Activities calendar

18 November 2016

21:57 - November 18, 2016

వైజాగ్‌ : టెస్ట్‌ రెండు రోజు సైతం కొహ్లీ అండ్‌ కో డామినేట్‌ చేసింది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్‌ ...బౌలింగ్‌లోనూ అంచనాలకు మించి రాణించింది. తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా...బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌కు అవకాశమే ఇవ్వలేదు. దీంతో ఇంగ్లండ్‌ 103 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
రెండో రోజు సైతం విరాట్‌ ఆర్మీకి పోటీ లేదు..
వైజాగ్‌ టెస్ట్‌ రెండో రోజు సైతం విరాట్‌ ఆర్మీకి పోటీనే లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌ సమిష్టిగా రాణించి భారీస్కోర్‌ నమోదు చేయడంతో పాటు....స్పిన్నర్లు సైతం చెలరేగడంతో భారత్‌ జట్టు రెండో రోజే మ్యాచ్‌పై పట్టు బిగించింది.
భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు
4 వికెట్లకు 317 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్‌ ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 138 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు సవాల్‌ విసిరింది. విరాట్‌ 167 పరుగులు, పుజారా 119 పరుగులతో టాప్‌ స్కోరర్స్‌గా నిలిచారు. లోయర్‌ ఆర్డర్‌లో అశ్విన్‌, జయంత్‌ యాదవ్‌ రాణించడంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు చేసింది.
భారత స్పిన్నర్ల ధాటికి క్యూ కట్టిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టుకు ఏదీ కలిసి రాలేదు. భారత బౌలర్ల జోరు ముందు ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో ఇంగ్లండ్‌ జట్టు భారత జట్టుకు ధీటుగా బదులివ్వలేకపోయింది.మొదట్లో మహమ్మద్‌ షమీ శుభారంభాన్నివ్వగా...ఆ తర్వాత స్పిన్నర్లు అదరగొట్టారు. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. క్రీజ్‌లో నిలబడలేక చేతులెత్తేశారు.ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌లోనే సూపర్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ను బౌల్డ్‌ చేసి షమీ భారత్‌కు శుభారంభాన్నిచ్చాడు.
రూట్‌ ఒంటరి పోరాటం
మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా ...50వ టెస్ట్‌ ఆడుతున్న స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్‌ ఇంగ్లండ్‌ జట్టును ఆదుకున్నాడు. ఒంటరి పోరాటం చేసిన రూట్‌....కొద్దిసేపు భారత బౌలింగ్‌ ఎటాక్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.టెస్టుల్లో 24వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన రూట్‌ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయాడు. భారత స్టార్‌ స్పిన్నర్ అశ్విన్‌ రూట్‌ను బోల్తా కొట్టించాడు.
80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌
మొయిన్‌ అలీని ఒక్క పరుగుకే ఔట్‌ చేయడంతో జయంత్ యాదవ్ టెస్టుల్లో తొలి వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టు కోలుకోలేకపోయింది. ఆ తర్వాత బెన్‌ స్టోక్స్‌, బెయిర్‌స్టో సైతం భారత బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కోవడానికి అష్టకష్టాలు పడ్డారు.
ఇంగ్లండ్‌ జట్టు 5 వికెట్లు కోల్పోయి 138 పరుగులు
రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్‌ జట్టు 5 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్‌ జట్టు ఫాలో ఆన్‌ తప్పించుకోవాలంటే తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్‌ భారత స్పిన్‌ ఎటాక్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతే రెండో టెస్ట్‌పై ఇంగ్లండ్‌ జట్టు ఆశలు వదులుకోవాల్సిందే. వైజాగ్‌ టెస్ట్‌లో తొలి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ను ఓడించాలంటే ఇంగ్లండ్‌ జట్టు అంచనాలకు మించి రాణించాల్సిందే.  

21:49 - November 18, 2016

ఢిల్లీ : ఒక రూపాయి నోట్లు మళ్లీ రెప రెప లాడనున్నాయి. 30 ఏళ్ల తర్వాత నాసిక్‌ కరెన్సీ ప్రెస్‌ వీటిని ముద్రిస్తోంది. 5 వందలు, వెయ్యి నోట్లను రద్దు చేయాలని ప్రధాని మోది నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చిన్న నోట్ల ప్రాధాన్యత పెరిగింది. 5 వందల నోట్లను ఎక్కువగా ముద్రించడం కన్నా 10, 20, 50 రూపాయల నోట్లను అత్యధికంగా ముద్రించాలని రిజర్వ్‌బ్యాంక్‌ నిర్ణయించింది. రూపాయి నోట్లు ముద్రించాలని ఇప్పటికే రిజర్వ్‌బ్యాంక్‌ నాసిక్‌ కరెన్సీ ప్రెస్‌కు ఆదేశాలు జారీ చేసింది. గత వారం రూపాయి, 10, 20, 50, 5 వందల రూపాయల నోట్లను 5 కోట్లు ముద్రించింది. ఇందులో రూపాయి నోట్లు పదిలక్షలున్నాయి. ఇవి కాకుండా కోటి 90 లక్షల వంద నోట్లను నాసిక్‌ కరెన్సీ ప్రెస్‌ ముద్రించింది.

21:44 - November 18, 2016

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో డేటావిండ్ మొబైల్, ట్యాబ్‌లెట్ తయారీ పరిశ్రమను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు కెనడా రాయబారి నాదిర్‌పటేల్, సీఈవో సునీత్ సింగ్‌తులితోపాటు పలువురు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ఇంటర్‌నెట్‌ సేవలు అందించడంలో డేటావిండ్ అగ్రగామిగా కొనసాగుతుందని కేటీఆర్‌ తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన డేటావిండ్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డేటా విండ్ పెట్టుబడుల ద్వారా రాష్ర్టానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా ఉద్యోగాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మరో 6 నెలల్లో డేటావింగ్ వెయ్యి ఉద్యోగాలు కల్పించనున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. 

21:41 - November 18, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దై పది రోజులు గడిచింది. ఇప్పటికీ సామాన్యుడికి చిల్లర కష్టాలు తప్పడం లేదు. కనీస ఖర్చుల కోసం.. గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎంల ముందు వేచి చూడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. బ్యాంకుల్లో నగదు అయిపోవడంతో... ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. దీంతో ఏటీఎం కేంద్రాల వద్ద గంట గంటకు క్యూ పెరిగిపోతోంది.
పది రోజులు దాటినా తీరని చిల్లర కష్టాలు
పది రోజులు దాటినా ప్రజలకు చిల్లర కష్టాలు తీరడం లేదు. మనీ కోసం ఏటీఎంల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి మరింత రెట్టింపు అయ్యింది. ఏటీఎంలలో నోట్లు పెట్టినా గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతున్న పరిస్థితి నెలకొంది. అటు బ్యాంకుల వద్ద క్యూ భారీగా పెరిగిపోతోంది. నల్ల ధనాన్ని నియంత్రించడమేమో కానీ.. పెద్ద నోట్ల రద్దు ప్రజలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. పలు చోట్ల ఉదయం 11దాటినా బ్యాంకులు తెరుచుకోకపోవడం, నో క్యాష్‌ అనే బోర్టులు పెట్టడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు.
2వేల రూపాయల నోటు రావడంతో.. కొత్త కష్టాలు
ఏటీఎంలోే పలుచోట్ల 2వేల రూపాయల నోటు రావడంతో.. కొత్త కష్టాలు మొదలయ్యాయి. వాటిని మార్చుకునేందుకు ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. మరోవైపు ఏటీఎంలలో కొన్ని మాత్రమే పనిచేస్తుండటంతో... సామాన్యులు తీవ్ర అవస్థలు రెట్టింపయ్యాయి.
గంటల కొద్ది క్యూలలో జనాలు
అటు నగదు మార్పిడి కోసం పోస్టాఫీసుల వద్ద జనం బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య రైతుల నుంచి మొదలుకొని విద్యార్థులు, వృద్ధులు, పింఛన్‌ దారులు బ్యాంకుల వద్ద గంటల కొద్ది క్యూ లైన్లలో నిలబడుతున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దిద్దుబాటు చర్యలతో సామాన్యులకు ఏమాత్రం ఉపశమనం లభించినట్టు కనిపించడం లేదు. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు నగదు సరఫరా పెంచి.. ఏటీఎం లు పూర్తిస్థాయిలో పనిచేసే వరకు ఈ కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. 

21:37 - November 18, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పు బట్టింది. చిల్లర కష్టాలను తీవ్రమైన సమస్యగా అభివర్ణించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. నోట్ల రద్దుపై హైకోర్టులు, కింది కోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై స్టే విధించాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

నోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
నోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్రం నిర్ణయాన్ని.. అనంతర పరిణామాలను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ విచారించారు. ఈ అంశంపై కిందికోర్టుల్లో దాఖలైన పిటిషన్‌లు విచారించకుండా స్టే ఇవ్వాలన్న కేంద్ర వినతిని సీజే తోసిపుచ్చారు. సరిపడా చిల్లర నోట్లు లేకపోవడం వల్ల.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని.. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు తమ తలుపులు ఎలా మూసేస్తామని ప్రశ్నించారు. ఉపశమనం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్న వారి ఆశలను వమ్ము చేయలేమని జస్టిస్‌ ఠాకూర్‌ స్పష్టం చేశారు.

రూ.4500 నుంచి రూ.2000కు ఎందుకు త‌గ్గించారు: ఠాకూర్‌
దేశవ్యాప్తంగా వంద నోట్ల కొర‌త ఉంద‌ని కేంద్రం సుప్రీంకోర్టులో అంగీక‌రించింది. న‌వంబ‌ర్ 8కి ముందు 80 శాతం నోట్లు పెద్దవే కావడం వల్ల.. వంద నోట్లకు కొరత ఏర్పడిందని ప్రభుత్వ న్యాయవాది రోహ‌త్గీ కోర్టుకు తెలిపారు. రోజువారీ ప‌రిమితిని 4500 నుంచి 2000 రూపాయలకు ఎందుకు త‌గ్గించార‌న్న జస్టిస్‌ ఠాకూర్ ప్రశ్నకు ఎక్కువ మందికి నోట్ల మార్పిడి అవ‌కాశం క‌ల్పించేందుకే ఈ చ‌ర్య తీసుకున్నామ‌న్నారు. పెళ్లిళ్లు చేసుకొనేవారికి, రైతుల‌కు వెసులుబాటు క‌ల్పించామ‌ని వివరించారు.

23 ల‌క్షల కోట్ల నోట్లను ప్రింట్ చేయాల్సి ఉంది : కపిల్‌ సిబల్‌
దేశంలో 80 కోట్ల మంది జీతం ప‌ది వేల‌లోపేనని పిటిషనర్‌ తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు. అది బ్లాక్ మ‌నీ కాద‌ని కపిల్‌ సిబల్‌ కోర్టుకు తెలిపారు. 23 ల‌క్షల కోట్ల నోట్లను ప్రింట్ చేయాల్సి ఉందని, ప్రభుత్వం 14 ల‌క్షల కోట్ల క‌రెన్సీని ర‌ద్దు చేయ‌డంతో.. ప్రస్తుతం దేశంలో తొమ్మిది ల‌క్షల కోట్ల క‌రెన్సీ మాత్రమే అందుబాటులో ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీన్ని అభ్యంతర పెట్టిన ప్రభుత్వ న్యాయవాది రోహత్గీ.,. కపిల్‌ సిబల్‌ కోర్టులో రాజ‌కీయం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఉభయుల వాదనలు విన్న న్యాయస్థానం.. నవంబ‌ర్ 25లోగా క్షేత్రస్థాయి ప‌రిస్థితుల‌ను కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 

21:31 - November 18, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు అంశం పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. పెద్దనోట్ల రద్దుపై ప్రధాని వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీనిపై చర్చకు అనుమతివ్వకపోవడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. దీంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు వాయిదా
పార్లమెంట్‌ సమావేశాల్లో మూడో రోజున ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం సభ ప్రారంభమైన కాసేపటికే గందరగోళం నెలకొంది. రాజ్యసభలో నోట్ల ర‌ద్దు అంశంపై ప్రతిప‌క్ష నేత ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై క్షమాప‌ణ‌ చెప్పాల‌ని కేంద్ర మంత్రి న‌ఖ్వీ డిమాండ్ చేశారు. మాఫీ మాంగో అంటూ బీజేపీ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు.
నోట్ల ర‌ద్దు అంశంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ప్రతిప‌క్ష స‌భ్యుల ఆందోళన
ప్రధాని స‌భ‌కు వ‌చ్చి నోట్ల ర‌ద్దు అంశంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ప్రతిప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు.దీంతో సభ రెండున్నర వరకు రెండు సార్లు వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. విపక్షాల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొనడంతో డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ రాజ్యసభను సోమవారానికి వాయిదా వేశారు.
ల్‌ 56 ప్రకారం వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టు
లోక్‌సభలో కూడా అదే పరిస్థితి. తామిచ్చిన రూల్‌ 56 ప్రకారం వాయిదా తీర్మాణంపై చర్చ జరపాలని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. నోట్ల రద్దుపై చర్చ జరగడం విపక్షాలకు ఇష్టం లేదని, స్పీకర్‌ అనుమతిస్తే రూల్‌ 193 ప్రకారం తాము చర్చకు సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌ స్పష్టం చేశారు. విపక్షాల డిమాండ్‌ను స్పీకర్‌ సుమిత్రా మహాజన్ అంగీకరించక పోవడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. విపక్ష సభ్యుల ఆందోళనతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

ఓటింగ్‌ జరగాలని విపక్షాలు కోరడంతో బిజెపి తమ సభ్యులకు విప్‌ జారీ
వాయిదా తర్వాత తిరిగి లోక్‌సభ ప్రారంభమైనా విపక్షాలు తమ పట్టు వీడలేదు. విపక్షాల నిరసనల మధ్యే స్పీకర్‌ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. గందరగోళం నడుమ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. లోక్‌సభలో చర్చ అనంతరం ఓటింగ్‌ జరగాలని విపక్షాలు కోరుతుండడంతో బిజెపి తమ సభ్యులకు విప్‌ జారీ చేసింది. సభ్యులంతా సభలోనే ఉండాలని కోరింది.

మంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి
పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సంబంధిత మంత్రులే విపక్షాలకు సమాధానమిస్తారని, ప్రధానే సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేయడం సబబు కాదన్నారు. తగిన సమయంలో ప్రధాని సభలో సమాధానం చెప్పడం ఆనవాయితిగా వస్తోందని వెంకయ్య చెప్పారు. ప్రతిపక్షాలు పట్టు వీడడం లేదు...అధికార పక్షం మెట్టు దిగడం లేదు. దీంతో ఎలాంటి చర్చలు జరగకుండానే పార్లమెంట్‌ సోమవారానికి వాయిదా పడింది.

ఢిల్లీ బయలుదేరిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరారు. రేపు పాత పెద్దనోట్ల రద్దు అంశంపై రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ విషయంపై కేసీఆర్ ను ఢిల్లీ రావాలని గురువారం ప్రధాని మోదీ కేసీఆర్ కు ఫోన్ చేసిన విషయం తెలిసింది. నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయంపై పడిన ప్రభావం, ప్రజలు నోట్ల ఇబ్బందితో పడుతున్న ఇబ్బందులకు ప్రధానికి వివరించనున్నారు. 

20:45 - November 18, 2016

నిన్నటిదాకా మూడు పువ్వులు ఆరు కాయలు..మధ్య వర్తులు, బిల్డర్లు, పెట్టుబడిదారులు..సర్కారీ ఖజానా కళకళ.. ఇప్పుడు ఒక్కసారిగా బూం ఢాం అంది. పెద్ద నోట్ల రద్దుతో సీన్ రివర్సయింది. ఎప్పుడు నార్మల్ అవుతుందో ఊహించని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జరిగిన ఒప్పందాలు సైతం రద్దవుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా ఎంత కాలం? పెద్ద నోట్ల రద్దు రియల్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపింది.. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం..తెలంగాణ, ఆంధ్రా తేడా లేదు.. హైదరాబాద్, విజయవాడ, అమరావతి నో డిఫరెన్స్.. అన్ని చోట్లా అదే సందిగ్ధం.. అన్ని చోట్లా... అదే గందరగోళం.. కొత్త వివాదాలు.. కొత్త సమస్యలు.. పెద్ద నోట్ల రద్దు ఫలితం అన్ని రంగాలపై పడినట్టే.. రియల్ ఎస్టేట్ రంగంపై మరింత ఎక్కువగా పడిందా? హైదరాబాద్ చుట్టుపక్కల నిన్నమొన్నటివరకు రియల్ దందా ఓ రేంజ్ లో నడిచింది. ఆ మాటకొస్తే విభజన తర్వాత కూడా పెద్ద మార్పు కనపళ్లేదనే చెప్పాలి. కానీ, ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు తెలంగాణ రియాల్టీపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? భూముల అమ్మకాలు పడిపోయినట్టేనా? రియల్‌ ఎస్టేట్‌ రంగంపై పెద్ద నోట్ల రద్దు అతి పెద్ద ప్రభావం చూపింది. భూములు, ఇళ్ల క్రయ విక్రయాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి ఎవరూ రాక కార్యాలయాలు వెలవెల పోతున్నాయి. ఈ వ్యాపారంలో కొనసాగుతున్న వారు చేతిలో ఉన్న డబ్బును ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. అమరావతిలో నిన్నటిదాకా జోరున సాగిన రియల్ దందా పరిస్థితి ఇప్పుడెలా ఉంది? మోడీ పేల్చిన నోటు బాంబుతో ఏపీలో రియ‌ల్ బూమ్ పూర్తిగా కుప్ప‌కూలిపోయింది. గుంటూరు - విజ‌య‌వాడ మ‌ధ్య నిన్నమొన్నటి వరకు ఎకరం 15 కోట్లు పలికిన భూములు ఇపుడు ఎందుకు కొర‌గానివిలా మారిపోయాయి. బెజ‌వాడ శివారులో ఎకరం 12, 13 కోట్ల వరకు ఇచ్చినా దొరకని పరిస్థితి .. ఇప్పుడు సీన్ రివర్సౌతోందా? ఏపీలో రియల్ బూమ్ పరిస్థితి ఎలా ఉంది? దేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పట్లో కోలుకోదా? చాలా ఏళ్లుగా బూమ్ నడిచిన రియల్ రంగం ఇప్పట్లో లేచే అవకాశం కనిపించటం లేదా? పెద్ద నోట్ల రద్దు దెబ్బకు ఒక్కసారిగా రియల్ దందా కుప్పకూలనుందా? ఇవే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా? ఎంత కాలం ఈ పరిస్థితి కొనసాగనుంది? ఒక్కొక్కరి బాధ ఒక్కోలా ఉంది.. పెద్ద నోట్ల రద్దుతో చిల్లర సమస్య వచ్చి సామాన్యుడిని వేదనకు గురిచేస్తుంటే...ప్రభుత్వ ఖజానాకు పెద్ద వనరుగా ఉన్న రియల్ రంగంపై పెద్ద దెబ్బే పడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మార్కెట్ రేటుకు వాస్తవానికి మధ్య భారీ తేడా కనిపించే రియల్ రంగంలో కరెన్సీ కొరతతో అమ్మకాలు, కొనుగోళ్లకు భారీ కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

20:35 - November 18, 2016

మీ ఊర్లో చెక్ డ్యాం కట్టాలంటే చెప్పులరిగేలా నాసుట్టూ వందసార్లు తిప్పించుకుంటన్నంటున్నడు బాల్కొండ ఎమ్మెల్యే సారు..వందలకోట్లు ఖర్చుపెట్టిన ఎమ్మెల్యేనయినంటున్నడు ఈ వేముల ప్రశాంత రెడ్డి ఎమ్మల్యే సారు..పాత పెద్ద నోట్ల రద్దుతో చుక్కలు చూపె డుతన్నడు ప్రధాని మోదీ..మిలట్రీలో పనిచేసేవాల్లల్లో గుజరాతోల్లే తక్కువగా వున్నరట..నోట్లు దాసుకున్నోల్లలో మోదీ దోస్తునంటున్న కేజ్రీవాల్..ఆధారాల కోసం కాయితాల కట్టలు పట్కకొచ్చిన ఢిల్లీ సీఎం...మోడీ పెండ్లయితే మా బాధలు తెలిసేటివంటున్న జనాలు..సిరిసిల్లకాడ నాయినికి బీపీ వచ్చిందంట..బుడ్డర్ కాన్ గా అంటూ విరుచుకుపడ్డడు నాయినన్న..ఒంటిమీద పుస్తెలమ్మి పిల్లగాల్లకు బువ్వొండిపెడుతన్నామంటున్నరు అంగన్వాడి అమ్మలు.. గిసువంటి మస్తు ముచ్చట్లు మన మల్లన్న తీసుకొచ్చిండు..మరి ఈ ముచ్చట్లన్నీ చూడాలంటే ఈ వీడియో చూడుండ్రు..మస్తు ఖుషీ అవుండ్రి..

రేపు నోట్ల మార్పిడి రద్దు..

ఢిల్లీ : రేపు ఒక్కరోజు నోట్ల మార్పిడి రద్దు అంటూ ఆర్థిక శాఖ ప్రకటించింది. నోట్లు మార్పిడి చేసుకునేందురు సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే అవకాశముంది. దీంతో బ్యాంకుల సాధారణ పనివేళలతోనే కొనసాగనున్నాయి. 

19:49 - November 18, 2016
19:45 - November 18, 2016

ఢిల్లీ : కేవీపీ ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లును లోక్‌సభ స్పీకర్... రాజ్యసభ మనీ బిల్లుగా తేల్చింది. ఈ విషయంపై డిప్యూటీ ఛైర్మన్ ప్రకటన కురియన్ రాజ్యసభలో ప్రకటన చేశారు. గతంలో రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదా అమలుతో సహా పలు అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే చర్చ సందర్భంగా... ఇది ద్రవ్య బిల్లు అని చెప్పిన జైట్లీ ప్రకటించడంతో... మనీ బిల్ అవునా కాదా అన్న విషయం తేల్చేందుకు రాజ్యసభ... లోక్‌సభ స్పీకర్‌కు పంపింది. దీనిని అధ్యయనం చేసిన లోక్‌సభ స్పీకర్.,.. మనీ బిల్లుగా తేల్చారు. దీంతో బిల్లును లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలని రాజ్యసభ వైస్ ఛైర్మన్ కురియన్ ఇవాళ ప్రకటన చేశారు. 

19:39 - November 18, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. పెద్దనోట్ల రద్దు, నగదు మార్పిడికి సంబంధించి చర్చ చేపట్టాలని.. చర్చ జరిగే సమయంలో ప్రధాని మోదీ సభలో ఉండాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇస్తారని ప్రభుత్వం చెప్పినా శాంతించలేదు.ముందస్తు చర్యలు చేపట్టకుండా పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తీసుకోవడంతో దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని విపక్షాలు అగ్రహం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీయే సమాధానం చెప్పాలంటూ పోడియం వద్ద నినాదాలు చేశారు.దీంతో ఇరు సభలూ సోమవారానికి వాయిదా పడ్డాయి. మరోపక్క సామాన్యుడికి నోటు కష్టాలు తప్పడం లేదు. కనీస ఖర్చులకు అవసరమైన నగదు కోసం.. గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కొనసాగుతోంది.నోట్లరద్దు వెనక్కి తీసుకోవాలంటూ మమతా బెనర్జీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నోట్ల కష్టాలను ఏకరువు పెట్టాయి.ఏపీ సీఎం చంద్రబాబు నోట్ల రద్దుతో రాష్ట్ర ఖజానాకు ఏర్పడిన స్థితిగతులు..ప్రజలు పడుతున్న కష్టాలు వంటి పలు అంశాలపై కేంద్రానికి లేఖ రాస్తున్నట్లుగా తెలిపారు.తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రధాని ఫోన్ పిలుపు మేరకు ఢిల్లీ పయనమయ్యారు. రేపు ప్రధానితో భేటీకానున్న కేసీఆర్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు ప్రధానికి వివరించనున్నారు. 

19:14 - November 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగులపై నోట్ల రద్దు ఎఫెక్ట్ పడింది. నవంబర్ నెల వేతనాలపై స్పెషల్ సీఎస్ ప్రదీప్ చంద్రను ఉద్యోగ సంఘ నాయకులు కలిశారు. నగదు రూపంలో జీతాలు చెల్లించాలనీ అది సాధ్యం కాకపోతే ఒకేసారి రూ.లక్ష డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. ఉద్యోగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలో ఆర్డర్ టు సర్వ్ ప్రకారం వెళ్లిన ఉద్యోగులకు పర్మినెంట్ కేటాయింపులు ఇచ్చేంత వరకూ పాత జిల్లాలో ఇచ్చిన పద్ధతుల్లోనే వేతనాలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. తెలంగాణలో మూడున్నర లక్షలమంది వున్నారు..ఇంకా పలువురు పెన్షన్ దారులున్నారు. కాగా గత 10 రోజుల క్రితయం కేంద్ర ప్రభుత్వం పాత పెద్దనోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్తనోట్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం విత్ డ్రా కేవలం రూ.2000లకు మాత్రమే పరిమితి చేసింది. పాత నోట్లు బ్యాంక్ లో జమచేసిన కొత్తనోట్లను పొందే క్రమంలో ఖాతాదారులు పలు ఇబ్బందులకు గురవుతున్న సంగతి తెలిసిందే.

18:57 - November 18, 2016

హాయ్ హలో వెల్కం టు సెన్సేషనల్ ఫిలిం రివ్యూ షో నేడే విడుదల....ఈ రోజు నేడే విడుదలలో మనం మాట్లాడుకుబోయేది నిఖిల్ హీరోగా వస్తున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా గురించి..డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలతో వేరియేషన్ చూపిస్తున్న నిఖిల్.. ఈ రోజు ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. హెబ్బా పటేల్, నందితా , నిఖిల్ లీడ్ రోల్స్ లో రిలీజైన ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్స్ తో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది.ఆనంద్ డైరెక్షన్ లోవచ్చిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా నిఖిల్ కు డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేయబోతోందని టాక్. లవర్ బాయ్ క్యారెక్టర్స్ తో పాటు.. ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ కూడా అటెంప్ట్ చేసే నిఖిల్ కు ఈ సినిమా మరో బూస్టప్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్...ఈ సినిమా రేటింగ్ కోసం ఈ వీడియోను చూడండి..

తెలంగాణ ఉద్యోగులపై నోటు ఎఫెక్ట్..

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగులపై నోట్ల రద్దు ఎఫెక్ట్ పడింది. నవంబర్ నెల వేతనాలపై స్పెషల్ సీఎస్ ప్రదీప్ చంద్రను ఉద్యోగ సంఘ నాయకులు కలిశారు. నగదు రూపంలో జీతాలు చెల్లించాలనీ అది సాధ్యం కాకపోతే ఒకేసారి రూ.లక్ష డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. ఉద్యోగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలో ఆర్డర్ టు సర్వ్ ప్రకారం వెళ్లిన ఉద్యోగులకు పర్మినెంట్ కేటాయింపులు ఇచ్చేంత వరకూ పాత జిల్లాలో ఇచ్చిన పద్ధతుల్లోనే వేతనాలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. 

డిసెంబర్ 2న కార్యచరణ ప్రకటిస్తా : ముద్రగడ

తూర్పుగోదావరి : సీఎం చంద్రబాబుకు కాపునేత ముద్రగడ మరో లేఖ రాశారు. మా హక్కులకు కాలరాస్తున్నారనీ..పోలీసులు, కెమెరాలతో దాడి చేస్తున్నారని లేఖ ఆరోపించారు. డిసెంబర్ 2న కాపు జేఏసీ సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. 

చిల్లర ఇబ్బందులు తొలగించేదుకు చర్యలు: బాబు

విజయవాడ : నోట్ల రద్దుతో రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు నెలకొన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఆర్బీఐ గవర్నర్ తో మాట్లాడానని అన్నారు. ఇప్పటి వరకు 8 వేల కోట్లు పంపారని, ఇంకా 10వేల కోట్ల రూపాయలు పంపాలని కోరామన్నారు. ఆన్ లైన్ సేవలు పెంచాలని ఆయన తెలిపారు. అందుకే 80 శాతం ఈపాస్ మిషన్స్ కు సబ్సిడీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆన్ లైన్ చెల్లింపులకు ఇన్సెంటివ్స్ ప్రకటించాలని ఆయన సూచించారు. ఆన్ లైన్ సేవలంటేనే చాలా మంది భయపడిపోతున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడున్న ఆన్ లైన్ సేవలను ప్రక్షాళన చేయాలని ఆయన సూచించారు.

18:28 - November 18, 2016

విజయవాడ : నోట్ల రద్దు అనంతరం జరిగిన పరిణామాలపై సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు, తొలగించేందుకు యత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 8 వేల కోట్లు పంపారని, ఇంకా 10వేల కోట్ల రూపాయలు పంపాలని కోరామన్నారు. ఆన్ లైన్ సేవలు పెంచాలని ఆయన తెలిపారు. అందుకే 80 శాతం ఈపాస్ మిషన్స్ కు సబ్సిడీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.పాతనోట్లు మార్చుకునేందుకు ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్రప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లుగా తెలిపారు.దీనిపై ఆర్థికశాఖ కార్యదర్శిను ముంబైకి పంపించామని తెలిపారు. చిన్న నోట్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖ పేర్కొన్నట్లుగా చెప్పారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు వున్నా తాత్కాలికంగా సమస్యలు వస్తున్నాయనీ..దీన్ని అధిగమించేందుకు పరిష్కరించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. రెండువేల నోట్లతో ఎటువంటి ఉపయోగం లేదనీ అందుకనే చిన్ననోట్లను అమలులోకి తీసుకురావాలన్నారు. సాధ్యమైనంత త్వరగా రూ.500ల నోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లుగా చెప్పారు. చిల్లర కష్టాలను తగ్గించుకునేందరు సాధ్యమైనంతగా ఆన్ లైన్ విధానాన్ని ఉపయోగించాలని సూచించారు. ప్రజలకు నగదు అందించేందుకు దేవాలయాల్లోని హుండీల్లో నగదును ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో జమచేస్తున్నామని తెలిపారు.ఆన్ లైన్ సేవలు వినియోగించుకునేందుకు వీలుగా, స్వైపింగ్ ఛార్జీలు తీసెయ్యాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో 75 శాతం మందికి డెబిట్ కార్డులుంటే...వాటిని వినియోగించేవారు కేవలం 30 శాతం మందేనని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 9,51,000 లక్షలకు పైగా ప్రజలకు అకౌంట్లు లేవని ఆయన చెప్పారు. 39 వేల మందికి అకౌంట్లు ఓపెన్ చేసేందుకు చర్యలు చేపట్టగా, మిగిలిన వారికి ఇంకా అకౌంట్లు జారీ చేయాల్సి ఉందని తెలిపారు. 

ట్యాక్స్ ఎగ్గొట్టేవారిపై కేంద్రం కఠిన చర్యలు..

ఢిల్లీ : పన్ను ఎగవేత దారులపై కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నల్లధనం మార్చేందుకు ఇతరుల ఖాతాలు వినియోగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఖాతాలు దుర్వినియోగమైతే సొంతదారుపై ఐటీ చట్టం కింద విచారణ చేపడతామని, నల్లధనం నిర్మూలనకు అందరూ సహకరించాలని ప్రభుత్వం కోరింది.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ అన్న క్యాంటిన్లు: బాబు

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శుక్రవారం పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేయబోయే ఎన్టీఆర్ అన్న క్యాంటిన్లను ముందుగా నగరాలు, పట్టణాలలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు . అన్న క్యాంటిన్లలో తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అందించాలని, చౌకధరల దుకాణాలను రిటైల్ కిరాణా దుకాణాలుగా మార్చాలని, డ్వాక్రా, మెప్మా సంస్థల ఉత్పత్తుల విక్రయానికి చోటు కల్పించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..

హైదరాబాద్‌: ఎస్సార్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీవర్ష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మోతీనగర్‌లోని తన ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శ్రీవర్ష ఎస్సార్‌నగర్‌లోని నారాయణ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల పరీక్షలకు హాజరుకాలేదన్న కారణంతో ఫిజిక్స్‌ లెక్చరర్‌ ప్రేమ్‌కుమార్‌ తోటి విద్యార్థుల ముందు తీవ్రంగా తిట్టాడని... దానిని అవమానంగా భావించిన శ్రీవర్ష ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

17:31 - November 18, 2016

సంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర 33వ రోజుకు చేరింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కొనసాగుతోన్న పాదయాత్రకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందుతున్నాయి. తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు...వికలాంగులు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ..పనికి తగ్గ జీతం అంగన్వాడీ కార్యకర్తలకు లేదని వారు వాపోతున్నారు. పనికి తగ్గ జీతం లేకా కడుపునిండా తిండిలేక అంగన్వాడీలు అనారోగ్యానికి గురవుతున్నారనీ..ఊర్లో ఏ ఒక్క పని వున్నాగానీ అంగన్వాడీ కార్యకర్తలే చేయాల్సి వస్తోందని వారు తెలిపారు. నగదు బదిలీ పథకాన్ని ఆపి ఎవరి ఎకౌంట్లలో వారికే వేయాలని వారు కోరారు. వికలాంగులకు వచ్చే పెన్షన్ కూడా నిలిపివేశారనీ వారు పాదయాత్ర బృందానికి తెలిపారు. ఇలా వారి సమస్యలను పాదయాత్ర బృందానికి వినతుల ద్వారా తెలుపుకుంటున్నారు. 

17:23 - November 18, 2016
17:21 - November 18, 2016

ఢిల్లీ : నోట్లరద్దు అనంతర పరిణామాలపై మోదీ సర్కార్‌పై రోజురోజుకూ విమర్శలు పెరుగుతున్నాయి. బీజేపీ అనుంబంధసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. సంఘ్ నేత కేఎన్.గోవిందాచార్య కేంద్రప్రభుత్వానికి రాసిన లేఖ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసేలా ఉంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖా కార్యదర్శి శక్తికాంత్ దాస్‌, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు రాసిన లేఖలో ఆయన ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం నోట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దీలో చనిపోయిన 40మంది కుటుంబాలను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో నష్టపరిహారాన్ని చెల్లించాలని, పరిహారాన్ని అందించకపోతే ప్రభుత్వం తగిన ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుందని అన్నారు. ప్రణాళికాబద్ధంగా వ్యవరించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఇదే విషయాన్ని ఆయన ఫేస్‌ బుక్‌లో కూడా ప్రస్తావించారు. 

17:14 - November 18, 2016

ఢిల్లీ : ఓ బిల్లు మనీ బిల్లా కాదా అన్నది కేవలం లోక్‌సభ స్పీకర్‌కే నిర్ధారించే హక్కు ఉంటుందని కాంగ్రెస్‌ నేత జయరాం రమేష్‌ అన్నారు. కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లు ద్రవ్య బిల్లు కాదని స్పీకర్‌ నిర్ధారించినట్లు తెలిపారు. ఈ విషయంలో ఆర్థిక మంత్రి రాజ్యసభను తప్పుదోవ పట్టిస్తున్నారని జయరాం రమేష్‌ ధ్వజమెత్తారు. కెవిపి ప్రయివేట్‌ బిల్లుపై చర్చ జరగాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని తాము ఛాలేంజ్‌ చేస్తామన్నారు. దీన్ని మనీబిల్లుగా కాంగ్రెస్‌ పరిగణించడం లేదన్నారు.

కేవీపీ బిల్లు ద్రవ్య బిల్లే : కురియన్
ఏపి ప్రత్యేక హోదాకు సంబంధించి కేవిపి ప్రవేశ పెట్టిన ప్రయివేట్‌ బిల్లును రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ కురియన్‌ ద్రవ్యబిల్లుగా నిర్ధారించారు. న్యాయ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సభలో ప్రకటించారు. కేవిపి ప్రవేశ పెట్టిన ఏపి ప్రత్యేక హోదా బిల్లును ప్రొసీడింగ్స్‌ నుంచి తొలగిస్తున్నట్లు కురియన్‌ పేర్కొన్నారు. విభజన చట్టంలో మార్పులు చేయాలంటూ గత ఆగస్టు నెలలో కేవీపి రాజ్యసభలో ప్రయివేట్‌ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలను ఈ బిల్లులో చేర్చారు. ప్రయివేట్‌ బిల్లును మనీబిల్లుగా నిర్ధారించడంతో ఈ బిల్లును లోక్‌సభలోనే ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది.

 

కేంద్రం మరో కీలక నిర్ణయం..?

ఢిల్లీ : కొద్దిరోజులు నగదు మార్పిడిని నిలిపివేయాలని కేంద్రం యోచిస్తోంది. కేవలం డిపాజిట్లు మాత్రమే స్వీకరించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. 

16:51 - November 18, 2016
16:46 - November 18, 2016

ఢిల్లీ : ఏ క్షణంలో అయినా పెద్దనోట్ల మార్పిడి ప్రక్రియ నిలిపివేసే యోచనలో ప్రభుత్వం వున్నట్లుగా సమాచారం. ఆర్బీఐ, ఆర్థిక శాఖలు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లుగా సమాచారం. ఈ నెల 24 లేదా అంతకంటే ముందే పెద్ద నోట్ల మార్పిడీ బందయ్యే అవకాశం కనిపిస్తోంది. నల్లకుబేరులు ఒప్పందాలు చేసుకుని నల్లధనం మార్చుకుంటున్నారన్న ఊహగానాల నడుమ, నగదు రహిత లావాదేవీలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం పాత నోట్లను బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న వారు మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అనంతరం చెక్ లేదా డెబిట్ కార్డు ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చని తెలుస్తోంది. బ్యాంకుల్లో డిపాజిట్ మాత్రమే చేసుకునే వెసులుబాటుంది. ప్రస్తుతం పాత 500,1000 నోట్లను మార్పిడి చేసుకునే ప్రజలకు మరింత సమస్యలు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రైతుల కోసం బ్యాంకు ఉద్యోగుల ధర్నా..

కర్నూలు : కేడీసీసీ బ్యాంకు ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 90 శాతం రైతులు ఉన్న బ్యాంకులో కేవలం డిపాజిట్ లకు పరిమితం చేయడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్య్ బ్యాంకు చర్యలు రైతులకు ఇబ్బందికరంగా మారాయని కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మల్లిఖార్జునరెడ్డి పేర్కొన్నారు. 

నోట్ల రద్దుపై మరోసారి లేఖ రాయాలని బాబు నిర్ణయం..

విజయవాడ : నోట్ల రద్దుతో తలెత్తిన ఇబ్బందులపై కేంద్రానికి మరోసారి లేఖ రాయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. ప్రజల అవసరాలకు సరిపడా రూ. 10 వేల కోట్ల విలువైన 100, 500 నోట్లను ఏపీకి పంపాలని సీఎం కోరనున్నారు. సహకార బ్యాంకుల్లో పాతనోట్లతో బకాయిలు చెల్లించేలా రైతులకు అవకాశం కల్పించాలని సూచించారు. 

16:13 - November 18, 2016

నోట్ల రద్దుపై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ ఠాకూర్ కీలక ప్రశ్నలు సంధించారు. నగదు బదలాయింపు పరిమితిని రూ. 4,500 నుండి రూ. 2వేలకు ఎందుకు కుదించారని ప్రశ్నించారు. బయట పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని, విపరీతంగా క్యూలు కనబడుతున్నాయన్నారు. 

అనంతలో టెన్ టివి కథనానికి స్పందన..

అనంతపురం : టెన్ టివి కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్యులపై వేటు పడింది. కలెక్టర్ శశిధర్ ఈ చర్యలు తీసుకున్నారు.

 

సుష్మాకు కిడ్నీ ఇస్తానన్న రాయపాటి..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కు ఎంపీ రాయపాటి లేఖ రాశారు. సుష్మాకు కిడ్నీ ఇచ్చేందుకు రాయపాటి ముందుకొచ్చారు. తన కిడ్నీ స్వీకరించాలని రాయపాటి విజ్ఞప్తి చేశారు. 

16:05 - November 18, 2016

తూర్పుగోదావరి : దివీస్ వ్యతిరేక ఉద్యమంపై ప్రభుత్వ ఆంక్షల‌ను కోర్టు తోసిపుచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజ‌ల గొంతు వినిపించే అవ‌కాశం క‌ల్పించింది. సుమారు 90 రోజులుగా సాగుతున్న 144 సెక్షన్ ఆంక్షల‌ను కాద‌ని, బ‌హిరంగ‌స‌భ‌కు అనుమ‌తినిచ్చింది. తూర్పు గోదావ‌రి జిల్లా తొండంగి మండ‌లంలో దివీస్ నిర్మిత ప్రాంతాల్లో ప్రజ‌ల నిర‌స‌న‌లు పోలీసుల‌తో అడ్డుకుంటున్న ప్రభుత్వానికి చెంపపెట్టు క‌లిగించే రీతిలో హైకోర్ట్ తీర్పునిచ్చింది. ఈనెల 20న పంపాదిపేట‌లో బ‌హిరంగ‌స‌భ జ‌రుపుకోవ‌డానికి అంగీక‌రించింది. కోర్టు తీర్పు ప‌ట్ల సీపీఎం నేత‌లు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. 

15:59 - November 18, 2016

హైదరాబాద్ : విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి ప్రతి ఒక్కరి అకౌంట్‌లో 15లక్షల రూపాయలు వేస్తానన్న హామీ ఏమైందని ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత డీకే అరుణ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పెద్ద నోట్లను రద్దు చేశారని ఆమె ఆరోపించారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా.. కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. 

15:58 - November 18, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు చిరు వ్యాపారులు తీవ్రంగా పడుతోంది. హైదరాబాద్‌లోని గుడి మల్కాపూర్‌ పూల మార్కెట్‌ వెలవెలబోతోంది. మార్కెట్‌లో భారీగా చిల్లర కొరత ఏర్పడింది. ప్రజలు పాత నోట్లు తీసుకోని వస్తుండటంతో వాటికి చిల్లర ఇవ్వలేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు దారులు లేక తీసుకొచ్చిన పూలను మార్కెట్లోనే పారవేసే పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..

15:53 - November 18, 2016

కరీంనగర్  :  పెద్దనోట్ల రద్దుతో పదిరోజులు గడుస్తున్నా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. చిల్లర ఇక్కట్లు సామాన్య ప్రజలతోపాటు వ్యాపార వాణిజ్య సంస్థలకు తప్పడం లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే కరీంనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం....రిజిస్ట్రేషన్లు జరక్క బోసిపోయింది. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ మాట్లాడుతూ..గతంలో నెలకు 200 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యేవని 8వ తేదీన పాతనోట్ల రద్దు ప్రకటన అనంతరం 18తేదీకి కేవలం 12 మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయని సబ్ రిజిస్ట్రార్ తెలిపారు. అవికూడా గతంలో చలాన్ లు కట్టినవి మాత్రమే అయ్యాయనీ..కొత్తగా చలాన్ లు కట్టేపరిస్థితి ప్రస్తుతం లేదన్నారు.

15:50 - November 18, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సంబంధిత మంత్రులే విపక్షాలకు సమాధానమిస్తారని, ప్రధానే సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేయడం సబబు కాదన్నారు. తగిన సమయంలో ప్రధాని సభలో సమాధానం చెప్పడం ఆనవాయితిగా వస్తోందని వెంకయ్య చెప్పారు. సభలో చర్చ సాగకుండా కాంగ్రెస్‌ రాద్దాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు. నోట్ల రద్దు అంశంపై విపక్షాల మంచి సూచనలు వస్తే ప్రభుత్వం స్వాగతిస్తుందన్నారు.

15:45 - November 18, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాల్లో మూడో రోజున ఎలాంటి చర్చ జరగకుండానే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభమైన కాసేపటికే గందరగోళం నెలకొంది. నోట్ల ర‌ద్దు అంశంపై ప్రతిప‌క్ష నేత ఆజాద్ నిన్న చేసిన వ్యాఖ్యల ప‌ట్ల క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని కేంద్ర మంత్రి న‌ఖ్వీ డిమాండ్ చేశారు. మాఫీ మాంగో అంటూ బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. మరోవైపు ప్రధాని స‌భ‌కు వ‌చ్చి నోట్ల ర‌ద్దు అంశంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ప్రతిప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. విపక్ష సభ్యులు ఛైర్మన్‌ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో సభ రెండున్నర వరకు రెండు సార్లు వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైంది. సభలో గందరగోళం నెలకొనడంతో డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ రాజ్యసభను సోమవారానికి వాయిదా వేశారు.

15:34 - November 18, 2016

ఢిల్లీ :కేవీపీ ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లును లోక్‌సభ స్పీకర్... రాజ్యసభ మనీ బిల్లుగా తేల్చింది. ఈ విషయంపై డిప్యూటీ ఛైర్మన్ ప్రకటన కురియన్ రాజ్యసభలో ప్రకటన చేశారు. గతంలో రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదా అమలుతో సహా పలు అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే చర్చ సందర్భంగా... ఇది ద్రవ్య బిల్లు అని చెప్పిన జైట్లీ ప్రకటించడంతో... మనీ బిల్ అవునా కాదా అన్న విషయం తేల్చేందుకు రాజ్యసభ... లోక్‌సభ స్పీకర్‌కు పంపింది. దీనిని అధ్యయనం చేసిన లోక్‌సభ స్పీకర్.,.. మనీ బిల్లుగా తేల్చారు. దీంతో బిల్లును లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలని రాజ్యసభ వైస్ ఛైర్మన్ కురియన్ ఇవాళ ప్రకటన చేశారు. అనంత‌రం ప‌లు అంశాల‌పై స‌భ్యులు మాట్లాడుతుండ‌గా విప‌క్ష‌నేత‌లు పోడియం వ‌ద్ద త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తుండ‌డంతో రాజ్య‌స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు కురియ‌న్ పేర్కొన్నారు.గత సమావేశాల్లో కేవీపీ బిల్లుపై రాజ్యసబలో పూర్తిస్థాయిలో చర్చ జరిగినా ఎటూ తేల్చకుండానే రాజ్యసభను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా అమలుతో సహా పలు అంశాలను కేవీపీ ఈ బిల్లులో పొందుపరిచారు. 

కేవీపీ బిల్ మనీ బిల్లే : కురియన్

ఢిల్లీ : వాయిదా అనతరం తిరిగి ప్రారంభమైన రాజ్యస‌భలో గందరగోళం మధ్యే స‌భ్యులు ప‌లు బిల్లులను ప్రవేశపెట్టారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం కేవీపీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లును ద్రవ్య బిల్లుగా నిర్ధారణ చేసినట్టు డిప్యూటీ ఛైర్మ‌న్ కురియ‌న్ ప్ర‌క‌టించారు. న్యాయ స‌ల‌హా తీసుకున్న త‌రువాతే కేవీపీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుపై ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు.

జయ కోలుకున్నారు - అపోలో ఛైర్మన్..

చెన్నై : సీఎం జయలలిత పూర్తిగా కొలుకున్నారని, ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ చేరకూడదనే జయను ఇంకా ఐసీయూలో ఉంచామని అపోలో ఛైర్మన్ వెల్లడించారు. డిశ్చార్జ్ తేదీపై ఆమె నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 

నోట్ల రద్దుపై సుప్రీంలో కేంద్రం పిటిషన్..

ఢిల్లీ : నోట్ల రద్దుపై హైకోర్టుల్లో దాఖలయ్యే పిటిషన్ల విచారణపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర విజ్ఞప్తిని సుప్రీం తిరస్కరించింది. రాష్ట్రాల్లో వేర్వేరు సమస్యలున్నాయని వ్యాఖ్యానించింది. ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయవచ్చని సుప్రీం పేర్కొంది. 

5గంటలకు యూపీ నేతలతో రాహుల్ భేటీ..

ఢిల్లీ : సాయంత్రం ఐదు గంటలకు యూపీ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

సీనియర్ మంత్రులతో మోడీ భేటీ..

ఢిల్లీ : నోట్ల మార్పిడిపై సీనియర్ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారు. ఆర్థిక శాఖ చేపట్టిన చర్యలపై మంత్రులతో సమీక్షించారు. వ్యవసాయదారులు, చిన్న వ్యాపారులకు తోడ్పడేలా ఆర్థిక శాఖ చర్యలు తీసుకొంటోందని ప్రధాని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ చర్యలపై ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోందని కొద్ది రోజుల్లో అన్నీ సజావుగా సాగుతాయన్నారు. 

అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం..

హైదరాబాద్ : క్యాంపు ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఢిల్లీ పర్యటనపై చర్చించారు. 

కేంద్రానికి కోల్ కతా హైకోర్టు ఆదేశాలు..

కోల్ కతా : నోట్ల రద్దుపై ఈనెల 25వ తేదీలోపు నివేదిక సమర్పించాలని కేంద్రానికి కోల్ కతా హైకోర్టు ఆదేశించింది. 

రైతులకిచ్చిన వాగ్ధానాలు పూర్తి - సీఆర్డీఏ కమిషనర్..

విజయవాడ :రైతులకు ఇచ్చిన వాగ్ధానాలు 99 శాతం పూర్తి చేయడం జరిగిందని, అమరావతిలో సర్క్యులర్ ట్రైన్ ఏర్పాటు చేస్తామని సీఆర్డీఏ కమిషనర్ పేర్కొన్నారు. నాలుగు నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని, 28న ప్రభుత్వ డిజైన్ల ఎంపిక చేస్తామన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 

14:06 - November 18, 2016

హైదరాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనర్ స్వాతిలక్రాతో టెన్ టివి మానవి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు తెలిపారు. షీటీమ్స్ గురించి మాట్లాడారు. మరిన్ని వివరాను వీడియోలో చూద్దాం....

 

13:59 - November 18, 2016
13:57 - November 18, 2016

సంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర 33వ రోజుకు చేరింది. ఇవాళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం హుగ్గెల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. రంజోలు, పస్తాపూర్‌, జహీరాబాద్‌, మాచనూరు, బర్డీపూర్‌, ఎల్గోయి గ్రామాల్లో ఇవాళ తమ్మినేని బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టి వర్గాల సామాజిక అభివృద్ధి కోసమే పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. దళితుల జీవితాల్లో మార్పులేదని...పేదరికంలో మగ్గుతున్నారని వాపోయారు. మరిన్ని వివరాను వీడియోలో చూద్దాం...

 

13:51 - November 18, 2016

కడప : జిల్లా రైల్వేకోడూరులో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం నిండు గర్భిణీ ప్రాణాలను తీసింది. ప్రసవం కోసం శ్రీలక్ష్మీ అనే గర్భిణీ రైల్వేకోడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు సకాలంలో స్పందించకపోగా.. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో గర్భిణీ మృతి చెందింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:42 - November 18, 2016

విశాఖ : నగరంలోని ఫోర్త్ టౌన్ వద్ద హైవేపై ప్రమాదం జరిగింది. బైకును లారీ ఢీకొట్టడంతో లారీ దగ్ధమైంది. ప్రమాదం ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

13:39 - November 18, 2016

ఢిల్లీ : మూడో రోజు ప్రారంభమైన రాజ్యసభ సమావేశంలో నోట్ల రద్దు అంశంపై విపక్షాలు పట్టువీడలేదు.  ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యులు ఛైర్మన్‌ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. నోట్ల రద్దు అంశంపై చర్చ జరగాలని ప్రధాని మోదీ సభకు హాజరై సమాధనం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. మరోవైపు రాజ్యసభలో నిన్న ప్రతిపక్షనేత ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు.  దీంతో సభను డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైన గంరదగోళం నెలకొనడంతో సభ రెండున్నరకు వాయిదా పడింది. 

 

13:37 - November 18, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో మూడోరోజు ఎలాంటి చర్చ జరగకుండానే లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. పెద్దనోట్ల రద్దు అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. తామిచ్చిన రూల్‌ 56 ప్రకారం వాయిదా తీర్మాణంపై చర్చ జరపాలని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు కోరాయి. ఈ అంశంలో చర్చకు అనుమతించేది లేదని స్పీకర్‌ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. విపక్షాల నిరసనల మధ్యే స్పీకర్‌ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. విపక్ష సభ్యుల గందరగోళం నడుమ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. లోక్‌సభలో చర్చ అనంతరం ఓటింగ్‌ జరగాలని విపక్షాలు కోరుతుండడంతో బిజెపి తమ సభ్యులకు విప్‌ జారీ చేసింది. సభ్యులంతా సభలోనే ఉండాలని కోరింది. 

 

13:33 - November 18, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుపై సహనం సడలిపోతోందని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఇది దేశంలో అలజడికి దారి తీయవచ్చని తెలిపారు. చర్చకు సహకరిస్తామన్న కాంగ్రెస్ వాయిదాలకే ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు. తక్షణమే పార్లమెంట్ లో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. 

13:21 - November 18, 2016
13:09 - November 18, 2016

వికారాబాద్ లో పీఎస్ ల ప్రారంభం..

వికారాబాద్ : జిల్లాలో రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యటించారు. మన్నెగూడ సమీపంలో నిర్మించిన చన్గొముల్ నూతన పోలీస్ స్టేషన్‌ను, కొడంగల్‌లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను హోంమంత్రి ప్రారంభించారు. 

12:59 - November 18, 2016

ఆర్బీఐ కార్యాలయం ఎదుట కేరళ సీఎం..మంత్రుల ధర్నా..

తిరువనంతపురం : ఆర్‌బీఐ కార్యాల‌యం ఎదుట కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌..రాష్ట్ర మంత్రులు ధర్నా నిర్వహించారు. నోట్ల రద్దు అంశంపై వారు ఆందోళన చేపట్టారు. 

12:57 - November 18, 2016
12:55 - November 18, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు పార్లమెంట్ ఉభయసభలను కుదిపేశాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అర్ధగంటపాటు వాయిదా పడిన లోక్ సభ 12గంటలకు తిరిగి ప్రారంభమైంది. కానీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఉదయం 11గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. సభను 11.30గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభం కాగానే విపక్షాలు..అధికారపక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. 12 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ కురియన్ వెల్లడించారు. అనంతరం తిరిగి సభ ప్రారంభమైంది. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఛైర్మన్ సభను 12.30గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు రాజ్యసభ ఉదయం ప్రారంభం కాగానే ఆజాద్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. మరో వైపు లోక్ సభలో పెద్దనోట్ల రద్దుపై విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. మధ్యాహ్నం 12గంటల అనంతరం ప్రారంభమైన సభలో జీరో అవర్ ను స్పీకర్ కొనసాగించారు. ప్రత్యేక హోదా అంశంపై టిడిపి సభ్యుడు కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఇతర అంశాలపై సభ్యులు మాట్లాడారు. విపక్షాల ఆందోళన మధ్యే జీరో అవర్ కొనసాగుతోంది. 

 

లోక్ సభ సోమవారానికి వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం ప్రారంభం కాగానే విపక్షాల ఆందోళనతో సభ వాయిదా పడుతూ వస్తోంది. చివరకు స్పీకర్ సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

12:42 - November 18, 2016

ఢిల్లీ : బ్యాంకుల్లో సిరా గుర్తుకు ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం తెలిపింది. త్వరలో తమిళనాడుతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరగనుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖకు ఎలక్షన్ కమిషన్ లేఖ రాసింది. ఉప ఎన్నికల్లో దీని వల్ల ఇబ్బందొస్తుందని లేఖలో పేర్కొంది. వీడియోలో చూద్దాం....

 

12:40 - November 18, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దు కష్టాలు రోజు రోజుకూ  తీవ్రమవుతున్నాయి. ఇప్పటికీ సామాన్యులకు ఇక్కట్లు తప్పడం లేదు. 500, వెయ్యి నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. గంటల తరపబడి ఏటీఎంల ముందు వేచిచూడాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిల్లర కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
ఐడీహెచ్ కాలనీ...
నోట్ల రద్దు కష్టాలు  రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇప్పటికీ సామాన్యులకు ఇక్కట్లు తప్పడం లేదు. 500, వెయ్యి నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. గంటల తరపబడి ఏటీఎంల ముందు వేచిచూస్తుంటే...రెండు వేల నోటు చేతికొస్తోంది. అసలే చిల్లర లేక ఇబ్బంది పడుతున్న తమకు రెండువేల చిల్లర ఎక్కడ దొరుకుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని మొట్టమొదటి బెడ్‌రూమ్‌ కాలనీ అయిన ఐడీహెచ్‌ కాలనీలోని పరిస్థితిని వీడియోలో చూద్దాం....

 

12:33 - November 18, 2016

కర్నూలు : జిల్లాలో ర్యాగింగ్‌ భూతం మళ్లీ పడగవిప్పింది. ర్యాగింగ్‌ కు విద్యార్థిని బలైంది. సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కడప జిల్లా బద్వేల్ మండలం పుటాయపల్లికి చెందిన ఉష నంద్యాల ఆర్‌జీఎం కాలేజీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటుంది. ఈనేపథ్యంలో అదే కాలేజీకి చెందిన సీనియర్లు ఉషను ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్‌ ను భరించలేక విద్యార్థిని ఉష ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు అంటున్నారు. గతంలో సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పబడినా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే మళ్లీ వారు ర్యాగింగ్ కు పాల్పడ్డారని అంటున్నారు. అయితే ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణం కాదని కాలేజీ యాజమాన్యం అంటుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఉష స్వగ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:22 - November 18, 2016

ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలి - టిడిపి ఎంపి..

ఢిల్లీ : ఏపీకి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పించాలని టిడిపి సభ్యుడు కింజరపు అచ్చెన్నాయుడు లోక్ సభలో డిమాండ్ చేశారు. మూడో రోజు జరిగిన సమావేశాల్లో విపక్షాల ఆందోళన మధ్య స్పీకర్ జీరో అవర్ కొనసాగించారు. పలువురు సభ్యులు మాట్లాడారు. 

లోక్ సభలో ఆందోళనల మధ్య జీరో అవర్..

ఢిల్లీ : లోక్ సభలో పెద్దనోట్ల రద్దుపై విపక్షాలు ఆందోళన కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12గంటల అనంతరం ప్రారంభమైన సభలో జీరో అవర్ ను స్పీకర్ కొనసాగించారు. ప్రత్యేక హోదా అంశంపై టిడిపి సభ్యుడు కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఇతర అంశాలపై సభ్యులు మాట్లాడారు. విపక్షాల ఆందోళన మధ్యే జీరో అవర్ కొనసాగుతోంది. 

12:09 - November 18, 2016

హైదరాబాద్ : పదో రోజైనా కరెన్సీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. డబ్బుల కోసం జనం పడిగాపులు కాస్తున్నారు.  బ్యాంకులు, ఏటీఎంల వద్ద పెద్దఎత్తున బారులుతీరారు. కిలోమీటర్ల మేర క్యూలు ఉన్నాయి. చాలా చోట్ల ఏటీఎంలు పనిచేయడం లేదు. ఇవాళ్టి నుంచి నోట్ల మార్పిడి పరిమితిని ఆర్బీఐ రూ. 2000కు కుదింపు చేసింది.  రైతులు వారానికి రూ. 25000 తీసుకునే వెసులుబాటు కల్పించింది. పెళ్లిళ్ల ఖర్చుల కోసం రూ. 2.50 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది. స్వైపింగ్‌ మిషన్లను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రాజ్యసభ మళ్లీ వాయిదా..

ఢిల్లీ : రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. పెద్దనోట్ల రద్దుపై విపక్షాలు ఆందోళన చేపట్టింది. ఉదయం 11గంటలకు ప్రారంభం కాగానే సభను 11.30గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభం కాగానే విపక్షాలు..అధికారపక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. 12 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ కురియన్ వెల్లడించారు. అనంతరం తిరిగి సభ ప్రారంభమైంది. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఛైర్మన్ సభను 12.30గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

పార్లమెంట్ ను కుదిపేస్తున్న పెద్ద నోట్ల రద్దు..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా పడిన లోక్ సభ తిరిగి ప్రారంభమైంది. కానీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. రాజ్యసభ ఉదయం ప్రారంభం కాగానే ఆజాద్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగిన అనంతరం డిప్యూటి ఛైర్మన్ సభను 11.30గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీనితో సభను 12.00 గంటల వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

జహీరాబాద్ లో ఎస్సీలకు కిరాయి ఇవ్వరా ?

సంగారెడ్డి : జహీరాబాద్ లో పలు సమస్యలతో బాధ పడుతున్నామని స్థానికులు తెలియచేశారు. మహాజన పాదయాత్ర బృందానికి వినతిపత్ర సమర్పించారు. 'ఉన్న స్మశాన స్థలం సరిపోవడవం లేదు. వంద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవు. ఎస్సీలకు అద్దెలకు ఇవ్వడం లేదు. మంగళిషాపులకు అద్దెలు విపరీతంగా పెంచుతున్నారు. లోన్స్ ఇవ్వడం లేదు. చెరుకుకు కనీస మద్దతు ధర కల్పించాలి. అల్లం, ఆలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'. అని వినతిపత్రంలో పేర్కొన్నారు. 

11:33 - November 18, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో మూడో రోజు కూడా సేమ్ సీన్ రిజీట్ అయింది. పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడ్డాయి. ఉభయసభలు ప్రారంభం కాగానే పెద్ద నోట్ల రద్దుపై చర్చించాలని లోక్ సభ, రాజ్యసభలలో విపక్షాలు పట్టుబట్టాయి. లోక్ సభలో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. రాజ్యసభలలో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ ఎంత చెప్పినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. దీందో స్పీకర్ లోక్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలలో కూడా పెద్ద నోట్ల రద్దు అంశంపై గందరగోళం ఏర్పడింది. దీంతో రాజ్యసభ చైర్మన్ సభను 11.30గంటలకు వాయిదా వేశారు. ఇదిలావుంటే లోక్ సభ సభ్యులందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. ఎంపీలందరూ సభలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని రాజ్యసభకు రావాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నిన్న రాజ్యసభలో ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులకు ఆజాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

రాజ్యసభ..లోక్ సభ వాయిదాలు..

ఢిల్లీ : పెద్ద నోట్లు రద్దు అంశం పార్లమెంట్ ఉభయ సభలనూ కుదిపేసింది. మూడో రోజు శుక్రవారం సభలు ప్రారంభమయ్యాయి. పెద్ద నోట్లు రద్దు అంశంపై విపక్షాలు ఇరు సభల్లోనూ ఆందోళన చేపట్టాయి. రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు లోక్ సభ అభినందనలు తెలిపింది. రాజ్యసభలో ఛైర్మన్ పోడియాన్ని విపక్షాలు చుట్టుముట్టాయి. ఇదిలా ఉంటే పార్లమెంట్ సభ్యులకు బీజేపీ విప్ జారీ చేసింది. తప్పనిసరిగా సభకు హాజరు కావాలని పేర్కొంది. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో లోక్ సభ మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా పడగా రాజ్యసభ 11.30గంటల వరకు వాయిదా పడింది. 

ఆజాద్ క్షమాపణలు చెప్పాలి - బీజేపీ..

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుపై కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. మూడో రోజు ప్రారంభమైన రాజ్యసభలో బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. దీనితో విపక్ష..అధికారపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. 

ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో పెద్దనోట్ల రద్దు అంశంపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. లోక్ సభళో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ప్రసంగిస్తున్నారు. 

11:00 - November 18, 2016
10:48 - November 18, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పది రోజులైనా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. డబ్బుల కోసం జనం పడిగాపులుగాస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం బారులు తీరారు. కిలోమీటర్ల వెంబడి క్యూలు కడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:40 - November 18, 2016

సంగారెడ్డి : తెలంగాణ గ్రామాల్లో ఏ ఒక్క రైతు సంతోషంగా లేరని, రుణమాఫీ లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన హామీలపై తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. పాదయాత్రపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
పాదయాత్ర బృందానికి ఘనస్వాగతం 
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 32వ రోజు పూర్తి చేసుకుంది. 32వ రోజు సంగారెడ్డి జిల్లాలోని...కోహిర్‌ మండలంలోకి పాదయాత్ర బృందం ప్రవేశించింది.  స్థానికులు, ప్రజాసంఘాల నేతలు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బృందానికి ఘనస్వాగతం పలికారు. బంట్వారం మండలం తోరుమామిడి, బిలాలిపూర్‌, కోహిర్‌, మాచిరెడ్డిపల్లి, పీచేరాగడిపల్లి, హుగ్గెళ్లి వరకు సాగింది. కోహిర్‌ మండలం మాయినేరిపల్లి వద్ద పాదయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.  
కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలి : తమ్మినేని  
ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ప్రజా క్షేత్రంలోకి వచ్చి ప్రజా సమస్యలను చూడాలని, సమస్యలు పరిష్కరిస్తే తాము పాదయాత్ర ఆపివేస్తామని తమ్మినేని అన్నారు.  ప్రజా సమస్యలను పరిష్కరించకుండా.. పాదయాత్రపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు.  గ్రామంలో  రైతులు సంతోషంగా లేరని, ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడా కనిపించడం లేదని తమ్మినేని అన్నారు. తెలంగాణ వామపక్ష, సామాజిక శక్తులన్నింటిని ఏకం చేసి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా పోరాటం చేస్తామని తమ్మినేని తెలిపారు.
కరవు, వలసల నివారణకు చర్యలు తీసుకోవాలి : రాజు 
వికారాబాద్‌ జిల్లాలోని కరవు నివారణకు, వలసల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాదయాత్ర బృంద సభ్యులు రాజు డిమాండ్‌ చేశారు. వికారాబాద్‌ జిల్లాలో  జీసీసీని ఏర్పాటు చేసి... గిరిజనులు పండిస్తున్న ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన కోరారు. పల్లెపల్లెను పలకరిస్తూ... ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న పాదయాత్ర బృందానికి అడుగడుగునా ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు.  

 

10:34 - November 18, 2016

ఢిల్లీ : కృష్ణా నది జలాల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ట్రైబ్యునల్ తీర్పుపై ఈ సందర్భంగా  సుప్రీంకోర్టు ఆరా తీసింది. ఏపీ, తెలంగాణ మధ్యే పంపకాలు జరపాలన్న ట్రైబ్యునల్ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ అంశంలో తదుపరి విచారణకు ఏపీ, తెలంగాణ హాజరు కావాలని ట్రైబ్యునల్ చెప్పినట్లు కర్ణాటక పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 18 కి వాయిదా వేసింది. 
ట్రైబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టు ఆరా 
కృష్ణా నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గతంలో ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఈ సందర్భంగా  అత్యున్నత న్యాయస్థానం ఆరా తీసింది. ఏపీ, తెలంగాణ మధ్యే పంపకాలు జరపాలన్న ట్రైబ్యునల్ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకు తెలియజేసింది. అయితే... ఈ అంశంలో తదుపరి విచారణకు ఏపీ, తెలంగాణ హాజరు కావాలని ట్రైబ్యునల్ చెప్పినట్లు కర్ణాటక ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది.  
తెలంగాణ తరపు న్యాయవాది వాదనలు 
ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 89 ప్రకారం.. కృష్ణా నీటి పంపకాలు రెండు రాష్ట్రాలకే పరిమితమవ్వాలని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ అనడం సరికాదని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ తెలంగాణల మధ్య నీటి పంపకాలు చేపట్టాలని  ట్రైబ్యునల్ తీర్పు వెలువరించిందని కర్నాటక, కేంద్రం  సుప్రీంకు తెలిపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు కేటాయించిన నీటిని పంచుకోవడానికి అభ్యంతరమేంటని ధర్మాసనం తెలంగాణను ప్రశ్నించింది. 25 శాతం జనాభా ఉన్న తెలంగాణకు కేవలం12 శాతం నీటిని మాత్రమే కేటాయించారని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 
ఆ వివాదాన్ని కేంద్రం టైబ్యునల్‌కి నివేదించాలి : వైద్యనాథన్ 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య జలవివాదం ఉత్పన్నమైతే.. ఆ వివాదాన్ని కేంద్రం టైబ్యునల్‌కి నివేదించాలని తెలంగాణ తరపు న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలో తమ వాదనలు పూర్తి స్థాయిలో వినిపించలేదని ఏపీ తరపు న్యాయవాది ఏకే గంగూలీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ, తెలంగాణ విజ్ఞుప్తులను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 18 కి వాయిదా వేసింది.

 

ర్యాగింగ్ కు విద్యార్థిని బలి..

కర్నూలు : జిల్లాలో ర్యాగింగ్ పడగవిప్పింది. నంద్యాల ఆర్ జీఎం కాలేజీలో ఉష చదువుతోంది. సీనియర్ల ర్యాగింగ్ భరించలేక ఉష ఆత్మహత్య చేసుకుంది.

ఉషది కడప జిల్లా బద్వేల్ గా గుర్తించారు. విద్యార్థిని ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణం కాదని కాలేజీ యాజమాన్యం పేర్కొంటోంది. 

మూడో రోజు..పార్లమెంట్ సమావేశాలు..

ఢిల్లీ : మూడో రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నేడూ పార్లమెంట్ ను నోట్ల రద్దు అంశం కుదిపేయనుంది. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. మరో వైపు విపక్షాలను ఎదుర్కొనేందుకు అధికారపక్షం కసరత్తులు చేస్తోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. నోట్ల రద్దుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్రం పేర్కొంది. ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 

యూపీ నేతలతో భేటీ కానున్న రాహుల్..

ఢిల్లీ : కాసేపట్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యూపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

సీనియర్ మంత్రులతో భేటీ కానున్న వెంకయ్య..

ఢిల్లీ : సీనియర్ మంత్రులతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

సీతాఫల్ మండిలో నోట్ల మార్పిడి పేరిట మోసం

హైదరాబాద్ : సీతాఫల్ మండిలో నోట్ మార్పిడి పేరిట మోసం జరిగింది.  నోట్లు మారుస్తామని దుండగులు ఓ వ్యక్తిపై దాడి చేసి రూ.3 లక్షలు దోచుకెళ్లారు. ముగ్గురిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 2.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  

 

నేడు పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ఎదుట తృణమూల్ కాంగ్రెస్ ధర్నా

ఢిల్లీ : ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ఎదుట తృణమూల్ కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. నోట్ల రద్దుపై కేంద్రం వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. 

 

08:47 - November 18, 2016

యంగ్ హీరో శర్వానంద్ పెద్ద సినిమాలతో పోటీ పడి ఈ సంక్రాంతి సైలెంట్ గా సక్సెస్ కొట్టాడు. మరోసారి సేమ్ సీన్ రిపీట్ చేయడానికి ఈ హీరో రెడీ అవుతున్నాడు. అయితే ఈసారి శర్వానంద్ కి బిగ్ హ్యండ్ కూడా సపోర్ట్ గా ఉంది. సంక్రాంతి సమరంలో దిగుతున్న ఈ యంగ్ హీరోకి అండగా ఉందేవరో మీరు ఓ లుక్కెయండి. 
శర్వానంద్ కు వరుస సక్సెస్ లు
యంగ్ హీరో శర్వానంద్ వరుస సక్సెస్ లతో మంచి స్వీంగ్ లో ఉన్నాడు. ఈ కుర్రహీరో సంక్రాంతికి ఎక్స్ ప్రెస్ రాజా గా వచ్చి మరో హిట్టు కొట్టి హ్యట్రిక్ సక్సెస్ కంప్లీట్ చేశాడు. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో జోష్ లో శర్వానంద్ వచ్చే సంక్రాంతికి కూడా పెద్ద హీరోల సినిమాలకు పోటీగా తన సినిమాను బరీలో దించడానికి రెడీ అయ్యాడు. 
ప్రస్తుతం శర్వానంద్ శతమానం భవతి 
ప్రస్తుతం శర్వానంద్ శతమానం భవతి అనే మూవీ చేస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ స్టేజ్ కి చేరుకున్నఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే సీజన్ లో చిరంజీవి,బాలకృష్ణ,వెంకటేష్ లాంటి బడా స్టార్స్ బెర్త్ లు కన్ ఫర్మ్ చేసుకున్నారు. అయిన కూడా శర్వానంద్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే శతమానం భవతి సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. అందుకే శర్వా కూడా ధీమాగా ఉన్నట్లు సమాచారం. 
క్లైమాక్స్ షూటింగ్ 
శతమానం భవతి సినిమాకి సంబంధించి క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ నెల 18 తేదీ వరకూ టాకీ పార్టు పూర్తవుతుందట.  ఆ తరువాత పాటల చిత్రీకరణను ఈ నెల 28వ తేదీలోగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసి, సంక్రాంతి కానుకగా  ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.

 

దేశ వ్యాప్తంగా పదోరోజు కరెన్సీ కొరత కష్టాలు

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరెన్సీ కొరత కష్టాలు పదోరోజుకు చేరాయి. బ్యాంకులు, ఏటీఎంల ఎదుట క్యూలైన్లు కొనసాగుతున్నాయి. ఏటీఎం, బ్యాంకుల్లో డబ్బుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా ఏటీఎంలు పని చేస్తున్నాయి. జనానికి చిల్లర కష్టాలు తప్పడం లేదు. రూ.2000 నోట్లకు చిల్లర దొరక్కా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసరాల కొనుగోలుకూ తిప్పలు తప్పలేదు.

నేడు నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ పర్యటన

నెల్లూరు : నారా లోకేష్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జనచైతన్య యాత్రలో లోకేష్ పాల్గొననున్నారు. 

నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి పోచారం పర్యటన

సంగారెడ్డి : మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి  నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కందిలో వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలను మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం కలెక్టరేట్ లో రబీ సీజన్ పై అధికారులతో పోచారం సమీక్ష చేయనున్నారు.

 

తెలంగాణ ఇంఛార్జ్ సీఎస్ గా ప్రదీప్ సింగ్

హైదరాబాద్ : నేటి నుంచి 5రోజులు సెలవుపై తెలంగాణ సీఎప్ రాజీవ్ శర్మ వెళ్లనున్నారు. ఇంఛార్జ్ సీఎస్ గా ప్రదీప్ సింగ్ కు బాధ్యతలు అప్పగించారు. నేటి నుంచి ఐదు రోజులపాటు ఇంఛార్జ్ సీఎస్ గా ప్రదీప్ సింగ్ వ్యవహరించనున్నారు. 

08:18 - November 18, 2016

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి డా.రాకేష్,  సీఐటీయూ నేత ఉమా మహేష్ పాల్గొని, మాట్లాడారు. సామాన్య ప్రజలను ఆదుకునే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలన్నారు.మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

08:10 - November 18, 2016

వయోజనులు, వికలాంగులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిలబడలేక ఇబ్బందులు పడుతున్నారని... వారికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాల సీనియర్స్ సిటిజన్స్ అసోసియేషన్ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ జివి.రావు కోరారు. ప్రపంచంలో ఎక్కడా చట్టాలు అమలు కావడం లేదన్నారు. ఇవాళ్టి జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఎవరికైనా వృద్ధాప్యం అనివార్యం. 60 ఏళ్లు దాటినవారిని సీనియర్ సిటిజన్స్ గా గౌరవిస్తుంటాం. 58 ఏళ్లకే రిటైర్మెంట్ అమలవుతోంది. ఆరు పదుల వయస్సులో శారీరక శ్రమ చేసే శక్తి తగ్గుతుందనడంలో సందేహం లేదు. అప్పటికే బిపి, షుగర్ , కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. మన దేశం జనాభాలో సీనియర్ సిటిజన్స్ సంఖ్య పెరుగుతోంది. మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులు వృద్ధుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీనియర్ సిటిజన్స్ సంక్షేమం మీద ప్రభుత్వాలు మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం వుంది. సీనియర్ సిటిజన్స్ ప్రస్తుతం ఫేస్ చేస్తున్న సవాళ్లేమిటి? వీరి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:53 - November 18, 2016
07:52 - November 18, 2016
07:51 - November 18, 2016

గుంటూరు : జిల్లాలో మంగళగిరికి మంజూరు చేసిన ఎయిమ్స్‌ నిర్మాణాన్ని  2018 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీలుంటే వచ్చే ఏడాది నుంచి అద్దె భవనాల్లో తరగతులు ప్రారంభించే అంశాన్ని పరిశీలించేందుకు అంగీకరించింది.  ప్రధాన మంత్రి స్వాస్త్య సురక్షా యోజన పథకం కింది విజయవాడ, అనంతపురం ప్రభుత్వాస్పత్రులను  సూపర్‌ స్పెషాలిటీస్‌గా అభివృద్ధి చేసేందుకు నిథులు మంజూరుకు కేంద్రం ఒప్పుకుంది. 
ఎయిమ్స్‌ పై ఉన్నతస్థాయి సమీక్షా 
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేయతలపెట్టిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ... ఎయిమ్స్‌ పై ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాతోపాటు ఆశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
2020 కంటే ముందే మంగళగిరి ఎయిమ్స్‌ 
మంగళగిరి ఎయిమ్స్‌ నిర్మాణానికి  శంకుస్థాపన చేసి, నెలలు గడుస్తున్నా... .ఇంతవరకు నిర్మాణాలు చేపట్టకపోవడంపై చర్చించారు. టెండర్లు పిలిచేసేందుకు చేస్తున్న సన్నాహాలపై సమీక్షించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. 2020 నాటికి మంగళగిరి ఎయిమ్స్‌ను పూర్తి చేయాలని తొలుత ప్రతిపాదించినా... 2018 నాటికి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వీలుంటే వచ్చే ఏడాది నుంచి బోధనా తరగతులు ప్రారంభించే అంశాన్ని పరిశీలించనున్నారు. 
సూపర్‌స్పెషాలిటీస్‌ ఆస్పత్రులకు రూ. 150 కోట్లు 
మరోవైపు ప్రధాన మంత్రి స్వాస్త్య సురక్ష  యోజన పథకం కింది విజయవాడ, అనంతపురం ప్రభుత్వాస్పత్రులను సూపర్‌ స్పెషాలిటీస్‌గా మార్చాలని నిర్ణయించారు. ఇందుకు 150 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ నిధులను విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 15 డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్ర సానుకూలంగా స్పందించింది. 
 

ఢిల్లీ ముంద్వాలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీ : ముంద్వాలోని మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణాల నుంచి మంటలు ఎగిసిపడుతన్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 33 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. 

 

07:45 - November 18, 2016

విజయవాడ : ఏపీలో మందుబాబులకు ఇక పండగే పండగ... మద్యం పుచ్చుకోవాలంటే ఇకపై బార్లు, వైన్‌ షాపులకే వెళ్లాల్సిన పనిలేదు. ఫుడ్‌ ఫ్లాజాలు, బీచ్‌ రోడ్లు. పర్యాటక ప్రాంతాలు... ఇలా ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్మే విధంగా  బార్‌ లైసెన్స్‌ల  జారీ విధానాన్ని సవరించింది. ఓపెన్‌ బార్లకు తలుపులు బార్లా తెరిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహారం అమ్మే ప్రతి చోటా మద్యం కూడా అమ్మే విధంగా బార్ల  లైసెన్సింగ్‌  విధానాన్ని సవరించింది. ఇక మందుబాబులకు కిక్కే... 
ఏపీలో ఓపెన్‌ బార్లు.. 
ఏపీలో ఇక మద్యం ఏరై పారనుంది. ఆంక్షలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ తాగే అవకాశం కల్పించింది. ఫుడ్‌ ఫ్లాజాలు, ఫుడ్‌ కోర్టుల్లో పూటుగా తాగొచ్చు. బీచ్‌ రోడ్లు, రిసార్ట్‌లు, ఇతర పర్యాటక ప్రాంతాల్లో పీకల నిండా  తాగే అవకాశం కల్పించింది. ఇందుకు ఏ నింబధనలు అడ్డురావు. అడిగేవారూ ఉండరు. ప్రభుత్వమే ఈ విధానాన్ని తీసుకొచ్చింది. 
ఓపెన్‌ బార్లకు ఏపీ ప్రభుత్వం కొత్త పేరు 
ఓపెన్‌ బార్లకు ఏపీ ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది. రెడీ టు డ్రింక్‌ అన్న ముద్దు పేరుతో బీరు, వైన్‌, జిన్‌... ఇలా ఎనిమిది రకాల మద్యాన్ని ఫుడ్‌ కోర్టులు, ఫ్లాజాలు, బీచ్‌రోడ్లలో అమ్ముకునే అవకావం కల్పించింది. ఇప్పటి వరకు రిసార్టుల్లో చాటుమాటుగా మద్యం అమ్మకాలు జరుతుండగా... ఇకపై ఇక్కడ కూడా విక్రయించుకునే వీలు కల్పించింది. అయితే ప్రార్థనా మందిరాలున్న ప్రాంతాల్లో మాత్రం  ఓపెన్‌ బార్లకు అనుమతి  ఇవ్వరు. 
ఏటా జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు లైసెన్స్‌లు 
కొత్త  విధానం ప్రకారం ప్రతి ఏటా జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు  అమల్లో ఉండేలా ఓపెన్‌ బార్లకు లైసెన్స్‌లు జారీ చేస్తారు. ఫుడ్‌ కోర్టులు, ఫ్లాజాల్లో మద్యం అమ్ముకునేందుకు స్థల నిబంధనలు కూడా సడలించింది. దీనిని 200 మీటర్ల నుంచి 100 మీటర్లకు తగ్గించింది. ఇందుకు భారీ మొత్తంలో ఫీజు కూడా ఏమీ చెల్లించాల్సిన పనిలేదు. ఓ లక్షల రూపాయలు కడితే సరిపోతుందని ఉత్తర్వులు జారీ చేసింది. లైసెన్స్‌ ఇచ్చిన చోటే ఓపెన్‌ బారు పెట్టుకోవాలన్న నిబంధన కూడా  ఏదీ లేదు. ఒక పాంత్రంలో లైసెన్స్‌ తీసుకుని మరో ప్రాంతంలో కూడా బార్‌ పెట్టుకునే వీలు కల్పించింది. 
నిబంధనలు సడలించి బార్లు, వైన్‌ షాపుల ఏర్పాటు 
ఇంతేకాదు... జాతీయ రహదారుల పక్కన బార్లు, వైన్‌ షాపుల ఏర్పాటు నిబంధనలను కూడా సడలించింది. ఈ రోడ్లకు వంద మీటర్ల పరిధిలో మద్యం అమ్ముకునేందుకు వీలు కల్పించింది. ఇప్పటికే బీచ్‌లలో లప్‌ ఫెస్టివల్‌ అంటూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదన.. తీవ్ర  వివాదాన్ని దారితీసి, దుమారం చెలరేగిన నేపథ్యంలో రెడీ టు డ్రింక్‌... ఓపెన్‌ బార్లు ఏ రగడకు కారమణమవుతాయో చూడాలి. 

07:40 - November 18, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దై తొమ్మిది రోజులైంది.. ఇప్పటికీ సామాన్యుడికి మనీ కష్టాలు తప్పడం లేదు. కనీస ఖర్చులకు అవసరమైన నగదు కోసం.. గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. అన్ని ఏటీఎం కేంద్రాల వద్ద క్యూ భారీగా పెరిగిపోతోంది. నోట్ల పాట్లు ఏ రీతిలో ఉన్నాయో గంట గంటకు పెరుగుతున్న క్యూ లైన్లే చెబుతున్నాయి. 
తీరని నగదు మార్పిడి కష్టాలు 
పది రోజులు కావస్తున్నా .. సామాన్యులకు నగదు మార్పిడి కష్టాలు తీరనేలేదు. నగదు కోసం.. ఏటీఎంల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. ఏటీఎంలు నోట్లు పెట్టిన కాసేపటికే ఖాళీ అవుతున్నాయి. అటు బ్యాంకుల వద్దా తరగని రద్దీ సామాన్యుడిని కష్టాల పాల్జేస్తోంది. నోట్ల రద్దు నిర్ణయం ఫలాల మాటేమో కానీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల అవసరాలు తీర్చలేని ఏటీఎంలు 
చాలా జిల్లాల్లో ఏటీఎంల సంఖ్య ప్రజల అవసరాలను ఏమాత్రం తీర్చలేక పోతోంది. ఉన్నవే తక్కువ ఏటీఎంలు..వాటి నుంచి రెండు వేల నోట్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో చిల్లర కోసం  ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌ లాంటి నగరాల్లోనూ కొన్ని చోట్ల ఏటీఎంలు పనిచేయక పోవడం వినియోగదారుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. పనిచేస్తున్న ఏటీఎంలలో నగదు పెట్టిన కొద్దిసేపటికే ఖాళీ అవుతున్నాయి.
పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాలు 
మరోవైపు.. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ పలు చోట్ల సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర ముఖ్య కార్యక్రమాలు జరుపుకునేందుకు మోడీ నిర్ణయం శరాఘాతంగా మారిందని నేతలు విమర్శించారు. కేరళ మాదిరిగా 500, వెయ్యి నోట్లను డిసెంబర్ 31 వరకు చెలామణిలో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు ప్రభావం తొమ్మిది రోజులైనా తీరక పోవడంతో.. సామాన్యుల్లో అసహనం పెరుగుతోంది. 

 

07:33 - November 18, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం... సామాన్యుడి బతుకుని చిదిమేస్తోంది. చిల్లర వ్యాపారాలు మూతబడే పరిస్థితి తలెత్తుతోంది. చిరుజీవుల ఉపాధికీ చేటు తెస్తోంది. వ్యవసాయ రంగం కుదేలవుతోంది. రబీ సేద్యం అసాధ్యంగా మారింది. ఏ మనిషిని కదిలించినా చిల్లర కష్టాలే.. ఏ రంగాన్ని చూసినా నోట్ల పాట్లే. 
పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక గందరగోళం..
పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక గందరగోళం..సామాన్యుడిపైనే అధిక ప్రభావం.. అవును..! పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం.. నల్లధనాన్ని వెలికి తీయడం మాటేమో గానీ.. సామాన్యుడి నడ్డిని విరుస్తోందన్నది వాస్తవం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమైన ప్రభుత్వం.. తన నిర్ణయం ద్వారా చిరుజీవుల ఉపాధికి గండి కొట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
నిత్యావసర వస్తువుల విక్రయాలపై పెద్దనోట్ల రద్దు ప్రభావం 
ఒక్కసారిగా పెద్దనోట్లు చెల్లకుండా పోవడంతో.. ప్రజల వద్ద కరెన్సీ అందుబాటులో లేకుండా పోయింది. బ్యాంకులు.. ఏటీఎంల వద్ద క్యూలైన్లలో నిల్చుని ఓ నాలుగు వేలు సమకూర్చుకున్న ప్రజలు.. మరీ అవసరమైతే తప్ప వాటిని ఖర్చు చేయడం లేదు. ఇక తప్పదు అనుకున్న వస్తువులు, పదార్థాలనే కొంటున్నారు. దీంతో పెద్దనోట్ల రద్దు ప్రభావం నేరుగా నిత్యావసర వస్తువుల విక్రయాలపైనే పడింది.  
వ్యాపార సంస్థల్లో తగ్గిన విక్రయాలు 
చిల్లర నోట్లు లేని కారణంగా లావాదేవీలు గణనీయంగా తగ్గి.. వ్యాపార సంస్థల్లో విక్రయాలు బాగా తగ్గాయి. ఎక్కడి స్టాకులు అక్కడే మూలుగుతున్నాయి. సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందో అర్థం కాక.. వ్యాపారులు కలవరపడుతున్నారు. డిసెంబర్‌ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడమో.. ఔట్‌లెట్స్‌ని బంద్‌ చేయడమో తప్పదని అంటున్నారు. ఈ రెండింటిలో ఏది జరిగినా చిరుద్యోగులు రోడ్డున పడే ప్రమాదం పొంచివుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. 
చిరు వ్యాపారులపై పెద్ద ప్రభావం
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఫుట్‌పాత్‌ వ్యాపారులు, బ్యాంకు మెట్లు ఎక్కని చిరు వ్యాపారులపై పెద్ద ప్రభావమే చూపుతోంది. రోజూ ఎంతోకొంత వ్యాపారమైతేనే తప్ప పొట్టగడవని ఈ వర్గం వ్యాపారుల్లో అత్యధికులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి పెట్టుబడి మొత్తాన్ని అప్పుగా తెచ్చుకుంటుంటారు. నోట్ల రద్దుతో చిరువ్యాపారులకు డబ్బు అందుబాటులోకి రాని పరిస్థితి తలెత్తింది. దీంతో వారు ఉపాధిని కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. 
రైతులు ఆందోళన 
మరో యాభై రోజుల్లో సమస్య ఓ కొలిక్కి వస్తుందని ప్రధాని ప్రకటన.. రైతుల గుండెల్లో బండరాళ్లను వేసింది. యాభై రోజులంటే ఓ పంట కాలం. అన్ని రోజులు విత్తనాలకు, ఎరువులకు, కూలీలకు డబ్బు, పశువులకు దాణా ఎలా అన్న ప్రశ్న రైతులను వేధిస్తోంది. బ్యాంకుల్లో రుణాలు రీషెడ్యూలు కాని వారు... బకాయిలు పేరుకు పోయిన వారు.. వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులనైనా ఆశ్రయించేవారు. ఇప్పుడు నోట్ల రద్దు ప్రభావంతో రైతులకు ఆ ఆశకూడా లేకుండా పోయింది. దీంతో రబీలో సేద్యానికి గడ్డు పరిస్థితేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వేధిస్తోన్న నోట్ల సమస్య
ఏ రంగాన్ని తరచి చూసినా.. నోట్ల సమస్య వేధిస్తోంది. నల్లధనాన్ని బయటకు తీయడం.. అవినీతిని అంతం చేయడం మాటేమో కానీ.. సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇలాంటి భారీ నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక మోదీ ఆంతర్యం ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి, మోదీ సర్కారు సామాన్యుల కనీస కోర్కెలను మన్నించి ప్రత్యామ్నాయం చూపుతుందో.. లేదో చూడాలి. 

నేడు లోక్ సభలో చర్చకు రానున్న పలు బిల్లులు

ఢిల్లీ : నేడు లోక్ సభలో ఎంపీ వినోద్ ప్రైవేట్ మెంబర్ బిల్లు, తెలంగాణ ఆర్థికసాయంపై ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చకు రానున్నాయి. 

07:01 - November 18, 2016

గుంటూరు : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఏపీ రాజధాని ప్రాంతంలోని చిన్న వ్యాపారులు లబోదిబోమంటున్నారు. సచివాలయం ప్రారంభం కావడం, ఉద్యోగులు తరలిరావడంతో వ్యాపారాలు జోరుగా సాగుతాయని లక్షల్లో పెట్టుబడి పెట్టి ప్రారంభించిన షాపులు కాస్తా పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అంటూ వెలవెలబోతున్నాయి. ఐదు వందల, వెయ్యి రూపాయల నోట్లు రద్దవడంతో పాటు కొత్తగా వచ్చిన రెండు వేల రూపాయల నోటుకు సరిపడ చిల్లర ఇవ్వలేక వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  
పెద్ద నోట్ల రద్దుతో మారిన పరిస్ధితి  
పదిరోజుల క్రితం ఏపీ రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా సందడి వాతావరణమే కనిపించేది. ముఖ్యంగా  తాత్కాలిక సచివాలయం నిర్మించిన వెలగపూడి, మందడం గ్రామాల్లో అయితే సాయంత్రం వేళల్లో అన్ని వ్యాపార సంస్థలు రద్దీగా ఉండేవి. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు కారణంగా పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. ఓ వైపు లక్షల్లో డబ్బు ఉన్నా కొనలేని పరిస్ధితులను రైతులు ఎదుర్కోటుంటే, మరో వైపు పెద్ద నోట్లకు చిల్లర ఇవ్వలేక వచ్చిన వారు వెనక్కి వెళ్లిపోతుంటే చూడలేక వ్యాపారులు బాధపడుతున్నారు.   
అన్ని వ్యాపారాలపై ప్రభావం 
ఏపీ రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరు ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలు బాగా జరుగుతాయి. సచివాలయం ప్రారంభమవడంతో మందడం, వెలగపూడిలో అనేకమంది భారీ పెట్టుబడితో హోటల్స్, నిర్మాణ రంగానికి చెందిన పలు వ్యాపారాలను ప్రారంభించారు. తాజాగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో అన్ని వ్యాపారాలపై దీని ప్రభావం  పడింది. ఇప్పుడు 20 రూపాయల వస్తువు కొనాలన్నా 500 రూపాయల నోటు ను తీస్తుండటంతో వ్యాపారులు చిల్లర ఇవ్వలేమని చేతులు ఎత్తేస్తున్నారు. కూరగాయలు, కిరాణా, హోటల్స్ ఇలా అన్ని చోట్ల ఇదే  పరిస్ధితి నెలకొంది. సచివాలయంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు సైతం చిల్లర కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరూ 50 రూపాయల వస్తువుకు 500, 1000 రూపాయల నోటు ఇవ్వడంతో చిల్లర ఇవ్వలేక వ్యాపారాలు తగ్గుతున్నాయని వ్యాపారస్తులు అంటున్నారు.
విజయవాడలో పెద్ద నోట్ల కష్టాలు 
మరోవైపు విజయవాడలో కూడా చిల్లర దొరకక  చిన్న వ్యాపారుల నుంచి  కార్పొరేట్ స్ధాయి ల వరకు ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన వారం రోజులుగా అన్ని రకాల వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయాయి. రోజుకు 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు వ్యాపారాలు జరిగే బీసెంట్ రోడ్ నిర్మానుష్యంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం రద్దు చేసిన 500, 1000 నోట్లను తీసుకోలేని పరిస్ధితి , మరోవైపు ప్రభుత్వం కొత్తగా జారీచేసిన 2000 రూపాయల నోటుకు చిల్లర దొరకని పరిస్ధితి. దీంతో వ్యాపారులు తమ బిజినెస్ సరిగా జరగక నానా ఇబ్బందులు పడుతున్నారు.   
రైతులు ఆవేదన 
మరో వైపు రాజధాని కారణంగా ప్రతి రైతు కోటీశ్వరుడిగా మారిపోయారు. ఎవరి వద్ద చూసినా పెద్ద నోట్లే తప్ప చిన్న నోట్లు కనబడటం లేదు. బ్యాంకుల్లోని వెళ్లినా రోజుకు 4 వేలకు మించి తీసుకోలేని పరిస్ధితుల్లో ప్రతి ఒక్కరు పెద్ద నోట్లతో షాపులన్నీ తిరగాల్సి వస్తోంది. ఇంటినిండా డబ్బున్న కడుపునిండా అన్నం తినలేని పరిస్ధితి తమకు ఏర్పడిందని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

 

06:54 - November 18, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పాత బకాయిలను వీలైనంతగా వసూలు చేయాలని తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌ శర్మ అధికారులను ఆదేశించారు. వాణిజ్య సంస్థలు, వ్యక్తిగత చెల్లింపులు ఏవైనా సరే.. పాత నోట్ల ద్వారానైనా చెల్లించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని వారి ఆస్తులు జప్తు చేసైనా సరే బకాయిలు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. 
జీహెచ్‌ఎంసీకి నోట్ల వర్షం 
పెద్ద నోట్ల రద్దు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. రద్దయిన పెద్ద నోట్లతోనూ పన్ను బకాయిలు చెల్లించవచ్చంటూ ఇచ్చిన పిలుపు.. జీహెచ్‌ఎంసీకి నోట్ల వర్షం కురిపించింది. వాటర్‌వర్క్స్‌, విద్యుత్‌ విభాగాలకు మొండి బకాయిలు కూడా పెద్ద మొత్తంలో వసూలయ్యాయి. దీంతో ఇప్పుడు అన్ని పన్ను విభాగాల్లోనూ ఇదే తరహా డ్రైవ్‌ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జీహెచ్‌ఎంసీ తరహాలోనే స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ.. తాజాగా వాణిజ్యపన్నుల శాఖను ఆదేశించారు. గురువారం ఆ శాఖ అధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. 
వాణిజ్య పన్నుల శాఖ డిఫాల్టర్ల వివరాలపై బహిరంగ ప్రచారం 
వాణిజ్య పన్నుల శాఖకు సుమారు వెయ్యి 194 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉందని.. ఆశాఖ అధికారులు సీఎస్‌కు వివరించారు. ఇందులో నవంబర్ 16 వరకు 182 కోట్ల రూపాయలు వసూలైనట్లు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని రాబట్టేందుకు స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. పన్ను బకాయిల వసూళ్లకు జీహెచ్‌ఎంసీ తరహాలోనే పాత నోట్లను అంగీకరించాలని సీఎస్‌ వాణిజ్యపన్నుల శాఖ అధికారులకు సూచించారు. బకాయిల వసూళ్ల క్రమంలో అవసరమైతే ఆస్తుల జప్తునూ చేపట్టాలన్నారు. ఆస్తుల వేలంలో టిఎస్‌ఐఐసి, హెచ్‌ఎండీఏ, హౌసింగ్‌ బోర్డ్స్‌ బిడ్లు దాఖలు చేసేలా చూడాలని సీఎస్‌ అదేశించారు. వాణిజ్య పన్నుల శాఖ డిఫాల్టర్ల వివరాలపై బహిరంగ ప్రచారం చేయాలన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో.. వాణిజ్య పన్నుల శాఖ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎస్‌ రాజీవ్‌శర్మ సూచించారు. 

 

06:47 - November 18, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ ఇవాళ  ఢిల్లీ వెళుతున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉండాలన్న ప్రధాని సూచన మేరకు సీఎం రేపు ఢిల్లీ వెళుతున్నారు. రేపు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయి.. రాష్ట్రంపై పెద్దనోట్ల రద్దు ప్రభావాన్ని సీఎం వివరించనున్నారు. సామాన్యులు, అసంఘటిత రంగాలకు చెందిన వ్యాపారుల విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని సీఎం కోరనున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరించనున్న కేసీఆర్  
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధాని మోడీకి వివరించనున్నారు. శుక్రవారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని.. ప్రధాని మోడీ కేసీఆర్‌కు సూచించారు. పెద్ద నోట్ల రద్దు తాజా పరిస్థితులను లిఖిత పూర్వకంగా తెలపాలన్నారు. దీంతో సీఎం కేసీఆర్‌ శుక్రవారం హస్తినకు పయనమవుతున్నారు. ఎల్లుండి ప్రధాని మోడీతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. 
పెద్దనోట్ల రద్దు పర్యవసానాలపై కేసీఆర్ సమావేశం  
మరోవైపు పెద్దనోట్ల రద్దు పర్యవసానాలపై.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాబడిని పెంచుకునే అవకాశాలపై చర్చించారు. ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి నోట్ల రద్దు నిర్ణయం దోహదపడితే ప్రధానికి మద్దతిస్తామని, సంస్కరణలు కొనసాగి తీరాలని ఈ సందర్భంగా అధికారులతో సీఎం అన్నారు. నల్లధనం నిర్మూలనకు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులు, చిన్న వ్యాపారులు,  అసంఘటిత వ్యాపారులు నష్టపోకుండా చూడాలని సూచించారు.  
రాష్ట్రాల ఆదాయంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం  
ఆర్థిక వ్యవస్థలోని లొసుగులను సవరించడానికి పెద్ద నోట్ల రద్దు చేస్తే.. దాని ప్రభావం రాష్ట్రాల ఆదాయంపై పడిందనే వాస్తవం గ్రహించాలని సీఎం అధికారులతో అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కేంద్రానికి చెల్లించాల్సిన అప్పులను వాయిదా వేసేలా అభ్యర్థిస్తామని సీఎం తెలిపారు. రెండున్నర లక్షల ఆదాయం లేదా నగదు మనీని బ్లాక్‌మనీగా కాకుండా లెక్కలోనికి రాని రూపాయలుగా పరిగణించాలని, చిల్లర వ్యాపారం, అసంఘటిత రంగాలకు మినహాయింపు ఇవ్వాలని కోరనున్నట్లు సీఎం తెలిపారు. 

నేడు మొబైల్ కంపెనీ ప్రతినిధులు, బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం

విజయవాడ : నేడు మొబైల్ కంపెనీ ప్రతినిధులు, బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. 

నేడు భదాద్రి రామయ్యకు దర్బారు ఉత్సవం ప్రారంభం

భద్రాద్రి : నేడు పునర్వమ నక్షత్రం సందర్భంగా భదాద్రి రామయ్యకు దర్బారు ఉత్సవం ప్రారంభం కానుంది. 

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోడీతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక పరిమితులపై చర్చించనున్నారు. 

 

తెలంగాణలో నేటి నుంచి పరమపద వాహనాలు ప్రారంభం

 హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి పరమపద వాహనాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతి చెందిన పేదల మృతదేహాలను స్వగ్రామానికి తరలించేందుకు ప్రభుత్వం వాహనాలను ఏర్పాటు చేసింది.

Don't Miss