Activities calendar

26 October 2016

22:00 - October 26, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, ఆమె త్వరలోనే ఇంటికి చేరుకుంటారని అన్నాడిఎంకే అధికార ప్రతినిధి సిఆర్‌ సరస్వతి తెలిపారు. అమ్మ చాలా బాగున్నారు...దేవుడు ఆమెతో ఉన్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తల ప్రార్థనలు, జయలలితకు చికిత్స జరిపిన లండన్, సింగపూర్‌, ఎయిమ్స్‌కు చెందిన వైద్య నిపుణుల కారణంగా ఆమె త్వరగా కోలుకున్నారని పేర్కొన్నారు. మరోవైపు జయలలిత త్వరగా కోలుకోవాలని కోరుతూ పెరంబూరులో స్థానిక ఎమ్మెల్యే వెట్రివేలు, అన్నాడిఎంకే కార్యకర్తల ఆధ్వర్యంలో మృత్యుంజయ యజ్ఞాన్ని చేపట్టారు. ఎకరం మైదానంలో 150 హోమ గుండాలను ఎర్పాటు చేసి ప్రత్యేక యాగం చేశారు.  ఈ యజ్ఞంలో 6 వందల మంది పూజారులు.. మూడు వేల మంది భక్తులు పాల్గొన్నారు.   

 

21:57 - October 26, 2016

విజయవాడ : అమరావతి నిర్మాణలో స్వీస్ చాలెంజ్ విధానంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఉన్నత న్యాయస్థానానికి నివేదించింది. ఆసక్తి వున్న వారంతా బిడ్‌ వేసేలా.. త్వరలోనే మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 
స్విస్ చాలెంజ్ టెండర్ల ప్రక్రియపై యూ టర్న్ 
స్విస్ చాలెంజ్  టెండర్ల ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. కొత్తగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపింది. ఈమేరకు హైకోర్టుకు వెల్లడించింది. దీంతో.. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఎంచుకున్న స్విస్‌ చాలెంజ్‌ విధానానికి ప్రస్తుతానికి బ్రేక్‌ పడినట్లయింది. 
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పిటిషనర్‌లు  
గతంలో జారీ చేసిన స్విస్‌ చాలెంజ్‌ నోటిఫికేషన్‌లో.. టెండర్ల ప్రక్రియ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని తలపించేలా ఉందని, స్వదేశీ సంస్థలు టెండర్‌ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొందరు పిటిషనర్‌లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సింగిల్‌ బెంచ్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రెవెన్యూ షేర్ విషయంలో స్పష్టత లేకపోవడం. స్విస్ చాలెంజ్ విధానంపై గతంలో కేల్కర్‌ కమిటీ.. సుప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదిక.. ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటే .. లండన్ కోర్టులో పిటిషన్ వేయాల్సిన అవసరం ఉంటుందనే వాదనలను పరిగణలోకి తీసుకున్న సింగిల్ బెంచ్.. 66 పేజీల సుదీర్ఘ మధ్యంతర తీర్పును వెల్లడించింది. ఇందులో ప్రభుత్వం జారీ చేసిన స్విస్‌ చాలెంజ్‌ నోటిఫికేషన్ పై స్టే విధించింది. అయితే.. ప్రభుత్వం దీనిపై డివిజన్‌ కోర్టుకు అప్పీలుకు వెళ్లింది. సింగిల్‌బెంచ్‌ ఇచ్చిన స్టేను తొలగించాలని అభ్యర్థిస్తూ పిటిషన్‌ వేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం.. ప్రభుత్వానికి పలు సూటి ప్రశ్నలు వేసింది. 
చట్టపరమైన ఆధారాలు చూపలేక పోయిన ప్రభుత్వం 
సుధీర్ఘ వాదనల్లో.. స్వీస్ చాలెంజ్‌కి తగిన చట్టపరమైన ఆధారాలను ప్రభుత్వం చూపలేక పోయింది. సింగిల్ బెంచ్ తీర్పులో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వలేక పోయారు అడ్వకేట్ జనరల్ దమ్ములపాటి శ్రీనివాస్‌ రావు. టెండర్లలో అంతర్జాతీయ కంపెనీల పేరుతో లోపాయికారీ ఒప్పందం ఉందని పిటిషనర్లు బలమయిన వాదనలు వినిపించారు.  సీఆర్‌డీఏ చట్టంలోని పలు అంశాలను తుంగలో తొక్కడమే కాకుండా, లోకల్ కార్పొరేషన్ అథారిటీని పట్టించుకోలేదని పిటిషనర్లు కోర్టుకు నివేదించారు. పైగా మంత్రులతో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి చట్టబద్ధత లేకపోవడాన్నీ వారు ప్రశ్నించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశ్నలకు అడ్వొకేట్‌ జనరల్‌ మౌనాన్నే ఆశ్రయించారు. తద్వారా ఈ వ్యవహారంలో పిటిషనర్‌ల వాదనను పరోక్షంగా అంగీకరించారు. 
కొత్త నోటిఫికేషన్‌
వాదనల అనంతరం.. స్విస్‌ చాలెంజ్‌ విధానానికి సంబంధించి మార్పులతో కూడిన నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని సర్కార్‌ తెలిపింది. అయితే కొత్త నోటిఫికేషన్‌లో రహస్యాలు లేకుండా చూడాలని ప్రతివాదుల పిటిషనర్ ప్రకాశ్ రెడ్డి వాదించారు. కొత్త నోటిఫికేషన్‌లో అభ్యంతరాలు ఉంటే కోర్టుకు రావచ్చని ఉన్నత న్యాయస్థానం సూచించింది. నోటిఫికేషన్ రద్దు చేయడంతో అప్పీల్ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను మూసి వేస్తున్నట్లు ధర్మాసనం తీర్పునిచ్చింది. 
కొత్త నోటిఫికేషన్‌పై అప్పుడే సందేహాలు 
అయితే కొత్త నోటిఫికేషన్‌పై అప్పుడే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందరూ పాల్గొనేలా కొత్తగా స్విస్‌ చాలెంజ్‌ విధానంలోనే టెండర్లు పిలుస్తారా..? లేక అభివృద్ధి పేరిట ప్రభుత్వానికి తక్కువ ఖర్చు ఎక్కువ లాభం వచ్చేలా నూతన టెండర్ల పక్రియను తెరపైకి తీసుకు వస్తారా..? అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి స్విస్‌ చాలెంజ్‌ విధానంలో తాజా తీర్పుతో ఏపీ ప్రభుత్వ దూకుడుకు న్యాయస్థానం ముకుతాడు వేసినట్లయింది. 

 

21:52 - October 26, 2016

తూర్పుగోదావరి : దీపావళి..! ప్రపంచానికి వెలుగులు పంచే పండుగ. చిచ్చుబుడ్లు.. మతాబులు.. కాలుస్తూ చిన్నా పెద్దా హుషారుగా గడిపే పండుగ. దీపావళి టపాసుల తయారీ.. ఇటీవలి కాలంలో కుటీర పరిశ్రమగా వ్యాపిస్తోంది. అయితే తయారీ సంస్థలు సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా.. బాణాసంచా తయారీ దారులు.. ఈసారీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బాణా సంచా తయారీపై 10టీవీ ప్రత్యేక కథనం..
దీపావళి వచ్చిందంటే.. జగమంతా వెలుగులు 
తూర్పుగోదావరి జిల్లాలో కుటీర పరిశ్రమగా బాణా సంచా తయారీ.. నిబంధనలను పాటించని బాణాసంచా తయారీ సంస్థలు.. ప్రాణాలు అరచేత పట్టుకుని పనిచేస్తున్న కార్మికులు.. దీపావళి వచ్చిందంటే.. జగమంతా వెలుగులు పరచుకుంటాయి. నింగిని తాకే తారాజువ్వలు.. గగనాన నవ్య నక్షత్ర మండలాన్ని సృష్టిస్తాయి. ఆబాలగోపాలమూ మతాబుల వెలుగులతో మురిసిపోతుంటారు. అందరిలోనూ ఉల్లాసాన్నీ, ఉత్తేజాన్నీ నింపే మతాబులు.. వాటి తయారీదారుల జీవితాల్లో మాత్రం చీకట్లనే నింపుతున్నాయి. తరచూ సంభవించే ప్రమాదాల కారణంగా.. బాణాసంచా తయారీ కార్మికులు అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండేళ్ల క్రితం జరిగిన ఘోర దుర్ఘటనను ఈ ప్రాంతం ఇప్పటికీ మరచిపోలేదు. 
బాణా సంచా తయారీ కేంద్రంలో రెండేళ్ల క్రితం అగ్నిప్రమాదం 
తూర్పు గోదావరి జిల్లా వాకతిప్పలోని బాణా సంచా తయారీ కేంద్రంలో రెండేళ్ల క్రితం అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో పది మంది కార్మికులు ప్రాణాలు కొల్పొయారు. బాణాసంచా తయారీ సంస్థ.. సరైన జాగ్రత్తలు పాటించని కారణంగానే భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందని అనంతర దర్యాప్తులో వెల్లడైంది. ఇలాంటి చేదు ఘటన నుంచి.. బాణాసంచా తయారీ సంస్థలు నేటికీ పాఠాలు నేర్చుకోవడం లేదు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని వదిలించాల్సిన అధికారులూ అలసత్వంగానే వ్యవహరిస్తున్నారు. వీరు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో.. బాణాసంచా తయారీ కేంద్రాలు.. నిబంధనలకు యథేచ్ఛగా నీళ్లు వదులుతున్నాయి. 
టపాసులు ఎగుమతి 
తూర్పు గోదావరి జిల్లాలోని.. వివిధ బాణా సంచా తయారీ కేంద్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు టపాసులు ఎగుమతి అవుతున్నాయి. సంవత్సరం పొడవునా వివిధ సందర్భాలకు తగ్గట్టుగా తయారయ్యే ఉత్పత్తులను ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. వేట్ల పాలం, రాయవరం, బిక్కవోలు ప్రాంతాల్లో బాణాసంచా తయారీ ఓ కుటీర పరిశ్రమగా సాగుతోంది. వందల కుటుంబాలు బాణా సంచా తయారీ పరిశ్రమలపై ఆధార పడి జీవిస్తున్నాయి. 
కూలీల పరిస్థితి అధ్వానం
బాణాసంచా తయారు చేసే కూలీల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రజలందరికీ పండుగ పూట ఆనందాన్ని నింపుతున్న కుటుంబాల్లో నిత్యం అవస్థలు తప్పడం లేదు. పిల్లా పాప పని చేసినా చాలీచాలని కూలీలతో పొట్ట నింపుకోవాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి బాణా సంచా తయారీలో వ్యాపారులే లాభపడుతున్న పరిస్థితి కన్పిస్తోంది. అయితే.. బాణా సంచా తయారీ సంస్థల నిర్వాహకులు మాత్రం ఇందుకు భిన్నంగా చెబుతున్నారు. ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయని, పైగా చైనా నుంచి దిగుమతి అయ్యే బాణాసంచా తమ ఉత్పత్తులపై పెను ప్రభావం చూపుతోందని వారంటున్నారు. 
ప్రమాదకర పరిస్థితుల్లో తయారీదారులు, కూలీల జీవనం 
తయారీదారులు, కూలీలు నిత్యం ప్రమాదకర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. ప్రమాదాల నివారణకు అనేక నిబంధనలు ఉన్నప్పటికీ చాలా చోట్ల వాటిని పెడచెవిన పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటున్న అధికారులు.. ఎప్పట్లాగానే.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెబుతున్నారు. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా.. ఈసారి కూడా నిర్లక్ష్యం నీడలోనే బాణాసంచా తయారు చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

21:48 - October 26, 2016

సీఎం కేసీఆర్ మీద కోర్టు కాయిదాలు.... కాంగ్రెసొల్లు చేస్తే ఉంటాయ పాయిదాలు, డబుల్ బెడ్ రూం దరఖాస్తులు వట్టిన జనం.. చూడాలే ఇస్తడా.. ఇయ్యడా అనేది చూడాలి మనం, చేతులు కలిపిన దొంగలు... పోలీసులు, గుంతలుదొవ్విన నయా శ్రామికులు, హోంగార్డుల పంజాదీ ఒడవది తీరది.. సర్కారుకు సోయి దెచ్చే దారి ఏదీ..?, తెలుగు రాష్ట్రాల మీదికి ఉరుకొస్తున్న వాన... బారసాలజేసి పేరువెట్టిన మొగులు శాఖ, నర్సిమ్మ స్వామికి నామాలువెట్టిన దొంగలు.. దేవుని గుడిని కూడా ఇడవని లంఫంగులు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:26 - October 26, 2016

పచ్చటి అడవిలో రక్తం చిందింది. సర్కారు తుపాకీ గర్జించింది. ఉషోదయంపై ఎర్రటి చారిక మిగిల్చింది. ఎన్ కౌంటర్లే పరిష్కారమా..?? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేకం కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

నాలుగో వన్డేలో న్యూజిలాండ్ విజయం

రాంచీ : న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించింది. 20 పరుగుల 
తేడాతో భారత్ పై న్యూజిలాండ్ గెలుపొందింది. 

21:05 - October 26, 2016

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'అదిగదిగో అధ్యక్ష పీఠం' పేరుతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాలిఫోర్నియా నుంచి శ్రీనివాస్ రావు, విశ్లేషకులు నరసింహారావు, రాజకీయ విశ్లేషకులు నగేష్ కుమార్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్

రాంచీ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్ లో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 204 పరుగుల వద్ద అక్షర్ పటేల్ (38) ఔట్ అయ్యాడు.

ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్

రాంచీ : భారత్, న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్ లో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పయింది. అమిత్ మిశ్రా ఔట్ అయ్యాడు.

 

20:42 - October 26, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కోసం వందసార్లైనా బల్లలెక్కడానికైనా సిద్ధమని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ తెలిపారు. ఈమేరకు టెన్ టివితో ఆయన మాట్లాడారు. హోదా కోసం వెయ్యిసార్లైనా మైకులు విరగొట్టడానికైనా సిద్ధమన్నారు. ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరైన రామకృష్ణ.. దీనిపై స్పందిస్తూ ప్రత్యేక హోదాను సీఎం చంద్రబాబు కేంద్రానికి తాకట్టుపెట్టారని విమర్శించారు. ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చామని చెప్పారు. హోదా కోసం శాసనసభలో తమ పోరు కొనసాగుతుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

ధర్మవరంలో ఉద్రిక్తత

అనంతపురం : జిల్లాలోని ధర్మవరంలో మంత్రి పరిటాల, ఎమ్మెల్యే సూరి వర్గీయుల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. ధర్మవరంలో పరిటాల వర్గీయులు ప్లెక్సీలు ఏర్పాటు చేయగా... ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులు చించేశారు. దీంతో పరిటాల వర్గీయులు ఆందోళనకు దిగారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులను భారీగా మోహరించారు. 

 

20:32 - October 26, 2016

అనంతపురం : జిల్లాలోని ధర్మవరంలో మంత్రి పరిటాల, ఎమ్మెల్యే సూరి వర్గీయుల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. ధర్మవరంలో పరిటాల వర్గీయులు ప్లెక్సీలు ఏర్పాటు చేయగా... ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులు చించేశారు. దీంతో పరిటాల వర్గీయులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులను భారీగా మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఏపీ పోలీసుల వ్యూహం ఫలించిందా

హైదరాబాద్ : మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లో ఏపీ పోలీసుల వ్యూహం ఫలించిందా అంటే అవుననే తెలుస్తోంది. పెద్ద మొత్తంలో రిక్రూట్‌ చేసుకోవాలన్న అత్యాశతో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బతగిలింది. 

ఏడో వికెట్ కోల్పోయిన భారత్

రాంచీ : న్యూజిలాండ్ , భారత్ మధ్య జరుగుతున్న నాలుగోవన్డే మ్యాచ్ లో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 167 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా ఔట్ అయ్యాడు. 

 

ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ బహిరంగ లేఖ విడుదల

హైదరాబాద్ : ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ బహిరంగ లేఖ విడుదల చేసింది. మావోయిస్టు నేత శ్యాం పేరిట 4 పేజీల లేఖ విడుదలైంది. ఏవోబీ ఎన్‌కౌంటర్‌ బూటకమని అందులో పేర్కొన్నారు. కోవర్టులను చొప్పించి ఎన్‌కౌంటర్‌ చేశారని శ్యాం ఆరోపించారు. విష ప్రయోగం చేసి మావోయిస్టులపై కాల్పులు జరిపారన్నారు. చంద్రబాబు, లోకేష్‌పై ఆత్మాహుతి దాడులు చేస్తామని హెచ్చరించారు. 

20:17 - October 26, 2016

హైదరాబాద్ : మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లో ఏపీ పోలీసుల వ్యూహం ఫలించిందా అంటే అవుననే తెలుస్తోంది. పెద్ద మొత్తంలో రిక్రూట్‌ చేసుకోవాలన్న అత్యాశతో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బతగిలింది. ఏవోబీలో రిక్రూట్‌మెంట్‌ కోసం వారం రోజుల క్యాంపును ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులు. అయితే అప్పటికే మావోయిస్టు పార్టీలో కొందరు కోవర్టులు రిక్రూట్‌మెంట్‌ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో 500 మంది పోలీసులు చుట్టుముట్టినా సెంట్రీలుగా ఉన్న కోవర్టులు సమాచారం ఇవ్వలేదు. మూడంచెల సెంట్రీలను దాటిన గ్రేహౌండ్స్‌ పోలీసులు మరో రెండు సెంట్రీలను దాటి  సెంట్రల్‌ కమిటీ నేతలను టార్గెట్‌ చేయాలనుకున్నారు. అప్పటికే అప్రమత్తమైన అగ్రనేతలు ఆర్కే, ఉదయ్‌, చలపతితో పాటు మరికొంతమంది కీలక నేతలు అక్కడి నుంచి పారిపోయారు. మరోవైపు అగ్రనేతల కోసం ఏవోబీలో గ్రేహౌండ్స్‌ బలగాలు జల్లెడపడుతున్నాయి. ఏపీ డీజీపీకి తెలియకుండానే ఆపరేషన్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌ పోలీసులు నిన్న ఓ మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఆ మావోయిస్టే కోవర్టు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే ఆచూకీపై పార్టీఅగ్రనేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకా అగ్రనేతలకు ఆర్కే అందుబాటులోకి రాలేదని సమాచారం.
ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ బహిరంగ లేఖ విడుదల 
మరోవైపు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ బహిరంగ లేఖ విడుదల చేసింది. మావోయిస్టు నేత శ్యాం పేరిట 4 పేజీల లేఖ విడుదలైంది. ఏవోబీ ఎన్‌కౌంటర్‌ బూటకమని అందులో పేర్కొన్నారు. కోవర్టులను చొప్పించి ఎన్‌కౌంటర్‌ చేశారని శ్యాం ఆరోపించారు. విష ప్రయోగం చేసి మావోయిస్టులపై కాల్పులు జరిపారన్నారు. చంద్రబాబు, లోకేష్‌పై ఆత్మాహుతి దాడులు చేస్తామని హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆరో వికెట్ కోల్పయిన భారత్

రాంచీ : న్యూజీలాండ్ , భారత్ మధ్య జరుగుతున్న నాలుగోవన్డే మ్యాచ్ లో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 154 పరుగులు వద్ద కేదార్ జాదవ్ డకౌట్ అయ్యాడు. 

 

 

నాలుగో వికెట్ కోల్పయిన భారత్

రాంచీ : న్యూజీలాండ్ , భారత్ మధ్య జరుగుతున్న నాలుగోవన్డే మ్యాచ్ లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 135 పరుగుల వద్ద ధోనీ (11) ఔట్ అయ్యాడు. 

 

19:42 - October 26, 2016

హైదరాబాద్ : మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌ ప్రభాకర్‌ మృతిచెందడంతో హైదరాబాద్‌ యాప్రాల్‌లోని ఆయన కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. ప్రభాకర్‌ భార్య దేవేంద్ర..మల్కన్‌గిరి ఎస్పీ ఆఫీసుకు చేరుకొని ప్రభాకర్‌ మృతదేహాన్ని గుర్తుపట్టడంతో కుటుంబసభ్యులు భోరున విలపిస్తున్నారు. 20 ఏళ్ల క్రితమే ప్రజా సమస్యలపై ప్రభాకర్‌ పోరాటం కొనసాగించాడని..ఆయన సన్నిహతులు, కుటుంసభ్యులు గుర్తుచేసుకుంటున్నారు. ప్రభాకర్‌ మృతదేహాన్ని యాప్రాల్‌కు తీసుకొస్తున్నారన్న సమాచారంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

 

మూడో వికెట్ కోల్పోయిన భారత్

రాంచీ : న్యూజీలాండ్, భారత్ మధ్య జరుగుతున్న నాలుగోవన్డే మ్యాచ్ లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 128 పరుగుల వద్ద రహానే (57) ఔట్ అయ్యాడు. 

 

మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్ లో పెరిగిన మృతుల సంఖ్య

విశాఖ : మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్లో మృతుల సంఖ్య 32కు పెరిగింది. మల్కన్‌గిరి అడవుల్లో కూంబింగ్ చేస్తున్న భద్రతా సిబ్బంది.. మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. ప్రస్తుతం మల్కన్‌ గిరి ప్రాంతాల్లో గ్రైహౌండ్స్ కూంబింగ్‌ కొనసాగుతోంది. 

18:42 - October 26, 2016

రంగారెడ్డి : తెలంగాణలో లక్షా 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. ప్రభుత్వం వీటిని భర్తీ చేయడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో డిగ్రీలు పాసై ఉద్యోగం, ఉపాధి దొరకక లక్షాలాదిమంది రోడ్డున తిరుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహాజన పాదయాత్రలో భాగంగా.. రంగారెడ్డి జిల్లా పోరెండ్లలో ఆయన పర్యటించారు. ప్రజల విజ్ఞప్తులను తమ్మినేని బృందం స్వీకరించింది. ప్రజల కనీస సౌకర్యాలు మెరుగుపరిచినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని తమ్మినేని అన్నారు. మహాజన పాదయాత్రకు ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌ మద్దతు తెలిపారు.  

 

18:34 - October 26, 2016

హైదరాబాద్ : హరితహారం కార్యక్రమం సందర్భంగా నాటిన మొక్కలు ఇప్పుడు మోడబారిపోయాయి. సరైన పర్యవేక్షణ లేక చాలా ప్రాంతాల్లో నాటిన మొక్కలు ఎండిపోయాయి. హరిత హారం కార్యక్రమం సందర్భంగా నానా హడావుడి చేసిన.. వారంతా ఇప్పుడు ఎక్కడున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోట్లు ఖర్చుచేసి.. హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినా.. పూర్తిస్థాయిలో కార్యక్రమం విజయవంతం కాలేదనే విమర్శలు బయలుదేరాయి. 
చాలాచోట్ల ఎండిపోయిన మొక్కలు
వ‌నం పెరగాలి.. కోతులు పోవాలి... క‌రువు కాట‌కాలు క‌నుమ‌రుగు కావాలి... రాష్ర్టం సుభిక్షంగా ఉండాలి... అందుకు హ‌రితహార‌మే శ‌ర‌ణ్యమంటూ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కోట్ల రూపాయలు వెచ్చించి... లక్షల మొక్కలు నాటారు. సామాన్యుడి నుంచి ముఖ్యమంత్రి, గ‌వ‌ర్నర్ వ‌ర‌కు అంద‌రూ క‌దిలారు. అయితే...హ‌రితహారం సందర్భంగా నాటిన మొక్కలు ఇప్పుడు ఎండిపోయాయి. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

18:30 - October 26, 2016

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో కోలుకున్న.. చిన్నారి సంజన డిశ్చార్జ్ అయ్యింది. తాగుబోతుల నిర్లక్యపు డ్రైవింగ్‌కు గురై... కామినేనిలో చికిత్స పొందిన సంజన పూర్తిగా కోలుకుని.. క్షేమంగా ఇంటికి చేరుకుంది. మరికొన్ని రోజులు సంజనకు వైద్యం అందించాలని, మూడు వారాల్లో లేచి నడుస్తుందని కామినేని వైద్యులు స్పష్టం చేశారు. 
కోలుకున్న చిన్నారి సంజన 
తల్లిదండ్రుల ప్రార్థనలు ఫలించాయి.. చిన్నారి సంజన కోలుకుంది. ఈనెల 2వ తేదీన పెద్ద అంబర్‌పేటలో శ్రీదేవి, ఆమె కూతురు సంజన రోడ్డు దాటుతుండగా... తాగుబోతుల ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా తల్లి కూతుళ్లు తీవ్రంగా గాయపడి... ఆస్పత్రి పాలయ్యారు. శ్రీదేవి త్వరగా కోలుకున్నా... చిన్నారి సంజన మాత్రం కోమాలోనే ఉండిపోయింది. ప్రమాదంలో గాయపడి కోమాలోకెళ్లిన సంజనకు కామినేని వైద్యులు మెరుగైన ట్రీట్‌మెంట్‌ అందించారు. 
ప్రస్తుతం సంజన కోలుకుందని కామినేని వైద్యులు తెలిపారు. మరికొన్ని రోజులు వైద్యం అందించాలని డాక్టర్లు తెలిపారు. మరో మూడువారాల్లో సంజన లేచి నడుస్తుందని అన్నారు. 
సంజన తల్లిదండ్రులు సంతోషం 
డాక్టర్లు మెరుగైన చికిత్స అందించి.. తమ పాప ప్రాణాలు కాపాడారని సంజన తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం వల్ల తనకు ఇప్పటికీ నొప్పులు ఉన్నాయని, సరిగ్గా నడవలేక, కూర్చోలేకపోతున్నానని సంజన తల్లి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదానికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని సంజన తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తంగా సంజన కోలుకుని ఇంటికి క్షేమంగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. 

 

18:18 - October 26, 2016

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ ఆందోళనలో..హైకోర్టు నలుగురికి బెయిల్‌ మంజూరు చేసింది. ఆరేటి సత్యవతి, వాసు, త్రిమూర్తులు, సుబ్రహ్మణ్యంకు బెయిల్ లభించింది. కంపెనీకి 50 మీటర్ల దూరంలో ఉండాలని కోర్టు ఆంక్షలు విధించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:14 - October 26, 2016

విశాఖ : మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్లో మృతుల సంఖ్య 32కు పెరిగింది. మల్కన్‌గిరి అడవుల్లో కూంబింగ్ చేస్తున్న భద్రతా సిబ్బంది.. మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. ప్రస్తుతం మల్కన్‌ గిరి ప్రాంతాల్లో గ్రైహౌండ్స్ కూంబింగ్‌ కొనసాగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

18:12 - October 26, 2016

హైదరాబాద్ : స్విస్‌ చాలెంజ్‌ విధానంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. స్విస్‌చాలెంజ్‌పై కొత్త నోటిఫికేషన్‌ జారీకి నిర్ణయించినట్లు.. ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో ఎవరైనా దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తామని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. అటు కొత్త నోటిఫికేషన్‌లో ఎలాంటి దాపరికాలు ఉండరాదని పిటిషనర్లు కోరారు. కొత్త నోటిఫికేషన్‌పై అభ్యంతరాలుంటే తమను ఆశ్రయించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. ఏపీ ప్రభుత్వం వేసిన అప్పీల్‌ పిటిషన్‌నూ న్యాయస్థానం కొట్టివేసింది. 
సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు..
స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టు తీర్పు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానకి చెంపదెబ్బ. స్విస్ చాలెంజ్ పద్ధతి టెండర్ పద్ధతి. విలువైన భూములపై వ్యాపారం చేసేందుకు సింగపూర్ కంపెనీలకు అవకాశం కల్పించే పద్ధతి. మన దేశ కంపెనీలకు కాకుండా విదేశాలకు కట్టబెట్టే విధానం. 1690 ఎకరాల భూమిని సేకరించారు. స్విస్ చాలెంజ్ పద్ధతి.. ప్రజానికాన్ని దగా చేయడం లాంటిదే. రాష్ట్ర ప్రభుత్వ తీరు మారాలి. ప్రతిపక్షాలను పట్టించుకోకుండా సీఎం ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టు తీర్పు అనుసరించి ప్రభుత్వం గుణపాఠం తెచ్చుకోవాలి. దేశీయ కంపెనీలకు రాష్ట్ర రాజధాని నిర్మాణం బాధ్యతలను అప్పగించాలి. స్విస్ చాలెంజ్ పద్ధతికి స్వస్తి చెప్పాలి. మన దేశంలో పెద్ద ప్రాజెక్టులను నిర్మించిన ఇంజనీర్లు ఉన్నారు. బాక్రానంగల్, నాగార్జున సాగర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను నిర్మించుకున్నాం. మన దేశంలోని ఇంజనీర్లు, కాంట్రాక్టుల నిర్మించే విధంగా రూపకల్పన చేయాలన్నారు.
సీపీఎం నేత బాబూరావు...
స్విస్ చాలెంజ్ విధానంపై ప్రభుత్వం వెనక్కు తగ్గడమంటే.. నోటిఫికేషన్ తప్పులతడక అన్న విషయం అర్థం అయింది. భూములను దొడ్డి దారిన సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. చట్ట సవరణలను కూడా ఉపసంహరించుకోవాలి. స్టార్టప్...కేవలం రియల్ ఎస్టేట్ ప్రాసెస్ మాత్రమే. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును రద్దు చేయాలి. విధానంపై పున:సమీక్ష జరగాలి. 
వైసీపీ నేత గౌతం రెడ్డి... 
స్విస్ చాలెంజ్ విధానంపై స్పష్టత, పారదర్శకత లేదు. సరైన విధివిధానలు రూపొందించలేదు. కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. స్విస్ చాలెంజ్ విధానం లోపభూయిష్టమని విజయ్ కేల్ కర్ కమిటీ తెలిపింది.
ఓపెన్ టెండర్ పిలవాలి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆరేటి సత్యవతికి బెయిల్ మంజూరు..

పశ్చిమగోదావరి : తుందుర్రు మెగా అక్వాఫుడ్ ఆందోళనలో నలుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరేటి సత్యవతి, వాసు, త్రిమూర్తులు, సుబ్రమణ్యంలకు బెయిల్ మంజూరైంది. 

వడిశలేరు వద్ద రోడ్డు ప్రమాదం...

తూర్పుగోదావరి : రంగంపేట (మం) వడిశలేరు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 

17:40 - October 26, 2016

రంగారెడ్డి : సర్కార్ ఏం చెప్పింది ? ఏం చేస్తోంది ? గత రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది ? తదితర వివరాలను ప్రజలకు సీపీఎం వివరంగా తెలియచేస్తోంది. వారిలో ఆలోచనను రేకేత్తిస్తోంది. అధికారంలోకి రాకముందు ఎలాంటి హామీలిచ్చారు ? ప్రస్తుతం ఆ హామీలు ఏమాత్రం అమలయ్యాయి ? బంగారు తెలంగాణ సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు సర్కార్ కి తెలియచేసేందుకు సీపీఎం మహాజన పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు (బుధవారం)కు పదో రోజుకు చేరుకుంది. మహేశ్వరం మండలంలో చేరుకున్న అనంతరం సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు.
ఆయన మాటల్లోనే..'తనను ముఖ్యమంత్రి చేయమన్నాడు..అధికారంలోకి తేవాలన్నాడు..ఓట్లు వేయమని అన్నాడు..కేజీ నుండి పీజీ దాక ఉచిత ఇంగ్లీషు విద్య అన్నడు. అన్నాడా ? అనలేదా ? అన్నవాడు రెండున్నర ఏండ్లు అయ్యింది. ఒక్క స్కూల్ పెట్టాడా ? ఒక్క స్కూల్లో ఇంగ్లీషు మీడియం ఉందా ? చేయలేదు. ఎందుకు చేయలేదో ప్రశ్నించడానికి పాదయాత్ర బయలుదేరింది. ఆయన్ను తిట్టడానికో..ముఖ్యమంత్రి సీటు దింపడానికో..నేనే..ఇంకోవరో కూర్చొవడానికి కాదు..ఆయన్నే కూర్చొమనండి..ఐదేండ్లు కూర్చొమనండి..మంచి పనులు చేస్తే మళ్లీ ఓట్లు వేసి ఇంకో ఐదేండ్లు కూర్చొమనండి. ఇది సంబంధం లేదు. కానీ మనకు బతుకు కావాలి. తెలంగాణ జనానికి ఏమిస్తానని చెప్పావో అది ఇవ్వాలి. చదువు ఇస్తానన్నావు. ఇవ్వలేదు. వైద్యం ఇస్తావా ? వైద్యం కూడా లేదు. జబ్బు వచ్చిన వాడు. ప్రైవేటు ఆసుపత్రిలోకి వెళితే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులపై ఎవరి కంట్రోల్ ఉంది ? ఆంద్రోళ్లు చేయబట్టే మనకు ఉద్యోగాలు రాలేదు...మన ఉద్యోగాలను ఆంద్రోళ్లు కూర్చొని అనుభవనిస్తున్నారు...తెలంగాణ వస్తే ఆంద్రోళ్లు వెళ్లిపోతే..మొత్తం ఉద్యోగాలన్నీ మనకే వస్తాయని అన్నారు..అయిపోయింది..వాళ్లు వెళ్లిపోయారు. మరి ఉద్యోగాలు రావాలి కదా. ? రెండున్నర ఏండ్లు అయిపోయాయి. ఇంకా ఆటోలు ఎందుకు తోలుతున్నారు ? అడ్డా కూలీలుగా ఎందుకు బతుకుతున్నారు ? తెలంగాణలో లక్షా 80వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి' అని తమ్మినేని వివరించారు. 

17:25 - October 26, 2016

హైదరాబాద్ : బ్రిజేష్ కుమార్ ట్రైబ్యున‌ల్ నిర్ణయంపై ఏపీ స‌ర్కార్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లనుంది. న్యాయపోరాటం చేయనుందా? లేక కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానుందా? ట్రిబ్యునల్‌ నిర్ణయంతో ఏపీకి అన్యాయం జ‌రుగుతుంద‌నే వాద‌న‌లు ఇప్పటికే బ‌లంగా వినిపిస్తున్నాయి...మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఈ విష‌యంపై ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు సర్కార్‌ ఎలా వ్యవహరిస్తుందనే అంశం ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది. 
ఏపీలో రాజకీయ ప్రకంపనలు 
తెలుగురాష్ట్రాల్లో కృష్ణా జలాల పంపిణికి సంబంధించి బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ వెల్లడించిన నిర్ణయం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటినే ఇరు రాష్ట్రాల మధ్య పంప‌కాలు చేసుకోవాల‌ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ స్పష్టం చేసింది. అయితే బ్రిజేష్ నిర్ణయంతో రెండు రాష్ట్రాల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌నే వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. మిగులు జ‌లాల‌ను కూడా ఎగువ రాష్ట్రాల‌కు కేటాయించ‌డంతో దిగువ రాష్ట్రాల‌కు తీవ్ర నీటి ఇబ్బందులు త‌ప్పవని చెబుతున్నారు.
ఇంకా స్పందించ‌ని ఏపీ సర్కార్ 
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేష్ నిర్ణయంపై వెంట‌నే రియాక్ట్ అయింది..ఆ రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి హ‌రీష్ రావు నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ స‌బ్  క‌మిటీని ఏర్పాటు చేసింది. ఎలా ముందుకు వెళ్లాల‌నే దానిపై కేసీఆర్‌ స‌ర్కార్ సీరియ‌స్‌గా దృష్టి సారించి ముందుకు వెళ్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సీనియ‌ర్ న్యాయ‌వాదిని కూడా నియ‌మించింది. ఇది ఇలా ఉంటే ఏపీ సర్కార్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. 
న్యాయ‌ప‌రంగా పోరాటానికి సిద్ధమవుతున్న టీఎస్‌ స‌ర్కార్‌
మరోవైపు బ్రిజేష్ ట్రిబ్యునల్‌ నిర్ణయంపై ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం చేయాల‌ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మిత్రపక్షమైన మోడీ సర్కార్‌పై ఒత్తిడి తేవాల‌ంటున్నాయి. ప్రత్యేక హోదా తరహాలో మెతకవైఖరి అవలంభిస్తే కృష్ణా జలాల పంపిణి విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వాదిస్తున్నాయి. ఓవైపు న్యాయ పోరాటం చేస్తామ‌ని మంత్రి దేవినేని చెబుతున్నా..ఇంత వ‌ర‌కు ఆ దిశగా ఎలాంటి  చ‌ర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీపై టీడీపీ ఒత్తిడి తేలేకపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ దారి ఎంచుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. 

 

17:25 - October 26, 2016

భారీ ఎత్తున కొనసాగుతున్న ఫేక్ కరెన్సీ నోట్ల చలామణి..పోలీసులు బిజీ..బిజీ..,బ్యాంకు ఏటీఎంలలో నకిలీలే..

జెజవాడలో వాడ వాడల్లో నకిలీ నోట్లు దర్శనమిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుండి గ్యాంగ్స్ దూసుకొస్తున్నాయి. దీనితో బెజవాడ నకిలీ నోట్లతో వణుకుతోంది. బెజవాడలో కోట్లాది రూపాయల ఫేక్ కరెన్సీ నోట్లను చెలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా నకిలీ నోట్లు బయటపడుతుండడం ఆందోళనకరంగా మారిపోయింది. పోలీసుల బందోబస్తు బిజీగా ఉండడం దుండగులకు వరంగా మారిందా ? బ్యాంకు ఎంటీఎంలలో నకిలీలే.. ఆరోపణలు వస్తున్నా బ్యాంకులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీనితో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీని గురించి మరింతగా తెలుసుకొనేందుకు వీడియో క్లిక్ చేయండి. 

17:14 - October 26, 2016

హైదరాబాద్ : శాసనసభలో సభ్యులు ప్రవర్తించిన తీరు ఆధారంగానే నివేదిక తయారు చేస్తామని ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఈమేరకు టెన్ టివితో ఆయన మాట్లాడారు. ప్రివిలేజ్‌ కమిటీ ముందుకు రెండోరోజు ఐదుగురు సభ్యుల దగ్గరనుంచి వివరాలు అడిగి తెలుసుకున్నానని ఆయన అన్నారు. మిగతా ముగ్గురు సభ్యులు వచ్చిన తర్వాతే పూర్తి నివేదిక తయారుచేస్తామని చెప్పారు. ప్రివిలేజ్‌ కమిటీలో సమిష్టి నిర్ణయాలు ఉంటాయే తప్ప..తానొక్కడినే నిర్ణయాలు తీసుకోనని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

భారత్ విజయలక్ష్యం 261 పరుగులు..

రాంచీ : భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. గుప్తిల్ 72, విలియం సన్ 41, లాథమ్ 39, టేలర్ 35, వాట్లింగ్ 14, డెవిక్ 11, నీషం 6 పరుగులు చేశారు. భారత బౌలింగ్ లో అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీయగా కులకర్ణి, అక్షర్ పటేల్, పాండ్యా, ఉమేశ్ లు చెరో ఒక వికెట్ తీశారు. 

32కి చేరిన ఎఓబీ మృతుల సంఖ్య..

విశాఖపట్టణం : ఏఓబీ ఎన్ కౌంటర్ మృతుల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య 32కి చేరింది. మల్కన్ గిరి అడవుల్లో మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది.

 

మౌలాలీలో కార్మికుడు మృతి..

హైదరాబాద్ : మౌలాలి డీజిల్ లోకో షెడ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఇంజన్ ను రిపేర్ చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ శ్రీనివాసులు అనే కార్మికుడు మృతి చెందాడు. 

16:58 - October 26, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో బెయిలు షరతులు సడలించాలన్న రేవంత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ప్రతి వారం ఏసీబీ ముందు హాజరు కావలన్న షరతుని కోర్టు సడలించింది. అయితే ఏసీబీ ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని తెలిపింది. దర్యాప్తు పెండింగ్‌లో ఉందని ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:53 - October 26, 2016

విజయవాడ : అమరావతి  నిర్మాణంలో భాగంగా పరిపాలనా నగరానికి ఈ నెల 28న కేంద్ర  మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం  3 గంటల నుంచి  4 గంటల మధ్య  జరిగే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. జిల్లా అధికార యంత్రాంగం శంకుస్థాపన స్థలంలో పనులను వేగవంతం చేస్తోంది. 
మరో నిర్మాణానికి అడుగు 
ఏపీ రాజధాని అమరావతిలో మరో నిర్మాణానికి అడుగుపడబోతోంది. ఇప్పటి వరకూ తాత్కాలిక సచివాలయంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం..ఇక నుంచి శాశ్వత రాజధాని నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. రాజధానిలో ప్రధానమైన పరిపాలన నగర నిర్మాణానికి ఈనెల 28న శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ అడ్మినిస్ట్రేటివ్‌ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులూ హాజరు కానున్నారు. 
అడ్మినిస్ట్రేటివ్‌ సిటీకి శంకుస్థాపన 
లింగాయపాలెం, రాయపూడి గ్రామాల అడ్మినిస్ట్రేటివ్‌ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. అదే స్థలంలో.. సుమారు వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనున్నారు. అతిథులు ఈ వేదిక నుంచే ప్రసంగించేలా సన్నాహాలు చేస్తున్నారు. వేదిక నిర్మాణానికి అవసరమైన పనులను జిల్లా అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే ఇతర అధికారులు శంకస్థాపన పనులను పరిశీలించారు. 
భద్రతకు పటిష్ట చర్యలు 
శంకుస్థాపన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానుండటంతో ...భద్రతకు సంబంధించి పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా రూరల్‌ ఎస్పీ నారాయణ నాయక్‌ తెలిపారు. సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు  తలెత్తకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శంకుస్థాపన స్థలాన్ని.. అధికారులతో కలిసి వారూ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఇక మూడురోజులే మిగిలి ఉండటంతో, జిల్లా అధికార యంత్రాంగం పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతోంది. 

16:48 - October 26, 2016

హైదరాబాద్ : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఫిరాయింపుల ఫిర్యాదుపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో తెలపాలని తెలంగాణ స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్‌ 8కి వాయిదా పడింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నేతలపై అనర్హత వేటు వేయాలని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:42 - October 26, 2016

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లిలో విద్యార్థినిల అదృశ్యం కలకలం సృష్టించింది... స్థానిక పాఠశాలలో చదువుతున్న హేమ, నయిమిషా, సుమాన కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.. తమ బిడ్డలు ఎక్కడున్నారో చెప్పాలంటూ పాఠశాలముందు ధర్నా చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:36 - October 26, 2016

హైదరాబాద్ : మెట్రో భవన్ ముందు వైసీపీ ధర్నాకు దిగింది. కమీషన్లకు కక్కుర్తి పడి మెట్రో పనులను నిలిపివేశారని ఆరోపించారు. త్వరితగతిన మెట్రో పనులను పూర్తి చేసి  ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:29 - October 26, 2016

'పవన్ కళ్యాణ్' 'సర్ధార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తరువాత నటిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రానికి 'కాటమరాయుడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. 'పవన్' సరసన మరోసారి 'శృతి హాసన్' నటిస్తోంది.
ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు. ఈ సినిమాలో 'పవన్' స్నేహితుడిగా ఈసారి 'ఆలీ' నటించడం లేదని 'సునీల్' నటించనున్నాడని టాక్. వీలైనంత తొందరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని 'పవన్' భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మార్చి 2017న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో ? వేచి చూడాలి. 

16:00 - October 26, 2016

హైదరాబాద్ : తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్‌తో ఆస్పత్రి పాలైన చిన్నారి సంజన డిశ్చార్జ్ అయింది. ప్రమాదంతో ఈ నెల 2న కోమాలోకి వెళ్లిన పాప... నెమ్మదిగా కోలుకుంది. రోడ్డుదాటుతుండగా పాపతోపాటు.. ఆమెతల్లిని కారు ఢీకొట్టింది. తల్లి శ్రీదేవి కోలుకున్నా... చిన్నారిమాత్రం కోమాలో ఉండిపోయింది. మెరుగైన చికిత్స అందించిన కామినేని వైద్యులు... పాపను డిశ్చార్జ్ చేశారు. మూడు వారాల తర్వాత సంజన నడుస్తుందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సంజన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

15:56 - October 26, 2016

బుల్లితెర సెన్సేషన్ యాంకర్స్ లలో 'అనసూయ' ఒకరు. 'జబర్దస్త్' షో ద్వారా ఈమె పాపులర్ అయ్యింది. అనంతరం వివిధ టెలివిజన్ కార్యక్రమాల్లో యాంకర్ గా చేస్తోంది. తన నటన..హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ యాంకర్ వెండితెరపై కూడా నటించింది. 'సొగ్గాడే చిన్ని నాయన'...'క్షణం' సినిమాల్లో తన నటనతో అందర్నీ మెప్పించింది. తాజాగా ఓ యంగ్ హీరోతో చిందేయనున్నట్లు తెలుస్తోంది. మెగా హీరో 'సాయి ధరమ్ తేజ' నటిస్తున్న 'విన్నర్' సినిమాలో 'అనసూయ' నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓ ప్రత్యేక పాటలో 'సాయి ధరమ్'తో చిందేయనున్నట్లు పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో 'సాయి ధరమ్ తేజ' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' నటిస్తోంది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి మరియు ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని అందుకే ఈ చిత్రానికి 'విన్నర్' అనే టైటిల్ పెట్టినట్లు తెలిసింది. 

15:55 - October 26, 2016

హైదరాబాద్ : వర్షాకాల శాసనసభ సమావేశాల్లో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై వివరణ తీసుకున్నామని ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అన్నారు. 12 మంది వైసీపీ సభ్యుల్లో 9 మంది ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారని తెలిపారు. హాజరు కాని ముగ్గురు వైసీపీ సభ్యులకు డిసెంబర్ 2 వ తేదీ వరకూ సమయం ఇచ్చామని చెప్పారు. అందరి వివరణ తీసుకున్నాక వచ్చే శాసనసభ సమావేశాల కంటే ముందే స్పీకర్ కు నివేదిక అందిస్తామని తెలిపారు. 

 

15:48 - October 26, 2016

మహారాష్ట్ర : టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీ ఎట్టకేలకు ఈమెయిల్‌ ద్వారా స్పందించారు. చైర్మన్‌ పదవి నుంచి తనను తొలగించిన పద్ధతి షాక్‌కు గురిచేసిందంటూ బోర్డు సభ్యులకు పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నారు. తనను తొలగించడం ద్వారా బోర్డుకు ఎలాంటి ప్రశంసలు రాలేదని, కనీసం తన వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని మిస్త్రీ ఆవేదన వ్యక్తం చేశారు. టాటా బోర్డులో తొమ్మిది మంది సభ్యులు ఉండగా.. అందులో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనను సమర్థించారు. మిస్త్రీ స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా రతన్‌ టాటాను నియమించిన విషయం తెలిసిందే.  మిస్త్రీ లీగల్‌చర్యలు తీసుకోకుండా ముందస్తు జాగ్రత్త పడ్డ టాటా గ్రూప్‌  కేవియట్‌ పిటిషన్లను బొంబాయి హైకోర్టులో దాఖలు చేసింది. అయితే, ప్రస్తుత దశలో లీగల్‌ చర్యలు తీసుకొనేందుకు మిస్త్రీ సిద్ధపడటం లేదని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 

 

15:45 - October 26, 2016

కర్నాటక : బళ్లారి గనుల అవినీతి ఆరోపణల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత యడ్యూరప్పకు ఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం యడ్యూరప్పను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. 40కోట్లు అవినీతికి పాల్పడినట్లు యడ్యూరప్పపై కేసు నమోదు కావడంతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై యడ్యూరప్ప, ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని, తాను సచ్ఛీలుడిగా రుజువైందన్నారు. త్వరలో కర్ణటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోర్టు తీర్పు బిజెపికి ఊరటనిచ్చింది. 2011లో అక్రమ మైనింగ్‌ కేసులో యడ్యూరప్పపై లోకాయుక్త అభియోగాలు మోపడంతో ఆయన మూడు వారాల పాటు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

 

స్విస్ ఛాలెంజ్ విధానంలో ఏపీకి చుక్కెదురు..

హైదరాబాద్ : హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్విస్ ఛాలెంజ్ విధానంపై ఏపీ ప్రభుత్వం వేసిన అప్పీల్ ను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని నిర్మాణం కోసం స్విస్ ఛాలెంజ్ విధానంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కొత్త నోటిఫికేషన్ లో త్వరలో విడుదల చేస్తామని, అప్పుడు టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చని ఏజీ పేర్కొన్నారు. 

15:38 - October 26, 2016

డెహ్రడూన్ : ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ గవర్నర్‌ రాంనాయక్‌ను కలిశారు. అఖిలేష్‌కు అత్యంత సన్నిహితుడైన పవన్‌ పాండేను శివపాల్‌ యాదవ్‌ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించిన నేపథ్యంలో సిఎం గవర్నర్‌తో భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన పవన్‌ పాండేను మంత్రి పదవిలో కొనసాగిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. శివపాల్‌తో పాటు నలుగురు మంత్రులను అఖిలేష్‌ తొలగించిన విషయం తెలిసిందే. సిఎం వారిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అన్నది కూడా చర్చనీయాంశమైంది. మరోవైపు శివపాల్‌ యాదవ్‌ తన అధికార నివాసాన్ని ఖాళీ చేస్తున్నట్లు సమాచారం. గవర్నర్‌ను కలిసే ముందు అఖిలేష్‌ తన నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై వారితో చర్చించినట్లు సమాచారం. అనంతరం గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లారు. ముఖ్యమంత్రి పదవికి అఖిలేష్ రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

15:27 - October 26, 2016

కార్తీ...తమిళ యాక్టర్. ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి. 'ఊపిరి' సినిమాతో డైరెక్ట్ గా తెలుగు సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా తర్వాత 'కార్తీ'తో డ్రీం వారియర్ పిక్చర్స్ ఓ ద్విభాషా చిత్రాన్ని చేస్తోంది. 'కాష్మోరా'గా రానున్న ఈ సినిమా ఇటీవల ఆడియో లాంచ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాని తెలుగులో పీవీపీ సినిమా బ్యానర్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అక్టోబర్ 28వ తేదీన విడుదలవుతున్న సందర్భంగా 'కార్తీ' ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా రోమాన్స్ మాత్రం ఉండదని, క్రైమ్, హారర్ అన్ని అంశాలు సమపాళ్లలో ఉన్న చిత్రమిదన్నారు. 'బాహుబలి'తో తమ సినిమాను పోల్చిచూస్తారనే భయముందని, విజువల్ ఎఫెక్ట్స్‌ను సమకూర్చిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేయడం కలిసివస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు. 'కార్తీ' రెండు గెటప్ లో కనిపించనున్నాడు. రాజ్ నాయక్ పాత్ర సీరియస్ గాఉం టుందని, కాష్మోరా పాత్ర వినోదాన్ని పంచుతుందని కార్తీ పేర్కొన్నారు. నయనతార, శ్రీ దివ్యలు హీరోయిన్లుగా నటించారు. 'నయనతార' యువరాణి పాత్రలో నటిస్తోంది. 90 నిమిషాల పాటు వచ్చే గ్రాఫిక్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, తెలుగు, తమిళ భాషల్లో కలిపి 2000 థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు పీవీపీ ప్రసాద్ పేర్కొన్నారు. 

ఓటుకు నోటు..రేవంత్ కు ఊరట..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టి.టిడిపి నేత రేవంత్ రెడ్డికి హైకోర్టులో కొంత ఊరట లభించింది. ప్రతి వారం ఏసీబీ ముందు హాజరు కావాలన్న షరతుని హైకోర్టు సడలించింది. ఓటుకు నోటు కేసులో బెయిల్ షరతులను సడలించాలని రేవంత్ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారించింది. దర్యాప్తు పెండింగ్ లో ఉందని ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీబీ ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని హైకోర్టు రేవంత్ కు సూచించింది. 

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిరాయింపుదారులపై స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో తెలపాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణనను నవంబర్ 8కి వాయిదా వేసింది. 

సచివాలయం కూల్చివేతపై పిటిషన్ వేస్తా - కోమటిరెడ్డి..

హైదరాబాద్ : సచివాలయం కూల్చివేత నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ వేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. వాస్తు పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని, వాస్తు సరిగ్గా లేకపోతే నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పీవీ నర్సింహరావు ప్రధాని ఎలా అయ్యారని ప్రశ్నించారు. 

14:05 - October 26, 2016

పవన్ కళ్యాణ్...సమంతలు మళ్లీ జత కట్టనున్నారా ? వీరిద్దరూ ఓ చిత్రంలో నటించనున్నారా ? అనే చర్చ టాలీవుడ్ లో జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో 'అత్తారింటికి దారేది' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు 'తివిక్రమ్' దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా 'తివిక్రమ్' 'పవన్' కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 'పవన్' నటిస్తున్న 'కాటమమరాయుడు' చిత్రం అయిపోగానే 'తివిక్రమ్' సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. 'పవన్' సరసన నటించే హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ అన్వేషిస్తోందని వినికిడి. కథానాయికగా 'సమంత' పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే ఒకవేళ నిజమైతే 'తివిక్రమ్' దర్శకత్వంలో 'సమంత'కు నాలుగో చిత్రమౌతుంది. 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అత్తారింటికి దారేది', 'అ..ఆ' చిత్రాల్లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు....

14:00 - October 26, 2016

న్యాయసలహాలు,సూచనలు ఇచ్చే మైరైట్ కార్య క్రమం ఈరోజుకూడా మనముందుకు వచ్చేసింది. భారత ప్రభుత్వం గృహహింసని నేరంగా గుర్తించి గృహహింస నిరోధక చట్టం 2005ని తీసుకొచ్చింది. ఈ చట్టం మాత్రం 2007సం.లో రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది . కుటుంబంలో జరిగే ఎటువంటి హింసనైనా ఈ చట్టంతో ఉపశమనం పొందవచ్చు. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ఏర్పాటు చేయటం జరిగింది.వేధింపులకు గురవుతున్న మహిళలకు రక్షణ కవచంగా గృహహింస చట్టంగా పేర్కొనవచ్చు.. ఈ రోజు ప్రధానంగా మహిళలు అనుభవించే గృహహింస నుండి విముక్తి లేక ఉపశమనం పొందే చట్టం 'గృహహింస' చట్టం గురించి తెలిపేందుకు అడ్వకేట్ పార్వతిగారు మైరైట్ కార్యక్రమంలో సిద్ధంగా వున్నారు. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

గవర్నర్ తో ముగిసిన అఖిలేష్ భేటీ..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ గవర్నర్ తో జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. సుమారు అరగంట పాటు ఈ భేటీ కొనసాగింది. సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.  

13:50 - October 26, 2016

రంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర పదోరోజుకు చేరింది.. ఇవాళ బాచుపల్లి, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, పోరళ్ల, కోళ్లపడ్కల్‌, గాంధీనగర్‌తండా, దుబ్బచర్ల, మన్సాన్‌పల్లి క్రాస్‌రోడ్‌లో పాదయాత్ర కొనసాగుతోంది... మరిన్ని సమాచారానికి వీడియో చూడండి..

13:47 - October 26, 2016

హైదరాబాద్ : అన్ని వర్గాలను సమతుల్యం చేసుకుంటూ బీసీల అభివృద్ధికి కృషి చేస్తామని తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బీఎస్ రాములు తెలిపారు. బీసీ కమిషన్‌ చైర్మన్‌గా ప్రభుత్వం తనను నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా బీసీ సంఘం పనిచేస్తుందని చెబుతున్న బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బీఎస్ రాములు తెలిపారు.తాను రచించిన రచనలను ఆచరణకు ఈ సందర్భంగా యత్నిస్తానని రాములు పేర్కొన్నారు. 

13:44 - October 26, 2016

తూర్పుగోదావరి : జె. తిమ్మాపురం నెక్కంటి సీఫుడ్స్‌ ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్ లీకేజీ ఘటన తుందుర్రు ఆక్వాఫుడ్ బాధితులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఫ్యాక్టరీ వల్ల తమ ప్రాణాలకు ముప్పు అని ఎంత చెప్పినా వినకుండా సీఫుడ్స్ ఫ్యాక్టరీ పెట్టారని.. దాని పర్యవసానమే తాజా సంఘటన అని తిమ్మాపురం వాసులు చెబుతున్నారు. దీంతో తుందుర్రులో ఆక్వాఫుడ్ పెట్టొద్దని.. ఇప్పుడు జరిగిన సంఘటనే తుందుర్రులో జరగొచ్చని గ్రామస్తులు భయపడుతున్నారు. అందుకే ఆక్వాఫుడ్ తమ ప్రాంతంలో పెట్టొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల విడుదలయ్యే కాలుష్యం 33 గ్రామాలను నాశనం చేస్తుందని.. రోజుకు 2లక్షల లీటర్ల నీటిని భూమిలో నుంచి తోడేస్తారని విశ్వమానవ వేదిక సభ్యులు చెబుతున్నారు.మరింత సమాచారానికి వీడియో చూడండి..

13:36 - October 26, 2016

ఉత్తరప్రదేశ్ : సమాజ్ వాదీ పార్టీలో ములాయం ఫ్యామిలీ సర్కస్ కొనసాగుతోంది. గవర్నర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. దీనిపై సర్వత్రా ఉత్కంట నెలకొంది. అఖిలేష్ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అఖిలేష్ యాదవ్ కేబినెట్ నుండి బాబాయ్ శివపాల్ యాదవ్ ను తొలగించారు. దీని అఖిలేష్ తండ్రి మాజీ సీఎం ములాకం జోక్యం చేసుకున్నారు. అఖిలేష్..శివపాల్ మధ్య సయోధ్యను కుదిర్చేందుకు సతవిధాలా ప్రయత్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. సమావేశానంతరం ములాయం మాట్లాడుతూ ఎస్పీ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. ఇది జరిగి 24 గంటలు గడవకముందే అఖిలేష్ గవర్నర్ ను కలవటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా శివపాల్ ను అమర్ సింగ్ ను మొదటినుండి వెనకేసుకొచ్చి కుమారుడు అఖిలేష్ లే ములాయం మందలిస్తూ వచ్చిన విషయం తెలిసిందే..

పార్టీలో విభేదాలు లేవు : ములాయం
సమాజ్‌వాది పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. తమ కుటుంబం ఐక్యంగా ఉందని, ఎలాంటి తగాదాలు లేవని, మా పార్టీ కుటుంబం లక్ష్యం ఒక్కటేనన్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించడమే మాముందున్న కర్తవ్యమని ములాయం చెప్పారు. ప్రజలు తమతోనే ఉన్నారని, వారికోసం పనిచేస్తామన్నారు. కొంతమంది అనవసరంగా అమర్‌సింగ్‌ను ఆడిపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. మీడియా సమావేశానికి శివపాల్‌ హాజరు కాగా, అఖిలేష్‌ యాదవ్‌ హాజరు కాకపోవడం గమనార్హం. 

13:26 - October 26, 2016

హైదరాబాద్ : చిన్నారి సంజన డిశార్జ్ అయ్యింది. నగరంలోని అంబర్ పేట వద్ద తాగుబోతుల నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు ఆసుపత్రి పాలైన సంజన కామినేని ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోగ్యవంతురాలయ్యింది. కాగా చికిత్స సంజన స్పందించటంతోనే దాదాపు 80శాతం వరకూ సంజన ఆరోగ్యం మెరుగుపడిందని కామినేని ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు.దీంతో కామినేని ఆసుపత్రి నుండి సంజన నేడు డిశ్చార్జ్ కానుంది. మెరుగైన చికిత్స అందించిన కామినేని వైద్యులు... పాపను డిశ్చార్జ్ చేశారు.. మూడువారాలతర్వాత సంజన నడుస్తుందని వైద్యులు తెలిపారు.. మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.. ఇప్పటికే ఈ ఘటనలో గాయాలకు గురైన తల్లి శ్రీదేవి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. 

గవర్నర్ తో అఖిలేష్..

లక్నో : ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అబ్బాయి..బాబాయ్ మధ్య గొడవలు ఇంకా సద్దుమణగలేదు. కాసేపటి క్రితం సీఎం అఖిలేష్ గవర్నర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం పదవికి అఖిలేష్ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

బాబాయ్..అబ్బాయి..ఇంకా సద్దుమణగని గొడవలు..

ఉత్తర్ ప్రదేశ్ : అబ్బాయి..బాబాయ్ మధ్య గొడవలు ఇంకా సద్దుమణగలేదు. సమాజ్ వాదీ పార్టీలో ఇంకా బహిష్కరణల పర్వం కొనసాగుతోంది. అఖిలేష్ అనుచరుడు పవన్ పాండేపై బహిష్కరణ వేటు పడింది. ఆరేళ్ల పాటు పార్టీ నుండి శివపాల్ బహిష్కరించారు. 

13:07 - October 26, 2016

విశాఖ : తుఫాన్‌గామారిన వాయుగుండం తూర్పు ఆగ్నేయానికి 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.. పశ్చిమ ఆగ్నేయందిశగా ప్రయాణిస్తోంది.. వాయుగుండం రేపు సాయంత్రం ఆంధ్ర తీరంలోకి ప్రవేశించే అవకాశంఉంది.. దీనిప్రభావంతో రేపు సాయంత్రం నుంచి చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.. ఈ నెల 28నుంచి భారీ వర్షాలుపడే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు.. 

12:57 - October 26, 2016

అనంతపురం : కదిరిలో ఓ వ్యక్తి కిడ్నాప్‌ వార్త కలకలం సృష్టిస్తోంది. తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్తుండగా ప్రేమ్‌నాథ్‌రెడ్డిని కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదుచేశారు.. నలుగురు దుండగులు రెండుబైక్‌లపైవచ్చి ప్రేమ్‌నాథ్‌ను ఎత్తుకువెళ్లారని ఆరోపిస్తున్నారు.. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్ కు కారణంగా తెలుస్తోంది. అప్పు సొమ్ము చెల్లించాలని అడిగినందుకు రాణాప్రతాప్‌ అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌ చేసి ఉంటారని బంధువులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.. కిడ్నాపైన ప్రేమ్‌నాథ్.... లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి కుమారుడు. 

12:55 - October 26, 2016

నిజామాబాద్ : కామారెడ్డిలో ఇద్దరు పోకిరీలకు స్థానికులు దేహశుద్ది చేశారు.. సరోజిని రోడ్డులోని ఓ ఇంట్లో యువతి స్నానం చేస్తుండగా... కృష్ణ, నరేష్ సెల్ ఫోన్‌లో వీడియోతీశారు.. ఇది గమనించిన యువతి కేకలు వేయడంతో ఆమె తల్లితోపాటు స్థానికులు యువకుల్ని పట్టుకున్నారు.. ఇద్దరినీ చితకబాది పోలీసులకు అప్పగించారు.. 

12:49 - October 26, 2016

విజయవాడ : పట్టపగలు..కాదంటే అర్థరాత్రి...బెజవాడ రోడ్లపై రయ్ మంటూ సౌండ్ తప్ప ఏమీ కన్పించదు...ఆ వెంటనే మరొకటి...కాస్త అలాగే నిలబడి చూస్తే అప్పుడు అర్థమవుతుంది..రయ్‌మంటూ దూసుకుపోయేవి బైక్‌లేనని...మరీ ఇంతగా వెళ్తున్నదెవరనుకుంటున్నారా యూతే...కుర్రకారు షికార్లు కాదు.. డేంజర్ రైడింగ్‌లే అవి... రకరకాల బైక్ స్టంట్స్‌తో పట్టపగలు సైతం బెంబేలెత్తిస్తుంటారు...దీన్ని నిరోధించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయాత్నాలు అంతంత మాత్రమే... దీంతోనే బైక్ రేసింగ్‌ గ్యాంగ్‌లు పుట్టుకొస్తున్నాయి...ఫేస్‌బుక్‌ల ద్వారా దందా చేస్తున్న నాలుగు ముఠాలు కూడా ఉన్నాయి...మరి ఈ తతంగం ఆపేదెప్పుడు..నగరవాసులకు కంటిమీద కునుకు పట్టేదెప్పుడు....

రేసింగ్‌లో పాల్గొనటానికి ఉవ్విళ్లూరుతున్న యూత్
పోలీసులే ఆశ్చర్య పోతున్నారు....బైక్‌ రేసర్‌ వీడియోను తనలో నిక్షిప్తం చేసుకోలేకపోతున్నానని సీసీ కెమెరాలు సైతం సిగ్గుపడుతున్నాయి...అంతగా దూసుకెళ్తున్న బైక్‌ రైడింగ్‌లు బెజవాడలో పెరిగిపోయాయి... గ్యాంగ్‌లు బెట్టింగ్‌లు పెడుతూ 20 ఏళ్ల కుర్రకారును ఆకర్షిస్తున్నారు..డబ్బు కోసం కాకపోయినా ఆ రేసింగ్‌లో పాల్గొనాలనే ఆశలు రేకెత్తిస్తున్నారు...

బెజవాడ నగరంలో పాశ్చాత్య సంస్కృతి
రాజధాని కేంద్రంగా మారిన బెజవాడ నగరంలో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతుంది..రకరకాల గ్యాంగ్‌లు నగరంలో కొత్త తరహా ఆటను మొదలుపెడుతున్నారు..అందులో ప్రధానమైంది బైక్‌ రేసింగ్... ఇప్పుడీ కల్చర్‌ బెజవాడకు పాకింది..ఒకటి కాదు..రెండు కాదు... నగరంలో ఐదు గ్యాంగ్‌లు చెలరేగుతున్నాయి..దుమ్ములేపుతున్నాయి..దీంతో ఇలాంటి సంస్కృతి పెరిగితే రాబోయే కాలంలో ప్రమాదాలు పెరుగుతాయని పోలీసుల్లో ఆందోళన కన్పించింది...వీటిని ఆదిలోనే తృంచేయాలన్న సంకల్పంతో ఉన్న పోలీసు డిపార్ట్‌మెంట్‌ యాక్షన్‌లోకి దిగింది...

అడ్డొచ్చిన హోంగార్డును గాయపర్చిన రేసర్లు..
బైక్‌ రేసర్లుగా మారేందుకు కారణం కన్నవారేనంటున్నారు పోలీసులు... తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం..గారాభం చేయడం.. కొడుకులు ఉన్నతంగా ఉండాలనుకోవడం కూడా ప్రాణాలకే ముప్పు తెస్తుందంటున్నారు...బైక్‌ నడపడంలోనే కాదు..వారి వ్యక్తిత్వంలో కూడా దూకుడు ప్రభావం పెరిగిందంటున్నారు... మొన్నటికి మొన్న మేజర్లయిన కుర్రాళ్లలో పెరుగుతున్న దూకుడు స్వభావం ప్రమాదాలకు సంకేతమనేనన్నారు..ఇదే కొనసాగితే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళన మొదలయింది....

నాలుగు రకాల గ్యాంగ్‌లు బైక్ రేసింగ్ ఆపరేట్
నగరంలో నాలుగు రకాల గ్యాంగ్‌లు బైక్ రేసింగ్ ఆపరేట్ చేస్తున్నాయన్న సమాచారం పోలీసుల వద్ద ఉంది..సోషల్ మీడియాతో పాటు ఫేస్‌బుక్ ద్వారా కూడా రేసింగ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతున్నాయంటున్నారు కాప్స్...

వ్యూహాత్మక చర్యలకు రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు
నగరంలో పెరుగుతున్న ఇలాంటి పాశ్యాత్య పోకడలనుంచి యూత్‌ను దూరం చేసేందుకు పోలీసులు సన్నద్దమవుతున్నారు.. ఆరంభంలోనే వారిని కట్టడి చేయకపోతే రాబోయే కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయని పోలీసులు వ్యూహాత్మంగా చర్యలు తీసుకోబోతున్నారు...

యువతలో పెరుగుతున్న బైక్ క్రేజ్‌
కాలంతో పాటు...పెరుగుతున్న జనాభాతో పాటు..అంతకు మించి కొత్త కొత్త స్నేహాలు..ఇవే ఎదుగుతున్న యూత్‌ను తప్పుదారి పట్టిస్తున్నాయి.. మంచిని పెంచాల్సిన స్నేహం చెడును ప్రోత్సహిస్తుందనడంలో సందేహం లేదు...దానికి ఉదాహరణే బెజవాడలో దొరికిన బైక్ రేసర్లు...పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని కుర్రాళ్లకు ఇప్పుడు జల్సా బైక్‌ రేసింగ్...నగరంలో అంతకంతకు పెరుగుతున్న క్రేజ్‌ ప్రాణాలకే ముప్పు తెస్తుందని తెలుసుకోలేకపోతున్నారు...

మార్కెట్లోకి వస్తున్న కొత్త రకం బైక్స్...లక్షల్లో పెట్టి కొనుగోలు చేస్తున్న యూత్..
అన్నింటా కొత్తే...అందులో యూత్‌ను ఆకర్షించేది బైక్స్..వీటిలో కూడా సరికొత్త వాహనాలు రావడం..వాటిని రేసింగ్‌లకు వాడుతుండడంతో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతుంది...ఇప్పుడు బెజవాడలో కొనసాగుతుంది కూడా అదే...జనారణ్యంలో చక్కర్లు కొడుతూ ..వాటిపై హైస్పీడ్‌లో వెళ్తూ పందాలు కాస్తున్నవారెందరో ఉన్నారు..వీరి ఆగడాలకు అడ్డూఅదుపు లేకపోవడంతో ప్రజలకు ప్రాణసంకటంగా మారిపోతోంది. వీరిని కెమెరాల్లో బంధించాలన్నా, సెల్ ఫోన్లలో క్లిక్ మనిపించాలన్నా కూడా కెమెరాలకు సైతం అందనంత స్పీడ్ గా బైక్ లపై చెక్కేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు...

బెట్టింగ్‌లకు బెజవాడ వీధులే..
బైక్ రైడర్లంతా ఒక బ్యాచ్ గా ఏర్పడి అటు పోలీసులకు, ఇతరులు గుర్తుపట్టలేనంతగా కాళ్లకు షూ, రెయిన్ కోర్టు తరహాలో పూర్తిగా డ్రెస్సింగ్, మొహం గుర్తుపట్టనంతగా తలకు హెల్మెట్, తలకు క్లాత్ లు పెట్టుకుని బెట్టింగ్ లకు పాల్పడుతూ బెజవాడ వీధులన్నీ ఒక రౌండ్ చుట్టేస్తున్నారంటే ఏ స్థాయిలో నెట్ వర్క్ పెంచుకూపోతున్నారో ఊహించుకోవచ్చు...

అర్థరాత్రి వేళలో బైక్ రైడర్స్
ప్రధాన నగరాలకే పరిమితమైన రేసింగ్‌ ఇప్పుడు బెజవాడ కూడా చేరింది... రాజధానిగా మారడంతో పాటు నగరంలో పెరుగుతున్న రోడ్ల విస్తరణ..కొత్త కొత్త రహదారులు యూత్‌ వికృత ఆటలకు వేదికవుతుంది...40 కిలోమీటర్లలోపు వేగంతో వెళ్లాల్సిన రోడ్లపై 80 నుంచి 120 కిలోమీటర్లు.. ఆపైన వేగంతో రయ్ రయ్ మంటూ ఉడుకు రక్తంతో ఫాస్ట్ ఫాస్ట్ గా దూసుకుపోతుండడం పాదాచారులకు కూడా ఇబ్బందిగా మారుతోంది...

దూసుకెళ్లే వాహనాలతో ఇబ్బందులు..
రాత్రి 10 గంటల తర్వాత ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో ఈ సమాయన్నే బైక్ రైడర్స్ అనుకూలంగా మార్చుకుంటున్నారు. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ సమయంలో ఉండకపోవడంతో విచ్చలవిడి వేగంతో దూసుకెళ్తున్నారు. కొందరు బెట్టింగ్ లు కట్టుకుని మరీ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు...దీనికితోడు సింగల్, ట్రిఫుల్ రైడింగ్, జిగ్ జాగ్ డ్రైవింగ్, స్నేక్ డ్రైవింగ్, వీల్ డ్రైవింగ్ ఇలా అనేక రకాల డేంజర్ స్టంట్లతో బైక్ రైడర్స్ రెచ్చిపోతున్నారు.

పోలీసుల యాక్షన్‌ షురూ...రేసింగ్ కల్చర్‌పై నిఘా...గ్యాంగ్‌లపై ఆరా...
బెజవాడలో పెచ్చుమీరిపోయిన ఈ రేసింగ్ కల్చర్ ను అణచివేసేందుకు సమాయత్తమైన పోలీసులు జులై 12న ఐదుగురు రేసర్లను అరెస్ట్ చేశారు. ఇంకొందరు తప్పించుకుంటూ ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారని, వారందరీకి చెక్ పెడతామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. పోలీసుల బాధ్యతే అనుకుంటే మాత్రం పొరపాటే...కన్నవారి పర్యవేక్షణ కూడా ఉండాలి...పుత్రరత్నాలు బైక్‌లపై ఎక్కడికి వెళ్తున్నారు.. ఏం చేస్తున్నారన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది...ఏదైనా జరగరానిది జరిగితే నష్టపోయేది ముందుగా ఆ కన్నవారేనన్న ధ్యాస ఉండాలి...

పాక్ ఉల్లంఘనలపై కేంద్ర కేబినెట్ భేటీ..

ఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం రేపు సమావేశాం కానుంది. ప్రధాని మోదీ అధ్యకతన జరుగనున్న ఈ సమావేశంలో దేశంలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలతోపాటు, జమ్మూ కశ్మీర్‌లో పాక్ కాల్పుల ఉల్లంఘన తదితర అంశాలపై చర్చించునున్నట్టు సమాచారం.

మహాత్మాగాంధీ విగ్రహాం ధ్వంసం..

ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లాలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేయడం క‌ల‌క‌లం రేపుతోంది. నర్సాపూర్ మండలం బొల్లమాడు గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఆ గ్రామస్తులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. దుండ‌గుల చ‌ర్య‌ను ఖండిస్తూ ఈ రోజు ధ‌ర్నాకు దిగారు. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

12:35 - October 26, 2016

ఒడిశా : మల్కన్ గిరి ఎస్పీ కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్ కౌంటర్ లో మరణించినవారి మృతదేహాలను చూపించకుండా కేవలం ఫోటోలు మాత్రమే చూపిస్తున్నారనీ..మృతదేహాలను చూపించాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టుల కుటుంబ సభ్యులు..హక్కుల సంఘం నేతలు కళ్యాణరావు, వరవరరావు, ఆర్కే భార్య శిరీష్ ఆసుపత్రిముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాగా మృతుల ఫోటోలు మాత్రమే చూపిస్తామని ఎస్పీ మహాపాత్రో స్పష్టం చేశారు. బంధువులకు మాత్రమే మృతదేహాలను అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఎన్ కౌంటర్ పై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ వచ్చే బుధవారానికి వాయిదా పడింది. ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

బోర్డు సభ్యులకు మిస్త్రీ ఈ మెయిల్..

ముంబై : టాటా గ్రూప్ బోర్డు సభ్యులకు సైరస్ మిస్త్రీ ఈమెయిల్ పంపించారు. బోర్డు వ్యవహరించిన తీరు షాక్ కు గురి చేసిందని మెయిల్ లో పేర్కొన్నారు. తన వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని, ఛైర్మన్ పదవి నుండి తొలగించడం అనైతికమన్నారు. 

వెలగపూడి సెంటర్ లో రైతుల ఆందోళన...

గుంటూరు : వెలగపూడి సెంటర్ లో రైతులు ఆందోళన చేపట్టారు. ప్లాట్ల కేటాయింపులో అన్యాయం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఇవ్వాల్సిన ప్లాట్లను ఐనవోలు, శాఖమూరు పక్కన ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలోనే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

12:13 - October 26, 2016

రిటైర్డ్ ఇంజనీర్లతో మంత్రి హరీష్ రావు సమావేశం..

హైదరాబాద్ : జలసౌధలో రిటైర్డ్ ఇంజనీర్లతో మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం..ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చ జరగనుంది. 

ఏపీ ప్రివిలేజ్ కమిటీ విచారణ ప్రారంభం..

హైదరాబాద్ : ఏపీ ప్రివిలేజ్ కమిటీ విచారణ సమావేశం ప్రారంభమైంది. గత సమావేశాల్లో గందరగోళంపై కమిటీ ముందు ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వివరణనివ్వనున్నారు. విదేశాల్లో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని కమిటీకి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సమాచారం అందించారు. 

మల్కన్ గిరి ఆసుపత్రి వద్ద మావోయిస్టు కుటుంబసభ్యుల ఆందోళన..

ఒడిశా : మల్కన్ గిరి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతి చెందిన మావోయిస్టుల కుటుంబసభ్యుల ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో విరసం నేతలు వరవరరావు, కళ్యాణ్ రావు, ఆర్కే భార్య పద్మా అలియాస్ శిరీషలు పాల్గొన్నారు. మావోయిస్టుల ఫొటోలు చూపిస్తున్నారే కానీ మృతదేహాలు చూపించడం లేదని ఆరోపిస్తున్నారు. 

12:07 - October 26, 2016

నెక్కంటి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీ లో మరోసారి గ్యాస్ లీక్..

కాకినాడ : పెద్దాపురం (మం) జె.తిమ్మాపురంలోని నెక్కంటి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో మరోసారి గ్యాస్ లీకేజ్ అయ్యింది. పది మంది కార్మికులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భయంతో కార్మికులు పరుగులు తీశారు. స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. 

ముగ్గురు గురుకుల విద్యార్థినిల అదృశ్యం..

పశ్చిమగోదావరి : భీమడోలు (మం) పోలాసానిపల్లెలో గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. పాఠశాలల వద్ద తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

12:03 - October 26, 2016

ఢిల్లీ : జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఫీల మోన్ రాజా అనే పీహెచ్‌డీ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. బ్రహ్మాపుత్ర హాస్టల్‌లోని తన గదిలో జతుంగ్ ఫీల మోన్ రాజా మృతదేహం లభ్యమైంది. గత రెండు రోజుల నుంచి రాజా గదికి తాళం వేసి ఉంది. మంగళవారం సాయంత్రం రాజా గదిలో నుంచి దుర్వాసన వస్తోంది. దీంతో అనుమానం వచ్చిన విద్యార్థులు వర్సిటీ భద్రతా సిబ్బందిని పిలిపించి గది తలుపులు పగులగొట్టారు. రాజా మృతి చెంది ఉండటంతో షాక్‌కు గురయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జతుంగ్ ఫీల మోన్ రాజా స్వస్థలం మణిపూర్.
ఆచూకీ లేని న‌జీబ్ అహ్మ‌ద్ ..
జేఎన్‌యూకు చెందిన మరో విద్యార్థి అక్టోబ‌ర్ 15వ తేదీ నుంచి న‌జీబ్ అహ్మ‌ద్ అదృశ్య‌మయ్యాడు. ఇంతవరకూ నజీబ్ ఆచూకీ లభ్యం కాలేదు. అవుతోంది. ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియలేదు. ఏబీవీపీ విద్యార్థుల‌తో గొడ‌వ జ‌రిగిన త‌ర్వాత ఆ స్టూడెంట్ క‌నిపించ‌కుండా పోయాడు.

యడ్యూరప్ప నిర్దోషిగా ప్రకటించిన సీబీఐ..

కర్ణాటక : బళ్లారీ మైనింగ్ కేసులో యడ్యూరప్పకు ఊరట లభించింది. యడ్యూరప్పను నిర్దోషిగా సీబీఐ కోర్టు ప్రకటించింది. మైనింగ్ వ్యవహారాంలో యడ్యూరప్ప రూ. 40 కోట్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వెలువడిన సంగతి తెలిసిందే. 

హైకోర్టులో మల్కన్ గిరి ఎన్ కౌంటర్ కేసు విచారణ..

హైదరాబాద్ : హైకోర్టులో మల్కన్ గిరి ఎన్ కౌంటర్ కేసు విచారణ జరిగింది. మృతదేహాలను విశాఖకు తరలించాలని పిటిషనర్ కోరారు. ఎన్ కౌంటర్ ఒడిశాలో జరిగినందున తమ పరిధి కాదని, ఎన్ కౌంటర్ పై పూర్తి సమాచారం అందివ్వాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. విచారణ బుధవారానికి వాయిదా వేసింది. 

11:45 - October 26, 2016

విశాఖ : తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. వాయుగుండం తుపానుగా మారడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. విశాఖ తీరానికి తూర్పు దిశలో 760 కిలోమీటర్ల దూరంలో కీంద్రీకృతమైన వాయుగుండం ఏపీలోనే తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో రేపటి నుంచి కోస్తాలో, రాయలసీమ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

తుపానుకు కయాంత్ నామకరణం
కయాంత్ గా నామకరణం చేసిన ఈ తుపాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా పయనిస్తోంది. ఇది బుధవారం నాటికి ఒకింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. రాగల 36 గంటల్లో తుపాను మరింత బలపడనుంది. పశ్చిమ దిశగా పయనిస్తూ రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. రేపటి నుంచి ఏపీ, ఒడిశాలో తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరిక
మరోవైపు ఈ నెల 27 నుంచి రాష్ట్రంలో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. 28, 29 తేదీల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. అదే సమయంలో ఈ నెల 27 నుంచి కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అలాగే మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. కాగా తుపానుకు ‘క్యాంట్‌’ అనే పేరును మయన్మార్‌ సూచించింది.

11:36 - October 26, 2016

తూర్పుగోదావరి : నెక్కంటి ఆక్వా ఫ్యాక్టరీ వద్ద భయానక పరిస్థితి నెలకొంది. ఫ్యాక్టరీలో మరో సారి గ్యాస్ లీక్అయ్యింది. దీంతో భయాందోళనలకు లోనైన కార్మికులు భారీగా గేట్ వైపు దూసుకొచ్చారు. దీంతో కొంత తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఈ ఘటనలో 40 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పెద్దాపురం మండటం జె.తిమ్మాపురం నెక్కంటి ఆక్వా ఫ్యాక్టరీలో మంగళవారం గ్యాస్ లీక్ అయి 27మంది కార్మికులు తీవ్రంగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వీరింకా డిశార్జ్ కాలేదు. ఇంతలోనే ఫ్యాక్టరీలో మరో ప్రమాదం జరిగింది. కాగా మంగళవారం అస్వస్థతకు గురయినవారికి న్యాయం చేయాలని ఫ్యాక్టరీ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆందోన చేపట్టినవారిపై ఫ్యాక్టరీ యాజమాన్యం గూండాలతో దాడిచేయించింది. ఫ్యాక్టరీలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం..భయానక స్థితి నెలకొంది. 

11:25 - October 26, 2016

విశాఖ : ఏవోబీ ఎన్ కౌంటర్ ఘటనలో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను పోస్ట్ మార్టం పూర్తయ్యింది. మల్కన్ గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయ్యింది. సోమ, మంగళవారాల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మొత్తం 28 మంది మృతి చెందారు. దీంటో మొదటిరోజు 24గురు, రెండవరోజు 4 మృతి చెందారు. వీరిలో 24గురుకి పోస్ట్ మార్టం పూర్తవ్వగా బుధవారం మరో నలుగురికి పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం పరిశీలించేందుకు మృతులకు సంబంధించిన ఆర్కే భార్య శిరీష, కళ్యాణ్ రావు, విరసం నేత వరవరరావు ఆసుపత్రిలో పరిస్థితిని సమీక్షించారు. మావోలకు ప్రధమ చికిత్స చేసే ఆర్ఎంపీ డాక్టర్లపై ఏవోబీ సరిహద్దు ప్రాంతాలలో పోలీసలు నిఘా పెట్టారు. ఇప్పటివరకూ 14 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మరో 14మందిని గుర్తించాల్సివుంది.  

11:04 - October 26, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం మరికొద్దిసేపట్లో జరగనుంది. ఈ సమావేశానికి ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, సునీల్ కుమార్, కే.సంజీవయ్య, కంబాల జోగులు అనే ఎమ్మెల్యేలు కమిటీ ముందు హాజరుకానున్నారు. కాగా మంగళవారం మొదటి విడతగా ప్రివిలేజ్ కమిటీకి ఆరుగురు హాజరుకావాల్సి వుండగా నలుగురు మాత్రమే హాజరయ్యారు. చెవిరెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే ఆరోగ్యరీత్యా హాజరుకాలేకపోతున్నామని కమిటీ చైర్మన్ గుల్లపల్లి సూర్యారావుకు లెటర్ పంపించారు. బుధవారం రెండో విడద ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. వర్షాకాల సమావేశాల్లో ఏపీ ప్రత్యేక హోదా అంశంపై అసెంబ్లీ హాల్లో వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.

సంక్షేమ రంగంపై బాబు టెలీ కాన్ఫరెన్స్..

విజయవాడ : సంక్షేమ రంగంపై సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ప్రభుత్వాలు సంక్షేమ రంగం సక్రమంగా అమలు చేయనందుకే పేదల జీవన ప్రమాణాలు పెరగలేదన్నారు. ఆర్థిక సంస్కరణల్లో సంక్షేమ రంగానికే ప్రాధాన్యవుందన్నారు. మున్సిపల్ ఏజెన్సీ ప్రాంతాల్లో చంద్రన్న భీమా కార్యాక్రమం మరింగా వేగం పుంజుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రూ.25వేల కోట్లతో 100 స్కూల్స్ ను అప్ గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. 

నెక్కంటి ఆక్వా ఫ్యాక్టరీలో మరోప్రమాదం!..

తూర్పుగోదావరి : నెక్కంటి ఆక్వా ఫ్యాక్టరీలో మరో సారి ప్రమాదం సంభవించింది. పెద్దాపురం మండటం జె.తిమ్మాపురం నెక్కంటి ఆక్వా ఫ్యాక్టరీలో మంగళవారం గ్యాస్ లీక్ అయి 27మంది కార్మికులు తీవ్రంగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వీరింకా డిశార్జ్ కాకముందే మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మంగళవారం అస్వస్థతకు గురయినవారికి న్యాయం చేయాలని ఫ్యాక్టరీ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. 

ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం.

పశ్చిమ గోదావరి : భీమడోలు మండలం పొలసానిపల్లిలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. బాలికల గురుకుల వసతిగృహం నుంచి విద్యార్థినులు అదృశ్యమైనట్లు సిబ్బంది గుర్తించారు. వసతిగృహం సిబ్బంది ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

10:46 - October 26, 2016

హైదరాబాద్ : ప్రివిలేజ్ కమిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యేల తొలి రోజు విచారణ పూర్తయ్యింది. ఈ విచారణకు మొదటిరోజు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. సభలో తమకు అవకాశం ఇవ్వలేదనే కారణంతోనే నిరసన వ్యక్తం చేశామని..ఈ విషయాన్ని అధికార పార్టీ రాద్ధాంతం చేసిందని..విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదాపై పోరాడుతున్న తమపై కావాలనే సభాహక్కుల సంఘానికి అధికార పార్టీ ఫిర్యాదు చేసిందని ఆరోపించారు.

ప్రివిలేజ్ కమిటీ కి వైసీపీ ఎమ్మెల్యేల తొలి రోజు విచారణ పూర్తి
అసెంబ్లీ సమావేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారన్న కారణంతో నోటీసులు అందుకున్న ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలలో ..నలుగురు మాత్రమే హాజరయ్యారు. కొడాలినాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విచారణకు హాజరు కాలేదు. ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్న తమపై అన్యాయంగా సభాహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారని విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. గతంలో ఇంతకన్నా పెద్ద సంఘటనలు జరిగినా వాటిని అధికార పార్టీ పట్టించుకోలేదని అన్నారు.

బుధవారం విచారణ అనంతరం స్పీకర్ కు నివేదిక : గొల్లపల్లి
సభా హక్కుల ఉల్లంఘన పేరిట 12 మంది వైసీపీ సభ్యులకు నోటీసులు పంపించారు. తొలిరోజు ప్రివిలేజ్ కమిటీ ముందు నలుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వీరి నుంచి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌ గొల్లపల్లి సూర్యారావు వివరాల్ని అడిగి తెలుసుకున్నానన్నారు. బుధవారం కూడా మరో ఆరుగురు సభ్యులను విచారించి ఓ నివేదిక తయారుచేస్తామన్నారు. ఆ తర్వాతే నివేదికను స్పీకర్‌కు సమర్పిస్తామని తెలిపారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది : స్పీకర్ కోడెల
వైసీపీ సభ్యుల వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సభాపతిగా తనకు ఎవరి మీద కోపంలేదని తెలిపారు. సభను సాఫీగా నడపటమే తన బాధ్యతని...ఆ పనిని సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

విచారణ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
మొదటి రోజు నలుగురు ఎమ్మెల్యేల వివరణను తీసుకున్న కమిటీ...తరువాత మిగతా ఎనిమిది మందిని విచారించనుంది. అనంతరం సభాహక్కుల సంఘంలోని అందరు సభ్యులు సమావేశమై చర్య తీసుకోవాలా...వద్దా..అన్న విషయాన్ని చర్చించనున్నారు. 

ఏపీలో వాహనాలకు జీపీఎస్..

గుంటూరు : రాష్ట్రంలో తిరిగే ప్రతి వాహనానికీ విధిగా జీపీఎస్‌ అమర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను నిర్దేశించారు. టోల్‌గేట్ల దగ్గర స్కానర్లు, కెమెరాలు అమర్చి తాగి వాహనాలు నడిపేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. డ్రైవింగ్‌ లైసెన్సుల జారీకి, కొత్త వాహనాల రిజిస్ర్టేషన్లకు ఆధార్‌ తప్పనిసరి చేశామని రవాణా కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యం సీఎంకు వివరించారు. అలాగే రాష్ట్రంలో 9చోట్ల డ్రైవింగ్‌ ట్రాక్‌లను వినూత్న విధానంలో ఏర్పాటుచేస్తున్నామన్నారు. 

కాసేపట్లో రెండోవిడత ప్రివిలేజ్ సమావేశం..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం మరికొద్దిసేపట్లో జరగనుంది. ఈ సమావేశానికి ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, సునీల్ కుమార్, కే.సంజీవయ్య, కంబాల జోగులు అనే ఎమ్మెల్యేలు కమిటీ ముందు హాజరుకానున్నారు. కాగా మంగళవారం మొదటి విడతగా ప్రివిలేజ్ కమిటీకి ఆరుగురు హాజరుకావాల్సి వుండగా నలుగురు మాత్రమే హాజరయ్యారు. బుధవారం రెండో విడద ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది.

సికింద్రాబాద్ కు 8గంటల విద్యుత్ కట్..

సికింద్రాబాద్‌ : నేడు 8 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. జేమ్స్ స్ట్రీట్‌లో సబ్ స్టేషన్ పరికరాలను మారుస్తున్న కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోత ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

10:25 - October 26, 2016

విశాఖ : ఏవోబీలో కూంబింగ్ కొనసాగుతోంది. మంగళవారం ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోల మృతదేహాలకు బుధవారం మల్కన్ గిరి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. మల్కన్ గిరి ఎస్పీ కార్యాలయంలో పోస్టు మార్టంకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ పరిధిలోని చెక్ పోస్టుల వద్ద తనిఖీలను అధికారులు ముమ్మరం చేశారు. సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 24మందికి ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయ్యింది. పోస్ట్ మార్టం పరిశీలించేందుకు మృతులకు సంబంధించిన ఆర్కే భార్య శిరీష, కళ్యాణ్ రావు, విరసం నేత వరవరరావు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మావోలకు ప్రధమ చికిత్స చేసే ఆర్ఎంపీ డాక్టర్లపై ఏవోబీ సరిహద్దు ప్రాంతాలలో పోలీసలు నిఘా పెట్టారు.

నేడు చిన్నారి సంజన డిశ్చార్జ్...

హైదరాబాద్ : తాగుబోతుల నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి సంజన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. నేడు కామినేని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానుంది. ఇప్పటికే ఈ ఘటనలో గాయాలకు గురైన తల్లి శ్రీదేవి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. 

నలుగురు మావోయిస్టు మృతదేహాలకు పోస్టుమార్టం..

విశాఖపట్టణం : మల్కన్ గిరిలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్పీ కార్యాలయానికి వరవరరావు, కళ్యాణ్ రావు, ఆర్కే భార్య శిరీష చేరుకున్నారు. ఇప్పటికే 24 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లోని ఆర్ఎంపీ డాక్టర్లపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. 

09:44 - October 26, 2016
09:41 - October 26, 2016

ముంబై : టాటా సన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ పల్లోంజీ మిస్త్రీకి ఉద్వాసన పలకడం దేశ కార్పొరేట్‌ రంగంలో సంచలనం సృష్టించింది. ఈయన ఎంపికే కాదు...నిష్క్రమణ కూడా ఆశ్చర్యకర రీతిలో జరగింది. 7 లక్షల కోట్ల టాటా గ్రూప్‌కు సారథిగా వచ్చిన మిస్త్రీని... ఉన్నపళంగా, అర్థాంతరంగా ఎందుకు సాగనంపారు? దేశ పారిశ్రామిక వర్గాల్ని తీవ్ర షాక్‌కు గురిచేసిన ఈ ఘటనకు అసలు కారణం ఏమిటి?

సైరస్ మిస్త్రీని తొలగిస్తూ టాటా సన్స్‌ బోర్డు సంచలన నిర్ణయం
భారత దేశంలో అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగిస్తూ టాటా సన్స్‌ బోర్డు తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. 2012, డిసెంబరు 29న రతన్‌ స్థానంలో 48 ఏళ్ల సైరస్ పల్లోంజి మిస్త్రీ టాటా గ్రూప్‌ పగ్గాలు చేపట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అనూహ్యంగా అతి తక్కువ సమయంలోనే ఆయనకు ఉద్వాసన పలికారు. దీనికి కారణమేంటి అన్న ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది.

సైరస్‌ మిస్త్రీ పనితీరు బాగాలేంటున్న టాటా బోర్డు
సంస్థ సీఈఓగా సైరస్‌ మిస్త్రీ పనితీరు అస్సలు బాగాలేని కారణంగానే బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి సైరస్‌ మిస్త్రీని తొలగించాలన్న నిర్ణయం ఇప్పటికి ఇప్పుడే తీసుకున్నది కాదు.... టాటా గ్రూప్‌ కొన్ని వారాలుగా ఈ అంశంపై తర్జనభర్జన పడుతోందని సమాచారం. టాటా గ్రూప్‌లో ఎన్నో కంపెనీల్లో.. కేవలం రెండు కంపెనీలు మాత్రమే లాభాల బాటలో పయనిస్తున్నాయని, మిగతా కంపెనీలన్నీ తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయని.. దీనికి సైరస్‌ మిస్త్రీ తీరే కారణమని బోర్డు భావించినట్లు భోగట్టా. పైగా రుణాలను తగ్గించడం కోసం ఆస్తులను విక్రయించడానికే మిస్త్రీ అధిక ప్రాధాన్యత ఇచ్చారని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

మిస్త్రీ ఉద్వాసన ప్రకటనతో బోర్డు మీటింగ్‌లో గందరగోళం
మిస్త్రీని తొలగించే ప్రక్రియ కూడా అత్యంత నాటకీయంగా సాగినట్లు టాటావర్గాల సమాచారం. ఎప్పుడూ ప్రశాంతంగా జరిగే టాటా సన్స్‌ బోర్డ్‌ సమావేశాలు సోమవారం పూర్తి భిన్నంగా జరిగిందని, మిస్త్రీ ఉద్వాసన నిర్ణయం ప్రకటించడంతో ఒక్కసారిగా బోర్డు మీటింగ్‌లో గందరగోళం ఏర్పడిందని ఇన్‌సైడర్లు పేర్కొన్నారు. కావాలనే బోర్డు ఎజెండాలో మిస్త్రీ ఉద్వాసన అంశాన్ని చేర్చలేదని చెబుతున్నారు.

న్యాయసలహా చూపించాలంటూ మిస్త్రీ డిమాండ్‌
తన తొలగింపు అంశంపై షాక్‌ తిన్న మిస్త్రీ ఈ నిర్ణయం నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. టాటా నిబంధనల పుస్తకం ప్రకారం కనీసం 15రోజుల ముందైనా నోటీసు ఇవ్వాలని, బోర్డు ఎదుట తన వాదన వినిపించుకొనేందుకు అవకాశముంటుందని మిస్త్రీ పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, తాము ముందే "న్యాయసలహా' తీసుకున్నామని బోర్డు సభ్యులు మిస్త్రీకి చెప్పారని, ఆ న్యాయసలహా తనకు చూపించాలన్న మిస్త్రీ డిమాండ్‌కు.. ఇదేమీ కోర్టు హియరింగ్‌ కాదంటూ బోర్డు సభ్యులు తోసిపుచ్చినట్లు చెబుతున్నారు.

బాంబే హైకోర్టును ఆశ్రయించే యోచనలో మిస్త్రీ
బోర్డు నిర్ణయాన్ని సవాల్‌ చేయాలని భావిస్తున్న సైరస్‌ మిస్త్రీ -బాంబే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. టాటా సన్స్‌ బోర్డులోని తొమ్మిది మంది సభ్యుల్లో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనకు మద్దతు పలికారు. ఇద్దరు గైర్హాజరయ్యారు. తొమ్మిదో సభ్యుడైన మిస్త్రీ ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు నిరాకరించారు. టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రేసులో ఆరుగురు పేర్లు తెరపైకి వచ్చాయి. పెప్సికో చైర్మన్ ఇంద్రా నూయీ, వొడాఫోన్‌ మాజీ సిఈఓ అరుణ్‌ శరిణ్, టాటా ఇంటర్నేషనల్‌ ఎండీ నోయెల్‌ టాటా, టిసీఎస్‌ అధిపతి ఎన్‌.చంద్రశేఖరన్‌, టాటా గ్రూప్‌కు చెందిన ఇషాత్‌ హుస్సేన్, బి.ముత్తురామన్‌లున్నారు. నియోల్‌ టాటా, ఇంద్రా నూయీలకే ఎక్కువ అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

09:33 - October 26, 2016

రంగారెడ్డి : పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై తమ్మినేని సీఎంకు లేఖ రాశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్‌ నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తుక్కుగూడ ఇండస్ట్రియల్‌ ఏరియాలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామన్న కేసీఆర్‌ ఆ ఊసే ఎత్తడం లేదని తమ్మినేని విమర్శించారు. ప్రజలను ఐక్యం చేసేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నామని పాదయాత్ర బృందంలోని నేతలు తెలిపారు.

200 కిలో మీటర్ల పాదయాత్ర..కంచె ఐలయ్య మద్ధతు
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా...జనంతో మమేకమై సాగుతున్న మహాజన పాదయాత్ర తొమ్మిదో రోజుకి 200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం లేమూరు వద్ద ప్రారంభమైన పాదయాత్ర గూడూరు, బండగూడూరు, మీదుగా కందుకూరు, దబ్బెడగూడ, మీర్‌ఖాన్‌పేట, కందుకూరు మండలం మేదునూరు చేరుకుంది. మేదునూరులో పాదయాత్ర బృందానికి అపూర్వ స్వాగతం లభించింది. తొమ్మిదో రోజు 25.1 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. ఇక్కడ రంగారెడ్డి జిల్లా పార్టీ ఉద్యమ నిర్మాణ సారధులు పాషా, నరహరిల స్మారక స్థూపాన్ని తమ్మినేని ఆవిష్కరించారు. ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య సీపీఎం మహాజన పాదయాత్రకు మద్దతు తెలిపారు.

పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్న స్థానికులు
మహాజన పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్లిన అక్కడ గిరిజనులు, ప్రజలు తమ సమస్యలను తమ్మినేని బృందానికి విన్నవిస్తున్నారు. సీపీఎం మహాజన పాదయాత్రకు ఐద్వాతో పాటు ఇతర మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సీపీఎం పార్టీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని పాదయాత్ర బృందంలోని నేతలు తెలిపారు. 

09:24 - October 26, 2016

అనంతపురం : రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. తుంగభద్ర కాలువ కింద నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లాలో రఘువీరారెడ్డి పాదయాత్ర చేపట్టారు. పంటలన్నీ ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదనదని రైతులు వాపోతున్నారన్నారు.కాంగ్రెస్‌ హయాంలో రైతులను అన్ని విధాలా ఆదుకున్నామని తెలిపారు.నీటి విడుదల కోసం చంద్రబాబు కర్నాటక సర్కార్‌తో ఎందుకు మాట్లాడటం లేదనీ..గతంలో మేము అధికారంలో ఉండగా కర్నాటకతో చర్చించి నీళ్లు తీసుకువచ్చామన్నారు.రైతుల రుణాలు మాఫీ చేయాతనీ..తగిన నష్టపరిహారమివ్వాలని ఈ సందర్భంగా రఘువీరా డిమాండ్ చేశారు. 

09:23 - October 26, 2016

హైదరాబాద్ : నగరంలో బ్రెస్ట్ క్యాన్సర్ పై పింక్ వాక్ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేబీఆర్ పార్క్ నుంచి బసవతరాకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వరకు ఈ వాక్ నడిచింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కవిత, హీరో బాలకృష్ణ, నటి మంచు లక్ష్మి హాజరయ్యారు. 

09:20 - October 26, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో అవినీతిని సహించేది లేదన్నారు మేయర్‌. రోడ్ల అవినీతిపై విచారణ కొనసాగుతుందని.. ఎంతటివారైనా చర్యలు తప్పవన్నారు. శానిటేషన్‌లో బోగస్‌ కార్మికులను గుర్తించేందుకు బయో మెట్రిక్‌ విధానాన్ని త్వరలో అమలు చేస్తామని మేయర్‌ ప్రకటించారు.. జీహెచ్ ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అర్ధరాత్రి నగరంలో పర్యటించారు. పలు ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్ల మరమ్మతులను పరిశీలించారు. ఆరాంఘర్‌ చౌరస్తా, ఆసిఫ్‌నగర్‌, మల్లేపల్లి, కూకట్‌పల్లి వై జంక్షన్‌ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులను చూశారు.. అధికారులను అడిగి పనుల వివరాల్ని తెలుసుకున్నారు..

పనుల్లో నాణ్యత లేకపోతే సహించేది లేదు -మేయర్‌
హైదరాబాద్‌లో రోడ్లు వేయకుండానే పనులు పూర్తి చేసినట్లు వెబ్‌సైట్‌లో సమాచారం పొందుపర్చిన వ్యవహారంలో ఓ అధికారిని సస్పెన్షన్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరుగుతుందని.. అవసరమైతే ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామన్నారు మేయర్‌ బొంతు రామ్మోహన్‌. మరోవైపు పనుల్లో నాణ్యత లేకపోతే సహించబోమని.. ఎంతటివారైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మేయర్‌కు వినతిపత్రం అందజేసిన ఇంజనీర్లు
ఇదిలావుంటే.. డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ను సస్పెండ్‌ను నిరసిస్తూ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట వివిధ భాగాల ఇంజనీరింగ్‌ అధికారులు ధర్నా చేపట్టారు. వెంటనే సస్పెన్షన్‌ ఎత్తివేయాలంటూ మేయర్‌కు వినతిపత్రం అందించారు.

శానిటేషన్‌లో లోపాలు అరికడతాం : మేయర్‌
ఇక స్వచ్చ హైదరాబాద్‌ లక్ష్యంగా పని చేస్తున్న బల్దియా శానిటేషన్‌లో లోపాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు బొంతు రామ్మోహన్‌. కార్మికుల్లో అనేకమంది బోగస్‌ కార్మికులు ఉన్నారని.. తాను స్వయంగా రాత్రిళ్లు పర్యటించినప్పుడు ఈ విషయం బయటపడిందన్నారు. దీనిని అరికట్టేందుకు కార్మికులకు బయో మెట్రిక్‌ విధానాన్ని అమలు చేయడంతోపాటు.. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న శానిటరీ సూపర్‌వైజర్లను బదిలీ చేస్తామన్నారు మేయర్‌.

స్వీట్‌షాపులపై దృష్టిపెట్టిన జీహెచ్‌ఎంసీ
ఇక దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో స్వీట్‌షాపులపై దృష్టి సారించాలని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను మేయర్‌ ఆదేశించారు. పండుగకు ప్రజలు భారీ ఎత్తున స్వీట్లు కొనుగోలు చేయనున్న నేపథ్యంలో ఎలాంటి కల్తీ లేకుండా షాపుల యజమానులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా కల్తీ జరిగినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే తాను స్వయంగా షాపులను తనిఖీ చేస్తానన్నారు. 

ఏపీపై దూసుకొస్తున్న 'కయాంత్'!

విశాఖపట్నం: క్యాంట్‌ తుపాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైపే దూసుకొస్తోంది. తొలుత పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల వైపు వెళ్తుందనుకున్న ఈ తుపాను చివరకు దిశ మార్చుకుంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 27 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం మధ్యాహ్నానికి తుపానుగా బలపడింది. ఇది ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 600, విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 705, మచిలీపట్నానికి తూర్పు ఈశాన్య దిశలో వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

09:12 - October 26, 2016

జమ్ము కశ్మీర్ : పాకిస్థాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌పై పాక్ భద్రతా సిబ్బంది కాల్పులకు తెగబడింది. గడిచిన 20 గంటలుగా ఆర్‌ఎస్‌పురా సెక్టార్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. పాక్ కాల్పుల్లో 11 మంది పౌరులకు గాయాలయ్యాయి. మోర్టార్ దాడుల కారణంగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాక్ కాల్పులను భారత్ బలగాలను ధీటుగా ఎదుర్కొంటోంది. ఉరి ఉగ్రవాద ఘటన తరువాత పాకిస్థాన్ 40సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. అత్యంత అప్రమత్తంగా వున్న భారత్ భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వుంది. పాక్ సరిహద్దుల వెంట వున్న గ్రామాలకు సంబంధించిన స్థానికులను ఇప్పటికే తరలించారు. పంట చేతికొచ్చే సమయంలో వేరే ప్రాంతానికి తరలటంపై ఇష్టపడని స్థానిక వ్యవసాయదారులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టకపోవటంతో పాక్ పాల్పడుతున్న కాల్పులకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది. పాక్ ప్రధానంగా భారత్ రక్షణ స్థావరాలను..స్థానిక గ్రామాలపై కాల్పులకు పాల్పడుతోంది. 

ఆర్‌ఎస్ పురా సెక్టార్‌పై పాక్ కాల్పులు..

జమ్ము కశ్మీర్ : పాకిస్థాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌పై పాక్ భద్రతా సిబ్బంది కాల్పులకు తెగబడింది. గడిచిన 20 గంటలుగా ఆర్‌ఎస్‌పురా సెక్టార్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. పాక్ కాల్పుల్లో 11 మంది పౌరులకు గాయాలయ్యాయి. మోర్టార్ దాడుల కారణంగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

ఢిల్లీ : నగరంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బారఖాంబా రోడ్డులోని ఓ భవనం 11వ అంతస్తు నుంచి పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. 10 అగ్నిమాపక శకటాలతో మంటలార్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సివుంది.

08:53 - October 26, 2016
08:52 - October 26, 2016

ఆలిండియా హోంగార్డ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ సకినాల నారాయణ నిరాహారదీక్షకు దిగడంతో హోంగార్డుల సమస్యలు మరోసారి ఎజెండా మీదకు వచ్చాయి. అరెస్టులు, ధర్నాలు, ఆత్మహత్యాయత్నాలతో వాతావరణం మరింత వేడెక్కింది. హోంగార్డుల ఆందోళనకు విభిన్న రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. హోంగార్డుల ఆందోళనకు కారణమేమిటి? హోంగార్డుల వర్కింగ్‌ కండిషన్స్‌ ఎలా వున్నాయి? హోంగార్డులు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు హోంగార్డ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జంగోజి గారు, హోంగార్డు సుజాత 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

08:51 - October 26, 2016

హోంగార్డులకు ఉద్యోగ భద్రత లేదు. రోజుకి 400 రూపాయల వేతనంతో పనిచేయాల్సి వస్తోంది. వీక్లీ ఆఫ్‌ లుండవు. ఏ ఒక్కరోజు సెలవు పెట్టినా జీతం కట్‌ అవుతుంది. ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న హోంగార్డులు తమను రెగ్యులరైజ్‌ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.

వెట్టిచాకిరీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన హోంగార్డులు
ఒంటిపై ఖాకీ దుస్తులు. కాళ్లకు బూట్లు. చేతిలో లాఠీలు. పోలీసు శాఖలో ఉద్యోగం. ఈ ఉపమానం చాలదు హోంగార్డ్స్‌ని వర్ణించడానికి.ఖాకీలేసుకున్న వారి కళ్ల నిండా కన్నీటి సుడులుంటాయి. ఆ కళ్లలోకి సూటిగా చూస్తే గుండెలోతుల్లో తగిలిన గాయాలు కనిపిస్తాయి. వారి హృదయాన్ని ఒక్కసారి మెత్తగా స్పృశిస్తే ఎన్నాళ్లుగానో దాచుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంటుంది.

దేశంలో ఆరు లక్షల మంది హోంగార్డులు
వారి మాటలు, బాధలు, కష్టాలు వింటే అదొక ఉద్యోగం కాదనీ, అదో భయంకర శిక్ష అనే అభిప్రాయం కలుగుతుంది. మన దేశంలో ఆరు లక్షల మంది హోంగార్డులందరి గుండెల్లో గూడుకట్టుకున్న ఆవేదన్నంతా ఒక్కటే. ఇంతభయంకరమైన శిక్షను ఇంకెంతకాలం అనుభవించాలన్నదే వారి ఆక్రందన.

1962లో హోంగార్డుల వ్యవస్థ పునర్‌ వ్యవస్థీకరణ
భారత్‌ చైనా యుద్ధం నేపథ్యంలో 1962లో హోంగార్డ్‌ వ్యవస్థను పునర్‌ వ్యవస్థీకరించారు. అత్యవసర సమయాల్లో ఔత్సిహికుల సేవలను వినియోగించుకునే ఉద్దేశంతో ఏర్పాటైన హోంగార్డుల వ్యవస్థ చివరకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ లో వెట్టి చాకిరీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్, క్రైం, సీఐడీ, గ్రేహాండ్స్‌, ఆక్టోపస్‌, టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌, ఫైర్‌, వాటర్‌ వర్క్స్‌, ఆర్టీసీ, రైల్వే ఇలా హోంగార్డ్స్‌ సేవలు వాడుకోని విభాగమంటూ లేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో 40 వేల మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 7వేల మంది హోంగార్డులున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్స్‌ డ్యూటీలలో వుండేవారిలో అత్యధికులు హోంగార్డులే. పొద్దస్తమానం దుమ్మూ ధూళి, కాలుష్యం పీలుస్తున్న కారణంగా వీరికి శ్వాసకోశవ్యాధులొస్తున్నాయి. పది పన్నెండు గంటలు నిలుచొని పనిచేయడం వల్ల కాళ్లనొప్పులొస్తున్నాయి.

కట్టు బానిసల్లా హోంగార్డుల జీవితాలు..
ట్రాఫిక్స్‌ డ్యూటీకి మించిన నరకం మరొకటి వుంది. అదే బాస్‌ల ఇళ్లలో పనిచేయడం. ఎస్‌ ఐ స్థాయి నుంచి ప్రతి పోలీస్‌ ఆఫసర్‌కీ వీరు కట్టుబానిసల్లాగా పనిచేయాల్సిన దుస్థితి. కూరగాయలు, కిరాణా సామాన్లు తీసుకురావడం, బూట్లు పాలిష్‌ చేయడం, బట్టలు ఉతకడం, ఇల్లు ఊడ్చడం, అంట్లు తోమడం, అయ్యవారితోపాటు అమ్మవారికీ సేవలు చేయడం, చెప్పులు మోయడం ఇలాంటివన్నీ చేసేది హోంగార్డులే. చాలామంది పోలీస్‌ బాస్‌ల ఇళ్లలో హోంగార్డులకు పనిమనుషులకు ఇచ్చే గౌరత కూడా దక్కదు.

రోజుకు రూ.400ల వేతనం..
వానొచ్చినా, వరదొచ్చినా, గొడవలైనా, రాస్తారోకోలైనా, బందులైనా, కర్ఫ్యూలైనా, పండగలైనా, మీటింగ్‌లైనా, ఉత్సవాలైనా, ఊరేగింపులైనా ఎక్కడ ఏది జరిగినా మరుక్షణంలో ఆ ప్రాంతానికి పరుగులు తీసేది హోంగార్డులే. మన దేశంలో 22 లక్షల పోలీస్‌ పోస్టులుంటే అందులో దాదాపు అయిదన్నర లక్షల పోస్టులు ఖాళీగానే వున్నాయి. ఈ పనిభారం అంతా మోస్తున్నదీ హోంగార్డులే. శాంతిభద్రతల నిర్వహణలో, ట్రాఫిక్‌ వ్యవస్థ నియంత్రణలో అత్యంతకీలక సేవలు అందిస్తున్న హోంగార్డులకిస్తున్నది నెలసరి వేతనం కాదు. రోజువారీ కూలీ. ముక్కుతూ మూలుగుతూ వారికిస్తున్నది రోజుకి 400 రూపాయలు. ఒక్క ఆబ్సెంట్‌ కాకుండా నెల మొత్తం చెమటోడ్చి, వళ్లంతా హూనం, మనస్సంతా గాయం చేసుకున్నా వీరికి వచ్చేది కేవలం 12 వేల రూపాయలే. ఇందులోనూ పై ఆఫీసర్లు కొంత నొక్కేస్తున్నా ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించలేని దీనస్థితి హోంగార్డులది. రికార్డ్స్‌ లో చూపించే లెక్కలకీ, వీరి చేతిలో పెట్టే డబ్బుకీ అసలు పొంతనే వుండదు. అదేమని అడిగితే ఉద్యోగం పీకేస్తారేమోనన్న భయం . ఇతర ప్రాంతాల్లో డ్యూటీకి వెళ్లిన అలవెన్స్‌లేవీ ఇవ్వరు.

పోలీస్‌ ఉద్యోగాల భర్తీలో హోంగార్డులకు దక్కని వెయిటేజీ
ఏళ్ల తరబడి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నా కనీసం కానిస్టేబుళ్ల నియామకాలలో కూడా వీరికి రిజర్వేషన్లుకానీ, ప్రత్యేక ప్రాధాన్యతలు కానీ వుండవు. హోంగార్డుగా పనిచేస్తుండడమే వారికి కానిస్టేబుళ్ల నియామకాలలో శాపంగా మారుతోంది. కానిస్టేబుల్‌ ఉద్యోగాల పరీక్షకు ప్రిపేర్‌ కావాలంటే నాలుగు రోజులు సెలవు పెట్టే అవకాశం కూడా లేని అభాగ్యులు వీరు. సెలవు అడిగితే బాస్‌ లు ఉగ్రరూపం చూపిస్తారు. రోజుకి పది పన్నెండు గంటలు డ్యూటీ చేస్తుండడంతో కనీసం దేహదారుఢ్యాన్ని పెంచే వ్యాయామాలు చేసుకునే టైం కూడా వీరికి చిక్కదు.

మహిళా హోంగార్డుల పరిస్థితి మరింత దయనీయం
మహిళా హోంగార్డుల పరిస్థితి మరింత దయనీయం. లైంగిక వేధింపులు షరామామూలు. డ్యూటీ సమయంలో టాయ్‌లెట్స్‌కి వెళ్లడానికి కూడా వీలులేని దీనత్వం . దీంతో వీరిని యూరినరీ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ఏదో ఒక రోజు తమ ఉద్యోగం పర్మినెంట్‌ అవుతుందనీ, జీతాలు పెరుగుతాయన్న ఆశే ఇన్ని బాధలు భరించే శక్తిని స్తోంది. కానీ పదేళ్లు పదిహేనేళ్లు అంతకు మించి డిపార్ట్‌ మెంట్‌ కోసం సేవలందించినా వీరిపట్ల న్యాయంగా వ్యవహరించే ప్రభుత్వాలే కనిపించడం లేదు. పోలీస్‌ బాస్‌లు తమను కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదన్న ఆవేదన ప్రతి హోంగార్డు గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది

అందుకే పింక్ రిబ్బన్ వాక్ : కవిత

హైదరాబాద్ : అందరి కోసం పనిచేసే మహిళ తన ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బ్రెస్ట్ కేన్సర్ అవగాహన కోసమే పింక్ రిబ్బన్ వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యాధిని గుర్తించిన తర్వాత చికిత్సకు వెళ్లడం కంటే రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు. బ్రెస్ట్ కేన్సర్ ఒకటి వస్తుందని తెలియని వారు చాలామంది ఉన్నారని, అటువంటి వారిలో అవగాహన కల్పించేందుకు బసవతారకం కేన్సర్ ట్రస్ట్ పింక్ రిబ్బన్ వాక్‌ను నిర్వహిస్తోందని, వారికి తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. 

అందుకే పింక్ రిబ్బన్ వాక్ : కవిత

హైదరాబాద్ : అందరి కోసం పనిచేసే మహిళ తన ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బ్రెస్ట్ కేన్సర్ అవగాహన కోసమే పింక్ రిబ్బన్ వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యాధిని గుర్తించిన తర్వాత చికిత్సకు వెళ్లడం కంటే రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు. బ్రెస్ట్ కేన్సర్ ఒకటి వస్తుందని తెలియని వారు చాలామంది ఉన్నారని, అటువంటి వారిలో అవగాహన కల్పించేందుకు బసవతారకం కేన్సర్ ట్రస్ట్ పింక్ రిబ్బన్ వాక్‌ను నిర్వహిస్తోందని, వారికి తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. 

08:46 - October 26, 2016

తూర్పుగోదావరి : ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నెక్కంటి సీఫుడ్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు బైటాయించారు. ఆందోళనకారులపై ఫ్యాక్టరీ యాజమాన్యం గూండాలు దాడికి పాల్పడ్డారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఫ్యాక్టరీలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం జరగటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పెద్దాపురం మండలం జె.తిమ్మాపురం సీఫుడ్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం రాత్రి నెక్కంటి సీఫుడ్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ఘటనలో దాదాపు 27మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. వీరికి నష్టపరిహారం అందించాలనీ..దీనికి కారణమైన ఫ్యాక్టరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. 

మద్యం మత్తుతో మరో ప్రమాదం..

హైద‌రాబాద్‌: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.స్పందించిన స్థానికులు చికిత్సకోసం వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన సరూర్‌నగర్‌ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కర్మన్‌ఘాట్‌ నుంచి గాయత్రీనగర్‌ వైపు వెళ్తుండగా క్రాంతీనగర్‌ వద్దకు చేరుకోగానే వెనక నుంచి వేగంగా వచ్చిన కారు వాటిని ఢీకొటింది. అదే వేగంతో ఆపకుండా పరారవుతున్న డ్రైవర్ ను స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవరు వెంకటకృష్ణారెడ్డి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు.

08:45 - October 26, 2016

జార్ఖండ్ : భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య కీలక మ్యాచ్‌కు రాంచీలో రంగం సిద్ధమైంది.5 వన్డేల సిరీస్‌లోని కీలక నాలుగో వన్డేలో నెగ్గి సిరీస్‌ సొంతంచేసుకోవాలని ధోనీసేన తహతహలాడుతుండగా.......అంచనాలకు మించి రాణించి సిరీస్‌ను సమం చేయాలని కివీస్‌ టీమ్ పట్టుదలతో ఉంది.

5 వన్డేల సిరీస్‌లోని కీలక నాలుగో వన్డేకు రాంచీ రెడీ
మెన్‌ ఇన్‌ బ్లూ , బ్లాక్‌ క్యాప్స్‌ జట్ల వన్డే సిరీస్‌ క్లైమాక్స్‌ దశకు చేరుకుంది. 5 వన్డేల సిరీస్‌లోని ఆసక్తికర పోరుకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.కీలక నాలుగో వన్డేకు రాంచీలోని జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది.

ధర్మశాల వన్డేలో భారత్  సునాయాస విజయం..
ధర్మశాల వన్డేలో బౌలర్ల షోతో భారత్‌ సునాయాస విజయం సాధించగా....లో స్కోరింగ్‌ థ్రిల్లర్‌లా సాగిన ఢిల్లీ వన్డేలో కివీస్‌ టీమ్‌ ధోనీసేనకు షాకిచ్చింది. మొహాలీ వన్డేలో విరాట్‌ కొహ్లీ సూపర్‌ సెంచరీతో సంచలన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

భారత్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి..
ధోనీ హోంగ్రౌండ్‌ జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో జరుగనున్న నాలుగో వన్డేలోనూ భారత్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌కొహ్లీ,జార్ఘండ్‌ డైనమైట్ ధోనీ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో భారత్‌ బ్యాటింగ్‌ ఎప్పటిలానే పటిష్టంగా ఉంది. ఇక ఓపెనర్లు రోహిత్‌ శర్మ,అజింక్య రహానే,మనీష్‌ పాండే,కేదార్‌ జాదవ్‌ సైతం పూర్తి స్థాయిలో చెలరేగితే కివీస్‌ టీమ్‌కు కష్టాలు తప్పవు.

సిరీస్‌లో భారత విజయాల్లో బౌలర్లదే కీలక పాత్ర
మూడు వన్డేల్లోనూ హార్దిక్‌ పాండ్య, ఉమేష్‌ యాదవ్‌, కేదార్‌ జాదవ్‌,అమిత్‌ మిశ్రా, జస్ప్రీత్‌ బుమ్రా....న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు ఎలా కట్టడి చేశారో అందరికీ తెలిసిందే. సిరీస్‌కు ముందు బలహీనంగా కనిపించిన బౌలింగ్‌ ఎటాక్‌ ప్రస్తుతం ప్రమాదకరంగా కనిపిస్తోంది. సిరీస్‌లో భారత విజయాల్లో బౌలర్లదే కీలక పాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. అస్వస్థత కారణంగా సురేష్‌ రైనా ఏకంగా సిరీస్‌కే దూరమవ్వడంతో ....మూడు వన్డేల్లో ఆడిన జట్టుతోనే భారత జట్టు
పోరాడి ఓడిన న్యూజిలాండ్
మరోవైపు తొలి వన్డేలో తేలిపోయి...రెండో వన్డేలో అంచనాలకు మించి రాణించిన న్యూజిలాండ్‌ జట్టు ...మూడో వన్డేలోనూ పోరాడి ఓడింది. టామ్‌ లాథమ్‌ నిలకడగా రాణిస్తుండటంతో పాటు...కెప్టెన్‌ కేన్‌ విలియమ్‌సన్‌, రాస్‌ టేలర్‌, జిమ్మీ నీషమ్‌ తిరిగి ఫామ్‌లోకి రావడంతో కివీస్‌ టీమ్‌ బ్యాటింగ్‌ సైతం భారత్‌కు ధీటుగా ఉంది.

టాప్‌ క్లాస్‌ పేస్‌ బౌలర్లతో కివీస్‌ బౌలింగ్ ఎటాక్‌
మార్టిన్‌ గప్తిల్‌, ల్యూక్ రాంకీ, కోరీ యాండర్సన్‌ వంటి హార్డ్‌ హిట్టర్లు సైతం గాడిలో పడితే కివీస్‌ టీమ్‌కు తిరుగుండదు. ట్రెంట్‌ బౌల్ట్‌,టిమ్‌ సౌథీ, మ్యాట్‌ హెన్రీ వంటి టాప్‌ క్లాస్‌ పేస్‌ బౌలర్లతో కివీస్‌ బౌలింగ్ ఎటాక్‌ పదునుగా ఉంది. ఢిల్లీ వన్డేలో ట్రెంట్‌ బౌల్ట్‌,టిమ్‌ సౌథీ తమ అనుభవాన్నంతా ఉపయోగించి భారత బ్యాట్స్‌మెన్‌కు ఎలా బోల్తా కొట్టించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కీలకం కానున్న టాస్
జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో భారత్‌కు మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. రాంచీలో భారత్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. రెండో సారి బ్యాటింగ్‌ చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉండటంతో టాస్‌ కూడా కీలకం కానుంది.

కివీస్‌ బౌలింగ్‌ ఎటాక్‌కు మధ్య మరోసారి పోరు
ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌, ప్రస్తుత ఫామ్‌ చూస్తే భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నా...న్యూజిలాండ్‌ జట్టును అసలేమాత్రం తక్కువ అంచనా వేయలేం. భారత బ్యాటింగ్‌కు ..కివీస్‌ బౌలింగ్‌ ఎటాక్‌కు మధ్య మరోసారి హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. రాంచీ వన్డేలో నెగ్గి ధోనీసేన సిరీస్‌ సొంతం చేసుకుంటుందా లేక న్యూజిలాండ్‌ జట్టు సిరీస్‌ను సమం చేయగలుగుతుందో లేదో తెలియాలంటే తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్‌చేయాల్సిందే.

08:44 - October 26, 2016

విశాఖ : ఏవోబీలో ఎన్‌కౌంటర్‌ పరంపర మంగళవారమూ కొనసాగింది. 24 మంది మావోయిస్టులు మరణించి 24 గంటలు కాకముందే.. పోలీసుల తూటాలకు మరో నలుగురు మావోయిస్టులు నేలకొరిగారు. రామ్‌గఢ్‌-పనస్‌పుట్‌ అటవీ ప్రాంతంలోనే మళ్లీ కాల్పులు జరిగాయి.

తాజా ఘటనలో నలుగురు మావోయిస్టుల మృతి
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. సోమవారం ఎన్‌కౌంటర్‌ జరిగిన రామ్‌గఢ్-పనస్‌పుట్ అటవీ ప్రాంతంలోనే మళ్లీ కాల్పులు జరిగాయి. తాజా ఘటనతో 24 గంటల వ్యవధిలో పోలీసుల తూటాలకు మరణించిన మావోయిస్టుల సంఖ్య 28కి చేరింది.

28కి చేరిన మావోల మృతుల సంఖ్య
మరోవైపు మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌పై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, పోలీసుల హత్యాకాండ అని విమర్శించాయి. 28 మంది చనిపోయారని చెబుతూ.. కేవలం 11 మంది మృతదేహాలనే చూపడం అమానవీయమని ప్రజాసంఘాలు దుయ్యబట్టాయి. పోలీసులు ఇంకా కాల్పులు జరుగుతున్నాయని చెప్పడంలో వాస్తవం లేదని, అదుపు లోకి తీసుకున్న మావోయిస్టులను ఒక్కొక్కరిగా చంపేందుకు చేస్తున్న కుట్రేనని ప్రజాసంఘాలు విమర్శించాయి. మావోయిస్టులను చిత్ర హింసలకు గురిచేసిన పోలీసులు.. ఆ గాయాలను సమసిపోయేలా చేసేందుకు వివరాలు వెల్లడించకుండా గందరగోళం సృష్టిస్తున్నారని ప్రజాసంఘాల నేతలు విమర్శించారు.

బూటకపు ఎన్‌కౌంటర్‌ : అరుణ తండ్రి లక్ష్మణ్
ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, కాల్పుల్లో మృతి చెందిన అరుణ తండ్రి లక్ష్మణ్‌ అన్నారు. అరుణ, ఆజాద్‌ ఇద్దరు తన బిడ్డలేనని లక్ష్మణ్‌ తెలిపారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను భరించలేకనే అరుణ, ఆజాద్‌ మావోయిస్టులుగా మారారని ఆయన తెలిపారు. అరుణ 2003లో తనను కలిసిందని, ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ప్రభుత్వం చంపడమే పనిగా పెట్టుకుందని, ఎన్ని ఎన్‌కౌంటర్లు చేసినా.. కొత్త నీరు వచ్చి చేరుతుందని ప్రజాసంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. పోలీసులు ఏవోబీలో ఇంకా కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు. జరుగుతున్న ఘటనలతో.. సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

 

08:43 - October 26, 2016

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఏర్పాటుపై ఉద్యోగ సంఘాల మధ్య లడాయి ప్రారంభమైంది. టాస్‌ ఏర్పాటును రెవిన్యూ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే... గ్రూప్‌ వన్‌ అధికారులు సమర్ధిస్తున్నారు. టాస్‌ అవసరంలేదని రెవిన్యూ అధికారులు వాదిస్తుంటే.... జిల్లాల విభజన నేపథ్యంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ తప్పనిసరని గ్రూప్‌ వన్‌ అధికారులు చెబుతున్నారు.

గ్రూప్‌-1 అధికారులు / రెవెన్యూ అధికారులు
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌... టాస్‌.. ఇప్పుడు ఉద్యోగ సంఘాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర సర్వీస్‌ అధికారుల తరహాలో తెలంగాణలో రాష్ట్ర సర్వీస్‌ క్యాడర్‌ అధికారులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివలన అన్ని విషయాల్లో కేంద్ర సర్వీస్‌ అధికారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని రాష్ట్రం భావించింది.

టాస్‌ ఏర్పాటును పరిశీలించేందుకు ఎంజీ గోపాల్‌ అధ్యక్షతన కమిటీ
టాస్‌ ఏర్పాటును పరిశీలించేందుకు మున్సిపల్‌ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్‌ అధ్యక్షతన ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఆదేశాల ప్రకారం గ్రూప్‌ వన్‌ అధికారుల సంఘం, రెవిన్యూ అధికారుల సంఘాలను వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న విధానాలపై నివేదికలు సమర్పించాలని కోరింది. గ్రూప్‌ వన్‌ అధికారులు కేరళ, కర్నాటక, రాజస్థాన్‌, జార్ఖండ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించి టాస్‌కు అనుకూలంగా నివేదిక సమర్పించింది. రెవిన్యూ ఉద్యోగుల సంఘం మాత్రం ఒకే రాష్ట్రంలో పర్యటించింది. గ్రూప్‌ వన్‌ అధికారుల నివేదికను రెవిన్యూ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది.

గ్రూప్‌ వన్‌ అధికారుల ఆవేదన
టాస్‌ ఏర్పాటు చేస్తే అధికారులందరికీ సమాన అవకాశాలు దక్కుతాయని గ్రూప్‌ వన్‌ అధికారులు చెబుతున్నారు. రెవిన్యూలో కింది స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నతాధికారులుగా పదోన్నతులు వస్తుంటే, ఇతర శాఖల్లోని గ్రూప్‌ వన్‌ అధికారులకు ఈ అవకాశం లేకండా పోతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అయితే రెవిన్యూ ఉద్యోగులు ఈ వాదాన్ని తోసిపుచ్చుతున్నారు.

అన్ని శాఖల్లో కూడా డైరెక్టర్‌ పోస్టులు సృష్టించాలి : శ్రీనివాస్ గౌడ్
పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఏర్పాటుచేసి, అన్ని శాఖల్లో కూడా డైరెక్టర్‌ పోస్టులు సృష్టించాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ సూచిస్తున్నారు. టాస్‌ ఏర్పాటుపై ఉద్యోగ సంఘాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో.... ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

 

08:40 - October 26, 2016

ఢిల్లీ : తెలంగాణలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు గ్రాంటును పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. పీఎంకేఎస్‌వై కింద నిర్మాణంలో ఉన్న పదకొండు ప్రాజెక్టులకు ఏడు వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు... కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతికి విజ్ఞప్తి చేశారు. అలాగే నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినట్టు మిషన్‌ కాకతీయకు ఐదు వేల కోట్ల రూపాయల గ్రాంటు ఇవ్వాలని కోరారు...

ఉమాభారతితో భేటీ అయిన హరీష్ రావు
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకం కింద చేపడుతున్న సాగునీటి ప్రాజెక్ట్‌లు గురించి చర్చించేందుకు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల మంత్రులు, అధికారులతో కేంద్ర జలవనరుల మంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చించారు.

పీఎంకేఎస్‌వై కింది దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులు
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకం కింద చేపడుతున్న ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారు. పీఎంకేఎస్‌వై పథకం కింద దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులుగా చేపడుతుండగా, వీటిలో తెలంగాణకు చెందిన 11 పథకాలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్ట్‌లకు 77వేల595 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్ట్‌లకు 7 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని లెక్క తేల్చారు. వీటిలో కేంద్ర ప్రభుత్వ గ్రాంటుతోపాటు, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు.... నాబార్డు రుణం కూడా ఉంది. పీఎంకేఎస్‌వై కింద చేపడుతున్న సాగునీటి ప్రాజెక్ట్‌ల కోసం నాబార్డు ఇటీవల 15 వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ రుణంలో రాష్ట్రానికి రావాల్సిన వాటాపై ఉమా భారతితో హరీశ్‌రావు చర్చించారు. ద్రవ్య నియంత్రణ, బడ్జెట్‌ నిర్వహణ.. ఎఫ్‌ఆర్‌బీఎంతో పరిమితితో ముడిపెట్టకుండా ఈ రుణాన్ని ఇవ్వాలని కోరారు. దేవాదులకు ఇస్తున్న 25 శాతం గ్రాంటును 60 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఉమా భారతి సానుకూలంగా స్పందించారని హరీశ్‌రావు చెబుతున్నారు.

రూ. 5వేల కోట్లు ఇవ్వండి : హరీష్ రావు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చెరువులు పునరుద్ధరణ కార్యక్రమం... మిషన్‌ కాకతీయకు కూడా ఐదు వేల కోట్ల రూపాయల గ్రాంటు ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు.

బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ నిర్ణయంపై ఈనెల 29 కీలక భేటీ
సాగునీటి ప్రాజెక్ట్‌లకు కేంద్రం నుంచి రావాల్సిన ఆరొందల కోట్ల రూపాయల గ్రాంటును కూడా వెంటనే విడుదల చేయాలని హరీశ్‌రావు... ఉమా భారతికి విజ్ఞప్తి చేశారు. దేవాదులకు 300 కోట్లు, ఎస్‌ఆర్‌ఎస్‌పీకి 200 కోట్లు, భీమా ఎత్తిపోతల పథకానికి వంద కోట్ల రూపాయలు వంతున గ్రాంటు రావాల్సి ఉన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు కృష్ణా జలాల కేటాయింపులను రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ.. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీసుకున్న నిర్ణయంపై ఈనెల 29న జరిగే మంత్రివర్గం ఉపసంఘం భేటీలో చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు వాదిస్తున్న న్యాయవాది వైద్యనాథన్‌కు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలపై ఏం చేయాలన్న అంశంపై ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది. 

08:38 - October 26, 2016

ఢిల్లీ : పాఠశాల స్థాయిలో డిటెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించింది. ఈ విధానం సరైందని కాదని ఢిల్లీలో జరిగిన సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సమావేశంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వాదించారు. టినెన్షన్‌తో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న కొన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల వాదనలతో కడియ శ్రీహరి విబేధించారు. సమావేశానికి హాజరైన మరికొన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణతో ఏకీభవించాయి. దీంతో డిటెన్షన్‌ విధానంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టారు.

 

08:34 - October 26, 2016

విజయవాడ : ఏపీలో హోదా రగడ మళ్లీ హీటెక్కింది. హోదా అంశంపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ ప్రధాన ప్రతిపక్షం వైసిపి పట్టుబడుతుండగా..హోదా వల్ల కలిగే లాభాలకు జగన్‌ అడ్డుపడుతున్నారని అధికార పక్షం విమర్శిస్తోంది. దీంతో రాష్ట్రంలో అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

పవన్ కళ్యాణ్‌కు ఎటాక్ కు జగన్ స్కెచ్ ?
ఆంధ్రప్రదేశ్‌లో హోదా రగడ మళ్లీ ఊపందుకుంది. రాష్ట్రంలో ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ను ప్రధాన ప్రతిపక్షం మళ్లీ రగిలించే ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక హోదాపై పెరుగుతున్న పొలిటికల్ హీట్‌ను మరింత పెంచేందుకు వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. హోదాపై అధికార పక్షంతో పాటు పవన్ కళ్యాణ్‌కు ధీటైన సమాధానం ఇచ్చేందుకు వైఎస్‌ జగన్ స్కెచ్ వేస్తున్నారు.

కర్నూలులో యువభేరీలో జగన్
కర్నూలులో జరిగిన యువభేరీ కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల లోపు ప్రత్యేక హోదా హామీ నెరవేర్చకపోతే తమ ఎంపీల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తామన్నారు. అందరు కలిసి పోరాడితే ప్రత్యేక హోదా ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్నారు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఎంపీలు పోరాడి సాధించుకోగా..పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హోదా హామీని మనం సాధించుకోలేమా అని ఆ్రగహం వ్యక్తంచేశారు.

హోదా కోసం పోరాటం: జగన్
ప్రత్యేక హోదా వస్తేనే ఏపీకి మేలు జరుగుతుందని వైఎస్ జగన్ అన్నారు. హోదా కోసం పోరాటం కొనసాగించాల్సిందే అని జగన్‌ పిలుపునిచ్చారు. అయితే గతంలోనే ఇందుకు సంబంధించి వైసీపీ అధినేత ప్రకటన చేసినా..తాజాగా ఈ వ్యవహారం మరోసారి చర్చనీయంశంగా మారింది. పార్టీ ఎంపీలతో పాటు సీనియర్ నేతలతో ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరిపినట్లు పార్టీ నేతలు అంటున్నారు. వచ్చే నెల మొదటివారంలోపే ఎంపీల రాజీనామాలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎంపీల రాజీనామాతో కేంద్రం దిగిరాక పోయినా..ప్రజాక్షేత్రంలో పార్టీకి మరింత పట్టు పెరుగుతుందన్న ధీమా ప్రతిపక్ష పార్టీలో కనిపిస్తోంది.

కొత్త పరిశ్రమలకు ఎందుకు అడ్డుపడుతున్నారు: అచ్చెన్నాయుడు
అయితే జగన్‌ చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం ఘాటుగా స్పందించింది. ఓ వైపు ప్రత్యేక హోదా రావాలంటున్న జగన్‌...రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకు ఎందుకు అడ్డుపడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

హోదా గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదు : ప్రత్తిపాటి
హోదా గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదని..మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పార్టీ మనుగడ కోసమే హోదా గురించి జగన్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికే జగన్ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని అంటున్నాడని..ఒకవేళ రాజీనామా చేసినా..ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు.

జగన్ రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగిస్తాడా?
మొత్తానికి ఏపీలో మళ్లీ ప్రత్యేక హోదాపై రగడ మొదలైంది. హోదాపై కేంద్రం స్పందించకపోతే జగన్ రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగిస్తారా లేదా అన్నది మరికొద్ధి రోజుల్లో తేలనుంది. 

08:21 - October 26, 2016

ఏపీలో హోదా రగడ మళ్లీ హీటెక్కింది. హోదా అంశంపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ ప్రధాన ప్రతిపక్షం వైసిపి పట్టుబడుతుండగా..హోదా వల్ల కలిగే లాభాలకు జగన్‌ అడ్డుపడుతున్నారని అధికార పక్షం విమర్శిస్తోంది. దీంతో రాష్ట్రంలో అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలులో జరిగిన యువభేరీ కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల లోపు ప్రత్యేక హోదా హామీ నెరవేర్చకపోతే వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తామన్నారు.ఈ వ్యవహారం మరోసారి చర్చనీయంశంగా మారింది. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. చర్చలో విజయ్ కుమార్ (టీడీపీ నేత) కరణం ధర్మశ్రీ ( వైసీపీ నేత)రమాదేవి (సీపీఎం నేత) పాల్గొన్నారు. పాల్గొన్న నేతల అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..చర్చలో పాల్గొన్న టీడీపీ నేత విజయ్ కమార్ మాట్లాడుతూ..వైసీపీ నేతలు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో వస్తే పోటీ చేసి గెలిచేందుకు టీడీపీ సిద్ధంగా వుందనీ..రాజీనామా చేసే ధైర్యం వైపీపీ వుందాని ప్రశ్నించారు. 

అటవీ శాఖలో ఉద్యోగాలు..

హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త. అటవీశాఖలో ఖాళీగా ఉన్న 2014 పోస్టులను భర్తీ చేయనుంది. 2014 పోస్టులను భర్తీ చేయాలన్న ప్రతిపాదన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వద్దకు చేరిందని అధికారవర్గాలు తెలిపాయి. ఏయే క్యాటగిరీల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో నివేదిక పంపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అటవీశాఖను ఆదేశించారు.

అర్థరాత్రి మేయర్ పర్యటన..

హైదరాబాద్ : అర్థరాత్రి మేయర్ బొంతు రామ్మోహన్ సుడిగాలి పర్యటన చేశారు. నగరంలోని రోడ్లును పరిశీలించారు. ఆరంఘర్ చౌరస్తా,అసిఫ్ నగర్, మల్లేపల్లి, కూకట్ పల్లి,వై.జంక్షన్ పనులను మేయర్ పరిశీలించారు. 

Don't Miss