Activities calendar

17 November 2016

21:44 - November 17, 2016

గుజరాత్ : పెద్ద నోట్ల ర‌ద్దుతో స‌గ‌టు మ‌నిషి నానా తిప్పలు ప‌డుతుంటే... గుజ‌రాత్‌లో మాత్రం రెండు వేల నోట్లు రెప రెప లాడాయి. కొత్త నోటు ఇలా వచ్చిందో లేదో అప్పుడే 2 వేల నోట్లను లంచానికీ వాడుతున్నారు అవినీతిపరులు. పోర్ట్ ట్రస్ట్‌కు చెందిన ఇద్దరు అధికారులు అవినీతికి పాల్పడ్డారు. ఓ ప్రైవేట్ సంస్థకు పెండింగ్ బిల్స్‌ జారీ చేయ‌డానికి రెండున్నల లక్షలు లంచం తీసుకున్నారు. విషయమేమంటే ఆ నోట్లన్నీ కొత్త 2 వేల నోట్లే కావడం గమనార్హం. నిజానికి ప్రభుత్వ నిబంధ‌న‌ల ప్రకారం వారానికి 24 వేల క‌న్నా ఎక్కువ నోట్ల మార్పిడి చేసుకోవ‌డానికి అనుమ‌తి లేదు. అలాంట‌ప్పుడు ఇంత సొమ్ము ఎలా వ‌చ్చింద‌న్నది కూడా ఇప్పుడు ఆసక్తిక‌రంగా మారింది. పెద్ద నోట్ల రద్దు ద్వారా అవినీతి నిర్మూలిస్తామని చెప్పిన ప్రధాని మోది- దీనిపై ఏమంటారో మరి.

21:39 - November 17, 2016

ఢిల్లీ : కేంద్రం దిద్దుబాట పట్టింది. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులే సతమతమవుతున్న విషయాన్ని గుర్తించింది. పెద్దమొత్తాల్లో నగదును విత్‌ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు రెండున్నర లక్షల వరకూ నగదును డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అలాగే రైతులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా వారానికి పాతిక వేల రూపాయల వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.

పెళ్లిళ్లు చేసేవారు రూ.2.5లక్షలు ఒకేసారి డ్రా చేసుకునే అవకాశం
పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులే సతమతమవుతున్న విషయాన్ని కేంద్రం గుర్తించింది. తొమ్మిది రోజుల తర్వాత దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. నగదు లేక వివాహాలు ఆగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. వధూవరుల కుటుంబ సభ్యుల్లో ఒకరు.. వ్యక్తిగత ఖాతా నుంచి రెండున్నర లక్షల రూపాయలు విత్‌ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి పాన్‌కార్డు చూపి.. ఈ మొత్తాన్ని ఒకేసారి డ్రా చేసుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యుల్లో ఇంకెవరూ డబ్బు డ్రా చేయబోరన్న అండర్‌టేకింగ్‌ బ్యాంకుకు సమర్పించాలని ఆర్బీఐ షరతు విధించింది.
రైతుల రబీ కష్టాల నివారణకు చర్యలు
రబీ సీజన్‌లో రైతులు వారానికి పాతిక వేల రూపాయలు విత్‌ డ్రా చేసుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. పంటరుణాలను, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా పొందవచ్చని సూచించింది. అయితే విత్‌ డ్రా చేసే మొత్తాన్ని.. రైతులు వేసిన పంట ఆధారంగానే అనుమతిస్తారని ఆర్బీఐ స్పష్టం చేసింది.

రుణ బీమా చెల్లింపు పరిమితి 15 రోజులు పెంపు
మార్కెటింగ్‌ కమిటీలకు పంటను అమ్మే రైతులు చెక్కుల ద్వారా ఆ సొమ్మును తమ అకౌంట్‌లో జమ చేసుకుని.. వారానికి 25 వేల రూపాయల చొప్పున డ్రా చేసుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. రైతులు పంట రుణ బీమా చెల్లించే పరిమితిని అదనంగా 15 రోజులు పొడిగించారు. కరెంట్‌ అకౌంట్‌ ఖాతాలున్న వారు వారానికి 50వేల రూపాయలు నగదును విత్‌ డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.

రూ.4,500 నుంచి రూ.2 వేలకు నోట్ల మార్పిడి కుదింపు
పెద్దనోట్ల మార్పిడిపైనా ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఇప్పటివరకూ నాలుగున్నర వేల వరకూ పెద్దనోట్లను మార్చుకునే అవకాశం ఉండేది. దీన్ని రెండువేల రూపాయలకు కుదించింది. నగదు మార్పిడి చేసుకున్న వారికి సిరా గుర్తు పెట్టడాన్ని ఇకపైనా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్‌ నెల జీతంలో 10వేల రూపాయలు ముందుగానే డ్రా చేసుకునే సదుపాయాన్ని ఆర్బీఐ కల్పించింది. 

21:31 - November 17, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. పెద్దనోట్ల రద్దు, నగదు మార్పిడికి సంబంధించి చర్చ చేపట్టాలని.. చర్చ జరిగే సమయంలో ప్రధాని మోదీ సభలో ఉండాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇస్తారని ప్రభుత్వం చెప్పినా శాంతించలేదు. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.

పెద్ద నోట్ల రద్దుపై దద్దరిల్లిన ఉభయసభలు
పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండోరోజు పెద్ద నోట్ల రద్దు అంశంపై ఉభయసభలు దద్దరిల్లాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే నోట్ల రద్దు అంశంపై చర్చ చేపట్టాలని..ప్రధాని సభలో ఉండాలని విపక్షాలు హంగామా చేశాయి. ముందస్తు చర్యలు చేపట్టకుండా పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తీసుకోవడంతో దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని విపక్షాలు మండిపడ్డాయి. నోట్ల మార్పిడి అంశంపై చర్చ నిర్వహిస్తే ఆర్థిక మంత్రి జైట్లీ వివరణ ఇస్తారని డిప్యూటి ఛైర్మన్ చెప్పినప్పటికీ విపక్షాలు శాంతించలేదు. ప్రధాని మోదీయే సమాధానం చెప్పాలంటూ పోడియం వద్ద నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది.ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల నోట్ల మార్పిడి కోసం దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 40 మంది మృతి చెందారని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. ఇప్పుడు చనిపోతున్నవారిలో సగం మంది కూడా ఉరీ ఉగ్రదాడిలో మరణించలేదని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారితీశాయి. ఈ మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలని ఆజాద్‌ పేర్కొన్నారు.

నోట్ల రద్దు పాకిస్తాన్‌ ఉగ్రవాద దాడులతో పోల్చడం అవమానకరం: వెంకయ్య
ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనను పాకిస్తాన్‌ ఉగ్రవాద దాడులతో పోల్చడం జాతికి అవమానకరమని.. అందుకు ఆయన క్షమాపణ చెప్పి తీరాలన్నారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని వెంకయ్య డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ను కోరారు.

మీరా మాకు చెప్పేదంటూ ఆజాద్ మండిపాటు..
మీరు పాకిస్థాన్‌లో పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లి వచ్చి, వాళ్లకు రెడ్ కార్పెట్లు పరుస్తారు, మీరు మాకు చెబుతారా..అంటూ మంత్రిపై ఆజాద్‌ విరుచుకుపడ్డారు. తీవ్ర గందరగోళం మధ్య డిప్యూటి చైర్మన్‌ రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేశారు.

నోట్ల మార్పిడి అంశంపై కూడా చర్చ చేపట్టాలని ఖర్గే డిమాండ్‌
పెద్దనోట్ల రద్దు అంశం లోక్‌సభలోను దుమారం చెలరేగింది. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, టీఎంసీ, తదితర పార్టీలు పెద్ద నోట్ల రద్దుపై వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. దీనిపై చర్చ చేపట్టాలని, ప్రధాని సభలో ఉండాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. స్పీకర్‌ విపక్షాల డిమాండ్‌ను తిరస్కరించి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగారు.నోట్ల మార్పిడితో ప్రజలు పడుతున్న కష్టాలతో పాటు... నోట్ల మార్పిడి అంశం పలువురికి ముందే తెలుసున్న అంశంపై కూడా చర్చ చేపట్టాలని ఖర్గే డిమాండ్‌ చేశారు.

నోట్లరద్దుపై చర్చకు సిద్ధమేనని, ఓటింగ్‌ అవసరం లేదు : అనంత్ కుమార్
నోట్లరద్దుపై చర్చకు సిద్ధమేనని, ఓటింగ్‌ అవసరం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌ కుమార్‌ స్పష్టం చేశారు.మంత్రి సమాధానం సంతృప్తి చెందని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పలుమార్లు సభను వాయిదా వేసినప్పటికీ లాభం లేకపోవడంతో సభ్యుల గందరగోళం మధ్య స్పీకర్‌ సుమిత్రా మహాజన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

21:20 - November 17, 2016

కడప : రాజంపేట మండలం సిద్ధలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోడికోడళ్లు అనుమానాస్పదంగా మృతి చెందారు. దివ్య, ప్రసన్నతో పాటు మరో తోడికోడలు తోడికోడళ్లు అనుమానాస్పద స్థితిలో మరణించారు. అత్తా మామ పరారీలో వుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా అత్తా మామలు వీరిని చంపి పరారైనట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. మృతి చెందినవారి భర్తల్లో ఒకరి గొర్రెల కాపరి... మరొకరి భర్త దుబాయ్ లో వున్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిసరాలకు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

హంద్రీనీవాలో విద్యార్థి గల్లంతు..

కర్నూలు : హంద్రీనీవా కాలువలో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. పత్తికొండ మండల పరిధిలోని పందికోన వద్ద పులికొండకు వెళ్లే దారిలో ఉన్న హంద్రీనీవా కాలువలో గురువారం విద్యార్థిని గల్లంతవగా మరో బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గల్లంతవగా మరో బాలుడు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 

20:48 - November 17, 2016

ఎవర్నీ వదలటం లేదు..అందరిపైనా ఉరుము లేని పిడుగుపాటులా పడింది. ఒక్కసారిగా నేలకూల్చింది. బతుకుల్ని అయోమయంగామార్చింది. ముఖ్యంగా దేశానికి వెన్నెముక లాంటి రైతన్న కష్టాలు మాటలకు అందని తీరులో మారాయి. చేతిలో సొమ్ములేదు.. అప్పులు పుట్టవు. బ్యాంకుల రుణం అందదు.. రబీ సీజన్ మొదలయింది. ప్రకృతి విపత్తులకు అలవాటయిన రైతన్న సర్కారు కొట్టిన నోటు దెబ్బకు విలవిల్లాడుతున్నాడు. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. రైతులు, రైతు కూలీలు వ్యవసాయంపై ఆధారపడిన ప్రతిఒక్కరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల దగ్గరా తిరుగుతున్నారు. పొలాలనొదిలి రోడ్డునపడ్డ రైతన్న దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఎంత కాలం ఈ పరిస్థితి ఉంటుందో తెలియని అయోమయం అంతటా నెలకొంది. రైతన్న బతుకంతా ఏదో ఒక గండమే.. ప్రకృతి విపత్తులు తరచుగా కాటేస్తుంటే.., ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం నిండా ముంచుతోంది. ముఖ్యంగా రబీ మొదలయ్యే సమయంలో పెద్ద నోట్ల రద్దు అంతులేని కష్టాలను తెచ్చిపెడుతోంది. అడుగడుగునా కరెన్సీ సమస్య ఎదురవుతూ రైతన్నను ఎక్కడలేని సమస్యలో పడేసింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. బ్యాంకులన్నీ ఇప్పడు పాత నోట్ల మార్పిడి, డిపాజిట్లపైనే దృష్టి పెట్టాయి. రుణాల జారీవైపు తొంగిచూసే అవకాశం కూడా కనిపించటం లేదు. అప్పోసప్పో చేసి రబీ పైర్లు సాగుచేద్దామన్న ఎవరి దగ్గరా డబ్బులులేవు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిద్దామన్నా.. వీరి దగ్గరా పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులు దిగాలుగా చూస్తున్నారు. రుణాల్లేవ్.. మైక్రో ఏటీఎంలు అడ్రస్ లేవ్..పెద్ద నోట్ల రద్దు వ్యవసాయం రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పిడుగుపాటులా వచ్చిన కరెన్సీ కష్టాలు కర్షకులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ధాన్యం చేతికి వస్తున్న టైంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం.. రైతులకు అంతులేని కష్టాలు తెచ్చిపెట్టింది. పెద్దనోట్లు చెల్లక, చిల్లరలేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు ఇచ్చిన కరెన్సీ చెల్లక, చెక్కులు ఎలా మార్చుకోవాలో తెలీక దిక్కులు చూస్తున్నారు. రుణాల కోసం రైతన్న ఇబ్బందులు మాటల్లో చెప్పలేని విధంగా మారింది. మరోపక్క రైతన్న నిస్సహాయతను పలు చోట్ల వడ్డీ వ్యాపారులు ఉపయోగించుకుంటున్నారు. ఇక మైక్రో ఏటీఎం లు ఏర్పాటు చేయాలన్న ఆర్బీఐ ఆదేశాలు అమలవుతున్న జాడ ఎక్కడా కనిపించటం లేదు. దీంతో సన్న చిన్నకారు రైతులు, రైతు కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. సర్కారు నిర్ణయం వెనుక లక్ష్యం ఏదైనా.. ఇప్పుడు చూస్తున్న సమస్య మాత్రం చిన్నా చితకదేం కాదు. అన్ని వర్గాలను, అందర్నీ ఇబ్బందులకు గురిచేస్తూ బడుగు బతుకులను అగాధంలోకి నెట్టిన నిర్ణయం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా కష్టాల కడలిలో ఉన్న రైతన్న పెద్ద నోట్ల రద్దుతో విలవిల్లాడుతున్నాడు.

ముగ్గురు తోడికోడళ్లు అనుమానాస్పద మృతి!

కడప రాజంపేట మండలం సిద్ధలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు తోడికోడళ్లు అనుమానాస్పదంగా మృతి చెందారు. అత్తా మామ పరారీలో వున్నారు. ముగ్గురూ ఒకేసారి మృతి చెందటం..అత్తా మామలు పరారీలో వుండటంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ దారుణ ఘటనపై వివరాలు తెలియరావాల్సివుంది. 

నటి మల్లికా షెరావత్ పై దాడి..

హైదరాబాద్ : బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటన పారిస్ లోని ఆమె సొంత అపార్టుమెంట్ లో జరిగింది. గత శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మల్లిక తన ప్రియుడు సిరిల్ తో కలిసి అపార్టు మెంట్ కు వచ్చింది. అదే సమయంలో మాస్కులు ధరించి అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిపై టియర్ గ్యాస్ స్ప్రే చేసి ఈ దాడికి పాల్పడ్డారు. అనంతరం, మల్లిక తన స్నేహితులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో వారు అక్కడికి వచ్చారు. మల్లిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. 

20:19 - November 17, 2016

ఢిల్లీ : దేశంలో ఎక్కడ చూసినా చిల్లర కొరతే. అసలీ చిల్లర సమస్య ఎప్పటికి తీరుతుంది..? ప్రధాని చెప్పినట్లు 50 రోజుల్లో అందరికీ చిల్లర నోట్లు అందుబాటులోకి వస్తాయా..? ఏమో..! డౌటేనంటున్నారు విశ్లేషకులు. నోట్ల కొరత తీరాలంటే తక్కువలో తక్కువగా ఏడాదిన్నర అవుతుందన్నది ఆర్థిక నిపుణుల విశ్లేషణ.

అందుబాటులో లేని చిన్న నోట్లు..పరిస్థితి అదుపులోకి వచ్చేది ఎన్నడు..?
దేశమంతటా చిల్లర నోట్ల సమస్య..ప్రజలకు సరిపడా అందుబాటులో లేని చిన్న నోట్లు..పరిస్థితి అదుపులోకి వచ్చేది ఎన్నడు..? పెద్ద నోట్ల రద్దు దేశంలో పెద్ద గందరగోళాన్నే సృష్టిస్తోంది. సామాన్యులు నోట్ల కోసం పాట్లు పడుతున్నారు. బ్యాంకులు ప్రజలకు సరిపడా కరెన్సీని అందుబాటులో ఉంచడం లేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఈ సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుంది..? అసలు ఆర్బీఐ... దేశ అవసరాలకు సరిపడా కరెన్సీని అందుబాటులో ఉంచిందా..? అందరి ఇబ్బందులూ తీరాలంటే ఇంకెనాళ్లు కావాలి..? ఇదీ సామాన్యులను వేధిస్తోన్న ప్రశ్న.

అక్టోబర్‌ నెలాఖరుకి చలామణి నోట్లు... మొత్తం 17 లక్షల 50 వేల కోట్లు...
ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం... అక్టోబర్‌ నెలాఖరు నాటికి చలామణిలో ఉన్న నోట్లు... మొత్తం 17 లక్షల 50 వేల కోట్లు. ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయంతో మార్కెట్‌లో ఉన్న 14 లక్షల 50వేల కోట్ల రూపాయలు చెల్లుబాటు కాకుండా పోయాయి. రద్దు నిర్ణయం తర్వాత నాలుగు రోజుల్లో బ్యాంకులు వినియోగదారులకు సుమారు 50వేల కోట్ల రూపాయలను అందించింది. ఇంకా 14 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్‌లో ఇంకా చెల్లుబాటు కాని నోట్లుగానే మిగిలి వున్నాయి. 

20:16 - November 17, 2016

పోలవరం ప్రాజెక్టు నిర్వాశితులతో మల్లన్న ముచ్చట్లాడాడు..వారి కష్టాలను తెలుసుకున్నాడు. సీపీఎం పాదయాత్ర దృష్టికి ఈ కష్టాలను తీసుకెళ్లాడు. తెలంగాణలోకి కొన్ని మండలాలను అంటే పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను కేంద్రప్రభుత్వం ఏపీలో విలీనం చేసింది. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాలలో తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే సున్నం రాజయ్య పర్యటిస్తున్నారు.ఆయా ప్రాంతలలోని ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టారు. ఈనేపథ్యంలో పాదయాత్ర గౌరదేవ్ పేట కాలనీకి చేరుకుంది. ఎమ్మెల్యేలకు ఈ ప్రాంతవాసులు తమ సమస్యలను వెళ్ళబోసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిమిత్తం ఆ ప్రాంత వాసుల భూములను తీసుకున్నారు. దీనికి నష్టపరిహారం నిమిత్తం రూ.1.15వేలిచ్చారన్నారు. కాగా ప్రస్తుతం నిర్వాశితులకు రూ.10లక్షల 80వేలు ఇస్తున్నారనీ ఇదే నష్టపరిహారాన్ని తమకు కూడావర్తించాలని వారు కోరుతున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే వివరించి తమకు న్యాయం జరిగేలా చూడమని వారు కోరారు. ఈ సమస్యకోసం ప్రభుత్వంపై తాము పోరాడి వారికి న్యాయం చేకూరుస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సున్నం రాజయ్య భరోసానిచ్చారు. మరింత సమాచారానికి మన మల్లన్న ముచ్చట్లను చూడండి..

పెద్ద నోట్లను రద్దుపై వెనక్కు తగ్గం : జైట్లీ

ఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటన ఉపసహరించుకునే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోన్‌ ప్రీమియం గడువు పెంచామని, ఇలాంటి పరిస్థితుల్లో కొందరికి అసౌకర్యం సహజమేనని అన్నారు. నల్లధనాన్ని అరికట్టాలంటే నోట్ల రద్దు తప్ప మరో మార్గం లేదని జైట్లీ స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గర తగినంత కరెన్సీ ఉందని, ముందస్తు ప్రణాళికతోనే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.

19:41 - November 17, 2016

స్వచ్ఛ భారత్ నగరాలు..

ఢిల్లీ: స్వచ్ఛ భారత్ అవగాహన ప్రచారంలో ముందున్న నగరాలు, పట్టణాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ నగరం తొలిస్థానాన్ని సంపాదించుకుంది. రెండో స్థానం వసాయ్ కి, మూడో స్థానం హైదరాబాద్ కు దక్కగా, 8వ స్థానంలో తిరుపతి నిలిచింది.

19:32 - November 17, 2016

టోల్ ప్లాజా రుసుముని ర‌ద్దు తేదీ పెంపు..

ఢిల్లీ : న‌ల్ల‌ధ‌నాన్ని, న‌కిలీనోట్ల‌ను అరిక‌ట్ట‌డానికి ఈ నెల‌ 8న కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో టోల్‌గేట్ల వ‌ద్ద వాహ‌న‌దారులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డిన సంగ‌తి తెలిసిందే. జాతీయ ర‌హ‌దారుల‌పై వాహ‌నాలు భారీగా నిలిచిపోవ‌డంతో మూడు రోజుల పాటు టోట్‌గేట్ల రుసుముని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆ వెంటనే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే, దేశంలో కొత్త నోట్లు, కావల‌సినంత చిల్ల‌ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రాక‌పోవ‌డంతో ఆ త‌రువాత కూడా మ‌రో రెండుసార్లు టోల్ గేట్ల రుసుం గడువును పొడిగించిన కేంద్ర ప్రభుత్వం..

19:20 - November 17, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. వెంటనే ఢిల్లీకి రావాలని అందుబాటులో వుండాలని మోదీ ఫోన్ లో తెలిపారు. దీంతో ప్రధాని పిలుపు మేరకు కేసీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. శనివారం నాడు ప్రధానితో కేసీఆర్ భేటీ కానున్నారు. కాగా ఇప్పటికే ప్రధానితో భేటీకి సీఎం అపాయింట్ మెంట్ తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితులపై ప్రధానికి కేసీఆర్ వివరించానున్నారు. సీఎం కేసీఆర్ పెద్ద నోట్ల రద్దుపై రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోతోందని ఇప్పటికే పలు సందర్భాలలో పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుతో తీవ్ర ప్రభావం రద్దు ప్రభావంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం రిజిస్ట్రేషన్లు, విద్యుత్, వాటర్, ఇంటిపన్ను వంటి పలు రూపాల్లో వచ్చే ఆదాయం భారీగా పడిపోయిందని కేసీఆర్ పేర్కొన్నారు.కాగా కేంద్రం నిర్ణయాన్ని మాత్రం బాహాటంగా ఖండించలేని స్థితిలో కేసీఆర్ ఇరకాటంలో పడ్డారు. ఈ క్రమంలో ప్రధాని వద్ద నుండి వచ్చిన పులుపు మేరకు కేసీఆర్ హస్తినకు పయమయ్యారు. 

హస్తినకు సీఎం కేసీఆర్..

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం ఎల్లుండి ప్రధాని మోదీని కలువనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రేపు ఢిల్లీకి చేరుకుని అందుబాటులో ఉండాలని ప్రధాని మోదీ సూచించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రధాని మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, సమస్యలపై సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం. 

19:02 - November 17, 2016

నోట్ల రద్దు కష్టాలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇప్పటికీ సామాన్యులకు ఇక్కట్లు తప్పడం లేదు.. 500, వెయ్యి నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. గంటల తరపబడి ఏటీఎంల ముందు వేచిచూడాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిల్లర కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ నల్లకుంట నుంచి దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

18:59 - November 17, 2016

తిరుపతి : తన మీద అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే నేరుగా చంచల్ గూడ జైలుకెళ్లి కూర్చుంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. తిరుపతిలో పర్యటించిన ఆయన.. నగరంలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్ధులతో ముఖాముఖి నిర్వహించారు. ఏటా ఆస్తుల వివరాలు వెల్లడిస్తూ తమ కుటుంబం అందరికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. బ్రాహ్మిణిని తప్ప తాను ఎవరినీ ఇప్పటి వరకు ప్రేమించలేదని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు లోకేష్ సరదాగా సమాధానమిచ్చారు. 

18:56 - November 17, 2016

విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లు ప్రధాని, ముఖ్యమంత్రి, వెంకయ్యనాయుడుపై చీటింగ్ కేసు పెట్టామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. అనంతపురం నగరంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం ఏర్పాటు చేసిన ప్రజా బ్యాలెట్ కార్యాక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓ ప్రవేటు కళాశాలలో విధ్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి... వారి అభిప్రాయాలను సేకరించారు. 

18:53 - November 17, 2016

అమరావతి : ఏపీ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లలో మౌలిక వసతులకు సీఆర్డీఏ శ్రీకారం చుట్టింది. నేలపాడు గ్రామంలోని రైతులకు కేటాయించిన ప్లాట్లలో పెగ్ మార్కింగ్, కచ్చా రోడ్ల నిర్మాణాలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

18:49 - November 17, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితి పాము నోట్లో కప్ప చందంగా మారింది. గ్రేటర్‌ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన కేసీఆర్ కు ఇప్పుడు మింగలేని, కక్కలేని పరిస్థితి ఎదురైంది. పెద్ద నోట్ల రద్దుపై కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు... ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తుంటే... ఈ విషయంలో ఏమిచేయాలో పాలుపోక అయోమయ పరిస్థితుల్లో టీఆర్ఎస్ నేతలు కొట్టుమిట్టాడుతున్నారన్న చర్చ జరుగుతోంది.

గ్రేటర్‌ ఎన్నికల ముందు కేంద్రంపై విరుచుకుపడ్డ టీఆర్‌ఎస్‌
రాజకీయ వ్యూహరచనలో దిట్టగా పేరు పొందిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌... పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎలా వ్యవహరించాలన్న విషయంలో ఎటూ తేల్చులేకపోతున్నారు. గ్రేటర్‌ ఎన్నికలకు ముందు కేంద్ర విధానాలపై విరుచుకుపడ్డ గులాబీ బాస్‌, టీఆర్‌ఎస్‌ నేతలు... ఢీ అంటే ఢీ అన్నారు... సై అంటే సై అన్నారు. కానీ తదనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు వ్యూహాన్ని మార్చకున్నట్టు కనపిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పార్టీ సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌ ?
ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దుపై కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ... కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ప్రధాని మోడీపై బాహాటంగానే విరుచుకుపడుతూ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పెద్ద నోట్ల రద్దును స్వాగతించినా... రెండు వేల రూపాయల నోట్లు తీసుకురావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్‌ పార్టీ నేతలతో జరుగుతున్న సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ బాహాటంగా మాత్రం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలేదు. ప్రభుత్వ అధికారులతో నిర్వహిస్తున్న సమీక్షల్లో కూడా అంతర్గతంగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న కేసీఆర్‌... బయటకు మాత్రం కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించలేక, వ్యతిరేకించలేకపోతున్నారు.

పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీల మౌనవ్రతం
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెద్ద నోట్ల రద్దుపై వివిధ పార్టీలు గళం విప్పుతున్నా.. టీఆర్‌ఎస్‌ ఎంపీలు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు. కరెన్సీ రద్దుపై ఏవిధంగా వ్యవహరించాలన్న విషయంలో పార్టీ అధినాయకత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో పెదవి విప్పడంలేదు. ఐదొందలు, వెయ్యి నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వొద్దని పార్టీ ఎంపీలను గులాబీ బాస్‌ ఆదేశించినట్టు సమాచారం. కేంద్ర నిర్ణయంతో ప్రజలు ఎదర్కొంటున్న ఇబ్బందులను మాత్రమే ప్రస్తావించాలని సూచించినట్టు వినిపిస్తోంది. కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉంటే.. రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకోవచ్చన అభిప్రాయంతో ఉన్న కేసీఆర్‌... పెద్ద నోట్ల రద్దుపై బాహాటంగా ప్రకటనలు చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఈనెలాఖరులో ప్రధాని మోదీ హైదరాబాద్‌ వచ్చే అవకాశం
వీలుంటే ప్రధాని మోదీని కలిసి పెద్ద నోట్ల రద్దపై తన మనసులోని భావాలను వ్యక్తం చేయాలన్న ఆలోచనలో టీఆర్‌ఎస్‌ అధినేత ఉన్నారు. ఈ నెలాఖరులో మోదీ హైదరాబాద్‌లో పర్యటించే అవకాశం ఉండటంతో నేరుగా కలిసి, పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వానికి ఎదురవుతున్న సమస్యలను వివరించాలన్న యోచనలో ఉన్నారు. మొత్తం మీద కరెన్సీ నోట్ల రద్దు వ్యవహారం గులాబీ దళాధిపతితోపాటు, పార్టీ నేతల దూకుడుకు బ్రేకులు వేసిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ వ్యూహాత్మక మౌనం దేనికి సంకేతాలన్న అంశంపై టీఆర్‌ఎస్‌ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

 

18:41 - November 17, 2016

ఢిల్లీ : రాజ్యసభలో పెద్దనోట్ల రద్దు అంశంపై కాంగ్రెస్‌ నేత ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అజాద్ పాకిస్తాన్‌కు అనుకూలంగా సర్టిఫికేట్‌ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం దేశంలో సంభవిస్తున్న మరణాలను చూస్తుంటే ఉగ్రవాద దాడుల మృతుల కన్నా ఎక్కువగా ఉందని ఆజాద్‌ వ్యాఖ్యానించడం జాతి వ్యతిరేకమని వెంకయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆజాద్‌ మాటలను రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటి ఛైర్మన్‌కు మంత్రి విజ్ఞప్తి చేశారు. తీవ్ర గందరగోళం మధ్య డిప్యూటి చైర్మన్‌ సభను వాయిదా వేశారు. కాగా పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇప్పటికే 40మంది మృతి చెందారని ఇది పాక్‌ టెర్రరిజం దాడుల మృతుల కన్నా ఇపుడున్న పరిస్థితే తీవ్రంగా ఉందన్నారు. మీ తప్పుడు నిర్ణయంల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వంపై మండిపడిన విషయం తెలిసిందే. 

ఆజంఖాన్ క్షమాపణలు చెప్పు: సుప్రీంకోర్టు

ఢిల్లీ : నోయిడా అత్యాచార ఘటనపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, సి.నాగప్పన్ లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పును ఇచ్చింది. ఒక ప్రజాప్రతినిధి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. జులై 29న నోయిడాకు చెందిన ఒక కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా కారును అడ్డుకున్న కొందరు దుండగులు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజకీయ కుట్ర అని ఆరోపిస్తూ ఆజంఖాన్ నాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

18:30 - November 17, 2016

అనంతపురం : ఏదన్నా రోగమొస్తే పేదవారికి ప్రభుత్వాసుపత్రే కదా గతి..మరి ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన పేదవారికి సిబ్బంది సరైన వైద్యం గానీ, సౌకర్యాలను గానీ అందిస్తున్నారా అంటే లేదనే చెప్పాల్సి వస్తోంది. దీనిక ప్రత్యక్ష నిదర్శనం ఈ ఘటన..మానవత్వం మండగలిసిందా? లేక అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం మనుష్యులు కొరవడుతోందా? సాటి మనిషికి ఏదో జంతువుని లాక్కెళుతున్నట్లుగా ఓ భార్య తన భర్తను ఊడ్చుకెళ్లింది. ఇది భర్తమీద వున్న కోపం వల్లనో లేదా అతనేదో అన్యాయం చేశాడనో కాదు..ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించేందుకు ఓ భార్య భర్తను తీసుకొచ్చింది. నడవలేని స్థితిలో వున్న భర్తను తాను మోయలేక..మనసు చంపుకునిఈ పనిచేసింది. అదేమిటానుకుంటున్నారా? నడవలేని తన భర్తకు వీల్ చైర్ ఇచ్చేందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. దీంతో నడవలేని స్థితిలో వున్న భర్తను మోయలేక..పై అంతస్థుకు తీసుకెళ్ళేందుకు ఈ భార్య భర్తను నేలపై ఊడ్చుకుంటూ తీసుకెళ్లింది. ఈ ఘటన చూస్తూ మానవత్వం సిగ్గుపడేలా వుంది..

గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన
జిల్లాలోని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో హృదయవిదారక దృశ్యం నెలకొంది. ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. వైద్యం కోసం వచ్చిన దంపతులకు ఆస్పత్రి సిబ్బంది వీల్‌ఛైర్ ఇవ్వలేదు. దీంతో భర్తను రెండో అంతస్తుకు మోయలేక భార్యనే లాక్కుంటూ సెకండ్‌ ఫ్లోర్‌కు తీసుకెళ్లింది. ఈ ఘటన అక్కడున్న ప్రతి ఒక్కర్నీ కదలించింది. ఆస్పత్రి సిబ్బందిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రులలో సిబ్బంది నిర్లక్ష్యం..అలసత్వం మరోసారి బైటపడింది..నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాట ఎంత వాస్తవమో ఈ ఘటనతో మరోసారి నిరూపితమయ్యింది. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి..అప్పుడైనా ఈ సర్కారు దవాఖాలకు వచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారు...అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే నిరుపేదలు ధైర్యంగా ప్రభుత్వాసుపత్రులకు వస్తారు. ఆ ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..

17:57 - November 17, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల ర‌ద్దుతో తెలంగాణ ప్రభుత్వం ప‌రేషాన్‌లో ప‌డింది. భారీ బ‌డ్జెట్ అంచ‌నాలు తలకిందులవుతున్నాయి. పెద్దనోట్లను రద్దు చేసిన కేంద్రం నిర్ణయాన్ని తప్పుప‌ట్టలేక‌..స‌మ‌ర్థించ‌నూలేక జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. లోటు నిధుల్ని పూడ్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తునే స‌రైన స‌మ‌యంలో కేంద్రంతో మాట్లాడాల‌ని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. మ‌రోవైపు జీతాల విష‌యంలోను ఇబ్బందులు ఉండ‌డంతో వచ్చే నెల జీతాన్ని రెండు విడ‌త‌లుగా ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నట్లు స‌మాచారం.
నోట్ల రద్దుతో భారీగా నష్టపోయిన తెలంగాణ
నిన్నా మొన్నటి వరకు ఆదాయంలో దేశంలోనే నెంబర్‌వన్‌ రాష్ట్రం ..కానీ ఇప్పుడు నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ కాస్తా నెమ్మదిగా కిందకు పడిపోయే ప్రమాదం కారణం..పెద్దనోట్ల రద్దు ..500, వెయ్యినోట్ల రద్దుతో తెలంగాణ భారీగా న‌ష్టపోయింది. ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే తెలంగాణ‌కు ఆదాయ‌మార్గాలు భిన్నంగా ఉంటాయి. రియ‌ల్ ఎస్టేట్‌, రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్‌, ఎక్సైజ్ రంగాల్లో మెజారిటి ఆదాయాన్ని రాబ‌ట్టుకుంటుంది. ఇక క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ ద్వారా కూడా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ఇప్పుడు నోట్ల ర‌ద్దు వ్యవహారంతో ఈ రంగాలన్ని ఒక్కసారిగా కుదేలయ్యాయి. ప్రజ‌ల దగ్గర లిక్విడిటి త‌గ్గిపోవ‌డం..బ్లాక్ మనీ బ్లాక్ అవ‌డంతో మార్కెట్ పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రియ‌ల్ ఎస్టేట్ రంగం శరవేగంగా పుంజుకుంది. క‌మ‌ర్షియ‌ల్ టాక్స్ వ‌సూళ్లు కూడా పెరిగాయి. దీంతో వ‌చ్చే ఏడాది బ‌డ్జెట్‌ను భారీగా ప్లాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ల‌క్షా 40నుంచి ల‌క్షా 50 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. మ‌రోవైపు ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను పెద్ద ఎత్తున చేప‌ట్టింది.
తెలంగాణ ప్రభుత్వానికి క‌ష్టాలు
కానీ అకస్మాత్తుగా జరిగిన ప‌రిణామంతో తెలంగాణ ప్రభుత్వానికి క‌ష్టాలు త‌ప్పేలా క‌నిపించ‌డంలేదు. బ‌డ్జెట్‌లో నిధుల కోసం భూముల అమ్మకం కూడా చేప‌ట్టాల‌ని భావించారు. భూముల అమ్మకం ద్వారా 10వేల కోట్లను స‌మీక‌రించాల‌ని కూడా బ‌డ్జెట్‌లో పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు నోట్ల ర‌ద్దుతో భూముల అమ్మకాలు జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. మొత్తంగా నెల‌కు 2వేల కోట్ల ఆదాయం లోటు స్పష్టంగా క‌నిపిస్తుంది. ఇంకా ప్రభుత్వ ఆదాయంపై ప‌డే ప్రభావం ఎంతుండ‌బోతుంద‌నే అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాల‌ని సీఎస్‌ రాజీవ్‌శర్మను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈ ఏడు నెల‌ల్లో వ‌చ్చిన ఆదాయం ఎంత‌..నోట్ల ర‌ద్దు త‌ర్వాత న‌వంబ‌ర్‌లో వ‌చ్చిన ఆదాయం ఎంత‌..భ‌విష్యత్తులో ధీర్ఘకాలికంగా ఎలాంటి ప‌రిస్థితులు ఉండ‌బోతున్నాయ‌నే అంశాల‌ను ప‌రిశీలించాల‌ని ఆదేశించారు.
భూముల అమ్మకం ద్వారా రూ. 10వేల కోట్లు
ఇంత జ‌రుగుతున్నా సీఎం కేసీఆర్‌ మాత్రం..ప్రస్తుత పరిణామాలపై బ‌హిరంగంగా స్పందించ‌డంలేదు. ప్రజల అభిప్రాయాల‌ను తెలుసుకున్న త‌ర్వాతే ప్రభుత్వం త‌ర‌పున స్పందించాల‌ని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇత‌ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌ను సంప్రదిస్తున్నా..కొద్ది రోజుల ప‌రిశీల‌న త‌ర్వాతే స్పందిస్తాన‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా ప్రజ‌ల ఇబ్బందులు..రాష్ట్రం మ‌నుగ‌డ‌పై ప‌డే ప్రభావంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.మ‌రోవైపు ఇప్పటికిప్పుడు ఉద్యోగుల జీతాల‌పై ప‌డే ప్రభావాన్ని ఎదుర్కునేందుకు..ఈ నెల జీతాన్ని రెండు ద‌ఫాలుగా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు కేంద్రానికి లేఖ కూడా రాయ‌నున్నట్లు తెలుస్తుంది.
బహిరంగంగా స్పందించని సీఎం కేసీఆర్
ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే నోట్ల ర‌ద్దు అంశంపై స్పందించాల‌ని తెలంగాణ స‌ర్కార్‌ భావిస్తోంది. ఒకవేళ ప్రజల్లో అనుకున్నంత వ్యతిరేకత లేకుంటే, రాష్ట్ర ఆర్ధిక లోటుకు కేంద్ర నిర్ణయమే కార‌ణం కాబ‌ట్టి.. హస్తినాధీశులే దీనికి ప‌రిష్కారం చూపాల‌ని డిమాండ్ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

17:49 - November 17, 2016

హైదరాబాద్ : స్పీకర్ మధుసుదనా చారికి టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి లేఖ రాశారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ ఇంకా విచారణ ప్రారంభించలేదని లేఖలో పేర్కొన్నారు. ఫిరాయింపులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని... డిసెంబర్ 20 తో ఆ గడువు ముగుస్తుందన్నారు. అప్పటిలోగా విచారణ పూర్తి చేయకపోతే మరోసారి కోర్టు తలుపుతడతామని రేవంత్ రెడ్డి లేఖలో తెలిపారు. 

17:47 - November 17, 2016

సిద్ధిపేట : ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మంత్రి మంత్రి హరీశ్‌రావు పాదయాత్ర చేపట్టారు. నగరంలోని గాంధీ సెంటర్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ధోబిగాల్లి, బారఇమాం, కమాన్‌ చేపల బస్తీల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

17:44 - November 17, 2016

సంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర 32వ రోజు.. సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. కర్ణాటక రాష్ర్టం శివరాంపూర్‌ మీదుగా సంగారెడ్డి జిల్లాలోని...కోహిర్‌ మండలంలోకి పాదయాత్ర బృందం ప్రవేశించింది. ఈ సమయంలో.. స్థానికులు, ప్రజాసంఘాలు భారీగా హాజరై.. సీపీఎం పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. సీఐటీయూ నాయకులు చుక్కా రాములు మాట్లాడుతూ..కోహిర్ మండలంలో దళితుల సమస్యలు విపరీతంగా వుందన్నారు. ఈ ప్రాంతంలో దేవాలయంలోకి దళితులను అనుమతించలేదనీ..రెండు గ్లాసుల విధానం ఈ ప్రాంతంలో వుందన్నారు. ఈ విధానం తొలగిపోవాలని దీనికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం పాదయాత్రకు విశేష్ స్పందన లభిస్తోందన్నారు.ఈరోజుకు పాదయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని ఈసందర్భంగా చుక్కారాములు తెలిపారు.

17:33 - November 17, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దు కష్టాలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇప్పటికీ సామాన్యులకు ఇక్కట్లు తప్పడం లేదు.. 500, వెయ్యి నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. గంటల తరపబడి ఏటీఎంల ముందు వేచిచూస్తుంటే...రెండు వేల నోటు చేతికొస్తోంది. అసలే చిల్లర లేక ఇబ్బంది పడుతున్న తమకు రెండువేల చిల్లర ఎక్కడ దొరుకుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని మొట్టమొదటి బెడ్‌రూమ్‌ కాలనీ అయిన ఐడీహెచ్‌ కాలనీ పలు సమస్యలను ఎద్కొంటున్నారు. పెద్దనోటును చిన్న నోట్లుగా మార్చుకునేందుకు లైన్లలో నిలబడితే లేని పోని ఆరోగ్య ఇబ్బందులొస్తున్నాయని ఈ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ఏదైనా రోగమొస్తే చేతిలో రెండువేలు వున్నాగానీ వైద్యం చేయించుకోలేని స్థితి నెలకొందని వారు వాపోతున్నారు. ఏషాపుకు వెళ్లినా చిల్లర సమస్యలే ఎదురవుతున్నాయంటున్నారు.స్కూల్లో ఫీజులు కట్టేందుకు వెళ్ళినా రెండువేల నోట్లు తీసుకోనంటున్నారని వారి చిల్లర కష్టాలను ఏకరవుపెట్టారు.

17:28 - November 17, 2016

సిద్ధిపేట : పెద్దనోట్ల రద్దు తమ పాలిట శాపంగా మారిందని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాష్ట్రాల రైతులు హాజరయ్యే సిద్ధిపేట జిల్లా కంకోల్‌ సంత ఎవరూ లేక వెలవెలబోతోంది. చిల్లర లేక పశువుల అమ్మకం, కొనుగోళ్లు ఆగిపోయాయని రైతులు చెబుతున్నారు. ఎడ్లకు మేతాలేదు..మాకు తిండీలేదని పశువుల వ్యాపారులు వాపోతున్నారు. నాయకులు తయారుచేసిందే నల్లధనమని ఓ వ్యాపారి మండిపడ్డాడు. పశువుల విక్రయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు. 

డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్ బీఐ

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు డిపాజిట్లపై పడింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఎస్ బీఐ తగ్గించింది. ఇవాళ్లి నుంచే కొత్త వడ్డీ రేట్లు అమలు అవనున్నట్లు పేర్కొంది. ఏడాది నుంచి 450 రోజుల లోపు టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు 7.5 శాతం నుంచి 6.90 శాతానికి తగ్గించింది. ఇప్పటి వరకు రూ.1,14,139 కోట్లు డిపాజిట్లను ఎస్బీఐ స్వీకరించింది. 

పార్చ్యూన్ మ్యాగజైన్ మొదటి ర్యాంకర్ గా జుకర్ బర్గ్

హైదరాబాద్ : పార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్ 50 వ్యాపారవేత్తల్లో ముగ్గురు భారతీయులకు చోటు లభించింది. అజితా రాజేంద్రకు 34వ ర్యాంకు, అదిత్యపూరికి 36వ ర్యాంక్, అజయ్ బంగాకు 48వ ర్యాంకు, మైక్రో సాఫ్ట్ చీఫ్ సత్యనాదేళ్లకు 5వ ర్యాంకు, ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కు మొదటి ర్యాంక్ లో నిలిచారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు 'హార్సే' పేరుతో పరమపద వాహనాలు...

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయిన వారి భౌతికకాయాలను ఉచితంగా తరలించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. హార్సే పేరుతో పరమపద వాహనాలను అందుబాటులో తేనుంది. రేపు గాంధీ ఆస్పత్రిలో 50 వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభిచనున్నారు. జిల్లాల వారీగా ఆస్పత్రులకు వాహనాలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

ముగిసిన తొలి రోజు ఆట

విశాఖ: తొలిరోజు ఆట ముగిసింది. భారత్ 317/4, భారత్ బ్యాటింగ్ లో పుజారా 119, రహానే 23, విజయ్ 20 చేయగా, ఇంగ్లండ్ బౌటింగ్ లో అండర్సన్ 3, బ్రాడ్ కు ఒక వికెట్ దక్కింది.

వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ :తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీసులో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాబడిని పెంచుకునే అవకాశం చర్చిస్తున్నట్లు సమాచారం.

ఆ పదమే మా బ్యాచ్ తో మొదలైంది : సరస్వతీ

నాటి యాంకర్ సరస్వతీతో మానవి ప్రత్యేక ఇంటర్వూ నిర్వహించింది.  ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. తన కెరీర్, యాంకర్ గురించి పలు విషయాలు తెలిపారు. ఆ విషయాలను ఆమె మాటల్లోనే... 'యాంకరింగ్ అనే పదం మా బ్యాచ్ తో మొదలైంది. ప్రతి చానల్ కు పని చేశాను. 26  సం.లుగా యాంకరింగ్ చేస్తున్నాను. సుమాంజలి ప్రొగ్రామ్ చేశాను. బాగా ఎంజాయ్ చేశాను. వయస్సులో కాదు జీవితంలో ఎదగాలి. 1988 సం.లో నాకు పెళ్లి అయింది' అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

కాపు రిజర్వేషన్లు వచ్చే వరకు పోరు ఆగదు: ముద్రగడ

తూ.గో : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహనిర్బంధాన్ని సడలించారు. కాపు రిజర్వేషన్లు వచ్చే వరకు పోరు ఆగదని, జేఏసీతో చర్చించి పాదయాత్ర తేదీని ప్రకటిస్తామని ముద్రగడ తెలిపారు.

కరెన్సీ కొరత లేదు : ఆర్బీఐ

ఢిల్లీ : కరెన్సీ కొరత లేదని, సరిపడ కరెన్సీ అందుబాటులో ఉందని ఆర్బీఐ ప్రకటించింది. కరెన్సీ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

16:40 - November 17, 2016

కడప : ప్రధాని నరేంద్రమోడీ పై కడపవాసులు మండిపడ్డారు. నోట్ల రద్దు ప్రకటన చేసి నేటికి తొమ్మిది రోజులు కావస్తున్నా నేటికి ప్రజలకు చిల్లర కష్టాలు తప్పటంలేదు. బ్యాంకుల వద్ద ఉదయంనుండే లైన్లలో నిలబడి పలు ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ క్రమంలోనే కడప బ్యాంక్ వద్ద ప్రజలు బారులు తీరి నిలబడ్డారు. దీంతో వారు సహనాన్ని కోల్పోయి ప్రధానిపై మండిపడ్డారు. ప్రధాని మోదీ కడుపుకు అన్నంతింటున్నారా? గట్టి తింటున్నారా? అని ఓ సామాన్యుడు ప్రధాని నరేంద్రమోడీపై ఓ సామాన్యుడు మండిపడ్డాడు. రెండువేల నోట్లు మాత్రమే బ్యాంకులలో అందుబాటులో వున్నాయని దీంతో చిల్లర కష్టాలు తప్పటంలేదని..ఈనోటు చేతిలో వున్నా ఏమీ కొనలేదని పరిస్థితుల్లో వున్నామని సామాన్యులు మండిపడుతున్నారు.సామాన్యులకు ఇబ్బందులు పెట్టేకంటే పెద్దవారి వద్ద వున్న నల్లధనాన్ని వెలికితీయాలన్నారు. 

16:36 - November 17, 2016

విశాఖ : రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఇంటిస్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఆడబిడ్డలు మరొకరిపై ఆధారపడకుండా తెలుగింటి ఆడబిడ్డలకు భద్రత, భరోసానిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మహిళా సాధికారతకు కృషి చేసిన పార్టీ టీడీపీ మాత్రమేనని తెలిపారు. నేడు ఏదైనా సమస్య వస్తే భయపడకుండా సమస్యలపై ఆడబిడ్డలు పోరాడుతున్నారని పేర్కొన్నారు. స్కూల్స్ లో కళాశాలలో ఆడపిల్లకు రిజర్వేషన్స్ ను టీడీపీ ప్రవేశపెట్టిందనీ దాని ఫలితమే నేడు చదువుకునే ఆడపిల్లల శాతం పెరిగిందన్నారు. మహిళలు చేట్టిన ఏపనైనా సరే మంచి ఫలితాన్నిస్తాయన్నారు. అందుకనే తెలుగింటి ఆడబిడ్డల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు మహిళల పేరిట ఇళ్ళస్థలాల పట్టాలిస్తున్నామన్నారు. 

మహిళా సాధికారత కోసం డ్వాక్రా, మెప్మా సంఘాలు : చంద్రబాబు
మహిళా సాధికారత కోసం డ్వాక్రా, మెప్మా వంటి సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన పట్టాల పంపిణీ-మహిళా సాధికారత సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకేసారి 30 వేల 562 మందికి క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేశారు. మహిళల పేరుతో ఇంటిపట్టాలివ్వడం తనకు ఆనందంగా ఉందని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ... ఎవరైనా లంచం అడిగితే నేరుగా తనకే ఫిర్యాదు చేయాలని బాబు సూచించారు. 

హోదా కోసం రోడెక్కడం సరికాదు: నారా లోకేశ్

తిరుపతి : ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో చిన బాబు నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నా పై అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే నేరుగా వెళ్లి చంచల్ గూడ జైల్లో కూర్చుంటానని తెలిపారు. ఏటా ఆస్తులు వెల్లడిస్తున్న ఆదర్శ కుంటుంబం మాది అని స్పష్టం చేశారు. కరెన్సీ కష్టాలు తాత్కాలికమేనని, కేంద్రం ఇంకాస్త మెరుగ్గా వ్యవహరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ చివరి వరకు పరిష్కారం కాకుంటే నిలదీద్దామని, ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాల వృద్ది రేటు 4.5% ఉంటే మనం 12 శాతం వృద్ధి సాధించామని హోదా కోసం రోడెక్కడం సరికాదని లోకేశ్ హితవు పలికారు.

స్పీకర్ కు రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారికి టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి లేక రాశారు. లేఖలోని సారాంశం ఇలా ఉంది... టీఆర్ ఎస్ లో చేరిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై డిసెంబర్ 20 లోపు నిర్ణయం తెలపాలని హైకోర్టు ఆదేశించినా ఇంత వరకు చర్యలు లేవని మండి పడ్డారు. గడువు లోగా విచారించకపోతే మరోసారి కోర్టుకెళ్తామని హెచ్చరించారు.

మేయర్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ భేటీ....

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం ప్రారంభం అయ్యింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ.5,643 కోట్ల బడ్జెట్ ను అధికారులు ప్రతిపాదించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై స్టాండింగ్ కమిటీ చర్చిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 10 నాటికి బడ్జెట్ పై ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.

15:58 - November 17, 2016

హైదరాబాద్ : కేసీఆర్ ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికు లేదని హోం మినిస్టర్ నాయిని నర్శింహారెడ్డి పేర్కొన్నాడు. రేవంత్ రెడ్డి ఓ బచ్చా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయాయన్నారు. చంద్రబాబు మెప్పుకోసమే సిఎం కేసిఆర్‌పై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ ఉనికి చాటుకునేందుకు తాపత్రాపడుతున్నారని అది ముగిసిపోయిన పార్టీ అని నాయిని రేవంత్ రెడ్డిపై విమర్శలు సంధించారు. 

 

 

15:46 - November 17, 2016

పదే పదే సభను అడ్డుకోవడం సరికాదు : వెంకయ్యనాయుడు

ఢిల్లీ : పదే పదే సభను అడ్డుకోవడం సరికాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదం వల్ల దేశం నాశనమవుతుంటే పాకిస్థాన్ ను సమర్థించడం సరికాదన్నారు.

ఢిల్లీ ఆర్బీఐ కార్యాలయం వద్ద మమత, కేజ్రీవాల్ నిరసన

ఢిల్లీ : పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్న‌ ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జి, ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ త‌మ‌కు మ‌ద్ద‌తు తెలపుతున్న కార్యకర్తలతో కలిసి ఢిల్లీలోని ఆర్‌బీఐ కార్యాల‌య ముట్ట‌డికి ప్ర‌య‌త్నించారు. అప్ర‌మ‌త్త‌మ‌యిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ తీవ్ర‌ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. 

15:36 - November 17, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో తెలంగాణ సర్కారు భారీ ప్రణాళికలకు బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ తలపెట్టిన సచివాలయ నిర్మాణం.. వివిధ ప్రాజెక్టులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.

పెద్దనోట్ల రద్దుతో తెలంగాణ సర్కారు ప్రణాళికలకు బ్రేక్‌
ప్రభుత్వం.. వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల అంచనాతో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి ప్రణాళిక రచించింది . దీని కోసం సర్వం సిద్ధం చేసుకుంది. అయితే 500, వెయ్యి నోట్ల రద్దు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో సర్కారుకు పన్నుల రూపేణా వచ్చే ఆదాయం కూడా భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీంతో కొత్త సచివాలయ నిర్మాణానికి నిధుల కేటాయింపు కూడా సమస్యగా మారింది.

సచివాలయ నిర్మాణానికి వ్యతిరేకిస్తున్న విపక్షాలు

మరోవైపు ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి.. కొత్త సచివాలయం నిర్మించాలనే ఆలోచనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దంటూ కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికే ఆందోళన కూడా చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి హైకోర్టులో కేసు కూడా వేశారు. దీంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ తరుణంలో ప్రస్తుతం కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకోవడం అసాధ్యమని.. ఇది జరిగే పనికాదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంచుమించు ఈ ప్రతిపాదన అటికెక్కటినట్టుగా కనిపిస్తోంది.

15:30 - November 17, 2016

ఢిల్లీ : సుప్రీంకోర్టులో కృష్ణా ట్రైబ్యునల్ తీర్పుపై తెలంగాణ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.. ఉన్నతన్యాయస్థానంలో కృష్ణాజలాల వివాదం కేసు విచారకు వచ్చింది. ఏపీ, తెలంగాణ మాత్రమే కృష్ణా జలాలను పంచుకోవాలని ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చిందని కేంద్రం కోర్టుకి తెలిపింది. ఇక ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని మహారాష్ట్ర,కర్ణాటక వాదించాయి. తదుపరి విచారణను జనవరి18 కు వాయిదా వేసింది. 

15:27 - November 17, 2016

ఢిల్లీ : రైతులు వారానికి 25వేలు.. వ్యాపారులు 50వేల రూపాయలను వ్యక్తిగత పూచీకత్తు మీద డ్రా చేసుకోవచ్చని ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ తెలిపారు. అలాగే పెళ్లిళ్ల ఖర్చుల కోసం 2.50 లక్షల రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చన్నారు. పంటల బీమా ప్రీమియం గడువును 15రోజులకు పెంచామని.. రైతులకు అండగా ఉంటామన్నారు. రేపటి నుంచి బ్యాంకుల్లో నగదు మార్పిడి పరిమితి 4500 నుంచి 2000 రూపాయలకు తగ్గించామని తెలిపారు.

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ : అధికార పక్షం, విపక్షాల మధ్య జరిగిన వాగ్యుద్ధంతో రాజ్యసభ రేపటికి (శుక్రవారానికి వాయిదా పడింది). పెద్ద నోట్ల రద్దు అంశం పెద్దల సభను కుదిపేసింది. ప్రధాని సభకు వచ్చే వరకు ఆ అంశంపై చర్చ జరిపేది లేదని విపక్షం పట్టుబట్టి వెల్ లోకి దూసుకురావడంతో గందరగోళం నెలకొంది. విపక్షాలను ఎంత వారించినా వినకపోవడం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

15:18 - November 17, 2016

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభమైంది. పెద్దనోట్ల రద్దు అంశంపై మరోసారి రాజ్యసభలో పెద్దనోట్ల రద్దు అంశంపై గందరగోళం నెలకొంది. ఈ విషయంలో జాయింట్ పార్లమెంట్ కమిటీకి విపక్షాలు పట్టుపట్టాయి. వెల్ లోకి దూసుకొచ్చి విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గందరగోళం మధ్య కాంగ్రెస్ సభ్యులు గులామ్ నబీ అజాద్ మాట్లాడుతూ..పెద్దనోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారనీ..కొన్ని ప్రాంతాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయన్నారు. ప్రజల మరణాలకు ప్రభుత్వం బాధ్య వహించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 40 మంది మృతి చెందారని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. ఈ మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ సభాపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ డిమాండ్ చేశారు. పాక్‌ టెర్రరిజం దాడుల మృతుల కన్నా ఇపుడున్న పరిస్థితే తీవ్రంగా ఉందన్నారు. మీ తప్పుడు నిర్ణయంల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. మృతుల్లో రైతులు, కార్మికులు, పేదలే ఉన్నారని తెలిపారు.చర్చకు సహకరించాలని డిప్యూటీ స్పీకర్ విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు ఏమాత్రం పట్టించుకోలేదు. పదే పదే సభను అడ్డుకోవటం సరైందికాదని స్పీకర్ సూచించారు. అయినా విపక్షాలు వవినిపించుకోకపోవటంతో సభను స్పీకర్ శుక్రవారానికి వాయిదా వేశారు.  

ప్రధాని సభకు రావాల్సిందే : ఆజాద్

ఢిల్లీ : ప్రధాని మోదీ సభకు వచ్చే వరకు చర్చకు ఒప్పుకోమని కాంగ్రెస్ నేత ఆజాద్ పట్టబట్టారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో విపక్షాలు, అధికార పక్షం మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు తీవ్రవాదుల దాడులతో చనిపోవడం లేదని, ప్రభుత్వ తప్పుడు నిర్ణయంతో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ల కోసమే ప్రభుత్వ నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.

జాయింట్ పార్లమెంట్ కమిటీకి విపక్షాల డిమాండ్

ఢిల్లీ : పెద్దల సభను నోట్ల రద్దు అంశం కుదిపేస్తోంది. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. పెద్ద నోట్ల రద్దు అంశంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వెల్ లోకి దూసుకువచ్చి ఆందోళనను కొనసాగిస్తున్నాయి.

పుజారా, కోహ్లీ చేరో సెంచరీ

విశాఖ : ఉక్కునగరంలో భారత్ , ఇంగ్లాండు మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పుజారా, కోహ్లీ  చేరో సెంచరీ పూర్తి చేశారు. ప్రస్తుతం231పరుగుల వద్ద మ్యాచ్ కొనసాగుతోంది. 

15:00 - November 17, 2016

ఢిల్లీ : ప్రధాని మోదీ నిర్ణయంపై బీజేపీ సభ్యులు కూడా ఆనందంగా లేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో పశ్చిమబంగ సీఎం మమతాబెనర్జీ, కేజ్రీవాల్‌ సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు. నిత్యావసర వస్తువుల కోసం జనం విలవిలలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా బుధవారంనాడు కూడా రాష్ట్రపతి భవన్ వరకూ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఆజాద్ పురా రోడ్డులో ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ..పాత పెద్దనోట్ల రద్దు భారత్ లోనే అతి పెద్ద స్కాం అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లు మాత్ర‌మే ఇస్తుండ‌డంతో కొత్త పెద్ద‌నోట్లు ప‌ట్టుకొని జ‌నం రోడ్డున ప‌డ్డారని ఆయ‌న అన్నారు. తినేందుకు కూడా తిండిలేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారుబ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మల్యాను ప్రధాని మోదీ విదేశాలకు తరలించారని ఆరోపించారు. బడాబాబులకు చెందిన రూ.7వేల కోట్ల రుణాలను ఎస్ బీఐ మాఫీ చేసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా మమత బెనర్జీ మాట్లాడుతూ కేంద్రం పాతనోట్ల రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో ప్రధానంగా సామాన్యులు, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

బ్యాంకుల్లో తనకు బకాయిల్లేవ్ : నాగార్జున

హైదరాబాద్: బ్యాంకులకు తాను కాని, అన్నపూర్ణ స్టూడియోస్ కాని ఎలాంటి బకాయిలు పడలేదని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పష్టం చేశారు. తాము బకాయిలు చెల్లించలేదంటూ కొంతమంది మాట్లాడుతున్నారని... వారందరికీ ఈ విషయాన్ని చెబుతున్నారని తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ అభివృద్ధి కోసం ఇంతకు ముందు బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న మాట వాస్తవమేనని... కానీ, ఈ ఏడాది ప్రారంభంలోనే వాటన్నిటినీ చెల్లించేశామని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తన వివరణ ఇచ్చారు.

కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు పై టీ.సర్కార్ కినుకు

హైదరాబాద్ : కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు పై తెలంగాణ సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టులో విచారణకు వచ్చిన కృష్ణాజలాల వివాదం కేసు లో ఏపీ, తెలంగాణ మాత్రమే జలాలను పంచుకోవాలని ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చిందని కేంద్రం తెలిపింది. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు స్పష్టం చేశాయి. తదుపరి విచారణనను జనవరి 18కి వాయిదా వేసింది.

అందుబాటులోకి రూ.500ల నోట్ : జైట్లీ

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా నేటి నుంచి 22,500 ఏటీఎంలలో రూ.500, రూ.2000 నోట్లు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి అరున్ జైట్లీ ప్రకటించారు. కొత్త రూ.1000 నోట్లు వస్తాయనేది అవాస్తవం అని స్పష్టం చేశారు.

నోట్ల రద్దు స్వతంత్ర భారత్ లోనే పెద్ద స్కాం : కేజ్రీవాల్

ఢిల్లీ :నోట్ల రద్దు స్వతంత్ర భారత్ లోనే పెద్ద స్కాం ఢిల్లీ కేజ్రీవాల్ అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై ఆజాద్ పురా రోడ్డులో ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ఆ పార్టీ నేతలు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ... వేల కోట్లు ఎగ్గొట్టిన విజయమల్యాను మోదీ విదేశాలకు తరలించారని ఆరోపించారు. 8 లక్షల కోట్ల రూపాలయ స్కాం అని బడాబాబులకు చెందిన రూ.7వేల కోట్ల రుణాలను ఎస్ బీఐ మాఫీ చేసిందని మండిపడ్డారు.

14:07 - November 17, 2016

మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషతో మానవి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

14:02 - November 17, 2016

సంగారెడ్డి : సీపీఎం చేపట్టిన మహా పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అన్ని వర్గాల వారు తమ సమస్యలను పాదయాత్ర బృందానికి చెప్పుకుంటున్నారు. నేటితో వికారాబాద్‌ జిల్లాలో మహాజన పాదయాత్ర ముగిసింది. కర్ణాటక రాష్ర్టం శివరాంపూర్‌ మీదుగా సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌ మండలంలోకి పాదయాత్ర బృందం ప్రవేశించింది. ఈ బృందానికి సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇప్పటి వరకూ 800 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇటు అన్ని రాజకీయ పార్టీలు కూడా సీపీఎం పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారు. 

 

హౌరా రైతుల్లో భారీగా నల్లధనం,బంగారం స్వాధీనం...

చెన్నై :ఎగ్మూర్ రైల్వే స్టేషన్ నుంచి హౌరా రైలులో పెద్ద మొత్తంలో తరలిస్తున్న నోట్ల కట్టలు, నగలు పట్టుబడింది. ఏసీ బోగిని బుక్ చేసుకున్నఆర్ పీఎఫ్ ఐజీ ఎస్ కే పారి తరలించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. పట్టుబడ్డ ఎస్ కే పారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

14:00 - November 17, 2016

వికారాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర 32వ రోజుకు చేరుకుంది. 800 కిమీ. పూర్తి చేసుకుంది. ప్రజల నుంచి పాదయాత్ర బృందానికి విశేష స్పందన లభిస్తోంది. పాదయాత్ర బృంద సభ్యులు రాజుతో టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. వికారాబాద్‌ జిల్లాలోని కరువు నివారణకు, వలసల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాదయాత్ర బృంద సభ్యులు రాజు డిమాండ్‌ చేశారు. వికారాబాద్‌ జిల్లాలో జీసీసీని ఏర్పాటు చేసి.. దాని ద్వారా గిరిజనులు పండిస్తున్న ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కేసీఆర్ ను విమర్శించే స్థాయి రేవంత్ కు లేదు : నాయిని

నల్గొండ : టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి మతిలేకుండా మాట్లాడుతున్నారని, కేసీఆర్ ను విమర్శించే స్థాయి రేవంత్ కు లేదని హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డి అన్నారు. ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసం, చంద్రబాబు మెప్పు కోసమే సీఎం కేసీఆర్ పై చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నపుడు ఏనాడూ రుణమాఫీ చేయని టిడిపి నేతలు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరం గా ఉందని ఎద్దేవా చేశారు. టిడిపి, కాంగ్రెస్ కలిసే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

13:54 - November 17, 2016

ఢిల్లీ : రైతులు వారానికి 25వేలు.. వ్యాపారులు 50వేల రూపాయలను వ్యక్తిగత పూచీకత్తు మీద డ్రా చేసుకోవచ్చని ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంతదాస్  తెలిపారు. అలాగే పెళ్లిళ్ల ఖర్చుల కోసం 2.50 లక్షల రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చన్నారు. పంటల బీమా ప్రీమియం గడువును 15రోజులకు పెంచామని.. రైతులకు అండగా ఉంటామన్నారు. రేపటి నుంచి బ్యాంకుల్లో నగదు మార్పిడి పరిమితి 4500 నుంచి 2000 రూపాయలకు తగ్గించామని తెలిపారు. 

13:50 - November 17, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభ దద్దరిల్లింది. ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభంకాగానే ప్రతిపక్ష సభ్యులు పెద్ద నోట్ల రద్దుపై చర్చకు పట్టుబట్టారు. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. విపక్షాల గందరగోళం మధ్య సభ నాలుగుసార్లు వాయిదా పడింది. పదకొండున్నరకు, మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ తర్వాత పన్నెండున్నరకు సభ వాయిదా పడింది. పన్నెండున్నరకు తిరిగి సమావేశమైన సభలో ఎలాంటి మార్పు లేకపోవడంతో సభాపతి అన్నారీ రాజ్యసభను రెండుగంటలకు వాయిదా వేశారు. పెద్ద నోటు రద్దు వల్ల రైతులు, పేదలు ఇబ్బందులు పడుతున్నారని విపక్షాలు పేర్కొన్నాయి. నోటు రద్దు విషయం కొందరు ప్రముఖులకు ముందే తెలిసిపోయిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 
లోక్‌సభలో గందరగోళం 
పెద్దనోట్ల రద్దుపై లోక్‌సభలోనూ గందరగోళం నెలకొంది. . కాంగ్రెస్, టీఎంసీ, తదితర పార్టీలు పెద్ద నోట్ల రద్దుపై వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ఈ అంశంపై చర్చ చేపట్టాలని.. ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. అయితే విపక్షాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీంతో విపక్ష సభ్యులు సభలో పెద్దయెత్తున నినాదాలు చేస్తున్నారు. నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. సభ కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతుండడంతో స్పీకర్‌ సభను పన్నెండున్నరకు వాయిదా పడింది. లోక్‌సభ తిరిగి ప్రారంభం కాగా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. నోట్లరద్దు జాతీయ అంశమని దీనిపై చర్చ జరిగాలని, ఓటింగ్‌కు కూడా సిద్ధమని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. తమ చర్చకు సిద్ధమేనని, విపక్షాల సూచనలను స్వీకరిస్తామని కేంద్రమంత్రి అనంతకుమార్‌ చెప్పినప్పటికీ విపక్షాలు సంతృప్తి చెందలేదు. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

 

13:36 - November 17, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో తెలంగాణ వాణిజ్యశాఖకు కలెక్షన్ల వర్షం కురిసింది. వాణిజ్య పన్నుల ద్వారా రూ. 182 కోట్ల మొండి బకాయిలు వసూలు చేశారు. మిగతా మొండిబకాయిలనూ త్వరగా వసూలు చేయాలని సీఎస్ రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:22 - November 17, 2016
13:20 - November 17, 2016

ఢిల్లీ : లోక్ సభ రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే నోట్ల రద్దు అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. విపక్షాలు పోడియంను చుట్టుముట్టాయి. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం కాగానే నోట్ల రద్దు అంశంపై మళ్లీ విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. స్పీకర్ ఎంత చెప్పినా వినలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:16 - November 17, 2016

ఢిల్లీ : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రాజ్యసభ నాలుగోసారి వాయిదా పడింది. పెద్ద నోట్ల రద్దుపై సభ దద్దరిల్లింది. రాజ్యసభ ప్రారంభం కాగానే నోట్ల రద్దు అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. విపక్షాలు పోడియంను చుట్టుముట్టాయి. దీంతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ ఎంత చెప్పినా.. విపక్షాలు వినకుండా ఆందోళన చేశాయి. దీంతో స్పీకర్ సభ 30నిమిషాలపాటు వాయిదా వేశారు. అనంతరం 11.30 గంటలకు తిరిగి సభ ప్రారంభం అయింది. నోట్ల రద్దు అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు మళ్లీ పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకం నినాదాలు చేశాయి.  స్పీకర్ ఎంత చెప్పిన ఆందోళన విరమించలేదు. దీంతో స్పీకర్ సభను మధ్నాహ్నం 12.00 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభం అయింది. పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చకు పట్టుబట్టాయి. ప్రధాని మోడీ సభకు రావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. స్పీకర్ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆందోళన కొనసాగించారు. దీందో స్పీకర్ సభను మధ్యాహ్నం 12.30 గంటకు మరోమారు వాయిదా వేశారు. 
వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభం అయింది. సభలో మళ్లీ అదే గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

తెలంగాణ వాణిజ్య శాఖకు కలెక్షన్ల వర్షం..

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో తెలంగాణకు నష్టం కలిగిందా ? లాభం కలిగిందా ? అనే దానిపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించారు. ఇదిలా ఉంటే తెలంగాణ వాణిజ్యశాఖకు కలెక్షన్ల వర్షం కురిసింది. వాణిజ్య పన్నుల ద్వారా రూ. 182 కోట్ల మొండి బకాయిలు వసూలు చేశారు. మిగతా మొండిబకాయిలనూ త్వరగా వసూలు చేయాలని సీఎస్ ఆదేశించారు. 

పాలి హౌస్ లను పరిశీలించిన మంత్రి పోచారం..

మెదక్ : పిలికొట్టాం గ్రామంలో పాలి హౌస్ లను మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కలెక్టరేట్ లో వ్యవసాయ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. 

పార్క్ హయత్ హోటల్ లో ప్రీ మెచ్యుర్టీ డే..

హైదరాబాద్ : పార్క్ హయత్ హోటల్ లో ప్రీ మెచ్యురిటీ డే కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. 445 మంది పిల్లలతో ప్రీ మెచ్యురిటీ కార్యక్రమం నిర్వహించిన రెయిన్ బో హాస్పిటల్ గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పింది.

రైతులు ప్రతివారం రూ. 25వేలు డ్రా - శక్తికాంత్ దాస్..

ఢిల్లీ : ధాన్యం, విత్తనాల కొనుగోలు కోసం రైతులు ప్రతివారం రూ. 25వేలు విత్ డ్రా చేసుకోవచ్చని ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ వెల్లడించారు. బ్యాంకు ఖాతాలు మాత్రం రైతుల పేర్ల మీదనే ఉండాలని సూచించారు. పంటల బీమా ప్రీమియం పెంచుతున్నట్లు వెల్లడించారు. 

లోక్ సభ శుక్రవారానికి వాయిదా..

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు లోక్ సభను కుదిపేసింది. విపక్షాలు ఆందోళన చేయడంతో లోక్ సభ పలుమార్లు వాయిదా పడింది. చివరకు పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

13:01 - November 17, 2016

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న కొత్త సినిమా ఒపెనింగ్ జరుపుకుంది. ఈ చిత్రం పై దర్శకుడు కొరటాల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దర్శకుడి మాటలతో ఈ న్యూ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందని ఆడియన్స్ అప్పుడే లెక్కలు వేస్తున్నారు. మహేష్ తో చేయనున్న మూవీపై కొరటాల చేసిన హాట్ కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం....
కాస్త స్పీడ్ పెంచిన మహేష్ బాబు
సినిమా తరువాత సినిమా చేసే మహేష్ బాబు కాస్త స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం ప్రిన్స్ ఓ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. శ్రీమంతుడు భారీ హిట్టు తరువాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా బ్రహ్మోత్సవం స్టార్ట్ చేసిన ప్రిన్స్ ఈ మూవీ డిజాస్టర్ కావడంతో కాస్త టైం తీసుకుని మురుగదాస్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు. అయితే ఈ మూవీతో పాటు రిసెంట్ గా కొరటాల డైరెక్షన్ లో న్యూ మూవీని స్టార్ట్ చేశాడు.  
కొరటాల చాలా పెద్ద స్టేట్మెంట్ 
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న కొత్త సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. రామానాయుడు స్టూడియోలో ఎలాంటి హంగామా లేకుండా ఈ మూవీ ముహుర్తం సింపుల్ గా కానిచ్చేశారు. మహేష్ తో తను చేయనున్న కొత్త మూవీ తెలుగు సినిమా స్థాయిని పెంచే చిత్రమవుతుందని కొరటాల చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు.
100కోట్ల బడ్జెట్ తో చిత్రం 
ఈ మూవీ రాజకీయాల నేఫథ్యంలో నడుస్తుందట. భరత్ అను నేను టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు మూవీ స్టోరీ లైన్ మార్చేస్తుందని ఈ దర్శకుడు మరో హాట్ కామెంట్ చేశాడు. ఎప్పుడు లేనివిధంగా కొరటాల సినిమా ప్రారంభోత్సవం రోజే ఈ స్థాయి చెప్పడంతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెరుగుతున్నాయి. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 100కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తుంది.

12:54 - November 17, 2016

హైదరాబాద్ : ఓటు నోటుకు నోటు కేసు నమోదుతో ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ ను వదిలిపెట్టి వెళ్లారని మాజీ ఎంపీ ఉండవల్లి  హైకోర్టులో వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు కేసు నమోదు చేయాలన్న తీర్పును కొట్టివేయాలన్న చంద్రబాబు పిటిషన్ పై ఉండవల్లి ఇంప్లీడ్ అయ్యారు. మళ్లీ చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిధార్ధ లూథ్రా ఈరోజు వాదనలు వినిపించనున్నారు. 
ఓటుకు నోటు కేసుపై ఉండవల్లి వాదనలు
ఓటుకు నోటు కేసులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ తనదైన శైలిలో హైకోర్టులో వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు చంద్రబాబు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న తీర్పును కొట్టివేయాలనే పిటిషన్ పై ఉండవల్లి ఇంప్లీడ్ ఆయ్యారు. గతంలో ఏసీబీ వాదనలు, ఏపీ. సీఎం తరపున సిదార్ధలూథ్రా వాదనలకు కౌంటర్ గా తన వాదనలు వినిపించారు.
హైకోర్టుకు ఎలాంటి తీర్పునైన ఇచ్చే అధికారం ఉందన్న ఉండవల్లి
ఉన్నత న్యాయస్థానానికి సీఆర్పీసీ 482 ప్రకారం ఎలాంటి తీర్పునైన ఇచ్చే అధికారం ఉందని ఉండవల్లి తెలిపారు. ఆడియో, వీడీయో ద్వారా కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ.. మీడియాకు ఎవరు ఇచ్చారో స్పష్టం చేయాలని కోరారు. చానెల్స్ ద్వారా ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలు మొత్తం ఆ ఆడియో, వీడియోలను చూసి ఆ నేరం ఎవరు చేశారో గుర్తించారు. దర్యాప్తు సంస్థ దర్యాప్తు సరిగ్గా చేయకుంటే సీఆర్పీసీ 39 ప్రకారం కోర్టుకు ఎవరైనా రావచ్చు. దీని పై ఈ నేరాన్ని ఎవరు చేశారో గుర్తిస్తే చాలు.. వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోకుంటే..ప్రజలందరూ లోకో స్టాండ్ పై కోర్టును ఆశ్రయించవచ్చని ఉండవల్లి తెలిపారు.
దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని చెబుతోన్న ఏసీబీ
ఏసీబీ చార్జీషీట్ దాఖలు చేసి 15 నెలలు గడుస్తున్నా ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పుతోంది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక సీ.ఎం. ఉన్నారు. కాని ఏసీబీ లా కమిషన్ ఆఫ్ ఇండియా  డైరెక్షన్స్ ప్రకారం దర్యాప్తు పూర్తి చేయడం లేదని ఏసీబీ పై ఫిర్యాదు చేశారు. కేసులో ఎమ్మెలేలు ఎం.పీలు ఉంటే ఏడాది లోపు కేసును పరిష్కరించాలన్నారు. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం పేరును 22 సార్లు  పేర్కొన్న దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని వాదనలు వినిపించారు.
హైదరాబాద్ ను విడిచివెళ్లడానికి ఓటునోటు కేసే కారణం : ఉండవల్లి
ఇక ఏపీ పునర్ విభజన యాక్ట్ లో ఉన్న అంశాలను తుంగలో తొక్కి హైదరాబాద్ ను విడిచి వెళ్లడానికి కారణం ఓటుకు నోటు కేసేనని వివరణ ఇచ్చారు. అయితే ఏసీబీ కోర్టులో పిటిషనర్ ఎమ్మెల్యే ఆర్కే సెక్షన్ 210 సీఆర్పీసీ చట్ట ప్రకారం అదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరగా.. కోర్టు  సీఆర్పీసీ సెక్షన్ 156 , సబ్ క్లాజ్ 3 ప్రకారం అదేశాలు జారీ చేసింది. దీని పై ఎలాంటి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఏసీబీ, చంద్రబాబు, ఎమ్మెల్యే ఆర్కే, ఉండవల్లి వాదనలు పూర్తి అయ్యాయి. మళ్లీ చంద్రబాబు తరుపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిధార్ధ లూథ్రా ఈరోజు వాదనలు వినిపించనున్నారు. 

 

12:47 - November 17, 2016

అనంతపురం : జిల్లాలోని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో హృదయవిదారక దృశ్యం నెలకొంది. ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. వైద్యం కోసం వచ్చిన దంపతులకు ఆస్పత్రి సిబ్బంది వీల్‌ఛైర్ ఇవ్వలేదు. దీంతో భర్తను రెండో అంతస్తుకు మోయలేక భార్యనే లాక్కుంటూ సెకండ్‌ ఫ్లోర్‌కు తీసుకెళ్లింది. ఈ ఘటన అక్కడున్న ప్రతి ఒక్కర్నీ కదలించింది. ఆస్పత్రి సిబ్బందిపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

12:42 - November 17, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల ర‌ద్దుతో తెలంగాణ ప్రభుత్వం ప‌రేషాన్‌లో ప‌డింది. భారీ బ‌డ్జెట్ అంచ‌నాలు తలకిందులవుతున్నాయి. పెద్దనోట్లను రద్దు చేసిన కేంద్రం నిర్ణయాన్ని తప్పుప‌ట్టలేక‌..స‌మ‌ర్థించ‌నూలేక జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. లోటు నిధుల్ని పూడ్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తునే స‌రైన స‌మ‌యంలో కేంద్రంతో మాట్లాడాల‌ని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. మ‌రోవైపు జీతాల విష‌యంలోను ఇబ్బందులు ఉండ‌డంతో వచ్చే నెల జీతాన్ని రెండు విడ‌త‌లుగా ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నట్లు స‌మాచారం. 
నోట్ల ర‌ద్దుతో అన్ని రంగాలు కుదేలు
నిన్నా మొన్నటి వరకు ఆదాయంలో దేశంలోనే నెంబర్‌వన్‌ రాష్ట్రం ..కానీ ఇప్పుడు నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ కాస్తా నెమ్మదిగా కిందకు పడిపోయే ప్రమాదం.. కారణం..పెద్దనోట్ల రద్దు. 500, వెయ్యినోట్ల రద్దుతో తెలంగాణ భారీగా న‌ష్టపోయింది. ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే తెలంగాణ‌కు ఆదాయ‌మార్గాలు భిన్నంగా ఉంటాయి. రియ‌ల్ ఎస్టేట్‌, రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్‌, ఎక్సైజ్ రంగాల్లో మెజారిటి ఆదాయాన్ని రాబ‌ట్టుకుంటుంది. ఇక క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ ద్వారా కూడా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ఇప్పుడు నోట్ల ర‌ద్దు వ్యవహారంతో ఈ రంగాలన్ని ఒక్కసారిగా కుదేలయ్యాయి. ప్రజ‌ల దగ్గర లిక్విడిటి త‌గ్గిపోవ‌డం..బ్లాక్ మనీ బ్లాక్ అవ‌డంతో మార్కెట్ పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రియ‌ల్ ఎస్టేట్ రంగం శరవేగంగా పుంజుకుంది. క‌మ‌ర్షియ‌ల్ టాక్స్ వ‌సూళ్లు కూడా పెరిగాయి. దీంతో వ‌చ్చే ఏడాది బ‌డ్జెట్‌ను భారీగా ప్లాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ల‌క్షా 40నుంచి ల‌క్షా 50 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. మ‌రోవైపు ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను పెద్ద ఎత్తున చేప‌ట్టింది.
టీ.ప్రభుత్వానికి క‌ష్టాలు  
కానీ అకస్మాత్తుగా జరిగిన ప‌రిణామంతో తెలంగాణ ప్రభుత్వానికి క‌ష్టాలు త‌ప్పేలా క‌నిపించ‌డంలేదు. బ‌డ్జెట్‌లో నిధుల కోసం భూముల అమ్మకం కూడా చేప‌ట్టాల‌ని భావించారు. భూముల అమ్మకం ద్వారా 10వేల కోట్లను స‌మీక‌రించాల‌ని కూడా బ‌డ్జెట్‌లో పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు నోట్ల ర‌ద్దుతో భూముల అమ్మకాలు జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. మొత్తంగా నెల‌కు 2వేల కోట్ల ఆదాయం లోటు స్పష్టంగా క‌నిపిస్తుంది. ఇంకా ప్రభుత్వ ఆదాయంపై ప‌డే ప్రభావం ఎంతుండ‌బోతుంద‌నే అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాల‌ని సీఎస్‌ రాజీవ్‌శర్మను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈ ఏడు నెల‌ల్లో వ‌చ్చిన ఆదాయం ఎంత‌..నోట్ల ర‌ద్దు త‌ర్వాత న‌వంబ‌ర్‌లో వ‌చ్చిన ఆదాయం ఎంత‌..భ‌విష్యత్తులో ధీర్ఘకాలికంగా ఎలాంటి ప‌రిస్థితులు ఉండ‌బోతున్నాయ‌నే అంశాల‌ను ప‌రిశీలించాల‌ని ఆదేశించారు. 
భూముల అమ్మకం ద్వారా రూ. 10వేల కోట్లు 
ఇంత జ‌రుగుతున్నా సీఎం కేసీఆర్‌ మాత్రం..ప్రస్తుత పరిణామాలపై బ‌హిరంగంగా స్పందించ‌డంలేదు. ప్రజల అభిప్రాయాల‌ను తెలుసుకున్న త‌ర్వాతే ప్రభుత్వం త‌ర‌పున స్పందించాల‌ని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇత‌ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌ను సంప్రదిస్తున్నా..కొద్ది రోజుల ప‌రిశీల‌న త‌ర్వాతే స్పందిస్తాన‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా ప్రజ‌ల ఇబ్బందులు..రాష్ట్రం మ‌నుగ‌డ‌పై ప‌డే ప్రభావంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.మ‌రోవైపు ఇప్పటికిప్పుడు ఉద్యోగుల జీతాల‌పై ప‌డే ప్రభావాన్ని ఎదుర్కునేందుకు..ఈ నెల జీతాన్ని రెండు ద‌ఫాలుగా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు కేంద్రానికి లేఖ కూడా రాయ‌నున్నట్లు తెలుస్తుంది.
బహిరంగంగా స్పందించని సీఎం కేసీఆర్ 
ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే నోట్ల ర‌ద్దు అంశంపై స్పందించాల‌ని తెలంగాణ స‌ర్కార్‌ భావిస్తోంది. ఒకవేళ ప్రజల్లో అనుకున్నంత వ్యతిరేకత లేకుంటే, రాష్ట్ర ఆర్ధిక లోటుకు కేంద్ర నిర్ణయమే కార‌ణం కాబ‌ట్టి.. హస్తినాధీశులే దీనికి ప‌రిష్కారం చూపాల‌ని డిమాండ్ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది

 

12:38 - November 17, 2016

విజయనగరం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పీడ్‌ పెంచారు. అనంతపురం సభ విజయవంతం కావడంతో..  మరిన్ని బహిరంగ సభలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. తదుపరి సభను ఉత్తరాంధ్రలో ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ప్రజల్లో మరింత మమేకమయ్యేందుకు పవన్‌ ముందుకు అడుగులు వేస్తున్నారు. ఒక వ్యూహం ప్రకారం సభలను నిర్వహిస్తూ... ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ జిల్లాలో సభలు ఏర్పాటు చేసి.. అక్కడి స్థానిక సమస్యలపై ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే  తిరుపతి, కాకినాడ, అనంతపురంలో సభలు నిర్వహించిన పవన్‌... తన తర్వాత సభకు వేదిక‌గా ఉత్తరాంధ్రను ఎంచుకున్నట్టు స‌మాచారం.
విజయనగరంలో సభకు సన్నాహాలు
ఉత్తరాంధ్ర ప్రజా సమస్యలపై తన గళం విప్పేందుకు పవన్‌ సిద్ధమవుతున్నారు. పవన్‌ తన తర్వాత సభను విజయనగరంలో నిర్వహించేందుకు  సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు పవన్‌ ఆదేశించినట్టు  సమాచారం. ఈ మేరకు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు అమలుపై, వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన నిధుల ఖర్చు.. వంటి అంశాలను పవన్‌ ప్రస్తావించినున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్‌ నెలాఖరు లేదా.. జనవరిలో ఈ సభ ఉండే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్‌.. అందుకు అనుగుణంగా పార్టీ బలోపేతంపై కూడా దృష్టి సారించారు.  దానికనుగుణంగానే  అన్ని జిల్లాలో సభలు ఏర్పాటు చేస్తున్నారు.

 

12:30 - November 17, 2016

సంగారెడ్డి : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్న.. సీపీఎం మహాజన పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో పూర్తి చేసుకొంది. ఇవాళ సీపీఎం బృందం పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనుంది. తమ సమస్యలను సీపీఎం పాదయాత్ర బృందం ముందు విన్నవించుకునేందుకు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  
రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర పూర్తి
గత నెలలో ప్రారంభమైన సీపీఎం మహాజన పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసుకోంది. ఇప్పుడు ఇక సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనుంది. ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలం మనియర్‌పల్లి గ్రామంలో తమ్మినేని బృందం అడుగుపెట్టనుంది. సీపీఎం మహాజన పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలో ప్రవేశించనుందన్న విషయం తెలుసుకున్న ప్రజలు తమ సమస్యలను తెలిపేందుకు ఎంతగానే ఎదురుచూస్తున్నారు.
సీఎంపై మండిపడుతున్న సీపీఎం నాయకులు
మహాజన పాదయాత్ర బడుగు బలహీన వర్గాల సమస్యలను తెలుసుకోని వాటిని ముఖ్యమంత్రికి విన్నవించినా పట్టించుకోవడం లేదని సీపీఎం నాయకులు అంటున్నారు. ప్రజా సమస్యలపై సీఎం స్పదించే తీరు సరిగా లేదని సీపీఎం నాయకులు మండిపడుతున్నారు.  
సీపీఎంతో తమ సమస్యలు ఎన్నో పరిష్కారం : ప్రజలు
సీపీఎంతోనే తమ సమస్యలు ఎన్నో పరిష్కారం అయ్యాయని.. ఆ పార్టీ చేపట్టిన మహాజన పాదయాత్ర కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామని సంగారెడ్డి జిల్లా కోహిర్ వాసులు అంటున్నారు. ఇవాళ సంగారెడ్డిలో అడుగుపెట్టనున్న సీపీఎం మహాజన పాదయాత్రకు ఘనస్వాగతం పలికేందుకు కోహిర్ గ్రామస్తులందరూ సిద్ధమయ్యారు.  

 

12:25 - November 17, 2016

కడప : జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్వానికి పాల్పడ్డారు. యువతి మృతి చెంది. జిల్లాలోని బద్వేల్‌ మండలం అగ్రహారంలో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈఘటనలో యువతి మృతి చెందింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు.

12:18 - November 17, 2016
12:17 - November 17, 2016

ఢిల్లీ : లోక్ సభ వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే నోట్ల రద్దు అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. విపక్షాలు పోడియంను చుట్టుముట్టాయి. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదా వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

లోక్ సభ వాయిదా

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. అదే సమయంలో స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించడంతో విపక్షాలు స్పీకర్ పోడియం చుట్టముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టాయి. అంతే కాకుండా ప్రధాన్ని సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

12:13 - November 17, 2016

ఢిల్లీ : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రాజ్యసభ మూడోసారి వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభం కాగానే నోట్ల రద్దు అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. విపక్షాలు పోడియంను చుట్టుముట్టాయి. దీంతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ ఎంత చెప్పినా.. విపక్షాలు వినకుండా ఆందోళన చేశాయి. దీంతో స్పీకర్ సభ 30నిమిషాలపాటు వాయిదా వేశారు. అనంతరం 11.30 గంటలకు తిరిగి సభ ప్రారంభం అయింది. నోట్ల రద్దు అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు మళ్లీ పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకం నినాదాలు చేశాయి.  స్పీకర్ ఎంత చెప్పిన ఆందోళన విరమించలేదు. దీంతో స్పీకర్ సభను మధ్నాహ్నం 12.00 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభం అయింది. పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చకు పట్టుబట్టాయి. ప్రధాని మోడీ సభకు రావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. స్పీకర్ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆందోళన కొనసాగించారు. దీందో స్పీకర్ సభను మధ్యాహ్నం 12.30 గంటకు మరోమారు వాయిదా వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

ఉభయ సభలను కుదిపేస్తున్న పెద్ద నోట్ల రద్దు అంశం

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అంశం ఉభసభలను కుదిపేస్తోంది. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చను చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. అంతే కాకుండా ప్రధాని ఈ అంశం పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ పోడియంను చుట్టుముట్టి అందోళన చేపట్టాయి. వీరి ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ నిర్వహించడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ ఇప్పటి వరకు మూడు సార్లు వాయిదా పడింది.

మూడోసారి వాయిదా పడ్డ రాజ్యసభ

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు పై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళనలతో రెండు సార్లు వాయిదా పడిన అనంతరం ప్రారంభమైన సభలో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. దీంతో మూడవ సారి కూడా రాజ్యసభ వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు.

ప్రధాని సమాధానం చెప్పాలి:విపక్షాలు

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు పై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ లోక్ సభలో స్పీకర్ పోడియం చుట్టుముట్టి విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

11:53 - November 17, 2016
11:51 - November 17, 2016
11:50 - November 17, 2016
11:49 - November 17, 2016
11:43 - November 17, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితి పాము నోట్లో కప్ప చందంగా మారింది. గ్రేటర్‌ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన కేసీఆర్ కు ఇప్పుడు మింగలేని, కక్కలేని  పరిస్థితి ఎదురైంది. పెద్ద నోట్ల రద్దుపై కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు... ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తుంటే... ఈ విషయంలో ఏమిచేయాలో పాలుపోక అయోమయ పరిస్థితుల్లో టీఆర్ ఎస్ నేతలు కొట్టుమిట్టాడుతున్నారన్న చర్చ జరుగుతోంది. 
గ్రేటర్‌ ఎన్నికల ముందు కేంద్రంపై విరుచుకుపడ్డ టీఆర్‌ఎస్‌ 
రాజకీయ వ్యూహరచనలో దిట్టగా పేరు పొందిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌... పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎలా వ్యవహరించాలన్న విషయంలో ఎటూ తేల్చులేకపోతున్నారు. గ్రేటర్‌ ఎన్నికలకు ముందు కేంద్ర విధానాలపై విరుచుకుపడ్డ గులాబీ బాస్‌, టీఆర్‌ఎస్‌ నేతలు... ఢీ అంటే ఢీ అన్నారు... సై అంటే సై అన్నారు. కానీ తదనంతరం మారిన  పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు వ్యూహాన్ని మార్చకున్నట్టు కనపిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
పార్టీ సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌ ? 
ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దుపై కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ... కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ప్రధాని మోడీపై బాహాటంగానే విరుచుకుపడుతూ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పెద్ద నోట్ల రద్దును స్వాగతించినా... రెండు వేల రూపాయల నోట్లు తీసుకురావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్‌ పార్టీ నేతలతో జరుగుతున్న సమావేశాల్లో  పెద్ద నోట్ల రద్దును  వ్యతిరేకిస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ బాహాటంగా మాత్రం  తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలేదు. ప్రభుత్వ అధికారులతో నిర్వహిస్తున్న సమీక్షల్లో కూడా అంతర్గతంగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న కేసీఆర్‌... బయటకు మాత్రం కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించలేక, వ్యతిరేకించలేకపోతున్నారు. 
పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీల మౌనవ్రతం 
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెద్ద నోట్ల రద్దుపై వివిధ పార్టీలు గళం విప్పుతున్నా.. టీఆర్‌ఎస్‌ ఎంపీలు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు.  కరెన్సీ రద్దుపై ఏవిధంగా వ్యవహరించాలన్న విషయంలో పార్టీ అధినాయకత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో పెదవి విప్పడంలేదు. ఐదొందలు, వెయ్యి నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వొద్దని పార్టీ ఎంపీలను గులాబీ బాస్‌ ఆదేశించినట్టు సమాచారం. కేంద్ర నిర్ణయంతో ప్రజలు ఎదర్కొంటున్న ఇబ్బందులను మాత్రమే ప్రస్తావించాలని సూచించినట్టు  వినిపిస్తోంది. కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉంటే.. రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకోవచ్చన అభిప్రాయంతో ఉన్న కేసీఆర్‌... పెద్ద నోట్ల రద్దుపై బాహాటంగా ప్రకటనలు చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. 
టీఆర్‌ఎస్‌ నేతల దూకుడుకు బ్రేకులు
వీలుంటే ప్రధాని మోదీని కలిసి పెద్ద నోట్ల రద్దపై తన మనసులోని భావాలను వ్యక్తం చేయాలన్న ఆలోచనలో టీఆర్‌ఎస్‌ అధినేత ఉన్నారు. ఈ నెలాఖరులో మోదీ హైదరాబాద్‌లో పర్యటించే అవకాశం ఉండటంతో నేరుగా కలిసి, పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వానికి ఎదురవుతున్న సమస్యలను వివరించాలన్న యోచనలో ఉన్నారు. మొత్తం మీద కరెన్సీ నోట్ల రద్దు వ్యవహారం గులాబీ దళాధిపతితోపాటు, పార్టీ నేతల దూకుడుకు బ్రేకులు వేసిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ వ్యూహాత్మక మౌనం దేనికి సంకేతాలన్న అంశంపై టీఆర్‌ఎస్‌ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. 

 

మరోసారి వాయిదా పడ్డ రాజ్యసభ

ఢిల్లీ : మరోసారి రాజ్యసభ వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి పెద్ద నోట్ల రద్దుపై చర్చను చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. మరోసారి డిప్యూటీ ఛైర్మన్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

సీనియర్ ఆర్టిస్ట్ సుధతో చిట్ చాట్

సీనియర్ ఆర్టిస్ట్ సుధతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపారు. తన సినీ కెరీర్ గురించి వివరించారు. తన అనుభవాలను తెలిపారు. అలాగే ఆమె నటించిన ఇటీవలి చిత్రం 'ఆమె అతడైతే' సినిమా విశేషాలు చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:40 - November 17, 2016

ఢిల్లీ : రాజ్యసభలో వాయిదాల పర్వం కొసాగుతోంది. రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభం కాగానే నోట్ల రద్దు అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. విపక్షాలు పోడియంను చుట్టుముట్టాయి. దీంతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ ఎంత చెప్పినా.. విపక్షాలు వినకుండా ఆందోళన చేశాయి. దీంతో స్పీకర్ సభ 30 నిమిషాలపాటు వాయిదా వేశారు. అనంతరం 11.30 గంటలకు తిరిగి సభ ప్రారంభం అయింది. నోట్ల రద్దు అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు మళ్లీ పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకం నినాదాలు చేశాయి. స్పీకర్ ఎంత చెప్పిన ఆందోళన విరమించలేదు. దీంతో స్పీకర్ సభను మధ్నాహ్నం 12.00 గంటలకు వాయిదా వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

11:33 - November 17, 2016

ఢిల్లీ : ఉభయసభల సమవేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్ సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. నోట్ల రద్దుపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల ఎంపీల నినాదాలు చేస్తున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ

ఢిల్లీ : ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి పెద్ద నోట్ల రద్దు పై చర్చను చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభలో ఆందోళన నెలకొంది. అనంతరం తిరిగి ప్రారంభం అయినా అదే సీన్ రిపీట్ అవుతోంది.

ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు

ఢిల్లీ : ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి పెద్ద నోట్ల పై చర్చను చేపట్టాలని లోక్ సభలో విపక్షాలు పట్టుబట్టి ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ కొనసాగిస్తున్నారు. విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ వాయిదా పడిన విషయం తెలిసిందే.

11:20 - November 17, 2016

ఢిల్లీ : రాజ్యసభ వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభం కాగానే నోట్ల రద్దు అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. విపక్షాలు పోడియంను చుట్టుముట్టాయి. దీంతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ ఎంత చెప్పినా.. విపక్షాలు ఆందోళన చేశాయి. స్పీకర్ సభ 30నిమిషాలపాటు వాయిదా వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

లోక్ సభలో విపక్షాల ఆందోళన

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లుతున్నాయి. రాజ్యసభ వాయిదా పడగా... లోక్ సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి పెద్ద నోట్ల రద్దు పై చర్చను చేపట్టాలు పట్టుబడుతున్నాయి. అంతే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకం నినాదాలు చేస్తున్నాయి. దీనికి స్పందించిన అధికార పార్టీ పెద్ద నోట్ల రద్దు పై చర్చకు సిద్ధం అని ప్రకటించాయి.

 

11:17 - November 17, 2016

ఢిల్లీ : ఉభయసభల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ప్రారంభం కాగానే నోట్ల రద్దుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. విపక్షాలు పోడియంను చుట్టుముట్టాయి. దీంతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. 
 

రాజ్యసభ వాయిదా

ఢిల్లీ : శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే దివంగత నేతలకు సంతాపం తెలిపారు. అనంతరం ప్రశ్నోత్తరాలను రద్దు చేసి పెద్ద నోట్ల రద్దు పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అంతేకాకుండా పోడియం చుట్టు చేరి ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

11:12 - November 17, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు అంశంపై కాంగ్రెస్‌లో అయోమయం నెలకొంది. దీనిపై ఏ వైఖరిని అవలంబించాలో ఆపార్టీ తేల్చుకోలేకపోతుంది. హై కమాండ్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో స్థానిక నాయకత్వం ఎటూ తేల్చుకోలేక పోతోంది. మోదీ నిర్ణయాన్ని సైద్ధాంతికంగా వ్యతిరేకించాలా.. లేక జ‌నం ఎదుర్కొంటున్న సమస్యలపైనే మాట్లాడాలా అనే సంశయంలో పడ్డారు.
కాంగ్రెస్ తర్జన భర్జన 
500, వెయ్యి రూపాయల నోట్ల ర‌ద్దు అంశం దేశాన్ని కుదిపేస్తోంది. జ‌నం బ్యాంకుల వద్దనే రోజుల త‌ర‌బ‌డి గ‌డుపుతున్నారు. చిల్లర కోసం..నగదు మార్పిడి కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతో పలు రాజకీయ పార్టీలు  మోదీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ప్రణాళిక లేకుండా వ్యవహరించారంటూ విమర్శిస్తున్నాయి. కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం దీనిపై ఎలా రియాక్ట్‌ అవ్వాలో తెలియక తర్జన భర్జన పడుతుంది. హై కమాండ్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ముందుకు వెళ్లలేక.. ఆగలేక మదనపడుతున్నారు.      
ఆచితూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం
పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏటీఎంల దగ్గరకు వ‌చ్చి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ఎత్తిచూపే ప్రయత్నం చేసినా .. పార్టీ నేతలకు ఇది ఎలాంటి దిశానిర్దేశాన్ని ఇవ్వలేదంటున్నారు. మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని అన్ని రాష్ట్రాల నేత‌ల నుంచి ఒత్తిడి వ‌స్తున్నా .. హై క‌మాండ్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. న‌ల్లధ‌నాన్ని వెలికి తీసే విష‌యంలో తాము వ్యతిరేకం కాద‌ని చెబుతూనే .. పెద్ద నోట్ల ర‌ద్దుపై ఆకస్మిక నిర్ణయం సరికాదని చెప్పాలనే ప్రయత్నం చేస్తోంది. 
పూర్తిగా వ్యతిరేకించలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ నాయకులు
పెద్దనోట్ల ర‌ద్దును గుడ్డిగా వ్యతిరేకిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే భావ‌న కాంగ్రెస్ నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది.  మోదీ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తే  మొద‌టికే  మోసం జరుగుతుందని ఢిల్లీ పెద్దల్లో ఉంది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు దూకుడుగా వ్యవహరించ లేని పరిస్థితి. అయితే మౌనంగా ఉంటే రాజకీయంగా మరోరకమైన ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.. అందుకే ఈ విషయంలో అదిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే బాగుటుందని అభిప్రాయపడుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఔత్సాహిక స్థానిక నాయకులే స్వాతంత్రించి ధర్నాలు చేస్తున్నారు. మొత్తానికి పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్‌ ఇంతగా ఆచితూచి ఎందుకు వ్యవహరిస్తోందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చసాగుతోంది. 

రాజ్యసభలో గందరగోళం

ఢిల్లీ : శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కొద్ది సేపటిక్రితం ప్రారంభం అయ్యాయి. ప్రారంభం అయిన వెంటనే విపక్ష సభ్యులు పోడియం చుట్టుముట్టడంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. 

11:06 - November 17, 2016

హైదరాబాద్ : బ‌ల్దియా అధికారుల చ‌ర్యల‌పై మున్సిప‌ల్ శాఖ‌మంత్రి కేటిఆర్ మ‌రోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌గ‌రంలో రోడ్ల అభివృద్ది, ప్రజా ర‌వాణ‌ా, జంక్షన్ల డెవ‌ల‌ప్‌మెంట్‌పై దృష్టి సారించాల‌ని ఆధికారుల‌ను ఆదేశించారు.  స‌మ‌గ్ర రోడ్ల అభివృద్ది ప్రణాళిక అమ‌లుతోపాటు ప్రస్తుతం జ‌రుగుతున్న వైట్ టాపింగ్ రోడ్ల ప‌నుల‌ను కేటీఆర్ స‌మీక్షించారు.
అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశం 
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ పై  మంత్రి కేటీఆర్ ఫోక‌స్ పెట్టారు. న‌గ‌ర ప‌రిధిలోని ప్రభుత్వ శాఖ‌ల ఉన్నతాధికారుల‌తో  మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ది  కేంద్రంలో అధికారులతో కేటీఆర్  స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు  దెబ్బతిన్న రోడ్ల మ‌ర‌మ్మత్తుల‌ను 75కోట్ల రూపాయ‌ల‌తో అనుమతిచ్చిన 489 ప‌నుల్లో ఎన్ని ప‌నులు పూర్తయ్యయో అధికారుల‌ను అడిగితెల‌ుసుకున్నారు. 
రెగ్యులర్‌గా ఇబ్బందులు పునరావృతం కావద్దోన్న కేటీఆర్
ఇకపై ఇలాంటి ఇబ్బందులు  పున‌రావృతం కావ‌ద్దని, రెగ్యుల‌ర్‌గా వాట‌ర్ లాగింగ్ ప్రాంతాలు, లోత‌ట్టు ప్రాంతాల‌లో తిరిగి రోడ్లు దెబ్బతిన‌కుండా స్పెష‌ల్ ప్లాన్ రూపోందించాల‌ని మంత్రి కేటిఆర్ అధికారులను ఆదేశించారు. న‌గ‌రంలో రోడ్ల నిర్వహణ మ‌రింత స‌మ‌ర్థవంతంగా నిర్వహించేందుకు త‌గుచ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. గ్రేట‌ర్ లో 480 లేన్ కిలోమీట‌ర్ల మేరా 1,275 కోట్ల రూపాయ‌లతో నిర్మించే వైట్‌టాపింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక‌లు రూపొందించామ‌న్నారు.  మొద‌టి ద‌శ‌లో ర‌ద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల‌లో ఈ ప‌నులు చెప‌ట్టాల‌న్నారు. వ‌చ్చే వ‌ర్షాకాలంలోపు ఈ  వైట్‌టాపింగ్ రోడ్లు, క్యారేజి వే నిర్మాణాన్ని పూర్తిచేసేలా చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు.  
ఎస్‌.ఆర్‌.డి.పి ప్రాజెక్ట్ పై సమీక్ష 
న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల‌లో  2,631 కోట్ల  వ్యయంతో నిర్మిస్తున్న ఎస్‌.ఆర్‌.డి.పి ప్రాజెక్ట్ ప‌నుల‌ను మంత్రి కేటీఆర్ స‌మీక్షించారు.  ఐదు ప్యాకేజీల్లో ప్యాకేజి ప‌నికి  సంబంధించి నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్‌లో కొన‌సాగుతున్న కేసు త్వరిత‌గ‌తిన పూర్తయ్యేలా త‌గు చ‌ర్యలు  తీసుకోవాల‌న్నారు. ప్యాకేజి -2 కింద కామినేని జంక్షన్ వ‌ద్ద చేప‌ట్టిన ప‌నులకు అడ్డంకిగా ఉన్న  జ‌ల‌మండ‌లి వాట‌ర్ పైప్‌లైన్లు వెంట‌నే తొల‌గించాల‌ని వాట‌ర్ బోర్డు అధికారుల‌ను ఆదేశించారు. ఉప్పల్ జంక్షన్, ర‌సూల్‌పురాలో కేంద్ర ప్రభుత్వ సంస్థల‌కు చెందిన భూములు సేక‌రించాల్సి ఉన్నందున ఈ నెల 21న సంబంధిత కేంద్ర మంత్రుల‌తో మాట్లాడి లైన్ క్లియ‌ర్ చేస్తామ‌ని  మంత్రి  కేటీఆర్ చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ రోడ్ నెం: 45ను క‌మ‌ర్షియ‌ల్ రోడ్‌గా ప్రక‌టించిన నేప‌థ్యంలో జూబ్లీహిల్స్ బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద నుండి పాత బొంబాయి హైవే మార్గంలో ఎలివేటెడ్  కారిడార్‌ను నిర్మించేందుకు ప్రణాళిక‌లు సిద్దం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.   

ఏపీకి ప్రత్యేక హోదా పై ఉభయ సభల్లో నోటీసులు

ఢిల్లీ : కాసేపట్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ టిడిపి ఎంపీలు ఉభయసభల్లో నోటీసులు ఇచ్చారు.

10:56 - November 17, 2016

నోట్ల మార్పిడి రూ.4500 నుండి రూ.2వేలకు తగ్గింపు

ఢిల్లీ : రేపటి నుండి బ్యాంకుల్లో పాత నోట్ల మార్పిడి రూ.4500 నుండి రూ. 2వేలకు తగ్గించినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ప్రకటించారు. వర్తకులు వారానికి రూ.50వేలు డ్రా చేసుకోవచ్చని, బ్యాంకు ఉద్యోగులకు రూ.10వేల అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

10:52 - November 17, 2016

ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం వల్ల సామాన్యులే ఇబ్బందులు పడుతున్నారని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీకాంగ్రెస్ నాయకురాలు ఇందిర, బీజేపీ నేత ఆచారి, లక్ష్మణ్ రావు పాల్గొని, మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల చిన్న వ్యాపారుల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. రూ.500, 1000 నోట్లను అనుమతించాలన్నారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల నల్లధనం పూర్తిగా తగ్గిపోదన్నారు. నల్లధనం ఉన్నవారు డబ్బును మార్చుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తీసుకొస్తామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రైతులు వారానికి రూ.25వేలు విత్ డ్రా చేసుకోవచ్చు

ఢిల్లీ : ధాన్యం, విత్తనాల కొనుగోలు కోసం రైతులకు ఆర్థిక శాఖ వెసులుబాటు కల్పించింది. రైతులు ప్రతి వారం రూ.25 వేలు విత్ డ్రా చేసుకోవచ్చని, పెళ్లి ఉన్నవారు రూ.2.5 లక్షలు డ్రా చేసుకోవచ్చని ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ప్రకటించారు.

10:46 - November 17, 2016

ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సంఘం నేత కె. శ్రీనివాస్ కోరారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'పెద్ద నోట్ల రద్దు ప్రభావం విభిన్న రంగాల మీద కనిపిస్తోంది. ఓ వైపు వ్యవసాయ మార్కెట్ లు వెలవెలబోతున్నాయి. మరోవైపు చేపల మార్కెట్లలో సందడి తగ్గింది. పట్టుకొచ్చిన చేపలు పాడైపోకుండా కాపాడుకోవడం మత్స్యకారులకు ఇప్పుడో పెద్ద సమస్యగా మారుతోంది'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆదాయపన్ను చట్టం నియమాలు మార్చి సీబీడీటీ

ఢిల్లీ : ఆదాయపన్ను చట్టం నియమాలను సీబీడీటి మార్చింది. ఇకపై సేవింగ్ ఖాతాలో రూ.2.5 లక్షలు, కరెంట్ ఖాతాలో రూ.12.5 లక్షల నగదు కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే ఖాతాదారులకు ఆర్థిక శాఖ నోటీసులు ఇవ్వనుంది. నవంబర్ 9 నుండి డిసెంబర్ 30 వరకు జరిగే లావాదేవీలపై బ్యాంకుల నుంచి ఐటీ వివరాలను సేకరించనునుంది. మరో వైపు ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ లు వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది.

 

సైదాబాద్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు

హైదరాబాద్ : సైదాబాద్ లో ఆకతాయిలు రెచ్చిపోయారు. లక్ష్మీనగర్ కాలనీలో రాత్రి పార్క్ చేసిన 9 కార్ల అద్దాలను దుండగులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

10:30 - November 17, 2016

పెద్ద నోట్లు రద్దు వ్యవహారం సాధారణ జన జీవనం మీద తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నల్లధనాన్ని ఎంత వరకు వెలికితీస్తుందో చెప్పలేం కానీ సామాన్య ప్రజలు మాత్ర తీవ్ర ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు
సామాన్యులకు కష్టాలు 
500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మరు క్షణం నుంచే సామాన్యులు పెట్రోల్ బంక్ లు, ఏటిఎంలు, బ్యాంక్ ల చుట్టూ పరుగులు తీస్తున్నారు. రెండు మూడు రోజుల్లో గాడిలో పడుతుందని తొలుత అంచనాలు వేసినవారే ఇంకా రెండు మూడు వారాలైనా ఈ కష్టాలు తప్పవంటూ నిట్టూరుస్తున్నారు. పాలు, కూరగాయలు, కిరాణాతో పాటు అనేక వ్యాపారాల మీద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ప్రతి కుటుంబం ఆర్థిక అత్యయిక పరిస్థితిని ప్రకటించుకుంది. ఆచూతూచి ఖర్చు పెడుతున్నారు. ప్రయాణాలు, చెల్లింపులు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు అన్నీ వాయిదా వేసుకుంటున్నారు.  కేవలం రెండు వేల రూపాయలు డ్రా చేసుకునేందుకు జనం ఏటిఎంల చుట్టూ ఆదుర్ధాగా తిరుగుతుంటే, గాలి జనార్ధన్ రెడ్డి లాంటి రాజకీయ సంపన్నుల ఇళ్లలో ఫంక్షన్ లు ఏ ఆటంకాలు లేకుండా సాగిపోతున్నాయి. ఇలాంటప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం నల్లధనానికి ముకుతాడు వేస్తుందంటే ఎలా నమ్మగలం? అసలు ప్రభుత్వ నిర్ణయం వెల్లడించడానికి ముందే రహస్య సమాచారం అందుకున్న బడాబాబులు గప్ చుప్ గా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. బ్లాక్ మనీ కూడబెట్టినవారెవ్వరూ  బ్యాంక్ ల దగ్గరకు రాకపోయినా, ఇంట్లో కూర్చొనే అంతా చక్కబెట్టుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 
ప్రభుత్వంపై విమర్శలు 
కొంతమంది నల్లకుబేరులకు ముందుగానే ఉప్పు అందించి, మరికొందరికీ వ్యవహారం చక్కబెట్టుకునే మార్గాలుంచి, సామాన్యులను మాత్రం ఆర్థిక ఇక్కట్లకు గురిచేసిందన్న విమర్శలను ప్రభుత్వం మూటగట్టుకుంటోంది.  తామేదో సాహసోపేత నిర్ణయం తీసుకున్నామన్న ఖ్యాతి సంపాదించాలన్న యావ తప్ప, సామాన్యులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి  కేంద్ర ప్రభుత్వం ఆలోచించిన దాఖలాలు కనిపించడం లేదు. ఓ వైపు నల్లకుబేరుల భరతం పట్టేందుకే పెద్ద నోట్లు రద్దు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించిన కొద్ది గంటల్లోనే, మార్కెట్ శక్తులు విజృభించి ఉప్పు ప్యాకెట్ ను మూడు నాలుగు వందలకు అమ్ముకున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, అనేక నిత్యావసర వస్తువుల ధరలు భగ్గమనే ప్రమాదం వుంది. నోట్ల రద్దు తర్వాత అనేక ప్రాంతాల్లో సరకు రవాణా స్తంభించిపోయింది. హోల్ సేల్ మార్కెట్ లు మూతపడ్డాయి. రైతులు పంటలు అమ్ముకోలేకపోతున్నారు. ఒకవేళ అమ్ముకున్నా, పే మెంట్స్ నిలిచిపోయాయి.  చేపల మార్కెట్ లలోనూ పరిస్థితి ఘోరంగానే వుంది. అమ్మకాలు పడిపోయాయి.  పట్టుకొచ్చిన మత్స్యసంపదను భద్రపరచడం ఇప్పుడో పెద్ద సమస్యగా మారింది. స్టోరేజీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. మరోవైపు నిర్మాణపనులు నిలిచిపోవడంతో ఆ రంగంలో పనిచేస్తున్నవారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 
వ్యాపారుల గుప్పెట్లోకి వంద రూపాయల నోట్లు 
500, 1000 రూపాయల నోట్లు బ్యాంక్ లకు చేరితే, జనం చేతిలో వున్న వంద రూపాయల నోట్లు వ్యాపారుల గుప్పెట్లోకి వెళ్తున్నాయి. బ్యాంక్ లు పంపిణీ చేస్తున్న రెండు వేల రూపాయల నోట్లకు చిల్లర సంపాదించడం పెద్ద సమస్యై సామాన్యుడిని వెక్కిరిస్తోంది.  ఆస్థి పన్ను, నల్లాపన్ను, కరెంట్ బిల్లుల వసూళ్లు కొంత పెరిగిన మాట వాస్తవమే అయినా, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఇతర ఆదాయాలు భారీగా పడిపోయాయి. రెవెన్యూ వసూళ్లు పడిపోతే, జీతాలు ఎలా ఇవ్వాలో అర్ధంకాక రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. రాబోయే రెండు మూడు వారాల్లో పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో అర్ధంకాని పరిస్థితే నెలకొంది. ఈ పరిణామాలను గుర్తించి, తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, మోడీ ప్రభుత్వానికి తాము ఆశించిన మైలేజీ రాకపోగా, డ్యామేజీ జరిగే అవకాశమూ వుంది. 

 

అలెప్పోలో బాంబు పేలుడు : 54 మంది మృతి

హైదరాబాద్: సిరియాలోని అలెప్పోలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 54 మంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో నిఘా వర్గాలు వున్నాయి.

గృహనిర్భంధంలోనే ముద్రగడ

తూ.గో : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభవం నిన్నటి నుండి(బుధవారం) గృహనిర్భంధంలోనే ఉన్నారు. అంతే కాకుండా క్లిర్లంపూడిలో 2 వేల మంది పోలీసులతో పహారా కాస్తున్నారు.

గుంతకల్లు సర్కారీ ఆసుపత్రిలో దయనీయ దృశ్యం..

అనంతపురం : గుంతకల్లు సర్కారీ ఆసుపత్రిలో దయనీయ దృశ్యం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన ఓ రోగికి ఆసుపత్రి సిబ్బంది వీల్ ఛైర్ ఇవ్వలేదు. దీనితో భర్తను మేయలేక లాక్కుంటూ సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్లింది. 

కాసేపట్లో ప్రారంభం కానున్న ఉభయ సభలు..

ఢిల్లీ : కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. దివంగత సభ్యులకు లోక్ సభ సంతాపం తెలిపిన అనంతరం బుధవారం వాయిదా పడిన సంగతి తెలిసిందే. నేడు జరిగే సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు అంశంపై విపక్షాలు ఆందోళన చేసే పరిస్థితి ఉంది. లోక్ సభలోనే ప్రధాని ఉండాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే నోట్ల రద్దుపై చర్చకు కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. నోట్ల రద్దుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజ్యసభలో బుధవారం పెద్ద నోట్లు రద్దు అంశంపై చర్చ జరిగింది. 

09:49 - November 17, 2016

విశాఖ : ఇండియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో టెస్ట్‌కు విశాఖపట్నంలో రంగం సిద్ధమైంది. రాజ్‌ కోట్‌ టెస్ట్‌లో డ్రాతోనే సరిపెట్టుకున్న ఇరు జట్లు వైజాగ్‌ టెస్ట్‌లో బోణీ కొట్టాలని తహతహలాడుతున్నాయి. అంచనాలకు తగ్గట్టుగా రాణించాలని కొహ్లీసేన పట్టుదలతో ఉండగా....మరోసారి ఆతిధ్య జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించాలని  కుక్‌ అండ్‌ కో ప్లాన్‌లో ఉంది.   
అసోసియేషనల్‌ స్టేడియంలో రంగం సిద్ధం
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న అసలు సిసలు టెస్ట్‌ సిరీస్‌లోని రెండో సమరానికి భారత జట్టు సన్నద్ధమైంది.ఇండియా ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌కు విశాఖపట్నంలోని ఏసీఏ, వీడీసీఏ క్రికెట్‌ అసోసియేషనల్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. 
వైజాగ్‌ టెస్ట్‌లో బోణీ కొట్టాలని తహతహ 
రాజ్‌ కోట్‌ టెస్ట్‌లో డ్రాతోనే సరిపెట్టుకున్న ఇరు జట్లు వైజాగ్‌ టెస్ట్‌లో బోణీ కొట్టాలని తహతహలాడుతున్నాయి. అంచనాలకు తగ్గట్టుగా రాణించాలని కొహ్లీసేన పట్టుదలతో ఉండగా....మరోసారి ఆతిధ్య జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించాలని  కుక్‌ అండ్‌ కో ప్లాన్‌లో ఉంది.  ఇరు జట్ల ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో ఇంగ్లండ్‌దే పై చేయిగా ఉన్నా...ప్రస్తుత భారత టెస్ట్‌ టీమ్‌ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం. 
ఇంగ్లండ్‌కు ధీటుగా భారత బ్యాటింగ్ లైనప్‌ 
కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు టెస్ట్‌ స్పెషలిస్ట్‌లు, టాప్‌ క్లాస్‌ స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లతో పవర్‌ఫుల్‌గా ఉంది. మురళీ విజయ్‌, పుజారా సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో పాటు....కొహ్లీ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తుండటంతో భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌ ఇంగ్లండ్‌కు ధీటుగా ఉంది. ఇక సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ గౌతమ్‌ గంభీర్‌ సైతం ఫామ్‌లోకొస్తే భారత్‌ బ్యాటింగ్‌కు తిరుగుండదు. అశ్విన్‌,జడేజా, అమిత్‌ మిశ్రా వంటి మేటి స్పిన్నర్లతో భారత స్పిన్‌ బౌలింగ్‌ విభాగం ఎప్పటిలానే పటిష్టంగా ఉంది. 
భారత్‌కు ధీటుగా ఇంగ్లండ్‌   
అన్ని విభాగాల్లో ఇంగ్లండ్‌  జట్టు భారత్‌కు ధీటుగా ఉంది. కుక్‌, రూట్‌, హమీద్‌,బెయిర్‌ స్టో  వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో ఇంగ్లీష్‌ టీమ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. ఇక ఒంటిచేత్తో జట్టుకు విజయాన్నందించగల ఆల్‌రౌండర్లు బెన్‌ స్టోక్స్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌ ఓక్స్‌లతో ఇంగ్లండ్‌ జట్టు సమతూకంగా ఉంది. మొయిన్‌ అలీ, అన్సారీ, ఆదిల్‌ రషీద్‌లతో కూడిన ఇంగ్లండ్‌ స్పిన్‌ బౌలింగ్‌ విభాగం భారత బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌ విసురుతోంది. రెండో టెస్ట్‌తో స్పీడ్‌ గన్‌ జేమ్స్‌ యాండర్సన్‌ తుది జట్టులో ఆడేది ఖాయంగా కనిపిస్తుండటంతో భారత బ్యాట్స్‌మెన్‌కు  కష్టాలు తప్పకపోవచ్చు. తొలి టెస్ట్‌ను ఆఖరి రోజు చివరి ఓవర్‌ వరకూ పోరాడి డ్రాగా ముగించిన భారత్...వైజాగ్‌ టెస్ట్‌లో మాత్రం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. స్పిన్నర్లకు అనుకూలించే వైజాగ్‌ పిచ్‌పై ఇరు జట్ల మరోసారి హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. 

09:44 - November 17, 2016

విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు..దీనికి సంభందించన అన్ని ఎర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చెశారు..రాష్ర్టంలో ఇంత వరకూ ఏర్పాటు చెయ్యని భారీ సభను ఎర్పాటు చెయ్యడానికి అధికార గణం సమాయత్తం అవుతుంది..
భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ను వీక్షించనున్న సీఎం
విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో నగరానికి రానున్న చంద్రబాబు.. భారత్‌-ఇంగ్లాండ్ టెస్ట్‌ మ్యాచ్‌ను వీక్షిస్తారు. అనంతరం అక్కడే  క్రికెట్‌కు సేవ చేసిన మాజీ లెజెండరీ క్రికెటర్లు, ప్రస్తుత టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఇరు జట్ల సారధులను సన్మానిస్తారు.
చోడవరంలో జనచైతన్యయాత్రలో పాల్గొననున్న సీఎం
ఆ తర్వాత హెలికాప్టర్‌లో చంద్రబాబు చోడవరం చేరుకుంటారు. జనచైతన్య యాత్రతో పాటు.. బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం విశాఖలోని అంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సింహాచలం, గాజువాకలో 100 గజాలలోపు స్థలాలలో ఇళ్లు కట్టుకున్న 31 వేల మందికి చంద్రబాబు పట్టాలు పంపిణీ చేస్తారు. అలాగే రెండో విడత డ్వాక్రా రుణమాఫీ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. డ్వాక్రా మహిళలకు 148 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేస్తారు. 
భారీ బందోబస్తు 
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏవోబీలో ఎన్‌కౌంటర్‌ దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్‌ టీమ్‌లతో పాటు భద్రతా బలగాలు సభా ప్రాంగణాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. 

 

09:42 - November 17, 2016

హైదరాబాద్ : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు రాజభోగం పట్టనుంది. ప్రపంచంలోనే అత్యుత్తమైన ఎయిర్‌పోర్ట్‌గా నిర్మించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విమాన ప్రయాణం పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని విమానాశ్రయాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. 
అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలోని మౌలిక వసతుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. భోగాపురంలో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచంలోని టాప్‌-10లో ఒకటిగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయ పనుల్లోఅనుభవమున్నవారికి నిర్మాణ పనులు అప్పగించాలని ఆదేశించారు. వచ్చే నెల మొదటివారంలోగా పర్యావరణ అనుమతులు పొందాలని, 2017 జనవరి నాటికి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయాలన్నారు. 
పనులు వేగవంతం చేయాలని ఆదేశం 
ఇక ఓర్వకల్లు, దొనకొండ, నాగార్జునసాగర్‌, దగదర్తి విమానాశ్రయాల ఏర్పాటు వివరాలను చంద్రబాబు తెలుసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు విమానాశ్రయాలకు ప్రయాణికుల తాకిడి పెరిగిన నేపథ్యంలో.. పనులను వేగవంతం చేయాలన్నారు. తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు,.. విశాఖకు దుబాయ్‌, లండన్‌, హాంకాంగ్‌ నుంచి సర్వీసులు నడిచేలా చూడాలని సీఎం సూచించారు. అలాగే విజయవాడ-ముంబై మధ్య విమాన సర్వీసులు నడిపే అవసరముందని సూచించారు. 
త్వరలో ఇంటింటికి పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ కనెక్షన్స్
వచ్చే నెలలో కొవ్వూరు, రాజమండ్రిలో ఇంటింటికి పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని గెయిల్‌ అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ఉభయగోదావరి జిల్లాలోని ఆర్టీసీ బస్సులకు సీఎన్‌జీ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ పనులు ముగింపు దశకు వచ్చినట్లు చంద్రబాబుకు అధికారులు తెలిపారు. లక్ష సీపీఈ బాక్స్‌లను కొనుగోలు చేసినట్లు.. మరో 9 లక్షల బాక్సులను త్వరలోనే కొనుగోలు చేస్తామని తెలిపారు. 

09:38 - November 17, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. చేతిలో డబ్బు లేకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. పన్నులు రాబడి తగ్గిపోయింది. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడతున్న తెలంగాణ సర్కార్‌... కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.  కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపును నిలిపివేసింది. ఫీజలు రీఎంబర్స్‌మెంట్‌ అమలును ఆపివేసింది. ఆర్ బీఐ నుంచి లోను తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు  కూడా చెల్లించలేని  స్థితిలోకి నెట్టివేయబడింది. 
ఓవర్‌ డ్రాఫ్ట్‌ దిశగా టీసర్కార్ 
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కకుంది. కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. వ్యాపార లావాదేవీలన్ని నిలిచిపోయాయి. పారిశ్రామికోత్పత్తిపైనా ప్రభావం చూపింది. ప్రభుత్వానికి రాబడి తగ్గిపోయింది. ఖజానా ఖాళీ అయ్యింది. దీంతో ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన విత్తం కూడా సర్కారు దగ్గర లేకపోవడంతో ఓవర్‌ డ్రాఫ్ట్‌ దిశగా పయనిస్తోంది. 
బిక్కముఖం వేసిన ప్రభుత్వం... 
దైనందిన కార్యక్రమాలకు కూడా చేతిలో రొక్కంలేక బిక్కముఖం వేసిన తెలంగాణ ప్రభుత్వం... ఇప్పుడు ఖర్చులు తగ్గించుకుంటోంది. బిల్లుల చెల్లింపులను నిలిపివేస్తోంది. కాంట్రాక్టర్లకు అన్ని రకాల చెల్లింపులను తాత్కాలికంగా ఆపివేసింది. ఇది పనుల నత్తనడకకు కారమణమవుతోంది. సాగునీటి ప్రాజెక్ట్‌లు, రోడ్లు, గృహ నిర్మాణంతోపాటు... సంక్షేమ పథకాల అమలుపైనా ప్రభావం చూపింది.  విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ను కూడా కొంతకాలంపాటు నిలిపివేసింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, రిటైరైన ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపు, వృద్ధాప్య, వింతంతు, వికలాంగ పింఛన్లను ప్రాధాన్యతా క్రమంలో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది. 
ఆర్‌బీఐ లోను కోసం ప్రయత్నం 
ప్రభుత్వ ఖాతాలో లోటు ఏర్పడటంతో దిక్కతోచని స్థితిలో పడిన తెలంగాణ సర్కార్.... ప్రత్యామ్నాయాలపైన దృష్టి పెట్టింది. ఆర్‌బీఐ పరపతి కోసం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ దగ్గర చాలినంత డబ్బులేక... రోజువారీ కార్యక్రమాలు కూడా ఆగిపోయే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు... వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ ద్వారా ఆర్‌బీఐ నుంచి రుణం తీసుకునేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు వీలుగా ఆర్‌బీఐ పరపతి విధానంలో వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ను ఒక భాగంగా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దీనిని ఉపయోగించుకుని, భారతీయ రిజర్వు బ్యాంకు నుంచి 1500 కోట్ల రూపాయల అప్పు తీసుకునే అవకాశం ఉంది. స్వల్పకాలంలో తిరిగి చెల్లించాల్సి ఉన్న వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్సాన్సెస్‌పై  తక్కువ వడ్డీ వసూలు చేస్తారు. రుణం తీసుకోకుండా ఉద్యోగులకు జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం...  ఆర్‌బీఐ లోను కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆర్థిక శాఖ అధికారులుందరూ ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. 
ఆర్‌బీఐ రుణంతో జీతాలు చెల్లించిన ప్రభుత్వం 
రాబడి పడిపోయినప్పుడు ప్రభుత్వలు ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకోవడం కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రంలో 1999-2004 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం పలు దఫాలుగా ఓవర్‌ డాఫ్ట్‌లో పడిపోయింది.  ఆయా సందర్భాల్లో రిజర్వు బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం  కూడా ఒకటి రెండు సందర్భాల్లో  వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ ను ఉపయోగించుకుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సర్కార్‌ ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లడం ఇదే మొదటిసారిగా భావిస్తున్నారు. 

 

09:25 - November 17, 2016

హైదరాబాద్ : పేట్ బషీరాబాద్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. రియల్టర్ పై ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. రియల్టర్ నాగేందర్ రెడ్డి భార్యతో కలిసి అత్తవారింటికి వెళ్లి తిరిగి పేట్ బషీరాబాద్ బాపూనగర్ లో ఉన్న స్వగృహానికి రాత్రి 10.30 గంటల సమయంలో వచ్చాడు. ఇంట్లోకి వెళ్లే సందర్భంలో సాయిప్రభు తేజ అనే వ్యక్తి.. సమీపంలో నుంచి నాగిరెడ్డిపై రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. నాగేందర్ రెడ్డి తలకు గురిపెట్టి కాల్చాడు. నాగేందర్ రెడ్డి తప్పించుకున్నాడు. ఒక బుల్లెట్ ఇంటి గోడకు తగలింది. మరో రెండు బుల్లెట్లు అతని వీపులోకి దూసుకెళ్లాయి. అయినా నాగిరెడ్డి.. తేజను పట్టుకుని కేకలు వేశాడు. స్థానికులు తేజను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రివాల్వర్, బుల్లెట్ ను స్వాధీనం చేస్తున్నారు. నాగిరెడ్డికి త్రీవ గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. వీపులోకి దూసుకెళ్లిన బుల్లెట్లను తీయాల్సివుంది. ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. చక్రవర్తి, తాను కలిసి గతంలో వ్యాపారం చేశామని... ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తి విడిపోయామని నాగిరెడ్డి తెలిపారు. గత ఎనిమిది నెలలుగా తేజ తరచూ గొడవ పడుతూ తనపై దాడికి పాల్పడుతున్నాడని చెప్పారు. ఈనేపథ్యంలోనే చక్రవర్తి సుఫారీ ఇచ్చి..సాయిప్రభు తేజతో తనపై కాల్పులు జరిపించారని నాగిరెడ్డి ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

నేడు సంగారెడ్డి జిల్లాలోకి సీపీఎం మహాజన పాదయాత్ర

సంగారెడ్డి : నేడు సంగారెడ్డి జిల్లాలోకి సీపీఎం మహాజన పాదయాత్ర ప్రవేశించనుంది. కోహిర్ మండలం మనేరుపల్లిలో పాదయాత్ర ప్రారంభం కానుంది. 

ప్రకాశం జిల్లాలో దారుణం

ప్రకాశం : వేటపాలెం మండలం అడుసుమిల్లిలో దారుణం జరిగింది. చీటిపాలు నిర్వహించే వెంకటేశ్వర్లు, రామలక్ష్మీ దంపతులపై హోంగార్డు వసంతరావు కత్తితో దాడికి పాల్పడ్డాడు. భర్త వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉంది. రామలక్ష్మీకి గాయాలు అయ్యాయి. ఆమెను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. చీటిపాట విషయంలో వివాదమే దాడికి కారణమని చెబుతున్నారు. హోంగార్డు వసంతరావు పరారీలో ఉన్నాడు. 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మంచిర్యాల : హాజీపూర్ పీఎస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామును లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

నేడు విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

విశాఖ : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. జీవో 296 ప్రకారం 100 గజాల లోపు ఇళ్ల క్రమబద్దీకరణ 
చేయనున్నారు. లబ్ధిదారులకు చంద్రబాబు పట్టాలు పంపిణీ చేయనున్నారు. చోడవరంలో జనచైతన్యయాత్రలో సీఎం పాల్గొననున్నారు. చంద్రబాబు.. భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ ను చూడనున్నారు.  

కృష్ణా జిల్లాలో ముఖ్య వ్యాపారులతో కలెక్టర్లు భేటీ

విజయవాడ : పెద్దనోట్ల రద్ద నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ముఖ్య వ్యాపారులతో కలెక్టర్లు భేటీ అయ్యారు.  

 

నేడు విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

విశాఖ : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. జీవో 296 ప్రకారం 100 గజాల లోపు ఇళ్ల క్రమబద్దీకరణ చేయనున్నారు. లబ్ధిదారులకు చంద్రబాబు పట్టాలు పంపిణీ చేయనున్నారు. చోడవరంలో జనచైతన్యయాత్రలో సీఎం పాల్గొననున్నారు. చంద్రబాబు.. భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ ను చూడనున్నారు.  

06:39 - November 17, 2016

ఢిల్లీ : ఉత్తరభారతంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2 శాతంగా నమోదు అయింది. తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూప్రకంపనలతో జనం హడిలిపోయారు. భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. డబ్బుల కోసం ఏటీఎంల వద్ద నిల్చున్న జనం పరుగులు తీశారు. హర్యానాలోని రెవారీ జిల్లా బావల్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఢిల్లీలో మెట్రో సేవలను రద్దు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పేట్ బషీరాబాద్ లో కాల్పుల కలకలం

హైదరాబాద్ : పేట్ బషీరాబాద్ లో కాల్పులు కలకలం రేపింది. రియల్టర్ నాగేందర్ రెడ్డిపై రివాల్వర్ తో కాల్పులు జరిపారు. 
నిందితుడు నాగేందర్ రెడ్డి తలకు గురిపెట్టి కాల్చాడు. అతను తప్పించుకున్నాడు. నాగేందర్ రెడ్డి వీపులోకి మరో రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. 

ఉత్తరభారత్ లో స్వల్ప భూకంపం

ఢిల్లీ : ఉత్తరభారత్ లో స్వల్ప భూకంపం సంభవించింది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2 శాతంగా నమోదు అయింది. 

 

Don't Miss