Activities calendar

25 October 2016

కేబియెట్ పిటిషన్లు దాఖలు చేసిన టాటా గ్రూప్

మహారాష్ట్ర : ముంబై హైకోర్టు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో టాటా గ్రూప్ కేబియెట్ పిటిషన్లు దాఖలు చేసింది. ఉద్వాసనను ఛాలెంజ్ చేస్తూ మిస్త్రీ కోర్టును ఆశ్రయిస్తారన్న అంచనాతో టాటా గ్రూప్ కేబియెట్ పిటిషన్లు దాఖలు చేసింది. తాము ఇంతవరకు కోర్టును ఆశ్రయించలేదని సైరస్ మిస్త్రీ తెలిపారు.

 

విద్యుత్‌శాఖ పనితీరుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు విద్యుత్‌ కనెక్షన్లపై జరుగుతున్న అక్రమాలకు చెక్‌పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీనిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌శాఖ పనితీరుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. 

22:07 - October 25, 2016
22:06 - October 25, 2016

హైదరాబాద్ : కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై సిపిఎం దాడులు జరుపుతోందన్న ఆరోపణలను ఆ పార్టీ ఖండించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నియోజక వర్గంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలే బాంబులతో దాడులు చేశారని సిపిఎం గుర్తు చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ జరిపిన దాడిలో సిపిఎం కార్యకర్త మృతి చెందాడని పేర్కొంది. ముస్లింలు అధికంగా ఉండే ఉత్తర కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించింది. కేరళలో దాడులతో విధ్వంసం సృష్టిస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని సిపిఎం దుయ్యబట్టింది. సిపిఎం పార్టీ కార్యాలయాలపై ఆర్ఎస్‌ఎస్‌ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారని 3 వందల మంది కార్యకర్తలు గాయపడ్డారని తెలిపింది.

 

22:01 - October 25, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మెగలోమాన్య అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఈ వ్యాధితో బాధపడే వాళ్లు పూర్వకాలంలో తాను రాజునని భావిస్తారని...తమకు  నచ్చినట్లు భవనాలు ఉండాలని అనుకుంటారని చెప్పారు. అందుకే కేసీఆర్ ఉన్న భవనాలు కూల్చేసి..కొత్త భవనాలు కట్టాలని ఆదేశిస్తున్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తుండటం దురదృష్టకరమని చెప్పారు. 

 

21:59 - October 25, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు విద్యుత్‌ కనెక్షన్లపై జరుగుతున్న అక్రమాలకు చెక్‌పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీనిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌శాఖ పనితీరుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్పందిస్తూ..ప్రభుత్వం వేలకోట్లు ఖర్చుచేసి రైతులకు కరెంట్‌ అందిస్తుంటే వారికి సకాలంలో విద్యుత్‌ కనెక్షన్లు అందించలేకపోతున్నామని అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇప్పటికీ..రాష్ట్రంలో కొత్త కనెక్షన్ల కోసం 97వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడంపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే 7నెలల్లో అందరికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియను ముగించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 

 

21:55 - October 25, 2016

ఎద్దేడుస్తున్న ఎవసం.. రైతేడుస్తున్న రాజ్యం..తెలంగాణలో తెర్లుతెర్లైతున్న రైతుల కథ, మూడో ఫ్లోర్ నుంచి జారిపడ్డ హోంమంత్రి... పరామర్శకు పోయినకాడనే ట్రీట్ మెంట్, రాజకీయాలు మైలవడ్డయంటున్న చంద్రాలు.. చేసిందెవలయ్యా.. మీరే అంటున్న జనాలు, చాప పిల్లలతోని కళకళలాడుతున్న చెర్లు.... అవిటిని రక్షించుకోకపోతే మిగిలేది తెర్లు, యజ్ఞంతోనే వానలు పడ్డయన్న మల్లారెడ్డి.. మరి హైదరాబాద్ వరదల సంగతేంటన్న, డొనాల్డ్ ట్రంప్ ను గెలిపిస్తానంటున్న కెఎ పాల్.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....
 

21:44 - October 25, 2016

కేంద్రప్రభుత్వానికి టీడీపీ దాసోహం అయిందని వక్తలు విమర్శించారు. ఇవాళ్టి చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత గౌతంరెడ్డి, టీడీపీ నేత జూపూడీ ప్రభాకర్, సీపీఎం నేత బాబూరావు పాల్గొని, మాట్లాడారు. కేంద్రం వద్ద టీడీపీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతుందని విమర్శించారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే మంత్రివర్గంలో నుంచి టీడీపీ ఎంపీలు వైదొలగాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:22 - October 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టాస్) ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టాస్‌ ఏర్పాటుపై రెండు ఉద్యోగ సంఘాల మధ్య కోల్డ్‌ వార్‌ జరుగుతోంది. సచివాలయంలో ఎంజి గోపాల్‌ నేతృత్వంలోని టాస్‌ కమిటీ.. రెవిన్యూ, గెజిటెడ్‌, గ్రూప్‌ 1 అధికారుల సంఘాలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీలో అధికారుల సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. టాస్ ఏర్పాటుపై మరింత అధ్యయనం చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగులు అన్నారు. టాస్ ఏర్పాటు అవసరం లేదని రెవిన్యూ ఉద్యోగులు అంటున్నారు. చిన్న జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో టాస్‌ అనవసరమన్నారు. జేసీ పోస్టులు రెవిన్యూ శాఖకే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. శాఖల కుదింపు నేపథ్యంలో టాస్ పై అధ్యయనానికి రెవిన్యూ సంఘం 3 నెలల గడువు కోరింది. రెవిన్యూ అధికారుల సంఘం వాదనతో గ్రూప్‌ 1 అధికారుల సంఘం విభేదించింది. టాస్ ఏర్పాటు అని వార్యమని గ్రూప్‌ 1 అధికారుల సంఘం తెలిపింది. గ్రూప్‌ 1 లోని సమర్థ అధికారులకే జాయింట్‌ కలెక్టర్‌ పోస్టులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలను పరిగణలోకి తీసుకోవద్దని గ్రూప్‌ 1 అధికారులు సంఘం తెలిపింది. రెవిన్యూ శాఖ పెత్తనం పోతుందనే భయంతోటే టాస్ ను వ్యతిరేకిస్తున్నారని ఆరోపణ చేసింది. టాస్‌ వివాదంతో ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడే ప్రమాదం ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

టాస్‌ ఏర్పాటుపై కోల్డ్‌ వార్‌

హైదరాబాద్ : తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టాస్‌ ఏర్పాటుపై రెండు ఉద్యోగ సంఘాల మధ్య కోల్డ్‌ వార్‌ జరుగుతోంది. సచివాలయంలో ఎంజి గోపాల్‌ నేతృత్వంలోని టాస్‌ కమిటీ.. రెవిన్యూ, గెజిటెడ్‌, గ్రూప్‌-1 అధికారుల సంఘాలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీలో అధికారుల సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. 

 

21:13 - October 25, 2016

కర్నూలు : జిల్లాలో జరిగిన యువభేరీలో వైసీపీ అధినేత పొలిటికల్‌ సమరానికి సంకేతాలు పంపారు. తొలిదశలో ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంటు స్తంభించాలని యోచిస్తోంది. తదుపరి వైఎస్సార్ పార్టీ ఎంపీల రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నారు. ప్రత్యేక హోదా అంశంతో... ఏపీలో  బీజేపీ ప్రాబల్యానికి గండి కట్టేందుకు..అధికార టీడీపీకి అడ్డుకట్టవేసేందుకు...జనసేనకు చెక్ పెట్టేందుకు...త్రిముఖ రాజకీయ వ్యూహంతో ముందుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రత్యేక హోదాయే అజెండాగా ఉపఎన్నికల ఎత్తుగడ వేస్తున్నారు. కేంద్రాన్ని, రాష్ట్రాన్ని ఇరకాటంలోకి నెట్టే కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రత్యేకహోదా అజెండా జనసేన చేతిలో పడకుండా అడ్డుచక్రం వేయాలని చూస్తున్నారు. యువత జనసేన జెండా ఎత్తుకోకుండా పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే వేడి రగిల్చే ప్లాన్ చేస్తున్నారు. అధికారపక్షాలను సంక్షోభంలోకి నెట్టివేసే ఎత్తుగడకు వేస్తున్నారు. 

 

యువభేరిలో జగన్ సంకేతాలు

కర్నూలు : జిల్లాలో జరిగిన యువభేరీలో వైసీపీ అధినేత పొలిటికల్‌ సమరానికి సంకేతాలు పంపారు. తొలిదశలో ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంటు స్తంభించాలని యోచిస్తోంది. తదుపరి వైఎస్సార్ పార్టీ ఎంపీల రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నారు. 

21:03 - October 25, 2016

విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వం పెద్దల కోసం పనిచేస్తూ పేదల నోట్లో మట్టికొడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు సీహెచ్.బాబూరావు విమర్శించారు. నవంబర్ 1 నుంచి జన చైతన్య యాత్రల పేరుతో వచ్చే టిడిపి నేతలను అడుగడుగునా నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారాయన. విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గంలో సీపీఎం ప్రజా చైతన్య పాదయాత్రలు 3వ రోజూ కొనసాగాయి. చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్ళలో ఇచ్చిన హామీలను అమలుపరచలేదన్నారు. పొదుపు గ్రూపులను అస్తవ్యస్ధం చేసిన టిడిపి ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుంటే నవంబర్, డిసెంబర్ నెలలో ప్రజా ఉద్యమం చేపడతామని బాబురావు హెచ్చరించారు. 

 

20:59 - October 25, 2016

శ్రీకాకుళం : ఉన్నత చదువులు చదివాడు.. పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డాడు.. సంతోష జీవితం అనుభవిస్తున్నాడు.. అయినా ఏదో వెలితి.. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని..  ఊరి రుణం తీర్చుకోవాలని తపించాడు. అంతే అనుకున్నదే తరవుగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఇప్పుడతను ఆ ఊరి శ్రీమంతుడు.. ఎవరతను? అతను దత్తత తీసుకున్న గ్రామం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ.. 
గ్రామస్తుల జీవితాల్లో వెలుగు 
శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ఉన్న గ్రామం బంటుపల్లి.. ఎన్నో రకాల సమస్యలు ఆ గ్రామాన్నిచుట్టుముట్టాయి. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం ముఖం చాటేసింది. ఇక తమ బతుకులు బాగుపడేది ఎప్పుడు అని దిగాలుగా ఉన్న గ్రామస్తుల జీవితాల్లోకి వెలుగు నింపడానికి వచ్చాడు. అతనే నడికుడితి ఈశ్వరరావు.. 
గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈశ్వరరావు 
గ్రామస్తులు ఎన్ ఈఆర్ అని పిల్చుకునే ఈశ్వరరావు.. ఢిల్లీలో పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డాడు. అతని తల్లి గ్రామ సర్పంచ్‌.. తన ఊరు పడుతున్న కష్టాల గురించి తెలుసుకుని.. పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలని గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. అప్పటి నుంచి బంటుపల్లి గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి గ్రామస్తుల జీవితాల్లో వెలుగునింపారు. గ్రామంలో చదువుకున్న యువతకు ఉపాధి.. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టుమిషన్ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి తమ జీవితాలు బాగుచేశారని గ్రామస్తులు చెబుతున్నారు. ఎన్.ఈ.ఆర్ తమకు దేవుడిచ్చిన వరమని అంటున్నారు.
బంగారు బంటుపల్లిగా మారిన బంటుపల్లి గ్రామం..          
ఒకప్పుడు ఎంతో నిర్లక్ష్యానికి గురైన బంటుపల్లి గ్రామం.. నేడు బంగారు బంటుపల్లిగా మారిందని.. శ్రీ మహాలక్ష్మి యూత్ క్లబ్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించి బంటుపల్లిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని యూత్ క్లబ్ సభ్యులు తెలిపారు. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే తపనతో తన సొంత నిధులు వెచ్చించి బంటుపల్లి గ్రామాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నానని ఈశ్వరరావు అన్నారు. ఊరి రుణం తీర్చుకునే భాగ్యం తనకు దొరకడం తన అదృష్టమని ఆయన చెబుతున్నారు. ఈశ్వరరావు కృషితో శ్రీకాకుళం జిల్లాలోనే తమ గ్రామం అగ్రగామిగా నిలిచిందని.. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు తమ గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

20:53 - October 25, 2016

శ్రీకాకుళం : ప్రజల కోసం పనిచేస్తున్న తన కొడుకు మున్నా..పోలీసు కాల్పుల్లో చనిపోయినందుకు తనకు గర్వంగా ఉందని మావోయిస్ట్‌ అగ్రనేత ఆర్కే భార్య శిరీష అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న తన కొడుకు ప్రజల కోసమే ప్రాణాలు కోల్పోవడం గర్విస్తున్నానని తెలిపారు. అయితే ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు చనిపోయారని ప్రభుత్వం చెప్పడం శుద్ధ అబద్దమన్నారు. వెనక నుంచి పోలీసులు దొంగదెబ్బ తీశారు కాబట్టే అంతమంది చనిపోయారని ఆమె ప్రభుత్వాన్ని విమర్శించారు. 

20:34 - October 25, 2016

విజయనగరం : జిల్లాలో దారుణం జరిగింది. చీపురుపల్లిలో ఓ యువకుడు ప్రియురాలిని రైలుకిందకు తోసేశాడు. దీంతో అమ్మాయి తన రెండు కాళ్లు కోల్పోయింది. నీలవేణి అనే యువతి రామకృష్ణ అనే యువకుడితో ప్రేమలో పడింది. ప్రేమ విషయంలో సమస్యలు రావడంతో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు. తీరా ఆత్మహత్య చేసుకునే ముందు ప్రియురాలిని రైలు కింద తోసేసి రామకృష్ణ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

 

20:30 - October 25, 2016

వరంగల్ : కంకుల సాగు రైతులకు కష్టాలు తెచ్చి పెట్టింది. పంట ఏపుగా పెరిగినప్పటికీ కూడా పైసా లాభం లేకపోవడంతో మొక్క జొన్న  రైతులు కళ్లనీళ్ల పర్యంతమవుతున్నారు. రోజు రోజుకూ పతనమవుతున్న ధరలతో మొక్కజొన్న రైతు గుండె బరువెక్కుతోంది.... వరంగల్ జిల్లా మొక్కజొన్న రైతుల కష్టాలపై టెన్ టీవీ ప్రత్యేక కథనం 
రైతులకు ధరాఘాతం 
ఆరుగాలం కష్టించి మొక్కజొన్న సాగు చేసిన రైతులకు ధరాఘాతం తగిలింది. వ్యయ ప్రయాసాలకోర్చి పండించిన పంటకు మద్దతు ధర రాక.. రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మొన్నటి వరకూ ఆకాశానికి ఎగబాకిన క్వింటా మొక్కజొన్న ధర.. అమాంతం పడిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 
400 రూపాయలు తగ్గిన ధర 
మొక్కజొన్న ధర అమాంతం పడిపోయింది. వారం రోజుల క్రితం వరకూ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.1,950 పలికిన మొక్కజొన్న.. ప్రస్తుతం నాలుగు వందల రూపాయలు తగ్గి 1400 రూపాయలు మాత్రమే పలుకుతోంది. అక్టోబర్ తొలి వారంలో పెరిగిన ధరలతో సంతోషంలో మునిగిపోయిన రైతన్నలకు ప్రస్తుతం తగ్గిన ధరలు నిరాశకు గురి చేస్తున్నాయి. 
మొక్కజొన్న పంట వైపు రైతుల మొగ్గు
గడిచిన ఖరీఫ్ సీజన్ లో వర్షాలు ఆశించిన మేర కురవడంతో రైతన్నలు మొక్కజొన్న పంటను సమృద్ధిగా పండిచారు. దీంతోపాటు పత్తి పంటకు అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చాలా మంది రైతులు ఈసారి పత్తిని కాదని మొక్కజొన్న సాగు వైపు మొగ్గు చూపారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న సాగు అమాంతం రెట్టింపు అయ్యింది. నూతనంగా ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లాలోనే 15,017 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేసిన పరిస్ధితి. గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయిలో మొక్కజొన్న సాగు చేయడంతో దిగుబడి గణనీయంగా వచ్చింది. ఇదే మొక్కజొన్నధరల పతనానికి కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితి 
మొక్కజొన్నను మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు అయ్యే రవాణా ఖర్చులూ గిట్టుబాటు కాని పరిస్థితి ఉందని రైతులంటున్నారు. ప్రస్తుతం సరైన ధర లేకపోవడంతో తమకు పెట్టుబడి కూడా రావడం లేదంటున్నారు.
రైతుల కంట కన్నీరు
వారంరోజుల వ్యత్యాసంతోనే భారీగా ధరలు పడిపోవడంతో రైతన్నలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వారం క్రితం పంటను అమ్ముకున్న వారంతా ఆనంద పడుతుండగా.. ప్రస్తుతం మార్కెట్‌కు మొక్కజొన్న పంటను తీసుకొచ్చిన రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్దతు ధర చెల్లించి మొక్కజొన్నను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

కేరళ సీపీఎంపై ఆర్ ఎస్ ఎస్ తప్పుడు ప్రచారం : సీపీఎం పొలిట్ బ్యూరో

ఢిల్లీ : కేరళ సీపీఎంపై ఆర్ ఎస్ ఎస్ తప్పుడు ప్రచారాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. సీపీఎం కేడర్ పై ఆర్ ఎస్ ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఆర్ ఎస్ ఎస్ బాంబు దాడులతో హింసాత్మక చర్యలకు పాల్పడిందని చెప్పారు. ఈ ఘటనలో సీపీఎం ఓ కార్యకర్తను కోల్పోయిందని తెలిపారు. కేరళలో ఎల్డీఎఫ్ ఆధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే ఆర్ ఎస్ ఎస్ చేతిలో ఐదుగురు సీపీఎం కార్యకర్తలు చనిపోయారని తెలిపారు. 300 మంది గాయపడ్డారని, కార్యకర్తల 80 ఇళ్లు కూల్చారని తెలిపారు. 35 సీపీఎం ఆఫీసులు ధ్వంసమయ్యాని అన్నారు.

20:23 - October 25, 2016

విశాఖ : బంగాళాఖాతంలో వాయుగుండం తుఫానుగా మారింది. తీవ్రవాయుగుండం తుఫానుగా మారిందని విశాఖ వాతావరణశాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ తుఫానుకు క్యాంట్‌గా పేరుపెట్టారు. దీని ప్రభావం ఈనెల 28నుంచి ఉత్తరకోస్తా, ఒడిశాపై ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. తుఫాను ప్రభావంతో ఉత్తరకోస్తా తీరంవెంబడి గంటకు 65 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

19:15 - October 25, 2016
19:13 - October 25, 2016

యూపీ : సమాజ్‌వాది పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. తమ కుటుంబం ఐక్యంగా ఉందని, ఎలాంటి తగాదాలు లేవని, మా పార్టీ కుటుంబం లక్ష్యం ఒక్కటేనన్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించడమే మాముందున్న కర్తవ్యమని ములాయం చెప్పారు. ప్రజలు తమతోనే ఉన్నారని, వారికోసం పనిచేస్తామన్నారు. కొంతమంది అనవసరంగా అమర్‌సింగ్‌ను ఆడిపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. మీడియా సమావేశానికి శివపాల్‌ హాజరు కాగా, అఖిలేష్‌ యాదవ్‌ హాజరు కాకపోవడం గమనార్హం. 

 

19:11 - October 25, 2016
19:04 - October 25, 2016

హైదరాబాద్ : మల్కన్‌గిరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకమని, ఇది ఓ హత్యాకాండ అని ప్రజాసంఘాలు విమర్శించాయి. 27 మంది చనిపోయారని చెబుతూ.. కేవలం 11 మంది మృతదేహాలను చూపించడం అమానవీయమని ప్రజాసంఘాలు దుయ్యబట్టాయి. మరోవైపు ఇంకా కాల్పులు జరుగుతున్నాయని పోలీసులు చెప్పడంతో వాస్తవం లేదని, పోలీసుల చేతిలో మరికొందరు మావోయిస్టులు ఉన్నారని ఒక్కొక్కరిగా వారిని చంపేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని ప్రజాసంఘాల నేతలు విమర్శించారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, ఉద్దేశపూర్వకంగానే పోలీసులు కాల్చిచంపారని కాల్పుల్లో మృతి చెందిన అరుణ తండ్రి లక్ష్మణ్‌ అన్నారు. అరుణ, ఆజాద్‌ ఇద్దరు తన బిడ్డలేనని లక్ష్మణ్‌ తెలిపారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను భరించలేకనే అరుణ, ఆజాద్‌ మావోయిస్టులుగా మారారని ఆయన తెలిపాడు. అరుణ 2003లో తనను కలిసిందని, అప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేదని ఆయన తెలిపాడు.  ప్రభుత్వం చంపడమే పనిగా పెట్టుకుందని, ఎన్ని ఎన్‌కౌంటర్లు చేసినా.. కొత్త నీరు వచ్చి చేరుతుందని ప్రజాసంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ఇది ప్రజలకు, వ్యవస్థకు మధ్య జరుగుతున్న యుద్ధమని విరసం నేత వరవరరావు అన్నారు. 

 

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

ఒడిషా : రాష్ట్రంలో వంతెనపై నుంచి ఓ బస్సు కింద పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలాయ్యయి.  క్షతగాత్రుల్లో ఐదు మంది పరిస్థితి విషమంగా ఉంది. 

ఎయిర్ లైన్స్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు

విజయవాడ : ఎయిర్ లైన్స్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ను విమానయాన హబ్ గా మార్చేంచేందుకు సహకరించాలని చంద్రబాబు ప్రతినిధులను కోరారు.

17:44 - October 25, 2016

హైదరాబాద్ : యువభేరి కార్యక్రమాల పేరుతో ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు, ఉద్యోగలు వస్తాయని వైఎస్ జగన్..యువభేరి కార్యక్రమాల ద్వారా విద్యార్ధులను తప్పుదోవపట్టిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును వైఎస్ జగన్ అడ్డుపడుతున్నాడని తెలిపారు. మరో వైపు ప్రత్యేక హోదా పేరుతో ధ్వంద వైఖరిని అవలభిస్తున్నారని విమర్శించారు.  

 

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆశ్రయించిన సైరన్ మిస్త్రీ..

ముంబై : నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను సైరన్ మిస్త్రీ ఆశ్రయించారు. రతన్ టాటా, టాటా గ్రూప్, టాటా ట్రస్టుకు వ్యతిరేకంగా నాలుగు కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. రతన్ టాటా, టాటా సన్స్, డొరాబ్జీ ట్రస్టులపై మూడు కేవియెట్ లు దాఖలు చేయగా రతన్ టాటా, టాటా సన్స్ పై సైరన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ కేవియట్ దాఖలు చేసింది. 

ఆర్ఎస్ పురా సెక్టార్ లో పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : ఆర్ఎస్ పురా సెక్టార్ లో పాక్ సైన్యం మళ్లీ కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. 

17:40 - October 25, 2016

రంగారెడ్డి : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ చేపట్టిన మహాజన పాదయాత్ర తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఆ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో పాదయాత్ర సాగుతోంది. పలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత చెరుపల్లి సీతారాములు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మహాజన పాదయాత్ర జయప్రదంగా సాగుతుందని చెప్పారు. పాదయాత్ర తొమ్మిదో రోజుకు చేరుకుందని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తమ ఇబ్బందులను పాదయాత్ర బృందానికి చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల బాధలు కష్టాలు చూస్తుంటే... రాష్ట్రంలో ప్రజలు సుఖంగా ఉన్నారని... సీఎం కేసీఆర్ చెప్పిన విషయం అబద్ధమని తేలిందన్నారు. సర్వే రిపోర్టులు, సీఎం కేసీఆర్ మాటాలకుచ, గ్రామాలు, పల్లెల్లో ఉన్న పరిస్థితులకు చాలా తేడా ఉందన్నారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిర్వాసితుల సమస్యలతోపాటు పలు సమస్యలు పాదయాత్ర బృందం దృష్టికి వస్తున్నాయని తెలిపారు. సమస్యలపై తాము అధ్యయనం చేసి వాటిపై పోరాటాలను రూపకల్పన చేసి.. సమస్యల పరిష్కారం కొసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఆక్వా, పశు సంవర్థక శాఖపై ప్రత్తిపాటి సమీక్ష..

గుంటూరు : వెలగపూడిలో ఆక్వా, పశు సంవర్థక శాఖపై మంత్రి ప్రత్తిపాటి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 44 వేల 101 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా సాగు చేస్తున్నారని, ఆక్వారంగంలో యాంటీ బయోటిక్స్ ఉపయోగంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పశువులను వేరే ప్రాంతాలకు తరలిస్తే అనుమతి తీసుకోవాలని సూచించారు. కోల్డ్ స్టోరేజ్ ఘటనలో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. కోల్డ్ స్టోరేజ్ అనుమతులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. 

17:25 - October 25, 2016

ఆదిలాబాద్ : దశాబ్దాల కాలం పోరాడి ఆదివాసీలు సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం కాలరాస్తోంది. జల్‌, జమీన్‌, జంగిల్‌ కోసం కొమరం భీమ్‌ పోరాడిన నేలపై సర్కారీ మార్కు దురాక్రమణ కొనసాగుతోంది. చట్ట ప్రకారం హక్కులు పొందిన అటవీ భూములను కూడా హరితహారం పేరుతో తిరిగి లాక్కోవడానికి అటవీశాఖ ఆదివాసీ గ్రామాలపై దండయాత్రలు చేస్తోంది.  
అటవీ భూములు ఖాళీ చేయాలని ఆదేశాలు
అవిభాజ్య ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములపై సర్కారు కన్ను పడింది. హరితహారంలో భాగంగా ఈ భూముల్లో మళ్ళీ మొక్కలు పెంచాలని ప్రభుత్వం ఆదేశించిందంటూ అటవీ శాఖ అధికారులు హడావుడి చేస్తున్నారు. అటవీ భూములు ఖాళీ చేయాలని ఆదేశిస్తూ గ్రామాలపై అటవీ శాఖ అధికారులు విరుచుకుపడుతున్నారు.  
ఆదివాసీల జీవన విధానంలో పోడు వ్యవసాయం అంతర్భాగం 
తెలంగాణలో 1,14,865 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉండగా దీనిలో 29,242 కిలోమీటర్ల అటవీ భూమి ఉంది.  ఆదివాసీలు అధికంగా నివసించే  ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 1700 చ.కి.మీ విస్తీర్ణంలో అడవులు వ్యాపించి ఉన్నాయి.  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,10,274 హెక్టార్లు అటవీ ప్రాంతం ఉంది. మంచిర్యాల జిల్లాలో  4 వేల 56.36 చ.కి.మీ విస్తీర్ణం, నిర్మల్ జిల్లాలో 3వేల 562.51 చ. కి.మీ. వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రాంతాలలో నాలుగు దశాబ్దాలుగా అటవీ భూముల్లో ఆదివాసీలు, దళితులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆదివాసీల సంస్కృతి, జీవన విధానంలో పోడు వ్యవసాయం కూడా ఒక అంతర్భాగం. 
పదెకరాలకు క్లెయిమ్‌లు ఇవ్వడానికి ముందుకురాని ప్రభుత్వం  
ఆదివాసీల సుదీర్ఘ పోరాట ఫలితంగా 2006 లో కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2008 నుంచి అటవీ హక్కుల చట్టాలన్నిఅమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రాంతంలో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గుర్తింపు ప్రక్రియను నామమాత్రంగా కూడా చేపట్టలేదు. గరిష్ఠంగా పదెకరాల వరకూ  వ్యక్తిగత క్లెయిమ్‌లు ఇవ్వవచ్చని చట్టంలో పేర్కొన్నప్పటికీ పదెకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. అటవీ హక్కుల గుర్తింపు క్లెయిమ్‌లకు అటవీశాఖ అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది. 
పోడు రైతులను వేధిస్తున్న అటవీ అధికారులు
హరితహారంలో భాగంగా అటవీ భూముల్లో మొక్కలు పెంచుతామంటూ అటవీ అధికారులు పోడు రైతులను వేధిస్తున్నారు. అటవీ హక్కుల కోసం  దరఖాస్తు చేసుకున్నా పెండింగ్‌ లో ఉన్నాయనే నెపంతో పోడు వ్యవసాయదారులను తమ భూమిలోకి అడుగు పెట్టనివ్వడం లేదు.  అవిభాజ్య ఆదిలాబాద్‌ జిల్లాల్లో అటవీ హక్కుల గుర్తింపు పత్రాలు పొందిన వారిని కూడా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. 
ఉద్యమానికి సన్నద్ధమవుతున్నఆదివాసీలు
అటవీహక్కుల చట్టం  ప్రకారం సామాజిక గుర్తింపు పొందిన భూముల్లో కూడా తామే అడవులు పెంచుతామంటూ ఆ భూమిని అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకోవడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోడు భూములపై ఉద్యమ బాట పట్టేందుకు ఆదివాసీలు సన్నద్ధం అవుతున్నారు.

ప్రియురాలిని రైలు కిందకు తోసేసిన ప్రియుడు...

విజయనగరం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిపై ప్రియుడు హత్యాయత్నం చేశాడు. ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుందామని చెప్పిప్రియురాలిని రైలు కిందకు తోసేశాడు. దీనితో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి.

 

 

వంతెనపై నుండి కింద పడిన బస్సు..

ఒడిశా : అంగుల్ జిల్లాలో వంతెనపై నుండి బస్సు కిందపడింది. నలుగురు చనిపోగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

పోలీసులు దొంగ దెబ్బ తీశారు - ఆర్కే భార్య...

విశాఖపట్టణం : మావోయిస్టులను పోలీసులు దొంగ దెబ్బ తీశారని ఆర్కే భార్య శిరీష పేర్కొన్నారు. కొడుకు మరణం కడుపు కోతను మిగిల్చిందని, పీడిత ప్రజల కోసం పోరాడుతూ చనిపోవడం గర్వంగా ఉందని తెలిపారు. 

ఆధార్ సిన్హాతో హోం గార్డుల ప్రతినిధులు..

హైదరాబాద్ : ప్రభుత్వ పొలిటికల్ సెక్రటరీ ఆధార్ సిన్హాను హోం గార్డ్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 

ఈటెలను కలిసిన బీసీ కమిషన్ ఛైర్మన్..

హైదరాబాద్ : మంత్రి ఈటెలను బీసీ కమిషన్ ఛైర్మన్ బి.ఎస్.రాములు కలిశారు. గౌరీ శంకర్, కృష్ణ మోహన్, ఆంజనేయులు కూడా కలిసిన వారిలో ఉన్నారు. 

17:16 - October 25, 2016

ఢిల్లీ : టీమిండియా ఇన్‌స్టంట్‌ ఫార్మాట్‌ కెప్టెన్‌ ధోనీ వన్డేల్లో రికార్డ్‌ల మోత మోగిస్తున్నాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన ధోనీ....9వేల పరుగుల మైలురాయిని సైతం అధిగమించాడు. జార్ఘండ్‌ డైనమైట్‌ ధనా ధన్‌ ధోనీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో రికార్డ్‌లు కొత్తేమీ కాదు. కెప్టెన్‌గా,  వికెట్‌ కీపర్‌గా మాత్రమే కాదు బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డ్‌ల మోత మోగిస్తున్నాడు. ఒక్క ఇన్నింగ్స్‌తోనే విమర్శకులకు ...ధోనీ దిమ్మతిరిగిపోయె సమాధానమే ఇచ్చాడు. టీమిండియా ఇన్‌స్టంట్‌ ఫార్మాట్ల కెప్టెన్‌ ధోనీ...మొహాలీ వన్డేతో  అరుదైన రికార్డ్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత్ విజయంలో ధోనీ కీలక పాత్ర
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విరాట్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ధోనీ... వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత క్రికెటర్‌గా ధోనీ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకూ 195 సిక్స్‌లతో టాప్‌ ప్లేస్‌లో ఉన్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండుల్కర్‌ రికార్డ్‌ను ధోనీ బద్దలు కొట్టాడు.
వన్డేల్లో 9వేల పరుగుల మైలురాయి
వన్డేల్లో 61వ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన జార్ఖండ్‌ డైనమైట్‌.....ఇదే ఇన్నింగ్స్‌తో వన్డేల్లో 9వేల పరుగుల మైలురాయిని సైతం ధోనీ అధిగమించాడు. వన్డేల్లో 9వేల పరుగుల మార్క్ దాటిన 3వ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌గా మహీ హిస్టరీ క్రియేట్‌ చేశాడు. 244 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్‌ దాటిన ధోనీ..... ఓవరాల్‌గా 10వేల 109 బంతుల్లో 9 వేల పరుగులు పూర్తి చేశాడు. వన్డేల్లో అతి తక్కువ బంతుల్లో 9వేల పరుగులు చేసిన  బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో ధోనీ 3వ స్థానంలో నిలిచాడు. 
వన్డేల్లో 108 విజయాలందించిన ధోని 
ధర్మశాల మ్యాచ్‌తో వన్డేల్లో భారత్‌కు 108 విజయాలందించిన కెప్టెన్‌గా రికార్డ్‌ నెలకొల్పాడు. వన్డే కెప్టెన్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్‌ బోర్డర్‌ 107 విజయాల  రికార్డ్‌ను మహీ బద్దలు కొట్టాడు.  ప్రస్తుతం ధోనీ 109 విజయాలతో .... వన్డేల్లో ఓ జట్టుకు అత్యధిక విజయాలందించిన కెప్టెన్‌ల లిస్ట్‌లో రెండో స్థానండో ఉన్నాడు. భారత జట్టుకు భారంగా మారాడని విమర్శించిన వారందరికీ .... ఈ రికార్డ్‌ బ్రేకింగ్‌ ఇన్నింగ్స్‌తోనే ధోనీ బదులిచ్చాడు. 2019 వన్డే  ప్రపంచకప్‌ వరకూ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేది లేదని తేల్చిచెప్పిన ధోనీ.....ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఇంకెన్ని రికార్డ్‌లు బద్దలు కొడతాడో చూడాలి. 

 

17:10 - October 25, 2016

హైదరాబాద్ : అన్ని వర్గాలను సమతుల్యం చేసుకుంటూ బీసీల అభివృద్ధికి కృషి చేస్తామని తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బీఎస్ రాములు తెలిపారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. బీసీ కమిషన్‌ చైర్మన్‌గా ప్రభుత్వం తనను నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా బీసీ సంఘం పనిచేస్తుందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియాలో చూద్దాం...

 

17:03 - October 25, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి వద్ద హోం గార్డుల ధర్నా ఉద్రిక్తమైంది. గాంధీ ఆసుపత్రి భవనం పైకి ఎక్కి  ముగ్గురు హోంగార్డులు  ఆందోళన చేశారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకూ  దీక్ష విరమించేదిలేదని  హోంగార్డులు స్పష్టం చేస్తున్నారు. హోంగార్డుల ఆందోళనపై   హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. హోంగార్డుల సంఘంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. 

 

17:00 - October 25, 2016
16:48 - October 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణం ఖాయమైంది.  వారం పది రోజుల్లో ప్రస్తుత సెక్రటేరియట్‌ను  ఇతర ప్రాంతాలకు తరలించాలని సీఎస్ రాజీవ్ శర్మ అంతర్గత అదేశాలు జారీ చేశారు. ఇందుకోసం స్పెషల్ సీఎస్ క్యాడర్ అధికారులతో కమిటీని నియమించి తరలింపు భాద్యత వారికి అప్పగించారు. సీఎం, సీఎస్ కార్యాలయాతోపాటు మంత్రుల కార్యాలయాలనూ తరలించాలని నిర్ణయించారు.
సచివాలయం ఖాళీ చెయ్యించడానికి పనులు వేగవంతం 
కొత్త  సచివాయల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కారు...ప్రస్తుత  సచివాలయం ఖాళీ చెయ్యడానికి  సంబంధించిన పనులను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగానే...  పదిరోజుల్లో సచివాలయం ఖాళీ చెయ్యాలని డెడ్‌లైన్‌ విధించింది.  ఇటీవల జరిగిన క్యాబినేట్ సమావేశంలో దీని పై మంత్రులు, అధికారులకు స్పష్టత ఇచ్చిన సీఎం కేసిఆర్...ఈ ప్రక్రియ వేగవంతం చేసే బాధ్యతను సీఎస్ రాజీశ్ శర్మకు అప్పగించారు. 
9 మంది ఐఏఎస్‌లకు సచివాలయం తరలింపు బాధ్యతలు  
సచివాలయం తరలింపు బాధ్యతను తొమ్మిది మంది ఐఏఎస్‌లతో కూడిన కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఎంజి గోపాల్‌, ఆధేర్‌ సిన్హా, అశోక్‌ కుమార్‌, వికాస్‌ కారీ, మీనా, సునీల్‌ శర్మ, శాలినీమిశ్రాలకు...ఒక్కొక్కరికి నాలుగు లేదా ఐదు శాఖలను తరలించే బాధ్యతను అప్పగించింది. అన్నిశాఖల కార్యదర్శులకు బీఆర్‌కే భవనాలు కేటాయించాలని నిర్ణయించింది. మున్సిపల్‌ ఆఫీస్‌ను డీటీసీటీ ఆఫీసుకు తరలించాలని.. అటవీశాఖను అరణ్యభవన్‌కు మార్చాలని.. హౌసింగ్‌ శాఖను గృహకల్పకు మార్చాలని నిర్ణయించింది. బి.సి.సంక్షేమ శాఖకు  డిఎస్‌ఎస్‌ భవన్‌ కేటాయించాలని...ఆర్ ఆండ్ బి, సంక్షేమ, పురపాలక, ప్రణాళిక శాఖలు మినహా అన్ని శాఖలూ బిఆర్‌కే భవన్‌కే తరలించాలని నిర్ణయించింది. 
మంత్రులకు ప్రత్యామ్నాయ చాంబర్లు 
కొత్త సచివాలయం నిర్మించనున్న నేపథ్యంలో మరోవైపు మంత్రులకు ప్రత్యామ్నాయ చాంబర్లు కేటాయించాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది.  బీజేపీ ఆఫీస్‌లో  హోంమంత్రి నాయినికి, కోఠిలోని డీఎంఓహెచ్‌లో ఆరోగ్యశాఖ లక్ష్మారెడ్డికి, సీసీఎల్‌ఏ భవనంలో రెవెన్యూ మంత్రికి కేటాయించాలని నిర్ణయించింది. ఎల్బీస్టేడియం సమీపంలోని అగ్రికల్చర్‌ కమిషరేట్‌లో పోచారంకు.. శాంతినగరంలోని పశుసంవర్థక శాఖ భవనంలో తలసానికి చాంబర్లు కేటాయించనున్నారు. దామోదర సంజీవయ్య భవన్‌లో  చందూలాల్‌కు.. జలసౌధలో హరీష్‌రావుకు.. డీటీసీటీ భవన్‌లో కేటీఆర్‌కు.. ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ కార్యాలయంలో జూపల్లికి... బస్‌భవన్‌లో రవాణాశాఖ మంత్రికి చాంబర్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలను తమకు అప్పగించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. ఇందుకు ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వ అవసరాల కోసం...అన్ని పరిపాలన కేంద్రాలు ఒకే చోట ఉండేలా ఆదర్శ్ నగర్ లోని హెర్మటెజ్ భవనాన్ని అప్పచెప్పేందకు సిద్దంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

 

16:43 - October 25, 2016

కరీంనగర్‌ : జిల్లా కేంద్రంలో ఓ చెత్త కుప్పలో రెండు గ్రెనేడ్స్ లభించడం స్థానికంగా కలకలం రేపింది. జ్యోతినగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాల మైదానంలో ఉన్న చెత్తను తొలగిస్తుండగా గ్రెనేడ్స్‌ బయటపడ్డాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

16:40 - October 25, 2016

గుంటూరు : జిల్లాలోని బాపట్లలో విషాదం చోటుచేసుకుంది. సూర్యలంక బీచ్‌లో ముగ్గురు బీటెక్ విద్యార్థులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో ప్రత్యూష అనే విద్యార్థిని మృతి చెందింది. మరో విద్యార్థి సత్య కోసం గాలింపు కొనసాగుతుంది. సుష్మ అనే విద్యార్థిని స్థానికులు సురక్షితంగా రక్షించారు. విద్యార్థులు విజ్ఞాన్ యూనివర్శిటీగా చెందిన వారిగా గుర్తించారు. 

 

16:36 - October 25, 2016

హైదరాబాద్ : కొన్ని పత్రికలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొత్తులుగా మారాయని జీహెచ్ ఎంసీ ఇంజనీర్లు ఆరోపించారు. జీహెచ్ ఎంసీ ఇంజనీర్లపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ ఎంసీ ప్రధానకార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రేటర్‌ స్కాంలో ఇంజనీర్లు అవినీతికి పాల్పడినట్లు ఓ పత్రిక ఆరోపణలు చేసిందని.. తక్షణమే ఆ ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ బ్రాండ్ విలువ తగ్గించడానికే కొంత మంది ఇలాంటి అసత్యపు కథనాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

 

16:33 - October 25, 2016

హైదరాబాద్ : ఏపీ శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ ముందు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరై తమ వాదనలు వినిపించారు. గతంలో టీడీపీ సభ్యులు స్పీకర్‌ పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించిన సందర్భాలున్నాయని ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రత్యేక హోదాపై పోరాటం చేశాం తప్ప.. మేం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, ఎవరి పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి తెలిపారు.  సభా హక్కుల ఉల్లంఘన పేరిట 12 మంది వైసీపీ సభ్యులకు నోటీసులు పంపించగా... అందులో నలుగురు సభ్యులు కమిటీ ముందు హాజరై తమ వాదనలు వినిపించారు. ఏడుగురు సభా హక్కుల కమిటీ సభ్యుల్లో నలుగురు సభ్యులు గైర్హాజరు కావడం శోచనీయమని ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌ అభిప్రాయపడ్డారు. తామేదో అల్‌ఖైదా తీవ్రవాదులమన్నట్లు అధికార పార్టీ వ్యవహరించటం సముచితం కాదని ఆయన అన్నారు. 

 

16:08 - October 25, 2016

ఉత్తమ్ కుమార్ రెడ్డి..టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్...ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలెట్ గా సేవలందించారు. క్రమశిక్షణే ఆయన ఫాలో అవుతుంటారు. కానీ ఆయనలో మార్పు వచ్చింది. ఎంతో నీట్ గా ఉండాల్సిన ఉత్తమ్ ప్రస్తుతం భారీ గడ్డంతో కనబడుతున్నారు. ఉన్నట్టుండి ఆయనలో మార్పు వెనుక మతలేబంటీ అని చర్చించుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలున్నాయా ? అంటూ చర్చ జరుగుతోందంట. కానీ ఈ 'గడ్డం' వెనుక పెద్ద కథ ఉందంట. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాక గడ్డం పెంచుతానని ఉత్తమ్ అనుకున్నారంట. అంతేగాకుండా దీక్షలో కూడా ఉన్నారంట. తన పట్టుదల కార్యకర్తలపై ప్రభావం చూపుతుందని ఉత్తమ్ అనుకుంటున్నట్లు టాక్. 2019 వరకు ఆయన గడ్డం ఎంతలా పెరుగుతుందో వేరే ఊహించాలా ? ఆయన శపథం నెరవేరుతుందా ? లేదా ? అనేది 2019లో తేలుతుంది. 

15:33 - October 25, 2016

ఆకు కూరలలో కెరోటిన్‌ అనే పదార్ధం సమృద్ధిగా ఉం టుంది. శరీరంలో కెరోటిన్‌ విటమిన్‌ 'ఎ'గా మారుతుం ది. విటమిన్‌ 'ఎ' చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్ళకు సరైన చూపును ఇస్తూ రేచీకటి రాకుండ కాపాడుతుంది. ఆకు కూరల్లో తోట కూర ఒకటి. ఈ తోటకూర తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి.
అధిక రక్తపోటుకు చెక్ పెడుతుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది.
రెగ్యులర్ గా తోటకూర తింటే రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ ఆకుకూరను భుజించడం ఉత్తమం. పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికి తోడు కొవ్వును తగ్గిస్తుంది.
తోటకూర తక్షణశక్తినివ్వడంలో తోడ్పడుతుంది. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివీ సమకూరుతాయి.
తోటకూరలోని 'విటమిన్‌ సి' రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. తాజా తోటకూర  ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.. తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు రాలదు. మాడు మీద చుండ్రు తగ్గుతుంది.
విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్‌ ఎ, సి, డి, ఇ, కె, విటమిన్‌ బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు. ఇవన్నీ సమకూరుతాయి.
వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరుకుతాయి.

కుటుంబం వేరు..పార్టీ వేరు - ములాయం..

లక్నో : కుటుంబం వేరు..పార్టీ వేరని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యానించారు. అఖిలేష్ ముఖ్యమంత్రిగానే కొనసాగుతారని, తదుపరి ముఖ్యమంత్రి కూడా అఖిలేషే అని పేర్కొన్నారు. మంత్రులను వెనక్కి తీసుకొనే విషయం అఖిలేష్ కు వదిలేసినట్లు, పార్టీలో ఎలాంటి విబేధాలు లేవన్నారు. అమర్ సింగ్ ను పార్టీ నుండి తొలగించమని, శివపాల్ విషయంలో సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రాంగోపాల్ వ్యాఖ్యలను పట్టించుకోమన్నారు. 

హోం గార్డుల ఆందోళనపై నాయినీ స్పందన..

హైదరాబాద్ : హోం గార్డుల సంఘంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తామని హోం మంత్రి నాయినీ నర్సింహరెడ్డి వెల్లడించారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. 

గాంధీ ఆసుపత్రి బిల్డింగ్ పైకి ఎక్కిన హోం గార్డులు..

హైదరాబాద్ : హోం గార్డుల సమస్యలు పరిష్కరించాలంటూ గాంధీ ఆసుపత్రి భవనంపై ఎక్కిన ఇద్దరు హోం గార్డులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. 

సభా హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుంది - ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి..

విజయవాడ : పోడియం దగ్గరకు వెళ్లడం సభా హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుందని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఏ సభ్యుడిని అడ్డుకోలేదని..అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు. తామేమన్నా అల్ ఖైదా తీవ్రవాదులమా విచారించడానికి అని ప్రశ్నించారు. సభా హక్కులను రక్షించాల్సిన కమిటీతోనే తమల్ని భక్షించాలని చూస్తున్నారని తెలిపారు. 

విజయ్ మాల్యాపై సుప్రీం ఆగ్రహం..

ఢిల్లీ : విజయ్ మాల్యాపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తుల వివరాలు పూర్తిగా వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు నాలుగు వారాల గడవు విధించింది. బ్యాంకుల కన్సార్టియం వేసిన పిటిషన్ పై సుప్రీం విచారించింది. 

బాపట్లలో విషాదం..

గుంటూరు : జిల్లా బాపట్లలో విషాదం చోటు చేసుకుంది. సూర్యలంక బీచ్ లో ముగ్గురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఘటనలో ప్రత్యూష అనే విద్యార్థిని మృతి చెందగా సుష్మ అనే విద్యార్థిని సురక్షితంగా స్థానికులు రక్షించారు. మరో విద్యార్థి సత్య కోసం గాలింపులు కొనసాగుతున్నాయి. విద్యార్థినిలు విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన వారీగా గుర్తించారు.

13:55 - October 25, 2016

రంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర 9వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర 200 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఇవాళ రంగారెడ్డి జిల్లాలోని బండగూడూరు, కందుకూరు, దెబ్బడగూడ గ్రామాల్లో పాదయాత్ర బృందం పర్యటించనుంది. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

13:52 - October 25, 2016

హైదరాబాద్ : తన కూతురు కవిత బతుకమ్మ ఆడతానంటే కోట్లకు కోట్ల రూపాయల ప్రజాసొమ్మును ధారాధత్తం చేసిన సీఎం కేసీఆర్‌కు.. తెలంగాణ ఆడబిడ్డలు తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు వెంటనే ఫీజు బకాయిలు విడుదలచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఎన్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీనగర్‌లో నిర్వహించిన నిరసన సభకు పలువురు టీడీపీ నేతలు హాజరై విద్యార్థులకు మద్దతు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదలచేయాలని టీఎన్ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీనగర్‌లో నిరసన సభ నిర్వహించారు. సభకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. స్కాలర్ షిప్ మా హక్కు- మీరు వేసే భిక్ష కాదు అని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు.

13:45 - October 25, 2016

కర్నూలు : అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకోగా...ఇస్తామన్న ప్రత్యేక హోదాను మనం పోరాటంతో సాధించుకోలేమా అని వైఎస్ జగన్ అన్నారు. పోరాడితే ప్రత్యేక హోదా తప్పకుండా సాధ్యమవుతుందని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ పార్లమెట్ లో గట్టిగా పోరాడుతుందని ఆయన అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలను, బడ్జెట్ సమావేశాలను తమ ఎంపీలు స్ధంబింపచేస్తారని ప్రకటించారు. అప్పటికి హోదా హామీ నెరవేరకపోతే ఎంపీల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తామని జగన్ తెలిపారు. 

జగన్ సంచలన వ్యాఖ్యలు...

కర్నూలు : వైసీపీ అధ్యక్షుడు జగన్ యువభేరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై పోరాడుతామని, కేంద్రం స్పందించకుంటే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్నారు. హోదా నినాదంతో ఉప ఎన్నికలకు వెళుతామని, అసాధ్యం అని అనుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చిందని పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను సాధించుకోలేమా ? అని ప్రశ్నించారు. 

గాంధీ ఆసుపత్రి వద్ద హోం గార్డుల ఆందోళన..

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి వద్ద హోం గార్డులు ఆందోళన చేపట్టారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న హోం గార్డ్ రమేష్ ను పరామర్శించేందుకు హోం గార్డులు ఆసుపత్రికి వచ్చారు. వీరి ఆందోళనకు టి.టిడిపి నేత రేవంత్ మద్దతు తెలిపారు. 

ఎన్ కౌంటర్ ను ఖండించిన పది వామపక్ష పార్టీలు..

హైదరాబాద్ : మల్కాన్ గిరిల ఎన్ కౌంటర్ ను తెలంగాణ పది వామపక్ష పార్టీలు ఖండించాయి. ఎన్ కౌంటర్ అనేక అనుమానాలకు తావిస్తోందని, ఎన్ కౌంటర్ పై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణం నుండి సమస్యను పరిష్కరించాలని సూచించాయి. 

కర్నూలులో టిడిపి సమన్వయ కమిటీ సమావేశం..

కర్నూలు : జిల్లా టిడిపి కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఇన్ ఛార్జీ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా పేరిట విద్యార్థులను జగన్ తప్పుదోవపట్టిస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు ఇది గమనించాలని మంత్రి సూచించారు. ఓ వైపు పరిశ్రమలు కావాలని అడుగుతున్న జగన్ వచ్చిన పరిశ్రమలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. 

యూరిపై ఉగ్ర పని లష్కరే తోయిబాదే..

ఢిల్లీ : యూరి ఘటనకు లష్కరే తోయిబా బాధ్యత వహించింది. యూరిలో బీఎస్ఎఫ్ క్యాంపుపై దాడి చేసింది తామేనంటూ పాక్ లో గుజరాంవాలలో పోస్టర్లు వెలిశాయి. 

రెవిన్యూ, ఆదాయంపై సీఎం బాబు సమీక్ష..

విజయవాడ : సీఎంవోలో రెవిన్యూ, ఆదాయంపై సీఎం సమీక్ష జరిపారు. మంత్రులు యనమల, పీతల, కొల్లు రవీంద్ర, శిద్ధాలు పాల్గొన్నారు. 

చక్కెర పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి ఈటెల భేటీ..

హైదరాబాద్ : సచివాలయంలో చక్కెర పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. జీఎస్టీ అమలుపై చర్చ జరిగింది. 

13:41 - October 25, 2016

దంపతులు తీసుకునే విడాకులపై ఇటీవలి కాలంలో న్యాయస్థానాలు పలు విధాలుగా తీర్పులిస్తున్నాయి. భార్య భర్తను మానసికంగా శారీరకంగా వేధిస్తే విడాకులు తీసుకోవచ్చనీ..సుదీర్ఘ కాలంగా భార్యా భర్తల మధ్య దాంపత్య బంధం లేకున్నా..భర్త యొక్క తల్లిలదండ్రులకు సంబంధించిన బాధ్యతలను భార్య నిర్లక్ష్యం చేస్తున్నా విడాకులు తీసుకోవచ్చు వంటి సంచలనాత్మక తీర్పులనుఇటీవల కాలంలోన్యాయస్థాలు ఇస్తున్నాయి... భార్యా భర్తల మధ్య తలెత్తే వివాదాల మధ్య రోజురోజుకీ విడాకుల సంఖ్య పెరిగిపోతోంది. దీనికి గల కారణాలేమిటి? న్యాయస్థానాలు ఇటువంటి తీర్పులివ్వటానికి గల కారణాలేమిటి? అనే అంశాలపై ఆనాటి వేదిక మనముందుకు వచ్చింది. ఈ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

ప్రివిలేజ్ కమిట ఎదుట వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా..

హైదరాబాద్ : ప్రివిలేజ్ కమిటీ ఎదుట వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభలో ఏ విధంగా నిరసన తెలపాలో చెప్పాలని ప్రివిలేజ్ కమిటీని అడిగినట్లు వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల భావోద్వేగ సమస్య అని, శాసనసభలో తమ గొంతునొక్కి హక్కులను కాలరాశారని తెలిపారు. తమ మీద చర్యలు తీసుకొంటే ప్రత్యేక హోదాపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంటో బయటపడుతుందన్నారు. 

13:28 - October 25, 2016

హైదరాబాద్: ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గుల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అసెంబ్లీ సమావేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి నోటీసులు అందుకున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రివిలేజ్ కమిటీ విచారణ మొదలైంది. మంగళవార  విచారణకు ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉండగా, నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. కొడాలినాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాలేదు. ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ శాసనసభ సమావేశాల్లో బెంచీలు ఎక్కి స్పీకర్‌పైకి కాగితాలు విసిరి, స్పీకర్ టేబుల్‌పైన మైక్ విసిరేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. మహిళా మార్షల్స్‌ను కూడా ఇబ్బంది పెట్టారు. ఈ ఘటనలకు కారణమైన 12మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో నేడు హాజరు ప్రివిలేజ్ కమిటీకి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీలో జరిగిన విజువల్స్ ను క్లిప్పింగ్ ను చూపి ఎమ్మెల్యేలను చైర్మన్ గుల్లపల్లి వివరణ కోరారు. కాగా మరో ఆరుగురు ఎమ్మెల్యేలు రేపు కమిటీ ముందు హాజరుకావాల్సివుంది. వీరిలో ఎంతమంది కమిటీకి డుమ్మాకొట్టినున్నారో వేచి చూడాలి.

 

హోంగార్డులకు రేవంత్ రెడ్డి మద్దతు..

హైదరాబాద్ : ఈరోజు తెల్లవారుజామునహోంగార్డుల దీక్షను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారినిక సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. హోంగార్డుల సమస్యలు పరిష్కరించకుండా దీక్ష భగ్నం చేశారని గాంధీ ఆసుపత్రి వద్ద హోంగార్డు రమేశ్‌ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడ్ని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రి వద్దకు చేరుకున్న హోం గార్డులు ఆందోళనకు దిగారు. హోంగార్డుల ఆందోళనకు తెదేపా నేత రేవంత్‌రెడ్డి మద్దతు తెలిపారు. ధర్నా విరమించాలని టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి కోరినా హోంగార్డులు పట్టించుకోలేదు.

ప్రివిలేజ్ కమిటీకి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు..

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి నోటీసులు అందుకున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రివిలేజ్ కమిటీ విచారణ మొదలైంది. ఇవాల్టి విచారణకు ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉండగా, నలుగురే వచ్చారు. కొడాలినాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాలేదు. ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ శాసనసభ సమావేశాల్లో బెంచీలు ఎక్కి స్పీకర్‌పైకి కాగితాలు విసిరి, స్పీకర్ టేబుల్‌పైన మైక్ విసిరేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. మహిళా మార్షల్స్‌ను కూడా ఇబ్బంది పెట్టారు. ఈ ఘటనలకు కారణమైన 12మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది.

12:31 - October 25, 2016
12:29 - October 25, 2016

కరీంనగర్: జిల్లాలోని జ్యోతినగర్ చెత్తకుండీ దగ్గర హ్యాండ్  గ్రనేడ్స్ కలకలం సృష్టించాయి. మున్సిపల్ సిబ్బంది చెత్తను శుభ్రం చేస్తుండగా చెత్తకుప్పలో గ్రనేడ్స్ కనిపించాయి. మునిపల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులకు గ్రనేడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాంబు స్క్వాడ్ సాయంతో పరిసర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. నగర కమిషనర్ కమలాసన్ జిల్లాలో ప్రతీ రెండు రోజులకు ఒకసారి కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దుండుగులు గ్రనేడ్స్ చెత్తకుండీలో పడేసి వుంటారని భావిస్తున్నారు. దీనిపై కమిషనర్ దర్యాప్తు కమిషన్ ఆదేశించారు. 

12:20 - October 25, 2016

ఢిల్లీ : దేశరాజధానిలో పేలుడు కలకలం రేపింది. నగరంలోని నయా బజార్ లోని చాందినీ చౌక మార్కెట్ సమీపంలో పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది..సంఘటానాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. పోలీసులు సంఘటానాస్థలాన్ని పరిశీలిస్తున్నారు. కాగా దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా దుకాణంలో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఉగ్రదాడులు జరుగుతున్న క్రమంలో ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కర్నూలులో వైసీపీ యువ భేరీ..

కర్నూలు : వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్ లో వైసీపీ యువభేరీ జరుగుతోంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారని, ఎన్నికలయ్యాక మోసం చేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపణలు గుప్పించారు. 

ఢిల్లీలో పేలుడు..

ఢిల్లీ : దేశ రాజధానిలోని నయా బజార్ లో మంగళవారం పేలుడు సంభవించింది. చాందినీ చౌక్ మార్కెట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. 

12:06 - October 25, 2016
12:04 - October 25, 2016

హైదరాబాద్ : మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ కు.. రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా.. బృందాలకు రూపకల్పన చేసిన అడిషనల్‌ సీపీ స్వాతి లక్రా.. హర్షం వ్యక్తం చేశారు. షీటీమ్స్‌ సహాయంతో నగరంలోని మహిళలు ధైర్యంగా ఉండగలుగుతున్నారని ఆమె అన్నారు. ఇక ముందు కూడా మరింత మెరుగైన సేవలు అందించేందుకు షీటీమ్స్ కృషి చేస్తాయని తెలిపారు.

షీ టీమ్స్ సేవలపై అడిషనల్‌ సీపీ స్వాతి లక్రా హర్షం
మహిళల భద్రతకు షీటీమ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అడిషనల్‌ సీపీ స్వాతి లక్రా తెలిపారు. ఈ బృందాలు ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. షీటీమ్స్‌ పనితీరును ఆమె వివరించారు. ఆకతాయిల వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు ఏర్పాటైన షీటీమ్స్ సేవలు రెండేళ్లు పూర్తి చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

2014 అక్టోబర్‌ 24 మొదలైన షీటీమ్స్ సేవలు
2014 అక్టోబర్ 24 నుంచి ఈ రోజు వరకు నగర వ్యాప్తంగా మొత్తం 2వేల 362 ఫిర్యాదులు షీటీమ్స్ కు అందాయని స్వాతి లక్రా చెప్పారు. మెత్తం 800 కేసులు నమోదయ్యాయని అన్నారు. కేసులు నమోదైన వారిలో 222 మంది మైనర్లు, 577 మంది మేజర్లు ఉన్నారని, వీరిలో ఇద్దరి పై పీడీ యాక్ట్.. ఒక్కరిపై పోస్కో కేసు.. 40 మంది పై నిర్భయ యాక్ట్ కేసు.. 33 మంది పై ఐటి యాక్ట్ కేసులు నమోదు చేశామని తెలిపారు. నిందితుల్లో 41 మంది జైలు పాలు కాగా.. 242 మందికి ఫైన్ విధించినట్లు స్వాతి లక్రా చెప్పారు.

షీటీమ్స్ సేవలను అభినందిస్తున్న మహిళలు
షీటీమ్స్ ద్వారా సహాయం పొందిన మహిళలు.. ఈ బృందం సేవలపై హర్షం వ్యక్తం చేశారు. షీటీమ్స్ వల్ల తామంతా నిర్భయంగా రోడ్లపైకి రాగలుగుతున్నామన్నారు. ఏ సమయంలో ఫిర్యాదు చేసినా షీటీమ్స్ స్పందించడం ...తమకెంతో భరోసాను కలిగిస్తోందని అన్నారు. షీటీమ్స్ పట్ల మహిళలు చూపుతున్న ఆదరణపై స్వాతి లక్రా సంతోషం వ్యక్తం చేశారు. టెక్నాలజీ సహాయంతో భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని ఆమె తెలిపారు

11:58 - October 25, 2016
11:54 - October 25, 2016

నెల్లూరు : జిల్లా ఆక్వారంగానికి పెట్టింది పేరు. ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ ఆక్వాసాగు అవుతుంది. అలాంటిది ఇప్పుడా జిల్లా ఆక్వారంగంలో అక్రమాలకు అడ్డాగా మారుతోంది. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ జిల్లాలో యథేచ్ఛగా క్యాట్ ఫిష్ సాగు జరుగుతోంది. అక్రమసాగును అడ్డుకోవాల్సిన అధికారులు సరామామూలుగానే మామూళ్ల మత్తులో తూలుతున్నారు.

కృష్ణపట్నం పోర్టు తో సులువుగా సరుకును విదేశాలకు ఎగుమతి
నెల్లూరుజిల్లా అనగానే గుర్తొచ్చే రంగం ఆక్వారంగం.. జిల్లాలో ఎక్కడ చూసినా ఆక్వాసాగు దృశ్యాలు కనపడతాయి. అనేక మంది రైతులు కోటీశ్వరులూ అయ్యారు. ఆసియాఖండంలోనే అతి పెద్దదైన కృష్ణపట్నం పోర్టు జిల్లాలోనే ఉండడం.. సులువుగా సరుకును విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఈ రంగంపై దృష్టిసారించారు.

నెల్లూరు జిల్లాలో రెచ్చిపోతున్న ఆక్వా అక్రమవ్యాపారులు
ఇంత చరిత్ర ఉన్న ఆక్వారంగానికి ఇప్పుడు అక్రమార్కుల బెడద పట్టుకుంది. ఆక్వారంగం మాటున నిషేధంలో ఉన్న క్యాట్ ఫిష్‌ వ్యాపారం జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలోని నెల్లూరు రూరల్ ,కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, అల్లూరు, దగదర్తి, గూడూరు, బుచ్చి మండలాల్లో సుమారు వేల ఎకరాల్లో క్యాట్ ఫిష్ ను అక్రమార్కులు సాగుచేస్తున్నారు.

బుచ్చి మండలం కేంద్రంగా ఈ అక్రమ వ్యాపారం
బుచ్చి మండలం కేంద్రంగా ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది. అక్రమవ్యాపారానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉండడంతో ఈ మండలాన్ని ఆక్రమార్కులు తమ అడ్డాగా మార్చుకున్నారు. జిల్లాలోనే అత్యధికంగా క్యాట్ ఫిష్ ఇక్కడే సాగవుతోంది. విశేషం ఏమిటంటే స్థానికులే కాకుండా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన కొందరు వ్యక్తులు పలు ప్రాంతాల్లో చేపల గుంటలను లీజుకు తీసుకుని క్యాట్ ఫిష్‌ను సాగుచేస్తున్నారు.

క్యాట్ ఫిష్ లకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు, జంతుకళేబరాలు
అదీకాక ఈ క్యాట్ ఫిష్‌ను సాగుచేయడం చాలా సులభం.. ఇవి ఎలాంటి తిండినైనా తిని బతకగలవు.. దీంతో అక్రమార్కులు వీటికి ఆహారంగా కోళ్ల వ్యర్థాలు, జంతుకళేబరాలను వేస్తున్నారు.

తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర.. చైనా, వియత్నాంలకు ఎగుమతి..
ఎదుగదలకు వచ్చిన తర్వాత వీటిని నెల్లూరుతో పాటు పక్కరాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోని స్టార్ హోటల్స్‌కు.. చైనా, వియత్నాం దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. మరో వైపు సాగుచేసే ప్రాంతంలోని స్థానికులు చర్మవ్యాధులు బారిన పడుతున్నారు. వీటి గుంటల నుంచి వచ్చే నీటి వల్ల కాలువలు కలుషితమౌతున్నాయని స్థానికులు వెల్లడిస్తున్నారు. వీటిని సాగుచేసేందుకు మేతగా కోళ్ల వ్యర్ధాలను, జంతు కళేబరాలను వాడుతుండడంతో ఈ క్యాట్ ఫిష్‌ను తినడంవల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

మామూళ్ల మత్తులో పోలీసులు, రెవెన్యూ అధికారులు
క్యాట్ ఫిష్ ను తిని ప్రజలు వ్యాధుల బారిన పడుతుండడంతో హైకోర్టు కూడా క్యాట్ ఫిష్ సాగుని నిషేధించింది. అయితే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమార్కులు సాగు చేస్తున్నారు. ఇంత పబ్లిక్ గా క్యాట్ ఫిష్ సాగవుతున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు మామూళ్లు తీసుకుంటూ అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే నిషేధిత క్యాట్ ఫిష్ సాగుని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు, వైద్యులు చెబుతున్నారు.

 

11:46 - October 25, 2016

హైదరాబాద్ : మాటలు కోటలు దాటుతున్నా పనులు గడపదాటడం లేదన్న చందంగా మారింది తెలంగాణలో విశ్వవిద్యాలయ దుస్థితి. ఓవైపు ఉన్నత విద్య కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఇటు నిధులు లేక అటు అధ్యాపకుల నియామకాలు లేక విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.

తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో సమస్యల తాండవం
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి ఆమడదూరంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సమస్యల సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. నాణ్యమైన విద్య అందకపోవడంతో విద్యార్ధులు ఉపాధికి దూరమవుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ సమస్య వారిని వేధిస్తోంది. దాదాపుగా అన్నీ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో..కాంట్రాక్ట్‌ ప్రొఫెసర్లతో తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో పాఠ్యాంశాలపై పట్టులేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు విశ్వ విద్యాలయాలను నిధుల సమస్య వెంటాడుతోంది. వీసీల నియామకం జరిగినా ఎక్కడి సమస్య అక్కడే ఉండిపోయింది. కొత్తగా వచ్చిన వీసీలకు నిధులు కేటాయించకపోవడంతో..ఉన్నత విద్యను గాడీలో పెట్టేందుకు అవకాశం లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది.

వీసీల నియామకం జరిగినా మారని పరిస్థితి
మరోవైపు ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్శిటీ వచ్చే యేడాది శతాబ్ధి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాలను భారీగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణ బడ్జెట్‌కు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని తెలుస్తోంది. మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతావాహన పాలమూరు యూనివర్శిటీలను మౌళిక సదుపాయాల సమస్య పట్టి పీడిస్తోంది. అటు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినులకు కష్టాలు తప్పడం లేదు. హాస్టళ్లలో సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటున్నారు. రాత్రిళ్లు కరెంట్ పోయినా పట్టించుకునే నాథుడే లేడని..రక్షణ కరువై భయంతో గడుపుతున్నామని వాపోతున్నారు.

ఉద్యమాలు చేస్తామంటూ విద్యార్థుల హెచ్చరిక ..
ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నడుం బిగించాలని విద్యార్థులు కోరుతున్నారు. నాణ్యమైన విద్య, విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. 

తిరుమల ఘాట్ రోడ్డులో బైక్ రైసింగ్..

చిత్తూరు : తిరుమల ఘాట్ రోడ్డుపై బైక్ రైసింగ్ నిర్వహించిన నలుగురు తమిళనాడు యువకులను టిటిడి విజిలెన్స్ అదుపులోకి తీసుకుంది. 

అనంతనాగ్ లో సెర్చ్ ఆపరేషన్..

జమ్మూ కాశ్మీర్ : అనంతనాగ్ లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాద అనుమానితులు దాగి ఉన్నారనే సమాచారంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు. 

ధర్నా చేయనున్న జీహెచ్ఎంసీ ఇంజనీర్లు..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ రోడ్లపై వచ్చిన అవినీతి ఆరోపణలను నిరసిస్తూ భోజన విరామ సమయంలో ఇంజనీర్లు ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాలో 18 విభాగాలకు సంబంధించిన ఇంజనీర్లు పాల్గొననున్నారు. 

11:40 - October 25, 2016
11:34 - October 25, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ఆందోళన ప్రతిపక్ష పార్టీలో టెన్షన్‌ పుట్టిస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో తమ పార్టీ సభ్యుల నిరసన తీరు.. వైసీపీలో గుబులు పుట్టిస్తోంది. విచారణ జరిపిపేందుకు రంగంలోకి దిగిన ప్రివిలేజ్ కమిటీ.. 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. రెండు రోజుల పాటు తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

12మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
ప్రత్యేక హోదా అంశం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ప్రత్యేక హోదా డిమాండ్‌ను అస్త్రంగా వాడుకునేందుకు ప్రయత్నించిన వైసీపీని అదే అంశం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదాపై నిరసన తెలిపేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అనుసరించిన విధానం ఆ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు సభా హక్కులు ఉల్లఘించారని ఆరోపిస్తూ అధికార పార్టీ సభ్యులు ప్రివిలేజ్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సభలో జరిగిన పరిణామాలు స్పీకర్‌ అనుమతితో బయటపెట్టారు. దీంతో విపక్ష సభ్యుల వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు ప్రివిలేజ్ కమిటీని అధికార పక్షం నియమించింది. వైసీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన కమిటీ..రెండు రోజుల పాటు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

సభా హక్కులు ఉల్లఘించారని ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు
వైసీపీ ఎమ్మెల్యేల వాదనలు వినేందుకు సిద్ధమైన సభా హక్కుల కమిటీ.. ఈరోజు, రేపు భేటీ కావాలని నిర్ణయించింది. వైసీపీ కి చెందిన 12 మంది శాసనసభ్యులు తమ వాదనలు కమిటీ ముందు వినిపించనున్నారు. ఈరోజు ఆరుగురు సభ్యులు, బుధవారం మరో ఆరుగురు సభ్యులు కమిటీ ముందు హాజరుకానున్నారు. వారు వినిపించే వాదనలతో ప్రివిలేజ్ కమిటీ సంతృప్తిచెందినట్లయితే వైసీపీ ఎమ్మెల్యేలకు ఊరట దక్కనుంది. కానీ ప్రివిలేజ్ కమిటీ కఠినంగా వ్యవహరించాలని భావిస్తే మాత్రం వైసీపీ శాసనసభ్యులకు ఇబ్బందికరమైన పరిణామాలు ఎదర్కొక తప్పేలా కనిపించడం లేదు. గతంలో రోజా విషయంలో కూడా కమిటీ పలు మార్లు విచారణ జరిపి నివేదిక ఇవ్వడంతో ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు విపక్ష ఎమ్మెల్యేలు ప్రివిలేజ్ కమిటీ ముందు ఏం చెబుతారన్నది ఉత్కంఠ రేపుతోంది. 

11:19 - October 25, 2016

ఉత్తరప్రదేశ్ : కొన్ని రోజులుగా సమాజ్ వాద్ పార్టీ తలెత్తిన వివాదం ఎట్టకేలకు ముగిసింది. అబ్బాయ్ అఖిలేష్ యాదవ్, బాబాయ్ శివపాల్‌ యాదవ్ మధ్య ఎస్పీ అధినేత ములాయం సింగ్ రాజీ కుదిర్చారు. దీంతో మళ్లీ శివపాల్‌ను తన మంత్రివర్గంలోకి అఖిలేష్ తీసుకున్నారు. సమాజ్‌వాది పార్టీలో కుటుంబ పోరు ఇంకా కొలిక్కి వచ్చింది. బాబాయ్‌ అబ్బాయ్‌ల వార్‌ కాస్తా తండ్రీ కొడుకుల సమరంగా మారింది. ఈ నేపథ్యంలో బాబాయ్ అబ్బాయిల మధ్య నెలకొన్న వివాదం ఓ క్రమంలో తండ్రీ కుమారుల మధ్య ఇంచుమించు ఘర్షణ వాతావరణంగా మారింది. దీంతో తనపై కుట్ర జరుగుతోందని, ఇందుకు వ్యతిరేకంగా పోరాడతానని అఖిలేష్‌ స్పష్టం చేశారు. ఇది ఎంతవరకూ దారితీసిందంటే అఖిలేష్ యాదవ్ వేరే పార్టీ పెడతాడనేంతగా దారితీసింది. ఆయన్ను వ్యతిరేకిస్తున్న శివపాల్‌, అమర్‌సింగ్‌లు తనకు సోదరులంటూ ములాయం వెనకేసుకొచ్చారు. దీంతో ఎస్పీ ఫ్యామిలీ సంక్షోభం రసకందాయంలో పడింది. కాగా సమన్వయంతో వ్యవహరించిన ములాయం రానున్న ఎన్నికల్లో ఈ వివాద ప్రభావం పడేలా వుండటంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్లుగా సమాచారం. 

ఎన్ కౌంటర్ ఘటనతో ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు...

శ్రీకాకుళం : ఎవోబీ ఎన్ కౌంటర్ ఘటనతో సరిహద్దు గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు భద్రతను పెంచారు. భామిని, ధోనుభాయి, బత్తిలి, మిలియాపుట్టి, పీఎస్ పరిధిలో అదనపు బలగాలను మోహరించారు.

 

కాసేపట్లో ఏపీ ప్రివిలేజ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుంది. అసెంబ్లీ ప్రాంగణానికి వైసీపీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. 

11:08 - October 25, 2016

తూర్పుగోదావరి : ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు స్వల్ప ప్రమాదం సంభవించింది. కాకినాడలోని సంజీవనీ ఆసుపత్రిలో లిఫ్ట్ కూలి పడటంతో లిఫ్ట్ లో వున్న మంత్రికి స్వల్ప ప్రమాదం సంభవించింది. కాగా పెద్దాపురం మండలం జే. తిమ్మాపురంలో ఆక్వా పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది.. ఈ ఘటనలో 27మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని  కాకినాడ  సంజీవనీ ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనలో బాధితులను పరామర్శించారు. కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వుందని తెలియటంతో మరోసారి బాధితుల యోగక్షేమాలు కనుక్కునేందుకు మంత్రి ఆసుపత్రికి వచ్చారు. ఈ నేపథ్యంలో మూడో ఫ్లోర్ లో వున్న బాధితులను పరామర్శించేందుకు వెళుతుండగా లిఫ్ట్ రెండో అంతస్థుకు చేరుకోగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ ఘటనలో మంత్రికి మంత్రి నడుముకు దెబ్బతగిలినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన కొద్దిపాటి ఇబ్బందకి లోనయ్యారు. స్వల్పంగా అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి కాళ్లు విరిగినట్లుగా తెలుస్తోంది. సంజీవనీ ఆసుపత్రిలోనే మంత్రికి గాయపడినవారికి చికిత్సనందిస్తున్నారు. 

చినరాజప్పకు గాయాలు..

తూర్పు గోదావరి : జిల్లా కాకినాడలోని సంజీవని ఆసుపత్రిని సంద‌ర్శించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య‌మంత్రి, హోం మంత్రి చినరాజప్ప ప్ర‌మాదానికి గుర‌య్యారు. మూడో అంత‌స్తునుంచి లిఫ్టులో కిందకు వస్తుండగా లిఫ్టు వైరు ఒక్కసారిగా తెగిపడ‌డంతో చినరాజ‌ప్ప అందులోనే ప‌డిపోయారు. దీంతో ఆయన నడుము భాగంలో గాయాల‌య్యాయి. వెంటనే ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

10:54 - October 25, 2016

గుంటూరు : అమరావతి శాశ్వత రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా రాయపూడి, లింగాయలపాలెం, ఉద్దండ్రాయిని పాలెం గ్రామాల్లో నేల సాంధ్రతను తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలు మట్టిపరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ నెల 28న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీదుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపట్ల అధికారులు పనులలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అమరావతిలో మొత్తం తొమ్మిది నగరాలను ప్రభుత్వం నిర్మించనుంది. దీనిలో పాలన పరమైన నిర్మాణాన్ని ప్రభుత్వం ముందుగా చేపట్టింది. దీనికి కేంద్రహోం మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాన చేయనున్నారు. లింగాయపాలెం, ఉద్దంరాయుని పాలెం, వంటి మూడు గ్రామాలలో మరికొద్ది సేపట్లో సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. 

10:48 - October 25, 2016

హైదరాబాద్ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. నిన్న జరిగిన రామ్‌గఢ్-పనస్‌పుట్ అటవీ ప్రాంతంలోనే నేడు మళ్లీ కాల్పులు జరిగాయి. ఆంధ్రా-ఒడిశా కూంబింగ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో నిన్న 24 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల మృతదేహాలకు రాత్రే పోస్టుమార్టం పూర్తయింది. ప్రస్తుతం ఈ మృతదేహాలు మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయంలో ఉన్నాయి. బంధువులు వస్తే మృతదేహాలు అప్పగిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఒకవేళ మృతదేహాలను ఏపీ, తెలంగాణకు తరలిస్తే ఈ నెల 27వ తేదీ వరకు భద్రపరచాలని ఉమ్మడి హైకోర్టు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది.

10:44 - October 25, 2016

విజయవాడ : కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు బీసీ ల రిజర్వేషన్లకు అన్యాయం చేయబోమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరంలేదని భరోసా ఇచ్చారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు బీసీ రిజర్వేషన్లను తగ్గించబోతున్నారంటూ కొన్ని పార్టీలు బీసీ లను రెచ్చగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను నమ్మొద్దని కోరారు.

ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకాన్ని మరింత విస్తరించే యోచనలో సర్కార్
ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకాన్ని మరింత విస్తరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి 69.11 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇందుకుగాను బీసీ విద్యార్థినీ విద్యార్థులు, వీరి తల్లిదండ్రులు చంద్రబాబును కలిసిన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చంద్రబాబు వివరించారు.

ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకంతో 194 మంది బీసీ విద్యార్థులకు సాయం
కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు బీసీ రిజర్వేషన్లను తగ్గింగచబోతున్నారని కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని చంద్రబాబు కోరారు. ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకం కింద 194 మంది బీసీ విద్యార్థులకు ప్రభుత్వం సాయం చేసింది. దీనిని మరింత వస్తృతపరిచి వెయ్యి మంది విద్యార్థులకు సాయం చేయాలని నిర్ణయించింది. ప్రతిభ ఉన్నా డబ్బులు లేవన్న ఉద్దేశంతో విదేశీ విద్య ఆశలను చంపుకోవద్దని, అర్హులైన అందరికీ విదేశీ విద్యాకు సహాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే బీసీ విద్యను ప్రోత్సహిస్తామన్నారు. బీసీ ఉపప్రణాళిక కింద 8,832 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. దీనిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

10:37 - October 25, 2016

నల్గొండ: జిల్లాలో మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉస్మానియా మెడికల్ కాలేజీలోఎంబీబీఎస్ ఫస్టియర్‌ చదువుతున్న సాయికుమార్ రెడ్డి అనే మెడికో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రోజున తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిన సాయికుమార్ బోయవాడలోని తను నివాసముండే లక్ష్మీసాయి అపార్ట్ మెంట్ ఐదో అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. శనివారం తల్లితో పాటు గడిపిన సాయికుమార్ ఆత్మహత్య చేసుకోవటంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మెడిసిన్ చదవటం ఇష్టంలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. కానీ దీన్ని సాయి కుటుంబ సభ్యులు కొట్టిపడేస్తున్నారు. సాయి ఇష్టప్రకారమే మెడిసిన్ లో చేర్పించినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. మెడిసిన్ ఎంసెట్ లో సాయి కుమార్ 152వ ర్యాంక్ రావటం గమనించదగిన విషయం. కాగా నల్లగొండకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ యానాల ప్రభాకర్ రెడ్డి కుమారుడు సాయికుమార్ గా తెలుస్తోంది. మెడిసిన చదవటం ఇష్టంలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్ రాసినట్లుగా సమాచారం. పోస్ట్ మార్టం నిమిత్తం సాయికుమార్ మృతదేహాన్ని స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టు మార్టం రిపోర్టు అందిన అనంతరం ఏవిషయాన్ని తెలిజేస్తామని పేర్కొంటున్నారు.

రైల్వే వంతెనపై నుండి బోల్తాపడ్డ లారీ..

తూర్పుగోదావరి : రాజమండ్రిలో గోదావరి రైల్‌ కం రోడ్డు వంతెనపై నుంచి మంగళవారం ఉదయం లారీ అదుపు తప్పి రైల్వే ట్రాక్‌పై పడింది. విజ్జేశ్వరం నుంచి కొవ్వూరు మీదుగా రాజమహేంద్రవరం వస్తున్న లారీ వంతెన మలుపు వద్ద ఆగివున్న మరో ఇసుక లారీని ఢీకొట్టి పై నుంచి రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ఘటనతో విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైల్వే ట్రాక్‌పై పడిన లారీని తొలగించారు. విద్యుత్‌ సరఫరా పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టారు. 

వాటర్ ట్యాంక్ లో విషం!..

పశ్చిమగోదావరి : జిల్లాలో కొందరు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. గ్రామానికి రక్షిత మంచినీటి సరఫరా వాటర్ ట్యాంక్ లో కొందరు విషం  కలిపారు. ఈ ఘటన ఉప్పాకపాడులో జరిగింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్థుల సమచారాం మేరకు వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

బాంబు పేలుడులో 10మంది మృతి..

చైనా : ఫుగూ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10మంది అక్కడిక్కడే మృతి చెందగా దాదాపు 147మంది గాయాలపాలయ్యారు. ఫూగూలోని జిన్‌మిన్‌ ప్రాంతంలో ఉన్న ఓ నివాస గృహంలో సోమవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి సమీపంలోని ఆసుపత్రి, స్థానిక గృహాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేలుడుకి గల కారణాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.కాగా పాకిస్థాన్ లో ఉగ్రదాడికి 59మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్..

తూర్పుగోదావరి : జిల్లాలోని తిమ్మాపురంలో ఉన్న రొయ్యల శుద్ధి పరిశ్రమలో గ్యాస్ లీక్ కావడంతో వందమంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 27 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిశ్రమలో కార్బన్ మోనాక్సైడ్ లీకేజీ వల్లే కార్మికులు అస్వస్థతకు గురైనట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ హోంమంత్రి చినరాజప్ప పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఏవోబీలో మళ్లీ ఎదురు కాల్పులు..

విశాఖ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మరోసారి ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. సోమవారం జరిగిన ప్రాంతంలోనే నేడు మళ్లీ కాల్పులు జరిగాయి. ఆంధ్రా-ఒడిశా కూంబింగ్ పోలీసులు చేపట్టిన సంయుక్తంగా ఆపరేషన్‌లో నిన్న 24 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. 

09:31 - October 25, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా జిల్లాల వారీగా కార్యక్రమాలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దీనిపై అధికారులు పూర్తిగా దృష్టి పెట్టినప్పుడే జిల్లాల పునర్విభజన పరమార్థం నెరవేరుతుందన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోని కలెక్టర్ల పని తీరును.. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ రాజీవ్‌ శర్మతో కలిసి కేసీఆర్‌ సమీక్షించారు.

పునర్వ్యవస్థీకరణతో అతిపెద్ద పరిపాలన సంస్కరణలు : కేసీఆర్‌
క్షేత్ర స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందాలన్న లక్ష్యంతోనే జిల్లాలు, మండలాల విభజన చేసినట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో అతిపెద్ద పరిపాలనా సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు. వీటి ఫలితాలు ప్రజలకు అందేలా ఎక్కడిక్కడ జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. నో యువర్‌ డిస్ట్రిక్ట్‌ - ప్లాన్‌ యువర్‌ డిస్ట్రిక్ట్‌ అనే నినాదంతో జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆదేశించారు.

రాబోయే 8-10 ఏళ్ల కోసం ప్రణాళికలు సిద్దం చేయాలి : కేసీఆర్‌
జిల్లాల్లోని వనరుల అధారంగా ఏ జిల్లాలో ఏం చేయాలనే విషయంపై స్పష్టత తెచ్చుకుని, రాబోయే 8-10 ఏళ్ల కోసం ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రజలకు మేలిమి పాలన అందాలంటే అవినీతి పోవాలన్న కేసీఆర్‌.. రెవెన్యూ కార్యాలయంలో డబ్బులు ఇవ్వకపోతే పని కాదనే భావన పోవాలన్నారు. సర్వే విభాగాల్లో లంచం ఇవ్వకుండా పని జరిగినప్పుడే ప్రజలకు అవినీతి రహిత పాలన అందినట్లన్నారు.

సంక్షేమ రంగాల్లో మరింత ప్రగతి సాధించాలి : కేసీఆర్
పాలన పరంగా సంక్షేమ రంగాల్లో మరింత ప్రగతి సాధించాలని కేసీఆర్‌ సూచించారు. గ్రామాల్లో కరెంటు, ట్రాన్స్ ఫార్మర్లను వెంటనే రైతులకు అందించడం ద్వారా.. ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందన్న సంకేతాలు పంపాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూడాలన్న కేసీఆర్‌... అన్నదాతలకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.

 

09:29 - October 25, 2016

రంగారెడ్డి : ఎనిమిదో రోజు సీపీఎం మహాజన పాదయాత్ర రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పటేల్ గూడెం నుంచి.. కొంగర, రావిరాల, తుక్కుగూడ, ఇమామ్‌ గూడ, మంకాల్‌, లేమూరు గ్రామాల్లో కొనసాగింది. అడుగడుగునా పాదయాత్ర బృందానికి ప్రజలు తమ సమస్యలను విన్నవించారు. ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి ఎజెండాతో తెలంగాణలో మహాజన పాదయాత్ర చేపట్టామని తమ్మినేని స్పష్టం చేశారు.

సమస్యలను విన్నవిస్తూ పాదయాత్రకు స్థానికుల మద్ధతు
ప్రజా సమస్యలను స్పృషిస్తూ.. బడుగు, బలహీన వర్గాల వెన్నుతడుతూ.. సీపీఎం మహాజన పాదయాత్ర ముందుకు సాగుతోంది. అడుగడుగునా.. సీపీఎం పాదయాత్ర బృందానికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. తమ సమస్యలను విన్నవిస్తూ.. పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు.

తెలంగాణలో హిట్లర్‌ పాలన : సబితా ఇంద్రారెడ్డి
పాదయాత్రలో భాగంగా... తమ్మినేని అంగన్‌వాడీ కేంద్రాలను, పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులను అడిగి పాఠశాల సమస్యలను తెలుసుకున్నారు. అంగన్‌వాడీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. తెలంగాణ రాష్ర్టంలో ప్రస్తుతం హిట్లర్‌ పాలన కనిపిస్తోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీపీఎం మహాపాదయాత్రకు సబితా ఇంద్రారెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.

కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా తెలంగాణ సర్కార్‌: చంద్రకుమార్
కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా తెలంగాణ సర్కార్‌ వ్యవహరిస్తోందని.... ప్రజా సమస్యలపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదని జస్టిస్‌ చంద్రకుమార్‌ విమర్శించారు. రైతు ఆత్మహత్యల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు.

విమర్శల వల్ల గిరిజనులకు న్యాయం జరుగదు : బెల్లయ్యనాయక్
ప్రజాపక్షాన మాట్లాడుతున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయ విమర్శలు చేయడం వల్ల గిరిజనులకు ఎలాంటి న్యాయం జరగదని, పాలకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా గిరిజనుల రిజర్వేషన్ల జీవోపై సంతకం చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్యనాయక్‌ అన్నారు.

09:26 - October 25, 2016

తూర్పుగోదావరి : రాజమండ్రి రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. రోడ్డు బ్రిడ్జిపై నుంచి పట్టాలపై లారీ పడిపోయింది. దీంతో రైల్వే విద్యుత్ వైర్లు తెగిపోయాయి. పలు రైళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విశాఖ- విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో కొన్ని రైళ్ల రాకపోకల దారిని మళ్లించారు. లారీని తొలగించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. భారీ క్రేన్ తో అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. 

09:24 - October 25, 2016

పాకిస్థాన్‌ : ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ తన నెత్తిమీత తాను కుంపటి పెట్టుకుంటోంది. ఉగ్రదాడులతో పాకిస్థాన్ ఎప్పటికప్పుడు నెత్తురోడుతూనే ఉంటుంది. దేశం అవలంభిస్తున్న విధానాలకు పాక్ లోని సామాన్య ప్రజలు బలయిపోతుంటారు. కానీ ఈసారి ముష్కరులు పోలసు శిక్షణా కేంద్రంపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే.. క్వెట్టాలోని పోలీసు శిక్షణా కేంద్రంపై ముష్కరులు విరుచుకుపడ్డారు. ఉగ్రదాడిలో 59 మంది ట్రైనింగ్‌ పోలీసులు మృతి చెందారు. చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి. దాడి జరిగిన సమయంలో శిక్షణా కేంద్రంలో 600 మంది ఉన్నట్లు సమాచారం. కొంతమందిని భద్రతా సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మరికొంత మందిని ముష్కరులు బందీలుగా చేసుకున్నారు. ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఎల్‌ఈజే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నారు.

09:22 - October 25, 2016

తూర్పుగోదవరి : జిల్లాలో దారుణం జరిగింది. ఓ రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పెద్దాపురం మండలం జె. తిమ్మాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. రొయ్యల పరిశ్రమలో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ అవ్వటంతో 27మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతోవారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవ్వటంతో ఊపిరి అందక వారు తీవ్రంగా ఇబ్బందులకు గురయినట్లుగా తెలుస్తోంది. కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయిందని యాజమాన్యం పేర్కొంటోంది. కానీ అమ్మెనియా లీక్ అయినట్లుగా పరిసర ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. బాధితులను మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు...కాగా సమాచారం అందుకున్న ఎస్పీ రవిప్రకాశ్ కూడా బాధితులను పరామర్శించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

09:21 - October 25, 2016

విశాఖ : ఏవోబీలో ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఆంధ్రా ఒడిస్సా సరిహద్దులో మరోసారి తుపాకీల మోతలు మోగాయి. పోలీసులకు మావోలకు కొనసాగుతున్న ఎదురు కాల్పుల్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మావోలు మృతి చెందినట్లుగా సమాచారం. మల్కన్ గిరి పరరిధిలోని బెజ్యంగి బ్లాక్ లో కాల్పులు జరుగుతున్నాయి. కాగా సోమవారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 24మంది మావోలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తగిన ప్రతీకారం తీర్చుకునేందుకు మావోలు గురిపెడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై వారు ఓ హెచ్చరిక కూడా జారీ చేసినట్లుగా సమాచారం. ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల సమన్వయంతో ఈ కూబింగ్ కొనసాగుతోంది. కాగా పోలీసులకు మావోలకు మధ్య అమాయక గిరిజనులు మాత్రం నలిగిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెటుకుని వారు జీవనం సాగిస్తున్న పరిస్థితులను అడవిబిడ్డలు ఎదుర్కొంటున్నారు. మావో సమాచారం తెలిపమని పోలీసులు..పోలీసుల సమాచారం తెలిపాలని మావోలు గిరిజన ఆదివాసీలను ఎప్పటికప్పుడు వారిని బాధపెడుతూనే వుంటాయి. 

09:19 - October 25, 2016

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఈ ఎన్ కౌంటర్ అతిపెద్దదనే విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్‌కౌంటర్లు జరిగినా ఏవోబీలో జరిగిన ఈ అతిపెద్ద ఘటనతో మావోల సామ్రాజ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. దీంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేనంత ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోలు మృతి చెందగా అందులో పలువురు అగ్రనేతలు కూడా ఉన్న విషయం తెలిసిందే. దీనిపై మావో ప్రభావిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్డులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో రామశర్మ (కాంగ్రెస్ నేత),( లక్ష్మణరావు( మాజీ ఎమ్మెల్సీ), రామకృష్ణ ప్రసాద్ ( టీడీపీ అధికార ప్రతినిథి) పాల్గొన్నారు. చర్చలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ..గిరిజనులకు పోలీసులకు మధ్య అమాయక గిరిజనులు నలిగిపోతున్నారన్నారు. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..సమగ్ర సమాచారం తెలుసుకోండి...

రక్తసిక్తమైన పాక్..44మంది మృతి..

పాకిస్థాన్ : పాకిస్థాన్‌ మరోమారు రక్తసిక్తమైంది. క్వెట్టాలోని పోలీసు శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 44 మంది మృతి చెందగా వందలాదిమంది గాయపడ్డారు. క్వెట్టాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలూచిస్థాన్ పోలీస్ కాలేజీపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోగా 118 మంది గాయపడినట్టు బలూచిస్థాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తి పేర్కొన్నారు. ఈ ఏడాది పాకిస్థాన్‌లో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడుల్లో ఇది మూడోది. దాడిలో ఐదారుగురు ఉగ్రవాదులు పాల్గొనట్టు పోలీసులు చెబుతున్నారు.

07:56 - October 25, 2016

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌ ఇలా దేశంలో ఎక్కడకు వెళ్లినా చెరకు రైతుకు చివరకు చేదే మిగులుతుంది. చెరకు రైతుల జీవితాలను పీల్చిపిప్పి చేస్తున్న షుగర్‌ ఫ్యాక్టరీల యాజమన్యాలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించడం లేదు. ప్రతి ఏటా క్రషింగ్‌ సీజన్‌లో మిల్లు యాజమాన్యాలు రైతులతో పేచీ పడుతున్నాయి. ఒక టన్ను చెరకు ద్వారా 40వేల రూపాయలకు పైగా ఆదాయం సంపాదించే షుగర్‌ ఫ్యాక్టరీలు అందులో పది శాతం కూడా రైతులకు ఇవ్వడం లేదు.

అప్పుల ఊబిలో చెరకు రైతులు
మనదేశంలో దాదాపు 50 లక్షల ఎకరాల్లో చెరకు సాగవుతోంది. 60 నుంచి 70 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. మన దేశంలో అయిదు వందలకు పైగా చెరకు మిల్లులున్నాయి. మన దేశంలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి 35 కిలోల చక్కెర వినియోగిస్తారని అంచనా. 2030 నాటికి మన దేశంలో చక్కెర వాడకం 52 మిలియన్‌ టన్నులకు చేరుతుందని భావిస్తున్నారు. ఇందులో పంచదార డిమాండే 33 మిలియన్‌ టన్నులు వుంటుందనే అంచనాలున్నాయి. కానీ ఇప్పుడు మనదేశంలో ఉత్పత్తి అవుతున్నది 19 నుంచి 20 మిలియన్‌ టన్నులే. రాబోయే పదిహేనేళ్ల కాలంలో చక్కెర ఉత్పత్తిని భారీగా పెంచుకోకపోతే ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన దురావస్థ దాపురిస్తుంది. మనకు ఆ దుస్థితి రాయకుండా చేయగలిగింది ఒక్క చెరకు రైతులే. అయితే ఇవాళ చెరకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా వుంది.

10 ఏళ్ళ నుండి చెరకు సాగులో ఇబ్బందులు
గత పదేళ్లలో మన దేశంలో చెరకు సాగు విస్తీర్ణం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. చెరకు ఉత్పత్తి 230 నుంచి 350 మిలియన్‌ టన్నుల మధ్య ఊగిసలాడింది. దేశీయ అవసరాలు తీర్చాలంటే మరో పదిహేనేళ్ల కాలంలో చెరకు ఉత్పత్తిని 520 మిలియన్‌ టన్నులకు పెంచుకోకతప్పదు. . మన దేశ అవసరాలకు తగ్గట్టుగా చెరకు ఉత్పత్తి పెంచుకోవాలంటే దానిని సాగు చేసే రైతులు యోగ క్షేమాలు కూడా ఆలోచించాల్సి వుంటుంది. కానీ, మనదేశంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. రైతు కుటుంబాల నెలసరి సగటు ఆదాయం కేవలం 2400 రూపాయలు మాత్రమే. నెలసరి ఆదాయం ఇంత తక్కువ స్థాయిలో వుంటే రైతులు బతికేదెలా? వారి కుటుంబాలను పోషించుకునేదెలా? అందుకే చాలామంది రైతులు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీ పని చేయడానికి సైతం సిద్ధమవుతున్నారు.

దయనీయంగా మారుతున్న చెరకు రైతుల పరిస్థితి
కేవలం నాలుగైదు వందల మంది చక్కర పరిశ్రమల యజమానులే 60 లక్షల మంది చెరకు రైతుల జీవితాలను శాసిస్తున్న దురావస్థ. మనదేశంలో చక్కర మిల్లు యజమానులు ఆడిందే ఆట పాడిందే పాటగా చలామణి అవుతోంది. రైతులకు ఇవ్వాల్సిన పైకం సకాలంలో చెల్లించరు. ఇవాళ మిల్లులో చెరకు అప్పగిస్తే ఏ మూడు నాలుగు నెలలకైనా బిల్లు చెల్లిస్తారో, లేదో తెలియని దురావస్థ అనేక ప్రాంతాల్లో వుంది. ప్రయివేట్‌ మిల్లు యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్టు చట్టాలు ఉల్లంఘిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో చెరకు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది.

కనీస ధర కోసం రైతులు పోరాటం
చెరకులో వ్యర్థంగా పోయేదంటూ ఏమీలేదు. రసం తీయగా మిగిలిన పిప్పి నుంచి కూడా విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చు. చెరకు గడల నుంచి 24 రకాల బై ప్రొడక్ట్స్ వస్తాయి. ఒక టన్ను చెరకు నుంచి 100 కేజీల పంచదార, 150 యూనిట్ల విద్యుత్‌, 35 లీటర్ల ఆల్కహాల్‌ ఉత్పత్తి చేయొచ్చని బెంగళూరు అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ పరిశోధనలో నిగ్గుతేలింది. వీటి ద్వారా మిల్లు యాజమాన్యాలకు 40వేల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందనడంలో సందేహం లేదు. అందులో పదిశాతం రైతులకు ఇచ్చినా, వారి జీవితాలు కాస్తంత ఒడ్డున పడతాయి. కానీ, యాజమాన్యాలు 2500 రూపాయలకు మించి ఇవ్వడానికి అంగీకరించడం లేదు. ప్రతి క్రషింగ్‌ సీజన్‌లోనూ కనీస ధర కోసం రైతులు పోరాడాల్సి వస్తోంది.

చెరకు పంట వేసేందుకు భయపడతున్న రైతులు
చెరకు ఫ్యాక్టరీల యాజమాన్యాలతో విసిగిపోయిన రైతులు చివరకు సాగుచేయాలంటేనే జంకుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఒకప్పుడు తెలుగు నేల మీదే రెండు లక్షల ఎకరాల్లో చెరకు సాగు విస్తీర్ణం పడిపోయింది. ఇలా రైతులు చెరకు సాగుకు దూరమైతే భవిష్యత్‌లో పంచదార, బెల్లంకు తీవ్ర కొరత వచ్చే ప్రమాదం వుంది. అదే జరిగితే వాటి ధరలు మరింత కొండెక్కి కూర్చుంటాయి. ఈ పరిస్థితిని నివారించాలంటే చైరకు రైతుల సంక్షేమానికీ ప్రభుత్వాలు ప్రయత్నించాల్సి వుంటుంది. ప్రయివేట్‌ షుగర్‌ ఫ్యాకర్టీ యాజమాన్యాల ఒత్తిడికి లొంగకుండా రైతుల శ్రేయస్సు కోసం గట్టి చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.

07:53 - October 25, 2016

ఆంధ్రప్రదేశ్ లో చెరకు రైతులు మరోసారి ఉద్యమబాట పడుతున్నారు. ఇవాళ విజయవాడలోని చెరకు కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు సమాయత్తమవుతున్నారు. చెరకు రైతుల ఆందోళనకు కారణం ఏమిటి? క్రషింగ్ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? ప్రభుత్వం ముందు, ఫ్యాక్టరీ యాజమాన్యాల ముందు చెరకు రైతులు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ చెరకు రైతు సంఘం నేత ఎం. హరిబాబు 10 టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ చర్చ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

07:48 - October 25, 2016

ఉత్తరప్రదేశ్ : సమాజ్‌వాది పార్టీలో కుటుంబ పోరు ఇంకా కొలిక్కి రాలేదు. బాబాయ్‌ అబ్బాయ్‌ల వార్‌ కాస్తా తండ్రీ కొడుకుల సమరంగా మారింది. తనపై కుట్ర జరుగుతోందని, ఇందుకు వ్యతిరేకంగా పోరాడతానని అఖిలేష్‌ స్పష్టం చేస్తే... ఆయన్ను వ్యతిరేకిస్తున్న శివపాల్‌, అమర్‌సింగ్‌లు తనకు సోదరులంటూ ములాయం వెనకేసుకొచ్చారు. దీంతో ఎస్పీ ఫ్యామిలీ సంక్షోభం రసకందాయంలో పడింది.

అంతర్గత కలహాలతో సమాజ్ వాద్ పార్టీ..
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమాజ్‌వాదీ పార్టీ అంతర్గత కలహాలతో అతలా కుతలమవుతోంది. బాబాయ్‌ శివపాల్‌తో సహా నలుగురు మంత్రులకు ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఉద్వాసన పలకడంతో ఇద్దరి మధ్య వార్‌ తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ములాయం నేతృత్వంలో పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి ముందు అఖిలేష్‌, శివపాల్‌ అనుచరులు బాహాబాహీకి దిగారు.ఇరువర్గాల మధ్య వివాదం తీవ్రం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను చెదరగొట్టి పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చారు.

భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయిన అఖిలేష్
ఎస్పీ సమావేశంలో అఖిలేష్‌ ఆవేశపూరితంగా మాట్లాడారు. నాన్నే నాకు గురువు, దైవం అని, పార్టీని చీల్చి కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన లేదని భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. ములాయం కోరితే సీఎం పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని అఖిలేష్‌ ప్రకటించారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని తాను సహించనని అమర్‌సింగ్‌ను ఉద్దేశించి అన్నారు.

అఖిలేష్ ప్రసంగంలో మైక్ లాగేసుకున్న శివపాల్
సీఎం అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారంటూ.. అఖిలేశ్ ప్రసంగిస్తుండగానే, శివపాల్‌ యాదవ్‌ మైక్ లాగేసుకున్నారు.అఖిలేష్‌ యాదవ్‌ కొత్త పార్టీ పెట్టి ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పాడంటూ శివపాల్‌ యాదవ్‌ గంగానదిపై ఒట్టు పెట్టుకున్నారు. తానేం తప్పు చేశానని తన శాఖలన్నీ లాగేసుకున్నారని నిలదీశారు. తాను సిఎం, నేతాజీ ములాయం ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించానని పేర్కొన్నారు. కొందరు అధికారాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారని పార్టీ బలోపేతం కోసం తానెంతో కృషి చేశానని చెప్పారు.

అఖిలేష్ ను విమర్శించిన తండ్రి ములాయం
ఇద్దరి వాదనలు విన్న ములాయం - విమర్శలు ఎదుర్కొనే సత్తా లేని వారు నాయకుడిగా ఎదగలేరు అని అఖిలేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీలో, కుటుంబంలో విభేదాలు తనను కలిచి వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. శివపాల్‌, అమర్‌సింగ్‌లను వెనకేసుకొచ్చారు. శివపాల్‌ పెద్ద మాస్‌ లీడరని, ఆయన పార్టీకి అవసరమన్నారు. అమర్‌సింగ్‌ తనకు సోదరుడులాంటి వాడని క్లిష్ట పరిస్థితుల్లో వెన్నంటి ఉన్నారని తెలిపారు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ములాయం చెప్పారు.

పార్టీకి నష్టం వాటిల్లే కుటుంబ వివాదాలు..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్పీలో తలెత్తిన కుటుంబ వివాదాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బాబాయ్‌, అబ్బాయ్‌ల మధ్య వివాదాన్ని ములాయం పరిష్కరిస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి. 

07:42 - October 25, 2016

ముంబై : దేశంలో అతిపెద్ద కార్పొరేట్‌ సంస్థ టాటా సన్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంస్థ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని తొలగించి, రతన్‌ టాటాకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ దాదాపు నాలుగేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు. 2012లో ఆయన రతన్‌ టాటా నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఓ అత్యున్నత స్థాయి బృందం కొత్త ఛైర్మన్‌ అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది.

చైర్మన్‌ పదవి మార్పుపై కారణాలు వెల్లడించని టాటా గ్రూపు
టాటా సన్స్ చైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని తొలగించడం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌ రంగంలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశీయ అతి పెద్ద ప్రైవేటు కార్పొరేటర్‌గా పేరు పొందిన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజి మిస్త్రీని తప్పించడం వెనుక కారణాలేమై ఉంటాయన్న దానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాను నియమిస్తూ బోర్డు సోమవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. చైర్మన్ పదవి మార్పునకు టాటా గ్రూప్ ఎలాంటి కారణాలు వెల్లడించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. లాభాపేక్ష లేని వ్యాపారాలపై మిస్త్రీ అశ్రద్ధ వహించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. టాటా సంస్థల విక్రయాలు జరుపుతూ ఇటీవల పలు నిర్ణయాలు తీసుకోవడం మిస్త్రీపై వేటు వేయడానికి కారణాలై ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. మేజర్ డీల్ గా యూరప్‌లో ఉక్కు వ్యాపారాలను విక్రయించారు.

మిస్త్రీని తొలగిస్తూ బోర్డు సామూహికంగా నిర్ణయం
సైరస్ మిస్త్రీ నేతృత్వంలోనే యూరప్‌లో తమకున్న లాంగ్ ప్రొడక్ట్స్ ఉక్కు వ్యాపారాన్ని విక్రయించినట్లు టాటా స్టీల్ (యూకే) ప్రకటించింది. కేవలం ఆదాయాలపై మాత్రమే శ్రద్ధ వహించడం, లాభాపేక్ష లేని వ్యాపారాల నుంచి వైదొలగడం వంటివి మిస్త్రీ నిర్వహించే వాటిలో టాటా సన్స్‌కు అసంతృప్తి కలిగించే అంశాలుగా మారినట్టు సమాచారం. దీంతో కంపెనీ బోర్డు సైరస్ మిస్త్రీని తొలగించిందని వాదన వినిపిస్తోంది. బోర్డు సామూహికంగా ఈ నిర్ణయం తీసుకుందని, ప్రిన్సిపల్ షేర్ హోల్డర్స్ టాటా ట్రస్ట్స్ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం వెలువడినట్టు టాటా గ్రూప్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. టాటాసన్స్, టాటా గ్రూప్ దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుకూలంగా సైరస్‌ మిస్త్రీని మార్పు చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆపరేటింగ్ స్థాయిలోని సీఈవోలో ఎలాంటి మార్పులు లేవని ఆయన తెలిపారు. నాలుగు నెలలో శాశ్వత చైర్మన్‌ను గ్రూప్ నియమిస్తుందని ప్రకటించారు. కొత్త చైర్మన్‌ అన్వేషణ బృందంలో రతన్‌ టాటా, వేణు శ్రీనివాసన్‌, అమిత్‌చంద్ర, రోనన్‌సేన్‌, కుమార్‌ భట్టాచార్య సభ్యులుగా ఉన్నారు.

రతన్‌టాటా వారసునిగా 2012లో బాధ్యతలు
నిర్మాణ రంగంలో దిగ్గజ వ్యాపారవేత్తైన పల్లోంజీ మిస్త్రీ చిన్న కుమారుడు సైరస్‌ మిస్త్రీ. లండన్‌లోని ఇంపీరియల్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌, లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ పూర్తిచేశారు. రతన్‌టాటా వారసునిగా సైరస్‌ మిస్త్రీ 2012లో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్‌ బాధ్యతలు చేపట్టిన వ్యక్తుల్లో పేరులో టాటా లేని రెండో వ్యక్తి మిస్త్రీ. గతంలో నౌరోజి సక్లట్‌వాలా 1932-38 మధ్య కాలంలో ఛైర్మన్‌గా పనిచేశారు. టాటా సన్స్‌ సంస్థకు మిస్త్రీ ఆరో ఛైర్మన్‌. సైరస్‌ మిస్త్రీ అంతకుముందు షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. టాటా సన్స్ బోర్డ్ సభ్యునిగా పని చేశారు.

07:30 - October 25, 2016

అనంతపురం : జనసేన జనంలోకి వెళుతోంది. ప్రజా సమస్యలపై పోరాటాలు, సభలు, సమావేశాల ద్వారా ఇకపై నిరంతరం జనంలోనే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనిలో భాగంగా వచ్చే నెల 10న అనంతపురంలో మూడో బహిరంగ సభ నిర్వహించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు.

వచ్చే నెల 10 అనంతపురంలో మూడో సభ
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జనసేన ప్రారంభించిన ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ నిర్ణయించారు. ఇప్పటికే తిరుపతి, కాకినాడల్లో నిర్వహించిన రెండు సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో పవన్ కల్యాణ్‌ వచ్చే నెల 10న అనంతపురంలో మూడో సభ ఏర్పాటు చేశారు. జనసేన ప్రకటన చేసిన వెంటనే పార్టీ నేతలు, కార్యకర్తలు వేదిక కోసం అన్వేషణ ప్రారంభించారు. అనంతపురం సభకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్న పార్టీ నేతలు... ఇందుకు అనుగుణంగా ఉన్న మైదానాలను పరిశీలిస్తున్నారు.

ఈనెల మొదటి వారంలోనే సభ నిర్వహణకు ప్రణాళికలు
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా పోరాట సభను నిర్వహిస్తామని పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటనలో భాగంగా అనంతపురం సభను ఏర్పాటు చేశారు. రాయలసీమలో వెనుకబడిన ప్రాంతమైన అనంతపురంలో జనసేన సభ నిర్వహిస్తే పార్టీకి అన్ని విధాల కలిసివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రత్యేక హోదాతోపాటు జిల్లా సమస్యలను ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా జనాదరణ పొందొచ్చని జనసేన భావిస్తోంది. అనంతపురం జిల్లాలో తీవ్ర కరవు నెలకొంది. జిల్లాలోని అన్ని మండలాలను ప్రభుత్వం కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే కరవుతో సతమతమవుతున్న అనంతపురంకు ఎంతగానో ఉపయోగపడుతుందని పవన్‌ భావిస్తున్నారు. ప్రత్యేక హోదాతో వచ్చే నిధులను ఈ జిల్లాలో కరవు నివారణ చర్యలకు వాడుకోవచ్చన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈనెల మొదటివారంలోనే అనంతపురంలో బహిరంగ సభను నిర్వహించాలని జనసేన ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే దేశ సరిహద్దుల్లో ఉద్రికత్తలు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సేన మెరుపుదాడుల నేపథ్యంలో నవంబర్‌లో జరపాలని నిర్ణయించారు.

భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసిపోరాటం
వచ్చే ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేక హోదా పోరాట బహిరంగ సభలను పూర్తి చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నారు. 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే జనసేన రాజకీయంగా రాటుతేలే విధంగా పవన్‌ పావులు కదుపుతున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలు, పోరాటాలు, ఉద్యమాల ద్వారా కార్యకర్తల్లో కాకపుట్టిచ్చేందుకు ఈ సభలు, సమావేశాలు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు నుంచి పార్టీ కోసం పూర్తి సమయం కేటాయించాలన్న ఆలోచనలో ఉన్న పవన్‌ కల్యాణ్‌... ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో భావసారూప్యం ఉన్న పార్టీలో కలిసి వెళ్లే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. గోదావరి మెగా ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో సీపీఎం చేస్తున్న ఉద్యమాన్ని సమర్ధించారు. తుందుర్రులో పర్యటించాలనుకున్నా... అక్కడ నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వెళ్లలేక, ఆక్వా పార్క్‌ బాధిత గ్రామాల ప్రజలను హైదరాబాద్‌ పిలిపించుకుని ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ విధంగా ఏదోఒక కార్యక్రమం ఉంటే జనసేనకు ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు. ఈక్రమంలోనే పవన్‌ ప్రజా సమస్యలపై సమరశంఖం పూరిస్తున్నారు.

పక్కా వ్యూహంతో ముందుకెళుతున్న పవన్
పవన్‌ కల్యాణ్‌ పోకడలు చూస్తుంటే రాజకీయంగా పక్కా ప్రణాళికలతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. జనసేన అధినేత పనవ్‌ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగితే రాష్ట్ర రాజకీయాలు మరింత రక్తి కట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీడీపీ బలంగా ఉన్న అనంతపురంలో జనసేన సభ నిర్వహించాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదేనన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. పవన్‌ పూర్తి స్థాయి నేతగా మారితే రాజకీయ సమీకరణల్లో సమూల మార్పులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. 

07:15 - October 25, 2016

గుంటూరు : లక్ష్మీ లావణ్య కోల్డ్‌ స్టోరేజీలో మళ్లీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిన్న అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పక్క గోదాములో మిర్చీ బస్తాలను నిల్వ చేశారు. అయితే పక్క గోదాములకు కూడా మంటలు వ్యాపించి మిర్చీ బస్తాలు దగ్ధమయ్యాయి. కాగా సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో రూ.35 కోట్ల విలువైన మిర్చి సరుకు అగ్నికి ఆహుతయ్యింది. ఓ పక్కన మంటలు వ్యాపిస్తూండగానే స్టోరేజ్ గోడలను ప్రొక్లెయిన్ తో పగులగొట్టి కొంతవరకూ సరుకును సురక్షితంగా తరలించారు. దీంతో కొంతవరకూ మిర్చి నిల్వలను సురక్షితంగా దక్కించుకోగలిగారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మరోసారి అగ్నిప్రమాదం రిపీట్ అయ్యింది. దీంతో పక్క గోదాములో నిల్వచేసిన మిర్చీ బస్తాలకు మంటలు అంటుకుని కష్టపడి దక్కించుకున్న మిర్చి బస్తాలు సోమవారం మరోసారి సంభవించిన ప్రమాదంలో కాలి బూడదయిపోయింది. దీంతో నష్టం మరింతగా పెరిగింది.రైతులు మరింత నష్టంలో కూరుకుపోయారు. గతంలో ఇదే కోల్డ్ స్టోరేజ్ లో ఐదుసార్లు అగ్నిప్రమాదం జరిగిందనీ..ఆ ప్రమాదాలలో తాము కోల్పోయిన సరుకు ఇంతవరకూ నష్టపరిహారం అందనేలేదనీ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటను సరైన ధరకు విక్రయించుకుందామని ఆశించన రైతుల ఆశలకు అగ్నిప్రమాదాలు నిలువునా ముంచుతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యల అంశంలో ఆలోచించాల్సిన అవుసరం ఎంతైనా వుంది. ఎందుకంటే రైతే దేశానికి వెన్నెముక కాబట్టి..

ప్రతీకారం తీర్చుకుంటాం : మావో నేత జగన్

విశాఖ : ఏవోబీలో జరిగిన బూటకపు ఎన్ కౌంటర్ పై ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు తెలంగాణ కార్యదర్శి జగన్ హెచ్చరించారు. ఏవోబీలో మోసపూరితంగా దాడి చేశారని, ఏకపక్ష కాల్పులతోనే అందరినీ కాల్చి చంపారని అన్నారు. మృతదేహాలను భద్రపరిచి నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ బూటకపు ఎన్ కౌంటర్ పై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు.

06:50 - October 25, 2016

హైదరాబాద్‌ : అంబర్‌పేటలో హోంగార్డులు చేస్తున్నదీక్షను పోలీసులు తెల్లవారుజామున భగ్నం చేశారు. హోంగార్డుల అధ్యక్షుడు సకినాల నారాయణతో పాటు పలువురు హోంగార్డులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకుండానే దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ రమేష్‌ అనే హోంగార్డు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో రమేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే రమేష్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా రమేష్ పరిస్థితి విషమంగా వున్నట్లుగా సమాచారం. ఇక అదుపులోకి తీసుకున్న హోంగార్డులను ఓయూ, అంబర్‌పేట పీఎస్‌లకు తరలించారు. కాగా తమ డిమాండ్లు పరిష్కరించకుండా తమ దీక్షను బలవంతంగా విరమింపజేసేందుకు యత్నిస్తే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆయన హెచ్చరించి రూమ్ లోనే దీక్షను కొనసాగించారు. గతంలో సీఎం, హోం మినిష్టర్ ని కలిసి తమ కష్టాలను చెప్పుకున్నా ఎటువంటి న్యాయం జరగలేదని .. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలని సత్యనారాయణ రెండోరోజు దీక్ష సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందకుంటే ఆమరదీక్ష చేసేందుకు కూడా తాము సిద్ధంగా వున్నామని హోం తమ సర్వీసులను క్రమబద్దీకరిస్తానని ..తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించకపోతే.. తామంతా నిరాహాద దీక్ష చేపడతామని హోంగార్డులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హోంగార్డుల దీక్షను తెల్లవారు ఝామున ఉద్రిక్తతల మధ్య పోలీసులు భగ్నం చేశారు. 

హోంగార్డులు దీక్ష భగ్నం..

హైదరాబాద్‌ : అంబర్‌పేటలో హోంగార్డులు చేస్తున్నదీక్షను పోలీసులు తెల్లవారుజామున భగ్నం చేశారు. హోంగార్డుల అధ్యక్షుడు నారాయణతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.తమ డిమాండ్లను నెరవేర్చకుండానే దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ రమేష్‌ అనే హోంగార్డు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.  ఈ ఘటనలో రమేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే రమేష్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Don't Miss