Activities calendar

11 November 2016

21:32 - November 11, 2016

రాజ్ కోట్ టెస్టులో బౌలింగ్‌లో చతికిల పడ్డ భారత్.. బ్యాటింగ్‌లో మాత్రం దూసుకెళ్తోంది. మూడో రోజు ఆట ముగిసే నాటికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లు పుజారా, మురళీ విజయ్‌ శతకాలతో రాణించారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 209 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. విజయ్ 126 పరుగులు, పుజారా 124 పరుగులతో భారత్‌ స్కోర్‌ బోర్డును పెంచారు. ఓపెనర్ గంభీర్ తనకొచ్చిన అవకాశాన్ని మరోసారి చేజార్చుకున్నాడు. 29 పరుగులకే ఔటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, స్టోక్స్, అన్సారీ, రషీద్‌కి తలో వికెట్ దక్కింది. ఇంగ్లండ్ తొలి ఇన్సింగ్స్‌కు... భారత్ ఇంకా 219 పరుగుల వెనకంజలో ఉంది. 

21:31 - November 11, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై బిజెపి-విపక్షాల మధ్య వార్‌ కొనసాగుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం పేదలకు వ్యతిరేకంగా ఉందని కొన్ని పార్టీలు ధ్వజమెత్తాయి. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సంపన్నులు సంతోషంగానే ఉన్నారని పేర్కొన్నాయి. రెండు వేల నోటు తేవడం వల్ల నల్లధనం, అవినీతిని ప్రభుత్వం ఎలా నిర్మూలిస్తుందని ప్రశ్నించాయి. ప్రతిపక్షాల ఆరోపణలను అధికార బిజెపి తిప్పికొట్టింది.  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో హల్‌ చల్ చేశారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు ఆయన స్వయంగా బ్యాంకుకు వెళ్లారు. 4వేల పాత నోట్లు మార్చుకునేందుకు ఆయన పార్లమెంట్ స్ట్రీట్‌లో బ్యాంక్ వద్ద క్యూలైన్లో నిల్చున్నారు. సామాన్య ప్రజల కష్టాలు మోదీ ప్రభుత్వానికి తెలియడం లేదన్నారు.

కేజ్రీవాల్ ప్రశ్న..
వెయ్యి రూపాయల నోటు రద్దు చేసి రెండు వేల నోటు తేవడం వల్ల నల్లధనాన్ని, అవినీతిని ఎలా రూపుమాప గలుగుతారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. రెండు వేల నోటు రావడం వల్ల నల్ల కుబేరులకు అవినీతిపరులకు మరింత వెసలుబాటు కలుగుతుందన్నారు. ఫేస్‌బుక్‌లో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన కేజ్రీవాల్‌-మోది ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కార్పోరేట్లకు, కొందరు స్నేహితులకు మోది నిర్ణయం ముందే తెలుసని, వారంతా భూములు, బంగారం కొంటున్నారని, 20 శాతం కమిషన్‌పై నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. నల్లధనాన్ని నిర్మూలించాలన్న చిత్తశుద్ధి మోదికి ఉంటే... 2011లో స్విస్‌ బ్యాంకుల్లో దాచుకున్న 600 మంది నల్లకుబేరుల లిస్టుపై ఎందుకు చర్యలు చేపట్టలేదని కేజ్రీవాల్‌ నిలదీశారు.

మాయావతి..ములాయం విమర్శలు..
కార్పోరేట్లకు లాభం చేకూర్చేందుకే మోది ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని బిఎస్‌పి చీఫ్‌ మాయావతి విమర్శించారు. ఇది అప్రకటిత ఆర్థిక ఎమర్జెన్సీగా వర్ణించారు. కేవలం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారని ఎస్పీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ మండిపడ్డారు. నల్లధనం అభివృద్ధి నిరోధకంగా ఉందని, తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో నల్లధనంపై మోది ఇచ్చిన హామీతో ఒత్తిడి కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, ఇది అరాచకానికి దారి తీసిందని ములాయం ఆరోపించారు.

మెచ్చుకున్న అమిత్ షా..
నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలించేందుకే మోది సర్కార్‌ 5 వందలు, వెయ్యి నోట్లను రద్దు చేసిందని బిజెపి చీఫ్‌ అమిత్‌ షా అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అందరూ స్వాగతిస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం శోచనీయమన్నారు. నల్లధనంపై నిన్నటి వరకు ప్రశ్నించిన విపక్షాలకు మోది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మింగుడు పడడం లేదని అమిత్‌ షా అన్నారు. కేంద్రం నిర్ణయం వల్ల ఎన్నికల్లో నల్లడబ్బు ప్రవాహం అరికట్టవచ్చని, స్వచ్ఛమైన రాజకీయాలకు ఆస్కారం ఉందని చెప్పారు. అవినీతి, ఉగ్రవాదం, నల్లధనం నిర్మూలనకు మీరు అనుకూలమా...వ్యతిరేకమా...అన్న విషయాన్ని తేల్చాలని...కాంగ్రెస్‌, ఎస్పీ, బిఎస్పీ, ఆప్‌ పార్టీలను అమిత్‌షా ప్రశ్నించారు. మోది ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఫలితాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాలి.

21:23 - November 11, 2016

హైదరాబాద్ : టాలీవుడ్‌కు ఐటీ అధికారులు షాక్‌ ఇచ్చారు. బాహుబలి సినిమా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.. దాదాపు 3గంటలకుపైగా సోదాలు కొనసాగించారు.. వారి దగ్గరనుంచి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం.. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిన మూడు రోజులకే ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. టాలీవుడ్‌కు పెద్ద షాక్‌నిచ్చారు. తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోన్న బాహుబలి సినీ నిర్మాతల ఇళ్లు.. కార్యాలయాలపై దాడులు చేశారు. ప్రభుత్వం రద్దు చేసిన నోట్లను భారీ మొత్తంలో కార్టన్లలో తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. సినిమా నిర్మాతలు యార్లగడ్డ శోభు, ప్రసాద్‌ దేవినేని ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు.

పత్రాల స్వాధీనం ? 
యార్లగడ్డ శోభు, ప్రసాద్‌ దేవినేని ఇళ్లు, కార్యాలయాలపై సోదాల సందర్భంగా.. పలు విలువైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.. మొత్తం పాతిక మంది అధికారులు బృందాలుగా ఈ సోదాల్లో పాల్గొన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి తొలి భాగం.. బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టి భారీ కలెక్షన్లను రాబట్టింది. పెట్టుబడికి మూడింతలుగా అంటే సుమారు ఆరు వందల కోట్లకు పైబడి ఆదాయం రావడంతో.. రెండో భాగాన్ని మరింత ఖర్చుతో నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యం కూడా ఐటీ సోదాలకు కారణమని భావిస్తున్నారు. బాహుబలి సినిమా నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు.. టాలీవుడ్‌ను ఉలికిపడేలా చేసింది. సినీ పరిశ్రమలోని మరింత మంది ప్రముఖులపై త్వరలోనే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. 

21:22 - November 11, 2016

హైదరాబాద్ : పన్ను చెల్లింపుకు జీహెచ్ఎంసీ గడువు పెంచింది.. శని, ఆది, సోమవారాల్లోకూడా ప్రజలు పన్ను చెల్లించొచ్చని ప్రకటించింది.. మరోవైపు బల్దియా బంపర్‌ ఆఫర్‌కు భారీ స్పందన వచ్చింది.. పాతనోట్లతో ఒకేరోజు గ్రేటర్‌వాసులు దాదాపు 50కోట్లవరకూ పన్ను చెల్లించారు.. ఇలా ఒక్కరోజే రికార్డు స్థాయిలో పన్ను వసూలు కావడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి బంపర్‌ ఆఫర్‌కు భారీ స్పందన వచ్చింది.. శుక్రవారం అర్ధరాత్రివరకే పాతనోట్లతో పన్ను చెల్లించే అవకాశం ఉండటంతో ప్రజలు జీహెచ్‌ఎంసీ ఆఫీసుముందు క్యూకట్టారు.. ఉదయం 7గంటలనుంచి పన్ను చెల్లించేందుకు ఆఫీసుముందుకు చేరారు. రాత్రి 9గంటలవరకూ దాదాపు 50కోట్లరూపాయలు వసూలైనట్లు అధికారులు అంచనావేస్తున్నారు.

జలమండలి..
హైదరాబాద్‌లో జలమండలి కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది.. పాతనోట్లతో పన్నులు చెల్లించేందుకు ఒకే చెప్పడంతో... ఉదయం నుంచే నగరవాసులు కార్యాలయంముందు క్యూకట్టారు.. రాత్రి 9గంటలవరకూ దాదాపు 15కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు అంచనావేస్తున్నారు. సాధారణంగా పన్ను చెల్లింపుకు మార్చి 31ని చివరి తేదీగా ప్రకటిస్తారు.. అప్పటివరకూ జీహెచ్‌ఎంసీకి వందకోట్లు వసూలవుతాయి.. ఈసారి మాత్రం ఒకేరోజు ఉహించనివిధంగా పన్నులు వసూలయ్యాయి.. వాటర్‌బోర్డు, హెచ్‌ఎండీలోకూడా పన్నువసూళ్లు ఇలాగే ఉన్నాయి. పెద్దనోట్లను ఒకేసారి రద్దు చేయడం, బ్యాంకుల్లో భారీ క్యూలతో నగరవాసులు పన్ను చెల్లింపువైపు మొగ్గుచూపారు.. పన్ను ఎప్పటికైనా కట్టాల్సిందే.. బ్యాంకుల్లో క్యూకట్టి డబ్బు మార్చుకోవడంకంటే పన్ను చెల్లించడమే బెటరని ఫిక్స్ అయ్యారని ఈ వసూళ్లద్వారా తెలుస్తోంది.. మరోవైపు అరకొర నిధులతో అల్లాడుతున్న జీహెచ్‌ఎంసీకి ఈ ఆదాయంతో భారీగా లబ్ది చేకూరనుంది. పెండింగ్‌లోఉన్న ప్రాజెక్టులను ఈ డబ్బుతో పూర్తిచేసే ఛాన్స్‌ ఉంది.. మొత్తానికి ఏళ్లకుఏళ్లుగా వసూలుకాని మొండి బకాయిలు కూడా వసూలుకావడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

21:20 - November 11, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కడ చూసినా.... జనం భారీగా క్యూ కడుతున్నారు. నిత్యవసరాలన్నీ నగదుతో ముడిపడి ఉండటంతో కొత్త నోట్ల కోసం.. నానా తంటాలు పడాల్సి వస్తోంది. అటు దుకాణాల్లో పాత నోట్లు నిరాకరిస్తుండటం.. ఇటు కొత్త నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఏటీఎంలు తెరచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఏటీఎంలు పనిచేస్తాయని ప్రభుత్వం చెప్పినా చాలా ప్రాంతాల్లో ఆ పరిస్థితి కనిపించడంలేదు.. కొత్త నోట్లు ఇంకా బ్యాంకులకు చేరక ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.

నానా ఇబ్బందులు..
పాత 500, 1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు అధికారుల తీరుతో ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. వరంగల్ జిల్లాలో ఇప్పటికే 200 కోట్ల రూపాయల మేర డబ్బులు బ్యాంకుల్లో జమ అయ్యాయి. ఇంకా యాభై, వంద రూపాయల నోట్ల కోసం ప్రజలు బ్యాంకుల్లో పడిగాపులు కాస్తూనే ఉన్నారు. పాలమూరు జిల్లాలో ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల వద్ద వినియోగదారులు బారులు తీరారు. బ్యాంకుల్లో 500, వేయి రూపాయల నోట్ల మార్పిడి కోసం జనం క్యూ కట్టారు. ఏటీఎంల్లో డబ్బుల డ్రా చేసుకునేందుకు ప్రజలు గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు మాత్రమే డ్రా చేసుకునే వీలుండటంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్‌ జిల్లాలో పాత నోట్ల రద్దు ప్రభావం స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై తీవ్రంగా చూపుతోంది. జనం లేక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. గతంలో రోజుకు 150 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు.. ఇప్పుడు రెండు, మూడుకు మించడం లేదంటే పరిస్థితి తీవ్రత ఏంటో తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రిజిస్ట్రేషన్లు పూర్తిగా పడిపోయాయని ఉప్పల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ తెలిపారు.

వినూత్న నిరసనలు..
హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలో పోలీసులు తమ ఉదారత చాటుకున్నారు. పెద్ద నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద క్యూ కట్టిన జనాలకు పోలీసులు దగ్గరుండి మరీ వాటర్ పాకెట్లు సరఫరా చేశారు. రెండు రోజుల తర్వాత ఏటీఎంలు తెరుచుకోవడంతో జనాలు బారులు తీరారు. నగదును బ్యాంకులలో డిపాజిట్‌ చేసేందుకు ఖాతాదారులు భారీగా తరలివచ్చారు. రాంనగర్‌లో బ్యాంకుకు వచ్చిన ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. అలాగే ఇంకా చాలా చోట్ల ఏటీఎంలు తెరుచుకోలేదు. తెరుచుకున్న ఏటీఎంలలో క్యాష్‌ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాత నోట్ల రద్దుపై తిరుపతిలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. వెయ్యి నోట్లను ఒంటిపై పరచుకుని రోడ్డుపై అడ్డంగా పడుకున్నాడు. రెండు రోజుల్లో తన కుమార్తె పెళ్లి ఉండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇలా చేశానని సుబ్రహ్మణ్యం అంటున్నాడు. సుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరులో..
గుంటూరులో రెండో రోజు బ్యాంకుల వద్ద ఖాతాదారుల రద్దీ కొనసాగింది. శుక్రవారం కూడా ఏటీఎంలు మూతపడి ఉండటంతో.. జనం బ్యాంకులకు క్యూ కడుతున్నారు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల దగ్గర పడిగాపులు కాశారు. కేంద్రం రద్దు చేసిన 500, వెయ్యినోట్లతో వెలగపూడి సచివాలయంలోని ఉద్యోగులకు రెండో రోజు కూడా తిప్పలు తప్పలేదు. మొదటి రోజు ఎలాగోలా సర్దుకున్న ఉద్యోగులు,..రెండో రోజు బ్యాంకుల్లో డబ్బును పొందవచ్చని భావించారు. కానీ సచివాలయంలోని ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ లకు కొత్తనోట్లు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

తూర్పు మన్యంలో..
పెద్ద నోట్ల రద్దుతో తూర్పు మన్యంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చిల్లర సమస్యతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మన్యం వాసులు డివిజన్‌ కేంద్రంలోని బ్యాంకులకు క్యూ కడుతున్నారు. నిత్యవసరాలకు డబ్బులు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని మన్యం వాసులు వాపోతున్నారు. పలుచోట్ల బ్యాంకుల్లో సిబ్బంది తక్కువగా ఉండటంతో వినియోగదారులకు నగదు చెల్లింపులు ఆలస్యం అవుతోంది. దీంతో ఖాతాదారులు నగదు సంబంధిత వ్యవహారాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఎక్కడ చూసినా జనం నోట నోట్ల మాటే వినిపిస్తోంది. అటు.. దుకాణాల్లో పాత నోట్లు తీసుకోక.. ఇటు కొత్త నోట్లు దొరక్క జనం అల్లాడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయం చూపాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.  

జీహెచ్ఎంసీకి రూ. 40.5 కోట్లు..

హైదరాబాద్ : మరో మూడు రోజుల పాటు పాత నోట్లతో బిల్లులు చెల్లించే అవకాశం ఉందని మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. పన్ను చెల్లింపు కేంద్రాలు శని, ఆదివారాల్లోనూ పనిచేస్తాయన్నారు.ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి రూ. 40.5 కోట్ల ఆదాయం సమకూరింది. జలమండలికి రూ. 14.43 కోట్ల ఆదాయం, హెచ్ఎండీఏకు రూ. 4.10 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఇతర పట్టణాలు..నగరాల్లో రూ. 11 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ప్రజలు ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని సూచించారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం సృష్టించింది. ప్రయాణీకుడు నాగ మురళీకృష్ణ వద్దనుండి బుల్లెట్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన...విచారణ చేపడుతామన్న టీఎస్పీఎస్సీ..

వరంగల్ : ప్లాటినమ్ స్కూల్ సెంటర్ లో మూడు గంటలకు పైగా హైడ్రామా కొనసాగింది. గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ లోనూ ఆందోళనలు కొనసాగాయి. టీఎస్ పీఎస్పీ తో ఏసీపీ సురేంద్ర నాథ్ సంప్రదింపులు జరిపారు. 13న విచారణ జరిపి న్యాయం చేస్తామని టీఎస్పీఎస్సీ హామీనిచ్చింది. పరీక్షా సెంటర్ కు ఫ్యాక్స్ మేసేజ్ పంపింది. ఒక కోడ్ పేపర్ కు బదులు మరో కోడ్ పేపర్ ఇచ్చారని నిరసన వ్యక్తం చేశారు. 

20:17 - November 11, 2016

ఏంత పైకముంటేమున్నది..? జేవులళ్ల.. బిచ్చగాని బొచ్చెలున్న చిల్లకున్న ఇల్వలేదాయే..ఇగో తీస్కోండ్రి.. అని నోట్ల కట్టలు జనం చేతుల వెట్టిండనుకో..? ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు ఈ రెండు పిట్టెలు రాలినట్టే గొడ్తున్నయ్ మోడీ గాల్చిన పెద్దనోట్ల రద్దుతుపాకికి..తెలంగాణ సర్కారు పెద్దలు మాత్రం ముద్దుగ నేర్సుకున్నరువా ఒక ముచ్చట..పాపం కారెం శివాజి సారును జూస్తుంటే కండ్లళ్ల కెళ్లి నీళ్లొస్తున్నయమ్మా..? సోమారం నాడు అంటే నవంబర్ పద్నాల్గు తారీఖు నాడు చందమామను పిల్వుండ్రి కచ్చితంగొస్తడు..? నాను పచ్చరంగులుండే.. నాగులవాసం పామును జూస్తెనే భయమైతది..పక్కా మంచు లచ్చుమవ్వనే మాట్లాడుతున్నదేమో అనుకోవాలె మనం.. గిసొంటి ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:14 - November 11, 2016

తెలంగాణ సర్కారు పెద్దలు మాత్రం ముద్దుగ నేర్సుకున్నరువా ఒక ముచ్చట.. ఏదన్న మంచి పనైందన్కో రాష్ట్రంల.. అది మా ఘనతనే.. మా కీర్తే.. మా శెమ్టనే అంటరు.. అదే ఏదన్న చెడుపైందనుకో.. ఏయ్ ఇది గత పాలకుల పని.. వాళ్ల పనితానానికి నిదర్శనం అని ఉల్టా ముచ్చట్లు జెప్పుకొస్తున్నరట.. గసొంటి ముచ్చటనే నిన్న మెదక్ జడ్పీ సమావేశంల అయ్యిందట సూడుండ్రి..ఏమి అయ్యిందో చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:59 - November 11, 2016

పెద్ద నోట్లతో తెలుగు రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అటు పాత నోట్ల నిరాకరణ..కొత్త నోట్లు రాక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. బ్యాంకుల ఎదుట గంటల తరబడి ప్రజలు నిలుచోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో క్యూలో ఉన్న వారు సృహ తప్పిపడిపోతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఎదురవుతున్న సమస్యలు..నివారించేందుకు ఎలాంటి మార్గాలున్నాయనే దానిపై శశికుమార్ (ఎకనామిస్ట్), సి.టి.చౌదరి (చార్టర్ అకౌంట్), శేషాద్రి (చార్టర్ అకౌంట్) మాట్లాడారు. వివిధ సమస్యలపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు వివిధ రంగాల నిపుణులు సమాధానాలు చెప్పారు. మరి ప్రజలు ఎలాంటి సమస్యలు అడిగారు ? నిపుణులు ఎలాంటి సమాధానాలు చెప్పారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

పన్ను చెల్లింపు కేంద్రాన్ని సందర్శించిన మేయర్..

హైదరాబాద్ : పన్ను చెల్లింపు కేంద్రాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ సందర్శించారు. పన్నుల ద్వారా ఇప్పటి వరకు రూ. 40 కోట్ల ఆదాయం వచ్చిందని, పన్ను చెల్లింపునకు రాత్రి 12గంటల వరకు అవకాశం ఉందన్నారు. ఎక్కువ మొత్తం పెండింగ్ లో ఉన్నవాళ్లూ ఆస్తి పన్ను కట్టొచ్చన్నారు. 

జీహెచ్ఎంసీకి రూ. 40.3 కోట్ల ఆదాయం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీకి గణనీయంగా ఆదాయం పెరిగింది. పాత నోట్లతో ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు. దీనికారణంగా ఇప్పటి వరకు రూ. 40.3 కోట్ల ఆదాయం లభించింది. 

మూడు రోజుల పాటు పాతనోట్లు చెల్లుబాటు..

ఢిల్లీ : ఆసుపత్రులు, పెట్రోల్ బంక్ లు, రైల్వే, బస్సు టికెట్లకు విమాన టికెట్లకు మరో మూడు రోజుల పాటు పాత. రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లుబాటు అవుతాయని కేంద్రం పేర్కొంది. 

వరంగల్ లో గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన..

వరంగల్ అర్బన్ : ప్లాటినమ్ జూబ్లీ హై స్కూల్ లో గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పరీక్ష హాల్ లో ఆన్సర్ షీట్లతో అభ్యర్థులు బైఠాయించారు. ఒక కోడ్ పేపర్ కు బదులు మరో కోడ్ పేపర్ ఇచ్చారని నిరసన వ్యక్తం చేశారు. పరీక్షా కేంద్రానికి ఏసీపీ సురేంద్ర నాథ్ చేరుకున్నారు. 

18:40 - November 11, 2016

'ప్రేమమ్' తో బ్లాక్ బస్టర్ హిట్టు ఖాతాలో వేసుకున్న 'అక్కినేని నాగచైతన్య' లేటెస్ట్ గా మూవీ 'సాహసం శ్వాసగా సాగిపో'తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా శుక్రవారం నుంచి థియేటర్స్ లో సందడిచేస్తోంది. 'ఏ మాయ చేశావె' లాంటి క్యూట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్, నాగచైతన్యతో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నాడు. 'ప్రేమమ్' విజయం తర్వాత 'నాగచైతన్య' నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకుల అభిప్రాయాలు..సినిమా రివ్యూ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

రిటైర్డ్ జస్టిస్ కట్జూపై సుప్రీం తీవ్ర ఆగ్రహం..

ఢిల్లీ : రిటైర్డ్ జస్టిస్ కట్జూపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ కట్జూకు కోర్టు ధిక్కార నోటీసులు ఇచ్చింది. అత్యాచారం, హత్య కేసులో న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుపై తన బ్లాగులో జస్టిస్ కట్జూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

18:28 - November 11, 2016

విజయవాడ : ఆవుల కోసం హాస్టళ్లు ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో శుక్రవారం ఆవుల వృద్ధికి ప్రయోగాత్మక పద్ధతిలో ఐవీఎఫ్ టెక్నాలజిని ఆయన ప్రారంభించారు. పశుసంవర్థక శాఖ, జేకే ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఐవీఎఫ్ టెక్నాలజీని వాడుతున్న రాష్ట్రాల్లోల ఏపీది మొదటిస్థానంలో ఉందని, వ్యవసాయ ఆదాయంతో పోటీగా పశుపోషణలో కూడా ఆదాయం వస్తుందన్నారు. త్వరలో అమెరికాలో వలే ఆడ ఆవులు, గేదెలను పుట్టించే టెక్నాలజీని అమలు చేస్తామన్నారు. గుంటూరు లాంలో త్వరలో డా.ఎన్టీఆర్ సెంటర్ ఫర్ ఎక్సిలెన్స్ పేరిట ఐవీఎఫ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. పాడి పరిశ్రమ అభివృద్దికి ముందుకు వచ్చే వారిని పోత్సాహిస్తామని చెప్పారు. 

18:15 - November 11, 2016
17:59 - November 11, 2016

మహబూబ్ నగర్ : ప్రజలకు మౌలిక సదుపాయాలు అందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. జిల్లాల విభజన వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. మహాజన పాదయాత్ర 26వ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రకు స్థానికుల నుండి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. పరిగిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కేసీఆర్ కు తమ్మినేని మరో లేఖ..

మహబూబ్ నగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరో లేఖ రాశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 26వ రోజు మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆయన 19 లేఖలు రాసిన సంగతి తెలిసిందే. చేనేతలు చాలా కష్టాల్లో ఉన్నారని, అమరచింతలో 120 మగ్గాలు మూతపడ్డాయని 20వ లేఖలో పేర్కొన్నారు. బడ్జెట్ లో చేనేతకు ఒక్క పైసా కేటాయించలేదని, చేనేత సమస్యలపై కార్యచరణ రూపొందిస్తామని ప్రకటించారని కానీ ఇప్పటి వరకు పురోగతి లేదన్నారు. వెంటనే చేనేత పాలసీని రూపొందించాలని, ఉపాధి భద్రతపై చేనేత ప్రతినిధులతో భేటీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. చేనేతలకు కనీసం రూ.

17:50 - November 11, 2016
17:21 - November 11, 2016
17:20 - November 11, 2016
17:17 - November 11, 2016

హైదరాబాద్ : రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రజలకు కష్టాలు గురి చేస్తుంటే జీహెచ్ఎంసీకి మాత్రం సంతోషం నింపుతోంది. రద్దయిన నోట్లను తీసుకుంటామని..ఏ రకమైనా ట్యాక్స్ కట్టవచ్చని జీహెచ్ఎంసీ పేర్కొనడం కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. రద్దయిన నోట్లతో ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న జీహెచ్ఎంసీ ఓ నిర్ణయాన్ని తీసుకుంది. రద్దయిన నోట్ల ద్వారా వివిధ పన్నులు కట్టవచ్చని..ఇందుకు అర్ధరాత్రి వరకు కౌంటర్లు పనిచేస్తాయని పేర్కొంది. దీనితో ప్రజలు వివిధ ట్యాక్స్ కట్టడానికి జీహెచ్ఎంసీకి...వివిధ కౌంటర్లకు తండోపతండాలుగా తరలివచ్చారు. శుక్రవారం సాయంత్రానికి రూ. 27కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ కమిషనర్ రవీందర్ రెడ్డి టెన్ టివితో మాట్లాడారు. సెంట్రల్ జోన్ లో రూ. 7.4 కోట్లు వసూలయ్యాయని, మంచి పరిణామమన్నారు. అర్ధరాత్రి వరకు కౌంటర్లు తెరిచే ఉంటాయని, రద్దయిన నోట్లను తీసుకోవడం జరుగుతుందన్నారు. వివిధ సెంటర్ల ద్వారా ఇంకా చెల్లింపులు జరుగుతున్నాయి. సిటిజన్ సర్వీస్ సెంటర్లు..మీ సేవా సెంటర్ల ద్వారా రూ. 27 కోట్ల 27 లక్షలు వసూలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

భారత్ - జపాన్ మధ్య చారిత్రక ఒప్పందం..

జపాన్ : భారత్ - జపాన్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. అణు ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ కు అణు సాంకేతికతను జపాన్ అందించనుంది. సరిహద్దు ఉగ్రవాదంపై కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. అణు ఒప్పందం చారిత్రాత్మకమైందని భారత ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

జీహెచ్ఎంసీకి గణనీయమైన ఆదాయం..

హైదరాబాద్ :పాత నోట్ల రద్దుతో జీహెచ్ఎంసీకి గణనీయమైన ఆదాయం లభించింది. పాత నోట్లను తీసుకుంటామని చెప్పడంతో ప్రజలు వివిధ ట్యాక్స్ కట్టడానికి ఉత్సాహం చూపారు. వివిధ రకాల పన్నుల చెల్లింపుల ద్వారా ఇప్పటి వరకు రూ. 22.77 కోట్ల ఆదాయం వచ్చింది. 

17:00 - November 11, 2016

ముంబై : మళ్లీ కండలవీరుడికి కష్టాలు మొదలయ్యాయా ? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే కృష్ణ జింకల కేసు సల్మాన్ ను వీడడం లేదు. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో రాజస్థాన్ సర్కార్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ కేసులో సల్మాన్ నిర్దోషి అని రాజస్థాన్ హైకోర్టు ఇటీవలే తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాజస్థాన్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ కిందికోర్టు తీర్పును అమలు చేయాలని సుప్రీంని కోరింది. ఈ కేసులో సల్మాన్ దోషి అని, కోర్టులో లొంగిపోయి శిక్షను పూర్తి చేసే విధంగా చూడాలని కోర్టును కోరింది.
16 ఏళ్ళ క్రితం ‘హం సాథ్ సాథ్ హై’ చిత్రం షూటింగ్ సందర్భంగా రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ పై ఆయుధాల చట్టం కింద స్థానిక లూని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

16:42 - November 11, 2016

హైదరాబాద్ : 'బాహుబలి' నిర్మాతలపై ఐటీ కన్ను పడింది. శుక్రవారం ఏకంగా నిర్మాతలైన శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లు..కార్యాలయాలపై ఐటీ శాఖాధికారులు దాడులు నిర్వహించారు. 'బాహుబలి'ని దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్ స్టామినా చూపించింది. భారీగానే కలెక్షన్లు రాబట్టినట్లు టాక్ ఉంది. ఇదిలా ఉంటే 'బాహుబలి' ఆదాయ వనరులపై ఐటీ దృష్టి సారించింది. తక్కువ మొత్తంలో లెక్కలు చూపించినట్లుగా ఐటీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు బృందాలు ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతోంది. ప్రత్యక్షంగా..పరోక్షంగా సహకరించిన వారిపై తనిఖీలు చేపడుతోంది.
రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు అనంతరం టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ దాడి చేయడం చర్చనీయాంశమైంది. 'బాహుబలి' చిత్రం అనంతరం దీనికి సీక్వెల్ గా 'బాహుబలి-2' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంఆ కొనసాగుతోంది. ప్రస్తుతం ఐటీ శాఖ దాడుల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఈ నేపత్యంలో సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ టెన్ టివితో మాట్లాడారు. ఆ విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

 

 

'బాహుబలి' నిర్మాతలపై ఐటీ దాడులు..

హైదరాబాద్ : బాహుబలి నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. 

క్యూ లైన్ లో రాహుల్ గాంధీ..

ఢిల్లీ : పార్లమెంట్ స్ట్రీట్ లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హల్ చల్ చేశారు. రూ. 4వేల పాత నోట్లు మార్చుకొనేందుకు రాహుల్ వచ్చారు. ఏటీఎం వద్ద ఆయన క్యూలైన్ లో నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. 

16:11 - November 11, 2016

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 699 పాయిట్లు నష్టపోయి 26,181 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 229 పాయింట్లు నష్టపోయి 8296 వద్ద నిఫ్టీ ముగిసింది. 

రాజ్ కోట్ టెస్టులో సెంచరీల హోరు..

రాజ్ కోట్ టెస్టులో సెంచరీల హోరు కొనసాగింది. పుజారా, మురళీ విజయ్ లు సెంచరీలతో చెలరేగిపోయారు. టెస్టుల్లో పుజారాకు 9వ సెంచరీ కాగా, విజయ్ కు 7వ సెంచరీ పూర్తి చేశారు. 

కొత్త నోట్లు వస్తున్నాయి - ఆర్బీఐ..

ముంబై : దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు కొత్త నోట్లు చేరుతున్నాయని, ఖాతాదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ఆర్బీఐ సూచించింది. పాత నోట్ల మార్పిడికి 50 రోజుల సమయం ఉందని, డిసెంబర్ 30 వరకు పాత నోట్లు మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది. 

15:50 - November 11, 2016
15:49 - November 11, 2016

నెల్లూరు : జిల్లాలో ఎస్ఎఫ్ఐ కలెక్టర్ రేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. గురుకుల సాంఘీక సంక్షేమ హాస్టళ్లు, పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్..ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. కలెక్టర్ ముట్టడికి యత్నించింది. ఏవీఎం కాంపౌండ్ నుండి కలెక్టర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకొనేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ గేట్ వద్ద బైఠాయించారు. పెరిగిన ఛార్జీలకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు. 

15:45 - November 11, 2016
15:44 - November 11, 2016

శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దు ప్రజలను ఎన్నో కష్టాలను పెడుతోంది. చివరకు ప్రాణాలు కూడా పోతున్నాయి. మొన్న వరంగల్ లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పలాస మండలం టెక్కలిలో తండ్రిని చివరిచూపు చూడలేని పరిస్థితి నెలకొలంది. టెక్కలి పట్నం ప్రాంతానికి చెందిన కొక్కిరి గురువులు అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతని కుమారులు, కుమార్తెలు హైదరాబాద్ లో ఉంటున్నారు. సమాచారం తెలుసుకున్న కుమారులు, కుమార్తెలు టెక్కలికి బయలుదేరారు. కానీ పెద్ద నోట్లు చెల్లక పోవడం..చిల్లర లేకపోవడంతో వారు టెక్కలికి చేరుకోలేకపోయారు. దీనితో గురువులు భార్య నారాయణమ్మ దహన సంస్కారాలు నిర్వహించింది. తండ్రిని కడసారి చూడాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలమయ్యామని గురువులు కొడుకులు..కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని కన్నీటి పర్యంతమయ్యారు. 

15:34 - November 11, 2016
15:31 - November 11, 2016

హైదరాబాద్ : ఏపీలో పనిచేసే ఆరోగ్య మిత్రలకు హైకోర్టు తీపికబురు అందించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేసింది. దీనితో ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురైంది. గత కొన్ని నెలల క్రితం 1600 మంది ఆరోగ్య మిత్రలను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో ఆరోగ్యమిత్రలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తాము ఉపాధి కోల్పోయామని, దీనిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని వారు పేర్కొన్నా ప్రభుత్వం కనికరించలేదు. దీనితో కొంతమంది ఉద్యోగులు హైకోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. బాధితుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన కోర్టు జీవోను ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తొలగించిన 1600 మంది ఆరోగ్య మిత్రలను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది.

15:20 - November 11, 2016

హైదరాబాద్ : పాత నోట్లు రద్దును క్యాష్ చేసుకోవాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్రయత్నాలు చేస్తోంది. ఎలాంటి ట్యాక్స్..పెండింగ్ బకాయిలు రద్దయిన నోట్ల ద్వారా కట్టుకోవచ్చని అధికారులు ప్రకటించారు. దీనితో ప్రజలు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాలకు పోటెత్తారు. దీనితో ఆయా కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు 6 కోట్ల 11 లక్షల డబ్బులు వసూలయ్యాయి. ఈ సందర్భంగా సీజీఎం ఆనంద్ రావ్ టెన్ టివితో మాట్లాడారు. 30 క్యాష్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని, అర్ధరాత్రి వరకు కౌంటర్లు పనిచేయడం జరుగుతుందన్నారు. క్యాష్ కౌంటర్ ద్వారా 1.78 లక్షల రూపాయల కలెక్షన్ రావడం జరిగిందన్నారు. 611 మంది మీటర్స్ రీడర్స్ నగరంలోని ప్రాంతాల్లో తిరగడం జరుగుతోందని, డిఫాల్టర్స్ కు సపరేట్ గా లిస్టులను ఇవ్వడం జరిగిందన్నారు. వీరందరినీ కాంటాక్ట్ చేసి డబ్బులను కట్టాలని కోరడం జరుగుతోందని, ఎలాంటి బకాయిలున్నా సరే..వాటిని కట్టుకోవచ్చన్నారు. గంట గంటకు మేసేజ్ ల ద్వారా సమాచారం పంపించడం జరుగుతోందన్నారు. 

15:12 - November 11, 2016

మిషన్ కాకతీయ వారికి ఉపాధిగా మారింది - పొన్నం..

హైదరాబాద్ : కాంట్రాక్టర్లకు మిషన్ కాకతీయ ఉపాధిగా మారిందని మాజీ ఎంపీ పొన్నం పేర్కొన్నారు. కాంగ్రెస్ హాయాంలో జరిగిన పనులను టీఆర్ఎస్ ఖాతాలో వేసుకొంటోందని, మిషన్ కాకతీయపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయలో అక్రమాలు నిరూపించేందుకు సిద్ధమని వెల్లడించారు. 

గ్రూప్ 2 పరీక్ష ఓఎంఆర్ షీట్ల తారుమూరు..

నిజామాబాద్ : ఆత్మకూరు క్షత్రీయ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్ 2 పరీక్షల ఓఎంఆర్ షీట్లు తారుమారయ్యాయి. దీనితో విద్యార్థులు ఆందోళనకు దిగారు. 

మియాపూర్ లో బస్సు దగ్ధం..అనుమానాలు..

హైదరాబాద్ : మియాపూర్ లో జనప్రియ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు దగ్ధంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇన్సూరెన్స్ కోసం స్కూల్ యాజమాన్యమే బస్సును దగ్ధం చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని స్కూల్ యాజమాన్యం పేర్కొంటోంది. 

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవి చూసింది. 600 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా 200 పాయింట్లకు పైగా నిఫ్టీ కొనసాగుతోంది. 

ఆరోగ్యమిత్రల తొలగింపు జీవో రద్దు..

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. 1600 మంది ఆరోగ్య మిత్రలను తొలగిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని సూచించింది. 

పవన్ సలహాలను స్వీకరిస్తాం - ఏపీ మంత్రి నారాయణ..

గుంటూరు : పవన్ కళ్యాణ్ సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తుందని ఏపీ మంత్రి నారాయణ వెల్లడించారు. డిసెంబర్ నుండి కేబినెట్ సమావేశాలు వెలగపూడిలోనే నిర్వహిస్తామని, రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీలో సాయంత్రం వరకు పాత నోట్లతో బిల్లులు చెల్లించుకోవచ్చన్నారు. ప్రజల అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 

ఏపీలో వందగజాల్లోపు క్రమబద్దీకరణ..

విజయవాడ : అమరావతి సచివాలయంలో భూముల క్రమబద్ధీకరణలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా వంద గజాల్లోపు స్థలాలను క్రమబద్ధీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. గాజువాక, సింహాచలం, కేఆర్ఎం కాలనీలో అక్రమ కట్టడాలపై కూడా మంత్రివర్గం చర్చించింది. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. 118, 206 జీవోల సాథనంలో ఒకే జీవో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

14:41 - November 11, 2016

వరంగల్ : భారత ప్రభుత్వం తీసుకున్న కరెన్సీ రద్దు నిర్ణయంతో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. నిత్యవసరాలకు సరిపడా డబ్బులు దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల మార్పిడికి గంటల తరబడి బ్యాంకుల్లో నిలబడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. బ్యాంకుల్లోనూ ఐడీ ప్రూఫ్‌, ఆధార్‌కార్డు వంటివి చూపిస్తేనే నగదు లావాదేవీలు జరుపుకొనే వెసులుబాటు కల్పిస్తున్నారని ఖాతాదారులు చెబుతున్నారు. వరంగల్‌లో కరెన్సీ కష్టాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:39 - November 11, 2016
14:37 - November 11, 2016

విజయవాడ : సెంట్రల్‌ నియోజకవర్గంలోని 42వ డివిజన్‌లో సీపీఎం ప్రజా చైతన్య పాదయాత్ర కొనసాగింది. స్థానికులు తమ సమస్యలను ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ బాబూరావు దృష్టికి తీసుకొచ్చారు. ధరలు తగ్గిస్తామని ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా ప్రకటించి..రెండున్నరేళ్లయినా ధరలను నియంత్రించలేకపోతున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బాబూరావు నిప్పులు చెరిగారు. జన చైతన్య యాత్రల పేరుతో టీడీపీ నేతలు దండలేయించుకోవడం తప్ప ప్రజలతో మాట్లాడటం లేదని ఆరోపించారు. మున్సిపాల్టీలను ప్రభుత్వం నిర్విర్యం చేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. 

14:36 - November 11, 2016
14:35 - November 11, 2016

అనంతపురం : కరవు అన్నది మన మనస్సులోనే కానీ...ప్రాంతాల్లో లేదని అన్నారు పవన్‌ కల్యాణ్. సైన్స్‌ అండ్ టెక్నాలజీతో కరువు మీద యుద్ధం ప్రకటించాలని ఆకాంక్షించారు. అమరావతి అద్భుతంగా ఉండి.. అనంతపురం కంటతడి పెడుతూ ఉంటే తాను తట్టుకోలేనన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:34 - November 11, 2016

అనంతపురం : కులాలను గౌరవిస్తాను కానీ.. వాటిని నెత్తికెక్కించుకోనని అన్నారు పవన్‌. అనంతపురంలో గేట్‌ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన...రిజర్వేషన్‌ అంశం లోతైన సమస్య అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లో సమగ్రమైన చర్చ జరగాలన్నారు. రిజర్వేషన్‌ లేని వారికి ఆర్థిక సాయం అందించాలన్నారు. రిజర్వేషన్లపై భవిష్యత్‌లో ప్రజాదర్బార్‌లో చర్చిస్తానన్నారు పవన్‌. 

14:31 - November 11, 2016

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ కార్యాలయాలు జనంతో కిక్కిరిసిపోయాయి. పాత నోట్లతో పన్నులు చెల్లించేందుకు ఇవాళ అర్ధరాత్రి వరకు అవకాశం ఇవ్వడంతో కార్యాలయాలకు జనం క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు 16 కోట్ల మేర పన్నులు వసూలయ్యాయని మేయర్‌ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పిలుపునిచ్చారు. 

14:29 - November 11, 2016

చిత్తూరు : పాత నోట్ల రద్దుపై ప్రజల్లో తీవ్ర ఆందోళన కొనసాగుతోంది. తిరుపతిలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. వెయ్యి నోట్లను ఒంటిపై పరచుకుని రోడ్డుపై అడ్డంగా పడుకున్నాడు. రెండు రోజుల్లో తన కూమార్తె పెళ్లి ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇలా చేశానని సుబ్రహ్మణ్యం అంటున్నాడు. సుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

14:28 - November 11, 2016

మెదక్ : పాత నోట్ల రద్దు ప్రభావం స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై తీవ్రంగా చూపుతోంది. జనం లేక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. గతంలో రోజుకు 150 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు..ఇప్పుడు రెండు, మూడుకు మించడం లేదంటే పరిస్థితి తీవ్రత ఏంటో తెలుస్తోంది. సంగారెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈపరిస్థితి నెలకొంది. సబ్ రిజిష్ట్రార్ ముత్తయ్య టెన్ టివితో మాట్లాడారు. క్యాష్ తీసుకోవడం జరగడం లేదని, 100-120 రిజిష్ట్రార్ లు జరిగేవని, ప్రస్తుతం రెండు...మూడు మాత్రమే రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయన్నారు. నోట్లు చెల్లవని చెబుతున్నారని, చలాన్లు కూడా చెల్లడం లేదని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. బ్యాంకులకు వెళితే డబ్బులు తీసుకోవడం లేదని, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చలాన్లు కూడా తీసుకోవడం లేదన్నారు. 

14:14 - November 11, 2016

హైదరాబాద్ : మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు. పోడూరు రింగ్ రోడ్డు వద్ద శుక్రవారం సుమారు పదిహేను మంది మొక్కలు నాటుతున్నారు. మధ్యాహ్న సమయంలో శామిర్ పేట నుండి అతి వేగంగా వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పింది. ఒక్కసారిగా పనులు చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లింది. దీనితో ముగ్గురు కూలీలు అక్కడికక్కడనే దుర్మరణం చెందారు. 40 మీటర్ల వరకు వారి మృతదేహాలు ఎగిరిపడడంతో వాహనం ఎంత వేగంగా ప్రయాణీస్తుందో అర్థమౌతోంది. రోడ్డు అంతా బీభత్సంగా మారిపోయింది. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు కూలీల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మల్లేష్, శేఖర్, అప్పారావులు మృతి చెందిన వారిలో ఉన్నారు. వారు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 

13:52 - November 11, 2016

మహబూబ్ నగర్ : సామాజిక న్యాయం అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని సీపీఎం పాదయాత్ర సందర్భంగా పీఆర్ పీఎస్ రాష్ట్ర కన్వీనర్‌ జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. సీపీఎం మహాపాద యాత్ర 26వ రోజు మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగుతోంది. హన్వాడ నుంచి ప్రారంభమైన సీపీఎం పాదయాత్రకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. సామాజిక న్యాయం సాధించకుండా.. సమగ్రమైన అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కుల వివక్ష కుల అసమానత అనేది రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు. భూమి భూస్వాముల చేతుల్లోనే వుందనీ..పేదలకు భూమి వుండటమనేది సామాజిక న్యాయంలో ఒక భాగమని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్అమలు వరకే ప్రభుత్వం ఆలోచిస్తోంది..కానీ ఎస్సీ,ఎస్టీలకు బడ్జెట్ లో వాటా కావాలని డిమాండ్ చేశారు. భూమిలోనూ..బడ్జెట్ లోనూ..సంపదలో ..అభివృద్ధిలో భాగం కావాలని డిమాండ్ చేశారు.

నోట్ల మార్పిడి..సొమ్మసిల్లుతున్న ప్రజలు..

యాదాద్రి : మోత్కూరులో నోట్ల మార్పిడి ఎస్ బీహెచ్ వద్ద ప్రజలు బారులు తీరారు. తోపులాటలో ఓ మహిళ సృహ కోల్పోయింది. హైదరాబాద్ లోని రాంనగర్ ఎస్ బీహెచ్ వద్ద పెద్ద నోట్ల కోసం ప్రజలు బారులు తీరారు. క్యూ లైన్ లో నిలబడిన ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. 

పన్నులు చెల్లించండి - మేయర్..

హైదరాబాద్ : పన్నుల చెల్లింపునకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 

జీహెచ్ఎంసీకి కాసుల వర్షం..

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో జీహెచ్ఎంసీకి కాసుల వర్షం కురిపిస్తోంది. పెద్ద నోట్లను స్వీకరిస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించడంతో ప్రజలు ట్యాక్స్..ఇతరత్రా పనులు కట్టేందుకు ముందుకొచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 12గంటల వరకు రూ. 6.76 కోట్ల ఆదాయం వచ్చింది. 

13:46 - November 11, 2016

ఢిల్లీ : వెయ్యి రూపాయల నోటు రద్దు చేసి రెండు వేల నోటు తేవడం వల్ల నల్లధనాన్ని, అవినీతిని ఎలా రూపుమాప గలుగుతారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఈ విషయంలో తాను నిపుణులతో మాట్లాడినా ఎవరూ దీనికి సమాధానం చెప్పలేదని ఆయన వెల్లడించారు. రెండు వేల నోటు రావడం వల్ల నల్ల కుబేరులకు అవినీతిపరులకు మరింత సౌకర్యం అవుతుందన్నారు. ప్రస్తుతం 5 వందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేయాలని మోది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొందని కేజ్రీవాల్‌ అన్నారు. నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని వెల్లడించారు. అవినీతి నిర్మూలనకు తామెప్పుడూ స్వాగతిస్తామని పేర్కొన్నారు.

ముగిసిన గ్రూప్ 2 పేపర్ 1 పరీక్ష..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పేపర్ 1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 02.30 నుండి సాయంత్రం 5గంటల వరకు పేపర్ -2 పరీక్ష జరగనుంది. 

ప్రొ.లక్ష్మీని ఎందుకు అరెస్టు చేయలేదన్న హైకోర్టు..

హైదరాబాద్ : గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. నిందితురాలు ప్రొ.లక్ష్మీని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రొ.లక్ష్మీని గాలిస్తున్నామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

సల్మాన్ కు సుప్రీం నోటీసులు..

ఢిల్లీ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ నిర్దోషిత్వాన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. 

13:42 - November 11, 2016

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌వాసులకు జీహెచ్‌ఎంసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించడంతో పన్నులు కట్టేందుకు నగరవాసులు క్యూ కడుతున్నారు. పన్నుల స్వీకరణకు పాత 500, వెయ్యి నోట్లు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ప్రకటించడంతో.. ప్రజలు జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి భారీగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీకి 6 కోట్లకుపైగా పన్నులు వసూలయ్యాయి. ఇంకా క్యూలైన్లలో జనాలు బారులు తీరి ఉన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌వాసులకు జీహెచ్‌ఎంసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించడంతో పన్నులు కట్టేందుకు నగరవాసులు క్యూ కడుతున్నారు. పన్నుల స్వీకరణకు పాత 500, వెయ్యి నోట్లు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ప్రకటించడంతో..ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీకి 6 కోట్లకుపైగా పన్నులు వసూలయ్యాయి.

జడ్జీల నియామక ప్రక్రియపై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : జడ్జీల నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ఎలాటి ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో లేదని కేంద్రం పేర్కొంది. 24 మంది హైకోర్టు న్యాయమూర్తులను నియమించడం జరిగిందని, 44 మంది నియామకంపై పున:పరిశీలనకు కొలిజియంకు పంపడం జరిగిందని తెలిపింది.

సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల వెలవెల..

హైదరాబాద్ : సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో భూముల రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. 

విద్యుత్, రెవెన్యూ ఆఫీసుల వద్ద ఫుల్ రష్..

హైదరాబాద్ : విద్యుత్, రెవెన్యూ కార్యాలయాల వద్ద ప్రజలు బారులు తీరారు. బిల్లుల చెల్లింపునకు పెద్ద నోట్లను స్వీకరిస్తుండడంతో భారీగా ప్రజలు తరలివస్తున్నారు. 

12:49 - November 11, 2016
12:47 - November 11, 2016

యాదాద్రి : గ్రూప్‌-2 పరీక్ష కోసం ఎంతో తీవ్రంగా శ్రమించిన విద్యార్థులు.. ఒక్క నిమిషం నిబంధనతో పరీక్షకు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. నల్లగొండ, యాదాద్రి జిల్లాలలో సుమారు 20 మంది విద్యార్థులు పరీక్షకు ఆలస్యంగా వచ్చారు. గ్రూప్‌-2 పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. దీంతో సదరు విద్యార్థులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. 

12:39 - November 11, 2016

గుంటూరు : రెండో రోజు బ్యాంకుల వద్ద ఖాతాదారుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ ఏటీఎంలు తెరుచుకోవాల్సి ఉన్నా.. ఇంకా మూతపడి ఉండటంతో.. జనం బ్యాంకులకు క్యూ కడుతున్నారు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కొత్త రూ.500, రూ.2వేల నోట్లను డ్రా చేసుకునేందుకు నగరంలోని హిమాయత్ నగర్ ఏక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద జనాలు క్యూ కట్టారు. ఇలా పలు ప్రాంతాలలో ఏటీఎంలలో నగదులేక ప్రజలు నిరాశగా వెనుదిరుగుతున్నారు.కాగా సాయంత్రం వరకూ ఏటీఎంలలో నగదు అందుబాటులోకి తీసుకొస్తామని బ్యాంక్ అధికారులు తెలుపుతున్నారు. కాగా పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయానికి దేశ ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడాలో అన్ని రకాలుగానూ పడుతున్నారు. 

12:36 - November 11, 2016

హైదరాబాద్ : పాత నోట్ల రద్దుతో రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. రిజిస్ట్రేషన్లు పూర్తిగా పడిపోయాయని చెబుతున్న ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ మధుసూధన్ మాట్లాడుతూ..పెద్ద నోట్ల రద్దుతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా పడిపోయాయని తెలిపారు. గతంలో రోజుకు 50కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగేవనీ..నోట్ల రద్దుతో రిజిస్ట్రేషన్‌కు జనం ముందుకు రావడం లేదని వెల్లడించారు. 

12:24 - November 11, 2016

కరీంనగర్ : తిమ్మాపూర్ లో ఓ స్కూటీని మినీ వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లుగా సమాచారం. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భవిత స్వప్నా ఇద్దరూ అక్కాచెల్లెళ్లుగా తెలుస్తోంది. భవిత గత కొంతకాలంగా గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ అయ్యింది. ఈరోజు పరీక్ష వున్న నేపథ్యంలో భవితను పరీక్ష కేంద్రం వద్ద డ్రాప్ చేసేందుకు స్వప్న వెళ్తున్న క్రమంలో అతివేగంగా వచ్చిన మినీ వ్యాన్ స్కూటీని ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది. కాగా భవిత పరిస్థితి విషమంగా వుంది. స్వప్న చికిత్స పొందుతోంది.

12:13 - November 11, 2016

తిరుపతి : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలలో గందరగోళం నెలకొనటం కొనసాగుతోంది. చిల్లర దొరకని కష్టాలు ఓవైపు కొనసాగుతుంటే..ఆస్తులు అమ్ముకుని...చిట్టీలు ద్వారా అందిన డబ్బును మార్చుకోలేక..ఇలా ఎన్నో సమస్యలలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో కుమార్తె వివాహం కోసం డబ్బు కూడబెట్టుకున్నాడు. ఈక్రమంలో పెద్దనోట్లు చెల్లవంటూ ప్రకటన వచ్చింది. దీంతో తన వద్ద వున్న వెయ్యి రూపాయల నోట్లు చెల్లవని తెలిసిన ఓ సామాన్య తండ్రి వినూత్న నిరసనను ప్రదర్శించాడు. వివాహం కోసం కూడబెట్టిన వెయ్యి నోట్లను సుబ్రమణ్యం అనే వ్యక్తి దిక్కుతోచని స్థితికి చేరుకున్నాడు. ఒంటిపై పేర్చుకుని నడిరోడ్డుపై పడుకుని తన నిరసనను వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు సుబ్రమణ్యాన్ని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల ప్రాణాలమీది తెలుస్తున్న ఘటనలు కూడా నెలకొంటున్నాయంటే అతిశయోక్తి కాదు. 

అజయ్ సింగ్ అల్లుడిని చంపిన మావోలు..

ఛత్తీస్ ఘడ్ : ఏవోబీలో ఎన్ కౌంటర్ తో తమకు జరిగిన నష్టానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న మావోయిస్టులు, శుక్రవారం నాడు కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ అల్లుడిని కాల్చి చంపారు. బీజాపూర్ జిల్లాలో అజయ్ సింగ్ అల్లుడిని అటకాయించిన మావోలు కాల్పులు జరపడంతో ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో బీజాపూర్ ప్రాంతంలో పోలీసు బలగాలను భారీగా పెంచారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో విస్తృతంగా కూంబింగ్ ప్రారంభించారు.

11:51 - November 11, 2016

అనంతపురం : గుత్తిలో ఇంజనీరింగ్ విద్యార్థుల‌ ఇష్టాగోష్ఠిలో విద్యార్థులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మాధానాలు చెప్పారు. ఈ సంద‌ర్భంగా పవన్ కళ్యాణ్ ను ఓ విద్యార్థిని అనంత‌పురం జిల్లా అభివృద్ధి కోసం మీరు ఏం చేయ‌గ‌ల‌రు? అని ప్ర‌శ్నించింది. దీనికి పవన్ కల్యాణ్ స‌మాధానం చెబుతూ... నేనొక రైతుననీ..రైతుల బాధలు తనకు తెలుసన్నారు. రైతుల సమస్యలపై పాదయాత్ర చేయాలని ఉందని తెలిపారు. పాదయాత్ర చేసే శక్తి తన‌కు ఉందని అన్నారు. విద్యార్థులు అడిగే అన్ని ప్ర‌శ్న‌ల‌కి ఇప్పుడు స‌మాధానం చెప్ప‌లేనని పేర్కొన్నారు. అనంత‌పురంలోని క‌ర‌వు ప్రాంతాల్లో పాద‌యాత్ర చేస్తాన‌ని వెల్ల‌డించారు. అక్క‌డి క‌ర‌వు ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం చేస్తాన‌ని, ఆ తరువాత అన్ని అంశాల‌ను స‌మ‌గ్రంగా చ‌ర్చించి పోరాడ‌తాన‌ని చెప్పారు. కరవు ప్రాంతాల్లో మూడు రోజులు పర్యటించాలని అనుకుంటున్నానని అన్నారు. 

11:34 - November 11, 2016

హైదరాబాద్ :పాత వెయ్యి, 500 నోట్లతో ఆస్తి పన్ను చెల్లించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించడంతో.. జీహెచ్‌ఎంసీ కార్యాలయాలకు జనం క్యూ కడుతున్నారు. ఇవాళ అర్ధరాత్రి వరకు సేవలు అందిస్తామని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి సెంట్రల్‌ జోన్‌ కార్యాలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.మరింత సమాచారానికి వీడియో చూడండి..

పన్ను చెల్లింపుదారులకు బల్దియా బంపర్‌ ఆఫర్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌ పన్ను చెల్లింపుదారులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. పన్నుల స్వీకరణకు పాత 500, వెయ్యి నోట్లు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ప్రకటించారు. ఈరోజు అర్ధరాత్రి వరకు మీ సేవా కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో పన్నులు స్వీకరిస్తారని తెలిపారు.

11:30 - November 11, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో భూముల రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. దీంతో హైదరాబాద్‌ నగర పరిధిలోని ఉప్పల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వెలవెలబోతోంది.ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిత్యమూ రద్దీగా వుండేది. డాక్యుమెంట్ రైటర్ మాట్లాడుతూ..ఆన్ లైన్ పంపిణీకి సర్వర్లు సరిగ్గా పనిచేయకపోవటం..కొత్త కరెన్సీ అందుబాటులోకి రాకపోవటమై...బ్యాంక్ లలో పరిమిత నగదు పంపణీ చేయటం..వంటి పలు అంశాల నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లుగా వారు పేర్కొన్నారు. 

11:15 - November 11, 2016

హైదరాబాద్ : డబ్బులను డ్రా చేసుకునేందుకు జనాలు ఏటీఎంల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. కొత్త రూ.500, రూ.2వేల నోట్లను డ్రా చేసుకునేందుకు నగరంలోని హిమాయత్ నగర్ ఏక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద జనాలు క్యూ కట్టారు. ఇలా పలు ప్రాంతాలలో ఏటీఎంలలో నగదులేక ప్రజలు నిరాశగా వెనుదిరుగుతున్నారు.కాగా సాయంత్రం వరకూ ఏటీఎంలలో నగదు అందుబాటులోకి తీసుకొస్తామని బ్యాంక్ అధికారులు తెలుపుతున్నారు. కాగా పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయానికి దేశ ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడాలో అన్ని రకాలుగానూ పడుతున్నారు. ఈ అంశంలో డబ్బున్నవారు లేని అనే తేడా లేకుండా ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాకపోతే ఇబ్బందులు పడేవారిలో సామాన్యులే ఎక్కువమంది ఉండటం గమనార్హం. 

10:58 - November 11, 2016

విజయవాడ : ఏటీఎంల వద్ద ప్రజలు బారుతు తీరారు. ఉదయం నుండే ఏటీఎం లకు పరుగులు తీసిన ప్రజలకు డబ్బులు లేని మిషన్లు వెక్కిరిస్తున్నాయి. అన్ని ఏటీఎంలలో కొత్త కరెన్సీని నింపే పనులు పూర్తి కాకపోవడం, నింపిన వాటిల్లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ కాకపోవడం వంటి కారణాలతో ఉదయం 9 గంటలు అవుతున్నా ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజలు బారుతీరుతున్నారు. శుక్రవారం నుండి ఏటీఎంలను అందుబాటులోకి తీసుకొన్తామని బ్యాంక్ అధికారలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుండే ఏటీఎం వద్ద ప్రజలు బారులు తీరారు. పొద్దున్నే నిత్యావసరాల నిమిత్తం చిల్లర తీసుకోవాలని ఏటీఎంలకు వెళ్లిన వారిని మూసివున్న తలుపులు 'అవుట్ ఆఫ్ సర్వీస్' అన్న బోర్డులు వెక్కిరిస్తున్నాయి. విషయం తెలీని ప్రజలు ఏటీఎంల వద్ద భారీ ఎత్తున క్యూ కడుతూ, ఎప్పుడు తెరుస్తారని అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని అడుగుతున్నారు. కాగా మధ్యాహ్నం తరువాత మాత్రమే ఏటీఎంలు తెరచుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.కాగా మూడు రోజుల క్రితమే బ్యాంకులకు కొత్తనోట్లను పంపిణీ అయినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. కాగా బుధ, గురు వారాల్లో ఏటీఎం కేంద్రాలను మూసి ఉంచిన సంగతి తెలిసిందే.

పనిచేయని బయోమెట్రిక్ మిషన్లు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణలో ఆయా పొరపాట్లు దొర్లుతున్నాయి. ఇప్పటికే ఆయా పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ మిషన్లు పనిచేయకపోవడంతో అభ్యర్ధుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటుచేసిన ఓ పరీక్షా కేంద్రం అడ్రస్ లో పొరపాటు జరగడంతో అభ్యర్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాల్‌టికెట్లలో సమతానగర్‌కు బదులుగా నేరేడ్‌మెట్‌ ఉండటంతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. సమతానగర్‌లోని సమారిటెన్‌ స్కూల్‌ పరీక్షా కేంద్రంలో 300 మంది అభ్యర్థులకు సెంటర్‌ ఏర్పాటు చేయగా ప్రస్తుతం 80 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు.

10:48 - November 11, 2016

గుంటూరు : కేంద్రం రద్దు చేసిన 500, వెయ్యినోట్లతో వెలగపూడి సచివాలయంలోని ఉద్యోగులకు రెండవ రోజు కూడా తిప్పలు తప్పలేదు. మొదటి రోజు ఎలాగోలా సర్దుకున్న ఉద్యోగులు,..రెండొవ రోజు బ్యాంకుల్లో డబ్బును పొందవచ్చని భావించారు. కానీ సచివాలయంలోని ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ లకు కొత్తనోట్లు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వెలగపూడి సచివాలయంలోని ఉద్యోగులు నానా తంటాలు
ఆర్బీఐ రద్దు చేసిన 500, వెయ్యినోట్లను మార్పిడి చేసుకునేందుకు వెలగపూడి సచివాలయంలోని ఉద్యోగులు నానా తంటాలు పడ్డారు. పాత నోట్లు ఇచ్చి చిల్లర తీసుకుందామని ఉదయం 10 గంటలకే సచివాలయంలోని ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్‌లకు వద్దకు చేరుకున్న ఉద్యోగులక నిరాశే ఎదురైంది. బ్యాంకల్లో వంద నోట్లు లేకపోవడంతో 500 మించి చిల్లరు ఇవ్వలేమని,..కొత్త నోట్లు రాలేదని స్పష్టం చేశారు. దీంతో చాలా మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉన్న చిల్లర కాస్తా అంతకుముందు రోజే అయిపోవడంతో ఏం చేయాలో తోచక తిరిగి విధుల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం తర్వాత కొత్త నోట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో ఉద్యోగులు లంచ్‌ తర్వాత బ్యాంక్‌ల వద్ద పడిగాపులు కాచారు. అయితే అత్యవసరమైన వాళ్లకు తొలుత 500 చిల్లర ఇచ్చారు. ఔట్‌సోర్సింగ్‌ , సాధారణ ఉద్యోగులకు చిల్లర ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సచివాలయంలోని క్యాంటీన్‌లో సైతం పెద్ద నోట్ల ఇబ్బందులు
మరోవైపు సచివాలయంలోని క్యాంటీన్‌లో సైతం పెద్ద నోట్లు తీసుకోకపోవడంతో,..ఉద్యోగుల తినడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. పెద్ద నోట్లు తీసుకుంటే, మళ్లీ తాము బ్యాంక్ కు వెళ్లి మార్చుకోవాలనే ఉద్దేశంతో క్యాంటీన్ వారు నిరాకరిస్తున్నారు. హైదారాబాద్ నుండి వచ్చిన చాలా మంది ఉద్యోగులు భోజనం కోసం క్యాంటీన్ మీదే ఆధారపడడంతో,..చిల్లర నోట్లు లేక భోజనాలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

నోట్ల రద్దుతో ఇబ్బందులు
రాజధాని ప్రాంతంలోని రైతుల కూడా పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో ఉన్న బ్యాంకుల వద్దకు వెళ్లి చిల్లర అడుగుతున్నారు. వారు కూడా నోట్లు రాలేదని చెప్పడంతో,..చేసేది లేక వెనుదిరుగుతున్నారు. మరికొంత మంది తమ వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటున్నారు..ప్రస్తుతానికి డిపాజిట్ చేస్తే,.ఆ తర్వాత కొత్తనోట్లు తీసుకోవచ్చని భావిస్తున్నారు. అటు చాలా మంది రైతులు కూడా ఇదే భావనతో తమ వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు.

 

రోడ్డుపై రూ. 500 నోట్ల బస్తా..

సూర్యాపేట : హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై, సూర్యాపేట పట్టణం వద్ద రోడ్డపై నోట్ల కట్టల బస్తా కనిపించడం కలకలం రేపింది. ఇక్కడి ఆర్ కేఎల్ కే కాలేజీ సమీపంలో మొత్తం 500 రూపాయల నోట్లున్న ఓ బస్తాను గుర్తించినట్టు పలువురు స్థానికులు తెలిపారు. ఈ నోట్లను ముట్టుకునేందుకు ప్రజలు భయపడ్డారని తెలిపారు. విషయం గురించి తెలుసుకున్న పోలీసులు వచ్చేసరికి ఈ నోట్ల బస్తా మాయమైంది. చెత్తను తీసుకువెళ్లే మునిసిపల్ సిబ్బంది దీన్ని తీసుకువెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. నోట్ల బస్తాపై విచారిస్తామని పోలీసులు తెలిపారు.

దీక్ష‌ల‌తో అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావు : పవన్

అనంతపురం : గాంధీయిజం అంటే త‌న‌కు ఇష్టమేన‌ని కానీ అన్ని సమస్యలకు అది పరిష్కారం కాదని జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. అనంపురం జిల్లా గుత్తిలో పవన్ కల్యాణ్ నిర్వహిస్తోన్న విద్యార్థుల‌తో ఇష్టాగోష్ఠిలో ఆయన విద్యార్థుల అడిగిన ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతూ..నిరాహార దీక్ష‌ల‌తో అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావని అన్నారు. అలాగ‌ని ఆవేశ ప‌డ‌డం కూడా స‌మ‌స్య‌లకు ప‌రిష్కారాలు చూప‌వ‌ని చెప్పారు. ఓ ప్ర‌ణాళిక‌తో స‌మ‌గ్రంగా ఆలోచించి ముందుకు వెళ్లాల‌ని సూచించారు. తాను ఇచ్చిన మాట‌పై ఎక్క‌డా త‌గ్గ‌బోన‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌తాన‌ని అన్నారు.

10:27 - November 11, 2016

అనంతపురం : గుత్తి గేట్ విద్యార్ధులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఓ విద్యార్థి ఎంట్రన్స్ పరీక్షల్లో కేస్ట్ ను బట్టికాకుండా మెరిట్ ను పరిధిలోకి తీసుకుంటే బాగుంటుందని దీనిపై మీ అభిప్రాయమేంటని అడిగారు.. ఈ అంశం చాలా సున్నితమైందనీ..ఓసీ రిజర్వేషన్లపై ప్రజాదర్భార్ లో చర్చిస్తానని తెలిపారు. ఈ అంశంలో అంతర్జాతీయంగా చర్చ జరగాల్సిన అవుసరముందన్నారు. కులాలపై తనకు నమ్మకం లేదనీ..నేటి నేతలు ఎలక్షన్లలో కులాలను రెచ్చగొట్టి ఓట్లు బ్యాంక్ గా ఉపయోగించుకుంటున్నారన్నారు. వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు వున్నాగానీ..రిజర్వేషన్లు లేని వారికి ఫైనాన్షన్ సపోర్ట్ వుండే బాగుంటుందన్నారు. కులాలను అధిగమించాలంటే ముందుగా మనమే ముందడుగువేయాలని పిలుపునిచ్చారు.ప్రత్యేక హోదాకోసం నిరాహార దీక్ష చేస్తామన్న మీరు దానిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వనున్నారని ట్రిపుల్ ఈ విద్యార్థి ఆశా జెన్నీఫర్ అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానం చెబుతూ..ఆవేశంతో ఏ సమస్యలు పరిష్కారం కావలని పోరాడి సాధించుకోవాలన్నారు. ప్రత్యేక హోదాపై ఆవేశంతో కాకుండా ఆలోచించే మాట్లాడుతున్నాననీ..ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పరిష్కారం దిశగా నడిచేందుకు తానెప్పుడూ సిద్ధంగా వున్నానన్నారు. నిరాహాద దీక్షలతో సమస్యలు పరిష్కారమైతే దేశంలో దారిత్ర్యం ఎప్పుడో తొలగిపోయేదన్నారు.

గాంధీగారి సిద్ధాంతాలతో అన్ని సమస్యలు పరిష్కారం కావు : పవన్
గాంధీగారి సిద్ధాంతాలతో అన్ని సమస్యలకూ పరిష్కారం కావని అభిప్రాయపడ్డారు. ప్రతీ 20 ఏళ్ళకు ఒకసారి కరెన్సీ మార్పిడి జరిగితే అవినీతికి తావు వుండదనీ అంబేద్కర్ పేర్కొన్నారనీ..ఈ అంశంలో పెద్ద నోట్ల మార్పిడికి ప్రధాని మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారని ఓ విద్యార్థి మాట్లాడారు. అనంతపురం జిల్లాకు రూ.6వేల కోట్లు కేటాయించామని న్యూస్ వచ్చిందన్నారు. ఇది ఎంతవరకూ నిజమని విద్యార్థి అడిగిన ప్రశ్నకు పవన్ అవి పేపర్ల వరకూ పరిమితమన్నారు. అవినీతి ప్రక్షాళ అనేది రాజకీయ నాయకులతో ప్రారంభమవ్వాలని పవన్ పేర్కొన్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

10:02 - November 11, 2016
10:00 - November 11, 2016

ఢిల్లీ : తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు.. కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించి వివిధ పెండింగ్‌ పనులపై చర్చించారు.. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు..

కేంద్ర జౌళిశాఖ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌
రెండోరోజు పర్యటనలో మంత్రి కేటీఆర్‌ పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు.. గురువారం ఉదయం కేంద్ర జౌళిశాఖ ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు.. తెలంగాణ తరపున జాతీయ టెక్స్‌టైల్‌ విధానం ఎలా ఉండాలో సూచనలిచ్చారు.. మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ పాలసీ సపోర్ట్‌తోపాటు.. పన్నెండు చేనేత సమూహాలు ఇవ్వాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కోరారు..

పెండింగ్‌లో హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి
ఆ తర్వాత కేటీఆర్‌... కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు.. పునర్విభజనచట్టంలో ఇచ్చిన హామీల్లో కొన్ని పెండింగ్‌లోఉన్నాయని... వాటిని వెంటనే అమలు చేయాలని కోరారు.. కేటీఆర్‌ విజ్ఞప్తిపై స్పందించిన జైట్లీ.. తెలంగాణకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. అలాగే సినిమాలకు ఒకే శ్లాబ్‌ విధానం అమలుచేస్తే తెలుగు చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుందని మంత్రి దృష్టికి తెచ్చారు.. ప్రాంతీయ సినిమాలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు..

నిర్మలాసీతారామన్‌ తో భేటీ అయిన కేటీఆర్
జైట్లీతో భేటీ తర్వాత కేటీఆర్‌ కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిశారు.. ఫార్మా, హైదరాబాద్‌, నాగ్‌పూర్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌, లెదర్‌ పార్క్‌, డ్రైపోర్టు నిర్మాణంలో కేంద్రం సహాయం అందించాలని కోరారు.. ఢిల్లీ టూర్‌ మంత్రి కేటీఆర్‌తోపాటు.. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఉన్నారు..

 

ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..

విశాఖ : ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. లంబసింగిలో5,పోతురాజుగుడి ప్రాంతంలో 6 ,చింతపల్లి,పాడేరులలో 8డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. 

టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి..

శ్రీకాకుళం : మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ నేత గొర్లె హరిబాబునాయుడు గత రాత్రి శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం పాకర్లపల్లిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే చికిత్సను పొందుతున్నారు. హరిబాబు నాయుడు మృతిపట్ల పలువురు ప్రముఖులు విషాదం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.

సమ్మె చేపట్టిన సింగరేణి కార్మికులు..

ఖమ్మం : భద్రాద్రి జిల్లాలో సింగరేణి కార్మికులు సమ్మె చేపట్టారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మింనెంట్ చేయాలనీ..సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం..డ్రైవర్లను ఆపరేటర్లుగా గుర్తించాలనీ..డిమాండ్ చేస్తూ ఇల్లందు, కొత్తగూడెం, సత్తుపల్లిలలో విధులకు దాదాపు 20వేలమంది కార్మికులు గైర్హాజరయ్యారు. దీంతో 35 విభాగాల్లోనూ..16 ఓసీల్లోను బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గణుగూరులో జీఎం కార్యాలయం ముట్టడికి యత్నించారు.

 

షాహిబాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..

ఉత్తరప్రదేశ్ : షాహిబాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గార్మెంట్ ఫాక్టరీలో శుక్రవారం ఉదయం 4గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13మంది మృతి చెందారు.పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకుని 12 ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. 

09:53 - November 11, 2016

హైదరాబాద్‌: నగరంలోని ఏటీఎంలకు ప్రజలు క్యూకడుతున్నారు. ఎంతో ఆశతో వెళ్లినవారికి ఏటీఎంలో నగదు లభించకపోవటం నిరాశపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త రూ.2000, రూ.500 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చర్యతో దేశవ్యాప్తంగా బుధ, గురువారాల్లో ఏటీఎంలు మూతపడ్డాయి. అన్ని ఏటీఎంలలో సాయంత్రవరకూ కొత్త నోట్లు పెట్టిన తర్వాత వాటిని తిరిగి ప్రారంభిస్తామనీ.. బ్యాంకు అధికారులు పేర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం ఉదయం నగదు కోసం ఏటీఎంలకు వెళ్లిన చాలామందికి నిరాశ ఎదురైంది. రెండు రోజుల పాటు పెద్దనోటు చెలామణి గాక, చిల్లర నోట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం నుంచైనా తమ సమస్య తీరుతుందని ఎదురుచూసిన వారు నిరాశకు గురవుతున్నారు.

ఆత్మహత్య చేసుకున్న వరుడు..

విశాఖ : గాజువాకలో విషాదం చోటుచేసుకుంది. శ్రీహరిపురం లోని ఓ ఇంట్లో వివాహం జరగాల్సివుంది. ఇంతలోనే ఆ ఇంట్లో విషాయం చోటుచేసుకుంది. పెండ్లి కుమార్తె,పెండ్లి కుమారుడు కుటుంబంబో వివాదం తలెత్తింది. దీంతో పెండ్లి కుమారుడు శివ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా వీరి ఇంట్లో రేపు వివాహం జరగాల్సివుంది. 

09:50 - November 11, 2016

ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదని అనంతపురం బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్న కేంద్రమంత్రి వెంకయ్య మాటలను పవన్‌ తిప్పికొట్టారు. అమరావతి రాజధాని సంపన్నుల కోసమా? సామాన్యుల కోసమా? అని ప్రశ్నించారు. చట్టబద్దత లేని ప్యాకేజీ గురించి ఒక్కో నాయకుడు ఒక్కోలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి సహజంగా వచ్చే ఆదాయాన్ని ప్యాకేజీలలో చూపి అంకెల గారడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈచర్చలో సీహెచ్ బాబూరావు (సీపీఎం నేత),చందూరి సాంబశివరావు (టీడీపీ నేత) విల్సన్ (బీజేపీ నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

09:48 - November 11, 2016

విశాఖపట్టణంలో లవ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తీవ్ర వివాదస్పదమయ్యాయి. ఫిబ్రవరి 12 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్ పై మహిళా సంఘాల నుంచి, యువజన సంఘాల నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి. వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పర్యాటక శాఖ కాస్త వెనక్కితగ్గిన్నప్పటికీ, నిర్వాహకులు తెరచాటు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. లవ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అనుమతించాలంటూ ఓ ప్రయివేట్ సంస్థ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. విశాఖపట్టణంలో లవ్ బీచ్ ఫెస్టివల్ ను మహిళా సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? లవ్ బీచ్ ఫెస్టివల్ యువత మీద, మహిళల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం వుంది? లవ్ బీచ్ ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు మహిళా సంఘాలు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నాయి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఐద్వా నాయకురాలు ప్రభావతి విశాఖపట్టణం స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

09:47 - November 11, 2016

అనంతపురం : 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఏపీలో పార్టీ తొలి కార్యాలయాన్ని అనంతపురంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్న వెంకయ్య మాటలను పవన్‌ తిప్పికొట్టారు. హోదా నినాదంతో రాజకీయాల్లో నూతన అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన అనంతపురం సభలో స్పష్టం చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ పవన్
అనంతపురంలో జరిగిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విరుచుకుపడ్డారు. చట్టబద్దత లేని ప్యాకేజీ గురించి ఒక్కో నాయకుడు ఒక్కోలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి సహజంగా వచ్చే ఆదాయాన్ని ప్యాకేజీలలో చూపి అంకెల గారడీ చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి మళ్లీ సన్మానాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయవద్దు : పవన్ కళ్యాణ్
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉన్నా అది ఆచరణలో కనిపించడం లేదన్నారు పవన్‌కల్యాణ్‌. నీళ్లు లేకుండా అనంతపురంను ఎలా అభివృద్ధి చేస్తారని పవన్‌ ప్రశ్నించారు. ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించారు.

2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా- పవన్‌ కల్యాణ్
వచ్చే ఏడాది అనంతపురంలోనే పార్టీ తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని.. 2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అనంతపురం జిల్లా కరవును ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్తానన్నారు.

ఏ పార్టీనీ జనసేన వ్యతిరేకం కాదు
ఏపీకి ప్యాకేజీని టీడీపీ ప్రభుత్వం ఎలా అంగీకరించిందో ప్రజలకు చెప్పాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. తమ పార్టీ టీడీపీకో.. వైసీపీకో వ్యతిరేకం కాదని.. చంద్రబాబు, జగన్‌తో తనకు విభేదాలు లేవని పవన్‌ అన్నారు. భావితరాలకు నష్టం జరిగేలా వ్యవహరిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి : పవన్‌
నాయకుల్లో చిత్తశుద్ది లోపించడం వల్లే ఏళ్ల తరబడి అనంతలో కరవు కొనసాగుతుందని పవన్‌ అన్నారు. టీడీపీపై అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయని పవన్‌ బాబు సర్కార్‌కు చురకలంటించారు. నూతన రాజధాని ప్రజలకు అనుకూలంగా ఉండాలన్నారు. మాజిక మార్పుకోసమే జనసేన ఆవిర్భవించిందన్న పవన్‌ కల్యాణ్‌ రైతుల పక్షాన ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు.  

09:46 - November 11, 2016

హైదరాబాద్: శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 పరీక్ష జరుగనుంది. మొత్తం 1032 పోస్టులకు 7.89లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం పరీక్షకు 8.30 నుంచి 9.45 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1.15 గంటల నుంచి 1.45 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. గ్రూప్-2 అభ్యర్థుల కోసం ఆర్టీసీ 2500 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఈ పరీక్షకు నిమిషం నిబంధన వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. 

09:45 - November 11, 2016

హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్‌ 2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు మరికొద్దిసేపట్లో పరీక్ష రాయనున్నారు. దాదాపు ఏడున్నరలక్షలమంది ఈ పరీక్ష రాయబోతున్నారు. నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకి చేరుకోవాలని సూచించారు.తెలంగాణలో గ్రూప్‌ 2 పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు టీఎస్ పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.. 19వందల 16 సెంటర్లలో 7లక్షల 83వేలమంది అభ్యర్థులు గ్రూప్‌ 2కు హాజరుకాబోతున్నారు.. ఉదయం పదిగంటలకు పరీక్ష మొదలవుతుంది.. అభ్యర్థులు 45నిమిషాలకు ముందే పరీక్షాకేంద్రంలోకి రావాలని సూచించారు. 9గంటల 45నిమిషాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.ఇక మధ్యాహ్నం రెండున్నర గంటలకు రెండో పేపర్‌ కు పరీక్ష జరుగుతుంది.. ఈ పరీక్షకు పావుగంటల ముందుగా పరీక్షాకేంద్రంలోకి పంపుతారు.. గ్రూప్‌ 2లో వెయ్యి 32పోస్టులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. శుక్రవారం రెండు పేపర్లు, ఆదివారం మరో రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది... అభ్యర్థులంతా హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు..

ఆభరణాలు, గొలుసులు, చెవిపోగులు, చేతి గడియారాలు
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు షూస్‌ వేసుకొని రావొద్దంటూ అధికారులు ఆదేశించారు.. ఆభరణాలు, గొలుసులు, చెవిపోగులు, చేతి గడియారాలు, ఎలక్టాన్రిక్ గాడ్జెట్లకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిలేదని స్పష్టం చేశారు.. అలాగే అభ్యర్థులు చేతులపై గోరింటాకు, ఇంక్ వంటివి ఉండకూడదని సూచించారు. ఓఎంఆర్ పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతోనే రాయాలనే నిబంధలున్నాయి. 

09:07 - November 11, 2016

ఢిల్లీ : పెద్ద నోట్లు బ్యాంకుల్లో జమ చేస్తున్నారా? దీనికి ఓ లిమిట్‌ ఉంది. రెండున్నర లక్షల డిపాజిట్‌ దాటితే పాన్‌కార్డుతో సహా ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. లేదా భారీ జరిమానా తప్పదు. అక్రమ సంపాదనపై ఐటి డేగకన్ను వేసింది.

చర్చనీయాంశమై పెద్ద నోట్ల రద్దు
ఐదు వందలు, వెయ్యి నోట్ల రద్దు అంశం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీటిపై చాలామందికి చాలా రకాల సందేహాలున్నాయి. పెద్దనోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్పిడి చేసుకునేందుకు కేంద్రం 50 రోజుల గడువిచ్చింది. ఓవైపు బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేసుకునేందుకు వీలు కల్పిస్తూనే మరోవైపు నల్లధనం నివారణకు చర్యలు చేపట్టింది.

అక్రమ సంపాదన అని తేలితే 2 వందల శాతం వరకు జరిమానా
ఇకపై బ్యాంకుల్లో జమ చేసేందుకు రెండున్నర లక్షల పరిమితి విధించింది. రెండున్నర లక్షల డిపాజిట్‌ దాటితే పాన్‌కార్డుతో సహా ఆదాయ మార్గాల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. లేదా భారీ మొత్తంలో జరిమానా విధించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఒకవేళ అక్రమ సంపాదన అని తేలితే 2 వందల శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

నవంబరు 10 నుంచి డిసెంబరు 30వ తేదీ వరకు నిబంధన
నవంబరు 10 నుంచి డిసెంబరు 30వ తేదీ వరకు ప్రతి బ్యాంకు ఖాతాలో రెండున్నర లక్షలకు పైగా జమచేసే ప్రతి ఖాతాదారుడి వివరణ తీసుకోనున్నట్లు హస్ముఖ్‌ తెలిపారు.

రిటర్న్స్‌ దాఖలు చేయకుంటే.. దొంగ లెక్కల లెక్కేనంటున్న ఆదాయపన్ను శాఖ
ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వారు సరైన రిటర్న్స్‌ దాఖలు చేయకుంటే.. ఆదాయపన్ను శాఖ అధికారులు దొంగ లెక్కల కిందకే వస్తుందన్నారు. చిన్న వ్యాపారులు, గృహిణులు, చిరుద్యోగులు, కళాకారులు, కార్మికులు, పన్ను పరిధిలోకి రాని వారు దాచుకునే మొత్తాల గురించి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. 2 లక్షల్లోపు డబ్బు జమ చేసేవారిపై ఆదాయపన్ను శాఖ నుంచి ఎటువంటి ఇబ్బందులు రావని భరోసా ఇచ్చారు. బంగారు ఆభరణాల కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా పాన్‌కార్డు వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.

06:59 - November 11, 2016

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పెద్ద నోట్ల ర‌ద్దు కార‌ణంగా రోజు వారీగా బిల్లులు, టాక్స్ లు వ‌సూలు చేసే సంస్థలకు రాబ‌డులు భారీగా త‌గ్గాయి. హైద‌రాబాద్ బ‌ల్దియాకు ప్రతి రోజు వ‌చ్చే ఆదాయం కంటే రెండు రేట్లు త‌క్కువ‌గా వ‌స్తుంది. సిటిజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లలో 500, వెయ్యి నోట్లను తీసుకోమంటూ అధికారులు ప్రక‌టించ‌డంతో ఆస్తి ప‌న్ను, ట్రెడ్ లైసెన్స్, టౌన్ ప్లానింగ్ ప‌ర్మిష‌న్‌ ఫీజులు చెల్లించేందుకు పౌరులు ముందుకు రావటం లేదు. అయితే దీనిపై బల్దియా..ఇవాళ రాత్రి వరకు అన్నిరకాల పన్నులన్నీ పాతనోట్లతో చెల్లించవచ్చంటూ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

500 , 1000రూపాయల నోట్లు చెల్లవంటూ 8న కేంద్రం ప్రక‌టన
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ప‌న్ను చెల్లింపుదారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింది. పాత 500, 1000 నోట్లు కేవ‌లం బ్యాంకుల్లో మాత్రమే మార‌కం జ‌రుగుతుండ‌టంతో డ‌బ్బు రూపంలో ప‌న్నులు చెల్లించాల‌న్న వీలు కాలేదు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు లోక‌ల్ బాడీల‌కు చెల్లించాల్సిన ఫీజులు, టాక్స్ లు ఇవాళ రాత్రి 12గంట‌ల వ‌ర‌కు చెల్లించడానికి అవ‌కాశం క‌ల్పించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వ ప‌న్నుల‌తో పాటు, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ కు కూడా భారీ ఆదాయం స‌మ‌కూర‌నుంది.

8 తేదిన కోటి 65 ల‌క్షలు వ‌చ్చిన ఆస్తిప‌న్ను
500 , వెయ్యి రూపాయల నోట్లు చెల్లవంటూ 8వ తేది రాత్రి కేంద్ర ప్రభుత్వం ప్రక‌టించ‌డంతో భారీ మొత్తంలో న‌గ‌దు ఉన్న వారంద‌రూ అందోళ‌న చెందారు. దీంతో బుధవారం, గురువారాల్లో బ‌ల్దియాకు వ‌చ్చే ఆదాయం రెండు రేట్లు ఒక్కసారిగా ప‌డిపోయింది. 8వ తేదిన కోటి 65 ల‌క్షలు వ‌చ్చిన ఆస్తిప‌న్ను 9వ తేది కేవ‌లం 50ల‌క్షలు మాత్రమే వ‌చ్చింది. ఇందులో ఎక్కువ భాగం చెక్కుల రూపంలో వ‌చ్చింది. 10వ తేది కూడా అదే ప‌రిస్థితి ఏర్పడింది. దాంతో ఈ రెండు వారాలు ప‌రిస్థితులు ఇలానే ఉంటే బ‌ల్దియాకు ఆర్థిక క‌ష్టాలు మ‌రింత ఎక్కువైయ్యే అవ‌కాశం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవ‌కాశంతో కార్పొరేష‌న్ గ‌ల్లాపెట్టే గ‌ల గ‌లమ‌నే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

బ‌ల్దియాలో రూ. 2500 కోట్ల ఆస్తిప‌న్ను పెండింగ్‌
ఇప్పుడు వ‌చ్చిన అఫ‌ర్ ను అంద‌రూ వినియోగించుకోవాలంటూ పిలుపునిస్తున్నారు జిహెచ్ఎంసి అధికారులు. ప్రస్తుతం ఉన్న ఆస్తిప‌న్ను బ‌కాయిల చెల్లింపుతో పాటు రానున్న 5 ఏళ్ల కోసం కూడా ఆస్థి ప‌న్నులు చెల్లించ వ‌చ్చటుంన్నారు. గ‌త ఎరియ‌ర్స్ ప్రస్తుత డిమాండ్ క‌లిపి బ‌ల్దియా 2500 కోట్ల ఆస్తిప‌న్ను డిమాండ్ ఉంది. ఇవి కాకుండా ట్రేడ్ లైసెన్స్ ఫీజు 30 కోట్ల వ‌ర‌కు వ‌సూలు కాగా మ‌రో 25 కోట్లు వ‌ర‌కు డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవ‌కాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు బ‌ల్దియా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. జిహెచ్ఎంసి కార్యాలయాల్లో ఉన్న సిటిజ‌న్ స‌ర్విస్ సెంట‌ర్ల వ‌ద్ద ప్రత్యేక సిబ్బంది నియామ‌కం కోసం అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

06:55 - November 11, 2016

హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్‌ 2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ ఏర్పాటు తరువాత జరుగుతున్న ఈ పరీక్షలో..రికార్డు స్థాయిలో దాదాపు ఏడున్నరలక్షలమంది పరీక్ష రాయబోతున్నారు. నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకి చేరుకోవాలని సూచించారు.

1916 సెంటర్లలో పరీక్ష రాయబోతున్న 7లక్షల 83వేలమంది అభ్యర్థులు
తెలంగాణలో గ్రూప్‌ 2 పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు టీఎస్ పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.. 19వందల 16 సెంటర్లలో 7లక్షల 83వేలమంది అభ్యర్థులు గ్రూప్‌ 2కు హాజరుకాబోతున్నారు.. ఉదయం పదిగంటలకు పరీక్ష మొదలవుతుంది.. అభ్యర్థులు 45నిమిషాలకు ముందే పరీక్షాకేంద్రంలోకి రావాలని సూచించారు. 9గంటల 45నిమిషాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు..

బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల వేలిముద్రల సేకరణ
ఈ పరీక్షకు బయోమెట్రిక్ విధానంద్వారా అభ్యర్థుల వేలిముద్రలు తీసుకోబోతున్నారు.. ఈ వేలిముద్రతో పాటు.. డిజిటల్ ఫొటోను దరఖాస్తు చేసిన వివరాలతో పోల్చిచూస్తారు... అన్నీ సరిగ్గా ఉంటేనే అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అనుమతిలభిస్తుంది.. ఇక మధ్యాహ్నం రెండున్నర గంటలకు రెండో పేపర్‌ కు పరీక్ష జరుగుతుంది.. ఈ పరీక్షకు పావుగంటల ముందుగా పరీక్షాకేంద్రంలోకి పంపుతారు..

1032పోస్టులకు పరీక్ష నిర్వహణ
గ్రూప్‌ 2లో వెయ్యి 32పోస్టులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. శుక్రవారం రెండు పేపర్లు, ఆదివారం మరో రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది... అభ్యర్థులంతా హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు..

ఆభరణాలు, గొలుసులు, చెవిపోగులు, చేతి గడియారాలు
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు షూస్‌ వేసుకొని రావొద్దంటూ అధికారులు ఆదేశించారు.. ఆభరణాలు, గొలుసులు, చెవిపోగులు, చేతి గడియారాలు, ఎలక్టాన్రిక్ గాడ్జెట్లకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిలేదని స్పష్టం చేశారు.. అలాగే అభ్యర్థులు చేతులపై గోరింటాకు, ఇంక్ వంటివి ఉండకూడదని సూచించారు. ఓఎంఆర్ పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతోనే రాయాలి.

సమయానికి లేని బస్సులు..మిమర్శిస్తున్న అభ్యర్థులు
మరోవైపు సెంటర్లను చాలాదూరంలో వేశారని అభ్యర్థులు విమర్శిస్తున్నారు.. సమయానికి బస్సులు లేకపోతే అక్కడికి చేరుకోవడం తమకు ఇబ్బంది అని చెబుతున్నారు.తెలంగాణ ఏర్పాటు తరువాత భారీగా జరుగుతున్న ఈ పరీక్షకు... అన్ని ఏర్పాట్లు చేశామని టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు కూడా తాము చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని కోరుతున్నారు...

మందు పాతర పేలి జవాను మృతి..

ఛత్తీస్‌గఢ్‌ : లో రెండు వేర్వేరు చోట్ల మావోయిస్టులు అమర్చిన మందు పాతరలు పేలి ఒక జవాను మృతి చెందగా మరొక మహిళ గాయపడింది. బీజాపూర్‌ జిల్లాలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గ్రూప్‌(డీఆర్‌జీ) భద్రతా సిబ్బంది కూంబింగ్‌ చేసి తిరిగి వస్తుండగా, జవాను ముద్ర బుధ్‌రాం ప్రమాదవశాత్తు మందుపాతరపై కాలు వేయడంతో అది పేలి మృతి చెందాడు. దంతెవాడ జిల్లాలో పశువులు కాయడానికి వెళ్లిన ఓ మహిళ మందుపాతరపై కాలు వేయడంతో అది పేలి గాయాలయ్యాయి.

Don't Miss