Activities calendar

02 November 2016

22:12 - November 2, 2016

ఢిల్లీ : ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు బీసిసిఐ భారత జట్టును ప్రకటించింది. తొలి రెండు  టెస్ట్‌లకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అనూహ్యంగా చోటు దక్కించుకోగా....సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ గౌతమ్‌ గంభీర్‌ చోటు నిలుపుకున్నాడు. 
హార్దిక్‌ పాండ్యకు టెస్ట్‌ జట్టులో చోటు 
ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌లకు బీసిసిఐ భారత జట్టును ఎంపిక చేసింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును మాజీ క్రికెటర్‌ ఎంఎస్ కే ప్రసాద్‌ సారధ్యంలోని భారత క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అనూహ్యంగా టెస్ట్‌ జట్టులో చోటు దక్కించుకోగా....సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ గౌతమ్‌ గంభీర్‌ ఓపెనర్‌గా చోటు నిలుపుకున్నాడు. 
న్యూజిలాండ్‌తో ముగిసిన సిరీస్‌లో ఆడిన జట్టుకే మొగ్గు 
గాయపడిన రోహిత్‌ శర్మ, భుశనేశ్వర్‌ కుమార్‌ స్థానాల్లో కరుణ్‌ నాయర్‌, ఇషాంత్‌ శర్మలను ఎంపిక చేసిన సెలక్షన్‌ కమిటీ....దాదాపుగా న్యూజిలాండ్‌తో ముగిసిన సిరీస్‌లో ఆడిన జట్టుకే మొగ్గు చూపారు. 
తొలి రెండు టెస్ట్‌లకు ప్రకటించిన జట్టులో 
తొలి రెండు టెస్ట్‌లకు ప్రకటించిన జట్టులో విరాట్‌ కొహ్లీ, మురళీ విజయ్‌, చటేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, కరుణ్‌ నాయర్‌, గౌతమ్‌ గంభీర్‌, వృద్దిమాన్‌ సాహా, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేష్‌ యాదవ్‌, జయంత్‌ యాదవ్‌ ఉన్నారు. న్యూజిలాండ్‌ జట్టును స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో క్లీన్‌ స్వీప్‌ చేసిన జట్టుతోనే ఇంగ్లండ్‌ సిరీస్‌లోనూ భారత్‌ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.   
నవంబర్‌ 9 న రాజ్‌కోట్‌లో ప్రారంభం కానున్న సిరీస్ 
మొత్తం మీద ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు చోటు కల్పించడం మినహా ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌కు ప్రకటించిన జట్టులో పెద్దగా సంచలనాలేమి లేకపోవడం విశేషం. నవంబర్‌ 9 న రాజ్‌కోట్‌లో ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ డిసెంబర్‌ 20న జరిగే చెన్నై టెస్ట్‌తో ముగుస్తుంది.  

 

22:04 - November 2, 2016

ఢిల్లీ : వ‌న్ ర్యాంక్ వ‌న్ పెన్షన్‌ పథకం ఓ మాజీ సైనికోద్యోగిని బలిగొంది. ఓఆర్ ఓపీ లో తమ డిమాండ్లను అమ‌లు చేయ‌లేద‌న్న కార‌ణంతో మనస్థాపం చెందిన ఓ మాజి సైనికోద్యోగి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టించింది. మరోవైపు ఈ అంశం రాజకీయంగా దుమారం సృష్టించింది. ఓఆర్ ఓపీ  ని అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని విపక్షాలు ధ్వజమెత్తాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు.
మాజీ సైనికోద్యోగి రామ్‌ కిషనల్‌ గ్రేవాల్‌ ఆత్మహత్య 
ఒకే ర్యాంకు ఒకే పింఛను పథకం అంశానికి సంబంధించి హరియాణాకు చెందిన మాజీ సైనికోద్యోగి రామ్‌ కిషనల్‌ గ్రేవాల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు గ్రేవాల్‌ ఘటనా స్థలంలో సుసైడ్‌ నోట్‌ వదిలి ప్రాణాలు తీసుకున్నారు. ఓఆర్‌ఓపీ పథకంలో తమ డిమాండ్లను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని, తోటి జవానుల కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్నట్లు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.
కేంద్రం వైఫల్యాన్ని ఎండగట్టిన  కాంగ్రెస్‌, ఆప్‌
ఒఆర్‌ఒపిని అమలు చేయడంలో కేంద్రం వైఫల్యాన్ని కాంగ్రెస్‌, ఆప్‌లు ఎండగట్టాయి. గ్రేవాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రికి వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. ఆసుపత్రి వద్ద పోలీసులు బాధిత కుటుంబాన్ని అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వారిని వెంటనే వదిలి పెట్టాలని రాహుల్‌ కోరినా పోలీసులు తమ అశక్తతను వ్యక్తం చేశారు. భారత్‌లో ఓ సైనిక కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నందుకు పోలీసులు సిగ్గుపడాలని రాహుల్‌ గాంధీ  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆసుప‌త్రి వ‌ద్ద ప‌రిస్థితులు చ‌క్కదిద్దడానికే తాము పై అధికారుల ఆదేశాలు పాటిస్తున్నామని పోలీసులు చెప్పారు. బాధిత సైనిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను కూడా పోలీసులు అడ్డుకున్నారు.
ప్రభుత్వం విఫలమవ్వడంతోనే నా తండ్రి ఆత్మహత్య : కుమారుడు క్రిష్ణగ్రెవాల్ 
వన్ ర్యాంకు వన్ పెన్షన్ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని సుబేదార్ గ్రెవాల్ కుమారుడు రామ్ క్రిష్ణ గ్రెవాల్ స్పష్టం చేశారు. ఓఆర్‌ఓపి అమలుపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడేందుకు మంగళవారం తోటి సైనికులతో కలిసి రాంకిషన్‌ కూడా వెళ్లారు. కానీ మార్గ మధ్యలోనే ఆయన విషం తీసుకున్నారు. వెంటనే రాంమనోహర్‌ ఆసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూశారని రామ్‌క్రిష్ణ చెప్పారు. 'నా దేశం కోసం, నా మాతృభూమి కోసం, నా దేశ వీర జవానుల కోసం తన ప్రాణాలు అర్పిస్తున్నట్లు సుసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారని' ఆయన తెలిపారు.

 

21:56 - November 2, 2016

పథకాలు పాతర ప్రచారం జాతర.. కోతలు కోసి వాతలు పెడుతున్న సర్కారు, ఎలుకను పట్టెటందుకు కొండను తవ్వుతున్న సిటు.. సర్కారు నచ్చనొల్లనే పట్టాలే ఫస్టు, మోసెటోళ్ల మీద బైలుకువోయిన ప్రభుత్వం... చంద్రన్న ఏలువడి చొముటోడ్చుతున్న రైతు, పోలీసుస్టేషన్ కు చేరిన సీతారాములు... వన వాసం ఇడిసి జనవాసంల జిక్కిండ్రు, జయలలితకు కరుణానిధి గ్యాంగ్ చేతవడి.. కరుణానిధికి జయమ్మ బిడ్డల బానుమతి, యమలోకానికి సెలవిచ్చిన యముడు.. యేడాదికోసారి యమపురికి తాళాలు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం..

21:45 - November 2, 2016

ఎపి ప్రజలు ప్యాకేజీ కాదు.. ప్రత్యేకహోదా కావాలని కోరుతున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఫేస్ టు   ఫేస్ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. ఎపి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే..
'వామపక్షాలకు ఆదరణ లేదనడం సరికాదు. విభజన అంశాలను నెరవేర్చ లేదు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయలేదు. విభజన హామీలను సక్రమంగా అమలు చేయలేదు. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిధుల కేటాయింపుల్లో వివక్ష కొనసాగుతోంది. వామపక్షాల బలం తగ్గింది. డబ్బు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. దీన్ని ఎదుర్కోవాలి. కమ్యూనిస్టులు ఐక్యంగా ఉంటే ఉపయోగం. ఎన్నికల్లో కలిసే ఉంటాం. 2019 ఎన్నికల్లో కూడా కలిసే ఉంటాం. సీపీఎం, సీపీఐ కలిసి ఒకటిగా ఉంటే ఇంకా మంచిది. పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేసే అవకాశం ఉంది. టీడీపీతో కలిసే అవకాశమే లేదు. చంద్రబాబు పార్టీ పిరాయింపులకు పార్టీ పిరాయింపులకు పాల్పడ్డాడు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాడు. చంద్రబాబుతో కలిసి పని చేసే వీల్లేదు. నక్సలైట్లు జన జీవన స్రవంతిలో కలవాలి' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:36 - November 2, 2016
21:35 - November 2, 2016
21:27 - November 2, 2016

హీరో సుమంత్ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన నటించిన 'నరుడా డోనరుడా'.. మూవీ విషయాలు తెలిపారు. పలు అసక్తికరమైన విషయాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:21 - November 2, 2016

హైదరాబాద్ : అడగడుగునా నిఘా.. ముమ్మర తనిఖీలు...పహారా కాస్తున్న పోలీసులతో మన్యం మరోసారి వేడేక్కింది. మావోయిస్టు పార్టీ బంద్‌ పిలుపుతో ఏజెన్సీ ప్రాంతాల్లో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు..ఏవోబీని చుట్టుముట్టాయి.. దీంతో ఎప్పుడు ..ఏం జరుగుతుందోనని ఆదివాసీలు భయపడుతున్నారు.           
ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు పార్టీ బంద్‌కు పిలుపు
ఏవోబీ మరోసారి ఉద్రిక్తంగా మారింది. గత నెల 24వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమై మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘా పెంచారు. పెద్దఎత్తున పోలీసు బలగాలను దించారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 
ఎన్‌కౌంటర్‌లో 33 మంది మావోయిస్టులు మృతి
మల్కన్‌గిరి పరిధిలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు కోలుకోలేని దెబ్బతిన్నారు. మొత్తం 33 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఆ పార్టీ అగ్రనేతలను కూడా కోల్పోయింది. అయితే  ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని..పోలీసులు చేసిన హత్యలు అని మావోయిస్టు పార్టీ తో పాటు ప్రజాసంఘాలు, విరసం నేతలు అంటున్నారు. 
ఏవోబీని జల్లెడ పడుతున్న పోలీసులు
బంద్‌ నేపథ్యంలో ఈ నెల మూడో తేదీన ఐదు రాష్ట్రాలలో బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ విశాఖ జిల్లా జీకే వీధి మండలంలో మావోయిస్టులు లేఖలు.. కరపత్రాలు కూడా విడుదల చేశారు.
అనుమానితులు కనిపిస్తే ఆరా
బంద్‌ పిలుపుతో మావోయిస్టు పార్టీ ప్రతీకార దాడులు దిగే అవకాశం ఉందని.. పోలీసు బలగాలు ఏవోబీని జల్లెడ పడుతున్నాయి. జిల్లాలోని ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అప్రమత్తం చేశారు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లకు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించారు. ఇందులో భాగంగా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బుల్లెట్‌ఫ్రూఫ్‌ వాహనంలో తిరుగుతున్నారు. మరో మంత్రి యనమల రామకృష్ణకు కూడా భద్రత పెంచారు.   
మన్యంలో అడుగడుగునా తనిఖీలు 
ఒడిశా బలగాల సాయంతో మన్యంలో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులు కనిపిస్తే ఆరా తీస్తున్నారు. మన్యంలోని కీలక మార్గాల్లో వాహనాల రాకపోకలు, ప్రయాణికుల కదలికలపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగా పోలీసులు కొత్తగూడెం జిల్లా.. భద్రాచలం పట్టణంలో..ఖమ్మం జిల్లా..భద్రాచలం ఏజెన్సీలో హైఅలెర్ట్‌ ప్రకటించారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో లాడ్జీలు..హోటళ్లు..సెల్‌షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీ టీవీ పుటేజ్‌లను.. రికార్డులను పరిశీలిస్తున్నారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రపడిన వారి సమాచార వ్యవస్థపై నిఘా పెట్టారు. అయితే ఇటు పోలీసుల నిఘా.. అటు మావోయిస్టుల బంద్‌ పిలుపుతో గిరిజనులు  అల్లాడుతున్నారు. మన్యంలో జరిగే  సంతలకు వెళ్లడానికి ఆదివాసీలు భయపడుతున్నారు. దీంతో  కిటకిటలాడే వారపు సంతలు వెలవెలబోతున్నాయి.

 

21:17 - November 2, 2016

ఢిల్లీ : ఏవోబీ, భోపాల్‌ ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర 27 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ రెండు ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని వివిధ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. మావోయిస్టు నేత రామకృష్ణ పోలీసుల ఆధీనంలోనే ఉన్నారని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబా ఆరోపించారు. ఆర్‌కేని రహస్యంగా చంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటున్న సాయిబాబా ఆరోపించారు. ఈమేరకు సాయిబాబా 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏవోబీ ఎన్‌కౌంటర్‌ బూటకమన్నారు. అమాయక గిరిజనులను పోలీసులు పట్టుకుని చంపారని తెలిపారు. గిరిజనులను పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. రామకృష్ణను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల ఆధీనంలో ఉన్న అందర్నీ వదిలిపెట్టాలన్నారు. 

 

21:11 - November 2, 2016
21:10 - November 2, 2016
21:02 - November 2, 2016

విజయవాడ : పేదలను నట్టేట ముంచిన ప్రభుత్వం టిడిపి ప్రభుత్వమేనన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సిహెచ్.బాబూరావు.  టిడిపి ప్రభుత్వ హయంలో పేదరికం పెరుగుతుందా..లేక తగ్గుతుందా ఆపార్టీ నేతలే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారాయన. ప్రజా చైతన్య పాదయాత్రలో భాగంగా విజయవాడలోని 51 వ డివిజన్ లో సిపిఎం నేతలు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో ప్రజలు స్వచ్చంధంగా వచ్చి సిపిఎం నేతలకు తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సిహెచ్.బాబూరావు రెండున్నరేళ్ళలో ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వివరించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాల కారణంగా ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. చంద్రబాబు పాలనలో బడా బాబులు కోట్లకు పడగలెత్తుతున్నారని, పేదలు మాత్రం పేదరికంలోనే మగ్గిపోతున్నారన్నారు. పేదలకు అన్నివిధాలా ఆదుకుంటామన్న బాబు వారికిచ్చే సబ్సిడీ కూడా తీసేశారని మండిపడ్డారు. అద్దెలకుంటున్న వారికి కనీసం సొంతింటిని కూడా కల్పించలేని దుస్ధితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే ప్రజా చైతన్య పాదయాత్ర ద్వారా ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బాబూరావు హెచ్చరించారు. 

 

20:59 - November 2, 2016

చిత్తూరు : ఏపీలో పోలీసు అధికారి మోసం బయటపడింది. చిత్తూరు జిల్లాలో ఓ యువతిని ఎస్సై మాయమాటలతో వంచించాడు. బోయకొండకు చెందిన అరుణను మదనపల్లి డివిజన్‌ ఎస్సై సునీల్‌ కుమార్‌ రెడ్డి ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని 10 లక్షల రూపాయలు తీసుకున్న ఎస్సై.. పెళ్లి పేరు ఎత్తితే మాట దాటవేశాడు. దీనిపై మదనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో అరుణ మీడియాను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన డీఎస్పీ ఎస్సై సునీల్‌ కుమార్‌ రెడ్డిని సస్పెండ్‌ చేశారు. 

 

20:57 - November 2, 2016

కడప : రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమపై వివక్ష చూపుతోందని ఎమ్మెల్సీ గేయానంద్‌ ఆరోపించారు. రాయలసీమకు కేటాయించిన ఎస్సై పోస్టులే దానికి నిదర్శనమన్నారు. దాదాపు 152 ఎస్సై పోస్టులు కేటాయించాల్సి ఉండగా.. కేవలం 50 మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే తమ తప్పు సరిదిద్దుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయాన్ని కూడగడుతామన్నారు. 

 

వెలుగు ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వరాలు

విజయవాడ : వెలుగు ఉద్యోగులకు ముఖ్యమంత్రి వరాలు ప్రకటించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్లకు సీఎం ఆమోదం తెలిపారు. 35 శాతం వేతనం పెంపునకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. పని తీరును బట్టి వేతన పెంపుదల ఉంటుంది. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమల భక్తుల రద్దీ పెరిగింది. 24 కంపార్టుమెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తుల దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.38 కోట్లు. 

రాహుల్ గాంధీని విడిచిపెట్టిన పోలీసులు

ఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు విడిచిపెట్టారు. రెండు సార్లు రాహుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

20:25 - November 2, 2016

నాగర్ కర్నూలు : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. దేశంలో దళితుల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇలాంటి ఘటనలు నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని అనేక గ్రామాల్లో నిత్యం జరుగుతున్నాయని దళిత యువకులు ఆరోపిస్తున్నారు. తమపై దాడులు జరిగితే ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే లేడంటున్నారు. గ్రామాల్లో దళితులు ఎదుర్కొంటున్న వివక్షతకు సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:22 - November 2, 2016

నాగర్ కర్నూలు : జిల్లాలోని తెలకపల్లి మండలంలో సీపీఎం మహాజన పాదయాత్ర 17వ రోజు కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు అనేక ప్రజాసంఘాలు, ప్రజలు భారీగా మద్దతు తెలుపుతున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను అనేక వర్గాల ప్రజలు పాదయాత్ర చేస్తున్న సీపీఎం నేతల దృష్టికి తీసుకువచ్చారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామన్న హామీని టీఆర్‌ఎస్‌ నెరవేర్చడం లేదని నేతలు ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజలకు అండగా ఉంటామని నేతలు స్పష్టం చేశారు. 

 

20:17 - November 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో జీవో నెం.58కు అధికారులు తూట్లు పొడిచారు. దరఖాస్తు చేసుకుంటే పేదల ఇళ్లను క్రమబద్దీకరిస్తామని అధికారులు ప్రకటించడంతో 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వార్షికాదాయం ఎక్కువగా ఉందంటూ అధికారులు దరఖాస్తులను తిరస్కరించారు. ఇళ్ల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్న 3 వేల మందికి నోటిసులు జారీ చేశారు. మార్కెట్‌ ధర ప్రకారం డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. దీంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

20:10 - November 2, 2016

సిద్ధిపేట : వచ్చే రెండేళ్లలో గోదావరి నీళ్లను సిద్ధిపేటకు తెప్పిస్తామని మంత్రి హరీష్‌ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పటి నాయకులు రైతులను పట్టించుకోలేదన్నారు. వచ్చే రెండేళ్లలో సిద్ధిపేటకు రైల్వే లైన్‌ వస్తుందన్న హరీష్‌ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

20:08 - November 2, 2016

అనంతపురం : తనకు లోకల్‌ రాజకీయాలపై ఆసక్తి లేదని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. అనంతపురంలో మరువవంక పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించిన జేసీ.. రాజకీయాల కోసం స్వచ్చభారత్‌ చేపట్టడం లేదని.. ప్రజలకు మంచి చేయాలన్న తపన మాత్రమే తనకు ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ రాకపై స్పందించిన జేసీ.. ఆయన ఏం చెప్తాడో చూద్దామన్నారు. 

 

20:04 - November 2, 2016

హైదరాబాద్ : ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ పచ్చి బూటకమని విరసం నేత వరవరరావు ఆరోపించారు. పోలీసుల చెరలో ఉన్న మావోయిస్టు అగ్రనేత ఆర్కేను వెంటనే కోర్టులో హజరుపరచాలని డిమాండ్ చేశారు. మల్కన్‌గిరిలో ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డ పోలీసులను హత్యానేరం కింద శిక్షించాలన్నారు. మావోయిస్టులు తలపెట్టిన బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 

 

19:51 - November 2, 2016

మెదక్‌ : ఆహార భద్రతా, వాతావరణ మార్పు, నీరు, వ్యవసాయం వంటి అంశాలపై మెదక్‌ జిల్లాలోని పటాన్‌ చెర్వు ఇక్రిశాట్‌లో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 16 అంతర్జాతీయ సంస్ధలు పాల్గొంటున్నాయి. సదస్సులో 72 పరిశోధనా పత్రాలు ప్రవేశ పెడుతారు. 

 

19:49 - November 2, 2016

హైదరాబాద్ : తెలంగాణలో డెంగీ విజృంభిస్తోన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టిటీడీపీ నేతలు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. సర్కార్‌ దేవుడి మీద భారం వేసి పరిపాలన సాగిస్తోందని ఫిటిషన్‌ లో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్‌లో డెంగీ ఫివర్‌తో 23 మంది గిరిజనుల ప్రాణాలు పోయినా.. కేసీఆర్‌ సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టిటీడీపీ నేతలు ఆరోపించారు.
 

 

వీర జవాన్ ఆత్మహత్య చేసుకుంటే మోడీకి కనిపించడం లేదా : ఉత్తమ్

హైదరాబాద్ : వీర జవాన్ ఆత్మహత్య చేసుకుంటే మోడీకి కనిపించడం లేదా అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. చనిపోయిన మాజీ సైనికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ ను అడ్డుకోవడం దారుణమన్నారు. సైనికుల పట్ల బీజేపీ నేతల ప్రేమ ఎంటో అర్థమవుతోందని చెప్పారు.
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పై మోడీ ఆటలాడుతుతున్నారని మండిపడ్డారు. 

 

19:22 - November 2, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్యను ప్రశ్నించారు. నార్సింగి పోలీసు స్టేషన్‌లో జరిగిన విచారణకు హాజరైన కృష్ణయ్య నుంచి సిట్‌ అధికారులు వాంగ్మూలం నమోదు చేశారు. నయీంతో కృష్ణయ్యకు సంబంధాలున్నాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే నయీంతో తనకు ఏరకమైన సంబంధాలు లేవని కృష్ణయ్యా చెబుతున్నారు. ఈ కేసులోకి  ప్రభుత్వం తనను అనవసరంగా లాగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

19:19 - November 2, 2016

విజయవాడ : అమరావతి నిర్మాణంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణ పనులు జాప్యంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాల్సిన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పనులు ఇంకా కొలిక్కి రాకపోవడంపై మండిపడ్డారు. వెంటనే 7 రోడ్లకు పారదర్శకంగా టెండర్లు పిలవాలని చంద్రబాబు ఆదేశించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:16 - November 2, 2016

వాషింగ్టన్ : హిల్లరీ క్లింటన్‌ ఈమెయిల్‌ వ్యవహారంలో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ తిరిగి విచారణకు ఆదేశించడంపై స్పందించేందుకు వైట్‌ హౌజ్‌ నిరాకరించింది. అధ్యక్ష ఎన్నికల ముందు ఎఫ్‌బిఐ తీసుకున్న నిర్ణయం హిల్లరీ క్లింటన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమె నిజాయితీపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు నమ్మకం ఉందని వైట్‌ హౌజ్‌ మీడియా కార్యదర్శి జోష్‌ అర్నెస్ట్‌ తెలిపారు. కోమె ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం లేదన్న విశ్వాసం ఒబామాకు ఉందన్నారు. ఈమెయిల్‌ వ్యవహారం దర్యాప్తుకు సంబంధించిన విషయాలను జేమ్స్‌ కోమె ప్రజలకు వెల్లడించవచ్చని, ఇందులో తమ జోక్యం ఏమి ఉండదని అర్నెస్ట్‌ చెప్పారు.

 

19:13 - November 2, 2016

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డెమోక్రెటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తన ప్రత్యర్థి రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై మళ్లీ విరుచుకు పడ్డారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవికి ఎంతమాత్రం అర్హుడు కాదని పేర్కొన్నారు. ట్రంప్‌ అబద్ధాల కోరు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తని ఆరోపించారు. గత 30 ఏళ్లలో ట్రంప్‌ మహిళలను కించపర్చడంలోనే కాలం గడిపారని హిల్లరీ ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికలకు ఇక వారం రోజులే సమయం ఉందని, ట్రంప్‌ విషయంలో ఆలోచించి ఓటేయాలన్నారు. అణ్వాయుధాలపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమని హిల్లరీ హెచ్చరించారు.

 

19:10 - November 2, 2016
19:09 - November 2, 2016
19:08 - November 2, 2016

హైదరాబాద్ : గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. కేంద్ర ప్రభుత్వం 2016కు గాను.. ఆయన్ను సెంటినరీ అవార్డు ఫర్‌ ఇండియన్ ఫిల్మ్‌ పర్సనాలిటీగా ఎంపిక చేసింది. ఈనెల 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న ఇఫి వేడుకల్లో అవార్డును ప్రదానం చేయనున్నారు. 
సెంటెనరీ అవార్డు ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీగా ఎంపిక 
తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. నలభైఏళ్లుగా తెలుగువారిని తన స్వరంతో అలరిస్తోన్న మధుర గాయకుడు బాలు అందుకోని అవార్డులు లేవు.. పొందని రివార్డులు లేవు. బాలసుబ్రహ్మణ్యం కీర్తికిరీటంలో తాజాగా మరో కలికితురాయి వచ్చి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2016 సంవత్సరానికి గాను.. సెంటెనరీ అవార్డు ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీగా ఎంపిక చేసింది. 
భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేస్థానం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగానే కాదు...నటుడిగా..సంగీత దర్శకుడిగా..నిర్మాతగా తనదైన శైలిలో భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేస్థానం సంపాదించుకున్నారు. హీరో స్వరానికి తగ్గట్లుగా తన గళాన్ని పలికించి ఔరా అనిపించడం బాలూకే చెల్లింది. సాడ్ సాంగ్స్...స్పీడ్ సాంగ్స్...టైటిల్ సాంగ్స్...క్లాసికల్..రాక్..ఫోక్  పాట ఏభావానికి సంబంధించిందైనా.. శ్రోతలను అలరించడమే లక్ష్యంగా ఆయన స్వరప్రస్థానం సాగింది. 
ఒకే రోజు వివిధ భాషల్లో 21 పాటలు 
ఒకే రోజు వివిధ భాషల్లో 21 పాటలు పాడిన రికార్డు కూడా బాలూ సొంతం... ఇంతటి కృషీవలుడు కాబట్టే ఆయన ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా అవార్డులు అందుకున్నారు. లెక్కలేనన్ని రాష్ట్రస్థాయి అవార్డులు స్వీకరించారు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. ఇప్పుడు కేంద్రప్రభుత్వం ప్రకటించిన సెంటెనరీ అవార్డు ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ పురస్కారం.. తన షోకేస్‌లో ప్రత్యేకమైనదిగా బాలూ అభివర్ణిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ అవార్డును వహీదారెహమాన్‌, రజనీకాంత్‌, ఇళయరాజాలు మాత్రమే  అందుకున్నారు. ఈ పురస్కారాన్ని పొందిన నాలుగోవ్యక్తిగానే కాదు.. తొలి తెలుగు వ్యక్తిగానూ బాలసుబ్రహ్మణ్యం చరిత్రలో నిలిచిపోనున్నారు. 

 

18:51 - November 2, 2016

హైదరాబాద్ : కమల్‌హాసన్‌, గౌతమి బ్రేకప్‌పై కమల్‌ కూతురు శృతి స్పందించారు.. తాను ఎవ్వరి వ్యక్తిగత జీవితాలపై ఎప్పుడూ కామెంట్‌ చేయలేదని స్పష్టం చేసింది... తనకు తన తల్లిదండ్రులు, చెల్లెలే ముఖ్యమని ట్వీట్‌ చేసింది శృతి హాసన్‌.. మరోవైపు ఈ బ్రేకప్‌పై కమల్‌హాసన్‌కూడా మౌనం వీడారు.. గౌతమి హ్యాపీగా ఉండటమే తనకు ముఖ్యమని తెలిపారు.. ఆమె ఎలా ఉండాలనుకున్నా తనకు అభ్యంతరంలేదని చెప్పారు.. దేవుడు తనకు శృతి, అక్షర, సుబ్బులక్ష్మిలాంటి ముగ్గురు కూతుళ్లను ఇచ్చాడని.. తాను ఎంతో అదృష్టవంతుడినని తెలిపారు.

 

రాహుల్ మళ్లీ అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఢిల్లీ : రాహుల్ గాంధీని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.ఆస్పత్రి వద్ద  కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని జ్యోతిరాధిత్య సింథియా అన్నారు. 

నయీం కేసులో లాగొద్దు - కృష్ణయ్య..

హైదరాబాద్ : నయీం వ్యవహారాలతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యానించారు. పోలీసుల నుండి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, నయీంకు సంబంధించిన విషయాల్లో తనను లాగవద్దని సూచించారు. సిట్ అధికారులు ప్రశ్నించారు..ఒక సాక్షిగానే హాజరయ్యానని తెలిపారు.

 

నగరంలో మోడీ దిష్టిబొమ్మ దహనం..

హైదరాబాద్ : ఢిల్లీ పోలీసులు రాహుల్ ను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ గాంధీభవన్ రోడ్డు వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. 

17:24 - November 2, 2016

టాలీవుడ్ లో ప్రస్తుతం అక్కినేని తనయుల వివాహంపై చర్చ జరుగుతోంది. నాగ చైతన్య – సమంత, అఖిల్ - శ్రియా భూపాల్ వివాహాలపై రోజుకో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా 'అఖిల్' వివాహం త్వరలో కాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఫ్యాషన్ డిజైనర్ అయిన 'శ్రియా భూపాల్' - 'అఖిల్' లు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థానికి 'అక్కినేని' గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 9వ తేదీన ఈ వేడుక జరగనుందని టాలీవుడ్ టాక్. టాలీవుడ్‌ భామలు శ్రియ, కాజల్ అగర్వాల్, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్‌లతో పాటు బాలీవుడ్ కథానాయికలు ఆలియా భట్, శ్రద్ధాకపూర్.. తదితరులకు శ్రియా భూపాల్ దుస్తులు డిజైన్ చేశారు.
మరోవైపు నాగ చైతన్య - సమంతల ప్రేమ కూడా వెలుగులోకి వచ్చింది. దీనితో ఇద్దరు కుమారుల పెళ్లి ఒకేసారి చేయాలని అక్కినేని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ చైతూ, సమంతల పెళ్లి విషయంలో క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా అఖిల్ నిశ్చితార్థం చేయాలని అక్కినేని నాగార్జున భావించినట్లు సమాచారం. 

దివీస్ ప్రభావిత గ్రామాల్లో టెన్షన్..టెన్షన్..

తూర్పుగోదావరి : దివీస్ ప్రభావిత గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేపు బహిరంగసభకు దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగసభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సీపీఎం నేతలను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనితో సీపీఎం నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

రాహుల్..కేజ్రీలను అడ్డుకున్న పోలీసులు..

ఢిల్లీ : ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రి వద్ద సీఎం కేజ్రీవాల్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న సైనికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వారు వచ్చారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని, ప్రధాని మోడీ అబద్ధాలు మాట్లాడుతున్నారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. పోలీసులు అడ్డుకోవడంపై రాహుల్ మండిపడ్డారు. బీజేపీ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తోందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 349 పాయింట్ల నష్టంతో 27,527 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 112 పాయింట్ల నష్టంతో 8,514 నిఫ్టీ ముగిసింది. 

మోడీ అధ్యక్షతన అత్యున్నత సమావేశం..

ఢిల్లీ : ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యున్నత సమావేశం జరిగింది. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, పారికర్, అజిత్ దోవల్ లు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు, సరిహద్దు ప్రజల రక్షణపై చర్చించారు. 

జంతర్ మంతర్ వద్ద 27 ప్రజా సంఘాల ధర్నా..

ఢిల్లీ : జంతర్ మంతర్ వద్ద 27 ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఏవోబీ ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

నయీం కేసులో కీలక మలుపు..

హైదరాబాద్ : నయీం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలని టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యకు నార్సింగి పోలీసులు నోటీసులిచ్చారు. విచారణకు హాజరై తన వాదనను ఆర్.కృష్ణయ్య వినిపించారు. ఆర్.కృష్ణయ్య స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. సరూర్ నగర్ లో ఓ వ్యాపారి హత్య కేసులో కృష్ణయ్యను గంటపాటు సిట్ విచారించింది. 

టెస్టుల్లో హార్థిక్ పాండ్యా..

ఢిల్లీ : ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత్ జట్టును ఎంపిక చేశారు. తొలి రెండు టెస్టులకు జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టులో గౌతమ్ గంభీర్ స్థానాన్ని కాపాడుకోగా టెస్టుల్లోకి హార్థిక్ పాండ్యా ఎంట్రీ ఇచ్చాడు. ఈనెల 9న టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. జట్టులో విరాట్ కోహ్లీ, రహానే, గంభీర్, సాహా, మురళీ విజయ్, రవీంద్ర జడేజా, షమీ, అశ్విన్, అమిత్ మిశ్రా, ఇషాంత్, ఉమేష్ యాదవ్, పాండ్యా, కరణ్ నాయర్, జయంత్ లున్నారు. 

మేండార్ సెక్టార్ లో పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : మేండార్ సెక్టార్ లో కాల్పుల ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘస్తూనే ఉంది. ఇద్దరు సాధారణ పౌరులకు గాయాలయ్యాయి. పాక్ కాల్పులను భారత జవాన్లు తిప్పికొడుతున్నారు. 

హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ అభివృద్ధి - కేటీఆర్..

వరంగల్ : హైదరాబాద్ ధీటుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామని ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వరంగల్ పట్టణ అవసరాలకు అనుగుణంగా నాలాల విస్తరణ చేపడుతామన్నారు. ఉద్యమంలో కలిసి వచ్చిన వారందరికీ నామినేటెడ్ పదవులు కల్పించనున్నట్లు వెల్లడించారు. వరంగల్ జిల్లా అభివృద్దిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, కేసీఆర్ సమర్థతను దేశం మొత్తం గుర్తించిందన్నారు.

 

రాజధాని నిర్మాణ పనుల జాప్యంపై బాబు సీరియస్..

హైదరాబాద్ : అమరావతి నిర్మాణ పనుల జాప్యంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు ఇంకా కొలిక్కి రాకపోవడంపై అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఏడు రోడ్లకు టెండర్లు పిలవాలనిఅ ధికారులకుబాబు ఆదేశాలు జారీ చేశారు. 

భూ సేకరణపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచి భూ సేకరణ చేయాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈనెల 16కి వాయిదా వేశారు. 

టాటాను వీడని సైరస్ తలనొప్పి..

ఢిల్లీ : టాటా సన్స్ ను సైరస్ మిస్త్రీ తలనొప్పి వీడడం లేదు. టాటా గ్రూప్ లోని మరికొన్ని సంస్థలకు ఛైర్మన్ గా మిస్త్రీ కొనసాగుతున్నారు. టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్ కంపెనీ లి., టాటా పవర్ సంస్థలకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మూడు సంస్థల ఛైర్మన్ పదవుల నుండి సైరస్ ను తొలగించడం సులభం కాదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

13:45 - November 2, 2016

న్యాయ సమస్యలపై సలహాలు..సూచనలు ఇచ్చే మైరైట్ కార్యక్రమం ఈరోజుకూడా మన ముందుకు వచ్చేసింది. ఈరోజు మైరైట్ లో కంజూమర్ ఫోరం అంటే ఏమిటి? అనే అంశంపై సలహాలు..సూచనలు అందించేందుకు అడ్వకేట్ పార్వతి వచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ కంజూమర్ ఫోరం ను ఆశ్రయించవచ్చు అనే విషయంలో పార్వతిగారు ఇంకా ఎటువంటి సమాచారాన్ని అందించారో తెలుసుకోవాలంటే వీడియో చూడండి..

13:41 - November 2, 2016
13:38 - November 2, 2016
13:36 - November 2, 2016

విజయవాడ : పేదలను నట్టేట ముంచిన ప్రభుత్వం టిడిపి ప్రభుత్వమేనన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సిహెచ్.బాబూరావు. టిడిపి ప్రభుత్వ హయంలో పేదరికం పెరుగుతుందా..లేక తగ్గుతుందా ఆపార్టీ నేతలే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారాయన. ప్రజా చైతన్య పాదయాత్రలో భాగంగా విజయవాడలోని 51 వ డివిజన్ లో సిపిఎం నేతలు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో ప్రజలు స్వచ్చంధంగా వచ్చి సిపిఎం నేతలకు తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సిహెచ్.బాబూరావు రెండున్నరేళ్ళలో ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వివరించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాల కారణంగా ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. చంద్రబాబు పాలనలో బడా బాబులు కోట్లకు పడగలెత్తుతున్నారని, పేదలు మాత్రం పేదరికంలోనే మగ్గిపోతున్నారన్నారు. పేదలకు అన్నివిధాలా ఆదుకుంటామన్న బాబు వారికిచ్చే సబ్సిడీ కూడా తీసేశారని మండిపడ్డారు. అద్దెలకుంటున్న వారికి కనీసం సొంతింటిని కూడా కల్పించలేని దుస్ధితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే ప్రజా చైతన్య పాదయాత్ర ద్వారా ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బాబూరావు హెచ్చరించారు. 

13:33 - November 2, 2016

కరీంనగర్ : విద్యుత్ కోతల్లేకుండా లో ఓల్టెజ్ సమస్యలను తీర్చేందుకు అదనంగా సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మాంజూరు చేసిందని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. కోటి 92లక్షలతో నిర్మించ తలపెట్టిన 6సబ్ స్టేషన్ల నిర్మాణానికి మంత్రి ఈటెల శంకుస్థాపన చేశారు. ఇళ్ల పై నుండి ఉన్న విద్యుత్ లైన్లకారణంగా జరిగే ప్రమాదాలను నివరించాడానికి 9కోట్ల రూపాయలతో విద్యుత్ లైన్ల మరమత్తు చేపట్టినట్లు తెలిపారు. నూతనంగా వచ్చే పరిశ్రమలకు అడిగిన వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

13:25 - November 2, 2016

మహబూబ్ నగర్ : సీపీఎం మహాజన పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రాంరెడ్డిపల్లిలో పర్యటిస్తున్న బృందం స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కేజీ పీజీ ఉచిత విద్యను అందిస్తామన్న కేసీఆర్‌...ఆ మాట మర్చిపోయారని బృందంలో పర్యటిస్తున్న సభ్యులు శోభన్‌నాయక్‌ విమర్శించారు. హాస్టళ్లలో చాలీచాలని వసతులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆదివాసి గిరిజన సంఘం నేత శోభన్‌నాయక్‌ పేర్కొన్నారు.దళితులు, గిరిజనుల దగ్గరనుంచి వేలాది ఎకరాలను ప్రభుత్వం లాక్కొంటుందనీ... వట్టెం, ఎల్కతండ రిజర్వాయర్ల విషయంలో వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం లాక్కుంటోందన్నారు. పలు స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలు కావడంలేదన్నారు. తండాల్లోని యువకులు ఉద్యోగాల్లేక ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారనీ..లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్‌...ఆ ఊసే ఎత్తడంలేదని ఈ సందర్భంగా శోభన్ నాయక్ విమర్శించారు.

13:22 - November 2, 2016

ఢిల్లీ : ఆంధ్రా, ఒడిషా సరిహద్దులో ఎన్‌కౌంటర్‌పై ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర 27 ప్రజాసంఘాలు ధర్నా చేపట్టాయి.. అక్టోబర్‌ 24 ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.. ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు చెబుతున్నట్లు మల్కన్‌గిరిలో జరిగిందని ఎన్‌కౌంటర్‌ కాదని ప్రజాసంఘాలు ఆరోపించాయి.. కోవర్ట్ ఆపరేషన్‌ ద్వారా ఆదివాసులు, మావోయిస్టులపై నరమేధమని మండిపడ్డాయి.. కూంబింగ్ ఆపరేషన్‌ పేరుతో గిరిజన గ్రామాలను నాశనం చేస్తున్నారని విమర్శించారు.. పోలీస్ కస్టడీలోఉన్న ఆర్కే తోపాటు 10మంది మావోయిస్టు నేతల్ని కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు.. కూంబింగ్‌ ఆపేసి.. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యాకేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ ధర్నాలో ప్రొఫెసర్‌ సాయిబాబాతోపాటు.. పలు ప్రజాసంఘాలు పాల్గొన్నాయి.. 

13:15 - November 2, 2016
12:47 - November 2, 2016

హైదరాబాద్ : హాయిగా...ఆడిపాడే బాల్యం అధోగతి పాలవుతోంది. అమ్మానాన్నల ఒడిలో ఆత్మీయతను పొందాల్సిన అనేక మంది బాలలు.. అనాథ జీవనం గడుపుతున్నారు. చెత్తకుప్పలే పురిటి లోగిళ్లుగా పెరిగిన అనాథలు.. దారం తెగిన గాలిపటాల్లా.. దరి చేర్చుకునే వారులేక బతుకులీడుస్తున్నారు. ట్రాఫిక్‌ కూడళ్లలో... నగరాల నడిబొడ్డున ఇలాంటి ఎందరో చిన్నారులు రోజూ దర్శనమిస్తూనే ఉంటారు.

భావి పౌరుల జీవితాలను పట్టించుకునే వారెవరు..?
పలక బలపం పట్టాల్సిన చేతులు పైసల కోసం యాచన..లేలేత వయస్సులోనే భరించలేని యాతన....అక్షరాలు దిద్దాల్సిన వయసులో.. కూలీలుగా అవతారం..కన్నా..చిన్నా పిలుపుల స్థానంలో.. ఒరే..ఒసే అన్న ఈసడింపులు....ఇదీ.. నగరంలోని అనాథ పిల్లల దుస్థితి. చింపిరి జుట్టు.. చిరిగిన బట్టలతో... నగరంలోని ప్రతి కూడళ్లలో కనిపించే బాలలు.. అమ్మా, నాన్న, అక్కా.. చెల్లి లేని అనాథలుగా జీవనం కొనసాగిస్తున్నారు. చిన్నతనంలోనే అందర్నీ కోల్పోయి కొందరు... కామాంధుల చేతిలో బలైపోయిన అభాగ్యులకు పుట్టిన వారు మరికొందరు. పేగుబంధం భారమై.. కన్నతల్లికి దూరమై...చెత్తకుప్పలే పొత్తిళ్లుగా జీవితాలను ప్రారంభించిన ఈ పిల్లలు సమాజం దృష్టిలో అనాథలు.

ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 30 వేల మంది వీధి బాలలు
జానెడు పొట్టకు.. పిడికెడు మెతుకులు అందించే భరోసా కోసం దీనంగా చూస్తూ.. బాల్యం రోడ్డు పాలవుతోంది. బస్టాండ్‌లు, హోటళ్లు, ట్రాఫిక్‌ సిగ్నళ్ల దగ్గర, లేత వయస్సులోనే రెక్కలు ముక్కలు చేసుకుంటున్న బాల్యం.. నగరాల్లో ఏ దరీ లేక.. ఎందరినో అర్థిస్తోంది... తల్లిదండ్రులను కోల్పోయి... జన్మనిచ్చిన వాళ్లకు భారమై.. ఏ దిక్కు లేని యాచకులకు జన్మించి.. ఇబ్బందులు తాళలేక ఇంట్లోంచి పారిపోయి వచ్చినవారు, సెక్స్‌ వర్కర్లకు పుట్టిన పిల్లలు... ఇలా కారణాలేమైతేనేం... మొత్తానికి చిట్టి పొట్టి మాటలు మాట్లాడే వయస్సులోనే అనేక మంది పిల్లలు వీధిన పడుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 30 వేల మంది బాలలు.. గూడు లేక.. కూడు లేక అల్లాడుతున్నారన్నది ఓ అంచనా. దీన్ని బట్టే వీధినపడ్డ అనాథ బాలల దుస్థితి ఏంటో అర్థమవుతుంది.

ఆకలితో అలమటిస్తూ.. పొట్ట కూటికోసం భిక్షాటన
హైదరాబాద్‌లోని కొన్ని చౌరస్తాల్లో చిన్న పిల్లలు, పసికందుల్ని తీసుకొచ్చి భిక్షాటన చేయించే మాఫియా దాష్టీకాలూ.. మానవతావాదుల్ని విస్మయపరుస్తున్నాయి. నిరుపేదల నుంచి వందకో.. వేయికో.. పసికందుల్ని కొని... నగరాల్లో వారితో భిక్షాటన చేయిస్తూ పబ్బం గడుపుకొంటున్న ముఠాలూ.. అభం శుభం తెలియని బాల్యం బతుకుల్లో చీకటి నింపుతున్నాయి. నామమాత్రపు ఆదరణ కరవైన అనాధ బాలలు మొత్తం వ్యవస్థ పైనే ద్వేష భావాన్ని పెంచుకుంటున్నారు. కొందరు బాలలైతే.. అసలు ఎవరినీ నమ్మలేక పోతున్నారు. అలాంటి వారిని సరైన మార్గంలో నడిచేలా చేసి..సమాజంలో భాగస్వామ్యం చేయడం ఛాలెంజింగ్‌ వ్యవహారమే అంటున్నారు నిపుణులు.

అక్కున చేర్చుకునే వారు లేక.. వీధిన పడుతూ..
అయినవాళ్లు లేక... ఉన్నవారు పట్టించుకోక, కూడు కోసం.. గూడు కోసం భిక్షాటన చేస్తూ.. నగరంలో అడుగడుగునా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ఈ భావిపౌరుల జీవితాలు పట్టించుకునే వారెవరు..? ఏ చౌరస్తాలో చూసినా బిక్కుబిక్కుమంటూ.. దీనంగా చూస్తూ... అరచేతిని చాపే బాల్యం గురించి ఆలోచించే పాలకులేరీ..? బంగారు బాల్యం.. రోడ్లపైనే మసిబారి పోతుంటే...అమాయక పిల్లలు ఎందరో దారం తెగిన గాలిపటంలా దిక్కూమొక్కూ లేకుండా కాలం వెళ్లదీస్తుంటే.. వారిని ఆదుకునే ఆపన్న హస్తాలేవీ..?   

ప్రభుత్వాలు చేయని కొన్ని పనుల్ని చేస్తున్న స్వచ్చంద సంస్థలు
ఎవరికీ పట్టని బతుకులు వారివి. అటు బంధువులు.. ఇటు పాలకులు పట్టించుకోకపోవడంతో వీధి బాలల జీవితాలు రోడ్లకే పరిమితం అవుతున్నాయి. భావి పౌరులుగా రాణించాల్సిన..నేటి బాలలు బాధలు మరవడం కోసం మత్తులో మునుగుతున్నారు. దీంతో బంగారు భవిష్యత్‌ చిన్నతనంలోనే చిందరవందరగా మారుతోంది. ఇలాంటి వారిని కొన్ని స్వచ్చంద సంస్థలు అక్కున చేర్చుకున్నాయి. ప్రభుత్వాలు చేయని కొన్ని పనుల్ని స్వచ్చంద సంస్థలు చేసి చూపిస్తూ.. బాల్యానికి ఆసరాగా నిలవడం అభినందనీయం...!

వీధి బాలల్ని చేరదీయంలో ఎన్జీవోలు కీలక పాత్ర
రోడ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లే అడ్డాగా చేసుకుని.. యాచకులుగా మారిన బాలల్ని చేరదీసేందుకు కొన్ని ఎన్జీవోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నగరంలోని కూడళ్లు, ఫ్లైఓవర్ల కింద దుర్భర స్థితిలో ఉన్న బాలల్ని చేరదీసి కొన్ని స్వచ్చంద సంస్థలు వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాయి. ప్రాథమిక విద్యాభ్యాసం అలవడేందుకు వారిని బ్రిడ్జ్‌ స్కూళ్లలో చేర్పించి సక్రమ మార్గంలోకి తెస్తున్నాయి. ఇలాంటి బాల్యాన్ని చేరదీసేందుకే .. మేమున్నామంటూ... నగరంలో అనేక ఎన్‌జీవోలు పనిచేస్తున్నాయి.

హోంలో చేరాక తమ జీవితాలు పూర్తిగా మారిపోయంటున్న అనాథ బాలలు
దాతల సాయంతో చాలా మంది అనాథ పిల్లలు నాణ్యమైన విద్య, సదుపాయాలు పొందుతున్నారు. దీంతో తామూ ఎవ్వరికీ తీసిపోమని నిరూపించుకుంటున్నారు. వీరిలోని ప్రతిభను వెలికితీసేందుకు కంప్యూటర్‌; ఇంగ్లీష్‌, మ్యాథ్య్‌ సబ్జెక్టుల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. ప్రేమ, ఆప్యాయతలను పంచుతూ వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. హోంలో చేరాక తమ జీవితాలు పూర్తిగా మారిపోయాయని అనాథ బాలలు చెబుతున్నారు.

అనాధ పిల్లలు... సింగిల్ పేరెంట్ పిల్లలు.. సెక్స్ వర్కర్స్ పిల్లలు
తల్లిదండ్రులు లేని పిల్లలు, సింగిల్‌ పేరెంట్ పిల్లలు, అందరినీ కోల్పోయినవారు, దూరపు చుట్టాల దగ్గర పెరుగుతున్న వాళ్లు.. ఇలా ఎందరికో స్వచ్చంద సంస్థలు అమ్మ ఆలనను..నాన్న పాలనను అందిస్తున్నాయి. అలాంటి వాటిలో రెయిన్‌ బో హోం ఒకటిగా చెప్పవచ్చు. ఈ స్వచ్చంద సంస్థలో తామంతా ఒకే కుటుంబంలా ఉంటున్నామని చెబుతున్నారు పిల్లలు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకునేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు. నీడలా వెంటాడే గత జ్ఞాపకాలు కొందరు పిల్లలను బాధిస్తే.. మరికొందరు పిల్లలు తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ...
రెయిన్‌ బో హోమ్‌లో నివసిస్తున్న ఈ బాలలది ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. కొందరు యాచిస్తూ..ఇక్కడికి చేరితే.. మరికొందరు అసాంఘిక శక్తుల చేతుల్లో చిక్కి త్రుటిలో తప్పించుకుని ఇక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కరూ అపారమైన ప్రతిభా పాటవాలు ఉన్నవారే కావడం విశేషం. తమకు సరైన మార్గనిర్దేశం చేస్తే.. ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి ఉన్నత స్థితికి చేరుకుంటామని చెబుతున్నారు.

58 హోమ్స్‌ మాత్రమే నిర్వహిస్తున్న ప్రభుత్వం
నిజానికి వీధి బాలల సంరక్షణ బాధ్యత ప్రభుత్వాలదే. కానీ కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు బాధ్యత పంచుకోవడంలో అలవిమాలిన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. నగరంలో ప్రభుత్వం కేవలం కొంతమంది వీధి బాలలకు మాత్రమే ఆశ్రయం కల్పిస్తోంది. మిగతా వారంతా వీధుల్లోనే గడపాల్సి వస్తోంది. అలాంటి వారిని చేరదీసి అక్కున చేర్చుకుంటున్నాయి కొన్ని స్వచ్ఛంధ సంస్థలు. హైదరాబాద్‌ నగరంలో దాదాపు 30 వేల వీధి బాలలుంటే.. కేవలం 58 హోమ్స్‌ను మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటిలో కేవలం మూడు వేల మంది పిల్లల్ని మాత్రమే సంరక్షిస్తున్నారు.

రూ.20 లక్షల కోట్ల బడ్జెట్‌లో బాలల కోసం వెచ్చిస్తున్నది 0.02 శాతమే
వీధి బాలల సంరక్షణ.. కేంద్ర పరిధిలో అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయని కేంద్రం, కేంద్రం బాధ్యత తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం అనాథ బాలల సంక్షేమం కోసం నిధులు కేటాయించడం లేదు. ఇంటిగ్రేటెడ్‌ ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ స్కీం కింద వీధి బాలల సంరక్షణ కోసం కేంద్రం ఈ ఏడు కేవలం 400 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే... 20 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో వీధి బాలల సంక్షేమం కోసం వెచ్చిస్తున్న మొత్తం కేవలం 0.02 శాతం మాత్రమే. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు దక్కేది 26 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం మరో 65 లక్షలు కేటాయిస్తున్నా.. ఆ మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న నిధులు నామమాత్రం కావడంతో వీధి బాలల సంక్షేమం ఫుట్‌పాత్‌లకే పరిమితమవుతోంది. ప్రభుత్వం వీధి బాలల సంక్షేమం కోసం మరిన్ని నిధులు కేటాయించి, తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తే.. నేటి బాలలే..రేపటి పౌరులుగా రాణిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.  

12:36 - November 2, 2016

హైదరాబాద్ : మావోయిస్టు నేత ఆర్కే కోసం మావోయిస్టులు ముమ్మరంగా గాలిస్తున్నారు.. 5 రాష్ట్రాల్లో అడవులను జల్లెడపడుతున్నారు.. ఏజెన్సీ ప్రాంతాల్లో పోస్టర్లువేసి ఆర్కే ఆచూకీ తెలపాలంటూ మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేస్తోంది.. గిరిజన ప్రాంతాల్లో ఆర్కే ఆచూకీకోసం వెతుకుతున్నారు.. మరోవైపు ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.. పోలీసులుమాత్రం ఆర్కే తమదగ్గర లేరని స్పష్టం చేస్తున్నారు.మావోయిస్టు నేత ఆర్కే ఆచూకీకోసం మావోయిస్టుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆర్కే ఆచూకీ తెలపాలంటూ మావోనేతలు పోస్టర్లు వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అధీనంలో వున్న మావోయిస్టు నేత ఆర్కేని..అతని అనుచరులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇక్రిశాట్ లో అంతర్జాతీయ సదస్సు...

సంగారెడ్డి : పటన్ చెరులో ఇక్రిశాట్ లో అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. నిబో డైరెక్టర్ జనరల్ నేల్స్ వాగ్ స్టడ్ సదస్సును ప్రారంభించారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జెరిమి బర్డ్ పాల్గొన్నారు. 16 అంతర్జాతీయ, 21 జాతీయ, 9 రాష్ట్ర సంస్థలు పాల్గొన్నాయి. 72 పరిశోధన పత్రాలను ప్రతినిధులు సమర్పించారు. వాతావరణ మార్పు, నీరు, వ్యవసాయం, ఆహార భద్రతపై సదస్సులో చర్చించనున్నారు. 

ఆర్కే కోసం జల్లెడ పడుతున్న మావోయిస్టులు..

విశాఖపట్టణం : ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టులు జల్లెడపడుతున్నారు. ఆర్కే ఆచూకి తెలపాలంటూ మావోయిస్టులు పోస్టర్లు వేస్తున్నారు. ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. వెంటనే కోర్టు ఎదుట ఆర్కేను ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఆర్కే తమ అదుపులో లేరని పోలీసులు పేర్కొంటున్నారు. 

12:27 - November 2, 2016

హైదరాబాద్‌ : భోజన ప్రియులకు శుభవార్త.. హైదరాబాదీలకు సరికొత్త రుచులు పరిచయం చేసేందుకు చైనీస్ రెస్టారెంట్ ఏర్పాటైంది. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో ఫుడ్ ఉండడం ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ.. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ సారి ఈ రెస్టారెంట్‌పై ఓ లుక్ వేయండి.

నగరంలో కొత్త హోటళ్లు, రెస్టారెంట్లు
హైదరాబాదీలు భోజన ప్రియులు అని అందరికీ తెలిసిన విషయమే.. అందుకే నగరంలో ఎప్పటికప్పుడు కొత్త హోటళ్లు, రెస్టారెంట్లు పుట్టుకొస్తాయి. తాజాగా చైనీస్ రెస్టారెంట్ ఒకటి నగరవాసుల కోసం ఏర్పాటైంది. కూకట్‌పల్లిలోని సృజనమాల్‌లో టాంగ్ రెస్టారెంట్ ను ప్రారంభించారు..

200 రకాలకు పైగా చైనా వంటకాలు
అన్ని రెస్టారెంట్‌లతో పోల్చుకుంటే దీనికి ఓ ప్రత్యేకత ఉంది.. ఇందులో కేవలం చైనా నుంచి ఇంపోర్ట్ అయిన ఫుడ్ మాత్రమే ఉంటుంది. దాదాపు 200 రకాలకు పైగా చైనా వంటకాలు భోజన ప్రియులను అలరించనున్నాయి.

చైనా సాంప్రదాయ వంటకాల ప్రత్యేకత
నాణ్యమైన చైనా హత్ &స్వీట్ స్పైసీ,స్నాక్స్, వీటెన్, హమ్ బర్గర్స్, విబిన్న రకాల స్వీట్స్, కేక్స్, స్నాక్ ఐటెమ్స్, స్టార్టస్, ఫ్రూట్ జ్యుసెస్ ఇలా అన్ని రకాల ఇంపోర్టెడ్ చైనా రుచులను అందిచనున్నారు.చైనా సాంప్రదాయ వంటకాలను అందించడమే తమ ప్రత్యేకత అని.. త్వరలోనే మరో 30 రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. అందరికి అందుబాటు ధరల్లో ఇక్కడ వంటకాలు లభిస్తాయన్నారు.చైనా వంటకాలను ఇష్టపడే వారికి ఈ రెస్టారెంట్ ఎంతగానే ఉపయోగనడింది. ఇంకెందుకు ఆలస్యం రెస్టారెంట్‌కి వెళ్లి మీకు నచ్చిన వంటకాలను తిని ఆస్వాధించండి.

 

12:22 - November 2, 2016

హైదరాబాద్ : చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేస్తాం.. చెత్త సమస్య తీరుతుంది.. విద్యుదుత్పత్తి పెరుగుతుంది. ఇది ఒకప్పుడు పాలకులు చెప్పిన మాటలు.. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌గా ఉన్నప్పుడు ఆర్డీఎఫ్ తో చేసుకున్న ఒప్పందం ఇంకా ప‌ట్టాలెక్కేలా లేదు. అప్పుడు ఇప్పుడు అంటూన్నారే త‌ప్పా ఎప్పుడు ప్రారంభ‌మౌతుందో చెప్పలేని ప‌రిస్థితి. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో చెత్త స‌మ‌స్య రోజు రోజుకు తీవ్రత‌ర‌మౌతుంది.

చెత్తతో అందుబాటులోకి 11మెగావాట్ల విద్యుత్
హైదరాబాద్‌లోని చెత్తతో 11మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వ‌స్తుంది. ఇదీ నాటి పాల‌కులు వేసిన అంచ‌నా. అందుకు త‌గ్గట్లుగా నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో విద్యుత్‌ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఆర్డీఎఫ్‌కు చెందిన 26 ఎకరాల స్థలంలో పనులు ప్రారంభించారు. ఇక్కడ ప్రతి రోజు 1100 మెట్రిక్‌ టన్నుల చెత్తను ఉప‌యోగించి విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి ప్లాంట్ నిర్మాణం చేపట్టారు.

ప్రస్తుతం 4వేల టన్నుల చెత్త ఉత్పత్తి
ప్రస్తుతం న‌గ‌రంలో 4వేల ట‌న్నులకు పైగా చెత్త ప్రతి రోజు ఉత్పత్తి అవుతుంది. దానిని నిర్ములించ‌డం జిహెచ్ఎంసికి పెద్ద స‌వాలుగా మారింది. ప్రతి నెల కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తుంది. అయినా డంపింగ్ కేంద్రాల వ‌ద్ద మాత్రం ప‌రిస్థితి అధుపులోకి రావ‌డం లేదు.

సత్ఫలితాలను ఇస్తే మరికొన్ని ప్లాంట్‌లను చేపట్టాలని నిర్ణయం
బీబీన‌గ‌ర్ వ‌ద్ద ఏర్పాటు చేస్తున్న రిఫ్యూస్డ్ డ్రైవ్డ్ ఫ్యూయ‌ల్ ఆర్ డి ఎఫ్ స‌త్ఫలితాల‌ను ఇస్తే ఇలాంటి వాటినే మ‌రికొన్నింటిని ఏర్పాటు చేయాల‌ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. గ‌త ఏడాది ఆగ‌స్ట్ నాటికి ఆర్డిఎఫ్ ప్లాంట్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని ప్రక‌టించింది. ఏడాది పూర్తయినా ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది.

పాత ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.26కోట్లు
ఇక 2000 సంవత్సరంలో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం 25 కోట్లరూపాయ‌లు ఉండగా ప్రస్తుతం ఆ వ్యయం భారీగా పెరిగిందంటున్నారు. ఈ ప్రాజెక్టులో బల్దియా వాటా కింద 6.40కోట్లు పెట్టుబడి పెట్టాల్సిఉండగా ఇప్పటివరకు 4 కోట్ల వ‌ర‌కు చెల్లించిన‌ట్లు స‌మాచారం. తక్షణమే విద్యుత్ ఉత్పత్తి చేప‌డితే కోట్లాది రూపాయ‌లు బ‌ల్దియాకు సేవ్ అవుతాయి.

చెత్త స‌మ‌స్యకు చెక్ పడేనా?
స్వచ్ఛ హైద‌రాబాద్ సంద‌ర్భంగా హ‌డావిడి చేసిన బ‌ల్దియా.. ఇప్పుడు దాని గురించి పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్లాంట్ ను త్వర‌గా ప్రారంభిస్తే చెత్త స‌మ‌స్యకు కొంత‌మేరకైనా చెక్ ప‌డుతుంది.

 

12:17 - November 2, 2016

విశాఖ : మావోయిస్టుల బంద్‌ పిలుపుతో పోలీసులు ఐదు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు.. ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.. మావోయిస్టులు దాడులు చేసే అవకాశముందంటూ తెలుగు ప్రజాప్రతినిధులకు పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు.. ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించొద్దని సూచించారు.. తెలంగాణలో కొమురం భీం, ఆసిఫాబాద్‌, రామగుండం, భద్రాచలం, జయశంకర్‌, కొత్తగూడెం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు... ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయగోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.. పోలీసుల తనిఖీలు, హెచ్చరికలతో గిరిజనులు వణికిపోతున్నారు.. మరోవైపు భోపాల్‌లో నిషేధిత సిమీ సభ్యుల ఎన్‌కౌంటర్‌తోకూడా పోలీసులు నిఘా పెంచారు.. తమకు సమాచారం ఇవ్వకుండా నేతలు ఎక్కడికీ వెళ్లొద్దని సూచించారు.. ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశముందన్న నిఘా సంస్థలు హెచ్చరికతో పోలీసులు తనిఖీలు పెంచారు.. ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు రేపు బంద్‌కు పిలుపునిచ్చారు.

భోపాల్ సెంట్రల్ జైలుకు శివరాజ్ సింగ్ చౌహాన్..

మధ్యప్రదేశ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ కు చేరుకున్నారు. సెంట్రల్ జైలును ఆయన సందర్శిస్తున్నారు. ఇటీవలే జైలు నుండి పారిపోయిన 8మంది ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో హతమైన సంగతి తెలిసిందే. 

12:12 - November 2, 2016

హైదరాబాద్ : ఏవోబీలో అక్టోబర్ 24 నుండి మూడు రోజుల పాటు జరిగిన ఎన్ కౌంటర్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్ అంటూ మావో పార్టీలు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాయి. దీంతో దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ న్యాయస్థానం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ తరపు నాయ్యవాదిని పిటీషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఒడిషాకు వెళ్లి ఎందుకు ఎన్ కౌంటర్ సంబంధించిన పూర్తి వివరాలు కౌంటర్ లో పొందుపర్చలేదని పిటీషనర్ తరపు న్యాయవాది రఘునాథ్ పేర్కొన్నారు.దీంతో కేసును వచ్చే మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. 

11:43 - November 2, 2016

ఢిల్లీ : దేశ భద్రత కోసం..దేశ ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను తృణ ప్రాణంగా త్యాగం చేసే జవాన్లు కూడా ఆత్మహత్య చేసుకుంటారా? అలా జరిగితే అది వీర జవాన్ల త్యాగాన్ని అవమానించినట్లుగా భావించవచ్చా? మరి వారు చేసిన త్యాగాలకు అర్థం లేనట్లేనా? జవాన్లను గౌరవించుకోవాల్సిన అవసరం పాలకులకు పట్టదా ? దేశం కోసం పోరాడిన వారు దక్కాల్సిన వాటి కోసం పోరాటం చేసే దుస్థితి ఎందుకు వస్తోంది ? గత సంవత్సర కాలంగా మాజీ సైనికోద్యోగులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసందే. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేయాలని కోరుతూ వీరు ఆందోళన చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర ఆవేదన తెలియచేస్తున్నారు. తాజాగా ఓ సైనికోద్యోగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. 

కేంద్ర ప్రభుత్వం తాత్సారం వల్లే..
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఓఆర్‌ఓపీ అమలు చేయాలని కోరుతూ మాజీ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికుల ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓఆర్ఓపీ అమలులో జాప్యంతో మనస్థాపానికి చెందిన రామ్ కిషన్ అగర్వాల్ అనే మాజీ సైనికుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చనందుకు గాను తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడని మృతుడి కుమారుడు మీడియాకు తెలిపాడు. సమాచారం తెలుసుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓఆర్ఓపీ డిమాండ్..
ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఓఆర్ఓపీ ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చినట్లుగా బడ్జెట్ కేటాయింపుల్లో దాదాపు రూ.8వేల కోట్లు కేటాయించినా అమలులో మాత్రం కనిపించటంలేదు. కాగా దాదాపు 25 లక్షలమంది మాజీ సైనికులకు ఈ పెన్షన్ అందాల్సివుంది. ఓఆర్‌ఓపీ డిమాండ్ గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది. తమ డిమాండ్ల అమలుకై మాజీ సైనికులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేశారు. మృతుడు రామ్ కిషన్ గెహర్వాల్ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో సైతం పాల్గొన్నాడు. ఆత్మహత్య అనంతరం గెహర్వాల్ ఆర్ ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో గెహర్వాల్ ను రక్షణ శాఖమంత్రి మనోహర్ పారికర్ పరామర్శించారు. కానీ చికిత్స తీసుకుంటూ గెహర్వాల్ మృతి చెందారు. 

బీజేపీతో జనసేత జత కట్టలేదు - సిద్దార్థనాథ్ సింగ్..

విజయవాడ : బీజేపీతో జనసేన పార్టీ జత కట్టలేదని, ఎన్నికల్లో జనసేన తమకు మద్దతు మాత్రమే తెలిపిందని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జీ సిద్దార్థ నాథ్ సింగ్ వెల్లడించారు. టిడిపితో ఎలాంటి విబేధాలు లేవన్నారు. 

మాజీ సైనికుడి ఆత్మహత్య..కేంద్రంపై కేజ్రీ ఫైర్..

న్యూఢిల్లీ : ఒకే ర్యాంకు ఒకే ఫించన్ పథక అమలులో జాప్యం చేస్తున్నారంటూ మాజీ సైనికోద్యోగి రామ్ కిషనల్ గ్రేవాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటనతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రంపై మండిపడ్డారు. ఇది చాలా బాధకరమైన విషయమని, సైనికుల హక్కుల కాపాడటం కోసం మద్దతుగా నిలవాలని ఆయన ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. 

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..

హైదరాబాద్ : మధ్య అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. 24గంటల్లో బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

ఏవోబీలో హై టెన్షన్..

విశాఖపట్టణం : ఏవోబీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రేపు ఐదు రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏవోబీని ఆంధ్ర, ఒడిశా బలగాలు జల్లెడపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని బత్తిలి, మిళియాపుట్టి, పాతపట్నంలో భారీగా పోలీసులు మోహరించారు. 

పోలీసుల భారీ కూంబింగ్...

వరంగల్ : ఏవోబీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. తెలంగాణ - ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఏటూరు నాగారం అడవుల్లో గ్రే హౌండ్స్ జల్లెడ పడుతున్నాయి. దేవాదుల, వాజేడు, గోదావరి చెర్రి పాయింట్ల వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. 

కరీంనగర్ లో మంత్రి ఈటెల పర్యటన..

కరీంనగర్ : జిల్లాలో మంత్రి ఈటెల పర్యటించారు. ఆరు సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు ఈటెల శంకుస్థాపన చేశారు. జిల్లాలో విద్యుత్ కోత, లో ఓల్టేజీ సమస్యలు లేకుండా చేయడం జరిగిందని..పరిశ్రమలకు అడిగిన వెంటనే కనెక్షన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. రూ. 9 కోట్లతో ఇళ్లపై ఉండే విద్యుత్ లైన్లను ఆధునీకరించామన్నారు. 

మాజీ జవాను ఆత్మహత్య..

ఢిల్లీ: ఓఆర్‌ఓపీ అమలు చేయాలని కోరుతూ మాజీ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో నేడు చోటుచేసుకుంది. ఓఆర్‌ఓపీ అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చనందుకుగాను తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడని మృతుడి కొడుకు తెలిపాడు. 

పాక్ కు జైట్లీ డెడ్లీ వార్నింగ్!..

ఢిల్లీ : దాయాది దేశం పాకిస్థాన్ కు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. పాక్ సైన్యం భారతీయులకు హాని తలపెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత శిబిరాలపై పాక్ సైన్యం దాడి చేస్తోందని... ఈ నేపథ్యంలో 14 పాకిస్థాన్ స్థావరాలను బీఎస్ఎఫ్ జవాన్లు ధ్వంసం చేశారని అన్నారు. ఇది పాకిస్థాన్ కు ఓ హెచ్చరిక అని చెప్పారు. పాక్ చర్యలను ఇకపై భారత్ ఉపేక్షించదని... సైన్యం దీటుగా సమాధానమిస్తుందని తెలిపారు.

ఆర్కేని కోర్టులో హాజరుపరచాలి : వరవరరావు

వరంగల్ : ఏపీ ప్రభుత్వం అధీనంలో వున్న మావోయిస్టు నేత ఆర్కేని..అతని అనుచరులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. ఏవోబీలో గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్ ను వెంటనే ఆపాయాలనీ..ఆక్టోబర్ 24న బూటకపు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను చట్టబద్ధంగా శిక్షించాలని వరవరరావు డిమాండ్ చేశారు. 

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్‌మార్కెట్లు ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 265 పాయింట్లకు పైగా నష్టంలో, నిఫ్టీ 87 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలహీనపడి 66.80 పైసలు వద్ద కొనసాగుతోంది. మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ, సెంచురి, యాక్సిస్‌ బ్యాంక్‌, వెడంట షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈనెల 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నందున.. ఈ నెలలో ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికలు ముగిసేంత వరకు మదుపర్లు భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపకపోవచ్చు.

లారీ బైక్ ఢీ..ఒకరు మృతి..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద లారీ, బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా. మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన అన్నదమ్ములు శివ, కిరణ్ బైకు వెళ్తోండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివ అక్కడికక్కడే మృతిచెందాడు.

10:39 - November 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మరికొన్ని రోజుల్లో బిజీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోని గులాబీ బాస్... ఇప్పుడు పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. కొత్త కార్యవర్గాల ఏర్పాటు అనంతరం నేతలకు చేతినిండా పని కల్పించేందుకు అధినేత ప్రణాళికలను రచించారు.

పార్టీ నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించే పనిలో గులాబీబాస్‌
తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న గులాబీ నేతలు దాదాపు రెండున్నరేళ్లుగా స్తబ్దుగా ఉన్నారు. పార్టీ అధికార పగ్గాలు చేపట్టడంతో... ముఖ్యమంత్రి ఇప్పటి వరకు పాలన వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. రెండేళ్లు పూర్తి కావస్తుండటంతో ఇప్పుడు పార్టీ నేతలకు కొత్త బాధ్యతలను అప్పగించేందుకు కేసీఆర్‌ సమాయాత్తం అయ్యారు. ఉద్యమంలో ఎంత బిజీగా ఉన్నారో... ఇప్పుడు అంతే బీజీగా మార్చేందుకు అధినేత కసరత్తు చేస్తున్నారు.

జిల్లా కార్యవర్గాలతో పాటు, అనుబంధ సంఘాల నియామకం
అతి త్వరలో జిల్లా కార్యవర్గాలతో పాటు... అనుబంధ సంఘాల నియామకం కూడా పూర్తి చేయనున్నారు. జిల్లా స్థాయిలో కీలక పదవులైన అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు నేతల ఎంపిక దాదాపు పూర్తైంది. అనుబంధ సంఘాల కార్యవర్గాలను కూడా పార్టీ దాదాపు ఖరారు చేసింది. రాష్ట్ర కార్యవర్గం, పోలిట్ బ్యూరో సభ్యుల ఎంపిక తుది దశలో ఉన్నట్లు సమాచారం. కేసీఆర్‌ నియమించిన త్రిసభ్య కమిటీ రాష్ట్ర కార్యవర్గంపై సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. కొత్త కార్యవర్గాల అనంతరం వారికి ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను గులాబీ బాస్‌ అప్పగించనున్నారు.

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు
అమలు చేస్తున్న పథకాలతో పాటు భవిష్యత్‌లో ప్రభుత్వ ప్రణాళికలను పార్టీ పరంగా ప్రజలకు వివరించేందుకు నేతలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు సీఎం పావులు కదుపుతున్నారు. కొత్త కార్యవర్గాల నియామకం అనంతరం వారితో ఒక రోజు సమావేశం నిర్వహించి, డిసెంబర్ 2వ తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల్లోనే ఉండే విధంగా ప్రణాళికలను అమలు చేయాలని కేసీఆర్‌ యోచిస్తున్నట్లు సమాచారం. కొత్త జిల్లాల్లో కొత్త కార్యవర్గాలతో నేతల్లో ఉత్సాహం నింపడంతో పాటు... రాష్ట్ర స్థాయిలో కూడా పదవుల పంపిణీని మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా త్వరలోనే టీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలతో బిజీబిజీగా గడపనున్నారు. 

10:15 - November 2, 2016

విశాఖ : ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో బంద్‌కు మావోలు పిలుపునిచ్చారు. ఉగ్రసంస్థలు దాడి జరిపే అవకాశమున్నట్లుగా నిహాసంస్థలు హెచ్చరించాయి. దీంతో ముందస్తున్న చర్యల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర సరిహద్దుల్లో బలగాలను భారీగా మోహరించారు. తూర్పు అటవీప్రాంతంలో పోలీసులు కూబింగ్ తో జల్లెడపడుతున్నారు. ఏజెన్సీలోకి వచ్చే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తమకు చెప్పకుండా ప్రజాప్రతినిధులు పర్యటించవద్దని పోలీసులు సూచించారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజలు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. కాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏపీలో ఉత్తరాంధ్ర ఏజెన్సీ, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరుతోపాటు తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాచలం ఏజెన్సీలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ సందర్భంగా మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉండడంతో రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు.

 

09:49 - November 2, 2016

ముంబై : టాటా గ్రూప్‌ కొత్త ఛైర్మన్‌గా సుబ్రమణియన్‌ రామాదొరై నియమం కాబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ల ఛైర్మన్‌గా పనిచేసిన రామాదొరై..ఇటీవలే తన పదవులకు రాజీనామా చేశారు. రామాదొరైది కేబినెట్‌ మినిస్టర్‌ హోదా. 71ఏళ్ల రామాదొరై ఆరోగ్య కారణాల వల్ల తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంపిన లేఖలో పేర్కొన్నారు. రామాదొరై రాజీనామాను ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు ఆమోదించాయి. టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని తప్పించడంతో... ఆ స్థానంలో టాటా గ్రూప్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న రామాదొరైని నియమిస్తారనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. 

09:46 - November 2, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలలో పనిచేసే ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. వారికి హెచ్‌ఆర్‌ఏ చెల్లింపు విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఏ ప్రాంతంలో పనిచేసే వారికి ఎంత చెల్లించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కసరత్తు ఎప్పుడు కొలిక్కి వచ్చి తమ కష్టాలు తీరుతాయోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హెచ్‌ఆర్‌ఏపై నిర్ణయం తీసుకోని ప్రభుత్వం
కొత్త జిల్లాలో పనిచేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అక్డోబర్ నెల జీతాలు పాత జిల్లాల మాదిరిగానే ప్రభుత్వం చెల్లించనుంది. దీనికి సంబధించిన ఉత్తర్వులను ఇప్పటికే విడుదల చేసింది. మరోవైపు కొత్త జిల్లాలో ఉద్యోగులను ఆర్డర్ టూ సర్వ్ ద్వారా సర్డుబాటు చేయడంలోనూ కొంత మంది అధికారులు అవినీతికి పాల్పడినట్లుగా టీఎన్జీవో నేతలు ఆరోపిస్తున్నారు.

20శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని డిమాండ్
ఇది ఇలా ఉంటే జనాభా ప్రాతిపదికన కాకుండా జిల్లా కేంద్రాల ప్రాతిపదికన మాత్రమే హెచ్ఆర్ఏ చెల్లించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాత జిల్లా కేంద్రాలతో పాటు కొత్త జిల్లాలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులందరికి 20 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

14.5శాతం మాత్రమే చెల్లిస్తున్నారని ఉద్యోగుల ఆవేదన
కొత్త జిల్లాలకు సంబంధించి చాలా జిల్లా కేంద్రాల్లో జనాభా 2 లక్షలకు లోబడి మాత్రమే ఉంది. దీంతో ఆయా జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులకు 20 శాతం హెచ్ఆర్ఏ వర్తించదు. ప్రస్తుతం 2 లక్షలకు పైగా జనాభా ఉన్న జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు మాత్రమే 20 శాతం హెచ్ఆర్ఏ వర్తిస్తుంది. దీంతో కొత్త జిల్లాల కేంద్రాలకు వచ్చిన పాత జిల్లాల కేంద్రాల్లోని ఉద్యోగులు హెచ్ఆర్ఏ కొంత నష్టపోవాల్సి వస్తుంది. 2 లక్షల కన్నా తక్కువగా ఉన్న జిల్లా కేంద్రాల్లో 14.5 శాతం మాత్రమే హెచ్ఆర్ఏ చెల్లిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు 20%
ప్రస్తుతం ఉన్న శ్లాబులు ప్రకారం జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు 20 శాతం, 2 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు 14.5 శాతం, గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు 12 శాతం , హైద్రాబాద్‌లోని ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ ఇస్తుంది ప్రభుత్వం..

జిల్లా కేంద్రాల్లో పనిచేసే వారందరికి 20%
అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం జిల్లా కేంద్రాల్లో పనిచేసే వారందరికి 20 శాతం,హైద్రాబాద్ వారికి 30 శాతం, ఇక మిగిలిన శ్లాబ్ కు 14.5 శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. 

5న ఘనాపూర్ లో జాబ్ మేళా..

హైదరాబాద్: నవంబర్ 5వ తేదీన ఘట్‌కేసర్ మండలంలోని ఘనాపూర్ కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో దాదాపు పదివేల ఉద్యోగాల భర్తీ కొరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల వైస్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈంప్, ఇన్ఫోసిస్, రిలయన్స్ జియో, విద్యాయుగ్, హెటీరో, యోమా, కార్వే, ప్లిప్‌కార్జ్, ఎంజిల్ బ్రోకింగ్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేళాలో పాల్గొనే వారు వైబ్‌సైట్ HTTP//WWW10000JOBMELA.COM.లో తమ పేర్లను రిజిస్టేషన్ చేయించుకోవాలని కోరారు.

టాటా గ్రూప్ చైర్మన్ గా రామదొరై?..

ముంబై : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికినప్పటి నుంచి ఆ పదవిలో ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఎన్ఎస్ డీఏ), నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ డీసీ) చైర్మన్ పదవులకు రాజీనామా చేసిన సుబ్రమణియన్ రామదొరై పేరు ప్రముఖంగా వినపడుతోంది. 

5 రాష్ట్రాలో బంద్ కు మావోల పిలుపు..

విశాఖ : ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో బంద్‌కు మావోలు పిలుపునిచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర సరిహద్దుల్లో బలగాలను భారీగా మోహరించారు. ఏజెన్సీలోకి వచ్చే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తమకు చెప్పకుండా ప్రజాప్రతినిధులు పర్యటించవద్దని సూచించారు.

మంచిర్యాలలో కార్డెన్ సెర్చ్..

మంచిర్యాల: అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాలలో పోలీసులు ఈ ఉదయం నిర్బంధ తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. సోదాల సందర్భంగా ప్రతి ఇంటినీ జల్లెడ పట్టిన పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా గుర్తింపు పత్రాలు లేని ఓ కారు, 22 బైక్‌లను సీజ్‌చేశారు.

ప్రయివేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ..విజలెన్స్ దాడులు..

హైదరాబాద్ : నగరంలో ఆర్టీఏ..విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. పెద్ద అంబర్ పేట ఓ ఆర్ ఆర్ ఆర్ వద్ద ప్రయివేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ..విజిలెన్స్అధికారులు ఏకకాలంలో దాడు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 14 బస్ లను అధికారులు సీజ్ చేశారు.

3న డీఎడ్ పరీక్షలు..

హైదరాబాద్‌ : డీఎడ్‌ 2014/16 బ్యాచ్‌ సెకండియర్‌ విద్యార్థులకు, గతంలో ఫెయిలైన అభ్యర్థులకు ఈ నెల 3 నుంచి 8 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ వి.ఎ్‌స.భార్గవ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌ టికెట్లు www.bseap.org వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటి వరకు అందని అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకుని సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ అటెస్టేషన్‌ చేయించుకుని పరీక్షలకు హాజరుకావాలని ఆయన సూచించారు.

09:06 - November 2, 2016

ఢిల్లీ: ఢిల్లీలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన షాదారా ప్రాంతంలో గల ఓ భవనంలో జరిగింది. ఈ ప్రమాదంలో లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో 10 మంది వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. సహాయక చర్యలు చేపట్టి మంటల్లో చిక్కుకున్న పలువురిని రక్షించారు. వీరిలో కొందరు అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు సమాచారం. 

నగరంలో ఇక్రిశాట్ సదస్సు..

హైదరాబాద్‌: నేటి నుంచి హైదరాబాద్ ఇక్రిశాట్‌లో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, నీరు, వ్యవసాయం, ఆహారభద్రతలపై చర్చించనున్నారు. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగుతోందని అధికారులు తెలిపారు.

ఢిల్లీలో అగ్నిప్రమాదం..

ఢిల్లీ: ఢిల్లీలోని షాదారా ప్రాంతం మోహన్‌పార్క్‌లో గల ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో 10 మంది వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. సహాయక చర్యలు చేపట్టి మంటల్లో చిక్కుకున్న పలువురిని రక్షించారు. వీరిలో కొందరు అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు సమాచారం. 

08:26 - November 2, 2016

తమిళనాడు : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది.  ఓ కారును అంబులెన్స్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో నలుగురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఈ ఘనట తమిళనాడులోని తిరుత్తణిలో చోటుచేసుకుంది. మృతులు ఎస్వీ మెడికల్ కాలేజీకి చెందిన సుధీర్, శివకుమార్ అనే వైద్య విద్యార్థులుగా గుర్తించారు. తిరుపతిలో ఓ పుట్టిన రోజు వేడుకలకు హాజరై  తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి విషమంగా వుంది. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి దారితీసినట్లుగా తెలుస్తోంది. అతివేగం ప్రాణాంతకమనే విషయం వాహనం నడిపేవారు గమనించాల్సిన అవుసరం ఎంతైనావుంది.

08:14 - November 2, 2016

గుంటూరు : తెలంగాణకు సచివాలయ భవనాల అప్పగింతపై ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. విభజన చట్టంతో ముడిపడి ఉన్న ఈ అంశంపై తొందరపడి నిర్ణయం తీసుకోకూడదనే భావనకు వచ్చినట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో రాజకీయ ఆరోపణలకు తావులేని విధంగా భవనాల అప్పగింతకు అనువైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం.

భవనాలను అప్పగించాలని తెలంగాణ కేబినెట్ తీర్మానం
ఆంధ్రప్రదేశ్ పరిపాలన వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి జరుగుతుండడంతో హైదరాబాలోని ఏపీ సచివాలయ భవనాలను తమకు అప్పగించాలని తెలంగాణ కేబినెట్ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని ఏపీ ప్రభుత్వానికి కూడా పంపింది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ అంశం తెరపైకి వచ్చిన నాటి నుంచి వివిద మార్గాల్లో లాభ నష్టాల నివేదికను తయారు చేసుకున్న ప్రభుత్వం.. భవనాల అప్పగింతపై అభ్యంతరం లేదనే సంకేతాలను ఇచ్చింది.

భవనాలు అప్పగిస్తే హైదరాబాద్‌పై హక్కు
అయితే భవనాలను అప్పగిస్తే తమకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిపై ఉన్న హక్కు కోల్పోతామోనన్న భయం ఏపీ పెద్దలను కలవరపెడుతున్నట్టు తెలుస్తోంది. సొంత గడ్డపై నుంచి పరిపాలన చేయాలనే ధృడ సంకల్పంతో రికార్డు సమయంలో అమరావతిలో చంద్రబాబు సర్కార్ తాత్కాలిక సచివాలయం నిర్మించి అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తోంది. దీంతో హైదరాబాద్‌లోని సచివాలయ భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం విన్నపం మేరకు ఈ సచివాలయ భవనాలను అప్పగించేందుకు, అనువైన న్యాయమార్గాలపై ఏపి సర్కార్ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.

భవనాల అప్పగింతలో న్యాయవివాదాలు
సచివాలయ భవనాల అప్పగింతలో అనేక న్యాయ వివాదాల కోణాలు దాగి ఉండటంతో.. అటు తెలంగాణ సర్కార్, ఇటు ఏపీ సర్కార్ ప్రత్యామ్నాయ మార్గాలపైనే దృష్టి పెట్టినట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ సూచనల మేరకు వేరే భవనాలను ఇవ్వడం లేదా తమకు వేరే భవనాలను కేటాయించమని కోరడం లాంటి అంశాలపైనే ఇరురాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భవనాల అప్పగింతలపై ఏపీ ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ అ మేరకు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని భావిప్తోంది.అటు కేంద్రం కూడా దీనిపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.. 

08:07 - November 2, 2016

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఎటువంటి చర్యలకు దిగరాదని.. తెలంగాణ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. దీనిపై పదిరోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. ఓ వైపు ఏపీ భవనాల ఖాళీపై స్పష్టత రాకపోవడం, మరోవైపు కూల్చివేతపై ఆదేశాలతో... కొత్త సచివాలయ నిర్మాణ భవిష్యత్‌ ఆసక్తిగా మారింది. కూల్చివేతలపై స్టే ఆర్డర్ ఇచ్చిన కోర్టు సచివాలయం తరలింపు విషయంలో జోక్యం చేసుకోమని..కూల్చివేతపై విచారణను పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం నేత),తాడూరి శ్రీనివాస్ రావు (టీఆర్ఎస్ నేత),దినకర్ (టీడీపీ నేత)పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న నేతలు ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

07:59 - November 2, 2016

ఉస్మానియా యూనివర్సిటీలో మరో ఉద్యమానికి తెర లేస్తోంది ఈ నెల 5 వ తేదీన ఫీజు దీక్ష నిర్వహించేందుకు తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ దీక్షలో తెలంగాణ జెఏసి నేత కోదండరామ్, బిసి సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్యతో పాటు మరికొందరు ప్రముఖులు పాల్గొంటున్నట్టు తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నాయకులు చెబుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో తలపెట్టబోతున్న ఫీజు దీక్షకు కారణాలేమిటి? ఈ ఫీజు దీక్ష ద్వారా ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? ఫీజు దీక్ష తుదపరి కార్యాచరణ ప్రణాళికలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక అధ్యక్షుడు నిజ్జన రమేష్ ముదిరాజ్ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

07:56 - November 2, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికల పోరు ఉత్కంఠగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వే ఫలితాలు తారు మారవుతున్నాయి. మద్దతుదారుల్లో ఉత్సాహం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు తాజాగా నిర్వహించిన సర్వేలో హిల్లరీ వెనకబడిపోయారు. రిపబ్లిక్‌ అభ్యర్థి ట్రంప్‌ ఒక్క శాతం తేడాతో హిల్లరీని బీట్‌ చేశారు.

రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మరో వారం రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా ఓటర్ల నాడీ అంతు చిక్కడం లేదు. మూడో ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ అనంతరం పోల్‌ సర్వేల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌పై స్పష్టమైన ఆధిక్యం చూపారు. రాను రాను ఆమె ఆధిక్యం తగ్గుతూ వస్తోంది.

తాజా పోల్‌లో రిపబ్లికన్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా హిల్లరీపై స్వల్ప ఆధిక్యం
వాషింగ్టన్‌ పోస్ట్‌-ఎబిసి న్యూస్‌ ట్రాకింగ్‌ నిర్వహించిన తాజా పోల్‌లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా హిల్లరీపై స్వల్ప ఆధిక్యాన్ని సాధించారు. ఈ సర్వేలో ట్రంప్‌కు 46 శాతం మద్దతు రాగా... హిల్లరీకి 45 శాతం మద్దతు లభించినట్లు సర్వే తెలిపింది. ఇద్దరి మధ్య తేడా కేవలం ఒక్కశాతం మాత్రమే ఉండడంతో ఈ ఎన్నికల్లో హోరా హోరీ పోరు తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు.

మెయిళ్ల వ్యవహారంపై ఎఫ్‌బిఐ దర్యాప్తు ..వెనకబడిన హిల్లరీ
హిల్లరీ క్లింటన్‌ ఈ-మెయిళ్ల వ్యవహారంపై ఎఫ్‌బిఐ దర్యాప్తుకు ఆదేశించడంతో ఆమె ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ అంశాన్ని ట్రంప్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. హిల్లరీ నేరపూరిత చర్యలన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినవేనని ఎన్నికల ర్యాలీల్లో ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. హిల్లరీ విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు 60వేల ఈమెయిళ్ల గల్లంతు వ్యవహారంపై ఎఫ్‌బీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఎఫ్‌బిఐ దర్యాప్తు ఆమె విజయావకాశాలను దెబ్బతీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నవంబరు 8న అధ్యక్ష ఎన్నికలు
తాజా సర్వే ద్వారా ట్రంప్‌ మద్దతుదారుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తుండగా.... క్లింటన్‌ మద్దతుదారుల్లో నిరుత్సాహం ఆవరించింది... నవంబరు 8న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 

07:49 - November 2, 2016

ఢిల్లీ : మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో నిషేధిత సిమీ కార్యకర్తల ఎన్‌కౌంటర్‌పై కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పోలీసుల గుట్టు రట్టవుతుందన్న కారణంతోనే సిమీ కార్యకర్తలను ఎన్‌కౌంటర్‌ చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేవలం సిమీ ఖైదీలే జైలు నుంచి ఎలా పారిపోగలిగారని దిగ్విజయ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలీసులే వారిని కాల్చి చంపారని ఆరోపించారు. సిమీ కార్యకర్తలు ఆయుధాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. వారిని ప్రాణాలతో పట్టుకుంటే పోలీసుల గుట్టు బయటపడుతుందన్న కారణంతోనే వారిని చంపేశారని దిగ్విజయ్‌ అన్నారు.

07:47 - November 2, 2016

జమ్ము కశ్మీర్ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. తాజాగా సాంబా జిల్లాలోని రాంఘర్‌, రాజౌరి సెక్టార్‌లలో పాకిస్తాన్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పౌరులు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. కాల్పుల్లో మరో 8 మంది పౌరులు గాయపడ్డారు. సరిహద్దు గ్రామాల పౌరులే లక్ష్యంగా పాక్‌ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. దీనిపై ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగా స్పందించింది. సైన్యం జరిగిన కాల్పుల్లో ఇద్దరు రేంజర్లతో సహా.. 14 పాక్ పోస్టులు ధ్వంసమయ్యాయి. 

07:42 - November 2, 2016

హైదరాబాద్ : ప్రభుత్వంపై పోరును ఉధృతం చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. నిన్నటి వరకూ రైతు గర్జన, విద్యార్థి గర్జనలు నిర్వహించిన హస్తం పార్టీ... తాజాగా డెంగ్యూ మరణాలపై పోరుబాట పట్టింది. ఖమ్మం జిల్లాలోని డెంగ్యూ మరణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌... ముఖ్యమంత్రి, గవర్నర్‌కు లేఖలు రాసింది. డెంగ్యూ మరణాలను తక్షణమే అరికట్టి.. గ్రామాల్లో మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తోంది.

ప్రజా వ్యతిరేక విధానాలు..రుణామాఫీ చేయకపోవడంతో కాంగ్రెస్‌ ఆందోళన
ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్‌ ఈ మధ్య కాస్తా దూకుడు పెంచింది. ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగడుతోంది. ఇప్పటికే రైతు గర్జన, విద్యార్థి గర్జనలు నిర్వహిస్తూ.. ప్రజల్లోకి వెళ్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పుపడుతోంది. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల డిజైన్‌ మార్పును గతంలో తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్‌... తెలంగాణ వాస్తవ జల దృశ్యంతో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. అంతేకాదు... మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలతో హోరెత్తించింది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకొచ్చి రెండున్నర ఏళ్లైనా... ఇప్పటికీ రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయకపోవడంతో... కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుపడుతోంది. రైతులతో కలిసి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఆధ్వర్యంలో ఉరువాడ రైతు గర్జన సభలతో హోరెత్తిస్తోంది.

సీఎం, గవర్నర్‌కు లేఖలు రాసిన మల్లు భట్టి విక్రమార్క
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు అమలు చేయకపోవడంతో... కాంగ్రెస్‌ దీన్ని అస్ర్తంగా చేసుకుని ఇప్పటికే విద్యార్థి గర్జన సభలు నిర్వహించింది. న‌కిలీ విత్తనాలపై 'అన్నదాత‌ల ఆక్రంద‌న' పేరుతో పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. తాజాగా రాష్ర్టంలో అక్కడక్కడ నమోదవుతున్న డెంగ్యూ మరణాలను అస్ర్తంగా తీసుకున్నారు. ఖమ్మం జిల్లా బోనెకల్‌ మండలంలో నమోదవుతున్న డెంగ్యూ మరణాలపై కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌కు లేఖలు కూడా రాసింది.

ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కోరిన మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లాలోని డెంగ్యూ తీవ్రత‌ను తెలిపేందుకు భట్టివిక్రమార్క ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కోరారు. ఒకవేళ కేసీఆర్‌ అనుమతి దొరక్కపోతే... ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్‌లో దీక్ష చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ప్రజా సమస్యల పరిష్కరంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్‌ అన్ని దారులను వెతుకుతోంది.

07:38 - November 2, 2016

హైదరాబాద్ : తెలంగాణలో మొదటిసారి నిర్వహిస్తున్నగ్రూప్‌-2 ఎగ్జామ్‌కి టీఎస్ పీఎస్ సీ సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11, 13 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఎన్నడూ లేనివిధంగా 7లక్షల 89వేల 985 మంది అభ్యర్థలు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బూట్లు, నగలు, వాచ్‌, ధరించ కూడదని నిబంధనలు విధించారు.

ఈనెల 11, 13 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష
ఈనెల 11, 13వ తేదీల్లో నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్షకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ అన్నిఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా దరఖాస్తులు రానంతగా ఈసారి రికార్డు స్ధాయిలో 7లక్షల 89వేల 985 మంది అభ్యర్ధులు గ్రూప్-2కి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19వందల 11 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు పాటించాల్సిన నియమ నిబంధనలను టీఎస్ పీఎస్ సీ విడుదల చేసింది.

బూట్లు వేసుకుని రావొద్దని టీఎస్‌పీఎస్‌సీ సూచన
ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులు బూట్లు వేసుకోని రావద్దని, మహిళా అభ్యర్థులు బంగారు నగలు, గొలుసులు ధరించి ఎగ్జామ్‌కు రావొద్దని తెలిపింది. అంతేకాదు.. ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు, మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, గడియారాలు, క్యాలిక్యులేటర్లు, లాగ్‌ టేబుల్స్‌, చేతిబ్యాగులు, పర్సులు, నోటుబుక్స్, రికార్డింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్లు వంటివి పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావొద్దని తెలిపింది. గతంలో పరీక్ష నిర్వహణలో ఎదుర్కొన్న సమస్యలు.. మరోసారి పునరావృతం కాకూడనే... ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని తెలిపారు. హాల్‌ టికెట్‌పైన ఫొటో, సంతకం సరిగా లేని అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఉదయం జరిగే పరీక్షకు 8గంటల 15నిమిషాల నుంచి కేంద్రంలోకి అనుమతిస్తారు.. 9గంటల 45నిమిషాలకు గేట్లు మూసివేస్తారు. మధ్యాహ్నం జరిగే పరీక్షకు ఒంటి గంటా 15 నిమిషాల నుంచి 2గంటల 15 నిమిషాల వరకు అభ్యర్థులను అనుమతించనున్నారు. ఉదయం 9గంటల 45నిమిషాల తర్వాత, మధ్యాహ్నం 2గంటల 15 నిమిషాల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని పబ్లిక్ కమిషన్ తెలిపింది. అభ్యర్ధుల తనిఖీల విషయంలో ఈ సారి చాలా స్ర్టిక్ట్‌గా ఉండబోతున్నట్టు సర్వీస్ కమిషన్ చెబుతోంది. బయోమెట్రిక్‌ విధానం ద్వారా అభ్యర్థుల చేతివేలి ముద్ర, ఫొటో తీసుకుంటామని తెలిపింది. ఒకరి బదులు మరొకరు పరీక్షకు హాజరుకాకుండా నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. మొత్తంగా అభ్యర్థులందరూ గ్రూప్‌-2 ఎగ్జామ్‌కు సహకరించాలని కమిషన్‌ విజ్ఞప్తి చేసింది. 

07:34 - November 2, 2016

హైదరాబాద్ : సులభతర వ్యాపార విధానాల అమల్లో రాష్ట్రం సాధించిన మొదటి ర్యాంకును పెట్టుబడులకు అనుకూలంగా మలచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిచింది. అన్ని విషయాల్లో ప్రగతిపథంలో నడుస్తున్న రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ర్యాంకును ఉపయోగించుకోవాలని భావిస్తోంది. పక్కా ప్రణాళికతో పాటు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగడంతోనే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రానికి ఫస్ట్‌ ర్యాంకు సాధ్యమైందని పాలకులు చెబుతున్నారు.

సులభతర వ్యాపార విధానాల అమల్లో తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్
సులభతర వ్యాపార విధానాల అమల్లో గతేడాది 13వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మొదటి ర్యాంకు సాధించింది. ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన సంస్కరణల అమలు ద్వారా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ చేసిన ప్రకటన ప్రభుత్వంలో నూతన ఉత్సాహం నింపుతోంది. దీనిని ఆధారంగా వ్యాపార అనుకూల విధానాల అమల్లో మరింత ముందుకు సాగాలని సర్కార్‌ నిర్ణయించింది.

ఇరవై ఆరు చట్టాలను సవరించిన సర్కార్‌
సులభతర వాణిజ్య విధానాల కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద కసరత్తు చేసింది. పెట్టుబడుల ఆకర్షణకు అనుకూలంగా 26 చట్టాలను సవరించింది. పారిశ్రామికవేత్తలను ఇబ్బందులకు గురిచేసే తనిఖీలను తగ్గించింది. నిర్వహించాల్సిన 57 రిజిస్టర్ల సంఖ్యను తక్కువ చేసింది. అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టింది. పదిహేను రోజుల్లో అనుమతి రాకపోతే ఆటోమేటిక్‌గా అనుమతి ఇచ్చినట్టుగా పరిగణించేలా నిబంధనలు తీసుకొచ్చింది. కొన్నింటికి స్వీయ ధృవీకణ విధానాలను ప్రవేశపెట్టింది. లైసెన్స్‌ల పునరుద్ధరణ కాలవ్యవధిని గణనీయంగా పెంచింది. దీంతో రాష్ట్రానికి పెట్టుబడులు పెరిగాయి. సంస్కరణల తర్వాత రాష్ట్రానికి 44వేల791 కోట్ల పెటుబడులతో 2550 సంస్థలను ఆకర్షించగలిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 65 శాతం సంస్థలు ప్రారంభమయ్యాయి. వీటిలో లక్షా 61 వేల మందికి ఉపాధి లభించిందని లెక్కలు తేల్చిన సర్కార్‌... దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. 

07:31 - November 2, 2016

ప్రకాశం  : విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని.. రాత్రింబవళ్లూ కష్టపడుతూ అభివృద్ధి బాట పట్టించేందుకు కృషి చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన ధ్యేయమని.. పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. తాను రాష్ట్రాభివృద్ధికి ప్రయత్నిస్తుంటే.. కొందరు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఆ

07:29 - November 2, 2016

హైదరాబాద్ : సచివాలయ కూల్చివేత నిర్ణయాన్ని అఖిల పక్షం తీవ్రంగా ఖండించింది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ఐక్యంగా ఉద్యమిస్తామని నేతలు హెచ్చరించారు. హైదరాబాద్‌ సీపీఐ కార్యాలయంలో సచివాలయ కూల్చివేత అవసరమా అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సెక్రటేరియట్ ఎంతో ప్రాముఖ్యత ఉన్న చారిత్రక కట్టడమని..కూల్చాల్సిన అవసరం ఏముందని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని వాస్తుల పేరుతో కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. 

07:22 - November 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండో రోజూ సదర్‌ ఉత్సవాలను అదిరిపోయేలా నిర్వహించారు. దున్నపోతుల విన్యాసాలను ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకున్నాయి. సదర్‌ ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని.. ఆనందంలో మునిగి తేలిపోయారు.

ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
రంగురంగుల పూలదండలతో అలంకరించిన దున్నపోతులు..దున్నపోతుల విన్యాసాలు, డప్పుల దరువు, కళాకారుల నృత్యాలు, యువత జోష్‌తో సదర్‌ సమ్మేళనం గ్రేటర్‌ హైదరాబాద్‌లో సందడిగా సాగింది. ఆటపాటలతో నారాయణగూడ వైఎంసీఏ, ముషీరాబాద్‌ చౌరస్తా తదితర ప్రాంతాలు దద్దరిల్లాయి.దీపావళి ఉత్సవాల్లో భాగంగా ప్రతిఏటా యాదవులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సదర్‌ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దున్నపోతుల విన్యాసాలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నారాయణగూడ చౌరస్తాలో నిర్వహించిన తెలంగాణ యాదవ సదర్‌ సమ్మేళనం ఆద్యంతం ఆకట్టుకుంది. ఉత్సవాల్లో మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ర్ట బీజేపీ అధ్యక్షులు లక్ష్మన్‌, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి..

తమిళనాడు : తిరుత్తణిలో ఓ అంబులెన్స్ కారును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో నలుగురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. వీరు ఎస్వీ మెడికల్ కాలేజీకి చెందిన వారుగా తెలుస్తోంది. పుట్టిన రోజు వేడుకలకు వెళ్ళి తిరిగివస్తూండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

Don't Miss