Activities calendar

06 November 2016

రేపు బాబు ఢిల్లీ పర్యటన రద్దు ?

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు రేపటి ఢిల్లీ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ కావాల్సి ఉంది. రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళుతారని సమాచారం. 

ఢిల్లీలో మాస్క్ లకు పెరిగిన డిమాండ్..

ఢిల్లీ : దేశ రాజధానిలో మాస్క్ లకు డిమాండ్ పెరుగుతోంది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరిన సంగతి తెలిసిందే. 

21:31 - November 6, 2016
21:29 - November 6, 2016

అమెరికా : అధ్యక్ష పీఠం కోసం.. డొనాల్డ్‌ ట్రంప్‌ తన వద్దనున్న అన్ని ట్రంప్‌ కార్డులనూ ఉపయోగిస్తున్నారు. తాజాగా అమెరికాలోని భారతీయ ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ట్రంప్‌ తనయుడు ఎరిక్‌ ట్రంప్‌ తండ్రి వ్యూహాన్ని అమలు చేసే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగా.. ఎరిక్‌ ట్రంప్‌.. ఫ్లోరిడాలోని హిందూ దేవాలయాన్ని సందర్శించి.. హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం వరకూ సూటూబూటుతో వచ్చిన ఎరిక్‌.. ఆలయం వెలుపల.. భారతీయ సంప్రదాయ దుస్తులైన షెర్వాణీ ధరించి.. ఆలయంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్లోరిడాలోని సంపన్న హిందూ జనాభా అమెరికా ఎన్నికల్లో కీలక పాత్రను పోషించే దశకు చేరుకుంది. దీంతో వారి ఓట్లను ఆకర్షించేందుకు ఎరిక్‌ ట్రంప్‌ ఆలయ సందర్శన చేసినట్లు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు కానీ, వారి ప్రతినిధులు కానీ.. ఇలా నేరుగా ఇండియన్‌ అమెరికన్‌ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

21:28 - November 6, 2016

ఢిల్లీ : అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న నగరాల్లో కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం జనాన్ని భయపెడుతోంది. దీంతో మరో మూడు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మళ్లీ వాహనాలకు సరి-బేసి విధానాన్ని ప్రారంభించాలని ఆప్‌ సర్కార్‌ నిర్ణయించింది. దేశ రాజధానిలోని వాయు కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యాణాల్లో పంట పొలాల్లోని గడ్డిని దహనం చేస్తుండటంతో కొద్ది రోజులుగా ఢిల్లీలో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. సురక్షిత పరిమితికి మించి 17 రెట్లు ఎక్కువగా అక్కడి గాలి కలుషితం అవుతోంది. దీంతో సాధారణ జన జీవననానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాయు కాలుష్య నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని 1800 మున్సిపల్‌ పాఠశాలలు తెరుచుకోలేదు. మరో మూడు రోజులపాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మళ్లీ వాహనాలకు సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు వాయుకాలుష్యంపై కేంద్ర సాయం కోరారు.

పర్యావరణ మంత్రులతో సమావేశం..
అటు కేంద్రం కూడా పొరుగు రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో సమావేశం నిర్వహించింది. గడ్డి దహనాన్ని అడ్డుకోవాలని సమావేశంలో రాష్ట్రాలకు సూచించింది. ఢిల్లీలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి నెలకొందని.. దీనిపై సత్వర చర్యలు అవసరమని కేంద్రం భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. అక్కడి వాయుకాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఓ గ్యాస్‌ ఛాంబర్‌లా మారిపోయిందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినవి చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. వాహనాల వాడకం తగ్గించి పౌరులు ప్రజా రవాణాపై మొగ్గుచూపాలని కోరారు. 

21:26 - November 6, 2016

నెల్లూరు : కడుపులో వస్త్రాన్ని మరచి కుట్లు వేసిన... ప్రైవేట్ ఆస్పత్రి వైద్యురాలి నిర్వాకంపై బాధిత మహిళ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు.. అయితే డాక్టర్‌ మాత్రం రోగి బంధువులే తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.. డబ్బే ధ్యేయంగా పనిచేస్తున్న కొందరు వైద్యుల నిర్వాకం రోగులకు నరకయాతన మిగులుస్తోంది. నెల్లూరుకు చెందిన లక్ష్మీశ్రావణి కాన్పుకోసం సులోచనమ్మ నర్సింగ్‌హోంలో చేరింది. మూడు నెలల క్రితం ఆమెకు ఆపరేషన్‌ చేసిన వైద్యులు బిడ్డను బయటకు తీశారు. వారం రోజుల తర్వాత పేషంట్‌ను డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ తర్వాత లక్ష్మికి కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది. వారాలు గడుస్తున్నా నొప్పి తగ్గకపోగా మరింత పెరిగింది. నొప్పి తీవ్రం కావడంతో ఆమె సింహపురి ఆస్పత్రిలో మరో డాక్టర్‌ దగ్గర పరీక్ష చేయించుకుంది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు... ఆపరేషన్ సమయంలో కడుపులో వస్త్రంలాంటి వస్తువును మరచిపోయి కుట్లు వేశారని తేల్చారు. మళ్లీ ఆపరేషన్ చేసి బయటకు తీయాలని సూచించారు.

బిల్లు మొత్తం చెల్లిస్తామని ఆస్పత్రితో అగ్రిమెంట్‌..
వైద్యుల సలహాతో లక్ష్మి కుటుంబసభ్యులు టెన్షన్ పడ్డారు. ఈ విషయాన్ని మొదటి ఆపరేషన్ చేసిన డాక్టర్‌ సులోచనమ్మ దృష్టికితెచ్చారు. ఈ విషయంపై వెంటనే అప్రమత్తమైన ఆమె లక్ష్మికి చికిత్స అందిస్తున్న మరో ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి లక్ష్మికి వైద్యం ఖర్చు మొత్తం తానే చెల్లిస్తానని విషయం బయటకు చెప్పొద్దంటూ వారితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన వైద్యురాలు సులోచనమ్మ.. పొరపాటును అంగీకరిస్తూనే బాధితురాలి బంధువులే తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

చర్యలు తీసుకోవాలంటున్న బంధువులు...
అయితే డాక్టర్‌ ఆరోపణల్ని బాధితురాలి బంధువులు ఖండిస్తున్నారు. తమ బిడ్డ ఇంత బాధపడుతున్నా సులోచనమ్మ ఒక్కసారికూడా ఇటువైపు రాలేదని మండిపడుతున్నారు.. సులోచనమ్మ తీరుకు నిరసనగా ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ధనార్జనే ధ్యేయంగా డాక్టర్లు ఇలా రోగులకు నరకం చూపిస్తున్నా అధికారుల్లో ఏ మాత్రం చలనంలేదు. ఆస్పత్రులను పర్యవేక్షించాల్సిన అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు. నిఖిల్‌రెడ్డి వ్యవహారంలో తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ స్పందించిన తరహాలోనే.. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ కూడా.. సులోచనమ్మపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

21:23 - November 6, 2016

హైదరాబాద్ : ఎత్తు పెంపు కోసం ప్రమాదకరమైన శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డికి గ్లోబల్‌ ఆస్పత్రి వైద్యులు చికిత్స నిలిపివేశారు. నిఖిల్‌కు ఆపరేషన్‌ చేసిన వైద్యుడు చంద్రభూషణ్‌పై తెలంగాణ వైద్యమండలి వేటు వేసిన నేపథ్యంలో.. తమ కుమారుడికి చికిత్స అందించేందుకు గ్లోబల్‌ ఆస్పత్రి వైద్యులు నిరాకరిస్తున్నట్లు నిఖిల్‌ తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో కాళ్లకు ఇన్‌ఫెక్షన్‌ సోకి పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి పరిస్థితి అర్థం చేసుకుని తక్షణం చికిత్స ప్రారంభించాలని కోరుతున్నారు.

21:21 - November 6, 2016
21:20 - November 6, 2016

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వరుసగా మూడోసారి దావోస్‌ నుంచి ఆహ్వానం అందింది. గతంలో దావోస్‌ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో చంద్రబాబు వివిధ అంశాలపై ప్రసంగించారు. తాజాగా వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక 47వ వార్షిక సదస్సులోనూ ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు చంద్రబాబును కోరారు. ఈ మేరకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం మేనేజ్‌మెంట్ బోర్డు మెంబర్‌ ఫిలిప్‌ రోజియర్‌ చంద్రబాబుకు లేఖ రాశారు. స్పందించే బాధ్యతాయుత నాయకత్వం అనే అంశంపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. గతంలో జరిగిన రెండు వరుస సదస్సుల్లోనూ చంద్రబాబు.. ప్రపంచ దేశాల మంత్రులు, అంతర్జాతీయ సంస్థల అధిపతులను కలిసి రాష్ట్రానికి పెట్టుబడులను స్వాగతించారు. రక్షణ, వైమానిక, ఇంధన, ఆతిథ్య, వైద్య పరికరాల తయారీ, మౌలిక సదుపాయాల కల్పన, బహుళార్థ ఆర్థిక సంస్థలు, రవాణా, నౌకాయాన, ఐటీ సెక్టార్లలో ప్రపంచ దిగ్గజ సంస్థల అధిపతులతో ముఖ్యమంత్రి సమావేశాలు జరిపారు. ఆ సదస్సుకు మన దేశం నుంచి హాజరైన ఒకే ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రత్యేక గౌరవాన్ని పొందారు.

ఒక రోజు ముందే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యల వలయంలో కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో పరిష్కార మార్గాన్ని చూపేందుకు 2017 వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సు కీలకం కానుందని భావిస్తున్నారు. సమాజానికి ఆందోళన కలిగిస్తున్న సంక్లిష్టతల గురించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గురించి దావోస్ సదస్సు కీలక చర్చలు చేయనుంది. ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా రాష్ట్రానికి ప్రయోజనాలు రాబట్టాలని ప్రభుత్వం ఆశిస్తోంది. సదస్సుకు ఒక రోజు ముందే జ్యూరిచ్ వెళ్ళి అక్కడ అంతర్జాతీయ వాణిజ్య వేత్తలు, పెట్టుబడిదారులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపేందుకు.. పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

21:19 - November 6, 2016

విశాఖపట్టణం : ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకూ తమ పోరు ఆగదని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వెంకయ్య, చంద్రబాబులు.. చీకటి ఒప్పందాల కోసం ఏపీ ప్రజల భవిష్యత్‌ను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. తమకు ఉద్యమాలంటే వెరపు లేదని... జైళ్లంటే భయం లేదన్న జగన్‌.. అన్ని ప్రాంతాల్లో సభలు, యువభేరీలు పెట్టి.. హోదా పోరు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన 'జై ఆంధ్రప్రదేశ్‌' బహిరంగ సభలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరుపై వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు... కేసుల నుంచి బయటపడేందుకు 5 కోట్ల ప్రజల జీవితాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఘాటు విమర్శలు చేశారు.

రైల్వే జోన్ ఎందుకివ్వరు ?
విశాఖకు రైల్వే జోన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన జగన్‌ ఏ యాక్ట్ ప్రకారం గుజరాత్‌కు రైల్వే వర్సిటీ ఇచ్చారని ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం కూడా ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడా ప్రతిపాదించలేదన్నారు. శీతాకాల సమావేశాలలోపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించి... ఉప ఎన్నికలకు వెళ్తామన్నారు జగన్‌. ప్రత్యేక హోదా అంశాన్ని 2019 ఎన్నికల్లో రెఫెండంగా మార్చే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రం నంబర్ వన్ అవుతుందన్నారు. అరుణ్ జైట్లీ, వెంకయ్య, చంద్రబాబు కలిసి హోదా రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా కూడా టీడీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అన్న ఉద్యమానికి విశాఖ గడ్డ స్ఫూర్తినిచ్చిందని, అందుకే..ఈ గడ్డ మీద ప్రత్యేక హోదా ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందన్నారు జగన్‌. 

స్వామీజీల చేత గుడ్లు తినిపించాలి - గద్దె రాంమోహన్ గౌడ్..

విజయవాడ : ఎమ్మెల్యే గద్దె రాంమోహన్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్డు శాకాహారమేనని, దీనిపై చర్చ జరగాలని పేర్కొన్నారు. స్వామీజీలు గేదెల పాలు తాగినప్పుడు కోడి గుడ్డు ఎందుకు తినరని ప్రశ్నించారు. ముందు స్వామీజీల చేత గుడ్లు తినిపించాలని, స్వామీజీల చేత గుడ్డలను శాకాహారంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. 

20:13 - November 6, 2016

పోరాటాలకు సానుకూల వాతావరణం - మధు..

గుంటూరు : రైతులు కూలీలు, కార్మికుల పోరాటాలకు సానుకూల వాతావరణం ఏర్పడుతోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. పరిశ్రమలు తమకొద్దంటూ ప్రజలు మొత్తుకుంటున్నా బలవంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారని తెలిపారు. స్థానికుల వ్యతిరేకతను అభివృద్ధి నిరోధకం అనుకుంటే చంద్రబాబుది పొరపాటేనన్నారు. 

19:56 - November 6, 2016

నల్గొండ : అధికార పార్టీలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి ఆయన. పైకి చాలా గుంభనంగా కనిపించినా.. తెర వెనక మంత్రాంగం నడిపించడంలో దిట్ట. సీపీఎంలో రాజకీయ ఓనమాలు నేర్చుకుని.. టీడీపీ, కాంగ్రెస్ లలో వివిధ పదవులు అనుభవించి.. ప్రస్తుతం టీఆర్‌ఎస్ పంచన చేరారు. రెండు రోజులుగా ఆయన మళ్లీ పార్టీ మారనున్నారని ప్రచారం ఊపందకుంది. ఇంతకు ఎవరాయన? ఆయన కథేంటి? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.. గుత్తా సుఖేందర్ రెడ్డి.. సీనియర్ పార్లమెంటేరియన్. వార్డు మెంబర్ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. వివిధ పదవులు అనుభవించి.. ప్రస్తుతం మూడవ సారి నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తిగా.. జంపింగ్ జపాంగ్ గా కూడా ఆయన గురించి రాజకీయవర్గాల్లో చర్చించుకుంటారు.

1980లో...
1980లో సీపీఎం నుంచి ఉరుమడ్లలో వార్డు సభ్యునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గుత్తా.. ఆ తర్వాత నాటి అధికార పార్టీ టీడీపీలో చేరి వివిధ పదవులు అనుభవించారు. 2009 సాధారణ ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా నల్లగొండ పార్లమెంట్ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో టీడీపీ నుంచి గుత్తా ఆ స్థానం ఆశించి భంగపడ్డారు. దీంతో రాత్రికి రాత్రి పార్టీ మార్చి.. తెల్లారేసరికి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగి గెలుపొందారు. 2014లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో 16వ లోక్ సభకు ఎన్నికయ్యారు.

మళ్లీ కాంగ్రెస్ లోకి ? 
ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ప్రభంజనంతో చాలాచోట్ల కాంగ్రెస్ ఓడిపోయినా.. నల్లగొండ నుంచి గుత్తా గెలిచి సత్తా చాటారు. ఆ తర్వాత వివిధ అంశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించి విజయం సాధించారు. పార్టీ ఫిరాయింపులపై, టిఆర్ఎస్ ఆకర్ష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే పలు సందర్భాలలో టీఆర్‌ఎస్ లో చేరుతున్నారా అన్న ప్రశ్నను తీవ్రంగా ఖండించారు. కానీ అనూహ్యంగా నాలుగు నెలల క్రితం టీఆర్‌ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. ఇదంతా పక్కన ఉంచితే రెండు, మూడు రోజులుగా గుత్తా మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతారంటూ జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుంది. నాలుగు రోజుల క్రితం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి వెళ్లి.. అక్కడ సీఎల్పీ నేత జానారెడ్డిని కలవడంతో ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. టీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలో మంత్రి పదవి ఇస్తారని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. అయితే పార్టీలో చేరిన తర్వాత గుత్తాకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే కాంగ్రెస్‌ గూటికి వెళ్లాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఖండించిన గుత్తా...
అయితే ఈ ఆరోపణలను గుత్తా సుఖేదంర్ రెడ్డి ఖండించారు. తాను టీఆర్‌ఎస్‌లోనే ఉంటానని స్పష్టంచేశారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోనని తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీ నేతగా చెలామణి అవుతున్న గుత్తా ఆత్మాభిమానం గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని రాజకీయ ప్రత్యర్థులు ఘాటుగానే విమర్శిస్తున్నారు. అయితే గుత్తా నిజంగా పార్టీ మారుతారా.. లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. 

19:43 - November 6, 2016

మహబూబ్ నగర్ : సీపీఎం మహాజన పాదయాత్రకు కాంగ్రెస్‌ నేత చిన్నారెడ్డి మద్దతు ప్రకటించారు.. రోజుకు కాస్త దూరం నడిస్తేనే అలసిపోతామని... అలాంటిది తెలంగాణలో పాదయాత్ర బృందం 4వేల కిలోమీటర్లు నడవబోతోందని ప్రశంసించారు.. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా అంకితభావంతో సీపీఎం బృందం పర్యటిస్తోందని చెప్పుకొచ్చారు.. సీపీఎం ఒక సిద్దాంతానికి కట్టుబడిన పార్టీ అని కితాబిచ్చారు.. వనపర్తి జిల్లాలో పాదయాత్ర బృందాన్ని చిన్నారెడ్డి కలుసుకున్నారు.. 

19:40 - November 6, 2016

జయశంకర్ : ప్రొఫెసర్ జయశంకర్‌ జిల్లాలో టీడీపీ రైతు పోరు యాత్ర కొనసాగుతోంది. యాత్రలో సమస్యలను ప్రజలు తమ ముందు వెళ్లబోసుకుంటున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:36 - November 6, 2016
19:35 - November 6, 2016

విజయవాడ : ఆకతాయి వేధింపులు తట్టుకోలేక విజయవాడలో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని... ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. విజయవాడ మొఘల్రాజపురంలో నివస్తున్న ఓ వివాహితను అదే ప్రాంతంలో ఉంటున్న కోటేశ్వరరావు అలియాస్‌ చిట్టి అనే వ్యక్తి కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ మహిళ తన భర్తకు చెప్పి.. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

మళ్లీ వేధింపులు...
అయితే.. చిట్టి సమీప బంధువు మాచవరం పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండటంతో ఆయన ఒత్తిడితో పోలీసులు కేవలం చిట్టిని మందలించి వదిలిపెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న చిట్టి మళ్లీ ఆ వివాహితను వేధించడం మొదలుపెట్టాడు. సెల్‌ఫోన్‌కు అసభ్య మెసేజ్‌లు పెడుతూ బెదిరిస్తున్నాడు. ఇదేమని ప్రశ్నించిన బాధితురాలి భర్తపై కూడా చిట్టి దౌర్జన్యానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి కూడా చిట్టి నుంచి ఫోన్‌లో వేధింపులు రావడంతో... ఇంట్లో ఎవరూలేని సమయంలో వంటగదిలోకి వెళ్లిన బాధితురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాచవరం పోలీసులు.. పరారీలో ఉన్న చిట్టి కోసం గాలిస్తున్నారు. గతంలోనే చిట్టిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడు తమ బిడ్డకు ఈ గతి పట్టేదికాదని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

19:33 - November 6, 2016
19:21 - November 6, 2016

విశాఖపట్టణం : టీడీపీ రెండేళ్ల పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. బాబు పాలనలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయని జగన్‌ ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్‌ బహిరంగ సభలో ప్రభుత్వంపై జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని చెప్పిన బీజేపీ తర్వాత మాట మార్చిందన్నారు. విభజనతో రాష్ట్రం ఏం నష్టపోయింది, రెండున్నరేళ్లలో రాష్ట్రం అభివృద్ధి సాధించిందా? లేదా? అని ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు, కార్మికులు, రైతు కూలీలు, డ్వాక్రా సంఘాల సభ్యులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరూ సంతోషంగా లేరన్నారు వైఎస్‌ జగన్‌. విభజన హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కనీసం ప్రశ్నించలేకపోతోందన్నారు. ఎన్నికల హామీల అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తానన్న చంద్రబాబు.. కరవుప్రదేశ్‌, ఆత్మహత్యలప్రదేశ్‌గా మార్చేశారని వైఎస్‌ జగన్‌ అన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని.. రైతుల అప్పుల అంశంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉందని నివేదికలే చెబుతున్నాయన్నారు.

పోడు రైతుల భూమలపై అధికారుల దాడులు..

భూపాల్ పల్లి : ఏటూరు నాగారం (మం) చిన్న బోయినపల్లిలో పోడు రైతుల భూములపై అటవీశాఖాధికారులు దాడులు నిర్వహించారు. రైతుల పంటలను అటవీ శాఖాధికారులు ధ్వంసం చేశారు. అక్బర్ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. రైతులు..అటవీశాఖాధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

బీదర్ లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ సూసైడ్..

కర్నాటక : బీదర్ లో గురు నానక్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని వద్ద సూసైడ్ నోట్ లభ్యమైనట్లు తెలుస్తోంది. స్నేహితులు డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని నోట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

18:33 - November 6, 2016

రాజమండ్రి : టిడిపి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు రాజమండ్రిలో ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదని మాజీ ఎంపీ మిడియం పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ రాజమండ్రిలో సీపీఎం పాదయాత్ర నిర్వహించింది. 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా మిడియం బాబురావు మీడియాతో మాట్లాడారు. ఇటీవలి కాలంలో పౌర సదుపాయాల పేరిట పన్నులు పెంచుతున్నారని, ఇది అర్ధరహితమన్నారు. అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీ పేరిట బూచీ చూపిస్తున్నారని విమర్శించారు. 

18:16 - November 6, 2016

కేజీ సెక్టార్ లో పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పాక్ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా కేజీ సెక్టార్ పైకి కాల్పులకు తెగబడింది. ఒక జవాన్ వీరమరణం పొందగా ఓ మహిళ గాయపడింది. 

17:31 - November 6, 2016

విశాఖపట్టణం : ప్రత్యేక హోదాపై వైసీపీ పోరాటం వీడడం లేదు. సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీ రాష్ట్రంలో ఆరు బహిరంగసభలు పెట్టి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని యోచిస్తోంది. అందులో భాగంగా విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రసంగించారు. తాను ప్రసంగంతో ఊదరగొట్టడానికి రాలేదని, ఆవేదనను పంచుకోవడానికి వచ్చానన్నారు. కొన్ని ప్రశ్నలు..ఆలోచనలతో ఇక్కడకు రావడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన వల్ల లాభ పడ్డామా? నష్టపోయామా ? అనేది ఆలోచించాలన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెండున్నర సంవత్సరాలలో ఏదైనా లాభం జరిగిందా ? నష్టపోయిన పరిస్థితుల్లో ఉన్నామా ? అనేది ఆలోచించాలన్నారు. 'పిల్లలను చదివించాలని..చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని..ఉండటానికి ఇళ్లు..జబ్బు వస్తే వైద్యం అందాలని..వృద్ధులైన తండ్రిదండ్రులకు అండదండలు అందాలని..ఆదాయం తగ్గకుండా ఉండాలి'..ఇలాంటి కోరికలు ప్రతి మనిషి కోరుకుంటారని పేర్కొన్నారు. ఈ కోర్కెలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. గడిచిన కాలంలో భారీ పరిశ్రమలు ఎన్ని వచ్చాయి ? ఎస్సీ, ఎస్టీ సోదరుల భూమలకు రక్షణ ఉందా ? పక్కా ఇళ్లు వచ్చాయా ? ఎన్నికల హామీలు నెరవేర్చారా ? వడ్డీ లేని రుణాలున్నాయా ? డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేశారా ? బెల్టుషాపులు తగ్గాయా ? ప్రత్యేక హోదా వచ్చిందా ? లాంటి ప్రశ్నలు జగన్ లేవనెత్తారు. 

ప్రసంగిస్తున్న జగన్..

విశాఖపట్టణం : వైసీపీ ఆధ్వర్యంలో జై ఆంధ్రప్రదేశ్ బహిరంగసభ జరుగుతోంది. సభలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రసంగిస్తున్నారు. రెండున్నర సంవత్సరాలలో ఏదైనా లాభం జరిగిందా ? నష్టపోయిన పరిస్థితుల్లో ఉన్నామా ? అనేది ఆలోచించాలని జగన్ సూచించారు. 

వనపర్తిలో మహాజన పాదయాత్ర..

మహబూబ్ నగర్ : సీపీఎం మహాజన పాదయాత్ర వనపర్తికి చేరుకుంది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల ప్రజలు బృందానికి ఘన స్వాగతం పలికారు. పాదయాత్రకు కాంగ్రెస్, టిడిపి, వైసిపి, సినీ నిర్మాత మాదల రవి సంఘీభావం తెలిపారు. 

వైభవంగా చిన జీయర్ షష్టిపూర్తి..

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో త్రిదండి చిన జీయర్ స్వామి షష్ట్యాబ్ది ఉత్సవం వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు,
తెలంగాణ సీఎం కేసీఆర్ లు పాల్గొననున్నారు. 

సభా ప్రాంగణానికి చేరుకున్న జగన్..

విశాఖపట్టణం : 'జైఆంధ్రప్రదేశ్' సభా ప్రాంగణానికి వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జై ఆంధ్రప్రదేశ్ పేరిట బహిరంగసభ జరుగుతున్న సంగతి తెలిసిందే. 

స్కూటీలను అందించిన సీఎం మఫ్తీ...

జమ్మూ కాశ్మీర్ : బారాముల్లాలో సీఎం మహబూబా మఫ్తీ విద్యార్థినిలకు స్కూటీలను అందించారు. సీఎం స్కూటీ స్కీం పథకం కింద సీఎం మఫ్తీ వీటిని అందించారు. 

ఇండియా గేట్ వద్ద జేఎన్ యూ విద్యార్థుల ఆందోళన..

ఢిల్లీ : ఇండియా గేట్ వద్ద ఆందోళన చేస్తున్న జేఎన్ యూ విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి నజీమ్ అహ్మద్ అదృశ్యంపై వారు ఆందోళన చేపట్టారు. 

15:52 - November 6, 2016

డబుల్ డెక్కర్ రైలులో సాంకేతిక లోపం..

కర్నూలు : తిరుపతి - కాచిగూడ డబుల్ డెక్కర్ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. డోన్ రైల్వే స్టేషన్ లో రెండు గంటలుగా రైలు నిలిచిపోయింది. ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. 

15:42 - November 6, 2016

విజయవాడ : మావోయిస్టు నేత ఆర్కే తమ వద్ద లేడనే విషయాన్ని కోర్టుకు తెలిపామని ఏపీ డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. పోలీసులపై బురదజల్లడం మావోయిస్టులకు అలవాటే అన్నారు. మావోయిస్ట్‌లది మొదటి నుంచి ప్రతికార ధోరణే అన్నారు. ఆయుధాలు లేకుండా చర్చలకు రమ్మని మావోయిస్టలును కోరుతున్నామని చెప్పారు. గాయపడిన మావోయిస్ట్‌లు లొంగిపోతే పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తామన్నారు. కటాఫ్ ఏరియాలో వారం కిందటే బలగాలను ఉపసంహరించుకున్నామని చెప్పారు. 

15:32 - November 6, 2016

విజయవాడ : టీడీపీ నేతలు తెలివి తక్కువ వాళ్లా? మోసగాళ్లా? చెప్పాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ పార్టీలు ప్రజలను ఇంకా మోసం చేస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదావల్ల ఉపయోగాలేంటో సీఎం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. హోదాపై పవన్‌, జగన్‌ నిజాయితీగా పోరాడాలని సూచించారు. విజయవాడలో రష్యన్‌ విప్లవ శత వార్షికోత్సవ ప్రారంభసభలో రాఘవులు పాల్గొన్నారు. ఏడాదిపాటు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రకటించారు. 

సీఎం బాబుకు ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు ఆహ్వానం..

విజయవాడ : దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 17 నుండి 20వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది. జెనివాలో పర్యటిస్తున్న ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి ముఖ్యకార్యనిర్వాహక అధికారికి ఆహ్వాన లేఖను అందచేశారు. 

కృష్ణాలో వైసీపీ ఖాళీ అవుతోంది - మంత్రి దేవినేని..

విజయవాడ : కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోందని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. జిల్లాలో మరో ముగ్గురు వైసీపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారని, కొడాలి నాని భాషా సరిగ్గా లేనందునే ఛైర్మన్లు, కౌన్సిలర్లు టిడిపిలో చేరారని తెలిపారు. 

ఆర్కే తమవద్ద లేడనే విషయం కోర్టుకు తెలిపాం - డీజీపీ..

విజయవాడ : ఆర్కే తమ వద్ద లేడనే విషయాన్ని కోర్టుకు తెలియచేయడం జరిగిందని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. పోలీసులపై బురదజల్లడం మావోయిస్టులకు అలవాటేనని, మావోయిస్టులదరి మొదటి నుండి ప్రతీకార ధోరణేనని తెలిపారు. ఆయుధాలు లేకుండా చర్చలకి రమ్మంటున్నట్లు గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే పూర్తిస్థాయి చికిత్స అందిస్తామన్నారు. కటాఫ్ ఏరియాలో బలగాలను ఉపసంహరించుకున్నట్లు, ఏవోబీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ప్రజాప్రతినిదులకు అదనపు భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 

రాష్ట్రపతిని కలవనున్న కేజ్రీవాల్..

ఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలువనున్నారు. జేఎన్ యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యంపై రాష్ట్రపతి దృష్టికి తేనున్నారు. 

14:57 - November 6, 2016
14:54 - November 6, 2016

ఇటీవల దళిత బహుజన కవులు అద్భుత సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. నల్గొండకు చెందిన భూతం ముత్యాలు దళిత తాత్వికతతో నవలలు కవితా సంపుటాలు వెలువరించారు. ఆయన రాసిన దళిత బహుజన సాహిత్యాన్ని విశ్లేషిస్తున్నారు ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:50 - November 6, 2016

సాహిత్యం సమాజానికి అద్దం పడుతుంది. సామాజిక చరిత్రకు అక్షర రూపమిస్తుంది. అంతేకాదు ప్రజలను చైతన్య ప్రవాహాలుగా మారుస్తుంది. అలాంటి సాహిత్యాన్నిసృష్టించిన కవులు రచయితలు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఇటీవలే ప్రతిష్టాత్మకమైన మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు పొందిన అమెరికా రచయిత పాల్ బెయిటీ ప్రత్యేక కథనంతో పాటు, దళిత బహుజన కవి, భూతం ముత్యాలు ధిక్కార స్వరంతో ఈ వారం మీ ముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం.
'ద సెల్ అవుట్' నవలకు బుకర్ ప్రైజ్
ప్రపంచంలో ఏ రచయితకైనా తీరని కల అంటూ ఉంటే అది నోబెల్ ప్రైజ్ లేక కనీసం బుక్కర్ ప్రైజ్ పొందాలని ఉంటుంది. అయితే అదంత సులభ సాధ్యం కాదు. కాని అమెరికాకు చెందిన నల్లజాతి వ్యంగ్య రచయిత పాల్ బెయిటీ ఈ ఏడాది బుకర్ ప్రైజ్ కు ఎంపికయ్యాడు. అతడు రాసిన ద సెల్ అవుట్ నవలకు ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ లభించింది. అమెరికాలో నల్లజాతీయులపై పోలీసులు జరుపుతున్న దాష్టీకాలను, ఇప్పటికీ నల్లజాతీయులను బానిసలుగా భావిస్తున్న వైనాన్ని ఆయన తన నవలలో ఎండగట్టాడు. సాహిత్యంలో 2016 బుకర్ ప్రైజ్ గ్రహీత పాల్ బెయిటీ పై 10 టి.వి.ప్రత్యేక కథనం.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

14:49 - November 6, 2016

హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రి అప్రతిష్ఠపాలవుతోంది. ఆసుపత్రి పరిపాలనా అంతా నా ఇష్టం అంటూ దవాఖానాను భ్రష్టు పట్టిస్తున్నాడు ఇక్కడి సూపరింటెండెంట్‌. అధికారంలో ఉన్న ఓ చోటా నాయకుని అండతో రెచ్చిపోతున్నాడు. సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆగడాలపై 10 టీవీ ప్రత్యేక కథనం..! సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గమైన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఏరియా ఆసుపత్రిలో రోజు రోజుకు ఆగడాలు ఎక్కువపోతున్నాయి. ఆస్పత్రిలో అంతా తన ఇష్టం ప్రకారమే పరిపాలన జరగాలంటూ రోగులను, వైద్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. టీఆర్‌ఎస్ పార్టీలోని ఓ చోట నాయకునికి దగ్గర బంధువు కావడంతో మరింత రెచ్చిపోతున్నాడు. ఇతనే ఆ ప్రబుద్ధుడు...ఆస్పత్రి సూపరింటెండెంట్‌ గూడూరి రవీందర్.

అధికారులు మందలించినా మారని తీరు...
నాలుగు నియోజక వర్గాల ప్రజలకు ఈ ఆసుపత్రే దిక్కు. ప్రతిరోజు సుమారు రెండు వందల మంది రోగులు ఆస్పత్రికి వస్తారు. అలాంటి ఈ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ వైఖరితో రోగులు, వైద్యసిబ్బంది నానాఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవలు అందించాల్సిన వైద్యుడిని పక్కన పెట్టి మరీ ఇతనే ఆపరేషన్‌లు చేస్తున్నాడు. దీంతో ఆ వైద్యుడు ఆ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా అతనిపై దాడి చేసి.. ఆస్పత్రి నుంచి వేరే చోటికి బదిలీ చేయించాడు. శవాలను తరలించేందకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన శవపేటికలను సైతం గూడూరి రవీందర్ అమ్ముకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతటితో ఆగకుండా ఆస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే విమర్శలున్నాయి.

అనేక ఫిర్యాదులు...
సూపరింటెండెంట్‌ నిర్వహకంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులందాయి. దీంతో ఇతన్ని అధికారులు ఎన్నిసార్లు మందలించినా తీరు మార్చుకోవడం లేదు. ఆస్పత్రిలోని పరికరాలను రవీందర్‌ అమ్ముకునేందుకు ఆటోలో తరలిస్తుండగా టెన్ టీవీ కెమెరాకు ఆ దృశ్యాలు చిక్కాయి. దీనిపై సూపరింటెండెంట్‌ నిలదీయగా తనకి ఏం తెలియదని బుకాయించాడం అతనికే సొంతం.. ఇప్పటికైనా సూపరింటెండెంట్‌ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. 

14:43 - November 6, 2016

శ్రీకాకుళం : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించారు...అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. ఆఘమేఘాల మీద గ్రానైట్ కొండ తవ్వకాలకు అనుమతులు ఇచ్చి అమాయక గిరిజనుల బ్రతుకులను అతలాకుతలం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చాపరాయి కొండ గనుల లీజుపై టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై10 టీవీ ప్రత్యేక కథనం..! శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని చాపరాయి కొండ ఇది. దీనిపై కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉండటం ఇక్కడి గిరిజనులకు శాపంగా మారింది. తాత ముత్తాతల కాలం నుంచి చాపరాయి కొండను జీవనాధారంగా చేసుకుని వందలాది గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 2004, 2009 సంవత్సరాల్లో డిజైనర్ రాక్స్ సంస్థ చాపరాయికొండపై ఉన్న విలువైన గ్రానైట్ నిక్షేపాల తవ్వకాల కోసం అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఎన్ వోసీ ఇచ్చే తరుణంలో గిరిజనులు ఆగ్రహాం వ్యక్తం చేయడం, లోకాయుక్తలో కేసు వేయడం లాంటి పరిణామాలతో లీజు ఆగిపోయింది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ... గ్రానైట్ తవ్వకాలను పూర్తిగా వ్యతిరేకించింది. ప్రస్తుతం వీరన్న దొర అనే వ్యక్తి లీజు అనుమతులకు దరఖాస్తు చేసుకోవడం...టీడీపీకి చెందిన బడా నేతలు ప్రోత్సహించడంతో రెవెన్యూ, గనుల శాఖ అధికారులు ఎన్ వోసీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై గిరిజనులు ఆగ్రహాం వ్యక్తం చేస్తునారు.

గ్రానైట్ ప్రతినిధులు, వాహనాలను అడ్డుకున్న గిరిజనులు..
అధికారులు ఇంకా పూర్తిస్థాయిలో అనుమతులు ఇవ్వకముందే... చాపరాయి కొండపై గ్రానైట్ శాంపిల్స్ సేకరించడానికి పాతపట్నం మండలం బగంతర గ్రామానికి మిడ్‌నెస్ట్ గ్రానైట్ ప్రతినిధులు వచ్చారు. దీంతో గ్రామస్తులు ఏకమై గ్రానైట్ ప్రతినిధులను, వారి వాహనాలను అడ్డుకున్నారు. ఈ కొండపై ఎన్నో రకాల ఔషధ మెక్కలతో పాటు కంది, కొర్రలు, సాములు, గంటిలు, జనుము, చోడి, పసుసు, అల్లం లాంటివి గిరిజనులు సాగుచేస్తున్నారు. అరటి, మామిడి, జీడీ, ఫైనాపిల్, పనస పంటలు సైతం పండిస్తున్నారు. చాపరాయి కొండపై గ్రానైట్ నిక్షేపాల త్వవకాల కోసం అనుమతులు ఇస్తే ఏళ్ల తరబడి ఇక్కడ జీవిస్తున్న తమ మనుగడుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాపరాయి కొండను లీజుకు ఇస్తే సహించమంటూ ఇప్పటికే తహీశీల్దార్, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు.

గిరిజనుల పోరాటానికి సీపీఎం మద్దతు..
బాధితుల పక్షాన సీపీఎం అండగా నిలుస్తోంది. సర్వే నెంబర్ 255, ఇతర చాపరాయి కొండలో నీలిగ్రానైట్ నిక్షేపాలు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తే... మరో కన్నెధార పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చాపరాయి కొండ విషయంలో పునరాలోచించుకోవాలని గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. 

14:38 - November 6, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ముప్పు తప్పదా? వారిపై అనర్హత వేటు పడటం ఖాయంగా కనిపిస్తోందా? సుప్రీం కోర్టు స్పీక‌ర్‌కు ఇచ్చిన గ‌డువు ద‌గ్గర ప‌డుతుండ‌టంతో.. సభాపతి ఏం చెబుతారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ విషయంలో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం వెల్లడించినా.. సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని హస్తం పార్టీ నేతలు ఎందుకు భావిస్తున్నారు. టిఆర్ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో గులాబీ గూటికి చేరిన హస్తం పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. వీరిపై అనర్హత వేటు కోసం కాంగ్రెస్ పార్టీ పట్టుబిగించడం వారిలో కలవరం రేపుతోంది. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై వేటు వేయాల‌ని స్పీక‌ర్ మ‌ధుసూధ‌నాచారికి టీ కాంగ్‌ నేతలు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టునూ ఆశ్రయించారు. ఫ‌లితం లేకుండా పోవ‌డంతో సుప్రీం కోర్టు గడపతొక్కారు. ఈ పిటిషన్‌పై విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసి..నవంబర్ 8 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

స్పీకర్‌ ఏం చెబుతారన్న అంశంపై ఉత్కంఠ..
సుప్రీం కోర్టుకు వివరణ ఇవ్వాల్సిన గడువు ముంచుకొస్తుండటంతో.. ఇప్పుడు స్పీకర్‌ ఎలా రెస్పాండవుతారన్నది హాట్‌ టాఫిక్‌గా మారింది. ఎప్పటిలోగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చర్యలు తీసుకుంటారో కోర్టుకు చెప్పాల్సి ఉంది. ఇప్పటికే స్పీక‌ర్ కార్యాల‌యం సదరు ఎమ్మెల్యేల‌కు నోటీసులు జారీ చేసింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగానే స్పీకర్‌ తన నిర్ణయాన్ని వెల్లడించడంలో జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సుప్రీంలో కేసు ఉన్నందునా ఎక్కువ గడువు కోరకుండా త్వరలోనే తన నిర్ణయాన్ని స్పీకర్‌ ప్రకటిస్తారని భావిస్తున్నారు.

నష్టం లేదన్న భావనలో నేతలు..
స్పీకర్‌ అనుకూలంగా లేదా ప్రతికూలమైన నిర్ణయం తీసుకున్నా..త‌మ‌కు న‌ష్టం లేద‌న్న భావ‌న‌లో కాంగ్రెస్ నేత‌లు ఉన్నారట. గ‌తంలో ఒడిశాలో బిష్నోయ్య కేసును ఉద‌హ‌రిస్తున్నారట. రెండు మూడు నెల‌ల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రిం తీర్పు వెల్లడించవచ్చనుకుంటున్నారు. అంతేకాదు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రలోభాల పర్వాన్ని ప్రజ‌ల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్‌ అయ్యామని..సుప్రీం జోక్యంతో ఈ విష‌యాన్ని జాతీయ స్థాయికి చేర్చాగలిగామని చెప్పుకుంటూ ఖుషీ అవుతున్నారట ఆ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ ఏం చెప్పినా..? చెప్పకపోయినా? సుప్రీం నిర్ణయం పాజిటీవ్‌గానే ఉంటుంద‌న్న ధీమాలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ ఆశ‌లు ఫ‌లిస్తాయో లేదో తెలియాలంటే ఈనెల 8 వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

14:35 - November 6, 2016
14:35 - November 6, 2016
14:33 - November 6, 2016

హైదరాబాద్ : జిల్లాల పునర్వస్థీకరణలో గిరిజన ప్రాంతాలకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విమర్శించారు. గిరిజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలు - భవిష్యత్‌ కార్యాచరణ అన్న అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన కోదండరామ్‌ .. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తి చూపారు. ఈ విషయంలో గిరిజనుల ప్రతిపత్తి కాపాడేందుకు చర్యలు తీసుకోలేదన్నారు. గిరిజన ప్రాంతాలకు పాలనా సమగ్రత ఏర్పడేలా ప్రయత్నాలు జరగలేదని మండిపడ్డారు. తండాలను పంచాయతీలుగా ప్రకటించాలని కోరిన కోదండరామ్‌.. గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములను సర్కారు బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. 

14:33 - November 6, 2016

నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలను విస్మరిస్తోంది. అధికారంలోకి రాగానే ఒకే విడత రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైంది. దీంతో ఇటు మూడో విడత రుణం మాఫీ కాక .. అటు కొత్త రుణాలు అందక రైతులు నానా కష్టాలు పడుతున్నారు.  ప్రభుత్వ తీరుతో నిజామాబాద్ జిల్లా రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం.
రుణమాఫీ కాక తీవ్ర ఇబ్బందులు 
నిజామాబాద్ జిల్లా రైతులు రుణమాఫీ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 4.25లక్షల మంది రైతులు ఉన్నారు. వివిధ బ్యాంకుల్లో దాదాపు 3.95 లక్షల మంది అన్నదాతలు రుణాలు పొందారు. రైతుల రుణాన్ని నాలుగు విడతలుగా మాఫీ చేస్తామన్న ప్రభుత్వం.. మూడో విడత రుణమాఫీ నిధుల విడుదలలో జాప్యం చేయడం వల్ల రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది.  
రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టు ప్రదక్షణలు 
ఇప్పటికే కొంతమంది రైతులు రెండు నెలలుగా రుణమాఫీ నిధుల కోసం బ్యాంకుల చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. గత సంవత్సరం తీవ్ర కరువు నెలకొనటంతో  కేంద్రం రాష్ర్టానికి 791 కోట్లు కరవు సహయం ప్రకటించింది. అందులో కొంత భాగం ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వ ఖజానాలో జమ చేసింది.  జిల్లాకు కరవు సాయంగా దాదాపు 116 కోట్లు అందించింది. ఈ మొత్తాన్ని జూన్, జులై నెలల్లో 3,79,542 మంది రైతుల ఖాతాల్ల్లో జమ చేస్తామని సాక్షాత్తు రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇంతవరకు రూపాయి కూడా రైతుల ఖాతాల్లో జమకాలేదు. 
ఇన్‌ఫుట్ సబ్సిడీలోనూ కోత
అంతేకాకుండా ఇన్‌ఫుట్ సబ్సిడీలోనూ ప్రభుత్వం కోత విధించినట్లు తెలిసింది. దీనివల్ల అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రబీ సీజన్ ప్రారంభం అవుతున్న సందర్భంలో నిధులను విడుదల చేస్తే ఉపయోగం ఉంటుందని రైతులు చెబుతున్నారు.  
1.20 లక్షల ఎకరాలకుపైగా పంట నష్టం 
ఇటీవల వరదల వలన జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు పైనే సోయా పంటకు నష్టం వాటిల్లింది. ఓ వైపు రైతులు పంట నష్టం వాటిల్లి విలవిలలాడుతుంటే మరోవైపు ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం చెల్లించకుండా రైతులను మరింత క్షోభకి గురిచేస్తోంది. అధికారులు తూతూ మంత్రంగా నష్టంపై సర్వే చేసి చేతులు దులుపుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
శోకసంద్రంలో రైతన్న  
ఇటు ప్రభుత్వం రుణం మాఫీ చేయక.. అటు ఇన్సూరెన్స్‌ కంపెనీ నష్టపరిహారం చెల్లించక పోవడంతో రైతన్న శోకసంద్రంలో మునిగితేలుతున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు వెంటనే రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాలని రైతుసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

14:28 - November 6, 2016

కృష్ణా : గుడివాడలో వైసీపీకి షాక్‌ తగిలింది. గుడివాడ మున్సిపల్‌ ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావుతో సహా 9 మంది కౌన్సిలర్లు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మున్సిపల్‌ కౌన్సిల్‌లో వైసీపీకి బలం తగ్గి.. టీడీపీ బలం పెరగడంతో మున్సిపల్‌ కౌన్సిల్‌ టీడీపీ వశం కానుంది. జగన్‌, స్థానిక నేతల తీరుతోనే వైసీపీ నేతలంతా టీడీపీలో చేరుతున్నారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఇంకా చాలామంది నేతలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

 

14:25 - November 6, 2016

హైదరాబాద్ : ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఓమ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలింత మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సదాశివపేట్‌ అనంతసాగర్‌కు చెందిన స్రవంతి గత నెల 31న స్థానిక ఆస్పత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ అనంతరం స్రవంతికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కూకట్‌పల్లి ఓమ్నీ ఆస్పత్రికి తరలించారు. 4 రోజులు చికిత్స చేసిన వైద్యులు.. డిశ్చార్జ్‌ చేస్తామని చెప్పి చివరగా ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి స్రవంతి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.  

 

14:22 - November 6, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రాక ముందు ఎన్నో హామీలు గుప్పించారు. వాటన్నింటినీ ఒక్కోటి అమలు చేస్తున్నారు. అందులో ప్రధానమైంది మహిళలకు గృహోపకరణాలు ఇవ్వడం. ఉచితంగా ఫ్యాన్లు..మిక్సీలు..గ్రైండర్ లు ఇలాంటి గృహోపకరణాలన్నీ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం వీటితో కొంతమంది బిజినెస్ చేస్తున్నారు. తమిళనాడు బోర్డర్ లో నివాసం ఉంటున్న కొంతమంది తెలుగు వారు వస్తువులను కొనుగోలు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఆదివారం సెలవు దినాన విజయవాడ నడిబొడ్డున విక్రయిస్తున్నారు. చీఫ్ గా ఉంటుండడంతో కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు. దీనికంతటికి కారణం ఎవరు ? ఎవరు విక్రయాలు చేస్తున్నారు ? ఎవరు తరలిస్తున్నారు ? తదితర వివరాలు తెలియాల్సి ఉంది. మరి దీనిపై అక్కడి ప్రభుత్వం..ఇక్కడి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

14:21 - November 6, 2016

ముంబై : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ మద్దతు ప్రకటించారు. ఈనెల 8న జరిగే ఎన్నికల్లో హిల్లరీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. హిల్లరీ గెలుస్తారని, రాజ్యాంగం, మానవతా విలువల పరిరక్షణ శక్తికి దేవుడు ఇస్తారని చెప్పారు. కండల వీరుడు సల్లూభాయ్‌ మేరకు ట్వీట్‌ చేశారు. 

 

14:19 - November 6, 2016

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ నెవాడ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ట్రంప్‌ను అత్యవసరంగా  వేదిక వెనుక ఉన్న హాల్లోకి తీసుకెళ్లారు.  దీంతో నెవాడ సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వేదిక ముందున్న వ్యక్తుల్లో ఒకరి దగ్గర తుపాకీ ఉందన్న వదంతులు రావడంతో ట్రంప్‌ను రక్షించేందుకు సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు  ట్రంప్‌ను పక్కకు తీసుకెళ్లారు. అయితే నెవాడ సభకు హాజరైన వారిలో ఎవరి దగ్గర తుపాకులు లేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 
 

 

14:19 - November 6, 2016

విశాఖపట్టణం : భావితరాల భవిష్యత్ కోసం వైసీపీ పోరాటం చేస్తోందని వైసీపీ నేత అమర్ నాథ్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా విశాఖలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అమర్ నాథ్ టెన్ టివితో మాట్లాడారు. గతంలో ఇదే వేదికపై నుండి బీజేపీ, టిడిపి పార్టీలు పలు హామీలు గుప్పించారని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఇదే వేదికపై నుండి జగన్ డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆరు మహాసభలను పెట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే విశాఖలో తొలి సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉత్తరాంధ్ర..ఇతర జిల్లాల నుండి లక్షలాది మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. 

14:18 - November 6, 2016

కామారెడ్డి : అవినీతి..అక్రమాలకు పాల్పడవద్దు..ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అని పాలకులు పేర్కొంటుంటారు. కానీ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తాజాగా ఓ ఎమ్మెల్యే అనుచరులు వీరంగం కలకలం సృష్టించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి అక్రమాలు..అవినీతికి పాల్పడ్డాడరని బాల్ రాజ్ గౌడ్ అనే వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి..ఎమ్మెల్యే..అవినీతి అక్రమాలు తెలిపేందుకు బాల్ రాజ్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు సమావేశ ప్రాంగణానికి చేరుకుని దాడికి పాల్పడ్డారు. వార్త సేకరణకు వచ్చిన వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. వెంటనే బాధితులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

14:17 - November 6, 2016

అమెరికా : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ ల మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. వరుస సర్వేల్లో విజయావకాశాలు ఇద్దరి మధ్యా దోబూచులాడుతున్నాయి. మొన్నటి మొన్న హిల్లరీ కన్నా ఓ శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్న ట్రంప్ మళ్లీ వెనుకబడ్డాడు. తాజా సర్వేల్లో హిల్లరీ క్లింటన్.. ట్రంప్ కన్నా ఓ ఐదు శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడైంది. 
మరో రెండు రోజుల్లో పోలింగ్  
అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. పోలింగ్ కు మరో రెండు రోజులే మిగిలింది. దీంతో డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం హోరాహోరీ తలపడుతున్నారు. ఇద్దరు అభ్యర్థులూ ప్రచారాన్ని తారాస్థాయిలో చేస్తున్నారు. అమెరికా 45వ అధ్యక్షులుగా ఎన్నికయ్యేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ అభ్యర్థులు ఉపయోగించుకుంటున్నారు. అటు మీడియా సంస్థలు కూడా ఎవరు గెలుస్తారు..? అన్న అంశంపై సర్వేల మీద సర్వేలు నిర్వహిస్తున్నాయి. 
స్వల్ప ఆధిక్యంలో హిల్లరీ క్లింటన్ 
చివరి రెండు రోజుల్లో విజయావకాశాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయన్న అంశంపై వాషింగ్టన్ పోస్ట్ ఏబీసీ నిర్వహించిన సర్వేలో హిల్లరీ క్లింటన్ స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లారు. హిల్లరీకి 48 శాతం ఓటర్లు మద్దతు పలుకగా.. ట్రంప్ ను 44 శాతం మంది ఓటర్లు బలపరిచారు. 
వివిధ సంస్థలు సర్వేలు
వాషింగ్టన్ పోస్ట్ఏబీసీ వెలువరించిన సర్వేలో.. ఇద్దరు అభ్యర్థులకు మద్దతివ్వడానికి కారణమేంటి అన్న ప్రశ్నకు లభించిన సమాధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హిల్లరీని సమర్థిస్తున్నాము కాబట్టి ఆమెకు మద్దతిస్తున్నట్లు.. హిల్లరీ సపోర్టర్స్ చెబితే.. హిల్లరీని వ్యతిరేకిస్తున్నాము కాబట్టి ట్రంప్ ను సమర్థిస్తున్నామని మిగిలిన వారు చెప్పారు. దీన్నిబట్టి.. ఇక్కడి ఓటర్లు హిల్లరీ అనుకూల, వ్యతిరేకులగా మారారన్న భావన వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా.. వాషింగ్టన్ పోస్ట్ ఏబీసీ ఈరోజు వెలువరించిన తాజా సర్వే మాత్రం డెమొక్రాట్లలో చెప్పలేని ఆనందాన్ని కలిగించిందనడంలో సందేహం లేదు.     

 

14:12 - November 6, 2016

గుంటూరు : ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ మచిలీపట్నం డివిజన్‌ 48వ మహాసభలు గుంటూరు జిల్లా తెనాలిలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ మహా సభలను ఆలిండియా ఇన్సరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు వేణుగోపాలు ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఖాతాదారులకు అందించాల్సిన మెరుగైన  సేవల గురించి వివరించారు. బీమా క్లెయిముల పరిష్కారంలో ఎల్ ఐసీ ప్రపంచంలోనే ముందు ఉందన్నారు. 

14:10 - November 6, 2016

వనపర్తి : తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 21 రోజుకు చేరుకుంది. 110 గ్రామాలు, 4 జిల్లాల గుండా యాత్ర సాగుతోంది. పాదయాత్రకు అడుగడుగునా పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన వస్తుందని సీపీఎం నేతలంటున్నారు. ఈ మేరకు పాదయాత్ర బృందం నేత అబ్బాస్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పాదయాత్ర 500 వందల కిలీమీటర్లు పూర్తి చేసుకుందని తెలిపారు. ముస్లింలకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో ముస్లిం ఇనాం భూములు ఇంకా పెత్తందార్ల ఆధీనంలో ఉండటంతో ముస్లింలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని తెలకపల్లిలో ముస్లీంలకు ఇచ్చిన పీర్లమాన్యం భూములను పెత్తందార్లు కబ్జా చేశారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:54 - November 6, 2016

వాయు కాలుష్యంపై ఢిల్లీ కేబినెట్ అత్యవసర సమావేశం

ఢిల్లీ : వాయు కాలుష్యంపై ఢిల్లీ కేబినెట్ అత్యవసర సమావేశం అయింది. మరో మూడు రోజులు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

 

13:43 - November 6, 2016

హైదరాబాద్ : జిల్లా కమిటీల ఏర్పాటు అధికార టీఆర్ఎస్ లో చిచ్చు రేపుతోంది. నేతల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. వీధి కెక్కుతున్న నేతలకు సర్దిచెప్పడం అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. టీఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల మొదటి వారంలో జిల్లా కార్యవర్గాలకు ప్రకటించాలనుకున్నా.... నేతల మధ్య నెలకొన్న విబేధాలతో ఇప్పుడా ప్రక్రియ మరింత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 
అధికార పార్టీలో ఆధిపత్య పోరు 
అధికార పార్టీలో ఆధిపత్య పోరు ఎక్కువైంది. టీఆర్ఎస్‌లోకి వలసొచ్చిన నేతల సంఖ్య భారీగా ఉండడంతో.. జిల్లా కమిటీల ఏర్పాటు, పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. పాత, కొత్త తేడా లేకుండా ప్రతిఒక్కరూ పదవుల కోసం పోటీ పడుతున్నారు. తమ అనుచరులకు జిల్లా కమిటీల్లో చోటు కల్పించేందుకు నేతలూ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఫలితంగా పార్టీలో వర్గాలు తయారై.. గొడవలకు కారణమవుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
అనుయాయులకు పదవులు ఇప్పించుకునే యత్నం 
పునర్విభజన తర్వాత రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటయ్యాయి. వీటికి టీఆర్ఎస్‌ కమిటీలను నియమిస్తున్నట్లు ప్రకటించగానే మంత్రులు మొదలు.. ప్రజాప్రతినిధులందరూ తమ అనుయాయులకు అవకాశం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పాత జిల్లాల్లోని మంత్రులకు కమిటీల కూర్పు బాధ్యతలు అప్పగించారు. నేతల మధ్య నమన్వయం ఉన్న చోట కొత్త కార్యవర్గాల ఎంపిక సాఫీగానే జరిగినా... ఆధిపత్య పోరు ఉన్న జిల్లాల్లో మాత్రం ఇవి ఇంకా ఒక కొలిక్కి రాలేదని అంటున్నారు. మంత్రులు తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నారు. వీరి వ్యవహార శైలిని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. 
అధ్యక్ష పదవుల కోసం పోటీ 
టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధ్యక్ష పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా ఉందని  పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఎవరికి వారు తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా ఇదేవిధమైన పరిస్థితి ఉంది. పూర్వపు వరంగల్‌ జిల్లాలో కీలక నేతలు ఉండటంతో తమ తమ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలస వచ్చిన వారికి పదవులు ఇప్పించుకునేందుకు పావులు కదపడం వివాదాస్పదంగా మారుతోంది. దీంతో మధ్యేమార్గంగా కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. 
ఆ జిల్లాల్లో కొత్త పేర్లు 
టీఆర్‌ఎస్‌లోని కీలక నేతల చొరవతో నిజామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కమిటీల ఏర్పాటు సాఫీగా పూర్తైంది.  హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో  తుది కసరత్తులో కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. విభేదాలు మరింత ముదిరి, పార్టీ పరువు బజారు కెక్కకముందే జిల్లా కమిటీల ఏర్పాటు ప్రక్రియను సాధ్యమైన త్వరగా.. సాఫీగా పూర్తి చేయాలన్న ఆలోచనలో  టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఉన్నారు. అధినేత ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

 

13:39 - November 6, 2016

హైదరాబాద్ : టెక్నాలజీతో అక్రమాలు అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతుంది. ముఖ్యంగా  ఖర్చులు.. డీజిల్‌ దుబారాను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఆపరేషన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను మొదలుపెట్టింది. అలాగే చెత్తబండ్ల రిపేర్లు ఖర్చు తగ్గించడం కోసం నయా ప్లాన్‌ వేస్తోంది. 
అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా జీహెచ్‌ఎంసీలో పారిశుధ్య విభాగం  
జీహెచ్‌ఎంసీలో పారిశుధ్య విభాగం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. డీజిల్‌ నుంచి మొదలుకుని.. వాహనాల రిపేర్ల వరకు అన్ని అక్రమాలే. ఎవరికి అందినకాడికి వారు దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి  చెక్‌ పెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తం వ్యవస్థను డీ సెంట్రలైజ్ చేస్తున్నారు.   
జీహెచ్‌ఎంసీ వాహనాలు మొత్తం 773
చెత్త త‌ర‌లింపుతో పాటు... అధికారుల కోసం ఉప‌యోగిస్తున్న  వాహ‌నాలు మొత్తం గ్రేట‌ర్‌లో 7 వందల 73 ఉన్నాయి. ఈ వాహనాలకు ప్రతిరోజు 25 వేల 606 లీటర్ల డీజిల్‌ ఖర్చు అవుతుంది. గతంలో 40 వేల లీటర్ల డీజిల్‌ ఖర్చేయ్యేది. అయితే కొన్ని వాహనాలను ఉపయోగించకపోయినా... అవి రిపేర్‌లో ఉన్న కూడా వాటికి డీజిల్‌ ఖర్చు రాబడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం డీజిల్‌ ఖర్చు.. 26 వేల లీటర్లకు తగ్గింది. ఇంకా అనవసర ఖర్చులను తగ్గించేందుకు పక్కాగా ప్లాన్‌ చేస్తున్నామని  అధికారులు చెబుతున్నారు. అలాగే పాత వాహనాలను  తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
వాహనాలకు జీపీఎస్‌ వ్యవస్థ అనుసంధానం...?
జీహెచ్‌ఎంసీ నుంచి బయటకు వెళ్లిన వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయి... ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.. అసలు ఆఫీస్‌ పనులకు ఉపయోగిస్తున్నారా.. లేదా పర్సనల్‌గా వాడుకుంటున్నారా? అనే అంశాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం వాహనాలకు జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈ ప్రాసెస్‌ టెండర్‌ స్థాయిలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే మరో ఐదువేల లీటర్ల డీజిల్‌ ఆదా చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే మొత్తం వ్యవస్థ పారదర్శకంగా ఉండేలా మార్పులు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుని.. అన్ని శాఖలను ప్రక్షాళన చేసేందుకు బల్దియా ప్రయత్నిస్తోంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 

 

13:33 - November 6, 2016

హైదరాబాద్ : ఎన్‌ఆర్‌ఐ పెళ్లి సంబంధాల విషయంలో అమ్మాయిల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని మహిళా కమిషన్‌ సూచించింది. ఎన్‌ఆర్‌ఐలు అదనపు కట్నం కోసం తమ భార్యలను వదిలేస్తున్నట్టు తమ అధ్యయనంలో తేలిందని మహిళా కమిషన్‌ చైర్మన్‌ తెలిపారు. 
అదనపు కట్నం కోసం ఎన్‌ఆర్‌ఐల వేధింపులు   
మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐ పెళ్లిల్లు సమస్యలు అనే అంశంపై హైదరాబాద్‌లో సదస్సు జరిగింది.  విదేశాల్లో పనిచేసే అబ్బాయికి ఇచ్చి తమ అమ్మాయిని పెళ్లి చేయాలనుకునే తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలని పలువురు అభిప్రాయపడ్డారు. రెండు వందల మంది ఎన్‌ఆర్‌ఐలు అదనపు కట్నం కోసం తమ భార్యలను వేధించారని, 50 మంది భార్యలను వదిలేశారని అధ్యయనంలో తేలిసిందని మహిళా కమిషన్‌ చైర్మన్‌ త్రిపురాన వెంకటరత్నం అన్నారు.   విదేశీ చట్టాలతో ఇబ్బందులు
భార్యలను వేధించే ఎన్‌ఆర్‌ఐ భర్తల గురించి ఫిర్యాదులు అందినా.. వారిని స్వదేశం రప్పించడం కష్టంగా మారిందని పోలీసు అధికారి  సౌమ్యా మిశ్రా చెప్పారు. విదేశీ చట్టాల వల్ల కొంత ఇబ్బంది ఉందన్నారు. అలాగే ఎన్‌ఆర్‌ఐల చేతిలో మోసపోయిన అమ్మాయిలకు న్యాయ సహాయం అందించడంతో పాటు వారిలో మనో స్థైర్యాన్ని పెంచే బాధ్యత మహిళా కమిషన్‌దేనని సదస్సులో పాల్గొన్న ఎంపీ కేశవరావు అన్నారు. బాధిత మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.  
భారత మహిళలకు ప్రతిబందకంగా విదేశీ చట్టాలు  
ఎన్‌ఆర్‌ఐలకు తమ అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని .. పాస్‌పోర్టులు కూడా పరిశీలించాలని పోలీసు అధికారి స్వాతి లక్రా అన్నారు. మనదేశంలో ఉండే చట్టాలు ఇతర దేశాల్లో చెల్లుబాటుకావని అన్నారు. విదేశీ చట్టాలు భారత మహిళలకు ప్రతిబందకంగా మారాయని అన్నారు. మహిళా కమిషన్‌ ఈ సదస్సును నిర్వహించడం ఆహ్వానించ దగ్గ విషయమని బాధితులు అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.  

 

టీఆర్ ఎస్ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి అనుచరుల దౌర్జన్యం

నిజామాబాద్ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే రవీందర్ అవినీతి అక్రమాలపై బాల్ రాజ్ గౌడ్ అనే వ్యక్తి మీడియా సమావేశం నిర్వహించారు. బాల్ రాజ్ గౌడ్ పై ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. అనుచరులు జర్నలిస్టులను బెదిరించారు. 

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాజధాని పనులను మోడీ ఆన్ లైన్ లో ప్రారంభించనున్నారు.

 

13:04 - November 6, 2016

భూపాలపల్లి : తెలంగాణ రైతు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు టీటీడీపీ రైతు పోరు యాత్ర భూపాలపల్లి జిల్లా నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా నేతలు మినీపాదయాత్రలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో రేవంత్ మాట్లాడుతూ ఒకే విడతలో రుణమాఫీ చెల్లించాలన్నారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, పంట రుణాలు ఇవ్వలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:54 - November 6, 2016

హైదరాబాద్ : నగర రోడ్లు మరో వ్యక్తి ప్రాణాలు తీసాయి. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. హరికృష్ణ అనే వ్యక్తి పహాడిరీఫ్ లో ఎలక్ర్టిషియన్ గా విధులు నిర్వసహిస్తున్నాడు. విధులు ముగిసాకా.. పహాడీషరీఫ్‌ నుంచి బైక్‌పై హరికృష్ణ, బాలకృష్ణ ఇంటికెళ్తున్నాడు.మార్గంమధ్యలో కంచన్ బాగ్ డీఆర్‌డిఎల్‌ వద్ద.. రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో హరికృష్ణకు తీవ్ర గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకకాల కూర్చున్న బాలకృష్ణకు గాయాలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:37 - November 6, 2016

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొల్ కతాకు చెందిన డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన కలకలం రేపింది. కొల్ కతాకు చెందిన డిగ్రీ విద్యార్థిని ప్రియాసింగ్ రెండు రోజుల క్రితం షాపింగ్ కోసం హైదరాబాద్ బయలుదేరింది. హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పింది. ఇండిగో ఫ్లైట్ టిక్కెట్లు కూడా తీసుకుంది. కోల్ కతా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చింది. హైదరాబాద్ కు చేరుకుంది. అయితే రెండు రోజులుగా ప్రియాసింగ్ ఇంటికి రాకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు కోల్ కతా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో అదృశ్యమైనట్లు తెలియడంతో నిన్న రాత్రి వారు ఇక్కడికి చేరుకున్నారు. శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్ పోర్టులోని సీపీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఎయిర్ పోర్టులో ప్రియాసింగ్ దిగినట్లు గుర్తించారు. కానీ ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియరావడం లేదు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ప్రియాసింగ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

టీటీడీపీ జన చైతన్య యాత్ర ప్రారంభం

భూపాలపల్లి : టీటీడీపీ జన చైతన్య యాత్ర ప్రారంభం అయింది. వేశాలపల్లి నుంచి యాత్ర ప్రారంభం అయింది. యాత్రలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 

టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్ చైర్మన్, 9 మంది కౌన్సిలర్లు

విజయవాడ : సీఎం చంద్రబాబు సమక్షంలో గుడివాడ మున్సిపల్ చైర్మన్, 9 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. బాబు..వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  

10:44 - November 6, 2016

ప్రకాశం : జిల్లాలోని రాచర్ల మండలం గిద్దలూరులో రామాంజనేయులు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివాహేతర సంబంధం ఉందన్న కారణంతో రామాంజనేయులుపై.. బాలరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామాంజనేయులును స్టేషన్‌కు పిలిపించి పోలీసులు విచారించారు. ఆ తర్వాత అస్వస్థతకు గురైన రామాంజనేయులును వారి సోదరుడికి అప్పగించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు రామాంజనేయులు మృతి చెందాడు. పోలీసుల దెబ్బలకు తాళలేక రామాంజనేయులు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పాక్ సైన్యం కాల్పుల్లో భారత జవాను మృతి

శ్రీనగర్ : పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ మన్ కొట్టె సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో భారత జవాను మృతి చెందాడు. పాక్ సైన్యం కాల్పులను భారత జవాన్లు తిప్పికొడుతున్నారు. 

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విద్యార్థిని అదృశ్యం

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో విద్యార్థిని ప్రియాసింగ్ అదృశ్యమయింది. హైదరాబాద్ లో షాపింగ్ కోసమని ప్రియాసింగ్.. కోల్ కతా నుంచి ఇండిగో విమానంలో వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు పీఎస్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

 

10:31 - November 6, 2016
10:28 - November 6, 2016

ఢిల్లీ : మూడు రోజుల భారత్‌ పర్యటనకు బ్రిటన్‌ ప్రధాని థెరీసా మే ఇవాళ  ఢిల్లీ రానున్నారు. ప్రధానిగా భాధ్యతలు చేపట్టిన తర్వాత థెరీసా మే ఐరోపా వెలువల పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ రాత్రికి ఢిల్లీ చేరుకునే థెరీసా మేకి... మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ స్వాగతం పలుకుతారు. ద్వైపాక్షిక అంశాలపై రాష్ట్రపతితో చర్చలు జరుపుతారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఢిల్లీలో జరిగే టెక్నాలజీ సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు.  ఇద్దరు నేతల సమక్షంలో రెండు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తాయి. బ్రిటన్‌ ప్రధాని థెరీసా మే వెంట ఆ దేశ వాణిజ్య మంత్రులు లియామ్‌ ఫాక్స్‌, గ్రెగ్‌ హ్యాండ్స్‌తోపాటు 40 మంది  ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం వస్తోంది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బయటపడనున్న తరుణంలో భారత్‌లో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని బ్రిటన్‌ భావిస్తోంది. ఢిల్లీ తర్వాత భారత సాంకేతిక రాజధాని బెంగళూరు సందర్శిస్తారు. మంగళవారం లండన్‌ బయలుదేరి వెళతారు. 
 

 

ఎపిలో కానిస్టేబుల్, జైలు వార్డన్ ఉద్యోగాలకు ప్రాథమిక పరీక్ష ప్రారంభం

హైదరాబాద్ : ఎపిలో నేడు కానిస్టేబుల్, జైలు వార్డన్ ఉద్యోగాలకు ప్రాథమిక పరీక్ష ప్రారంభం అయింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. రాష్ట్రంలోని 27 ప్రాంతాల్లో 792 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ 61 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

 

10:18 - November 6, 2016

విశాఖ : జీకే వీధి మండలం అడ్డసారలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. ప్రజా దోహులుగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ పోస్టర్లు వెలిశాయి. ఇటీవల ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ లో 30మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆర్కే ఆచూకీపై కొన్ని రోజులు ఉత్కంఠ నెలకొంది. ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడని, అతన్ని చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ప్రజా సంఘాలు, వరవరరావు ఆరోపించారు. కానీ ఆర్కే క్షేమంగా ఉన్నట్లు తనకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారని విసరం నేత వరవరరావు తెలిపారు. అయితే ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్ అని..ఈ ఈఘటన తప్పకుండా ఎపి సర్కార్ మూల్యం చెల్లించుకోకతప్పదని మావోయిస్టులు హెచ్చరించారు. ప్రతీకార దాడులు జరుపుతామని తెలిపారు. ఈనేపథ్యంలో టీడీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తూ అడ్డసారలో వెలిసిన మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

టీడీపీ నేతలకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ పోస్టర్లు

విశాఖ : జీకే వీధి మండలం అడ్డసారలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. ప్రజా దోహులుగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ పోస్టర్లు వెలిశాయి

జమ్మూకాశ్మీర్ లో పాక్ సైన్యం కాల్పులు

శ్రీనగర్ : పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ కేజీ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. పాక్ సైన్యం కాల్పులను భారత జవాన్లు తిప్పికొడుతున్నారు. 

09:56 - November 6, 2016
09:55 - November 6, 2016

నితిన్ కొత్త సినిమాపై క్లారిటి వచ్చేసింది. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ కొత్త మూవీలో స్టార్ హీరోయిన్ నితిన్ కి జోడిగా నటించనుంది. రెండు సినిమాలతో ఒకే అనిపించుకున్న ఓ యంగ్ డైరెక్టర్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇంతకీ నితిన్ కొత్త మూవీ విశేషాలేంటో చూద్దాం...
అ ఆ సినిమాతో భారీ హిట్టు 
అ ఆ సినిమాతో నితిన్ భారీ హిట్టు అందుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రిలీజై 10 నెలలు గడుస్తుంది. అయిన కూడా సక్సెస్ కంటిన్యూ చేయాలనే ఆలోచనతో నితిన్ మంచి కథ కోసం ఇంతకాలం వెయిట్ చేశాడు. ఇప్పుడు స్టోరీ సెట్ కావడంతో వచ్చే నెలలో నితిన్ అఫిషియల్ గా న్యూ మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు. 
హను రాఘవపూడి దర్శకత్వంలో కొత్త మూవీ
హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ కొత్త మూవీ చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో రిలీజైన కృష్ణగాడి వీరప్రేమగాథతో ఈ దర్శకుడు మంచి సక్సెస్ అందుకున్నాడు. రిసెంట్ గా ఈ దర్శకుడు చెప్పిన స్టోరీ విన్న నితిన్ వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.
వచ్చే నెలలో సెట్స్ పైకి
వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో నితిన్ పక్కన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వినికిడి. అవుట్ అండ్ అవుట్ క్లీన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కబోతుందట. క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్స్ వేస్తున్నారు.

09:47 - November 6, 2016

గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్డే ఇష్టమంటుంది. అంతేకాదు టాలీవుడ్ రీ ఏంట్రీ విషయంలో తనపై వినిపిస్తున్న గాసిప్స్ పై ఈ బ్యూటీ ఫైర్ అయింది. ఎవరి వద్ద చేతులు చాచి అడుక్కోవాల్సిన అవసరం తనకు లేదని, పనికట్టుకుని కొందరు తనపై చీప్ కామెంట్స్ చేస్తున్నారంటూ మండిపడుతుంది. ఇంతకీ ఇల్లిబేబీ కోపానికి కారణమేంటో మీరే చూడండి.
జీరో సైజ్ అందాలతో ఇలియానా 
జీరో సైజ్ అందాలతో ఇలియానా టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. రెండు సినిమాలతోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కోటీ రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న తొలి హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకున్నప్పటికి ఇలియానాకు మాత్రం బాలీవుడ్ లో వెలిగిపోవాలని ఆశపడింది. అందుకే ఇక్కడ మంచి స్వీంగ్ లో ఉండగానే బాలీవుడ్ కి చెక్కేసింది.
బాలీవుడ్ ఇష్టమన్న ఇలియానా  
ఇలియానా తనకు బాలీవుడ్ అంటే ఇష్టమని క్లారిటి ఇచ్చేసింది. అందుకే తెలుగు సౌత్ ఇండస్ట్రీ వదిలేసి మరీ ముంబైలో వాలిపోయినట్లు చెప్పుతుంది. అయితే ఇక్కడ ఆఫర్లు మాత్రం రావడం లేదని  గోవా బ్యూటీ నిజం చెప్పేసింది. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ కొందరూ బాలీవుడ్ లో సినిమాలు లేకపోవడంతో ఇలియానా తెలుగులో రీ ఏంట్రీ ఇవ్వడానికి దర్శకనిర్మాతలను కాకపడుతుందని వినిపిస్తున్న పుకార్లపై ఘాటుగా స్పందించింది.
బాలీవుడ్ లో ఛాన్స్ లు వస్తే నటిస్తా 
బాలీవుడ్ లో ఛాన్స్ లు వస్తే నటిస్తా లేదంటే ఖాళీగా ఉంటా. అంతేగానీ సౌత్ లో ఛాన్స్ ల కోసం ఎవరి దగ్గర చేతులు కట్టుకుని అడుక్కోవాల్సిన అవసరం తనకు లేదని ఇలియానా ఫైర్ అవుతుంది. తెలుగు నుంచి ఆఫర్ వస్తే ఆలోచిస్తా తప్పా, ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ బేగింగ్ చేసి స్థితిలో తను లేనని గోవా బ్యూటీ గాసిప్స్ రాయుళ్లపై మండిపడుతుంది. బాలీవుడ్ లో రిసెంట్ గా రుస్తుం సినిమాతో సక్సెస్ అందుకున్న ఇలియానా ప్రస్తుతం అజయ్ దేవగణ్ తో బాద్షా  సినిమాలో నటిస్తుంది.

 

09:36 - November 6, 2016

వికారాబాద్ : పేదరికం, కుష్టురోగంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని 60 కిలోమీటర్ల దూరం తోపుడుబండిపై తోసుకెళ్లిన ఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన కవిత అనే మహిళ హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో తోపుడుబండిపై హైదరాబాద్‌ నుంచి రాములు భార్య మృతదేహాన్ని వికారాబాద్‌ తీసుకెళ్ళాడు. దారిలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అంత్యక్రియలకు డబ్బులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివేకానంద ట్రస్ట్‌ వాహనంలో మయికోడు గ్రామానికి మృతదేహాన్ని తరలించారు. 

 

09:32 - November 6, 2016

వనపర్తి : తెలంగాణ భవిష్యత్‌ కోసం సీపీఎం మహాజన పాదయాత్ర సాగుతుందని.. ఈ విషయాన్ని ప్రజలు అభిప్రాయపడుతున్నారని పాదయాత్ర కో ఆర్డినేటర్‌ బి. వెంకట్‌ అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించామని.. ఈనెల 8న ఆ ప్రణాళికను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:27 - November 6, 2016

వనపర్తి : తెలంగాణ వచ్చినా ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. 20 రోజులుగా సీపీఎం చేస్తున్న మహాజన పాదయాత్ర వనపర్తి జిల్లాలోకి ప్రవేశించింది. తెలంగాణ అభివృద్ధి కోసం 39 అంశాలతో తయారు చేసిన నివేదికను ఈనెల 8న బహిరంగపరుస్తామంటున్నారు  సీపీఎం నేతలు. నాగర్‌కర్నూలు జిల్లా కరవుపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. 
పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం 
సీపీఎం మహాజన పాదయాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఈరోజు పాదయాత్ర నాగర్‌కర్నూల్‌ జిల్లా నుంచి వనపర్తి జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్ర బృందానికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్‌ నేత హర్షవర్ధన్‌రెడ్డి, పసుపుల కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు జగన్‌రెడ్డితో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు పాదయాత్రకు మద్దతు తెలిపారు. 
పాదయాత్రకు మంచి స్పందన : ఎంవీ రమణ 
పాదయాత్రకు మంచి స్పందన ఉందని వృత్తిదారుల నేత ఎంవీ రమణ అన్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల వల్ల ఉపాధి కోల్పోతున్నామని వడ్డర్లు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. అలాగే మత్స్యకారులు కూడా అనేక అవస్థలు పడుతున్నారన్నారు. కుల వృత్తుల వారికి ఉపాధి కల్పించాలని రమణ డిమాండ్‌ చేశారు. 
పేదలబతుకుల్లో ఎలాంటి మార్పు లేదు : తమ్మినేని 
తెలంగాణ వచ్చినా పేదల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు తమ్మినేని. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని.. లేకపోతే అన్ని వర్గాలతో కలిసి పోరాటం చేయాలని సీపీఎం నిర్ణయించినట్లు తమ్మినేని తెలిపారు. 
వైవిధ్యమైన ప్రాంతాల్లో పాదయాత్ర : బి.వెంకట్ 
సీపీఎం మహాజన పాదయాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు పాదయాత్ర కన్వీనర్‌ వెంకట్‌. ఇప్పటివరకు రెండు వైవిధ్యమైన ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగిందని.. ఈరోజు వనపర్తి జిల్లాలో ప్రవేశించిందన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సీపీఎం ప్రత్యామ్నాయ ప్రణాళిక రచించిందన్నారు. 39 అంశాలపై తయారుచేసిన నివేదికను ఈనెల 8న విడుదల చేస్తామన్నారు. 
కరవుపై కేసీఆర్‌కు తమ్మినేని లేఖ 
నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కరవుపై కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. మరోవైపు పాదయాత్రతో పాటు.. తమకు వస్తున్న ఫిర్యాదులపై ప్రజల తరపున పోరాటం ఉధృతం చేసేందుకు సీపీఎం సిద్ధమవుతోంది. 

 

09:19 - November 6, 2016

రంగారెడ్డి : జిల్లాలోని దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శంషాబాద్ సమీపంలోని ఖాజాపల్లిలో ప్రవీణ్ అనే యువకుడు తండ్రి, సోదరితో కలిసి నివాసముంటున్నారు. ప్రవీణ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గత కొంతకాలంగా తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరుగుతోంది. ఈనేపథ్యంలో ప్రవీణ్ ను బండరాయితో మోదీ దారుణంగా హత్య చేశారు. పోలీసులు పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:55 - November 6, 2016

వాషింగ్టన్ : అమెరికాలో కీలకమైన ఎన్నికలను ఎదుర్కొంటున్న అక్కడి ప్రజల్లో ఎన్నో ఆశలు.. మరెన్నో సందేహాలు. ఇంతకీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? సర్వేలన్నీ హిల్లరీ క్లింటన్‌కు ఎడ్జ్‌ ఇస్తున్నాయి. కానీ ట్రంప్‌ గెలిచే అవకాశాలూ లేకపోలేదన్న భావనా వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ గెలిస్తే అమెరికాలో పర్యవసానాలు ఎలా ఉంటాయి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.
ట్రంప్‌ విమర్శలపాలు
డొనాల్డ్‌ ట్రంప్‌..! ఏడాది కాలంగా అమెరికన్లతో పాటు.. ప్రపంచ దేశాలన్నింటా విపరీతంగా చర్చనీయాంశమైన పేరు. మహిళలను వస్తువుగా అభివర్ణించడం.. హిల్లరీని నాస్టీ ఉమన్‌ అని పిలవడం.. ముస్లింలను, మెక్సికన్లను తూలనాడడం ద్వారా ట్రంప్‌ విమర్శలపాలయ్యారు. ఆయా వర్గాలు ట్రంప్‌పై వ్యతిరేకతను ప్రదర్శించడం మొదలుపెట్టాయి. అయినా.. ఇప్పటికీ డొనాల్డ్‌ ట్రంప్‌.. హిల్లరీ క్లింటన్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు..? ఇదెలా సాధ్యం..?
శ్వేత సంతతి ఓట్లు ట్రంప్ సొంతం : సర్వేలు 
ఇప్పుడున్న ట్రెండ్స్‌ని బట్టి చూస్తే.. ఇవ్వాళ్టికివాళ ట్రంప్‌.. శ్వేత సంతతి వారి ఓట్లను గంపగుత్తగా సొంతం చేసుకుంటారని పోల్‌ సర్వేలు చెబుతున్నాయి. ఈ వైట్‌మేల్స్‌లో... తక్కువ చదువుకే పరిమితమైన నిరుద్యోగులు దాదాపు 70 శాతం ఉంటారని ఓ అంచనా. ఇక శ్వేతవర్ణ మహిళల్లో 43 శాతం మంది కూడా ట్రంప్‌కే ఓటేస్తారని సర్వేలు చెబుతున్నాయి. శతాబ్దాల ప్రజాస్వామిక అమెరికాలో.. మహిళలను అగౌరవ పరిచేవారిని అస్సలు సహించని తత్వమున్న అక్కడి ప్రజలు.. ట్రంప్‌ను ఎందుకింతలా ఆదరిస్తున్నారు..? 
వర్కర్స్‌ పాలిట అమెరికా స్వర్గధామం 
డొనాల్డ్‌ ట్రంప్‌కు..  వైట్‌ మేల్స్‌లో అపూర్వ ఆదరణకు.. అక్కడి ఉద్యోగ, ఉపాధి అవకాశాల లేమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 1970 దశకంలో సగటు అమెరికా వర్కర్‌.. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అద్భుత ఉపాధి, వేతనాలు పొందేవారు. అద్భుత జీవన ప్రమాణాలతో.. అమెరికా వర్కర్స్‌ పాలిట స్వర్గధామంగానే భాసిల్లింది. అయితే.. ఆ తర్వాతి పరిణామాల్లో.. ఆయిల్‌ ధరలు పెరగడం.. జర్మనీ మిషన్లు, జపాన్‌ కార్లు, కొరియన్‌ స్టీల్‌ ఉత్పత్తులు ప్రపంచాన్ని.. ముంచెత్తాయి. ఆయా దేశాల్లో తక్కువ వేతనాలకే పనివాళ్లు దొరకడం.. అమెరికాలో అత్యధిక వేతనాలు చెల్లిస్తుండడంతో పోటీ తట్టుకోలేని పరిస్థితి అమెరికాకు ఎదురైంది. ఆ దేశ విధాన నిర్ణయాలు.. దేశాన్ని ప్రపంచంలోనే సుసంపన్నంగా నిలిపినా.. కార్మిక లోకంలో అసంతృప్తిని పెంచుతూ వచ్చింది. 
స్థానికుల అసంతృప్తిని ట్రంప్ క్యాష్‌ చేసుకునే ప్రయత్నం 
అమెరికాకు చెందిన సంస్థలు కూడా తక్కువ వేతనాలు లభించే దేశాలకు పనులు అప్పగించడం.. అమెరికాలోనూ తక్కువ వేతనాలిచ్చి విదేశీయులకు ఉపాధి కల్పిస్తుండడం.. స్థానికుల్లో అసహనానికి కారణమైంది. ఇది ఏటికేడు పెరుగుతూ వచ్చింది. ఇదే అంశాన్ని ట్రంప్‌ తన ట్రంప్‌కార్డుగా వినియోగించుకున్నారు. భారత్‌ లాంటి దేశాల నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలు లభిస్తుంటే.. అమెరికన్‌ కార్మికులు నిరుద్యోగంతో అలమటిస్తున్నారంటూ ట్రంప్‌ తన ప్రసంగాల ద్వారా స్థానికుల్లో అసంతృప్తిని క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేశారు. తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విదేశీయులు కొల్లగొట్టేస్తున్నారన్న భావనలో ఉన్న వైట్‌ మేల్‌ను ట్రంప్‌ ప్రసంగాలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఆ కారణంగా ట్రంప్‌కు ఆ వర్గంలో విపరీతమైన ఆదరణ పెరిగింది.
ట్రంప్‌ అమెరికాను రెండు వర్గాలుగా చీల్చారంటున్న విశ్లేషకులు 
ఈ ఎన్నికల వేళ.. ట్రంప్‌ అమెరికాను నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీల్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడి సమాజంలో అమెరికన్‌.. నాన్‌ అమెరికన్‌ అన్న వర్టికల్‌ చీలికను తెచ్చాచరని, ఈ ఎన్నికల్లో ట్రంప్‌ గెలిచినా.. గెలవక పోయినా.. ఇప్పుడాయన నాటిన అసంతృప్తి బీజాలు.. రాబోయే రోజుల్లో వటవృక్షాలవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికన్‌ కార్మిక సమాజంలో.. ఈ అసహనం అంతకంతకూ పెరిగిపోయి.. వచ్చే ఎన్నికలను మరింతగా ప్రభావితం చేస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. అమెరికా కార్మిక సమస్యలు, పన్నులపై పాలకుల విధానాలు సమూలంగా మారకుంటే.. అక్కడి రాజకీయ, సామాజిక స్థితి మరింతగా దిగజారే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 

08:46 - November 6, 2016
08:45 - November 6, 2016

హైదరాబాద్ : తెలంగాణలో డెంగీ వ్యాధితో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల వంతు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని టీజాక్ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌  ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈమేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కోదండరామ్‌ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన హెచ్ ఆర్ సీ... దీనిపై ఈనెల 15 నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గ్రామాల్లో పారిశుధ్యం అధ్యానంగా తయారైందన్నారు. పంచాయతీలు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయన్నారు. గ్రామీణ వైద్యశాలల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు శూన్యమని పేర్కొన్నారు.

 

ఇస్తాంబుల్ విమానాశ్రయం వద్ద కాల్పులు

టర్కీ : ఇస్తాంబుల్ విమానాశ్రయం వద్ద కాల్పులు జరిగాయి. దీంతో ఇస్తాంబుల్ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు.

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి 645 గ్రాముల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. 
 

08:12 - November 6, 2016

హైదరాబాద్ : తెలంగాణలో రైతు సమస్యలపై ఉద్యమించేందుకు టీటీడీపీ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు యాత్ర చేపట్టి వారి సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయించింది. ప్రజా క్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగట్టే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇవాళ భూపాలపల్లి జిల్లాలో రైతు యాత్రను ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది . 
రాష్ట్రమంతా పర్యటించాలని నిర్ణయం
రైతు సమస్యల పరిష్కారమే ఏజెండాగా మరో పోరుబాటకు సిద్ధమైంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ. అన్నదాతల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు రైతు యాత్ర పేరుతో రాష్ట్ర మంతా పర్యటించాలని నిర్ణయించింది. మినీ పాదయాత్రలతో ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. టిఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని టిటిడిపి ఆరోపిస్తోంది. రైతు రుణమాఫీ ఒకే విడతలో చెల్లించకపోవడం కూడా ఆత్మహత్యలకు ఓ కారణమని వాదిస్తోంది.  
జిల్లా కేంద్రాల్లో  మినిపాదయాత్రలు 
ఎల్. రమణ, రేవంత్ రెడ్డితో పాటు ఇతర కీలక నేతలు జిల్లా కేంద్రాల్లో రైతు సమస్యలపై మినిపాదయాత్రలు చేపట్టనున్నారు. ఈనెల 6న భూపాల్ పల్లి జిల్లాలో ప్రారంభమయ్యే రైతు యాత్ర... 30వ తేదీన కొడంగల్‌లో జరిగే బహిరంగ సభ ద్వారా ముగియనుంది. రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చెల్లింపు.. పంట రుణాలు, పంట బీమాహక్కుతో పాటు రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలన్నదే రైతు యాత్ర లక్ష్యమని టి-టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై పిడియాక్టు ప్రయోగించాలని.. రైతుకు గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నామ్ తరహాలో మార్కెటింగ్ విధానాన్ని పటిష్టం చేయటంతో పాటు, కరువు కాలంలో రైతులకు కరువు భత్యం చెల్లించాలని టి-టిడిపి డిమాండ్ చేస్తోంది.

 

రంగారెడ్డి జిల్లాలో ఘోర ఘటన

రంగారెడ్డి : జిల్లాలో ఘోరం ఘటన చోటుచేసుకుంది. ప్రవీణ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తండ్రే హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

వికారాబాద్ లో విషాద ఘటన...

వికారాబాద్ : జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లో అనారోగ్యంతో భార్య మృతి చెందింది. ఆమె భర్త భార్య మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి వికారాబాద్ కు 60 కిమీ తోపుడు బండిపై తీసుకెళ్లాడు. 

 

07:54 - November 6, 2016

హైదరాబాద్ : తన పార్టీని మరింత స్పీడ్‌గా జనాల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన అధినేత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు జనసేన అంటే పవన్ ఒక్కరే తెరపై కనిపించే వారు. ఇప్పడు పార్టీలో కీలక విభాగాలకు ఇంఛార్జ్‌లను నియమించి... పార్టీని పూర్తిస్థాయిలో రాజకీయ పార్టీగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు జనసేనాని.
2019 ఎన్నికలు లక్ష్యంగా పవన్‌ అడుగులు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  2019 ఎన్నికల లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని ప్రధాన సమస్యలపై స్పందిస్తున్నారు. ఇప్పటివరకు జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా.. అది పవన్ అకౌంట్‌లోనే పడేది. అయితే... వాటికి పుల్‌స్టాప్ పెట్టేస్తూ.. తన టీమ్ ‌ను రంగంలోకి దింపేస్తున్నారు పవన్ కళ్యాణ్. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నేరుగా బాధితులు పవన్ కళ్యాణ్ ‌ని కలుస్తున్నారు. అయితే... కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కరం అవుతున్నాయని పవన్ భావిస్తున్నారు. ఇక నుంచి అన్ని ప్రాంతాల్లోని ప్రజా సమస్యలను కొత్తగా నియమించిన జనసేన ఇన్‌ఛార్జ్‌లు, నాయకుల దృష్టికి తీసుకెళ్తే...పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతాయని పవన్‌ భావిస్తున్నారు. 
పార్టీ బలోపేతంపై పవన్ దృష్టి
జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై జనసేన సీరియస్‌గా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే మొదటిసారి పార్టీకి సంబంధించిన నాయకులను ప్రకటించి... పార్టీ  కెడర్‌ను, లీడర్స్‌ని ఊత్సహపరిచింది. జనసేన పార్టీ తెలంగాణ సమన్వయకర్తగా బి. మహేందర్‌రెడ్డి‌ని, పార్టీ ఇన్‌చార్జ్‌గా శంకర్‌గౌడ్‌ను‌, మీడియా హెడ్‌గా టి. హరిప్రసాద్‌ను అధికారికంగా నియమిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటికే పార్టీకి చెందిన లీడర్లను ఫైనల్ చేసిన పవన్ మరికొద్ది రోజుల్లోనే పార్టీకి సంబంధించి మరికొంత మంది నేతలతో పూర్తి కార్యాచరణను ప్రకటించనున్నారు. మొత్తంగా జనసేనను బలోపేతం చేసేందుకు పవన్‌ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

07:48 - November 6, 2016

హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ టూరిజం శాఖల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఏపీ అటవీశాఖ అనుమతి లేదంటూ నాగార్జునసాగర్‌లోని నంది కొండపై తెలంగాణ లాంచీని ఏపీ అధికారులు ఆపేశారు. తొలిసారి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సొంత లాంచీ నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీ నుంచి నందికొండకు వెళ్లింది. 
తెలంగాణ లాంచీ నిలిపివేత
తెలంగాణకి చెందిన లాంచీని నాగార్జునసాగర్‌లో ఏపీ టూరిజంశాఖ నిలిపివేసింది. తమ అనుమతులు లేవంటూ సాయంత్రం వరకు లాంచీని అలాగే ఉంచింది. దీంతో పర్యాటకులు సాయంత్రం వరకు అక్కడే తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర అధికారులు ఏపీ సర్కారుతో సంప్రదించి లాంచీని వెనుకకి రప్పించారు. 
తెలంగాణ వాదులు రాస్తారోకో 
తొలి ట్రిప్పు తర్వాత అనుమతి లేదంటూ నందికొండలోనే లాంచీని ఏపీ అటవీశాఖ సిబ్బంది నిలిపివేశారు. నందికొండలో లాంచీని నిలిపివేతను నిరసిస్తూ నాగార్జున సాగర్ కొత్త బ్రిడ్జి వద్ద తెలంగాణ వాదులు రాస్తారోకో చేశారు. నందికొండపై తెలంగాణ పర్యాటకులకు అధిక ధరలకు తినుబండారాలు విక్రయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
లాంచీ యాత్రకు అన్ని అనుమతులు ఉన్నాయి : లాంచీ స్టేషన్ మేనేజర్ 
ఇప్పటికే లాంచీ యాత్రకు అన్ని అనుమతులు వచ్చాయని.. ఏపీ అటవీశాఖ అనుమతుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నామని లాంచీ స్టేషన్ మేనేజర్ సత్యం తెలిపారు. తెలంగాణ లాంచీని నందికొండలో ఆపి పర్యాటకులకు అసౌకర్యం కలిగించడం సరికాదని పర్యాటకులు తెలిపారు. విహారయాత్రకు వచ్చిన పర్యాటకులను ఇబ్బందులు పెడుతారా? సమస్యలు ఉంటే మాట్లాడుకోవాలే తప్ప ఇలా చేయడం పద్ధతికాదన్నారు. 

 

నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన

నాగర్ కర్నూల్ : నేడు జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

 

07:39 - November 6, 2016

హైదరాబాద్ : నయీమ్‌ కేసుల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు సిట్ అధికారులు. మరికొద్ది రోజుల్లోనే విచారణను పూర్తిచేసి... చార్జీషీట్ వేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.... చార్జీషీట్ వేసేలోపే మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఎవర్ని అరెస్ట్ చేస్తారనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 
నయీమ్‌ కేసును త్వరగా పూర్తిచేయాలని ప్లాన్‌
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయీమ్ కేసును త్వరగా పూర్తి చేసేందుకు సిట్ అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నయీమ్ కేసులో దర్యాప్తును మరింత స్పీడ్ పెంచారు. నయీమ్ కేసుల్లో ఇప్పటి వరకు 166 కేసులు నమోదయ్యాయి. ఇందులో 109 మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. నయీమ్‌ కేసుల్లో అరెస్ట్ అయిన వారిలో ప్రభుత్వ అధికారుల నుంచి సామాన్యుల వరకు ఉన్నారు. ఈ కేసుల్లో 92 మందిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని.. ప్రశ్నించి.. స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు పోలీసులు. 
పీటీ వారెంట్‌పై కోర్టులో 230 మంది హాజరు 
నయీమ్‌ కేసుల్లో 230 మందిని పీటీ వారెంట్‌పై కోర్టులో హాజరు పరిచి విచారించారు. మొత్తం 418 మందిని సాక్షుల కింద విచారించి... స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. నయీమ్ కేసుల్లో సోమవారం లేదా మంగళవారం రోజు చార్జీషీట్‌ను దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 9హత్య కేసుల్లో నయీమ్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. నయిమ్ కేసుల్లో తొవ్వినకొద్ది అనేక విషయాలు బయటికొస్తుండటంతో దర్యాప్తును పూర్తి చేయాలంటే మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మొదటగా... చార్జీషీట్లు వేసి... ఆ తర్వాత సప్లీమెంటరీ చార్జీషీట్లు దాఖలు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సప్లీమెంటరీ చార్జీషీట్లు దాఖలు చేసే క్రమంలో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు... ఎవరిన్ని అరెస్ట్ చేస్తారనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

 

ఎపిలో నేడు కానిస్టేబుల్, జైలు వార్డన్ ఉద్యోగాలకు పరీక్ష

హైదరాబాద్ : ఎపిలో నేడు కానిస్టేబుల్, జైలు వార్డన్ ఉద్యోగాలకు ప్రాథమిక పరీక్ష జరుగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 27 ప్రాంతాల్లో 792 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 61 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

 

నేడు రాజమండ్రిలో మంత్రి సిద్ధరాఘవరావు పర్యటన

తూర్పుగోదావరి : నేడు రాజమండ్రిలో మంత్రి సిద్ధరాఘవరావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.  

 

 

07:26 - November 6, 2016

కర్నూలు : ఏపీ బాగుండాలంటే.. టీడీపీయే శాశ్వతంగా అధికారంలో ఉండాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో సైకిల్‌ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్, వైసీపీలు రెండు కుమ్యక్కయ్యాయని..ఆ పార్టీలు అడ్రస్ లేకుండా గల్లంతవుతాయని విమర్శించారు.
కర్నూలులో చంద్రబాబు పర్యటన
జనచైతన్యయాత్రలో భాగంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో పర్యటించారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 65 కోట్లతో అమృత పథకం కింద మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అలాగే విజయవనం అభివృద్ధి పనులకు, ఉర్దూ వర్శిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కిడ్స్‌ వరల్డ్ నుంచి సీఎం చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. పాతబస్తీలో సుమారు 5 కిలోమీటర్ల మేర నడిచి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉస్మానియా కాలేజ్, వన్‌ టౌన్‌ కాలనీ, అమ్మవారి గుడి మీదుగా పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు..ఓర్వకల్లులో విద్యాసంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామని..ఉర్దూలో బీఈడీ చేసిన వారికోసం స్పెషల్ డీఎస్సీ నిర్వహిస్తామనీ చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. 
జగన్ పై చంద్రబాబు ధ్వజం
రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేకహోదా పేరుతో జగన్ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. సీబీఐ విచారణ ఎదుర్కొన్న వారు తనను సీబీఐ ఎంక్వైరీ చేయించుకోమని చెబుతున్నారని మండిపడ్డారు. తనది రాజపడని నైజమని చెప్పారు. 
మహిళల వల్లే పేదరికంపై గెలుపు సాధ్యమన్న బాబు 
కర్నూలు అవుట్‌డోర్‌ స్టేడియంలో డ్వాక్రా పొదుపు సంఘాలు నిర్వహించిన బహిరంగ సభలోనూ చంద్రబాబు ప్రసంగించారు. ఆడపిల్ల వంటింటికే పరిమితం కావాలనే ధోరణి మారాలని.. పేదరికంపై గెలుపు మహిళల వల్లే సాధ్యమన్నారు. జనచైతన్య యాత్రలో.. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే.. కార్పొరేషన్‌ ఎన్నికలకు ప్రచారం చేస్తూ.. ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరుగుతూ.. చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. 

 

07:20 - November 6, 2016

విశాఖ : అధికార పార్టీ అడ్డగోలుతనంగా వ్యవహరించింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్‌సి ఓట్ల నమోదుకు నవంబర్‌ 5 చివరి రోజు కావడంతో అడ్డదారుల్లో విశాఖ ఆర్డీవో కార్యాలయానికి దరఖాస్తులను వేల సంఖ్యలో సంచుల్లో వేసి తెచ్చి పడేసింది. ఎవరి దరఖాస్తులు వారే తీసుకొచ్చి సమర్పించాలన్న ఎన్నికల సంఘం నిబంధనను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ఈ తీరును నిరసిస్తూ  ప్రజాసంఘాలు కలెక్టరేట్‌లోని ఆర్డీవో కార్యాలయం సాక్షిగా 'భగ్గు'మన్నాయి.
7వేల నకిలీ ఓట్ల నమోదు 
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలకు ఓట్లు దందా మొదలైంది. విశాఖలో ఒకటి కాదు రెండు కాదు సుమారు 7వేల నకిలీ ఓట్ల నమోదుకు ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఇది గమనించిన సీపీఎం నాయకులు వారిని అడ్డుకొని ఆ దరఖాస్తులను దహనం చేశారు.
అక్రమ మార్గాల్లో దరఖాస్తులు
విశాఖ నగరంలో కొంతమంది వ్యక్తులు 7 వేలకు పైగా దరఖాస్తులను సంచుల్లో వేసి ఆర్డీవో కార్యాలయంలో తెచ్చి పడేశారు. వాటిపై ఓ విద్యాసంస్థకు చెందిన కవరింగ్‌ లెటర్‌ కనిపించింది. ఎంఎల్‌సి ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చిన నుంచీ విశాఖలో పలు అక్రమ మార్గాల్లో దరఖాస్తులను కార్పొరేషన్‌ జోనల్‌ కార్యాలయాలకు, తహశీల్దార్ల వద్దకు పంపించే ఏర్పాట్లలో అధికార పార్టీ నిమగ్నమైంది. నగరంలో కొంతమంది అధికారులే స్వయంగా టిడిపి అర్బన్‌ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించారు. కొన్నిచోట్ల టిడిపి శిబిరాల్లోకి అధికారులు వెళ్లి దరఖాస్తులు తీసుకున్నారు. 
టిడిపి ప్రభుత్వంపై సీపీఎం నేతలు ఆగ్రహం  
టిడిపి ప్రభుత్వం అధికారం ఉందని నిబంధనలను ఇష్టం వచ్చినట్లు మీరుతుందని సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల నిబంధల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే స్వీకరణ ఉండగా 6 గంటల తర్వాత 7వేల ఓట్లు నమోదు చేసేందుకు తేవడం ఏంటని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. అధికారుల చేతి వాటంతోనే ఇదంతా జరుగుతుందని మండిపడ్డారు. దీంతో విశాఖ కలెక్టరెట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై కమిటీ వేసి విచారణ చేపట్టాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా.. 
ఓ ప్రైవేటు విద్యాసంస్థల అధినేత ఈ ఎన్నికల్లో ఎంఎల్‌సిగా పోటీచేయనున్న నేపథ్యంలో ఇలా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గడువు దాటాకా వేల దరఖాస్తులు పంపడం కూడా ఈ ప్లాన్‌లో భాగంగానే జరిగినట్లు సమాచారం.  

 

07:12 - November 6, 2016

హైదరాబాద్ : పంజాగుట్ట నిమ్స్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏఎస్సై మృతి చెందారు. భుజంగరెడ్డి.. అంబర్ పేట హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ సెంటర్ లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు భుజంగరెడ్డి బైకుపై అంబర్ పేట వెళ్తున్నారు. మార్గంమధ్యలో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో అమిర్ పేట నుంచి సోమాజిగూడ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైకు ఢీకొట్టింది. రోడ్డుపై గుంతలు ఉండడంతో బైకు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. దీంతో ఏఎస్సై భుజంగరెడ్డి లారీ వెనుక టైర్ల కింద పడడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పంజాగుట్ట పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి, మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నేడు బ్రిటన్ వెళ్లనున్న ఎంపీ కంభంపాటి

హైదరాబాద్ : నేడు ఎంపీ కంభంపాటి హరిబాబు బ్రిటన్ వెళ్లనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

నేడు చినజీయర్ స్వామి షష్టి పూర్తి సభ

హైదరాబాద్ : నేడు చినజీయర్ స్వామి షష్టి పూర్తి సభ నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను సిద్ధం చేశారు. 

 

నేడు విశాఖలో వైసీపీ జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ

విశాఖ : నేడు విశాఖలో వైసీపీ జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 'ప్రత్యేక హోదా...ఆంధ్రుల హక్కు' నినాదంతో సభ నిర్వహిస్తున్నారు. 

నేడు ఢిల్లీ రానున్న యూకే ప్రధాని థెరిసా మే

ఢిల్లీ : నేడు యూకే ప్రధాని థెరిసా మే ఢిల్లీ రానున్నారు. రక్షణ, భద్రత ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. 

రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై భుజంగరెడ్డి మృతి

హైదరాబాద్ : పంజాగుట్ట నిమ్స్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏఎస్సై భుజంగరెడ్డి మృతి చెందారు. 
 

నేటి నుంచి తొలి అంతర్జాతీయ వ్యవసాయ జీవవైవిధ్య సదస్సు

ఢిల్లీ : నేటి నుంచి తొలి అంతర్జాతీయ వ్యవసాయ జీవవైవిధ్య సదస్సు జరుగనుంది. ప్రధాని మోడీ సదస్సును ప్రారంభించనున్నారు. సదస్సుకు 60 దేశాల నుంచి 900 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 

 

Don't Miss