Activities calendar

05 November 2016

21:43 - November 5, 2016

ఢిల్లీ : పెట్రోల్‌ ధరలు మరోసారి పెరిగాయి. పెరిగిన అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా.. లీటర్ పెట్రోల్‌పై 89 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈ ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. స్థానిక పన్నులతో కలిపి ఈ భారం రూపాయి వరకు ఉంటుంది. సెప్టెంబర్ నుంచి పెట్రోల్ ధరలు ఆరుసార్లు...డీజిల్ రేట్లు మూడుసార్లు పెరిగాయి. 

21:39 - November 5, 2016

హైదరాబాద్ : జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సాగుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను జనసేన పార్టీ విడుదల చేసింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. ఇందులో భాగంగా బొంగునూరి మహేందర్‌రెడ్డి, నేమూరి శంకర్‌గౌడ్‌, పి.హరిప్రసాద్‌లకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ ఆవిర్భావ సమయంలో ఉపాధ్యక్షునిగా నియమితులైన మహేందర్‌రెడ్డి తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయ కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు. నేమూరి శంకర్‌ గౌడ్‌ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. పి.హరిప్రసాద్‌ పార్టీ మీడియా విభాగానికి సంబంధించిన కార్యకలాపాలు పర్యవేక్షించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

21:37 - November 5, 2016

హైదరాబాద్‌ : స్టార్టప్ రాజధానిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో టీ హబ్ ఫేజ్-2ని ప్రారంభిస్తామని తెలిపారు. అటు టీ హబ్ ఒక్క ఏడాదిలోనే అద్భుతాలు సాధించిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశంసించారు. హైదరాబాద్‌లో టీ-హబ్ వార్షికోత్సవానికి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.

టీ హబ్‌ విజయవంతంగా ఏడాది పూర్తి
స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్‌ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ టీ హబ్‌ను సందర్శించారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి ఇంక్యుబేషన్ సెంటర్లను పరిశీలించారు. స్టార్టప్ కంపెనీల గురించి ఆరా తీశారు. అనంతరం టీ హబ్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న రవిశంకర్ ప్రసాద్, కేటీఆర్.. యువ పారిశ్రామిక వేత్తలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా కొందరు యువకులు తమ ఆవిష్కరణలను కేంద్ర మంత్రికి వివరించారు.

ప్రస్తుతం టీ హబ్‌లో 200లకు పైగా స్టార్టప్ కంపెనీలు
హైదరాబాద్‌ను స్టార్టప్ రాజధానిగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. స్టార్టప్ ఇండియా కోసం.. కేంద్రం పది వేల కోట్లు కేటాయించి యువతను ప్రోత్సహించిందని చెప్పారు. వాస్తవానికి స్టార్టప్ ఇండియా కంటే ముందే తెలంగాణలో టీ హబ్ ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం 200లకు పైగా స్టార్టప్ కంపెనీలు టీ హబ్ లో పనిచేస్తున్నాయని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్-2ను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇప్పుడున్న టీ హబ్ కు 5 రెట్లు పెద్దదిగా టీ హబ్-2 ఉంటుందని కేటీఆర్ వివరించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ టీ హబ్ 2కు శంకుస్థాపన చేస్తారని అంతకుముందు ట్విటర్‌లో కేటీఆర్ ప్రకటించారు. ఏ రంగానికైనా టెక్నాలజీ కచ్చితంగా అవసరమేనని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ అన్నారు. స్టార్టప్‌ కంపెనీల నుంచి వచ్చిన ఉత్పత్తులు సామాన్య ప్రజలకు ఉపయోగపడాలని ఆయన అభిలషించారు. తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ ద్వారా యువ ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహిస్తోందని అభినందించారు. ఈ సందర్భంగా టెక్నాలజీని ఉపయోగించుకుని స్వయం సహాయక శక్తిగా ఎదిగిన తెలంగాణ బీడీ కార్మికురాలు సత్తెమ్మను కేంద్ర మంత్రి ఉదహరించారు.అనంతరం .. కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ని మంత్రి కేటీఆర్‌ ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి మెమెంటో అందజేశారు.

పార్టీ బలోపేతంపై పవన్ దృష్టి..

హైదరాబాద్ : జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. 'ఇందులో భాగంగా బొంగునూరి మహేందర్ రెడ్డి, నేమూరి శంకర్ గౌడ్, పి.హరిప్రసాద్ లకు కీలక బాధ్యతలు అప్పగించాము. పార్టీ ఆవిర్భావ సమయంలో ఉపాధ్యక్షునిగా నియమితులైన మహేందర్ రెడ్డి తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయ కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. నేమూరి శంకర్ గౌడ్ పార్టీ తెలంగాణ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. సీనియర్ పాత్రికేయుడు పి.హరిప్రసాద్ ను పార్టీ మీడియా విభాగానికి హెడ్ గా నియమించాము' అని ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు.

21:18 - November 5, 2016

'అడవిలో లాస్ట్‌ బస్‌' అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో రాకేందు మౌళి రెండు పాటలు రాశారు. గౌతం మీనన్ దర్శకత్వం వహించిన సాహసమే శ్వాసగా సాగిపో సినిమాలో ర్యాప్ సాంగ్ సింగింగ్ ...గాయకుడు..మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయిత..ప్రముఖ పాటల రచయిత వెన్నెలకంటి కుమారుడు అయిన రాకేందుమౌళి వెన్నెలకంటితో రాకేందు మౌళి తో టెన్ టీవీ స్పెషల్ చిట్ చాట్.. క్రిమినల్ సినిమాలో ప్రియా ప్రియతమా రాగాలు పాటంటే చాలా ఇష్టమట..మ్యూజిక్ డైరెక్టర్..పాటల రచయిత కంటే సింగర్ గానే తనకు ఎక్కువ మార్కులు వేసుకుంటానంటున్నాడు రాకేందు. ఇంకా ఈ చిట్ చాట్ లో రాకేందు చెప్పిన విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

21:02 - November 5, 2016

సైకిల్ తో డాష్ ఇచ్చాడనీ కత్తితో పొడిచాడు..

హైదరాబాద్ : సనత్ నగర్ లో ఇద్దరు బాలుర మధ్య ఘర్షణ నెలకొంది. సాయిరాం అనే బాలుడిపై అరవింద్ అనే బాలుడు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో సాయిరామ్ కు వీపుపై తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అరవింద్ 6వ తరగతి చదువుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా 2వ తేదీన తనను అరవింద్ సైకిల్ తో గుద్దాడనే కోపం పెంచుకున్న సాయిరాం ఈ దారుణానికి పాల్పడినట్లుగా సమాచారం.

ఘట్ కేసర్ లో నిలిచిపోయిన ఓచార్మినార్ ఎక్స్ ప్రెస్..

హైదరాబాద్ : చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం తలెత్తింది. ఘట్ కేసర్ స్టేషన్ లో గంటకు పైగా అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు పలు ఇబ్బందులకు లోనవుతున్నారు. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్తుండగా చార్మినార్ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది.  

పెరిగిన పెట్రోలు..డీజిల్ ధరలు!..

హైదరాబాద్ : పెట్రోలు..డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటరు పెట్రోలుపై 89 పైసలు, డీజిల్ పై 86 పైసలు పెరిగాయి. పెరిగిన ధరలు శనివారం అర్థరాత్రి నుండి అమలుకానున్నాయి.

20:23 - November 5, 2016

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. తాజాగా జరిపిన సర్వేలో డెమాక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తన ప్రత్యర్థి రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌పై కేవలం 2 శాతం ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఫాక్స్‌ న్యూస్‌ తాజాగా జరిపిన సర్వేలో ఇద్దరి మధ్య పోటీ పోటా పోటీగా ఉన్నట్లు తేలింది. డొనాల్డ్‌ ట్రంప్‌కు 43 శాతం ఓటర్ల మద్దతు లభించగా హిల్లరీకి 45 శాతం మద్దతు ఉన్నట్లు సర్వే చెప్పింది. ఇంతకు ముందు వాషింగ్టన్‌-ఏబిసి న్యూస్‌ జరిపిన సర్వేలో హిల్లరీకి 47 శాతం, ట్రంప్‌కు 44 శాతం మద్దతు లభించింది. తాజా సర్వేతో ట్రంప్‌పై హిల్లరీ ఆధిక్యత 3 శాతం నుంచి 2 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుంది? అమెరికా ప్రజలు ఎవరివైపు నిలవబోతున్నారు? ట్రంప్ గెలిచే అవకాశం ఎంతవరకూ వుంది? అనే అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో నగేష్ (మాజీ రెసిడెంట్ ది హిందూ), వెంకట్రావు (విశ్లేషకులు),హరీ కాసుల (ఎన్నికల స్ట్రాటజిస్ట్ )పాల్గొన్నారు. 

19:44 - November 5, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌-హిల్లరీల మధ్య పోటా పోటీ కొనసాగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఫాక్స్‌ న్యూస్‌ తాజాగా జరిపిన సర్వేలో హిల్లరీ ట్రంప్‌పై కేవలం రెండుశాతం ఆధిక్యంతో ఉన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌-సిబిఎస్‌ న్యూస్‌ జరిపిన సర్వేలో ట్రంప్‌, హిల్లరీల పట్ల ఎక్కువ మంది అమెరికన్లు అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడైంది. ప్రధాన అభ్యర్థులు హిల్లరీ క్లింటన్‌, డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రజల హృదయాలను చూరగొనలేకపోతున్నారని పేర్కొంది.

డొనాల్డ్‌ ట్రంప్‌కు 43 శాతం, హిల్లరీకి 45 శాతం మద్దతు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. తాజాగా జరిపిన సర్వేలో డెమాక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తన ప్రత్యర్థి రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌పై కేవలం 2 శాతం ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఫాక్స్‌ న్యూస్‌ తాజాగా జరిపిన సర్వేలో ఇద్దరి మధ్య పోటీ పోటా పోటీగా ఉన్నట్లు తేలింది. డొనాల్డ్‌ ట్రంప్‌కు 43 శాతం ఓటర్ల మద్దతు లభించగా హిల్లరీకి 45 శాతం మద్దతు ఉన్నట్లు సర్వే చెప్పింది. ఇంతకు ముందు వాషింగ్టన్‌-ఏబిసి న్యూస్‌ జరిపిన సర్వేలో హిల్లరీకి 47 శాతం, ట్రంప్‌కు 44 శాతం మద్దతు లభించింది. తాజా సర్వేతో ట్రంప్‌పై హిల్లరీ ఆధిక్యత 3 శాతం నుంచి 2 శాతానికి తగ్గింది.

హిల్లరీ క్లింటన్‌, డోనాల్డ్‌ ట్రంప్‌ దేశాన్ని ఏకతాటిపై నడపలేరని అభిప్రాయం
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటే...అమెరికన్లు మాత్రం నిరాసక్తతను కనబరుస్తున్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌-సిబిఎస్‌ న్యూస్‌ తాజాగా జరిపిన సర్వేలో 10 మందిలో ఎనమండగురు ఎన్నికల ప్రచారం తమకు ఆసక్తి కలిగించడం లేదని చెప్పారు. ప్రధాన అభ్యర్థులు హిల్లరీ క్లింటన్‌, డోనాల్డ్‌ ట్రంప్‌ దేశాన్ని ఏకతాటిపై నడపలేరని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు.

మహిళల ఓట్ల విషయంలో ట్రంప్‌ కన్నా హిల్లరీకి 14 శాతం ఎక్కువ ఆదరణ
హిల్లరీ ఈమెయిల్‌ వ్యవహారంపై ఎఫ్‌బిఐ విచారణకు ఆదేశించిన తర్వాత న్యూయార్క్‌ టైమ్స్‌-సిబిఎస్‌ ఈ సర్వే నిర్వహించింది. ఓట్ల వ్యత్యాసం తగ్గుతూ వస్తున్నప్పటికీ.. ట్రంప్‌ కన్నా హిల్లరీనే కాస్త పైచేయిగా ఉన్నారు. సర్వేలో 45 శాతం మంది హిల్లరీకి.. 42 శాతం మంది ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. మహిళల ఓట్ల విషయంలో ట్రంప్‌ కన్నా హిల్లరీ 14 శాతం ఎక్కువ ఆదరణ పొందగా... పురుషుల ఓట్లకు సంబంధించి ట్రంప్‌ కన్నా ఆమె 11 శాతం వెనుకబడి ఉన్నట్లు తేలింది.

ఈమెయిల్స్‌ అంశంపై ఎఫ్‌బిఐ దర్యాప్తు ప్రభావం ఉండదు
ఇ-మెయిల్‌ వివాదానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో హిల్లరీకి మద్దతివ్వబోమని చెప్పినవారి కన్నా.. మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌కు ఓటు వేయమని చెప్పినవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఎఫ్‌బిఐ మళ్లీ దర్యాప్తుకు ఆదేశించినా దాని ప్రభావం పెద్దగా ఉండబోదని పది మందిలో ఆరుగురు ఓటర్లు అభిప్రాయపడ్డారు. మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌లో కొంత మార్పు వచ్చిందని పది మందిలో నలుగురు అభిప్రాయపడ్డారు.

పట్టభద్రులుకాని 55 శాతం మంది ట్రంప్‌కు, 30 శాతం హిల్లరీకి మద్దతు
ట్రంప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీలో విభేదాలు ఉన్నాయని ఆ పార్టీ మద్దతుదారుల్లో 85 శాతం అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్వేతజాతీయుల్లోని పట్టభద్రుల్లో 48 శాతం మంది హిల్లరీకి, 41 శాతం మంది ట్రంప్‌కు మద్దతివ్వగా.. పట్టభద్రులుకానివారిలో 55 శాతం మంది ట్రంప్‌కు, 30 శాతం మంది హిల్లరీకి ఓటు వేస్తామని చెప్పారు.
మరో మూడు రోజుల్లో అత్యంత కీలకమైన ఎన్నికలు
మరో మూడు రోజుల్లో అత్యంత కీలకమైన ఎన్నికలను ఎదుర్కొంటున్న అమెరికా ప్రజల్లో ఎన్నో ఆశలు.. మరెన్నో సందేహాలు. ఇంతకీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? సర్వేలన్నీ హిల్లరీ క్లింటన్‌కు ఎడ్జ్‌ ఇస్తున్నాయి. కానీ ట్రంప్‌ గెలిచే అవకాశాలూ లేకపోలేదన్న భావనా వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ గెలిస్తే అమెరికాలో పర్యవసానాలు ఎలా ఉంటాయి..?

హిల్లరీకి గట్టి పోటీ ఇస్తున్న డొనాల్డ్‌ ట్రంప్
డొనాల్డ్‌ ట్రంప్‌..! ఏడాది కాలంగా అమెరికన్లతో పాటు.. ప్రపంచ దేశాలన్నింటా విపరీతంగా చర్చనీయాంశమైన పేరు. మహిళలను వస్తువుగా అభివర్ణించడం.. హిల్లరీని నాస్టీ ఉమన్‌ అని పిలవడం.. ముస్లింలను, మెక్సికన్లను తూలనాడడం ద్వారా ట్రంప్‌ విమర్శలపాలయ్యారు. ఆయా వర్గాలు ట్రంప్‌పై వ్యతిరేకతను ప్రదర్శించడం మొదలుపెట్టాయి. అయినా.. ఇప్పటికీ డొనాల్డ్‌ ట్రంప్‌.. హిల్లరీ క్లింటన్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు..? ఇదెలా సాధ్యం..?

వైట్‌ మేల్స్‌లో 70 శాతం నిరుద్యోగులు
ఇప్పుడున్న ట్రెండ్స్‌ని బట్టి చూస్తే.. ఇవ్వాళ్టికివాళ ట్రంప్‌.. శ్వేత సంతతి వారి ఓట్లను గంపగుత్తగా సొంతం చేసుకుంటారని పోల్‌ సర్వేలు చెబుతున్నాయి. ఈ వైట్‌మేల్స్‌లో... తక్కువ చదువుకే పరిమితమైన నిరుద్యోగులు దాదాపు 70 శాతం ఉంటారని ఓ అంచనా. ఇక శ్వేతవర్ణ మహిళల్లో 43 శాతం మంది కూడా ట్రంప్‌కే ఓటేస్తారని సర్వేలు చెబుతున్నాయి. శతాబ్దాల ప్రజాస్వామిక అమెరికాలో.. మహిళలను అగౌరవ పరిచేవారిని అస్సలు సహించని తత్వమున్న అక్కడి ప్రజలు.. ట్రంప్‌ను ఎందుకింతలా ఆదరిస్తున్నారు..?

1970 దశకంలో అమెరికా వర్కర్లకు అద్భుత ఉపాధి అవకాశాలు
డొనాల్డ్‌ ట్రంప్‌కు.. వైట్‌ మేల్స్‌లో అపూర్వ ఆదరణకు.. అక్కడి ఉద్యోగ, ఉపాధి అవకాశాల లేమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 1970 దశకంలో సగటు అమెరికా వర్కర్‌.. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అద్భుత ఉపాధి, వేతనాలు పొందేవారు. అద్భుత జీవన ప్రమాణాలతో.. అమెరికా వర్కర్స్‌ పాలిట స్వర్గధామంగానే భాసిల్లింది. అయితే.. ఆ తర్వాతి పరిణామాల్లో.. ఆయిల్‌ ధరలు పెరగడం.. జర్మనీ మిషన్లు, జపాన్‌ కార్లు, కొరియన్‌ స్టీల్‌ ఉత్పత్తులు ప్రపంచాన్ని.. ముంచెత్తాయి. ఆయా దేశాల్లో తక్కువ వేతనాలకే పనివాళ్లు దొరకడం.. అమెరికాలో అత్యధిక వేతనాలు చెల్లిస్తుండడంతో పోటీ తట్టుకోలేని పరిస్థితి అమెరికాకు ఎదురైంది. ఆ దేశ విధాన నిర్ణయాలు.. దేశాన్ని ప్రపంచంలోనే సుసంపన్నంగా నిలిపినా.. కార్మిక లోకంలో అసంతృప్తిని పెంచుతూ వచ్చింది.

నిరుద్యోగంతో అమెరికన్లు అలమటిస్తున్నారని రెచ్చగొడుతున్న ట్రంప్
అమెరికాకు చెందిన సంస్థలు కూడా తక్కువ వేతనాలు లభించే దేశాలకు పనులు అప్పగించడం.. అమెరికాలోనూ తక్కువ వేతనాలిచ్చి విదేశీయులకు ఉపాధి కల్పిస్తుండడం.. స్థానికుల్లో అసహనానికి కారణమైంది. ఇది ఏటికేడు పెరుగుతూ వచ్చింది. ఇదే అంశాన్ని ట్రంప్‌ తన ట్రంప్‌కార్డుగా వినియోగించుకున్నారు. భారత్‌ లాంటి దేశాల నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలు లభిస్తుంటే.. అమెరికన్‌ కార్మికులు నిరుద్యోగంతో అలమటిస్తున్నారంటూ ట్రంప్‌ తన ప్రసంగాల ద్వారా స్థానికుల్లో అసంతృప్తిని క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేశారు. తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విదేశీయులు కొల్లగొట్టేస్తున్నారన్న భావనలో ఉన్న వైట్‌ మేల్‌ను ట్రంప్‌ ప్రసంగాలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఆ కారణంగా ట్రంప్‌కు ఆ వర్గంలో విపరీతమైన ఆదరణ పెరిగింది.

రాజకీయ, సామాజిక స్థితి మరింతగా దిగజారే ప్రమాదం విశ్లేషలు
ఈ ఎన్నికల వేళ.. ట్రంప్‌ అమెరికాను నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీల్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడి సమాజంలో అమెరికన్‌.. నాన్‌ అమెరికన్‌ అన్న వర్టికల్‌ చీలికను తెచ్చాచరని, ఈ ఎన్నికల్లో ట్రంప్‌ గెలిచినా.. గెలవక పోయినా.. ఇప్పుడాయన నాటిన అసంతృప్తి బీజాలు.. రాబోయే రోజుల్లో వటవృక్షాలవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికన్‌ కార్మిక సమాజంలో.. ఈ అసహనం అంతకంతకూ పెరిగిపోయి.. వచ్చే ఎన్నికలను మరింతగా ప్రభావితం చేస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. అమెరికా కార్మిక సమస్యలు, పన్నులపై పాలకుల విధానాలు సమూలంగా మారకుంటే.. అక్కడి రాజకీయ, సామాజిక స్థితి మరింతగా దిగజారే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 

19:32 - November 5, 2016

విశాఖ  : ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం వైసీపీ మరోసారి తన గళాన్ని విప్పుతోంది. హోదా డిమాండ్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు స్కెచ్‌ వేసింది. విశాఖలో ఈ నెల 6వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ సభలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని వైసీపీ అధినేత ప్లాన్ చేశారు.

6 విశాఖ నగరంలో భారీ బహిరంగ సభ
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేస్తూ... వైసీపీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. ఈ నెల 6వ తేదీన విశాఖలో ప్రత్యేక హోదాపై వైసీపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ సభ ఏర్పాట్లను పార్టీ అగ్రనేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏపీ రాష్ర్ట వ్యాప్తంగా ప్రత్యేక హదాపై మొత్తం 6 సభలు ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే... తొలిసభను విశాఖ నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు 'జై అంధ్రప్రదేశ్' బహిరంగసభ పేరు పెట్టారు. సభావేదికకు గురజాడ పేరు, సభా ప్రాంగణానికి తెన్నీటి విశ్వనాథం పేర్లు పెట్టారు.

త్వరలో విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు
విశాఖలో ఏర్పాటు చేస్తున్న సభకు భారీగా జన సమీకరణ చేసే పనిలో పడ్డారు వైసీపీ నేతలు. విశాఖ నగరంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఉంది. త్వరలోనే విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ.. విశాఖలో సభను ఏర్పాటు చేస్తోంది.

విశాఖ నగరంలోని కార్మిక వర్గంలో చైతన్యం ఎక్కువే..
ఇటు విద్యా పరంగానూ విశాఖ నగరం బాగా అభివృద్ధి చెందింది. ఈ నగరంలో కార్మిక వర్గంలో చైతన్యం కూడా ఎక్కువే. అందుకే విశాఖలో ఏర్పాటు చేస్తున్న బహిరంగసభను విజయవంతం చేసి... ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని వైసీపీ భావిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి భారీగా జనసమీకరణ చేసి.. సభను సక్సెస్‌ చేయాలని భావిస్తున్నారు. 

19:28 - November 5, 2016

చిత్తూరు : తిరుమలలో టీటీడీ మహిళా కార్మికులు తమ నిజాయితీని చాటుకున్నారు. తిరుమల సన్నిదానం అతిథి గృహంలోని ఓ గదిని శుభ్రం చేస్తుండగా దొరికిన బంగారు నగలను తిరిగి సొంతదారులకు అప్పగించారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గదిలో సుమారు 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు వదలి వెళ్ళగా..గుర్తించిన మహిళా కార్మికులు అధికారుల ద్వారా వారికి అప్పగించి వారి ఉదారతను చాటుకున్నారు. 

19:26 - November 5, 2016

పశ్చిమగోదావరి : యనమదుర్రు డ్రైయిన్‌పై పోరాటం చేస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఈ నెల 15 నుంచి జిల్లా కలెక్టరేట్‌కి ఆందోళన చేపడుతామన్నారు. తణుకు నుంచి భీమవరం వరకు .. భీమవరం నుంచి ఏలూరు వరకు పాదయాత్ర చేపడుతామన్నారు. ఇందులో గొందేరు డ్రెయిన్‌, యనమదుర్రు డ్రెయిన్‌ బాధితులు పాల్గొంటారని చెప్పారు. నర్సాపురంలో తాగడానికి మంచినీళ్లు కరువయ్యాయని.. గోదావరి నుంచి నీటిని తరలించాలని మధు డిమాండ్‌ చేశారు. 

19:24 - November 5, 2016

గుంటూరు : ఏపీ లో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచడం పట్ల ఆంధ్రప్రదేశ్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం సంయుక్త కార్యాచరణ సమితి హర్షం వ్యక్తం చేసింది. చాలా మంది నిరుద్యోగులకు ఇది మేలు చేస్తుందని సంఘం నేత కృష్ణయ్య చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2017 సెప్టెంబర్‌ 30 వరకు భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రమే వర్తించనుంది. అధికారంలోకి వస్తే... వయో పరిమితిని పెంచుతామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఈ మేరకు వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

చోరీలు చేస్తున్న ఎయిర్ పోర్టు సిబ్బంది!..

హైద‌రాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిబ్బందిపై మ‌రోసారి ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ప్ర‌యాణికుల నుంచి సిబ్బంది 2,100 సౌదీ రియాల్స్, మూడు సెల్‌ఫోన్లు చోరీ చేశారు. నిజామాబాద్‌కు చెందిన దశరథ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సాదిఖ్ అనే వ్య‌క్తులు జెడ్డా నుంచి విమానంలో అక్క‌డ‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో త‌మ‌ లగేజీని చూసుకున్న‌ తరువాత, త‌మ బ్యాగులు చిరిగిన బ్యాగుల్లో త‌మ వ‌స్తువులు క‌నిపించ‌క‌పోవ‌డంతో బ్యాగేజి సిబ్బందే చోరీకి పాల్ప‌డ్డార‌ని ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు.

స్కూల్ డైరెక్టర్ పై 9వ తరగతి విద్యార్థి కాల్పులు..

మధ్యప్రదేశ్‌ : రాట్లాం జిల్లాలోని ఓ స్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి తమ స్కూల్ డైరెక్టర్‌పై తుపాకీతో కాల్పులు జ‌రిపాడు. ఈ ఘటనలో స్కూల్‌ డైరెక్టర్‌ అమిత్‌ తీవ్ర‌గాయాలయ్యాయి. దీంతో జైన్ ఆసుప‌త్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. కాగా అమిత్ ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని పోలీసులు చెప్పారు. కాగా స్కూల్ యూనిఫాంలో కాకుండా సివిల్ డ్రెస్ లో సదరు విద్యార్థి స్కూలుకు వెళ్ళటంతో ఆగ్ర‌హించిన ఉపాధ్యాయులు విద్యార్థిని హెచ్చరించి మ‌ళ్లీ ఇంటికి వెళ్లి స్కూల్‌ యూనిఫాం వేసుకుని పాఠ‌శాల‌కు ర‌మ్మ‌న్నారు.

18:48 - November 5, 2016

హైదరాబాద్ : ఎటు చూసినా..ఎటు విన్నా ఫ్యాషన్‌...ఫ్యాషన్‌..ఫ్యాషన్‌. ఫ్యాషన్‌ దూరని రంగం లేదు..ఫ్యాషన్‌ ఊసెత్తని మాట లేదు. ఇందుకు పెళ్లిళ్లూ మినహాయింపేమి కాదు. వధూవరులు కూసింత సిగ్గును పక్కకు పెడితే వివాహ వేదికలే ఫ్యాషన్‌ పరేడ్ అవుతాయనడంలో సందేహమే లేదు. అంతలా వెడ్డింగ్ కలెక్షన్‌లో కలగలిసిపోయింది ఫ్యాషన్‌.

డ్రెస్‌ దగ్గర నుంచి వెడ్డింగ్‌ కార్డు వరకు ఫ్యాషన్‌ హవా
జీవితంలో ఒకే ఒక్క సారి జరిగే మహోత్సవం వివాహాం.. పెళ్లిలో వేసుకునే డ్రెస్‌ దగ్గర నుంచి వెడ్డింగ్‌ కార్డు వరకు ఫ్యాషన్‌ కోరుకుంటున్నారు. దీంతో షోరూమ్‌లు ఢిపరెంట్‌ డిజైన్లతో ఆకర్షిస్తూ మ్యారేజ్‌ కలెక్షన్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి.

సంస్కృతీ, సంప్రదాయాలకు తగ్గట్టు పెళ్లి దుస్తులు
రాబోయే పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని వధూవరుల కోసం అవసరమైన డిజైనర్‌వేర్‌ను ఫ్యాషన్‌ డిజైనర్లు ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. మారుతున్న ఫ్యాషన్‌ ట్రెండ్‌కు అనుగుణంగా యువతి యువకుల టేస్ట్‌కు తగినట్లుగా ఫ్యాషన్‌ డిజైనర్లు డ్రెస్‌లను సమ్‌థింగ్‌ స్పెషల్‌గా తీర్చిదిద్దుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతీ, సంప్రదాయాల తగ్గట్టు పెళ్లి వస్త్రాలను సృష్టిస్తున్నారు.
సరికొత్త డిజైనర్‌వేర్‌ లు
రెండు జీవితాలను ఒకటి చేసేది వివాహ బంధం. ఈ బంధాన్ని మనదేశంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేశంలోని ఆయా రాష్ట్రాల వాసులు పెళ్లిళ్లను ఘనంగా జరిపిస్తారు. వధూ వరులకు అవసరమైన అందమైన డ్రెస్‌లు, గోల్డ్‌ వంటి వాటిని ప్రత్యేక కొనుగోలు చేస్తారు. రాబోయే పెళ్లిళ్ల సీజన్‌ మార్కెట్లకు కొత్త కళను తీసుకువచ్చాయి. ఫ్యాషన్‌ డిజైనర్లు సరికొత్త డిజైనర్‌వేర్‌ను రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు.

డిఫరెంట్‌ కలర్‌ కోడ్‌ డ్రెస్‌ను ధరించడం ఇప్పుడు ఫ్యాషన్‌
పెళ్లిలో వధూవరులు అందమైన వస్త్రాల్లో మెరుస్తారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు డిఫరెంట్‌ కలర్‌ కోడ్‌ డ్రెస్‌ను ధరించడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. వధువు తళుకులీనే బంగారు ఆభరణాలను ధరిస్తోంది. వధువు చేతులు, కాళ్లకు గోరింటాకు డిజైన్లతో మరింత అందంగా మారుతుంది. వధూవరుల కోసం ప్రత్యేకంగా డిజైనర్‌వేర్‌ ఉంటోంది. జీవితంలో మరచిపోలేని అనుభూతిని కలిగించే వివాహాన్ని దృష్టిలో పెట్టుకొని స్పెషల్‌ డిజైనర్‌వేర్‌ను సృష్టిస్తున్నారు.

సిల్క్‌, జార్జిట్స్‌, కాంచిపురం సిల్క్‌, సింథటిక్‌ ఫ్యాబ్రిక్స్‌తో వస్త్రాలు
వస్త్రాలను సిల్క్‌, జార్జిట్స్‌, కాంచిపురం సిల్క్‌, సింథటిక్‌ ఫ్యాబ్రిక్స్‌ తో రూపొం దిస్తున్నారు. వీటికి జరీ వర్క్‌ను జతచేసి అందంగా తీర్చిదిద్దుతున్నారు. వివాహ సమయంలో వధువు ధరించే పట్టుచీరలను ప్రత్యేక డిజైన్లతో తయారు చేస్తున్నారు. డిజైనర్‌ చీరలను స్వరోస్కి, స్టోన్స్‌, క్రిస్టల్స్‌, కుందన్‌ వర్క్‌తో ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. ఆయా ప్రాంతాల సంప్రదాయాల మేరకు చీరలు, చోళీ, లహెంగా, గాగ్రాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు.

80,90లో కనుమరుగైన వడ్డాణాలు, అరవంకీలు
ఒకప్పుడు నగలు ఎంత నాజూగ్గా వుంటే అంత అందం. ఇప్పుడు మాత్రం ఆడంబరంగా కనిపిస్తేనే అందం. ఎప్పటికో పాతకాలపు నగలు ఇవాళ్టి ఫ్యాషన్ అయి కూర్చుంటున్నాయి. ఎప్పుడు 80,90లో కనుమరుగైన వడ్డాణాలు, అరవంకీలు తలపైన పెట్టుకునే సూర్య చంద్రుళ్లు ,వజ్రాలు ,రత్నాలతో కలిసి మెరిసిపోతున్నాయి. సింపుల్ జ్యూవెలరీ,మ్యాచింగ్ జ్యూవెలరీ ,హెవీ వెడ్డింగ్ జ్యూవెలరీ అని మన ట్రెండ్లో వున్నాయి. కనుకనే కొన్ని పెళ్లిళ్లలో నిలువెల్లా బంగారం అన్న మాటని నిజం చేస్తూ పెళ్లి కూతురుకి పెట్టే నగలు బంగారు తొడుగు తొడిగినట్లే వస్తున్నాయి. బరువు తక్కువా ఎక్కువా అన్న సంగతి పక్కన పెడితే అట్టహాసంగా కనిపించే నగలు ఇప్పటి తరం ఫంక్షన్లకు ,పెళ్లిళ్లకే 

18:22 - November 5, 2016

నెల్లూరు : ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రయివేటు ఆసుపత్రుల్లో కూడా వైద్యుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రసవానికి వచ్చిన శ్రావణి అనే మహిళకు వైద్యులు సిజేరియన్ చేశారు. కానీ ఆపరేషన్ సమయంలో శ్రావణి కడుపులో ఓక్లాత్ ను వుంచి కుట్లు వేసేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని సులోచన నర్శింగ్ హోం లో జరిగింది. నారాయణ రెడ్డి పేట కు చెందిన శ్రావణి అనే మహిళ ప్రసవానికి సులోచన ఆసుపత్రిలో ప్రసవరం కోసం జాయిన్ అయ్యింది. ఈ నేపథ్యంలో శ్రావణికి సిజేరియన్ చేసి పండండి మగబిడ్డను వైద్యులు తీశారు. అనంతరం కొన్ని రోజులకు డిశ్చార్జ్ అయిన శ్రావణి ఇంటికి చేరుకుంది. కాగా కొన్ని రోజుల అనంతరం శ్రావణి కడుపు నొప్పితో బాధపడుతూ మరో ఆసుపత్రిలో శ్రావణి చేరటంతో ఈ విషయం బైటపడింది. ఈ సిజేరియన్ ఆపరేషన్ కు రూ.80వేలు చార్జ్ చేశారు. దీనిపై సదరు ఆసుపత్రి వైద్యులను ప్రశ్నించగా ఈ విషయం బైటకు చెప్పవద్దని ..గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు. 

కడుపులో క్లాత్ వుంచి కుట్లు వేసిన వైద్యులు!..

నెల్లూరు : ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రయివేటు ఆసుపత్రుల్లో కూడా వైద్యుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రసవానికి వచ్చిన శ్రావణి అనే మహిళకు వైద్యులు సిజేరియన్ చేశారు. కానీ ఆపరేషన్ సమయంలో శ్రావణి కడుపులో ఓక్లాత్ ను వుంచి కుట్లు వేసేశారు. కాగా కొన్ని రోజుల అనంతరం కడుపు నొప్పితో బాధపడుతూ మరో ఆసుపత్రిలో శ్రావణి చేరటంతో ఈ విషయం బైటపడింది. 

17:58 - November 5, 2016

నల్లగొండ : ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారుల అలసత్వం రైతులను కష్టాల పాలుచేస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంటను వ్యవసాయ మార్కెట్‌లో విక్రయించి 15 రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విక్రయానికి ముందు 48 గంటల్లో అకౌంట్‌లో డబ్బులు వేస్తామని చెప్పారని.. ఇప్పుడు రేపు మాపు అంటూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సాంకేతిక కారణాలతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమా కాలేదని అధికారులు చెబుతున్నారు. 

17:55 - November 5, 2016

రాజన్న సిరిసిల్లా : ఏరియా ఆస్పత్రిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోందని వైద్యం కోసం వస్తున్న రోగులు, వీరి బంధువులు ఆరోపిస్తున్నారు. నిండు గర్భిణిలకు కూడా వైద్యం అందించని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రిలో పని చేస్తున్న స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ల లీలారాణి పది రోజుల పాటు వ్యక్తిగత సెలవుపై వెళ్లడంతో గర్భిణిలను పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ఆస్పత్రికి వస్తున్న గర్భిణిలను వైద్య సిబ్బంది నిర్ధాక్ష్యంగా బయటకు గెంటివేస్తున్నారు. దీంతో నిండు గర్భిణిలను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి వస్తే కనీస వైద్య పరీక్షలు కూడా చేసే దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

17:52 - November 5, 2016

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు లక్ష్యంగా చేసుకుని టీ.పీసీసీ విమర్శల వర్షం కురిపించింది. తెలంగాణ అభివృద్ధిపథంలో పయనిస్తోందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గవర్నర్‌ పదేపదే ప్రశంసిస్తుండటంపై టీ.పీసీసీ విస్మయం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరు గవర్నర్‌కు కపించడంలేదా.. అన్ని ప్రశ్నించింది. ఆరోగ్య శ్రీ వైద్య సేవలు నిలిచిపోయి రోగులు అవస్థలు పడుతున్నా గవర్నర్‌ పట్టించుకోరా.. అని నిలదీసింది. ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌ లేక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నా పట్టించుకునే దిక్కులేదని మండిపడింది. రైతుల రుణమాఫీ, ఎస్టీ , మైనారిటీల రిజర్వేషన్ల పెంపు వంటి అంశాల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించినా.. గవర్నర్‌ పట్టించుకోరా అని... టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

17:49 - November 5, 2016

హైదరాబాద్ : ఐటీ పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన టీహబ్.. తమ సేవలు మరింత విస్తృతం చేయనుంది. త్వరలో టీహబ్‌ సెకండ్ ఫేజ్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్.. సెకండ్ ఫేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతమున్న టీహబ్‌ కంటే... ఈ నిర్మాణం.. నాలుగురేట్లు పెద్దదిగా ఉంటుంది.

17:47 - November 5, 2016

హైదరాబాద్ : పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. రామానాయుడు స్టూడియోలో ఇవాళ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలొచ్చాయి. ప్రస్తుతం పవన్ కాటమరాయుడి చిత్ర షూటింగ్‌లో ఉన్నారు. డిసెంబర్ నుంచి కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. 

17:42 - November 5, 2016

హైదరబాద్ : వనపర్తి నుంచి వైద్యం కోసం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి వచ్చిన నాగమ్మ అనే మహిళ మృతి చెందారు. ఈ నెల 1న గాంధీలో చేరిన నాగమ్మకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.... క్యాన్సర్‌ ఉందని తేల్చారు. అదేరోజు ఆపరేషన్‌ చేశారు. చేసిన శస్త్రచికిత్స విఫలమైందంటూ రెండు రోజుల తర్వాత మళ్లీ ఆపరేషన్‌ చేశారు. రెండోసారి శస్త్రచికిత్స చేసిన తర్వాత స్పృహ కోల్పోయిన నాగమ్మ గత రాత్రి మరణించింది. రెండుసార్లు ఆపరేషన్‌ చేయడంతోనే నాగమ్మ మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు.

17:37 - November 5, 2016

హైదరబాద్ : ఆర్టీసీకి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ గుడ్‌బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. నష్టాలను భరించడం తమ వల్ల కాదని చేతులు ఎత్తివేసే యోచన కనిపిస్తోంది. ఇదే విషయాన్ని త్వరలో ప్రభుత్వానికి తెలియజేయాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ తొలి ఏడాది 137 కోట్లు, రెండో ఏడాది 198 కోట్లు చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 270 కోట్లు చెల్లించాలని ఆర్టీసీ జీహెచ్‌ఎంసీకి ప్రతిపాదనలు పంపింది. అయితే.. ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జీహెచ్‌ఎంసీకి సాయం అందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారానికి వీడియో చూడండి..

నోయిడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య..

ఢిల్లీ : వర్శిటీలో తెలంగాణ తెలంగాణకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నోయిడాలోని అమితి యూనివర్శిటీలో జరిగింది. సదరు విద్యార్థి తాను వుంటున్న హాస్టల్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

17:26 - November 5, 2016

హైదరాబాద్‌ : శనివారం నగరంలోని మ‌ల‌క్‌పేట్‌లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో మ‌ద్యం తాగి స్కూలు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్ ప‌ట్టుబ‌డ్డారు. ఆటో డ్రైవర్ మొహమ్మద్ ఉస్మాన్‌ ప్రతిరోజూ కింగ్‌కోఠిలోని సెయింట్‌ జోసెఫ్ స్కూలు నుంచి విద్యార్థులను తీసుకెళ్తుంటాడని పోలీసులు తెలిపారు. కాగా స్కూలు పిల్లిల్ని ఆటోలో పంపించే తల్లిదండ్రులు ఇటువంటి ఆటోడ్రైవ‌ర్‌ల ప‌ట్ల జాగ్ర‌త‌వ‌హించాల‌ని హెచ్చ‌రించారు. త‌ల్లిదండ్రులు ఆటో డ్రైవర్ల గమనించాలని ఈ సందర్భంగా పోలీసలు సూచించారు.

17:18 - November 5, 2016

విశాఖ : ఇన్నోవా కారు ఓ పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన రాయవరం మండలం అడ్డరోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. మృతులంతా విశాఖ జిల్లా గాజువాకకు చెందినవారుగా గుర్తించారు. గాజువాక నుండి రాజమండ్రి వెళ్తున్న ఇన్నోవా కారు సడెన్ గా అదుపు తప్పి వరాహ నదికి సంబంధించిన కాలువ కల్వర్టు ను ఢీకొని కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదం మధ్యహ్నాం 4 గంటల సమయంలో జరిగినట్లుగా తెలస్తోంది. 

కాలువలో పడ్డ కారు..4గురు మృతి..

విశాఖ : ఇన్నోవా కారు ఓ పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన రాయవరం మండలం అడ్డరోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. మృతులంతా విశాఖ జిల్లా గాజువాకకు చెందినవారుగా గుర్తించారు.

16:52 - November 5, 2016

కర్నూలు : శనివారం క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న చంద్రబాబు డ్వాక్రా సంఘాల స్టాళ్ల‌ను ప‌రిశీలించారు.డ్వాక్రా మ‌హిళ‌ల పొదుపు సంఘాల బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. పేదరిక నిర్మూలన మహిళలతోనే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఆడ‌వారికి ఏం తెలియ‌దులే అన్న పరిస్థితి నుంచి ఎంతో సాధించి నిరూపించార‌ని చెప్పారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాల మ‌హిళ‌లు ఎంతో ఉత్సాహంగా ఉన్నార‌ని అన్నారు. సాధారణ మహిళల్లో అసాధారణ శక్తి ఉందని అన్నారు. అది సంఘటిత శక్తిగా మారుతోందని వ్యాఖ్యానించారు. గతంతో ఆడబిడ్డలు జీవితాంతం మరొకరిపై ఆధారపడి జీవించేవారనీ..కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఆడబిడ్డలు ఒకరిపై ఆధారపడే పరిస్థితి లేకుండా వారే మరొకరికి ఆధారం చూపేలా ఏపీ మహిళలు తయారయ్యారని ఆనందం వ్యక్తం చేశారు. జనాభాలో 50 శాతంగా వుండే ఆడబిడ్డలు శక్తివంతంగా మారాలనేదే తన ఉద్ధేశ్యమన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని వ్యవస్థ ఏపీలో వుందని..ఇది ఏపీకే సొంతమన్నారు. పేదరికం రూపుమాపాలంటే అది మహిళకే సాధ్యమన్నారు. మహిళలల్లో అసాధారణమైన శక్తి వుందనీ..అది గ్రూపులుగా ఏర్పడటంతో రాష్ట్ర చరిత్రే మారిపోతుందని మహిళలను చంద్రబాబు ఉత్సాహపరిచారు. ఆడబిడ్డ పసుపు కుంకుమ అనే పథకం రాష్ట్ర ఆడబిడ్డలకు వరమని తెలిపారు.కర్నూలు నా మానస పుత్రిక అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 

ఆందోళన బాటలో టీ.ఎల్పీజీ డిస్టిబ్యూటర్లు..

హైదరాబాద్ : తెలంగాణ ఎల్పీజీ డిస్టిబ్యూటర్లు ఆందోళన బాట పట్టారు. వినియోగదారులకు ఇబ్బందు కలుగకుండా నిరసన కార్యక్రమాలు చేపడతామని డిస్టిబ్యూటర్లు తెలిపారు. 22వ తేదీన బ్లాక్ చేస్తామని 28న గ్యాస్ సరఫరా నిలిపివేస్తామన్నామన్నారు. ఒక సిలిండర్ పై రూ.66 తమకివ్వాలనీ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఆయిల్ కంపెనీలు సరిగ్గా గ్యాస్ సరఫరా చేయటం లేదని ఆరోపించారు. వచ్చే నెల 5లోగా తమ సమస్య పరిష్కరించకపోతే గ్యాస్ సరఫరా నలివేస్తామని హెచ్చరించారు. 

16:28 - November 5, 2016

గుంటూరు : మెడికల్ విద్యార్థి సంధ్య ఆత్మహత్య కేసులో మరిన్ని వివరాలు బయటకొస్తున్నాయి..... సంధ్య ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్‌ లక్ష్మి ప్రవర్తనపై సన్నిహితులు తలోరకంగా స్పందిస్తున్నారు.. అటు ఈ ఆత్మహత్యపై విచారణ కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందింది.. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా లక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు..

విద్యార్థిని సంధ్య ఆత్మహత్య కేసులో విచారణ వేగవంతం
వైద్య విద్యార్థిని సంధ్య ఆత్మహత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది.. సంధ్య సూసైడ్‌కు కారణమైన ప్రొఫెసర్‌ లక్ష్మి ఇంకా పరారీలోనే ఉన్నారు.. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.. నాలుగు బృందాలు తమిళనాడు, పాండిచ్చేరి, మహారాష్ట్రలో ఆమె ఆచూకీకోసం ప్రయత్నిస్తున్నాయి..

మూడేళ్లనుంచి తరహా మానసిక రుగ్మతతో బాధపడుతున్న లక్ష్మి?
మరోవైపు సంధ్య ఆత్మహత్యపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ అన్ని వివరాలు సేకరించింది.. ఈ కమిటీసభ్యులు వైద్యులు, నర్సులు, విద్యార్థులు, సిబ్బందిని విచారించారు.. విధి నిర్వహణలో లక్ష్మి నిబద్దతగా ఉండేదని.. అయితే కొన్ని విషయాల్లోమాత్రం తీవ్ర ఆవేశానికి గురయ్యేదని కమిటీ దృష్టికివచ్చింది.. కోపంతో ఇష్టంవచ్చినట్లు తిట్టడం, అవమానించడంచేసేదని విద్యార్థులు కమిటీ సభ్యులకు చెప్పారు.. సంధ్య విషయంలోకూడా లక్ష్మి ఇదే తరహాలో వ్యవహరించారని... సెలవు ఇవ్వకుండా ఆమె మనసు బాధపడేలా తిట్టారని తెలిపారు.. ఈ వివరాలన్నీ సేకరించిన కమిటీ.... సంధ్య ఆత్మహత్యకు ప్రొఫెసర్ వేధింపులేకారణమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.. అటు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేకూడా ఈ ఘటనపై మెజిస్ట్రీరియల్ విచారణకు అదేశించారు. ఈ విచారణకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
30ఏళ్లపాటు వైద్యవృత్తిలో నిబద్దత కలిగిన వైద్యురాలిగా లక్ష్మికి పేరు
విద్యార్థులవైపు వాదన ఇలా ఉంటే... లక్ష్మికి సన్నిహితులవాదన మరోలా ఉంది.. 30ఏళ్లపాటు వైద్యవృత్తిలో నిబద్దత కలిగిన వైద్యురాలిగా ఆమెకు పేరుంది.. మూడేళ్లనుంచి ఓ తరహా మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది... అప్పటికప్పుడే అందరిపై నోరు పారేసుకోవడం... ఇష్టంవచ్చినట్లు కేకలు పెట్టడం, చిన్న చిన్న తప్పులకే సిబ్బందికి చివాట్లు పెట్టడంతో విద్యార్థులు, సిబ్బంది భయపడిపోయారు.. సహ ప్రొఫెసర్లుకూడా ఆమెతో మాట్లాడాలంటేనే టెన్షన్ పడే పరిస్థితి ఏర్పడింది.. ఇలా ప్రవర్తించడంసరికాదని... సన్నిహితులు లక్ష్మికి సలహా ఇచ్చినట్లు సమాచారం.. ఈసూచనలపై స్పందించిన లక్ష్మి తాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో అర్థం కావడంలేదని చెప్పినట్లు తెలుస్తోంది.. ఒక దశలో తీవ్రంగా మధనపడి ప్రొఫెసర్ వృత్తికి రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం.. ఇంతలో సంధ్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె మరింత చిక్కుల్లో పడింది... ప్రస్తుతం పరారీలో ఉన్న లక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌ కేసు ఈ నెల 7కు వాయిదాపడింది.. 

16:22 - November 5, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రిక్రూట్‌మెంట్‌ విభాగంలో జరిగిన ఈ ఘటనలో పలు ఫైళ్లు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దట్టమైన పొగల కారణంగా మంటలను అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదానికి కారణమని తేల్చారు. 

16:14 - November 5, 2016

హైదరాబాద్ : ఐటీ అడ్డా హైదరాబాద్‌..అక్రమార్కుల అడ్డాగా మారుతోంది. డబ్బిస్తే చాలు ఎలాంటి అక్రమాన్నయినా సరే... ఇట్టే చేసేసే ఘనులు వీధికొక్కరుగా కనిపిస్తున్నారు. యువత అవసరాలను తీర్చే వంకతో.. దొంగ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. ఐటీ కంపెనీల్లో చేరేందుకు అవసరమైన ఆఫర్ లేటర్.... హైక్ లేటర్.... ఐడీ కార్డ్ ... కంపెని మెయిల్ ఐడీ.. ఇలా ఒకటేమిటి.. అన్ని రకాల సర్టిఫికెట్లనూ సృష్టించి ఇస్తున్నారు. ఇలాంటి ఓ అక్రమాల కంపెనీ గుట్టును 10-టీవీ నిఘా బృందం రట్టు చేసింది.

ప్రపంచంలోని ఐటీ దిగ్గజ కంపెనీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా హైదరాబాద్
హైదరాబాద్‌..ప్రపంచంలోని ఐటీ దిగ్గజ కంపెనీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. దీంతో దేశంలోని ఎక్కడెక్కడి వాళ్లూ.. ఐటీ జాబ్స్‌ కోసం హైదరాబాద్‌ తరలి వస్తున్నారు. కానీ ఐటీ కంపెనీల నిబంధనలు.. ఇలాంటి వారి ఉద్యోగ ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. సరిగ్గా ఇక్కడే అక్రమార్కులు రంగప్రవేశం చేస్తున్నారు. డూప్లికేట్‌ కంపెనీల పేరిట.. డూప్లికేట్‌ సర్టిఫికెట్లు సృష్టిస్తూ.. యువతను.. వారి ద్వారా ఐటీ కంపెనీలనూ మోసం చేస్తున్నారు.

అమీర్‌పేట..సాఫ్ట్‌వేర్‌ చదువుల హబ్‌..
తెలుగు రాష్ట్రాల ఇంజనీర్లు.. నైపుణ్యాన్ని పెంచుకునే అడ్డా..ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. అమీర్‌పేట రెండోకోణం మోసం.. నేరపూరితం..! నేటి యువతకు సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌పై ఎనలేని మక్కువ. అందునా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ అంటే పిచ్చ క్రేజ్‌. అందుకే.. దేశంలోని ఎక్కడెక్కడి వాళ్లూ.. ఐటీ జాబ్స్‌ కోసం హైదరాబాద్‌కే తరలివస్తున్నారు. దీంతో ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు డిమాండ్‌ పెరిగిపోయింది.

ఐటీ కంపెనీలో ఉద్యోగం ఖాళీ ఉందంటే వేలకు వేల అప్లికేషన్‌లు
ఏదైనా ఐటీ కంపెనీలో ఉద్యోగం ఖాళీ ఉందంటే వేలకు వేల అప్లికేషన్‌లు వస్తున్నాయి. దీంతో సంస్థలు పూర్వానుభవం ఉన్నవారికే ఉద్యోగాలిస్తామని షరతులు విధిస్తున్నాయి. గతంలో ఎక్కడో ఓ చోట ఉద్యోగం చేసినా.. మెరుగైన కోర్సు నేర్చుకునేందుకు ఉద్యోగం వదిలేసిన వారికి కొంతకాలం గ్యాప్‌ వస్తుంది. దీన్ని కూడా ఐటీ కంపెనీలు అభ్యంతర పెడుతున్నాయి. దీంతో.. ఉద్యోగార్థులు పక్కచూపులు మొదలు పెట్టారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు.. దీన్నే సంపాదనకు మార్గంగా ఎంచుకున్నారు. దీని కోసం దర్జాగా కన్సల్టెన్సీలనూ ఓపెన్‌ చేసేశాయి.

డబ్బిస్తే చాలు.. ఉద్యోగార్థులు కోరుకున్న సర్టిఫికెట్‌
డబ్బిస్తే చాలు.. ఉద్యోగార్థులు కోరుకున్న సర్టిఫికెట్‌ను చేతిలో పెట్టేస్తున్నాయి.. ఈ కన్సల్టెన్సీలు. ఓ ఇరవై వేల రూపాయలు మనవి కాదనుకుంటే.. కంటిన్యూయస్‌గా ఉద్యోగం చేసినట్లు సర్వీసు సర్టిఫికెట్లు.. కంపెనీల ఐడీలు.. అక్కడి నుంచి రిలీవ్‌ అయినట్లుగా నకిలీ సర్టిఫికెట్లూ మన సొంతం చేస్తాయీ కన్సల్టెన్సీలు. అమీర్‌పేటలోని ఇలాంటి ఓ అక్రమాల కంపెనీ గుట్టును 10-టీవీ నిఘా బృందం రట్టు చేసింది.

నకిలీ సర్టిఫికెట్ గాళ్ళతో 10టీవీ రిపోర్టర్ సంభాషణ ఇలా వుంది

కన్సల్టెన్సీ ప్రతినిధి : మీ బ్రదర్ కా

రిపోర్టర్ : తమ్ముడికి 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది దాన్ని ఫిల్ అప్ చెయ్యాలి

కన్సల్టెన్సీ ప్రతినిధి : ఇప్పుడు వర్క్ చేస్తున్నారా

రిపోర్టర్ : చెయ్యట్లేదు ... ఇంటర్వ్యూ కి వెళ్ళాడు 2 రౌండ్స్ క్వాలిఫై అయ్యాడు 3వ రౌండ్ ఉన్నది

కన్సల్టెన్సీ ప్రతినిధి : ఏ టెక్నాలజీ

రిపోర్టర్ : నాకు తెలీదండి....... నాకు సాఫ్ట్‌వేర్ అంత ఐడియా లేదు .....

కన్సల్టెన్సీ ప్రతినిధి : మనం డాక్యుమెంట్స్ అయితే ఇస్తాము.. 2 ఇయర్స్ గ్యాప్‌ని మన దగ్గర ఉన్న ఏదో కంపెనీలో వర్క్ చేసినట్టు గ్యాప్‌ను ఫుల్‌ఫిల్ చేస్తాము

రిపోర్టర్ : అలాగే మరి శాలరి స్లిప్లు అవీ ఇస్తారా

కన్సల్టెన్సీ ప్రతినిధి : పే స్లిప్లు.. శాలరి స్లిప్లు.. ఐడీ కార్డ్.. అఫిషియల్ మెయిల్ ఐడీ హెచ్ ఆర్ డిటైల్స్ అన్నీ ఇస్తాము. రియల్‌గా ఉంటాయి మనం ఇచ్చే కంపెనీలు

రిపోర్టర్ : మళ్ళా బ్యాక్ గ్రౌండ్ చెక్ ప్రాబ్లం అవ్వదుగా

కన్సల్టెన్సీ ప్రతినిధి : వెరిఫికేషన్ 100 పర్సెంట్‌ క్లియర్ అవుతుంది.... నో ఇష్యూ.. ఇరవై వేలు చార్జ్ చేస్తాము. ఇనిషియల్‌గా మూడు వేలు పే చెయ్యాలి

రిపోర్టర్ : మూడు వేలు పే చేస్తే మాకు ఏమి ఇస్తారు

కన్సల్టెన్సీ ప్రతినిధి : మూడు వేలు పే చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళే డాక్యుమెంట్స్ ఇస్తాము

రిపోర్టర్ : పాత కంపెనీలో చేసినట్టు ఆఫర్ లెటర్ అవీ ఇస్తారా

కన్సల్టెన్సీ ప్రతినిధి : ఆఫర్ లెటర్ .... హైక్ లెటర్ .... ఐడీ కార్డ్ ...కంపెనీ మెయిల్ ఐడీ అన్ని ఇచ్చేస్తాము. ఆఫ్టర్ గెట్టింగ్ జాబ్ జాయనింగ్ టైంలో పాత కంపెనీ రిలీవింగ్ లెటర్ కావాలి. రిలీవింగ్ లెటర్ కావాలంటే 17 వేలు పే చెయ్యాలి

రిపోర్టర్ : మరి బ్యాంక్ స్టేట్ మెంట్‌కి ఎంత పే చెయ్యాలి

కన్సల్టెన్సీ ప్రతినిధి : బ్యాంక్ స్టేట్‌మెంట్ అవీ ఫ్రిగానే ఇస్తాము

రిపోర్టర్ : ఎన్నాళ్లది ఇస్తారు... త్రీ మంత్స్‌ది ఇస్తారా

కన్సల్టెన్సీ ప్రతినిధి : 6 మంత్స్

రిపోర్టర్ : మీకు ఏమైనా కొన్ని బ్యాంకులు ఉన్నాయా లేక .....

కన్సల్టెన్సీ ప్రతినిధి : ఎబ్బీఐ,ఎస్బీహెచ్ వాటివి ఇస్తాము ....

రిపోర్టర్ : శాలరి ఎంత వరకు ఇస్తారు ...

కన్సల్టెన్సీ ప్రతినిధి : 5.4 మాగ్జిమం

రిపోర్టర్ : అంటే అకార్దింగ్ టు ది పోస్ట్

నిర్భయంగా బ్యాంక్‌ నకిలీ స్టేట్‌మెంట్స్‌ను తయారీ
ఈ తతంగంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. స్టేట్‌బ్యాంక్‌ లాంటి నేషనలైజ్డ్‌ బ్యాంక్‌లో మనకు అకౌంట్‌ లేకున్నా.. అందులో మన శాలరీ క్రెడిట్‌ అయినట్లుగా దొంగ సర్టిఫికెట్‌ను సృష్టిస్తుండడం.. డూప్లికేట్‌ సర్టిఫికెట్లు సృష్టించడంలో.. అమీర్‌పేట అక్రమార్కులు బరితెగించి పోయారు. వీరు ఏకంగా స్టేట్‌బ్యాంక్‌లో లేని అకౌంట్‌కు.. ప్రతి నెలా జీతం క్రెడిట్‌ అయినట్లుగా సర్టిఫికెట్లు సృష్టించేస్తున్నారు. ఇది అతి పెద్ద నేరమని తెలిసినా.. వీరు నిర్భయంగా బ్యాంక్‌ నకిలీ స్టేట్‌మెంట్స్‌ను తయారు చేస్తున్న తీరు దిగ్భ్రాంతిని కలిగించక మానదు.

ఐటీలో ఓనమాలు కూడా తెలియని వ్యక్తికి సర్టిఫికెట్
ఐటీలో ఓనమాలు కూడా తెలియని వ్యక్తికి కూడా రెండేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసినట్లు సర్వీస్‌ సర్టిఫికేట్‌ ఇచ్చారు ఈ కన్సెల్టెన్సీ నిర్వాహకులు. ప్లేస్లిప్స్, ఐడీ కార్డులూ నకిలీవి సిద్ధం చేసిచ్చారు. ఇలాంటి నకిలీ సర్టిఫికెట్లు పొంది ఎంతమంది అనర్హులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా చలామణి అవుతున్నారో అంతు చిక్కదు.
నగరంలో 500 నకిలీ కన్సల్టెన్సీలు..
ఇలాంటి కన్సల్టెన్సీలు హైదరాబాద్‌లో సుమారు ఐదు వందల దాకా ఉన్నాయని సమచారం. రెండున్నరేళ్ల క్రితమే పురుడు పోసుకున్న తెలంగాణ.. సరళీకృత వాణిజ్య విధానం ద్వారా.. ఈజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ డూయింగ్‌లో తాజాగా దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. ఇలాంటి తరుణంలో వెలుగు చూస్తోన్న డూప్లికేట్‌ సర్టిఫికేట్ల వ్యవహారం.. రాష్ట్రం పరువును తీస్తోంది. విదేశీ సంస్థలు రాష్ట్ర ఐటీ ప్రొఫెషనల్స్‌పై అనుమానపు చూపులు చూసే పరిస్థితి దాపురించింది. వీటిని అరికట్టకుంటే.. ఐటీ రంగంలోనే కాదు.. అన్ని రంగాల్లోనూ డూప్లికేట్‌గాళ్లే నిండిపోయే ప్రమాదం ఉంది.

 

15:58 - November 5, 2016

తూర్పుగోదావరి : పోలవరం ముంపు మండలాల ప్రజలకు పునరావాసం కల్పించాలన్న డిమాండ్‌లో సీపీఎం చేపట్టిన పాదయాత్రకు గిరిజనుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 4న యటపాకలోని కన్నాయిగూడెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర 28 వరకు కొనసాగుతుంది. మొత్తం 225 ఆదివాసీ ఆవాసాను కలుపుతూ 500 కిలో మీటర్లు సాగే పాదయాత్ర కొండకోనలు మీదుగా కొనసాగుతోంది. భద్రచలం మాజీ ఎంపీ మిడియం బాబూరావు, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, రాజమహేంద్రవరం సీపీఎం నేత అరుణ్‌ల నేతృత్వంలో జరుగుతున్న పాదయాత్రలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. 

15:51 - November 5, 2016

కర్నూలు : జిల్లా సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జనచైతన్య యాత్రలో ఏపీ సీఎం చంద్రబాబు ముస్లింలపై వరాలు కురిపించారు. ఉర్దూ పండిట్‌ పోస్టులు భర్తీ చేసేందుకు అవసరమైతే ప్రత్యేకంగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వేస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తనకు వేరే కోరిక, ఆశ లేదన్నారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఓటుకు నోటు కేసులో తాను రాజీపడ్డానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరికి డబ్బులు ఇచ్చానో చెప్పాలని ప్రశ్నించారు. 

15:33 - November 5, 2016

విజయవాడ: ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 42 ఏళ్ళకు పెంచుతూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2017 సెప్టెంబర్‌ 30వరకు భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రమే ఈ వయోపరిమితి పెంపు వర్తించనుంది. రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాల జాతర ఏపీలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు 30లోపు భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రమే వయోపరిమితి పెంపు వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు.గ్రూప్ 1/2 అభ్యర్థులకు ఈ వయోపరిమితి వర్తించనుంది. 

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..

విజయవాడ: ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని పెంచుతూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2017 సెప్టెంబర్‌ 30వరకు భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రమే ఈ వయోపరిమితి పెంపు వర్తించనుంది. 

15:21 - November 5, 2016

తూర్పుగోదావరి  : విపక్ష నేత జగన్ దళిత, ఆదివాసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కారెం శివాజీ ఆరోపించారు. ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్‌గా సమర్ధవంతంగా విధులు నిర్వహించిన తనపై కోర్టులో జగన్ కేసులు వేయించారని రాజమహేంద్రవరంలో విమర్శించారు. జగన్‌కు దళిత, గిరిజనులు సరైన గుణపాఠం చెబుతారన్నారు. న్యాయవ్యవస్థపై తనకు గౌరవం ఉందని..కోర్టు తీర్పు ను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేసారు. 

15:17 - November 5, 2016

జగిత్యాల : చదువు చెప్పమని కాలేజీకి పంపిస్తే ప్రేమ పాఠాలు చెప్పాడో దుర్మార్గపు లెక్చరర్.. విద్యార్థిని ప్రేమపేరుతో నమ్మించి ఆమెను తీసుకొని పారిపోయాడు.. బిడ్డ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కాలేజీముందు ఆందోళనకు దిగారు.. అటు లెక్చరర్‌తీరుపై విద్యార్థిసంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.. విద్యార్థి నేతలు కాలేజ్‌ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.. శ్రీహర్ష జూనియర్‌ కళాశాలలో రాజ్ కుమార్ అనే లెక్చరర్ అదే కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ప్రేమపేరుతో తీసుకుపోయాడు. రెండు రోజుల క్రితం కళాశాలకు వెళ్ళిన విద్యార్థి తిరిగి రాకపోవటంతో ఆందోళనకు లోనైన తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు విద్యార్థి బంధువులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా గత రెండు రోజుల నుండి విద్యార్థినికి సంబంధించి ఎటువంటి ఆచూకీ లభించలేదు. 

15:08 - November 5, 2016

హైదరబాద్ : అనేక కళారూపాలకు తెలంగాణ కళా నిలయమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన తెలంగాణ కళామేళాను కేటీఆర్‌ ప్రారంభించారు. కళాకారులను ప్రొత్సహించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఇలాంటి ప్రదర్శనల ద్వారా భాగ్య నగరం స్వరూపాన్ని కళాకారులు మార్చేస్తున్నారని చెప్పారు. ప్రతీ కళాకారుడిని వెలుగులోకి తీసుకురావాలన్న కేటీఆర్‌.. ప్రభుత్వం కళలను ప్రొత్సహిస్తుందన్నారు. 

15:04 - November 5, 2016

గుజరాత్‌ : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్‌కోట్‌ సమీపంలో లారీ, వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం రాజ్‌కోట్‌ సమీపంలోని బగోదరా హైవేపై జరిగింది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

రైల్‌ నిలయంలో అగ్నిప్రమాదం!..

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రైల్‌ నిలయంలోని రిక్రూట్‌మెంట్‌ కార్యాలయంలో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. రెండు అగ్నిమాపక శకటాలతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

కశ్మీర్ కాల్పుల్లో పాక్ ఉగ్రవాది హతం..

జమ్ముకశ్మీర్‌ : షోపియన్‌ జిల్లాలో భద్రతా బలగాలకు, పోలీసులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. షోపియన్‌ జిల్లాలోని దోబిజన్‌ గ్రామంలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదులు ఉన్న ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాను గాయపడగా, ఒక ఉగ్రవాదిని హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

లోయలో పడ్డ బ‌స్సు..10మంది మృతి..

హిమాచల్ ప్రదేశ్‌ : రాష్ట్రంలోని మండి జిల్లాకు స‌మీపంలో ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటు చేసుకుంది. జార్జ్ ప్రాంతం మీదుగా వెళుతోన్న ఓ బ‌స్సు ఒక్క‌సారిగా అదుపుత‌ప్పడంతో లోయ‌లో ప‌డింది. ఈ ప్ర‌మాదంలో బ‌స్సులోని ప్ర‌యాణికుల్లో ప‌ది మంది మృతి చెందిన‌ట్లు అక్క‌డి అధికారులు గుర్తించారు. ప‌లువురికి గాయాల‌యిన‌ట్లు తెలుస్తోంది. ఘట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ బ‌స్సులో చిక్కుకుపోయిన ప్ర‌యాణికుల‌ను ర‌క్షించేందుకు శ్ర‌మిస్తున్నారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

14:18 - November 5, 2016

నాగర్ కర్నూల్ : సీపీఎం మహాజన పాదయాత్ర 20 వ రోజుకు చేరుకుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలో పాదయాత్ర జరుగుతోంది. ఈ సందర్భంగా తమ్మినేని మీడియాతో మాట్లాడారు. 20 రోజుల పాదయాత్ర విశేషాలను మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం చాలా ముఖ్యమన్నారు. రెడ్డి, వెలమ కులాలే అధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నాయన్నారు. ఆధిపత్య భావజాలం తరతరాలుగా కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతోందన్నారు. టీఆర్ ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ప్రాజెక్టుల పేరిట వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి సేకరిస్తోందన్నారు. రైతులకు జీవో 123 ప్రకారం నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కులాలు అభివృద్ధికి  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆర్టీఏ అధికారులు తనిఖీలు

హైదరాబాద్‌ : నగరంలో ఆర్టీసీ అధికారులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఉదయం నుంచే నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్‌ జాతీయరహదారిపై ఆర్టీఏ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.

కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన

కర్నూలు : నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. కిడ్స్‌ వరల్డ్‌ సమీపంలో అమృత్‌ పథకం కింద చేపట్టనున్న మంచినీటి పథకానికి, రూ.15కోట్లతో చేపట్టనున్న విజయవనానికి శంకుస్థాపన చేశారు.

14:02 - November 5, 2016
13:59 - November 5, 2016

చిత్తూరు : తిరుమల శ్రీవారిని ఇవాళ ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. కేరళ గవర్నర్ సత్తాశివం, టిడిపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న వారికి ఆలయ అధికారులు ఘణంగా స్వాగతం పలికి దర్శన ఏర్నాట్లు చేసారు. క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా శ్రీవారి సుప్రభాతసేవలో పాల్గొన్నారు. 

 

కరీంనగర్ త్రీటౌన్‌ ఎస్సై రఫిక్‌ఖాన్‌ పై సస్పెన్షన్ వేటు

కరీంనగర్ : త్రీటౌన్‌ ఎస్సై రఫిక్‌ఖాన్‌ను నగర కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. ఇదివరకే పెళ్లైన ఎస్సై రఫిక్‌ఖాన్‌.. తమ కూతురును బెదిరించి కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకున్నాడని తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేసిన పోలీసులు..నివేదికను ఉన్నతాదికారులకు పంపించారు. దీనిపై విచారించిన కమిషనర్‌ కమలహాసన్‌రెడ్డి..రెండో పెళ్లి చేసుకున్న త్రీటౌన్‌ ఎస్సై రఫిక్‌ఖాన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:56 - November 5, 2016

కరీంనగర్ : త్రీటౌన్‌ ఎస్సై రఫిక్‌ఖాన్‌ను నగర కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. ఇదివరకే పెళ్లైన ఎస్సై రఫిక్‌ఖాన్‌.. తమ కూతురును బెదిరించి కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకున్నాడని తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేసిన పోలీసులు..నివేదికను ఉన్నతాదికారులకు పంపించారు. దీనిపై విచారించిన కమిషనర్‌ కమలహాసన్‌రెడ్డి..రెండో పెళ్లి చేసుకున్న త్రీటౌన్‌ ఎస్సై రఫిక్‌ఖాన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:54 - November 5, 2016

కర్నూలు : నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. కిడ్స్‌ వరల్డ్‌ సమీపంలో అమృత్‌ పథకం కింద చేపట్టనున్న మంచినీటి పథకానికి, రూ.15కోట్లతో చేపట్టనున్న విజయవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కిడ్స్‌ వరల్డ్‌ నుంచి తెదేపా జనచైతన్యయాత్రలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. మంత్రి అచ్చెన్నాయుడు, రాజ్యసభ సభ్యుడు టి.జి వెంకటేశ్‌, పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:50 - November 5, 2016

గుజరాత్‌ : పట్టపగలు అందరూ చూస్తూనే ఉన్నారు...అందరిలో భయమే..ఏ ఒక్కరూ ధైర్యం చేయలేదు...ఏ ఒక్కరూ అడుగుముందుకు వేయలేదు...ప్రేక్షకపాత్ర వహించారేగాని మానవత్వంతో ఆలోచించలేదు..ఫలితంగా ఓ చోట యువకుడు కళ్ల ముందే చనిపోగా...మరో చోట ఇద్దరు యువకులు ప్రాణాపాయంతో బయటపడ్డారు..ఈ రెండు ఘటనలు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి...సాటి మనిషి సాయం కోరినా అడుగు ముందుకు పడకపోవడం సిగ్గుచేటు..అదే సమయంలో మనుషులే మృగాలుగా మారి దారుణాలకు తెగబడ్డారు...
ఒంట్లో ఓపికలేకున్నా తెగబడ్డాడు..
నడిరోడ్డులో దారుణం
గుజరాత్‌లో పట్టపగలే దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై తండ్రి కొడుకులు కత్తి దాడి చేశారు. పిడిగుద్దులతో కింద పడేశారు..ఆ తర్వాత రాళ్లతో కొట్టారు..అప్పటికీ కసితీరని ఆ తండ్రీ కొడుకులు కత్తితో పొడిచారు...రక్తస్రావంతో లేవలేని పరిస్థితిలో ఉంటే చినిపోయాడని వదిలేశారు...వెళ్లిపోయారు...కాని ఆ వ్యక్తి లేచి చూశాడు..ఎవరూ ఆసరా రాలేదు..ఎవరూ పట్టించుకోలేదు..నడిరోడ్డుపై అంతమంది రాకపోకలు సాగిస్తున్నా ఏ ఒక్కరిలో మానవత్వం కానరాలేదు...చివరకు ఆ యువకుడు పడిపోయి శ్వాస విడిచాడు...
హర్యానాలో మరో దారుణం 
హర్యానాలో పట్టపగలే మరో దారుణం జరిగింది. ఇద్దరు యువకులపై రౌడీలు చెలరేగిపోయారు..అందరూ చూస్తుండగా వారిని వారించి దుర్మార్గంగా ప్రవర్తించారు...అంబాలా ఫ్లైఓవర్‌ పక్కన ఇద్దరి యువకులపై విచక్షణారహితంగా దాడి చేశారు...కర్రలు, రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడి దృశ్యాలు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవిలో రికార్డు అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రౌడీల కోసం గాలిస్తున్నారు...
పట్టపగలే రెండు ఘటనలు  
గుజరాత్, హర్యానాలో జరిగిన రెండు ఘటనలు పట్టపగలు జరిగినవే..జనారణ్యంలో జరిగినవే..అందరూ ప్రేక్షకపాత్ర వహించారేగాని ఏ ఒక్కరూ ఆపేందుకు ముందుకు రాలేదు..మానవత్వం చూపలేదు..ధైర్యం చేయలేదు..ఫలితంగా ఓ యువకుడు మృతి చెందగా...మరోచోట ఇద్దరు యువకులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

 

13:41 - November 5, 2016

హైదరాబాద్ : ఎపి టీడీపీలో రగడ మొదలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు వర్సెస్ పార్టీ నేతల మధ్య వార్‌ నడుస్తోంది... ఓవైపు పార్టీని పటిష్టం చేయాలంటూ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తుంటే... కొత్తగా ఏర్పడుతున్న సమస్యలు పార్టీ వర్గాల్ని టెన్షన్ పెడుతున్నాయి.. జనచైతన్య యాత్రలపై...ఈ  ఇంటర్నల్ వార్ ఎఫెక్ట్ నేతల్ని కలవరపెడుతోంది.. 
నువ్వానేనా అంటూ తలపడుతున్న నేతలు
ఏపీలో జంపింగ్‌లు టీడీపీనికూడా ఇబ్బందిపెడుతున్నాయి.. అప్పటికే పార్టీలోఉన్న సీనియర్‌ నేతలు కొత్తవారి రాకను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.... వలసలతో పార్టీ బలోపేతంకాకపోగా రెండుగావిడిపోయిన నేతలు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు.. ముఖ్యంగా ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో వైసీపీ నేతల వలసలు టీడీపీలో చిచ్చుపెట్టాయి.. మొదటినుంచి పార్టీలోఉన్నవారు ఈ చేరికలపై భగ్గుమంటున్నారు.. నేతలమధ్య చాలాచోట్ల బహిరంగవార్‌ నడుస్తోంది.. ప్రకాశం జిల్లా అద్దంకిలో కరణం బలరాం వర్సెస్ గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి.. నియోజకవర్గాల బాధ్యతలను ఎమ్మెల్యేలకే అప్పగించాలని టిడిపి అధిష్ఠానం నిర్ణయించినా ఇక్కడ అది ఆచరణలోకివచ్చే అవకాశం కనిపించడంలేదు.. కరణం బలరాం తన పంథాలో ఎలాంటిమార్పులేకుండా ముందుకువెళుతున్నారు.. 
ఆళ్ళగడ్డ, నంద్యాలలోకూడా సేమ్‌ సీన్‌
అటు కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ, నంద్యాలలోకూడా ఇదే పరిస్థితి... భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియలను పార్టీలో చేర్చుకోవడంపై గంగుల, శిల్ప గుర్రుగాఉన్నారు. అనంతపురం జిల్లా కదిరిలోకూడా వైసిపి ఎమ్మెల్యే చాంద్ భాషా రాక పార్టీలో సమస్యలు సృష్టించింది.. టిడిపి నేత కందికుంట‌ ప్రసాద్‌.... భాషా చేరికకు వ్యతిరేకంగా ఉన్నారు.. క‌డ‌ప జిల్లా జ‌మ్ముల‌మ‌డుగు లో ఆదినారాయ‌ణ రెడ్డి, వ‌ర్సెస్ రామ సుబ్బారెడ్డిల మధ్య వివాదం కొన‌సాగుతుంది. కేడర్‌ను కాపాడుకునేందుకు పార్టీ అధిష్ఠాన నిర్ణయాన్నికూడా ఈ సీనియర్‌ నేతలు పట్టించుకోవడంలేదు.. రెండుగావిడిపోయి ఈ నేతలమధ్యపోరు ఘర్షణలకు, హత్యారాజకీయాలకు దారితీస్తోంది... 
జనచైతన్య యాత్రలపై తీవ్ర ప్రభావం 
టీడీపీ నేతలమధ్య రగడ ఏపీలో జనచైతన్య యాత్రలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.. సమస్యాత్మక నియోజకవర్గాల్లో వర్గపోరు ఈ యాత్రకు ప్రధాన సమస్యగా మారింది.. ఈ ప్రాంతాల్లో జనచైతన్య యాత్రల నిర్వహణ పార్టీకి పెద్ద సవాలుగా మారింది.. వర్గ విభేదాలపై పార్టీ పెద్దలు సీరియస్‌గాఉన్నా... స్థానికంగా కలిసి పనిచేసే అవకాశం లేకపోవటం టిడిపిని కలవర పెడుతోంది.

 

13:38 - November 5, 2016

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.

13:33 - November 5, 2016

హైదరాబాద్‌ : నగరంలో ఆర్టీసీ అధికారులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఉదయం నుంచే నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్‌ జాతీయరహదారిపై ఆర్టీఏ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. విజయవాడ, నల్గొండ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేశారు. 

 

13:31 - November 5, 2016

కర్నూలు : జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నారు. అమృత పథకం కింద 68 కోట్ల రూపాయలతో 15 వేల కుళాయి కనెక్షన్లు ప్రారంభించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:28 - November 5, 2016

హైదరాబాద్ : బల్దియా ఖజానా వెల వెల బోతుందా..? ఆర్ధిక ఇబ్బందుల్లో జీహెచ్‌ఎంసీ కొట్టుమిట్టాడుతుందా..? విశ్వ నగరం చేస్తామన్న ప్రభుత్వం బల్దియాకు హ్యాండ్‌ ఇస్తుందా.? చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదా..? అంటే అవుననే చెప్పక తప్పదు. సర్కార్‌ నిధులు ఇవ్వకపోగా ఇతర సంస్ధలకు నిధులు చెల్లించాలంటూ హుకూం జారీ చేయడంతో బల్దియా కష్టాలతో కూనరిల్లుతోంది. 
పరిస్థితి తారుమారు 
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒకప్పుడు భారీగా ఆదాయం ఉన్న లోకల్‌ బాడీ.. ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతి వెంకన్న తర్వాత భారీగా ఆదాయం ఉన్న సంస్ధగా బల్దియాను అభివర్ణించేవారు. కానీ కొద్ది సంవత్సరాలుగా జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ వేల కోట్లుకు ఎగబాకింది. ఈ ఏడాది ఏకంగా 5,600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ రూపొందించింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారు అయ్యింది. 
వెల వెలబోతున్న కార్పొరేషన్‌ గల్లాపెట్టే  
నిత్యం కాసులతో గళగళలాడే కార్పొరేషన్‌ గల్లాపెట్టే వెల వెలబోతుంది. గత ఆర్ధిక సంవత్సరం కూడా బల్దియాకు 600 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉండేవి. కానీ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఖజానా ఖాళీ అయ్యింది. ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటి వరకు 1200 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరింది. అభివృద్ది పనులు పక్కన బెట్టి..మెయింటెనెన్స్‌ కోసం ప్రతి నెల తప్పకుండా 150 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 95 నుంచి 100 కోట్ల రూపాయలు జీతాలు, వేతనాలు, పెన్షన్ల కోసం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల 14 కోట్ల విద్యుత్‌ ఛార్జీలు చెల్లించాలి. వీటికి తోడు వాహనాలు, కార్యాలయాలతో పాటు ఇతర మెయింటెనెన్స్‌ కోసం 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాంతో వచ్చిన ఆదాయం అంతా ఖర్చయిపోతుంది.
ప్రభుత్వమే కారణం.. 
జీహెచ్‌ఎంసీకి ఇలాంటి పరిస్థితులు రావడానికి ప్రభుత్వమే కారణం.. ఆదాయం బాగా ఉందంటూ జీహెచ్‌ఎంసీకి చెందిన నిధులను ఆర్టీసికి వచ్చిన నష్టాలతో భర్తీ చేశారు. ఆస్తి పన్ను వసూళ్లలో 15 శాతం నిధులు హైదరాబాద్‌ వాటర్‌ బోర్డుకు చెల్లించాలని సర్కార్‌ ఆదేశించింది. దాంతో ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆర్టీసికి 2015-16 సంవత్సరంలో 170 కోట్లు చెల్లించగా..2016-17 సంవత్సరంలో 198 కోట్ల రూపాయలు చెల్లించింది. అంతే కాకుండా ఎన్నికల ముందు జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను 95 కోట్ల రూపాయలను రద్దు చేసిన ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇక 1200 రూపాయల కంటే తక్కువ ఆస్తి పన్ను చెల్లించే వారు నామినల్‌ పన్నును మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం డిసైడ్‌ చేయడంతో ప్రతి ఏటా కార్పొరేషన్‌ కు 25కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతోంది.
బల్దియాకు నిధులు నామ మాత్రమే.. 
జీహెచ్‌ఎంసీకి ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రావాలి. కానీ రెండేళ్లుగా బల్దియాకు ప్రభుత్వాల నుంచి అందుతున్న నిధులు నామ మాత్రమే.. దీంతో కార్పొరేషన్‌ ఖజానా ఖాళీ అయ్యింది. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ 2వేల 819 కోట్ల రూపాయలు అవసరమంటూ ప్రభుత్వానికి విన్నవిస్తే 428 కోట్ల రూపాయలు కేటాయించి.. 23 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. ఇక 2016-17 ఆర్ధిక సంవత్సరానికి 2వేల 260 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరితే.. 400 కోట్ల రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. 
అప్పుల కోసం అన్వేషణ  
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కార్పొరేషన్‌ను ఎలా నెట్టుకురావాలంటూ గ్రేటర్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు బల్దియా అప్పుల కోసం అన్వేషిస్తోంది. నిర్మాణం మధ్యలో ఆగిపోయిన ఇందిరమ్మ ఇళ్లను కంప్లీట్‌ చేసేందుకు 370 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు సిద్ధమైంది. క్రెడిట్‌ రేటింగ్స్‌ ఫిక్స్‌ చెయ్యడం కోసం ఇప్పటికే ఇక్రా, కేర్‌ సంస్ధలను జీహెచ్‌ఎంసీ ఆశ్రయించింది. మంచి రేటింగ్‌ వస్తే మూడు వేల కోట్ల వరకు అప్పులు తీసుకోవడానికి అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితులన్ని చూస్తుంటే 1990 దశకంలో జీహెచ్‌ఎంసీ ఎదుర్కొన్న ఇబ్బందులు..మళ్లీ రానున్నాయంటున్నారు నిపుణులు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రేటర్‌ అభివృద్దిపై పూర్తి స్థాయిలో సహకరించకపోతే.నెలల తరబడి బిల్లులు ఆగిపోవడం..వారాలు తరబడి జీతాలు అందకపోవడం వంటి పరిస్థితులు ఉత్పన్నం కాక తప్పదు.

 

13:21 - November 5, 2016

హైదరాబాద్ : విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లిస్తామని హామీల మీద హామీలిచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా.. పెండింగ్ ఫీజు బకాయిలు మాత్రం విడుదలకు నోచుకోలేదు. దీంతో అటు కళాశాలలు, ఇటు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బకాయిలు చెల్లించకపోతే వచ్చే నెలలో జరగబోయే సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరిస్తామని ఇప్పటికే డిగ్రీ కాలేజీలు అల్టిమేటం జారీ చేశాయి. ఫీజుల కోసం అవసరమైతే మరోసారి ఆందోళనకు సిద్ధమని ప్రకటించాయి. 
విద్యార్థులు నానా ఇబ్బందులు 
ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణలో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో అటు విద్యార్థులు.. ఇటు యాజమాన్యాలు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. స్వయంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
రూ. 2వేల 68 కోట్ల బకాయిలు 
ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని కాలేజీలకు దాదాపు 2వేల 68 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2016 మార్చి 29న అసెంబ్లీలో, మే 24న కాలేజీ యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ జూన్‌ 30 నాటికి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత నెల 17న ఉప ముఖ్యమంత్రి కడియ శ్రీహరి కూడా.. అక్టోబర్‌ నెలాఖరు వరకు 600 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే చివరికి కేవలం 258 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.  అందులో డిగ్రీ కాలేజీలకు ఫీజుల బకాయిల కింద కేవలం 50 కోట్లు మాత్రమే అందాయి. రాష్ట్రంలో 1150 డిగ్రీ కాలేజీలుంటే.. వాటిలో 11 లక్షల మంది విద్యార్థులున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. 
విద్యాశాఖ మంత్రే కాదు.. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ సైతం నెరవేరక పోవడం దారుణమని కాలేజీ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 
పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలి  
బకాయిలు విడుదల కాక.. అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నామని.. వెంటనే పెండింగ్‌ బకాయిలను విడుదల చేసి ఆదుకోవాలని ఇప్పటికే ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కలిసి కాలేజీ యాజమాన్యాలు మెమోరండం అందజేశాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరులోగా పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని.. లేకపోతే.. వచ్చే నెలలో జరగనున్న పరీక్షలను బహిష్కరిస్తామని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి.  

 

13:14 - November 5, 2016
13:12 - November 5, 2016

హైదరాబాద్ : తెలంగాణలో అధికార పార్టీ గూటికి చేరిన టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ... సుప్రీంకోర్టు గడప తొక్కడంతో కేసు విచారణ ఊపందుకుంది. దీంతో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోనని టీఆర్ఎస్‌లోకి వలస వచ్చిన నేతలు సతమతవుతున్నారు. 
టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసలు
టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో వలస బాటపట్టారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అతిక్రమించి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సుప్రీం కోర్టు గడప తొక్కడంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది.  
ఎమ్మెల్యేలకు గతంలో నోటీసులు జారీ 
వలస ఎమ్మెల్యేలపై విచారణ జరుపుతుండగానే సుప్రీం కోర్టు పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులకు గతంలోనే నోటీసులు జారీ చేసింది. సాంకేతికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, రెడ్యానాయక్, కోరం కనకయ్య, విఠల్ రెడ్డిలకు ఎమ్మెల్యే సంపత్ కుమార్ నోటీసులను అసెంబ్లీలోనే అందచేశారు. కేసు విచారణ మరోసారి తెరపైకి రావడంతో సుప్రీం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సమాధానం కోరుతూ ఈ నెల 8వ తేదీలోపు గడువు విధించింది. దీనిపై సీఎం కేసీఆర్, శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు అడ్వకేట్ జనరల్‌తో సమావేశమై చర్చించారు. సుప్రీం కోర్టుకు  అధికార పార్టీ ఎలాంటి సమాచారం ఇస్తోందోనన్న ఆందోళన టీడీపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలందరినీ వెంటాడుతోంది.
అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధం 
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కేసు ఆసక్తిగా మారిన ఈ పరిస్ధితుల్లోనే మరోవైపు అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ చివరి నాటికి పూర్తి చేయాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. 

 

12:59 - November 5, 2016

హైదరాబాద్ : గోడు చెబుకుందామని వస్తే.. అందుబాటులో మంత్రులు ఉండడం లేదు.. ప్రజా సమస్యల కంటే ఏపీలోని అధికార పార్టీ నేతలకు పార్టీ కార్యక్రమాలపైనే ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నారు. దీంతో గ్రీవెన్స్‌ డేకి పెద్ద సంఖ్యలో వస్తున్న బాధితులు నిరాశతో వెనుదిరుగుతున్నారు..!
నిరాశతో వెనుదిరుగుతున్న బాధితులు 
ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు వీలుగా... ప్రతి శుక్రవారాన్ని గ్రీవెన్స్ డేగా ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు...సచివాలయంలో మాత్రం మంత్రులను ప్రజలకు అందుబాటులో ఉంచలేకపోతున్నారు. తమ సమస్యలను మంత్రులకు చెప్పుకునేందుకు నిత్యం వందల మంది వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి వస్తున్నారు. అయితే.. ఎంతో సూదర ప్రాంతాల నుంచి వస్తున్నబాధితులను.. భద్రతా కారణాల రీత్యా పోలీసులు వారిని సచివాలయంలోనికి అనుమతించడం లేదు. దీంతో చాలామంది నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే
ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే అయినప్పటికీ మంత్రులు సచివాలయానికి రాకపోవడానకి ప్రధాన కారణం జనచైతన్య యాత్రలేనని చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మేల్యేలు జన చైతన్య యాత్రలో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో గ్రీవెన్స్ డేకు మంత్రులు దూరమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. సచివాలయానికి వచ్చి గ్రీవెన్స్ డేలో ప్రజల సమస్యలు విందామని భావిస్తున్న ఒకరిద్దరు మంత్రుల కూడా అధిష్టానం జన చైతన్య యాత్రలే ముఖ్యమని చెప్పడంతో  చేసేది ఏమీ లేక వాటిలో పాల్గొంటున్నారు. 
హైటెక్ స్థాయిలో తాత్కాలిక సచివాలయం 
హైటెక్ స్థాయిలో ఏపీ తాత్కాలిక సచివాలయం నిర్మించినా... అది ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జన చైతన్య యాత్రలు ముగిసిన తర్వాత అయినా మంత్రులు గ్రీవెన్స్ డేకి వచ్చి బాధితుల సమస్యలు వింటారో లేదో చూడాలి..!

12:51 - November 5, 2016

విశాఖ : వివాదస్పదమవుతున్న విశాఖ బీచ్ ఫెప్టివల్‌ కార్యక్రమ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భారత సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోమని స్పష్టం చేసింది. విశాఖకు వస్తున్న ఖ్యాతిని తగ్గించడానికే ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించింది ప్రభుత్వం.
బీచ్ లవ్ ఫెస్టివల్ పై ప్రభుత్వం క్లారిటీ 
విశాఖలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం రోజున ఏర్పాటు చేయాలనుకున్న బీచ్ లవ్ ఫెస్టివల్ పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌ ప్రభుత్వం తరపున స్పందించారు. 
వైజాగ్ లవ్ ఫెస్టివల్‌కు ప్రభుత్వానికి సంబంధం లేదు : కామినేని
వైజాగ్ లవ్ ఫెస్టివల్‌కు ప్రభుత్వానికి సంబంధం లేదని, సీఎం సహా మంత్రులెవరూ లవ్‌ ఫెస్టివల్‌కు హాజరుకారని మంత్రి కామినేని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ ఊహాత్మక ఆరోపణలే అని మండిపడ్డారు. అనుమతి కోసం గోవాకు చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులు, మున్సిపాలిటీకి, పర్యాటక శాఖకు దరఖాస్తు చేశారని,ఆ ఫెస్టివల్ మన సంస్కృతికి విరుద్ధమని తేలితే అనుమతి ఇవ్వబోమని తెలిపారు. 
ఇలాంటి కార్యక్రమాలతో విశాఖకు మరిన్ని పెట్టుబడులు          
మన సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అయితే.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విశాఖకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని తెలిపారు. పాజిటీవ్ గ్లోబల్ కన్సెల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు.
ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం : గంటా          
బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌పై జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, టూరిజం, ఉడా ఉన్నతాధికారుల అధ్వర్యంలో కమిటీ వేశామని.. ఆ కమిటీ నుంచి వచ్చిన నిర్ణయం మేరకే  ఫెస్టివల్‌కి అనుమతి ఇచ్చామన్నారు గంటా. విశాఖను అప్రతిష్టపాలు చేయడానికే ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. బీచ్ ఫెస్టివల్‌పై అన్ని వర్గాల నుంచి వస్తున్న విమర్శలతో ఫెస్టివల్ నిర్వహణపై ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గిందనే చెప్పుకోవచ్చు. 

 

కోల్డ్ బెల్టు జిల్లాల ఎమ్మెల్సీలతో ఎంపీ కవిత సమావేశం

హైదరాబాద్ : కోల్డ్ బెల్టు జిల్లాల ఎమ్మెల్సీలతో ఎంపీ కవిత సమావేశం అయ్యారు. పలు అంశాలపై మంత్రి చర్చిస్తున్నారు. 

 

12:39 - November 5, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం వైసీపీ మరోసారి తన గళాన్ని విప్పుతోంది. హోదా డిమాండ్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు స్కెచ్‌ వేసింది. విశాఖలో ఈ నెల 6వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ సభలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని వైసీపీ అధినేత ప్లాన్ చేశారు.
వైసీపీ ఉద్యమం ఉధృతం 
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేస్తూ... వైసీపీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. ఈ నెల 6వ తేదీన విశాఖలో ప్రత్యేక హోదాపై వైసీపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ సభ ఏర్పాట్లను పార్టీ అగ్రనేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏపీ రాష్ర్ట వ్యాప్తంగా ప్రత్యేక హదాపై మొత్తం 6 సభలు ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే... తొలిసభను విశాఖ నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు 'జై అంధ్రప్రదేశ్' బహిరంగసభ పేరు పెట్టారు. సభావేదికకు గురజాడ పేరు, సభా ప్రాంగణానికి తెన్నీటి విశ్వనాథం పేర్లు పెట్టారు. 
త్వరలో విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు 
విశాఖలో ఏర్పాటు చేస్తున్న సభకు భారీగా జన సమీకరణ చేసే పనిలో పడ్డారు వైసీపీ నేతలు. విశాఖ నగరంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఉంది. త్వరలోనే విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ.. విశాఖలో సభను ఏర్పాటు చేస్తోంది.
ఉత్తరాంధ్ర నుంచి భారీగా జనసమీకరణ 
ఇటు విద్యా పరంగానూ విశాఖ నగరం బాగా అభివృద్ధి చెందింది. ఈ నగరంలో కార్మిక వర్గంలో చైతన్యం కూడా ఎక్కువే. అందుకే విశాఖలో ఏర్పాటు చేస్తున్న బహిరంగసభను విజయవంతం చేసి... ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని వైసీపీ భావిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి భారీగా జనసమీకరణ చేసి.. సభను సక్సెస్‌ చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా వైసీపీ మరోసారి ఏపీ ప్రత్యేక హోదాపై ఆందోళనను ఉధృతం చేసి.. రాష్ర్ట ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది. 

హెచ్ ఐసీసీఐలో ఐకాన్ సదస్సు

హైదరాబాద్ : నగరంలోని హెచ్ ఐసీసీఐలో ఐకాన్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు. 

లక్నోలో ఎస్పీ సిల్వర్ జూబ్లీ వేడుకలు

యూపీ : లక్నోలో సమాజ్ వాదీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు అజిత్ సింగ్, శరద్ యాదవ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు. 

 

కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు

కడప : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అమృత పథకం కింద15 కుళాయి పైపు లైన్లను ప్రారంభించారు. 

10:56 - November 5, 2016

హైదరాబాద్ : సఫిల్ గూడలో రోడ్డు కుంగడంతో గుంత ఏర్పడింది. బైకుపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు గుంతలో పడిపోయారు. బైకు నడుపుతున్న వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న మహిళ సహా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని రక్షించి 108 లో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాటర్ వర్క్స్ పైపు లైన్ కారణంగానే రోడ్డుపై గుంత ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:49 - November 5, 2016

వరంగల్‌ : పట్టణంలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. సీకేఎం కళాశాల సమీపంలో బ్రీతింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌రావుపై ఏఆర్‌ కానిస్టేబుల్‌ అనిల్‌ దాడి చేశారు. ఎస్సై సహా సిబ్బందిపై అనిల్‌ దాడికి పాల్పడ్డాడు. గత వారం రోజులుగా వరంగల్‌ నగరంలో వరుస ఘటనలు స్థానికుల్ని కలవరపెడుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:46 - November 5, 2016

కరీంనగర్ : జిల్లాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యానికి ఓ నిండుప్రాణం బలైంది. కాలుకు చేయాల్సిన ఆపరేషన్‌ గుండెకు చేయడంతో రాజన్న సిరిసిల్లాకు చెందిన కరీం అనే వ్యక్తి  చనిపోయాడు. జారిపడి కాలు విరిగిందని కరీంనగర్లోని మక్సూర్‌ ఆసుపత్రికి కొద్ది రోజుల క్రితం కరీం వెళ్లాడు. అయితే గుండె బలహీనంగా ఉందంటూ వైద్యులు గతనెల 21 ఆరోగ్యశ్రీ కింద గుండె ఆపరేషన్‌ చేశారు. అయితే అనారోగ్యంతో కరీం నిన్న మృతిచెందాడు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కరీం మృతిచెందాడని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. 

10:44 - November 5, 2016

ఢిల్లీ : గత ఐదు రోజులుగా విషపూరితమైన పొగ మంచు కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి కాలుష్యం అమాంతం పెరిగిపోయింది. దీనివల్ల కొన్ని పాఠశాలలు బయట కార్యక్రమాలను వాయిదా వేయడమే కాకుండా ఆస్థమా విద్యార్థులను స్కూల్‌కు రావద్దని సూచించాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

సఫిల్ గూడలో రోడ్డు పై గుంత

హైదరాబాద్ : సఫిల్ గూడలో రోడ్డు పై గుంత ఏర్పడింది. వాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఆ గుంతలో పడిపోయారు. మహిళ సహా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

 

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. నగరంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది.పొగ మంచుకు బాణాసంచా కాలుష్యం తోడైంది.  దీపావళి తర్వాత కాలుష్యం అత్యంత తీవ్రస్థాయికి చేరింది. దీంతో నేడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1800 పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 

 

09:53 - November 5, 2016

నాగర్ కర్నూల్ : సీపీఎం మహాజన పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల, పెద్దకొత్తపల్లి మండలాల్లో పాదయాత్ర బృందం పర్యటించింది. అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంది. పాదయాత్ర బృందానికి స్థానికులంతా తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందం సభ్యురాలు రమా టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మహాజన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజలు సమస్యలను ఏకరవుపెడుతున్నారని చెప్పారు. సమస్యలపై పార్టీలకతీతంగా నేతలు పాదయాత్ర బృందానికి ఆర్జీలు పెడుతున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

హైదరాబాద్ సమన్వయ కమిటీ సమావేశం

హైదరాబాద్ : హెచ్ ఎండీఏ బుద్ధ పూర్ణిమ కార్యాలయంలో హైదరాబాద్ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ కమిషనర్లు, వాటర్ బోర్డు ఎండీ దాన కిషోర్, రెవెన్యూ, పోలీసు, ట్రాఫిక్ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

 

వరంగల్ లో తాగుబోతులు వీరంగం

హన్మకొండ : వరంగల్ లో తాగుబోతులు వీరంగం సృష్టించారు. సీకేఎం కళాశాల సమీపంలో బ్రీతింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ ఐ శ్రీనివాస్ రావుపై ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ దాడికి పాల్పడ్డాడు. ఎస్ ఐ సహా సిబ్బందిపై అనిల్ దాడి చేశాడు. వారం రోజులుగా నగరంలో జరుగుతున్న వరుస సంఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. 

 

09:35 - November 5, 2016

నాగర్ కర్నూల్ : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ఎజెండాతో చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. సంచార జాతుల సమస్యలపై తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం సంచార జాతుల వారికి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 
పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం 
సీపీఎం మహాజన పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో లింగాల మండలంలో అంబటిపల్లి, దేవినేనిపల్లి, అక్కడి నుంచి పెద్దకారుపాముల, పెద్దకొత్తపల్లి వరకు సాగింది. పాదయాత్ర బృందానికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పలు పార్టీలకు చెందిన మండల స్థాయి నేతలు మద్దతు తెలిపారు. 
సంచార జాతుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ 
సంచార జాతుల సమస్యలపై తమ్మినేని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. సంచార జాతులకు చెందిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సంచార జాతులవారికి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయాల జోక్యం లేకుండా... అంగన్‌వాడీ, ఐసీడీఎస్‌లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పాదయాత్ర బృందం సభ్యురాలు రమ అన్నారు. 
దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వని సర్కార్ : జాన్ వెస్లీ 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. పాదయాత్రలో పాల్గొన్న బృందం సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. నాగర్ కర్నూలు ప్రాంతం వలసలకు పెట్టింది పేరని..కానీ వలసలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని జాన్‌వెస్లీ అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగుల వెతల్ని పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. 

 

09:26 - November 5, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని శివారులో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. బొమ్మకల్‌ గ్రామ చెరువు సమీపంలోని పొలాల్లో గ్రామస్తులకు ఎలుగుబంటి కనిపించింది. గ్రామస్తులంతా కలిసి దానిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. జనాల్ని చూసి భయపడ్డ ఎలుగు చెట్టెక్కి కూర్చుంది. ఎలుగుబంటి ఎక్కడ గ్రామాల్లోకి ప్రవేశిస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ఈ జీవిని పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గుట్టలను క్వారీ యజమానులు పేల్చివేయడంతో ఆహారం, నీటికోసం ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వస్తున్నాయి.

 

09:23 - November 5, 2016

ఢిల్లీ : రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌కు కేంద్ర ప్రభుత్వం అనుహ్య రీతిలో షాకిచ్చింది. కేజీ బేసిన్‌లో ఓఎన్ జీసీ చమురు క్షేత్రాల నుంచి ఆర్ ఐఎల్ అక్రమంగా గ్యాస్‌ను తోడ్కోవడాన్ని కేంద్రం ఆక్షేపించింది. సహజ వాయువును అక్రమంగా తోడుకున్నందుకు సుమారు 10 వేల 347 కోట్ల భారీ జరిమాన విధించింది. దీనిపై రిలయన్స్‌ సంస్థ న్యాయపోరాటం చేయబోతోంది. 
రిలయన్స్‌కు రూ.10,380 కోట్ల భారీ జరిమానా
ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు కేంద్రం పెద్ద షాకిచ్చింది. కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీ గ్యాస్ బ్లాక్ నుంచి అక్రమంగా సహజవాయువును లాగేసుకున్నట్టు రేగిన వివాదంలో 1.55 బిలియన్ డాలర్లు అంటే.. ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు రూ.10,380 కోట్ల భారీ జరిమానాను విధించింది. రిలయన్స్‌తో పాటు దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్ పెట్రోలియం, నికో రిసోర్సెస్‌కు కేంద్ర పెట్రోలియం శాఖ డిమాండ్ నోటీసులను జారీ చేసింది. ఓఎన్‌జీసీకి కేజీ బేసిన్‌లో కేజీ-డీడబ్ల్యూఎన్-98/2, గోదావరి పీఎంఎల్ పేరుతో చమురు-గ్యాస్ బ్లాక్‌లున్నాయి. ఇవి రిలయన్స్‌కు చెందిన కేజీ-డీ6 బ్లాక్ పక్కనే ఉన్నాయి. తమ బ్లాక్‌ల నుంచి గ్యాస్‌ను రిలయన్స్‌ లాగేసుకుంటోందని ఓఎన్‌జీసీ చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు కేంద్రం జస్టిస్ ఏపీ షా నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆగస్టు 29న ఇచ్చిన నివేదికలో రిలయన్స్‌ ఓఎన్‌జీసీ గ్యాస్‌ను అక్రమంగా తోడేసుకున్నది వాస్తవమేనని తేల్చిచెప్పింది.
338.33 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల గ్యాస్‌ తరలింపు 
ఓఎన్‌జీసీ బ్లాక్‌ల నుంచి గడిచిన ఏడేళ్లుగా రిలయన్స్‌ సుమారు 338.33 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల గ్యాస్‌ను తన బావుల ద్వారా తోడేసుకుందని కేంద్రం లెక్కతేల్చింది. దీనికిగాను 1.47 బిలియన్ డాలర్లను రిలయన్స్‌, బీపీ, నికోలు జరిమానాగా చెల్లించాలని, ఈ నెల 3న పెట్రోలియం మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. సంబంధిత కాలానికి వడ్డీ కింద మరో 149.86 మిలియన్ డాలర్లను కూడా జత చేసింది. అయితే, ఈ గ్యాస్‌పై రిలయన్స్‌ చెల్లించిన 71.71 మిలియన్ డాలర్ల రాయల్టీని తీసేస్తే మొత్తం జరిమానా 1.55 బిలియన్ డాలర్లుగా నిర్ధారించింది. రిలయన్స్‌ నుంచి రాబాట్టాల్సిన నష్టపరిహారం ఓఎన్‌జీసీకి కాకుండా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుందని షా కమిటీ సూచించడంతో దీనిపై ఓఎన్‌జీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. 
కేజీ డీ6 బ్లాక్ పరిధిలోనే ప్రభుత్వంతో ఒప్పందం
షా కమిటీ సిఫార్సులు, రిలయన్స్‌ నుంచి రాబట్టే పరిహారం ఓఎన్‌జీసీకి కాకుండా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుందన్న వాదనల నేపథ్యంలో దీనిపై ఆర్బిట్రేషన్ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క, తాము ఉద్దేశపూర్వకంగా పక్కనున్న ఓఎన్‌జీసీ బ్లాక్ నుంచి గ్యాస్‌ను తోడుకోలేదని.. తమ కేజీ-డీ6 బ్లాక్ పరిధిలోనే ప్రభుత్వంతో ఒప్పందం, అనుమతుల మేరకే బావులను తవ్వి గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నామని ఆర్‌ఐఎల్ వాదిస్తోంది. పీఎస్‌సీ ప్రకారం ప్రభుత్వం, కాంట్రాక్టర్ మధ్య ఎవైనా వివాదాలు తలెత్తితే ఆర్బిట్రేషన్ ద్వారానే పరిష్కరించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఐఎల్, భాగస్వామ్య సంస్థలు ఓఎన్‌జీసీ గ్యాస్ వివాదంలో కూడా ఆర్బిట్రేషన్‌ను మొదలుపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా ఓఎన్‌జీసీ గ్యాస్‌ను తోడుకోవడం సరికాదని సూచిస్తూ.. రిలయన్స్‌ సంస్థకు కేంద్రం షాక్‌నిచ్చింది. 

 

09:16 - November 5, 2016

కొరిమో గ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ లారెన్స్ చిరంజీవి మూవీపై కన్నేశాడు. మల్టీటాలెంటెడ్ పర్సన్ మెగాస్టార్ మూవీని రిమేక్ చేయబోతున్నాడట. ఇంతకీ లారెన్స్ రిమేక్ చేస్తున్న చిరంజీవి మూవీ ఏంటో మీరు ఓ లుక్కెయండి.
'గంగ'తో భారీ హిట్టు 
స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా డైరెక్టర్ గా కూడా సత్తా చూపిస్తున్నాడు. ముని సీరిస్ లైన కంచన, గంగ సినిమాలతో ఈ లారెన్స్ ఇటు నటుడిగా, డైరెక్టర్ తన టాలెంట్ చూపించాడు. గంగ సినిమాతో భారీ హిట్టు కొట్టిన మల్టీటాలెంటెడ్ ఇప్పుడు చిరంజీవి మూవీనే రిమేక్ చేయబోతుండడం విశేషంగా మారింది.
ముగ్గురు మొనగాళ్లు..
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ మూవీస్ లో ముగ్గురు మొనగాళ్లు ఒకటి. చిరు త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయమే సాధించింది. ఇందులోని మూడు క్యారెక్టర్లలో చిరు చూపించిన వైవిధ్యం.. ఆయన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా మెగా అభిమానుల్ని ఉర్రూతలూగించింది. ఈ సినిమాను ఇప్పుడు లారెన్స్ రీమేక్ చేయబోతున్నాడట. 
మూడు రకాల పాత్రల్లో లారెన్స్
ముగ్గరు మొనగాళ్లు సినిమా నిజానికి రజనీకాంత్ హీరోగా చేసిన మూండ్రు ముగమ్ కి రిమేక్ గా తెరకెక్కింది. ఇప్పుడు ఇదే చిత్రం రిమేక్ లో లారెన్స్ సైతం మూడు క్యారెక్టర్స్ లో తన మల్టీటాలెంట్ ని మరోసారి చూపించాలని ఆశపడుతున్నాడట. ఈ చిత్రానికి నిర్మాత కూడా లారెన్సేనట. అయితే దర్శకత్వ బాధ్యతలు మాత్రం వేరే దర్శకుడికి అప్పగిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాని ఇప్పటి జనరేషన్ కి తగ్గట్లగా డీల్ చేసే దర్శకుడి కోసం లారెన్స్ సర్చ్ చేస్తున్నాడట. గంగలో రెండు రకాల పాత్రలతో అదరగొట్టిన లారెన్స్ ఈ ముగ్గరు మొనగాళ్లు రిమేక్ లో మూడు రకాల పాత్రలతో అదుర్స్ అనిపిస్తాడేమో చూడాలి.

 

09:10 - November 5, 2016

సింగం 3గా రాబోతున్న సూర్య కొత్త చిత్రం స్టార్ట్ చేశాడు. చిన్న సినిమాతో పెద్ద హిట్టు కొట్టిన డైరెక్టర్ తో ఈ వర్సటైల్ స్టార్ న్యూ మూవీ అనౌన్స్ చేశాడు. సూర్య చేస్తున్న కొత్త మూవీ విశేషాలేంటో చూద్దాం...
24 సినిమాతో సూర్య సక్సెస్ 
ఆఫ్టర్ లాంగ్ టైం 24 సినిమా సూర్య సక్సెస్ చూశాడు. ఈ చిత్రం తమిళంలో కంటే తెలుగులోనే భారీ కలెక్షన్లను రాబట్టింది. 24విజయంతో రిలాక్స్ గా ఉన్న సూర్య సింగం 3తో బాక్సఫీసు వద్ద గర్జించడానికి సిద్ధంగా ఉన్నాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ మూవీ డిసెంబర్ 16న రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు సూర్య న్యూ మూవీ స్టార్ట్ చేశాడు.
సూర్య కొత్త మూవీ  
తానా సెరిందా కూట్టం అనే టైటిల్ తో సూర్య కొత్త మూవీ చేస్తున్నాడు. నాన్ రౌడీతో పెద్ద హిట్టు కొట్టిన విఘ్నేష్ శివన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో నేను రౌడీగా డబ్ చేసిన సంగతి తెలిసిందే. నాన్ రౌడీ మూవీ టేకింగ్ ఫిదా అయిన సూర్య ఈ దర్శకుడితో పని చేయాలని కోరికతో ఛాన్స్ ఇచ్చినట్లు వినిపిస్తుంది.    
హీరోయిన్ గా కీర్తి సురేష్  
ఈ కొత్త సినిమాలో సూర్య పక్కన కీర్తి సురేష్ ని హీరోయిన్  ఎంపిక చేశారు. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందట. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ఈ నెల రెండో వారంలో స్టార్ట్ కానునట్లు తెలుస్తుంది. జెస్ట్ త్రీ మంథ్స్ లో షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తుందట. 

 

కరీంనగర్ లో ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం...

కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు నిర్వాకం బయటపడింది. కాలు విరిగిందని కరీం అనే వ్యక్తి మక్స్యూర్ ఆస్పత్రికి వెళ్లాడు. గుండె బలహీనంగా ఉందని గత నెల 21న ఆరోగ్యశ్రీ కింద కరీంకు వైద్యులు ఆపరేషన్ చేశారు. అనార్యోగంతో ఆయన నిన్న మృతి చెందారు. మక్స్యూర్ ఆస్పత్రి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువుల డిమాండ్ చేస్తున్నారు. 

08:43 - November 5, 2016

దీపికపడుకొనే పద్మావతిగా మారుతుంది. పీకూగా వావ్ అనిపించిన ఈ లాంగ్ లెగ్స్ బ్యూటీ పద్మావతిగా మెస్మరైజ్ చేయడానికి రెడీ అయింది. త్రీబుల్ ఎక్స్ కోసం బాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చిన దీపిక లేటేస్ట్ గా బీటౌన్ లో మరో బిగ్ ఛాన్స్ పట్టేసింది. దీపికపడుకొనే చేయనున్న పద్మావతి మూవీ సంగతులేంటో చూద్దాం... 
మళ్లీ బీటౌన్ లో 
బాజీరావు మస్తానీ, పీకూ సినిమాలతో దీపికపడుకొనే బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంది. అయితే హాలీవుడ్ మూవీ త్రీబుల్ ఎక్స్ లో ఛాన్స్ రావడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలకు నో చెప్పింది. ఇప్పుడు త్రీబుల్ ఎక్స్ మూవీ కంప్లీట్ కావడంతో మళ్లీ బీటౌన్ లో తన జోరు చూపించడానికి రెడీ అవుతుంది.  
మరో వైవిధ్యభరితమైన చిత్రం
రామ్ లీల, పికూ, బాజీరావ్ మస్తానీ చిత్రాల్లో దీపికపడుకొనే డిఫరెంట్ రోల్స్ ప్లే చేసింది. ఈ మూవీస్ సక్సెస్ కావడంతో పాటు ఈ బ్యూటీకి నటిగా మంచి పేరు తెచ్చాయి. దీంతో తాజాగా ఈ భామ మరో వైవిధ్యభరితమైన చిత్రాన్ని అంగీకరించింది. పద్మావతి టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీకి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నాడు.
అందుకే అంగీకరించా..
రామ్ లీలా, బాజీరావు మస్తానీ తరువాత పద్మావతి కోసం సంజయ్ లీలా భన్సాలీతో సార్ తో వర్క్ చేయడం హ్యపీగా ఉందని చెప్పుతుంది. ఈ పాత్ర తనకి ఎంతో కొత్తగా అనిపించిందనీ, అందుకే అంగీకరించానని దీపికా సంతోష పడుతుంది. పద్మావతి సినిమాకి అదృష్టంగా భావిస్తుందట. ఈ సినిమాలోని పద్మావతి పాత్ర కోసం సంజయ్ లీలా భన్సాలీ ఊహించిన పాత్రకు 100పర్సెంట్ ట్రై చేస్తానని దీపిక చెప్పుతుంది.ఈ మూవీ ఏ నేఫథ్యంలో తెరకెక్కుతుందనే విషయంలో యూనిట్ క్లారిటి ఇవ్వలేదు.

 

'ది చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ' ఆధ్వర్యంలో జాతీయ బాలల చిత్రోత్సవం

హైదరాబాద్‌: నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని 'ది చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ'  జాతీయ బాలల చిత్రోత్సవాన్ని నిర్వహించనుంది. జైపూర్ వేదికగా ఈనెల 14 నుంచి 16 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో 40కి పైగా అవార్డ్ విన్నింగ్ చిత్రాలను ప్రదర్శించనున్నారు. దేశంలోని పలు ప్రాంతీయ చిత్రాలను ఫెస్టివల్‌లో భాగంగా స్క్రీన్ చేయనున్నట్లు సీఎఫ్‌ఎస్‌ఐ డైరెక్టర్ ముఖేష్‌ఖన్న తెలిపారు.

లారీ, వ్యాన్ ఢీ.. 14 మంది మృతి

గుజరాత్ : రాజ్ కోట్ సమీపంలోని బగోదర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, వ్యాన్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. 

07:55 - November 5, 2016

ఫీజు రియింబర్స్ మెంట్ నిధులను వెంటనే చెల్లించాలని వక్తలు అన్నారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, టీపీసీసీ నాయకురాలు ఇంద్ర శోభన్, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ పాల్గొని, మాట్లాడారు. విద్య, వైద్యం కార్పొరేట్ మయం అయిందన్నారు. న్యాయ వ్యవస్థపై కూడా కార్పొరేటీకరణ పెరిగిందని చెప్పారు. ప్రభుత్వాలు కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వమే అసలు ముద్దాయగా ఉందన్నారు. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

07:48 - November 5, 2016
07:47 - November 5, 2016

అమెరికా : మరో 3 రోజుల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఉత్కంఠను మరింత పెంచేస్తున్నాయి. అటు ట్రంప్.. ఇటు హిల్లరీ... కొన్నికొన్ని సందర్భాల్లో ఎవరి ఆధిక్యాన్ని వారు ప్రదర్శిస్తుండటం... ఎన్నికల వేడిని మరింత పెంచేస్తోంది. ఈ ఉత్కంఠకు సంబంధించి... అమెరికాలో ఒహియో రాష్ట్రం నుంచి ఎన్నికల స్ట్రాటజిస్ట్ హరీ కాసుల... టెన్‌ టీవీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాం... ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:40 - November 5, 2016

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. అధ్యక్ష ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే గడువుండడంతో ట్రంప్‌, హిల్లరీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. పోల్‌ సర్వేలలో వీరిద్దరి మధ్య తేడా స్వల్పంగానే ఉండడం గెలుపెవరన్నది ఉత్కంఠగా మారింది. అధ్యక్ష ఎన్నికలపై తెలుగు ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో అమెరికాలోని  మా టెన్‌టీవీ ప్రతినిధి శారద అందిస్తున్న వివరాలు మీకోసం...
నువ్వా... నేనా అన్నట్లు పోటీ 
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో డెమోక్రటిక్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, రిపబ్లికన్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నికల్లో గెలుపు కోసం నువ్వా... నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. 
తెలుగు ప్రజలు హిల్లరీ వైపే మొగ్గు 
అమెరికాలోని తెలుగు ప్రజల్లో అధికశాతం హిల్లరీ వైపే మొగ్గు చూపుతున్నారు. మహిళలను కించపరిచే ట్రంప్‌ పట్ల తమకు ఏమాత్రం గౌరవం లేదని, ట్రంప్‌ విధానాలు తమకు  నచ్చడం లేదని స్పష్టం చేశారు.  హిల్లరీ అనుభవజ్ఞురాలని కితాబిచ్చారు.
ట్రంప్ పై కొందరు మండిపాటు 
నవంబర్‌ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హిల్లరీ క్లింటన్‌కే వేస్తామని కచ్చితంగా మరికొందరు చెబుతున్నారు.  హిల్లరి మంచి గుణాల కన్నా ట్రంప్‌ చెడు గుణాల వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని టెన్‌టీవికి తెలిపారు. ట్రంప్‌ అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని..... మెక్సికన్లను డ్రగ్‌ ట్రాఫికర్లుగా, రేపిస్టులుగా, ముస్లింలను టెర్రరిస్టులుగా ట్రంప్‌ పోల్చడంపై మండిపడుతున్నారు. ట్రంప్‌ది బిజినెస్‌ మైండని, ఆయన ప్రజల కోసం సామాజిక సేవలు చేసిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. మూడు డిబేట్‌లలో హిల్లరీపై పర్సనల్‌ కామెంట్స్‌ చేశాడే తప్ప అమెరికాకు ఏం చేయాలన్న విధానాలు ట్రంప్‌ వద్ద లేవన్నారు.
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌ : తెలుగువాళ్లు  
ఇద్దరు అభ్యర్థుల ప్రచారాలను పోల్చుకున్నట్లయితే ట్రంప్‌ అప్రజాస్వామికంగా, దురహంకార పూరితంగా వ్యవహరిస్తున్నట్లు కనపడిందని తెలుగువాళ్లు చెబుతున్నారు. మహిళలు, మెక్సికన్లు, మైనారిటీల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సముచితం కాదు. ట్రంప్‌ ఫాసిస్ట్‌లా ప్రవర్తిస్తున్నారు. ఆయనను ఎన్నుకుంటే అమెరికా ఏమవుతుందోనన్న భయం తెలుగువాళ్లలో నెలకొంది. సెనెటర్‌గా... మంత్రిగా అనుభవం ఉన్న హిల్లరీని ఎన్నుకుంటేనే అమెరికాకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు. ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉందని, తాము ఎవరికి ఓటేస్తానన్నది ఇప్పుడే చెప్పలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 

 

07:32 - November 5, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్రమంగా కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని అపోలో ఎండీ ప్రతాప్‌ రెడ్డి ప్రకటించారు. జ‌య పూర్తిగా స్పృహ‌లోకి వ‌చ్చార‌ని, త‌న చుట్టు జ‌రుగుతున్న విష‌యాలు ఆమె గ్రహించగలుగుతున్నారని చెప్పారు. త‌న‌కు కావాల్సిన వాటిని ఆమె అడుగుతున్నార‌ని ప్రతాప్‌ రెడ్డి తెలిపారు. 2, 3 రోజుల్లో ఆమెను ఐసీయూ నుంచి ప్రత్యేకగదికి మార్చనున్నట్లు తెలిపారు. జయలలిత కోరితే 2, 3 వారాల్లో డిశ్చార్జ్‌ చేస్తామని కూడా ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. తీవ్రమైన జ్వరంతో... గత నెల 22నుంచి ఆమె ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 

07:30 - November 5, 2016

ఢిల్లీ : ఓఆర్‌ఓపి అమలు చేయకుండా మాజీ సైనికులను మోడీ ప్రభుత్వం మోసగిస్తోందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోడీ మాత్రం వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ అమలు చేసినట్లు ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. మీరు ఓఆర్‌ఓపి అమలు చేస్తే మాజీ సైనికులు జంతర్‌ మంతర్‌ వద్ద ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. 15 మంది పారిశ్రామిక వేత్తలకు లక్షా పదివేల కోట్లు కట్టబెట్టిన ప్రభుత్వం రైతులకు, సైనికులకు నయాపైసా ఇవ్వడం లేదని రాహుల్‌ దుయ్యబట్టారు. మాజీ సైనికులు రాహుల్‌ గాంధీని కలుసుకున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

 

నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన

కామారెడ్డి : నేడు జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. 
 

07:22 - November 5, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని అధికార పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నేడో, రేపో కొత్త కార్యవర్గాల నియామాకాన్ని ప్రకటించే అవకాశాలు ఉండటంతో నేతలు తమకు పదవులు దక్కుతాయో లేదా అన్న ఆందోళనలో ఉన్నారు. పాత జిల్లాల పరిధిలోని మంత్రులతో ఆశవాహులు లాబీయింగ్‌ నడుపుతున్నారు. 
టీఆర్‌ఎస్‌ కమిటీ ఎంపిక దాదాపు పూర్తి
పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన గులాబీ దళపతి.. కమిటీ ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తి చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ మొదటి వారంలో  కొత్త జిల్లాల ప్రకారం జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాలు, రాష్ట్ర కార్యవర్గాలను ప్రకటించేందుకు కేసీఆర్‌ ఇప్పటికే జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలో 10 జిల్లాలకుగాను 12 మంది అధ్యక్షులుండగా... ఇప్పుడు పెరిగిన కొత్త జిల్లాలతో జిల్లా అధ్యక్షుల సంఖ్య 31కి పెరుగుతోంది. దీంతో పాటు అన్ని జిల్లాల కార్యవర్గాలకు అనుబంధ సంఘాలను కూడా ఇప్పుడే  ఖరారు చేయాలనే అభిప్రాయంతో అధినేత ఉన్నారు. దీంతో ఒక్కో జిల్లాలో 114 మంది నేతలకు పదవులు దక్కడం ఖాయమైంది. జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవులకు మాత్రం పోటీ తీవ్రంగా నెలకొంది.
పాత జిల్లాల పరిధిలోనే కొత్త జిల్లాలు ఏర్పాటు 
పాత జిల్లా కమిటీలను దాదాపు యధావిధిగా కొనసాగిస్తూ... కొత్త జిల్లాలకు కొత్త అధ్యక్షులను సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకోని పూర్తి చేసినట్లు పార్టీ నేతలు అంటున్నారు. మెజార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తైందని, పార్టీ నేతల మధ్య తీవ్ర పోటీ ఉన్న జిల్లాల ఖరారుపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోవాల్సి ఉందన్న ప్రచారం జరుగుతోంది. పాత జిల్లాల పరిధిలోనే కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో మంత్రులుగా ఉన్నవారు జిల్లా అధ్యక్షుల పేర్లను ప్రతిపాదించారని తెలుస్తోంది. ఇటు రాష్ట్ర కమిటీ ఎంపికపై పార్టీ అధినేత త్రిసభ్య కమిటీని నియమించారు. ఆ కమిటీ తుది కసరత్తు పూర్తి చేసి... అధినేత ఆమోదం కోసం జాబితాను సమర్పించినట్లు తెలుస్తోంది.
రెండ్రోజుల్లో పార్టీ కార్యవర్గాల ప్రకటటన...?
ఇవాళ లేదా రేపు పార్టీ కార్యవర్గాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల అధ్యక్షుల పేర్లు ఖరారు కావడంతో వారంతా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. మరికొన్ని జిల్లాల్లోని నేతల్లో కూడా ఉత్కంఠ పెరుగుతుండటంతో... వారు కూడా పదవుల కోసం చివరి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

 

నేడు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

ఆదిలాబాద్ : నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగనుంది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, బోగు రామన్న పాల్గొన్నారు. 

 

07:09 - November 5, 2016

చిత్తూరు : కోట్లాది మంది భక్తుల కష్టాలు తీర్చే శ్రీ వేంకటేశ్వరస్వామికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆధిపత్యం కోసం జీయర్లు, వైష్ణవ అర్చకులు పోటీపడి శ్రీవారి నామాన్ని వివాదం చేస్తున్నారు. మా సాంప్రదాయ ప్రకారం నామాలు పెట్టాలని ఓ వర్గం అంటుంటే.. మా సాంప్రదాయం ప్రకారం నామాలు పెట్టాలని మరోవర్గం అంటోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలుస్తోంది. 
వివాదానికి కారణమైన నామాలు  
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రతి శుక్రవారం వేకువజామున శ్రీవారి మూలవిరాట్‌కు నిర్వహించే అభిషేక సేవ తర్వాత అలంకరించే నామాలు ఈసారి వివాదానికి కారణమైంది. 
స్వామివారికి 'వై' ఆకారంలో నామాలు
అభిషేక సేవ తర్వాత అలంకరణ సమయంలో స్వామివారికి 'వై' ఆకారంలో నామాలు పెడుతుంటారు. అయితే ఈ రోజు స్వామివారికి 'యూ' ఆకారంలో నామాలు పెట్టారని తోమాల సేవ నిర్వహించే జియ్యంగార్లు ఆరోపిస్తున్నారు. స్వామివారి కైంకర్యం నిర్వహించే రమణ దీక్షితులే 'యూ' ఆకారంలో నామాలు పెట్టారంటున్నారు. నామాల విషయంలో జీయర్లు, వైష్ణవ అర్చకుల మధ్య వివాదం శతాబ్ధాలుగా కొనసాగుతోంది. అయితే 18వ శతాబ్ధంలో అప్పటి నార్త్‌ ఆర్కాటు నవాబు ఈ వివాద పరిష్కారానికి.. వై, యూ నామాలు కాకుండా తమిళంలో 'ప' అక్షరం పోలిన నామాన్ని ఖరారు చేశారట. అయితే,.. మూలమూర్తికి మాత్రం వై ఆకారంలోనే నామాన్ని అలంకరిస్తున్నారని జీయర్లు అంటున్నారు. 
ఆలయ డిప్యూటీ ఈవో దృష్టికి వ్యవహారం  
అయితే రమణ దీక్షితులు నామాలు పెట్టిన వ్యవహారాన్ని జియ్యంగార్లు ఆలయ డిప్యూటీ ఈవో దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై జియ్యంగార్లు డిప్యూటీ ఈవోతో వాగ్వాదానికి దిగారు. తోమాల సేవ విధులకు హాజరుకాబోమని అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ విషయాన్ని డిప్యూటీ ఈవో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 
రమణదీక్షితులుకు నోటీసులు ఇచ్చే యోచనలో టీటీడీ 
ఈ వ్యవహారంలో రమణ దీక్షితులుకు టీటీడీ నోటీసులు ఇచ్చే యోచనలో ఉంది. గతేడాది కూడా రమణ దీక్షితులు కుమారుడు అభిషేకం సమయంలో శ్రీవారి నామాలు మార్చడంపై జియ్యంగార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రమణ దీక్షితులు కుమారుడిని ఆరు నెలల పాటు అభిషేక సేవలకు దూరంగా ఉంచారు. అయితే ఇప్పుడు రమణ దీక్షితులే స్వయంగా అభిషేక సేవలు నిర్వహించడంతో టీటీడీ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. 
కావాలని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు : రమణదీక్షితులు  
45 ఏళ్లుగా స్వామివారి కైంకర్యం నిర్వహిస్తున్న తనపై ఎలాంటి ఆరోపణలు లేవని.. ఇప్పుడే కావాలని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారంటున్నారు రమణదీక్షితులు. ఇప్పటికే తన మనవడిని శ్రీవారి గర్భాలయంలో తీసుకువెళ్లారని రమణ దీక్షితులు ఆలయ ఉన్నతాధికారుల నుంచి నోటీసులు అందుకున్నారు. ఆ వ్యవహారం సద్దుమణగకముందే మరో వివాదంలో ఇరుక్కున్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. 

 

నేడు ఎన్ టీఆర్ ట్రస్టు భవన్ లో ప్రధానమంత్రి కౌశల కేంద్రం ప్రారంభం

హైదరాబాద్ : ఎన్ టీఆర్ ట్రస్టు భవన్ లో ప్రధానమంత్రి కౌశల కేంద్రాన్ని కేంద్రమంత్రి దత్తాత్రేయ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎపి సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 

 

నేడు నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ పర్యటన

నెల్లూరు : నేడు జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

 

06:56 - November 5, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. పలువురు వైద్యులపై వేటు వేసింది. హైదరాబాద్‌లో నిఖిల్‌రెడ్డికి ఎత్తుపెంచుతామని ఆపరేషన్‌ చేసిన ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేసింది. గ్లోబల్‌ ఆసుపత్రి డాక్టర్ చంద్రభూషణ్‌పై రెండేళ్లు... సృష్టి బేబీ సెంటర్‌ డాక్టర్‌ నమ్రతపై ఐదేళ్లు.. జగిత్యాల డాక్టర్‌ మనోజ్‌కుమార్‌పై మూడేళ్లు సస్పెన్షన్‌ వేటు వేసింది. డాక్టర్‌ రాహుల్‌, హరికుమార్‌, మిన్హాజ్‌ జాఫర్‌లపై 6 నెలల వేటు వేసింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. డాక్టర్లు స్వామి, రాజేష్‌లపై పోలీసు విచారణకు ఆదేశించింది.

 

06:54 - November 5, 2016

ఢిల్లీ : జీఎస్టీ పన్నువసూలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ అంశంపై రెండో రోజు జరిగిన సమావేశం అసంతృప్తిగా ముగిసింది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. జీఎస్టీ ద్వారా పేదలపై భారం పడకుండా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఈటల కోరారు. సామాన్యులపై శ్లాబు రేట్లు లేకుండా ఉండాలని సూచించారు. 
పన్ను వసూలు విధానంపై విస్తృతంగా చర్చ
ముఖ్యంగా పన్ను వసూలు విధానం ఎలా ఉండాలనే దానిపై ఈ సమావేంలో విస్తృతంగా చర్చ జరిగింది. పన్ను వసూలపై మరింత స్పష్టత కోసం ఈ నెల 20వ తేదీన రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మళ్లీ సమావేశమవుతారు. ఆ రోజు జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 
ఆ సంస్థలను రాష్ట్రాలకే ఇవ్వండి : ఈటల
ఆచరణాత్మక పన్ను విధానంతో జీఎస్టీని సమర్ధవంతంగా అమలులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామని ఈటల తెలిపారు. కోటిన్నర ఆదాయమున్న సంస్థలను రాష్ట్రాల పరిధిలోకి తీసుకురావాలని సూచించామన్నారు. గతంలో కొన్ని వస్తువులపై పన్ను విధించినప్పటికీ ఆశించిన స్థాయిలో పన్ను కలెక్షన్లు రాలేదని... అందుకే అలాంటి వాటిపై పన్ను తగ్గించి అందరూ ట్యాక్స్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీని అమలు చేయాలని కేంద్రం ధృడ నిశ్చయంతో ఉందన్నారు. దీనిపై కేంద్రానికి, రాష్ట్రానికి ఎదురవుతున్న ఇబ్బందులను శాస్త్రీయకోణంలో పరిష్కరించాలని ఈటల తెలిపారు. 

 

06:50 - November 5, 2016

హైదరాబాద్ : సింగరేణి కార్మికుల కోసం సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత సింగరేణి కార్మికుల కలను నెరవేర్చారు.. వారసత్వ ఉద్యోగాలకు సీఎం అంగీకారం తెలిపారు. ఈ నిర్ణయంపై కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తూ... పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. సింగరేణి కార్మికలు కల నెరవేరింది. ఎన్నో సంవత్సరాల పోరాటానికి తెరపడింది. కార్మికుల కలను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 
సింగరేణి సంస్థ చారిత్రాత్మక నిర్ణయం 
సింగరేణి కార్మికులకు శుభవార్త. 15 ఏళ్ల తరువాత సింగరేణి సంస్థ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి సింగరేణి బోర్డు అంగీకరించింది. 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 58 ఏళ్ల వయసు కార్మికులు... వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు అర్హులు. ఉద్యోగాన్ని కార్మికుని కుమారుడు, అల్లుడు లేదా సోదరుడు పొందేందుకు అర్హులుగా నిర్ణయించారు. వారసత్వ ఉద్యోగాలు పొందే వారి వయసు 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలని బోర్డు తెలిపింది. ఈ నిర్ణయంపై సింగరేణి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
కార్మికులకు అనుకూలంగా నిర్ణయం 
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు గత 15 సంవత్సరాలుగా భర్తీ కావడం లేదు. ప్రస్తుతం సంస్థలో 58వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ ప్రకారం సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల వారసులు వారసత్వ ఉద్యోగాలకు అర్హులే..  దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.
కార్మికులు హర్షాతిరేకాలు
ప్రభుత్వం, సింగరేణి సంస్థ నిర్ణయంతో కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్సి సంబరాలు చేసుకున్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కి సింగరేణి కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.  

నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

కర్నూలు : నేడు సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారు. సిక్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా కాలేజీ మీదుగా కోల్స్ కాలేజీ వరకు పాదయాత్ర చేయనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 
డ్వాక్రా మహిళల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. 

 

నేటి నుంచి భారత్, బంగ్లా సైనిక విన్యాసాలు

ఢాకా : నేటి నుంచి భారత్, బంగ్లా సైనిక విన్యాసాలు జరుగనున్నాయి. సంప్రీతి 2016 పేరిట 5 నుంచి 18 వరకు విన్యాసాలు కొనసాగనున్నాయి. 

 

నేడు హైకోర్టు హౌసింగ్ ఎన్నికలు

హైదరాబాద్ : నేడు హైకోర్టు హౌసింగ్ ఎన్నికలు జరుగనన్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగున్నాయి. 9 మంది బోర్డు ఆప్ డైరెక్టర్ పోస్టుల కోసం ఎన్నిక జరుగనుంది. బరిలో 28 మంది అభ్యర్థులు ఉన్నారు. 

Don't Miss