Activities calendar

09 November 2016

విశాఖ జిల్లాలో మావోయిస్టులు భారీ బహిరంగ సభ

విశాఖ : జీకే వీధి..చింతపల్లి సమీపంలో మావోయిస్టులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. వందలాది మంది గిరిజనులు హాజరయ్యారు. టీడీపీ, బీజేపీ నేతలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరికలు చేశారు. 

21:56 - November 9, 2016
21:55 - November 9, 2016

ఢిల్లీ : శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి ఎల్డీఎఫ్‌ ఎప్పుడో మద్దతు తెలిపిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ తెలిపారు. మహిళలకు దేశంలోని అన్ని దేవాలయాలల్లో ప్రవేశానికి అనుమతి ఉండాలన్నారు. శబరిమల ఆలయలంలో మహిళల ప్రశేశానికి సానుకూలంగా ఉన్నామని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తెలిపిందని ఆమె వెల్లడించారు. 

21:51 - November 9, 2016

హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్... ఇవాళ కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన  ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ భేటీలో పాల్గొంది. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న రెండు స్కై వేల‌కు స్థలం కేటాయింపు, కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల మూసివేత అంశాలను ప‌రిష్కరించాల‌ని పారిక‌ర్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పారికర్ హామీ ఇచ్చినట్టు కేటీఆర్ తెలిపారు. రేపు మరికొంత మంది కేంద్రమంత్రులతో కేటీఆర్ భేటీ కానున్నారు. 

 

21:48 - November 9, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో జనం పరేషాన్‌ అవుతున్నారు. చిల్లర దొరక్క తలలు పట్టుకుంటున్నారు. మోదీ నిర్ణయం ప్రజలకు తాత్కాలిక కష్టాల్ని తెస్తోంది. ఎక్కడికెళ్లినా.. ఏ వస్తువు కొనులకుంటున్నా.. ఖచ్చితంగా చిల్లర కావాల్సిందే అంటూ షాపు యజమానులు తేల్చిచెబుతున్నారు. చేతిలో చిల్లరలేక.. పెద్దనోట్లు దండిగా ఉన్నా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో జనం గందరగోళానికి గురవుతున్నారు. 500, 1000 నోట్లను రద్దు చేయడంతో... హోటళ్లు, దుకాణాలు, పెట్రోల్‌బంకులు, టోల్‌ ప్లాజాల్లో జనం కష్టాలు అన్ని ఇన్నీకావు..!
నోట్ల రద్దుపై సర్వత్రా చర్చ
ఇప్పుడు ఎక్కడ విన్నా.. పెద్ద నోట్ల రద్దుపైనే చర్చ. చిల్లర కోసం జనం ఆగచాట్లు అన్నిఇన్నీకావు.. నల్లధనం నియంత్రణకు ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఊహించని రీతిలో ఆచరణలోకి వచ్చిన ఈ నిర్ణయం ప్రజలకు తాత్కాలిక ఇబ్బందులకు గురిచేస్తోంది. పెద్దనోట్ల రద్దుతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెద్దనోట్లను పెట్రోల్‌ బంకుల్లో తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించినా.. తమవద్ద చిల్లర లేదంటూ బంకు యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలీక వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వాహనదారులు వారికి కావాల్సినంత పెట్రోల్‌ పోయించుకుని.. రూ.500నోట్లు ఇచ్చి చిల్లర తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. ఆ విధంగా వారి జేబులకు చిల్లు పడుతోంది. 
సరిపడ చిల్లరలేక జనం పరేషాన్‌
మరికొన్ని పెట్రోల్‌ బంకుల్లో తమ వద్ద చిల్లర నోట్లు లేవని.. రూ.500.. రూ.వెయ్యికి తక్కువ పెట్రోల్‌ పోయమని తేల్చి చెప్పటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. మరికొందరు రూ.500.. రూ.వెయ్యికి పెట్రోల్‌.. డీజిల్‌ పోయించుకునేందుకు సిద్ధమై.. రూ.500లకు.. రూ.వెయ్యికి తక్కువ మొత్తానికే ట్యాంక్‌ నిండినా.. మిగిలిన చిల్లర తమ వద్ద లేదని.. తామేం చేయలేమని తేల్చేయటంపై ప్రజలు మండిపడుతున్నారు.
టోల్‌ప్లాజాల్లో వాహనదారుల కష్టాలు
జాతీయ రహదారుల గుండా ప్రయాణాలు చేసే ప్రయాణీకులు టోల్‌ప్లాజాల వద్ద నగదు సమస్య ఎదుర్కొంటున్నారు. రూ.500, రూ.1000 నోట్లను టోల్‌ప్లాజా సిబ్బంది నిరాకరిస్తుండటంతో కొందరు వాహనదారులు వారితో వాగ్వాదానికి దిగారు. మరికొందరు ఏం చేయాలో తెలీక నిరాశగా తిరుగుముఖం పట్టారు.
ఏటీఎంల్లో క్యాష్‌ నిల్‌ 
కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో ఉలిక్కిపడిన ప్రజలు నగదు విత్‌ డ్రా చేసుకునేందుకు ఏటీఎంలకు పరుగులు పెట్టారు. అర్థరాత్రి వేళలోనూ పెద్ద ఎత్తున నగదు విత్‌ డ్రా చేసుకున్నారు. దీంతో.. పలు ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఇక.. బుధవారం నుంచి ఏటీఎంలు పని చేయకపోవటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు. చేతిలో పెద్దగా నగదు ఉంచుకోకుండా అవసరానికి ఏటీఎంలలో నుంచి తీసుకునే అలవాటు ఉన్న వారి కష్టాలు అన్నీఇన్నీ కావు.
చిన్నవ్యాపారుల ఆక్రోశం 
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అన్ని వర్గాల వారిపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నగరాల్లోని పెద్దపెద్ద షోరూంలు.. షాపింగ్‌ మాల్స్‌ లాంటి వాటికి తాజా నిర్ణయం పెద్ద ప్రభావం చూపించకున్నా.. చిన్న.. ఒక మోస్తరు షాపుల వారికి షాకింగ్‌గా మారింది. ఇక.. కూరగాయలు.. పండ్ల దుకాణాలు.. టిఫిన్‌ సెంటర్లు లాంటి వారి ఇబ్బంది అంతాఇంతా కాదు. తాజా పరిణామంతో చిన్న వ్యాపారాల మీద తీవ్ర ప్రభావం పడిందని వాపోతున్నారు.
నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్న జనం
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు నిత్యావసరాలకు సైతం ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా చిల్లర లేని కారణంగా మెడిసిన్స్, నిత్యావసర సరుకులు సైతం కొనుగోలు చేయలేకపోతున్నట్లు సామాన్యులు చెబుతున్నారు. అవసరం ఉండి కొంత మంది చిల్లర కోసం వస్తుంటే కొంత మంది అదే పనిగా కేవలం పెద్ద నోట్లను మార్చుకోవడానికి చిల్లర కోసం వస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొంత మంది ప్రజల ఇబ్బందులను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. చిల్లర ఇస్తే ఐదువందలకు వంద రూపాయల కమిషన్ తీసుకుంటున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఏకంగా కౌంటర్లే తెరిచారు. కొంత మంది వెయ్యికి 700 రూపాయలే ఇస్తున్నారు. తమ వద్ద ఉన్న విలువైన నోట్లు అవసరానికి పనికి రావడం లేదని వాపోయారు.
అందుబాటులోకి రానున్న బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రజల కష్టాలు తాత్కాలికమేనని... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. పాత నోట్ల స్థానంలో కొత్తనోట్లను ప్రవేశపెట్టేందుకు బ్యాంకులు, ఏటీఎంలు ఒకటి రెండు రోజులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. నవంబర్‌ 11 నుంచి పాతనోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తొందరపాటుతో కమిషన్లతో బేరాలు చేసే వారి చేతుల్లో మోసపోవద్దని సూచిస్తున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయం నల్ల కుబేరులకు ఎలాంటి నష్టాన్ని కలిగించిందో తెలియదు కానీ, సామాన్యులకు, మధ్య తరగతి ప్రజలకు మాత్రం తప్పని కష్టాలను మిగిల్చింది. 

21:43 - November 9, 2016

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలవడంతో భారతీయుల్లో ఆందోళన మొదలైంది. అమెరికన్లు నిరుద్యోగులుగా మారడానికి వలసవాదులే కారణమని ట్రంప్‌ ఆరోపించడమే ఇందుకు కారణం. ఎన్నికల ప్రచారంలో అమెరికన్లకు చేసిన వాగ్దానాలకు ట్రంప్‌ కట్టుబడి ఉంటారా? భారత్‌ పట్ల ఆయన వైఖరి ఎలా ఉండబోతోంది?  
అనూహ్య రీతిలో ట్రంప్‌ విజయం 
ప్రపంచాన్ని శాసించగలిగే సత్తా ఉన్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అనూహ్య రీతిలో విజయం సాధించారు. భారత్‌ పట్ల ట్రంప్‌ వైఖరి ఎలా ఉండబోతున్నారన్నది ఆసక్తి కలిగిస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారం అమెరికన్ ప్రజలు కోల్పోతున్న ఉద్యోగాల దిశగా సాగింది. అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు, చైనీస్, సింగపూర్ తదితర దేశాల ప్రజలు ఎగరేసుకు పోతున్నారని, వాటిని అరికడతామన్నారు. మళ్లీ అమెరికా ఉద్యోగాలు అమెరికాకు తెస్తామని, భారత్ నుంచి వెళ్లే వలసవాదులపై ఆంక్షలు విధిస్తామని పరోక్షంగా హెచ్చరించారు.  
ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు తారుమారు 
ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధిస్తారని భారతీయులు ఊహించలేదు. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు తారుమారు చేస్తూ ఫలితాలు ట్రంప్‌కు అనుకూలంగా రావడంతో భారతీయులతో పాటు ప్రంపంచ దేశాలు కంగుతిన్నాయి. ట్రంప్‌ విదేశీ నీతి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిగా మారింది. మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిగా ట్రంప్‌కు పేరుంది. తానిచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటే అమెరికా కంపెనీల్లో భారతీయ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలపై తీవ్ర ప్రభావం 
గత ప్రభుత్వాలు తీసుకున్న విదేశీ వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షిస్తానని ట్రంప్ హెచ్చరించడంతో, భారత్తో ఉన్న ట్రేడ్ డీల్స్పై కూడా ఈ ప్రభావం పడే అవకాశముంది. హెచ్1బీ వీసా ప్రొగ్రామ్ను ట్రంప్ ఎక్కువగా టార్గెట్ చేశారు. ఈ ప్రొగ్రామ్ను నిలిపివేస్తానని అమెరికన్లకు హామీ ఇచ్చారు. దీంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న భారత ఐటీ ఇండస్ట్రి భారీగా నష్టపోనుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది.
ట్రంప్ గెలుపుతో భారత్ కు నష్టాలు, లాభాలు
ట్రంప్ గెలుపుతో భారత్ కు నష్టాలతో పాటు కొన్ని లాభాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఓవైపు కఠినతరమైన ఇమిగ్రేషన్ రూల్స్ను తీసుకొస్తానని చెప్పిన ట్రంప్  మరోవైపు భారత విద్యార్థులు, వ్యాపారస్తుల మనసులు గెలుచుకోవడానికి కృషి చేశారు. ట్రంప్‌ విజయం పట్ల అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు సంతృప్తిగానే ఉన్నారు. విద్యా, వైద్యం, టెక్నాలజీ రంగాల్లో భారతీయులు రాణిస్తూ అమెరికా అభివృద్ధిలో భాగమవుతున్నారు.
భారత్ కు అనుకూలంగా మారే అవకాశం 
చైనా పట్ల ఆయనకున్న వైరుధ్యం అది భారత్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ట్రంప్‌ ముస్లింలను టెర్రరిస్టులుగా పోల్చడంతో పాకిస్తాన్‌ను ఉగ్రవాద సహకార దేశంగా ముద్ర వేయడానికి ఆయన వెనకాడక పోవచ్చు. పాకిస్తాన్‌కు బుద్ది చెప్పేందుకు ట్రంప్‌ భారత్‌ కలిసి పనిచేసే అవకాశం లేకపోలేదు. భారత్‌తో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తామని ఆయన పలుమార్లు చెప్పడం గమనార్హం.

 

21:40 - November 9, 2016

అమెరికా : ఒకప్పటి రియాలిటీ టీవీ స్టార్‌... ఇప్పుడు రియల్‌ హీరోగా ఎదిగారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచి ఆ దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త.. అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యర్థి హిల్లరీ కంటే వెనుకంజలో ఉన్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు ఆధిక్యం ఎలా వచ్చింది. ఈ గెలుపునకు గల కారాణాలు ఏంటి..?
ట్రంప్‌ ఎన్నిక సంచలనం
ఎన్నో విమర్శలు... బెదిరింపులు... సొంతపార్టీ నుంచే సవాళ్లు... వీటన్నింటినీ అధిగమించి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడం సంచలనం సృష్టించింది. ఇటీవల ప్రపంచ చరిత్రలో ట్రంప్‌ రాజకీయంగా ఎదిగిన క్రమం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రత్యర్థి పక్షమే కాదు, దేశంలోని పలు సెలబ్రిటీలు, సొంత పక్షంలోని వారే విమర్శల వర్షం కురిపించారు. గతంలో ట్రంప్‌ తమను వేధించినట్టు పలువురు మహిళలు బహిరంగంగానే ఆరోపించారు. అయితే వీటన్నింటిని తట్టుకొని అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నిక కావడం విశేషం.
మైనారిటీలు, ఇతర వర్గాలపై వివాదస్పద వ్యాఖ్యలు 
అమెరికా భవిష్యత్‌పై అమెరికన్ల ఆందోళనను ట్రంప్‌ సరిగ్గా అర్థం చేసుకున్నారు. వలసలపై అమెరికన్ల భయాన్ని పొగొట్టే క్రమంలో భాగంగా ఆయన మైనారిటీలు ఇతర వర్గాలపై వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలకు తానే రక్షణ కలిగిస్తానన్న భరోసా కల్పించారు. ఎనిమిది సంవత్సరాల నుంచి అమెరికాలో డెమోక్రాట్ల పాలన కొనసాగింది.  ఈ ఎనిమిదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య మార్పులు సంభవించాయి. ఆర్థిక వ్యవస్థ మందగించి... అమెరికాకు అనేక రంగాల్లో పెనుసవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో మార్పు కోసం రిపబ్లికన్లకు ఓటు వేయాలన్న ట్రంప్‌ పిలుపునకు అమెరికన్లు విశేషంగా స్పందించారు. అమెరికాలో అవినీతిని నిర్మూలిస్తానని డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన హామీకి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు.  
పెన్సిల్వేనియాలో ట్రంప్‌ విజయం  
ఎన్నికల ప్రచారంలో భాగంగా రిపబ్లికన్‌లు కీలకంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించడంతో పాటు డెమోక్రాట్లకు కంచుకోటలుగా ఉన్న పలురాష్ట్రాలపై ప్రత్యేకంగా గురిపెట్టారు. ఈ రాష్ట్రాల్లో పలు సార్లు ప్రచారం నిర్వహించడం ద్వారా అనేకమంది ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కీలకమైన ఫ్లోరిడాతో బాటు పెన్సిల్వేనియాలో విజయం సాధించడంతో ట్రంప్‌కు ఎదురులేకుండాపోయింది.
ట్రంప్‌కు శ్వేతజాతీయులు మద్దతు 
2012 ఎన్నికల్లో అమెరికాలో స్థిరపడిన లాటిన్‌ అమెరికన్‌ దేశాలకు చెందిన ప్రజలు.. ఆఫ్రో అమెరికన్లు ఒబామాకు మద్దతు పలికారు. ఈ ఎన్నికల్లో వారు ఓటింగ్‌లో ఎక్కువగా పాల్గొనలేదు. శ్వేతజాతీయులు ఎక్కువగా ట్రంప్‌కు మద్దతు పలకడంతో పాటు స్వయంగా వారు ఓటింగ్‌ కేంద్రాలకు రావడంతో ట్రంప్‌కు గెలుపు సునాయాసంగా మారింది. నార్త్‌ కరొలినా, ఒహాయో రాష్ట్రాల్లో కూడా గెలుపుతో ట్రంప్‌ ఆధిక్యంలోకి వెళ్లారు. ఫ్లోరిడాలో 29 ఎలక్ట్రోరల్‌ ఓట్లు ఉండటం.. అవి రిపబ్లికన్స్‌కు రావడంతో ట్రంప్‌ విజయ పథంలో నిలిచేందుకు దోహదం చేసింది.
డెమోక్రటిక్‌ పార్టీ అంచనాలు తలకిందులు 
ప్రచారం చివరి దశలో ట్రంప్‌ తన సరళిని మార్చుకుని..తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు. కార్మికులతో పాటు గ్రామీణ ఓటర్లను తన ప్రసంగాలతో ప్రభావితం చేయడంతో వారు ఆయన వైపు మొగ్గు చూపారు. ట్రంప్‌ దుందుడుకు ప్రచారమే తమకు అనుకూలిస్తుందని డెమోక్రటిక్‌ పార్టీ పెట్టుకున్న అంచనాలు.. తలకిందులు కావడంతో ట్రంప్‌ గెలుపునకు మార్గం సుగమం అయింది.  
అమెరికన్లను విశేషంగా ఆకట్టుకోగలిన ట్రంప్‌ 
తాను గెలిస్తే అమెరికాను ప్రపంచంలోనే మహోన్నత దేశంగా చేస్తానంటూ ట్రంప్‌ ప్రచారం చేశారు. అలాగే జాతీయ వాదాన్ని, దేశభక్తిని చాటేలా ట్రంప్‌ తన ప్రసంగంతో అమెరికన్లను తనవైపు మలుచుకున్నారు. అదే సమయంలో వరుస డెమొక్రటిక్‌ పాలనతో అమెరికన్లు కాస్త కొత్తదనం కోరుకున్నారు. దేశభక్తి భావాల్ని మేల్కొలిపేలా ట్రంప్‌ అమెరికన్లను ఇన్‌స్పైర్‌ చేయగలిగారు.  అమెరికన్‌ యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను చైనాతో పాటు మరికొన్ని దేశాలు  తన్నుకు పోతున్నాయని..వీటిని కట్టడి చేసేలా కొత్త చట్టాలు తీసుకొస్తామని చెప్పి ట్రంప్‌ అమెరికన్లను విశేషంగా ఆకట్టుకోగలిగారు.  

 

పెద్దనోట్ల రద్దుతో చిల్లర కొరత

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా చిల్లర కొరత ఏర్పడింది. సరిపడ చిల్లర లేక సామాన్య ప్రజల ఇబ్బందులు పడుతున్నారు. 500, 1000 నోట్లు తీసుకోవడానికి వ్యాపారులు నిరాకరిస్తున్నారు. దళారులు రూ.500, 1000 నోట్ల మార్పిడికి పాల్పడుతున్నారు. దళారులు రూ. 500 కు రూ.100 కమీషన్ తీసుకంటున్నారు. పుణ్యక్షేత్రాల్లోనూ చిల్లర లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 

టోల్ ట్యాక్స్ రద్దు చేసినా.. సిబ్బంది ట్యాక్స్ వసూలు

కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజాతో పాటు పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ టోల్ ప్లాజా సిబ్బంది దోపిడీకి పాల్పడుతున్నారు. కేంద్రం టోల్ ట్యాక్స్ రద్దు చేసినట్లు ప్రకటించినా సిబ్బంది వాహనదారుల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తోంది. 

రక్షణమంత్రి పారికర్ ను కలిసిన మంత్రి కేటీఆర్

ఢిల్లీ : రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ను మంత్రి కేటీఆర్ కలిశారు. కేటీఆర్ తోపాటు మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న రెండు స్కైవేలకు, కంటోన్మెంట్ పరిధిలోని రోడ్ల విస్తరణకు రక్షణ శాఖ స్థలాలు ఇవ్వాలని కోరామని మంత్రి కేటీఆర్, మేయర్ రామ్మోహన్ తెలిపారు. కంటోన్మెంట్ రోడ్ల మూసివేత సమయం పెంచాలని కోరినట్లు చెప్పారు. కంటోన్మెంట్ స్థలానికి బదులుగా ఎక్కడ స్థలం ఇవ్వాలో వారంలోగా నిర్ణయించి బెబుతామని పారికర్ కు చెప్పామని చెప్పారు. 
 

20:57 - November 9, 2016

నోట్ల రద్దే అన్ని సమస్యలకు పరిష్కారమా ? విదేశాల్లో పోగుబడిన నల్లధనం మాటేమిటీ ? అక్రమ స్థిరాస్తుల సంగతేంటి ? సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపుతోంది ? నోట్లు... పాట్లు.. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం. పూర్తి వివరాను వీడియోలో చూద్దాం...

 

20:55 - November 9, 2016

మల్లన్నముచ్చట్లలో భాగంగా ఇవాళ మల్లన్న వరంగల్ జిల్లాలోని రైతులతో, పేదలతో ముచ్చటిండు. జిల్లాలోని జయన తిరుమలాపురంలో పంట పొలంలోని రైతుతో ముచ్చటించిండు. వ్యవసాయం కష్టాలను తెలుసుకున్నాడు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నాడు. ఈ సందర్భంగా వ్యవసాయంలో వచ్చే ఇబ్బందులను రైతు మల్లన్నకు ఏకరువుపెట్టాడు. సర్కార్ సహాయం అంతంతమాత్రమే అంటున్నాడు రైతు. అంనతరం జిల్లాలోని మరో గ్రామం మున్ననూరులోని పేదల జీవితాలు, ఇళ్ల పరిస్థితిపై పేదలతో ముచ్చటించిండు. ఈ సందర్భంగా పేదలు తమ గోడును మల్లన్నకు విన్నవించుకున్నారు. ప్రభుత్వం మాకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటున్నారు. వారి పేదరికంపై మల్లన్న రిపోర్టు అందించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఈ శని, ఆది, సోమవారాల్లో బ్యాంకులు పని చేస్తాయి : ఆర్ బిఐ

ఢిల్లీ : ఈ శని, ఆది, సోమవారాల్లో బ్యాంకులు పని చేస్తాయని ఆర్ బీఐ తెలిపింది. రూ.500, రూ.1000 నోట్లు మార్చుకునేందుకు ఖాతాదారులకు వెసులుబాటు కల్పించింది. 

20:26 - November 9, 2016
20:16 - November 9, 2016

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. సర్వే రిపోర్టులు, అంచనాలు తారుమారయ్యాయని తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆర్థికరంగ నిపుణులు పాపారావు, విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు, అమెరికా నుంచి హరికాసుల, నారాయణమూర్తి పాల్గొని, మాట్లాడారు. హిల్లరీ క్లింటన్ పాప్ లర్ ఓట్లను పొందారని.. ఎలక్ట్రోలర్ ఓట్లు గెలవలేకపోయారని తెలిపారు. ఓటర్ టర్న్ అవుట్ అయిందన్నారు. ఒబామాకు సపోర్టు చేసినట్లుగా హిల్లరీ క్లింటన్ కు సపోర్ట్ చేయలేదని పేర్కొన్నారు. సెనెట్ లో, హౌజ్ లో రిపబ్లిక్ పార్టీ అధీక్యంలో ఉంది కనుక వారు ఏ నిర్ణయం తీసుకుంటే అదే అమోదం పొందుతుందని చెప్పారు. ట్రంప్ ది పెద్ద విజయంగా కనపడడం లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

కలెక్టర్లు, డీఈవోలతో కడియం వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ప్రభుత్వం పాఠశాలల్లో డిజిటలైజేషన్ పై చర్చిస్తున్నారు. 

 

2 వేల నోట్లలో ఎలాంటి చిప్, రహస్య కెమెరాలు లేవు : ఆర్బీఐ

ఢిల్లీ : కొత్తగా వస్తున్న రూ.2000 నోట్లలో ఎలాంటి చిప్ లు రహస్య కెమెరాలు లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆర్బీఐ ఖండించింది. ప్రజలు ఎటువంటి పుకార్లు నమ్మవద్దని సూచించింది.

19:24 - November 9, 2016

కృష్ణా : విజయవాడలో రేపట్నుంచి ఇండియా, వెస్టిండీస్ మహిళల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లకు ఇబ్రహీంపట్నంలోని మూలపాడులో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన స్టేడియం వేదిక కానుంది. వన్డే, టీ20 ఫార్మాట్ లో ఎంతో బలంగా ఉన్న వెస్టిండీస్ మహిళా జట్టును మట్టికరిపించేందుకు ఇండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. 
మ్యాచ్ వ్యూహంపై... క్రికెట్ కెప్టెన్ మిథాలి రాజ్ టెన్ టివితో మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

19:14 - November 9, 2016

కర్నూలు : జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్యాపిలి పట్టణానికి చెందిన మధు అనే వ్యక్తి.. ప్రభుత్వ పాఠశాలలో 1 వ తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై వారం రోజుల కిందట అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాలికను తల్లిదండ్రులు గమనించిడంతో అసలు విషయం చెప్పింది. దీంతో ఆ బాలికను కర్నూలు ప్రభూత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.

 

19:11 - November 9, 2016
19:09 - November 9, 2016
19:04 - November 9, 2016

ఢిల్లీ : రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి కేంద్రప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో శనివారం, ఆదివారం అన్ని బ్యాంకులు పని చేస్తాయని ఆర్ బీఐ తెలిపింది. పెద్ద నోట్ల రద్దు దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

18:59 - November 9, 2016

హైదరాబాద్ : రూ.500, 2000 నోట్లు అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ నల్లధనం పెరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ నోట్లను తాత్కాలికంగా ఇచ్చి తర్వాత రద్దు చేయాలని చెప్పారు. ప్రస్తుతం సమస్యలున్నా.. భవిష్యత్ లో లాభాలుంటాయని పేర్కొన్నారు. రెండు వేల నోట్లపై చర్చ జరగాలన్నారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత నగదు అవపసరం ఏముందని అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా టెక్నాలజీ వాడకం పెరిగిందని చెప్పారు. దీని ద్వారా అవినీతిని తగ్గించవచ్చన్నారు. బ్యాంకులు ఎక్కువ శాఖలను పెంచి ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు అన్నారు. ఆన్ లైన్ లో లావాదేవీలు పెరుగుతాయని తెలిపారు. దీర్ఘకాలికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. స్వచ్చ భారత్ అంటే మనుషులు శుభ్రంగా ఉండడమే కాదు.. రోడ్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మనుషులే కాదు.. మనసులు కూడా శుభ్రంగా ఉండాలని చెప్పారు.

 

ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

జమ్మూకాశ్మీర్ : బారాముల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు. మాచిల్ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పుల్లో భారత జవాను మృతి చెందారు. 

 

18:53 - November 9, 2016

ఆదిలాబాద్‌ : పరిహారం కోసం పదేళ్లుగా ఎదురుచూపులు.. పునరావసం కోసం అధికారులు చుట్టూ ప్రదక్షణలు.. ఉపాధి అవకాశం పోయింది.. ఉండడానికి గూడు లేదు. ఇదీ ఎల్లంపల్లి భూ నిర్వాసితుల గోడు. సాగునీరు అందుతుందన్న ఆశతో సర్వం కోల్పోయి.. ప్రభుత్వం చేతిలో దగా పడి.. బతుకు పోరాటం చేస్తున్నారు. తమ వెతలను తీర్చమంటూ నేతలకు విన్నవిస్తున్నారు. 
ప్రాజెక్ట్‌తో ముంపునకు గురైన 9 గ్రామాలు
ఆదిలాబాద్‌ జిల్లా.. శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ ఆయకట్టు కింద.. తొమ్మిది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. మంచిర్యాల మండలంలో నస్పూరు, గుడిపేట, చందనాపూర్‌, కొండపల్లి, రాపల్లి పడ్దన్‌పల్లి, కర్ణమామిడి గ్రామాలు, లెక్సట్టిపేట మండలంలోని నూరారం..గుళ్లకోటలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కేవలం గుడిపేట గ్రామస్థులు మాత్రమే పూర్తిస్థాయిలో పునరావాస కాలనీకి తరలివెళ్లారు. మిగిలిన ఎనిమిది గ్రామాల ప్రజలు వారి గ్రామాల్లోనే నివసిస్తున్నారు. వీరెవరికీ పూర్తిస్థాయి పరిహారం అందలేదు. 
పూర్తికాని పునరావాస కాలనీలు
కేవలం ఒక్క నస్పూర్‌ గ్రామంలోనే 16 కోట్ల 72 లక్షల పరిహారం పెండింగ్‌లో ఉంది. అదే విధంగా గుళ్లకోట గ్రామస్థులకు 8 కోట్ల72 లక్షల పరిహారం చెల్లించాలి..వీరికి పూర్తి పరిహారం చెల్లించలేదు.. దీంతో వీరి కోసం పునరావాస కాలనీ ఏర్పాటు చేసినా.. అక్కడకు వెళ్లమని నిర్వాసితులు తేల్చి చెబుతున్నారు. అలాగే రాపల్లి గ్రామస్థులకు మొత్తం 13 కోట్ల 23 లక్షలు పరిహారం పెండింగ్‌లో ఉంది. వీరికి కూడా పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు.. వీరి కోసం ఏర్పాటు చేసిన కాలనీలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. దీంతో వీరు కూడా గ్రామంలోనే ఉండిపోయారు.
మధ్యలోనే నిలిచిపోయిన పునరావాస కాలనీ నిర్మాణం
ఈ ప్రాజెక్ట్ కింద చందనాపూర్‌ గ్రామంలో 267 కుటుంబాలు.. ముంపునకు గురవుతున్నాయి. వీరికి 8 కోట్ల 50 లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉంది. అలాగే వీరి కోసం కాలనీ నిర్మాణానికి కేటాయించిన భూమి వివాదంలో చిక్కుకుంది. దీంతో కాలనీ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో వారంతా గ్రామంలోనే ఉంటున్నారు. అలాగే పడ్తన్‌పల్లి గ్రామస్థులకు 7కోట్ల 81 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది. వీరి కోసం కాలనీని నిర్మిస్తున్నారు. కర్టమామిడి గ్రామస్థులకు 20కోట్ల 27 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది. వీరికి హాజీపూర్‌ శివారులో 110 ఎకరాలు పునరావాసం కోసం కేటాయించాల్సి ఉండగా..ఇప్పటికీ 40 ఎకరాలు మాత్రమే సేకరించారు.
పరిహారం ఇవ్వలేదని ఊళ్లు ఖాళీ చేయని గ్రామస్థులు
సూరారం గ్రామంలో 209 కుటుంబాలు ఉండగా.. వీరికి 3 కోట్ల 90 లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉంది. అలాగే కొండపల్లి గ్రామంలో 244 కుటుంబాలు  ముంపునకు గురవుతుండగా.. 3 కోట్ల 51 లక్షల పరిహారం పెండింగ్‌లో ఉంది. దీంతో గ్రామస్థులు ఊళ్లు ఖాళీ చేయలేదు. చేయడానికి పనిలేకుండా.. ఉండడానికి గూడు లేకుండా ఎక్కడికి పోవాలని ఆయా గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల చుట్టూ నీరు వచ్చి చేరుతుందని.. పురుగులు..పాములు వచ్చి చేరుతున్నాయని వాపోతున్నారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా..మమ్మల్ని అధికారులు పట్టించుకోవడం లేదని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ స్థలం కేటాయించే వరకు.. గ్రామాలను వదలివెళ్లే పరిస్థితి లేదని బాధితులు అంటున్నారు. వర్షాకాలం రాకముందే తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. 

 

18:47 - November 9, 2016

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం చేస్తున్న మహాజన పాదయాత్ర 24వ రోజుకు చేరుకుంది. ఈరోజు పాదయాత్ర మహబూబ్‌నగర్‌ జిల్లా లాల్‌కోట నుంచి ప్రారంభమైంది. తమ్మినేని బృందానికి వైద్యబృందం.. వైద్య పరీక్షలు నిర్వహించారు. తమ్మినేని బృందానికి ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి నినాదాలతో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కమిటీ మహాజన పాదయాత్ర చేపట్టింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాద్ర చేస్తున్నారు. 64 సం.లున్న తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో పాదయాత్ర జరుగుతోంది. మహాజన పాదయాత్ర మంచి ఆదరణ పొందింది. నాడు నైజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం జరిగింది. ఇప్పుడు తెలంగాణ గడ్డపై ప్రజలు మళ్లీ పొలికేక వేస్తున్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. ఎపిలో కూడా మరోరూపంలో పోరాటాలు సాగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:37 - November 9, 2016

వరంగల్‌ : నగరానికి కొత్త కరెన్సీ వచ్చేసింది. భారీ బందోబస్తు మధ్య ఎస్ బీహెచ్ జోనల్‌ కార్యాలయానికి కొత్త నోట్లను తరలించారు. ఈ డబ్బును కిందకు దించే సమయంలో రోడ్డుపై రాకపోకలు ఆపేశారు. ఈ నగదును స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. రేపటి నుంచి ఈ కరెన్సీ ప్రజలకు అందుబాటులోకి రానుంది. 

 

బ్యాంకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : బ్యాంకులు ఎక్కువ శాఖలు పెంచి ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆన్ లైన్ లో లావాదేవీలు పెరుగుతాయని తెలిపారు. దీర్ఘకాలికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. స్వచ్చ భారత్ అంటే మనుషులు శుభ్రంగా ఉండడమే కాదు.. రోడ్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మనుషులే కాదు.. మనసులు కూడా శుభ్రంగా ఉండాలని చెప్పారు.
 

టెక్నాలజీ పెరిగిన తర్వాత నగదు అవపసరం ఏముంది : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : టెక్నాలజీ పెరిగిన తర్వాత నగదు అవపసరం ఏముందని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా టెక్నాలజీ వాడకం పెరిగిందని చెప్పారు. దీని ద్వారా అవినీతిని తగ్గించవచ్చన్నారు. 

 

మళ్లీ నల్లధనం పెరుగకుండా చర్యలు తీసుకోవాలి : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : రూ.500, 2000 నోట్లు అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. మళ్లీ నల్లధనం పెరుగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తాత్కాలికంగా ఇచ్చి తర్వాత రద్దు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సమస్యలున్నా.. భవిష్యత్ లో లాభాలు ఉంటాయని తెలిపారు. రెండు వేల నోట్లపై చర్చ జరగాలన్నారు.  

 

 

 

శనివారం, ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయ్...

ఢిల్లీ : రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి కేంద్రప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.  పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో శనివారం, ఆదివారం బ్యాంకులు పని చేస్తాయని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.  

 

17:49 - November 9, 2016

హైదరాబాద్ : రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.500, 1000 నోట్ల రద్దుతో చాలా ఉపయోగాలున్నాయని పేర్కొన్నారు. పెద్ద నోట్లు రద్దు చేయాలని టీడీపీ చాలా సార్లు డిమాండ్ చేసిందని.. తమ సూచనను కేంద్రం అమలులోకి తెచ్చిందని తెలిపారు. తాజా నిర్ణయంతో నిజాయితీపరులకు ఎలాంటి ఇబ్బంలేదన్నారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రజల్లో అవగాహన పెంచాలని చెప్పారు. హెల్స్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. 

 

17:37 - November 9, 2016
17:36 - November 9, 2016

ఢిల్లీ : శుక్రవారం వరకు దేశవ్యాప్తంగా టోల్‌టాక్స్‌ను రద్దు చేస్తూ.. కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రూ.500, 1000 నోట్ల రద్దుతో టోల్‌గేట్ల వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ జాం నెలకొంటోంది. సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం శుక్రవారం వరకు టోల్‌ టాక్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

17:33 - November 9, 2016

గుంటూరు : ఐదు వందల.. వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అయితే ఈ నిర్ణయాన్ని అకస్మాత్తుగా ప్రకటించడంతో గుంటూరు జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరుకులు కోసం వెళ్లినా ఆ నోట్లు చెల్లడం లేదంటున్నారని వాపోతున్నారు. ఏటీఎంలు.. బ్యాంకులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. ఎన్నికల జిమ్మిక్కు కోసమే రూ.500, 1000 నోట్లను రద్దు చేశారన్నారు. ప్రజలను భ్రమల్లో ఉంచడానికే పెద్ద నోట్లను రద్దు చేశారని చెప్పారు. ఇది పాలకుల కుట్రగా భావిస్తున్నామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

17:25 - November 9, 2016

హైదరాబాద్ : 500,1000 రూపాయల నోట్ల రద్దుతో ట్యాక్స్‌ చెల్లించేందుకు చెల్లింపు దారులు ముందుకు వస్తున్నారు. తమ వద్ద ఉన్న 500, 1000 రూపాయల నోట్లను తీసుకోవాలంటూ చెల్లింపుదారులు జీహెచ్‌ఎంసీ అధికారులను సంప్రదిస్తున్నారు. అటు అధికారులు మాత్రం.. కరెన్సీ కాకుండా డీడీలు లేదా చెక్కులు తీసుకు రావాలనడంతో చెల్లింపుదారులు వెనుదిరుగుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:11 - November 9, 2016

కృష్ణా : విజయవాడలో..నిర్మిస్తున్న జక్కంపూడి కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. భవిష్యత్తులో ఈ కాలనీ టీడీపీకి కంచుకోటగా మారాలని ఆయన ఆకాంక్షించారు. కాలనీకి కావల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. అందరూ కుల, మతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని ఆయన సూచించారు. 

 

17:06 - November 9, 2016

విజయవాడ : అగ్రిగోల్డ్‌ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో ఆందోళనకు దిగారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు అవకాశం కల్పించాలని రోడ్డుపై బైఠాయించారు. అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు అగ్రిగోల్డ్‌ బాధితులను వారికి మద్దతు తెలిపిన వామపక్ష నేతలను బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబందించి మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:50 - November 9, 2016

ఢిల్లీ : నల్లధనంపై చర్యలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఎం తప్పుబట్టింది. నోట్ల రద్దుతో నల్లధనం ఆగదని ఆ పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు అన్నారు. ఈమేరకు ఢిల్లీలో టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రూ.500, 1000నోట్లు చెల్లవంటూ హఠాత్తుగా ప్రకటిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది ఎన్నికల్‌ స్టంట్‌ అని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైందికాదని అభిప్రాయపడ్డారు. నల్లధనాన్ని ఎవ్వరూ క్యాష్ రూపంలో పెట్టుకోరని... భూమిరూపంలోనో, బంగారంగానో దాచుకుంటారని తెలిపారు. టెర్రరిస్టుల పనులు కూడా ఆగే అవకాశంలేదన్నారు. ఉగ్రవాదులు డబ్బును ఆన్‌లైన్‌లో మార్చుకుంటారని చెప్పారు. నోట్లు చెల్లక సామాన్యులకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పనులు వదులకొని బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారని తెలిపారు. డబ్బు మార్చేందుకు బ్రోకర్లు తయారయ్యారన్నారు. అర్ధరాత్రి అలాంటి నిర్ణయం ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ముందుజాగ్రత్త చర్యలు ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. 

 

16:50 - November 9, 2016

పెద్ద నోట్ల రద్దు ఏంత పనిచేసింది ? అంటూ ప్రజలు వాపోతున్నారు. రూ. 500, రూ. 1000 రూపాయలను రద్దు చేస్తున్న కేంద్రం అకస్మాత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 30వ తేదీ వరకు ప్ర‌జ‌లు త‌మ వద్దనున్న పెద్ద నోట్ల‌ని బ్యాంకుల్లో మార్చుకోవ‌చ్చని సూచించింది. కానీ బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో పెద్ద నోట్లను ఏం చేయాలో కొంతమందికి తోచడం లేదు. వ్యాపారస్తులు..ఇతరులు ఈ నోట్లను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. తాజాగా నోట్ల రద్దు విడుదలయ్యే సినిమాలను తాకింది. ప్రతి గురు..శుక్రవారాల్లో సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో కూడా పలు చిత్రాలు ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. ఇందులో 'నరేష్' నటించిన 'ఇంట్లో దెయ్యం నాకేంటి భయం', 'నాగ చైతన్య' నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాలు శుక్రవారం విడుదలయ్యేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేసినట్లు టాక్. కానీ పెద్ద నోట్ల రద్దుతో థియేటర్ కు ప్రేక్షకులు వస్తారా ? రారా ? అనే సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. మల్టీప్లెక్స్ ధియేటర్లలో టికెట్లు రేట్లు కూడా అలానే ఉన్నాయి. మరి రూ. 500, రూ. 1000 రూపాయల నోట్లను వారు తీసుకుంటారా ? లేదా ? చిత్రాలు విడుదలవుతాయా ? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. డబ్బులు లేక ప్రేక్షకులు విడుదలయ్యే సినిమాలకు వెళుతారా ? లేదా ? అనేది చూడాలి. 

16:42 - November 9, 2016

ఢిల్లీ : దేశంలో 85 నుంచి 86 శాతం కరెన్సీ 5 వందలు, వెయ్యి నోట్లే చలామణి అవుతున్నాయని, ఇది ఆర్థికవ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించిందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. బ్లాక్‌ మనీ, అవినీతి , క్రైం, టెర్రరిజం, నకలీ నోట్లకు సంబంధించి 5 వందలు, వెయ్యినోట్లే చలామణి అయ్యాయని వీటి నుంచి ఆర్థికవ్యవస్థకు విముక్తి కల్పించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పాత 5 వందలు, వెయ్యి నోట్లపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఖర్చులు అవసరాల కోసం ఇంతకు ముందే డబ్బు డ్రా చేసుకున్నవాళ్లు బ్యాంకుకు వెళ్లి వాటిని మార్చుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం 100, 50 తదితర చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయని, మరో నాలుగు వారాల్లో కొత్త కరెన్సీ అందుబాటులోకి వస్తుందని జైట్లీ చెప్పారు. 

16:39 - November 9, 2016

హైదరాబాద్ : 500, వెయ్యి రూపాయల నోట్ల రద్దుతో ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.  ఏటీఎంలు పని చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపులలో 500 నోట్లు తీసుకోకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర కోసం పెట్రోల్‌ బంకులకు క్యూలు కడుతున్నారు. అయితే.. పెట్రోల్‌ బంక్‌లలో కూడా చిల్లర లేకపోవడంతో 500 నోట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. 
మహబూబ్ నగర్ 
ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దుతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని మహబూబ్‌నగర్‌ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అదేవిధంగా రూ.500, రూ.వెయ్యి నోట్లు మార్చేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో దుకాణాలకు పరుగులు మొదలుపెట్టారు. 
కరీంనగర్‌
పెట్రోల్‌ బంకుల్లో వినియోగదారులంతా చిల్లర కోసం వస్తుండటంతో బంకు యజమానులకు, వినియోగదారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బ్యాంకులు, ఏటీఎంలు మూసివేయడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. 
విశాఖ 
ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విశాఖలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నోట్లు తీసుకునేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. పెట్రో బంకుల్లో పెద్ద నోట్లతో  ఆమేరకు ఆయిల్‌ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఐదొందలు, వెయ్యి నోట్ల రద్దుతో విశాఖ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మా ప్రతినిధి జార్జ్‌ మరిన్ని వివరాలు అందిస్తారు. 
తూర్పుగోదావరి 
ఐదు వందల..వెయ్యి రూపాయల నోట్ల రద్దుతో తూర్పుగోదావరి జిల్లా.. కాకినాడవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు బ్యాంకులు..ఏటీఎంలు మూసివేతతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.  కేంద్ర నిర్ణయంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని.. కొందరు భావిస్తున్నారు. 
వరంగల్ 
రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు నిర్ణయం వరంగల్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో వ్యాపార లావాదేవీలు తాత్కాలికంగా స్తంభించాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌తో సహా జిల్లాలోని అన్ని పెద్ద మార్కెట్‌లపైనా ఈ ప్రభావం అధికంగా ఉంది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
ఖమ్మం 
నల్లధనం నియంత్రణకు కేంద్రం చేపట్టిన చర్యలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. 500, 1000 నోట్లు చెల్లకపోవడంతో జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. 

 

రాణిస్తున్న ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్..

గుజరాత్ : రాజ్ కోట్ లో భారత్ తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ రాణిస్తున్నారు. డకెట్ 13 పరుగులకు అవుట్ అయినా తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ నిలదొక్కుకున్నారు. జోయ్ రూట్ ధాటిగా ఆడి శతకం చేశాడు. మెయిన్ ఆలీ కూడా చక్కగా రాణించాడు. 124 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రూట్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 283 పరుగులతో ఆడుతోంది. 

పెద్ద నోట్ల రద్దుతో నష్టం ఎక్కువ – చిదంబరం..

ఢిల్లీ : రూ. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో లాభం కంటే నష్టమే ఎక్కువని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ప్రజలను పూర్తి సన్నద్ధులను చేసిన తరువాత ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

16:33 - November 9, 2016

ఢిల్లీ : రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి లాభం లేదని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నిర్ణయం ప్రభుత్వానికి, బ్యాంకులకు పెద్ద పరీక్ష అని అన్నారు. రూ.2000 నోట్లతో నల్లధనం పెరుగుతుందన్నారు. నోట్ల రద్దు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్నారు. 

 

మూలపాడులో సీఎం బాబు పర్యటన..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూలపాడులో పర్యటించారు. క్కంపూడి హౌసింగ్ కాలనీలో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉన్నత పాఠశాల, కమ్యూనిటీ హాలును ఆయన ప్రారంభించారు. 

టోల్ ట్యాక్స్ రద్దు..

ఢిల్లీ : ఎల్లుండి అర్ధ‌రాత్రి వ‌ర‌కు టోల్‌ట్యాక్స్ ను పూర్తిగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు భారత జాతీయ రహదారుల సంస్థ ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద ఆందోళన పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. 

నోట్ల రద్దుపై సీపీఎం పొలిట్ బ్యూరో స్పందన..

ఢిల్లీ : రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు చేయడం నల్లధనం నిరోధానికి సంపూర్ణంగా ఉపకరించదని సీపీఎం పొలిట్ బ్యూరో పేర్కొంది. దీని ప్రభావం కొంతమేరకే ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ చర్యతో సామాన్యులు, దినసరి కూలీలు, మత్స్యకారులు, చిన్న వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. నల్లదనం, నకిలీ నోట్లు నిరోధించే గట్టి చర్యలేవీ ప్రభుత్వం తీసుకోలేదని విమర్శించింది. 

ఉత్తరాఖండ్ లో ఆర్మీ చీఫ్..

ఉత్తరాఖండ్ : ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సెంట్రల్ సెక్టార్ లోని ఉత్తర సరిహద్దులో పర్యటిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలపై ఆయన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 

15:19 - November 9, 2016

సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' తాజాగా ఎవరిని టార్గెట్ చేస్తారు ? ఎవరిపై పంచ్ లు విసురుతారు ? ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. 'ప్రత్యేక హోదా'పై 'పవన్' భారీ బహిరంగసభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 10వ తేదీన అనంతపురంలో ఆయన బహిరంగసభ నిర్వహించతలపెట్టారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అటు అభిమానులు..అటు ఇతర నేతల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో తిరుపతిలో 'జనసేన' తొలి సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. 'ప్రత్యేక హోదా' ఆయనపై తొలిసారిగా గళం విప్పారు. 2014 ఎన్నికల్లో హోదా ఇస్తామని..తెస్తామని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీనిని నెరవేర్చి తీరాలని 'హోదా'ను అడ్డుక్కోవాల్సిన పరిస్థితి ఉండదని..అది ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఐదు కోట్ల ప్రజల ప్రయోజనమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. అనంతరం కొద్దిరోజుల విరామం అనంతరం కాకినాడలో రెండో బహిరంగ సభ నిర్వహించారు. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యపై పలు సెటైర్లు వేశారు. అనంతరం 'అనంత'లో సభ ఏర్పాటు చేస్తుండడంతో అందరి దృష్టి 'పవన్'పైనే నెలకొంది. ఎవరిని టార్గెట్ చేస్తారు ? ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తారా ? తన పంచ్ లతో మరోసారి విరుచకపడుతారా ? అనే చర్చ జరుగుతోంది. మరి ఆయన ఎవరిపై విమర్శలు గుప్పిస్తారు ? ఎలాంటి ప్రసంగం ఉంటుందో నవంబర్ 10వ తేదీ వరకు వేచి చూడాలి. 

15:10 - November 9, 2016
15:08 - November 9, 2016
15:07 - November 9, 2016
15:06 - November 9, 2016

టాలీవుడ్..బాలీవుడ్..కోలీవుడ్ ఇలా ఏ వుడ్ లోనైనా సినిమా ప్రారంభోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంటారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సినీ హీరో..హీరోయిన్లు..దర్శక..నిర్మాతలు పాల్గొంటూ ఉంటుంటారు. కానీ హీరో 'మహేష్ బాబు' లేకుండానే ఆయన చిత్రం ప్రారంభమైంది. 'కొరటాల' దర్శకత్వంలో 'మహేష్' ఓ సినిమా చేయనున్నాడనే టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో జరిగాయి. ఈ కార్యక్రమానికి కొరటాల శివతో పాటు సంగీత దర్శకుడు 'దేవి శ్రీ ప్రసాద్', సురేష్ బాబు, శ్యాం ప్రసాద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. 'మహేష్ బాబు' బిజీగా ఉన్నారని తెలుస్తోంది. దీనితో ఆయన సతీమణి నమ్రత ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. 'మహేష్'కి జోడి ఏ కథానాయిక నటించనున్నారనే తెలియడం లేదు. ఇప్పటి వరకు 'కొరటాల' అనుష్క, శృతిహాసన్, సమంత, నిత్యామీనన్ లాంటి టాప్ హీరోయిన్స్ లను సెలక్ట్ చేసిన సంగతి తెలిసిందే. 'మహేష్' తో మరో భారీ హిట్ కొట్టాలని 'కొరటాల' ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

బ్లాక్ మనీ అరికట్టడానికే నోట్ల రద్దు - జైట్లీ..

ఢిల్లీ : బ్లాక్ మనీని అరికట్టడానికే పెద్ద నోట్ల రద్దు నిర్ణయమని... సామాన్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. ఎన్ని డబ్బులున్నా బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చని..అయితే ఐడీ ప్రూఫ్‌ మాత్రం కచ్చితంగా చూపించాలని స్పష్టం చేశారు. 

దేశ వ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద వాహనదారుల ఆందోళన..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద వాహనదారులు ఆందోళన చేస్తున్నారు. చిల్లరతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ. 500, రూ. 1000 నోట్లను టోల్ గేట్ సిబ్బంది నిరాకరిస్తున్నారు. సిబ్బంది..వాహనదారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంటోంది. 

11న తెరుచుకోనున్న బ్యాంకులు..ఆ తరువాత..

హైదరాబాద్ : నోట్ల రద్దుతో బ్యాంకులు మంగళ, బుధవారాలు బ్యాంకులు పనిచేయవు. తిరిగి 11న బ్యాంకులు పనిచేస్తాయి. 12, 13 శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులు తిరిగి పనిచేయవు. 14వ తేదీన గురునానక్ జయంతి కావడంతో బ్యాంకులకు సెలవు. వరుస సెలవులు రావడంతో నోట్ల మార్పునకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  

పెద్ద నోట్ల రద్దుపై నితీష్ స్పందన..

బీహార్ : వెయ్యి రూపాయలు, ఐదు వందల రూపాయలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ స్పందించారు. మోడీ తీసుకున్న నిర్ణయం సరియైనదని, ప్రస్తుతం ప్రజలకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. 

జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో గెలుపొందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పార్టీ 276, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 218 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. 

13:38 - November 9, 2016

అమెరికా : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. రాజకీయ విశ్లేషకుల అంచనాలు, సర్వేల ఫలితాలను తలకిందులు చేసి,.. అనూహ్యంగా గెలుపును సొంతం చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ముందంజలో ఉన్న హిల్లరీ, ఆ తర్వాత నువ్వా... నేనా.. అన్నట్టుగా పోటా పోటీగా కొనసాగారు. అనంతరం హిల్లరీ వెనుకబడిపోయారు. మెజార్టీలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్‌ ఆధిక్యతలో కొనసాగుతూ వచ్చారు. ఎన్నికల్లో గెలుపుతో ట్రంప్‌ శిబిరంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హిల్లరీ శిబిరం నిరాశ, నిస్పృహల్లో ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్‌ అమెరికా 45వ అధ్యక్షుడుగా వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణస్వీకారం చేస్తారు.ఈ సందర్భంగా ట్రంప్ కార్యాలయం నుండి మాట్లాడారు. అభిమానుల హర్షధ్వనాల మధ్య ట్రంప్ ప్రసంగించారు. తన విజయానికి సహాయసహకారాలు అందించినవారందరకీ ఈసందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సమిష్టిగా అమెరికా అభివృద్దికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అమెరికా పునర్ నిర్మాణం మన కర్తవ్యమన్నారు.
ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను : ట్రంప్
అమెరికాకు పూర్వ వైభవం తెస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థికంగా అమెరికాను అగ్రస్థానంలో నిలబెడతానని... అమెరికా అభివృద్ధి రేటును రెండింతలు చేస్తానని ట్రంప్ తెలిపారు. కష్టపడి పనిచేస్తే, ఏ కల అయినా సార్థకమవుతుందని అన్నారు. మాజీ సైనికులకు అండగా నిలుస్తానని చెప్పారు. అమెరికాను దేశాన్ని తాను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పారు. అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత ట్రంప్ కీలక ఉపన్యాసం చేశారు. తన మద్దతుదారులు, కుటుంబసభ్యులంతా పక్కనుండగా... తన దేశాన్ని, ప్రపంచాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.అన్నిటికన్నా ముందు తన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని చెప్పారు. తన తల్లిదండ్రుల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. తన కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు తెలిపారు. తన విజయం కోసం తపించిన వారందరికీ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాట ఇచ్చారు.

భారత్ సాఫ్ట్ వేర్ కు గడ్డుకాలం రానుందా?
ట్రంప్ అధ్యక్షుడు కావటంతో ఇటు భారత్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు గడ్డు కాలం రానున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా హెచ్1బి వీసా ప్రోగ్రామ్ పైనే ట్రంప్ ఎక్కువ టార్గెట్ చేసే అవకాశం ఉంది. దీంతో, డాలర్ డ్రీమ్స్ తో అమెరికా వెళ్లే ఐటీ నిపుణులకు, భారత ఐటీ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ తగలనుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి భారత ఐటీ దిగ్గజ కంపెనీలకు ట్రంప్ ఎఫెక్ట్ భారీగా ఉండొచ్చు. అమెరికన్ల ఉద్యోగాలను ఇండియా, చైనా, సింగపూర్ దేశస్తులు తన్నుకుపోతున్నారని... తాను అధ్యక్షుడినైతే వాటిని అరికడతానని ట్రంప్ శపథం చేసిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ఉద్యోగ నిమిత్తం యూఎస్ వెళ్లే వలసవాదులపై ఆంక్షలు విధిస్తానని కూడా ట్రంప్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ రాకతో... ఇమ్మిగ్రేషన్ రూల్స్ చాలా కఠినతరం అయ్యే అవకాశం ఉంది.

బద్దలైన ట్విట్టర్ రికార్డులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడితో ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా పోస్టులు చేస్తున్నారు. అమెరికా ఎన్నికల రోజు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో ఖాతాదారులు ఇంతకు ముందు ఎన్న‌డూ లేని విధంగా 3.5 కోట్ల ట్వీట్లు చేశారు. ట్విట్ట‌ర్ చ‌రిత్ర‌లోనే ఇది అత్యధిక రికార్డుగా న‌మోదైంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈ రోజు ఉదయం 7:30 నిమిషాల వరకు అమెరికా ఎన్నికలకు సంబంధించి ట్విట్టర్ లో ఇంతటి అధిక సంఖ్య‌లో ట్వీట్లు చేశారు.ఈ రికార్డు అమెరికా ఎన్నిక‌ల రోజునే న‌మోదైంది. 2012లో అత్యధికంగా ట్విట్ట‌ర్ ఖాతాదారులు 3.20 కోట్లకు పైగా ట్వీట్లు చేశారు. అమెరికా అధ్య‌క్ష పీఠాన్ని కైవ‌సం చేసుకోవ‌డానికి పోటీప‌డుతున్న డోనాల్డ్ ట్రంప్‌ కు ట్విట్ట‌ర్‌లో కోటి 31 లక్షల మంది ఫాలోవ‌ర్లు ఉండ‌గా, హిల్లరీ క్లింటన్‌ కు కోటి నాలుగు లక్షలమంది ఉన్నారు.

మార్పుకు సమయం వచ్చింది - ట్రంప్..

అమెరికా : 45అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించారు. ఈ సందర్భంగా మద్దతు దారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. అమెరికా కలలు సాకారం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని, అమెరికాకు మంచి భవిష్యత్ నిర్మిద్దామన్నారు. అమెరికాలో మార్పుకు సమయం వచ్చిందని, దేశ అభివృద్దిని రెట్టింపు చేయాలని ఆకాంక్షించారు. హిల్లరీ ఇప్పుడే కాల్ చేసి అభినందించారని తెలిపారు. అందరం కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చిందని, తమ ఎదుట చాలా పెద్ద సవాల్ ఉందన్నారు. సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. 

13:23 - November 9, 2016

మళ్లీ 'చైనా కోతి' వార్తల్లోకి ఎక్కింది. ఇదంతా అమెరికా అధ్యక్షుడిగా 'ట్రంప్' ఘన విజయం సాధించారు. హిల్లరీ క్లింటన్ పై ఆయన గెలుపొందారు. దీనితో దృష్టి 'చైనా కోతి' వైపు మళ్లింది. ఎందుకు ? ఏమైంది ? అనేది తెలుసుకోవాలంటే ఇది చదవండి...చైనాలో 'గెడా' పేరు గల కోతి ఉంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సాకర్ యూరోపియన్ చాంపియన్ షిప్ ఫైనల్ లో గెలిచే జట్టు ఏదన్నది ఖచ్చింతగా చెప్పేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాల్లో ఎవరు గెలుస్తారని 'గెడా'ను ప్రశ్నించింది. 'గెడా' ఎదుట హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ ల భారీ కటౌట్లను ఉంచారు. రెండింటిలో ఏదో ఒక దానిని పట్టుకోవాలని ఆ కోతిని కోరగానే అది క్షణం ఆలస్యం చేయకుండా డోనాల్డ్ ట్రంప్ కటౌట్ ను ముట్టుకుందని షియాన్షు ఎకలాజికల్ పార్క్ వర్గాలు తెలిపాయి. బుధవారం నాడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాల కౌంటింగ్ లో ట్రంప్ గెలుపొందారు. 

ట్రంప్ విన్..

అమెరికా : 45వ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నిక ఫలితాల కౌంటింగ్ కొనసాగింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హిల్లరీ క్లింటన్ పై ట్రంప్ ఘన విజయం సాధించారు. 270 మ్యాజిక్ ఫిగర్ ను ట్రంప్ దాటారు. ట్రంప్ 276, హిల్లరీ 218 స్థానాల్లో విజయం సాధించారు. 

13:06 - November 9, 2016

సూపర్ స్టార్ 'రజనీకాంత్ ' సినిమా ప్రారంభం అయ్యిందంటే చాలు ఆయన అభిమానులు ఎంతో ఉత్కంఠకు గురవుతుంటారు. చిత్ర విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటీవలే ఆయన నటించిన 'కబాలి' అభిమానులను అలరించింది. ప్రస్తుతం 'శంకర్' దర్శకత్వంలో 'రజనీ' నటిస్తున్నాడు. మరో అద్భుత సృష్టిగా..భారీగా ఈ చిత్రాన్ని శంకర్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 'రోబో' సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. 'ఐ' సినిమా పరాజయంతో వెనుక పడ్డ 'శంకర్', '2.0'తో మరోసారి తన స్టామినా ప్రూవ్ చూసుకోవాలని భావిస్తున్నాడు. బాలీవుడ్ యాక్షన్ హీరో 'అక్షయ్ కుమార్' విలన్ గా నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి 2017 జనవరి నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందంట. ఈ ఏడాదిలో సినిమా విడుదలవుతుందని అభిమానులు ఆశించారు. కానీ వచ్చే సంవత్సరం విడుదలవుతుండడంపై కొంత నిరుత్సాహానికి గురయ్యారని తెలుస్తోంది. వీరిని సంతృప్తిపరచడానికి 'రజనీ' పుట్టిన రోజున చిత్ర టీజర్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి టీజర్ విడుదలవుతుందా ? టీజర్ తో 'రజనీ' ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తారో చూడాలి. 

12:57 - November 9, 2016
12:55 - November 9, 2016

విజయనగరం : చేతిలో నోట్లు...ఉన్నాయి..కానీ ఖర్చు పెట్టలేని పరిస్థితి లేదు..ఎవరూ డబ్బులు తీసుకోవడం లేదు. పాల ప్యాకెట్ ఇవ్వండి..డబ్బులు తీసుకోండి అంటున్నా వాళ్లు డబ్బులు తీసుకోవడానికి ఇష్ట పడడం లేదు. ఇప్పటికే అర్థమైందా ? ఆయన చేతిలో ఉన్నవి రూ. 500, రూ. 1000 నోట్లు.. ఈ నోట్లను చూస్తే చాలు ప్రస్తుతం ఇతరులు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఈ పెద్ద నోట్లు ఇక చెల్లవని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 11 అర్ధరాత్రి వరకు ఈ పెద్ద నోట్లు చెల్లుతాయని ప్రకటించినా నోట్లను తీసుకోవడానికి వ్యాపారస్తులు..ఇతరులు నిరాకరిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఓ కూలీ అష్టకష్టాలు పడుతున్నాడు. ఆ కూలీతో టెన్ టివి ముచ్చటించింది. తాను గత కొన్ని రోజులుగా డబ్బులు జమ చేసుకోవడం జరిగిందని, అవి కూడా రూ. 500, రూ. 1000 నోట్లు ఉన్నాయన్నారు. కేంద్రం రాత్రి ప్రకటనతో తన దగ్గరున్న నోట్లను తీసుకోవడం లేదని, పాల ప్యాకెట్ కొందామని అనుకున్నా ఇవ్వడం లేదని వాపోయాడు. ఇలాంటి వ్యక్తి ఇంకెంత మంది ఉన్నారో ...

12:49 - November 9, 2016

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో చిల్లర లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయిన పరిస్థితులు నెలకొంటున్నాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ సిబ్బంది రూ.500 నోట్లును తీసుకోవటం లేదు. దీంతో వాహనదారులు ఆందోలన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఇదే పరిస్థితి కేతెపల్లి మండలం కొయ్యలగూడె టోల్ గేట్ వద్ద కూడా నెలకొంది. పెట్రోల్ బంకుల్లో రూ. 500, రూ. 1000 మొత్తానికి పెట్రోల్ కొనాల్సిందేనంటూ సిబ్బంది పేర్కొంటున్నారు. చిల్లర లేక టిఫిన్ చేయడానికి కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిల్లర కొరత కారణంగా టోల్ గేట్ల వద్ద, పెట్రోల్ బంకుల్లో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో సిబ్బంది పెద్దనోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. మరోవైపు చిరు వ్యాపారుల వర్తకం తీవ్ర ప్రభావానికి గురైతుంది.సరిపడ చిల్లర లేక ప్రయాణాలను సైతం రద్దు చేసుకునే పరిస్థితులు నెలకొంటున్నాయంటే అతిశయోక్తి కాదు. 

12:37 - November 9, 2016

ఢిల్లీ : ఐదు వందలు ..వెయ్యి రూపాయలు..ఈ నోట్లు భారత కరెన్సీలో అతి పెద్దవి అనే సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ నోట్లు వేస్ట్ పేపర్లుగా మారిపోయాయి. సోషల్ నెట్ వర్క్స్ లో అయినతే ఈ నోట్లతో పల్లీలు,పాన్ లు, స్నాక్స్ లను ప్యాక్ చేసే పేపర్స్ గా ఇమేజ్ లు కూడా కనిపిస్తున్నాయి. దీనికి కారణం మంగళవారం రాత్రి ప్రధాని మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ప్రకటనే దీనికి కారణం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి రేగింది. బ్లాక్‌ మనీని అరికట్టేందుకు 500,1000 రూపాయల నోట్లను రద్దు చేసిన మోడీ సర్కార్‌..రెండురోజుల పాటు ఏటీఎంలను బంద్‌ చేసింది. ఇవాళ ఒక్కరోజు బ్యాంకులకు కూడా ఆర్బీఐ సెలవు ప్రకటించింది. మోదీ నిర్ణయంతో ప్రజలు ఏటీఎం సెంటర్ల వద్ద బారులు తీరారు. ఒక్క ఏటీఎం సెంటరనే కాదు..పెట్రోల్‌ బంకులు, షాపింగ్‌ కాంప్లెక్సుల వద్ద జనం పెద్ద ఎత్తున క్యూ కట్టారు. కొన్ని చోట్ల చిన్నస్థాయి వ్యాపారస్తులు సైతం ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచే 500, 1000 రూపాయల నోట్లను అంగీకరించకపోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఒక్కరు తమ జేబుల్లో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు.జేబులో వెయ్యి రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కూడా 100 రూపాయల నోట్ల కోసం ఎగపడ్డారు. ఏటీఎంలో వంద రూపాయల నోటు కన్పిస్తే చాలు జనం ఎగబడి మరీ వాటిని దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.   

12:29 - November 9, 2016

తాను వ్యభిచారం చేయలేదని..తన పేరుతోనే ఉన్న మరొకరు చేసిన తప్పు తనను అప్రతిష్ట పాలు చేస్తోందని మలయాళ సినీ నటి అమలా రోజ్ కురియన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇటీవలే వ్యభిచారం చేస్తూ 'అమలా రోజ్ కురియన్' పట్టుబడిదంటూ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోయింది. దీనిపై ఆ నటి తీవ్రంగా స్పందించింది. తన ఫేస్ బుక్ లో తన ఆవేదనను వెళ్లగక్కింది. చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తూ నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్నానని పేర్కొంది. వ్యభిచారం చేసింది తాను కాదని, ఇలాంటి వార్తల వల్ల యాక్టింగ్ పై ఆసక్తి తగ్గిపోతోందని తెలిపింది. తాను మధ్యతరగతి నుండి వచ్చానని, నటనపై ఉన్న ఆసక్తితోనే ఫిల్మిం ఇండస్ట్రీకి వచ్చినట్లు పేర్కొంది. ఈ వార్తను పదే పదే ప్రచారం చేస్తున్నవారు తన ఆత్మహత్య వార్తను చూడాలనుకుంటున్నారా ప్రశ్నించింది. 

12:21 - November 9, 2016

రూ. 500, రూ. 1000 అక్కడ చెల్లుతాయి..

హైదరాబాద్ : ఈనెల 11వ అర్ధరాత్రి వరకు రూ.500, రూ. 1000 నోట్లు చెల్లనున్నాయి. ఇవాళ, రేపు ఏటీఎంలు పనిచేయవు. ఇవాళ బ్యాంక్ లు..ట్రెజరీలు పనిచేయవు. రేపటి నుండి కొత్త నోట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఆఖరు వరకు పాత నోట్లను బ్యాంకులు..పోస్టాఫీస్ ల్లో మార్చుకొనే అవకాశం ఉంది. ఆన్ లైన్ లావాదేవీలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి వరకు ఆసుపత్రులు, రైల్వే బుకింగ్ కౌంటర్లు, ఆర్టీసీ బస్సుల కౌంటర్లు, ఎయిర్ లైన్స్ టికెట్ల కౌంటర్లు, పెట్రోల్, డీజిల్ బంకుల్లో పాత రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లనున్నాయి.

పార్టీ ముఖ్యనేతలతో రమణ..రేవంత్ సమావేశం..

హైదరాబాద్ : పార్టీ ముఖ్య నేతలతో టి.టిడిపి నేతలు రమణ, రేవంత్ లు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీపై చర్చ జరిగింది. ఇదే కేసులో పార్టీ విలీనం అంశంపై ఇంప్లీడ్ అయ్యే అవకాశాలను నేతలు పరిశీలిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై స్పీకర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. పెద్ద నోట్ల రద్దును టి.టిడిపి స్వాగతించింది. ఏపీ సీఎం చంద్రబాబు చొరవను నేతలు అభినందించారు. 

12:14 - November 9, 2016

ట్రంప్ విజయం ?

అమెరికా : అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం 285 ఎలక్ట్రోరల్ ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. క్లింటన్ దారులన్నీ మూసుకపోయినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

నోట్ల రద్దుపై హైకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలుగు రాష్ట్రాల హైకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. 

రూ. 1000 నోటు..పాట్నా రైల్వే స్టేషన్ లో గందరగోళం..

పాట్నా : రైల్వే స్టేషన్ లో గందరగోళం నెలకొంది. తమ దగ్గర రూ. వేయి నోట్లు ఉన్నాయని, కానీ రైల్వే ఉద్యోగులు తీసుకోవడం లేదని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పాదయాత్రకు మధు సంఘీభావం..

మహబూబ్ నగర్ : సీపీఎం మహాజన పాదయాత్ర 24వ రోజు ప్రారంభమైంది. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు సంఘీభావం తెలిపారు. దేవరకద్ర, లాల్ కోట, ఓబులాయపల్లిలో పాదయాత్ర బృందం పర్యటించనుంది. 

11:47 - November 9, 2016

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంతో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అక్రమంగా దాచుకున్న డబ్బును ఏం చెయ్యాలో తెలియక దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. మంగళవారం రాత్రి నుండి బుధవారం వరకూ ప్రజలు పడిన ఆందోళన అంతా ఇంతా కాదు..ఆందోళన..గందరగోళం..అయోమయం ఇలా పలు భావనలకు లోనయ్యారు. ఈ ఇబ్బందులు నేటితో ముగియనున్నాయి.రద్దు చేసిన నోట్లకు కొంతకాలం నిర్ణీత కాలం వరకూ పరిగణలో వుండగా..మరోపక్క ప్రభుత్వం కొత్తనోట్లను అమలులోకి తేనుంది. కొత్తగా రూ.500,1000నోట్లను అమలులోకి తేనుంది. కాగా నోట్ల రద్దుపై అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ హెల్ప్‌లైన్ నెంబర్లు నెంబర్లు ప్రకటించాయి. 022-22602201, 011-23093230 నెంబర్లకు ఫోన్ చేసి అనుమానాలు తొలగించుకోవచ్చని తెలిపింది.

11:35 - November 9, 2016

హైదరాబాద్ : 500, వెయ్యి రూపాయల నోట్లు ఇకనుంచి చట్టబద్ధంగా చెల్లుబాటు కావని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సంచలన నిర్ణయంతో ప్రజలు గందరగోళంలో పడిపోయారు. బ్లాక్‌ మనీని అరికట్టేందుకు చరిత్రక నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లను కేంద్రం బ్యాన్‌ చేసింది. 500,1000 రూపాయల నోట్లను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం ప్రకటించారు. అక్రమార్కుల భరతం పట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ప్రకటించారు. దీంతో సామాన్య ప్రజలు కొన్ని ఇబ్బందులు పడుతున్నా ఎక్కువ శాతం మంది ప్రధాని నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. కాగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలతో ఇబ్బందులనేవి వుంటాయి. ఇది సర్వ సాధారణం. కానీ ప్రధాని మోదీ తీసుకున్న ఈ సంచలనాత్మక ప్రకటనతో రాత్రికి రాత్రి సామాన్య మధ్య తరగతి ప్రజలు కొంతమేరకు ఇబ్బందులు పడినమాట వాస్తవమే..కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కావాలంటే నిర్ణీత కాలంపాటు ఇబ్బందులు తప్పవనే సంగతి తెలిసిందే..కాగా ఆ ఇబ్బందులకు ప్రత్నామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటిస్తే ఇబ్బందులు కొంతమేరకు దాటేఅవకాశాలున్నాయి..

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో సామాన్యుడి ఆగ్రహం

ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చాలా మందికి సమస్యల్ని తెచ్చిపెట్టింది. నల్లధనాన్ని వెలికి తీయడేమోగానీ అకస్మాత్తు నిర్ణయం తమని ముప్ప తిప్పలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అత్యవసర సేవల విషయంలో మాత్రం 72 గంటలపాటు మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వాస్పత్రలు, ఫార్మసీలు, రైల్వేస్టేషన్లు, పెట్రోల్‌, డీజిల్‌ బంకులు, వినియోగదారుల సహకార కేంద్రాలు, శ్మశానవాటికలు, ప్రభుత్వ డెయిరీ మిల్క్‌ బూత్‌‌లు, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మాత్రం రద్దు చేసినట్టు ప్రకటించినా పెద్ద నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రధాని మోదీ ప్రకటించడంతో కొంతలో కొంత సామాన్యులకు ఊరట కలిగించింది. 

11:15 - November 9, 2016

హైదరాబాద్ : 'మీ దగ్గర రూ. 50..రూ. 100 ఉన్నాయా ?' ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. 'అరే ఉంటే ఇయ్ భైయ్..కొంచెం ఎక్కువైనా డబ్బులు తీసుకో..నాకు మాత్రం రూ. 50 లేదా రూ. 100 ఉంటే ఇయి' అని వేడుకుంటున్నారు. రూ. 500..రూ. 1000 నోట్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం జనజీవనంపై పెను ప్రభావం చూపెడుతోంది. రూ. 500, రూ. 1000 నోట్లను వ్యాపారులు తీసుకోవడం లేదు. దీనితో చిల్లర కోసం ప్రజలు ఎగబడుతున్నారు. కానీ చాలా ప్రాంతాల్లో రూ. 50, రూ. 100 దొరక్కపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల ఇబ్బందులను కొంతమంది క్యాష్ గా ఉపయోగించుకుంటున్నారు. ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ వారికి కావాల్సిన నోట్లను ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టోల్ గట్ల వద్ద రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకోకపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. ఏటీఎంలు మూగబోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రూ. 500, రూ. 1000 నోట్ల డిపాజిట్ల విషయంలో గరిష్ట నియంత్రణ ఏమీ ఉండదని ఎస్ బీఐ ఎండీ ప్రకటించారు. ఎంతమొత్తమైనా డిపాజిట్ చేయవచ్చని సూచించారు. 

11:14 - November 9, 2016

అమెరికా : తమ దేశంలోనే తాము నిరుద్యోగులుగా మారిపోతుండటాన్ని జీర్ణించుకోలేని శ్వేతజాతీయలు ట్రంప్ నే ఎన్కుకున్నట్లుగా ఫలితాలు తెలియజేస్తున్నాయి. వలస విధానంపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తారనే నమ్మకంతోనే అమెరికన్లు ట్రంప్ నే ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది.అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయం కానున్నట్లుగా ఇప్పటివరకూ అందిన సమాచారం బట్టి తెలుస్తోంది. దీంతో రిపబ్లికన్ ప్రతినిధులు, ట్రంప్ అభిమానులు, ఆయన ప్రచార బృందం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మ్యాజిగ్ ఫిగర్: 270 కాగా 215 ప్రస్తుతం 454 చోట్ల ఫలితాల వెలువడగా, ట్రంప్ : 244 హిల్లరీ : దిశగా సాగుతున్నారు. ట్రంప్ కు స్పష్టమైన ఆధిక్యం, లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో 84 చోట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి వుండగా, అక్కడ కనీసం 30 చోట్ల విజయం సాధిస్తే, ట్రంప్ శ్వేతసౌదాధిపతి అయినట్టే. ప్రస్తుతమున్న సరళి చూస్తుంటే అదేం పెద్ద సమస్యేమీ కాదని, ట్రంప్ విజయం ఖాయమని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో చివరిదశలో ప్రవాస భారతీయులను అకట్టుకునేందుకు ట్రంప్ యత్నించారు. అలాగే చైనా ఉత్పత్తులు ఎక్కువ శాతం అమెరికాకు ఎగుమతి..దీంతో అమెరికాలో ఎకానమీ తగ్గటం వంటి పలు అంశాలపై అమెరికన్లు దృష్టిపెట్టి ట్రంప్ వైపు నిలిచినట్లుగా తెలుస్తోంది. 

ట్రంప్ 244...

అమెరికా : అధ్యక్ష ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ట్రంప్ అధిక్యంలో కొనసాగుతున్నారు. ట్రంప్ 244, హిల్లరీ క్లింటన్ 215 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించారు. 

10:38 - November 9, 2016

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' కోసం అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సమాచారం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత 'చిరంజీవి' వెండితెరపై ఎలా కనబడుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. చిత్రానికి సంబంధించిన ఫొటోలు బయటకు వస్తుండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. తాజాగా క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్ల తో 'చిరు' పోరాడే సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఫొటో 'చిరు' పక్కన కండలు పెంచిన ఓ వ్యక్తి కనబడుతుండడం..ఫైట్ సీన్స్ ఎలా ఉంటాయోనని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
'ఖైదీ నెంబర్ 150' సినిమా సెట్స్ పైకి వెళ్లిన నాటి నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. అందుకే 'చిరంజీవి'తో సహా ప్రతి ఒక్కరూ పగలు రాత్రి తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. 

10:32 - November 9, 2016

హైదరాబాద్ : అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత స్టాక్‌ మార్కెట్లపై పడటంతో సెన్సెక్స్‌, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ ఆధిక్యం, బ్లాక్‌మనీ నివారణ కోసం ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన చర్యలు స్టాక్‌మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. సెన్సెక్స్‌ ప్రారంభమైన కొద్ది సమయానికే 1000 పాయింట్లకు పైగా నష్టం చవిచూసింది. నిఫ్టీ 300 పాయింట్ల నష్టపోయి 8220 వద్ద ట్రేడింగ్‌ జరుగుతోంది. ఒకదశలో గరిష్ఠంగా 1500 పాయింట్ల నష్టంతో 26600 మార్కును తాకింది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలబాటలో పయనిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్‌ అవుతున్నాయి.

10:30 - November 9, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠత కొనసాగుతోంది. ప్రతీ కౌంటింగ్ కు నువ్వా నేనా అన్నట్లుగా హిల్లరీ, ట్రంప్ కొనసాగుతున్నారు. 85 శాతం విజయావకాశాలు హిల్లరీకి ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. కానీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నకొద్దీ అమెరికన్లు మార్పునే కోరుతున్నారన్న సంకేతాలు వెలువడుతుండగా, శ్వేతసౌధానికి ట్రంప్ చేరువవుతున్నారన్నట్లుగా ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం మొత్తం 438 చోట్ల ఫలితాల సరళి వెలువడగా క్లింటన్ 210 స్థానాల్లో ట్రంప్ 228  స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ధనిక రాష్ట్రాలైన కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా, హయావ్, మసాచుసెట్స్, వెర్మాంట్, ఓరెగాన్, వాషింగ్టన్ తదితర రాష్ట్రాల్లో హిల్లరీ గెలువగా, వ్యవసాయం, పరిశ్రమలు అధికంగా ఉండే, రెండు డకోటా రాష్ట్రాలు, నెబ్రాస్క్, కన్సాస్, టెక్సాస్, ఓక్లహామా, లూసియానా, అర్కన్సాస్, జార్జియా తదితర రాష్ట్రాల్లో ట్రంప్ విజయం దిశగా దూసుకెళుతున్నారు. స్వింగ్ రాష్ట్రాలైన ఓహియో, ఫ్లోరిడాల్లో ఆయన విజయంతో 95 శాతం మేరకు ట్రంప్ విజయావకాశాలు మెరుగపడగా, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప హిల్లరీ కి చాన్స్ ఉండకపోవచ్చని నిపుణులు వ్యాఖ్యానించారు.

26 ఓట్ల దూరంలో ట్రంప్..

అమెరికా : అధ్యక్ష ఎన్నిక ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లను అందుకోవడానికి ట్రంప్ 26 ఓట్ల దూరంలో ఉన్నారు. ప్రస్తుతం ట్రంప్ 244, హిల్లరీ 210 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించారు. 

ట్రంప్ 232...

అమెరికా : అధ్యక్ష పీఠంపై కూర్చొవడానికి అభ్యర్థి ట్రంప్ మరో కొద్ది దూరంలో ఉన్నారు. అధ్యక్ష ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తాజా సమాచారం మేరకు ట్రంప్ 232, హిల్లరీ 209 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించారు. 

హిల్లరీ 210...ట్రంప్ 228.

అమెరికా : అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం హిల్లరీ 210..ట్రంప్ 228 ఎలక్ట్రోరల్ ఓట్లను సాధించారు. 

స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చిన భారత్ నోట్లు..అమెరికా ఓట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లను భారత్ నోట్లు..అమెరికా ఓట్లు కుప్పకూల్చాయి. 8300 పాయింట్ల వద్ద నిఫ్టీ ట్రేడవుతోంది. 

ట్రంప్ కే విజయావకాశాలు.?

అమెరికా : అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ట్రంప్ కు 222 ఎలక్ట్రోరల్, హిల్లరీ 210 ఓట్లు పోలయ్యాయి. 21 రాష్ట్రాల్లో ట్రంప్, 15 రాష్ట్రాల్లో హిల్లరీ ముందంజలో కొనసాగుతున్నారు. ట్రంప్ కే విజయావకాశాలున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ఇండియాలో చిల్లర కష్టాలు..

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా చిల్లర కొరత ఏర్పడింది. సరిపడ చిల్లర లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఐదు వందలు, వేయి నోట్లను తీసుకోవడానికి వ్యాపారులు నిరాకరిస్తున్నారు. ఇదే అదనుగా చిల్లర డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న జనాల నిస్సాహాయతను దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. 10శాతం కమీషన్ తీసుకుని చిల్లర ఇస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయంపై ప్రభుత్వానికి అనుగుణంగా సమాయత్తమయ్యేందుకు సిబ్బంది నేడు బ్యాంకులు, ఏటీఎంలకు సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. 

ట్రంప్ ఆధిక్యంతో స్టాక్ మార్కెట్ల విలవిల..

అమెరికా : భారత స్టాక్ మార్కెట్ బుధవారం నాటి సెషన్ ఆరంభంలోనే భారీ నష్టాల్లోకి కూరుకుపోయింది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రానున్నారన్న వార్తలతో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించింది. దీంతో స్టాక్ మార్కెట్ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి కూరుకుపోయింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 1700 పాయింట్లకు పైగా నష్టంలో నిలిచింది. ఆపై 9:25 గంటల సమయంలో కాస్తంత తేరుకుంది. ప్రస్తుతం 1000 పాయింట్లకు పైగా నష్టంలో నడుస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 26,588 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..

గుజరాత్ : రాజ్ కోట్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగనుంది. తొలి టెస్టులో కోసం వేసిన టాస్ లో భారత్ టాస్ ఓడిపోయింది. చాలా రోజుల తరువాత భారత జట్టు టాస్ ఓడిపోగా, ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు హస్తినకు వెళ్ళనున్న చంద్రబాబు..

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. గురువారం  పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉన్నత విద్యారంగంపై ‘భారత పరిశ్రమలు, వాణిజ్య సమాఖ్య(ఫిక్కీ)’ నిర్వహించే సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు. అనంతరం కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అధ్యక్షతన వివిధ పరిశ్రమలు, కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో జరిగే రౌండ్‌టేబుల్‌ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 

09:29 - November 9, 2016

హైదరాబాద్ : అగ్రరాజ్య అధిపతిగా ట్రంప్ నిలుస్తాడనే అంచనాలు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. తూర్పు ఆసియా దేశాల్లోని స్టాక్‌మార్కెట్లన్నీ షేక్ అయ్యాయి. ఆ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్‌పై కూడా పడింది. మంగళవారం 1600 పాయింట్ల నష్టంలో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. మార్కెట్లోని డబ్బును బంగారంవైపు పెట్టుబడులుగా మళ్లించే అవకాశం ఉండటంతో బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం 900 పాయింట్ల నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు కొనసాగుతున్నాయి. అంటే దాదాపు రూ.2లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు మదుపరులు ప్రారంభంలోనే కోల్పోయారు. బ్యాంకింగ్, ఆటో షేర్లు పూర్తిగా పడిపోయాయి. బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతిన్నది. నిన్నటి 500, 1000 నోట్ల రద్దు ప్రకటనతో పాటు, అమెరికా ఫలితాలు స్టాక్‌మార్కెట్లను షేక్ చేస్తున్నాయి. విదేశీ, స్వదేశీ పెట్టుబడుదారులు స్టాక్స్‌ అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరో రెండు మూడు గంటల్లో అమెరికా పూర్తి ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు ఎటు పయనిస్తాయో వేచి చూడాల్సి ఉంది.అమెరికా  ఎన్నికల స్ట్రాటజిస్ట్ హరికాసుల విశ్లేషణ చూడండి..

09:18 - November 9, 2016

అమెరికా : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ కంటే రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ ముందుకు దూసుకుపోతున్నారు. ఎలక్టోలర్‌ కాలేజీ ఓట్లలో ట్రంప్‌ పై చేయి సాధించారు. తాజా సమాచారం ప్రకారం ట్రంప్‌కు 167 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. హిల్లరీకి 111 ఎలక్టోరల్ ఓట్ల మద్దతు లభించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నా .... ఆ తర్వాత హిల్లరీ ముందంజకు చేరుకున్నారు. తర్వాత ఇద్దరి మధ్య నువ్వా... నేనా.. అన్నట్టుగా పోటీ కొనసాగింది. తర్వాత ట్రంప్‌ ఒక్కసారిగా పైచేయి సాధించారు. ఎలక్టోరల్‌ కాలేజీలో మొత్తం 538 ఓట్లు ఉన్నాయి. తాజా ఫలితాలను బట్టి చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్వేతజాతీయుల్లో ఎక్కువ మంది ట్రంప్‌ను అనుకూలంగా ఓటు వేశారని విశ్లేషిస్తున్నారు. ట్రంప్‌ శ్వేతజాతి ఓటర్లను రెచ్చగొట్టి, వీరి బలహీనతలను అనుకూలంగా మలచుకున్నారని చెబుతున్నారు. గతంలో ఒబామాను ఆధిక్యత వచ్చిన రాష్ట్రాల్లో కూడా హిల్లరీ వెనుకబడటమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ మెయిల్స్‌ కుంభకోణం వ్యవహారం హిల్లరీని దెబ్బ కొట్టినట్టుగా విశ్లేషిస్తున్నారు. ఈ అంశంపై కాలిఫోర్నియా నుండి విశ్లేషకులు శ్రీనివాస్ తిరునగరి విశ్లేషణ కోసం ఈ వీడియోను చూడండి..

08:50 - November 9, 2016
08:47 - November 9, 2016

కేంద్ర ప్రభుత్వం నల్లధనంపై ఉక్కుపాదం మోపింది. బ్లాక్‌ మనీని అరికట్టేందుకు చరిత్రక నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లను కేంద్రం బ్యాన్‌ చేసింది. 500,1000 రూపాయల నోట్లను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం ప్రకటించారు. అక్రమార్కుల భరతం పట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ప్రకటించారు. 500, వెయ్యి రూపాయల నోట్లు ఇకనుంచి చట్టబద్ధంగా చెల్లుబాటు కావని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సంచలన నిర్ణయం ప్రకటించారు. డిసెంబర్ 30వ తేదీలోగా బ్యాంకులో గానీ, పోస్టాఫీసులో గానీ ప్రజలు నగదును బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆయన సూచించారు. దానికి ఏ విధమైన చార్జీలూ ఉండవని స్పష్టం చేశారు. జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో ఆ విషయం తెలిపారు. ఈ నేపథ్యంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం నేత) ప్రకాశ్ రెడ్డి (బీజేపీ నేత) లక్ష్మీనారాయణ ప్రముఖ విశ్లేషకులు)నశికుమార్ (ఎకనమిస్ట్ ), చర్చలో పాల్గొన్న వక్తలు తెలిపిన అభిప్రాయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

టోల్ గేట్ల వద్ద'పెద్ద నోట్ల'ఇబ్బందులు..

యాదాద్రి : చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ సిబ్బంది రూ.500 నోట్లును తీసుకోవటం లేదు. దీంతో వాహనదారులు ఆందోలన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఇదే పరిస్థితి కేతెపల్లి మండలం కొయ్యలగూడె టోల్ గేట్ వద్ద కూడా నెలకొంది. కాగా రూ.500,1000 నోట్లు చెల్లవంటూ మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. 

అమెరికాలో కాల్పులు..ఒకరు మృతి..

అమెరికా : లాస్‌ఏంజిల్స్‌కు తూర్పున 25 మైళ్ల దూరంలో గల అజూసా పట్టణంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో స్థానికంగా కలకలం చెలరేగడంతో అధికారులు పోలింగ్ జరుగుతున్న రెండు పోలింగ్ బూత్‌లను మూసివేశారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, భారీ ఆయుధాలు కలిగిన ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. ఓటర్లు సమీప పోలింగ్ బూత్‌లలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.

నోట్లు మార్చుకోవాలంటే ఈ నంబర్లు..

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడంతో ఏర్పడే ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం 8గంటలకు కంట్రోల్‌ రూం అందుబాటులోకి వస్తుంది. ముంబయి రిజర్వు బ్యాంకు, దిల్లీలోని వాణిజ్య వ్యవహారాల విభాగంలో రెండు కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. మొదటి 15 రోజులు 24 గంటలకు పాటు ఇవి సేవలు అందిస్తాయి. ఢిల్లీ కంట్రోల్‌ రూం నెంబర్‌ : 011 2309 3230,,ముంబయిలోని కంట్రోల్‌ రూం ఫోన్‌ నెంబర్లు : 022 2260 2201, 022 2260 2944

నగరవాసులను వణికిస్తున్న చలిపులి..

హైదరాబాద్ : నగరవాసులను చలి వణికిస్తోంది. గత నాలుగురోజుల నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. మధ్నాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు రాత్రి వేళల్లో చలిగాలుల తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజుల నుంచి నగరంలో కనిష్ఠంగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా మధ్యాహ్నం వేళల్లో గరిష్ఠంగా 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండురోజులుగా సాధారణకంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హిల్లరీపై ట్రం ప్ఆధిక్యం..

అమెరికా : ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది.అమెరికాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. డెమెక్రటిక్ అభ్యర్థి హిల్లరీ కంటే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఆధిక్యత సాధించారు. హిల్లరీ క్లింటన్, ట్రంప్ మధ్య హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఫ్లోరిడా, ఇండియానా, కెంటకి, నార్త్ కొరోలినా, న్యూహాంప్ షైర్ ,మిచ్ గావ్ లలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ముందజలో ఉన్నారు. 

08:14 - November 9, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ కంటే రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ ముందుకు దూసుకుపోతున్నారు. ఎలక్టోలర్‌ కాలేజీ ఓట్లలో ట్రంప్‌ పై చేయి సాధించారు. తాజా సమాచారం ప్రకారం ట్రంప్‌కు 128 మంది ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. హిల్లరీకి 97 మంది ఎలక్టోరల్ ఓట్ల మద్దతు లభించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నా .... ఆ తర్వాత హిల్లరీ ముందంజకు చేరుకున్నారు. తర్వాత ఇద్దరి మధ్య నువ్వా... నేనా.. అన్నట్టుగా పోటీ కొనసాగింది. తర్వాత ట్రంప్‌ ఒక్కసారిగా పైచేయి సాధించారు. ఎలక్టోరల్‌ కాలేజీలో మొత్తం 538 ఓట్లు ఉన్నాయి.ఒహియో స్టేట్ నుండి అమెరికా ఎన్నికలపై ప్రముఖ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ హరికాసుల టెన్ టీవీతో మాట్లాడుతూ ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి..

ప్రధాని నిర్ణయాన్ని హర్షిస్తున్న ఏపీ సీఎం..

గుంటూరు : నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రధాని తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. ఇదో చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థగా నల్లధనం విస్తరించడానికి పెద్దనోట్లే కారణమని పేర్కొన్నారు. నల్లధనం వల్ల ద్రవ్యోల్బణంతోపాటు రాజకీయ రంగం, పాలనా రంగాల్లో అవినీతి పెద్ద ఎత్తున పెరిగిపోయిందన్నారు. వీటి రద్దు వల్ల ఇక నుంచి అలా జరిగే పరిస్థితి ఉండదన్నారు. 

అమెరికాలో కాల్పుల కలకలం!..

అమెరికా : ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని అజుసా పోలింగ్‌ కేంద్రం సమీపంలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. ముగ్గురు గాయపడ్డారు. దీంతో అజుసాలోని రెండు పోలింగ్‌ కేంద్రాలను నిలిపివేశారు. తెల్ల షర్టుపై బుల్లెట్‌ప్రూఫ్‌ దుస్తులు ధరించి భారీ ఆయుధాలతో ఆగంతకుడు దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

జేఎన్‌యూ ప్రొఫెసర్ పై హత్యకేసు..

ఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత జిల్లా సుక్మాలో ఒక గిరిజనుడి హత్యకేసులో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నళిని సుందర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ అర్చనాప్రసాద్‌తోపాటు పలువురు మావోయిస్టులు, ఇతరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల..

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయింది. మొత్తం 982 పోస్టులకు గానూ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు-442, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు-540 ఉన్నాయి. ఈ పోస్టులకు నవంబర్‌ 11 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్‌ 10 ఆఖరు తేదీ. 2017 ఫిబ్రవరి 26న ప్రాథమిక పరీక్ష జరగనుంది. 2017 మే 20, 21 తేదీల్లో మెయిన్స్‌ పరీక్ష జరగనుంది.

పెద్ద నోట్ల రద్దుతో శ్రీవారి భక్తుల పాట్లు..

తిరుమల : రూ. 500, 1000 నోట్ల రద్దుతో తిరుమల కొండపై భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నోట్లను తీసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిరాకరిస్తున్నారు. అలాగే రెండు రోజులపాటు ఏటీఎంలు పనిచేయవని ప్రకటించడంతో ఏటీఎంలన్నీ మూతపడ్డాయి. దీంతో భక్తుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అంతేగాక హోటళ్ళ యజమానులు రూ. 500, 1000 నోట్లను తీసుకోకపోవడంతో భక్తులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ రోడ్లపై పడిగాపులు పడుతున్నాయి. కనీసం టిఫిన్ చేసేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఫ్లోరోసిస్ పై అంతర్జాతీయ సదస్సు..

హైదరాబాద్: ఫ్లోరోసిస్ పరిశోధనపై ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. తెలంగాణలో ఈ సదస్సు జరగడం ఇదే మొదటిసారి. ఈ సంబంధించిన వివరాలను సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి, సైంటిస్టు డాక్టర్ అర్జున్ ఎల్.ఖండారే వెల్లడించారు. తార్నాకలోని జాతీయ పౌష్టికాహార పరిశోధన సంస్థ(ఎన్‌ఐఎన్)లో ఈ నెల 9 నుంచి 11 వరకు జరిగే ఈ సదస్సు ప్రారంభోత్సవానికి తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖామంత్రి డా. సి.లక్ష్మారెడ్డి ముఖ్య అతిధిగా హజరు కానున్నట్లు తెలిపారు. కృంగదీసే ప్లోరోసిస్..ప్రస్తుత స్థితి, సవాళ్లు.. పరిష్కారాలు అనే అంశంపై సదస్సును నిర్వ హిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రధాని నిర్ణయంపై విపక్షాలు ఫైర్..

పశ్చిమ బెంగాల్ : రూ.500, 1000 నోట్లను మంగళవారం అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ మోదీ ప్రకటించడంతో పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానిపై పలు విమర్శలు చేశారు. ఇది ఒక అవివేకంతో తీసుకున్న నిర్ణయమన్నారు. నల్లధనాన్ని వెనక్కి రప్పించడంలో విఫలమవ్వడంతో ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ ఆకస్మిక తప్పుడు నిర్ణయంతో సామాన్య ప్రజల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

07:39 - November 9, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికలు హోరాహోరిగా కొనసాగుతున్నాయి. ఆనవాయితీ ప్రకారం మంగళవారం 45వ అధ్యక్ష ఎన్నికలు న్యూహంప్‌షైర్‌లోని డిగ్స్‌విల్లే నాచ్‌లో ముందుగా పోలింగ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ కొనసాగింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, మెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ల మధ్య తీవ్ర పోటీనెలకొంది. అధ్యక్ష ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరిగా సాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం పోలింగ్‌ ఈ తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఇక ఫలితాలు ఉదయం 7గంటలనుంచి ప్రారంభమై మధ్యాహ్నానికల్లా అమెరికా అధ్యక్షుడు ఎవరనేది ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పూర్తి ఫలితాలు మాత్రం సాయంత్రానికి వెలువడనున్నాయి.

చెపాక్‌లో ఓటేసిన హిల్లరీక్లింటన్‌
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ హోరాహోరీగా కొనసాగుతోంది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భర్త బిల్‌ క్లింటన్‌తో కలిసి వచ్చిన హిల్లరీ న్యూయార్క్‌లోని చెపాక్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా హిల్లరీ స్పందిస్తూ..దేశం కోసం అనేకమంది ప్రజలు ఎన్నికల్లో భాగస్వాములయ్యారని అన్నారు. ఈ రోజు తాను గెలిస్తే అత్యుత్తమమైన పాలన అందిస్తానని హిల్లరీ స్పష్టం చేశారు. అటు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌బూత్‌ల వద్ద బారులు తీరారు. ఈసారి ఎన్నికల్లో సుమారు 20 కోట్ల మంది ఓటు వేస్తామంటూ పేర్లు నమోదు చేయించుకున్నారు.

వర్జీనియా రాష్ట్రంవైపే అందరి దృష్టి
అయితే అందరి దృష్టి మాత్రం వర్జీనియా రాష్ట్రంవైపే ఉంది. ఆ రాష్ట్ర నుంచి 13మంది ఎలక్టోరల్‌ ఓటర్లున్నారు. వర్జీనియాలో ఆధిక్యం ప్రదర్శించే అభ్యర్థులే దేశాధ్యక్షుడిగా ఎన్నికవుతారనేది సెంటిమెంట్‌గా కొనసాగుతోంది. 2008, 2012 ఎన్నికల్లో ఒబామాకు మద్దతుగా ఈ రాష్ట్రం నిలిచింది. అంతకుముందు ఇక్కడ రిపబ్లికన్లకు పట్టు ఉండేది. ఇక 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న జార్జియా రాష్ట్రం 1996 నుంచి రిపబ్లికన్లకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ..ఇటీవల ఇక్కడ వారు తమ పట్టును కోల్పోతుండటం గమనార్హం.
ఎలక్టోరల్‌ కాలేజీలో మొత్తం 538 ఓట్లు
అధ్యక్ష ఎన్నికలో కీలకపాత్ర పోషించే ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 538 ఓట్లు ఉండగా..మెజారిటీ 270 ఓట్లు సాధించిన అభ్యర్థే అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. సీఎన్‌ఎన్‌ మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం హిల్లరీ ఖాతాలో 268 ఓట్లున్నాయి.17 రాష్ట్రాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని,..మరో 5 రాష్ట్రాల్లో అనుకూలతను సంపాదించిన ఆమె..ఊహించని పరిణామాలు ఎదురైతే తప్ప అమెరికా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టంచడం ఖాయమని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

ఎలక్టోరల్‌ కాలేజీలో మొత్తం 538 ఓట్లు
అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికే తొలి ఫలితం వెలువడింది. న్యూ హంప్‌షైర్‌లోని డిగ్జ్‌విల్లే నాచ్‌లో పోలింగ్‌ పూర్తయి తొలి ఫలితం వెలువడింది. ఇక్కడి 8 ఓట్లలో డెమెక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు నాలుగు ఓట్లు గెలుచుకోగా..రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ రెండు ఓట్లు గెలుచుకున్నారు. అటు తూర్పు తీర ప్రాంత పోలింగ్‌ కేంద్రాల్లోనూ ఓటింగ్‌ ముగిసి కౌంటింగ్‌ కూడా ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం..ఈ తెల్లవారుజాము వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది. ఉదయం 7గంటల నుంచి ఓట్ల లెక్కింపు రంభమై..మధ్యాహ్నానికల్లా తొలి ఫలితాలు,.సాయంత్రానికి వరకు తుది ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈ మెయిళ్ల వ్యవహారంలో చిట్టచివరి నిమిషంలో ఊరట లభించడంతో డెమెక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు విజయావకాశాలు పెరిగాయి. ఏది ఏమైనా మధ్యాహ్నానికల్లా అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేంది ఎవరనేది తేలిపోతుంది. 

07:37 - November 9, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి రేగింది. బ్లాక్‌ మనీని అరికట్టేందుకు 500,1000 రూపాయల నోట్లను రద్దు చేసిన మోడీ సర్కార్‌..ఇవాళ, రేపు ఏటీఎంలను బంద్‌ చేసింది. ఇవాళ ఒక్కరోజు బ్యాంకులకు కూడా ఆర్బీఐ సెలవు ప్రకటించింది. మోదీ నిర్ణయంతో ప్రజలు ఏటీఎం సెంటర్ల వద్ద బారులు తీరారు. ఒక్క ఏటీఎం సెంటరనే కాదు..పెట్రోల్‌ బంకులు, షాపింగ్‌ కాంప్లెక్సుల వద్ద జనం పెద్ద ఎత్తున క్యూ కట్టారు.

రూ.500, 1000 నోట్లను తిరస్కరించిన వ్యాపారస్తులు
500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు మోడీ ఆకస్మిక ప్రకటన దేశవ్యాప్తంగా అల్లకల్లోలం రేపింది. ఈ నిర్ణయం మార్కెట్ లో అలజడి సృష్టించింది. వ్యాపారస్తులు 500, 1000 రూపాయల నోట్లను తీసుకోవడానికి నిరాకరించగా..ఇవాళ, రేపు ఏటీఎం సెంటర్లు బంద్‌ చేస్తామని కేంద్రం ప్రకటించడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జేబులో వెయ్యి రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కూడా 100 రూపాయల నోట్ల కోసం ఎగపడ్డారు. ఏటీఎంలో వంద రూపాయల నోటు కన్పిస్తే చాలు జనం ఎగబడి మరీ వాటిని దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

ఏటీఎం సెంటర్ల వద్ద క్యూ కట్టిన ప్రజలు
రెండు రోజుల పాటు ఏటీఎంలు పనిచేయబోవని తెలిసిన తర్వాత కనీస అవసరాలు, అత్యవసర పనుల కోసం చాలా మంది ఏటీఎంల వద్ద క్యూ కట్టారు. అందులోనూ చాలా మంది 500 రూపాయలలోపు డబ్బు డ్రా చేయడానికి ఒకటికి నాలుగుసార్లు ఏటీఎంలను వినియోగించారు. తమ వద్ద ఉన్న కొన్ని నోట్లను ఈ కామర్స్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి పెద్ద ఎత్తున క్యాష్ డిపాజిట్ మిషీన్ల వద్ద బారులు తీరారు.

ఖర్చుల కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన సామాన్యులు
కొన్ని చోట్ల చిన్నస్థాయి వ్యాపారస్తులు సైతం ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచే 500, 1000 రూపాయల నోట్లను అంగీకరించకపోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఒక్కరు తమ జేబుల్లో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఆ నోట్లను అంగీకరించిన చోట్ల కొందరు కొనుగోళ్లు జరిపారు.

రూ.100 నోట్ల కోసం పాకులాడుతున్న సామాన్యులు
పాత నోట్లు 11వ తేదీ అర్ధరాత్రి వరకు చెల్లుబాటు అవుతుందని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ చాలా చోట్ల చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్దస్థాయి వ్యాపారస్తులు వాటిని తీసుకోవడంలేదు. పాత నోట్లను బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించినా..చాలా మంది వ్యాపారులు వాటిని తిరస్కరించారు. దీంతో సామాన్యులు, కొనుగోలు దారులు వంద నోట్ల కోసం పరుగులు పెట్టారు. ప్రస్తుత ఖర్చుల కోసమైన ఉంటే చాలు అనుకుంటూ విశ్వ ప్రయత్నాలు చేశారు.

హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలో క్యూ
హైదరాబాద్‌, తిరుపతి, విశాఖ పట్నం, విజయవాడ నగరాల్లో అర్ధరాత్రి దాటినా ఏటీఎం సెంటర్ల వద్ద చాంతాడంత క్యూ కొనసాగింది. కొన్ని చోట్ల ఏటీఎంలు మొరాయించడం..మరికొన్ని చోట్ల డబ్బులు లేకపోవడం వంటి సమస్యలు సామాన్యులను ముప్ప తిప్పలు పెట్టాయి. ఏటీఎంలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్యూ వందల మీటర్లు పెరిగిపోయింది. అయినా అర్ధరాత్రి తర్వాత చాలా ఏటీఎంలు నో క్యాష్‌..అవుటాఫ్‌ సర్వీస్‌ అంటూ బోర్డులు పెట్టేయంతో చాలా మంది దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. జేబులో ఉన్న చిల్లర డబ్బులతో వెను దిగాల్సిన పరిస్థితి వచ్చింది.

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో సామాన్యుడి ఆగ్రహం
ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చాలా మందికి సమస్యల్ని తెచ్చిపెట్టింది. నల్లధనాన్ని వెలికి తీయడేమోగానీ అకస్మాత్తు నిర్ణయం తమని ముప్ప తిప్పలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అత్యవసర సేవల విషయంలో మాత్రం 72 గంటలపాటు మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వాస్పత్రలు, ఫార్మసీలు, రైల్వేస్టేషన్లు, పెట్రోల్‌, డీజిల్‌ బంకులు, వినియోగదారుల సహకార కేంద్రాలు, శ్మశానవాటికలు, ప్రభుత్వ డెయిరీ మిల్క్‌ బూత్‌‌లు, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మాత్రం రద్దు చేసినట్టు ప్రకటించినా పెద్ద నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రధాని మోదీ ప్రకటించడంతో కొంతలో కొంత సామాన్యులకు ఊరట కలిగించింది. అయినా కూడా వీటి దగ్గరా జనాలు పెద్ద ఎత్తున క్యూ కట్టి 500, వెయ్యినోట్లను వందల్లోకి మార్చుకుంటున్నారు.

 

07:35 - November 9, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంతో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అక్రమంగా దాచుకున్న డబ్బును ఏం చెయ్యాలో తెలియక దిక్కు తోచని స్థితిలో పడిపోయారు.

500, 1000 నోట్లు ఇకనుంచి చిత్తు కాగితాలు: ప్రధాని మోడీ
అవినీతిపరులు, విదేశీ శక్తుల చేతుల్లో ఉన్న 500, 1000 రూపాయల నోట్లు ఇకనుంచి చిత్తు కాగితాలుగా మారనున్నాయని ప్రధాని మోడీ అన్నారు. దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రధాని తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని ఆర్థిక రంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. దీని వల్ల సామాన్యులకు, నిజాయతీపరులకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేస్తున్నారు.

డిసెంబరు 30లోపు బ్యాంకులో డిపాజిట్‌ చేసుకునే అవకాశం
ప్రజలు తమ వద్ద ఉన్న 500, 1000 రూపాయల నోట్లు డిసెంబరు 30లోపు బ్యాంకులో డిపాజిట్‌ చేసుకునే అవకాశం కల్పించారు. నల్లధనం కూడబెట్టిన వారు తమ వద్ద ఉన్న 500, 1000 రూపాయల నోట్లు బ్యాంకులో డిపాజిట్‌ చేయలేరు కాబట్టి అవి చిత్తుకాగితాలుగా మారే అవకాశముంది. రద్దు చేసిన నోట్ల స్థానంలో 500, 2వేల రూపాయల కొత్తనోట్లు జారీ చేస్తామని ప్రధాని తెలిపారు.

పాన్ కార్డు, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడిలలో ఏదో ఒకటి తప్పనిసరి
డిసెంబరు 30లోపు డిపాజిట్‌ చేయనివారు..గుర్తింపు కార్డులు సమర్పించి మార్చి 31లోపు డిపాజిట్‌ చేయవచ్చని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం చక్కబెట్టేందుకు ఆర్‌బీఐ, బ్యాంకులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్న ఆయన..నగదు తప్ప మిగతా లావాదేవీలు యథాతథమని ప్రధాని స్పష్టం చేశారు. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. మీ సొమ్ము మీదే అని ప్రధాని భరోసా ఇచ్చారు.బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవడానికి గుర్తింపు పత్రాలు తప్పనిసరి చేశారు. పాన్ కార్డు, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడిలలో ఏదో ఒకటి తప్పనిసరిగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చూపించి మాత్రమే ఈ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డులు లేకుండా పాత నోట్లను మార్చుకోవడం కుదరదు. దీంతో నల్లధనం దాచుకున్న వ్యక్తులు కట్టల కొద్దీ 500, 1000 రూపాయల నోట్లు మార్చుకోవడం అంత తేలిక కాదు.

అత్యవసర సేవలకు 72 గంటల మినహాయింపు
అయితే అత్యవసర సేవల విషయంలో మాత్రం 72 గంటల పాటు మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వాస్పత్రులు, ఫార్మసీలు, రైల్వేస్టేషన్లు, పెట్రోల్‌, డీజిల్‌ బంకులు, వినియోగదారుల సహకార కేంద్రాలు, శ్మశానవాటికలు, ప్రభుత్వ డెయిరీ మిల్క్‌ బూత్‌‌లు, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ నెల 11న అర్ధరాత్రి వరకు పెద్ద నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రధాని ప్రకటించారు.

కాల్‌ చేయాల్సిన నెంబర్లు: 022-22602201, 011-23093230
నోట్ల రద్దుపై అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ హెల్ప్‌లైన్ నెంబర్లు నెంబర్లు ప్రకటించాయి. 022-22602201, 011-23093230 నెంబర్లకు ఫోన్ చేసి అనుమానాలు తొలగించుకోవచ్చని తెలిపింది.

 

07:34 - November 9, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం నల్లధనంపై ఉక్కుపాదం మోపింది. బ్లాక్‌ మనీని అరికట్టేందుకు చరిత్రక నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లను కేంద్రం బ్యాన్‌ చేసింది. 500,1000 రూపాయల నోట్లను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం ప్రకటించారు. అక్రమార్కుల భరతం పట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ప్రకటించారు.

రూ. 500, వెయ్యి రూపాయల నోట్లు చెల్లుబాటు చట్టబద్ధం కావు: మోడీ
500, వెయ్యి రూపాయల నోట్లు ఇకనుంచి చట్టబద్ధంగా చెల్లుబాటు కావని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సంచలన నిర్ణయం ప్రకటించారు. డిసెంబర్ 30వ తేదీలోగా బ్యాంకులో గానీ, పోస్టాఫీసులో గానీ ప్రజలు నగదును బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆయన సూచించారు. దానికి ఏ విధమైన చార్జీలూ ఉండవని స్పష్టం చేశారు. జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో ఆ విషయం తెలిపారు.

వారానికి 20 వేల రూపాయలకు మించి విత్‌డ్రా చేయరాదు
అవినీతి, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదం ఆర్థిక వ్యవస్థను చేతుల్లోకి తీసుకుని ప్రమాదకరంగా మారుతున్నాయని మోడీ చెప్పారు. తక్షణమే 500, 1000 రూపాయల నోట్ల ముద్రణను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రోజూ బ్యాంకు నుంచి 10వేల రూపాయలకు మించి విత్‌డ్రా చేయరాదన్నారు. వారానికి 20 వేల రూపాయలకు మించి విత్‌డ్రా చేయరాదన్నారు. డిసెంబరు 30లోగా డిపాజిట్‌ చేయనివారు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్‌ చేయవచ్చని ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు.

తక్షణమే రూ.500, రూ.1000 రూపాయల నోట్ల ముద్రణ రద్దు-: మోడీ
బుధవారం బ్యాంకులకు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. బుధ, గురువారాల్లో ఏటీఎంలు కూడా పనిచేయవన్నారు. 500, 2000 రూపాయల నోట్లను ఈ నెల 10వ తేదీ నుంచి కొత్తగా అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. నల్లధనం, అవినీతి కబంధ హస్తాల్లో దేశం చిక్కుకుపోయిందన్న ఆయన..అధికార దుర్వినియోగంతో అనేక మంది భారీ ఎత్తున సంపదను కూడగట్టారన్నారు. నిజాయితీ పరులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారన్న మోడీ..సాధారణ పౌరుడు అత్యంత నిజాయితీతో జీవిస్తున్నాడన్నారు.

నెల 11 అర్థరాత్రి వరకు ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు..
ఉగ్రవాద సంస్థలు 500, 1000 రూపాయల దొంగనోట్లను చెలామణి చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయన్న ఆయన..అవినీతిపరుల ఆటకట్టించేందుకు బినామీ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. సబ్‌ కా సాథ్‌- సబ్‌ కా వికాస్‌ అన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. ఈ నెల 11 అర్థరాత్రి వరకు వైద్యసేవలు, రైలు టికెట్ల కోసం 500, 1000 రూపాయల నోట్లు వాడవచ్చన్నారు. నగదు తప్ప మిగతా లావాదేవీలు యథాతథంగా సాగుతాయని తెలిపారు.

రెండున్నరేళ్లలో లక్షా 25వేల కోట్ల నల్లధనాన్ని వెలికి తీశాం: ప్రధాని
దీపావళి మరునాడు వీధుల్లో చెత్త ఊడ్చినట్లు దేశంలో అనినీతిని ఊడ్చేద్దామని మోడీ పిలుపునిచ్చారు. నల్లధనం, దొంగనోట్లతో ఆటలాడేవారి ఆట కట్టిద్దామన్నారు. భారత్‌లో అవినీతి చాలా వరకు తగ్గిందన్న ఆయన..రెండున్నరేళ్లలో లక్షా 25వేల కోట్ల నల్లధనాన్ని వెలికి తీశామని చెప్పారు. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Don't Miss