Activities calendar

19 November 2016

21:44 - November 19, 2016

తమిళనాడు : ముఖ్యమంత్రి జయలలితను ఐసియు వార్డు నుంచి జనరల్‌ వార్డుకు షిఫ్ట్‌ చేశారు. ఈ విషయాన్ని అన్నాడిఎంకే వర్గాలు ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. జయలలిత డీ హైడ్రేషన్‌, జ్వరంతో సెప్టెంబర్‌ 22న అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఐసియూలో చికిత్స పొందుతున్న జయలలిత సిసియూ వార్డులోకి షిఫ్ట్‌ కావడం ఇదే తొలిసారి. ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో గ్రూప్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వెళ్లవచ్చని ఆయన తెలిపారు. 

21:40 - November 19, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో దేశవ్యాప్తంగా సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. ఎక్కడ చూసినా జనం ఏటీఎంలు, బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. చిరు వ్యాపారులు, వినియోగదారులు గంటలకొద్దీ క్యూ లైన్లలో నిలబడ్డా... ఒట్టి చేతులతో తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుల నోట్ల కష్టాలకు అంతులేకుండా పోయింది. తెల్లవారుజాము నుంచి డబ్బుల కోసం నిలబడి వృద్ధులు, మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఏటీఎంలు, బ్యాంకుల ముందు గంటల తరబడి పడిగాపులు
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా.. ప్రజలకు నగదు కష్టాలు తీరడం లేదు. ఎక్కడ చూసినా జనం ఏటీఎంలు, బ్యాంకుల ముందు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జనం చిల్లర డబ్బుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మహిళలు, వృద్ధుల వెతలైతే వర్ణనాతీతం.

తిరుపతిలో నగదు మార్పిడి కోసం వృద్ధులు తీవ్ర ఇబ్బందులు
తిరుపతిలో నగదు మార్పిడి కోసం వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెల్లవారుజాము నుంచే పనులన్నీ మానుకుని గంటల బ్యాంకుల వద్ద లైన్లలో నిరీక్షించారు. కనీస ఖర్చులకు కూడా డబ్బుల్లేవని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తాము హాస్పిటల్‌కు వెళదామన్న.. నగదు దొరకడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలో టాక్సీ డ్రైవర్లు నానా కష్టాలు
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో నల్గొండ జిల్లాలో టాక్సీ డ్రైవర్లు నానా కష్టాలు పడుతున్నారు. కార్తీకమాసం, పెళ్ళిళ్ల సీజన్‌ కావడంతో బిజీగా ఉండాల్సిన ట్యాక్సీ యజమానులు గిరాకీ లేక అల్లాడుతున్నారు. ముందే నిర్ణయించుకున్న లాంగ్ టూర్లను కూడా చాలామంది రద్దు చేసుకున్నారని, ట్యాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన 2 వేల నోట్లకు చిల్లర దొరక్క.. ఆర్థిక వ్యవహారాలను వాయిదా వేసుకోవాల్సి వస్తోందని టాక్సీ డ్రైవర్లు వాపోతున్నారు.

11 రోజులైనా.. తీరని చిల్లర కష్టాలు..
ఇప్పటికి 11 రోజులైనా.. చిల్లర కష్టాలు తీరడం లేదు. కొన్ని చోట్ల ఏటీఎంలు పనిచేయక జనం తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోంది. నగదు పెట్టిన కొద్ది సేపట్లోనే ఏటీఎంలు ఖాళీ అవుతుండటంతో.. నిత్యావసర వస్తువులు కూడా కొనలేని పరిస్థితి ఉందని పేదలు, మహిళలు వాపోతున్నారు. కొత్త ఐదు వందల రూపాయల నోట్లను వెంటనే మార్కెట్లోకి తేవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

విజయవాడలో బోసిపోయిన మార్కెట్లు
విజయవాడలో నిరంతరం వినియోగదారులతో కిటకిటలాడే మార్కెట్‌లు బోసిపోయి కనిపిస్తున్నాయి. కస్టమర్లు లేక పలు షాపింగ్‌ మాళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కర్ఫ్యూలు, బంద్‌లను సైతం తట్టుకున్న మార్కెట్లు.. పెద్ద నోట్ల రద్దు ధాటికి విలవిల్లాడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌లో కళకళలాడాల్సిన కిరాణం, స్టీలు, గాజుల దుకాణాలన్నీ బేజారయ్యాయి.

దినసరి కూలీలు నానా పాట్లు
పెద్ద నోట్ల రద్దుతో.. చిల్లర నోట్లు దొరక్క అటు దినసరి కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కూలీ పనులు దొరకడం లేదని.. అన్ని పనులు స్తంభించిపోయాయని ఆవేదన చెందుతున్నారు. కూలీ పని దొరికినా.. 5 వందల రూపాయల నోట్లు ఇస్తున్నారని.. అవి చెల్లడం లేదని వాపోతున్నారు.

కొనసాగుతున్న విశాఖపట్నంలో ఏటీఎంలు.. బ్యాంకుల వద్ద రద్దీ ..
విశాఖపట్నంలో ఏటీఎంలు.. బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగుతోంది. అన్ని పనులు మానుకుని చిల్లర కోసం ఏటీఎంల దగ్గర గంటల తరబడి నిరీక్షించక తప్పడం లేదని సామాన్యులు వాపోతున్నారు. కొన్ని ఏటీఎం ల దగ్గర రెండు వేల రూపాయల నోటే వస్తుందని.. దానిని మార్చడానికి నానా తంటాలు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు తప్పా.. సంపన్నులెవరూ క్యూలో నిల్చున్నట్లు కనబడటం లేదని పలువురు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా చిల్లర కోసం జనం పడరాని పాట్లు
మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చిల్లర కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన అవసరం ఉంది. 

21:34 - November 19, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే 500 నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులపై ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన సీఎం కేసీఆర్‌..సమస్యల పరిష్కారానికి ప్రధానికి కీలక సూచనలు చేశారు. నోట్ల రద్దు వల్ల తెలంగాణ రాష్ట్రానికి సుమారు 3,250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా ప్రధానికి కేసీఆర్‌ వివరించారు.

నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం
పెద్ద నోట్ల రద్దు సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం అయ్యారు. ప్రధాని ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్‌ సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు కొనసాగిన ఈ సమావేశంలో నోట్ల రద్దుతో పాటు పలు కీలక అంశాలపై మోదీతో సీఎం కేసీఆర్ చర్చించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులను మోదీకి సీఎం వివరించారు. కేంద్రానికి చెల్లించాల్సిన పన్నుల్లో మారటోరియం విధించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. గృహిణులు దాచుకున్న మొత్తాన్ని నల్లధనంగా పరిగణించవద్దని సూచించారు. ప్రైవేటు వైద్యశాలల్లోనూ పాతనోట్లు స్వీకరించేలా చర్యలు చేపట్టాలని మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా 500 నోట్లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా పెద్ద నోట్ల మార్పిడి కొనసాగించాలన్నారు.

పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై కేసీఆర్‌తో చర్చించిన మోదీ
500, వెయ్యినోట్లను రద్దు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రధానికి సీఎం కేసీఆర్‌ వివరించారు. వాణిజ్యం, ఎక్సైజ్‌, రవాణా శాఖ రంగాలకు తీరని నష్టం వాటిల్లిందన్నారు ఇప్పటివరకు సుమారు 3,250 కోట్ల రూపాయల నష్టం రాష్ట్రానికి వాటిల్లినట్లు సీఎం కేసీఆర్‌ ప్రధానికి తెలిపారు. ఇక నోట్ల రద్దువల్ల గ్రామీణస్థాయిలో బ్యాంకు లావాదేవీలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని..గ్రామీణ ప్రాంతాల్లో అన్‌ అకౌంటబుల్‌ మనీ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని మోదీని సీఎం కేసీఆర్‌ కోరారు. 2.50 లక్షల పరిమితి నుంచి గృహిణులకు విముక్తి కలిగించాలన్నారు. అలాగే గ్రామీణ బ్యాంకులకు కొత్తనోట్లను సరఫరా చేసి రైతులు ఇబ్బందిపడకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో వివిధ ప్రభుత్వ పథకాలు నిలిచిపోకుండా వడ్డీలేని రుణాలు ఇవ్వాలని సీఎం ప్రధానిని కోరారు.

నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది-: సీఎం కేసీఆర్
పెద్ద నోట్ల రద్దు అంశంపై సీఎం కేసీఆర్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ కావడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగించింది. 

21:22 - November 19, 2016

నల్లగొండ : జిల్లీ కేంద్రంలో టీఆర్ఎస్ నేత అరాచకం సృష్టించాడు. మంత్రి జగదీష్ బంధువునంటూ ఈదులూరి సంతోష్ అనే వ్యక్తి కొందరిని గదిలో బంధించి దాడికి పాల్పడ్డాడు. స్థానిక పరిశ్రమలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి వద్ద నుండి డబ్బులు వసూలు చేశారు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవటంతో సంతోష్ ను బాధితులు ప్రశ్నించారు. దీంతో వారిని గదిలో బంధించి దాడికి పాల్పడ్డాడు. సంతోష్ బాధితులపై దాడి చేసిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కాగా ఈదులూరి సంతోష్ టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నేతగా తెలుస్తోంది. బాధితులకు బూతులు తిడుతూ కాళ్ళతో తన్నుతూ అరాచకానికి పాల్పడినట్లుగా ప్రత్యక్షంగా తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందిస్తే ఎవ్వర్నీ బ్రతకనివ్వనని సంతోష్ బాధితులకు భయాందోళనలకు గురిచేశారు. మానసికంగా శారీరకంగా వేధించాడు. ఈ విషయం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

టీ.ఎస్ వైద్య విద్యాశాఖలో భారీగా ప్రమోషన్లు!

హైదరాబాద్ : రాష్ట్ర వైద్య విద్యాశాఖలో భారీగా పదోన్నతులు జరిగాయి. 23 విభాగాలకు చెందిన 105 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు వరించాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులపై ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

21:14 - November 19, 2016

నోట్ల రద్దు దేశాన్ని కుదిపేస్తోంది. భారతదేశం నోట్ల భారతంగా మారిపోయింది. ఈ నిర్ణయం నల్ల కుబేరులను నియంత్రించేందుకేనా? నోట్ల రద్దుతో వారి నిజంగా నిద్ర పట్టటంలేదా? ఈ నిర్ణయంతో నల్లధనం నియంత్రించబడుతుందా? నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న కష్టాలు సమాధానం ఎవరు చెబుతారు? కార్మికుల కండగండ్లు తీర్చేదెవరు? రైతన్నల కష్టాలకు ఎవరు అండగా వుంటారు? ప్రస్తుతం దేశంలో వున్న ప్రధాన సమస్య చిల్లర సమస్య. దేశవ్యాప్తంగా నోట్ల రద్దుపైనే చర్చ నడుస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దుతో పాతనోట్లను కొత్త నోట్లు మార్చుకునే క్రమంలో సామాన్యులు పలు ఇబ్బందులకు..కష్టాలకు గురవుతున్నారు. చిల్లర నోట్లు లభించక దేశవ్యాప్తంగా సామాన్యులు అల్లాడిపోతున్నారు. బ్యాంకుల వద్ద, పోస్టాఫీసుల వద్ద..ఏటీఎంల వద్ద బారులు తీరి గంటల కొద్దీ నిలబడుతున్నారు. అయినా వారి సమస్యలు తీరటంలేదు..కొన్ని ప్రాంతాలలో ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థిలు కనిపిస్తున్నాయి. నోట్ల రద్దు..ప్రజలు పడుతున్న కష్టాలు.. 11 రోజులు గడిచినా దేశంలో ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశంపై నగదు నరకం అనే పేరుతో టెన్ టీవీ బిగ్ డిబేట్ చేపట్టింది. ఈ చర్చలో శ్రీధర్ రెడ్డి (బీజేపీ అధికార ప్రతినిధి), తెలకపల్లి రవి (ప్రముఖ విశ్లేషకులు), అద్దంకి దయాకర్ (కాంగ్రెస్ టీ.పీసీసీ అధికార ప్రతినిధి), శశి కుమార్ (ప్రముఖ ఎకనమిస్ట్), కర్నె ప్రభాకర్ (టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ),సురేష్ రాయుడు ( టీఐ ఏపీ చాప్టర్ మాజీ ప్రెసిడెంట్) , ఇంకా రైతులు, వివిధ రంగాల నుండి వచ్చిన వ్యక్తులు,వ్యాపారులు, ఉద్యోగులు, ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ మెగా చర్చలో పాల్గొన్నవారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి..

అనంతపురం : కనకళ్లు మండలం బేగానపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో యువకుడికి గాయాలయ్యాయి. గాయపడిన యువకుడు సోమశేఖర్ ను చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సోమశేఖర్ పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఈ ఘటనలో మృతి చెందినవారు సురేష్, బాలాజీగా పోలీసులు గుర్తించారు. 

పిచ్చికుక్క దాడిలో 20 మంది గాయాలు..

కామారెడ్డి : బీర్కూర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. పిచ్చికుక్క దాడిలో 20 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు తీవ్రంగా గాయపడటంతో నిజామాబాద్, బాన్సువాడ ఆస్పత్రులకు తరలించారు. మిగతా వారికి బీర్కూర్ పీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.

 

డీజీపీల సదస్సుకు హాజరుకానున్న ప్రధాని..

రంగారెడ్డి : ఈ నెల 25, 26, 27 తేదీల్లో రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో డీజీపీల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీతో సహా అన్ని రాష్ర్టాల డీజీపీలు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై ఎన్‌ఎస్‌జీ అధికారులు సమీక్ష నిర్వహించారు. జాతీయ పోలీసు అకాడమీ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

20:41 - November 19, 2016

సంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో కొనసాగుతోంది. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నేలకల్లు పరిధిలోని భూములను నిమ్జ్‌ పేరుతో ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తోందని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేదిలేదని స్థానిక రైతులు అంటున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి వినతిపత్రం కూడా అందించారు. రెండు పంటలు పండే తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వబోమంటున్న రైతుల పేర్కొంటున్నారు. 

రెండువేల నకిలీ నోట్లతో వ్యాపారికి కుచ్చుటోపీ..

విజయవాడ : నగరంలో రూ.2000 నకిలీ నోట్లు హల్ చల్ చేస్తున్నాయి. నగదు మార్పిడిలో ఓ ముఠా మోసాలకు పాల్పడుతోంది. ఓ వ్యాపారికి రూ.15లక్షల విలువైన నకిలీ రూ.2వేల నోట్లతో ఓ ముఠా కుచ్చుటోపీ పెట్టిన అంశం వెలుగులోకి వచ్చింది. సదరు ముఠా వద్ద రూ.20లక్షల నగదును మార్చుకున్న వ్యాపారి వరంగల్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. పరువు పోతుందనే భయంతో సదరు బాధితుడు వాపోతున్నాడు. ఈ విషయంపై వ్యాపారి వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

రాజ్యసభ బీజేపీ సభ్యులకు అధిష్టానం విప్ జారీ..

ఢిల్లీ : శీతాకాల సమావేశాల్లో ఇరు సభల్లోనూ నోటు రద్దు అంశం హీటెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసింది. ఓటింగ్‌ కు అవకాశమిచ్చే నిబంధన కింద పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలంటూ లోక్‌ సభలో, ప్రధాని మోదీ సమక్షంలో చర్చ జరగాలంటూ రాజ్యసభలో విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో తమ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు జరగనున్న రాజ్యసభ శీతాకాల సమావేశాల్లో పాల్గొవాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ గైర్హాజరు కాకూడదని పేర్కొంటూ విప్ జారీ చేసింది. కాగా శీతాకాల సమావేశాల్లో ఇరు సభల్లోనూ నోటు రద్దు అంశం హీటెక్కిస్తోంది.

20:18 - November 19, 2016

అనంతపురం : తాడిపత్రిలో నడిరోడ్డుపై తాగుబోతులు వీరంగం చేశారు. జామపండ్ల వ్యాపారిపై ఆరుగురు మందుబాబులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆ చిరువ్యాపారికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆసుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘనస్థలికి చేరుకున్న పోలీసులు దాడి దృశ్యాలను స్థానికంగా వున్న సీసీ కెమెర పుటేజ్ లో పరిశీలించారు. దీంతో మందుబాబుల్లో ఒకరైన నూర్ బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో వున్న మిగతా ఐదుగురికోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. నిందితులపై 325,355,ఎస్సీ,ఎస్టీ కేసును పోలీసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే రోడ్డుపై జామ‌కాయలు అమ్ముకుంటున్న చిరువ్యాపారి వద్దకు గుంపుగా ఆరుగులు మందుబాబులు వచ్చి జామకాయ‌లు తిన్నారు. తిన్న జామకాయ‌ల‌కు డ‌బ్బులివ్వ‌మ‌ని అడిగినందుకు జామపండ్లు అమ్ముతున్న వ్యక్తిని ఇష్టమొచ్చినట్లుగా చితకబాదారు. డ‌బ్బులిచ్చేదిలేదంటూ చిరువ్యాపారిపై అంతాక‌లిసి దాడికి దిగారు. రోడ్డుపై జామకాయ‌ల బండిని తిరగబెట్టేశారు. ఇవన్నీ సమీపంలో వున్న ఓ కెమెరా కంటికి చిక్కాయి. కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఓ పార్టీలో ఫుల్ గా తాగిన యువకులు తాగిన మైకంలో పండ్లవ్యాపారిపై దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. అడ్డుకున్న స్థానికులపై కూడా వీరు దాడికి పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

టీఆర్ఎస్ నాయకుడి అరాచకం..

నల్లగొండ : జిల్లీ కేంద్రంలో టీఆర్ఎస్ నేత అరాచకం సృష్టించాడు. మంత్రి జగదీష్ బంధువునంటూ ఈదులూరి సంతోష్ అనే వ్యక్తి కొందరిని గదిలో బంధించి దాడికి పాల్పడ్డాడు. స్థానిక పరిశ్రమలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి వద్ద నుండి డబ్బులు వసూలు చేశారు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవటంతో సంతోష్ ను బాధితులు ప్రశ్నించారు. దీంతో వారిని గదిలో బంధించి దాడికి పాల్పడ్డాడు. సంతోష్ బాధితులపై దాడి చేసిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కాగా ఈదులూరి సంతోష్ టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నేతగా తెలుస్తోంది. 

ఓ మెగా నల్ల కుబేరుడి బంపరాఫర్!..

తమిళనాడు : పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం ప్రకటనతో నల్లకుబేరులు నల్లధనాన్ని వదిలించుకునేందుకు పలు మార్గాల్ని అవలంభిస్తున్నారు. శనివారం తిరునల్వేలిలో ఆటోడ్రైవర్లకు ఓ నల్లకుబేరుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ ప్రాంతంలోని రెండు పెట్రోలు బంక్ దారులకు రద్దు అయిన రూ. 500, 1000 రూపాయల నోట్లను ఇచ్చి బంక్ కు వచ్చిన ప్రతి ఆటోకు పెట్రోల్ పోయాలని చెప్పి వెళ్లిపోయారు. ఈ విషయం ఆటో డ్రైవర్లకు తెలియడంతో ఈ రెండు బంకులకు ఆటోలు క్యూకట్టాయి.ఒకో బంక్ వారికి రై.50,000 ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

నల్లధనం నియంత్రణకు కేంద్రం కఠిన చర్యలు..

ఢిల్లీ : నల్లధనం నియంత్రణకు కేంద్రం మరిన్ని కఠిన చర్యలు చేపట్టింది. పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసినవారికి ఐటీ నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వేలాదిమందికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. పెద్ద సంఖ్యలో ఖాతాల వివరాలను ఐటీ శాఖ సేకరించింది. 

19:07 - November 19, 2016
19:06 - November 19, 2016

విశాఖ : పెద్ద నోట్ల రద్దు అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిల్లర నోట్ల కొరత సామాన్యులకు కొరకరాని కొయ్యగా మారింది. చిల్లర నోట్లు దొరక్క..వేలమంది కార్మికులకు అన్నంపెట్టే బెల్లం మార్కెట్‌ మూతపడింది. దీంతో కార్మికుల కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. నోట్ల కష్టాల నేపథ్యంలో..అనకాపల్లి బెల్లం మార్కెట్‌పై 10 టీవీ ప్రత్యేకs కథనం.
చిన్న నోట్లు దొరక్క బెల్లం కొనడం మానేసిన వ్యాపారులు
అనేక మందికి అన్నంపెట్టే బెల్లం మార్కెట్‌...దేశంలోనే రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్‌గా అనకాపల్లి...చిల్లర సమస్యతో మార్కెట్‌ను మూసేసిన వ్యాపారులు..దిక్కుతోచని స్థితిలో వేలాది మంది రైతులు. ఇదీ.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్ దుస్థితి. గతంలో సమ్మెల ప్రభావంతో అతలాకుతలమైన ఈ మార్కెట్‌ తాజాగా చిల్లర నోట్లు దొరక్క మూతపడింది. దీంతో మార్కెట్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్న అనేక మంది కార్మికులు ఇప్పుడు రోడ్డున పడాల్సి వచ్చింది.
దేశంలోనే రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్‌గా అనకాపల్లి...
అనకాపల్లి బెల్లం మార్కెట్‌ దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌. ఇక్కడి నుంచి పలు రాష్ట్రాలకు బెల్లం ఎగుమతులు జరుగుతాయి. మార్కెట్లో సుమారు 200 మంది కూలీలు, 150 మంది కళాసీలు, 200 మంది కలగార్లతో పాటు మరో 200 మంది ఇతర కూలీలు పని చేస్తుంటారు. బెల్లం దిమ్మెలను విక్రయించే రైతులతో పాటు కొనుగోలు చేసే వ్యాపారస్తులు, ఎగుమతి చేసే వ్యాపారులు .. బెల్లం దిమ్మెలకు ఇచ్చే కమీషన్‌ ద్వారా వీరంతా లావాదేవీలు కొనసాగిస్తారు.
అనకాపల్లి మార్కెట్‌ నుంచి పలు రాష్ట్రాలకు బెల్లం ఎగుమతులు
జిల్లాలో 3 వేలకు పైగా చెరకు క్రషింగ్ బెల్లం పట్టీలున్నాయి. ఒక్కో పట్టి నుంచి రోజుకు 90 దిమ్మల బెల్లం తయారు చేస్తారు. అనకాపల్లీ, యలమంచిలి, చోడవరం, మాడుగుల నియోజక వర్గాల్లో చెరకే ప్రధాన పంట. ప్రతిరోజు ఇక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకు బెల్లం దిమ్మెల రవాణా జరుగుతుంది. ప్రతిరోజు 60 లక్షల రూపాయల విలువైన బెల్లం ఇతర ప్రాంతాలకు ఎగుమతి కావడం, రవాణా ఖర్చులే లక్షల్లో ఉండటం వల్ల నగదు లావాదేవీలు తప్పనిసరి. అయితే.. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో వ్యాపారులు కొనుగోళ్లు మానేశారు. బెల్లానికి మంచి మార్కెట్ ఉన్న సమయంలో మార్కెట్‌ మూతపడటంతో అన్నదాతలకు ఆశనిపాతంగా మారింది.
బెల్లం మార్కెట్‌ మూసివేతతో రైతులు, వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన
ఇపుడిపుడే మార్కెట్‌ పుంజుకుంటున్న తరుణంలో.. కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కనీసం రైతులకు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకపోవడంతో.. బెల్లం మార్కెట్‌ మూసివేయాల్సి వచ్చిందని వర్తకులు చెబుతున్నారు. అటు కమీషన్ ఏజంట్లు కూడా రైతులకు ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. డబ్బులున్నా.. వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ విషయంలో బ్యాంకులు కూడా స్పందించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని రైతులు, వ్యాపారుల డిమాండ్‌
అటు.. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఓ వైపు.. బెల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉంచే పరిస్థితి లేకపోడం, మరోవైపు చెరకు పంట కోతకొచ్చి సిద్ధంగా ఉండటం రైతుల్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఇదే సమయంలో వ్యాపారులు చెరకు కొనుగోళ్లు నిలిపివేయడంతో క్రషింగ్ ఆగిపోయింది. చేతికి వచ్చిన పంట కోయకపోతే పంట పాడై పోతుందని, అదే జరిగితే తామంతా రోడ్డున పడతామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.   

18:57 - November 19, 2016

విశాఖ : చిల్లర కష్టాలు గిరిజనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం ఔనురు గ్రామంలో వారంతపు సంతలపై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌ తీవ్రంగా పడుతోంది. ప్రతి శుక్రవారం గిరిజనులతో కిటకిటలాడే సంత.. ఈ సారి కొనుగోలు దారులు లేక వెలవెలబోయింది. చిల్లర కష్టాలతో పాటు నోట్ల కొరతతో వ్యాపారం డీలా పడింది. ఆస్పత్రి ఖర్చులకు కూడా డబ్బులు లేవని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దుతో ఉల్లి రైతుల బేజారు..
పెద్ద నోట్ల రద్దుతో పంట అమ్ముడు పోక రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కర్నూలు మార్కెట్‌లో ఉల్లిని కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో పెద్ద ఎత్తున రైతులు ఉల్లిని తరలించారు. తీరా ఉల్లి తెచ్చాక కరెన్సీ లేదని అధికారులు కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో రైతులు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. వెంటనే ఉల్లిని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. 

18:52 - November 19, 2016

విజయవాడ : సామాన్య మధ్యతరగతి ప్రజలపైనే ప్రధాని మోదీ సర్జికల్ దాడి చేస్తున్నారు తప్పితే పారిశ్రామికవేత్తలపై కాదన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పెద్దనోట్ల రద్దుతో దేశంలోని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ..పారిశ్రామికవేత్తలెవరూ ఇబ్బందులు పడడంలేదన్నారు. దేశంలోని మధ్యతరగతి ప్రజలు పెళ్లిళ్లు జరుపుకోలేకపోతున్నారన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకం నోట్లపై ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు నారాయణ. 

18:46 - November 19, 2016

పశ్చిమగోదావరి : రైతాంగ సమస్యలపై ఈనెల 26న బీజేపీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో రైతు సభను నిర్వహించనున్నట్టు ఆ పార్టీ నేత పురందేశ్వరి తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు కాస్త ఇబ్బందులు కలిగిన మాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు. అయితే అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. చిల్లర కష్టాలు తీర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం 16 లక్షల కోట్ల డబ్బు మార్పిడి జరుగుతుందని పురందేశ్వరి అన్నారు. 4 లక్షల కోట్ల డబ్బు తేడా ఉందని దాని నిరోదానికే వెయ్యి, 500 నోట్లను రద్దు చేసినట్లు చెప్పారు.

18:43 - November 19, 2016

కర్నూలు : కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టెడు శోకంలో ఉన్న తమపై విచారణ అధికారి అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని ఉషారాణి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లాలోని ఆర్‌జీఎం కాలేజీలో ర్యాగింగ్‌ వలన ఆత్మహత్య చేసుకున్న ఉషారాణి తమ కూతురు కాదని పాణ్యం సీఐ ఆరోపిస్తున్నారని తండ్రి జయరామిరెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఎవరో చెప్పిన మాటలు విని సీఐ ఇలా మాట్లాడటం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేసు విచారణను డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని జయరామిరెడ్డి కోరారు.

కుటుంబ నియంత్రణ పాటించొద్దన్న సీఎం..

తూర్పుగోదావరి : జిల్లా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ నియంత్రణ వల్ల జనాభా తగ్గుతుందని.. కుటుంబ నియంత్రణను పాటించవద్దని అన్నారు. స్వయం సహాయక గ్రూపులతో ముఖాముని నిర్వహించిన సీఎం జనాభా తగ్గుదలతో రాబోవు కాలంలో అనేక సమస్యలు వస్తాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో స్వయంసహాయక గ్రూపులతో ముఖాముఖి నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

18:32 - November 19, 2016

తూర్పుగోదావరి : జిల్లా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ నియంత్రణ వల్ల జనాభా తగ్గుతుందని.. కుటుంబ నియంత్రణను పాటించవద్దని అన్నారు. స్వయం సహాయక గ్రూపులతో ముఖాముని నిర్వహించిన సీఎం జనాభా తగ్గుదలతో రాబోవు కాలంలో అనేక సమస్యలు వస్తాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో స్వయంసహాయక గ్రూపులతో ముఖాముఖి నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆన్‌లైన్‌ లావాదేవీలపై ప్రజలు దృష్టి పెట్టాలి : చంద్రబాబు
పెద్దనోట్ల రద్దుతో చిల్లర సమస్య తీవ్రమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దీన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాని చెప్పారు. నిర్వహించిన ఆయన ఆన్‌లైన్‌ లావాదేవీలపై ప్రజలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జన్‌ధన్‌ అకౌంట్లు ఉన్నవాళ్లంతా రూపీకార్డులు తీసుకోవాలని.. దాని ద్వారానే లావాదేవీలు జరపాలని కోరారు.

18:28 - November 19, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అంచనాలు తప్పుతోంది. స్థానిక నాయకుల్లో సహకారం లోపించడంతో... టీడీపీ సభ్యత్వ నమోదు నత్తనడకన సాగుతోంది. దీంతో రాష్ట్రంలో టీడీపీ బలోపేతమవ్వడం ప్రశ్నార్థకంగా మారింది.
తెలంగాణలో బలం పెంచుకునేందుకు టీడీపీ ప్రయత్నం
తెలంగాణలో టీడీపీని తిరిగి పట్టాలెక్కించేందుకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సంస్థాగతంగా బలం పెంచుకోవాలని ఆ పార్టీ నేతలు ఆశించారు. ఈ మేరకు నవంబర్‌ ఒకటో తేదీన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీ-టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అయితే లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆ పార్టీ నేతలు విఫలమయ్యారు. 15లక్షల మందిని సభ్యులుగా చేర్పించాలని లక్ష్యం పెట్టుకున్నా... చాలా చోట్ల వంద సభ్యత్వాలు కూడా చేర్పించలేదు.
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో ముందుకు సాగని సభ్యత్వ నమోదు
హైదరాబాద్‌లో లక్షా 57 వేల సభ్యత్వాలు, రంగారెడ్డి జిల్లాలో 2లక్షల 65వేల సభ్యత్వాలు చేయించాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఈ రెండు జిల్లాల్లో కేవలం పదివేల మందిని కూడా చేర్పించలేకపోయారు. అలాగే జూబ్లిహిల్స్‌లో 157 మంది, సనత్ నగర్‌లో 264 , ఎల్‌బీ నగర్‌లో 566, శేర్లింగంపల్లిలో 544, కుత్బుల్లాపూర్‌లో 311, ఇబ్రహీంపట్నంలో 801, రాజేంద్రనగర్ లో 613, మహేశ్వరంలో 447, కూకట్ పల్లిలో 416 మంది మాత్రమే టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. మెదక్ జిల్లాలో ఒక్కొక్క సభ్యత్వం మాత్రమే అయింది. మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో మాత్రం కొంతమేర సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందుకు సాగుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా టీడీపీకి ఊహించిన స్థాయిలో స్పందన రావడం లేదు.
టీడీపీ నాయకుల్లో నైరాశ్యం వల్లే జోరుగా సాగని సభ్యత్వ నమోదు
టీడీపీ నాయకుల్లో నెలకొన్న నైరాశ్యం వల్లే సభ్యత్వం నమోదు లక్ష్యాన్ని చేరుకోవడం లేదని తెలుస్తోంది. ప్రతిజిల్లాకు ఓ సీనియర్ నేతను ఇంచార్జ్‌గా వేసినా, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ నేతలు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నేతలు.. తమకు పూర్తిబాధ్యతలు ఇస్తేనే, సభ్యత్వం చేయిస్తామంటూ మొండికేయటం కూడా టీడీపీకి తలనొప్పిగా మారింది. అయితే కొంతమంది నేతలు పెద్దనోట్ల చలామణి రద్దుకావడంతోనే సభ్యత్వ నమోదుకు ఎవరూ ముందుకు రావడం లేదని వాదిస్తున్నారు.
అధినేతల ఆదేశాలు
తెలంగాణ టీడీపీ సభ్యత్వాల నమోదు విషయంలో అధిష్ఠానమే రంగంలోకి దిగాలని భావిస్తోంది. సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీ టీడీపీ నేతలకు ఆదేశించారు.

ప్రధానితో కేసీఆర్ భేటీ ముగిసింది..

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. సుమారు గంటపాటు కొనసాగిన సమావేశంలో నోట్ల రద్దుతో పాటు పలు కీలక అంశాలపై మోదీతో సీఎం చర్చించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులను మోదీకి సీఎం వివరించారు. కేంద్రానికి చెల్లించాల్సిన పన్నుల్లో మారటోరియం విధించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. గృహిణులు దాచుకున్న మొత్తాన్ని నల్లధనంగా పరిగణించవద్దని సూచించారు. ప్రైవేటు వైద్యశాలల్లోనూ పాతనోట్లు స్వీకరించేలా చర్యలు చేపట్టాలని మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా రూ. 500 నోట్లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. 

18:12 - November 19, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. సుమారు గంటపాటు కొనసాగిన సమావేశంలో నోట్ల రద్దుతో పాటు పలు కీలక అంశాలపై మోదీతో సీఎం చర్చించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులను మోదీకి సీఎం వివరించారు. కేంద్రానికి చెల్లించాల్సిన పన్నుల్లో మారటోరియం విధించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. గృహిణులు దాచుకున్న మొత్తాన్ని నల్లధనంగా పరిగణించవద్దని సూచించారు. ప్రైవేటు వైద్యశాలల్లోనూ పాతనోట్లు స్వీకరించేలా చర్యలు చేపట్టాలని మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా రూ. 500 నోట్లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా పెద్ద నోట్ల మార్పిడి కొనసాగించాలన్నారు.

బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య?..

పశ్చిమగోదావరి : పెదపాడులోని ఇండియన్‌ బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ లంకపల్లి శ్యాంప్రియ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏలూరుకు చెందిన లంకపల్లి శ్యాంప్రియ తాను అద్దెకు ఉంటోన్న గదిలోనే ప్యాన్‌కు ఉరివేసుకుంది. గత ఆరు నెలలుగా బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆమె మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లిన ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పెదపాడు ఎస్సై ఎం.విజయకుమార్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

ఉషారాణి ఆత్మహత్య కారకుల అరెస్ట్ కు మంత్రిఆదేశం..

కర్నూలు : నంద్యాల ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని ఉషారాణి కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో పోలీసులు ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థుల అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. సీనియర్లు చేసిన ర్యాంగింగ్ కు విద్యార్థిని ఉషారాణి బలైపోయింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ర్యాగింగ్ కు పాల్పడ్డ ఆరుగురు సీనియర్లపై కేసులు నమోదు చేశారు. గతంలో నాగార్జున వర్శిటీలో రిషితేశ్వరి అనే విద్యార్థిని ఇలాంటి నేపథ్యంలోనే ఆత్మహత్యకు గురైన సంగతి తెలిసిందే.

17:49 - November 19, 2016

తూర్పుగోదావరి : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా డ్వాక్రా మహిళలను ఉద్ధేశించి  చంద్రబాబు ప్రసంగించారు. వెలుగు సిబ్బందికి 30 శాతం వేతనాలు పెంచిన ఘనత టీడీపీదేనని తెలిపారు. ప్రపంచంలో అసాధ్యమైంది ఏదీ లేదనీ..క్రమశిక్షణతో చేసిన పని సత్ఫలితాలనిస్తుందన్నానరు. డ్వాక్రా సంఘాలు పెట్టినప్పుడు ..సంఘంలో జాయినయిన మహిళల్ని చూసి ఆక్షేపించారనీ..ఇప్పుడు కుటుంబాన్ని ఆదుకునేది డ్వాక్రా మహిళలేనన్నారు. ప్రపంచంలో భారత నాగరికత విశిష్టమైనదన్నారు. 

17:40 - November 19, 2016

తూర్పు గోదావరి : జిల్లా పంపాదిపేటలో ఈ నెల 20న సీపీఎం తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు అనుమతిచ్చినా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సభ ఏర్పాట్లకు కొరకు పంపాదిపేటకు వచ్చిన సీపీఎం జిల్లా కార్యదర్శి శేషబాబ్జీని ఒంటిమిట్ట పోలీసులు అరెస్టు చేశారు. దివీస్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన సభకు హైకోర్టు అనుమతిచ్చినా తనను అరెస్టు చేయడం దారుణమని శేషబాబ్జీ ఆరోపించారు. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పంపాదిపేట పరిసర గ్రామస్థులు కొన్ని నెలల నుండి ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్ధతుగా సీపీఎం పార్టీ నిలబడింది. ఈ ప్రాంత పరిసరాల్లో ఎవరు వచ్చినా పోలీసులు అరెస్టులు చేయటం..ఎటువంటి ర్యాలీలు గానీ, ఆందోళనలు గానీ చేయకుండా పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడటం తెలిసిందే. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో కోర్టు బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పంపాదిపేటకు రావటంతో పోలీసులు అరెస్ట్ చేయటం గమనించదగిన విషయం.

17:28 - November 19, 2016

ఢిల్లీ : వ్యవసాయ రంగం బడ్జెట్ కసరత్తును కేంద్రం వేగవంతం చేసింది. వ్యవసాయ సంఘాల ప్రతినిధులతో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా వ్యవసాయ రంగవృద్ధి క్రమంగా పడిపోతుందని..సమావేశంలో పాల్గొన్న అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి దశరథ రామిరెడ్డి అన్నారు. పరిశ్రమల మాదిరిగా వ్యవసాయరంగానికి కూడా ఇన్సూరెన్స్‌, రుణాలు, పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే వ్యవసాయ రంగం మెరుగవుతుందని దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించాలన్నారు. ప్రతి ఏటా వ్యవసాయ రంగం వృద్ధి క్రమంగా పడిపోతుందని తెలిపారు. బడ్జెట్‌ నిథులు క్షేత్రస్థాయిలో రైతులకు చేరడంలేదన్నారు. ప్రస్తుతం 60 నుంచి 13-14 శాతానికి వ్యవసాయ రంగం పడిపోయిందనీ.. రైతులకు ఇన్‌పుట్‌ నిధులకు కొరత పెరుగుతోందని తెలిపారు. రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదనీ..వ్యవసాయ రంగం పేరుతో వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి దశరథ రామిరెడ్డి పేర్కొన్నారు.

17:22 - November 19, 2016

ఢిల్లీ : ప్రధాని మోదీతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొద్ది సేపటి క్రితం స‌మావేశ‌మ‌య్యారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు స‌హా ప‌లు అంశాల‌పై ఆయ‌న ప్ర‌ధానితో చ‌ర్చిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌రువాత రాష్ట్రంలోనెలకొన్న పరిస్థితులపై చ‌ర్చ కొన‌సాగుతోంది. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటించిన అనతరం 8 త‌రువాత‌ తెలంగాణ రాష్ట్ర ఆదాయంపై ప‌డిన‌ ప్ర‌భావం, రాష్ట్రంలోని సామాన్య ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు న‌ష్ట‌పోతున్న తీరుపై కేసీఆర్ ప్రధానికి వివ‌రిస్తున్నారు. ఈ పరిస్థితులపై తగిన చర్యల్ని సత్వరమే తీసుకోవాల‌ని కేసీఆర్ కోరిన‌ట్లు స‌మాచారం. 

17:15 - November 19, 2016

హైదరాబాద్  : పెద్ద నోట్ల రద్దు ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై తీవ్రంగా ఉందన్నారు రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌. దేశంలో 86 శాతం పెద్ద నోట్లే ఉండడంతో ఇప్పుడు ఆ నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్ర అధాయంపై స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రేపు ఢిల్లీలో జరగబోయే జీఎస్టీ సమావేశంలో నోట్ల రద్దు అంశంపై కీలక అంశాలన్నీ కేంద్రం ముందు పెడతామని మంత్రి ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. చేతి వృత్తుల వ్యాపారం అంతా నగదుతోటే ముడిపడి ఉంటుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తి దారులు నగదు రూపంలోనే నిల్వ ఉంచుకుంటారనీ..ఉన్నవాళ్ళను లేని వాళ్ళను ఒకే గాటన కట్టకూడదన్నారు. 2000 నోట్లతో మరిన్ని సమస్యలు ఉత్పన్నమౌతున్నాయన్నారు. తక్షణమే గ్రామాల్లో సరిపడా చిల్లర అందచేయాల్సిన అవసరముందన్నారు. జీఎస్టి అమలుపై ఇప్పటికి నాలుగు మీటింగ్‌లతో 70 శాతం స్పష్టత వచ్చిందని తెలిపారు. జీఎస్టీ ద్వారా రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని కోరామని ఈ సందర్భంగా మంత్రి ఈటెల పేర్కొన్నారు.

 

17:12 - November 19, 2016

శ్రీకాకుళం : టీడీపీ చేపడుతున్న జన చైతన్య యాత్రకు లేని అడ్డంకులు ప్రజల కోసం చేస్తున్న అణు చైతన్య పాదయాత్రలకు ఎందుకు అవాంతరాలు సృష్టిస్తున్నారని సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణ స్థలం మండలం కొవ్వాడలో అణు విద్యుత్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్న తమకు అనుమతులు ఇవ్వకుండా అరెస్టులు చేయడాన్ని ప్రజా సంఘాలు ఖండించాయి. భూకంపాల జోన్‌లో ఇటువంటి ప్రమాదకర అణు రియాక్టర్లు పెడితే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని సీపీఎం నేతలు హెచ్చరిస్తున్నారు. 

17:06 - November 19, 2016

విజయవాడ : ప్రధాని మోదీ ప్రభుత్వంలో రైతులు, పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. బ్లాక్‌ మనీని అరికట్టడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే దీనికోసం ప్రభుత్వం అవలంభిస్తున్న విధానం సరిగ్గా లేదని ఆయన అన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కర్నూలు నగరంలో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ఖర్గేతో పాటు ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల పాల్గొన్నారు.   

16:58 - November 19, 2016

కడప : ఉషారాణి మరణానికి నిరసనగా కడపలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లా.. బద్వేలలోని కాలేజీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి.. నాలుగు రోడ్ల కూడలిలో మానవహారాన్ని నిర్వహించారు. చట్టాలు ఎన్ని ఉన్నా.. మహిళలకు వేధింపులు తగ్గడం లేదని.. విద్యార్థి నాయకులు అన్నారు. చట్టాలు మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు.

16:55 - November 19, 2016

హైదరాబాద్ : బస్టాండ్‌లు..కాంప్లెక్స్‌లు వెలవెలబోతున్నాయి.. బస్సులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి..చిల్లర సమస్య ఆర్టీసీకి భారంగా మారింది. అంతంత మాత్రం రెవెన్యూతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ... పెద్దనోట్ల రద్దుతో దిక్కుతోచన స్థితిలో పడింది.

చిల్లర సమస్యతో వెలవెలబోతున్న బస్టాండ్లు..కాంప్లెక్స్‌లు
రోజూ ప్రయాణికులతో కిటకిటలాడే మహాత్మాగాంధీ బస్టాండ్‌...ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది. ప్రయాణికుల కోసం..బస్సులు ఎదురుచూస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయం.. ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిల్లరలేక ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు సంశయిస్తున్నారు. పాత నోట్లు ఆర్టీసీ బస్సుల్లో చెల్లుతాయని చెబుతున్నా ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదని.. రోజువారి ఆదాయంలో 10 నుంచి 15 శాతం మేర నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

బస్సుల్లో చిల్లర ఇవ్వలేక ఇబ్బందిపడుతున్నామంటున్న కండక్టర్లు
బస్సుల్లో ప్రయాణికులు తెచ్చే 500 వందలు, వెయ్యి నోట్లకు చిల్లర ఇవ్వలేక నానా ఇబ్బందులు పడుతున్నామని కండక్టర్లు.. చెబుతున్నారు. వీలైనంత వరకు సర్దుబాటు చేస్తున్నప్పటికీ... చిల్లర కష్టాలు మాత్రం పెద్ద తలనొప్పిగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిల్లర లేక బస్సులు మధ్యలోనే దింపేస్తున్నారు : ప్రయాణీకులు
చిల్లర లేక అత్యవసరం అయితే తప్ప దూర ప్రయాణాలు చేయడం లేదని.. కొన్ని బస్సుల్లో చిల్లర ఇవ్వడం లేదని.. చిల్లర లేక బస్సులు మధ్యలోనే దింపేస్తున్నారని ప్రయాణికులు అంటున్నారు.పాతనోట్ల రద్దుతో కనీస అవసరాలు తీరడం లేదని.. అవసరమైన ప్రయాణాలు చేయడం లేకపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. దీంతో ఆర్టీసీ కూడా సంక్షోభంలో పడింది.     

16:52 - November 19, 2016

విజయవాడ : పాత నోట్ల ప్రభావంతో పూల మార్కెట్‌ డీలా పడింది. కార్తీక మాసంలో లక్షల్లో జరగాల్సిన వ్యాపారం వేలల్లో జరుగుతోంది. పూల ధరల అమాంతం పడిపోవడంతో విజయవాడలో వ్యాపారం మొత్తం కుదేలయ్యింది. సీజన్‌ టైంలో 150 రూపాయలు పలికే పూలు పెద్ద నోట్ల రద్దుతో 20 రూపాయలకు పడిపోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. నోట్ల రద్దు వల్ల పచ్చి వ్యాపారాలపై తీవ్రంగా పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. లక్షల్లో జరగాల్సిన పూల వ్యాపారం వేలకు సరిపెట్టుకోవాల్సివస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. ఏటీఎంల్లో రెండు వేల నోట్లు లభించటం..బైటకూడా చిల్లర దొరకపోవటంతో పూల వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చామంతులు కిలో రూ.100 లకు అమ్మేవారమని ప్రస్తుతం 30కే అమ్ముతున్నామంటున్నారు. పూల కోత గిట్టుబాటుకూడా రావట్లేదని పూల రైతులు వాపోతున్నారు. కార్తీకమాసంలో అయ్యప్ప మాలలు వేసుకున్న అయ్యప్ప భక్తులు చేతిలో డబ్బులున్నా స్వామికి పూలు కొనలేకపోతున్నామని త్వరంగా చిల్లర నోట్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

ఏపీ, విజయవాడ, పూల మార్కెట్, నోట్ల రద్దు,

ప్రధానితో భేటీ అయిన కేసీఆర్..

ఢిల్లీ: తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పెద్దనోట్ల రద్దుతోపాటు తదితర ముఖ్య అంశాలపై ఆయన ప్రధానితో చర్చిస్తున్నారు.

కాసేపట్లో ప్రధానితో కేసీఆర్ భేటీ..

ఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈమేరకు సాయంత్రం 4.40 గంటలకు ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పెద్దనోట్ల రద్దుతోపాటు తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.

వైజాగ్ మ్యాచ్ లో అశ్విన్ అరుదైన రికార్డ్

వైజాగ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో భారత స్పిన్ మాంత్రికుడు అశ్విన్ అరుదైన రికార్డ్ సాధించాడు. 2016లో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. అశ్విన్ ఇప్పటివరకూ 1171 పరుగులిచ్చి 52 వికెట్లు తీశాడు. ఈ ఏడాదిలో అశ్విన్ కంటే ఎక్కువగా శ్రీలంక స్పిన్ బౌలర్, కెప్టెన్ రంగనా హెరాత్ 54 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. 

16:21 - November 19, 2016

బడ్జెట్ పై జైట్లీ ముందస్తు కసరత్తులు..

ఢిల్లీ : 2017/18 కేంద్ర బడ్జెట్ పై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముందస్తు కసరత్తులు ప్రారంభించారు. ఈ అంశంలో నీతి అయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగారియా.. ఐసీఏఆర్ డైరెక్టర్ర జన్ రల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి.. పంజాబ్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. సాధారణ బడ్జెట్ లో వివిధ రంగాల ప్రాముఖ్యతలపై మంత్రి చర్చలు జరుపుతున్నారు. 

బీభత్సం సృష్టించిన మావోలు..

ఒడిశా : కొరాపుట్‌ జిల్లాలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. సిమిలిగూడ మండలం బిత్తర్‌కోట వద్ద ఐదు వాహనాలకు నిప్పుపెట్టారు. రహదారి నిర్మాణ పనుల్ని వ్యతిరేకిస్తూ వారు ఈ బీభత్సానికి పాల్పడినట్లు సమాచారం. రహదారి నిర్మాణ పనుల సూపర్‌వైజర్‌ను కూడా ఇన్‌ఫార్మర్‌ నెపంతో గొంతుకోసి చంపారు.

హెచ్ సీయూలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం..

హైదరాబాదు : హెచ్ సీయూలో మరో పీహెచ్ బీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. దీంతో క్యాంపస్ లో మరో వివాదం నెలకొంది.దీంతో విద్యార్థులు పరిపాలనా భవనం ఎదుట ఆందోళనకు దిగారు. మచిలీపట్నానికి చెందిన పీహెచ్ డీ విద్యార్థి అబ్రహాం తన గైడ్ ప్రొఫెసర్ వైజీశ్వరన్ సరైన గైడెన్స్ ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతుండడంతో విరక్తి చెంది, ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. వేధింపులకు పాల్పడిన గైడ్ వైజీశ్వరన్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అబ్రహాం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

చర్లపల్లిలో జైలులో ఖైదీ ఆత్మహత్య..

హైదరాబాద్: నగరంలోని చర్లపల్లిలో జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీపక్ అనే ఖైదీ జైలు గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ చోరీ కేసులో అరస్టై గత ఫిబ్రవరి నుంచి దీపక్ జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. కాగా వరంగల్ జైలులో కూడా ఓ ఖైదీ మత్తు మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే.

15:35 - November 19, 2016

విశాఖ: ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేసిన విమ్స్‌ను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది..ఇప్పటికే టెండర్లు పిలవడానికి నిర్ణయించింది. అయితే విమ్స్‌ను ప్రైవేట్ పరం చేయవద్దని డిమాండ్ చేస్తూ వైసీపీ, వామపక్షాలు, అన్ని పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాల కోసం వీడియో చూడండి..

15:33 - November 19, 2016

విశాఖ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం ఇప్పుడు విశాఖ షిప్పింగ్ హార్బర్‌పై పడింది. చేపల అమ్మకాలు తగ్గిపోవడంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. బిజినెస్‌ సగానికి సగం తగ్గిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోవైపు వస్తున్న కొనుగోలుదారులు సైతం పెద్ద నోట్లు తెస్తుండడంతో మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. దీంతో ఎప్పుడు బిజీగా ఉండే హార్బర్‌ వ్యాపారం లేక వెలవెలబోతుంది.

విశాఖలో నిత్యం 30 కోట్ల చేపల వ్యాపారం
కడలి కెరటాలను చీల్చి జీవిత సమరం చేసే మత్స్యకారుల బ్రతుకులు ప్రధాని తీసుకున్న ఒక్క నిర్ణయంతో చుక్కాని లేని నావలా తయ్యారయ్యాయి. విశాఖ జిల్లావ్యాప్తంగా రోజుకు దాదాపు 30 కోట్ల రూపాయల మేర చేపల వ్యాపారం సాగుతుంది. ఇందులో ఎగుమతుల కంటే చిల్లరగా జరిగే వ్యాపారమే ఎక్కువ..దాదాపు జిల్లావ్యాప్తంగా లక్ష మందికి పైగా మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. విశాఖలో 600 బోట్లు, జిల్లా వ్యాప్తంగా మరో వెయ్యి బోట్లు చేపల వేట కోసం సముద్రంలోకి వెళతాయి.
రోజుకు విశాఖలో రూ. 30 కోట్ల బిజినెస్
ఇప్పుడు చేపల సీజన్ కావడంతో మత్స్యకారులు మంచి బిజినెస్ జరుగుతుందని ఆశపడ్డారు. కానీ ఒక్కసారిగా కేంద్ర తీసుకున్న పెద్ద నోట్ల నిర్ణయంతో 30 కోట్ల రూపాయల వ్యాపారం జరిగే చోట 10 కోట్ల రూపాయల బిజినెస్ కూడా జరగటం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తగ్గిన ఎగుమతులు
విశాఖ నుంచి పెద్దఎత్తున ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతులు సాగుతాయి. ట్యూనా లాంటి చేపలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. అయితే ఇప్పడు పెద్ద నోట్లు రద్దుతో వ్యాపారులు చేపలు కొనడం మానేశారు. మరోవైపు కొనుగోలుదారులు కూడా పెద్ద నోట్లు తీసుకురావడంతో వారికి చిల్లర ఇవ్వలేని పరిస్ధితి ఏర్పడింది. రోజువారి వ్యాపారాలు గత వారం రోజులుగా మందగించి ఇల్లు గడవటం కష్టంగా మారిందని మత్స్యకారులు వాపోతున్నారు. చేపలను దాచుకునే సదుపాయం లేకపోవడంతో చేపలు దేనికి పనికి రాకుండా పోతున్నాయి. పెద్ద బోట్లు ఇప్పటికే చేపలవేటకు వెళ్లడం మానేశాయి..కేవలం మెకనైజ్డ్ బోట్లు, తెప్పలు మాత్రమే వేటకు వెళుతున్నాయి.
సమృద్ధిగా దొరుకుతున్న చేపలు..పెద్దనోట్ల రద్దుతో తగ్గిన అమ్మకాలు
సీజన్ కావడంతో సముద్రంలో చేపలు సమృద్ధిగా దొరుకుతున్నా పెద్ద నోట్ల రద్దుతో వాటి అమ్మకాలు మాత్రం జరగడంలేదు. చిల్లర సమస్యతో కొనుగోలుదారులు తమ ముఖం కూడా చూడటం లేదని చిల్లర చేపల వర్తకులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మరికొద్దికాలం కొనసాగితే తమ పరిస్ధితి దారుణంగా మారుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. 

15:29 - November 19, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. ఆసరా పెన్షన్‌ చెల్లింపులో అక్రమాలకు చోటు లేకుండా.. బయో మెట్రిక్‌ విధానాన్ని పాటించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు.

వృద్ధుల పెన్షన్‌ చెల్లింపులో సమస్యలు తలెత్తకుండా చర్యలు
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో ఆసరా పెన్షన్‌దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు సర్కార్‌ యత్నిస్తోంది. వృద్ధుల పెన్షన్‌ చెల్లింపులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పంచాయతీరాజ్‌ సిబ్బందికి సూచించారు. పెద్ద నోట్ల రద్దుతో పింఛన్ల పంపిణీకి ఎలాంటి విఘాతం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

రూ.100, 500 నోట్ల సమాచార సేకరణ
బ్యాంకులు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 100, 500 నోట్ల సమాచారాన్ని సేకరించారు. గత నెలలో బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా జరిగిన పింఛన్ల పూర్తి జాబితా పరిశీలించి.. పింఛన్ల జారీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమాయక వృద్ధులను అడ్డుపెట్టుకుని దళారులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. బయోమెట్రిక్‌ ద్వారానే పింఛన్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తానికి నోట్ల రద్దుతో పెన్షన్‌దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. 

15:26 - November 19, 2016

నల్లగొండ : నోట్ల రద్దు వ్యవహారం అన్ని రంగాలను అతలాకుతలం చేస్తుంది. రైతులు, వ్యాపారులు, విద్యార్థులు.. మొదలు.. టాక్సీ డ్రైవర్లు కూడా పాత నోట్ల రద్దు నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్తీకమాసం, పెళ్ళిళ్ల సీజన్‌ కావడంతో బిజీగా ఉండాల్సిన ట్యాక్సీ డ్రైవర్లు పెద్దనోట్ల రద్దుతో గిరాకీ లేక అల్లాడుతున్నారు. ముందే నిర్ణయించుకున్న లాంగ్ టూర్లను కూడా చాలామంది రద్దు చేసుకున్నారని నల్గొండలో ట్యాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

15:23 - November 19, 2016

కరీంగనర్ : వసతి గృహంలో ఉండాల్సిన విద్యార్థులు అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురవడంతో గ్రామస్థులు ఆగ్రహించారు. ఈ ఘటన కరీంగనర్.. దుర్శేడ్ గ్రామంలో చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్‌ అనే విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు హస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను బార్‌అండ్‌ రెస్టారెంట్‌గా తయారు చేశారని.. విద్యార్థులు మద్యం సేవించి అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్లారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

15:13 - November 19, 2016

విజయవాడ : ఏపీలోని పలు కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై వేసిన కమిటీ నివేదికను బయటపెట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావుపై కూడా రోజా ఘాటు విమర్శలు చేశారు. బీచ్ ఫెస్టివల్స్ పై వున్న శ్రద్ధ విద్యార్థులపై లేదని రోజా విమర్శించారు.కార్పొరేట్‌ కాలేజీల్లోని విద్యార్థుల ఆత్మహత్యలపై రోజా ఆందోళన వ్యక్తం చేశారు.

బ్యాంకుల్లో తగ్గి ఏటీఎంల వద్ద పెరిగాయి..

హైదరాబాద్ : నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన 11 రోజుల తరువాత నేడు, బ్యాంకుల్లో ఖాతాదారుల క్యూలైన్లు కాస్తంత తగ్గాయి. ఇదే సమయంలో ఏటీఎం మెషీన్ల వద్ద మాత్రం రద్దీ కొనసాగుతోంది. చాలా బ్యాంకుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నేడు కేవలం తమ శాఖకు సంబంధించిన ఖాతాదారులకు, వృద్ధులకు మాత్రమే సేవలందిస్తామని బ్యాంకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇతర బ్యాంకుల కస్టమర్లకు నోట్ల మార్పిడి ఉండదని ప్రకటించడంతోనే బ్యాంకుల ముందు క్యూ లైన్లు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. 

ఇంగ్లండ్ 255 పరుగులకు ఆలౌట్..

విశాఖపట్టణం : తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 200 పరుగుల ఆధిక్యంలో భారత్ సాధించింది.  అశ్విన్ 5, షమి, ఉమేష్, జడేజా, యాదవ్ లకు తలో వికెట్ తీశారు. 

పీఈఎస్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్య..

బెంగళూరు : పీఈఎస్ యూనివర్సిటీ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. వివేకానందుడి బోధనలు యువతకు ఆదర్శమని, యువత జాతీయ భావం పెంపొందించుకోవాలని సూచించారు. మాతృభాష అనేది చాలా ముఖ్యమైందన్నారు. 

26న అమిత్ షా పర్యటన - పురంధేశ్వరీ..

విజయవాడ : 26వ తేదీన అమిత్ షా తాడేపల్లి గూడెంలో పర్యటిస్తారని, రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై దృష్టి సారించిందని బీజేపీ నేత పురంధేశ్వరీ పేర్కొన్నారు. భవిష్యత్ లో మంచి ప్రయోజనం ఉందన్నారు. 

13:41 - November 19, 2016

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడిపై పెను ప్రభావం చూపిస్తోంది. కొనుగోలు దారులు లేక వ్యాపారస్తులు నష్టపోతున్నారు. నోట్లు దొరక్క..రూ. 2000వేల రూపాయలకు చిల్లర లేకపోవడంతో సామాన్యుడు అష్టకష్టాలు పడుతున్నారు. చిరు వ్యాపారుల ఆదాయానికి భారీ గండికొడుతోంది. ఈ సందర్భంగా టెన్ టివి సామాన్యుడి సమస్యలు..వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకోవాడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సుల్తాన్ బజార్ లో పర్యటించింది. మరి అక్కడ వ్యాపారస్తులు..కొనుగోలుదారులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయండి. 

13:17 - November 19, 2016

చిత్తూరు : నల్ల కుబేరులకు 'వెంకన్న' బంపర్ ఆఫర్ ను ప్రకటిస్తున్నట్లు నవీన్ కుమార్ అనే భక్తుడు పేర్కొన్నారు. 'నల్ల కుబేరులకు 'వెంకన్న బంపర్ ఆఫర్'...నల్లకుబేరులు తిరుమలకు తరలిరండి' బ్యానర్లతో అలిపిరి వద్ద ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. శ్రీవారికి కోట్లాది మంది భక్తులున్నారని, ఉన్న నల్లధనాన్ని శ్రీవారి హుండీలో వేసి పుణ్యం కట్టుకోవాలని సూచించారు. లక్షలాది రూపాయలు వేయడానికి వచ్చే నల్లకుబేరులకు పలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వారికి శ్రీవారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందచేయాలని సూచించారు. నల్లధనం విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేరిట ఉన్న స్వర్ణ భారతి ట్రస్టు పేరిట లక్షలాది..కోట్లాది రూపాయలను మార్చుకున్నారని దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

13:09 - November 19, 2016
13:08 - November 19, 2016

ఖమ్మం : మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఇటీవలే మావోయిస్టులను పెద్ద ఎదురుదెబ్బ తగిలిన అనంతరం మరో దెబ్బ తగిలింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్ గఢ్ జిల్లాలో అబీస్మా, తుస్పేల్లి అటవీప్రాంతంలో పోలీసులు గత రాత్రి నుండి భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తుస్పెల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారనే సమాచారం పోలీసులకు అందించింది. వెంటనే అక్కడ కూంబింగ్ నిర్వహించారు. తారసపడడంతో లొంగిపోవాలని మావోయిస్టులకు పోలీసులు హెచ్చరించారు. హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ మావోయిస్టులు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. వెంటనే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఐదుగురు మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలు అట్టుడికపోతున్నాయి. ఇన్ ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. దీనితో గిరిజనులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాల్పుల అనంతరం ఈ ప్రాంతంలో భారీగా ఆయుధాలు..సాహిత్యం..నగదు లభ్యమైంది. 

స్కార్పియో బోల్తా..నలుగురు మృతి..

వనపర్తి : కొత్తకోట (మం) ఆమడబాకుల స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కార్పియో బోల్తా కొట్టడంతో నలుగురు మృతి చెందారు. శబరిమల నుండి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

చిల్లర ఇవ్వలేదని దాడి..

అనంతపురం : పరిగి (మం) కోనాపురంలో రూ. 500 కు చిల్లర ఇవ్వలేదని వ్యాపారిపై ఓ వ్యక్తి బ్లేడ్ తో దాడికి పాల్పడ్డాడు. వ్యాపారి రాజునాయక్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. 

సెజ్ ల పేరిట రియల్ ఎస్టేట్ - తమ్మినేని..

సంగారెడ్డి : ఝురా సంగం (మం) నుండి ఎలగోయికు మహాజన పాదయాత్ర చేరుకుంది. నిమ్జ్ పేరిట భూములు లాక్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెజ్ ల పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. 17 గ్రామాల పరిధిలో 12,600 ఎకరాలు బలవంతంగా లాక్కొంటున్నారని విమర్శించారు. 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పోరటానికి అండగా ఉంటామని వెల్లడించారు. 

మెదక్ ఎస్ బిహెచ్ లో కొత్త స్కాం..

మెదక్ : ఎస్ బిహెచ్ లో కొత్త కరెన్సీ స్కాం చోటు చేసుకుంది. విజయ డెయిరీ ఖాతా నుండి రూ. 1.20 కోట్లు ఒకే రోజు డ్రా అయ్యాయి. గరిష్టంగా రూ. 24 వేలను డ్రా చేసుకొనే నిబంధననను ఎస్ బి హెచ్ సిబ్బంది పాటించలేదు. విత్ డ్రా జరిగి వారం అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు. సమగ్ర విచారణ జరిపించాలని సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

12:52 - November 19, 2016

ఢిల్లీ : ఇస్లామిక్ మతప్రబోధకుడు జకీర్ నాయక్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. మహారాష్ట్రలో నిషేధించిన జకీర్ కార్యాలయాలపై శనివారం ఎన్ఐఏ దాడులు చేసింది. మతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని, యువకులు ఉగ్రవాదులుగా మారేందుకు ప్రోత్సాహిస్తున్నారని జకీర్ పై ఆరోపణలున్నాయి. దీనితో కేంద్రం ఆయన కార్యలయాలపై నిషేధం విధించింది. దాడుల్లో పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటిని పరిశీలిస్తున్నట్లు, జకీర్ నాయక్ పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ కు విదేశాల నుండి వచ్చే విరాళాలపై ఆంక్షలు విధించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందిన తరువాత వాటిని తీసుకోవాలని సూచించింది. 

12:47 - November 19, 2016
12:45 - November 19, 2016
12:44 - November 19, 2016

మెదక్ : పెద్ద నోట్లు రద్దు నేపథ్యంలో కేంద్రం తీసుకున్న చర్యలు కేవలం సామాన్యులకేనా ? బడా బాబులకు లేదా ? అనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. ఎందుకంటే మెదక్ జిల్లాలో కొత్త స్కాం ఒకటి చోటు చేసుకుంది. గరిష్టంగా రూ. 24వేలు డ్రా చేయాలని కేంద్రం పేర్కొన్నా 'విజయ డెయిరీ' సంస్థ నుండి ఏస్ బీహెచ్ రూ. 1.20 కోట్ల రూపాయలు డ్రా కావడం ప్రస్తుతం చర్చానీయాంశమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది జరిగి వారం అవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనివాస రావు మేనేజర్ సరియైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అసలు ఏం జరిగింది ? ఒకే రోజు ఇంత పెద్ద మొత్తం ఎలా డ్రా చేశారనే తెలియడం లేదు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

12:39 - November 19, 2016
12:37 - November 19, 2016
12:36 - November 19, 2016
12:35 - November 19, 2016

విజయవాడ : పెద్దనోట్ల రద్దు వ్యాపార రంగాన్ని కుదిపేసింది. వ్యాపారం లేకపోవడంతో యజమానులు లబోదిబోమంటున్నారు. విజయవాడలో రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. అందులో పనిచేసే సిబ్బంది ఖాళీగా కూర్చొంటున్నారు. కేవలం వివాహానికి సంబంధించిన షాపింగ్ మాత్రమే జరుగుతోందని పలువురు పేర్కొంటున్నారు. రైతులు, కూలీలు, చిరు వ్యాపారులపై ఈ నోట్ల రద్దు ప్రభావం చూపిస్తోంది. సామాన్యుడు షాపింగ్ చేయలేని పరిస్థితి నెలకొంటోందని, చిల్లర మొదట అందుబాటులో ఉంచాలని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయండి.

 

11:12 - November 19, 2016

కరీంనగర్ : జిల్లా దురిశేడు ఎస్టీ రెసిడెన్సియల్‌ హాస్టల్‌ నుంచి ముగ్గురు విద్యార్థులు పరారీకి ప్రయత్నించారు. వీరు బైక్‌పై పారిపోతూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి గోడను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

11:09 - November 19, 2016

కర్నూలు : విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మొన్న వేధింపులకు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. తాండ్రపాడులోని చైతన్య కాలేజీలో లోక్ నాథ్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి ఇతను హాస్టల్‌ గదిలో తాడుతో ఉరి వేసుకున్నాడు. విద్యార్థిది తుగలి మండలం ఆమిణాబాద్‌ గ్రామం. విద్యార్థి మృతికి కాలేజీ అధ్యాపకుల వేధింపులే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతను మృతి చెంది రెండు గంటలవుతున్నా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదని ఓ వ్యక్తి పేర్కొన్నారు. ఇతను మృతి చెందిన కొద్దిసేపటికే మరో విద్యార్థి నిద్రమాత్రలు మింగాడని, ఇతడిని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. కాలేజీలో 5గంటల నుండి రాత్రి 12గంటల వరకు చదివిస్తున్నారని, సొంత ప్రయోజనాల కోసం విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం వత్తిడి తీసుకొస్తోందని ఆరోపించారు. 

పోలవరం విలీన మండలాల్లో సీపీఎం పాదయాత్ర..

తూర్పుగోదావరి : విలీన మండలాల్లోని ప్రజల సమస్యలపై సీపీఎం పాదయాత్ర నిర్వహించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. కాలేజీలు, ఆశ్రమ పాఠశాలలో సరైన సదుపాయాలు లేవని, పూర్తిస్థాయిలో ప్యాకేజీ అమలయ్యే వరకు పోలవరం నిర్మాణం నిలిపివేయాలని సూచించారు. 

నౌషెరా సెక్టార్ లో పాక్ సైన్యం..

జమ్మూ కాశ్మీర్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పాక్ ఉల్లంఘించింది. నౌషెరా సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. 

రాజమహేంద్రవరంలో సీఎం చంద్రబాబు పర్యటన..

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో పరిపాలన భవనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆసుపత్రి నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 

10:52 - November 19, 2016
10:30 - November 19, 2016

శ్రీకాకుళం : జాతీయ స్థాయిలో వాసికెక్కిన పలాస జీడిపప్పుపై పెద్దనోట్ల రద్దు ప్రభావం భారీగా పడింది. పెద్ద నోట్లు చెల్లక చిల్లర నోట్లు రాక దాదాపు 150 పరిశ్రమల లావాదేవీలు ఆగిపోయాయి. రోజువారీ లావాదేవీలకు నగదు అందుబాటులో లేక.. వేతనాలు చెల్లించలేక.. జీడిపప్పు వ్యాపారులు సతమతమవుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో బకాయిలు కూడా రికవరీ కాక నానా తంటాలు పడుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో జీడిపరిశ్రమలను మూసేస్తున్నారు. కర్మాగారాలన్నీ మూతపడటంతో వ్యాపారులు.. పరిశ్రమనే నమ్ముకున్న కార్మికులు నానా యాతనలూ పడుతున్నారు. పలాస జీడిపరిశ్రమను కుంగదీస్తోన్న నోట్ల రద్దు ప్రభావంపై 10టీవీ ప్రత్యేక కథనం.  శ్రీకాకుళం జిల్లా పలాస జీడి పప్పు పరిశ్రమకు..పెద్దనోట్ల రద్దు ఇచ్చిన షాక్‌ అట్టాంటిట్లాంటిది కాదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం క్యాష్యూ ఇండస్ట్రీని కనీవినీ ఎరుగని రీతిలో కుదిపేస్తోంది. గడచిన వారం రోజుల్లో వందల కోట్ల లావాదేవీలు నిలిచిపోవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. చిల్లర లేక దినసరి కూలీలకు సైతం వేతనాలు చెల్లించలేక, బ్యాంకుల నుండి చెల్లింపులు నిలిచిపోయి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడచిన కొన్ని దశాబ్దాలుగా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురవలేదని క్యాష్యూ ఇండస్ట్రీ యజమానులు ఆందోళన చెందుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని పలాస, అనంతపురం, మందస, వజ్రపుకొత్తూరు, సోంపేట, పాతపట్నం తదితర ప్రాంతాల్లో 340 వరకూ జీడి పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 150 వరకూ పరిశ్రమలు అనంతపురం ఇండస్ట్రియల్‌ ఏరియాలోనే ఉన్నాయి.

పెద్దనోట్ల రద్దు..
పెద్దనోట్ల రద్దు దెబ్బకు ఈ 150 పరిశ్రమలూ మూతబడ్డాయి. పరిమిత లావాదేవీలకు మాత్రమే వీలు కల్పించడం వల్లే ఈ పరిస్థితి దాపురించినదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు . పలాస క్యాష్యూ ఇండస్ట్రీ ఒక్కసారిగా కుదేలైపోయింది . ఉత్పత్తి, లావాదేవీలు స్తంభించిపోవడంతో తొలి రెండు రోజుల్లో 40 పరిశ్రమలు మూతపడగా వారం రోజుల్లో 150 కాజూ ఇండస్ట్రీలు మూతబడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో జీడిపప్పు ఉత్పత్తికి రోజుకు రెండు వేల బస్తాల జీడిపిక్కలు అవసరం. వీటిని ప్రాసెస్‌ చేయడానికి దాదాపు 25 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ వారానికొకసారి లేదా రోజువారీ కూలీలు చెల్లిస్తుంటారు. గడచిన వారం రోజులుగా చేతిలో డబ్బులు లేక వ్యాపారులు చెల్లింపులు చేయలేక చేతులెత్తేశారు. పలాస కేంద్రంగా రోజుకు నాలుగు వేల టన్నుల జీడిపప్పు ఉత్పత్తి అవుతుంటుంది . మూతపడిన పరిశ్రమల మూలంగా ఇప్పటికే మూడు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. మరో నెల రోజులపాటు పరిశ్రమలు తిరిగి తెరిచే అవకాశం లేకపోవడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు ముప్పై వేల మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు .

రిటైల్ మార్కెట్ లో...
ఇదిలా ఉంటే రిటైల్ మార్కెట్ లో కూడా జీడిపప్పు కొనుగోళ్లు పూర్తిగా పడిపోయాయి. గడచిన కొన్ని రోజులుగా ఎగుమతులు లేక, అమ్మకాలు జరగక కనీస వ్యాపారం జరగడం లేదు. ఈ నెల 8 వ తేదీన పెద్ద నోట్ల రద్దు ప్రకటన తరువాత స్టాకు గోడౌన్లకే పరిమితం అయిపోయింది. దీంతో సుమారు 200 కోట్లు రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. ఇక్కడి జీడిపప్పు నిల్వలు హైదరాబాద్ , ముంబై , కాన్పూర్, ఇండోర్, చెన్నై, పాట్నా, నాగపూర్, రాయపూర్, భువనేశ్వర్, విశాఖ లాంటి నగరాలకు ఎగుమతి అవుతాయి. ఈ ఎనిమిది రోజుల్లో ఒక టన్ను సైతం జీడి పప్పు ఇక్కడి నుండి కదలలేదంటే పెద్ద నోట్ల రద్దు ఎంత మేర ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి ఎప్పటికి సర్దుకుంటుందో పరిశ్రమ మళ్లీ ఎలా నిలదొక్కుకుంటుందో అర్థం కాక అటు వ్యాపారులు ఇటు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 

10:27 - November 19, 2016

సంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర 33వ రోజు పూర్తి చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం హుగ్గెల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్రలో వినతులు వెల్లువెత్తాయి. జహీరాబాద్‌లో జరిగిన సభలో అంగన్‌ వాడీలు, వికలాంగులు తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు అందజేశారు. హెగ్గెల్లిలో ప్రాంభమైన యాత్ర మాచనూరు, బర్దీపూర్ మీదుగా సాగింది. అట్టడుగు వర్గాల అభివృద్ధి జరగకుండా తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం మహాజనపాదయాత్రలో భాగంగా జహీరాబాద్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు అందజేశారు.

పలువురు వినతిపత్రాలు..
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 93 శాతం బడుగు బలహీన వర్గాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని తమ్మినేని అన్నారు. వారి సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగినపుడు రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మహాజన పాదయాత్రలో వినతులు వెల్లువెత్తాయి. తమ సమస్యలపై ఆయా వర్గాల ప్రజలు.. ప్రధానంగా అంగన్‌వాడీలు, వికలాంగులు వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న నగదు బదిలీ పథకంతో తమకు తీవ్ర ఇబ్బందులు తప్పవని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోపించారు. దీనికి సంబంధించి సీపీఎం పాదయాత్రలో మెమొరాండాన్ని అందజేసినట్లు తెలిపారు. జహీరాబాద్‌లో జరిగిన సీపీఎం పాదయాత్ర సభలో వికలాంగుల డివిజన్‌ అధ్యక్షులు వినతి పత్రం అందజేశారు. జహీరాబాద్‌ డివిజన్‌ వ్యాప్తంగా సుమారు 300 మందికి వికలాంగుల ఫించన్లు నిలిచిపోయాయని తెలిపారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం హుగ్గెల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర...బర్దీపూర్‌ తో ముగిసింది. పాదయాత్రలో ప్రజలు తమ సమస్యల కోసం వినతి పత్రాలు అందజేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని తమ్మనేని హామీ ఇచ్చారు. 

దివిసీమ ఉప్పెనకు 39 ఏళ్లు..

కృష్ణా : దివిసీమ ఉప్పెనకు నేటితో 39 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంకా విషాదకర జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. తీర ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 

దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో పాదయాత్ర..

సంగారెడ్డి : దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పాదయాత్ర రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను సన్మానించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. ఆధ్యాత్మిక వాదులు చనిపోయిన తర్వాత పరలోకంలో విముక్తి కోరుకుంటారని, కానీ కమ్యూనిస్టులు బతికుండగానే ఈ క్షణం పేదల, బడుగు, బలహీనవర్గాల బతుకులకు విముక్తి కావాలని పోరాడుతామన్నారు. 

34వ రోజు మహాజన పాదయాత్ర..

సంగారెడ్డి : జిల్లాలో 34వ రోజు శనివారం పాదయాత్ర కొనసాగుతోంది. ఝరాసంగం (మం) బర్దీపూర్ నుండి పాదయాత్ర ప్రారంభమైంది. ఎలిగోయి, మల్కాన్ పాడు, హత్తులూరు, రాయకోడ్ లలో పాదయాత్ర జరగనుంది. 

09:28 - November 19, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దుతో చాలా ఇబ్బందులు పడుతున్నామని సామాన్యులు వాపోతున్నారు. హైదరాబాద్..తిరుపతిలో పరిస్థితులు తెలుసుకోవడానికి టెన్ టివి ప్రయత్నించింది. హైదరాబాద్ నగరంలో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం సామాన్యుడు రోజు వారి ఇంటికి అవసరమయ్యే సరుకులను తీసుకెళుతుంటాడు. కానీ కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు సామాన్యుడి జీవితంపై పెను ప్రభావం చూపెడుతోంది. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు చేసిన సంగతి తెలిసింది. అనంతరం రూ. 2000 నోట్లను కొత్త నోట్లను విడుదల చేసింది. దీనితో సామాన్యుడు అష్టకష్టాలు పడుతున్నారు. చిల్లర దొరక్కపోవడం..పాత నోట్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు నగర వాసులు పేర్కొంటున్నారు.

తిరుపతిలో...
రోజులు గడుస్తున్నా ప్రజల ఇబ్బందులు మారడం లేదు. పెద్దనోట్ల రద్దుతో తిరుపతి వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, పెట్రోల్ దొరక్క సమస్యలు ఎదుర్కొంటున్నామని టెన్ టివితో సామాన్యులు తెలిపారు. పలువురు బ్యాంకుల ఎదుట వృద్ధులు వేచి ఉన్నారు. 

09:13 - November 19, 2016

హైదరాబాద్ : మనీ ప్రాబ్లమ్స్ తీరేదెన్నడూ ? ప్రస్తుతం ఈ ప్రశ్నే అందరి మదిలో తలెత్తుతోంది. పెద్ద నోట్ల రద్దుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దు చేసి 11వ రోజు అయినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. నేటి నుండి సొంత ఖాతదారులకే మాత్రమే నోట్ల మార్పిడి చేయాలని, ఇందులో వృద్ధులకు మినహాయింపు ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది. శనివారం ఉదయం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలుసుకోవడానికి టెన్ టివి ప్రయత్నించింది.

హైదరాబాద్ లో...
రామాంతాపూర్ లో ఏటీఎం వద్ద ప్రజలు క్యూ కట్టారు. తమ దగ్గర వచ్చే సరికి ఏటీఎంలో డబ్బు ఉంటుందా ? లేదా ? అనే ఉత్కంఠలో ఉన్నారు. బ్యాంకుల్లో నగదు మార్పిడిపై ఆర్బీఐ పలు చర్యలు తీసుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు ఏటీఎంల్లో రెండు వేల రూపాయలు వస్తుండడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని పలువురు పేర్కొంటున్నారని ఓ వ్యక్తి వాపోయాడు.

విజయవాడలో...
విజయవాడలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. పెద్ద నోట్ల రద్దు..కొత్తగా రెండు వేల రూపాయలు అందుబాటులోకి రావడంతో పరిస్థితి దారుణంగా తయారైందని పలువురు పేర్కొంటున్నారు. చేతిలో డబ్బు ఉన్నా చిల్లర దొరక్కపోవడంతో కనీసం ఛాయ్ తాగలేకపోతున్నామని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్..కూరగాయలు..ఆసుపత్రులకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన వ్యాపారానికి ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారానికి చాలా తేడా ఉందని హోటల్ యజమాని పేర్కొన్నారు. 

విరాట్ విల్లాలో మావోయిస్టుల దుశ్చర్య..

ఒడిశా : కొరాపుట్ జిల్లా విరాట్ విల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఐదు వాహనాలకు మావోయిస్టులు నిప్పంటించారు. ఇన్ ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని హత్య చేశారు. 

పారిపోవడానికి ప్రయత్నిస్తూ..

కరీంనగర్ : దురిశేడు ఎస్టీ రెసిడెన్షియల్ హాస్టల్ నుండి ముగ్గురు విద్యార్థులు పారిపోవడానికి ప్రయత్నించారు. బైక్ పై పారిపోతూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి గోడను ఢీకొట్టారు. ఒక విద్యార్థి మృతి చెందగా, ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. 

08:53 - November 19, 2016

తమకూ ఓ గృహం ఉండాలని ప్రతొక్కరూ కోరుకుంటుంటారు. ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలని ఆశిస్తుంటారు. గతంలో పుంజుకున్న రియల్ ఎస్టేట్ ప్రస్తుతం కుదేలైపోయింది. నల్లధనం నియంత్రణలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో వర్త..వాణిజ్య..స్థిరాస్థి రంగం కుదేలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రియల్ ఎస్టేట్ స్వల్ప కుదుపునకు చోటు చేసుకుందని తెలుస్తోంది. చిన్న అవసరాలు తీరకుండా సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గృహం..స్థలం కొనుగోలకు లక్షల రూపాయలు అవసర పడుతుండడం వల్ల సామాన్య..మధ్యతరగతి చివరకు సంపన్న వర్గాలు జంకుతున్నారు. నగదు చెలామణి ఆగిపోవడంతో 50 శాతం తగ్గిపోయినట్లు రిజిస్ట్రేషన్ అధికారులు పేర్కొంటున్నారు. కొత్త జిల్లాల పేరిట తెలంగాణ, కొత్త రాజధాని పేరిట ఏపీలో రియల్ ఎస్టేట్ గతంలో పుంజుకుంది. బిల్డర్లు..రియలర్టు ఇంకా ఎలాంటి అభిప్రాయాలు తెలిపారు ? 
హైదరాబాద్ లో ఉండే పలు అపార్ట్ మెంట్ లు నిర్మాణం అవుతున్నాయి. కానీ ఎక్కువగా అభివృద్ధి చెందే ప్రాంతంలో అపార్ట్ మెంట్ లు కావాలని అనుకుంటుంటారు. మరి తూర్పు ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి ? నగరం కాంక్రీట్ జంగిల్ గా మారింది. గ్రీన్ గా మారాలంటే ? తెలంగాణలో హైదరాబాద్ తరువాత పెద్ద సిటీ వరంగల్. మరి ఇక్కడ స్థిరాస్థి రంగం ఎలా ఉంది ? ఆకట్టుకుంటున్న మార్బుల్ ఫ్లోరింగ్...ఇతరత్రా విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

భద్రతా బలగాలు..ఉల్ఫా ఉగ్రవాదుల మధ్య కాల్పులు..

అసోం : టిన్సుకియాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు, ఉల్ఫా ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. 

ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్..

ఢిల్లీ : ఆరు రాష్ట్రాల్లో శనివారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 4 లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ లో 2 లోక్ సభ, ఒక అసెంబ్లీ నియోజకవర్గం, తమిళనాడులో మూడు అసెంబ్లీ స్థానాలు, పుదుచ్చేరిలో ఒక అసెంబ్లీ స్థానానికి..అసోం, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లో పోలింగ్ కొనసాగుతోంది. 

08:22 - November 19, 2016

సంగారెడ్డి : సహకారం రంగాన్ని పటిష్ట పరిచి రైతులకు మరింత సేవలందిస్తామని మంత్రి పోచారం వెల్లడించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో మంత్రి పోచారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని శాఖల సమన్వయంతో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు. వచ్చే వానకాలం పంటకు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. నోట్ల రద్దుపై కూడా ఆయన మాట్లాడారు. రుణాల మాఫీ డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందని, పెద్ద నోట్ల రద్దు అంతగా రైతులపై ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సొంత ఖాతాదారులకే బ్యాంకుల సేవలు..

హైదరాబాద్ : నేడు సొంత ఖాతాదారులకే బ్యాంకుల సేవలు అందనున్నాయి. ఇందులో సీనియర్ సిటిజన్లకు మినహాయింపునిచ్చారు. నోట్లు మార్చుకొనేందుకు వీరికి అవకాశం కల్పించారు. 

08:11 - November 19, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు కష్టాలు తీరడం లేదు. చిల్లర కోసం ఒకరు..డబ్బులు తీసుకోవడానికి మరొకరు..ఇలా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. నేడు బ్యాంకుల్లో నగదు మార్పిడి రద్దు కావడంతో మరిన్ని సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. తెల్లవారుజామున నుండే ఏటీఎంల వద్దకు ప్రజలు తరలివస్తున్నారు. శనివారం పరిస్థితి తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అంబర్ పేట నుండి ఒక్క ఏటీఎం లేదని, రామంతాపూర్ లో ఉన్న ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వచ్చామని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. ఒక్క రూపాయి దొరకడం లేదని..పలు చోట్ల ఏటీఎంలు పనిచేయడం లేదని మరొకరు వాపోయాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

తూర్పుగోదావరిలో బాబు పర్యటన..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. సెంట్రల్ జైల్లో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 

07:31 - November 19, 2016

నల్లధనంపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొంది. చిల్లర కష్టాలను తీవ్రమైన సమస్యగా అభివర్ణించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (నవతెలంగాణ సంపాదకులు), కుమార్ (బీజేపీ), శ్రీనివాస్ యాదవ్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వీరు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

07:31 - November 19, 2016

ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అంటూ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఎమ్మెల్యే వేముల పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'కేసీఆర్ డౌన్..ఎమ్మెల్యే డౌన్' అంటూ నినాదాలు చేశారు. అసలు సంగతి ఏంటంటే..చెరువు చెక్ డ్యాం సంగతి చూడమంటే ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుర్రకథలు..హరికథలు చెబుతున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వేముల మాట్లాడారు. చెక్ డ్యాం నిర్మాణం గురించి హైదరాబాద్ నూరు సార్లు తిప్పించుకుంట..కానీ రోడ్డుకు అడ్డంగా పడితే మాత్రం నూరుసార్లు తిప్పించుకుంటా అని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకముందు కార్లలో ఏసీ, కూర్చొంటే ఏసీ ఉండేదని, అంతేగాక కోట్ల రూపాయలు సంపాదించినా..ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అంటూ పేర్కొనడం చర్చానీయాంశమైంది. జనం పని చేయమంటే గిట్ల మాట్లాడుతారా ? అంటూ జనం గుసగుసలు పెట్టుకున్నారంట. పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేసేయండి. 

పోలవరం విలీన మండలాల్లో సీపీఎం పాదయాత్ర..

తూర్పుగోదావరి : పోలవరం విలీన మండలాల్లో నేడు సీపీఎం పాదయాత్ర చేపట్టనుంది. అనంతరం బహిరంగసభ జరగనుంది. ఈ కార్యక్రమాల్లో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొననున్నారు. 

06:46 - November 19, 2016
06:45 - November 19, 2016

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో కీలక పాత్ర పోషించనున్నారని కాంగ్రెస్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పాల్గొంటారని కాంగ్రెస్‌ యూపీ ప్రచార కమిటీ చైర్మన్‌ సంజయ్‌సింగ్‌ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేయడానికి ప్రియాంక ఒప్పుకున్నారని.. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక ఆమె ప్రచార తేదీలను ప్రకటిస్తామని కాంగ్రెస్‌ యూపీ చీఫ్‌ రాజ్‌బబ్బార్‌ తెలిపారు. ప్రియాంక ప్రచారంతో పార్టీ కార్యకర్తల్లోనే కాకుండా ప్రజలందరిలోనూ ఆత్మవిశ్వాసం పెంచుతుందని రాజ్‌బబ్బార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

06:43 - November 19, 2016
06:41 - November 19, 2016

హైదరాబాద్‌ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కుత్బుల్లాపూర్ విలేజ్‌లోని శివాలయం వద్ద నీలు అనే యువకుడు రాజేశ్వరి అనే యువతిపై యాసిడ్‌తో దాడి చేశాడు. యువతి వీపుపై యాసిడ్ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వివాహేతర సంబంధమే దీనికి కారణం అయ్యి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

06:40 - November 19, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణించి.. స్వస్థలాలకు పార్థివదేహాలను తరలించేందుకు ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆస్పత్రులలో మరణించిన వారిని ఇళ్లకు తరలించేందుకు 'పార్థివ వాహనం' పేరిట ఉచిత వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని గాంధీ ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు జెండా ఊపి ప్రారంభించారు. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయి.. దిక్కుతోచని స్థితిలో ఉన్న పేదలకు ఈ పథకం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న తమ ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రభుత్వాస్పతులలో సిబ్బంది సేవాభావంతో పని చేయాలన్నారు మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌. పేదల పార్థివ దేహాలను తరలించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తొలి విడతలో 50 పార్థివ వాహన సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో ఈ వాహన సర్వీసులను కల్పిస్తామని మంత్రులు తెలిపారు.

06:37 - November 19, 2016

మెదక్ : అధికారులు సమీక్షలకు తప్పుడు లెక్కలతో వస్తే ఉపేక్షించేది లేదంటూ మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై మంత్రులు ఘాటుగా స్పందించారు. వ్యవసాయశాఖ, నీటి పారుదలశాఖ, రెవిన్యూ, మార్కెటింగ్ శాఖల సమన్వయంతోనే వ్యవసాయ రంగం బలోపేతం అవుతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు అన్నారు. శాఖల మధ్య సమన్వయ లోపంతో వ్యవసాయరంగం అనుకున్నంత పురోగతి సాధించటం లేదని వారు అభిప్రాయపడ్డారు.

అధికారి తీరుపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు..
ఒక గ్రామంలో సాగు భూమి ఎంతుందన్న లెక్కల్లో ఒక్కో శాఖ ఒక్కో లెక్క చెబుతోందని, దీనివల్ల వ్యవసాయ ప్రణాళిక సరిగా లేక అంతిమంగా రైతు నష్టపోతున్నాడని మంత్రి హరీష్ రావు అన్నారు. సమావేశంలో ఒక అధికారి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటంతో ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే మరీ ఎక్కవైంది కదా! అంటూ మండిపడ్డారు. మీరంతా సమన్వయంతో పనిచేసి రైతులకు మేలు చేయాలంటూ హితవు పలికారు.

అధికారులు స్ధానికంగానే ఉండాలని ఆదేశం..
అధికారులు పనితీరు మార్చుకొని, రైతులతో మమేకమవ్వాలని మంత్రి పోచారం కోరారు. వచ్చే వానాకాలంలో స్పష్టమైన లెక్కలతో సమీక్షకు రావాలని, కాకి లెక్కలు ఉండకూడదన్నారు. హైదరాబాద్ దగ్గరుందని అక్కడి నుండే రాకపోకలు సాగిస్తామని చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. మొత్తంమీద వ్యవసాయశాఖ సమీక్ష సమావేశం అధికారుల పనితీరు, శాఖల మధ్య సమన్వయ లోపం అన్న అంశాలపైనే కొనసాగింది. సమావేశంలో మంత్రులు చేసిన సూచనలను అధికారులు ఏ మేరకు పాటిస్తారో వేచి చూడాలి. 

06:35 - November 19, 2016

హైదరాబాద్ : కేసీఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి విరుచుకుపడింది. ఈసారి కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ను టార్గెట్‌ చేశారు హస్తం పార్టీ నేతలు. ఇన్నాళ్లు నోట్ల రద్దుపై నోరు మెదపని గులాబీ నేత.. ఇప్పుడెందుకు ఢిల్లీకి వెళ్లారని ప్రశిస్తున్నారు ? మోదీ పిలవగానే కేసీఆర్‌ ఢిల్లీకి పరుగెత్తుతున్నారంటే.. దీని వెనుక బ్లాక్‌ అండ్‌ వైట్‌ తతంగం దాగుందంటున్నారు హస్తం నేతలు.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్దనోట్ల ర‌ద్దుతో ప్రజ‌లు అవ‌స్థలు ప‌డుతున్నారు. చిల్లర కోసం బ్యాంక్ ల వ‌ద్ద జనం బారులు తీరుతున్నారు. ఇక రాష్ట్రంలో ప్రజ‌లు ప‌డుతున్న బాధ‌లు అన్ని ఇన్ని కావు. చిల్లర లేక, ఉన్న డ‌బ్బును మార్చుకోలేక‌.. డ‌బ్బులుండి కూడా ఎండుతున్న పంట‌ల‌కు ఎరువులు కొన‌లేక‌.. ఇలా సామాన్యలు త‌ల్లడిల్లి పోతున్నారు. ఏకంగా క్యూలైన్ల లో నిల్చోలేక సామాన్యులు చ‌నిపోతున్న సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే ఇంత జ‌రుగుతున్న సీఎం కేసీఆర్ ఎందుకు దీనిపై స్పందిచ‌డం లేద‌ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

స్పందించని కేసీఆర్..
కేంద్రం పెద్ద నోట్ల రద్దు చేసి 10 రోజులైనా కేసీఆర్ మాత్రం ఈ నిర్ణయం మంచిద‌ని కాని, చెడ్డద‌ని కాని చెప్పలేదు. పోనీ పేద‌లు నిత్యం బాధలు ప‌డుతున్న వారిప‌ట్ల కూడా ఒక్క ప్రక‌ట‌న చేయ‌లేదు. ఇక ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీ వెళుతుండ‌టం.. ఈరోజు ప్రధాని మోడీతో.. కేసీఆర్ భేటీ కానుండ‌టంతో.. ఇక కాంగ్రెస్ కారాలు మిరియాలు నూరుతోంది. దేశవ్యాప్తంగా అనేక పార్టీలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి. ఢిల్లీ, బెంగాల్ సీఎంలు అయితే ఏకంగా ఢిల్లీ వేదిక‌గా మోడీ స‌ర్కార్ పై యుద్ధం ప్రక‌టించారు. అంతేకాదు మోడీ మిత్ర ప‌క్షం శివ‌సేన సైతం మోడీ నిర్ణయాన్ని పేద‌ల‌కు ఇబ్బందికరంగా ఉంద‌ని ఇప్పటికే త‌ప్పుప‌ట్టింది. 

పెద్ద మతలబే...
అయితే కేసీఆర్ మౌనం వెన‌క పెద్ద మ‌త‌ల‌బే ఉందంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. కేసీఆర్ తన దగ్గర ఉన్న బ్లాక్ మనీని మార్చుకునేందుకే ఢిల్లీలో సంప్రదింపులు జరిపారని..దానిలో భాగంగానే కేసీఆర్ ప్రధాని మోడి అపాయింట్ మెంట్ తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ లోపాయికారి ఒప్పందంతో కేసీఆర్ తన బ్లాక్ మనీని వైట్ చేసుకోబోతున్నారని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. మోడీ భేటీ తర్వాతనే కేసీఆర్ నోరు విప్పుతారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సీఎంగా ఉండి సామాన్యుల సమస్యలపై మాట్లాడకుండా కేవలం సొంత డబ్బును కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నకాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరీ దీనిపై గులాబీ బాస్ ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి. 

06:32 - November 19, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దు వ్యవహారంపై చర్చించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ బాట పట్టారు. ఈ వ్యవహారంలో ప్రధానిని కలుస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇప్పటికే మోదీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం.. పలు సూచనలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే.. నల్లధనం వ్యవహారంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తుండగా.. ప్రస్తుతం కేసీఆర్‌ చేసే సూచనలపై మోదీ ఎలా స్పందిస్తారనేది హాట్‌ టాపిక్‌గా మారింది. నోట్ల రద్దు వ్యవహారంలో తొలుత స్పందించకపోయినా.. చివరకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. అయితే ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని ప్రధాని మోదీని కోరారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన కేసీఆర్‌.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదని తెలుసుకున్నట్లు సమాచారం. అందుకే కేసీఆర్‌ మోదీకి ఫోన్‌ చేసి నోట్ల రద్దు వ్యవహారంలో మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.

మోడీ ఎలా స్పందిస్తారో..
కేసీఆర్‌ చెప్పిన అంశాలపై స్పందించిన మోదీ.. ప్రస్తుతం ఎలా అవలంబించాలో లిఖితపూర్వకంగా తెలియజేయాలని శనివారం అందుబాటులో ఉండాలని కోరారు. దీంతో కేసీఆర్‌ ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం మోదీతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ కష్టాలు చిన్న వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, రైతులు, చిరువ్యాపారులు 2.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే దానిని నల్లధనంగా కాకుండా అన్‌ అకౌంటెడ్‌ డబ్బుగా చూడాలని కేసీఆర్‌ కోరుతున్నారు. అయితే దీనిపై మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత రోజు ఢిల్లీలో ఉన్న మంత్రి కేటీఆర్‌.. అరుణ్‌జైట్లీతో భేటీ అయ్యారు. పాతనోట్లతో ప్రభుత్వ బిల్లులు చెల్లించుకునే అవకాశం కల్పించాలని కోరారు.. వెంటనే స్పందించిన జైట్లీ దేశ వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు కేసీఆర్‌ కూడా మరో కీలక సూచనతో ప్రధానిని కలుస్తున్నారు. మరి ప్రధాని దీనిపై పాజిటివ్‌గా స్పందిస్తే.. దేశం దృష్టి మొత్తం కేసీఆర్‌ వైపు మళ్లే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే... నల్లధనం నివారణకు కేంద్రం ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో కేసీఆర్‌ ఇచ్చే సూచనపై మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి. 

06:30 - November 19, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు వల్ల సీనియర్‌ సిటిజన్లు మరింత ఇబ్బంది పడుతుండటంతో కేంద్రం వారి కోసం ఒక రోజు కేటాయించింది. ఈ రోజు నోట్ల మార్పిడిని రద్దు చేసిన ఆర్బీఐ.. సీనియర్ సిటిజన్లు మాత్రమే తమ పాత నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది. సాధారణ పని వేళల్లో తెరుచుకోనున్న బ్యాంకులు.. సీనియర్‌ సిటిజన్లకు నోట్లు మార్చి ఇవ్వనున్నాయి. 

06:29 - November 19, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాల్లో మూడో రోజున ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం సభ ప్రారంభమైన కాసేపటికే గందరగోళం నెలకొంది. రాజ్యసభలో నోట్ల ర‌ద్దు అంశంపై ప్రతిప‌క్ష నేత ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై క్షమాప‌ణ‌ చెప్పాల‌ని కేంద్ర మంత్రి న‌ఖ్వీ డిమాండ్ చేశారు. మాఫీ మాంగో అంటూ బీజేపీ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. ప్రధాని స‌భ‌కు వ‌చ్చి నోట్ల ర‌ద్దు అంశంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ప్రతిప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. దీంతో సభ రెండున్నర వరకు రెండు సార్లు వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. విపక్షాల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొనడంతో డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ రాజ్యసభను సోమవారానికి వాయిదా వేశారు. లోక్‌సభలో కూడా అదే పరిస్థితి. తామిచ్చిన రూల్‌ 56 ప్రకారం వాయిదా తీర్మాణంపై చర్చ జరపాలని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.

సోమవారానికి వాయిదా..
నోట్ల రద్దుపై చర్చ జరగడం విపక్షాలకు ఇష్టం లేదని, స్పీకర్‌ అనుమతిస్తే రూల్‌ 193 ప్రకారం తాము చర్చకు సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌ స్పష్టం చేశారు. విపక్షాల డిమాండ్‌ను స్పీకర్‌ సుమిత్రా మహాజన్ అంగీకరించక పోవడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. విపక్ష సభ్యుల ఆందోళనతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.వాయిదా తర్వాత తిరిగి లోక్‌సభ ప్రారంభమైనా విపక్షాలు తమ పట్టు వీడలేదు. విపక్షాల నిరసనల మధ్యే స్పీకర్‌ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. గందరగోళం నడుమ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

బీజేపీ సభ్యులకు విప్..
లోక్‌సభలో చర్చ అనంతరం ఓటింగ్‌ జరగాలని విపక్షాలు కోరుతుండడంతో బిజెపి తమ సభ్యులకు విప్‌ జారీ చేసింది. సభ్యులంతా సభలోనే ఉండాలని కోరింది. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సంబంధిత మంత్రులే విపక్షాలకు సమాధానమిస్తారని, ప్రధానే సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేయడం సబబు కాదన్నారు. తగిన సమయంలో ప్రధాని సభలో సమాధానం చెప్పడం ఆనవాయితిగా వస్తోందని వెంకయ్య చెప్పారు. ప్రతిపక్షాలు పట్టు వీడడం లేదు...అధికార పక్షం మెట్టు దిగడం లేదు. దీంతో ఎలాంటి చర్చలు జరగకుండానే పార్లమెంట్‌ సోమవారానికి వాయిదా పడింది.

పట్టు బిగించిన భారత్..

విశాఖపట్టణం : ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ పట్టు బిగుస్తోంది. బ్యాటింగ్ లో రాణించి భారీ స్కోరు నమోదు చేసిన టీమ్ ఇండియా బౌలింగ్ లో రాణించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 49 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. స్టోక్స్ (12 బ్యాటింగ్), బెయిర్ స్టో (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 

నేడు ఎస్ఆర్ఎం అడ్మిషన్ యాప్ విడుదల..

హైదరాబాద్ : ఎస్ఆర్ఎం యూనివర్సిటీ శనివారం అడ్మిషన్ల అప్లికేషన్ ను లాంచ్ చేయనుంది. బీటెక్ ప్రవేశం ద్వారా అర్హత పరీక్ష ఉత్తీర్ణత, ఎస్ఆర్ఎం జాయింట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఆధారంగా జరుగుతుంది. 

నేడు మోడీతో భేటీ కానున్న కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఆయన భేటీ కానున్నారు. పెద్ద నోట్లు రద్దు అంశంపై చర్చ జరగనుంది. 

నేటి నుండి ఎస్ఐ మెయిన్స్ పరీక్షలు..

హైదరాబాద్ : పోలీసు, అగ్నిమాపక శాఖలోని సబ్ ఇన్స్ పెక్టర్, ఫైర్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి సంబంధించి శని, ఆదివారాల్లో మెయిన్స్ పరీక్షలు జరనున్నాయి. ఒక్క నిమిషం ఈ పరీక్షలకు కూడా అమలుకానుంది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

 

నేడు వృద్ధులకు మాత్రమే..

హైదరాబాద్ : నోట్ల మార్పిడికి బ్యాంకుల్లో నేడు వృద్ధులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. రూ. 2000 మొత్తానికి పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు పొందవచ్చని కేంద్రం పేర్కొంది. 

జేఈఈ మెయిన్స్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల..

హైదరాబాద్ : ఎన్‌ఐటీ, ఐఐటీ, ఇతర జాతీయ విద్యా సంస్థలలో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్ అడ్మిషన్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదలయ్యింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరి 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

Don't Miss