Activities calendar

03 November 2016

21:55 - November 3, 2016
21:52 - November 3, 2016

బ్రిటన్ : యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రెగ్జిట్‌ ప్రక్రియను సాధ్యమైనంత తర్వగా అమలు చేయాలనుకుంటున్న బ్రిటన్‌ కొత్త ప్రధాని థెరీసా మే ఆశలపై ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ హైకోర్టు నీళ్లు చల్లింది. పార్లమెంటు ఆమోదంలేకుండా బ్రెగ్జిట్‌ను అమలుపై ప్రధాని ఏకపక్ష నిర్ణయం తీసుకోవద్దని ఆదేశిస్తూ సంచలన తీర్పు చెప్పింది. ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అప్పీలు చేసే అంశాన్ని బ్రిటన్‌ ప్రధాని థెరీసా మే పరిశీలిస్తున్నారు.

బ్రిటన్‌ ప్రధాని థెరీసా మేకి గట్టి ఎదురు దెబ్బ
సాధ్యమైనంత త్వరగా బ్రెగ్జిట్‌ను అమలు చేయాలనుకుంటున్న బ్రిటన్‌ ప్రధాని థెరీసా మేకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బ్రెగ్జిట్‌ అమలు ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. థెరీసా మే ప్రభుత్వానికి ఇది శరాఘాతంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 51.9 శాతం మంది ఓటు
యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగన్న అంశంపై ఈ ఏడాది జూన్‌ 23న ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఓటింగ్‌లో పాల్గొన్న వారిలో 51.9 శాతం మంది బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేశారు. 48.1 శాతం మంది బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించారు. దీంతో అప్పట్లో ప్రధానిగా ఉన్నడేవిడ్‌ కామెరాన్‌ బ్రెగ్జిట్‌ దెబ్బకు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కామెరాన్‌ వారసురాలుగా అధికార కన్సర్వేటివ్‌ పార్టీ పార్లమెంటరీ పక్షం థెరీసా మేను ఎన్నుకుంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన థెరీసా మే.. బ్రెగ్జిట్‌ ప్రక్రియను త్వరగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ఇంగ్లండ్‌ అండ్‌ వైల్స్‌ హైకోర్టు... థెరిసా మే చర్యలకు బ్రేక్‌ వేసింది. పార్లమెంటు ఆమోదం లేకుండా బ్రెగ్జిట్‌ను అమలు చేసే అధికారం ప్రధాని థెరీసా మేకి లేదని తీర్పు చెప్పింది. బ్రిటన్‌ రాజ్యాంగం ప్రకారం పార్లమెంటుకు మాత్రమే సార్వభౌమాధికారం ఉందని తేల్చి చెప్పింది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా నడుచుకునే అధికారం ప్రధానికి లేదని స్పష్టం చేసింది. దీంతో బ్రెగ్జిట్‌ అమలు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్టు అయ్యింది.

వచ్చే నెల 7 సుప్రీంకోర్టులో అప్పీలు చేసే యోజనలో బ్రిటన్‌ ప్రధాని
బ్రెగ్జిట్‌ ప్రక్రియ అమలును నిలుపుదల చేస్తు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇంగ్లండు సుప్రీంకోర్టులో సవాల్‌ చేసే అంశాన్ని బ్రిటన్‌ ప్రధాని పరిశీలిస్తున్నారు. వచ్చే నేల 7న దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కేసును యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌లోనే పరిష్కరించుకోవాలని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో అప్పీల్‌పై సత్వర నిర్ణయం తీసుకోవాలని బ్రిటన్‌ మంత్రులు, న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. 

21:46 - November 3, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలవాలని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులకు ఆదేశించారు. ఈ నెల 10న మల్లన్నసాగర్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. ఇక చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తి చేసి ఆసియాలోనే సరికొత్త రికార్డు నమోదు చేసుకోవాలని సూచించారు.

జలసౌధలో నీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్‌రావు సమీక్షా సమావేశం
జల సౌధలో తెలంగాణ నీటి ప్రాజెక్టులపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 2017 డిసెంబర్ కల్లా గోదావరి జలాలు తెలంగాణ పొలాలకు తరలించవలసి ఉందన్నారు. ఇందుకోసం ఇరిగేషన్, రెవిన్యూ, అటవీ, విద్యుత్‌, గనులకు సంబంధించిన ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో సమష్టిగా పనిచేసి గడువులోగా పనులు పూర్తిచేయాలని మంత్రి సూచించారు. భూసేకరణ పనులను మరింత వేగవంతం చేసి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేలా చూడాలని ఆయన కోరారు.

వారంలో అన్నారం పంపు హౌస్‌ పనులు ప్రారంభించాలని ఆదేశించిన మంత్రి
మేడిగడ్డ బ్యారేజీ పనుల టెండర్లు రెండు వారాల్లో ప్రారంభించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. అన్నారం, సందిళ్ళ బ్యారేజీల పనులు నవంబర్ 15న ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మూడు బ్యారేజీలతో పాటు పంప్ హౌజ్ ల పనులను కూడా ఏక కాలంలో, సమీకృతంగా చేపట్టాలని హరీశ్ రావు సూచించారు. అయితే కన్నెపల్లి పండ్ హౌజ్ పనులు ప్రారంభించేందుకు, కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైనట్టు ఇరిగేషన్ అధికారులు మంత్రికి తెలిపారు. మరో వారంలో అన్నారం పంపు హౌజ్‌ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సుందిళ్ళ పనులకు నవంబర్ 15 డెడ్ లైన్‌గా మంత్రి ఖరారు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో... అధికారులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని, అపుడే తెలంగాణలో ప్రాజెక్టుల కల సాకారమవుతుందని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు అన్నారు. 

21:42 - November 3, 2016

ఉత్తరప్రదేశ్ : అఖిలేశ్ రథయాత్ర విజయవంతం కావాలని సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఆకాంక్షించారు. అఖిలేష్‌ శ్రీకారం చుట్టిన 'వికాస్ రథయాత్ర'లో పాల్గొన్న ఆయన.. ఉత్తరప్రదేశ్ లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని సమాజ్‌ వాదీ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. 

21:38 - November 3, 2016

ఢిల్లీ : షెడ్యూల్ ప్రకారమే జీఎస్టీ అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జీఎస్టీ మండలి సమావేశంలో పన్ను రేట్ల విధానం, పరిహారంపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన చెప్పారు. జీఎస్టీ పన్ను రేటును 5, 12, 18, 28 శాతాలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆహార ధాన్యాలపై సాధారణ ప్రజలకు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు చెప్పారు. సామాన్యులు వినియోగించే వస్తువులపై 5శాతం పన్ను రేటును నిర్ణయించామన్న జైట్లీ.. కూల్‌డ్రింక్స్, పాన్ మసాలా, లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై 28శాతం పన్ను విధించనున్నట్లు తెలిపారు.

21:35 - November 3, 2016

గుంటూరు : అమరావతిని నాలెడ్జ్ సిటీగా మారుస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉన్నత విద్యలో రాష్ట్రం ఐదోస్థానంలో ఉందని.. నెంబర్‌వన్‌గా ఎదగాలన్నదే తన కోరిక అన్నారు. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు, కాలేజీలు కొత్త రాజధానిలో తమ సంస్థల ఏర్పాటుకు ఉత్సాహం చూపుతున్నాయని తెలిపారు. వెల్లూరు వర్సిటీ నిర్మాణానికి కేంద్ర మంత్రి వెంకయ్యతో కలిసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

అమరావతిలో ప్రతిష్టాత్మకమైన వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శంకుస్థాపన
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకమైన వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఐనవోలు గ్రామం సమీపంలో విట్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. మొదటి దశలో 100 ఎకరాల్లో భవనాలు నిర్మించనున్నారు. 2000 కోట్లతో విట్ యూనివర్సిటీ నిర్మాణం చేయనున్నారు. ఈ నెల 9 నుంచి అమరావతి విట్ క్యాంపస్‌లో అడ్మిషన్లు ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది జూలై నాటికి తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నారు. మెడికల్‌, నర్సింగ్‌ కోర్సుల నిర్వహణకు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపడతామని విట్‌ వైస్‌ఛాన్సలర్‌ విశ్వనాథన్‌ తెలిపారు. విట్ పరిసర గ్రామాలైన ఐనవోలు, శాఖమూరు, వెలగపూడి గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు.

ఐదో స్థానంలో వున్న రాష్ట్రం నెంబర్ వన్ కావాలి : చంద్రబాబు
విట్‌ రూపంలో ప్రపంచస్థాయి విద్యాసంస్థ అమరావతికి రావడం శుభసూచకమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాలు వస్తాయని, అన్ని క్యాంపస్‌ల కంటే అమరావతి విట్‌ ముందుండాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్యలో రాష్ట్రం ఐదోస్థానంలో ఉందని.. నెంబర్‌వన్‌గా ఎదగాలన్నదే తన కోరిక అన్నారు.

చంద్రబాబు కృషి తోనే విట్ : వెంకయ్య నాయుడు
విట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ అమరావతికి రావడం రాష్ట్ర విద్యార్దులకు ఎంతో ఉపయోగకరమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. చంద్రబాబు కృషి కారణంగా అమరావతి అభివృద్ది వేగంగా సాగుతుందన్నారు.

1984లో 180 మంది విద్యార్థులతో ప్రారంభమైన విట్‌..
1984లో 180 మంది విద్యార్థులతో ప్రారంభమైన విట్‌.. ఈనాడు 30వేల మంది విద్యార్థులకు ఎదిగిందన్నారు ఆ సంస్థ వీసీ విశ్వనాథన్‌. ప్రపంచంలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీల్లో మేటిగా నిలిచిందన్నారు.  

21:27 - November 3, 2016

విశాఖ : మావో కీలక నేత ఆర్కే క్షేమం.. హైదరాబాద్ : మావోయిస్టు కీలక నేత ఆర్కే క్షేమంగా వున్నట్లుగా సమాచారం అందుతోంది. మావోయిస్టు పార్టీకి క్షేమంగా వున్నట్లుగా సమాచారం అందింది. కాగా ఎప్పుడు ఎన్ కౌంటర్ జరిగినా ఆర్కే 10,15 రోజుల పాటు అజ్ఞాతంలోనే వుండాడని సమాచారం. ఏవోబీ ఎన్ కౌంటర్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆర్కే ఎట్టకేలకూ క్షేమంగా వున్నట్లు సమాచారం అందంటంతో ఆ పార్టీ నేతలు హాయిగా ఊపిరి పూల్చుకున్నారు. కాగా ఏవోబీ ఎన్ కౌంటర్ అనంతరం ఆర్కే ఆచూకీ గురించి తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏవోబీ ఎన్ కౌంటర్ అనంతరం ఆర్కే పోలీసుల అధీనంలోనే వున్నాడనీ అతనికి ఎటువంటి హానీ తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలంటూ ఆర్కే భార్య శిరీష..మావో ప్రజాసంఘాలు.. హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచరాణ చేపట్టిన న్యాయస్థానం ఏవోబీ ఎన్ కౌంటర్ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కాగా కౌంటర్ లో పూర్తి వివరాలు లేవంటూ మావో సంఘాల అడ్వకేట్ పేర్కొనటంతో న్యాయస్థానం రెండు వారాలకు ఈ కేసును వాయిదా వేసింది. ఆ క్రమంలో ఆర్కే క్షేమంగా వున్నాడంటూ వార్త రావటం..ఆ పార్టీకి ఆర్కే అందుబాటులోకి రావటంతో ఆర్కే పై ఉత్కంఠ వీడినట్లయ్యింది. కాగా ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు గురువారం ఐదు రాష్ట్రాల బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాలలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అన్ని సరిహద్దుల్లోనే కాక తెలుగు రాష్ట్రాలలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.ఎట్టకేలకూ మావోల బంద్ ప్రశాంతంగా ముగిసింది. దీంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

మావో కీలక నేత ఆర్కే క్షేమం..

హైదరాబాద్ : మావోయిస్టు కీలక నేత ఆర్కే క్షేమంగా వున్నట్లుగా సమాచారం అందుతోంది. మావోయిస్టు పార్టీకి క్షేమంగా వున్నట్లుగా సమాచారం అందింది. కాగా ఎప్పుడు ఎన్ కౌంటర్ జరిగినా ఆర్కే 10,15 రోజుల పాటు అజ్ఞాతంలోనే వుండాడని సమాచారం. ఏవోబీ ఎన్ కౌంటర్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆర్కే ఎట్టకేలకూ క్షేమంగా వున్నట్లు సమాచారం అందంటంతో ఆ పార్టీ నేతలు హాయిగా ఊపిరి పూల్చుకున్నారు. కాగా ఏవోబీ ఎన్ కౌంటర్ అనంతరం ఆర్కే ఆచూకీ గురించి తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. 

20:30 - November 3, 2016

మావోల బంద్ సక్సెస్ చేసిన సర్కారోల్లు..జనాలకు డబుల్ బెడ్ రూములీయని కేసీఆర్ సారు రూ.50కోట్లతో సీఎం కేసీఆర్ ఇల్లు కట్టుకుంటుడ్రు..లేదంటే తెలంగాణ అమరవీరులకు ఆత్మలకు శాంతి చేకూరేందుకే ఈ పేద్ద ఇల్లు కట్టుకుండ్రంట..అగ్నిపరీచ రాసిన బీటెక్ పిల్లగాల్లు.. ప్రశ్నాపత్రంల నారా లోకేస్ ఆస్తుల విలువ ఏంటని ప్రశ్నలు..మరాఠాల ఓటేస్తే ఒటేల్లల 25శాతం డిస్కౌంట్లంట.. కరీంనగర్ ల సారా బట్టీలపై దండయాత్ర జేసిన సర్కారోల్లు..తాగితే మా మందే తాగిలిగానీ మీయంతట మీరే తయారుజేసుకుంటే ఎట్టాగంటున్న సర్కారోల్లు..సచ్చిపోయిన యజమాని ఘోరీకాడనే ఏడత్తాన్న జంతువులు..మమ్మల్ని సంపనీకే నాగుల పండగొచ్చిందని ఏడత్తాన్న పాములు..గిసువంటి మస్తు ముచ్చట్లు కోసం చూత్తానే వుండండి..మల్లన్న ముచ్చట్లు..మంచి ముచ్చట్ట కోసం ఈ వీడియో చూడుండ్రి..

20:04 - November 3, 2016

గుంటూరు : వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టబోతున్నారా..? విజయానికి బాటలు వేసుకునేందుకు తండ్రి బాటలో ఆయన కూడా సిద్దమవుతున్నారా..? ఒకవేళ పాదయాత్ర చేపడితే అదెలా ఉండబోతోంది...? వైసీపీకి జగన్‌ పాదయాత్ర ఎంతవరకు ప్లస్‌ అవుతుంది. వీటన్నింటికీ సమాధానం కావాలంటే... జస్ట్‌ వాచ్‌ దిస్ స్టోరీ....!

2017 నవంబర్‌, 2018 ఏప్రిల్‌లో పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని యోచన
వైఎస్ రాజశేఖర్ రెడ్డి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత. 2004లో ఆయన అధికారంలోకి రావడానికి ముందు ప్రతిపక్ష నేత హోదాలో 1498 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రే ఆయన్ను సీఎం చేసింది. సొంతంగా ఇమేజ్ పెరగడంతో పాటు... కాంగ్రెస్ పార్టీ విజయానికి అది టానిక్‌లా పనిచేసింది. తిరిగి 8 ఏళ్ల తర్వాత.. అంటే 2017 చివరిలో గానీ లేదా 2018 ఏప్రిల్ లో గానీ ఆయన తనయుడు, ప్రస్తుత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా తండ్రిలా పాదయాత్రకు సిద్దమవుతున్నారట.

వైసీపీ చిత్తశుద్ధిపై నేతల్లో నిరసనలు
2014 ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారనే ప్రచారం బలంగా జరిగింది. సర్వేలు కూడా అదే విషయాన్ని చెప్పాయి. కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ అనుభవంతో వేసిన ఎత్తుగడలు వైసీపీకి విజయాన్ని దూరం చేశాయి. అందులోనూ వైఎస్ జగన్ ప్రదర్శించిన అతి విశ్వాసం సొంత పార్టీలోనే విమర్శలకు దారి తీసింది. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా జగన్ స్పీడ్ పెంచినా... పార్టీ కేడర్‌లో అనుకున్నంత ఉత్సాహాం కనిపించడం లేదు. విజయసాయి రెడ్డి, బొత్స, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్థసారథి, మిథున్ రెడ్డి, అంబటి వంటి నేతలు శ్రద్ధ కనబరుస్తున్నా అందరి నేతల్లోనూ ఆ ఉత్సాహాం కనిపించడం లేదు.. ఎమ్మెల్యేల్లో ఏడుగురు మినహా.. మిగిలిన వారంతా చురుగ్గా పనిచేయడం లేదన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

పార్టీ శ్రేణుల్లో నిస్తేజం
మరో వైపు వైసీపీ టిక్కెట్‌తో గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ తో లాగేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిస్తేజం ఉంది. ప్రత్యేకహోదా తో జనంలోకి బలంగా వెళ్లాలనే స్ట్రాటజీ పొలిటికల్ గా జగన్ వర్కవుట్ చేస్తున్నారనే సంకేతాలు పంపుతున్నా.. జన సేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇదే ఎజెండాతో వరుస సభలు, ప్రకటనలతో హోరెత్తుస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ విజయవకాశాలను దెబ్బతీసినట్లు.. ఈ సారి పవన్ ప్రభావం అటు టీడీపీ పైన పడుతుందా.. మళ్లీ మనపైకే వస్తుందా అనే దానిపై వైసీపీలో సందిగ్ధత కొనసాగుతోంది. పవన్ ఎక్కువగా గోదావరి జిల్లాలపై గురిపెట్టడం, ఆయన సామాజికవర్గం అక్కడ ఎక్కువ ఉండటం వంటి అంశాలు వైసీపీలో చర్చకు దారి తీస్తున్నాయి. యువభేరీలంటూ విద్యార్థుల్లోకి పోతున్నా.. ఈ వేడి 2019 ఎన్నికల వరకు ఉంటుందా అనేది అనుమానం పార్టీ వర్గాల్లో వెల్లడవుతోంది.

దాదాపు 2 వేల కిలో మీటర్ల పాదయాత్రకు ప్రణాళిక సిద్ధం చేయనున్న వైసీపీ
ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరు సలుపుతూనే... పార్టీని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే.. దివంగత నేత వైఎస్సాఆర్ బాటే కరెక్టనే భావనకు జగన్ వచ్చారని తెలుస్తోంది. 2017 నవంబర్ లోగానీ లేదా 2018 ఏప్రిల్ లో గానీ పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. 13 జిల్లాల పరిధిలో చేపట్టబోయే ఈ పాదయాత్రను కడప జిల్లాలో.. వైఎస్‌ఆర్‌ సమాధి నుంచి ప్రారంభించి.. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం వరకు దాదాపు 2 వేల కిలో మీటర్లు కొనసాగిస్తారని పార్టీ వర్గాల సమాచారం.

ఫ్యాక్టర్స్ ప్రభావం చూపుతాయంటున్న విశ్లేషకులు
జగన్ పాదయాత్ర సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయి. ప్రత్యేక హోదా డిమాండ్ ప్రజల్లో బలంగా ఉంటుందా. పవన్ బలం పెరుగుతుందా.. పూర్తిగా చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా ఇలా చాలా ఫ్యాక్టర్స్ ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషలకులంటున్నారు. 

19:56 - November 3, 2016

హైదరాబాద్ : మెగాస్టార్ ఇక రాజకీయాలుకు గుడ్ బై చెప్పబోతున్నారా..? ఇప్పటి నుంచి సినిమాలపైనే పూర్తిగా దృష్టి పెట్టబోతున్నారా...? అటు ఇండస్ట్రీలో.. ఇటు ఏపీ రాజకీయ వర్గాల్లోనూ ఇప్పుడిదే హాట్‌ టాఫిక్‌గా మారింది. ఇంతకీ అసలు చిరు మనస్సులో ఏముందో మరి...? జస్ట్‌ వాచ్‌ దిస్ స్టోరీ...!

2009 ఎన్నికల్లో చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి 18 శాతం ఓటింగ్
మెగాస్టార్ చిరంజీవి... ఇండస్ట్రీలో ఆయనకున్నంత ఇమేజ్ అంతా ఇంతా కాదు. పరిశ్రమలో చాలా ఏళ్లపాటు నంబర్ వన్‌గా ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన మెగాస్టార్‌కి.. ఆ ఇమేజ్ పొలిటికల్ మైలేజ్ ఇవ్వలేకపోయింది. 2009 ఎన్నికల్లో చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ 18 శాతం ఓటింగ్ సంపాదించుకున్నా.. గెలిచిన కొద్ది పాటి ఎమ్మెల్యేల్లో కొందరు కాంగ్రెస్ వైపు వెళ్లారు.. ఇక పార్టీని నడపడం కష్టం అనుకున్న.. చిరంజీవి తన ఎమ్మెల్యేలతో సహా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో ఆయనకు కేంద్రంలో స్వతంత్ర హోదాలో కేబినెట్‌ మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

2017 ఏప్రిల్ 2 నాటికి ముగియనున్న చిరు రాజ్యసభ సభ్యత్వం
2017 ఏప్రిల్ 2 నాటికి చిరు రాజ్యసభ సభ్యత్వం ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పూర్తిగా రాజకీయాలకు దూరం కావాలనే యోచనలో ఉన్నారని తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఒక విధంగా ఇది ఆయన అభిమానులకు రుచించని అంశమే అయినా... మళ్లీ ఖైదీ నెంబర్ 150 అంటూ తెరపైకి రానుండటం, మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటం, అలాగే చరణ్ చిరు నటించబోయే తదుపరి సినిమాల స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటుండటం.. వంటి అంశాలు.. చిరు మళ్లీ సినిమాలవైపు పూర్తిగా దృష్టి సారిస్తున్నారనే సంకేతాలు పంపుతున్నాయి.

చిరంజీవితో ఫోన్‌లో మాట్లాడిన ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
తాజా వార్తలపై చిరంజీవితో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. అయితే తానేమీ పార్టీ మారడం లేదని.. అదే సమయంలో రాజకీయాలపై అంత ఆసక్తి లేదన్నట్లు చిరంజీవి మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. సన్నిహితులు కూడా చిరు సినిమాల వైపే ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతున్నారు. అలాగే జనసేన తరపున పనిచేయడానికి కూడా ఆయన సిద్ధంగా లేరంటున్నారు. సోదరుడు పవన్ సినిమాల నుంచి రాజకీయాల వైపు ఎక్కువ దృష్టి పెడుతుంటే.. చిరంజీవి మాత్రం పాలిటిక్స్‌ నుంచి సినిమాల వైపు దృష్టి సారిస్తున్నారన్న చర్చ అభిమానుల్లో మొదలైంది.

కాపు నేతల ఆత్మీయ సమావేశానికి హాజరుకాని చిరంజీవి
ఇటీవల విజయవాడలో పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నిర్వహించిన కాపు నేతల ఆత్మీయ సమావేశానికి కూడా చిరు హాజరు కాలేదు. తన తండ్రి ఇప్పుడు కంఫర్టబుల్‌గా ఉన్నారు. ఇలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం.. అంటూ ఒకానొక సందర్భంలో చిరు కుమార్తె సుస్మిత కూడా వ్యాఖ్యానించారు. మరో వైపు కాపులు, రిజర్వేషన్ల అంశంతో ఉక్కిరిబిక్కిరవుతున్న టీడీపీ... చిరును ఆ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఏప్రిల్ 2 తో ఎలాగూ రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది.. వెంటనే టిడీపీ తరపున మళ్లీ ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తే.. కాపుల్లో ఉన్న అసంతృప్తిని కొంతమేరకైనా.. తగ్గించుకోవచ్చనే ఆలోచనలో బాబు ఉన్నారంటున్నారు.. సినిమాలవైపు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్న చిరు.. మరి టీడీపీ ఆఫర్‌ను స్వీకరిస్తారో లేదో చూడాలి.

 

19:46 - November 3, 2016
19:27 - November 3, 2016
19:22 - November 3, 2016

విశాఖ : విశాఖలో నిర్వహించ తలపెట్టిన బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ను ఉపసంహరించుకోవాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. పాశ్చాత్య సంస్కృతిని మన సాంప్రదాయాలపై రుద్దాలని చూడటం సరికాదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ఏంటని అంబటి ప్రశ్నించారు. 

19:20 - November 3, 2016

హైదరాబాద్ : ఏపీలో కాంగ్రెస్ పార్టీ మూతపడిందంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. అధికారానికి దూరమైనంత మాత్రాన కాంగ్రెస్‌ పార్టీ మూతపడినట్టు కాదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు ప్రజల హృదయాల్లో ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అధికారం మళ్లీ కాంగ్రెస్‌కే వస్తుందన్న ఆశభావాన్ని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వ్యక్తం చేశారు. 

19:15 - November 3, 2016

విశాఖ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే అదృశ్యంపై ఇంకా మిస్టరీ వీడటం లేదు. ఆర్కే భార్య శిరీష వేసిన పిటిషన్‌పై ఏ.పి. సర్కార్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఆర్కే తమ రాష్ట్ర పోలీసుల అదుపులో లేరని స్పష్టం చేసింది. మరోవైపు ఏపీ పోలీసుల అదుపులో ఆర్కే ఉన్నట్లు ఏ చిన్న ఆధారం ఉన్నా..తమకు సమర్పించాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

ఆర్కే భార్య శిరీష పిటీషన్
ఆర్కే ఆచూకీపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారని ఆర్కే భార్య, పౌరహక్కుల నేతలు ఆరోపిస్తుండగా..తమ ఆధీనంలో లేరని ఆ రాష్ట్ర పోలీసులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే భార్య శిరీష వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో ఆర్కే తమ ఆధీనంలో లేరని చెప్పడాన్ని పిటిషనర్ తరఫు లాయర్‌ తప్పు పట్టారు. ఆర్కేను టార్గెట్ చేసుకోని పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని.. రామకృష్ణకు చెందిన ముగ్గురు గన్ మెన్స్ కూడా చనిపోయారని తెలిపారు. ఆర్కేను సజీవంగా పట్టుకుని పోలీసులు వేధిస్తున్నారని.. వాదనలు వినిపించారు. అటు పౌరహక్కుల నేతలు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు.

ఆర్కే ఆచూకీపై కొనసాగుతున్న సస్పెన్స్
ఆర్కే తమ రాష్ట్ర పోలీసుల అదుపులో లేరని ఏపీ అడ్వొకెట్ జనరల్ దమ్మాల పాటి శ్రీనివాస్ రావు వాదించారు. ఆర్కే ఒక్క రాష్ట్రంలో నివాసం ఉండే వ్యక్తి కారని.. ఆయనపై ఏ.పీ.లో 40 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఒడిశా పోలీసులతో కలిసి కూంబింగ్ చేస్తుండగా ఎన్ కౌంటర్ జరిగిందని ఈ ఘటనలో 31 మంది మృతిచెందినట్లు తెలిపారు. మరోవైపు ఏ.పీ.లో ఇప్పటివరకు 42 మంది మావోయిస్టులు అదృశ్యమయ్యారని.. వారికి సంబంధించి ఎలాంటి బయటకు రాలేదని పిటిషనర్‌ తరఫు లాయర్‌ వాదించారు. అయితే పోలీసులే వారిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఎన్ కౌంటర్ చేస్తున్నారని పిటిషనర్ తరపు లాయర్ ఆరోపించారు. ఇదే కేసును ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరగా.. మీరే నేరుగా వెళ్లొచ్చని.. అందుకు కోర్టు ఆదేశాలు అవసరం లేదని ఉన్నత న్యాయస్థాయం స్పష్టం చేసింది. ఒకవేళ ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందించని పక్షంలో తాము ఆదేశాలు జారీ చేస్తామని డివిజన్ బెంచ్ హామీ ఇచ్చింది. 

ఈనెల 17కు కేసు వాయిదా
ఏపీ పోలీసుల అదుపులో ఆర్కే ఉన్నట్లు ఏ చిన్న సమాచారం ఉన్నా..వివరాలు సమర్పించాలని పిటిషనర్‌ తరఫు లాయర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం 15 రోజుల గడువు ఇస్తూ తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం. 

19:12 - November 3, 2016

తూర్పుగోదావరి : దానవాయిపేట నుంచి దివీస్‌ కంపెనీని తొలిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.కంపెనీని తొలగించకపోతే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.తొండంగి మండలం దానవాయిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివీస్‌ కంపెనీకి వ్యతిరేకంగా దానవాయిపేటలో సీపీఎం నిర్వహించతలపెట్టిన సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎంరాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు 200 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నేతలను పోలీసులు తీసుకెళ్తుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీ చార్జ్‌ చేయడంతో.. పలువురికి గాయాలు అయ్యాయి. అరెస్ట్‌ చేసిన నేతలను ఐదు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. తుని, తుని రూరల్‌, అన్నవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం స్టేషన్లకు తరలించారు.

19:07 - November 3, 2016
19:01 - November 3, 2016

హైదరాబాద్ : ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు సాధించడం కష్టమైనా ఈరోజుల్లో.. కేవలం పదోతరగతి అర్హతతో ప్రభుత్వ కొలువులు వారి సొంతమవుతున్నాయి. మీకు పట్టుదల ఉండాలే కానీ ఉద్యోగం సాధించడానికి తాము అండగా ఉంటామంటుంది తేజాస్ డిఫెన్స్ అకాడమీ.. ఇప్పటివరకు ఎంతోమంది నిరుద్యోగుల కలలను సాకారం చేసిన ఈ అకాడమీపై 10టీవీ ప్రత్యేక కథనం..!

పది, ఇంటర్ అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగాలు
ఉన్నత చదువులు చదివిన వారు సైతం సాధించలేని ఉద్యోగాలను కేవలం పది, ఇంటర్మీడియట్ అర్హతతో సాధిస్తూ అందరిని అబ్బురపరుస్తున్నారు. వీరిని వెనక నుంచి ప్రోత్సహిస్తోంది మాత్రం తేజాస్ డిఫెన్స్ అకాడమీ.. ఈ అకాడమీలో చదివిన ఎందరో విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు.

2011లో సంస్థను ఏర్పాటుచేసిన నిర్వాహకులు సతీష్‌రావు
2011లో కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో తేజాస్ డిఫెన్స్ అకాడమీ సంస్థను నిర్వాహకుడు సతీష్ రావు స్థాపించారు. ఈయనకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే సంకల్పం ఉన్నప్పటికీ రాత పరీక్షలో మెలికలు తెలియక తరుచూ విఫలమవుతూ వచ్చారు.. అప్పుడు తనకి పుట్టిన ఆలోచన నుంచే ఈ సంస్థను ఏర్పాటు చేశారు.

ఇప్పటివరకు 415 మందికి ఉద్యోగాలు
పదవ తరగతి, ఇంటర్మిడియట్ చదివి జీవితంలో స్థిరపడాలనే యువతకు డిఫెన్స్ రంగంలో ఎయిర్ ఫోర్స్ ,నేవి, ఆర్మీ రంగాలలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారికి ఉపాధి సాధించేలా ఈ సంస్థ నాణ్యమైన శిక్షణ ఇస్తోంది. ఇప్పటి వరకు ఈ సంస్థలో శిక్షణ పొందిన 415 మంది విద్యార్ధులు ఉద్యోగాలను సాధించారు.

ప్రస్తుతం అకాడమీలో 300 మంది విద్యార్ధులు కోచింగ్
ప్రస్తుతం అకాడమీలో 300 మంది విద్యార్ధులు కోచింగ్ తీసుకుంటుండగా ఇందులో 62 మంది విద్యార్ధులు పలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సంస్థలో శిక్షణ పొందడానికి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. ఇక్కడ ఇచ్చే శిక్షణతో ఉద్యోగాలను సాధిస్తామని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

డిఫెన్స్ రంగానికి కేరాఫ్ అడ్రస్‌ తేజాస్ డిఫెన్స్ అకాడమీ
విద్యార్థులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుభవం కలిగిన ఫ్యాకల్టిచే ఆర్థమెటిక్, రీజనింగ్,ఇంగ్లీష్,జనరల్ నాలెడ్జీ, మ్యాథ్స్,ఫిజిక్స్ సబ్జెక్టులపై కోచింగ్ ఇస్తున్నామని సంస్థ నిర్వాహకులు సతీష్ రావు చెబుతున్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తు తన ఉదారతనాన్ని చాటుకుంటుంది ఈ సంస్థ. డిఫెన్స్ రంగంలో ఉద్యోగం పొందాలనుకునే వారికి కేరాఫ్‌ అడ్రస్‌ తేజాస్ డిఫెన్స్ అకాడమీ. 

18:54 - November 3, 2016

హైదరాబాద్ : చర్లపల్లి జైలులో ఖైదీలకు మానసిక సత్ప్రవర్తన కలిగించేందుకుగాను ఉత్తరకొరియాకు చెందిన ఇంటర్నేషనల్‌ యూత్‌ కొరియా ఫెలోషిప్‌ సంస్థ కౌన్సిలింగ్‌ నిర్వహించింది. భారత్‌లో ఖైదీలకు చాలా స్వేచ్ఛ ఉందని.. ఇక్కడి ఖైదీలకు ఇస్తున్న శిక్షణ బాగుందని కొరియా మానసిక శిక్షణ ప్రత్యేక ప్రతినిధి కిమ్‌ జి సంగ్‌ అన్నారు. కొంత మంది ఖైదీలు తాము తప్పు చేశామని మనస్తాపం చెందకుండా ఉండేందుకు తాము ప్రత్యేక కౌన్సిలింగ్‌ నిర్వహించామని ఆయన చెప్పారు. కొరియాలో ఖైదీలను కఠినంగా శిక్షిస్తారని కిమ్‌ జి సంగ్‌ చెప్పారు.

ఓయూలో మైండ్‌ ఎడ్యుకేషన్‌
మద్యం, మారక ద్రవ్యాలతో యువత చిత్తవుతుందని.. వీటికి దూరంగా ఉండాలని ఇంటర్నేషనల్‌ యూత్‌ ఫెలోషిప్‌ సంస్థ తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో మైండ్‌ ఎడ్యుకేషన్‌పై ప్రొఫెసర్‌ యూన్‌జంగ్‌ సూ ప్రసంగించారు. యువత ఆత్మహత్యకు దారితీసే పరిస్థితుల్లో ఒంటరితనం ఓ కారణమైతే.. తన గురించి తాను వ్యక్తపరచకపోవడమన్నారు. యువత అధునాతనమైన ఆలోచన విధానాన్ని పొంపెందించుకోవడమే ఇంటర్నేషనల్‌ యూత్‌ ఫెలోషిప్‌ సంస్థ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.

అబ్కారీ భవన్ మైండ్ క్యాంప్
ఉద్యోగులకు విధుల్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేలా స్థైర్యం పెంచేందుకు ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ అనే సంస్థ.. అబ్కారీ భవన్‌లో సెమినార్ నిర్వహించింది. మైండ్ క్యాంప్ పేరుతో నిర్వహించిన ఈ సెమినార్‌కు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ఉద్యోగులు, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు... తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ సంస్థతో ఈ కార్యక్రమం నిర్వహించింది.

 

18:48 - November 3, 2016

మహబూబ్ నగర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు ప్రజా గొంతకను తమ గొంతుకగా వినిపిస్తామన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సీఎం కేసీఆర్ దిగివచ్చేదాకా తమ పోరాటం ఆపమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానని కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించారని..స్వరాష్ట్రం సిద్ధించినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.  
సీపీఎం పాదయాత్ర@400కి.మీ..
సీపీఎం మహాజన పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. ఇబ్రహీంపట్నంలో మొదలైన ఈ మహాజన పాదయాత్ర నిన్నటివరకు 400 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసుకొని ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అచ్చంపేటలోకి ప్రవేశించింది. సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ మహాజన పాదయ్రాత్ర ఇవాళ రామాజిపల్లి, కొండనాగుల, బల్మూరు, అనంతవరం, నర్సాయిపల్లిలో కొనసాగుతోంది. సీపీఎం మహాజన పాదయాత్రకు టిడిపి అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జ్‌ వెంకటేశ్‌ మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా..ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని వెంకటేశ్‌ విమర్శించారు.

18:43 - November 3, 2016

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌, టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే వరకు గడ్డం తీయనన్న ప్రతిజ్ఞ చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డాలు పెంచుకుంటే ముఖ్యమంత్రి కాలేరంటూ విపరీత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న ఉత్తమ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమన్ని మల్లు రవి హెచ్చరించారు.

బీజేపీ పరివర్తన్ యాత్ర..

ఉత్తరప్రదేశ్ : బీజేపీ పార్టీ పరివర్తన్ యాత్ర చేపట్టనుంది. నవంబర్ 5 నుంచి యూపీలోని శహరన్‌పూర్ నుంచి పరివర్తన్ యాత్ర ప్రారంభం కానుంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పార్టీ కార్యకర్తలతో కలిసి పరివర్తన్ యాత్ర ను ప్రారంభించనున్నారు.

ఎన్డీటీవీ ప్రసారాలను నిలిపివేత!..

ఢిల్లీ : ప్రముఖ జాతీయ వార్తా ఛానల్ ఎన్డీటీవీ ప్రసారాలు ఆగిపోనున్నాయి. 9, 10 తేదీల్లో 24 గంటల పాటు ఎన్డీటీవీ ప్రసారాలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్తలను ప్రసారం చేసే క్రమంలో నిబంధనలను పాటించకపోవడమే దీనికి కారణం. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు... ఎయిర్ బేస్ లోని కీలక ప్రదేశాలను టీవీలో ప్రసారం చేయడంతో, కేంద్ర సమాచార ప్రసార శాఖ ఎన్డీటీవీపై కొరడా ఝుళిపించింది.

లాలూ ప్రసాద్ యాదవ్ కారు బోల్తా..

బీహార్ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కాన్వాయ్ కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఘటన హాజీపూర్ జిల్లాలో జరిగింది. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

నిఘా కన్నుకు కోటిన్నర..

హైదరాబాద్: నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ పోలీసులు నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎన్‌ఎండీసీతో కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఎన్‌ఎండీసీ సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. కోటిన్నర వెచ్చించనుంది.

షెడ్యూల్ ప్రకారమే జీఎస్టీ అమలు..

ఢిల్లీ: షెడ్యూల్ ప్రకారమే జీఎస్టీ (గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) అమలులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఇవాళ జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో పన్ను రేట్ల విధానం, పరిహారంపై సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. ఈ విషయమై అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ పన్ను రేటును 5,12, 18, 28 శాతాలుగా నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. 

2నెలల్లో ఓఆర్ఓపీ పరిష్కారం..

ఢిల్లీ : లక్షమంది మాజీ సైనికుల సమస్యలను 2నెలల్లో పరిష్కరిస్తామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపీ) పథకం అమలు తీరుపై సైనికుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌కు సంబంధించి సమస్యలను పరిష్కరిస్తామని పారికర్ వెల్లడించారు.

అర్థనగ్న ప్రదర్శనతోమాజీ సైనికుల నిరసన..

ఢిల్లీ : వన్ ర్యాంకు- వన్ పెన్షన్ పథకం తీరుపై సైనికుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకాన్ని అమలు చేస్తోన్న తీరుపట్ల తమ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఇవాళ కొందరు మాజీ సైనికులు ఛలో ఢిల్లీ పేరుతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.కాగా ఆన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం అమలులో జరుగుతున్న జాప్యానికి ఓ మాజీ సైనికుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 

 

17:57 - November 3, 2016

హైదరాబాద్ : పూజించే చేతులే..పుట్టగతులు లేకుండా చేస్తున్నాయి.. ఓవైపు దైవంతో సమానమంటూనే..మరోవైపు దయలేకుండా నాశనం చేస్తున్నాయి. దీంతో ఈ జీవజాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. నాగుల చవితి సందర్భంగా ...ఈ ఒక్కరోజు మాత్రమే సర్పజాతిని...సఖ్యంగా చూసుకుంటే సరిపోతుందా...మరి మిగిలిన రోజులు పాములను చంపెయ్యడం న్యాయమా...వాచ్‌దిస్ స్టోరీ...

భారతీయ సంస్కృతిలో పాములకు పూజలు
ఈ ప్రకృతిలో అన్ని జాతులతో పాటు సర్పజాతి మమేకమైంది.... జీవవైవిధ్యాన్ని కాపాడటంలో తమ పని తాము చేసుకుంటూ మనుగడ సాగిస్తోంది. భారతీయ సంస్కృతిలో పాములు పూజలందుకోవడం ఓ భాగమైపోయింది. అయితే పూజల పేరుతో పుట్టలో పాలుపొయ్యడం వల్ల...పుట్టలో నివసిస్తున్న పాములకు ప్రాణహాని కలుగుతోంది.

ఆచారాల వల్ల సర్పజాతి మనుగడే ప్రమాదం
పాములను పూజించేందుకు పూర్వీకులు ఆచరించిన పండగే నాగుల చవితి...అనాది కాలంగా అది దేశ సంస్కృతిలో భాగమైంది. మిగిలిన పండగల్లాగే నాగుల చవితి రోజున కుటుంబ సమేతంగా పుట్టల దగ్గరకెళ్లి...పాలను పోసి ...పిల్లా పాపలతో పూజించడం..తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ ఆచారాల వల్ల సర్పజాతి మనుగడే ప్రమాదంలో పడుతోంది.

పట్టణీకరణ కారణంగా...సర్పజాతి మనుగడకే ముప్పు
అసలే పూజల పేరుతో పాముల ఆవాసాలు నాశమనమవుతుంటే...మరోవైపు పట్టణీకరణ కారణంగా...పెరుగుతోన్న రియల్ ఎస్టేట్, కాలుష్యంతో సర్పజాతి మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. ఇదికాక పాములన్నీ విషపూరితమైనవని భావించి...వాటిని చంపేస్తున్నారు. నిజానికి దేశంలో ఉన్న 170 సర్పజాతుల్లో మూడు జాతులు మాత్రమే ప్రమాదకరమైనవి. పాముల వల్ల వ్యవసాయానికి పరోక్షంగా మేలు జరుగుతోంది. పంటలను నాశనం చేసే ఎలుకలను తినేవి పాములే. మానవ జాతికి మేలు చేసే సర్పజాతిని కాపాడుకోవాలని గ్రీన్‌మెర్సీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించి...పూజించే చేతులతో పాములను చంపవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాణహాని ఉన్నప్పుడు మినహా ఇంకెప్పుడూ పాములను నాశనం చెయ్యొద్దని సూచిస్తున్నారు. 

17:51 - November 3, 2016

వికారాబాద్ : తాండూరు మున్సిపల్ చైర్మన్‌ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ఒప్పందం ప్రకారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజీనామా చేస్తారా? ఒకవేళ చేస్తే ఎంఐఎం నుంచి ఎవరు బరిలోఉన్నారు? చివరినిమిషంలో కాంగ్రెస్‌ పైచేయి సాధించే అవకాశముందా? ప్రత్యేక కథనం..

31వార్డు కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలు
వికారాబాద్‌ జిల్లా తాండూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. రెండున్నర ఏళ్లక్రితం ఇక్కడ మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి.. 31వార్డు కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా... టీఆర్‌ఎస్‌, ఎంఐఎం చెరో పదిస్థానాలు సాధించాయి... కాంగ్రెస్‌ 8, టీడీపీ 2, బీజేపీ ఒక్క స్థానంలో గెలుపొందాయి..... చైర్మన్‌ పీఠంకోసం టీఆర్‌ఎస్‌, ఎంఐఎం మధ్య ఒప్పందం కుదిరింది.... ఈ పొత్తుప్రకారం రెండున్నరేళ్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మిగిలిన కాలం ఎంఐఎం అభ్యర్థి చైర్మన్‌గా ఉండాలి... ఈ అగ్రిమెంట్‌ ప్రకారం టీఆర్‌ఎస్‌ నేత విజయలక్ష్మి చైర్‌పర్సన్‌గా... సాజిద్‌ అలీ వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.. వీరి పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియబోతోంది.. ఒప్పందంప్రకారం టీఆర్‌ఎస్‌ చైర్‌పర్సన్‌ రాజీనామా చేస్తారా? లేదా? అన్న అంశంపై జిల్లాలో చర్చ నడుస్తోంది.. జిల్లాలోనే కీలకస్థానాన్ని టీఆర్‌ఎస్ వదులుకుంటుందా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. జీహెచ్‌ఎంసీలో పాగావేసి తెలంగాణలోనే పెద్దపార్టీగా కొనసాగుతున్న గులాబీదళం చైర్‌పర్సన్‌ను వదులుకుంటే ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

ఎంఐఎంనుంచి రేసులో నలుగురు మహిళలు
అటు పార్టీ అధిష్టానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే తాను పదవికి రాజీనామా చేస్తానని విజయలక్ష్మి ముందే ప్రకటించారు.. ఒకవేళ ఆమె రాజీనామా చేస్తే ఎంఐఎంనుంచి ఎవరు చైర్మన్‌ బరిలోఉన్నారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.. ఎంఐఎంనుంచి నలుగురు మహిళలు రేసులోఉన్నారని సమాచారం... మరోవైపు చివరినిమిషంలో కాంగ్రెస్‌ చైర్ పర్సన్‌ అభ్యర్థి సునీతా సంపత్‌కూడా పోటీలోకి వచ్చే అవకాశముందన్న వార్తలుకూడా వస్తున్నాయి..

స్పష్టత కోసం ఎదురు చూడాల్సిందే..

టీడీపీమాత్రం ఈ రెండున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ చేసిందేమీలేదని విమర్శిస్తోంది.. ఏ ఒక్క సమస్యా పరిష్కారంకాలేదని ఆరోపిస్తోంది..వికారాబాద్‌ జిల్లాలోనే కీలక స్థానమైన ఈ చైర్మన్‌ స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది.. కొద్దిరోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది...

17:46 - November 3, 2016

కరీంనగర్ : సింగరేణిలో పాత నిబంధనలప్రకారమే వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరిస్తారా? ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? రెండేళ్ల లెఫ్ట్‌ సర్వీస్‌ రూల్‌ను కొనసాగిస్తారా? తొలగిస్తారా? మెడికల్‌ అన్‌ఫిట్‌ పరిస్థితేంటి? ఇవి బొగ్గు గని కార్మికుల్లో సందేహాలు.. వీటన్నింటిపై నవంబర్ 4న సమావేశంలో స్పష్టతవచ్చే అవకాశముంది.

నవంబర్‌ 4 సింగరేణి కీలకభేటీ
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నిబంధనలపై సస్పెన్స్ కొనసాగుతోంది.. నవంబర్‌ 4న జరగబోయే సింగరేణి భేటీలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది... ఈ సమావేశానికి కీలక ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు.. బోర్డు డైరెక్టర్లలో కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి, కోలిండియా సంచాలకులు, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు.. వీరంతా సమావేశానికి వస్తారని తెలుస్తోంది.. బోర్డు డైరెక్టర్ల సమావేశంలో వారసత్వ ఉద్యోగాలకు ఆమోదంలభిస్తేనే నిర్ణయం అమల్లోకివస్తుంది.. దీంతో ఈ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది..

అక్టోబర్‌ 6 ఉద్యోగాల పునరుద్దరణపై ప్రకటన విడుదల
అక్టోబర్‌ 6న ఉద్యోగాల పునరుద్దరణపై ప్రకటన విడుదలైనా... విధివిధానాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.. సింగరేణిలో 1998జూన్‌వరకూ వారసత్వ ఉద్యోగాలు కొనసాగాయి.. ఆ తర్వాత ఈ ఉద్యోగాలు రద్దయ్యాయి.... ఈ అంశంపై ఎన్నికలకుముందు కార్మికసంఘాలు ప్రధానంగా ఫోకస్‌ చేశాయి.. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తమ ఎజెండాలో ప్రధాన అంశంగా వారసత్వ ఉద్యోగాలను చేర్చింది.. ఇక టీఆర్‌ఎస్‌కూడా సార్వత్రిక ఎన్నికలకుముందు ఈ హామీ ఇచ్చింది.. అధికారంలోకివచ్చాక వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరిస్తామంటూ అక్టోబర్‌ 6న ప్రకటన విడుదలచేసింది.. ఈ ప్రకటనకు కార్మికులనుంచి హర్షం వ్యక్తమైంది.. అయితే వారసత్వ ఉద్యోగాల పునరుద్దరణ ఏ ప్రాతిపదికన చేపడతారన్న విషయంపై క్లారిటీ రాలేదు..

కీలకంగామారిన రెండేళ్లసర్వీసు నిబంధన
వారసత్వ ఉద్యోగాల పునరుద్దరణకు సర్వీస్ నిబంధనలు కీలకంగా మారాయి.. 1998కిముందు రెండేళ్లసర్వీసుఉన్న కార్మికులు స్వచ్ఛంద ఉద్యోగవిరమణ చేస్తే వారసుడికి ఉద్యోగంవచ్చే అవకాశంఉండేది.. ఇప్పుడు ఇదే నిబంధనను వర్తింపజేస్తారా? సర్వీసుతో పనిలేకుండా వారసత్వంకింద దరఖాస్తుచేసిన ప్రతి కార్మికుడి పిల్లలకు ఉద్యోగం ఇస్తారా? రూల్స్ పేరుతో కోత విధిస్తారా? అన్నది సమావేశం తర్వాత తేలే అవకాశంఉంది.. 

17:41 - November 3, 2016

హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకూ ఆన్‌లైన్ కష్టాలు...ఇప్పుడేమో పుస్తకాల లేక నానా అవస్థలు ...ఓవైపు పరీక్షలు దగ్గర పడుతుంటే..మరోవైపు సిలబస్ పూర్తికాక..కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు డిగ్రీ విద్యార్థులు. ఎన్ని సమస్యలు ఎదురైనా, విద్యను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వాల మాటలు... కాగితాలకే పరిమితమవున్నాయి గానీ చేతల్లో కనిపించడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

కొత్త విద్యావిధానాల రూపంలో విద్యార్థుల తిప్పలు
ముందు వెయ్యి..వెనుక గొయ్యి మాదిరిగా తయారైంది తెలంగాణ డిగ్రీ విద్యార్థుల పరిస్థితి. చదువుదామంటే పుస్తకాలు లేవు...పోనీ క్లాస్ నోట్సు చదువుదామనుకుంటే, సిలబస్ పూర్తి కాలేదు. దీంతో ఏం చెయ్యాలో అర్థంకాక డిగ్రీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొత్త విద్యావిధానాల రూపంలో తిప్పలు తప్పడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో మొట్టమొదటిసారిగా సీబీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిన విద్యాశాఖ
తెలంగాణలో మొట్టమొదటిసారిగా సిబిసిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఫస్ట్ ఇయర్ లోనే విద్యాశాఖ కు చుక్కెదురైంది. ఈ ఏడాదే డిగ్రీ ఆన్‌లైన్ విధానం కూడా ప్రవేశపెట్టి మరింత ఇబ్బందులను ఎదుర్కొంది రాష్ట్ర సర్కారు. మొత్తానికి ఏదోలాగా తరగతులు ప్రారంభించినా..సిలబస్ ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు మొదటి సారి సెమిస్టర్ విధానంలో వచ్చె నెలలోనే పరీక్షలు జరగనున్నాయి. కాని ఇప్పటివరకు పుస్తకాలు అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఏడాది జూలై 4 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం
రాష్ట్రంలో ఈ ఏడాది జూలై 4 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమైంది. నవంబర్ 14న మొదటి సెమిస్టర్ ఆఖరి పనిదినంగా విద్యాశాఖ క్యాలెండర్ విడుదల చేసింది. నిజానికి ఈనెల 15నుంచి ప్రాక్టికల్స్ ఆరంభం కావాలి.. 24 నుంచి పరీక్షలు మొదలవ్వాలి.. కాని వీటిని వాయిదా వేసిన విద్యాశాఖ... డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాకపోవడం వల్లే పరీక్షలను వాయిదా వేస్తున్నారనే అనుమానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలుగు అకాడమికి తెలంగాణా ఉన్నత విద్యామండలి గత ఆగస్టులో సిలబస్ ఇచ్చినప్పటికీ... పాఠ్యాంశాన్ని రాయించే వరకు సమయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. మరో నాలుగైదు రోజుల్లో పుస్తకాలు ప్రింటింగ్ కి వెళతాయని తెలుగు అకాడమి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో లేని స్పష్టత
పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత లేకపోవడం.. ఇంకా సిలబస్ పూర్తికాకపోవడంతో మానసికంగా ఆందోళనకు గురవుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై విద్యాశాఖ వెంటనే స్పందిచాలని డిమాండ్‌ చేస్తున్నారు. త్వరగా బుక్స్ ప్రింటింగ్ పూర్తి చేసి.. తమకు అందజేస్తే పరీక్షలకు సన్నద్ధమవుతామని అంటున్నారు.  

17:35 - November 3, 2016

జగిత్యాల: జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. హన్మకొండకు చెందిన ఐదుగురు భక్తులు వేములవాడ రాజరాజేశ్వరి దేవిని దర్శించుకొని అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వెళ్తుండగా వాహనం అతివేగంతో అదుపుతప్పి ఓ వ్యవసాయ బావిలో పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రామస్వామి(66), అతని భార్య శారదాదేవి(60), కుమారుడు కుమారస్వామి(45), అతని భార్య సుభాషిణి (40) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన నవీన్‌ను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ అనంతశర్మ సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

బ్రెగ్జిట్ పై సంచలన తీర్పు..

బ్రిటన్ : బ్రెగ్జిట్ పై బ్రిటన్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. యూరోపియనన్ యూనియన్ నుండి బ్రిటన్ తప్పుకోవాలంటే..బ్రెగ్జిట్ పార్లమెంట్ ఆమోదం తెలిపాలంటూ బ్రిటిన్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పార్లమెంట్ ఆమోదం పొందకుండా బ్రెగ్జిట్ సాధ్యం కాదని పేర్కొంది. బ్రిటన్ కోర్టు తీర్పుపై యూకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళనుంది. 

17:00 - November 3, 2016

అమెరికా : డెమొక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ కు మద్దతిచ్చేందుకు అధ్యక్షుడు ఒబామా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. తనపై ప్రేమ ఉంటే హిల్లరీకి ఓటేయాలని ఒబామా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొలంబస్‌లోని కాపిటల్‌ యూనివర్సిటీలో యువతను ఉద్దేశించి ఒబామా ప్రసంగించారు. నాకోసం ఎలా కష్టపడ్డారో హిల్లరీ కోసం కూడా అలాగే కష్టపడాలని సూచించారు. నేనైనా, బిల్ క్లింటనైనా... మా కన్నా హిల్లరీకే అధ్యక్ష పదవికి అర్హతలు ఎక్కువగా ఉన్నాయన్నారు. విదేశాంగ మంత్రిగా ఎన్నో క్లిష్ట సమస్యలను ఆమె పరిష్కరించారని ఒబామా చెప్పారు. ఆమె యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు మంచి అధ్యక్షురాలిగా పనిచేయగలుగుతారని పేర్కొన్నారు. 

16:50 - November 3, 2016

వీర్యదానం అవసరమేనని సినీ నటుడు అక్కినేని సుమంత్ వ్యాఖ్యానించారు. ఆయన నటించిన 'నరుడా డోనరుడా' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఇతరత్రా విడుదలైన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా టెన్ టివి 'సుమంత్' తో చిట్ చాట్ నిర్వహించింది. కొత్తగా పెళ్లయిన వారిలో చాలా మందికి పిల్లలు పుట్టడం లేదని, కొంచెం వినడానికి ఇబ్బందికరంగా ఉన్నా రిలేటివ్ అవుతారని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. హిందీలో కూడా ఈ సినిమా విజయవంతం అయ్యిందని, రొమాంటిక్ కామెడీ ఉంటుందన్నారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

16:30 - November 3, 2016

గుంటూరు : గుంటూరు అంటేనే మిర్చి ఘాటు గురించి తెలినివారుండరు. అతి పెద్ద మిర్చి యార్డు కూడా గుంటూరు లో వుంది. దీన్ని ఆసరా చేసుకుని మిర్చిని కారంగా తయారు చేసే మిల్లులు అధికసంఖ్యలు ఈ ప్రాంతంలో వుంటాయి. ఈ ప్రాంతపు మిర్చికి మంచి పేరుంది. అలాగే మంచి డిమాండ్ కూడా వుంటుంది. వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. దీన్ని ఆసరా చేసుకున్న కారం మిల్లుల యజమానులు తొడమల్ని పౌడర్ గా తయారుచేసిన కారంలో కలుపుతున్నారు. అలాగే రంపపు పొడి కూడా కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కారం మిల్లులపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. దాదాపు రూ. కోటి.20లక్షల విలువైన కారం నిలువలను అధికారులు సీజ్ చేశారు. 

16:15 - November 3, 2016

జిల్లా కలెక్టర్లతో మంత్రి హరీష్ వీడియో కాన్ఫరెన్స్..

హైదరాబాద్ : జిల్లా కలెక్టర్లతో మంత్రి హరీష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టు భూ సేకరణ, రబీ సీజన్ ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. 

మోసం చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ - యాష్కి..

హైదరాబాద్ : ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ అని టి.కాంగ్రెస్ నేత మధుయాష్కీ పేర్కొన్నారు. రూ. 300 కోట్లగ్రేటర్ స్కాంలో కేటీఆర్..కేసీఆర్ లు భాగస్వాములని ఆరోపించారు. ఈ స్కాంపై లోకాయుక్తలో కేసు వేస్తామని, మిషన్ భగీరథలో కేటీఆర్ వాటా ఎంత అని ప్రశ్నించారు. చుక్కనీరు ఇవ్వకుండా రూ. 8వేల కోట్లు ఎలా ఖర్చయ్యాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సన్నాసులకు గడ్డాలు పెంచుకున్న ఋషుల గురించి తెలియదని వ్యాఖ్యానించారు. 

16:10 - November 3, 2016

టీఆర్ఎస్ సన్నాసులకు వారి గురించి తెలీదు..

హైదరాబాద్ : అవినీతిలో రైతు ఆత్మహత్యలలో, ప్రజలను మోసం చేయటంలో సీఎం కేసీఆర్ నెంబర్ వన్ గా వున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ ఎద్దేవా చేశారు.రూ.300కోట్ల గ్రేటర్ స్కామ్ లో తండ్రీ కొడుకులు కేసీఆర్,కేటీఆర్ లు ఇద్దరూ భాగస్వాములని విమర్శించారు. ఈ స్కామ్ లో లోకాయుక్తలో కేసు దాఖలు చేస్తామని తెలిపారు. మిషన్ భగీరథలో కేటీఆర్ వాటా ఎంతని ప్రశ్నించారు. చుక్కనీరు ఇవ్వకుండా రూ.8వేల కోట్లు ఎలా ఖర్చు అయ్యాయో తెలిపాలని డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ సన్నాసులకు గడ్డాలు పెంచుకున్న రుషుల గురించి తెలిదని ఈ సందర్భంగా మధుయాష్కీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ఓఆర్ఓపీ స్పందించిన పారికర్..

ఢిల్లీ : ఓఆర్ ఓపీ పై రక్షణ శాఖ మంత్రి పారికర్ స్పందించారు. మాజీ సైనికుల సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తామని హామీనిచ్చారు. 

15:55 - November 3, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ మళ్లీ దూసుకు పోతున్నారు. తాజాగా రైటర్స్‌-ఇప్సోస్‌ నిర్వహించిన పోల్‌లో హిల్లరీ- ట్రంప్‌పై 6 శాతం ఆధిక్యంతో ఉన్నారు. ఈ-మెయిల్స్‌ వ్యవహారంపై ఎఫ్‌బిఐ విచారణకు ఆదేశించినా హిల్లరీపై అంతగా ప్రభావం చూపడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఎఫ్‌బిఐ విచారణకు ముందు కూడా హిల్లరీ ట్రంప్‌పై 6 శాతం ఆధిక్యం
మరో ఐదు రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సమయంలో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు భారీ ఊరట లభించింది. తాజాగా అధ్యక్ష పదవికి జరిపిన ఎన్నికల పోల్‌ సర్వేలో మరోసారి తన ప్రత్యర్థి రిపబ్లిక్‌ అభ్యర్థి ట్రంప్‌పై ఆధిక్యాన్ని నిలుపుకున్నారు. తాజాగా రైటర్స్‌-ఇప్సోస్‌ నిర్వహించిన పోల్‌లో హిల్లరీ- ట్రంప్‌పై 6 శాతం ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.

28 అక్టోబర్‌-నవంబర్‌ 1 మధ్య రైటర్స్‌-ఇప్సోస్‌ పోల్‌ సర్వే
గత శుక్రవారం హిల్లరీ ఈమెయిల్స్‌ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఎఫ్‌బిఐ డైరెక్టర్ జేమ్స్‌ కోమి కాంగ్రెస్‌కు సూచనప్రాయంగా తెలిపారు. హిల్లరీ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఈ మెయిల్‌ సర్వర్‌ను దురుపయోగం చేశారా లేదా అన్న విషయం దర్యాప్తులో తేలనుందని కోమి చెప్పారు. కోమి ప్రకటన తర్వాత నిర్వహించిన ఈ సర్వే హిల్లరీపై ప్రభావం చూపలేక పోయింది. 28 అక్టోబర్‌-నవంబర్‌ 1 మధ్య రైటర్స్‌-ఇప్సోస్‌ పోల్‌ సర్వే నిర్వహించింది. ఈమెయిల్‌ వివాదంపై ఎఫ్‌బిఐ విచారణకు ఆదేశించక ముందు కూడా రైటర్స్‌-ఇప్సోస్‌ నిర్వహించిన పోల్‌లో కూడా హిల్లరీ ట్రంప్‌పై 6 శాతం ఆధిక్యంతో ముందంజలో ఉండడం గమనార్హం.

హిల్లరీ ఈమెయిల్స్‌ వ్యవహారంపై ఎఫ్‌బిఐ విచారణ
హిల్లరీ క్లింటన్‌ ఈ-మెయిల్స్‌ వ్యవహారంపై విచారణ జరుపుతామన్న ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీ తీరుపై డెమోక్రాట్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోవైపు హిల్లరీ ఈమెయిల్స్‌ వ్యవహారాన్ని రిపబ్లికన్లు తమకు అనుకూలంగా మలచుకున్నారు. హిల్లరీ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ట్రంప్‌ ఎదురుదాడికి దిగారు.

ఎన్నికలకు ముందే 1772 మంది ముందస్తు ఓటు
నవంబర్‌ 8న జరగనున్న అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు ముందే 1772 మంది ముందస్తు ఓటేశారు. ఇందులో 45 శాతం మంది హిల్లరీని సమర్థించగా, 39 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓటేశారు. ఎఫ్‌బిఐ కోమి ప్రకటనకు ముందు జరిగిన పోల్‌లో ట్రంప్‌కు 37 శాతం ఓట్లు రాగా...హిల్లరీకి 43 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు.

రియల్‌ క్లియర్‌ పాలిటిక్స్‌ సర్వేలో 4.6 శాతం నుంచి1.7తగ్గిన హిల్లరీ
గతవారం పలు పోల్‌ సంస్థలు నిర్వహించిన జాతీయా పోల్స్‌లో హిల్లరీ ఆధిక్యత తగ్గింది. రియల్‌ క్లియర్‌ పాలిటిక్స్‌ నిర్వహించిన పోల్స్‌లో హిల్లరీ ఆధిక్యం గత శుక్రవారం 4.6 శాతం ఉండగా.. బుధవారం 1.7 శాతంగా ఉంది. రెండు రోజుల క్రితం వాషింగ్టన్‌ పోస్ట్‌-ఎబిసి న్యూస్‌ ట్రాకింగ్‌ నిర్వహించిన పోల్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా హిల్లరీపై ఒక్క శాతం స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. రైటర్స్‌-ఇప్సోస్‌ సంస్థ అమెరికాలోని 50 రాష్ట్రాల్లో పోల్‌ నిర్వహించింది.

15:46 - November 3, 2016

హైదరాబాద్ : అలనాటి ఎన్టీఆర్ ప్రభుత్వం హాయంలో మావోయిస్టుల మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయనీ..ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోవటానికి అదే కారణమని విరసం నేత వరవరరావు పేర్కొన్నారు. ఆర్కే పోలీసుల వద్ద ఉన్నాడనే ఒక్క ఆధారం ఉన్నా చెప్పాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశించింది. కాల్పుల నుంచి తప్పించుకున్న చలపతి, అరుణలు ఆర్కే బతికేఉన్నారని ఇచ్చిన ప్రకటనే మాకు ఆధారమని వరవరరావు పేర్కొన్నారు. ఆర్కే ..ఆర్కేతో పాటు ఆయన అంగరక్షకుడు కూడా గాయపడినట్లుగా ఎన్ కౌంటర్ కాల్పుల నుండి తప్పించుకున్న చలపతి, అరుణలు చెప్పారని..దీంతోనే ఆర్కే జీవించివున్నారనీ..అదీ పోలీసులు అదుపులోనే వున్నారనీ వరవరరావు ధీమా వ్యక్తం చేశారు. ఆర్కేను కోర్డులో హాజరుపరచకుంటే 22 సంవత్సరాల అనతంరం ఇది కూడా ఓ మిస్సింగ్ కూడా నమోదవుతుందన్నారు. 

15:38 - November 3, 2016

పాకిస్థాన్ : ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న జకారియా ఎక్స్‌ప్రెస్‌, ఫరీద్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పాక్ ఆర్థిక రాజధాని కరాచీలోని లండి రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు నుజ్జునుజ్జయిపోయాయి. బోగీలను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి లోపలి వారిని బయటకు తీశారు. 

15:36 - November 3, 2016

విజయవాడ : గత 15 రోజులుగా ఏపీ ప్రభుత్వం తమను వేధిస్తోందని అగ్రి బయోటెక్‌ మ్యానుఫ్యాక్షర్‌ అసోసియేషన్‌ యాజమాన్యం ఆరోపించింది. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ బయో ప్రొడక్స్ట్‌ అందిస్తున్న 40 కంపెనీలపై దాడులకు దిగడం సరికాదన్నారు. జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాలలో నిషేధించిన కెమికల్స్‌ని దిగుమతి చేసుకుని రన్‌ చేస్తున్న మల్టీ బయో కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఏ రైతు కంప్లెంట్‌ చేయకపోయినా కేసులు పెడుతున్నారని.. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. 

15:33 - November 3, 2016

గుంటూరు : ముల్లును ముల్లుతోనే తీయాలనే సామేతను ఫాలో అవుతోంది ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం. రాజకీయంగా టీడీపీని ఇరుకున పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్నే అస్ర్తంగా చేసుకుని.. సర్కార్‌ తీరును ప్రజల్లో ఎండగట్టాలని ప్రతిపక్షం ప్లాన్‌ చేస్తోంది.

తెరపైకి నియోజకవర్గాల నిధుల విడుదల అంశం
టీడీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు కుదేలవుతున్న వైసీపీ... ఇప్పుడు కొత్త వ్యూహాలకు పదునుపెడుతోంది. భవిష్యత్తులోనైనా పార్టీ ప్రజాప్రతినిధులను కాపాడుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయంగా అధికార పార్టీని ఇరుకున పెడుతూనే.. రాజకీయంగా బలపడేందుకు కూడా ప్రణాళికలు రచిస్తోంది. తమ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ అంశాన్నే అస్ర్తంగా చేసుకోని సర్కార్‌ను ఇరుకున పెట్టాలని ప్లాన్‌ చేస్తోంది.

ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు ప్లాన్‌
నియోజకవర్గాలకు నిధుల విడుదల కోసం ముఖ్యమంత్రి ముందు తమ వాదనలను వినిపించేందుకు వైసీపీ శాసనసభ పక్షం రెడీ అవుతోంది. ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలందరూ కలిసి చంద్రబాబును కలిసి.. నిధుల విడుదల జాప్యంలో జరుగుతున్న సమస్యలను తెలియజేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎం అపాయింట్‌మెంట్‌ కావాలని ఎమ్మెల్యేలు కోరుతున్నట్లు సమాచారం. తాము ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావడంతోనే... నిధులను త్వరగా విడుదల చేయడం లేదని ఆరోపిస్తున్నారు.మొత్తంగా వైసీపీ అధినేత జగన్‌ తమ ఎమ్మెల్యేలతో కలిసి.. సీఎంను కలుస్తారా..? లేదా అన్న చర్చ సాగుతోంది. 

15:30 - November 3, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో డెంగ్యూ కోరలు చాస్తోంది. కొన్ని చోట్ల మెరుగైన వైద్యం అందక నిరుపేదలు మహమ్మారి పంజాతో ప్రాణాలు కోల్పోతున్నారు. వందల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నా... నివారణ చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. హైదరాబాద్‌లోని ఒక బస్తీలో 70 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి... అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..!

తెలంగాణలో కోరలు చాస్తున్న డెంగ్యూ
డెంగ్యూతో తెలంగాణ రాష్ట్రం వణికిపోతోంది. సీజనల్ జ్వరాలతో జనం భయపడిపోతున్నారు. పెద్ద సంఖ్యలో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా వ్యాధులు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్నిచోట్ల డెంగ్యూ మరణాలు నమోదవుతున్నా.. అధికార యంత్రాంగం సీరియస్‌గా దృష్టిసారించడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో ఇటీవల డెంగ్యూ సోకి చాలామంది చనిపోయారు.

డెంగ్యూ తీవ్రతను తగ్గించే ప్రయత్నం
అక్కడక్కడ డెంగ్యూ కేసులు, డెంగ్యూ మరణాలు నమోదవుతున్నా... అధికారులు మాత్రం తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1,968 డెంగ్యూ, 2,758 మలేరియా కేసులు నమోదయ్యాయి. కేవలం ఖమ్మం జిల్లా బోనకల్‌లోనే 8మంది డెంగ్యూ సోకి మరణించడం మరింత భయాందోళనకు గురి చేస్తోంది. అయితే... డెంగ్యూతో కేవలం ఇద్దరే చనిపోయారని అధికార యంత్రాంగం చెబుతోంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందని నాణ్యమైన వైద్యసేవలు
మరోవైపు రాష్ర్టంలోని చాలా పీహెచ్‌సీల్లో సరైన మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో నిరుపేదలు నానా అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల వైద్యసిబ్బంది లేక రోగులకు నాణ్యమైన వైద్యం అందని పరిస్థితులున్నాయి. రాష్ర్టంలో ఖాళీగా ఉన్న వైద్యపోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వైరల్‌ ఫీవర్స్‌తో నిరుపేదలు ఆస్పత్రుల చుట్టు తిరుగుతూ.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, వెంటనే రాష్ర్టంలో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఏజెన్సీల్లో, గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.ఇప్పటికైనా వైద్యాధికార యంత్రాంగం రాష్ర్టంలో నమోదవుతున్న మలేరియా, డెంగ్యూ కేసులు, మరణాలపై సీరియస్‌గా ఫోకస్‌ చేసి.. నివారణ చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మారుమూల పల్లెలు, ఏజెన్సీల్లో తక్షణమే హెల్త్‌ క్యాంపులు నిర్వహించాలని కోరుతున్నాయి. 

15:10 - November 3, 2016

తూర్పుగోదావ‌రి : తొండంగి మండలం దానవాయిపేటలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. గురువారం సీపీఎం నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో అక్క‌డ‌ తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. దివీస్ ఫార్మాకి వ్యతిరేకంగా తలపెట్టిన బహిరంగసభను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పాలీసులకు గ్రామస్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుబ్బలక్షి అనే మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిని పీఎస్ కు తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులను మాత్రం నాలుగు వేన్లలో దాదాపు 150 మందికి అరెస్ట్ చేశారు. వారందరినీ ఎక్కడికి తరలించారో తెలియటంలేదు. మహళలు అని కూడా చూడకుండా వారందరినీ జుట్టుపట్టుకుని ఊడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్లలో పడేశారు. కాగా తొండంగిలో రెండు నెలలుగా 144 సెక్షన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కవరేజ్ కు వెళ్ళిన 10టీవీ పై తుని సీఐ అప్పారావు దురుసుగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. దానవాయి పేట నుండి దివీస్ కంపెనీని తొలగించాలని..తొలగించకుంటే ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. 

భద్రాద్రిలో సైకో వీరంగం..

భద్రాద్రి : భద్రాచలంలో సైకో కలకలం సృష్టించాడు. సాయిబాబా గుడి వద్ద గాజు సీసాలను జనాలపైకి విసిరాడు. భయంతో స్థానికులు పరుగులు తీశారు. సైకో కోసం పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు. 

కారం పొడుల కంపెనీలపై విజిలెన్స్ అధికారుల దాడులు..

గుంటూరు : జిల్లాలో ఉన్న వివిధ కారం పొడుల కంపెనీలపై విజిలెన్స్ దాడులు నిర్వహించారు. రూ. కోటి 20 లక్షల విలువైన కల్తీ కారం నిల్వలను సీజ్ చేశారు. మిర్చి తొడులను పొడిగా చేసి కారంలో కలుపుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. 

15:01 - November 3, 2016

చిత్తూరు : ఐదు రాష్ట్రాలలో మావోయిస్టులు ప్రకటించిన బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కావటంతో పోలీసులు ఆప్రాంతంలో అప్రమత్తంగా వున్నారు. చంద్రబాబు సొంతగ్రామంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నారావారి పల్లెలో మూడంచెల భద్రత కొనసాగుతోంది. రంగం పేట నుండి నారావారి పల్లె వరకూ దారి పొడవునా పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కాగా ఏవోబీలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ కు నిసనగా మావోయిస్టులు ఐదు రాష్ట్రాలలో బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే..

14:53 - November 3, 2016

విశాఖ : బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం, వాయవ్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్‌ తీరంవైపు వెళ్లవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఒడిశాలపై ఎక్కువగా ఉండవచ్చని, తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది. సముద్రంలోకి చేపల వేట నిమిత్తం ఎవరూ వెళ్లరాదని హెచ్చరించింది.

దానవాయిపేటలో ఉద్రిక్తత..

తూర్పుగోదావరి : తొండంగి (మం) దానవాయిపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివీస్ వ్యతిరేక బహిరంగసభను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తోపులాటలో ఓ మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో సహా పలువురు నేతలను అరెస్టు చేశారు. వీరిని పీఎస్ కు తీసుకెళుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. తొండంగి మండలం నుండి దివీస్ ను తొలగించకపోతే చంద్రబాబును ప్రజలే తరిమికొడుతారని సీపీఎం నేత మధు పేర్కొన్నారు. 

ఏడాదిలో కాళేశ్వరం పూర్తి - మంత్రి హరీష్..

హైదరాబాద్ : ఏడాదిలోగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆసియాలోనే సరికొత్త రికార్డు నెలకొల్పుతామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. భూ సేకరణ వేగవంతం చేసి 2017 డిసెంబర్ నాటికి కాళేశ్వరం పూర్తి చేసి నీళ్లు ఇస్తామని తెలిపారు. కాళేశ్వరం పనులను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఎప్పటికప్పుడు జలసౌధ నుండి పర్యవేక్షిస్తానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు కొరత లేదని, ఈనెలలో మల్లన్న సాగర్ టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. 

బంగాళాఖాతంలో వాయుగుండం..

విశాఖపట్టణం : ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. విశాఖకు 650 కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 72గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, ఒడిశా తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. 

ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతు మహాసభ - కోట్ల..

విజయవాడ : రైతులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా 19వ తేదీన కర్నూలు జిల్లా కోడుమూరులో రైతు మహాసభ నిర్వహించనున్నట్లు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు.  సభకు మల్లిఖార్జునఖర్గే హాజరవుతారని పేర్కొన్నారు. రాయలసీమలో రైతాంగం ఇబ్బందుల్లో ఉందని, రైతులను ఆదుకున్నామని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపెడుతోందన్నారు. 

14:00 - November 3, 2016

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తన ప్రత్యర్థి రిపబ్లిక్‌ అభ్యర్థి ట్రంప్‌పై మళ్లీ ఆధిక్యాన్ని కనబరచారు. తాజాగా అధ్యక్ష పదవికి జరిపిన ఎన్నికల పోల్‌ సర్వేలో హిల్లరీ- ట్రంప్‌పై 6 శాతం ఆధిక్యంతో ఉన్నారు. తాజాగా రైటర్స్‌-ఇప్సోస్‌ నిర్వహించిన పోల్‌లో ఈ విషయం స్పష్టమైంది. దీంతో హిల్లరీపై ఈ-మెయిల్స్‌ వ్యవహారం అంతగా ప్రభావం చూపడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈమెయిల్‌ వివాదంపై ఎఫ్‌బిఐ విచారణకు ఆదేశించక ముందు కూడా రైటర్స్‌-ఇప్సోస్‌ నిర్వహించిన పోల్‌లో కూడా హిల్లరీ ట్రంప్‌పై 6 శాతం ఆధిక్యంతో ముందంజలో ఉండడం గమనార్హం. రెండు రోజుల క్రితం వాషింగ్టన్‌ పోస్ట్‌-ఎబిసి న్యూస్‌ ట్రాకింగ్‌ నిర్వహించిన పోల్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా హిల్లరీపై ఒక్క శాతం స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే.
హిల్లరీకి మద్దతిచ్చేందుకు ఒబామా ప్రత్యక్షంగా రంగంలోకి
డెమొక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ కు మద్దతిచ్చేందుకు అధ్యక్షుడు ఒబామా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. తనపై ప్రేమ ఉంటే హిల్లరీకి ఓటేయాలని ఒబామా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొలంబస్‌లోని కాపిటల్‌ యూనివర్సిటీలో యువతను ఉద్దేశించి ఒబామా ప్రసంగించారు. నాకోసం ఎలా కష్టపడ్డారో హిల్లరీ కోసం కూడా అలాగే కష్టపడాలని సూచించారు. నేనైనా, బిల్ క్లింటనైనా... మా కన్నా హిల్లరీకే అధ్యక్ష పదవికి అర్హతలు ఎక్కువగా ఉన్నాయన్నారు. విదేశాంగ మంత్రిగా ఎన్నో క్లిష్ట సమస్యలను ఆమె పరిష్కరించారని ఒబామా చెప్పారు. ఆమె యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు మంచి అధ్యక్షురాలిగా పనిచేయగలుగుతారని పేర్కొన్నారు. 

 

 

 

 

13:56 - November 3, 2016

తమిళనాడు : చెన్నైలో 61 మందిని సజీవ సమాధి చేసిన మౌళివాకంలోని రెండవ భవనాన్ని కార్పొరేషన్‌ అధికారులు కూల్చివేశారు. రెండేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న 11అంతస్తుల భవనం కూలిన ఘటనలో 61 మంది మృతి చెందారు. అందులో 47 మంది తెలుగు వారే.. తమిళనాడు ప్రభుత్వం తూతూ మంత్రంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటే ఏపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరో 11 అంతస్తుల భవనం నిర్మాణంలోనూ లోపాలు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో న్యాయస్థానం అనుమతితో కార్పొరేషన్‌ అధికారులు కూల్చివేశారు. 

13:45 - November 3, 2016

నాగర్ కర్నూలు : సీపీఎం మహాజన పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. ఇబ్రహీంపట్నంలో మొదలైన ఈ మహాజన పాదయాత్ర నిన్నటివరకు 400 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసుకొని ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలోకి ప్రవేశించింది. సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ మహాజన పాదయ్రాత్ర ఇవాళ రామాజిపల్లి, కొండనాగుల, బల్మూరు, అనంతవరం, నర్సాయిపల్లిలో కొనసాగనుంది. పాదయాత్రలో దారిపొడవునా స్థానిక సమస్యలను బృందం సభ్యులు అడిగి తెలుసుకుంటున్నారు. అచ్చంపేట ప్రాంతంలో టైగర్‌ జోన్‌ పేరుతో గిరిజనులను ప్రభుత్వం ఖాళీ చేయిస్తోందని ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న ఆదివాసి గిరిజన సంఘం నేత నైతం రాజు అన్నారు. ఆదివాసిలకు వెంటనే ఏజెన్సీ సర్టిఫికెట్లను అందచేయాలని కోరారు. ఈమేరకు నైతం రాజుతో 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే.. 
'గత 18 రోజులుగా పాదయాత్ర చేస్తున్నాం. 100 గిరిజన తండాలకు వెళ్లాము. వారి నుంచి పాదయాత్ర బృందానికి ఆపూర్వ స్పందన లభించింది. అచ్చంపేట ఏరియాలో శ్రీశైలం టైగర్ జోన్ ఉంది. అక్కడ చెంచుల జాతి అంతరించే పరిస్థితి వచ్చింది. 100 చెంచు కుటుంబాలకు 50 కుటుంబాలు మిగిలాయి. టైగర్‌ జోన్‌ పేరుతో గిరిజన గూడెంలనూ ప్రభుత్వం ఖాళీ చేయిస్తోంది. శ్రీశైలం టైగర్ జోన్ పేరుతో గిరిజన గూడాలను ఖాళీ చేయడం మంచింది కాదు. గిరిజనులకు ఏజెన్సీ సర్టిఫికెట్లను ప్రభుత్వం అందివ్వాలి' అని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

13:39 - November 3, 2016

హైదరాబాద్ : పోలీసుల కస్టడీలోనే ఉన్న..ఆర్కేను కోర్టులో హాజరుపరచాలని తాము కోర్టులో వాదించినట్లు ప్రజాసంఘాల తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే దీనిపై స్పందించి ఏపీ అడ్వకేట్ జనరల్... ఆర్కే తమ అదుపులోలేడని కోర్టుకు తెలిపారు. ఉంటే  కోర్టులో హాజరుపరిచేవాళ్లమని స్పష్టం చేశారు. ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడని ఆధారాలు చూపేందుకు 15 రోజుల సమయం కావాలని పిటిషనర్‌ కోరారు. దీంతో హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 
 

పంచాయతీ రాజ్..గ్రామీణాభివృద్ధి శాఖపై జూపల్లి సమీక్ష..

హైదరాబాద్ : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. తండాలను గ్రామ పంచాయతీలులగా మార్చడంపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 900 కోట్ల నిధులను త్వరితగతిన పొందేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్ వాడీ, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. 

ఎన్ కౌంటర్ ప్రదేశానికి ఓయూ జేఏసీ నిజనిర్ధారణ బృందం..

హైదరాబాద్ : ఏవోబీ ఎన్ కౌంటర్ పై నిజనిర్ధారణకు వెళుతున్నామని ఓయూ జేఏసీ నేతలు సతీష్, కోట శ్రీనివాస్, డేవిడ్ పేర్కొన్నారు. ఓయూతో పాటు అనేక యూనివర్సిటీల విద్యార్థులు నిజనిర్ధారణ బృందంలో ఉంటారని తెలిపారు. ఈనెల ఆరో తేదీన ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి చేరుకుంటామని, నాలుగు రోజుల పాటు నిర్ధారణ చేపడుతామన్నారు. ఎన్ కౌంటర్ పై వాస్తవాలు వెలికితీసేందుకు వెళుతున్నట్లు తెలిపింది. ఒడిశా..ఏపీ పోలీసులు, మావోయిస్టులు సహకరించాలని తెలిపారు. 

13:36 - November 3, 2016

గుంటూరు : అద్భుత నైపుణ్యానికి ప్రపంచ స్థాయి విద్య అవసరమని..విట్ యూనివర్సిటీతో అది సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లాలోని ఐనవోలులో జరిగిన వెల్లూరు సాంకేతిక విశ్వవిద్యాలయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితోపాటు  ఆయన శంకుస్థాపన చేశారు. అమరావతిలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. దేశంలోనే గొప్ప విద్యాసంస్థలున్న నగరంగా అమరావతిని నిలిపేందుకు కృషి చేస్తామని అన్నారు. 
చంద్రబాబు కృషితో ఏపీకి విట్ : వెంకయ్యనాయుడు
ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న విట్‌ సంస్థ... ఏపీకి రావడం వెనుక చంద్రబాబు కృషి ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. చంద్రబాబు ముందు చూపు కారణంగా ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఏపీకి వస్తున్నాయని ఆయన తెలిపారు. 

 

13:31 - November 3, 2016

ఒడిశా : ఏవోబీ ఎన్ కౌంటర్ నిరసనగా మావోయిస్టు పార్టీ ఇవాళ బంద్ కు పిలుపిచ్చింది. ఏవోబీ ఎన్ కౌంటర్ కు మావోయిస్టులు బదులు తీసుకున్నారు. ఒడిశాలో మావోయిస్టులు ప్రతీకార చర్య తీసుకున్నారు. రాయగఢ్ భవానీపట్నంలో మాజీ సర్పంచ్ ను మావోయిస్టులు హత్య చేశారు. మాజీ సర్పంచ్ ను కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:28 - November 3, 2016
13:26 - November 3, 2016

మృతి చెందిన మాజీ సైనికోద్యోగి కుటుంబానికి రూ. కోటి పరిహారం..

ఢిల్లీ : వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు విధానంలో జాప్యాన్ని నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికోద్యోగి రాంకిషన్ కుటుంబానికి సీఎం కేజ్రీవాల్ పరిహారాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబానికి రూ. కోటి సహాయాన్ని అందచేయనున్నట్లు ప్రకటించారు. 

బెంగళూరు స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణంపై స్టే..

చెన్నై : బెంగళూరు స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణంపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని సిటిజన్ ఫోరం వ్యతిరేకించింది. 

13:01 - November 3, 2016

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న హిల్లరీ, ట్రంప్‌ల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. ట్రంప్‌ అబద్ధాల కోరు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తని హిల్లరీ ఆరోపించగా...  అమెరికా అధ్యక్ష పదవికి ఎంతమాత్రం అర్హుడు కాదని ఒబామా ధ్వజమెత్తారు. మరోవైపు హిల్లరీ పాలసీలతో అమెరికాలో వలసలు పెరిగి జనాభా రెండింతలు కానుందని ట్రంప్‌ ఆరోపించారు. 
హిల్లరీ, ట్రంప్‌ల ఊపందుకున్న ప్రచారం  
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండడంతో హిల్లరీ, ట్రంప్‌ల ప్రచారం ఊపందుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
ట్రంప్‌పై విరుచుకు పడ్డ హిల్లరీ 
డెమోక్రెటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తన ప్రత్యర్థి రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ట్రంప్‌ అబద్ధాల కోరు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తని ఆరోపించారు. గత 30 ఏళ్లలో ట్రంప్‌ మహిళలను కించపర్చడంతోనే కాలం గడిపారని హిల్లరీ ధ్వజమెత్తారు.  ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవికి ఎంతమాత్రం అర్హుడు కాదని హిల్లరీ పేర్కొన్నారు. ట్రంప్‌ విషయంలో ఆలోచించి ఓటేయాలన్నారు. అణ్వాయుధాలపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు దేశానికి ప్రమాదకరమని హిల్లరీ హెచ్చరించారు.
హిల్లరీ విధానాలను దుయ్యబట్టిన ట్రంప్ 
న్యూమెక్సికోలోని ఓ ప్రచార సభలో రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ తన ప్రత్యర్థి హిల్లరీ విధానాలను తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. వలస విధానాలకు సంబంధించి హిల్లరీ పాలసీలతో అమెరికాలో 3 రెట్లు జనాభా పెరగనుందని ట్రంప్‌ హెచ్చరించారు. 2016లో అమెరికా జనాభా 324 మిలియన్లుగా ఉందని, హిల్లరీ విధానాలను అనుసరిస్తే రెండింతలు పెరుగుతుందని ఆరోపించారు.  ఓ అధ్యయనం ప్రకారం అమెరికాలో అక్రమ వలసదారులు 11 మిలియన్ల దాకా ఉన్నారని ట్రంప్‌ వెల్లడించారు.
ట్రంప్‌ పై మండిపడిన ఒబామా 
అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా ట్రంప్‌ పై మండిపడ్డారు. ఓహియోలోని ఓ సభలో ప్రచారం చేసిన ఒబామా-ట్రంప్‌కు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఇలాంటి వ్యక్తి అధ్యక్ష పదవికి అర్హుడు కాదని ఒబామా అన్నారు. ప్రాథమిక ఎన్నికల్లో రిపబ్లికన్లే ట్రంప్‌ను ఈసడించుకున్నారన్న విషయాన్ని ఒబామా ప్రజలకు గుర్తు చేశారు.  ముస్లింలను అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తాననని ట్రంప్‌ చెప్పడం అమెరికా విభిన్న సంస్కృతిపై దాడి చేయడమేనని అన్నారు.
హిల్లరీకి ఎదురు దెబ్బ 
మరో వారం రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హిల్లరీ క్లింటన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఓ పోల్‌ సర్వేలో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీపై రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌  స్వల్ప ఆధిక్యం కనబర్చారు.  హిల్లరీ కన్నా ట్రంప్‌కు ఒక్కశాతం ప్రజా మద్దతు పెరిగింది.

అఖిలేష్ యాత్రలో సాంకతిక లోపం..

ఉత్తర్ ప్రదేశ్ : సీఎం అఖిలేష్ యాదవ్ ప్రారంభించిన వికాస్ యాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే నిలిచిపోయింది. వాహనంలో సాంకేతిక లోపం తలెత్తడంతో యాత్ర నిలిచిపోయింది. 

12:56 - November 3, 2016

విశాఖ : ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు ఇవాళ ఒక్కరోజు బంద్‌కు పిలుపునివ్వడంతో ఐదు రాష్ట్రాల పోలీసులు అలెర్టయ్యారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా రాజకీయ నేతలపై దాడులు జరగవచ్చన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 
బస్సు రాకపోకలు పూర్తిగా నిలిపివేత 
మరోవైపు ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో బస్సు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఎక్కడికక్కడే చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి విస్త్రతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంద్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో గల ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే బస్సులను పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి దగ్గర అధికారులు నిలిపివేశారు. మావోయిస్టుల బంద్ జరుగుతున్న దృష్ట్యా ఏజెన్సీలో నక్సలైట్లు విధ్వంసకర చర్యలకు పాల్పడే అవకాశముందని భావిస్తూ పోలీసులు ఏజెన్సీలోకి వచ్చే బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్తలు పడుతున్నారు. 
మావోయిస్టు ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక నిఘా
అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ములుగు ఏజెన్సీలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.
మావోయిస్టుల బంద్ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హనుమాన్‌నగర్‌లో కార్డన్‌సెర్చ్ నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 50బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. బస్టాండ్, శివారుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు విశాఖ ఏజెన్సీలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. పాడేరులో ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. అక్కడకక్కడా ప్రైవేటు వాహనాలు తిరుగుతున్నాయి. పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సింగిల్ రూట్ బస్సులను ఆపేశామని, మిగతా రూట్లలో బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారాయి. బస్సులు నిలిచిపోవడంతో ప్రజా రవాణా స్తంభించింది.
ఏవోబీ సరిహద్దు గ్రామాల్లో హైటెన్షన్‌ 
మావోయిస్టుల బంద్‌ నేపథ్యంలో ఏవోబీ సరిహద్దు గ్రామాల్లో హైటెన్షన్‌ నెలకొంది. ప్రధానంగా ఒడిషాలో మావోయిస్టులు పలు ప్రాంతాల్లో పోస్టర్లను అంటించడంతో మరోసారి ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు గ్రామాల్లోని రహదారులపై మావోయిస్టులు పెద్ద ఎత్తున చెట్లను నరికివేయడంతో..రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

 

12:50 - November 3, 2016

హర్యానా : వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ పథకం విఫలమైందంటూ ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికుడు రాం కిషన్ గ్రెవాల్ అంత్యక్రియలు ముగిశాయి. హర్యానాలోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు ముగిశాయి. భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య మాజీ సైనికుడి అంతిమ యాత్ర సాగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. రామ్‌ కిషన్‌ గ్రేహల్‌ అంత్యక్రియలకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హజరయ్యారు.  
అంత్యక్రియలకు హాజరైన రాహుల్ గాంధీ
వన్‌ ర్యాంక్‌, వన్‌ పెన్షన్‌ పథకం విఫలమైందంటూ ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికుడు రామ్‌ కిషన్‌ గ్రెహన్‌ అంత్యక్రియల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. నిన్న ఆత్మహత్య చేసుకున్న సైనికుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన రాహుల్‌ గాంధీని పోలీసులు అడ్డుకోని పోలీస్టేషన్‌కు తరలించారు. రాహుల్‌ గాంధీతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య రామ్‌ కిషన్‌ గ్రెహన్‌ మృతదేహాన్ని హర్యానాలోని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. 

 

తల్లిని హతమార్చిన కొడుకులు..

హైదరాబాద్ : సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో సంజీవ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు కుమారులు తల్లిని కత్తితో పొడిచి చంపారు. 

12:42 - November 3, 2016

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న న్యూ మూవీకి ముహుర్తం ఖారారైంది. ఈ సినిమాను త్రివిక్రమ్, మిత్రుడు నిర్మిస్తుండడం విశేషం. ఈ కలయికలో మరో సినిమా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఆడియన్స్, మూవీ ఫిక్స్ కావడంతో పుల్ ఖుష్ అవుతున్నారు. సిని స్నేహితుల కొత్త మూవీ ముహుర్తం ఎప్పుడో చూద్దాం....
న్యూ మూవీ ఖాయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ న్యూ మూవీ ఖాయమైపోయింది. అధికారికంగా ఈ నెల 5న ముహూర్తం జరుపనున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ నిర్మాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా ఈ ఎడాది చేసిన 'అఆ' మూవీ భారీ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ 
ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ రాధాకృష్ణ నిర్మిస్తున్న భారీ చిత్రం కావడంతో ఒపెనింగ్ అట్టహాసంగా చేయాలని తలచారట. కానీ పవన్ మాత్రం సింపుల్ గానే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పడంతో, ముఖ్య అతిథుల మధ్యే త్రివిక్రమ్, పవన్ ల సినిమా ముహుర్తం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సైతం ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నట్లు టాక్. ఓ హీరోయిన్ ఆల్ రెడీ సమంతను ఫిక్స్ చేసినట్లు వినిపిస్తుంది.  
వచ్చే నెల నుంచి సెట్స్ పైకి 
పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్స్ విషయం తెలిసిందే. దీంతో పాటు త్రివిక్రమ్, పవన్ ల మధ్య గాఢమైన స్నేహం ఏర్పడంతో మాటల మాంత్రికుడు ఈసారి ప్రాణమిత్రుడి కోసం ఎలాంటి స్టోరీ రాశాడనేది వెరీ ఇంట్రెస్ట్ గా మారింది. ఈ నెలాఖరుకల్లా క్యాస్టింగ్ కంప్లీట్ చేసి సినిమాను వచ్చే నెల నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ యంగ్ మ్యాజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.  

 

12:36 - November 3, 2016

ఫైనల్ గా నాని ఆ ఒకడికి ఓటేశాడు. ఇంతకాలం సన్పెన్స్ కొనసాగుతున్న మూవీని నేచురల్ స్టార్ ఒకే చేశాడు. ఓ మాస్ స్టార్ హ్యండ్ ఇచ్చిన ఈ సినిమాను నాని హ్యండిల్ చేస్తుండడం వెరీ ఇంట్రెస్ట్ గా మారింది. మరి నాని చేస్తున్న ఈ కొత్త మూవీ విశేషాలేంటో చూద్దాం..
తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న నాని 
ప్రస్తుతం ఇండస్ట్రీలో క్షణం తీరిక లేకుండా సినిమాల మీద సినిమాల చేస్తున్న హీరో ఎవరంటే నాని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ ఎడాది మూడు సినిమాలు రిలీజ్ చేసి మూడు సక్సెస్ లు అందుకున్నాడు. అంతేనా ఈ హీరో నటిస్తున్న నేను లోకల్ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇలా ఒకే ఎడాదిలో నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన ఈ జనరేషన్ హీరోగా నాని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు.
సెట్స్ పైకి 'ఎవడో ఒకడు' 
దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న నేను లోకల్ సినిమాకి ఈ నెలతో ప్యాకప్ చెప్పనున్నారు. ఆ వెంటనే దిల్ రాజు, నాని తో ఎవడో ఒకడు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతుండడం విశేషం. వేణుశ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. నిజానికి స్టోరీని దిల్ రాజు రవితేజ తో చేయాలనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. దీంతో ఇప్పుడు ఇదే మూవీని నానితో సెట్ చేసి తెరకెక్కిస్తుండడం విశేషం.
ప్రీ ప్రొడక్షన్ పనులు 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ న్యూ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రం పుల్ ప్లెజ్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్నట్లు తెలుస్తుంది. అయితే దర్శకుడు శ్రీరామ్ మాత్రం ఇది రవితేజతో చేయాలనుకున్న స్టోరీ కాదని,మాస్ రాజా కోసం అనుకున్న స్టోరీ వేరే అని చెప్పుతున్నాడు. మరి రవితేజ కోసం అనుకున్న టైటిల్ ఎవడో ఒకడినే ఈ మూవీకి ఫిక్స్ చేయడం ఏంటీ అనే ప్రశ్నపై యూనిట్ నుంచి క్లారిటి లేదు. ఈ మాస్ ఎంటర్ టైనర్ లో నాని ఏ మేరకు ఫిట్ అనిపించుకుంటాడో చూడాలి.  

 

విట్ ముందుండాలి - బాబు..

గుంటూరు : 'విట్' రూపంలో ప్రపంచస్తాయి విద్యా సంస్థ రావడం శుభసూచికమని, అన్ని క్యాంపస్ లకంటే అమరావతి విట్ ముందుండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఐనవోలులో వెల్లూరు సాంకేతిక విశ్వ విద్యాలయానికి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు శంకుస్థాపన చేశారు. 

12:26 - November 3, 2016

చిరంజీవి 150వ సినిమా కోసం ఆడియన్స్ వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 సంక్రాంతి కానుక రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే అన్నయ్య మూవీ ఇచ్చిన టైం కంటే ముందుగానే రిలీజ్ కానుందట. ఖైదీ నెంబర్ 150 రిలీజ్ కి కొత్త ఇచ్చిన ఆ డేట్ ఏంటో చూడండి.. 
చిత్రం కాస్త ముందుగానే రిలీజ్ ..? 
లాంగ్ గ్యాప్ తరువాత చిరంజీవి మూవీ చేస్తుండడంతో ఖైదీ నెంబర్ 150 రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదల చేయన్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం కాస్త ముందుగానే రిలీజ్ కానుందని సమాచారం.
11నే రిలీజ్ 
సంక్రాంతి కానుక జనవరి 14న రిలీజ్ కావాల్సిన ఖైదీ నెంబర్ 150 ఇప్పుడు 11నే రిలీజ్ కాబోతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ పుల్ హ్యపీగా ఫీలవుతున్నారు. అన్నయ్య మూవీ కాస్త ముందుగా రిలీజ్ అవుతుండడంతో మెగా ఫ్యాన్స్ కి పండుగ ముందే వచ్చినట్లైంది. సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ మూవీని రెండు రోజులు ముందుకు జరిపినట్లు టాక్.
కత్తికి రిమేక్ 
మెగావారసుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ సూపర్ హిట్టు కత్తికి రిమేక్ గా తెరకెక్కుతుంది. వినాయక్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి పక్కన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ డ్రామాకి మేసేజ్ ని జోడించి ఈ మూవీని వెరీ ఇంట్రెస్ట్ గా వినాయక్ మలుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ లోబిజీగా ఉన్న ఈ మూవీ ఆడియోను వచ్చే నెలలో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.  

 

12:12 - November 3, 2016

చిత్తూరు : పర్యాటక కేంద్రాల్లో ఏం జరుగుతుంది...? అక్కడ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతున్న అనర్థాలకు ఎవరు బాధ్యులు..? కొందరి కక్కుర్తితో పర్యాటక..యాత్రాస్థలాల్లో అపచారమే జరుగుతుంది. స్థానిక పోలీసులకు కన్పించడం లేదా..? లేక తెలిసినా పట్టించుకోవడం లేదా..? ఆహ్లాదకరమైన వాతావరణం కోసం..ప్రశాంతత కోసం పవిత్ర స్థలాలకు వచ్చేస్తున్న వారి పరిస్థితి ఏంటి.?? కైలాసనాథ కోనలో యదేచ్చగా వ్యభిచారం కొనసాగుతున్నా ఎవరికీ కన్పించడం లేదా..? టూరిజం సిబ్బందే ప్రోత్సహిస్తుంటే పోలీసులకు..సంబంధిత అధికారులకు తెలియడం లేదా..? భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు నిఘా పెట్టలేదు...పర్యాటకస్థలాలను ఏర్పాటు చేసింది పాపాత్ముల కోసమేనా...??
కైలాసనాథ కోన ప్రసిద్ద క్షేత్రం 
ఇది కైలాసనాథ కోన...చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని కైలాసనాథ కోనకు జిల్లాలోనే ప్రసిద్ద క్షేత్రంగా పేరుంది..స్వయానా పార్వతీ పరమేశ్వరులే ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్దులై సేదతీరినట్లు చెబుతుంటారు...ఆ దేవదేవులే నడయాడిన కోనగా భాసిల్లుతూ కైలాసనాథ కోనకు యాత్రికుల రాకపోకలు పెరిగాయి...
నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు 
ఆ శివుడి పవిత్ర మాసంగా కొలిచే కార్తీక మాసం ఘడియల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఇక్కడ టూరిజం శాఖ కూడా వసతులు ఏర్పాటు చేసింది...దీంతో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతుంటారు. ఇలాంటి పవిత్ర స్థలంగా భావించే చోట స్వార్థపరులు పెరిగిపోయారు...తమ సుఖాల కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారన్న ఆరోపణలు పెరిగిపోయాయి....
పవిత్రక్షేత్రంలో పాపాత్ములు..
కైలాసనాథ కోన...ఈ పేరు తెలియనివారు లేరు..శివభక్తులేగాకుండా...అయ్యప్ప మాలధారణ కార్యక్రమాలకు ఇక్కడికి చేరతారు..వీరితో పాటే పాపాత్ములు కూడా చేరుతున్నారు...అందుకు టూరిజంలోని కొందరు సిబ్బంది కక్కుర్తికి పవిత్రస్థలం కాస్త పాపాత్ముల అడ్డాగా మారుతుంది... విచ్చలవిడిగా వ్యభిచార కార్యకలాపాలు సాగేందుకు కాటేజీలనే ఎంచుకుంటున్నారంటే అక్కడివారి ప్రోత్సాహం ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతోంది...
అసాంఘీక శక్తులు 
ఆహ్లాదకరమైన వాతావరణానికి, మానసిక ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న కైలాసనాథ కోనకు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు ఇక్కడకు వస్తుంటారు. ఈ ప్రాంతాన్నే తమకు అనుకూలంగా మార్చుకున్న అసాంఘీక శక్తులు కొంతమంది అడ్డాగా మార్చుకుంటున్నారు. దీనికి ఏపి టూరిజం సిబ్బంది తమ వంతు సాయంగా ఈ పాపంలో పాలుపంచుకుంటున్నారు.
ప్రశ్నించివారికి బెదిరింపులు
ఇక పవిత్ర క్షేత్రంలో జరుగుతున్న పాపాత్ముల కార్యకలాపాలపై ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం బెదిరింపులు మామూలే..అందుకు మామూళ్లతో పెద్దోళ్లను తమవైపు తిప్పుకుంటున్న వారే వీటిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి...అటవీ ప్రాంతంను తలిపించే ఈ ప్రాంతంలో ఎక్కువగా తమిళనాడు నుండి పర్యాటకలు రావడం, వారితో పాటు మాంసం, మందు తరలివస్తున్నాయి.
యదేచ్చగా కొనసాగుతున్న వ్యభిచారం..
భక్తులు సమాచారం ఇవ్వడంతో ఏపి టూరిజం వద్ద కాపుకాస్తే నమ్మలేని నిజాలు కెమారాకు చిక్కాయి...టూరిజం అతిదిగృహంలో యదేచ్చగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనికి టూరిజంలోని సిబ్బంది వారికి కావల్సిన అన్నింటిని సరఫరా చేస్తున్నారు...ఈ పాడు పనికోసం ఎక్కడక్కడ నుండో  జంటలు, జంటలుగా ఇక్కడ వచ్చి తమ పని పూర్తి చేసుకుంటున్నారు....అందుకు ఈ వీడియోలే సాక్ష్యం...
మనోభావాలు దెబ్బతీస్తున్నారంటున్న భక్తులు..
వచ్చినవారెవరు..ఎందుకు వచ్చారు...వారి వాలకం చూసి అనుమానం వచ్చినా ఎలాంటి సమాచారం అడగడం లేదు..అందుకు కారణం ఒక్కటే...వారికి డబ్బు ఇస్తే చాలు అని అక్కడున్నవారు చెప్పడం చెప్పుకోదగ్గ విషయమే...
గంట గంట చొప్పున డబ్బులు వసూలు 
ఇక ఇక్కడికి జంటలుగా తమ సుఖాల కోసం వచ్చేవారి నుంచి గంట గంట చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది...పవిత్ర స్థలంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం చూసేందుకు వచ్చే ఫ్యామిలీలు ఇక్కడి వ్యవహారంతో ఇబ్బందులు పడుతున్నారు...అయితే ఇంత జరుగుతున్న పోలీసులు స్పందించకపోవడానికి కారణాలు ఏంటనేది అర్థం కాని ప్రశ్నలే...పవిత్రను దెబ్బ తీసే విదంగా తెర వెనుక కథ నడుపుతున్న బడానాయకులు ఎవరన్నది అంతుచిక్కడం లేదు.

 

11:59 - November 3, 2016

హైదరాబాద్ : ఆర్కే ఆచూకీ తెలపాలంటూ ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్కే తమ అదుపులో లేడని ఏపీ అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. తమ అదుపులో ఉంటే పెండింగ్ లో ఉన్న కేసుల్లో పోలీసులు కోర్టులో హాజరుపరిచేవారని తెలిపారు. పోలీసుల దగ్గర ఉన్నాడని ఆధారాలు చూపేందుకు 15 రోజుల సమయం కావాలని పిటిషననర్ కోర్టును అభ్యర్థించారు. దీనితో విచారణను రెండు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:54 - November 3, 2016
11:53 - November 3, 2016


యూపీ : సమాజ్ వాదీ పార్టీలో తన్నులాట కొనసాగుతోంది. బాబాయ్, అబ్బాయ్ వర్గీయుల మధ్య గొడవలు జరుగుతూనేవున్నాయి. ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్, శివపాల్ యాదవ్ సమక్షంలోనే సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. 'వికాస్ రథయాత్ర' పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ అఖిలేశ్ యాదవ్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎస్పీ కార్యకర్తలు పరస్పరం తన్నుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 
అఖిలేశ్ రథయాత్ర విజయవంతం కావాలి : ములాయం 
అఖిలేశ్ రథయాత్ర విజయవంతం కావాలని సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఆకాంక్షించారు. అఖిలేష్‌ శ్రీకారం చుట్టిన 'వికాస్ రథయాత్ర'లో పాల్గొన్న ఆయన.. ఉత్తరప్రదేశ్ లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తున్న విశ్వాసం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

ట్రంప్ పై ఒబామా విమర్శలు..

అమెరికా : అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై అమెరికా అధ్యక్షుడు ఒబామా మరోసారి విమర్శలు గుప్పించారు. అతడిని ఎన్నుకుంటే ప్రమాదంలో పడుతుందని, పౌర హక్కులకు ట్రంప్ ప్రమాదకారి అని ఆరోపించారు. 

మావోయిస్టు ఖైదీల నిరహార దీక్ష..

హైదరాబాద్ : చర్లపల్లి జైల్లో మావోయిస్టు ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టులు బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బంద్ కు సంఘీభావంగా వీరు ఈ ఉదయం నుంచి దీక్షను చేపట్టారు. 

11:50 - November 3, 2016

గద్వాల : జోగులాంబ జిల్లా ఇటిక్యాల మండలం బీచ్‌పల్లి వద్ద మహిళా మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి. కృష్ణానదికి సమీపంలో గుర్తుతెలియని ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఈ ముగ్గురు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా లేక..ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందారా అన్నది తేలాల్సి ఉంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

బాబు కృషి అభినందనీయం - వెంకయ్య...

గుంటూరు : ఐనవోలులో విట్ కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడారు. తొందరగా సచివాలయం పూర్తి చేసుకున్న సిబ్బంది..కొన్ని సమస్యలున్నా కొత్త సచివాలయంలో కొలువుదీరిన ఉద్యోగులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానానికి చేరాయని, విట్ ను రాష్ట్రానికి తీసుకరావడంలో చంద్రబాబు కృషి అభినందనీయమన్నారు. 

11:47 - November 3, 2016

విజయవాడ : వంటగ్యాస్‌ పేలుడు జరిగిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ బాబు రావు డిమాండ్ చేశారు. సుందరయ్య నగర్‌లో వంటగ్యాస్‌ పేలుడు జరిగిన ఘటన స్థలాన్ని ఆయన సందర్శించారు. బాధితులను వివరాలు అడిగి తెలుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. స్థానిక ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

రాంకిషన్ అంత్యక్రియల్లో పాల్గొన్న రాహుల్..

ఢిల్లీ : వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు విధానంలో జాప్యాన్ని నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికోద్యోగి రాంకిషన్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ అంత్యక్రియల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాసేపట్లో బామ్లాకు సీఎం కేజ్రీవాల్ చేరుకోనున్నారు. 

11:43 - November 3, 2016

దీపావళి రోజునే టార్గెట్.. టపాసుల మధ్యలో కాల్పులు..అనంతరం పరారీ..ఎవరీ హంతకులు..ఎందుకు చంపారు..

సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాడు..అందరి మంచి కోరుకుంటాడు.. కానీ అతనికి మాత్రం శతృవులు పెరిగిపోయారు.. వ్యాపారంలో విబేధాలా ? మరైదైనా కారణాలున్నాయా ? బెంగళూరులో హత్యకు గురైనా ఆంధ్రా పారిశ్రామికవేత్తను అంతం చేసింది ఎవరు ? దీపావళి టపాసుల మధ్యలో కాల్పులు జరిపి పారిపోయిన కిరాతకులు ఎవరు ?
బెంగళూరులో ఆంధ్రా పారిశ్రామిక వేత్త పరుచూరి సురేంద్ర కుమార్ స్థిరపడ్డారు. 15 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ పేరిట ఆయన పలు సేవా కార్యక్రమాలు చేసేవారు. కానీ ఈయనకు శతృవులు పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ఎందుకు ఆయన ఇటీవలే తుపాకి లైసెన్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం. హత్య జరిగిన సమయంలో దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయినట్లు, దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మరి ఎవరో హంతకులు ? 

11:43 - November 3, 2016

తూర్పుగోదావ‌రి : జిల్లాలోని తొండంగిలో తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. దివీస్ ఫార్మాకి వ్యతిరేకంగా దివీస్ వ్యతిరేక పోరాట క‌మిటీ ఇచ్చిన పిలుపుతో పోలీసులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు. స‌భ జ‌రిపి తీరుతామ‌ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మ‌ధు ప్రకటిస్తుంటే..స‌భ‌ను అడ్డుకోవ‌డానికి పోలీసులు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సీపీఎం నేత‌లను అడ్డుకోవ‌డానికి కాకినాడ‌ తుని మ‌ధ్యలో పెద్ద ఎత్తున చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. 

 

11:41 - November 3, 2016

కేసును నీరుగార్చే ప్రయత్నాలు ? పోలీసులను అడ్డుకుంటున్నది ఎవరు ? ప్రదీప్ మరణం మిస్టరీయేనా ?

విశాఖపట్టణం అనకాపల్లిలో అవంతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి 'ప్రదీప్' మృతి మిస్టరీ వీడడం లేదు. ఇక ఈ కేసు మిస్టరీయేనా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హత్య చేసిన వారిని శిక్షించాలంటూ ప్రదీప్ బంధువులు..విద్యార్థులు ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. కేసును నీరుగారస్తున్నారంటూ ఆందోళన పెరిగింది..కేసులో వాస్తవాలు బయటకు రాకుండా చేస్తున్నారంటూ ఆరోపణలు పెరిగాయి. వీటికి పోలీసులు చెబుతున్న సమాధానాలు మాత్రం బాధితులకు ఓదార్పు ఇవ్వడం లేదు. మరి స్టూడెంట్ ప్రదీప్ డెత్ కథేంటీ ? ప్రేమ వ్యవహారమే కారణమా ? లేక మరేదైనా జరిగిందా ? కొంతమంది యువకులు ప్రదీప్ ను గాయపరిచారని, అప్పటి నుండి కనిపించడం లేదని పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే ప్రదీప్ మృతదేహం లభ్యం కావడం సంచలనం సృష్టించింది. మరి ఈ కేసు మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి. 

11:37 - November 3, 2016

ఖమ్మం : ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో మావోయిస్టుల బంద్‌ కొనసాగుతోంది. హోటళ్లు‌, లాడ్జీల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాజేడు, వెంకటాపుపరం, చర్ల మండలాల్లో గిరిజనులు పోలీసుల పహారాలో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కదలికలపై ఖమ్మం సీపీ నిఘా పెంచారు. తెలంగాణలో 7 జిల్లాల్లో, ఏపీలో 5 జిల్లాల్లో బంద్‌ ప్రభావం కనబడుతోంది. తమ అనుమతి లేకుండా ఎటూ వెళ్లకూడదని రాజకీయ నేతలకు పోలీసుల ఆంక్షలు విధించారు. వీఐపీలకు భద్రత పెంచారు.
ఏవోబీ సరిహద్దు గ్రామాల్లో హైటెన్షన్‌
మావోయిస్టుల బంద్‌ నేపథ్యంలో ఏవోబీ సరిహద్దు గ్రామాల్లో హైటెన్షన్‌ నెలకొంది. ప్రధానంగా ఒడిషాలో మావోయిస్టులు పలు ప్రాంతాల్లో పోస్టర్లను అంటించడంతో మరోసారి ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు గ్రామాల్లోని రహదారులపై మావోయిస్టులు పెద్ద ఎత్తున చెట్లను నరికివేయడంతో..రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియాలో చూద్దాం..

 

11:32 - November 3, 2016

హైదరాబాద్‌ : ఆర్కే భార్య వేసిన పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఆర్కేను కోర్టు ముందు ప్రవేశపెట్టేలా ఆదేశించాలంటూ ఆర్కే భార్య శిరీష అక్టోబర్‌ 31న పిటిషన్ వేశారు. ఆర్కే తమ అదుపులో లేరంటూ ఏపీ పోలీసులు వాదిస్తున్నారు. ఆర్కేపై 40 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఏపీ పోలీసులు తెలిపారు. విశాఖ రూరల్‌ పీఎస్‌లో 22 కేసుల్లో కోర్టుకు హాజరుకావట్లేదన్నారు. పిటిషనర్‌ ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఆర్కే ఆచూకీ తెలపాలంటూ దాఖలైన పిటిషన్‌పై కాసేపట్లో ఏపీ పోలీసులు కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్‌ కొనసాగుతోంది. మావోయిస్టు బంద్‌ ప్రభావం ఆర్కే చుట్టూ తిరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టు వాల్‌పోస్టర్లు వెలిశాయి. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా డెన్‌లపై దాడి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బంద్‌ ప్రభావం కనపడకుండా పోలీసులు మోహరింంచారు. తమ అనుమతి లేకుండా ఎటూ వెళ్లకూడదని రాజకీయ నేతలకు పోలీసుల ఆంక్షలు విధించారు. వీఐపీలకు భద్రత పెంచారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. తెలంగాణలోని 7 జిల్లాల్లో, ఏపీలో 5 జిల్లాల్లో బంద్‌ ప్రభావం కొనసాగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఆర్కే కేసు..వాయిదా..

హైదరాబాద్ : ఆర్కే ఆచూకీ తెలపాలంటూ ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్కే తమ అదుపులో లేడని ఏపీ అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. తమ అదుపులో ఉంటే పెండింగ్ లో ఉన్న కేసుల్లో పోలీసులు కోర్టులో హాజరుపరిచేవారని తెలిపారు. పోలీసుల దగ్గర ఉన్నాడని ఆధారాలు చూపేందుకు 15 రోజుల సమయం కావాలని పిటిషననర్ కోర్టును అభ్యర్థించారు. దీనితో విచారణను రెండు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది.  

ఐనవోలులో విట్ శంకుస్థాపన...

గుంటూరు : జిల్లాలోని ఐనవోలులో విట్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు, తదితరులు పాల్గొన్నారు. 

10:58 - November 3, 2016

టాలీవుడ్..ఇతర వుడ్ లలో పలు చిత్రాల్లో 'త్రిష' నటించి ప్రేక్షకుల మన్ననలను చూరగొంది. టాలీవుడ్ అగ్ర హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందని..పెళ్లి చేసుకొంటోందనే పుకార్లు షికార్లు చేశాయి. కానీ 'త్రిష' మాత్రం సినిమాల్లో నటిస్తోంది. అందర్నీ షాక్ చేసేలా తమిళంలో వరుసగా కేజ్రీ ఆఫర్స్ దక్కించుకొంటోంది. ప్రస్తుతం త్రిష చేతిలో ఆరేడు సినిమాలు ఉన్నట్లు టాక్. ఇదిలా ఉంటే పలు చిత్రాల్లో రిస్క్ తో కూడుకున్న షాట్స్ ఉంటాయి. ఇందులోనే కిక్ ఉంటుందని ఈ భామ పేర్కొంటోంది. 'త్రిష' టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం 'మోహిని' రమణ మాదేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం నీటి లోపల కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. దీనికి 'త్రిష' ఒకే చెప్పేశారు. ఈ సీన్స్ ని ఇటీవలే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో దర్శకుడితో 'త్రిష' నీటిలో ఓ ఫొటో కూడా దిగింది. 'నీటి లోపల మా డైరెక్టర్ తో సరదాగా' అంటూ 'త్రిష' ఆ ఫొటోను ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. అదండి సంగతి..

స్వల్పలాభాల్లో స్టాక్ మార్కెట్..

ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. 22 పాయింట్లకు పైగా సెనెక్స్, 8 పాయింట్లకు పైగా నిఫ్టీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

10:37 - November 3, 2016
10:35 - November 3, 2016

హైదరాబాద్ : 'ముందే 'పెట్రోల్' పోయించుకోండి' అంటున్నారు ఏంటీ ? మళ్ళీ ధరలు పెరుగుతాయా ? లేక స్టాక్ ఉండదా ? అని అనుకుంటున్నారా ? అదేం కాదు. పెట్రోల్ బంక్ లకు తాళాలు పడనున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గతంలో లాగా చేసినట్లుగానే ఈసారి కూడా పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఆందోళన బాటపట్టాయి. ఈనెల 6వ తేదీన దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంక్ లు మూతపడనున్నాయి. ఐదో తేదీన సాయంత్రం ఆరు గంటల వరకు బంక్ లు పనిచేయనున్నట్లు తెలుస్తోంది. పెట్రో కంపెనీలు ఆయిల్ పై మార్జిన్ పెంచాని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనలో భాగంగా గురు, శుక్రవారాల్లో కంపెనీల నుంచి ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేయనున్నారు. సో...ముందే పెట్రోల్ పోయించుకుంటే బెటర్..

10:26 - November 3, 2016

ఆర్కే కేసు..కౌంటర్ దాఖలు చేయనున్న పోలీసులు..

హైదరాబాద్ : ఆర్కే ఆచూకి తెలపాలంటూ దాఖలైన పిటిషన్ పై ఏపీ పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. పిటిషన్ ఆరోపణలు అవాస్తవమని, ఆర్కే తమ అదుపులో లేడని ఏపీ పోలీసులు వాదిస్తున్నారు. ఆర్కేపై 40 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, విశాఖ రూరల్ పీఎస్ లో నమోదైన 22 కేసుల్లో కోర్టుకు హాజరు కావడం లేదని పేర్కొంటున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న మావోయిస్టుల బంద్‌

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్‌ కొనసాగుతోంది. తెలంగాణలోని 7 జిల్లాల్లో, ఏపీలో 5 జిల్లాల్లో బంద్‌ ప్రభావం కనిపిప్తోంది.  మావోయిస్టు బంద్‌ ప్రభావం ఆర్కే చుట్టూ తిరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా డెన్‌లపై దాడి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బంద్‌ ప్రభా

09:54 - November 3, 2016

హైదరాబాద్ : ఆర్కే భార్య వేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఆర్కేను కోర్టు ముందు ప్రవేశపెట్టేలా ఆదేశించాలంటూ ఆర్కే భార్య శిరీష అక్టోబర్‌ 31న పిటిషన్ వేశారు. ఆర్కే తమ అదుపులో లేరంటూ పోలీసులు వాదిస్తున్నారు. ప్రజాసంఘాలుమాత్రం ఆర్కేను పోలీసులే ఎక్కడో దాచారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్‌ కొనసాగుతోంది. తెలంగాణలోని 7 జిల్లాల్లో, ఏపీలో 5 జిల్లాల్లో బంద్‌ ప్రభావం కనిపిప్తోంది.  మావోయిస్టు బంద్‌ ప్రభావం ఆర్కే చుట్టూ తిరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా డెన్‌లపై దాడి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బంద్‌ ప్రభావం కనపడకుండా పోలీసులు మోహరించారు. తమ అనుమతి లేకుండా ఎటూ వెళ్లకూడదని రాజకీయ నేతలకు పోలీసుల ఆంక్షలు విధించారు. వీఐపీలకు భద్రత పెంచారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆర్కేను కోర్టు ముందు ప్రవేశపెట్టేలా ఆదేశించాలంటూ శిరీష పిటిషన్

హైదరాబాద్ : ఆర్కే భార్య వేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఆర్కేను కోర్టు ముందు ప్రవేశపెట్టేలా ఆదేశించాలంటూ ఆర్కే భార్య శిరీష అక్టోబర్‌ 31న పిటిషన్ వేశారు. ఆర్కే తమ అదుపులో లేరంటూ పోలీసులు వాదిస్తున్నారు. ప్రజాసంఘాలుమాత్రం ఆర్కేను పోలీసులే ఎక్కడో దాచారని ఆరోపిస్తున్నాయి. 

09:46 - November 3, 2016

విశాఖ : ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు పార్టీ బంద్‌కు పిలుపు ఇచ్చింది. మావోయిస్టుల బంద్‌ ప్రకటనతో..మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. బంద్‌ ప్రకటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మన్యంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రజా ప్రతినిధులకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు కీలకమార్గాల్లో వాహన తనిఖీలు చేస్తున్నారు. హోటల్స్, లాడ్జిలలో పూర్తిస్థాయిలో చెకింగ్స్ చేపడుతున్నారు. అనుమానితులపై ఆరాతీస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలన్నింటినీ పోలీసుశాఖ జల్లెడపడుతోంది. 
కరీంనగర్‌ జిల్లాలో పోలీసులు అలెర్ 
మావోయిస్టుల బంద్‌ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లాలో పోలీసులు అలెర్టయ్యారు. కాళేశ్వరం-కన్నేపల్లి వద్ద తెలంగాణ-మహారాష్ట్ర వంతెనపై అర్ధరాత్రి నుంచి ఈతెల్లవారుజాము వరకు కూడా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని ఆపి విస్త్రత తనిఖీలు చేపడుతున్నారు. అనుమానాస్పదంగా కనపడ్డ వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు తూర్పు అటవీ ప్రాంతాన్ని మొత్తం పోలీసులు జల్లెడ పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

కరీంనగర్‌ జిల్లాలో పోలీసులు అలెర్ట్

కరీంనగర్ : మావోయిస్టుల బంద్‌ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లాలో పోలీసులు అలెర్టయ్యారు. కాళేశ్వరం-కన్నేపల్లి వద్ద తెలంగాణ-మహారాష్ట్ర వంతెనపై అర్ధరాత్రి నుంచి ఈతెల్లవారుజాము వరకు కూడా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని ఆపి విస్త్రత తనిఖీలు చేపడుతున్నారు. అనుమానాస్పదంగా కనపడ్డ వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు తూర్పు అటవీ ప్రాంతాన్ని మొత్తం పోలీసులు జల్లెడ పడుతున్నారు. 

 

ఉద్రిక్తంగా మారిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు

విశాఖ : మావోయిస్టుల బంద్‌ ప్రకటనతో..మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. బంద్‌ ప్రకటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మన్యంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రజా ప్రతినిధులకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు కీలకమార్గాల్లో వాహన తనిఖీలు చేస్తున్నారు.  హోటల్స్, లాడ్జిలలో పూర్తిస్థాయిలో చెకింగ్స్ చేపడుతున్నారు. అనుమానితులపై ఆరాతీస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలన్నింటినీ పోలీసుశాఖ జల్లెడపడుతోంది. 

09:36 - November 3, 2016

విజయవాడ : సుందరయ్యనగర్ లో వంటగ్యాస్ లీకై పేలుడు సంభవించింది. కంప్యూటర్ ఆన్ చేయగానే పేలుడు జరిగింది. దీంతో ఇల్లు ధ్వంసం అయింది. పేలుడు ధాటికి చుట్టుపక్కల నాలుగు ఇళ్లలకు బీటలు వారాయి. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:31 - November 3, 2016

వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ ను అరెస్టు సరికాదని వక్తలు అన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తులసీదాస్, కాంగ్రెస్ నేత బెల్యా నాయక్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:22 - November 3, 2016

రాష్ట్రంలో దళితులకు స్మశానవాటికలే లేవని.. అలాంటప్పుడు బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని కుల వివక్ష వ్యతిరేకపోరాట సంఘం(కెవిపిఎస్) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 9 వేల గ్రామాల్లో దళితులకు స్మశాన స్థలాలు లేవని తెలిపారు. ఉన్న స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని చెప్పారు. ఏదో ఒక గ్రామంలో స్మశానవాటికలు ఉన్నా.. దళితులకు, అగ్రవర్ణాలకు వేర్వేరుగా స్మశాన వాటికలు ఉన్నాయని పేర్కొన్నారు. బూడిదలో కూడా కుల వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 'స్మశానవాటికలు ఇప్పుడో పెద్ద సమస్యగా మారాయి.  పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఈ సమస్య బాధిస్తోంది. కొన్ని చోట్ల స్మశానవాటికలు కబ్జాలకు గురవుతుంటే, మరికొన్ని చోట్ల స్మశానవాటికలకు వెళ్లే దారిలేక జనం అవస్థ పడుతున్నారు. దళితుల విషయంలో వివక్ష అదనపు సమస్యగా మారి బాధిస్తోంది.' మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:03 - November 3, 2016

ఒక వైపు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ సిటీలు, అమృత నగరాలు నిర్మిస్తామంటున్నాయి. కానీ తోటి మనిషి చనిపోతే, అంత్యక్రియలు నిర్వహించడానికి కాస్తంత స్థలం లేక, అక్కడకు వెళ్లే దారిలేక జనం బాధపడుతున్నారు. 
స్మశానవాటికలనూ వదలని కబ్జా కోరులుత
మరణం అనివార్యం. పుట్టిన ప్రతి మనిషీ ఏదో ఒకరోజు చనిపోకతప్పదు. మృత్యుదేవత ఎప్పుడు ఏ రూపంలో కబళిస్తుందో ఊహించలేం. మన తోటివారు ఎవరు, ఎప్పుడు, ఏ కారణంతో చనిపోయినా బాధపడతాం. దు:ఖిస్తాం. అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలుకుతాం.  స్మశానం దాకా వెళ్లి, అంత్యక్రియల్లో పాల్గొని బరువెక్కిన హృదయాలతో తిరిగొస్తాం. తోటి మనుషుల పట్ల మనం నిర్వర్తించే కనీస ధర్మమిది.  
అంత్యక్రియలకు కనీస స్థలం లేకపోతే పరిస్థితేమిటి? 
కానీ, చనిపోయిన ఆత్మీయుడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కనీస స్థలం లేకపోతే పరిస్థితేమిటి? స్మశాన వాటికకు వెళ్లేందుకు, మ్రుతదేహాన్ని తీసుకెళ్లేందుకు దారికూడా లేకపోతే అంత్యక్రియలు చేసెదెట్లా? ఇదే సమస్య ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తీవ్రంగా వుంది. 
చాలాచోట్ల స్మశానవాటికలు లేవు
చాలాచోట్ల స్మశానవాటికలు లేవు. కొన్ని చోట్ల వెళ్లేందుకు దారిలేదు. మరికొన్ని చోట్ల కబ్జా కోరులు ఆక్రమిస్తున్నారు. అనేక స్మశాన వాటికల్లో కనీస సదుపాయాలు లేవు. అంత్యక్రియలకు హాజరైన బంధువులు కనీసం కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు కూడా లేని దుస్థితి. షెడ్డులు వున్న స్మశానవాటికల సంఖ్య చాలా స్వల్పం. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాలు, నగరాల్లోనూ స్మశానవాటికల సమస్య చాలా తీవ్రంగా వుంది. గత పదిపదిహేనేళ్ల కాలంలో దాదాపు అన్ని పట్టణాలు విస్తరించాయి. కొత్తకొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. కానీ, ఏ ఒక్క చోటా స్మశానవాటికలకు స్థలాలు కేటాయించలేదు.   ఆధునిక అభివృద్ధికి చిరునామాగా భావిస్తున్న హైదరాబాద్ మహానగరంలోనూ స్మశానవాటికల్లో అనేక సమస్యలు బాధిస్తున్నాయి. నిర్వహణా లోపాలు వెక్కిరిస్తున్నాయి. 
ఇక దళితుల పరిస్థితి మరీ దుర్భరం
ఇక దళితుల పరిస్థితి మరీ దుర్భరం. స్మశానవాటికలు లేక, దారులు లేక దళితులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఒక్కొక్కసారి వివాదాలూ తలెత్తి, ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. తమకు స్మశానవాటికలు నిర్మించాలంటూ చాలా ఏళ్లుగా దళితులు పోరాడుతున్నారు. దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 1235 జీవోను జారీ చేశారు. దళితులకు స్మశాన వాటికలు నిర్మించాలనీ, ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు లేకపోతే ప్రయివేట్ స్థలాలు కొనైనా వాటిని నిర్మించాలంటూ ఆ జీవో పేర్కొన్నారు. స్మశానాలు ఆక్రమణలకు గురికాకుండా వాటి చుట్టూ ప్రహరిగోడ నిర్మించాలనీ , దహన సంస్కారాలకు వీలుగా షెడ్డులు నిర్మించి, బోర్ లు ఏర్పాటు చేయాలన్నది ఆ జీవోలోని మరో ముఖ్యమైన పాయింట్. కానీ, ఆ జీవో సక్రమంగా అమలు కావడం లేదు. ఇప్పటికీ స్మశానవాటికల కోసం పోరాడాల్సిన దయనీయ స్థితి దళితులది. 

 

08:56 - November 3, 2016

జైపూర్ : రాజస్థాన్‌లోని ఓ నగరంలోకి బీఎస్‌ఎఫ్‌ బలగాలతో అధికారులు వెళ్లారు..ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు..అక్కడికి వెళ్లిన అధికారులు కూడా ఆ ప్రాంతంలో సోదాలు చేస్తే దొరికిన టాబ్లెట్లు చూసి నివ్వెరపోయారు..అవన్నీ మత్తు పదార్థాలే... భారీ డ్రగ్‌ రాకెట్‌ను చేధించిన డీఆర్‌ఐ అధికారులు బాలివుడ్‌ నిర్మాతను అదుపులోకి తీసుకున్నారు...అధికారుల రైడ్స్‌లో దొరికిన మత్తు పదార్థాల విలువ మూడువేల కోట్లకుపైనే...
పెద్దమొత్తంలో మత్తు పదార్థాలు 
మాదక ద్రవ్యాలను సరఫరా చేసేందుకు రెడీ చేస్తున్న భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టును విప్పారు డీఆర్‌ఐ అధికారులు...సెంట్రల్‌ టీమ్స్‌ ఆధ్వర్యంలో జరిగిన సోదాల్లో పెద్దమొత్తంలో మత్తు పదార్థాలు దొరికాయి...వేల కోట్లు విలువజేసే డ్రగ్స్‌ను పట్టుకోవడంతో కలకలం రేపింది.
3వేల కోట్ల విలువైన నార్కోటిక్ డ్రగ్‌ సీజ్ 
రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఓ ఫ్యాక్టరీపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చేసిన దాడుల్లో భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. 3వేల కోట్ల విలువైన నార్కోటిక్ డ్రగ్‌ను అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఈ డ్రగ్ వ్యవహారంతో సంబంధమున్న బాలీవుడ్ నిర్మాత సుభాష్ దుధానిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
టాబ్లెట్ల రూపంలో తయారీ...
ఉదయపూర్ సమీపంలోని మరుధర్ డ్రింక్స్ అనే కంపెనీలో టాబ్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకుని దాడులు చేశారు...ఇందులో మెత్తం 2 కోట్లకుపైగా ఉన్న టాబ్లెట్స్ దొరికాయి..ఇవి 23 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుందని లెక్క తేల్చారు.... దీని మార్కెట్ విలువ 3వేల కోట్ల విలువ ఉంటుందని  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ క‌స్టమ్స్‌ చైర్‌ప‌ర్సన్ న‌జీబ్ షా వెల్లడించారు. ఇక్కడ త‌యారవుతున్న ఈ మాండ్రాక్స్ మాత్రలను మొజాంబిక్‌, సౌతాఫ్రికాల‌కు త‌ర‌లిస్తున్నట్లు విచారణలో తేలింది.

 

మావోయిస్టు పార్టీ బంద్..పోలీసులు అప్రమత్తం

విశాఖ : ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసగా మావోయిస్టు పార్టీ బంద్ కు పిలుపునిచ్చింది. పోలీసులు అప్రమత్తం అయ్యారు. మన్యంలో నిఘా పెంచారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఏవోబీలో హై అలర్ట్

శ్రీకాకుళం : ఐదు రాష్ట్రాల మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ఏవోబీలో హై అలర్ట్ ప్రకటించారు. బామిని మండలంలో బస్సు సర్వీసులు పోలీసులు నిలిపివేశారు. తువ్వకొండ ప్రాంతంలో ప్రత్యేక బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వజ్రపుకొత్తూరు, మందస, బామిని మెలియాపుట్టి ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు.

 

08:42 - November 3, 2016

బెంగళూరు : కర్నాటకలో ఓ కీచకుడికి బాధితులు దేహశుద్ధి చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మంజునాథ అనే వ్యక్తి 100 మందిని మోసం చేశాడు. భర్త మోసాలను భరిస్తూ వస్తున్న భార్య.. మంజునాథను బాధితులకు రెడ్‌ హ్యండెండ్‌గా పట్టించింది. శివమొగ్గలోని ఓ లాడ్జిలో పట్టుకున్న బాధితులు చెప్పులు, చీపుర్లతో చితక బాదారు. జుట్టు కత్తిరించి, చీర కట్టించి, మెడలో తాళి వేసి ముఖానికి బొట్టు పెట్టి దేహశుద్ధి చేశారు.

 

08:38 - November 3, 2016

హైదరాబాద్ : దాదాపు నెలన్నర తర్వాత సిట్‌ స్పీడ్ పెంచిందా..? ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విచారణతో ఇక వేగం కానుందా..? ఓ హత్య కేసులో వాంగ్మూలం తీసుకున్న సిట్‌ బృందాలు అధికార పార్టీ నేతలను కూడా విచారించేందుకు సిద్దమయిందా..? లేక ఇంతటితో మళ్లీ ఆగిపోతుందా..? ఆర్‌.కృష్ణయ్య విచారణతో కలకలం రేపిన సిట్‌ ఏం చేయబోతుంది..???
ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యకు నోటీసులు..
గ్యాంగ్‌స్టర్ నయీం కేసుల్లో విచారణ చేసిన సిట్‌ కొన్నాళ్ల తర్వాత స్పీడ్ పెంచింది...ఇప్పటికే ఎందరో పేర్లు బయటకు వచ్చేలా లీకులిచ్చిన సిట్‌ తాజాగా తీసుకున్న నిర్ణయం కీలక మలుపులు తిరుగుతోంది...ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే..బీసీ సంఘాల ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్యకు నార్సింగి పోలీసులు నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది...దీనిపై సిట్‌ దాదాపు గంటసేపు ఆయనను విచారించింది...ఓ హత్య కేసులో గంటపాటు విచారించిన సిట్ స్టేట్ మెంట్ రికార్డు చేసుకుంది. గతంలో ఎప్పటి నుంచో సంబందాలు ఉన్నాయన్న ఆర్ .కృష్ణయ్యను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి...నెలన్నరగా స్థబ్దతగా ఉన్న నయిం కేసులో సిట్‌ విచారణ కీలక పరిణామం చోటు కేసుకోవడంతో ఒక్కసారి కలకలం రేపింది...
సరూర్‌నగర్ వ్యాపారి హత్యలో విచారణ...
హైదరాబాద్‌ సరూర్ నగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో ఆర్.కృష్ణయ్యను విచారించినట్లు తెలుస్తుంది...ఈ విషయంతో పాటు పలు విషయాలపై దాదాపు గంటపాటు విచారణలో నయింకు కృష్ణయ్యకు ఉన్న సంబందాల పై ఆరా తీశారు. మాదాపూర్ కు చెందిన ల్యాండ్ సెటిల్ మెంట్ లో పలు పశ్నలు అడిగినట్లు తెలుస్తుంది....
తనకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు : ఆర్.కృష్ణయ్య 
ఇదిలా ఉంటే తనకు ఎలాంటి సంబందం లేని కేసుల్లో ఇరుకించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆర్. కృష్ణయ్య అరోపించారు. తనకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదన్నారు. పోలీసులు ఎప్పుడు పిలిచిన వచ్చేందుకు సిద్దమన్నారు. ప్రచారం కోసమే టీ.ఆర్.ఎస్. ప్రభుత్వం ఇలా పేపర్ స్టేట్ మెంట్ ఇచ్చి శిష్యరికం పై వివరణ కోరారని కృష్ణయ్య తెలిపారు.
కృష్ణయ్య విచారణతో కలకలం...
గడిచిన నెలన్నరగా నయీం కేసుల్లో ఎలాంటి పురోగతిలేకపోగా...ఒక్కసారిగా ఆర్. కృష్ణయ్యను విచారించడంతో కలకలం రేగింది. బుధవారమే ఆర్. కృష్ణయ్య ను అరెస్ట్ చేస్తారనే వార్తలు వచ్చాయి. కాని ఒక సాక్షిగా మాత్రమే విచారించినట్లు సమాచారం. అయితే 10 వేల కోట్లకు పడగలేత్తిన నయింకు సహాకరించింది ఏవరు..? నల్గొండకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ముఖ్యనేతకు ఉన్న సంబందాల పై విచారణ వేగవంతం చేస్తారా..లేదా అనేది వేచి చూడాలి. 24 హత్య కేసుల్లో ఇంకా బయటకు రాని హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు అనుమానం. 

 

08:34 - November 3, 2016

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్‌ డాక్టర్‌ అవతారమెత్తాడు. తలకు గాయమై ఆస్పత్రికి వచ్చిన రోగికి.. వైద్యం చేసేందుకు డాక్టర్లు అందుబాటులో లేరు. ఫోన్‌ చేసి డాక్టర్‌ను పిలిపించమని రోగి బంధువులు కోరినా.. సెక్యూరిటీ గార్డు పట్టించుకోలేదు. పైగా మీకు వైద్యం కావాలా ? ట్రీట్‌మెంట్‌  కావాలా ? అంటూ మహిళా రోగి తలకు కుట్లు వేశాడు. దీన్ని రోగి బంధువుల్లో ఒకరు రికార్డ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. సెక్యూరిటీ గార్డ్‌ ట్రీట్‌మెంట్‌తో రోగికి ఏమైనా అయితే పరిస్థితి ఏంటని.. రోగి బంధువులు ప్రశ్నిస్తున్నారు. విధులకు డుమ్మా కొట్టిన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

 

08:32 - November 3, 2016

నాగర్ కర్నూలు : ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు.. ప్రభుత్వంలో కదలిక తెచ్చేందుకు కొనసాగుతున్న సీపీఎం పాదయాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు తమ్మినేని బృందం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలు తీరే వరకు వారికి అండగా ఉంటామని సీపీఎం నేతలు హామీ ఇచ్చారు. 
400 కి.మీ దాటిన పాదయాత్ర 
సీపీఎం మహాజన పాదయాత్ర 17వ రోజు నాగర్‌కర్నూలు జిల్లాలో కొనసాగింది. తెలకపల్లి మండలం చిన్నమదునూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. రామిరెడ్డిపల్లె, తెలకపల్లి, రాకొండ, వినుకుంట, గట్టుతుమ్మెన్‌పల్లి మీదుగా సాగుతూ అచ్చంపేటకు చేరింది. ఈరోజు 27.7 కిలోమీటర్ల పాదయాత్రతో.. 400 కిలోమీటర్లు దాటింది. 
పాదయాత్రకు అన్ని గ్రామాల్లో ప్రజలు సంఘీభావం 
సీపీఎం పాదయాత్రకు అన్ని గ్రామాల్లో ప్రజలు సంఘీభావం తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీపీఎం నేతలకు తెలిపి వినతులు అందజేశారు. అనేక గ్రామాల్లో తమపై దాడులు కొనసాగుతున్నాయని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. 
పాదయాత్రకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీకృష్ణ సంఘీభావం 
అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం రైతులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. తమ గ్రామాలకు కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నుంచి నీళ్లు రావడం లేదని కలెక్టర్‌ ముట్టడికి బయల్దేరిన రైతులకు తమ్మినేని మద్దతు తెలిపారు. సమస్యను తెలుసుకున్న తమ్మినేని... సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామన్న ప్రభుత్వం.. ప్రతిపాదనలు ఉన్న గ్రామాలకు కూడా ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదన్నారు. వెంటనే కాలువ పనులు పూర్తి చేసి.. పంటలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం పాదయాత్రకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీకృష్ణ సంఘీభావం తెలిపారు. 

 

08:22 - November 3, 2016

హైదరాబాద్ : తెలంగాణలో భూసేకరణకు సంబంధించిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇండియా స్టాంప్ డ్యూటీ చట్టాన్ని తుంగలో తొక్కి... పాలసీ విధానంతో ముందుకెళ్తున్నారని పిటిషనర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే భూ నిర్వాసితులకు ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపిన ప్రభుత్వం... తమకు భూసేకరణ భారంగా మారిందని వాదించింది. 
న్యాయవాది కే.ఎస్. మూర్తి కోర్టులో పిటిషన్ 
తెలంగాణలో భూసేకరణపై హైకోర్టులో వివిధ దశల్లో విచారణ కొనసాగుతోంది. తాజాగా దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. భూముల మార్కెట్ రేటు ఖారారు చేయకుండానే పాత మార్కెట్ విలువ ప్రకారం భూసేకరణ చేయడం చట్ట విరుద్దమని న్యాయవాది కే.ఎస్. మూర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
2012లో మార్కెట్ విలువలు సవరించారన్న పిటిషనర్
చివరిసారిగా 2012లో భూ రిజిస్ట్రేషన్, మార్కెట్ విలువలు సవరించారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు సవరణలు చేయలేదని పిటిషనర్ కోర్టులో వాదించారు. ఇండియా స్టాంప్ డ్యూటీ యాక్ట్ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండు సంవత్సరాలకు ఒకసారి సవరణలు జరగాలని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలా చేయకుండానే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందన్నారు.  
భూసేకరణ కోసం ప్రభుత్వం చాలా ఖర్చుచేసిందన్న అడ్వకేట్ జనరల్ 
ఇప్పటికే భూ సేకరణ కోసం ప్రభుత్వం చాలా ఖర్చు చేసిందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. మార్కెట్ విలువ ప్రకారమే భూములను కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక సమర్పిస్తామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఇందుకు రెండు వారాల సమయం కావాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వారం రోజుల సమయం సరిపోతుందని పిటిషనర్ అభ్యంతరం తెలపగా..  సమగ్ర నివేదిక.. నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున రెండు వారాల సమయం కావాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 16కు ఉమ్మడి హైకోర్టు వాయిదా వేసింది. 

 

08:18 - November 3, 2016

వరంగల్ : గడ్డాలు పెంచుకుంటే సీఎం కాలేరని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. వరంగల్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మర్రి యాదవరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  
వరంగల్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మర్రి యాదవరెడ్డి బాధ్యతలు
వరంగల్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మర్రి యాదవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, కడియం శ్రీహరి, ఈటల రాజేందర్‌, వరంగల్‌ మేయర్‌ నన్నపనేని నరేందర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.  
వరంగల్ నగరాభివృద్ధికి మాస్టర్ ఫ్లాన్ సిద్ధం : మంత్రి కడియం 
వరంగల్ నగరాభివృద్ధికి మాస్టర్ ఫ్లాన్ సిద్ధం చేశామని, మంత్రి కేటీఆర్ వరంగల్ అభివృద్ధి పట్ల ఎంతో అంకిత భావంతో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పనిచేసే వారికి పదవులు తప్పకుండా వస్తాయన్నారు. 
అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు : మంత్రి కేటీఆర్  
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. గడ్డాలు పెంచుకుంటే ముఖ్యమంత్రి కాలేరని ఆక్షేపించారు. వరంగల్‌లో త్వరలో ఏర్పాటయ్యే టెక్స్‌టైల్‌ పార్క్‌ ద్వారా వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. తెలంగాణ సాధన కోసం కష్టపడిన పార్టీ కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామని.. రాబోయే రోజుల్లో పెద్దసంఖ్యలో నామినేటెడ్‌ పదవులు రానున్నాయన్నారు. 

 

08:14 - November 3, 2016

విశాఖ : అక్టోబర్‌ 23వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు ఏవోబీ కమిటీ ప్రతినిధి జగబంధు తెలిపారు. పక్కా సమాచారంతోనే ఎన్‌కౌంటర్‌ చేశారని తెలిపారు. అక్టోబర్‌ 23వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు ఏవోబీ కమిటీ ప్రతినిధి జగబంధు ఒక మీడియా ప్రతినిధికి ఫోన్‌ ద్వారా వివరాలు వెల్లడించారు. ఉదయాన్నే రోల్‌కాల్‌లో ఉన్న తమను పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపారని, దీంతో తాము కూడా ఎదురుకాల్పులు జరిపామని, అయితే, పోలీసుల శక్తిని తక్కువ అంచనా వేసినందునే... భారీగా నష్టపోయామని మావోయిస్టు ఏవోబీ కమిటీ ప్రతినిధి జగబంధు తెలిపారు.
ఏవోబీ నుంచి పోలీసు బలగాలను వెనక్కి తీసుకోవాలి... 
ఏవోబీ నుంచి పోలీసు బలగాలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే టీడీపీ, బీజేడీ ప్రభుత్వాలు భారీ మూల్యం చెల్లించకతప్పదని మావోయిస్టు ఏవోబీ కమిటీ ప్రతినిధి జగబంధు గట్టిగా హెచ్చరించారు. మాజీ మావోయిస్టుల సహకారంతో పోలీసులు ఎన్‌కౌంటర్‌ జరిపారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌ ఘటనలో తమ లోపాలను సమీక్షించుకుంటూనే... పోలీసులకు ఇన్‌ఫార్మాలుగా వ్యవహరించిన వారిపై బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. మావోయిస్టుల ఆశయాలను నెరవేరుస్తామని తెలిపారు. మావోయిస్టులను చంపడం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించలేరని తెలిపారు. పోరాడే ప్రజల నుంచే నాయకత్వాన్ని భర్తీ చేస్తామని తెలిపారు. 

08:08 - November 3, 2016

విశాఖ : ఆంధ్రా, ఒడిశా సరిహద్దులతోపాటు 5 రాష్ట్రాల ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓవైపు   పోలీసుల గాలింపులు... మరోవైపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టుల బంద్‌ ప్రకటనతో... ఏ క్షణం ఏ జరుగుతుందోననే భయంతో ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే  మైదాన ప్రాంతంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే అవకాశాలు లేకపోలేదనే నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు . ప్రజాప్రతినిధులు జిల్లాలు పర్యటించవద్దని ఇరురాష్ట్రాల నాయకులకు సూచిస్తున్నారు.  
ఐదు రాష్ట్రాల్లో హై అలర్ట్
ఓవైపు పోలీసుల బూట్ల చప్పులు..మరోవైపు మావోయిస్టుల ప్రతీకార జ్వాలలు...ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత ... ఇది ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితి...ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనకు నిరసనగా  మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో   పోలీసులు ఐదు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. 
ప్రజాప్రతినిధులకు పోలీసుల హెచ్చరిక
మావోయిస్టులు దాడులు చేసే అవకాశముందంటూ తెలుగు రాష్ట్రాల   ప్రజాప్రతినిధులకు పోలీసులు  హెచ్చరికలు జారీ చేశారు.. ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించొద్దని సూచించారు. తెలంగాణలో కొమురం భీమ్, ఆసిఫాబాద్‌, రామగుండం, భద్రాచలం, జయశంకర్‌, కొత్తగూడెం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు... ఏపీలోని  ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయగోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మరోవైపు పోలీసుల తనిఖీలు, హెచ్చరికలతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు  వణికిపోతున్నారు. 
బంద్‌ను విజయవంతం చేసేందుకు మావోయిస్టుల యత్నం
ఆంధ్రా..ఒడిశా సరిహద్దులో గత నెల 24 జరగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఒడిశా, చత్తీస్‌గడ్, మహారాష్ట్రల్లో బంద్ విజయవంతం చేసేందుకు మావోయిస్టులు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లుతున్నారు.  మరోవైపు ఏవోబీలో జరిగన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా  అన్ని జైళ్లలో నిరాహరదీక్షలు చేయాలని... చర్లపల్లి జైలులో మావోయిస్టు ఖైదీలు కోబర్ట్ గాంధీ, వారణాసి సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్‌కు  మెమొరండం అందజేశారు. ఏకపక్ష కాల్పుల నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల బంద్‌ ప్రభావం కనిపించకుండా ఉండేందుకు వేలాది సంఖ్యలో పోలీసులు ఎజెన్సీ ప్రాంతాలను జల్లడపడుతున్నారు. మావోయిస్టులు మైదానంలో అలజడి రేపే అవకాశాలు ఉన్నాయని   కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో గతంలో పార్టీలో పని చేసిన మావోయిస్టుల పై  ప్రత్యేక దృష్టి పెట్టి..పూర్తి అప్రమత్తతో పోలీస్‌ శాఖ ముందుకు వెళుతోంది. 

 

వంటగ్యాస్ లీకై పేలుడు

విజయవాడ : సుందరయ్యనగర్ లో వంటగ్యాస్ లీకై పేలుడు సంభవించింది. కంప్యూటర్ ఆన్ చేయగానే పేలుడు జరిగింది. ఇల్లు ధ్వంసం అయింది. పేలుడు ధాటికి చుట్టుపక్కల నాలుగు ఇళ్లలకు బీటలు వారాయి. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

 

ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల బంద్ ప్రభావం

విశాఖ : ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఏజేన్సీ ప్రాంతాలకు బస్సు సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. 

కేరళలో నేడు మంత్రి జూపల్లి పర్యటన

తిరువనంతపురం : కేరళలో నేడు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

నేడు టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుల ఎంపిక

హైదరాబాద్ : నేడు టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. జిల్లా అధ్యక్షులను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. 

నేటి నుంచి సీఎం అఖిలేష్ యాదవ్ వికాస్ యాత్ర

యూపీ : నేటి నుంచి సీఎం అఖిలేష్ యాదవ్ వికాస్ యాత్ర చేయనున్నారు. లక్నోలో యాత్రను ప్రారంభించనున్నారు.

Don't Miss