Activities calendar

29 October 2016

22:28 - October 29, 2016

తాళీ కట్టించుకున్న ఓ అమ్మాయి... కొన్ని గంటల్లోనే నాలుగు గోడల మధ్య రోధిస్తుంది. పాతికేళ్లుగా పెంచుకున్న ప్రేమ, కన్న కలలు అడియాశలై ఓ కుటుంబం తల్లడిల్లిపోతుంది. కూతురిని ఇచ్చి కట్టబెట్టిన ఆమె కన్నవారు.. భవిష్యత్ ఏంటనీ ప్రశ్నించుకుంటున్నారు.. ఎందరిలోనో విషాదం నింపింది ప్రేమేనా...? ఆ ప్రేమనే పగబట్టిందా..? ఆ ప్రేమనే ప్రతీకారం తీర్చుకుందా..? లేక మరేదైనా జరిగిందా..? నెల రోజులుగా వారి కళ్లల్లో కన్నీరు ఆగడం లేదు. వారి ఎదురుచూపులన్నీ న్యాయం కోసమే. వారి ఆరాటమంతా తమకు జరిగిన అన్యాయంపై ఓదార్పు మాత్రమే..పీటల మీద పెళ్లి కొడుకు.. కొన్ని గంటల్లోనే పాడే మీదకు ఎలా చేరాడు..? ఎన్నో అనుమానాలు..నేటికి తీరలేదు. వాస్తవాలు బయటపడలేదు. ఓ ఘటన ఎందరిలోనో విషాధాన్ని నింపింది. ఇది కథకాదు. ఏ రియల్ స్టోరీ... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

కెరణ్ సెక్టార్ లో నాలుగు పాకిస్తాన్ పోస్టులు ధ్వంసం

జమ్మూకశ్మీర్ : కెరణ్ సెక్టార్ లో నాలుగు పాకిస్తాన్ పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది.

మోమోరండం ఆఫ్ ప్రోటో కాల్ సవరణపై కేంద్రం దృష్టి సారించింది : వెంకయ్యనాయుడు

విజయవాడ : సుప్రీంకోర్టు నిర్దేశాల మేరకు మోమోరండం ఆఫ్ ప్రోటో కాల్ సవరణపై కేంద్రం దృష్టి సారించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. సుప్రీం మార్గదర్శకత్వంలో సమస్యను త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. నూతన మొమోరండం ఆఫ్ ప్రోటోకాల్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనూ న్యాయమూర్తుల నియామకాల ఖాళీలపై కాంగ్రెస్ విమర్శలు దురదృష్టకరమన్నారు. 

22:03 - October 29, 2016

చెన్నై : దేశీయంగా దివాళీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా...రకరకల టపాసులతో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఈసారి తమిళనాడులో తయారు చేసిన ఓ క్రాకర్ అందరిని ఆకట్టుకుంది. ప్లైయింగ్ సాసర్‌లా తిరుగుతూ పొగలు విరజిమ్మూతూ... ఆకాశంలోకి వెళ్లి... తిరిగి పారాష్యూట్ సాయంతో కిందకి దిగడం దీని ప్రత్యేకత. 

 

22:01 - October 29, 2016

ఢిల్లీ : సైనికులకు అందే పథకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. సైన్యం సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ... ఆయన ప్రధానికి లేఖ రాశారు. మాజీ సైనికోద్యోగుల కోసం ప్రవేశపెట్టిన వన్ ర్యాంక్, వన్ పెన్షన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. దీపావళి సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పంపాలని మోదీ పిలుపునివ్వడంపై రాహుల్ ఫైర్ అయ్యారు. సైనికులకు చేతల్లో చేసి చూపించాలి కానీ మాటలతో కాదని విమర్శించారు.

 

 

21:59 - October 29, 2016

ఢిల్లీ : ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ బలాన్ని మరింత పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి 200 ఫైటర్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అయితే వీటిని నేరుగా కాకుండా... ఇండియాలోనే ఉత్పత్తి చేసే సంస్థలకే డీల్ ఇస్తామని కండీషన్ విధించింది. ప్రస్తుతానికి 200 ఫైటర్ విమానాల కొనుగోలుకు ఓకే చెప్పినా.. ఆ సంఖ్య 300కు పెరిగే అవకాశముంది. ఇప్పటికే అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్, స్వీడన్‌ స్యాబ్ కంపెనీ దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు సిద్ధమని ప్రకటించాయి. లాక్‌హీడ్ మార్టిన్ ఎఫ్ 16 యుద్ధ విమానాలను, స్వీడన్ కంపెనీ గ్రిఫెన్ యుద్ధ విమానాలను ఐఏఎఫ్ కు విక్రయించాలని ఆసక్తి కనబరుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు 15 బిలియన్ డాలర్లుగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. 

 

21:57 - October 29, 2016

సూర్యపేట : కేసీఆర్‌ సర్కార్‌ రైతులను నిలువునా ముంచేసిందని టిపిసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ లో ఏర్పాటు చేసిన రైతు గర్జన సభలో పాల్గొన్న ఆయన.. తెలంగాణ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయని ఆశపడ్డ ప్రజల్ని కేసీఆర్‌ మోసం చేశారన్నారు. ప్రభుత్వం మెడలు వంచి ఏకకాలంలో రుణమాఫీ చేయిస్తామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. 

 

21:54 - October 29, 2016

విశాఖ : వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. దీపావళికి ముందు రోజే క్రికెట్‌ అభిమానులకు టిం ఇండియా విక్టరీ కానుక అందించింది. కివీస్‌ను భారత్‌ చిత్తు చిత్తుగా ఓడించడంతో సాగర తీరంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలో... కీలక మ్యాచ్‌ను గెలిచిన భారత్‌.. వన్డే సిరీస్‌ను 3-2 తేడాతో గెలుచుకుంది.
మరోసారి చెలరేగిన భారత్‌
అచ్చొచ్చిన వైజాగ్ స్టేడియంలో భారత్‌ మరోసారి చెలరేగిపోయింది. స్పిన్ కు అనుకూలంగా మారిన పిచ్‌పై... బౌలర్లు చెలరేగడంతో... దోనీసేన రికార్డ్ విజయం సాధించింది. కీలక మ్యాచ్‌ను గెలిచి... 5 వన్డేల సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. వడివడిగా ఆడింది. రోహిత్ శర్మ70 పరుగులు, విరాట్ కోహ్లీ 65 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో అలరించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది.  
అద్భుతంగా రాణించిన భారత్‌ బౌలర్లు  
270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భారత్‌ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఉమేశ్ యాదవ్ తొలి ఓవర్లోనే ఓపెనర్ గప్టిల్ ను ఖాతా తెరవకుండానే ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో బుమ్రా బౌలింగ్ లో మరో ఓపెనర్ లాథమ్ 19 పరుగులు చేసి జయంత్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఓ దశలో కివీస్‌ రెండు వికెట్ల నష్టానికి 60 చేసింది. కివీస్‌ కెప్టెన్ విలియమ్సన్ 27 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. 
79 పరుగులకే కివిస్ ఆలౌట్‌ 
స్పిన్నర్లు మిశ్రా, అక్షర్ పటేల్ రాణించడంతో కివీస్ బ్యాట్స్ మన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు. ముఖ్యంగా స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా మాయజాలంతో కివీస్‌ కోలుకోలేని దెబ్బతింది. 18 పరుగుల ఇచ్చిన మిశ్రా 5 కీలక వికెట్లు తీశారు. స్పిన్నర్ల దెబ్బకు... చివరి 15 పరుగుల్లోపే మిగిలిన ఏడు వికెట్లను కోల్పోవడం విశేషం. కివీస్‌ 23.1 ఓవర్లలో కేవలం 79 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో భారత్‌ 190 పరుగుల తేడాతో విజయం సాధించింది. 5 వికెట్లు తీసి అద్భుతంగా రాణించిన అమిత్‌ మిశ్రాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. 

 

21:48 - October 29, 2016

నేరం ఘోరం... జరుగుతున్నప్పుడు అది ఆపడానికి..  ఎవరూ ప్రయత్నించరా..? చుట్టుపక్కల ఎవరున్నాకూడా స్పందించకుండా ఎందుకంటారు..? స్పందిస్తే ఏమౌతుంది..? ఎందుకొచ్చిన చిక్కు అనుకుంటారు కొందరు... స్పందిస్తే మనని ఎక్కడ ఇరికిస్తారోనని కొందరి భయం.. మరి కొందరికి ఆ నేరంలో తాము కూడా బలౌతామని మరో భయం.. ఏవైతేనే వీళ్లు చూస్తుండగానే నేరం జరుగుతోంది. సాక్షం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు.. ఎందుకిలా..? ఎవరూ పట్టిచ్చుకోకపోతే ఎలా?.
సమాజంలో మనం భాగమేన అన్న స్పృహ ఉంటే.. ఆ క్షణలో ఆ దయనీయమైన స్థితిలో తామే ఉంటే అన్న ఆలోచన కొంకమైన  వస్తే... స్పందిస్తారేమో కదా... చుట్టూ వందమంది జనం.. అందరూ చూస్తుండగానే ఒకడు ఆమెను దారుణంగా పొడిచేశాడు. నడి రోడ్డు మీద ఘాతుకం... ఎవరూ సాక్షం చెప్పలేదు. అసలు అతనెవరు..? ఆమెవరు..? ఎలా జరిగిందా ఘోరం..? నేటి ఈ హీరోయిన ఎపిసోడ్ లో చూడండి.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:21 - October 29, 2016
21:18 - October 29, 2016

మోతెవరి ముఖ్యమంత్రి కేసీఆర్ సారే.. సర్వేలు చేసి మరీ చెప్తున్న సంస్థలొల్లు, పరకాల ఎమ్మెల్యేకు చెప్పుల మర్యాద.. స్పీకర్ ముంగటనే ఇజ్జత్ దీసిన జనం, ఓట్లల్లకు దిగుతున్న బైరెడ్డి సారు పార్టీ.. కర్నూలు కార్పొరేషన్ల టిక్కెట్లు ఇడుదల, శరందప్పి కొట్టుకుంటున్న నెల్లూరు నేతలు... మైకులిరగొట్టి... పిడిగుద్దులుగుద్దుకోని, అంతర్జాతీయ స్థాయికెదిగిన హైదరాబాద్... కుటీరపరిశ్రమలైతున్న డ్రగ్స్ కంపిన్లు, ఏసుక్రీస్తు సమాధినితొవ్విన శాస్త్రవేత్తలు... లోపల ఏమున్నదో అని భక్తుల పడిగాపులు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

20:58 - October 29, 2016

హైదరాబాద్ : చూస్తే బుల్లి పిట్ట.. కానీ ఎగిరే సామర్థ్యం మాత్రం అసామాన్యం. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు.. పిడికెడంత ఉన్న ఆ పక్షి.. జీవనశైలే విభిన్నం. ఒక్కసారి గాల్లోకి ఎగిరిందంటే... ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా పది నెలల పాటు భూమిని తాకకుండానే ఆకాశంలో ఎగరేస్తుంది. అదే స్విఫ్ట్‌ పక్షి. విమానాన్ని పోలి ఉండే పొడవాటి రెక్కలు.. టర్పెడో లాంటి ఆకారం.. చూడ ముచ్చటగా ఉండే ఆ చిన్న పక్షి ప్రపంచ రికార్డును సొంతం చేసుకోవడం పక్షి శాస్త్రవేత్తలను అబ్బురపరుస్తోంది.
చిన్న పక్షి..  పెద్ద రికార్డు
ఓ చిన్న పక్షి..  పెద్ద రికార్డుకే సొంతదారు. ప్రపంచంలోని మరి దేనికీ సాధ్యం కాని ఘనతను ఈ పక్షి సొంతం చేసుకుంది. చేతిలో ఒదిగే పోయేంత సైజు.. టర్పెడో లాంటి ఆకారంలో ఉన్న ఈ పక్షి పేరు స్విఫ్ట్‌. ఇంధనంతో గాల్లో ఎగిరే విమానాలు కూడా రెండు మూడు రోజులు ప్రయాణించి.. ల్యాండ్‌ అవుతాయి. కానీ స్విఫ్ట్‌ పక్షి మాత్రం.. భూమిని కనీసం తాకను కూడా తాకకుండా పదినెలల పాటు గాల్లోనే ఎగరడం ద్వారా.. పక్షి ప్రేమికుల్ని అబ్బురపరుస్తోంది.     
నాన్‌స్టాఫ్‌ ఫ్లైట్‌లా స్విఫ్ట్‌ బర్డ్‌.. 
నాన్‌స్టాఫ్‌ ఫ్లైట్‌లా స్విఫ్ట్‌ బర్డ్‌.. పదినెలల పాటు గాల్లో ఎగరడం అద్భుతమంటున్నారు పక్షి శాస్త్రవేత్తలు.  స్వీడన్‌లోని లండ్‌ యూనివర్సిటీకి చెందిన హెడెన్‌స్టార్మ్ బృందం స్విఫ్ట్‌ బర్డ్‌పై 13 నెలల పాటు పరిశోధన చేసింది. కొన్ని స్విఫ్ట్‌ పక్షులను ఎంపిక చేసి.. వాటి కదలికల్ని తెలుసుకునేందుకు వాటికి ఆధునాతన పరికరాలు అమర్చారు. ఎంత దూరం ప్రయాణించాయి. ఎంత వేగంగా దూసుకుపోయాయి. వీటితో పాటు నేలపై ఎన్నిసార్లు వాలాయన్న అంశాలపై వారు పరిశోధన చేశారు. 
పది నెలలపాటు భూమిని తాకకుండా గాల్లోనే 
శాస్త్రవేత్తలను అబ్బురపరిచేలా స్విఫ్ట్‌ పక్షులు దాదాపు పది నెలలపాటు భూమిని తాకకుండా గాల్లోనే ఎగిరాయి. ఉత్తర యూరప్‌ నుంచి మధ్య ఆఫ్రికా వరకు దాదాపు 99.5 శాతం ఆకాశంలో ఎగిరి రికార్డు సృష్టించాయి. పదినెలల మారథాన్‌ కొనసాగించడం నిజంగా వరల్డ్‌ రికార్డే అంటున్నారు శాస్త్రవేత్తలు. మూడు పక్షులైతే చెట్టు కొమ్మలపై కూడా వాలకుండా.. ఏకంగా పదినెలలు గాల్లోనే ఎగరడం విశేషం. 10 వేల మైళ్లకు పైగా రెస్ట్ లేకుండా స్విఫ్ట్‌ పక్షులు ప్రయాణించడం శాస్త్రవేత్తల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతోంది. 
స్విఫ్ట్‌ పక్షులు అలసి నిద్రపోవా..? 
స్విఫ్ట్‌ పక్షులు అలసి నిద్రపోవా..? అన్న ప్రశ్నా శాస్త్రవేత్తలో కలిగింది. ఆ అంశంపైనా వారు పరిశోధన చేయగా.. స్విఫ్ట్‌ పక్షులు.. గాల్లో ఎగురుతూనే కునుకు తీస్తున్నట్లు గుర్తించారు. ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతూ పొద్దస్తమానం ప్రయాణించడం అసాధ్యమని.. అలాంటిది స్విఫ్ట్‌ పక్షులు మాత్రం దాన్ని సుసాధ్యం చేశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తానికి ఈ బుల్లిపిట్ట.. పక్షిజాతుల్లోనే అరుదైన రికార్డును తన సొంతం చేసుకుని.. అందరినీ అబ్బురపడేలా చేస్తోంది. 

 

టీసర్కార్ పై ఉత్తమ్ ఫైర్

నల్గొండ : సూర్యపేటలో కాంగ్రెస్ రైతు గర్జన సభ నిర్వహించింది. ఈ సభలో టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. టీసర్కార్ ను తీవ్రంగా విమర్శించారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు. ఇప్పటి వరకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదన్నారు.

 

20:44 - October 29, 2016

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ కొత్త మూవీ కాటమరాయుడు టీజర్ రిలీజైంది. దీపావళి కానుకగా... ఫ్యాన్స్ కోసం టీజర్ విడుదల చేశారు. ఫ్యాక్షన్ బ్యాక్‌ గ్రౌండ్‌లో... లవ్ స్టోరీగా ఈ మూవీ రెడీ అవుతోంది. డాలీ డైరక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో శ్రుతి హసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 

 

20:42 - October 29, 2016

హైదరాబాద్ : తెలంగాణలో రైతాంగ సమస్యలపై పోరాటానికి సిద్ధమైంది టీ-టీడీపీ. నవంబర్‌లో రైతు పోరుబాట పేరుతో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. రోజుకు 15 కిలోమీట‌ర్ల మేర యాత్ర సాగించాలని భావిస్తున్నారు. నవంబర్ 6వ తేదీన యాత్రను ప్రారంభించాలని టీ.టీడీపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది.
ప్రభుత్వం వైఖరిని ఎండగట్టాలని టీడీపీ యోచన 
రైతు సమస్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిని ప్రజల్లోనే ఎండగట్టాలని తెలంగాణ తెలుగుదేశం భావిస్తోంది. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గతంలోనే ఆందోళన చేపట్టిన టీ.టీడీపీ ఇప్పుడు మరోసారి ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతుల దగ్గర నుంచి బలవంతపు భూసేకరణ జరపడంపై టీటీడీపీ గతంలో ఆందోళన చేపట్టింది. రైతు రుణమాఫీ ఒకేసారి అమలు చేయకపోవటాన్ని నిరసిస్తూ.. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. పెరుగుతున్న రైతు ఆత్మహత్యలపై కూడా ధర్నాలు చేపట్టిన టీ.టీడీపీ... ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవటంతో పోరును ఉధృతం చేయాలని నిర్ణయించింది. 
నవంబర్‌లో పాదయాత్ర 
ఇప్పటికే ముఖ్యనేతలతో టీ.టీడీపీ అధ్యక్షులు ఎల్‌.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలు పలు సమీక్షలు నిర్వహించారు. రైతు సమస్యలపై ఎలాంటి పోరాటం చేయాలన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చారు. నవంబర్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఎల్. రమణ, రేవంత్‌రెడ్డిలతో పాటు ఇతర ముఖ్యనేతలు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనాలని నిర్ణయించారు.
రైతు పోరుబాట పేరుతో యాత్ర 
రైతు పోరుబాట పేరుతో చేపట్టే యాత్రను నవంబర్ 6న భూపాలపల్లి నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. నవంబర్ 30న కొడంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఇప్పటికే యాత్ర రూట్ మాప్ కూడా రెడీ చేశారు. రైతు రుణమాఫీ, కరువుతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రైతు ఆత్మహత్యలు, కేంద్రం నుండి 700కోట్ల రూపాయల కరువు సాయం అందినా, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక్కరూపాయి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించకపోవటం లాంటి అంశాలపై టీ.టీడీపీ  పోరాటం చేయాలని భావిస్తోంది. టిఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న టీడీపీలో మళ్లీ హడావుడి మొదలైంది. ప్రస్తుతం తలపెట్టిన పాదయాత్ర ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయొచ్చనే భావనలో ఉన్నారు నాయకులు. 

 

20:27 - October 29, 2016

మంచి విద్య అందిస్తేనే పేదల జీవితాల్లో మార్పు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : భావితరాలకు మంచి విద్య అందిస్తేనే పేదల జీవితాల్లో మార్పు వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. గురుకులాల ఏర్పాటు ఇందులో భాగమే అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జనాభా ప్రకారం గురుకులాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక్కో విద్యార్థిపై దాదాపు రూ.84 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గురుకులాలకు స్వంత భవనాలు, మౌలిక వసతులకు రూ.3 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 
 

 

20:08 - October 29, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సింగపూర్ కంపెనీలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని.. అఖిలపక్షం నేతలు ఆరోపించారు. ప్రజా రాజధాని నిర్మాణం అందరికీ అవసరమేనని, అయితే రైతుల నుంచి తీసుకున్న భూములను విదేశీ కంపెనీలకు కట్టబెట్టాలని ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిపై హైకోర్టు ఆక్షేపణ, ప్రైవేట్ విద్యా, వైద్య సంస్ధలకు రాజధాని భూముల కేటాయింపులపై రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిలపక్షం నేతలు పలు తీర్మానాలను ఆమోదించారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిని కేల్కర్ కమిటీ వ్యతిరేకించిందన్న నేతలు.. స్విస్ ఛాలెంజ్ పై కోర్టు ఆదేశాలను దిక్కరించి దొడ్డిదారిన సింగపూర్ కంపెనీకి భూమలను దారాదత్తం చేసేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. 

 

తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ...

చిత్తూరు : తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు నింది వెలుపలికి క్యూలైన్లు వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు సమయం పడుతుంది.

 

 

20:01 - October 29, 2016

అనంతపురం : ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం జరిగితే ఎవరినీ ఉపేక్షించేది లేదని మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. అనంతపురంలో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. పంట సంజీవని, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాల అమలును వేగవంతం చెయ్యాలని పరిటాల సునీత ఆదేశించారు. 

 

19:57 - October 29, 2016

ప్రకాశం : నవంబర్ 1న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న జనచైతన్య యాత్రను విజయవంతం చెయ్యాలని మంత్రి సిద్ధారాఘవరావు కోరారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులను మంత్రి పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి జిల్లా నాయకులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జనచైతన్య యాత్రతో పాటు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా సీఎం పాల్గొంటారని ఆయన తెలిపారు. 

 

19:55 - October 29, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ అనడం నయవంచన అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. చట్టంలో ఉన్నవి అన్నీ అమలు పరుస్తున్నామంటున్నారే తప్ప... కొత్తగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందేమీ లేదన్నారు. అన్ని రాష్ట్రాలకు వచ్చినట్లే ఏపీకి కూడా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని.. దాన్ని బాబు సర్కార్‌ పెద్దది చేసి చూపించే ప్రయత్నం చేస్తుందని రఘువీరా విమర్శించారు. రాజధానిలో ఇప్పటికే నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారని.. టెండర్ల పిలవకుండా శంకుస్థాపనలు చేస్తే ప్రయోజనం ఏంటన్నారు.  

19:51 - October 29, 2016
19:44 - October 29, 2016

విశాఖ :  ఆఖరి వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. 3-2 తేడాతో ఐదు వన్డేల సిరీస్‌ను టీం ఇండియా కైవసం చేసుకుంది. భారత స్పిన్నర్ల దాటికి కివీస్‌ చేతులేత్తేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టిం ఇండియా 269 పరుగులు చేసింది. 270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 79 పరుగులకే అలౌట్‌ అయింది. దీంతో భారత్‌ 190 పరుగుల తేడాతో కివీస్‌పై విజయం సాధించింది. అమిత్‌ మిశ్రా 5 కీలక వికెట్లు తీసి.. కివీస్‌ నడ్డి విరిచారు. గతంలో లాగే విశాఖలో స్పిన్నర్ల హావా సాగింది. దీంతో ఐదుగురు కివీస్‌ బ్యాట్స్‌మెన్‌లు డకౌట్‌ అయ్యారు. టిం ఇండియా విజయంతో వైజాగ్‌ లో సంబరాలు అంబరాన్ని అంటాయి. దీపావళికి ముందు రోజే క్రికెట్‌ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. 

న్యూజిలాండ్ పై భారత్ గెలుపు

విశాఖ : భారత్, న్యూజిలాండ్ ల మధ్య జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 79 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. భారత్ నిర్ణీత వోవర్లలో 269 పరుగులు చేసింది.

 

19:37 - October 29, 2016

మహబూబ్ నగర్ : సీపీఎం మహాజన పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి మహాజన పాదయాత్ర చేరుకుంది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రకు అడుగడుగునా అనూహ్య స్పందన వస్తోంది. ప్రజాసంఘాలతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌, టిడిపిలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. యాత్రలో భాగంగా తమ్మినేని వీరభద్రం పలు గ్రామల్లో పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జడ్చర్లలో ఏర్పాటుచేసిన సమావేశంలో కాంగ్రెస్‌, టిడిపి నేతలు మద్దతు తెలుపుతూ తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ... తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. బీసీల అభ్యున్నతికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్‌ నిధుల గురించి సీఎం మాట్లాడడంలేదన్నారు. ప్రభుత్వ విద్య, వైద్యను ప్రోత్సహించాలని సూచించారు.

 

తొమ్మిదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

విశాఖ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 76 పరుగుల వద్ద సోధీ ఔట్ అయ్యాడు. 

ఎనిమిదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

విశాఖ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 74 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.
 

18:44 - October 29, 2016

వికారాబాద్‌ : జిల్లాలోని లగచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. స్నానం కోసం వెళ్లిన బాలురు సందీప్ గౌడ్‌, సంపత్‌లు ఈతరాకపోవడంతో చెరువులో మునిగిపోయారు. బట్టలు ఉతకడానికి అక్కడికి వచ్చిన భార్గవి అనే మహిళ ..బాలురను రక్షించడానికి ప్రయత్నించి..వారితో పాటు మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ ముగిసింది. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పుపై చర్చించారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపరంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న అంశంపై సబ్ కమిటీలో చర్చించారు

18:40 - October 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ ముగిసింది. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పుపై చర్చించారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపరంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న అంశంపై సబ్ కమిటీలో చర్చించారు. 3 గంటలకు పైగా సబ్‌ కమిటీ భేటీ కొనసాగింది. మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సభ్యులు, ప్రభుత్వ సలహాదారు ఆర్ .విద్యాసాగరరావు, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి, ఇ.ఎన్.సి. మురళీధర్ రావు, సీనియర్ న్యాయవాది రవీందర్ రావు హాజరయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.

 

రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

విశాఖ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 28 పరుగుల వద్ద లాథమ్ (19) ఔట్ అయ్యాడు. 

 

17:29 - October 29, 2016

ఢిల్లీ : ఐదు వందల ఏళ్ల తర్వాత జీసస్ సమాధిని తెరిచారు.  శతాబ్దాల క్రితం జెరూసలెంలో క్రీస్తు సమాధి చుట్టూ చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్కర్ ను నిర్మించారు...ప్రస్తుతం చర్చి పునరుద్ధరణ చర్యల్లో భాగంగా పలువురు మతాధికారుల సమక్షంలో జీసస్ సమాధిపై ఉన్న చలువరాతి బండలను పక్కకు తొలగించారు.  
పాలరాతి ఫలకం తొలగింపు 
క్రైస్తవులు అత్యంత పవిత్రమైన స్థలంగా భావించే ప్రదేశం జెరూసలెంలోని చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్కర్.. అంతటి ముఖ్యమైన ఈ సమాధిని దాదాపు ఐదువందల ఏళ్లతర్వాత తెరిచారు.. ఈ సమాధిపై క్రీస్తుశకం 1555 నుంచి ఉన్న పాలరాతి ఫలకాన్ని చర్చి పునరుద్ధరణ చర్యల్లో భాగంగా తొలగించారు.  
చివరిసారిగా 1808..1810 ప్రాంతాల్లో సమాధి పునరుద్ధరణ
క్రైస్తవులంతా పూజనీయంగా భావించే ఈ ప్రదేశంలో ఎడిక్యూల్‌గా చెబుతున్నచిన్నపాటి నిర్మాణంలో క్రీస్తును సమాధి చేశారు. అగ్నిప్రమాదంలో దెబ్బతిన్నతర్వాత చివరిసారిగా 1808-1810 సంవత్సరాలమధ్య ఈ సమాధికి మరమ్మత్తులు చేశారని నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్ తెలిపింది.. ఇప్పుడు మళ్లీ ఈ భాగాన్నే ఏథెన్స్‌లోని జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పునరుద్ధరిస్తున్నారు.
అత్యుత్తమ టెక్నాలజీతో సమాధి పునరుద్ధరణ పనులు
క్రీస్తు శకం 326 లో రోమన్‌ చక్రవర్తి కాన్‌స్టన్‌టైన్‌ ది గ్రేట్‌ తల్లి సెయింట్‌ హెలీనా ఈ శిలను గుర్తించినట్లు చరిత్ర చెబుతోంది.. ఎంతో చారిత్రక ప్రాధాన్యమైన ఈ సమాధి పునరుద్ధరణ కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు అతి జాగ్రత్తగా చేస్తున్నారు.. ఈ పనులకు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు.. ప్రతి అంశాన్ని వీడియో తీస్తూ ముందుకు సాగుతున్నారు.

 

న్యూజిలాండ్ విజయలక్ష్యం 270 పరుగులు

విశాఖ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్ లో నిర్ణీత 50 వోవర్లలో ఆరు వికెట్ల నష్టానికి భారత్ 269 పరుగులు చేసింది. న్యూజిలాండ్ విజయలక్ష్యం 270పరుగులుగా ఉంది. 

16:58 - October 29, 2016

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివాదాలతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తాజాగా మరో వివాదం అగ్రరాజ్యాన్ని వార్తల్లో నిలిపేలా చేసింది. 
మరో వివాదంలో హిల్లరీ క్లింటన్‌
డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్షుని ఎన్నికల్లో పోటీచేస్తున్న హిల్లరీ క్లింట‌న్‌గా తాజాగా మరో వివాదంలో ఇరుకున్నారు. హిల్లరీ ఈ-మెయిళ్ల వ్యవ‌హారం మ‌ళ్లీ బ‌య‌ట‌ప‌డింది. గ‌తంలో అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు హిల్లరీ స‌ర్వర్ నుంచి వెళ్లిన ఈ-మెయిళ్లపై విచార‌ణ చేప‌డుతున్నట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది. తాజాగా వెలుగుచూసిన ఈమెయిళ్లను విచారిస్తున్నట్లు ఎఫ్‌బీఐ అధికారులు అమెరికా చ‌ట్టస‌భ ప్రతినిధుల‌కు తెలియ‌జేశారు. ప్రభుత్వ హోదాలో ఉన్న హిల్లరీ గ‌తంలో ప్రైవేట్ స‌ర్వర్ ద్వారా ఈమెయిళ్లను పంపారు. ఇప్పుడు ఈ మెయిళ్లలో ఉన్న స‌మాచారాన్ని పున‌స‌మీక్షించ‌నున్నట్లు అధికారులు తెలిపారు. 
హిల్లరీ ప్రతిష్టకు సవాల్‌గా మారిన ఎఫ్‌బీఐ విచారణ
ప్రస్తుతం అమెరికాలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం నెల‌కొన్న సమయంలో ఎఫ్‌బీఐ విచార‌ణ డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ ప్రతిష్టకు స‌వాల్‌గా మార‌నుంది. గ‌తంలో హిల్లరీతో ప‌నిచేసిన మాజీ ఉద్యోగి భ‌ర్త ఆంథోనీ వీన‌ర్ ఆ ఈమెయిళ్లను బ‌హిర్గతం చేశాడు. విచార‌ణ‌లో భాగంగా ఎఫ్‌బీఐ అధికారులు అబ్దిన్‌, వీన‌ర్ కంప్యూట‌ర్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై హిల్లరీ స్పందించారు. వెంట‌నే ఈమెయిళ్లలో ఉన్న వాస్తవాల‌ను బ‌యటపెట్టాల‌ని అధికారులను ఆమె కోరారు.
ఈమెయిళ్ల అంశంపై స్పందించిన ట్రంప్‌
కొత్తగా ఈమెయిళ్ల వ్యవ‌హారం బ‌య‌ట‌ప‌డ్డ అంశంపై రిప‌బ్లిక‌న్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. హిల్లరీ ఈమెయిళ్ల వ్యవ‌హారం వాట‌ర్‌గేట్ కుంభ‌కోణం కంటే పెద్దద‌ని ట్రంప్ ఆరోపించారు. 1970లో జ‌రిగిన వాట‌ర్‌గేట్ స్కాండల్ వ‌ల్ల అప్పటి అధ్యక్షుడు రిచ‌ర్డ్ నిక్సన్ భారీ న‌ష్టాన్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. హిల్లరీ ఈమెయిళ్ల వ్యవ‌హారంలో త్వర‌గా న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నట్లు ట్రంప్ అన్నారు. నవంబర్ 8వ తేదీన అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్షురాలు కావాలని కలలు కంటున్న హిల్లరీ క్లింటన్ భవితవ్యాన్ని ఈ పరిణామం ఎటు తీసుకెళ్తుందో వేచిచూడాలి. 

 

16:47 - October 29, 2016

వాషింగ్టన్ : అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 767 విమానం ప్రమాదానికి గురైంది. చికాగో విమానాశ్రయంలో రన్‌వేపై టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే ప్రయాణికులు, సిబ్బంది కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. చికాగో నుంచి మియామీ వెళ్తున్న ఈ విమానంలో 161 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు.

 

16:43 - October 29, 2016

గుంటూరు : ఎపి రాజధాని అమరావతిలో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించేలా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని కలలు కంటున్న సీఎం చంద్రబాబునాయుడు... జాతీయ క్రీడల నిర్వహణ విషయంలో  శ్రద్ధతీసుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 నేషనల్‌ గేమ్స్‌కు  బిడ్‌ వేసే విషయంలో ఎపి ఒలింపిక్‌ అసోసియేషన్‌తో చర్చించేందుకు చంద్రబాబు చొరవ చూపకపోవడాన్ని  క్రీడా సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇందుకు రాజకీయాలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో జాతీయ క్రీడలు రాష్ట్రానికి రావడం ప్రశ్నార్థకంగా మారిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
క్రీడా సంఘాల్లో రాజకీయ జోక్యం 
క్రీడా సంఘాల్లో రాజకీయ జోక్యం పెరగడంతో క్రీడా స్ఫూర్తి దెబ్బతింటోందన్న విమర్శలు ఉన్నాయి. ఏపీ రాజధాని అమరావతిని క్రీడా రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ఒలింపిక్స్‌ నిర్వహించే స్థాయిలో క్రీడా నగరాన్ని నిర్మించాలని క్రీడల్లో ప్రతిభచూపిన వారిని సన్మానించే సభా కార్యక్రమాల్లో, సమీక్షల్లో  పదేపదే చెబుతున్నారు. ముందుగా జాతీయ క్రీడలతో ప్రారంభించి, ఏసియన్‌ గేమ్స్‌, కామగన్‌వెల్త్‌ క్రీడలు.. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ, చివరికి ఒలింపిక్స్‌ నిర్వహించే స్థాయికి చేరాలన్న ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా... ఈ  దిశగా చర్యలు తీసుకునే విషయంలో చంద్రబాబులో క్రీడా స్ఫూర్తి లోపించిందన్న విమర్శలున్నాయి. 
ఎంపీ గల్లా జయదేవ్‌, జేసీ పవన్‌రెడ్డి చెరోవర్గం 
ముంగిట్లో 2019 జాతీయ క్రీడలు ఉన్నాయి. వీటికి బిడ్‌ వేసేందుకు కేవలం వారం రోజులే మిగిలి ఉందని క్రీడా సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విషయం చర్చించేందుకు చంద్రబాబు అపాయింట్‌ కోరితే... కొంతమంది అధికారులు, రాజకీయ నేతలు అడ్డుపడుతున్నారని విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ రెండుగా చీలిపోయింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, అనతంపురం ఎంపీ  జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి  చెరో వర్గానికి కొమ్ముకాయడంతో  ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతిష్ఠ మంటకలిసిందన్న విమర్శలు వచ్చాయి.  అంతిమంగా  గల్లా జయదేవ్ అధ్యక్షుడుగా ఉన్న ఏపీ ఒలింపిక్ అసోసియేషన్‌ కు  ఇండియన్‌ ఒలింపిక్‌  అసోసియేషన్ గుర్తింపు ఇవ్వడంతో వివాదం సమసిపోయిందనుకున్నా ఆ రాజకీయాలు ఇంకా భగ్గుమంటూనే ఉన్నాయి.  
క్రీడలతో సంబంధంలేని వ్యక్తులు పెత్తనం 
క్రీడలతో సంబంధంలేని వ్యక్తులు పెత్తనం చెలాయించడంతో రాష్ట్రం 2017 జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశం కూడా లేకుండా పోతోందన్న ఆందోళన  వ్యక్తమవుతోంది. జాతీయ క్రీడలకు బిడ్‌ వేయాలంటే ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ద్వారానే వెళ్లాల్సి ఉంటుందని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు వాస్తవాలు గ్రహించి, ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ గుర్తింపు పొందిన ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌తో  చర్చించి జాతీయ క్రీడలకు బిడ్‌ వేయాలని కోరుతున్నారు. 


 

16:37 - October 29, 2016

గుంటూరు : ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థుల ఆందోళన సరికాదని సూపరింటెండెంట్ రాజునాయడు అన్నారు. అత్యవసర సేవల నిలిపివేతపై మంత్రి కామినేని సీరియస్‌ అయ్యారు. ఆస్పత్రిలో ఆందోళన చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజునాయుడును ఆదేశించారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా.. కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తాఫా మద్దతు తెలిపారు. ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు

 

మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన..

జమ్మూ కాశ్మీర్ : మరోసారి పాక్ కాల్పులకు ఉల్లంఘన పాల్పడింది. కుప్వారలోని కీరన్ సెక్టార్ లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఓ మహిళకు గాయాలయ్యాయి. 

16:13 - October 29, 2016

గుంటూరు : ప్రతిపక్ష వైసీపీ... ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2లక్షల 3 వేల కోట్ల నిధులను రాష్ట్రానికి అందిస్తామని స్పష్టం చేసినా... ప్రతిపక్ష నేతలు విమర్శించడం తగదని అన్నారు. విమర్శలు చేసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. అలాంటి పార్టీలను ప్రజలు ఆదరించరని అన్నారు. 

 

తల్లుల పేరిట క్రికెటర్ల జెర్సీలు..

విశాఖపట్టణం : వన్డేలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ - కివీస్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మాతృమూర్తుల పేరిట క్రికెటర్లు జెర్సీలు ధరించారు. జీవితంలో తమ ఉన్నతికి కారణమైన తల్లుల పేర్లతో జెర్సీలు ధరించామని క్రికెటర్లు పేర్కొన్నారు. 

బాబ్లీ గేట్ల మూసివేత..

మహారాష్ట్ర : బాబ్లీ గేట్లను మూసివేశారు. సుప్రీం తీర్పు మేరకు వచ్చే ఏడాది జులై వరకు 14 గేట్లను మూసివేయనున్నారు. దీనితో ఎస్సారెస్పీకి ఇన్ ఫ్లో నిలిచిపోయింది. 

ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా బంద్..

హైదరాబాద్ : ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా నవంబర్ 3న బంద్ కు మావోయిస్టు సెంట్రల్ కమిటీ పిలుపునిచ్చింది. ఐదు రాష్ట్రాల్లో బంద్ ఉంటుందని కమిటీ ప్రతినిధి ప్రతాప్ ప్రకటించారు. 

15:47 - October 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అయ్యింది. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పుపై చర్చిస్తున్నట్లు సమాచారం. మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సభ్యులు. ప్రభుత్వ సలహాదారు ఆర్ . విద్యాసాగరరావు ,ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి,  ఇ.ఎన్.సి. మురళీధర్ రావు, సీనియర్ న్యాయవాది రవీందర్ రావు హాజరైనట్లు సమాచారం. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపరంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న అంశంపై సబ్ కమిటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలున వీడియోలో చూద్దాం...

కల్కి స్వామి ఆరోగ్యంపై వదంతులు...

చిత్తూరు : కల్కి స్వామి ఆర్యోంపై వదంతులు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో కల్కి స్వామి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని భక్తులకు కలిస్వామి ఆశ్రమ నిర్వాహకులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. 

15:25 - October 29, 2016

హైదరాబాద్ : తెలుగు లోగిళ్లలో దీపావళి సందడి ప్రారంభమయ్యింది. తారాజువ్వలు తారాపథంలోకి దూసుకుపోవడానికి రెడీ అవుతున్నాయి. రాకెట్లు రయ్‌మని ఎగిరిపోవడానికి రెక్కలు తొడుక్కుంటున్నాయి. చిచ్చు బుడ్డులు చిందులేయడానికి ముస్తాబవుతున్నాయి. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కోటికాంతుల దీపావళిని మరింత ఆనందంగా జరుపుకోవచ్చంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. 
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి మొదలైంది. బాణసంచా దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. దీపావళి సందర్భంగా జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నగరంలో బాణసంచా దుకాణాలు, హోల్‌ సేల్‌ దుకాణదారులకు 20 రోజులుగా ఫైర్‌ సేఫ్టీపై అగ్నిమాపకశాఖాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో చైనా క్రాకర్స్‌ అమ్మకాలకు దూరంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. అత్యవసర సహయం కోసం 101 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలని చెబుతున్నారు. టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చని స్పష్టం చేస్తున్నారు. 
జంట నగరాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు 
దీపావళి పండగ సందర్భంగా జంట నగరాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో బాణసంచా పేల్చడాన్ని నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ నగర సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 1 ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. పరిమితికి మించి శబ్ధ కాలుష్యం వచ్చే టపాసులు పేల్చవద్దని సూచించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయ ప్రాంగణం, బీర్‌కే భవన్, జీహెచ్‌ఎంసీ, మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయాలు, మింట్ కాంపౌండ్, నిజాం కాలేజ్, శాసనసభ పరిసరాలు, పబ్లిక్ గార్డెన్, అప్పర్ ట్యాంక్ బండ్, ఐమ్యాక్స్, రోటరీ, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. 

 

15:23 - October 29, 2016

హైదరాబాద్ : వెలుగులు నింపే దీపావళి పండుగ సంబరాలకు..భాగ్యనగరం నగరం సిద్ధమవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా వీధుల్లో రకరకాల.. ప్రమిదలు కొలువుదీరాయి. రంగరంగుల ప్రమిదలు మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరోవైపు గతేడాది కన్నా ఈసారి ప్రమిదల ధరలు కొనకముందే భగ్గుమంటున్నాయి. 
వెలుగులు నింపే ఆనందాల దీపావళి
చీకట్లు పారద్రోలి వెలుగులు నింపే ఆనందాల దీపావళి పండుగ సందడి.. హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. ఓ వైపు బాణాసంచా కొనుగోళ్లు.. మరోవైపు మట్టి ప్రమిదల అమ్మకాలు జోరందుకున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రమిదల అంగళ్లు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ప్రమిదల ధరలు పెరగడంతో మహిళలు పెదవి విరుస్తున్నారు. 
రకరకాల ఆకృతుల్లో ప్రమిదలు
రకరకాల ఆకృతుల్లో..మునుపెప్పుడూ చూడని రూపాల్లో ప్రమిదలు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. సగటు, మధ్య తరగతి ప్రజల కోసం తెలంగాణలోని వివిధ గ్రామీణ ప్రాంతాల్లో తయారైన మట్టి ప్రమిదలు ఆకట్టుకుంటున్నాయి. ధనికుల కోసం  డిమాండ్‌కు తగినట్లు గుజరాత్, కోలకత్తా, రాజస్థాన్‌, మహారాష్ట్రల నుంచి కూడా ప్రమిదలు దిగుమతి అవుతున్నాయి. 
చిన్న చిన్న ప్రమిదల్లో చక్కని మోడల్స్‌ 
ఇక చిన్న చిన్న ప్రమిదల్లో కూడా ఈ సారి చక్కని మోడల్స్‌ వచ్చాయి. ఇక గిఫ్ట్‌ చేసేందుకు వీలుగా తయారైన ప్రమిదలు భలేగా ఆకట్టుకుంటున్నాయి. దీపాల మధ్య అందంగా ఇమిడిపోయేందుకు తయారైన లక్ష్మీ  రూపంతో ఉన్న దీపం, దీపాల కుందె, థాలి, ఫ్లోటింగ్‌ దియాస్‌, శివపార్వతుల స్వరూపాలు,దేవతమూర్తుల ఆకృతులు, తాబేలు,హాండి ఆకారంలో అందరికీ కనువిందు చేస్తున్నాయి. ప్రమిదల్లో 200 రకాల వెరైటిలను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. రంగుల ప్రమిదలదే ఈ సారి మార్కెట్‌లో హవా అంతా.. మార్కెట్‌లో అప్పుడే వీటి అమ్మకాలు జోరందుకున్నాయి. 

 

 

జనగాం జిల్లా అభివృద్దిపై మంత్రి కడియం సమీక్ష..

జనగాం : జిల్లా సమగ్రాభివృద్ధిపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి చందూలాల్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ, జెడ్పీ ఛైర్మన్‌తో అధికారులు హాజరయ్యారు. 

15:14 - October 29, 2016

టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు భారీ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకటి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' కాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'. ఈ చిత్రాలకు సంబంధించిన పోస్టర్స్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇటీవలే 'బాలయ్య' టీజర్ కూడా విడుదల చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత చిరు వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీనిపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. మెగాస్టార్ ఎలా కనిపిస్తాడో ? ఎలా నటిస్తాడోనన్న అభిమానుల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. దీపావళి పండుగ సందర్భంగా 'చిరంజీవి'కి సంబంధించిన న్యూ లుక్స్ ను విడుదల చేశారు. ఇందులో బాస్ ఈజ్ బ్యాక్ అనేలా 'చిరు' కనిస్తుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్ లో న్యూ యంగ్ లుక్ లో కనిపిస్తుండడంతో చిత్రంలో ఎలా కనిపిస్తారోనన్న ఉత్కంఠ పెరిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి'ని తెరపై ఎప్పుడెప్పుడు చూడాలని మెగా ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే 'చిరంజీవి' బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్నాడట. 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి 'వినాయక్' దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

సంక్రాంతికి రిలీజ్...
గతంలో 'వినాయక్', 'మెగాస్టార్' కాంబినేషన్ లో 'ఠాగూర్' వీరివురి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా మిగిలిపోయింది. ఇటీవలే ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో 'చిరంజీవి', 'కాజల్' ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారని టాక్. 'ఖైదీ నెంబర్ 150' సినిమా సెట్స్ పైకి వెళ్లిన నాటి నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. అందుకే 'చిరంజీవి'తో సహా ప్రతి ఒక్కరూ పగలు రాత్రి తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. 

ఇబ్రహీంపట్నంకు రానున్న సీఎం చంద్రబాబు దంపతులు..

విజయవాడ : సాయంత్రం ఐదు గంటలకు ఇబ్రహీంపట్నంలో అమరావతి షాపింతగ్ ఫెప్టివల్ ముగింపు..దీపావళి సంబరాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు దంపతులు హాజరు కానున్నారు. 

బోనకల్ గ్రామంలో కుంతియా..

ఖమ్మం : బోనకల్ గ్రామాన్ని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా సందర్శించారు. సోనియా, రాహుల్ ఆదేశాలతో తాను ఇక్కడకు రావడం జరిగిందని, జిల్లాలో డెంగ్యూ వ్యాధి దారుణంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని, మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా ఉచిత వైద్యం అందించాలని, పార్లమెంట్ లో జిల్లా సమస్యలను లేవనెత్తుతామన్నారు.

 

14:39 - October 29, 2016

మహారాష్ట్ర : ఔరంగాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణసంచా దుకాణాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో నిమిషాల్లో షాపులన్ని కాలిబూడిదయ్యాయి. పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. 

 

14:24 - October 29, 2016

టీఆర్ఎస్ సర్వేపై దత్తన్న స్పందన..

హైదరాబాద్ : టీఆర్ఎస్ సర్వేపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పందించారు. సర్వే ఫలితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, రాజకీయ సంకల్పం, కార్యాచరణతో ఫలితాలు తారుమారవుతాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, సచివాలయ నిర్మాణం కాదని..మొదల రైతులు..విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. 

13:57 - October 29, 2016

నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. ఎగువ రాష్ట్రంలోని మహారాష్ట్రలో నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇవాళ్టి నుంచి జూలై ఒకటి వరకు 14 గేట్లు మూతపడనున్నాయి.. జూలై ఒకటి తర్వాత తిరిగి గేట్లను తెరవనున్నారు.

హరీష్ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : రెండు గంటలకు హరీష్ రావు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు, తదుపరి కార్యాచరణపై చర్చ జరగనుంది. 

13:55 - October 29, 2016

మహబూబ్ నగర్ : తెలంగాణలో సీపీఎం మహాజన పాదయాత్ర 13వరోజుకు చేరింది.. సెప్టెంబర్‌ 15న పాదయాత్ర మొదలుపెట్టిన సీపీఎం బృందం... పల్లె పల్లనెనూ పలకరిస్తోంది.విజయవంతంగా 300 కిలోమీటర్ల దూరం నడిచింది.. శనివారం నాటికి పాదయాత్ర పదమూడవరోజుకు చేరుకుంది. బూర్గుల క్రాస్‌రోడ్డు వద్ద సీపీఎం మహాజన పాదయాత్ర 300కి.మీ పూర్తిచేసుకుంది. బూర్గుల క్రాస్‌ రోడ్డు వద్ద పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం లభించింది.ఈ పాదయాత్రకు కాంగ్రెస్ నేత మల్లు రవి, సీపీఐ బాలానగర్‌ మండలం నేతలు మద్ధతు తెలిపారు. ఇంకా పలు ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, ఆశావర్కర్లు తమ మద్ధతును తెలుపుతున్నారు.జడ్చర్లలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను కాంగ్రెస్‌ నేత మల్లు రవి కలిశారు.. తెలంగాణ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.. మరింత సమాచారానికి వీడియో చూడండి..

అర్బన్ ఎస్పీ త్రిపాఠితో వైద్య విద్యార్థుల చర్చలు..

గుంటూరు : అర్బన్ ఎస్పీ త్రిపాఠితో మెడికల్ పీజీ విద్యార్థులు చర్చలు జరిపారు. పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్ లక్ష్మీ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు త్వరలో అరెస్టు చేస్తామని అర్బన్ ఎస్పీ త్రిపాఠి పేర్కొన్నారు. ప్రొఫెసర్ లక్ష్మీని త్వరగా అరెస్టు చేయాలని కోరినట్లు పీజీ వైద్య విద్యార్థులు తెలిపారు. 

చెరువులో పడి ముగ్గురు మృతి..

వికారాబాద్ : బొమ్రాస్ పేట మండలం లగచర్లలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. భార్గవి, చింటూ (14), నాని (13)లు మృతి చెందిన వారిలో ఉన్నారు. 

13:48 - October 29, 2016

ఢిల్లీ : క్యాన్సర్ బాధితుల కోసం తాను స్థాపించిన లైఫ్ ఎగైన్ సంస్థకి ప్రభుత్వ సహకారాన్ని కోరేందుకే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుని కలిశానని ప్రముఖ సినీ నటి గౌతమి తెలిపారు. క్యాన్సర్ మహమ్మరిపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం తరపున ఎలాంటి సాయమైనా అందిస్తామని వెంకయ్య హామీ ఇచ్చారన్నారు. మీడియా కూడా తన వంతు బాధ్యతగా క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆమె కోరారు. 

13:44 - October 29, 2016
13:41 - October 29, 2016

గుంటూరు : ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థుల ఆందోళన సరికాదని సూపరిటెండ్ రాజునాయడు అన్నారు. అత్యవసర సేవల నిలిపివేతపై మంత్రి కామినేని సీరియస్‌ అయ్యారు. ఆస్పత్రిలో ఆందోళన చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజునాయుడును ఆదేశించారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా.. కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తాఫా మద్దతు తెలిపారు. ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

13:22 - October 29, 2016

హైదరాబాద్‌: అమీర్ పేటలో అగ్నిప్రమాదం సంభవించింది. గ్రీన్ పార్క్ సమీపంలోని ఐదు అంతస్థుల  మైహోమ్ అపార్ట్ మెంట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ క్రింద వున్న కారు డెకార్స్‌ దుకాణంలో వ్యాపించిన మంటలు పై అంతస్థులకు ఎగబాకాయి. సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో దాదాపు మూడున్నర గంటల నుండి ఫైర్ సిబ్బంది కష్టపడటంతో మంటలు అదుపులోకి వచ్చాయి. నుండి ఈ ప్రమాదంలో షాపులోవున్న కారు స్పేర్ పార్ట్ మొత్తంగా అగ్నికి ఆహుతయినట్లుగా తెలుస్తోంది. పంజాగుట్ట..అమీర్ పేటల్లో పలు రద్దీప్రదేశం కావటంతో ఆప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు పలు ఇబ్బందులకు లోనవుతున్నారు. కాగా సెల్లార్లలో ఇటువంటి షాపులకు ఎటువంటి అనుమతీ వుండదు.కానీ నిబంధలను పాటించకపోవటంతో ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తూండటం గమనించాల్సిన విషయం.

12:42 - October 29, 2016

హైదరాబాద్ : నగరంలోని ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాల అంశం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. తెలంగాణ చెందిన 210 మంది గ్రూప్ 4 ఉద్యోగులను ఏపీకి కేటాయించటంపై వారు మొదటినుండి వ్యతిరేకిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఏపీ సంబంధించిన వారు కాబట్టి తమను తెలంగాణ సచివాలయంలోకి అనుమతించటంలేదని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపి నుండి తమను తెలంగాణకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవటంలేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో నగరంలోని ఏపీ సచివాలయంలో ఆందోళన నెలకొంది. ఏపీ సచివాలయంలో ఏపీకి కేటాయించిన తెలంగాణ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు.ప్రస్తుతం తమను రెండు సచివాలయల్లోకి అనుమతించటంలేదని వారు వాపోతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనను ఉదృతంచేసే యోచనలో వున్నారు. ఏపీ పాలనా విభాగాలు అమరావతికి తరలిపోవటంతో ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే నేపథ్యంలో తెలంగాణలో స్థిరపడిన ఏపి ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. కాగా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించ తలపెట్టిన సచివాలయం విషయంలో ఏపీ సచివాలయాలు తిరిగి తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సమ్మతించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వైద్య విద్యార్థినిల ఆందోళనపై మంత్రి కామినేని సీరియస్..

గుంటూరు : ప్రభుత్వాసుపత్రిలో అత్యవసర సేవల నిలిపివేతపై మంత్రి కామినేని సీరియస్ అయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజు నాయుడుకు ఫోన్ చేశారు. ఆసుపత్రిలో ఆందోళన చేయకుండా చర్యలు తీసుకోవాలని, రోగులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

 

నవంబర్ 6 నుండి టి.టిడిపి రైతు పోరుబాట..

హైదరాబాద్ : నవంబర్ 6వ తేదీ నుండి టి.టిడిపి రైతు పోరుబాట నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. భూపాలపల్లి నుండి పోరుబాట ప్రారంభం కానుంది. రోజుకు 15 కి.మీటర్లు పాదయాత్ర చేయాలని, నవంబర్ 30న కొడంగల్ లో రైతులతో బహిరంగసభ నిర్వహించేందుకు టి.టిడిపి నేతలు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. కొత్తగూడెం, పెద్దపల్లి, నిజామాబాద్, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, గద్వాల, జగిత్యాల, వనపర్తిలో పాదయాత్ర చేయాలని యోచిస్తున్నారు. రమణ, రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 

న్యూ డెమోక్రసీ మధు ఏరియా దళ కమాండర్ అరెస్టు..

భద్రాద్రి : టేకులపల్లి (మం) బాటన్ననగర్ లో న్యూ డెమోక్రసీ మధు ఏరియా దళ కమాండర్ ఆజాద్ ను పోలీసులు అరెస్టు చేశారు. 20 ఏళ్లుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. 

12:16 - October 29, 2016

'వెంకటేష్' ఎంతో ఊహించుకున్న 'బాబు బంగారం' తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం బడ్జెట్ ని రాబట్టగలిగింది కానీ ఈ చిత్రం వల్ల 'వెంకటేష్' కి ప్రత్యేకంగా ఒరిగింది మాత్రం ఏం లేదని చెప్పాలి. అందుకే 'గురు' రీమేక్ తో అయినా బాక్సాఫీసు వద్ద విక్టరీ నమోదు చేయాలని ఈ సీనియర్ స్టార్ కసిగా ఉన్నాడు. 'వెంకటేష్' బాలీవుడ్ లో సూపర్ హిట్టు అయిన 'సాలా ఖద్దూస్' రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'గురు' టైటిత్ తో తెరకెక్కుతున్న గత నెల 19 స్టార్ట్ చేశారు. ఈ చిత్రం ఒపెనింగ్ రోజే 'వెంకీ' ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి మూవీపై అంచనాలు పెంచారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. దీపావళి సందర్భంగా పోస్టర్ ను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది. తొలుత దీపావళి రోజున టీజర్ విడుదలవుతుందని ప్రచారం జరిగింది. క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో 'రితికా సింగ్' కీలక పాత్రలో నటిస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగతం సమకూరస్తున్నారు. డిసెంబర్ లో మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ రీమేక్ తో అయిన 'వెంకీ' సోలోగా సూపర్ హిట్టు కొడుతాడో చూడాలి.

12:02 - October 29, 2016

ఖమ్మం : బోనకల్ మండలంలో డెంగీ ఫీవర్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. మూడు నెలల్లో మండలంలో సగటున ఒక్కో నెలలో 6 వేలకు పైగా విష జ్వరాల కేసులు నమోదయ్యాయి. డెంగీ పాజిటివ్ కేసులు 305 నమోదు కావడంతో దేశంలోనే అత్యధికంగా ఈ కేసులు బోనకల్ మండలంలో నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు విషజ్వరాలతో 19 మంది మృతిచెందగా.. డెంగీతోనే చనిపోయారన్న అనుమానాలున్నాయి.

బోనకల్ మండలంలో డెంగీ విలయ తాండవం
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో డెంగీ జ్వరం విలయ తాండవం చేస్తోంది. ఈ మండలంలోని 15 గ్రామాల్లో డెంగీ పంజాతో వందలాది కుటుంబాలు మంచం పట్టాయి. ఆగస్టు నెలలో 5,143, సెప్టెంబర్‌లో 6,138, ఈ నెలలో ఇప్పటి వరకు 6,735 మందికి విషజ్వరాలు సోకాయి. ఇందులో బోనకల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స కోసం వచ్చిన 305 మందికి డెంగీ పాజిటివ్ ఉన్నట్లు సమాచారం. వందలాది మంది ఖమ్మం, విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు.
బోనకల్ పీహెచ్‌సీలో 305 డెంగీ పాజిటివ్ కేసులు?
విష జ్వర బాధితులతో బోనకల్ పీహెచ్‌సీ ఆస్పత్రి కిటకిటలాడుతోంది. ఆరు పడకల స్థాయి ఆస్పత్రి కావడంతో..తాత్కాలికంగా 60 మంచాలు ఏర్పాటు చేశారు. ఆరు బయట కూడా వైద్యం అందిస్తున్నారు. రోజుకు 50 లోపే ఉండే బయటి రోగులు సంఖ్య మూడు నెలలుగా 200 పైగానే ఉంటోంది. గతంలోనే ఒక్కరే డాక్టర్ ఉండగా.. అదనంగా ముగ్గురు డాక్టర్లను నియమించారు. వీరే కాకుండా ఒక్కో బృందానికి ఇద్దరు డాక్టర్ల చొప్పున ఐదు బృందాలకు మొత్తంగా 10 మంది డాక్టర్లను నియమించి.. మండలంలో 150 మెడికల్ క్యాంపులు నిర్వహించారు.

3 నెలలుగా పీహెచ్‌సీ కిటకిట..రోజూ 200 దాటుతున్న ఓపీ సంఖ్య
బోనకల్‌లో 77, ఆళ్లపాడులో 71 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మూడు నెలల్లో మండలంలో 18 మంది డెంగీతో మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు డాక్టర్లు మాత్రం డెంగీ మరణాలు ఒక్కటి కూడా నమోదుకాలేదని చెప్పుకొస్తున్నారు.

బోనకల్లో 77, ఆళ్లపాడులో 71 డెంగీ పాజిటివ్‌ కేసులు
బోనకల్‌ మండలంలో విజృంభిస్తున్న డెంగీ జ్వరాల అదుపునకు ప్రభుత్వం యుద్ధపాత్రిపదిక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వైద్య సిబ్బందిని పెంచి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారత్- న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ విజేతను తేల్చే కీలక మ్యాచ్‌కి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం వేదికైంది. సిరీస్‌లో చివరి వన్డే మ్యాచ్ నగరంలో ఏసీఏ స్టేడియంలో జరగనుంది. దీంతో ఉదయం నుంచే స్టేడియంకి అభిమానులు బారులుతీరారు. అభిమానుల కోలాహలంతో సాగర తీరం సందడిగా నెలకొంది. 

11:47 - October 29, 2016
11:45 - October 29, 2016

హైదరాబాదు : నగరంలోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖుష్బు అనే మహిళ మిస్సైన ఘటన కలకలం రేపుతోంది. ఖుష్బూ అనే మహిళ తన భర్తతో కలిసి దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. కాగా ఖుష్బూ దంపతులు కోల్ కతా వెళ్లాల్సి ఉంది. అయితే కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఎదురు చూసే క్రమంలో నాలుగు గంటల విరామం వుంటంతో ఆమె షాపింగ్ చేసుకుని వస్తానని భర్తతో చెప్పి బయలుదేరింది.ఆ తరువాత ఆమె ఆచూకీ లేకుండా పోయింది. భర్త ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. దీంతో మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు ఎయిర్ పోర్టులోని సీసీ టీవీ పుటేజ్లో ఆమె వాష్ రూమ్ వెళ్లినట్లుగా తెలిసింది. ఆ తరువాత ఖుష్బూ జాడ తెలీకుండా పోయింది. దీనిపై ఆమె ఎక్కడికి వెళ్లి ఉంటుందనే విషయమై ఎయిర్ పోర్ట్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

11:38 - October 29, 2016

'నిరుప్పుడా.. నెరంగుడా'...'కబాలి డా'..అంటూ రజనీ డైలాగ్స్ కు అభిమానులు ఊగిపోయారు. ఆయన నటించిన 'కబాలి' చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో 'రాధిక ఆప్టే' నటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్..టీజర్ తో హల్ చల్ చేసిన ఈ సినిమా జులై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. వయసు మళ్లిన డాన్ పాత్రలో 'రజనీకాంత్' తన అద్భుతమైన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారనే చెప్పవచ్చు. ఎమోషనల్..యాక్షన్ సన్నివేశాలను తనదైన స్టైల్ లో రక్తి కట్టించాడు. దూరమైన భార్య తపించే భర్తగా, డాన్‌గా, ఓ తండ్రిగా ఇలా ఆయన పాత్ర భిన్నంగా సాగింది. ఇక భార్య పాత్రలో రాధిక ఆప్టే పాత్ర సహజంగా సాగుతుంది. 'కబాలి' చిత్రం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ కలర్ పుల్ పోస్టర్స్ ని రిలీజ్ చేసింది.
ఇక ఈ చిత్రం ఎంత వసూళ్లు సాధించాయనే ఓ వైపు చర్చ జరుగుతోంది. రూ. 300 కోట్లు..కాదు కాదు..రూ. 500 కోట్లు అని టాక్స్ వినిపించాయి. అన్ని భాషల్లో కలిపి వరల్డ్ వైడ్ గా రూ. 287 కోట్లు సాధించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు వర్షన్ లో రూ. 36 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. సినిమా మీద పెట్టుబడితో పోలిస్తే 'కబాలి' నిరాశ పరిచినా ఓవరాల్ గా మాత్రం తమిళంలో హయ్యస్ట్ షేర్ కలెక్ట్ చేసిందని టాక్. 

11:34 - October 29, 2016

గుంటూరు : మెడికోల ఆందోళ గత ఐదురోజులుగా కొనసాగుతుండగా శనివారం ఆరోరోజుకు ఆందోళన చేరుకుంది..24వ తేదీన మెడికో సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుంది.సంధ్యారాణి ఆత్మహత్యకు ప్రొ.లక్ష్మికారణమంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఈనేపథ్యంలో  పరారీలో వున్న ప్రొ.లక్ష్మిని అరెస్ట్ చేసిన తగిన  చర్యలు తీసుకోవాలంటూ తోటి మెడికోలు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రికి తాళాలు వేసి..అత్యవసర సేవలు నిలిపివేసి మెడికోలు ఆందోళ కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై ఆసుపత్రి సూపరిండెంట్ రాజునాయుడు మాట్లాడుతూ..మెడికోలు చేస్తున్న ఆందోళనతో ఆసుపత్రిలో వైద్యసేవలకు తీవ్రంగా అంతరాయం కలుగుతోందనీ..ఆందోళన పేరుతో రోగులను ఇబ్బంది పెట్టటం సరికాదని పేర్కొన్నారు. తక్షణమే ఆందోళన విరమించి మెడికోలు విధుల్లో చేరాలని సూచించారు. సంధ్యారాణి ఘటనపై ప్రభుత్వం కూడా దర్యాప్తును ముమ్మరం చేసిందని తెలిపారు. మరోపక్క మెడికోల ఆందోళనతో వార్డుల్లో వైద్యసేవలు నిలిచిపోయాయనీ..అత్యవసర సేవల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసామని తెలిపారు. ప్రొ.లక్ష్మి ప్రవర్తనపై గతంలో కూడా ఫిర్యాదులున్నాయనీ.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ రాజునాయుడ్ని నివేదిక అందించామనీ ఆర్ఎంవో రమేష్ తెలిపినదానికి ఏం చెబుతారనే ప్రశ్నకు సమాధనంగా లక్ష్మిని అరెస్ట్ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మంత్రి కామినేని కలెక్టర్లతోనూ పోలీస్ శాఖలను ఈ విషయంపై ఆదేశించారని పోలీసుల బృందాలు లక్ష్మికోసం గాలిస్తున్నారని తెలిపారు. 

గుంటూరు కొనసాగుతున్న మెడికల్ విద్యార్థుల ఆందోళన..

గుంటూరు : మెడికల్ పీజీ విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని, వార్డుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయని ఆర్ఎంవో రమేష్ పేర్కొన్నారు. వైద్య విద్యార్థిని సంధ్యారాణి మృతికి కారణమైన ప్రొ.లక్ష్మీని అరెస్టు చేయాలని మెడికల్ పీజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

మహాజన పాదయాత్ర 300 కి.మీటర్ల పూర్తి..

రంగారెడ్డి : షాద్ నగర్ నుండి మహాజన పాదయాత్ర ప్రారంభమైంది. కాసేపటి క్రితం బూర్గుల గ్రామానికి చేరుకోవడంతో 300 కి.మీటర్ల పూర్తయ్యింది. బూర్గుల ఎక్స్ రోడ్డు, బాలానగర్, రంగారెడ్డి గూడ, నాచారం, సోరంపేటలో పాదయాత్రో బృందం పర్యటించింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ సీపీఎం జిల్లా కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. 

10:45 - October 29, 2016

ఓపెన్ గ్యార్బేజ్ పాయింట్ లలో జీహెచ్ఎంసీ దీపాలు..

హైదరాబాద్ : పారిశుధ్యంపై అవగాహనకు జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఓపెన్ గ్యార్బేజ్ పాయింట్ లలో చెత్తను తొలగించి జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులు దీపాలు వెలిగించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్ల వేయడం మానుకోవాలని నగర ప్రజలకు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. 

గోకుల్ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం..

సికింద్రాబాద్ : వెస్ట్ మారేడ్ పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోకుల్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. 

గుంటూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత..

గుంటూరు : ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్య విద్యార్థిని సంధ్యారాణి మృతికి కారణమైన ప్రొ.లక్ష్మీని అరెస్టు చేయాలని మెడికల్ పీజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రిలో అత్యవసర సేవలను నిలిపివేశారు. ఆసుపత్రి గేట్లకు తాళాలు వేసిన నిరసన వ్యక్తం చేశారు.

10:38 - October 29, 2016

విశాఖ : ఉక్కునగరానికి క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. నగరంలోని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి  క్రికెట్ స్టేడియంలో శనివారం మధ్యహ్నాం నుండి జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం తెలుగు అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కాగా కయాంత్ తుపాన్ గండం తప్పిపోవటంతో విశాఖలో మరింత ఉత్సాహంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌లోని క్లైమాక్స్‌ ఫైట్‌కు టీమిండియా సన్నద్ధమైంది. హోరాహోరీగా సాగుతోన్న సిరీస్‌ను సమం చేసిన కివీస్‌ టీమ్‌ ఆఖరి వన్డేలోనూ ధోనీసేనకు చెక్‌ పెట్టాలని పట్టుదలతో ఉంది. ప్రస్తుత సిరీస్‌లోనే కాదు వన్డే ఫార్మాట్‌లో భారత్‌కు గట్టి పోటీనిచ్చిన జట్లలో న్యూజిలాండ్‌ ముందువరుసలోనే ఉంది. 

భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆధిపత్య పోరు
ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌ సైతం నువ్వా నేనా అన్నట్లుగానే సాగుతోంది. ఇరు జట్ల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ప్రస్తుత సిరీసే నిదర్శనం.

ధర్మశాల వన్డేలో భారత్‌ సునాయాస విజయం
ధర్మశాల వన్డేలో బౌలర్ల షోతో భారత్‌ సునాయాస విజయం సాధించగా....లో స్కోరింగ్‌ థ్రిల్లర్‌లా సాగిన ఢిల్లీ వన్డేలో కివీస్‌ టీమ్‌ ధోనీసేనకు షాకిచ్చింది. మొహాలీ వన్డేలో విరాట్‌ కొహ్లీ సూపర్‌ సెంచరీతో టీమిండియా సునాయాస విజయం సాధించింది.

నాలుగో వన్డేలో అంచనాలకు మించి రాణించిన కివీజట్టు
కీలక నాలుగో వన్డేలో కివీస్‌ టీమ్‌ అంచనాలకు మించి రాణించింది. బ్యాటింగ్‌లో అంతంత మాత్రంగానే రాణించినా బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టింది.19 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

సిరీస్‌ విజయంపై ధీమాగా వున్న ధోనీ సేన
దీంతో 5వ వన్డేలో నెగ్గి సిరీస్‌ సొంతంచేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.ఆఖరి వన్డేలోనూ సంచలనం సృష్టించాలని కివీస్‌ టీమ్‌ తహతహలాడుతుండగా....సొంతగడ్డపై తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన ధోనీసేన సిరీస్‌ విజయంపై ధీమాగా ఉంది.

న్యూజిలాండ్‌తో వన్డే ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో భారత్‌దే కాస్త పై చేయిగా
ప్రస్తుత సిరీస్‌లో మాత్రమే కాదు వన్డే ఫార్మాట్‌లో భారత్‌కు గట్టి పోటీనిచ్చిన జట్లలో న్యూజిలాండ్‌ ముందువరుసలోనే ఉంది. వన్డేల్లో ఏ జట్టుకైనా న్యూజిలాండ్‌ ఎప్పటికీ పటిష్టమైన ప్రత్యర్ధే అనడంలోనూ ఎటువంటి సందేహం లేదు. ఇరు జట్ల మధ్య వన్డే ద్వైపాక్షిక సిరీస్‌ అంటే హోరాహోరీ పోరు ఖాయమనే చెప్పాలి. కానీ న్యూజిలాండ్‌తో వన్డే ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో భారత్‌దే కాస్త పై చేయిగా ఉంది.ఢిల్లీ వన్డే వరకూ ఇరు జట్లు 97 మ్యాచ్‌ల్లో పోటీపడగా...భారత్‌ 48 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. న్యూజిలాండ్‌ 43 మ్యాచ్‌ల్లో నెగ్గింది.ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది.

రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా మ్యాచ్
విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ -వీడీసీఏ స్టేడియం వేదికగా జరుగునున్న ఐదో వన్డే ఎప్పటిలానే హోరాహోరీగా సాగుతుందో లేక అనూహ్యంగా ఏకపక్షంగా ముగుస్తుందో చూడాలి. మరింత సమాచారానికి వీడియో చూడండి..

పాక్ రేంజర్ల కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం..

జమ్మూ కాశ్మీర్ : పాక్ రేంజర్ల కాల్పుల్లో మరో జవాన్ మృతి చెందాడు. మచిల్ సెక్టార్ లో బీఎస్ ఎఫ్ జవాన్ నితిన్ సుభాష్ వీరమరణం పొందాడు. పాక్ రేంజర్ల కాల్పుల్లో గత వారం రోజుల్లో నలుగురు బీఎస్ఎఫ్, ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు.

10:20 - October 29, 2016

గుంటూరు : వైద్యం అందించే డాక్టర్ కే న్యాయం జరగని క్రమంలో సామాన్య మనుష్యులకు ఎలా న్యాయం చేయగలుగుతామని జూనియర్ డాక్టర్లు పేర్కొంటున్నారు. పేషెంట్లను ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తమకు లేదనీ...తోటి విద్యార్థికి అన్యాయం జరిగుతుంటే పోరాటం చేసే బాధ్యత తమకుందని వారు కోరుతున్నారు. తప్పు చేసిన ప్రొ.లక్ష్మిని వెంటనే అరెస్ట్ చేసి..అధికారికంగా ప్రకటిస్తేనే తాము పోరాటాన్ని నిలిపి విధుల్లో పాల్గొంటామని జూనియర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై గుంటూరు ఏ ఎస్పీ భాస్కర్ రావు మాట్లాడుతూ..నిందితురాలు ప్రొ.లక్ష్మిని అరెస్ట్ చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామనీ..అత్యవసర సేవలు నిలిపివేసి సామాన్య రోగులను ఇబ్బందులు పాలు చేయటం సరికాదని ఆయన సూచించారు. ఈ ఉద్రిక్తతలకు కారణం వైద్యుల్లో వున్న గ్రూపులే కారణమని ఈ సందర్బంగా ఏఎస్పీ భాస్కర్ అభిప్రాయపడ్డారు.

మెడికో సంధ్యారాణి ఆత్మహత్య
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.. వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆరు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఈ నేపథ్యంలో సంధ్యారాణి మృతికి కారణమైన ప్రొఫెసర్‌ లక్ష్మిని అరెస్ట్‌ చేయాలంటూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.. ఆస్పత్రిలో అత్యవసర సేవలు నిలిపివేశారు.. ఆస్పత్రి గేట్లకు తాళం వేసి నిరసన తెలుపుతున్నారు. ప్రొఫెసర్‌ వేధింపులే కారణమంటూ సూసైడ్‌ నోట్‌ రాసింది.. అయినా ఆమెపై చర్య తీసుకోవడంలేదంటూ విద్యార్థులు రోడ్డెక్కారు.. ఐదురోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు.. కాగా భార్య సంధ్యారాణి మృతిని తట్టుకోలేని భర్త డాక్టర్ రవి ఆత్మహత్యకు యత్నించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవి పరిస్థితి కూడా విషయంగా వున్నట్లు సమాచారం.

10:01 - October 29, 2016

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ ఆందోళనబాటపట్టింది.. ప్రభుత్వ వైఫల్యాన్ని పశ్నిస్తూ కమలదళం నిరసనల్ని ఉధృతం చేసింది. మొన్న డబుల్ బెడ్ రూం ఇండ్లపై ధర్నా చేసిన బీజేపీ నేతలు....ఇవాళ హుస్సేన్ సాగర్ నాలా దగ్గర పేదల ఇళ్ల తొలగింపుపై గళమెత్తనున్నారు.. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, రామచంద్రరావులు హాజరుకానున్నారు..

09:59 - October 29, 2016

మహబూబ్ నగర్ : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా.. చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర చురుగ్గా సాగుతోంది. రంగారెడ్డిలో జిల్లాలో యాత్రను పూర్తిచేసుకుని.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్ర బృందానికి అడుగడుగునా.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదని ప్రజలు ఏకరువు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, చేతల్లో సరైన పాలన అందించడం లేదని ఈ సందర్భంగా తమ్మినేని విమర్శించారు.

12వ రోజు మహాజన పాదయాత్ర
జనం సమస్యలు వింటూ... పాలకుల పనితీరుపై చురకలు అంటిస్తూ... సీపీఎం మహాజన పాదయాత్ర చురుగ్గా ముందుకు సాగుతోంది. 12వ రోజు మహాజన పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో పూర్తై.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్ర బృందానికి అడుగడుగునా.. జనం నీరాజనాలు పలుకుతున్నారు.

పాదయాత్రకు అన్ని పార్టీల మద్ధతు
యాత్రకు అన్ని వర్గాల నుంచి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. అన్ని పార్టీల వారు కూడా యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. జనం సమస్యలపై సీపీఎం చేపట్టిన మహాపాదయాత్ర నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. పాదయాత్రలో ఉన్న సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి టీ.టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఫోన్‌ చేసి.. పాదయాత్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. నవంబర్‌ 1న టీడీపీ నేతలంతా పాదయాత్రలో పాల్గొంటామని చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా తిమ్మాజీ పేట వద్ద ఎల్‌. రమణతో పాటు..ఇతర ముఖ్యనేతలమంతా పాదయాత్రలో పాల్గొంటామని చెప్పారు. రైతు సమస్యలపై సీపీఎంతో కలిసి పోరాడుతామని రేవంత్‌రెడ్డి తెలిపారు. అంతేకాదు.. తెలంగాణలోని టీడీపీ కేడర్‌ అంతా పాదయాత్రలో పాల్గొంటుందని హామీ ఇచ్చారు.

పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యేలు
13వ రోజు జరిగే పాదయాత్రలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యేలు మల్లు రవి, ఎర్ర శేఖర్‌ పాల్గోనున్నారు. 12వ రోజు సాగిన పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఇటు రంగారెడ్డి కొత్తూరు వద్ద సీపీఐ నాయకులు పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ఆశాకార్యకర్తలు, మహిళా సంఘాలు, వివిధ కార్మిక సంఘాలు యాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో సాగిన పాదయాత్ర విశేషాల గురించి పాదయాత్ర కో-ఆర్డినేటర్‌ వెంకట్‌ 10టీవీకి తన అనుభవాలను పంచుకున్నారు. అంచనా కంటే ప్రజల నుంచి అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. మొత్తంగా గ్రామాల్లోని సమస్యలను తెలుసుకుంటూ తమ్మినేని బృందం పాదయాత్ర సాగుతోంది.

09:44 - October 29, 2016
09:39 - October 29, 2016

గుంటూరు : ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.. వైద్య విద్యార్థిని సంధ్యారాణి మృతికి కారణమైన ప్రొఫెసర్‌ లక్ష్మిని అరెస్ట్‌ చేయాలంటూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.. ఆస్పత్రిలో అత్యవసర సేవలు నిలిపివేశారు.. ఆస్పత్రి గేట్లకు తాళం వేసి నిరసన తెలుపుతున్నారు. ఆరురోజులక్రితం వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుంది.. ప్రొఫెసర్‌ వేధింపులే కారణమంటూ సూసైడ్‌ నోట్‌ రాసింది.. అయినా ఆమెపై చర్య తీసుకోవడంలేదంటూ విద్యార్థులు రోడ్డెక్కారు.. ఐదురోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు.. 

09:36 - October 29, 2016

జమ్ము కశ్మీర్ : సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. తాజాగా మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడిచింది. కాల్పులపై రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆరాతీశారు. ఆర్‌ఎస్ పూరా సెక్టార్‌లోని అబ్దులియన్ వద్ద పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల్లో ఓ భారత్ జవాన్ మృతిచెందాడు. కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. 48 గంటల్లో 14 సార్లు పాక్ కాల్పులకు పాల్పడింది. ఇప్పటివరకు 15 మంది పాక్ రేంజర్లును భారత జవాన్లు మట్టుబెట్టారు. మరోవైపు కూప్వారా జిల్లాలో ఉగ్రవాదులు కూడా కాల్పులకు పాల్పడ్డారు. మాంచీ సెక్టార్ వద్ద బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. దీపావళి పండుగ సందర్భంగా పాక్ వరుస కాల్పులకు పాల్పడుతోంది. 

09:24 - October 29, 2016
09:20 - October 29, 2016

సికింద్రాబాద్‌ : వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని గోకుల్‌ చైనీస్‌ రెస్టారెంట్‌లో అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్ లో వున్న ఎనిమిదిమంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో కిచెన్‌లోని ఫర్నిచర్‌, వంట సామగ్రి, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. పోలీసులు, సికింద్రాబాద్‌ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోని మంటల ఆర్పివేశారు. 

బోరబండలో బాలుడు కిడ్నాప్..

హైదరాబాద్: బోరబండలో ఏడేళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇంటి ముందు ఆడుకుంటున్నలోకేశ్ అనే బాలుడ్ని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

09:09 - October 29, 2016
09:05 - October 29, 2016

హైదరాబాద్ : అంబర్ పేట లో మైనర్లు వీరంగం సృష్టించారు. గతంలో జరిగిందే మళ్లీ జరిగింది. కారును ర్యాష్ గా డ్రైవ్ చేయటంతో నాలుగు కార్లు ఓ బైకు ధ్వంసమయ్యాయి. అంబర్ పేటలోని డీడీ కాలనీనలో ఈ ఘటన జరిగింది.  సమాచారం అందుకున్న పోలీసులు మైనర్ ని అదుపులోకి తీసుకున్నారు. సదరు కారులో వున్న మద్యం సీసాలు కూడా వున్నట్లుగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కారులో ఓ యువతి కూడా వున్నట్లుగా తెలుస్తోంది.మైనర్లు కారు నడపటమే ఓ నేరం..పైగా ర్యాష్ డ్రైవింగ్..ఆపై కారులో మద్యం సీసాలు..ఇవన్నీ చూస్తుంటే సమాజంలోని యువత ఎటువంటి పెడదారులు తొక్కుతున్నారో అర్థమవుతోంది. కారు నడిపిన మైనర్ శ్రీచైతన్య కాలేజ్ లో ఇంటర్ చదువుతున్నట్లుగా తెలుస్తోంది.

అంబర్ పేట ప్రమాదంలోనే సంజనకు గాయాలు
కొన్ని రోజుల క్రితం అంబర్ పేటలోనే మద్యం తాగి డ్రైయింగ్ చేసిన కొందరి ఘాతుకానికి చిన్నారి సంజన..తల్లి శ్రీదేవి దాదాపు మృత్యువు అంచులదాకా వెళ్ళి తిరిగొచ్చారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలయిన సంజన రెండు రోజుల క్రితమే కామినేని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్అయ్యింది. 80 శాతం వరకూ ఆరోగ్యవంతురాలైన సంజన పూర్తిగా కోలుకోవటానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.

పంజాగుట్టలో మద్యం డ్రైవింగ్ కు బలైపోయిన చిన్నారి రమ్య కుటుంబం
అంతకుముందు పంజాగుట్టలో మద్యం త్రాగి డ్రైవ్ చేసిన కొందరు ఇంజనీరింగ్ స్టూడెంట్ చేసిన బీభత్సానికి చిన్నారి రమ్య కుటుంబంలోని మూడు తరాలవారిని బలితీసుకుంది. ఇప్పుడు తాజాగా అంబర్ పేటలో మైనర్ల నడిపిన వాహనం చేసిన బీభత్సానికి ఆ ప్రాంత వాసులు హడలిపోయారు. కాగా ఈ ఘటన తెల్లవారుఝామున కావటంతో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. టీనేజ్ లో వున్న యువత పట్ల తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా వుండాల్సిన అవుసరం ఎంతైనా వుంది కదా?...

 

08:46 - October 29, 2016

జమ్ము కశ్మీర్ : సరిహద్దులో కాల్పుల్ ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు బీఎస్ఎఫ్ బలగాలు ధీటైన సమాధానమిస్తున్నాయి. గత వారం రోజులుగా భారత్‌ జరిపిన దాడిలో 15 మంది పాకిస్థానీ జవాన్లు హతమయ్యారు. పాక్‌ కాల్పుల కారణంగా సరిహద్దు సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా పాక్‌ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. కాగా ఈ ఎదురు కాల్పుల్లో  గాయపడిన ఓ భారత జవాను మృతి చెందాడు. 

భారీ మూల్యమే చెల్లించుకుంటున్న పాకిస్థాన్
జమ్ముకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వద్ద పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్‌ సైన్యం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది. పాక్‌ కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతుండడంతో పాక్‌కు తీరని నష్టమే వాటిల్లుతోంది. గత వారం రోజుల్లో బిఎస్‌ఎఫ్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన 15 మంది సైనికులు మృతి చెందినట్లు ఆర్మీ అధికారి అరుణ్‌కుమార్‌ చెప్పారు. పాకిస్థాన్ ఫ్రాంటియర్ ఫోర్స్ కు చెందిన ఇద్దరు సైనికులతో పాటు 13 మంది పాక్ రేంజర్ల చనిపోయి ఉంటారని బీఎస్ఎఫ్ అంచనా వేస్తోంది. నియంత్రణ రేఖ వ‌ద్ద ఉన్న సాధార‌ణ పౌరుల‌పై తాము ఎప్పుడూ కాల్పులు జరపలేదని భారత్‌ స్పష్టం చేసింది.

24 గంటల నుండి కొనసాగుతున్న కాల్పులు
గత 24 గంటల నుంచి జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాక్‌ వైపు నుంచి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.. రాజౌరి, సాంబా, అబ్దులియా, ఆర్ ఎస్ పురా, సుచిత్గర్ ప్రాంతాల్లో ఏక ధాటిగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఫూంచ్‌ సెక్టార్‌లో పాకిస్తాన్‌ మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పాకా ఆర్మీ కాల్పుల్లో ఖౌర్‌, మెందర్‌లోని ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఓ బాలిక గాయపడింది.

పాక్ కాల్పుల్లో మరో భారత జవాను వీరమరణం
గత 24 గంటల్లో జమ్ము, కతువా, రాజౌరి, హీరానగర్‌, ఆర్‌ఎస్‌ పురా సెక్టార్లలో పాకిస్తాన్‌ పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆర్మీవర్గాలు తెలిపాయి. బిఎస్‌ఎఫ్‌కు చెందిన 24 పోస్టులపై పాక్‌ కాల్పులు జరిపింది. చిన్న తరహా ఆయుధాలు, ఆటోమెటిక్ మోర్టార్స్‌తో శత్రు దళాలు దాడికి దిగినట్లు భారత ఆర్మీ పేర్కొంది. అయితే పాక్ దళాలను భారత ఆర్మీ దీటుగా తిప్పికొట్టింది. మన సైనికులు ఎవరూ గాయపడలేదని బీఎస్ఎఫ్ పేర్కొంది. కాగా పాక్‌ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఓ భారత జవాను గురువారం కన్నుమూశాడు. మరో 13 మంది పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి.

సర్జికల్ దాడుల అనంతరం బోర్డర్ లో ఉద్రిక్తత
పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్‌ సైన్యం నిర్వహించిన సర్జికల్‌ దాడుల తర్వాత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్‌ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సర్జికల్‌ దాడుల తర్వాత పాక్‌ జరిపిన కాల్పుల్లో నలుగురు భారత జవాన్లతో పాటు ఐదుగురు పౌరులు మృతి చెందారు. 34 మంది గాయపడ్డారు.

అంబర్ పేట లో మైనర్లు వీరంగం..

హైదరాబాద్ : అంబర్ పేట లో మైనర్లు వీరంగం సృష్టించారు. కారును ర్యాష్ గా డ్రైవ్ చేయటంతో నాలుగు కార్లు ఓ బైకు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మైనర్ ని అదుపులోకి తీసుకున్నారు. సదరు కారులో వున్న మద్యం సీసాలు కూడా వున్నట్లుగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

పాక్ కాల్పుల్లో భారత్ జవాను మృతి..

జమ్మూకాశ్మీర్: పాక్ చొరబాటుదారులు మరొకసారి రెచ్చిపోయారు. జమ్మూకాశ్మీర్ల‌లోని మచిల్ సెక్టార్‌లోకి ఉగ్రవాదులు తెగబడి కాల్పులు జరిపారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా ధళాలు మట్టుబెట్టాయి. ఎదురుకాల్పుల్లో మంజీర్ సింగ్ అనే భారత జవాను చనిపోయాడు.

08:25 - October 29, 2016

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రాజధాని అమరావతి నిర్మాణానికి మరో కీలక ఘట్టానికి శుక్రవారం శంకుస్థాపన చేసింది. రాజధానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ భవానాలకు శంకుస్థానప చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపనచేశారు.గతంలో అమరావతి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోదీ నీరు..మట్టి ఇచ్చారు. నేడు ఆర్థిక మంత్రికూడా ఏపీకి ఎంతో చేస్తామనీ..అండగా వుంటామనీ..ప్రత్యేక ప్యాకేజీలో చెప్పినవీ చెప్పనివీ కూడా చేస్తామని పాత పాటే పాడారు..రాష్ట్రానికి కొత్తగా వరాలేవీ ఇవ్వకుండానే.. అడ్మినిస్ట్రేటివ్‌ సిటీకి శంకుస్థాపన చేసేసి వెళ్లిపోయారు. రాజధాని నిర్మాణంలో ఏపీని ఒంటరిగా వదిలేయబోమని, రెవెన్యూ లోటును కూడా తామే భర్తీ చేస్తామని హామీలు గుప్పించి వెళ్లిపోయారు. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో గఫూర్ (సీపీఎం నేత),రవి చంద్రారెడ్డి (కాంగ్రెస్ నేత), ఆనంద్ బాబు (టీడీపీ ఎమ్మెల్యే) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న నేతల అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

 

చైనీస్‌ రెస్టారెంట్‌లో అగ్రిప్రమాదం..

సికింద్రాబాద్‌ : వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని గోకుల్‌ చైనీస్‌ రెస్టారెంట్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కిచెన్‌లోని ఫర్నిచర్‌, వంట సామగ్రి, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. పోలీసులు, సికింద్రాబాద్‌ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోని మంటల ఆర్పివేశారు. రెస్టారెంట్‌ భవనం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. రెస్టారెంట్‌లో ఉన్న సిబ్బందిని పోలీసులు సురక్షితంగా కాపాడారు.

07:58 - October 29, 2016

ఢిల్లీ : హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల జాప్యంపై సుప్రీంకోర్టు కేంద్రానికి మొట్టికాయలు వేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను భేఖాతరు చేయడంపై ధ్వజమెత్తింది. జడ్జీలు లేక అనేక కోర్టు గదులకు తాళాలు వేయాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొంది. కేంద్రం అహంకార వైఖరిని వీడి న్యాయవ్యవస్థను రక్షించేందుకు కృషి చేయాలని సూచించింది.

వ్యవస్థలు నిలిచిపోయే పరిస్థితిని తీసుకురావద్దని కేంద్రానికి హెచ్చరిక
హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జడ్జీల నియామ‌కంపై అల‌స‌త్వం ప్రద‌ర్శిస్తున్న కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం ఉదాసీనత కారణంగా వ్యవస్థలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. జడ్జీలు లేక అనేక కోర్టు గదులకు తాళాలు వేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, కర్ణాటక హైకోర్టులో గ్రౌండ్‌ పూర్తిగా మూసివేయడం జరిగిందని పేర్కొంది. వ్యవస్థలు నిలిచిపోయే పరిస్థితిని తీసుకురావద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని హెచ్చరించింది.

హైకోర్టు జడ్జీల నియామ‌కాల్లో కేంద్రం అల‌స‌త్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
జడ్జిల నియామక ప్రక్రియకు విధివిధానాలు ఎందుకు ఖరారు చేయడం లేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. న్యాయమూర్తుల నియామకంపై కొలీజియం సిఫార్సులు చేసినా ప్రభుత్వం తాత్సారం చేయడాన్ని తప్పు పట్టింది. ఈ అంశంలో కేంద్రం అహంకార వైఖరిని వీడాలని, న్యాయవ్యవస్థను రక్షించేందుకు కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్‌ సూచించారు. మీతో పోరాడాల‌ని మాకు లేదు, కానీ మీరు ఇలాగే వెళ్తే, మేం అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రంతో అమీ తుమీకి సిద్ధపడడం తమ అభిమతం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.

కొలీజియం పంపిన లిస్టులో చాలామంది పేర్లపై అభ్యంతరాలున్నాయి
కొలీజియం పంపిన లిస్టులో చాలామంది పేర్లపై అభ్యంతరాలున్నాయని కేంద్రం తరపున అటార్ని జనరల్‌ ముకుల్‌ రోహ్తగి కోర్టుకు చెప్పారు.

75మంది పేర్ల లిస్టును ఫిబ్రవరిలో కేంద్రానికి అందించిన కొలీజియం
హైకోర్టు జడ్జిల నియామాకాలకు సంబంధించి కొలీజియం 75 మంది పేర్లతో కూడిన లిస్టును ఫిబ్రవరిలో కేంద్రానికి అందజేసింది. ఈ నియామకాలపై కేంద్రం ఇంతవరకు స్పందించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. తాము పంపిన లిస్టులోని పేర్లపై కేంద్రానికి ఏవైనా అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలని దీనిపై పునర్విచారణ జరుపుతామని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్‌ 11కు వాయిదా వేసింది.

07:51 - October 29, 2016

హైద‌రాబాద్ : నగరంలోని ఏపీ స‌చివాల‌య‌ భ‌వ‌నాల‌ను తెలంగాణ స‌ర్కార్‌కు అప్పగించే విషయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇద్దరు ముఖ్యమంత్రుల క్యాంపు కార్యాలయాల నుంచి రాజ్‌భవన్‌ వరకు ఇదే అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సచివాలయం భవనాలను అప్పగిస్తే ఏపీకి ప్రత్యామ్నాయంగా హెర్మిటేజ్‌ బల్డింగ్‌ ఇస్తామని తెలంగాణ సర్కార్‌ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న సచివాలయం స్థానంలో ఆధునిక హంగులతో కొత్త భవనాలు నిర్మించాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో ఉన్న భవనాల్లో కొన్నింటిని తెలంగాణకు, మరికొన్నింటిని ఏపీకి కేటాయించారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనాలను నిర్మించుకున్న ఏపీ ప్రభుత్వం... అధికార యంత్రాంగం మొత్తాన్ని అక్కడకు తరలించింది. కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణానికి వీలుగా ఖాళీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ భవనాలను తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.

ఏపీ సచివాలయ భవనాల అప్పగింతకు తెలంగాణ మంత్రివర్గం తీర్మానం
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దఫదఫాలుగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. సచివాలయ భవనాలు అప్పగించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ కేబినెట్‌ చేసిన తీర్మానాన్ని సీఎం కేసీఆర్‌ గవర్నర్‌కు అందచేశారు. నరసింహన్‌ ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించడంతో సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఇటీవల విజయవాడలో జరిగిన టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో కూడా సచివాలయం భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే అంశంపై చర్చించారు. తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అలంబించాలన్న అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. ఈనెల 31న విజయవాడలో జరిగే ఏపీ మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ భవనాలు కావాలి -ఏపీ
అయితే సచివాలయం భవనాలను అప్పగించే విషయంలో ఏపీ ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలో ఉన్న ఉమ్మడి సంస్థల పంపకం విషయంలో తెలంగాణ సర్కార్‌ స్పష్టత ఇచ్చిన తర్వాతే హైదరాబాద్‌లోని సచివాలయం భవనాలను అప్పగించాలని కొందరు మంత్రులు చంద్రబాబు దృష్టికి తెచ్చారని సమాచారం. సచివాలయ భవనాలను అప్పగిస్తే ప్రత్యామ్నాయం చూపాలని ఏపీ కోరుతోంది. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలోని కొన్ని భవనాలు కావాలని ఏపీ ప్రతిపాదిస్తోంది. లేనిపక్షంలో హాకా భవన్‌ ఇవ్వాలని సూచిస్తోంది. ఇది కాకపోతే జూబ్లీ హాల్‌ అప్పగిస్తే... ఏపీ భవన్‌ నిర్మించుకునేందుకు వీలుంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

హెర్మిటేజ్‌ భవన్‌ ఇస్తామంటున్న తెలంగాణ సర్కార్‌
అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. హాకా భవన్‌ వెనుక ఉన్న హెర్మిటేజ్‌ బిల్డింగ్‌ను ఇస్తామన్న ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఈ భవనంలో ఉన్న కార్యాలయాలను ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మౌకిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ప్రత్యామ్నాయ భవనాలు లేదా స్థలం విషయంలో ఏపీ ప్రభుత్వ మరో ప్రతిపాదన కూడా ముందుకు తెచ్చిందని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఆదర్శ్‌నగర్‌లో ఉన్న పాత రిట్జ్‌ హోటల్‌ స్థలాన్ని అడగాలని ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. సచివాలయం, అసెంబ్లీకి అతిసమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఏపీ భవన్‌ నిర్మాణానికి అనుకూలమని ఏపీ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం భవనాలను తెలంగాణకు అప్పగింత, ఏపీకి ప్రత్యామ్నాయ భవనాల కేటాయింపు విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. 

07:43 - October 29, 2016
07:40 - October 29, 2016

గుంటూరు : మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌లకు భద్రత మరింత పెరిగింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంతోపాటు, ఎన్టీఆర్ ట్రస్టు భవన్ దగ్గర అదనపు భద్రతతోపాటు, నిఘా పెంచారు. చంద్రబాబునాయుడు, లోకేశ్‌ల టార్గెట్‌గా ఆత్మాహుతి దాడులు చేస్తామన్న మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం... ఈ ఇద్దరి భద్రత కట్టుదిట్టం చేసింది.

ప్రతీకార జ్వాలలతో రగిలిపోతున్న మావోయిస్టులు
ఏవోబీ ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టులు ప్రతీకార జ్వాలలతో రగిలిపోతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు పూర్తి బాధ్యత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదే అంటూ మావోయిస్టు నేత శ్యాం పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ఈయన తనయుడు లోకేశ్‌లపై ఆత్మహుతి దాడులు జరుపుతామంటూ హెచ్చరించారు.

చంద్రబాబు నివాసం, ప్కార్‌ హయత్‌ హోటల్‌ దగ్గర ప్రత్యేక భద్రత
మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ పోలీసులు చంద్రబాబునాయుడు భద్రతను కట్టుదిట్టం చేశారు. చంద్రబాబు పాల్గొనే అన్ని కార్యక్రమాల్లో తనిఖీలు, సోదాలు విస్తృతం చేశారు. అడుగడుగునా ప్రత్యేక నిఘా ఉండేలా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంతోపాటు, కుటుంబ సభ్యులు తాత్కాలికంగా బస చేస్తున్న బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌ దగ్గర కూడా అదనపు భద్రతా సిబ్బందిని నియమించారు. ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు సానుభూతిపరులు, ప్రజా సంఘాల నేతలు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో టీడీపీ కార్యాలయం దగ్గర విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. మరింత భద్రత ఏర్పాటు చేశారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు కూడా అదనపు భద్రత ఏర్పాటు చేశారు. లోకేశ్‌ పర్యటనలను భద్రతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. లోకేశ్‌ పాల్గొనే కార్యక్రమాల్లో నిఘా కూడా పెంచారు.

చంద్రబాబు, లోకేశ్‌ల మరింత భద్రత
ఏపీలోచంద్రబాబు, లోకేశ్‌ల భద్రత చంద్రబాబు, లోకేశ్‌ల భద్రత మరింత పెంచారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం, విజయవాడలోని క్యాంపు కార్యాలయంతోపాటు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో కూడా భద్రత పెంచారు. తాత్కాలిక సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర కూడా విస్తృత భద్రత ఏర్పాటు చేశారు.  

07:32 - October 29, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణకు తెలంగాణ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్‌ క్లాసులు ప్రారంభించబోతుంది. ఇందుకోసం రాష్ట్రంలోని 1500 పాఠశాలలను ఎంపిక చేయబోతున్నారు. డిజిటల్‌ తరగతుల అమలులో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు సర్కార్‌ కసరత్తు చేస్తోంది.

నవంబర్‌ 14 నుంచి 1500 స్కూళ్లలో డిజిటల్‌ తరగతులు
ప్రభుత్వ పాఠశాలల సంస్కరణల్లో భాగంగా విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు బోధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్‌ 14న రాష్ట్రంలో 1500 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఇందుకోసం అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దేందుకు రూపకల్పన
రాష్ట్రంలో డిజిటల్‌ తరగతులు ప్రారంభించి.. దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని కడియం అన్నారు. డిజిటల్‌ తరగతులు ప్రారంభించే పాఠశాలల వివరాలను జిల్లాలవారీగా తయారుచేయాలని, వసతులు, మరమ్మతులకు సంబంధించిన వివరాలు తెలపాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్‌ తరగతులు నిర్వహించే పాఠశాలల్లోని టీచర్లకు అవసరమైన శిక్షణను నవంబర్‌ 10లోగా పూర్తి చేయాలన్నారు. ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టులను ఎన్ సీఈఆర్టీ రూపొందించిన సబ్జెక్ట్‌ కంటెంట్‌ను విద్యార్థులకు డిజిటల్‌ తరగతుల ద్వారా బోధించనున్నారు. ఎంపిక చేసిన 1500 పాఠశాలల్లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, మన టీవీ ద్వారా డిజిటల్‌ తరగతులపై శిక్షణ ఇవ్వనున్నట్లు కడియం తెలిపారు. మొత్తానికి మారుతున్న కాలానుగుణంగా కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లలోనూ డిజిటల్‌ తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. మరి డిజిటల్‌ తరగతుల అమలులో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా తీర్చదిద్దాలనుకుంటున్న ప్రభుత్వ లక్ష్యం ఎంతమేరకు సఫలీకృతమవుతుందో చూడాలి. 

07:28 - October 29, 2016

హైదరాబాద్ : రాజ్ భవన్ లో రెండురోజుల ముందుగానే దీపావళి వెలుగులు విరజిమ్మాయి.ఏ సంప్రదాయ వేడుకలోనైనా తమదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గవర్నర్ నరసింహన్ దంపతుల ప్రత్యేకత. రెండురోజుల ముందుగానే దీపావళి వేడుకలను రాజ భవన్ లో ఘనంగా జరిపించారు. రాజ్‌ భవన్‌ లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగకు 48 గంటల ముందే గవర్నర్‌ దంపతులు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో గవర్నర్‌ దంపతులు పాల్గొన్నారు. దీపావళి సంబరాల్లో చిన్నారుల డ్యాన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

07:23 - October 29, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వల్ల జరగనున్న నష్టాన్ని వివరించారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే సచివాలయం తరలింపుపై కూడా గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. ఏపీ సచివాలయానికి కేటాయించిన భవనాలు అప్పగించే నేపథ్యంలో తాత్కాలిక వసతికి ఏపీ అడిగిన భవనాన్ని ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. నవంబర్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. 

07:19 - October 29, 2016

గుంటూరు : అవే హామీలు..! అవే లెక్కలు...! అమరావతి వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మళ్లీ పాత పాటే పాడారు. రాష్ట్రానికి కొత్తగా వరాలేవీ ఇవ్వకుండానే.. అడ్మినిస్ట్రేటివ్‌ సిటీకి శంకుస్థాపన చేసేసి వెళ్లిపోయారు. రాజధాని నిర్మాణంలో ఏపీని ఒంటరిగా వదిలేయబోమని, రెవెన్యూ లోటును కూడా తామే భర్తీ చేస్తామన్నారు.

శిలాఫలకం ఆవిష్కరించిన అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు
ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ సిటీ నిర్మాణానికి.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శంకుస్థాపన చేశారు. శుక్రవారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో జైట్లీతో పాటు, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్య సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ఐదేళ్లలో ఏపీకి 2 కోట్ల 3లక్షలు ఇస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్ర సంస్థలు మంజూరు చేశామన్నారు. నాబార్డు నిధులతో పోలవరాన్ని వేగంగా పూర్తి చేస్తామన్నారు జైట్లీ. క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు.

హోదాతో దక్కే ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో ఉన్నాయి : చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో అరుణ్‌జైట్లీని ఆకాశానికెత్తేశారు. రాష్ట్రానికి జైట్లీ ఎంతో సాయం చేశారని, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, నాబార్డు ద్వారా 100 శాతం నిధులు కేటాయించారని చెప్పారు. ప్రత్యేక హోదాతో దక్కే ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో ఉన్నాయని, అందుకే తాను ప్యాకేజీకి ఒప్పుకున్నట్లు తెలిపారు. ప్యాకేజీపై కాంగ్రెస్‌, వైసీపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చంద్రబాబు దుయ్యబట్టారు.

ఏపీ అభివృద్ధిపై కేంద్రానికి ప్రత్యేక శ్రద్ధ : వెంకయ్య
ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు కేంద్రమంత్రి వెంకయ్య. అమరావతి గ్రేటర్‌ అమరావతి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఏపీలోని అన్ని ప్రాంతాలను రాజధానికి అనుసంధానం చేస్తామని, గన్నవరం ఎయిర్‌పోర్టుకు మెట్రోరైల్‌ వేస్తామని వెంకయ్య హామీ ఇచ్చారు. మోదీ, బాబు జోడీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు.

ఏడు వరుసల రహదారుల నిర్మాణానికి జైట్లీ శంకుస్థాపన
లింగాయపాలెంలో ప్రభుత్వ పరిపాలన భవనాల సముదాయంతో పాటు మరిన్ని కార్యక్రమాలకు కేంద్రమంత్రులు శంకుస్థాపనలు చేశారు. రిజర్వ్‌బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం, విజయవాడలో మురుగునీటి పారుదల వ్యవస్థ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణంతో పాటు రాజధానిలో రోడ్ల నిర్మాణానికి శిలాఫలకాలు ఆవిష్కరించారు.

కుకట్ పల్లిలో జాబ్ మేళా..

హైదరాబాద్ : వాణిజ్యాభివృద్ధ్దిలో కీలకపాత్ర పోషించే ఫ్రీలాన్స్ డిజిటల్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ రంగాల్లో నిరుద్యోగులను ప్రోత్సహించే లక్ష్యంతో ఓడీసీ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో డిజిటల్ మార్కెటింగ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఓడీసీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పడిగల శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం కూకట్‌పల్లిలోని ఓడీసీ కార్యాలయంలో ఉద్యోగ మేళా ఉంటుందన్నారు. డిగ్రీ, ఎంబీఏ, బీబీ ఏ, బీటెక్, ఎంటెక్, పీజీ చేసిన వారు అర్హులన్నారు. వివరాలకు 99890 51527, 9989051514 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

ఉస్మానియా పరిధిలో పరీక్షలు వాయిదా..

హైదరాబాద్ : ఉస్మానియాయూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 2 పరీక్ష వచ్చేనెల 11వ తేదీన జరుగనున్న నేపథ్యంలో ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు చెప్పారు. ఆ పరీక్షను తదుపరి నిర్వహించే తేదీ వివరాలను ఓయూ వెబ్‌సైట్ WWW.OSMANIA.AC.INలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.

Don't Miss