Activities calendar

14 November 2016

21:30 - November 14, 2016

అమెరికా : అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక తాను జీతం తీసుకోనని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. సీబీఎన్‌ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రకటన చేశారు. అధ్యక్షుడిగా ఏడాదికి వచ్చే నాలుగు లక్షల డాలర్లను తాను తీసుకోనని స్పష్టం చేశారు. ఒకవేళ చట్ట ప్రకారం తీసుకోవాల్సి వస్తే సంవత్సరానికి ఒక డాలరు మాత్రమే తీసుకుంటానని తెలిపారు. అలాగే సెలవులు కూడా తీసుకోనని చెప్పారు. దేశానికి నేను చేయాల్సిన పని చాలా ఉందన్నారు. హెల్త్‌ కేర్‌, పన్నులు తగ్గించే అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. అమెరికన్లకు సేవ చేసేందుకే అధ్యక్షుడిని అయ్యానని ట్రంప్‌ అన్నారు. సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో తాను జీతం తీసుకోనని ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

21:29 - November 14, 2016

జమ్మూ కాశ్మీర్ : భారత బలగాలు జ‌రిపిన కాల్పుల్లో త‌మ సైనికులు ఏడుగురు మృత్యువాత పడిన‌ట్లు పాకిస్థాన్ ఆర్మీ ప్రక‌టించింది. బీంబెర్ సెక్టార్‌లో భారత్‌ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని పాకిస్థాన్ ఆరోపించింది. ఫిరంగులు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్‌తో ఆదివారం రాత్రి భార‌త ఆర్మీ ఫైరింగ్ జరిపిన‌ట్లు పాక్ వెల్లడించింది. అయితే భారత ఆర్మీ దీన్ని ధృవీకరించలేదు. సెప్టెంబ‌ర్ 29న పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు సర్జికల్ దాడులు జరిపినప్పటి నుంచీ పాకిస్తాన్న కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ కాల్పులకు తెగబడుతోంది. పాక్‌ కాల్పులను తిప్పికొడుతూ అనేక మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే.

21:28 - November 14, 2016

ఢిల్లీ : ఈ నెల 16 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు అంశమే కీలకం కానుంది. ఈ అంశంలో మోది ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. పెద్ద నోట్ల రద్దుతో శీతాకాల సమావేశాలు మరింత వేడెక్కించనున్నాయి. 5 వందలు, వెయ్యినోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపైనే విపక్షాలు తమ అస్త్రాలను సంధించనున్నాయి. పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై విపక్షాలన్నీ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, సిపిఎం, ఆర్‌జెడి, జెడియు తదితర పార్టీలు ఢిల్లీలో సమావేశమయ్యాయి. పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేశాయి.

రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ..
సమావేశాల తొలిరోజే వందమంది విపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించాలన్న యోచనలో కాంగ్రెస్‌ ఉంది. పెద్దనోట్ల రద్దుకు సంబంధించి నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విపక్షాలు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. నోట్ల రద్దు అంశం బిజెపికి ముందే తెలుసా అంటూ విపక్షాలు నిలదీశాయి. ప్రభుత్వ ప్రకటనకు ముందే పశ్చిమబెంగాల్‌లో బిజెపి తరపున బ్యాంకుల్లో భారీగా డిపాజిట్లు జమ అవ్వడమే ఇందుకు నిదర్శనమని ఆరోపించాయి. కేంద్రం టాక్స్‌ టెర్రరిజాన్ని ప్రారంభించిందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది.

విపక్షాల విమర్శలు..
మోది చెబుతున్నట్లు పేదలు కాదు.. ఆయన కార్పోరేట్‌ స్నేహితులే హాయిగా నిద్ర పోతున్నారని ఆప్‌ ఎద్దేవా చేసింది. పెద్ద నగదు రద్దుపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం..ప్రభుత్వ సమాధానానికి అణుగుణంగా భవిష్యత్ పోరాటాన్ని రూపొందిస్తామని ఏచూరి అన్నారు. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు బిజెపి పార్లమెంటరీ సమావేశమైంది. పెద్దనోట్ల రద్దుపై ప్రజల ఆదరణ ఉందని విపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని బిజెపి నిర్ణయించింది. ప్రధాని నిర్ణయానికి ఎన్డీయే పక్షాలు మద్దతు తెలిపాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 16 వరకూ నెల రోజుల పాటు జరుగనున్నాయి. 

21:24 - November 14, 2016
21:23 - November 14, 2016

హైదరాబాద్ : సెలవుల్లో బ్యాంకులు తెరిచినా... ప్రజలకు చిల్లర ఇక్కట్లు తప్పడం లేదు. ఇవాళ తెలంగాణలోని బ్యాంకులు, పోస్టాఫీసులకు సెలవైనా...ఏపీలో మాత్రం అన్ని బ్యాంకులు పనిచేశాయి. అయినా ప్రజల కష్టాలు తీరడం లేదు. చిల్లరకోసం జనం నానా అగచాట్లు పడుతున్నారు. ఏటీఎంల దగ్గర భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు చిల్లర కొరత ఏర్పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెలవుల్లో బ్యాంకులను తెరచినా ప్రజల కష్టాలు తీరడం లేదు. మరోవైపు ఏటీఎంల నుంచి రోజుకు 2వేల రూపాయల విత్‌డ్రాను 2వేల 500 రూపాయలకు పెంచినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. కొన్ని ఏటీఎంలలో 2వేలు మాత్రమే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏటీఎం సాఫ్ట్‌వేర్‌ను పూర్తిస్థాయిలో మార్చకపోవడంతో 2వేల 500 రూపాయలు రావడం లేదు. గురునానక్ జయంతి సందర్భంగా ఇవాళ తెలంగాణలో బ్యాంకులకు సెలవైనా...ఏపీలో మాత్రం బ్యాంకులు పనిచేశాయి. అయినా సామాన్య ప్రజలు చిల్లర కోసం నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏపీలో బ్యాంకులు ఓపెన్..తెలంగాణలో బంద్..
ఏపీలో పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే బ్యాంకులకు ఎగబడ్డారు. ఇవాళ కూడా బ్యాంకులు పని చేస్తాయని తెలియడంతో పెద్ద సంఖ్యలో ఖాతాదారులు బారులు తీరారు. ఏటీఎంల దగ్గర క్యూలు కట్టారు. చిల్లర సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో బ్యాంకులు తెరచినా ప్రజలను చిల్లర కష్టాలు ఇంకా వెంటాడుతునే ఉన్నాయి. చిల్లర లోటుతో పండ్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారం సగానికి పైగా తగ్గిపోయిందని వాపోతున్నారు. మరోవైపు తెలంగాణలో ఇవాళ బ్యాంకులకు సెలవన్న విషయం తెలియక దూరప్రాంతాల నుంచి గ్రామీణులు బ్యాంకుల వద్ద వేచి చూశారు. అయినా ఎంతకూ బ్యాంకులు తెరవకపోవడంతో తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిల్లర కష్టాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

21:21 - November 14, 2016

విజయవాడ : పెద్ద నోట్లను రద్దు చేయడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఖాతాలో డబ్బులున్నప్పటికీ..వాటిని తీసుకోవడానికి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని వాటిని పరిష్కరించాలన్నారు.రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందులను తొలగించేందుకు తాము కూడా తీవ్రంగా కసరత్తు చేస్తున్నామన్నారు చంద్రబాబు. రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి సోమవారం సీఎం అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఖాతాలో డబ్బులున్నప్పటికీ విత్‌డ్రా చేసుకోవడానికి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. సామాన్యుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేందుకు ఆర్థికశాఖ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు బ్యాంకర్లతో సమన్వయంగా పనిచేస్తున్నారన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం తొలిగేవరకు ప్రజలకు అండగా నిలుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

జైట్లీకి లేఖ రాస్తా..
పెద్ద సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు తాత్కాలిక ఇబ్బందులు సహజమేనన్నారు సీఎం చంద్రబాబు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ వినూత్న కార్యక్రమం చేపట్టారని రైతు బజార్‌లో 100, 50ల టోకెన్ల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో డిజిటల్‌ లావాదేవీలను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని వెల్లడించారు. భోపాల్‌, దిల్లీ, ముంబయిల్లో 500 నోట్లు విడుదల చేశారనీ..కానీ ఏపీకి ఇంకా రాలేదన్నారు. ప్రజలకు వీలైనంత మెరుగ్గా సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై..సీఎస్‌, డీజీపీ, ఆర్థిక శాఖ, పౌరసరఫరాలు, సమాచారశాఖ అధికారులతో ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. జిల్లాల్లో కలెక్టర్‌, ఎస్పీ, సంబంధిత శాఖల అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కమాండ్‌ కంట్రోళ్ల ద్వారా పరిస్థితిని అంచనా వేస్తూ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. నోట్ల కొరత విషయంపై ఆర్థికశాఖ మంత్రికి లేఖ రాస్తానని చంద్రబాబు తెలిపారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్రంతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వీలైనంత త్వరలో ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. 

ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి విశాల్ సస్పెండ్..

చెన్నై : ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి సినీ నటుడు విశాల్ ను సస్పెండ్ చేస్తూ లేఖ పంపించారు. నిర్మాతలు బాగుండాలని ప్రశ్నిస్తే తొలగిస్తారా అని విశాల్ ప్రశ్నించారు. జనవరిలో జరిగే నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు. తనకు ఇంకా లేఖ అందలేదని తెలిపారు. 

బాబుతో నేవీ అడ్మిరల్ హెచ్ సీఎస్ భేటీ..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడితో నేవీ అడ్మిరల్ హెచ్ సీఎస్ బిస్త్ భేటీ అయ్యారు. ఐఎన్ఎస్ విరాట్ ను ఏపీ పర్యాటక శాఖకు అప్పగించే అంశంపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఓ కంపెనీ ఏర్పాటు చేసి విరాట్ ను పర్యాటక ఆకర్షణీయ కేంద్రంగా ఏర్పాటు చేయాలని బాబు ప్రతిపాదించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తామని తెలిపారు.

20:58 - November 14, 2016

పిల్లలకు కూడా హక్కులుంటాయా? వాళ్లకేం తెలుసు..? పెద్దవాళ్లు ఏది చెప్తే అది చేయాల్సిందే.. ఇంకా వినకపోతే వీపు పగలగొట్టాల్సిందే.. ఈ మాటలు మన సమాజంలో కొత్తవేం కాదు. కానీ, వాళ్లకూ హక్కులుంటాయి. సీతాకోక చిలుక రెక్కలపై ఎగిరే రంగురంగుల బాల్యాన్ని చిదిమేసే హక్కు... ఆఖరికి తల్లిదండ్రులకు కూడా లేదని.. గుర్తించాల్సిన సమయం వస్తోంది. ఈ క్రమంలో విద్య, వైద్యం. అక్రమ రవాణా, పేదరికం.. ఇలా ఎన్నో సవాళ్లు.. ఇలా చిన్నారుల హక్కుల పరిరక్షణకు ఎదురవుతున్న సవాళ్ల గురించి ప్రత్యేక కథనం..మాటలకే పరిమితమౌవటం చాలా సాధారణంగా మారింది. వాళ్లు తారే జమీన్ పర్ అని సినిమా చూసి కళ్లు తుడుచుకుంటాం. తెల్లారాక మళ్లీ మామూలే .. అటు ప్రభుత్వం నిర్లక్ష్యం, ఇటు తల్లిదండ్రుల నిస్సహాయత, పేదరికం, తెలియనితనం, అక్రమార్కుల కుట్రలు..జైలు గదుల పాఠశాలలు వెరసి బాల్యం ప్రమాదంలో పడుతోంది. హక్కులు కాగితాల మీదున్నాయి.. రక్షణలు చట్టాల్లో ఉన్నాయి.

ఎలాంటి సవాళ్లు..?
అమలు గాల్లో ఉంది. రాజకీయ నాయకులు హామీలు, నోటిమాటలుగా మిగులుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య బాలల హక్కుల పరిరక్షణ సాధ్యమేనా? అసలు చిన్నారుల కోసం మనదేశంలో ఎలాంటి చట్టాలున్నాయి? ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి?  ఒక్కమాటలో చెప్పాలంటే, దేశంలో బాల్యం అనేక సమస్యల మధ్య నడుస్తోంది. పౌష్టికాహార లోపం, అనారోగ్యం, అవిద్య, బాలల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు ఒక్కసారిగా కబళిస్తున్నాయి.. దీంతో పసిమొగ్గలు కాస్తా- అనాథలు, వీధిబాలలు, బాల కార్మికులు, బాలనేరస్థులుగా మగ్గిపోతున్నారు. మీకు తెలుసా? నూటముప్పై కోట్లున్న భారత దేశ జనాభాలో సెక్స్ వర్కర్లు కోటి మందికి పైగా ఉన్నారు. అందులో 8నుండి 10ఏళ్ల పసిపిల్లలు పిల్లలు 10 లక్షలకు పైగా ఉన్నారంటే నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.

చిన్నారులకూ ఆలోచన..
చైల్డ్ ట్రాఫికింగ్ లో మనం టాప్ లో ఉన్నామంటే సిగ్గుపడాల్సిన సందర్భం. వాళ్లూ మనతో పాటే సమాజంలో ఉంటారు. కానీ, వాళ్లకే హక్కులు ఉండవు? ఉన్నా కాగితాలకే పరిమితం. ఇంటా, బయటా.. అనేక వివక్షలు. స్కూళ్లో కఠిన శిక్షలు. వెరసి అందమైన బాల్యం పీడకలలా మారుతోంది. ఎన్నో నేరాలు జరిగాయి. జరుగుతున్నాయి. విచారణలు జరిగాయి. శిక్షలు పడ్డవి కొన్ని. పెండింగ్ లో ఉన్నవి మరికొన్ని. కానీ, నేరాలు మాత్రం ఆగలేదు. పాశ్యాత్య దేశాలతో పోలిస్తే చిన్నారుల హక్కులు కాపాడటంలో మనం ఎంతో వెనుకబడి ఉన్నాం అనటంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నారులకు ఆలోచన ఉంటుంది.. అది రివ్వున ఎగిరేలా రెక్కలు తొడగాలి.. చిన్నారులకు కలలుంటాయి.. వాటిని సాకారం చేసుకునేలా ఆసరాగా నిలబడాలి. చిన్నారులకు తమదైన ప్రపంచం ఉంటుంది. అందులో విహరించేందుకు అడ్డంకులు తొలగించాలి. స్వేచ్ఛగా, నవ్వుతూ తుళ్లుతూ విహరించాల్సిన బాల్యం, ఆడుతూ పాడుతూ నేర్చుకుంటూ ఎదగాల్సిన వయస్సు ఏరకమైన హింసకు కూడా బలికాకుండా చూడగిలిగినపుడే సమాజానికి సరైన వికాసం సాధ్యపడుతుంది. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

మోడీ నిర్ణయాన్ని ప్రశంసించారు. - వెంకయ్య..

ఢిల్లీ : నోట్ల రద్దుపై పునరాలోచించే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రధాని నిర్ణయాన్ని అందరూ ప్రశంసించారని తెలిపారు. నోట్ల రద్దును సమర్థించిన ఎన్డీయే మిత్రపక్షాలకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొన్నారు. 

20:33 - November 14, 2016

పోలవరం..ముంపు మండాలాలు..ప్రస్తుతం ఇవన్నీ భవిష్యత్ లో కనిపించవు. 2018 నాటికి పోలవరం కట్టి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ నెలకొన్న పరిస్థితులు తెలుసుకొనేందుకు 'మల్లన్న' పర్యటించాడు. ఆ ప్రాంతాల్లో ఉన్న పీహెచ్ సీలను సందర్శించాడు. పోలవరం ముంపు మండలాల్లో పీహెచ్ సీలు పోలవరం నీళ్లల్లో మునిగిపోతున్నాయని మల్లన్న తెలిపిండు. ఛిన్నాభిన్నం కాబోతున్న ఇవి భవిష్యత్ లో మనకు కనిపించవని, అటువైపు కేసీఆర్..మరోవైపు చంద్రబాబు నాయుడిలద్దరి వ్యవహారంతో ప్రజల భవిష్యత్ అంధకారంలో ఉందని తెలిపాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

20:31 - November 14, 2016

భద్రాచలం అడవుల్లోకి 'మల్లన్న' వెళ్లిండు..పోలవరంలో మునిగిపోతున్న ప్రాంతాల్లో 'మల్లన్న' తిరిగిండు. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజల గోస బాహ్య ప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం చేసిండు. సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లుగా పోలవరం పూర్తయితే పచ్చగా ఉన్న పొలాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. పోలవరం ముంపు మండలాలకు సంబంధించి ఏపీకి కేటాయించిన మండలాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. పోలవరం ఇష్యూలో ఇద్దరు చంద్రులు కలిసి ప్రజలకు అమవాస్య చూపెడుతున్నారు. మునిగిపోతున్న విద్యార్థులు..టీచర్లు..ఇతరత్రా అంశాలపై 'మల్లన్న'కు తెలియచేశారు. మరి వారి ఆవేదన ఎలా ఉందో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

బాబును కలిసిన పతంజలి గ్రూప్ ప్రతినిధి..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడిని పతంజలి గ్రూప్ ప్రతినిధి బాలకృష్ణ కలిశారు. ఏపీలో ఐదు ప్రాజెక్టుల ఏర్పాటుకు పతంజలి ముందుకొచ్చింది. అందులో రెండు టిటిడి సాయంతో ప్రతిపాదనలు చేసింది. ఫుడ్ పార్క్, గోశాల నిర్వాహణ, ఆయుర్వేద వర్సిటీ, నిత్యావసరాల తయారీ పరిశ్రమ, యోగా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 

ఆర్టీసీలో పాత నోట్లు చెల్లుబాటు - ఎండీ రమణరావు..

హైదరాబాద్ : ఈనెల 24 వరకు ఆర్టీసీ బస్సుల్లో పాత రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లుతాయని ఎండీ రమణారావు వెల్లడించారు. 

మాదిగల శక్తి ప్రదర్శన సభ ప్రారంభం..

హైదరాబాద్ : ఎగ్జిబీషన్ గ్రౌండ్ లో పిడమర్తి రవి నేతృత్వంలో మాదిగల శక్తి ప్రదర్శన సభ జరుగుతోంది. డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, పిడమర్తి రవి, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.  

19:50 - November 14, 2016
19:44 - November 14, 2016

ఉత్తర్ ప్రదేశ్ : ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు తెలియకుండా పార్టీ టికెట్లను కట్టబెడుతున్నారని ఎస్పీ బహిష్కృత నేత, ములాయం సోదరుడు, రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్‌ యాదవ్‌ అన్నారు. అధికారికంగా పనిచేయనప్పటికీ తానిప్పటికీ సమాజ్‌వాది పార్టీలోనే కొనసాగుతున్నట్టుగా భావిస్తున్నానని చెప్పారు. సిఎం అనుమతి లేకుండా టికెట్లను కట్టబెట్టొద్దని చాలామంది శాసనసభ్యులు అభిప్రాయపడుతున్నారని రాంగోపాల్‌ తెలిపారు. మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురై ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ అంతర్గత కలహాలపై స్పందించిన రాంగోపాల్- అఖిలేష్‌ దేశంలోనే ఓ బలమైన నాయకుడుగా ఆవిర్భవించారని పేర్కొన్నారు.

19:43 - November 14, 2016

హైదరాబాద్ : ఇవాళ వరల్డ్‌ డయాబెటీక్‌ డే. ప్రపంచవ్యాప్తంగా షుగర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్‌కి భారత దేశం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఆహారపు అలవాట్ల వల్లే ఇవాళ భారత దేశంలో షుగర్‌ పేషంట్లు రోజు రోజుకు పెరుగుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకొని నిత్యం వ్యాయామం చేస్తే షుగర్‌ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

 

19:41 - November 14, 2016

ఢిల్లీ : ఎల్లుండి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే సమావేశమైన విపక్ష పార్టీలు రేపు మరోసారి సమావేశం కానున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి టెని టెవికి తెలిపారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

19:40 - November 14, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై సిపిఎం ధ్వజమెత్తింది. ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేయకుండా మోది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి, నల్లధనం నిర్మూలిస్తామని చెప్పడం భ్రమ తప్ప మరోటి కాదని స్పష్టం చేసింది. డిసెంబర్ 30 వరకు పాత 500 ,1000 నోట్ల ను ప్రజా అవసరాలకోసం ఖర్చు చేసే అవకాశం కల్పించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఆదరా బాదరాగా కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్ల రైతులు, పేదలు, కార్మికులు, మధ్యతరగతి వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం ధ్వజమెత్తింది. మోది చెప్పినట్లు పెద్దనోట్ల రద్దు వల్ల అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం, నకిలీనోట్ల చలామణి అంతం అవుతుందనుకుంటే అది వట్టి భ్రమే... ఉగ్రవాదుల‌కు నిధుల‌ త‌ర‌లింపును క్యారీ బ్యాగుల్లో ఎవ‌రూ చేయ‌బోరని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారు వారికి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ద్వారానే నిధులు స‌మ‌కూరుస్తారని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

విదేశాల్లో నల్లధనం..
90 శాతం నల్లధనం విదేశాల్లోనే మూలుగుతోందని, ఆ ధనాన్ని వెనక్కి రప్పిస్తానని ప్రధాని హామీ ఇచ్చారని సిపిఎం గుర్తు చేసింది. మోది సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అడుగు ముందుకు కదలలేదని విమర్శించింది. విదేశాల్లో ఎవ‌రెవ‌రికి న‌ల్లధ‌నం ఉందో మోదీ వ‌ద్ద 568 మంది జాబితా ఉందని, ఆ జాబితా ఎందుకు బ‌య‌ట‌పెట్టడం లేదని ప్రశ్నించింది. శారదా స్కాం, నారదా స్టింగ్‌ ఆపరేషన్‌లలో వారు ప్రత్యక్షంగా కనిపించినా వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొంది. అవినీతి నిర్మూలనకోసం అవినీతికి పాల్పడే వారిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించింది. తమిళనాడు, బెంగుళూరులలో 2వేల నోట్లకి అప్పుడే నకిలీ నోట్లు వచ్చాయని, రెండు వేల నోట్లతో అవినీతి, నల్లధనం రెండింతలవుతుందని హెచ్చరించింది.

ముందుగానే నోట్ల మార్పిడి..
పెద్ద నోట్ల రద్దుపై పది నెలలుగా కసరత్తు జరుగుతుందంటే ముందుగానే కార్పొరెట్ కంపెనీలు బిజెపి ఎన్డీఏ పార్టీల నాయకులు నగదును మార్చుకున్నారని సిపిఎం ఆరోపించింది. సెప్టెంబర్ నెలలొ రెండేళ్ళ లో ఎన్నడూ లేనంతగా బ్యాంకులలో 6 లక్షల కోట్ల నగదు డిపాజిట్లు జరగడమే ఇందుకు నిదర్శనం. జాతీయ బ్యాంకులకు బడా కార్పొరేట్ కంపెనీలు 11 లక్షల కోట్ల రుణాలు బకాయిలున్నాయి..వాటిని రికవరీ చేయకుండా కేంద్రం గతేడాది లక్షా 12 వేల కోట్ల రూపాయలు కార్పోరేట్లకు మాఫీ చేసిందని ఏచూరి ధ్వజమెత్తారు. రాజకీయ అవసరాల కోసమే మోది పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

పార్లమెంట్ లో చర్చ..
మోదీ ప్రపంచం వేరు...భారత దేశ పరిస్దితులు వేరని సిపిఎం తెలిపింది. దేశంలో 90 శాతం గ్రామీణ ప్రజలు నగదు చెల్లింపుల ద్వారానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పేర్కొంది. డిసెంబర్ 30 వరకు పాత 500 ,1000 నోట్ల ను ప్రజా అవసరాలకోసం ఖర్చు చేసే అవకాశం కల్పించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. కేరళ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులన్నింటికి డిసెంబర్ 30 వరకు చెల్లించేలా నిర్ణయం తీసుకుందని కేంద్రంతో సహా అన్ని రాష్ట్రాలు ఈ విధంగా ప్రజలకు వెసులుబాటు కల్పించాలని సూచించింది. ఈ నెల 16 నుంచి జరిగే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్‌లో చర్చకు నోటీసులిచ్చామని సిపిఎం వెల్లడించింది.

ఓటుకు నోటు..ఏసీబీ వాదనలు పూర్తి..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో హైకోర్టులో ఏసీబీ వాదనలు పూర్తయ్యాయి. రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదని ఏసీబీ పేర్కొంది. వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సమర్పించిన డాక్యుమెంట్స్ లో ఎలాంటి అథార్టీ లేదని తెలిపింది. విచారణ జరుగుతుండగా అనవసర పిటిషన్ లు వేసి కేసు విచారణకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపింది. కోర్టు ఆదేశాల ప్రకారమే విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 

పార్లమెంట్ లో విపక్షాల సమావేశం..

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ లో విపక్షాలు సమావేశం నిర్వహించాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, వామపక్ష పార్టీలు, వివిధ పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. శీతాకాల సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చర్చించారు. 

18:51 - November 14, 2016
18:41 - November 14, 2016

నెల్లూరు : జిల్లాకు చెందిన సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్ దంపతులు అమెరికాలో మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏఎస్ పేట మండలం పెద్ద అబ్బిపురం గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పార్థసారధి గత ఇరవై ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. అయితే నాలుగురోజుల క్రితం డల్లాస్ లోని వారి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పార్థసారధి, ఆయన భార్య లీలావతి మృతి చెందారు. దీంతో పార్థసారధి స్వగ్రామైన పెద్దఅబ్బిపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం స్పందించి మృతదేహాలను వెంటనే స్వదేశానికి తెప్పించాలని కుటుంబసభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. 

18:39 - November 14, 2016

గుంటూరు : తప్పించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది..అందుకు ఎందరో సహకరించారు..చట్టపరమైన సాయం దొరకలేదు..పోలీసుల నుంచి గాలింపు ముమ్మరమైంది..చివరకు పట్టుబడింది...ఆమెనే ప్రొఫెసర్‌ లక్ష్మి... ఎన్నో రోజులుగా మాయమైన లక్ష్మిని పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌కు తరలించనున్నారు. వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ చాలా రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ప్రొఫెసర్‌ లక్ష్మి ఎట్టకేలకు దొరికింది...బెంగళూరులో వాహనంలో ప్రయాణిస్తుండగా లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు...ఇప్పటికే లక్ష్మి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే..స్పెషల్‌ టీమ్స్‌కు వచ్చిన సమాచారంతో బెంగళూరులో మకాం వేయగా ఆమె చిక్కింది...అక్కడి కోర్టులో హాజరుపర్చి చట్టపరమైన అనుమతులు తీసుకుని లక్ష్మిని మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది.

వేధింపులు..
గుంటూరులో వైద్య విద్యార్థిని సంధ్యారాణి కేసులో పోలీసులు చేపట్టిన దర్యాప్తు సందర్భంగా ఆమె డైరీ దొరికింది...అందులో ప్రొఫెసర్ లక్ష్మి తనను వేధిస్తుందని రాసుకుంది...ఆమె వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంధ్యారాణి తన డైరీలో రాసుకుంది.. దీంతో సంధ్యారాణి బంధువులు, జూనియర్‌ వైద్యులు..ప్రొఫెసర్‌ లక్ష్మిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేశారు...ఆ తర్వాత ప్రభుత్వం కూడా వీరి ఆందోళనలతో దిగివచ్చింది...వెంటనే లక్ష్మి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమె గురించి సమాచారం సేకరించింది..అయితే లక్ష్మిని కాపాడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన వారున్నారు.

అన్ని రకాల ప్రయత్నాలు..
ప్రొఫెసర్‌ లక్ష్మి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది..కేసు నుంచి తప్పించుకునేందుకు...అరెస్టు కాకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో బెంగళూరులో తలదాచుకుంది...ఇక లక్ష్మికి సహకరించారన్న ఆరోపణలతో హరిబాబును కూడా అదుపులోకి తీసుకున్నారు..ఆ తర్వాత ఆమె బంధువులు..ఇళ్లలో తనిఖీలు చేశారు...గాలింపు ముమ్మరం చేయడంతో లక్ష్మికి సంబంధించిన సమాచారం తెలిసింది...వెంటనే ప్రత్యేక బృందం బెంగళూరులో మకాం వేయగా...ఆమె కదలికలపై కన్నేశారు..అనుకున్నట్లుగానే వాహనంలో వెళ్తున్న లక్ష్మిని పోలీసులు పట్టుకున్నారు.

18:37 - November 14, 2016

కాకినాడ : దివీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా కాకినాడ కలెక్టరేట్‌ ముందు వామపక్షాలు ధర్నా నిర్వహించారు. దివీస్‌ను వ్యతిరేకిస్తూ స్థానిక గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌ ముందు ఆందోళన నిర్వహించారు. వీరి ఆందోళనకు సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి. మధు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా స్పందిస్తూ..పరిశ్రమల ఏర్పాటుకు సీపీఎం వ్యతిరేకం కాదని..కానీ కాలుష్య కారక పరిశ్రమలను మాత్రం అనుమతిచ్చే ప్రసక్తేలేదన్నారు మధు. ఎట్టి పరిస్థితుల్లోనూ దివీస్‌ పరిశ్రమను అడ్డుకొని తీరుతామని మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

18:36 - November 14, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వ టోల్‌గేట్ల దగ్గర రహదారి సుంకం వసూలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అయినా ఏపీఎస్ఆర్టీసీ మాత్రం ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తోంది. దీంతో సంస్థ తీరుపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఐదుదొందలు, వెయ్యి రూపాయల నోట్ల చలామణిని కేంద్ర ప్రభత్వం ఈనెల 8న రద్దు చేసింది. దీంతో చిల్లరకు ఇబ్బందులు వచ్చాయి. టోల్‌గేట్ల దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోవడందో రహదారి సుంకం వసూలును ఈనెల 14 వరకు కేంద్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఆర్టీసీ సహా అందరూ గోల్‌గేట్ల దగ్గర రహదారి సుంకాన్ని చెల్లించడంలేదు. టోల్‌ టాక్స్‌ వసూలును కేంద్రం నిలిపివేసినా... ఏపీఎస్‌ఆర్టీసీ మాత్రం ప్రయాణికుల నుంచి వసూలు చేయడం విమర్శలకు తావిస్తోంది. రహదారి సుంకం వసూలును నిలిపివేస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ పాటించకపోవడాన్ని ప్రయాణికులు తప్పుపడుతున్నారు. ప్రయాణికుల నుంచి టోల్‌గేట్‌ వసూలు చేయొద్దని తమకు ఏ రకమైన ఆదేశాలు లేవని బస్సు కండక్టర్లు చెబుతున్నారు. టికెట్‌ జారీ యంత్రాల్లో టోల్‌గేట్‌ను ఫీడ్‌చేసి ఉండటంతో వసూలు చేయక తప్పడం లేదంటున్నారు. టోల్‌గేటు నిలిపివేత తాత్కాలిక ఏర్పాటేనని, ఇవాళ్టితో ముగుస్తున్న దీనిని మరికొన్ని రోజులు పొడిగిస్తే అప్పుడు పరిశీలిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత రహదారి సుంకం నిలిపివేయడంతో ఆర్టీసీకి కొన్ని కోట్ల రూపాలు మిగిలి ఉంటుందని లెక్కవేస్తున్నారు. 

18:31 - November 14, 2016
18:26 - November 14, 2016

పోలవరం పనులపై బాబు వర్చువల్ ఇన్ స్పెక్షన్..

విజయవాడ : క్యాంపు ఆఫీస్ నుండి పోలవరం పనులపై సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ ఇన్ స్పెక్షన్ చేశారు. డంపింగ్ యార్డు కోసం తవ్విన మట్టిన తరలించేందుకు వీలుగా అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే రహదారిని విస్తరిస్తున్నట్లు ట్రాన్స్ ట్రాయ్..త్రివేణి సంస్థలు పేర్కొన్నాయి. స్పిల్ వే, స్పిల్, ఛానల్, పవర్ హౌస్ ఫౌండేషన్ కు సంబంధించి రోజుకు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాలనుకున్నట్లు పేర్కొన్నాయి.

18:16 - November 14, 2016

బీజేపీ ఉన్నతస్థాయి సమావేశం..

ఢిల్లీ : బీజేపీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్, అరుణ్ జైట్లీలు పాల్గొన్నారు. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వ వ్యూహంపై చర్చించారు. 

రైతులకు కనీస మద్దతు ధర వచ్చేల చూడాలి - ఈటెల..

హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి ఈటెల పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చూడాలని, ఉప్పు విషయంలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో 900 మెట్రిక్ టన్నుల ఉప్పు అందుబాటులో ఉందన్నారు. నిత్యావసర సరుకులు నల్లబజారుకు తరలించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మిల్లర్లకు చివరి అవకాశం ఇచ్చి సీఎంఆర్ బకాయిలు పూర్తిగా రాబట్టాలన్నారు. 

17:50 - November 14, 2016

హెచ్‌.వై. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మహేష్ కత్తి డైరెక్షన్‌లో నాగ‌మ‌ల్లారెడ్డి నిర్మాత‌గా 'తారాజువ్వ‌లు' చిత్రం రూపొందుతోంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి..కత్తి మహేష్ లు విశేషాలు తెలియచేశారు. మరి వారు ఎలాంటి విశేషాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి. 

17:44 - November 14, 2016
17:42 - November 14, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా కుదేలైంది. సంపన్న రాష్ట్రం ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఆర్థికంగా మిగులు ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ మళ్లీ లోటులోకి వెళుతుందేమోనన్న భయం ప్రభుత్వాన్ని పట్టిపీడిస్తోంది. రోజువారీ రాబడి రెండొందల కోట్ల నుంచి ఎనిమిది కోట్లకు పడిపోవడంతో ఏమిచేయాలో పాలుపోక అధికారులు, పాలకులు అయోమయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల చెలామణి రద్దు నిర్ణయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై బాగానే ప్రభావం చూపింది. సర్కారీ రాబడి తగ్గిపోవడంతో ఉత్పన్నమయ్యే పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్రతో కలిసి ఆర్థిక పరిస్థితిపై చర్చించారు.

పడిపోయిన మద్యం అమ్మకాలు..
కాసులతో గలగలలాడిన ఖజానా... పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా ఒట్టిపోయింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కూడా కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులు. ఈ మూడు శాఖల ద్వారా రోజుకు రెండొందల కోట్ల ఆదాయం వచ్చేది. వైన్‌ షాపులు, బార్లలో మద్యం అమ్మకాలు పడిపోయాయి. దుకాణాల్లో కొనుగోళ్లు తగ్గాయి. భూములు, స్థలాలు, ఫ్లాట్ల లావాదేవీలు గతంలో మాదిరిగా జరగడంలేదు. దీంతో రాబడి లేకపోవడంతో అధికారులు, పాలకుల చేతులు కట్టేసినంత పనైందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బుధవారం రూ.22 కోట్లు, గురువారం రూ.20 కోట్లు..
పెద్ద నోట్ల రద్దుకు ముందు స్థిరాస్తి వ్యాపారం బాగా ఉండేది. రోజుకు మూడువేలకు పైగా లావాదేవీలు జరిగేవి. కానీ ఇప్పుడు కేవలం రెండొందల లోపే ఉన్నాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి. సగటున రోజుకు 20 కోట్ల వంతున నెలకు 320 కోట్ల రాబడితో ప్రభుత్వ గల్లాపెట్టే గలగల్లాడేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తొంబైశాతం రాబడి పడిపోయిందని లెక్కలు తేల్చారు. వాహనాల అమ్మకాలు రోజుకు మూడు వేల నుంచి వెయ్యికి తగ్గిపోవడంతో, రవాణ శాఖ ద్వారా వచ్చే ఆదాయం 60 శాతం కోల్పోవాల్సి వచ్చింది. అయితే పెద్ద నోట్లు రద్దైన తర్వాత మొదటి రెండు రోజులు రాబడి తగ్గినా... శుక్రవారం నుంచి పెరుగుతూ వస్తోందని అధికారులు చెప్పడం కొంత ఊరట కలిగించే అంశంగా భావిస్తున్నారు. సగటున రోజువారీ మద్యం ఆదాయం 40 కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ బుధవారం 22 కోట్ల గురువారం 20 కోట్లు మాత్రమే వచ్చిందని లెక్క తేల్చారు. కానీ శుక్రవారం ఒక్కసారిగా 68 కోట్లకు చేరడంతో అధికారులు కొద్దిగా ఊపరి పీల్చుకున్నారు. నగదుపై లావాదేవీలు జరిగే చిన్న వ్యాపారాలు కూడా తగ్గిపోవడంతో ఆ ప్రభావం ఖజానాపై పడుతోంది. మొత్తం మీద నెలకు వెయ్యి కోట్ల రాబడి కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా ప్రభుత్వం వేస్తోంది.

కోలుకోడానికి నాలుగైదు నెలలు..
పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి ప్రభుత్వం ఇప్పుడే కోలుకునే అవకాశాలు లేవని..దీనికి నాలుగైదు నెలలు పట్టొచ్చనుకొంటున్నారు. వచ్చే బడ్జెట్‌పై కూడా ఇది ప్రభావం చూపుతుందన్న నిర్ధారణకు అధికారులు వచ్చారు. 2015-16 వార్షిక బడ్జెట్‌ లక్షా 30 వేల కోట్ల రూపాయలు కాగా... 2016-17 బడ్జెట్‌ లక్ష కోట్లకు మించకపోవచ్చని అంచనాతో పాలకవర్గం ఉంది. పన్నులు పెంచి రాబడి పెంచుకొందామనుకున్నా... రాష్ట్రంలో ప్రస్తుతం ఈ పరిస్థితి లేదంటున్నారు. పన్ను పోటు ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుందన్న భయంతో సర్కార్‌ ఉంది. రుణం తెచ్చుకుందామన్నా ఆ పరిస్థితీ లేదు. ఆర్థిక నియంత్రణ, బడ్జెట్‌ నిర్వహణ... ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారంలో బడ్జెట్‌ సైజును బట్టి మూడు శాతం ఉన్న రుణ పరిమితిని ఇటీవలే మూడున్నర శాతానికి పెంచారు. ఇలా అన్నిద్వారాలు మూసుకుపోవడంతో ప్రభుత్వానికి చేతులు కట్టేసినంత పనైందని పాలకుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. ఆదాయం పెంచుకునేందుకు ఏ ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఉన్నదాంతోనే కొంతకాలంపాటు సర్దుకుపోవాల్సిన పరిస్థితితులు ఉత్పన్నమయ్యాయి.  ప్రస్తుత బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు సింహభాగం కేటాయించారు. పాతికవేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం చకచకా సాగిపోతున్న తరుణంలో అనూహ్యంగా చోటు చేసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈ రంగంపై కూడా పడుతుందని భావిస్తున్నారు. 

జీహెచ్ఎంసీకి నాలుగో రోజు రూ. 35 కోట్లు..

హైదరాబాద్ : పాత నోట్లు రద్దు జీహెచ్ఎంసీ పంట పండిస్తోంది. నాలుగో రోజు పాత నోట్లతో చెల్లింపులు జరుగుతున్నాయి. సోమవారం రూ. 35 కోట్ల రాబడి వచ్చింది. ఈనెల 24వరకు పాతనోట్లతో బకాయిలు చెల్లించే అవకాశం కేంద్రం కల్పించింది. 

నాయినీని వేదికపైకి పిలవని నిర్వాహకులు..

హైదరాబాద్ : నీలోఫర్ హాస్పిటల్ లో నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. హోం మంత్రి నాయినీని వేదికపైకి నిర్వాహకులు పిలవలేదు. దీనితో నాయినీ వేదిక ఎక్కకుండానే అలిగి వెళ్లిపోయారు. 

పోలీసులపైకి రాళ్లు రువ్విన ఎర్రచందనం స్మగ్లర్లు...

కడప : సిద్ధవటం (మం) ఆవుకురాయి లంకమళ్ల అటవీ ప్రాంతంలో పోలీసులకు 30 మంది ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. రాళ్లు రువ్వడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

 

16:20 - November 14, 2016

సంగారెడ్డి : జిల్లాలో నోట్ల రద్దుతో సామాన్యులకు ఇక్కట్లు తప్పడం లేదు. చిల్లర లేక..పాత నోట్లు ఎవరూ తీసుకోకపోవడంతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శని, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేశాయి. కానీ సోమవారం సెలవు దినం కావడంతో బ్యాంకులు మూతపడ్డాయి. ఈ సమాచారం తెలియని కొంతమంది గ్రామీణులు బ్యాంకుల ఎదుటపడిగాపులు కాశారు. సమాచార లోపంతో బ్యాంకుల ఎదుట నిలుచుకున్నారు. ఉత్తర్ పల్లి నుండి సంగారెడ్డికి రావడానికి చాలా సమస్యలు ఎదుర్కొన్నామని, చిల్లర ఇవ్వడం లేదని వాపోయారు. చిట్టీ..కిరాయి పైసలు కడుతామంటే పాతనోట్లను తీసుకోవడం లేదన్నారు. 

16:13 - November 14, 2016

విజయవాడ : రాష్ట్రంలో నెలకొన్న నోట్ల రద్దు సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. పెద్ద నోట్ల రద్దు - తాజాగా పరిస్థితులపై బాబు సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే దానిపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిపారు. నోట్ల రద్దు ప్రకటన కంటే ముందే కొంత కసరత్తు చేస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేదన్నారు. ఏపీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఓ కమిటీని కూడా నియమించడం జరిగిందన్నారు. ఈ రోజు రాష్ట్రంలో బ్యాంకులు పనిచేయడం జరుగుతున్నాయని, ఏపీలో నిన్నటి వరకు రూ. 6,706 కోట్లు డిపాజిట్ చేశారని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు, రైతు బజార్లలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సాహించాలని, బ్యాంకర్లు, అధికారులు సమన్వయ పరచుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

నోట్ల రద్దుపై బాబు సమీక్ష..

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు - తాజాగా పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే దానిపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిపారు. నోట్ల రద్దు ప్రకటన కంటే ముందే కొంత కసరత్తు చేస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేదన్నారు. ఏపీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఓ కమిటీని కూడా నియమించడం జరిగిందన్నారు. 

కాసేపట్లో మాదిగల శక్తి ప్రదర్శన సభ..

హైదరాబాద్ : సాయంత్రం ఎగ్జిబీషన్ గ్రౌండ్ లో పిడమర్తి రవి నేతృత్వంలో మాదిగల శక్తి ప్రదర్శన సభ జరగనుంది. డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.  

15:52 - November 14, 2016
15:20 - November 14, 2016

ఢిల్లీ : రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు విషయంలో టోల్ గేట్ రద్దు విషయంలో కేంద్రం మరోసారి స్పందించింది. గడువు పొడిగిస్తూ ప్రకటించింది. పెద్దనోట్ల రద్దుతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టోల్ గేట్ల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దేశ వ్యాప్తంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై స్పందించి కేంద్రం టోల్ గేట్ రద్దును ఎత్తివేసింది. ఈనెల 14వ తేదీ వరకు ఈ పొడిగింపు ఉంటుందని కేంద్రం పేర్కొంది. కానీ ఏటీంఎలలో డబ్బులు లేకపోవడం..బ్యాంకుల్లో అధిక రద్దీ నెలకొడంతో యథాతథ పరిస్థితి నెలకొంది. దీనిపై మరోసారి కేంద్రం మరోసారి నిర్ణయం తీసుకుంది. ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి వరకు టోల్ గేట్ రద్దు ఉంటుందని కేంద్రం పేర్కొంది. అప్పటి వరకు పరిస్థితుల్లో మార్పు వస్తుందా ? లేదా ? అనేది వేచి చూడాలి.

 

టోల్ గేట్ రద్దు గడువు పొడిగింపు..

ఢిల్లీ : వాహనదారులకు మరోసారి కేంద్రం ఊరటనిచ్చింది. జాతీయ రహదారుల టోల్ వసూలు రద్దు గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. నవంబర్ 18వ తేదీ అర్ధరాత్రి వరకు టోల్ రద్దు కొనసాగనుంది. కేంద్ర నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

15:13 - November 14, 2016

హైదరాబాద్ : వైసీపీ నుండి టిడిపిలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవలే 20 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపి తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనితో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని..వారిపై అనర్హత వేటు వేయాలని ఉమ్మడి హైకోర్టులో అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉమ్మడి హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. గతంలో పలుమార్లు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపులో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, స్పీకర్ కు కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చా ? లేదా ? అనేదానిపై తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పిటిషన్ పై కోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. మరి ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

వైసీపీ అనర్హత పిటిషన్ పై హైకోర్టు విచారణ..

హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల పాటు విచారణ వాయిదా వేసింది. 

15:06 - November 14, 2016

గుంటూరు : నోట్ల రద్దు అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రజలకు మాత్రం కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చిల్లర దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కొన్ని శాఖలకు పాతనోట్లను చెల్లుబాటు అయ్యే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పాత నోట్లకు ఇక్కడ కూడా అనుమతినిచ్చే విధంగా చూడాలని కోరుతున్నారు. తమ యొక్క పాలసీలు చెల్లించేందుకు అనుమతినివ్వాలని ఎల్ఐసీ ఉద్యోగస్తులు కోరుతున్నారు. ఎల్ ఐసీ ప్రీమియం చెల్లింపులకు పెద్ద నోట్లను అనుమతించాలని, చెల్లింపుదారుల నుండి నుండి తమ మీద వత్తిడి వస్తోందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:46 - November 14, 2016

భీంబర్ సెక్టార్ లో పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : భీంబర్ సెక్టార్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. భారత జవాన్ల కాల్పుల్లో ఏడుగురు పాక్ సైనికులు మృతి చెందారు. 

14:30 - November 14, 2016

బ్యాంకుల పరిస్థితిపై కలెక్టర్ ప్రవీణ్ సమీక్ష..

విశాఖపట్టణం : బ్యాంకుల్లో నెలకొన్న పరిస్థితిపై కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆరా తీశారు. జిల్లా 75 శాతం ఎస్ బీఐ, ఆంధ్రా బ్యాంకుల్లో నగదు ఉందని, 50శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయన్నారు. ఉన్న డబ్బుల్లో వంద నోట్ల సంఖ్య తక్కువగా ఉందని, దీనిపై ఇప్పటికే బ్యాంకర్లు ఆర్ బీఐకి లేఖలు రాయడం జరిగిందన్నారు. 24వ తేదీ అర్ధరాత్రి వరకు హాస్పిటళ్లు, పెట్రోల్ బంకుల్లో పాత నోట్లు చెల్లుబాటు అవతాయన్నారు.

 

24వరకు పాతనోట్లు చెల్లుబాటు..

ఢిల్లీ : ఆసుపత్రులు, మెడికల్ షాపులు, పెట్రోల్ బంక్ లు, కరెంటు బిల్లుల చెల్లింపునకు 24వరకు పాతనోట్లు చెల్లుబాటు కానున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ వెల్లడించారు. బ్యాంకుల వద్ద వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక లైన్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఏటీఎంల వద్ద భద్రత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

కాకినాడ కలెక్టరేట్ వద్ద సీపీఎం బహిరంగసభ..

కాకినాడ : కలెక్టరేట్ వద్ద సీపీఎం బహిరంగసభ నిర్వహించింది. దివీస్ నిర్మాణాన్ని విరమించుకోవాలని ప్రజా ఉద్యమాలపై పోలీసుల నిర్భందాన్ని నిరసిస్తూ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు.

14:18 - November 14, 2016
14:17 - November 14, 2016

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్స్ కి 30 ఏళ్లు దాటి ముచ్చటగా మూడేళ్లు దాటింది. కెరీర్ పరంగా ఇప్పటికి స్వీంగ్ లో ఉండడంతో ఈ ముద్దుగుమ్మలకు పెళ్లిపై ధ్యాసలేనట్లుంది. ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సులో కావాలంటారు. కానీ ఈ బ్యూటీ మాత్రం ఈ వయస్సులో కూడా సినిమాలే ముఖ్యమంటున్నారు. ముప్పైదాటి ఆ ముదురు భామలెవరో ఇప్పుడు చూద్దాం..
ఈ హీరోయిన్లు ఇంకా ఫామ్‌లోనే..
త్రిష, నయనతార, అనుష్క, ఈ ముగ్గురు హీరోయిన్లుగా ఇంకా ఫామ్‌లోనే వున్నారు. తెలుగు, తమిళ్‌లో హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లు ముప్పై ఎప్పుడో దాటేశారు. అయినా ఇప్పటివరకూ ఈ ముగ్గురూ పెళ్ళి చేసుకోలేదు. అయితే.. చెన్నై చిన్నది త్రిషకి ఆమధ్య పెళ్ళి ఫిక్స్ అయి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. కానీ. పెళ్ళి తరువాత సినిమాలు చేయకూడదని పెళ్ళికొడుకు కండిషన్ పెట్టడంతో త్రిష ఆ పెళ్ళి కాన్సిల్ చేసేసింది. ఇకపై పెళ్ళి ఆలోచన లేదని నా ఫోకస్ అంతా సినిమాలపైనే అంటూ ఈ బ్యూటీ పెద్ద స్టేట్‌మెంటే ఇచ్చింది. చూస్తుంటే ఈ బ్యూటీ పెళ్లి ఇప్పట్లో అయ్యేలా లేదు.
హాట్ టాపిక్ గా నయనతార
నయనతార విషయానికి వస్తే ఈ బ్యూటీ ఎప్పుడూ ఏవరో ఒకరితో లవ్ బిజీగా ఉంటుంది. ఎఫైర్స్ పరంగా ఈ బ్యూటీ ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. కానీ పెళ్లి మ్యాటర్ లో నయన్ కి కాలం కలిసి రావడం లేదు. శింబుని పెళ్లి చేసుకుందాం అనుకుంటే బెడిసికొట్టింది. ఇక ముగ్గరు పిల్లలకు తండ్రి అయిన ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఆ ప్లాన్ కూడా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ దర్శకుడు విఘ్నేష్ తో మరోసారి ప్రేమయాణం సాగిస్తుంది. మరి వీరి ప్రేమ ఏ కంచికి చేరుతుందో చూడాలి.
అనుష్క...వరుసగా భారీ సినిమాలు 
అనుష్క సంగతి తీసుకుంటే ఇప్పటి వరకు ఈ బ్యూటీపై అపిషియల్ గా ఏ లవ్ మ్యాటర్ వినిపించింది లేదు కనిపించింది లేదు. ఈ బ్యూటీ వరుసగా భారీ సినిమాలు చేస్తూ క్షణం తీరికలేకుండా గడుపుతుంది. మొన్ననే 34ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ యెగా బ్యూటీ నయన్ కంటే త్రిష కంటే ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్ స్టేజ్ లో ఉంది. అయిన కూడా అనుష్కకి త్వరలోనే పెళ్ళి చేసేయాలని ఆమె ఫ్యామిలీ ప్లాన్ చేసిందంటున్నారు. ప్రస్తుతం బాహుబలి 2, నమో వేంకటేశాయ, భాగమతి సినిమాలతో బిజీగా ఉంది. మరి ఈ ముదురు భామలకు పెళ్లి టైం ఎప్పుడో స్తుందో చూడాలి. 

 

14:14 - November 14, 2016

హైదరాబాద్ : పాత నోట్ల రద్దు విషయం జీహెచ్ఎంసీ పంట పండిస్తోంది. రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిని అవకాశంగా తీసుకోవాలని జీహెచ్ఎంసీ భావించి పాత నోట్లతో ట్యాక్స్ కట్టవచ్చని ప్రకటించింది. దీనితో నగర ప్రజలు ట్యాక్స్ కట్టడానికి ముందుకొస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈ ట్యాక్స్ చెల్లింపులు జరుగుతున్నాయి. నాలుగో రోజు సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు జీహెచ్ఎంసీకి రూ. 11 కోట్ల రాబడి వచ్చి చేరింది. ఈ సందర్భంగా డిప్యూటి కమిషనర్ సత్యనారాయణ టెన్ టివితో మాట్లాడారు. సర్కిల్ 10 లో ఎల్ఆర్ఎస్ కింద ఆరు కోట్ల రూపాయలు వచ్చిందని, 13 కోట్ల ట్యాక్స్ రూపేణ వచ్చిందన్నారు. ఈనెల 24వ తేదీ వరకు పాతనోట్లతో బకాయిలు చెల్లించే అవకాశం కల్పించింది.

14:11 - November 14, 2016

గుంటూరు : గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ప్రొ.లక్ష్మీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మెడికో విద్యార్థి సంధ్యారాణి సూసైడ్ కేసులో ప్రొ.లక్ష్మీ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. విద్యార్థిని ఆత్మహత్య అనంతరం ప్రొ.లక్ష్మీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీనితో పోలీసులు ఆమె ఆచూకి కోసం గాలింపులు చేపట్టారు. ఐదు బృందాలుగా ఏర్పడి కొన్ని రాష్ట్రాల్లో గాలింపుల చేపట్టారు. ప్రొ.లక్ష్మీ పరారీలో ప్రధాన కారకుడైన తేళ్ల హరిబాబును పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. లక్ష్మీ కుటుంబసభ్యులను పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. తాము లొంగిపోతామని లక్ష్మీ దంపతులు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. వీళ్లు బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా హిందూపురంలో పోలీసుల ఎదుట ప్రొ.లక్ష్మీ లొంగిపోయినట్లు తెలుస్తోంది. వీరిని గుంటూరు జిల్లాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొ.లక్ష్మీ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విద్యార్థిని సంధ్యారాణి సూసైడ్ నోట్ లో పేర్కొంది. 

14:08 - November 14, 2016

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కబాలి మూవీని మించిపోయేలా రోబో2 కోసం ప్రణాళికలు సిద్ధం చేశాడట. త్వరలోనే రోబో 2 ప్రమోషన్స్ తో దున్నేయడానికి శంకర్ అండ్ యూనిట్ రెడీ అవుతుందట. భారీ బడ్జెట్ తో హై ఎక్స్ పెక్టేన్షన్స్ తో రిలీజ్ కి రెడీ అవుతున్న రోబో 2 విశేషాలేంటో హావ్  ఏ లుక్.
కబాలికి వచ్చిన హైప్ 
రీసెంట్‌గా రజనీకాంత్ కబాలికి వచ్చిన హైప్ ఏ సినిమాకీ రాలేదు. ఈ మూవీ రిలీజ్ కి ముందు చేసిన ప్రచారంతో సిని ఆడియన్స్ మొత్తం కబాలి ఫీవర్‌తో ఊగిపోయింది. అంతలా కబాలిని ప్రమోట్ చేశారు మేకర్స్. ఇప్పుడు రజనీ రోబో 2 మూవీని అంతకు మించిన రేంజ్ లో ప్రమోట్ చేయాలని శంకర్ తో పాటు యూనిట్ భావిస్తుందట. 
ఎండింగ్ స్టేజ్ కి రోబో 2షూటింగ్ 
రోబో 2షూటింగ్ ఎండింగ్ స్టేజ్ కి చేరుకుంది. దీంతో ఇక ప్రమోషన్స్ తో పిచ్చేక్కించాలని యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ ప్రమోషన్లు కబాలి ని మించే రేంజ్‌లో ఉంటాయట. మామూలుగానే రజినీ మానియా ఓ రేంజ్‌లో వుంటుంది. ఇక శంకర్ కాంబినేషన్‌లో రోబో తరువాత వస్తోన్న ఈ మూవీ కావడంతో రోబో 2పై స్కై రేంజ్ లో అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఈ నెల 20న రోబో 2 ఫస్ట్ లుక్ రిలీజ్‌ 
ఈ నెల 20న రోబో 2 ఫస్ట్ లుక్ రిలీజ్‌తో మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నారు. తరువాత వరుసగా మూవీపై హైప్ పెరిగేలా ప్రమోషన్స్ ప్లాన్ రెడీ చేస్తారట. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా చేస్తున్న ఈ మూవీలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రోబో 2తో బాక్సఫీసు వద్ద1000కోట్లు కలెక్ట్ చేయాలనేది శంకర్ టార్గెట్ గా కనిపిస్తుంది. మరి రోబో 2 ఏ రేంజ్ లో సక్సెస్ కొడుతుందో చూడాలి. 

 

జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న పన్నుల చెల్లింపులు..

హైదరాబాద్ : పాత నోట్ల రద్దు విషయం జీహెచ్ఎంసీ పంట పండిస్తోంది. ఈనెల 24వ తేదీ వరకు పాతనోట్లతో బకాయిలు చెల్లించే అవకాశం కల్పించింది. దీనితో పన్నులు కట్టేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. నాలుగో రోజు 12 గంటల వరకు రూ. 11 కోట్ల రాబడి వచ్చి చేరింది. 

పోలీసుల ఎదుట లొంగిపోయిన ప్రొ.లక్ష్మీ..

గుంటూరు : గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ప్రొ.లక్ష్మీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెడికో విద్యార్థి సంధ్యారాణి సూసైడ్ లో ప్రొ.లక్ష్మీ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

 

14:03 - November 14, 2016

వికారాబాద్ : సీపీఎం చేపట్టిన 'మహాపాదయాత్ర'కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇవాళ్టితో పాదయాత్ర 29వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరగడం లేదని ఎంబిసి నేత ఆశయ్య అన్నారు. ప్రతిపక్షాలపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆశయ్య తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు గంగిరెద్దుల్లా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని అన్న వ్యాఖ్యలను కేటీఆర్‌ వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన దొరతనానికి, అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్షాలపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల గంగిరెద్దులతో మంత్రి కేటీఆర్ ఇంటిపై దండయాత్ర చేస్తామని హెచ్చరించారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

హైకోర్టులో మళ్లీ ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు..

హైదరాబాద్ : హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మళ్లీ చుక్కెదురైంది. ఏపీ ఏస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా కారెం శివాజీ నియామకం చెల్లదని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుఐ డివిజన్ బెంచ్ లో విచారణ జరిగింది. నిబంధనలు పాటించకుండా శివాజీని ఎలా నియమించారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. 

13:59 - November 14, 2016

వికారాబాద్ : సీపీఎం, టీ.టీడీపీ చేపట్టిన పాదయాత్రలపై తెలంగాణ మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. తక్షణమే కేటీఆర్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న సమస్యలపై సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రతిపక్షాలపై అర్థరహిత విమర్శలు చేయడం సరికాదని ప్రభుత్వాన్ని తమ్మినేని హెచ్చరించారు. తక్షణమే ప్రజలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు. సీపీఎం, టీ.టీడీపీ పాదయాత్రలపై మంత్రి కేటీఆర్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి రాకముందే గ్రామాల్లో గంగిరెద్దులు తిరుగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ గంగిరెద్దు వ్యాఖ్యలపై తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. తాము సూటీగా ప్రజా సమస్యలపైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నామని.. కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే.. ప్రతిపక్షాలకు సమాధానాలు ఇవ్వాలని సవాల్ విసిరారు. ప్రతిపక్షాలపై అర్థరహిత విమర్శలు చేయడం సరికాదని తమ్మినేని సూచించారు. గంగిరెద్దు అంటే అంత చులకనా..?, గంగిరెద్దు జీవితం హీనమైన జీవితమా..? అని ప్రశ్నించారు. గంగిరెద్దు కూడా ఒక కులానికి ఉపాధి చూపిస్తున్న గొప్ప జంతువు అని అన్నారు. గంగిరెద్దులతో పోల్చినా తాము బాధపడమని..కానీ గంగిరెద్దు కులాన్ని కించపర్చటమనేది దొరతనానికి, అహంకారానికి నిదర్శనమన్నారు. మంత్రి వ్యాఖ్యలు రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని తెలిపారు. కేటీఆర్ రాజకీయాలు తెలియని దద్దమ్మని అని తాము కూడా విమర్శలు చేయొచ్చని.. కానీ ప్రజా సమస్యలపైనే తమ దృష్టి అని తెలిపారు. కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెపాలన్నారు. మంత్రికి దమ్ముంటే తాము లేవనెత్తిన ప్రశ్నలు సమధానాలు చెప్పాలి.. సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించాలన్నారు. 'డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేదని చెబుతున్నాము.. ఎక్కడ కట్టారో చూపించాలి...అలాగే. ముస్లింలకు రిజర్వషన్లు అమలు కావడం లేదని అంటున్నాము.. ఎక్కడ  అమలు అవుతున్నాయో చూపించాలి'.. అని సవాల్ విసిరారు. తాము వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్ప లేక పరికితనం, చేతకాని శాపనార్ధాలు పెడ్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ వాఖ్యలు ఆయన దొరతనానికి నిదర్శమన్నారు. మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని... వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి అంతం కాదు - ఏచూరి..

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి అంతం కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు చూపించిన ఏకైక పార్టీ సీపీఎం అని, 90 శాతం నల్లధనం విదేశాల్లో ఉందన్నారు. స్విస్ బ్యాంకులో నల్లధనం దాచిన వారి జాబితాను మోడ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కొత్త కరెన్సీ తేవడం వల్ల దేశంలో ఎవరూ సంతృప్తితో లేరని, ఉగ్రవాదులకు నిధుల తరలింపు క్యారీ బ్యాగుల్లో చేయరని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆన్ లైన్ ద్వారానే నిధులు చేరవేస్తారని, యూపీ ఎన్నికల దృష్ట్యా.. ఎన్నికల హామీల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పెద్ద నోట్లను రద్దు చేశారని విమర్శించారు.

13:55 - November 14, 2016
13:54 - November 14, 2016

కడప : జిల్లాలోని పులివెందులలో మరోసారి ఫ్యాక్షన్ పడగవిప్పింది. పులివెందుల నామాలగుండు వద్ద టీడీపీ కార్యకర్త శంకరప్పపై బాంబులు, కొడవళ్లతో గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో ఆయన  తీవ్రంగా గాయపడ్డాతు. శంకరప్ప ఓ కేసులో సాక్షి కావడంతో కావాలనే అతన్ని చంపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గాయపడిన శంకరప్పను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

13:52 - November 14, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుకి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. గాంధీభవన్ వద్ద రోడ్డుపై నేతలు బైఠాయించి తమ నిరసన వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్థంచేసి.. మోదీ హటావో దేశ్ బచావో అని పెద్ద ఎత్తున నినాదాలుచేశారు. ధర్నా చేస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

 

13:50 - November 14, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో పాత బకాయిల వసూళ్లు కొనసాగుతున్నాయి. నాలుగోరోజు రూ. 6.01 కోట్ల రాబడి వచ్చింది. నోట్ల రద్దు నిర్ణయం జీహెచ్‌ఎంసీ పంట పండిస్తోంది.  ఈ నెల 24 వరకు పాత నోట్లతో బకాయిలు చెల్లించే అవకాశం కేంద్రం కల్పించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నోట్ల రద్దుతో ప్రజలకు కష్టాలు : బివి.రాఘవులు

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు కష్టాలు పడుతున్నాని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యలు బివి.రాఘవులు అన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే కేంద్రం పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ చేపట్టిందన్నారు. ప్రజల ఇక్కట్లను చూసి అన్ని పార్టీలు నోట్ల రద్దుపై మాట్లాడుతున్నాయన్నారు. మోడీ చేస్తున్న ఉద్వేగపూరిత ప్రసంగాల వల్ల లాభం లేదని చెప్పారు. మోడీ ఉపన్యాసాల్లో నిజాయితీ లేదన్నారు. మోడీ చేయాల్సింది ఉద్వేగపూరిత ప్రసంగాలు కాదని.. సావధానంగా ఆలోచించి.. సమస్యను పరిష్కరిచాలని సూచించారు. సమస్యను పరిష్కరించకుండా... ప్రసంగాలు చేస్తే ఉపయోగం లేదని తేల్చిచెప్పారు. 

పెద్ద నోట్ల రద్దుపై జాతీయస్థాయి ఉద్యమాలకు సన్నహాలు

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై జాతీయస్థాయి ఉద్యమాలకు సన్నహాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లోపు ముందు గ్రాండ్ అలయెన్స్ పెంపు రూపు రానుంది. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సీపీఎంతో జటకట్టేందుకు సుముఖం ఉంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం, ఆప్ నేత కేజ్రీవాల్ కేంద్రంపై వార్ ప్రకటించారు.  

13:37 - November 14, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో రైతులు ఇబ్బందులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ అన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో పేద ప్రజలలే ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. నల్లధనం ఉన్నవారు ముందే జాగ్రత్త పడ్డారని తెలిపారు. ప్రత్యామ్నాయ కరెన్సీ ఏర్పాటు చేసే వరకు రూ.500, 1000 నోట్లను అమలులో ఉంచాలన్నారు. క్యాష్ మనీ చెల్లింపులు ఒక్క స్విట్జర్లాండ్ మాత్రమే అమలు చేస్తోందన్నారు. అధిక శాత నల్లధనం రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే ఉందన్నారు. ఉగ్రవాదం, అవినీతి, నల్లధనం పేరుతో నోట్లు రద్దు చేస్తుమన్నాడం సరికాదని హితవు పలికారు. ధరలు, ఉపాధి విషయంలో కేంద్రం మాట తప్పిందని.. వీటి నుంచి తప్పించుకోవడానికే నోట్ల రద్దు విషయాన్ని ముందుకు తెచ్చిందని ఎద్దేవా చేశారు. యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. నల్లధనాన్ని రప్పించి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న మోడీ మాట ఏమైందని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని చెప్పారు. ప్రజల సౌకర్యం కోసం పెద్ద నోట్లను తీసుకుంటామని కేరళ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. మరోవైపు శారదా నారదా స్కాంలో ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. అవినీతిని నిర్మూలించాలంటే ముందు విచారణ జరపాలన్నారు. ఎన్నికల ఖర్చుల లెక్కలను చూపిస్తున్న ఏకైక పార్టీ సీపీఎం అని తెలిపారు. స్విస్ బ్యాంకులోని 600 నల్లధనం కుబేరులపై విచారణ జరపడం లేదని ఏచూరీ విమర్శించారు. కేంద్రం లక్షా 12 వేల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు మాఫీ చేసిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పెద్ద నోట్ల రద్దుతో పేదప్రజలకు ఇబ్బందులు : ఏచూరీ

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో పేద ప్రజలలే ఇబ్బంది పడుతున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. ప్రజల సౌకర్యం కోసం పెద్ద నోట్లను తీసుకుంటామని కేరళ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. నల్లధనం ఉన్నవారు ముందే జాగ్రత్త పడ్డారని తెలిపారు. ప్రత్యామ్నాయ కరెన్సీ ఏర్పాట్లు చేసే వరకు రూ.500, 1000 నోట్లను అమలులో ఉంచాలన్నారు. యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ధరలు, ఉపాధి విషయంలో కేంద్రం మాట తప్పిందని.. వీటి నుంచి తప్పించుకోవడానికి నోట్ల రద్దు విషయాన్ని ముందుకు తెచ్చారని ఎద్దేవా చేశారు.

నల్లధనం కుబేరులపై విచారణ జరపడం లేదన్న ఏచూరీ

ఢిల్లీ : స్విస్ బ్యాంకులోని 600 నల్లధనం కుబేరులపై విచారణ జరపడం లేదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ విమర్శించారు. లక్షా 12 వేల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు మాఫీ చేసిందన్నారు. ఉగ్రవాదం, అవినీతి, నల్లధనం పేరుతో నోట్లు రద్దు చేస్తుమన్నాడం సరికాదన్నారు. 

13:08 - November 14, 2016
13:07 - November 14, 2016

పెద్ద నోట్ల రద్దుతో రైతులకు ఇబ్బందులు : ఏచూరీ

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ అన్నారు. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. శారదా నారదా స్కాంలో ప్రభుత్వం ఏం చేసిందన్నారు. అవినీతిని నిర్మూలించాలంటే ముందు విచారణ జరపాలన్నారు. ఎన్నికల ఖర్చుల లెక్కలను చూపిస్తున్న ఏకైక పార్టీ సీపీఎం అని తెలిపారు. 

 

12:48 - November 14, 2016

చర్మం ముడతలుగా మారుతోందా ? నివారించడానికి ఎన్నో మందులు..క్రీములు వాడారా ? అయితే ఈ చిట్కాలు పాటించి చూడండి.
పచ్చిపాలు చర్మానికి తేమనందిస్తాయనే విషయం తెలిసిందే. ఇది నల్లమచ్చలున్నా తగ్గుతాయి. బాగా మగ్గిన అరటిపండును తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. అందులో ఓ చెంచా పెరుగూ, కొద్దిగా తేనె వేసుకుని బాగా కలపాలి. దీన్ని కొద్దిగా వేడిచేసి ఆ తరవాత ముఖం, మెడకూ పూతలా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
ఎనిమిది బాదం గింజలు తీసుకుని ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు పచ్చిపాలు పోసుకుంటూ మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి అరగంట తరవాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో రెండుమూడుసార్లు చేస్తుంటే ముడతలు పెరగకుండా ఉంటాయి. బాదంలో ‘విటమిన్‌ ఈ’ తోపాటూ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పోషకాలు చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి.
గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం, చెంచా తేనె కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. కొద్దిసేపటి అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. 

12:45 - November 14, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై జాతీయస్థాయి ఉద్యమాలకు సన్నహాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లోపు ముందు గ్రాండ్ అలయెన్స్ పెంపు రూపు రానుంది. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సీపీఎంతో జటకట్టేందుకు సుముఖం ఇప్పటికే ఢిల్లీ సీఎం, ఆప్ నేత కేజ్రీవాల్ కేంద్రంపై వార్ ప్రకటించారు.  ఢిల్లీలో సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశమైంది. పెద్దోనోట్ల రద్దు, మమత బెనర్జీ మద్దతుపై చర్చించనున్నారు. అఖిపక్షాలతో చర్చలకు సిద్ధమని సీపీఎం నేతలు తెలిపారు. ఈ మేరకు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్రం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండానే పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ చేపట్టిందన్నారు. ప్రజల ఇక్కట్లను చూసి అన్ని పార్టీలు నోట్ల రద్దుపై మాట్లాడుతున్నాయన్నారు. మోడీ చేస్తున్న ఉద్వేగపూరిత ప్రసంగాల వల్ల లాభం లేదని చెప్పారు. మోడీ ఉపన్యాసాల్లో నిజాయితీ లేదన్నారు. మోడీ చేయాల్సింది ఉద్వేగపూరిత ప్రసంగాలు కాదని.. సావధానంగా ఆలోచించి.. సమస్యను పరిష్కరిచాలని సూచించారు. సమస్యను పరిష్కరించకుండా... ప్రసంగాలు చేస్తే ఉపయోగం లేదని తేల్చిచెప్పారు. సమస్య పరిష్కారం దిశగా కేంద్రం ఆలోచలన చేయాలని చెప్పారు. భావోద్వేగ ప్రసంగాల కంటే సావధానంగా ఆలోచించి.. ప్రజల కష్టాలను తీర్చాలన్నారు. ప్రజలకు ఊరట కలిగించే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని నోట్ల రద్దు నిర్ణయాన్ని సవరించాలన్నారు. ఈనెల 30 వరకు పాత నోట్లను అనుమతించాలని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే.. తృణమూల్ కాంగ్రెస్ సీపీఎంతో జత కట్టాల్సిన అవసరం లేదు. విడిగా కూడా నిరసన తెలుపువచ్చన్నారు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగానే సీపీఎంతో జతకడతానని మమత చెప్పడం పొలిటికల్ స్టంట్ తప్ప వేరే కాదని స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ లో ఆందోళన చేయవచ్చాన్నారు. రేపు పూర్తి స్థాయి సమావేశం జరుగునుందని తెలిపారు. నోట్ల రద్దు విషయంలో పార్లమెంట్ లో క్రేంద ప్రభుత్వని నిలదీసే అంశంపై చర్చస్తామని చెప్పారు.   

 

12:44 - November 14, 2016

టాలీవుడ్ లో 'పవన్ కళ్యాణ్'..'మహేష్ బాబు' లు ఇద్దరూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒక సినిమా పూర్తికాకముందే మరోసినిమాకు సైన్ చేసేస్తున్నారు. ప్రిన్స్..పవర్ స్టార్ లిద్దరూ డిసెంబర్ లో కొత్త చిత్రాల షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. అందు వల్ల చేస్తున్న సినిమాలను తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారంట. 'మహేష్ బాబు' దర్శకుడు 'మురుగదాస్' కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయినట్లు టాక్. ప్రస్తుతం చిత్రానికి సంబంధించని కొన్ని కీలక సన్నివేశాలను గుజరాత్ లో చిత్రీకరిస్తున్నారు. జనవరిలో చిత్రం విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంలో 'మహేష్' ఇంటిలెజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'రకూల్ ప్రీత్ సింగ్' కథానాయికగా నటిస్తోంది. హరీష్ జయరాజ్ బాణీలు 

పవన్ కాటమరాయుడు..
మరోవైపు 'పవన్ కళ్యాణ్' 'కాటమరాయుడు' చిత్రంలో నటిస్తున్నాడు. 'పవన్' కు జోడిగా 'శృతి హాసన్' మరోసారి జత కడుతోంది. అనంతపూర్ లో జనసేన సభలో పాల్గొన్న అనంతరం 'పవన్' తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నాడంట. ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని టాక్. జనవరి నాటికి అన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైంది. డిసెంబర్ నుండి 'పవన్' తన మిత్రుడు 'తివిక్రమ్' రూపొందే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. మరి జనవరిలో ఎవరు సక్సెస్ సాధిస్తారో చూడాలి. 

12:31 - November 14, 2016

ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు పెద్దలు. కానీ నేడు ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం లేదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు పనుల్లో బిజీ బిజీగా మారిపోతున్నారు. దీనివల్ల కొంతమంది తరచూ అనారోగ్యాలకు గురవుతుంటారు. మంచి ఆరోగ్యానికి ఈ ఐదు చిట్కాలు పాటించి చూడండి..

  • రోజుకు మూడు లీటర్ల నీరు తాగితే రోగాలు దగ్గరకు రాకుండా ఉంటాయి.
  • రోజుకు ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వును తీసివేస్తుంది.
  • రోజుకు ఒక కప్పు పాలు సేవించడం వల్ల ఎముకలను ధృడంగా ఉంటాయి.
  • రోజుకు ఒక తులసి ఆకును తినడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
  • రోజుకు ఒక యాపిల్ భుజించడం వల్ల డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరం ఉండదు.

అంతేగాకుండా తక్కువ ఒత్తిడి..ఎక్కువగా నిద్ర పోవడం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడుతారు. అలాగే వీలైనంత సేపు నడవాలి. తక్కువ కోపంగా ఉండి ఎక్కువగా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. 

ఢిల్లీలో సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై జాతీయస్థాయి ఉద్యమాలకు సన్నహాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లోపు ముందు గ్రాండ్ అలయెన్స్ పెంపు రూపు రానుంది. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సీపీఎంతో జటకట్టేందుకు సుముఖం ఇప్పటికే ఢిల్లీ సీఎం, ఆప్ నేత కేజ్రీవాల్ కేంద్రంపై వార్ ప్రకటించారు.  ఢిల్లీలో సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశమైంది. పెద్దోనోట్ల రద్దు, మమత బెనర్జీ మద్దతుపై చర్చించనున్నారు. అఖిపక్షాలతో చర్చలకు సిద్ధమని సీపీఎం నేతలు తెలిపారు. 

12:20 - November 14, 2016

చందమామ రావే జాబిలి రావే అనగానే ఇవాళ చంద్రుడు మన ముందుకు రానున్నాడు. రెట్టింపు వెలుగులతో 70 ఏళ్ల తర్వాత మళ్లీ మనల్ని పలకరించడానికి సూపర్‌మూన్ రెడీ అయ్యాడు. సూపర్ మూన్‌ పలకరింపుని.. వెలుగులని ఇప్పుడు మిస్సయితే మరో 70 ఏళ్ల వరకు ఆగాల్సిందే.. వెన్నెల అంటే నచ్చని వారుండరు.. అలాంటి వెన్నెలని పంచే నిండు చందమామను చూస్తే ప్రతి ఒక్కరీ మనసు పులకరిస్తుంది. అదే చందమామ ఇవాళ అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా.. భూమికి అతి దగ్గరగా కనిపించబోతున్నాడు. ఆ ఆద్భుత దృశ్యం ఇవాళ రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఆవిష్కృతం కాబోతోంది.

70 ఏళ్లలో..
70 ఏళ్లకోసారి మాత్రమే ఇలాంటి అరుదైన 'సూపర్‌మూన్‌' దర్శనమిస్తాడని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో 1948లో ఈ పూర్ణచంద్రుడు కనిపించాడనీ.. మళ్లీ ఈ అరుదైన చందమామను చూడాలంటే 2034 వరకు ఆగాల్సిందే అంటున్నారు. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతుండటంతో కొన్నిసార్లు దగ్గరగా, ఇంకొన్నిసార్లు దూరంగా వస్తుంటాడని భూగ్రహానికి అత్యంత సమీపంగా వచ్చినపుడే ఈ సూపర్‌మూన్‌ ఏర్పడుతుందని తెలిపారు. అందుచేత మిగతా రోజులతో పోల్చుకుంటే ఇవాళ చంద్రుడు 30శాతం ఎక్కువగా ప్రకాశిస్తాడనీ, చంద్రుడి వ్యాసం సైతం పెద్దదిగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఇవాళ్టి సూర్యాస్తమయం అద్భుతంగా ఉండనుందని... ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని నాసాకు చెందిన శాస్త్రవేత్త నోహ్ పెట్రో వెల్లడించారు. 

11:57 - November 14, 2016

రకూల్ ప్రీత్ సింగ్ మరో మెగా ఛాన్స్ పట్టేసింది. మెగా ఫ్యామిలీ కుర్రాళ్లతో ఆడిపాడిన ఈ బ్యూటీ ఇప్పుడు మెగా బిగ్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే గోల్డెన్ ఛాన్స్ పట్టేసింది. ఇంతకీ రకూల్ ఏ మూవీలో పవర్ స్టార్ తో జోడికట్టబోతుందో వాచ్ దీస్ స్టోరీ.
పవన్ కళ్యాణ్ తో రకూల్  
టాలీవుడ్ లో ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హవా నడుస్తోంది. ఈ బ్యూటీ కి కూడా మెగా కాంపౌండ్ హీరోయిన్ అనే ట్యాగ్ వేసేసుకుంది. మెగా హీరోల్లో రామ్ చరణ్ తో బ్రూస్ లీ,అల్లుఅర్జున్ సరైనోడు మూవీస్ లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తో విన్నర్ మూవీలో నటిస్తుంది. అంతేకాదు ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో రకూల్ హీరోయిన్ గా నటించనుంది.
తమిళ దర్శకుడు నీసన్‌ దర్శకత్వంలో 
కాటమరాయుడు మూవీలో నటిస్తున్న పవన్ కళ్యాణ్‌ ఆ తరువాత తమిళ డైరెక్టర్ నీసన్‌తో ఓ మూవీ కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రొడ్యూసర్ ఎ ఎమ్ రత్నం నిర్మించనున్న ఈ మూవీలో పవన్ పక్కన రకూల్ ని కన్ ఫర్మ్ చేసినట్లు వినికిడి. తొలుత ఈ మూవీలో నయనతారను తీసుకోవాలనుకున్న ఫైనల్ యూనిట్ రకూల్ వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. 
మరో రెండు తమిళ చిత్రాలకు సెన్ 
బ్రూస్ లీ తరువాత రకూల్ మరోసారి రామ్ చరణ్ తో నటిస్తున్న ధృవ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. అదే విధంగా మహేష్ బాబు సినిమాతో పాటు సోగ్గాడే చిన్నినాయన ఫేం కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నాగచైతన్య నటించనున్న మూవీలో కూడా రకూల్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇవే కాకుండా రిసెంట్ మరో రెండు తమిళ చిత్రాలకు సెన్ చేసింది. 

 

11:57 - November 14, 2016

'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన యాంకర్ లో 'అనసూయ' ఒకరు. బుల్లితెరపై కనిపించే ఈ ముద్దుగుమ్మ వెండితెరపై కూడా కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇటీవలే 'నాగార్జున' నటించిన 'సొగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో తొలిసారి తళుక్కున మెరిసింది. 'క్షణం' చిత్రంలో కూడా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రత్యేక పాటల్లో కూడా నటించాలని ఈ భామ నిర్ణయం తీసుకుందంట. అందులో భాగంగా 'సాయి ధరమ్ తేజ' నటిస్తున్న 'విన్నర్' చిత్రంలో ఐటం సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట. గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం 'అనసూయ' ఏకంగా 12 కిలోల బరువు పెరిగిందని టాక్. సినిమా తనపై చిత్రీకరించే ఐటమ్ సాంగ్ 'అనసూయ..అనసూయ'.. పేరిట సాగుతుందని, అందుకే బొద్దుగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈ పాటను చిత్రీకరించారని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు హెలైట్ గా నిలుస్తుందని టాక్. మరి ఈ పాటలో 'అనసూయ' ఎలా ఆడిందో తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

వారానికి రూ.24 వేలు డ్రా చేసుకోవచ్చన్న శక్తికాంత్

ఢిల్లీ : అత్యవసర సేవలకు పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. ఏటీఎంల వద్ద భద్రత పెంచెందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బ్యాంకుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. విమాన టిక్కెట్లకు ఈనెల 24 వరకు పాత నోట్లు చెల్లుబాటు కానున్నట్లు తెలిపారు. నగదు డిపాజిట్ లకు పరిమితి లేదన్నారు. గ్రామాల్లోనూ కొత్త నోట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ10 వేల లిమిట్ ను ఎత్తివేసింది. వారానికి రూ.24 వేలు డ్రా చేసుకోవచ్చన్నారు. సరైన ఆధారాలు చూపిస్తే ఒకేసారి రూ.50 వేలు విత్ డ్రా చేసుకోవచ్చన్నారు.

11:41 - November 14, 2016

ఢిల్లీ : అత్యవసర సేవలకు పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. ఏటీఎంల వద్ద భద్రత పెంచెందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బ్యాంకుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. విమాన టిక్కెట్లకు ఈనెల 24 వరకు పాత నోట్లు చెల్లుబాటు కానున్నట్లు తెలిపారు. నగదు డిపాజిట్ లకు పరిమితి లేదన్నారు. గ్రామాల్లోనూ కొత్త నోట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ10 వేల లిమిట్ ను ఎత్తివేసింది. వారానికి రూ.24 వేలు డ్రా చేసుకోవచ్చన్నారు. సరైన ఆధారాలు చూపిస్తే ఒకేసారి రూ.50 వేలు విత్ డ్రా చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

నేడు తెలంగాణలో బ్యాంకులు, ఫోస్టాఫీసులకు సెలవు

హైదరాబాద్ : నేడు తెలంగాణలో బ్యాంకులు, ఫోస్టాఫీసులకు సెలవు ప్రకటించారు. ఎపిలో బ్యాంకులు ఇవాళ పని చేయనున్నాయి. నోట్ల రద్దుతో ఆరో రోజైన పరిస్థితులు కుదటపడలేదు.

11:21 - November 14, 2016

హైదరాబాద్ : నేడు తెలంగాణలో బ్యాంకులు, ఫోస్టాఫీసులకు సెలవు ప్రకటించారు. ఎపిలో బ్యాంకులు ఇవాళ పని చేయనున్నాయి. నోట్ల రద్దుతో ఆరో రోజైన పరిస్థితులు కుదటపడలేదు. డబ్బుల కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం బారులు తీరారు. ఏటీఎం దగ్గర భారీ క్యూలైన్లు ఉన్నాయి. ఏటీఎంలు చాలా వరకు పని చేయడం లేదు. నగదు పెట్టిన కొద్దిసేపట్లోనే ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయి. నిత్యవసర సరుకుల కోనుగోలుకు చిల్లర కొరత ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:16 - November 14, 2016

ఢిల్లీ : నేడు బీజేపీ పార్లమెంటరీ సమావేశం కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం, పెద్ద నోట్ల రద్దు, ఒకే ర్యాంకు.. ఒకే ఫించను తదితర అంశాలపై చర్చించనున్నారు. ప్రధాన మోడీ, అమిత్ షా సహా పలువురు నేతలు హాజరుకానున్నారు. అనంతరం ఎన్ డీఏ పక్ష నేతలతో మోడీ సమాశం కానున్నారు. నోట్ల రద్దు నిర్ణయానికి సహకరించాలని కోరనున్నారు. బుధవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ నేతృత్వంలో 7 గంటలకు అఖిలపక్ష పార్టీల సమావేశం జరుగనుంది. కాంగ్రెస్, తృణమూల్, లెఫ్టు పార్టీలు కూడా సమావేశం కానున్నాయి. నోట్ల రద్దును విపక్షాలు వ్యతిరేకిస్తున్నారు. యుపి ఎన్నికలు, సర్జికల్ స్ట్రైయిక్స్.. నేపథ్యంలో కేంద్ర సర్కార్ నల్లధనం అంశాన్ని తెరమీదకు తెచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

నేడు బీజేపీ పార్లమెంటరీ సమావేశం

ఢిల్లీ : నేడు బీజేపీ పార్లమెంటరీ సమావేశం కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం, పెద్ద నోట్ల రద్దు, ఒకే ర్యాంకు.. ఒకే ఫించను తదితర అంశాలపై చర్చించనున్నారు. 

11:07 - November 14, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ కనిపిస్తోంది. గోదావరి, కృష్ణా నదుల్లో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దేవాలయాలకు భక్తులు పోటెత్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచారామాలు కిటకిటలాడుతున్నాయి. భీమవరం సోమేశ్వరాలయం, పాలకొల్లు రామలింగేశ్వర ఆలయం,  ద్రాక్షరామ, సామర్లకోట, పిఠాపురం, కోటిపల్లి, మురమళ్ల, సోంపల్లి, అన్నవరం, అంతర్వేది, శ్రీశైలం, మహానంది, యాగంటి, కాల్వబుగ్గ శైవతక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. 
దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి దర్శనానికి  తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరి దీపారాధనలు చేస్తున్నారు. వేములవాడలో భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల పోటెత్తారు. గోదావరిలో భక్తులు పుణ్యస్నానమాచరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శైవక్షేత్రాల్లో భక్తుల పూజలు నిర్వహిస్తున్నారు. నీలకంఠేశ్వర ఆలయంలో ఎంపీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ వెయ్యిస్తంబాల గుడి, బాసరలో భక్తుల రద్దీ కిక్కిరిసిపోయింది. మంచిర్యాల గూడెం సత్యనారాయణస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అన్ని ఆలయాల్లో భక్తులు దీపారాధనలు చేస్తున్నారు. 
భక్తులతో కిటకిటలాడుతున్న పంచారమా క్షేత్రాలు 
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పంచారమా క్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పశ్చిమగోదావరి 
జిల్లాలోని పాలకొల్లు క్షీరారామా క్షేత్రానికి తెల్లవారు జామున నుంచే భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి రోజున 36క వొత్తులను వెలిగిస్తే సంవ్సతరమంతా దీపారాధన చేసినంతా పుణ్యం వస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచరామా క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 

10:58 - November 14, 2016

వికారాబాద్ : తెలంగాణ అభివృద్ధి కావాలంటే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం తలపెట్టిన మహాజనపాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. వికారాబాద్ జిల్లా పరిగి, నష్కల్, చిక్కంపల్లి, మీదుగా వికారాబాద్‌ కు చేరుకుంది పాదయాత్ర. 
ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యం
తెలంగాణలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి జరిగినపుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా సాగుతోన్న సీపీఎం మహాజనపాదయాత్ర 28 వ రోజు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ 700 కిలోమీటర్ల మేర వరకూ జరిగిన పాదయాత్రకు అటు ప్రజల నుంచి ఇటు  రాజకీయ పార్టీల నుంచి  అడుగడుగునా మద్దతు లభిస్తోంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు వీరేంద్రగౌడ్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్‌ పాదయాత్రకు సంఘీభావం  తెలిపారు. 
సమస్యలపై పోరాటం 
తెలంగాణ అభివృద్ధి కావాలంటే ప్రజల బతుకులు బాగుపడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బడుగు, బలహీన వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించకుండా రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఆయా జిల్లాల్లో పర్యటించిన తాము ప్రజల సమస్యలను తెలుసుకున్నామని..వీటిపై పోరాటం సాగిస్తామని తమ్మినేని స్పష్టం చేశారు. 
పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాదరావు మద్దతు 
టీఆర్ఎస్ సర్కారు నిరంకుశ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీపీఎం తలపెట్టిన పాదయాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాదరావు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాటం సాగించాలని ఆయన కోరారు. 
పేదల బతుకులు మారలేదు : ప్రొఫెసర్ హరగోపాల్‌ 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా పేదల బతుకులు మాత్రం మారలేదని ప్రొఫెసర్ హరగోపాల్‌ అన్నారు. అభివృద్ధి నమూనా మార్చకుండా..పాత పద్దతిలోనే పరిపాలన సాగిస్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పరిపాలనా నమూనాను మార్చుకొని  బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని పాదయాత్రలో పాల్గొన్న నేతలంతా డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ పోరాటం తప్పదని స్పష్టం చేశారు. 

ఏటీఎం, బ్యాంకుల నుంచి తీసుకునే నగదు పరిమితి పెంపు

హైదరాబాద్ : ఏటీఎం, బ్యాంకుల నుంచి తీసుకునే నగదు పరిమితి పెంచారు. నోట్ల మార్పిడి పరిమితి 4 వేల నుంచి 4500 వరకు పెంచారు. కౌంటర్ లోఒకేసారి రూ.24 వేలు తీసుకునే అవకాశం కల్పించారు. 

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

చెన్నై : విల్లుపురం జిల్లా ఉర్నడూర్ పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
 

మియాపూర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : నగరంలోని మియాపూర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ గుడిసెలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో తల్లి, కొడుకు సజీవ దహనమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

10:37 - November 14, 2016

హైదరాబాద్ : చలికోసం వేసుకున్న మంట ఓ తల్లీకొడుకుల ప్రాణాలను బలితీసుకుంది. వారి పాలిట యమపాశం అయింది. అగ్నికి ఆహుతి అయ్యారు. మియాపూర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తల్లీకొడుకు సజీవదహనమయ్యారు. యాచక వృత్తి చేస్తున్న తల్లీకొడుకులు మియాపూర్‌లో రోడ్డు ప్రక్కల గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. యాచక వృత్తి నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువ కావడంతో చలి మంట వేసుకున్నారు. అనంతనం గుడిసలో పడుకున్నారు. రాత్రి 12 గంటలకు గుడిసెకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తల్లి, కొడుకు సజీవ దహనమయ్యారు. ఫైర్ సిబ్బంది వచ్చే సరికి మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. మృత దేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

నేడు అర్ధరాత్రి వరకు పని చేయనున్న బ్యాంకులు

సూర్యపేట : ఇవాళ అర్ధరాత్రి వరకు సూర్యపేట, కోదాడ, హుజూర్ నగర్ లోని ఎస్ బీహెచ్ ట్రెజరీ బ్యాంకులు పని చేస్తాయని కలెక్టర్ సురేంద్ర మోహన్ తెలిపారు. రద్దైన నోట్లతో భూముల క్రమబద్దీకరణ పన్ను చెల్లించవచ్చన్నారు. 

09:46 - November 14, 2016

కేంద్రప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని వక్తలు తెలిపారు. సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత దినకర్, ఎపి కాంగ్రెస్ నేత రవిచంద్రారెడ్డి, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎంఎ.గఫూర్ పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వ ఆలోచించి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం మూలంగా ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని మోడీ నిర్ణయం చేయలేదని విమర్శించారు. సామాన్య పౌరులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. విదేశాల్లోని నల్లధనంపై దృష్టిపెట్టాలని సూచించారు. నల్లధనం వ్యక్తుల జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:45 - November 14, 2016

ఇన్నేళ్లకు కూడా ఇంకా బాలకార్మికులు ఉండడం బాధాకరమని హైదరాబాద్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు, సోషల్‌ యాక్టివిస్ట్‌ డి. ప్రకాష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఇవాళ బాలల దినోత్సవం. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో బాలలకున్న హక్కులేమిటి? బాల్యం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? పిల్లల పట్ల తల్లితండ్రుల, సమాజం బాధ్యతలేమిటి? వంటి అంశాలపై ప్రకాష్‌ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:40 - November 14, 2016

నేటి బాలలే రేపటి పౌరులు. బాలలే భారత భాగ్య విధాతలు. ఇలాంటి నినాదాలు వింటున్నప్పుడు మధురాతిమధుర అనుభూతి ఏదో మనల్ని మైమరిపిస్తుంది. మనం మన పిల్లలను నిజంగా ప్రేమిస్తున్నామా? బాలల దినోత్సవం సందర్భంగా మనమంతా నిజాయితీగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. 
ఏటా 25 లక్షలమంది చిన్నారులు మృతి
మన దేశంలో బాల్యం అనేక దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. కొన్ని దృశ్యాలు మనసును పరవశింపచేస్తాయి. మరికొన్ని దృశ్యాలు గుండెను బరువెక్కిస్తాయి. బాల్యం ఎవరికైనా మధుర జ్ఞాపకమే. కానీ , అందరి బాల్యం ఒక్కలా సాగదు. 
ఒక చోట జననం ఓ ఉత్సాహం. మరోచోట అదొక విషాదం. కళ్లు తెరచీ తెరవక ముందే మృత్యువు వెన్నాడుతోంది.  మన దేశంలో ఏటా దాదాపు పన్నెండు లక్షల మంది శిశువులు నెల నిండకుండానే కన్నుమూస్తుండడం ప్రపంచంలో మరెక్కడా లేని విషాదం. 
ఏడాది నిండకముందే నూరేళ్ల ఆయుష్షు 
ఒక చోట బోసి నవ్వుల పాపాయి తొలి ఏడాది పూర్తి చేసుకోవడం ఓ సెలబ్రేషన్. మరోచోట ఏడాది నిండకముందే నూరేళ్ల ఆయుష్షు తీరుతుంది. పుట్టిన ప్రతి పదహారు మందిలో ఒకరు ఫస్ట్‌ బర్త్‌ డే చేసుకోక ముందే చనిపోతున్నారు. ప్రతి 11మందిలో ఒకరికి ఐదేళ్లకే నూరేళ్లు నిండుతున్నాయి. మన దేశంలో ఏటా దాదాపు పాతిక లక్షల మంది పిల్లలు ఆకలితోనో, అనార్యోగ్యంతోనో, చలితోనో, ఎండలోనో చనిపోతున్నారు. 30 లక్షల మంది ఆడపిల్లలు పదహారేళ్ల వయస్సైనా రాకముందే జీవితం చాలిస్తున్నారు.  నలభై శాతం మందికి పైగా పిల్లలు  డొక్కలు ఎండిపోయి,  పేగులు వేల్లాడేసుకుని, కళ్లు పీక్కుపోయి తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆరు కోట్ల మంది పసిబిడ్డలు ఆకలితో నకనకలాడుతున్న దేశం మనది. 
మధ్యలో చదువు మానేసేవారిలో బాలికలే ఎక్కువ 
ఒక చోట ఓనమాలు నేర్చుకునే ప్రక్రియ ప్రారంభించడమే ఓ సంబరం. మరోచోట జీవితాంతం అక్షర గంధానికి నోచుకోని దైన్యం. మన దేశంలో ప్రతి వందమంది పిల్లల్లో 19 మంది బడిలో చేరే భాగ్యానికి నోచుకోవడం లేదు. ఒకవేళ చేరినా 70 శాతం మంది మధ్యలోనే బడిమానేయాల్సిన దైన్యం. ఇలా మధ్యలోనే చదువు సంధ్యలు మానేసేవారిలో బాలికలే ఎక్కువ శాతం మంది ఉండడం మరో దురదృష్టం. బడికి వెళ్లలేని పిల్లలంతా, ఎముక బొక్కలు ముదరకముందే ఎక్కడో ఒక చోట బాల కార్మికులై, పని మనుషులై ఎదురొస్తారు. అది కూడా దొరకనివాళ్లు చెత్తకుప్పల్లో బాల్యాన్ని ధారపోస్తున్నారు. 
బాల ఏసుప్రభువుల్లా బడి పిల్లలు 
ఒకచోట బడి పిల్లలు బాల ఏసుప్రభువుల్లా దర్శనమిస్తారు. మరోచోట యోగి వేమనల్లా ఎదురొస్తారు. 
ఒకరికి వంటినిండా మోయలేనన్ని బరువులు. షూ, టై, బ్యాడ్జి, రిబ్బన్‌,  వీపు మీద బ్యాగ్‌ . వీటిలో ఏది లోపించినా అది నేరం. మరచిపోయినా, మాసిపోయినా వళ్లంతా వాతల శిక్ష. 
మరొకరిది సిగ్గుబిళ్లలు కూడా కప్పుకోలేని దైన్యం. సుర్రున కాలే రోడ్డుమీద నడవాలన్నా, ముళ్ల బాటలో పరుగెత్తాలన్నా కనీసం చెప్పులేసుకోలేని దౌర్భాగ్యం. అతుకుల బొంతలే వారికి యూనిఫాం. 
కరిగిపోతున్న టెక్నో బాల్యం
ఒకచోట లేత నడుములు విరిగేలా పుస్తకాల మోత. మరోచోట ఒక్క చిత్తు పుస్తకమైనా కొనుక్కోలేని దీనత్వం. కార్పొరేట్ స్టిక్కర్‌ తగిలించుకున్న యాజమాన్యం రంగురంగుల బుక్సిచ్చి, వేలకు వేలు గుంజుతుంది.  అంతా ఉచితమనే లేబులేసుకున్న సర్కారీ స్కూల్‌  క్లాసుకొక్క పుస్తకమైనా ఇవ్వదు.
గాలి, ఎండ, వాన, మట్టివాసనల పరిమళం ఇలాంటి అనుభూతులేవీ తెలియకుండానే టెక్నో బాల్యం కరిగిపోతుంది. ఎముకలు కొరికే చలి, మండుటెండల వేడిమిని భరిస్తూ సంక్షేమ హాస్టల్‌ బాల్యం చిన్నబుచ్చుకుంటుంది. ఒకచోట ర్యాంక్ ల చట్రంలో చిక్కుకున్న బాల్యం  పసితనపు కోతిచేష్టలకు దూరమవుతుంది.  మరోచోట అక్షరం ముక్క నేర్పే దిక్కులేక బాల్యం గాడిద చాకిరీకి దగ్గరవుతుంది.
భయాన్ని పెంచుతున్న బాల్యం 
మనదేశంలో బాల్యం మాధుర్యపు లోతును ఎందరికీ అందిస్తున్నదో తెలియదు కానీ, భయాన్ని మాత్రం పెంచుతోంది. అవును. ఇప్పుడు పిల్లలు పుడుతున్నారంటే భయం. ఎదుగుతున్నారంటే భయం. గడపదాటుతున్నారంటే భయం. అడుగులేస్తున్నారంటే భయం. వీధిలోకి వెళ్తున్నారంటే భయం. ఏకాంతంగా వదిలేయాలంటే భయం. ఆడపిల్లల విషయంలో ఇలాంటి భయాలు మరీ మరీ ఎక్కువ. 
కామాంధుల చేతిలో పసికూనలకు నరకం 
ఈ పసిపిల్ల మీద ఎప్పుడు ఏ మృగం విరుచుకుపడుతుందో తెలియదు. మనదేశంలో పదేళ్లు కూడా నిండని పసికూనలు రోజుకి ఇద్దరు చొప్పున కామాంధుల చేతిలో నరకాన్ని చూస్తున్నారు. ప్రతి పదిమంది చిన్నారి చిట్టితల్లుల్లో ఒకరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో లైంగిక హింసను భరిస్తున్నారు. 
పిల్లల కిడ్నాప్ 
ఏ పసిమొగ్గను ఎప్పుడు ఎవడు ఎందుకు కిడ్నాప్ చేస్తాడో తెలియదు. మనదేశంలో మిస్సయిన పిల్లల ఆచూకీ వెదికిపట్టుకోండని సుప్రీంకోర్టే గద్దించినా ఫలితం లేదు. రోజుకి దాదాపు రెండు వేల మంది పిల్లలు దారితప్పో, కిడ్నాపయ్యో, అలిగో అమ్మానాన్నలకు దూరమవుతున్నా, వారిని వెదికి పట్టుకుని, అమ్మ ఒడిని చేర్చేందుకు అవసరమైన యంత్రాంగమే లేకుండా పోయింది. 
పిల్లలపై వివిధ ఘటనల ప్రభావం 
ఇక ఇళ్లలో భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు, ఇరుకుఇరుకు ఇళ్లల్లో తెలిసీతెలియనితనంతో సాగించే శృంగారాలూ, బుల్లి తెర మీద, వెండితెర మీద కనిపించే దృశ్యాలూ, క్రమశిక్షణ, హోంవర్క్‌ల పేరుతో స్కూళ్ల్లో కొంతమంది టీచర్లు దండించే తీరు పిల్లల ప్రవర్తనను, జీవితాలనూ తీవ్రంగానే ప్రభావితం చేస్తున్నాయి. 
పెంపకంలో వివక్ష 
ఇక అమ్మాయిలు, అబ్బాయిల పెంపకం విషయంలో కొంతమంది అమ్మానాన్నలు చూపించే వివక్ష పసి వయస్సులోని ఆ లేత మనసులను పెద్ద అగాధంలోని విసిరివేస్తున్నాయి. ఇన్ని భయంకర వాస్తవాల మధ్య ఏటా నవంబర్‌ 14న వస్తున్న బాలల దినోత్సవం కార్పొరేట్‌ యుగంలో కిడ్స్‌ ఫ్యాషన్‌ షోగా మారుతోంది. జర జాగ్రత్త. 

09:30 - November 14, 2016

యాదాద్రి : డెంగ్యూ మహమ్మారి ఆ ఊరిని కాటేస్తోంది. ప్రజలకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు పత్తా లేరు. ఊర్లో ఉన్న ప్రభుత్వాస్పత్రికి ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది. ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లు నగరాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటుంటే.. ఆర్ధికంగా ఇబ్బంది పడేవాళ్లు.. ఆస్పత్రి ఎప్పుడు తెరుస్తారా ? వైద్యులు ఎప్పుడు వస్తారా ? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. 
కొల్లూరులో విష జ్వరాలు 
యాదాద్రి జిల్లా ఆలూరు మండలంలోని కొల్లూరు గ్రామాన్ని విష జ్వరాలు వెంటాడుతున్నాయి. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు డెంగ్యూ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. నెలల తరబడి జ్వరాల బారినపడినా పట్టించుకునే నాధుడే లేడని గ్రామస్తులంటున్నారు. ఊర్లో ఉన్న ప్రభుత్వాస్పత్రి ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి ఉందంటున్నారు. 
డాక్టర్లు ఎప్పుడో ఒకసారి ఆస్పత్రికి 
డాక్టర్లు ఎప్పుడో ఒకసారి ఆస్పత్రికి వచ్చినా.. జ్వరం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించి వెళ్లిపోతున్నారని గ్రామస్తులంటున్నారు. మా గ్రామానికే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి జ్వరంతో బాధపడుతున్నా.. నగరానికి వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత లేక ఆస్పత్రి ఎప్పుడు తెరుస్తారా ? వైద్యం ఎప్పుడు చేస్తారా ? అని ఎదురుచూస్తున్నామని గ్రామస్తులంటున్నారు. 
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యం : సర్పంచ్ 
ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ జ్వరాలు మాత్రం తగ్గడం లేదంటున్నారు గ్రామ సర్పంచ్‌ శంకరయ్య. ఊర్లో పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

09:23 - November 14, 2016
09:21 - November 14, 2016
09:18 - November 14, 2016

కొత్తగూడెం : కొత్తగూడెంలో పండుగలా సాగిన బాలోత్సవ్‌ రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. నాలుగురోజుల పాటు పిల్లలంతా ఒక్కచోట చేరి ఎంజాయ్‌ చేశారు. 29 అంశాల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. 29 వేదికల్లో చిన్నారులు ప్రదర్శించిన  నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకలకు హాజరైన మంత్రి కేటీఆర్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. 
నాలుగు రోజుల పాటు బాలోత్సవ్ 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి తెలుగు బాలల పండుగ విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, తుమ్మల నాగేశ్వరరావుతో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు 29 అంశాల్లో తమ ప్రతిభను చాటారు. సాంస్కృతిక, కళా ప్రదర్శనలలో గెలుపొందిన వారికి కేటీఆర్‌ బహుమతులు అందజేశారు. 
పిల్లలను సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి : కేటీఆర్‌
తల్లిదండ్రులు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కేటీఆర్‌ అన్నారు. దాని కోసం బాలోత్సవ్‌ లాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. మనం మరిచిపోతున్న ఎన్నో కళలు, సంప్రదాయాలను నేటితరం చిన్నారులకు పరిచయం చేస్తూ వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తున్న బాలోత్సవ్‌కు కృతజ్ఞతలు చెప్పిన కేటీఆర్‌.. మరో 50 ఏళ్లు ఇదే ఉత్సాహంతో వేడుకలు నిర్వహించాలని ఆకాంక్షించారు. 
ఆకట్టుకున్న నృత్యాలు  
నాలుగు రోజుల కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులు.. మరో రెండు రోజులు ఉంటే బాగుండుననే అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది కూడా బాలోత్సవ్‌కు హాజరవుతామని మరింత ఉత్సాహంగా చెప్పారు చిన్నారులు. బాలోత్సవ్‌ ముగింపు వేడులకు పట్టణవాసులను ఎంతగానో అలరించాయి. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. 

 

09:10 - November 14, 2016

హైదరాబాద్ : రైతు సమస్యలే ఎజెండాగా రైతు పోరు బాట పట్టిన తెలుగు తమ్ముళ్లు...ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించకపోతే..పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని  హెచ్చరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల‌ను పరామర్శించి వారిని ఆదుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిశీల‌న చేస్తూ రైతు క‌ష్టాల‌పై ప్రభుత్వ అలసత్వాన్ని ఎండ‌గ‌డుతున్నారు. టీటీడీపీ రైతు పోరుయాత్రకు రైతులు, ప్రజల నుంచి స్పందన రావడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
చురుగ్గా రైతు పోరుయాత్ర 
రైతు సమస్యలు వింటూ...పాలకుల పనితీరుపై నిప్పులు చెరుగుతూ... టీటీడీపీ రైతు పోరుయాత్ర చురుగ్గా ముందుకు సాగుతోంది. భూపాల ప‌ల్లి జిల్లా నుంచి ప్రారంభమైన ఈ యాత్ర.. ఖ‌మ్మం జిల్లాలో పూర్తి చేసుకుని ప్రస్తుతం పెద్ద ప‌ల్లి జిల్లాలో కొనసాగుతోంది. పొలాల దగ్గర రైతులను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఒకే విడతలో రుణమాఫీ చెల్లించాలని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంతరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, పంట రుణాలు ఇవ్వలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షల నష్టపరిహారం ఇవ్వాలంటున్నారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పట్టు పడుతున్నారు. 
పెద్దపల్లి రైతులను ప‌రామ‌ర్శించిన టీటీడీపీ నేత‌లు 
న‌కిలీ విత్తనాలతో నష్టాల పాలైన పెద్దపల్లి రైతులను టీటీడీపీ నేత‌లు ప‌రామ‌ర్శించారు...జిల్లాలోని రైక‌ల్ వ‌ప‌ల్లి,నార‌య‌ణ‌పూర్,కొడూరిపాక‌,నిమ్మన‌ప‌ల్లి నిట్టూర్ పెద్దపల్లి ప్రాంతాల్లో యాత్ర కొనసాగింది. రైతు సమస్యలపై తెలుగుదేశం తెలంగాణ శాఖ సమరశంఖం  పూరించింద‌నీ..న‌కిలీ విత్తనాలు అంటగట్టిన అక్రమార్కులని కఠినంగా శిక్షించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాదు న‌ష్టపోయిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేసేదాక రాజీలేని పోరాటం చేస్తామ‌ని హెచ్చరించారు.  
ఈనెల 30న ముగియనున్న పోరుయాత్ర
ఈనెల 30న టీటీడీపీ రైతు పోరుయాత్ర మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌లో ముగియనుంది. చివరిరోజు భారీ బహిరంగసభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు రైతు పోరు యాత్ర.. మరోవైపు పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసే దిశగా తెలుగుతమ్ముళ్లు కదులుతున్నారు. నేతలు, కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ఇప్పటినుంచే గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నారు. అధిక సమయం ప్రజా క్షేత్రంలోనే ఉంటూ వారి సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలనుకుంటున్నారు. మొత్తంగా  తెలంగాణ‌లో పార్టీకి పునర్‌ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 

 

09:08 - November 14, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయం  హైద‌రాబాద్ పాల‌క సంస్థల‌కు క‌లిసొచ్చింది. మూడో రోజు కూడా జీహెచ్ఎంసీకి పెద్దమొత్తంలో ప‌న్నులు వసూలయ్యాయి. సోమవారం రాత్రి వరకు అవకాశం ఉండటంతో భారీగా నగరవాసులు పన్నులు చెల్లించేందుకు క్యూ కడుతున్నారు. 
500, 1000 నోట్లతో పన్నులు చెల్లిస్తున్న నగరవాసులు
ఫీజులు, ప‌న్నులు చెల్లించ‌డానికి పాత నోట్లను ఉప‌యోగించ‌వ‌చ్చంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ జీహెచ్ఎంసీకి కాసుల వర్షం కురిపిస్తోంది.  500, 1000రూపాయ‌ల నోట్ల మార‌కానికి వ‌చ్చిన ఇబ్బందుల‌ నుండి గ‌ట్టెక్కడానికి జీహెచ్ఎంసి, వాట‌ర్ బోర్డు, హెచ్ఎండీఏ, విద్యుత్ సంస్థల‌కు ఉన్న బ‌కాయిల‌ను గ్రేట‌ర్ వాసులు చెల్లిస్తున్నారు . 
ఆదివారం రూ. 32. 4 కోట్ల పన్నులు వసూలు
ఆదివారం జీహెచ్‌ఎంసీలో ఆస్తి పన్ను కింద రూ.9 కోట్లు, ఎల్‌ఆర్‌ఎస్ కింద రూ.23.4 కోట్లు వసూలైంది.  హెచ్‌ఎండీఏ పరిధిలో సుమారు రూ.3.39 కోట్లు వసూలైయ్యాయి. జలమండలి పరిధిలో సుమారు 25 వేల మంది నల్లా బిల్లుల బకాయిలు చెల్లించగా రూ.3.20 కోట్లు వసూలైంది
బల్లియాకు రూ.  99.4  కోట్ల పన్నులు వసూలు
ఇప్పటీ వరకు శుక్రవారం, శనివారం రెండురోజుల్లోనే  99. 4 కోట్ల రూపాయల ఆదాయం బ‌ల్దియాకు వచ్చింది. దీంతో పన్నుల వసూలకు యంత్రాంగాన్నిరంగంలోకి దింపి పన్ను వసూలుకు అన్ని రకాలుగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా ప్రసార మాధ్యమాలు, ఎస్ ఎంఎస్ ద్వారా జీహెచ్ఎంసీ ప్రజల దృష్టికి  తీసుకెళుతోంది. ఇక ఇప్పుడు క‌లిసోచ్చిన అవ‌కాశాన్ని నగర వాసులు స‌ద్వినియోగం చేసుకోవాలంటున్నారు జీహెచ్ఎంసి అధికారులు. 
ఆదాయం పెంపుకోసం స్పెష‌ల్ ప్రోగ్రాం డిజైన్ 
బ‌ల్దియాలో చేప‌డుతున్నట్లుగానే జ‌ల‌మండ‌లి కూడా ఆదాయం పెంపుకోసం స్పెష‌ల్ ప్రోగ్రాం డిజైన్ చేసింది. శుక్రవారం 49వేల‌మంది 17.1కోట్ల రూపాయలు చెల్లించ‌గా...... శ‌నివారం  28వేల మంది  4కోట్ల రూపాయ‌లు వాట‌ర్ బోర్డుకు పన్నులు చెల్లించారు. ఆదివారం నాడు జలమండలి పరిధిలో సుమారు 25 వేల మంది నల్లా బిల్లుల బకాయిలు చెల్లించగా 3.20 కోట్ల రూపాయలు వసూలయ్యాయి.  సోమ‌వారం సెలవులు ఉన్నప్పటికీ  త‌మ క్యాష్ కౌంట‌ర్లు ప‌నిచేస్తాయని.. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఏది ఏమైనా పెద్ద నోట్ల రద్దుతో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. జీహెచ్‌ఎంసీ, జలమండలి ఖజానా నిండుతుండడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

09:07 - November 14, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా కుదేలైంది. సంపన్న రాష్ట్రం ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఆర్థికంగా మిగులు ఉన్న రాష్ట్ర బడ్జెట్‌  మళ్లీ లోటులోకి వెళుతుందేమోనన్న భయం ప్రభుత్వాన్ని పట్టిపీడిస్తోంది. రోజువారీ రాబడి రెండొందల కోట్ల నుంచి ఎనిమిది కోట్లకు పడిపోవడంతో ఏమిచేయాలో పాలుపోక అధికారులు, పాలకులు అయోమయంతో కొట్టుమిట్టాడుతున్నారు. 
తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం 
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల చెలామణి రద్దు నిర్ణయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై బాగానే ప్రభావం చూపింది. సర్కారీ రాబడి తగ్గిపోవడంతో ఉత్పన్నమయ్యే పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్రతో కలిసి ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. 
అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుపై ప్రభాశం 
కాసులతో గలగలలాడిన ఖజానా... పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా ఒట్టిపోయింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కూడా కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులు. ఈ మూడు శాఖల ద్వారా రోజుకు రెండొందల  కోట్ల ఆదాయం వచ్చేది. వైన్‌ షాపులు, బార్లలో మద్యం అమ్మకాలు పడిపోయాయి. దుకాణాల్లో కొనుగోళ్లు తగ్గాయి. భూములు, స్థలాలు, ఫ్లాట్ల లావాదేవీలు గతంలో మాదిరిగా జరగడంలేదు. దీంతో రాబడి లేకపోవడంతో అధికారులు, పాలకుల చేతులు కట్టేసినంత పనైందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
60 శాతం పడిపోయిన రవాణ శాఖ ఆదాయం 
పెద్ద నోట్ల రద్దుకు ముందు స్థిరాస్తి వ్యాపారం బాగా ఉండేది. రోజుకు మూడువేలకు పైగా లావాదేవీలు జరిగేవి. కానీ ఇప్పుడు కేవలం రెండొందల లోపే ఉన్నాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి. సగటున రోజుకు 20 కోట్ల వంతున నెలకు 320 కోట్ల రాబడితో ప్రభుత్వ గల్లాపెట్టే  గలగల్లాడేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తొంబైశాతం రాబడి పడిపోయిందని లెక్కలు తేల్చారు. వాహనాల అమ్మకాలు రోజుకు మూడు వేల నుంచి వెయ్యికి తగ్గిపోవడంతో, రవాణ శాఖ ద్వారా వచ్చే ఆదాయం 60 శాతం కోల్పోవాల్సి వచ్చింది. అయితే పెద్ద నోట్లు రద్దైన తర్వాత మొదటి రెండు రోజులు రాబడి తగ్గినా... శుక్రవారం నుంచి పెరుగుతూ వస్తోందని అధికారులు చెప్పడం కొంత ఊరట కలిగించే అంశంగా భావిస్తున్నారు. సగటున రోజువారీ మద్యం ఆదాయం 40 కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ బుధవారం 22 కోట్ల గురువారం 20 కోట్లు మాత్రమే వచ్చిందని లెక్క తేల్చారు. కానీ శుక్రవారం ఒక్కసారిగా 68 కోట్లకు చేరడంతో అధికారులు కొద్దిగా ఊపరి పీల్చుకున్నారు. నగదుపై లావాదేవీలు జరిగే చిన్న వ్యాపారాలు కూడా తగ్గిపోవడంతో ఆ ప్రభావం ఖజానాపై పడుతోంది. మొత్తం మీద  నెలకు వెయ్యి కోట్ల రాబడి కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా ప్రభుత్వం వేస్తోంది.  
కోలుకోడానికి నాలుగైదు నెలలు 
పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి ప్రభుత్వం ఇప్పుడే కోలుకునే అవకాశాలు  లేవని..దీనికి నాలుగైదు నెలలు పట్టొచ్చనుకొంటున్నారు.  వచ్చే  బడ్జెట్‌పై  కూడా ఇది ప్రభావం చూపుతుందన్న నిర్ధారణకు అధికారులు వచ్చారు. 2015-16 వార్షిక బడ్జెట్‌ లక్షా 30 వేల కోట్ల రూపాయలు కాగా... 2016-17 బడ్జెట్‌ లక్ష కోట్లకు మించకపోవచ్చని అంచనాతో పాలకవర్గం ఉంది. పన్నులు  పెంచి రాబడి పెంచుకొందామనుకున్నా... రాష్ట్రంలో ప్రస్తుతం ఈ పరిస్థితి లేదంటున్నారు. పన్ను పోటు ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుందన్న భయంతో సర్కార్‌ ఉంది. రుణం తెచ్చుకుందామన్నా ఆ పరిస్థితీ లేదు. ఆర్థిక నియంత్రణ, బడ్జెట్‌ నిర్వహణ... ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారంలో బడ్జెట్‌ సైజును బట్టి మూడు శాతం ఉన్న రుణ పరిమితిని ఇటీవలే మూడున్నర శాతానికి పెంచారు. ఇలా అన్నిద్వారాలు మూసుకుపోవడంతో ప్రభుత్వానికి చేతులు కట్టేసినంత పనైందని పాలకుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. ఆదాయం పెంచుకునేందుకు ఏ ప్రత్యామ్నాయం లేకపోవడంతో   ఉన్నదాంతోనే కొంతకాలంపాటు  సర్దుకుపోవాల్సిన పరిస్థితితులు ఉత్పన్నమయ్యాయి. 
బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు సింహభాగం 
ప్రస్తుత బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు సింహభాగం కేటాయించారు. పాతికవేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం చకచకా సాగిపోతున్న తరుణంలో అనూహ్యంగా చోటు చేసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈ రంగంపై కూడా పడుతుందని భావిస్తున్నారు.

 

శివాలయాలకు పోటెత్తిన భక్తులు

ప్రకాశం : కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఓడరేవు, రామాపురం, పాకల, రామాయపట్నం, కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. 

 

దివీస్ కు వ్యతిరేకంగా నేటి నుంచి సీపీఎం నేతల ఆమరణ దీక్ష

తూర్పుగోదావరి : దివీస్ కు వ్యతిరేకంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద నేటి నుంచి సీపీఎం నేతల ఆమరణ దీక్ష చేయనున్నారు. దీక్షలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు  పాల్గొననున్నారు. 

సోమర్లకోట, ద్రాక్షారామ ఆలయానికి పోటెత్తిన భక్తులు

తూర్పుగోదావరి : కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమర్లకోట, ద్రాక్షారామ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అన్నవరం కొండపై భక్తులు కిటకిటలాడుతున్నారు. 

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

సిరిసిల్ల : కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. 

నేడు తెలంగాణలో కాంగ్రెస్ నిరసనలు

హైదరాబాద్ : నేడు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులపై ఆందోళన చేయనున్నారు.

 

07:25 - November 14, 2016

హైదరాబాద్ : పచ్చనోట్లు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెద్దనోట్లను కేంద్రం రద్దు చేయడంతో చిన్ననోట్ల కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. పెద్ద నోటు జేబులో ఉన్నా..అది ఎందుకూ పనికిరాకపోవడంతో జనం చిల్లర కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అటు చిన్న వ్యాపారస్తులను సైతం చిల్లర కష్టాలు వెంటాడుతున్నాయి.  
సామాన్య ప్రజలు పడరాని పాట్లు 
కరెన్సీ కష్టాలు వరుసగా నాలుగోరోజు తప్పలేదు. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను పొందడంలో..సామాన్య ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఏటీఎంలపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు ఇప్పటికీ నిరాశే ఎదురవుతోంది. పాత కరెన్సీ మార్పిడికి డిసెంబర్-30 వరకు గడువున్నప్పటికీ.. తెల్లవారుజాము నుంచే బ్యాంకుల దగ్గర ఖాతాదారులు బారులు తీరుతున్నారు. ఏటీఎంలు పనిచేయకపోవడంతో నాలుగోరోజు ప్రజలు బ్యాంకులవైపే పరుగులు తీశారు. వందల్లో ఒక్క శాతం ఏటీఎంలు మాత్రమే పనిచేస్తుండటంతో..బ్యాంకులన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. 
కరెన్సీ నిల్ 
ప్రజల వద్ద ఇబ్బడిముబ్బడిగా కరెన్సీ లేని పరిస్థితి నెలకొంది. దీని ప్రభావం వివిధ వ్యాపారలపై గణనీయంగా పడుతోంది. ముఖ్యంగా చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదివారం ఎప్పుడూ కళకళలాడే నాన్-వెజ్ దుకాణాలన్నీ..వెలవెలబోయాయి. కూరగాయలు, నాన్‌వెజ్‌ మార్కెట్లు జనం లేక వెలవెలబోయాయి. కస్టమర్లు రాకపోయేసరికి తీవ్రంగా నష్టపోతున్నామని మటన్‌ వ్యాపారులు చెబుతున్నారు. మాంసం దుకాణాలకు రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లు పాత నోట్లనే తెస్తున్నారు. దీంతో..అందరికీ చిల్లర ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రధాని నిర్ణయం తమ వ్యాపారాన్ని బాగా దెబ్బతీసిందని దుకాణదారులు వాపోతున్నారు. పెద్ద వ్యాపార సంస్థలేకాదు..రోడ్డువెంట ఉండే చిన్నాచితక వ్యాపారస్తులు సైతం పెద్ద నోట్ల దెబ్బకు విలవిలలాడిపోతున్నారు. 
నోట్లమార్పిడికి బ్యాంకుల్లో గంటల తరబడి క్యూ 
మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో జనం చిల్లర నోట్ల కోసం కోటికష్టాలు పడుతున్నారు. నోట్లమార్పిడి కోసం బ్యాంకుల్లో గంటల తరబడి క్యూలో నిల్చున్నా..కొత్త నోట్లు దొరకని పరిస్థితి నెలకొంది. బ్యాంకు అంధికారులు కూడా ఎక్కువగా డిపాజిట్లకే ప్రాధాన్యత ఇస్తున్నాయనీ..చేంజ్‌ కోసం వచ్చే వారిని పట్టించుకోవడంలేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రోజంతా క్యూలో నిలబడినా కేవలం 4వేల రూపాయలు మాత్రమే చిల్లర ఇస్తుండడంతో అవి తమ కనీస అవసరాలకు ఏమాత్రం సరిపోవడంలేదని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
విత్‌డ్రాయల్‌ పెంచాలి..
ఇప్పటికైనా కేంద్రం స్పందించి బ్యాంకుల్లో సరిపడా చిల్లరనోట్లను ఉంచేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బ్యాంకులు ఇచ్చే 2వేల రూపాయల చిల్లర తమ అవసరాలను తీర్చలేదని.. విత్‌డ్రాయల్‌ మొత్తాన్ని పెంచాలని జనం కోరుతున్నారు. 

07:17 - November 14, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అందుతున్న ఫిర్యాదులు, వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉపసంహరణ పరిమితిని పెంచింది. అలాగే నోట్ల మార్పిడి పరిమితిని కూడా నాలుగు వేల నుంచి నాలుగున్నర వేలు చేసింది. ఏటీఎంలలో ఉపసంహరణ పరిమితిని కూడా రెండు వేల నుంచి రెండున్నర వేలకు పెంచింది.
రూ. 4 వేల నుంచి రూ.4,500లకు పెంపు 
ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దు దరిమిలా ఉత్పన్నమైన పరిణామాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకుల్లో  పాతనోట్ల మార్పిడి, ఏటీఎంల్లో ఉపసంహరణ పరిమితిని పెంచింది. అలాగే బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ పరిమితిని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
బ్యాంకులకు చేరుతున్న కొత్త 500 నోట్లు 
రద్దు చేసిన ఐదొందల రూపాయల నోట్ల స్థానంలో ప్రవేశపెట్టిన కొత్త ఐదొందల రూపాయల నోట్లు ఇప్పుడిప్పుడే బ్యాంకులకు చేరుతున్నాయి. దీంతో ప్రజల ఇబ్బందులను కొంత వరకైనా తొలగించాలన్న లక్ష్యంతో  పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత నాలుగువేల రూపాయలుగా నిర్దారించిన నోట్ల మార్పిడి పరిస్థితిని ఇప్పుడు నాలుగున్నర వేలకు పెంచారు. అలాగే ఏటీఎంల నుంచి ఉపసంహరణ పరిమితిని కూడా హెచ్చించారు. ఈనెల 11 నుంచి ఇప్పటి వరకు రెండు వేల రూపాయలుగా ఉన్న ఉపసంహరణ పరిమితిని ఇప్పుడు రెండున్నర వేలకు పెంచారు. వారానికి 20 వేల రూపాయలుగా ఉన్న ఉపసంహరణ పరిమితిని కూడా 24 వేల రూపాయలకు హెచ్చించారు. రోజుకు పది వేల రూపాయలు మాత్రమే తీసుకోవాలన్న నిబంధనను తొలగించారు. ఆర్‌బీఐ,  వాణిజ్య బ్యాంకులు, తపాలా కార్యాలయాలను నిరంతరం సమన్వయం చేస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 
బ్యాంకుల్లో 3లక్షల కోట్ల పాత నోట్లు జమ 
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు ఇబ్బడి ముబ్బడిగా పాత నోట్ల వచ్చిపడుతున్నాయి. మార్పిడి, డిపాజిట్ల రూపంలో ఇంతవరకు మూడు లక్షల కోట్లకు పైగా పాత నోట్లు జయ అయ్యాయని ఆర్థిక శాఖ లెక్కలు తేల్చింది. వినియోగదారుల చేతుల్లోకి 50 వేల కోట్ల నగదు చేరింది. నగదు సమస్య ఉన్న ప్రాంతాలకు గుర్తించి... తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను కేంద్రం కోరింది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని సూచించింది. చెక్కులు, డీడీలు, ఆన్‌లైన్‌ చెల్లింపులను నిరాకరించే వ్యాపార సంస్థలపై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయొచ్చని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దివ్యాంగులు, వృద్ధులకు బ్యాంకుల్లో ప్రత్యేక  క్యూలైన్లు, రోగుల కోసం మొబైల్‌ బ్యాకింగ్‌ వ్యాన్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. 
నోట్ల మార్పిడికి రూ. 2వేల నోట్లు జారీ 
రద్దు చేసిన ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్ల స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఐదొందల రూపాయల నోట్ల బ్యాంకుల్లో ఇప్పుడిప్పుడే చెలామణిలోకి వస్తున్నాయి. నోట్ల మార్పిడికి బ్యాంకుల్లో రెండు వేల రూపాయల నోట్లు ఇస్తున్నారు. వంద నోట్లు చాలా తక్కువగా జారీ చేస్తున్నారు. దీంతో రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవడంలో చాలా సమస్యలు  ఎదురువున్నాయి. ఆదివారం సాయంత్రమే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఖాతాదారులకు ఐదొందల రూపాయల నోట్లు జారీ చేశారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐదొందల రూపాయల నోట్లను పరిమితంగా విడుదల చేయడంతో ఇంకా కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి రాలేదు. 

 

నేడు కాంగ్రెస్, తృణమూల్, లెఫ్ట్ పార్టీ నేతలు భేటీ

ఢిల్లీ : నేడు కాంగ్రెస్, తృణమూల్, లెఫ్ట్ పార్టీ నేతలు భేటీ కానున్నారు. పెద్దనోట్ల రద్దు అంశంపై విక్షాలు చర్చించనున్నాయి. 

 

నేడు లోక్ సభ స్పీకర్ ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ

ఢిల్లీ : నేడు లోక్ సభ స్పీకర్ ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ జరుగనుంది. శీతాకాల సమావేవాలపై చర్చ జరుగనుంది. 

 

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 

 

Don't Miss