Activities calendar

28 October 2016

23:19 - October 28, 2016

తమిళ స్టార్ హీరో కార్తీక్ కథనాయకుడిగా నయనతార, శ్రీదివ్య, వివేక్ ప్రధాన పాత్రదారులుగా గోకుల్ దర్శకత్వంలో పీవీపీ, ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన హారర్ కామెడీ చిత్రం కాష్మోరా. తమిళంతోపాటు తెలుగులోనూ కార్తీక్ కు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని రెండు భాషల్లో ఈ సినిమా రెండు వేలకు పైగా థియేటర్లలో రీలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా వుందో తెలుసుకోవాలంటే.. రివ్యూలోకి వెళ్లాల్సిందే... సినిమా రేటింగ్.. వంటి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:44 - October 28, 2016

హైదరాబాద్ : గవర్నర్‌ నరసింహన్‌తో  సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో.... కృష్ణా జలాలలపై బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు, ప్రభుత్వ స్పందనను కేసీఆర్... గవర్నర్‌కు వివరించారు. కొత్త సచివాలయ భవన నిర్మాణాల నమూనాలపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగింది. వీలైనంత త్వరగా ఏపీ సర్కార్ ఆధీనంలో ఉన్న భవనాలను అప్పగించాలని ముఖ్యమంత్రి గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

 

21:33 - October 28, 2016
21:31 - October 28, 2016
21:29 - October 28, 2016

దీపావళి అంటే మతాబుల వెలుగలు.... వెన్నెల ముద్దల వెలుగు రేఖలు, కాకరపువ్వొత్తుల కలకలం, చిచ్చుబుడ్డిలా ఉవ్వెత్తున్న ఎగసే సంతోషం... వెలుగు నింపాల్సిన చోట అంతులేని కాలుష్యం... వెలుగురేఖల వేడుకలో ఎన్నో అపశృతులు, పర్యావరణాన్ని కాలుస్తున్నారా..??.. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:18 - October 28, 2016

తెర్లుకొచ్చిన తెలంగాణ ఎవుసం... నకిలి సీడ్స్ తోటి మోసపోయిన గాసం, పట్నం సివార్లదాకొస్తున్న సిరుతపులులు.. యాచారం గుట్టల కింద జనం గుబులు, వేములవాడ ఆర్టీసీ డిపోల ఆడామే గోస... పోన్లు చేసి ఇంటికి రమ్మంటున్న పెద్దసారు, లక్షలు జేబులవెట్టుకోని తిరుగుతున్న పోరలు... అయ్యను పిలిచిఅప్పజెప్పిన పోలీసులు, హోండా బండిలకి జొర్రిన నాగుపాము.. రెండు గంటల సేపు రోడ్డు మీద ట్రాఫిక్ జాం, ఒడ్లు వొలిచి వొడి బియ్యం జేస్తున్న భక్తులు... రామయ్య పెళ్లికి తయారైతున్న తలంబ్రాలు...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

నవంబర్ 14 నుంచి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు : కడియం

హైదరాబాద్ : నవంబర్ 14 నుంచి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను నిర్వహిస్తామని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పాఠశాలులు, కస్తూర్బా, గురుకుల పాఠశాలలో డిజిటల్ తరగతులను నిర్వహిస్తామని చెప్పారు. 

 

20:58 - October 28, 2016
20:56 - October 28, 2016

అమరావతిలో పరిపాలన నగరం శంకుస్థాపన కార్యక్రమంలో నేతలు ఒకరిపై మరొకరు ప్రసంశలు కురిపించుకున్నారు తప్ప... ప్రజలకు లాభం చేకూరిందేమీ లేదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొని, మాట్లాడారు. పున:శంకుస్థాపన చేశారని చెప్పవచ్చాన్నారు. కార్యక్రమంలో ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ లాగా ఉందని ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:51 - October 28, 2016
20:50 - October 28, 2016
20:49 - October 28, 2016
20:48 - October 28, 2016

నల్గొండ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎల్పీ నేత జానా రెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా నిడమనూరు మండలం కేంద్రంలో రైతుల చేపట్టిన దీక్షలో పాల్గొన్న ఆయన.. హామీలు అమలు చేయకపోతే ప్రజలే సర్కార్‌కు బుద్ది చెబుతారని హెచ్చరించారు. పెండింగ్‌ ఫీజు రి ఎంబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలంటూ జానారెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. 

 

20:40 - October 28, 2016

రంగారెడ్డి : జిల్లాలోని మల్లాపూర్‌ పారిశ్రామిక వాడలో.. అల్ఫాఫెన్డా జోల్‌ కంపెనీపై టాస్క్‌ఫోర్సు సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో 11కోట్ల 50 లక్షల విలువైన నిషేధిత గుల్ఫాం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బాల్‌రెడ్డిని అదుపులోకి టాస్క్‌ఫోర్సు తీసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

మల్లాపూర్‌ పారిశ్రామిక వాడలో టాస్క్‌ఫోర్సు దాడులు

రంగారెడ్డి : జిల్లాలోని మల్లాపూర్‌ పారిశ్రామిక వాడలో.. అల్ఫాఫెన్డా జోల్‌ కంపెనీపై టాస్క్‌ఫోర్సు సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో 11కోట్ల 50 లక్షల విలువైన నిషేధిత గుల్ఫాం స్వాధీనం చేసుకున్నారు. 

 

ఢిల్లీలో కదం తొక్కిన విద్యార్థులు

న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అదృశ్యం అయిన విద్యార్థి నజీబ్ ఆచూకీ కనుగొనాలంటూ విద్యార్థులు కదం తొక్కారు. 14 రోజులు అవుతున్నా.. నజీబ్ అచూకీ కనుగొనడంలో... విఫలమయ్యారని ఆరోపిస్తూ... ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను ముట్టడించారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకోవడంతో... కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నజీబ్ విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 

20:33 - October 28, 2016

న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అదృశ్యం అయిన విద్యార్థి నజీబ్ ఆచూకీ కనుగొనాలంటూ విద్యార్థులు కదం తొక్కారు. 14 రోజులు అవుతున్నా.. నజీబ్ అచూకీ కనుగొనడంలో... విఫలమయ్యారని ఆరోపిస్తూ... ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను ముట్టడించారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకోవడంతో... కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నజీబ్ విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:22 - October 28, 2016

హైదరాబాద్‌ : అల్వాల్‌ లోని కేఎంఆర్‌ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలేజీ డైరెక్టర్‌ మహేందర్‌ రెడ్డి విద్యార్ధినిలతో అసభ్యంగా ప్రవరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యార్ధి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగాయి. మహేందర్‌ రెడ్డిని తొలగించి, అతన్ని శిక్షించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేందర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

 

19:56 - October 28, 2016
19:43 - October 28, 2016
19:23 - October 28, 2016

మహబూబ్ నగర్ : తెలంగాణ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన 'మహాజన పాదయాత్ర'కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకుని.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి పాదయాత్ర బృందం చేరుకుంటోంది. 12 రోజుల పాటు రంగారెడ్డి జిల్లాలో సాగిన పాదయాత్ర విశేషాలు, అనుభవాలపై పాదయాత్ర కో...ఆర్డినేటర్‌ వెంకట్‌ 10టీవీకి అనేక విషయాలు తెలియజేశారు. అంచనా కంటే ప్రజల నుంచి అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలపై అధ్యాయనం చేయడంతో పాటు ప్రజల్లో చైతన్యం కల్గిస్తామంటున్నారు. పాదయాత్రకు అన్ని పార్టీల వారు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు.

 

ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ అరెస్టు

హైదరాబాద్ : ఓయూలో అసోసియేట్ ప్రొఫెసర్ మనోహర్ డేవిడ్ మ్యాథ్యూస్ ను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరానికి పాల్పడినందుకు డేవిడ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

19:15 - October 28, 2016

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలోని దివీస్‌ ప్రాజెక్టు ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది... ఫ్యాక్టరీ నిర్మాణంకోసం చెట్లను తొలగించేందుకు యాజమాన్యం ప్రయత్నించింది.. వీరిని స్థానికులు అడ్డుకున్నారు.. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించొద్దంటూ నినాదాలు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

19:12 - October 28, 2016

గుంటూరు : కేంద్ర సహకారంతో బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఏపీ అభివృద్ధిలో జైట్లీ సాయం మరువలేమన్నారు. అమరావతిలో పరిపాలన నగరానికి శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ప్రత్యేక హోదాకు... ప్యాకేజీ తేడా లేనప్పుడు ఒప్పుకుంటే తప్పేంటని బాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బాబు ఆరోపించారు. కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం సహకారం ఉండాలని, ఇప్పటి వరకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెండున్నరేళ్ల కాలంలోనే పరిపాలన సొంతగడ్డకు తేవడం జరిగిందని, ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. విభజన సమయంలో కాంగ్రెస్ మోసం చేసిందని, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తోందన్నారు. సమస్యల్లో ఉన్న ఏపీకి కేంద్రం సహకారం అందించాలని కోరారు. ఇప్పటి వరకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్యాయం జరగనీయమని, ఇక్కడి ప్రజలకు కూడా ఎలాంటి కష్టం..నష్టం రాకుండా చేస్తామన్నారు. అమరావతి నుండి పరిపాలన చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఏపీకి అన్ని రంగాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని, విశాఖకు కచ్చితంగా రైల్వే జోన్ వస్తుందన్నారు. రూ. 500 కోట్లతో అమరావతిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అశాస్త్రీయ విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని ఇలా అన్యాయం జరుగుతుంటే వెంకయ్య, జైట్లీ అండగా ఉన్నారని తెలిపారు. వెంకయ్య..జైట్లీ ప్రయత్నం వల్లే ప్రత్యేక హోదా ప్రకటన చేశారని పేర్కొన్నారు. వీరిద్దరి సహకారం వల్లే ఏపీ కొంత నిలదొక్కుకుందని, పోలవరం నిర్మాణానికి కేంద్రం అండగా ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. హోదా వల్ల కలిగే అన్ని ప్రయోజనాలు ప్యాకేజీ ద్వారా ఇస్తామన్నారని పేర్కొన్నారు. రాజధాని రైతులకు పన్ను మినహాయించాలని, ప్రత్యేక హోదాకు ప్యాకేజీ తేడా లేనప్పుడు ఒప్పుకుంటే తప్పేంటనీ ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తుంటే విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. హోదాపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. హోదా వల్ల పరిశ్రమలకు రాయితీలు వస్తాయంటున్నారని, అలా ఎక్కడుందో చెప్పడం లేదని పేర్కొన్నారు. 

19:08 - October 28, 2016

గుంటూరు : అమరావతి నిర్మాణంలో కేంద్రం తప్పకుండా అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరున్‌ జైట్లీ. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తామన్నారు. ఇప్పటికే ఏపీకి అనేక ప్రాజెక్టులు ఇచ్చామని చెప్పారు. రాజధాని నిర్మాణంలో ఏపీని ఒంటరిగా వదిలవేయమని.. పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రూపొందించబోయే రాజధాని అందమైన, అద్భుతమైన పట్టణంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్ర సంస్థలు ఇవ్వడం జరిగిందన్నారు. జాతీయ రహదారుల విస్తరణ, పరిశ్రమలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఏపీకి కాంగ్రెస్ కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నట్లు, ఐదేళ్లలో ఏపీకి రూ. 2...3 లక్షల కోట్టు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే మూలధనంపై పన్ను రద్దు విషయాన్ని ఢిల్లీకి వెళ్లగానే సానుభూతితో పరిశీలించి పరిష్కరిస్తానని తెలిపారు. 2004నుండి ఐదేళ్లలో వచ్చిన సాయం కంటే ఈ రెండున్నరేళ్లలో ఎక్కువ సాయం వచ్చిందన్నారు. గతంలో ఎన్నడూ రానటువంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏపీలో మోడీ ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు. విజయవాడలో భూ సేకరణ అయితే అత్యంత ఆధునిక విమానాశ్రయం తయారవుతుందన్నారు. విదేశీ రూపంలో నిధులు ఇవ్వడం జరుగుతుందని, త్వరలోనే ఈ కార్యక్రమం అమలు కాబోతోందన్నారు. అమరావతి గ్రేటర్ అమరావతిగా మారుతుందని ఆకాంక్షించారు. హైదరాబాద్ లా అమరావతిని తీర్చిదిద్దగల సత్తా చంద్రబాబుకు ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం అండగా ఉంటుందన్నారు. నా బార్డు నిధులతో పోలవరం నిర్మాణం చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. 

 

19:03 - October 28, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నగర నిర్మాణంలో మరో బృహత్తర ఘట్టానికి అడుగు పడింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో ప్రభుత్వ పరిపాలన భవనాల సముదాయానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు, పాల్గొన్నారు. 950 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయానికి 5,600కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్ర సచివాలయం, శాసనసభ, మండలి భవనాలు, రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాస భవనం, ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగుల నివాస గృహాలు వంటివన్నీ ప్రభుత్వ భవనాల సముదాయంలో భాగంగానే నిర్మిస్తారు. ఈ నిర్మాణాలను 2018 డిసెంబర్‌ నాటికి కొలిక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 

ముగిసిన గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై చర్చించారు.

18:58 - October 28, 2016

విజయవాడ : నగరంలోని కొండప్రాంతంలో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలకు రిజిస్ర్టేషన్‌ సౌకర్యం కల్పించాలని, పక్కా ఇళ్ల నిర్మాణానికి సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ డిమాండ్‌ చేశారు. విజయవాడలో సీపీఎం చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఈ మేరకు గఫూర్‌తో టెన్ టివి ఫే టు ఫీస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దెకు ఉండే పేదలకు ఇళ్లు నిర్మించి.. ఇవ్వాలని, రిటైనింగ్‌ వాల్స్‌ మెట్లు నిర్మించి.. ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:51 - October 28, 2016

విజయవాడ : ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టించి.. ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ.. అధికారంలోకి వచ్చాక.. ఆ హామీలను మర్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు విమర్శించారు. విజయవాడలో బాబురావు ఆధ్వర్యంలో సీపీఎం పాదయాత్ర చేపట్టింది. ఈ యాత్రలో సీపీఎం నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్హులైన వారికి వెంటనే ఇళ్లు కట్టించి.. ఇవ్వాలని బాబురావు డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని కోరారు. 

18:44 - October 28, 2016

శ్రీనగర్ : జ‌మ్మూ క‌శ్మీర్‌లో ప‌దేప‌దే కాల్పుల ఉల్లంఘ‌న‌కు పాల్పడుతున్న పాకిస్థాన్ ఆర్మీకి భార‌త్ దీటైన జ‌వాబు ఇచ్చింది. భార‌త జ‌వాన్లు జ‌రిపిన ఎదురుకాల్పుల్లో పాక్ ఆర్మీకి చెందిన 15 మంది సైనికులు మృతిచెందారని BSF డైరెక్టర్ జ‌న‌ర‌ల్ అరుణ్ కుమార్ తెలిపారు. పాకిస్థాన్ ఫ్రాంటియర్ ఫోర్స్ కు చెందిన ఇద్దరు సైనికులతో పాటు 13 మంది పాక్ రేంజర్ల చనిపోయారని తెలిపింది. గత 24 గంటల నుంచి జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో ఫైరింగ్ కొనసాగుతూనే ఉంది. రాజౌరి, సాంబా, అబ్దులియా, ఆర్ ఎస్ పురా, సుచిత్గర్ ప్రాంతాల్లో ఏకధాటికి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న తరహా ఆయుధాలు, ఆటోమెటిక్ మోర్టార్స్ తో దాడికి దిగింది. అయితే పాక్ దాడులను తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో మన సైనికులు ఎవరూ గాయపడలేదని బీఎస్ఎఫ్ పేర్కొంది. 

 

18:42 - October 28, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుకున్నారు. సైనిక్‌పురిలోని రాజశేఖర్‌ అనే వ్యక్తి ఇంటి నుంచి.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు... 2.5 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 20 రోజుల క్రితం డ్రగ్స్‌ కేసులో రాజశేఖర్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 45 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనిచ్చిన సమాచారంతో.. సైనిక్‌పురిలో ఉన్న రెండున్నర కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:54 - October 28, 2016

మహబూబాబాద్ : దేశంలోని అనేక చోట్ల అనునిత్యం దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో దారుణం జరిగింది. అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దళిత దంపతులపై కర్రలతో గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. జిల్లాలోని కే.సముంద్రం మండలంలో గ్రామస్థులు బల్లారి యాకయ్యతోపాటు అతని కుటుంబ సభ్యులు కలిసి దళిత దంపతులపై కర్రలు, మారణాయుధాలతో దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. మహిళను వివస్త్రను చేసి చితకబాదారు. భార్యా భర్తలకు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ దాడిని గ్రామస్తులు అడ్డుకోకపోవడం గమనార్హం. దళిత మహిళ కుటుంబానికి, బల్లారి యాకయ్య కుటుంబానికి మధ్య ఇటీవల గొడవ జరిగిందని.. ఈ నేపథ్యంలోనే బల్లారి యాకయ్య కుటుంబ సభ్యులు దళిత దంపతులపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:42 - October 28, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అమరావతిలో పరిపాలన నగరానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఎపికి అభివృద్ధికి కేంద్ర విధాలుగా ఆదుకుంటుందన్నారు. ప్రపంచంలో అభివృద్ధిలో ఇండియా వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. చైనా కంటే ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన రిఫార్మ్స్, పర్ ఫామ్, ట్రాన్స్ ఫార్మ్ నినాదాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇండియాను శక్తివంతమైన దేశంగా తయారు చేయాలన్నారు. ఆకలి లేని దేశాన్ని తయారు చేయాలని కాంక్షించారు. కేంద్రం ఎపికి ఎక్కువ నిధులు, ప్రాజెక్టులను ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి కేంద్రం సహాయ పడుతుందన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర రాజధానికి మెట్రో రైలు ఏర్పాటు చేస్తామన్నారు. 40 ఏళ్లలో ఎప్పుడూ చేయని సహాయాన్ని ఎపికి చేస్తామని చెప్పారు. అమరావతి నుంచి గుంటూరుకు రైలు మార్గం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మాదిరిగా గ్రేటర్ అమరావతి తయారు చేస్తామన్నారు. రాజధానికి స్వచ్చందంగా భూములిచ్చిన రైతులను ఆయన అభినందించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం......

 

17:22 - October 28, 2016

హైదరాబాద్ : తెలంగాణలో సీపీఎం పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలని చూడటం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టడమే మహాజన పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సీపీఎం పాదయాత్రను అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ చూడడం దారుణమని పేర్కొన్నారు. సీఎం వైఖరిని తెలంగాణ ప్రజలు సహించరని తెలిపారు. ఏవోబీ ఎన్‌కౌంటర్‌ పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏవోబీ ఎన్ కౌంటర్ పలు అనుమానాలున్నాయని తెలిపారు. మావోయిస్టులను అరెస్టు చేసి... కోర్టుకు తీసుకొచ్చే అవకాశం ఉందని.. అలా కాకుండా వారిని కాల్చి చంపినట్లు అనుమానం వస్తుందన్నారు. ఎన్ కౌంటర్ పై జ్యుడీషియల్ ఎంక్వరీ చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:10 - October 28, 2016
17:09 - October 28, 2016

కేంద్రం సహకారం ఉండాలి - చంద్రబాబు..

గుంటూరు : కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం సహకారం ఉండాలని, ఇప్పటి వరకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో పరిపాలన నగరానికి శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రెండున్నరేళ్ల కాలంలోనే పరిపాలన సొంతగడ్డకు తేవడం జరిగిందని, ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. విభజన సమయంలో కాంగ్రెస్ మోసం చేసిందని, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తోందన్నారు. సమస్యల్లో ఉన్న ఏపీకి కేంద్రం సహకారం అందించాలని కోరారు.

17:02 - October 28, 2016

హైదరాబాద్ : గ్రేట‌ర్‌ హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ వెలుగు పూలు పూయించేందుకు బల్దియా కసరత్తు ముమ్మరం చేసింది. న‌గ‌ర‌మంతా ఎల్ఈ డి దీపాల కాంతులు నింపేందుకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బ‌హుల ప్రయోజనాలతో ప్రపంచంలో మరెక్కడ లేని విధంగా హైద‌రాబాద్‌లో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. 
ఎల్‌ఈడీ బల్బులతో విద్యుత్తు, డబ్బూ రెండు ఆదా 
ఎల్‌ఈడీ బల్బుల ద్వారా విద్యుత్తు, డబ్బూ రెండు ఆదా చేయవచ్చు. సహజ వనరులను కాపాడుకోవచ్చు. ఇదే ఆలోచనతో ముందుకెళ్తోంది మహానగర పాలక సంస్థ. గ్రేట‌ర్‌లోని అన్ని వీధి దీపాల‌ స్థానంలో ఎల్‌ఈడి బల్బులు మార్చాల‌ని నిర్ణయించింది. నగరంలో వీధి దీపాల  నిర్వాహణ, విద్యుత్ చార్జీల కోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఏటా వీధిదీపాల నిర్వహణకోసం సుమారు 185 కోట్లు బల్దియా వెచ్చిస్తోంది. నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు ఎల్ ఈ డి బల్బులే ప్రత్యామ్నాయమని భావిస్తున్న అధికారులు చాంద్రాయ‌ణ గుట్ట, మాదాపూర్‌ ప్రాంతాల్లో 750 లైట్లను ఏర్పాటు చేసి వాటి పనితీరును పరిశీలించారు. ఎల్‌ఈడి బల్బులతో అధిక వెలుతురుతో పాటు 40 నుంచి 50శాతం విద్యుత్ ఆదా అవుతుందని గుర్తించారు. దశలవారీగా నగరం మొత్తం స్ట్రీట్‌ లైట్స్‌ ఎల్‌ఈడీ బల్బులు అమర్చాలని నిర్ణయించారు. 
గ్రేట‌ర్ ప‌రిధిలో 4,13,029 వీధి దీపాలు
ఇక గ్రేట‌ర్ ప‌రిధిలో 4 లక్షల 13 వేల 29 వీధి దీపాలున్నాయి. వీటి నిర్వహణకు 68 మంది అధికారులతో పాటు 715 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వేతనాల కోసం 10 కోట్ల రూపాయాలు ఖర్చు అవుతుండ‌గా , మెటిరియల్ కొనుగోలుకు 15 కోట్లు వెచ్చిస్తున్నారు.  35 కోట్ల వరకు అభివృద్ది పనులకు కేటాయిస్తున్నారు. ఇక కరెంటు బిల్లుల కోసం ఏకంగా 125 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇలా మొత్తం 185 కోట్లవరకు సంవత్సరానికి ఖర్చు చేస్తుంది బల్దియా. ఇంతచేసినా వీధి దీపాలు ఎక్కడో ఒకచోట వెలుగుతున్నాయి. ఖ‌ర్చు మాత్రం త‌డిసిమోప‌డ‌వుతుంది.  ఈ సమస్యలకు చెక్‌పెట్టేందుకు కార్పొరేషన్ ఎల్‌ఈడి బల్బులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 
బహుళ ప్రయోజనాలు ఉండేలా తయారీ 
సాధారణ ఎల్‌ఈడీ బల్బుల మాదిరిగా కాకుండా నగరంలో ఏర్పాటు చేసే ఎల్‌ఈడీ బల్బులకు బహుళ ప్రయోజనాలు ఉండేలా రూపొందిస్తున్నారు.  ఈ వ్యవస్థ స్మార్ట్‌సిటీకి అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దనున్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన‌ర్జీ ఎఫిసెన్సీ స‌ర్వీ‌స్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తుంది. ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయంలో వెలుతురు  త‌గ్గేలా..ఎక్కువగా ఉన్న వేళల్లో వెలుతురు పెరిగే సదుపాయాలను కల్పించనున్నారు. పొల్యూషన్‌, వాతావరణ పరిస్థితులను కూడా గుర్తించే వ్యవస్థ ఉంటుందని..అందులోనే సిసి కెమెరాలు ఉంటాయని బల్దియా అధికారులు చెబుతున్నారు. 

 

16:58 - October 28, 2016

హైదరాబాద్ : గులాబి పార్టీలో పదవుల పందేరం జోరందుకుంది. ఓ వైపు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.....మరోవైపు స్థానికంగా కూడా జిల్లాల నాయకత్వం బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. పార్టీ పరంగా ఇప్పటివరకు లేని కమిటీలను త్వరలో నియామకం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
పార్టీ పదవుల భర్తీపై దృష్టి సారించిన గులాబీ బాస్ 
అధికార టీఆర్‌ఎస్ పార్టీలో పదవుల జాతర మొదలైంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులను ఒక్కొక్కటిగా భర్తీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రస్తుతం పార్టీ పదవుల భర్తీపై దృష్టి సారించారు. వారం రోజులుగా పార్టీ కీలక నేతలతో సమావేశమవుతూ జిల్లాలవారీగా నివేదికలను తెప్పించుకుంటున్నారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తదితరులతో కూడిన ఒక బృందం ఇప్పటికే జిల్లాల నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. వీరు స్థానికంగా ఆయా జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడి పార్టీ జిల్లా కమిటీలను ఖరారు చేస్తున్నారు.
అన్ని జిల్లాలకు కొత్త కార్యవర్గాలు 
రాష్ట్ర కార్యవర్గ నియామకంతో పాటు, పొలిట్ బ్యూరో, జిల్లాల కార్యవర్గాలను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని గులాబి బాస్ నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర కార్యవర్గ ఎంపిక బాధ్యతను మంత్రులు ఈటల, జగదీశ్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు అప్పగించినట్లు సమాచారం.  జిల్లాల సంఖ్య భారీగా పెరగడంతో  కొత్త జిల్లాల్లో కూడా  పార్టీ  కార్యవర్గాల నియామకంపై  ఆయా జిల్లాల మంత్రులు, సీనియర్ నేతల ద్వారా కసరత్తు జరుగుతోంది. చిన్న జిల్లాల్లో 15 మంది, పెద్ద జిల్లాల్లో 24 మందితో పార్టీ జిల్లా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పార్టీకి అనుబంధంగా ఉండే మహిళ, యువజన తదితర సంఘాలకు పదిమంది చొప్పున సభ్యులుండేలా కమిటీలను వేయనున్నారు. పార్టీ కోసం ఆదినుంచి పనిచేస్తున్న వారికి కమిటీల్లో స్థానం కల్పించనున్నారు. జిల్లా కమిటీలతోపాటు రాష్ట్ర కమిటీని కూడా నియమించనున్నారు. దీనికి సంబంధించి కూడా కసరత్తు పూర్తయినట్లు తెలిసింది. వారం రోజుల్లోపే కమిటీల ఏర్పాటునకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. 
కొత్త కార్యవర్గాల నియామకంపై నేతల్లో జోష్‌ 
త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మొదలు కానున్న నేపథ్యంలో కొత్త కార్యవర్గాల నియామకంపై  నేతల్లో జోష్‌ నింపుతోంది.  ఓ వైపు అధికారిక పదవులు మరో వైపు పార్టీ పదవులు గులాబి నేతలకు  పెద్ద ఎత్తున దక్కనున్నాయి. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి టీఆర్ ఎస్ లో కొనసాగుతున్న నేతలు పదవులపై భారీగా ఆశలు పెంచుకున్నారు. మరి గులాబీ బాస్‌ ఎంతమందిని సంతృప్తపరుస్తారో చూడాలి. 

 

16:54 - October 28, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఆక్వా ఫుడ్‌ పార్క్‌ గ్రామాల్లో సీపీఎం చేపట్టిన ప్రజాభేరి పాదయాత్ర ఐదోరోజుకు చేరింది. అక్వాఫుడ్‌ పార్క్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఈ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రాజెక్టు వద్దంటూ ప్రజలు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. ఫుడ్‌ పార్క్‌ వల్ల కాలుష్యం పెరిగిపోతుందన్నారు.

 

16:50 - October 28, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజాసమస్యలపై సీపీఎం పార్టీ చేస్తున్న మహాజన పాదయాత్రకు టీడీపీ మద్దతు తెలిపింది. పాదయాత్ర ఈనెల 31 వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకోగానే  పాదయాత్ర చేస్తున్న తమ్మినేని వీరభద్రం బృందాన్ని కలిసి సంఘీభావం తెలపనున్నట్లు ఆ పార్టీ నాయకులు అమర్ నాథ్ బాబు తెలిపారు. 

 

 

ఏపీకి కేంద్రం అండ - జైట్లీ...

గుంటూరు : అమరావతి పరిపాలన నగరానికి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. చైనా కంటే వేగంగా భారత్ అభివృద్ది చెందుతోందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రూపొందించబోయే రాజధాని అందమైన, అద్భుతమైన పట్టణంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్ర సంస్థలు ఇవ్వడం జరిగిందన్నారు.

16:27 - October 28, 2016

నెల్లూరు : నగర కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జీవో 279ను రద్దు చేయాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల ధర్నా చేపట్టారు. అక్కడికివచ్చిన మేయర్‌ను కార్మికులు అడ్డుకున్నారు. కార్మికులను పోలీసులు కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించడంతో రెండువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మేయర్‌ కిందపడిపోయారు. కార్మికుడు స్పృహతప్పి పడిపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

విద్యాశాఖాధికారులతో మంత్రి కడియం భేటీ..

హైదరాబాద్ : విద్యాశాఖాధికారులతో మంత్రి కడియం శ్రీహరి సమీక్ష భేటీ అయ్యారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, డిజిటల్ క్లాసులపై సమీక్షి నిర్వహించారు.

 

16:24 - October 28, 2016

ఢిల్లీ : హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల జాప్యంపై సుప్రీంకోర్టు కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడింది. న్యాయమూర్తుల నియామకం వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.  కేంద్రం ఉదాసీనత కారణంగా వ్యవస్థలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. జడ్జీలు లేక అనేక కోర్టు గదులకు తాళాలు వేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, కర్ణాటక హైకోర్టులో గ్రౌండ్‌ పూర్తిగా మూసివేయడం జరిగిందని పేర్కొంది. న్యాయమూర్తుల నియామకంపై కొలీజియం సిఫార్సులు చేసినా ప్రభుత్వం తాత్సారం చేయడాన్ని తప్పు పట్టింది. ఈ అంశంలో కేంద్రం అహంకార వైఖరిని వీడాలని, న్యాయవ్యవస్థ రక్షించేందుకు కృషి చేయాలని ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్‌ అన్నారు. ఈ విషయంలో రాజ్యాంగం ఏర్పాటు చేసిన రెండు ప్రధాన వ్యవస్థలు సుప్రీంకోర్టు-కేంద్రం అమీ తుమీకి సిద్ధపడడం తమకిష్టం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్‌ 11కు వాయిదా వేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మోడీ-బాబు జోడి ఉంటేనే రాష్ట్రాభివృద్ధి - జైట్లీ..

గుంటూరు : 900 ఎకరాల్లో ఏర్పాటు కానున్న పరిపాలన నగర నిర్మాణానికి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. మోడీ - చంద్రబాబు జోడి ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మంచి చేసిన వారిని ప్రశంసించడం సంస్కారమని, అందుకే సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశంసిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజధాని రాత్రికి రాత్రి ఏర్పడదని, కొన్ని కష్టాలు..సమస్యలున్నాయన్నారు. అందరూ చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు.

15:45 - October 28, 2016

నేచురల్ స్టార్ 'నాని' 'నేను లోకల్' అంటున్నాడు. నటించిన చిత్రాలు వరుసగా విజయవంతం కావడంతో 'నానీ' ఖుషీ ఖుషీగా ఉన్నాడు. అదే ఊపులో 'నేను లోకల్' చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. నిర్మాత 'దిల్ రాజు' సమర్పణలో 'సినిమా చూపిస్తా మామ' చిత్రానికి దర్శకత్వం వహించిన 'త్రినాథ రావు నక్కిన' దర్శకత్వంలో 'శిరీష్' నిర్మాతగా 'నేను లోకల్' చిత్రం రూపొందుతోంది. 'కీర్తి సురేష్' హీరోయిన్ గా నటిస్తోంది. దీపావ‌ళి సంద‌ర్బంగా సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసి సినిమాను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నట్లు 'దిల్' రాజు పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఐదు వ‌రుస స‌క్సెస్‌లు కొట్టిన 'నాని' తమ బ్యాన‌ర్‌లో విడుద‌ల‌వుతున్న 'నేను లోక‌ల్‌'తో సెకండ్ హ్యాట్రిక్ పూర్తిచేస్తాడ‌నే న‌మ్మ‌కంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం', 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌', 'కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌', 'జెంటిల్ మ‌న్‌', 'మ‌జ్ను' చిత్రాలు 'నాని'కి మంచి పేరు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 

అమరవాతిలో నూతన పరిపాలన భవనానికి శంకుస్థాపన..

గుంటూరు : అమరావతిలో నూతన పరిపాలన భవనానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడులు పాల్గొన్నారు.

 

తమ్మినేనికి రేవంత్ ఫోన్..

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్రలో ఉన్న తమ్మినేని వీరభద్రంకు టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. మహాజన పాదయాత్రకు టిడిపి పూర్తి మద్దతు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. నవంబర్ 1వ తేదీన టిడిపి నేతలంతా యాత్రలో పాల్గొంటారని, మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజీపేట వద్ద రమణతో పాటు టిడిపి కేడర్ అంతా పాదయాత్రలో పాల్గొంటుందని రేవంత్ పేర్కొన్నారు. 

మహబూబాబాద్ మండలంలో దళిత దంపతులపై దాడి..

మహబూబాబాద్ : మండలంలో దారుణం చోటు చేసుకుంది. దళిత దంపతులపై కర్రలతో గ్రామస్తులు దాడి చేశారు. మహిళను వివస్త్ర చేసి చితకబాదారు. భార్య భర్తలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

జైట్లీని కలిసిన అమరావతి రైతులు..

విజయవాడ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని రైతులు కలిశారు. అమరావతి నిర్మాణం కోసం భూమిలిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రద్దు చేయాలని రైతులు కోరారు. రైతుల పక్షాన జైట్లీతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని జైట్లీ హామీనిచ్చారు. 

అల్వాల్ కేఎంఆర్ కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన...

మేడ్చల్ : అల్వాల్ కేఎంఆర్ కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల డైరెక్టర్ మహేందర్ రెడ్డి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

 

విశాఖ జాయింట్ కలెక్టర్ బదిలీ...

విజయవాడ : విశాఖపట్టణం జాయింట్ కలెక్టర్ నివాస్ బదిలీ అయ్యారు. అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్ మెంట్ లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

15:15 - October 28, 2016

టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్..ఏ వుడ్ లోనైనా చిత్రం విడుదలయ్యే ముందు ఆ చిత్రాన్ని వినూత్నంగా పబ్లిషిటీ చేయాలని చిత్ర దర్శక, నిర్మాతలు ఆలోచిస్తుంటారు. అందులో భాగంగా ఒకసారి పోస్టర్..మరొక్కసారి మోషన్ పోస్టర్..మరోసారి టీజర్..ఇలా విభిన్నంగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా నటుడు 'సూర్య' నటిస్తున్న 'సింగం-3' చిత్ర మోషన్ పోస్టర్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో 'సూర్య'కు మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన చిత్రాలు విజయవంతమయ్యాయి కూడా. హరి దర్శకత్వంలో 'ఎస్-3' చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో 'అనుష్క'..'శృతి హాసన్' లు జోడిగాన టిస్తున్నారు. 'సింగం' సిరీస్ లో మూడో భాగమైన ఈ చిత్రంలో 2015 మిస్టర్ వరల్డ్..బుల్లితెర నటుడు 'థాకూర్ అనూప్ సింగ్' ప్రతినాయకుడి పాత్రలో నటించారు. 'ఎస్-3' చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఈ సమయంలోనే 'సూర్య' సోదరుడు 'కార్తీ' నటించిన 'కాష్మోరా' విడుదల చేయాలని నిర్ణయించారు. సినిమా విడుదల వాయిదా వేయాలని నిర్మాత జానవేల్ రాజాను 'సూర్య' కోరినట్లు తెలుస్తోంది. దీనితో సినిమాను డిసెంబర్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు టాక్. టీజర్ మాత్రం నవంబర్ ఏడో తేదీన విడుదల చేయనున్నట్లు మోషన్ పోస్టర్ లో పేర్కొన్నారు. గతంలోలాగానే ఈ చిత్రం కూడా అలరిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

కేసీఆర్ కు రేవంత్ లేఖ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు టి.టిడిపి నేత రేవంత్ లేఖ రాశారు. హోంగార్డుల ఉద్యోగాలను వెంటనే క్రమబద్ధీకరించాలని, పోలీసులతో సమానంగా వారికి వేతనం ఇవ్వాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని లేఖలో కోరారు. 

సికింద్రాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టివేత..

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో మరోసారి డ్రగ్స్ దొరికాయి. సైనిక్ పురిలోని రాజశేఖఱ్ అనే వ్యక్తి ఇంటి నుండి రూ. 2.5 కోట్ల విలువైన డ్రగ్స్ ను ఎన్ సీబీ స్వాధీనం చేసుకుంది. 20 రోజుల క్రితమే డ్రగ్స్ కేసులో రాజశేఖర్ అరెస్టు అయ్యాడు. ఇంతకుముందు రూ. 45 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 

నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

నెల్లూరు : నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జీవో 279ని రద్దు చేయాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. అక్కడకు వచ్చిన మేయర్ అబ్దుల్ అజీజ్ ను అడ్డుకున్నారు. మేయర్ తో కార్మికులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనితో మేయర్ కిందపడిపోయారు. 

14:09 - October 28, 2016

పోరాటాలే ఆమె  జీవితం..నిత్యం ప్రజలతోమమేకం..ప్రజాసమస్యలకు కోసమే నిరంతరం పోరాటం..సీపీఎం పార్టీ నేతగా.. తెలంగాణ ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు..ప్రజాసమస్యలతో పోరాడే నేపథ్యంలో తన భర్తను కూడా ఆమె పోగొట్టుకున్నారు. ప్రజాసమస్యలకోసం నిరంతరం పోరాటంచేస్తూ..నిత్యం ప్రజల్లో మమేమయ్యే బత్తుల హైమావతితో ఈరోజు మానవి మీ ముందుకు వచ్చింది. మరి హైమావతిగా జీవితంలో ఒక భాగమైపోయిన పోరాటాలను ..ఈ సందర్భంగా ఎదుర్కొన్న సమస్యలను సవాళ్లను మానవితో పంచుకున్నారు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

సీపీఎం మహాజన యాత్రకు టి.టిడిపి సంఘీభావం..

హైదరాబాద్ : సీపీఎం మహాజన యాత్రకు టి.టిడిపి సంఘీభావం వెల్లడించింది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో టి.టిడిపి నేతలు భేటీ అయ్యారు. 31న టి.టిడిపి నేతలు పాదయాత్రలో పాల్గొననున్నారు. నవంబర్ 1 నుండి పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని, రుణమాపీ అమలులో ప్రభుత్వ వైఫల్యంపై జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామని అరికెల నర్సిరెడ్డి పేర్కొన్నారు. 

న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు...

ఢిల్లీ : న్యాయమూర్తుల నియామకాల జాప్యంపై కేంద్ర ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. జడ్జిల నియామకంపై కొలీజయం సిఫార్సులు చేసినా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, ఈ విషయంలో ప్రతిష్టంభన ఉండరాదన్నారు. వ్యవస్థలు నిలిచిపోయి పరిస్థితిని తీసుకరావద్దని, కేంద్రం ఉదాసీనత వల్ల వ్యవస్థలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది. జడ్జిలు లేక అనేక కోర్టు గదులకు తాళాలు వేయాల్సిన దుస్థితి ఉందన్నారు. కేంద్రం అహంకార వైఖరిని వీడాలని, న్యాయవ్యవస్థను రక్షించాలని చీఫ్ జస్టిస్ ఠాకూర్ సూచించారు. 

14:00 - October 28, 2016

హైదరాబాద్ : ఐపీఎస్ లకు సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని... కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీసూచించారు... సాంకేతికతను ఉపయోగించుకుంటూ నేరాలను అరికట్టాలని కోరారు.. హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 68 పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్ కు అరుణ్ జైట్లీ హాజరయ్యారు. ట్రైనింగ్ లో ప్రతిభచూపిన అధికారులకు జైట్లీ అవార్డులు ప్రదానం చేశారు.    

ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక శ్రద్ధ - జైట్లీ...

విజయవాడ : జిల్లాలో బీజేపీ కార్యకర్తలు సమావేశం జరుగుతోంది. కేంద్ర మంత్రులు జైట్లీ, వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, అందుకే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని మంత్రి జైట్లీ తెలిపారు. విభజనతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకొంటోందని, ఏపీకి కేంద్రం నిరంతరం సాయం చేస్తుందన్నారు. దేశాభివృద్దికి ప్రధాని మోడీ నిరంతరం కష్టపడుతున్నారని, ఆర్థికాభివృద్ధిలో దేశం దూసుకెళుతోందని తెలిపారు. సమర్థ నాయకత్వం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రధాని మోడీ నిరూపిస్తున్నట్లు పేర్కొన్నారు.

13:58 - October 28, 2016

మహబూబ్ నగర్ : సీపీఎం మహాజన పాదయాత్ర 12వరోజుకు చేరింది.. ఈ మహాజన పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన వస్తోంది.. ప్రతి పల్లెలోనూ ప్రజలు సీపీఎం బృందానికి ఘనస్వాగతం పలుకుతున్నారు... రంగారెడ్డిజిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించిన సీపీఎం బృందం... ఇవాళ మహబూబ్‌నగర్‌ జిల్లాలో అడుగుపెట్టింది.. చిన్న చిన్న తండాలకువెళ్లిన బృందం సభ్యులు అక్కడి సమస్యలు తెలుసుకున్నారు.. 

13:55 - October 28, 2016

గుంటూరు : రైతులు ఇచ్చిన భూముల్లో పరిపాలన నగరం నిర్మాణం కాబోతుండడంతో రాయపూడి, లింగాయపాలెం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శంఖుస్థాపన జరిగే ప్రాంతానికి కుంటుంబ సభ్యులతో కలిసి వచ్చి చూసి వెళుతున్నారు. కాగా ఈ శంకుస్థాపనకు రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. మరికాసేపట్లో  జరగనున్న పరిపాలన నగర శంకుస్థాపనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. లింగాయపాలెం, రాయపూడి గ్రామాల మధ్యలో శంకుస్థాపన జరగనుంది. మొత్తం 72 ఎకరాల్లో సభా స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రైతులు వ్యక్తం చేసే ఆనందం..వారి అభిప్రాయాలుఉ తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

13:49 - October 28, 2016

తూర్పుగోదావరి : కాకినాడ జీజీహెచ్ లో అదృశ్యమైన శిశువు ఆచూకీ లభించింది.. కిర్లంపూడి మండలం తిమ్మాపురంలో పాపను పోలీసులు గుర్తించారు.. పసికందుకు ఎత్తుకెళ్లిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.. రెండురోజులక్రితం పసికందును ఓ మహిళ ఎత్తుకెళ్లింది.. సీసీ ఫుటేజ్‌ద్వారా నిందితురాల్ని గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.. 

13:43 - October 28, 2016

తూర్పుగోదావరి : జిల్లాలోని దివీస్‌ ప్రాజెక్టు ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది... ఫ్యాక్టరీ నిర్మాణంకోసం చెట్లను తొలగించేందుకు యాజమాన్యం ప్రయత్నించింది.. వీరిని స్థానికులు అడ్డుకున్నారు.. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించొద్దంటూ నినాదాలు చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కాగా 30 మంది రైతులకు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. పోలీస్ పహారా మధ్య ఫ్యాక్టరీ నిర్మాణానికి పభుత్వం పాల్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

13:39 - October 28, 2016

గుంటూరు : యువనేత నారా లోకేశ్‌ ఏపీ తెలుగుదేశం పార్టీపై పట్టు బిగిస్తున్నారు. కొద్ది రోజుల్లో మంత్రి పదవి చేపట్టే అవకాశాలున్న లోకేశ్‌...టీడీపీ పై పూర్తి స్థాయిలో గ్రిప్‌ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు తెలుగుదేశంలో లోకేశ్‌ ప్రధాన ఆకర్షణగా మారారు. టీడీపీ ని నడిపేందుకు లోకేశ్‌ ఎలాంటి ప్రాణాళికలు అమలు చేస్తారు..? చినబాబు రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న అంశంపై పార్టీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి.
తండ్రి బాటలో తనయుడు
తండ్రి నారా చంద్రబాబునాయుడు బాట‌లో నడిచేందుకు తనయుడు నారాలోకేశ్‌ సిద్ధమవుతున్నారు. సాంకేతిక‌త‌కు పెద్దపీట వేస్తూ...టిడీపీలో యువ‌నేత‌గా త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న లోకేశ్‌ ... ప్రస్తుతం ప్రభుత్వంలో చేరక‌ముందే పార్టీపై పూర్తి స్ధాయిలో ప‌ట్టుబిగించేందుకు స‌న్నద్ధమవుతున్నారు.

తెలుగు తమ్ముళ్లపై పట్టు బిగించేందుకు యత్నం
చంద్రబాబునాయుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వ‌ర‌కూ.. పార్టీపై పట్టు సాధించారు. 1985 నుంచి 94 వ‌ర‌కు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన చంద్రబాబు.. టీడీపీపై ఎలాగైతే గ్రిప్ సాధించారో... లోకేశ్‌ కూడా అదే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. తండ్రి తరహాలోనే తెలుగు తమ్ముళ్లపై పట్టు బిగించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పార్టీలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు.

పార్టీ సభ్యులకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా
2014ఎన్నిక‌ల‌కు పూర్వం...టీడీపీలో తెర వెనుక ఉంటూ ప‌నిచేసిన లొకేశ్‌ ఆతర్వాత టీడీపీ స‌భ్యత్వ న‌మోదు కార్యక్రమం భాద్యత‌లు స్వీక‌రించి 55 ల‌క్షల మందిని స‌భ్యులుగా చేర్పించి, అందరి దృష్టిని ఆకర్షించారు. పార్టీలో చేరిన వారికి ఎల‌క్ట్రానిక్ స‌భ్యత్వ గుర్తింపు కార్డులను అందుబాటులోకి తెచ్చిన ఘ‌న‌త‌ కూడా లోకేశ్‌దే. కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గా...భాద్యత‌లు స్వీక‌రించి సామాన్య కార్యకర్తల‌కు సైతం అందుబాటులో ఉంటూ...క్షేత్ర స్థాయిలో కూడా పట్టు సాధించారు. పార్టీలో స‌భ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ...రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. ఇలాంటి కొత్త ఆలోచనలతో ముందుకొచ్చిన లోకేశ్‌ అటు పార్టీ నేతలు, ఇటు కార్యకర్తల ప్రశంసలు అందుకున్నారు.

పార్టీ పదవులు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో లోకేశ్‌ ముద్ర
పార్టీపై మ‌రింత‌గా ప‌ట్టుబిగించేందుకు ప్రయ‌త్నిస్తున్న లోకేశ్‌... వారానికి ఐదు రోజుల పాటు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో తెలుగు త‌మ్ముళ్లకు అందుబాటులో ఉంటున్నారు. ఏపీలోని 13 జిల్లాల నేత‌ల‌తో సంప్రదిస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నారు. అటు పార్టీ ప‌ద‌వులతోపాటు, ఇటు నామినేటెడ్ పోస్టుల భర్తీలో తనదైన ముద్ర ఉండేలా చూస్తున్నారు. పైర‌వీల‌కు తావులేకుండా.. ప‌నిచేసిన వారికే పెద్దపీట వేస్తుండటంతో అస‌మ్మతికి తావు లేకుండా చేస్తున్నారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ లో భాగంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో ప్రారంభమైన గ్రూపు తగాదాలు ఆదిలోనే సమసిపోయేలా లోకేశ్‌ చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీలో పరిణతి చెందిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.

జనచైతన్య యాత్రతో చేరువయ్యే ప్రయత్నం
ఇక వచ్చే నెలలో మంత్రివ‌ర్గ పునర్వవస్థీకరణ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకున్న నేప‌ధ్యంలో ఈ లోపే రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, ప్రజ‌ల‌ను క‌లుసుకునేందుకు లొకేశ్‌ స‌మాయ‌త్తం అవుతున్నారు. జ‌న చైతన్య యాత్రల పేరిట ప్రజ‌ల‌కు మ‌రింత దగ్గర‌య్యేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ యాత్రలో వీలైన‌న్ని ఎక్కువ ప్రాంతాల‌కు వెళ్తూ...ప్రజా సమస్యలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రభుత్వం అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌ధ‌కాల‌ను ప్రజలకు అందరి దృష్టిని ఆకర్షించేందకు సిద్ధమవుతున్నారు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో...కోటి మందిని చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

తెలంగాణలో పార్టీని పార్టీని పట్టాలెక్కించేందుకు యత్నాలు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ... ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు లోకేశ్‌. ఏపీ టీడీపీలో పూర్తి స్థాయిలో పట్టు సాధించిన తర్వాత తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. 

13:32 - October 28, 2016

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-12లోని సితార హోటల్‌లో  అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వంటగదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో వినియోదారుల సంఖ్య తక్కువగా ఉండటంతో వారిని అప్రమత్తం చేశారు.

13:26 - October 28, 2016

గుంటూరు : మెడికల్ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. ఐదు రోజుల క్రితయం సంధ్యారాణి అనే మెడికల్ పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం ప్రొ.లక్ష్మి కారణమంటూ ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేస్తున్నారు. ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తాళలేక మెడికల్‌ పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక ఆమె భర్త ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. మరోవైపు సంధ్యారాణి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మూడు రోజులుగా విధులను బహిష్కరించిన ఆందోళన ఆరోరోజుకు చేరుకుంది.

సంధ్యారాణి మృతిని తట్టుకోలేక భర్త రవి ఆత్మహత్యయత్నం
మహిళా ప్రొఫెసర్‌ వేధింపులు తాళలేక గుంటూరు మెడికల్‌ కాలేజీలో గైనకాలజీ సెకండియర్‌ చదువుతున్న సంధ్యారాణి ఈ నెల 24న ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీలో ప్రొఫెసర్‌ లక్ష్మి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తన డైరీలో సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చిల్డ్రన్స్‌ స్పెషలిస్టు డాక్టర్‌ చిట్టిప్రోలు రవితో సంధ్యారాణి వివాహం జరిగింది. సంధ్యారాణి మృతిని తట్టుకోలేక రవి ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు హైదరాబాద్‌ లోని యశోద ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్ట్ చేయాలని మెడికోలు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్‌ను కలిసిన జూనియర్‌ డాక్టర్లు... ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా నిందితురాలు ప్రొఫెసర్ లక్ష్మి పరారీలో ఉన్నారు. 

జీజీహెచ్ లో కిడ్నాపైన పసికందు క్షేమం..

కాకినాడ : జీజీహెచ్ లో కిడ్నాపైన పసికందు ఆచూకీని పోలీసులు గుర్తించారు. కిర్లంపూడి (మం) తిమ్మాపూర్ లో చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. పసికందును ఎత్తుకెళ్లిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. 

ఎన్ కౌంటర్ కాదు - సురవరం..

హైదరాబాద్ : ఏవోబీలో జరిగింది ఎన్ కౌంటర్ కాదని..పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. హోం గార్డుల సమస్యలపై ప్రభుత్వ తీరు అప్రజాస్వామికమని, సచివాలయం తరలింపు నిలిపివేయాలన్నారు. 

హోటల్ సితారా గ్రాండ్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోటల్ సితారా గ్రాండ్ లో మంలు చెలరేగాయి. 

13:10 - October 28, 2016

జమ్మూకశ్మీర్‌: పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని ఎల్‌వోసీ దగ్గర పాక్ ఆర్మీ మళ్లీ కాల్పులకు తెబడింది. ఈ కాల్పులను భారత్ జవాన్లు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. భారత జవాన్ల కాల్పుల్లో ఓ పాక్ రేంజర్ హతమయినట్లుగా సమాచారం. భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో కతువ,హీరా నగర్ , సాంబ, ఆర్నియ, ఆర్ ఎస్ పుర,ఆక్నూర్, మెందార్‌, పూంఛ్‌ సెక్టార్‌ ల వద్ద పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. ఒక్కసారిగా కాల్పుల తీవ్రత పెరిగిపోవడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. పాక్‌ సైన్యం దాడిని భారత జవాన్లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఈ కాల్పుల్లో ఓ బాలిక తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. గాయాలయ్యాయి. భారత్ సమర్థవంతగా చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత పలుమార్లు పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. భారత్ చెందిన ప్రధాన రక్షణా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతోంది. ఈ కాల్పులకు సరిహద్దుల్లో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కశ్మీర్ లో పలు గ్రామాలు ఇప్పటికే ఖాళీ చేయగా వ్యవసాయ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నవారు మాత్రం వేరే ప్రదేశాలకు తరలటానికి ఇష్టపడటంలేదు. దీంతో పాక్ పాల్పడుతున్న కాల్పులకు సాధారణ పౌరులు గాయాలపాలవుతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనాన్ని వెళ్లదీస్తున్నారు.

12:47 - October 28, 2016

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలు శుక్రవారం సమావేశంకానున్నారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు కన్వీనర్ల నియామకంపై సమావేశంలో చర్చించారు. అలాగే నవంబర్‌ 1 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం,రైతుల సమస్యలపై నవంబర్‌ 3 నుంచి చేపట్టబోయే పాదయాత్ర.. నూతన జిల్లాలను కన్వీనియర్ల నియాయామకం..సమావేశంలో చర్చించారు.ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్, మోత్కుపల్లి నర్శింహులు, ఎల్ రమణి వంటి దాదాపు 30మంది సీనియర్ నేతలు సమావేశంలో హాజరయ్యారు. కాగా ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ కూడా ప్రభుత్వ విధానాలను ఎండగడుతు పలు ఆందోళన కార్యక్రమాలను చేపడుతోంది. ఈ విషయంలో తామేమీ తక్కువకాదు ప్రజాసమస్యలపై పోరాడేందురు టీ.టీడీపీ సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది.

12:23 - October 28, 2016

పశ్చిమగోదావరి : ఇంట్లో గలగలా తిరిగే అమ్మాయి పుట్టిన రోజునాడే మృతి చెందితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా వుంటుంది? పైగా ఇ ఇంటి యజమాని కూడా ప్రాణాపాయస్థితిలో వుంటే వారి ఆవేదనకు అంతు వుంటుందా? వారి కుటంబంలో ఇంతటి విషాదాన్ని నింపటానికి కారణమేంటో తెలుసా? వాహనాల అతివేగం..రోడ్లు నిబంధనలు పాటించకపోవటం? కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం..కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఏమంటారా? రోడ్డు నిర్మాణం చేపట్టే సమయంలో కీలక మలుపుల వద్ద..స్కూల్ పరిసర ప్రాంతాలు వంటి సున్నిత ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్స్ వేయాలని కనీస నిబంధలను పాటించని..వాటిపై అవగాహనలేమి..ఇవన్నీ కలిసి ఓ కుటుంబంలోని ఓ అమ్మాయి ప్రాణాలు తీసాయి..

దేవరపల్లిలో విషాదం..
జిల్లా దేవరపల్లి శివారులో ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నీరజ అనే బాలిక మృతి చెందింది. నీరజది ఈరోజు పుట్టినరోజు కావటంతో మరింత విషాదంగా ఈ ఘటనను చెప్పుకోవచ్చు. పుట్టినరోజునాడు అమ్మానాన్నల వద్ద ఆశీర్వాదాలు తీసుకుని తండ్రితో కలిసి స్కూలుకు వెళుతున్న నీరజను ఓ లారీ రూపంలో వచ్చిన మృత్యువు పొట్టనపెట్టుకుంది. ఈ ఘటనలో ఆదిశేఖర్ కు తీవ్రగాయాలవ్వగా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా ఆదిశేఖర్ పరిస్థితి కూడా విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరపల్లి పోలీసులు తెలిపారు. ఇవాళ నీరజ పుట్టినరోజు కూడా కావడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నీరజ చదువుతున్న స్కూలు టీచర్లు, విద్యార్థులు నీరజ మృతి చెందటంపై మనస్థాపానికి గురయ్యారు. సంఘటనాస్థలంలో వీరంతా ఆందోళన చేపట్టారు. పరారైన లారీ క్లీనర్, డ్రైవర్ స్థానిక పీఎస్ లో లొంగిపోయినట్లుగా సమాచారం. 

టి.టిడిపి ముఖ్య నేతలు భేటీ..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టి.టిడిపి ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, రావుల, ప్రకాష్ రెడ్డిలు హాజరయ్యారు. నవంబర్ 3 నుండి చేపట్టే పాదయాత్రపై చర్చిస్తున్నారు. 

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద పోలీసుల మోహరింపు..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. ఏవోబీలో ఎన్ కౌంటర్ కు నిరసనగా ప్రజా సంఘాలు ఆందోళన చేస్తారనే అనుమానంతో భద్రత పెంచారు. 

దివీస్ లో చెట్ల తొలగింపు..అడ్డుకున్న స్థానికులు..

కాకినాడ : తొండంగి (మం) దివీస్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో చెట్ల తొలగింపునకు యాజమాన్యం ప్రయత్నించింది. స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

ఛైర్మన్ కోసం అన్వేషణ ప్రారంభం - టాటా గ్రూప్..

ఢిల్లీ : టాటా గ్రూప్ ఛైర్మన్ పదవికి సమర్థుడైన వ్యక్తి కోసం అన్వేషణ మొదలైందని టాటా గ్రూప్ ప్రకటించింది. నాలుగు నెలలకు మించి ఒక్క రోజు కూడా రతన్ టాటా ఆ పదవిలో ఉండరని వెల్లడించింది. 

12:00 - October 28, 2016

హైదరాబాద్ : తెలంగాణలో రేషనలైజేషన్ మళ్లీ తెరపైకొచ్చింది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా మరోసారి రేషనలైజేషన్ పేరుతో 1500 పాఠశాలలను మూసివేసేందుకు తెలంగాణా సర్కార్ పావులు కదుపుతోంది. ఈ నిర్ణయంతో విద్యాసంవత్సరం మధ్యలో ఇటు విద్యార్ధులను అటు టీచర్లను ఇబ్బందులకు గురిచేయబోతోంది.

ప్రభుత్వ బడుల మూసివేతకు వడివడిగా అడుగులు
తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ బడుల మూసివేతకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 4వేల బడుల్ని మూసివేసేందుకు ప్రభుత్వం గతంలో సిద్ధమైంది. ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో వెనక్కి తగ్గింది.

సుప్రీం నిర్ణయాలను బేఖాతరు చేస్తూ..1500 స్కూల్స్ విలీనంకి రంగం సిద్ధం
సుప్రీం నిర్ణయాలను సైతం బేఖాతరు చేస్తు ప్రభుత్వం మళ్లీ మొదటికే వచ్చింది. ఈసారి నాలుగువేల స్కూల్స్ కాకపోయినా దాదాపుగా ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ, హైస్కూల్స్ అన్నీ కలిపి 1500 స్కూల్స్‌ని ఇతర స్కూల్స్‌లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

తెలంగాణలో 25,966 పాఠశాలలు..24 లక్షలకు పైగా విద్యార్థులు
తెలంగాణ వ్యాప్తంగా 25వేల 966 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 24 లక్షలకు పైగా విద్యార్దులు చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఈ యేడాది విద్యార్ధుల సంఖ్య కూడా తగ్గింది. అయితే ఇటీవలే జరిగిన డిఈవోల సమీక్షా సమావేశాల్లో మంత్రి కడియం, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ రేషనలైజేషన్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

పాత జిల్లాల ప్రకారం పదిలోపు ఉన్న స్కూల్స్‌
పాత జిల్లాల ప్రకారం పది లోపు విద్యార్ధులున్న స్కూల్స్ లిస్టు తయారుచేసేందుకు అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. జిల్లాల వారిగా మహబూబ్‌నగర్ లో అత్యధికంగా 235 స్కూల్స్ ని మూసివేసేందుకు రెడీ అయ్యారు. కరీంనగర్ లో 161, మెదక్ 93, రంగారెడ్డిలో 49, వరంగల్ 221, నల్గొండ 177, ఖమ్మంలో 116, నిజామాబాద్ లో 55, అదిలాబాద్ 120, హైదరాబాద్‌లో నాలుగు పాఠశాలల్లో విద్యార్ధుల లెక్కలు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

విద్యార్ధులు తక్కువగా ఉన్నారనే వంక
కేవలం విద్యార్ధులు తక్కువగా ఉన్నారనే వంకతో రాష్ట్రంలో అనేక స్కూల్స్ ని మూసివేసి దగ్గర్లో ఉన్న స్కూల్స్‌లో విలీనం చేస్తున్నారు. అయితే సుప్రింకోర్టు ఇదివరకే స్కూల్స్ లో విద్యార్ధులు లేకపోవడానికి కారణం ఎవరు అనేదానిపై ఆలోచించాలే తప్పితే వాటిని మూసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కానీ మళ్లీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో విద్యార్దులు తక్కువగా ఉన్న బడుల వివరాలను సేకరించాలని అధికారులకు తెలిపినట్టు సమాచారం.

రేషనలైజేషన్ తో లాభాల కంటే నష్టాలే ఎక్కువ : ఉపాధ్యాయ సంఘాలు
రేషనలైజేషన్ ప్రక్రియ వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోపోతే అన్నిఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. 

11:56 - October 28, 2016

హైదరాబాద్ : తెలంగాణలో డిప్యూటీ ఈవోల పోస్టుల రద్దుకు రంగం సిద్ధమైంది. వారి బాధ్యతలనూ ఇక నుంచి ఈవోలే చూడనున్నారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. జిల్లాల విభజన చేసి డీఈవోలు, డిప్యూటి డిఈవోలు, ఎంఈవోల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం పునర్విభజన పూర్తవ్వగానే డిప్యూటీ ఈవోలకు మంగళం పాడేందుకు సన్నద్ధమైంది.

గందరగోళంలో డిప్యూటీ ఈవోల పోస్టులు
తెలంగాణలో జిల్లాల పునర్విభజనతో డిప్యూటీ ఈవోల పోస్టులు గందరగోళంలో పడ్డాయి. మరికొన్ని రోజుల్లో ఈ పోస్టులకు ఎగనామం పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల విద్య అంతంత మాత్రంగా ఉండటంతో.. ఇక డిప్యూటీ ఈవోల పోస్టులను తొలగిస్తే విద్యారంగం మరింత కుంటుపడే ప్రమాదం కనిపిస్తోందని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.

డిఈవోలకు బాధ్యతలు అప్పగించారంటున్న ఉన్నతాధికారులు
ఇప్పటికే ఈ పోస్టులను అనాధికారికంగా రద్దు చేసి వారి బాధ్యతలను డిఈవోలకు అప్పగించారని కొందరు ఉన్నాతాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పాత పది జిల్లాల పరిధిలో 56 డిప్యూటీ ఈవోల పోస్టులు ఉన్నాయి. వీటిలో 11 మంది రెగ్యూలర్‌ అధికారులున్నారు. అయితే మిగిలిన పోస్టుల్లో ఆయా డివిజన్లలోని సీనియర్‌ ప్రధానోపాధ్యాయులే ఇన్‌చార్జులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి 40 హైస్కూల్స్‌కి ఒకరు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టుల భర్తీ ఏకీకృత ఉమ్మడి సర్వీస్‌రూల్స్‌తో ముడిపడి ఉండటంతో అవి భర్తీకి నోచుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

దీర్ఘకాలిక సెలవుల్లో ఇద్దరు డిప్యూటీ ఈవోలు
అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 11 రెగ్యూలర్ డిప్యూటీ ఈవోల్లో కూడా ఇద్దరు దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నారు. మిగిలిన 9మంది ఇప్పటికే డీఈవోలుకు ఇంచార్జులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు డిప్యూటీ ఈవో పోస్టులను ప్రస్తుతానికి పెండింగ్‌లో పెడుతున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం వారు చూస్తున్న హైస్కూళ్ల పర్యవేక్షణ.. వారి వారి మండలాల పరిధిలోని ఎంఈవోలకు అప్పగించారు.

డిప్యూటీ ఈవో పోస్టుల రద్దుకు యత్నాలు.. విద్యావేత్తలు ఆందోళన
మరోవైపు ఎంఈవోల పోస్టుల ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఇప్పుడు డిప్యూటీ ఈవో పోస్టుల రద్దుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంతో విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లను బలోపేతం చేయడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆవేదన చెందుతున్నారు. 

11:52 - October 28, 2016

విశాఖ : ఏవోబీ లో ఎన్‌కౌంటర్‌ ముమ్మాటికీ భూటకపు ఎన్‌కౌంటర్‌ అని మావోయిస్ట్ కైలాసం అన్నారు.... 30మందిని చంపినంతమాత్రాన తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు... ఏవోబీ ఎన్‌కౌంటర్‌ ముమ్మాటికీ భూటకమేనని మావోయిస్ట్ కైలాసం పేర్కొన్నారు. 30మంది నేతల్ని చంపినంతమాత్రాన ఉద్యమం ఆగదన్నారు. విద్రోహుల విధానాలతో విప్లవవీరులు హతమయ్యారని ఆరోపించారు. హెచ్చరికలులేకుండా కాల్పులు జరిపి .ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారన్నారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌ను మావోల సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఏపీ, ఒడిశా సీఎంలే దీనికి కారణమనీ..అటవీ సంపద దోచుకునేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు 30మంది మావోయిస్టుల్ని హత్య చేశారీన..మృతుల్లో ఆదివాసీలుకూడా వున్నారని తెలిపారు. ఒక వీరుడు మరణిస్తే వేలమంది వీరులు పుట్టుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్ కౌంటర్ తో మా ఉద్యమం ఆగదనీ..ఈ హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామనీ హెచ్చరించారు. కొందరు మావోయిస్టులు పోలీసులు అదుపులోఉన్నారనీ..వారిని చిత్రహింసలు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల ఆదుపులోఉన్న మావోయిస్టుల్ని కోర్టులో హాజరుపరచాతనీ డిమాండ్ చేశారు. ఆర్కే పోలీసుల ఆదుపులోఉన్నారని మా అనుమానీ ఈ సందర్భంగా మావోనేత కౌలాసం అభిప్రాయపడ్డారు. మావోయిస్ట్ కైలాసం ఏమన్నారో ఆడియోలో వినండి..

పుట్టిన రోజునాడే కబళించిన మృత్యువు...

పశ్చిమగోదావరి : దేవరపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పుట్టిన రోజునాడే మృత్యువు కబళించింది. 8వ తరగతి విద్యార్థిని నీరజ తండ్రితో కలిసి బైక్ పై స్కూల్ కు వెళుతోంది. లారీ ఢీకొనడంతో నీరజన మృతి చెందగా తండ్రికి గాయాలయ్యాయి. పుట్టిన రోజునాడే నీరజ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.  

11:45 - October 28, 2016

యాపిల్ పిల్ల 'హన్సిక' దీవాళి ఫెస్టివల్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంది. అయితే కుక్కలపై ఉన్న ప్రేమ ఈ బ్యూటీకి మనుషులపై లేనట్లుంది. పేట్స్ కోసం ఆలోచిస్తున్న ఈ బ్యూటీ మనుషుల కోసం మాత్రం ఆలోచించడం లేదు. ఇంతకీ హన్సిక దీపావళి పండగక్కి కుక్కలపై ప్రేమకి లింక్ ఏంటీ ? టాలీవుడ్ తో కెరీర్ మొదలుపెట్టి తెలుగు సినిమాలతోనే స్టార్ అయిన బ్యూటీ 'హన్సిక'. ఎందుకో కానీ ఈ బ్యూటీ కోలీవుడ్ లో సెట్ అయింది. వీలుచిక్కిన ప్రతిసారి తెలుగు ఇండస్ట్రీలో ఓ సినిమా చేస్తోంది. కానీ పుల్ ప్లెజ్డ్ గా తెలుగు ఇండస్ట్రీపై మాత్రం ఫోకస్ పెట్టడం లేదు. ఇదంతా పక్కన పెడితే ఎప్పటిలాగే ఈ బబ్లీ గాళ్ ఈ దీపావళిని కూడా తన పిల్లలతో గ్రాండ్ గా ప్లాన్ చేసుకుందట.

30 మంది పిల్లల దత్తత..
అదేంటి 'హన్సిక'కు పెళ్లే కాలేదు పిల్లలెక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారా. ఈ యాపిల్ బ్యూటీ 30 మంది పిల్లలను దత్తత తీసుకుంది లేండి. అయితే ఈ పిల్లల గురించేమో కానీ 'హన్సిక'కు కుక్కల పిల్లల మీదే ప్రేమ ఎక్కవగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే కుక్క పిల్లలు భయపడతామేయోనని దీపావళిని సైలెంట్ గా జరుపుకోవాలనుకుంటుందట. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా 'హన్సిక' తన దత్తత పిల్లలతో దీపావళిని గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. ఇందుకు కోసం రెండు రోజుల ముందే ముంబయ్ లోని ఇంటికి వెళ్లనుందట. అయితే టపాసులు కాల్చకూడదని ఈ బ్యూటీ నిర్ణయం తీసుకుందట. ఎందుకంటే తన ఇంట్లో చాలా కుక్కపిల్లలు ఉన్నాయని టపాసులు కాలిస్తే అవి భయపడతాయని ఈ బ్యూటీ చెప్పుతోంది. ఓ పక్కా స్వచ్చంద సంస్థలు టపాసుల వల్ల పర్యావరణం పాడవుతుందని చెప్పుతుంటే ఈ పిల్ల మాత్రం కుక్కల కోసమంటోంది. ఏదైనా 'హన్సిక' మానవత్వమే మానవత్వం లెండి. ఏదైతేనేమి ఈ బ్యూటీ టపాసుల కాల్చి పర్యావరణాన్ని పాడుచేయనందుకు సంతోషించాలి.

11:44 - October 28, 2016

హైదరాబాద్ : సర్దార్‌ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 68వ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. ఐపీఎస్ ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు. లైవ్‌లో చూద్దాం..

11:41 - October 28, 2016

శ్రీకాకుళం : ఆరుగాలం పండించుకున్న పంటకు నష్టం జరిగితే ఆ రైతు గుండె చెరువయిపోతుంది కాదా. ఇటువంటి ఘటనే శ్రీకాకుళం జిల్లా రైతులకు జరిగింది. ఆముదాల వలస మండల కేంద్రం కృష్ణాపురం వద్ద వంశధార కుడి కాలువకు గండి పడింది. 150 ఎకరాలకు పైగా వరి పంట నీట మునిగింది. నీరు ఒక్కసారిగా పొలాలను ముంచేయడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

11:35 - October 28, 2016

హైదరాబాద్ : యువ ఐపీఎస్ లకు అత్యుత్తమ శిక్షణ కేంద్రం అది. లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేయడం... దేశ భద్రత, సైబర్ నేరాలు, అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేలా అక్కడ ఇచ్చే శిక్షణ యువ పోలీసులను మరింత రాటుతేలేలా చేస్తుంది.. అలాంటి అత్యుత్తమ శిక్షణకు మారుపేరు హైదరాబాద్ సర్దార్‌ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ. ఎన్ పీఏ లో యువ ఐపీఎస్ ల శిక్షణ పై 10 టీవీ ప్రత్యేక కథనం....

1975లో నేషనల్ పోలీస్ అకాడమీ ఏర్పాటు
హైదరాబాద్ లోని శివరాంపల్లిఇది... 1975లో ఈ ప్రాంతం పెద్ద అడవిని తలపించేది. ఇక్కడకు చేరుకోవాలంటే రోడ్డుమార్గం కూడా ఉండేది కాదు. పోలీసుల అత్యుత్తమ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం ఈ గ్రామానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేసింది.. 41ఏళ్లక్రితం ప్రారంభమైన ఈ అకాడమీ ఎంతోమంది ఐపీఎస్ లను తయారుచేసింది... వల్లభ హిల్స్‌లోని 275 ఎకరాల్లో అకాడమీ ఏర్పాటైంది... చుట్టూ కొండలు, పక్కనే మీరాలం చెరువుతో ఈ ప్రాంతంలో శిక్షణ యువ పోలీసుల్లో మరింత ఏకాగ్రతను పెంచుతోంది.. ఇక్కడ ఏర్పాటుచేసిన జాతీయ జెండా అకాడమీకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది..

ఎన్ పీఏ లో శిక్షణ పూర్తి చేసుకున్న 67 బ్యాచ్‌లు
సర్దార్‌ అకాడమీలో ఇప్పటివరకు 67 బ్యాచ్‌లు శిక్షణ పూర్తిచేసుకున్నాయి... 68వ బ్యాచ్ శిక్షణకూడా ముగిసింది.. ఈ బ్యాచ్‌లో బీటెక్, ఎంబీబీఎస్‌లాంటి కోర్సులుచేసినవారుకూడా ఉన్నారు.. లక్షల్లో జీతాలు వదులుకొని దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో వీరు సివిల్స్ వైపు వచ్చారు.. తాజా బ్యాచ్‌లో ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్నా 126మంది... వివిధ రాష్ట్రాల్లో విధులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. ఈ బ్యాచ్‌నుంచి తెలుగు రాష్ట్రాలకు 7 గురిని కేటాయించారు.. గతంతోపోలిస్తే శిక్షణలో ఎన్నో మార్పులువచ్చాయని.. అకాడమీ డైరెక్టర్‌ అరుణా బహుగుణ చెబుతున్నారు..

ఐపీఎస్ గౌతమిది వ్యవసాయ కుటుంబం
యువ ఐపీఎస్‌లకు ఇక్కడ 45వారాలపాటు ట్రైనింగ్ ఇస్తారు.. కేవలం భారత్‌ ఐపీఎస్‌లేకాదు.. నేపాల్, భూటాన్, మాల్దీవుల పోలీసులు కూడా ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు.. పోలీస్‌ డ్యూటీకి మానసికంగా... శారీరకంగా ఇక్కడ రెడీ అవుతున్నారు.. ఇక్కడ శిక్షణ తీసుకునే ఐపీఎస్‌లది ఒక్కొక్కరిది ఒక్కో నేపధ్యం... చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికిచెందిన గౌతమి బి.టెక్ పూర్తి చేసి ఓ ప్రైవేట్‌ కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగం సాధించారు.. ప్రజాసేవచేయాలన్న ఆలోచనతో ఆమె సివిల్స్ వైపు అడుగులువేశారు.... తన లక్ష్యసాధనకోసం ఉద్యోగాన్ని వదిలేసి రాత్రింబవళ్లు కష్టపడి చదివారు.. ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.. తెలంగాణలో సేవలందించనున్న కర్నాటకకు చెందిన రక్షిత ఇక తెలంగాణకు కేటాయించిన కర్నాటక యువతి రక్షితకూడా బీటెక్‌ చదివారు.. సివిల్స్ ఫస్ట్‌ అటెంప్ట్‌లో ఐఆర్ఎస్ కు సెలక్టయ్యారు.. ఐపీఎస్ టార్గెట్‌ సాధించేందుకు మరోసారి సివిల్స్ రాసి అనుకున్నది సాధించారు.. తెలంగాణ పాలనలో తాను భాగస్వామ్యం కాబోవడం

తెలంగాణకు చెందిన చేతన జర్నలిస్ట్ కుమార్తె
తెలంగాణకు కేటాయించిన మరో ఐపీఎస్‌ చేతనది మరో కథ... జర్నలిస్ట్ కూతురైన చేతన డాక్టర్‌గా స్థిరపడ్డారు.. రోజూ వచ్చే కేసులను చూసే సమయంలో మహిళలకు ఏదైనా చేయాలని ఆలోచించారు.... సివిల్స్ ద్వారామాత్రమే ఇది సాధ్యమని మళ్లీ పుస్తకం పట్టారు.. అనుకున్నది సాధించి సొంత రాష్ట్రంలో విధులు నిర్వహించబోతున్నారు..

డెహ్రాడూన్, మసూరి ప్రాంతాల్లో రివర్ ర్యాఫ్టింగ్, రాక్ క్లైయ్బింగ్ లలో శిక్షణ
పోలీస్‌ శిక్షణలోభాగంగా ఈ యువ ఐపీఎస్‌లు... పలు ప్రాంతాలకు వెళతారు.. డెహ్రాడూన్‌, మసూరి ప్రాంతాల్లో రివర్‌ ర్యాఫ్టింగ్, రాక్‌ క్లైంబింగ్‌లో శిక్షణ తీసుకుంటారు.. పోలీసు ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లకు ముందే సిద్ధమవుతారు.. ఇలా 45వారాల శిక్షణలో ఎన్నో అంశాలు నేర్చుకున్న ఐపీఎస్‌లు డ్యూటీలో చేరేందుకు రెడీ అయ్యారు.. 

11:15 - October 28, 2016

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. శుక్రవారం జరగనున్న పరిపాలన నగర శంకుస్థాపనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. లింగాయపాలెం, రాయపూడి గ్రామాల మధ్యలో శంకుస్థాపన జరగనుంది. మొత్తం 72 ఎకరాల్లో సభా స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సభా వేదిక వెనుక వైపు హెలీప్యాడ్ నిర్మాణం చేస్తున్నారు. సభా వేదికకు 30 మీటర్ల దూరంలో శంఖుస్థాపన శిలాఫలకాలు సిద్దం చేస్తున్నారు. సభా వేదిక ముందు రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు, ఇతర వి.ఐ.పిలకు కూడా వేదిక క్రిందనే గ్యాలరీని ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ..వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. మధ్యహ్నాం 3.44 గంటలకు ఈ శుభకార్యం జరుగనుంది. పరిపాలన నగరంతో పాటు రిజర్వ్ బ్యాంక్ , గుంటూరు అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ , రాజధానిలో 7 ప్రధాన రహదారుల ఏర్పాటుకు సంబంధించిన శిలాఫలకాలను అరుణ్‌ జైట్లీ ఆవిష్కరించనున్నారు. అనంతరం సభా వేదిక పై ప్రసంగించనున్నారు.ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న అరుణ్ జైట్లీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అనంతరం ప్రత్యేక హెలీకాప్టర్ లో అమరావతికి చేరుకోనున్నారు. కేంద్రమంత్రులకు సీఎం చంద్రబాబు ఆతిథ్యం ఇవ్వనున్నారు.

శంకుస్థాపనకు దాదాపు 30వేలకు పైగా హాజరు
శంకుస్థాపన కార్యక్రమానికి 30 నుంచి 40వేల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ ప్రజలకు, మంత్రులకు, కేంద్ర మంత్రులకు, సీఎంకు వేరువేరుగా రహదారాలు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

హైకోర్టులో సెక్రటేరియట్ కూల్చివేతపై విచారణ..

హైదరాబాద్ : సెక్రటేరియట్ కూల్చివేత పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ నవంబర్ 1కి వాయిదా వేసింది. 

దివ్యదర్శనం కాంప్లెక్స్ ను పరిశీలించిన ఈవో..జేఈవో..

చిత్తూరు : రూ. 2.23 కోట్లతో టిటిడి నూతనంగా నిర్మించిన దివ్యదర్శనం కాంప్లెక్స్ ను ఈవో, జేఈవో పరిశీలించారు. నవంబర్ 1 నుండి దివ్యదర్శనం కాంప్లెక్స్ ను భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. దివ్యదర్శనం కాంప్లెక్స్ లో లడ్డూ టోకెన్లు, లగేజీ కౌంటర్లు, కాఫీ, పాలు, నీరు ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నడకదారి భక్తుల కోసం ఆధునాతన సౌకర్యాలతో దివ్యదర్శనం కాంప్లెక్స్ నిర్మించడం జరిగిందన్నారు. 

దేశ ఐక్యతలో పటేల్ కీలక పాత్ర - జైట్లీ..

హైదరాబాద్ : నేషనల్ పోలీసు అకాడమీలో 68వ మ్యాచ్ ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 124 మంది ఐపీఎస్ లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. దేశ ఐక్యతలో వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని, సంస్థానాల విలీనంలో పటేల్ పాత్ర చాలా కీలకమన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన రెండున్నరేళ్లలో తన ముద్ర వేశారని, ఎంతో మంది ధైర్యవంతులను అకాడమీ అందించిందన్నారు. సమాజం కోసం పోలీసు వ్యవస్థ అహర్నిశలు కష్టపడుతోందన్నారు. 

ఘజియాబాద్ లో అగ్నిప్రమాదం...

ఉత్తర్ ప్రదేశ్ : ఘజియాబాద్ ఫరూక్ నగర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు.

 

 

కర్నూలు జిల్లాలో దారుణం..

కర్నూలు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో దుండగులు వదిలివెళ్లారు. స్థానికులు శిశువు ఏడుపు విని గుర్తించారు. ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. రెండు రోజుల క్రితం శిశువును వైద్యులు డిశ్చార్జ్ చేశారు. సీ క్యాంప్ సెంటర్ లో శిశు గృహకు తరలించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. 

హడలిపోతున్న కశ్మీర్ ప్రజలు..

కశ్మీర్ : జమ్మూ, కశ్మీర్ లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో పాక్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్ శుక్రవారం కూడా సరిహద్దు గ్రామాలపై బుల్లెట్ల వర్షం కురిపించింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనలతో వణికిపోతున్నారు. ఈ ఘటనలో ఓ బాలికకు గాయాలయ్యాయి. 

కార్డన్ సెర్జ్ లో 20వాహనాలు సీజ్..

హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. శుక్రవారం వేకువజామున జరిపిన తనిఖీల్లో 60 మంది పోలీసులు పాల్గొన్నారు. మార్కండేయకాలనీదిగ్బంధం చేసి, ఇంటింటినీ సోదా చేశారు. ఎలాంటి పత్రాలు లేని 20 బైక్‌లు, ఒక ఆటోను సీజ్ చేశారు.

ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్..

జమ్ము కశ్మీర్ : జైషే-ఇ-మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో గడిచిన రాత్రి చోటుచేసుకుంది. 46 రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో భద్రతా సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి ఏకే-47, పిస్టల్, మందుగుండు సామాగ్రి, గ్రనేడ్ లాంచర్, యూబీజీఎల్ గ్రనేడ్స్‌ను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

10:40 - October 28, 2016

ఉత్తరప్రదేశ్ : వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ ఒంటరి పోరుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. కుటుంబంలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ములాయం రాజనీతిని ప్రదర్శిస్తున్నారు. ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రీయ లోక్‌దళ్‌ నేత అజిత్‌ సింగ్‌, జెడియు మాజీ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌, దేవెగౌడలతో మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు నవంబర్‌ 5న జరిగే ఎస్పీ రజతోత్సవాలకు వీరిని ఆహ్వానించేందుకు శివపాల్‌ యాదవ్‌ ఢిల్లీ వెళ్లారు. బీహార్‌ మాదిరి యూపీలో కూడా మహాకూటమి ఏర్పాటుకు ములాయం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.  

10:37 - October 28, 2016

ఉత్తరప్రదేశ్ : ములాయం కుటుంబంలో ముసలం తారాస్థాయికి చేరుకోవడంతో ఎట్టకేలకు ఎస్పీ సీనియర్ నేత అమర్ సింగ్ మౌనం వీడారు. యాదవ కుటుంబంలో సంక్షోభానికి తాను కారణమంటూ తనపై ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అఖిలేష్ తనను బ్రోకర్ అనడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను బలి చేయడం వల్ల సమస్యలు పరిష్కర మౌతాయనుకుంటే తాను బలికి సిద్ధమేనని అమర్‌సింగ్ ప్రకటించారు. ములాయం చెప్పేవరకు తాను పార్టీ వీడనని, అఖిలేష్‌కు తన మద్దతు ఉంటుందన్నారు. ములాయంను షాజహాన్ అని, అఖిలేష్‌ను ఔరంగజేబు అనలేదని వివరణ ఇచ్చారు. కుటుంబమంతా అఖిలేష్‌ వివాహాన్ని వ్యతిరేకించినా తానే దగ్గరుండి పెళ్లి జరిపించిన విషయాన్ని అమర్‌సింగ్ గుర్తు చేశారు. రాంగోపాల్ యాదవ్‌ను నపుంసకుడని తాను అనలేదని, తనను చంపుతామంటూ ఆయన బెదిరించడం తగదని అమర్‌సింగ్ సూచించారు.

10:21 - October 28, 2016
10:18 - October 28, 2016

కర్నూలు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మానవుల్లో నానాటికి మానవత్వపు చాయలు అడుగంటిపోతున్నాయి. బిడ్డల్ని ఒక్క దెబ్బ వేయాలంటేనే ప్రాణం గిలగిలలాడిపోతుంది. పశువులు..పక్షులు సైతం తమ కూనలకు అపద సంభవిస్తే ప్రాణాలకు తెగించి పోరాడుతాయి. కానీ మనిషి అనే రెండు కాళ్ల మృగం మాత్రం తమ బిడ్డల్ని తామే పొట్టనపెట్టుకుంటున్నారు. ఈ రెండు కాళ్ళ మృగాలను ఎలా పోల్చాలో కూడా తెలియని జాతిగా ముద్రపడిపోతున్నారు. కనీవినీ ఎరుగని దారుణం కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ శిశువు కాళ్లు, చేతులు విరిచి కర్నూలు ప్రభుత్వాసుపత్రి సమీపంలో పడేసి పారిపోయారు. శిశువును గమనించిన ప్రభుత్వాసుపత్రి సిబ్బంది శిశు సంజీవని వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కాళ్లూ చేతులూ కావాలనే విరిచేసినట్లుగా తెలుస్తోంది. పసికందు తల్లిదండ్రులు ఎవరు? శిశువు దుస్థితికి కారణమైన దుర్మార్ఘుల కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

కర్నూలులో దారుణం..

కర్నూలు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ శిశువు కాళ్లు, చేతులు విరిచి కర్నూలు ప్రభుత్వాసుపత్రి సమీపంలో పడేసి పారిపోయారు. శిశువును గమనించిన ప్రభుత్వాసుపత్రి సిబ్బంది శిశు సంజీవని వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

09:51 - October 28, 2016

హైదరాబాద్ : సర్దార్‌ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 68వ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్ పరేడ్ ప్రారంభమైంది. విధి నిర్వహణకు 126 మంది యువ ఐపీఎస్ లు సిద్ధమయ్యారు. ఏపీ తెలంగాణాకు ఏడుగురు ఐపీఎస్ ఆఫీసర్లను కేటాయించారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

09:48 - October 28, 2016

రంగారెడ్డి : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా.. జనంతో మమేకమై సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర రంగారెడ్డిలో జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర బృందానికి అడుగడుగునా..ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదని ప్రజలు ఏకరువు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, చేతల్లో సరైన పాలన అందించడం లేదని ఈ సందర్భంగా తమ్మినేని విమర్శించారు.
పాలకుల పనితీరుపై చురకలు అంటిస్తూ..పాదయాత్ర
జనం సమస్యలు వింటూ... పాలకుల పనితీరుపై చురకలు అంటిస్తూ... సీపీఎం మహాజన పాదయాత్ర ముందుకు సాగుతోంది. 11వ రోజు మహాజన పాదయాత్ర శంషాబాద్‌, మహేశ్వరంలో మండలాల్లో కొనసాగింది. నాగారం, పెద్దగోల్కొండ, బహదూర్‌గూడ, చిన్నగోల్కొండ, శంకరాపూర్‌ , ఘాంన్సిమియాగూడ, షాపూర్‌, మదనపల్లి, పాలమాకుల, కొత్తూరు వరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల పైగా.. సాగింది. ఉదయం నాగారంలో ప్రారంభమైన పాదయాత్ర మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొత్తూరు వరకు కొనసాగింది.
మాటలే గానీ చేతలు లేని టీ.సర్కార్ : తమ్మినేని
గ్రామాల్లోని సమస్యలను తెలుసుకుంటూ తమ్మినేని బృందం పాదయాత్ర సాగింది. ఆశాకార్యకర్తలు, మహిళా సంఘాలు, వివిధ కార్మిక సంఘాలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సీపీఎం మహాజన పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఎంబీసీల సమస్యలపై తమ్మినేని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తమ పాదయాత్ర ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చిందని తమ్మినేని అన్నారు. పాదయాత్ర ప్రారంభించాక.. ప్రభుత్వం ఏదో ఓ పని చేస్తున్నామనే బిల్డప్‌ ఇస్తోందని అన్నారు. అధికారులను పరిశీలనకు తీసుకొచ్చింది. అయితే కదలికతో పాటు పనులు కూడా చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. మాటలు చెబుతున్న ప్రభుత్వం.. చేతల్లో ఏం చేయడం లేదని తమ్మినేని విమర్శించారు. రెండున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలన తెలంగాణ అభివృద్ధి సాధించేలా లేదని తమ్మినేని దుయ్యబట్టారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వ పరిపాలన సాగాలని ఆయన సూచించారు. 

09:43 - October 28, 2016

విశాఖ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.. ఆర్కే ఆచూకీ దొరకలేదని పోలీసులు స్పష్టం చేస్తుంటే..... ప్రజాసంఘాలు మాత్రం ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆరోపిస్తున్నాయి.

అశ్రునయనాల మధ్య మావోయిస్టుల అంత్యక్రియలు
మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల అంత్యక్రియలు కుటుంబసభ్యులు, బంధువులు, ప్రజాసంఘాల నేతల అశ్రునయనాల మధ్య ముగిశాయి. మావోయిస్ట్ అగ్ర నేత ఆర్కే కొడుకు పృధ్వీ,..అలియాస్ మున్నా అంత్యక్రియలు స్వగ్రామం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో విప్లవాభివందనాల మధ్య ముగిశాయి. అంతకుముందు మున్నా మృతిదేహం ఆలకూరపాడుకు చేరుకున్న తర్వాత..లాల్‌ సలాం నినాదాలతో గ్రామం మారుమ్రోగింది. మున్నా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రజాసంఘాలు, వామపక్షాల నేతలు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మున్నాకు నివాళులర్పించారు. విప్లవగీతాలతో మున్నశవయాత్ర సాగింది. అంతకు ముందు మున్నా మృతదేహానికి నివాలులర్పించిన విరసం నేతలు.. మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బూటకపు ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో జరిపించాలని డిమాండ్ చేశారు. ఇటు మున్నా తల్లి శిరీష కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తన బిడ్డను పెట్టుకున్న ప్రభుత్వానికి గుణపాఠం తప్పదంటూ విమర్శించింది.

ముగిసిన బాకురు వెంకటరమణ అలియాస్ గణేష్ అత్యక్రియలు
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మరో మావోయిస్టు సీనియర్ నేత బాకురు వెంకటరమణ అలియాస్ గణేష్ అత్యక్రియలు ముగిసాయి. గణేష్‌ స్వగ్రామమైన విశాఖజిల్లా హుకుంపేట మండలం బాకూరులో గణేష్‌ అంత్యక్రియలు జరిగాయి.

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మావోయిస్టులు ఐనపర్తి దాసు, గెడ్డం సువర్ణరాజుల అంత్యక్రియలు విప్లవజోహార్ల మధ్య ముగిశాయి. 25 ఏళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరిన ఐనపర్తి దాసు, తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన గెడ్డం సువర్ణ రాజులు ప్రజా సమస్యలపై పోరాడారని గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు. ఇద్దరి మృత దేహాలకు పల్లంట్లలో అంత్యక్రియలు నిర్వహించారు.

స్వగ్రామంలో కుందనాలు అలియాస్‌ మమత అంత్యక్రియలు
మరో మావోయిస్టు కుందనాలు అలియాస్‌ మమత అంత్యక్రియలు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా పెదవంకలో జరిగాయి. కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అమర వీరుల స్థూపం వద్ద ఆమె మృతదేహానికి విప్లవ జోహార్లు అర్పించారు.

ఆర్కే మా అదుపులో లేడు : ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ
ఇక మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో తృటిలో తప్పించుకున్న మాయివోస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీపై వస్తున్న వార్తలపై విశాఖ ఎస్పీ స్పందించారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే పోలీసులు అదుపులో ఉన్నారంటూ వస్తున్న వార్తలను ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఖండించారు. ఆర్కే తమ అదుపులో లేరని ఆయన స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని ఎస్పీ ప్రకటించారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారమే మృతదేమాలకు పోస్టుమార్టం నిర్వహించామని..72 గంటల తర్వాతే మృతదేహాలను బంధువులు తీసుకెళ్లకపోతే..తామే ఖననం చేస్తామనన్నారు.

ఏవోబీలో కొనసాగుతున్న కూంబింగ్
మరోవైపు ఏవోబీ సరిహద్దు ప్రాంతంలో ఇంకా పోలీసు కూంబింగ్‌ కొనసాగుతూనే ఉంది. దీంతో ఏవోబీ ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. పోలీసులు తుపాకీ మోతలతో ఏవోబీ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. తాజాగా మరోసారి జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందడంతో మృతుల సంఖ్య 30కు చేరుకుంది. ఎన్‌కౌంటర్‌లో తృటిలో తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, గాజర్ల రవి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

09:34 - October 28, 2016

తూర్పుగోదావరి : ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే సామాన్య ప్రజలు హడలిపోతున్న పరిస్థితులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సర్కారు దవాఖానల్లో వైద్యుల నిర్లక్ష్యం..సిబ్బంది అవినీతి..శిశువుల అపహరణ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ ఆసుపత్రులంటే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. గతంలో విజయవాడలో ఆసుపత్రిలో ఓ శిశువు అపహకరణకు గురయ్యింది. శిశువుకోసం గాలించిన పోలీసులు వారంరోజులకు శిశువు దొరికింది. ఇటువంటి ఘటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. కాకినాడలోని జీజీహెచ్ లో శిశువు అపహరణకు గురైంది. రెండురోజుల క్రితం దర్గ అనే మహిళకు ఆసుపత్రిలో ఆడశిశువు జన్మించింది. ఆసుపత్రిలో దుర్గ కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకున్న దేవీ మహిళ... పాపను అపహరించుకుపోయినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, సీసీటీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు సదరు మహిళ పాపను ఎత్తుకెళ్లిపోయినట్టు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె కోసం గాలిస్తున్నారు. బకెట్ లో పెట్టుకుని దేవి అనే మహిళ శిశువును అపహరించినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రి అధికారులు, పొలీసులు నిందితురాలు దేవి గురించి గాలిస్తున్నారు. ఇటువంటి ఘటనల పట్ల ఆసుపత్రి సిబ్బందితోపాటు పేషెంట్లుకూడా అనుక్షణం అప్రమత్తంగా వుండాల్సిన అవుసరం ఎంతైనా వుంది. 

09:26 - October 28, 2016

హైదరాబాద్ : తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో విద్యార్థి గర్జన వేదికగా రాష్ట్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. విద్యార్థుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే విద్యార్థులను శతృవులుగా చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గర్జనకు విద్యార్థులు భారీగా హాజరవడంతో.. హస్తం నేతలు ఖుషీఖుషీగా ఉన్నారు.

సర్కార్‌పై కాలు దువ్వుతున్న టీ.కాంగ్రెస్
కేసీఆర్ సర్కార్‌పై కాంగ్రెస్ కాలుదువ్వుతోంది. ఇప్పటికే రైతు గర్జనలతో హోరేత్తిస్తున్న హస్తం పార్టీ... ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పై పోరు బాట ప‌ట్టింది. ఇందుకోసం విద్యార్థులతో దరఖాస్తుల ఉద్యమాన్ని మొదలు పెట్టింది. ఫీజు బకాయిలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పోరాడేలా విద్యార్థులను ఐక్యం చేస్తోంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై దరఖాస్తుల ఉద్యమాన్ని షురూ
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై దరఖాస్తుల ఉద్యమాన్ని షురూ చేసిన కాంగ్రెస్ నేతలు..దిల్‌సుఖ్‌నగర్ విద్యార్థి గర్జన వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ తెలంగాణ విద్యార్థులను.. ఉగ్రవాదులను చూసినట్టు చూస్తున్నారని మండలి విపక్షనేత షబ్బీర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయకుండా.. వాస్తు పేరుతో కొత్త సచివాలయం నిర్మాణానికి కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని విమర్శించారు.

టీఆర్‌ఎస్ అధికారంలో విద్యారంగం కుంటుపడింది : ఉత్తమ్ కుమార్ రెడ్డి
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యారంగం కుంటుపడిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం : జానారెడ్డి
విద్యార్థుల అకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని.. అలాగే విద్యార్థుల బాగు కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీసుకొచ్చిందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పథకాలతో పాటుగా అన్ని ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కి విద్యార్థులు తగినబుద్ధి చెప్పాలని జానా కోరారు. విద్యార్థి గర్జన ఉద్యమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరు కావడంపై కాంగ్రెస్ నేతలు ఖుషీ అవుతున్నారు. ఫీజుపోరుతో యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ విభాగాలు యాక్టివ్‌ గా పనిచెయ్యడం తమకు కలిసొచ్చిందని భావిస్తున్నారు. 

09:24 - October 28, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ బాధితులకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. అక్షయ గోల్డ్‌ అకౌంట్‌లో ఉన్న పది కోట్ల రూపాయలను .. చిన్న మదుపరులకు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాల వారీగా అటాచ్‌ చేసిన ఆస్తులను వేలం నిర్వహించాలని ఆదేశం
అగ్రిగోల్డ్ బాధితులకు త్వరగతిగా న్యాయం చేయాలని యోచిస్తున్న ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం.. ఒక అడుగు ముందుకేసింది. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్‌ కేసులో... జిల్లాల వారీగా అటాచ్‌ చేసిన ఆస్తులను ఏపీ ప్రభుత్వమే వేలం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. వేలం ద్వారా వచ్చిన డబ్బులను హైకోర్టు ప్రత్యేక అకౌంట్‌లో జమ చేయాలని సూచించింది. మరోవైపు అక్షయ గోల్డ్‌ అకౌంట్‌లో ఉన్న 10 కోట్ల రూపాయలను చిన్న మొత్తాల బాధితులకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

అమ్మకాలపై సమన్వయకర్తగా జ్యుడిషియల్‌ కమిటీ
జ్యుడిషియల్‌ కమిటీ ... అమ్మకాలపై సమన్వయకర్తగా వ్యవహారిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే ఈ వేలం వేసిన ఆస్తులకు త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ప్రభుత్వం వేసే వేలానికి సంబంధించిన పూర్తి సమాచారంతో రావాలని ఆదేశిస్తూ.. విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది.

ఆనందం వ్యక్తం చేస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితులు
అక్షయ అకౌంట్ లో ఉన్న పది కోట్ల రూపాయలను చిన్న మదుపరులకు చెల్లించాలని ఆదేశించడంతో అగ్రిగోల్డ్‌ బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది శుభవార్తగా భావిస్తున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అగ్రిగోల్డ్‌ కేసులో నాలుగు రాష్ట్రాల్లో 40 లక్షల మంది బాధితులు ఉన్నారు. కోర్టు ఆదేశాలతో తమకు త్వరలోనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.

 

09:22 - October 28, 2016

గుంటూరు : వైసీపీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, ప్రస్తుత వైసీపీ నేత బాలశౌరి చిక్కుల్లో పడ్డారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి పోలు శ్రీధర్‌తో పాటు బాలశౌరిపై సీబీఐ అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. వచ్చే వారంలో సీబీఐ అధికారులు బాలశౌరిని విచారించే అవకాశముంది.

వైసీపీ నేత బాలశౌరి చుట్టూ ఉచ్చు
కాంగ్రెస్ మాజీ ఎంపీ, వైసీపీ నేత బాలశౌరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలతో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి పోలు శ్రీధర్‌ను ఇటీవల సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఆయనపై ఛార్జీ షీట్ కూడా దాఖలు చేసింది. 2007 జనవరి 1 నుంచి 2012 డిసెంబరు 31 మధ్య కాలంలో పోలు శ్రీధర్‌ సుమారు 12 కోట్ల వరకు అక్రమ ఆస్తులు సంపాదించారని ఛార్జీషీట్‌లో పేర్కొంది. కేసును లోతుగా విచారిస్తున్న సీబీఐ అధికారులు.. హైదరాబాద్‌, నోయిడా, గుంటూరులో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బాలశౌరి ఎంపీగా ఉన్న సమయంలో ఆయన బ్యాంకు ఖాతా నుంచి శ్రీధర్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ ఎకౌంట్‌కు భారీ మొత్తంలో నగదు బదిలీ అయినట్లు డాక్యుమెంట్ల ఆధారంగా గుర్తించారు.

వైసీపీ నేత బాలశౌరిపై సీబీఐ కేసు నమోదు
బాలశౌరికి స్థలం కొనుగోలు చేసేందుకే ఆయన తన బ్యాంకు ఖాతాలో భారీగా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేశారని.. ఆదాయానికి మించి ఎలాంటి ఆస్తులు కూడబెట్టలేదని శ్రీధర్‌ సీబీఐ విచారణలోవెల్లడించారు. దీంతో బాలశౌరిపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.

ఢిల్లీ నజ్‌ఫగడ్‌లో 2007లో 12.5 కోట్లకు 20 ఎకరాల స్థలం కొనుగోలు
ఢిల్లీ సమీపంలోని నజ్‌ఫగడ్‌ ప్రాంతంలో 2007లో బాలశౌరి 20 ఎకరాల స్థలాన్ని 12 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో బాలశౌరికి, రైతులకు మధ్యవర్తిగా శ్రీధర్‌ వ్యవహరించారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బాలశౌరి శ్రీధర్‌ ఖాతాకు తరలించారు. నజ్‌ఫగడ్‌ యాక్సిస్‌ బ్యాంకులోని శ్రీధర్‌ ఖాతాకు ఓసారి 8 కోట్ల 40 లక్షలు పంపారు. బెంగళూరులోని అదే బ్యాంకులో ఉన్న శ్రీధర్‌ మరో ఖాతాలో రెండు సందర్బాల్లో కోటి 20 లక్షలు, మరోసారి 2 కోట్ల 30 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఇంత భారీస్థాయిలో లావాదేవీలు రహస్యంగా జరగడానికి నజ్‌ఫగడ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మనీశ్‌ సక్సేనా హస్తం ఉన్నట్లు సీబీఐ గుర్తించినట్లు తెలుస్తోంది.

సహకరించారన్న ఆరోపణతో బ్యాంకు మేనేజర్‌ అరెస్ట్‌
ఎఫ్ ఐ ఆర్‌లో బాలశౌరి పేరును చేర్చిన సీబీఐ అధికారులు వచ్చే వారం ఆయన్ను విచారించే అవకాశం కనిపిస్తోంది. భూమి కొనుగోలు లావాదేవీ చట్టప్రకారమే జరిగిందని.. సీబీఐ ముందు హాజరవ్వడానికి బాలశౌరికి ఎలాంటి అభ్యంతరం లేదని వైసీపీ నేతలంటున్నారు.. ఈ కేసు విషయమై బాలశౌరిని టెన్ టీవీ ప్రతినిధి సంప్రదించగా..తాను ఢిల్లీలో ఉన్నానని.. మీడియా ముందుకు రాదల్చుకోలేదని.. చట్ట ప్రకారం కేసును ఎదుర్కొంటానని వివరణఇచ్చారు...ఇప్పటికే ఈ కేసులో శ్రీధర్‌తో పాటు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మనీశ్ సక్సేనాను పోలీసులు అరెస్ట్ చేశారు..

 

09:19 - October 28, 2016

హైదరాబాద్ : ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా హైదరాబాద్‌లోని టీడీపీ  కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళకారులు టీడీపీ తోపాటు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆపరేషన్‌ ఆర్కే పేరుతో జరుగుతున్న గాలింపు చర్యలను వెంటనే నిలిపివేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్‌ చేశారు

 

09:17 - October 28, 2016

జమ్ము కశ్మీర్ : పాకిస్థాన్‌ కుత్సిత బుద్ధి మళ్లీ చూపించుకుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ, భారత పోస్టులు, సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడుతోంది. తెల్లవారు ఝామున నౌషిరా సెక్టార్ లో పాక్ కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్‌ లోని భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో కతువ,హీరా నగర్ , సాంబ, ఆర్నియ, ఆర్ ఎస్ పుర,ఆక్నూర్, మెందార్‌, పూంఛ్‌ సెక్టార్‌ ల వద్ద పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. ఒక్కసారిగా కాల్పుల తీవ్రత పెరిగిపోవడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇళ్లు ఖాళీ చేసి, బంకర్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అయితే పాక్ రేంజర్ల దాడులను భారత జవాన్లు ధీటుగా ఎదుర్కొంటున్నారు. కాగా, పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందానికి 45 సార్లు తూట్లు పొడిచి, కాల్పులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. కాగా పాకిస్థాన్ దుందుడుకు చర్యల్ని భారత్ బలగాలు ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. గంటన్నరపాటు ఈ కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ఓ బాలిక గాయపడింది. 

09:02 - October 28, 2016

ఆంధ్రప్రదేశ్‌ ఆటో రంగంలో దాదాపు 9 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికే 5 లక్షల ఆటోలు రోడ్ల మీద తిరుగుతున్నాయి. అయితే, ఆటో డ్రైవర్లను అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ఈ వృత్తిలో రోజుకో కొత్త సవాల్‌ ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ లో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వీరి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఆటో డ్రైవర్స్‌ అసోసియేషన్‌ నేత రవిశంకర్‌ రెడ్డి విజయవాడ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

09:00 - October 28, 2016

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న హోంగార్డులు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు. సీఎస్ రాజీవ్‌శర్మతో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో.. హోంగార్డులు సచివాలయ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు.. ఆందోళన చేస్తున్న హోంగార్డులను అరెస్ట్‌ చేసి వారి ధర్నాను భగ్నం చేశారు. యాదృశ్చికంగా గురువారం నాడు సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమానవేతనం ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది. అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వీరయ్య (నవ తెలంగాణ ఎడిటర్) ఇందిర ( టీ.కాంగ్రెస్ నేత) రాకేశ్ (టీఆర్ఎస్ నేత) ఈ అంశంపై మరింత సమాచారం కోసం వీడియోను చూడండి..

జీజీహెచ్ లో శిశువు అపహరణ !..

తూర్పుగోదావరి : కాకినాడలోని జీజీహెచ్ లో శిశువు అపహరణకు గురైంది. రాజవొమ్మంగి మండలానికి చెందిన రెడ్డి లక్ష్మి రెండు రోజుల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలో ఆమె కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకున్న గుర్తుతెలియని మహిళ... వారిని నిద్రపొమ్మని చెప్పి, వారంతా నిద్రలోకి జారుకున్న అనంతరం పాపను పట్టుకుని వెళ్లిపోయింది. నిద్రలేచి చూసిన కుటుంబ సభ్యులు పాప కనిపించకపోవడంతో లబోదిబోమన్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, సీసీటీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు, ఆ గుర్తుతెలియని మహిళ పాపను ఎత్తుకెళ్లిపోయినట్టు గుర్తించారు.

07:47 - October 28, 2016

గుంటూరు : ఏపీ రాజధానిలో అడ్మినిస్ట్రేటివ్ సిటి శంకుస్థాపనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషాలకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 72 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీ రాజధానిలో చురుగ్గా సాగుతున్న అడ్మినిస్ట్రేటివ్ సిటి శంకుస్థాపన ఏర్పాట్లు
అమరావతిలో మరో నిర్మాణానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. శుక్రవారం జరగనున్న పరిపాలన నగర శంకుస్థాపనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. లింగాయపాలెం, రాయపూడి గ్రామాల మధ్యలో శంకుస్థాపన జరగనుంది. మొత్తం 72 ఎకరాల్లో సభా స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సభా వేదిక వెనుక వైపు హెలీప్యాడ్ నిర్మాణం చేస్తున్నారు. సభా వేదికకు 30 మీటర్ల దూరంలో శంఖుస్థాపన శిలాఫలకాలు సిద్దం చేస్తున్నారు. సభా వేదిక ముందు రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు, ఇతర వి.ఐ.పిలకు కూడా వేదిక క్రిందనే గ్యాలరీని ఏర్పాటు చేస్తారు.

శంకుస్థాపన చేయనున్న కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషాలకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరిపాలన నగర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడకు చేరుకోనున్న అరుణ్ జైట్లీ అక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎంతో కలిసి శంకు స్థాపన ప్రాంతానికి చేరుకోనున్నారు. పరిపాలన నగరంతో పాటు రిజర్వ్ బ్యాంక్ , గుంటూరు అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ , రాజధానిలో 7 ప్రధాన రహదారుల ఏర్పాటుకు సంబంధించిన శిలాఫలకాలను అరుణ్‌ జైట్లీ ఆవిష్కరించనున్నారు. అనంతరం సభా వేదిక పై ప్రసంగించనున్నారు.

30 నుంచి 40వేల మంది హారవుతారని అంచనా
శంకుస్థాపన కార్యక్రమానికి 30 నుంచి 40వేల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ ప్రజలకు, మంత్రులకు, కేంద్ర మంత్రులకు, సీఎంకు వేరువేరుగా రహదారాలు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీ రాజధాని అమరావతిలో భూమి పూజలు, శంకుస్థాపనల హడావుడి
ఏపీలో రాజధాని అమరావతి ప్రాంతంలో భూమి పూజలు, శంకుస్థాపనలు ఎక్కువ అయ్యాయి. ఒక్కోసారి ఒక్కో పేరుతో ప్రభుత్వం శంకుస్థాపనల కోసం హడావుడి చేయడం మినహా, వాస్తవిక నిర్మాణాలు కార్యరూపం దాల్చడంలేదన్న విమర్శలున్నాయి. అమరావతిలో ఎక్కడపడితే అక్కడ శంకుస్థాపనల శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయని విపక్షాలు వేలెత్తి చూపుతున్నాయి.

గతేడాది అక్టోబర్‌ 22 అమరావతి నిర్మాణానికి మోదీ శంకుస్థాపన
ఏపీ రాజధాని అమరావతిలో భూమి పూజలు, శంకుస్థాపనలు పెరిగిపోయాయి. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి భూమిపూజ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గతేడాది అక్టోబర్‌ 22న క్యాపిటల్‌ సిటీ అమరావతికి అట్టహాసంగా శంకుస్థాపన జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మట్టి, పలు నదుల నుంచి తీసుకొచ్చిన నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రధాని, రాజధానికి నిధులు ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇదే విధమైన హడావుడి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేసి రెండు రోజుల తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించారు. శ్రావణమాసంలో ప్రవేశ హడావుడి చేశారు. ఆ తర్వాత ఒక్కో మంత్రి తమ చాంబర్లను ప్రారంభించారు. ఈనెల 3 నుంచి పూర్తి స్థాయి పాలన ప్రారంభమైంది. ఇవాళ జరిగే ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

శంకుస్థాపనల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని విపక్షాల విసుర్లు
రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఎన్నిసార్లు భూమి పూజలు, మరెన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. భూమి పూజలు, శంకుస్థాపనల పేరుతో కాలక్షేపం చేస్తోందని విమర్శిస్తున్నాయి. ఇదో ప్రచార ఆర్భాటంగా మారిందని మండిపడుతున్నాయి. నిర్మాణాలు చేపట్టకుండా భూమి పూజలు, శంకుస్థాపనలకే పరిమితం అవుతారా అని ప్రశ్నిస్తున్నాయి. ప్రచార ఆర్భాటానికి వందల కోట్ల ప్రజాధనాన్ని తగలేస్తారా అంటూ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. పరినాలనా భవనాల డిజైన్లు రూపొందించంకుండా, టెండర్లు పిలవకుండా వచ్చే నెల 1 నుంచి నిర్మాణాలు ప్రారంభం కావాలని సీఎం చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు.

శంకుస్థానపనలతో సరిపెడతారా? లేక నిర్మాణాలు చేపడతారా :విపక్షాలు
పరిపాలనా భవనాల శంకుస్థాపనకు వస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని ఘనంగా సన్మానించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీతో సరిపెట్టి, నిధుల కేటాయింపులో రిక్తహస్తం చూపినందుకు జైట్లీకి సన్మానమా.. అంటూ ప్రశ్నిస్తున్నాయి.

శంకుస్థాపనలతోనే సరిపెడతారా? నిర్మాణాలు చేపడతారా ? - విపక్షాలు
ప్రభుత్వం ఇకనైనా భూమి పూజలు, శంకుస్థాపనల హడావుడికి స్వస్తిపలికి శాశ్వత నిర్మాణాలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ముందుగా నిర్ణయించినట్లు 2018 నాటికి రాజధాని తొలిదశ నిర్మాణాన్ని పూర్తి చేయాలంటున్నారు. 

07:03 - October 28, 2016

పశ్చిమగోదావరి : భీమవరంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. రౌడీషీటర్‌ బైసాని రామకృష్ణను ప్రత్యర్థులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. మాంసం కొట్టే కత్తితో దుండగులు రామకృష్ణను పైశాచికంగా నరికి చంపారు. అర్ధరాత్రి సుంకర బుద్ధయ్య వీధిలో జరిగిన ఈ ఘటన జరిగింది. దీంతో భీమవరం వన్‌టౌన్‌లో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి..హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. గత 10 సంవత్సరాల క్రితం జరిగిన ఓ కేసులో రామకృష్ణ ప్రధాన నిందితుడుగా వున్నాడు. దీనికి తోడు లు పీఎస్ లలో రామకృష్ణపై పలు కేసులున్నాయి. కాగా రామకృష్ణ వడ్డీ వ్యాపారం చేస్తూంటాడు. ఈ క్రమంలో వ్యాపార లావీదీవేల్లో గానీ, లేదంటే పాత కక్షలతో గానీ ప్రత్యర్థులు ఈ దారుణానికి పాల్పడి వుండే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. కత్తితో దాడిచేసి ఆపై చేతిపంపు రాడ్ తో కూడా దాడి హత్య చేసినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. అర్థరాత్రి టూవీలర్ పై రామకృష్ణ ఇంటికి వెళ్తుండా ప్రత్యర్ధులు దాడి చేసి హత్యచేశారు. కాగా కత్తిపట్టిన వాడు కత్తితోనే కడతేరుతాడు అనే పెద్దల నానుడి మరోసారి నిరూపింతమైనట్లుగా ఈ హత్య ఉదతంతో తెలుస్తోంది. 

బైసాని రామకృష్ణ దారుణహత్య!..

పశ్చిమగోదావరి : భీమవరంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. రౌడీషీటర్‌ బైసాని రామకృష్ణను ప్రత్యర్థులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. మాంసం కొట్టే కత్తితో రామకృష్ణను పైశాచికంగా నరికి చంపారు. అర్ధరాత్రి సుంకర బుద్ధయ్య వీధిలో జరిగిన ఈ ఘటన భీమవరం వన్‌టౌన్‌లో తీవ్ర కలకలం రేపింది. 

Don't Miss