Activities calendar

30 October 2016

21:55 - October 30, 2016

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీలో భారత జట్టు విజేతగా నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో భారత్ 3-2 స్కోరుతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ పై విజయం సాధించింది. దీపావళి రోజున భారత హాకీ ఆటగాళ్లు ట్రోఫీ సాధించి భారత్‌కు తీపి కానుకగా అందించారు. ఈ మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. భారత ఆటగాడు రూపిందర్‌ పాల్‌ సింగ్‌ తొలి గోల్‌ సాధించి జట్టుకు శుభారంభం అందించాడు. 23వ నిమిషంలో భారత ఆటగాడు అఫాన్‌ యూసుఫ్‌ మరో గోల్‌ చేయడంతో ఆధిక్యం 2-0కి పెరిగింది. కాగా ఆ తర్వాత పాక్‌ వరుసగా రెండు గోల్స్‌ చేయడంతో ఇరు జట్ల స్కోర్లు 2-2తో సమమయ్యాయి. ఈ దశలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. మ్యాచ్‌ మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా, నికిన్‌ తిమ్మయ్య గోల్‌ చేయడంతో భారత్‌ మళ్లీ 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పాక్‌ ఆటగాళ్లు గోల్‌ చేయలేకపోయారు. భారత్‌ మ్యాచ్‌తో పాటు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీని గెలవడమిది రెండోసారి. భారత హాకీ జట్టుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

21:53 - October 30, 2016

సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది.. పాక్‌ ఆర్మీ క్యాంపులపై భారత్‌ దాడితో రెచ్చిపోయిన ఉగ్రవాదులు... మళ్లీ కాల్పులకు తెగబడ్డారు.. కుప్వారాలో భద్రతాదళాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో BSF జవాను గాయపడ్డాడు.. ఉగ్రవాదుల కాల్పులకు భారత బలగాలు ధీటుగా సమాధానమిచ్చారు.

21:52 - October 30, 2016

జమ్ముకాశ్మీర్‌ : వేర్పాటువాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. అనంతనాగ్ జిల్లాలో ప్రభుత్వ హైయర్ సెకండరీ పాఠశాల భవనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పాఠశాల భవనం చాలావరకు దెబ్బతింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌లో హతమైనప్పటి నుంచీ వేర్పాటువాదులు విద్యా సంస్థలను టార్గెట్ చేసుకున్నారు. గడచిన నాలుగు నెలల్లో 25 పాఠశాలలు, కళాశాలలను వేర్పాటువాదులు, ఆందోళనకారులు తగులబెట్టారు.

 
21:50 - October 30, 2016

మహాబూబ్ నగర్ : మహాజన పాదయాత్ర ద్వారా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్లకు వచ్చిన తమ్మినేనికి మందకృష్ణ మాదిగ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేండున్నరేళ్లు గడుస్తున్నా.. ప్రజలు కోరుకున్న పాలన జరగడం లేదని మందకృష్ణ అన్నారు.

21:48 - October 30, 2016

హైదరాబాద్ :  దేశ ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటామన్నారు. అందరి జీవితాల్లో చీకటిని పారదోలి వెలుగునింపాలని వెంకయ్య అన్నారు.

 
21:44 - October 30, 2016
హైదరాబాద్ : మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ కోవర్టు ఆపరేషన్‌ అని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌ అన్నారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో లేఖ విడుదల చేసిన జగన్‌.. బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నవంబర్‌ 3న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో 34 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు చెప్పారు. రాష్ట్ర కమిటీ సభ్యులు దయ, గణేశ్‌, డివిజన్‌ కమిటీ సభ్యుడు రైను, ఏరియా కమిటీ సభ్యులు మధు, మమత, లత, హరి, స్వరూప, ఆర్కే కొడుకు మున్నా, బిర్సు, గంగాల్‌, శ్వేత, బుద్రి, మురాయ్‌, మల్లేశ్‌, బెంగాలి సురేశ్‌, రాజన్న, సుధీర్‌, లత, బీమాల్, రమేశ్, ఎర్రాలు, జ్యోతి, రూపి, దినేశ్‌, జరీనా, రామ్‌కి పేర్లను మావోయిస్టులు ప్రకటించారు. 40 ఏళ్ల విప్లవోద్యమ చరిత్రలో ఇంతటి నష్టాన్ని చవిచూడలేదన్నారు. కోవర్టు కుట్రకు పాల్పడ్డ అధికారులు, ప్రభుత్వాలపై ప్రతీకారం తప్పదని జగన్‌ హెచ్చరించారు.
 
 
21:42 - October 30, 2016

కరీంనగర్ : ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులే వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు.. అమ్మాయిల్ని మాయమాటలతో లొంగదీసుకుంటూ డిపార్ట్‌మెంట్‌ పరువుతీస్తున్నారు. ఇందుకు నిదర్శనమే కరీంనగర్ త్రీటౌన్‌ ఎస్సై రఫీఖాన్‌. మొదట వివాహమైనా ఎవరికీ తెలియకుండా రఫీఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో విషయం వెలుగులోకి వచ్చింది.సమాజాన్ని కాపాడాల్సిన పోలీసులు సమాజానికి చేటుగా మారుతున్నారు. స్ర్తీలను రక్షించాల్సిన రక్షకభటులు మోసాలకు పాల్పడుతున్నారు. కరీంనగర్‌లో ఎస్సైగా పనిచేస్తున్న రఫీఖాన్ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మొదట వివాహం జరిగినా...జరగనట్టు నటించి..వైద్యురాలుగా పనిచేస్తున్న వాణీలతను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడని వాణీలత తరపు బంధువులు ఆరోపించడంతో రఫీఖాన్‌ గుట్టు రట్టయ్యింది.హుజూరాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ వాణీలతకు, ఎస్సై రఫీఖాన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహానికి దారితీసింది. ఈనెల 26న తన కుమార్తె కనిపించడంలేదంటూ వాణీలత తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురిని మాయమాటలతో మోసం చేసాడంటూ రఫీఖాన్‌పై కమిషనర్ కమలాసన్‌ రెడ్డిని ఆశ్రయించారు. ఆ సమయంలోనే రఫీఖాన్‌కు రెండో వివాహం జరిగిందని తెలియడంతో షాక్‌ అయ్యారు. తమ కుమార్తెకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు.కరీంనగనర్ త్రీటౌన్‌ ఎస్సైగా పనిచేస్తున్న రఫీఖాన్‌కు 2008 ఆగస్ట్ 21న సెరీనాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొంతకాలంగా మొదటి భార్య సెరినాను విడాకుల కోసం వేధిస్తున్నాడని ఆమె తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. వాణీలతను వివాహం చేసుకోవడం కోసమే అలా ప్రవర్తిస్తున్నాడని చెబుతున్నారు. అయితే రఫీఖాన్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వారిని ఉద్యోగాలను తొలగించాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా పై అధికారులు స్పందించి... ప్రేమపేరుతో వంచిస్తున్న ఎస్‌ఐ రఫీఖాన్‌ను కఠినంగా శిక్షించి..తమకు న్యాయం చెయ్యాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

 
 
21:39 - October 30, 2016

హైదరాబాద్:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సుధీర్ఘంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. రేపటి ఏపీ కేబినెట్‌ భేటీ నేపథ్యంలో సచివాలయంలో ఆ రాష్ట్రానికి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించాలన్న తీర్మానంపై చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు బ్రిబేష్ కుమార్ ట్రిబ్యునల్‌ నిర్ణయంపై తీసుకోనున్న చర్యలపై మంతనాలు జరిపినట్లు సమచారం.రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ముందుగా గవర్నర్‌ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. పలు కీలక విషయాలు నరసింహన్‌ దృష్టికి తెచ్చారు. సోమవారం ఏపీ కేబినెట్ భేటీ అవుతున్న నేపథ్యంలో.. సచివాలయ భవనాల అప్పగింతకు సంబంధించి గత మంత్రి మండలి చేసిన తీర్మానంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నూతన సచివాలయం నిర్మాణంపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ విపక్షాలు కోర్టులను ఆశ్రయించిన విషయంపై వివరించినట్లు సమాచారం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రతిపాదికగా నిర్మాణాలు చేపడుతున్నట్లు కేసీఆర్‌ గవర్నర్‌కు చెప్పినట్లు సమాచారం.బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయం ఇరు రాష్ట్రాల రైతులకు నష్టంవాటిల్లే విధంగా ఉందని.. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం కూడా స్పందిస్తే బాగుంటుందని కేసీఆర్ గవర్నర్‌ దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. న్యాయపోరాటం కోసం నియమించిన క్యాబినేట్ సబ్ కమీటి తీసుకున్న నిర్ణయాలను కూడా గవర్నర్‌కి వివరించినట్లు సమాచారం. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖకు చెందిన వారితో సమావేశం ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఇటీవల ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టుల విషయంపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. బిసి కమిషన్ నియమాకం పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం ఏపీ కేబినెట్‌ భేటీ అవుతున్న సందర్భంగా.. తెలంగాణ సీఎం గవర్నర్‌తో సమావేశం కావడం హాట్‌టాఫిక్‌గా మారింది.

 
 
21:36 - October 30, 2016

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పిల్లలు, పెద్దలు దీపావళి వేడుకల్లో మునిగిపోయారు. బాణసంచా కాల్చుతూ ఆనందిస్తున్నారు. మహిళలు ప్రమిదలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో చిన్నారులతో రాష్ట్రపతి దీపావళి వేడుకలు జరుపుకోగా.. హిమచల్‌ ప్రదేశ్‌లో జవాన్లతో ప్రధాని మోదీ దీవాళి సంబరాలు చేసుకున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.టపాసుల మోతలు..మిఠాయిలు పంచుతూ ఆత్మీయ పలకరింపులు..పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ దీపావళి సంబరాలను జనం ఆస్వాదిస్తున్నారు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చిన్నారులతో సరదాగా గడిపి వారికి చాక్లెట్లను అందజేశారు. దీపావళి సందర్భంగా ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి వేడుకలు జవాన్లతో జరుపుకున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నూర్‌ జిల్లాలోని ఐటీబీపీ జవాన్లను ఆయన కలిశారు. ఈ సందర్భంగా మోదీ సైనికులకు మిఠాయిలు పంచారు. దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లతో మోదీ దీపావళి సంబరాలు జరుపుకోవడం తొలిసారి కాదు. గత రెండు దీపావళి వేడుకలను ఆయన సైనికులతోనే జరుపుకొన్నారు. జవాన్లకు మద్దతుగా కోట్లాది మంది దీపాలు వెలిగిస్తున్నారని సైనికులతో మోదీ అన్నారు. ప్రధాని అభ్యర్థిగా తన తొలి బహిరంగ సభలోనే ఒకే ర్యాంక్‌ ఒకే వేతనంపై హామీ ఇచ్చానని వెల్లడించారు. ఈ దీపావళిని జవాన్లకు అంకితిమిస్తున్నట్లు తెలిపారు.తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ప్రజా దర్బార్‌లో భాగంగా గవర్నర్‌ సాధారణ ప్రజలను కలిశారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పరిష్కరిస్తారన్న నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. రాజ్‌భవన్‌ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా గవర్నర్‌ దంపతులకు ఫోన్‌ చేసి దీవాళి విషేస్‌ తెలిపారు.  మొత్తంగా దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.

 
 
21:25 - October 30, 2016

కరీంనగర్‌ : టవర్ సర్కిల్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. టపాసులు పేలుస్తుండగా నిప్పురవ్వలు ఎగిరిపడి...సంగీత వస్త్ర దుకాణంలో మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

20:35 - October 30, 2016

కరీంనగర్ లో దీపావళి ప్రమాదం..

కరీంనగర్ : టవర్ సర్కిల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సంగీత వస్త్ర దుకాణంలో మంటలు ఎగిరిపడుతున్నాయి. నిప్పురవ్వలు ఎగిరిపడి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

20:08 - October 30, 2016
19:45 - October 30, 2016

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పులి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నికీషా పటేల్. ఈ మూవీలో నిఖిషా పటేల్ పోలీస్ గెటప్ లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. కన్నడలో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ, తెలుగు సినిమాలకి మాత్రం అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ఈ మధ్య కాలంలో తెలుగు నుండి ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వస్తుండటంతో...ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. తాజాగా 'అరకు రోడ్ లో' నటిస్తోంది. రాం శంకర్ హీరోగా నటించారు. దీపావళి పండుగ సందర్భంగా టెన్ టివి 'నిఖిషా'తో ముచ్చటించింది. మరి ఆ ముద్దుగుమ్మ ఎలాంటి విశేషాలు తెలిపారో చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:32 - October 30, 2016

విశాఖపట్టణం : జిల్లాల్లో దీపావళి పండుగ సందడి నెలకొంది. దీపావళి సందర్భంగా హారతి పూజలను నిర్వహిం చారు. వ్యాపారస్తులు దుకాణ సముదాయాల వద్ద ఉదయం నుంచే పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. నేడు లక్ష్మి పూజ నిర్వహించి దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు బాణాసంచా కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:11 - October 30, 2016

హైదరాబాద్ : దీపావళి సందడి నగరంలో ప్రారంభమయ్యింది. తారాజువ్వలు తారాపథంలో దూసుకపోతున్నాయి. చిచ్చు బుడ్డులు..భూ చక్రాలను పిల్లలు కాల్చుకుంటూ సందడి చేస్తున్నారు. వెలుగుల దీపావళి పండుగలో ప్రమిదలు, బొమ్మలు, టపాసులే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. వివిధ దీపాలతో ఇళ్లను అందంగా అలంకరిస్తున్నారు. ఈ దీపాల కాంతుల్లో ఇళ్లు ధగధగమంటున్నాయి. మరోపక్క బాణసంచా రేట్లను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ధరలు చూసి దీపావళి ఆనందం సగం ఆవిరి అయిపోతోంది. గతేడాదితో పోల్చితే రేట్లు రెట్టింపు అయ్యాయి. పండగ రోజు కావడంతో రేట్లు మరింత ఆకాశాన్నంటుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఏవోబీ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ లేఖ..

హైదరాబాద్ : ఏవోబీ ఎన్ కౌంటర్ పై భారత మావోయిస్టు పార్టీ పేరిట లేఖ విడుదలైంది. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 21 మంది పేర్లను ప్రకటించారు. ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ కామ్రెడ్ లున్నట్లు పేర్కొంది. తీవ్రంగా గాయపడిన 11 మంది కామ్రెడ్లను పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపారని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ కోవర్టు ఆపరేషన్ అని తెలిపారు. దీనికి నిరసనగా నవంబర్ 3న ఐదు రాష్ట్రాల బంద్ ను విజయవంతం చేయాలని లేఖలో మావోయిస్టులు కోరారు. 40 ఏళ్ల విప్లవ చరిత్రలో ఇంతమంది కోల్పోవడం తొలిసారని తెలిపారు. కోవర్టులున తయారు చేసి బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారని తెలిపారు.

ఆస్ట్రేలియాలో భారతీయుడి సజీవదహనం..

ఢిల్లీ : ఆస్ట్రేలియాలో భారతీయుడిని దుండగులు హత్య చేశారు. భారత డ్రైవర్ ను సజీవ దహనం చేశారు. దాడి ఘటనపై ఆసీస్ ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సజీవదహనం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. భారతీయుడిని సజీవదహనం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ కోరారు. 

18:15 - October 30, 2016

జమ్మూలో మరో స్కూల్ లో అగ్నిప్రమాదం..

జమ్మూ కాశ్మీర్ : మరోసారి పాఠశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కబా మార్గ్ లో ప్రభుత్వ పాఠశాలలో మంటలు చెలరేగాయి. గడిచిన రెండు నెలల్లో 20 స్కూళ్లల్లో అగ్నిప్రమాదాలు సంభవించడం గమనార్హం. 

17:22 - October 30, 2016

సంగారెడ్డి : దీపావళి వచ్చిదంటే ఇంటి నిండా దీపాలు వెలుగులు ఉంటాయి. అంతేగాకుండా వీధుల్లో టపాసుల మోతతో దద్ధరిల్లుతుంటాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. టపాసుల విక్రయాలు లేక వెలవెలబోతున్నాయి. గత సంవత్సరం కంటే కొనుగోళ్లు తగ్గిపోయాయి. టపాసులు కాల్చడం వల్ల కాలుష్యం పెరిగిపోతోందనే విషయం ప్రజలను ఆలోచింప చేస్తోంది. జనంలో కాలుష్యంపై చైతన్యం పెరుగుతోంది. మెదక్ సంగారెడ్డిలో టపాసుల విక్రయాలు లేక వెలవెలబోతున్నాయి. అమ్మకాలు లేకపోవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఆన్ లైన్ కొనుగోళ్లు..కాలుష్యంపై చైతన్యం..నెలాఖరు కావడం కారణమని తెలుస్తోందని కొంతమంది వ్యాపారులు పేర్కొంటున్నారు. 

అఖిలేష్ చూడటానికి ఎగబడిన జనం..తొక్కిసలాట..

లక్నో : యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ను చూడటానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. దీనితో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్లు సమాచారం. సొంత గ్రామమైన సైఫైలో అఖిలేష్ పర్యటించారు. 

16:32 - October 30, 2016

నిజామాబాద్ : చనిపోయిన తరువాత గుర్తుండేందుకు సమాధిని నిర్మిస్తారు. అది సంప్రదాయం. కానీ బతికుండగానే ఒ వ్యక్తి తన సమాధిని నిర్మించుకున్నాడు. కొడుకులకు తాను చనిపోయిన తరువాత ఎలాంటి భారం కావద్దనుకున్నాడో.. మరేమోగానీ తన భార్య సమాధి వద్దే తన సమాధిని నిర్మించుకున్నాడు. జిల్లా కమ్మర్‌పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన పడాల గంగాధర్, భార్య పడాల చంద్రబాగు దంపతులకు ఇద్దరు కుమారులు. ఒకరు ఉపాధి నిమిత్తం అరబ్ దేశానికి వెళ్లగా... రెండవ కుమారుడు ఆర్ఎంపీ వైద్యునిగా పని చేస్తున్నాడు. కిరాణా కొట్టు నడుపుతూ జీవనం సాగించే గంగాధర్‌.. ప్రాణముండగానే తన సమాధి నిర్మించుకొని ఔరా అనిపిస్తున్నాడు. తన భార్య పడాల చంద్రబాగు ఏప్రిల్ 14, 2007లో డాబాపై నుండి పడి చనిపోయింది. జీవితాంతం కలిసి మెలసి ఉంటానన్న పెళ్లి నాటి ప్రమాణాలు గుర్తు తెచ్చుకొని గంగాధర్ తన వ్యవసాయ తోటలో భార్య సమాధి నిర్మించాడు. భార్య విగ్రహంతో పాటు తన విగ్రహన్ని ఏర్పాటు చేయించాడు. బతికుండగానే సమాధి కట్టించుకోవడాన్ని గ్రామస్తులు వింతగా చూస్తున్నారు.

కొడుకులపై నమ్మకం లేక కాదు..
బతికుండగానే సమాధి నిర్మించుకోవటం అంటే కొడుకుల పై నమ్మకం లేక కాదని..తన సహ ధర్మచారిణి ఒంటరి కాకూడదన్నదే తన కోరిక అని గంగాధర్‌ అంటున్నాడు. చంద్రబాగు పేరిట ఆమె కొడుకు అమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు గ్రామాల్లో పేదలకు దుస్తులు క్రీడా పరికరాలు అందిస్తున్నారు. సమాధి నిర్మాణ విషయంలో ఎవరేమనుకున్నా తనకు అవసరం లేదని.. సమాధి వద్ద ఉద్యానవనంగా తీర్చిదిద్ది బాటసారులకు సేదతీర్చుతానని గంగాధర్‌ చెబుతున్నాడు. 

16:30 - October 30, 2016

కడప : వాడవాడలా దీపావళి సంబరాలు ప్రారంభమయ్యాయి. దీపాలతో ఇంటిని అలంకరించేందుకు ఆకాశంలో బాణాసంచా వెలుగులు నింపేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. దీంతో మార్కెట్‌లు..షాప్‌లు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. అయితే టపాసుల ధరలు వినియోగదారులను హడలెత్తిస్తున్నాయి. ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వాపోతున్నారు. కడప జిల్లాలో దీపావళి సందడి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమిదలు.. టపాసుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా కడప నగరంలో మున్సిపల్ గ్రౌండ్స్‌లో టపాసుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. స్టేడియంలో ఏర్పాటు చేసిన టపాసుల స్టాళ్ల వద్ద జనం క్యూ కడుతున్నారు.

మరింత ప్రియంగా టపాసుల ధరలు..
అయితే టపాసుల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండటం లేదని కడప వాసులు చెబుతున్నారు. గతంతో పోల్చితే ఈ ఏడాది ధరలు విపరీతంగా ఉన్నాయంటున్నారు. టపాసుల ధరలు మరింత ప్రియంగా మారాయని తప్పక కొనుగోలు చేస్తున్నామంటున్నారు. ఈ పండుగ సంతోషకరంగా జరగడం లేదని....కష్టంగానే జరుపుకుంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాక్స్ లు అధికంగా వసూలు చేస్తుండటంతో తాము కూడా అధిక ధరలకు టపాసులు విక్రయించాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ట్యాక్స్‌లు.. అద్దెలు ఎక్కువగా ఉన్నాయని అందుకే ధరలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. లాభం లేకపోయినా.. నష్టం రాకుండా ఉంటే చాలని అనుకుంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. టపాసుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో విక్రయాలు గతం కన్నా బాగా తక్కువగా సాగుతున్నాయనే చెప్పాలి. 

16:28 - October 30, 2016

మహబూబ్ నగర్ : మహాజన పాదయాత్ర ద్వారా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజల సమస్యలు తెలుసుకుంటారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గత కొన్ని రోజులుగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతున్న తెలిసిందే. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్లకు వచ్చిన తమ్మినేనికి మందకృష్ణ మాదిగ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేండున్నరేళ్లు గడుస్తున్నా.. ప్రజలు కోరుకున్న పాలన జరగడం లేదని మందకృష్ణ అన్నారు. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పాలన జరుగుతందా ? లేదా ? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వెనుకబడిన వర్గాల వారి పరిస్థితి ఏంటీ తెలుసుకోవడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని సీపీఎం చేపట్టిందన్నారు. పాదయాత్ర చేసే వారికి కష్టాలు తెలుస్తాయని, తాను గతంలో కూడా పాదయాత్రలు చేసినట్లు చెప్పారు. సంకల్పం ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావని మందకృష్ణ పేర్కొన్నారు. 

16:15 - October 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ రాజ్ భవన్ కు వెళ్లారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించాలని కేసీఆర్ కోరినట్లు, రేపు జరిగే ఏపీ కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకొనే విధంగా చూడాలని కోరినట్లు సమాచారం. ఈ విషయంలో గవర్నర్ తో కేసీఆర్ రెండు పర్యాయాలు భేటీ అయ్యారు. కృష్ణా జలాల విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును గవర్నర్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 

గవర్నర్ ను కలిసిన కేసీఆర్...

హైదరాబాద్ : రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను సీఎం కేసీఆర్ కలిశారు. గవర్నర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు. ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించాలని కేసీఆర్ కోరనున్నట్లు తెలుస్తోంది. 

15:35 - October 30, 2016
15:34 - October 30, 2016

ఆదిలాబాద్ : ఆదివాసీల దండారి పండుగ సంప్రదాయబద్ధంగా ముగిసింది. గుస్సాడీ నృత్యాలు, కోలాటాలతో గిరిజనులు ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.. దీపావళికి వారం రోజుల ముందునుంచే ప్రారంభమయ్యే దండారి ఉత్సవాలపై 10టీవీ స్పెషల్ స్టోరీ.. అందరూ మైమరచిపోయేలా గిరిజనులు ఎంతో ఉత్సాహంగా దండారీ ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. దీపావళి నాటికి పరిసమాప్తమయ్యేలా వారం ముందు నుంచే వీరు ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలకు దీపావళి ప్రత్యేక పండగ.. ప్రత్యేక వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో ఏ గ్రామం చూసినా ఎంతో సందడిగా కనిపిస్తుంది.

వారం రోజుల ముందు..
దీపావళికి వారం రోజుల ముందు గిరిజన గ్రామాల్లో దండారి పండుగ మొదలవుతుంది. ఈ పండక్కి గిరిజనవాసులంతా తమ స్వస్థలాలకు చేరుకుంటారు. ఆడపడచుల్ని.. బంధువుల్ని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. ఈ ఉత్సవాల్లో ఆదివాసీలు చేసే నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సంప్రదాయం ప్రకారం తమ ఆరాధ్య దైవమైన అకాడీ పేన్‌కు గిరిజనులు పూజలు చేస్తారు. గుస్సాడీ టోపీలను ఇంటి ముందు ఉంచుతారు. తలపై నెమలి పించం టోపిని ధరించిన గుస్సాడీలు మెడలో గవ్వల మాలలను వేసుకుంటారు. శరీరానికి బూడిద, నల్లని రంగు పూసుకొని నడుముకు, జంతు చర్మాలుగానీ... ప్రత్యేకంగా కుట్టిన డ్రెస్‌లనుగానీ ధరిస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టుకొని సామూహికంగా గుస్సాడీ డ్యాన్సులు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని గ్రామవాసులంతా చూస్తారు.

దేవుడు ఆవహిస్తాడని నమ్మకం..
గుస్సాడీ వేషాధారణలో ఉన్న వారిని దేవుడు ఆవహిస్తాడని గిరిజనుల నమ్మకం. అందుకే ఈ వేషాధారణలో ఉన్న వారికి పాదాభివందనం చేస్తారు. గుస్సాడీ వేషాధారణలో ఉన్న వారుకూడా ఎంతో నిష్టతో ఉంటారు. వారం రోజుల పాటు నృత్యాలతో పాటు కోలాటాలు వేస్తారు. ఈ సంబరాలతో గిరిజన గ్రామాల్లో ఓ జాతర వాతావరణం కనిపిస్తుంది. పండగకు వచ్చిన వారందరికీ కొత్త బట్టలు పెట్టి అతిథి మర్యాదలు చేస్తారు ఆదివాసీలు. దండారి పండగ ఉత్సవాలుచేస్తే గ్రామ దేవత చల్లగా చూస్తుందని ఆదివాసీల విశ్వాసం.... అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని... సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని నమ్ముతారు.. అనాదినుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గిరిజనులు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

15:28 - October 30, 2016

విజయవాడ : దీపావళి వేడుకలు జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గ మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీ అవతారంలో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి అభరణాలతో అలంకరించారు. ఈ సందర్భంగా విశిష్టత గురించి ఆలయ పురాణ పండితులు టెన్ టివికి తెలిపారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:10 - October 30, 2016

సైనికులతో మోడీ దీపావళి..

కిన్నూర్ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కిన్నూర్ జిల్లాలోని ఐటీబీపీ జవాన్లను కలిశారు. ఈ సందర్భంగా సైనికులకు మోడీ మిఠాయిలు తినిపించారు. దేశ సరిహద్దులో ఉన్న జవాన్లతో మోడీ దీపావళి సంబరాలు జరుపుకున్నారు. 

కొనసాగుతున్న మెడికోల ఆందోళన..

గుంటూరు : ప్రొ.లక్ష్మీని అరెస్టు చేయాలని మెడికల్ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మెడికోలు ఆందోళన చేపట్టారు. 

విశాఖలో పోలీసుల విస్తృత తనిఖీలు..

విశాఖపట్టణం : ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టులు బంద్ కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనితో విశాఖలో పోలీసుల విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. 

14:30 - October 30, 2016

హర్యానా : ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం చెందిన ఆర్మీ జవాన్‌ మణ్ దీప్ సింగ్ అంత్యక్రియలు హర్యానాలో కురుక్షేత్రలో ముగిసాయి. అధికార లాంఛనాలతో వీరజవాన్‌ అంత్యక్రియలు నిర్వహించారు. ఎల్‌వోసీలోని మాచిల్‌ సెక్టార్‌లో మనీందర్‌ సింగ్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు కాల్పులకు దిగడంతో ఆయన మృతి చెందారు. దేశం కోసం అశువులు బాసిన సింగ్ మృతదేహాన్ని చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. 2008లో ఆర్మీలో చేరిన సింగ్‌ సిక్‌ రెజిమెంట్, 17 రాష్ట్రీయ రైఫిల్స్‌ వంటి ప్రదేశాల్లో విధులు నిర్వహించారు. దేశం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతో గర్వంగా ఉందని మణ్ దీప్ సింగ్ సోదరుడు సందీప్‌సింగ్ తెలిపారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రమూకలను మన ఆర్మీ ధీటుగా ఎదుర్కొందని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. 

14:28 - October 30, 2016

ఢిల్లీ : ఐక్యరాజ్య సమితి మొదటిసారి దీపావళి వేడుకలు నిర్వహించింది. న్యూయార్క్‌ ఉన్న UNO బిల్డింగ్‌ దీపాలతో మెరిసిపోయింది. హ్యాపీ దీపావళి అంటూ ఏర్పాటుచేసిన విద్యుత్ లైట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు న్యూయార్క్‌లో ఉన్న భారతీయులు దీపావళి సందరాల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన హ్యాపీ దీపావళి లైట్లపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

14:24 - October 30, 2016

కరీంనగర్ : ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులే వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు.. అమ్మాయిల్ని మాయమాటలతో లొంగదీసుకుంటున్న పోలీసులు..డిపార్ట్‌మెంట్‌ పరువుతీస్తున్నారు.. తాజాగా ఈ లిస్టులో కరీంనగర్‌ త్రీటౌన్‌ ఎస్సై రఫీఖాన్‌ చేరాడు.. రఫీఖాన్‌కు 2008 ఆగస్ట్ 21 న సెరినాతో వివాహం జరిగింది.. వీరికి ఇద్దరు కొడుకులున్నారు.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రఫీఖాన్‌... వాణీలత అనే వైద్యురాల్ని రెండో పెళ్లి చేసుకున్నాడు.. తన కూతురును రఫీఖాన్‌ మోసం చేశాడంటూ వాణీలత తండ్రి కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు.. తమ బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.. మరోవైపు కొన్ని నెలలుగా విడాకుల కోసం రఫీఖాన్‌ మొదటి భార్యపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

14:22 - October 30, 2016

ఢిల్లీ : ఇటలీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1 గా నమోదైంది. సెంట్రల్‌ ఇటలీలో ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ఆగ్రేయ పెరుజియాకు 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నెలకొని ఉందని అమెరికా భూగర్భ విజ్ఞాన సంస్థ తెలిపింది. భూమికి దాదాపు 108 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ప్రభావం ఆసియా దేశాలపై ఉండే అవకాశం ఉంది. వారం రోజుల్లో ఇటలీలో సంభవించిన భూకంపాల్లో ఇంది రెండోది. గత బుధవారం తూర్పు రోమ్‌ లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించగా.. దీని ప్రకంపనలు రాజధాని రోమ్‌ ను వణికించాయి. రెండు నెలల కిందట ఇటలీలో సంభవించిన భూకంపంలో వందల మంది మృతి చెందారు. 

ఇటలీలో మరోసారి భూకంపం..

ఢిల్లీ : ఇటలీ భూకంపంతో వణికిపోయింది. సెంట్రల్ ఇటలీలో భారీ ఎత్తున్న ప్రాణ..ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై 7.1గా నమోదైంది. వారం వ్యవధిలో ఇటలీలో రెండోసారి భూకంపం సంభవించింది. 

14:01 - October 30, 2016

చిరంజీవి తనకు దేవుడులాంటి వారని..చిరంజీవి నటిస్తున్న సినిమాలో ఒక్క సాంగ్ కు కొరియోగ్రాఫర్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు..ఇందుకు చిరంజీవిని కలుస్తానని టాలీవుడ్ కొరియాగ్రాఫర్ గణేష్ తెలియచేశారు. దీపావళి పండుగ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. పవన్ సినిమాలో ఒక్క బిట్ అయినా చేస్తానని..ఇందుకు ఎన్ని సినిమాలైనా వదులు కోవడానికి సిద్ధమేనన్నారు. తన జీవిత విశేషాలు..తన ప్లాన్స్..డ్యాన్స్..ఇతర విషయాలు తెలియచేశారు. అంతేగాకుండా పలువురు కాలర్స్ తో మాట్లాడారు. ఆయన ఎలాంటి విశేషాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి. 

13:28 - October 30, 2016
13:24 - October 30, 2016

కరీంనగర్ : త్రీ టౌన్ ఎస్ ఐ రఫీఖాన్ పై కమిషనర్ కమలాసన్ రెడ్డికి ఫిర్యాదు అందింది. మాయమాటాలు చెప్పి రఫీఖాన్ తన కూతుర్ని రెండో పెళ్లి చేసుకున్నాడంటూ యవతి తండ్రి కృష్ణమూర్తి ఫిర్యాదు చేశారు. మొదటి భార్య ఉండగానే రఫీఖాన్ మోసపూరితైన మాటలు చెప్పి... తన కూతురు వాణీలతను రెండో పెళ్లి చేసుకున్నాడని కమిషనర్ కమలాసన్ రెడ్డికి కృష్ణమూర్తి ఫిర్యాదు చేశారు. విడాకుల కోసం కొన్ని నెలలుగా మొదటి భార్యపై రఫీఖాన్ ఒత్తిడి తెస్తున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలున్నారు. రెండో బాబుకు 17 నెలల వయసు ఉంది. పీఎస్ కు వచ్చే అమ్మాయిల్ని మాయమాటలతో మోసం చేస్తాడంటూ రఫీఖాన్ పై ఆరోపణలు కూడా ఉన్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:11 - October 30, 2016

రోమ్ : ఇటలీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 శాతంగా నమోదు అయింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

12:58 - October 30, 2016

సిరిసిల్లా జిల్లాలో విషాదం..

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ మండలం ఆరేపల్లిలో దారుణం జరిగింది. నీటి గుంతలో పడి ఒక మహిళ, బాలుడు మృతి చెందారు. పశువులను కడగడానికి గుంతలోకి వెళ్లి.. నీటిలో మునిగి..ఊపిరాడక మాంజేటి మణెమ్మ అనే మహిళ మృతి చెందింది. అలాగే ఆమెను రక్షించడానికి వెళ్లిన ఛత్రపతి అనే బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

12:51 - October 30, 2016

తూర్పుగోదావరి : కాకినాడలో క్రాకర్స్‌ కొనకముందే మంట పుట్టిస్తున్నాయి. టపాసుల ధరలు దడ పుట్టిస్తున్నాయి. బాణసంచా ధరలు భగ్గుమంటున్నాయి. ఆకాశాన్ని అంటుతున్న ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు టపాసులు కొనాలంటే జంకుతున్నారు. పెరిగిన టపాసుల ధరలు పండగ ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. 
దీపావళి పండుగంటే కళ్లల్లో వెలుగులు
దీపావళి పండుగంటే కళ్లల్లో వెలుగులు చిచ్చుబుడ్డిలా విరజిమ్ముతాయి. కాకరపూవొత్తులు సందడి చేస్తాయి. సరదాను, ఆనందాన్ని పంచే ఈ వేడుకలను చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ తెగ ఎంజాయ్‌ చేస్తారు. కానీ వెలుగుల వేడుకకు.. ధరల సెగ తగిలింది. తారాజువ్వల్లా ధరలు ఆకాశానికి దూసుకెళ్తున్నాయి. టపాసుల ధరల మోతతో వినియోగదారుల గుండె గుబేల్‌మంటోంది. 
జీవితాల్లో వెలుగులు నింపని దీపావళి 
ఈ ఏడాది దీపావళి చాలామంది జీవితాల్లో వెలుగులు నింపడం లేదు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బాణసంచా ధరలు అమాంతం పెరిగాయి. ముడిసరుకులు, ఇతర వస్తువుల రేట్లు కూడా భారీగా పెరగడంతో దీని ప్రభావం టపాసులపై పడింది. దీనికితోడు అధికారుల నియంత్రణ కొరవడడంతో షాపుల యాజమానులు ఎంఆర్ పి కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు.  పెరిగిన ధరలతో టపాసులు కొనాలంటేనే భయపడిపోతున్నారు సామాన్యులు.
భారీగా తగ్గిన బాణసంచా విక్రయాలు 
కాకినాడ‌లో ఏటా కుళాయి చెరువు ఆవ‌ర‌ణ‌లో బాణ‌సంచా విక్రయాలు సాగేవి. అయితే ఈ ఏడాది కోర్టు ఆదేశాల‌తో టపాసుల అమ్మకాలు ఆనంద‌భార‌తి గ్రౌండ్‌కి మార్చారు. నగరానికి దూరంగా ఉండటం వలన బాణసంచా విక్రయాలు భారీగా తగ్గిపోయాయని వ్యాపారులు వాపోతున్నారు. పెరిగిన ధరల భారం వ్యాపారులను కూడా కోలుకోకుండా చేస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో వినియోగదారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. ఎంతో కష్టపడి టపాసుల షాపులు పెడితే..పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో లేదోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

 

రాజ్‌భవన్‌లో ప్రజా దర్బార్

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకొని గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్లో ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా ప్రజలను గవర్నర్ కలుసుకోనున్నారు. 

 

12:37 - October 30, 2016

కెరీర్ పరంగా చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలో నటించాలని త్రిష ఆశపడుతుంది. తమిళుల ఆరాధ్యదేవత పాత్రలో కనిపించాలనేది ఈ బ్యూటీ డ్రీమ్ రోలట. ఇది నిజమైతే ఈ చెన్నై పొన్ను కెరీర్ ధన్యమైనట్లే అంటుంది. ఇంతకీ త్రిష అంతగా ఇష్టపడుతున్న ఆ క్యారెక్టర్ ఏంటో మీరే చూడండి...
ఇంకా బిజీ బిజీగా త్రిష కెరీర్ 
34ఏళ్లు దాటిన త్రిష కెరీర్ పరంగా ఇంకా బిజీ బిజీగా ఉంది. ఈ  తెలుగులో ఛాన్స్ లు తగ్గిన ఈ బ్యూటీకి తమిళంలో మాత్రం నాలుగు సినిమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతుంది. రిసెంట్ గా ఈ బ్యూటీ ధనుష్ కి జోడిగా నటించిన కోడి రిలీజైంది. తెలుగులో ధర్మయోగి టైటిల్ తో డబ్ అయిన ఈ మూవీలో త్రిష రాయకీయనాయకురాలిగా నటించింది. అయితే ఓ డ్రీమ్ రోల్ లో నటించి తన కెరీర్ ని సార్థకం చేసుకోవాలని ఈ బ్యూటీ ఆశపడుతుందట.
జయలలిత పాత్రలో నటించాలని త్రిష కోరిక  
తమిళనాడు ముఖ్యమంత్రి తమిళుల ఆరాధ్యదైవమైన జయలలిత పాత్రలో త్రిష నటించాలని కోరుకుంటుందట. ఇక కెరీర్ గురించి చెప్పుతూ మిస్ చెన్నైగా ఎంపికైనప్పటి ఇప్పటి వరకూ కెరీర్‌లో ఒక్క డల్ మొమెంట్ కూడా లేదని చెప్పుతుంది. అంతేకాదు తను ఎనాడు పశ్చాత్తాప పడిన సందర్భాలు కూడా లేవంటుంది.ఇవే కాదు త్రిష బోలెడు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పి షాక్ ఇచ్చింది.
ఈ స్థాయికి వస్తానని ఊహించలేదన్న త్రిష
కెరీర్ పరంగా ఈ స్థాయికి వస్తానని ఊహించలేదని చెప్పిన ఈ చెన్నై పొన్ను, నటిగా ఉండడం వలన అత్యంత చెత్త విషయం ఏంటంటే, ఎందులోనూ నిజాయితీ ఉండదని నిజాయితీగా ఒప్పేసుకుంది. నటన అంటేనే అబద్ధం కదా, అందుకేనేమో తన ప్రెండ్స్ నిక్ నేమ్ గా ట్రాష్( చెత్త) అని పెట్టారని నవ్వుతుంది. అలసట, ఆరోగ్యం బాగోనప్పుడు ట్రావెలింగ్‌ చేస్తే నార్మల్ అవుతుందట. అన్నట్లు ఈ బ్యూటీ టైటిల్ రోల్ లో ప్లే చేస్తున్న మోహిని త్వరలో రిలీజ్ కి రెడీగా ఉంది.  

 

భారత భద్రతా దళాలపై టెర్రరిస్టులు మళ్లీ కాల్పులు

జమ్మూకాశ్మీర్ : సరిహద్దులో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుప్వారాలో భారత భద్రతా దళాలపై టెర్రరిస్టులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. టెర్రరిస్టులకు ధీటుగా భారత జవాన్లు సమాధమిస్తున్నారు. టెర్రరిస్టుల కాల్పుల్లో బీఎస్ ఎఫ్ జవానుకు గాయాలయ్యాయి. 

12:25 - October 30, 2016

జమ్మూకాశ్మీర్ : సరిహద్దులో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుప్వారాలో భారత భద్రతా దళాలపై టెర్రరిస్టులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. టెర్రరిస్టులకు ధీటుగా భారత జవాన్లు సమాధమిస్తున్నారు. టెర్రరిస్టుల కాల్పుల్లో బీఎస్ ఎఫ్ జవానుకు గాయాలయ్యాయి. భద్రతా దళాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎల్ వోసీ పరిహద్దు ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సరిహద్దులోని 40 గ్రామాల ప్రజలు వారి బంధువుల గ్రామాలకు తరలివెళ్లారు. అయితే కొంతమంది తమ నివాస ప్రాంతాలు, వ్యవసాయ పొలాలను విడిచి వెళ్లడం లేదు. మరోవైపు పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు పాల్పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:12 - October 30, 2016

బాలకృష్ణ శాతకర్ణి మూవీ బిజినేస్ అదిరిపోతుంది. సెంచరీ మూవీతో ఈ మాస్ స్టార్ కలెక్షన్ల పరంగా కూడా సెంచరీ కొట్టేలా కనిపిస్తున్నాడు. రిలీజ్ కి ముందే రికార్డ్ స్థాయిలో బిజినేస్ చేస్తున్న గౌతమి పుత్రతో బాలయ్య సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. 
ముగింపు దశకు 'గౌతమీపుత్ర శాతకర్ణి' షూటింగ్  
గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం షూటింగ్ ముగింపు దశకి చేరుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ ను కూడా చిత్రీకరించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతుంది.ఈ మూవీ ఏరియాల వారీగా హక్కులకు గట్టిపోటీ ఏర్పడింది.  
శాతకర్ణికి 80 కోట్ల  ప్రీ రిలీజ్ బిజినెస్ 
శాతకర్ణి చిత్రానికి 80 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. బాలకృష్ణ 100వ సినిమా కావడంతో పాటు చారిత్రక నేపథ్యం గల చిత్రం కావడం వలన ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అందువల్లే బయ్యర్లు కూడా ఈ చిత్రంపై భారీ అమౌంట్ పెట్టాడానికి వెనుకడం లేదు.
క్రిష్ దర్శకుడు కావడం సినిమాకు ప్లస్ పాయింట్ 
ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు కావడం ప్లస్ పాయింట్ గా మారింది. రోటీన్ కి భిన్నంగా సినిమాలు తీసే దర్శకుడిగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్న క్రిష్ ఈ సినిమాతో మరోసారి తన ముద్ర చూపిస్తాడనడలో సందేహం లేదు. ఈ దర్శకుడి గత చిత్రం కంచె నేషనల్ అవార్డ్ ని దక్కించుకోవడం కూడా గౌతమిపుత్ర శాతకర్ణికి కలిసొచ్చే అంశమే. వందో చిత్రంతో బాలయ్య వందకోట్లు కలెక్ట్ చేయాలన టార్గెట్ పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.

 

12:09 - October 30, 2016

టాలీవుడ్ హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ లేటేస్ట్ గా మరో క్రెడిట్ సొంతం చేసుకుంది. వరస పెట్టి ఛాన్స్ లు పట్టేస్తున్న ఈ బ్యూటీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా క్రేజీ సినిమాలన్ని తన గుప్పిట్లో పెట్టేసుకుంది. ఇంతకీ రకూల్ చేస్తున్న సినిమాలేంటో ఈ బ్యూటీ ఖాతాలో చేరిన ఆ క్రెడిట్ ఏంటో చూద్దాం...
షార్ట్ పిరియడ్ లో బిగ్ ఛాన్స్ లు 
చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకూల్ ప్రీత్ సింగ్ షార్ట్ పిరియడ్ లో బిగ్ ఛాన్స్ లు పట్టేసింది. తొలిరెండు సినిమాలు బిగ్ హిట్స్ కావడంతో బడా ఫ్యామిలీ హీరోలతో నటించే క్రేజీ ఛాన్స్ లు ఈ చిన్నదాన్ని వరించాయి. అంతేకాదు రెండేళ్లు తిరక్కముందే రకూల్ స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయింది. 
మహేష్ బాబు, మురుగదాస్ మూవీలో హీరోయిన్ గా 
మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, అల్లుఅర్జున్ లతో నటించిన రకూల్ ఇప్పుడు సాయిధరమ్ తేజ్ తో విన్నర్ మూవీ చేస్తుంది. ఇక నందమూరి చిన్నొడుతో నాన్నకు ప్రేమతో నటించిన ఈ బ్యూటీ లేటేస్ట్ మహేష్ బాబు, మురుగదాస్ మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. అలాగే నాగచైతన్య, కళ్యాణ్ కృష్ణ కొత్త సినిమాలో కూడా రకూల్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. 
తమిళంపైన కూడా ఫోకస్ 
టాలీవుడ్ లోని నాలుగు బిగ్ ఫ్యామిలీస్ హీరోలతో నటించిన క్రెడిట్ రకూల్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ బ్యూటీతో నటించిన ప్రతి హీరో కూడా మరోసారి నటించేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందుకు రకూల్ ఈగోస్ లేకుండా అందరితో కలిసిపోవడమే అనేది ఇండస్ట్రీ టాక్. రామ్ చరణ్ ధ్రువ లో మరోసారి జోడికట్టుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళంపైన కూడా ఫోకస్ చేస్తుంది. 

 

12:01 - October 30, 2016

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ మండలం ఆరేపల్లిలో దారుణం జరిగింది. నీటి గుంతలో పడి ఒక మహిళ, బాలుడు మృతి చెందారు. పశువులను కడగడానికి గుంతలోకి వెళ్లి.. నీటిలో మునిగి..ఊపిరాడక మాంజేటి మణెమ్మ అనే మహిళ మృతి చెందింది. అలాగే ఆమెను రక్షించడానికి వెళ్లిన ఛత్రపతి అనే బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

11:57 - October 30, 2016
11:55 - October 30, 2016

కృష్ణా : జిల్లాలోని ఘంటసాల వెంకటేశ్వర సంగీత కాలేజీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది.. కాలేజీలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమంకోసం దుర్గామల్లేశ్వర గణేష్‌ సేవాసమితి సభ్యులు వచ్చారు.. ఈ సభ్యుల్ని పోలీసులు అడ్డుకున్నారు.. కళాశాల ప్రిన్సిపల్‌ అనుమతి తీసుకోవాలని పోలీసులు సూచించారు.. పోలీసుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు.. తమను కాలేజీలోకి వెళ్లనివ్వడంలేదంటూ నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే బోండా ఉమా తాము కాలేజీలోకి వెళ్లకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

 

11:53 - October 30, 2016

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై.. మంచి సాధించే విజయానికి దీపావళి పండుగ నిదర్శనమని ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. కాలుష్య రహితంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కాగా ప్రదాని మోదీ ఈ దీపావళిని ఉత్తరాఖండ్‌లోని మనా అనే గ్రామంలో ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు దళంతో కలిసి జరుపుకోనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

 

దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : మోడీ

ఢిల్లీ : ప్రధాని మెడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంతర్జాతీయ పండుగ అని తెలిపారు. 

కురుక్షేత్రకు చేరుకున్న మన్ దీప్ సింగ్ భౌతికకాయం

హర్యానా : ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన భారత జవాన్ మన్ దీప్ సింగ్ భౌతిక కాయం కురుక్షేత్రకు చేరుకుంది. కాసేపట్లో మన్ దీప్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మన్ దీప్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కట్టర్

చంఢీఘర్ : సీఎం మనోహర్ కట్టర్ హర్యానా చేరుకున్నారు. ఉగ్రవాదుల చేతిలో వీర మరణం పొందిన బీఎస్ ఎఫ్ జవాన్ మన్ దీప్ సింగ్ కుటుంబ సభ్యులను కట్టర్ పరామర్శించారు. కాసేపట్లో మన్ దీప్ సింగ్ అంత్యక్రియలు జరుగనున్నాయి. 

10:11 - October 30, 2016
10:10 - October 30, 2016

హైదరాబాద్ : ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలకు హైదరాబాద్‌ పెట్టింది పేరు. దీపావళి తర్వాత యాదవులు నిర్వహించుకునే సదర్‌ కార్యక్రమం కూడా ఇందులో భాగం. ఈ ఉత్సవాలను యాదవులంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్సవాలు జరుపుకొనేందుకు యాదవులు సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఉత్సవాల్లో హర్యానా నుంచి తీసుకువచ్చినవిరాట్‌ దున్న హల్‌చల్‌ చేయబోతోంది. 
రూ. 9 కోట్ల విరాట్
చూశారుగా... భారీ ఖాయం.. దొప్పల్లాంటి  చెవులు.. మెలికలు తిరిగిన కొమ్ములతో ఎలా ఉందో ఈ దున్న. ఇది అలాంటిలాంటి మామూలు దున్న కాదు. ఈ సారి నగరంలో జరిగే సదర్‌ ఉత్సవాల్లో ఈ దున్నే హైలెట్‌.
సదర్ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి 
దీపావళి సందర్భంగా ప్రతిఏటా నగరంలో ఘనంగా సదర్‌ ఉత్సవాలు జరగుతాయి. దీపావళి మరుసటిరోజు జరుపుకొనే ఈ ఉత్సవాలకు యాదవులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎప్పటిలాగే ఈసారి కూడా సదర్‌ ఉత్సవాల్లో దున్నపోతుల ఊరేగింపు ఉంటుంది. కానీ ఈసారి ఉత్సవాలకు మాత్రం విరాట్‌ అనే హర్యానా దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతోంది. 
దీపావళి పండుగ తర్వాతి రోజు సదర్‌ సమ్మేళనాలు 
దీపావళి పండుగ తర్వాత రోజు సదర్‌ సమ్మేళనాలు జరుగుతాయి. యాదవుల సంస్కృతి, సాంప్రదాయాలకు చిహ్నమైన సదర్‌ పండుగలో విరాట్‌ కీలకంగా నిలుస్తోంది. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటంటారా..? దీని కోసం వెచ్చించిన మొత్తం అంతా ఇంతా కాదు.  ఏకంగా 9 కోట్ల రూపాయలతో విరాట్‌ను కొనుగోలు చేసి హర్యానా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారంటే.. దీని ప్రత్యేకత ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.  
సదర్‌ ఉత్సవాల్లో విరాట్‌ కనువిందు 
దీపావళి సందర్భంగా జంటనగరాల సదర్‌ ఉత్సవాల్లో విరాట్‌ కనువిందు చేయనుంది. నగరంలోని చప్పల్‌ బజార్‌కు చెందిన లడ్డూ యాదవ్‌, పరశురామ్‌ యాదవ్‌లు హర్యానాలోని సోనా పట్టణం నుంచి ఈ రాచదున్నను తీసుకొచ్చారు. విరాట్‌ ఠీవీ, రాచ వైభోగం అంతా ఇంతా కాదు. దీని ఎత్తు ఏడు అడుగులు.  గతేడాది తెచ్చిన యువరాజ్‌  దున్న విలువ ఏడు కోట్లయితే.. ఈసారి తీసుకొచ్చిన ఈ విరాట్‌ దున్నకి మరో రెండు కోట్లు అదనంగా.. అంటే 9 కోట్లు వెచ్చించారు. తమ తాతల వారసత్వంగా వస్తున్న సదర్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకే ఈ దున్నను తెచ్చామని.. నగరానికి చెందిన చిట్టబోయిన వంశస్థులు  చెబుతున్నారు. 
విరాట్‌ పోషణకు భారీ ఖర్చు 
విరాట్‌ పోషణకు అయ్యే ఖర్చు కూడా అంతా ఇంతా కాదు. రోజుకు 20 కిలోల యాపిల్స్‌, ఐదు కిలోల డ్రై ఫ్రూట్స్‌, బాదం పిస్తాలు, కాజులు లాగించేయడం దీని స్పెషల్‌.  కేవలం మినరల్ వాటర్‌ మాత్రమే తాగే ఈ రాచదున్న... వేసవిలో రోజూ రెండు క్యాన్ల బీర్లు, మరో రెండు ఫుల్‌ బాటిళ్ల బ్లాక్‌ డాగ్‌ విస్కీ అవలీలగా తాగేస్తోంది ఈ దున్న. 
దున్నకు చాలా ప్రత్యేకతలు 
ముర్రాజాతికి చెందిన ఈ రాచ దున్నకు ఇంకా చాలా ప్రత్యేకతలే ఉన్నాయి.  ముఖ్యంగా ఇప్పటికే ఐదు నేషనల్‌ అవార్డులను సొంతం చేసుకుని తన ప్రత్యేకత ఏంటో చాటుకుంది. నగరానికి వచ్చిన ఈ విరాట్‌ను చూసేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే గోపినాథ్‌ .. చప్పల్‌ బజార్‌కు వచ్చారు. వందేళ్లుగా హిందూ ముస్లింలు కలిసికట్టుగా సదర్‌ ఉత్సవాలు జరుపుకొంటున్నారని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ అన్నారు.  
విరాట్‌ను హైదరాబాద్‌కు రప్పించేందుకు రూ.లక్షల ఖర్చు
ఇన్ని ప్రత్యేకతలున్న విరాట్‌ను హైదరాబాద్‌కు రప్పించేందుకు ఐదు లక్షల రూపాయాల ఖర్చయిందని నిర్వహకులు తెలిపారు. హర్యానా నుంచి భారీ వాహనంలో విరాట్‌ను నగరానికి తరలించారు. విరాట్‌ బాగోగులు చూడటానికి పది మంది సిబ్బంది ఉంటారు. విరాట్‌కు ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తూ.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కంటికి రెప్పలా కాపాడుతుంటారు. 
దున్నకు మరో ప్రత్యేకత 
ఈ దున్నకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ దున్న వీర్యానికి విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది.  ముఖ్యంగా వీర్యాన్ని నైట్రోజన్‌ సిలిండర్లలో భద్రపరిచి ఇంజెక్షన్‌ల రూపంలో విక్రయిస్తారు. ఒక్కో ఇంజెక్షన్‌ విలువ 1000 రూపాయల నుంచి 1500 వరకు ధర పలుకుతోంది. దీని వీర్యం విక్రయాల ద్వారా విరాట్ యజమానికి ఏటా 70 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. టర్కీ, స్కాట్లాండ్, బ్రెజిల్ దేశాలకు విరాట్ వీర్యాన్ని ఎగుమతి చేస్తున్నారు.
విరాట్ కు భారీ మొత్తం..
యాదవుల సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన సదర్‌ ఉత్సవాలకోసం... అంత భారీ మొత్తాన్ని వెచ్చించి విరాట్‌ను తీసుకురావడం గర్వంగా ఉందని నగరానికి చెందిన యాదవులు చెబుతున్నారు. వారసత్వంగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించేందుకే విరాట్‌, బాదల్‌ అనే రెండు దున్నలను తీసుకొచ్చామని నిర్వాహకులు చెబుతున్నారు. సదర్‌ ఉత్సవాల కోసమే దున్నలను పెంచి పోషిస్తున్నామని చెబుతున్నారు. హిందూ, ముస్లింలు కలిసి కట్టుగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఈ సదర్‌ ప్రత్యేకత అని నిర్వాహకులు చెబుతున్నారు. సదర్‌ ఉత్సవాల కోసం వచ్చిన విరాట్‌ను చూసేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి చప్పల్‌ బజార్‌కు విరాట్‌ను చూసేందుకు క్యూ కడుతున్నారు. 

 

09:47 - October 30, 2016

విజయవాడ : చుట్టూ నీరు.. ఆ పక్కనే.. కనుచూపు మేరలో అందమైన కొండలు.. మధ్యలో ఆ దరిని.. ఈ దరినీ కలిపే ఆనకట్ట. వాటితో  పాటు పారాచూట్‌, బనానా బోట్, బెలూన్‌ వాకింగ్‌. ఇప్పుడీ అందాలన్నీ  పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆహ్లదకరమైన వాతావరణంతో అందరినీ అలరిస్తున్న కృష్ణా నది అందాలపై 10టివి స్పెషల్‌ స్టోరీ...! 
ఆహ్లదపరిచే ఆధునాతన అందాలు...
ఇరువైపులా పరుచుకున్న పచ్చని చెట్లు...హాయిగా...పిల్ల తెమ్మరల సవ్వడిలో సాగిపోయే పడవ ప్రయాణం...మనసును ఆహ్లదపరిచే ఆధునాతన అందాలు...జల వనరులతో కళకళలాడుతున్న కృష్ణా నది అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రివర్‌ స్పోర్స్ట్ బోటింగ్‌ కోసం ప్రతిరోజు బెజవాడ సమీప ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు.  పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 
అమరావతికి సరికొత్త సొబగులు 
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సరికొత్త సొబగులు అద్దుతున్నారు. ఇందులో భాగంగా.. కృష్ణా నదిలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు 14 రకాల వాటర్‌ స్పోర్స్ట్ బోట్స్‌ను అందుబాటులో ఉంచింది ఛాంపియన్స్‌ యాచ్‌ క్లబ్‌.  బర్త్‌డే, మ్యారేజ్‌తో పాటు ఇతర నైట్‌ పార్టీలకు కృష్ణా నది వేదికగా మారుతోంది. ఏకంగా 200 మంది వేడుకల్లో పాల్గొనేలా పెద్ద బోట్‌ను సిద్ధం చేయడంతో రోజురోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. 
భవానీ ద్వీపం కేంద్రంగా పర్యాటక రంగం అభివృద్ధి 
భవానీ ద్వీపం కేంద్రంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. భవానీ ద్వీపాన్ని ఇప్పటి వరకూ టూరిజం శాఖ మాత్రమే సద్వినియోగం చేసుకుని పర్యాటకులకు అందుబాటులో ఉంచింది. అయితే నెల రోజుల నుంచి ఛాంపియన్స్ యాచ్ క్లబ్ కూడా పర్యాటక రంగ అభివృద్ధి కోసం కృష్ణానదిలో సరికొత్త బోటింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది.  
బెజవాడకు విచ్చేస్తున్న పర్యాటకులు 
విజయవాడతోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి పర్యాటకులు బెజవాడకు విచ్చేస్తున్నారు. కృష్ణానదిలో ఏర్పాటు చేసిన పర్యాటక బోట్స్ లో విహరించి కృష్ణా నది అందాలను ఆస్వాదిస్తున్నారు. పారాషూట్, బనానా బోట్, బెలూన్ల వాకింగ్, స్కూటర్ బోట్ లాంటి సరికొత్త పరికరాలతో కృష్ణానదిలో విహారిస్తూ పర్యాటకులు ఆహ్లదకర వాతావారణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు.  బెజవాడలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ పై పర్యాటక ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
విజయవాడలో పర్యాటక రంగం అభివృద్ధి : నిర్వాహకులు 
రానున్న కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత పర్యాటక రంగాన్ని విజయవాడలో అభివృద్ధి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం పర్యాటకశాఖ ఆధ్వర్యంలోనూ భవానీ ద్వీపాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఒకపక్క ప్రభుత్వం, మరోవైపు ప్రైవేట్ సంస్థలు పర్యాటక రంగ అభివృద్ధికి పోటీ పడుతుండటంతో..భవిష్యత్‌లో విజయవాడ  ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

రామంగుండం ఎన్ టీపీసీలో నిలిచిన విద్యుదుత్పత్తి

పెద్దపల్లి : రామంగుండం ఎన్ టీపీసీలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

 

09:35 - October 30, 2016

పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం ఎన్ టీపీసీలో పెద్ద ప్రమాదం తప్పింది. బొగ్గు బంకర్‌ కుప్పకూలడంతో నాలుగో యూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. సిబ్బంది విధులు ముగిసే సమయం కావడం, బంకర్‌ ఉన్న ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బంకర్‌లో నిల్వ ఉన్న 20వేల టన్నుల బొగ్గు నేలపాలయింది. హుటాహుటిన అక్కడికిచేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించారు. బంకర్‌ కూలడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.

 

09:32 - October 30, 2016

హైదరాబాద్ : దీపావళి పండగ అంటేనే టపాసుల మోత. చిచ్చుబుడ్లు, లక్ష్మీబాంబులు, సుతిలిబాంబులంటూ రకరకాల పేర్లతో వాటిని కాల్చి మోత మోగిస్తారు. అదిరిపోయేలా టపాసులు పేల్చితేనే దీపావళి పండగ అనిపించదు కొందరికి. కానీ టపాసుల నుంచి వెలువడుతున్న శబ్ధ, వాయుకాలుస్యాన్ని మాత్రం ఎవరూ లెక్కచేయరు. అయితే దీపావళి పండుగను..కాలుష్యంతో కాకుండా ఎకో ఫ్రెండ్లీ దీపావళిని జరుపుకోవాలని పర్యావేరణ వేత్తలు సూచిస్తున్నారు.
దీపావళి అంటేనే పటాసుల మోత
దీపావళి అంటేనే పటాసుల మోత. సుతిలిబాంబు, లక్ష్మీబాంబులు, ఉల్లిగడ్డ బాంబు, థౌజెండ్‌ వాలా ఇలా రకరకాల పేర్లతో టపాసుల్ని కాల్చి ఆనందం పొందుతారు. కానీ టపాసుల్ని కాల్చితే ఎంత కాలుష్యం వెలువడుతుందో ఎవరూ ఊహించరు. పండగలు జరుపుకోవడం అంటేనే శుభం కోరడం.. దీపావళి లాంటి పండగల్ని మనం విపరీతంగా డబ్బు ఖర్చు చేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము. పండగ అంటే అంతా సంతోషంగా సామూహికంగా జరుపుకోవాల్సింది. కొన్నేళ్లుగా పండగలు జరుపుకుంటున్న మాట వాస్తవమే అయినప్పటికీ..పండుగల మాటున..ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నామన్న సంగతిని మనం మర్చిపోతున్నాం. ప్రపంచంలో కాలుష్యం పెంచిపోషిస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో వుందంటే మనం ఎంతలా కాలుష్యాన్ని వెదజల్లుతున్నామో అర్థమవుతుంది. 
బాంబుల చప్పుల్లతో దద్దరిల్లనున్న వీధులు 
దీపావళి వస్తే వీధులన్ని బాంబుల చప్పుల్లతో దద్దరిలిపోతుంటాయి. గాలిలో విపరీతమైన కాలుష్యం నిండిపోయి మనం కెమికల్స్‌ను పీల్చుకోవాల్సి వస్తుంది. ఇది అనేక రోగాలకు దారితీస్తోంది. సాధారణంగా టపాసుల్లో సోడియం నైట్రేట్, పోటాషియం నైట్రేట్ మూలకాలను వాడుతారు. ఇవి ఆరోగ్యానికి అంతగా హానిచేయకపోయినా..ప్రమాకరమైనవే. కానీ వీటికన్నా మహమ్మారి చైనా టపాసులు మరీ డేంజర్. వీటిలో పొటాషియం క్లోరైడ్ వంటి ప్రమాదకరమైన మూలకాలను వాడుతున్నారు. ఇవి భారత్‌లో 1992లోనే రద్ధు చేసినప్పటికీ ఇంకా ఇక్కడ వీటికి విపరీతమైన మార్కెట్‌ ఉంది. 
టపాసుల వల్ల ఊపిరితిత్తుల్లో అనేక సమస్యలు
దీపావళి పండగ రోజు మనం కాల్చే టపాసులవల్ల గాలిలో సల్ఫర్ డై ఆక్సైడ్ విపరీతంగా పెరిగిపోవడంతో ఇది పీల్చుకున్న వారికి ఊపిరితిత్తుల్లో అనేక సమస్యలకు కారణం అవుతోంది. అస్తమా సమస్యలున్న వారికి ఇది మరింత డేంజర్ అంటున్నారు వైద్యులు. అంతేకాదు చిన్న పిల్లల్లో ఈ సమస్య ఉంటే మరింత తీవ్రమవుతోందంటున్నారు డాక్టర్లు. మనుషులతో పాటు విపరీతమైన శబ్ధ కాలుష్యంతో మూగజీవాలు వాటి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.  
పర్యావరణ కాలుష్యం వల్ల 32 లక్షల మంది మృతి 
ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం వల్ల 32 లక్షల మంది చనిపోతున్నారని లెక్కలు చెబుతున్నాయి. భారత్‌లో 7లక్షల మంది పర్యావరణంలో కాలుష్యాన్ని పెంచడం వల్లే చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచ దేశాల్లో కాలుష్య కోరల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దేశాల్లో మొదటి స్థానంలో అమెరికా ఉంటే.. రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో భారత్‌ ఉంది. ప్రపంచంలోనే కాలుష్యం అధికంగా ఉండే టాప్ 20 నగరాల్లో మన దేశంలోనే 13 నగరాలు ఉండటం విశేషం. మొదటి స్థానంలో ఢిల్లీ ఉండగా...3వస్థానంలో హైదరాబాద్ ఉంది. అంటే మనం ఎంతటి డేంజర్ పొజిషన్‌లో ఉన్నామో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పండగల్ని సంతోషాల హరివిల్లులుగా జరుపుకోవాలి గాని కాలుష్యాన్ని ప్రేరేపించే విధంగా జరుపుకోవద్దంటున్నారు నిపుణులు. భూతాపాన్ని తగ్గించి రాబోయే కాలంలోనైనా ముప్పును తప్పించాలని పర్యావరణ ప్రియులు కోరుతున్నారు. 

 

08:14 - October 30, 2016

రామగుండం ఎన్టీపీసీలో కుప్పకూలిన కోల్ బంకర్

పెద్దపల్లి : రామగుండం ఎన్టీపీసీలో కోల్ బంకర్ కుప్పకూలింది. 4 వ యూనిట్ లో 500 మెగా వాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. 

08:09 - October 30, 2016

విజయవాడ : ఓవైపు దీపావళి టపాసుల అమ్మకాలు తారజువ్వలా దూసుకుపోతుంటే..అక్కడ మాత్రం కొనుగోళ్లు లేక బాణసంచా దుకాణాలు వెలవెలబోతున్నాయి. 80 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించినా అటు వైపు రావడానికే జనం వెనకాడుతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టిన వ్యాపారులకు దీపావళి పండగ నిరాశే నింపుతోంది. బెజవాడలో బాణసంచా వ్యాపారులకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇందుకు కారణాలేంటి ? వాచ్‌ దిస్‌ స్టోరీ
కొనుగోళ్లు లేక వెలవెలబోతున్న బాణసంచా దుకాణాలు  
ఒకప్పుడు దీపావళి పండగ వచ్చిందంటే చాలు బెజవాడ స్వరాజ్య మైదానంలో బాణసంచా దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయేవి. టపాసుల వ్యాపారులకు లాభాల పంట పండేది. వారం రోజుల ముందు నుంచే టపాకాయల విక్రయాలు భారీ స్థాయిలో జరిగేవి. ఫైర్ వర్క్స్ అండ్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బాణసంచా విక్రయాలు జరిపేవారు. పురోగమనంలో ఉన్న టపాసుల వ్యాపారం.. రాష్ట్ర విభజన అనంతరం తిరోగమనం దిశగా మారింది. స్వరాజ్య మైదానం సీఎం క్యాంపు కార్యాలయానికి అతిచేరువలో ఉండటంతో గతేడాది ఇక్కడ బాణాసంచా విక్రయాలకు అధికారులు అనుమతివ్వలేదు. సమీపంలోని ఇందిరా గాంధీ క్రికెట్ స్టేడియంలో వ్యాపారులు బాణాసంచా విక్రయాలు జరిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ కూడా ఈ ఏడాది అధికారులు క్రాకర్స్ అమ్మకాలకు పర్మిషన్‌ ఇవ్వలేదు. భవానీ ఘాట్ దగ్గర ఉన్న ఖాళీ ప్రాంతంలో బాణాసంచా స్టాల్స్  ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో వ్యాపారులకు నగరానికి దూరంగా ఉన్న భవానీ ఘాట్‌లో బాణసంచా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
టపాసులు కొనేందుకు ముందుకు రాని జనం  
భవానీపురంలో బాణసంచా కొనుగోళ్లు లేక వ్యాపారులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 80 శాతం డిస్కౌంట్‌ ప్రకటించినా టపాసులు కొనేందుకు జనం ముందుకు రాకపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల దూకుడు నిర్ణయాలే తమకు నష్టాన్ని మిగిల్చిందని వాపోతున్నారు. బెజవాడకు దూరంగా ఉన్న భవానీపురంలో బాణసంచా కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. గతేడాది కన్నా రేట్లు బాగా పెంచేశారని.. డిస్కౌంట్లు అనేది వ్యాపారుల మాయజాలమని పెదవి విరుస్తున్నారు. 
నగరంలోనే బాణసంచా అమ్మకాలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి 
భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి పునారావృతం కాకుండా ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బాణసంచా వ్యాపారులు కోరుతున్నారు. వచ్చే సంవత్సరం నగరంలోనే బాణసంచా అమ్మకాలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

08:04 - October 30, 2016

హైదరాబాద్ : గులాబీ నేతల పదవుల భర్తీకి రంగం సిద్దమైంది. నవంబర్‌ మొదటివారంలో భారీగా పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలవారీగా పార్టీ కమిటీలతో పాటు.. అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని గులాబీ బాస్‌ నిర్ణయించారు. అన్ని కార్యవర్గాలు కలిపి ఒక్కో జిల్లాలో 114 మందికి అవకాశం దక్కనుంది. 
గులాబీ నేతలకు పదవుల దక్కడం ఖాయం
తెలంగాణాలో గులాబీ నేతలకు పదవుల దక్కడం ఖాయమైంది. కొత్త జిల్లాలు   ఏర్పడడంతో పార్టీ నిర్మాణాన్ని కొత్త జిల్లాల ఆధారంగా  చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు.  ప్రస్తుతం ఉన్న 12 మంది జిల్లా అధ్యక్షులు 31కి పెరగనున్నారు. పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధ్యక్షుల ఎంపిక బాధ్యతను స్వయంగా గులాబి బాస్ చూస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల అధ్యక్షుల ఎంపిక  ఇప్పటికే పూర్తయిందని పార్టీ  నేతలు అంటున్నారు.
జిల్లా కార్యవర్గంతో పాటు అనుబంధ సంఘాల నియామకం
రాష్ట్రవ్యాప్తంగా 3,534 మందికి పార్టీ పదవులు 
ఒక్కో జిల్లాలో ప్రధాన కార్యవర్గంతో పాటు.. అనుబంధ సంఘాలను కూడా ఒకే సారి నియమించేందుకు కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రధాన కమిటీలో జిల్లా పార్టీ అధ్యక్ష, కార్యదర్శులతో కలిపి 24 మందికి అవకాశం దక్కనుంది.  అదేవిధంగా  ఒక్కో జిల్లాల్లో 9 అనుబంధ సంఘాలను పార్టీ నియమించనుంది. ఒక్కో అనుబంధ సంఘంలో 10 మందికి  చాన్స్ లభించనుంది. ప్రధాన కమిటీ, అనుబంధ సంఘం కలిసి ఒక్కో జిల్లాలో 114 మంది నేతలకు పదవులు దక్కనున్నాయి. దీంతో త్వరలో 3534 మందికి పార్టీ పదవులు దక్కించుకోనున్నారు. 
కొత్త నేతలకు గులాబీ బాస్‌ దిశానిర్దేశం
కొత్త కార్యవర్గాల అధికారిక ప్రకటన అనంతరం పదవులు పొందిన నేతలతో కేసీఆర్‌ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. నవంబర్ మొదటి వారంలో  పదవుల పంపిణీ పూర్తయితే  నవంబర్ మూడో వారంలో కొత్త నేతలకు గులాబి బాస్ దిశా నిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా  డిసెంబర్ 2వ తేదీన పార్టీ నిర్వహించనున్న  రెండున్నర సంవత్సరాల వేడుకకు ఏర్పాట్లను మొదలుపెట్టనున్నారు.  అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు కావడంతో.. ఇప్పటి వరకు ప్రభుత్వపరంగా చేపట్టిన కార్యక్రమాలు.. భవిష్యత్‌లో ప్రభుత్వ లక్ష్యాలను ఈ సభ ద్వారా వెల్లడించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం.
పదవులు దక్కని నేతలకు నామినేటెడ్ స్థానాల్లో అవకాశం 
పార్టీ పరంగా పదవులు దక్కని నేతలకు నామినేటెడ్ స్థానాల్లో అవకాశం కల్పించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి వారంలో పార్టీ పదవుల పంపిణీ పూర్తయిన వెంటనే మరికొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశముందని పార్టీ కీలక నేతలంటున్నారు. 

 

07:59 - October 30, 2016

హైదరాబాద్ : బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై ఏం చేయాలనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే మంత్రివర్గ ఉప సంఘం సమావేశం ముగిసింది. నవంబర్ మొదటివారంలో మరోసారి భేటీ కానున్నారు. రాజకీయపరమైన ఇబ్బందులు కలగకుండా, ఇరుగుపోరుగు రాష్ట్రాలతో స్నేహ బంధాలు దెబ్బతినకుండా ఉండాలని మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
బ్రిజేష్ తీర్పుపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా నీటినే రెండు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై అధ్యయనం చేసేందుకుగాను తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీ వారంలో రెండుసార్లు సమావేశమైంది. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ కూడా హాజరయ్యారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై ఏం చేయాలనే అంశంపై చర్చించారు. ప్రభుత్వం ముందున్న న్యాయపరమైన అంశాలను మంత్రివర్గఉపసంఘం సభ్యులు అడిగి తెలుసుకొన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను అమలు చేస్తే రాష్ట్రానికి నష్టమనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. అయితే నష్టనివారణకు ఏం చేయాలనే దానిపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. 
ఇతర రాష్ట్రాలతో స్నేహ సంబంధాలు దెబ్బతినకుండా ఉండాలి.. 
ఇతర రాష్ట్రాలతో తెలంగాణకు ఉన్న స్నేహ సంబంధాలు దెబ్బతినకుండా ఉండాలని మంత్రి వర్గ ఉపసంఘ సభ్యులు అభిప్రాయంతో ఉన్నారు. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ఒప్పందం చేసుకుంది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని ఒప్పందం సందర్భంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు విషయమై వేసే అడుగుల ప్రభావం మహారాష్ట్రతో ఉన్న సంబంధాలను దెబ్బతీసేవిధంగా ఉండకూడదనే అభిప్రాయంతో సర్కార్ ఉంది. ఇతర రాష్ట్రాలతో ఉన్న సంబంధాల విషయాల విషయంలో కూడా సర్కార్ ఇదే వైఖరితో ఉంది.
రాష్ట్రానికి నష్టం వాటిల్లకూడదు.. 
కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి నష్టం వాటిల్లకూడదనే అభిప్రాయంతో ఉంది క్యాబినెట్ సబ్ కమిటీ. మరో వైపు ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం రాష్ట్రంలో కూడా రాజకీయంగా నష్టం వాటిళ్లకూడదనే అభిప్రాయంతో ఉంది.. మంత్రివర్గ ఉపసంఘం. 
వచ్చే వారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
ఏం చేస్తే రాష్ట్రానికి అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయో....అదే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఏం చేయాలనే దానిపై ఇంకా నిర్ణయాలనికి రాలేదు. సమావేశంలో చర్చించిన అంశాలను బయటకు తెలిస్తే పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకొంటున్నారు ఉపసంఘం సభ్యులు. వచ్చే వారం జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

07:53 - October 30, 2016

విజయవాడ : ఓ వైపు వీనుల విందైన సంగీత విభావరి.. మరోవైపు చిన్నారుల గానలహారి.. ఇంకోవైపు మదినిదోచే సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు.. మొత్తంగా కృష్ణా తీరంలో ముందస్తు దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. పవిత్రసంగమం వద్ద నిర్వహించిన పవిత్రహారతి కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి సతీసమేతంగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. 
కృష్ణాతీరంలో దీపావళి వేడుకలు 
సాయం సంధ్యా వేళ..కృష్ణమ్మ పరవళ్లు..సంగీత సుస్వరాల గుభాళింపులు..సంప్రదాయ నృత్యాలు.. విజయవాడ వద్ద కృష్ణాతీరంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పవిత్రసంగమం వద్ద నిర్వహించిన పవిత్రహారతి కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. 
అట్టహాసంగా దీపావళి వేడుకలు 
అర్చకుల వేదమంత్రాల మధ్య కృష్ణమ్మకు పవిత్రహారతిని సమర్పించడంతో దీపావళి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బాణసంచా వెలుగుల్లో పవిత్రసంగమం ప్రాంగణమంతా దేదీప్యమానంగా వెలుగులీనింది. దీపావళి వేడుకల సందర్భంగా నరకాసుర వధ కార్యక్రమం ఆహుతులను అలరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఓకే ఏడాది రెండు నదులను కలిపిన ఘనత టీడీదేనని సీఎం పేర్కొన్నారు. గోదావరి జలాలతో కృష్ణా జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్రస్తుత సమాజంలో ఎంతో మంది నరకాసురులు ఉన్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండి వారికి బుద్ధి చెప్పాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడం ద్వారా రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చడమే ధ్యేయమన్నారు. కృష్ణమ్మకు ధన్యవాదాలు తెలిపేందుకు పవిత్రహారతి చేపట్టామని, ఆనందం, ఆరోగ్యంగా ఉండాలంటే పండగలు అవసరమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. 

 

07:49 - October 30, 2016

హైదరాబాద్ : దీపావళి సందడి ప్రారంభమయ్యింది. తారాజువ్వలు తారాపథంలోకి దూసుకుపోవడానికి రెడీ అవుతున్నాయి. రాకెట్లు రయ్‌మని ఎగిరిపోవడానికి రెక్కలు తొడుక్కుంటున్నాయి. చిచ్చు బుడ్డులు చిందులేయడానికి ముస్తాబవుతున్నాయి.  భూ చక్రాలు గిరిగిరా తిరిగేయడానికి భలే ముచ్చటపడుతున్నాయి. టపాసులు  పేలిపోవడానికి టైమ్‌ను కౌంట్‌ చేసుకుంటున్నాయి. ఎప్పుడు వెలిగిస్తారా అని అగ్గిపెట్టెలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. 
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి 
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి మొదలైంది. బాణసంచా దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి. వెలుగుల దీపావళి పండుగలో ప్రమిదలు, బొమ్మలు, టపాసులే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. ప్రమిదలు, బొమ్మల కోసం  ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. కొనుగోలుదారులతో ఈ షాపులన్నీ కళకళలాడుతున్నాయి. వివిధ దీపాలతో ఇళ్లను అందంగా అలంకరిస్తున్నారు. ఈ దీపాల కాంతుల్లో ఇళ్లు దగధగమంటున్నాయి. 
బాణసంచా రేట్లతో వినియోగదారులు బెంబేలు
మరోపక్క బాణసంచా రేట్లను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ధరలు చూసి దీపావళి ఆనందం సగం ఆవిరి అయిపోతోంది. గతేడాదితో పోల్చితే రేట్లు రెట్టింపు అయ్యాయి. పండగ రోజు కావడంతో రేట్లు మరింత ఆకాశాన్నంటుతున్నాయి. 
ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు
దీపావళి సందర్భంగా జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నగరంలో బాణసంచా దుకాణాలు, హోల్‌ సేల్‌ దుకాణదారులకు 20 రోజులుగా ఫైర్‌ సేఫ్టీపై అగ్నిమాపకశాఖాధికారులు అవగాహన కల్పించారు. ఒకవేళ అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు. అత్యవసర సహయం కోసం 101 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలని చెబుతున్నారు. టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చని స్పష్టం చేస్తున్నారు. 
జంట నగరాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు 
దీపావళి పండగ సందర్భంగా జంట నగరాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో బాణసంచా పేల్చడాన్ని నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ నగర సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. పరిమితికి మించి శబ్ధ కాలుష్యం వచ్చే టపాసులు పేల్చవద్దని సూచించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
టపాసులు కాల్చకుండా దీపావళి జరుపుకోవాలి : పర్యావరణవేత్తలు 
మరోపక్క టపాసులు కాల్చకుండా దీపావళిని జరుపుకోవాలని పర్యావరణవేత్తలు పిలుపునిస్తున్నారు. క్రాకర్స్‌ విపరీతంగా కాల్చడం వల్ల శబ్ధ కాలుష్యంతో పాటు... పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్

కాశ్మీర్ : పాకిస్తాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆర్ ఎస్ పురా, హిరానగర్,సాంబా సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. పాక్ కాల్పులను భారత్ జవాన్లు తిప్పికొడుతున్నారు. 

నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

హైదరాబాద్ : నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆయన వర్థంతి కార్యాక్రమాన్ని నిర్వహించనున్నారు.  

నేడు ఆసియా చాంపియన్ ట్రోఫీ హాకీ ఫైనల్

ఢిల్లీ : నేడు ఆసియా చాంపియన్ ట్రోఫీ హాకీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు భారత్, పాకిస్తాన్ ఢీకొననున్నాయి. 

నేడు దీపావళి సందర్భంగా గంటపాటు ప్రజలకు అందుబాటులో గవర్నర్ దంపతులు

హైదరాబాద్ : నేడు దీపావళి సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులు గంటపాటు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు దీపావళి శుభాకాంక్షలు అందుకోనున్నారు.  

Don't Miss