Activities calendar

12 November 2016

22:22 - November 12, 2016

ఓ చిన్న తప్పు ఎన్నో జీవితాలును శాషిస్తోంది. మరెన్నో కుటుంబాల్లో విషాదానికి కారణమౌతుంది. ఆ తప్పు వారు చేసిన వాఇరిక ఇబందించిన వారు చేసినా.. శిక్ష మాత్రం ఎందరికో పడుతుంది. ఎవరు చేసిన తప్పుకు వారు చట్టం ప్రకారం శిక్షార్హులైతే.. వారిని నమ్ముకున్నవారు... వారిపై ఆధారపడ్డ వారు, వారి నమ్ముకున్న వారు జీవితాంతం శిక్ష అనుభవిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అందరికి పడుతుంది. ఈ ఇలాంటి ఘోరాలెన్నో కళ్ల ముందే జరుగుతున్నాయి. చట్ట రీత్య శిక్షపడ్డ వారే... శిక్షార్హులనుకుంటే పొరపాటే. జనారణ్యంలో అవమానాలు పడుతూ, అర్ధాకలితో అలమటిస్తూ కాలం వెల్లదీసేవారు కూడా శిక్ష అనుభవిస్తున్నట్లే. అనంతపురంలో జరిగిన ఓ ఘోరం రెండు కుటుంబాల కన్నీటికి కారణమయ్యింది. ఇది కథకాదు.. రియల్ స్టోరీ.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎపిలో ఐపీఎస్ ల బదిలీలు

హైదరాబాద్ : ఎపిలో ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీగా బి.వినయ్ భాష్కర్, విజయవాడ తూర్పు ఏసీపీగా భాస్కర్, విశాఖ జిల్లా పాడేరు డీఎస్పీగా ఎం.మహేంద్ర, విశాఖ చింతపల్లి డీఎస్పీగా అనిల్ కుమార్, విశాఖ హార్టర్ డీఎస్పీగా రంగరాజు, విశాఖ ద్వారక ఏసీపీగా రామచంద్రరావు, విశాఖ మధురవాడ ఎసీపీగా బీవీఎస్ నాగేశ్వరరావు, ప.గో జిల్లా పోలవరం డీఎస్పీగా ఏటీ రవికుమార్, తూ.గో జిల్లా చింతూరు డీఎస్పీగా దిలీప్ కిరణ్, శ్రీకాకుళం కాశిబుగ్గ డీఎస్పీగా టీటీ ప్రభాకర్ బాబును నియమించారు. 

21:55 - November 12, 2016

ఢిల్లీ : రాజ్‌కోట్‌ టెస్టులో... నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌... వికెట్‌ నష్టపోకుండా 114 పరుగులు చేసింది. ఓపెనర్‌ హమీద్‌ 62 పరుగులు సాధించగా... కుక్‌ 46 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 49 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ఇంగ్లాండ్‌ 163 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆదివారం ఆటకు ఆఖరి రోజు కావడంతో ఇంగ్లాండ్‌ వీలైనంత వేగంగా ఆడి భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్‌ డ్రా అయ్యే అవకాశాలే మెరుగ్గా ఉన్నాయి. అంతకు ముందు భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఏడు బౌండ‌రీల‌తో 70 ర‌న్స్ చేసిన అశ్విన్ నాలుగో రోజు కీల‌క పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌల‌ర్‌ ర‌షీద్ నాలుగు, మొయిన్ అలీ, అన్సారీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. 

 

21:54 - November 12, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారని అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి తెలిపారు. జయలలితకు ఇన్‌ఫెక్షన్ తగ్గిపోయిందని... ఆమె శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉన్నారని చెప్పారు. జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి చేస్తామన్నారు. ఐసీయూ నుంచి ఆమెను త్వరలోనే స్పెషల్‌ రూమ్‌కు మారుస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 22 న జయలలిత ఇన్‌ఫెక్షన్‌తో అపోలో ఆసుపత్రిలో చేరారు. మొదట్లో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, క్రమేణా కోలుకున్నారు. అపోలో వైద్య బృందంతో పాటు లండన్‌ ప్రత్యేక వైద్య నిపుణుడు, ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యుల ఆధ్వర్యంలో జయలలిత చికిత్స పొందారు.

 

21:51 - November 12, 2016

హైదరాబాద్ : గుంటూరులో వైద్యవిద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కారకులకు శిక్షపడేలా చూస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ హమీ ఇచ్చారు. కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తాళలేకనే సంధ్యారాణి సూసైడ్‌ చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు మంత్రి దృష్టికి తెచ్చారు. మరో రెండు నెలల్లో విద్య పూర్తి చేసుకుని తిరిగి వచ్చేదని, కానీ ఇలా వేధింపులకు బలి అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంధ్యారాణి కుటుంబానికి సానూభూతి తెలిపిన మంత్రి, వెంటనే ఏపీ ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సంధ్యారాణి కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేకున్నా.... నిందితులకు శిక్ష పడాలన్నారు. ఈ విషయంలో తాము మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని కామినేని హామీ ఇచ్చారు. మంత్రితో మాట్లాడిన కేటీఆర్‌ ఏపీ డీజీపీ సాంబశివరావుతోనూ ఫోన్‌లో మాట్లాడారు. నిందితురాలిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీజీపీ తెలిపారు. 

 

21:48 - November 12, 2016

హైదరాబాద్ : పాత 500, వెయ్యి రూపాయల నోట్ల మార్పిడికి టీ సర్కార్‌ మరో ఆఫర్‌ ప్రకటించింది. జీవో నెం.59, 92 ద్వారా నిర్మాణాలు, ఖాళీ స్థలాల క్రమబద్దీకరణకు డిమాండ్‌ నోటీస్‌ అందుకున్న వారు పాత 500, 1000 రూపాయల నోట్లు చెల్లించే వెసులుబాటు కల్పించింది. సీఎస్‌ రాజీవ్‌శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌తో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం కూడా ట్రెజరీలు, బ్యాంకులు పనిచేస్తాయని.. ట్రెజరీల ద్వారా చెల్లింపులకు అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.  

 

21:46 - November 12, 2016
21:45 - November 12, 2016

తెలంగాణలో ఈనెల 19, 20 తేదీల్లో ఎస్ ఐ రాత పరీక్ష

హైదరాబాద్ : తెలంగాణలో ఈనెల 19, 20 తేదీల్లో ఎస్ ఐ రాత పరీక్ష జరుగునుంది. 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు పేపర్ 2 పరీక్ష జరుగునుంది. 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పేపర్ 3, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 4 పరీక్ష జరుగనుంది. రేపటి నుంచి హాట్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

 

21:36 - November 12, 2016

సీఎస్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ తో సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : సీఎస్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ తో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. జీవో నెం.59, 92 ద్వారా నిర్మాణాలు, ఖాళీ స్థలాలు, క్రమబద్దీకరణకు డిమాండ్ నోటీస్ అందుకున్న వారికి రూ.500, 1000 చెల్లించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. రేపు కూడా ట్రెజరీలు,బ్యాంకులు పని చేస్తాయన్నారు.
ట్రెజరీల ద్వారా చెల్లింపులకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.

 

21:19 - November 12, 2016

రియల్ ఎస్టేట్ రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉండదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మధుకర్ రెడ్డి, క్రెడై..శేఖర్ రెడ్డి, సుధాకర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా.....

 

21:13 - November 12, 2016

వనపర్తి జిల్లాలోని అప్పాయిపల్లి, మున్ననూరుతోపాటు పలు గ్రామాల్లోని కూలీలు, రైతులు, గ్రామస్తులతో మల్లన్నముచ్చటించాడు. వారి స్థితిగతులు, బతుకుదెరువు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా కూలీలు తమ గోడును టెన్ టివికి వెల్లబోసుకున్నారు. ఆ వివరాలను వారి మాటల్లోనే.... తమకు బతుకు దెరువు లేదు. పనికి తగ్గ కూలీ లేదు. పని కోసం వేరే ఊర్లకు వలసపోతున్నాము. రోజు మొత్తం కూలీ చేస్తే వంద రూపాయలు ఇస్తే సరిపోవటం లేదు. ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు. మాకు ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. మేము సంతోషంగా లేము. దు:ఖంలో ఉన్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని' అని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

హైదరాబాద్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన బహిరంగసభలో పాల్గొని, ప్రసంగించారు.

 

20:47 - November 12, 2016
20:45 - November 12, 2016

'ఆమె అతడైతే' సినిమా టీమ్ టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా హీరో, అనీష్ , హీరోయిన్ చిరాశ్రీ, సీనియర్ ఆర్టిస్ట్ సుధ.. సినిమాకు సంబంధించిన విశేషాలు తెలిపారు. తమ అనుభవాలను విరించారు. వారు తెలిపిని మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:33 - November 12, 2016

సీనియర్ ఆర్టిస్ట్ సుధతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపారు. తన సినీ కెరీర్ గురించి వివరించారు. తన అనుభవాలను తెలిపారు. అలాగే ఆమె నటించిన ఇటీవలి చిత్రం 'ఆమె అతడైతే' సినిమా విశేషాలు చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:23 - November 12, 2016
20:19 - November 12, 2016

విశాఖ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో ఆరెస్టైన సీపీఎం నాయకులు విడుదలయ్యారు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి సీపీఎం జిల్లా కార్యదర్శి కె. లోకనాధం, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావులు నేడు జైలు నుంచి బయటకు వచ్చారు. విడుదలైన నేతలకు పెద్ద సంఖ్యలో సీపీఎం కార్యకర్తలు స్వాగతం పలికారు. నియమాలను ఉల్లంఘించిన విద్యాసంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకోకుండా అడ్డుకున్న సీపీఎం నాయకులపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. 

 

20:15 - November 12, 2016
20:13 - November 12, 2016
20:08 - November 12, 2016

వరంగల్ : 500, 1000 నోట్ల రద్దు ప్రభావం సామాన్య, మధ్య తరగతి ప్రజల మీదనే కాకుండా... వ్యాపారాలను పూర్తిగా కుదేలు చేస్తోంది. ఇప్పటికే బులియన్, ట్రేడింగ్, వ్యవసాయ మార్కెట్ లలో లావాదేవీలు పూర్తిగా నిలిచి పోయాయి. మూడు రోజులుగా ప్రజలకు నిత్యావసరాలు అందించే చిరు వ్యాపారులు కరెన్సీ రద్దుతో అల్లాడుతున్నారు. వ్యాపారులు లేక కూరగాయల మార్కెట్లు వెల వెల బోతున్నాయి. వ్యాపారాలు సాగక, చిల్లర దొరకక అవస్థలు పడుతున్న చిరువ్యాపారులు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:59 - November 12, 2016

హైదరాబాద్ : పాతనోట్లతో మున్సిపల్‌ పన్నులు, విద్యుత్ బిల్లులు, వాటర్‌ బిల్లులు చెల్లించేందుకు అవకాశం కల్పించడంతో జీహెచ్‌ఎంసీ కార్యాలయాలకు జనం పోటెత్తారు. మరో మూడు రోజులు గడువు పొడిగించడంతో బల్దియా కార్యాలయాల వద్ద రద్దీ కొనసాగుతోంది. ఇవాళ ఇప్పటివరకు 8కోట్ల బకాయిలు వసూలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

బల్దియా కార్యాలయాల వద్ద రద్దీ

హైదరాబాద్ : పాతనోట్లతో మున్సిపల్‌ పన్నులు, విద్యుత్ బిల్లులు, వాటర్‌ బిల్లులు చెల్లించేందుకు అవకాశం కల్పించడంతో జీహెచ్‌ఎంసీ కార్యాలయాలకు జనం పోటెత్తారు. మరో మూడు రోజులు గడువు పొడిగించడంతో బల్దియా కార్యాలయాల వద్ద రద్దీ కొనసాగుతోంది. ఇవాళ ఇప్పటివరకు 8కోట్ల బకాయిలు వసూలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పాకిస్తాన్ లో బాంబు పేలుడు....30 మంది మృతి

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు. బలోచిస్థాన్ రీజియన్ లో ఘటన చేటుసుకుంది. 

 

అశోకా జెమ్స్ ఆండ్ జ్యువెల్లర్స్ యజమాని దొరబాబు అరెస్టు

హైదరాబాద్ : కేపీహెచ్ బీ కాలనీలోని అశోకా జెమ్స్ ఆండ్ జ్యువెల్లర్స్ యజమాని దొరబాబును అరెస్టు చేశారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని దొరబాబు రూ.20 మంది నుంచి రూ. 80 లక్షలు వసూలు చేసి మోహం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సైఫాబాద్ ఎస్ బీఐ బ్యాంక్ వద్ద కస్టమర్ల ఆందోళన

హైదరాబద్ : సైఫాబాద్ ఎస్ బీఐ బ్యాంక్ వద్ద కస్టమర్ల ఆందోళన చేపట్టారు. పని వేళ ముగిసిందని సిబ్బంది నోట్ల మార్పిడి నిలిపివేసింది. రాత్రి వరకు బ్యాంకులు పని చేస్తాయని ప్రభుత్వం చెబుతోందంటూ వినియోగదారులు నిరసన చేపట్టారు.
 

దివిస్ నిర్మాణ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత

తూర్పుగోదావరి : దివిస్ నిర్మాణ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. దివిస్ ను వ్యతిరేకిస్తూ చేపట్టిన సీపీఎం పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు సందర్భంగా ఓ మహిళను పోలీస్ వ్యాన్ ఢీకొట్టింది. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్తికి తరలించారు. 200 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. 

 

 

18:46 - November 12, 2016

తూర్పు గోదావరి : జిల్లాలో పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రశాతంగా పాదయాత్ర చేస్తున్న సీపీఎం కార్యకర్తలు, మహిళలపై పోలీసులు విరుచుకుపడ్డారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దివిస్ నిర్మాణ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. దివిస్ ను వ్యతిరేకిస్తూ చేపట్టిన సీపీఎం పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. నేతలను ఈడ్చుకెళ్లి.. వ్యాన్ లో పడేశారు. మహిళలపై మగ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి వ్యాన్ లో పడేశారు.  200 మందిని అరెస్టు చేశారు. మహిళలపై నుంచి పోలీసు జీపు ఎక్కించారు. నేతలను అరెస్టు చేసి తీసుకెళ్తున్న వ్యాన్ కు అడ్డంగా కార్యకర్తలు రోడ్డుపై పడుకున్నారు. ఈ ఈ క్రమంలో పోలీసు వ్యాన్ ఓ మహిళను ఢీ కొట్టింది. మహిళ కాలుపై నుంచి వ్యాన్ వెళ్లింది. ఆమె తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆమెను తుని ఆస్పత్రికి తరలించారు. 500 మంది పోలీసులు మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:04 - November 12, 2016
18:03 - November 12, 2016

ఢిల్లీ : నవంబర్‌ 11 నుంచి ఏటిఎంలు పనిచేయడం ప్రారంభించినా...కేవలం వంద రూపాయల నోట్లకే పరిమితమైంది. కొత్తగా వచ్చే ఐదు వందలు, రెండు వేల నోట్లు రావడానికి మరో నెలరోజులు పట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఎందుకంటే కొత్త ఐదు వందల నోటు సైజు పాత ఐదు వందల నోటు కన్నా పూర్తిగా భిన్నంగా ఉంది. 2 వేల నోటుకు సంబంధించి ఇంకా స్లాటే పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో పెద్ద నోట్లు ఎటిఎంల నుంచి ఇప్పుడప్పట్లో వచ్చేలా లేవు. ఎటిఎంలో కొత్త స్లాటు తొందరగా ఏర్పాటు చేయకుంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. చిన్ననోట్ల వల్ల ఎటిఎం తొందరగా ఖాళీ అవుతుండడంతో ప్రజలు అసహనానికి లోనవుతున్నారు. జర్మనీ, జపాన్‌ల నుంచి కొత్త సాఫ్ట్‌వేర్‌ను తెప్పించి ఎటిఎంలలో కొత్తనోట్లను లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అప్పటివరకు వంద నోట్లే శరణ్యం.

 

17:59 - November 12, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దు నిర్ణయం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా టాలీవుడ్‌ ఈ ఎఫెక్ట్ బాగానే పడింది. పెద్ద నోట్ తొలగింపుతో సినిమాల విడుదలతో పాటు షూటింగ్స్‌  కూడా నిలిచిపోయి దర్శక నిర్మాతలు, నటులు విలవిల్లాడుతున్నారు. కేంద్రం నిర్ణయంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. 
టాలీవుడ్‌కు పెద్ద షాక్ 
ఎవరూ ఊహించని విధంగా కేంద్రం 500, వేయి రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్‌కు పెద్ద షాకిచ్చింది. తాజాగా విడుదలైన సినిమాలపై నోట్ల రద్దు ఎఫెక్ట్‌ తీవ్రంగా కనిపిస్తోంది. శుక్రవారం రిలీజయిన నాగ చైతన్య మూవీ సాహసం శ్వాసగా సాగిపో సినిమాపై ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. సినిమా బాగుందన్న టాక్‌ వినిపిస్తున్నా... చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర ఆడియెన్స్‌ లేకపోవడం శోచనీయం. అలాగే రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన అల్లరి నరేష్‌ కూడా.. ఇంట్లో దయ్యం నాకేంటీ భయం సినిమాను వాయిదా వేశారు. ఈ సినిమాలే కాదు.. మిగతా సినిమాలపైనా నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా పడింది. 
సినీ సెలబ్రిటీస్‌పై ఐటీ దాడులు 
సినిమాల రిలీజులు షూటింగ్‌ నిలిచిపోవడమే కాదు.. అనుమానిత సినీ సెలబ్రిటీస్‌పై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. శుక్రవారం బాహుబలి నిర్మాతలు యార్లగడ్డ శోభు, దేవినేని  ప్రసాద్‌పై జరిగిన దాడుల్లో 50 కోట్లు పట్టుబడినట్లు వినిపిస్తోంది. అయితే ఈ డబ్బు బ్లాక్‌ మనీ కాదనేది నిర్మాతల వాదన. ఈ డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు, అధికారులకు ఆ నిర్మాతలు సదరు డాక్యుమెంట్లు చూపించినట్లు తెలుస్తోంది. అదే ఊపుతో శనివారం బాహుబలి డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. 
ఓ హీరో ఇంట్లో 25 కోట్ల నగదు..?
అదేవిధంగా ఓ హీరో ఇంట్లో ఏకంగా 25 కోట్ల నగదు ఉన్నట్లు ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. వేరే లావాదేవీల కోసం ఇంత పెద్ద మొత్తాన్ని తెచ్చి ఇంట్లో పెట్టినట్లు సమాచారం. అయితే.. మరో రెండు రోజులు ఆగితే పేమెంట్స్‌ పూర్తవుతాయనగానే.. ప్రధాని నరేంద్రమోదీ నోట్ల రద్దు ప్రకటన చేశారు. ఇప్పుడా పాతిక కోట్లను ఏం చేయాలన్న డైలామాలో సదరు హీరో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న బిపాషా బసుకు రోజు వారీ వైద్య ఖర్చులకు డబ్బులు దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. కేంద్రం తీసుకున్న నిర్ణయం సినీ సెలబ్రిటీస్‌పై తీవ్ర ప్రభావమే చూపుతోంది.
సినిమాలకు కష్టాలు
బాలీవుడ్, టాలీవుడ్‌లలో అగ్ర హీరోలు సినిమాల నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హీరోలకు, దర్శకులకు కూడా పారితోషికాలు భారీగానే ఉంటున్నాయి. ఈ సొమ్ములో అధిక భాగం నల్లధనమేనని పలువురు గతంలో వెల్లడించారు. ఇప్పుడు  500, 1000 నోట్ల రద్దుతో బ్లాక్ మనీ మారకం ఆగిపోవడంతో సినిమా రంగంలో నల్ల ధనం రూపంలో జరిగే భారీ చెల్లింపులు ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. పలు భారీ ప్రాజెక్టులు మందగించడంతో పాటు.. ఆయా సినిమాలను  నల్ల డబ్బుతో కొనే బయ్యర్లకు డబ్బు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. సినిమాల కొనుగోళ్లు ఆగిపోవడంతో,  తద్వారా ఆయా సినిమాలు సైతం కష్టాలు ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు అంచనా. కొన్ని సినిమాల షూటింగ్‌లు సైతం ఆగిపోవడంతో.. నిత్యం షూటింగ్‌లపై ఆధారపడి జీవించే కార్మికులు, జూనియర్‌ ఆర్టిస్టులు, కిందిస్థాయి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ షూటింగ్‌లపై ఆధారపడి బతికే అనేక క్రాఫ్ట్‌ల కార్మికులు సైతం... తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

డ్వాక్రా, మెప్మా సంఘాలకు 10 వేల కోట్లు : సీఎం చంద్రబాబు

శ్రీకాకుళం : కుంకుమ, పసుపు కింద పది వేల కోట్లు మహిళలకు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. తనకు అత్యంత దగ్గరున్న వ్యవస్థ డ్వాక్రా, మెప్మా సంఘాలని పేర్కొన్నారు. డ్వాక్రా, మెస్మా సంఘాలు ఐక్యమత్యంగా ఉన్నారని చెప్పారు. 'మీ పట్ల నా ప్రేమ, ఆదరణ తగ్గదని' సీఎం చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలన్నారు. 

గ్రూప్ 2 పరీక్షపై ఘంటా చక్రపాణి ప్రెస్ మీట్

హైదరాబాద్ : నిన్న జరిగిన గ్రూప్ 2 పేపర్ 1, 2 పరీక్ష సజావుగా జరిగిందని టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న ఇబ్బందులు మినహా పరీక్ష ప్రశాంతంగా కొనసాగిందని తెలిపారు. పరీక్ష పారదర్శకంగా, పక్బందిగా ఎలాంటి అపోహలకు తావుకుండా జరిగిందన్నారు. అయితే కొంతమంది అపోహలు పుట్టిస్తున్నారని వాటిని నమ్మొద్దని పేర్కొన్నారు.

17:49 - November 12, 2016

హైదరాబాద్ : ఈ నెల 11న జరిగిన గ్రూప్-2 పేపర్ 1, 2 పరీక్ష సజావుగా జరిగిందని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షకు 5 లక్షల 17 వేల 811 మంది అభ్యర్థులు హాజరయ్యారని, 65 శాతం హాజరు నమోదైందని తెలిపారు. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని.. ఓఎంఆర్ షీట్ మార్పిడి విషయంలో అభ్యర్థులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని చెప్పారు. పరీక్ష పూర్తి పారదర్శకంగా నిర్వహించామని అభ్యర్థులు అపోహలను నమ్మొద్దని కోరారు. రేపు జరిగే పేపర్ 3, 4 పరీక్షకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. పరీక్షకు సంబంధించిన పూర్తి బాధ్యత టీఎస్ పీఎస్ సీదేనని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీసు, ఆర్టీసీ అందరూ కలిసి సమిష్టిగా పరీక్షను నిర్వహిస్తున్నారని తెలిపారు. బార్ కోడ్ కు సంబంధించి ఎలాంటి ఆందోళన చెందవద్దని.. బుక్ లెట్ కోడ్ ఉంటే సరిపోతుందని చెప్పారు. ఇవాళ ఉదయం నుంచి పరీక్ష నిర్వహణపై రకరకాల ప్రకటనలు వచ్చాయని తెలిపారు. భూపాల్ పల్లి జిల్లా ములుగు సెంటర్ లో నిన్న జరిగిన ఘటనపై ఓ పత్రిక ప్రత్యేకం కథనం కూడా ప్రసారం చేసిందన్నారు. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత అభ్యర్థిదని తెలిపారు. తాము నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి, దరఖాస్తుల చేస్తున్నప్పుడు జిల్లాలు విభజన జరగలేదని చెప్పారు. పరీక్ష నిర్వహణలో గందరగోళం జరిగిందని కొన్ని పత్రికలు అంటున్నాయని.... వాటిపై వివరణ ఇచ్చేందుకే ఈ ప్రెస్ మీట్ నిర్వహించామని తెలిపారు. 

 

17:35 - November 12, 2016

శ్రీకాకుళం : మహిళలకు అపారమైన తెలివితేటలు, సామర్థ్యాలున్నాయని.. వారిని ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు చెప్పారు. జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్వాక్రా, మెప్మా సంఘాల బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు. 1995 సం.లో డ్వాక్రా సంఘాన్ని ప్రారంభించామని తెలిపారు. పొదపు ఉద్యమంతో శ్రీకారం చూట్టామన్నారు. ఇప్పటి వరకు 9 లక్షల సంఘాలు, 90 లక్షల మంది సభ్యులున్నారని తెలిపారు. పొదుపు ఎంత చేస్తే అంత రివాల్వింగ్ ఫండ్ ఇచ్చామని గుర్తుచేశారు. నాడు మహిళలను విమర్శించిన వారికి ఇప్పుడు నోటి మాట రావడం లేదన్నారు. మహిళలు గ్రామాల్లో ఉద్యమాలు చేశారని, భర్తలకు చదువు నేర్పించారని తెలిపారు. కుటుంబ నియంత్రణకు పిలుపిస్తే పాటించారని పేర్కొన్నారు. 10సం.లో ప్రపంచలో ఎక్కడ లేని విధంగా కుటుంబ నియంత్రణకు ముందుకు వచ్చారని తెలిపారు. అయితే ఇప్పుడు కుటుంబాన్ని పెంచాలని కోరుతున్నామన్నారు. ఎపిలో జనాభా తగ్గుతుందని చెప్పారు. జనాభా పెంచాలని కోరారు. ఎంతమంది చనిపోతే... అంత మంది పుట్టాలన్నారు. కుంకుమ, పసుపు కింద పది వేల కోట్లు మహిళలకు ఇస్తున్నట్లు ప్రకటించారు. తనకు అత్యంత దగ్గరున్న వ్యవస్థ డ్వాక్రా, మెప్మా సంఘాలని పేర్కొన్నారు. డ్వాక్రా, మెస్మా సంఘాలు ఐక్యమత్యంగా ఉన్నారని చెప్పారు. 'మీ పట్ల నా ప్రేమ, ఆదరణ తగ్గదని' సీఎం చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలన్నారు. 

 

17:06 - November 12, 2016

గుంటూరు : రూ. 500, 1000 నోట్ల రద్దుతో పట్టణాల్లోని ప్రజలు అల్లాడుతుంటే.. గ్రామా ల్లోని ప్రజలు అంతకంటే.. ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ రాజధాని గ్రామాల్లోని రైతులు, సాధారణ ప్రజలు పెద్ద నోట్ల రద్దు కారణంగా అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాజధాని గ్రామాల్లోని బ్యాంకుల వద్ద తాజా పరిస్థితిని వీడియోలో చూద్దాం..

 

16:59 - November 12, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు విషయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ముందే తెలుసని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ సమాచారం ముందుగానే లీకవడంతో చంద్రబాబు, టీడీపీ నేతలు సర్దుకున్నారని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:43 - November 12, 2016

వరంగల్ : జిల్లాలోని పరిధిలోని ఐదు జిల్లాల్లో ఏటీఎంలు పూర్తిస్థాయిలో పని చేయకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు.  బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద బారులు తీరారు .. చిల్లర కోసం భారీ సంఖ్యలో జనం బ్యాంకులు, పోస్టాఫీసుల వద్దకు చేరుకుంటున్నారు. డబ్బులు కోసం గంటల కొద్ది నిరీక్షణ తప్పడం లేదని..మహిళలు.. వృద్ధులు తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:38 - November 12, 2016

విజయవాడ : రద్దు చేసిన పెద్ద నోట్ల మార్పిడి కోసం బ్యాంకులు దగ్గర జనం బారులు తీరారు.  గంటల తరబడి వేచివున్న చేతికి నగదు అందే పరిస్థితి కనిపించడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గర ఉన్న సొమ్మును డిపాజిట్‌ చేసేందుకు వస్తున్న ఖాతాదారులకు కూడా ఇబ్బందులు తప్పడంలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:35 - November 12, 2016

హైదరాబాద్ : పన్నుల రూపంలో నిన్న ఒక్కరోజే 55 కోట్లు రావడంతో..జీహెచ్ఎంసీ అధికారులు పాతబకాయిల వసూలుకు కసరత్తు ముమ్మరం చేశారు. సిబ్బందిని అధికంగా పెంచడంతో పాటు అవకాశం ఉపయోగించుకోవాలని పన్నుబకాయిదారులకు మెసేజ్ లతో పాటు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు పన్నులు చెల్లించడం వల్ల మార్చిలో విధించే 24 శాతం వడ్డీ కూడా మినహాయింపు ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పన్ను చెల్లింపు ప్రయోజనాలపై విస్త్రృతంగా ప్రచారం చేస్తున్నామని చెప్పారు.

తుర్కయంజాల్ లో విషాదం

రంగారెడ్డి : తుర్కయంజాల్ లో విషాదం నెలకొంది. తల్లీకొడుకు అనుమానాస్పద మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే వీరి మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

శ్రీకాకుళం : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్వాక్రా, మెప్మా సంఘాల బహిరంగ సభలో పాల్గొని, మాట్లాడారు. మహిళలకు అపారమైన తెలివితేటలు, సామర్థ్యాలున్నాయని కొనియాడారు.
వారిని ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు.  

15:56 - November 12, 2016

హైదరాబాద్ : పాతనోట్లతో మున్సిపల్‌ పన్నులు, విద్యుత్ బిల్లులు, వాటర్‌ బిల్లులు చెల్లించేందుకు అవకాశం కల్పించడంతో.. జీహెచ్‌ఎంసీ కార్యాలయాలకు జనం పోటెత్తుతున్నారు. మరో మూడు రోజులు గడువు పొడిగించడంతో బల్దియా కార్యాలయాల వద్ద జనం బారులు తీరుతున్నారు. సిబ్బందిని క్షేత్రస్థాయిలోకి పంపి పన్నులు వసూళ్లు చేసేందుకు అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

పాక్ సైన్యం కాల్పుల్లో భారత జవాను మృతి

జమ్మూకాశ్మీర్ : కెరన్ సెక్టార్ లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపారు. పాక్ సైన్యం కాల్పుల్లో ఓ భారత జవాను మృతి చెందారు. 

 

కాంగ్రెస్ ఓబీసీ సెల్ కార్యకర్తల అరెస్టు

హైదరాబాద్ : గాంధీభవన్ రోడ్డుపై కాంగ్రెస్ ఓబీసీ సెల్ సభ్యులు బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని పలువురిని అరెస్టు చేశారు. 

15:47 - November 12, 2016

సంగారెడ్డి : ప్రధాని నరేంద్రమోడీపై మాజీ విప్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కరెన్సీని రద్దు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈమేరకు సంగారెడ్డి ఎస్ బీహెచ్ ముందు కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తానన్న హామీని విస్మరించారు. అక్కడి డబ్బులను తీసుకురాలేక దేశంలోని రూ.500, 1000 నోట్లను రద్దు ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోడీ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:28 - November 12, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు సాహసోపేతమైన నిర్ణయమని కేంద్రఅర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఢిల్లీలో బ్యాంకర్లతో అరుణ్ జైట్లీ అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చిల్లర కొరత చీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రతి రోజు నోట్ల మార్పిడిని సమీక్షిస్తున్నామని చెప్పారు. ఎస్ బీఐలో రెండు కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. నోట్ల మార్పిడి ప్రారంభమై మూడు రోజులైందని తెలిపారు. ప్రతి రోజు బ్యాంకర్ల నుంచి డాటా తెప్పించుకుంటున్నామని తెలిపారు. బ్యాంకు సిబ్బంది సెలవులు కూడా తీసుకోకుండా విధుల నిర్వహిస్తున్నారు.

 

బ్యాంకర్లతో అరుణ్ జైట్లీ అత్యవసర సమావేశం

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు సాహసోపేతమైన నిర్ణయమని కేంద్రఅర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఢిల్లీలో బ్యాంకర్లతో అరుణ్ జైట్లీ అత్యవసర సమావేశం నిర్వహించారు. చిల్లర కొరత చీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

ఇప్పటివరకు రూ.3.5 కోట్ల పన్ను వసూలు : జీహెచ్ ఎంసీ కమిషనర్

హైదరాబాద్ : ఇప్పటి వరకు రూ.3.5 కోట్ల పన్ను వసూలు అయిందని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ ఉండదన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే పన్ను చెల్లింపు దారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. 

15:14 - November 12, 2016

జీహెచ్ ఎంసీలో రెండో రోజు కొనసాగుతున్న పన్ను వసూళ్లు

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో రెండో రోజు పన్ను వసూళ్లు కొనసాగుతోంది. సిబ్బందిని క్షేత్రస్థాయిలో పంపి బిల్దియా పన్నుల వసూళ్లకు ప్లాన్ చేస్తోంది. 

డీసీపీ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ : డీసీపీ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాతబస్తీ మీరాలమండిలో ఉప్పు అధిక రేట్లకు అమ్ముతున్నారనే సమచారంతో సోదాలు నిర్వహించారు. 

 

13:59 - November 12, 2016

హైదరాబాద్‌ : నాచారంలో సెల్‌ఫోన్‌ దొంగ హస్తలాఘవం ప్రదర్శించాడు. భవానీ నగర్‌లోని ఓ పూజా స్టోర్స్ యజమానురాలికి టోకరా ఇచ్చాడు. ఆమెను మాటల్లోకి దించి 20 వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను నొక్కేశాడు. ఆలస్యంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో దొంగ చేతివాటం బయటపడింది. దీంతో షాప్‌ యజమానురాలు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సీసీటీవీ పుటేజీని పరిశీలించి దొంగ కోసం వేటప్రారంభించారు.  

13:57 - November 12, 2016

గుంటూరు : పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏపీ ఖజానాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రజలంతా పాత నోట్లను మార్చుకునేందుకు ఆసక్తి చూపడంతో రెండురోజులుగా వ్యాపారాలు కుదేలయ్యాయి. భూముల రిజిస్ట్రేషన్,బంగారం కొనుగోళ్లు, రియల్‌ రంగాల్లో లావాదేవీలు జరగడం లేదు. దీంతో వాణిజ్య పన్నుల రూపంలో రావాల్సిన సర్కారు ఆదాయానికి గండి పడుతోంది. మరో రెండు వారాల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.

500, 1000 నోట్ల రద్దుతో కుదేలవుతున్న ఏపీ ఖజానా
ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా తయారైంది ఏపీ ఆర్థిక పరిస్థితి. కేంద్రం తీసుకున్న 500, 1000 నోట్ల రద్దు నిర్ణయంతో..అసలే కష్టాల్లో ఉన్న ఏపీ ఖజానా మరింత కుదేలవుతోంది. వ్యాపారాల్లో లావాదేవీలు జరుగకపోవడంతో..టాక్స్ రూపంలో రావాల్సిన ఆదాయానికి భారీగా చిల్లుపడుతోంది. మరోవైపు వంద నోట్ల కొరత తీవ్రం కావడంతో పెద్దగా బిజినెస్ జరగడం లేదు. దీంతో సర్కారు ఖజానాకు రావాల్సిన వాణిజ్య పన్నులు ఒక్కసారిగా పడిపోయాయి. దాదాపు అన్ని వ్యాపారాలు చతికిల పడ్డాయి.

రాష్ట్రంలో ప్రతినెలా సుమారు రూ. 27 వేల కోట్ల లావాదేవీలు
సాధారణంగా రాష్ట్రంలో ప్రతినెలా సుమారు 27 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. ఇందులో తొమ్మది శాతం అంటే దాదాపు 2వేల 500 కోట్లు వివిధ పన్నుల రూపంలో ఖజానాకు చేరుతుంది. అంటే సగటున రోజుకు సుమారు 85 కోట్ల రూపాయలు పన్ను రూపంలో చేరాల్సి ఉంది. అయితే కేంద్ర నిర్ణయంతో రెండు రోజులుగా పన్ను రాబడి పూర్తిగా తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. నష్టపోయిన వ్యాపారాలు తిరిగి కోలుకోవాలంటే సమయం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆర్థిక స్తబ్దతను తొలగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు
కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయం అటు ప్రభుత్వాలపైనా..ఇటు ప్రజలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనడంలో సందేహం లేదు. దీంతో వీలైనంత త్వరగా ఆర్థిక స్తబ్దతను తొలగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 

13:54 - November 12, 2016

వికారాబాద్ : సీపీఎం మహాజనపాదయాత్ర 27వ రోజుకు చేరింది.. వికారాబాద్‌ జిల్లాలో సీపీఎం బృందం పర్యటిస్తోంది.. పాదయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు భాస్కర్‌ అందిస్తారు..ఈ సందర్భంగా వృత్తిదారుల సంఘం నేత రమణ మాట్లాడుతూ..వృత్తిదార్లందరూ స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత కూడా చేనేత కార్మికుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదన్నారు. స్వంత రాష్ట్రం వచ్చిన తరువాత తమ బాగుపడతాయని ఆశపడ్డామనీ..కానీ ఇప్పటికీ సమస్యలు కొనసాగుతున్నాయని పాదయాత్రలో భాగంగా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. నానాటికీ చేతివృత్తులు నిర్వీర్యమైపోతున్నాయన్నాయన్నారు..అలాగే చేనేత కార్మికుల పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. రెండున్న సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేనేత సంక్షేమంకోసం నిధులు కేటాయించలేదన్నారు. ఓ స్కూలులోని విద్యార్థులకు కట్టుకునేందుకు సరైన దుస్తులు కూడా లేని స్థితిలో వున్నారన్నారు. 

13:43 - November 12, 2016
13:42 - November 12, 2016

నిజామాబాద్ : గ్రామీణ ప్రాంత ప్రజల కొత్త ఆలోచనల ఆవిష్కరణలకు వేదికగా నిజామాబాద్‌లో డిజిటల్‌ రూరల్‌ టీ హబ్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే హైదరాబాద్‌ వెయ్యి అంకుర సంస్థలకు అవకాశం కల్పించేందుకు వీలుగా టీ హబ్‌ రెండో దశ నిర్మాణాన్ని చేపడుతున్నారు. టీ హబ్‌లో జరిగిన సదస్సులో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఈ కేటీఆర్ ఈ విషయాలు చెప్పారు. టీ హబ్‌ మొదటి దశ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయాన్ని గుర్తు చేశారు. 

13:18 - November 12, 2016

జపాన్ : ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన కొనసాగుతోంది. మూడు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రధాని మాట్లాడుతూ నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేశామని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవుసరం లేదనీ..డిసెంబర్ 30వరకూ పాతనోట్లను మార్చుకునే వీలుందని తెలిపారు. గత రెండున్నర ఏళ్ళలో రూ.లక్షా 25వేల బ్లాక్ మనీ వెలుగు చూసిందని తెలిపారు. 

బాహుబలి నిర్మాతలపై ఐటీ దాడులు..

హైదరాబాద్ : బాహుబలి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ లతో పాటు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలోని డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లు, కార్యాలయాలపై ‘ఐటీ’ దాడుల నిమిత్తం 30 టీమ్ లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే రూ.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు నేడు ఓపెన్ చేయనున్నారు.

12:59 - November 12, 2016

నిజామాబాద్ : అట్టహాసంగా ప్రారంభించారు.. ఆరు నెలలకే అటకెక్కించారు. అన్నదాతలకు ఆసరా అనుకున్న పథకాన్ని కాస్తా నీరుగార్చేశారు. నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డ్‌లో నామ్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ..నామ మాత్రమే అయింది. దీంతో రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర లభించడం గగనంగా మారింది.

నామ మాత్రమైన నామ్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌
నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డ్‌లో ఆరు నెలల క్రితం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నామ్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభించారు. రైతుకు మద్దతు ధర ఉండేవిధంగా కేంద్రం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో రైతులు తమ ఉత్పత్తులను స్థానిక మార్కెట్‌కు తీసుకువస్తే దేశంలో ఏ వ్యాపారైన.. ఎక్కడ మార్కెట్‌ నుంచైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో రైతుల ఉత్పత్తులకు ఎక్కువ రేటు వచ్చే అవకాశం ఉంది. అయితే సర్వర్‌ పనిచేయకపోవడంతో.. ఈ విధానం అమలు కావడం లేదు.

రైతుల వివరాల నమోదుకు సహకరించని సర్వర్‌
మార్కెట్‌ యార్డ్‌కు వందల నుంచి వేల సంఖ్యలో వచ్చే రైతుల వివరాలు నమోదు చేయడానికి నామ్‌ సర్వర్‌ సహకరించడం లేదు. ఈ విషయాన్ని మార్కెట్ సిబ్బంది.. ఢిల్లీ అధికారులకు తెలియజేశారు. దీంతో ఓ బృందం ఇక్కడకు వచ్చి..పరిశీలించి వెళ్లింది. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో రైతులు తీసుకొచ్చిన ఉత్పత్తులను యార్డ్‌లో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ విధానంలోనే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది..రైతులకు మద్దతు ధర లభించడం కష్టంగా మారింది.

సిండికేట్‌గా మారి ధరను శాసిస్తున్న వ్యాపారులు
పాత విధానం వ్యాపారులకే ఉపయోగపడుతుంది. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ముందుగా ఒక ధరను నిర్ణయించుకుని.. అందరూ అదే ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటి వరకు ఈ యార్డ్‌లో 80 వేల క్వింటాళ్ల సోయా అమ్మకాలు జరిగాయి.. కానీ ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర లభించలేదు. అలాగే మొక్కజొన్న కొనుగోళ్లుకు కూడా మద్దతు ధర లభించలేదు. అదే నామ్‌ అమల్లో ఉంటే రైతులు లాభం చేకూరేది. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి పెట్టి.. మార్కెట్‌ యార్డ్‌లో నామ్‌ అమలయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. కనీస ధర రాకపోవడంతో ఎలా బతకాలో తెలియడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

12:54 - November 12, 2016

హైదరాబాద్ : లోటస్‌పాండ్‌లోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించారు. ప్రత్యేక హోదా ఎజెండాగా పార్లమెంట్‌లో పోరాడాలని సమావేశంలో నిర్ణయించారు.. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని జగన్ దిశానిర్దేశం చేసినట్లు ఎంపీ మేకపాటి తెలిపారు. 

12:51 - November 12, 2016

శ్రీకాకుళం : సిక్కోలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.. శ్రీకాకుళంలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.. ముత్యాలమ్మగుడి నుంచి ఏడురోడ్లకూడలివరకు జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు..జిల్లాకు సంబంధించిన మంత్రులు అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, పలువురు తెదేపా నేతలు,కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

12:48 - November 12, 2016

అనంతపురం : తాడిపత్రిలో ఉద్రిక్తత ఏర్పడింది.. తాడిపత్రి ఇంచార్జ్‌గా బాధ్యతల స్వీకరణకు పాదయాత్రగా వైసీపీ నేత పెద్దారెడ్డి బయలుదేరారు.. ఎర్రగుంటపల్లి దగ్గరకు రాగానే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.. 30 యాక్ట్‌ అమలులోఉందని పెద్దారెడ్డిని ఆపేశారు.. పోలీసులతీరుపై పెద్దారెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు..

12:46 - November 12, 2016

సంగారెడ్డి : జిల్లాలో ఒక కేజీ ఉప్పు ప్యాకెట్ ను రూ200 రూపాయలకు విక్రయించారు. పట్టణంలోని పాత బస్టాండ్‌ సెంటర్‌లో ఉప్పు ప్యాకెట్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. ఎవరో నాలుగు బస్తాల్లో ఉప్పును తీసుకువచ్చి అమ్మడం ప్రారంభించడంతో.. చాలామంది ఉప్పు ప్యాకెట్లను కొనడం ఆరంభించారు. దీంతో అక్కడ రద్దీ నెలకొంది. కాగా రాష్ట్ర రాజధాని హైదరబాద్ లోని ఉప్పు ధర పెరిగిందని పుకార్లు చెలరేగాయి. బోరబండ, సనత్ నగర్, బాలానగర్, పాతబస్తీల్లో కిలో ఉప్పు ప్యాకెట్ రూ.200 నుండి రూ.300లు కొన్ని ప్రాంతాలలో రూ. 500లకు వ్యాపారులు విక్రయించి దోపిడీ చేశారు. దీంతో ఉప్పు కొరత పుకార్లను నమ్మొద్దంటూ సీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ఉప్పును బ్లాక్ లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.

శ్రీకాకుళంలో పర్యటిస్తున్న చంద్రబాబు..

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటన కొనసాగుతోంది. శ్రీకాకుళం కలెక్టరేట్‌ ఆవరణలో పలు అభివృధ్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం శ్రీకాకుళంలోని ముత్యాలమ్మ ఆలయం నుంచి సీఎం పాదయాత్ర ప్రారంభించారు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, పలువురు తెదేపా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెచ్చిపోయిన మహిళా దొంగలు..

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో మహిళా దొంగలు రెచ్చిపోయారు. ప్రశాంత్‌నగర్‌లోని థియేటర్ దగ్గర ఉన్న దంపతుల క్లినిక్‌పై దాడి చేసి బ్యాంకులో మార్చుకునేందుకు తమ వద్ద పెట్టుకున్న సొత్తును అపహరించుకు పోయారు. దంపతులు రాంగోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు. సీసీ టీవీ కెమెరా పెట్టుకోకపోవడంపై పోలీసులు అసహనం వ్యక్తం చేశారు.

12:27 - November 12, 2016

ఖమ్మం : సెల్ఫీ పిచ్చి రోజురోజుకీ మితిమీరిపోతోంది. సెల్ఫీపై మోజుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న సందర్భాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనే ఖమ్మం జిల్లాలో జరిగింది. టేకులపల్లి వంతెన వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.నాగార్జున సాగర్ కెనాల్ కు నీటిని విడుదల చేశారు. దీంతో విహారానికని విజయ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు సాగర్ కాలువ వద్దకు వచ్చారు. నిండుగా వున్న సాగర్ కాలువను చూసి ముగ్ధులైన  పరమేశ్వర్, నాగరాజు అనే ఇద్దరు విద్యార్థులు సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారు. విద్యార్థులకోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ సురేష్ కుమార్ గాలింపు చర్యల్ని పరిశీలించారు.

12:09 - November 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం చలితో వణుకుతోంది. శీతల గాలులకు ప్రజలు గజగజ వణుకుతున్నారు. తెల్లవారుజామున దట్టమైన మంచు అలుముకుంటుంది. అన్ని జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గత 24 గంటల్లో రాత్రి సమయాల్లో 4 నుంచి 8 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

పంటలపై చలి ప్రభావం
పగలు.. రాత్రి ఉష్ణోగ్రతలు భారీ తేడా ఉన్నందున.. పంటల ఎదుగుదలపైనా కూడా తీవ్ర ప్రభావం పడుతోందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఈ ప్రభావం ఎక్కువగా వరిపైరుపై ఉంటుందని.. ధాన్యం దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు.

చలితో వణుకుతున్న తెలంగాణ రాష్ట్రం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చలి అధికంగా ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. హైదరాబాద్‌లో 12 డిగ్రీలు, మెదక్‌లో 11 డిగ్రీలు, ఆదిలాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌లో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 8 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. అలాగే మెదక్, నల్లగొండ, హైదరాబాద్, హన్మకొండల్లో సాధారణం కంటే ఏడు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు తగ్గాయి.

మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో చలిగాలులు
ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో... రాత్రి పూట చలిగాలులు వీస్తున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి చలిగాలులు వీస్తుండడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని...మరో రెండు రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య భారీ తేడా
పగలు, రాత్రి ఉష్ణోగత్రలు మధ్య భారీ తేడా కనిపిస్తోంది. ఆదిలాబాద్‌లో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీలు కాగా, రాత్రి 13 డిగ్రీలుగా ఉంది. మెదక్‌లో పగలు 31 డిగ్రీలు, రాత్రి ఏకంగా 11 డిగ్రీలకు పడిపోయాయి. హైదరాబాద్‌లో గరిష్టంగా 31 డిగ్రీలు ఉండగా.. కనిష్టంగా 12 డిగ్రీలు ఉండటం గమనార్హం. 

12:02 - November 12, 2016

మెదక్ : మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో రెండు వేల రూపాయల నోట్లను పొందటం.. వాటిని చిల్లరగా మార్చుకోవడం మహా కష్టంగా మారింది. దీంతో నిత్యావసరాలను తీర్చుకోవడానికి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే కొన్ని బ్యాంకులు ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని వంద రూపాయల నోట్లను ఇస్తుండటంతో ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది. సంగారెడ్డిలోని యాక్సిస్ బ్యాంకు ప్రజల అవస్థలకు కొంతమేరకు ఊరటిను కలిగిస్టున్నట్లుగా తెలుస్తోంది. 

ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ మృతి..

ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటన నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అబూజ్‌మడ్ ప్రాంతంలో ఇవాళ మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఎల్‌వోఎస్ డిప్యూటీ కమాండర్ బోటి కశ్యప్ మృతిచెందారు.

తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం..

తిరుమల : రహదారిలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. చెన్నైకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న ఓ కారు 13వ మలుపు వద్ద అదుపుతప్పి ఫెన్సింగ్ ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో నలుగురు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

11:41 - November 12, 2016

హైదరబాద్ : పెళ్లిళ్ల సందడి మొదలైంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా వెడ్డింగ్‌ కలెక్షన్స్‌, షాపింగ్‌ మాల్స్‌అన్నీ కస్టమర్లతో కలకలలాడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్లో సరికొత్తగా ఏర్పాటు చేసిన డిజైనర్స్‌ ఎక్స్‌పో అందరిని ఆకట్టుకుంటోంది.

నగరంలో షాపింగ్‌ సందడి
పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో హైదరాబాద్ నగరంలో షాపింగ్‌ సందడి మొదలైంది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో నగరంలో ఫ్యాషన్‌ ఎక్స్‌పోలు కూడా ఊపందుకున్నాయి. నగరంలోని తాజ్‌కృష్ణలో ఏర్పాటు చేసిన డిజైనర్స్‌ ఎక్స్‌పో అందరిని ఆకట్టుకుంటోంది. టాలీవుడ్‌ హీరోయిన్లు ఈ ఎక్స్‌పోని ప్రారంభించారు. పెళ్లి కూతురుకు కావాల్సిన అన్ని రకాల లేటెస్ట్‌ డిజైన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు చూసిన ఎక్స్‌పోలకు భిన్నంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వెడ్డింగ్‌ కలెక్షన్స్‌ మగువలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇమిటేషన్‌ జ్యూవెలరీ, డిజైనర్ సారీస్‌, డిజైనర్ డ్రెస్‌ మెటీరియల్స్, ప్రింటెడ్‌ సారీస్‌ మహిళల మనసును దోచుకుంటున్నాయి.

లేటెస్ట్‌ ఫ్యాషన్‌ ట్రెండ్స్‌
ఎప్పటికప్పుడు వస్తున్న లేటెస్ట్‌ ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ను సిటీ మహిళలు ఫాలోఅవుతున్నారు. అందుకే వివధ మెట్రో సిటీస్‌లో సందర్భాన్ని బట్టి ఎక్స్‌ కల్చర్‌ మారుతోంది. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన డిజైనర్‌ వెడ్డింగ్‌ కలెక్షన్స్‌..నగరంలోని మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కత్తా నుంచి వచ్చిన డిజైనర్స్‌ తమ డిజైన్స్‌ను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు.

తాజ్‌కృష్ణ హోటల్లో అలరిస్తున్న డిజైన్ ఎక్స్ పో
పెళ్లిలో అందరూ ప్రత్యేకంగా కనిపించడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి వారికోసం జ్యూవెల్లరీ కలెక్షన్‌, న్యూ డిజైనర్‌ చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్‌,డిజైనర్ ఫుట్‌వేర్‌, లైఫ్‌స్టైల్‌ ఆక్సెసరీస్‌ను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి తాజ్‌కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ డిజైనర్‌ ఎక్స్‌పోకి విశేష స్పందన వస్తోంది. పెళ్లిళ్లకు కావాల్సిన డిజైన్స్ అన్నీ ఇక్కడ ఉండడంతో నగరంలోని మహిళలు ఎక్స్‌పోకి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 

11:32 - November 12, 2016

హైదరాబాద్ : ఏపీలో ఏటీఎంలు ఇంకా పనిచేయకపోవడంతో ఖాతాదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంలలో జనాల క్యూలు కొనసాగుతున్నాయి.. ఉదయంనుంచే డబ్బు డ్రా చేసుకునేందుకు జనాలు బ్యాంకులు, ఏటీఎంలముందు క్యూకట్టారు.. ఏటీఎం మిషన్లలో డబ్బు మధ్యాహ్నానికే అయిపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడంలేదు.. బ్యాంకుల్లోకూడా సాయంత్రానికి క్యాష్‌లేదంటూ సిబ్బంది సమాధానమిస్తున్నారు.. రాష్ట్రంలోని పలుచోట్ల ఏటీఎంలలో డబ్బు నింపకపోవడంతో ఖాతాదారులకు అవస్థలు తప్పట్లేదు. దీంతో ఖాతాదారులు అసహనానికి గురవుతున్నారు. శనివారం కూడా ప్రతి బ్యాంకులు,ఏటీఎం వద్ద పెద్ద క్యూలు కనపడుతుండటం గమనార్హం.

11:24 - November 12, 2016

తమిళనాడు : ప్రముఖ తమిళ సినీ, టీవీ నటి సబర్న అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. మధురవాయిలోని తన నివాసంలో సమన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గత మూడు రోజులుగా ఆమె ఇంటి తలుపులు మూసి వుండటం.. ఆమె నివాసం నుండి దుర్వాసన వస్తుండటంతో... అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అన్నాసాగర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితినిక సమీక్షించారు. అనంతరం ఇంటి తలుపును బద్దలుకొట్టి ఇంట్లోకి ప్రవేశించిన వారికి ఒక సూసైడ్ నోట్ కనిపించింది. దాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా సబర్న తలపై బలమైన గాయం ఉండటం వున్నట్లుగా సమాచారం. దీంతో ఆమె మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మృతదేహం దుర్వాసన వస్తుండటంతో మూడు రోజుల క్రితమే ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా సబర్న కుటుంబ సభ్యులు సమీపంలోని విరుగంబాక్కంలో నివాసం ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఓ ఛానల్ లో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన సబర్న... ఆ తర్వాత సీరియళ్లు, సినిమాల్లో నటిగా ప్రతినటిగా కూడా నటించింది. కలై, కుదిరసు, పూజైలాంటి చిత్రాల్లో ఆమె నటించింది.

11:07 - November 12, 2016

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పెద్ద నోట్లను రద్దు విషయంలో ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో పెద్ద కుంభకోణం దాగి వుందని ఆరోపించారు. దీంట్లో బీజేపీ నేతలకు భారీగా లబ్డి చేకూరిందని ఆరోపించారు. పెద్ద నోట్లను రద్దు చేసిన సామాన్యులపై ప్రభుత్వం సర్జికల్ స్టైక్స్ గా ఆయన అభివర్ణియంచారు. నోట్ల రద్దు విషయం ఈ విషయం బీజేపీ నేతలకు ముందే తెలుసన్నారు. ఇది ఉద్ధేశ్యపూర్వకంగా సృష్టించిన సంక్షోభమని విమర్శనాస్త్రాలు సంధించారు. నోట్ల రద్దుకు ముందే బీజేపీ నేతల వద్ద రూ.2వేల నోట్లు ఎలా వున్నాయని ప్రశ్నించారు. నల్ల కుబేరులు బాలర్లను బ్లాక్ లో కొనుగోలు చేస్తున్నారన్నారు. నల్లధనం ఎవరి వద్ద వుందో బహిర్గతం చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. 

10:56 - November 12, 2016

హైదరాబాద్ : పన్ను చెల్లింపుకు జీహెచ్ఎంసీ గడువు పెంచింది.. శని, ఆది, సోమవారాల్లోకూడా ప్రజలు పన్ను చెల్లించొచ్చని ప్రకటించింది.. మరోవైపు బల్దియా బంపర్‌ ఆఫర్‌కు భారీ స్పందన వచ్చింది.. పాతనోట్లతో ఒకేరోజు గ్రేటర్‌వాసులు దాదాపు 50కోట్లవరకూ పన్ను చెల్లించారు.. ఇలా ఒక్కరోజే రికార్డు స్థాయిలో పన్ను వసూలు కావడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

శుక్రవారం అర్ధరాత్రివరకు పాతనోట్లకు అవకాశం
జీహెచ్‌ఎంసీ, జలమండలి బంపర్‌ ఆఫర్‌కు భారీ స్పందన వచ్చింది.. శుక్రవారం అర్ధరాత్రివరకే పాతనోట్లతో పన్ను చెల్లించే అవకాశం ఉండటంతో ప్రజలు జీహెచ్‌ఎంసీ ఆఫీసుముందు క్యూకట్టారు.. ఉదయం 7గంటలనుంచి పన్ను చెల్లించేందుకు ఆఫీసుముందుకు చేరారు.. రాత్రి 9గంటలవరకూ దాదాపు 50కోట్లరూపాయలు వసూలైనట్లు అధికారులు అంచనావేస్తున్నారు...

రాత్రి 9గంటలవరకూ దాదాపు 15కోట్ల ఆదాయం
హైదరాబాద్‌లో జలమండలి కార్యాలయంలోకూడా ఇదే పరిస్థితి ఉంది.. పాతనోట్లతో పన్నులు చెల్లించేందుకు ఒకే చెప్పడంతో... ఉదయం నుంచే నగరవాసులు కార్యాలయంముందు క్యూకట్టారు.. రాత్రి 9గంటలవరకూ దాదాపు 15కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు అంచనావేస్తున్నారు..

పన్ను చెల్లింపుకు మార్చి 31ని చివరి తేదీ
సాధారణంగా పన్ను చెల్లింపుకు మార్చి 31ని చివరి తేదీగా ప్రకటిస్తారు.. అప్పటివరకూ జీహెచ్‌ఎంసీకి వందకోట్లు వసూలవుతాయి.. ఈసారి మాత్రం ఒకేరోజు ఉహించనివిధంగా పన్నులు వసూలయ్యాయి.. వాటర్‌బోర్డు, హెచ్‌ఎండీలోకూడా పన్నువసూళ్లు ఇలాగే ఉన్నాయి.. పెద్దనోట్లను ఒకేసారి రద్దు చేయడం, బ్యాంకుల్లో భారీ క్యూలతో నగరవాసులు పన్ను చెల్లింపువైపు మొగ్గుచూపారు.. పన్ను ఎప్పటికైనా కట్టాల్సిందే.. బ్యాంకుల్లో క్యూకట్టి డబ్బు మార్చుకోవడంకంటే పన్ను చెల్లించడమే బెటరని ఫిక్స్ అయ్యారని ఈ వసూళ్లద్వారా తెలుస్తోంది.. మరోవైపు అరకొర నిధులతో అల్లాడుతున్న జీహెచ్‌ఎంసీకి ఈ ఆదాయంతో భారీగా లబ్ది చేకూరనుంది. పెండింగ్‌లోఉన్న ప్రాజెక్టులను ఈ డబ్బుతో పూర్తిచేసే ఛాన్స్‌ ఉంది.. మొత్తానికి ఏళ్లకుఏళ్లుగా వసూలుకాని మొండిబకాయిలు కూడా వసూలుకావడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

ఒక్కరోజే 5 కోట్ల 80 లక్షల రూపాయల ఆస్తిపన్ను వసూలు
తెలంగాణ పంచాయతీల్లో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 5 కోట్ల 80 లక్షల రూపాయల ఆస్తిపన్ను వసూలైంది. పాత 500, వెయ్యి రూపాయలతో ఆస్తి పన్ను చెల్లించేందుకు...ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రాపర్టీ టాక్స్‌ కలెక్టయ్యింది. ఆయా జిల్లాల్లో మంత్రులు సైతం దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించారు. కొత్తనోట్లు తీసుకోవడానికి ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయా జిల్లాల పంచాయతీ అధికారులతో మాట్లాడి ఆస్తిపన్ను వివరాలనడిగారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ మొత్తం 64 కోట్ల 50లక్షల రూపాయల రాబడి రాగా...ఒక్క శుక్రవారమే 5 కోట్ల 80 లక్షల రూపాయల ఆస్తిపన్ను వసూలు కావడం విశేషం. 

10:37 - November 12, 2016

సిద్ధిపేట : దుద్దెడ టోల్ గేట్ వద్ద టోల్ ట్యాక్స్ ను సిబ్బంది వసూలు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈనెల 14వ తేదీ వరకూ టోల్ ట్యాక్స్ ను కేంద్రం రద్దు చేసింది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా టోల్ ట్యాక్ వసూలు చేయటంపై వాహనదారులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు చేపట్టారు. 

10:34 - November 12, 2016

గుంటూరు : ఏసీ సీఎం చంద్రబాబు తన ఓటు హక్కును ఉండవల్లికి మార్చుకున్నారు. అలాగే తన కుటుంబ సభ్యుల ఓటు హక్కును ఉండవల్లికి మార్చారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కు తెలియజేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రాలకు హైదరాబాద్ రాజధానిగా 10 సంవత్సరాల హక్కు వుంది. కానీ స్థానిక కేంద్రం నుండే పూర్తిస్థాయి పాలన అందించాలనీ..ప్రజలకు అందుబాటులో రాజధాని..ప్రజాప్రతినిథులు వుండాలనే ఉద్ధేశ్యంతో రాజధానికి పూర్తిగా చంద్రబాబు నివాసాన్ని తరలించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి తన ఓటుహక్కును ఏపీ రాజధాని ప్రాంతమైన ఉండవలికి మార్చుకున్నారు. అమరావతి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న నేపథ్యంలో ఓటు హక్కు ఆ ప్రాంతానికే చెంది వుండాలనే ఉద్దేశ్యంతో ఉండవల్లికి మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ తో చంద్రబాబుకు పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్లుగా భావించవచ్చు.టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ సర్వేలో కూడా చంద్రబాబు..ఆయన కుటుంబ సభ్యులు స్థానిక నివాసం ఉండవల్లిలోనే నమోదు చేయించుకున్న విషయం తెలిసిందే. కాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం ఓటుహక్కు హైదరాబాద్ నుండి మార్పించుకోలేదు. 

పెద్ద నోట్ల రద్దుతో జగన్ కు అస్వస్థత: వర్ల

గుంటూరు : పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం పట్ల దేశ ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే... వైసీపీ అధినేత జగన్ మాత్రం అస్వస్థతకు గురయ్యారని టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీని ఎలా వైట్ మనీగా మార్చుకోవాలాని జగన్ దిగులు పడుతున్నారని... అందువల్లే ఆయనకు అస్వస్థత కలిగి ఉంటుందని రామయ్య ఎద్దేవా చేశారు. జగన్ పై సీబీఐ నమోదు చేసిన అక్రమ కేసుల విలువ రూ. 43 వేల కోట్లని... దీనికి అదనంగా మరో రూ. 43 వేల కోట్ల అవినీతి సొమ్ము జగన్ వద్ద ఉందని ఆరోపించారు. 

దివీస్ ప్రాంతంలో సీపీఎం నేతల అరెస్ట్..

తూర్పుగోదావరి : దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా తొండంగి మండలం పాపాదిపేటలో సీపీఎం నేతలు పాదయాత్ర చేపట్టారు. దీంతో పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు పాల్గొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న పలువురు విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తొండంగి మండలంలో ప్రభుత్వం తలపెట్టిన దివీస్ కంపెనీ మాకొద్దంటూ ఆ ప్రాంత రైతులు గత కొంతకాలంగా ఆందోలలు చేస్తున్న విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా సీపీఎం పార్టీ నిలబడింది. 

టోల్ గేట్ వద్ద వాహనదారుల ఆందోళన..

సిద్ధిపేట : దుద్దెడ టోల్ గేట్ వద్ద టోల్ ట్యాక్స్ ను సిబ్బంది వసూలు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈనెల 14వ తేదీ వరకూ టోల్ ట్యాక్స్ ను కేంద్రం రద్దు చేసింది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా టోల్ ట్యాక్ వసూలు చేయటంపై వాహనదారులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు చేపట్టారు.   

09:22 - November 12, 2016

హైదరాబాద్ : శనివారం నాడు కూడా బ్యాంకుల వద్ద ఏటీఎంల వద్ద జనాలు బారులు తీరారు. గత రెండు రోజుల నుండి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో పాత నోట్లను కొత్త నోట్లగా మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరి నిలబడ్డారు. కొత్తనోట్లను ఏటీఎంలలో అందుబాటులోకి తీసుకొచ్చిన సమయం నుండి ఏటీఎం సెంటర్ల వద్ద తిరునాళ్ళను తలపించే మాదిరిగా ప్రజలు నిలబడి వున్నారు. అదే సమయంలో సర్వర్లు డౌన్ అయిపోవటం..మధ్యహ్నా వరకూ మిషన్లలో నగదు అయిపోవటంతో ప్రజలు నానా పాట్లూ పడుతున్నారు. ఇదే పరిస్థితి కాచిగూడ ఆంధ్రాబ్యాంక్ వద్ద శనివారం కూడా కొనసాగింది. ఈ క్రమంలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకోండి.

09:05 - November 12, 2016

హైదరాబాద్ : తెలంగాణలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ లో గత రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీలుగా నమోదయింది. మెదక్ లో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలకు పడిపోయింది. ఖమ్మంలో సాధారణ ఉష్ణోగ్రత కంటే 8 డిగ్రీలు తక్కువగా నమోదయింది. హైదరాబాద్, హన్మకొండ, నల్లగొండ, మెదక్ లలో సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువగా నమోదయింది. కాగా ఉత్తర, ఈశాన్య భారతం నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. మరోవైపు పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. హైదరాబాద్ లో పగటి పూట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు కాగా, రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలుగా ఉంది.

08:39 - November 12, 2016
08:38 - November 12, 2016
08:33 - November 12, 2016

శ్రీకాకుళం : టీడీపీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రోజంతా నగరంలోనే పర్యటించనున్నారు. దీంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

నేడు శ్రీకాకుళంలో సీఎం పర్యటన
సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లాలో స్థానిక నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డ్వాక్రా మహిళలతో సదస్సుకు కేఆర్‌ స్టేడియంలో సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం చేరుకోనున్న చంద్రబాబు
సీఎం చంద్రబాబునాయుడు ఉదయం పది గంటలకు శ్రీకాకుళం జిల్లాకు చేరుకోనున్నారు. తన పర్యటనలో భాగంగా జనచైతన్య యాత్రలో పాల్గొననున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టరేట్‌ వద్ద అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్న సమగ్ర కలెక్టరేట్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకూ పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. దాని తర్వాత రెండు గంటల పాటు డ్వాక్రా మహిళలతో జరిగే సదస్సులో పాల్గొననున్నారు.

గ్రూపు తగాదాలను సరిచేస్తారని కార్యకర్తల ఆశ
అయితే ఈసారి చంద్రబాబునాయుడు నగరానికే పరిమితం కానున్నారు. మరో రెండు నెలల్లో కార్పొరేషన్‌ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ కేడర్‌ను సిద్ధం చేసేందుకు సీఎం పర్యటన ఉపయోగపడుతుందని స్థానిక టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం తన పర్యటనలో భాగంగా నగర పార్టీ కేడర్‌లో ఉన్న గ్రూపు తగాదాలను సరిచేసి.. కార్పొరేషన్‌ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తారని కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

08:29 - November 12, 2016

అనంతపురం :కులాలను గౌరవిస్తాను కానీ.. వాటిని నెత్తికెక్కించుకోబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు గుత్తిలోని గేట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ పలు అంశాలపై స్పందించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రెండో రోజూ
అనంతపురం జిల్లాలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రెండో రోజూ కొనసాగింది. గుత్తి గేట్స్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకి పవన్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు.

రిజర్వేషన్‌ పై ప్రజాదర్బార్‌లోను, చట్ట సభల్లోనూ ప్రస్తావిస్తా
రిజర్వేషన్ల గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నకి.. రిజర్వేషన్‌ అంశం లోతైన సమస్య అని, దీన్ని ప్రజాదర్బార్‌లోను, చట్ట సభల్లోనూ ప్రస్తావిస్తామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తాను కులాలను గౌరవిస్తానే తప్ప.. వాటిని నెత్తికెక్కించుకోబోనని స్పష్టం చేశారు. .. అన్నారు.

కరవు అన్నది మనస్సులోనే కానీ... ప్రాంతాల్లో లేదు : పవన్
కరవు నేపథ్యంలో జిల్లాలోని ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటారా అన్న విద్యార్థుల ప్రశ్నకు పవన్‌ సుదీర్ఘమైన సమాధానాన్నిచ్చారు. కరవు అన్నది మనస్సులోనే కానీ... ప్రాంతాల్లో లేదన్నారు. శాస్త్ర సాంకేతికతలతో కరువు మీద యుద్ధం ప్రకటించాలని ఆకాంక్షించారు. అమరావతి అద్భుతంగా ఉండి.. అనంతపురం కంటతడి పెడుతూ ఉంటే తాను తట్టుకోలేనన్నారు.

బలవంతులకే చట్టాలు ఉపయోగపడుతున్నాయి..
భారత చట్టాల అమలు తీరుపై జనసేనాని పెదవి విరిచారు. బలవంతులకు బలహీనంగా.. బలహీనులకు బలవంతంగా చట్టాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. దోపిడీదారులకు చట్టాలు అనుకూలంగా పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు.

నిర్భయ చట్టాన్ని తెచ్చేందుకు అరవై ఏళ్లు పట్టిందా : పవన్
దేశంలో మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకునేందుకు.. ఓ నిర్భయ చట్టాన్ని తెచ్చేందుకు అరవై ఏళ్లు కావలసివచ్చిందని పవన్‌ కల్యాణ్‌ ఆక్షేపించారు. ఈ సెషన్‌ ద్వారా.. పవన్‌ కల్యాణ్‌తో ఇంటరాక్ట్‌ కావడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ అండగా ఉంటానంటే అర్థరాత్రి తిరగడానికి తాము వెనకాడమని పలువురు విద్యార్థినులు తెలిపారు. పవన్‌ ఏపీలో ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలిపించుకుంటామన్నారు. అనంతపురం అభివృద్ధికై భవిష్యత్‌లో జనసేన పార్టీ ఏం చేయబోతుందో ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. 

08:27 - November 12, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ బంగారు వ్యాపారులను తాకింది. కేంద్ర నిర్ణయంతో బంగారు వ్యాపారులు కుదేలవుతున్నారు. ప్రస్తుత పెళ్ళిళ్ల సీజన్‌లో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని భావించిన వ్యాపారులు.. కొనుగోలుదారులే లేక తీవ్రంగా నష్టపోతున్నారు.

రూ.లక్షలకు పడిపోయిన వేల కోట్ల రూపాయల వ్యాపారం
నిత్యం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగే గోల్డ్ బిజినెస్ మూడు రోజులుగా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో వినియోగదారులు బంగారం కొనడానికి ముందుకు రావడంలేదు. దీంతో వేల కోట్ల రూపాయల్లో జరిగే వ్యాపారం కాస్తా నేడు లక్షల రూపాయలకే పరిమితమైపోయింది.

నల్లధనాన్నివైట్ గా మార్చేందుకు బంగారంపై పెట్టుబడి
బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు చాలామంది బంగారంపై పెట్టుబడి పెడతారు. అయితే ప్రస్తుతం చిరు వ్యాపారులు కూడా బంగారం కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రధానంగా నోట్లకు సంబంధించి చిల్లర దొరకకపోవడం, బంగారం వ్యాపారులు పాత నోట్లను తీసుకోకపోవడంతో కొనే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది.

బంగారానికి వాణిజ్య కూడలి విజయవాడ
బంగారానికి వాణిజ్య కూడలి అయిన విజయవాడ పాతబస్తీతోపాటు బీసెంట్ రోడ్డు తదితర ప్రాంతాల్లో నిత్యం కోట్ల రూపాయల గోల్డ్ వ్యాపారం జరుగుతుంది. అయితే ఇప్పుడు బంగారం కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో రోజుకు లక్ష రూపాయల వ్యాపారం కూడా కాని పరిస్థితి తలెత్తిందని విక్రేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్ళిళ్ల సీజన్ కావడంతో.. కొనుగోళ్లు భారీగా ఉంటాయని, పెద్ద ప్రమాణంలో బంగారాన్ని కొని నిల్వ చేశామని, అయితే నోట్ల రద్దు నిర్ణయంతో.. కొనుగోలుదారులే రాని పరిస్థితి తలెత్తిందని, దీంతో తాము మరింతగా నష్టపోతున్నామని వ్యాపారులు అంటున్నారు.

కొత్త నోట్ల మార్పిడికి కొంత సమయం ఇస్తే బాగుండేదంటున్నవ్యాపారులు
ఇప్పటికే కోట్ల రూపాయలలో నష్టాన్నిచవిచూశామని, ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చిన వారికి కూడా బంగారం ఇచ్చే పరిస్థితి లేదని వ్యాపారులు వాపోతున్నారు. కొత్త నోట్ల మార్పిడి విషయంలో కొంత సమయం ఇస్తే బావుండేదని, ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల గోల్డ్ బిజినెస్‌పై భారీ ప్రభావమే పడిందని వ్యాపారులు అంటున్నారు.

బంగారం కొనుగోళ్లపై కొంత కాలమే ఎఫెక్ట్ ఉంటుందంటున్న వ్యాపారులు
బంగారం కొనుగోళ్లపై నోట్ల రద్దు ప్రభావం కొంత ఉంటుందని వ్యాపారులుఅంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ప్రజలెవరూ పెద్ద నోట్లను తమ వద్ద ఉంచుకోరని, నగదును మళ్లీ బంగారంపైనే పెట్టుబడి పెడతారని అంటున్నారు. ఫలితంగా గోల్డ్ బిజినెస్ త్వరలోనే పుంజుకుంటుందని వారు నమ్ముతున్నారు. మొత్తానికి కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో.. ప్రస్తుతానికైతే బంగారు వ్యాపారుల జీవితాల్లో చీకట్లను నింపిందనే చెప్పాలి.

 

08:23 - November 12, 2016

ఢిల్లీ : నల్ల కుబేరులపై సర్జికల్ దాడులు జరుపుతూ 500, వెయ్యినోట్లను రద్దు చేసిన కేంద్రం..నల్లధనం నిరోధకానికి మరిన్ని కఠిన చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు, కొనుగోళ్లపై కేంద్రం నిఘాపెట్టింది. జ్యూయలరీ షాపులపై ఎక్సైజ్‌శాఖ ఒక్కసారిగా మెరుపు దాడులు చేసి బ్లాక్‌మనీకి అడ్డుకట్టవేసే ప్రయత్నం చేశౄరు. ఇదిలా ఉండగా మరోవైపు చిల్లరకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో... ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, రైల్వే కౌంటర్లు, విమానాశ్రయాల్లో పాత 500, వెయ్యినోట్లు మరో మూడు రోజుల పాటు పనిచేస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ నెల 14 అర్థరాత్రి వరకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

నోట్లు మార్చుకునే తేదీని ఈనెల 14 వరకూ పొడిగింపు
కేంద్ర నిర్ణయంతో సతమతమవుతున్న సామాన్యులను ఆదుకునేందుకు..మోదీ సర్కారు నోట్లు మార్చుకునే తేదీని ఈనెల 14 వరకూ పొడిగిస్తూనే..మరోవైపు నల్లధనం నిరోధానికి మరిన్ని కఠిన చర్యలకు పూనుకుంది. తాజాగా బంగారం వ్యాపారుల నుంచి అమ్మకాల వివరాలను కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా 25 నగరాల్లోని 600 దుకాణాల నుంచి అమ్మకాలు, కొనుగోళ్ల వివరాలు కావాలని ఆదేశించింది.

హైదరాబాద్‌లో జ్యూవెల్లరీ షాపులపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారుల దాడులు
హైదరాబాద్‌లో జ్యూవెల్లరీ షాపులపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడులు చేశారు. నిబంధనలను అతిక్రమించిన 15 జ్యువెల్లరీ షాపులకు నోటీసులు అందజేశారు. అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలను 24 గంటల్లోగా ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక జారీచేశారు.

25 నగరాల్లో 600 బంగారం షాపుల సేల్స్ పరిశీలిస్తున్న కస్టమ్స్‌, ఎక్సైజ్‌
రెండున్నర లక్షలకు పైగా జరిగిన లావాదేవీల వివరాలపై బ్యాంకులకు ఆదేశాలు.మరోవైపు దేశవ్యాప్తంగా 67 ఫారెక్స్ డీలర్ల లావాదేవిలపై ఈడీ దాడులు జరిగాయి. 25 నగరాల్లో 600 బంగారం షాపుల సేల్స్ లావాదేవిలను కస్టమ్స్‌, ఎక్సైజ్‌ అధికారులు పరిశీలిస్తున్నారు. రెండున్నర లక్షలకు పైగా జరిగిన లావాదేవీల వివరాలను తెలపాలని అన్ని బ్యాంకులకు ఐటీశాఖ ఆదేశాలు జారీచేసింది.

సాధ్యమైనంతగా నగదును అందుబాటులో ఉంచేలా యత్నాలు
పెద్ద నోట్ల నిషేధంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రెండు వారాల్లో సమసి పోతాయని నగదు నిల్వల సేవల సంస్థలు భరోసా ఇచ్చాయి. సాధ్యమైనంత తక్కువ సమయంలో నగదును అందుబాటులో ఉంచేలా శ్రమిస్తున్నామని తెలిపాయి. మరోవైపు ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, రైల్వే కౌంటర్లు, విమానాశ్రయాల్లో పాత 500, వెయ్యినోట్లు చెలామణిని మరో మూడు రోజుల పాటు అంటే ఈనెల 14 అర్థరాత్రి వరకు పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. 

08:18 - November 12, 2016

వరంగల్ : వరంగల్ జైలు నుండి ఖైదీలు పరారయ్యారు. ప్రహరీగోడ దూకి ఖైదీలు పరారయ్యారు. బీహార్ కు చెందిన రాజేష్ యాదవ్ అనే ఖైదీతో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన సైనిక్ సింగ్ అనే మరో ఖైదీ పరారైనట్లుగా సమాచారం. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఖైదీలు పరారైనట్లుగా జైలు సూపరింటెండెంట్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్మీలో పనిచేసే క్రమంలో సైనిక్ సింగ్ ఓ రైఫిల్ ను దొంగిలించాడనే ఆరోపణతో సైనిక్ సింగ్ కు ఐదు సంవత్సరాలు శిక్ష విధించబడింది. మరో ఆరునెలల్లో శిక్షకాలం పూర్తి కావచ్చే సమయంలో పరారవటం గమనించదగిన విషయం. ఇక రాజేష్ యాదవ్ ఓ హత్య కేసులో నిందితుడన్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ వారు కప్పుకునే బెడ్ షీట్ల ఆధారంగా ప్రహరీగోడ దూకి పారిపోయినట్లుగా తెలుస్తోంది. మట్టెవాడ సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఆరు పోలీసు బృందాలు పరారైన ఖైదీల కోసం  గాలిస్తున్నాయి. ఖాజీపేట, వరంగల్ , హన్మకొండ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలలో గాలిస్తున్నారు.పరకాల ప్రాంతంలో పొలలోకి వెళ్లి దాక్కున్నారనే అనుమానంతో ఆప్రాంతలోకూడా గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. వరంగల్ నగర్ సీపీ సుధీర్ బాబు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షించారు. జైల్లో వున్న సీసీ కెమెరాల పుటేజ్ నుకూడా సుధీర్ బాబు సమీక్షించారు. జైలు లో వున్నప్పుడు తోటి ఖైదీలతో వారు ఎలా వుండేవారు? వేరు వేరు రాష్ట్రాలకు చెందిన వీరిద్దరి మధ్య ఎటువంటి వాతావరణం ఉండేది అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.  

08:16 - November 12, 2016

హైదరాబాద్ : ఉప్పు ధర పెరిగిందని నగరంలో పుకార్లు చెలరేగాయి. బోరబండ, సనత్ నగర్, బాలానగర్, పాతబస్తీల్లో కిలో ఉప్పు ప్యాకెట్ రూ.200 నుండి రూ.300లు కొన్ని ప్రాంతాలలో రూ. 500లకు వ్యాపారులు విక్రయించి దోపిడీ చేశారు. దీంతో ఉప్పు కొరత పుకార్లను నమ్మొద్దంటూ సీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ఉప్పును బ్లాక్ లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యూపీ నుండి వచ్చిన ఉప్పు పుకారు
నోట్ల రద్దుతో కిలో ఉప్పును నాలుగు వందల రూపాయలకు అమ్ముతున్నారనే పుకార్లు ఉత్తరప్రదేశ్‌లో షికార్లు చేస్తున్నాయి. మొరాదాబాద్‌లో అనేక దుకాణాల్లో రద్దీ నెలకొంది. వినియోగదారులు పెద్ద సంఖ్యలో వచ్చి ఉప్పు కొంటుండటంతో దుకాణదారులు బెంబేలెత్తిపోతున్నారు. కొందరు వ్యాపారులు దుకాణాలు కూడా మూసివేసుకున్నారు. ఈ పుకార్లను నమ్మవద్దని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ప్రజలు మాత్రం ఆందోళన చెందుతునే ఉన్నారు.

08:00 - November 12, 2016

ఢిల్లీ : భారత్-జపాన్‌ల మధ్య అణు ఒప్పందం కుదిరింది. ప్రపంచంలో ఓ దేశంతో జపాన్‌ అణు ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. ఎన్ఎస్‌జిలో భారత సభ్యత్వానికి జపాన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.

మూడు రోజుల పాటు ప్రధాని జపాన్‌ పర్యటన
మూడు రోజుల జపాన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోది జపాన్‌ ప్రధాని షింజో అబేతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జపాన్‌తో భారత్‌ అణుఒప్పందాన్ని కుదుర్చుకుంది. అనంతరం మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

జపాన్‌తో పౌర అణు ఒప్పందం చారిత్రాత్మకం : ప్రధాని మోదీ
జపాన్‌తో పౌర అణు ఒప్పందం చారిత్రాత్మకమని ప్రధాని మోది అభివర్ణించారు. జపాన్‌తో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశం భారత్‌ అని తెలిపారు. భారత్‌కు జపాన్‌ సహజ మిత్రదేశమని పేర్కొన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు పౌర అణు ఒప్పందం ఎంతో దోహద పడుతుందని ప్రధాని అన్నారు. అణు సాంకేతికతకు సంబంధించి భారత్‌కు జపాన్‌ సంపూర్ణ సహకారం అందించనుందని మోది చెప్పారు. ఎన్‌ఎస్‌జిలో భారత సభ్యత్వానికి జపాన్‌ ప్రధాని మద్దతు తెలిపినందుకు షింజో అబేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుతాయని మోది స్పష్టం చేశారు.

ప్రపంచంలోనే భారత్‌ను ఓపెన్‌ ఎకానమీగా మార్చేందుకు యత్నిస్తున్నాం: మోదీ
అంతకు ముందు టోక్యోలో జరిగిన సీఐఐ-కైడాన్‌రెన్‌ వాణిజ్య సమావేశంలో ప్రధాని మోది పాల్గొని ప్రసంగించారు. భారత్‌ను ప్రపంచంలోనే ఓపెన్‌ ఎకానమీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియాకు ఊతమివ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ కొత్త దిశలో పురోగమిస్తోందని, తమ దేశంలో పెట్టుబడులకు జపాన్‌ను ఆహ్వానిస్తున్నామన్నారు. తక్కువ శ్రామిక ఖర్చు, స్థూల ఆర్థిక స్థిరత్వం కలిసి భారత్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయమైన దేశంగా మారుస్తోందని మోది పేర్కొన్నారు. జపాన్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.

 

07:58 - November 12, 2016

గత మూడు రోజుల నుండి దేశంలో ఒక్కటే సమస్య నెలకొంది. అదే పెద్ద నోట్ల మార్పిడి కోసం సామాన్యుడు మొదలుకొని కోటీశ్వరుడి వరకూ పెద్ద నోట్లను చిన్న నోట్లుగా..లేదా కొత్త నోట్లుగా మార్చుకునేందుకు పరుగులు తీశారు. బ్యాంకుల వద్ద..ఏటీఎం ల వద్ద బారులు తీరి నిలబడ్డారు. ఓ రకంగా చెప్పుకోవాలంటే బ్యాంకులు..ఏటీఎం సెంటర్లు తిరునాళ్ళను తలపించాయి. కొందరైతే స్పృహతప్పి పడిపోయిన సంఘటనలు కూడా నెలకొన్నాయి. చిల్లర కోసం..కొత్త నోట్లగా మార్చుకునే క్రమంలో పేదా గొప్ప అనే తారతమ్యం లేకుండా పోయింది. దీంట్లో కాంగ్రెస్ నేత...అభిమానులు యువరాజుగా పిలుచుకునే రాహుల్ గాంధీ కూడా లైన్ లో నిలబడ్డారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సైతం కష్టాలు తప్పలేదు. ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లోవున్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కి వచ్చిన రాహుల్.. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు సామాన్యులతో సమానంగా క్యూ లో నిలబడ్డారు. బ్యాంక్ లో 4 వేల రూపాయలు మార్చుకున్నారు. పాత నోట్ల మార్పిడి కోసం సామాన్య ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా రాహుల్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆచారి (బీజేపీ నేత) కైలాష్ రాకేశ్ (టీ.కాంగ్రెస్ నేత) ( టీఆర్ఎస్ నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

ఉప్పు కొరత పుకార్లు..కిలో రూ.300లు..

హైదరాబాద్ : ఉప్పు ధర పెరిగిందని నగరంలో పుకార్లు రేగాయి. బోరబండ, సనత్ నగర్, బాలానగర్, పాతబస్తీల్లో కిలో ఉప్పు ప్యాకెట్ రూ.200 నుండి 300లకు వ్యాపారులు విక్రయించారు. దీంతో ఉప్పు కొరత పుకార్లను నమ్మొద్దంటూ సీపీ ప్రకటించారు. ఉప్పును బ్లాక్ లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

07:06 - November 12, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కడ చూసినా.... జనం భారీగా క్యూ కడుతున్నారు. నిత్యవసరాలన్నీ నగదుతో ముడిపడి ఉండటంతో కొత్త నోట్ల కోసం.. నానా తంటాలు పడాల్సి వస్తోంది. అటు దుకాణాల్లో పాత నోట్లు నిరాకరిస్తుండటం.. ఇటు కొత్త నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు.చిల్లరనోట్ల కష్టాలు సామాన్యులను ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఏటీఎంలు తెరచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఏటీఎంలు పనిచేస్తాయని ప్రభుత్వం చెప్పినా చాలా ప్రాంతాల్లో ఆ పరిస్థితి కనిపించడంలేదు.. కొత్త నోట్లు ఇంకా బ్యాంకులకు చేరక ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.

యాభై, వంద రూపాయల నోట్ల కోసం ప్రజలు బ్యాంకుల్లో పడిగాపులు
పాత 500, 1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు అధికారుల తీరుతో ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. వరంగల్ జిల్లాలో ఇప్పటికే 200 కోట్ల రూపాయల మేర డబ్బులు బ్యాంకుల్లో జమ అయ్యాయి. ఇంకా యాభై, వంద రూపాయల నోట్ల కోసం ప్రజలు బ్యాంకుల్లో పడిగాపులు కాస్తూనే ఉన్నారు.

పాలమూరు జిల్లాలో ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల రద్దీ
పాలమూరు జిల్లాలో ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల వద్ద వినియోగదారులు బారులు తీరారు. బ్యాంకుల్లో 500, వేయి రూపాయల నోట్ల మార్పిడి కోసం జనం క్యూ కట్టారు. ఏటీఎంల్లో డబ్బుల డ్రా చేసుకునేందుకు ప్రజలు గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు మాత్రమే డ్రా చేసుకునే వీలుండటంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పాత నోట్ల రద్దు ప్రభావం నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
మెదక్‌ జిల్లాలో పాత నోట్ల రద్దు ప్రభావం స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై తీవ్రంగా చూపుతోంది. జనం లేక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. గతంలో రోజుకు 150 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు.. ఇప్పుడు రెండు, మూడుకు మించడం లేదంటే పరిస్థితి తీవ్రత ఏంటో తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రిజిస్ట్రేషన్లు పూర్తిగా పడిపోయాయని ఉప్పల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ తెలిపారు.

బ్యాంకుల వద్ద క్యూ కట్టిన జనాలకు పోలీసుల సర్వీస్
హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో పోలీసులు తమ ఉదారత చాటుకున్నారు. పెద్ద నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద క్యూ కట్టిన జనాలకు పోలీసులు దగ్గరుండి మరీ వాటర్ పాకెట్లు సరఫరా చేశారు. రెండు రోజుల తర్వాత ఏటీఎంలు తెరుచుకోవడంతో జనాలు బారులు తీరారు. నగదును బ్యాంకులలో డిపాజిట్‌ చేసేందుకు ఖాతాదారులు భారీగా తరలివచ్చారు. రాంనగర్‌లో బ్యాంకుకు వచ్చిన ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. అలాగే ఇంకా చాలా చోట్ల ఏటీఎంలు తెరుచుకోలేదు. తెరుచుకున్న ఏటీఎంలలో క్యాష్‌ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఒంటిపై వెయ్యి నోట్లను పరచుకుని నిరసన
పాత నోట్ల రద్దుపై తిరుపతిలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. వెయ్యి నోట్లను ఒంటిపై పరచుకుని రోడ్డుపై అడ్డంగా పడుకున్నాడు. రెండు రోజుల్లో తన కుమార్తె పెళ్లి ఉండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇలా చేశానని సుబ్రహ్మణ్యం అంటున్నాడు. సుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరులో రెండో రోజు బ్యాంకుల వద్ద ఖాతాదారుల రద్దీ
గుంటూరులో రెండో రోజు బ్యాంకుల వద్ద ఖాతాదారుల రద్దీ కొనసాగింది. శుక్రవారం కూడా ఏటీఎంలు మూతపడి ఉండటంతో.. జనం బ్యాంకులకు క్యూ కడుతున్నారు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల దగ్గర పడిగాపులు కాశారు. కేంద్రం రద్దు చేసిన 500, వెయ్యినోట్లతో వెలగపూడి సచివాలయంలోని ఉద్యోగులకు రెండో రోజు కూడా తిప్పలు తప్పలేదు. మొదటి రోజు ఎలాగోలా సర్దుకున్న ఉద్యోగులు,..రెండో రోజు బ్యాంకుల్లో డబ్బును పొందవచ్చని భావించారు. కానీ సచివాలయంలోని ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ లకు కొత్తనోట్లు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

చిల్లర సమస్యతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మన్యం వాసులు
పెద్ద నోట్ల రద్దుతో తూర్పు మన్యంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చిల్లర సమస్యతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మన్యం వాసులు డివిజన్‌ కేంద్రంలోని బ్యాంకులకు క్యూ కడుతున్నారు. నిత్యవసరాలకు డబ్బులు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని మన్యం వాసులు వాపోతున్నారు.

కొత్త నోట్లు దొరక్క అల్లాడుతున్న జనం
పలుచోట్ల బ్యాంకుల్లో సిబ్బంది తక్కువగా ఉండటంతో వినియోగదారులకు నగదు చెల్లింపులు ఆలస్యం అవుతోంది. దీంతో ఖాతాదారులు నగదు సంబంధిత వ్యవహారాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఎక్కడ చూసినా జనం నోట నోట్ల మాటే వినిపిస్తోంది. అటు.. దుకాణాల్లో పాత నోట్లు తీసుకోక.. ఇటు కొత్త నోట్లు దొరక్క జనం అల్లాడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయం చూపాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

పెద్దనోట్ట మార్పిడిలో మావోలు..

జార్ఖండ్ : రద్దయిన పెద్దనోట్లు మార్చుకునే పనిలో మావోయిస్టులు కూడా ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ సమాచారం మేరకు మావోయిస్టు నేతకు చెందిన రూ.25 లక్షలను జార్ఖండ్ పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. డంపుల్లో ఆయుధాలతో పాటు డబ్బులను మావోలు దాస్తుంటారని, రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి గిరిజనులను ఉపయోగించుకుంటున్నారని నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మావోలకు సంబంధించిన పెద్దనోట్ల మార్పిడి జరగవచ్చనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

వరంగల్ జైలు నుండి ఖైదీలు పరారీ..

వరంగల్ : వరంగల్ జైలు నుండి ఖైదీలు పరారయ్యారు. ప్రహరీగోడ దూకి ఖైదీలు పరారయ్యారు. బీహార్ కు చెందిన రాజేష్ అనే ఖైదీతో పాటు సైనిక్ సింగ్ అనే మరో ఖైదీ పరారైనట్లుగా సమాచారం. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Don't Miss