Activities calendar

07 November 2016

23:11 - November 7, 2016

ఢిల్లీ : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌, బ్రిటన్‌ పరస్పరం సహకరించు కుంటున్నాయని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. భారత, బ్రిటన్‌ సాంకేతిక సదస్సులో ప్రసంగించిన మోడీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో 'మేకిన్ ఇండియా'ను భాగం చేస్తామన్నారు. తమ దేశంలో వ్యాపారాలు కోసం ట్రావెల్ చేసేవారికి వీసా ప్రక్రియను సులభతరం చేస్తానని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే హామీ ఇచ్చారు. చాలామంది భారతీయులు తమ స్కిల్స్ను, ఐడియాలను, బిజినెస్లను బ్రిటన్కు తీసుకొస్తున్నారని, ఇది తమ దేశానికి, ఆర్థికవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. భద్రతా మండలిలో, ఎన్‌ఎస్‌జిలో భారత సభ్యత్వానికి మద్దతిస్తామని థెరిసా ప్రకటించారు. బ్రెగ్జిట్‌ నుంచి బయటకు వచ్చాక బ్రిటన్‌ ప్రధాని థెరిసా తొలిసారిగా మూడు రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చారు.

 

23:08 - November 7, 2016

ఢిల్లీ : రష్యా విప్లవం ప్రపంచ మానవ జాతిని జాగృతం చేసిందని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ అన్నారు. భగత్‌ సింగ్‌, ఠాగూర్‌, సుబ్రహ్మణ్య భారతి లాంటి మహామహులు అక్టోబర్‌ విప్లవంతో ప్రభావితం చెందినవాళ్లేనని చెప్పారు. కానీ 1926లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పడ్డాక ప్రజల పక్షాన నిలబడే కమ్యూనిజాన్ని తమ శత్రువుగా భావించిందన్నారు. ఫాసిజం ముందు కమ్యూనిజయం ఎప్పుడూ తలవంచలేదని కరత్‌ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాదంలో భారత దేశంలో కల్లోలం సృష్టిస్తోందని మండిపడ్డారు. భారత్‌పై అక్టోబర్‌ విప్లవ ప్రభావం ఎంతో ఉందని తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో ఢిల్లీలోని కన్ఫూషన్‌ క్లబ్‌లో జరిగిన అక్టోబర్‌ రెవల్యూషన్ శత జయంతి వేడుకల్లో బృందాకరత్‌ పాల్గొని ప్రసంగించారు.

 

23:04 - November 7, 2016

ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు తాను కట్టుబడి ఉంటానని రాహుల్  పేర్కొన్నట్టు పార్టీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ సూర్జెవాలా తెలిపారు. న్యూఢిల్లీలో రాహుల్‌ అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. రాహుల్ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి కూడా ఇదే తగిన సమయంగా సభ్యులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని వెల్లడించారు. సోనియాకు అనారోగ్యంతో రాహుల్ నేతృత్వంలో ఇవాళ్టి సమావేశం జరిగింది.

23:02 - November 7, 2016

ఢిల్లీ : పఠాన్‌కోట్ ఉగ్రదాడి సమయంలో నిషేధిత ప్రదేశాలను ప్రసారం చేశారంటూ జాతీయ టీవీ చానల్ ఎన్డీటీవీ ఇండియాపై విధించిన నిషేధంపై కేంద్రం పునరాలోచనలో పడింది. ప్రస్తుతానికి నిషేధాన్ని నిలుపుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఎన్డీటీవీ ప్రసారాలను ఈ నెల 9వ తేదీన ఒకరోజు పాటు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎన్డీటీవీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై మంగళవారం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్డీటీవీపై నిషేధం విషయంలో వెనక్కి తగ్గినట్టు సమాచారం. 

 

22:59 - November 7, 2016

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో ఈనెల 21న తీర్పు వెలువడనుంది. ఈ కేసుకు సంబంధించి రంగారెడ్డి ఎన్ ఐఏ కోర్టులో విచారణ పూర్తైంది. 157 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈ కేసులో ఏ1 అసదుల్లా అక్తర్, ఏ2గా యాసిన్ భత్కల్, ఏ3గా తహసీన్ అక్తర్, ఏ4గా రెహమాన్, ఏ5గా ఏజాజ్ షేక్ ఉన్నారు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన పేలుళ్లలో 22 మంది మృతి చెందగా, 138 మంది గాయపడ్డారు. 

 

22:53 - November 7, 2016

నాగర్ కర్నూలు : జిల్లాలోని అచ్చంపేటలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మదంలించడంతో బాలుడు వాటర్‌ ట్యాంక్‌లో దూకి మృతి చెందాడు. అచ్చంపేటలో నివాసముంటున్న జశ్వంత్ అనే బాలుడు స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్నాడు. అయితే తల్లిదండ్రులు అతన్ని మందలించారు. దీంతో జశ్వంత్ రెడ్డి ఇంటిపై ఉన్న వాటర్‌ ట్యాంక్‌లో దూకి మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

22:44 - November 7, 2016

మరో ప్రపంచం కోసం తొలి అడుగులు, కోటి కాంతులతో సరికొత్త ఉషోదయపు వెలుగులు, అరుణారుణ పతాక రెపరెపలు, అక్టోబర్ విప్లవానికి జేజేలు..!! ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలోచూద్దాం..

22:41 - November 7, 2016

సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి నినాదాలతో తెలంగాణ రాష్ట్రంలో సీపీఎం మహాజన పాదయాత్ర చేపట్టింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అక్టోబర్ 17న పాదయాత్ర ప్రారంభం అయింది. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. 500 కి.మీ.కు పాదయాత్ర చేరుకుంది. మల్లన్నముచ్చట్లలో భాగంగా సీపీఎం మహాజన పాదయాత్ర బృందంతో మల్లన్న ముచ్చటించిండు. పాదయాత్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న తమ్మినేని వీరభద్రంతో ముచ్చటిండు.   
ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
'జనం చాలా కష్టాల్లో ఉన్నారు. పాదయాత్రలో నేను నడిస్తే కాళ్లకు వచ్చే నొప్పులకంటే.. జనం నొప్పులు చాలా ఎక్కువ. జనం గోసం చాలా ఉంది. ప్రతి ఊరులో గోసనే ఉంది. కష్టాలు కథలు బయటికొస్తున్నాయి. రైతుల బాధలు చూస్తే.. నాకు ఎక్కడ బంగారు తెలంగాణ కనబడ లేదు. ఇట్లే ఉంటే తెలంగాణ వ్యవసాయం ముండబోస్తది.. కేసీఆర్ కు ఉద్యోగమా..? మాకు ఉద్యోగమా..? అని యువత ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ గల్లా బట్టి నిలదీయాలి. కేసీఆర్ జనంలోకి రావాలి అని అన్నారు. 
కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి..
తెలంగాణ రాష్ట్రం కోసం 14 మంది అమరులయ్యారు. సీఎం కేసీఆర్ వారిపై కనికరం చూపడం లేదు. విపక్షాలు ఏకమైతేనే కేసీఆర్ కు గుణపాఠం చెప్పలుగుతాం. కుటుంబంలోని వ్యక్తులు ప్రభుత్వంను నడుపుతున్నారు. నియంతృత్వం కొనసాగుతోంది అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

22:03 - November 7, 2016
22:02 - November 7, 2016

మహబూబ్ నగర్ : బాలబాలికల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే లక్ష్యంతో పాలమూరు జిల్లాలో సరికొత్త పథకం అమలులోకి రాబోతోంది.. చిన్నతనంలోనే వివిధ రకాల జబ్బుల్ని గుర్తించి ఉచితంగా చికిత్స అందించేలా పథకాన్ని రూపొందించారు.. కలెక్టర్‌ రొనాల్డ్ రాస్‌ స్వయంగా ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు.. 
నవంబర్‌ 14న బాల స్వస్త్‌కు శ్రీకారం
మహబూబ్‌నగర్‌ జిల్లాలో బాల బాలికల ఆరోగ్యానికి సంబంధించి సరికొత్త పథకం అమల్లోకి రాబోతోంది.. బాల స్వస్త్‌ పేరుతో నవంబర్‌ 14న ఈ స్కీంకు శ్రీకారం చుట్టబోతున్నారు.. చిన్నారుల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే ఈ కార్యక్రమం అమలుకోసం సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నారు.. జిల్లాలో 18ఏళ్లలోపు బాలబాలికలు దాదాపు 2లక్షల 24వేలమంది ఉన్నారు.. స్వస్త్ పథకంలో వీరందరికీ సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు.. 
జన్యుసంబంధమైన లోపాలతో జననం 
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 మిలియన్లమంది శిశువుల్లో 6శాతం మంది జన్యుసంబంధమైన లోపాలతో జన్మిస్తున్నారు.. ఇలాంటి లోపాలు కొన్నిసార్లు ప్రాణాంతకంగాకూడా మారతాయి.. ఇక పౌష్టికాహారలోపంకూడా చిన్నారులను తీవ్రంగా వేధిస్తోంది.. ఇక జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లల్లో దాదాపు 48శాతమంది పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారు.. వయసుకుతగు బరువులేక అనారోగ్యానికి గురవుతున్నారు.. ఐరన్‌లోపంతో 70శాతంమందికి రక్తహీనత వస్తోంది.. ఈ అనారోగ్య సమస్యలన్నీ చిన్నప్పుడే గుర్తించి చికిత్స అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.. 
ఎన్‌హెచ్‌ఆర్‌ఎంకింద ఉచితంగా చికిత్స 
బాల్‌ స్వస్త్‌ అమలుకోసం అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు.. వైద్య ఆరోగ్య సిబ్బంది, మెడికల్ అధికారులు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు, సీడీపీఓలు, విద్యాశాఖ ఎంఈఓలు, మొబైల్ హెల్త్ టీం సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.. వీరు ఏఎన్ఎంలు, అంగన్ వాడీ కార్యకర్తలందరికీ ఈ నెల 9వరకూ ట్రైనింగ్ ఇస్తారు..... శిక్షణ పూర్తిచేసుకున్నవారు బాలబాలికలకు స్క్రీనింగ్ నిర్వహించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు.. ఇందులో అనారోగ్యం ఉందని తేలితే NHRM కింద ఉచితంగా చికిత్స అందిస్తారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకానికి నిధులు అందజేయనున్నాయి. 
పథకం అమలుపై కలెక్టర్‌ రొనాల్డ్ రాస్‌ ప్రత్యేక శ్రద్ధ
జిల్లాలో ఈ పథకానికి వైద్య ఆరోగ్యశాఖ వేగంగా కసరత్తు చేస్తోంది.. కలెక్టర్‌ రొనాల్డ్ రాస్‌ ప్రత్యేకంగా ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు.. చిన్నారులకు పరీక్షలు జరిపేందుకు 12 టీంలను ఏర్పాటుచేశారు.. ఈ బృందంలో నలుగురు సభ్యులుంటారు.. ఇందులో ఇద్దరు మెడికల్ అధికారులు, ఏఎన్ఎం, ఫార్మసిస్ట్ వుంటారు. వీరు రోజుకు 120మంది బాలబాలికలకు పరీక్షలు చేయాలి.. ఈ వివరాల్ని జాగ్రత్తగా నమోదు చేయాలి..  
విజయవంతంగా పథకం అమలు 
ఈ పథకాన్ని కలెక్టర్ రొనాల్డ్ రాస్ మెదక్‌ జిల్లాలో విజయవంతంగా అమలు చేశారు. అదేవిధానంలో పాలమూరు జిల్లాలోకూడా అమలుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ స్కీంను పూర్తిస్థాయిలో అమలుచేస్తే శిశుమరణాలు తగ్గే అవకాశంఉంటుంది.. కొన్నిరకాల దీర్ఘకాలి, ప్రాణాంతక వ్యాధులనుముందుగానే తెలుసుకొని చికిత్స అందించడానికి ఛాన్స్ ఉంటుంది.. జిల్లాలో చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారు.. ఇలాంటి పథకాన్ని కేవలం మొక్కుబడిగా మార్చకుండా అధికారులు సీరియస్‌గా దృష్టిపెడితేనే అనుకున్న టార్గెట్‌ సాధించే అవకాశముంది.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.. 

 

21:58 - November 7, 2016
21:54 - November 7, 2016

ప్రకాశం : సినీ నిర్మాత టి.కృష్ణ కొడుకుగా పుట్టడం తన అదృష్టమన్నారు.. ఆయన కొడుకు హీరో గోపీచంద్.. టీ కృష్ణ పేరుతో ప్రతి ఏడాది పలు కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ప్రశంసించారు.. ఒంగోలులో కృష్ణ 30వ వర్ధంతి సభకు గోపీచంద్‌ హాజరయ్యారు.. వివిధ రంగాల్లో ప్రతిభచూపిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు.

 

21:49 - November 7, 2016

శ్రీకాకుళం : పెద్దపాడులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాంధీనగర్‌లో గ్యాస్ సిలెండర్ లీకై  ఒక్కసారిగా మంటలు వ్యాపించి సమీపంలోని ఇళ్లల్లో సిలెండర్లు పేలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదంలో 16 పూరిళ్లు దగ్థమయ్యాయి. మంటల్లో తమ డబ్బు, వస్తువులన్ని కాలిపోయాయని బాధితులు వాపోతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 

21:47 - November 7, 2016

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమరావతిలో ఫోరెన్సిక్‌ సైన్స్ ల్యాబొరేటరీ ఏర్పాటుచేస్తామని... ఎపి డిజిపి సాంబశివరావు ప్రకటించారు. ఈ సంస్థను దేశస్థాయిలోనే సెంటర్‌ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు.. ఈ సంస్థకు కేంద్రం 153కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 100కోట్లు కేటాయిస్తుందని తెలిపారు.

 

21:41 - November 7, 2016

విజయవాడ : విజ్ఞానానికి కులం, మతంతో సంబంధంలేదన్నారు.. సీఎం చంద్రబాబు నాయుడు.. ఏపీని టెక్నాలజీ హబ్‌గా మారుస్తానని ప్రకటించారు. విజయవాడలో ఏపీ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన చంద్రబాబు... తిరుపతిలో ప్రపంచస్థాయి సైన్స్ మ్యూజియంకు 50 ఎకరాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ బీచ్‌ ఫెస్టివల్‌పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

 

21:39 - November 7, 2016

కృష్ణా : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు జారిపడ్డాడు. దీంతో దాదాపు అరగంటపాటు బ్యారేజీలోనే ప్రాణాలతో పోరాటం చేశాడు. సకాలంలో సోలీసులు స్పందించి తాళ్ల సాయంతో బయటకు లాగడంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. 

 

21:31 - November 7, 2016
19:33 - November 7, 2016

హైదరాబాద్ : ఇంట్లో పిల్లలు ఆడుకుంటుంటే వచ్చే శబ్దాలతో మొదలయిన చిన్న మాటల యుద్దం చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది..అప్పటికే ఓనర్‌తో గొడవలున్న ఆ కుటుంబంపై మరింతగా విరుచుకుపడ్డారు..దీంతో మనస్తాపం చెందిన ఇల్లాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. చిన్న విషయానికి ఇల్లాలిని బలితీసుకున్న ఓనర్ పరారీలో ఉన్నాడు..హైదరాబాద్‌లో జరిగిన ఘోరం ఇద్దరు చిన్నారులను తల్లి ప్రేమకు దూరం చేసింది..
హైదరాబాద్‌లో ఘోరం..
ఇద్దరు పిల్లలతో హాయిగా ఉంటున్న ఓ ఇల్లాలు ఇంటి ఓనర్ దంపతుల వేధింపులు తట్టుకోలేక ఉరితాడుకు వేలాడింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని మెడికల్‌ సొసైటీలో ప్రసన్నకుమార్‌, హేమలత దంపతులు ఇంటి యజమానులు..వీరు కింద పోర్షన్‌లో ఉంటుండగా...పైన పోర్షన్‌ను రామకృష్ణ, సుజాత దంపతులకు అద్దెకు ఇచ్చారు.
ఇంటి ఓనర్ వేధింపులు...వివాహిత ఆత్మహత్య 
ఆదివారం కావడంతో చిన్నారులు ఇంట్లోనే ఆడుకుంటుండగా కిందకు శబ్దాలు వస్తున్నాయని ఓనర్ దంపతులు ఆగ్రహించారు..ఈ విషయంలో రామకృష్ణ పెళ్లికని ఊరెళ్లగా సుజాత ఉంది..ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు దూషించారు...దుర్భాషలాడడంతో మనస్తాపం చెందిన సుజాత ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది...తాను చనిపోయే ముందు ఇంట్లోని గోడలపై తన ఓనర్ దంపతుల వేధింపులతోనే చనిపోతున్నానంటూ రాసింది.
ఇంట్లో లేని భర్త రామకృష్ణ
ఫంక్షన్ ఉందని వెళ్లిన భర్త రామకృష్ణకు ఇల్లాలు ఫోన్ చేసి చెప్పింది..దీంతో వెంటనే అతను బయల్దేరి వచ్చాడు..తలుపులు ఎంతకూ తీయకపోవడంతో తీరా చూస్తే ఇంట్లో ఉరితాడుకు వేలాడుతూ కన్పించింది...
రంగంలోకి పోలీసులు  
ఇంటి ఓనర్ వేధింపులతోనే మరణించిందన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటి యజమాని ప్రసన్న కుమార్ పరారీలో ఉన్నాడని ..గాలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

 

19:26 - November 7, 2016

హైదరాబాద్ : పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం వేతనాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్. కె.నాగేశ్వర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం 26వేల రూపాయలకు పెంచాలన్న డిమాండ్‌పై హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కేంద్ర ఉద్యోగులు, కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కనీస వేతనం పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీకే హామీ ఇచ్చారని.. ఇంత వరకు ఆ హామీ ఎందుకు అమలు కాలేదని సీపీసీ ప్రధాన కార్యదర్శి వి.నాగేశ్వరరావు ప్రశ్నించారు. 

 

ఏపీలో గ్రూప్..2 నోటిఫికేషన్ కు ఏర్పాట్లు

హైదరాబాద్ : ఏపీలో గ్రూప్..2 నోటిఫికేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 1100 పోస్టులతో రేపు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 

తుని రూరల్ సీఐ నాపై దాడి చేసి దుర్భాషలాడారన్న పి.మధు

విజయవాడ : తొండండి మండలం దానవాయిపేట, తాటియాకులపాలెంలో 3న తుని రూరల్ సీఐ తనపై దాడి చేసి దుర్భాషలాడారని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలపారు. ఇక్కడ ఇంకోసారి కనబడితే ఎన్ కౌంటర్ చేస్తానని మాజీ ఎంపీ అని చూడకుండా తన పట్ల సీఐ ప్రవర్తించిన తీరు పోలీసుల ప్రవర్తన నియమావళికి విరుద్ధమన్నారు. 

 

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని మహాత్మ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీకి టీసర్కార్ ఆమోదం తెలిపింది. రెగ్యులర్ పద్ధతిలో 3,570 పోస్టులు, ఔట్ సోర్సింగ్ కింద 476 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే మూడేళ్లలో ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. 

డీడీసీఎ నిర్ణయాన్ని నిలిపివేసిన హైకోర్టు

ఢిల్లీ : ముగ్గురు సెలెక్టర్లను తొలగిస్తూ డీడీసీఎ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు నిలిపివేసింది. 48 గంటల్లో క్రికెటర్లను అన్ని బకాయిలు చెల్లించాలని డీడీసీఏను కోర్టు ఆదేశించింది. 

జగన్ వి అర్థంపర్థం లేని ఆరోపణలు : నారా లోకేష్

ఎపీ : నారా లోకేష్  మీడియాతో చిట్ చాట్ చేశాడు. జగన్ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ వాడిన భాష సరికాదన్నారు. 25 వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఫీచర్ గ్రూప్ తో ఉన్న హెరిటేజ్ క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని ప్రశ్నించారు. జగన్ లా కంపెనీ ఉత్పత్తి ప్రారంభించకుండానే షేర్లు అమ్ముకోలేదన్నారు. 

 

18:36 - November 7, 2016

వనపర్తి : సీపీఎం మహాజన పాదయాత్ర 22వ రోజుకు చేరుకుంది. 150 గ్రామాల్లో 530 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర సాగింది. తెలంగాణ ఏర్పడినా.. అట్టడుగు వర్గాల ప్రజల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు కావడం లేదని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఏ ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, కేజీటూ పీజీ విద్య అమలు కావడం లేదన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడకపోతే.. సామాజిక ఉద్యమం ఉధృతం అవుతుందని తమ్మినేని హెచ్చరించారు. 

18:33 - November 7, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి హైకోర్టు తేదీలు ప్రకటించింది. ఇవాళ సీఐడీ అధికారులు ఆస్తుల వివరాలు సమర్పించగా... హైకోర్టు తేదీలు ఖరారు చేసింది. విజయవాడలోని వాణిజ్య సముదాయ భవనాల అమ్మకానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటితో పాటు అత్యంత విలువైన రెండు ఆస్తులను అమ్మాలని ఆదేశించింది. అత్యంత విలువైన రెండు ఆస్తులను సీఐడీ విక్రయించాలని.. మరో 2 ఆస్తులను విచారణ కమిటీ అమ్మాలని కోర్టు సూచించింది. ఈ నెల 21లోగా మార్కెట్‌ విలువ ప్రకారం ఆస్తుల వివరాలను.. కోర్టుకు సమర్పించాలని సీఐడీ, విచారణ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. 28న పత్రికా ప్రకటనలు ఇవ్వాలని కోర్టు సూచించింది. వచ్చే నెల 19లోగా ఓపెన్‌ వేలం వేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

 

18:24 - November 7, 2016

హైదరాబాద్ : అభివృద్ధిలోకంటే మద్యం అమ్మకాల్లోనే తెలంగాణ నెంబర్‌ 1లో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. టీఆర్ ఎస్ ప్రభుత్వానికి మద్యంపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. మద్యంపై ప్రభుత్వ విధానాలకు నిరసనగా బీజేపీ సీనియర్‌ నేత ప్రొఫెసర్‌ శేషగిరిరావు ఈ నెల 11న ఆబ్కారీ భవన్‌ ముందు 24గంటల దీక్ష చేస్తారని ప్రకటించారు.

 

18:11 - November 7, 2016

హైదరాబాద్ : నయీం కేసులో రిటైర్డ్ అదనపు ఎస్ పీ రవీందర్ రెడ్డిని సిట్‌ విచారించింది. అతనినుంచి వివరాలు సేకరించింది. 1996నుంచి 2000 సంవత్సరంవరకూ రవీందర్‌ రెడ్డి నల్లగొండ జిల్లాలో పని చేశారు. ఆ సమయంలో రవీందర్‌ రెడ్డికి... నయింతో సంబంధాలున్నాయంటూ ఆరోపణలొచ్చాయి. అయితే రవీందర్‌ రెడ్డిమాత్రం తనకు నయింతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.

 

18:08 - November 7, 2016

హైదరాబాద్ : టాలెంట్‌ ఉన్న వాళ్లకు ఎక్కడైనా అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేంద్రం ప్రభుత్వం ఈజీఎంఎం ద్వారా  4 వేల మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ప్లేస్‌మెంట్‌ కూడా ఇప్పించారని అన్నారు. తారామతి బరాదరిలో నిర్వహించిన ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌ మిషన్‌ కన్వెన్షన్‌లో పాల్గొన్న మంత్రి వివిధ సంస్థల్లో ట్రైనింగ్‌ తీసుకుని.. ఉద్యోగాలు పొందిన వారికి నియమాక పత్రాలు అందజేశారు. పలువురు గ్రామీణ విద్యార్థులు సాధించిన విజయాలపై రూపొందించిన 100 స్మైల్స్‌ అనే పుస్తకాన్ని జూపల్లి ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో ఈ విధానం 20 వేల మందికి ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 

18:01 - November 7, 2016

హైదరాబాద్ : వచ్చే ఏడాది జూన్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డలో 'ఇన్ స్పైర్ ఎక్స్ పో లెవెల్ ఎగ్జిబిషన్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఈ నెల 14నుంచి 1500 ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభించనున్నామని చెప్పారు. 

17:57 - November 7, 2016

పెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖనిలో ఇద్దరు మాజీ మావోయిస్టులను అరెస్టు చేశారు. తుపాకీతో బెదిరించి మిల్లర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు మాజీ మావోయిస్టులు... సుదర్శన్‌రెడ్డి, కృష్ణమూర్తిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఓ తుపాకీ, 13 రౌండ్ల బుల్లెట్లు, రూ.3 లక్షలు, కారు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

17:41 - November 7, 2016

చిత్తూరు : తిరుపతిలో ఎయిర్‌ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. టేకాఫ్ కు ముందు విమానం టైరు పేలింది. అయితే ప్రమాదం తప్పింది. విమానంలోని 178 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. విమానం తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్లాల్సివుంది. మరిన్ని వివరాను వీడియోలో చూద్దాం..

 

17:37 - November 7, 2016

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో.. తాజాగా నిర్వహించిన సర్వేలు డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు అనుకూలంగా వెలువడుతున్నాయి. ఈ మెయిల్స్‌ కుంబకోణంలో హిల్లరీ పాత్ర లేదని ఎఫ్ బిఐ తేల్చిన నేపథ్యంలో.. ఓటర్లలో హిల్లరీ పట్ల సానుకూలత పెరుగినట్లు సర్వేలు చెబుతున్నాయి. అమెరికా వ్యాపార పత్రిక వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఎన్ బీసీ న్యూస్‌ సంయుక్తంగా జరిపిన సర్వేలో 44 శాతం మంది ఓటర్లు హిల్లరీకి  అనుకూలంగా ఉన్నారు. రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌కు 40 శాతం మంది మద్దతు ప్రకటించారు. 
శరవేగంగా మారుతున్న పరిణామాలు  
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొద్ది గంటల సమయమే మిగిలింది. ఈ దశలో అమెరికాలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీకి ప్రజల మద్దతు పెరుగుతోంది. నిన్నమొన్నటి వరకు హిల్లరీ-ట్రంప్‌ల మధ్య  నువ్యా-నేనా.. అన్నట్టు ఉన్న పోటీ ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది. తాజా సర్వేల్లో ఈ విషయం వెల్లడవుతోంది. 
హిల్లరీ, ట్రంప్‌ మధ్య 4 శాతం ఓట్ల వ్యత్యాసం 
ఇంతకు ముందు వివిధ మీడియా సంస్థలు, ఏజెన్సీలు నిర్వహించిన సర్వేల్లో హిల్లరీ, ట్రంప్‌ల మధ్య జనాభిప్రాయంలో పెద్ద తేడా లేకపోయినా... వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఎన్‌బీసీ న్యూస్‌ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఇద్దరి మధ్య నాలుగు శాతం వ్యత్యాసం ఉంది. ఈ సర్వేలో హిల్లరీకి 44 శాతం మంది ఓటర్లు మద్దతు ప్రకటించారు. ట్రంప్‌కు 40 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. లిబర్టేరియన్‌ పార్టీ అభ్యర్థి గ్రే జాన్‌సన్‌కు ఆరుశాతం, గ్రీన్‌ పార్టీ అభ్యర్థి జిల్‌ స్టీన్‌కు రెండు శాతం మద్దతు లభించింది. ఈనెల 3-5 తేదీల మధ్య ఈ సర్వే జరిపారు. మొత్తం 1282 మందిని ఓటర్ల నుంచి సేకరించిన ప్రజాభిప్రాయం ఆధారంగా సర్వే ఫలితాలను ప్రకటించారు. ప్రజాభిప్రాయంలో 2.73 శాతం అటూ ఇటూగా ఉండొచ్చు మినహా... పెద్ద తేడా  ఉండే అవకాశం లేదని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ప్రతినిధులు చెబుతున్నారు. 
గత సర్వేలో హిల్లరీ, ట్రంప్‌ల మధ్య 11 శాతం వ్యత్యాసం 
ఇరవై రోజుల వ్యవధిలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సర్వే నిర్వహించడం ఇది రెండోసారి. గతనెల మధ్యలో జరిపిన సర్వేలో కూడా ట్రంప్‌ కంటే  హిల్లరీ క్లింటన్‌కు 11 శాతం మంది ఓటర్ల మద్దతు ఎక్కువగా లభించింది. గత సర్వేతో పోలిస్తే ఈసారి ఇద్దరి మధ్య ఏడు శాతం వ్యత్యాసం తగ్గడం గమనించ దగ్గ విషయం. హిల్లరీకి ఏడు శాతం మద్దతు తగ్గినా, ఈమెదే పైచేయి అని  వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తేల్చింది. రియల్‌ క్లియర్‌ సర్వేలో ట్రంప్‌ కంటే  హిల్లరీకి 1.8 ఆధిక్యంలో ఉన్నారు. పొలిటికో మార్నింగ్‌ కన్సల్ట్‌ పోల్‌ సర్వేలో కూడా హిల్లరీకే ఆధిక్యత లభించింది. ఈ సర్వేలో 45  శాతం ఓటర్లు హిల్లరీకి మద్దతు పలికారు ట్రంప్‌కు 42 శాతం మంది హిల్లరీకి అనుకూలంగా ఉన్నారు. ఇద్దరి మధ్య మూడు పాయింట్లు తేడా ఉంది. పొలిటికో మార్నింగ్‌ కన్సల్ట్‌ 1482 మందిని నుంచి అభిప్రాయం సేకరించింది. ఈమెయిల్స్‌ కుంభకోణంలో హిల్లరీ పాత్రలేదని  అమెరికా ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ... ఎఫ్‌బీఐ  తేల్చిన తర్వాత ఆన్‌లైన్‌ సర్వేల్లో  ప్రజాభిప్రాయం హిల్లరీకి అనుకూలంగా మారుతోంది. 

 

17:33 - November 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పేదలకి కనీస మౌలిక సదుపాయాలు కల్సించకుండా.. కొత్త కార్యాలయాల పేరుతో ప్రజాధనం వృథా చేస్తోందని మాజీ జస్టిస్ చంద్రకుమార్ విమర్శించారు. జనవిజ్ఞాన వేదిక, ఆల్ ఇండియా పీపుల్స్ నెట్‌వర్క్స్‌ ఆధ్వర్యంలో 'సబ్‌ కా దేశ్ హమారా దేశ్' అనే అంశంపై ఉస్మానియా యూనివర్శిటీలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకి కోదండరామ్, మాజీ జస్టిస్ చంద్రకుమార్‌లు హాజరయ్యారు. అభివృద్ధి పేరుతో దళితులు, ఆదివాసీలు అణచివేతకు గురవుతున్నారని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. 

 

17:32 - November 7, 2016

వర్షాకాలం..శీతాకాలాల్లో జలుబు..దగ్గు వస్తుంటాయి. వీటిని కొంతమది నిర్లక్ష్యం చేస్తుండడంతో పలు అనారోగ్యాలకు గురవుతుంటారు. జలుబు..దగ్గు రాగానే వైద్యుడి దగ్గరకు పరుగెత్తడం..సొంత వైద్యం కనబరుస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే జలుబు..దగ్గు నయమవుతాయి.
మిరియాలు..వీటిని పొడి చేసి పాలల్లో కలిపి తాగాలి. మిరియాలు పొడిగా చేసి పాలలో వేసి బాగా మరిగించి. ఇలా చేయడం వల్ల దగ్గు తగ్గుతుంది.
వేడిపాలలో పసుపు వేసుకోని తాగాలి. పసుపు యాంటిబయాటిక్ కూడా. దీనివల్ల మన శరీరంలో ఉండే ఇన్పెక్షన్ పోతుంది.
జలుబు ఉన్న సమయంలో నీరు తాగవద్దని అనుకుంటుంటారు. కానీ ఇది మంచిది కాదు. ఎక్కువ నీరు తాగడం మంచిది. అది కూడా వేడినీరు అయితే ఇంకా మంచిది. దగ్గు ఉన్న రోజుల్లో చాలా సార్లు గోరువెచ్చటి నీరు తీసుకున్నట్లయితే గొంతులో ఉండే అసౌకర్యం తగ్గుతుంది.
లవంగాలని పెనంపై వేసి కాస్త కాల్చినట్టుగా చేయాలి. అనంతరం వీటిని చప్పరిస్తూ ఉన్నట్టయితే దగ్గు నుండి సత్వరమే ఉపశమనం కలుగుతుంది.

17:25 - November 7, 2016

ఇండియాలో మేటి దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకడు. ఇప్పుడు ఫామ్ లో లేనంత మాత్రాన వర్మ ట్యాలెంట్ ను తక్కువ అంచనా వేయరు. సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కావాల్సిన టాలెంట్ ఈ దర్శకుడిలో పుష్కలంగా ఉంది. ప్రస్తుతం వర్మ అలాంటి సెల్యూలాయిడ్ వండర్ ని రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రియేట్ దర్శకుడు ఓ ఇంటర్నేషనల్ మూవీ స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి అందరికి సర్ ప్రైజ్ షాక్ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ 340కోట్లతో న్యూక్లియర్ టైటిల్ తో హాలీవుడ్ మూవీకి రూపకల్పన చేస్తున్నాడట. అమెరికా, చైనా, రష్యా, యెమెన్ లతో పాటు ఇండియాలో ఈ మూవీ షూట్ జరుపడానికి సన్నాహాలు చేస్తున్నాడు. వర్మతో 15 ఏళ్ల అనుబంధం ఉన్న సీఎంఏ గ్లోబల్ ఈ న్యూక్లియర్ మూవీని నిర్మించనుంది. అసలు ఫామ్ లేని వర్మ ఇంత బడ్జెట్ లో మూవీ ప్లాన్ చేయడమే ఆశ్యర్యంగా ఉందనే టాక్.

చిన్న చితక సినిమాలు..
వర్మ చిన్న చితక సినిమాలతో కాలం వెళ్లదీస్తున్నాడు. న్యూక్లియర్ తో మరోసారి తన టాలెంట్ ని చూపించాలని ఈ దర్శకుడి ఆలోచనగా కనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి స్టోరీ సినాప్సిస్ కూడా చెప్పేశాడు. ముంబైకి ఓ ఆటమిక్ స్ట్రగుల్ చేయబడుతుందట. ఆ క్రమంలో కాశ్మీర్ ను ఖాళీ చేయాలనే డిమాండ్ చేస్తారు. పాకిస్తాన్ నాకే సంబంధం లేదంటే, అప్పుడు అమెరికా రంగంలోకి దిగి తమ సైన్యాన్ని మోహరించడానికి ఇండియా, పాక్ లను అమెరికా ఒప్పిస్తుంది. ఇదే అదే మూడో ప్రపంచయుద్ధానికి నాంది అనేది వర్మ ఈ మూవీలో చెప్పాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్య టెర్రరిజం అయినా, అణుబాంబు ఇంకా ప్రమాదం అనేది ఈ సినిమా ద్వారా వర్మ చెప్పబోతున్నాడట. మరి ఈ మూవీతో వర్మ తనేంటో చూపిస్తాడో చూడాలి.

క్లైమాక్స్ షూటింగ్ లో మృతి చెందిన విలన్లు..

కర్నాటక : 'మాస్తిగుడి' సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది. చెరువులో పడి ఇద్దరు నటులు అనీల్, ఉదయ్ లు మృతి చెందారు. ఈ ఘటనలో హీరో దునియా విజయ్ సురక్షితంగా బయటపడ్డాడు. క్లైమాక్స్ షూటింగ్ లో హెలికాప్టర్ నుండి చెరువులో అనీల్, ఉదయ్ లు దూకారు. కానీ వీరు నీటిలో మునిగి చనిపోయారు. వీరిద్దరూ సినిమాలో విలన్లుగా నటిస్తున్నారు. 

17:21 - November 7, 2016

హైదరాబాద్ : అక్టోబర్ విప్లవం ఎంతో ఘన చరిత్ర కలిగిందని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అన్నారు. అక్టోబర్ విప్లవ శతవార్షికోత్సవ సభ సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో కార్మిక వర్గ హక్కులకై పోరాడాలని పిలుపునిచ్చారు. 

 

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్..

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. ఆస్తుల వివరాలను సీఐడీ కోర్టుకు సమర్పించింది. దీనితో ఆస్తుల అమ్మకానికి హైకోర్టు తేదీలను ప్రకటించింది. ఈనెల 21లోగా మార్కెట్ విలువ ప్రకారం ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించాలని సీఐడీ, విచారణ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. అత్యంత విలువైన రెండు ఆస్తులను సీఐడీ విక్రయించాలని, విజయవాడలోని వాణిజ్య సముదాయ భవనాల అమ్మకానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో రెండు ఆస్తులను విచారణ కమిటీ అమ్మాలని కోర్టు సూచించింది. 28న పత్రికా ప్రకటనలు ఇవ్వాలని, వచ్చే నెల 19లోగా ఓపెన్ వేలం వేయాలని హైకోర్టు పేర్కొంది.

గోదావరిఖనిలో ఇద్దరు మాజీ మావోల అరెస్టు..

పెద్దపల్లి : గోదావరిఖని ఇద్దరు మాజీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వసూళ్లకు పాల్పడుతున్న సుదర్శన్ రెడ్డి, కృష్ణమూర్తిలను పోలీసులు అరెస్టు చేశారు. ఓ తుపాకీ, 13 రౌండ్ల బుల్లెట్లు, రూ. 3 లక్షలు, కారు స్వాధీనం చేసుకున్నారు.

 

17:09 - November 7, 2016

వరుస సక్సెస్ లతో ఊపుమీదున్న 'నిఖిల్' స్పీడ్ కి 'శంకరాభరణం' మూవీ బేక్స్ వేసింది. దీంతో కొత్త సినిమా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' హిట్టు కొట్టి ఫాంలోకి రావాలని ఆశపడుతున్నాడు. 'హెబ్బా పటేల్', 'నందిత శ్వేతా' కథానాయికలుగా నటిస్తుండగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. హర్రర్ థ్రిల్లర్ గా రూపొందిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీ ఈ నెల 18 న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీకి పోటీ ఇద్దరు తమిళ హీరోలు తమ సినిమాలతో రెడీగా ఉన్నారు.తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోల్లో 'విశాల్' ఒకడు. ఈ హీరో చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి.

మరో హీరో..
ఈక్రమంలో ఆయన నటించిన కొత్త చిత్రం 'ఒక్కడొచ్చాడు' టైటిల్ తో ఇక్కడ కూడా రిలీజ్ అవుతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో 'విశాల్' కి జోడిగా 'తమన్నా' నటించింది. ఈ మూవీ కూడా 18న రిలీజ్ కాబోతుంది. 'నిఖిల్' మూవీకి పోటీగా వస్తున్న మరో తమిళ హీరో 'విజయ్ ఆంటోనీ'. 'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హీరో 'భేతాళుడి'గా మెస్మరైజ్ చేయడానికి వస్తున్నాడు. ఈ చిత్రం సైతం 18 న రిలీజ్ కానుంది. తెలుగులో సైతం 'బిచ్చగాడు' భారీ విజయం సాధించడంతో 'భేతాళుడు' సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ ఇద్దరు తమిళ తంబీలను తట్టుకుని 'నిఖిల్' 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.  

17:09 - November 7, 2016

విశాఖ : రష్యా విప్లవ ప్రాధాన్యం తగ్గించే కుట్రలు జరుగుతున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. విశాఖలో జరిగిన రష్యా విప్లవ శతవార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నాయని ధ్వజమెత్తారు. ఏపీలో కాలుష్యకారక పరిశ్రమలకు చంద్రబాబుదే బాధ్యతన్నారు. 

 

17:04 - November 7, 2016

'ప్రభాస్' చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాడు. ఈ స్టార్ నెక్ట్స్ మూవీలో డోంట్ కేర్ అనే రేంజ్ లో బడ్జెట్ ని కేటాయించినట్లు సమాచారం. దీంతో వాపుని చూసి బలుపు అనుకుంటున్నాడంటే 'ప్రభాస్' పై కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ నెక్ట్ మూవీ కోసం ఆయన చేస్తున్న రిస్క్ ఏంటో తెలుసా ? 'బాహుబలి' భారీ సక్సెస్ తో 'ప్రభాస్' ఇండియా వైజ్ గా పాపులారైపోయాడు. బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు సైతం 'ప్రభాస్‌'తో మూవీ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. 'బాహుబలి'తో ఈ స్టార్ హీరోకి వచ్చిన వచ్చిన ఫేంని వినిపించుకోవాలని ప్రతిఒక్కరూ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు 'ప్రభాస్' మార్కెట్ రేంజ్ ఎంతో తెలుసుకోకుండా ఆయన న్యూమూవీపై ఎంత బడ్జెట్ అయిన పెట్టాడానికి రెడీ అవుతున్నారు.

బాహుబలి -2 తరువాత..
'బాహుబలి-2' తరువాత 'ప్రభాస్', 'సుజిత్‌' డైరెక్షన్‌లో న్యూ మూవీ చేయబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ ప్రమోద్ వంశీలు ఈ మూవీని నిర్మించనున్నారు. దాదాపు ఈ సినిమా కోసం 150 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వినికిడి. అంతేకాదు ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీన్ కోసమే ఏకంగా 40కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వినిపిస్తుంది. 'సుజిత్' డైరెక్షన్ లో రానున్న ఈ న్యూ మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందట. యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ గా హాలీవుడ్‌ టాప్ టెక్నీషియన్‌ను తీసుకురానున్నారట. ఇందుకోసం ఈ బడ్జెట్ ని కేటాయించినట్లు తెలుస్తోంది. 'బాహుబలి' వాపుని చూసి బలుపనుకుని ఇలా బడ్జెట్ కేటాయిస్తే అసలుకే మోసం వస్తుందని సిని వర్గాలు గసుగుసలాడుతున్నాయి. 'బాహుబలి' మ్యానియాలో 'ప్రభాస్' మరోసారి భారీ రిస్క్ కి రెడీ అవుతున్నాడు. మరి ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. 

16:58 - November 7, 2016

దర్శకుడు హరీశ్ శంకర్ 'డీజే' మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడు. అంతేనా ఈ మూవీతో తన పన్నేండేళ్ల కల నేరవేరుతుందన్నందుకు సంతోషంగా ఉందని ఆనందపడుతున్నాడట. తన డ్రీమ్ నిజమైనందుకు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఎవర్ గ్రీన్ సినిమాగా తీర్చిదిద్దతున్నానని ఈ దర్శకుడు కాన్ఫిడెంట్ గా చెప్పుతున్నాడు. దర్శకుడు 'హారీశ్ శంకర్' 'గబ్బర్ సింగ్' తో తారపథంలోకి దూసుకెళ్లాడు. కానీ 'ఎన్టీఆర్' తో చేసిన 'రామయ్యా వస్తావయ్యా' డిజాస్టర్ తో ఎంత స్పీడ్ గా స్టార్ డమ్ తెచ్చుకున్నాడో అంతే స్పీడ్ గా కిందకి పడిపోయాడు. అయితే గత ఎడాది 'సాయిధరమ్ తేజ్' తో చేసిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' మూవీతో ఈ దర్శకుడిగా మరోసారి తన టాలెంట్ చూపించాడు.

ఆర్య మూవీ..
దర్శకుడు 'హరీశ్' 'బన్నీ'తో చేస్తున్న 'డీజే' 'దువ్వాడ జగన్నాథమ్' మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుతున్నాడు. అంతేకాదు ఈ మూవీతో తన 12ఏళ్ల కల నిజమైందని పొంగిపోతున్నాడు. 'ఆర్య' మూవీలో 'బన్నీ' పెర్ఫార్మెన్స్ చూసి ఫ్లాట్ అయిన 'హరీశ్ శంకర్' అప్పటి నుంచి 'బన్నీ'తో మూవీ చేయాలని కల కనేవాడట. ఇప్పుడు 'దువ్వాడ జగన్నాథమ్' మూవీతో ఆ కల నేరవేరుతున్నందుకు థ్రిల్లింగ్ గా ఉందని సంబరపడుతున్నాడు. 'డీజే' మూవీని ఎవర్ గ్రీన్ ఎంటర్ టైనర్ గా నిలిచిపోతుందని 'హారీశ్ శంకర్' కాన్ఫిడెంట్ గా చెప్పుతున్నాడు. ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీని 'దిల్ రాజు' నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో 'బన్నీ'కి జోడిగా 'పూజా హెగ్డే'తో నటిస్తోంది. 'సరైనోడు' లాంటి బ్లాక్ బస్టర్ తరువాత 'అల్లు అర్జున్' నటిస్తున్న చిత్రం కావడంతో 'డీజే' పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. మరి 'హారీశ్ శంకర్' 'డీజే'తో 'బన్నీ'కి ఎలాంటి హిట్టు ఇవ్వబోతున్నాడో చూడాలి.

16:52 - November 7, 2016
16:50 - November 7, 2016

కర్నూలు : ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎదురుచూస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజాభిప్రాయసేకరణలో భాగంగా కర్నూలులో ప్రజాబ్యాలెట్‌ కార్యక్రమం చేపట్టారు. హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రఘువీరాతో పాటు.. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, తులసీరెడ్డి పాల్గొన్నారు.

 

16:47 - November 7, 2016
16:44 - November 7, 2016

హైదరాబాద్ : రష్యా విప్లవం..! ప్రపంచ పరిణామాలను గణనీయంగా ప్రభావితం చేసిన విప్లవం. రష్యాలో ఈ మహా విప్లవం తర్వాతే ప్రజాస్వామ్య భావన విశ్వవ్యాప్తమైంది. అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. అసలు రష్యా విప్లవం ఎప్పుడు.. ఎందుకు.. ఎలా.. జరిగింది.? పర్యవసానాలు ఏంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.
జారు చక్రవర్తిపై సైన్యం తిరుగుబాటు
అది 19వ శతాబ్దం.. జారు చక్రవర్తుల నియంతృత్వ పాలనలో రష్యా ప్రజలు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారు. తినడానికి తిండిలేక.. కట్టుకోవడానికి బట్టలు లేక..బానిస బతుకులు బతికారు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. యుద్ధంలో 20 లక్షల మంది సైనికులు చనిపోగా.. 50 లక్షల మంది గాయపడ్డారు. ఇందుకు బాధ్యుడైన జార్‌ చక్రవర్తిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. 1917 ఫిబ్రవరిలో జార్‌పై ప్రజలు తిరుగుబాటు చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులను అణచివేయాలని జారు పాలకులు సైన్యాన్ని ఆదేశించారు. అయితే చక్రవర్తి ఆజ్ఞలను నిరాకరించడమేకాక.. జారు చక్రవర్తిపైనే సైన్యం తిరుగుబాటు చేసి పదవీచ్యుతున్ని చేసింది.
అక్టోబర్‌ మహా విప్లవం సాకారం
అప్పటికే ప్రవాస జీవితం గడుపుతున్న లెనిన్‌ ఏప్రిల్‌ 3న రష్యాలో అడుగుపెట్టాడు. 1917 జులైలో లెనిన్‌ నాయకత్వాన బోల్షివిక్‌ పార్టీ చేసిన తిరుగుబాటు విఫలమైంది. అనంతరం సోషలిస్టు రివల్యూషనరీ పార్టీ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరకాలంలోనే ఈ ప్రభుత్వం నిర్వీర్యమైంది. సోవియట్ల విప్లవం ద్వారా అధికారంలోకి రావడానికి ఇదే తగిన సమయమని లెనిన్‌ భావించారు. అక్టోబర్‌ 10న జరిగిన బోల్షివిక్‌ కేంద్రకమిటీ రహస్య సమావేశంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని నిర్ణయించారు. ఈలోగా మిలటరీ రివల్యూషనరీ కమిటీ ఆధ్వర్యంలో తిరుగుబాటు చేయడానికి సాయుధ రెడ్‌గార్డ్స్‌ను తయారు చేశారు. 1917 అక్టోబర్‌ 24 అర్థరాత్రి రెడ్‌గార్డ్స్‌ పెట్రోగ్రాడ్‌ నగరంలోని పలు ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అక్టోబర్‌ 25 ఉదయం తాత్కాలిక ప్రభుత్వం కూలిపోయిందని..అధికారం సోవియట్ల చేతుల్లో ఉందని లెనిన్‌ ప్రకటించాడు. ఆ విధంగా 20వ శతాబ్దపు చరిత్ర గతిని మార్చిన అక్టోబర్‌ మహా విప్లవం సాకారమైంది.
రష్యాలో మొట్టమొదటి సోషలిస్టు రాజ్యం
రష్యా విప్లవం తర్వాత రష్యాలో మొట్టమొదటి సోషలిస్టు రాజ్యం ఏర్పడింది. తర్వాతర్వాత అనేత దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. చైనా, వియత్నాం, క్యూబా వంటి అనేక దేశాల్లో సోషలిస్టు విప్లవాలు వచ్చాయి. రష్యన్‌ విప్లవ విజయంతో సోషలిస్టు భావజాలం విశ్వవ్యాప్తమైంది. సామాజిక, ఆర్థిక హక్కులు లేకుండా కేవలం రాజకీయ హక్కులతో నిజమైన ప్రజాస్వామ్యం రాదనే భావన ప్రజల్లో నాటుకుపోయింది. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని కూడా రష్యన్‌ విప్లవం గణనీయంగా ప్రభావితం చేసింది.  
వచ్చే ఏడాదితో వందేళ్లు
1917 రష్యా అక్టోబర్‌ విప్లవానికి వచ్చే ఏడాదితో వందేళ్లు. అక్టోబర్‌ విప్లవ శతజయంతి ఉత్సవాలు మానవాళికి నేటికీ స్ఫూర్తిదాయకం. నేడు పెట్టుబడిదారీ దేశాలు ప్రజలపై భారాలు వేస్తూ.. ప్రతిఘటిస్తున్న ప్రజలను వారి పోరాటాలను నిరంకుశంగా అణచివేస్తున్నాయి. ఈ దశలో అక్టోబర్‌ విప్లవం ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం. అక్టోబర్‌ విప్లవ శతవార్షికోత్సవాలు.. 2017 సంవత్సరం మొత్తం జరపాలని సీపీఎం కేంద్రకమిటీ నిర్ణయించింది. ఈ సందర్బంగా ఈనెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం రాష్ట్రకమిటీ సభ నిర్వహిస్తోంది.  

 

త్వరలో డీఎస్సీ - మంత్రి కడియం..

హైదరాబాద్ : త్వరలో డీఎస్పీ నోటిఫికేషన్ చేయనున్నట్లు మంత్రి కడియం పేర్కొన్నారు. జిల్లాల విభజన వల్లే డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యమవుతోందన్నారు. వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కేజీ టూ పీజీలో భాగంగానే గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు, సమైక్య పాలనలో భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. 

శబరిమలలో మహిళల ప్రవేశానికి కేరళ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

ఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించేందుకు అభ్యంతరం లేదని కేరళ ప్రభుత్వం పేర్కొంది. తదుపరి విచారణనను సుప్రీంకోర్టు ఫిబ్రవరికి వాయిదా వేసింది. 

16:18 - November 7, 2016

విజయవాడ : లెనినిజం, మార్క్సిజంపై పెట్టుబడిదారులు దాడి చేస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. పెట్టుబడిదారుల కుట్రలకు వ్యతిరేకంగా తొమ్మిది దేశాల్లో కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాయన్నారు. చారిత్రాత్మక అక్టోబరు సోషలిస్ట్ విప్లవం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్‌లో అన్ని వామపక్ష పార్టీలు లెనిన్‌కి ఘనంగా నివాళి అర్పించారు. అంతర్జాతీయంగా గ్లోబిలైజేషన్ తరువాత పెట్టుబడిదారి వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని.. అది కోలుకునే పరిస్థితులు కూడా లేవని నిపుణులు చెబుతున్నారన్నారు. 

 

భారత్ - యూకే మధ్య కీలక ఒప్పందాలు..

ఢిల్లీ : భారత్ - యూకే మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. కీలక రంగాల్లో సహకారంపై ఒప్పందాలు చేసుకున్నారు. వాణిజ్య సంబంధాలు మెరుగుపరిచేందుకు జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి మోడీ వెల్లడించారు. మేథో సంపత్తి విషయంలో పరస్పర సహకారానికి అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు మోడీ తెలిపారు. ఐరాస భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వానికి ఎనెస్ జీలో సభ్యత్వానికి యూకే మద్దతిస్తుందని, రక్షణ రంగంలో పెట్టుబడులకు బ్రిటన్ కు ఆహ్వానం పలకనున్నట్లు తెలిపారు. 

నయీంతో సంబంధాలు లేవు - రిటైర్డ్ ఎస్పీ

హైదరాబాద్ : నయీం వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని రిటైర్డ్ ఎస్పీ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. నయీం కేసులో సిట్ అధికారులు ఆయన్ని విచారించిన సంగతి తెలిసిందే. 

178 మంది ప్రయాణీకులు సురక్షితం..

తిరుపతి : ఎయిర్ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. విమాన టైరు పేలిపోయింది. ఆ సమయంలో విమానంలో 178 మంది ప్రయాణీకులున్నారు. వీరందరూ సురక్షితంగా ఉన్నారు. 

పేలిన విమానం టైరు.. తప్పిన ముప్పు

చిత్తూరు : తిరుపతిలో ఎయిర్ ఇండియా విమానికి ముప్పు తప్పింది. విమానం టైరు పేలింది. పెను ప్రమాదం తప్పింది. 178 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.

 

16:04 - November 7, 2016

విజయవాడ : అభయ గోల్డ్‌ కేసులో సీఐడీ దర్యాప్తు పూర్తయ్యింది. రేపు విజయవాడ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయనున్నారు. 10 వేల పేజీలతో సీఐడీ చార్జిషీట్‌ తయారు చేసింది. 26 మంది నిందితులపై అభియోగపత్రం దాఖలు చేశారు. ఈమేరకు సీఐడీ అధికారి భాస్కర్ రావు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'అభయగోల్డ్‌ లో 3 లక్షల 71 మంది ఖాతాదారులు ఉన్నారు. ఖాతా దారులకు కంపెనీలు 174 కోట్ల రూపాయలు ఎగగొట్టాయి. 2 కంపెనీలు డిపాజిట్ చేసుకుని.. మూడో కంపెనీకి ట్రాన్స్ ఫర్ చేశాయి. 23 మందిని ముద్దాయిలుగా గుర్తించాం. ఖాతా దారులకు 174 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాల్సి ఉంది. చాలా ఆధారాలు, బ్యాంకు ఖాతాలు సేకరించాం. 23 మంది పై ఛార్జీషీట్ దాఖలు చేశాము. ఖాతా దారులకు డబ్బులు ఎప్పుడు చెల్లించాలన్న విషయం కోర్టు పరిధిలో ఉంది. ఖాతాదారులకు డబ్బులను కోర్టు ఎప్పుడు పంచమంటే అప్పుడు పంచుతామని' అని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఇందిరాపార్కు వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ధర్నా..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కనీస వేతనాలు, ఫిట్ మెంట్ పెంచాలని డిమాండ్ చేశారు. జులైలో ఉద్యోగులు జీతాలు పెంపుపై మంత్రుల కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కేంద్రం తీరుకు నిరసనగా మూడంచెల ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధం కావాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపునిచ్చింది. 

రిటైర్డ్ అడిషనల్ ఎస్పీని విచారించిన సిట్..

హైదరాబాద్ : నయీం కేసులో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డితో పాటు మరో అధికారిని సిట్ అధికారులు విచారించారు. నార్సింగి పీఎస్ లో విచారణ కొనసాగుతోంది.

 

రేపు కోర్టుకు సిట్ నివేదిక..

హైదరాబాద్ : నయీం కేసులో రేపు నివేదికను సిట్ అధికారులు హైకోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటి వరకు 166 కేసులు నమోదు చేసింది. 418 మంది సాక్షులను విచారించి 109 మందిని అరెస్టు చేసింది. భువనగిరి, కోరుట్ల, ఎల్బీనగర్, కరీంనగర్, జనగాం, జగిత్యాలతో పాటు పీఎస్ లలో కేసులు నమోదయ్యాయి. నయీం కేసు విచారణలో 9 హత్య కేసులు బయటపడ్డాయి. ప్రభుత్వ న్యాయవాదులతో సిట్ చీప్ నాగిరెడ్డి చర్చిస్తున్నారు. 

15:50 - November 7, 2016

తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి కేరళ ప్రభుత్వం అంగీకరించింది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించేందుకు ప్రభుత్వం సిద్ధమని తెలిపింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 20 కి వాయిదా వేసింది. కేరళ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చాక స్త్రీ, పరుషులను సమానంగా చూడాలినే ఉద్దేశ్యంతోనే ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అంగీకరించింది. అయితే ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించడంపై మత పెద్దలు నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారితో చర్చలకు సిద్ధమని ప్రభుత్వం అంటుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

భారత్, యూకే మధ్య పలు కీలక ఒప్పందాలు

ఢిల్లీ : భారత్, యూకే మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కీలక రంగాల్లో సహకారంపై కీలక ఒప్పందాలు కుదిరాయి. 
 

14:23 - November 7, 2016
14:21 - November 7, 2016

విశాఖపట్టణం : ఎన్డీయే ప్రభుత్వం పర్యావరణానికి తూట్లు పొడుస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. రష్యా విప్లవ శతవార్షిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రష్యా విప్లవ ప్రాధాన్యం తగ్గించే కుట్రలు జరుగుతున్నాయని, ఏపీలో కాలుష్యకారక పరిశ్రమలకు చంద్రబాబుదే బాధ్యత అని తెలిపారు. కాలుష్యాన్ని పెంచే టిడిపి, బిజెపి విధానాలపై పోరాటం ఆగదన్నారు. పర్యావరణ పర్యవేక్షించడానికి గంభీరమైన ప్రసంగాలు చేశారని, బీజేపీ, ఎన్డీయే విధ్వంసాన్ని పక్కనపెట్టి సుద్దులు చెబుతున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని విధ్వంసాన్ని చేయవద్దంటూనే పర్యావరణాన్ని..ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో టిడిపి ప్రభుత్వం ప్రజలను బెదిరించడానికి ప్రయత్నిస్తోందని రాఘవులు తెలిపారు. 

మద్యం నివారణకు బీజేపీ మద్దతు - లక్ష్మణ్..

హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం నివారణకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 11న అబ్కారీ భవన్ ఎదుట 24గంటల దీక్ష చేయనున్నట్లు బీజేపీ నేత లక్ష్మణ్ ప్రకటించారు. ప్రతి గ్రామంలో బారు..నీరులా వ్యవస్థ మారిందన్నారు. మద్యం అమ్మకాలపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే మహా ఉద్యమం తప్పదన్నారు. మద్యం అమ్మకాల్లో కేసీఆర్ నెంబర్ వన్ అని అభివర్ణించారు. 

14:15 - November 7, 2016

మహబూబ్ నగర్ : ఎన్నెన్నో వాగ్ధానాలు చేసిన కేసీఆర్‌.. ఏ ఒక్క వాగ్ధానాన్ని అమలు చేయలేదని, తెలంగాణ ప్రజల బతుకు మార్చే పరిపాలన కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్రలో భాగంగా వనపర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తమ్మినేని పాదయాత్రకు పలువురు నేతలు, ప్రముఖులు సంఘీభావం తెలిపారు

21 రోజుకు చేరుకున్న పాదయాత్ర
తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 21 రోజుకు చేరుకుంది. పాదయాత్రకు అడుగడుగునా భారీ స్పందన లభిస్తోంది. సినీ నటులు మాదాల రవి, వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. 21వ రోజు పాదయాత్ర వనపర్తి జిల్లా రేమద్దులలో ప్రారంభమై.. తిరుమలాపురం, అప్పాయపల్లి, మున్ననూరు, అక్కడినుంచి వనపర్తికి చేరుకుంది. వనపర్తిలో భారీ బహిరంగసభ నిర్వహించారు. కేసీఆర్‌ ఎన్నో వాగ్ధానాలు చేశారని.. ఏ ఒక్క వాగ్ధానాన్ని అమలు చేయడం లేదని తమ్మినేని అన్నారు. బతుకు మార్చే తెలంగాణ కోసమే బహుజన పాదయాత్ర బయలుదేరిందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలించే విధానం మారాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ముస్లింలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు : ఎండీ అబ్బాస్
గ్రామాల్లో ముస్లిం ఇనాం భూములు ఇంకా పెత్తందార్ల ఆధీనంలో ఉండటంతో ముస్లింలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని మైనారిటీ నేత ఎండీ అబ్బాస్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నా.. మన బతుకుల్లో ఏం మార్పు రాలేదని, కొంతమంది పెత్తనం సాగుతుంది తప్పా అనుకున్న రీతిలో ప్రతిఫలాలు అందడం లేదని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. సమున్నత లక్ష్యంతో సీపీఎం చేపట్టిన పాదయాత్ర అభినందనీయమని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ చేయడానికి కేసీఆర్‌ సర్కారు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. సీపీఎం మహాజన పాదయాత్రలో పలు వర్గాల ప్రజలు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. పాదయాత్రలో వెల్లువెత్తిన ప్రజాసమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. 

14:14 - November 7, 2016

సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించిన బాబు..

విజయవాడ : సైన్స్ కాంగ్రెస్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. యూనివర్సిటీల వీసీలు, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన పలువురు శాస్త్రవేత్తలకు సీఎం సన్మానం చేశారు. యువ శాస్త్రవేత్తలకు ప్రశంసాపత్రాలు సీఎం అందచేశారు. వచ్చే సైన్స్ కాంగ్రెస్ సదస్సులో మేడం క్యూరీ, సీవీ రామన్, ఆచార్య ఎన్జీ రంగాను గుర్తించేలా సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తామన్నారు. సైన్స్ పై ప్రతొక్కరూ మమకారం పెంచుకోవాలని, తిరుపతిలో 50 ఎకరాల్లో సైన్స్ మ్యూజియంను రెండేళ్లలో పూర్తిచేస్తామన్నారు.

13:54 - November 7, 2016

మహబూబ్ నగర్ : సామాజిక న్యాయం, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తలపెట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 22వ రోజుకు చేరింది. ఈరోజు వనపర్తి జిల్లాలో ప్రారంభమైన యాత్ర ఖానాపల్లె, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరులలో కొనసాగనుంది. పాదయాత్రకు ప్రజల నుంచి ఎన్నో వినతులు, విజ్ఞాపనలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్లు, రేషన్‌కార్డుల సమస్యలతో పాటు.. దళితులకు మూడేకరాల భూమి, శ్మశాన వాటికలు కబ్జాలాంటి ఆంశాలు ప్రధానంగా సీపీఎం నేతల దృష్టికి వస్తున్నాయి. ఇప్పటికే అనేక సమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాస్తున్న తమ్మినేని బృందం.. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మరింత ఉత్సాహంతో పాదయాత్ర కొనసాగిస్తోంది. 

13:52 - November 7, 2016

తిరుమల : శ్రీవారి ఆలయంలో పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల అనంతరం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి భక్తులు విరాళంగా ఇచ్చిన 7 టన్నుల పువ్వులను పుష్పయాగానికి వినియోగించనున్నారు. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

13:49 - November 7, 2016

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయీమ్ కేసును త్వరగా పూర్తి చేసేందుకు సిట్ అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నయీమ్ కేసులో దర్యాప్తును మరింత స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఎస్పీ రవీందర్ రెడ్డిని సిట్ అధికారులు నార్శింగ్ పీఎస్ లో విచారిస్తున్నారు. నయీమ్ కేసుల్లో ఇప్పటి వరకు 166 కేసులు నమోదయ్యాయి. ఇందులో 109 మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. నయీమ్‌ కేసుల్లో అరెస్ట్ అయిన వారిలో ప్రభుత్వ అధికారుల నుంచి సామాన్యుల వరకు ఉన్నారు. ఈ కేసుల్లో 92 మందిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని.. ప్రశ్నించి.. స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు పోలీసులు. పీటీ వారెంట్‌పై కోర్టులో 230 మంది హాజరుపరిచారు. 418 మంది సాక్షుల విచారణను రికార్డు చేశారు.  

13:31 - November 7, 2016

తూర్పుగోదావరి : సాగరాన్ని నమ్ముకుని సంసారాన్ని ఈదుతున్నారు.... కడలి ఆధారంగా కాపురాలు నడుపుతున్నారు.... ప్రకృతి ప్రసాదించిన మత్స్యసంపదతో కడుపు నింపుకుంటున్నారు.... కానీ ఇప్పుడు సర్కార్ తీరుతో పాటు ఆయిల్ కంపెనీల అరాచకాలతో మత్స్యకారులు అవస్థలు పాలవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న ఆయిల్ కంపెనీల అడ్డగోలు వ్యవహారాలపై 10 టీవీ ప్రత్యేక కథనం.

కడలిలో ఆయిల్‌ సంస్థల సీస్మిక్‌ సర్వేలు..
కడలిలో ఆయిల్‌ సంస్థల సీస్మిక్‌ సర్వేలు..మత్స్యకారుల జీవితాల్లో కమ్ముకుంటున్న చీకట్లు..బెస్తల విన్నపాలు పట్టించుకోని పాలకులు.ఆదుకునేందుకు ముందుకు రాని పాలకులు..ఇదీ కోనసీమలోని మత్స్యకారుల వేదన. తరతరాలుగా సముద్ర సంపదనే నమ్ముకుని జీవిస్తున్న తమకు.. ఉపాధి దూరమయ్యే ప్రమాదం తలెత్తిందని మత్స్యకారులు చేస్తున్న రోదన.

ఆయిల్‌ సంస్థల నిర్వాకంతో మత్స్యకారుల జీవితాల్లో చీకట్లు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ...! మూడు వైపులా గోదారి.. ఓ వంక కడలి..!! అపరిమితమైన నీటివనరులు.. ఈనేలకు పచ్చందనాన్ని పులిమి.. ప్రకృతి అందానికి నిదర్శనంగా నిలుపుతున్నాయి. ఇక్కడి జలసంపద.. దాన్ని అనుసరించుకున్న జలచర సంపద.. వేలకొద్దీ మత్స్యకారుల జీవితాలకు ఆధారంగా ఉంటోంది. అయితే.. ప్రభుత్వ విధానాలు.. ఆయిల్‌ సంస్థల నిర్వాకంతో ఈనేలపైని మత్స్యకారుల జీవితాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి.

ఆయిల్ కంపెనీల తీరుపై మత్స్యకారుల ఆగ్రహం
ప్రకృతి వైపరీత్యాల వేళ మాత్రమే మత్స్యకారులు సముద్రంలో చేపల వేటను ఆపేవారు. కానీ ఇప్పుడు ఆయిల్‌ సంస్థల కారణంగా.. నిత్యం చేపలవేటను నిలిపివేయాల్సిన దౌర్భాగ్య స్థితి తలెత్తింది. ఓ వైపు పంటలను నాశనం చేయడం ద్వారా పర్యావరణాన్ని దెబ్బతీస్తూ.. మరోవైపు డ్రిల్లింగ్ పేరిట బతుకులపై భయాందోళనలు రేపుతూ.. ఆయిల్‌ కంపెనీలు చెలరేగిపోతున్నాయి. కంపెనీలు చేపట్టిన సీస్మిక్ సర్వే కారణంగా మత్స్యకారులు చేపలవేటకు వెళ్లలేని పరిస్థితి. పైగా.. డ్రిల్లింగ్‌ వల్ల.. మత్స్యసంపద గణనీయంగా అంతరించి పోతోందంటూ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మత్స్య సంపద పరిరక్షణ పేరుతో రెండు నెలల పాటు వేటకు విరామం
మత్స్యసంపద పరిరక్షణ పేరుతో ఏప్రిల్ 16 నుంచి జూన్ 15 వరకూ ప్రతి ఏడాది సముద్ర వేటను మత్స్యకారులు నిలిపివేస్తున్నారు. ఆసమయంలో సముద్రం మీద ఆధారపడిన మత్స్యకారులందరికీ పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బియ్యం,పప్పులు, కిరోసిన్ వంటివి అందిస్తామని చెప్పినప్పటికీ అవి వారికి అందిన దాఖలాలు లేవు. అయితే దీనికి తోడు ఇప్పుడు సీస్మిక్ సర్వే పేరిట రష్యన్ కంపెనీ చేస్తున్న కార్యకలాపాలు మత్స్యకారుల జీవనానికి తీవ్ర ఆటంకం కల్గిస్తున్నాయి. అసలు వేటకు వెళ్లకుండా చేస్తున్నాయి.

సర్వే కోసం వేసిన కేబుళ్ల వల్ల తెగుతున్నవలలు
సర్వే కోసం వేస్తున్న కేబుళ్ల మూలంగా వలలన్నీ తెగిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టరు వరకూ వెళ్లి విన్నివించారు. అయినప్పటికీ అధికారులు, అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవడం వారిలో ఆందోళనను మరింతగా పెంచుతోంది.

సముద్రంలోకి వెళ్లి మత్స్యకారులు నిరసన
అధికారులు పట్టించుకోకపోవడంతో సహనం నశించిన మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి తమ నిరసన తెలిపారు. అయినా వేట సాగించడానికి అవకాశం కల్పించకపోవడంతో అడ్డుగా ఉన్న కేబుళ్లను తొలగించి ఒడ్డుకు చేర్చారు. దీంతో మత్స్యకారులపై పోలీసులు కేసులు పెట్టి వేధించడం మొదలుపెట్టారు. కేసులు నమోదుతోనే వదలకుండా మత్స్యకారులను జైలు రిమాండ్ కు తరలించారు. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మత్స్యకార ప్రాంతాల్లో 144 సెక్షన్
నిరసన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మత్స్యకారుల ప్రాంతాల్లో ప్రభుత్వం ఏకంగా 144 సెక్షన్ పెట్టి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. దీంతో మత్స్యకార గ్రామాలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నాయి. పరిస్థితిని గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే మత్స్యకారులు, ఆయిల్‌ కంపెనీలతో చర్చలకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఓ వైపు వేట లేకపోవడం మరోవైపు తప్పుడు కేసులతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో కరవాక, మఠం మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

13:17 - November 7, 2016

హైదరాబాద్ : పరిపాలన విధానాన్ని మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ అధికార విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. పరిపాలన నిర్వహణకు కేవలం ఐఏఎస్‌ల మీదనే ఆధారపడకుండా, సొంత క్యాడర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం గ్రూప్‌-1 అధికారులను..కేంద్ర సర్వీసు అధికారులకు సమాంతరంగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు తెంగాణ సర్కారు యత్నం
ప్రభుత్వ పాలనలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు తెంగాణ సర్కారు భారీ ప్లాన్‌ చేస్తోంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అభివృద్ధి సాధించాలంటే పూర్తి అవగాహన ఉన్న అధికార యంత్రాంగం అవసరమని భావిస్తోంది తెలంగాణ సర్కారు. కేంద్ర సర్వీసు అధికారులతో క్షేత్రస్థాయిలో సంతృప్తికరమైన పాలన సాగడం లేదని అనుకుంటోంది. క్షేత్రస్థాయి అభివృద్ధి కోసం ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ విధానాన్ని సొంతంగా రూపొందించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఐఏస్‌కు ప్రత్యమ్నాయ సర్వీస్ ఏర్పాటుకు తెలంగాణ సర్కారు యోచన
పరిపాలనలో ప్రధాన పాత్రవహించే ఐఏఎస్‌లకు ప్రత్యమ్నాయంగా సొంత స్టేట్‌ క్యాడర్‌ను తయారు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఐఏఎస్‌గా సెలక్టయిన వ్యక్తి పరిపాలనలో ఏశాఖకైనా మారవచ్చు. అదే గ్రూప్-1 నుంచి ఎంపికైనవారు మాత్రం ఎంపికైన డిపార్ట్‌మెంట్‌కే పరిమితమై ఉంటారు. దీనివల్ల ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించేందుకు అధికారులు అవసరమవుతున్నారు. అయితే ఇక నుంచి గ్రూప్-1 అధికారులను ఆల్‌రౌండర్‌గా మార్చేందుకు రాష్ట్ర సర్కారు శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీ నియామకాల్లో మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. గ్రూప్-1 అధికారి ఒకే శాఖకు పరిమితం కాకుండా ఏ శాఖలోనైనా ఎటువంటి పదవినైనా నిర్వహించే విధంగా నియమనిబంధనలను సంస్కరించేందుకు సిద్ధమవుతోంది.

33 ప్రభుత్వ మంత్రిత్వ శాఖల పరిధిలో గ్రూప్-1 అధికారి విధులు
మరోవైపు తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసుకు ఎంపికయ్యే గ్రూప్-1 అధికారి.. 33 ప్రభుత్వ మంత్రిత్వ శాఖల పరిధిలోని 112 హెచ్‌ఓడీల్లో పనిచేసే విధంగా మార్గదర్శకాలను రూపొందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఐఏఎస్‌కి ఎంపికైన అధికారి సబ్‌కలెక్టర్, కలెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్‌ సెక్రటరీ వంటి పదవులు అధిరోహించడానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో..అదే విధంగా తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు ఎంపికయ్యే అధికారి 33 శాఖల్లోని పదవులను నిర్వర్తించేలా రూల్స్ మార్చాలని నిర్ణయించింది. దీనివల్ల ఉద్యోగ సంఘాలు, గ్రూప్‌-1 ఆఫీసర్ల సంఘాల మధ్య అభిప్రాయం బేధాలు తలెత్తే అవకాశముండదని విశ్లేషకులు చెబుతున్నారు. గ్రూప్-1కు ఎంపికైన అధికారులంతా సమానమేనని...వారందరికీ అన్ని శాఖల్లో పనిచేసే అవకాశాలు సమానంగా ఉంటాయని అంటున్నారు.పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కారు రచిస్తోన్న ప్రణాళికలు ఏ మేరకు విజయం సాధిస్తాయో చూడాలి.

సీసీఎల్ ఏ అధికారులతో సీఎస్ భేటీ..

హైదరాబాద్ : భూ పరిపాలనకు సంబంధించిన అంశాలపై సీసీఎల్ఏ అధికారులు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శితో సీఎస్ భేటీ అయ్యారు. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు అధికారులు హాజరయ్యారు. 

సిరిసిల్ల సర్కార్ ఆసుపత్రి కథనాలకు స్పందన..

సిరిసిల్ల : ప్రభుత్వ ఆసుపత్రిపై టెన్ టివి కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఆసుపత్రి సూపరిటెండెంట్ రవీందర్ నిర్వాకంపై మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో ఆసుపత్రిలో వైద్య శాల అధికారులు తనిఖీలు నిర్వహించారు. 

నయీం కేసు..రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విచారణ..

హైదరాబాద్ : నయీం కేసులో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీని సిట్ విచారించింది. నార్సింగి పీఎస్ లో విచారణ కొనసాగుతోంది. 

కాలుష్యంపై ఎన్జీటీ సీరియస్..

ఢిల్లీ : కేంద్రం, ఢిల్లీ, గుజరాత్, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలపై ఎన్జీటీ సీరియస్ అయ్యింది. కాలుష్యానికి పాల్పడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ? నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. 

13:11 - November 7, 2016

వివాహిత ఆత్మహత్య..

హైదరాబాద్ : కూకట్ పల్లి మెడికల్ సొసైటీలో విషాదం చోటు చేసుకుంది. వివాహిత సుజాత ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి యజమాని వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గోడపై రాతలు రాసింది. 

12:50 - November 7, 2016

హైదరాబాద్‌: సచివాలయ భవనాల కూల్చివేతను అడ్డుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌కు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. వాస్తు పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నం చేస్తున్నారని గవర్నర్‌కు వివరించారు. సెక్రటేరియట్‌లో ఇటీవలే నిర్మించిన భవనాలు కూడా ఉన్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. వాస్తు పేరుతో ప్రభుత్వ భవనాలను కూల్చాలనుకోవడం సరికాదన్నారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. సచివాలయం తరలించడం అంటే ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. తమ అనుమతులు లేకుండా ఎటువంటి కూల్చివేతలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఈసందర్భంగా న్యాయస్థానం హెచ్చరించిన విషయం తెలిసిందే. గవర్నర్ తో భేటీ అయిన వారిలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

12:40 - November 7, 2016
12:38 - November 7, 2016

ఢిల్లీ : ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సీనియర్ నాయకులంతా హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో సోనియాగాంధీ హాజరు కాలేదు..కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికలు..ప్రస్తుత రాజకీయ అంశాలు..పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించనున్నారు. 2017లో జరుగనున్న యూపీ, పంజాబ్ సహా గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సందర్భంగా పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలపైనా నేతలు చర్చించనున్నారు. మోదీ సర్కారును ఇరుకున పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు..వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ..పాక్ పై భారత్ సర్జికల్ దాడులు వంటి పలు అంశాలపై నేతలు చర్చించనున్నారు. కాగా, సోనియాగాంధీ అనారోగ్యంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని రాహుల్ గాంధీ స్వీకరించాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.  

విశాఖలో రష్యా విప్లవ శతవార్షిక కార్యక్రమం..

విశాఖపట్టణం : రష్యా విప్లవ శతవార్షిక కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పాల్గొన్నారు. రష్యా విప్లవ ప్రాధాన్యం తగ్గించే కుట్రలు జరుగుతున్నాయని, ఎన్డీయే ప్రభుత్వం పర్యావరణానికి తూట్లు పొడుస్తోందని పేర్కొన్నారు. ఏపీలో కాలుష్యకారక పరిశ్రమలకు చంద్రబాబుదే బాధ్యత అని, కాలుష్యాన్ని పెంచే టిడిపి, బిజెపి విధానాలపై పోరాటం ఆగదన్నారు. ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో టిడిపి ప్రభుత్వం ప్రజలను బెదిరించడానికి ప్రయత్నిస్తోందని రాఘవులు తెలిపారు. 

లెనిన్ సెంటర్ వద్ద వామపక్షాలు నివాళులు..

విజయవాడ : రష్యా ఉద్యమం శత వార్షికోత్సవం సందర్భంగా లెనిన్ సెంటర్ వద్ద వామపక్ష నేతలు నివాళులర్పించారు. సోవియట్ యూనియన్ లో ఆర్థిక వ్యవస్థ కూలిన తరువాత మార్క్సిజం, లెనినిజంపై పెట్టుబడిదారులు దాడి చేశారని ఏపీ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. 9 దేశాల్లో పెట్టుబడి దారి వ్యవస్థపై కార్మిక వర్గాల నుండి తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

పిటిషన్ ను ఉపసంహరించుకున్న శిరీష..

హైదరాబాద్ : ఆర్కే ఆచూకి తెలపాలంటూ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను శిరీష ఉపసంహరించుకుంది. హైకోర్టు కేసును కొట్టివేసింది. ఆర్కే సమాచారం తెలియడంతో శిరీష కేసును ఉపసంహరించుకుంది. 

12:21 - November 7, 2016

హైదరాబాద్ : కూక‌ట్‌ప‌ల్లిలోని మెడికల్ సొసైటీలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇంటి య‌జ‌మాని వేధింపులతో సుజాత అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. తాము అద్దెక వుంటున్న ఇంటి య‌జ‌మాని ప్ర‌స‌న్న కుమార్ వ‌ల్లే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు గోడ‌లపైనా, త‌లుపుల‌పై సుజాత రాసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంటి యజమాని ప్ర‌స‌న్నకుమార్ త‌న‌ను వేధింపులకు గురిచేస్తున్నాడ‌ని, తమ ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో వచ్చి త‌నపై దాడి చేశాడ‌ని పేర్కొంది. యజమానురాలు ప్రసస్న కుమార్ స్నేహలతకు సుజాతలకు మధ్య కొంతకాలంగా పిల్లల విషయంలో వివాదమున్నట్లుగా తెలుస్తోంది. రామకృష్ణ సుజాతల ఇద్దరు పిల్లలు తరచూ అల్లరి చేస్తున్నారనీ..అల్లరిని నియంత్రించాలని సుజాతను హెచ్చరించామే తప్ప ఎటువంటి దాడికి పాల్పడలేదని ఇంటి యజమానులు పేర్కొంటున్నారు. ఇంటి యజమానులపై హత్య కేసు నమోదుచేయాలని మృతురాలి భర్త రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. 

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం..

ఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గైర్హాజర్ అయ్యారు. అనారోగ్యం కారణంగా సోనియా హాజరు కాలేదని తెలుస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు..పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 

12:06 - November 7, 2016

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం..

ఢిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి అనారోగ్య కారణాలతో సోనియాగాంధీ హాజరుకాలేదు. రాహుల్‌, ఇతర నేతలు హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఓఆర్‌ఓపీ అమలుపై సమావేశంలో చర్చించనున్నారు. పార్టీలో సంస్థాగత ఎన్నికల వాయిదాపై తీర్మానం చేసే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఓక్లహామాలో భూకంపం..

అమెరికా : ఓక్లహామా రాష్ట్రంలో నిన్న రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదయింది. ఓక్లహామా సిటీ నుంచి 50 మైళ్ల దూరంలో ఉన్న ఆర్కాన్సాస్, కాన్సాస్, కషింగ్, మిస్సోరి ప్రాంతాల్లో భూకంప ప్రభావంతో పలు భవనాలు నేలకొరిగాయి. అయితే, ప్రాణనష్టం మాత్రం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. మరోవైపు, వారం క్రితం కూడా ఓక్లహామాలో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఏడాది కాలంలో 3కు పైగా తీవ్రతతో అక్కడ 1,010 భూకంపాలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ వల్లే ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

యజమాని వేధింపులతో మహిళ ఆత్మహత్య!..

హైదరాబాద్ : కూక‌ట్‌ప‌ల్లిలోని శ్రీ‌నివాస న‌గ‌ర్ కాల‌నీలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇంటి య‌జ‌మాని వేధింపులతో సుజాత అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఇంటి య‌జ‌మాని ప్ర‌స‌న్న కుమార్ వ‌ల్లే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు గోడ‌, త‌లుపుల‌పై ఆమె రాసింది. ప్ర‌స‌న్నకుమార్ త‌న‌ను వేధింపులకు గురిచేస్తున్నాడ‌ని, తమ ఇంట్లో ఎవ‌రూ లేరి స‌మ‌యంలో ఇంటికి వచ్చి త‌నపై దాడి చేశాడ‌ని పేర్కొంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఇంటి య‌జ‌మాని ప్ర‌స‌న్న‌కుమార్ ప‌రారీలో ఉన్నాడు.

కేసు విత్ డ్రా చేసుకున్న శిరీష..

హైదరాబాద్ : మావోయిస్టు నేత ఆర్కే సమాచారం అందించాలంటూ ఆర్కే భార్య హైకోర్టులో వేసిన హిబిజన్ కార్పస్ పిటీషన్ ను శిరీష్ విత్ డ్రా చేసుకున్నారు. దీంతో కోర్టు ఈ కేసున కొట్టివేసింది. కాగా ఏవోబీలో భారీ ఎన్ కౌంటర్ లో దాదాపు 32మంది మావోయిస్టు మృతి చెందారు. ఈ క్రమంలో మావో కీలక నేత ఆర్కే ఆచూకీ లభ్యం కాలేదు. ఆర్కేను పోలీసులే నిర్భంధించారనీ..వెంటనే ఆర్కేను కోర్టులో హాజరుపరచాలంటూ భార్య శిరీష..ప్రజాసంఘాల నేతలు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ క్రమంలోనే ఆర్కే ఆచూకీ లభించింది.దీంతో శిరీష్ కేసును విత్ డ్రా చేసుకున్నారు.  

11:43 - November 7, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికలపై ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల కన్ను పడింది. పోలింగ్‌ రోజులు మారణహోమం తప్పదని ఐఎస్, అల్‌ ఖైదా ఉగ్రవాదులు హెచ్చరించిన నేపథ్యంలో నిఘా పెంచారు. అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముస్లింలు ఓటు వేయొద్దని ఉగ్రవాద గ్రూపులు పిలుపు ఇచ్చాయి. సోదాలు విస్తృతం చేశారు. బ్యాలెట్‌ పెట్టెలు ధ్వంసం చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల దగ్గర భారీ భద్రతతో ఏర్పాటు చేయడంతోపాటు, ప్రత్యేక నిఘా ఉంచారు. టెక్సాస్‌, న్యూయార్క్‌, వర్జీనియాలో ఎన్నికలను విచ్ఛిన్నం చేసేందుకు అల్‌ ఖైదా కుట్రలు పన్నుతోందన్ననిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక భద్రతకు చర్యలు చేపట్టారు. డెమోక్రాటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలు రెండూ కూడా ముస్లింలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని ఉగ్రవాద సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీంతో అమెరికా అంతర్గత భద్రతా శాఖ అప్రమత్తమై నిఘా పెంచింది. 

11:17 - November 7, 2016

హైదరాబాద్ : ఎత్తు పెంపు చికిత్స మళ్లీ తెరమీదకు వచ్చింది. 10 రోజుల క్రితం నిఖిల్ రెడ్డి అనే యువకుడు ఎత్తు పెంపు చికిత్స కోసం గ్లోబల్ హాస్పిటల్ వైద్యలు సర్జరీ చేశారు. అక్టోబర్ 27న డా.భూషణ్ నిఖిల్ రెడ్డికి సర్జరీ చేశారు. నవంబర్ 4న నిఖిల్ కు వైద్యులు మరోసారి సర్జరీ చేయాల్సి వుండగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డా.భూషణ్ ను రెండు నెలల పాటు సస్పెండ్ చేశారు. దీంతో నిఖిల్ రెడ్డికి చికిత్సను సదరు ఆసుపత్రి వైద్యులు నిలిపివేశారు. ఈ క్రమంలో నిఖిల్ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టటంతో మళ్లీ చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. కానీ నిఖిల్ తండ్రి మాత్రం కాళ్ళకు వచ్చిన ఇన్ ఫెక్షన్ కు సంబంధించి ఎటువంటి చికిత్స చేయలేదనీ కేవలం డ్రెస్సింగ్ మాత్రమే చేశారని చెప్పారు. ఈ క్రమంలో డాక్టర్ భూషన్ స్థానంలో వున్న అరబింద్ నిఖిల్ కుటుంబానికి అండగా వుంటామని పేర్కొంటున్నారు. 

జేఎన్ యూలో తుపాకి కలకలం..

ఢిల్లీ : జేఎన్ యూలో తుపాకి కలకలం సృష్టించింది. వర్సిటీలోని నార్త్ గేట్ దగ్గర పడి ఉన్న ఓ పాత బ్యాగులో ఒక దేశృయ తుపాకి, 7 బుల్లెట్లు, ఒక స్ర్కూడ్రైవర్ లభ్యమయ్యాయి.

 

22వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర..

వనపర్తి : సీపీఎం మహాజన పాదయాత్ర 22వ రోజుకు చేరుకుంది. ఖానాపల్లి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరులలో పాదయాత్ర బృందం పర్యటించనుంది. 

నిఖిల్ కుటుంబానికి అండ - గ్లోబల్ మెడికల్..

హైదరాబాద్ : నిఖిల్ రెడ్డి కుటుంబానికి తాము అండగా ఉంటామని గ్లోబల్ మెడికల్ సర్వీసింగ్ డైరెక్టర్ డా.ఆనంద్ పాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం నిఖిల్ కు భూషణ్ స్థానంలో డా.అరవింద్ వైద్యం చేస్తున్నారని పేర్కొన్నారు. అక్టోబర్ 27న నిఖిల్ రెడ్డికి డా. భూషణ్ వైద్యం చేయడం జరిగిందని, నవంబర్ 4వ తేదీన నిఖిల్ కు మరోసారి వైద్యం చేయాల్సి ఉందన్నారు. కానీ మెడికల్ కౌన్సిల్ నిర్ణయంతో వైద్యంలో జాప్యం జరిగిందన్నారు. 

నిఖిల్ నివాసంలో గ్లోబల్ వైద్య బృందం..

హైదరాబాద్ : నిఖిల్ రెడ్డి నివాసానికి గ్లోబల్ ఆసుపత్రి వైద్యుల బృందం చేరుకుంది. పది రోజుల అనంతరం నిఖిల్ రెడ్డికి చికిత్స అందిస్తున్నారు. నిఖిల్ కు ఆపరేషన్ చేసిన వైద్యుడిపై తెలంగాణ వైద్య మండలి చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. 

అభయగోల్డ్ స్కాంపై సీఐడీ నివేదిక...

విజయవాడ : అభయగోల్డ్ కుంభకోణంపై కాసేపట్లో జిల్లా కోర్టులో సీఐడీ నివేదిక సమర్పించనుంది. 9వేల పేజీలతో నివేదికను సీఐడీ రూపొందించింది. 3లక్షల మంది మందికి పైగా ఖాతాదారులున్నట్లు, రూ. 173 కోట్ల డిపాజిట్ లు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈకేసులో మొత్తం 23 మందిని నిందితులుగా సీఐడీ తేల్చింది. ఏ 1 నిందితుడు శ్రీనివాస్ కు చెందిన రూ. 1.70 కోట్ల నగదు, ఖరీదైన వాహనాలు, 700 ఎకరాలకు పైగా భూములతో పాటు పలు స్తిరాస్తులను సీజ్ చేసినట్లు సీఐడీ డీఎస్పీ భాస్కరరావు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఆస్తులన్నీ బాధితుల ఖాతాల్లో డిపాజిట్లు చెల్లిస్తామన్నారు. 

10:52 - November 7, 2016

గుంటూరు : వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి దేవినేని విరుచుకుపడ్డారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ టీడీపీ అని పునరుద్ఘాటించారు. జై ఆంధ్రప్రదేశ్‌ సభ జగన్‌ ఎందుకోసం పెట్టారో తెలియడం లేదన్నారు. అవినీతి డబ్బుతో సభకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని..ఎక్కడెక్కడి నుంచి సేకరించారో అవినీతి లెక్కలు కూడా బయటపెడతామన్నారు.

10:49 - November 7, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమాక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ పెద్ద ఊరట లభించింది. ఈ మెయిల్స్‌ కుంభకోణంలో హిల్లరీ పాత్రకు సంబంధించి ఆధారాలు లభించలేదని ఎఫ్బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ బి. కామీ అమెరికా పార్లమెంటు కాంగ్రెస్‌లో ప్రకటించారు. హిల్లరీపై ట్రంప్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఎఫ్ బీఐ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు లభించలేదని చెప్పారు. దీంతో హిల్లరీపై నేరాభియోగాలను నమోదు చేయలేమని జేమ్స్‌ బి. కామీ ప్రకటించారు. ఈమేరకు పార్లమెంటులోని వివిధ కమిటీలకు జేమ్స్‌ బి. కామీ లేఖలు రాశారు. అయితే దీనిపై రిపబ్లికన్లు మండిపడుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థి ట్రంప్‌ను దెబ్బకొట్టేందుకు డెమోక్రాట్లు ఆడిన నాటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌కు ముందు ఎఫ్ బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ బి. కామీ ఈ ప్రకటన చేయడాన్ని రిపబ్లికన్లు తప్పుపడుతున్నారు. 

10:46 - November 7, 2016

హైదరాబాద్ : భీమిలి సబ్ రిజిష్ట్రార్ సంజీవయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో వనస్థలిపురంలోని విజయపురి కాలనీలో సంజీవయ్య నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖపట్టణం, ఒంగోలు ఇలా ఏకకాలంలో ఐదు ప్రాంతాలలో ఏసీబీ దాడులు చేపట్టింది. ఈ దాడులలో రూ.5లక్షల నగరదు, బంగారు, వెండి ఆభరణాలను అధికారులు గుర్తించారు. సరూర్ నగర్ లో భార్యపేరిట ఓ అపార్ట్ మెంట్..ప్రకాశం జిల్లాలో భూమలుకు సంబంధించిన డాక్యుమెంట్లు ..అలహాబాద్ బ్యాంక్ లో ఓ లాకర్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. 

కారేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం..

ఖమ్మం : కారేపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా మ్యాజిక్ - లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 

ప్రొ.లక్ష్మీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ..

గుంటూరు : ప్రొఫెసర్ లక్ష్మీ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. మూడో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు విచారించనుంది. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో లక్ష్మీ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం లక్ష్మీ పరారీలో ఉన్నారు. 

షోపియాన్ లో ఎదురు కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : షోపియాన్ లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు..ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాది హతం కాగా ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. 

10:29 - November 7, 2016

చిత్తూరు : కమలేష్‌ అనే ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేణిగుంట నారాయణ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న కమలేష్ అనే విద్యార్థి హాస్టల్‌లోని తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పలమనేరుకు చెందిన కమలేష్‌ నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. యాజమాన్యం కమలేష్‌ను తిరుపతి సమీపంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతిచెందాడు. చదువు విషయంలో అధ్యాపకుల ఒత్తిళ్ల కారణంగానే కమలేష్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా కమలేష్ కాలేజ్ టాపర్ గా కూడా పేరుంది.కమలేష్ మార్కులను చూసిన కళాశాల యాజమాన్యం ఉచిత సీట్ ను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కమలేష్ రూమ్ లో సుదీర్ఘమైన సూసైడ్ నోట్ కూడా లభించింది. లేఖలో ఎవరిమీద ఎటువంటి ఆరోపణలు లేవు.. తాను చనిపోకపోతే పెద్ద తప్పు జరుగుతుందనీ..నా చావుకు ఎవరూ కారణం కాదని..తాను చనిపోతున్నందుకు తల్లిదండ్రులకు క్షమాపణ కోరుతున్నట్లుగా వుంది. కానీ 99 శాతం మార్కులతో కాలేజ్ టాపర్ గా వున్న..సున్నిత మనస్కుడుగా వున్న  కమలేష్ ఆత్మహత్య మాత్రం మిస్టరీగా వుంది. మరోవైపు కమలేష్ తల్లిదండ్రులు మాత్రం ఈ విషయంపై స్పదించటానికి ఆసక్తి చూపటంలేదు. 

భీమిలి సబ్ రిజిష్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

పశ్చిమగోదావరి : భీమిలి సబ్ రిజిష్ట్రార్ సంజీవయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖపట్టణం, ఒంగోలులో తనిఖీలు చేస్తున్నారు. 

10:12 - November 7, 2016

హైదరాబాద్ : పవిత్ర కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం నుంచే భక్తులు భారీగా ఆలయాలకు బారులు తీరారు. నదీజలాల్లో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి.

10:02 - November 7, 2016

ఢిల్లీ : అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న నగరాల్లో కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం జనాన్ని భయపెడుతోంది. దీంతో మరో మూడు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మళ్లీ వాహనాలకు సరి-బేసి విధానాన్ని ప్రారంభించాలని ఆప్‌ సర్కార్‌ నిర్ణయించింది.

ఢిల్లీలోని 1800 మున్సిపల్‌ పాఠశాలల సెలవు
దేశ రాజధానిలోని వాయు కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యాణాల్లో పంట పొలాల్లోని గడ్డిని దహనం చేస్తుండటంతో కొద్ది రోజులుగా ఢిల్లీలో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. సురక్షిత పరిమితికి మించి 17 రెట్లు ఎక్కువగా అక్కడి గాలి కలుషితం అవుతోంది. దీంతో సాధారణ జన జీవననానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాయు కాలుష్య నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని 1800 మున్సిపల్‌ పాఠశాలలు తెరుచుకోలేదు. మరో మూడు రోజులపాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మళ్లీ వాహనాలకు సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు వాయుకాలుష్యంపై కేంద్ర సాయం కోరారు.

పర్యావరణ మంత్రులతో సమావేశం
అటు కేంద్రం కూడా పొరుగు రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో సమావేశం నిర్వహించింది. గడ్డి దహనాన్ని అడ్డుకోవాలని సమావేశంలో రాష్ట్రాలకు సూచించింది. ఢిల్లీలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి నెలకొందని.. దీనిపై సత్వర చర్యలు అవసరమని కేంద్రం భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. అక్కడి వాయుకాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఓ గ్యాస్‌ ఛాంబర్‌లా మారిపోయిందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినవి చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. వాహనాల వాడకం తగ్గించి పౌరులు ప్రజా రవాణాపై మొగ్గుచూపాలని కోరారు.

 

09:57 - November 7, 2016

గుంటూరు : పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్‌ లక్ష్మి బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ కోర్టులో విచారణ సాగనుంది. మూడో అదనపు మెజిస్ట్రేట్‌ కోర్టు విచారించనున్నది. ప్రస్తుతం ప్రొఫెసర్‌ లక్ష్మి పరారీలో ఉండటంతో ఆమె కోసం 5 పోలీస్‌ బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రొఫెసర్‌ లక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. మెడికో సంధ్యారాణి ఆత్మహత్య..ఈ నేపథ్యంలో ఆమె భర్త ఆత్మహత్యాయత్నం, ప్రొ.లక్ష్మి పరారీ విషయం తెలిసిందే..మరోవైపు లక్ష్మికి సన్నిహితులవాదన మరోలా ఉంది.. 30ఏళ్లపాటు వైద్యవృత్తిలో నిబద్దత కలిగిన వైద్యురాలిగా ఆమెకు పేరుంది.. మూడేళ్లనుంచి ఓ తరహా మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది... అప్పటికప్పుడే అందరిపై నోరు పారేసుకోవడం... ఇష్టంవచ్చినట్లు కేకలు పెట్టడం, చిన్న చిన్న తప్పులకే సిబ్బందికి చివాట్లు పెట్టడంతో విద్యార్థులు, సిబ్బంది భయపడిపోయారు.. సహ ప్రొఫెసర్లుకూడా ఆమెతో మాట్లాడాలంటేనే టెన్షన్ పడే పరిస్థితి ఏర్పడింది.. ఇలా ప్రవర్తించడంసరికాదని... సన్నిహితులు లక్ష్మికి సలహా ఇచ్చినట్లు సమాచారం.. ఈసూచనలపై స్పందించిన లక్ష్మి తాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో అర్థం కావడంలేదని చెప్పినట్లు తెలుస్తోంది.. ఒక దశలో తీవ్రంగా మధనపడి ప్రొఫెసర్ వృత్తికి రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం.. ఇంతలో సంధ్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె మరింత చిక్కుల్లో పడింది... ప్రస్తుతం పరారీలో ఉన్న లక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌ కేసు ఈ నెల 7కు వాయిదాపడింది.. ఈ నేపథ్యంలో ఈరోజు మేజిస్ట్రేట్ కోర్టులో లక్ష్మి బెయిల్ అంశంపై విచారణ జరుగనుంది.

09:50 - November 7, 2016

హైదరాబాద్‌ : నగరంలో మందుబాబుల ఆగడాలు రోజు రోజు కూ మితిమీరిపోతున్నాయి. అర్థరాత్రి వరకూ తెరిచి వున్న వైన్ షాపులు..తాగి తూగుతున్న నగర ప్రజలు రాత్రంతా వీధుల్లో తిరుగుతు అరాచకాలు సృష్టిస్తున్నారు. తాగి వాహనాలు నడుపుతు పలువరి ప్రాణాలను తీస్తున్నారు. మరికొంతమంది వీరి నిర్లక్ష్యానికి బలైయిపోతున్నారు. తాగి వాహనాలు నడుపుతు కొంతమంది సృష్టించి గలాటాకు ఓ చిరుద్యోగి గాయాలపాలయ్యాడు. ఈ ఘటన నగర శివారులోని అల్వాల్ లో చోటుచేసుకుంది. అల్వాల్ లో మందుబాబులు రెచ్చిపోయారు. మద్యం సేవించి కారు నడుపుతూ పిజా ఉద్యోగిని ఢీకొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఘటనలో మద్యం మత్తులో బైకిస్ట్ ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి.  

09:44 - November 7, 2016

విశాఖ : ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోంది. అవకతవకలను ప్రశ్నించిన సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం, బీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌లను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇంకా చాలామందిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. పోలీసుల తీరుపై సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

09:40 - November 7, 2016

తెలంగాణలో దాదాపు రెండున్నర లక్షల మంది బియిడి నిరుద్యోగులు, 80 వేల మందికిపైగా డియిడి నిరుద్యోగులున్నారు. 2012 తర్వాత ఉపాధ్యాయ నియామకాలు జరగలేదు. ఇన్ని వేల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అవస్థపడుతున్నారు. దాదాపు పాతికవేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా వున్నట్టు నిరుద్యోగ బియిడి సంఘాల నేతలు చెబుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయ నియమకాల ప్రక్రియను టిఎస్‌పిఎస్సీకి అప్పగించడంపైనా నిరుద్యోగ బియిడీలు తప్పుబడుతున్నారు ఈ నేపథ్యంలో డిఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలంటూ నిరుద్యోగ బియిడి, డియిడి అభ్యర్థుల సంఘాలు పోరుబాట పట్టాయి. నవంబర్‌ 15 న విద్యాశాఖ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు నిరుద్యోగ బియిడి అభ్యర్థుల సంఘం నేత మధుసూదన్‌ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

09:37 - November 7, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల రాకతో నియోజకవర్గాల నిధుల కేటాయింపుపై అయోమయ పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లాల అమలుతో ఒక్కో నియోజకవర్గం రెండుకు పైగా జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. దీంతో వీటికి నిధులను ఏ ప్రాతిపదికన విడుదల చేయాలన్న సందిగ్ధత నెలకొంది. దీనిపై దృష్టిసారించిన అధికారులు తీవ్ర కసరత్తుల తర్వాత ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు.

కొత్త జిల్లాల రాకతో నియోజక వర్గ నిధుల కేటాయింపై సందిగ్ధత
కొత్త జిల్లాల రాకతో నియోజక వర్గాల్లో కన్‌ఫ్యూజన్ మొదలైంది. ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులపై సమస్యలు నెలకొన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలోని దాదాపు 30 కంటే ఎక్కువ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల్లోకి వెళ్లాయి. దీంతో సీడీపీ నిధులను ఏవిధంగా ఖర్చు చేయాలన్న అంశంపై కలెక్టర్లలో సందేహం చోటుచేసుకుంది. ఈ అంశంపై సుదీర్ఘ కసరత్తులు చేసిన ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. సీడీపీ అభివృద్ధి నిధులు..నియోజక వర్గ కేంద్రం ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా కలెక్టర్‌ ద్వారా ఖర్చు చెయ్యాలని నిర్ణయించింది.
ఎమ్మెల్యే ప్రతిపాదన మేరకు నియోజకవర్గ నిధుల కేటాయింపు
ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం నియోజక వర్గ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న జిల్లా కలెక్టర్ సీడీపీ నిధులను విడుదల చేస్తారు. ఒక నియోజక వర్గం రెండు, మూడు జిల్లాల్లో ఉంటే ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే ప్రతిపాదనల మేరకు అభివృద్ధి పనులను కలెక్టర్ మంజూరు చేయాలి. ఇప్పటికే నిధులు విడుదలై పనులు పూర్తికానిచోట కొత్తగా ఏర్పడిన జిల్లా కలెక్టర్ పీడీ అకౌంట్‌లో ఆ నిధులను జమ చేస్తారు. ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీలలో విడుదల చేసిన నిధుల వినియోగం తరువాత ఏవైనా మిగిలితే అవికూడా కొత్త జిల్లా కలెక్టర్ పీడీ అకౌంట్‌కు పంపించాలి. నిధులతోపాటు యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇప్పటికే పనులకు అనుమతి ఇచ్చి వివిధ దశలలో ఉంటే ..ఆ నిధులు ఏ జిల్లా పరిధిలో ఉంటే ఆ జిల్లా పరిధిలోకి బదిలీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సీనియర్ ఐఏఎస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
కొత్త జిల్లాల్లో పరిపాలనాపరంగా వస్తున్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. దీంతో ఇందుకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

 

09:34 - November 7, 2016

చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన 'జై ఆంధ్రప్రదేశ్‌' బహిరంగ సభలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరుపై వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు... కేసుల నుంచి బయటపడేందుకు 5 కోట్ల ప్రజల జీవితాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఘాటు విమర్శలు చేశారు. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో గఫూర్ (సీపీఎం నేత) శ్రీరాములు (టీడీపీ నేత),అడ్డేపల్లి శ్రీధర్(బీజేపీ నేత) కరణం ధర్మశ్రీ (వైసీపీ నేత)పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న నేతలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..సమగ్ర సమాచారం తెలుసుకోండి..

09:19 - November 7, 2016

జయశంకర్ : పోడు భూములపై తెలంగాణ ప్రభుత్వం అధికార ఝలుం ప్రదర్శిస్తోంది. ఏళ్ల తరబడి పోడు భూముల్ని సాగుచేసుకుంటున్న రైతులపై అటవీశాఖ అధికారులు దాడులు చేసి మరోసారి తమ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. రైతులపై దాడులు చేయడమే కాదు..పంటలను సైతం ధ్వంసం చేశారు. జయశంకర్‌ జిల్లా ఏటూరునాగారంలో పంటలను ధ్వంసం చేసిన అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు.

100 ఎకరాల్లో పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతులు
జయశంకర్ జిల్లా ఏటూర్ నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం శివారులోని పోడుభూముల్లో రైతులు సాగు చేస్తున్న పెసరు, పల్లి పంటలపై అటవీశాఖ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి పంటను ధ్వంశం చేశారు. సుమారు 100 ఎకరాలలో ఉన్న పల్లి, పెసరు మొక్కలనును తొలగించారు. రైతులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

20 రోజుల క్రితమే పంటలను ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులు
సుమారు 20ఏళ్లుగా పెసర,పల్లి పంటలను ఇక్కడి రైతులు సాగుచేస్తున్నారు. రెండు నెలల క్రితం ఈ పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు హరితహారంపేరుతో మొక్కలు నాటడానికి రాగా రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆదివారం సైతం మరోసారి డీఎఫ్‌వో పురుషోత్తం ఇతర అధికారులు కలిసి సుమారు అరెకరం మేర పెసర మొక్కలను పీకేశారు. అయితే విషయం తెలుసుకున్న రైతులు..హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అటవీశాఖ అధికారులను నిలదీశారు. రైతులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వావాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అధికారుల తీరుపై మండిపడ్డ రైతులు
అప్పులు చేసి పోడు భూముల్లో పంటలు సాగు చేసుకుంటుండగా అటవీశాఖ అధికారులు ఇలా పంటలను ధ్వంసం చేయడం ఏంటని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏళ్ల తరబడి పోడు భూముల్ని సాగుచేసుకుంటుంటే..సీఎం కేసీఆర్‌కు మాత్రం తమ భూములపైనే కన్నుపడిందని రైతులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు...ఘటనాస్థలానికి చేరుకొని జరిగిన ఘటనను ఆరాతీశారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించుకోవాలని రైతులు, అధికారులకు సూచించారు. దీంతో పోలీసుల సూచన మేరకు రైతులు, అటవీశాఖ అధికారులు శాంతించి వెనక్కి వెళ్లిపోయారు.

 

09:15 - November 7, 2016

రాజన్న సిరిసిల్ల : తెలంగాణలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. తెల్లవారింది మొదలు..రాత్రివరకు యథేచ్చగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు మాఫియాగాళ్లు. అధికారులు, పోలీసుల అండదండలతో వందలు, వేల టన్నుల ఇసుకను అమ్ముకొంటూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరగడంలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడి సొంత నియోజకవర్గంలోనే ఇసుక మాఫియా బరితెగిస్తోంది.

70 ట్రాక్టర్లు ..ఒక్కో రోజు 100 ట్రాక్టర్లు
ఇక్కడ చూడండి. ఇదేదో జాతరకు వెళ్తున్నట్లుగా ట్రాక్టర్లు ఒకదాని వెనుక మరొకటి ఎలా క్యూ కట్టాయో. ఇలా ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా 70 ట్రాక్టర్లు. ఒక్కో రోజు వీటి సంఖ్య 100దాకా ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ ట్రాక్టర్లన్నీ నాన్‌స్టాప్‌గా ట్రిప్పుల మీద ట్రిప్పులు కొడుతూనే ఉంటాయి.

ఉదయం 5 నుంచి మొదలు ..మధ్యాహ్నం 1 గంట వరకు తరలింపు
తెల్లవారుజామునుంచే ఇసుక రాయుళ్లు మేల్కొని ప్రకృతి సంపదను ఎలా కొల్లగొడుతున్నారో చూడండి. మరి ఇదంతా జరుగుతుంది ఎక్కడో కాదు..సాక్షాత్తూ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్లా జిల్లా నియోజకవర్గంలోనే. ఉదయం 5 అయిందంటే చాటు..సిరిసిల్ల శివారులోని సాయినగర్‌ మానేరు నది ప్రాంతం ట్రాక్టర్ల మోతతో దద్దరిల్లుతుంది.

సిరిసిల్లలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
70, 80 ట్రాక్టర్లు నిత్యం ఇలా మానేరు నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుంటాయి. అయితే ఆదివారం కూడా ఇలాంటి దృశ్యాలనే చూసిన స్థానికులు..మీడియాకు సమాచారం అందించారు. వెంటనే మీడియా మానేరు నది వద్దకు చేరుకొని అక్రమంగా ఇసుక తరలిస్తున్న దృశ్యాలను చిత్రీకరించింది. మరోవైపు ఇదే విషయాన్ని స్థానికులు పోలీసులకు కూడా చేరవేయగా..పోలీసులు గంట తర్వాత తాపీగా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కొంతమంది ఇసుక మాఫియాగాళ్లు ఇసుకను అక్రమంగా అడ్డాలకు తరలించగా..మరికొంతమంది ఎక్కడికక్కడ ఇసుకను డంప్‌ చేసి పారిపోయారు. చివరకు మిగిలిన రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకొని వాటిని స్టేషన్‌కు తరలించారు.

పోలీసుల అండదండలతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతుందని స్థానికులు ఆరోపణ
మరి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న విషయం ఉన్నతాధికారులు, పోలీసులకు తెలియదా అంటే..పైకిమాత్రం తెలియదనే బుకాయిస్తుంటారు. కానీ..ఈ ఇసుక దందా అంతా వారి కనుసన్నల్లోనే జరుగుతోందనేది వాస్తవమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోలీసుల అండదండలతో రెచ్చిపోతున్న మాఫియా
ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి వాగులు, వంకలు, నదులు జలకల సంతరించుకోవడంతో రైతులు సంబరపడ్డారు. కానీ వీరి ఆశలన్నీ ఇలాంటి ఇసుక మాఫియాగాళ్ల ఆగడాలతో అడియాశలవుతున్నాయి. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్‌ అక్రమ ఇసుక మాఫియాపై స్పందించి ఇసుక మాఫియాగాళ్లపై చర్యలు తీసుకొని నదిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. 

09:13 - November 7, 2016

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు.. మూడోసారీ.. దావోస్‌ వార్షిక సదస్సులో ప్రసంగించనున్నారు. జనవరి 17 నుంచి 20వరకు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 47వ వార్షిక సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడానికి.. ఈ సదస్సును వేదికగా చేసుకోవాలని చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. 'దావో'యి చంద్రబాబు

2017 సమావేశాల్లో చంద్రబాబుకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆహ్వానం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వరుసగా మూడోసారి దావోస్‌ నుంచి ఆహ్వానం అందింది. గతంలో దావోస్‌ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో చంద్రబాబు వివిధ అంశాలపై ప్రసంగించారు. తాజాగా వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక 47వ వార్షిక సదస్సులోనూ ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు చంద్రబాబును కోరారు. ఈ మేరకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం మేనేజ్‌మెంట్ బోర్డు మెంబర్‌ ఫిలిప్‌ రోజియర్‌ చంద్రబాబుకు లేఖ రాశారు. స్పందించే బాధ్యతాయుత నాయకత్వం అనే అంశంపై చంద్రబాబు ప్రసంగించనున్నారు.

రక్షణ, వైమానిక, ఇంధన, వైద్య పరికరాల తయారీ తదితర సంస్థల అధిపతులతో భేటీ
గతంలో జరిగిన రెండు వరుస సదస్సుల్లోనూ చంద్రబాబు.. ప్రపంచ దేశాల మంత్రులు, అంతర్జాతీయ సంస్థల అధిపతులను కలిసి రాష్ట్రానికి పెట్టుబడులను స్వాగతించారు. రక్షణ, వైమానిక, ఇంధన, ఆతిథ్య, వైద్య పరికరాల తయారీ, మౌలిక సదుపాయాల కల్పన, బహుళార్థ ఆర్థిక సంస్థలు, రవాణా, నౌకాయాన, ఐటీ సెక్టార్లలో ప్రపంచ దిగ్గజ సంస్థల అధిపతులతో ముఖ్యమంత్రి సమావేశాలు జరిపారు. ఆ సదస్సుకు మన దేశం నుంచి హాజరైన ఒకే ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రత్యేక గౌరవాన్ని పొందారు.

దావోస్ సదస్సు ద్వారా రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరేలా వ్యూహరచన
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యల వలయంలో కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో పరిష్కార మార్గాన్ని చూపేందుకు 2017 వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సు కీలకం కానుందని భావిస్తున్నారు. సమాజానికి ఆందోళన కలిగిస్తున్న సంక్లిష్టతల గురించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గురించి దావోస్ సదస్సు కీలక చర్చలు చేయనుంది. ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా రాష్ట్రానికి ప్రయోజనాలు రాబట్టాలని ప్రభుత్వం ఆశిస్తోంది. సదస్సుకు ఒక రోజు ముందే జ్యూరిచ్ వెళ్ళి అక్కడ అంతర్జాతీయ వాణిజ్య వేత్తలు, పెట్టుబడిదారులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపేందుకు.. పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

 

దేవాదులపై నేడు హరీష్ రావు సమీక్ష..

హైదరాబాద్ : దేవాదుల ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జలసౌధలోని సమావేశ మందిరంలో ప్రాజెక్టు పనుల పురోగతి, భూసేకరణపై అధికారులతో సమీక్షించనున్నారు. దేవాదుల ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం(పీఎంకేఎస్‌వై) కింద ఎంపికైన విషయం విదితమే.

6గురు మహిళల్ని ఢీకొన్న రైలు..

బీహార్ : ఆరుగురు మహిళలు ఘోర ప్రమాదంలో మృత్యుఒడికి చేరారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో పూజలు ముగించుకుని వెళ్తున్న మహిళల్ని ఓ రైల్వే స్టేషన్ పట్టాలను దాటుతున్న వేళ వేగంగా దూసుకొచ్చిన రైలు అందరి ప్రాణాలనూ తీసింది. ఈ ఘటన బీహార్ లో జరిగింది. రామ్ బంద్రాపూర్ రైల్వే స్టేషన్ లో పూజలు చేసి వస్తున్న ఈ ఆరుగురినీ రైలు ఢీకొనడంతో వారి కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించామని రైల్వే పోలీసులు వెల్లడించారు.

కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు..

హైదరాబాద్ : కార్తీక సోమవారం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులతో పంచారామాలు పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల కోసం సోమేశ్వర, క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోష్పాదక్షేత్రం, వలందరరేవుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం, తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయం, యాదాద్రి జిల్లాలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

Don't Miss