Activities calendar

16 November 2016

21:46 - November 16, 2016

ఢిల్లీ : జల్లికట్టు క్రీడ నిషేధంపై సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జల్లికట్టును రాష్ట్ర క్రీడగా గుర్తించడానికి ప్రాతిపదిక లేదని జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్ నారిమన్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. తమిళుల సాంప్రదాయ క్రీడ జల్లికట్టును నిషేధిస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను పున:సమీక్షించాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంలో ఈ పిటిషన్ దాఖలు చేసింది. 

21:39 - November 16, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తరువాత.. దేశవ్యాప్తంగా జరుగుతున్న లావాదేవీలపై ఐటీ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉంది. బ్యాంకుల్లో జమచేయలేక...నల్లడబ్బు ఉన్న బడాబాబులు... తమ నగదును ధార్మిక సంస్థలకు ఇస్తున్నారన్నని తెలియడంతో... ఐటీ విభాగం.. ఆ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశ వ్యాప్తంగా 1400 మత సంబంధిత సొసైటీలు.. ఛారిటబుల్‌ ట్రస్టులకు నోటీసులు జారీచేసింది. ఈ ఏడాది మార్చి 31 నుంచి... నవంబర్‌ 8 వరకు.. బ్యాలెన్స్‌ షీట్‌లను అందజేయాలని ఆదేశించింది. దీంతో పాటు... నవంబర్‌ 8 తర్వాత జరిగిన రోజు వారీ లావాదేవీలను... ఈనెల 18లోగా అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

21:37 - November 16, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం విధించిన వివిధ ఆంక్షల వల్ల దేశంలో అత్యధికంగా ఉన్న సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. కేంద్రం అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడం వల్ల సామాన్యులు పడరాని కష్టాలు పడుతున్నారని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల కలెక్టర్లు, అన్ని బ్యాంకుల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సీఎస్‌, మంత్రి ఈటెల రాజేందర్‌ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ..బ్యాంకులో నగదు మార్పిడి పరిమితిని 4500 నుంచి 10వేలకు పెంచాలని..24వేల విత్‌డ్రా పరిమితిని 2లక్షలకు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సామాన్యులు పడుతున్న ఇబ్బందులను కేంద్రం పరిష్కరించాలన్నారు. 

21:35 - November 16, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని 'తుగ్లక్ చర్య'గా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు పార్లమెంట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు పాదయాత్ర నిర్వహించాయి. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి మెమొరాండం సమర్పించాయి. తృణమూల్‌ చీఫ్‌ మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో బిజెపి మిత్రపక్షం శివసేన, ఆప్, ఎన్‌సి నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడిందని మమత విమర్శించారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌, వామపక్షాలు, తదితర పార్టీలు టిఎంసి ర్యాలీలో పాల్గొనలేదు. ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ కూడా ర్యాలీకీ గైర్హాజరయ్యారు. 

21:31 - November 16, 2016

ఢిల్లీ : 5 వందలు, వెయ్యి నోట్ల రద్దుతో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వేడెక్కాయి. ప్రత్యామ్యాయ చర్యలు చేపట్టకుండా ఉన్నట్టుండి పెద్ద నోట్లు రద్దు చేయడంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. కేంద్రం అనాలోచిత చర్య కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తాయి. నల్లధనం ఉన్నవాళ్లే ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం సమర్థించుకుంది.

పెద్ద నోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో వాడి వేడి చర్చ
పెద్ద నోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో వాడి వేడి చర్చ జరిగింది. చర్చను ప్రారంభించిన కాంగ్రెస్- పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఉత్పన్నమయ్యే సమస్యలను కేంద్రం సరిగా అంచనా వేయలేకపోయిందని పేర్కొంది. కనీస హెచ్చరిక కూడా లేకుండా కేంద్రం పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మ అన్నారు. పనులు మానుకుని బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్నారని... ప్రజలను కష్టాల పాలు చేసే అధికారం

పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారు : పీయూష్ గోయొల్
దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారని కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తొలిసారి నిజాయతీరులకు మేలు జరుగుతోందన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ముకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. నల్లధనం దాచుకున్న వారే ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

భారత దేశంలో నగదు రహిత విధానం ఎలా సాధ్యం :ఏచూరి
86 శాతం నగదు లావాదేవీలు జరిగే భారత దేశంలో నగదు రహిత విధానం ఎలా సాధ్యమని సీపీఎం నేత సీతారాం ఏచూరి మోదీ సర్కార్‌ను ప్రశ్నించారు. 80 శాతం గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సౌకర్యం లేదన్నారు. అలాంటిది చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లో చేసుకోమంటే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. కేవ‌లం నోట్ల ర‌ద్దుతోనే న‌ల్లధానాన్ని అడ్డుకోవ‌చ్చా అని ప్రశ్నించారు. మోదీ చ‌ర్యతో మొస‌ళ్లు ఎంజాయ్‌ చేస్తున్నాయని, చిన్న చేప‌లు చ‌స్తున్నాయ‌న్నారు. బ‌కాయిలు చెల్లించ‌ని వ్యాపార‌వేత్తల రుణాల‌ను ఎత్తివేయడాన్ని ఏచూరి త‌ప్పుప‌ట్టారు. దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల అప్పులు మాత్రం మాఫీ కావడంలేదని, బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

నల్లధనం వున్నవారే విమర్శలు : వెంకయ్యనాయుడు
నల్లధనం కలిగిన వాళ్లే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎదురుదాడికి దిగారు. మోది తీసుకున్న నిర్ణయంపై ప్రజలతో పాటు ప్రపంచమంతా ప్రశంసిస్తుంటే కొన్ని పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ముందుగానే చెబితే నల్లకుబేరులు జాగ్రత్త పడరా అని ప్రశ్నించారు.

చర్చ జరగకుండానే లోక్‌సభ రేపటికి వాయిదా
ఎలాంటి చర్చ జరగకుండానే లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సభ ప్రారంభమైన వెంటనే.. ఇటీవల మృతిచెందిన పలువురు ప్రముఖులకు సంతాపంగా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సభను రేపటికి వాయిదా పడింది. 

6గురు మావోయిస్టుల మృతి..

ఛత్తీస్‌గఢ్‌ : దంతెవాడ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జల్లికట్టుపై నిషేధం కొనసాగింపు : సుప్రీం

ఢిల్లీ: జల్లికట్టు క్రీడ నిషేధంపై సమీక్షించాలని తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జల్లికట్టును రాష్ట్ర క్రీడగా గుర్తించడానికి ప్రాతిపదిక లేదని జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్ నారిమన్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. తమిళుల సాంప్రదాయ క్రీడ జల్లికట్టును నిషేధిస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను పున:సమీక్షించాలని తమిళనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

24 వరకు ప్రభుత్వ చెల్లింపులు పాతనోట్లతోనే..

హైదరాబాద్: రద్దయిన రూ.500, 1000 పాత నోట్లతో ఈ నెల 24 వరకు అన్ని ప్రభుత్వ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు సీఎస్ రాజీవ్‌శర్మ వెల్లడించారు. ఈ విషయమై రాజీవ్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ పాత నోట్లతో ఫీజులు, పన్నులు, అపరాధ రుసుం చెల్లించవచ్చని తెలిపారు. 

ప్రధానితో భేటీ అయిన బిల్ గేట్స్!..

ఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో కలుసుకున్నారు. ఇద్దరి మధ్యా అనేక అంశాలపై చర్చ వచ్చింది. నోట్ల రద్దు అంశంతో పాటు స్వచ్ఛభారత్‌పై కూడా చర్చించినట్లు సమాచారం. బిల్‌గేట్స్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతోన్న గేట్స్ ప్రధాని చేపట్టిన స్వచ్ఛభారత్‌కు పెద్ద ఎత్తున సహకరించాలనుకున్నారని తెలిసింది. 

రైల్వే ట్రాక్ పై నటుడి డెడ్ బాడీ!..

ముంబై: ప్రముఖ నటుడు ముఖేశ్ రావల్‌ మృతదేహం రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ముంబై బోరివలి రైల్వే ట్రాక్‌పై ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బుల్లితెరపై సంచలనం రేపిన రామానంద్ సాగర్ రామాయణంలో ముఖేశ్ రావల్ విభీషనుడి పాత్ర పోషించారు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

20:39 - November 16, 2016

అంచనాలు తప్పాయి.. అల్లకల్లోలం జరుగుతోంది. నల్లధనం కోసం అంటూ తీసుకున్న స్టెప్ ఇప్పుడు సామాన్యుడి మెడకు చుట్టుకుంటోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని వైఫల్యం ఇప్పుడు ప్రతికూలతను పెంచుతోందా? భారత ఆర్ధిక వ్యవస్థపై సరైన అంచనాలు లేకపోటమే ఈ సమస్యకు దారి తీసిందా? మరికొంత కాలం పెద్ద నోట్లు చెల్లుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందా? ఎంత కాలం ఈ నోట్ల గోల? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. నల్లధనం వెలికి తీస్తామంటూ తీసుకున్న స్టెప్ ప్రజానీకాన్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా బతికే ప్రజానీకం మెజారిటీ ఉన్నచోట నోట్ల రద్దు అంటూ సర్కారు తీసుకున్న నిర్ణయం రోజు రోజుకు గందరగోళాన్ని పెంచుతోంది. వంద నోట్ల కొరత దేశాన్ని మరిన్ని ఇబ్బందుల వైపు నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది దేశంలో? ఒకవైపు నల్లధనికులను పట్టడానికి అని సామాన్యుడిని రోడ్డు మీదకు తెచ్చి నిలబెట్టారు. అదేమంటే నిలబడలేరా ఆ మాత్రం అని గద్దిస్తున్నారు. విదేశాల్లో నల్లధనాన్ని తెస్తామని అధికారంలోకి వచ్చిన వాళ్లు.. స్వదేశంలోని సామాన్యుల చేతుల్లోని డబ్బుకు విలువ లేకుండా చేశారు. ఇంకో యాభై రోజులు ఇలాగే ఉండమంటున్నారు. మరోపక్క అప్పులు ఎగ్గొట్టినవాళ్లను ఒడ్డున పడేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దులో భారీ కుంభకోణం ఉందా? ఈ నిర్ణయం కొందరికి ముందే తెలుసా? భారత ఆర్ధిక వ్యవస్థ స్వరూపాన్ని అంచనా వేయటంలో మోడీ సర్కారు బోల్తా కొట్టిందా? అందుకే కరెన్సీ రద్దు ఇలాంటి ఫలితాలు ఇస్తోందా? బ్యాకింగ్ వ్యవస్థ అందుబాటులో లేని చోట... కోట్లాది ప్రజలు బ్యాంకులకు అతీతంగా అనేక ట్రాన్సాక్షన్లు చేసే చోట.. ముందు జాగ్రత్తలు లేకుండా తీసుకున్న నిర్ణయమే ఈ గందరగోళానికి కారణమా? పెద్ద నోట్ల రద్దులో భారీ కుంభకోణం ఉందా? ఇది ప్రధానిది వ్యక్తిగత నిర్ణయమా? ఈ నిర్ణయం కొందరికి ముందే తెలుసా? గతంలో ప్రధాని మోడీకి ముడుపులందాయా? బీజెపీ భారీగా ఫండ్స్ అందాయా? విపక్షాలనుండి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి? పెద్ద నోట్ల రద్దు ప్రభావం పార్లమెంట్ సమావేశాలపై పడనుందా? ఆరోపణలు, ఆధారాలు ఎలా ఉన్నా, ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారం నుంచి ఏటీఎంల చుట్టూ తిరుగుతూ.. అన్ని పనులు ఆపుకుని బ్యాంకుల ఎదురుగా క్యూ కట్టిన తీరు విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ కరెన్సీ గోల ఇంకెన్నాళ్లు అంటే సమాధానం చెప్పే పరిస్థితి కనిపించటం లేదు.

20:30 - November 16, 2016

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంత వాసులు ఇరు రాష్ట్రా మధ్యన నలిగిపోతున్నారు. తెలంగాణ ఆంధ్రా చంద్రయ్యలిద్దరి తీరుతో పోలవరం ముంపు ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఖమ్మం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పాదయాత్ర చేట్టారు. పాదయాత్రకు స్కూలు విద్యార్థులు తమకున్న కష్టాలను చెప్పుకున్నారు. ఓ వినతిపత్రాన్ని కూడా ఎమ్మెల్యే సున్నం రాజయ్యగారికి ఇచ్చారు. తమ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత..మంచినీటి కొరత వంటి సమస్యలను తీర్చాలంటూ స్కూలు విద్యార్థులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై మరింత సమాచారానికి మల్లన్న ముచ్చట్లు చూడండ్రి..

20:18 - November 16, 2016

హైదరాబాద్ : పెద్ద నోటు రద్దు వల్ల కుబేరులు బెంబేలెత్తడం ఏమో కానీ.. సామన్యులు మాత్రం నానా కష్టాలు పడుతున్నారు. వంద రూపాయల నోటు కోసం గంటల కొద్ది క్యూలైన్లో నిలబడి చివరికు ఒట్టి చేతులతో వెనుదిరుగుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పనులు మానేసుకుని బ్యాంకుల వద్దే నిరీక్షించాల్సి వస్తుందని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు ప్రస్తుత పరిస్థితి అనేక కారణాలు ఉన్నాయి.

చిల్లర దొరక్క అవస్థలు పడుతున్న ప్రజలు
500, వెయ్యి నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి బ్యాంకుల వద్ద నిలబడి పాత నోట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా బ్యాంకులలో డబ్బులు డ్రా చేసుకోవాలన్న ఇదే పరిస్థితి. ఇక ఏటీఎంల వద్ద నిత్యం నో సర్వీస్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజల కరెన్సీ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.

ఇప్పుడు మరో కొత్త సమస్య
ఇదిలావుంటే.. ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. బ్యాంకులలో డబ్బులు డ్రా చేసుకున్నవారికి.. రెండు వేల రూపాయల నోట్లు ఇస్తున్నారు. దీంతో మళ్లీ చిల్లర కష్టాలు మొదలయ్యాయి. గతంలో వెయ్యి రూపాయలకే చిల్లర దొరక్క అనేక ఇబ్బందులు పడ్డ ప్రజలు.. ఇప్పుడు రెండు వేల రూపాయలతో అవస్థలు పడుతున్నారు. ఏ షాపుకు వెళ్లినా వ్యాపారులు రెండు వేల నోటుకు చిల్లర ఇవ్వడం లేదు. దీంతో చిల్లర దొరక్క అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొత్త కరెన్సీ వచ్చే వరకు తిప్పలు తప్పవంటున్న అధికారులు.
ఇదిలావుంటే.. ప్రజలు తాము మార్చుకున్న వంద నోట్లు ఖర్చు చేయకుండా.. తమ వద్దే ఉంచుకోవడం వల్ల చిల్లర సమస్య తలెత్తుతుందంటున్నారు బ్యాంక్‌ అధికారులు. రొటేషన్‌ లేకపోవడంతో వంద నోట్ల కోసం ఆర్‌బీఐ మీదనే ఆధారపడాల్సి వస్తుందంటున్నారు.

చిల్లర కష్టాలు తప్పేటట్లు లేదు.
ఇక ప్రజలు అవసరం ఉన్నా.. లేకున్నా కూడా డబ్బులను అదేపనిగా డ్రా చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. అవసరం ఉన్నవారికి కూడా డబ్బులు ఇవ్వలేకపోతున్నామని బ్యాంక్‌ అధికారులంటున్నారు. కొత్త 500 రూపాయల నోట్లు వస్తే సమస్య పరిష్కారమవుతుందంటున్నారు. అయితే.. కొత్త కరెన్సీ వచ్చేందుకు ఇంకా 15 రోజుల పట్టే అవకాశం ఉండడంతో అప్పటివరకు చిల్లర కష్టాలు తప్పేటట్లు లేదు.

 

20:06 - November 16, 2016

మైనింగ్‌ మాఫియాగా ఆరోపణలు..మూడేళ్లు జైలు జీవితం..బెయిల్‌పై విడుదల..ఇదీ గాలి జనార్దనరెడ్డి చరిత్ర..బుధవారం తన కుమార్తె బ్రహ్మణీరెడ్డి పెళ్లిని నభూతో అన్న రీతిలో జరిపారు. కుమార్తె వివాహం సందర్భంగా ఆహ్వాన పత్రిక ఓ సంచనలం అయ్యింది. ఇప్పుడు వివాహం..మరో సంచలనం వందల కోట్లు ఖర్చుపెట్టి వివాహం జరిపిస్తున్నారు. ఇది అసలు విషయం కాదు. కానీ పాతనోట్లను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో భారతదేశంలోని యావత్తు సామాన్యులు పాతనోట్లను మార్చుకునేందుకు..చిల్లర నోట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ వందల కోట్లు ఖర్చుపెట్టే గాలి కుమార్తె వివాహం విషయంలో మాత్రం పాతనోట్ల ప్రభావం ఏమాత్రం పడకపోవటం విశేషం...మరోపక్క ఎస్బీఐ పాత మొండి బకాయి వసూళ్ళ విషయంలో చేతులెత్తేసింది. లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఎస్బీఐ వద్ద రూ.900ల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు చెక్కేసిన విషయం తెలిసిందే..ఈ మొత్తాన్ని వసూలు చేసుకుందుకు ఎస్బీఐ తీవ్రంగా యత్నించింది..కానీ ఇప్పుడు ఏమైందో తెలీదు గానీ విజయ్ మాల్యా అప్పుతో సహా రై.7,016 కోట్ల రుణాలు ఎత్తివేస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దీనిపై సీపీఎం పార్టీతో పలు పార్టీలు విమర్శలు కురిపిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో దేవి(సామాజిక వేత్త), అద్దంకి దయాకర్ (టీ.పీసీసీ నేత), శ్రీధర్ రెడ్డి(బీజేపీ నేత) పాల్గొన్నారు. ఈ రెండు అంశాలపై చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి..

 

20:04 - November 16, 2016

ఢిల్లీ : చిల్లర నోట్ల కోసం సామాన్యులు పడరాని పాట్లూ పడుతున్న వేళ.. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా... రుణాల ఎగవేతదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. మొండి బకాయిలు చెల్లించలేమని సాకు చెబుతూ.. విజయ్‌మాల్యా సహా 63మంది రుణాలను రైట్‌ ఆఫ్‌ చేసింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెతుతున్నాయి.
రూ.7,016 కోట్ల లోన్లపై ఆశలు వదులుకున్న ఎస్‌బీఐ
సామాన్యుల నుంచి రుణాలను వడ్డీలు.. చక్రవడ్డీలతో సహా వసూలు చేసే.. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. బడాబాబులపై తమ ప్రేమను మరోసారి చాటుకుంది. విజయ్‌మాల్యా సహా 63 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రుణాలను ఎత్తివేసింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 7,016 కోట్ల బకాయిలను రైట్‌ ఆఫ్‌ జాబితాలో చేర్చింది. ఇందులో లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా రుణమే పన్నెండు వందల కోట్ల రూపాయలు.

సూర్యా ఫార్మా రుణం రూ.526 కోట్లు, జీఈటీ పవర్‌రూ.400 కోట్లు
ఉద్దేశపూర్వకంగా రుణాలు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడి.. ఇప్పుడీ జాబితాలో చేరిన సంస్థల్లో కొన్ని తెలుగు రాష్ట్రాలకు చెందినవీ ఉన్నాయి. కేఎస్‌ ఆయిల్‌ సంస్థ 596 కోట్లు, సూర్యా ఫార్మా 526 కోట్లు, జీఈటీ పవర్‌ 400 కోట్లు, సాయి ఇన్ఫో సిస్టమ్స్‌ 376 కోట్లు, విక్టరీ ఎలక్ట్రికల్స్‌ 93కోట్ల91 లక్షలు, కేఆర్‌ఆర్‌ ఇన్‌ఫ్రా 86కోట్ల73 లక్షలు, విక్టరీ ట్రాన్స్‌ అండ్‌ స్విచ్‌ గేర్స్‌ లిమిటెడ్ 65 కోట్ల 57 లక్షలు, ఘనశ్యామ్‌ దాస్‌ జెమ్స్‌& జ్యువెలర్స్‌ 61కోట్ల72 లక్షలు, ఎస్‌ఎస్‌వీజీ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్‌ 65కోట్ల 24 లక్షలు, యాక్సిస్‌ స్ట్రక్చ్‌రియల్స్‌ 51కోట్ల49 లక్షల మేర బ్యాంకులకు బకాయి పడ్డాయి. ఈ మొత్తం రుణాలను ఎస్బీఐ రైట్‌ ఆఫ్‌ చేసింది.

సీపీఎం సహా పలు పార్టీల విమర్శలు..
నల్లధనాన్ని నియంత్రించేందుకేనంటూ.. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. పర్యవసానంగా చిల్లర లభ్యం కాక సామాన్యులు నానా యాతనలూ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో.. విజయ్‌మాల్యా సహా 94లోన్‌ అకౌంట్లను పక్కకు పెడుతూ ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం.. సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఈ అంశం బుధవారం రాజ్యసభలోనూ ప్రస్తావనకు వచ్చింది. సీపీఎం సహా పలు పక్షాలు.. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి.
ఎస్బీఐ నిర్ణయాన్ని విమర్శించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సహా పలువురు ప్రముఖులూ ఎస్బీఐ నిర్ణయాన్ని తప్పుబట్టారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాలతో పెద్దలే లబ్ది పొందుతున్నారన్నారు. పేదలు డబ్బు కోసం క్యూలో నిలబడి ఇబ్బంది పడుతుంటే పెద్దలకు లబ్ది చేకూర్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

రైటాఫ్‌ చేయడంపై.. మండిపడుతున్న సామాన్య పౌరులు
సామాన్యులకు వేలల్లో ఇచ్చిన బకాయిలను ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు.. బడాబాబుల వేల కోట్ల రూపాయల రుణాలను.. వసూలు చేయలేమన్న సాకుతో ఇలా రైటాఫ్‌ చేయడంపై.. సామాన్య పౌరులూ మండిపడుతున్నారు. 

19:55 - November 16, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు ప్రభావం సామాన్యుడిపైనే పడుతోంది..? పెద్దోళ్లింట్లో అన్ని కార్యక్రమాలూ సజావుగా సాగిపోతూనే ఉన్నాయి. లక్షల్లో కాదు.. ఏకంగా వందల కోట్లల్లో చేసే ఖర్చులకూ వారికి ఎలాంటి ఇబ్బందీ రావడం లేదు. అవును.. గాలి జనార్దనరెడ్డి కుమార్తె వివాహపు అట్టహాసం, హంగూ ఆడంబరాలను చూసిన సామాన్యులు మాత్రం... ఔరా డబ్బుంటే.. నోట్ల రద్దు ఇబ్బంది ఉండదన్న మాట అని గుసగుసలాడుతున్నారు.

నోట్ల కష్టాలు పడుతున్న సామాన్యులు..అంగరంగ వైభవంగా గాలి వారి పెండ్లి
కోట్లకు పడగలెత్తిన వారి భోగాలను ఏమాత్రం అడ్డుకోలేని పెద్ద నోట్ల రద్దు..నోట్ల రద్దు నేపథ్యంలోనూ అంగరంగ వైభవంగా నభూతో అన్న తీరున సాగిన గాలి జనార్దనరెడ్డి కుమార్తె వివాహం.. సామాన్యుల్లో ఒకే ప్రశ్నను రేకెత్తిస్తోంది. కేవలం రెండు వేల నోట్ల రూపాయల కోసం పడరానీ పాట్లూ పడుతూ.. తామంతా క్యూ లైన్లలో నిలుచుంటే.. గాలి జనార్దనరెడ్డికి.. కుమార్తె పెళ్లి కోసం సరికొత్త నగదు అంత భారీగా ఎలా సమకూరిందీ అన్న సందేహం కలుగుతోంది.

వందల కోట్ల ఖర్చుతో వివాహం
మైనింగ్‌ మాఫియాగా ఆరోపణలు ఎదుర్కొని.. మూడేళ్లు జైలు జీవితం గడిపి.. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన గాలి జనార్దనరెడ్డి.. బుధవారం తన కుమార్తె బ్రహ్మణీరెడ్డి పెళ్లిని నభూతో అన్న రీతిలో జరిపారు. జిగేల్‌ జిగేల్‌ మనే బెంగళూరు ప్యాలెస్‌ మెరుపులు.. విజయనగర కాలాన్ని గుర్తుకు తెచ్చే అద్భుత సెట్టింగ్‌లు, తాను పుట్టి పెరిగిన బళ్లారికి చెందిన ప్రముఖ వీధులను గుర్తుకు తెచ్చే సెట్టింగ్‌లు.. ఇది వివాహమా..? లేక చారిత్రక ప్రదర్శన కేంద్రమా అన్న భావనను కలిగించింది.
బాలీవుడ్‌ నుంచి వచ్చిన ఆర్ట్‌ డైరెక్టర్లు గాలి వారింటి పెళ్లి వేదిక
బాలీవుడ్‌ నుంచి వచ్చిన ఆర్ట్‌ డైరెక్టర్లు గాలి వారింటి పెళ్లి వేదికను, పరిసరాల్లోని సెట్టింగ్‌లను రూపొందించారు. సినిమా రంగంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే వీరందరికీ గాలి జనార్దనరెడ్డి కూడా భారీ మొత్తంలోనే చెల్లించినట్లు చెబుతున్నారు. వివాహ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా.. ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే తక్షణమే స్పందించేందుకు మూడు వేల మంది బౌన్సర్లనూ జనార్దనరెడ్డి నియమించారు. దీనికోసం సదరు బౌన్సర్లను ఏర్పాటు చేసిన సంస్థలకు కోట్లాది రూపాయలు ముట్టచెప్పినట్లు భోగట్టా.

వివాహ వేడుకకు ఇప్పటికే కనీసం 100 కోట్ల రూపాయలు ఖర్చు
ఇక వివాహానికి హాజరైన అతిథులను బెంగళూరు ప్యాలెస్‌ చుట్టుపక్కల ఉన్న షాంగ్రిలా, విండ్సర్‌ మానర్‌, లీమెరిడియన, గ్రాండ్‌ అశోకా తదితర ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగిన రిసెప్షన్‌కు, బుధవారం నాటి వివాహ వేడుకకు ఇప్పటికే కనీసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఓ అంచనా. హైదరాబాద్‌లోని ఆత్మీయులు, మిత్రులు, బంధువుల కోసం.. త్వరలోనే శంషాబాద్‌లోనూ ఓ రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీనికీ కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

పెళ్లి ఖర్చులకు ఎలా సమకూర్చుకున్నారనే ప్రశ్న?
దేశమంతటా పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇళ్లల్లో పెళ్లిళ్లు ఆగుతుంటే గాలివారింట మాత్రం ఇంత ఆడంబరంగా పెళ్లి చేసేందుకు డబ్బు ఎలా సమకూర్చుకున్నారు..? అన్న ప్రశ్నకు ఆయన అనుచరుల నుంచి ఓ విచిత్రమైన సమాధానం వస్తోంది. గాలి జనార్దనరెడ్డి తన కుమార్తె వివాహ ఖర్చుల కోసం కర్ణాటకలోని 10 ఆస్తులతో పాటు సింగపూర్‌లోని ఓ భవంతిని కుదువ పెట్టినట్లు చెబుతున్నారు. ఆ డబ్బుతో.. ఆరు నెలల క్రితమే ఏర్పాట్లన్నీ చేసేశారని, అవసరమైన అడ్వాన్సులు, ఖర్చులు నగదు రూపంలోనే జరిపారని చెబుతున్నారు. అందుకే పెళ్లిని ఇంత నిశ్చింతగా జరిపారన్నది ఆయన సన్నిహితుల కథనం. ఏది ఏమైనా.. నోట్ల రద్దు ప్రభావం సామాన్యులపై ఒకలా... సంపన్నులపై మరొకలా ఉందన్న అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది.

 

19:26 - November 16, 2016

తూర్పుగోదావరి  : పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మూలిగేనక్కపై తాటిపండు పడిన చందంగా మారిందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నోట్ల సమస్యతో రబీ సాగు డోలాయమానంలో పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త కరెన్సీ చాలినంతగా అందుబాటులోకి రాకపోవడంతో పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడంలేదు. నగదు సమస్యలో గోదావరి జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై 10 టీవీ ప్రత్యేక కథనం...

పెద్ద నోట్లను రద్దు చేయడంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రైతన్నకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సాగుచేసిన ఖరీఫ్‌ పంట ఇంకా చేతిరాలేదు. ఉన్నసొమ్ముతోపాటు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి పంటలు సాగు చేశారు. రబీ సీజన్‌ ప్రారంభమైన సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో అన్నదాతలను దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేసింది.

అప్పో చొప్పో చేసి రబీ పైర్లు సాగుచేసే వీలు లేని స్థితి
చేతిలో చిల్లిగవ్వ లేదు. బ్యాంకులన్నీ ఇప్పడు పాత నోట్ల మార్పిడి, డిపాజిట్లపైనే దృష్టి పెట్టాయి. రుణాల జారీవైపు తొంగిచూసే అవకాశం కూడా లేకుండా పోయింది. అప్పో చొప్పో చేసి రబీ పైర్లు సాగుచేద్దామన్న ఎవరి దగ్గరా డబ్బులులేవు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిద్దామన్నా.. వీరి దగ్గరా పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో ఏమిచేయాలో పాలుపోని స్థితిలో రైతులు దిగాలుగా చూస్తున్నారు. గోదావరి డెల్టాలో ఖరీఫ్‌ సాగు కంటే రబీపైనే రైతులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్‌లో అకాల వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటే చేతికొచ్చిన పంట నోటికందకుండా పోతుందన్న భయం అన్నదాతలను వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో రబీపై కూడా ఆసలు సన్నగిల్లుతున్నాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది. కౌలు రైతుల

కేంద్ర ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయంతో అందరికీ సమస్యలు
పెద్ద నోట్ల రద్దుతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పాత కరెన్సీ చలామణి గడువును పెంచాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయంతో అందరికీ సమస్యలు వచ్చిపడ్డాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది. సమస్యలను సృష్టించిన కేంద్రమే దీనికి సత్వర పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. 

19:02 - November 16, 2016

విజయవాడ : ప్రైవేట్‌ ఆస్పత్రులన్నీ మూతబడ్డాయి..ప్రభుత్వం నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ను రద్దు చేయడంతో వైద్యుల ఆందోళన బాట పట్టారు. కౌన్సిల్‌ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

18:52 - November 16, 2016

విజయవాడ : సాంకేతికంగా పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తమ పార్టీ మీడియా అధికార ప్రతినిధులందరిని కలుపుతూ ఓ వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది. ఏదైనా అంశంపై స్పందించాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు... ఆ అంశంపై పార్టీ స్టాండ్ ను ఇకపై వాట్సప్ ద్వారా అధికార ప్రతినిధులకు తెలియచేస్తారు. వాటిపై ఎలాంటి సందేహాలున్నా వెంటనే వాట్సప్ లో చర్చించుకునే అవకాశం కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఇకపై మీడియాల్లో టిడిపి తరపున హాజరయ్యే వాళ్ళందరు... పార్టీ లైన్ ను మరింత చొరవగా ముందుకు తీసుకెళ్ళే వీలు కలుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

18:50 - November 16, 2016

విజయవాడ : పెద్దనోట్ల రద్దుతో విజయవాడలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ వెలవెలపోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్తంభించడంతో విజయవాడలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. గతంలో ఒక్కో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 50 నుంచి 60 దాకా రిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు 20 నుంచి 30 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పాతనోట్లను రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తీసుకోకపోవడంతో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రిజిస్ట్రార్లు మాత్రం రిజిస్ట్రేషన్‌కు సంబంధించి డీడీలు మాత్రమే తీసుకుంటామని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

18:48 - November 16, 2016

విజయవాడ : 500, వెయ్యి నోట్ల రద్దుతో 8వ రోజైనా పరిస్థితులు కుదటపడడం లేదు. చిల్లరకోసం జనం నానా అగచాట్లు పడుతున్నారు. చాలాచోట్ల ఏటీఎంల దగ్గర భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఏటీఎంలు పనిచేయడం లేదు. నగదు పెట్టిన కొద్దిసేపట్లోనే ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయి. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు చిల్లర కొరత ఏర్పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో కూడా జనాలు లైన్లలో నిలబడి నానా అగచాట్లు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో లైన్లలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. చిల్లర కోసం, పాతనోట్ల మార్పిడి కోసం ప్రజలు పడిగాపులు పడుతున్నారు.

పెద్దనోట్ల మార్పిడికి వచ్చిన వృద్ధురాలు విజయలక్ష్మి మృతి
కృష్ణాజిల్లా ఉయ్యూరులో పెద్దనోట్ల మార్పిడికి వచ్చిన వృద్ధురాలు విజయలక్ష్మి మృతి చెందింది. స్థానిక ఎస్‌బీహెచ్‌ వద్ద ఉదయం నుంచి క్యూలో నిలబడి ఒక్కసారిగా కుప్పకూలింది. విజయలక్ష్మిని ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది.

కాకినాడ పోస్టాఫీసు వద్ద జనాలు పడిగాపులు
పాత నోట్ల మార్పిడి కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ బ్యాంకుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇదే అంశంపై కాకినాడలోని పోస్టాఫీసు ,వద్ద జనాలు అగచాట్లు చూడండి..

పెద్ద నోట్ల రద్దు మహాయజ్ఞం..వెంకయ్య

ఢిల్లీ: నల్లధనం నిర్మూలించడంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఒక మహాయజ్ఞమని, బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీపై ఇది ఒక రకమైన యుద్ధమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతిపకాలు ఎటువైపో తేల్చుకోవాలని సూచించారు. పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో జరుగుతున్న చర్చలో వెంకయ్య మాట్లాడారు. ఇవాళ ఉదయం నుంచి విపకాలు లేవనెత్తిన ప్రశ్నలపై వెంకయ్య సమాధానం ఇచ్చారు. సందిగ్ధత, అపోహల నుంచి కాంగ్రెస్ బయటకు రావాలని సూచించారు. 

కలెక్టర్లతో ఈటెల వీడియో కాన్ఫరెన్స్..

హైదరాబాద్: కలెక్టర్లతో మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఈటల జిల్లా కలెక్టర్లతో చర్చించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. 

నగరంలో భారీ చోరీ..

హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగులగొట్టి కిలో బంగారం, రూ. 11 లక్షలను దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన ఇంట్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తిని అంత్యక్రియలకు తీసుకెళ్లిన తర్వాత దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేశారు. బాధిత కుటుంబం పోలీసుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

18:02 - November 16, 2016

నిజామాబాద్ : అసలే పీకల్లోతు నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని ఇప్పుడు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వెంటాడుతోంది. అధికారుల తీరుతో రాష్ట్రంలో బస్టాండ్‌ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రగతి రథం ప్రజల నేస్తం అన్న ఆర్టీసీ నినాదం కేవలం పేరుకే పరిమితమైపోయింది. ఇందుకు ఉదాహరణే నిజామాబాద్ బస్టాండ్.

వేలాది మంది ప్రయాణీకులు వందలాది ఇక్కడి నుంచి ప్రయాణాలు
తెలంగాణలో బస్టాండ్‌ల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. నిజామాబాద్‌ బస్టాండ్ రాష్ట్రంలో పేరుగాంచింది. నిత్యం వేలాది మంది ప్రయాణీకులు వందలాది ఇక్కడి నుంచి ప్రయాణాలు చేస్తుంటారు. అలాంటి బస్టాండ్‌కి ఇప్పుడు కష్టకాలం వచ్చింది. శిథిలావస్థకు చేరిందని రెండు నెలల క్రితం ఆర్టీసీ అధికారులు ఈ బస్టాండ్‌ని కూల్చివేశారు. ఇంతవరకు దాని స్థానంలో నూతన భవనాన్ని నిర్మించకపోవడంతో ప్రజలు తడెకల కిందే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.

మురికి నీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం
బస్టాండ్ తదితర ప్రాంతాల్లో మురికి నీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీనికి తోడు దోమల బెడదతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఫ్లాట్ ఫారంలు లేకపోవడంతో ఏ బస్సు ఎక్కడ వచ్చి ఆగుతుందో తెలియడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

కొత్త బస్టాండ్‌ని నిర్మించాలని ప్రయాణికులు డిమాండ్
నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే ఈ బస్టాండ్ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్న ఉన్నతాధికారులు కన్నెత్తి చూడడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వీడి.. కూల్చివేసిన బస్టాండ్ ప్రదేశంలో కొత్త బస్టాండ్‌ని నిర్మించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. 

17:59 - November 16, 2016

హైదరాబాద్ : భాగ్యనగరంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇళ్ల నిర్మాణానికి మూడు సార్లు టెండర్లు పిలిచినా.. సరైన స్పందన లేకపోవడంతో ప్రైవేట్‌ బిల్డర్లకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. దీంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం స్పీడందుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నత్తనడకన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం
తెలంగాణ ప్రభుత్వ కలల ప్రాజెక్టు అయిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం నాలుగడుగులు ముందుకు.. ఏడడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. భాగ్యనగరంలో ఏడాదిలోనే లక్ష ఇళ్లు నిర్మిస్తామని స్వయానా కేసీఆర్‌ హామీ ఇచ్చినా.. ఇళ్ల నిర్మాణానికి టెండర్లు కరువయ్యాయి. జీవో నెంబర్‌ 94 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్డ్‌ అయిన కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లు దాఖలు చేసే అవకాశం ఉండడంతో స్పందన అంతం మాత్రమే ఉంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది జీహెచ్‌ఎంసీ. లైసెన్స్‌ పొందిన బిల్డర్లకు అవకాశం ఇస్తే నిర్మాణ ప్రక్రియ వేగవంతమవుతుందని సూచించింది. దీంతో ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్డ్‌ కాంట్రాక్టర్లతో పాటు.. జీహెచ్‌ఎంసీ లైసెన్స్‌ పొందిన బిల్డర్లు కూడా టెండర్లు దాఖలు చేసే వెసులుబాటు కల్పించింది.

చార్టెడ్‌ అకౌంటెంట్‌, అనుభవం ఉన్న ఇంజనీర్‌ ధృవీకరణ
ప్రభుత్వ తాజా నిర్ణయంతో భవనాల నిర్మాణ రంగంలో అనుభవజ్ఞులైన బిల్డర్లకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు దాఖలు చేసే అవకాశం కలగనుంది. వీరు చార్టెడ్‌ అకౌంటెండ్‌, అనుభవం కలిగిన ఇంజనీర్‌తో ధృవీకరించబడి.. ప్రస్తుతం చేస్తున్న పనులు, పూర్తి చేసిన పనులకు సంబంధించిన వివరాలు అందించాల్సి ఉంటుంది.

42 ప్రాంతాలలో 18,805 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు టెండర్లు
ప్రభుత్వ తాజా నిర్ణయంతో పరిపాలన అనుమతులు జారీ చేసిన 42 ప్రాంతాలలో 18,805 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు జీహెచ్‌ఎంసీ సిద్దమవుతోంది. ఇప్పటివరకు టెండర్లు రాని ఈ పథకానికి.. ప్రభుత్వ తాజా నిర్ణయం ఎంతవరకు కలిసివస్తుందో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగాల్సి ఉంది. 

17:56 - November 16, 2016

వికారాబాద్ : బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధనే లక్ష్యంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 31వ రోజు కొనసాగుతోంది. ఓబీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య మాట్లాడుతూ..సంచార జీవితం గడుపుతున్నవారికి కుల సర్టిఫికెట్లు కూడా లేవన్నారు. అందుకనే వీరికి సంక్షేమపథకాలు అమలు జరపటంలేదన్నారు. వారికి అన్నిరకాల గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఎంబీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య డిమాండ్ చేశారు. వికారాబాద్‌ జిల్లా కోటిపల్లి మండలం ఓబులాపురం గ్రామంలో సీపీఎం నేతలు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇదే గ్రామంలో అభివృద్ధికి నోచుకోని మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌కు చెందిన కుటుంబం తమ సమస్యను విన్నవించింది. కోటిపల్లి మండలం ఓబులాపురంలో కర్ణాటక నుండి వలస వచ్చిన సంచార జాతులకు సంబంధించిన ఓ కుటుంబం తమ కష్టాలను సీపీఎం పాదయాత్రకు తెలుసుకున్నారు. బ్రతుకుతెరువు కోసం కర్ణాటక నుండి వికారాబాద్ మండలానికి వలస వచ్చిన ఓ కుటుంబ బాధలిలా వున్నాయి. ఊరూరూ తిరిగి కూలిపనులు చేసుకుంటామని ఇలా రెండు నెలలకోసారి తమ రాష్ట్రానికెళ్లి వస్తామని వారు తెలిపారు. 

17:48 - November 16, 2016

హైదరాబాద్ : ఫీజు బకాయిలు చెల్లించకపోతే సీఎం కేసీఆర్‌ను విద్యార్థులు రోడ్లపై తిరగనివ్వరని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఫీజు బకాయిలు అంశంలో కేసీఆర్ డ్రామాలాపాలని ఎద్దేవా చేశారు. చెల్లించాలంటూ ఆయన కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేసీఆర్ ఆటలాడుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. 

17:45 - November 16, 2016

హైదరాబాద్ : ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన... రాష్ట్రంలోని 11 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇందుకు కావల్సిన నిధుల సేకరణ కోసం నాబార్డు అధికారులతో ఆయన సెక్రటేరియట్ లో సమావేశం జరిపారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు నిధులు అందించాలని ఆయన నాబార్డును కోరారు. కేంద్రం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మూడేళ్లలో ఈ 11 ప్రాజెక్టులు పూర్తి చేయవలసి ఉందని... ఇందుకుగాను 7వేల 900 కోట్ల రూపాయల నిధులు అవసరమని నాబార్డు బృందానికి మంత్రి తెలిపారు. 

17:43 - November 16, 2016

హైదరాబాద్ : కరెన్సీ షాక్‌ తగిలింది. దీంతో పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల ప్రకటన నిర్ణయాన్ని గులాబీ దళాధిపతి వాయిదా వేసుకున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ నోటా, ఈ నోటా... విషయం ఆశావహులకు తెలియడంతో వారు నిరాశకు లోనవుతున్నారు.

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల కూర్పుపై దృష్టి
పెద్ద నోట్ల రద్దు ప్రభావం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పైనే కాదు.. పార్టీ మీద కూడా పడింది. గులాబిదళంలో ఉత్సాహం నింపేందుకు పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల కూర్పుపై దృష్టి, నెల రోజులు కసరత్తు తర్వాత వీటికి తుదిరూపం ఇచ్చారు. వీటిని ప్రకటించాలనుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా పెద్ద నోట్లను రద్దు చేయంతో టీఆర్‌ఎస్‌ అధినేత పునరాలోచనలో పడ్డారు. ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను చలామణిని నుంచి తొలగించడంతో ప్రభుత్వం ఖజానా కుదేలైంది. ఇప్పుడు దృష్టంతా దీనిపైనే ఉండటంతో పార్టీ కార్యవర్గాల ప్రకటనను వాయిదా వేసుకున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో పదవులపై ఆశపెట్టుకున్న వారు నిరాశకు లోనవుతున్నారు.

కార్యవర్గాలను ప్రకటించి శిక్షణ ఇవ్వాలనుకున్న కేసీఆర్‌
గులాబీ బాస్‌ ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం... పార్టీ కార్యవర్గాలను ఈ నెల్లో ప్రకటించి శిక్షణ ఇవ్వాలనుకున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తువుతున్న సందర్భంగా వచ్చే నెల 2న భారీ బహిరంగ సభ నిర్వాహిచాలనుకున్నారు. కానీ పెద్ద నోట్ల రద్దుతో ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కార్యవర్గాలు, సభల్లో ముగినిగి తేలితే... అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపడుతున్న టీఆర్‌ఎస్‌... నేతలు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. ప్రజల ఇబ్బందులను కేంద్ర దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కరెన్సీ కష్టాలు తొలగిపోయిన తర్వాత గులాబీ బాస్‌... పార్టీ కార్యవర్గాల ప్రకటనపై మళ్లీ దృష్టి పెట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

 

పెద్ద నోట్ల రద్దుపై కోదండరాం స్పందన..

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుపై ప్రొ.కోదండరాం స్పందించారు. నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే కరెన్సీని పెంచాలని..విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. నల్లధనం బయటకు వస్తుందన్న ఆశతో ప్రజలు కష్టాలు భరిస్తున్నారని, ప్రజల అవస్తలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలని సూచించారు. నోట్ల రద్దుపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అలాగే నల్లధనం దాచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బడా పెట్టుబడి దారులకు బకాయిలు మాఫీ చేయడం అన్యాయమన్నారు. 

17:04 - November 16, 2016

నెల్లూరు : తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నాయకులు, ప్రజలు చేస్తోన్న కృషి అభినందనీయమని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ అన్నారు. ఆయన దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లాలోని కండ్రగ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మొదట కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. తరువాత గ్రామంలో జరుగుతున్న స్వచ్ఛభారత్‌ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు సచిన్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

గోదావరి నది యాజమాన్య బోర్డు భేటీ..

హైదరాబాద్ : జలసౌధలో గోదావరి నది యాజమాన్య బోర్డు భేటీ జరిగింది. బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టులు, నిర్వాహణపై చర్చ జరిగింది. 

17:00 - November 16, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌కు రాత్రి ఏది కలలోకి వస్తే అది ప్రజలపై రుద్దుతారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించడం లేదంటూ ఆయన కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రజల అవసరాలను విస్మరించి..పాలన చేస్తున్న కేసీఆర్ డ్రామాలు ఆపాలని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు పడుతున్నారన్నారు. విద్యార్ధులకు కేజీ టూ పీజీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు రాత్రి కల్లోకి వచ్చిందే పగలు ప్రజలపై రుద్దుతున్నాడని ఎద్దేవా చేశారు.  

మీడియాకు స్వేచ్ఛ అవసరమన్న మోడీ..

ఢిల్లీ : ప్రెస్ కౌన్సిల్ స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. మీడియాపై అతి నియంత్రణ సమాజానికి మంచిది కాదని, ప్రభుత్వాలు కూడా తమకు నచ్చిన వారికి లీకులిస్తున్నాయని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో మీడియా మౌనంగా ఉందని, మీడియాకు స్వేచ్ఛ అవసరమని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల హత్యలు బాధాకరమని, తప్పుల ఆధారంగా మీడియాపై ఓ అభిప్రాయానికి రావడం సరికాదన్నారు.  

ఓటుకు నోటు కేసులో హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. ఉండవల్లి వాదనలు ముగిశాయి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, చట్టం ముందు అందరూ సమానమేనని ఎవరూ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. కోర్టుకున్న అధికారాలతో బాబును విచారించేలా ఆదేశించాలని కోరారు. దేశం మొత్తం ఈ కేసును ఉత్కంఠగా ఎదురు చూస్తోందని తెలిపారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. 

16:57 - November 16, 2016

తూర్పుగోదావరి : శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే అడ్డుకోవడం సరికాదని..రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని అంబటి రాంబాబు ఆరోపించారు. కిర్లంపూడిలో కాపు నేత ముద్రగడ పద్మనాభంను కలవడానికి వెళ్లిన అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. తమను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అంబటి అన్నారు. ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభంను కలిసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. 

16:55 - November 16, 2016

కర్నూలు : పాత నోట్ల రద్దు.. పెళ్లి వేడుకలపై కూడా పడుతోంది. కర్నూలు జిల్లా నంద్యాల కోటవీధిలో రవి-ఈశ్వరి వివాహం నిశ్చయించారు. అయితే.. పాతనోట్లు కట్నంగా తీసుకునేందుకు వరుడి కుటుంబం నిరాకరించింది. దీంతో పెద్దలు జోక్యం చేసుకుని.. వరుడు తల్లిదండ్రులను ఒప్పించారు. దీంతో పెళ్లికి శుభం కార్డు పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

పెద్ద నోట్ల వల్ల ఇబ్బందులు - ఏచూరి..

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు వల్ల రైతులు, కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడారు. పనులు లేక 25 లక్షల ట్రక్కులు నిలిచిపోయాయని, జాతీయ రహదారులపై వేల ట్రక్కులు నిలబడి ఉన్నాయన్నారు. కూరగాయాలు..పండ్లతో ఈ ట్రక్కులు వెళుతున్నాయన్నారు. ట్రక్కు డ్రైవర్లు, డైలీ వర్కర్స్, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రూ. 2వేల రూపాయల నోటుకు చిల్లర దొరకపోవడంతో తాను స్వయంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అస్సాంలో ట్రీ గార్డ్స్ వర్కర్స్ కు సహాయం చేసినట్లే బెంగాల్..ఇతర ప్రాంతాల్లో ఎందుక చేయలేదని నిలదీశారు.

16:45 - November 16, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు..ప్రజలు పడుతున్న ఇబ్బందులపై టీ.జాక్ అధ్యక్షలు ప్రొ.కోదండరాం మాట్లాడారు. ముందస్తు చర్యలు చేపట్టకుండా పెద్ద నోట్లను రద్దు చేయటాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రజల అవసరాల మేరకు..సరైన ఏర్పాట్లు చేయకుండా..వంద నోట్ల ను పెంపు చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. చిల్లర కరెన్సీ ప్రజలకు అందుబాటులో లేనందువల్ల అసంఘటిత రంగం నిలిచిపోయిందన్నారు. అమ్మకాలు నిలిచిపోయాయన్నారు. దీంతో జీవనోపాధి అవకాశాలు దెబ్బతిన్నాయన్నారు. చిల్లర లేమితో రోజుకూలిలకు దీంతో పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిరువ్యాపారులు చిల్లర లేమితో వ్యాపారం దెబ్బతింటోందన్నారు. చిన్న నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రప్రభుత్వాన్ని కోదండరాం కోరారు. ఆధునిక బ్యాంకింగ్ విధానం తెలియనివారు దీంతో సమస్యల్లో ఇరుక్కుపోతున్నారన్నారు. ఇటువంటి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. పలు రూపాల్లో వున్న నల్లధనం పేరుకుపోయిందనీ..దాన్ని వెలికి తీసుకునేందుకు..వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కర్నాటకలో గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహానికి వందలాది కోట్లు ఖర్చుచేస్తున్నాడనీ..ఇటువంటివారిపై చర్యలు తీసుకోవాల్సిన అవుసరముందన్నారు. బ్లాక్ మనీ బైటకొస్తే ప్రజలకు పంపిణీ చేసే సంక్షేమపథకాలు అమలవుతాయన్నారు. 

16:41 - November 16, 2016

కృష్ణా : పెద్దనోట్ల రద్దు నిర్ణయం పలువురి ప్రాణాలకు బలిగొంటోంది. పాతనోట్లకు మార్చుకునేందుకు బ్యాంక్ లకు వచ్చి గంటల తరబడి లైన్లలో నిలబడలేక వేరేదారిలేని స్థితిలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్ మారేడ్ పల్లిలో బుధవారం నాడు నోట్లు మార్చుకునేందుకు వచ్చిన ఓ రిటైర్డ్ ఉద్యోగి లైన్ లో నిలబడి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో పెద్దనోట్లను వందనోట్లుగా మార్చుకునేందుకు వచ్చిన కనక మేడల విజయలక్ష్మి అనే వృద్ధురాలు(71) ఉదయం నుండి లైన్ లో నిలబడి ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. అక్కడున్నవారు వెంటనే స్పందించి అంబులెన్స్ ను రప్పించి ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ ఘటన ఎస్ బీహెచ్ బ్యాంక్ వద్ద జరిగింది. మృతి చెందిన విజయలక్ష్మి పమిడిముక్కల మండలం గోపవాని పాలెం వాసిగా తెలుస్తోంది. 

15:40 - November 16, 2016

ఢిల్లీ : కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీ సమస్యలు తీరిపోతుందా అని రాజ్యసభలో  పెద్దనోట్ల రద్దు అంశంపై మాట్లాడుతూ..సీపీఎం నేత సీతారాం ఏచూరి కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 90శాతం నల్లధనం విదేశాల్లో మూలుగుతోందన్నారు. దేశంలో దాదాపు 86 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే కొనసాగుతాయనీ..కేవలం 14 శాతం మాత్రమే ఆన్ లైన్ ద్వారా జరుగుతాయన్నారు. ఇటువంటి పరిస్థితి వున్న భారతదేశంలో ఆన్ లైన్  విధానం ఎంతవరకూ కొనసాగుతుందన్నారు. ప్రతీ అంశాన్ని ఆన్ లైన్ లో చూసుకోమంటున్న కేంద్రం ఆన్ లైన్ విధానం తెలియ‌ని సామాన్యుడు ఇబ్బందుల్లో పడుతున్నాడన్నారు.నల్లధన్నాన్ని రప్పించిన ప్రతీ ఖాదాదారుడ్నికి రూ.15లక్షలు జమ చేస్తానన్న ప్రధాని వాగ్దానం ఏమైందని ఈ సందర్భంగా ఏచూరి కేంద్రాన్ని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనీ పంటకు గిట్టుబాటు లేక రైతులు నష్టాలపాలవుతున్నారని ఈ సమస్యలన్నింటికీ కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

15:25 - November 16, 2016

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభమైంది. ప్రారంభమైన అనంతరం రాజ్య‌స‌భ‌లో పెద్ద‌నోట్ల ర‌ద్దుపై చ‌ర్చ కొన‌సాగింది. ఈ అంశంపై సీపీఎం రాజ్య‌స‌భ సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రజలు పడుతున్న కష్టాలపై సీపీఎం ఎంపీ సీతారాం కేంద్ర నిర్ణయంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీనికి కేంద్రం ఏం సమాధనం చెబుతుందని ప్రశ్నించారు. నోట్ల రద్దు నిర్ణయానికి ముందే బీజేపీ నేతలకు ముందే తెలుసనీ అందుకే నోట్ల రద్దు ప్రకటనకు ముందే బీజేపీ నేతలు బెంగాల్ లో కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారని పేర్కొన్నారు. ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోకుండా ఇటువంటి చ‌ర్య‌లు ఎందుకు తీసుకున్నారని అడిగారు. జాతీయ ర‌హ‌దారుల‌పై స‌ర‌కు ర‌వాణా వాహ‌నాలు వేల సంఖ్య‌లో ఆగిపోయాయని, మ‌రోసారి పంట ఉత్ప‌త్తుల ధ‌ర‌లు ప‌డిపోయాయని చెప్పారు. రోజువారీ కూలీలు చిల్లర లేక భోజనం కూడా చేయలేని స్థితిలో వున్నారని పేర్కొన్నారు. చేసేందుకు పనులు లేక దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డ్రైవర్లు దాబాల్లో క్రెడిట్ కార్డులు ఉపయోగించి భోజనం చేయాలా అని ప్రశ్నించారు. రైతులు,కార్మికులు చిల్లర కొరతతో పనులు లేకా దొరికిన పని చేసి కూలీలు కూలి పొందలేకా పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనుల్లేక 25 లక్షల వాహనాలు నిలిచిపోయాయన్నారు. నల్ల ధనాన్ని తెప్పించి ప్రతి ఖాతాదారుడి ఖాతో రూ.15లక్షలు వేస్తామని ప్రధాని మోదీ ఇచ్చి హామీ ఇప్పుడు ఏమైందని ఊచూరి ప్రశ్నించారు. బ్లాక్ మనీ అంశంలో మొసళ్ళను వదిలి చిన్న చేపలపై ప్రతాపం చూపుతున్నారని ఎద్దేవా చేశారు. 

14:55 - November 16, 2016

హైదరాబాద్ : చిక్కడపల్లిలో ఆరేళ్ల బాలుడు జాహిద్ కిడ్నాప్ కు గురయ్యాడు. ఇది ఉదయం 10 గంటలకు జరిగింది. చాదర్ ఘాట్ కు ఆటోలో తండ్రికొడుకులు వెళుతున్నారు. సిగరేట్ కోసం తండ్రి ఆటో దిగగానే బాలుడిని ఆటో డ్రైవర్ తీసుకెళ్లిపోయాడు. పీఎస్ లో బాలుడి తండ్రి జహంగీర్ ఫిర్యాదు చేశాడు. జహంగీర్ భార్య అనారోగ్యంగా వుండటంతో కుమారుడ్ని తీసుకుని జహంగీరు ఆటోలో ఆసుపత్రికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఓషాపుకు వెళ్లేందుకు జహంగీర్ ఆటో దిగాడు. ఇదే అదనుగా భావించిన ఆటో డ్రైవర్ బాలుడ్ని తీసుకుని పరారయ్యాడు.దీంతో దిక్కుతోచని జహంగీరు చిక్కడపల్లి పీఎస్ లో ఫర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ కోసం గాలింపుచర్యలు చేపట్టారు. 

14:50 - November 16, 2016

ఢిల్లీ : మొండి బకాయిల విషయంలో ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.7,016 కోట్ల లోన్లపై ఆశలు వదులుకున్నట్టు ప్రకటించింది.మొత్తం 94 ఖాతాలపై రుణాలు వసూలు చేయలేమని చేతులెత్తేసింది. ఇందులో విజయ్‌మాల్యాకు చెందిన 1201 కోట్లు రుణాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు... కేఎస్‌ ఆయిల్‌ సంస్థకు చెందిన 596 కోట్లు, సూర్యా ఫార్మా రూ.526 కోట్లు, జీఈటీ పవర్‌ 400 కోట్లు, సాయి ఇన్ఫో సిస్టమ్స్‌ రూ.376 కోట్లు ఉన్నాయి. వీటిని వసూలు చేయలేమంటూ.. ఎస్బీఐ చేతులెత్తేసింది. 

14:47 - November 16, 2016

వరంగల్ : సెంట్రల్ జైలు తరచూ వార్తల్లోకి వస్తోంది. ఇటీవలే వరంగల్ సెంట్రల్ జైలు నుండి ఇద్దరు ఖైదీలు పరారైన సంగతి తెలిసిందే. బుధవారం ఇదే జైల్లో ఓ ఖైదీ ఆత్మహత్యకు యత్నించాడు. బీహార్ కు చెందిన రాజశేఖర్ అనే ఖైదీ ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషయమించటంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. తన వద్ద వున్న మత్తు టాబ్లయిట్స్ మింగి ఆత్మహత్యకు యత్నించినట్లుగా తెలుస్తోంది. అసలు ఖైదీ వద్దకు ఈ టాబ్లయిట్స్ ఎలా వచ్చాయనేది విషయంపై అధికారులు ఆరాతీస్తున్నారు. దీంతో జైల్లో భద్రతా లోపాలు ఎలా వున్నాయో తెలుస్తోంది. కాగా ఇటీవల ఇదే జైలు నుండి ఇద్దరు ఖైదీలు సెక్యూరిటీ కళ్లు కప్పి పరారయిన సంగతి తెలిసిందే. 

14:42 - November 16, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు పార్లమెంట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు పాదయాత్ర నిర్వహించాయి. తృణమూల్‌ చీఫ్‌ మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో బిజెపి మిత్రపక్షం శివసేన, ఆప్, ఎన్‌సి నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌, వామపక్షాలు, తదితర పార్టీలు ఈ ర్యాలీలో పాల్గొనలేదు. ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ కూడా ర్యాలీకీ గైర్హాజరయ్యారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై మమతా బెనర్జీ రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించనున్నారు. 

ఎస్ బీఐ రైట్స్ ఆఫ్ చేసిన జాబితాలో....

ఢిల్లీ : ఎస్ బీఐ రైట్స్ ఆఫ్ చేసిన జాబితాలో విజయ్ మాల్యాకు చెందిన రూ. 1201 కోట్లు.. కేఎస్ ఆయల్ సంస్థకు చెందిన రూ. 596 కోట్లు...సూర్యా ఫార్మా రూ. 526 కోట్లు..జీఈటీ పవర్ 400 కోట్లు...సాయి ఇన్ఫోసిస్టమ్స్ రూ. 376 కోట్లు..ఉన్నాయి. బడా బాబుల ఆస్తులు రైట్స్ ఆఫ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వరంగల్ సెంట్రల్ జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం..

వరంగల్ : జిల్లా సెంట్రల్ జైల్లో మరో ఘటన చోటు చేసుకుంది. బీహార్ కు చెందిన ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏజీఎం ఆసుపత్రికి తరలించారు. 

చిక్కడపల్లిలో ఆరేళ్ల బాలుడు కిడ్నాప్..

హైదరాబాద్ : చిక్కడపల్లిలో ఆరేళ్ల బాలుడు జాహిద్ కిడ్నాప్ కు గురయ్యాడు. చాదర్ ఘాట్ కు ఆటోలో తండ్రికొడుకులు వెళుతున్నారు. సిగరేట్ కోసం తండ్రి ఆటో దిగగానే బాలుడిని ఆటో డ్రైవర్ తీసుకెళ్లిపోయాడు. పీఎస్ లో బాలుడి తండ్రి జహంగీర్ ఫిర్యాదు చేశాడు. 

మొండిబకాయిలపై ఎస్ బీఐ కీలక నిర్ణయం..

ఢిల్లీ : మొండి బకాయిల విషయంలో ఎస్ బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 7016 కోట్ల లోన్లపై ఎస్ బీఐ ఆశలు వదులుకుంది. ఎస్ బీఐ రైట్స్ ఆఫ్ చేసిన జాబితాలో విజయ్ మాల్యాకు చెందిన రూ. 1201 కోట్లు, మొత్తం 94 ఖాతాలపై ఎస్ బీఐ ఆశలు వదులుకుంది. 

14:07 - November 16, 2016
14:06 - November 16, 2016

ఢిల్లీ : కేరళ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న మారణకాండ పై ఫొటో ఎగ్జిబిషన్ ను సీపీఎం జాతీయ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ, కేరళ సీఎం పినరయ్ విజయన్ ఢిల్లీలో ప్రారంభించారు. కేరళలో ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపాన్ని ఫొటోల ద్వారా కేరళ రాష్ట్ర కమిటీ బహిర్గత పరిచింది. ఈ కార్యక్రమంలో సీపీఎం ఎంపీలు, పొలిట్ బ్యూర్ సభ్యులు, ఢిల్లీ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ హత్యాకాండలో మృతి చెందిన నేతలకు, కార్యకర్తలకు సీపీఎం నేతలు నివాళులర్పించారు. రెండు రోజులపాటు ఈ ఫొటో ఎగ్జిబిషన్ కొనసాగనుంది. 

 

అత్తాపూర్ ఎస్ బీఐ వద్ద దారి దోపిడి...

హైదరాబాద్ : అత్తాపూర్ ఐసీఐసీఐ బ్యాంకు దగ్గర దోపిడి జరిగింది. రూ. 50 లక్షలు డిపాజిట్ చేయడానికి వెళ్లిన బంగారం వ్యాపారి దీపక్ నుండి నకిలీ పోలీసులు బ్యాగ్ లాక్కెళ్లారు. 

13:51 - November 16, 2016

వికారాబాద్ : సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసం సీసీఎం మహాజన పాదయాత్ర చేపట్టింది. పాదయాత్ర 31 వ రోజుకు చేరుకుంది. వికారాబాద్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అన్ని వర్గాల నుంచి పాదయాత్ర బృందానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా పాదయాత్ర బృందం సభ్యుడు నగేష్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. దళితుల స్మశాన వాటికలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. కాలువల్లో బొందలు పెట్టే పరిస్థితి నెలకొందని వాపోయారు. దళితులకు స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలన్నారు. కూలీ పనులు లేక పేదలు వలస పోతున్నారని.. వారికి పని కల్పించి... వలసలను నివారించాలని కోరారు. ఉపాధి హామి పథకం నీరు గారి పోరుతుందని చెప్పారు. వెంటనే ఉపాధీ పనులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాను వీడియోలో చూద్దాం...

 

పుట్టంరాజుకండ్రిక అభివృద్ధి చెందడం సంతోషం - సచిన్..

నెల్లూరు : రెండేళ్లలో పుట్టంరాజుకండ్రిక అభివృద్ధి చెందడం చాలా సంతోసంగా ఉందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్కూలర్ పేర్కొన్నారు. పూర్తికాని పనులను త్వరలో పూర్తి చేస్తామని, స్వచ్ఛ భారత్ తో పాటు స్వస్త్ భారత్ కావాలని ఆకాంక్షించారు. సెకండ్ ఫేజ్ కింద నిర్నూరు, గొర్లపల్లిలో రూ. 3 కోట్లతో ఏడాదిలోపు పనులు పూర్తి చేయనున్నారు. ఇందుకు రూ. 90 లక్షల చెక్కును సచిన్ అందచేశారు. 

కొనసాగుతున్న కాపు నేతల అరెస్టు పర్వం..

తూర్పుగోదావరి : కాపు నేతల అరెస్టు పర్వం కొనసాగుతోంది. మండపేటలో కాంగ్రెస్ నేత కామన ప్రభాకర్ రావును, కిర్లంపూడికి బయలుదేరిన అంబటితో సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. బొమ్మూరు పీఎస్ కు తరలించారు. 

13:41 - November 16, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై ఢిల్లీలో విపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ఆధ్వర్యంలో పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్బుల్లా, బీజేపీ మిత్రపక్షమైన శివసేన పాల్గొన్నాయి. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులున రాష్ట్రపతి ప్రణమ్ ముఖర్జీకి విన్నవించనున్నారు. ఇది పెద్ద కుంభకోణంగా రాష్ట్రపతికి తెలిపనున్నారు. ఈ కార్యక్రమంలో లెఫ్టు పార్టీలు పాల్గొనలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పుట్టంరాజువారి కండ్రిగలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్...

నెల్లూరు :పుట్టంరాజువారి కండ్రిగలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పర్యటించారు. స్వచ్ఛ భారత్ పై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సామాజిక వికాస భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు క్రీడా కిట్ లను సచిన్ అందచేశారు. పుట్టంరాజుకండ్రిగలో క్రీడల అభివృద్దికి సచిన్ హామీనిచ్చారు. క్రికెట్ తో పాటు మిగతా ఆటలను ప్రోత్సాహిస్తానన్నారు. గ్రామస్తులతో సచిన్ సెల్ఫీ దిగారు. 

పార్లమెంట్ నుండి రాష్ట్రపతి భవన్ వరకు మార్చ్..

ఢిల్లీ : పార్లమెంట్ నుండి మమత ఆధ్వర్యంలో మార్చ్ జరిగింది. పార్లమెంట్ నుండి రాష్ట్రపతి భవన్ వరకు మార్చ్ నిర్వహించారు. పెద్దనోట్ల రద్దుపై విపక్షాలు మార్చ్ నిర్వహించాయి.

జగ్గారెడ్డి అరెస్టు...

సంగారెడ్డి : జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని మాజీ విప్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. విద్యార్థులు..పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. జగ్గారెడ్డిని అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. 

13:21 - November 16, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో వాడివేడి చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ అవినీతిపై ప్రధాని పోరాడడం కొందరికి నచ్చడం లేదన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. దేశ ప్రయోజనాల కోసమే పెద్ద నోట్లు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకే నోట్లను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సక్రమైన డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. డిసెంబర్ 30 వరకు నగదు మార్పిడికి అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:10 - November 16, 2016
13:08 - November 16, 2016
12:44 - November 16, 2016

కర్నాటక : నోట్ల రద్దు నేపథ్యంలో.. పెద్దమొత్తాలను మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పెళ్లిళ్ల కోసం కూడబెట్టిన... అనేక మంది సామాన్యులు..చేసేది లేక వివాహాలను వాయిదా వేసుకున్నారు. మరికొందరైతే ఏకంగా పెళ్లిళ్లను రద్దు చేసుకున్నారు. కానీ... ఓ వీఐపీ కుమార్తె వివాహం మాత్రం కోట్ల రూపాయల ఖర్చులతో అంగరంగ వైభవంగా జరగుతోంది. నల్లధనం ఇబ్బందులు సామాన్యులకే తప్ప.. సంపన్నులకు కాదనే విషయాన్ని ఈ వివాహం మరోసారి రుజువు చేస్తోంది. ఇంతకీ.. ఎవరిదా వివాహం...?  అనే కదా మీ డౌట్‌... అయితే మీరీ స్టోరీ చూడాల్సిందే...! 
రూ. 4 వేలు విత్ డ్రా చేసుకునేందుకు సామాన్యుల తిప్పలు 
నాలుగు వేల రూపాయలు బ్యాంకు నుంచి విత్‌ డ్రా చేసుకోవాలంటే.. సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. పరిమిత మొత్తంలో నగదు డ్రా చేసుకునేందుకే బ్యాంకులు ఆంక్షలు విధించడంతో... చాలామంది పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపలేక.. అన్ని పనుల్ని వాయిదా వేసుకున్నారు. కొందరైతే.. అప్పటికే నిశ్చితార్థం అయిన పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటే... మరికొందరు.. వాటిని రద్దు చేసుకున్నారు. అయితే... మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి కుమార్తె వివాహం మాత్రం అంగరంగవైభవంగా కోట్ల రూపాయల ఖర్చుతో సాఫీగా జరగబోతోంది. అందరూ ఆశ్చర్యపోయేలా ఇప్పటికే.. ఖరీదైన శుభలేఖలు పంచిన గాలి జనార్దన్‌రెడ్డి... కోట్ల రూపాయలు ఖర్చు చేసి కుమార్తె వివాహం ఘనంగా జరుపుతున్నారు. 
50 వేల మంది గెస్ట్‌లు హాజరు... 
గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె వివాహానికి దాదాపు 50 వేల మంది గెస్ట్‌లు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా..రాజకీయ నేతలు, సినీతారలు, వీవీఐపీలు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.  వేడుకలకు వచ్చే అతిథులకు అన్ని ఏర్పాట్లు చేయాలంటే కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది. మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా... వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న గాలి జనార్దన్‌రెడ్డికి .. నగదు ఎలా సమకూరుతోందన్న ప్రశ్నలు సామాన్యుడిని తొలచివేస్తున్నాయి. దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని బయటకు చెబుతున్నప్పటికీ.. ఆ ఖర్చు ఇంకా భారీ మొత్తంలోనే ఉంటుందనేది అంచనా. మరి.. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పెళ్లి ఖర్చులకు.. గాలికి ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎలా సమకూరుతోందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద నోట్ల ఇక్కట్లు సామాన్యులకే తప్ప.. సంపన్నులకు కాదన్న మాట అని జనం గుసగుసలు పోతున్నారు. 
పెళ్లికి హాజరు కావద్దని బీజేపీ నేతలకు అధిష్టానం ఆదేశాలు
మరోవైపు ...గాలిజనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహ వేడుకలకు హాజరు కావద్దని రాష్ట్ర బీజేపీ నేతలకు అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్పకు ఫోన్ చేసి ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. గాలి కుమార్తె వివాహానికి హాజరు కావాలా..? వద్దా...? అని సతమతమవుతున్న బీజేపీ నేతలు అధిష్ఠానం ఆదేశాలతో వెనక్కు తగ్గే అవకాశముంది. కోట్ల రూపాయల నల్లధనం వెచ్చించి గాలిజనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వివాహానికి బీజేపీ నేతలు హాజరైతే..ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉందని అధిష్టానం పేర్కొన్నట్లు తెలుస్తోంది. అటు కాంగ్రెస్‌ నాయకత్వం కూడా పార్టీ కర్నాటక శ్రేణులకు ఇదే తరహా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. గాలి ఇంట వివాహానాకి రాజకీయ ప్రముఖులే కాదు.. గల్లీ నాయకులు కూడా హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. మరి ఈ పెళ్లికి ఎవరెవరు వస్తారో..? ఎంత గ్రాండ్‌గా జరుగుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 

 

12:19 - November 16, 2016

ఢిల్లీ : నల్లధనంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నోట్ల మార్పిడికి ఐడీ ఫ్రూఫ్ జిరాక్స్ అవసరం లేదు...

న్యూఢిల్లీ : పాత పెద్ద నోట్ల మార్పిడికి ఐడీ ప్రూఫ్ జిరాక్స్ అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. బ్యాంకుల్లో కేవలం ఏదైనా గుర్తింపు కార్డు చూపించి నోట్ల మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది. నోట్ల మార్పిడి దరఖాస్తులో రాసిన వివరాలు, గుర్తింపు కార్డులో ఉన్న వివరాలు సరైనవిగా ఉండాలని పేర్కొంది. జిరాక్స్ కాపీలు తీసుకురావాలనే నిబంధన లేదని స్పష్టం చేసింది.

12:15 - November 16, 2016

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు విలవిల్లాడుతున్నారని తెలిపారు. నల్లధనం పేరుతో దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. రూ.2 నోటుకు చిల్లర దొరకడం లేదన్నారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద జనం బారులు తీరారని చెప్పారు. నల్లధనం ఉన్నవారి జాబితా ప్రభుత్వం వద్ద ఉంది.. వారి పేర్లను ఎందుకు భయటపెట్టడం లేదని ప్రశ్నించారు. నల్లధనం అంటే ఏమిటో తెలపాలన్నారు. నగదు రహిత దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా...అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

11:59 - November 16, 2016

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దివంగత ఎంపీలకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. థాయిలాండ్ మృతికి రాజ్యసభ నివాళి అర్పించింది. రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరుగుతోంది. నేటి నుంచి డిసెంబర్ 16 వరకూ నెల రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. లోక్ సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ వెల్లడించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
  

11:52 - November 16, 2016

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబర్ 16 వరకూ నెల రోజుల పాటు 
సమావేశాలు జరుగనున్నాయి. దివంగత ఎంపీలకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. అనంతరం లోక్ సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ సుమిత్రామహజన్ వెల్లడించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

డయాలసిస్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సుష్మాస్వరాజ్

ఢిల్లీ : కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఎయిమ్స్ లో డయాలసిస్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సుష్మా ఆరోగ్యం నిలకడగా ఉందని క్రానిక్ డయాబెటిస్ ఉండటంతో ఆ ప్రభావం కిడ్నీ పనితీరుపై పడిందని, బయాలసిస్ జరుగుతోందని ఎయిమ్స్ వర్గాలు తెలిపినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

11:47 - November 16, 2016

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబర్ 16 వరకూ నెల రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. దివంగత ఎంపీలకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. థాయ్ లాండ్ రాజు మృతికి రాజ్యసభ సంతాపం నివాళులర్పించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

చెన్నై ఆర్బీఐ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ : చెన్నైలోని ఆర్బీఐ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీపీఎం కార్యకర్తలు ఆర్బీఐ కార్యాలయాన్ని ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.

పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో చర్చ

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో చర్చను ఆనంద్ శర్మ ప్రారంభించారు. ఈ నెల 8న పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన చేశారని, నల్లధనం, నకిలీ నోట్లు నిర్మూలనకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని ప్రకటించారని ఆనంద్ శర్మ తెలిపారు. చెలామణిలో ఉన్న 86% కరెన్సీని రద్దు చేశారని చెప్పారు.

11:35 - November 16, 2016

మహారాష్ట్ర : భివండి కోర్టులో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఆర్ ఎస్ ఎస్ పరువునష్టం కేసులో రాహుల్ కు బెయిల్ మంజూరు అయింది. వ్యక్తిగత పూచికత్తుపై కోర్టు రాహుల్ కు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ 28కి వాయిదా పడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

భివండి కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట

మహారాష్ట్ర: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి భివండి కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఆర్ ఎస్ ఎస్ పరువునష్టం దావా కేసులో రాహుల్ కు బెయిల్ లభించింది. రాహుల్ వ్యక్తిగత పూచీకత్తు పై భివండీ కోర్టు బెయిల్ మంజూరు చేసి...విచారణను 28కి వాయిదా వేసింది. 

కొనసాగుతున్న రాజ్యసభ సమావేశాలు..

ఢిల్లీ : రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. శీతాకాల సమావేశాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే థాయిలాండ్ మృతికి, దివంగత ఎంపీలకు రాజ్యసభ నివాళి అర్పించింది. 

లోక్ సభ రేపటికి వాయిదా..

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే మృతి చెందిన సభ్యులకు లోక్ సభ సంతాపం తెలియచేసింది. అనంతరం గురువారానికి సభను వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ వెల్లడించారు. 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఇటీవలే మృతి చెందిన వారికి లోక్ సభ సంతాపం తెలియచేసింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 16 వరకూ నెల రోజుల పాటు జరుగనున్నాయి. 

నల్లధనం చర్చించేందుకు రెడీ - ప్రధాని మోడీ..

ఢిల్లీ : నల్లధనంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని సూచించారు. 

10:47 - November 16, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభం అయ్యాయి. డిజిటల్ క్లాసులను హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకే డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:43 - November 16, 2016

గుంటూరు : పెద్ద నోట్ల రద్దు చేసి ఎనిమిది రోజులైన పరిస్థితులు కుదుటపడడం లేదు. చిల్లర కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంల దగ్గర భారీగా క్యూలైన్లు ఉన్నాయి. చాలా చోట్ల ఏటీఎంలు పని చేయడం లేదు. నగదు పెట్టిన కొద్దిసేపట్లోనే ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయి. వినియోగ దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:39 - November 16, 2016

ధనుష్ వీఐపీ ఎంతటి సన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అదేనండి తెలుగులో రఘువరణ్ బీటెక్ గా రిలీజై సక్సెస్ అయిన వీఐపీ మూవీ సీక్వెల్ పట్టాలెక్కింది. ధనుష్ స్వయంగా కథ అందిస్తున్న ఈ మూవీ రెండో భాగానికి డైరెక్టర్ ని ఛేంజ్ అయ్యాడు. వీఐపీ 2 తెరకెక్కిస్తున్న ఆ దర్శకుడెవరో ఈ మూవీ విశేషాలేంటో మీరు ఓ లుక్కెయండి.
తమిళంలో భారీ హిట్టు 
ధనుష్ హీరోగా తమిళంలో మూడేళ్ల కిందట రిలీజైన విఐపి భారీ హిట్టుగా నిలిచింది. బక్కపలుచని బాబు ఈ మూవీతో తొలిసారి 50కోట్ల కలెక్షన్లను సాధించాడు. ఇదే సినిమాను తెలుగులో రఘువరన్ బీటెక్ పేరుతో డబ్ చేసి ఇక్కడ తొలి సక్సెస్ ను అందుకున్నాడు. ఈ సినిమాకి సీక్వెల్ రానున్నట్టుగా కొంతకాలంగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీని త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్లు ధనుష్ అనౌన్స్ చేశాడు.
వీఐపీ సినిమాకి వేల్ రాజ్ డైరెక్ట్ 
వీఐపీ సినిమాకి వేల్ రాజ్ డైరెక్ట్ చేశాడు. అయితే ఈ రెండో భాగానికి ధనుష్ కథ,మాటలు అందిస్తుండగా ఆయన వైఫ్ సౌందర్య దర్శకత్వం వహిస్తుండడం విశేషం. గతంలో ఈమె ధనుష్ హీరోగా చేసిన త్రీ మూవీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో బ్లాక్ బస్టర్ గా నిలిచిన వీఐపీ సీక్వెల్ ని సౌందర్య ఎలా డీల్ చేస్తారనేది ఇంట్రెస్ట్ గా మారింది.
తమిళం, తెలుగులోనూ ఏకకాలంలో షూటింగ్ 
ఈ సీక్వెల్ ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ సీక్వెల్ ని తెలుగులో సైతం  విఐపి 2 టైటిల్ తోనే రిలీజ్ చేయాలని ధనుష్ భావిస్తున్నాడట. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ మూవీని జెస్ట్ 2మంథ్స్ లో కంప్లీట్ చేసి ఫిబ్రవరి లేదా మార్చిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.మరి ధనుష్ భార్య ఈ సీక్వెల్ తో అయిన దర్శకురాలిగా ఫ్రూవ్ చేసుకుంటుందో చూడాలి.

 

10:35 - November 16, 2016

రామ్ చరణ్ ఇక థియేటర్స్ లో కలుద్దామంటూ హింట్ ఇచ్చేశాడు. ఈ మెగా వారసుడు ధృవ షూటింగ్ కంప్లీట్ అయిందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. ఇంట్రో సాంగ్ తో ఆన్ లోకేషన్స్ కి బాయ్ చెప్పిన చెర్రీ ఇక థియేటర్స్ లో హంగామా చేయడానికి రెడీ అయ్యాడు.
ధృవ షూటింగ్ కంప్లీట్ 
రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రం ధృవ రెండు రోజుల కిందట షూటింగ్ కంప్లీట్ చేసుకుందట. ఈ విషయాన్ని స్వయంగా చెర్రీ ట్వీటర్ ద్వారా పోస్ట్ చేశాడు. ధ్రువ సినిమాకి సంబంధించి చరణ్ ఇంట్రో సాంగ్ ని 5రోజులుగా షూట్ చేశారు. రీసెంట్ గా ఈ ఒక్క సాంగ్ చిత్రీకరణను పూర్తి కావడంతో టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిందని ఇక అతిత్వరలో థియేటర్స్ లో కలుద్దామంటూ రిలీజ్ పై క్లారిటి ఇచ్చేశాడు.
ధృవపై భారీ అంచనాలు 
బ్రూస్ లీ ప్లాప్ తరువాత వస్తున్న ధృవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కోలీవుడ్ సూపర్ హిట్టు  తని ఒరువన్ కి రిమేక్ అనే విషయం తెలిసిందే.మగధీర చిత్రం తరువాత అల్లు అరవింద్ మళ్లీ ఇన్నాళ్లకు చెర్రీతో ధృవ చిత్రం నిర్మిస్తుండడంతో ఈ మూవీపై స్కై రేంజ్ అంచనాలు ఏర్పడుతున్నాయి. 
ఆడియోకి సూపర్ రెప్పాన్స్ 
ఇటీవల రిలీజైన ధృవ ఆడియోకి సూపర్ రెప్పాన్స్ వస్తుంది. చెర్రీ సినిమాల్లోని సాంగ్స్ లో ఈ మూవీ సాంగ్ కూడా ది బెస్ట్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రకూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఒకప్పటి హ్యండసమ్ హీరో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ధృవతో చెర్రీ ఈసారైనా భారీ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

 

స్కూళ్లలో దశలవారీగా కంప్యూటర్లు - కడియం..

హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంలు ప్రారంభమయ్యాయి. మనటీవీలో ప్రసారాలను డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ లు ప్రారంభించారు. 3352 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంలు ప్రారంభించనున్నట్లు, ప్రమాణాలను కూడిన విద్యను అందించాలన్నదే లక్ష్యమని కడియం శ్రీహరి పేర్కొన్నారు. స్కూళ్లలో దశలవారీగా కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామని, ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్నదే లక్ష్యమన్నారు. డిజిటల్ క్లాస్ ల ద్వారా విద్యార్థుల ప్రమాణాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. 

నేడే గాలి కూతురు వివాహం..

బెంగళూరు : నేడు బెంగళూరు ప్యాలెస్ లో గాలి జనార్ధన్ రెడ్డి కూతురు వివాహం జరగనుంది. సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. వివాహానికి 70 ఎకరాల బెంగళూరు ప్యాలెస్ ముస్తాబైంది. ప్యాలెస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

10:29 - November 16, 2016

ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన సుష్మా..

ఢిల్లీ : ఎయిమ్స్ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చేరారు. కిడ్నీ సమస్యలతో సుష్మా బాధ పడుతున్నారు. కిడ్నీ మార్పిడికి డయాలసిస్ ను డాక్టర్లు నిర్వహిస్తున్నారు. 

10:26 - November 16, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ బడుల్లో సంస్కరణలకు తెలంగాణ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి విడతగా ఈరోజు 2,636 స్కూళ్లలో డిజిటల్‌ తరగతులను ప్రారంభించనున్నారు. 
డిజిటల్‌ తరగతులు 
తొలి విడతలో 2,636 పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు 
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. సంస్కరణలో భాగంగా నేటినుంచి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ప్రారంభించనున్నారు. తొలి విడతగా ఈరోజు 2,636 పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించనున్నారు. మన టీవీ ప్రసారాల ద్వారా లాంచనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 
కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా 
కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు నిర్వహించాలని సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. డిజిటల్‌ తరగతులు నిర్వహించే పాఠశాలల్లో టీచర్లకు అవసరమైన శిక్షణను కూడా అందించారు. ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు హిందీ మినహా మిగతా సబ్జెక్టులలో ఎన్ సీఈఆర్ టీ రూపొందించిన సబ్జెక్ట్‌ కంటెంట్‌ను విద్యార్థులకు డిజిటల్‌ తరగతుల ద్వారా బోధిస్తారు. ఎంపిక చేసిన 2,636 స్కూళ్లలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, మనటీవీ ద్వారా తరగతులపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతోంది. 

 

తెలంగాణలో డిజిటల్ క్లాసులు ప్రారంభం

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభం అయ్యాయి. డిజిటల్ క్లాసులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 

 

10:11 - November 16, 2016

వికారాబాద్ : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్న.. సీపీఎం మహాజన పాదయాత్ర నెలరోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికి పాదయాత్ర బృందం దాదాపు 760 కిలోమీటర్లు పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకుంది. అడుగడుగునా పాదయాత్ర బృందానికి ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. 30వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర.. పెద్దేముల్‌ మండలంలో మొంబాపూర్‌ లో ప్రారంభమైంది. కందవెల్లి, కోకూరు, రాజీవ్‌ గృహకల్ప.. అక్కడి నుంచి తాండూరుకు చేరుకుంది.  ఆ తర్వాత.. అంతారం, కందనేలి తండా, ఖాజీపూర్‌, బుద్దారం.. పెద్దేమూల్‌కు చేరుకుని... అక్కడే రాత్రి బస చేసింది.  
కందవెల్లిలో పీహెచ్‌సీని పరిశీలించిన పాదయాత్ర బృందం 
కందవెల్లిలో సీపీఎం పాదయాత్ర బృందం పీహెచ్‌సీని పరిశీలించి... కోకూర్‌లో సోషల్‌ వెల్పేర్‌ స్కూల్‌, కాలేజీని సందర్శించింది. అక్కడి విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు. తాండూర్‌లో జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం, స్థానిక కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ నేతలు సంఘీభావం తెలిపారు.  సీపీఎం పాదయాత్ర ఎజెండా చాలా మంచి ఉద్దేశంతో కూడుకున్నదని, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాలని కోదండరామ్‌ అన్నారు. స్థానికంగా  పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్య, వైద్య రంగంలో ప్రభుత్వం పాత్ర పెంచాలని కోదండరామ్‌ సూచించారు. 
కేసీఆర్‌ దేంట్లో నెంబర్‌ వన్ ...? : తమ్మినేని 
కేసీఆర్‌ దేంట్లో నెంబర్‌ వనో తెలపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. కేసీఆర్‌ పాదయాత్రపై విమర్శలు చేయడం తగదని, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర సీపీఎం దని తమ్మినేని అన్నారు.  రాష్ట్రంలో 93 శాతం ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినట్లని తమ్మినేని అన్నారు. ప్రతి సాధారణ పౌరుడికి విద్యా, వైద్యంతో పాటు కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావాలని తమ్మినేని సూచించారు. దున్నేవాడికి భూమి ఎంత కీలకమో.. ప్రతి ఇంట్లో పిల్లలకు విద్య కూడా అంతే కీలకమని తమ్మినేని అన్నారు. 

 

తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు

తూర్పుగోదావరి : కాపు రిజర్వేషన్ల కోసం మరోసారి పాదయాత్ర చేస్తానని ముద్రగడ పద్మనాభం ప్రకటించడంతో తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు సూచలన మేరకు పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నా ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. అరెస్ట్‌ చేసిన కాపు జేఏసీ నేతలను విడుదల చేయాలంటూ అమలాపురం పీఎస్‌ ఎదుట కాపు నేతలు బైఠాయించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. 

09:52 - November 16, 2016

తూర్పుగోదావరి : కాపు రిజర్వేషన్ల కోసం మరోసారి పాదయాత్ర చేస్తానని ముద్రగడ పద్మనాభం ప్రకటించడంతో తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు సూచలన మేరకు పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నా ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. అరెస్ట్‌ చేసిన కాపు జేఏసీ నేతలను విడుదల చేయాలంటూ అమలాపురం పీఎస్‌ ఎదుట కాపు నేతలు బైఠాయించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:48 - November 16, 2016

సిద్ధిపేట : జిల్లాలో విషాదం నెలకొంది. మిర్‌దొడ్డి మండంలోని ధర్మారంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:41 - November 16, 2016

తూర్పుగోదావరి : జిల్లాలోని అమలాపురం, కిర్లంపూడిలలో ఉద్రిక్తత నెలకొంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో పోలీసుల మోహరింపు కొనసాగుతోంది. ముద్రగడ పద్మనాభం గృహనిర్బంధంలోనే ఉన్నారు. పోలీసులు భారీగా మోహరించారు. నలుగురు ఎస్పీలతో జిల్లాలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకు కాపు జేఏసీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అమలాపురం పోలీసుస్టేషన్ ఎదుట కాపు నేతలు ఆందోళన చేపట్టారు. నిన్న అరెస్టు చేసిన కాపు నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. పాదయాత్రకు ముద్రగడ అనుమతి తీసుకోలేదని.. పాదయాత్రను అడ్డుకుని తీరుతామని ఎస్పీ చెప్పారు. ముద్రగడ మళ్లీ పాదయాత్ర చేయడానికి ప్రయత్నిస్తే అరెస్టు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. మరోవైపు పాదయాత్ర చేసి తీరుతామని ముద్రగడ తేల్చి చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:35 - November 16, 2016

పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం నల్లధనం కుబేరులపై యుద్ధ ప్రకటించనట్లు లేదని.. ప్రజలపై యుద్ధం ప్రకటించనట్లు ఉందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు, సీపీఎం నేత బాబూరావు, బీజేపీ నాయకురాలు పాదూరి కరుణ పాల్గొని మాట్లాడారు. నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డిసెంబర్ 31 వరకు నోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వాలన్నారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:33 - November 16, 2016

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేత పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'తెలుగు రాష్ట్రాల్లో కొంత భాగం కరువుతో బాధపడుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు చేతికొచ్చిన పంటలను నాశనం చేశాయి. ఇంకోవైపు మార్కెట్ లో మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి సమయంలో పెద్ద నోట్లను రద్దు చేయడం రైతుల కష్టాలను మరింత పెంచుతోంది. పంటలు అమ్ముకునే సమయంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో దాని ప్రభావం  వ్యవసాయ మార్కెట్ల మీద కూడా పడుతోంది. చిల్లర, కరెన్సీ కొరత కారణంగా ఉల్లిగడ్డలను హోల్ సేల్ మార్కెట్ ను మూసివేస్తున్నట్టు ఇప్పటికే వ్యాపారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. రైతులు ఎదుర్కొంటున్న దాదాపు 17 రకాల సమస్యలపై అఖిల భారత కిసాన్ సభ ఉద్యమించేందుకు సమాయత్తమవుతోంది. ఈ నెల 24న చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై పెద్దిరెడ్డి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:32 - November 16, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు ప్రభావం.. తెలంగాణ రాష్ట్ర ఖజానాపై గణనీయంగా పడుతోంది. నాలుగైదు రోజులుగా పన్నుల వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. దీని ప్రభావం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ఉంటుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే క్షేత్రస్థాయిలో వాస్తవ స్థితిని అధ్యయనం చేయాలంటూ వివిధ శాఖల అధిపతులకు అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక ఆధారంగానే ఇకపై నిధుల కేటాయింపు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. 
లోటు బడ్జెట్‌ దిశగా రాష్ట్ర ఆర్థిక స్థితి
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద షాక్‌నిచ్చింది. గుజరాత్‌ తర్వాత తమదే మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రమని భావిస్తున్న కేసీఆర్‌ సర్కారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటు బడ్జెట్‌ దిశగా సాగుతుండడంతో ఆందోళన చెందుతోంది. గడచిన నాలుగైదు రోజులుగా ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, మద్యం విక్రయాలు భారీ స్థాయిలో తగ్గిపోయాయి. సర్కారు ఖజానాకి రోజువారీ రావాల్సిన డబ్బులూ రాకపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 
గవర్నర్‌కు పరిస్థితిని వివరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
పెద్దనోట్ల రద్దు వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల గురించి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే  గవర్నర్‌ నరసింహన్‌కు వివరించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ.. వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు, వ్యాట్‌, ఎక్సైజ్‌ ఆదాయం, రవాణా పన్ను, నాన్‌ ట్యాక్స్‌ రెవిన్యూ, నెలవారీ ఖర్చులు.. ప్రస్తుతం సమకూరుతున్న ఆదాయం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల.. రెవిన్యూను పెంచే శాఖల ఆర్థిక స్థితిపై ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులకు సూచించారు.
ఆదాయ వివరాలపై సుదీర్ఘ చర్చ
వివిధ శాఖలకు సంబంధించి గడచిన ఏడు నెలల్లో సమకూరిన ఆదాయం.. నోట్ల రద్దు అనంతరం వచ్చిన ఆదాయం.. భవిష్యత్తులో ఖజానాకు చేరే ఆదాయం వివరాల గురించే సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాబోయే నెలల్లో లభించే వాటా, నిధులు తదితర అంశాలనూ సమీక్షించింది. ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తూ.. ఎప్పటికప్పుడు తగ్గ వ్యూహాలతో ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషించాలని రాజీవ్‌ శర్మ అధికారులకు సూచించారు. అటు ప్రభుత్వం కూడా తమ వైపు నుంచి చేయాల్సిన అంశాలను పరిశీలిస్తోంది. మొత్తానికి మోడీ నిర్ణయం.. తెలంగాణ ఖజానాపై పెను ప్రభావమే చూపుతోంది. ఫలితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కుంటుపడే ప్రమాదమూ ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

 

ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు మృతి

జమ్మూకాశ్మీర్ : సోపోర్ లో ఉగ్రవాదులు, భారతభద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీసు మృతి చెందారు. 

 

09:27 - November 16, 2016

నెల్లూరు : క్రికెట్‌ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌ ఈరోజు నెల్లూరు జిల్లాకు రానున్నారు. రెండేళ్ల క్రితం తాను దత్తత తీసుకున్న పుట్టంరాజువారికండ్రిగలో పలు అభివృద్ధి పనులను లిటిల్‌ మాస్టర్‌ ప్రారంభించనున్నారు. సచిన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రెండేళ్ల క్రితం తాను దత్తత తీసుకున్న గూడూరు మండలంలోని పుట్టంరాజువారికండ్రిగలో సచిన్‌టెండూల్కర్‌ ఈరోజు పర్యటించనున్నారు. గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సచిన్‌ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్వచ్చభారత్‌ కార్యక్రమంపై అధికారులతో భేటీ అవుతారు. తర్వాత గ్రామంలోని అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై బహిరంగ సభలో వివరించనున్నారు. దాదాపు అరగంట సేపు జరిగే ఈ సభకు 4 వేల మందికి అనుమతి ఇవ్వనున్నారు. సచిన్‌ టెండూల్కర్‌ అరగంటసేపు మాట్లాడే అవకాశం ఉందని అధికారులంటున్నారు. 
పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి
గత పర్యటనలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, క్రికెట్‌ అభిమానులు కోరుతున్నారు. గతంలో సచిన్‌ పర్యటించిన సమయంలో వివిధ రాష్ట్రాల, జాతీయ స్థాయి మీడియా, జిల్లాలోని క్రికెట్‌ అభిమానులు అనూహ్యంగా ఒక్కసారిగా ఆదర్శ పల్లెకు రావడంతో కిక్కిరిసిపోయింది. గ్రామంలో సరైన వసతులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా కొంతమందికే అనుమతి ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. 
2 గంటలసేపు పర్యటించనున్న సచిన్‌ 
ఇక సచిన్‌ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2 గంటల సేపు పుట్టంరాజువారికండ్రిగలో పర్యటించిన సచిన్‌ టెండూల్కర్‌ మధ్యాహ్నం 2 గంటలకు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి తాను దత్తత తీసుకున్న గ్రామానికి మరోసారి సచిన్‌ టెండూల్కర్‌ వస్తుండడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. 

 

09:25 - November 16, 2016

విజయవాడ : అగ్రిగోల్డ్‌ బాధితుల కన్నీళ్లు తుడవాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పునకు అనుగుణగా ఈ సంస్థ భూములను  విక్రయించి బాధితులకు సొమ్ము అందజేయాలని  తీర్మానించింది. ఫైబర్‌ నెట్‌ కోసం 300 కోట్ల రూపాయలతో 10 లక్షల సెట్‌టాప్‌ బాక్స్‌ల కొనుగోలుకు ఆమోదముద్ర వేశారు. అలాగే ఈనెలాఖరు నాటికి పల్స్‌ సర్వేని పూర్తి చేయాలని  నిర్ణయించింది. 
పలు సంస్థలకు భూములు కేటాయింపు  
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన నాలుగు గంటలకు పైగా జరిగిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పటిమాదిరిగానే పలు సంస్థలకు భూములు కేటాయించారు. అగ్రిగోల్డు భూముల విక్రయంపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఈ సంస్థకు ఉన్నభూముల్లో గుర్తించిన వాటిని అమ్మకానికి పెడతారు. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న అగ్రిగోల్డు భూములను కూడా స్వాధీనం చేసుకుని  విక్రయించి, బాధితులకు సొమ్ము చెల్లించాలని నిర్ణయించారు. ఇకపై ప్రతి మంత్రివర్గంలో అగ్రిగోల్డు భూముల అమ్మకం పురోగతిని చర్చిస్తారు. 
పల్స్‌ సర్వేని ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలి : మంత్రి మండలి 
రాష్ట్రంలో జరుగుతున్న పల్స్‌ సర్వేని ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ సర్వేలో కుటుంబ సమాచారం చెబితే సంక్షేమ పథకాల అమలు నిపివేస్తారని ప్రజల మనసులో గూడుకట్టున్న అపోహపై మంత్రివర్గం చర్చించింది. 
అమృతా యూనివర్సిటీకి 200 ఎకరాలు 
ఇక భూసంతర్పణలో మాతా అమృతానందమయి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న అమృత యూనివర్సిటీకి సీఆర్‌డీఏ పరిధిలో 200 ఎకరాలు కేటాయించారు. భారతీయ రిజర్వు బ్యాంకుకు 11 ఎకరాలు, కేంద్ర ప్రజా పనుల శాఖకు 28 ఎకరాలు కేటాయిస్తూ తీర్మానించారు. వర్షాభావం ఎదర్కొంటున్న నాలుగు రాయలసీమ జిల్లాలతోపాటు, కోస్తాలోని ప్రకాశం జిల్లాలో 1149 కోట్ల రూపాయల అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధితో రైతుల ఆదాయం పెరిగే కార్యక్రమాలు అమలు కేబినెట్‌లో నిర్ణయించారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింది పేదలకు లక్షా 20 వేల ఇళ్ల నిర్మాణానికి 1801  కోట్ల రూపాయలు కేటాయించారు. ఫైబర్‌నెట్‌ కోసం 300 కోట్ల రూపాయలతో  పది లక్షల సెట్‌ టాప్‌ బాక్స్‌ల కొనుగోలుకు  మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో భూ సమీకరణకు ఆమోదం తెలిపింది.

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శతవండీ సహిత రుద్రయాగం

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 20 వరకు శతవండీ సహిత రుద్రయాగం నిర్వహించనున్నారు. 

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్రిక్తత

తూర్పుగోదావరి : జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత కొనసాగుతోంది. ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహం యాత్ర నేపథ్యంలో పోలీసుల మోహరింపు కొనసాగుతోంది. 

నేడు రాష్ట్రపతి ప్రణబ్ ను కలవనున్న పలువురు సీఎంలు

ఢిల్లీ : నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సీఎంలు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఒమర్ అబ్దుల్లాలు కలవనున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.

నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

హైదరాబాద్ : నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరుగనుంది. బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టులపై చర్చించనున్నారు. 

 

కరీంనగర్ జిల్లాలో నేటి నుంచి జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు

కరీంనగర్ : జిల్లాలో నేటి నుంచి జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరుగనున్నాయి. జిల్లా విభజన తర్వాత మొదటి సమావేశం జరుగనుంది. ఏడు జిల్లాల అధికారులు పాల్గొననున్నారు. 

ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు

ఢిల్లీ : ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలకు అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. పెద్ద నోట్ల రద్దు అంశమే ఈసారి సమావేశాలను కుదిపేసే అవకాశం వుంది. దీనిపై అధికార, ప్రతిపక్షాలు వ్యూహప్రతివ్యూహాలతో రెడీ అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో పేద, మధ్యతగరతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేవనెత్తడం ద్వారా ఎన్డీయేని ఇరకాటంలో పెట్టాలని  ప్రతిపక్షాలు నిర్ణయించాయి. అయితే దీనిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైంది. 

07:06 - November 16, 2016

విజయవాడ : ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్యాకేజ్‌కు చట్టబద్ధత కల్పించేలా ఎంపీలు పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో రాష్ట్రానికి జరిగే నష్టాన్ని భర్తీ చేసేలా ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న ప్యాకేజ్‌కు త్వరితగతిన చట్టబద్ధత దక్కినప్పుడే రాష్ట్రానికి ప్రయోజనమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 
టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం 
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలోని సీఎం కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో ఏపీ ప్యాకేజీకి చట్టబద్ధతపై ప్రధానంగా చర్చించారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీలంతా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రతినిధులను కలిసి ప్యాకేజి చట్టబద్ధత అంశాన్ని మరోసారి ప్రస్తావించాలని, దీనిపై ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలవాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అత్యధిక లబ్ధిని రాబట్టడమే లక్ష్యంగా ఎంపీలందరూ సమన్వయంతో కృషి చేయాలన్నారు. 
పోలవరంకు నాబార్డు రుణం మంజూరుపై స్పష్టత రావాలి : సీఎం 
పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నాబార్డు రుణం మంజూరుపై వారం రోజుల్లో కేంద్రం నుంచి స్పష్టత తీసుకురావాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విశాఖ రైల్వే జోన్, నియోజకవర్గాల పునర్విభజన వంటి పలు అంశాలను త్వరితగతిన అమలు చేసేలా ప్రయత్నించాలన్నారు. విదేశీ ప్రాయోజిత పథకాలకు కేంద్రం సాయంపై ఈ సమావేశాల్లో తమ వాణిని గట్టిగా వినిపించాలన్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం, రాజ్యసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలు గురించి పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని ఎంపీలకు సూచించారు. 
నల్లధనం కట్టడికి ఎలక్ట్రానిక్ కరెన్సీ : చంద్రబాబు 
పాతనోట్ల స్థానంలో కొత్తనోట్లను ప్రవేశపెట్టడం శుభ పరిణామమే అయినా,..ఆచరణలో సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడితే బాగుండేదని సమావేశంలో సీఎం చంద్రబాబు అన్నారు. నల్లధనం కట్టడికి ఎలక్ట్రానిక్ కరెన్సీని విస్తృతంగా వినియోగించేలా కేంద్రం చర్యలు తీసుకునేట్టు ఎంపీలు కృషి చేయాలని చంద్రబాబు అన్నారు. డిజిటల్ ఇండియా సాకారం కావాలంటే డిజిటల్ కరెన్సీ వినియోగం పెరగాల్సి ఉందన్నారు. రూపే కార్డ్‌ను బలోపేతం చేయడం,.స్వైపింగ్ మిషన్లను సబ్సిడీపై వ్యాపారులకు అందించడం,..ఆన్‌లైన్-మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలకు రుసుముల రద్దు కోసం ఎంపీలు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి సూచించారు. విజయవాడలో నిర్వహించిన ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనాచౌదరి, ఎంపీలు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు.

 

06:59 - November 16, 2016

ఢిల్లీ : ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలకు అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. పెద్ద నోట్ల రద్దు అంశమే ఈసారి సమావేశాలను కుదిపేసే అవకాశం వుంది. దీనిపై అధికార, ప్రతిపక్షాలు వ్యూహప్రతివ్యూహాలతో రెడీ అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో పేద, మధ్యతగరతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేవనెత్తడం ద్వారా ఎన్డీయేని ఇరకాటంలో పెట్టాలని  ప్రతిపక్షాలు నిర్ణయించాయి. అయితే దీనిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైంది. 
పెద్ద నోట్ల రద్దుపై ఏకమైన ప్రతిపక్షాలు
పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. పార్లమెంటు వేదికగా  ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. ఎన్టీయే భాగస్వామ్య పక్షమైన శివసేన కూడా నోట్ల రద్దు  ఆకస్మిక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. రద్దు చేసిన పెద్ద నోట్ల మార్పిడి, కొత్త నోట్ల కొరతతో  ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్లమెంటులో లేవనెత్తడం ద్వారా.. మోడీ ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని ఎండగట్టేందుకు సిద్ధమయ్యాయి. 
ఉభయ సభలను కదిపేయనున్న పెద్ద నోట్ల రద్దు 
పార్లమెంటు శీతాకాల సమావేశాల మొదటిరోజే పెద్ద నోట్ల రద్దు అంశం ఉభయసభలను కుదిపేసే అవకాశం ఉంది. లోక్‌సభ, రాజ్యసభ సజావుగా సాగితే ప్రతిపక్షాలు లేవనెత్తే ఏ సమస్యకైనా సావధానంగా సమాధానం చెబుతామని ఎన్డీయే చెబుతున్నా... విపక్షాలు మాత్రం ఉభయ సభలను స్తంభింపచేయాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఐదొందలు, వెయ్యి నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న అంశాన్ని ప్రస్తావించడం ద్వారా.. ఈ నిర్ణయం ఓ పెద్ద కుంభకోణం అన్న అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. మోదీ సర్కార్‌ ఇది ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంకాదని, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ఈ సమాచారం ముందుగానే లీకవ్వడంతో సర్దుకుని జాగ్రత్త పడ్డారన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఇదే వాదాన్ని పార్లమెంటులో లేవనెత్తాలన్న యోచనలో విపక్షాలు ఉన్నాయి. 
పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్‌, టీఎంసీ వాయిదా తీర్మానాలు 
ముందుగా నిర్ణయించిన అజెండాను పక్కనపెట్టి,  పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ఉభయ సభల్లో చర్చించాలంటూ  కాంగ్రెస్‌,  తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇప్పటికే వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి.  ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీఎంసీతోపాటు, ఆప్‌ డిమాండ్‌ చేస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారం కుదేలైందని, ఇది ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉందన్న ఆందోళన కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే నల్లధన ప్రవాహంతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టేందుకే పెద్ద నోట్లను రద్దు చేశామన్న వాదాన్ని వినిపిస్తున్న ఎన్డీయే... పార్లమెంటులో కూడా దీంతోనే ప్రతిపక్షాల నోరు మూయించాలన్న ఆలోచనలో ఉంది. ప్రజలకు కష్టాలు స్వల్పకాలమేనని, దీర్ఘకాలంలో ఆర్ఘిక వ్యవస్థకు ఎంతో మేలు చేసే నిర్ణయాన్ని విపక్షాలు వ్యతిరేకించడం తప్పదన్నది ఎన్టీయే వాదన. ప్రతిపక్షాల వాదన నల్లకాసురులను వెనుకేసుకొచ్చే  విధంగా ఉందన్నవాదాన్ని వినిపించడం ద్వారా ఈ పార్టీ నేతలకు  చెక్‌ పెట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మొత్తంమీద ఈ అంశంపై వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
పార్లమెంటు ముందుకు పది బిల్లులు 
పెద్ద నోట్ల రద్దుతోపాటు మరికొన్ని సమస్యలు, ఇంకొన్ని అంశాలు కూడా పార్లమెంటులో సునామీ సృష్టించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మాజీ సైనికులకు వన్‌ ర్యాంక్‌, వన్‌ పెన్షన్‌ విధానం అమల్లో జరుగుతున్న లోపాలు, వ్యత్యాసాల అంశం కూడా పార్లమెంటులో వేడి పుట్టించే అవకాశం ఉంది. ఇటీవల సుబేదార్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్న అంశాన్ని విపక్షాలు ప్రస్తావించే అవకాశం ఉంది.  రైతాంగ సమస్యలు కూడా ఉభయ సభను తాకొచ్చని భావిస్తున్నారు. ఇకపోతే పది  బిల్లులు కూడా పార్లమెంటు ముందుకు రానున్నాయి. సమగ్ర వస్తు, సేవల పన్నుతోపాటు అద్దెగర్భం నియంత్రం బిల్లులకు ఆమోదం పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి జీఎస్‌టీ అమలుతో రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని భర్తీ చేసేందుకు ఉద్దేశించిన టీఎస్‌టీ సవరణ బిల్లు, పన్ను శ్లాబుల నిర్ణయం బిల్లును పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది.  కార్మిక శాఖ పరిధిలోకి వచ్చే ఫ్యాకర్టీలు, సంస్థల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు పెంపుదలకు సంబంధించి మెటర్నిటీ బెనిఫిట్‌ యాక్ట సవరణ బిల్లు, ప్రజా వేగుల రక్షణ చట్ట సవరణ బిల్లు కూడా పార్లమెంటు ఆమోదం కోసం ఉంచుతారు. 
వచ్చే నెల 16 వరకు పార్లమెంటు సమావేశం 
కశ్మీర్‌ అంశంతోపాటు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిక్షణా కేంద్రాలపై భారత సైనికులు మెరపు దాడులు, భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ సేనల ఏకపక్షంగా  కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన, ఉద్రిక్తతలు కూడా పార్ల మెంటులో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల 16 వరకు జరిగే శీతాకాల సమావేశాల్లో  22 రోజుల పాటు పార్లమెంటు సమావేశం అవుతుంది.మొత్తం మీద చూస్తే ఈసారి  పార్లమెంటు సమావేశాలు వాడీ వేడీగా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.    

 

నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

సిరిసిల్ల : నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

 

సిద్ధిపేట జిల్లాలో విషాదం

సిద్ధిపేట : మిర్ దొడ్డి మండలం ధర్మారంలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

 

నేడు పుట్టంరాజువారికండ్రిగలో సచిన్ టెండూల్కర్ పర్యటన

నెల్లూరు : నేడు దత్తత గ్రామం పుట్టంరాజువారికండ్రిగలో సచిన్ టెండూల్కర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు. 

 

నేడు తెలంగాణ వ్యాప్తంగా డిజిటల్ క్లాసులు ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా నేడు డిజిటల్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. 2,636 పాఠశాలల్లో డిజిటల్ క్లాసులను విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించనున్నారు. 

 

Don't Miss