Activities calendar

15 November 2016

22:03 - November 15, 2016

అమెరికా : నూతన అధ్యక్షుడు ట్రంప్‌ తొలిసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరచుకోవాలని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కలిసి పనిచేయాలన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమెరికా చారిత్రాత్మక ఎన్నికల్లో తాను గెలిచినందుకు పుతిన్‌ తనకు ఫోన్‌ చేశారని ట్రంప్‌ చెప్పారు. ట్రంప్‌ గెలిచిన గంటకే పుతిన్‌ టెలిగ్రాం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. రష్యా, అక్కడి ప్రజలతో బలమైన సంబంధాలు ఏర్పరచుకునేందుకు తాను ఉత్సాహంతో ఉన్నానని ట్రంప్‌ అన్నారు. సిరియా విషయంలో అమెరికా, రష్యాల మధ్య విభేదాలున్న విషయం తెలిసిందే.

22:01 - November 15, 2016

ఉత్తరప్రదేశ్ : పెద్ద నోట్ల రద్దుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థికసంక్షోభం సమయంలో భారత ఆర్థికవ్యవస్థను గట్టెక్కించింది బ్లాక్మనీనే నిపుణులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. నల్లధనాన్ని నేను వ్యతిరేకిస్తున్నా... కానీ ప్రపంచమంతా ఆర్థికసంక్షోభంలో కూరుకున్నప్పుడు భారత్ను సంక్షోభం పరిస్థితుల నుంచి బయటపడేసింది మాత్రం ఈ నల్లధనమేనని అఖిలేష్‌ చెప్పుకొచ్చారు. బ్లాక్మనీని బయటికి తీసుకురావడానికి మోది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద భారీ క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

21:58 - November 15, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుపై.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని కమిటీతో... విచారణ జరిపించాలని ఆయన ప్రత్యేకంగా సమావేశమైన ఢిల్లీ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.

21:56 - November 15, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినప్పటికీ...చిల్లర మార్పిడి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. నోట్ల రద్దు పై హైదరాబాద్‌లో జరిగిన అన్నిపార్టీల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందు చూపులేకుండా కేంద్రం నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ సమావేశానికి ఆయా పార్టీలకు చెందిన నేతలు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. 

21:54 - November 15, 2016

తూర్పుగోదావరి : బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చెప్పినట్లుగా.. విదేశాల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల అకౌంట్లను కేంద్రం జాతీయం చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉండవల్లి డిమాండ్ చేశారు. ఆ నిర్ణయం ప్రధాని మోదీ తీసుకున్నట్లయితే దేశమంతా ఆయన్ను కీర్తించేవారన్నారు. కొందరి ప్రయోజనాల కోసం అందరినీ ఇబ్బంది పెట్టడం సబబు కాదన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుపతిలో వైసీపీ ధర్నా చేపట్టింది. భూమన కరుణాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. 500, 1000 నోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భూమన అన్నారు.

21:51 - November 15, 2016

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్ర వాయిదా పడింది. పోలీసుల విజ్ఞప్తితో ముద్రగడ పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. త్వరలోనే పాదయాత్ర తేదీని ప్రకటిస్తానన్నారు . అయితే తరువాతి పాదయాత్రకు పోలీసుల అనుమతిని కోరబోనని ముద్రగడ స్పష్టం చేశారు.

ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ పాదయాత్రను వాయిదా
కాపునేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఈ యాత్రను అడ్డుకోవాలన్న మేడ శ్రీనివాస్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు.. ముద్రగడ యాత్రకు అనుమతినిచ్చింది. దీంతో ముద్రగడ పాదయాత్రకు సమాయత్తమయ్యారు. ఈ పరిస్థితుల్లో ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు.. ఆయన పాదయాత్ర ప్రయత్నాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పోలీసుల భారీ మోహరింపుతో కిర్లంపూడిలో ఉద్రిక్తత
పోలీసుల భారీ మోహరింపుతో కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల చర్చల అనంతరం.. ముద్రగడ పద్మనాభం రేపటి నుంచి ప్రారంభించాలనుకున్న పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. అంతకుముందు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వైసీపీ నేత అంబటి.. పోలీసుల అనుమతి లేదన్న నెపంతో పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన యాత్రను ప్రభుత్వమే కావాలనే అడ్డుకుందని అన్నారు. మొత్తానికి బుధవారం నుంచి ప్రారంభించాల్సిన పాదయాత్రను ముద్రగడ వాయిదా వేసుకోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. తరువాతి పాదయాత్రకైనా ప్రభుత్వం అనుమతిస్తుందో లేదో చూడాలి. 

21:47 - November 15, 2016

విజయవాడ : పెద్దనోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. విజయవాడలో నాలుగు గంటలపాటు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఫైబర్‌ నెట్‌ కోసం 10 లక్షల సెట్‌టాప్‌ బాక్సుల కొనుగోలు చేయాలని నిర్ణయించింది. విజయవాడ సిద్దార్థ కాలేజీ భూముల లీజు ధర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ భారత్‌ తరహాలో ఏపీలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

21:46 - November 15, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుతో ప్రజల కష్టాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల ఎటిఎంల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకుల వద్ద రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్‌ కొన్ని సూచనలు చేశారు. జనం మళ్లీ మళ్లీ డిపాజిట్‌ చేయకుండా వేలుపై సిరా గుర్తు పెట్టనున్నారు.

నగదు తీసుకున్న వారికి సిరాగుర్తు
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల వద్ద జనం రద్దీని తగ్గించేందుకు కేంద్రం దృష్టి పెట్టింది. బ్యాంకుల్లో నగదు మార్పిడి చేసుకున్న వారే మళ్లీ మళ్లీ రావడంతోనే క్యూలైన్లు పెరుగుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ గుర్తించింది. నగరాల్లో నగదు తీసుకున్న వారికి సిరాగుర్తు పెట్టడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. ఓటు కోసం వాడే ఈ ఇంక్‌ వేలిపై త్వరగా మాసిపోదని, బ్యాంక్‌కు వచ్చేవారిని త్వరగా గుర్తించగలమని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు. కొత్త నోట్లు ఎక్కువ మందికి అందాలనేది తమ తాపత్రయమని చెప్పారు.

జన్‌ధన్‌ యోజన ఖాతాల్లో నల్లధనం డిపాజిట్లు జరుగుతున్నట్లు గుర్తింపు
నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు కొందరు సామాన్యులను ఎరవేసి నగదు మార్పిడి చేస్తున్నారు. ముఖ్యంగా జన్‌ధన్‌ యోజన ఖాతాల్లో నల్లధనం డిపాజిట్లు జరుగుతున్నట్లు గుర్తించిన కేంద్రం- ఈ ఖాతాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. సొంత డబ్బు డిపాజిట్‌ చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అక్రమంగా నగదు నిల్వలు కలిగివున్నవారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది. జన్‌ధన్ ఖాతాదారులు ఇతరుల డబ్బుకు తమ అకౌంట్‌లో చోటివ్వకూడదని శక్తికాంత్‌దాస్‌ సూచించారు.

ధార్మిక సంస్థలు, ట్రస్టులకు కేంద్రం సూచనలు
ధార్మిక సంస్థలు, ట్రస్టులు తమ వద్ద నున్న చిన్న కరెన్సీని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని కేంద్రం సూచించింది. దీనివల్ల మార్కెట్‌లో చిల్లర సమస్య తప్పుతుందని, చిన్ననోట్లను డిపాజిట్‌ చేసి పెద్ద నోట్లను పొందే వీలుందని కేంద్రం పేర్కొంది.

పుకార్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి : శక్తికాంత్
సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయని ప్రజలు వీటిని నమ్మవద్దని కేంద్రం అప్రమత్తం చేసింది. బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తారన్న ఓ మెసేజ్‌ వైరల్‌ అయ్యిందని, ఈ మెసేజ్‌ గత ఏడాది క్రితం నాటిదని, ఇలాంటివాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని శక్తికాంత్‌ దాస్‌ సూచించారు.

మైక్రో ఏటీఎంల ఏర్పాటుతో నగదు కొరత తగ్గింపు : శక్తికాంత్
ప్రజలకు అవసరమైన నగదు ఆర్‌బీఐ వద్ద ఉందని.. ఎవరూ ఆందోళన చెందొద్దని శక్తికాంత్‌ దాస్‌ పేర్కొన్నారు. మైక్రో ఏటీఎంల ఏర్పాటుతో నగదు కొరత తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బ్యాంకులోకి నకిలీ నోట్లు రాకుండా టాస్క్‌ఫోర్స్‌ దృష్టి పెట్టిందన్నారు. 

21:37 - November 15, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్యులకు శరాఘాతంగా మారింది. గంటల కొద్దీ క్యూలో నిలబడి.. పడిగాపులు కాస్తున్నా... చిల్లర నోట్లు దొరకే పరిస్థితి లేక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోతున్నారు. సామాన్యులు పనులన్నీ వదులుకుని.. చిల్లర నోట్ల కోసం రోజంతా బ్యాంకు క్యూల్లో నిలవాల్సిన దుస్థితి.

గుండెపోటుతో మరణించిన ఉద్యోగి
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగ్గా చేయని కారణంగా.. ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. చిల్లర నోట్ల కోసం.. నగదు మార్పిడి కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి వృద్ధులు.. వ్యాధిగ్రస్థుల ప్రాణాలపైకి తెస్తోంది. ఆంధ్రాబ్యాంకులో నగదు జమ చేయడానికి క్యూలైన్‌లో నిలబడి.. సికింద్రాబాద్‌ మారేడుపల్లి రైల్వేకాలనీకి చెందిన లక్ష్మినారాయణ.. క్యూలైన్‌లోనే గుండెపోటుతో కుప్పకూలి పోయాడు. దాదాపు రెండు గంటలపాటు నిలబడే ఉండడం.. కనీస వసతులూ అక్కడ లేకపోవడం.. అధికారుల నిర్లక్ష్యం.. లక్ష్మీనారాయణ మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

పెద్ద నోట్లు తీసుకోబోమంటూ బోర్డులు పెట్టిన బ్యాంకులు
ఇక నోట్ల మార్పిడి, చిల్లర నోట్ల కోసం ప్రజలు అన్ని బ్యాంకులు.. ఏటీఎంల వద్ద మంగళవారం కూడా క్యూ కట్టారు. కొన్ని బ్యాంకులైతే రద్దీని తట్టుకోలేక పెద్ద నోట్లు తీసుకోబోమంటూ బోర్డులు పెట్టేశాయి. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండల సహకార బ్యాంకు.. పెద్ద నోట్లు తీసుకోబోమనడంతో ధాన్యం విక్రయించిన మొత్తాన్ని డిపాజిట్‌ చేసేందుకు వెళ్లిన రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గడువు డిసెంబర్‌ 30 వరకు ఉన్నా.. బ్యాంకు అధికారులు ఐదు వందలు, వేయి నోట్లు తీసుకోక పోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు అధికారులు మాత్రం.. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సర్క్యలర్‌ ఆధారంగా డిపాజిట్లు తీసుకోవడం లేదని చెబుతున్నారు.

నోట్ల ఇక్కట్లే అదనుగా.. కొందరు తమ చేతివాటం
నోట్ల ఇక్కట్లే అదనుగా.. కొందరు తమ చేతివాటం చూపిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా.. చంద్రకల్‌ గ్రామానికి చెందిన నర్సమ్మ వద్దనున్న 15 వేల 500 రూపాయలను.. గుర్తు తెలియని ఆగంతకుడు మాటలతో మాయచేసి కొల్లగొట్టుకు పోయాడు. కేంద్రం నిర్ణయం కడప జిల్లా రైతులను తీవ్ర ఇక్కట్ల పాల్జేసింది. వ్యవసాయ అవసరాల నిమిత్తం.. పాత నోట్లతో మార్కెట్‌కు వెళ్లిన రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరిగి వస్తున్నారు. బ్యాంకుల నుంచి సరిపడా డబ్బులు రాక.. రైతులు, వ్యవసాయ కూలీలు సతమతమవుతున్నారు. కూలీలకు ఇచ్చేందుకు డబ్బుల దొరక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు, మందులు కూడా కొనలేని పరిస్థితి ఉంది. నాలుగు వేల కోసం పొలం పనులు వదిలిపెట్టి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అనంతపురం జిల్లాలోనూ సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. కదిరి పోస్టాఫీసులో.. కేవలం 2500 రూపాయలు మార్చుకోవడానికి ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకూ పడిగాపులు పడే పరిస్థితి నెలకొంది.

ఉదయం 9నుంచి సాయంత్రం 6 గంటలవరకు పడిగాపులు
రద్దయిన పెద్దనోటుతో ఏమీ కొనలేక,. చిల్లర ఎక్కడా దొరక్క సామాన్యులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఉదయం 9నుంచి సాయంత్రం 6 గంటలవరకు పనిచేయాల్సిన బ్యాంకులు.. మధ్యాహ్నమే మూతపడుతుండటం కూడా సామాన్యుల కష్టాలను రెట్టింపు చేస్తోంది. 

21:32 - November 15, 2016

ఢిల్లీ : రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం
బుధవారం నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో నల్లధనాన్ని అరికట్టేందుకంటూ మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయమే ప్రధాన చర్చనీయాంశం కానుంది. ఇప్పటికే ఈ అంశంపై ఒక్కటైన విపక్షాలు కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. అన్ని పార్టీలూ విడివిడిగా వ్యూహాలను రచిస్తున్నాయి.

సోనియాగాంధీ అధ్యక్షతన పార్లమెంటరీ సమావేశం
కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన పార్లమెంటరీ సమావేశం జరిగింది. పెద్ద నోట్ల రద్దు, సర్జికల్‌ దాడులు, ఓఆర్‌ఓపి, రైతుల పరిస్థితి, జడ్జిల నియామకం తదితర అంశాలను లేవనెత్తాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. కొత్త నోట్ల ముద్రణపై తమ పార్టీ నేతలకు ముందే సూచించడం ద్వారా ప్రధాని పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్‌ నాయకత్వం ఆరోపించింది. నోట్ల మార్పిడితో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.

పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా పార్లమెంట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీ
పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా పార్లమెంట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని తృణమూల్‌ నిర్ణయించింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌, వామపక్షాలు పాల్గొనడం లేదు. బిజెపి మిత్రపక్షం శివసేన ఈ ర్యాలీలో పాల్గొనాలని నిర్ణయించింది.

సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలకు మోది విజ్ఞప్తి
మరోవైపు ప్రధాని మోది అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలకు మోది విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చకు సిద్ధమని బిజెపి స్పష్టం చేసింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 16 వరకూ నెల రోజుల పాటు జరుగనున్నాయి. 

మంత్రి జైట్లీతో రతన్ టాటా భేటీ!..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీతో ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఈరోజు సమావేశమయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించినప్పటి నుంచి వారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జైట్లీతో రతన్ టాటా సమావేశమవడం గమనార్హం. సుమారు అరగంటసేపు జరిగిన వారి సమావేశంలో ఏ విషయాలపై చర్చించారన్నది బయటకు రాలేదు. ఈ సమావేశానంతరం మీడియాతో మాట్లాడేందుకు టాటా నిరాకరించారు.

దీదీ ర్యాలీకి శివసేన మద్దతు..

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుపై నిరసన వ్యక్తం చేస్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలో నిర్వహించనున్న ర్యాలీకి శివసేన పార్టీ మద్దతు తెలిపింది. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ పార్లమెంట్ హౌస్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ జరగనుంది. 

తగ్గిన పెట్రోల్..డీజిల్ ధరలు..

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.1.46 పైసలు, డీజిల్ ధర రూ.1.53 పైసలు తగ్గింది. తగ్గిన పెట్రోల్ ధరలు ఈ రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు చమురు సంస్థలు ఒక ప్రకటన చేశాయి.

20:42 - November 15, 2016

ఏటీఎంల దగ్గర నిలబడి నిలబడి కాళ్లు పీకుతున్నాయి.. బ్యాంకు ఎదురుగా క్యూలో ఉండీ ఉండీ నీరసం వస్తోంది. ఉన్న నాలుగు పెద్ద నోట్లు చెల్లవు. మారవు. వంద నోట్లు అందవు. పాలు, కూరగాయలనుంచి ఏది కొందామన్నా వీల్లేని పరిస్థితి. ఏమిటీ సంక్షోభం? ఏ లక్ష్యం కోసం సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది? ఎవర్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. కరెన్సీ కష్టాలతో దేశమంతా విలవిల్లాడుతుంటే.. ఇంకో యాభై రోజులే అంటున్న సర్కారు తీరుపై విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. ఇప్పుడు దేశమంతా క్యూలో ఉంది. ఇప్పుడు దేశమంతా ఎదురు చూపుల్లో ఉంది..ఇప్పుడు దేశమంతా అయోమయంలో ఉంది. నమ్మకం కోల్పోయి..భరోసా దూరమైన పరిస్థితిలో సామాన్య ప్రజానీకం విలవిల్లాడుతోంది. సొమ్ము వాళ్లదే.. ఎకౌంట్ వాళ్లదే.. సంపాదించింది న్యాయంగానే.. జేబులో ఉన్నది ఆ నాలుగు నోట్లే.. కానీ, అవే చెల్లవని సర్కారు చెప్తోంది. పోనీ మార్చుకుంటామంటే సరైన ఏర్పాట్లు చేయలేదు. సరుకులు కొందామంటే తీసుకోరు. కూరగాయలు కొందామంటే చెల్లవంటారు. ఏమిటీ దుస్థితి.. ఏంటీ ఖర్మ? సర్కారు నిర్ణయం ఎవర్ని ఉద్ధేశించి తీసుకున్నారు? నల్లధనం ఇప్పటివరకు ఎంత బయటికొచ్చింది? పన్నులు కట్టని వాళ్లు ఇప్పటి వరకు ఎంత మంది బయటపడ్డారు? మామూలు ప్రజలు తమ న్యాయమైన సంపాదన ఉపయోగించుకోవటానికి ఇబ్బందులు ఎందుకు పడాల్సి వస్తోంది. యాభై రోజుల్లో అంతా సద్దుమణుగుతుందా? యాభై రోజులు..కేవలం యాభై రోజులు ఓపిక పట్టండి.. నల్ల కుబేరుల్ని వెంటాడుతా.. ప్రజలు కలలుగన్న భారతాన్ని ఇస్తా.. ఇదీ ప్రధాని మోడీ చెప్తున్న మాట. మరి 50 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందా? లేక మరింతకాలం పడుతుందా?మోడీ సర్కారు విస్వసనీయతకు దెబ్బ తగిలిందా? డీ మానిటైజేషన్ లో కనిపించని కోణాలున్నాయా? ప్రజల్లో కరెన్సీ రద్దుపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందా? తాము సంపాదించిన సొమ్మును ఒక్కసారిగా రద్దు చేయటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోందా? క్యూలో నిలబడ్డ దేశం, ఏటీఎంల ముందు ఎదురు చూపుల్లో నిలబడ్డ దేశం ఇప్పుడు అనేక ప్రశ్నలు గుప్పిస్తోంది. ఎవరి కోసం ఈ చర్యలు..? ఏ లక్ష్యం కోసం ఈ నిర్ణయం? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఒక్కసారిగా బతుకుల్ని చెల్లని నోట్లుగా మార్చటం సర్కారు వైఫల్యం కాదా? కొన్ని సమాధానాలు ఆలస్యంగా అయినా చెప్పక తప్పదు...

రైల్వే మంత్రితో మంత్రి పద్మారావు భేటీ..

ఢిల్లీ: మంత్రి పద్మారావు ఇవాళ కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభును కలిశారు. సికింద్రాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం రైల్వే స్థలం కేటాయించాలని ఆయన కేంద్రమంత్రి సురేశ్‌ప్రభును కోరారు. తమ విజ్ఞప్తికి సురేశ్‌ప్రభు సానుకూలంగా స్పందించారని మంత్రి పద్మారావు తెలిపారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు..

విజయవాడ: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్‌లో పలు అంశాలపై నాలుగు గంటలపాటు చర్చించారు. చర్చల అనంతరం ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ పలు నిర్ణయాలు తీసుకుంది. ఫైబర్‌ నెట్‌ కోసం 10 లక్షల సెట్‌టాప్‌ బాక్సుల కొనుగోలు చేయాలని నిర్ణయించింది. విజయవాడ సిద్దార్థ కాలేజీ భూముల లీజు ధర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎకరాకు రూ. లక్ష నుంచి రూ.21 లక్షలు పెంచింది. దేవాదాయశాఖ భూమిని సిద్దార్థ కాలేజీ లీజుకు తీసుకుంది.

జలమండలికి భారీ ఆదాయం..

హైదరాబాద్: జలమండలికి ఇప్పటివరకు బిల్లుల రూపంలో రూ.35 కోట్ల రాబడి వచ్చిందని జలమండలి అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. నేడు ఒక్క రోజు బిల్లుల రూపంలో రూ.5.36 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఒక్క రోజే బిల్లులు చెల్లించని మొత్తం 330 పెద్ద బకాయిదారుల నల్లా కనెక్షన్లను తొలగించినట్లు పేర్కొన్నారు. 

20:16 - November 15, 2016

పోలవరం ముంపు ప్రాంతాలలో అన్ని వ్యవస్థలూ చిన్నా భిన్నంగా తయారయ్యాయి. డ్వాక్రా..అంగన్వాడీ..మధ్యహ్నా భోజనం ఇలా..సంక్షేమపథకాలన్నీ సంక్షోభంలో వున్నాయి. ఈ ప్రాంతాలలో మన మల్లన్న పర్యటించాడు. ఆ కష్టాలన్నీ మనక కళ్ళకుకట్టినట్లు చూపించాడు. ఇక పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కొన్ని మండలాలను ఏపీలో విలీనం చేశారు. ఈ మండలాల్లో ఖమ్మం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పాదయాత్ర చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాశితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అంతవరకూ నిర్మాణం చేపట్టరాదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. పాదయాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. ఈ పాదయాత్రలో సీపీఎం మాజీ ఎంపీ బాబూరావు పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో నేతలు ఎటువంటి డిమాండ్లతో ముందుకు సాగుతున్నారో తెలియాలంటే మల్లన్న ముచ్చట్లలో చూడండి..

20:12 - November 15, 2016
20:10 - November 15, 2016

పెద్ద నోట్ల రద్దుతో రైతులు వ్యవసాయ కూలీలు పలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. 10టీవీ కొన్ని కేంద్రాలను పరిశీలించింది. మలక్ పేటలో ఉల్లిమార్కెట్ లో పెద్దనోట్లు మార్పిడి కుదరక..చిల్లర నోట్లు దొరక్క ఉల్లి రైతులు పలు కష్టాలకు లోనవుతున్నారు. అటు గుంటూరు మిర్చి మార్కెట్ కు కూడా నోట్ల కష్టాలు తప్పలేదు..ఇలా పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా పలు ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దు, రైతులు..వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న కష్టాలు అనే అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో టి.సాగర్ (తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు), కేశవ రావు(ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

20:00 - November 15, 2016

విజయవాడ : కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలుగు ప్రజల మనోభావాలను 500, 1000 నోట్లతో పోల్చడంపై సీపీఎం ఏపీ కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కట్టబెట్టారని నచ్చినట్టు వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని మండిపడ్డారు. చట్టబద్ధతలేని ప్రత్యేక ప్యాకేజీని పక్కనపెట్టుకుని ఊరేగుతున్న... టీడీపీ, బీజేపీలకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కాగా మంగళవారం టీడీపీ పార్లమెంటరీ సమావేశం అనంతరం కేంద్రమంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశం చెల్లని రూ.500, రూ.1000 నోట్లు లాంటిదేనని.. ప్రత్యేక హోదా అంశంపై పట్టుబడితే ఎటువంటి లాభం ఉండదన్నారు. ఈ అంశంపై సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు మండిపడ్డారు.

19:58 - November 15, 2016

విజయవాడ : బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు లేక బ్యాంకులకు వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంక్‌ సిబ్బంది తీరుకు నిరసనగా విజయవాడ వన్ టౌన్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఆమె ఆందోళనకు దిగారు. బ్యాంక్ అధికారులను కలసి మహిళలు, వృద్ధులపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినా బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళా కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

19:47 - November 15, 2016

గుంటూరు : ప్రొ.లక్ష్మి కేసులో గుంటూరు కోర్టులో హైడ్రామా నడిచింది. ఈ కేసులో జిల్లా రూరల్ ఎస్పీ... తన పేరును ఇరికించారని లాయర్ నర్రా శ్రీనివాసులు ఆరోపించారు. న్యాయవాదిగా మాత్రమే తన వృత్తి ధర్మం నిర్వహించానని లాయర్ తెలిపారు. నేరం రుజువుకాకుండా ముద్దాయిలను మీడియాకు చూపడం మానవహక్కుల ఉల్లంఘనేనన్న లాయర్... ప్రొ.లక్ష్మి కుమారుడిని 9 రోజులుగా నిర్బంధించి వేధించారని కోర్టులో తెలిపారు.గ

 20 రోజుల తర్వాత పోలీసులకు చిక్కిన ప్రొఫెసర్‌ లక్ష్మీ
 
పుణ్యక్షేత్రాలు తిరిగింది...తెలిసినవారి సహకారం తీసుకుంది...కొత్త కొత్త ప్రాంతాల్లో తలదాచుకుంది..బెయిల్‌ దొరక్కపోవడంతో మళ్లీ ప్రయత్నం చేసేందుకు అన్ని పావులు కదిపింది....చివరకు పెద్ద నోట్లు రద్దు కావడంతో ఆమె సమాచారం తెలిసింది..దీంతో పాటు చుట్టుముట్టిన పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయింది...ఆమెనే ప్రొఫెసర్‌ లక్ష్మీ... గుంటూరు జూనియర్ వైద్యురాలి ఆత్మహత్య కేసులో 20 రోజుల తర్వాత ప్రొఫెసర్‌ లక్ష్మీ చిక్కింది...

తమ తప్పేం లేదంటూ మొసలికన్నీరు..
గుంటూరులో జూనియర్‌ వైద్యురాలు సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలైన ప్రొఫెసర్‌ లక్ష్మి, ఆమె భర్తని బెంగళూరులో అరెస్ట్‌ చేసిన గుంటూరు పోలీసులు దంపతులతో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురిని గుంటూరుకు తరలించారు...వారిని మీడియా ముందు చూపించిన పోలీసులు ఆ తర్వాత కోర్టుకు తరలించారు...గుంటూరులో గత నెల 24న మృతి చెందగానే ఆమె వద్ద దొరికిన డైరీ ఆధారంగా ప్రొఫెసర్‌ లక్ష్మీ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది..మొదట్లో దీన్ని లైట్‌గా తీసుకున్నా సంద్యారాణి కుటుంబీకులు..స్టూడెంట్స్.. ఇతర వర్గాల వారి ఆందోళనలతో కేసును సీరియస్‌గా పరిగణించి ప్రొఫెసర్‌ లక్ష్మీ కోసం గాలింపు ముమ్మరం చేశారు...గడిచిన 20 రోజులుగా లక్ష్మీ దంపతులు తప్పించుకు తిరుగుతూ కొన్ని గంటల క్రితం బెంగళూరులోని ఓ సన్నిహితుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు...

తమ తప్పేం లేదంటూ మొసలికన్నీరు..
గుంటూరులో జూనియర్‌ వైద్యురాలు సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలైన ప్రొఫెసర్‌ లక్ష్మి, ఆమె భర్తని బెంగళూరులో అరెస్ట్‌ చేసిన గుంటూరు పోలీసులు దంపతులతో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురిని గుంటూరుకు తరలించారు...వారిని మీడియా ముందు చూపించిన పోలీసులు ఆ తర్వాత కోర్టుకు తరలించారు...గుంటూరులో గత నెల 24న మృతి చెందగానే ఆమె వద్ద దొరికిన డైరీ ఆధారంగా ప్రొఫెసర్‌ లక్ష్మీ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది..మొదట్లో దీన్ని లైట్‌గా తీసుకున్నా సంద్యారాణి కుటుంబీకులు..స్టూడెంట్స్.. ఇతర వర్గాల వారి ఆందోళనలతో కేసును సీరియస్‌గా పరిగణించి ప్రొఫెసర్‌ లక్ష్మీ కోసం గాలింపు ముమ్మరం చేశారు...గడిచిన 20 రోజులుగా లక్ష్మీ దంపతులు తప్పించుకు తిరుగుతూ కొన్ని గంటల క్రితం బెంగళూరులోని ఓ సన్నిహితుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు...

సంధ్యారాణి భర్త ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుంది : లక్ష్మి
సంధ్యారాణి విషయంలో తాను ఏ తప్పూ చేయలేదంటున్నారు ప్రొఫెసర్‌ లక్ష్మి...తాను 22 ఏళ్లుగా సర్వీసులో ఉన్నానని.. ఇప్పటివరకు తనపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. సంధ్యారాణికి గైనిక్‌ విభాగం ఇష్టం లేదని..తన భర్త ఒత్తిడితోనే గైనిక్‌ తీసుకుందన్నారు...

సంధ్యారాణి ఆత్మహత్య ఘటన దురదృష్టకరం : లక్ష్మి భర్త
ముందస్తు బెయిల్‌ వచ్చేవరకు పోలీసులకు దొరకకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే తప్పించుకుని తిరిగినట్లు ప్రొఫెసర్‌ లక్ష్మి భర్త డాక్టర్‌ విజయసారథి తెలిపారు...తమకు బెయిల్‌ వచ్చేలా చేస్తానని..విశ్రాంత న్యాయమూర్తి, మరో న్యాయవాది ఇచ్చిన సూచనతో తాము పారిపోయినట్లు చెప్పారు...సంధ్యారాణి ఆత్మహత్య ఘటన దురదృష్టకరమని.. ఈ కేసులో నిజానిజాలు కోర్టు విచారణలో తేలుతాయన్నారు.

లక్ష్మికి సహరించినవారిని అరెస్ట్ చేశాం : ఐజీ సంజయ్
గుంటూరు నుంచి తప్పించుకున్న ప్రొఫెసర్‌ లక్ష్మీ దంపతులు చాలా చోట్ల మకాం మారుస్తూ ఎందరో సహకారం తీసుకున్నారు.. ఇందులో ప్రధానంగా ఐదుగురిని గుర్తించిన పోలీసులు వారిని కూడా అరెస్టు చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ మీడియా సమావేశంలో వివరించారు...విచారణ దాదాపు పూర్తయిందని, టెక్నికల్ గా మరింత సమాచారం సేకరించాల్సి ఉందన్నారు. అలాగే స్థానిక పోలీసుల వైఫల్యంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసు బాస్‌ తెలిపారు..

19:41 - November 15, 2016
19:40 - November 15, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల కష్టాలు ఇప్పట్లో తీరేలా కన్పించడంలేదు. పెద్దనోటుతో ఏమీకొనలేక,.చిల్లర ఎక్కడా దొరక్క సామాన్యులు పడరాని పాట్లు పడుతున్నారు. గంటలకొద్ది బ్యాంకుల్లో క్యూలో నిలపడ్డా ..చిల్లర దొరక్కపోవడంతో ప్రజలు బ్యాంకు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 6గంటలవరకు పనిచేయాల్సిన బ్యాంకులు..మధ్యాహ్నమే షట్టర్‌ని మూసేస్తున్నారు. హైదరాబాద్‌ రాంనగర్‌లో ఉన్న ఇండియన్‌ బ్యాంకు మధ్యాహ్నం 4 గంటలకే మూసేయంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

18:26 - November 15, 2016

తూర్పుగోదావరి : తూర్పుగోదావరి : కాపునేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర వాయిదా పడింది. బుధవారం నాడు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఐదురోజుల పాటు 105 రోజుల పాటు ఈ పాదయాత్రకు ముద్రగడ ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ క్రమంలో ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్ర వాయిదా పడింది. పోలీసుల విజ్ఞప్తితో ముద్రగడ వెనక్కి తగ్గారు. మరోవైపు త్వరలోనే పాదయాత్ర తదుపరి తేదిని ప్రకటిస్తానని ప్రకటించారు. అయితే పాదయాత్రకు పోలీసుల అనుమతి కోరేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. ఈనేపథ్యం పాదయత్రకు అనుమతి తీసుకోనని ముద్రగడ స్పష్టం చేశారు. మరోపక్క అనుమతి తీసుకోని పాదయాత్రను అడ్డుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ముద్రగడకు పోలీసులు పలు విధాలుగా నచ్చజెప్పారు. దీంతో ముద్రగడ తన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు..తదుపతి పాదయాత్ర తేదీని త్వరలో ప్రకటిస్తానన్నారు. 

17:50 - November 15, 2016

హైదరాబాద్ : ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద యాసంగి సాగు పెరగాలని.. 8 లక్షల ఎకరాల సాగుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ విషయంపై త్వరలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సారెస్పీ కింద యాసంగి కార్యాచరణ ప్రణాళికలను నీటిపారుదల శాఖ ఖరారు చేసింది. ఈ కార్యాచరణపై వరంగల్‌, కరీంనగర్‌, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

17:49 - November 15, 2016

వికారాబాద్ : విద్య, వైద్య సదుపాయాలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో జరిగిన సీపీఎం పాదయాత్రలో పాల్గొన్న ఆయన సంఘీభావం తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో ప్రవైటీకరణను అడ్డుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అ సందర్భంగా ప్రొ.కోదండరామ్ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే సీపీఎం పాదయాత్రకు పలుపార్టీలు,ప్రజాసంఘాలు, ప్రజలు మద్ధతు పలుకుతున్నారు. దారిపొడవునా ప్రజలు తమ కష్టాలు పాదయాత్ర సభ్యులకు ఏకరువుపెడుతున్నారు. ప్రజాసమస్యలపై కార్యదర్శి తమ్మినేని ప్రభుత్వాని లేఖల ద్వారా తెలిపారు. ప్రజాససమస్యలపై తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

విద్యుత్ కొనుగోళ్లపై విపక్షాలవి తప్పుడు ఆరోపణలు

హైదరాబాద్: విద్యుత్ ఉత్పత్తి కొనుగోళ్లపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. కొన్ని పార్టీలు ఆంధ్ర ఏజెంట్లుగా మారాయని, అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవపట్టించొద్దని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఉందని, ఈసీ నియమించిన తర్వాతే అనుమతి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

విమర్శల పర్వంలో కాంగ్రెస్, బిజెపి నేతలు

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిజెపి నేత లక్ష్మణ్ లు విమర్శల పర్వం కొనసాగింది. బ్లాక్ మనీకి అడ్డుకట్టపడితేనే పేదోడి అభివృధ్ధి అని లక్ష్మణ్ అనగా, ముందస్తు చర్యలు తీసుకోకుండా నోట్లు రద్దు చేయడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం అని ఉత్తమ్ తెలిపారు. 70 వేళ్ల కాంగ్రెస్ పాలనలో నల్లధనం పెరిగిందని లక్ష్మణ్ అనగా 100 రోజుల్లో నల్లధనం తీసుకొస్తానన్నది మోదీ కాదా అని ఉత్తమ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన చట్టాల వల్లే నల్లధనం ఆలస్యం అయ్యిందని... దాన్ని రూపుమాపడానికి మోదీ పూనుకున్నారని లక్ష్మణ్ అన్నారు. 

17:31 - November 15, 2016

తూర్పుగోదావరి : జిల్లా క్లిరంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. పాదయాత్ర నిర్వహించేందుకు తన నివాసం నుంచి బయలుదేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ఆదిలోనే చుక్కెదురైంది. పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులతో ముద్రగడ అనుచరులు వాగ్వాదానికి దిగారు.దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. కాగా గతంలో కూడా ముద్రగడ కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తునిలో రైలుకు ఆందోళన కారులు నిప్పు అంటించటం వంటి పలు సంఘటనలకు దారితీసింది. 

17:26 - November 15, 2016

హైదరాబాద్ : రెండేళ్లలో భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న టీఆర్‌ఎస్ సర్కారు...రెండేళ్లు గడిచినా ఎలాంటి పనులను ప్రారంభించలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ప్రజలపై అధిక భారం పడుతుందని అసెంబ్లీలో వివరించినా...కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. 270 మెగా వాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించాలనుకున్న ప్రభుత్వం...ఈ విషయంలో పునఃసమీక్షించుకోవాలని సూచించారు. 

17:21 - November 15, 2016

హైదరాబాద్ : చైతన్యపురి పీఎస్‌లో పరిధిలోని గ్రీన్‌హిల్స్‌లో దారుణం జరిగింది. ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న 14ఏళ్ల మైనర్‌ బాలికపై ఆ ఇంటి యజమాని కొడుకు అత్యాచారానికి పాల్పడ్డాడు. హైకోర్టు అడ్వకేట్ కొడుకైన భరత్‌కుమార్‌రెడ్డి తన ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న బాలికపై కొద్ది నెలలుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతో ప్రస్తుం ఆ మైనర్‌ బాలిక 2నెలల గర్భవతి. అయితే జరిగిన ఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. బాలికపై అత్యాచారం చేసిన భరత్‌కుమార్‌రెడ్డిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ చైతన్యపురి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు. 

కిర్లంపూడిలో ఉద్రిక్తత....

తూ.గో : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రేపటి నుంచి ప్రారంభిచనున్న పాదయాత్ర నేపథ్యంలో కిర్లంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. కాపు జేఏసీ నేతలు, అనుచరులతో ముద్రగడ మంతనాలు జరుపుతున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. శాంతి భద్రతల దృష్ట్యా పాదయాత్రను విరమించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోలీసుల విజ్ఞప్తిని ముద్రగడ నిరాకరించడంతో రావులపాలెంలో 144 సెక్షన్ విధించి కవాతు నిర్వహించారు. పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించొద్దని ఆదేశించారు. అంతే కాకుండా రావులపాలెంలో పలువురు కాపు జేఏసీ నేతలను అరెస్టు చేసి దూరప్రాంతాలకు పోలీసులు తరలిస్తున్నారు.

17:16 - November 15, 2016

ముంబై : స్టాక్‌ మార్కెట్లో మరోసారి భారీగా పతనమైంది. అంతర్జాతీయ భయాలు, దేశీయ పరిస్థితుల మధ్య సెల్లింగ్ ప్రెషర్ కు మార్కెట్ కుదేలైంది. సెన్సెక్స్ 514 పాయింట్లు నష్టపోయి... 26వేల 305 వద్ద ముగిసింది. నిఫ్టీ 188 పాయింట్ల నష్టంతో 8వేల 108 వద్ద క్లోజైంది. ఆటోమోబైల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో అమ్మకాలు భారీగా జరిగాయి. నిఫ్టీలో టాటా మోటార్స్ అత్యధికంగా 10శాతం క్షీణించింది. గ్రాసిమ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్, అల్ట్రా టెక్, ఐషర్ మోటార్స్, జీ, మారుతీ, అంబూజా 5శాతానికి పైగా పతనమయ్యాయి. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడియా, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్.. లాభాల్లో నిలిచాయి. 

వైద్యం అందక 6 రోజుల బాలుడు మృతి

నెల్లూరు : ఆత్మకూరులోని వందపడకల ఆస్పత్రిలో దారుణం జరిగింది. సకాలంలో వైద్యం అందక 6 రోజుల బాలుడు మృతి చెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యంతో తమ బాలుడు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు.

17:14 - November 15, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుతో ప్రజల ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బ్యాంకులలో గంటల తరబడి నిలబడడం, ఏటీఎంల వద్ద నో సర్వీస్‌ బోర్డులు లాంటి సమస్యలకు చెక్‌ పెట్టే దిశగా కేంద్రం యోచిస్తోంది. నగదు విత్‌డ్రాకు 'మైక్రో ఏటీఎం'లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇవి అందుబాటులోకి వస్తే ప్రజల ఇబ్బందులు తీరుతాయంటుంది. అసలు మైక్రో ఏటీఎంలు అంటే ఏమిటి ? ఏటీఎంలకు వాటికి తేడా ఏంటి ? అవి ఎలా పని చేస్తాయో ? మనం చూద్దామా...
ప్రజలకు ఇబ్బందులపై దృష్టి సారించిన కేంద్రం
నోట్ల రద్దు సంగతేమోగానీ ఇప్పుడు జనాలు ఎక్కడ చూసినా బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎం సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. క్యాష్ డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేయడం, నోట్ల మార్పిడి వంటి పనులతో ప్రజలు బారులు తీరి పనులు పూర్తి చేసుకుంటున్నారు. అయితే బ్యాంకులు, పోస్టాఫీసుల సంగతి అటుంచితే ఏటీఎంలలో చాలా వరకు పనిచేయకపోవడం, ఇంకొన్నింటిలో ఎప్పటికప్పుడు క్యాష్ అయిపోతుండడంతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ప్రజల ఇబ్బందులపై దృష్టి సారించిన కేంద్ర సర్కార్‌ పెద్ద ఎత్తున మైక్రో ఏటీఎంలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వీటితో ప్రజలకు కొంత ఇబ్బందులు తప్పుతాయని అధికారులంటున్నారు.

ఇప్పటికే పలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మైక్రో ఏటీఎంలు
మైక్రో ఏటీఎం అంటే.. మనం ఇప్పటివరకు క్రెడిట్, డెబిట్ కార్డులను స్వైప్‌ చేసే మిషన్ల మాదిరిగానే ఉంటాయి. కాకపోతే వీటిని ఆయా బ్యాంకులు ఎంపిక చేసిన ప్రతినిధులు నిర్వహిస్తుంటారు. వారికి మిషన్లు ఇచ్చాక పెద్దమొత్తంలో నగదును తమ వద్ద పెట్టుకుంటారు. తమ దగ్గరకు నగదు కోసం వచ్చే బ్యాంక్‌ ఖాతాదారుల నుంచి డెబిట్‌ లేదా క్రెడిట్‌కార్డును స్వైప్‌ చేస్తారు. వారికి కావాల్సిన నగదు మొత్తాన్ని మిషన్‌లో ఎంటర్‌ చేయగానే కార్డ్‌ స్వైప్‌ అవుతుంది. దీంతో నగదు ఖాతాదారుని అకౌంట్‌ నుంచి కరస్పాండెంట్‌ అకౌంట్‌కు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. తర్వాత ఆ మొత్తాన్ని అతను ఖాతాదారుడికి ఇస్తాడు.

గంటల తరబడి నిలబడే ప్రక్రియకు చెక్‌
ఈ మైక్రో ఏటీఎంలు ఇప్పటికే పలు గ్రామీణ ప్రాంతాల్లో ఆయా బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం నోట్ల రద్దుతో అన్ని ప్రాంతాల్లో నగదు తీసుకునేందుకు ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో వీటిని అన్ని ప్రాంతాలలో భారీస్థాయిలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది. ఈ మిషన్లు అందుబాటులోకి వస్తే.. ఖాతాదారులు డబ్బు డ్రా చేసుకోవడం సులభమవుతుంది. ఇక ఈ మిషన్ల నిర్వహణ ఖర్చు కూడా ఏటీఎంల కన్నా తక్కువగా ఉండడం.. ఒక్కసారి మిషన్‌ను కొనుగోలు చేస్తే మళ్లీ దానిపై ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండందంటున్నారు అధికారులు. ఈ మిషన్‌ను ఒక స్థానం నుంచి మరో స్థానానికి తీసుకువెళ్లడం కూడా చాలా సులభతరం. సో.. మైక్రో ఏటీఎంలు అందుబాటులోకి వస్తే ఖాతాదారులు ఇక డబ్బు డ్రా చేసుకోవడం మరింత సులభతరమయ్యే అవకాశం ఉంది. 

పార్లమెంట్ హాల్ లో అఖిల పక్షం భేటీ

ఢిల్లీ : పార్లమెంట్ హాల్ లో అఖిల పక్షం భేటీ అయ్యింది. ఈ భేటీకి కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్, టీఎంసీ, డీఎంకే నేతలు హాజరు కాగా... ప్రభుత్వం నుంచి అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు.

రూ.2 వేల దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు

మహబూబాబాద్ : దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు అయ్యింది. తేజావత్ ప్రదీప్, బానోత్ ప్రదీప్ లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి నాలుగు నకిలీ రూ.2 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

17:08 - November 15, 2016

తూర్పుగోదావరి : కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ముందుగా గుర్తొచ్చేది వనభోజనాలు.. విహారయాత్రలు.. అందమైన ప్రకృతి అందాల వీక్షణకి శీతాకాలానికి మించిన సీజన్ మరొకటి ఉండదు. అందుకే పాఠశాలలు సైతం ఈ సీజన్‌లో విజ్ఞాన విహారయాత్రలకి మొగ్గుచూపుతున్నాయి.

అనేక జీవ‌రాశులు, వృక్షరాశులు ఈ అడవుల సొంతం
విజ్ఞాన విహారయాత్రలు అంటే విద్యార్థులు అమితంగా ఇష్టపడతారు. ఎందుకంటే ఈ విహారయాత్రలలో వినోదంతో పాటు విజ్ఞానం పొందే అవకాశం ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ‌కు స‌మీపంలో ఉన్న మ‌డ అడ‌వుల ప్రాంతం విహారయాత్ర కేంద్రంగా బాగా అభివృద్ధి చెందుతోంది. అనేక జీవ‌రాశులు, వృక్షరాశుల‌ గురించి తెలసుకోవడానికి ఈ ప్రాంతం ఉపయోగపడుతోంది.

విద్యార్థుల రాకతో సందడిగా మారిన మడ అడవుల ప్రాంతం
ఇక ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి త‌ర‌లివ‌స్తున్నారు. తొమ్మిదో త‌ర‌గ‌తి విద్యార్థులంద‌రినీ విహారయాత్రల‌కు తీసుకెళ్లి ఆ ప్రాంతంలో ప్రత్యక్ష అనుభ‌వాల‌కు ప్రాధాన్యత‌నివ్వాల‌ని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా నిధుల కేటాయింపు కూడా జ‌రిగింది. దీంతో పాఠశాల యాజమాన్యాలు పిల్లల‌ను తీసుకుని మ‌డ అడ‌వుల‌కు క్యూ క‌డుతున్నాయి. మ‌డ అడ‌వుల మూలంగా పిల్లలకు ఆనందం, ఆధ్యాయ‌నం రెండూ ఏక‌కాలంలో దొరకుతున్నట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు మ‌డ అడ‌వుల ప్రాంతంలో కార్తీకమాసం సంద‌డి కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

ప్రొ.లక్ష్మికి 29 వరకు రిమాండ్...

గుంటూరు: మెడికల్ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ లక్ష్మికి గుంటూరు పోలీసులు రిమాండ్ విధించారు. లక్ష్మితో పాటు ఆమె భర్త విజయ్ సారథి, కుమారుడు ప్రవీణ్ కు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం వారిని గుంటూరు జైలుకు తరలించారు. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న లక్ష్మిని సోమవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే..

ఆలయాల హుండీల్లో చిల్లరను బ్యాంకుల్లో జమచేయండి....

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఆలయాల హుండీల్లోని చిన్న నోట్లు, చిల్లరను తక్షణం బ్యాంకుల్లో జమ చేయాలని కేంద్రం ఆదేశించింది. భక్తులు సమర్పించే చిల్లరను బ్యాంకుల్లో జమచేయాలని ఆలయ ట్రస్టులను ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ ఆదేశించారు.

16:33 - November 15, 2016

గుంటూరు : మెడికో సంధ్యారాణి ఆత్మహత్య కేసులో అరెస్టైన ప్రొపెసర్ లక్ష్మీని పోలీసులు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. నిందితులను ఏయే సెక్షన్ల కింద అరెస్ట్‌ చేశారో.. రిమాండ్‌ రిపోర్టులో పేర్కొనాలంటూ మేజిస్ట్రేట్‌ పోలీసులను ఆదేశించారు. నిందితులందరికీ సెక్షన్‌ 306 ఎలా వర్తిస్తుందో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. కాగా అంతకు ముందు ప్రొఫెసర్ లక్ష్మిని... పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.సంధ్యారాణి ఆత్మహత్యతో తనకెలాంటి సంబంధం లేదని.. తాను ఏ తప్పు చేయలేదని చెబుతోంది ప్రొఫెసర్‌ లక్ష్మి. సంధ్యారాణికి గైనకాలజీ చదవడం ఇష్టం లేకపోయినా.. భర్త ఒత్తిడి వల్ల చదువుతోందని.. అది కూడా ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని చెబుతోంది. మెడికో సంధ్యారాణి కేసులో ప్రొఫెసర్ లక్ష్మిని పోలీసులు మీడియా ఎదుట హాజరుపరిచారు. చట్టం నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని లక్ష్మి, ఆమె భర్త విజయసారథి దేశంలోని 16 ప్రాంతాల్లో తలదాచుకున్నారని గుంటూరు రేంజ్ ఐజీ తెలిపారు. వారిద్దరినీ నిన్న బెంగళూరులో అరెస్టు చేశామన్నారు. వీరికి కోటక్ మహేంద్ర బ్యాంక్ ఉద్యోగి ప్రవీణ్ సహకరించారు.

గజదొంగ అబిద్ అహ్మద్ అరెస్ట్....

హైదరాబాద్ : ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న గజదొంగను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. గజదొంగ అబిద్ అహ్మద్ సైబరాబాద్ పరిధిలోని మేడిపల్లి, ఉప్పల్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, కుషాయిగూడ, మల్కాజ్‌గిరిలో నిందితుడిపై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిందితుడి నుంచి కిలో బంగారం, 20 తులాల వెండి, రూ. 2.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు

బాలికపై హైకోర్టు న్యాయవాది కుమారిడి ఘాతుకం...

హైదరాబాద్ : చైతన్యపురి గ్రీన్ హిల్స్ కాలనీలో బాలికపై హైకోర్టు న్యాయవాది కుమారుడు భరత్ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. 2 నెలల గర్భం దాల్చిన బాలిక చైతన్యపురి పీఎస్ లో బాలిక, మహిళా సంఘాలు ఫర్యాదు చేశారు.

జీహెచ్ ఎంసీ వసూళ్లలో తగ్గని జోరు...

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ వసూళ్లలో జోరు తగ్గలేదు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు రూ.4,74 కోట్లు వసూలయ్యింది. ఆస్తిపన్ను రూ.2.33 కోట్లు, ఎల్ ఆర్ ఎస్ రూ.2.41 కోట్లు వసూలయినట్లు సమాచారం.

సెనారి హత్యాకాండ కేసులో 10 మంది మరణశిక్ష

పాట్నా : బీహార్ లోని సెనారి హత్యాకాండ కేసులో 10 మంది దోషులకు జహనాబాద్ కోర్టు మరణ శిక్ష ఖారారు చేసింది. మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. 1999 మార్చి 18న కుల తగాదాల్లో 34 మంది ఊచకోతకు కేసులో ఈ తీర్పు వెలువడింది.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై :నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 514 పాయింట్లు వద్ద, నిఫ్టీ 188 పాయింట్ల వద్ద ముగిశాయి.

ప్రత్యేక హోదా చెల్లని పెద్ద నోట్ల వంటిది : సుజనా చౌదరి

హైదరాబాద్ : కేంద్ర మంత్రి సుజనా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా చెల్లని రూ.500, 1000 నోట్ల వంటిదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనవరి తర్వాత ప్రత్యేక హోదా చెల్లని నోట్లతో సమానమని, ఉనికి కోసమే ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా నాటకం ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్లానింగ్ కమిషన్ రద్దు చేసినా ప్రత్యేక హోదాను పవన్ కల్యాన్ పట్టుకోవడం లో అర్థం లేదన్నారు.

16:01 - November 15, 2016

విజయవాడ : విజయవాడలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు సుజనా చౌదరి,అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం చెల్లని రూ.500, రూ.1000 నోట్లు లాంటిదేనని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అంశంపై పట్టుబడితే ఎటువంటి లాభం ఉండదన్నారు. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ కు చట్టబద్ధత కోసం శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో పట్టుబడతామని తెలిపారు.పోలవరం ప్రాజెక్టు నిధులు.. విశాఖ రైల్వే జోన్ అంశానికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. మరో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, రూ.2 వేల నోట్ల చలామణిపై కేంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. నోట్ల రద్దు వల్ల ఏర్పడిన సమస్యలను పార్లమెంటులో చర్చిస్తామన్నారు.

15:53 - November 15, 2016

హైదరాబాద్ : కాపునేత ముద్రగడ పద్మనాభం యాత్రను అడ్డుకోవాలన్న...మేడ శ్రీనివాస్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతిపౌరుడికి ఉంటుందని... పాదయాత్రను అడ్డుకునేలా తీర్పు ఇవ్వలేమని స్పష్టం చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉందని తెలిపింది.

15:46 - November 15, 2016

హైదరాబాద్‌ : బ్యాంకుల, ఏటీఎంల వద్ద కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నగరంలో పలు బ్యాంకులకు ఇంకా 2వేల, 100 రూపాయల నోట్లు... అందలేదు. దీంతో పలు ప్రాంతాల్లో సిబ్బందితో ప్రజలు వాగ్వాదానికి దిగుతున్నారు. ఆర్బీఐ నుంచి తమకు డబ్బులు రావడం లేదని బ్యాంకు మేనేజర్లు చెబుతున్నారు. మరోవైపు మారేడ్ పల్లి ఆంధ్రాబ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చిన... రిైటర్డ్ ప్రభుత్వ ఉద్యోగి లక్ష్మీనారాయణ గుండెపోటుతో మృతిచెందారు.

15:41 - November 15, 2016
15:40 - November 15, 2016

ఉక్రెయిన్‌ : పార్లమెంట్‌ రణరంగంగా మారింది. పార్లమెంట్‌లో ఎంపీలు ఒలెగ్‌ ల్యాష్కో, యురీ బోక్యో విచక్షణారహితంగా కొట్టుకున్నారు. యురీ బోక్యోని ఒలెగ్‌ ల్యాష్కో విమర్శించడంతో ఆగ్రహించిన యురీ బోక్యో అతనిపై పిడిగుద్దులు కురిపించాడు. పక్కనే ఉన్న మిగతా సభ్యులు అతడిని అదుపు చేయడంతో గొడవ సద్దుమణింది. ఉక్రెయిన్‌ ఎంపీలు పార్లమెంట్‌లో కొట్టుకోవడం ఇదే తొలిసారి కాదు. 2014లో ఎమ్‌హెచ్‌17 విమానం కూలిపోయిన ఘటన విషయంపైనా ఎంపీలు పార్లమెంట్‌లోనే కొట్టుకున్నారు. 

15:37 - November 15, 2016

విజయవాడ : రాయలసీమలో బలిజలను వైఎస్సార్‌, ఆయన తనయుడు వైఎస్ జగన్‌ తీవ్రంగా అణచివేశారని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఆరోపిస్తున్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను దెబ్బతీసే విధంగా వైసీపీ కుట్ర చేస్తుందని మండిపడుతున్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ బలిజ శంఖారావానికి శ్రీకారం చుట్టారు. రేపు ఉదయం కడప జిల్లాలోని గండి క్షేత్రం నుంచి 5 రోజులపాటు పాదయాత్ర చేపట్టనున్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్, ముద్రగడ పద్మనాభంల కుట్రను ఎండగడుతామని ఈ సందర్భంగా రామానుజ తెలిపారు. 

15:29 - November 15, 2016

సంగారెడ్డి : పాతనోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి బ్యాంకుల వద్దే నిరీక్షిస్తున్నారు. సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం సంగారెడ్డి ఎస్‌బీహెచ్‌ బ్యాంకు వద్ద ఉదయం నుండి జనాలు బారులు తీరి నిలబడ్డారు. గత నాలుగు రోజుల నుండి ఇదే పరిస్థితి నెలకొందని ఖాతాదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రత్యేక ప్యాకేజీ కి చట్టబద్ధతపై పట్టుబట్టండి: చంద్రబాబు

హైదరాబాద్: ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధతపై పార్లమెంట్ లో పట్టుబట్టాలని టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించినట్లు సమాచారం. కొద్ది సేపటి క్రితం ముగిసి సమావేశంలో రేపు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ప్యాకేజీ చట్టబద్ధత గురించి అడగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అత్యధిక లభిద్దని రాబట్టడమే లక్ష్యంగా పని చేయాలని టిడిపి ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించినట్లు సమాచారం.

15:25 - November 15, 2016

హైదరాబాద్ : అమెరికా ఎంపీల బృందం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను తెలంగాణ సచివాలయంలో కలిసింది. రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టే అంశాల గురించి కేటీఆర్‌తో చర్చించింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను కేటీఆర్‌ వారికి వివరించారు. అమెరికాలో ఏర్పాటు చేయనున్న స్టేట్ డెస్క్, టి బ్రిడ్జ్‌ కార్యక్రమం గురించి ఎంపీల బృందం కేటీఆర్‌తో చర్చించింది.

మారేడ్ పల్లి ఆంధ్రాబ్యాంక్ లో విషాదం

సికింద్రాబాద్ : మారేడ్ పల్లి ఆంధ్రాబ్యాంక్ లో విషాదం చోటు చేసుకుంది. డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి లక్ష్మీనారాయణ గుండె పోటుతో మృతి చెందారు.

15:20 - November 15, 2016

కృష్ణా : జిల్లా నందిగామ నెహ్రూ సెంటర్‌లో రిటైర్డ్‌ ఏఎస్సై వెంకటేశ్వరరావుపై కత్తులతో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో రిటైర్డ్‌ ఏఎస్సై వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా కుటుంబ కక్షలతోనే వెంకటేశ్వరావుపై దాడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. 

15:18 - November 15, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రానికి ఆదాయం పెరిగింది కానీ తగ్గలేదన్నారు. కేంద్ర నిర్ణయం టీఆర్‌ఎస్‌ శ్రేణులకు నష్టం కలిగించివుండొచ్చేమో కానీ ప్రజలకు కాదన్నారు. పంటల ద్వారా వచ్చిన ఎంత సొమ్మైనా రైతులు ఏ బ్యాంకులోనైనా నిర్భయంగా జమచేసుకోవచ్చని అందుకు తాను అండగా నిలబడతాన్నారు. 

15:16 - November 15, 2016

గుజరాత్ : నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్లు రద్దు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి ఆయన తల్లి హీరాబెన్‌ మద్దతు ప్రకటించింది. 90 ఏళ్ల హీరాబెన్‌ పెద్దనోట్ల మార్పిడికి కోసం స్వయంగా బ్యాంక్‌కి వెళ్లారు. గుజరాత్‌లోని గాంధీనగర్లో ఉన్న అహ్మదాబాద్‌ బ్యాంక్‌కి వెళ్లి ఆమె క్యూలో నిలబడి నోట్లను మార్చుకున్నారు. 

పెద్ద నోట్ల రద్దుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. విత్ డ్రా లిమిట్ ను పెంచాలని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది.

ముద్రగడ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రేపటి నుంచి ప్రారంభించనున్న పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన పాదయాత్రకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ ప్రభుత్వం చెబుతోన్న వాదన సరికాదని పేర్కొంది. అయితే శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపుకోవచ్చని, శాంతి భద్రతల సమస్యలను పోలీసులే చూసుకోవాలని తెలియజేసింది.

15:11 - November 15, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుతో ప్రజల కష్టాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల ఎటిఎంల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్‌ బ్యాంకుల వద్ద క్యూలైన్లు పెరిగినట్లు గుర్తించినట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బ్యాంకులోకి నకిలీ నోట్లు రాకుండా టాస్క్‌ఫోర్స్‌ పరిశీలిస్తోందన్నారు. రద్దీని తట్టుకునేందుకు మైక్రో ఎటిఎంల ఏర్పాటు చేయనున్నట్లు శక్తికాంతదాస్‌ చెప్పారు. బ్యాంకుల వద్ద ఒకసారి నోట్లు మార్చుకున్నవారు పదే పదే బ్యాంకులకు రాకుండా ఉండేందుకు వారి వేలుపై సిరా గుర్తు వేస్తారని ఆయన స్పష్టం చేశారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు కొందరు జన్‌ధన్‌ బ్యాంకు అకౌంట్లను వాడుకుంటున్నారని ఈ ఖాతాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జన్‌ధన్ ఖాతాదారులు వారికి అవకాశం ఇవ్వొద్దని సూచించారు. కొందరు బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తారన్న వదంతులు నమ్మెద్దని ప్రజలకు సూచించారు. బ్యాంకుల్లో తగినంత డబ్బు అందుబాటులో ఉందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు.

మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్

హైదరాబాద్: ప్రతీకారంతో రగిలిపోతున్న పాకిస్థాన్ జమ్ముకాశ్మీర్ లోని సుందర్ బనీ సెక్టార్ లో మళ్లీ కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల కాల్పులను భారత్ జవాన్లు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. మరోవైపు పాకిస్థాన్ భద్రతా దళాలతో ఆదేశ ప్రధాని భేటీ అయి సరిహద్దులోని పరిస్థితి పై సమీక్షిలు జరుపుతున్నట్లు సమాచారం.

14:57 - November 15, 2016

ఢిల్లీ : ఐదు వందలు, వెయ్యి నోట్ల రద్దుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నగదు మార్పిడి, ఉపసంహరణకు సంబంధించి ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. పెద్దనోట్ల రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. బ్యాంకులు, ఏటీఎంల వల్ల రద్దీ నియంత్రణకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కోరింది. నవంబర్‌ 25లోగా దీనిపై జవాబివ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లకుబేరులకు తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ సుప్రీం కోర్టుకు తెలియజేశారు.

 

14:28 - November 15, 2016

మెగా ఫ్యామిలీ అభిమానం వల్ల సూర్య వెనక్కి తగ్గక తప్పలేదు. ఎవ్రీథింగ్ రెడీ చేసుకున్న ఈ కోలీవుడ్ స్టార్ కి లాస్ట్ మినిట్ లో మెగాషాక్ తగిలింది. దీంతో మెగా ఫ్యామిలీ లవ్ సూర్య పాలిట శాపంగా మారిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ మెగా కాంపౌండ్ వల్ల సూర్యకు కలిగిన ఇబ్బంది ఏంటో ఇప్పుడు చూద్దాం....
24మూవీతో సూర్య హిట్టు ట్రాక్
ఆఫ్టర్ లాంగ్ టైం 24మూవీతో సూర్య హిట్టు ట్రాక్ ఎక్కాడు. సక్సెస్ ఊపులో ఉన్న ఈ స్టార్ బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ కొట్టాడానికి రెడీ అయ్యాడు. సింగం సిరిస్ లో భాగంగా రానున్న సూర్య కొత్త చిత్రం సింగం3 రిలీజ్ కి సిద్దమైంది. ఈ మూవీని డిసెంబర్ 9 రిలీజ్ చేయడానికి అంతాసిద్దమైంది. కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ అభిమానం వల్ల ఈ రిలీజ్ డేట్ ఛేంజ్ అయినట్లు వినికిడి.
సింగం3 డిసెంబర్ 16కి పోస్ట్ పోన్ 
మ్యాటర్ ఏంటంటే డిసెంబర్ 9 రిలీజ్ కావాల్సిన సింగం3 డిసెంబర్ 16కి పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. ఇందుకు రామ్ చరణ్ ధృవ సినిమానే మొయిన్ రిజన్ అనేది ఒపెన్ సీక్రెట్. ధృవ డిసెంబర్ 2 రిలీజ్ అవుతుంది. అందుకే రెండు వారాలా గ్యాప్ ఇచ్చి సింగం3తో రావాలని సూర్య ప్లాన్ చేసుకుంటున్నాడట. అంతేకాదు అవసరమైతే ఈ చిత్రం రిలీజ్ మరో వారం డీలే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 
సింగం3...తెలుగు, తమిళంలో రిలీజ్ కి ప్లాన్ 
సింగం3 ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళంలో రిలీజ్ కి ప్లాన్ చేశారు. సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ధృవకు పోటీగా వస్తే రెండు సినిమాలు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే సూర్య,అల్లుఅరవింద్ మాట్లాడుకుని మరీ ఈ డిసిషన్ తీసుకున్నారట. సూర్యకు అల్లు అరవింద్ అన్నా మెగా ఫ్యామిలీ అన్నా ఎనలేని రెస్పెక్ట్. ఎందుకంటే గజని సినిమాను ప్రమోట్ చేసి సూర్యకు తెలుగు మార్కెట్ క్రియేట్ చేసిందే అల్లుఅరవిందే. ఈ అభిమానం వల్లే ఈ కోలీవుడ్ స్టార్ తన సినిమా రిలీజ్ కి వాయిదా వేసుకున్నాడు. 

 

14:22 - November 15, 2016

శ్రద్ధాకపూర్ రికార్డ్స్ కి బ్రేక్ పడింది. ఈ బ్యూటీ జడ్జిమెంట్ ఈసారి పని చేయలేదు. అనుకోని షాక్ తో ఈ యూత్ డ్రీమ్ గాళ్ డిస్పాయింట్ అయింది. ఏ విషయంలో శ్రద్దాకపూర్ జడ్జిమెంట్ మిస్ ఫైర్ అయిందో హావ్ ఏ లుక్.
హిట్టు ట్రాక్ కి బ్రేక్ 
బాలీవుడ్ లో వరుసగా హిట్స్ ఉన్న హీరోయిన్ శ్రద్ధా కపూర్.  ఈ బ్యూటీ హీరోయిన్ గా అరంగేట్రం చేసిన తర్వాత ఇప్పటి వరక ఫ్లాప్ అన్నదే ఎదురు కాలేదు. వరుసగా తను చేసిన సినిమాలు అన్ని బాక్సఫీసు వద్ద సూపర్ కలెక్షన్లు సాధించాయి. ఇలా నాలుగేళ్లుగా ఓటమి ఎరుగని హీరోయిన్ గా శ్రద్దా బాలీవుడ్ లో హవా సాగిస్తుంది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ హిట్టు ట్రాక్ కి బ్రేక్ పడింది. 
శ్రద్ధాకపూర్ జడ్జిమెంట్ వర్కవుట్ కాలేదు..
ఆషికి2 తో మొదలైన శ్రద్ధ విజయ విహారం గోరి తేరి ప్యార్ మే, ఏక్ విలన్,హైడర్, ఉంగ్లీ,ఏబీసీడీ2, బాఘీ వరకూ కంటిన్యూ అయింది. వీటిలో ఒకట్రెండ్ సినిమాలకు రివ్యూలు తేడా వచ్చినా కలెక్షన్స్ మాత్రం కుమ్మేశాయి. కానీ ఇప్పుడు రాక్ఆన్2 ఈ రికార్డును బ్రేక్ చేసేసింది. ఈ మూవీ విషయంలో శ్రద్ధాకపూర్ జడ్జిమెంట్ వర్కవుట్ కాలేదు. 
కేవలం 7కోట్లు మాత్రమే కలెక్ట్ 
నాలుగు కిందట రిలీజైన ఈ మూవీకి తొలి వీకెండ్ లో కేవలం 7కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మొదటి రోజు 2కోట్లు,రెండో రోజు 2.41 కోట్లు, మూడో రోజు ఆదివారం నాడు 2.58 కోట్లు మాత్రమే వచ్చాయి. రాక్ఆన్ లాంటి క్రేజీ మూవీకి సీక్వెల్ కి ఫస్ట్ వీకెండ్ లో కేవలం7 కోట్ల వసూల్ కావడం అంటే భారీ ఫ్లాప్ కింద లెక్క. ఇంత డల్ కలెక్షన్లు ఉండటానికి కేంద్ర తీసుకున్న పెద్ద నొట్ల రద్దు ప్రభావం కూడా బాగానే పనిచేసింది. అలా అని సినిమా రివ్య్వూస్ కూడా ఏమంత గొప్పలేవు.  రాక్ ఆన్ 2 ప్లాప్ శ్రద్దాకపూర్ సక్సెస్ హవా బ్రేక్ వేసింది.

 

14:20 - November 15, 2016

ఆలయాల్లోకి మహిళకు ప్రవేశం కల్పించాలని వక్తలు అన్నారు. 'దేవాయల్లోకి మహిళకు ప్రవేశం' అంశంపై మానవి మైరైట్ ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహిచింది. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి, శరాద పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన ఆ విషయాలను వారి మాటల్లోనే..
'మొదట ఆమ్మోరుకు ఆరాధన చేశారు. మగవారికి నిశిద్ద ప్రదేశంగా ఉండేది. ఒకప్పుడు ఆడ పూజారులు ఉన్నారు. ఎర్ర చీర స్త్రీ రుతస్రావానికి ప్రతీక. ఎరుపు శుభం కింద తయారైంది. క్రమేణా మగ పూజారులు తయారయ్యారు. మగ పూజారులు ఎర్ర చీరలు కట్టుకుని పూజలు చేస్తున్నారు. నాడు మగవారిని ఆలయాల్లోకి ప్రవేశం లేదు. నేడు ఆడవారికి ప్రవేశం లేదు. ఇది ఉల్టా సమాజం' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

14:11 - November 15, 2016
14:03 - November 15, 2016

వికారాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర 30వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. ఈమేరకు టెన్ టివితో గిరిజన విద్యార్థి సంఘం నేత శోభన్ నాయక్ మాట్లాడారు. తండాలను గ్రామ పంచాయితీలను చేస్తానన్న ఎన్నికల హామీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని గిరిజన విద్యార్థి సంఘం నేత శోభన్ నాయక్ అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:59 - November 15, 2016

ఢిల్లీ : విభజన హామీలను పరిష్కరించాలని టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై పార్లమెంటులో ప్రస్తావిస్తామని తెలిపారు. అసెంబ్లీ సీట్ల సంఖ్యపై మాట్లాడుతామన్నారు. ఇటు పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:54 - November 15, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌  నేత ఉండవల్లి చెప్పారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నల్లధనం బంగారం రూపంలోకి మారుతోందన్నారు. రూ.2 వేల కోట్లతో బ్లాక్ మనీ పెరుగుతుందని చెప్పారు. ఎక్సైజ్ ఆదాయం 35 శాతం పడిపోయిందని తెలిపారు. దేశంలో 3 కోట్ల మంది ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని తెలిపారు. నల్లధనం ఉన్నవాళ్లు ఎవరూ బ్యాంకులకు వెళ్లడం లేదన్నారు. నల్లధనం అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చెప్పినట్లుగా.. విదేశాల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల అకౌంట్లను కేంద్రం జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ నిర్ణయం ప్రధాని మోడీ తీసుకున్నట్లయితే దేశమంతా ఆయన్ను కీర్తించేవారన్నారు. కొందరి ప్రయోజనాల కోసం అందరినీ ఇబ్బంది పెట్టడం సబబు కాదన్నారు. 

 

 

 

బాక్సైట్ తవ్వకాల పై హైకోర్టును ఆశ్రయించిన గిరిజనులు

విశాఖ : ఏజెన్సీలోని బాక్సైట్ తవ్వకాల లీజ్ ఇవ్వడంపై హైకోర్టులో గిరిజనులు పిటిషన్ దాఖలు చేశారు. గిరిజనులు భూములను సంస్థలకు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వం వాదించింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేసి లిఖిత పూర్వకంగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు విచారణ మూడు వారాల వరకు వాయిదా వేసింది.

మార్చి వరకు పాత నోట్లతో పన్నులు చెల్లించాలి : ఎంపి జితేందర్ రెడ్డి

ఢిల్లీ : నోట్ల రద్దు పై ప్రజలు ఆందోళనలో ఉన్నారని ఎంపి జితేందర్ రెడ్డి అన్నారు. నల్లధనాన్ని వెలికితీసే పనిని స్వాగతిస్తున్నామని... కానీ అర్థాంతరంగా తీసుకున్న నిర్ణయం వల్ల దేశ జీడీపీ పై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. మార్చి వరకు పాత నోట్లతో పన్నులు చెల్లించేలా అంగీకరించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తెలంగాణలో రిజిస్ర్టేషన్లు ఆగిపోయాయని, రాష్ట్ర ఆదాయంపై పెద్ద నోట్ల ప్రభావం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు విభజన చట్టం అమలు అంశాలపై మాట్లాడేందుకు టీఆర్ ఎస్ కు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరనున్నట్లు తెలిపారు.

13:27 - November 15, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దుతో ప్రజలు చిల్లర లేక ఇబ్బందులు పడుతున్నారని... తక్షణమే చిల్లరను అందుబాటులోకి తీసుకురావాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు.ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయం బాబుకి ముందుగానే లీకైందని ఆరోపించారు. చంద్రబాబు ఆయన కుటుంబం, మంత్రులు.. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడడానికే విదేశాలకు వెళ్లారని ఆరోపించారు. రాష్ట్రంలో తాగడానికి మంచి నీరు లేదు కానీ మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. రెండు రూపాయలకు వాటర్ ఇస్తామన్నారు కానీ... మందు బాటిళ్లు ఇస్తున్నారని విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం తీర్మాణం చేస్తే ఎందుకు హోదా  ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 'మీ లేఖకు, మీ సంతకానికి విలువ లేదు అని చంద్రబాబును ఉద్ధేశించి మాట్లాడారు. వీధి వీధికి ఒక వైన్ షాపును ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకునే విధంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ప్రతి చోట ర్యాగింగ్ ఉదృతం అయిందన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి టీడీపీ నేతపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఆయనపై చర్యలు తీసుకుని ఉంటే అధికారులపై దాడులు పునరావృత్తం అయ్యేవి కావని తెలిపారు. పోలీసు వ్యవస్థ అండగా ఉందని ఇష్టమొచ్చినట్లగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

సంధ్యారాణి ఆత్మహత్య దురదృష్టకరం: ప్రొ.లక్ష్మి భర్త

గుంటూరు : మెడికో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య దురదృష్టకరమని ప్రొ.లక్ష్మి భర్త విజయసారధి తెలిపారు. నిన్న బెంగుళూరు అరెస్టు చేసి గుంటూరులో నేడు మీడియా ముందు ప్రొఫెసర్ లక్ష్మి, ఆమె భర్తను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా లక్ష్మి భర్త మాట్లాడుతూ బెయిల్ వస్తుందన్న ఆశతో కొన్నాళ్లు ఇతర ప్రాంతాల్లో గడిపామని విజయసారధి తెలిపారు. న్యాయ విచారణకు తమ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

తక్షణమే చిల్లర అందుబాటులోకి తీసుకురండి: రోజా

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో చిల్లర లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... తక్షణమే చిల్లర అందుబాటులోకి తీసుకురావాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. నోట్ల రద్దు నిర్ణయం బాబుకు ముందుగానే లీకైందని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పోరుతోందని మండిపడ్డారు.

సిండికేట్ బ్యాంక్ క్లర్క్ మల్లేష్ కు రిమాండ్

హైదరాబాద్ : సిండికేట్ బ్యాంక్ క్లర్క్ మల్లేష్ ను సరూర్ నగర్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా కమలానగర్ సిండికేట్ బ్యాంక్ లో రూ.6లక్షలు మార్పిడి కేసులో మల్లేష్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

13:00 - November 15, 2016
12:59 - November 15, 2016

గుంటూరు : మెడికో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టమైన సంఘటన అన్నారు ప్రొఫెసర్‌ లక్ష్మి భర్త డాక్టర్‌ విజయసారథి. చట్టంపై గౌరవం ఉన్నప్పటికీ ముందస్తు బెయిల్‌ వస్తుందన్న ఆశతో కొన్నాళ్లు ఇతర ప్రాంతాల్లో గడిపినట్లు తెలిపారు. తమ కుటుంబ సభ్యులు న్యాయ విచారణకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

 

తిరుమలలోని హోటళ్లలో అధిక ధరల వసూళ్లపై విచారణ

తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని హోటళ్లలో అధిక ధరల వసూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో 3 వారాల్లో నివేదిక దాఖలు చేయాలని టీటీడీకి హైకోర్టు అదేశించింది.

12:57 - November 15, 2016

చిత్తూరు : పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుపతిలో వైసీపీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. భూమన కరుణాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. 500, 1000 నోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భూమన అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

రిటైర్డ్ ఏఎస్ఐ పై కత్తులతో దాడి స్పాట్ డెడ్

కృష్ణా : నందిగామ నెహ్రూ సెంటర్ లో రిటైర్డ్ ఏఎస్సై వెంకటేశ్వరరావుపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఏఎస్సై అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ముద్రగడ పాదయాత్రపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ రోజు మధ్యాహ్నాం 1.30కి వాయిదా వేసింది.

మళ్లీ మళ్లీ వస్తున్నారు : శక్తికాంత్ దాస్

ఢిల్లీ : ఒకసారి బ్యాంక్ కు వచ్చిన వాళ్లే మళ్ళీ మళ్ళీ వస్తున్నారని... ఒకసారి నగదు మార్చుకున్న వారి వేలికి పై ఇంక్ మార్క్ వేస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ హెచ్చరించారు. పెద్ద నగరాల్లో నేటి నుంచే ఇంక్ మార్క్ అమల్లోకి వస్తుందని తెలిపారు. జన్ ధన్ ఖాతాల్లో నల్లధనం డిపాజిట్ చేస్తున్నారని, ఇకపై జన్ ధన్ అకౌంట్ల పై నిఘా పెడుతున్నట్లు ప్రకటించారు. బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు వెళ్తారనే తప్పుడు ప్రచారం జరుగుతోందని... అలాంటిది ఏమీ లేదని శక్తికాంత్ దాస్ తెలిపారు.

12:45 - November 15, 2016

గుంటూరు : మెడికో స్టూడెంట్ సంధ్యారాణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ లక్ష్మి దంపతులను బెంగళూరులో అరెస్ట్‌ చేసి గుంటూరుకు తీసుకొచ్చారు. ఇవాళ మీడియా ముందు హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొ.లక్ష్మీ సహా ఆరుగురిని అరెస్టు చేశామని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రామన్న పేటలో రైతుల ఆందోళన

యాదాద్రి : రామన్న పేటలో సహకార బ్యాంక్ ఎదుట రైతుల ఆందోళన చేపట్టారు. రూ.500, 100 నోట్లు బ్యాంకు సిబ్బంది తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

12:37 - November 15, 2016

కాకినాడ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మూలిగేనక్కపై తాటిపండు పడిన చందంగా మారిందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నోట్ల సమస్యతో రబీ సాగు డోలాయమానంలో పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త కరెన్సీ చాలినంతగా అందుబాటులోకి రాకపోవడంతో పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడంలేదు. నగదు సమస్యలో గోదావరి జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై 10 టీవీ ప్రత్యేక కథనం... 
రబీ కష్టాలు 
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రైతన్నకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సాగుచేసిన ఖరీఫ్‌ పంట ఇంకా చేతిరాలేదు. ఉన్నసొమ్ముతోపాటు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి పంటలు సాగు చేశారు. రబీ సీజన్‌ ప్రారంభమైన సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో అన్నదాతలను దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేసింది. 
చేతిలో చిల్లిగవ్వ లేదు 
చేతిలో చిల్లిగవ్వ లేదు. బ్యాంకులన్నీ ఇప్పడు పాత నోట్ల మార్పిడి, డిపాజిట్లపైనే దృష్టి పెట్టాయి. రుణాల జారీవైపు తొంగిచూసే అవకాశం కూడా లేకుండా పోయింది. అప్పో చొప్పో చేసి రబీ పైర్లు సాగుచేద్దామన్న ఎవరి దగ్గరా డబ్బులులేవు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిద్దామన్నా.. వీరి దగ్గరా పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో ఏమిచేయాలో పాలుపోని స్థితిలో రైతులు దిగాలుగా చూస్తున్నారు. 
రబీపైనే రైతులు ఆశలు 
గోదావరి డెల్టాలో ఖరీఫ్‌ సాగు కంటే రబీపైనే రైతులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్‌లో   అకాల వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటే  చేతికొచ్చిన పంట నోటికందకుండా పోతుందన్న భయం అన్నదాతలను వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో రబీపై కూడా ఆసలు సన్నగిల్లుతున్నాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది. కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పాత కరెన్సీ చలామణి గడువు పెంచాలి 
పెద్ద నోట్ల రద్దుతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పాత కరెన్సీ చలామణి గడువును పెంచాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయంతో  అందరికీ సమస్యలు వచ్చిపడ్డాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది. సమస్యలను సృష్టించిన కేంద్రమే దీనికి సత్వర పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. 

 

ముద్రగడ పాదయాత్ర షెడ్యూల్ విడుదల

తూ.గో : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేశారు. రావుల పాలెం నుంచి వానపల్లి వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. మరో వైపు ముద్రగడ పాదయాత్రకు ప్రభుత్వ అనుమతి లేదని హోం మంత్రి చినరాజప్ప స్పష్టం చేయడంతో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కాపు నేతలు ఆరోపించారు.

వివిధశాఖల ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ భేటీ

హైదరాబాద్: వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ రీజీవ్ శర్మ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆదాయం, రాబడి, ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం. 

2వేల నోట్ తో బ్లాక్ మనీ పెరుగుతుంది : ఉండవల్లి

హైదరాబాద్ : 2 వేల నోట్ తో బ్లాక్ మనీ పెరుగుతుందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్డాడుతూ...ఎక్సైజ్ ఆదాయం 35 శాతం పడిపోయిందని, పెద్ద నోట్ల రద్దు వల్ల సమాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లధనం ఉన్నవారు ఎవరూ బ్యాంకులకు రావడం లేదని, నల్లధనం బంగారం రూపంలోకి మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

12:32 - November 15, 2016
11:39 - November 15, 2016

చెన్నై: తమిళ సినీ నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) సభ్యత్వం నుంచి నటుడు, నిర్మాత విశాల్‌ను తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు టీఎఫ్‌పీసీ వెల్లడించింది. ఈ మేరకు నిర్మాతల మండలి సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిర్మాతల మండలి చర్యపై విశాల్‌ స్పందిస్తూ... నిర్మాతలను కించపరిచే విధంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, మండలి నుంచి తనను తొలగించడాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. నిర్మాతల సంక్షేమాన్నే తాను కోరుకుంటానని, రాబోయే నిర్మాతల మండలి ఎన్నికల్లో తమ వర్గం బరిలోకి దిగుతుందని విశాల్‌ వెల్లడించారు.

10:50 - November 15, 2016

గుంటూరు : మెడికో స్టూడెంట్ సంధ్యారాణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ లక్ష్మి దంపతులను బెంగళూరులో అరెస్ట్‌ చేసి గుంటూరుకు తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియా ముందు హాజరుపర్చనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మీడియా ముందుకు ప్రొ.లక్ష్మి దంపతులు

గుంటూరు : మెడికో స్టూడెంట్ సంధ్యారాణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ లక్ష్మి దంపతులను బెంగళూరులో అరెస్ట్‌ చేసి గుంటూరుకు తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియా ముందు హాజరుపర్చనున్నారు. 

10:46 - November 15, 2016

హైదరాబాద్ : చిలర కొరత ప్రభావం తెలుగు రాష్ట్రాల ఉల్లి మార్కెట్లను తాకింది. వారం రోజులుగా కర్నూలు మార్కెట్‌లో ఉల్లి విక్రయాలు నిలిచిపోయాయి. నేటి నుంచి హైదరాబాద్‌ మలక్‌పేట మార్కెట్‌లో ఉల్లి క్రయ విక్రయాలు నిలిపివేయనున్నారు. చిల్లర కొరతతో ట్రేడర్స్‌ మార్కెట్ బంద్‌ పాటిస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులు, సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఉల్లి మార్కెట్లపై చిల్లర కొరత ప్రభావం

హైదరాబాద్ : చిలర కొరత ప్రభావం తెలుగు రాష్ట్రాల ఉల్లి మార్కెట్లను తాకింది. వారం రోజులుగా కర్నూలు మార్కెట్‌లో ఉల్లి విక్రయాలు నిలిచిపోయాయి. నేటి నుంచి హైదరాబాద్‌ మలక్‌పేట మార్కెట్‌లో ఉల్లి క్రయ విక్రయాలు నిలిపివేయనున్నారు. చిల్లర కొరతతో ట్రేడర్స్‌ మార్కెట్ బంద్‌ పాటిస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులు, సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. 

 

10:43 - November 15, 2016

హైదరాబాద్ : మాదిగ రిజర్వేషన్ల కోసం అవసరమైతే కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మాదిగల రిజర్వేషన్‌ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు మంత్రి. హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన మాదిగ శక్తి ప్రదర్శన సభలో పాల్గొన్న మంత్రి కడియం శ్రీహరి..కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుని మందకృష్ణ మాదిగ అంబేద్కర్‌తో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి స్పందిస్తూ..రిజర్వేషన్ల పేరుతో 20 ఏళ్లుగా మందకృష్ణ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం అలాంటి పనులను ఇకనైనా మానుకోవాలని పిడమర్తి రవి సూచించారు. 

10:41 - November 15, 2016

వికారాబాద్ : సీపీఎం, టీ.టీడీపీ చేపట్టిన పాదయాత్రలపై మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. తక్షణమే కేటీఆర్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. సీపీఎం మహాజన పాదయాత్ర 29వ రోజు పూర్తి చేసుకుంది. వికారాబాద్‌ జిల్లాలో కొనసాగుతోన్న పాదయాత్రకు అడుగుడుగునా జనాలు నీరాజనాలందిస్తున్నారు. అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
కేటీఆర్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి : తమ్మినేని
ప్రతిపక్షాలు గంగిరెద్దుల్లా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. తక్షణమే కేటీఆర్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న సమస్యలపై సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రతిపక్షాలపై అర్థరహిత విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్న పాదయాత్రలను స్వాగతించాలి గానీ...విమర్శించడం ప్రభుత్వానికి తగదని అన్నారు. 
మహాజన పాదయాత్రకు అన్ని వర్గాలు మద్దతు 
ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయంగా సాగుతోన్న సీపీఎం మహాజన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. వికారాబాద్‌ జిల్లాలో సాగుతున్న పాదయాత్రకు తెలంగాణలో బీసీ సామాజిక ఎంబిసి నేత ఆశయ్య  సంఘీభావం తెలిపారు. తెలంగాణలో బీసీ సామాజిక  వర్గానికి న్యాయం జరగడం లేదని ఆశయ్య అన్నారు. ప్రతిపక్షాలపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలపై ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించని పార్టీలకు ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. 
గంగిరెద్దులతో దండయాత్ర : ఆశయ్య
కేటీఆర్ వ్యాఖ్యలు గంగిరెద్దుల కులస్తులను కించపరిచే విధంగా ఉన్నాయని పాదయాత్రలో పాల్గొన్న నేతలు ఆరోపించారు. దొరల బిడ్డగా భావించుకుంటున్న కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే గంగిరెద్దులతో దండయాత్రకు సిద్ధమవుతామని హెచ్చరించారు. 

10:30 - November 15, 2016

నేడు కాంగ్రెస్ ఉన్నత స్థాయి సమావేశం

ఢిల్లీ : నేడు ఢిల్లీలో కీలక భేటీలు జరగబోతున్నాయి. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కాంగ్రెస్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. పార్లమెంటులో వ్యవహరించాల్సిన వైఖరిపై చర్చించనున్నారు. 

నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ...

ఢిల్లీ : ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంటు సమావేశాలకు సహకరించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేయనున్న మోదీ విజ్ఞప్తి చేయనున్నారు. 

 

09:58 - November 15, 2016

హైదరాబాద్ : రూ.500, వెయ్యి నోట్ల రద్దుతో ఏడో రోజైనా పరిస్థితులు కుదటపడడం లేదు. చిల్లరకోసం జనం నానా అగచాట్లు పడుతున్నారు. చాలాచోట్ల ఏటీఎంల దగ్గర భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఏటీఎంలు పనిచేయడం లేదు. నగదు పెట్టిన కొద్దిసేపట్లోనే ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయి. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు చిల్లర కొరత ఏర్పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

పెద్ద నోట్ల రద్దుపై ఏకమవుతున్న విపక్షాలు

ఢిల్లీ : నేడు ఢిల్లీలో కీలక భేటీలు జరగబోతున్నాయి. పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు ఏకమవుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు నోట్ల రద్దుపై విపక్షాలన్ని భేటీ కానున్నాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, ఎస్పీ, ఆప్, డీఎంకే, ఏఐఏడీఎంకే, ఎన్సీపీ సహా ఇతర విపక్ష ఎంపీలు హాజరుకానున్నారు. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ నిర్వహించే యోచనలో విపక్షాలు ఉన్నాయి. 

మరికాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

విజయవాడ : మరికాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంట్‌ శీతాకాల స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై చర్చించనున్నారు. ప్రత్యేక ప్యాకేజీకి చ‌ట్టబద్ధత, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాల‌తో పాటు.. పెద్ద నోట్ల రద్దుపై చర్చించనున్నారు. 

ఏటీఎంల వద్ద భారీ క్యూలు

హైదరాబాద్ : 500, వెయ్యి నోట్ల రద్దుతో ఏడో రోజైనా పరిస్థితులు కుదటపడడం లేదు. చిల్లరకోసం జనం నానా అగచాట్లు పడుతున్నారు. చాలాచోట్ల ఏటీఎంల దగ్గర భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఏటీఎంలు పనిచేయడం లేదు. నగదు పెట్టిన కొద్దిసేపట్లోనే ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయి. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు చిల్లర కొరత ఏర్పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

 

09:51 - November 15, 2016

కర్నూలు : జిల్లాలోని ఆళ్లగడ్డ సమీపంలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక బాలుడికి గాయాలు కావడంతో.. వెంటనే ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మంటలు చెలరేగినప్పుడు బస్సులో  21 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆర్టీసీ బస్సు కర్నూలు నుంచి కడపకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:46 - November 15, 2016

నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్ కుమార్, సీపీఎం నేత శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. నోట్ల రద్దుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఈ నెల 30వరకు పాత నోట్లను అమలులో ఉంచాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:42 - November 15, 2016

బీజేపీ అధికారంలోకి వచ్చాక దళిత, మైనార్జీలపై దాడులు పెరుగుతున్నాయని ఏఐఎస్ఎఫ్ నేత స్టాలిన్ అన్నారు. విశ్వవిద్యాలయాల నిర్వీర్యానికి కుట్ర జరుగుతోందన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ జెఎన్ యులో బయోటెక్నాలజీ విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యం వ్యవహారం తీవ్రంగా కుదిపేస్తోంది. ఈ విద్యార్థి అదృశ్యమై దాదాపు నెల రోజులవుతున్నా ఆచూకీ లభించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీంతో చలో జెఎన్ యు పేరుతో విద్యార్థి సంఘాలు దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి'. వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:24 - November 15, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని ఏసీబీ మరోసారి స్పష్టం చేసింది. హైకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబు వేసిన పిటిషన్‌పై ఏసీబీ వాదనలు వినిపించింది. క్రిమినల్‌ కేసులో మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూదని ఏసీబీ వాదించింది. ఏసీబీ వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.
చంద్రబాబు పిటిషన్‌పై వాదనలు  
ఓటుకు నోటు కేసు నుంచి తనను తప్పించాలని చంద్రబాబు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఏసీబీ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం ఈ కేసుకు వర్తిస్తుందన్న ఏసీబీ.. గవర్నమెంట్‌ జీతం తీసుకుంటేనే వర్తించాల్సిన పని లేదన్నారు. ఎన్నికల్లో పాల్గొని ప్రజా సంబంధిత విధులు నిర్వహించే వారికి లంచం ఇవ్వచూపడం నేరమని ఏసీబీ తరుపు న్యాయవాది వాదించారు.
స్టీఫెన్‌ సన్‌ మంచివాడన్న ఏసీబీ.. 
తమకు ఫిర్యాదు చేసిన స్టీఫెన్‌ సన్‌ మంచివాడన్న ఏసీబీ.. అతను ఎవ్వరి వద్ద డబ్బులు డిమాండ్‌ చేయలేదని స్పష్టం చేసింది. అతని వద్దకే మత్తయ్య రెండు కోట్లు ఇస్తామని వచ్చారని చెప్పింది. ఆ తర్వాత సెబాస్టియన్ రేవంత్ రెడ్డితో కలిసి 5 కోట్లు ఇస్తామని వచ్చారని లాయర్‌ రవి కిరణ్‌ వాదించారు. అందుకే నామినేటేడ్ ఎమ్మెల్యే తమకు లేఖ రాశారని ఏసీబీ వాదించింది. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతోనే అందుబాటులో ఉన్న టెక్నాలజీతో దర్యాప్తు చేశామని ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. 
మూడో వ్యక్తి కలుగచేసుకునే అర్హత లేదన్న ఏసీబీ 
50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నామన్న ఏసీబీ.. మిగతా 4 కోట్ల 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి అరెంజ్ చేశారో తెల్చే పనిలో పడ్డామని చెప్పింది. క్రిమినల్ కేసులో మూడో వ్యక్తి కలుగచేసుకునే అర్హత లేదని ఏసీబీ తరుపు న్యాయవాది వాదించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి కోర్టుకు వచ్చారని వాదించారు. ఏదైన సాక్ష్యాధారాలు ఉంటే నేరుగా దర్యాప్తు అధికారి వద్దకు రాకుండా కోర్టుకు ఎలా వచ్చారని ఏసీబీ ప్రశ్నించింది. 
ఏసీబీ మోమో దాఖలు చేసిందన్న ఏసీబీ 
ఇక 156 సీఆర్పీసీ ప్రకారం ఏసిబి కోర్టు తీర్పు ఇవ్వగానే ఏసీబీ మోమో దాఖలు చేసిందన్న ఏసీబీ.. ఆ మోమోలో సీఆర్పీసీ 210 ప్రకారం దర్యాప్తు చేస్తున్నామని కోర్టుకు తెలిపింది. ఎమ్మెల్యే లేవనెత్తిన విషయాలని పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. తొందరపడి రిజల్ట్ రావాలంటే రాదని కోర్టు సమయం వృధా చేయడానికే ఇలా పిటిషన్ దాఖలు చేశారని ఏసీబీ తరుపు లాయర్‌ వాదించారు. ఏసీబీని తప్పుపట్టాల్సిన అవసరం లేదని తాము దర్యాప్తు వేగంగానే చేస్తున్నామని లాయర్‌ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు తరుపు వాదనలు, ఎమ్మెల్యే ఆర్కే వాదనలు పూర్తికాగా ఏసీబీ మరి కొన్ని వాదనలు వినిపిస్తామని తెలిపింది. దీంతో తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. 

 

09:08 - November 15, 2016
09:07 - November 15, 2016

హైదరాబాద్ : పార్లమెంట్‌ శీతాకాల స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై టీడీపీ క‌స‌ర‌త్తు ముమ్మరం చేస్తోంది. ప్రత్యేక ప్యాకేజీకి చ‌ట్టబద్ధత, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాల‌పై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సమాయత్తమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు విజ‌య‌వాడ‌లో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించి.. ఎంపిలు అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై దిశానిర్దేశం చేయ‌నున్నారు.  
టీడీపీ ఎంపీలతో అధినేత చంద్రబాబు భేటీ 
ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై.. టీడీపీ ఎంపీలతో అధినేత చంద్రబాబు విజయవాడలో భేటీ కానున్నారు. కేంద్రంపై ఏఏ అంశాల్లో ఒత్తిడి పెంచాలో చర్చించనున్నారు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ..పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం ప్రదాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక ప్యాకేజీకి చ‌ట్ట బద్ధత క‌ల్పించాల‌నే  ప్రధాన డిమాండ్‌ను పార్లమెంట్‌ సమావేశాల్లో లేవనెత్తడానికి టీడీపీ సిద్ధమైనట్లు సమాచారం. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై విపక్షాల నుంచి రాష్ట్రంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీ ఎలాంటి చట్టబద్ధత లేనిదని దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహరచన చేస్తోంది టీడీపీ. పెండింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులను రాబట్టే అంశాలను సమావేశంలో లేవ‌నెత్తాల‌ని భావిస్తోంది. అలాగే వెనుక‌బ‌డిన జిల్లాలకు మ‌రికొన్ని నిధులు ఇవ్వాల‌ని కేంద్రాన్ని కోర‌నున్నారు ఎంపిలు. 
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాబట్టాల్సిన తీరుపై చర్చ  
మరోవైపు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఓ వైపు కేంద్ర నిర్ణయాన్ని సమర్థిస్తూనే మరోవైపు 2 వేల నోట్లను రద్దు చేయాలని కేంద్ర పెద్దలకు సూచిస్తున్నారు. ఈ విషయం చర్చకు వచ్చినట్లైతే..2 వేల నోట్లను రద్దు చేయాలని డిమాండ్‌ వినిపించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఏదీ ఏమైనా ప్రత్యేక హోదా కోసం విపక్షాలు పట్టుబడుతుంటే.. టీడీపీ ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్దత కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. 

 

నేడు భారత్ లో ఇజ్రాయెల్ అధ్యక్షుడు పర్యటన

ఢిల్లీ : నేడు భారత్ లో ఇజ్రాయెల్ అధ్యక్షుడు రిబ్లిన్ పర్యటించనున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఆర్థికమంత్రితో ఆయన భేటీ కానున్నారు. 

 

నేడు వరంగల్ అర్బన్ జిల్లాలో కడియం శ్రీహరి పర్యటన

వరంగల్ : నేడు వరంగల్ అర్బన్ జిల్లాలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

08:40 - November 15, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్ ఎస్ నిర్ణయించింది. సామాన్య, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోకుండా ఉన్నపళంగా  ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్ల చలామణి నిలిపివేయడాన్ని పార్టీ నాయకత్వం తప్పుపడుతోంది. ఈ విషయాలను ఉభయసభల్లో లేవనెత్తాలని టీఆర్ ఎస్  పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. 
పార్టీ ఎంపీలతో కేసీఆర్‌ భేటీ 
టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. బుధవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. నగరంలో అందుబాటులో ఉన్న ఎంపీలు ఈ భేటీకి హాజరయ్యారు. 
నోట్ల రద్దును తప్పుపడుతున్న టీఆర్ ఎస్ 
పెద్ద నోట్ల రద్దు దరిమిలా ఉత్పన్నమైన పరిణామాలే ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా ఐదొందలు, వెయ్యి కరెన్సీ నోట్లను రద్దు చేయడాన్ని టీఆర్‌ఎస్‌ తప్పుపడుతోంది. నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా... అమలు చేసే విధానం మాత్రం సరిగాలేదని విమర్శిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో రైతుల, రోగులు ఎన్నో అవస్థలు పడుతున్న విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. 
పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలి 
వీటితోపాటు రాష్ట్ర సమస్యలను కూడా పార్లమెంటులో  ప్రస్తావించాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది.  పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుతోపాటు..  సాగునీటి ప్రాజెక్ట్‌లకు నిధులు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తదితర అంశాలను కూడా ఉభసభల్లో  లేవనెత్తాలని నిర్ణయించింది. అలాగే హైకోర్టు విభజన అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపాదించింది. మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసేలోపు ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీతోపాటు, కేంద్ర మంత్రులను కలుసుకోవాలని కేసీఆర్‌ నిర్ణయించారు.  పెద్ద నోట్ల రద్దుతోపాటు, రాష్ట్ర సమస్యలపై చర్చించాలని భావిస్తున్నారు. 

08:32 - November 15, 2016

హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలంగాణలో తీవ్ర నష్టాలు మిగిల్చినట్లు సీఎం కేసీఆర్‌ కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2400 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశామని..పూర్తి నివేదికను త్వరలోనే పంపుతామని తెలిపారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన ముగియడంతో కేంద్ర బృందం సీఎంతో భేటీ అయి వర్షాల వల్ల కలిగిన నష్టాలపై చర్చించింది.   
తెలంగాణలో పలు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన 
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం సిద్దిపేట,  కరీంనగర్, సంగారెడ్డి, తదితర జిల్లాల్లో పర్యటించింది. ఆ తర్వాత క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది. రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టానికి తగిన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కేంద్ర బృందానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్‌తో కేంద్ర బృందం భేటీ 
సెప్టెంబర్‌ నెలలో అనూహ్యంగా భారీ వర్షాలు కురిసాయని.. ఒక్క రోజే 31 సెంటీమీటర్ల వరకు వర్షాలు పడి అపార నష్టం వాటిల్లిందని వివరించారు. మిషన్‌ కాకతీయ కార్యక్రమం ద్వారా చాలా చెరువులను పునరుద్ధరించడం ద్వారా పెద్ద ముప్పు తప్పిందన్నారు. అయితే భారీ వర్షాలు కురిసినా మిషన్‌ కాకతీయ ద్వారా బాగుపడిన చెరువుకట్టలు తెగలేదన్నారు. రహదారులు బ్రిడ్జిలు, దెబ్బతిన్నాయని, విద్యుత్‌ లైన్లు, స్తంభాలకు నష్టం జరిగిన విషయాన్ని వారి దృష్టికి తెచ్చారు. హైదరాబాద్‌లోనూ భారీ నష్టం జరిగిందని.. 150 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2400 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశామని.. పూర్తి నివేదికను త్వరలోనే పంపుతామన్నారు.  దీనికి అనుగుణంగా కేంద్రం సాయం అందేలా చూడాలని కేంద్ర బృందానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఇందుకు  కేంద్ర బృందం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.  

 

08:25 - November 15, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో జీహెచ్‌ఎంసీలో నోట్ల పంట పండుతోంది. పాత నోట్లు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ చెప్పడంతో భారీగా బకాయిల వసూళ్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పెండింగ్‌ ఉన్న ట్యాక్స్‌లను  చెల్లించేందుకు  నగర వాసులు క్యూ కడుతున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఖజానాకు భారీగా నగదు వచ్చి చేరుతోంది. సోమవారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో   51  కోట్ల 5 లక్షల రూపాయల  బకాయిలు వసూళ్లు జరిగాయి.
నగరవాసుల క్యూ  
పెద్ద నోట్ల రద్దుతో  ఓవైపు సామాన్య ప్రజలు నానా పాట్లు పడుతుంటే...మరోవైపు జీహెచ్‌ఎంసీకి మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు పెండింగ్‌ ఉన్న ట్యాక్స్‌లను   పాతనోట్ల రూపంలో చెల్లించేందుకు  నగర వాసులు క్యూ కడుతున్నారు. గతంలో లేని విధంగా రికార్డు స్థాయిలో పన్నుల వసూలు జరుగుతోంది.
ఒక్కరోజే రూ.51 కోట్ల 5లక్షల కలెక్షన్‌ 
ఇవాళ ఒక్కరోజే రికార్డుస్థాయిలో 51  కోట్ల 5 లక్షల రూపాయల  బకాయిలు వసూళ్లు జరిగాయి. ఆదివారం జీహెచ్‌ఎంసీలో ఆస్తి పన్ను కింద రూ.9 కోట్లు, ఎల్‌ఆర్‌ఎస్ కింద రూ.23.4 కోట్లు వసూలైంది.  హెచ్‌ఎండీఏ పరిధిలో సుమారు 3 కోట్ల 39 లక్షలు  వసూలయ్యాయి. జలమండలి పరిధిలో సుమారు 25 వేల మంది నల్లా బిల్లుల బకాయిలు చెల్లించగా 3  కోట్లు వసూలైంది. శుక్రవారం, శనివారం రెండురోజుల్లోనే  99 కోట్ల రూపాయల ఆదాయం బ‌ల్దియాకు వచ్చింది. ఇవాళ్టి వసూళ్లను కలుపుకొని సుమారు 150 కోట్ల రూపాయల వరకూ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
అన్నిరకాలుగా ప్రచారం చేస్తోన్న జీహెచ్‌ఎంసీ
పన్నుల వసూలు ఊపందుకోవడంతో అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించి అన్నిరకాలుగా ప్రచారం చేస్తోంది జీహెచ్‌ఎంసీ. ప్రసార మాధ్యమాలు, ఎస్ ఎంఎస్ ద్వారా జీహెచ్ఎంసీ ప్రజల దృష్టికి తీసుకెళుతోంది. బ‌ల్దియాలో చేప‌డుతున్నట్లుగానే జ‌ల‌మండ‌లి కూడా ఆదాయం పెంపుకోసం స్పెష‌ల్  ప్రోగ్రాం డిజైన్ చేసింది. ఏదేమైనా రికార్డుస్థాయిలో పన్ను వసూలు జరగడంతో బల్దియా అధికారులు ఫుల్ జోష్ మీదున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అన్ని విధాలా చర్యలు చేపడుతున్నారు. 

 

08:17 - November 15, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుతో ప్రజల ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బ్యాంకులలో గంటల తరబడి నిలబడడం, ఏటీఎంల వద్ద నో సర్వీస్‌ బోర్డులు లాంటి సమస్యలకు చెక్‌ పెట్టే దిశగా కేంద్రం యోచిస్తోంది. నగదు విత్‌డ్రాకు 'మైక్రో ఏటీఎం'లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇవి అందుబాటులోకి వస్తే ప్రజల ఇబ్బందులు తీరుతాయంటుంది. అసలు మైక్రో ఏటీఎంలు అంటే ఏమిటి ? ఏటీఎంలకు వాటికి తేడా ఏంటి ? అవి ఎలా పని చేస్తాయో ? మనం చూద్దామా. 
మైక్రో ఏటీఎంల ఏర్పాటు 
నోట్ల రద్దు సంగతేమోగానీ ఇప్పుడు జనాలు ఎక్కడ చూసినా బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎం సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. క్యాష్ డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేయడం, నోట్ల మార్పిడి వంటి పనులతో ప్రజలు బారులు తీరి పనులు పూర్తి చేసుకుంటున్నారు. అయితే బ్యాంకులు, పోస్టాఫీసుల సంగతి అటుంచితే ఏటీఎంలలో చాలా వరకు పనిచేయకపోవడం, ఇంకొన్నింటిలో ఎప్పటికప్పుడు క్యాష్ అయిపోతుండడంతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ప్రజల ఇబ్బందులపై దృష్టి సారించిన కేంద్ర సర్కార్‌ పెద్ద ఎత్తున మైక్రో ఏటీఎంలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వీటితో ప్రజలకు కొంత ఇబ్బందులు తప్పుతాయని అధికారులంటున్నారు. 
మైక్రో ఏటీఎం అంటే.. 
మైక్రో ఏటీఎం అంటే.. మనం ఇప్పటివరకు క్రెడిట్, డెబిట్ కార్డులను స్వైప్‌ చేసే మిషన్ల మాదిరిగానే ఉంటాయి. కాకపోతే వీటిని ఆయా బ్యాంకులు ఎంపిక చేసిన ప్రతినిధులు నిర్వహిస్తుంటారు. వారికి మిషన్లు ఇచ్చాక పెద్దమొత్తంలో నగదును తమ వద్ద పెట్టుకుంటారు. తమ దగ్గరకు నగదు కోసం వచ్చే బ్యాంక్‌ ఖాతాదారుల నుంచి డెబిట్‌ లేదా క్రెడిట్‌కార్డును స్వైప్‌ చేస్తారు. వారికి కావాల్సిన నగదు మొత్తాన్ని మిషన్‌లో ఎంటర్‌ చేయగానే కార్డ్‌ స్వైప్‌ అవుతుంది. దీంతో నగదు ఖాతాదారుని అకౌంట్‌ నుంచి కరస్పాండెంట్‌ అకౌంట్‌కు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. తర్వాత ఆ మొత్తాన్ని అతను ఖాతాదారుడికి ఇస్తాడు. 
ఆయా బ్యాంకులు మైక్రో ఏటీఎంలు  
ఈ మైక్రో ఏటీఎంలు ఇప్పటికే పలు గ్రామీణ ప్రాంతాల్లో ఆయా బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం నోట్ల రద్దుతో అన్ని ప్రాంతాల్లో నగదు తీసుకునేందుకు ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో వీటిని అన్ని ప్రాంతాలలో భారీస్థాయిలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది. ఈ మిషన్లు అందుబాటులోకి వస్తే.. ఖాతాదారులు డబ్బు డ్రా చేసుకోవడం సులభమవుతుంది. ఇక ఈ మిషన్ల నిర్వహణ ఖర్చు కూడా ఏటీఎంల కన్నా తక్కువగా ఉండడం.. ఒక్కసారి మిషన్‌ను కొనుగోలు చేస్తే మళ్లీ దానిపై ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండందంటున్నారు అధికారులు. ఈ మిషన్‌ను ఒక స్థానం నుంచి మరో స్థానానికి తీసుకువెళ్లడం కూడా చాలా సులభతరం. సో.. మైక్రో ఏటీఎంలు అందుబాటులోకి వస్తే ఖాతాదారులు ఇక డబ్బు డ్రా చేసుకోవడం మరింత సులభతరమయ్యే అవకాశం ఉంది. 

 

కూకట్ పల్లిలో యువకుడు బ్రెయిన్ డెడ్

హైదరాబాద్ : కూకట్ పల్లిలో యువకుడు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అవయవదానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. 12న మియాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో శశాంక్ గాయపడ్డారు. కూకట్ పల్లి ప్రగతి కాలేజీలో శశాంక్ డిగ్రీ  చదువుతున్నాడు. 

నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

కరీంనగర్ : నేడు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. 

07:49 - November 15, 2016

జగిత్యాల : జిల్లాలో విషాదం నెలకొంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ ఇద్దరు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రకు చెందిన చంద్రాపూర్ కు చెందిన ఎనిమిది మంది బృందం కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, కొండగట్టులకు దైవ ధర్శనం కోసం మూడు రోజుల క్రింతం వచ్చారు. దైవ దర్శనం అయిన తర్వాత నిన్న అర్ధరాత్రి స్వగ్రామం మహారాష్ట్రలోని చంద్రాపూర్ కు తిరుగుప్రయాణం అయ్యారు. మార్గంమధ్యలో జగిత్యాల జల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు  విపుల్, ఆర్యన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ అతివేగంగా వల్లే ప్రమాదం జరినట్లు తెలుస్తోంది. పైగా డ్రైవర్ మద్యం సేవించినట్లు పోలీసులు నిర్దారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:37 - November 15, 2016

హైదరాబాద్ : సిటీలో సూపర్ మూన్ దృశ్యాన్ని చిన్నారులు ఆనందంగా వీక్షించారు. ప్లానెటరీ సొసైటీ ఇండియా, హెచ్ ఎండీఏ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్ సంజీవయ్య పార్కులోని ఎత్తైన జాతీయ జెండా వద్ద వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సూపర్ మూన్‌ను వీక్షించారు. చంద్రుడు భూమికి అత్యంత సమీపానికి రావడంతో మరింత అందంగా కనిపించాడు. దాదాపు 7 దశాబ్ధాల తర్వాత చంద్రుడు భూమికి ఇంత దగ్గరగా రావడంతో ప్రజలంతా ఎత్తయిన ప్రదేశాల నుంచి వీక్షించి ఆనందించారు. సాధారణం కన్నా 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ వెలుగులతో చందమామ కనిపించింది. డిసెంబర్‌ 14 వరకు చంద్రుడు ఇలాగే ఉంటాడని పలువురు నిపుణులు తెలిపారు. అత్యంత పెద్దగా ఉన్న చందమామను చూసిన పిల్లలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 

ఆర్టీసీ బస్సులో మంటలు...బాలుడికి గాయాలు

కర్నూలు : ఆళ్లగడ్డ సమీపంలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బాలుడికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు కర్నూలు నుంచి కడప వెళ్తోంది. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

జగిత్యాల : ధర్మపురి మండలం నేరెళ్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వేములవాడ నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. 

పరువునష్టం దావా కేసులో విచారణకు హాజరుకానున్న రాహుల్ గాంధీ

ఢిల్లీ : నేడు థానే కోర్టులో పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీ విచారణకు హాజరుకానున్నారు. 

 

Don't Miss