Activities calendar

27 October 2016

ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని హోంగార్డు ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ : సీఎస్‌ రాజీవ్‌శర్మతో హోంగార్డుల సంఘం ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో తెలంగాణ సచివాలయం ముందు హోంగార్డుల ఆందోళన కొనసాగుతోంది. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. మరో మహిళా హోంగార్డు సృహతప్పి పడిపోయింది. సర్వీస్‌ రెగ్యులర్‌ చేయాలని ప్రధాన డిమాండ్‌ చేస్తున్నారు. సచివాలయం ముట్టడికి హోంగార్డుల యత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. హోంగార్డుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

21:57 - October 27, 2016
21:55 - October 27, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో విచారణ మళ్లీ ప్రారంభమైంది. ఓటుకు నోటు కేసు నుంచి తనను తప్పించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఈ కేసు విచారణను మళ్లీ ప్రారంభించింది. ఇంతకుముందు ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే ఇవ్వగా.. పిటిషనర్లు దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు వారాల్లోగా ఈ కేసును తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో మళ్లీ విచారణ ప్రారంభమైంది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదాపడింది. 

 

21:52 - October 27, 2016

హైదరాబాద్ : బిసి కమిషన్ సమాజంలోని వివిధ కులాల స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు, ప్రతిపాదనలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. బిసి కమిషన్ ఛైర్మన్ గా బి.ఎస్.రాములు, సభ్యులుగా వకుళాభరణం కృష్ణమోహన్, జూలూరి గౌరీ శంకర్, ఆంజనేయ గౌడ్ లు పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా బిసి కమిషన్ చేయాల్సిన పనులు, బిసి కులాల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్‌ సూచనలు ఇచ్చారు. తెలంగాణలో కూడా తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల శాతం పెంచేందుకు శాసనసభలో చట్టం చేసి పార్లమెంటుకు పంపనున్నట్లు సీఎం చెప్పారు. 

 

21:47 - October 27, 2016

హైదరాబాద్ : కులాల మధ్య అంతరాలు తొలగాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రవీంద్రభారతిలో బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీసీ కమిషన్‌ చైర్మన్‌గా బిఎస్‌ రాములు, సభ్యులు ఆంజనేయ గౌడ్, గౌరీ శంకర్, కృష్ణమోహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. మంత్రి జోగు రామన్న అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి ఈటెల ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కొత్త ఛైర్మన్ బిఎస్ రాములు నేతృత్వంలోని బీసి కమిషన్ కొత్త ఒరవడితో చరిత్రలో నిలిచిపోయేలా పనిచేయాలన్నారు ఈటెల. బీసీల సమస్యలపై లోతుగా అధ్యయనం చేసి పరిష్కరానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పటి వరకు బీసీల జనాభా ఎంతో లెక్కలు లేవని ఆవేదన వ్యక్తం చేసారు.  కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, ఎంపీలు బాల్క సుమన్, వినోద్  పాల్గొన్నారు. 

 

21:44 - October 27, 2016

హైదరాబాద్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న హోంగార్డులు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు. సీఎస్ రాజీవ్‌శర్మతో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో.. హోంగార్డులు సచివాలయ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు.. ఆందోళన చేస్తున్న హోంగార్డులను అరెస్ట్‌ చేసి వారి ధర్నాను భగ్నం చేశారు. 
హోంగార్డులు ఆందోళన ఉద్రిక్తం 
సర్వీస్‌ రెగ్యులర్‌ చేయాలంటూ హోంగార్డులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సీఎస్ రాజీవ్‌శర్మతో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో.. హోంగార్డులు తెలంగాణ సచివాలయ ముట్టడికి యత్నించారు. ఇందిరాపార్క్‌ నుంచి సచివాలయం వైపు భారీ ర్యాలీగా తరలివచ్చిన హోంగార్డులు ఒక్కసారిగా సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల లాఠీచార్జీలో పలువురు హోంగార్డులు గాయపడ్డారు. 
సచివాలయం గేట్‌ వద్ద బైఠాయింపు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన హోంగార్డులు సచివాలయం గేట్‌ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. 
హోంగార్డులకు అనేక సంక్షేమ పథకాలు అమలు : డీజీపీ
మరోవైపు.. హోంగార్డుల ఆందోళనపై స్పందించిన డీజీపీ అనురాగ్‌శర్మ.. హోంగార్డులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. హోంగార్డులకు 5 లక్షల ప్రమాద బీమా, తీవ్రవాదుల దాడిలో చనిపోయిన హోంగార్డులకు, 30 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇస్తున్నామని డీజీపీ చెప్పారు. హోంగార్డులు వెంటనే విధుల్లో చేరాలని.. లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. 
హోంగార్డు ఆత్మహత్యాయత్నం 
అటు హోంగార్డులు మాత్రం స్పష్టమైన హామీ కోసం పట్టుపట్టారు. ఓ హోంగార్డు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. మరో హోంగార్డు సృహతప్పి పడిపోయాడు.  దీంతో సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

 

హోంగార్డుల ఆందోళనపై స్పందించిన డీజీపీ అనురాగ్‌శర్మ..

హైదరాబాద్ : హోంగార్డుల ఆందోళనపై స్పందించిన డీజీపీ అనురాగ్‌శర్మ.. హోంగార్డులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. హోంగార్డులకు 5 లక్షల ప్రమాద బీమా, తీవ్రవాదుల దాడిలో చనిపోయిన హోంగార్డులకు, 30 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇస్తున్నామని డీజీపీ చెప్పారు. హోంగార్డులు వెంటనే విధుల్లో చేరాలని.. లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. 

21:38 - October 27, 2016

ఎమ్మెల్యేలందరికీ డబుల్ స్టోర్ ఇళ్లు....సర్కార్ పెట్టిందట దీని మీద కళ్లు, కోతిని దించవొయ్యి.. హనుమంతున్ని జేసిర్రు....స్వచ్ఛ భారత్ కింద చెత్త పని జేసిర్రు, డల్లాస్ రోడ్ల మీద పోరగాల పాటలు.... రిమ్ జుమ్ రిమ్ జుమ్ దరిద్రబాద్ ఆటలు, కామారెడ్డి కాడా కాల్లతోని తన్నిర్రు..ఆడోళ్ల తెరువువోతే ఆగుతరా మరి, తాగి అడ్డం బడిపోయిన సైకిల్ లేపేటందుకు అవస్థపడ్డ ఓనర్... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

21:26 - October 27, 2016

నినాదాలు ఘనం... ఆచరణ శూన్యం, మాటలకే పరిమితం... వాస్తవంలో వివక్షే నిజం.. ఒకే పనికి తక్కువ వేతనం...మహిలపై అంతులేని భారం, అర్థిక సమానత్వం... అంతులేని దూరం.. సమానత్వం ఎన్నాళ్లకు...? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.....

 

షీనాబోరా హత్యకేసులో సీబీఐ విచారణ

ముంబై : షీనాబోరా హత్యకేసులో సీబీఐ విచారణ చేపట్టింది. ముగ్గురు ఉన్నతాధికారులను సీబీఐ విచారించింది. ముంబై మాజీ పోలీసు ఉన్నతాధికారి రాకేష్, మారియా హోంగార్డు బాస్ డేవెన్ భారతితోపాటు ముంబై డీసీపీ సత్యనారాయణ చౌదరిలను సీబీఐ అధికారులు విచారించారు. 

 

21:13 - October 27, 2016

సీఎం చంద్రబాబు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి విమర్శించారు. చంద్రబాబు ఎపి అభివృద్ధికి ఆంటంకంగా మారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మధుతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రజల నుంచి భూముల లాక్కుంటుందని మండిపడ్డారు. ప్రత్యేకహోదా కోసం జగన్, పవన్ కళ్యాణ్ చేపట్టే కార్యక్రమాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే.. 
ఇసుక దందాలో టీడీపీ నేతలు
'రెండున్నర సం.ల కాలంలో టీడీపీ ప్రభుత్వం పని విధానంపై ప్రజలకు చెప్పడానికి ఏమీ లేదు. వైసీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తెచ్చుకునేంందుకు రెండున్నర సం.లు కృషి చేశారు. అలాగే కాంగ్రెస్ నుంచి కూడా టీడీపీలోకి నేతలు వెళ్లారు. ఇసుక మీద కాంట్రాక్టు విధానానికి స్వస్తి చెప్పి.. ఎవరైనా తీసుకోవచ్చనే..విధానం తెచ్చారు. ఇసుక దందాలో కొటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక దందా మారలేదు.
ఇసుక దందాలో టీడీపీ నేతలు మునిగిపోయారు.
సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టే యత్నం
అభివృద్ధి పేరుతో 1690 ఎకరాల భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేశారు. రాజధాని నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నీళ్లు, మట్టి ఇచ్చాడు తప్ప ఒక్క రూపాయ ఇవ్వలేదు. టీడీపీకి ఈ కాలంలో ఎమ్మెల్యేల సంఖ్యరీత్యా బలం పెరిగింది తప్ప.. ప్రజల బలం లేదు. ఓడిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలకు అధికారాలను ఇస్తూ నెట్టుకొస్తున్నారు. గుంటూరు జిల్లా పోన్నూరులో డాక్డర్ పై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తే...ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నష్టపరిహారం ఇవ్వకుండా భూములను దివీస్ కంపెనీకి కట్టబెడుతున్నారు.
టీడీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి 
టీడీపీ పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల 11 వందల ఎకరాలను సేకరించారు. నష్ట పరిహారం చెల్లించకుండా...బలవంతంగా భూములను లాక్కుంటున్నారు. పూలింగ్ విధానంపై రైతాంగానికి తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రజా సమస్యల కోసం పని చేస్తున్న కమ్యూనిస్టులు టెర్రరిస్టుల కంటే ప్రమాదకరణమనడం తీవ్ర ఆక్షేపనీయం. ఆ వ్యాఖ్యలు సీఎం చేతకాని తనానికి నిదర్శనం. ముఖ్యమంత్రి తన చేతగాని తనాన్ని ప్రతిపక్షాలపై నెట్టివేస్తున్నారు. పరిశ్రమలకు వామపక్షాలు, ప్రతిపక్షాలు వ్యతరేకం కాదు.
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం 
శ్రీకాకుళం జిల్లాలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు తిరస్కరించిన కంపెనీలను ఎపి రాష్ట్రంలో పెట్టడానికి సీఎం ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను బాగు చేసిన దాఖలాలు లేవు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క పరిశ్రమ కూడా లేదు. యువతకు ఉద్యోగాలు లేవు. కాలుష్య పరిశ్రమలను వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని పక్షాలను కలుపుకుని పోరాటం చేస్తామని' మధు హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:49 - October 27, 2016

హైదరాబాద్ : హోంగార్డుల ఆందోళన కొనసాగుతోంది. సచివాలయం ఎదుట బైఠాయించి హోంగార్డులు ఆందోళన చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్ రావాలని కోరుతున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతకముందు టీసచివాలయం ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. దీంతో సచివాలయం ప్రధాన గేట్ ముందు ఆందోళనకారులు బైఠాయించారు. హోంగార్డులపై పోలీసులు లాఠీచార్చీ చేశారు.  ఘటనలో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. లాఠీచార్జీని హోంగార్డులు తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ నేత మల్లురవి.. 
'హోంగార్డుల ఉద్యమానికి పూర్తి సహాయ సహకారుల అందిస్తాం. వారిని రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు మాట తప్పిన ప్రభుత్వంగా నిలిచింది. ఉద్యమాలను కూడా చేయనియ్యడం లేదు. ఉద్యమ పార్టీ ఉద్యమాలను అణచివేస్తుంది' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:40 - October 27, 2016

ఆకతాయిల వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం...

నిజామాబాద్ : వర్ణి మండలం చింతల్ పేట్ తండాలో దారుణం జరిగింది. ఆకతాయిల వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నలుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

జీహెచ్ ఎంసీలో సర్కిళ్ల పెంపు ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో సర్కిళ్ల పెంపు ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 26 సర్కిళ్లను 30 కి పెంచుతూ స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. కాసేపట్లో జీవో విడుదల కానుంది. దీపావళి నుంచి 30 సర్కిళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. 
 

సైరస్ మిస్త్రీ ఈ మెయిల్స్ పై స్పందించిన టాటా గ్రూప్

మహారాష్ట్ర : సైరస్ మిస్త్రీ ఈ మెయిల్స్ పై టాటా గ్రూప్ స్పందించింది. రతన్ టాటా పై సైరస్ మిస్త్రీ చేసిన అరోపణలు అవాస్తవమని చెప్పారు. చైర్మన్ గా మిస్త్రీకి పూర్తి అధికారులు ఇచ్చారని టాటా గ్రూప్స్ తెలిపింది.  ఛైర్మన్ మార్పు బోర్డు సభ్యుల సమిష్టి నిర్ణయమని తెలిపారు.

 

20:23 - October 27, 2016

అనంతపురం : నీళ్లు లేక భూములు.. బీళ్లుగా మారుతున్నాయి. పెట్టుబడి పెట్టిన రైతులు..ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ప్రకృతి సహకరించక..ప్రభుత్వము ఆలోచించక...అన్నదాతలు ఆందోళనతో జీవిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ దుస్థితిని పట్టించుకోవాలంటూ అనంతపురం రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దయనీయంగా హెచ్‌ఎల్సీ ఆయకట్టు రైతుల స్థితి
అనంతపురం జిల్లా హెచ్ఎల్సీ ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తుంగభద్ర ఎగువ ప్రాంతంలో వర్షాలు రాకపోవటంతో తుంగభద్ర డ్యాంలోకి నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు పెట్టి..పంటలు వేశామని చివరి దశలో నీళ్లు లేక.. పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.     
నీరు 9 టీఎంసీలకు పడిపోయిన వైనం
తుంగభద్ర డ్యాంలో నీరు లేకపోవడంతో జిల్లాకు రావల్సిన 22 టీఎంసీల నీరు 9 టీఎంసీలకు పడిపోయింది. నవంబర్‌ ఐదో తేదీకి ఈ తొమ్మిది టీఎంసీలకు నీరు కోటా పూర్తవుతుంది.  అయితే  ఏదో విధంగా కర్ణాటకను ఒప్పించి మరో రెండు టీఎంసీల నీటిని నవంబర్‌ నెలాఖరు వరకు అందిస్తే పంటలు పూర్తిగా పండుతాయని రైతులు అంటున్నారు. ఇప్పటికే ఆయకట్టు చివరి రైతులకు నీరందక పంటలు ఎండిపోయాయని.. మరో రెండు టీఎంసీలు నీరు వదిలితే కెనాల్‌ దగ్గర్లో ఉన్న రైతులకైనా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. లేదంటే చివరి దశలో ఉన్న పంటలు ఎండిపోయి భారీ ఎత్తున నష్టపోయే అవకాశాలున్నాయని రైతులు వాపోతున్నారు. 
రైతుల కోసం ఆందోళన చేస్తున్న రాజకీయ నాయకులు
రైతుల విన్నపాలతో.. నీటి విడుదలపై రాజకీయ నాయకులు కూడా  ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏపీ చీఫ్‌ విప్‌ కాలువ శ్రీనివాసులు తుంగభద్ర బోర్డుకు వెళ్లి అధికారులతో చర్చించి.. ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని విన్నవించారు.  దీంతో ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. అలాగే ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి కణేకల్‌ ప్రాంతంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ.. పాదయాత్ర చేపట్టారు.  అసలు ఇంత విపత్కర పరిస్థితులు ఏర్పడినా.. ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చించి రాజకీయాలకు అతీతంగా నీటిని విడిపించాలంటూ డిమాండ్ చేశారు. మరో రెండు టీఎంసీల నీరు విడుదల చేస్తే.. పది వేల ఎకరాల్లో పంట నిలబడే అవకాశం ఉంది. దీంతో భారీ నష్టం తగ్గుతుంది. నీళ్లు ఇచ్చి తమను ఆదుకోవాలంటూ.. రైతులు ప్రభుత్వంవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

 

20:19 - October 27, 2016

విశాఖ : మల్కన్‌గిరిలో జరిగింది ముమ్మాటికి బూటకపు ఎన్‌కౌంటర్‌ అని మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష అన్నారు. తన కొడుకు మున్నాను నిరాయుధుడిని చేసి కాల్చిచంపారని ఆరోపించారు. ఈమేరకు శిరీషతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయారనడం అబద్ధన్నారు. టార్చర్ బెట్టి... చంపి ఎన్ కౌంటర్ అని చెబుతున్నారన్నారు. ఇది ఎన్ కౌంటర్ అంటే ఎవరూ నమ్మరని తెలిపారు. ప్రజలకు మున్నా అంటే చాలా ఇష్టమని.. ప్రజల జీవితాలతో మమేకమయ్యారని చెప్పారను. ప్రజలకోసమే చనిపోయారని తెలిపారు. మున్నా మరణించినందుకు తల్లిగా తనకు బాధ, ఆవేదన ఉందన్నారు. కానీ ఎంతో మంది కడుపుకోత తీర్చడానికి తన బిడ్డ వెళ్లి.. ప్రజల కోసం ప్రాణాలు వదిలారని పేర్కొన్నారు. తన కడుపుకోత తీర్చడానికి కూడా ఇంకో బిడ్డ వెళ్తాడని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

20:12 - October 27, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలోని భీమవరం మండలం తుందుర్రులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి మెగా అక్వా ఫుడ్‌ పార్క్‌ ను వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయ సేకరణను గ్రామస్థులు బహిష్కరించారు. సబ్‌ కలెక్టర్‌ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణకు హజరైన స్థానికులు తమ సమస్యలు చెప్పి గోదావరి మెగా అక్వా ఫుడ్‌ పార్క్‌ ను వ్యతిరేకించారు. గ్రామస్థులు సబ్‌ కలెక్టర్ తో వాగ్వాదానికి దిగడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

20:05 - October 27, 2016

విశాఖ : మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలు వారివారి స్వస్థలాలకు చేరుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టునేత గణేష్‌ మృతదేహం స్వగ్రామమైన విశాఖజిల్లా హుకుంపేట మండలం బాకూరుకు చేరుకుంది. గణేష్‌ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు భోరున విలపించారు. ఆ తర్వాత గ్రామంలో నిర్వహించిన గణేష్‌ అంతిమయాత్రలో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 
స్వగ్రామానికి ప.గో వాసుల మృతదేహాలు  
మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన పశ్చిమ గోదావరి వాసుల మృతదేహాలు స్వగ్రామమైన దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామం చేరుకున్నాయి. 25 ఏళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరిన ఐనపర్తి దాసు, తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన గెడ్డం సువర్ణ రాజులు గత 4 రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. వారి మృతదేహాలు స్వగ్రామం పల్లంట్ల చేరుకోవడంతో వారి బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇద్దరి మృత దేహాలకు పల్లంట్ల అంత్యక్రియలు నిర్వహించారు.

 

ఆర్కే తమ ఆధీనంలో లేడన్న ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ

విశాఖ : మావోయిస్ట్‌ అగ్రనేత ఆర్కే ఆచూకీ ఇంకా లభించలేదు. ఆర్కే.. ఏపీ ప్రభుత్వం చేతిలో బంధీగా ఉన్నారని తెలంగాణ డెమోక్రటిక్‌ ఫోరమ్‌ ఆరోపించింది. ఆర్కేను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు ఆర్కే తమ ఆధీనంలో లేదని విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రకటించారు. 

19:43 - October 27, 2016

విశాఖ : మావోయిస్ట్‌ అగ్రనేత ఆర్కే ఆచూకీ ఇంకా లభించలేదు. ఆర్కే.. ఏపీ ప్రభుత్వం చేతిలో బంధీగా ఉన్నారని తెలంగాణ డెమోక్రటిక్‌ ఫోరమ్‌ ఆరోపించింది. ఆర్కేను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే తమ అదుపులో లేరని విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టులను.. ఒకచోటకు చేర్చేందుకు ప్రజా సంఘాల నేతలు..కోడ్‌ లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తున్నారని ఎస్పీ అన్నారు. ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని ప్రకటించారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారమే మృతదేమాలకు పోస్టుమార్టం నిర్వహించామని..72 గంటల తర్వాతే మృతదేహాలను బంధువులు తీసుకెళ్లకపోతే..తామే ఖననం చేస్తామనన్నారు. ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తే.. కేసును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

19:21 - October 27, 2016

రంగారెడ్డి : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తానని ఎన్నికల హామీల్లో ఇచ్చిన కేసీఆర్‌... ఆదిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సర్కారు విఫలమైందన్నారు. విద్యాహక్కు చట్టం ఇప్పటివరకు రాష్ట్రంలో అమలు కావడంలేదని విమర్శించారు. బీసీలకు ఎలాంటి న్యాయం జరగడంలేదన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా నాగారం,  పెదగోల్కొండ, బహదూర్‌గూడ, చినగోల్కొండ, శంకరాపురం, షాపూర్‌, మదనపల్లి, పాలమాకుల, తిమ్మాపూర్, కొత్తూరులో పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు గ్రామ గ్రామాన సీపీఎం బృందానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. స్థానిక సమస్యల్ని ప్రజలు సీపీఎం బృందానికి చెప్పుకుంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 

 

గాంధీభవన్ లో పీసీసీ ముఖ్య నేతల సమావేశం

హైదరాబాద్ : గాంధీభవన్ లో పీసీసీ ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, కొప్పుల రాజు హాజరయ్యారు. రుణమాఫీ అంశం జనంలోకి తీసుకెళ్లే దానిపై చర్చ జరుగుతోంది. 

వడ్డీ వ్యాపారి దాడి... వ్యక్తి మృతి

తూర్పుగోదావరి : కాకినాడలో వడ్డీ వ్యాపారి రాజేష్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అప్పు సకాలంలో చెల్లించలేదని లేబర్ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ గోవిందరాజుపై దాడికి దిగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోవిందరాజు మృతి చెందాడు.

నా జీవితాంతం ములాయంతోనే ఉంటా : అమర్ సింగ్

లక్నో : తన జీవితాంతం ములాయంతోనే ఉంటానని అమర్ సింగ్ తెలిపారు. అఖిలేష్ తనను బ్రోకర్ అన్నందుకు బాధగా ఉందన్నారు. ములాయం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాంగోపాల్ యాదవ్ తనను బెదిరించారని పేర్కొన్నారు. 

కొనసాగుతోన్న హోంగార్డుల ఆందోళన

హైదరాబాద్ : హోంగార్డుల ఆందోళన కొనసాగుతోంది. సచివాలయం ఎదుట బైఠాయించి హోంగార్డులు ఆందోళన చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రావాలని కోరుతున్నారు.

18:16 - October 27, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ కాల్ సెంటర్ నిర్వహణపై 10 టివి కథనానికి స్పందన లభించింది. జీహెచ్ ఎంసీ కాల్ సెంటర్ నిర్వహణపై విచారణకు ఆదేశించారు. కాల్ సెంటన్ తనిఖీ చేసి టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ రావు వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:45 - October 27, 2016

హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కారం కోసం సచివాలయం ముట్టిడికి యత్నించిన హోంగార్డులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న హోంగార్డులపై లాఠీచార్జీ చేశారు. ఆందోళనకారులను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. ఇందిరాపార్కు నుంచి ర్యాలీగా వచ్చిన హోంగార్డులు తెలంగాణ సచివాలయ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు హోంగార్డులను అడ్డుకుని అరెస్టు చేశారు. మిగిలిన హోంగార్డులు రోడ్డుపై భైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలని, సీఎంను కలిసి సమస్యలను విన్నవించే అవకాశం కల్పించాలని పట్టుబట్టారు. పోలీసులు ఎంత చెప్పినా హోంగార్డులు వినకుండా ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో హోంగార్డులు ఆగ్రహించారు. సమస్యలు విన్న లాఠీచార్జ్ చేస్తారని మండిపడ్డారు. పోలీసులు తమను తీవ్రంగా కొట్టారని వాపోయారు. ఫ్రెండ్లీ పోలీసులు అంటే ఇదేనా...అని ప్రశ్నించారు. తాము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని చెప్పారు. హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం  హామీ ఇచ్చారని..,.కానీ ఇప్పుడు అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఇదేం న్యాయమని ప్రశ్నించారు. ఇందుకోసమేనా తెలంగాణ సాధించుకున్నది అని నిలదీశారు. సీఎంను కలవాల్సిందే...పట్టుబట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించే దాకా పోరాటం ఆపేదిలేదని తేల్చి చెప్పారు. వందలాదిగా హోంగార్డులు తరలివచ్చారు. భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:39 - October 27, 2016

న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌లోని క్లైమాక్స్ ఫైట్‌కు టీమిండియా సన్నద్ధమైంది. హోరాహోరీగా సాగుతున్న సిరీస్‌ను సమం చేసిన కివీస్‌ టీమ్‌ ఆఖరి వన్డేలోనూ ధోనీ సేనకు చెక్‌ పెట్టాలని పట్టుదలతో ఉంది. ప్రస్తుత సిరీస్‌లోనే కాదు వన్డే ఫార్మాట్‌లో భారత్‌కు గట్టి పోటీనిచ్చిన జట్లలో న్యూజిలాండ్‌ ముందువరుసలోనే ఉంది. వన్డేల్లో భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్....ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌ సైతం నువ్వా నేనా అన్నట్లుగానే సాగుతోంది. ఇరు జట్ల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ప్రస్తుత సిరీసే నిదర్శనం.

ధోనీ సేనకు షాక్...
ధర్మశాల వన్డేలో బౌలర్ల షోతో భారత్‌ సునాయాస విజయం సాధించగా లో స్కోరింగ్‌ థ్రిల్లర్‌లా సాగిన ఢిల్లీ వన్డేలో కివీస్‌ టీమ్‌ ధోనీ సేనకు షాకిచ్చింది. మొహాలీ వన్డేలో విరాట్‌ కొహ్లీ సూపర్‌ సెంచరీతో టీమిండియా సునాయాస విజయం సాధించింది. కీలక నాలుగో వన్డేలో కివీస్‌ టీమ్‌ అంచనాలకు మించి రాణించింది. బ్యాటింగ్‌లో అంతంత మాత్రంగానే రాణించినా బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టింది. 19 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. దీంతో 5వ వన్డేలో నెగ్గి సిరీస్‌ సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఆఖరి వన్డేలోనూ సంచలనం సృష్టించాలని కివీస్‌ టీమ్‌ తహతహలాడుతుండగా సొంతగడ్డపై తిరుగులేని ట్రాక్‌ రికార్డ్ కలిగిన ధోనీసేన సిరీస్‌ విజయంపై ధీమాగా ఉంది.

ఏకపక్షంగా సాగుతుందా ? 
ప్రస్తుత సిరీస్‌లో మాత్రమే కాదు వన్డే ఫార్మాట్‌లో భారత్‌కు గట్టి పోటీనిచ్చిన జట్లలో న్యూజిలాండ్‌ ముందు వరుసలోనే ఉంది. వన్డేల్లో ఏ జట్టుకైనా న్యూజిలాండ్‌ ఎప్పటికీ పటిష్టమైన ప్రత్యర్ధే అనడంలోనూ ఎటువంటి సందేహం లేదు. ఇరు జట్ల మధ్య వన్డే ద్వైపాక్షిక సిరీస్‌ అంటే హోరాహోరీ పోరు ఖాయమనే చెప్పాలి. కానీ న్యూజిలాండ్‌తో వన్డే ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్ లో భారత్‌దే కాస్త పై చేయిగా ఉంది. ఢిల్లీ వన్డే వరకూ ఇరు జట్లు 97 మ్యాచ్‌ల్లో పోటీపడగా భారత్‌ 48 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. న్యూజిలాండ్‌ 43 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. విశాఖపట్నంలోని YS రాజశేఖర రెడ్డి ACA-VDCA స్టేడియం వేదికగా జరుగునున్న ఐదో వన్డే ఎప్పటిలానే హోరాహోరీగా సాగుతుందో లేక అనూహ్యంగా ఏకపక్షంగా ముగుస్తుందో చూడాలి.

జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ కథనంపై స్పందన..

హైదరాబాద్ : కాల్ సెంటర్ ను తనిఖీ చేసిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి వివరాలు సేకరించారు. కాల్ సెంటర్ నిర్వాహణపై ఇటీవలే టెన్ టివిలో కథనం ప్రసారమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నిర్వాహణపై విచారణకు కమిషనర్ ఆదేశించారు. 

17:31 - October 27, 2016

వంటిళ్లు..కేవలం వంటలు వండటానికి మాత్రమే కాదు..ఔషధాలకు నిలయంగా కూడా చెప్పుకోవచ్చు. ఆహార పదార్థాల్లో వాడే వాటిల్లో మన ఆర్యోం దాగి ఉంది. పోపుల పెట్టేలో ఉండే దినుసులు ఎంతగానే ఉపయోగపడుతాయి.
అల్లం : అజీర్ణ వ్యాధులకు అద్భుతంగా పని చేస్తుంది. అంతేగాకుండా ఉదర సంబంధ వ్యాధులకు దీనిని మించిన ఔషధం లేదు. వికారం, వాంతులు, విరోచనాలను నివారిస్తుంది.
జీలకర్ర : జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. ఆకలిని పుట్టించడమే కాకుండా శ్వాసక్రియ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆవాలు : గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది.
లవంగాలు : ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. దీనిని నమలడం వల్ల దంత రక్షణ, నోటిని, శ్వాసను తాజాగా ఉంచుతుంది. యాంటిసెప్టిక్, యాంటీ బయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తుంటారు.
మిరియాలు : ఆహారం తేలికగా జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
వెల్లుల్లి : కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. 

17:14 - October 27, 2016

లాల్ బజార్ వద్ద ప్రమాదం..

మేడ్చల్ : తిరుమలగిరి పరిధిలోని లాల్ బజార్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి రెండో తరగతి విద్యార్థిని సాయిదీప్తి మృతి చెందింది. సాయిదీప్తి ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. 

బాబును కలిసిన అశోక్ బాబు..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబు కలిశారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపై సీఎంతో చర్చించారు. రూరల్ ప్రాంతంలో ఉద్యోగుల హెల్త్ కార్డులు ఉపయోగపడడం లేదని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్ ఆలస్యమౌతోందని, పెరిగిన పీఆర్సీకి అనుగుణంగా జీతాలు పెంచాలని కోరడం జరిగిందన్నారు. నవంబర్ 1 వరకు సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తామని సీఎం హామీనిచ్చారని తెలిపారు. 

సచివాలయం గేటు వద్ద హోం గార్డుల బైఠాయింపు..

హైదరాబాద్ : సచివాలయంలో హోం గార్డులు బైఠాయించారు. సీఎం కేసీఆర్ రావాలని పిలుపునిచ్చారు. హోం గార్డులకు సర్దిచెప్పేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక ఇక్కడి నుండి కదిలేది లేదని హోం గార్డులు స్పష్టం చేశారు. 

17:05 - October 27, 2016

శ్రీకాకుళం : కయాంత్ తుఫాను హెచ్చరికలతో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపీ బలపడి తుఫానుగా మారుతుందనే వాతావరణ శాఖ సూచనలతో తీర ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావంతో 28వ తేది నుంచి భారీ వర్షాలతో పాటు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కలెక్టర్‌ లక్ష్మి నరసింహం చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

16:52 - October 27, 2016

విజయవాడ : ఏజెన్సీ ప్రాంతాల్లో కుప్పం తరహాలో మినరల్‌ వాటర్‌ సరఫరా చేయాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య, రహదారులపై మంత్రులు కామినేని, అయ్యన్నపాత్రులతో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో మలేరియా నియంత్రణకు ఐటీడీఏ ప్రాజెక్టుల ద్వారా సిట్రొనెల్లా లాంటి 4, 5 జాతుల ప్లాంటేషన్‌ లు పెద్ద ఎత్తున చేపట్టాలని బాబు ఆదేశించారు. 

 

16:50 - October 27, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని కనకదుర్గ చిట్‌ఫండ్స్‌లో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. అసిస్టెంట్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ రాకేష్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. యాజమాన్య వేధింపులే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం యాజమాన్య వేధింపులతో బ్రాంచ్‌ మేనేజర్‌ నరేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. వరుస మరణాలు అనేక అనుమానాలు కల్గిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ బాధితులకు హైకోర్టులో ఊరట లభించింది. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లాల వారిగా అటాచ్‌ చేసిన ఆస్తులను ఏపీ ప్రభుత్వమే వేలం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 

16:45 - October 27, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ బాధితులకు హైకోర్టులో ఊరట లభించింది. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లాల వారిగా అటాచ్‌ చేసిన ఆస్తులను ఏపీ ప్రభుత్వమే వేలం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బులను హైకోర్టు ప్రత్యేక అకౌంట్‌లో జమ చేయాలని సూచించింది. మరోవైపు అక్షయ గోల్డ్‌ అకౌంట్‌లో ఉన్న 10 కోట్ల రూపాయలను చిన్న మొత్తాల బాధితులకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ నవంబర్‌ 7కు వాయిదా వేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:39 - October 27, 2016
16:36 - October 27, 2016

సచివాలయం ముట్టడికి హోంగార్డుల ప్రయత్నం..

హైదరాబాద్ : సచివాలయం ముట్టడికి హోం గార్డులు ప్రయత్నించారు. హోం గార్డులను పోలీసులు అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హోం గార్డులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

సుప్రీంలో సీపీఎం పిటిషన్...

ఢిల్లీ : మతం పేరిట ఎన్నికల్లో ఓట్లు అడగడంపై సుప్రీంకోర్టులో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి పిటిషన్ వేశారు. తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని సీపీఎం కోరింది. ఈ పిటిషన్ ను సుప్రీం విచారణకు స్వీకరించింది.  

కనకదుర్గ చిట్ ఫండ్స్ లో మరో ఉద్యోగి మృతి..

కరీంనగర్ : కనకదుర్గ చిట్ ఫండ్స్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ రాకేష్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. యాజమాన్యం వేధింపులే కారణమని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. యాజమాన్యం వేధింపులతో రెండు రోజుల క్రితం బ్రాంచ్ మేనేజర్ నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.

 

జీవితాంతం ములాయంతో - అమర్ సింగ్...

లక్నో : తన జీవితాంతం ములాయంతోనే ఉంటానని అమర్ సింగ్ ప్రకటించారు. అఖిలేష్ కంటే ముందునుండే ములాయంతోనే ఉన్నట్లు, అఖిలేష్ తనను బ్రోకర్ అన్నందుకు బాధగా ఉందన్నారు. ములాయం కుటుంబాన్ని విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నించానని తనపై ఆరోపణలు చేశారని తెలిపారు. రాంగోపాల్ యాదవ్ తనను బెదిరించాడని, తనకు ఏదైనా జరిగితే అతనిదే బాధ్యత అని తెలిపారు. 

16:17 - October 27, 2016
16:09 - October 27, 2016
16:04 - October 27, 2016

'ప్రభాస్' న్యూ మూవీపై క్లారిటి వచ్చేసింది. ఈ స్టార్ నెక్ట్స్ మూవీ 150కోట్లతో రూపొందనున్నట్లు టాక్. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్ గా సెట్ చేశారట. 'బాహుబలి-2' సినిమా త్వరగా కంప్లీట్ కావాలని 'ప్రభాస్' ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే 'బాహుబలి-2 'గా 'ప్రభాస్' వీరోచిత నటన చూడడంతో పాటు 'బాహుబలి -2' కంప్లీట్ అయితే 'ప్రభాస్' నెక్ట్స్ మూవీపై క్లారిటి వస్తుందని ఫ్యాన్స్ ఆశ. అయితే 'ప్రభాస్' నెక్ట్స్ పిక్చర్ పై క్లారిటీ వచ్చేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో 'సుజిత్' దర్శకత్వంలో న్యూ మూవీ సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రభాస్..సుజిత్...
డిసెంబర్ లో 'ప్రభాస్', 'సుజిత్' మూవీపై అఫిషియల్ స్టేట్ మెంట్ రానున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఆల్ రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ మూవీలో 'ప్రభాస్' కి జోడీగా బాలీవుడ్ భామ 'పరిణీతి చోప్రా'ను కన్ ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 150కోట్లతో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ జోనర్ లో రూపొందనుందట. బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ బాషల్లో నిర్మిస్తున్నారట. అందుకే బాలీవుడ్ బ్యూటీ అయితే ఈ మూవీకి సరైన ఛాయిస్ అని దర్శక నిర్మాతలు 'పరిణితి చోప్రా'ను సంప్రదించారట. ఇండియా వైజ్ గా 'ప్రభాస్' కి పెరిగిన స్టార్ డమ్ ని కంటిన్యూ చేయడానికి ఇలా భారీ స్థాయిలో మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ 'ప్రభాస్' రియల్ రేంజ్ ఏంటో తెలిసిపోతుందనే టాక్ వినిపిస్తోంది.

16:03 - October 27, 2016

విశాఖ : మావోయిస్ట్‌ అగ్రనేత ఆర్కే ఆచూకీ  ఇంకా దొరకలేదు. ఏపీ ప్రభుత్వం చేతిలో ఆర్కే బంధీగా ఉన్నారని తెలంగాణ డెమోక్రటిక్‌ ఫోరమ్‌ ఆరోపించింది. ఆర్కేను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్కేకు ఏమి జరిగినా తెలుగుదేశం ప్రభుత్వానిదే బాధ్యతని ప్రొ.హరగోపాల్‌, పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:00 - October 27, 2016

వరుసగా మూడు భారీ హిట్స్ కొట్టిన ఘనతను డైరక్టర్ 'కొరటాల శివ' దక్కించుకున్నాడు. దీంతో ఆయన నెక్ట్స్ ఏ స్టార్ తో మూవీ చేస్తాడా అంతా ఊహించారు. కానీ 'కొరటాల' మాత్రం మరోసారి 'మహేష్ బాబు'తోనే మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై చాలా రూమర్లు వినిపిస్తున్నాయి. అలాంటి వాటిపై 'కొరటాల' క్లారిటీ ఇచ్చేశాడు. 'మహేష్ బాబు'తో చేయనున్న సినిమాలో ఎలాంటి ఫ్యాన్సీ కాంబినేషన్స్ లేవని అసలు విషయం చెప్పేశాడు. అదే విధంగా ఇది మల్టీ స్టారర్ మూవీ కూడా కాదన్నాడు. ఈ మూవీపై బయట వినిపిస్తున్న స్పెక్యులేషన్లు ఏవీ పట్టించుకోవద్దని 'కొరటాల' రిక్వెస్ట్ చేశాడు.

డిసెంబర్ లో...
'నాగార్జున', 'మహేష్' నటించబోతున్నరనే న్యూస్ ఫేక్ అంటూ కొట్టిపారేశాడు. ఇప్పటి వరకు తాను చేసిన మూడు సినిమాల్లో హీరోకి సమానంగా మరో క్యారెక్టర్ ఉంది. 'మిర్చి'లో 'సత్యరాజ్', 'శ్రీమంతుడు' లో 'జగపతిబాబు', అలాగే 'జనతా గ్యారేజ్' లో 'మోహన్ లాల్' ఆ కోవకు చెందినవే. ఆ టైపులో ఇప్పుడు కూడా భారీ క్యాస్టింగ్ ఉంటుందేమో కానీ మరో స్టార్ హీరో మాత్రం 'మహేష్ బాబు' మూవీలో ఉండబోదని దర్శకుడు ముందే క్లారిటి ఇస్తున్నాడు. డిసెంబర్ లో ఈ మూవీ అఫిషియల్ స్టేట్ మెంట్ వస్తుందని దర్శకుడు హింట్ ఇచ్చేశాడు.

16:00 - October 27, 2016

సంగారెడ్డి : జిల్లాలో మహీంద్రా అండ్ మహీంద్ర కంపెనీ కార్మికులు పోరుబాట పట్టారు. దశాబ్దాలుగా పనిచేస్తున్నా కనీస వేతనాలు, బోనస్‌లు చెల్లించకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని...కార్మికులు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. వీరికి సిఐటియు మద్దతునిచ్చింది. కార్మిక హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షుడు భీరం మల్లేష్ హెచ్చరించారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:56 - October 27, 2016

'రామ్ చరణ్' ఊపిరి తీయలేనంత బిజీలో ఉన్నాడు. ఓ వైపు తన కొత్త సినిమాలో నటిస్తూనే మరో వైపు తండ్రి 'చిరంజీవి' సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ దగ్గరకి రావడంతో 'చెర్రీ' డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. ఇంత బిజీలో కూడా 'చెర్రీ' నెక్ట్స్ చేయబోయే కొత్త సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. 'చిరంజీవి' 152వ సినిమాకి 'అశ్వనీదత్' నిర్మాతగా వ్యహరించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా మాటల సందర్భంలోనే 'అశ్వనీదత్', 'చిరంజీవి' దగ్గర మరో విషయాన్ని ప్రస్తావించాడని తెలుస్తోంది.

క్రిష్ దర్శకుడు ? 
'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాను ఈ జనరేషన్ కి తగినట్టుగా మార్పులు చేసి 'చరణ్' తో రీమేక్ చేయాలనే ఉద్దేశ్యాన్ని బయటపెట్టాడట. అందుకు మంచి దర్శకుడిని కూడా సెట్ చేసినట్లు ఈ బడా ప్రొడ్యూసర్ మెగాస్టార్ కి చెప్పాడంట. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాకి కొనసాగింపుగా రూపొందనున్న ఈ మూవీకి 'జగదేకవీరుడు' అనే టైటిల్ ని కూడా 'అశ్వీనిదత్' రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడిగా 'క్రిష్' అయితే ఈ స్టోరీని బాగా హ్యాండిల్ చేస్తాడని 'చిరు'కి చెప్పాడంట. అందుకు 'చిరు' కూడా హ్యపీగా ఫీలైనట్లు వినికిడి. అన్ని కుదిరితే 'రామ్ చరణ్', 'సుకుమార్' తో సినిమా పూర్తయిన తరువాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. 

15:56 - October 27, 2016

హైదరాబాద్ : హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ...హోంగార్డుల సంఘం ప్రతినిధులు సీఎస్‌ రాజీవ్‌శర్మను కలిశారు. హోంగార్డులను రెగ్యులర్‌ చేయాలని సీఎస్‌ను కోరినట్లు హోంగార్డులు సంఘం ప్రతినిధి శారదాగౌడ్‌ తెలిపారు. హోంగార్డులను రెగ్యులరైజ్‌ చేసి వారి పేస్కేలు వర్తింపచేయాలని కోరామని చెప్పారు. అలాగే హోంగార్డులకు ఆరోగ్య భద్రత, ఈఎస్‌ఐ సౌకర్యం, పిల్లలకు స్కూలు ఫీజులు వంటి సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. టీఏలు, డీఏలు వర్తించడంతో పాటు నెలకు 3రోజుల సెలవులు మంజూరు చేయాలని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు. తాము చేసిన డిమాండ్స్‌పై సీఎస్‌ వందశాతం సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.

 

15:49 - October 27, 2016

గుంటూరు : జిల్లాలో మెడికల్‌ పీజీ విద్యార్ధిని ఆత్మహత్యకు నిరసనగా జూనియర్‌ డాక్టర్లు ఆందోళన ఉధృతం చేశారు. మహిళా ప్రొఫెసర్‌ వేధింపులు తట్టుకోలేకే సంధ్యారాణి సూసైడ్‌ చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా మెడికల్‌ పీజీ విద్యార్ధులు విధులను బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్లు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను వారి మాటల్లోనే..
మహిళా ప్రొఫెసర్ మాటలతో, ల్వాంగేజ్ తో చాలా ఇబ్బందులు పడ్డాము. పర్సనల్ గా కూడా తిట్టారు. తీవ్ర మనోవేదనకు గురైన సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు విద్యార్థులు బయపడి చెప్పలేదు. ఇప్పుడు చేప్పేందుకు ముందుకు వచ్చారు. ప్రొఫెసర్‌ వేధింపులు తట్టుకోలేకే సంధ్యారాణి సూసైడ్‌ చేసుకుంది. వేధింపులకు పాల్పడిన మహిళా ప్రొఫెసర్‌ ను సస్పెండ్‌ చేయాలి. అమెను అరెస్టు చేయాలి. ప్రస్తుతం సాధారణ సేవలను బహిష్కరించాం. 24 గంటల్లో ప్రొఫెసర్ ను అరెస్టు చేయకపోతే ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తామని... జూ.డాక్టర్లు హెచ్చరించారు. మూడు రోజుల క్రితం పీజీ విద్యార్ధిని సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
 

 

సీఎం కేసీఆర్ కు తమ్మినేని లేఖ..

రంగారెడ్డి : సీఎం కేసీఆర్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన ఎంబీసీలను ఆదుకోవాలని, ఎంబీసీల సమస్యలపై నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలని కోరారు. రాజకీయాల్లో కూడా ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేయాలని, సంచార జాతులకు కేటాయించిన నిధులను ఖర్చు చేయాలని పేర్కొన్నారు. సంచార జాతులకు ఇళ్లను నిర్మించి వారి పిల్లలకు ఉచిత నిర్బంద విద్య అందించాలన్నారు. బీసీలకు సబ్ప్లాన్ చట్టం చేయాలని, ఎంబీసీలు ఎదుర్కొంటున్న కుల వివక్షను రూపుమాపాలన్నారు.

15:39 - October 27, 2016

హైదరాబాద్ : నష్టాల బాటలో పయనిస్తోన్నసంస్థను లాభాల బాట పట్టించేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంస్ధ ఆస్తులను వినియోగించుకొని రెవెన్యూ పెంచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఆర్టీసీ స్థలాల్లో షాపింగ్‌ మాల్స్‌, మల్టీప్లెక్స్‌లను నిర్మించి అద్దెల ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని యోచిస్తోంది. వీటితో పాటే.. ప్రయాణికులకు మెరుగైన సేవలు.. ఆదాయం పెంపు లక్ష్యంగా.. కొత్తగా డివిజనల్‌ మేనేజర్‌ పోస్టులనూ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. 
ఆర్టీసీ స్థలాల్లో షాపింగ్‌మాల్స్, సినిమాహాల్స్ నిర్మాణం
నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని రక్షించుకునేందుకు టీఎస్‌ఆర్టీసీ నడుం బిగించింది. ఏటా వస్తోన్న కోట్లాది రూపాయల నష్టాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు కొత్త విధానాలను అమలు చేయనుంది. సంస్థ స్థలాలనే ఆదాయాభివృద్ధి వనరుగా మలచుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. సంస్థకు చెందిన స్థలాల్లో  షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ నిర్మించాలని ఆర్టీసీ యోచిస్తోంది. వీటి ద్వారా స్థిరమైన ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుత సంవత్సరం నాలుగువేల కోట్లున్న ఆదాయాన్ని.. వచ్చే ఏడాదికి ఐదువేల కోట్ల రూపాయలకు పెంచాలని ఆర్టీసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
సంస్థ నష్టాలపై దృష్టిసారించిన టీఎస్ ఆర్టీసీ
టీఎస్ ఆర్టీసీ.. గత  ఏడాది దాదాపు 700 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 90 డిపోలలో కేవలం పదింటిలోనే లాభాలొస్తున్నాయని, మిగిలిన 80 డిపోలూ నష్టాల బాటలో సాగుతున్నాయని సంస్థ రికార్డులు చెబుతున్నాయి. ఈ దశలో సంస్థను ప్రగతిబాట పట్టించేందుకు అట్టడుగు స్థాయి నుంచే సమూల మార్పులు తేవడానికి ఆర్టీసీ యాజమాన్యం సమాయత్తమవుతోంది. ఇటీవలే కొనుగోలు చేసిన పదకొండు వందల యాభై కొత్త బస్సులను.. కొత్త జిల్లాలకు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ప్రకటించిన వజ్ర మినీ బస్సు సర్వీసులను వచ్చే నెల నుంచి అందుబాటులొకి తీసుకురానుంది.  
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కసరత్తు
మరోవైపు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకూ ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌లలో డూప్లికేట్‌ వాటర్‌ బాటిల్‌ అమ్మకాలకు చెక్‌ పెట్టాలని యోచిస్తోంది. వాటి స్థానంలో బిస్లరీ వాటర్ బాటిల్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
కొత్తగా డివిజనల్‌ మేనేజర్‌ క్యాడర్‌ పోస్టుల ఏర్పాటు 
ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడం.. ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించే దిశగా.. కొత్తగా డివిజనల్‌ మేనేజర్‌ క్యాడర్‌ పోస్టులను ఏర్పాటు చేయాలనీ ఆర్టీసీ నిర్ణయించింది. డివిజన్‌ స్థాయిలో ఉన్నతాధికారి నియామకం వల్ల.. సంస్థను ప్రగతిబాటలో పరుగులు పెట్టించడం సాధ్యమవుతుందని ఆర్టీసీ యాజమాన్యం విశ్వసిస్తోంది. 

15:33 - October 27, 2016
15:28 - October 27, 2016

గుంటూరు : నగరంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నగరపాలక సంస్థకు త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఓట్లు తొలగించారన్న ఆరోపణలపై రాజకీయంగా రచ్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.  ఏపీ రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు నగరపాలక సంస్థలో చినికి చినికి గాలివాన చందంగా మారుతున్న ఓట్ల తొలగింపు వివాదంపై 10 టీవీ ప్రత్యేక కథనం....
ఓటర్ల జాబితాల సవరణ 
గుంటూరు నగరపాలక సంస్థకు  పుష్కర కాలం తర్వాత ఇప్పుడు ఎన్నికల నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ దిశగా జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఓటర్ల జాబితాల సవరణ చేపట్టారు. అయితే 2014లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే నగరంలో ఇప్పుడు ఓటర్లు తగ్గిపోయిన అంశం ప్రతిపక్ష వైసీపీని కలవరానికి గురి చేస్తోంది. రాజకీయంగా దెబ్బతీసేందుకు  తమపార్టీకి చెందిన ఓట్లను అక్రమంగా తొలగించారన్నది వైసీపీ నేతల వాదన. గత అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 2.30 లక్షల మంది ఓటర్లున్నారు. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 1.65 లక్షలకు తగ్గింది. తూర్పు నియోజకవర్గ ఓటర్ల సంఖ్య  లక్షా 95 వేల నుంచి  లక్షా 46  వేలకు తగ్గడంపై వైసీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో అడ్డదారులు, అక్రమ పద్ధతుల్లో విజయం సాధించాలన్న కుట్రలు, కుతంత్రాలతో  అధికారాన్ని అడ్డంపెట్టుకుని  టీడీపీ నేతలు ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలకు పాల్పడుతున్నారని  వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
వైసీపీ నేతల ఆరోపణలను తోసిపుచ్చిన టీడీపీ నేతలు
మరోవైపు వైసీపీ నేతల ఆరోపణలు టీడీపీ నాయకులు తోసిపుచ్చుతున్నారు. ఒక్క ఓటు కూడా తొలగించలేదంటున్నారు. ఇంటినంబర్ల తేడాతో ఓట్ల సంఖ్యలో వ్యత్యాసం వచ్చినట్టు చెబుతున్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో ఓటర్ల తొలంగింపుపై రాజకీయ పార్టీల  మధ్య రగులుతున్న రగడ భవిష్యత్‌లో ఏ పరిణామాలకు దారితీస్తుందోనన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరుగుతాయా... అన్న సంశయం వ్యక్తమవుతోంది. ఓటర్ల తొలగింపు వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

ఓటుకు నోటు..బాబు పిటిషన్ పై కొనసాగుతున్న విచారణ..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. బాబు తరపున లాయర్ లోథ్రా వాదనలు వినిపిస్తున్నారు. 

15:16 - October 27, 2016

హైదరాబాద్ : రెండున్నర సంవత్సరాలుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు ఎక్కడ ఇళ్లు నిర్మించలేదని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించడంలో ప్రభుత్వం విఫలమని జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా నిర్వహించింది. డబుల్ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం హామీ ఏమైందని కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. 

 

15:11 - October 27, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యారంగం కుంటుపడిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యపు వైఖరి వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలో ఉన్నాయన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. 

 

15:06 - October 27, 2016

నల్గొండ :  మెడికల్‌ పీజీ విద్యార్థిని మృతి తట్టుకోలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో డాక్టర్‌గా పనిచేస్తున్న రవి భార్య మరణంతో కుంగిపోయాడు.. మనస్తాపంతో బాత్‌రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు.. మరోవైపు రవి భార్య సంధ్యారాణి ఆత్మహత్యకు ప్రొఫెసర్‌ వేధింపులే కారణమంటూ గుంటూరులో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సంధ్యారాణి సూసైడ్‌నోట్‌ దీనికి సాక్ష్యమంటున్నారు.. ఆత్మహత్యకు కారణమైన మహిళా ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. గుంటూరులో పీజీ వైద్య విద్య చదువుతున్న సంధ్యారాణికి రవితో గత డిసెంబర్‌లో వివాహమైంది.. ప్రొఫెసర్‌ వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సుసైడ్‌నోట్ రాసిన సంధ్యారాణి... ఆత్మహత్య చేసుకుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

సీఎస్ తో హోం గార్డుల ప్రతినిధులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీఎస్ ను హోంగార్డుల ప్రతినిధులు కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, టీఏ - డీఏలు ఇవ్వాలని కోరారు. మహిళా హోం గార్డులకు పే విత్ మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని, తమిళనాడు తరహా విధానం అమలు చేయాలని సూచించారు. త్రిపురలో అమలులో ఉన్న పెన్షన్ విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని కోరారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళుతామని సీఎస్ హామీనిచ్చారని, సమ్మెపై హోంగార్డులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హోంగార్డుల ప్రతినిధి, న్యాయవాది శారదగౌడ్ పేర్కొన్నారు. 

కేంద్ర ఉద్యోగులు..పెన్షనర్లకు పెరిగిన డీఏ...

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రెండు శాతం డీఏ పెరిగింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

ఆర్కేను విడుదల చేయాలి - టి.డెమ్రోకటిక్ నేతలు..

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం చేతిలో బందీగా ఉన్న అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ డెమోక్రటిక్ నేతలు పేర్కొన్నారు. ఆర్కేకు ఏమి జరిగినా తెలుగుదేశం ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రొ.హరగోపాల్, పీఎల్ విశ్వేశ్వర్ రావు, జస్టిస్ చంద్రకుమార్ లు పేర్కొన్నారు. 

జిల్లాలో వైద్యురాలి ఆత్మహత్యలో నెలకొన్న వివాదం..

గుంటూరు : వైద్యురాలి ఆత్మహత్య వివాదం నెలకొంది. నాలుగు రోజుల క్రితం డా.సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది. గుంటూరులో పీజీ వైద్య విద్య చదువుతోంది. భార్య మృతి తట్టుకోలేక భర్త రవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పది నెలల క్రితం సంధ్యారాణికి..రవితో వివాహం జరిగింది. ఫ్రొఫెసర్ పై చర్య తీసుకోవాలంటూ గుంటూరులో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 

బీసీ కమిషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం..

హైదరాబాద్ : బీసీ కమిషన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కమిషన్ ఛైర్మన్ గా బీఎస్ రాములు, సభ్యులుగా రచయిత జూలూరి గౌరీ శంకర్, వకుళాభరణం కృష్ణ మోహన్, విద్యార్థి నేత ఆంజనేయులు గౌడ్ లు ప్రమాణ స్వీకారం చేశారు. 

కూకట్ పల్లి లో ఆక్రమణల పరిశీలన...

హైదరాబాద్ : కూకట్ పల్లిలో ఆక్రమణలను ఎమ్మెల్యే కృష్ణారావు, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డిలు పరిశీలించారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సైకో హల్ చల్..

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సైకో హల్ చల్ చేశాడు. సమయం అడిగిన వ్యక్తి షరీఫ్ పై సైకో బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో షరీఫ్ ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. సైకో కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

14:06 - October 27, 2016
14:05 - October 27, 2016
14:03 - October 27, 2016

రంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర పదకొండోరోజుకు చేరింది.. రంగారెడ్డి జిల్లా నాగారం, పెదగొల్కొండ, బహదూర్‌గూడ, చినగోల్కొండ, శంకరాపురం, షాపూర్‌, మదనపల్లి, పాలమాకుల,తిమ్మాపూర్, కొత్తూరులో పాదయాత్ర కొనసాగుతోంది.. ఈ పాదయాత్రకు ఆశావర్కర్లు సంఘీభావం ప్రకటించారు.. గ్రామ గ్రామాన పర్యటిస్తున్న సీపీఎం బృందానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.. స్థానిక సమస్యల్ని సీపీఎం బృందానికి ప్రజలు చెప్పుకుంటున్నారు.. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల నేత నైనాన్ రాజు మాట్లాడుతూ..ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర ఒక అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. రేషన్ కార్డులేక, పెన్షన్లు రాక ఇలా పలు ససమ్యలతో ప్రజలు నిత్యం సమస్యల్లో మగ్గిపోతుంటే బంగారు తెలంగాణ ఎలా అవుతుందని పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రశ్నించారు.

13:59 - October 27, 2016

హైదరాబాద్ : కేసీఆర్‌ తెలంగాణ విద్యార్థులను.. ఉగ్రవాదులను చూసినట్టు చూస్తున్నారని మండలి విపక్షనేత షబ్బీర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫీజు బకాయిలు విడుదలచేయాలంటూ హైదరాబాద్ ఎల్బీనగర్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.. ఈ సభకు పెద్ద ఎత్తున విద్యార్ధులు హాజరయ్యారు. విద్యార్థులకు ఫీజు బకాయిలు విడుదల చేయకుండా.. వాస్తు పేరుతో కొత్త సచివాలయం నిర్మాణానికి కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వం సంక్షేమ పథకాలను తుంగలో తొక్కింది : జానారెడ్డి

విద్యార్థుల అకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని.. అలాగే విద్యార్థుల బాగు కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీసుకొచ్చిందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పథకాలతో పాటుగా అన్ని ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కి విద్యార్థులు తగినబుద్ధి చెప్పాలని జానా కోరారు. 

13:54 - October 27, 2016

టీనేజ్ లోకి అడుగుపెట్టగానే.. రకరకాల చర్మ సమస్యలు ఎదుర్కొంటారు. టీనేజ్ లోకి ఎంటర్ అవగానే చర్మంలో అనేక మార్పులు కనిపిస్తాయి. టీనేజ్ లో పలురకాల మానసిక, శారీరక మార్పులకి గురవుతారు. ఈ మార్పులకి తోడు మీ చర్మం కూడా మార్పులకి లోనయితే కాస్త కంగారు పడటం సాధారణం. టీనేజ్ లో వచ్చే ప్రధాన సమస్య మెటిమలు. ఈ వయసులో ఇవి సర్వసాధారణం..వీటికి తోడు చర్మ సమస్యలకి కారణం తెలుసుకుంటే వాటిని అధికమించటానిక ఏం చేయాలో ఈ వీడియో చూడండి..

13:53 - October 27, 2016
13:45 - October 27, 2016

ఉత్తరప్రదేశ్ : అమర్ సింగ్.. దేశ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు... ఇప్పుడు యూపీ సంక్షోభంలోనూ అమర్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది.. అసలు అమర్ అంటే ములాయంకు ఎందుకింత ప్రేమ.. అసలు అమర్ సింగ్ కు ఎందుకింత ప్రాధాన్యత..

నవంబరు నాటికి అఖిలేష్ సీఎంగా ఉండరన్న అమర్‌సింగ్‌
నవంబరు నాటికి అఖిలేశ్‌ ముఖ్యమంత్రిగా ఉండరని అమర్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. ఆ మాటలు అన్నది రాం గోపాల్‌ యాదవ్‌ కాదు. అమర్‌సింగే. ఆయన మాటలతో నేను చాలా బాధ పడ్డాను. నేను ఔరంగజేబును, నువ్వు షాజహాన్‌ అంటూ ప్రచారం చేశారు. సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ ను ఉద్దేశించి యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలివి... ఈ వ్యాఖ్యలు చాలు.. అమర్ సింగ్ యూపీ సంక్షోభానికి ఎలా ప్రధాన కారణంగా నిలుస్తున్నారో... సమాజ్ వాదీ పార్టీ ముస్లిం ఓట్లను కోల్పోతోందంటూ ఓ ఎమ్మెల్యే పేరుతో ఫోర్జరీ లేఖ రాయించింది కూడా అమర్ సింగే... యూపీలో ములాయం ఫ్యామిలీ వార్ ఎపిసోడ్ లో అమరే అసలు విలనంటూ స్వయంగా ములాయం తనయుడు, సీఎం అఖిలేష్ యాదవ్ ప్రకటించారు... ఓసారి పార్టీ నుంచి బహిష్కరణకు గురై.. మళ్లీ పార్టీలోకి వచ్చి చక్రం తిప్పుతున్న అమర్ సింగ్ ఏంటో చెప్పడానికి ఇది చాలు...

కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని అఖిలేష్ స్పష్టం
కుటుంబంలో, పార్టీలో విభేదాలకు కారణం రాజ్యసభ ఎంపీ అమర్‌సింగేనని యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనే తనకు లేదని స్పష్టం చేశారు. తండ్రి ములాయం ఆదేశిస్తే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికీ సిద్ధమేనని విలపిస్తూ ప్రకటించారు. మా నాన్నే నాకు గురువు. కుట్రలను ఎలా ఎదుర్కోవాలో నాకు ఆయన నేర్పించారు. పార్టీలో, కుటుంబంలో విభేదాలు సృష్టించడానికి కొంతమంది కుట్రలు చేస్తున్నారంటూ పరోక్షంగా అమర్ సింగ్ పై వ్యాఖ్యానించారు.. ఇంతగా తనయుడు ఘోషిస్తున్నా.. ములాయం అమర్ సింగ్ ను కించిత్తు మాట కూడా అనడం లేదు.. ఎందుకిలా.. అమర్ పై ములాయంకు ఎందుకింత ప్రేమ

80వ దశకంలో యూపీలో సీనియర్ రాజకీయవేత్త ములాయం
ములాయం సింగ్ 80 దశకం నాటికే యూపీలో సీనియర్ రాజకీయ వేత్త... 1985లో ఆయన యూపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉండే వారు.. ఆయనప్పుడు జనతా పార్టీలో ఉన్నారు.. అప్పుడు రాజ్ పుత్ సామాజికవర్గానికి చెందిన అమర్ సింగ్ పరిచయమయ్యారు.. యూపీలో ఈ వర్గం పొలిటికల్ గా ప్రభావం చూపే వర్గం.. ములాయం సీఎం అయిన తర్వాత అమర్ సింగ్ క్లోజ్ అయ్యారు.. 1989లో ములాయం జనతాదళ్ నుంచి సీఎం అయ్యారు... అయితే జనతా దళ్ జాతీయ నాయకత్వంతో విభేదాలు కారణంగా 1992లో వేరు కుంపటి పెట్టుకొని సమాజ్ వాదీ పార్టీ స్థాపించారు.. అప్పటి నుంచి ఇక అమర్ సింగ్ హవాకు పగ్గాలు లేకుండా పోయాయి... పార్టీలో చేరకుండానే ములాయం కోటరీ సభ్యుడుగా ఉండి 1996లో పార్టీలో చేరాడు అమర్ సింగ్.. 1996 ఎన్నికల్లో పీవీ ప్రభుత్వం పడిపోయినప్పుడు కేంద్రంలో యునెటెడ్ ప్రభుత్వ ఏర్పాటులో సమాజ్ వాదీ తరపున అమర్ సింగ్ కీలక పాత్ర పోషించారు.. ఇలా తనకు పనికివచ్చే వ్యక్తంటూ అప్పుడు ములాయం మదిలో గుర్తింపు తెచ్చుకోగలిగారు.. అంతే పార్టీలో నెంబర్ 2 అనేదాకా అమర్ సింగ్ స్థాయి వెళ్లిపోయింది..

హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టున్న అమర్‌
హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టున్న అమర్.. ములాయం రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు షాడో మంత్రిగా ఉన్నారనే ప్రచారం జరిగింది. యూపీలో పార్టీ వ్యవహారాలు అన్ని అమర్ కనుసన్నల్లోనే జరిగేవి... 2003లో ములాయం మరోసారి యూపీ సీఎం అయినప్పుడు యూపీ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ హోదాలో అమర్ సింగ్ .. కార్పొరేట్ వర్గాలను ములాయం కు దగ్గర చేశారు.. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ తో పాటు జయాబచ్చన్, జయప్రద, రాజ్ బబ్బర్ తో సహా పలువురు సెలబ్రెటీలు సమాజ్ వాదీ కి దగ్గరయ్యారంటే అది అమర్ చలవే.. అందుకే అనతి కాలంలోనే ఆయన ములాయం బాగా కావాల్సిన వ్యక్తిగా , పార్టీలో కీలక శక్తిగా ఎదిగిపోయారు.. బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడి హోదాలో యూపీకి వచ్చారంటే అది అమర్ సింగ్ ప్రయత్నమేనని పలు సందర్బాల్లో ములాయం గుర్తు చేసుకున్నారు కూడా...

అఖిలేష్ ఎంట్రీతో మారిపోయిన సీన్‌
కన్న కొడుకు కంటే అమర్ సింగ్ కు పార్టీలో ప్రాధాన్యత పెరగడంతో ... అఖిలేష్ ఎంట్రీ తర్వాత సీన్ సితారైంది... 2009లో అఖిలేశ్ యాదవ్ సీఎంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అమర్ సింగ్ అతి జోక్యంపై అఖిలేష్ కన్నేశారు.. ఫిరోజ్ బాద్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు.. అది రుచించని అమర్ సింగ్ ఎస్పీ తిరుగుబాటు అభ్యర్థి కి మద్దతు పలికారు.. దీంతో దీన్ని సాకుగా చూపించి అమర్ పై తండ్రి చేతే బహిష్కరణ వేటు వేయించారు.. అఖిలేష్.. ఇలా వీరిద్దరి మధ్య వైరానికి బీజం పడింది...

అఖిలేష్ వ్యతిరేక రాజకీయాలకు తెరలేపిన ములాయం రెండో భార్య సాధన
అయితే ములాయం సింగ్ రెండో భార్య సాధనా .. తన తనయుడు ప్రతీక్ యాదవ్ రాజకీయ భవిష్యత్తుపై బెంగతో అఖిలేష్ వ్యతిరేక రాజకీయాలకు తెరలేపింది.. సాధనా అంటే అమితంగా ఇష్టపడే ములాయం.. ఆమె మాటను కాదనలేని స్థితికి వచ్చారు.. సరిగ్గా ఇదే సమయాన్నిఅమర్ సింగ్ తనకు అనుకూలంగా మార్చుకొని సాధనా సాయంతో తిరిగి 2016లో పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.. అప్పట్నుంచి తండ్రి తీరుపై అఖిలేశ్ గుర్రుగా ఉన్నారు.. కానీ తాజా పరిణామాలు... ములాయం కుటుంబంలో చిచ్చుకు ప్లాన్ ఖచ్చితంగా అమర్ సింగ్ దేననేది అఖిలేష్ తాజా వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి.. కానీ ప్రధాన మంత్రి కావాలనే కలను నిజం చేసుకోవాలంటే అమర్ సింగ్ లాంటి నమ్మిన బంటు ఉండాలనేది ములాయం మైండ్ సెట్.. దీంతో అమర్ పై తనయుడు ఏం మాట్లాడినా ఏం అనలేకపోతున్నారు...మొత్తానికి యూపీ ఎపిసోడ్ కు అమర్ కారకుడైనా.. ఆయన్ను ములాయం ఏం అనలేని రాజకీయ వైతాళిక పరిస్థితి అమర్ సింగ్ కల్పించినట్లయ్యింది...

 

13:36 - October 27, 2016
13:18 - October 27, 2016

నటసింహ నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. 'క్రిష్' దర్శకత్వంలో 'గౌతమి పుత్ర శాతకర్ణి' బాలకృష్ణ వందో చిత్రంగా రూపొందుతోంది. శరవేగంగా ఈ షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్..టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ కు 26 లక్షలకు పైగా వ్యూస్ లభించడం విశేషం. చారిత్రత్మాక నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుండడంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అంచనాలకు తగ్గట్టే దర్శక, నిర్మాతలు సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని టాక్. వంద లోకేషన్స్ లో ఒకేసారి విడదలయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఇక నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో కనిపిస్తుండగా హేమమాలిని, శ్రియ, కబీర్ బేడీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరి ఆ థియేట్రికల్ ట్రైలర్ ఎలాంటి సంచనాలు సృష్టిస్తోందో వేచి చూడాలి. 

12:55 - October 27, 2016

హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సంస్కరణలపై దృష్టి పెట్టింది. జిల్లాల విస్తీర్ణం గణనీయంగా తగ్గడంతో కలెక్టర్లపై గురుతర బాధ్యతలు ఉంచేలా నియమ, నిబంధనలను సవరించాలని సర్కార్‌ నిర్ణయించింది. ప్రజా సమస్యల పరిష్కారంలో ఇకపై కలెక్టర్లే బాధ్యత తీసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.
జిల్లాల విభజనతో కలెక్టర్లకు తగ్గిన పనిభారం
జిల్లాలను పునర్విభజించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పరిపాలనలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇంతకుముందున్న పది జిల్లాలు ఇప్పుడు 31 జిల్లాలుగా మారాయి. దీంతో గతంలోకంటే జిల్లా కలెక్టర్లకు పనిభారం చాలావరకు తగ్గింది. పెద్ద జిల్లాల కారణంగా ఇంతవరకు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టలేకపోయిన జిల్లా కలెక్టర్లకు ఇప్పుడు... ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపట్టింది. బిజినెస్‌ రూల్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తోంది. ఈ బాధ్యతలను కొందరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు అప్పగించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్లకు విస్తృతాధికారాలు ఇస్తూ 77వ నంబర్‌ జీవోను సవరించాలని సర్కార్‌ నిర్ణయిచింది.

అధికార కేంద్రీకరణ స్థానంలో వికేంద్రీకరణ
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు వీలైనంత త్వరగా ప్రజలకు అందించేలా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, జిల్లా రెవిన్యూ అధికారులు, రెవిన్యూ డివిజినల్‌ అధికారులు మధ్య విధులను విభజించబోతోంది. ప్రస్తుతం ఉన్న అధికార కేంద్రకరణ విధానాల స్థానంలో వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించింది. ల్యాండ్‌ రెవిన్యూ వ్యవహరాల పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్లు జాయింట్‌ కలెక్టర్లకు తోడుగా మరో అధికారికి కూడా అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా స్థాయిలోఉప కార్యదర్శిని నియమించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. భూములకు సంబంధించి 90 శాతం వ్యవహారాలను జిల్లా స్థాయిలోనే నిర్వహించేలా అధికారాలా బదలాయింపుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో భూపరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రతిపాదించింది.

ప్రాంతీయ సమన్వయాధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌
శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు అప్పగించే అంశం కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ప్రస్తుతం రెండు, మూడు జిల్లాలకు డిఐజీ స్థాయి పోలీసు అధికారి ఉన్నారు. వీరికి తోడు ప్రాంతీయ సమన్వయాధికారిగా ఒక సీనియర్‌ ఐఏఎస్‌ను నియమించే అంశంపై చర్చలు జరుపుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో ఉన్న ఈ విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలన్న యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కార్‌ ఉంది. ఆయా రాష్ట్రాల్లో కమిషనర్లలుగా ఉన్న ఈ పోస్టులను రాష్ట్రంలో కోఆర్డినేటర్లుగా మార్చాలన్న ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు.

ప్రభుత్వ శాఖలు, కలెక్టరేట్లకు 3,500 మంది సిబ్బంది అవసరం
అధికార విభజన తర్వాత జిల్లా స్థాయి అధికారుల నియమాకాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ శాఖలు, కలెక్టరేట్లలో పని చేసేందుకు 3,500 మంది సిబ్బంది అవసరం అవుతారని లెక్క కట్టారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందిని ఉపయోగించుకుని, కొత్త జిల్లాల్లో పాలన కుదుటపడిన తర్వాత అవసరాన్ని బట్టి నియామకాల ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. పరిపాలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 

12:51 - October 27, 2016

హైదరాబాద్ : ఏవోబీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావో నేత ప్రభాకర్ మృతదేహానికి పలువురు ప్రజాసంఘ నాయకులు ప్రజాగాయడకుడు దగ్గర్..విమలక్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడుతూ..ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ విషయంలో అనుమానాలున్నాయని పేర్కొన్నారు. చంపడం ప్రజాస్వామ్యం కాదన్నారు. అడవుల్లోకి వెళ్లి చంపాల్సిందనంత అవుసరం ఏముందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మావోయిస్టుల పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 

12:41 - October 27, 2016

తూర్పుగోదావరి : గురుకుల పాఠశాలలో విషాదం నెలకొంది. ఓ విద్యార్థిని అనుమానాస్పది స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన శివకోడూరు లో చోటు చేసుకుంది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న గోదారాణి అనే విద్యార్థిని గురుకుల పాఠశాలకు చెందిన హాస్టల్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. బుధవారం రాత్రి తోటి విద్యార్థులతో సాధారణంగా వ్యవహరించిన గోదారాణి తెల్లవారు ఝామున స్టడీ క్లాస్ లకు గోదారాణి హాజరుకాకపోవటంతో అనుమానించిన తోటి విద్యార్థినులు పరిశీలించగా గోదారాణి మరణించి వుండటాన్ని చూసి యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు..అటు విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించిన అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకున్నారు. కాగా తోటి విద్యార్థినులను..గోదారాణి తల్లిదండ్రులను విచారిస్తున్నారు.కాగా మృతురాలు అమలాపురంలోని భట్నవిల్లివాసిగా తెలుస్తోంది. 

అర్చకుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : అర్చకుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు నాయినీ, తలసాని, జూపల్లి, తుమ్మలలు హాజరయ్యారు. 

జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్ ఇళ్లపై బీజేపీ నేతలు ధర్నా చేశారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, చింతల, రాజాసింగ్, రామచంద్రారావులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని సైదాబాద్ పీఎస్ కు తరలించారు. ప్రభుత్వానికి..కేసీఆర్ కు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. 

ఎన్ కౌంటర్ బూటకం - శిరీష..

ప్రకాశం : ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని, మున్నాది ముమ్మాటికి హత్యేనని ఆర్కే భార్య శిరీష ఆరోపించింది. ఏవోబీ నుండి పోలీసులను వెనక్కి రప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. 

12:32 - October 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం కూల్చివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీని స్థానంలో కొత్త సచివాలయం నిర్మాణానికి టీఆర్ఎస్ సర్కార్ సిద్ధమయ్యింది. దీన్ని అస్త్రంగా చేసుకుని టీ.కాంగ్రెస్ గులాబీ పార్టీపై సమరానికి సిద్ధపడింది. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టులో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పిటీషన్ వేశారు. కొత్త సచివాలయం నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తోందని పిటీషన్ లో పేర్కొన్నారు. పిటీషన్ ను న్యాయస్థానం విచారణకు అంగీకరించి శుక్రవారం నాడు విచారణ జరుపుతామని పేర్కొంది. మరింత సమాచారం వీడియోలో చూద్దాం..

12:29 - October 27, 2016

విజయవాడ : నిధులున్నాయా..? ఎక్కడైనా దొరికాయా..? తవ్వకాలతో పురాతన సంపద కనుమరుగవుతుందే కాని నిధులు మాత్రం దొరకడం లేదు.. ఫలానా చోట నిధులున్నాయని తెలిస్తే చాలు.. రాత్రి రాత్రి కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.. మూఢనమ్మకాలు.. విశ్వాసాలతో ఎందరో నిధుల వేట కొనసాగిస్తున్నారు.. చారిత్రాత్మక భవనాలను..ఆలయాలను నామరూపాల్లేకుండా చేస్తున్నారు..తాజాగా వెలుగుచూసింది పిల్లల కిడ్నాప్..అనాథ పిల్లలను తీసుకెళ్లి పూజలు చేస్తున్నారు...నిధుల కోసం అరచేతిలో అంజనం వేస్తున్నారు..కన్పించలేదంటే వదిలేస్తున్నారు..అనుమానం వస్తే బలిచ్చేస్తారు...ఇలాంటి దుర్మార్గపు ముఠా బెజవాడ దొరకడం కలకలం రేపుతోంది...
నిధుల కోసం చిన్నారుల కిడ్నాప్..ఆలస్యంగా వెలుగుచూసిన ఘోరం..
గుప్త నిధులు..వీటి కోసం కొన్ని ముఠాల అన్వేషణ రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది..అయినా నిధులు దొరుకుతాయన్న అపనమ్మకాలను పెంచి పోషించేవారి వల్ల వేట కొనసాగుతూనే ఉంది..ఒక్కోక్కరూ ఒక్కోరకంగా నిధుల కోసం పాకులాడుతూనే ఉన్నారు.. తాజాగా గుప్త నిధుల కోసం ఓ ముఠా బెజవాడలో సంచరిస్తుందని తేలింది...వీరి స్టైల్‌ మాత్రం వేరు...
ఎదురు కాళ్లతో జన్మించిన పిల్లలతో అంజనాలు ..
ఇలాంటి ప్లాన్‌ చేసుకున్న ఓ నలుగురు వ్యక్తులు గల గ్యాంగ్‌ ముఠాగా ఏర్పడింది..వీరికి నిధులు ఉన్నాయో లేదో చెప్పేది శివస్వామి.. తానే శివుడికి స్వరూపమని నమ్మించి పిల్లలను తీసుకురమ్మని ఆజ్ఞవేస్తాడు..ఆ చిన్నారులు కూడా ఎదురుకాళ్లతో జన్మించినవారైతేనే నిధులు దొరుకుతాయంటూ చెప్పాడు..అంతే ఆ రోజు నుంచి ముఠా గురి అనాథ పిల్లలపై పడింది... వీరితో అయితే ఎలాంటి సమస్యలుండవు..వారు చేసే దుర్మార్గం బయటకు రాదు..ఇదే ఆలోచనతో బెజవాడపై పడ్డ ముఠా అనాథ చిన్నారుల కోసం అన్వేషిస్తోంది...
గతంలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్..
ఎదురుకాళ్లతో జన్మించిన పిల్లలయితే వారి అరచేతిలో అంజనం వేసి పసరుపోస్తే నిధులు ఎక్కడున్నాయో కన్పిస్తాయన్న శివస్వామి చెప్పిన కథలతో ముఠా చిన్నారులను కిడ్నాప్ చేసిన సందర్భాలున్నాయి...తాజాగా మరో చిన్నారిని ఎత్తుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది..ఎట్టకేలకు దీన్ని చేధించిన బెజవాడ సత్యనారాయణపురం పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకోవడంతో ఒళ్లు జలదరించే..కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి...

ఎవరీ శివస్వామి?
అసలు ఎవరీ శివస్వామి..ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు..ఎందుకిలా చేస్తున్నాడు...వీటన్నింటిపై పోలీసులు ఆరా తీస్తే తెలిసిన వాస్తవాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి...తానే శివుడికి స్వరూపమని రెండేళ్లుగా చేస్తున్న అరాచకాలు ఎన్నో...కాస్త లేటయినా...ఎలాంటి ప్రాణనష్టం జరగకున్నా దుర్మార్గుల జాతకాలు బయటపడ్డాయి...ఇంతకీ ఎవరీ శివస్వామి...
అసలు పేరు శ్రీనివాస్...కృష్ణాజిల్లా వాత్సాయికి చెందిన శ్రీనివాస్
ఇలాంటి మాటలు చెప్పిన శ్రీనివాస్‌ అంబరు పేటకు చెందిన రాజా, బుజ్జిలతో పాటు మరో ఇద్దరిని తనవైపు తిప్పుకున్నాడు... గుప్తనిధులు కావాలంటే తాను చెప్పింది చేయాలని ఆజ్ఙాపించాడు...
12 ఏళ్ళ లోపు వయస్సున్న పిల్లలు..ముందుకాళ్లతో జన్మించి ఉండాలి..
ఇలా చిన్నారులు ఎదురుకాళ్లతో జన్మించారో..లేక తల మొదలుతోనే బయటకు వచ్చారో తెలియదు కదా..అందుకే వారిలో ఎవరిపైనా అనుమానం వచ్చినా తీసుకువస్తే అరచేతిలో పసరువేస్తానంటూ చెప్పాడు..దాంతోనే విషయం తెలిసిపోతుందని నమ్మించాడు..
అనాథ శరణాలయాలే టార్గెట్ ...
దొంగ స్వామి చెప్పిన మాటలు నమ్మిన ముఠా సభ్యులు బెజవాడపై పడ్డారు..వీరి టార్గెట్‌ అనాథ శరణాలయాలే...రోడ్డుపై కన్పించే అనాథ పిల్లలే..వీరిని ఎత్తుకెళ్లి స్వామి ముందు హాజరుపరిస్తే నిధుల జాడ తెలిసిపోతుందని నగరంలో పిల్లల కిడ్నాప్‌లు చేస్తున్నారు..తాజాగా ఓ బాలుడిని ఎత్తుకెళ్లడంతో వీరి దుర్మార్గం వెలుగుచూసింది...
బాలభవన్ చుట్టు రెక్కీ...
విజయవాడ బావాజి పేటలోని బాల భవన్ నుండి ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసి వాత్సాయి కి తీసుకువెళ్ళారు. మూడురోజులు రకరకాల పూజలు చేశారు...ఆ పిల్లల చేతిలో పసరు పూసి నిధులు కనబడుతున్నాయని చూశారు...కాని స్వామికి కన్పించలేదంట..అంటే వారు ముందుకాళ్లతో జన్మించినవారు కాదని వదిలేశారు...

ఆ పిల్లలకు కుదరకపోతే మరొకరిని ఎత్తుకు వస్తాడు..
ఎత్తుకెళ్లే పిల్లల చేత మూడు రోజుల పాటు పూజలు చేస్తూ ఆ సమయంలో కనీసం తిండికూడ పెట్టేవారు కాదు..వారి చేతికి ఓం నమశివాయని అని గోరింటాకు పెట్టి పూజలు చేసి, ఆ చేతిలో ఆకుపసర పూసి అందులో.మూడుచుక్కలు నూనె పోసి గుప్తనిధులు అందులో కనబడుతున్నాయని.. అవి ఎక్కడనున్నాయో చూడమని పిల్లల్ని అడిగేవాడు.... చెప్పకపోతే బెదిరించేవాడు. అయినా కన్పించలేదని చెబితే వదిలేసి బయట చెబితే విషం కక్కుకొని చచ్చిపోతావని చెప్పి బయపెట్టేవాడు....

బాలవభవన్‌ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం
తాజాగా ఈ బాలుడు కాలేషాను ఎత్తుకెళ్లింది ముఠా...అంతకు ముందే సుభానీని కిడ్నాప్ చేసి వదిలేశారు..ఈ విషయం తెలుసుకున్న బాలవభవన్‌ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు..కాలేషా కన్పించడం లేదనేసరికి సుభానీ ద్వారా వివరాలు తెలుసుకుని వాత్సవాయి గ్రామానికి చేరారు..అక్కడ ముఠాను గుర్తించి బాలుడిని సురక్షితంగా భవన్ చేర్చారు..ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు...అరెస్ట్ చేసినప్పటికి శ్రీనివాస్ మాత్రం అప్పటికితాను శివ స్వరూపాన్నె అని చెప్పడంతో పోలీసులు శ్రీనివాస్ ను ఏం చేయాలో తెలియక తలలుపట్టుకున్నారు...

ముఠా దుర్మార్గం కలకలం
బెజవాడ నగరంలో బయటపడ్డ ముఠా దుర్మార్గం కలకలం రేపుతోంది...నిధుల కోసం అనాథపిల్లలను టార్గెట్ చేసిన ముఠా తీరుపై భయం నెలకొంది..చిన్నారులను బలిచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు వణుకుపుట్టించాయి..మూఢత్వంతో దుర్మార్గులు చేస్తున్న అకృత్యాలకు పసివాళ్లను పావులు చేస్తున్నారని ఈ ఘటనతో తేలింది...

12:26 - October 27, 2016

ఢిల్లీ: ఢిల్లీలో పాక్‌ హైకమిషన్‌ అధికారి మహబూబ్ అక్తర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్తర్ నుండి పలు రహస్య పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రక్షణ శాఖ రహస్య పత్రాలు చోరీ చేసిన కేసులో అక్తర్ ను అరెస్ట్‌ చేశారు. భారత్‌కు సంబంధించిన రహస్యాలను పాక్‌కు చేరవేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పాక్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ కూడా తమ ముందు హాజరుకావాలని భారత విదేశాంగశాఖ సమాన్లు పంపించింది. దీంతో ఎంతమందికి సంబంధం వుందనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇండియాలో దౌత్యాధికారి హోదాలో పనిచేస్తున్నట్టు నటిస్తూ, మరోవైపు ఇక్కడి సమాచారాన్ని రహస్యంగా పాక్ చేరవేస్తున్న ఆరోపణపై సదరు అధికారిని ఢిల్లీ పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. సోదాల్లో భారత సైన్యానికి చెందిన కీలక పత్రాలు ఆయన దగ్గర్నుంచి పట్టుబడటం గమనార్హం. 

సచివాలయం కూల్చడంపై హైకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : సచివాలయాన్ని కూల్చొద్దంటూ టి.కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, కోమటిరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొత్త సచివాలయం నిర్మాణంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పిటిషనర్ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అత్యవసర పిటిషన్ గా స్వీకరించాలని కోరగా శుక్రవారం విచారణ చేపడుతామని హైకోర్టు పేర్కొంది. 

ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి - విమలక్క..

మేడ్చల్ : ఎదురు కాల్పులైతే రెండు వైపులా నష్టం జరగాలని విమలక్క పేర్కొన్నారు. విష ప్రయోగం చేసి హత్య చేశారని, ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

ఎన్ కౌంటర్ పై అనుమానాలు - గద్దర్...

మేడ్చల్ : ఎన్ కౌంటర్ ఘటనపై అనుమానాలున్నాయని గద్దర్ పేర్కొన్నారు. చంపడం ప్రజాస్వామ్యం కాదని, అడవుల్లోకి వెళ్లి చంపాల్సినవసరం ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్ మావోయిస్టు పట్ల తమ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

మావోయిస్టు ప్రభాకర్ మృతదేహానికి పలువురు నివాళులు..

మేడ్చల్ : యాప్రాల్ లో మావోయిస్టు ప్రభాకర్ మృతదేహానికి గద్దర్, విమలక్క, ప్రజా సంఘాలు నివాళులర్పించాయి. ఏవోబీ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రభాకర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. 

మంత్రులు ప్రత్తిపాటి..రావెలకు భారీ భద్రత..

విజయవాడ : మావోయిస్టు హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు ప్రత్తిపాటి, రావెలకు భారీ భద్రత కల్పించారు. ఇటీవల ఎవోబీ భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. 

11:53 - October 27, 2016

హైదరాబాద్ : సర్కారు దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణుల ప్రాణాల మీదకి తెస్తోంది. ఆపరేషన్‌ పేరుతో వైద్యులు గర్భిణులకు వేదనలు మిగులుస్తున్నారు. ఒకే రోజు 15 మందికి గర్భిణులకు ఆపరేషన్‌లు చేసి.. ఐదో రోజున కొంత మందికి కుట్లు విప్పేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా.. కుట్ల గాయం మానక.. నొప్పిని తాళలేక బాలింతలు నానా అవస్థలూ పడుతున్నారు.

కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో గర్భిణులకు వికటించిన వైద్యం
హైదరాబాద్‌లోని.. కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో ఐదు రోజుల క్రితం ఆపరేషన్‌లు చేసిన గర్భిణులకు వైద్యం వికటించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా.. గర్భిణులు నొప్పితో విలవిలలాడిపోతున్నారు. కోఠి ఆసుపత్రి వైద్యులు ఐదు రోజుల క్రితం ఒకేసారి 15 మంది గర్భిణులకు ఆపరేషన్‌లు చేశారు. వారిలో కొంతమందికి ఆరో రోజునే కుట్లను విప్పివేశారు. అయితే ఆపరేషన్‌ చేసిన చోట కుట్ల గాయం మానలేదు.. దీంతో వారంతా నొప్పితో నరకం అనుభవిస్తున్నారు.

వైద్యులపై బాధితుల బంధువుల ఆగ్రహం
కుట్లు తొలగించిన నాటి నుంచి బాలింతలంతా నొప్పితో ఏడుస్తున్నారని.. వైద్యుల దగ్గరకు వెళ్లి అడిగితే పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. ఆస్పత్రిలో పేషెంట్లను పట్టించుకునే వారే లేరని అంటున్నారు. అంతేకాదు ఇతర ఆస్పత్రుల నుంచి మెటర్నిటీ హాస్పటల్‌కి వస్తే.. ఇక్కడ అడ్మిట్‌ చేసుకునేందుకు నిరాకరిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాధపడుతున్న బాలింతలను.. ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించేందుకు వారి బంధువులు ప్రయత్నిస్తున్నారు.

11:49 - October 27, 2016

హైదరాబాద్ : అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా వార్తల్లో నిలిచే మైనింగ్‌ శాఖ.. లాభాలతో ముందుకెళుతోంది. ప్రస్తుతం ఆ శాఖ ఆర్జించిన ఆదాయమే ఇందుకు నిదర్శనం. కేటీఆర్ మైనింగ్‌ శాఖ బాధ్యతలు తీసుకున్నాక... ప్రత్యేక దృష్టి సారించడంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని మైనింగ్‌ అధికారులు చెబుతున్నారు.

రికార్డు స్థాయిలో ఏడాది 69 శాతం ఆదాయం పెరుగుదల
తప్పుడు లెక్కలకు..అక్రమ ఆదాయానికి మారుపేరుగా నిలిచే మైనింగ్‌ శాఖ..తాజా పరిణామాలతో గతంలో లేని లాభాలను ఆర్జిస్తోంది. రికార్డు స్థాయిలో ఇసుక మినహా మిగిలిన ఇతర మైనర్ మినరల్స్ ద్వారా వచ్చే అదాయంలో 69 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇక ఇసుక నుంచి వచ్చే అదాయంలోనూ ఇదే విధంగా అదాయాభివృద్ధిని నమోదు చేస్తోంది. రెండు త్రైమాసికాల్లోని ఇసుక ఆదాయంలో 57 శాతం వృద్ధిని సాధించి... పక్కా ప్రణాళితో పనులు చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని రుజువు చేసింది మైనింగ్‌ శాఖ.

మైనింగ్ ప్రాంతాల్లో పర్యటించి లోపాలను పరిశీలించిన కేటీఆర్
మైనింగ్‌ శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించాకే.. ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని మైనింగ్‌ అధికారులు చెబుతున్నారు. కేటీఆర్ మైనింగ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే శాఖ ఆదాయంపై దృష్టి పెట్టారు. మైనింగ్‌ ప్రాంతాల్లో పర్యటించి..లోపాలను తెలుసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకొని..మైనింగ్‌ శాఖ మంచి ఫలితాలను సాధించేలా కృషి చేశారు. బాధ్యతాయుతంగా పనిచేసిన వారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. సింగరేణి సీఎండీ శ్రీధర్‌తో చర్చించి..మెరుగైన ఫలితాలు వచ్చేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఏడాది రూ. 357 కోట్ల ఆదాయాన్ని సాధించిన మైనింగ్‌ శాఖ
మైనింగ్‌ శాఖకు ఏప్రిల్- సెప్టెంబర్ రెండు త్రైమాసికాల్లో మైనర్ మినరల్స్ ద్వారా 357 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే సమయానికి 211 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇక ఇసుక సినరేజీ ఫీజులో 183 కోట్లు రాగా... గత సంవత్సరం 117 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే సమకూరింది. మైనింగ్‌ శాఖ సాధించిన ఫలితాలపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసిన వారందరికి ప్రొత్సహకాలిచ్చేందుకు కేటీఆర్ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మార్గ దర్శకాలను వెంటనే రూపొందించాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ను అదేశించారు. 

విషప్రయోగం చేసి హత్య : విమలక్క

హైదరాబాద్ : ఏవోబీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావో నేత ప్రభాకర్ మృతదేహానికి పలువురు ప్రజాసంఘ నాయకులు ప్రజాగాయడకుడు దగ్గర్..విమలక్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘం నేత విమల్క మాట్లాడుతూ..ఎదురు కాల్పులు జరిగితే ఇరువైపులా నష్టం జరగాలనీ కేవలం మావో నేతలు మాత్రమే ఈ ఘటనలో భారీగా మృతి చెందారన్నారు. పోలీసులు మాత్రం సురక్షితంగా వున్నారనీ కాబట్టి ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్ కౌంటరేనని ఆరోపించారు. మావోలకు విషప్రయోగం చేసి హత్య చేశారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. 

చిన్నచర్లపల్లిలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : కుషాయిగూడలోని చిన్నచర్లపల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న అగ్నిపమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు.ఈ క్రమంలో ఇంట్లో వున్న గ్యాస్ సిలిండర్ పోలింది. దీంతో సిబ్బందిలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  

పెయింట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

ఉత్తరప్రదేశ్‌ : ఓ పెయింట్ తయారీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు పక్కనే ఉన్న మరో రెండు యూనిట్లకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 

11:08 - October 27, 2016

నష్టాలతో స్టాక్ మార్కెట్ల ప్రారంభం..

ముంబై : గురువారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 72 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టంలో కొనసాగుతుండగా 31 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. 

పోలీసుల అదుపులో పాక్ హై కమిషన్ అధికారి..

ఢిల్లీ : పాక్ హై కమిషన్ అధికారి మహ్మద్ అక్తర్ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గూఢచర్యం ఆరోపణలపై మహ్మద్ అక్తర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

10:46 - October 27, 2016

హైదరాబాద్ : ఏవోబీ భారీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు నేతల మృతదేహాలు పోస్టు మార్టం అనతరం వారి బంధువులకు అప్పగించారు. దీంతో వారి నివాసాలకు ఒక్కొక్క నేత మృతదేహాలు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభాకర్..ఆర్కే కుమారుడు మున్నా మృతదేహాలు వారి నివాసాలకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే మావో ఉద్యమంలో కీలక నేత అయిన కృష్ణయ్య అలియాస్ దయా మృతదేహం వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెనికి చేరుకుంది. ఉద్యమకారులు..అభిమానుల సందర్శనాదర్థం కృష్ణయ్య అలియాస్ దయా మృతదేహాన్ని ఉంచారు. కాగా కృష్ణయ్యకు ఆరుగురు సోదరులున్నారు. తమ సోదరుడ్ని ఇలా విగతజీవిగా చూడటంపట్ల వారు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మావోల ఉద్యమంలో కీలక నాయకుడు కృష్ణయ్య మృతి పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు. 

ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టుల మృతి..

విశాఖపట్టణం : మల్కన్ గిరి చిత్రకొండ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. 

10:38 - October 27, 2016

హైదరాబాద్ : ఏవోబీ భారీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు కీలక నేత ప్రభాకర్ మృతదేహం నగరంలోని యాప్రాల్ ప్రాంతానికి చేరుకుంది. ఉద్యమకారులు..అభిమానుల సందర్శనాదర్థం ప్రభాకర్ మృతదేహాన్ని ఉంచారు. గురువారం ఉదయం 7గంటలకు యాప్రాల్ కు ప్రబాకర్ మృతదేహం చేరుకుంది. ఈ సందర్భంగా టెన్ టీవీతో ప్రభాకర్ భార్య మాట్లాడుతూ..మృతి చెందిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన తమకు మృతదేహాలు వున్న తీరును చూస్తే బూటకపు ఎన్ కౌంటర్ గా తెలుస్తోందన్నారు. మహిళా మావో నేతలు లత, మమత మృతదేహాలు దారణంగా వున్నాయని ప్రభాకర్ భార్య పేర్కొన్నారు. మహిళా మావోలను అత్యాచారం చేసి చిత్రహింసల పాలుచేసిన చంపేసారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ప్రాంతంలో బాక్సైట్ కు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయనీ..దానికి మావోయిస్టులు మద్ధతునిచ్చినందుకే పథకం ప్రకారంతోనే బూటకపు ఎన్ కౌంటర్ చేశారని ఆమెఆరోపించారు. ఈ బూటకపు  సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో తన భర్త తాను ఎంతో కృషి చేశామనీ..తాము కోరుకున్న ప్రజా తెలంగాణ రాలేదని ఆమె వాపోయారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ కాదు దొరల తెలంగాణ చరిత్రలో మళ్లీ పునరావృతమైందన్నారు. తన భర్తకు జరిగిన అన్యాయం మరే నేతలకు జరగకుండా వుండాలంటే ఈ ఎన్ కౌంటర్ పై సమగ్ర విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు.

తిరుమల అడవులకు నిప్పు పెట్టేవారు వీరేనా?

తిరుమల: తిరుమల అటవీ ప్రాంతంలోని గోగర్భం డ్యాం దగ్గర అనుమానస్పదంగా తిరుగుతున్న మొత్తం ఆరుగురు వ్యక్తులను అటవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరికి చెందిన వారిగా గుర్తించారు. గోగర్భం సమీప ప్రాంతాలలో అడవికి నిప్పు పెడుతున్నారంటూ వీరిని అదుపులోకి తీసుకున్నామని అటవీ సిబ్బంది తెలిపారు. ఏవోబీలో మావోలపై కాల్పులు జరిగిన ప్రాంతానికి చెందినవారు కావడంతో పోలీసులు వీరిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌ఎస్‌ పురాలో మళ్లీ కాల్పులు..

జమ్ముకశ్మీర్‌: పాకిస్థాన్‌ తరచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లో రాత్రి నుంచి పాక్‌ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ఆరుగురు పౌరులకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ఎదురు దాడికి దిగింది.

ఇటలీలో భారీ భూకంపం!..

ఇటలీ : మధ్య ఇటలీ ప్రాంతంలో బుధవారం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 6.0గా నమోదైనట్లు అమెరికా భూభౌతిక పరిశోధనా సంస్థ తెలిపింది. ప్రాణ నష్టంపై కచ్చితమైన సమాచారం లేదు. భారీ భూకంపానికి 2 గంటల ముందు 5.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. రోమ్‌కు దక్షిణాన 150 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్లలో లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావం మార్చీ ప్రాంతంలోని కాస్టిలాంజింలో సుల్‌నీరా పట్టణంపై తీవ్రంగా ఉంది. 

ఎయిర్ పోర్ట్ లో సెల్ ఫోన్లు స్వాధీనం..

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులే అక్రమంగా తీసుకువచ్చిన విలువైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళ వద్ద వీటిని స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు మహిళను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

తీవ్ర వాయుగుండంగా కయాంత్..

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న కయాంత్ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 240 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. పశ్చిమ నైరుతి దిశగా పయనిస్తుంది. మరో 12 గంటల్లో మరింత బలహీనపడనుంది. ఈ ప్రభావంతో కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురువనున్నాయి. కాగా పోర్టుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే విశాఖకు చేరుకున్నాయి. అదేవిధంగా మూడురోజుల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధించారు. ఈ నెల 29న నెల్లూరు పరిసరాల్లో కాయంత్ తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

10:09 - October 27, 2016

దాసిరెడ్డి గూడానికి కృష్ణయ్య మృతదేహం..

నల్లగొండ : ఏవోబీలో ఎన్ కౌంటర్ లో మృతి చెందిన చామల కృష్ణయ్య అలియాస్ దాయ మృతదేహం యాదాద్రి మండలం దాసిరెడ్డి గూడెం చేరుకుంది. కృష్ణయ్య మృదేహానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 

10:02 - October 27, 2016

గుంటూరు : మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారిలో అత్మస్ధైర్యం నింపేందుకు అచార్య నాగార్జున యూనివర్శిటీ నడుం బిగించింది. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలతో జాగృత పరిచేందుకు శ్రీకారం చుట్టింది. స్వీయ రక్షణ కోసం విద్యార్ధినులకు కరాటేలో ట్రైనింగ్‌ ఇస్తోంది.

మహిళా ధీరత్వం గురించి చెప్పాలంటే చరిత్ర పుటలు సరిపోవు
మహిళ ధీరత్వం గురించి చెప్పాలంటే చరిత్ర పుటలు సరిపోవు. కానీ ప్రస్తుత సమాజంలో మహిళలపై రోజూ ఏదో ఒక మూల దాడులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని ప్రతిఘటించేందుకు మహిళల్లోని శక్తిని తట్టి లేపేందుకు కరాటే లాంటి శిక్షణలు దోహదపడుతున్నాయి.

దేశ వ్యాప్తంగా మహిళలు, అమ్మాయిలపై వరుస దాడులు
దేశవ్యాప్తంగా మహిళలు, అమ్మాయిలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌ కు చెందిన రుద్రమదేవి స్వీయ రక్షణ అకాడమీ అధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్ధినులకు కరాటే శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. విద్యార్ధినులంతా ఉత్సాహంగా ఈ శిక్షణా శిబిరంలో పాల్గొని కరాటే నేర్చుకుంటున్నారు.

లక్షా 50వేల మందికి కరాటేలో శిక్షణ ఇచ్చి గిన్నీస్ బుక్ లో స్థానం
విద్యార్ధినులను చైతన్య పరచటంతో పాటు, వారిలో అత్మస్ధైర్యం నింపేందుకు ఈ తరహా శిక్షణలు ఉపయోగపడనున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ తరహా శిక్షణా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలు, యూనివర్శిటీల్లో ఇప్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు లక్షా 50వేల మందికి కరాటేలో శిక్షణ ఇచ్చి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించిన రుద్రమదేవి స్వీయ రక్షణ అకాడమీ.. భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్ధినులు, మహిళలకు ఈ తరహా శిక్షణలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది.

యూనివర్సిటీ చొరవను అభినందిస్తున్న తల్లిదండ్రులు
ఇలాంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను విద్యార్ధినులు ఎదుర్కొనేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. యూనివర్సిటీ చొరవను విద్యార్ధినుల తల్లిదండ్రులను అభినందిస్తున్నారు.

09:53 - October 27, 2016

విశాఖ : కయాంత్ తుపాను దూసుకొస్తోంది.. విశాఖకు ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని.. ఈ నెల 29న నెల్లూరు పరిసరాల్లో తీరం దాటొచ్చని వాతావరణ అధికారులు చెబుతున్నారు... తీరం దాటగానే సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.. తుపాను ప్రభావంతో ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.. మరోవైపు తుపాను హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ తెలిపారు. తీరప్రాంత జిల్లాల అధికారులతో మాట్లాడుతున్నామని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీచేశారు.. అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్‌ హెచ్చరిక జారీ చేశారు.. 

09:50 - October 27, 2016

తూర్పుగోదావరి : దీపావళి..! ప్రపంచానికి వెలుగులు పంచే పండుగ. చిచ్చుబుడ్లు.. మతాబులు.. కాలుస్తూ చిన్నా పెద్దా హుషారుగా గడిపే పండుగ. దీపావళి టపాసుల తయారీ.. ఇటీవలి కాలంలో కుటీర పరిశ్రమగా వ్యాపిస్తోంది. అయితే తయారీ సంస్థలు సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా.. బాణాసంచా తయారీ దారులు.. ఈసారీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బాణా సంచా తయారీపై 10టీవీ ప్రత్యేక కథనం..

తూర్పుగోదావరి జిల్లాలో కుటీర పరిశ్రమగా బాణా సంచా తయారీ
తూర్పుగోదావరి జిల్లాలో కుటీర పరిశ్రమగా బాణా సంచా తయారీ..నిబంధనలను పాటించని బాణాసంచా తయారీ సంస్థలు..ప్రాణాలు అరచేత పట్టుకుని పనిచేస్తున్న కార్మికులు..దీపావళి వచ్చిందంటే.. జగమంతా వెలుగులు పరచుకుంటాయి. నింగిని తాకే తారాజువ్వలు.. గగనాన నవ్య నక్షత్ర మండలాన్ని సృష్టిస్తాయి. ఆబాలగోపాలమూ మతాబుల వెలుగులతో మురిసిపోతుంటారు. అందరిలోనూ ఉల్లాసాన్నీ, ఉత్తేజాన్నీ నింపే మతాబులు.. వాటి తయారీదారుల జీవితాల్లో మాత్రం చీకట్లనే నింపుతున్నాయి. తరచూ సంభవించే ప్రమాదాల కారణంగా.. బాణాసంచా తయారీ కార్మికులు అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండేళ్ల క్రితం జరిగిన ఘోర దుర్ఘటనను ఈ ప్రాంతం ఇప్పటికీ మరచిపోలేదు.

అగ్ని ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి
తూర్పు గోదావరి జిల్లా వాకతిప్పలోని బాణా సంచా తయారీ కేంద్రంలో రెండేళ్ల క్రితం అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో పది మంది కార్మికులు ప్రాణాలు కొల్పొయారు. బాణాసంచా తయారీ సంస్థ.. సరైన జాగ్రత్తలు పాటించని కారణంగానే భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందని అనంతర దర్యాప్తులో వెల్లడైంది. ఇలాంటి చేదు ఘటన నుంచి.. బాణాసంచా తయారీ సంస్థలు నేటికీ పాఠాలు నేర్చుకోవడం లేదు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని వదిలించాల్సిన అధికారులూ అలసత్వంగానే వ్యవహరిస్తున్నారు. వీరు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో.. బాణాసంచా తయారీ కేంద్రాలు.. నిబంధనలకు యథేచ్ఛగా నీళ్లు వదులుతున్నాయి.
వేట్ల పాలం, రాయవరం, బిక్కవోలు ప్రాంతాల్లో బాణాసంచా తయారీ
తూర్పు గోదావరి జిల్లాలోని.. వివిధ బాణా సంచా తయారీ కేంద్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు టపాసులు ఎగుమతి అవుతున్నాయి. సంవత్సరం పొడవునా వివిధ సందర్భాలకు తగ్గట్టుగా తయారయ్యే ఉత్పత్తులను ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. వేట్ల పాలం, రాయవరం, బిక్కవోలు ప్రాంతాల్లో బాణాసంచా తయారీ ఓ కుటీర పరిశ్రమగా సాగుతోంది. వందల కుటుంబాలు బాణా సంచా తయారీ పరిశ్రమలపై ఆధార పడి జీవిస్తున్నాయి.

వెలుగుల పండుగల్లో విషాదాలు
బాణాసంచా తయారు చేసే కూలీల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రజలందరికీ పండుగ పూట ఆనందాన్ని నింపుతున్న కుటుంబాల్లో నిత్యం అవస్థలు తప్పడం లేదు. పిల్లా పాప పని చేసినా చాలీచాలని కూలీలతో పొట్ట నింపుకోవాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి బాణా సంచా తయారీలో వ్యాపారులే లాభపడుతున్న పరిస్థితి కన్పిస్తోంది. అయితే.. బాణా సంచా తయారీ సంస్థల నిర్వాహకులు మాత్రం ఇందుకు భిన్నంగా చెబుతున్నారు. ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయని, పైగా చైనా నుంచి దిగుమతి అయ్యే బాణాసంచా తమ ఉత్పత్తులపై పెను ప్రభావం చూపుతోందని వారంటున్నారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం
తయారీదారులు, కూలీలు నిత్యం ప్రమాదకర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. ప్రమాదాల నివారణకు అనేక నిబంధనలు ఉన్నప్పటికీ చాలా చోట్ల వాటిని పెడచెవిన పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటున్న అధికారులు.. ఎప్పట్లాగానే.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెబుతున్నారు. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా.. ఈసారి కూడా నిర్లక్ష్యం నీడలోనే బాణాసంచా తయారు చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి..

హైదరాబాద్: వనస్ధలిపురంలో గురువారం తెల్లజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న బైకు డీసీఎంను ఢీ కొట్టడంతో ఇంజనీరింగ్ విద్యార్ధి సాయికిరణ్ మృతి చెందాడు. సాయి కిరణ్ తో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

09:40 - October 27, 2016

రంగారెడ్డి : తెలంగాణలో లక్షా 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా..ప్రభుత్వం వాటిని భర్తీ చేయడంలేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్ర 10వ రోజు..తమ్మినేని బృందం రంగారెడ్డి జిల్లాలోని పలుగ్రామాల్లో పర్యటించి ప్రజల విజ్ఞప్తులను స్వీకరించింది. ప్రజల కనీస సౌకర్యాలు మెరుగుపరిచినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని తమ్మినేని అన్నారు.

10వరోజుకు పాదయాత్ర..
సీపీఎం మహాజన పాదయాత్ర పదోరోజు.. రంగారెడ్డి జిల్లా బాచుపల్లి, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, పోరళ్ల, కోళ్లపడ్కల్‌, గాంధీనగర్‌తండా, దుబ్బచర్ల, మన్సాన్‌పల్లి క్రాస్‌రోడ్‌ మీదుగా కొనసాగింది.

పోరెండ్లలో తమ్మినేని వీరభద్రం
పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా పోరెండ్లలో తమ్మినేని వీరభద్రం పర్యటించారు. ప్రజల విజ్ఞప్తులను తమ్మినేని బృందం స్వీకరించింది. ఆ తర్వాత నేదునూర్ల గ్రామానికి చేరుకున్న తమ్మినేని వీరభద్రం.. గ్రామంలోని మోడల్‌ స్కూలును సందర్శించారు. స్కూలు సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో లక్షా 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని..ప్రభుత్వం వీటిని భర్తీ చేయడం లేదని తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో డిగ్రీలు పాసై ఉద్యోగం, ఉపాధి దొరకక లక్షాలాదిమంది రోడ్డున తిరుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కనీస సౌకర్యాలు మెరుగుపరిచినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని తమ్మినేని అన్నారు. మహాజన పాదయాత్రకు ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌ మద్దతు తెలిపారు. సీపీఎం మహాజన పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. పలు ప్రజాసంఘాలతో పాటు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. 

09:30 - October 27, 2016

హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ ప్రమాదాలతో చేతికి అందివచ్చిన బిడ్డలు కన్నవారి కళ్ళముందే కడదేరిపోతున్నారు. దీంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అధికారులు ఎప్పటికప్పుడు చెబుతూనే వున్నారు. కానీ ప్రమాదాలను మాత్రం నివారించలేకపోతున్నారు. ఈ ప్రమాదాలకు ఎంతో భివష్యత్తు వున్న విద్యార్థులు బలైపోతున్నారు. ఇటువంటి సంఘటనే నగరంలోని వనస్థలిపురంలో జరిగింది. వనస్ధలిపురంలో గురువారం తెల్లజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకు డీసీఎంను ఢీ కొట్టడంతో ఇంజనీరింగ్ విద్యార్ధి సాయికిరణ్ మృతి చెందాడు. సాయి కిరణ్ తో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గురైన సాయి అనే చికిత్సపొందుతున్న స్నేహితుడిని పరామర్శించడానికి వనస్థలిపురం ఆసుపత్రికి వెళ్తున్న సాయికిరణ్ అనే ఇంజినీరింగ్‌ విద్యార్థి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.

09:19 - October 27, 2016

విశాఖ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి ఎన్‌కౌంటర్ ఘటన చోటుచేసుకుంది. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ అటవీప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. దీంతో మావోల మృతుల సంఖ్య 32కు చేరుకుంది. సంఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు లొంగిపోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఈ ఎన్ కౌంటర్ పై పోలీసులు అధికారికంగా ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. సోమావరం, మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఆర్కేతో పాటు మరో ఇద్దరు కీలక నేతలు తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. వీరికోసం ఏవోబీలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ తీరు చూస్తూ మావోలను పూర్తిగా మట్టుపెట్టేందుకు పూనుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కూబింగ్ లో ఆంధ్రాతో పాటు ఒడిశా నుండి దాదాపు 1000 మంది పోలీసులు కూడా కూబింగ్ లో పాల్గొన్నారు. మావోల ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదని తెలిపేందుకు మావో సానుభూతిపరులే సీఎం చంద్రబాబును హతమారుస్తామంటూ లేఖలు వ్రాసినట్లుగా పోలీసు శాఖ భావిస్తోంది. కాగా ఏవోబీ నుండి తప్పించుకున్న కీలక నేతలు నల్లమల ఫారెస్ట్ కు చేరుకోవచ్చనే అనుమానంతో ఆ ప్రాంతంలో గ్రేహౌండ్స్ దళాలు జల్లెడపడుతున్నాయి.

 

09:01 - October 27, 2016
08:58 - October 27, 2016

ప్రకాశం : ఏవోబీలో మృతి చెందిన మావోయిస్టు మున్నా మృతదేహం స్వగృహానికి చేరుకుంది. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత కుమారుడు మున్నా మృతదేహం ప్రకాశం జిల్లా ఆలకూరపాడుకు చేరుకుంది.. మున్నా మృతదేహాన్ని చూసి స్థానికులు, కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.. విరసం నేత కల్యాణరావుతోపాటు పలువురు మున్నాకు నివాళులు అర్పించారు..కాగా ఏవోబీలో సోమవారం భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారి మృతదేహాలకు మల్కన్ గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించారు. 

08:52 - October 27, 2016

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని జవహార్ నగర్, మజీద్ నగర్ లో పోలీసుల కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. సీడార్ట్, థర్ట్ ఐ టెక్నాలజీతో పోలీసులు తనీఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 63 వాహనాలను స్వాధీనం చేసుకొని, ఎనిమిది మంది రౌడీ షీటర్లతో పాటు 53మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్వగృహానికి చేరుకున్న మున్నా మృతదేహం..

ప్రకాశం : ఏవోబీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు మున్నా మృతదేహం స్వగృహానికి చేరుకుంది. టంగుటూరు మండలం ఆలకూరపాడులోని మున్నా నివాసానికి మున్నా మృతదేహం చేరుకుంది. కాగా ప్రముఖ మావో నేత ఆర్కే కుమారుడే ఈ మున్నా అనే విషయం తెలిసిందే. 

స్కూల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి..

తూర్పుగోదావరి : రాజోలు గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతికి గల కారణాలు తెలియరావాల్సివుంది.

08:26 - October 27, 2016

గుంటూరు: బాపట్లలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన నరాలశెట్టివారిపాలెంలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని హత్యక గల కారణాలను అంచనావేస్తున్నారు. కాగా ఈ హత్యలకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. రోకలి బండతో మోది దారుణంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. సమీప బంధువులే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.హత్యకు గురైనవారిద్దరూ తల్లీ నాగమణి, కుమార్తె సాయిలక్ష్మిలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో నాగమణి సంతానమైన మరో ఇద్దరు చిన్నారులకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ హత్యలతో స్ధానికంగా విషాదం నెలకొంది.

కయాంత్ ప్రభావంతో భారీ వర్షాలు..

విశాఖ: కయాంత్ తుఫాన్‌ క్రమంగా బలహీనపడుతోంది. ఈ తుఫాన్ 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఆ సమయంలో భారీ వర్షాలు పడే అవకాశముందని వారు తెలుపుతున్నారు. 

మహిళల దారుణ హత్య!..

గుంటూరు: బాపట్ల నరాలశెట్టివారిపాలెంలో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్యలకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. మృతులు నాగమణి అమె కూతురు సాయిలక్ష్మి అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

07:48 - October 27, 2016

స్విస్ చాలెంజ్ టెండర్ల ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. కొత్తగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపింది. ఈమేరకు హైకోర్టుకు వెల్లడించింది. దీంతో.. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఎంచుకున్న స్విస్‌ చాలెంజ్‌ విధానానికి ప్రస్తుతానికి బ్రేక్‌ పడినట్లయింది. గతంలో జారీ చేసిన స్విస్‌ చాలెంజ్‌ నోటిఫికేషన్‌లో.. టెండర్ల ప్రక్రియ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని తలపించేలా ఉందని, స్వదేశీ సంస్థలు టెండర్‌ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొందరు పిటిషనర్‌లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సింగిల్‌ బెంచ్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రెవెన్యూ షేర్ విషయంలో స్పష్టత లేకపోవడం. స్విస్ చాలెంజ్ విధానంపై గతంలో కేల్కర్‌ కమిటీ.. సుప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదిక.. ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటే .. లండన్ కోర్టులో పిటిషన్ వేయాల్సిన అవసరం ఉంటుందనే వాదనలను పరిగణలోకి తీసుకున్న సింగిల్ బెంచ్.. 66 పేజీల సుదీర్ఘ మధ్యంతర తీర్పును వెల్లడించింది. ఇందులో ప్రభుత్వం జారీ చేసిన స్విస్‌ చాలెంజ్‌ నోటిఫికేషన్ పై స్టే విధించింది. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో బాబూరావు(సీపీఎం నేత),చందు సాంబశివరావు (టీడీపీ నేత), తులసీరెడ్డి(కాంగ్రెస్ నేత)పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్త అభిప్రాయాలను తెలుసుకోవాలంటే వీడియో చూడండి..సమగ్ర సమాచారాన్ని తెలుసుకోండి..

07:35 - October 27, 2016

వ్యవసాయంతో పాటు ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్నవి సంప్రదాయ, చేతివృత్తులే. అయితే, ఆధునికాభివృద్ధి, ప్రభుత్వ విధానాలు అనేక వృత్తుల పాలిట శాపంగా మారుతున్నాయి. వృత్తిదారుల జీవితాలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. గ్రామీణ వృత్తుల విధ్వంసానికి దారితీస్తున్న కారణాలేమిటి? వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వివిధ వృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించాలి? బడ్జెట్ లలో నిధుల కేటాయింపు ఎలా వుంటోంది? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

07:31 - October 27, 2016

గుంటూరు : వైఎస్‌ జగన్‌.. కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారా ? ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ అనుసరించిన విధానాన్నే.. వైసీపీ ఇప్పుడు అనుసరిస్తుందా? ఎన్ని అడ్డంకులు ఎదురైనా గులాబీ బాస్‌ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన పంథాలో.. ప్రత్యేక హోదాపై ఉద్యమాన్ని విడనాడకూడదని వైసీపీ అధినేత భావిస్తున్నారా ? ఇప్పుడు జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది.

అధికార, ప్రతిపక్షాలను తన వ్యూహంతో ముప్పతిప్పలు పెట్టిన కేసీఆర్‌
తెలంగాణా ఉద్యమ ఛాంపియన్ గా నిలిచిన టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలంగాణా సెంటిమెంట్ రగలించడంలో టీఆర్ఎస్ అన్ని రాజకీయ పార్టీల కంటే ముందు నడిచింది. ఏ చిన్న అవకాశం వచ్చినా అధికార, ప్రతిపక్ష పార్టీలను తన వ్యూహాలతో కేసిఆర్ ముప్పతిప్పలు పెట్టారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణకు సై అనక తప్పని పరిస్థితులను కల్పించారు. ఇందుకోసం టీఆర్ఎస్ అసెంబ్లీని స్తంభింపచేయడం, రాజీనామాలు చేయడం లాంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్లి లబ్ధిపొందింది.

ప్రత్యేక హోదాపై ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమైన వైసీపీ
రాష్ట్ర విభజన అనంతరం ఎపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సీపీ కూడా దాదాపు ఇదే వ్యూహాన్ని అమలు చేసే విధంగా పావులు కదుపుతోంది. రెండేళ్లుగా ప్రత్యేక హోదా డిమాండ్‌ను వినిపించిన వైసీపీ ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణపై దృష్టి పెట్టింది. టీడీపీతో సహా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. గత వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో సభా వ్యవహారాలను అడ్డుకోవడంతో సభలో పార్టీ అనుసరించిన వ్యూహం విజయవంతం అయిందని వైసీపీ భావిస్తోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సమావేశాల అనంతరం పావులు కదిపింది. వైసీపీ ఎమ్మెల్యేలు సభాసంప్రాదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ.... వైసీపీ ని ఇరుకున పెట్టేందుకు స్కెచ్ వేసింది.

ఏపీలో పెరిగిన పొలిటికల్‌ హీట్‌
అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ లబ్ది విషయం ఎలా ఉన్నా.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు వైసీపీ  తాజాగా నిర్ణయం ఎపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఎపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించే అంశంపై జగన్ దృష్టి పెట్టారు. హోదాపై ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో దక్కితే.. వచ్చే ఎన్నికలకు మరింత ఉత్సాహంగా వెళ్లవచ్చని పార్టీ అధినేత భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై మరింత కసరత్తు చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలోపే అన్ని జిల్లాల్లో ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ను రగిలించే విధంగా పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు వైసీపీ నేతలు సిద్దమవుతున్నారు. 

07:26 - October 27, 2016

హైదరాబాద్ : కొత్త సచివాలయ నిర్మాణ అంశాన్ని అస్త్రంగా మలుచుకునేందుకు సిద్ధమవుతోంది హస్తం పార్టీ. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కేసీఆర్‌.. అనవసర అంశాలపై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్‌ అయ్యింది. ఓవైపు ఆందోళనలు, ధర్నాలు చేస్తూనే మరోవైపు కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు హస్తం నేతలు.

పోరును ఉధృతం చేస్తున్న కాంగ్రెస్‌
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం జోరు పెంచుతోంది. అధికార పార్టీపై అంశాలవారీగా కాలు దువ్వుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. సర్కార్‌పై పోరును ఉధృతం చేస్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్‌ డిజైన్‌ మార్పులు మొదలు.. తాజాగా రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుపై ప్రభుత్వం చేస్తున్న ఆలస్యాన్ని ఆయుధంగా చేసుకుని రైతు గర్జనలు, ఫీజు దీక్షలతో హోరెత్తించింది కాంగ్రెస్‌.

కొత్త సచివాలయ నిర్మాణానికి సిద్దమైన సర్కార్‌
తాజాగా కేసీఆర్‌ సర్కార్‌ సచివాలయాన్ని కూల్చి కొత్తగా నిర్మించేందుకు సిద్దమవుతోంది. దీనికి ఇప్పటికే కేబినెట్‌ ఆమోదం లభించింది. అంతేకాకుండా త్వరలోనే ప్రస్తుత సచివాలయాన్ని కూల్చి.. అక్కడ కొత్త హంగులతో రూ.350 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని.. సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు వివరించారు. దీంతో రేపో, మాపో కూల్చివేత పనులకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తుండటంతో కాంగ్రెస్‌ దీనిపై ఆందోళనకు సిద్దమవుతోంది.

వాస్తు పేరుతో ప్రజాధనం దుర్వినియోగం
ఇచ్చిన హామీలను కేసీఆర్‌ పక్కనపెట్టి వాస్తుపేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. అసలు వాస్తు బాగాలేకపోతే... తెలంగాణ ఎలా వచ్చిందని.. కేసీఆర్‌ ఎలా సీఎం అయ్యారని ప్రశ్నిస్తున్నారు. పాలనను గాలికి వదిలేసి.. ప్రజలపై మోపుతున్న భారాన్ని అందరికీ తెలిసేలా చేస్తామంటున్నారు. ఉమ్మడి పాలనలో సరిపోయిన సచివాలయం.. ఇప్పుడెందుకు సరిపోదంటున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరసనలు, ధర్నాలు చేపట్టేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. మరోవైపు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

దూకుడు పెంచిన కాంగ్రెస్
మొత్తానికి.. సర్కార్‌పై రైతు గర్జన, ఫీజు పోరుతో దూకుడు పెంచిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు కేసీఆర్‌ తలపెట్టిన సచివాలయ కూల్చివేతను అస్త్రంగా మార్చుకుంటోంది. మరి కాంగ్రెస్‌ పోరు గులాబీ బాస్‌పై ఏ మేరకు ఒత్తిడి పెంచుతుందో చూడాలి. 

07:20 - October 27, 2016

తూర్పుగోదావరి : ఆర్కే కుమారుడు మున్నా మృతదేహాన్ని ప్రకాశం జిల్లాకు తరలిస్తుండగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బంధుమిత్రుల కమిటీ సభ్యులు, విరసం నేత కళ్యాణ్‌రావ్‌ నివాళులర్పించారు. నిరాయుధులను పట్టుకుని ఎన్‌కౌంటర్‌ చేశారని కళ్యాణ్‌రావ్‌ ఆరోపించారు. బూటకపు ఎన్‌కౌంటర్లతో ఉద్యమాలను ఆపలేరన్నారని మావోయిస్టు కీలక నేత  ఆర్కే సతీమణి శిరీష ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఈ ఎన్ కౌంటర్ కు ప్రతిగా సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారనీ హెచ్చరించారు. ఉద్యమ నేతల ఆశయాలను నెరవేర్చేందుకు తన కుమారుడు అమరుడయ్యాడనీ..తన కుమారుడి ఆశయాలకు కోసం మరింతమంది ఉద్యమిస్తారని ఈ సందర్భంగా శిరీష్ పేర్కొన్నారు.   

07:17 - October 27, 2016

విశాఖ : ఆంధ్రా -ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 32కు పెరిగింది. తాజాగా మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. ప్రస్తుతం ఏవోబీలో గ్రైహౌండ్స్ దళాలు విస్తృతంగా కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఆర్కేతో పాటు ఇతర అగ్రనేతల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు మావోయిస్టు నేత శ్యాం పేరిట విడుదలైన 4 పేజీల లేఖలో... మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకమని, దీనికి బాధ్యుడైన చంద్రబాబు కుటుంబంపై దాడి చేస్తామని పేర్కొన్నారు. అయితే ఈ లేఖను ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

ఏవోబీలో గ్రేహౌండ్స్‌, సీఆర్‌పీఎఫ్‌ బలగాల కూంబింగ్‌
ఏవోబీ ప్రాంతం యుద్ధరంగాన్ని తలపిస్తోంది. మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగుతారన్న అనుమానంతో పోలీసులు కూంబింగ్‌ను ఉధృతం చేశారు. ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్‌, సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో పాటు ఏపీ, ఒడిశా సంయుక్త దళాలు అడవిని జల్లెడపడుతున్నాయి. కోరాపుట్‌, మల్కన్‌గిరి, గుమ్మ ఏరియాల్లో 13 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మల్కన్‌గిరి పరిసర గ్రామాలన్నీ పోలీసుల గుప్పెట్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌తో ఏవోబీ రాష్ట్ర కమిటీతోపాటు ఆంధ్రాలోని ఈస్ట్‌ డివిజన్‌, పెద్దబయలు, చిత్రకొండ, కోరాపుట్‌ కమిటీలు దాదాపుగా తుడిచి పెట్టుకుపోయాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

14 మంది మృతదేహాలు గర్తింపు
మరోవైపు ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్న అగ్రనేతలు ఎక్కడికి వెళ్లారన్నదానిపై పోలీసులకు ఇప్పటికీ సమాచారం అందడం లేదు. ముఖ్యంగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఆర్కే అలియస్ రామకృష్ణ, నర్సింహ్మారెడ్డి అలియస్ చలపతి అయన భార్య అరుణ, గుజ్జర్ల రవి గురించి సమాచారం లేదు. అయితే... వీరంతా గాయపడి ఉంటారని భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో అర్కే గన్‌మెన్లు ముగ్గురు చనిపోవడంతో ఆయన అదృశ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన 14 మందిని మాత్రమే గుర్తించారు. మిగతావారి వివరాలు తెలియాల్సి ఉంది.

మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళన
మావోయిస్టుల మృతదేహాల కోసం మల్కన్‌గిరికి పౌరహక్కుల సంఘం నేతలు, విరసం నేతలు వెళ్లారు. అయితే..మావోయిస్టు మృతదేహాల ఫోటోలు చూపిస్తున్నారని, మృతదేహాలను తమకు అప్పగించడం లేదని నిరసిస్తూ...విరసం నేతలు కల్యాణ రావు, వరవరరావు, అర్కే భార్య పద్మతో సహా పలువురు మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

ప్రభాకర్‌ మృతితో కుటుంబంలో విషాదం
మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌ ప్రభాకర్‌ మృతిచెందడంతో హైదరాబాద్‌ యాప్రాల్‌లోని ఆయన కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. ప్రభాకర్‌ భార్య దేవేంద్ర..మల్కన్‌గిరి ఎస్పీ ఆఫీసుకు చేరుకొని ప్రభాకర్‌ మృతదేహాన్ని గుర్తుపట్టారు.

మావోయిస్టు పార్టీ పేరిట 4 పేజీల లేఖ విడుదల
మరోవైపు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. మావోయిస్టు నేత శ్యాం పేరిట 4 పేజీల లేఖ విడుదలైంది. ఏవోబీ ఎన్‌కౌంటర్‌ బూటకమని, కోవర్టులను చొప్పించి ఎన్‌కౌంటర్‌ చేశారని శ్యాం ఆరోపించారు. విష ప్రయోగం చేసి మావోయిస్టులపై కాల్పులు జరిపారన్నారు. చంద్రబాబు, లోకేష్‌పై ఆత్మాహుతి దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే... ఈ లేఖ నిజమా కాదా అన్న విషయం ధ్రువీకరణ కాలేదు. 

07:09 - October 27, 2016

విశాఖ : కయాంత్‌ తుఫాను దూసుకొస్తోంది. ఇంతవరకు నడిసంద్రంలో ఊగిసలాడిన కయాంత్‌.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైపే శరవేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఈరోజు మధ్యాహ్నానికల్లా..ఏపీలో వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడడంతో..ఇప్పటికే విశాఖ తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో ముప్పు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తోంది. రెండేళ్లక్రితం విశాఖలో వచ్చిన పెనుతుపాను మిగిల్చిన చేదు జ్ఞాపకాలను మర్చిపోకముందే మరో తుపాను రాష్ట్రంవైపు శరవేగంగా దూసుకొస్తోంది. కయాంత్‌గా నామకరణం చేసిన ఈ తుపాను గంటకు 19 కిలోమీటర్లు వేగంతో రాష్ట్రంవైపు దూసుకొస్తోందని విశాఖ వాతవరణ అధికారులు తెలిపారు. ఇది ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 450, విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 520, మచిలీపట్నానికి తూర్పు ఈశాన్య దిశలో 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 520 కి.మీ.
కయాంత్‌ తుపాను ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కయాంత్‌ తుపాను బలపడే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. వాతవరణం అనుకూలంగా ఉంటే తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉంటుందన్నారు. దక్షిణ దిశగా చెన్నై వైపు తుపాను కదులుతున్నా..ఆంధ్రప్రదేశ్‌లోనే తీరం దాటే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. అయితే 28 తేదికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. గురువారం నుంచి ఏపీ, ఒడిశాలో తుపాను ప్రభావం ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఏపీలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఇప్పటికే రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

తుపాను ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు
మరోవైపు గురువారం నుంచి రాష్ట్రంలో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. 28, 29 తేదీల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే తమిళనాడులో 30-31 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అదే సమయంలో గురువారం నుంచి కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తుపాన్ బలపడితే తీరం వెంబడి గాలులు 90 నుండి100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు
తుపాను హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గురువారం నుండి ఎవరూ సముద్ర వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 29వ తేదీన న్యూజిలాండ్-ఇండియా మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌ను అవసరమైతే రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రమీణ్ కుమార్ తెలిపారు. మరో వైపు జిల్లాలో ఉన్న 53 లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసారు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్టీఆర్‌ఎఫ్‌కు చెందిన 20 రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచారు.

భారీ వర్షం కురిస్తే క్రికెట్ మ్యాచ్‌ను రద్ధు చేస్తామన్న కలెక్టర్
కయాంత్‌ తుపాను ఏపీవైపు దూసుకొస్తుండడంతో కోస్తాంధ్రప్రాంత వాసులు భయంతో వణికిపోతున్నారు. తుపాను ఎలాంటి ప్రమాదాన్ని తెస్తుందోనని భయపడుతున్నారు. రెండేళ్ల క్రితం విశాఖ నగరాన్ని అతలాకుతలం చేసిన తుపాను..చేదు జ్ఞాపకాలను ఇంకా మర్చిపోకముందే మరో తుపాను ముంచుకురావడంపై విశాఖవాసులు గజగజా వణికిపోతున్నారు. 

07:03 - October 27, 2016

హైదరాబాద్ : ప్రివిలేజ్ కమిటీ రెండో రోజు విచారణ పూర్తయింది. తొలిరోజు విచారణకు నలుగురు వైసీపీ సభ్యులు హాజరుకాగా.. రెండవ రోజు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రత్యేక హోదా పై ప్రజల ఆంకాక్షలను అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేస్తే విచారణ పేరుతో పిలిచి అవమానిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. మరోవైపు ఎమ్మెల్యేల వివరణ తీసుకున్న ప్రివిలేజ్ కమిటీ... ఫైనల్ రిపోర్ట్ ను శీతాకాల‌ స‌మావేశాల్లో అసెంబ్లీ ముందు ఉంచడానికి సిద్దమవుతోంది.

5గురు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రివిలేజ్ వద్ద హాజరు
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రివిలేజ్‌ మోషన్‌ ఎదుర్కొన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో ఐదుగురు బుధవారం ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట హాజరయ్యారు. మంగళవారం హాజరైన నలుగురితో కలిపి.. మొత్తం తొమ్మిది మంది సభ్యులు ప్రివిలేజ్‌ కమిటీకి వివరణ ఇచ్చారు. అసెంబ్లీ వ‌ర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం పై చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు సభా హక్కులను ఉల్లంఘించారంటూ మంత్రి యనమల 12 మంది వైసీపీ సభ్యులపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. స్పీకర్ ఈ నోటీస్‌ను ప్రివిలేజ్ కమిటీకి పంపడంతో 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కమిటీ నోటీసులు పంపింది. ఈమేరకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అదే విధంగా తమ వాణినీ విన్పించే ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదాపై ప్రజల ఆకాంక్షలను అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేస్తే విచారణ పేరుతో పిలిచి అవమానిస్తారా అంటూ వారు ప్రశ్నించారు.

ఎమ్మెల్యేలపై చర్యలు స్పీకర్ నిర్ణయిస్తారు : గొల్లపల్లి
ప్రివిలేజ్‌ మోషన్‌ ఎదుర్కొన్న 12 మందిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరుకాలేదు. డిసెంబర్2న విచారణకు హాజరుకావాలని వారిని ఆదేశించిన ప్రివిలేజ్‌ కమిటీ, స్పీకర్‌ తమకిచ్చిన 50 రోజుల గడువు లోపే నివేదిక సమర్పిస్తామని ప్రకటించింది. కమిటీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఎమ్మెల్యేలపై చర్యల అంశం స్పీకర్‌ పరిధిలోనిదని కమిటీ చైర్మన్‌ గొల్లపల్లి సూర్యారావు తెలిపారు.

12 మంది వైసీపీ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటో?
ఇప్పటికే ప్రివిలేజ్‌ కమిటీ విచారణను ఎదుర్కొన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ నుంచి బహిష్కృతురాలయ్యారు. ఇప్పుడు తాజాగా ప్రివిలేజ్‌ కమిటీ విచారణను ఎదుర్కొంటున్న 12 మంది వైసీపీ ఎమ్మెల్యేల భవి

06:52 - October 27, 2016

ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలే చేసింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు ఎంత గడువు కావాలో చెప్పాలంటూ స్పీకర్‌ను ఆదేశించింది. నవంబర్‌ 8వ తేదీలోగా నిర్ణయం వెల్లడించాలని సుప్రీం ఆదేశించింది.

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సంపత్‌ పిటిషన్‌..
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సంపత్‌ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా.. స్పీకర్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు ఎంత గడువు కావాలంటూ సుప్రీంకోర్టు.. అసెంబ్లీ స్పీకర్‌ను ప్రశ్నించింది. ఈనెల ఎనిమిది లోగా తనకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ స్పీకర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయితే స్పందన లేకపోవడంతో.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేయాల్సిందిగా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ సందర్భంగా.. సుప్రీం కోర్టు.. ఫిరాయింపులకు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ఎంత సమయం కావాలో నవంబర్ 8లోగా తెలపాలని స్పీకర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది.

పార్టీ ఫిరాయింపులపై టీ కాంగ్రెస్ న్యాయపోరాటం
అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని తెలంగాణ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014లో ఎన్నికలు జరిగాయని..ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయాయని పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై స్పీకర్ వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని 2015లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సైతం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్ ఆదేశాలివ్వాలని జంధ్యాల రవిశంకర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణలో తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని పిటిషనర్‌ సంపత్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేసారు. మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీం ఆదేశాలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. 

టీచర్ కొట్టటంతో రక్తపువాంతులు!?..

హైదరాబాద్ : జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని టీచర్ కొట్టటంతో రక్తపు వాంతులకు చేసుకున్నాడు. మూడు రోజులు స్కూలు కెళ్ళలేదని సురేష్ అనే విద్యార్థిని టీచర్ రోజుకు రూ.100 చొప్పున ఫైన్ కట్టాలని టీచర్ చెప్పింది. కాగా తాను కట్టలేని రమేష్ చెప్పాడు. దీంతో టీచర్ రమేష్ తలపై కొట్టింది. దీంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయిన రమేష్ రక్తపు వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. పాపిరెడ్డినగర్‌లో ఉన్న రాజధాని స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. 

 

Don't Miss