Activities calendar

13 November 2016

21:52 - November 13, 2016

తమిళనాడు: తాను పూర్తి ఆరోగ్యంతో ముందుకు వస్తానని తమిళనాడు సీఎం జయలలిత ప్రజలకు లేఖ ద్వారా తెలిపారు. ప్రజల ప్రార్థనలే తనకు పునర్జన్మనిచ్చాయని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. మూడుస్థానాల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులనే గెలపించాలని ఆమె ప్రజలను కోరారు.

 
21:49 - November 13, 2016
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 రెండోరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 63.20 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. శుక్రవారం పేపర్ -1, 2 పరీక్ష రాసినవారికి మాత్రమే పేపర్ -3, 4 పరీక్ష రాసేందుకు అర్హులు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1,916 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పరీక్షకు వన్ మినిట్ నిబంధన విధించడంతో... అభ్యర్థులకు చివరిక్షణాల్లో ఉరుకులు పరుగులు తప్పలేదు. 1గ్రూప్-2 ద్వారా ఒకవేయి 032 పోస్టులను భర్తీ చేయనున్నారు. త్వరలోనే గ్రూప్-2 పరీక్షకు సంబంధించిన కీని విడుదల చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది
21:46 - November 13, 2016
శ్రీకాకుళం: జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన సీపీఎం, సీఐటీయూ, ఇతర ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు.. ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది సీపీఎం నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొందరు ఉద్యమకారులను గదిలో నిర్భంధించి దురుసుగా ప్రవర్తించారు. న్యూక్లియర్ ప్లాంట్‌తో కలిగే నష్టాలను వివరించేందుకు.. ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్ట్ బాధిత ప్రాంతాల మీదుగా సిపిఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్‌ను నిర్మిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింగరావు అన్నారు. అక్రమ అరెస్టులతో పోలీసులు అణు వ్యతిరేక పోరాటాన్ని అడ్డుకోలేరని ఆయన హెచ్చరించారు. అయితే పోలీసులు మాత్రం..పాదయాత్రలకు అనుమతి లేనందునే వారిని అరెస్ట్‌ చేశామన్నారు.
 
21:44 - November 13, 2016

తూర్పుగోదావరి: కాపు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో 13జిల్లాల కాపు జేఏసీ నేతలతో ముద్రగడ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ముద్రగడ స్పందిస్తూ..కాపు సత్యాగ్రహ యాత్రకు పర్మిషన్‌ ఉండాలని నిబంధన పెట్టడం సరికాదన్నారు.

21:42 - November 13, 2016

హైదరాబాద్: ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రభుత్వం వైద్యవిధానాన్ని ప్రకటించాలని జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఎస్వీకేలో జరిగిన తెలంగాణలో వైద్యం, ఆరోగ్యంపై సమాలోచన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో మౌలికవసతులు కల్పించి, తగిన సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు.

 
21:39 - November 13, 2016
హైదరాబాద్:పెద్ద నోట్ల రద్దు అంశం దేశ వ్యాప్తంగా పెను దుమారాన్నే రేపుతోంది. ప్రధాని మోదీ నిర్ణయంపై జాతీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా.. విపక్షాలు, అక్కడక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.పెద్ద నోట్ల రద్దు ఫలితంగా తలెత్తిన ఇబ్బందుల నుంచి సామాన్యులను గట్టెక్కించాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యమబాట పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పశ్చిమ బంగ్ల సీఎం మమతా బెనర్జీ.. ప్రధాని నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇది భారీ కుంబకోణమని కేజ్రీ ఆరోపించగా.. సీపీఎం సహా వివిధ పక్షాల నేతలతో సమావేశానికి మమతాబెనర్జీ సిద్ధమవుతున్నారు. రాష్ట్రపతిని కూడా కలిసి ప్రజల కష్టాలను వివరిస్తానని ఆమె చెబుతున్నారు. అటు సీపీఎం కూడా.. ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు.. పూర్తి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకూ రద్దు చేసిన పెద్ద నోట్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసింది.వాయిస్‌ : ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ విపక్షాలు ప్రధాని మోదీ నిర్ణయంపై మండిపడుతున్నాయి. వచ్చే సంవత్సరం కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకుందని ఏపీ-పీసీసీ ఆరోపించింది. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించాలంటూ ఏపీ-పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు అనంతపురంలో ధర్నా చేశారు. నోట్ల రద్దు విషయం టీడీపీ, బీజేపీ నేతలకు ముందే తెలుసని రఘువీరా ఆరోపించారు.

వారికి ముందే తెలుసు :పెద్ద నోట్ల రద్దు ఎన్డీఏ నేతలకు ముందే తెలుసునని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. స్వచ్చంద ఆదాయ వెల్లడిలో 10 వేల కోట్లు జమ చేసిన నల్లకుబేరుడు ఎవరో ఐటి శాఖ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.మోడీ సర్కార్‌ నిర్ణయం ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాల్జేసిందని, ఈ వ్యవహారం ఆపరేషన్‌ సక్సెస్‌, పేషంట్‌ డెడ్‌ అన్న రీతిగా తయారైందని వైసీపీ ఆక్షేపించింది.మొత్తమ్మీద మోదీ నిర్ణయంపై విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. ఈ ఆకస్మాత్తు నిర్ణయం విపరిణామాలకు దారి తీసిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆక్షేపిస్తున్నాయి.
2వేల రూపాయల నోట్లను రద్దు చేయాలి:
కేంద్రం వెంటనే 2వేల రూపాయల నోట్లను రద్దు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. ఆయన ఇవాళ... పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలతో ఫోన్లో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నా.. 2 వేల రూపాయల నోటు తేవడంపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. 2వేల రూపాయల నోటుతో దేశంలో నల్లధనం పెరుగుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ నోట్లను రద్దు చేయాలని కోరారు. లేకుంటే త్వరలో తమ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు.

21:34 - November 13, 2016

డిల్లీ : నోట్ల మార్పిడి అంశంపై సమీక్ష కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు జారీచేసింది. అర్థరాత్రి నుంచి ఏటీఎంలో రోజుకు 2వేల రూపాయల విత్‌డ్రా పరిమితిని 2,500 కు పెంచింది. రేపటి నుంచి బ్యాంకుల్లో రోజుకు 4,500 రూపాయలు మార్పిడి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ పరిమితి 4వేలకే పరిమితం. వీటితో పాటు బ్యాంకుల్లో విత్‌ డ్రా లిమిట్‌ను వారానికి 20వేల నుంచి... 24వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా... రోజుకు 10 వేలు మాత్రమే తీసుకోవాలనే నిబంధన ఎత్తివేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ... బ్యాంకులకు ఆదేశాలు జారీచేసింది.

 

పవన్ పై రోజా ఘాటు వ్యాఖ్యలు..

తిరుపతి : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తానంటే ఎవరూ నమ్మరని, మాట తప్పడంలో పవన్ దిట్ట అని పేర్కొన్నారు. సభ వేదికపై పైన ఒక్కరే మాట్లాడుతూ పవన్ నియంతలా వ్యవహరిస్తున్నారని, జనసేనకు వైసీపీ నుండి ఎలాంటి వలసలు ఉండవన్నారు. ఎవరైనా వెళితే వారి రాజకీయ భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. నోట్ల రద్దు బాబుకు ముందే తెలుసునే అనుమానాలున్నాయని, అందుకే హెరిటేట్ షేర్లను ముందే అమ్మేశారని ఆరోపించారు. 

జగిత్యాలలో కేంద్రం కరవు బృందం పర్యటన..

జగిత్యాల : జిల్లాలో కేంద్రం కరవు బృందం పర్యటించింది. మల్యాల మండలం మానాల ఎస్సారెస్పీ గండి ప్రదేశం ముంపునకు గురైన పొలాలను బృందం పరిశీలించింది. జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళుతామన్నారు. 

తృణముల్ తో కలవం - ఏచూరి..

ఢిల్లీ : తృణముల్ కలిసి పోరాడేందుకు సిద్ధంగా లేమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ప్రకటించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మమతతో కలిసి పనిచేయమన్నారు. 

20:04 - November 13, 2016
19:42 - November 13, 2016

తూర్పుగోదావరి : దివీస్ వ్యతిరేక‌ ఉద్యమం రాజుకుంటోంది. ప్రభుత్వం నిర్భంధాన్ని న‌మ్ముకుంటోంది. కానీ ప్రజ‌లు మాత్రం పెద్ద స్థాయిలో ఉద్యమానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రజ‌ల పోరాటానికి సీపీఎంతో పాటు ప్రతిప‌క్షాల‌న్నీ ఏకమవుతున్నాయి. నిర్బంధం, పోలీస్ ఆంక్షల మధ్య.. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటం తీవ్రమ‌వుతోంది. దివీస్‌ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలకు విపక్షాలు కూడా తోడవ్వడంతో ఈ ఉద్యమం రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. దీంతో తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం ఇప్పుడు విపక్షాల ఆందోళనలతో అట్టుడుకుతోంది. తూర్పు గోదావ‌రి జిల్లా తొండంగి మండ‌లంలోని కోనఫారెస్ట్ ప్రాంతం ప్రశాంత‌త‌కు నిల‌యం. స‌ముద్ర తీరం అనుకూలంగా ఉండ‌డంతో దేశంలోనే స‌గానికి పైగా రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఇక్కడే ప్రారంభించారు. వాటి ద్వారా వేల‌మందికి ఉపాధి ల‌భిస్తోంది. మ‌త్స్యకారులు, రైతులు, వృత్తిదారులు అంతా జీవ‌నోపాధి సాగిస్తున్న ఈప్రాంతంలో ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం పెద్ద క‌ల‌క‌లం రేపింది. 640 ఎక‌రాల భూమిని దివీస్ ప‌రిశ్రమ కోసం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో స్థానికులు మండిప‌డుతున్నారు.

ఆగస్టు 28 నుంచి 144 సెక్షన్‌..
కనీసం ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయకుండా ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం తీసుకోవడంపై స్థానికులు మండిపడుతూ దివీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే ప్రజ‌ల ఆగ్రహాన్ని పట్టించుకోని ప్రభుత్వం.. వారిని అదుపుచేసేందుకు ఆగ‌స్ట్‌ 28 నుంచి ఈ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించింది. అయినా పోలీసు ఆంక్షలను పట్టించుకోని దాన‌వాయిపేట పంచాయతీలోని తాటాకుల పాలెం, న‌ర్సిపేట‌, పంపాది పేట‌, కొత్త పాక‌లు గ్రామస్తులు ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఈ పోరాటానికి సీపీఎం నేత‌లు కూడా మొద‌టి నుంచి అండ‌గా నిలుస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మ‌ధు ప‌లుమార్లు ఇక్కడ పర్యటించి ప్రజల పోరాటానికి అండగా నిలిచారు.

కవ్వింపు చర్యలు..
దివీస్‌ పరిశ్రమపై హైకోర్టు స్టేట‌స్ కో ఇచ్చినా కూడా ప్రభుత్వం అక్రమంగా ప‌రిశ్రమ నిర్మాణం కోసం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ కవ్వింపు చర్యలు స్థానికులను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. పోలీసుల హెచ్చరిక‌ల్ని లెక్కచేయకుండా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు స్థానికులు. అయితే కొంద‌రు పోలీస్ అధికారులు ఉద్యమంలో పాల్గొన్న మ‌హిళ‌లపై దౌర్జన్యం చేస్తున్నారు. తాజాగా పాద‌యాత్ర సంద‌ర్బంగా మ‌హిళ‌ల మీద పీఠాపురం సీఐ పైశాచికంగా వ్యవహరించడంతో అత‌నిపై నిర్భయ చ‌ట్టం పెట్టాలంటూ ఆందోళ‌న మొద‌ల‌య్యింది. 

పోలీసుల నిర్భందం..
ఈ నేప‌థ్యంలో పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకించడంతో పాటు కాలుష్య ప‌రిశ్రమలు నిలిపివేయాల‌ని డిమాండ్ చేస్తూ సీపీఎం నేత‌లు ఆమ‌ర‌ణ దీక్ష నిర్ణయాన్ని తీసుకున్నారు. సోమవారం నాడు కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఆమరణ దీక్షలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ప్రారంభిస్తారు. ఈ దీక్షలో సీపీఎం నేతలు కూడా పాల్గొంటారు. ప్రజ‌ల ఉద్యమానికి మద్దతుగా ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఈనెల 17న దివీస్ ప్రభావిత గ్రామాల్లో ప‌ర్యటించబోతున్నారు. అటు సీపీఎం పోలిట్ బ్యూరో స‌భ్యులు బీవీ రాఘ‌వులు కూడా 20వ తేదీన ఇక్కడ పర్యటించబోతున్నారు. దీంతో ఉద్యమం మరింత వేడెక్కనుంది.

19:39 - November 13, 2016

వికారాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం ఎంత వరకూ బయటకొచ్చిందో తెలియదు గానీ... సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం తలపెట్టిన మహాజనపాదయాత్ర 28 రోజులు పూర్తి చేసుకుందని చెప్పారు. ఇప్పటివరకూ 700 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరిగినట్లు తెలియజేశారు. ఆయా జిల్లాల్లో పర్యటించిన తాము ప్రజల సమస్యలను తెలుసుకున్నామని..వీటిపై పోరాటం సాగిస్తామని తమ్మినేని స్పష్టం చేశారు. 

19:38 - November 13, 2016

ఖమ్మం : జిల్లాకు చెందిన ప్రవాసులు సహకరిస్తే... జిల్లాలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆయన జిల్లాలో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శంకుస్థాపనలు చేశారు. ఎన్ఎస్సీ క్యాంపులో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయానికి, లకారం చెరువు సుందరీకరణకు, మమత హాస్పటల్ రోడ్డులోని నాలుగు లైన్ల రోడ్డుకు మరో మంత్రి తుమ్మలతో కలిసి.. కేటీఆర్‌ శంకుస్థాపనలు చేశారు. త్రీటౌన్‌లోని గోళ్లపాడులో నివాసం ఉంటున్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సీపీఎం నేతలు మంత్రులకు వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిష్కారం చేస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 

19:24 - November 13, 2016
19:22 - November 13, 2016
19:21 - November 13, 2016

శ్రీకాకుళం :జిల్లాలోని రణస్థల మండలం కొవ్వాడలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అణువిద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకంగా సీపీఎం నేతలు పాదయాత్ర చేపట్టారు. ఈపాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీపీఎం, సీఐటీయూ నేతలను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల జరిగే నష్టాలను వివరించడానికి ఈ రోజు నుండి 18వ తేదీ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్లాంట్ నిర్మాణం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వసుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నర్సింగరావు పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి లేనందు వల్లే నేతలను అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. 

19:13 - November 13, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుపై కేంద్రంపై విపక్షాలు గరంగరం అవుతున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు గళం విప్పారు. రూ. 2వేల నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు బాబు ఫోన్ చేశారు. పెద్ద నోట్ల రద్దుపై ఆయన తన అభిప్రాయాలు తెలియచేశారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రజలు సానుకూలంగా ఉన్నా రూ. 2వేల నోట్లు తీసుకరావడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్నారు. గతంలో రూ. 500, రూ. 1000 నోట్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు చెప్పారు. రూ. 2000వేల నోట్ రద్దు చేయకపోతే కార్యాచరణనను ప్రకటిస్తామని బాబు పేర్కొనడం గమనార్హం. 

రూ.2వేల నోట్ రద్దు చేయాలి - బాబు..

విజయవాడ : రూ. 2వేల నోట్లను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు బాబు ఫోన్ చేశారు. పెద్దనోట్ల రద్దు పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్న రూ. 2వేల నోట్లు తీసుకరావడంపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. రద్దు చేయకపోతే కార్యాచరణనను ప్రారంభిస్తామన్నారు. 

18:26 - November 13, 2016
18:19 - November 13, 2016
18:18 - November 13, 2016

గుంటూరు : ప్రొ.లక్ష్మీ ఆచూకి ఇంకా తెలియరావడం లేదు. ఈమె కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. తన ఆత్మహత్యకు ప్రొ.లక్ష్మీ కారణమని, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెడికో విద్యార్థి సంధ్యారాణి సూసైడ్ నోట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనితో అప్పటి నుండి ప్రొ.లక్ష్మీ పరారీలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రొ.లక్ష్మీ పరారీ కావడానికి సహకరించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తేళ్ల హరిబాబును పోలీసులు అరెస్టు చేశారు. పాండిచ్చేరి వెళ్లడానికి హరిబాబు కారును సమకూర్చాడని, ఆమె భర్త విజయ్ సారధితో ఫోన్ లో మాట్లాడినట్లు పోలీసులు కనుగొన్నారు. అతడిని అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. 25 వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు తేలిందని, ప్రొ.లక్ష్మీ పరారీ కావడానికి సహకరిస్తున్న వారందరూ నేరస్తులవుతారని ఎస్పీ పేర్కొన్నారు. 

మహాజన పాదయాత్రలో వీరేంద్ర గౌడ్..

వికారాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్రకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు వీరేంద్రగౌడ్, సుభాష్ యాదవ్ మద్దతు తెలిపారు. వారు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రకు ప్రొ.హరగోపాల్ సంఘీభావం తెలిపారు.

 

భోపాల్ లో కొత్త రూ. 500 నోట్లు..

భోపాల్ : పాత నోట్ల రద్దుతో చిల్లర కోసం బ్యాంకుల్లో ప్రజలు బారులుతీరుతున్నారు. కాసేపటి క్రితం భోపాల్ కొత్త ఐదు వందల రూపాయలు తీసుకున్నారు. 

17:47 - November 13, 2016

'ఆమె అతడైతే' లోనే రహస్యం ఉందని, చిత్రం చూస్తే ఆ రహస్యం తెలుస్తుందని విలక్షణ నటుడు తనికెళ్ల భరణి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్‌ క్లాసికల్‌ డాన్సర్‌ హనీష్‌ హీరోగా చిరాశ్రీ హీరోయిన్‌గా శ్రీ కనకదుర్గ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కె.సూర్యనారాయణ దర్శకత్వంలో మలినేని మారుతి ప్రసాద్‌, నెట్టెం రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆమె అతడైతే’. డిగ్రీ చదువుకున్న ఒక మిడిల్‌క్లాస్‌ కుర్రాడు తన తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చాడు అనే కధాంశంతో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో హీరో తండ్రిగా నటించానని, చాలా మంచి పాత్ర అని తెలిపారు. దర్శకుడు సూర్యనారాయణ చాలా కష్టపడి ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా తెరకెక్కించారని, నిర్మాతలు మారుతి ప్రసాద్‌, రాధాకృష్ణలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించారన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చక్కని సందేశం ఉన్న కథా చిత్రమిదని, తప్పకుండా ఈ చిత్రం యూత్‌ అందరికీ కనెక్ట్ అవుతుందన్నారు. చిత్రాన్ని అందరూ చూడాలని సూచించారు. ఇంకా ఎలాంటి విశేషాలను వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

ప్రమాదకరస్థితిలో సమాజం - అంబటి..

గుంటూరు : పెద్దనోట్ల రద్దుతో సమాజం ప్రమాదకరస్థితిలో పడిందని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. దీనిని చక్కదిద్దకపోతే తీవ్ర పరిణామాలు తలెత్తుతాయని హెచ్చరించారు. ప్రధాని మోడీ తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. మంత్రులు..ఎమ్మెల్యేలు, అనుచరుల బ్యాంకుల అకౌంట్లు పరిశీలిస్తే వాస్తవాలు బయటపడుతాయని తెలిపారు. 

ప్రభుత్వానికి ప్రొ.కోదండరాం సూచనలు..

హైదరాబాద్ : ఎస్వీకేలో టీజేఏసీ ఆధ్వర్యంలో వైద్యం, ఆరోగ్యంపై సమాలోచన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రొ.కోదండరాం పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని, జీడీపీలో వైద్య, ఆరోగ్య రంగానికి ఐదు శాతం పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రజారోగ్య వ్యవస్థలో వసతులు, సిబ్బందిని పెంచాలని సూచించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు తగిన సిబ్బంది..నిధులు కేటాయించాలని, మెడికల్ కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా రద్దు చేయాలన్నారు. ఆరోగ్య శ్రీ పథంకలోని లోపాలపై సమీక్షించి పరిష్కరించాలన్నారు.

17:22 - November 13, 2016

ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు 'అరుణ్ సాగర్ ని విలక్షణ నటుడు 'తనికెళ్ల భరణి' గుర్తు చేసుకున్నారు. తనికెళ్ల భరణితో టెన్ టివి ముచ్చటించింది. ఈసందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. అరుణ్ సాగర్ మంచి కవి అని, తండ్రుల గురించి ప్రస్తావన తీసుకొచ్చిన కవి అని పేర్కొన్నారు. తల్లిదండ్రులపై రాయని కవి ఉండరని పేర్కొన్నారు. తండ్రి యొక్క గొప్పతనం..అలాంటి తండ్రి జీవన విధానం ఎలా వెళుతాడు అనే దానిపై 'మేల్కోలుపు' పుస్తకం రాశారని పేర్కొన్నారు. అమ్మాయిలు తండ్రి తరపున ఉంటారని, తల్లి ప్రపంచానికి తెలియచేస్తే తండ్రి ప్రపంచాన్ని పరిచయడం చేస్తాడని పేర్కొన్నారు. అదే కాన్సెప్ట్ లో చిత్రం రూపొందడం జరిగిందన్నారు. 

న్యూజిలాండ్ లో భారీ భూకంపం..

క్రైస్ట్ చర్చ్ : న్యూజిలాండ్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 6.6గా న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. హాన్‌మ‌ర్ స్ప్రింగ్స్‌కు 20 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. 

17:09 - November 13, 2016

రాజ్ కోట్ : భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. భారత్ ముందు 310 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. కానీ సమయం తక్కువగా ఉండడంతో డ్రా వైపుకు భారత బ్యాట్స్ మెన్స్ మొగ్గు చూపారు. ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ కేవలం 172 పరుగులు మాత్రమే చేయగలగింది. దీనితో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 49 పరుగులతో కోహ్లీ నాటౌట్ గా నిలిచాడు. భారత్ మొదటి, రెండో ఇన్నింగ్స్ లో 537, 172/6 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తరపున రూట్, ఆలీ, స్టోక్స్ లు శతకాలతో రాణించారు. భారత తరపున పుజరా, విజయ్ లు రాణించారు. ఇంగ్లండ్ బౌలర్ రషీద్ ఏడు వికెట్లు తీయగా ఆలీ, అన్సారీకి మూడు వికెట్లు తీశారు. స్టోక్స్, వోక్స్, బ్రాడ్ లు తలో వికెట్ సాధించారు. ఇక భారత్ తరపున రెండు ఇన్నింగ్స్ లో అశ్విన్, జడేజాకు చెరో మూడు, షమీ, ఉమేష్ లకు తలో రెండు వికెట్లు, అమిత్ మిశ్రా ఒక వికెట్ తీశారు. 

డ్రాగా ముగిసిన భారత్ - ఇంగ్లడ్ తొలి టెస్టు..

రాజ్ కోట్ : భారత్ - ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 537 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి 260 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. భారత్ మొదటి, రెండో ఇన్నింగ్స్ లో 537, 172/6 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తరపున రూట్, ఆలీ, స్టోక్స్ లు శతకాలతో రాణించారు. భారత తరపున పుజరా, విజయ్ లు రాణించారు. ఇంగ్లండ్ బౌలర్ రషీద్ ఏడు వికెట్లు తీశాడు. 

16:32 - November 13, 2016

చిత్తూరు : వైసిపి ఎమ్మెల్యే రోజా డబ్బుల కోసం క్యూ లైన్ లో నిలుచున్నారు. ఆమె నోట్ల మార్పిడి కోసం నగరికి వచ్చారు. ఈసందర్భంగా మీడియాతో రోజా మాట్లాడారు. టిడిపి, బిజెపి ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితిపై బ్యాంకు సిబ్బందిని అడిగి వివరాలు తెలుకున్నారు. క్యూ లైన్ లో వేచి ఉన్న వారితో రోజా మాట్లాడారు. నల్లకుబేరులకు ముందు లీకులివ్వడం వల్ల వారు జాగ్రత్త పడ్డారని, కానీ సామాన్యులు మాత్రం తీవ్ర అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబుకు ముందే తెలియడం వల్ల హెరిటేజ్ సంస్థను అమ్ముకున్నారని రోజా విమర్శించారు. 

16:23 - November 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి పలు విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టీఆర్ఎస్ నాయకుడు కొడాలి రవి 250 మంది కార్యకర్తలతో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని, నోట్లు రద్దయిన తరువాత వాటితో పన్నులు వసూలు చేయడం చూస్తే ప్రభుత్వం దళారీగా మారిందని విమర్శించారు. సమర్థవంతమైన మంత్రిగా కేటీఆర్ పనిచేయడం లేదని, సాఫ్ట్ వేర్ కంపెనీలతో ఫొటోలు దిగి పత్రికల్లో ప్రచురించుకుంటున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఒక్క ప్రాంతంలోనైనా కేటీఆర్ పర్యటించలేదని పేర్కొన్నారు. 

నల్లధనం నియంత్రణ కోసమే నోట్ల రద్దు - మోడీ..

గోవా : నల్లధనం నియంత్రణ కోసమే పెద్ద నోట్ల రద్దు అని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యావత్ దేశం పెద్ద నోట్ల రద్దుకు బాసటగా నిలిచిందని, చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నా ఇవి తాత్కాలికమేనని పేర్కొన్నారు. నల్లధనం కుబేరుల వద్దనున్న ప్రతి పైసా దేశానిదేనన్నారు. దేశ సంపదను కొల్లగొట్టిన వారిని పట్టుకోవడమే తమ బాధ్యత అని, నల్లధనం నియంత్రణలో నిజాయితీగా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు. 

16:17 - November 13, 2016

మెదక్ : పాత నోట్ల రద్దు ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తోంది. చేతిలో డబ్బులున్నా ఖర్చు చేయని పరిస్థితి నెలకొంది. రెండు వేల రూపాయలకు ఎవరూ చిల్లర ఇవ్వకపోతుండంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డిలో ఎస్ బీహెచ్ ఎదుట తెల్లవారుజామునుండే ప్రజలు క్యూ లైన్ లో నిలుచున్నారు. బ్యాంకు సిబ్బంది మాత్రం వారి టైంలో వస్తున్నారని, అంతేగాక సిబ్బంది నిదానంగా పనిచేస్తున్నారని పలువురు ఆరోపించారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

బ్యాంకుల పరిస్థితిపై కలెక్టర్ సమీక్ష..

విశాఖపట్టణం : బ్యాంకుల్లో పరిస్థితిపై కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవలైన పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు రూ. 500 నోట్లు తీసుకోవాలని సూచించారు. బ్యాంకర్లు..ఆసుపత్రులతో రేపు సమావేశం నిర్వహించడం జరుగుతుందని, వంద నోట్లను బ్లాక్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

పిఠాపురంలో కాపు ఐక్య వేదిక వనసమారాధన..

తూర్పుగోదావరి : పిఠాపురంలో కాపు ఐక్య వేదిక వనసమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముద్రగడ, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజులు పాల్గొన్నారు. మంజునాథ కమిషన్ కు వాస్తవాలు తెలియకుండా బీసీలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. 

16:10 - November 13, 2016

విశాఖపట్టణం : చిల్లర కోసం ఏటీఎంల ఎదుట ప్రజలు బారులు తీరుతున్నారు. ఆదివారం బ్యాంకులు తెరిచి ఉండడంతో ప్రజలు భారీగా తరలివస్తున్నారు. నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. చిల్లర లేకపోవడంతో ఇక్కట్లకు గురవుతున్నారు. రెండు వేల రూపాయలకు చిల్లర లేకపోవడంతో అటు వ్యాపారస్తులు..వినియోగదారులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారీగా క్యూలు ఉండడంతో గంటల తరబడి నిలబడలేక తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు.

విజయనగరంలో...
విజయనగరం రైతు బజార్ లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. నిత్యం కొనుగోలుదారులతో బిజీ బిజీగా ఉండే మార్కెట్ ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:52 - November 13, 2016

కేజ్రీవాల్ ను కలిసిన పూనమ్ ఆజాద్..

ఢిల్లీ: బహిష్కృత బీజేపీ నేత ఎంపీ కీర్తిఆజాద్ సతీమణి పూనమ్ ఆజాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిశారు. ఆమె ఆప్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 

15:25 - November 13, 2016
15:18 - November 13, 2016

నెల్లూరు : ఈత సరదా ముగ్గురు ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఇందుకూరు పేట మండలంలో చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో సరదాగా మై పాడ్ బీచ్ కు వెళుదామని కారులో ఆరుగురు యువకులు వెళ్లారు. వీరందరూ సముద్రంలో ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఆరుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. రక్షించాలని కేకలు వేయడంతో అక్కడనే ఉన్న స్థానికులు స్పందించారు. ముగ్గురిని రక్షించారు. మిగతా ముగ్గురు నీటిలో మునిగిపోయారు. వీరి మృతదేహాలను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతి చెందిన వారు ముజీమ్, హరీష్ లు గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

15:11 - November 13, 2016

సంగారెడ్డి : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆదివారం సంగారెడ్డిలో సండే మార్కెట్ ఉంటుంది. కానీ మార్కెట్ లో ఈ ఆదివారం భిన్నమైన పరిస్థితి నెలకొందన్నారు. కొనుగోలు దారులు..అమ్మకం దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర లేదనే సమాధానాలు వస్తున్నాయి. వ్యాపారం పూర్తిగా తగ్గిపోయిందని, ఎలాంటి లావాదేవీలు జరగడం లేదన్నారు. కొత్త నోట్లను వెంటనే అందుబాటులో తేవాలని, అలాగే చిల్లరను ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. 

కొనసాగుతున్న గ్రూప్ 2 పేపర్ 4 పరీక్ష..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పేపర్ 4 పరీక్ష కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. 

ఏపీ ఆర్టీసీ ఎండీగా ఎం.మాలకొండయ్య.

విజయవాడ : ఆర్టీసీ ఎండీగా ఎం.మాలకొండయ్యలు నియమితులయ్యారు. అదనపు డీజీగా అంజనాసిన్హా, ఫైర్ సర్వీసెస్ డీజీగా కె.సత్యనారాయణ, లా అండ్ ఆర్డర్ ఐజీగా హరీష్ గుప్తా, సీఐడీ ఐజీగా అమిత్ గార్గ్, ఐజీ టెక్నికల్ గా ఇ. దామోదర్, ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ లు నియమితులయ్యారు. 

14:37 - November 13, 2016

తూర్పుగోదావరి : దివీస్ ప్రభావిత గ్రామాల ప్రజ‌లపై పోలీసుల పాశ‌విక దాడుల‌ను సీపీఎం తీవ్రంగా ఖండించింది. ప్రశాంతంగా పాద‌యాత్ర చేస్తుంటే అడ్డుకుని మ‌హిళ‌ల‌పై దాడి చేయ‌డాన్ని నిర‌సిస్తూ... ధ‌ర్నాకు దిగారు. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచిన పిఠాపురం సీఐపై నిర్భయ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేయాల‌ని సీపీఎం నేతలు ద‌డాలు సుబ్బారావు, దువ్వ శేష‌బాబ్జీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను ద‌హ‌నం చేశారు. దివీస్‌ను వ్యతిరేకిస్తున్న ప్రజ‌ల‌పై ప్రభుత్వం క‌క్ష పూరితంగా వ్యవ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు. కాలుష్య ప‌రిశ్రమ‌లు కాద‌న్నందుకు మ‌హిళ‌ల‌పై దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. త‌క్షణం దివీస్ ప్రతిపాద‌న ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు. దివీస్ నిర్మాణం ఉప‌సంహ‌రించుకునే వ‌ర‌కూ ఆందోళ‌న కొనసాగిస్తామ‌న్నారు.

 

14:35 - November 13, 2016

సిద్ధిపేట : తెలంగాణలోని పప్పు దినుసులను కేంద్రప్రభుత్వ సంస్థలతో కొనుగోలు చేపట్టాలని కేంద్రానికి మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు. రెండో పంట ఖర్చుల కోసం బ్యాంకుల నుంచి విత్‌ డ్రాల పరిమితి పెంచాలని కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గోదాముల నిర్మాణ పనులను మంత్రి హరీష్‌రావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హరీష్‌ మాట్లాడారు. రైతులకు నగదు మార్పిడితో పాటు రుణాలు అందించాలని కేంద్రానికి రాసిన లేఖలో హరీష్‌ కోరారు. 

14:34 - November 13, 2016

ఖమ్మం : నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శంకుస్థాపనలు చేశారు. ఎన్ఎస్సీ క్యాంపులో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయానికి, లకారం చెరువు సుందరీకరణకు, మమత హాస్పటల్ రోడ్డులోని నాలుగు లైన్ల రోడ్డుకు మంత్రులు కేటీఆర్‌, తుమ్మల శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా.. త్రీటౌన్‌లోని గోళ్లపాడులో నివాసం ఉంటున్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సీపీఎం నేతలు మంత్రులకు వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిష్కారం చేస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 

14:33 - November 13, 2016

ఖమ్మం : నోట్ల రద్దుతో ఖమ్మం జిల్లాలో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కావడంతో మాంసం తిద్దామన్న వారికి చేదు అనుభవం ఎదురవుతుంది. చిల్లర లేకపోవడంతో ఇటు కొనుగోలుదారులు, అటు అమ్మకందారులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:32 - November 13, 2016

ఢిల్లీ : నోట్ల రద్దు తర్వాత సామాన్యుల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. పాతనోట్లు మార్చుకునేందుకు కొందరు... నిత్యావసరాలకోసం మరికొందరు జనాలు బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూ కడుతున్నారు.. దేశరాజధాని ఢిల్లీలోకూడా ఇదే పరిస్థితి ఉంది.. పది వేల రూపాయల కోసం ఐదు గంటల పాటు లైన్లో నిలబడాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:14 - November 13, 2016

ముంబై : లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్ కార్యక్రమంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు సందడి చేశారు. అలనాటి శ్రీదేవి మొదలు నేటీ దీపికా పదుకొణే దాకా అందరూ ప్రత్యేక వస్త్రధారణలో తమ అందచందాలతో ప్రేక్షకులని కట్టిపడేశారు. తొలిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే కేవలం హీరోయిన్లకి మాత్రమే ఈ అవార్డులను అందించారు. సిల్వర్ స్క్రీన్‌పై భామల అందాల ప్రదర్శనతో పాటు వారు పోషించిన పాత్రలకు గుర్తింపుగా గోల్డెన్ రోజ్ అవార్డ్స్‌ని అందించారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా షారూఖ్ ఖాన్, కో హోస్ట్‌లుగా కరణ్ జోహార్, అర్జున్ కపూర్‌లు వ్యవహరించారు. 

రైతు పక్షపాతి అంటే ప్రజలు నవ్వుతున్నారు - మంత్రి తుమ్మల..

ఖమ్మం : కాంగ్రెస్ నేతలు కండువా వేసుకుని రైతు పక్షపాతి అంటే ప్రజలు నవ్వుతున్నారని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు చేపట్టిన పల్లె నిద్రకు స్పందన లేదని, కాంగ్రెస్ కు ప్రజా ఆమోదం లేదన్నారు. కాంగ్రెస్ నేతలతో చెప్పించుకొనే పరిస్థితి లేమని పేర్కొన్నారు. 

v

హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్ 2 పేపర్ 3 పరీక్ష ముగిసింది. పేపర్ 3 పరీక్షకు 63.20 శాతం మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5గంటల వరకు పేపర్ 4 పరీక్ష జరగనుంది. 

14:11 - November 13, 2016

ప్రకాశం : ఆ ఊరిని మహమ్మారి నాశనం చేస్తోంది. ఆ మహమ్మారిని తరిమికొట్టండి అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపురాలను నాశనం చేస్తున్న బెల్ట్ షాపులను ఎత్తివేయాలని పోలీసులు, ఎక్సైజ్ అధికారులను వేడుకున్నారు. గతంలో ఎన్నిసార్లు బెల్టు షాపులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఉన్నతాధికారులను ఆశ్రయించారు.

చెరుకుపాలెంలో పదికి పైగా బెల్ట్ షాపులు
ప్రకాశం జిల్లా దరిశి మండలం చెరుకుపాలెంలో పదికి పైగా బెల్ట్ షాపులున్నాయి. ఊరిలో మగాళ్లంతా రాత్రింబవళ్లు ఆ బెల్ట్ షాపుల వద్దే మకాం వేస్తున్నారు. ఆస్తులన్నీ కుదవ పెట్టడం, అప్పులకు అప్పులు చేస్తూ కాపురాలను గుళ్ల చేస్తున్నారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బెల్ట్‌ షాపులు మూసి వేయాలని మహిళల వినతి
తమ ఆవేదనను చెప్పుకునేందుకు ఆ ఊరి మహిళలు దరిశి వచ్చారు. దరిశిలోని పోలీసులు, ఎక్సైజ్ అధికారులను కలిశారు. ఊరిలో పది వరకు బెల్ట్ షాపులున్నాయన్న విషయాన్ని వివరించారు. అయితే ఇన్నాళ్లు అధికారులకు చెరుకుపాలెంలో బెల్ట్ షాపులు కనపడకపోవడం విశేషం.. ఐదు వందల ఇళ్లు కూడా లేని చెరుకుంపాలెంలో పదికి పైగా బెల్ట్ షాపులున్నాయంటే ఊరి జనం ఎలా తాగుడుకు బానిసయ్యారో అర్థం చేసుకోవచ్చు. రాత్రింబవళ్లు రెక్కల కష్టం చేసి ఉత్త చేతులతో ఇంటికి రావడంతో పాటు అప్పులపాలవుతున్నామంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్తులన్నీ కుదవ పెట్టడం, అప్పులకు అప్పులు చేస్తున్న వైనం
ఒంటిమీద పుస్తెలను సైతం తాగుబోతు భర్తలు తెగనమ్ముతుంటే... చేసేది లేక ఆ ఊరు మహిళలు ఎక్సైజ్‌ అధికారులను ఆశ్రయించారు. తాము ఏ విధంగా బాధపడుతున్నది... తమ కాపురాలు ఎలా నాశనం అవుతున్నది వివరించారు. బెల్ట్ షాపులు మూసి వేయనిదే తమ కాపురాలు బాగుపడవని మహిళలు తమ గోడును అధికారులకు వివరించి వినతి పత్రం సమర్పించారు.ఆ ఊరి మహిళల వినతి పత్రాన్ని స్వీకరించిన అధికారులు ఇప్పటికైనా బెల్ట్‌ షాపులను నిర్మూలించి వారి జీవితాలను చక్కదిద్దుతారో లేదో వేచి చూడాలి. 

అంతర్జాతీయ స్మగ్లర్ అరెస్టు...

కడప : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఆల్లీ ఉద్దీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో అల్లీఉద్దీన్ తో పాటు ఐదుగురు స్మగ్లర్లు కూడా ఉన్నారు. 2.1 టన్నుల ఎర్రచందనం, కారు, లారీ, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. దుబాయి కు చెందిన సాహూల్ అమీద్ కు ఆలీ ఉద్దీన్ ప్రధాన అనుచరుడు. 

ఈతకు వెళ్లి యువకులు మృతి..

నెల్లూరు : ఇందుకూరు పేట (మం) మైపాడు బీచ్ లో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. రంగనాయకుల పేటకు చెందిన నజీమ్, ముషఫ్, హరీష్ లుగా గుర్తించారు. 

పరారైన ఖైదీ అరెస్టు..

వరంగల్ : నిన్న వరంగల్ సెంట్రల్ జైలు నుండి తప్పించుకున్న ఇద్దరు ఖైదీల్లో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా గాజువాకలో సైనిక్ సింగ్ పట్టుబడ్డాడు. 

వరసుగా నాలుగో రోజు కరెన్సీ నష్టాలు..

హైదరాబాద్ : వరుసగా నాలుగో రోజు కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల ఏటీఎంలు మొరాయిస్తున్నాయి. నో క్యాష్ బోర్డులతో జనం నిరాశకు గురవుతున్నారు. నిత్యావసర కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

నోట్లు చెల్లడం లేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

నిజామాబాద్ : ఆర్మూర్ లో పాత నోట్లు చెల్లడం లేదన్న కిరోసిన్ పోసుకుని రఫీ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. దీనితో అతడిని ఆసుపత్రికి తరలించారు. 

14:07 - November 13, 2016

కామారెడ్డి : వాళ్లిద్దరు ప్రాణ స్నేహితులు...అత్యంత సన్నిహితులు...అయితే అందులో ఒకరు ఎమ్యెల్యే...ఇంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడా ఎమ్మెల్యే అవినీతి ఆగడాలు..స్నేహితునికి నచ్చడం లేదు. ఎన్నోసార్లు మందలించాడు. అయినా ఎమ్మెల్యే వినలేదు. దీంతో అవినీతిపై పోరాటం చేస్తూ..న్యాయమే లక్ష్యంగా అవినీతిపై పోరాట సమితిని సైతం ఏర్పాటు చేశాడు. ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడి చేసినా...పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు..అవినీతికి పాల్పడ్డ ఆ ఎమ్మెల్యే ఎవరు..వాచ్‌దిస్ స్టోరీ...

అవినీతిపై పోరాటమే ధ్యేయంగా చుక్కబాలరాజ్‌ గౌడ్‌
ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు...చుక్కబాలరాజ్‌ గౌడ్‌. అవినీతిపై పోరాటమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అక్రమాలపై అలుపెరుగని పోరాటం సాగిస్తున్నాడు. గతంలో వీరిద్దరు స్నేహితులు కూడా. అయితే రవీందర్ రెడ్డి వ్యవహార శైలి బాలరాజ్‌కు నచ్చకపోవడంతో అనేక సార్లు మందలించాడు. అయినా వికనపోవడంతో రవీందర్ రెడ్డి అక్రమాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని స్పష్టం చేశాడు.

1983- 2001 వరకు హౌసింగ్ శాఖ ఏఈగా బాల్ రాజ్ గౌడ్
చుక్క బాల్ రాజ్ గౌడ్ 1983 నుంచి 2001 వరకు హౌసింగ్ కార్పొరేషన్‌లో ఏఈగా, అదిలాబాద్‌లో డిఈ గా పనిచేశారు. 2001లో ఉద్యోగానికి రాజీనామా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసాడు. ప్రస్తుతం తన పొలంలో సేదతీరుతూ న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు. మిషన్ కాకతీయలో బాగంగ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెరువులు మరమ్మత్తు చేయటం కోసం రవీందర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై మంత్రి హరీశ్‌రావుకు, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి జోషికి లేఖ రాశాడు.

రవీందర్‌రెడ్డి అక్రమాలపై ఈనెల 6న మీడియా సమావేశం
ఎమ్మెల్యే రవీందర్‌ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడని ఈనెల 6న మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు బాల్‌రాజ్‌పై దాడికి పాల్పడ్డారు. మరోవైపు తాడ్వాయి మండలం ఎర్రపహడ్ గ్రామంలో దళితుల భూములను ఆక్రమించుకున్నాడంటూ ఎమ్మెల్యే పై ఆరోపిస్తున్నాడు. కుంట దేవదాయ భూమల్లో సైతం అక్రమాలకు పాల్పడ్డాడని...నియోజవర్గంలో కమీషన్లకు కక్కుర్తి పడుతూ, అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని విమర్శిస్తున్నాడు. ఎన్ని అవాంతరాలొచ్చినా...ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి అవినీతిపై పోరాటం చేస్తానని బాల్‌రాజ్ అంటున్నారు. ఈ వ్యవహాంలో ప్రభుత్వం త్వరగా న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

14:00 - November 13, 2016

వికారాబాద్ : తెలంగాణ రాష్ర్ట సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం తెలంగాణలో సీపీఎం చేపట్టిన 'మహాజన పాదయాత్ర' 28వ రోజుకు చేరుకుంది. అన్ని వర్గాల నుంచి పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. పరిగి, చిట్టెంపల్లి, వికారాబాద్‌ గుండా పాదయాత్ర సాగుతోంది. ప్రజలు తమ సమస్యలను సీపీఎం పాదయాత్ర బృందానికి చెప్పుకుంటున్నారు. ఊహించినదానికంటే ఎక్కువగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందంటున్నారు ఆ పార్టీ నేతలు.

13:58 - November 13, 2016

హైదరాబాద్ : ఉప్పు నిల్వలు అయిపోయాయన్న వార్తలను నమ్మొద్దన్నారు.. మంత్రి ఈటెల రాజేందర్‌.. ఇలాంటి పుకార్లను కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.. రాష్ట్ర ప్రజల అవసరాలకు తగినంత ఉప్పు ఉందని.. ఎవ్వరూ ఆందోళన చెందొద్దని సూచించారు..కాగా ఉప్పు దొరకటంలేదని పుకార్లతో తెలుగు రాష్ట్రాలలో కిలో ఉప్పు రూ. 200ల నుండి రూ.500ల వరకూ వ్యాపారులు విక్రయించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ఆర్థిక శాఖమంత్రి స్పందించి ఉప్పు పై వచ్చేపుకార్లను నమ్మవద్దని పేర్కొన్నారు.

13:54 - November 13, 2016

నిజామాబాద్ : పెద్దనోట్లు రద్దు ప్రభావం సామాన్యులపై భారీగానే పడింది. చిల్లర కోసం..పాతనోట్లు మార్పిడి అంశంలో సామాన్యులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రాణాల్ని తీసుకోవాటానికి కూడా యత్నిస్తున్నారు. ఇటువంటి సంఘటనే నిజామాబాద్ లో చోటుచేసుకుంది. పెద్దనోట్లు చెల్లకపోవడంతో మనస్తాపానికిగురైన ఓ ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరుకుచెందిన బాధితుడు తన దగ్గరున్న డబ్బు చెల్లడంలేదంటూ ఆవేదన చెందాడు.. బ్యాంకులు, ఏటీఎంలదగ్గర క్యూలతో విసిగిపోయాడు.. మనస్తాపంతో కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.. తీవ్రగాయాలపాలైన అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. బాధితుని పరిస్థితి విషమంగా ఉంది..

13:48 - November 13, 2016

తూర్పుగోదావరి : 500, 1000 నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇవాళ ఆదివారం అయినప్పటికీ.. కూరగాయలు, నాన్‌వెజ్‌ మార్కెట్లు జనం లేక వెలవెలబోతున్నాయి. కస్టమర్లు రాకపోయేసరికి తీవ్రంగా నష్టపోతున్నామని మటన్‌ వ్యాపారులు చెబుతున్నారు.కాగా వివాహాలపై, రియల్ ఎస్టేట్ రంగం,సినీ పరిశ్రమ,హోటల్స్, బంగారం ఇలా అదీ ఇదీ అనకుండా అన్ని రంగాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావరం పడిన విషయం తెలిసిందే. 

13:43 - November 13, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్షాలు సమరానికి సిద్ధమవుతున్నాయి. ప్రధాని మోదీ వెంటనే నోట్ల రద్దు నిర్ణయం ఉపసంహరణ చేయాలని పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. దీని కోసం నోట్ల రద్దు ఉపసంహరణ ఉద్యమాన్ని మమత చేపట్టనున్నారు. అలాగే ఉద్యమంలో సీపీఎంతో కలిసి నడుస్తామని ఆమె తెలిపారు. నోట్ల రద్దు వెనక భారీ స్కాం ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఉమ్మడి ఉద్యమానికి మమత నేతృత్వం వహించాలని కేజ్రీవాల్ కోరారు. కాంగ్రెస్ కూడా ప్రధాని మోదీపై పోరుకి కార్యాచరణ ప్రారంభించింది. 

13:40 - November 13, 2016

గోవా : నల్లధనం నియంత్రణకోసమే పెద్ద నోట్లు రద్దు చేశామన్నారు.. ప్రధాని మోదీ... నల్లధనంలోని ప్రతి పైసా పేదవాడికి చేరాలని చెప్పారు.. అవినీతిరహిత భారత్‌కోసమే ప్రజలకు తమకు ఓటేశారని గుర్తుచేశారు.. నవంబర్‌ 8న నోట్ల రద్దు నిర్ణయంతర్వాత సామాన్యులు ప్రశాంతంగా నిద్రపోయారని తెలిపారు.. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు..

మరోనటి అనుమానాస్పద మృతి..

కేరళ : మరోనటి అనుమానాస్పదంగా మృతి చెందింది. రెండు రోజుల క్రితం నటి, యంకర్అయిన సబర్న అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన మరువకముందే మరో నటి ఆత్మమత్య చేసుకుంది.  ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటి రేఖా మోహన్, తన అపార్టుమెంట్ లో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఫ్లాట్ లోపల తాళం వేసుకుని ఉండటంతో ఆమెది ఆత్మహత్యగా భావిస్తున్నారు. త్రిసూర్ లో నివసిస్తున్న ఆమె, గత రెండు రోజులుగా తన భర్తకు అందుబాటులోకి రాలేదు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో, అనుమానం వచ్చిన ఆయన, పోలీసుల సాయం కోరాడు.

మాజీ సీఎం అల్లుడిపై గృహహింస కేసు..

ఢిల్లీ : మాజీ సీఎం షీలా దీక్షిత్ అల్లుడు సయిద్ మహ్మద్ ఇమ్రాన్ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన తన భార్య, షీలా కుమార్తె లతికను గృహహింసకు గురిచేసినందుకు కేసు నమోదు కాగా, విచారణ జరిపిన పోలీసులు, ప్రాథమిక సాక్ష్యాలున్నాయని నిర్థారించి ఇమ్రాన్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. లతిక నుంచి ఇమ్రాన్ పది నెలల క్రితం విడిపోయారు. మూడేళ్ల నాడు అధికారాన్ని కోల్పోయిన తరువాత షీలా ఇంట విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. తన భర్త తనను హింసిస్తున్నాడని లతికా దీక్షిత్ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును విచారిస్తున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

అందుకే కుటుంబాన్ని వదిలేసా : మోదీ

గోవా : ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. దుఖాన్ని దిగమింగుకుంటూ తన ఆవేదన వెలిబుచ్చారు. కన్నీళ్లను దాచేస్తూ తన మనోభావాన్ని వ్యక్తపరిచారు. గోవాలో మాట్లాడుతూ నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేసినట్లు చెప్పిన మోదీ ఆ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. అత్యున్నత పదవిలో కూర్చుకునేందుకు తాను పుట్టలేదని, తన కుటుంబాన్ని, ఇళ్లును దేశం కోసం వదిలేశానన్నారు.

 

కలకత్తాలో కొత్త కరెన్సీ కలకలం..

పశ్చిమబెంగాల్ : ఒరిజినలా ? నకిలీయా ? నల్లధనమా ? ఇవేమి నోట్లో తెలియదు. కానీ కరెన్సీకి విలువ లేకుండా పోయింది. పెద్ద నోట్లు రద్దు చేయడంతో జనం ఇలా నోట్లను ముక్కలు ముక్కలు చేస్తున్నారు. కోపంతోనా, అవసరం తీరదనా, నోట్లతో పని లేదనుకున్నారా, ఎందుకో తెలియదు. కానీ పెద్ద పెద్ద నోట్లు ఇప్పుడు ఇలా రోడ్లను ఆశ్రయిస్తున్నాయి. కోల్‌కతా రోడ్లపై గుర్తు తెలియని వ్యక్తి ఇలా కరెన్సీ నోట్లు విసిరేశారు. రూ.500, రూ.1000 నోట్లు చింపి రోడ్లుపై విసిరేశారు. చించివేసిన కరెన్సీ నోట్లను పోలీసులు ప్రత్యేక సంచుల్లో తీసుకెళ్లారు.

12:44 - November 13, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరులు నానా తంటాలు పడుతున్నారు. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్ చేసేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో కొంత ముట్టజెపుతామంటూ.. కమీషన్‌ దందాకు దిగుతున్నారు. అదేవిధంగా.. భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ బ్లాక్‌మనీని విదిలించుకునే పనిలో పడ్డారు. నల్లకుబేరుల నోట్ల కట్టలను హైదరాబాద్‌లోని బంగారు, వజ్రాల వ్యాపారులు క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు. 100 నోట్ల కట్టలతో వచ్చిన వారికి 10గ్రాముల బంగారాన్ని 33 వేలకు విక్రయిస్తుండగా... ఐదు వందలు, వేయి రూపాయల నోట్ల కట్టలతో వచ్చిన వారికి మాత్రం 10 గ్రాముల బంగారాన్ని 50 నుంచి 60 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. బేగంబజార్‌, సిద్ధి అంబర్‌బజార్‌, బషీర్‌బాగ్‌, శాలిబండ, గుల్జార్‌హౌజ్‌, మహంకాళి వంటి ప్రాంతాల్లో జోరుగా బ్లాక్‌లో బంగారం విక్రయాలు జరుతున్నాయి. ఈ క్రమంలో నల్లకుబేరులు బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో రియల్ వ్యాపారంపై ప్రభావం భారీగానే పడింది. ఇక పెద్దనోట్ల రద్దుతో బంగారం కొనుగోళ్ళపై ఎటువంటి ప్రభావం పడనుంది? ఇది వారికి లాభమా?నష్టమా? అనే అంశంపై టెన్ టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో గోపీనాథ్ (ఈస్ట్ సిటీ జ్యువెలరీ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి),మధుకర్ రెడ్డి (ఎకనమిస్ట్ ) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న నిపుణుల అభిప్రాయాలు..విశ్లేషణలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

12:35 - November 13, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరులు నానా తంటాలు పడుతున్నారు. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్ చేసేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో కొంత ముట్టజెపుతామంటూ.. కమీషన్‌ దందాకు దిగుతున్నారు. అదేవిధంగా.. భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ బ్లాక్‌మనీని విదిలించుకునే పనిలో పడ్డారు.

10 నుంచి 50 శాతం కమీషన్‌ ముట్టజెబుతామంటూ బేరసారాలు
కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో నల్లకుబేరులు.. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్‌ మనీగా మార్చుకునేందుకు సరికొత్త మార్గాల బాట పడుతున్నారు. సామాన్యులు, ఉద్యోగులు, వ్యాపారులు, పరిశ్రమలు, నడుపుతున్నవారు. పెట్రోల్‌ బంకుల యజమానులు, ఆసుపత్రుల నిర్వాహకులు, ఇన్‌ఫ్రా కెంపెనీలను నడుపుతున్నవారిని సంప్రదిస్తున్నారు. 10 నుంచి 50 శాతం కమీషన్‌ ముట్టజెబుతామంటూ బేరసారాలాడుతున్నారు. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తీసుకోవాలని ఆఫర్లు ఇస్తున్నారు.

బ్లాక్‌ మనీని వైట్ చేసేందుకు నల్లకుబేరుల సరికొత్త మార్గాలు
అయితే.. సామాన్యులు మాత్రం నల్ల కుబేరుల ఆఫర్లతో తలలు పట్టుకుంటున్నారు. 2.50 లక్షలు పైబడి నగదును సొంత ఖాతాల్లో డిపాజిట్‌ చేస్తే ఆ సమాచారం ఐటీ శాఖకు చేరుతుందని సామాన్యులు నల్లకుబేరుల ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. మరోవైపు.. నల్లకుబేరుల నోట్ల కట్టలను హైదరాబాద్‌లోని బంగారు, వజ్రాల వ్యాపారులు క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు. 100 నోట్ల కట్టలతో వచ్చిన వారికి 10గ్రాముల బంగారాన్ని 33 వేలకు విక్రయిస్తుండగా... ఐదు వందలు, వేయి రూపాయల నోట్ల కట్టలతో వచ్చిన వారికి మాత్రం 10 గ్రాముల బంగారాన్ని 50 నుంచి 60 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. బేగంబజార్‌, సిద్ధి అంబర్‌బజార్‌, బషీర్‌బాగ్‌, శాలిబండ, గుల్జార్‌హౌజ్‌, మహంకాళి వంటి ప్రాంతాల్లో జోరుగా బ్లాక్‌లో బంగారం విక్రయాలు జరుతున్నాయి. ఈ క్రమంలో నల్లకుబేరులు బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

హైదరాబాద్‌లో 500 కోట్ల కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్‌ వర్గాల అంచనా..
శుక్రవారం ఒక్కరోజే... హైదరాబాద్‌లో 500 కోట్ల విలువైన కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్‌ వర్గాల అంచనా. నల్ల కుబేరుల నుంచి అందినకాడికి దండుకున్నవ్యాపారులు.. తాము సేకరించిన నగదుకు 2 శాతం కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించి.. పాత తేదీల్లో విక్రయించినట్లు చూపుతూ...నగదును వైట్‌ మనీగా చెలామణి చేసుకుంటున్నారు.

విజయవాడలో మాత్రం పరిస్థితి మరోరకంగా వుంది
అటు విజయవాడలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. మూడు పువ్వులు ఆరు కాయలుగా నిత్యం కళకళలాడే బంగారం వ్యాపారం..ఇక్కడ తీవ్ర నష్టాలు చవిచూస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో వినియోగదారులు బంగారం కొనుగోలు చేసేందుకు ముందుకు రాక.. వేల కోట్ల రూపాయల్లో జరిగే వ్యాపారం.. లక్షలకు పడిపోయింది. చిల్లర దొరక్కపోవడం, బంగారం వ్యాపారులు పాత నోట్లను తీసుకోకపోవడంతో.. బంగారం కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. మూడు రోజులుగా బంగారం కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో రోజుకు లక్ష రూపాయలు కూడా అమ్మే పరిస్ధితి లేదంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త నోట్ల ను పూర్తి స్ధాయిలో విడుదల చేస్తే నష్టాలు తగ్గితాయంటున్న వ్యాపారులు
ఇప్పటికే కోట్లలో నష్టాన్ని చూశామని, ఆర్డర్లు ఇచ్చే వారు కూడా రాకపోవడంతో తమ వ్యాపారం రోడ్డుమీద పడే పరిస్ధితి దాపురించిందని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త నోట్ల మార్పిడికి కొంత సమయం ఇచ్చి ఉంటే బావుండేదని, ఇప్పుడు బంగారం వ్యాపారం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముందని చెబుతున్నారు. ఇప్పటికే కోట్లలో నష్టపోయామని, కొత్త నోట్ల ను త్వరితగతిన పూర్తి స్ధాయిలో విడుదల చేస్తే కొంతలో కొంతైనా గట్టెక్కుతామని చెబుతున్నారు.

11:52 - November 13, 2016

ఢిల్లీ : జెఎన్‌టీయూ విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ ఆచూకీ ఎక్కడ..? నెల్లాళ్లుగా సహచర విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడం దేనికి సంకేతం..? ఎస్‌..! నిర్లక్ష్యం.. అడుగడుగునా అంతులేని నిర్లక్ష్యం..! పోలీసుల ద్వారా పాలకులు అనుసరిస్తోన్న సాచివేత విధానాలకు దర్పణం... నజీబ్‌ అదృశ్యం. ఏలికల తీరును నిరసిస్తూ దేశంలోని అన్ని వర్సిటీల విద్యార్థులు.. ఈనెల 15వ తేదీన చలో జేఎన్ యూ కూ పిలుపునిచ్చారు. అసలింతకీ ఢిల్లీ జెఎన్‌యూలో ఏం జరుగుతోంది..? వాచ్‌ దిస్‌ స్టోరీ.

వివాదాలకు కేంద్రంగా జేఎన్ యూ
ఢిల్లీ జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్శిటీ... ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. విద్యార్థుల ధర్నాలు, నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతోంది.

బయోటెక్నాలజీ చదువుతున్న నజీబ్‌ అహ్మద్‌
ఇతని పేరు నజీబ్ అహ్మద్. జేఎన్ యూ లో బయోటెక్నాలజీ చదువుతున్నాడు. ఉత్తరప్రదేశ్ బదౌన్ ప్రాంతం నుంచి మూడు నెలల క్రితం జె.ఎన్‌.యుకు వచ్చిన నజీబ్‌... మహి మాండవి హాస్టల్‌లోని రూమ్‌నెంబర్‌ 106లో చేరాడు. నజీబ్‌... మంచి విద్యార్థి అనే పేరుంది. తన పనేదో తాను చేసుకుపోయే మనస్తత్వం. ఎప్పుడు కూడా తోటి విద్యార్థులకు చదువుతూ.. కనిపించేవాడు. అయితే.. యూనివర్శిటీ హాస్టల్‌ నుంచి నజీబ్‌ కనిపించకుండా పోవడం... ఇప్పుడు విద్యార్థుల్లో ఆందోళనకు దారితీస్తోంది.

అక్టోబర్‌ 14 తేదీ రాత్రి ఏం జరిగింది..?
అక్టోబర్ 14న రాత్రి కొందరు ఏబీవీపీ విద్యార్థులు ఎన్నికల ప్రచారం సందర్భంగా... నజీబ్ ఉండే హాస్టల్‌ రూమ్‌నెంబర్‌ 106కు వెళ్లారు. నజీబ్ అన్ని మతాలను గౌరవించే విద్యార్థి. అతని చేతికి ఉన్న దారాన్ని చూసిన ఏబీవీపీ విద్యార్థులు నజీబ్‌తో దురుసుగా ప్రవర్తించారని సమాచారం. దాంతో గొడవ పెద్దగా మారి నజీబ్, ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీసిందని హాస్టల్‌ విద్యార్థులు చెబుతున్నారు. 15 మంది విద్యార్థులు నజీబ్‌ను ఒంటరిని చేసి కొట్టారని, హాస్టల్ వార్డెన్ వచ్చి వారించినా వినకుండా... వార్డెన్‌పై కూడా దాడి చేశారని, ఆ తర్వాత తన వల్లే తప్పు జరిగిందంటూ వందలాది విద్యార్థుల ముందు ABVP విద్యార్థి నాయకులు నజీబ్‌తో క్షమాపణలు చెప్పించుకున్నారని జెఎన్‌యూ విద్యార్థులు చెబుతున్నారు. అదేరోజు రాత్రి నజీబ్‌ తల్లికి ఫోన్‌ చేశాడు. ఆ తర్వాత నజీబ్‌ కనిపించకుండాపోయాడు. ఇంతకు నజీబ్‌ ఏమైయ్యాడు.

నెలరోజులు గడుస్తున్నా తెలియని నజీబ్‌ ఆచూకీ
నజీబ్ అదృశ్యమై నెలరోజులు గడుస్తోంది. ఇంతవరకూ అతని ఆచూకీని పోలీసులు చెప్పలేకపోతున్నారు. కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో నజీబ్‌ తల్లి... హాస్టల్‌ వీసీ, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వస్తే.. కేసు నమోదు చేయకుండానే వివరాలు తీసుకుని పంపించేశారు పోలీసులు. దీంతో అక్టోబర్ 17న విద్యార్థులంతా ఆందోళన చేయడంతో నజీబ్‌ మిస్సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నజీబ్‌ ఆచూకీ తెలపాలంటూ.. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌, ముఖ్యమంత్రి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు విద్యార్థులు వినతిపత్రాలు కూడా అందించారు. విద్యార్థుల ఆందోళనలు ఉధృతం చేయడంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసినా.. ఇంతవరకూ నజీబ్‌ ఆచూకీ తెలుసుకోలేకపోతున్నారు.

రాష్ర్టపతి ప్రణబ్‌ ముఖర్జీకి చేరిన నజీబ్‌ అదృశ్యం ఘటన
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నజీబ్ అదృశ్యం అంశాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో రాష్ర్టపతి యూనివర్శిటీ వీసీని నజీబ్ అదృశ్యంపై వివరణ కోరారు. నెలరోజులు కావొస్తున్నా... నజీబ్‌ ఆచూకీ తెలపకపోవడం, నజీబ్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడం, ఢిల్లీ పోలీసుల వైఫల్యం, వీ.సీ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ యూనివర్శిటీలోనే విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్షలకు దిగారు.

దర్బంగ ప్రాంతంలో నజీబ్ కనిపించాడంటున్న పోలీసులు
ఇప్పుడు ఢిల్లీ పోలీసులు నజీబ్‌ అదృశ్యంపై కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. దర్బంగ ప్రాంతంలో నజీబ్ కనిపించాడనే సమాచారం తమకు అందిందని, నజీబ్‌కు మానసిక పరిస్థితి సరిగా లేదని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు స్క్రీన్‌ప్లే అల్లారు. నజీబ్‌ ఆచూకీ కనిపెట్టాలని డిమాండ్‌ చేస్తూ.. హెచ్‌సీయూ, ఢిల్లీ, జామియా, లక్నో యూనివర్శిటీలతో సహా దేశంలోని అన్ని యూనివర్శిటీల్లోని విద్యార్థులు నిరసనలు తెలియజేస్తున్నారు. రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో నజీబ్‌ అహ్మద్‌ అంశాన్ని లెవనెత్తాలని కోరుతూ.. అన్ని పార్టీల ఎంపీలను కలుస్తామంటున్నారు విద్యార్థులు.

15 చలో జేఎన్‌యూకి పిలుపు
ఢిల్లీ పోలీసులు నజీబ్ ఆచూకీ కనిపెట్టకపోవడంతో దేశవ్యాప్త ఆందోళనలకు విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 15న చలో జేఎన్‌యూకి పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆందోళన ఉధృతమవుతున్న నేపథ్యంలో నజీబ్ ఆచూకీ కోసం కేంద్ర హోంశాఖ ఏం చర్యలు తీసుకుంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

11:46 - November 13, 2016

ఆదిలాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చలిపులి వణికిస్తోంది.. ముఖ్యంగా ఆదిలాబాద్‌ జిల్లాలో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంది.. రాత్రిపూట కురుస్తున్న మంచుతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.. ఉదయం 8దాటితే తప్ప ఎండ జాడ కనిపించడంలేదు... మరింత సమాచారానికి వీడియో చూడండి..

11:43 - November 13, 2016

విజయవాడ : తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఆదివారం కూడా నోట్ల పాట్లు తప్పలేదు. ఆదివారం కూడా బ్యాంకు సేవలు అందుబాటులో వున్న క్రమంలో నోట్లు మార్చుకునేందుకు జనాలు నాలుగో రోజు కూడా బ్యాంకుల వద్ద .. జనానికి మాత్రం పడిగాపులు తప్పడం లేదు. నిత్యావసరాలకూ డబ్బుల్లేక అవస్థలు పడాల్సి వస్తోంది. నోట్లు మార్చుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్తున్నవారు.. డ్రా చేసుకునేందుకు ఏటీఎంలకు వెళ్తున్నవారు గంటల కొద్దీ వేచి ఉండక తప్పడం లేదు. ఏపీలోని గుంటూరు, విజయవాడ,తిరుపతి, తెలంగాణలోని సంగారెడ్డి బ్యాంకుల వద్ద ప్రజలు ఉదయం ఏడు గంటల నుండే పడిగాపులు కాస్తున్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో జిల్లాలలో ప్రజల నోట్ల పాట్లు చూడండి..

11:36 - November 13, 2016

హైదరాబాద్ : నీటి సంపులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్న సౌమ్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. సౌమ్యది ఆత్మహత్య కాదని, ఆమె భర్త క్రిష్ణ గౌడ్ అతని తల్లిదండ్రులు కలిసి హత్య చేశారంటూ సౌమ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సౌమ్య తల్లిదండ్రులకు మహిళా హక్కుల సంఘాలు, బాలల హక్కుల సంఘం మద్దతుగా నిలిచాయి.

రోజుకో మలుపు తిరుగుతున్న సౌమ్య కేసు
హైదరాబాద్‌లో జరిగిన సౌమ్య హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సౌమ్యది ఆత్మహత్యేనని ఆమె భర్త కుటుంబీకులు చెబుతుండగా...సౌమ్యది హత్యేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇంతవరకూ ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చెయ్యలేదని చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందనేది స్పష్టంగా చెప్పలేదని అంటున్నారు. ఈ కేసుకి సంబంధించి ఎలాంటి విషయాన్ని బయటపెట్టకపోవడంలోనే ఏదో దాగి ఉందని ఆరోపిస్తున్నారు.

2014లో ప్రేమ వివాహం చేసుకున్న సౌమ్య
2014లో ప్రేమ వివాహం చేసుకున్న సౌమ్య, క్రిష్ణ గౌడ్... కొద్ది రోజులు బాగానే కాపురం చేశారంటూ... తరువాతనే క్రిష్ణ అసలు రూపం బయటడిందటున్నారు సౌమ్య తల్లిదండ్రులు. వీరికి 15 నెలల కుమారుడున్నాడని తెలిపారు. అయితే తమ కూతుర్ని క్రిష్ణగౌడ్‌ రోజూ కొట్టే వాడని..ఈ విషయాన్ని సౌమ్యనే స్వయంగా ఫోన్ చేసి చెప్పిందని తెలిపారు. వెంటనే ఇంటికి రమ్మని చెప్పినా..ఆమె భర్త తమ దగ్గరికి రానిచ్చేవాడు కాదని ఆరోపిస్తున్నారు.

సౌమ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్న తండ్రి
మరోవైపు తమ కుమార్తె చిన్న పిల్లాడితో కలిసి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తండ్రి చెబుతున్నారు.కేవలం తన మరదల్ని మరో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే సౌమ్యను పథకం ప్రకారం చంపారని ఆరోపించారు. తమ కుమార్తె విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా..ఎలాంటి స్పందన రాలేదని..అందుకే మహిళా హక్కుల సంఘాలను ఆశ్రయించామని తెలిపారు.

తమకు న్యాయం చేయాలని సౌమ్య తల్లిదండ్రులు
ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని సౌమ్య తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే మహిళా సంఘాల మద్దతుతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

11:33 - November 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ పోలీస్‌శాఖ ఎస్సై తుది పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది. ఈనెల 19, 20 తేదీల్లో నాలుగు పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇవాల్టి నుంచి 18 వరకు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పఈ తో పాటు..ఫైర్‌డిపార్ట్‌మెంట్‌లో ఎస్పీఎఫ్, ఎస్ పీవో సబ్‌ఇన్స్‌పెక్టర్‌ పరీక్ష పరిధిలోకి వస్తారు. 19న మొదటి పేపరు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు..రెండో పేపరు 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్ పూర్ణచందర్ తెలిపారు. 

11:29 - November 13, 2016

వికారాబాద్ : ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధించినట్లని, కాకి లెక్కలు చెబుతూ తెలంగాణ అభివృద్ధిని చూపడం కాదని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజలు కనీస అవసరాల కోసం పరితపిస్తున్నారని, రాష్ట్ర ప్రజలు బతుకు తెలంగాణ కోరుతున్నారు తప్ప బంగారు తెలంగాణ కాదని తమ్మినేని అన్నారు. వక్ఫ్‌ భూముల్ని కాపాడాలని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన తమ్మినేని
ప్రజాసమస్యలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. వక్ఫ్‌ భూములను రక్షించాలని తమ్మినేని లేఖలో డిమాండ్‌ చేశారు. ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలు రేషన్‌ కార్డులు, చదువులు లేక అల్లాడుతున్నారని, ప్రజలకు బతుకు తెలంగాణ కావాలని తమ్మినేని అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కావల్సింది బంగారు తెలంగాణ కాదని అన్నారు. పేద విద్యార్థులకు హాస్టళ్లలో నాసిరకం తిండి పెడుతున్నారని తమ్మినేని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైద్యం కూడా అందని పరిస్థితి ఉందని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలకు చెందిన మున్సిపల్‌ కార్మికుల వేతనాలు పెంచకుండా.. ఎస్సీ, ఎస్టీలను ఉద్దరిస్తామనడం సమంజసం కాదని తమ్మినేని అన్నారు.

హామీలను అమలు చేయకుండా ప్రజలను సర్కార్ మోసం చేస్తోంది : కృష్ణయ్య
కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది... సోనియాగాంధీ అయితే... తెలంగాణను తెచ్చిందే తానే అంటూ కేసీఆర్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని కృష్ణయ్య ఎద్దేవా చేశారు. ఇంటింటికి నల్లా పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారని కృష్ణయ్య అన్నారు. కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందని కృష్ణయ్య అన్నారు. దొరల పాలన నుంచి విముక్తి కల్పించేందుకు పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన ధ్వజమెత్తారు.

వికారాబాద్‌ జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర
27వ రోజు పాదయాత్ర వికారాబాద్‌ జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలోని కులకచర్ల, కాకులపల్లి, గొడుగోనిపల్లి, బాచుపల్లి, భోంపల్లి, రాఘవపూర్‌, సయ్యద్ మల్కాపూర్‌, పరిగిలో పాదయాత్ర బృందం పర్యటించింది. పరిగిలో జరిగిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. సీపీఎం పాదయాత్రకు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపారు. 

11:23 - November 13, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నిజంగానే బ్లాక్‌ మనీని నిరోధిస్తుందా..? ఇప్పటివరకు రికవరీ అయిన నల్లధనం ఎంత..? బ్లాక్‌మనీ ఎప్పుడో వైట్‌గా మారిపోయిందన్న వాదనల్లో నిజమెంత..? వాచ్‌ దిస్‌ స్టోరీ...!

మోదీ సర్కారు నిర్ణయం సఫలమా..? విఫలమా..?
సామాన్యుడిని కష్టాల పాల్జేస్తోన్న పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో.. రికవరీ అయిన నల్లధనం ఎంత..? అన్న ప్రశ్నకు ఆశ్చర్యకరమైన సమాధానం వస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 6 శాతం నల్లధనం మాత్రమే రికవరీ అయినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లోనే మొత్తం నల్లధనం బయటకు వస్తుందని ఎవరూ భావించడం లేదు కానీ.. రికవరీ అవుతోన్న బ్లాక్‌మనీ పర్సెంటేజీని చూస్తే.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం విఫలమవుతుందా..? అన్న సందేహాలనూ రేపుతోంది. ఇప్పటికే నల్లకుబేరులు తమ వద్దనున్న నగదును.. భూములు, నగలు, ఇతర ఆస్తుల కొనుగోలుకు వెచ్చించినట్లు సమాచారం.

2015/16లో నల్లకుబేరుల వద్ద నగదు రూపంలో ఉన్న డబ్బు 6 శాతం మాత్రమే
దేశంలో చలామణిలో ఉన్న ఏడువేల ఏడు వందల కోట్ల రూపాయల నల్లధనంలో ఐదు శాతం మాత్రమే అంటే 408 కోట్ల రూపాయలు మాత్రమే నగదు రూపంలో ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మిగిలిన ధనమంతా.. ఆస్తులు, వస్తువుల రూపంలో ఉండటం వల్ల.. నల్లధనం వెలికితీతకు.. కరెన్సీ మార్పు పెద్దగా ఉపకరించబోదని అంటున్నారు .అలాగే.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో నల్లకుబేరుల వద్ద నగదు రూపంలో ఉన్న డబ్బు కేవలం 6 శాతం మాత్రమేనని అధికారిక గణాంకాలు చాటుతున్నాయి.

మరికొద్ది రోజుల్లో తేలిపోతుందా?
అవినీతి పరులు, పన్ను ఎగవేత దారులు.. పెద్ద మొత్తంలో నగదు ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒక కోటి రూపాయల నగదు 13 కిలోల బరువు తూగుతుందని, అందుకే ఎవరూ నగదును దగ్గర ఉంచుకోరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవినీతి సొమ్ము, అక్రమార్జనంతా రియల్‌ ఎస్టేట్‌, ఇతర వస్తువుల రూపంలో నిక్షిప్తమై ఉందని, ఎటొచ్చి.. సామాన్యులు, మధ్యతరగతి వారికే తిప్పలు తప్పడం లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి మోదీ సర్కారు నిర్ణయం సఫలమా..? విఫలమా..? అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోతుందని విమర్శకులు భావిస్తున్నారు.

 

11:16 - November 13, 2016

హనీష్‌, కన్నడ భామ చిరాశ్రీ జంటగా శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్‌, ఎన్‌.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఆమె..అతడైతే`. యశోకృష్ణ సంగీతం అందించిన ఈ సినిమా విడుదలయ్యింది. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు సూర్యనారాయణ, హీరో అనీష్,హీరోయిన్ చిరాశ్రీలతో టెన్ టీవీ చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు సూర్యనారాయణ మాట్లాడుతూ..జాతీయ అవార్డు గ్రహీత..పాటల రచయిత సుద్దాల అశోక్ తేజగారు అభినందించారనీ అదే తనకు పెద్ద కాప్లిమెంట్ అని డైరెక్టర్ తెలిపారు. నెల్లూరు జిల్లాలోని ఓ ప‌ల్లెటూరు నుండి హైద‌రాబాద్‌కు క‌లెక్ట‌ర్ కావాల‌నే ల‌క్ష్యంతో వచ్చిన యువకుడు ఎటువంటి పరిస్థిలను ఎదుర్కొన్నాడో అనే విషయంలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలంటున్నాడు హీరో అనీష్.తరువాత సస్పెన్స్ సినిమాను చిత్రీకరించాలనుందని కూడా తెలిపారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించి పలు ఆశక్తికర అంశాలకోసం ఈ వీడియో చూడండి..

25 ఇసుక ట్రాక్టర్లు సీజ్ ..

జగిత్యాల: అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన సబ్ కలెక్టర్ 25 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన సబ్ కలెక్టర్ శశాంక్ ఆదివారం తెల్లవారుజామున గ్రామ శివారు నుంచి తరలుతున్న 25 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు.

చికెన్ కు షాక్ ఇచ్చిన పెద్దనోటు..

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం మాంసం వ్యాపారుల మీదా పడింది. ఆదివారం రోజు జోరుగా సాగే మాంసం వ్యాపారాలు మందగించాయి. సండే రోజు చికెన్‌ షాపులు ముందు వరుసకట్టే వినియోగదారులు పెద్ద నోట్ల రద్దుతో ఆవైపుకే రాలేదు. దీంతో వినియోగదారులు లేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి. 

10:12 - November 13, 2016

హైదరాబాద్: గ్రూప్-2 పేపర్-3,4 పరీక్ష ప్రారంభమయ్యాయి. అధికారులు గ్రూప్ 2 కోసం రాష్ట్రవ్యాప్తంగా 1916 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష జరుగనుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-4 పరీక్ష జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకూడా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని..నిమిషం నిబంధన వర్తిస్తుందనీ అధికారులు పేర్కొన్నారు. షూస్, మొబైల్ ఫోన్లు, వాచ్ లు వంటి పలు అంశాలపై నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. పరీక్ష వ్రాసే అభ్యర్థులు ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించి ఇబ్బందులకు లోను రావద్దని అధికారులు పేర్కొంటున్నారు. 11వ తేదీ గ్రూప్2 పరీక్ష రాసినవారికి మాత్రమే ఆదివారం గ్రూప్2 పేపర్ 3,4 పరీక్షలు రాసేందుకు అర్హులనే విషయాన్ని కూడా అధికారులు పేర్కొంటున్నారు.

సీపీఎం పాదయాత్రను ప్రారంభించిన మధు..

గుంటూరు : ప్రజా సమస్యలపై ఏపీ సీపీఎం చేపట్టిన పాదయాత్ర ప్రారంభమైంది. మంగళగిరి మండలం ఆత్మకూరులో పాదయాత్రను రాష్ట్ర కార్యదిర్శ పి. మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధి కంటే ప్రజల వద్ద నుండి భూములు ఎలా లాక్కోవాలా అని విషయంపైనే శ్రద్ధ ఎక్కువగా వుందని విమర్శించారు. ఇసుక స్కామ్ లు చేసుకునేందుకే నేతలు టీడీపీలోకి చేరుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలపై సీపీఎం నిత్యం పోరాటం చేస్తూనే వుంటుందని తెలిపారు.

నేడి నుండే కొత్త రూ.500..

ఢిల్లీ : నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శుభవార్త. పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా రూ.2 వేలు, రూ. 500 నోట్లను ప్రవేశపెట్టినట్టు చెప్పింది. అయితే ఇప్పటి వరకు రూ.2 వేల నోటు తప్ప రూ.500 నోటు చలామణిలోకి రాలేదు. అయితే ఈరోజు, లేదంటే రేపటి నుంచి కొత్త రూ.500 నోటును ప్రజలు అందుకునే అవకాశం కనిపిస్తోంది. నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్(సీఎన్‌పీ) నుంచి కొత్త రూ.500 నోట్లతో కూడిన 5 మిలియన్ లాట్ రిజర్వు బ్యాంకుకు చేరుకుంది. రూ.500 నోట్ల మొదటి కన్‌సైన్‌మెంట్‌ను రిజర్వు బ్యాంకుకు పంపించామని, బుధవారం మరో లాట్ పంపించనున్నట్టు అధికారులు తెలిపారు.

డీజిల్ వాహనాలపై సర్కార్ కొరడా!..

ఢిల్లీ : 15 ఏళ్ల నాటి భారీ డీజిల్ వాహనాలపై ఢిల్లీ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నేటి నుంచి దాదాపు 2 లక్షల వాహనాల ప్రయాణం ఆగిపోనుంది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో 1.91 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్‌ను రవాణా శాఖ రద్దు చేసింది. శుక్రవారం రాత్రి రిజిస్ట్రేషన్ రద్దు చేసిన వాహనాల జాబితాను అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు పంపినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గుర్తించిన వాహనాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు కూడా పంపినట్టు పేర్కొన్నారు.

09:09 - November 13, 2016

హైదరాబాద్: ఇవాళ గ్రూప్-2 పేపర్-3,4 పరీక్షలు జరుగనున్నాయి. అధికారులు గ్రూప్ 2 కోసం రాష్ట్రవ్యాప్తంగా 1916 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష జరుగనుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-4 పరీక్ష జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకూడా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని..నిమిషం నిబంధన వర్తిస్తుందనీ అధికారులు సూచిస్తున్నారు.కాగా 11వ తేదీ గ్రూప్2 పరీక్ష రాసినవారికి మాత్రమే ఆదివారం గ్రూప్2 పేపర్ 3,4 పరీక్షలు రాసేందుకు అర్హులనే విషయాన్ని కూడా అధికారులు పేర్కొంటున్నారు.

మరో ఉగ్రదాడి..52మంది మృతి..

పాకిస్థాన్‌ : ఉగ్రదేశమైన పాకిస్థాన్ లో మరో బాంబు దాడి సంభవించింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఉగ్రదాడికే తరకూ బలవుతోంది. తాజాగా ఇటువంటి ఘటనే జరిగింది. ఓ సూఫీ ప్రార్థనా మందిరంపై శనివారం రాత్రి జరిగిన బాంబు దాడిలో 52 మంది దుర్మరణం చెందారు. మరో వందమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రకటించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ సూఫీ ప్రార్థనా మందిరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు.

మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన..

ఖమ్మం: మంత్రి కేటీఆర్ ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మున్సిపల్ కార్పోరేషన్ భవనానికి కేటీఆర్ శంకుస్థాసన చేయనున్నారు. రూ.1.30కోట్లతో రోటరీనగర్-బోనకల్ లింక్ రోడ్డు, గోళ్లపాడు చానల్ అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాసన చేయనున్నారు. అనంతరం గొల్లగూడెంలో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొననున్నారు.

నేడు గ్రూప్-2 పేపర్-3,4 పరీక్షలు..

హైదరాబాద్: ఇవాళ గ్రూప్-2 పేపర్-3,4 పరీక్షలు జరుగనున్నాయి. అధికారులు గ్రూప్ 2 కోసం రాష్ట్రవ్యాప్తంగా 1916 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష జరుగనుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-4 పరీక్ష జరుగనుంది. 

420మంది ఎంపీలు ఆర్థిక నేరస్థులు : నారాయణ

తిరుమల: పార్లమెంటులో 270 మంది, రాజ్యసభలో 150 మంది ఆర్థిక నేరస్థులున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు. నల్లకుబేరులు బ్లాక్‌మనీతోనే హుండీలో శ్రీవారికి కానుకలుగా సమర్పిస్తున్నారని ఆయన అన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ రూ.వేలకోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఆయన ఇంతకుముందు రిలయన్స్‌ కంపెనీకి ఆర్థిక అధ్యక్షుడిగా పనిచేశారని నారాయణ ఆరోపించారు. నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందిపడుతున్నారని ఆయన అన్నారు.

08:28 - November 13, 2016

శ్రీకాకుళం : తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి చారిత్రక అవసరమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే కార్యకర్తలు మరింత చురుకుగా పని చేయాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా శ్రీకాకుళం నగరంలో పర్యటించిన చంద్రబాబు త్వరలోనే రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలు 225కు పెరగనున్నట్లు నేతలకు సూచించారు.

అభివృద్ధి పనులను ప్రారంభించిన చంద్రబాబు
సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించారు. ఉదయం శ్రీకాకుళం చేరుకున్న చంద్రబాబు.. కలెక్టరేట్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. తరువాత పలు అభివృద్ధి పనులకు రిమోట్ సిస్టం ద్వారా ప్రారంభించారు . అనంతరం ముత్యాలమ్మ గుడి, కాకి వీధి, మేదరవీధి, మార్కెట్‌ రోడ్ల మీదుగా పాదయాత్ర చేసిన చంద్రబాబు ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.

225కు పెరగనున్న నియోజకవర్గాలు
ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో జరిగిన జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు . కార్యకర్తల సంక్షేమానికి తొమ్మిది ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు . ఇప్పుడున్న 175 నియోజకవర్గాలు 225 కు పెరగనున్నాయని.. టీడీపీ శ్రేణులు బాధ్యతాయుతంగా మెలగాలన్నారు చంద్రబాబు. నేతల పనితీరుపై ఐవీఆర్‌ సిస్టమ్‌ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటానన్నారు. మహిళలకు రూ.10 వేలు ఆదాయం వచ్చేలా కృషి -చంద్రబాబు
కేఆర్‌ స్టేడియంలో జరిగిన డ్వాక్రా మహిళల సదస్సులోనూ చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో 24 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన తాము.. ప్రతి కుటుంబంలో మహిళలకు నెలవారీ 10 వేల రూపాయలు ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు 10 వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.

ఆముదాలవలస షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించాలని వినతి
ఆముదాలవలస షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించాలని బాధిత రైతులు చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించారు. మరోవైపు కొవ్వాడ అణువిద్యుత్‌ రద్దు చేయాలని కోరేందుకు ఎన్జీవో కార్యాలయం వద్ద వేచి 10 మంది సీపీఎం, సీఐటీయూ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. మరోవైపు మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో చంద్రబాబు పర్యటన మొత్తం పోలీసుల కట్టదిట్టమైన భద్రత నడుమ సాగింది. 

08:20 - November 13, 2016

హైదరాబాద్ : ఉప్పు. ఏ కూరకైనా రుచి రావాలంటే ఇది పడాల్సిందే. బీద, బిక్కీ తేడా లేదు.. ప్రతి ఇంట్లో దీనిని సర్వసాధారణంగా వాడుతుంటారు. అయితే.. ఇప్పుడు ఇది విశేషమైన ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ఉప్పు నిల్వలు తగ్గిపోయాయని వదంతులు పుట్టడంతో.. రాత్రికి రాత్రే ఉప్పుకు డిమాండ్‌ పెరిగింది. ఉప్పును కొనేందుకు జనాలు కిరాణా షాపులకు ఎగబడుతున్నారు. ఇవన్నీ వదంతులేనని ప్రభుత్వం ప్రకటించింది. పుకార్లు పుట్టించినవారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.
ఉత్తర భారతదేశంలో పుట్టిన పుకార్లు
దేశంలో ప్రజలకు రోజుకో కష్టం వచ్చి పడుతోంది. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో కష్టాలు పడుతున్న ప్రజలకు మళ్లీ ఉప్పు తిప్పలు మొదలయ్యాయి. దేశంలో ఉప్పు కొరత ఏర్పడిందన్న పుకార్లు రాత్రికి రాత్రే షికార్లు చేశాయి. ఉత్తర భారతదేశంలో పుట్టిన పుకార్లు దేశమంతా దావానలంలా వ్యాపించాయి.

కిలో ఉప్పు 250 నుంచి 300 రూపాయలకు అమ్మారని ప్రచారం
ఈ వార్తలు తెలిసిన వెంటనే ప్రజలు ఉప్పు ప్యాకెట్లను పొందేందుకు కిరాణా షాపులు, మాల్‌లకు పరుగులు పెట్టారు. ఎలాగైనా ఒక్క ప్యాకెట్టైనా పొందేందుకు కుస్తీ పట్టారు. ఉత్తరప్రదేశ్‌లో కిలో ఉప్పు 250 నుంచి 300 రూపాయలకు అమ్మారని ప్రచారం జరగడం.. ఇంకా ధరలు పెరుగుతాయన్న వదంతులతో ఒక్క ఉప్పు ప్యాకేట్‌నైనా సంపాదించేందుకు పోటీ పడ్డారు.

ఉప్పు కొనుగోలు కోసం జనాల పాట్లు
సంగారెడ్డి పాత బస్టాండ్‌ సెంటర్‌లో ఉప్పు కొనుగోలు కోసం జనాలు షాపులకు బారులు తీరారు. ఒక్కొక్కరు 30 నుంచి 50 కిలోలు కొనుగోలు చేస్తున్నారు. ఇంకా రేట్లు పెరుగాతాయేమోనన్న అనుమానంతో కొనుగోలు చేస్తున్నామంటున్నారు ప్రజలు. ఇప్పటివరకు అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు.

పుకార్లని చెప్పినా నమ్మటంలేదు : షాపు యజమాలు
ఉప్పు రేట్లు పెరిగాయన్న వార్తలన్నీ పుకార్లేనని చెప్పినా కొనుగోలుదారులు నమ్మడం లేదని షాపు యజమానులు చెబుతున్నారు. రేట్లు పెరగవంటున్నా కొనుగోలుదారులు వినడం లేదంటున్నారు.

ఉప్పు రేట్లు పెరిగాయన్న వదంతులు
ఉప్పు రేట్లు పెరిగాయన్న వదంతులతో హైదరాబాద్‌లోనూ కిరాణా షాపులకు కొనుగోలుదారులు బారులు తీరారు. ఉప్పు రేట్లు పెరిగాయనేది వదంతులేనని చెప్పినా.. కొనుగోలుదారులు కిలోల కొద్ది ఉప్పు తీసుకెళ్తున్నారని ఓ షాపు యజమాని తెలిపాడు. అయితే.. తాను మాత్రం మామూలు ధరకే ఉప్పును విక్రయిన్నట్లు తెలిపాడు.

కిలో ఉప్పును 100 రూపాయలు
ఉప్పు రేట్లు పెరిగాయన్న వదంతులతో కర్నూలు జిల్లా కోడుమూరులో షాపులకు కొనుగోలుదారులు క్యూ కట్టారు. దీంతో వ్యాపారులు కిలో ఉప్పును 100 రూపాయల వరకు విక్రయించారు. ఇంకా కొనుగోలుదారులు పెరగడంతో స్టాక్‌ లేదంటూ షాపు మూసివేశారని కొనుగోలుదారులంటున్నారు.

పుకార్లు సృష్టించేవారిపై చర్యలు : ఈటెల
ఇదిలావుంటే తెలంగాణలో ఉప్పు కొరత లేదని మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. ధరలు పెంచేస్తున్నారని వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని.. పుకార్లు సృష్టించేవారిపై చర్యలు తప్పవన్నారు ఈటెల.

ఉప్పు కష్టాలు
ఇప్పటికే నోట్ల రద్దుతో తిప్పలు పడుతున్న ప్రజలకు ఉప్పు కష్టాలు మొదలయ్యాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఉప్పును అక్రమంగా నిల్వ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

08:11 - November 13, 2016

హైదరాబాద్‌ : నగరంలో పోలీసులు నిర్భంధ తనిఖీలు కొనసాగిస్తున్నారు. తాజాగా నార్త్‌జోన్‌ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ సుమతి ఆధ్వర్యంలో సుమారు నాలుగు వందల మంది పోలీసులతో మహమ్మద్‌గూడా పరిసర ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ కార్డన్ సెర్చ్‌లో ఏడుగురు రౌడీషీటర్స్ , 14 మంది అనుమానుతులను అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు 35 బైకులు, కారు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 

నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న మంత్రి వెంకయ్య..

నెల్లూరు : నేడు నెల్లూరు జిల్లాలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పర్యటన. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. 

ఆదివారం కూడా బ్యాంక్ సేవలు..

హైదరాబాద్ : ఆర్‌బీఐ ఆదేశాల మేరకు ఆదివారం బ్యాంకులు పనిచేయనున్నాయి. తెలంగాణ ట్రెజరీ కార్యాలయాలు సైతం ఇవాళ పనిచేయనున్నాయి. పాత నోట్లతో ఎల్‌ఆర్ఎస్, బీఆర్ఎస్ చెల్లింపునకు అవకాశముంది. ఈ నెల 14 వరకు పాత పెద్దనోట్లను తీసుకునేందుకు వెసులుబాటు అమలులో వుంటుంది.

కెనరా బ్యాంక్ ఉద్యోగి అదృశ్యం..

సూర్యాపేట : కేంద్రంలోని కెనరా బ్యాంకులో ఏఈవోగా పనిచేస్తున్న సచిన్ హోసమని ఈ నెల 9 నుంచి అదృశ్యమయ్యాడు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌లోని రాంపురే బ్యాంకు కాలనీకి చెందిన సచిన్ హోసమని సూర్యాపేట కెనరాబ్యాంకులో ఏఈవోగా పనిచేస్తున్నాడు. సమీపంలోనే బ్యాంకు సెక్యూరిటీ గార్డ్ వీ శేఖర్‌రెడ్డితో కలిసి కిరాయికి ఉంటున్నాడు. 9న శేఖర్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లగా అదే రోజు రాత్రి నుంచి సచిన్ కనిపించడం లేదు.

07:41 - November 13, 2016

జపాన్ : ప్రధానమంత్రి నరేంద్రమోది మూడు రోజుల జపాన్‌ పర్యటన ముగిసింది. టోక్యో నుంచి ఢిల్లీకి ఆయన తిరుగు పయనమయ్యారు. ఈ పర్యటనలో జపాన్‌తో భారత్‌ కీలక అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేశంలో పెద్ద నోట్ల రద్దు అతి పెద్ద శుభ్రత కార్యక్రమమని, పన్ను ఎగవేతదారులను ఉపేక్షించేది లేదని మోది హెచ్చరించారు. జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలిసి మోది బుల్లెట్‌ ట్రెయిన్‌లో ప్రయాణించారు.జ‌పాన్ ప‌ర్యట‌న‌లో భాగంగా చివరి రోజు ప్రధాని న‌రేంద్ర మోదీ బుల్లెట్ రైలులో ప్రయాణించారు. షింక‌న్‌స‌న్ బుల్లెట్ రైలులో మోదీతో పాటు జపాన్ ప్రధాని షింజో అబే కూడా రైడ్ చేశారు. టోక్యో నుంచి కోబ్ వ‌ర‌కు ఇద్దరూ రైలులోనే ప్రయాణించారు.

ముంబై నుంచి అహ్మాదాబాద్ మ‌ధ్య బుల్లెట్‌ రైల్‌ ట్రాక్‌
ముంబై నుంచి అహ్మాదాబాద్ మ‌ధ్య నిర్మిస్తున్న బుల్లెట్‌ రైల్‌ ట్రాక్‌ను జ‌పాన్ టెక్నాల‌జీతోనే నిర్మించ‌నున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోది బుల్లెట్‌ ట్రెయిన్‌లో ప్రయాణించడం ద్వారా ఆ అనుభూతిని స్వయంగా తెలుసుకున్నారు.

కోబేలో ప్రవాస భారతీయులతో మోదీ
కోబేలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దుపై స్పందించారు. నల్లధనాన్ని నిర్మూలించేందుకే 5 వందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేయాలన్న నిర్ణయం కేంద్రం తీసుకుందని, ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని మోది స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నా... దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, పన్ను ఎగవేతదారులను మాత్రం ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. నోట్ల రద్దుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిసెంబరు 30 వరకు నగదు మార్పిడి, డిపాజిట్లు చేసుకోవచ్చని తెలిపారు.

జపాన్‌తో కీలక అణు ఒప్పందం
ఈ పర్యటనలో జపాన్‌తో కీలక అణు ఒప్పందం కుదుర్చుకోవడం మోది సాధించిన విజయం. జపాన్‌తో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశం భారత్‌ కావడం గమనార్హం. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు పౌర అణు ఒప్పందం ఎంతో దోహద పడనుంది. అంతేకాదు.. అణు టెక్నాలజీకి సంబంధించి భారత్‌కు జపాన్‌ సంపూర్ణ సహకారం అందించనుంది. పెట్టుబడులకు భారత్‌ అనుకూలమని, పెట్టుబడులతో రావాలని జపాన్‌ పెట్టుబడిదారులను మోది ఆహ్వానించారు. ఎన్‌ఎస్‌జిలో భారత సభ్యత్వానికి జపాన్‌ తన మద్దతు ప్రకటించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరు దేశాలు కలిసి పోరాడాలని నిర్ణయించాయి. మోది ప్రధానిగా జపాన్‌ దేశాన్ని పర్యటించడం ఇది రెండోసారి.

 

07:36 - November 13, 2016
07:35 - November 13, 2016

విశాఖ : ఓవైపు మోదీ పెద్దనోట్ల రద్దు వ్యవహారంతో నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మరోవైపు చిల్లర కోసం సామన్య ప్రజలు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మావోయిస్టులకు కూడా నోట్ల రద్దు దెబ్బ గట్టిగానే తగులుతోంది. ఇప్పటికే ఏవోబీ ఎన్‌కౌంటర్‌తో కోలుకోలేకపోతున్న మావోయిస్టులకు నోట్ల రద్దు రూపంలో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.

తాజాగా నోట్ల రద్దు నిర్ణయంతో ఆర్థికంగా ఎదురుదెబ్బ
మూలుగుతున్న నక్కమీద తాటికాయపడ్డ చందంగా మారింది మావోయిస్టుల పరిస్థితి. అసలే ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో తమ బలగాన్ని కోల్పోయిన మావోయిస్టులకు నోట్ల రద్దు నిర్ణయంతో మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు ప్రకటనతో డంపులో దాచిపెట్టిన సొమ్ము అడవి పాలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయల డబ్బును పేదలకు ఇచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. ఒక వైపు భారీ కుంబింగ్, మరో వైపు డిసెంబర్ 30 వరకు మాత్రమే గడువు ఉండటంతో దాచుకున్న ధనాన్ని ప్రజలకు చేర్చి మార్పిడి చేసే అవకాశాలు లేకుండా పోయాయి.

అటు ప్రజలకు పంచలేక, ఇటు అడవుల్లో దాచుకోలేక తర్జనభర్జన
ఇంతకుమందున్నడూ లేని ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు మావోయిస్టులను చుట్టుముట్టాయి. గతంలో మావోయిస్టు పార్టీకి ఇబ్బడిముబ్బడిగా వచ్చిన ఫండ్‌ను డంపుల్లో దాచి పెట్టేవారు. పేదలకు పంచిపెట్టి ఆర్ధికంగా అదుకునే వారు. ఆయుధాల కొనుగోలుకు ఖర్చుపెట్టే వారు. కొంత మొత్తాన్ని బంగారం రూపంలో దాచిపెట్టే వారు. అయితే ఇప్పుడు మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో నోట్ల రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. అయితే రాబోయే రోజుల్లో ఆర్ధికంగా బలపడాలని మావోయిస్టులు యోచిస్తున్నారు. ఇన్నాళ్లుగా వచ్చిన ఫండ్ రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. పార్టీ బలంగా ముందుకు వెళ్లాలంటే నిర్దిష్ట ఆర్ధిక బలం ఉండాలని అగ్రనాయకులు భావిస్తున్నారు.
భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు
గతంలో లేని విధంగా మావోయిస్టులకు ఆర్థికంగా గట్టి ఎదురు దెబ్బతగలడంపై మావోయిస్టులు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ఆర్థికంగా ఎదిగేందుకు మార్గాలను సుగమం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులునైనా ఎదుర్కొనేలా ప్రణాళికలు రచిస్తున్నారు. 

07:24 - November 13, 2016

హైదరాబాద్ : పాతనోట్ల మార్పిడి కోసం జనం నానా ఆగచాట్లు పడుతున్నారు. చాలాచోట్ల ఏటీఎంలు పనిచేయకపోవడంతో..పరేషాన్‌ అవుతున్నారు. బ్యాంకులకు వెళ్తే... బారులు తీరిన ఖాతాదారులు కనిపిస్తుండడంతో చుక్కులు కనిపిస్తున్నాయి. చిల్లర కోసం జనం కష్టాలు ఇంకా తీరడం లేదు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు.

నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద జనం బారులు
రూ.500, వెయ్యినోట్ల రద్దు చేయడంతో ఏర్పడిన గందరగోళం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పాతనోట్ల మార్పిడి కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం పడిగాపులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ఏటీఎంలు పూర్తిగా తెరుచుకోకపోవడంతో ఖాతాదారులు ఏటీఎంలకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొన్ని బ్యాంకుల్లో నగదు నిల్వలు తక్కువగా ఉండటంతో పాత నోట్లు డిపాజిట్‌ చేసిన వారికి 2వేలు మాత్రమే కొత్త నోట్లు ఇస్తున్నారు. కొన్ని బ్యాంకుల వద్ద ఖాతాదారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా తదితర నగరాల్లో కూడా
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా తదితర నగరాల్లో కూడా బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం బారులు తీరారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. వాటిని మార్చుకోడానికి బ్యాంకులకు వెళ్లినవారికి చుక్కలు కనిపిస్తున్నాయి.

కొన్నిచోట్ల పనిచేయని ఏటీఎంలు.. ఆందోళనలో ఖాతాదారులు
రెండో శనివారం, ఆదివారం కూడా బ్యాంకులు పనిచేస్తాయని ప్రకటించినా, తీరా అక్కడకు వెళ్లేసరికి డబ్బులు అయిపోయాయని మొండిచేతులు చూపిస్తున్నారు. కావాలంటే డబ్బులు మీ ఖాతాలలో డిపాజిట్ చేసుకోవచ్చని, తర్వాత ఏటీఎంలు ఎక్కడైనా పనిచేస్తే, వాటిలో తీసుకోవచ్చని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏటీఎంలు పనిచేయడం లేదు. వాటిముందు ఇప్పటికే నో క్యాష్ అని బోర్డులు పెట్టారు. బ్యాంకుల్లో సరిపడా డబ్బు లేకుండా బ్యాంకులు శని, ఆదివారాల్లో తెరిచి ఏం ప్రయోజనమని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు అవస్థలు
ఈ వారంలో శుభకార్యాలు పెట్టుకున్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల మార్పిడి సందర్భంగా... పెళ్లి కార్డు చూపించినప్పటికీ బ్యాంకర్లు కనికరించడంలేదని గగ్గోలు పెడుతున్నారు. నోట్ల మార్పిడి కోసం గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. బ్యాంకుల వద్ద ఉదయం నుంచి వందల సంఖ్యలో ప్రజలు క్యూలో నిల్చున్నప్పటికీ స్వల్ప మొత్తాల్లో మాత్రమే నగదు ఇస్తుండడంతో వారి సమస్యలు తీరడం లేదు. మరోవైపు సినిమా థియేటర్లు, వ్యాపార దుకాణాల్లో రద్దీ లేక వెలవెలపోయాయి. సాధారణంతో పోలిస్తే 30శాతం కంటే తక్కువ వ్యాపారం జరిగింది. చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. గీరాకీ లేక వ్యాపారం సన్నగిల్లిందని వాపోతున్నారు.

సామాన్యుడి కష్టాలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుడి కష్టాలను తగ్గించేందుకు కేంద్రం మరిన్ని ఉపశమన చర్యలను ప్రకటించింది. ప్రజలకు పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్ల వినియోగాన్ని సోమవారం వరకు పొడిగించింది. పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే, బస్సు టికెట్లు, ఎయిుర్ పోర్టుల్లోని కౌంటర్లలో విమాన టికెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మసీల్లో మందుల కొనుగోలు, ఎల్పీజీ సిలిండర్లు, రైల్వే కేటరింగ్‌ల్లో సోమవారం అర్ధరాత్రి వరకు పాత నోట్లు చెల్లుబాటవుతాయి. ప్రభుత్వ ఆధీనంలోని సహకార కేంద్రాల్లోనూ ధ్రువీకరణ పత్రాలతో పాత నోట్లను వినియోగించవచ్చు. మున్సిపాలిటీ, స్థానిక సంస్థల పన్నులు చెల్లించవచ్చు. 

07:11 - November 13, 2016

హైదరాబాద్ : కరెన్సీ నోట్ల మార్పు సామాన్యుల్ని అతలాకుతలం చేస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కేంద్రం ఒక ప్రకటనిచ్చి చోద్యం చూస్తోందని కామన్ మ్యాన్ మండిపడుతున్నాడు. బ్యాంకుల ముందు ఉదయం ఆరుగంటల నుండే బారులు తీరుతూ, చిల్లర నగదు కోసం పడిగాపులు కాస్తున్నారు.

500, వెయ్యి నోట్ల మార్పిడి మంచా, చెడా..?
500, వెయ్యి నోట్ల మార్పిడి మంచా, చెడా అన్నది పక్కనపెడితే దాని వల్ల తలెత్తే సమస్యల్ని ప్రభుత్వం అంచనా వేయడంలో విఫలమైందని సామాన్యులు స్వరం పెంచుతున్నారు. చిన్నా, పెద్దా డబ్బుల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకుల వద్ద గంటల తరబడి నిలబడినా డబ్బులు అందని పరిస్థితి.. దీనిపై ప్రశ్నిస్తే తామేమి చేయలేమంటూ బ్యాంకు సిబ్బంది చేతులెత్తేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వేలాది మంది బ్యాంకుల వద్ద క్యూ కడుతుంటే కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న విషయాన్ని కూడా బ్యాంకులు విస్మరించాయని మండిపడుతున్నారు. దీంతో మహిళలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఇక నల్లధనం వెలికితీయడం కోసం ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా, అంతకంటే ముందు తీసుకువల్సిన చర్యల్ని విస్మరించడం పట్ల ఆక్షేపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్ లోకి వంద, ఇతర చిన్న నోట్లు విరివిగా విడుదల చేశాక, పెద్దనోట్ల మార్పు చేస్తే బాగుండేదని ప్రజలు వాపోతున్నారు.

ముందస్తు చర్యలు తీసుకోకుండా నోట్లు రద్దు చేయడంపై ఆగ్రహం
అంతేకాదు నోట్ల మార్పిడి మా ప్రాణాల మీదకు వచ్చిందని, నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మరో మహిళ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇంత ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజ హితం కోసం అంటూ చేపట్టే ఏపనైనా, పర్యవసానాలను అంచనా వేయకుండా అకస్మాత్తుగా నిర్ణయాలను ప్రకటిస్తే ఇలాంటి నిరసనలే వెల్లువెత్తుతాయి. తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

07:03 - November 13, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం .. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లోని రియల్టీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అప్పటివరకు నగదు రూపంలో జరిగిన స్థిరాస్తి లావాదేవీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు లేక ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం ఇందుకు నిదర్శనం...

జిల్లాల విభజనతో తెలంగాణలో
విభజన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో రియల్ బూమ్ ఉపందుకొంది.. ముఖ్యంగా ఏపీ కొత్త రాజధాని అమరావతి, విశాఖపట్నంలతో పాటు మిగతా జిల్లాల్లోనూ భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి... అమరావతి, అమరావతి చుట్టూ భూముల ధరలు హైదరాబాద్ కంటే ఎక్కువ పలుకుతున్నాయి.. ఇక తెలంగాణలోనూ ప్రధానంగా రాజధాని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో రియల్ బూమ్ పెరిగింది. జిల్లాల విభజనతో ఇది మరింత స్పీడ్ అందుకొంది.. కానీ తాజాగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వ్యవహారం రియల్ రంగానికి చుక్కలు చూపబోతోందని నిపుణులు అంటున్నారు...

నగదు రూపంలో జరిగే స్థిరాస్తి లావాదేవీలన్నీ కుదేలే
నల్లధనం ఎక్కువ ప్రవహించే రంగం స్థిరాస్తి రంగమే. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎందుకంటే ప్లాట్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు, యజమాని చెప్పే ధరలకు పొంతనుండదు. ఫ్లాట్ల సంగతి చూసినా అంతే.. రిజిస్ట్రేషన్ విలువకు, చెల్లించే విలువకూ మధ్య భారీ వ్యత్యాసమే ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణలో సగటున రోజుకు 3 వేల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతాయి.. పెద్ద నోట్ల రద్దుతో బుధవారం కేవలం 150, గురువారం 300 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి.. ఇది చాలు పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్థిరాస్తి రంగంపై ఎంతలా ఉందో చెప్పడానికి. రియల్టీ రంగంలో స్థలాలు, విల్లాలు, ప్రీమియం ఫ్లాట్ల కొనుగోళ్లలో మెజార్టీ భాగం నగదు రూపంలోనే లావాదేవీలు జరుగుతాయి . అందుకే ఆయా విభాగాలపై స్వల్ప కాలంలో ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు.

బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ వంటి ప్రాంతాల్లో ప్రాజెక్టులకు ఎఫెక్ట్
రియాల్టీ ఎక్కువుగా ఉన్న హైదరాబాద్ నగరంలో 40-60 శాతం గృహాలు అందుబాటులో ఉన్నాయి. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, శ్రీనగర్‌కాలనీ, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రీమియం ప్రాంతాల్లోని ప్రాజెక్ట్‌లు, కొత్త జిల్లాల్లోని వెంచర్లు, స్థలాల క్రయవిక్రయాలకు కొంత కాలం ప్రభావం తప్పదంటున్నారు. వడ్డీ రేట్లు, రిజిస్ట్రేషన్ చార్జీల తగ్గింపు, వాస్తవ, మార్కెట్ విలువకు మధ్యనున్న వ్యత్యాసాన్ని తగ్గించడం వంటి చర్యల వల్ల ఈ రంగంలో నల్లధనాన్ని అరికట్టడానికి ఛాన్స్ ఉంటుందని.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, సామాన్యులు సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందనే చర్చ జరుగుతోంది.
తాజాగా పెద్ద నోట్ల రద్దుతో స్తంభించిన ఏపీ రియల్టీ రంగం
ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో క్యాపిటల్ రీజియన్‌లో ప్రభుత్వం భూమి విలువను ఎకరానికి 25 లక్షలుగా నిర్ణయించింది. కానీ, ఆయా ప్రాంతాల్లో మార్కెట్ రేటు మాత్రం 2-4 కోట్లు పలుకుతోంది. దీంతో కొనుగోలుదారుడు ప్రభుత్వానికి ఫీజులు, పన్నులు కేవలం 25 లక్షలకే చెల్లిస్తాడు. అమ్మేవాళ్లూ ఆదాయ పన్నులో ఈ లెక్కలు చూపించరు. కావాలంటే ఆదాయ పన్ను కూడా కొనుగోలుదారుడ్నే కట్టమంటారు. దీంతో కొనుగోలుదారుడు చేసేదేం లేక నగదు రూపంలోనే సొమ్మును చెల్లించాల్సిన అనివార్య పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి వాటికి చెక్ పడే అవకాశం ఉంది... డెవలపర్, స్థల యజమాని మధ్య జరిగే జాయింట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇందులో నగదు లావాదేవీలుండవు. బిల్డర్ నిర్మించే నిర్మాణంలో కొన్ని ఫ్లాట్లు ఓనర్‌కు అప్పగిస్తాడు. అంటే వాటిని యజమానే విక్రయించుకోవచ్చు. ఇది 40:50 లేదా 60:40 శాతంగా ఉంటుంది. అలాకాకుండా ఎవరైతే బిల్డర్లే ఒకేసారి డబ్బు చెల్లించి స్థలాన్ని కొంటారో అలాంటి ప్రాజెక్ట్‌లపై ప్రభావముంటుంది.

పెద్ద నోట్ల రద్దుతో అపార్ట్‌మెంట్ల కొనుగోళ్లు పెరిగే ఛాన్స్
పెద్ద నోట్ల రద్దు 30-60 లక్షల మధ్య ధరలుండే అపార్ట్‌మెంట్లకు మాత్రం కలిసొస్తుందని మరికొందరంటున్నారు. ఎందుకంటే ఈ విభాగంలో నగదు రూపంలో లావాదేవీలు జరిగేది కొంతే. 20-25 శాతం మాత్రమే ముందస్తు చెల్లింపులుగా నగదు రూపంలో తీసుకుంటారు. మిగిలినదంతా బ్యాంకు రుణంగా ఇస్తుంది. అందుబాటు గృహాల నిర్మాణదారులకు ప్రధాన పోటీదారులు పంచాయతీ లే-అవుట్లు, వెంచర్లు చేసే అసంఘటిత డెవలపర్లే. కానీ, ఇప్పుడు నోట్ల రద్దుతో లావాదేవీలు, బదిలీలు లేక వారందరూ తెరమరుగైపోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు నిపుణులు.. దీంతో ఎన్నారైలు, ఐటీ ఉద్యోగులు, పెట్టుబడిదారులకు మిగిలిన విభాగాల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశమే లేదు కాబట్టి అపార్ట్‌మెంట్ విభాగంలో పెట్టుబడులు పెడతారని అంటున్నారు.. 

06:56 - November 13, 2016

ఢిల్లీ : చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ నోట్ల మార్పిడి ప్రక్రియ సజావువుగా సాగుతోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. నోట్ల మార్పిడి ప్రారంభమై 3 రోజులు కావస్తోందని, దీనిపై ఎప్పటికప్పడు సమీక్ష జరుపుతున్నామన్నారు. పాత నోట్లను మార్చుకునేందుకు జనం బ్యాంకుల వద్దకు భారీగా తరలివస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు అందిస్తున్న సహకారానికి జైట్లీ కృతజ్ఞతలు తెలిపారు. 20-25 శాతం బ్యాంక్‌ లావాదేవీలు ఎస్‌బిఐ ఒక్కటే నిర్వహిస్తోందని, ఒక్క ఎస్‌బిఐలోనే 2 కోట్ల 28 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. ఇప్పటివరకు ప్రజలు 47 వేల 868 కోట్లు ఎస్‌బిఐలో డిపాజిట్‌ చేశారని, 58 లక్షల మంది నోట్లు మార్చుకున్నారని జైట్లీ పేర్కొన్నారు. రైల్వే, ఎయిర్‌లైన్స్‌, హాస్పిటల్స్, తదితర ప్రభుత్వ చెల్లింపులకు సంబంధించి సోమవారం వరకు పాత పెద్ద నోట్లు చెల్లుబాటు అవుతాయన్నారు. బ్యాంకు అధికారులు, ఉద్యోగులు సెలవులు కూడా తీసుకోకుండా రేయింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారని కితాబిచ్చారు. కొన్ని పార్టీలు బాద్యతా రహితంగా విమర్శలు చేస్తున్నాయని జైట్లీ ధ్వజమెత్తారు. 

కార్డెన్ సెర్చ్ లో 14మంది అరెస్ట్..

హైదరాబాద్ : సికింద్రాబాద్ మహ్మద్ గూడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ సుమతి ఆధ్వర్యంలో 430 మంది పోలీసులతో తనిఖీలు నిర్వహించారు. ఏడుగురు రౌడీ షీటర్లు, 14మంది అనుమానుతులను అరెస్ట్ చేశారు. 35 బైకులు, 3 ఆటోలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు.

Don't Miss