Activities calendar

08 November 2016

అధికార దుర్వినియోగం : ప్రధాని మోడీ

ఢిల్లీ : అధికార దుర్వినియోగంతో అనేక మంది భారీగా సంపాదించారని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. నిజాయీతిపరులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. సాధారణ పౌరుడు అత్యంత నిజాయితీగా జీవిస్తున్నాడని కొనియాడారు. అవినీతి అనుపానులు తెలిసినవాడే అవినీతికి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. అవినీతి, నల్లధనం, దొంగనోట్లు, ఉగ్రవాదం.. దేశ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. 

అన్ని వర్గాల అభివృద్ధే మా లక్ష్యం : ప్రధాని మోడీ

ఢిల్లీ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఒక వెలుగు రేఖ అని ఐఎంఎఫ్‌ చెప్పిందని మోడీ తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. దేశం నల్లధనం, అవినీతిలో చిక్కుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. 

21:39 - November 8, 2016

ఢిల్లీ : బ్లాక్ మనీ నిరోధానికి కేంద్రప్రభుత్వం కఠినచర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా రూ.500, వేయి నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. ఈ అర్ధరాత్రి నుంచి 500, వేయి నోట్ల రద్దుతో పాటు... ప్రింటింగ్ కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల వద్దనున్న వేయి, 500 రూపాయల నోట్లను.. ఈనెల 10 నుంచి డిసెంబర్ 31లోగా... బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకోవాలని... జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో మోడీ ప్రకటించారు. మరోవైపు రేపు బ్యాంకులు, ఏటీఎం పనిచేయవని కూడా తెలిపారు. అప్పటికి కుదరని వారు... మార్చి 31లోపు ఆర్బీఐకి సరైన ఆధారాలు చూపి... మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. అవినీతి అనుపానులు తెలిసినవాడే అవినీతికి పాల్పడుతున్నాడని మోడీ వ్యాఖ్యానించారు. అవినీతి, నల్లధనం, దొంగనోట్లు, ఉగ్రవాదం..దేశ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్‌ మనీ నిరోధానికి కఠిన చర్యలు తప్పవని ప్రధాని స్పష్టం చేశారు. నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 30 వరకు.. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డబ్బులు డిపాజిట్‌ చేసుకోవచ్చని మోడీ ప్రకటించారు. రేపు, ఎల్లుండి ఏటీఎంలు, బ్యాంకులు బంద్‌ చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. రోజుకు రూ.10వేలకు మించి డ్రా చేయరాదన్నారు. వారానికి రూ.20వేలు మాత్రమే డ్రా చేసే అవకాశం ఉందని తెలిపారు. 
త్వరలో రూ.500, రూ. 2000 నోట్లు చలామణి 
త్వరలో రూ.500, రూ. 2000 నోట్లు చలామణిలోకి వస్తాయన్నారు. బ్లాక్‌ మనీ నిరోధానికి కేంద్రప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడున్న 500, 1000 రూపాయల నోట్లను తీసుకుని.. కొత్తగా విడుదల చేసే నోట్లను ఇవ్వనున్నారు. ఆర్‌బీఐ కొత్తగా 500, రెండు వేల నోట్లను విడుదల చేయబోతోంది. చిప్ సౌకర్యంతో ఈ నోట్లను నకిలీకి ఆస్కారం లేకుండా విడుదల చేసేందుకు ఆర్బీఐ సిద్ధమవుతోంది. 
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఒక వెలుగు రేఖ : ప్రధాని
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఒక వెలుగు రేఖ అని ఐఎంఎఫ్‌ చెప్పిందని మోడీ తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. దేశం నల్లధనం, అవినీతిలో చిక్కుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగంతో అనేక మంది భారీగా సంపాదించారని తెలిపారు. నిజాయీతిపరులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. సాధారణ పౌరుడు అత్యంత నిజాయితీగా జీవిస్తున్నాడని కొనియాడారు. అవినీతి అనుపానులు తెలిసినవాడే అవినీతికి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. అవినీతి, నల్లధనం, దొంగనోట్లు, ఉగ్రవాదం.. దేశ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. బ్లాక్ మనీ నిరోధానికి కేంద్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందన్నారు. నేటి అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్ల ముద్రణ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 31 డిసెంబర్ లోగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.500, రూ.1000 నోట్లను జమ చేయాలని ఆదేశించారు. బ్యాంకుల్లో జమ చేసేటప్పుడు ఐడీ కార్డు తప్పనిసరి పేర్కొన్నారు. రోజుకు రూ.10 వేలకు మించి విత్ డ్రా చేయరాదన్నారు. వారానికి రూ.20 వేలకు మించి విత్ డ్రా చేయరాదని చెప్పారు. రేపు, ఎల్లుండి ఏటీఎంలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో కొత్త రూ.500, రూ.

21:14 - November 8, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. బ్లాక్ మనీ నిరోధానికి కేంద్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని మోడీ చెప్పారు. నేటి అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్ల ముద్రణ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 31 డిసెంబర్ లోగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.500, రూ.1000 నోట్లను జమ చేయాలని ఆదేశించారు. బ్యాంకుల్లో జమ చేసేటప్పుడు ఐడీ కార్డు తప్పనిసరి పేర్కొన్నారు. రోజుకు రూ.10 వేలకు మించి విత్ డ్రా చేయరాదన్నారు. వారానికి రూ.20 వేలకు మించి విత్ డ్రా చేయరాదని చెప్పారు. రేపు, ఎల్లుండి ఏటీఎంలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో కొత్త రూ.500, రూ. 2000 నోట్లు చలామణిలోకి వస్తాయని చెప్పారు. 
ఆడిటర్ చౌదరి...
'కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బట్టి నల్లధనం అరికట్టేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటారని ప్రజలు ముందే ఊహించారు.
విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు
రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేస్తే చాలా పరిణామాలుంటాయి. ఇది ఆలోచించకుండా చేసిన పని. భారత దేశం రూపాయికి మాత్రం విలువ ఉండదు. సామాన్యులకు కష్టాలు తప్పవు అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:00 - November 8, 2016

ధర్మానికి పిరాయించిన పిరాయింపు కేసు.... పార్టీలు మార్పిచ్చి పర్శానుజేపిచ్చిన చంద్రులు, నర్సిమ్మసామి మీద కేసీఆర్ భక్తి... జనానికి ఎన్నడు దొర్కునో సారు భుక్తి, అమెరికాల అట్టర్ ప్లాపై టంప్ పట్లు..ముందు ఫలితంలనే ఇల్లరీ అమ్మ హిట్టు, అవుతారం మార్చిన గుంటూరు బిచ్చగాళ్లు.. అయ్యప్పను గోల్ మాల్ జేస్తున్న బచ్చగాళ్లు, కరుమూర్తిసామికి కుదిరిన జోడు చెప్పులు...ముప్పై రోజుల పండుగల జేయొద్దు తప్పులు, ఆకాశంలున్న గాలిమోటర్ల పాము...వామ్మో మళ్ల ఈ ఇమానంల రాము, ఆకాశంలో ఉన్న గాలిమోటర్ల పాము..వామ్మో ఇంకో సారి మోటర్ల రాము, ఆవుకు శ్రీమంతం... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:44 - November 8, 2016

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఓ సెంటిమెంట్‌ ఉంది. అధ్యక్ష ఎన్నికలు మంగళవారం నాడే జరుగడం విశేషం. అమెరికా గత 150 ఏళ్లుగా ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది. నవంబర్‌లో వచ్చే మంగళవారమే ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు?
ఎన్నికలకు, మంగళవారానికి ఓ సెంటిమెంట్‌ 
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు, మంగళవారానికి ఓ సెంటిమెంట్‌ ఉంది. మనం నమ్మినా నమ్మకపోయినా అక్కడ అధ్యక్ష ఎన్నికలు మంగళవారం నాడే జరుగుతాయన్నది నిజం. యుఎస్‌ ప్రెసిడెంట్‌ ఎన్నికలు ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతాయి. నాలుగేళ్ల తర్వాత నవంబర్‌లో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం నాడు ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 19వ శతాబ్దం నుంచి ఈ తంతు కొనసాగుతోంది.
మంగళవారం ఎన్నికలు జరపాలని 1845లో కాంగ్రెస్‌ నిర్ణయం 
అమెరికా అధ్యక్ష ఎన్నికలను నవంబర్‌ నెలలో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం ఎన్నికలు జరపాలని 1845లో కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఆ సమయంలో కాంగ్రెస్ దీనికి సంబంధించి ఓ బిల్లు కూడా పాస్‌ చేసింది. రైతులను దృష్టిలో పెట్టుకుని నవంబర్‌లో ప్రెసిడెన్షియల్‌ ఎన్నికలు జరిపాలని అప్పట్లో కాంగ్రెస్‌ ఖరారు చేసింది. 
మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తే వ్యవసాయంపై తీవ్ర ప్రభావం 
ఎండ వేడి అధికంగా ఉండే వసంత రుతువులో అంటే మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తే వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో నవంబర్‌ నెలను కాంగ్రెస్‌ డిసైడ్‌ చేసింది. ఇక మంగళవారం విషయంలో కూడా ఓ ప్రత్యేకత ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లను దృష్టిలో పెట్టుకుని మంగళవారం పోలింగ్‌ జరపాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.  19 వ శతాబ్దంలో ఇప్పుడున్నంత టెక్నాలజీ, ఇన్ని రవాణా సదుపాయాలు అందుబాటులో లేవు. ఓటు వేసేందుకు ప్రజలు గుర్రాలపై వచ్చేవారు.
మంగళవారమే మంచి రోజని అమెరికా కాంగ్రెస్‌ ముహూర్తం 
ఎన్నికల ప్రక్రియ ఒకరోజు కంటే ఎక్కువ సమయం తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ రోజుల్లో రైతులు శనివారాలు కూడా పొలాల్లో పనిచేసేవారు. అందుకే ఆదివారం రెస్ట్‌ తీసుకునేవారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు చాలామంది చర్చికి వెళ్లేవారు. హాలీడే రోజు జాలీగా గడిపేందుకని మంగళవారాన్ని ఎంపిక చేశారు. అధికశాతం ప్రజలు ఎన్నికల్లో పాల్గొనేందుకు మంగళవారమే మంచి రోజని అమెరికా కాంగ్రెస్‌ ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఇదండీ... 

 

20:28 - November 8, 2016

కృష్ణా : విజయవాడ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఇబ్రహీంపట్నం సమీపంలోని మూలపాడులో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నిర్మించిన గోకరాజు లైలా గంగరాజు క్రికెట్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా వన్డే, టీ20 క్రికెట్ మ్యాచ్ లు వరుసగా జరగనున్నాయి. ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకూ ఈ మ్యాచ్ లను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇండియా, వెస్టిండీస్ క్రికెట్ మహిళా క్రికెటర్లు రెండ్రోజులుగా స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. భారతదేశంలో అత్యంత అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలో ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ లు జరగడం ఆనందదాయకమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఇవాళ అర్ధరాత్రి నుంచి రూ.500, 1000 నోట్ల ముద్రణకు అనుమతి రద్దు : మోడీ

ఢిల్లీ : ఇవాళ అర్ధరాత్రి నుంచి రూ.500, 1000 నోట్ల ముద్రణకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపారు. 

 

20:19 - November 8, 2016

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పద్మిని మూర్తి, అమెరికా ఎన్నికల స్టాటజిస్ట్ హరి కాసుల, విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు పాల్గొని, మాట్లాడారు. ఇవి హిస్టారిక్ ఎన్నికలని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై వక్తలు భిన్నవాదనలు వినించారు. ఫలితాలు హిల్లరీ క్లింటన్ వైపు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:57 - November 8, 2016

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై అధ్యయనం చేసేందుకు ఆరుగురు సభ్యులున్న కేంద్ర బృందం ఏపీ,తెలంగాణలో పర్యటించనుంది. ఈ నెల 11నుంచి 14వరకు ఈ బృందం పర్యటన సాగనుంది. 11, 12వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో, 13,14వ తేదీల్లో తెలంగాణలో బృందం పర్యటించి వరద నష్టం వివరాలు సేకరించనుంది. తమ రాష్ట్రంలో 1139 కోట్ల రూపాయల నష్టం వాటిలినట్లు ఏపీ తెలపగా... 700కోట్ల రూపాయల పంటనష్టం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రాధమిక నివేదిక సమర్పించాయి. వీటి ఆధారంగా కేంద్ర బృందం పర్యటించి... కేంద్రానికి తుది నివేదిక అందించనుంది. 

 

19:55 - November 8, 2016

హైదరాబాద్ : అమరావతి నిర్మాణాలకు పర్యావరణ అనుమతుల మంజూరును సవాల్‌ చేస్తూ... గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపించారు సీనియర్‌ న్యాయవాది రిత్విక్‌ దత్తా. ఇంతపెద్ద ప్రాజెక్టు ఏ కేటగరి కింద పరిగణించబడుతుందని, రాష్ర్టస్థాయి పర్యావరణ సంస్థకు అనుమతులు జారీచేసే పరిధి ఉండదన్నారు. 500 హెక్టార్లకు పైబడితే కేంద్రమంత్రి స్థాయి పర్యావరణ అధ్యయనం బృందం పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. తదుపరి వాదనలను గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రేపటికి వాయిదా వేసింది. 

 

మిడ్ నైట్ ఓటింగ్ లో ట్రంప్ పై చేయి

అమెరికా : మూడు చిన్న పట్టణాల్లో జరిగిన మిడ్ నైట్ ఓటింగ్ లో ట్రంప్ పై చేయి సాధించారు. 3 పట్టణాల్లో కలిసి ట్రంప్ కి 7 ఓట్ల ఆధిక్యత లభించింది. హిల్లరీకి 25 ఓట్లు పోలయ్యాయి. మిల్స్ ఫీల్డ్ లో  ట్రంప్ 12 ఓట్ల అధిక్యత సాధించారు. 

పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీ విచారణ

గుంటూరు : అమరావతి రాజధాని పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్లను ఎన్జీటీ విచారించింది. మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ పిటిషన్ పై వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాది రిత్విక్ దత్తా రాష్ట్ర స్థాయి పర్యావరణ సంస్థకు అనుమతులిచ్చే అధికారం లేదని వాదన వినిపించారు. 

సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో దారుణం

హైదరాబాద్ : సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో దారుణం జరిగింది. మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫొటోలను ఫేస్ బుక్ లో పెడతామని బెదిరించి విద్యార్థిని నుంచి విద్యార్థి ఆకాశ్ రెడ్డి రూ.5 లక్షలు వసూలు చేశాడు. ఆకాశ్ రెడ్డిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. 
 

 

లొంగిపోయిన 94 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు

ఒడిషా : మల్కన్ గిరి ఎస్పీ ఎదుట 94 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. ఏవోబీ ఎన్ కౌంటర్ లో దమయంతి గాయపడింది. 

 

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

భద్రాద్రి : టేకులపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. తమ చావుకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆయన భార్య లక్ష్మీ కారణమని సూసైడ్ నోట్ రాశారు. 

 

18:40 - November 8, 2016

హైదరాబాద్ : ఆస్తుల ముందు రక్త సంబంధాలు కానరాకుండా పోతున్నాయి...సికింద్రాబాద్‌లో ఇంటి విషయంలో గొడవ అక్కాతమ్ముళ్ల మధ్య వైరాన్ని పెంచింది.. ఏళ్లుగా వారిద్దరి ఘర్షణలు చివరకు ఒకరి హత్యకు దారి తీసింది... అక్క కుటుంబంతో సహా వచ్చి తమ్ముడితో పాటు మరదలిని బిల్డింగ్‌పై నుంచి తోసేశారు..ఈ దారుణం సికింద్రాబాద్‌లో కలకలం రేపింది..
సికింద్రాబాద్‌లో దారుణం
ఆస్తి...దీని కోసం జరిగిన ఘర్షణ చివరకు హత్యకు దారి తీసింది...కొన్నాళ్లుగా జరుగుతున్న గొడవలు అక్కాతమ్ముళ్ల మధ్య వైరంగా మారింది...చివరకు దుర్మార్గులుగా మారినవారే దంపతులను హత్య చేసేందుకు వెనుకాడలేదు..అందరూ చూస్తుండగానే బిల్డింగ్‌పై నుంచి తోసేశారు...సికింద్రాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీలో జరిగిన ఘోరం ఆత్మీయాభిమానాలను ప్రశ్నిస్తుంది.
వాటా కోసం అక్కాతమ్ముళ్ల మధ్య గొడవ
సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేటలోని ఐడీహెచ్‌ కాలనీలో ఏడాది క్రితం చంద్రప్రకాష్ దంపతులకు సెకండ్ ఫ్లోర్ లోని 23వ నెంబర్ ఇంటిని ప్రభుత్వం మంజూరు చేయడంతో ఇక్కడే భార్యాపిల్లతో ఉంటున్నారు...చంద్రప్రకాష్ వెల్డింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భర్త సంపాదనకు తోడు .. ఇతని భార్య జయశ్రీ సెక్యూరిటీగార్డుగా పనిచేసేది..ఈ దంపతులకు పదో తరగతి చదివే సుదీప్, ఏడో తరగతి చదివే పదమూడేళ్ల మాధురిలు ఉన్నారు...చీకటి పడుతున్న సమయంలో దంపతులు ఇంటికి చేరారు. పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు.
దంపతులను ఈడ్చుకెళ్లి తోసివేత..
కాలనీలోని ఈ ఇల్లు అక్క మీరాబాయి,తమ్ముడు చంద్రప్రకాశ్‌ల ఉమ్మడి ఆస్తిగా ఉంది..దీని విషయంలో ఇద్దరి మధ్య కొన్నాళ్గుగా గొడవలు జరుగుతున్నాయి..గతంలో కూడా దాడులు జరిగగా...కోర్టువరకు వెళ్లింది వీరి పంచాయితీ... మళ్లీ తమ్ముడి ఇంటిమీదకు వచ్చిన మీరాబాయి ఆమె కుమారుడు చింటూ,కూతురు కీర్తి, అల్లుడు బబ్లూ  ఇంట్లోకి జొరబడ్డారు. వచ్చీ రావడంతోనే గొడవపడసాగారు. ఆవేశంలో చంద్రప్రకాష్ ను, అతని భార్య జయశ్రీలను ఇంట్లోంచి బయటికి లాగి.. రెండో అంతస్తుపైనుంచి కిందకు ఎత్తిపడేశారు...జయశ్రీ అక్కడికక్కడే మృతి చెందగా...చంద్రప్రకాష్ తీవ్రంగా గాయపడ్డాడు...వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమంగానే ఉంది.
రక్తపు మడుగులో దంపతులు 
జరిగిన ఘటనతో ఉలిక్కిపడ్డ కాలనీవాసులు వచ్చి చూడగా రక్తపు మడుగులో దంపతులు కన్పించారు. వారిని తోసేసిన రాక్షసులు మాత్రం పారిపోయారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. వివరాలు తెలుసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
భయంతో వణుకుతున్న పిల్లలు 
ఈ ఇంటిలో తనకు వాటా ఉందని గొడవపడుతున్న మీరాబాయ్‌తో వేగలేక కోర్టు నుంచి ఇన్ జెక్షన్ ఆర్డర్ తీసుకుని చంద్రప్రకాష్ ఉంటున్నాడు. ఇప్పుడు న్యాయస్థానంలో ఈకేసు విచారణలో ఉంది. ఈ లోపే ఇంతటి ఘోరానికి పాల్పడింది మీరాబాయి. తల్లి చనిపోయి.. తండ్రి ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో వారి పిల్లలు భయంతో వణుకుతున్నారు.

 

18:32 - November 8, 2016

హైదరాబాద్ : ఖ‌రీఫ్ పూర్తైనా.. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు క‌ర‌వు స‌బ్సిడీ నిధులు అందించ‌క పోవ‌డంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. కేంద్రం ప్రక‌టించిన 720 కోట్ల రూపాయల క‌రువు నిధులు ఏమ‌య్యాయ‌ని ఆయ‌న ప్రశ్నించారు. గ్రామాల్లో ఎన్ ఆర్ జీఎస్ కూలీల‌కు కూడా చెల్లింపులు చేయ‌డం లేద‌ని ఆయ‌న ఫైరయ్యారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల‌పై స‌మీక్ష చేయాల‌ని  కేంద్రమంత్రి బండారు ద‌త్తాత్రేయ‌కు లేఖ రాశానని జీవ‌న్ రెడ్డి తెలిపారు. రైతుల‌కు ఇస్తున్న విడ‌త‌ల వారి రుణ‌మాఫీతో ఒరిగేది ఏమీలేద‌ని.. ఇది రైతుల‌ను మ‌రింత అప్పులు పాల‌చేస్తుందని జీవ‌న్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

 

18:27 - November 8, 2016

మహబూబ్ నగర్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని హోంమంత్రి నాయిని నరస్సింహారెడ్డి స్పష్టంచేశారు. నయీం కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందన్నారు. మహబూబ్‌నగర్‌లో కొత్తగా నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని.. పోలీసులకు ప్రజలు సంపూర్ణ సహకారాలు అందించాలని కోరారు. 

 

18:07 - November 8, 2016
17:48 - November 8, 2016

ఢిల్లీ : ఇండియా నుంచి పాకిస్తాన్‌కి తప్పిబోయిన మూగ బాలిక గీత తమ కుమార్తేనని డీఎన్‌ఏ టెస్ట్‌లో తేలుతుందనే నమ్మకం తమకు ఉందంని కిష్టయ్య, గోపమ్మ దంపతులు అన్నారు. విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదేశాల ప్రకారం ఢిల్లీలో డీఎన్‌ఏ టెస్ట్‌కి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. వారు తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:39 - November 8, 2016

మహబూబ్ నగర్ : ఉత్సవం దగ్గర పడితే.... స్వామివారి పాదుకల తయారీలో పడతారు.. ఎంతో నియమ నిష్టలతో..భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు. జాతరలో వాటిని ఊరేగించి.. ప్రత్యేకపూజలు నిర్వహించి.. స్వామివారికి సమర్పిస్తారు. భగవంతుడిని సేవించేందుకు కుల, మతాలు అడ్డురావని చాటుతారు. ఇంతకీ ఈ పాదుకలు చేసేది ఎవరు.. సమర్పించేది ఏ స్వామికి..? 
ప్రత్యేక ఆకర్షణగా స్వామివారి పాదుకలు
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం, కురుమూర్తి దేవాలయంలో ఉద్దాలోత్సవం ఘనంగా ప్రారంభమైంది. అయితే 30రోజులు పాటు సాగే ఈ ఉత్సవంలో స్వామివారికి సమర్పించే పాదుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రత్యేకంగా తయారుచేసిన పాదరక్షలను ఐదుసార్లు ఊరేగించి.. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. స్వామివారి ఈ పాదుకలను తిలకించడానికి భక్తులు కూడా ఎగబడతారు. హరిజనులు వారం రోజుల పాటు ఎంతో నియమ నిష్టలతో.. ప్రత్యేకంగా వీటిని తయారు చేస్తారు. 
అత్యంత వైభవంగా ఉద్దాల మహోత్సవం
చిన తిరుపతిగా పేరొందిన ఈ ఆలయంలో వెంకటేశ్వరస్వామి..కురుమూర్తిస్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. అయితే ప్రతి ఏటా స్వామి బ్రహ్మోత్సవాలను..అందులో ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో స్వామివారికి పాదుకల తయారీ సమర్పణ.. కీలకం. స్వామివారు.. లక్ష్మీదేవితో ఈ ప్రాంతానికి విహారానికి వచ్చినప్పుడు.. కాలికి ముళ్లు గుచ్చుకుని బాధపడ్డారని.. తన పాదముద్రను రాత్రి ఇసుకలో వేయగా.. వడ్డెమాన్‌ గ్రామ దళితులు దాని ఆధారంగా పాదుకలు తయారు చేశారని చెబుతారు. నేటికీ పాదుకలు తయారు చేసే బాధ్యతను స్థానిక దళితులు కొనసాగిస్తున్నారు. 
స్వామివారి అలంకరణలో ప్రతి సామాజిక వర్గం భాగం 
జాతర సమయంలో స్వామివారి అలంకరణలో ప్రతి సామాజిక వర్గం భాగమవ్వడం ఇక్కడ విశేషం. దళితులు స్వామివారి పాదుకలను తయారుచేయడమే కాదు.. ఉద్దాల మండపం పూజారులుగా కూడా వ్యవహరిస్తారు.. అలాగే విశ్వకర్మలు అలంకార వస్తువులను.. పద్మశాలీలు స్వామివారి వస్త్రాలను తయారు చేస్తారు. ఈ విధంగా స్వామి కరుణకు అందరూ పాత్రులవుతామని భక్తులు నమ్ముతారు. 

 

17:34 - November 8, 2016

హైదరాబాద్ : టీడీపీ రైతు పోరుయాత్రపై మంత్రి జూపల్లి విమర్శలు గుప్పించారు. టీడీపీ యాత్ర పచ్చటి పొలాల్లో మిడతల దండు పడినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. విద్యుత్‌ బకాయిలు వసూలుకు లక్ష మంది రైతులపై కేసులు నమోదు చేసిన చరిత్ర టీడీపీది అని మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ హయంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. అప్పుడు రైతుల కోసం ఎందుకు ఉద్యమించలేదని జూపల్లి ప్రశ్నించారు. 

 

17:32 - November 8, 2016

గుంటూరు : మెడికో సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలైన ప్రొ.లక్ష్మికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు. బెయిల్ పిటిషన్‌పై గుంటూరు జిల్లా కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రేపటికి వాయిదావేశారు.

శబరిమలలో ప్లాస్టిక్ ను నిషేధించాలి - ఇంద్రకరణ్..

కేరళ : దక్షిణాది రాష్ట్రాల దేవాదాయ శాఖ మంత్రుల సదస్సు జరిగింది. శబరిమలలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. శబరిమలలో ప్లాస్టిక్ ను నిషేధించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా భక్తులతో పాటు అందరూ సహకరించాలని సూచించారు. తెలంగాణ నుండి వచ్చే భక్తులకు హెల్త్ సెంటర్, ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటు చేయాలని ఇంద్రకరణ్ పేర్కొన్నారు. 

కోదండరాంపై బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు...

హైదరాబాద్ : ప్రొ.కోదండరాంపై ఎంపీ సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోదండరాం రహస్యంగా సోనియా గాంధీతో ఎందుకు సమావేశమయ్యారని, జులై 16, 17 తేదీల్లో సోనియాతో సమావేశం తరువాతే మల్లన్న సాగర్ రైతులను రెచ్చగొట్టారని ఆరోపించారు. కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్ గా మారారని, కావాలనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. కోదండరాం ఉద్యమకారుడి ముసుగులో టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఆడుతున్న నాటంకలో కోదండరాంది శిఖండి పాత్ర అని, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలనే కోదండరాం సంక్షేమ పతకాలపై బురదజల్లుతున్నారని పేర్కొన్నారు.

17:26 - November 8, 2016

అమెరికా : న్యూహ్యాంప్‌షైర్‌లోని మూడు చిన్న పట్టణాల్లో జరిగిన మిడ్‌నైట్‌ ఓటింగ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక్కడ రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. అర్థరాత్రి పోలింగ్‌ ప్రారంభమైన మూడు గ్రామాలు డిగ్జివిల్లే నాచ్‌, హార్ట్స్‌ లొకేషన్‌, మిల్లీస్‌ఫీల్డ్‌లలో ట్రంప్‌ ఆధిక్యాన్ని సాధించారు. ట్రంప్‌ 32 ఓట్లు, డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ 25 ఓట్లు గెలుచుకున్నట్లు యూఎస్‌ఏ టుడే వెల్లడించింది. ఈ మూడు వూళ్లలో కలిపి వంద మంది కంటే తక్కువ ఓటర్లు ఉంటారు. తొలి ఫలితం విడుదలైన డిగ్జివిల్లే నాచ్‌లో హిల్లరీ 4-2 ఓట్ల తేడాతో ట్రంప్‌పై విజయం సాధించారు. హార్ట్స్‌ లొకేషన్‌ టౌన్‌లో హిల్లరీ 17-14 ఓట్ల తేడాతో ట్రంప్‌ను ఓడించారు.  అయితే మిల్లీస్‌ఫీల్డ్‌లో ట్రంప్‌ 16-4 ఓట్ల తేడాతో హిల్లరీపై ఘన విజయం సాధించారు. మొత్తం మూడు ప్రాంతాల్లో కలిపి ట్రంప్‌కు 32 ఓట్లు రాగా... హిల్లరీకి 25 ఓట్లు వచ్చాయి. అమెరికాలో టైమ్‌జోన్ల తేడా వల్ల కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ జరుగుతుండగానే, కొన్ని చోట్ల ఫలితాలు విడుదలవుతుంటాయి. 

 

17:18 - November 8, 2016

యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వందో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని 'బాలకృష్ణ' ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చారిత్రక నేపథ్యంలో దర్శకుడు 'క్రిష్' తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిలిం సెట్ లో జరిగిన షూటింగ్ ఫొటోలు సందడి చేస్తున్నాయి. ఓ ఫొటోలో బాలయ్య..శ్రియలు కనిపిస్తున్నారు. ఇందులో శ్రియ కోయ గెటప్ లో కనిపిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, శ్రియలు దంపతులుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా బాలీవుడ్ అలనాటి అందాల నటి 'హేమమాలిని' ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. 

17:11 - November 8, 2016

యాదాద్రి : యాదాద్రి టెంపుల్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్ రెండోరోజు సమీక్ష నిర్వహించారు. యాదాద్రి టెంపుల్‌ సిటీ నిర్మాణంపై కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రధాన గుట్టకు సమీపంలో 30 ఎకరాల్లో కార్ల పార్కింగ్‌, 10 ఎకరాల్లో బస్సుల పార్కింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. 35 ఎకరాల్లో బస్‌ డిపో, పోలీస్‌, ఫైర్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ఫుడ్‌ కోర్డులను నెలకొల్పాలని కేసీఆర్ సూచించారు. ఆలయానికి మరోవైపు 25 ఎకరాల్లో పూలతోట, 50ఎకరాల్లో కళ్యాణ మంటపం, ప్రవచన వేదిక నిర్మించాలన్నారు. గుట్టపై నుంచి కిందికి డ్రైనేజీ వ్యవస్థ, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. టెంపుల్‌ సిటీలో భక్తులకు మంచి వసతి కల్పించేదుకు 100 ఏసీ రూంలు, 100 నాన్‌ ఏసీ రూంలు, 100 ఉచిత రూంలు, డార్మెటరీ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ అన్నారు. ప్రధాన గుట్టపైనే 2వేల కార్లు పార్కు చేసే విధంగా ఎస్కలేటర్‌ సౌకర్యంతో మల్టీ లెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని కూడా కేసీఆర్ సూచించారు.

 

17:08 - November 8, 2016

హైదరాబాద్ : ఎపికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఎపిసిసి అధ్యక్షుడు రఘవీరారెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని ఇంకా సజీవంగానే ఉందన్నారు. ఏపీలో ముగిసిన అధ్యాయం టీడీపీ, బీజేపీలేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేకహోదా ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీలు ఇచ్చేది కాదని ఇదీ ఆంధ్రుల హక్కు అని రఘవీరా రెడ్డి అన్నారు. 

సూర్యాపేట కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత...

సూర్యాపేట : జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని కలెక్టరేట్ ను తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థులు ముట్టడించారు. కలెక్టరేట్ లోకి దూసుకెళ్లి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. 

17:02 - November 8, 2016

విజయవాడ : వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చే రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వాలని నీతిఆయోగ్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విజయవాడలోని హోటల్ గేట్ వేలో నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా, సీఈవో అమితాబ్ కాంత్‌ను చంద్రబాబు కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం డ్యాష్ బోర్డు దేశంలో అత్యుత్తమమైనదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కొనియాడారు. డ్యాష్ బోర్డు చూసి తామే చాలా నేర్చుకున్నామన్నారు. గ్రామ స్థాయిలో రియల్ టైంలో గ్రోత్ రేట్‌ను సేకరించి... ప్రతి త్రైమాసికానికి వివరాలు వెల్లడిస్తున్నామని చంద్రబాబు.... నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాకు తెలియజేశారు. ఎడ్యూకేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో తమకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు చంద్రబాబు. మూడు గంటలకు పైగా జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర అంశాలపై నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పణగారియాకు స్వయంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు.  కోస్టల్ ఎకనామిక్ అండ్ ఎంప్లాయిమెంట్ జోన్ ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై సమావేశంలో కూలంకుశంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఒంటరి కాదని, అండగా ఉంటామని చెప్పారు నీతి ఉపాధ్యక్షుడు అరవింద్‌ పణగారియా తెలిపారు. 

 

16:47 - November 8, 2016
16:46 - November 8, 2016
16:44 - November 8, 2016

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భూమికి ఎంతో దూరంలో ఉన్న ఓ అంతరిక్ష శాస్త్రవేత్త అందరికన్నా ముందే తన ఓటుహక్కును  వినియోగించుకున్నారు. షేన్‌ కింబ్రౌ అంతరిక్షం నుంచి  తన ఓటుహక్కు వినియోగించుకున్నట్లు నాసా వర్గాలు వెల్లడించాయి.  షేన్‌ కింబ్రౌ అక్టోబర్‌ 19న సోయుజ్‌ రాకెట్‌లో ఫోర్త్‌ మిషన్‌ రీసెర్చ్‌ కోసం ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కి వెళ్లారు.  అయితే కింబ్రౌ తన ఓటును ఎలా పంపారో, ఎవరికి ఓటు వేశారన్న వివరాలు మాత్రం నాసా వెల్లడించలేదు.1997 నుంచి నాసా శాస్త్రవేత్తలు అమెరికా ఎన్నికల్లో అంతరిక్షం నుంచి తన ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. డేవిడ్‌ ఉల్ఫ్‌ అనే వ్యక్తి మొదటి సారి అంతరిక్షం నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

16:40 - November 8, 2016

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చివరి దశలో ట్రంప్‌, హిల్లరీ హోరా హోరీ ప్రచారం చేశారు.  రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌పై ఒబామా విరుసుకుపడితే.... హిల్లరీ మాత్రం పార్టీ విధానాలను వివరించి, చివరి ప్రచారంలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. దేశ భవిష్యత్‌కు అంత్యంత కీలకమైన ఎన్నికల్లో వివేకంతో ఓటేయాలని ట్రంప్‌ కోరారు. 
హిల్లరీ, ట్రంప్ సరప్పర విమర్శలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి ఘట్టంలో అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ హామీలు, పరస్పర విమర్శలతో హోరెత్తించారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి మద్దతుగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెన్సిల్వేనియా, ఫిలడెల్ఫియా జరిగిన ప్రచారం సభలో పాల్గొన్నారు. 
హిల్లరీకి ఓటు వేయాలన్న ఒబామా 
ఈ ఒక్కసారి తనను నమ్మి హిల్లరీకి ఓటు వేయాలని మిచిగాన్లో ఎన్నికల ర్యాలీలో ఒబామా విజ్ఞప్తి చేశారు. చరిత్ర సృష్టించే అవకాశం అరుదుగా వస్తుందని, దీన్ని వదులుకోవద్దన్నారు.  ప్రపంచమంతా మనవైపే  చూస్తోందని ఒబామా అన్నారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్ ఏ మాత్రం అర్హుడు కాడని మరోసారి ధ్వజమెత్తారు.  
ఫిలిడెల్ఫియాలో హిల్లరీ ప్రసంగం
ఫిలిడెల్ఫియాలో జరిగిన భారీ సభలో ఓటర్లను ఉత్సాహ పరుస్తూ హిల్లరీ ప్రసంగించారు. అమెరికాకు భవిష్యత్తులో మంచి రోజులున్నాయంటూ భరోసా ఇచ్చారు. ట్రంప్‌ లూజ్‌ కేనన్‌ లాంటివారని బలమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. హిల్లరీ ఇమ్మిగ్రెంట్లు, ఆఫ్రికన్లు, ముస్లింలు, మహిళల ఓటర్లపై దృష్టి పెట్టారు. 
హిల్లరీని దుయ్యబట్టిన ట్రంప్ 
రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ న్యూహ్యాంప్‌షర్‌ ప్రచార సభలో హిల్లరీని దుయ్యబట్టారు. ఈ మెయిల్స్ వ్యవహారంలో హిల్లరీ తప్పుచేసినట్టు ఎఫ్బీఐకి ముందే తెలుసని  ఆరోపించారు. హిల్లరీని ఎఫ్‌బిఐ రక్షించే ప్రయత్నం చేసిందని చెప్పారు. మీ వెంటే ఉంటా...మీ కోసం పోరాడుతా... మీకోసం విజయం సాధిస్తాననని ట్రంప్ అన్నారు. మనమందరం కలిసి అమెరికాను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.
ఓటర్లను ఆకర్షించేందుకు హిల్లరీ, ట్రంప్‌లు ప్రయత్నం
‍ప్రచారం చివరి రోజు హిల్లరీకి మద్దతుగా ఒబామాతో పాటు ఆయన భార్య మిచెల్లి ఒబామా, హిల్లరీతో పాటు ఆమె కుమార్తె చెల్సియా, భర్త క్లింటన్‌ పాల్గొన్నారు. ఆఖరు ప్రచారంలో ఓటర్లను ఆకర్షించేందుకు హిల్లరీ, ట్రంప్‌లు ప్రయత్నించారు. ఓటర్లు ఎవరివైపు మొగ్గుతారన్నది మరి కొద్ది గంటల్లో తేలనుంది.

 

16:34 - November 8, 2016
16:31 - November 8, 2016

హైదరాబాద్ : డెంగ్యూ మహమ్మారి తెలంగాణలో విలయ తాండవం చేస్తోంది. పల్లె పట్టణం అన్న తేడా లేకుండా పంజా విసురుతూ మరణ మృదంగం మోగిస్తోంది. డెంగ్యూ జ్వరాల విజృంభణతో ఏజెన్సీ ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. సరైన సమయంలో వైద్యం అందక జనం అల్లాడిపోతున్నారు. మరోవైపు డెంగ్యూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రాష్ట్రంలో డెంగ్యూ పూర్తిగా అదుపులో ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
ఖమ్మం జిల్లాలో పదుల సంఖ్యలో మృత్యువాత
తెలంగాణలో డెంగ్యూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో జనం పదుల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. డెంగ్యూతో జనం చనిపోతున్నా.. అదేమీ ప్రాణాంతకమైన జబ్బు కాదని ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది.
డెంగ్యూ దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న జనం  
రాష్ట్రంలో డెంగ్యూ దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. పలు ప్రాంతాల్లో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు విష జ్వర పీడితులతో  కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు డెంగ్యూ బూచి చూపి డబ్బులను దండుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెంగ్యూ నిర్దారణ పరీక్ష కేంద్రాల కొరత..సరిపడా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరిగా జనం ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన  పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఖమ్మం జిల్లాలో డెంగ్యూ మరణ మృదంగం మోగిస్తోంది. బోనకల్‌, గోవిందపురం, రావినూతల తదితర ప్రాంతాల్లో డెంగ్యూ ఫీవర్‌ దడపుటిస్తోంది. 
ప్రభుత్వంపై విమర్శలు 
రాష్ట్రంలో డెంగ్యూ విలయ తాండవం చేస్తున్నా..ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటన విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా కనిపిస్తోంది. డెంగ్యూ ప్రాణాంతకం కాదని, నయం కాని జబ్బు కూడా కాదని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో డెంగ్యూ అదుపులో ఉందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డెంగ్యూ సహా అన్ని రకాల వ్యాధులను ఎదుర్కోవడానికి  ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ సర్వ సన్నద్ధంగా ఉందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో విష జ్వర బాధితులకు వైద్యం అందక మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేదని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటకయ్యాక ఆ పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. 
విష జ్వరాలు అదుపునకు విస్తృత చర్యలు : మంత్రి లక్ష్మారెడ్డి 
ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు, నల్లమల ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలను అదుపు చేసి, మరణాలను తగ్గించామంటున్నారు లక్ష్మారెడ్డి. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేసి, ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ముందు జాగ్రత్త చర్యలు..వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేయడం.. ప్రజల్లో చైతన్యం కలిగించడం వంటి చర్యలతో సత్ఫలితాలు సాధించామంటున్నారు. అయితే  ఖమ్మం జిల్లా బోనకల్, గోవిందపురం, రావినూతలలో విష జ్వరాల విజృంభణ విచారకరం అన్నారు. కొందరు  మృత్యువాత పడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. డెత్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ఇద్దరు మాత్రమే డెంగీ లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చనిపోయారని.. ఇతరులు వివిధ ఆరోగ్య సమస్యలతో మృతిచెందినట్లు తెలిపారు. 
ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
గిరిజన ప్రాంతాల్లో తక్షణ వైద్య సాయం కోసం అవసరమైతే ఎయిర్ అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతామని ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ నేతలు ఊదరగొట్టారని.. ఇప్పుడు డెంగ్యూ విజృంభిస్తున్నా సాధారాణ వాహనాలు కూడా సమాకూర్చలేకపోతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 

మంత్రులపై మండిపడిన ఎన్జీటీ...

ఢిల్లీ : పంజాబ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలపై ఏన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం నియంత్రణ చర్యలపై ప్రణాళిక లేకుండా ట్రిబ్యునల్ ఎదుట మూడు రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. మంత్రుల తీరుపై ఎన్జీటీ మండిపడింది. 

హెచ్ఎండీఏపై హైకోర్టు అసంతృప్తి..

హైదరాబాద్ : పర్యావరణంపై హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో పర్యావరణ వేత్త ప్రతాప్ రెడ్డి పిటిషన్ వేశారు. నగరంలోని పబ్లిక్, ప్రైవేటు వెంచర్ లు, పార్కుల వివరాలను తెలపాలని గతంలీఓ హెచ్ఎండీఏని హైకోర్టు ఆదేశించింది. వివరాలు ఇవ్వకపోవడంతో హెచ్ఎండీఏ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్ లో ఉత్పన్నం కావద్దని సూచించింది. హైదరాబాద్ లోని గ్రీన్ సెచ్ ఏర్పాటుకు ఎలాంటి అవకాశాలునాయో చెప్పాలని హెచ్ఎండీఏని ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. 

ఏపీ ఒంటరి కాదు అండగా ఉంటాం - పణగారియా..

విజయవాడ : ఏపీ ఒంటరి రాష్ట్రం కాదని, అండగా ఉంటామని అరవింద్ పనగారియా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలుగా సాయం అందిస్తామన్నారు. సులభతర వాణ్జియంలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. 

బాబుతో ముగిసిన పనగారియ సమావేశం..

విజయవాడ : సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియ జరిపిన భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. కోస్టల్ ఎకనామిక్ అండ్ ఎంప్లాయిమెంట్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై చర్చ జరిగింది. సీఈఈజెడ్ వల్ల తయారీ రంగం పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. చైనా మాదిరిగా భారత్ లోనూ క్లస్టర్లు ఏర్పాటుకు నీతి ఆయోగ్ ముందుకొచ్చిందన్నారు. విశాఖ, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి - ఏర్పేడు, ఓర్వకల్లు, హిందూపురం, కృష్ణపట్నంలో క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పెట్టుబడుల ఆకర్షణలో నాలుగో స్థానంలో ఏపీ ఉందన్నారు.

16:16 - November 8, 2016

గుజరాత్ : అహ్మదాబాద్‌లో ఓ కారు మితిమీరిన వేగంతో దూసుకురావడంతో.. ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. కారు స్పీడ్‌గా దూసుకురావడంతో.. రోడ్డుపై వెళ్తున్న అమ్మమ్మ, మనవరాలిని ఢీకొట్టింది. సెకన్ల వ్యవధిలో అమ్మమ్మ ప్రాణాలు కోల్పోయింది. స్వల్పగాయాలతో మనవరాలు ప్రాణాలు దక్కాయి. 

16:08 - November 8, 2016

జగిత్యాల : దొంగలమర్రి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తిగింజల బస్తాలతో  వేగంగా వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో కారులోని ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను జగిత్యాలకు చెందిన అన్న-చెల్లెలు రాష్మేందర్, రవళిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

15:47 - November 8, 2016

చిత్తూరు : జిల్లాలోని పలమనేరులోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళాశాలకు చెందిన హరీష్ అనే విద్యార్థి నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హరీష్ ఆత్మహత్యకు ప్రిన్సిపాల్ కారణమంటూ విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళశాలను ముట్టడించారు. సర్దిచెప్పబోయిన అధ్యాపకులపై వాటర్ ప్యాకెట్లతో దాడి చేశారు.  

 

15:43 - November 8, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఎపి భవన్ విభజనపై ఈనెల 15న సమావేశం జరుగనుంది. భేటీకి రావాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రహోంశాఖ సమాచారం అందించింది. ఈ సమావేశానికి కేంద్రహోంశాఖ కార్యదర్శి నేతృత్వం వహించనున్నారు. అయితే విభజన చట్ట ప్రకారం 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని ఇప్పటికే హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన తర్వాత కేంద్రహోంశాఖ తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

వేములవాడలో 2వేల ఎకరాలకు సాగునీరందిస్తాం - మంత్రి హరీష్..

సిరిసిల్ల : 2018 నాటికి వేములవాడ నియోజకవర్గంలో 2వేల ఎకరాలకు సాగునీరందిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ హాయాంలో చేపట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు నత్తలు కూడా సిగ్గుపడేలా చేశారని ఎద్దేవా చేశారు. 56 ఏళ్లలో చేయలేని ప్రాజెక్టు పనులను రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని చెప్పుకొచ్చారు. 2015 నాటికి మైనార్టీ తీరిన మిడ్ మానేరు నిర్వాసితులకు వారంలోగా రూ. 2లక్షల పరిహారం చెల్లిస్తామన్నారు. 

హుస్నాబాద్ లో ఫైర్ ఆక్సిడెంట్..

సిద్దిపేట : హుస్నాబాద్ (మం) మీర్జాపూర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆర్కే బిన్నింగ్ మిల్లులో ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

15:22 - November 8, 2016

హైదరాబాద్ : 2017 ఉగాది లేదా తెలంగాణ ఆవిర్బావానికి హైదరాబాద్ మెట్రోరైలు ప్రారంభం అవుతుందని మెట్రో రైలు ఎమ్ డీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. నాగోల్..మెట్టుగూడ, మియాపూర్..ఎస్ ఆర్ నగర్ మార్గాల్లో 20కి.మీలు ప్రయాణానికి సిద్ధమైందని తెలిపారు. రైల్వే ఆర్ వోబీల వద్ద రైల్వే నుంచి సమస్యలున్నాయని చెప్పారు. పాతబస్తీ మినహా ఎక్కడా సమస్య లేదన్నారు. షెడ్యూల్ ప్రకారమే మెట్రోరైలు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎల్ ఆండ్ టీ ప్రాజెక్టు వదిలేసిందనే అపోహలు నిజం కావని తేల్చి చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఏపీ భవన్ విభజనపై త్వరలో సమావేశం..

ఢిల్లీ : ఏపీ భవన్ విభజనపై ఈనెల 15న సమావేశం జరగనుంది. భేటీకి రావాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు హోం శాఖ సమాచారం అందచేసింది. సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వం వహించనున్నారు. విభజన చట్టం ప్రకారం 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని ఇప్పటికే హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల అధికారులతో భేటీ తరువా తుది నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖ ప్రకటించనుంది. 

ఆనాటికి మెట్ రైల్ సిద్ధం - ఎండీ..

హైదరాబాద్ : 2017 ఉగాది లేదా తెలంగాణ ఆవిర్భావానికి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభించడం జరుగుతుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. తెలిపారు. నాగోల్ - మెట్టుగూడ, మియాపూర్ - ఎస్ఆర్ నగర్ మార్గాల్లో 20 కి.మీటర్లు ప్రయాణానికి సిద్ధమన్నారు. రైల్వే ఆర్ఓబీల వద్ద రైల్వే నుండి సమస్యలున్నాయన్నారు. 

15:01 - November 8, 2016
15:01 - November 8, 2016

నడుంనొప్పితో పలువురు ఎంతో బాధ పడుతుంటారు. ఎన్నో రకాలైన మందులు..వ్యాయామాలు చేసిన అప్పుడప్పుడు నడుంనొప్పి బాధ పెడుతూ ఉంటుంది. ఇందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే నడుంనొప్పి నుండి దూరం కావచ్చు.
వెన్నెముకకు బలాన్నించే వ్యాయామాలు, క్రమంతప్పకుండా చెయ్యడం వల్ల కూడా నడుమునొప్పికి చెక్ పెట్టవచ్చు.
నడుముకు ఏదైనా దెబ్బ తగిలితే నొప్పి, వాపు వస్తుంది. ఈ సమయంలో వాపు ఉన్న భాగంలో చల్లని లేదా వేడి కాపడం పెట్టడం చేయాలి. 
నడుము తీవ్రంగా నొప్పి పెడుతున్న సందర్భంలో కొంత సమయం పాటు విశ్రాంతిగా పడుకోవడం మంచిది. కానీ ఈ విశ్రాంతి కొద్ది సమయం పాటు మాత్రమే చేయాలి.
వంద గ్రాముల గసగసాలను మెత్తటి పొడిని రెండు చెంచాల మోతాదులో తీసుకుని గ్లాసు పాలలో కలుపుకొని తాగాలి.
నడుమునొప్పితో పాటుగా జ్వరం, మలబద్దకం, లేక మూత్రవిసర్జన మీద పట్టు కోల్పోవడం వంటి ఇతర సమస్యలు కూడా బాధిస్తున్నపుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
కొబ్బరి, బాదం, నీలగిరి తైలం.. ఇలా ఏదో ఒక నూనెను గోరువెచ్చగా చేసి దాంతో నొప్పి ఉన్న ప్రదేశంలో బాగా మసాజ్ చేయాలి.
నడుంనొప్పిని తగ్గించుకోవడానికి సహజసిద్ధమైన పద్ధతులతో పాటు శరీరంపై తక్కువ తీవ్రతను చూపే యోగా, ఈత.. వంటి సులభమైన వ్యాయామాలను చేయడం మంచిది.
​ నొప్పిని, వాపును తగ్గించడానికి ఐస్‌ ఎంతగానే ఉపయోగపడుతుంది. కొన్ని ఐస్ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి.. దాన్ని టవల్‌లో మూటకట్టాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో కనీసం పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. 

15:00 - November 8, 2016

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చివరి రోజు ఇద్దరు అభ్యర్థులూ ... ట్రంప్‌, హిల్లరీ హోరా హోరీ ప్రచారం చేశారు. న్యూహ్యాంఫ్‌షైర్‌లో రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ చివరి ప్రచార సభను నిర్వహించారు. దేశ భవిష్యత్‌కు అంత్యంత కీలకమైన ఎన్నికల్లో వివేకంతో ఓటేయాలని ట్రంప్‌ కోరారు. 

14:58 - November 8, 2016

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరి కొద్ది గంటల్లో జరుగనున్న తరుణంలో పోటీలో ఉన్న అభ్యర్ధులు ఇదర్దరూ చిరిగా పోటా పోటీ ప్రచారం నిర్వహించారు. యూఎస్‌ అధ్యక్షుడు ఒబామా, డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ ఫిలడెల్ఫియా జరిగిన ప్రచారం సభలో పాల్గొన్నారు. రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌పై ఒబామా విరుసుకుపడితే.... హిల్లరీ మాత్రం పార్టీ విధానాలను వివరించి, చివరి ప్రచారంలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. 
 

14:56 - November 8, 2016

హైదరాబాద్ : నగరంలోని ఇన్‌స్పయిర్‌ ఎగ్జిబిషన్‌ విద్యార్థుల్లోని ప్రతిభను బయటకుతీసింది. విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి.. మూడురోజులపాటు కొనసాగే ఈ ప్రదర్శనలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పాల్గొన్నారు.. 
ఇన్స్‌పైర్ ఎక్స్‌పోలో వివిధ రకాల ప్రదర్శనలు
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుతాలను ఆవిష్కరించారు. ఇన్స్‌పైర్ ఎక్స్‌పోలో వివిధ రకాల ప్రదర్శనలతో తమ సృజనాత్మకతను చాటిచెప్పారు. సైన్స్‌లో సరికొత్త పరిణామాలు, రైతులకు ఎంతో ఉపయోగపడే పరికరాలు, నగరాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించే కొత్త ఆలోచనలతో ప్రాజెక్టు రూపొందించారు.. మూడు రోజుల పాటే సాగే ఈ రాష్ట్ర స్థాయి ఇన్‌స్పయిర్‌ ప్రదర్శన హైద్రాబాద్ లోని సెయింట్ థెరిస్సా స్కూల్ లో  ప్రారంభమైంది..
ట్రాఫిక్ జాంకు తేలికైన పరిష్కారం 
దేశంలో వివిధ రకాల సమస్యలున్నాయి. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ జాంలతో కలిగే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ సమస్యకు చాలా తేలికైన పరిష్కారం చూపుతున్నారు సర్కారీ విద్యార్థులు. రోడ్డుకు సెన్సర్లు ఏర్పాటు చేస్తే ఎటువైపు ఎక్కువవాహనాలుంటే అటువైపు గ్రీన్‌ లైట్‌ వెలుగుతుందని సూచిస్తున్నారు. ఈ ప్రయోగం కూడా అందరినీ ఆకట్టుకుంది. అలాగే కలుషిత నీటిని వరిపొట్టు, చెక్క పొట్టు, మొక్కజొన్న కండి పొట్టు వంటి వ్యర్ధాలలతో శుద్ధిచేసి చూపాడు మరో విద్యార్థి..
రైతు సమస్యలపై సరికొత్త ఆవిష్కరణలు 
రైతు సమస్యలపై కూడా విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణలు తయారు చేశారు. వ్యవసాయ పనుల్ని వేగంగా పూర్తిచేసేందుకు మిషనరీలను కొనుగొన్నారు.. విద్యార్థులు రూపొందించిన ఓ యంత్రం.. దుక్కి దున్నడం, నీళ్లు పారించడం.. విత్తనాలు నాటడం, కలుపు మొక్కల్ని తీయడంలాంటి పనులన్నీ చేసేస్తుంది. ఈ ప్రదర్శనలు విద్యార్థుల్లోని ప్రతిభను బయటకుతీశాయి. వీరికి సరైన ప్రోత్సాహం ఇస్తే పరిశోధనల్లో మరింత రాణించే అవకాశం ఉంటుంది.

హిల్లరీపై ట్రంప్ పైచేయి..

అమెరికా : మూడు చిన్న పట్టణాల్లో జరిగిన మిడ్ నైట్ ఓటింగ్ లో ట్రంప్ పై చేయి సాధించారు. మూడు పట్టణాల్లో ట్రంప్ కు 7 ఓట్ల అధిక్యత వచ్చింది. మొత్తం ట్రంప్ కు 32 ఓట్లు పోలవ్వగా హిల్లరీకి 25 ఓట్లు పోలయ్యాయి. హిల్లరీకి డిక్స్ విల్లే నాచ్ లో 2, హాట్స్ లో 3 ఓట్ల అధ్యికత వచ్చింది. మిల్స్ ఫీల్డ్ లో 12 ఓట్ల అధిక్యాన్ని ట్రంప్ సాధించారు. 

ఏపీలో కేంద్ర బృందం పర్యటన..

ఢిల్లీ : ఏపీలో ఈనెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు కేంద్ర బృందం పర్యటించనుంది. గుంటూరు, విశాఖ జిల్లాల్లో వర్షాలు..వరదల వల్ల కలిగిన నష్టాన్ని ఎనిమిది మంది సభ్యుల బృందం అంచనా వేయనుంది. 

14:51 - November 8, 2016

నల్గొండ : ఏళ్ళ తరబడి వాయిదా పడుతూ వస్తున్న ఎలిమినేటి మాధవరెడ్డి లోలెవల్‌ కెనాల్‌కు మోక్షం కలగనుంది. ఈ నెల 9న ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టును మంత్రి హరీష్‌ రావు ప్రారంభించనున్నారు. దీంతో ఏళ్ల తరబడి ఎదురు చూస్తోన్న రైతుల కల ఫలించనుందని హరీష్‌ రావు అన్నారు. 
ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్టుకు ముహుర్తం ఖరారు 
నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రణాళిక.. మంత్రి హరీష్ రావు నిరంతర పర్యవేక్షణతో 80 వేల ఏకరాలకు నీరందించే ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్టుకు ముహుర్తం ఖరారు అయ్యింది. దశాబ్దానికి పైగా వాయిదా పడుతూ వస్తున్నఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యింది. దీంతో నాగర్జున సాగర్, మిర్యాలగూడ ప్రాంతాల్లోని రైతులకు సాగు నీటికి ఇక ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోతుందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
84వేల ఎకరాలకు సాగు నీరు 
మరోవైపు నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం చేరువలో ఉన్నప్పుడు.. గ్రావిటీ రూపంలో మిగులు వరద నీటిని తరలించి.. దాదాపు 84వేల ఎకరాలకు సాగు నీరు అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కేవలం 10వేల ఎకరాల సాగుకు మాత్రమే పరిమితమైంది. 1994లో జిల్లాలోని పెద్దవూర మండలం పుట్టిచెలిమ, పులియా తండా దగ్గర.. వరదకాల్వ నిర్మాణ పనులు ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రారంభమై.. దాదాపు 85.03 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ.. మధ్యలోని చెరువులు, కుంటలు నింపుతూ.. ఆఖరికి వేములపల్లి మండలం తోపుచర్ల సమీపంలోని నాగార్జున సాగర్ ఎడమకాల్వలో కలిసేలా డిజైన్ రూపొందించారు.  పెద్దవూర నుంచి అష్ట-కష్టాలు పడుతూ దాదాపు 84 కిలోమీటర్ల వరకు వరదకాల్వ పనుల తవ్వకాన్ని పూర్తిచేశారు. 
2015 వరకు గడువు పొడిగింపు 
జీరో కిలోమీటర్ నుంచి 63 కిలోమీటర్ల వరకు మొదటి ప్యాకేజీగా.. 63 నుంచి 84 కిలోమీటర్ల వరకు రెండో ప్యాకేజీగా విడగొట్టి పనులు చేపట్టారు. ఈ కాల్వ నిర్మాణానికి ఆనాటి టీడీపీ హయాంలో 30 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో.. 27కిలోమీటర్ల మేర వరదకాల్వ పనులు పూర్తయ్యాయి. అనంతరం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దీన్ని జల యజ్ఞంలో చేర్చింది. వరద కాల్వ పంప్ హౌజ్ నిర్మాణంలో వ్యయాన్ని పెరిగిన ధరల ప్రకారం కేటాయించి టెండర్లు పిలిచారు. ఇందులో పంప్ హౌజ్ నిర్మాణం కోసం 108కోట్ల రూపాయలు, కాల్వ నిర్మాణానికి 104 కోట్లు సైతం కేటాయించారు. అయితే ఈ పనులను 2009లోనే పూర్తి చేయాల్సి ఉన్నా.. 2015 వరకు గడువు పొడిగించారు. 
రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టుకు మోక్షం 
సాగర్ జలాశయం 575 అడుగుల కంటే తక్కువగా ఉన్నప్పుడు వరదకాల్వకు గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్లవు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోయాక దీనికి మోక్షం లభించింది. సరైన టైంలో కాల్వనిర్మాణ పనులు పూర్తవ్వకపోవడంతో.. కొన్నేళ్లుగా సాగర్ ప్రాజెక్ట్ కింద ఏటా వందలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రం కలుస్తోంది. దీంతో వరదకాల్వ పరిధిలో ఎకరానికి కూడా నీరిచ్చే పరిస్థితి లేదు. దీనికి సుమారు 1997లో 175కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం కాగా.. ప్రస్తుత వ్యయం 272కోట్లకు పెరిగింది. మొత్తానికి చాలా ఏళ్లుగా పెండింగ్‌ ఉన్న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రైతుల్లో ఏర్పడ్డ ఆసంతృప్తిని కొంతైనా తగ్గించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది.

 

యాదాద్రి టెంపుల్ సిటీపై ముగిసిన కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : యాదాద్రి టెంపుల్ సిటీపై గత రెండు రోజులుగా సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష ముగిసింది. యాదాద్రి టెంపుల్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. 10 ఏకరాల్లో బస్సుల పార్కింగ్..35 ఎకరాల్లో బస్ డిపో, పోలీస్, ఫైర్, కమర్షియల్ కాంప్లెక్స్..ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆలయానికి మరోవైపు 25 ఎకరాల్లో పూలతోట, 50 ఎకరాల్లో కళ్యాణ మంటపం, ప్రవచన వేదికల నిర్మాణం, గుట్టపై నుండి కిందకు డ్రైనేజీ వ్యవస్థ ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయాలన్నారు.

ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..

పశ్చిమగోదావరి : ఏలూరులో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న ఎస్.వి.రత్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. 

14:45 - November 8, 2016

గుంటూరు : జిల్లా ప్రభుత్వం ఆస్పత్రిలో పీజీ మెడికో డాక్టర్‌ సంధారాణి ఆత్మహత్య కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ లక్ష్మిని అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ సాంబశివరావు చెప్పారు. పరారీలో ఉన్న లక్ష్మి కోసం గాలిస్తున్నామన్నారు. లక్ష్మికి సహకరిస్తున్న వారిపై కూడా కేసులు పెడతామని చెప్పారు. 
 

14:41 - November 8, 2016


మేడ్చల్ : మంచి పొజిషన్‌లో ఉన్న ఓ వ్యక్తి బుద్ధి వక్రమార్గం పట్టింది. విధులు సక్రమంగా నిర్వహిస్తూ తోటి ఉద్యోగస్తులకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి.. మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్‌లోని ట్రాన్స్‌కో సబ్‌ డివిజన్‌ ఆఫీసులో బయటపడింది. అదే ఆఫీసులో పని చేస్తున్న మహిళా కంప్యూటర్‌ ఆపరేటర్‌.. ఏఈ మోజస్‌ తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 6 నెలల నుంచి తనను వేధిస్తున్నాడని పోలీసులకు మహిళా ఫిర్యాదు 
చేసింది. తాజాగా ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తోంది. ఇప్పటికే తన కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసినట్లు మహిళ చెబుతోంది. అతని వేధింపులతో బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని మహిళ అంటోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

14:25 - November 8, 2016

విశాఖ : ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై హైకోర్టులో గిరిజనులు పిటిషన్ దాఖలు చేశారు. లీజు ప్రక్రియను నిలిపివేయాలంటూ గిరిజనులు పిటిషన్ వేశారు. తమ హక్కులు కాపాడిన తర్వాతే లీజుకు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

చుంచుక్వారీలో అక్రమ ఇసుక దందా...

భూపాలపల్లి : మంగపేట (మం) చుంచుక్వారీలో జోరుగా అక్రమ ఇసుక దందా కొనసాగుతోంది. కోట్ల రూపాయల ఇసుక దోపిడికి కాంట్రాక్టర్లు పాల్పడుతున్నారు. క్వారీలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అధిక లోడుతో వెళుతున్న నాలుగు లారీలను అధికారులు సీజ్ చేశారు. 

హైకోర్టులో గిరిజనుల పిటిషన్..

విశాఖపట్టణం : ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై హైకోర్టులో గిరిజనులు పిటిషన్ దాఖలు చేశారు. లీజు ప్రక్రియను నిలిపివేయాలంటూ గిరిజనులు పిటిషన్ దాఖలు చేశారు. తమ హక్కులను కాపాడిన తరువాతే లీజుకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

విలీన మండలాల్లో సీపీఎం పాదయాత్ర..

తూర్పుగోదావరి : పోలవరం విలీన మండలాల్లో సీపీఎం పాదయాత్ర కొనసాగుతోంది. సీతారాంపురం వద్ద పాదయాత్రలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. పట్టిసీమ తరహాలో విలీన మండలాల రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విలీన మండలాల పర్జలను సీఎం గాలికొదిలేశారని, ముంపు మండాల నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోలవరం నిర్మాణం అడ్డుకుంటామని హెచ్చరించారు. 

14:05 - November 8, 2016

ఆత్మహత్యలు..ఇది సాధారణంగా రోజు ఏదో క సందర్భంలో ఏదో ప్రాంతంలో ఏదోక విషయంలో వినిపించే మాట..ఈ మాట సర్వసాధరణంగా మారిపోయింది.విద్యార్థులు పరీక్ష తప్పితే ఆత్మహత్య..రైతుల ఆత్మహత్యలు..వరకట్న వేధింపులతో ఆత్మహత్యలు..ర్యాంగింగ్ లతో ఆత్మహత్యలు..ఇలా ఈ మాట సర్వసాధరణంగా మారిపోయింది. రోజురోజుకూ ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మానవి వేదికలో ఆత్మహత్యలు పెరటానికి కారణాలేమిటి అనే అంశంపై చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొన్నవారు ఏం అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

14:00 - November 8, 2016

సోషల్ మాధ్యమాల్లో ఈ అంశంపై తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. 'పవన్ కళ్యాణ్' 'ధృవ' ఆడియోకు వెళుతారా ? వెళ్లరా ? అనే దానిపై తెగ చర్చ జరుగుతోందంట. ఇటీవలే ఓ కమెడియన్ చిత్ర ఆడియోకు 'పవన్' హాజరైన సంగతి తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో 'ధృవ' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో 'చెర్రీ' పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ నుండి భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్ర ఆడియోకు 'పవన్ కళ్యాణ్' హాజరవుతారా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. కమెడియన్ 'సప్తగిరి' నటించిన చిత్ర ఆడియోకు 'పవన్' హాజరైన సంగతి తెలిసిందే. 'ధృవ' ఆడియోకు మెగా హీరోలు కూడా అటెండ్ కానున్నారని తెలుస్తోంది. మరి 'పవన్ హాజరవుతారా ? లేదా ? అనేది రేపటికి తెలియనుంది. 

13:58 - November 8, 2016

అమెరికా : 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితం వెలువడింది. డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ 4-2 ఓట్ల తేడాతో ట్రంప్‌పై విజయం సాధించారు. రూరల్‌ న్యూ హ్యాంప్‌షైర్‌లోని మూడు చిన్న బస్తీల్లో అర్ధరాత్రి నుంచే పోలింగ్‌ మొదలవుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఇక్కడే పోలింగ్‌ ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ మొత్తం ఎనిమిది ఓట్లకు గాను డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ నాలుగు ఓట్లు గెలుచుకోగా, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు ఓట్లు, స్వతంత్రులు గేరీ జాన్సన్‌, మిట్టీ రోమ్నీ చెరొక ఓటును గెలుచుకున్నారు. అమెరికాలో 12 గంటల పాటు పోలింగ్‌ జరిగిన తర్వాత ఒక్కో రాష్ట్రంలో పోలింగ్‌ కేంద్రాలను మూసేస్తారు. ఆ వెంటనే కౌంటింగ్‌ మొదలవుతుంది. టైమ్‌ జోన్లు వేర్వేరుగా ఉండడం వల్ల ఒక చోట ఫలితాలు వెలువడుతున్న సమయానికి మరో రాష్ట్రంలో పోలింగ్‌ కొనసాగుతూనే ఉంటుంది.

13:55 - November 8, 2016

కొమురం భీమ్ : జల్‌, జంగల్‌, జమీన్‌పై గిరిజనులకే హక్కులు కల్పించాలనే నినాదంతో పోరాటం చేసిన యోధుడు.. కొమురం భీమ్‌. ఆయన పేరిట ఏర్పడిన నూతన జిల్లాలోనూ ఆయన ఆశయాలు నెరవేరడం లేదు. తరతరాలుగా అడవుల్లో నివాసముంటూ జీవనాధారం కోసం అటవీ భూముల్ని సాగు చేస్తున్న గిరిజనులకు.. ఆ భూములపై హక్కులు మాత్రం రావడం లేదు. రాజ్యాంగంలో కల్పించిన హక్కులు సైతం అమలుకు నోచుకోకపోవడంతో గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.

2008 చట్టం ప్రకారం.. అటవీ భూములపై హక్కులు
అడవినే నమ్ముకున్న గిరిజనులకు.. హక్కులు దూరం..ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వని అధికారులు..హక్కు పత్రాలు లేక తల్లడిల్లుతున్న అటవీ పుత్రులు ..ఇదీ.. కొమురం భీమ్‌ పేరిట ఏర్పడిన ఆసిఫాబాద్‌ జిల్లాలోని గిరిపుత్రుల దీన స్థితి. జల్‌, జంగల్‌ జమీన్‌పై గిరిజనులకే హక్కులు దక్కాలని పోరాడిన కుమ్రంభీం.. జిల్లాలోనూ ఆయన ఆశయాలు నెరవేరడం లేదు. 2008 చట్టం ప్రకారం..తాము సాగు చేస్తున్న అటవీ భూములపై హక్కుపత్రాలు వస్తాయని గంపెడాశతో ఎదురు చూస్తున్న గిరిజనులు.. ఏళ్ల తరబడిగా హక్కు పత్రాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు.

ఆసిఫాబాద్‌ 837 మంది లబ్దిదారులకు హక్కుపత్రాలు అందక ఇబ్బందులు
జిల్లాలోని 15 మండలాల్లో 837 మంది లబ్ధిదారులకు మాత్రమే హక్కుపత్రాలు ఇవ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నా...ఆ సంఖ్య మూడింతలు ఉంటుందని గిరిజన సంఘాలు పేర్కొంటున్నాయి. విచారణ పేరిట పత్రాలను ఇవ్వకుండా ఏళ్లకు ఏళ్లుగా జాప్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 15 మండలాల్లోని 177 గ్రామాలకు చెందిన గిరిజనులకు సంబంధించి.. 7,346 దరఖాస్తులకు గానూ 31,984 హెక్టర్ల సాగు భూములకు హక్కుపత్రాలు ఇవ్వాల్సి ఉంది. కానీ వీటిలో కేవలం 837 దరఖాస్తులకు మాత్రమే 2,204 హెక్టర్ల భూమి పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న గిరిజనుల్లో ఆందోళన నెలకొంది. సిర్పూర్‌ మండలంలో 187 దరఖాస్తులు, కెరమెరి మండలంలో 12 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, హక్కు పత్రాలపై అధికారుల సంతకాలు కాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికైనా హక్కు పత్రాలివ్వాలని కోరుతున్న గిరిజనులు
మరోవైపు హక్కు పత్రాలు పొందిన రైతులకూ రుణాల విషయంలో బ్యాంకుల నుంచి నిరాశే ఎదురవుతోంది. హక్కు పత్రాలపై రుణాలివ్వాలని కోరుతున్న గిరిజన రైతులకు అధికారులు మొండిచేసి చూపుతున్నారు. పత్రాలు వస్తే..బ్యాంకు రుణాలు దక్కుతాయనుకున్న రైతులకు ప్రయోజనం లేకుండా పోతోంది. దీంతో గత్యంతరం లేక గిరిజనులు దళారును నమ్మి మోస పోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా గిరిజన రైతుల సమస్యలపై దృష్టి సారించి బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

పోరుబాట పట్టనున్న గిరిపుత్రులు..
అటవీ, రెవిన్యూ శాఖలు సంయుక్త సర్వేలు నిర్వహించి రైతులకు సరిహద్దులకు సంబంధించిన రసీదులిచ్చాయి. ఏళ్లు గడుస్తున్నా... హక్కు పత్రాలు మాత్రం ఇవ్వడం లేదు. హక్కు పత్రాలున్న గిరిజనులకు బ్యాంకు రుణాలు, వివిధ ప్రభుత్వ పథకాలు వర్తించజేయాలని గిరిజనులు కోరుతున్నారు. అటవీ ఉత్పత్తులపై అధికారం కోసం పోరాటాలకు సిద్ధమవుతున్నారు.

ఢిల్లీ పోలీసులపై కన్హయ్య సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీ : పోలీసులపై జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 రోజులైనా విద్యార్థి నజీబ్ అహ్మద్ ఆచూకీ కనిపెట్టలేకపోయారని, యూనివర్సిటీలో బీరు..లిక్కర్..సిగరేట్..బీడీ పీకలు ఇలాంటివి లెక్కించడంలో మన పోలీసులు సిద్ధహస్తులని వ్యాఖ్యానించారు.
 

13:47 - November 8, 2016

అనంతపురం : కదిరి నియోజకవర్గ టీడీపీ లో వర్గ విబేధాలు భగ్గుమంటున్నాయి. వైసీపీ నుంచి టీడీపీ లోకి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌ బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విషయాల్లో పరస్పరం సహకరించుకుంటామని చెబుతూనే.. ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోవడం కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీడీపీ జనచైతన్య యాత్రల్లో ఇది మరోసారి బయటపడింది.

జిల్లా,రాష్ట్ర నాయకత్వాలకు ఫిర్యాదు..
అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతలు ఎవరికి వారే... యుమునా తీరే.. అన్న విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. వైసీపీ టికెట్‌పై గెలిచి, టీడీపీలోకి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌ బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ల మధ్య విబేధాలు ముదిరి రోజు రోజుకు దూరం పెరుగుతోంది. ఈ వ్యవహారంపై పార్టీ జిల్లా నాయకత్వం నుంచి రాష్ట్ర అధిష్టానం వరకు ఫిర్యాదులు అందినా ఎవరూ పట్టించుకోలేదన్న చర్చ నియోజకవర్గ టీడీపీలో కొసాగుతోంది. ఇద్దరు నేతలు వేర్వేరుగా కార్యక్రమాలు చేడుతోండటంతో ఎవరి వెంట వెళ్లాలో అర్థం కాక కార్యకర్తలు అయోమయానికి గురతున్నారు.

తారా స్థాయికి చేరిన విబేధాలు
కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి టీడీపీలో ఉన్న చాంద్‌ బాషా... గత ఎన్నికల ముందు పార్టీని విడిచి వైసీపీలో చేరి ఎన్నికల్ల్లో పోటీ చేసి విజయం సాధించారు. రెండేళ్ల తర్వాత మళ్లీ సొంతగూటికి వచ్చారు. దీంతో చాంద్‌ బాషా, వెంకట ప్రసాద్‌ల మధ్య తలెత్తిన విబేధాలు క్రమంగా తారా స్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి చందబాబు నియోజకవర్గంలో పర్యటనలకు వచ్చినప్పుడు మినహా... మిగిలిన సందర్భాల్లో ఎవరికి వారే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు.

భేషజాలకు పోతున్న నేతలు అయోమయంలో కార్యకర్తలు
విబేధాలను విస్మరించి ఏకతాటిపై నడుస్తామని ఇద్దరు నేతలూ ప్రస్తుతం జరుగుతున్న పార్టీ జనచైతన్య యాత్రల్లో చాంద్‌ బాషా, వెంకట ప్రసాద్‌ ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నారు. ఇద్దరు నేతలు భేషజాలకు పోవడం కార్యకర్తలను విస్మయానికి గురి చేస్తోంది.ఇద్దరి మధ్య నెలకొన్న విబేధాలు కదిరి నియోజకవర్గంలో టీడీపీకి నష్టం కలిగించేలా ఉన్నాయని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకత్వం చొరవ తీసుకుని పరిస్థితిని సరిదిద్దాలని కోరతున్నారు. 

13:42 - November 8, 2016

వనపర్తి : సీపీఎం మహాజన పాదయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. ఇప్పటి వరకు 550 కిలోమీటర్లు పూర్తి చేసుకుని అమరచింత మండలంలోకి ప్రవేశించింది. తెలంగాణలో గిరిజన జనాభా పెరిగిందని.. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న గిరిజన విద్యార్థినేత శోభన్‌ పేర్కొన్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

13:39 - November 8, 2016

విజయవాడ : ఏవోబీ ఎన్‌కౌంటర్‌ తర్వాత రాష్ట్రంలోని ప్రముఖుల భద్రత పెంచినట్టు బీజీపీ సాంబశివరావు చెప్పారు. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఉండాలని కోరామన్నారు. ఏపీ మవోయిస్టు దళాల్లో గాలికొండ దళ కమిటీ కదలికలను కనిపినట్టు డీజీపీ సాంబశివరావు చెప్పారు. 

13:35 - November 8, 2016

అనంతపురం : భూములకు ధరలు పెరుగుతున్నాయని తెలిస్తే చాలు.. భూ ఆక్రమణ దారులు పాగా వేస్తున్నారు. అవసరమైతే రికార్డుల్ని సైతం తారుమారు చేసి తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారులు ఇలాగే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో ఎంపీ ఫ్యామిలీకి సహకరించిన విఆర్ఓను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కుటుంబంపై ఆరోపణలు
అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప భూ దందా వివాదంలో కూరుకున్నారు. తప్పుడు రికార్డులు సృష్టించి.. భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఈయన ఫ్యామిలీపై ఆరోపణలు వచ్చాయి. గోరంట్ల మండలం బూదిలి రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 476లోని 13.30 ఎకరాల భూమిని హిందూపురం ఎంపీ తనయులు అంబరీష్‌, శిరీష్‌లు బలవంతంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సుంకప్ప కుమారులకు 2011లో చెన్నక్రిష్ణారెడ్డి, కదిరప్పకు విక్రయం
నిమ్మల కిష్టప్ప సొంత మండలం గోరంట్ల సమీపంలోని రెడ్డి చెరువు గ్రామం వద్ద.. సర్వే నెంబర్‌ 476లో 13.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 1920లో తమ్మినాయక్‌పల్లికి చెందిన వద్ది సుంకప్పకు ప్రభుత్వం ఈ భూమిని పట్టాగా ఇచ్చింది. ఆ తర్వాత సుంకప్ప కుమారులు మల్లేశప్ప, కిష్టప్ప, ఈరన్నలు 2011లో చెన్నక్రిష్ణారెడ్డి, కదిరప్పకు విక్రయించారు. ఈ భూమి జాతీయ రహదారికి అనుకుని ఉండటంతో విలువ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో.. ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారులు అంబరీష్‌, శిరీష్‌లు సుంకప్ప భార్య అంజినమ్మ తమకు 4.66 ఎకరాల భూమిని విక్రయించినట్లుగా రికార్డులు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఆరోపణలు ఖండించిన ఎంపీ కిష్టప్ప
తమ కుటుంబంపై వచ్చిన ఆరోపణలను హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప ఖండించారు. ఎలాంటి రికార్డులనూ తారుమారు చేయలేదని.. వ్యవసాయం కోసమే సదరు భూమిని చట్టప్రకారమే కొనుగోలు చేశానని వివరించారు.

రికార్డులు తారుమారు చేసిన వీఆర్‌వో నరసింహమూర్తి సస్పెన్షన్‌
అయితే సుంకప్ప కుమారుల నుంచి భూమిని కొన్న చెన్నక్రిష్ణారెడ్డి, కదిరప్పలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గోరంట్ల తహసీల్దార్‌ హసీనా సుల్తానా విచారణ జరిపారు. అధికారుల విచారణలో.. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుటుంబానికి అనుకూలంగా రికార్డులు తారుమారు చేసినట్లు తేలింది.

నిమ్మల కిష్టప్ప రాజీనామాకు విపక్షాల డిమాండ్‌
దీనికి కారణమైన బదిలి గ్రామ వీఆర్‌వో నరసింహమూర్తిని జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. అలాగే ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారులు చేయించిన భూమి రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితులకే భూములు అప్పగిస్తూ కలెక్టర్‌ శశిధర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఘటనతో నిమ్మల కిష్టప్ప కుటుంబం అక్రమాలకు పాల్పడ్డట్లు తేటతెల్లమైందని.. తక్షణమే ఆయన రాజీనామా చేయాలని బాధితులు, విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

సుజాత ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు..

హైదరాబాద్ : కూకట్ పల్లిలో వివాహిత సుజాత ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి యజమాని ప్రసన్నకుమార్ రెడ్డి, భార్య స్నేహలతలను మియాపూర్ కోర్టులో హాజరు పరిచారు. 

కోడిపందేలపై హైకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : ఏపీలో కోడిపందేలపై హైకోర్టులో ఓ స్వచ్చంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ వచ్చే వారానికి వాయిదా పడింది. 

13:19 - November 8, 2016

ఢిల్లీ : తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆర్టికల్‌ 226 ప్రకారం స్పీకర్‌ అధికారాలను సమీక్షించవచ్చా ? లేదా ? అనేది తెలపాలంటూ పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని సవాల్‌ చేస్తూ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని.. రెండేళ్లుగా ఈ అంశం పెండింగ్‌లో పెడుతూ వచ్చారని సంపత్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో సంపత్‌ హైకోర్టుకు వెళ్లినప్పటికీ స్పీకర్‌ అధికారాల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో సంపత్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

మోడల్ పీఎస్ లను పరిశీలించిన డీజీపీ..

గుంటూరు : నిర్మాణంలో ఉన్న రెండు మోడల్ పీఎస్ లను డీజీపీ పరిశీలించారు. నెలాఖరు కల్లా మోడల్ పీఎస్ ల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. మార్చి నాటికి రాష్ట్రంలో 100 మోడల్ పీఎస్ ల నిర్మిస్తామని, ప్రొ.లక్ష్మీ కోసం దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయన్నారు. ప్రొ.లక్ష్మీకి సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. 

తొలి ఫలితంలో హిల్లరీ అధిక్యత..

అమెరికా : అధ్యక్ష ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. న్యూ హ్యాంప్ షైర్ లో డిగ్జ్ విల్లే నాచ్ లో హిల్లరీ అధ్యికత కనబర్చింది. ట్రంప్ కంటే రెండు ఓట్ల ఆధిక్యతలో హిల్లరీ కొనసాగింది. 

ఏపీ సీఎం డ్యాష్ బోర్డు అత్యున్నతమైంది - అమితాబ్ కాంత్..

విజయవాడ : ఏపీ సీఎం డ్యాష్ బోర్డు అత్యున్నతమైందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ఏపీ సీఎం క్యాంపు ఆఫీసులో చంద్రబాబును నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగారియ, సీఈవో అమితాబ్ లు కలిశారు. డ్యాష్ బోర్డును చూసి చాలా నేర్చుకున్నామన్నారు. 

పార్టీ ఫిరాయింపు కేసు విచారణ..కీలక మలుపు..

ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు సుప్రీం వెల్లడించింది. స్పీకర్ అధికారాల అనే అంశాన్ని తేల్చాలని రాజ్యాగ ధర్మాసనాన్ని సుప్రీం కోరింది. కేసు విచారణనను ఐదుగురు జడ్జీల బెంచ్ కు బదిలీ చేసింది. 

12:39 - November 8, 2016
12:35 - November 8, 2016
12:31 - November 8, 2016

మహాత్మాగాంధీ మనవడు కానూ రాందాస్ (87) ఇక లేరు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం చేరిన ఆయన సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. పక్షవాతంతో గత నెల 22న కనూ రామ్‌దాస్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆయన కోమాలోకి వెళ్లారు. అయితే ఆయనకు మెరుగైన వైద్యం అందిచేందుకు ఎవరూ చొరవ చూపలేదని చిరకాల మిత్రుడు బాదియా ఆవేదన వ్యక్తం చేశారు.
1930 మార్చి - ఎప్రిల్ మాసంలో నిర్వహించిన 'దండి' సత్యాగ్రహం సమయంలో గుజరాత్ లోని దండి గ్రామంలో 'గాంధీ'తో కలిసి చిన్నారి 'కనూ రాందాస్ గాంధీ' నడిచివెళుతున్న ఫొటో ఎంతగానే పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలో 'గాంధీ' చేతిలో ఉన్న కర్రను 'కనూ రాందాస్' పట్టుకుని ముందుకు నడిచి వెళుతుండడం కనిపిస్తుంది. దండి సత్యాగ్రహానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉండి బతికున్న అతికొద్ది మందిలో కానూ గాంధీ ఒకరు. జాతిపిత మనవడిగా, నాసా శాస్త్రవేత్తగా ఘనమైన చరిత్ర ఉంది. కానీ ఆయనెవరూ పట్టించుకునేవారెవరూ లేక సూరత్‌లోని ఓ ట్రస్టు ఆస్పత్రిలో దీనావస్థలో గడిపారు. భార్య శివలక్ష్మి(90) తప్ప నా అనేవారెవరూ ఆయనకు లేరు. ప్రభుత్వాలు పట్టించుకోవాలని పలువురు కోరారు కూడా. కనూ రాందాస్‌ దాదాపు 40 ఏండ్ల పాటు అమెరికాలో ఉండి 2014లో భారత్‌కు వచ్చారు. నేషనల్‌ ఎరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మిషన్‌(నాసా)కు ఆయన 25 ఏండ్లపాటు సేవలందించారు. కనూ రాందాస్‌ అంత్యక్రియలు మంగళవారం(నేడు) సూరత్‌లో జరగనున్నాయి.

12:31 - November 8, 2016

హైదరాబాద్ : ఇటీవ‌ల తెలంగాణ పోలీసుల చేతిలో హ‌త‌మైన గ్యాంగ్‌స్ట‌ర్‌ నయీమ్‌ కేసులో ఛార్జిషీట్ల దాఖలుకు రంగం సిద్ధమైంది. సిట్ అధికారులు భువనగిరి కోరుట్ల రాజేంద్రనగర్ కోర్టులో 6 ఛార్జిషీట్లు దాఖలు చేయనున్నారు. ఈ కేసులో విచార‌ణ జరిపిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) మ‌రికాసేప‌ట్లో కేసులో పురోగతి, త‌మ‌ దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించనుంది. న‌యీమ్ కేసులో ఇప్పటివరకు 166 కేసులు నమోదయ్యాయి.

కేసు నివేదికను సిద్ధం చేసిన సిట్‌..
కేసు నివేదికను సిద్ధం చేసిన సిట్‌.. రేపు హైకోర్టుకు సమర్పించేందుకు రెడీ చేస్తుంది...నయీం కేసులో ఇప్పటివరకు 166 కేసులు నమోదు చేశారు...109 మంది అరెస్ట్‌ చేసిన సిట్‌.. 418 మంది సాక్షులను విచారించారు. భువనగిరి, కోరుట్ల, ఎల్బీనగర్‌, కరీంనగర్‌, జనగాం, జగిత్యాలతో పాటు పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు....అయితే ఇప్పటివరకు నమోదు చేసిన కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేయనున్నామని సిట్ చెప్పనుంది...ఇక ప్రధానంగా గ్యాంగ్‌స్టర్ కేసుల్లో సాక్షుల విచారణ జరిపిన సిట్‌ సప్లమెంటరీ చార్జిషీట్‌లో వీఐపీల పేర్లను పెట్టనున్నట్లు నివేదిక సమర్పించనుంది...

12:20 - November 8, 2016

హైదరాబాద్: రుణమాఫీ నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మూడో దశలో రెండో విడత నిధులు విడుదలయ్యాయి. రూ.2019.19 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కార్ ఎన్నికల నేపథ్యంలో ఒకే విడత రుణమాఫీ విడుదల చేస్థానని ప్రకటించిన విషయం తెలిసిందే. ధనిక రాష్ట్రమని చెప్పుకునే టీఆర్ఎస్ సర్కార్ ఇంతవరకూ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవటం పట్ల విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

12:12 - November 8, 2016

తిరుపతి : రోడ్లపై బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రి సమయంలో రేసర్ల తీరుతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా వెస్ట్ చర్చి వద్ద ఇద్దరు మహిళలను బైక్ రేసర్లు ఢీకొన్నారు. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయాలయపాలయ్యారు. దీంట్లో షర్మిల అనే యువతికి అపస్మారస్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ బైక్ రేసర్ల పట్ల చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా బైక్ రేసర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

ముందంజలో హిల్లరీ క్లింటన్..

ఢిల్లీ : అమెరికా ఎన్నికలపై సీబీఎన్ న్యూస్ పోల్స్ సర్వే నిర్వహించింది. సర్వేలో హిల్లరీ క్లింటన్ ముందంజలో ఉంది. హిల్లరీకి 46 శాతం, ట్రంప్ కు 41 శాతం మద్దతు లభించినట్లు సర్వేలో వెల్లడైంది. 

నయీం కేసులో ఛార్జీషీట్ల దాఖలుకు సిద్ధం..

హైదరాబాద్ : నయీం కేసులో ఛార్జీషీట్ల దాఖలుకు రంగం సిద్ధమైంది. రాజేంద్రనగర్, కోరుట్ల, భువనగిరి కోర్టుల్లో ఆరు ఛార్జీషీట్లను సిట్ దాఖలు చేయనుంది. 

బేగంబజార్ దోపిడి కేసులో ముగ్గురు అరెస్టు..

హైదరాబాద్ : బేగంబజార్ దోపిడి కేసులో ముగ్గురు దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రూ. 5.10 లక్షల నగదు, రెండు కిలోల గంజాయి, ఓ బైక్ తో పాటు మూడు సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

నాగం పిటిషన్ విచారణ వాయిదా..

హైదరాబాద్ : పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో అక్రమాలు జరుగుతున్నాయన్న నాగం పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది. 

భీమిలి సబ్ రిజిష్ట్రార్ ను విచారిస్తున్న ఏసీబీ..

విశాఖపట్టణం : భీమిలి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. సబ్ రిజిష్ట్రార్ సంజీవయ్యను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 

రుణమాఫీ నిధుల విడుదల..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ నిధులను విడుదల చేసింది. 2019.19 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడో విడతలోని రెండో దఫా మొత్తాన్ని విడుదల చేసింది. 

12:00 - November 8, 2016

ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయింపు నేతలకు గుండెల్లో గుబులు ప్రారంభమైంది. పార్టీ ఫిర్మాయింపులపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన నేతలకు అసెంబ్లీ స్పీకర్, పార్టీ ఫిరాయించిన నేతలకు గతంలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.అనర్హత పిటీషన్ల పరిష్కారానికి తీసుకుంటారో పూర్తి వివరాలతో మంగళవార లోపు వివరణ ఇవ్వాలని తెలంగాణ స్పీకర్ కు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా కాంగ్రెస్ నుండి పోటీచేసిన గెలిచి పార్టీ మారిన నేతలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. కాగా కాంగ్రెస్ పార్టీ నుండి..తెలుగుదేశం పార్టీ నుండి పలువురు నేతలు టీఆర్ ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. 

11:48 - November 8, 2016

కరీంనగర్ : మానవత్వం పరిమళించిన మంచి మనిషి అతను. ఉన్నంతలో నలుగురికి సాయం చేస్తూ సేవా హృదయాన్ని చాటుతూ ఆదర్శంగా నిలిచాడు. అలాంటి వ్యక్తిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. అయినా.. పుట్టెడు దుఃఖంలోనూ అతని కుటుంబం మానవత్వంతో ఆలోచించింది. భౌతికంగా దూరమైనా.. అతని అవయవాలు మరొకరికి ప్రాణదానం చేస్తాయన్న మానవతా దృక్పథంతో.. అవయవ దానానికి అంగీకరించి ఆదర్శంగా నిలిచారు.

రోడ్డు ప్రమాదానికి గురై రాంమోహన్ రావు తలకు తీవ్రగాయాలు
కరీంనగర్ జిల్లా సప్తగిరి కాలనీకి చెందిన ఇతని పేరు జోగినిపల్లి రాంమోహన్ రావు. బోయినపల్లి మండలం వెంకట్రావు పల్లిలో రూసో విద్య సంస్థలో ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ గా పని చేస్తున్నారు. కళాశాలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై రాంమోహన్ రావు తలకు తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని అపోలో రిచ్ హస్పిటల్‌కు తరలించగా... పరీక్షించిన వైద్యులు రామ్మోహన్‌ బ్రెయిన్‌ డెడ్‌ అయిందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనకు అవధులు లేకుండా పోయాయి. అంత బాధలోనూ రామ్మోహన్‌ భార్య కవిత, తల్లిదండ్రులు బాలకిషన్, విజయలు అవయవ దానం చేయడానికి అంగీకరించారు.

రామ్మోహన్‌ అవయవాలతో ఇతరులకి ప్రాణదానం
అపోలో రీచ్ వైద్య బందం హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యులను రప్పించి రాంమోహన్ మూత్ర పిండాలు, కాలేయం సేకరించారు. లయన్స్ క్లబ్ నిర్వహకులు కళ్లను తీసుకుని భద్ర పరిచారు. రామ్మోహన్ అవయవాలతో ఐదుగురికి కొత్త జీవితం లభించనుంది.

అవయవదానానికి ముందుకు వచ్చిన అతని కుటుంబ సభ్యులు
పుట్టెడు దుఃఖంలోనూ రామ్మోహన్‌ భార్య, కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఇతరుల ప్రాణాలు కాపాడేలా చేసింది. భౌతికంగా దూరమైన భర్త అవయవాలు మరొకరికి ప్రాణదానం చేస్తాయన్న ఆలోచనతో అతని కుటుంబ సభ్యులు మానవత్వమున్న మనుషులుగా అందరికీ ఆదర్శంగా నిలిచారు.

 

11:39 - November 8, 2016

మహబూబ్ నగర్ : స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లయినా కొన్ని కులాలకు గుర్తింపు లేకుండా పోయిందని ఎంబీసీ నేత ఆశయ్య అన్నారు. ప్రభుత్వ పథకాల్లో కింది కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు నాలుగు జిల్లాల గుండా సీపీఎం పాదయాత్ర కొనసాగింది. ఎక్కడ చూసినా ప్రజలు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. 22వ రోజు పాదయాత్ర వనపర్తి జిల్లా రాజుపేట నుంచి ప్రారంభమై అక్కడి నుంచి కొత్తకోట, మదునాపురం, ఆత్మకూరు వరకు కొనసాగింది. తమ్మినేని బృందం పాదయాత్రకు కాంగ్రెస్‌, టీడీపీ స్థానిక నేతలు, కులసంఘాల నేతలు మద్దతు తెలిపారు.

ప్రజాసమస్యల పట్ల సర్కార్ నిర్లక్ష్యం : తమ్మినేని
కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ప్రభుత్వం ప్రజాసమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని విమర్శించారు. రైతులకు రుణమాఫీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు హామీలిచ్చిన కేసీఆర్‌ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని తమ్మినేని అన్నారు. ఈ పాదయాత్ర తెలంగాణ ప్రజల్లో సామాజిక స్పృహను కలిగిస్తోందని తమ్మినేని అన్నారు.

సీపీఎం మహాజన పాదయాత్ర 22వ రోజుకు చేరుకుంది...
సీపీఎం మహాజన పాదయాత్ర 22వ రోజుకు చేరుకుంది. 150 గ్రామాల్లో 530 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర సాగింది. తెలంగాణ ఏర్పడినా.. అట్టడుగు వర్గాల ప్రజల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు కావడం లేదని ఆయన అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఏ ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, కేజీ టూ పీజీ విద్య అమలు కావడం లేదన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సీపీఎం పాదయాత్ర తెలంగాణ ప్రజల్లో సామాజిక స్పృహను కలిగిస్తోందని ఆయన అన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడకపోతే.. సామాజిక ఉద్యమం ఉధృతం అవుతుందని తమ్మినేని హెచ్చరించారు. తెలంగాణ వచ్చాక తమ బతుకులు మారతాయనుకున్న ప్రజలకు ఈ ప్రభుత్వం నిరాశను మిగుల్చుతోందని సీపీఎం నేతలు అన్నారు. కార్మికులు, కర్షకులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు అన్నారు. 

11:37 - November 8, 2016

హైదరాబాద్ : ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల ఉత్సవాలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కారు..ఉద్యమ నినాదమైన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కృష్ణా, గోదావారి,.ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ తర్వాత కాళేశ్వరం, మల్లన్నసాగర్‌లపై వచ్చిన వ్యతిరేకతతో..మిగితా వాటిపట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. రెండు రోజుల్లో ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్‌కి శంకుస్థాపన చేయనున్న ప్రభుత్వం..త్వరలోనే దేవాదులకి రంగం సిద్ధం చేసింది.

సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి
సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా నిరంతర సమీక్షలతో ఇరిగేషన్ అధికారులను ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రాజెక్టుల రీడైనింగ్‌ వల్ల గతంలో ఎదురైన సమస్యలను అధిగమించి..ముందుకు వెళ్లేందుకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వీలైనంత త్వరలో దేవాదులను పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనికోసం ఫాస్ట్‌ ట్రాక్‌ పద్ధతిని అవలంబించాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

జలసౌధలో ఇరిగేషన్‌ అధికారులతో దేవాదుల పనులపై సమీక్ష
భూసేకరణ, ఇతర నిర్మాణ పనులవల్ల దేవాదుల ప్రాజెక్టు నత్తనడకగా సాగుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జలసౌధలో ఆయన ఇరిగేషన్‌ అధికారులతో దేవాదుల పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టుపై ప్రతిరోజు తనకు ప్రోగ్రెస్ రిపోర్ట్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 123 జీవో ప్రకారం భూసేకరణ పనులను వేగవంత చేయాలని కోరారు. ప్రాజెక్టు భూసేకరణకు అటవీశాఖపరంగా తలెత్తే సమస్యలు ఇతర అంశాలను పరిష్కరించాలని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ జోషిని ఆదేశించారు.

2018 నాటికి దేవాదుల మూడవ దశ పూర్తిచేయాలని ఆదేశం
2018 నాటికి దేవాదుల మూడవ దశ పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన కింద కేంద్రప్రభుత్వం నిధులిస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రిటైర్డ్‌ తహసిల్దార్లను ఔట్‌సోర్సింగ్ కింద తీసుకోవాలని సూచించారు. పంప్‌హౌజ్‌లు పూర్తికాకుండా మోటార్లు, ఇతర పరికరాలు సమకూర్చుకోరాదని ఏజెన్సీలను మంత్రి ఆదేశించారు.

 

11:36 - November 8, 2016

యాదాద్రి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్ నిర్మాణం చేస్తున్న యాదాద్రి దేవస్ధానం దేశానికే ఆదర్శంగా నిలవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. లక్షలమంది భక్తుల వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వైటీడీఏ ఆధ్వర్యంలో టెంపుల్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

యాదాద్రి అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి
యాదాద్రి అభివృద్దిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయాన్ని అనేక ప్రత్యేకతలు, విశిష్టతలతో దేశంలోనే అత్యంత అద్భుత దేవాలయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ప్రత్యేక శ్రద్ధ, ప్రతీ అంగుళాన్ని ఉపయోగించే విషయంలో నిర్దిష్ట ప్రణాళిక ఉండాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో యాదాద్రి అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. లక్ష మందికి పైగా భక్తులొచ్చినా సరే..ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాఫీగా దర్శనం జరిగేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఆధ్యాత్మికత, భక్తి భావన, పవిత్రత, ప్రకృతి రమణీయత, పర్యాటక ప్రాముఖ్యత ఉట్టి పడేలా యాదాద్రికి నవరూపం ఇవ్వాలని సిఎం ఆకాంక్షించారు.

13 ఎకరాల విస్తీర్ణంలోని గుట్టపై ప్రెసిడెంట్‌ సూట్
ఇటీవల కాలంలో యాదాద్రికి భక్తుల సంఖ్య బాగా పెరిగింది. సెలవు రోజుల్లో, ప్రత్యేక సందర్భాల్లో లక్ష మందికి పైగా భక్తులు వస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా యాదాద్రిలో ఏర్పాట్లు ఉండాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. లక్ష మందికి పైగా ఒకే రోజు వచ్చినా అందరికీ మంచి వసతి దొరికేలా, ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లుండాలన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తున్నందున యాదాద్రికి నలువైపులా నాలుగు లేన్ల రోడ్లు నిర్మించాలని కేసీఆర్‌ సూచించారు. ప్రదక్షిణ మార్గాలను నిర్మించి. ప్రధాన గుట్టకు అభిముఖంగా ఉండే గుట్టపై అన్ని సౌకర్యాలతో కూడిన కాటేజీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈశాన్య భాగంలో 13 ఎకరాల విస్తీర్ణంలోని గుట్టపై ప్రెసిడెన్సీ సూట్ నిర్మించాలని సీఎం చెప్పారు. ఇప్పుడున్న బస్ స్టాండ్, బస్ డిపోలను మరో చోటికి మార్చి. యాదాద్రిలో పోలీస్, ఫైర్, హెల్త్ సేవలను అత్యవసరమైనవిగా గుర్తించాలన్నారు.

ఆలయ నిర్మాణ శిల్పులు, రూపకర్తలు దేశంలో పర్యటించాలి: సీఎం
యాదాద్రిని గొప్పగా తీర్చిదిద్దడానికి అవసరమైన నిధులు, కావాల్సినంత భూమిని సేకరించాం కాబట్టి ప్రణాళికతో నిర్మాణాలు చేపట్టాలని అదేశించారు. దేశంలో వివిధ దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సేవలను అధ్యయనం చేయడానికి అధికారులు, ఆలయ నిర్మాణ శిల్పులు, రూపకర్తలు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అదేశించారు

85 ఎకరాల భూమిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళిక
దేవాలయ అభివృద్ధి పనులకు గుట్ట పైన, కింద వ్యాపారం చేసుకునే వారు సహకరించాలని కేసీఆర్‌ కోరారు. వారి జీవనోపాధి గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న ఆయన... షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి, వారికి గదులు కేటాయించాలన్నారు. చేతివృత్తులు, చేనేత వస్త్రాలను ప్రోత్సహించడానికి షాపింగ్ కాంప్లెక్స్ లో ప్రత్యేక స్థలం ఇవ్వాలన్నారు. యాదాద్రి సమీపంలోనే ఉన్న 85 ఎకరాల అటవీ భూమిని సద్వినియోగం చేసుకునే ప్రణాళిక రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు.

 

నేడు సుప్రీంలో పార్టీ ఫిరాయింపులపై విచారణ..

ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ స్పీకర్ కు గతంలో సుప్రీం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అనర్హత పిటిషన్ల పరిష్కారానికి ఎంత సమయం తీసుకుంటారో కోర్టుకు తెలపాలని స్పీకర్ ను ఆదేశించింది. నేడు ఆ విషయాన్ని స్పీకర్ వెల్లడించాల్సి ఉంది. 

సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీసీసీఐ..

ఢిల్లీ : బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రేపు జరగబోయే భారత్ - ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ నిర్వాహణకు నిధుల విడుదలకు అనుమతించాలని బీసీసీఐ కోరింది. నిధులు లేకుంటే మ్యాచ్ నిర్వహించడం కష్టమని పేర్కొంది. 

పనగారియితో బాబు భేటీ...

విజయవాడ : నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కోస్టల్ ఎకనమిక్ జోన్ పై చర్చ జరుగనున్నట్లు సమాచారం. 

11:30 - November 8, 2016

ఢిల్లీ : పాక్ నుండి వచ్చిన గీత తమ బిడ్డేనని ఖమ్మం వాసులు పేర్కొంటున్నారు. 2015లో అక్టోబర్ లో పాకిస్థాన్ నుండి భారత్ కు గీత వచ్చింది. పాకిస్తాన్ నుండి వచ్చిన గీత తమ కుమార్తెనని ఖమ్మం వాసులు కృష్ణయ్య.గోపమ్మ పేర్కొంటున్నారు. ఈనేపళ్యంలో కృష్ణయ్య, గోపమ్మలిద్దరూ డీఎన్ఏ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వారికి నేడు ఢిల్లీలో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. పదేళ్ల క్రితం గీత తప్పిపోయి పాక్ చేరిన సంగతి తెలిసిందే.డీఎన్ ఏ టెస్ట్ ల్లో గీత వారి బిడ్డేనని తేలితే ప్రభుత్వం వారికే గీతను అప్పగించనుంది.  ప్రస్తుతం గీత భోపాల్ సంరక్షణ కేంద్రంలో వుంది.  

11:27 - November 8, 2016

టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్..ఏ వుడ్ లోనైనా నటించే హీరో..హీరోయిన్లకు ఎంతో అభిమానులు ఉంటారు. రాష్ట్రం..దేశం..విదేశాల్లో సైతం వారికి వీరాభిమానులు ఉంటుంటారు. తమ అభిమాని చిత్ర విశేషాలు..ఇతరత్రా అంశాల గురించి తెలుసుకోవాడానికి వీరు ఆసక్తి చూపుతుంటారు. అభిమానులకు చేరువకావడానికి పలువురు హీరోలు..హీరోయిన్లు సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగిస్తుంటారు. అందులో ప్రధానమైంది 'ట్విట్టర్'. ఈ ట్విట్టర్ ద్వారా ఫొటోలు..సినిమా షూటింగ్..ఇతర విశేషాలను పోస్టు చేస్తుంటారు. తాజాగా 'బాలకృష్ణ' కూడా ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేయాలని యోచిస్తున్నారంట. విదేశాల్లో ఉన్న అభిమానులకు తన సినిమా విశేషాలను తెలియచేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నారని టాక్. ప్రస్తుతం 'బాలకృష్ణ' 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'బాలయ్య' ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రచారానికి ఈ ట్విట్టర్ అకౌంట్ దోహదపడుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. వారి కోరిక మేరకే బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్. మరి ట్విట్టర్ ద్వారా 'బాలయ్య' ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి. 

11:19 - November 8, 2016

హైదరాబాద్ : నగరంలోని అడ్డగుట్టలో హృదయాలను కలిసివేసే ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక ఓ కార్మికుడు మృతదేహం నోచుకోలేని పరిస్థితులకు అడ్డగుట్ట కాలనీలో నెలకొంది. భవనాలకు సెంట్రింగ్ చేసే యాదగిరి అనే కార్మికుడు ప్రమాదవశాత్తు క్రింద పడి మరణించాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. చికిత్స నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. కానీ కాగా చికిత్స తీసుకుంటూ యాదగిరి మరణించాడు. దీంతో సోమవారంనాడు యాదగిరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఇంటింటికి కుటుంబ సభ్యులు తిరిగి సహాయం కోరారు. స్పందించిన స్థానికులు మూడు వేలు సహాయం చేశారు. కానీ అంత్యక్రియలకు పదివేలుంటేనే గానీ సరిపోవని మృతుడి అంత్యక్రియలు నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. కానీ అంత్యక్రియలకు డబ్బులు లేని కారణంగా మృతదేహంతో ఇంటివద్దనే కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికుల్ని కలచివేస్తోంది. కానీ వారు కూడా నిరుపేదలే కావటంతో కొంతవరకూ మాత్రమే సహాయం చేయగలిగారు. అంత్యక్రియలకు ఎవరైనా సహాయం చేయాలని యాదగిరి కుటుంబ సభ్యులు దీనంగా వేడుకుంటున్నారు.కాగా డబ్బులు లేక కొన్ని రోజుల క్రితం భార్య శవాన్ని మోసుకుంటూ కిలోమీటర్ల కొద్ది నడిచిన ఘటన ఇతర రాష్ట్రంలో చూశాం కానీ నేడు నగరంలోనే ఇటువంటి సంఘటన జరగటం నిజంగా దురదృష్టకరం. బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఓ నిరుపేద కుటుంబంలో మృతి చెందిన యాదగిరి అంత్యక్రియలకు కూడా నోచుకోకపోవటం కడు శోచనీయం..ఇదేనా బంగారు తెలంగాణ?.. కాగా అడ్డగుట్ట అంటేనే నిరుపేదలకు నివాసం అనే విషయం తెలిసిందే.

సిరిసిల్లకు రానున్న మంత్రి హరీష్..

సిరిసిల్ల : జిల్లాలో నేడు మంత్రి హరీశ్‌రావు పర్యటించనున్నారు. నీటి పారుదల అధికారులతో సమావేశం..వేములవాడలోని ఫాజిల్‌నగర్‌ చెరువు నుంచి నర్సింగాపూర్‌ చెరువులోకి ఎల్లంపల్లి నీటిని హరీష్ వదులనున్నారు. 

11:14 - November 8, 2016

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మస్తు జోరుగా మీదున్నాడు. వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడని టాక్. ఓ చిత్రం షూటింగ్ లో ఉండగానే మరో చిత్రానికి సైన్ చేసేస్తున్నాడు. ఆయన తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మాటల మాంత్రికుడు 'తివిక్రమ్' తో సినిమా చేయడానికి 'పవన్' గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొన్ననే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. తాజాగా తమిళ దర్శకుడు 'ఆర్ టి నేసన్' డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు టాక్. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా 'తమన్' ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్వయంగా 'థమన్' ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. 'పవన్' సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ దక్కడంపై 'థమన్' సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంటి ముంగిట మూడు రోజులుగా మృతదేహం..

హైదరాబాద్ : ఓ వ్యక్తి మృతదేహం ఇంటి ఎదుట మూడు రోజులుగా పడి ఉన్న ఘటన అడ్డగుట్టలో చోటు చేసుకుంది. భవనంపై నుండి పడి యాదగిరి అనే వ్యక్తి మృతి చెందాడు. డబ్బులు లేవని అతని కుటుంబసభ్యులు అంత్యక్రియలు జరిపించడం లేదు. దీనితో యాదగిరి మృతదేహం ఇంటి వద్దే పడి ఉంది. 

10:55 - November 8, 2016

గీత తమబిడ్డేనంటున్న ఖమ్మం దంపతులు..

ఢిల్లీ : పాక్ నుండి వచ్చిన గీత తమ బిడ్డేనంటూ డీఎన్ఏ పరీక్షలకు ఖమ్మ జిల్లా దంపతులు సిద్ధమయ్యారు. నేడు ఢిల్లీలో కిష్టయ్య, గోపమ్మ దంపతులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. పదేళ్ల క్రితం గీత తప్పిపోయి పాక్ చేరిన సంగతి తెలిసిందే. 

10:52 - November 8, 2016

ఛత్తీస్ గడ్ లో మావోయిస్టు దుశ్చర్య..

ఛత్తీస్ గడ్ : మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కాంకేర్ (మం) అంబేడులో ఇన్ ఫార్మర్ నెపంతో గ్రామస్తుడిని మావోయిస్టులు నరికిచంపారు. దంతెవాడ జిల్లా మధిరెలో సర్పంచ్ తో పాటు ఇద్దరు మహిళలను మావోయిస్టులు కిడ్నాప్ చేసి చంపారు. 

10:45 - November 8, 2016

హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ కొలువుల జాతర ప్రారంభమైంది. వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కాబోయే 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కొత్తగా 3570 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీసీ సంక్షేమ శాఖలో కొత్తగా 65 పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాగే వచ్చే ఏడాది జూన్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీచేస్తామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించడంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది.

119 బీసీ సంక్షేమ పాఠశాలలు ..3,570 కొత్త పోస్టులు మంజూరు
తెలంగాణలో మళ్లీ కొలువుల జాతర ప్రారంభం కాబోతోంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీసీ వెల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ విద్యా సంస్థలన్ని 2017 జూన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభం కావాల్సిందేనని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ పాఠశాలలు ప్రారంభం కావాలంటే అందులో పనిచేయడానికి సిబ్బంది కావాలి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోయే 119 బీసీ సంక్షేమ పాఠశాలలో కొత్తగా 3570 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. ఈ పోస్టులన్ని కూడా మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ బీసీ తరగతుల రెసిడెన్షియల్ విద్యా సంస్థల సోసైటీ కింద ప్రకటించింది ప్రభుత్వం.

119 ప్రిన్సిపాల్, 833 జూనియర్ పోస్టులు
కొత్తగా చేపట్టనున్న 3570 పోస్టుల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలకు ఒకరు చొప్పున 119 ప్రిన్సిపాల్ పోస్టులు, 833 జూనియర్ పోస్టులు, అలాగే 833 పీజీటీలు, 1071 టీజీటీలు, 119 ఫిజికల్ డైరెక్టర్లు, 119 పీఈటీలు, 119 లైబ్రెరీయన్స్, 11 క్రాప్ట్, ఆర్ట్, మ్యూజిక్ టీచర్స్, 119 స్టాఫ్ నర్సులు, 119 సీనియర్ అసిస్టెంట్లు పోస్టులను కేటాయించారు. అయితే ఈ పోస్టులన్నింటిని రాబోయే మూడేళ్లలో భర్తీ చేయాలని ప్రభుత్వం జారీచేసిన జీవోలో పేర్కొంది. వచ్చే ఏడాది 1785 పోస్టులను, 2018-19 సంవత్సరాల్లో 833 పోస్టులను, 2019-20 సంవత్సరంలో119 పోస్టులను, 2020-21 సంవత్సరంలో 833 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక వీటితో పాటు అవుట్ సోర్సింగ్ పద్దతిలో 476 పోస్టులను కూడా మంజూరు చేస్తున్నట్టు జీవోలో పేర్కొంది ప్రభుత్వం. అయితే అవుట్ సోర్సింగ్ పద్దతిలో చేపట్టే నియామకాలన్ని తొలి ఏడాదిలోనే భర్తీ చేయనున్నారు. కాగా మిగిలిన రెగ్యులర్ నియామకాలన్నింటిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేయనున్నారు.

మరో 65 పోస్టులను కూడా మంజూరు చేస్తూ సర్కారు మరో ఉత్తర్వ్యు జారీ
అయితే వీటితో పాటు బీసీ సంక్షేమ శాఖలో కూడా కొత్తగా మరో 65 పోస్టులను కూడా మంజూరు చేస్తూ సర్కారు మరో ఉత్తర్వ్యు జారీ చేసింది. ఇవి కూడా టీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. ఇవే కాకుండా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కూడా ఓ తీపి కబురును ప్రకటించారు. వచ్చే ఏడాది జూన్‌లో డీఎస్సీని నిర్వహిస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

10:42 - November 8, 2016

గుంటూరు : నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ తీపికబురు అందించింది.. కొత్త రాష్ట్రంలో తొలిసారి ఇవాళ లేదంటే రేపు గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ విడుదలకాబోతోంది. గ్రూప్‌2 కింద 1100 పోస్టులను భర్తీ చేయనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పకడ్బందీగా పరీక్షను నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలిసారిగా ప్రిలిమ్స్ విధానంలో పరీక్షకు ఏర్పాట్లు చేస్తోంది.

గ్రూప్-1లో 94, గ్రూప్‌2 కింద 1100 పోస్టులు, గ్రూప్-3లో 1500 ఉద్యోగాలు
ఏపీలో గ్రూప్స్ కొలువుల కోలాహలం ప్రారంభం కాబోతోంది. కొత్త రాష్ట్రంలో ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమైంది. వెయ్యికి పైగా పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసిన ఏపీపీఎస్సీ ప్రతిష్టాత్మకంగా పరీక్షలను నిర్వహించబోతోంది. మొదట గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల అనంతరం...గ్రూప్1, గ్రూప్3 పరీక్షలకు సైతం రెడీ అవుతోంది.

మొదటి విడతగా 10 వేల పోస్టుల భర్తీకి ఏపీ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సర్కారీ కొలువులను భర్తీ చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొదటి విడతగా 10 వేల పోస్టుల భర్తీకి ఏపీ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా...వీటిలో గ్రూప్-1 పోస్టులు 94, గ్రూప్‌2 కింద 1100 పోస్టులు, గ్రూప్-3లో 1500 పోస్టులు, పోలీసుశాఖ, ఇతర డిపార్ట్‌మెంట్స్‌లోని ఉద్యోగాలు కలుపుకొని మొత్తం 10 వేల ఉద్యోగాలు ఉన్నాయి. పోలీస్‌శాఖలోని నియామకాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా..సర్వీస్‌కమిషన్ ఇచ్చే నోటిఫికేషన్స్ మాత్రం ఆలస్యం అయ్యాయి. అయితే పాతపరీక్ష విధానానికి చెక్‌ పెట్టి...పలు సంస్కరణలు చేపట్టాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకోవడమే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.

వన్‌టైమ్ రిజిస్ట్రేషన్, వయోపరిమితి పెంపు, స్క్రీనింగ్‌ టెస్ట్ విధానాలు
మరోవైపు పరీక్షల నిర్వహణలోనూ కీలక మార్పులు తీసుకువచ్చింది ఏపీపీఎస్సీ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్, అభ్యర్థుల పరిమితినిబట్టి స్క్రీనింగ్‌ విధానం, వయోపరిమితి 42 ఏళ్లకు పెంపు వంటి అంశాలలో మార్పులు తీసుకువచ్చింది. గ్రూప్స్ అభ్యర్థుల సంఖ్య 40 వేలు దాటితే స్క్రీనింగ్ టెస్ట్‌ పెట్టాలని నిర్ణయించింది. సిలబస్ మార్పుల్లో కూడా విమర్శలకు చోటివ్వకుండా చూసుకుంది ఏపీపీఎస్సీ.గతంలో 34 ఏళ్ల వరకూ ఉన్న వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

నిరుద్యోగుల హర్షం

గ్రూప్2 నోటిఫికేషన్ వెలువడిన మరికొద్ది రోజుల్లోనే మిగిలిన నోటిఫికేషన్లు జారీచేసేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో,వీఆర్ ఏ అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ పోస్టులు...ఇలా రానున్న ఆరునెలల్లో నోటిఫికేషన్ల జాతర జరగబోతోంది. దీంతో ఎన్నాళ్లుగానో నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో పూర్తి ఉత్సాహం నిండింది.

 

10:39 - November 8, 2016

హైదరాబాద్ : సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా టీకాంగ్రెస్ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన హస్తంపార్టీ..ఇప్పుడు గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. అనాలోచితమైన కారణాలతో సెక్రటేరియట్‌ను కూల్చుతామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేసింది.

కాకపుట్టిస్తున్న సచివాలయం కూల్చివేత
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య సచివాలయం కూల్చివేత అంశం వేడి పుట్టిస్తోంది. ఇప్పుడున్న సచివాలయాన్ని కూల్చివేసి..కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని..కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో ఎలాగైనా రాష్ట్ర సర్కారుకు బ్రేకులు వెయ్యాలని భావిస్తోంది. కూల్చివేతను అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఉత్తమ్‌కుమరార్ నేతృత్వంలోని టీకాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. సచివాలయం తరలింపును నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన హస్తంపార్టీ
సచివాలయ కూల్చివేతపై ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు తాము చెప్పేవరకూ సచివాలయాన్ని కూల్చవద్దంటూ ఆదేశించింది. అయితే సేఫ్టీ కారణాలున్నాయంటూ ప్రభుత్వం..న్యాయస్థానానికి తప్పుడు కారణాలను చూపించిందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం బయటేమో వాస్తు పేరు చెబుతూ.. హైకోర్టులో ఫైర్ సేఫ్టీ అని చెప్పి ప్రజలను మోసం చేస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

కుమారుడు సీఎం కాలేడన్న భయం కేసీఆర్ ను వెంటాడుతోందా?
ఇప్పుడున్న సచివాలయం వాస్తుతో తన కుమారుడు సీఎం కాలేడన్న భయం కేసీఆర్ ను వెంటాడుతోందని ..అందుకే సచివాలయాన్ని కూల్చేసేందుకు సీఎం నిర్ణయించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. ఈనెల 10న పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం సచివాలయాన్ని సందర్శించి...వాస్తవ పరిస్థితులను హైకోర్టుకు వివరిస్తామని చెప్పారు.

ఓవైపు న్యాయపోరాటం చేస్తూనే ప్రజల మద్దతుకు పొందుకోవాలని యోచన
సచివాలయం కూల్చివేతపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే..ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు దీనిపై ప్రజల మద్దతు పొందేలా కార్యాచరణకు కాంగ్రెస్ సిద్ధమైంది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తోంది.

 

మళ్లీ పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా మంగళవారం ఉదయం నౌషెరా, రాజౌరీ సెక్టార్ లలో కాల్పులకు తెగబడింది. పాక్ కాల్పులను భారత జవాన్లు తిప్పి కొడుతున్నారు. 

పేస్ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య..

ప్రకాశం : జిల్లాలోని పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని మొదటి సంవత్సరం చదువుతోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

తిరుపతిలో బైక్ రైసింగ్..

తిరుపతి : నగరంలో అర్ధరాత్రి బైక్ రైసింగ్ నిర్వహించారు. వెస్ట్ చర్చి దగ్గర ఇద్దరు మహిళలను బైక్ రైసర్లు ఢీకొట్టారు. దీనితో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. 

బొగ్గు గనుల్లో ఎంపీ కవిత పర్యటన..

భద్రాద్రి : కొత్తగూడెం బొగ్గు గనుల్లో ఎంపీ కవిత పర్యటించారు. బొగ్గు ఉత్పత్తి ఉపాధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. 

10:34 - November 8, 2016

త్తీస్‌గడ్‌ : రాష్ట్రంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడ జిల్లా మావోయిస్టులు మదిరేలో సర్పంచ్‌తో పాటు ఇద్దరు మహిళలను కిడ్నాప్‌ చేశారు. అదేవిధంగా కాంకేర్‌ మండలం అంబేడులో ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో పలువురు గ్రామస్తులను మావోయిస్టులు అపహరించారు. 

10:24 - November 8, 2016

విశాఖ : ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోంది. అవకతవకలను ప్రశ్నించిన సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌లను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరిని మంగళవారం రెండో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారించిన అనంతరం వీరికి 15రోజుల రిమాండ్ ను మేజిస్ట్రేట్ కోర్టు విధించింది. దీన్ని సీపీఎం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయంగా సీపీఎం నేత మాట్లాడుతూ..ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు అధికార టీడీపీ యదేచ్ఛగా అవకతవకలకు పాల్పడుతున్నారనీ..దీనికి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన సూత్రధారిగా వున్నారని సీపీఎం నేత ఆరోపించారు. మంత్రి ఆదేశాలతో అర్థరాత్రి సమయంలో సీపీఎం నేతలను అరెస్ట్ చేయటంపట్ల వారి తీవ్రంగా నిరసిస్తున్నారు. బోగస్ ఓట్లుకాదంటున్న అధికార పార్టీ ఈ విషయంలో ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన నేతల్ని బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

10:11 - November 8, 2016

హైదరాబాద్‌ : నగర కేంద్రంగా పనిచేస్తోన్న మై హోమ్‌ ఇండస్ట్రీస్ ఫార్మా రంగంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన అధ్యయనం జరుగుతోందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సాంబశివరావు తెలిపారు. కొత్త బ్రాండ్‌ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తమ వ్యాపారంలో సుమారు 3 వేల కోట్ల వ్యాపారం సిమెంట్‌ విభాగం నుంచే జరుగుతోందని తెలిపారు. 

10:10 - November 8, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో పారదర్శకంగా దర్యాప్తు జరగాలంటే సీబీఐకి అప్పగించాలి...ఇదే డిమాండ్‌తో పాటు విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో వేసిన వాజ్యంపై విచారణ జరుగుతుంది..మరికొన్ని గంటల్లో దీనిపై విచారణ జరగనుండగా సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ సరికాదని నిరూపించేందుకు రెడీ అయింది సిట్...తమ ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తు..వాటికి సంబంధించిన వివరాలతో కూడిన నివేదిక తయారు చేస్తున్న సిట్‌ న్యాయ సలహా తీసుకుని హైకోర్టుకు ముందు నివేదికను సమర్పించనుంది...

నయీం కేసు చేజారకుండా ప్రయత్నాలు..
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో సిట్‌ దర్యాప్తు కాకుండా లోతుగా అధ్యయం చేస్తూనే అందులోని గుట్టును బయటపెట్టాలన్న వాదనలు పెరిగాయి...ఈ కేసుల్లో ఉన్న అధికార..అనధికార వర్గాలను తప్పించుకుండా అందరిపై చర్యలు తీసుకునేలా చూడాలని హైకోర్టులో వాజ్యం పడింది...అయితే దీనిపై ధర్మాసనం వాదనలు వినేందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది... సీబీఐకి కేసు అప్పగించాలన్న దానిపై హైకోర్టు రేపు విచారణ చేయనుంది...దీనికి గాను సిట్‌ తమ చేజారకుండా ఉండేందుకు ఇప్పటివరకు చేసిన దర్యాప్తు..తీసుకుంటున్న చర్యలపై నివేదిక సిద్దం చేసింది...అదే సమయంలో సిట్‌ చీఫ్‌ నాగిరెడ్డి హైకోర్టుకు వెళ్లి న్యాయ సలహాలు తీసుకోనున్నారు..దాని ద్వారా రేపు జరగబోయే విచారణలో తమ వాదన విన్పించనున్నారు....సీబీఐ చేతికి కేసు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు...

మొత్తం 166 కేసులు..109 మంది అరెస్టు..418 మంది సాక్షుల విచారణ..
నయీం కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేసు నివేదికను సిద్ధం చేసిన సిట్‌.. రేపు హైకోర్టుకు సమర్పించేందుకు రెడీ చేస్తుంది...నయీం కేసులో ఇప్పటివరకు 166 కేసులు నమోదు చేశారు...109 మంది అరెస్ట్‌ చేసిన సిట్‌.. 418 మంది సాక్షులను విచారించారు. భువనగిరి, కోరుట్ల, ఎల్బీనగర్‌, కరీంనగర్‌, జనగాం, జగిత్యాలతో పాటు పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు....అయితే ఇప్పటివరకు నమోదు చేసిన కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేయనున్నామని సిట్ చెప్పనుంది...ఇక ప్రధానంగా గ్యాంగ్‌స్టర్ కేసుల్లో సాక్షుల విచారణ జరిపిన సిట్‌ సప్లమెంటరీ చార్జిషీట్‌లో వీఐపీల పేర్లను పెట్టనున్నట్లు నివేదిక సమర్పించనుంది...

నార్సింగి స్టేషన్‌లో రిటైర్డ్‌ ఆఫీసర్ విచారణ..
మరోవైపు అదనపు ఎస్పీగా ఉన్న రవీందర్‌రెడ్డి నయీం కేసుల్లో పాత్ర ఉందంటూ వచ్చిన వాటిపై నేడు నార్సింగి పోలీసు స్టేషన్‌లో విచారించారు...రిటైర్డ్‌ ఆఫీసర్‌ను స్టేషన్‌కు రావాలంటూ నోటీసులు ఇచ్చిన సిట్‌ విచారించింది....దాదాపు రెండు గంటలకుపైగా రవీందర్‌రెడ్డిని విచారించిన సిట్‌ బృందం పలు కేసులకు సంబంధించిన వివరాలు తెలుసుకుంది...1996నుంచి 2000 సంవత్సరంవరకూ రవీందర్‌ రెడ్డి నల్లగొండ జిల్లాలో పనిచేశారు.. ఆ సమయంలో రవీందర్‌ రెడ్డికి... నయింతో సంబంధాలున్నాయంటూ ఆరోపణలొచ్చాయి... అయితే రవీందర్‌ రెడ్డిమాత్రం తనకు నయింతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసినట్లు తెలిసింది..

 

10:02 - November 8, 2016

కర్నాటక : ఓ సినిమా షూటింగ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. సినిమా క్లైమాక్స్‌లో హెలికాప్టర్‌ నుంచి హీరోతో పాటు కిందకు దూకిన ఇద్దరు విలన్లు నీటిలో మునిగి చనిపోయారు. మాస్తిగుడి మూవీ షూటింగ్‌లో ఈ విషాదం జరిగింది. కన్నడ హీరో దునియ విజయ్‌ తృటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డారు.

నీటిలో ఈదుతూ ఇద్దరు గల్లంతు..
అది సినిమా ఫైట్‌ సన్నివేశం..అందరూ చూస్తున్నారు...కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు..అంతలోనే.. హెలికాప్టర్‌ నుంచి ఇద్దరు నటులు చెరువులోకి దూకారు.. నీటిలో ఈదుతూ గల్లంతయ్యారు. స్టంట్‌ జరుగుతుందనుకునే లోగానే ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అతికష్టం మీద హీరో విజయ్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రెప్పపాటులో కళ్లముందే కెమెరాలు చిత్రీకరిస్తుండగా ఇద్దరు నటులు ప్రాణాలు కోల్పోయారు.

రిజర్వాయర్‌లో సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ చేస్తుండగా ప్రమాదం
ప్రముఖ కన్నడ హీరో దునియ విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "మాస్తిగుడి' బెంగళూరుకి 35 కిలోమీటర్ల దూరంలోని తిప్పగొందనహళ్లి రిజర్వాయర్‌లో సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ చేస్తుండగా ఈప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌ నుంచి హీరోతో పాటు ఇద్దరు నటులు ఉదయ్‌, అనిల్‌ రిజర్వాయర్‌లోకి దూకారు. అయితే, ఈత వచ్చిన హీరో ఈదుకుంటూ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడగా, ఇద్దరు నటులు మాత్రం రిజర్వాయర్‌లో మునిగి చనిపోయారు.

చిత్రయూనిట్‌పై పోలీసులు కేసు నమోదు
ఈ ఘటన సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. మరోవైపు ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోకుండా ఇంత రిస్కీ షాట్‌ చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో చిత్రయూనిట్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు.

10:01 - November 8, 2016

హైదరాబాద్‌ : నగరంలోని మల్కాజ్‌గిరిలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. మల్లికార్జున్‌ నగర్‌లో ఓ ఇంట్లో గ్యాస్‌ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న 15 గుడిసెలు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

10:00 - November 8, 2016

హైదరబాద్ : యాజమాన్యం జీతాలు ఇవ్వకుండా వేధిస్తుందంటూ సెక్యూరిటీ సిబ్బంది ఆందోళకు దిగారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో జీఫోర్‌ సెక్యూరిటీ సంస్ధ ఎదుట సిబ్బంది ఆర్ధరాత్రి ధర్నా చేశారు. తాము పనిచేస్తున్నా సంస్ధ జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని సెక్యూరిటీ సిబ్బంది ఆరోపించారు.

 

09:59 - November 8, 2016

గుంటూరు : ఏపీలో బడా ఆర్థిక నేరంగా గుర్తింపు పొందిన అభయగోల్డ్‌ కేసులో సీఐడీ దర్యాప్తు పూర్తైంది. మొత్తం 26మంది నిందితులపై అభియోగపత్రాన్ని రూపొందించారు. విజయవాడ న్యాయస్థానంలో 10వేల పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేశారు.

అభయగోల్డ్‌కు చెందిన మూడు సంస్థలపై కేసు నమోదు
జనం నుంచి కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అభయగోల్డ్ కేసులో సీఐడీ దర్యాప్తు పూర్తి అయ్యింది. అభయగోల్డ్‌కు చెందిన మూడు సంస్థలపై కేసు నమోదు చేశారు. ఈ మూడు సంస్థలు ఖాతాదారులకు 174కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టినట్లు విచారణలో తేలింది. అభయగోల్డ్ వ్యవహారంలో దాదాపు 10వేల పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. చార్జ్‌షీట్‌లో 23 మందిని ముద్దాయిలుగా చేర్చారు. నిందితులను అరెస్ట్ చేసి వారి ఆస్తులను సీజ్ చేశారు. కోర్టు అనుమతితో వారి ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేస్తామని సీఐడీ డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.

2008లో ప్రారంభమైన అభయగోల్డ్‌ సంస్థ
విజయవాడ కేంద్రంగా 2008లో ప్రారంభమైన అభయగోల్డ్‌ సంస్థ ఏపీ వ్యాప్తంగా లక్షలాది మంది నుంచి కోట్లాది రూపాయలను డిపాజిట్ల రూపంలో సేకరించింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన శ్రీనివాస్‌రావు ఛైర్మన్‌గా అభయగోల్డ్‌ ప్రారంభమైంది. పలు ఫైనాన్స్‌ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో శ్రీనివాస్‌రావు... ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించడం ఎలాగో తెలుసుకుని.. అభయగ్రూప్‌ పేరుతో శ్రీ అభయగోల్డ్

రూ.174కోట్లు కుచ్చుటోపీ పెట్టినట్లు విచారణలో వెల్లడి
ఇన్ర్ఫాటెక్‌ ఇండియా లిమిటెడ్‌, శ్రీ అభయా ఆర్గనిక్స్ ఇలా అనేక సంస్థలను ప్రారంభించాడు. శ్రీ అభయ రియల్ ఎస్టేట్ పేరుతో పలు ప్రాంతాల్లో శ్రీనివాస్‌రావు భూములను కొనుగోలు చేశాడు. వేలాది మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని లక్షలాది మందిని ఖాతాదారులుగా ఆకర్షించాడు. సుమారు 170 కోట్ల రూపాయల వరకు డిపాజిట్ల రూపంలో దండుకున్నాడు. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే, రెండు వందల గజాల స్థలం అంటూ కొత్తతరహా ప్రచారం నిర్వహించాడు. మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేలా కొత్త కొత్త పథకాలంటూ ప్రచారం చేసి చిన్నచిన్న మొత్తాల్లో డిపాజిట్లను సేకరించాడు. విస్తృతమైన ఏజెంట్ నెట్ వర్క్ తో కోట్లాది రూపాయలను సేకరించిన తరువాత బినామీ పేర్లతో భారీగా ఆస్తులను కూడబెట్టాడు. తిరిగి చెల్లించాల్సిన డిపాజిట్ దారులకు చెక్కులు జారీ చేశాడు. అవి బౌన్స్ అయిన నేపథ్యంలో చెల్లింపులకు వాయిదాలు వేస్తూ కాలం గడిపాడు. క్రమంగా అభయగోల్డ్ సంస్థ కార్యక్రమాలపై ఖాతాదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఏజెంట్లకు, ఖాతాదారులకు ముఖం చాటేశాడు శ్రీనివాస్‌రావు. దీంతో మోసపోయామని గ్రహించిన ఖాతాదారులు ఆయా పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేయడంతో 2013లో ప్రభుత్వం దీనిపై విచారణకు సీఐడీకి కేసును బదలాయించింది.

10,000పేజీలతో చార్జిషీట్ దాఖలు

సీఐడీ అధికారులు గతంలోనే శ్రీనివాసరావు, డైరెక్టర్లుగా ఉన్నవారిని అరెస్ట్ చేసి విచారించారు. ఈ మొత్తం వ్యవహారంలో పదివేల పేజీలతో కూడిన చార్జిషీటును విజయవాడ కోర్టులో దాఖలు చేశారు. 

09:58 - November 8, 2016

కేరళ : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం విషయంలో కేరళ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. శబరిమల ఆలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం

కేరళ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం
ఆలయ ప్రవేశ విషయంలో కేరళ సర్కార్‌ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఏ వయస్సు మహిళలైనా ఆలయంలోకి అనుమ‌తించాల్సిందేనని సుప్రీంకోర్టుకు తెలిపింది కేర‌ళ ప్రభుత్వం. రుతుక్రమానికి లోనయ్యే 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను ఆలయ బోర్డు ఇప్పటి వరకూ అమలు చేస్తోంది. అయితే, ఇలా మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం స్త్రీల పట్ల వివక్ష చూపడమేనంటూ దాఖలైన కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. గత విచారణ సందర్భంగా ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుణ్ణి పూజించడానికి ఫలానా భక్తులు మాత్రమే అర్హులని ఎక్కడైనా ఉంటుందా? అసలు దేవునికి భక్తుల విషయంలో తేడాలు ఉంటాయా? చిన్నాపెద్దా, కులం, మతంతోపాటు లింగబేధం కూడా ఉంటాయా?' అని న్యాయంస్థానం ప్రశ్నించింది. 'ఏ విధానం ఆధారంగా ఆలయాలకు వెళ్లకుండా మహిళలను అడ్డుకుంటున్నారు? దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చని, దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆయన దర్శనానికి స్త్రీ, పురుష వివక్ష ఏమిటని వ్యాఖ్యానించింది.

తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా
ఏ విధానం ఆధారంగా ఆలయాలకు వెళ్లకుండా మహిళలను అడ్డుకుంటున్నారు? దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చని, దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆయన దర్శనానికి స్త్రీ, పురుష వివక్ష ఏమిట'ని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహిళల ఆలయ ప్రవేశం విషయంలో సుప్రీంకోర్టుకు తన తాజా నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం తెలిపింది. కేరళ నిర్ణయాన్ని నమోదుచేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.

మహిళలకు సాంప్రదాయంగా వస్తున్న ఆలయ ప్రవేశ నిరాకరణ
శబరిమల ఆలయంలోకి యువ‌తుల‌కు ఆల‌య ప్రవేశం లేకపోవడం సాంప్రదాయంగా వ‌స్తోంది. రుతుస్రావం కార‌ణంగా వారిని అనుమ‌తించ‌డం లేద‌ని కొంద‌రంటే.. అయ్యప్ప బ్రహ్మచారి కాబ‌ట్టి యువ‌తుల‌కు అనుమతి ఉండ‌ద‌న్న వాద‌న ఉంది. 2007లో లెఫ్ట్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం మ‌హిళ‌లంద‌రినీ అనుమ‌తించాల్సిందే అన్న వాద‌న తెర‌పైకి తీసుకురాగా.. తర్వాత వ‌చ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని మార్చేసింది. ఇప్పుడు మ‌ళ్లీ ఎల్డీఎఫ్ అధికారంలోకి రావ‌డంతో మ‌రోసారి ఈ అంశం తెర‌పైకి వ‌చ్చింది. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సులకు చెందిన మహిళలను ప్రవేశం కల్పించాల్న కేరళ నిర్ణయంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

09:55 - November 8, 2016

14 ఏళ్ల లోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైందే సర్వశిక్షా అభియాన్‌ పథకం. అయితే ,ఆంధ్రప్రదేశ్‌ లో సర్వశిక్షా అభియన్‌ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పోరుబాటపట్టారు ఇవాళ విజయవాడలోని స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయం దగ్గర మహాధర్నా చేసేందుకు సమాయత్తమవుతున్నారు. పార్ట్‌ టైం టీచర్స్‌ , సిఆర్‌పిలు, ఐఈఆర్‌టిలు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, డిఎల్‌ఎంటిలు, మెసేంజర్స్‌, కస్తూర్బా స్కూల్స్‌లో టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు కలిపి దాదాపు పాతిక వేల మందికి పైగా సర్వశిక్షా అభియాన్‌ లో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికపై పనిచేస్తున్నారు. వీరంతా తమ కోరికల సాధన కోసం వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి మహాధర్నాకు నలుగురు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు కూడా హాజరవుతుండడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్‌ సర్వ శిక్షా అభియాన్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు బాలకాశి విజయవాడ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

09:54 - November 8, 2016

ప్రముఖ జాతీయ టీవీ న్యూస్ చానల్ ఎన్డీ టీవీపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కాగా ఎన్డీటీవీ ప్రసారాల నిలిపివేత అంశాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఈ అంశంపై సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఆరుగంటలు నిర్భంధంలోవుంచటం..దీంతో మళ్లీ ఎమర్జన్సీ పరిస్థితులను నెలకొంటున్నాయా? అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది.ఈ చర్చలో లక్ష్మణరావు( మాజీ ఎమ్మెల్సీ)దినేష్ గౌడ్ ( కాంగ్రెస్ నేత),రాకేష్ (బీజేపీ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..సమగ్ర సమాచారం తెలుసుకోండి.

09:36 - November 8, 2016

నల్లగొండ : మిర్యాలగూడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్ రూమ్ ను శుభ్రపరిచే కెమికల్ త్రాగి వెంకటేశ్వర్లు అనే రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నను చంపిన కేసులో వెంకటేశ్వర్లు అతని భార్య మిర్యాలగూడ సబ్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా రాత్రి 11గంటల సమయంలో వెంకటేశ్వర్లు వద్దకు బాత్ రూమ్ క్లీనర్ ఎలా వచ్చింది అనే విషయంపై అనుమానులు వ్యక్తం చేస్తున్నారు.

09:35 - November 8, 2016

విశాఖ : శీతాకాలం వచ్చిందంటే చాలు విశాఖ మన్యం చలి దుప్పటి కప్పుకుంటుంది. దీంతో మన్యం అంతా హిమసొగసును సంతరించుకుంటుంది. విశాఖ జిల్లాలోని మన్యం ప్రాంతంలో చలి పెరిగింది. మినుములూరు, లంబసింగిలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, పాడేరు, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మన్యాన్ని దట్టమైన పొగమంచు అలుముకుని ఆహ్లాదపరుస్తోంది. ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.

 

09:31 - November 8, 2016

హైదరాబాద్: ఆస్తి కోసం అయినవాళ్ల మధ్య చిచ్చు రేగుతోంది. ప్రాణాలు తీసుకునేంతవరకూ ఈ ఆస్తి తగాదాలు ఉదృతమవుతున్నాయి. ఇటువంటి సంఘటనే ఓ అక్కాతమ్ముళ్ల మధ్య నెలకొంది. ఈ వివాదం ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘనట బన్సీలాల్ పేటలో జరిగింది. ఓ డబుల్ బెడ్‌రూం ఇంటిలో భార్యభర్తలైన చందు, జయశ్రీలు నివసిస్తున్నారు. వీరికి మాధురి, సుదీప్ అనే ఇద్దరు పిల్లులున్నారు. ఉమ్మడి ఆస్తి కోసం చందు, తన సోదరి మీరాబాయిల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నారుు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మీరాబాయి తన కుటుంబసభ్యులతో కలసి చందు ఇంటికి వచ్చింది. దీంతో మరోమారు ఇరువురి మధ్య రేగిన వివాదం తారాస్థారుుకి చేరుకుంది. ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆవేశం పట్టలేని మీరాబాయి తమ్ముడు చందు, జయశ్రీలను బలవంతంగా రెండో అంతస్తు నుంచి కిందికి తోసివేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జయశ్రీ మృతిచెందగా, చందు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా స్థానికుల సమచారం మేరకు చందు, జయశ్రీల నివాసానికి చేరుకున్న పోలీసులు మీరాభాయిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

07:23 - November 8, 2016

విజయవాడ : అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి హైకోర్టు డేట్స్ ఖరారు చేసింది. అత్యంత విలువైన నాలుగు ఆస్తులను నెల పదిహేను రోజుల్లోపు అమ్మివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ జప్తు చేసిన అస్తుల వివరాలను పరిశీలించిన ధర్మాసనం.. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

ఈనెల 21 ఆస్తుల వివరాలను సమర్పించాలని ఆదేశం
అగ్రిగోల్డ్ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తుల అమ్మకాలపై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేస్తూ ఏ.పీ. తెలంగాణ ప్రభుత్వాలు ఫాలో కావాలని అదేశించింది. ఈనెల 21న ఆస్తుల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ విలువతో పాటు అన్ని వివరాలను సమర్పించాలని ఏ.పి., తెలంగాణ ప్రభుత్వానికి అదేశించింది. ఏ.పి. ప్రభుత్వం అటాచ్ చేసిన ఆస్తుల వివరాలను సీఐడీ కోర్టుకు సమర్పించింది. అందులో మొదటగా హాయిలాండ్ ఆస్తుల వివరాలు ఉన్నాయి. ఆస్తులను వేలం పాట వేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సి.ఐ.డి కోర్టుకు తెలిపింది. అయితే హాయిలాండ్ పై ప్రభుత్వం పెద్దలు కన్ను వేశారని అగ్రిగోల్డ్ తరుపు న్యాయవాది రవిచంద్ వాదనలు వినిపించారు. గతంలో హాయిలాండ్ కారుచౌకగా కోనుగోలు చేయాలని యోచించారు. ఇప్పుడు మళ్లీ అదే ఆస్తులను అమ్మివేస్తే.. సి.ఐ.డి. ద్వారా తక్కువ ధరకు కొనుగోలు చేయాలని ప్లాన్ ఉందని తెలిపారు. అయితే సి.ఐ.డి. మాత్రం అలాంటి ఉద్దేశం లేదని తెలిపింది.

విజయవాడలోని ఏడు ఆస్తులు, కీసరలోని భూమి అమ్మకానికి..
ఇక విజయవాడలోని ఏడు వాణిజ్య సముదాయాలు, కీసరలోని భూమి అమ్మకానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపింది అగ్రిగోల్డ్. దీంతో అత్యంత విలువైన నాలుగు ఆస్తులకు షెడ్యూల్ విడుదల చేసింది ఉన్నత న్యాయస్థానం. బహిరంగ వేలం పాటలో ఎవరైన పాల్గోన వచ్చని కోర్టు అదేశిస్తూ.. హాయిలాండ్ అమ్మకంపై విచారణ తర్వాత చేపడుతామని వాఖ్యానించింది. హైకోర్టు తీర్పుతో అగ్రిగోల్డ్ బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అగ్రిగోల్డ్ నుంచి డబ్బులు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. 

07:13 - November 8, 2016

అమెరికా : అనుకున్న సమయం రానే వచ్చింది. అమెరికా 45వ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రంగం సిద్ధమైంది. అధ్యక్ష ఎన్నికలకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల క్రతువు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే వాచ్‌ దిస్‌ స్టోరీ....

45వ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి అమెరికన్లు సిద్ధం
తమ దేశానికి 45వ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి అమెరికన్లు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు వచ్చిన సర్వేల ప్రకారం డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతోంది. ఈమెయిల్స్‌ వ్యవహారంపై హిల్లరీకి ఎఫ్‌బిఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చిన నేపథ్యంలో ఆమె మళ్లీ బలాన్ని పుంజుకున్నారు. ఒకవేళ ఈ పదవికి ఆమె ఎన్నికైతే అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించనున్నారు.అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ముందుగా ఎలక్టోరల్‌ కాలేజీకి ప్రతినిధులను ఎన్నుకుంటారు. వారంతా ఏదో ఒక పార్టీకి మద్దతుగా ఉంటారు. అంటే సాధారణ ఎన్నికల్లో మెజారిటీ పొందిన పార్టీయే అధికారంలోకి వస్తుంది.

270 ఓట్లు సాధించినవారికే అభ్యర్థి అధ్యక్ష పదవి..
అమెరికాలోని 50 రాష్ట్రాలుండగా..ఒక్కో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఉభయ సభ సభ్యులు అంటే సెనెటర్లు, రిప్రంజెంటేటివ్‌లను ఎన్నుకుంటారన్నమాట. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎన్నికలు నిర్వహిస్తాయి. ఎలక్టోరల్ కాలేజీ మొత్తం సభ్యుల సంఖ్య 538. ఇందులో అమెరికా ప్రతినిధుల సభ సంఖ్య 435, సెనేట్‌ సభ్యుల సంఖ్య 100. వాషింగ్టన్‌కు ముగ్గురు అదనపు సభ్యులుంటారు. 538 మంది ఎలక్టోరల్‌ సభ్యుల్లో 270 ఓట్లు పొందిన అభ్యర్థి అధ్యక్ష పదవికి ఎన్నికవుతారు.

ఎన్నికల అనంతరం గంటన్నరకు 30 రాష్ట్రాల ఫలితాలు
భారతీయ కాలమానం ప్రకారం జార్జియా, దక్షిణ కెరోలినా, ఇండియానా, కెంటకీలలో ఎన్నికలు బుధవారం ఉదయం ఐదున్నరకు ప్రారంభమవుతాయి. పదకొండున్నరకు ముగుస్తాయి. తొలి ఫలితాలు జార్జియా, వర్జీనియాల నుంచి వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత గంటన్నరకు 30 రాష్ట్రాల ఫలితాలు వెలువడుతాయి.

అందరి కళ్లు 29 ఎలక్టరోల్‌ ఓట్లున్న ఫ్లోరిడాపైనే
ఒకవేళ ట్రంప్‌ జార్జియాలో ఓడిపోతే సంచలనం అవుతుంది. ఎందుకంటే జార్జియా రిపబ్లికన్లకు కంచు కోట. అలాగే డెమోక్రట్ల కంచుకోట వర్జీనియాలో హిల్లరీ ఓడితే కూడా సంచలనమే అవుతుంది. డెమోక్రట్ల ఓటు బ్యాంకు ఓహియో, రిపబ్లికన్ల ఓటు బ్యాంకు నార్త్ కెరోలినాలో ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. ఓహియాలో 18, నార్త కెరోలినాలో 15 ఎలక్టోరల్‌ ఓట్లున్నాయి. అందరి కళ్లు 29 ఎలక్టరోల్‌ ఓట్లున్న ఫ్లోరిడాపైనే ఉన్నాయి. 2012లో ఇక్కడ ఒబామానే గెలిచారు. 20 ఎలక్టరోల్‌ ఓట్లున్న పెన్సిల్వేనియా కూడా ఇరు పార్టీల అభ్యర్థులకు కీలకమే. మెక్సికో సరిహద్దులోని ఎరిజోనా, టెక్సాస్ రాష్ట్రాలు హిల్లరీకి మద్దతునిచ్చే అవకాశం ఉంది. డెమాక్రట్లకు కంచుకోటగా ఉన్న కొలారాడో, మిచిగాన్, విస్కోన్సిన్‌ తదితర ప్రాంతాల్లో ట్రంప్‌ పాగా వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో 35 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. 55 ఎలక్టోరల్‌ ఓట్లు కలిగి ఉన్న కాలిఫోర్నియా- ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. కాలిఫోర్నియా డెమోక్రట్లకు మద్దతుగా ఉంది.

ఎన్నికల ప్రచారానికి వందల కోట్ల డాలర్ల ఖర్చు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత ఖరీదైన వ్యవహారం. ఎన్నికల ప్రచారానికి వందల కోట్ల డాలర్లు ఖర్చవుతాయి. 2012 ఎన్నికల్లో ఒబామా వంద కోట్ల డాలర్లు ఖర్చు చేసి ఉంటారని అంచనా. అభ్యర్థులు ఇంత భారీ వ్యయం చేయడానికి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల నుంచి విరాళాలు సేకరిస్తారు. ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలకంగా మారాయి.

16న గోదావరి బోర్డు సమావేశం..

హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఈనెల 16 నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు సమాచారం అందించారు. ఏపీ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాల్ని కృష్ణాడెల్టాకు తరలించడంతో పాటు పోలవరం ద్వారా తరలింపునకు కూడా పనులు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు కృష్ణాజలాల్లో 90 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉంది. ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.

కోర్టుకు సిట్ నివేదిక..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసు దర్యాప్తు నివేదిక సిట్ హైకోర్టుకు సమర్పించనుంది. ఇప్పటివరకూ సిట్ 166 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. పలువురిని అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం వారి సాక్ష్యాలను సిట్ రికార్డు చేసింది. ఈ నివేదికను ఈరోజు న్యాయస్థానానికి సమర్పించనుంది.  

నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు..

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడు జరుగనున్నాయి. బుధవారం మధ్యాహ్నాం కల్లా ఫలితాలు వెలువడే అవకాశం వున్నట్లుగా సమాచారం. 

Don't Miss