Activities calendar

04 November 2016

21:40 - November 4, 2016

హైదరాబాద్ : ప్రజా సమస్యలపై ప్రణాళికలేని పోరాటాలు చేయవద్దంటూ తెలంగాణ టీడీపీ నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు క్లాస్‌ ఇచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించారు. ఒక్కరోజు పర్యటనకు హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు... టీడీపీ తెలంగాణ రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు.

టీడీపీ తెలంగాణ నేతలతో చంద్రబాబు సమావేశం
తెలంగాణలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... బేగంపేట విమానాశ్రయంలో టీడీపీ తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులుతో అరగంటకు పైగా భేటీ అయిన చంద్రబాబు.. తెలంగాణలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విషయంలో తన నిర్ణయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని... స్వయం నిర్ణయాధికారం మీకే ఇచ్చానని ఈ సందర్భంగా బాబు అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీరియస్‌గా వర్కవుట్ చేయాలని సూచించారు. టీ-టీడీపీ చేపట్టిన రైతు పోరుబాట గురించి కూడా ఆరా తీసిన చంద్రబాబు... పై పై ఉద్యమాలు వద్దని, ప్రజా సమస్యలపై సీరియస్ గా పోరాడాలని ఘాటుగానే చెప్పినట్లు తెలుస్తోంది.

టీడీపీ సభ్యత్వ నమోదుపై చంద్రబాబు ఆరా
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలంగాణలో ఎలా జరుగుతుందన్న విషయాన్ని చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు అడహక్ కమిటీల ప్రతిపాదనలు చంద్రబాబుకు చూపించే ప్రయత్నాలను టి-టిడిపి నేతలు చేయగా, స్వయం నిర్ణయాలు తీసుకోవాలంటూ మరోసారి చంద్రబాబు సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని, గత సభ్యత్వం కంటే ఈసారి ఎక్కువ మంది సభ్యులను తెలంగాణలో చేర్పించాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.

31 జిల్లాలకు కన్వీనర్లను త్వరలోనే నియామకం
అధినేత చంద్రబాబును త్వరలో జరగబోయే టీడీపీ తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశానికి ఆహ్వానించినట్లుగా టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. 31 జిల్లాలకు కన్వీనర్లను త్వరలోనే నియమిస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు సూచనల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు సమస్యలపై ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు రమణ తెలిపారు.

ఈనెల 6న భూపాలపల్లి నుండి రైతు పోరుబాట
ఇప్పటికే ఖరారైన రైతు పోరుబాట యాత్రను ఈనెల 6న భూపాలపల్లిలో చేపట్టనున్నారు. వీటితో పాటు 9న ఖమ్మం, 12వ తేదీన పెద్దపల్లి, 15న సూర్యాపేట జిల్లాల్లో మినీ పాదయాత్రలను నిర్వహించేందుకు టీ-టీడీపీ రూట్ మాప్ రెడీ చేసింది. ఈ యాత్రల్లో టీ-టీడీపీ ముఖ్యనేతలంతా హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో పాదయాత్రలకు కూడా తేదీలు ఖరారు చేసేందుకు ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నారు. 

21:35 - November 4, 2016

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జన్మదిన వేడుకలు రాజ్‌భవన్‌లో అట్టహాసంగా జరిగాయి. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ విడివిడిగా రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుట్టిన రోజును ఎన్నడూ మరిచిపోలేనని..ఇది అత్యంత సంతోషకరమైన పుట్టిన రోజుగా పేర్కొన్నారు గవర్నర్ నరసింహన్.

గవర్నర్ నరసింహన్ 70వ పుట్టినరోజు వేడుకలు
రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ 70వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇరు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల రాకతో రాజ్‌భవన్‌లో సందడి వాతావరణం నెలకొంది.

సీఎం చంద్రబాబు గవర్నర్ర జన్మదిన శుభాకాంక్షలు
గవర్నర్ నరసింహన్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా తీసుకువెళ్లిన కేక్‌ను గవర్నర్‌తో కట్ చేయించారు. అనంతరం గవర్నర్‌తో భేటీ అయిన చంద్రబాబు.. రాష్ట్రంలోని పలు పథకాలు, పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాలను గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.

కేసీఆర్ శుభాకాంక్షలు
చంద్రబాబు వెళ్లిన సుమారు 2గంటల తరువాత... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, హోం మంత్రి నాయిని, స్పీకర్‌ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. స్పాట్

ఇంత ఆనందంగా ఎన్నడూ లేను : గవర్నర్ నరసింహన్
తాను 70 ఏళ్లుగా పుట్టిన రోజులు జరుపుకుంటున్నప్పటికీ ఇంత ఆనందంగా ఎన్నడూ లేనన్నారు గవర్నర్ నరసింహన్. తెలంగాణ రాష్ర్టానికి మొదటి గవర్నర్ కావడం గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ గురించి మాట్లాడుకున్నప్పుడు తాను ఆ రాష్ర్టానికి తొలి గవర్నర్‌గా పని చేశాననే సంతృప్తి తనకు ఉంటుందన్నారు నరసింహన్‌. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏ సమస్య ఉన్నా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు గవర్నర్‌ నరసింహన్‌.  

21:27 - November 4, 2016

హైదరాబాద్ : పెట్రోలియం డీలర్ల నిరసన కార్యాక్రమం వాయిదా పడింది. కిలో లీటర్‌ పెట్రోల్‌పై 138 రూపాయలు, కిలో లీటర్‌ డీజిల్‌పై 102 రూపాయల కమీషన్‌ ఇచ్చేందుకు సంస్థలు అంగీకరించాయి. ముంబైలో చమురు కంపెనీల ప్రతినిధులతో జరిగిన చర్చల్లో డీలర్ల డిమాండ్లను అంగీకరించారు. ఇతర సమస్యలపై చమురు కంపెనీలు పదిరోజుల గడువు కోరాయి.

డీలర్ల కమీషన్‌ పెంచేందుకు అంగీకరించిన చమురు సంస్థలు
పెట్రోలియం డీలర్ల డిమాండ్లకు చమురు సంస్థలు అంగీకరించడంతో... డీలర్లు తమ నిరసన కార్యాక్రమాన్ని వాయిదా వేశారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు నిర్ణీత సమయంలోనే బంకులను నడుపుతామని డీలర్లు అల్టిమేటం ఇచ్చారు. దీంతో డీలర్లు, చమురు సంస్థల ప్రతినిధుల మధ్య ముంబైలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో డీలర్ల కమీషన్‌ పెంచేందుకు చమురు సంస్థల ప్రతినిధులు అంగీకరించారు. కిలోలీటర్‌ పెట్రోల్‌పై 138 రూపాయలు, కిలో డీజిల్‌పై 102 రూపాయలు పెంచేందుకు సంస్థలు అంగీకరించడంతో.. డీలర్ల నిరసన కార్యక్రమం వాయిదా పడింది.

ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ : డీలర్ల సంఘం
మొదల కమీషన్‌ పెంచాలంటూ పెట్రోల్‌ బంకుల డీలర్లు.. బంకుల పనివేళల్లో మార్పులు చేసి నిరసన ప్రకటించారు. శనివారం నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పెట్రోల్‌ బంకులు పనిచేస్తాయని, ప్రతి ఆదివారం బంకులను మూసివేస్తామని పెట్రోలియం డీలర్ల సంఘం ప్రకటించింది. దీంతో రంగంలోకి దిగిన చమురు సంస్థలు డీలర్ల డిమాండ్లను పరిష్కరించేందుకు సానుకూలత వ్యక్తం చేశాయి. ఇతర డిమాండ్లపై పది రోజులు గడువు ఇవ్వాలని, వాటిని కూడా పరిశీలిస్తామని చమురు సంస్థలు కోరాయి.  

రిలయన్స్‌కు సర్కార్ భారీ షాక్‌ !

ఢిల్లీ: రిలయన్స్‌ సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. కేజీ బేసిన్‌లో రిలయన్స్‌ తమ సొంత బావుల నుంచే కాకుండా ప్రభుత్వ చమురు సంస్థలకు చెందిన బావుల నుంచి కూడా గ్యాస్‌ నిక్షేపాలను తోడుకున్నట్లు నిర్ధారణ కావడంతో భారీ జరిమానా విధించింది. రిలయన్స్‌ సంస్థతో పాటు దాని భాగస్వాములైన బీపీ(30 శాతం), నికో(10 శాతం)లకు కలిపి మొత్తంగా 1.55 బిలియన్‌ డాలర్ల జరిమానా చెల్లించాల్సిందిగా రిలయన్స్‌ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

21:07 - November 4, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికల సమయం మరింత దగ్గరపడుతున్న తరుణంలో భారీ బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని యూఎస్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఐఎస్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలు ఈ కుట్రకు పాల్పడనున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ముఖ్యంగా న్యూయార్క్, టెక్సాస్, వర్జీనియా భారీ పేలుళ్లకు, దాడులకు కుట్ర పన్నారన్న సమాచారంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. యాంటీ-టెర్రర్, హోమ్ లాండ్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని ఎఫ్ బీఐ అధికారులు పేర్కొన్నారు.

కర్నూలులో రేపు చంద్రబాబు పర్యటన..

కర్నూలు: సీఎం చంద్రబాబునాయుడు శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు కర్నూలు నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం విజయవాడ నుంచి హెలికాప్టర్లో కర్నూలులోని ఏపీఎస్పీ బెటాలియన్‌ గ్రౌండ్‌కు చేరుకోనున్న బాబు తొలుత కిడ్స్‌ వరల్డ్‌ వద్ద అమృత్‌ పథకానికి భూమిపూజ, విజయవనం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి ప్రారంభమయ్యే జనచైతన్య యాత్రలో పాల్గొంటారు.

అమెరికా ఎన్నికల్లో విధ్వంసానాకి ఉగ్రకుట్ర!..

అమెరికా : అధ్యక్ష ఎన్నికల సమయం మరింత దగ్గరపడుతున్న తరుణంలో భారీ బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని యూఎస్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఐఎస్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలు ఈ కుట్రకు పాల్పడనున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ముఖ్యంగా న్యూయార్క్, టెక్సాస్, వర్జీనియా భారీ పేలుళ్లకు, దాడులకు కుట్ర పన్నారన్న సమాచారంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

అమ్మకు రాములమ్మ పరామర్శ

తమిళనాడు : ముఖ్యమంత్రి జయలలిత చక్కగా కోలుకుంటున్నారని, మరో పది రోజుల్లో ఆమె ఇంటికెళ్లే అవకాశమున్నట్లుగా సినీనటి విజయశాంతి పేర్కొన్నారు.అన్నాడీఎంకే కార్యకర్తలు, ప్రజలు భయపడాల్సిందేమీ లేదని, జయ చక్కగా బయటికొచ్చి పరిపాలన చేస్తారని ఆమె వ్యాఖ్యానించారు. జయలలితను పరామర్శించేందుకు అపోలో ఆసుపత్రికి వచ్చిన విజయశాంతి వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను తెలిపారు.

ఏవోబీలో కూంబింగ్‌ జరపడంలేదు : ఏపీ డీజీపీ

ఢిల్లీ: ఏవోబీలో కూంబింగ్‌ జరపడంలేదని డీజీపీ సాంబశివరావు అన్నారు. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఏపీ డీజీపీ సమావేశమయ్యారు. ఏవోబీ ఎన్‌కౌంటర్‌ గురించి రాజ్‌నాథ్‌కు వివరించానని సాంబశివరావు తెలిపారు. ఈనెల 25న రెండు మోడల్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్నామని డీజీపీ చెప్పారు.

వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు భర్తీ..

హైదరాబాద్: మంత్రి లక్ష్మారెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. ఉద్యోగాల భర్తీకి ఉన్న అడ్డంకులపై సీఎస్, మంత్రి భేటీలో చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి వివరాలను వెల్లడిస్తూ.. వైద్య, ఆరోగ్యశాఖలో 2,118 ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలిగాయన్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామన్న ఆయన ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, విలేకరుల కోసం క్లినిక్‌లు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

కస్టమ్స్ తనిఖీల్లో భారీ నగదు స్వాధీనం..

ముంబై: ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు అక్రమంగా నగదును కలిగిఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. నిందితుల వద్ద లక్ష అరవై వేల దిరమ్స్‌ను గుర్తించారు. వీటి విలువ భారతీయ కరెన్సీలో రూ. 29 లక్షలుగా సమాచారం. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

20:45 - November 4, 2016

నాగుల చవితికి పాములకు మస్తుగా పాలాభిషేకం చేత్తన్న జనాలు..పాములకు పాలాభిషేకం..సచివాలయం కూలిగొట్టి తీరతామంటున్నడు సీఎం కేసీఆరు సారు..రూ.380కోట్లతో మల్లీ కట్టిపిస్తానంటున్నాడు..గెందుకంటే ఈ సచివాలయంలో సీఎం గిరి చేసిన ఎవరి కొడుకులూ సీఎం కాలేదంట..గందుకే సీఎం కొడుకు కేటీఆర్ సీఎం గావాలంటే గిప్పుడున్న సచివాలయం కూలగొట్టాలె..కొత్త సచివాలం కట్టాలని కంకణం గట్టుకున్నడంట..చంద్రబాబు నాయుడు బ్రోకర్ పన్లు మానుకోవాలంటున్న ఎర్రజెండా నాయకుడు సురవరం సారు.. బస్టాండ్లల్ల ఫ్లాట్ ఫాం టిక్కట్లకు పెట్టనీకి యోచనలు..కారంపొడులల్ల రంగేసిన రంపం పొట్టు కలుపుతాన్న జనాలు..లంకె బిందెల కోసం తవ్వకాలు..పాములకు పాలాభిషేకం..బుక్క బుక్కకూ ముక్కలు కావాలంటన్న అమెరికోల్లు..

20:28 - November 4, 2016
20:19 - November 4, 2016
20:16 - November 4, 2016

అమెరికా : మరో 3 రోజుల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఉత్కంఠను మరింత పెంచేస్తున్నాయి. అటు ట్రంప్.. ఇటు హిల్లరీ... కొన్నికొన్ని సందర్భాల్లో ఎవరి ఆధిక్యాన్ని వారు ప్రదర్శిస్తుండటం... ఎన్నికల వేడిని మరింత పెంచేస్తోంది. ఈ ఉత్కంఠకు సంబంధించి... అమెరికాలో ఒహియో రాష్ట్రం నుంచి ఎన్నికల స్ట్రాటజిస్ట్ హరీ కాసుల... టెన్‌ టీవీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాం... 

20:12 - November 4, 2016

తిరుమల : తిరుమలలో నామాల వివాదం నెలకొంది. జియంగర్లు, అర్చకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. తోమాల సేవలో వడగళై వర్గానికి చెందిన యూ ఆకారం నామాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్వామివారికి అలంకరించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో జియంగర్లు, అర్చకుల మధ్య వివాదం నెలకొంది. దీనిపై టీటీడీ రమణదీక్షితులుకు నోటీసు జారీ చేసే యోచనలో ఉంది. మరోవైపు ఈ వివాదంతో తనకెలాంటి సంబందం లేదని రమణ దీక్షితులు తెలపారు. 45 ఏళ్లుగా.. స్వామివారికి కైంకర్యం చేస్తున్నారని.. ఇప్పుడు ఆరోపణలు రావడం విడ్డురంగా ఉందన్నారు. కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రమణ దీక్షితులు ఆరోపించారు. దీని మరింత సమాచారానికి వీడియో చూడండి..

ఫీజ్ బకాయిలు చెల్లించాలి : ప్రతిపక్షాలు

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ధర్నాలు, ముట్టడిలతో వామపక్ష విద్యార్థి సంఘాలు హోరెత్తిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాంగ్రెస్‌ విద్యార్థి గర్జన చేపట్టగా.. తెలంగాణ విద్యార్థి వేదిక పోరుబాట పట్టింది. మరోవైపు బకాయిలు చెల్లించే వరకు సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించేది లేదని కళాశాలల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. 

20:00 - November 4, 2016

హైదరాబాద్ : విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లిస్తామని హామీల మీద హామీలిచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా.. పెండింగ్ ఫీజు బకాయిలు మాత్రం విడుదలకు నోచుకోలేదు. దీంతో అటు కళాశాలలు, ఇటు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బకాయిలు చెల్లించకపోతే వచ్చే నెలలో జరగబోయే సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరిస్తామని ఇప్పటికే డిగ్రీ కాలేజీలు అల్టిమేటం జారీ చేశాయి. ఫీజుల కోసం అవసరమైతే మరోసారి ఆందోళనకు సిద్ధమని ప్రకటించాయి.

తెలంగాణలో విద్యార్థులు నానా ఇబ్బందులు
ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణలో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో అటు విద్యార్థులు.. ఇటు యాజమాన్యాలు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. స్వయంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

24న కాలేజీ యాజమాన్యాలతో కేసీఆర్‌ సమావేశం
ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని కాలేజీలకు దాదాపు 2వేల 68 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2016 మార్చి 29న అసెంబ్లీలో, మే 24న కాలేజీ యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ జూన్‌ 30 నాటికి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత నెల 17న ఉప ముఖ్యమంత్రి కడియ శ్రీహరి కూడా.. అక్టోబర్‌ నెలాఖరు వరకు 600 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే చివరికి కేవలం 258 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అందులో డిగ్రీ కాలేజీలకు ఫీజుల బకాయిల కింద కేవలం 50 కోట్లు మాత్రమే అందాయి. రాష్ట్రంలో 1150 డిగ్రీ కాలేజీలుంటే.. వాటిలో 11 లక్షల మంది విద్యార్థులున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు.

వచ్చే నెల పరీక్షలను బహిష్కరిస్తాం : ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు
విద్యాశాఖ మంత్రే కాదు.. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ సైతం నెరవేరక పోవడం దారుణమని కాలేజీ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బకాయిలు విడుదల కాక.. అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నామని.. వెంటనే పెండింగ్‌ బకాయిలను విడుదల చేసి ఆదుకోవాలని ఇప్పటికే ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కలిసి కాలేజీ యాజమాన్యాలు మెమోరండం అందజేశాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరులోగా పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని.. లేకపోతే.. వచ్చే నెలలో జరగనున్న పరీక్షలను బహిష్కరిస్తామని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి.  

బకాయిలు చెల్లించాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ధర్నాలు, ముట్టడిలతో వామపక్ష విద్యార్థి సంఘాలు హోరెత్తిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాంగ్రెస్‌ విద్యార్థి గర్జన చేపట్టగా.. తెలంగాణ విద్యార్థి వేదిక పోరుబాట పట్టింది. మరోవైపు బకాయిలు చెల్లించే వరకు సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించేది లేదని కళాశాలల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. 

19:51 - November 4, 2016

విజయవాడ : ఈనెల 6న విశాఖలో జై ఆంధ్రప్రదేశ్ సభ జగన్‌ పెట్టాలనుకోవడంలో అర్థం లేదని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు. స్పెషల్ ప్యాకేజీపై జగన్ రాద్దాంతం చేయడం సరైనది కాదన్నారు. రాష్ట్ర విభజనకు వైఎస్ కూడా కారకుడేనని, 1999లో విభజన అంశాన్ని తెరపైకి తెచ్చింది ఆయనే అన్నారు. ఏపీలో ఎప్పటికైనా కాంగ్రెస్, వైసిపి కలవడం ఖాయమని జో

19:49 - November 4, 2016

విజయవాడ : భవన నిర్మాణ కార్మికులు కదం తొక్కారు. తమను సంక్షేమ బోర్డులో కొనసాగించాలన్న డిమాండ్‌తో లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఆందోళనకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్.డి.గఫూర్ మద్దతు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసం భవన నిర్మాణ కార్మికుల నోట్లో మట్టి కొడుతుందని ధ్వజమెత్తారు. సంక్షేమ బోర్డును రద్దు చేసి ఆ నిధులను చంద్రన్న బీమా పధకానికి తరలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

19:43 - November 4, 2016

విశాఖ : జనచైతన్య యాత్రలు ప్రారంభమయ్యాయి. ప్రతి టీడీపీ ఎమ్మెల్యే వారి నియోజకవర్గంలో జనచైతన్య యాత్రలో పాల్గొంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన జనచైతన్య యాత్రలో అర్బన్‌ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని సమాచారానికి వీడియో చూడండి..

19:42 - November 4, 2016

పశ్చిమగోదావరి : మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా సిపిఎం చేపట్టిన ప్రజాభేరి పాదయాత్ర ముగింపు సందర్భంగా.. మహా ధర్నా నిర్వహించారు. నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ ఆందోళనలో... వామపక్ష నాయకులు, వైసీపీ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. రైతులు, అంగన్ వాడి మహిళల్ని గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని విమర్శించారు. ఇప్పుడు అదే తరహాలో తుందుర్రులో అమాయక ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటే తాము చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహాధర్నాలో సీపీఎం, సిపిఐ, ఐద్వా, వైసీపీ, జనసేన నాయకులతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.తుందుర్రు ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా 11రోజులుగా సీపీఎం చేపట్టిన పాదయాత్ర చివర రోజుకు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో భారీ స్థాయిలో ర్యాలీ చేపట్టారు. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

అవాస్తవాల ప్రచారానికే జగన్ సభ : గంటా

విశాఖ : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవాస్తవాలను ప్రచారం చేసేందుకే జగన్ ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభను నిర్వహిస్తున్నాడని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షనేతగా విఫలమైన జగన్, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ సభను నిర్వహించనున్నారంటూ మండిపడ్డారు. గతంలో గర్జనల పేరిట బహిరంగ సభలను నిర్వహించిన జగన్, ఇప్పుడు, ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరిట బహిరంగ సభను నిర్వహించి తన బాణీని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

 

యువకుడు అనుమానాస్పద మృతి..

కరీంనగర్: తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. మృతదేహంతో మృతుడి బంధువులు కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాజీవ్ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

తీరు మారకుంటే వేటు తప్పదు : సీవీ ఆనంద్

హైదరాబాద్: పౌరసరఫరాల శాఖలోని అధికారులు, సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులపై వస్తున్న విమర్శలు, అవినీతి ఆరోపణలపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న నలుగురు తాత్కాలిక ఉద్యోగులపై ఆయన వేటు వేశారు. ఎంఎస్‌ఏ సలీం (కరీంగనర్), జె.భాస్కర్‌రెడ్డి(నల్లగొండ), వి.వెంకటరమణ (ఖమ్మం), ఎం.బాల్‌రెడ్డి (రంగారె డ్డి)లపై ఆయన సస్పెన‍్షన్ వేటు వేశారు. తీరు మారకుంటే రెగ్యులర్ ఉద్యోగులపైనా చర్యలు తప్పవని సీవీ ఆనందర్ హెచ్చరించారు. 

18:57 - November 4, 2016

సంగీత దర్శకుడిగా మంచి సంగీతంతో అలరించిన ఆర్పీ ప‌ట్నాయ‌క్ శ్రీను వాసంతి లక్ష్మి సినిమాలో సడెన్ గా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తన నటనతో ప్రేక్షకులను విమర్శకులను కూడా మెప్పించారు. ఆర్పీ సినిమా చేస్తున్నారంటే త‌ప్ప‌కుండా అందులో ఏదో ఒక ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఉంటుంద‌నే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల‌కు ఉంది. ఈ సారి మీడియాని ప్ర‌శ్నిస్తున్నామంటూ ఆర్పీ మ‌న‌లో ఒక‌డు సినిమాతో ముందుకొచ్చారు. ఇంత‌కు ముందు `బ్రోక‌ర్‌`తో ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఆయ‌న ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా మ‌న‌లో ఒక‌డు చిత్రంతో ఆక‌ట్టుకుంటానా ? ఈ చిత్రంలో మీడియాను ఆర్పీ ఎలా ప్ర‌శ్నించారు? మీడియాలోని త‌ప్పొప్పుల‌ను ఎత్తిచూప‌డంలో ఆర్పీ సక్సెస్ అయ్యారా? తెలుసుకోవాలంటే `మ‌న‌లో ఒక‌డు` రివ్వ్యూ చూడండి..ఈ సినిమాకు 10టీవీ ఇచ్చిన రేటింగ్ కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

18:44 - November 4, 2016

హాయ్ హలో వెల్కం టు సెన్సేషనల్ ఫిలిం రివ్యూ షో నేడే విడుదల....ఈ రోజు నేడే విడుదలలో మనం మాట్లాడుకుబోయేది సుమంత్ హీరోగా వస్తున్న నరుడా..డోనరుడా.. అండ్.. ఆర్.పి పట్నాయక్ హీరోగా మనలో ఒకడు సినిమాల గురించి. లేట్ గా వస్తున్నా..లేటెస్ట్ గా డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు సుమంత్. చాలా గ్యాప్ తర్వాత హిందీ రీమేక్ మూవీ..నరుడా..డోనరుడా సినిమాతో ఆడియన్స్ ని పలకరించనున్నాడు.. ఈ సినిమా పర్ ఫెక్ట్ రివ్యూ షోలో 10 టివి ఇచ్చిన రేటింగ్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం..

యాదాద్రిభువనగిరి : యాదగిరిగుట్ట పట్టణంలో అక్రమంగా గుట్కా విక్రయిస్తున్న దుకాణాలపై స్థానిక పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఐదు వేల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గుట్కాలు అమ్ముతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

18:28 - November 4, 2016

హైదరాబాద్ : రయ్..రయ్..మంటూ బైక్ శబ్ధాలు...కొత్త లుక్‌తో ఆకట్టుకునే స్టైల్....అబ్బాయిలకు ధీటుగా...బైక్ రైడింగ్...వీటన్నింటికీ వేదికైంది...హైదరాబాద్‌ షాదన్ కాలేజీ. అవేర్‌నెస్ కోసం ఇంతవరకూ వాక్‌లు, రన్‌లకే పరిమితమైన ఈవెంట్లు ఇప్పుడు బైక్ రైడ్‌ల రూపంలో మహిళలల్లో ధైర్యం నింపుతున్నాయి. మరోవైపు అతివేగం ప్రమాదకరమంటూ యూత్‌లో అవేర్‌నెస్ కల్పించేందుకు బైక్ రైడింగ్ నిర్వహించారు.

మారుతున్న ట్రెండ్..
కాలానికి తగ్గట్టు ట్రెండ్‌ మారుతోంది....అదే స్థాయిలో మహిళపై దాడుల పెరుగుతున్నాయి. అందుకే కొత్త కొత్త పద్దతులతో మహిళల్లో ఉత్సాహం నింపేందుకు ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. అలాంటిదే నెక్లెస్‌రోడ్‌లో జరిగిన బైక్ రైడింగ్...ఉమెన్ ఎక్స్‌ప్లోజ్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ రైడింగ్ మహిళల్లో నూతనుత్తేజాన్ని నింపింది. అదే సమయంలో అతివేగంతో జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

అతివేగంతో జీవితాన్ని నాశనం చేసుకోద్దంటున్న నిర్వాహకులు
పురుషుల కంటే మహిళలు తక్కువ కాదని నిరూపించేందుకే..ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్‌ చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దీంతోపాటు తమపై దాడులు జరిగితే తప్పించుకునేందుకు బైక్ రైడింగ్ ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు చెబుతున్నారు. అలాగే ఉన్న ఒక్క లైఫ్‌ని అతివేగంతో నాశనం చేసుకోవద్దని...యువతకు తెలిపేందుకు దీన్ని నిర్వహించామని అంటున్నారు.

స్పీడ్‌ డ్రైవింగ్‌ తో దుష్పరిమాణాలు : నిర్వాహకులు
మహిళలకు ప్రోత్సాహమిస్తే పురుషులతో సమానంగా దూసుకెళ్తారని...ఇందుకు ప్రస్తుతం మహిళలు సాధిస్తున్న ప్రగతే నిదర్శనమని బైక్ రైడర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. మహిళల శక్తిని గుర్తు చేసి...వాళ్లలో ధైర్యం నింపడానికి బైక్ రైడింగ్ ఉపయోడపగుతుందనే ఆలోచనతోనే బైక్ రైడింగ్ కండక్ట్‌ చేశామని అన్నారు. అలాగే స్పీడ్‌ డ్రైవింగ్‌ వల్ల కలిగే దుష్పరిమాణాలను ప్రతి ఒక్కరికి తెలపడమే ఈ ఈవెంట్ లక్ష్యమని నిర్వాహకులు చెప్పారు.

18:09 - November 4, 2016

హైదరాబాద్ : బల్దియా ఖజానా వెల వెల బోతుందా..? ఆర్ధిక ఇబ్బందుల్లో జీహెచ్‌ఎంసీ కొట్టుమిట్టాడుతుందా..? విశ్వ నగరం చేస్తామన్న ప్రభుత్వం బల్దియాకు హ్యాండ్‌ ఇస్తుందా.? చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదా..? అంటే అవుననే చెప్పక తప్పదు. సర్కార్‌ నిధులు ఇవ్వకపోగా ఇతర సంస్ధలకు నిధులు చెల్లించాలంటూ హుకూం జారీ చేయడంతో బల్దియా కష్టాలతో కూనరిల్లుతోంది.

రూ.5600 కోట్ల భారీ బడ్జెట్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒకప్పుడు భారీగా ఆదాయం ఉన్న లోకల్‌ బాడీ.. ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతి వెంకన్న తర్వాత భారీగా ఆదాయం ఉన్న సంస్ధగా బల్దియాను అభివర్ణించేవారు. కానీ కొద్ది సంవత్సరాలుగా జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ వేల కోట్లుకు ఎగబాకింది. ఈ ఏడాది ఏకంగా 5,600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ రూపొందించింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారు అయ్యింది.

బల్దియాకు రూ.600 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు
నిత్యం కాసులతో గళగళలాడే కార్పొరేషన్‌ గల్లాపెట్టే వెల వెలబోతుంది. గత ఆర్ధిక సంవత్సరం కూడా బల్దియాకు 600 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉండేవి. కానీ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఖజానా ఖాళీ అయ్యింది. ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటి వరకు 1200 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరింది. అభివృద్ది పనులు పక్కన బెట్టి..మెయింటెనెన్స్‌ కోసం ప్రతి నెల తప్పకుండా 150 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 95 నుంచి 100 కోట్ల రూపాయలు జీతాలు, వేతనాలు, పెన్షన్ల కోసం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల 14 కోట్ల విద్యుత్‌ ఛార్జీలు చెల్లించాలి. వీటికి తోడు వాహనాలు, కార్యాలయాలతో పాటు ఇతర మెయింటెనెన్స్‌ కోసం 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాంతో వచ్చిన ఆదాయం అంతా ఖర్చయిపోతుంది.

2016-17 సంవత్సరంలో రూ.198 కోట్లు
జీహెచ్‌ఎంసీకి ఇలాంటి పరిస్థితులు రావడానికి ప్రభుత్వమే కారణం.. ఆదాయం బాగా ఉందంటూ జీహెచ్‌ఎంసీకి చెందిన నిధులను ఆర్టీసికి వచ్చిన నష్టాలతో భర్తీ చేశారు. ఆస్తి పన్ను వసూళ్లలో 15 శాతం నిధులు హైదరాబాద్‌ వాటర్‌ బోర్డుకు చెల్లించాలని సర్కార్‌ ఆదేశించింది. దాంతో ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆర్టీసికి 2015-16 సంవత్సరంలో 170 కోట్లు చెల్లించగా..2016-17 సంవత్సరంలో 198 కోట్ల రూపాయలు చెల్లించింది. అంతే కాకుండా ఎన్నికల ముందు జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను 95 కోట్ల రూపాయలను రద్దు చేసిన ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇక 1200 రూపాయల కంటే తక్కువ ఆస్తి పన్ను చెల్లించే వారు నామినల్‌ పన్నును మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం డిసైడ్‌ చేయడంతో ప్రతి ఏటా కార్పొరేషన్‌ కు 25కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతోంది.

ఆర్టీసికి 2015-16 సంవత్సరంలో రూ.170 కోట్లు
జీహెచ్‌ఎంసీకి ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రావాలి. కానీ రెండేళ్లుగా బల్దియాకు ప్రభుత్వాల నుంచి అందుతున్న నిధులు నామ మాత్రమే.. దీంతో కార్పొరేషన్‌ ఖజానా ఖాళీ అయ్యింది. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ 2వేల 819 కోట్ల రూపాయలు అవసరమంటూ ప్రభుత్వానికి విన్నవిస్తే 428 కోట్ల రూపాయలు కేటాయించి.. 23 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. ఇక 2016-17 ఆర్ధిక సంవత్సరానికి 2వేల 260 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరితే.. 400 కోట్ల రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.

1990 దశకంలో ఇబ్బందులు ఎదుర్కొన్న బల్దియా
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కార్పొరేషన్‌ను ఎలా నెట్టుకురావాలంటూ గ్రేటర్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు బల్దియా అప్పుల కోసం అన్వేషిస్తోంది. నిర్మాణం మధ్యలో ఆగిపోయిన ఇందిరమ్మ ఇళ్లను కంప్లీట్‌ చేసేందుకు 370 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు సిద్ధమైంది. క్రెడిట్‌ రేటింగ్స్‌ ఫిక్స్‌ చెయ్యడం కోసం ఇప్పటికే ఇక్రా, కేర్‌ సంస్ధలను జీహెచ్‌ఎంసీ ఆశ్రయించింది. మంచి రేటింగ్‌ వస్తే మూడు వేల కోట్ల వరకు అప్పులు తీసుకోవడానికి అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితులన్ని చూస్తుంటే 1990 దశకంలో జీహెచ్‌ఎంసీ ఎదుర్కొన్న ఇబ్బందులు..మళ్లీ రానున్నాయంటున్నారు నిపుణులు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రేటర్‌ అభివృద్దిపై పూర్తి స్థాయిలో సహకరించకపోతే.నెలల తరబడి బిల్లులు ఆగిపోవడం..వారాలు తరబడి జీతాలు అందకపోవడం వంటి పరిస్థితులు ఉత్పన్నం కాక తప్పదు.

18:01 - November 4, 2016

మహబూబ్ నగర్ : సీపీఎం మహాజన పాదయాత్ర 19వ రోజు కొనసాగుతోంది. నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం సూరపురం గ్రామ సర్పంచ్‌ రాజశేఖర్‌ పాదయాత్రకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. రెండున్నరేళ్లుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని.. సర్పంచులు ఉత్సవవిగ్రహాలుగా మిగిలిపోయామనీ..గ్రామాలకు నిధులను వెంటనే విడుదల చేయాలని పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా సూరపురం గ్రామ సర్పంచ్ రాజశేఖర్ డిమాండ్ చేశారు.

17:57 - November 4, 2016

హైదరాబాద్ : ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జీఎస్‌టీ బిల్లు రావాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు ఆర్థిక మంత్రి ఈటెల. రాష్ట్రాలు, కేంద్రం తన ట్యాక్స్‌ రేంజ్‌ పరిధిని కోల్పోకుండా చూడాలని.. ప్రాక్టికల్‌ ట్యాక్సేషన్‌ ఉండాలన్న సూచనలు చేసినట్లు తెలిపారు. కోటి 50 లక్షల లోపు ట్యాక్స్ టర్నోవర్‌ ఉన్న డీలర్లను రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో.. కోటి 50 లక్షల కన్న ఎక్కువ ట్యాక్స్ టర్నోవర్‌ ఉన్న డీలర్లను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పర్యవేక్షణలో ఉండాలన్న ప్రతిపాదనపై చర్చించినట్లు తెలిపారు. 

17:55 - November 4, 2016

హైదరాబాద్ : నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల తీరు గుదిబండగా మారుతోంది. సంక్షేమ కార్యక్రమాలకు నిధులు లేక... అప్పుల కోసం తిప్పలు పడుతున్న సంస్థకు దన్నుగా ఉండాల్సిన నేతలు.. కార్పొరేషన్ ముందు తమ కోర్కెల చిట్టా విప్పారు. కార్పొరేటర్లందరికి హెల్త్ ఇన్సూరెన్స్, ఫోన్ బిల్లులు కావాలని కోరుతున్నారు.మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

17:52 - November 4, 2016

హైదరబాద్ : బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అంశంపై మఖ్ధూం భవన్‌లో రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జస్టిస్‌ చంద్రకుమార్‌, రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకోవాలని.. రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. 

17:50 - November 4, 2016

కేరళ : రాష్ట్రంలో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు బృందం కేరళ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బాలన్‌ మరియు ఫ్యాకల్టీ మెంబర్స్‌తో భేటీ అయ్యారు. కేరళలోని పంచాయతీరాజ్‌ వ్యవస్థపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను వీక్షించారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థ పనితీరుపై జూపల్లి ప్రశంసలందించారు. తెలంగాణలో గ్రామీణాభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు మంత్రి జూపల్లి వివరించారు. 

సండే పెట్రోల్ బంక్ లు బంద్..

హైదరాబాద్: ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్‌లను మూసివేయాలని పెట్రోల్ బంకుల యజమాన్యాల అసోసియేషన్ నిర్ణయించింది. మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు బంకులు తెరుస్తామని యజమానులు తెలిపారు. ప్రభుత్వ సెలవు దినాల్లో పెట్రోల్ బంకులు మూసివేస్తామని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని పెట్రోల్ బంకుల యజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది.

బొగ్గు కార్మికుల ఉద్యోగ బాధ్యత తమదే - ఎంపీ కవిత..

హైదరాబాద్ : సింగరేణి బొగ్గు కార్మికుల ఉద్యోగ బాధ్యత తమదేనని ఎంపీ కవిత పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మంది కార్మికులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. 

మాజీ సైనికులను మోసం చేస్తున్న కేంద్రం - రాహుల్..

ఢిల్లీ : మాజీ సైనికుల‌ను కేంద్రం మోసం చేస్తోంద‌ని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఓఆర్ఓపీపై ప్ర‌ధాని మోదీ అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నారని విమ‌ర్శించారు. 

17:01 - November 4, 2016

బ్రిటన్ : యునైటెడ్ కింగ్‌డ‌మ్ ప్రభుత్వం త‌మ వీసా నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం... యురోపియ‌న్ యూనియ‌న్ (ఈయూ)లో లేని దేశాలవారు ఇక యూకే వెళ్లడం... అంత సులువు కాదు. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ఈ కొత్త వీసా రూల్స్ క‌ష్టాలు తెచ్చిపెట్టాయి. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫ‌ర్ (ఐసీటీ) కేట‌గిరీలో వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే ప్రారంభ‌ వేతనం 30 వేల పౌండ్లు ఉండాల్సిందే. ఇంత‌కుముందు ఇది 20800 పౌండ్లుగా ఉండేది. ఈ కొత్త నిబంధ‌న న‌వంబ‌ర్ 24 నుంచి అమల్లోకి రానుంది. ఐసీటీ కేట‌గిరీలో బ్రిట‌న్‌లో ఉండే ఇండియ‌న్ ఐటీ కంపెనీలే ఎక్కువ శాతం వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేస్తుంటాయి. కొత్త నిబంధన.. ఈ సంస్థలకు శరాఘాతంగా మారింది.

16:58 - November 4, 2016

మధ్యప్రదేశ్ : సిమి ఉగ్రవాదులను మట్టుబెట్టే సమయంలో పోలీసుల మధ్య జరిగిన ఆడియో సంభాషణ బయటకు పొక్కాయి. అక్టోబర్‌ 31న ఉగ్రవాదులను అంతమొందించే సమయంలో పోలీసులు పొజిషన్‌ తీసుకునే ముందు హిందీలో జరిపిన సంభాషణ టేపు బయట పడింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశానికి చేరుకునే ముందు పోలీసులు జరిపిన సంభాషణలు ఇందులో స్పష్టంగా ఉన్నాయి. వాళ్లను చుట్టుముట్టండి.. వెంటనే పని పూర్తి చేయండి అన్న సంభాషణలు అందులో ఉన్నాయి. ఆడియో టేపుల్ని ఇంకా తాను వినలేదని, వాటిని పరిశీలించాల్సి ఉందని ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుపుతున్న సీఐడీ ఎస్పీ అనురాగ్‌శర్మ తెలిపారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ అనుసంధానంగా పోలీసులకు ఇన్‌స్ట్రక్షన్స్‌ వెళ్లినట్లు వెల్లడవుతోంది.  

16:52 - November 4, 2016

హైద‌రాబాద్ : శివారు ప్రాంతాల ప్రజ‌ల‌కు వ‌చ్చే మేనాటికి పుష్కలంగా త్రాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది జలమండలి. హడ్కో నుండి విడుదలైన 1700 కోట్ల రుణంతో పాటు.. ప్రభుత్వం నుండి వచ్చే 200 కోట్ల రూపాయల గ్రాంటుతో మూడు లక్షల కుటుంబాలకు సరిపడ త్రాగునీరు ఇవ్వడానికి 2700 కిలోమీటర్ల మేర పైపులైన్‌ ఏర్పాటు చేస్తోంది. ఈ పనుల వల్ల గ్రేటర్‌వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జల మండలి ఎండీ దానకిషోర్‌ తెలిపారు.

16:46 - November 4, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికలను ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. అధ్యక్ష ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే గడువుండడంతో ట్రంప్‌, హిల్లరీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. పోల్‌ సర్వేలలో వీరిద్దరి మధ్య తేడా స్వల్పంగానే ఉండడం గెలుపెవరన్నది ఉత్కంఠగా మారింది. అధ్యక్ష ఎన్నికలపై తెలుగు ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో అమెరికాలోని మా టెన్‌టీవీ ప్రతినిధి శారద అందిస్తున్న వివరాలు మీకోసం...

ఉత్కంఠ భరితంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు
నవంబర్‌8న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. డెమోక్రటిక్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, రిపబ్లికన్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నికల్లో గెలుపు కోసం నువ్వా... నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు.

హిల్లరీవైపే తెలుగు ప్రజల మొగ్గు
అమెరికాలోని తెలుగు ప్రజలు హిల్లరీ వైపే మొగ్గు చూపుతున్నారు. మహిళలను కించపరిచే ట్రంప్‌ పట్ల తమకు ఏమాత్రం గౌరవం లేదని, ట్రంప్‌ విధానాలు తమకు ఏమాత్రం నచ్చడం లేదని స్పష్టం చేశారు. హిల్లరీ అనుభవజ్ఞురాలని కితాబిచ్చారు.

హిల్లరీ మంచి కంటే ట్రంప్ కంపే ఎక్కువంటున్న తెలుగువారు
నవంబర్‌ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హిల్లరీ క్లింటన్‌కే వేస్తామని కచ్చితంగా మరికొందరు చెబుతున్నారు. హిల్లరి మంచి గుణాల కన్నా ట్రంప్‌ చెడు గుణాల వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ట్రంప్‌ అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని..... మెక్సికన్లను డ్రగ్‌ ట్రాఫికర్లుగా, రేపిస్టులుగా, ముస్లింలను టెర్రరిస్టులుగా ట్రంప్‌ పోల్చడంపై మండిపడుతున్నారు. ట్రంప్‌ది బిజినెస్‌ మైండని, ఆయన ప్రజల కోసం సామాజిక సేవలు చేసిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. మూడు డిబేట్‌లలో హిల్లరీపై పర్సనల్‌ కామెంట్స్‌ చేశాడే తప్ప అమెరికాకు ఏం చేయాలన్న విధానాలు ట్రంప్‌ వద్ద లేవన్నారు.ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉందని, తాము ఎవరికి ఓటేస్తానన్నది ఇప్పుడే చెప్పలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరు అభ్యర్థుల ప్రచారాలను పోల్చుకున్నట్లయితే ట్రంప్‌ అప్రజాస్వామికంగా, దురహంకార పూరితంగా వ్యవహరిస్తున్నట్లు కనపడిందని తెలుగువాళ్లు చెబుతున్నారు. మహిళలు, మెక్సికన్లు, మైనారిటీల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సముచితం కాదు. ట్రంప్‌ ఫాసిస్ట్‌లా ప్రవర్తిస్తున్నారు. ఆయనను ఎన్నుకుంటే అమెరికా ఏమవుతుందోనన్న భయం తెలుగువాళ్లలో నెలకొంది. సెనెటర్‌గా... మంత్రిగా అనుభవం ఉన్న హిల్లరీని ఎన్నుకుంటేనే అమెరికాకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు.

పెట్రోల్ బంక్ పనివేళల్లో మార్పులు..

హైదరాబాద్ : రేపటి నుండి పెట్రోల్ బంక్ ల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 9 నుండి సాయంత్రం 6గంటల వరకు ఒకే షిప్టు నడపాలని పెట్రోల్ బంక్ డీలర్లు నిర్ణయించారు. రెండు, నాలుగో శనివారాలు..ఆదివారం..సెలవు రోజుల్లో పెట్రోల్ బంక్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

16:39 - November 4, 2016

ఢిల్లీ : రాహుల్ గాంధీ అరెస్ట్ .. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ అణచివేత ధోరణికి నిరసనగా యూత్ కాంగ్రెస్... బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో గాంధీ భవన్ నుంచి ర్యాలీగా బయలు దేరిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు... బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్ళేందుకు ప్రత్నించారు. అయితే గాంధీభవన్ బయట భారీగా మొహరించిన పోలీసులు .. వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. 

16:33 - November 4, 2016

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు శుభవార్త. దాదాపు 15 ఏండ్ల తరువాత సింగరేణి సంస్థ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి సింగరేణి బోర్డు అంగీకరించింది. 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 58 ఏళ్ల వయసు కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వారసత్వ ఉద్యోగాలు కార్మికుల కుమారులు లేదా అల్లుడు లేదా సోదరుడు పొందేందుకు అర్హులుగా నిర్ణయించారు. వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు 18 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలని బోర్డు తెలిపింది. దీనిపై గత ప్రభుత్వాలు స్పందించటంతో సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 49 నుండి 50 సంత్సరాల లోపు వారు దీనికి అర్హులుగా తెలుస్తోంది. గతంలో కుమారుడు లేదా కుమార్తెలు మాత్రమే అర్హులుగా వుండేవారు. కానీ ఈ నిర్ణయంతో అల్లుడు లేదా తమ్ముడు కూడా అర్హులుగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.ఈ నిర్ణయం వచ్చే దసరా నుంచి అమలులోకి రానుంది. 

16:23 - November 4, 2016

తమిళనాడు : తమిళులకు శుభవార్త.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలిత క్రమంగా కోలుకున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ అపోలో ఎండీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. రెండు మూడు రోజుల్లో జయలలితను ఐసీయూ నుండి వార్డుకు షిఫ్ట్ చేస్తామని తెలిపారు. ఆమె కోరితే రెండు మూడు వారాల్లో డిశ్చౄర్జ్ చేస్తామన్నారు. ఓ పుస్తక కార్యక్రమానాకి హాజరైన ఎండీ ప్రతాప్ రెడ్డి ఓ సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు. దీంతో అమ్మ అభిమానులు పండుగ చేసుకోనున్నారు. అమ్మ తీవ్ర అనారోగ్యం నేపథ్యంలో రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా మారిపోయింది. పలువురు ప్రముఖులు ఆమె ఆరోగ్యంపై ఆసుపత్రికి చేరుకుని వైద్యులను ఆరా తీశారు. అమ్మ అభిమానులంతా అపోలో ఆసుపత్రి ఆవరణలోనే పడిగాపులు కాసారు. అమ్మ కోలుకోవాలని మొక్కులు మొక్కారు. ఆమె ఆరోగ్యంపై పూర్తి స్థాయి సమాచారం అందించాలని కోర్టులో పిటీషన్లు కూడా దాఖలు చేశారు. ఆమె కోలుకునే వరకూ సీఎం పరిధిలోని శాఖలన్నీ పన్నీర్ సెల్వంకు అప్పగించిన విషయం తెలిసిందే. 

ఐదో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లలో ఐదో రోజు నష్టాల్లో ముగిశాయి. 156 పాయింట్లు కోల్పోయి 27,284 వద్ద సెన్సెక్స్ ముగియగా 151 పాయింట్లు కోల్పోయి 8,433 వద్ద నిఫ్టీ ముగిసింది. 

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 15 ఏళ్ల తరువాత వారసత్వ ఉద్యోగాలపై చారిత్రక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారసత్వ ఉద్యోగాలకు సింగరేని అంగీకరించింది. దసరా నుండి అమలు కానుంది. 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుండి 59 ఏళ్ల వయస్సు కార్మికులు దరఖాస్తులకు అర్హులని పేర్కొంది. 18 నుండి 35 ఏళ్ల వయస్సు ఉన్న వారు కూడా అర్హులు. వారసత్వ ఉద్యోగాలకు కార్మికుల కుమారులు లేదా అల్లుడు..సోదరులు పొందేందుకు అర్హులుగా పేర్కొంది. 

టాటా గ్రూప్ లో సంస్థాగత మార్పులు..

ముంబై : టాటా గ్రూప్ లో సంస్థాగత మార్పులు జరిగాయి. టాటా గ్రూప్ హెచ్ ఆర్డీ చీఫ్ గా ఎస్.పద్మనాభన్..విదేశాల్లో సంస్థ నిర్వహణ బాధ్యతలు ముకుంద్ రాజన్ కు రతన్ టాటా అప్పగించారు. అమెరికా, సింగపూర్, దుబాయ్, చైనాలో టాటా సంస్థల నిర్వాహణ బాధ్యతలను రాజన్ చూడనున్నారు. హరీశ్ భట్ కు టాటా బ్రాండ్ నిర్వాహణ బాధ్యతలు అప్పచెప్పారు. 

కోలుకొన్న జయ..

చెన్నై : జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో ఆసుపత్రుల ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. తన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితిని జయలలిత అర్థం చేసుకోగలుగుతున్నారని తెలిపారు. ఓ పుస్తకం విడుదల కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు..మూడు రోజుల్లో ఐసీయూ నుండి వార్డుకు మారుస్తామన్నారు. జయలలిత కోరితే డిశ్చార్జ్ చేస్తామన్నారు. 

15:49 - November 4, 2016

రిలయెన్స్ కు కేంద్రం భారీ జరిమాన..

ముంబై : ఓఎన్జీసీ బావుల నుండి గ్యాస్ ను తోడేయడం పట్ల రిలయన్స్ కు కేంద్రం భారీ జరిమానను విధించింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ. 10,312 కోట్ల జరిమానాను కేంద్రం విధించింది. 

ఇంగ్లండ్ బోర్డుకు బీసీసీఐ సెక్రటరీ లేఖ..

ఢిల్లీ : ఇంగ్లండ్ తో సిరీస్ కు ముందు బీసీసీఐ చేతులేత్తిసింది. హోటల్, రవాణాలు ఖర్చులు మీరే పెట్టుకోండని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే లేఖ రాశారు. ఒక వేళ తాము బిల్లులు చెల్లించినా ఆ మొత్తం తిరిగి ఇవ్వాలని బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే పేర్కొన్నారు. పరిస్థితిని వివరించి అజయ్ షిర్కే క్షమాపణ కోరారు. ఈనెల 9 నుండి భారత్ - ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. 

15:18 - November 4, 2016

జగిత్యాల : జిల్లాలో ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయకల్లు మండలం అల్లేపూర్ గ్రామంలో ముగ్గురు ఆఫ్ఘనిన్ వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తెహజా,రహీముల్లా, నజీబుల్లా ..వీరితో పాటు యూపీ చెందిన నితిన్ కుమార్, గౌరవ్ కుమార్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి పాస్ పోర్ట్ లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా ఆఫ్ఘన్లు తాము హల్వా అమ్ముకునేందుకు వచ్చామని వారు చెబుతున్నారు.ఇంతదూరం వచ్చి హల్వా అమ్మకాలు సాగించటంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా జగిత్యాలలో ఐఎస్ ఐఎస్ కు సంబంధించి కార్యకలాపాలు కూడా జరిగాయి. అజాంగోరి అనే ఐఎస్ఐఎస్ ఉగ్రవాది కూడా తిరుబండారాలు అమ్ముకుంటూ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించాడు. అనంతరం ఎన్ కౌంటర్ లో అజాంగోరి మృతి చెందాడు. జరిగిన సందర్భాలు కూడా వున్నాయి. దీంతో ఆదిశగా పోలీసులు వారిని విచారిస్తున్నారు.

ఎన్టీజీలో అమరావతి నిర్మాణంపై విచారణ..

ఢిల్లీ : అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులపై ఎన్జీటీలో వరుసగా నాలుగో రోజు విచారణ కొనసాగింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఏపీ వివరణనిచ్చింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. రాజధాని ప్రాంతంలో భూమి ఎత్తును పెంచడం లేదని, భవనాలను సరైన ఎత్తులో ఏకే గంగూలి పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని ఎన్టీటీకి తెలిపింది.

 

తూర్పు మన్యంలో సీపీఎం పాదయాత్ర..

తూర్పుగోదావరి : తూర్పు మన్యంలో సీపీఎం పాదయాత్ర ప్రారంభమైంది. విలీన మండలాల్లో ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలు పాదయాత్ర చేపట్టారు. ఎటపాక మండలం కన్నాపురంలో పాదయాత్రను భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబురావు ప్రారంభించారు. 

దురుద్ధేశ్యంతోనే జగన్ సభ - గాలి..

విజయవాడ : దురుద్ధేశ్యంతోనే జగన్ జై ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహిస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ్మ నాయుడు పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీని జగన్ వద్దనడం సరైంది కాదని, ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు చేతిలో లేదని, మోడీ చేతిలో ఉందన్నారు. 

పోలీసుల అదుపులో ముగ్గురు అప్ఘన్లు..

జగిత్యాల : అల్లీపూర్ లో ముగ్గురు అప్ఘన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. హల్వా అమ్మకాల కోసం వచ్చినట్లు వారు పేర్కొంటున్నారు. 

సూపర్ సింగర్ పర్నికతో చిట్ చాట్...

సూపర్ సింగర్ పర్నికతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు అసక్తికరమైన విషయాలు తెలిపింది. ఈ ఫీల్డ్ కు వస్తానని అనుకోలేదని చెప్పారు. సింగర్ గా జర్నీ చాలా బాగుందన్నారు. పెళ్లి తర్వాత కూడా చాలా బాగుందని తెలిపారు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంట్లో పాడుతానని చెప్పారు. ఆమె పలు పాటలను పాడి వినిపించారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

14:54 - November 4, 2016

అమెరికా : నవంబర్ 8న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌కు మద్దతుగా ఆయన భార్య మెలెనియా ఫిలిడెల్ఫియాలో ప్రచారం నిర్వహించారు. రిపబ్లికన్‌ అభ్యర్థే విజయం సాధిస్తారని ట్రంప్‌ భార్య మెలెనియా ధీమా వ్యక్తం చేశారు. అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దడం ట్రంప్‌ వల్లే సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. ట్రంప్‌ పట్ల అనవరసరంగా దుష్ప్రచారం జరుగుతోందని మెలెనియా ఆవేదన చెందారు. ఒకవేళ తాను అమెరికాకు ప్రథమ మహిళనైతే ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఆన్‌లైన్‌ ద్వారా సమాధానం చెబుతానన్నారు. 18 ఏళ్లుగా తనకు ట్రంప్‌ తెలుసని, ఆయనకు వచ్చినంత వ్యతిరేక ప్రచారం అమెరికాలో ఎవరికి రాలేదన్నారు.

14:52 - November 4, 2016

ఢిల్లీ : పఠాన్‌కోట్‌ ఉగ్రదాడికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రసారం చేశారన్న కారణంతో హిందీ న్యూస్‌ ఛానల్‌ ఎన్డీటీవీ ప్రసారాలు నవంబర్‌ 9న ఒకరోజు నిలిపివేస్తున్నట్లు కేంద్ర సమాచార శాఖ ఆదేశించింది. దీనిపై సంబంధిత శాఖ విచారణ జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార శాఖ పేర్కొంది. 9 నవంబర్‌ రాత్రి 12 గంటల నుంచి 10 నవంబర్ 12 గంటల వరకు ప్రసారాలపై బ్యాన్‌ ఉంటుంది. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సందర్భంగా ఎన్డీటీవీ ఎయిర్‌బేస్‌లోని ఆయుధాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రసారం చేసినట్లు దీనిపై విచారణ జరిపిన కమిటీ పేర్కొంది. రక్షణకు సంబంధించిన గోప్యంగా ఉండే వివరాలు బహిర్గతం చేయడం దేశ భద్రతకు వ్యతిరేకమని తెలిపింది. తాము గోప్యమైన సమాచారాన్ని ప్రసారం చేయలేదని ఎన్టీటీవి వర్గాలు స్పష్టం చేశాయి. ఎన్డీటీవీ ప్రసారాలపై ఒకరోజు బ్యాన్‌ విధించడాన్ని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ఖండించింది. ఇది భావ ప్రకటనపై దాడిగా అభివర్ణించింది.

14:50 - November 4, 2016
14:48 - November 4, 2016

గుంటూరు : ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గ్రేహౌండ్స్‌ బలగాల కూంబింగ్‌ నిలిపివేయాలంటూ విరసం నేత కళ్యాణ్‌రావు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాసేవ చేస్తూ ప్రజల ఆస్తులను కాపాడుతున్న మావోయిస్టులను పోలీసులు అన్యాయంగా చంపేశారని ఆయన ఆరోపించారు. గుంటూరులో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ప్రజాసంఘాలు నిర్వహించిన ఆందోళనలకు కళ్యాణ్‌రావు, ఆర్కే భార్య శిరీష మద్దతు తెలుపుతూ ఆందోళనలో పాల్గొన్నారు. మావోయిస్టులను చంపిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కళ్యాణ్‌రావు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై ఆర్కే భార్య శిరీష స్పందిస్తూ..ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ అని..వెంటనే ఏవోబీలో కూంబింగ్‌ను నిలిపివేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. తన భర్త ఆర్కే క్షేమంగా ఉన్నారన్న సమాచారం మీడియాలో చూస్తేనే తెలిసిందన్నారు. 

14:46 - November 4, 2016

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ పుట్టినరోజు వేడుకలు కొనసాగుతున్నాయి...తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ 70వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు,కేసీఆర్ గవర్నర్ కు జన్మదిన శుంభాకాంక్షలు అందజేశారు. అనంతం గవర్నర్ కు శాలువా కిప్ప సత్కరించారు.

నరసింహన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన సీఎం చంద్రబాబు..
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ పుట్టినరోజు వేడుకలు కొనసాగుతున్నాయి... గవర్నర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నరసింహన్‌కు శాలువా కప్పి కేక్‌ తినిపించారు.. ఆ తర్వాత సచివాలయం తరలింపుపై గవర్నర్‌తో చంద్రబాబు కొద్దిసేపు చర్చించినట్లు తెలుస్తోంది..

గవర్నర్ కు శాలువా కప్పి సత్కరించిన సీఎం కేసీఆర్
రాజ్‌ భవన్‌కు చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. గవర్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నరసింహన్‌కు శాలువా కప్పి కేక్‌ తినిపించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌ గవర్నర్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. 

14:39 - November 4, 2016

తూర్పుగోదావరి : కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగిపై ఆదర్శ చిట్‌ఫండ్ కంపెనీ యాజమాన్యం దాష్టీకం ప్రదర్శించింది. అవకతవకలకు పాల్పడ్డాడన్న కారణంతో ఉద్యోగిపై పెట్రోల్‌ పోసి.. నిప్పంటించింది. దీంతో ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. చాలా కాలంగా అదే కంపెనీలో పనిచేసే ఉద్యోగిపై చిన్నపాటి అవకతవకలు జరిగిన కారణంగా కంపెనీ యాజమాన్యం ఇంతటి దారుణానికి పాల్పడటంపై తోటి ఉద్యోగులు, స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

14:35 - November 4, 2016

తిరుమల : నామాల వివాదం నెలకొంది. జియంగర్లు, అర్చకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. తోమాల సేవలో వడగళై వర్గానికి చెందిన యూ ఆకారం నామాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్వామివారికి అలంకరించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో జియంగర్లు, అర్చకుల మధ్య వివాదం నెలకొంది. దీనిపై టీటీడీ రమణదీక్షితులుకు నోటీసు జారీ చేసే యోచనలో ఉంది. 

14:33 - November 4, 2016

గద్వాల : జోగులాంబ జిల్లా గట్టు మండలం ఆలూరులో కరెంట్ షాక్ ముగ్గురి ప్రాణాలు తీసింది.. ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మత్తులు చేస్తుండగా ఐదుగురికి విద్యుత్‌షాక్‌ కొట్టింది.. ఇందులో ముగ్గురు మృతిచెందగా... ఇద్దరికి గాయాలయ్యాయి.. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. మృతులు వీరన్న, ఉరుకుందు, బుడ్డన్నగా గుర్తించారు..

కూబింగ్ లో పేలిన మందు పాతర..

ఒడిశా : రాయ్ ఘడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు కూబింగ్ చేపట్టారు. ఈ సమయంలో రోడ్డు మధ్యలో హఠాత్తుగా ఓ మందుపాతర పేలింది. ఈ ఘటనలో డాగ్ స్వాడ్ లోని ఓ శునకానికి గాయాలయ్యాయి. పోలీసులకు మాత్రం ఎటువంటి ప్రమాదం జరుగలేదు. 

తిరుమలలో 'నామాల' వివాదం..

తిరుమల : టిటిడిలో పెంగళై..వడగళై మధ్య మళ్లీ వివాదం నెలకొంది. తోమాల సేవలో వడళై వర్గానికి చెందిన 'యు' ఆకార నామాన్ని స్వామికి అలంకరించారని రమణదీక్షితులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రమణ దీక్షితులకు టిటిడి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 

14:02 - November 4, 2016
14:00 - November 4, 2016

'భూమిక హెల్ప్ లైన్' కొండవీటి సత్యవతితో టెన్ టివి మానవి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె పలు అసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..'నేను ఎలాంటి వివక్ష ఎదుర్కొలేదు. మాది చిన్న గ్రామం. మాది జాయింట్ ఫ్యామిలీ. కట్నాలు, సంప్రదాయాలకు నేను వ్యతిరేకం. రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. పిల్లలు వద్దనుకున్నాం. 1975 సం.లో హైదరాబాద్ వచ్చాను' .. అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:51 - November 4, 2016

హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకూ ఆన్‌లైన్ కష్టాలు...ఇప్పుడేమో పుస్తకాల లేక నానా అవస్థలు ...ఓవైపు పరీక్షలు దగ్గర పడుతుంటే..మరోవైపు సిలబస్ పూర్తికాక..కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు డిగ్రీ విద్యార్థులు. ఎన్ని సమస్యలు ఎదురైనా, విద్యను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వాల మాటలు... కాగితాలకే పరిమితమవున్నాయి గానీ చేతల్లో కనిపించడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. 
చదువుదామంటే పుస్తకాలు లేవు...
ముందు వెయ్యి..వెనుక గొయ్యి మాదిరిగా తయారైంది తెలంగాణ డిగ్రీ విద్యార్థుల పరిస్థితి. చదువుదామంటే పుస్తకాలు లేవు...పోనీ క్లాస్ నోట్సు చదువుదామనుకుంటే, సిలబస్ పూర్తి కాలేదు. దీంతో ఏం చెయ్యాలో అర్థంకాక  డిగ్రీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొత్త విద్యావిధానాల రూపంలో తిప్పలు తప్పడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 
ఆన్‌లైన్ విధానంతో మరింత ఇబ్బందులు 
తెలంగాణలో మొట్టమొదటిసారిగా సిబిసిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఫస్ట్ ఇయర్ లోనే విద్యాశాఖ కు చుక్కెదురైంది. ఈ ఏడాదే  డిగ్రీ  ఆన్‌లైన్ విధానం కూడా ప్రవేశపెట్టి మరింత ఇబ్బందులను ఎదుర్కొంది రాష్ట్ర   సర్కారు.  మొత్తానికి ఏదోలాగా తరగతులు ప్రారంభించినా..సిలబస్ ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు మొదటి సారి సెమిస్టర్ విధానంలో వచ్చె నెలలోనే  పరీక్షలు జరగనున్నాయి. కాని ఇప్పటివరకు పుస్తకాలు అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 
పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో పరీక్షల వాయిదా
రాష్ట్రంలో ఈ ఏడాది జూలై 4 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమైంది.  నవంబర్ 14న మొదటి సెమిస్టర్ ఆఖరి పనిదినంగా విద్యాశాఖ  క్యాలెండర్ విడుదల చేసింది. నిజానికి ఈనెల 15నుంచి ప్రాక్టికల్స్  ఆరంభం కావాలి..  24 నుంచి పరీక్షలు మొదలవ్వాలి.. కాని వీటిని  వాయిదా వేసిన విద్యాశాఖ... డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించేందుకు  ఏర్పాట్లు  చేస్తోంది. అయితే ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాకపోవడం వల్లే పరీక్షలను వాయిదా వేస్తున్నారనే అనుమానాలు వినిపిస్తున్నాయి.  మరోవైపు తెలుగు అకాడమికి తెలంగాణా ఉన్నత విద్యామండలి గత ఆగస్టులో సిలబస్ ఇచ్చినప్పటికీ... పాఠ్యాంశాన్ని రాయించే వరకు సమయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. మరో నాలుగైదు రోజుల్లో పుస్తకాలు  ప్రింటింగ్ కి వెళతాయని తెలుగు అకాడమి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. 
విద్యార్థుల్లో మానసికం ఆందోళన 
పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత లేకపోవడం.. ఇంకా సిలబస్ పూర్తికాకపోవడంతో మానసికంగా ఆందోళనకు గురవుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు.  దీనిపై విద్యాశాఖ వెంటనే స్పందిచాలని డిమాండ్‌ చేస్తున్నారు. త్వరగా బుక్స్ ప్రింటింగ్ పూర్తి చేసి.. తమకు అందజేస్తే పరీక్షలకు సన్నద్ధమవుతామని అంటున్నారు.  

13:46 - November 4, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ 70వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రాజ్‌ భవన్‌కు చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. గవర్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నరసింహన్‌కు శాలువా కప్పి కేక్‌ తినిపించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌ గవర్నర్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. 

 

13:44 - November 4, 2016

నాగర్ కర్నూలు : సీపీఎం మహాజన పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో సాగుతున్న పాదయాత్ర ప్రస్తుతం నాగర్‌కర్నూలు ప్రాంతంలో కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న బృందం సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. నాగర్ కర్నూలు ప్రాంతం వలసలకు పెట్టింది పేరని..కానీ వలసలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. జిల్లాలో వలసలకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. గిరిజన యువతకు ఉద్యోగాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దళితులు, గిరిజనుల, మైనారిటీలు, ఉద్యోగులు, మధ్య తరగతి నుంచి పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుందన్నారు. సమగ్రఅభివృద్ధి, సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటంలో నాగకర్ కర్నూల్ జిల్లా కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఆయా గ్రామాల్లో దళితులను దేవాలయాల్లోకి రానివ్వడం లేదని.... అలావ్ ఆడనిస్తలేరని తెలపారు. దొరల పెత్తనం కొనసాగుతుందన్నారు. కుల పీడన, వర్గ దొపిడీ తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. చెప్పుల మార్కెట్ కార్పొరేట్ శక్తుల చేతిలోకి వెళ్లిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:36 - November 4, 2016

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' 'కాటమరాయుడు' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 'సర్ధార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తరువాత నటిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రానికి 'కాటమరాయుడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. 'పవన్' సరసన మరోసారి 'శృతి హాసన్' నటిస్తోంది. ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి మెగాస్టార్ 'చిరంజీవి' వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. 'ఖైదీ నంబర్ 150' సినిమాలోని కొన్ని సీన్స్ ను 'కాటమరాయుడు' సెట్ లో షూట్ చేస్తుండడంతో 'చిరు' 'పవన్'ని కలిసినట్లు తెలుస్తోంది. ఒకే సెట్ లో కలుసుకున్న 'చిరు', 'పవన్' లు చాలాసేపు విడిగా మాట్లాడుకునట్లు టాక్. మాట్లాడుకున్నారు. మరి ఈ విషయం నిజమా ? కాదా ? అనేది ఫొటోలు బయటపడితే తెలుస్తుంది. 

13:35 - November 4, 2016

చంఢీఘర్ : హర్యానాలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులపై రౌడీ మూక రెచ్చిపోయింది. అంబాలా ఫ్లైఓవర్‌ పక్కన ఇద్దరి యువకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలు, రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడి దృశ్యాలు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవిలో రికార్డు అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రౌడీల కోసం గాలిస్తున్నారు. 

13:27 - November 4, 2016

పెద్దపల్లి : దక్షిణాది రాష్ట్రాలకు వెలుగులు అందిస్తున్న పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. 5వ యూనిట్‌లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడడంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీపావళి రోజున బొగ్గు బంకర్ కుప్ప కూలడంతో 4వ యూనిట్లోని 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఇంత వరకు 4వ యూనిట్‌లో పూర్తిగా మరమ్మతులు జరగక పోవడంలో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. ఇక 500 మెగావాట్ల సామర్ధ్యం గల 7వ యూనిట్‌ను వార్షిక మరమ్మత్తులో భాగంగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేసి మరమ్మత్తులు కొనసాగిస్తున్నారు. 45 రోజుల పాటు ఈ మరమ్మతులు కొనసాగనున్నాయి. 2600 మెగావాట్ల సామర్ధ్యం గల రామగుండం ఎన్టీపీసీలో కీలకమైన మూడు యూనిట్లలో సాంకేతిక కారణాలు తలెత్తడంతో ప్రస్తుతం ప్లాంట్‌లో 1100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. ఎన్టీపీసీ నుండి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, గోవా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రసారంలో ఇబ్బందులు తలెత్తున్నాయి. 

 

13:25 - November 4, 2016

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మళ్లీ పుల్ బిజీ అయింది. తెలుగు తమిళంలో కలిపి ఈ బ్యూటీ ఏకంగా ఆరు సినిమాలు చేస్తుంది. అవకాశాలు లేక ఐటం బ్యూటీగా టర్న్ తీసుకుందానుకున్న కాజల్ బడా సినిమాలను లైన్ లో పెట్టి తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పకనే చెప్పుతుంది. ఇంతకీ కాజల్ చేస్తున్న ఆ కొత్త సినిమాలేంటో వాచ్ దీస్ స్టోరీ.
కాజల్ గత ఎడాది ఒకే ఒక్క సినిమా 
కాజల్ గత ఎడాది ఒకే ఒక్క సినిమా టెంపర్ చేసింది. ఇక ఈ ఎడాది ఈ బ్యూటీ నటించిన బ్రహ్మోత్సవం, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో తెలుగులో కాజల్ పని అయిపోయినట్లే అనుకున్నారంతా. దీనికి తోడు ఈ బ్యూటీ జనతా గ్యారేజ్ లో ఐటం సాంగ్ లో ఆడిపాడటంతో ఇక కాజల్ కెరీర్ కోలాప్స్ అంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ కాజల్ ఒకేసారి ఆరు సినిమాల్లో నటిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
ఖైదీ నెంబర్ 150లో హీరోయిన్ గా కాజల్  
ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తేజ దర్శకత్వంలో రానా హీరోగా నటిస్తున్న మూవీలో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటు ఈ బ్యూటీ తమిళంలో నాలుగు బడా సినిమాలు చేస్తుంది.
ధనుష్ తో మరోసారి నటించేందుకు సైన్ 
తమిళంలో జీవా సరసన నటించిన కవాలై వేండెం సినిమా తెలుగులో ఎంత వరకు ఈ ప్రేమ టైటిల్ తో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అదే విధంగా తలా 57మూవీలో అజిత్ కి జోడిగా నటిస్తుంది. ఇక లేటేస్ట్ గా ధనుష్ తో మరోసారి నటించేందుకు సైన్ చేసింది. ధనుష్ భార్య సౌందర్య దర్శకత్వం వహించనున్న కొత్త మూవీలో కాజల్ నే హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఫేడవుట్ అయినట్లే అనుకున్న ఈ బ్యూటీ ఇలా వరుసగా బడా సినిమాలలో పుల్ స్వీంగ్ లో ఉంది.

 

బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్..

హైదరాబాద్ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని యూత్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించింది. దీనితో నాంపల్లి పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని గోషామహల్ పీఎస్ కు తరలించారు. 

13:12 - November 4, 2016

యంగ్ హీరో నిఖిల్ ఈసారి హిట్టు ఖాయమంటున్నాడు. అనుకోని ప్లాప్ తో కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ హీరో మరోసారి డిఫరెంట్ జోనర్ తో సక్సెస్ కొట్టాడానికి రెడీ అవుతున్నాడు. మరి నిఖిల్ కొత్త మూవీ విశేషాలేంటో వాచ్ దీస్ స్టోరీ.
నిఖిల్ కి షాక్
హ్యట్రిక్స్ సక్సెస్ లతో దూసుకుపోతున్న నిఖిల్ కి శంకరాభరణం సినిమా రూపంలో షాక్ తగిలింది. ఈ మూవీ దెబ్బకు కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి  చాలా టైమే తీసుకున్నాడు. కాస్త లేట్ అయితే అయింది కానీ ఈ సారి మాత్రం  సక్సెస్ గ్యారెంటీ అనే కాన్పిడెన్స్ తో ఉన్నాడు.
ఎక్కడికి పోతావు చిన్నవాడా 
నిఖిల్ తాజాగా ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీకి యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. సన్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నిఖిల్ కి జోడిగా హెబ్బా పటేల్ నందితా శ్వేత హీరోయిన్స్ నటిస్తున్నారు.  
ఈ నెల 11  సినిమాను విడుదల
ఎక్కడికి పోతావు చిన్నవాడాతో నిఖిల్ మరోసారి డిఫరెంట్ జోనర్ ట్రై చేస్తున్నాడు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో యూనిట్ పుల్ హ్యపీగా ఉంది. శంకరాభరణం పరాజయంతో డీలాపడిన నిఖిల్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాననే గట్టిగా నమ్ముతున్నాడు.ఈ థ్రిల్లర్ మూవీతో ఈ యంగ్ హీరో మరోసారి మెస్మరైజ్ చేస్తాడేమో చూడాలి.

 

హైదరాబాద్ లో భారత్ - చైనా భద్రతా సలహాదారుల సమావేశం..

హైదరాబాద్ : భారత్ - చైనా జాతీయ భద్రతా సలహాదారుల కీలక సమావేశం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా స్టేట్ కౌన్సిలర్ యాంగ్ బైచీ పాల్గొన్నారు. 

మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

ఢిల్లీ: విజయ్ మాల్యాకు ఢిల్లీ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు జారీ చేసిన స‌మ‌న్ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మాల్యాపై నాన్ బెయిల‌బుల్ వారంట్ జారీ చేసింది. 

12:50 - November 4, 2016

గుంటూరు : కేంద్రంగా నకిలీ కారం తయారీ గుట్టురట్టైంది. నగర శివార్లలోని నకిలీ కారం తయారు చేస్తున్న పలు మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు కోటి 20 లక్షల రూపాయల విలువైన కల్తీ కారం నిల్వలు సీజ్‌ చేశారు. కొంతమంది అక్రమార్కులు మిర్చి తొడిమెలను పొడిగా చేసి కారంలో కలుపుతున్నారు. వీటితో పాటు కారంలో కలిపేందుకు నిల్వ ఉంచిన ఇరవై బస్తాల రంగును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కోల్డ్ స్టోరేజ్‌లో అధికారులు 4200 బస్తాల చైనా కారం గుర్తించారు. చైనాలో పడేయడానికి సిద్ధంగా ఉన్న కారాన్ని దిగుమతి చేసుకొని దేశీయ కారంతో కలిపి విక్రయిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

12:48 - November 4, 2016

ఢిల్లీ : జంతర్‌మంతర్‌ వద్ద కాంగ్రెస్‌ క్యాండిల్‌ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకే ర్యాంకు ఒకే పింఛను పథకంలో అసమానతలు ఉన్నాయంటూ మాజీ సైనికోద్యోగి రాంకిషన్‌ గ్రేవాల్‌ ఆత్మహత్యపై కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన నిర్వహించింది. రాంకిషన్‌ ఆత్మకు శాంతి చేకూరాలంటూ క్యాండిల్‌ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఇందులో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా పోలీసులు కాంగ్రెస్‌ ర్యాలీని అడ్డుకుని అక్కడి నుంచి రాహుల్‌ను తుగ్లక్‌ రోడ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ మండిపడింది. బుధవారం ఢిల్లీలోని రామ్‌లోహియా ఆసుపత్రి వద్దకు వచ్చిన రాహుల్‌గాంధీని రెండుసార్లు నిర్భందించిన పోలీసులు.. ఇవాళ క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొనేందుకురాగా అడ్డుకున్నారు. 

 

గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని..కేసీఆర్..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

12:47 - November 4, 2016

యూపీ : అఖిలేశ్ రథయాత్ర విజయవంతం కావాలని సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఆకాంక్షించారు. అఖిలేష్‌ శ్రీకారం చుట్టిన 'వికాస్ రథయాత్ర'లో పాల్గొన్న ఆయన.. ఉత్తరప్రదేశ్ లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని సమాజ్‌ వాదీ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. 

 

12:40 - November 4, 2016

తూర్పుగోదావరి : జిల్లాలో దివీస్‌ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ నిన్న సీపీఎం తలపెట్టిన బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పలువురు నాయకులపై కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా దివీస్‌కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులు పెట్టాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:33 - November 4, 2016
12:23 - November 4, 2016

తమ దగ్గర పనిచేసే సిబ్బందితో ఉన్నతాధికారులు ఎలా ఉంటారు ? అదే కలెక్టర్ అయితే...ఆ పని..ఈ పని చేయించుకుంటారనే టాక్ ఉంది. ఇంటి పనుల దగ్గరి నుండి తమ ఆదేశాలతో వారితో ఎలాంటి పనులు చేయించుకుంటారనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఓ కలెక్టర్ మాత్రం తన కింద పనిచేసే సిబ్బందితో ఎలా ఉంటారో తెలుసా ? తన డ్రైవర్ కోసం ఆ కలెక్టర్ ఏం చేశారో తెలుసా ? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. మహారాష్ట్రలోని అకోలా కలెక్టర్ గా శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన దగ్గర దిగంబర్ థాక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతని వయస్సు 58 ఏళ్లు. ఇటీవలే ఆయన సర్వీస్ ముగియడంతో పదవీ విరమణ చేశాడు. ఇన్ని రోజులు తనను క్షేమంగా తీసుకెళ్లడం..విడిచిపెట్టడం లాంటి చేసిన ఈ డ్రైవర్ కి వినూత్నంగా వీడ్కోలు ఇవ్వాలని కలెక్టర్ నిర్ణయించుకున్నారు. అందుకే కలెక్టర్ శ్రీకాంత్ ఏకంగా డ్రైవర్ గా మారిపోయారు. తానే స్వయంగా డోర్ తెరిచి దిగంబర్ ను కూర్చొబెట్టి, కారు డ్రైవింగ్ చేస్తూ కలెక్టర్ ఆఫీసులో జరిగే వీడ్కోలు వేడుకకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 35 ఏళ్ల సర్వీసులో 18 మంది కలెక్టర్లకు డ్రైవర్ గా దిగంబర్ పనిచేశాడు. 

12:20 - November 4, 2016

హైదరాబాద్ : ఏవోబీలో కూంబింగ్ నిలిపివేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆర్కే క్షేమంగా ఉన్నాడన్న సమాచారం తమకు ఫోన్ ద్వారా తెలిసిందన్నారు. పోలీసులు ఆరోపిస్తున్నట్లుగా తాము మైండ్ గేమ్ అడట్లేదని చెప్పారు. 40 ఏళ్లుగా పోలీసులే మైండ్ గేమ్ ఆడుతున్నారని పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

12:16 - November 4, 2016

హైదరాబాద్ : ఎపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కారెం శివాజీ ఎన్నిక చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. శివాజీ నియామకం తీరును తప్పుబట్టింది. సమర్ధుడైన మరో వ్యక్తిని చైర్మన్ గా నియమించుకోవాలంటూ కోర్టు తీర్పు వెలువరించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఆర్కే భార్య పిటిషన్ ఉపసంహరణ..

హైదరాబాద్ : ఆర్కే క్షేమంగా ఉన్నాడని లాయర్ రఘునాథ్ హైకోర్టుకు తెలిపారు. ఆర్కే భార్య వేసిన పిటిషన్ ఉపసంహరణకు హైకోర్టు అనుమతినిచ్చింది.దీనితో పిటిషన్ ను లాయర్ రఘునాథ్ ఉపసంహరించుకున్నారు. 

ఎన్డీటీవీపై పానెల్ కమిటీ చర్యలు..

ఢిల్లీ : పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోని కీలక ప్రాంతాలను ప్రసారం చేసినందుకు ఎన్డీటీవీ ఇండియాపై పానెల్ కమిటీ చర్యలు తీసుకుంది. 9న మధ్యాహ్నం నుండి 24గంటల పాటు ప్రసారాలు నిలిపివేయనున్నారు. ప్రసారాలు నిలిపివేతను ఎడిటర్స్ గిల్డ్ ఖండించారు. ప్రసారాల నిలిపివేత నిర్ణయాన్ని కమిటీ ఉపసంహరించుకోవాలని సూచించారు. ఈ చర్య మీడియా స్వేచ్ఛకు విఘాతమన్నారు. 

12:04 - November 4, 2016

హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు గవర్నర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కు కేక్ తినిపించి విషెస్ తెలిపారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సచివాలయం తరలింపుపై గవర్నర్ తో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:53 - November 4, 2016

రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ధృవ' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. గీతా ఆర్ట్స్ పతాకొంపై అల్లు అరవింద్, ఎస్.వి.ప్రసాద్ లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నగరంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే చిత్ర ఆడియోను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఈనెల 9న నేరుగా మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు టాక్.
​రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా చెర్రీ పవర్ పుల్ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. సైంటిస్ట్ ముసుగులో చట్టవ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తున్న ప్రతి నాయకుడితో జరిపే పోరాటం ఆధారంగా కథ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్ విడుదలయ్యాయి. డిసెంబర్ మొదటి వారంలో 'ధృవ' సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అంతకంటే ముందుగానే ప్రేక్షకుల సమక్షంలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించాలని కూడా యోచిస్తున్నట్లు టాక్. అరవింద్‌స్వామి, నాజర్, పోసాని కృష్ణమురళి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

డీజీపీ వ్యాఖ్యలపై వరవరరావు ఆగ్రహం..

హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే క్షేమ సమాచారం తెలిసిన అనంతరం డీజీపీ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై విరసం నేత వరవరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేషశారు. పోలీసులే మైండ్ గేమ్ ఆడారని, ఆపరేషన్ ఆర్కే పేరిట పోలీసులు గందరగోళం సృష్టించారని విమర్శించారు. 

ఏవోబీ ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ ఆందోళన..

గుంటూరు : ఏవోబీ ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ ప్రజా సంఘాలు ధర్నా నిర్వహిస్తున్నాయి. మల్కన్ గిరి అడవుల్లో కూంబింగ్ ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ కౌంటర్ ను మావోయిస్టు బంధుమిత్రుల కమిటీ తీవ్రంగా ఖండించింది.

 

రెండు టన్నుల ఎర్రచందనం దుంగల స్వాధీనం..

బెంగళూరు : కటిగెనహళ్లిలో చిత్తూరు పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన రెండు టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 

కారెం శివాజీ ఎన్నిక చెల్లదన్న కోర్టు..

హైదరాబాద్ : హైకోర్టులో కారెం శివాజీకి చుక్కెదురైంది. ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ శివాజీ ఎన్నిక చెల్లదని హైకోర్టు పేర్కొంది. కారెం శివాజీ ఎన్నికపై గతంలో ప్రసాద్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. సమర్థుడైన మరో వ్యక్తిని ఛైర్మన్ గా నియమించుకోవాలంటూ సూచించింది. 

10:51 - November 4, 2016

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవ‌ల కాలంలో పార్టీ నేత‌లు, ప్రజాప్రతినిధుల‌కు ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారా..? అధికారుల‌తో సమీక్షల కంటే క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు ప్రజాప్రతినిధుల‌ ద్వారానే తెలుస్తాయనే భావ‌న‌కు సీఎం వచ్చారా..? చంద్రబాబుతో త‌మ‌కు దూరం పెరిగింద‌ని పార్టీ నేత‌లు, ప్రజాప్రతినిధులు అసంతృప్తిగా ఉన్న నేప‌థ్యంలో టీడీపీ అధినేతలో మార్పు ఏమైనా వచ్చిందా..? ఇవన్నీ చూస్తే.. నిజమేననంటున్న తెలుగు తమ్ముళ్లు..! చంద్రబాబులో వచ్చిన ఈ మార్పు పార్టీ నేతల్లో కొత్త ఉత్తేజం నింపుతోంది. 
చంద్రబాబులో మార్పు
ఈ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు వ్యవ‌హార శైలిలో కొంత మార్పు కనిపిస్తోంది. గంట‌ల‌కొద్ది అధికారుల‌తో స‌మీక్షలు నిర్వహిస్తూ పార్టీ వ్యవ‌హారాల‌కు కాస్త దూరంగా ఉండే చంద్రబాబు.. ఇటీవ‌ల‌ వీలైనంత ఎక్కువగా ప్రజాప్రతినిధులు, సమస్యలపై వచ్చే ప్రజల్ని కలిసేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు ఎక్కువ సయం కేటాయించడం ద్వారా నేరుగా ప్రజాసమస్యలు తెలుసుకొనే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నారు. 
పాలన వ్యవహారాల్లో చంద్రబాబు బిజీబిజీ
మొన్నటి వ‌ర‌కూ అధికారుల‌తో పాల‌నా సంబంధించిన వ్యవ‌హారాల్లో బిజీబిజీగా గ‌డిపిన చంద్రబాబు పార్టీ నేత‌ల‌కు, ప్రజాప్రతినిధుల‌కు క‌నీసం అపాయింట్ మెంట్ కూడా ఇచ్చేవారు కాదు. రెండున్నరేళ్ల కాలంగా పాలనా వ్యవహారాలకు అధిక సమయం కేటాయిస్తూ పార్టీ పట్ల ప్రత్యేకంగా దృష్టిసారించడం లేదని నేతల్లో కొంత అసంతృప్తి ఉండేది. దీంతో ముఖ్యమంత్రికి, ప్రజాప్రతినిధుల‌కు దూరం పెరుగుతోందనే గుసగుసలు పార్టీలో వినిపించాయి. కానీ, ఇటీవ‌ల చంద్రబాబు వ్యవ‌హార శైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది రోజులుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మధ్యాహ్నం ఎంతమంది ప్రజాప్రతినిధులు వ‌స్తే అంత‌మందిని ఆయ‌న క‌లుస్తున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు, పార్టీనేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నేత‌ల్లో అనందం  
మొత్తంగా రోజులో ఎక్కువ స‌మ‌యం పార్టీ నేత‌ల‌కు ప్రజాప్రతినిధుల‌కు సీఎం కేటాయించ‌డం ప‌ట్ల టీడీపీ నేత‌లు అనందం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కారంతో పాటు, పార్టీ బ‌లోపేతానికి అవ‌కాశం వ‌చ్చిందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. 

 

10:47 - November 4, 2016

గాంధీనగర్ : గుజరాత్‌లో పట్టపగలే దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై తండ్రి కొడుకులు కత్తి దాడి చేశారు. పిడిగుద్దులు, రాళ్లదాడి చేసిన తండ్రీకొడుకులు అనంతరం కత్తితో పొడిచి దారుణం హత్య చేశారు. ఈ దాడిలో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. దాడి చేస్తున్న సమయంలో పక్కనే ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడే కానీ అడ్డుకోలేదు. 

 

10:43 - November 4, 2016

కర్నాటక : బెంగళూరులోని కటిహన హల్లులో చిత్తూరు జిల్లా పోలీసుల దాడులు నిర్వహించారు. కటిహన హల్లు గ్రామ శివారులోని పొలంలో అక్రమంగా నిల్వవుంచిన రెండు టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.20 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఒక టన్ను ఎర్రచందనం ఖరీదు పది కోట్ల రూపాయలు ఉంటుంది.  పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:37 - November 4, 2016

గుంటూరు : అమరావతిలో జరగబోయే మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాలకు అసెంబ్లీ భవనం సిద్ధం అవుతోంది.   వెలగపూడిలోని తాత్కాలికి సచివాలాయం ప్రాంగణంలోనే తాత్కాలికంగా అసెంబ్లీ భవన నిర్మాణానికి ప్రభుత్వం శ్ర్రీకారం చుట్టింది. శాసనసభ, మండలిని కలిపి ఒకే భవనం లో నిర్మిస్తున్నారు. డిసెంబర్ 15 నాటికి అసెంబ్లీ భవనం పూర్తి చేయాడానికి, నిర్మాణ సంస్థలు పనులు వేగంగా చేస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:32 - November 4, 2016

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా నెమ్మదిగా కదులుతోంది. విశాఖ విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరాన,.పారాదీప్‌కు దక్షిణ నైరుతిగా 990 కిలోమీటర్ల దూరానా కేంద్రీకృతమైఉంది. ఇది మరో 12 గంటల్లో వాయువ్యంగా పయనించి ఆ తర్వాత ఈశన్యదిశగా బంగ్లాదేష్‌ వైపు మరలుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఉత్తరకోస్తాలో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. కళింగపట్నంలో 1 సెంటీమీటరు వర్షపాతం నమోదైంది. రేపు ఉత్తరకోస్తాతీరంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని..మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

గవర్నర్ ను కలిసిన బాబు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

పోలీసులపై చర్యలు తీసుకోవాలి - మధు..

తూర్పుగోదావరి : కాలుష్య కారక పరిశ్రమలను అంగీకరించమని, భౌతిక దాడులకు పాల్పడిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. దివీస్ నిర్మిత ప్రాంతంలో 15న రాఘవులు, 27న సీపీఎం పార్లమెంటరీ బృందం పర్యటిస్తారని పేర్కొన్నారు. 

సికింద్రాబాద్ లో టాస్క్ ఫోర్స్ దాడులు..

సికింద్రాబాద్ : మ్యాన్ పవర్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ఐదు సంస్థలపై కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. 

10:23 - November 4, 2016

రంగారెడ్డి : ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌ నిధుల విడుదలపై ప్రభుత్వం చేస్తున్న జాప్యం పేదల విద్యార్థులకు శాపంగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలంలోని మొగిలిగిద్ద గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్‌తో 18 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రజలను కోదండరామ్‌ పరామర్శించారు. రాజకీయనాయకులు అభిప్రాయాలకు అనుగుణగా అశాస్త్రీయంగా జిలాలు విభజన జరగడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయని విమర్శించారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. నిధుల విడుదల జాప్యంతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అవుతుందన్నారు. కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుకోలేని పేద విద్యార్థులకు ఫీజుల రీఎంబర్స్‌మెంటే దిక్కు అన్నారు. జిల్లాలు, మండలాల విభజన అశాస్త్రీయంగా జరిగిందన్నారు. జిల్లాల విభజనలో రాజకీయ నాయకుల అభిప్రాయానికే ప్రాధాన్యత ఉందన్నారు. 

10:17 - November 4, 2016

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని సోపూర్ లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది ఒమర్ ఖలిక్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పధార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ ఐఏ ద్వారా విచారించనున్నారు. ఉగ్రవాదిని ఎన్ ఐఏ కి అప్పగించే అవశాలు ఉన్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాది అరెస్టు

జమ్మూకాశ్మీర్ : సోపూర్ లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది ఒమర్ ఖలిక్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పధార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

09:52 - November 4, 2016

మేడ్చల్ : జిల్లాలోని శామీర్ పేట్ మండలంలో దారుణం జరిగింది.వివాహితపై కుటుంబ సభ్యులు హత్యాయత్నానానికి పాల్పడ్డారు. దొంగతనం నెపంతో భార్యపై భర్త, అత్త, మరిది కిరోసిన్ పోసి నిప్పంటించారు. శ్రీనివాస్ రెడ్డి, సరస్వతి దంపతులు. అత్త, మరిదిలతో కలిసి అలియాబాద్ లో నివాసముంటున్నారు. నిన్న రాత్రి ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనం నెపంతో సరస్వతిపై భర్త, అత్త, మరిది కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలపాలైన సరస్వతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సరస్వతి దేహం 96 శాతం కాలిపోయింది. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. మనస్తాపంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని భర్త, అత్త, మరిది అంటున్నారు. ఇదిలావుంటే భర్త, అత్త, మరిది కలిసి సరస్వతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారని సరస్వతి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. సరస్వతిపై హత్యాయత్నం చేశారా... లేదా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా అనే కోణంలో విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

భోపాల్ ఎన్ కౌంటర్ పై జుడీషియల్ విచారణకు ఆదేశం

మధ్యప్రదేశ్ : భోపాల్ ఎన్ కౌంటర్ పై జుడీషియల్ విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 

 

మేడ్చల్ జిల్లాలో దారుణం..

మేడ్చల్ : జిల్లాలోని శామీర్ పేట్ అలియాబాద్ లో దారుణం జరిగింది. దొంగతనం నెపంతో భార్యపై భర్త, మామ, అత్త, మరిది కిరోసిన్ పై పోసి నిప్పంటించారు. భార్య సరస్వతి మృతి చెందింది.

09:15 - November 4, 2016

టీడీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, టీపీసీసీ నేత రామ్ శర్మ, సీపీఎం నేత మురళీకృష్ణలు పాల్గొని, మాట్లాడారు. దివీస్ ల్యాబ్స్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచివేస్తుందని చెప్పారు. పోలీసులు పాశవికంగా ప్రవర్తించారని తెలిపారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:59 - November 4, 2016

రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని రజకవృత్తిదారుల సంఘం నేత గుమ్మడిరాజు నాగరాజు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'రజకవృత్తిని పారిశ్రామిక వృత్తిగా గుర్తించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. బిఎస్ రాములు నేతృత్వంలో ఏర్పాటైన బిసి కమిషన్ ను కలిసిన రజకవృత్తిదారుల సంఘం నేతలు ఇదే డిమాండ్ ను వినిపించారు. రజకవృత్తిదారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను బిసి కమిషన్ ఎదుట ప్రస్తావించారు'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

వైద్య పరీక్షలు చేయించుకున్న సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : పంజాగుట్టలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో సీఎం చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 

08:51 - November 4, 2016

ఆధునికాభివృద్ధి సంప్రదాయ వృత్తులకు రోజుకో సవాలు విసురుతోంది. అనేక వృత్తులు ధ్వంసమవుతున్నాయి. వృత్తిదారులకు ప్రభుత్వాల నుంచి సహాయం కొరవడుతోంది. మరోవైపు కార్పొరేట్ హంగులతో, కొత్తకొత్త బిజినెస్ వ్యూహాలతో విభిన్న వృత్తుల్లోకి ప్రవేశిస్తున్న పెద్దపెద్ద సంస్థలు వృత్తిదారుల జీవనోపాధికే సవాలు విసురుతున్నాయి. 
లాండ్రీ వ్యాపారంలోకి కార్పొరేట్ సంస్థలు
తాము ధరించే దుస్తులను శుభ్రంగా ఉతికి, ఇస్త్రీ చేసేందుకు నెలకు 2వేలకు రూపాయలకు పైగా వెచ్చిస్తున్న కుటుంబాలు చాలా వున్నాయి. కూరగాయలు, పండ్లు, పాలు, కిరాణా వ్యాపారాలలోకి ప్రవేశించిన విధంగానే  లాండ్రింగ్‌ బిజినెస్‌ లోకి ప్రవేశించేందుకు కొన్ని కార్పొరేట్‌ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. తరతరాలుగా దుస్తులు ఉతకడం,  ఇస్త్రీ చేయడం లాంటి పనులు చేస్తున్నది రజకులు.   మనుషులు దుస్తులు వేసుకోవడం అలవాటు చేసుకున్న నాటి నుంచే ప్రారంభమైన రజకవృత్తి ఇప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆధునిక సమాజంలో రజక వృత్తి అనేక మార్పులకు లోనవుతోంది. ఇదొక పెద్ద వ్యాపారంగా మారుతోంది. లాండ్రీ షాపుల నిర్వహణలోకి కార్పొరేట్ సంస్థలు కూడా ప్రవేశిస్తున్నాయి. మనదేశంలో ఏటా దాదాపు రెండు లక్షల 20 వేల కోట్ల రూపాయల టర్నోవర్ తో లాండ్రీ వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా.  ఇందులో సంఘటితరంగం వాటా కేవలం 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే.  98 శాతం అసంఘటితరంగంలోని రజకులు నిర్వహిస్తున్నాయి.  లాండ్రీ బిజినెస్ ఏటా 25 నుంచి 30శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందన్న అంచనాలున్నాయి. దీంతో లాండ్రీ బిజినెస్ ను కొల్లగొట్టేందుకు, క్యాష్ చేసేందుకు బడా సంస్థలు కూడా వ్యాపార వ్యూహాలు రచిస్తున్నాయి. ఆన్ లైన్ సర్వీస్ సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. 
అనేక సమస్యలు ఎదుర్కొంటున్న రజకులు  
మరోవైపు, తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవనయానం సాగిస్తున్న రజకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. బండచాకిరీ లాంటి ఈ వృత్తి నుంచి తప్పుకుంటున్న దృశ్యాలు గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తున్నాయి. దుస్తులు ఉతికేందుకు సమీపంలో నీళ్లు దొరక్కపోవడం, చెరువులు, కుంటలలోకి దిగితే చర్మవ్యాధులు సోకడం, గ్రామాల్లో సామాజిక బహిష్కరణలు లాంటి సమస్యలు వీరిని వేధిస్తున్నాయి. పట్టణాలలోని ధోబీ ఘాట్లలో సౌకర్యాలు లోపించడం,  మధ్యతరగతి కుటుంబాలు  వాషింగ్ మెషిన్ల వైపు మొగ్గుచూపుతుండడం, మరోవైపు వాషింగ్ ప్లాంట్ల రూపంలో బడా సంస్థల నుంచి పోటీ ఎదురవ్వడంతో రజకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకప్పుడు స్వతంత్రంగా వృత్తి నిర్వహించినవారు ఇప్పుడు వాషింగ్ ప్లాంట్లలో దినసరి కూలీలుగా పనిచేయాల్సిన పరిస్థితీ ఏర్పడుతోంది. వాషింగ్ ప్లాంట్ ఏర్పాటుకు కనీసం 5 నుంచి పది లక్షల రూపాయల దాకా ఖర్చవుతుంది. పట్టణాలు, నగరాలలో ప్రయివేట్ సంస్థలు  అత్యాధునిక పరికరాలతో వాషింగ్ పాంట్లు ఏర్పాటు చేసి లాభాలు గడిస్తుండగా, సంప్రదాయ రజకులు వాటిలో కూలీలుగా మారడమో, లేదా ఉపాధినే కోల్పోవడమో జరుగుతోంది. ప్రభుత్వాలు కానీ, స్థానిక సంస్థలు కానీ, రజక ఫెడరేషన్ కానీ వాషింగ్ ప్లాంట్ల ఏర్పాటు మీద దృష్టి సారించడం లేదు. పట్టణాలలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాషింగ్ ప్లాంట్లను నెలకొల్పడం వల్ల రజకుల శారీరక శ్రమను తగ్గించడమే కాకుండా, వారి జీవనోపాధిని కాపాడే అవకాశం వుంటుంది. సమాజం ఎంత ఆధునికంగా మారినా, కొన్ని వృత్తులు కొనసాగుతాయి. అలా కొనసాగేవాటిలో రజక వృత్తి ఒకటి. సంప్రదాయ వృత్తిలో రజకవృత్తిని కొనసాగిస్తున్నవారికి ఆధునిక యంత్రపరికరాలను సమకూర్చడం ద్వారా, వాటిని వినియోగించే నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి మేలు జరుగుతుంది. రజకులకు ఆధునిక యంత్రాలు, నైపుణ్య శిక్షణలో అందించడంలో ప్రభుత్వాలు ఎంత ఆలస్యం చేస్తే, అంత వేగంగా ప్రయివేట్, కార్పొరేట్ సంస్థలు లాండ్రీ బిజినెస్ ను కొల్లగొట్టే ప్రమాదం వుంది.  పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ కంపెనీలకు రాయితీలు, భూములు, ప్రోత్సహకాలు ఇస్తున్న విధంగానే రజక ఫెడరేషన్ లకు భూమి, ఆధునిక యంత్ర పరికరాలు సమకూర్చిపెట్టడం, విద్యుత్ రాయితీలివ్వడం ద్వారా సంప్రదాయ వృత్తిదారులకు కొత్త జీవితం ప్రసాదించే అవకాశం వుంది. 

 

రామగుండం ఎన్టీపీసీలో నిలిచి 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

పెద్దపల్లి : రామగుండం ఎన్టీపీసీ 5 వ యూనిట్ లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లో లీకేజీతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

 

08:40 - November 4, 2016

విశాఖ : ఎప్పుడూ విదేశీ భజన చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడవే విదేశీ పోకడలను రాష్ట్రానికి దిగుమతి చేసేందుకు పూనుకున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో బీచ్‌ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మందు, విందులతో పాటు... గానా భజానాలకు రంగం సిద్ధమవుతోంది. గతంలో గోవా బీచ్‌లో ఇలాంటి ఉత్సవం నిర్వహించారు. 
బీచ్‌ లవ్ ఫెస్టివల్ పై సర్వత్రా విమర్శలు
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. విశాఖలో బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పర్యాటకాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరిట ఏపీ సర్కారు పాశ్చాత్య సంస్కృతి వ్యాప్తికి దోహదపడే ప్రదర్శనలు, ఆట పాటలు, నృత్యాల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం సర్వత్రా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు గొడ్డలి పెట్టులాంటి బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ను తప్పకుండా.. అడ్డుకుంటామని విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 
బరితెగించి వ్యవహరిస్తోన్న రాష్ట్ర సర్కారు : ప్రతిపక్షాలు 
పర్యాటకాభివృద్ధి పేరిట రాష్ట్ర సర్కారు బరితెగించి వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇప్పటిదాకా దేశంలో ఒక్క గోవాలో తప్ప మరెక్కడా ఇలాంటి లవ్ ఫెస్టివల్ నిర్వహించిన దాఖలాలు లేవు. అయితే... గోవా సంస్కృతి సంప్రదాయాలు వేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీచ్‌లవ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం యువతను పెడదారి పట్టించే ప్రమాదం ఉందని అంటున్నారు. 
ఫిబ్రవరి 12 నుంచి మూడురోజుల పాటు నిర్వహణ
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ ఈ ప్రేమోత్సవం నిర్వహించనుంది. ఫిబ్రవరి 12 నుంచి ప్రేమికుల దినమైన 14వ తేదీ వరకు మూడురోజుల పాటు బీఎల్‌ఎఫ్-2017 పేరిట ఉత్సవాలు జరగనున్నాయి. ప్రఖ్యాత పాప్ గాయని, బెల్లీ డ్యాన్సర్ షకీరా ఆటపాటలు, హాలీవుడ్, బాలీవుడ్ తారలు, మోడళ్ల క్యాట్ వాక్‌లు, అందాల పోటీలు ఏర్పాటు చేయనున్నారు.
9వేల జంటలకు ఆహ్వానం 
ఐరోపా, అమెరికా తదితర దేశాల నుంచి ఏకంగా 9వేల జంటలను ఈ ఉత్సవానికి ఆహ్వానిస్తున్నారు. వారికోసం ప్రత్యేకంగా టెంట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు విశాఖ తీరంలో ఎక్కడ ఈ ఫెస్టివల్ నిర్వహించాలన్న దానిపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. ప్రసిద్ధ బౌద్ధారామాలున్న తొట్లకొండ, సాగర్‌నగర్ బీచ్, ప్రపంచ ప్రఖ్యాత ఎర్రమట్టి దిబ్బలు అనువైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఉత్సవంలో భాగంగా పెట్టుబడిదారుల సదస్సులతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ బీచ్ లవ్ వంటి పలు పోటీలు నిర్వహించి విజేతలకు అవార్డులను అందజేయాలని కూడా భావిస్తున్నారు. మారథాన్ వంటి పోటీలను మిల్కాసింగ్, పీటీ ఉషలతో ప్రారంభింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా టికెట్ ధర కూడా నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. ఇక దీనిపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. 
మహిళా సంఘాల ఆందోళన
పర్యాటకరంగం అభివృద్ధికి ఇలాంటి ఫెస్టివల్‌ను ఎంచుకోవడం తగదని మహిళా సంఘాలు సూచిస్తున్నాయి. వీటివల్ల యువత పెడదోవ పట్టే ప్రమాదం ఉందంటున్నాయి. ఓ ప్రైవేటు సంస్థ తమ వ్యాపార ప్రయోజనాల కోసం లవ్ ఫెస్టివల్ పేరిట మహిళల శరీరాన్ని ప్రదర్శనకు పెట్టడం, దానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం మంచి పద్ధతి కాదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. 
ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న విద్యార్థి సంఘాలు
గోవా బీచ్‌లో విశృంఖల పాశ్చాత్య పోకడలకు వ్యతిరేకంగా ఒకపక్క ఆందోళనలు చేస్తుంటే.. అలాంటి దుష్ట సంస్కృతిని విశాఖలో ప్రవేశపెడితే చూస్తూ ఊరుకోమని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. వివాదాస్పద బీచ్ ఫెస్టివల్‌పై విశాఖలో పర్యాటక శాఖ అధికారులు గానీ, వుడా, జీవీఎంసీ అధికారులు గానీ నోరుమెదపడం లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడమే తప్ప తామేమీ చేయలేమని అంటున్నారు. మొత్తంగా బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమంపై సర్వత్రా విమర్శలు వస్తుండటంతో.. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తుందా..? లేదా చూడాలి. 

 

08:25 - November 4, 2016

నాగర్ కర్నూలు : ప్రజాసమస్యలపై చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తమ్మినేని బృందం విమర్శించింది. ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు ప్రజా గొంతుకను తమ గొంతుకగా వినిపిస్తామని, సీఎం కేసీఆర్‌ దిగివచ్చే దాకా తమ పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా తమ్మినేని స్పష్టం చేశారు. 
18 వ రోజు 25 కి.మీ పర్యటన 
ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. 18వరోజు పాదయాత్ర బృందం 25 కిలోమీటర్లు పర్యటించింది. ప్రజలు తమకు విన్నవించిన సమస్యలపై తమ్మినేని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. జినుకుంట గ్రామంలోని లెదర్‌ పార్క్‌ను సందర్శించిన తమ్మినేని.. వెంటనే లెదర్‌ పార్కును పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెల్లించడం లేదని, నాలుగున్నర లక్షల మంది లబ్ధిదారులు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.  
ప్రజా గొంతకను మా గొంతుకగా వినిపిస్తాం : తమ్మినేని
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు ప్రజా గొంతకను తమ గొంతుకగా వినిపిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీఎం కేసీఆర్ దిగివచ్చేదాకా తమ పోరాటం ఆపేది లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానని కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించారని..స్వరాష్ట్రం సిద్ధించినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.  
హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం : వెంకటేష్‌
గురువారం పాదయాత్ర బృందం నాగర్ కార్నూల్ జిల్లాలోని రామాజిపల్లి, కొండనాగుల, బల్మూరు, అనంతవరం, నర్సాయిపల్లిలో కొనసాగింది. పాదయాత్రలో దారి పొడవునా స్థానిక సమస్యలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. సీపీఎం మహాజన పాదయాత్రకు టీడీపీ అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జ్‌ వెంకటేశ్‌ మద్దతు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా... ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని వెంకటేష్‌ విమర్శించారు.  
సీఎం కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసిన మహిళలు  
నాగర్ కర్నూల్ జిల్లా కొండనాగులు గ్రామంలో మహిళలు సీఎం కేసీఆర్‌పై దుమ్మెత్తిపోశారు. వృద్ధులకు ఫించన్‌, బడుగు బలహీన వర్గాల వారికి ఇళ్లు ఇచ్చేవరకు పోరాటం ఆపేది లేదన్నారు. ప్రజలు చైతన్య వంతులై ప్రజా సంక్షేమ కార్యాక్రమాలు అర్హులకు అందేవరకు ప్రభుత్వాన్ని నిలదీయాలని తమ్మినేని సూచించారు.

 

నేడు గవర్నర్ నరసింహన్ ను కలవనున్న సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : ఇవాళ ఉదయం 9 గంటలకు గవర్నర్ నరసింహన్ ను ఎపి సీఎం చంద్రబాబు కలవనున్నారు.  ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. 

08:13 - November 4, 2016

తూర్పుగోదావరి : దివీస్‌ ల్యాబ్స్‌కు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంతో జరుగుతున్న ప్రజా ఉద్యమం ఉద్ధృతమవుతోంది. కాలుష్యంతో ప్రజల పొట్టకొట్టే దివీస్‌కు వ్యతిరేకంగా దానవాయిపేటలో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కంపెనీకి వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ ఏపీ కార్యదర్శి మధు సహా వందలాది మంది కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు ఉక్కుపాదం మోపి అరెస్టుచేశారు. 
ప్రజా ఆందోళనకు సీపీఎం మద్దతు 
దివీస్‌ ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో జరుగుతున్న ఆందోళన రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. కంపెనీ పెట్టొదంటూ దానవాయిపేట పరిసర ప్రాంతాల ప్రజలు చేస్తున్న ఆందోళనకు సీపీఎం మద్దతు పలికింది. ప్రజలతో కలిసి  కొంతకాలంగా పోరాటం చేస్తోంది. ఈక్రమంలోనే గురువారం బహిరంగ సభ ఏర్పాటు చేసింది. 
మధు సహా 200 మంది కార్యకర్తలు, ప్రజలు అరెస్టు 
అయితే దివీస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంపై మొదటి నుంచి ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు... దివీస్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు చేసిన దానవాయిపేటలో బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదు. పైగా తొండంగి పరిసర ప్రాంత గ్రామాల్లో రెండున్నర నెలల క్రింతం విధించిన 144వ సెక్షన్‌ ఇంకా కొనసాగుతోంది. దానవాయిపేటలో పోలీసులు భారీగా మోహరించారు. సభ నిర్వహించేందుకు సీపీఎం నేతలు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు ముందుకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు సహా 200 మంది కార్యకర్తలు, ప్రజలను అరెస్టు చేశారు. మధుతోపాటు కొందర్ని కోటనందూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరికొందర్ని ప్రత్తిపాడుతోపాటు ఇతర పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లారు. 
పోలీసులు దాష్టీకం 
సీపీఎం నేతలు, కార్యకర్తల అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన దానవాయిపేట ప్రజలపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. మహిళలు, వృద్ధులు అన్న తేడా లేకుండా అందర్నీ చొక్కాలు పట్టుకుని లాగి పడేశారు. విచక్షణారహితంగా లాఠీలతో చితకబాదారు. పోలీసుల దౌర్జన్యానికి తాళలేక కొందరు మహిళలు సొమ్మసిల్లి కిందిపడిపోయారు.  నేతమీద పడిపోయిన కొందరు పురుషుల్ని కాళ్లు, చేతులు పట్టుకుని లారీల్లోకి  బలవంతంగా తోసేశారు. ఈ క్రమంలో ఆందోళనకారల చొక్కాలు, మహిళల వస్త్రాలు చినిగిపోయాయి. అరెస్టులను కవర్‌ చేస్తున్న మీడియాపై కూడా పోలీసులు దౌర్జన్యం చేశారు. 
పోలీసుల చర్యను తప్పుపట్టిన ఆందోళనకారులు 
పోలీసుల చర్యను ఆందోళనకారులు తప్పుపట్టారు. గ్రామస్థులు వందమంది ఉంటే... వెయ్యిమంది పోలీసులు ఎందుకని ఆగ్రహంతో ప్రశ్నించారు. దివీస్‌ కాలుష్యంతో తమ బతుకులు బుగ్గిపాలవుతాయన్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం దిగొచ్చి, దివీస్ ల్యాబ్స్‌ను వెనక్కి తీసుకునేవరకు ఉద్యమం ఆగదని సీపీఎం నేతలు  హెచ్చరిస్తున్నారు. దివీస్‌ వ్యతిరేక ప్రజా ఉద్యమంపై ప్రభుత్వం మోపుతున్న ఉక్కుపాదాన్ని లెక్కచేయకుండా ముందుకు సాగాలని సీపీఎం నేతలు, ప్రజా సంఘాల నేతలు నిర్ణయించారు. 

 

08:06 - November 4, 2016

హైదరాబాద్ : ఇక్రిశాట్‌లో రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు ముగిసింది. ఆహారభద్రత, వాతావారణ మార్పులు, నీటి వినియోగంపై జరిగిన సదస్సులో జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక సంస్థలు పాల్గొన్నాయి.    
వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులపై చర్చ
ఇక్రిశాట్ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సులో 'నేడు వ్యవసాయరంగంలో ఆచరించాల్సిన ఆధునిక పద్ధతులు' అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. వ్యవసాయరంగంలో నీటి వినియోగం పెరిగిపోయిందని, సాధ్యమైనంత వరకు వాటి వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉందని సదస్సులో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. 
ప్రపంచవ్యాపంగా పెరుగుతున్న జనాభా
పెరుగుతున్న జనాభాకు ఆహార అవసరాలు తీరాలంటే ఆహార ఉత్పత్తుల్లో గణనీయమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సాంకేంతిక పరిజ్ఞాన వినియోగంతో పాటు, రైతులకు నూతన మెళకువలు కూడా నేర్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ, విదేశీ ప్రతినిధుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం కలిగిందని ఆచార్య ఎన్జీ రంగాయూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ భాస్కర్ రావు తెలిపారు.
వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు
వాతావరణంలో వస్తున్న అనుహ్య మార్పులను తట్టుకుని వ్యవసాయరంగం మనగలిగేలా జరుగుతున్న పరిశోధనలను ఒకరికొకరు షేర్ చేసుకున్నామని కడప కలెక్టర్ కె.వి సత్యనారాయణ వివరించారు. కడప జిల్లాలో నీటి కొరతపై చేపట్టిన పద్దతులపై ఈ సదస్సులో పత్రాలు సమర్పించామని తెలిపారు. రానున్న రొజుల్లో వ్యవసాయరంగంలో అనుసరించాల్సిన పద్ధతులపై జరిగిన అంతర్జాతీయ సదస్సు, రైతాంగానికి క్షేత్రస్ధాయిలో ఎలా ఉపయోగపడునుందో వేచిచూడాలి.

 

08:03 - November 4, 2016

హైదరాబాద్ : చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేసి.. సరికొత్త రికార్డు నెలకొల్పుతామని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవతం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ జలసౌధలో మంత్రి హరీష్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 
నిర్మాణ స్థలం నుంచి జలసౌధకు వీడియో కెమెరా అనుసంధానం
హైదరాబాద్‌లోని జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులు, నిపుణులతో మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వానికి ఒక చాలెంజ్ అని హరీష్ అన్నారు. నిధులకు కొరత లేదని, ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీల మధ్య సమన్వయం, సమిష్టి కృషితో వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులను హైదరాబాద్ నుంచి మానిటర్ చేయడానికి వీలుగా ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో వీడియో కెమెరాలు ఏర్పాటు చేసి... జలసౌధలోని ఈఎన్‌సీ కార్యాలయానికి అనుసంధానం చేయనున్నట్టు మంత్రి తెలిపారు.  
కాళేశ్వరంపై ప్రతినెలా మంత్రి హరీష్‌రావు సమీక్ష
ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నందున ఇకపై ప్రతినెలా ప్రాజెక్టు పురోగతిపై సమగ్ర సమీక్ష జరుపుతామని మంత్రి తెలిపారు. 2017 డిసెంబర్‌లోగా గోదావరి జలాలను తెలంగాణ భూములకు తరలించే కార్యక్రమం ప్రారంభం అయ్యేలా చూడాలని మంత్రి అన్నారు.  రెండు వారాల్లో మేడిగడ్డ బ్యారేజీ పనులను, 15న అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ మూడు బ్యారేజీలతోపాటు పంప్‌హౌజ్‌ల పనులు కూడా ఏకకాలంలో చేపట్టాలని సూచించారు. 
కాళేశ్వరం పనులు శరవేగంగా చేపట్టాలని హరీష్‌ సూచన 
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టాలని, వచ్చే సంవత్సరం నాటికి బ్యారేజీల పనులు క్రస్ట్ లేవల్‌కు చేరుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఎల్లంపల్లి-మిడ్ మానేరు లింకుకు సంబంధించిన అన్ని పనులు పూర్తికావాలని సూచించారు. వచ్చే సంవత్సరం నాటికి ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరు, లోయర్ మానేరు, కాకతీయ కెనాల్‌ల ద్వారా ఎస్సారెస్పీ స్టేజ్ 1, 2ల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సుందిళ్ల పనులకు నవంబరు 15 డెడ్‌లైన్‌గా మంత్రి నిర్ణయించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలువాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు 10 తేదీన మల్లన్నసాగర్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలిపారు. 

 

07:58 - November 4, 2016

ఢిల్లీ : పెట్రోలియం డీలర్లు సమ్మెబాట పట్టారు. దీంతో ఏపీలోని పలుచోట్ల పెట్రోల్‌ దొరక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డిమాండ్ల సాధన కోసం చమురు పరిశ్రమ ప్రతినిధులతో ఇవాళ సాయంత్రం ముంబైలో జరిగే చర్చలు విఫలమైతే 5వ తేదీ నుంచి కేవలం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బంకులు నడుపుతామని డీలర్లు స్పష్టం చేశారు. 
పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్ల నిలిపివేత
పెట్రోల్, డీజిల్‌ విక్రయాలపై కమీషన్‌ పెంపు సహా ఇతర డిమాండ్ల సాధన కోసం పెట్రోలియం డీలర్లు సమ్మెబాట పట్టారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో చమురు సంస్థల నుంచి పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డిమాండ్ల సాధన కోసం చమురు పరిశ్రమ ప్రతినిధులతో ఇవాళ సాయంత్రం ముంబైలో జరిగే చర్చలు విఫలమైతే 5వ తేదీ నుంచి కేవలం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బంకులు నడుపుతామని తెలిపారు. 6వ తేదీ నుంచి ప్రతి ఆదివారంతోపాటు ప్రతి రెండో, నాలుగో శనివారాలు, బ్యాంకు, ప్రభుత్వ సెలవు దినాల్లో అమ్మకాలను నిలిపివేయనున్నారు. ఈ నెల 15న పూర్తిస్థాయిలో బంకుల బంద్‌ పాటించనున్నారు. డీలర్లు ఇప్పటికే గత నెల 19, 26 తేదీల్లో సాయంత్రం 15 నిమిషాలపాటు అమ్మకాలు నిలిపి నిరసన తెలిపారు.
5 శాతానికి కమీషన్‌ పెంచాలని డీలర్ల డిమాండ్‌
పెట్రోల్, డీజిల్‌ విక్రయాలపై ప్రస్తుతం 3 శాతంగా ఉన్న కమీషన్‌ను 5 శాతానికి పెంచాలన్నదే డీలర్ల ప్రధాన డిమాండ్‌గా ఉంది. డీలర్ల మార్జిన్‌పై 2011లో కేంద్ర ప్రభుత్వం నియమించిన అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సులను అమల్లో చమురు సంస్థలు పూర్తిగా విఫలయమయ్యాయయని డీలర్ల సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఆరు నెలలకోసారి తమ కమీషన్ ను పెంచే దిశగా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చిన చమురు సంస్థలు... ఇప్పటికీ హామీని నెరవేర్చలేకపోయాయని విమర్శిస్తున్నారు. డీలర్లకు తెలియజేయకుండా పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచే విధానానికి స్వస్తి పలకాలని, కొత్త పెట్రోల్‌ బంక్‌ల ఏర్పాటుకు అనవసరంగా అనుమతులు ఇవ్వరాదని, 2012లో జారీ చేసిన మార్కెటింగ్‌ డిసిప్లిన్ గైడ్‌లైన్స్‌ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. డిమాండ్లను నెరవేర్చకుంటే నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

 

07:53 - November 4, 2016

హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే మిస్సింగ్‌పై మిస్టరీ వీడింది. ఆయన క్షేమంగా ఉన్నట్లు విరసనం నేత వరవరరావు ప్రకటించారు. గత నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని వరవరరావు డిమాండ్‌ చేశారు. ఆర్కే క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో దేశ వ్యాప్తంగా మావోయిస్టు సానుభూతిపరులు, ప్రజా సంఘాల నేతలు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. 
ఆర్కే క్షేమం
మావోయిస్టు పార్టీ నేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ క్షేమంగా ఉన్నట్లు విరసం నేత వరవరరావు తెలిపారు. మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు ఫోన్ ద్వారా ఆర్కే క్షేమ సమాచారాన్ని తమకు అందజేసినట్లు వివరించారు. జగబంధు విడుదల చేసిన 14 నిమిషాల ఆడియోలో తాము క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నా... వారిలో ఆర్కే ఉన్నాడా లేదా అన్నదానిపై ఇప్పటివరకూ ఆందోళన నెలకొందన్నారు. జగబంధు తమకు ఫోన్ చేసి ఆర్కే కూడా క్షేమంగా ఉన్నారని తెలిపినట్లు వరవరరావు మీడియాకు వెల్లడించారు.
ఏఓబీలో కూంబింగ్‌ నిలిపివేయాలని డిమాండ్‌
ఏఓబీలో పోలీసు బలగాల గాలింపు వెంటనే నిలిపివేయాలని జగబంధు డిమాండ్‌ చేసినట్లు చెప్పారు. ఈ నెల 5, 6వ తేదీల్లో విశ్వవిద్యాలయాల విద్యార్థులు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల ప్రతినిధులు ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణ కోసం  మల్కన్ గిరికి రానున్నందున కూంబింగ్‌ను ఉపసంహరించుకోవాలని కోరారన్నారు. పోలీసులు 31 మంది మావోయిస్టులను దారుణంగా హతమార్చారని, అందులో నిరాయుధులైన 9 మంది ఆదివాసీలున్నారని జగబంధు తనకు వివరించినట్లు వరవరరావు తెలిపారు. ఆర్కే ఆచూకీ కోసం తాము హైకోర్టులో వేసిన హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను ఇవాళ ఉపసంహరించుకోనున్నట్లు వరవరరావు చెప్పారు.
ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలి : వరవరరావు 
ఏవోబీ ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రేహౌండ్‌ పోలీసులు సృష్టించిన భయోత్పాతంతో అక్కడి గిరిజనులు విలవిలలాడుతున్నారని వాపోయారు. తొమ్మిది మంది నిరాయుధ ఆదివాసీలను చిత్రహింసలకు గురిచేసి చంపిన వైనంపై న్యాయవిచారణ జరిపించాలని వరవరరావు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఆర్కే పోలీసుల కస్టడీలో లేరని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఘటనా స్థలం ఏపీ పరిధిలో లేదని, ఒరిస్సా రాష్ర్ట పరిధిలో ఉందని తెలిపింది. అక్కడి పోలీసులే కేసు నమోదు చేశారని ఏపీ తరపున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు చెప్పారు. ఆర్కే క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో మావోయిస్టు సానుభూతిపరులు, అభిమానులు, ప్రజా సంఘాల నేతలు ఊపిరి పీల్చుకున్నారు. 

నేటితో ముగియనున్న సీపీఎం ప్రజాభేరి పాదయాత్ర

ఏలూరు : నేటితో సీపీఎం ప్రజాభేరి పాదయాత్ర ముగియనుంది. తుందుర్రులో ఆక్వాఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ నర్సాపురంలో ర్యాలీ, ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేయనున్నారు. 

ఎపికి ప్రత్యేకప్యాకేజీపై నేడు బీజేపీ బహిరంగ సభ

హైదరాబాద్ : ఎపికి ప్రత్యేకప్యాకేజీపై నేడు బీజేపీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు. 

నేడు హైదరాబాద్ కు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

హైదరాబాద్ : కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నేడు హైదరాబాద్ రానున్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. 

 

నేడు గవర్నర్ నరసింహన్ పుట్టిన రోజు

హైదరాబాద్ : నేడు గవర్నర్ నరసింహన్ పుట్టిన రోజు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు గవర్నర్ ను కలిసి శుభాకాంక్షలు తెలపనున్నారు. 

Don't Miss