Activities calendar

01 November 2016

21:35 - November 1, 2016

విజయవాడ : టీడీపీ కార్యకర్తలే పార్టీకి కొండంత అండ అని, కార్యకర్తల ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకుంటూ నేతలు వారిని ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తలంతా నీతి..నిజాయితీలతో ఉండాలని.... అవినీతికి పాల్పడితే ఎవరినీ క్షమించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన తొలి సభ్యత్వం తీసుకున్నారు.ప్రభుత్వ పథకాలను అడ్డం పెట్టుకుని ఎవరు అవినీతికి పాల్పడ్డ ప్రజలు, పార్టీ క్షమించరని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నీతి నిజాయితీతో పాటు మంచి వ్యక్తిత్వం ఉంటే ప్రజలే మనతో ఉంటారని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో 2016-టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన తొలి సభ్యత్వం తీసుకున్నారు. ఉండవల్లి గ్రామపార్టీ అధ్యక్షుడు దాసరి కృష్ణకు వంద రూపాయలు సభ్యత్వ రుసుము చెల్లించి చంద్రబాబు తన సభ్యత్వాన్ని రెన్యువల్‌ చేయించుకున్నారు. అనంతరం చంద్రబాబు గుర్తింపు కార్డు అందుకున్నారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్‌ రమణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఇతర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.  
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కార్యకర్త సభ్యత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలందించటంతో పాటు కార్యకర్తల సంక్షేమ చూసుకోవాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. ప్రజల కోసం 15 పాయింట్‌ల ప్రోగ్రాం అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో 90 శాతం పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు.
పార్టీలో చేరమని ఎవరినీ బలవంత పెట్టవద్దని.. ప్రభుత్వం, పార్టీపై మక్కువ ఉన్న వారికే పార్టీ సభ్యత్వం ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు2014 -టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా  50  రోజుల్లో 55 లక్షల సభ్యత్వ నమోదు చేపట్టిన ఘనత టీడీపీదేనని.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. ఈ ఏడాది పార్టీ సభ్యత్వ సంఖ్యను కోటికి చేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన చెప్పారు.
    ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లో చనిపోయిన 1200 మంది కార్యకర్తలకు రెండు లక్షల చొప్పున 24 కోట్లను బీమా రూపంలో చెల్లించామని లోకేశ్‌ తెలిపారు. నెల రోజుల పాటు కొనసాగే పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను లోకేశ్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  
 

21:34 - November 1, 2016

ముంబైలో ఘోరం జరిగింది. భర్తతో కలిసి అద్దె ఇల్లు వెదకడానికి వెళ్లిన ఓ వివాహిత గ్యాంగ్‌ రేప్‌కు గురైంది. ముంబయిలోని అంబోలి  ప్రాంతంలో భార్యా భర్తలిద్దరూ అద్దెకోసం ఓ ఇంటికి వెళ్లారు. లోనికి వెళ్లి ఇంటిని పరిశీలిస్తుండగా ఏడుగురు వ్యక్తులు వారి చుట్టూ చేరారు. ముగ్గురు మాటలతో మభ్యపెట్టి ఆమె భర్తను విడిగా మరో వైపు తీసుకెళ్లారు. మిగతా నలుగురు వ్యక్తులు  ఆమెను ఓ గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దంపతుల ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులనూ పోలీసులు అరెస్టు చేశారు.

21:31 - November 1, 2016

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు ఉత్కంఠగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వే ఫలితాలు తారు మారవుతున్నాయి. మద్దతుదారుల్లో ఉత్సాహం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు తాజాగా నిర్వహించిన సర్వేలో హిల్లరీ  వెనకబడిపోయారు. రిపబ్లిక్‌ అభ్యర్థి ట్రంప్‌ ఒక్క శాతం తేడాతో హిల్లరీని బీట్‌ చేశారు.  
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మరో వారం రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా ఓటర్ల నాడీ అంతు చిక్కడం లేదు. మూడో ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ అనంతరం పోల్‌ సర్వేల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌పై స్పష్టమైన ఆధిక్యం చూపారు. రాను రాను ఆమె ఆధిక్యం తగ్గుతూ వస్తోంది.  
వాషింగ్టన్‌ పోస్ట్‌-ఎబిసి న్యూస్‌ ట్రాకింగ్‌ నిర్వహించిన తాజా పోల్‌లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా హిల్లరీపై స్వల్ప ఆధిక్యాన్ని సాధించారు. ఈ సర్వేలో ట్రంప్‌కు 46 శాతం మద్దతు రాగా... హిల్లరీకి 45 శాతం మద్దతు లభించినట్లు సర్వే తెలిపింది. ఇద్దరి మధ్య తేడా కేవలం ఒక్కశాతం మాత్రమే ఉండడంతో ఈ ఎన్నికల్లో హోరా హోరీ పోరు తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. హిల్లరీ క్లింటన్‌ ఈ-మెయిళ్ల వ్యవహారంపై ఎఫ్‌బిఐ దర్యాప్తుకు ఆదేశించడంతో ఆమె ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ అంశాన్ని ట్రంప్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. హిల్లరీ నేరపూరిత చర్యలన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినవేనని ఎన్నికల ర్యాలీల్లో ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. హిల్లరీ విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు 60వేల ఈమెయిళ్ల గల్లంతు వ్యవహారంపై ఎఫ్‌బీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఎఫ్‌బిఐ దర్యాప్తు  ఆమె విజయావకాశాలను దెబ్బతీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  తాజా సర్వే ద్వారా ట్రంప్‌ మద్దతుదారుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తుండగా.... క్లింటన్‌ మద్దతుదారుల్లో నిరుత్సాహం ఆవరించింది... నవంబరు 8న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

21:28 - November 1, 2016
21:25 - November 1, 2016

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యనల్‌లో విచారణ జరిగింది. సాగు భూముల్లో అమరావతి నిర్మాణం చేపడుతున్నారని వ్యాఖ్యానించిన NGT.. నష్ట నివారణకు ఏటువంటి చర్యలు  చేపడుతున్నారో తెలపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని పిటిషనర్‌ తరపు న్యాయవాది సంజయ్‌పారిక్‌ వాదనలు వినిపించారు. కొండవీటి వాగు దిశను సైతను మళ్లించి.. ఇక్కడ వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారన్నారు. ఈ వాదనలను ఏపీ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. కోర్టు సమయం ముగియడంతో ఈ విచారణను రేపటికి వాయిదా వేశారు.

21:23 - November 1, 2016

హైదరాబాద్ :   రంగుల ప్రపంచంలో ఆ జోడి వెలిగిపోయింది. తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించింది. వారిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమించుకున్నారు. ఇద్దరి మనుసులు కలవడంతో దశాబ్దానికి పైగా సహజీవనం చేశారు. తోడు నీడగా ఉన్న ఆ ఇద్దరు విడిపోయారు. వారే కమల్‌, గౌతమి.. వీరిద్దరి బంధం తెగిపోవడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్‌టాఫిక్‌గా మారింది.  ప్రముఖ హీరో కమల్‌హాసన్, గౌతమి విడిపోయారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలిపింది నటి గౌతమి. లైఫ్ అండ్‌ డెసిషన్స్ పేరుతో రాసిన ఓ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 13 ఏళ్లగా తమ సహజీవనం సాగిందని, ఇద్దరి ఆశయాలు, మార్గాలు వేరైనప్పుడు ఎవరిదారిలో వాళ్లు వెళ్లడమే ఏకైక మార్గమని తెలిపింది. హృదయం బద్దలయ్యే ఈ నిజం అంగీకరించడానికి, ఈ నిర్ణయానికి రావడానికి చాలా కాలం పట్టిందని వెల్లడించింది.  
తన లైఫ్‌లో తీసుకున్న కఠినమైన నిర్ణయమని, ఒకరితో బంధాన్ని తెంచుకోవడం అంతతేలిక కాదని వెల్లడించింది గౌతమి. కమల్‌ నుంచి దూరమైనా, తనకు ఎవరి సానుభూతి అవసరంలేదని, లైఫ్‌ని అర్థం చేసుకుని, మార్పులకు అనుగుణంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. తాను సొంతంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని, కమల్ ఆశయాలు నేరవేరాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించింది. ఆయనతో ఇన్నాళ్లు కలసి పని చేసినందుకు గర్వంగా వుందని చెప్పింది.
తను, కమల్ హాసన్‌ ఇక ఎక్కువ కాలం కలిసి ఉండలేమన్న విషయం తన హృదయాన్ని చిదిమేస్తోందని గౌతమి ఆవేదన వ్యక్తం చేసింది. కమిటెడ్‌ రిలేషన్‌ షిప్‌లో మన కలలే ముఖ్యమని అనుకోవడమా, లేక వాటిని కాదని జీవితంతో రాజీ పడడమా అని తేల్చుకోవడం ఎవరికీ అంత సులభతరమైన పనికాదన్నారు. ఒకర్ని తప్పుపట్టడానికో లేక సానుభూతి పొందడమో తన ఉద్దేశం కాదంది. తాను మొదట తల్లినని.. సాధ్యమైనంత వరకు బెస్ట్‌ మదర్‌గా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపింది. అందుకు నాతో నేను ప్రశాంతంగా ఉండాలంది. కమల్ తన కలల హీరో అని, చిన్నప్పటి నుంచి తన అభిమాన నటుడని, ఆయన నుంచి విడిపోయినప్పటికీ తన హీరో కమలహాసనేనని గౌతమి పేర్కొంది.కమల్‌హాసన్‌, గౌతమి కలసి తమిళంలో అపూర్వ సహోదరగళ్‌, కురుతిపునల్, నమ్మవర్, తీవార్‌ మగన్‌, పాపనాశం తదితర చిత్రాల్లో నటించారు. హిందీలో అప్పురాజా సినిమాలో జోడికట్టారు. తాజాగా కమల్‌ నటిస్తున్న శభాష్‌నాయుడు చిత్రీకరణ సందర్భంగా కమల్‌ కూతురు శ్రుతిహాసన్‌, గౌతమిల మధ్య విబేధాలు వచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి. శ్రుతి వస్త్రధారణ, పాత్ర తదితర విషయాల్లో గౌతమి కల్పించుకోవడం శ్రుతికి నచ్చలేదని తెలుస్తోంది. అయితే శ్రుతిహాసన్‌ వీటిపై వివరణ కూడా ఇచ్చింది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేసింది. ఈ కారణాలేనా లేక కమల్‌, గౌతమి మధ్య మరేవైనా విబేధాలు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది.
 

21:06 - November 1, 2016

హైదరాబాద్:  తెలంగాణ సచివాలయం కూల్చివేతపై తమ అనుమతి లేనిదే ఎలాంటి చర్యలకు దిగరాదని.. హైకోర్టు ఆదేశించింది. దీనిపై పదిరోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఓ వైపు ఏపీ భవనాల ఖాళీపై స్పష్టత రాకపోవడం, మరోవైపు కూల్చివేతపై ఆదేశాలతో... కొత్త సచివాలయ నిర్మాణ భవిష్యత్‌ ఆసక్తిగా మారింది.  
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై తమ అనుమతి లేనిదే ఎలాంటి చర్యలకు దిగరాదని.. టీ సర్కారును హైకోర్టు ఆదేశించింది. దీనిపై పదిరోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించింది. సచివాలయం కూల్చివేతపై ఎలాంటి తీర్పు ఇవ్వవద్దన్న ఏజీ వాదనలను తోసిపుచ్చుతూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సచివాలయం కూల్చివేతకు నిర్ణయించడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని..తెలంగాణ సర్కార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రజాప్రయోజన వాజ్యాలను దాఖలు చేశారు.  వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌, జస్టిస్‌ ఏ. శంకర్‌ నారాయణన్‌ బెంచ్‌.. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించి.. తమ అనుమతి లేనిదే సచివాలయం కూల్చివేయరాదని ఆదేశించింది. న్యాయవాది సత్యం రెడ్డి పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తూ.. 1985లో నిర్మించిన ఇప్పటి సచివాలయం.. అధునాతన హంగులతో కూడుకున్నదని, చాలా మన్నికైనదని వాదనలు వినిపించారు. గత ప్రభుత్వాలు ఇక్కడి నుంచే పరిపాలన చేశాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయంతో ప్రజాధనం వృధా అయ్యే అవకాశం ఉందని.. న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు కార్యాలయాల తరలింపుపై.. ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరిస్తోందని.. న్యాయవాదులు రఘు, రచనారెడ్డిలు తమ వాదనలు వినిపించారు. కార్యాలయాల తరలింపుపైనా స్టే ఇవ్వాలని ఉన్నత ధర్మాసనాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ రామకృష్ణ రెడ్డి పిటిషనర్ల వాదనలతో విభేధించారు. ముప్పై యేళ్ల నాటి భవనాల్లో పాలన సౌలభ్యం లేనందునే ఉన్న భవనాలను కూల్చి కొత్త భవనాలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు.  కూల్చివేతలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవద్దని కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే.. తరలింపులో అయితే జోక్యం చేసుకోలేము.. కానీ కూల్చివేత పై మాత్రం విచారణను పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తమ అనుమతి లేకుండా కూల్చివేయరాదన్న న్యాయమూర్తులు... పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని అదేశించారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

20:06 - November 1, 2016

తెలిసి చేశారో.. తెలియక చేశారో.. అసలు చేయలేదో ..మొత్తానికి ఊచలు లెక్కపెడుతున్నారు. కానీ, ఏ విషయం తేల్చాలి కదా.. అయితే బయటికి లేదంటే లోపలికి పంపాలి కదా.. కానీ, అండర్ ట్రయల్ గానే ఉంచేస్తున్నారు. అసలు కంటే కొసరుతోనే శిక్షిస్తున్నారు. ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గేలా చేస్తున్నారు. వీరిలో నిరుపేద దళితులు, ఎస్టీలు, ముస్లింలు ఉన్నారని సర్కారీ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. దేశంలో బడుగుజీవులకు న్యాయం అందకుండా ఆమడ దూరంలో ఉందని స్పష్టం అవుతోంది. ఈ అంశంపై ప్రత్యేక కథనం.. నిరక్షరాస్యత, పేదరికం.. ఈ రెండూ దేశంలో కొన్ని కులాల్లో మతాల్లో ఎందుకు ఎక్కువున్నాయో అర్ధం కావటానికి పెద్ద థియరీలు అక్కర్లేదు. కానీ, ఇప్పుడు వారి బతుకులను అవే నిర్దేశిస్తుంటే.... వాటినుంచి బయటపడాల్సిన మార్గాలను వెతక్క తప్పదు. కొన్ని కులాలు, మతాల వారు మాత్రమే.. అండర్ ట్రయల్స్ గా మగ్గుతున్నారంటే..వాటిపై పోరాటం చేయకతప్పదు..

విముక్తి లేదా ? 
క్రైమ్ రికార్డ్స్ ప్రిజన్ డేటా విస్మయాన్ని కలిగిస్తోంది. నిరక్షరాస్యత, పేదరికం కలగలిసి ఎలా బతుకులను కూలుస్తోందో స్పష్టం చేస్తోంది. నేరానికి పడే శిక్ష కంటే అండర్ ట్రయల్ గా ఎక్కువ కాలం జైళ్లలో మగ్గుతున్న లక్షలాదిమంది బతుకులను అంకెల్లో చూపుతోంది. మరి వీరికి విముక్తి లేదా?  నేరం రుజువైతే జైలు శిక్షపడాలి.. లేదంటే విడుదల కావాలి. కానీ, అటూ ఇటూ కాకుండా ఏళ్లకేళ్లు మగ్గుతున్న వారి సంఖ్య ఏడాదికేడు పెరుగుతోంది. దేశ సంపదను దోచుకుని సరిహద్దులు దాటి కొందరు విలాసంగా బతుకుతుంటే.. చిల్లదొంగతనాలు, చిన్న చిన్న నేరాలు చేసిన వేలాదిమంది మాత్రం జైళ్లలో మిగిలిపోతున్నారు.

కలుగ చేసుకున్న సుప్రీం..
సుప్రీం కోర్టు కలుగజేసుకున్నా పరిస్థితిలో మార్పు రాలేదు.. అండర్ ట్రయల్స్ దుస్థితి గురించి కేంద్రం చట్టసవరణ చేసినా పరిస్థితిలో మార్పు లేదు. మరో పక్క న్యాయ వ్యవస్థలో సిబ్బంది కొరత కేసులను పోగుపడేలా చేస్తోంది. ఏటా పేరుకుపోతున్న కేసులతో, నిండుతున్న జైళ్లతో దేశంలో కోర్టుకెళిన కేసు ఎప్పటికి తేలుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడి.. అండర్ ట్రయల్స్ జైళ్లలో మగ్గిపోతున్నారు. అవిద్య, పేదరికం.. ఈ రెండు ఎలిమెంట్స్ దేశంలో బతుకుల్ని శాసిస్తున్నాయి. పొరపాటున కేసులో ఇరుక్కుంటే భవిష్యత్తును కాలరాస్తోంది. బయటకొచ్చే మార్గం లేక.. సమాయపడే నాథుడు లేక... లక్షలాదిమంది జైళ్లలో మగ్గిపోతున్నారు. వీరిలో ఏ ఆధారంలేని, భరోసాలేని పేద దలితులు, ఆదివాసీలు, ముస్లింలు ఉండటం దేశ సామాజిక పరిస్థితిని కళ్లకు కడుతోంది.

20:03 - November 1, 2016

'సై' సిన్మ జూశిండ్రా మీరు.. అరేయ్ గోడ మీద పెద్ద పెద్ద అచ్చరాలు రాయుండ్రి రాబై.. నల్ల బాలు.. నాకిపాడేస్త అని ఎవ్వలంటరు కామెడీ సూపర్ స్టార్ వేణుమాధవ్ సారు అంటడు.. తెల్గు ప్రేక్షకులను కడ్పుబ్బ నవ్విచ్చిన వేణుమాధవ్ సారు.. కన్నీళ్లు వెట్టుకోని ఏడుస్తున్నడు.. కొంతమంది వేణుమాధవ్ సారు మీద పగవట్టి పాణం దీయాలని సూస్తున్నరట.. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:00 - November 1, 2016

ఎన్నికల కమిషనోళ్లు..మన కోసం ఒక మంచిపనిజేయవోతున్నది..మూలవిరాట్లు ముష్టెత్తుకుంటూంటే ఉత్సవవిగ్రహాలకు ఊరేగింపట గట్లనే ఉన్నది తెల్గు రాష్ట్రాల యవ్వారం మీద కేంద్ర పరిశ్రమల శాఖోళ్లు జెప్తున్న ముచ్చట జూస్తుంటే.? తెలంగాణల ఈ నడ్మ ఒక గమ్మతి ముచ్చట అయితున్నది రాజకీయంల గుర్తువట్టిండ్రా..? మొన్న వీడీపీ అనె సంస్థోళ్లు ఒక సర్వే జేశిండ్రు.. సై సీన్మ జూశిండ్రా మీరు.. దొంగతనం జేస్తందుకు గూడ తెల్వితేటలు గావాలె.. ఇంట్ల వెంచుకునె కుక్కపిల్ల సచ్చిపోతెనే మనకు ఎంత బాధనిపిస్తది..ఎర్ర చందనం దొంగలు ఏం జేస్తరు.. మంచిగ అడ్విలకు జొర్రి.. చెట్లను నర్కి స్మగ్లింగ్ జేస్తరుగదా..గిసొంటి గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయుండి..

19:56 - November 1, 2016
19:54 - November 1, 2016
19:50 - November 1, 2016
19:48 - November 1, 2016

విజయవాడ : కాపులను ఆకర్షించడానికి ఏపీలో రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదికపై స్వరత్రా ఆసక్తి నెలకొంది. మరో రెండు నెలల్లో నివేదిక వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే సగం జిల్లాల్లో పర్యటన పూర్తి చేసింది. సామాజిక వెనకబాటుతనంపై సందిగ్ధత నెలకొంది. పల్స్ సర్వే ఫలితాలకు నివేదికలో ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. 
కాంగ్రెస్...
కాపులను ఆకర్షించడానికి ఏపీ పీసీసీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా నేడు కాపులతో ఆత్మీయ సమావేశం చేపట్టింది. ఈ సమావేశాలకు అగ్రశ్రేణి నాయకులు హాజరవుతున్నారు. జిల్లాలోని కాపు నాయకుల గుర్తింపు..కీలక బాధ్యతల అప్పగింతపై కసరత్తులు జరుగుతున్నాయి. నైతిక, రాజకీయ మద్దతు ద్వారా పొలిటికల్ ప్రయోజనాలను ఏపీసీసీ ఆశిస్తోంది. రుణమేళాలు..క్షేత్రస్థాయి సమావేశాల ద్వారా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.

టిడిపి..
ఇక అధికారంలో ఉన్న టిడిపి కూడా కాపులను దగ్గరికి తీసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి సహా కీలక పదవులు టిడిపి హాయాంలోనే ఇచ్చామని ప్రచారం చేస్తోంది. కాపుల సమస్యలు ఎప్పటికప్పుడు అడ్రస్ చేయాలంటూ మంత్రులకు సూచనలు అందుతున్నాయి.

జనసేన..వైసీపీ..
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటు మార్చారు. కాపు వర్గాలను చేరువ చేసుకొనేందుకు సై అంటున్నారు. ఇందుకు ఏలూరు కేంద్రంగా నివాసం..పార్టీ కార్యక్రమాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బలమైన స్థానంగా పశ్చిమగోదావరిని మలుచుకోవాలనే వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ పరిస్థితి..కాపు రిజర్వేషన్ల అంశంలో వెనుకబడకూడదని కాంగ్రెస్ నిశ్చయించుకుంది. నైతిక మద్దతే కాకుండా క్షేత్రస్థాయిలోనూ శ్రేణుల సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకతకు రాజకీయాస్త్రంగా కాపు రిజర్వేషన్ల అంశాన్ని వైసీపీ మలుచుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక జనసేన అభిమానుల్లో అధిక సంఖ్యాకులు కాపు యువతే ఉండడం గమనార్హం.
మరింత విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

19:18 - November 1, 2016
19:18 - November 1, 2016
19:16 - November 1, 2016
19:16 - November 1, 2016
18:35 - November 1, 2016
18:32 - November 1, 2016

మహబూబ్ నగర్ : సీపీఎం అజెండా సీఎం కేసీఆర్‌ను భయపెడుతుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. అట్టడుగు కులాల వారికి తెలంగాణ ప్రభుత్వం చేసేందేమీ లేదని.. సీపీఎం మహాజన పాదయాత్ర ఈ విషయాన్ని బయటపెడుతుందన్న భయం సీఎంకు పట్టుకుందన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. పాదయాత్రను అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్ పలు రకాలుగా ప్రయత్నించినా అవి ఫలించలేదన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానం ధనవంతులు, కార్పొరేట్ శక్తులకు ప్రజల సొమ్ము దోచిపెట్టేదని విమర్శించారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:30 - November 1, 2016

హైదరాబాద్ : రైతుల సమస్యలపై పాదయాత్రకు టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి సిద్దమవుతున్నారు. 10 జిల్లాలో పర్యటించి నవంబర్‌ 30న తన నియోజకవర్గం కొడంగల్‌లో 20 వేల మంది రైతులతో భారీ బహిరంగ ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, రైతుల్లో భరోసా నింపేందుకు పాదయాత్ర చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా టెన్ టివి రేవంత్‌రెడ్డి ముచ్చటించింది. తెలంగాణ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేశారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

18:26 - November 1, 2016

హైద్రాబాద్ : నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. నిన్న రాత్రి ఒంటరిగా వెళుతున్న మహిళపై కొందరు గుర్తు తెలయని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. హయత్‌నగర్ లోని పెద్ద అంబర్ పేట్ లో వుంటున్న ఇరవై యేళ్ల ఈమె కొంత కాలంగా భర్త తో వివాదం కారణంగా పుట్టింట్లోనే ఉంటోంది. ఎల్‌బినగర్‌లోని ఓ మార్కెట్లో పనిచేస్తోంది. రాత్రి డ్యూటి అయిపోయి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి బలవంతంగా కారులో ఎక్కించారు. కొంత దూరం తీసుకెళ్లిన తరువాత ఆమెపై ఒకరు అత్యాచారం చేసారు. దీన్ని గమనించిన కొందరు స్థానికులు కారును వెంబడించి దాడి చేయగా నిందితులు పరారయ్యారు. భాధితురాలు ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పిఎస్‌లో కేసు నమోదు చేసారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. 

18:24 - November 1, 2016

వరంగల్ : ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు విరసం నేత వరవరరావు. పోలీసుల అదుపులో ఉన్న ఆర్కేతో పాటు 9 మంది ఆదివాసులను వెంటనే కోర్టులో హాజరుపర్చాలన్నారు. మావోయిస్టులను పోలీసులు చిత్రహింసలు పెట్టి హతమార్చారన్నారు. ఆర్కే సమాచారం ప్రజలందరికీ తెలవాల్సిన అవసరముందన్నారు వరవరరావు. 

18:23 - November 1, 2016

హైదరాబాద్ : రబీ సాగుకు రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు, ఎరువుల కొరత లేదని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రబీ పంటసాగుపై వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి.. రైతులకు విత్తనాలు అందించాలని పోచారం అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున పంటల విస్తీర్ణం పెరిగే అవకాశాలుంటాయన్నారు. రైతులకు బ్యాంకుల నుంచి అందే రుణాల విషయంలో సమస్యలు లేకుండా చూడాలని పోచారం అధికారులను ఆదేశించారు.

 

విత్తనాలు..ఎరువుల కొరత లేదు - పోచారం..

హైదరాబాద్ : రబీ సాగుకు రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు, ఎరువుల కొరత లేదని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రబీ పంటసాగుపై వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

18:20 - November 1, 2016
18:18 - November 1, 2016

పశ్చిమగోదావరి : ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు జీవితం గడిపిన ఆరేటి సత్యవతి విడుదల అయ్యారు. చంద్రబాబుకు ఆడపడుచుల ఉసురు తగులుతుందని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిల్లో ఉద్యమాన్ని ఆపబోమని చెబుతున్నారు. 41 రోజులు జైలు జీవితం గడిపిన సత్యవతి ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

18:15 - November 1, 2016

విజయవాడ : రెండున్నరేళ్ళలో ఏం సాధించారని టిడిపి నేతలు జన చైతన్య యాత్రలు చేపడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు ప్రశ్నించారు. జనం ఛీ కొడుతున్నా జన చైతన్య యాత్ర లు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందంటూ మండిపడ్డారు. విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్రలు నేటితో పదో రోజుకు చేరుకున్నాయి. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:14 - November 1, 2016

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని సీపీఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ అన్నారు. వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నట్లు ఎంబీభవన్‌లో జరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం, జిల్లా కార్యదర్శుల సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. రేషన్‌కార్డులు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి అంశాలపై ఎక్కువగా వినతులు వస్తున్నాయని.. వాటి పరిష్కారానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. వాస్తు పేరుతో సచివాలయాన్ని కూల్చకుండా.. పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించాలని వెంకట్‌ డిమాండ్‌ చేశారు.

 

18:12 - November 1, 2016

చిత్తూరు : టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్‌ 14న తెలుగు రాష్ట్రాల్లో మనగుడి కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుపతి అభివృద్ధికి రూ.185 కోట్లు కేటాయిస్తూ భేటీలో నిర్ణయించారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యిని.. 78.28 కోట్లతో కొనుగోలు చేయనున్నారు. ఏడాదిలోపు తిరుపతిలో 14.5 కోట్లతో..శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్‌ స్టూడియో నిర్మాణం చేయనున్నారు. టీటీడీలో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచేందుకు కూడా పాలక మండలి నిర్ణయించింది. 

టిటిడి పాలక మండలి సమావేశం..

చిత్తూరు : టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్‌ 14న తెలుగు రాష్ట్రాల్లో మనగుడి కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుపతి అభివృద్ధికి రూ.185 కోట్లు కేటాయిస్తూ భేటీలో నిర్ణయించారు. 

18:08 - November 1, 2016

విశాఖపట్నం : 'అవంతి' కాలేజి బీటెక్ విద్యార్థి ప్రదీప్ మృతిపై అతడి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలంటూ వాళ్లు ఆందోళన ఉధృతం చేశారు. ప్రదీప్ కనిపించడం లేదని తాము ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదని ప్రదీప్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం కోసం ప్రదీప్‌ మృతిదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించగా..అక్కడికి మృతుడి కుటుంబసభ్యులు, సహచర విద్యార్థులు, అగనంపూడి, దానబోయినపాలెం గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రదీప్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జంక్షన్‌ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

18:04 - November 1, 2016

కాకినాడ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం నేతలు పాదయాత్రతో సమరశంఖం పూరించారు. ఇంద్రపాలెం వంతెన దగ్గర ఉన్న అంబేద్కర్‌ విగ్రహం నుంచి పాదయాత్ర చేపట్టారు. స్మార్ట్‌సీటీలో ఏ మాత్రం ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ పాదయాత్రపై మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:02 - November 1, 2016

హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రావు నిప్పులు చెరిగారు. వ్యవసాయ రంగంలో రెండంకెల వృద్ధి రేటు సాధించామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో 93 శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారని.. సగటు రైతు అప్పు లక్షా 23 వేలు ఉందని సెస్‌ నివేదిక వెల్లడించిందన్నారు. ప్రభుత్వం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని సెస్‌ నివేదికతో తేటతెల్లమైందన్నారు.

 

18:01 - November 1, 2016

విజయవాడ : మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో నిషేధిత సిమీ కార్యకర్తల ఎన్‌కౌంటర్‌పై కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పోలీసుల గుట్టు రట్టవుతుందన్న కారణంతోనే సిమీ కార్యకర్తలను ఎన్‌కౌంటర్‌ చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేవలం సిమీ ఖైదీలే జైలు నుంచి ఎలా పారిపోగలిగారని దిగ్విజయ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలీసులే వారిని కాల్చి చంపారని ఆరోపించారు. సిమీ కార్యకర్తలు ఆయుధాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. వారిని ప్రాణాలతో పట్టుకుంటే పోలీసుల గుట్టు బయటపడుతుందన్న కారణంతోనే వారిని చంపేశారని దిగ్విజయ్‌ అన్నారు.

17:58 - November 1, 2016
17:56 - November 1, 2016

పశ్చిమగోదావరి : జిల్లా పెనుగొండ మండలం నడిపూడిలో కలకలం నెలకొంది. కొందరు దుండగులు ఓ మహిళను హత్య చేసి గోదావరి తీరంలో పూడ్చి పెట్టారు. మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు పెనుమంట్ర మండలం ఎస్‌.ఇల్లిందలపర్రుకు చెందినట్లుగా అనుమానిస్తున్నారు.

17:53 - November 1, 2016

జమ్మూ కాశ్మీర్ : అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడుతున్న దృశ్యాలను బిఎస్‌ఎఫ్‌ విడుదల చేసింది. జమ్ముకశ్మీర్‌లోని హీరానగర్‌ సెక్టార్‌లో థర్మల్‌ ఇమేజింగ్‌ పద్ధతిలో బిఎస్‌ఎఫ్‌ వీటిని రికార్డ్ చేసింది. ఉగ్రవాదులు భూమిపై పాకుతూ భారత్‌ భూభాగంలోకి దూసుకొస్తున్న విజువల్స్‌ ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్‌ 29, 30 తేదీల్లో ఈ దృశ్యాలను బిఎస్‌ఎఫ్‌ రికార్డు చేసింది.

17:51 - November 1, 2016

విశాఖపట్టణం: : జిల్లా బలిమెల రిజర్వాయర్లో రెండు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. రిజర్వాయర్లో ఉన్న మృతదేహం మావోయిస్టు అగ్రనేత ఆర్కేది అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతదేహం ఎవరిదన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ లో పలువురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. మావోయిస్టు అగ్రనేత ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నాడని, వెంటనే అతడిన కోర్టులో హాజరు పరచాలని ఆయన సతీమణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బలిమెల రిజ్వాయర్ లో మృతదేహాలు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. 

నూజివీడులో తెలుగు తమ్ముళ్ల మధ్య విబేధాలు..

కృష్ణా : నూజివీడులో తెలుగు తమ్ముళ్ల మధ్య విబేధాలు పొడచూపాయి. టిడిపి జిల్లా ఇన్ ఛార్జీ ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా నలుగురు ఎంపీటీసీలు రాజీనామాకు సిద్ధపడ్డారు. రాజీనామాలు చేయొద్దని ముద్రబోయిన వర్గీయులు వత్తిడి తెస్తున్నారు. 

కమల్ - గౌతమి విడాకులు..

చెన్నై : కమల్ హాసన్ తో విడిపోతున్నట్లు నటి గౌతమి ప్రకటించారు. నాలుగు నెలల క్రితం నుండే కమల్ కు గౌతమి దూరంగా ఉంటున్నారు. 13 ఏళ్ల సహజీవనానికి గౌతమి తెరదింపారు. ఇద్దరం విడిపోయినట్లు ట్విట్టర్ లో గౌతమి ప్రకటించారు. ఇది బాధాకర నిర్ణయమని కానీ తప్పడం లేదన్నారు. 1989లో సందీప్ భాటియాను గౌతమి పెళ్లి చేసుకున్నారు. 1999లో భాటియాకు గౌతమి విడాకులు ఇచ్చారు. వీరికి ఓ కూతురు ఉంది. 2005 నుండి కమల్ హాసన్ తో గౌతమి సహజీవనం కొనసాగించారు. కొంతకాలం క్రితం గౌతమి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధ పడ్డారు. 

15:19 - November 1, 2016

చెన్నై : ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ తో గౌతమి తన బంధాన్ని తెంచుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోకపోయినా గత 13 ఏళ్లుగా కలిసి ఉన్నారు. తామిద్దరం విడిపోతున్నట్లు గౌతమి ట్విట్టర్ లో ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అంతేగాకుండా మీడియాకు ఓ లేఖను గౌతమి విడుదల చేశారు. ఇది బాధకరమైన నిర్ణయమని, దాదాపు 13 ఏళ్లు ఇద్దరం కలిసి జీవించామన్నారు. ఒకరితో బంధాన్ని తెంచుకోవడం అంత సులువు కాదని..కానీ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. చాలా రోజులుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇందులో ఎవరి ప్రోద్బలం లేదని..అన్ని ఆలోచించాకే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 29 ఏళ్లు సినీ పరిశ్రమలో ఉన్నట్లు పరిశ్రమలో రాకముందు తాను కమల్ అభిమాని అని తెలిపారు. అతనితో ఎన్నో మధురానుభూతులు చూడడం జరిగిందని అంతేగాకుండా కాస్టూమ్స్ డిజైనర్ గా పనిచేయడం జరిగిందన్నారు. ఆయనతో కలసి సినిమాల్లో పనిచేసినందుకు గర్వంగా భావిస్తున్నట్లు, తన జీవితంలో కష్టసుఖాల్లో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు గౌతమి వెల్లడించారు.
కమల్ తన భార్య సారికకు దూరం కావడం..గౌతమి తన భర్తకు దూరమయ్యాక..వీరిద్దరూ దగ్గరయ్యారు. కమల్ తో కలిసి చాలా సినిమాల్లో నటించారు కూడా. కమల్ ఇటీవలే నటించిన 'పాపనాశనం' సినిమాలో గౌతమి ఆయనకు భార్యగా నటించారు. గౌతమి క్యాన్సర్ బారిన పడిన సమయంలో కమల్ అండగా నిలబడ్డారు. వీరిద్దరి విడాకులకు కారణాలేంటో తెలియడం లేదు. 

సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది టిడిపి - కేఈ..

గుంటూరు : తుళ్లూరు (మం) వెంకటపాలెంలో జన చైతన్య యాత్రను డిప్యూటి సీఎం కేఈ ప్రారంభించారు. అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది టిడిపి ప్రభుత్వమేనని, జిల్లాలో పరిష్కారం కాని సమస్యలను ఆర్డీవో స్థాయి అధికారులకు అప్పగించడం జరుగుతుందన్నారు. శిథిలావస్థలో ఉన్న తహశీల్దార్, ఆర్డీవో భవనాలను కూల్చివేసి నూతన భవనాలను నిర్మిస్తామన్నారు. వెబ్ పోర్టల్ ద్వారా కోటిన్నరకు పైగా మంది భూ సమస్యలను పరిష్కరించుకున్నారని కేఈ పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో నూతన సంస్కరణలను తీసుకొస్తామని తెలిపారు.

పాదయాత్రకు మంచి స్పందన - బి.వెంకట్..

హైదరాబాద్ : సీపీఎం జిల్లా కార్యదర్శులతో రాష్ట్ర కార్యదర్శివర్గం భేటీ జరిపింది. సీపీఎం పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్ పేర్కొన్నారు. మూడెకరాల భూమి..డబుల్ బెడ్ రూం ఇళ్లు..రేషన్ కార్డులు..స్మశాన వాటికల సమస్యలపై వినతులు వస్తున్నాయన్నారు. తక్షణమే ప్రభుత్వం వాటిని అమలు చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. సచివాలయం కూల్చాల్సినవసరం లేదని, వాస్తు పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. 

గోదావరి ఇసుక దిబ్బల్లో యువతి మృతదేహం..

పశ్చిమగోదావరి : గోదావరి ఇసుక దిబ్బల్లో యువతి మృతదేహం లభ్యమైంది. కుక్కలు పీక్కుతింటుంటే స్థానికులు గుర్తించిన పోలీసులకు సమాచారం అందించారు. హత్య చేసి పూడ్చిపెట్టినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

అధికారులపై పెద్దపల్లి కలెక్టర్ సీరియస్..

పెద్దపల్లి : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కలెక్టర్ వర్షిణి సీరియస్ అయ్యింది. డీఈవో వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చక్రధర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

పాక్ సైన్యం కాల్పులు..8మంది పౌరుల మృతి..

జమ్మూ కాశ్మీర్ : రామ్ గఢ్, నౌషెరా, రాజౌరీ సెక్టార్లలో మళ్లీ పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. రామ్ గఢ్ లో 8మంది పౌరులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 

ఏపీలో నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు..

హైదరాబాద్ : ఏపీలో నీటి వినియోగదారుల సంఘాలకు ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఆర్కేను కోర్టులో హాజరు పరచాలి - వరవరావు..

వరంగల్ : పోలీసుల అదుపులో ఉన్న ఆర్కే, 9మంది ఆదివాసీలను కోర్టులో హాజరు పరచాలని వరవరరావు డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఆర్కే సమాచారం ప్రజలకు తెలపాల్సినవసరం ఉందని పేర్కొన్నారు. 

14:08 - November 1, 2016

మహబూబ్ నగర్ : సీపీఎం మహాజన పాదయాత్ర 16వ రోజుకు చేరుకుంది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ యాత్ర ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు గ్రామాల గుండా సాగుతోంది. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలని పాదయాత్రలో పాల్గొన్న ఎంబీసీ నేత ఆశయ్య అన్నారు. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున రావడంవల్ల కమ్మరి, కుమ్మరి, చాకలి, సంచాల కులవృత్తులన్నీ నేడు ధ్వంసం అయ్యాయని ఆశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బడుగులను ప్రభుత్వం ఆదుకొని వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలంటున్న ఎంబీసీ నేత ఆశయ్య పేర్కొన్నారు.

బలిమెర రిజర్వాయర్ లో రెండు మృతదేహాలు..

విశాఖపట్టణం : బలిమెర రిజర్వాయర్ లో మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో ఒక మృతదేహం మావోయిస్టు అగ్రనేత ఆర్కేదా ? కాదా ? అనేది తెలియరావడం లేదు. కాసేపట్లో పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. 

సమన్వయంతోనే నెంబర్ వన్ ర్యాంకు - కేటీఆర్..

హైదరాబాద్ : అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్లే మొదటి ర్యాంకు వచ్చిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ నెంబర్ వన్ స్థానం పొందడానికి 22 శాఖలు సమన్వయంతో పనిచేశాయన్నారు. సీఎం కేసీఆర్ సూచనలతోనే పారిశ్రామిక రంగంలో..కార్మిక శాఖలోనూ 22 సర్వీసులు మొదలు పెట్టామన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు 58 జీవోలు తీసుకరావడం జరిగిందని, పరిశ్రమల కోసం 26 చట్టాలను సవరించుకుంటున్నట్లు తెలిపారు. 26 చట్టాలను సవరించి కొత్త విధానాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. తెలంగాణలో కొత్త 113 ఆన్ లైన్ సర్వీసులు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. 

14:06 - November 1, 2016

గుంటూరు : దేశంలోనే 50 రోజుల్లో అరకోటి సభ్యత్వం సాధించిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆపార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఏ కార్యకర్తకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పార్టీ వారిని ఆదుకుంటోందని తెలిపారు. ఇందుకోసం కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. పార్టీ శ్రేణుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కోటి మంది సభ్యులు లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

13:47 - November 1, 2016

ఒకప్పుడు వివాహాలు పెద్దలు కుదిర్చి చేసేవారు...అనంతరం వివాహాలు చేసే విధానంలో కుదుర్చుకునే విధానంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వివాహాలన్నీ మోట్రిమోనీ సంస్థల మీదనే ఆధారపడ్డాయి..ఈనాటి వేదికలో మోట్రిమోనీ వివాహాలు అనే అంశంపై వేదిక చర్చను చేపట్టింది. ఈ చర్చలో లక్ష్మీదేవి (వివాహ వ్యవస్థపై పరిశోధకులు), వెంకట్ రెడ్డి (జెమిని మ్యారేజ్ బ్యూరో)పాల్గొన్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

13:42 - November 1, 2016

జమ్ము కశ్మీర్ : మరోసారి పాకిస్థాన్ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో స‌రిహ‌ద్దుల్లో పాక్ రేంజ‌ర్ల కాల్పులకు ఐదుగురు భారతీయులు మృతి చెందారు. పలువురికి గాయలయినట్లుగా సమాచారం.కాగా మృతుల్లో ముగ్గురు మహిళలు,ఇద్దరు చిన్నారులు వున్నట్లుగా తెలుస్తోంది. సరిహద్దు గ్రామాల పౌరులే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులకుతెగబడుతున్నారు. పాక్ దాడులను భార‌త్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ గట్టిగా బుద్ధి చెబుతోన్నా పాకిస్థాన్ త‌న తీరు మార్చుకోవ‌డం లేదు. పాక్ బ‌ల‌గాలు జ‌మ్ముక‌శ్మీర్‌లోని సాంబా, నౌషేరా ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతోన్న‌ విష‌యం తెలిసిందే. భారత్ సర్జికల్ దాడుల అనంతరం పాకిస్థాన్ దాదాపు 60సార్లకు పైగా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

13:31 - November 1, 2016

హైదరాబాద్ : రెండేళ్ళలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమని మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. రెండేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి ఎనో అవార్డులొచ్చాయని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయటం వల్లనే తెలంగాణకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్ లో మొదటిస్థానాన్ని దక్కించుకున్నామన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు 58 జీవోలను తీసుకొచ్చామని తెలిపారు. అలాగే పరిశ్రమల కోసం 26 చట్టాలను సవరించుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు తెలంగాణ పారిశ్రామిక రంగం లో దూసుకుపోతోందన్నారు. అలాగే తెలంగాణలో కొత్తగా 113 ఆన్ లైన్ సర్వీసులు ప్రవేశపెట్టామన్నారు. 

ప్రగతి నగర్ లో మంత్రి జూపల్లి ఆకస్మిక పర్యటన..

హైదరాబాద్ : ప్రగతి నగర్ లో మంత్రి జూపల్లి ఆకస్మిక పర్యటన జరిపారు. పార్క్ స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని మంత్రి మంత్రి జూపల్లి పరిశీలించారు. అనుమతిలేని నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

అంబోలిలో మహిళపై గ్యాంగ్ రేప్..

ముంబై : అంబోలిలో 30 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన చోటు చేసుకుంది. ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తరలించారు.

అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..

విశాఖపట్టణం : అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రదీప్ బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రదీప్ మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ ఆందోళన చేపట్టారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు గాజువాక ఎమ్మెల్యే, పోలీసు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు.

 

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలి - చంద్రబాబు..

విజయవాడ : తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాల్సినవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పేదరికం లేని సమాజాం చూడాలన్నదే తమ ఆశయమని, కార్యకర్తలకు ప్రమాద బీమా రూ. 5లక్షలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని సూచించారు. ప్రతొక్కరికీ ఇంటి భద్రత కల్పిస్తామని, వ్యక్తిగత భద్రత..ఆడపిల్లల భద్రతకు ప్రాధాన్యతనిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ. 10 వేల ఆదాయం వచ్చేలా చూస్తామన్నారు. 

12:48 - November 1, 2016

విశాఖ : ఏపీలో పరిశ్రమల రగడ కొనసాగుతూనే ఉంది. పరిశ్రమల ఏర్పాటు వల్ల గ్రామాలు నాశనమవుతున్నాయనే ఆందోళనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజగా విశాఖపట్నం జిల్లాలో ఈ ప్రాసెసింగ్ యూనిట్ పరిశ్రమను మూసివేయాలని సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాలను గ్రామస్థులకు అనారోగ్యం
విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం ధర్మవరం దాదాపు 500 కుటుంబాలు ఉన్న కుగ్రామం.. 8 సంవత్సరాల క్రితం గ్రామంలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ -ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటుశారు. ఈ పరిశ్రమకు చెందిన వ్యర్ధ్యాల కోసం ఆ కంపెనీ ప్రతినిధులు ఎకరం విస్తీర్ణంలో ఓ చెరువును తవ్వించారు. పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలతో ఆ చెరువు ఇప్పుడు పూర్తిగా కలుషితమైంది. దీంతో గ్రామంలోని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు..

చెరువు కలుషితం..సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన
చెరువు కలుషితమవ్వడంతో ప్లాంట్‌ను మూసివేయాలని సీపీఎం అధ్వర్యంలో ప్రజలు అందోళకు దిగారు.. ఫ్యాక్టరీ వ్యర్థాల నుంచి వచ్చే దుర్గంధం భరించలేకుండా ఉందని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు..

యాజమాన్యం హామీతో ఆందోళన విరమణ
చివరికి ఆందోళనలతో దిగివచ్చిన ఫ్యాక్టరీ యాజమాన్యం మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.. దీంతో గ్రామస్తులు అందోళనను విరమించారు..

హెడ్ కానిస్టేబుల్ పాడెను మోసిన సీఎం చౌహాన్...

భోపాల్ : నిషేధిత సిమీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ యాదవ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొని యాదవ్ పాడెను మోశారు. యాదవ్ కుటుంబానికి రూ. పది లక్షల ఆర్థిక సాయాన్ని సీఎం ప్రకటించారు. అంతేగాకుండా అతని కూతురు వివాహానికి రూ. 5లక్షల సాయాన్ని ప్రకటించారు. 

జీహెచ్ఎంసీ కమిషనర్ తో జలమండలి ఎండీ భేటీ..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ తో జలమండలి ఎండీ దానకిశోర్ భేటీ అయ్యారు. శివారు ప్రాంతాల్లో 2500 కి.మీటర్లకు పైగా తాగునీటి పైపులైన్ కోసం అవసరమైన రోడ్ల తవ్వకంపై వీరు చర్చించారు. 

12:43 - November 1, 2016

విశాఖపట్నం : అవంతి కాలేజి బీటెక్ విద్యార్థి ప్రదీప్ మృతిపై అతడి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలంటూ వాళ్లు అగనంపూడి వద్ద జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో వాహనాలు భారీ సంఖ్యలో నిచిలిపోయి అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రదీప్ కనిపించడం లేదని తాము ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రదీప్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రదీప్ స్నేహితుల ఆధారంగా వెలుగు లోకి వచ్చిన వివరాలు
వాస్తవానికి ఈ విద్యార్థి విషయంలో.. అతడి స్నేహితుడు చెప్పిన విషయాల ఆధారంగానే వివరాలు తెలిశాయి. స్నేహితురాలితో కలిసి చాట్ బండి వద్ద చాట్ తింటుండగా.. చిన్నా, సాయి అనే ఇద్దరు నిందితులు ప్రదీప్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కొట్టారని అతడి స్నేహితుడు చెప్పాడు. ఆ విషయం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ప్రదీప్ కనిపించని విషయాన్ని అక్టోబర్ 28వ తేదీనే అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదని అంటున్నారు. చిన్నా, సాయి అనే ఇద్దరు తీసుకెళ్లారని ముందుగానే చెప్పారని, వాళ్లను తీసుకెళ్లి విచారిస్తే తన కొడుకు ప్రాణాలు పోయేవి కావని ప్రదీప్ తండ్రి అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు సాయిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. చిన్నా విషయం మాత్రం పోలీసులు వెల్లడించడం లేదు. అతడు కూడా అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో కొన్ని రాజకీయ ఒత్తిడులు కనిపిస్తున్నాయి. నిందితులు ఇద్దరిలో చిన్నా అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటాడు. అతడు ఒక ఎమ్మెల్యేతో కూడా సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అందుకే విచారణ సక్రమంగా సాగదని భావించిన బంధువులు.. తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు.

అగనంపూడి వద్ద జాతీయ రహదారిపై ఆందోళన
విశాఖ జిల్లా అనకాపల్లిలో దారుణం జరిగింది. శారదానదిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. 3 రోజుల క్రితం కిడ్నాపైన బీటెక్‌ విద్యార్థి ప్రదీప్‌గా అనుమానిస్తున్నారు. అయితే ప్రదీప్‌ను ప్రియురాలు కుటుంబ సభ్యులే కిడ్నాప్‌ చేసి హత్యచేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రదీప్‌ అదృశ్యంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ..అగనంపూడి వద్ద రహదారిపై మృతుడి బంధువుల రాస్తారోకో నిర్వహించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కసింకోట ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ప్రేమించుకున్నప్పుడు ఒకరిని చంపేయటం ఎంత వరకూ న్యాయమని ప్రదీప్ బంధువులు ప్రశ్నిస్తున్నారు. ప్రదీప్ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని అప్పటివరకూ ప్రదీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయటానికి వీల్లేదంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

28 నుండి అంతర్జాతీయ ఫిలి ఫెస్టివల్..

ఢిల్లీ : గోవాలో ఈనెల 28వ తేదీ నుండి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ జరగనున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. ఈ ఫెస్టివల్ కు 88 దేశాల నుండి ప్రతినిధులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 194 చిత్రాలు ప్రదర్శితమౌతాయన్నారు. 

12:38 - November 1, 2016

నిజామాబాద్ : నిజాం చక్కెర కర్మాగారం రాజకీయాలకు వేదికగా మారుతోంది.. ఫ్యాక్టరీ మూసివేతపై ప్రతిపక్షాలు పోరుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే ఫ్యాక్టరీని తెరిపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇదే అంశంపై పాదయాత్ర చేపట్టి అధికార పార్టీపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసింది.

మూడు నెలలుగా నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులకు మద్దతు
నిజామాబాద్ జిల్లాలోని నిజాం చక్కెర కర్మాగారాన్ని మూసివేయడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలంటూ మూడు నెలల నుంచి కార్మికులు, రైతులు నిరహార దీక్షలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. దీంతో ప్రతిపక్షాలు కార్మికులకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.
అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ మాట తప్పారని ఎద్దేవా
తాజాగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఆందోళన చేపట్టింది. అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీసింది. మాట తప్పడంలో కేసీఆర్‌కి నెంబర్ వన్ స్థానం ఇవ్వొచ్చని ఎద్దేవా చేసింది.

నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర
వారం రోజుల క్రితం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలో ఫ్యాక్టరీని తెరిపించాలని కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహించింది. ఈ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కలతో పాటు ప్రముఖనేతలందరూ పాల్గొన్నారు. తక్షణమే ప్రభుత్వం చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్మికులకు న్యాయం చేయాలంటున్న ప్రతిపక్షాల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గి కర్మాగారాన్ని తెరిపిస్తుందో లేదో వేచిచూడాలి.. 

12:33 - November 1, 2016

విజయవాడ : ఏపీ తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడ నగరం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అభివృద్ది కార్యక్రమాలకు చెల్లింపులు జరపలేని పరిస్థితి ఒకవైపు... సిబ్బంది జీతభత్యాలను సకాలంలో అందించలేని దుస్థితి మరోవైపు... పేరుకుపోతున్న అప్పులు... వసూలు కాని బకాయిలతో నగరంలో పాలన అస్తవ్యస్తంగా మారింది.

బ్యాంకులకు, ప్రభుత్వరంగ సంస్థలకు 200 కోట్లకు పైగా బకాయిలు
విజయవాడ నగరాన్ని అద్భుతంగా అభివృద్ది పథంలో నడిపిస్తానంటూ ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఊదరగొట్టేస్తున్నారు... మరోవైపు ఉద్యోగులకు జీతాలు... కాంట్రాక్టర్ లకు బిల్లులు కూడా చెల్లించలేని ఆర్థిక దుస్థితిలో కార్పొరేషన్ కొట్టుమిట్టాడుతోంది. పుష్కరాల పేరుతో నగరంలో చేసిన హడావుడి పనులకు కూడా బిల్లులను పెండింగ్ లో పెట్టిన అధికారుల తీరుతో పనులు చేసేందుకు ఉన్నదంతా ఊడ్చిపెట్టిన కాంట్రాక్టర్ లు బెంబేలెత్తుతున్నారు. రావాల్సిన ఆదాయం ఒకవైపు పేరుకుపోతుంటే... చెల్లించాల్సిన అప్పులు కార్పొరేషన్ ఖజానాను భయపెట్టేస్తున్నాయి. వివిధ బ్యాంకులకు, ప్రభుత్వరంగ సంస్థలకు కార్పొరేషన్ చెల్లించాల్సిన బకాయిలే రెండు వందల కోట్లకు పైగా ఉన్నాయి.

హడ్కో బ్యాంకుకు 99 కోట్లు.. ఏపియుఎఫ్ఐడిసికి 40 కోట్ల అప్పులు
హడ్కో బ్యాంకుకు 99 కోట్లు, ఏపియుఎఫ్ఐడిసికి 40 కోట్లు, ఎపిఎస్ హెచ్ సిఎల్ కు 57 కోట్లు చెల్లించాల్సి వుంది. ఈ అప్పులకు ఏటా 28 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అధికార పక్షం అంతర్గత కుమ్ములాటలతో కాలం వెళ్లదీస్తోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల నుంచి గ్రాంట్ లు తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం లేదనే విమర్శలు వున్నాయి. దీంతో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. పెండింగ్ బకాయిలు 19 కోట్లు కోసం కాంట్రాక్టర్ లు ఆందోళనలు చేసినా కూడా చెల్లించలేని దుస్థితి కార్పొరేషన్ ఎదుర్కొంటోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు రూ. 22 కోట్లు
నగరంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బకాయిలు 22 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్ కు రావాల్సి వుంది. వస్త్రలత బకాయిలే పదికోట్లకు పైగా వున్నాయి. జె ఎన్ ఎన్ యు ఆర్ యం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లెక్క తేలిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నలబై కోట్లు వచ్చే అవకాశం వుంది. ఇదీలా ఉంటే పుష్కరాల సమయంలో పనులు చేయాలంటూ వత్తిడి తెచ్చిన మున్సిపల్ అధికారులు ఆ తరువాత తమకు బిల్లుల చెల్లింపులు చేయలేక చేతులెత్తేస్తున్నారని కాంట్రాక్టర్ లు కూడా ఆందోళనలు దిగే పరిస్థితి ఏర్పడింది.

అధికారపక్షమే మేయర్ స్థానంలో
రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, మున్సిపల్ శాఖా మంత్రి కార్యాలయాలు వున్న విజయవాడ నగరంలో ఆర్థిక గందరగోళం జరుగుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. అధికారపక్షమే మేయర్ స్థానంలో కొనసాగుతున్నా... కార్పొరేషన్ కష్టాలు గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. 

అనకాపల్లి జంక్షన్ వద్ద విద్యార్థుల ఆందోళన..

విశాఖపట్టణం : అనకాపల్లి జంక్షన్ ఎదుట మృతి చెందిన ప్రదీప్ బంధువులు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అవంతి బీటెక్ కాలేజీ ప్రదీప్ మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ హత్య వెనుకాల టిడిపి నేతలు హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

టిటిడి పాలక మండలి సమావేశం ప్రారంభం..

చిత్తూరు :తిరుమల అన్నమయ్య భవన్ లో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది. టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతనలో ఈ సమావేశం జరుగుతోంది. 

11:47 - November 1, 2016

హైదరాబాద్: తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. 10రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకూ ఎటువంటి కూల్చివేతలకు చేపట్టకూడదని ఈ సందర్భంగా న్యాయస్థానం స్టే ఆర్డర్ జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాస్తు ప్రకారం లేదంటూ తెలంగాణ సెక్రటేరియట్‌ను కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజనాలవాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. సచివాలయాన్ని కూల్చివేయడానికి గల కారణాలను పూర్తి వివరాలతో పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పది రోజుల్లో ఎలాంటి కూల్చివేతలు జరపవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

11:39 - November 1, 2016

గుంటూరు : గుంటూరు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుండి టీడీపీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని చంద్రబాబు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్ళను పార్టీ వ్యవస్థాపకుడు..స్వర్గీయ ఎన్టీర్ నినదించేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. గత సంవత్సరం ఇండ్రస్ట్రియల్ ప్రమోషన్ రెండోస్తానంలోవున్న ఏపీ ఇప్పుడు మొదటిస్థానాన్ని దక్కించుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు . 2022 కల్లా దేశంలోనే టాప్ లో ఆంధ్రప్రదేశ్ వుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకునే బాధ్య‌త పార్టీద‌ని చంద్రబాబు అన్నారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ అందించేందుకు కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌ని సూచించారు. రాజ‌కీయాల‌పై త‌న కుటుంబం ఎప్పుడూ ఆధార‌ప‌డ‌కూడ‌ద‌ని తాను నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. న్యాయ‌బద్ధంగా డ‌బ్బు సంపాదించాల‌ని అన్నారు. ప్రజలకు ప్రజాప్రతినిధులే ఆదర్శంగా వుండాలే తప్ప వేలెత్తి చూపించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. స్థిరమైన పునాదులపై ఏర్పడిన పార్టీ టీడీపీ అని బాబు అన్నారు. కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. పేదరికంలేని సమాజ నిర్మాణమే లక్ష్యమని స్పష్టం చేశారు. 54లక్షల సభ్యత్వం ఉన్న పెద్ద కుటుంబం టీడీపీ అని పేర్కొన్నారు.దీన్ని కోటికి పెంచేలా నేతలు..కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యకర్తల అభివృద్ధి, సంక్షేమానికి మెరుగైన ప్రణాళికలు రూపొందించనున్నట్లు చెప్పారు. 

11:30 - November 1, 2016

విజయవాడ : తెలుగుదేశం రెండు బృహత్తర కార్యక్రమాలను ప్రారంభించనుంది. అటు పార్టీని, ఇటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనచైతన్య యాత్రలను చేపట్టాలని నిర్ణయించింది. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 2014లో 55 లక్షల మందిని పార్టీలో చేర్పించిన టీడీపీ, ఈసారి కోటిమందికి సభ్యత్వం ఇవ్వాలన్న భారీ లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 2014లో 55 లక్షల మందిని పార్టీలో చేర్పించిన టీడీపీ, ఈసారి కోటిమందికి సభ్యత్వం ఇవ్వాలన్న భారీ లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలు నవంబర్‌ 1 నుంచి ప్రారంభమై 30 రోజుల పాటు కొనసాగుతాయి. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సభ్యత్వ నమోదు ప్రారంభం అవుతుంది. చంద్రబాబునాయుడు ఏపీలో సభ్యత్వం తీసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని సూచించింది. 

బీబీనగర్ నిమ్స్ ను సందర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి..

యాదాద్రి : బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రిని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. నిమ్స్ భవన నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఆపరేషన్ థియేటర్ ను సందర్శించారు. సాధ్యమైనంత వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ఇన్ పేషెంట్, అత్యవసర సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భవన నిర్మాణ పనుల్లో రాజీపడొద్దన్నారు. 

భోపాల్ ఎన్ కౌంటర్ పై హెచ్చార్సీ నోటీసులు..

భోపాల్ : ఎన్ కౌంటర్ పై మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్ కౌంటర్ పై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

రాజకీయ పార్టీలపై ఈసీ కొరడా..

ఢిల్లీ : రాజకీయ పార్టీలపై ఈసీ కొరడా ఝులిపించింది. మేనిఫెస్టో అమలు చేయకుంటే ఇకపై సదరు పార్టీ గుర్తు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 23న జరిగిన సమావేశంలో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మేనిఫెస్టోలో పెట్టిన హామీని అమలు చేస్తామని రాజకీయ పార్టీలు స్టాంప్ పేపర్ పై అఫిడవిట్ సమర్పించాలి..హామీలు అమలు చేయకపోతే పార్టీ గుర్తు రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం..

గుంటూరు : టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. సభ్యత్వాన్ని చంద్రబాబు, లోకేష్ లు రెన్యువల్ చేయించుకున్నారు. పార్టీ సభ్యత్వం మొబైల్ యాప్ ను ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్, ఉండవల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు దాసరి కృష్ణలు చంద్రబాబుకు సభ్యత్వ కార్డును అందచేశారు. సభ్యత్వ నమోదు రుసుం రూ. 100 బాబు చెల్లించారు. 

10:49 - November 1, 2016

విశాఖ : విశాఖ ఉక్కు ఉద్యమానికి ఈనాటితో 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఏవీఎన్ కాలేజ్ నుండి పాత పోస్టాఫీసు వరకూ ర్యాలీ చేపట్టారు. విశాఖ ఉక్కును కాపాడుకోవాలని సీఐటీయూ అధ్యక్షులు నర్శింగ్ రావు పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ బాగుంటేన మన భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎన్నో ఉద్యమాలు.. మరెన్నో త్యాగాల ఫలితంగా..ఒకప్పుడు పోర్ట్‌ సిటీగా పేరొందిన విశాఖ నగరం... ఉక్కునగరంగా కీర్తి గడించింది. ఆ స్టీల్‌ ప్లాంట్‌ వెనుక ఎందరో యువకుల బలిదానం.. మరెందరో నాయకుల త్యాగాలు దాగి ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, శ్రామికులు.. ఇలా వివిధ వర్గాల ప్రజలు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని నినదించి స్టీల్‌ ప్లాంట్‌ను సాధించారు.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తెలుగు వారంతా ఉద్యమ దివిటీలై
ఆదిలాబాద్‌ నుంచి అనంతపురం వరకు... శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తెలుగు వారంతా ఉద్యమ దివిటీలై సాగిన తీరు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఆబాలగోపాలమూ రోడ్డెక్కిన అద్భుత దృశ్యమది. డిమాండ్‌ సాధన దిశగా.. రాష్ట్ర వ్యాప్త బంద్‌లు, రాస్తారోకోలు నిత్యకృత్యమై.. అంతిమ ఫలాన్ని అందుకున్న అపురూప ఘట్టం. అంతటి ఘన ఉద్యమానికి నవంబర్‌ ఒకటితో యాభై వసంతాలు పూర్తయ్యాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు పరిశ్రమ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు పరిశ్రమను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై ఒడిశా, తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో కేంద్రం తమిళనాడులోని సేలంలో స్టీల్‌ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఉడికిపోయింది.. ప్రజల కోపం సముద్ర కెరటాల్లా ఎగసిపడింది. అప్పటి విశాఖ ఎంపీ తెన్నేటి విశ్వనాథం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆయన చేపట్టిన ప్రత్యక్ష ఉద్యమంతో.. మరెందరో ముందుకు కదిలారు. అమృతరావు అనే నేత విశాఖ కలెక్టరేట్‌ వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు.

ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు
విశాఖ ఉక్కు కోసం పోరు ఉధృతమైంది. ఈ క్రమంలో 1966 నవంబర్‌ 1న విద్యార్థులు పోస్టాఫీసు, జగదాంబ థియేటర్‌ వద్ద పోలీసులు ఉద్యమకారులపై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో 12 మంది విద్యార్థులు, రిక్షా కార్మికులు మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి ఘటనకు నిరసనగా ప్రతిపక్షాలు రాజీనామా చేశాయి.

ఆంధ్రుల హక్కు అంటూ తెన్నేటి విశ్వనాధం నడిపిన ఉద్యమం
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ తెన్నేటి విశ్వనాధం నడిపిన ఉద్యమ ఫలితంగా, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 1970, ఏప్రిల్‌ 10న.. విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటించారు. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలను దానం చేసారు. 1971 జనవరి 20న ఇందిరాగాంధీ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. 2010లో నవరత్న హోదా పొందిన.. ఉక్కు కర్మాగారాన్ని.. జర్మనీ, సోవియట్‌ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించారు.  

ఆర్టీసీ బస్..టిప్పర్ ఢీ..

మంచిర్యాల: మందమర్రి కేకే-2 గని దగ్గర అంతర్రాష్ట్ర రహదారిపై ఆర్టీసీ బస్సు, టిప్పర్, కారు ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

10:35 - November 1, 2016

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సభ్యత్వం తీసుకున్నారు. చంద్రబాబుకు ఉండవల్లి గ్రామ కమిటీ సభ్యత్వమిచ్చింది.ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కళావెంకట్రావు,ఇంకా తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి గ్రామసంచాయితీ టీడీపీ కార్యదర్శికి రూ100 లు చెల్లించి చంద్రబాబు సభ్వత్వాన్ని నమోదు చేయించుకున్నారు. అనంతరం రసీదు తీసుకున్నారు. చంద్రబాబుకు సభ్యత్వ నమోదు కార్డును అందించారు. 

10:30 - November 1, 2016

విజయవాడ : తెలుగుదేశం రెండు బృహత్తర కార్యక్రమాలను ప్రారంభించింది. అటు పార్టీని, ఇటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనచైతన్య యాత్రలను చేపట్టాలని నిర్ణయించింది. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 2014లో 55 లక్షల మందిని పార్టీలో చేర్పించిన టీడీపీ, ఈసారి కోటిమందికి సభ్యత్వం ఇవ్వాలన్న భారీ లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలు నవంబర్‌ 1 నుంచి ప్రారంభమై 30 రోజుల పాటు కొనసాగుతాయి. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతుందని టీడీపీ నేత పేర్కొన్నారు. గతంలో 55లక్షలు చేయగా ఈ ఏడాది కోటికి సభ్యత్వాన్ని నమోదు చేసేందుకు టీడీపీ యోచిస్తోంది. సభ్యత్వం తీసుకున్నవారికి బీమా పథకాన్ని వర్తించనున్నట్లుగా నేతలు పేర్కొంటున్నారు. 

విజయవాడలో కాపు నేతల ఆత్మయ సమావేశం..

విజయవాడ : కాపు నేతల ఆత్మీయ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరాలు పాల్గొన్నారు. సర్దార్ పటేల్ విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోందని, పటేల్ ను ఆర్ఎస్ఎస్ నేతగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. గాంధీ హత్య తరువాత ఆర్ఎస్ఎస్ ను పటేల్ నిషేధించారని తెలిపారు. 

10:17 - November 1, 2016

ఇరు పార్టీ వర్గీయుల ఘర్షణ..

గుంటూరు : చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెం గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. జరిగింది. ఈ దాడిలో గాయపడిన యలమంద, అంజయ్య, కుమార్‌, శ్రీను, వీరయ్య, తదితరులను చికిత్స నిమిత్తం నరసరావుపేట, చిలకులూరిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘర్షణ జరిగినట్లు చిలకలూరిపేట గ్రామీణ సీఐ శోభన్‌బాబు తెలిపారు. గాయపడిన గ్రామంలో పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశామని సీఐ తెలిపారు.

09:41 - November 1, 2016

రాజన్న సిరిసిల్ల : జెగ్గారావుపల్లిలో అర్థరాత్రి దొంగతనం చేస్తూ ఓ దొంగ గ్రామస్తులకు అడ్డంగా దొరికి పోయాడు . జెగ్గారావుపల్లిలో బద్దేల్లి నర్సింహులు ఇంట్లోకి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఇంట్లోని బీరువాలో ఉన్న బంగారం, వెండిని దొంగలు ఎత్తుకుపోయారు. అయితే దొంగతనం చేస్తూ గ్రామస్తులకు దొరికిపోవడంతో ఓ దొంగ చాకచక్యంగా తప్పించుకోగా..మరొక దొంగను గ్రామస్తులు పట్టుకొని చితకబాదారు. 

09:36 - November 1, 2016

సంగారెడ్డి : జిల్లాల విభజన జరిగిపోయింది. పాలన ప్రారంభమై 15 రోజులు అవుతోంది. కానీ! కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేని పరిస్థితి కన్పిస్తోంది. కనీసం సమయ పాలన కూడా పాటించడం లేదు. ఇంకా గాడిలో పడని సంగారెడ్డి కలెక్టరేట్‌ పై ప్రత్యేక కథనం..

సీఎం కేసీఆర్‌ మెచ్చిన కలెక్టరేట్‌..
ఇది సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ మెచ్చిన కలెక్టరేట్‌.. జిల్లాల విభజన జరిగితే రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్‌లు ఇదే తరహాలో ఉండాలని సంకల్పించిన కార్యాలయం. అంతా బాగానే ఉంది. కానీ కలెక్టరేట్‌లు పూర్వపు కళ తప్పాయి.

కీలక శాఖలకు ఉద్యోగుల కొరత
ఈ సమీకృత కలెక్టరేట్‌లో సుమారు 44 శాఖలు పని చేస్తుంటాయి. జిల్లా కలెక్టర్‌ మొదలు అటెండర్‌ వరకు సమారుగా వెయ్యిలోపు ఉద్యోగులు ఇందులో పని చేస్తుంటారు. జిల్లాల విభజన జరిగిన తర్వాత కొన్ని కీలక శాఖలకు ఉద్యోగుల కొరత ఏర్పడింది. ఉన్న అధికారుల్లోనూ చాలా మంది హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటినా చాలామంది విధులకు హాజరు కాని పరిస్తితి. ఇంత పెద్ద కలెక్టరేట్‌కు కనీసం సెక్యూరిటీ కూడా లేదు. సెక్యూరిటీ అవుట్‌ పోస్టులు సిబ్బంది లేక వెక్కిరిస్తున్నాయి. దీంతో కలెక్టరేట్‌ పనులపై వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. అనేక సమస్యలతో కలెక్టరేట్‌కు వచ్చే వారికి అధికారులు అధికారులు అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు జిల్లాల విభజన జరిగిన తర్వాత అధికారుల కొరతతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయో లేదోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

బయోమెట్రిక్‌ మిషన్లను ఇంత వరకు సరి చేయని దుస్థితి
కలెక్టరేట్‌ ఇంకా గాడిలో పడని పరిస్థితి ఇక్కడ ఉంది. కలెక్టరేట్‌ లోని బయోమెట్రిక్‌ మిషన్లను ఇంత వరకు సరి చేయని దుస్థితి నెలకొంది. సమీకృత కలెక్టరేట్‌ సమస్యల్ని పరిష్కరించుకొని ప్రజలకు చక్కని పాలన అందిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ వాసం. వెంకటేశ్వర్లు చెప్పారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని చూసిన కలెక్టరేట్‌ ఇలా సమస్యల మయంగా మారింది. ఇకనైనా నూతన కలెక్టరేట్‌ సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తే మంచిది.

09:21 - November 1, 2016

పెద్దపల్లి : నిద్రమత్తో..నిర్లక్ష్యమో గానీ రెండు లారీలు బీభత్సం సృష్టించాయి. గోదావరిఖని గంగానగర్‌లో రెండు  లారీలు బీభత్సం సృష్టించాయి. అతివేగంగా వస్తున్న ఓ లారీ ఇంట్లోకి దూసుకుపోయింది. ఆ వెంటనే మరోలారీ మొదటి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. రెండు లారీలు ఒకదాని వెనుక మరోకటి విద్యుత్‌ స్తంభాలను ఢీకొనడంతో ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా మొత్తం నిలిచిపోయింది. కాగా ఈ ఘటన జరిగింది తెల్లవారుఝాము కావటంతో ప్రాణ నష్టం తప్పింది. లారీలు మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో భయపడిన డ్రైవర్ క్లీనర్ పరారీలో వున్నారు. 

09:13 - November 1, 2016

జమ్ము కశ్మీర్ : ఎల్ వోసీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్ రేంజర్లు మళ్లీ కాల్పులకు పాల్పడుతున్నారు. తాజాగా మంగళవారం నాడు కూడా రామ్ గఢ్, నౌషెరా,రాజౌరీ సెక్టార్ లలో పాక్ రేంజర్లు కాల్పుల మోత మోగిస్తున్నారు. ఈ కాల్పుల్లో ముగ్గురు కశ్మీర్ పౌరులకు గాయాలయ్యాయి. పాక్ రేంజర్ల కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉండటంతో దాదాపు ప్రతిరోజూ భారత సరిహద్దులో తుపాకుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. బీఎస్ఎఫ్ జరిపిన కాల్పులలో పాకిస్థాన్ కు చెందిన 15 మంది సైనికులు, మరికొందరు పౌరులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. భారత్ చేసిన సర్జికల్ దాడుల అనంతరం పాక్ ఇప్పటికి దాదాపు 60 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. దీనిపై రక్షణ శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశమున్నట్లుగా సమాచారం. భారత్ చేసిన సర్జికల్ దాడులను తట్టుకోలేని పాకిస్థాన్ ఇలా తరచూ కాల్పులకు పాల్పడుతూ తన అల్పత్వాన్ని చాటుకుంటోంది. 

కాల్పులతో కవ్విస్తోన్న పాక్..

జమ్ము కశ్మీర్ : రామ్ గఢ్, నౌషెరా,రాజౌరీ సెక్టార్ లలో పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడుతున్నారు. ఈ కాల్పుల్లో ముగ్గురు కశ్మీర్ పౌరులకు గాయాలయ్యాయి. పాక్ రేంజర్ల కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. కాగా పాకిస్థాన్ తరచూ కాల్పుల ఉల్లంఘనకు తరచూ పాల్పడుతోంది. భారత్ చేసిన సర్జికల్ దాడులను తట్టుకోలేని పాకిస్థాన్ ఇలా తరచూ కాల్పులకు పాల్పడుతూ తన అల్పత్వాన్ని చాటుకుంటోంది. 

కామారెడ్డిలో కూల్చివేతలు..

కామారెడ్డి : నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలను చేపట్టారు. రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తలెత్తిన ఇబ్బందులతో హైదరాబాద్ నగరంలో కూడా బల్దియా అధికారులు కొన్ని రోజులపాటు ఆక్రమణలను కూల్చివేశారు. నాలుగు రోజులు హడావిడి చేసిన అధికారులు మళ్లీ వాసి ఊసే ఎత్తకపోవటం గమన్హాం.

చంద్రబాబుకు తెదేపా సభ్యత్వం..

విజయవాడ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడు పార్టీ సభ్యత్వాన్ని ఈ నెల 1న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో స్వీకరిస్తున్నారు. ఉండవల్లి గ్రామ తెదేపా అధ్యక్షుడు దాసరి కృష్ణ ఆయనకు పార్టీ సభ్యత్వాన్ని ఇస్తారు. ఉండవల్లి మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలంలో ఉండటం, ముఖ్యమంత్రి నివాసం అదే గ్రామ పరిధిలోనిది కావడంతో సభ్యత్వాన్ని ఇక్కడి నుంచే స్వీకరించనున్నారు.

08:37 - November 1, 2016

విశాఖ : శారదా నదిలో ఓ యువకుడు మృత దేహం లభ్యమయ్యింది. విశాఖ జిల్లాలోని అనకాపల్లి వద్ద శారదా నదిలో ప్రదీప్ అనే యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. సదరు మృతదేహాన్ని ప్రదీప్ గా గుర్తించారు. మూడు రోజుల క్రితం ప్రదీప్ కనిపించటంలేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శారదా నదిలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావటం కలకలం సృష్టించింది. ఆగనంపూడికి చెందిన ప్రదీప్ కు ఓ లవర్ వున్నట్లుగా తెలుస్తోంది. ఆమెను కలుసుకునేందుకు వెళ్ళిన ప్రదీప్ తిరిగిరాలేదు. దీంతో ప్రదీప్ లవర్ బంధువులే తమ బిడ్డను కిడ్నాప్ చేసి హత్య చేశారని కశింకోట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై ఎస్సై స్పందించటంలేదని..ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు ఆగనంపూడి రహదారిపై రాస్తారోకో చేపట్టారు. స్థానిక నేతల అండతోనే తమ తమ బిడ్డను హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవటంలేదని ప్రదీప్ బంధువులు ఆరోపిస్తున్నారు.

గుంటూరులో గర్జించనున్న నిరుద్యోగులు..

గుంటూరు : నేడు నగరంలో నిరుద్యోగులు గర్జించనున్నారు. మహిమా గార్డెన్స్ లో నిరుద్యోగులు గర్జన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానిక బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హాజరుకానున్నారు. 

కోలుకుంటాం..కోవర్డులను వదలం..

విశాఖ : ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు భారీ నష్టమే జరిగిందని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేర్కొన్నారు. అయితే త్వరలోనే మళ్లీ కోలుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు తమకు కొత్త కాదన్న ఆయన, చనిపోయిన మావోయిస్టుల పేర్లను వెల్లడించారు. ఉద్యమాన్ని ఇక నుంచి ఉరకలెత్తిస్తామన్నారు. కోవర్టుకు పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో జగన్ హెచ్చరించారు. ఎన్‌కౌంటర్‌లో 30 మంది మృతి చెందడం 40 ఏళ్ల విప్లవ చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపారు. 

శారదా నదిలో యువకుడు మృత దేహం..

విశాఖ : శారదా నదిలో ఓ యువకుడు మృత దేహం లభ్యమయ్యింది.మూడు రోజుల క్రితం కిడ్నాప్ అయిన బీటెక్ విద్యార్థి ప్రదీప్ మృతదేహంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ లవర్ బంధువులే కిడ్నాప్ చేసి హత్య చేశారని ప్రదీప్ బంధువులు ఆరోపిస్తూ కశింకోట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదని ప్రదీప్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ఆగనంపూడి రహదారిపై రాస్తాకోరో చేపట్టారు.  

ఈ ప్రాంతాలలో 3న నీటి సరఫరా బంద్..

హైదరాబాద్‌ : కృష్ణా పైపులైన్‌ ముందస్తు మరమ్మతు పనుల్లో భాగంగా ఈ నెల 3న గురువారం ఉదయం 10 నుంచి 24 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు వాటర్‌బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

07:58 - November 1, 2016

అభివృద్ధిలో పోటీపడుతున్న తెలుగు రాష్ట్రాలు మరో అరుదైన ఘతనను సొంతం చేసుకున్నాయి. సులభతర వాణిజ్య విధానాలు అవలంభించడంలో 98.78 శాతం మార్కులతో మొదటిస్థానంలో నిలిచాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సంస్కరణల అమల్లో ఏపీ, తెలంగాణ ముందంజలో ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ, ఏపీ మొదటిస్థానంలో నిలిశాయి. గతేడాది మొదటిస్థానంలో ఉన్న గుజరాత్‌కు వెనక్కినెట్టాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు ఈసారి మూడో ర్యాంకు దక్కగా, ఛత్తీస్‌గఢ్‌ నాల్గో స్థానంలో నిలిచింది.ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నగేష్ (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు), మదన్ మోహన్ రెడ్డి (వైసీపీనేత), చందు సాంబశివరావు(టీడీపీ నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమచారానికి ఈ వీడియో చూడండి..సమగ్ర సమాచారాన్ని తెలుసుకోండి..

07:52 - November 1, 2016

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమానికి 50 వసంతాలు పూర్తయ్యాయి. 32 మంది యువకుల బలిదానాలు, 62 మంది ఎమ్మెల్యేల పదవీ త్యాగాల ఫలితంగా ఏర్పటైంది విశాఖ ఉక్కు కర్మాగారం. ఆదిలాబాద్ నుంచి అనంతపురం దాకా, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎందరో ఆనాటి ఉద్యమంలో పాల్గొని, విశాఖ ఉక్కును సాధించిపెట్టారు.

1970 ఏప్రిల్ 10న పార్లమెంట్ ప్రకటన..తీరప్రాంతంలో ఏకైక ఉక్కు కర్మాగారం
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అప్పటి విశాఖ ఎంపీ తెన్నేటి విశ్వనాధం నడిపిన ఉద్యమం 1966లోనే కీలక మలుపు తిరిగింది. అమృతరావు అనే విద్యార్ధినేత విశాఖ కలెక్టరేట్ వద్ద అమరణ దీక్షకు దిగారు. దీంతో 1966 నవంబర్ 1 విద్యార్ధులు భారీగా ఆందోళనల్లో పాల్గొన్నారు. పోస్టాఫీసు వద్ద, ఏవీఏన్ కాలేజీ డౌన్ వద్ద, జగదాంబ ధియేటర్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 మంది విద్యార్ధులు, రిక్షా కార్మికులు మరణించారు. .ఆ తరువాత మరింత తీవ్రరూపం దాల్చిన ఉద్యమం లో మొత్తం 32 విద్యార్థులు, కార్మికులు, కర్షకులు కోల్పోయ్యారు..ప్రతిపక్షం లో వున్న వామపక్ష ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఉద్యమం పతాకస్థాయికి చేరడంతో కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఉక్కు కర్మాగారం నెలకొల్పుతున్నట్టు 1970 ఏప్రిల్ 10న పార్లమెంట్ లో ప్రకటించింది. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలను 1970లో దానం చేసారు..ప్రజలు కూడా అతి తక్కువ ధరను వేల ఎకరాలు భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు..
సిఐవో 100 అవార్డును పొందిన ఘనత కూడా విశాఖ స్టీల్
విశాఖ నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో నెలకొల్పిన ఈ కర్మాగారం భారతదేశంలోనే అత్యాధునిక స్టీల్ ప్లాంట్ గా గుర్తింపు పొందింది. విశాఖ ఉక్కు ఉత్పత్తులకు దేశ విదేశాల్లో సైతం మంచి క్రేజ్ వుంది. అత్యంత నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తోందన్న పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. 2010 నవంబర్ 10న నవరత్న హోదాను పొందడం మరో విశేషం. భారతదేశంలో తీర ప్రాంతంలో వున్న ఏకైక ఉక్కు కర్మాగారం ఇదే కావడం మరో విశేషం. 25 వేల ఎకరాల్లో ఇది విస్తరించి వుంది. సిఐవో 100 అవార్డును పొందిన ఘనత కూడా విశాఖ స్టీల్ కు వుంది. దాదాపు పాతిక వేల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. దీనికి అనుబంధంగా 1950 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దీంతో విశాఖ నగరం స్టీల్ సిటీగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ప్రతి నెలా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తోంది విశాఖ స్టీల్.

12, 271 కోట్ల రూపాయల సేల్స్ టర్నోవర్
గత ఆర్థిక సంవత్సరంలో 12, 271 కోట్ల రూపాయల సేల్స్ టర్నోవర్ సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం 1421 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటించింది. గత 14 ఏళ్లుగా లాభాలు ఆర్జిస్తున్న వైజాగ్ స్టీల్స్ నష్టాలు ప్రకటించడం కొంత నిరాశ కలిగించే పరిణామం. అయితే, భవిష్యత్ లో ఉక్కు డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోవడం, చైనా నుంచి పోటీ కారణంగా నష్టాలు చవిచూడాల్సి వచ్చిందంటూ యాజమాన్యం చెబుతున్నా, ఇంకా అనేక కారణాలున్నాయి. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తోన్న మన విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు లేకపోవడం ఓ శాపం. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, ఐరన్ ఓర్ కొనుక్కోవాల్సి వస్తోంది. ఒక టన్ను ఉక్కును ఉత్పత్తి చేయాలంటే 1.6 టన్నుల ఐరన్ ఓర్ ను వినియోగాంచాల్సి వస్తుంది. టాటా, జిందాల్, సెయిల్ లాంటి సంస్థలకు సొంత గనులున్నా, విశాఖ స్టీల్ కు లేకపోవడం ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షకు నిదర్శనమన్న విమర్శలున్నాయి. సొంత గనులున్న సంస్థలు తక్కువ ధరకే ఐరన్ ఓర్ సమకూర్చుకుంటుంటే, విశాఖ స్టీల్ ఏడు ఎనిమిది రెట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది నష్టాలకు కారణమవుతోంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను కాజేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ లో వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.  

07:47 - November 1, 2016

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమానికి 50 వసంతాలు పూర్తయ్యాయి. ఆనాటి పోరాటంతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఇప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ముందు ప్రస్తుతం వున్న కొత్త సవాళ్లేమిటి? దీనిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? విశాఖ ఉక్కు విస్తరణకు వున్న అవకాశాలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేత రాజశేఖర్ విశాఖపట్టణం 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియోను చూడండి..

07:44 - November 1, 2016

తమిళనాడు : మొదటిసారిగా అమ్మ జయలలిత లేకుండా అన్నాడీఎంకే పార్టీ ఎన్నికల బరిలోకి దిగబోతోంది. అమ్మ లేకుండా జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధిస్తుందా.. అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. తమిళనాడులోని మూడు నియోజకవర్గాలైన అరవన్ కుర్చి, తంజావూరు, తిరుపరంగుండ్రం స్థానాలకు ఈనెల 19న ఉప ఎన్నికలు జరగనున్నాయి.

అమ్మ లేకుండా ఎన్నికల బరిలోకి అన్నాడీఎంకే పార్టీ
అన్నాడీఎంకే పార్టీ మొదటిసారిగా అమ్మ జయలలిత లేకుండా ఎన్నికల బరిలోకి దిగబోతోంది. సాధారణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పించిన మూడు నియోజకవర్గాలు అరవన్ కుర్చి, తంజావూరు, తిరుపరంగుండ్రం స్థానాలకు ఈ నెల 19న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అన్నాడీఎంకేని కలవరపెడుతోన్న జయ అనారోగ్యం
దీంతో రాష్ట్రంలో ప్రధాన అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్ధులను కూడా ప్రకటించటమే కాకుండా ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్పత్రి పాలవటం అధికారపార్టీని కలవరపెడుతోంది.. అధికార పార్టీ అభ్యర్ధిగా మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ కావటం, ఆయనపై అవినీతి ఆరోపణలు ఉండటం, అదే సమయంలో అధికార పార్టీ అభ్యర్ధుల ప్రచారానికి పెద్ద నేతల అండ లేకపోవటంతో వ్యతిరేకతను తలపిస్తోంది.

గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న డీఎంకే
మరోవైపు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు స్టాలిన్‌తో పాటు డీఎంకే సీనియర్ నేతలు శ్రమిస్తుండటం కొంతమేరకు వారికి లాభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రజా సంక్షేమ కూటమి ప్రకటించటంతో ఇక ఈ ఎన్నికలు ఎవరికి లాభిస్తాయనే విషయం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈ ఎన్నికలు జయలలిత లేకుండానే అధికార, ప్రతిపక్ష పార్టీలకు నువ్వానేనా అనే విధంగా సాగుతుండటం రాష్ట్రంలో చర్చకు దారితీసింది.

07:41 - November 1, 2016

హైదరాబాద్ : గులాబీ దళపతి కొత్త వ్యూహాలకు పదును పెట్టబోతున్నారా ? పార్టీ ఫిరాయింపులపై విపక్షాల ఆరోపణలకు చెక్‌ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా ? ఇప్పుడు ఏ ఎన్నికలు లేకపోయినా.. ఇతర పార్టీలతో చేరిన నేతలతో రాజీనామా చేయించి ఉప ఎన్నిక నగరా మ్రోగించేందుకు సిద్ధమవుతున్నారా ? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు.

రాజకీయ వలసలపై కొనసాగుతున్న దుమారం
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత జరిగిన రాజకీయ వలసలపై దుమారం కొనసాగుతోంది. వలస నేతలపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రెండేళ్లుగా ఈ తతంగం సాగుతున్నా.. వలసలు మాత్రం ఆగడంలేదు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు గులాబీ గూటికి చేరుతున్నారు.

పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌
పార్టీ ఫిరాయింపులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో విపక్షాల విమర్శలకు బ్రేక్‌ వేసేందుకు గులాబీ దళపతి కొత్త వ్యూహం అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎంపీని మంత్రివర్గంలోకి తీసుకుంటూ.. ఉప ఎన్నికకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఉప ఎన్నికలో విజయం సాధించి ప్రజామోదం తమకే ఉందని నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రెండున్నరేళ్ల ప్రభుత్వ పనితీరుపై వివరణ
జిల్లా కార్యవర్గాల నియామకం అనంతరం రెండున్నరేళ్ల ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరిస్తూ.. రాబోయే రోజుల్లో తమ ప్రాధాన్యతలను చెప్పేందుకు భారీ సభను నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికలకు వెళ్తే.. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం దక్కుతుందని గులాబి దళపతి భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీఆర్‌ఎస్‌ పాలనపై పలు సంస్థలు నెంబర్‌ వన్‌ అంటూ సర్వేలు ఇవ్వడంతో ఇది మరింత కలిసి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఓవైపు విపక్షాలకు చెక్‌ పెడుతూ.. మరోవైపు పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం నింపే విధంగా ముఖ్యమంత్రి ఎలాంటి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

07:38 - November 1, 2016

విజయవాడ : ఏపీ రాజకీయాల్లో స్థిర స్థానం కోసం జనసేనాని అడుగులు వేస్తున్నారా? ప్రశ్నించడమే లక్ష్యంగా పార్టీని స్థాపించిన పవన్‌ కల్యాణ్‌.. ఏపీలో ప్రతిపక్ష పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు వ్యూహాత్మకంగా సాగుతున్నారా..? ఏపీకి ప్రత్యేక హోదాపై వరుస సభలు నిర్వహిస్తూ జనం మద్దతు కూడగడుతోన్న పవన్‌.. తాజాగా తీసుకున్న మరో నిర్ణయం ఈ ప్రశ్నలను ఉత్పన్నం చేస్తోంది.

ఏపీలో జనసేన బలోపేతం కోసం పవన్‌ వ్యూహాత్మక అడుగులు
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలోపేతం దిశగా.. జనసేన అధినేత పవన్‌ అడుగులు వేస్తున్నారు. తిరుపతి, కాకినాడల్లో నిర్వహించిన రెండు సభలకు ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో.. వచ్చే నెల 10న అనంతపురంలో మూడో బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. ఈ లోగానే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏలూరులో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని నిర్ణయించారు. జిల్లా జనసేన కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్‌లో పవన్‌ను కలిసిన .గో. జిల్లా జనసేన కార్యకర్తలు
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భారీగా వచ్చిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లో కలుసుకున్నారు. ఏలూరులో ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్న వారి అభ్యర్థనకు జనసేనాని ఆమోదం తెలిపారు. తన ఓటు నమోదుకు తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ జిల్లా శ్రేణులను ఆయన ఆదేశించారు. దీంతోపాటే ఏలూరులో తనకు అనుకూలమైన నివాస భవనాన్ని చూడాలని కూడా ఆయన కోరారు.

ఆది నుంచి రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన పవన్‌
మొదటి నుంచి రాష్ట్ర విభజనను పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. జనసేన పార్టీ ఆవిర్భావ స‌మ‌యంలోనూ రాష్ట్ర విభ‌జన హేతుబద్ధంగా జరగలేదని.. ఏపీకి తీవ్ర న‌ష్టం చేశారంటూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఎన్నిక‌ల్లో సైతం టిడిపి, బీజేపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నిక‌ల అనంత‌రం ప్రజా సమస్యలపై జనసేనాని గ‌ళ‌మెత్తారు. ప‌త్ర్యేక హాదా సాధనపై వరుస సభలు నిర్వహిస్తూ నిరసనగళం వినిపిస్తున్నారు.

తనకు ఓటు హక్కు ఫార్మాలిటీస్‌ పూర్తిచేయాలని పవన్‌ సూచన
ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తాజా నిర్ణయం ద్వారా పవన్‌ కల్యాణ్‌ చెప్పకనే చెప్పారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ జిల్లాల్లో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉంది. వారిలో అత్యధికులు పవన్‌ను తమ ప్రతినిధిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ కూడా ఈ జిల్లాల్లో పార్టీకి గట్టి పునాది వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే ఏలూరులో ఓటు హక్కు పొందే నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. నవంబర్‌ రెండో వారంలో అనంతపురం సభ అనంతరం.. నాలుగో సభ ఏలూరులోనే నిర్వహిస్తారన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

కాపు సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా?
ఏలూరులో ఓటు హక్కును పొందడంతో పాటు.. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనీ పవన్‌ కల్యాణ్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏలూరు నుంచే సన్నద్ధమవ్వాలని పవన్‌ భావిస్తున్నట్లూ తెలుస్తోంది.

ఏలూరులో జనసేన కార్యకర్తల సంబరాలు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జనసేన కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. ఏలూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఓటు నమోదు చేయించుకుంటున్నారన్న ప్రకటనతో టపాసులు పేల్చి పవర్‌స్టార్‌కి తమ మద్దతు తెలియచేశారు. 

07:31 - November 1, 2016

విజయవాడ : తెలుగు రాష్ట్రల్లో నేటి నుంచి రెండు భారీ కార్యక్రమాలకు తెలుగుదేశం శ్రీకారం చుట్టనుంది. వీటిలో మొదటిది సభ్యత్వ సమోదు కాగా, రెండోది జన చైతన్య యాత్రలు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈసారి కోటి మందిని పార్టీలో చేర్చించాలని టీడీపీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. జనచైతన్య యాత్రల్లో భాగంగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.

1 నుంచి ప్రారంభమై 30 రోజుల పాటు కొనసాగనున్న జనచైతన్య యాత్రలు
తెలుగుదేశం రెండు బృహత్తర కార్యక్రమాలను ప్రారంభించనుంది. అటు పార్టీని, ఇటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనచైతన్య యాత్రలను చేపట్టాలని నిర్ణయించింది. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 2014లో 55 లక్షల మందిని పార్టీలో చేర్పించిన టీడీపీ, ఈసారి కోటిమందికి సభ్యత్వం ఇవ్వాలన్న భారీ లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలు నవంబర్‌ 1 నుంచి ప్రారంభమై 30 రోజుల పాటు కొనసాగుతాయి.

తెలంగాణలో పన్నెడు లక్షల మందికి సభ్యత్వం
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సభ్యత్వ నమోదు ప్రారంభం అవుతుంది. చంద్రబాబునాయుడు ఏపీలో సభ్యత్వం తీసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. ఉమ్మడి రాష్ట్రాలో హైదరాబాద్‌లోనే టీడీపీ సభ్యుడుగా పేరు నమోదు చేయించుకునే వారు. ఇక తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, కార్యనిర్వాహఖ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముందుగా సభ్యత్వం తీసుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఇంతకుముందు జరిగిన సభ్యత్వ నమోదులో ఉమ్మడి ఏపీలో 55 లక్షల మందిని పార్టీలో చేర్పించగా, తెలంగాణలో కేవలం 12 లక్షల సభ్యత్వం మాత్రమే నమోదైంది. దీంతో ఈసారి దీనిని భారీగా పెంచాలిన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ టీటీడీపీ నేతలను ఆదేశించారు. తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది అధికార టీఆర్‌ఎస్‌లో చేశారు. దీంతో కార్యకర్తలు చెల్లాచెదురైన నేపథ్యంలో సభ్యత్వ నమోదు ఎలా సాగుతుందోనన్న భయం ఈ ప్రాంత తెలుగుదేశం నేతల్లో ఉంది.

సంక్షేమ పథకాల అమలుపై ప్రజా స్పందన తెలుసుకునే యత్నం
సభ్యత్వ నమోదుతో పాటు చేపట్టే జనచైతన్య యాత్రల్లో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతారు. సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు అందుతున్నాయో ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. ప్రజల నుంచ్చి వచ్చే స్పందనను బట్టి అమల్లో లోపాలను సరిదిద్దుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో జరిగే జనచైతన్య యాత్రంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారు. నెలరోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు నాలుగు జిల్లాల్లో పర్యటించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావు మిగిలిన తొమ్మిది జిల్లాల్లో జరిగే జనచైతన్య యాత్రంల్లో పాల్గొంటారు.

అధినేతల దృష్టిని ఆకర్షించేందుకు తెలుగు తమ్ముళ్ల యత్నాలు
పార్టీ సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలతో తెలుగు రాష్ట్రాలో టీడీపీలో నూతనోత్సాహం వస్తుందని అధినాయకత్వం భావిస్తోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సత్తా చాటి అధినేతల దృష్టిని ఆకర్షించేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారు.

 

07:26 - November 1, 2016

హైదరాబాద్ : సర్వేలన్నీ కేసీఆర్‌ నంబర్‌ వన్‌ అంటున్నాయి. టీఆర్‌ఎస్‌ నేతలైతే గులాబీ బాస్‌ పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ కూడా కేసీఆర్‌ నంబర్‌ వన్‌ అనే అంటోంది. కాకపోతే చిన్న చేంజ్‌. పాలన, అభివృద్ధిలో కాదు... అవినీతి, దగా, మోసం చేయడంలో కేసీఆర్‌ ముమ్మాటికీ నంబర్‌ వన్‌ అంటూ సెటైర్లు వేస్తున్నారు హస్తం నేతలు.
స‌ర్వేల‌ను తూర్పార‌ప‌డుతున్న నేత‌లు
తెలంగాణలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మధ్య రాజకీయాలు ఉప్పునిప్పుగా మారాయి. గులాబీ పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపింది మొదలు.. కాంగ్రెస్‌ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని.. రైతులు, విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆందోళన చేస్తున్న హస్తం పార్టీకి.. తాజా సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌ పాలనకు అనుకూలంగా రావడంతో మరింత చిర్రెత్తిపోతుంది.

మోసం, దగా అవినీతిలో కేసీఆర్‌ నంబర్‌ వన్‌: ఉత్తమ్‌
టీఆర్‌ఎస్‌ పాలనపై తాజాగా రెండు సర్వేలు రాగా.. మొదటిదాంట్లో టీఆర్‌ఎస్‌ 109,.. ఎంఐఎం 7, కాంగ్రెస్‌ 2 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. మరోసర్వేలో కేసీఆర్‌ పాలనకు జేజేలు పలికింది. దేశంలోనే అత్యంత పాపులర్‌ సీఎం కేసీఆర్‌ అంటూ బయటపెట్టింది. దీంతో కాంగ్రెస్‌ నేతలు ఈ సర్వేలపే ముప్పేట దాడి చేస్తున్నారు. ఏ విషయంలో కేసీఆర్‌ నెంబర్‌ వన్‌ అంటూ సెటైర్లు వేస్తున్నారు టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఊరు, పేరులేని సర్వేల కంపెనీలతో కేసీఆర్‌ తనకు అనుకూలంగా సర్వేలు చేయించుకుని.. ప్రజలను మోసం చేస్తున్నారన్నారు ఉత్తమ్‌.

కేసీఆర్‌ హామీలను నెరవేర్చడం లేదన్న కాంగ్రెస్‌ నేతలు
అవినీతి కేసీఆర్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ సీఎం అని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. ప్రాజెక్టుల రీ-డిజైన్‌, మిషన్‌ భగీరథలో జరుగుతున్న అవినీతి నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్‌ బోగస్‌ సర్వేలు చేయిస్తున్నారంటున్నారు. ఇప్పటికే కేసీఆర్‌ హామీలపై పోరుబాట పట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు కేసీఆర్‌ ప్రజలను ఎలా మోసం చేస్తున్నాడో సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ చెబుతున్న పాపులర్‌కు రివర్స్‌ కౌంటర్‌తో జలక్‌ ఇస్తోంది హస్తం పార్టీ. 

07:22 - November 1, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పై మంత్రి హరీష్ రావు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండవ దశ పనుల ప్రగతితో పాటు..రానున్న రోజుల్లో ప్రారంభించబోయే మూడో దశ పనులపై ఆయన చర్చించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలన్ని డిసెంబర్ లోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

మిషన్ కాకతీయ థర్డ్ ఫేజ్ ప్రతిపాదనపై మంత్రి హరీష్ రావు సమీక్ష
త్వరలో చేపట్టబోయే మిషన్ కాకతీయ థర్డ్ ఫేజ్ ప్రతిపాదనల పై అధికారులతో మంత్రి హారిష్ రావు జల సౌధలో సమీక్షించారు.మిషన్ కాకతీయ మూడవ దశ కింద చేపట్టవలసిన పనుల ప్రతిపాదనలు డిసెంబర్ లోగా సిద్ధం చేయాలని అధికారులకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. మిషన్ కాకతీయ 1 , మిషన్ కాకతీయ 2 దశలలో చేపట్టిన పనులు, ఫలితాలను హరీశ్ రావు సమీక్షించారు. మిషన్ కాకతీయ కార్యక్రమం కింద చేపట్టిన పనులతో ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాలకు అదనంగా సాగనీరందించడం రికార్డు అని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ ఫలితాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు ఆదేశించారు.

మిషన్ కాకతీయ మూడో దశ మార్గదర్శకాల విడుదల
భూగర్భ జల సంపద పెరిగడంతో పాటు పెరిగిన సాగు విస్తీర్ణం, చేపలు పట్టుకొని జీవించే వారి జీవితాల్లో వచ్చిన మార్పు, వారి ఆర్ధిక పరిస్థితిలో మెరుగుదల తదితర అంశాలపై అధ్యయనం చేసి అంశాల వారీగా నివేదికలు తయారు చేయవలసిందిగా మంత్రి కోరారు. మిషన్ కాకతీయ మూడో దశ కింద చేపట్టవలసిన పనులకు సంబంధించిన మార్గ దర్శకాలను మంత్రి హరీశ్ రావు విడుదల చేశారు. వర్షాలు కురవకపోవడంతో కరవు పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు మిషన్ కాకతీయ మూడవ దశలో ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి తదితర జిల్లాలలో ఇలాంటి ప్రాంతాలను గుర్తించి చెరువుల పునరుద్ధరణ జరపాలని కోరారు. మిషన్ కాకతీయ రెండో దశలో పూర్తి కాకుండా మిగిలి పోయిన పనులన్నిటినీ మూడవ దశలో చేపట్టాలని కోరారు. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న, కట్ట తెగిన చెరువులకు మరమ్మత్తు పనులు చేపట్టాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.

చెరువులకు చెందిన ఫీడర్ చానళ్ళు, డైవర్షన్ చానళ్ల పనులు చేపట్టాలి
ఇక గొలుసు కట్టు చెరువులకు చెందిన ఫీడర్ చానళ్ళు, డైవర్షన్ చానళ్ల పనులు మిషన్ కాకతీయ కింద చేపట్టాలని సూచించారు. ఆయకట్టు లోకలైజేషన్ చేయాలని, రెవిన్యూ అధికార యంత్రాంగం సహకారంతో చెరువుల ఎఫ్. టి. ఎల్ నిర్ధారించాలని కోరారు. ఆయకట్టు మ్యాపులను సిద్ధం చేయాలన్నారు. కొత్త చెరువులను నిర్మించడం కోసం హైడ్రాలిక్ క్లియరెన్సు, సర్వే పనులు ఇతర కార్యక్రమాల అంచనాలు, ప్రతిపాదనలు డిసెంబర్ 9వ తేదీలోగా సమర్పించాలని మంత్రి హరీశ్ రావు కోరారు.ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న మినీ ట్యాంక్ బండ్ పనులు ఎంకె త్రీ కింద పూర్తి చేయాలని అధికారులను అదేశించారు.

07:18 - November 1, 2016

విజయవాడ : హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయాన్ని తెలంగాణకు అప్పగించాలా? లేదా..? అనే దానిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలో కొత్తగా నాలుగు ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఏపీ సచివాలయం అప్పగింతపై కేబినెట్‌లోచర్చ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలోని తన కార్యాలయంలో భేటీ అయిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయాన్ని తెలంగాణకు అప్పగించాలా.? లేదా..? కృష్ణాట్రిబ్యునల్ తీర్పుపై ఏంచేయాలనే దానిపై కేబినెట్‌ సమావేశంలో చర్చించినట్లు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. దీనిపై రాజ్‌భవన్‌ నుంచి వచ్చిన లేఖను పరిశీలించామన్న ఆయన.. ఏపీ సచివాలయం భవనాల అప్పగింతపై మంత్రి వర్గ ఉప సంఘం వేయాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. ఈ తీర్మానాన్ని రాజ్‌ భవన్‌కు పంపుతామన్నారు.

రాష్ట్రంలో4 ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు నిర్ణయం
అలాగే రాష్ట్రంలో4 ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శ్రీసిటీలో రెండు, విశాఖ, చిత్తురులో ఒక్కో వర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌ వర్సిటీ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాయిలాపడిన టైక్స్‌టైల్‌ పరిశ్రమల విద్యుత్‌ సబ్సిడీ 350 కోట్లను ప్రభుత్వమే భరించాలని కేబినెట్ నిర్ణయించింది.

గొర్రెలు, మేకల పెంపకందారుల ఫెడరేషన్‌పై సుదీర్ఘంగా చర్చ
గొర్రెలు, మేకల పెంపకందారుల ఫెడరేషన్‌పై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. 50 శాతం సబ్సిడీ అంశంపై కేబినెట్‌ భేటీలోచర్చ జరిగింది. అలాగే విశాఖలో వుడా స్థానంలో మెట్రో డెవలప్‌మెంట్‌ అధారిటీ ఏర్పాటుపై వచ్చే కేబినెట్లో తుది రూపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మధురవాడలో 400 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీయే తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

జనచైతన్య యాత్రలపై మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశాదిర్దేశం
జనచైతన్య యాత్రలపై మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశాదిర్దేశం చేశారు. జనచైతన్యయాత్రల సమన్వయ బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. సొంత జిల్లా, ఇన్‌చార్జ్‌గా ఉన్న జిల్లాలో పది రోజుల చొప్పున జనచైతన్య యాత్రల్లో పాల్గొనాలని మంత్రులను సీఎం ఆదేశించారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తదితర అంశాలపైనా ఈ భేటీలో చర్చించారు. 

5 గంటలపాటు విమానాశ్రయం క్లోజ్..

ముంబై : నేటి నుంచి నవంబర్‌ 28 వరకు ముంబయి విమానాశ్రయాన్ని రోజూ 5గంటల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విమానాశ్రయంలో మరమ్మతు పనుల కారణంగా నిర్ణయించిన రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మావో నేత ఆర్కేపై ఖాప్స్ కన్ను..

గుంటూరు : మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే పల్నాడుకు చెందిన వాడు కావడంతో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తం అయింది. ముఖ్యంగా ఎస్‌ఐబీతో పాటు కేంద్ర నిఘా వర్గాలు కూడా పల్నాడు ప్రాంతంపై కన్నేశాయి. మాజీలు, సానుభూతిపరుల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. కాగా గుంటూరు: జిల్లాలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏవోబీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో సుమారు 30 మంది మృతి చెందడం, మావోయిస్టు ఆగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్‌కే పోలీసుల అదుపులో ఉన్నాడంటూ ఆయన భార్య సహా మావోయిస్టులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

డివైడర్ ను ఢీకొన్న కారు..

హైదరాబాద్: నగరంలోని బొల్లారం అయ్యప్ప గుడి దగ్గర సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం తాగి నడుపుతుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమల : శ్రీవారికి భక్తుల రద్దీ పెరిగింది. 27 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి వున్నారు. సర్వ దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమల : శ్రీవారికి భక్తుల రద్దీ పెరిగింది. 27 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి వున్నారు. సర్వ దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. 

Don't Miss