ్చరించారు. తమ సర్వీసులను క్రమబద్దీకరిస్తానని టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీని నెరవేర్యావేర్చాలనీ..డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించకపోతే.. తామంతా దీక్ష చేపడతామని హోంగార్డులు హెచ్చరించారు. 

08:38 - October 24, 2016

అక్నూర్ సెక్టార్ లలో మళ్లీ కాల్పులు..

జమ్ము కశ్మీర్ : భారత సైన్యం ఎన్నిసార్లు, బుద్ధి చెప్పినా పాకిస్థాన్ తన నీచత్వాన్ని విడనాడలేకపోతోంది. భారత్ సైన్యాన్ని దెబ్బతీసే యత్నాలను మానుకోవటంలేదు. ఎన్నిమార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నా..పూర్తి బాధ్యతతో..కమిట్ మెంట్ తో వున్న భారత్ సైన్యం మనో ధైర్యంముందు పాక్ ఎప్పుడూ ఓడిపోతూనేవుంది. దీన్ని తట్టుకోలేని పాకిస్థాన్ తరచూ కాల్పుల ఉల్లంఘనను అతిక్రమిస్తూనే వుంది. దెబ్బతింటూనేవుంది. ఈ నేపథ్యంలో పాక్ మరో మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్ము కశ్మీర్ లో అర్థరాత్రి నుండి పాక్ కాల్పులకు పాల్పడుతోంది. ఆర్ఎస్ పురా, అక్నూర్ సెక్టార్ లలోని అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్ సైన్యాలు కాల్పులకు దిగాయి. 20 బీఎస్ఎఫ్, 5 ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకున్న పాక్ దళాలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కాల్పుల్లో బీఎస్ ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సుశీల్ కుమార్ తో పాటు మరో ఇద్దరు సాధారణ పౌరులు కూడా మృతి చెందారు. కాగా పాక్ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పి కొడుతున్నారు. భారత్ చేసిన సర్జికల్ దాడుల అనంతరం ప్రతీకారంతో రగిలిపోతున్న పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు తరచూ పాల్పడుతోంది. ఉరి ఘటన అనంతరం అంతర్జాతీయంగా పాక్ ఒంటిరి దేశంగా మిగిలిపోయింది. దీంతో భారత్ సైన్యం సమర్థతను..అంతర్జాతీయంగా పాక్ వస్తున్న విమర్శలను తట్టుకోలేని పాక్ తరచుగా కాల్పులకు పాల్పడుతూ తన అల్పత్వాన్ని..అభద్రతాభావాన్ని చాటుకుంటోంది. 

08:28 - October 24, 2016

విశాఖ : ఏవోబీలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 18మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులోని బూసిబుట్ట..కట్టా(సి) ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఇద్దరు గ్రేహౌండ్స్ కు చెందిన ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయి. గాయపడినవారిని విశాఖ ఆసుపత్రికి చికిత్స నమిత్తం తరలించారు. ఏవోబీలో మావోయిస్టులు ప్లీనరీ జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో కూంబింగ్ చేపట్టిన పోలీసులపై మావోలు కాల్పులకు పాల్పడ్డారు. సమర్థవంతంగా తిప్పికొట్టిన పోలీసులు 18మంది మావోయిస్టులను మట్టుపెట్టారు. నాలుగు ఏకే. 45 లు, మావోలకు సంబంధించి పలు కీలక అంశాలను నిక్షిప్తమై వున్న ఓ లాబ్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా మృతి చెందిన మావోలలో కీలక నేతలు వున్నట్లుగా భావిస్తున్నారు. 

డిప్రెషన్ కు లోనవుతున్నా : మాజీ ప్రధాని హంతకురాలు

ఢిల్లీ : రోజురోజుకు ఆశలు అడుగంటిపోతున్నాయి. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నా. నేను కంటతడి పెట్టని రోజు లేదు. విడుదల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా. రోజులు వస్తున్నాయి. పోతున్నాయి. నాకు మాత్రం విడుదల లభించడం లేదు. అసలు ఏనాటికైనా నేను విడుదలయ్యే అవకాశం ఉందా? అంటూ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీ డబ్ల్యూ)కు రేఖ రాసింది. తనను విడిచిపెట్టేందుకు చొరవ తీసుకోవాలని అభ్యర్థించింది. 

08:11 - October 24, 2016

నేడు వారణాసిలో పర్యటించనున్న ప్రధాని..

ఉత్తరప్రదేశ్ : వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం పర్యటించనున్నారు. రూ.51,000 కోట్లతో చేపడుతున్న 1500 కి.మీ గ్యాస్‌పైప్‌లైను ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన వారణాసికి రావడం ఇది ఎనిమిదోసారి. అలహాబాద్‌-వారణాసి రెండో రైలు మార్గం పనుల ప్రారంభం, డీజిల్‌ ఇంజిన్ల విభాగం (డీఎల్‌డబ్ల్యూ) విస్తరణ, త్వరగా పాడయ్యే ఆహార పదార్థాల కోసం అతిశీతల నిల్వ కేంద్రానికి శంకుస్థాపన తదితర కార్యక్రమాల్లోనూ ఆయన పాలుపంచుకోనున్నారు.

మాజీ జస్టిస్ సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్ : హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం 200 రూపాయల లంచం కోసం మాజీ ప్రధానిని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.200 లంచానికి ఆశపడ్డ ఓ హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం వల్లనే ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడికి పాల్పడగలిగిందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవినీతిని కూకటివేళ్లతో పెకలిస్తే తప్ప ఫలితం ఉండదన్నారు. జాతీయ అవినీతి నిర్మూలన కౌన్సిల్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న చంద్రకుమార్ పై విధంగా వ్యాఖ్యానించారు.

 

07:51 - October 24, 2016

హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ నేతృత్వంలో రైతు దీక్ష జరిగింది. ఎద్దు ఏడుస్తుంటే వ్యవసాయం నిలవదు, రైతు ఏడిస్తే రాజ్యం నిలవదు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దీక్షను కొనసాగించారు. ఈ దీక్షలో ఆచార్య హరగోపాల్‌, రమామల్కోటి, చుక్కా రామయ్య, జస్టిస్‌ చంద్రకుమార్‌, సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి, పొత్తూరి వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ సహా పలువురు ప్రముఖులు హాజరై దీక్షకు మద్దతు తెలిపారు. తెలంగాణలో రుణమాఫీ అమలుకాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద తెలంగాణ కోదండరామ్‌ నేతృత్వంలో రైతు దీక్ష జరిగింది. రైతులు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని దీక్షకు మద్దతు తెలిపిన మేధావులు విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈచర్చలో సమ్మారావు (టీఆర్ఎస్ నేత)తెలకపల్లి రవి (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు) తులసీ రెడ్డి (ఏపీ కాంగ్రెస్ నేత) దినకర్ (టీడీపీ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్త ఎటువంటి అభిప్రాయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...సమగ్ర సమాచారం తెలుసుకోండి..

07:45 - October 24, 2016

ఖరీఫ్ సీజన్ దాదాపు ముగింపు దశకు వచ్చింది. పంటలు చేతికొస్తున్నాయి. ఖరీఫ్ లో తీవ్రంగా దెబ్బతిన్న రైతులు రబీ సాగు మీదనే ఆశలు పెట్టుకున్నారు.

40శాతానికే పరిమితమైన వరిసాగు
వ్యవసాయరంగంలో సంక్షోభం తొలగలేదు. అవే కష్టాలు,అవే బాధలు, అవే నష్టాలు రైతులను వెక్కిరిస్తున్నాయి. ఆగస్టులో అనావృష్టి, సెప్టెంబర్ లో అతివృష్టి రైతులను దారుణంగా దెబ్బతీశాయి. జూన్, జులై లో సాగు ప్రారంభించిన పంటలు ఆగస్టులో మలమలమాడిపోయాయి. అష్టకష్టాలు పడి రైతులు పచ్చగా కాపాడుకున్న పంటలను సెప్టెంబర్ భారీ వర్షాలు దెబ్బతీశాయి. తెలంగాణలో ఆగస్టులో మొక్కజొన్న పంట ఆగమైపోయింది. సెప్టెంబర్ లో కురిసిన కుండపోతకు సోయా చిక్కుడు దారుణంగా దెబ్బతింది. వరి పంట విస్తీర్ణం 40శాతానికే పరిమితమైంది. ఇలా వివిధ రూపాల్లో అష్టకష్టాలు చుట్టుముట్టినవేళ ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదన రైతుల్లో గూడుకట్టుకుంది.
కేంద్రం కరువు మండలాల్లో సాయం కోసం 761 కోట్లు విడుదల
అనావృష్టి, అతివృష్టి కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది. కరువు మండలాల్లో సాయం కోసం 761 కోట్లు విడుదల చేసినట్టు కేంద్రం చెబుతోంది. దీనికి రాష్ట్రప్రభుత్వం మరో 250 కోట్ల రూపాయలు జోడించి, మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాల్సి వుంది. కానీ, అలాంటి కార్యాచరణే కనిపించడం లేదు.

తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ అంటూ కెసిఆర్ గప్పాలు
తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ అంటూ కెసిఆర్ ప్రభుత్వం ఎంత గొప్పగా మాట్లాడినా ఆచరణలో నకిలీ విత్తనాలు వెక్కిరించాయి. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. విత్తన తయారీ కార్యక్రమంలో రైతులకు భాగస్వామ్యం లేకుండా పోతోంది. ప్రయివేట్ వ్యాపారుల ఇష్టారాజ్యమే నడుస్తోంది. విత్తనాలు, ఎరువులు విషయంలో రైతులకు సలహాలిచ్చే వ్యవసాయ విస్తరణాధికారుల నియామకాల విషయంలోనూ ప్రభుత్వం నిర్లప్త వైఖరినే ప్రదర్శించింది. దీంతో వ్యాపారుల మాటలు నమ్మి, వ్యవసాయం చేయాల్సిన దుస్థితిలో రైతులు చిక్కుకున్నారు.

సక్రమంగా అమలు కాని రైతులు రుణమాఫీ
రుణమాఫీ సక్రమంగానూ, సంపూర్ణంగానూ అమలు చేయకపోవడం, బ్యాంకుల్లో రుణాలు లభించకపోవడం లాంటి సమస్యలు షరా మామూలుగానే రైతులను పీడిస్తున్నాయి. మద్దతు ధరల విషయంలోనూ అదే అన్యాయం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించేందుకు కూడా వ్యాపారులు ముందుకు రాని దుస్థితి. పెసర పంటకు కేంద్రం 4650 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. కానీ తెలంగాణలో 2600 నుంచి 3300 మధ్యలోనే వ్యాపారులు బేరసారాలు సాగించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాస్తవానికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొంత బోనస్ ధరను ప్రకటించి, దళారీలను కంట్రోల్ చేస్తే రైతులకు ఎంతోకొంత మేలు జరిగే అవకాశం వుంది. కానీ, అలాంటి ప్రయత్నం కనిపించడం లేదు. రైతులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. వారీ అసహనం ఆగ్రహంగా మారకముందే ప్రభుత్వం మేల్కొని, దిద్దుబాటు చర్యలకు దిగితే మంచిది. 

07:41 - October 24, 2016

తెలంగాణలో మరోసారి రైతు సమస్యలు ఎజెండా మీదకు వచ్చాయి. రైతు జెఏసి ఆధ్వర్యంలో నిన్ననే ఇందిరాపార్క్ దగ్గర ధర్నా జరిగింది. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలేమిటి? ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరలు రైతులకు న్యాయం చేస్తున్నాయా? విత్తన రాష్ట్రంలోనే నకిలీ విత్తనాల సమస్యాత్మకంగా మారడానికి కారణం ఏమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు తెలంగాణ రైతు సంఘం నేత చంద్రారెడ్డి గారు 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

07:37 - October 24, 2016

గుంటూరు : రాజధాని ప్రాంతం తుళ్ళూరు పరిధిలో పోలీసు భద్రతను మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు... గుంటూరు రేంజ్ ఐజి సంజయ్ చెబుతున్నారు. ఇందులో భాగంగా తుళ్ళూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో... భద్రతను మరింత కట్టుదిట్టం చేశామంటున్న ఐజీ సంజయ్ పేర్కొన్నారు.

07:32 - October 24, 2016

హైదరాబాద్ : విద్యా విధానం పటిష్టతపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా గురుకుల విద్యను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ గురుకుల విద్యాలయాలను భారీగా పెంచాలని నిర్ణయించింది. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా వీటిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు అవసరమైన నిధులు, సిబ్బందిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యత
రాష్ట్రంలో విద్యా సంస్థల రాశి పెరిగినా... ప్రమాణాల వాసి పెరగలేదన్న వాస్తవాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం... ఇప్పుడు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వ విద్యను ప్రైవేటు విద్యకు ధీటుగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించింది. దీనిలో భాగంగా గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తోంది.

బీసీలకు కొత్తగా 119 గురుకుల స్కూళ్లు
కేజీ టూ పీజీ ఉచిత విద్యా బోధన హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చర్యలు చేపట్టింది. గురుకుల పాఠశాలలను ఎక్కువగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే గురుకుల విద్యాలయాలను పరిమితం చేసిన ప్రభుత్వం ఇప్పుడు... బీసీలకు కూడా విస్తరించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బీసీ గురుకుల పాఠశాల ఉండేలా చర్యలు చేపట్టింది. మొత్తం 119 రెసిడెన్సియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈనెల 28న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

ఐదు, ఆరు తరగతులతో బీసీ గురుకులాలు ప్రారంభం
2017-18 విద్యా సంవత్సరం నుంచి బీసీ గురుకుల విద్యాలయాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి ఏడాది ఐదు, ఆరు తరగతులతో వీటిని ప్రారంభిస్తారు. మొత్తం 19,040 విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. బీసీ గురుకులాల్లో బాలికలను 62, బాలురకు 57 స్కూళ్లు కేటాయించారు. ఒక్కో తరగతిలో 80 సీట్లు ఉండే ఏర్పాటు చేశారు. ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులకు బోధన చేస్తారు. మొదటి సంవత్సరం అద్దె భవనాల్లో వీటిని ప్రారంభిస్తారు. బోధనతోపాటు, అద్దెల కోసం 169 కోట్ల రూపాయలు కేటాయించారు. శాశ్వత భవనాలు నిర్మించి, మౌలికసదుపాయాలు కల్పించడానికి 726 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. బీసీ గురుకులాల కోసం 4046 పోస్టులు భర్తీ చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరానికి 226 ఉద్యోగులు మంజూరు చేశారు. తరగతులు పెరిగే కొద్ది ఈ సంఖ్యను పెంచుకుంటా పోతారు. పునర్విభజనకు ముందు ఉన్న జిల్లాల వారీగా బీసీ గురుకులాలను కేటాయించారు. మహబూబ్ నగర్ జిల్లాకు 14, రంగారెడ్డికి 14, హైద్రాబాద్‌కు 15 బీసీ గురుకుల విద్యాలయాలు మంజూరు చేయాలని ప్రతిపాదించారు. మెదక్‌ జిల్లాకు 10, నిజామాబాద్ 09,అదిలాబాద్ 10,కరీంగనర్ జిల్లా కు 13, వరంగల్ 12, ఖమ్మం 10, నల్గొండ జిల్లాకు 12 వంతున ఈ స్కూళ్లను కేటాయించారు.

ప్రస్తుతం ఉన్న గురుకుల విద్యాలయాల్లో 10,241 మంది విద్యార్థులు
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బాలురకు 13, బాలికలకు 10 గురుకుల పాఠశాలు ఉన్నాయి. వీటిలో 10,241 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే 19 జూనియర్‌ కాలేజీలతోపాటు ఒక డిగ్రీ కాలేజీ ఉంది. గత విద్యాసంవత్సరంలో వీటిలో 96 శాతంపైగా ఫలితాలు వచ్చాయి. దీంతో బీసీ గురుకుల విద్యను మరింత ప్రోత్సహించాలని నిర్ణయించింది.

 

07:28 - October 24, 2016

హైదరాబాద్ : తమ సర్వీసులను క్రమబద్దీకరిస్తానని టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదంటూ హోంగార్డులు ఆందోళన చేపట్టారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అంబర్‌పేటలో దీక్ష చేపట్టారు. హోంగార్డుల రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ ఆమరణ దీక్షకు దిగారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించకపోతే.. తామంతా దీక్ష చేపడతామని హోంగార్డులు హెచ్చరించారు. 

07:25 - October 24, 2016

నిజామాబాద్‌ : జిల్లాలో జరిగిన కాంగ్రెస్‌ పాదయాత్రలో నేతలు అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో జరిగే అవాంతరాలను ప్రజలు సహించవచ్చని, ఎన్నికల హామీ విస్మరిస్తే మాత్రం ఓర్చుకోలేరని ధ్వజమెత్తారు. పాలకుల నిర్లక్ష్యంతో ప్రజలు కంటతడి పెడుతుంటే....ప్రైవేటు సర్వేలు చేయించి అగ్రస్థానంలో ఉన్నామని టీఆర్‌ఎస్ ప్రచారం చేసుకోవడం విచిత్రంగా ఉందని విమర్శించారు.

బోధన్ లో ముగిసిన కాంగ్రెస్ పాదయాత్ర
ఏకకాలంలో రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల‌, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ డిమాండ్లతో చేపట్టిన కాంగ్రెస్‌ పాదయాత్ర నిజామాబాదు జిల్లా బోధన్ నియోజకవర్గంలో ముగిసింది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన 4 రోజుల పాదయాత్ర ముగింపు సభ బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగింది. టీపిసిసి చీఫ్‌ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కేసీఆర్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే పారిశ్రామిక విధానం అమలు చేస్తోందని చెప్పే సీఎం కేసీఆర్..ఆసియా ఖండంలో ప్రసిద్ధి చెందిన 80 ఏళ్ల చరిత్రగల నిజాం చక్కెర మిల్లును ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పాత ఫ్యాక్టరీలను పునరుద్దరిస్తామన్న ప్రభుత్వం నేడు వాటిని మూసివేసి కార్మికులు, రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు.

కేసీఆర్‌ ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నారు : జానారెడ్డి
సీఎం కేసీఆర్‌ ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నారని సీఎల్పీ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన తరువాత వంద రోజుల్లో నిజాంషుగర్స్‌ ప్రభుత్వపరం చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయారన్నారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపిస్తామన్నారు జానారెడ్డి.ఎన్నికల హామీల అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు టీపీసీసీ చేపట్టిన పాదయాత్ర ఆ పార్టీకి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.

 

పాక్ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ జవాను మృతి..

జమ్మూకశ్మీర్ : దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడిచింది. గత వారం రోజుల నుంచి భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దులో భారత బలగాలకు, పాక్ రేంజర్లకు ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో సోమవారం తెల్లవారుజామున పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయాడు. మరో జవానుతో పాటు ఓ స్థానిక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవానును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

07:20 - October 24, 2016

గుంటూరు : జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లాలూపురంలో వద్ద వద్ద లక్ష్మీలావణ్య కోల్డ్‌ స్టోరేజీలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. మంటల తీవ్రత భారీగా వుండటంతో మరో రెండు ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నాలు చేస్తున్నారు. మంటలు ఆర్పేందుకు స్థానికంగా నీటి లభ్యత లేకపోవటంతో వాటర్ ట్యాంకర్లను తెచ్చేందుకు యత్నిస్తున్నారు. కాగా రైతుల కష్టార్జితాన్ని కాపాడేందుకు మంటల్లో కాలిపోగా మిగిలివున్న సరుకును బైటకు తీసుకొచ్చేందుకు స్థానికులు, అధికారులు యత్నిస్తున్నారు. కాగా మిర్చి ఘాటుతో సహాయక చర్యలను కొంత ఇబ్బందిగా వున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి  కారణాలు  తెలియరావాల్సివుంది.

06:56 - October 24, 2016

హైదరాబాద్ : బ్రాహ్మణ సామాజికవర్గ అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. బడ్జెట్‌లో 100 కోట్లను కేటాయించామని.. పేద విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ఓవర్సీస్‌ పథకాన్ని అమలు చేస్తామన్నారు. బ్రాహ్మణుల సమస్యలను తెలుసుకునేందుకు ఆ వర్గ ప్రతినిధులతో సమావేశమైన సీఎం.. నగరంలో బ్రాహ్మణ సదనం నిర్మిస్తామన్నారు. ఇందుకోసం అడ్‌హక్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

బ్రహ్మణ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశం
రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రతినిధులతో దశల వారిగా సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ తాజాగా బ్రహ్మణ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమయ్యారు. క్రిష్టియన్ మైనార్టీ, బంజారాలు, మళాయాళీల తరహాలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా ప్రత్యేక భవన సముదాయాన్ని నిర్మిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈసమావేశానికి సీఎస్‌ రాజీవ్‌శర్మ, ఏపీ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుతో సహా పలువురు హాజరయ్యారు.

బ్రాహ్మణులు సంక్షేమానికి అన్ని రకాల చర్యలు : కేసీఆర్
బ్రాహ్మణులతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. 1985లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దేశంలోనే మొదటిసారిగా సిద్దిపేటలో బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌ నిర్మించానని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని.. అందుకే కొత్త పథకాలు తెస్తున్నామన్నారు. బ్రాహ్మణులు కూడా నిర్లక్ష్యానికి గురి కావద్దన్నారు. హైదరాబాద్‌లో 12 ఎకరాల విస్తీర్ణంలో బ్రాహ్మణ సదనం నిర్మించి వారి సంక్షేమానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు కేసీఆర్‌. దేశ నలుమూలల నుంచి హైదరాబాద్‌ వచ్చే బ్రాహ్మణులకు సదనంలో వసతులు కల్పించడంతో.. బ్రాహ్మణ విద్యార్థులకు హాస్టల్‌ నిర్మిస్తామన్నారు. విదేశీ విద్యకోసం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఇక బ్రాహ్మణ సదనం నిర్మాణ పర్యవేక్షణ కోసం అడ్‌హక్‌ కమిటీని నియమించారు.

కేసీఆర్‌ను ప్రశంసించిన ఐవైఆర్ కృష్ణారావు
ఈ సమావేశంలో ఏపీ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. 'ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప దార్శనికుడని, మిషన్‌ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టులు, జిల్లాల పునర్వ్యస్థీకరణ లాంటి కార్యక్రమాలతో అందరినీ ఆకర్షిస్తున్నారన్నారు.

కేసీఆర్‌ సానుకూలంగా స్పందించడంతో బ్రాహ్మణుల హర్షం
ఈ సమావేశంలో సాంస్కృతిక యూనివర్సిటీ, వేద పాఠశాలల నిర్మాణంతో పాటు.. వేదాలు అభ్యసిస్తున్న వారికి ఆర్ధికసాయం లాంటి అంశాలతో పాటు మరికొన్ని డిమాండ్లను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. వీటిన్నింటికి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా..

హైదరాబాద్ : నేడు రెండో రోజు ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. ఇప్పటికే అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. 

Don't Miss