Activities calendar

10 November 2016

21:47 - November 10, 2016

ఢిల్లీ : భారత్‌, ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య భారత జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 63 పరుగులు చేసింది. ఓపెనర్లు మురళీ విజయ్‌ 25, గౌతమ్‌ గంభీర్‌ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 311 పరుగులతో రెండో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లాండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు లభించిన అద్భుత ఆరంభాన్ని ఆ జట్టు బ్యాట్స్‌మెన్స్‌ కొనసాగించడంతో భారీ స్కోర్‌ సాధించగలిగింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ స్టోక్స్‌ 128 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీయగా ఉమేష్‌, షమీ, అశ్విన్‌ తలో రెండు వికెట్లు తీశారు. అమిత్‌ మిశ్రాకు ఓ వికెట్‌ దక్కింది.

 

21:44 - November 10, 2016

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి కూటమి ఏర్పాటు చేయబోమని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌ స్పష్టం చేశారు. కేవలం తమ పార్టీలో విలీనం మాత్రమే ఉండే అవకాశముందని పేర్కొన్నారు. ఇటీవల ములాయం జనతాపరివార్‌ కూటమి నేతలతో చర్చించిన నేపథ్యంలో యూపీ ఎన్నికల్లో కూటమి ఏర్పడే అవకాశముందన్న వార్తొలొచ్చిన నేపథ్యంలో ములాయం వివరణ ఇచ్చారు. ఐదు వందలు, వెయ్యి నోట్లను రద్దు చేయాలన్న మోది ప్రభుత్వ నిర్ణయాన్ని ములాయం స్వాగతించారు. అయితే వారం పది రోజులు గడువిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బిజెపి ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. తాము నల్లధనానికి వ్యతిరేకమని ములాయం చెప్పారు.

 

21:42 - November 10, 2016

ఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం పెరిగిపోతుండటంపట్ల ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వంపై మండిపడింది. కాలుష్యం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతుండగా, లక్షలాది మంది ఆయుష్షు తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రజల సగటు ఆయుష్షు మూడేళ్లు తగ్గడం పట్ల దోషి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని పేర్కొంది. కాలుష్యాన్ని నివారించేందుకు ఏదైనా ప్రణాళిక ఉండే ఉండాలి కదా ...అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి, పూర్తి ప్రణాళికతో కోర్టుకు రావాలని సూచించింది. తదుపరి విచారణను నవంబర్‌ 25కి వాయిదా వేసింది.

21:39 - November 10, 2016

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్‌తో  తెలంగాణ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కొత్త సచివాలయం, కృష్ణ జలాల వివాదం, కొత్త ప్రభుత్వ కార్యదర్శి ఎంపిక వంటి అంశాలపై... ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వీటితో పాటు... పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్రంలో కలుగుతున్న ఇబ్బందులపై గవర్నర్‌కి వివరించినట్లు సమాచారం. ఈ భేటీ... దాదాపు నాలుగు గంటలపాటు సాగింది. 

 

21:37 - November 10, 2016

హైదరాబాద్ : ఢిల్లీలో పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజీబీజీగా గడిపారు. పలువురు కేంద్రమంత్రులతో పాటు రాష్ట్రపతితో భేటీ అయిన బాబు పలు కీలక  అంశాలపై చర్చించారు. అపోలో, ఫిక్కీ ప్రతినిధులతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
కేంద్రమంత్రులతో బాబు భేటీ
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బీజీబీజీ గడిపారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. విజయవాడ బైపాస్‌ రహదారి నిర్మాణంతో పాటు బెంజ్‌ సర్కిల్‌ వద్ద ప్లైఓవర్‌ నిర్మాణంపై గడ్కరీతో చంద్రబాబు చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. జనవరి 27, 28 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుపై చర్చించారు. వరుసగా రెండో ఏడాది ఈ సదస్సు నిర్వహించే అవకాశం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.   
పలు కీలక నిర్ణయాలు 
ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో అపోలో టైర్స్ సంస్ద ఏర్పాటుకు అపోలో టైర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అపోలో టైర్స్ చైర్మన్ ఒంకార్ కన్వార్  సమక్షంలో సంతకాలు చేసి, పత్రాలు మార్చుకున్నారు.  జనవరిలో శ్రీసిటీ సమీపంలో 250 ఎకరాల్లో 525 కోట్ల పెట్టుబడితో రోజుకు 12 వేల టైర్ల ఉత్పత్తి లక్ష్యంగా 4వీల్,2వీల్ టైర్ల కర్మాగారాన్నిఅపోలో టైర్స్ ఏర్పాటు చేయనుంది. 
ఫిక్కీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ
అనంతరం... ఫిక్కీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వెంకటేశ్వర వర్శిటీలో జాతీయ నాలెడ్జి ఫంక్షనల్‌ హబ్‌ ఏర్పాటు, అమరావతిలో ఫిక్కీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకున్నారు. 2029 నాటికి ఏపీని దేశీయ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. 
ధర్మేంద్రప్రధాన్‌తో చంద్రబాబు భేటీ
అనంతరం పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌తో సమావేశమైన చంద్రబాబు నాయుడు పెట్రోలియం యూనివర్సిటీ, కాకినాడలో ఏర్పాటు చేసే పెట్రో కాంప్లెక్స్, ఎల్‌ఎన్ టెర్మినల్, పైప్‌ల ద్వారా గ్యాస్ సరఫరా అంశాలపై చర్చించారు. రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన చంద్రబాబు ఫిబ్రవరిలో నిర్వహించే మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు ప్రణబ్ ను ఆహ్వానించారు.  

21:33 - November 10, 2016
21:31 - November 10, 2016

హైదరాబాద్ : జేబులో పెద్ద నోట్లున్నా ఏమీ కొనలేని పరిస్థితి... ఖాతాలో నిధులున్నా డ్రా చేయలేని పరిస్థితి... బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రజానీకం ఎదుర్కొన్న విచిత్ర దుస్థితి ఇది. కానీ, కొత్త 500, 2000 నోట్లు చెలామణిలోకి రావడంతో అంతా ఖుషీఖుషీగా ఫీలవుతున్నారు. బ్యాంకుల్లోంచి... కొత్తనోట్లను తీసుకున్నవాళ్లు అందరికీ చూపిస్తూ.. సంతోషం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా కోత్తనోట్లను తీసుకున్న వారి ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది. 
లైట్ పింక్ కలర్‌లో కొత్త నోటు 
పెద్ద నోట్ల రద్దు అనంతరం భారతదేశంలో కొత్త నోట్ల హడావుడి మొదలైంది. కొత్త నోట్లు తీసుకునేందుకు బ్యాంకుల వద్ద జనం పడిగాపులు కాచారు. కేంద్రం ప్రకటించిన కొత్త రూ.2వేల నోట్లు బ్యాంకుల నుంచి ఖాతాదారుల చేతులకు చేరుతున్నాయి. లైట్ పింక్ కలర్‌లో కొత్త నోటు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తనోట్లు అందుకున్న వారు తమ సంతోషాన్ని సెల్ఫీల ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
పాత రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేయడంతో నిన్న ఇబ్బంది పడ్డ వారి ముఖాల్లో వెలుగులు కనిపించాయి. 
ఈ నెల 12, 13వ తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి :  ఆర్బీఐ 
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఈ నెల 12, 13వ తేదీల్లో కూడా పనిచేస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. వాస్తవానికి.. 12వ తేదీ రెండో శనివారం, 13వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వినియోగదారుల రద్దీని ఎదుర్కొనేందుకు వీలుగా ఆ రెండు రోజులు బ్యాంకులను తెరచి ఉంచాలని ఆర్బీఐ ఆదేశించింది.

 

21:24 - November 10, 2016
21:13 - November 10, 2016

సమరానికి సై అన్నాడు..!! అధికారమే లక్ష్యంగా సాగనున్నాడా..? పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు..? అనంత సభ సంకేతాలేంటీ..? అసెంబ్లీకి 'గబ్బర్ సింగ్'... ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

బ్యాంకు ఖాతాదారులకు కాస్త ఊరట

ఢిల్లీ : బ్యాంకు ఖాతాదారులకు కాస్త ఊరట లభించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగిస్తే ఎలాంటి సర్ ఛార్జీల ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వెసులుబాటు కల్పించింది.

 

గవర్నర్ నరసింహన్ తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. నాలుగు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. 

 

ఢిల్లీలో వాయు కాలుష్యంపై హైకోర్టు తీవ్ర ఆందోళన

ఢిల్లీ : హస్తినలో వాయు కాలుష్యంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యంలో ఢిల్లీ ప్రపంచంలోనే నెం.1 ర్యాంక్ అని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు చీవాట్లు పెట్టింది. ప్రభుత్వాలకు రాజకీయాలు, ఓట్లు తప్ప వేరే ధ్యాసే లేదన్నారు. ప్రజా సంక్షేమం పట్టదా అని నిలదీసింది.

 

20:49 - November 10, 2016

సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి నినాదాలతో సీపీఎం మహాజన పాదయాత్ర చేపట్టింది. పాదయాద్ర బృందంతోపాటు ప్రజానాట్యమండలి కళాకారులు పాదయాత్ర చేస్తున్నారు. తన ఆట, పాటలతో జనాన్ని మేల్కొపుతున్నారు. పాదయాత్ర బృందం ముందు నడుస్తున్నారు. ప్రజలను సన్నదం చేస్తున్నారు. ఆ కళాకారులతో మల్లన్న ముచ్చటించాడు. ఈ సందర్భంగా కళాకారులు పలు పాటలు పాడారు. ఆడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:40 - November 10, 2016
20:38 - November 10, 2016
20:36 - November 10, 2016
20:34 - November 10, 2016
20:33 - November 10, 2016

హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. జనవరి 27, 28 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించేందుకు అంగీకరించిన నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు. వరుసగా రెండో ఏడాది కూడా సిఐఐ సదస్సును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని  ఆయన తెలిపారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రభుత్వ అధినేతలు, ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హజరు కానున్నారు. పరిశ్రమలు పెట్టడానికి అనుకూల రాష్ట్రంగా ఏపీ ఉందని ఆయన అన్నారు. రెండు పారిశ్రామిక కస్టర్లు, మూడు రైలు సరకు రవాణా కారిడార్‌లు, 9 ఓడరేవులు, 5 విమానశ్రయాలు ఏపీలో ఉన్నాయని ఆయన  తెలిపారు. మరెన్నో భవిష్యత్తులో రానున్నాయని చంద్రబాబు అన్నారు. 

 

20:31 - November 10, 2016

వరంగల్‌ : జిల్లాలో బ్యాంకులన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి... పెద్దనోట్ల రద్దు తర్వాత ఇవాళే బ్యాంకులు ప్రారంభం కావడంతో వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగాం, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని బ్యాంకులు క్రిక్కిరిసాయి.. మరిన్ని వివరాలు కేకే అందిస్తారు.. 
ఖమ్మం,  భద్రాద్రి 
ఖమ్మం,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బ్యాంకుల వద్ద రద్దీ నెలకొంది.  రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేసేందుకు ఖాతాదారులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. బ్యాంకుల్లో కనీస సదుపాయాలు కూడా ఏర్పాటుచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
కరీంనగర్, జగిత్యాల
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బ్యాంకులన్ని ఖాతాదారులతో నిండిపోయాయి. కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రజలు బ్యాంకుల ముందు బారులు తీరారు. 
ప్రకాశం 
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏ బ్యాంకు చూసినా జనాలతో కిటకిటలాడుతున్నాయి. తమ వద్ద ఉన్న పెద్దనోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద బారులు తీరారు. అయితే అధికారుల తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:22 - November 10, 2016

అనంతపురం : 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ప్రకటించారు. అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ ఈ ప్రకటన చేశారు. తనకు ఓట్లు వేసినా.. వేయకపోయినా ప్రజలకోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.. కరవుతో అల్లాడుతున్న అనంతపురంలోనే తన పార్టీ తొలి కార్యాలయం ఏర్పాటు చేస్తానని జనసేనాని ప్రకటించారు. సమస్యలు వస్తే నిలబడే వ్యక్తినేనని పవన్‌ అన్నారు. అనంతపురం అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. కరువు బారిన పడిన రైతులను ఆదుకునేందుకు తన వంతు కృషిచేస్తానని పవన్ ప్రకటించారు. 
అర్థంకాని స్పెషల్‌ ప్యాకేజీ  
స్పెషల్ ప్యాకేజీ గురించి మాట్లాడటానికి చాలా ఆలోచించానని పవన్‌ అన్నారు. స్పెషల్‌ ప్యాకేజీ సామాన్యులకు ఏ మాత్రం అర్థం కాకుండా ఉందని సినీ హీరో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హార్వర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న మేధావులు రూపొందించిన.. ఫ్యాకేజీపై.. మాట్లాడటానికి ఒంగోలు గోపాలనగరం వీధుబడిలో చదువుకున్న తనకు చాలా టైం పడుతుందని ఎద్దేవా చేశారు. ఓట్లు అడగడానికి వచ్చే నేతలు చాలా సరళమైన భాషలో మాట్లాడుతారని, ఫ్యాకేజీలో మాత్రం అర్థం కాని భాష వాడారని ఆయన దుయ్యబట్టారు. 
అనంత ప్రజల్ని కటేస్తోన్న కరవు  
అనంత ప్రజల్ని కరవు కటేస్తోందన్నారు పవన్‌ కళ్యాన్‌. అనంత కరువును ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తా అన్నారు. తాను కూడా రైతునన్న పవన్‌.. తనకు కూడా రైతు సమస్యలు అన్ని తెలుసన్నారు. ప్రభుత్వాలకు పట్టని రైతు సమస్యలను స్వచ్ఛంధ సంస్థలు ముందుకొచ్చి పరిష్కరిస్తున్నాయని అన్నారు. 
సరికొత్త రాజకీయ అధ్యయానికి శ్రీకారం 
ఈ ఫ్యాకేజీని తాను గతంలోనే పాచిపోయిన లడ్డూలతో పోల్చానని పవన్‌ అన్నారు. మనకు రావాల్సిందే ఇచ్చారు గానీ, ఫ్యాకేజీ ద్వారా మనకు ఏం ఇవ్వలేదని ఆయన అన్నారు. పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా... విభజించవచ్చని, స్పెషల్‌ స్టేటస్‌ రాకపోతే ప్రాణాలారిపోతాయన్న మాటలు విన్నా కేంద్రం కనికరించలేదని పవన్‌ ఎద్దేవా చేశారు. ఢిల్లీ చట్టసభల్లో కూర్చున్న నేతలకు స్పెషల్‌ స్టేటస్‌ అనేది ముగిసిన అధ్యాయం కావచ్చు గానీ.. అనంతపురం లాంటి కరవు ప్రాంతానికి అదో అమృతం చుక్క అని పవన్‌ అభివర్ణించారు. అనంతపురం వంటి కరవు ప్రాంతానికి నిధులు వస్తాయన్న ఉద్దేశంతోనే.. కుటుంబం మీద మమకారం.. అన్నీ పక్కన పెట్టి.. టీడీపీ, బీజేపీకి మద్దతు తెలిపానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అవి జరగనప్పుడు జీ హుజూర్‌ అంటూ ఉత్త చేతులతో కూర్చునే మనిషిని కాదని పవన్‌ స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి సరికొత్త రాజకీయ అధ్యయానికి శ్రీకారం చుడతామని పవన్‌ చెప్పారు. 
మాట మరిచిన నాయకుల్ని కూలదోస్తాం.. 
దండాలు పెట్టి మరీ ఓట్లడిగి.. అందలం ఎక్కి కూర్చున్నాక.. ప్రజల్ని మరిచిపోతారని పవన్‌ విమర్శించారు. ఓ చెట్టుకూడా భూమికి రుణపడి ఉంటుందని, అలాంటిది రాజకీయ నాయకులు అండగా ఉంటామని ఓట్లడిగి అన్నీ మరిచిపోయారని ఆయన ధ్వజమెత్తారు. ఇచ్చిన మాటను మరిచిన నాయకుల్ని కూలదోస్తామని పవన్‌ హెచ్చరించాడు. 
స్పెషల్‌ ఫ్యాకేజీపై తలా ఒక మాట 
ఏపీకి స్పెషల్‌ ఫ్యాకేజీపై తలా ఒక మాట మాట్లాడతారని పవన్‌ విమర్శించారు. అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు లాంటి నేతలు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని అస్పష్టంగా మాట్లాడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసినట్లుగా.. స్పెషల్‌ ఫ్యాకేజీ కూడా తమను వంచించేలా చేస్తున్నారని పవన్‌ ధ్వజమెత్తారు. కేంద్రం ప్రత్యేక ఫ్యాకేజీ ఇచ్చినా ఇవ్వకపోయినా.. కేంద్రం, ఆర్థిక సంఘం ఇచ్చేదే.. చట్టప్రకారం వచ్చేదే లక్షా డెబ్బై వేల కోట్లకు పైగా ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కేంద్రం ఏదో ఉద్దరించినట్లు మన నేతలు ఆహా.. ఓహో అంటూ సన్మానాలు చేయించుకుంటున్నారని పవన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
మోడీకి ఎదురెళ్లి మాట్లాడటానికి సిద్ధం 
ప్రధాని నరేంద్రమోడీపై తనకు విపరీతమైన గౌరవం ఉందని, అలాగని తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదురెళ్లి మాట్లాడటానికి కూడా సిద్ధమని పవన్‌ స్పష్టం చేశారు. కేంద్రం జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాల్సిందే లక్షా డెబ్బైవేల కోట్లుంటుందని పవన్‌ అన్నారు. కొందరు నాయకులు రాజకీయ చతురతతో ఎంతో ఇస్తున్నట్లు చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఇవన్నీ అంకెల్లో గారడీ తప్పా ఇంకేం కాదని పవన్‌ దుయ్యబట్టారు. 
సుజనా చౌదరిపైనా పవన్‌ నిప్పులు 
కేంద్ర మంత్రి సుజనా చౌదరిపైనా పవన్‌ నిప్పులు చెరిగారు. ఎయిరిండియా, పోస్టాఫీసు సేవలపై సుజనా చేసిన వ్యాఖ్యలని ఈ సందర్భంగా పవన్‌ ఉటంకించారు. మీరెచ్చే స్పెషల్ ఫ్యాకేజీ విమానం ఆగిపోయిందని పవన్‌ చలోక్తులు విసిరారు. కేంద్రం ఇచ్చిన ఫ్యాకేజీకి చట్టబద్దత లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన గ్రాంటు, రాష్ట్రం చేసిన ఖర్చు 8వేల కోట్లేనని.. దీనికి జాతీయ ప్రాజెక్టు అని పేరు పెట్టారని ఆయన విమర్శించారు. ఏ విధంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు అయిందో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పి తీరాలని పవన్‌ డిమాండ్ చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టని ప్రజలను వంచిస్తున్నారని ఆయన ఆ్రగహం వ్యక్తం చేశారు. 
కేంద్రంపై విరుచుకుపడ్డ పవన్ 
టాక్స్‌ ఇన్సెంటివ్స్‌ ఇచ్చామని చెప్పడానికే ప్రభుత్వానికి రెండున్నర సంవత్సరాలు పట్టిందని, అలాంటిది పరిశ్రమలు పెట్టడానికి ఎంత సమయం పడుతుందో చెప్పాలని పవన్‌ అన్నారు. ముఖ్యంగా చుక్క నీరు లేని అనంతపురం లాంటి ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు పెడతారని ఆయన ప్రశ్నించారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ద్వారా రీఫైనరీలు పెడతామని చెబుతూనే.. మహారాష్ట్రలో అల్రెడీ ఏర్పాటు చేస్తున్నారని పవన్‌ అన్నారు. మనకేమో పేపర్లలో మాత్రమే పరిశ్రమలు.. వాళ్లకేమో వాస్తవ పరిశ్రమలు అని కేంద్రంపై విరుచుకుపడ్డారు. 
ఆచరణ సాధ్యం కానీ ప్రకటన 
దుగ్గరాజపట్నంలో మేజర్‌ పోర్టు ఇస్తామని కేంద్రం ఆచరణ సాధ్యం కానీ ప్రకటన చేసిందని, కానీ ఇది కంటి తుడుపు చర్య అని పవన్‌ ధ్వజమెత్తారు. ఇది వాస్తవరూపం దాల్చే ప్రాజెక్టు కాదని ఆయన అన్నారు. రాష్ట్రం.. నిధులు లేవంటది.. కేంద్రం భూమి ఇవ్వాలంటోందని..... ఇదంతా పిచ్చి కుదిరితేనే పెళ్లి.. పెళ్లి కుదిరితేనే పిచ్చి అన్నట్లుందని పవన్‌ అభివర్ణించారు. సింగపూర్ అంటే పెద్ద పెద్ద కట్టడాలు మాత్రమే కాదని.. అవినీతి, లంచగొండితనం లేని వ్యవస్థ కనబడిందన్నారు పవన్.. ఒకప్పటి సింగపూర్ అధ్యక్షుడు లిక్ వాన్ వ్యూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. సింగపూర్ లాంటి కఠిన చట్టాలు వస్తేనే రాష్ట్రం సింగపూర్‌ అంతా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇన్ని లోపాలున్న ప్యాకేజీని టీడీపీ ప్రభుత్వం ఎలా ఆమోదించిదని పవన్ కల్యాణ్‌ ప్రశ్నించారు. మనకు రావాల్సిన వాటానే ప్యాకేజీ రూపంలో కేంద్రం ఇచ్చిందన్నారు. రాజకీయాలంటే బూతులు తిట్టుకోవడం కాదని..  జనసేన పోరాటం విధానాల మీద తప్ప వ్యక్తుల మీద కాదన్నారు. 

19:59 - November 10, 2016
19:12 - November 10, 2016

రేపు తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష

హైదరాబాద్ : తెలంగాణలో రేపు గ్రూప్ 2 పరీక్ష జరుగనుంది. పరీక్షకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 11, 13 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1916 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

 

బోరబండ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

హైదరాబాద్ : బోరబండలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

 

రాష్ట్రపతి ప్రణబ్ తో సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల భేటీ

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు భేటీ అయ్యారు. పలు అంశాలపై రాష్ట్రపతితో వారు చర్చిస్తున్నారు. 

18:22 - November 10, 2016

అనంతపురం : కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎపికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం మాట నిలబెట్టుకోలేకపోయిందన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా... టీడీపీ ప్రభుత్వం కేంద్రానికి వంతపాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఎపికి ప్రత్యేకహోదా ఇస్తామన్న కేంద్రం హోదా ఇవ్వకుండా ప్రజలను పదే పదే మోసం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎపికి ప్రత్యేకహోదా ఇస్తారో లేదో.. స్పష్టం చేయాలన్నారు. అనంతపురంలో జరిగిన సీమాంధ్ర హక్కుల సభలో పవన్ ప్రసంగించారు. అనంతపురానికి 2014 సం.లో ఎన్నికలప్పుడు వచ్చాను.. టీడీపీ, బీజేపీల తరపున మద్దతు కోసం వచ్చాని గుర్తు చేశారు. కానీ ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం మాట నిలనెట్టుకోలేదని, దానికి టీడీపీ మద్దతు పలుకుతుందన్నారు. ఎపికి ప్రత్యేకహోదా వచ్చే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. సమస్యలు వస్తే నిలబడే వ్యక్తినని..పారిపోయే వ్యక్తిని కాదని చెప్పారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని... మడమ వెనక్కి తిప్పమని చెప్పారు. 
అనంతపురం అంటే నాకు చాలా ఇష్టం 
అనంతపురం అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. దేశంలోకెళ్ల కరువు కోరల్లో చిక్కుకున్న ఎపిలోని అత్యధిక వెనుకబడి జిల్లా అనంతపురం పేర్కొన్నారు. రాయలసీమలో వెనుబడి ఉన్న అనంతపురం జిల్లాలకు అండగా ఉండడం తనకు ఎంతో ఇష్టమన్నారు. ఇటీవల మన దేశ సరిహద్దులో పాకిస్తాన్ మన సైనికులపై దాడి చేసి చంపిన సమయంలో ప్రత్యేకహోదా గురించి మాట్లాడడం సరికాదనిపించిందని... అందుకు అ సమయంలో అనంతపురం రాలేదన్నారు. చనిపోయిన భారత జవాన్ల ఆత్మశాంతి కోసం మౌనం పాటిద్దామని చెప్పారు. మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్పెషల్ ప్యాకేజీ పై మాట్లాడటానికి అధ్యయనం చేసేందుకు కొంత సమయం తీసుకున్నానని తెలిపారు. మనల్ని ఓట్లు అడిగేందుకు వచ్చనప్పుడు రాజకీయ నేతలు సులువైన, ప్రజలకు అర్థమైన భాష మాట్లాడుతారని..కానీ గెలిచి అందలం ఎక్కాక...మనకు రావాల్సిన నిధులు ఇచ్చే సమయానికి, హామీలు, చేసిన వాగ్ధానాలను అమలు చేసే సమయంలో మనకు అర్థం కాని మాటలు మాట్లాడుతూ, తికమక చేస్తూ ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు.
స్పెషల్ ప్యాకేజీలో కొత్తగా ఇచ్చిందేమీ లేదు... 
కేంద్రం ప్రత్యేకహాదా ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిందని...అప్పుడు తాను ప్యాకేజీపై స్పందిస్తూ పాచిపోయిన లడ్డు అన్నానని పదే పదే కేంద్రం నేతలు అన్నారని..చెప్పారు. కానీ చట్ట బద్ధంగా రాష్ట్రానికి రావాల్సినవే ఇచ్చారని..స్పెషల్ ప్యాకేజీలో కొత్తగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్ర విభజన చేయచ్చు, ఎంపీలు పెప్పర్ స్ర్పే కొట్టవచ్చు, స్పెషల్ ప్యాకేజీలో అద్భుతాలున్నాయని అనవచ్చు... కానీ తాను పాచిపోయిన లడ్డూలు అంటే తప్పుబడుతున్నారని తెలిపారు. ఇవ్వని స్పెషల్ స్టేటస్ కు హీరోలు అయిన వారున్నారని.. సన్మానాలు చేయించుకున్నావారున్నారని ఎద్దేవా చేశారు.
స్పెషల్ స్టేటస్ ..అమృతపు చుక్క
స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు... అయితే కేంద్రానికి స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయం కావచ్చు..కానీ అనంతపురం లాంటి కరువు, వెనుకబడిన జిల్లాల ప్రజలకు అది అమృతపు చుక్క అని అన్నారు. కుటుంబంపై మమకారం పక్కకు పెట్టి టీడీపీకి వంతపాడానంటే రాష్ట్రానికి నిధులు వస్తాయని, అనంత కరువు పోతుందంటే మద్దతు ఇచ్చానని తెలిపారు. కానీ అవి రానప్పుడు ఖాళీగా చేతులు కుట్టుకొని ఉండలేనని ఎదురు తిరుగుతానని హెచ్చరించారు. ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రజలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని మండిపడ్డారు. సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలు పెడతామన్నారు. అందలం ఎక్కాక ప్రజలను మరిచిపోతారని చెప్పారు. ఇచ్చిన మాటపై నిలబడకపోతే.. తాము తలుచుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తామని చెప్పారు. ఎపికి ప్యాకేజీ విషయంలో కేంద్రమంత్రులకు స్పష్టత కొరవడిందన్నారు. అరుణ్ జైట్లీ మాట్లాడుతూ 2లక్షల 3 వేల కోట్ల అంటాడు.. మరో మంత్రి వెంకయ్యనాయడు మాట్లాడుతూ... 2లక్షలు 25 వేల కోట్లు అంటారు. వారి మాటల్లో స్పష్టత లేదన్నారు. స్పెషల్ ప్యాకేజీ అర్ధరాత్రి ఇచ్చారని... ఎవరికి భయపడి అలా ఇచ్చారని ప్రశ్నించారు. 
అన్యాయం జరిగితే మోడీకి ఎదురెళ్తా..
స్పెషల్ ప్యాకేజీకి ఎలాంటి చట్టబద్దతలేదన్నారు. కేంద్రం ప్రకటించే ప్రత్యేకప్యాకేజీ మాట ఎలా ఉందంటే.... 'ఇంట్లో ఆలికి అన్నం పెట్టి ఊరు మొత్తానికి పెట్టినట్లు చెప్పుకుంటున్నారని..  దానికి చంద్రబాబు వంతపాడుతున్నారని ఎద్దేవా చేశారు. మోడీ అంటే తనకు గౌరవం ఉంది.. కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మోడీకి ఎదురెళ్లి మాట్లాడడానికి వెనుకాడనని చెప్పారు. చట్టపరంగా రావాల్సినవే ఇస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ ఇస్తలేరని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రాలకు రావాల్సిన నిధుల నిష్పత్తులను తగ్గించారని తెలిపారు. పేపర్ లో అంకెల గారడి తప్ప మరోటి కాదన్నారు. స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత లేదన్నారు. స్పెషల్ ప్యాకేజీ పేపర్ విమానం లాంటిదని సుజనా చౌదరికి చురకలంటించారు. స్పెషల్ ప్యాకేజీ చదివి సైట్ కూడా వచ్చిందని పేర్కొన్నారు. పోలవరం జతీయ ప్రాజెక్టు అన్నారు. పోలవరంకు 16 వేల కోట్లు...కావాలన్నారు. కానీ.. కేంద్రం మాత్రం ఇరిగేషన్ కే నిధులు ఇస్తామని అని క్లియర్ గా రాశారు. కేంద్రం ఇచ్చేది 8 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. అనంతపురంలో నీరు లేకుండా పరిశ్రమలు ఎలా పెడతారని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని కొంకన్ లో పరిశ్రమల స్తాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్... తెలంగాణ ఇస్తామని చెప్పి.. చెప్పి అనేక మంది ప్రాణాలు కోల్పోయాక ఇచ్చారని అలాగే ప్రత్యేకహోదా తెస్తామని చెప్పి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి తమ మనోభావాలు, ఆత్మగౌరం దెబ్బ తీయొద్దని చెప్పారు. మాటలు, అంకెల గారడీతో ప్రజలను వచించవద్దన్నారు. 
వారికి సన్మానాలు ఎలా చేస్తారు...? 
అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పాలని అడిగారు. కేంద్రం చెప్పే మాటలు విని విని అలసిపోయమన్నారు. 
హోదా ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్న వారికి సన్మానాలు ఎలా చేస్తారు...? అని ప్రశ్నించారు. ప్రజలను వంచించడం సరికాదన్నారు. ఒక వేల ప్రజలను ఇలాగే మోసం చేస్తే 2019 ఎన్నికల్లో ఏం చేయాలో అది చేస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల భావావేశాలు, ప్రేమ, మంచితనంతో ఆడుకోవద్దన్నారు. కులాలు, మతాలకతీంగా అందరి కోసం పని చేస్తానని చెప్పారు. కల్లూరి, గరిమెల నాగిరెడ్డి జీవితాలు స్ఫూర్తి దాయకం కాబట్టి సభ ప్రాంగణానికి వారి పెట్టామని తెలిపారు. 'మన వనరులు, సంపద మనకు ఉపయోగపడ్డ తర్వాతే బయటివారికి ఇవ్వాలని' వారు చెప్పారని తెలిపారు. 
2019 లో ఎమ్మెల్యేగా పోటీ 
ఎపీలో మొదటి జనసేన పార్టీ కార్యాలయాన్ని అనంతపురంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2019సం.ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. గెలిచినా, ఓడినా ప్రజలకు కోసం పని చేస్తానని చెప్పారు. అనంతపురం కరువుపై ఢిల్లీ వెళ్దామని పిలుపినిచ్చారు. కరువును దేశ రాజధానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కరవు వల్ల ఆడ పడచులు మానాలు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవారిపై అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు. రైతులు వలస కూలీలగా మారారని వాపోయారు. నేను కూడా చిన్నకమతం రైతును అన్నారు. రెయిన్ గన్ కొడితే కరువు ఆగిపోతుందా..? ప్రశ్నించారు. రాజకీయ నేతలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నటుడిగా తనకు ఆనందం లేదన్నారు. సమస్యలపై పోరాటం చేస్తున్నప్పుడు, ప్రజలకు అండగా నిలబడినప్పుడు నాకు అనందంగా ఉంటుందన్నారు. రాయలసీమ ప్రాంతానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 
విధానాలపైనే పోరాటం..
తనకు ఏ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్నారు. విధానాలపై పోరాటం తప్ప వ్యక్తులపై కాదన్నారు. చంద్రబాబు, జగన్ లపై వ్యతిరేకత లేదని తెలిపారు. కానీ ప్రజల మాటలను వినకపోతే... ఇచ్చిన హామీలను నెవర్చేకపోతే మాత్రం తాను వారికి ప్రధాన శత్రువును అవుతానని చెప్పారు. తనకు పదువులు అవసరం లేదని...ప్రజా సమస్యలు ముఖ్యమన్నారు. లోపాలున్న ప్యాకేజీని టీడీపీ ఎలా ఒప్పుకుందని ప్రశ్నించారు. ఆడబిడ్డల మాన సంరక్షణ కోసం ముందు జనసేన పార్టీగా ముందుంటామని చెప్పారు. ఆడబిడ్డలు, రైతులు ఎప్పుడు ఏడవకూడదన్నారు. అన్నం పెట్టే రైతులను చంపుతున్నారని ప్రభుత్వాలపై మండిపడ్డారు. రైతులను ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. నేతలకు రాజకీయాలు, పదవులపై ఉన్న శ్రద్ధ, మమకారం... ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు. అన్నదాతకు కోసం తాను ప్రాణాలు అర్పిస్తానని  చెప్పారు. రైతు ఎంత ముఖ్యమో జవాను కూడా అంతే ముఖ్యమన్నారు. టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. కులం అడ్డుగోడలు దాటి, కుటుంబ మమకారం దాటి టీడీపీకి మద్దతు పలికానని..కానీ ఆ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. టీడీపీ వీటిని సరిదిద్దకపోతే వేర్పాటు వాద ఉద్యమాలు వస్తాయన్నారు. రాయలసీమ, ఉత్తరాంత్రలో వేర్పాటు వాద ఆలోచనలు ఉన్నాయన్నారు. తెలంగాణ లాగా ఎపి మళ్లీ రెండు, మూడు ముక్కలు అయ్యే అకాశం ఉందన్నారు. సినిమాలో పోరాటం చేయడం తేలిక...కానీ నిజ జీవితంలో తేలిక కాదన్నారు. అయితే సమకాలీన దోపిడీ రాజకీయాలపై పోరాటం చేస్తానని చెప్పారు. దళిత, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులను గుర్తించి పరిశ్రమల  ఏర్పాటు చేసేందుకు వారికి ప్రోత్సహకాలు ఇవ్వాలన్నారు.
సామాజిక మార్పు కోసం రాజకీయాల్లోకి 
సామాజిక మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మీ కుటుంబంలో ఒక్కడిగా ఉంటానని తెలిపారు. కడుపు మండిన అనంతపురం నుంచే పోరాటం ప్రారంభిస్తామని చెప్పారు. కొత్త రాజకీయం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం గుర్తించని సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. ఎత్తైన భవనాలను కట్టినంత మాత్రాన సింగపూర్ తరహా రాజధాని కాదన్నారు. ఆలోచన విధానం, సమస్యలు, అవినీతి, హక్కులను కాలరాసే వ్యక్తులపై పోరాటం చేస్తామని...వారిని ఓడిస్తాం.. గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీగా హోదా సాధించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. కుదిరితే.. ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. అనంతపురం దుర్భిక్షాన్ని పారదోలాలన్నారు. అనంతపురానికి 100 టీఎంసీల నీటి కోసం అన్ని పార్టీలతో కలిసి వస్తానని చెప్పారు. రాజకీయ నాయకుల్లో కరెప్షన్ పోయిన తర్వాతే వ్యవస్థ బాగు పడుతుందన్నారు.

 

17:19 - November 10, 2016
17:17 - November 10, 2016
17:14 - November 10, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో బల్దియాకు భారీగా ఆదాయం తగ్గింది. మరోవారం పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంటున్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. రోజువారిగా బిల్లులు, ట్యాక్స్ లు వసూలు చేసే సంస్థలకు రాబడులు తగ్గాయి. జీహెచ్ ఎంసీకి ప్రతిరోజూ వచ్చే ఆదాయం కంటే 2 రెట్లు తక్కువగా ఆదాయం వస్తుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:48 - November 10, 2016

అనంతపురం : తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతపురం జిల్లాలో జనసేన భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభలో కూడా ప్రత్యేక హోదా విషయంలో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పలు విమర్శలు గుప్పించారు. హోదా విషయంలో మోసం చేయవద్దని..ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయవద్దని హెచ్చరించారు. తాను హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయం పెట్టడం జరిగిందని, అనంతరం అనంతలో పార్టీ కార్యాలయం పెడుతానని సభ సాక్షిగా ప్రకటించారు. అనంతరం తాను 2019 ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన సంచలన ప్రకటన చేశారు.

 

2019ఎన్నికల్లో ఏం చేయాలో తమకు తెలుసు - పవన్..

అనంతపురం : 2019ఎన్నికల్లో ఏం చేయాలో తమకు తెలుసని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అనంతపురంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. హోదా విషయంలో ఆయన మాట్లాడుతున్నారు. భావోవేశాలతో ఆటాలాడుకోవద్దని..ప్రేమ అభిమానంతో ఆటలాడుకోవద్దని పవన్ సూచించారు. 

'నీరు లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయి'..

అనంతపురం : చుక్క నీరు లేని అనంతలో నీరు లేకుండా ఎలాంటి పరిశ్రమలు పెడుతారని, యువతకు ఉద్యోగాలు ఎలా ఇస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు.రిఫైనరీ పరిశ్రమలు పెడుతామని పేపర్ లో పేర్కొంటున్నారని, కానీ మహారాష్ట్రలో కొంగన్ ప్రాంతంలో రిఫైనరీ కోసం చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. 

పోలవరంపై సమాధానం చెప్పాలి - పవన్..

అనంతపురం : పోలవరం జాతీయ ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతున్నారు. జాతీయ ప్రాజెక్టు విషయంలో వంచించవద్దని సూచించారు. 

'అనంత'కు 'హోదా' అమృతపు చుక్క..

అనంతపురం : ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కావచ్చు కానీ కరవు ప్రాంతమైన అనంతపురానికి అమృతపు చుక్క అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అనంతపురంలో నిర్వహిస్తున్న బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తున్నారు. 

ప్యాకేజీలో కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు - పవన్..

అనంతపురం : ప్రత్యేక హోదాపై మరోసారి పవన్ గళం విప్పారు. అనంతపురంలో జరుగుతున్న సభలో ఆయన మాట్లాడుతున్నారు. హోదా కాకుండా ప్యాకేజీని కేంద్రం ఇచ్చిందని, కానీ ఈ ప్యాకేజీలో కొత్తగా ఇచ్చింది ఏమీ లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

వేదికపైకి చేరుకున్న పవన్ కళ్యాణ్.

అనంతపురం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేదికపైకి చేరుకున్నారు. సీమాంధ్ర హక్కుల చైతన్య సభ పేరిట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సభ జరుగుతోంది. సభకు భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. 

ప్రపంచ మార్కెట్ లపై ట్రంప్ ప్రసంగ ప్రభావం..

ముంబై : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ విజయోత్సవ ఉపన్యాసం ప్రపంచ మార్కెట్ లపై సానుకూల ప్రభావం చూపెట్టింది. బ్యాకింగ్ రంగ షేర్లలో ఉత్సాహం కనబడింది.

 

15:55 - November 10, 2016

రాంచరణ్ తేజ తాజా చిత్రం 'ధృవ' ఆడియో పాటలు మార్కెట్ లో విడుదలయ్యాయి. అట్టహాసంగా ఆడియో కార్యక్రమం జరుగుతుందని ఆశించిన మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురయినట్లు తెలుస్తోంది. తమిళంలో ఘనవిజయం సాధించిన 'తని ఒరువన్‌' చిత్రాన్ని తెలుగులోకి 'ధృవ' పేరుతో 'రామ్‌చరణ్‌' హీరోగా రీమేక్‌ చేస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. 'రాంచరణ్‌' ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ సినిమా చేస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం 'చెర్రీ' తన బాడీ ఫిట్‌నెస్‌ దగ్గర్నుంచీ, ఆహారపు అలవాట్ల వరకూ ఎన్నో మార్పులు చేసుకున్నాడని టాక్. అయితే ఈ చిత్రం ఆడియో కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇతర మెగా హీరోలు హాజరవుతారనే ప్రచారం జరిగింది. కానీ 'ధృవ' ఆడియోను బుధవారం అర్ధరాత్రి డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేశారు. డిసెంబర్ 2న 'ధృవ' చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఏడాదిలో 4, 67,577 కోట్లు పెట్టుబడులు - చంద్రబాబు..

ఢిల్లీ : గత ఏడాది 300 ఎంవోయూల ద్వారా 4 లక్షల 67 వేల 577 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు, ఏడాది కాలంలో 93 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 1.60 లక్షల మందికి ఉపాధి లభించిందని, మరో 41 పరిశ్రమలకు భూములు కేటాయించాలని పేర్కొన్నారు. గతేడాది ఒప్పందాల్లో 41 శాతం అమలు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్ లో విశాఖ భారతదేశానికి డెస్టినేషన్ అవుతుందని పేర్కొన్నారు. 

ఏపీలో సీఐఐ సదస్సు...

ఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. 2017 జనవరి27, 28వ తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. వరుసగా రెండో ఏడాది ప్రభుత్వం నిర్వహిస్తోంది. వివిధ దేశాల నుండి ప్రభుత్వ ప్రతినిధులు హాజరు కానున్నారు. 

కాపు శంఖారావం పోస్టర్ ఆవిష్కరణ..

విజయవాడ : కాపు శంఖారావం పోస్టర్ ను మంత్రి నారాయణ విడుదల చేశారు. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కాపు కార్పొరేషన్ కృషి చేస్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. కార్పొరేషన్ ఫలాల వివరాలకు అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని, కాపులను బీసీల్లో చేర్చాలని సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. పల్స్ సర్వే త్వరలో పూర్తవుతుందని తెలిపారు. 

మిర్చిపంటలను పరిశీలించిన టి.టిడిపి నేతలు..

ఖమ్మం : కొణిజెర్ల మండలం సింగరాయపాలెంలో మిర్చి పంటను టి.టిడిపి నేతలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్ రెడ్డిలు పరిశీలించారు. 

ఎన్ కౌంటర్ పై విద్యార్థి నిజనిర్ధారణ కమిటీ పర్యటన..

విశాఖపట్టణం : ఏవోబీ ఎన్ కౌంటర్ దగ్గర పోలీసులు మాటువేసిన ప్రాంతంలో మద్యం సీసాలు, కండోములు గుర్తించినట్లు విద్యార్థి నిజనిర్ధారణ కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. నిజనిర్ధారణ కమిటీ పర్యటన, సభ్యుల వివరాలను ఏపీ, ఒడిశా డీజీపీలకు ముందే తెలపడం జరిగిందని, విశాఖ ఎస్పీ తమ పర్యటన సమాచారం లేదని శోచనీయమని పేర్కొంది. సమగ్ర పరీశీలన తరువాత హైదరాబాద్ లో పూర్తి నివేదిక వెల్లడిస్తామని వెల్లడిస్తోంది. 

మహాజన పాదయాత్ర..625 కి.మీ.

మహబూబ్ నగర్ : సీపీఎం మహాజన పాదయాత్ర జిల్లాకు చేరుకుంది. మొత్తంగా 625 కి.మీటర్లను పాదయాత్ర బృందం పూర్తి చేసింది. తెలంగాణ పారిశ్రామిక విధానం కార్పొరేట్లకు మేలు చేసేలా ఉందని, సామాన్యులకు ఎవరికీ ఉపాధి లభించదని పాదయాత్ర బృంద రథసారధి..సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్ కాదని..తెలంగాణ అంటే కమ్యూనిస్టులని, కార్పొరేట్ విద్య, ఆసుపత్రుల్లో సమూల మార్పులు రావాలని ఆకాక్షించారు. 

జీఎస్టీ నుండి ప్రాంతీయ చిత్రాలు మినహాయించాఆలి - సురేష్ బాబు..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా చలన చిత్ర రంగానికి ఒకే పన్ను విధించడం వల్ల ప్రాంతీయ సినిమా రంగాలు తీవ్రంగా నష్టపోతాయని టాలీవుడ్ నిర్మాతలు సురేష్ బాబు, సి.కళ్యాణ్ లు వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కేటీఆర్ తో పాటు సురేష్ బాబు, సి.కళ్యాణ్ లు ఉన్నారు. తెలంగాణ, ఏపీలో చిన్న సినిమాలకు ఏడు శాతం, పెద్ద సినిమాలకు 14 శాతం పన్ను అమల్లో ఉందని తెలిపారు. ప్రాంతీయ చిత్రాలకు కూడా 24 శాతం పన్ను కట్టాల్సి వస్తోందన్నారు. జీఎస్టీ నుండి ప్రాంతీయ చిత్రాలను మినహాయించాలని కోరడం జరిగిందన్నారు. 

15:06 - November 10, 2016
15:04 - November 10, 2016
15:02 - November 10, 2016
14:52 - November 10, 2016

అనంతపురం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం చేరుకున్నారు. సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో పవన్ ప్రసంగించనున్నారు. కాసేపట్లో సభ ప్రారంభం కానుంది. సభ జరిగే మైదానానికి విల్లవనేత తరిమెల నాగిరెడ్డి పేరు పెట్టారు. పవన్ సభకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సభకు మహిళలు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే కాకినాడలో ఏర్పాటు చేసిన పవన్ సభకు మహిళలు హాజరుకాలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:41 - November 10, 2016

హైదరాబాద్ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. మంత్రితోపాటు సినీ ప్రముఖులు సురేష్ బాబు, సి.కళ్యాణ్ జైట్లీని కలిశారు. ఈ సమావేశంలో జీఎస్టీ అమలుతో చలన చిత్రపరిశ్రమ ఎదుర్కోబోయే సమస్యలపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:32 - November 10, 2016
14:20 - November 10, 2016

సినిమాల్లో నటించే వారు చాలా కసరత్తులే చేస్తుంటారు. పాత్రకు న్యాయం చేయాలని కోరుకునే వారు రిస్కీ షాట్స్ కూడా చేస్తుంటారు. ఇందుకు తగిన శిక్షణ కూడా తీసుకుని ఆ పాత్రలో నటిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది నటులు అలా నటించారు కూడా. అలాంటి వారి జాబితాలో 'తాప్సీ' వచ్చి చేరింది. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా బాలీవుడ్ పై కన్నేసింది. ఆమె నటించిన 'పింక్' చిత్రం విజయం సాధించడం..విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. దీనితో కొత్త తరహా చిత్రాలపై 'తాప్సీ' ప్రాధాన్యత చూపెడుతోందంట. అందులో భాగంగా మరో చిత్రంలో నటిస్తోంది. బేబీ చిత్రానికి ప్రీకెల్వ్ గా రూపొందుతున్న 'నామ్ షబానా' సినిమాకు శివమ్ నాయర్ దర్శకత్వం వహిస్తున్నారు. మహిళా ప్రధాన ఇతివృత్తంతో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో 'తాప్సీ' నటిస్తోంది. ఇందు కోసం మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకుందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం చాలా కసరత్తులే చేసినట్లు, మంచి చిత్రమౌతుందన్న నమ్మకం ఉందని 'తాప్సీ' పేర్కొంటోంది. 

14:09 - November 10, 2016

ఢిల్లీ : రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. రాత్రికి రాత్రి రద్దు ప్రకటన చేయడంపై జనాలు మండిపడుతున్నారు. తమ వద్దనున్న పెద్దనోట్లను ఏమి చేయాలో అర్థం కాక జనాలు అవస్థలు పడ్డారు. ఈ నోట్లను మార్చుకోవచ్చని కేంద్రం పేర్కొంది. కానీ కొంతమంది నోట్ల కట్టలను కాల్చివేయడం స్వరత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలో చోటు చేసుకుంది. ఎక్కువ మొత్తంలో ఉన్న డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయని అనుకున్న వారు కొంతమంది ఇలా చేసి ఉండవచ్చునని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నోట్లను సగానికి పైగా కత్తిరించి ఇక్కడకు తీసుకొచ్చి కాల్చివేసినట్లు తెలుస్తోంది. ఈ నోట్లను ఎవరు కాల్చివేశారు ? ఈ డబ్బు ఎవరనేది తెలియడం లేదు. 

14:07 - November 10, 2016
14:06 - November 10, 2016
14:03 - November 10, 2016

మరో అంతర్జాతీయ వేడుకకు విశాఖపట్నం వేదిక కాబోతోంది. ఇంతకు ముందెన్నడూ లేని సరికొత్త వేడుక ‘బీచ్ లవ్‌ ఫెస్టివల్‌’ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు ముంబైకి చెందిన పాజిటివ్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ అండ్‌ కన్సల్టెన్సీ సంస్థ ముందుకొచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, విందువినోదాలు ఉంటాయి. ఈ నేపజథ్యంలో విశాఖ బీచ్ లవ్ ఫెస్టిఫల్ ను ప్రజాసంఘాలు..మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఈ అంశంపై మానవి ఫోకస్ మిగతా వివరాలకు వీడియో చూడండి..

జైట్లీతో కేటీఆర్..సినీ ప్రముఖుల భేటీ..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, సినీ ప్రముఖులు సురేష్ బాబు, సి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ అమలులో సినీ పరిశ్రమలో ఎదురయ్యే సమస్యలపై చర్చించారు. 

14:00 - November 10, 2016

మహబూబ్ నగర్ : సీపీఎం మహాజన పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. 600 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలోకి ప్రవేశించనుంది. ఇప్పటి వరకు 145 గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకున్నామని.. అడవుల నుంచి వేరుచేశాక చెంచుల జీవితం అధ్వాన్నంగా మారిపోయిందనీ గిరిజన సంఘం నేత రైతం రాజు విమర్శించారు. చెంచుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం నేత రైతం రాజు డిమాండ్ చేశారు.  

13:56 - November 10, 2016

కరీంనగర్‌ : జిల్లాలో కరెన్సీ కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. భగత్‌ నగర్‌లో విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు పాత నోట్లును సిబ్బంది తిరస్కరించడంతో వినియోగదారులు ఆందోళనకు దిగారు. బిల్‌ కలెక్టర్‌ను గదిలో నిర్బంధించి ఏఈతో గొడప పడ్డారు. కాగా పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటనతో దేశ ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భగత్‌ నగర్‌లో విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు పాత నోట్లును సిబ్బంది తిరస్కరించడంతో వినియోగదారులు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

విశాఖలో భాగస్వామ్య సదస్సు - నిర్మలా సీతారామన్..

ఢిల్లీ : విశాఖపట్టణంలో భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తామని కారిడార్లలో పెట్టుబడులను రాబట్టడమే తమ ధ్యేయమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాకినాడ ప్రాంతంలో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తామన్నారు. 

విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తున్నాం - బాబు..

ఢిల్లీ : విద్యారంగంలో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి మంచి స్థానం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీని అంతర్జాతీయ, విద్యా విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తున్నామని, ఉన్నత విద్యారగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వనిస్తున్నట్లు తెలిపారు. అనేక అంతర్జాతీయ విశ్వ విద్యాలయాలు ముందుకొచ్చాయని, విద్యారంగంలో ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. 2029 నాటికి ఏపీని దేశీయ విద్యా కేంద్రంగా తీరిదిద్దడమే లక్ష్యమన్నారు. 

అనంతకు చేరుకున్న పవన్ కళ్యాణ్..

అనంతపురం : జిల్లాకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం చేరుకున్నారు. సాయంత్రం జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. 

13:50 - November 10, 2016

సంగారెడ్డి : జిల్లాలోని బ్యాంకులు ఖాతాదారులతో కిటకిటలాడుతున్నాయి. నగదు మార్పిడి, డిపాజిట్‌ కోసం బ్యాంకుల దగ్గర బారులు తీరారు. వెయ్యి, 500 నోట్లను కేంద్రం రద్దుచేయడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. సంగారెడ్డి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ వద్ద ఖాతాదారులు బారుతీరి వున్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

13:26 - November 10, 2016

హైదరాబాద్ : సచివాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు డీకే అరుణ..సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని వాస్తు సరిగాలేని సచివాలయం వుండగా కేటీఆర్ ముఖ్యమంత్రి కాడని ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడని సచివాలయాన్ని కూలుస్తున్నాడనీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. గతంలో పనిచేసిన సీఎంల కుమారులెవరూ సీఎం కాలేదనీ..కొడుకు సీఎం కావాలనే పటిష్టంగా వున్న సచివాలయాన్ని కూల్చివేసేందుకు కేసీఆర్ పూనుకున్నాడని ఆరోపించారు. మరి కూల్చేసే ఉద్ధేశ్యముంటే గతంలో కోట్లు ఖర్చుపెట్టిన రిపేర్లు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రజల ధనాన్ని ఈరకంగా వృధా చేస్తుండటాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. మరో కాంగ్రెస్ నేత.. మాజీ హోం మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సచివాలయం కూల్చాల్సిన అవుసరం లేదని కాంగ్రెస్ నేత.. రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ చేయాల్సిన అవుసముందనీ..విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ చేయాలని వీటికి నిధులు విడుదల చేయకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తూ అసందర్భ పనులు చేస్తున్నారని ఆరోపించారు. కూలిపోయే భవనాలు లేనప్పుడు ఎందుకు కూల్చాల్సిన అవుసమేంటని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు.  

కాసేపట్లో పవన్ సభ..అభిమానుల సందడి..

అనంతపురం : కాసేపట్లో జనసేన మహాసభ ప్రారంభం కానుంది. ఈ సభలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. సభ జరిగే మైదానానికి విప్లవ నేత తరిమెల నాగిరెడ్డి పేరు పెట్టారు. 

12:35 - November 10, 2016

హైదరాబాద్ : నగరంలోని అబిట్స్ జన్ రల్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి ఇంకా కొత్త నగదు చేరుకోలేదు. దీంతో ఆ ప్రాంతంలో నగదు మార్పిడి కోసం వచ్చిన ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు పడుతున్నారు. ఖాతాదారులు పడిగాపులు కాస్తున్నారు. మధ్యహ్నాం 12గంటలైనా ఇంతవరకూ జీపీవోకి నగదు రాకపోవటం పట్ల ఖాతాదారులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉదయం 8గంటల నుండే అన్ని బ్యాంకులకు కొత్త నగదు రావటం..భారీగా చేరుకున్న ఖాతాదారులు పాతనోట్లను కొత్త కరెన్సీగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే. కాగా పాతనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటించిన అంశం దేశంలో తీవ్ర సంచలనం కలిగించింది. దీంతో సామాన్య ప్రజలు ఎక్కడకు వెళ్ళినా చిల్లరకోసం పాట్లు పడుతున్నారు. పలు వ్యాపారాలకు చిల్లర కొరతతో అనిశ్చితి ఏర్పడింది. ఈ అంశాన్ని దృష్టిలో వుంచుకున్న కేంద్రం కొత్త కరెన్సీని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత నగదును కొత్త నగదుగా మార్చుకునే క్రమంలో ఆలస్యం జరుగుతోంది. ఖాతాదారుల రద్దీ అవసరం మేరకు బ్యాంకులు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసిన సాధ్యమైనంత త్వరగా విధులను నిర్వర్తిస్తున్నారు. ఏది ఏమైనా పెను సంచలనాత్మక నిర్ణయంతో కొన్ని ఇబ్బందులు తప్పనిసరిగా వుంటాయి. 

12:20 - November 10, 2016

త్వరలో రీ డిజైన్ తో రూ. వేయి నోటు - శక్తికాంత్ దాస్..

ఢిల్లీ : త్వరలో రీ డిజైన్ తో రూ. వెయ్యి నోట్లు విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ వెల్లడించారు. కేంద్రం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

బందర్ లో జనచైతన్య యాత్ర..

కృష్ణా : బందర్ లో జనచైతన్య యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎంపీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. బైపాస్ రోడ్డు నుండి చిలకలపూడి వరకు లోకేష్ రోడ్డు షో నిర్వహించనున్నారు. 

కాఫీ షాపుల్లో ఉండే హుక్కా సెంటర్లపై జీహెచ్ఎంసీ కొరడా..

హైదరాబాద్ : కాఫీ షాపుల పేరిట హుక్కా సెంటర్లను నడుపుతున్న వారి లైసెన్స్ లు రద్దు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. పోలీసుల దాడితో జీహెచ్ఎంసీ పరిధిలో హుక్కా సెంటర్లు వెలుగులోకి వచ్చాయి.

 

12:13 - November 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సచివాలయాన్ని కూల్చొద్దంటూ టి.కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ ఆలీ, శ్రీశైలం గౌడ్, మల్లు రవి, విష్ణువర్దన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, వంశీచంద్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కాగా వాస్తు బాగోలేదంటూ సీఎం కేసీఆర్ సచివాలయం కూల్చివేతకు పూనుకుంది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. సచివాలయం కూల్చివేతతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. రూ.12వందల కోట్లు ప్రజాధనం వెచ్చించేందుకు సీఎం పూనుకోవటం దారుణమన్నారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుండగా పోలీసులు మాట్లాడుతుండా పోలీసులు అడ్డుకోవటంతో పోలీసులుకు నేతలకు మధ్య తీవ్రంగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది తీవ్రం కావటంతో న్యాయమైన పోరాటం చేస్తుంటే అడ్డుకుంటున్నారు కొడతారా అంటే ఎమ్మెల్యే షబ్బీర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

సచివాలయం వద్ద టి.కాంగ్రెస్ ధర్నా..ఉద్రిక్తత..

హైదరాబాద్ : వాస్తు పేరిట ప్రజాధనాన్ని వృదా చేయాలని చూస్తే ఊరుకోమని టి.కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు. సచివాలయం వద్ద టి.కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సచివాలయం తరలింపుపై నిరసన వ్యక్తం చేసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసిన పలువురు నేతలను అరెస్టు చేశారు. దీనితో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

కేంద్ర కేవియట్ పిటిషన్ తిరస్కరణ..

ఢిల్లీ : నోట్ల మార్పిడిపై సుప్రీంకోర్టులో కేంద్రం కేవియట్ దాఖలు చేసింది. వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వొద్దని పేర్కొంది. కానీ పిటిషన్ లో సమగ్రత లోపించిందని సుప్రీం తిరస్కరించింది. 

ఉత్తమ మార్గం ఎంచుకున్నాం - జైట్లీ..

ఢిల్లీ : విస్త్రత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వం క్లిష్టతరమైన నిర్ణయాలు తీసుకోవడం లేదని, వ్యాపారాలు మరింత సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని ఉత్తమ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. నోట్ల రద్దు సమయంలో జీఎస్టీని పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. 

తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సచివాలయాన్ని కూల్చొద్దంటూ టి.కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఉత్తమ్, షబ్బీర్ ఆలీ, శ్రీశైలం గౌడ్, మల్లు రవి, విష్ణువర్దన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, వంశీచంద్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. 

11:43 - November 10, 2016

ఢిల్లీ : పాతనోట్ల మార్పుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని కేంద్రమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. సామాన్యులు స్వ‌ల్ప‌కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్ప‌టికీ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కి దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాలు ఉన్నామని చెప్పారు. ప్ర‌భుత్వం క్లిష్ట‌త‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం లేదని జైట్లీ అన్నారు. దేశ భ‌విష్య‌త్తు దృష్ట్యా నిర్ణ‌యాలు తీసుకొని ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని చెప్పారు. ఆర్‌బీఐ, దేశంలోని బ్యాంకులు ప్ర‌జ‌ల‌కి ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్నాయని చెప్పారు. కొత్త నోట్ల ర‌ద్దు అంశాన్ని ప‌రిశీలించేట‌ప్పుడు జీఎస్టీ స‌వ‌ర‌ణ బిల్లును కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని నిర్ణ‌యం తీసుకున్నామని అన్నారు.

ఆదాయాన్ని వెల్ల‌డించని వారు బ్యాంకుల్లో భారీ డిపాజిట్లు చేస్తే పరిణామాలు : జైట్లీ
గ‌తంలో ఆదాయాన్ని వెల్ల‌డించని వారు ఇప్పుడు బ్యాంకుల్లో భారీ డిపాజిట్లు చేస్తే చ‌ట్ట‌ప్ర‌కారం ప‌రిణామాలు ఉంటాయన్నారు. వారాంత‌రాల్లో కూడా బ్యాంకుల సేవ‌లు ప్ర‌జ‌ల‌కి అందుతాయని అన్నారు. పెద్ద నోట్ల రద్దును తాను స‌మ‌ర్థిస్తున్న‌ట్లు చెప్పారు. అక్ర‌మంగా డ‌బ్బు సంపాదించిన వారే బ్యాంకుల్లో డిపాజిట్లు చేయ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు.వ్యాపారాలు మరింత సుల‌భ‌త‌రం చేసేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని జైట్లీ అన్నారు. విస్తృత ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని తెలిపారు. అంద‌రి నిర్ణ‌యాలు తీసుకొని ఉత్త‌మ మార్గాన్ని ఎంచుకున్నామ‌ని అన్నారు. గత ప్రభుత్వాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని వ్యాఖ్యానించారు. బ్యాంకుల్లో ప్ర‌జ‌లు ఈరోజు నుంచి నోట్ల మార్పిడి, డిపాజిట్లు చేస్తున్నారని అన్నారు.

11:22 - November 10, 2016

అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం జనసేనాని మరోసారి గర్జించనున్నారు. ఈ సారి రత్నాలసీమ రాయలసీమ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఇవాళ అనంతపురంలో నిర్వహించనున్న బహిరంగ సభకి సీమాంధ్ర హక్కుల చైత‌న్య స‌భ‌గా నామకరణం చేశారు. బెంగుళూరులో వున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే బయలుదేరారు. సాయంత్ర నాలుగు గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే తిరుపతి, కాకినాడ సభలో ఏపికి దక్కాల్సిన ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు సంధించిన విషయం తెలిసిందే. తాజాగా అనంతపురం జిల్లాలో నిర్వహించబోయే మూడో సభలో అనంతపురం స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ప్రత్యేక హోదాదాతోపాటు స్థానిక సమస్యలపై పవన్ స్పందిస్తారని అభిమానులు..జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. తమతరపున తమ కష్టాల తరపున తమ నాయకుడు పోరాడతారని అభిమానులు..పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురంలో భారీ బహిరంగసభ
ఏపీకి ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మరోసారి గళమెత్తనున్నారు. అనంత‌పురం వేదిక‌గా ఈ సారి తన వాణి వినపించనున్నారు. రేపు జరిగే బహిరంగ సభ‌ని విజ‌య‌వంతం చేసేందుకు జ‌న‌సేన కార్యకర్తలు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ స‌భ‌కి సీమాంధ్ర హక్కుల చైత‌న్య స‌భ‌గా నామకరణం చేశారు.

మహిళా రైతు ప్రాణం తీసిన పెద్ద నోట్ల రద్దు..

మహబూబాబాద్ : కరెన్సీ పరేషాన్ లో మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడింది. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు మహిళా రైతు ప్రాణం తీసింది. ఇంట్లో జమ చేసిన డబ్బులు చెల్లవనే మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

ట్విట్టర్ లో ట్రంప్ కు అభినందనల వెల్లువ..

అమెరికా : 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కు ట్విట్టర్ లో అభినందనల వెల్లువెత్తుతోంది. ట్విట్టర్ ద్వారా 7.5 కోట్ల మంది అభినందనలు తెలిపారు. 

మన్యంలో చలి తీవ్రత..

విశాఖపట్టణం : మన్యంలో చలి తీవ్రత పెరిగిపోయింది. దట్టమైన పొగమంచు ఉండడం వల్ల వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పాడేరులో 10, మినుమాలూరులలో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

విజయవాడకు చేరుకోని కొత్త నోట్లు..

విజయవాడ : బ్యాంకుల ఎదుట ప్రజలు బారులు తీరారు. పెద్ద నోట్లను మార్పిడి చేసుకోవడానికి వారు నిరీక్షిస్తున్నారు. కానీ బ్యాంకులకు కొత్త నోట్లు చేరుకోలేదు. 

11:00 - November 10, 2016

మహబూబ నగర్ : సీపీఎం పాదయాత్రకు విశేష ప్రజాధరణ లభిస్తోందని, ప్రజల సమస్యలపై పోరాడేందుకు సీపీఎం ఎప్పుడూ ముందుంటుందని పాదయాత్రలో పాల్గొన్న సీపీఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. తమ్మినేని పాదయాత్ర తెలంగాణ గడ్డపై మరో పొలికేక వంటిదని మధు అభివర్ణించారు.
ప్రజాసమస్యలు పరిష్కరించకుంటే పెద్దఎత్తున ఉద్యమం : తమ్మినేని
రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రజాసమస్యలు పరిష్కరించకపోతే.. సీపీఎం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తున్న తమ్మినేని బృందం యాత్ర 24వ రోజు 600 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రకు వివిధ పార్టీల స్థానిక నేతలు, ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి.
24వ రోజు పాదయాత్రకు 600 కిలోమీటర్లు పూర్తి
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంతో చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 24వ రోజు 600 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిదీపూర్‌, లాల్‌కోట, దేవరకద్ర, మీదుగా మన్నెంకొండ.. అక్కడి నుంచి ఒబులాయపల్లి వరకు సాగింది. నాలుగు జిల్లాల గుండా సాగిన ఈ యాత్రకు అడుగడుగునా స్థానిక నేతలు, ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. 24వ రోజు సీపీఎం ఏపీ కార్యదర్శి మధు, నారాయణపేట, కొడంగల్‌ జలసాధన సమితి కన్వీనర్‌ అనంతరెడ్డి పాదయాత్రకు మద్దతు తెలిపారు.
కేసీఆర్ కు లేఖ రాసిన తమ్మినేని
ప్రజల అపూర్వ ఆదరణ మధ్య పాదయాత్ర కొనసాగడం సంతోషంగా ఉందని, ఇదే రకమైన ఆదరణ కొనసాగించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ప్రజాసమస్యలపై, వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ను రెవిన్యూ డివిజన్‌ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ప్రజాసమస్యలు పరిష్కరించకపోతే.. సీపీఎం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని తమ్మినేని హెచ్చరించారు. ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతున్న తమ్మినేని బృందానికి.. అడుగడుగునా సమస్యల వినతులు వెల్లువెత్తుతున్నాయి.  

ట్రంప్ వ్యతిరేకుల ఆందోళన..

అమెరికా : సియాటిల్ లో ట్రంప్ వ్యతిరేకులు ఆందోళన చేపట్టారు. ట్రంప్ ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రంప్ వ్యతిరేకుల ర్యాలీలో కాల్పులు జరగడంతో పలువురికి గాయాలయ్యాయి. 

గడ్కరీతో భేటీ అయిన చంద్రబాబు..

ఢిల్లీ: హస్తిన పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సమావేశమయ్యారు. విజయవాడ బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌, బైపాస్‌ రోడ్డు, అమరావతి- రాయలసీమకు 4 లైన్ల రహదారిపై చర్చిస్తున్నట్లు తెలస్తోంది. కేంద్రమంత్రి సుజనా చౌదరి సమావేశంలో పాల్గొన్నారు.

గడ్కరితో బాబు భేటీ..

ఢిల్లీ : సీఎం చంద్రబాబు నాయుడు హస్తినకు చేరుకున్నారు. కాసేపటి క్రితం కేంద్ర మంత్రి నితీన్ గడ్కరితో బాబు సమావేశమయ్యారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణంపై చర్చించారు. 

నోట్ల మార్పిడికి బారులు తీరిన జనం..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్ల మార్పిడికి జనాలు బ్యాంకుల ఎదుట బారులు తీరారు. ఈ రోజు కేవలం రూ. 2000 వేల రూపాయలను మాత్రమే ఇస్తున్నారు. రూ. 500, రూ. 1000 పాత నోట్లను బ్యాంకులు తీసుకుంటున్నాయి. రేపటి నుండి రూ. 500 కొత్త నోట్లు అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారుల రద్దీకి అనుగుణంగా బ్యాంకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

వ్యాధి సోకిందని గర్భిణిని గెంటేసిన ఘనుడు..

జగిత్యాల : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోరుట్ల మండలం పైడిమడుగులో ఓ భర్త భార్యను నడిరోడ్డు పై వదిలేశారు. కుష్టువ్యాధి సోకిందని గర్భిణి అని కూడా చూడకుండా భర్త భార్యను బస్టాండ్ వద్ద నడిరోర్డుపై వదిలేశాడు. దీంతో దిక్కుతోచని సదరు మహిళ నడిరోడ్డుపైనే నిస్సహాయంగా పడివుంది. 

భద్రతాదళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

జమ్ము కశ్మీర్ : సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. బారాముల్లా రామాపూర్ సెక్టార్ లో మళ్ళీ కాల్పుల కలకలం రేగింది. రామాపూర్ సెక్టార్ వద్ద చొరబాటుకు ఉగ్రవాదులు యత్నించారు. దీంతో ఉగ్రవాదుల చొరబాటును భారత్ భద్రతాదళాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఉగ్రవాదిని హతమార్చారు.  

ట్రంప్ కు వ్యతిరేకంగా ర్యాలీలు..

అమెరికా : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా వందలాది మంది చేపట్టిన ర్యాలీకి సమీపంలో కాల్పులు జరిగాయి. వాషింగ్టన్‌ స్టేట్‌లోని సియాటెల్‌ నగరంలో ట్రంప్‌ తమకు అధ్యక్షుడిగా వద్దని నినాదాలు చేస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ ర్యాలీ జరగుతున్న ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిగినట్లు సియాటెల్‌ పోలీసు, అగ్నిమాపక విభాగం వెల్లడించింది. కాల్పుల్లో అయిదుగురు గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సియాటెల్‌ అగ్నిమాపక విభాగం ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

09:27 - November 10, 2016

హైదరాబాద్ : నగరంలోని రామంత్ పూర్ లో సెల్ఫీ సూసైడ్ కలకలం రేగింది. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న క్రాంతికుమార్ అనే వ్యక్తి ఉరితాడును మెడకు బిగించుకుని సెల్ఫీలో టాటా చెబుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రామంతపూర్ లో కలకలం రేపింది. నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన క్రాంతి కుమార్ బ్రతుకు తెరువుకోసం నగరానికి వలస వచ్చాడు. కొంతకాలంగా క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్యపుట్టింటికి వెళ్లింది. ఈ సమయంలో మంగళవారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రాంతి కుమార్ కనిపించకపోవటంతో స్థానికులు ఇంటికి వెళ్ళి చూడగా ఉరివేసుకుని వుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులతో నే క్రాంతి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. 

టాటా గ్రూప్‌ చైర్మన్ ఇషాత్ హుస్సేన్..

ముంబై : టాటా గ్రూప్‌ యాజమాన్యం సంస్థ.. టాటా కన్సల్టెంట్‌ సర్వీసెస్‌(టీసీఎస్‌) తాత్కాలిక ఛైర్మన్‌గా ఇషాత్‌ హుస్సేన్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు టాటా సన్స్‌ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల క్రితం సైరస్‌ మిస్త్రీని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసింది. ఆయన స్థానంలో తాత్కాలిక ఛైర్మన్‌గా రతన్‌ టాటా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ తాత్కాలిక ఛైర్మన్‌గా ఇషాత్‌ హుస్సేన్‌కు బాధ్యతలు అప్పగించారు.

09:10 - November 10, 2016

హైదరాబాద్ : నేడి నుండి కొత్త కరెన్సీ అందుబాటులోకి రానుంది. బ్యాంకుల్లో కొత్త నోట్ల మార్పిడి ప్రక్రియ గురువారం ఉదయం నుండి ప్రారంభమయ్యింది. దీంతో బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరారు. రూ.500,1000 పాత నోట్లను బ్యాంకు తీసుకుని వాటిస్థానంలో కొత్త నోట్లనుఅందించనున్నారు. కాగా ఒకో వ్యక్తికి రూ.4వేలు మాత్రమే ఇచ్చేలా నిబంధలున్న విషయం గమనించాలి. శని, ఆదివారాలు కూడా బ్యాంకు సేవలు అందుబాటులోకి వుంటాయి.. వినియోగదారుల రద్దీకి అనుగుణంగా బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. గ్రామీణ బ్యాంకుల నుండి పట్టణ బ్రాంచ్ లను సిబ్బంది అదనంగా తరలించారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ ఐసీఐసీఐ బ్యాంకుల్లో హడావిడి ప్రారంభమయ్యింది. కాగా ఈరోజు కూడా ఏటీఎం సేవలు మాత్రం ప్రజలకు అందుబాటులోకి రావటంలేదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించగలరు. నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలానాత్మక నిర్ణయంతో దేశం యావత్తు గందరగోళంలో పడిపోయింది. దీంతో రూ.500,1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటనతో దేశ వ్యాప్తంగా చిల్లర కష్టాలు ప్రారంభమయ్యాయి. దీంతోప్రజల కష్టాలను సత్వరమే తొలగించేందుకు ప్రభుత్వం కొత్తనోట్ల అందుబాటులోకి తీసుకొచ్చింది. 

నేటి నుండి బ్యాంకుల్లో నోట్ల మార్పిడి..

హైదరాబాద్ : నేడి నుండి కొత్త కరెన్సీ అందుబాటులోకి రానుంది. బ్యాంకుల్లో కొత్త నోట్ల మార్పిడి గురువారం నుండి ప్రారంభమయ్యింది. దీంతో బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరారు. రూ.500,1000 పాత నోట్లను బ్యాంకు తీసుకుని వాటిస్థానంలో కొత్త నోట్లనుఅందించనున్నారు. వీంతో బ్యాంకుల వద్ద భద్రను పెంచారు. కాగా ఒకో వ్యక్తికి రూ.4వేలు మాత్రమే ఇచ్చేలా నిబంధలున్న విషయం గమనించాలి. పెద్ద నోట్ల రద్దుతో రాత్రికి రాత్రి ప్రకటన..అమలుతో పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు ఊరట కలిగేలా కేంద్రప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవటం విశేషం.

బ్యాంకులపై ఐటీ కన్ను..

ఢిల్లీ : బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే ప్రతి రూపాయిపైనా ఆదాయపు పన్ను శాఖ కన్నేసింది. పన్ను మినహాయింపు పరిధిలో ఉన్నవారు (ఏడాదికి రూ. 2.5 లక్షలు) బ్యాంకుల్లో డిపాజిగట్లు చేస్తే భయపడాల్సిన అవసరం లేదని, పన్ను పరిధిలో ఉన్నవారు వేసే ప్రతి రూపాయినీ ఐటీ రిటర్నుల దాఖలుతో సరిపోల్చి చూస్తామని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముక్ అధియా వెల్లడించారు ఖాతాదారు ఐటీ రిటర్నుల సమయంలో వెల్లడించిన వివరాలతో తాజా డిపాజిట్లు సరిపోలకుంటే, అది పన్ను ఎగవేతనేనని, 200 శాతం పెనాల్టీ విధిస్తామని స్పష్టం చేశారు. మహిళలు రూ. 2.5 లక్షల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపారు.

ప్రధానిపై మండిపడ్డ ఎంపీ ఒవైసీ..

హైదరాబాద్ : అవినీతి నిర్మూలన కోసం పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ నిర్ణయం అనుచితమని, దినసరి కూలీలు, ప్లంబర్లు, మెకానిక్‌లు, డ్రైవర్లు వంటి వారితో ముడిపడే అంశాన్ని పట్టించుకోకుండా దారుణమైన పరిస్థితి కల్పించారంటూ విరుచుకుపడ్డారు. దేశంలో రెండు శాతం మాత్రమే క్యాష్‌లెస్ లావాదేవీలు జరుగుతున్నాయన్న ఆయన వారి కోసం మిగతా 98 శాతాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

జపాన్ కు బయలుదేరిని ప్రధాని

ఢిల్లీ : ప్రధాని మోదీ మరో విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ క్రమంలో జపాన్ పర్యటనకు ప్రధాని బయలుదేరారు. మూడు రోజుల పాటు మోదీ జపాన్ లోపర్యటించనున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో చలిపులి..

హైదరాబాద్: ఇరు తెలుగు రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలపై చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు పడిపోయాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, ఏపీలోని విశాఖ ఏజేన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైతున్నాయి. మోదకొండమ్మపాదాలు దగ్గర 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరులో 4 డిగ్రీలు, లంబసింగిలో 5 డిగ్రీలు, పాడేరులో 6 డిగ్రీలు, అరకు, చింతపల్లిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. అదేవిధంగా మెదక్‌లో 13, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

08:27 - November 10, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఓ రకంగా ప్రభుత్వానికి, బ్యాంకులకు అగ్ని పరీక్ష అని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. కేంద్రం నిర్ణయం నల్లధనం నియంత్రణ కోసమైతే తామూ మద్దతిస్తామన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి కొందరు మద్దతివ్వగా.. మరికొందరు వ్యతిరేకత వ్యక్తంచేశారు.

నోట్ల రద్దు కీలక నిర్ణయం : అరుణ్ జైట్లీ
రూ. 500, 1000 రూపాయల నోట్ల రద్దు కీలక నిర్ణయమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ నిర్ణయంతో ఆర్ధిక వ్యవస్థ దూసుకుపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల జీవన విధానంలో మార్పులు రావడంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా కీలకమార్పులోస్తాయని జైట్లీ తెలిపారు.

కేంద్ర నిర్ణయం అగ్నిపరీక్ష : మాజీ మంత్రి చిదంబరం
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓ రకంగా ప్రభుత్వానికి, బ్యాంకులకు అగ్ని పరీక్ష అని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు నష్టపోకుండా, వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 1978లో నోట్లను రద్దు చేసిన జనతా ప్రభుత్వం కూడా విఫలమైందని చిదంబరం గుర్తుచేశారు.

2 వేల నోట్ల చలామణీపై చర్చ జరగాలి : చంద్రబాబు
ఐదువందలు, వెయ్యి నోట్ల రద్దు నిర్ణయాన్ని టీడీపీ ఆహ్వానించింది.. 500, రెండు వేల రూపాయల నోట్లు కూడా అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పెద్దమొత్తంలో ట్రాన్సాక్షన్‌ చేయాలనుకుంటే బ్యాంకుల్లో చెక్కులు, డీడీలను ఉపయోగించుకోవచ్చన్నారు. 2 వేల నోట్ల చలామణీపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

పెద్దనోట్ల రద్దు వెనక పెద్ద కుట్ర : పొంగులేటి
పెద్దనోట్ల రద్దు వెనక పెద్ద కుట్ర దాగి ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబుకి నోట్ల రద్దు విషయం ముందుగానే ఎలా తెలిసిందని ప్రశ్నించారు.

నోట్ల రద్దు ఎన్నికల స్టంట్ : సీపీఎం నేత శ్రీనివాసరావు
నల్లధనంపై చర్యలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఎం తప్పుబట్టింది.. 500, 1000నోట్లు చెల్లవంటూ హఠాత్తుగా ప్రకటిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.. ఆ పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు.. ఇది ఎన్నికల్‌ స్టంట్‌ అని ఆయన విమర్శించారు.

పెద్దనోట్ల రద్దు వెనక పెద్ద కుట్ర
500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం హర్షం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ప్రధాని మోదీకి గత డిసెంబర్ లో లేఖ రాశానని తెలిపారు. రానున్న రోజుల్లో రాజకీయాల్లో మార్పులు వస్తే తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. మొత్తమ్మీద పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 

08:15 - November 10, 2016

విజయవాడ : నూజివీడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నూజివీడు మండలం తుక్కులూరు వద్ద ఆటో,లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. గురువారం తెల్లవారు ఝామున 3గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తుక్కులూరు వద్ద 30 మంది వ్యక్తులు పశ్చిమగోదావరి జిల్లాలో ఓ మొక్క తీర్చుకునేందుకు రెండు ఆటోల్లో బయలుదేరారు. మార్గమధ్యలో ఓ ఆటో చెడిపోయింది. ఆగోదిగి పరిశీలిస్తుండగా ఒక్కసారిగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఆటోను ఢీకొట్టింది. సంఘటనా స్థలంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా గాయపడ్డవారిని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతుల్లో ఓ మహిళ కూడా వుంది. మృతులు..గుర్రం శ్రీను, వీరయ్య, కిశోర్,శ్రీను, రాణి, చిన్న వెంకటేశ్వర్రావులుగా గుర్తించారు. వీరంతా నూజివీడుకు చెందిన కుటుంబానికి వారుగా సమాచారం. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో నలుగురి పరిస్థితి విషయంగా వుంది. ప్రమాదం జరిగిన అనంతరం టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. 

07:54 - November 10, 2016

దేశ వ్యాప్తంగా 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో దేశం మొత్తంగా పలు సమస్యలు తలెత్తాయి.ఇక సామ్యాన్య ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పొలానికి క్రిమిసంహారక మందు కొనేందుకు ఓ రైతు రూ.10,000 అప్పు తీసుకుని ఫెర్టిలైజర్స్ షాపుకు వెళ్ళిన రైతుకు రూ.1000 నోటు రద్దైన కారణంగా రైతు ఇచ్చిన నోట్లు చెల్లలేదు..దీంతో సదరు రైతు అప్పు ఇచ్చిన వ్యక్తి వద్దకు వెళ్ళి నగదు ఇస్తే ఆ వ్యక్తి కూడా ఆనోట్లను తీసుకోలేదు..ఒక సామాన్యరైతుకు రూ.10,000ల సమస్య చాలా పెద్దదనే చెప్పుకోవచ్చు..మరోవైపు వివాహ ముహూర్తాలు పెట్లుకున్న వారి పరిస్థితి చెప్పనే అక్కర్లేకుండా వుంది. పెట్రోల్‌ బంకుల వద్ద పాత కరెన్సీని తీసుకోవాలని కేంద్రం ఆదేశించినా.. బంకుల వద్ద చిల్లర లేక పోవడంతో వాహనదారులకు కష్టాలు తప్పలేదు. 500, 1000 నోట్లు ఇస్తే.. పూర్తి మొత్తంలో పెట్రోల్‌ పోసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు హైవేలపై టోల్‌ గేట్ల వద్ద కూడా ఇదే పరిస్థితి..చిన్న షాపులు, మార్కెట్ల వద్ద వినియోగదారులకు, బస్‌, రైల్వే ప్రయాణికులకు సైతం చిల్లర సమస్యలు సామాన్యులను వేధించింది. ఈ నేపథ్యంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నంద్యాల నర్శింహారెడ్డి (సీపీఎం నేత),శ్రీనివాస్ ( లోక్ సత్తా నేత)కుమార్ (బీజేపీ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న నేతల అభిప్రాయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి..సమగ్ర సమచారం తెలుసుకోండి..

 

07:38 - November 10, 2016

మన దేశంలో టైల్స్ పరిశ్రమ అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నప్పటికీ, ముడిపదార్ధాలు, డీజిల్, విద్యుత్, రవాణా చార్జీలు పెనుభారంగా మారుతున్నాయి. మరోవైపు దీర్ఘకాలం పాటు ఈ పరిశ్రమలో పనిచేస్తున్నవారిని శ్వాసకోశ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో టైల్స్ పరిశ్రమలో పనిచేస్తున్నవారి సంక్షేమంపై దృష్టి సారించాల్సిన అవసరం వుంది.

టైల్స్ ఉత్పత్తిలో 3వ స్థానం..10 లక్షల మందికి ఉపాధి
మన దేశంలో టైల్స్ పరిశ్రమకు వందేళ్ల చరిత్ర వుంది. టైల్స్ ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ మన దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలుస్తోంది. ఈ రంగంలో చైనా, బ్రెజిల్ తర్వాతి స్థానం మనదే. మన దేశంలో పది లక్షల మంది ప్రత్యక్షంగానో , పరోక్షంగానూ ఆధారపడి జీవనయానం సాగిస్తున్నారు. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న టైల్స్ లో సంఘటిత, అసంఘటిత రంగాలు చెరి సగం వాటా కలిగి వున్నాయి. టైల్స్ ఉత్పత్తికి గుజరాత్ కేంద్ర స్థానంగా వెలుగొందుతోంది. మొత్తం టైల్స్ ఉత్పత్తిలో 70శాతం అక్కడే ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో టైల్స్ ఉత్పత్తికి చక్కటి అవకాశాలున్నాయి. సంఘటిత రంగంలో డజనుకు పైగా ఉత్పత్తి సంస్థలుండగా, నాలుగైదు సంస్థలు మార్కెట్ లో మంచి పట్టు సాధించాయి.

ఇండియాలో 30 వేల కోట్ల రూపాయల బిజినెస్
మన దేశంలో టైల్స్ రంగంలో ఏటా దాదాపు 30 వేల కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తోంది. రాబోయే అయిదేళ్లలో 18శాతం వృద్ధి రేటు నమోదవుతుందున్న అంచనాలున్నాయి. పట్టణీకరణ, స్మార్ట్ సిటీలు, అమృతనగరాలు, స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు, హో మ్ లోన్స్ వడ్డీ రేట్లు తగ్గుతుండడం లాంటి పరిణామాలు టైల్స్ పరిశ్రమకు మరింత ఊపునిస్తాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే, విదేశీ దిగుమతులు టైల్స్ పరిశ్రమకు ఒకింత కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. 2011 వరకు దిగుమతులు ఎక్కువగా వుండేవి. ఆ తర్వాత తీసుకున్న యాంటి డంపింగ్ డ్యూటీ లాంటి చర్యలు స్వదేశీ పరిశ్రమకు ఎంతోకొంత మేలు చేశాయనే చెప్పాలి. ముడి పదార్ధాల ధరలు, విద్యుత్ చార్జీలు, డీజిల్ ధరలు రవాణా ఖర్చులు టైల్స్ పరిశ్రమకు పెను సవాలుగా మారుతున్నాయి. భారీగా పెరుగుతున్న వీటి ధరలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. మరోవైపు మారుతున్న వినియోగదారుల టేస్ట్ కు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను, డిజైన్ చాతుర్యాలను పెంచుకోవడం పెద్ద సవాలే. మరోవైపు , టైల్స్ పరిశ్రమలో పనిచేసే వర్కర్లను రకరకాల ఆరోగ్య సమస్యలూ పీడిస్తున్నాయి. వీటిలో అత్యంత బాధాకరమైనది సిలికోసిస్. ఇది టీబీ కి దారితీస్తుంది. ఊపరితిత్తులు, శ్వాస కోశ సంబంధ సమస్యలు వీరిని వెన్నాడుతున్నాయి. కాబట్టి, టైల్స్ పరిశ్రమ వృద్ధికి అవసరమైన ప్రోత్సహకాలు అందిస్తూనే, ఉద్యోగుల సంక్షేమం గురించి కూడా ప్రభుత్వాలు, యాజమాన్యాలు దృష్టి సారించాల్సిన అవసరం వుంది. 

07:34 - November 10, 2016

మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న పరిశ్రమల్లో టైల్స్ పరిశ్రమ ఒకటి. ఈ రంగంలో దాదాపు పది లక్షల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి పొందుతున్నారు. ఈ పరిశ్రమలో పనిచేసేవారిని పలురకాల సమస్యలు, ప్రమాదాలు వెన్నాడుతున్నాయి. మన దేశంలో టైల్స్ పరిశ్రమ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? టైల్స్ పరిశ్రమకు వృద్ధికి, అందులో పనిచేసే ఉద్యోగుల, కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి?వినియోగదారులు నాణ్యమైన టైల్స్‌ ను ఎంపిక చేసుకోవడం ఎలా? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు తెలంగాణ శానిటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు . నిట్కో రీజినల్ సేల్స్ మేనేజర్ జివి కిరణ్ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

07:29 - November 10, 2016

అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం జనసేనాని మరోసారి గర్జించనున్నారు. ఈ సారి రత్నాలసీమ రాయలసీమ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఇవాళ అనంతపురంలో నిర్వహించనున్న బహిరంగ సభకి సీమాంధ్ర హక్కుల చైత‌న్య స‌భ‌గా నామకరణం చేశారు.

హోదా కోసం మరోసారి గళమెత్తనున్న జనసేనాని
ఏపీకి ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మరోసారి గళమెత్తనున్నారు. అనంత‌పురం వేదిక‌గా ఈ సారి తన వాణి వినపించనున్నారు. రేపు జరిగే బహిరంగ సభ‌ని విజ‌య‌వంతం చేసేందుకు జ‌న‌సేన కార్యకర్తలు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ స‌భ‌కి సీమాంధ్ర హక్కుల చైత‌న్య స‌భ‌గా నామకరణం చేశారు.

తిరుపతిలో హోదాపై రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తానని వెల్లడి
ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తానని తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఇప్పటికే కాకినాడలో బహిరంగ సభ నిర్వహించారు. తాజాగా అనంత‌పురంలో బ‌హిరంగ స‌భ‌ నిర్వహించ‌నున్నారు. స‌భ జ‌రిగే మైదానానికి విప్లవ‌నేత‌ త‌రిమెల నాగిరెడ్డి పేరును, వేదిక‌కి స్వాత్రంత్ర స‌మ‌ర యోధుడు క‌ల్లూరు సుబ్బారావు వేదికగా ప‌వ‌న్ పేర్లు పెట్టారు.

హోదా, జిల్లా సమస్యలపై వివరించనున్న పవన్‌
అనంత‌పురం స‌భ‌ని జ‌న‌సేన సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ స‌భ ద్వారా ప్రత్యేక హోదా లాభాల‌తో పాటు, హోదా వ‌స్తే అనంత‌పురం జిల్లాలో ఉన్న క‌రువుని ఎలా నివారించవ‌చ్చో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వివ‌రించనున్నారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రంలోని ఇత‌ర ప్రజా స‌మ‌స్యల‌పైనా ప‌వ‌న్ చేస్తున్న పోరాటానికి ప్రజ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని జ‌న‌సేన నేత‌లు అభిప్రాయప‌డుతున్నారు.

అనంత‌పురం వేదిక‌పై సర్వత్రా ఆస‌క్తి
ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీలకతీతంగా ప్రజలు పవన్ కళ్యాణ్‌కి మద్దతు ఇస్తారని తాము ఆశిస్తున్నట్లు జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. హోదా విషయంలో ప‌వ‌న్ కేవ‌లం కేంద్రంపై విమ‌ర్శలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం విష‌యంలో మెత‌క వైఖ‌రి అనుస‌రిస్తున్నార‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. దీంతో అనంత‌పురం వేదిక‌గా ప‌వ‌న్ ఏమి మాట్లాడ‌బోతున్నార‌నేది ఆస‌క్తి గా మారింది.

 

07:19 - November 10, 2016

ఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం.. వాటి స్థానంలో సరికొత్త నోట్లను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ కొత్త నోట్లు ఎలా ఉండబోతున్నాయి..? వాటి విశిష్టతలేంటి..? అన్న అంశాలపై ప్రజల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. మార్కెట్‌లోకి ఇవాల్టి నుంచి రానున్న కొత్త ఐదు వందలు, రెండు వేల నోట్ల విశేషాలపై టెన్ టీవీ కథనం .

పూర్తి భిన్నంగా కొత్త రూ. 500..రూ. 2000 నోటుకు 17 ప్రధాన ఆకర్షణలు
నల్లధనం నిర్మూలనలో భాగంగా.. ఐదు వందలు.. వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా సరికొత్త రీతిలో ఐదు వందలు, రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెడుతోంది. గురువారం నుంచే ఈ కొత్త నోట్లు మార్కెట్‌లోకి రానున్నాయి. బ్యాంకులు.. ఏటీఎంలలో ఈ నోట్లను డ్రా చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఇంతకీ ఈ కొత్త నోట్ల విశేషాలేంటి..?

కొత్త నోట్లు విశిష్టమైనవంటున్న ఆర్బీఐ
కొత్తగా మార్కెట్‌లోకి రానున్న ఐదు వందలు, రెండు వేల రూపాయల నోట్లు ఎంతో విశిష్టమైనవని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లు పాత నోట్లకన్నా పూర్తి భిన్నమైనవని చెబుతోంది. ముఖ్యంగా రెండు వేల రూపాయల నోటుకు 17 ప్రధాన లక్షణాలున్నాయని ఆర్బీఐ వెల్లడించింది.

పాత నోటుకు పూర్తి భిన్నంగా కొత్త రూ.500 రూపాయల నోటు
మార్కెట్లోకి విడుదల చేయనున్న కొత్త రూ. 500 నోటు గురించి ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. మహాత్మాగాంధీ కొత్త నోట్లుగా పిలిచే వీటిపై నంబర్ ప్యానెల్స్ మధ్యలో e లెటర్ ముద్రితమైంది. కొత్త నోట్లపై 2016 సంవత్సరం ముద్రణతో పాటు.. ఆర్‌బీఐ గవర్నర్‌ డా.ఉర్జిత్‌ ఆర్‌ పటేల్‌ సంతకం, స్వచ్ఛభారత్‌ లోగోలను ముద్రించారు. నోటు వెనుక భాగంలో జాతీయ పతాకం రెపరెపలాడే చారిత్రక ఎర్రకోట ముద్రించారు. నిలువు 66మి.మి అడ్డం 150మి.మి పరిమాణంలో ఉండే ఈ నోట్లు బూడిద రంగులో ఉండనున్నాయి. కంటిచూపు లేని వారు కూడా సునాయాసంగా గుర్తుపట్టేలా ప్రత్యేక గుర్తులను పెట్టారు. గాంధీ ముఖచిత్రం, అశోక చిహ్నం, ఐదు బ్లీడ్‌ లైన్స్‌, చేతికి తగిలేలా నోటుకు కుడివైపున చిన్న సర్కిల్‌ ఉంటుంది.

మహాత్మాగాంధీ ముఖచిత్రంతో పాటు 2000 ఎలక్ట్రోటైప్‌ వాటర్‌మార్క్‌
కొత్తగా విడుదల కానున్న రెండు వేల రూపాయల నోటుపై.. కరెన్సీ విలువ మొత్తాన్ని అంకెతో పాటు.. దేవనాగరి లిపిలో ముద్రించారు. నోటుకు మధ్యలో మహాత్ముడి ముఖచిత్రం, ఎడమవైపున ఆర్‌బీఐ, చిన్న అక్షరాల్లో రెండు వేల అంకె ఉన్నాయి. నోటు మధ్యలో ఉండే ఆర్‌బీఐ థ్రెడ్‌ మార్కు రంగును.. ఆకుపచ్చ బదులుగా నీలంలోకి మార్చారు. నోటు కుడివైపున అశోక చిహ్నాన్ని ముద్రించారు. మహాత్మాగాంధీ ముఖచిత్రంతో పాటు 2000 ఎలక్ట్రోటైప్‌ వాటర్‌మార్క్‌, నోటుకు కుడి, ఎడమ వైపున ఏడు బ్లీడ్‌ లైన్స్‌ ఉంటాయి. రెండు వేల రూపాయల నోటు వెనుక భాగంలో స్వచ్ఛభారత్‌ లోగోతో పాటు.. భారత్‌ ప్రయోగించిన ప్రతిష్ఠాత్మక అంగారక ఉపగ్రహం మంగల్యాన్‌ చిహ్నం ఉండబోతున్నాయి. 

07:13 - November 10, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు... రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావమే చూపనుంది... ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోంటున్న తరుణంలో 500, 1000 రూపాయల నోట్ల రద్దు మరింత కష్టాలను తెచ్చినట్లైందంటున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు...

రియల్ రంగంపై నోట్ల రద్దు ఎఫెక్ట్
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం.. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి అశనిపాతంలా తగిలింది. రియల్ ఎస్టేట్ లావాదేవీలన్నీచాలా వరకు నగదు రూపంలోనే జరుగుతున్నాయి... పైగా నల్లడబ్బు ఎక్కువగా ఈ రంగంలోనే పేరుకుపోయింది. స్థిరాస్తి పెట్టుబడులలో వైట్ మనీ కంటే బ్లాక్ మనీ చెల్లించే వారే అధికమన్నది బహిరంగ రహస్యం. ఈ తరుణంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం.. రియల్‌ ఎస్టేట్‌ రంగంపై భారీగానే ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇది 6నెలల పాటు స్పష్టంగా కనిపిస్తోందని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అంటున్నారు. కేంద్ర నిర్ణయంతో భూమి క్రయవిక్రయాల్లో నల్లధనాన్ని పెట్టుబడిగా పెట్టే వారికి చెక్ పెట్టినట్లేనని అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ కు అనిశ్చితి
పెద్ద నోట్ల రద్దుపై మోదీ ప్రకటన తరువాత తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనిశ్చితి ఏర్పడిందని, దీనికి చిన్న పెద్ద కంపెనీలు అని తేడా లేకుండా అన్ని కంపెనీలు తీవ్రంగానే నష్టపోతాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటుటున్నారు. మధ్యతరగతి ప్రజలు ఇంతకు ముందు లానే కొనుగోలు చేస్తారని... పెద్ద స్థాయిలో నల్లధనాన్ని ఇన్వెస్ట్ మెంట్ చేసేవారు మాత్రం ఇక కొనుగోలు చేసే అవకాశం ఉండదంటున్నారు....స్థలాల కొనుగోలు తగ్గే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం
పెద్ద నోట్ల రద్దు ఇతర రంగాలపై ప్రభావం చూపినా చూపకపోయినా ... రియల్ ఎస్టేట్ రంగంపై మాత్రం తీవ్ర ప్రభావాన్నే చూపిస్తుందన్నది కాదనలేని సత్యం... ఈ ఒడిదుడుకులు కొంత కాలం మాత్రమే అన్న వాదన కూడా వినిపిస్తోంది. 

07:08 - November 10, 2016

హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో... బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. మరోవైపు నోట్ల రద్దు ఎఫెక్ట్ తమ వ్యాపారంపై పడుతోందని బంగారం వ్యాపారులు వాపోతున్నారు.

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ప్రధాని నిర్ణయం
నల్లధనం నియంత్రణకు ప్రధాని తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడంతో ఆ ఎఫెక్ట్ పసిడి బిజినెస్‌పై పడింది.

నోట్ల రద్దు నిర్ణయం తమ బిజినెస్‌కి దెబ్బేనంటున్న గోల్డ్ వ్యాపారులు
చాలా మంది... పెద్ద నోట్లను బంగారు ఆభరణాలు, గోల్డ్‌ బిస్కెట్లు కొనేందుకు వినియోగిస్తుండడంతో పసిడి మార్కెట్‌ ఊపందుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు కూడా చాలా చోట్ల పెద్దపెద్ద స్వర్ణాభరణాల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. దీంతో వ్యాపారులు బంగారు ధరలను అమాంతంగా పెంచేశారు. అయినా ప్రజలు బంగారు కొనేందుకే ఉత్సాహం చూపారు.

ఢిల్లీలో రూ.900 పెరిగి రూ.31,750కి చేరిన 10గ్రా.బంగారం ధర
పెద్దనోట్లను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల.. దేశవ్యాప్తంగా బంగారు వ్యాపారం బాగా పుంజుకుంది. దేశరాజధానిలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.900 పెరిగి రూ.31,750కి చేరింది. వెండి ధర కూడా భారీగా పెరిగి రూ.45వేల మార్కును తాకింది. కేజీ వెండి రూ.1,150 పెరిగి రూ.45వేలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4.8శాతం పెరిగి 1,337.38 డాలర్లకు చేరింది.

బంగారు వ్యాపారానికి ఇబ్బందేనంటున్న వ్యాపారులు
ప్రస్తుతం.. తమ వ్యాపారం పుంజుకున్నట్లు కనిపిస్తున్నా.... ఇది తమ బిజినెస్‌కి పెద్ద దెబ్బేనని అంటున్నారు గోల్డ్ షాప్ యజమానులు. కొన్ని నెలలుగా పసిడి వ్యాపారం స్తబ్దుగా ఉందని, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఇప్పుడిప్పుడే బంగారం కొనుగోళ్లు పుంజుకుంటున్నాయని, మధ్యతరగతి ప్రజలు తమ వద్ద కూడబెట్టుకున్న మొత్తంతో బంగారు కొనేందుకు వస్తుంటారని, అయితే ప్రధాని నిర్ణయం వల్ల.. వారివద్దనున్న నగదు చెల్లుబాటు కాని పరిస్థితి ఏర్పడిందని స్వర్ణవ్యాపారులు చెబుతున్నారు. ఇది తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం కూడా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా పరిణామాలతో పసిడి ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. 

07:02 - November 10, 2016

ఢిల్లీ : రూ. 500, 1000 రూపాయల నోట్ల రద్దు కీలక నిర్ణయమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ నిర్ణయంతో ఆర్ధిక వ్యవస్థ దూసుకుపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల జీవన విధానంలో మార్పులు రావడంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా కీలకమార్పులోస్తాయని అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రజలకు కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ రెండు రోజులు తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన ప్రకటించారు. 

06:54 - November 10, 2016

ఢిల్లీ : నోటు పాట్లకు కేంద్రం కొంచెం ఊరట నిచ్చింది. పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు శని, ఆది వారాలు సైతం బ్యాంకులు పనిచేసేలా ఆర్బీఐ ఆదేశించింది. అలాగే హైవేలల్లో ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా రేపు అర్థరాత్రి వరకు టోల్‌టాక్స్‌ వసూలు చేయవద్దని కేంద్రం తేల్చి చెప్పింది.

పెట్రోల్‌ బంకుల వద్ద నోట్ల ఇబ్బందులు.
500, 1000 రూపాయల నోట్ల రద్దుతో సామ్యాన్య ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పెట్రోల్‌ బంకుల వద్ద పాత కరెన్సీని తీసుకోవాలని కేంద్రం ఆదేశించినా.. బంకుల వద్ద చిల్లర లేక పోవడంతో వాహనదారులకు కష్టాలు తప్పలేదు. 500, 1000 నోట్లు ఇస్తే.. పూర్తి మొత్తంలో పెట్రోల్‌ పోసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

పలు టోల్‌గేట్ల వద్ద చిల్లర సమస్య
మరోవైపు హైవేలపై టోల్‌ గేట్ల వద్ద కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. పలు టోల్‌గేట్ల వద్ద చిల్లర సమస్యతో వాహనాల రద్దీ నెలకొంది. ఇక చిన్న షాపులు, మార్కెట్ల వద్ద వినియోగదారులకు, బస్‌, రైల్వే ప్రయాణికులకు సైతం చిల్లర సమస్య వేధించింది.

దేశవ్యాప్తంగా టోల్‌టాక్స్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ
ప్రజల సమస్యలపై స్పందించిన ఆర్బీఐ.. శని, ఆదివారాలు అన్ని బ్యాంకులు పని చేస్తాయని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 500, 1000 రూపాయల నోట్ల మార్పిడికి కాస్త వెసులుబాటు కల్పించారు. అటు హైవేలలో ట్రాఫిక్‌ జామ్‌లను దృష్టిలో ఉంచుకున్న కేంద్రం.. శుక్రవారం వరకు దేశవ్యాప్తంగా టోల్‌టాక్స్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది

ఆటో..లారీ ఢీ..6గురు మృతి..

విజయవాడ : నూజివీడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నూజివీడు మండలం తుక్కులూరు వద్ద ఆటో,లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. 

Don't Miss